Jogulamba District Latest News
-
రైతు సీఎం కేసీఆర్.. బూతుల సీఎం రేవంత్
రేవంత్‌రెడ్డి వరంగల్‌లో సోనియాగాంధీని దేవతన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాగాంధీని బలిదేవత అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతావు. మాట తప్పుడే రేవంత్‌రెడ్డి డీఎన్ఏలో ఉంది. ఏ విషయంలో కూడా మాట మీద నిలబడలేదు. ఆరు గ్యారెంటీలు అమలుకాలేదు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, రూ.2500 మహిళలకు ఇస్తానని చెప్పి నెరవేర్చలేదు. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు రాలేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్కిట్, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, బీసీ బంధు, దళిత బంధు, ముదిరాజ్‌లు చేపల పిల్లలను కోల్పోయారు. కరోనా సమయంలో మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు బంద్‌పెట్టి రైతులకు రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. అప్పుడు వచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదు ? కేసీఆర్ తన హయాంలో రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చారు, వాగులపై చెక్‌డ్యాంలు కట్టారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. రైతు సీఎం కేసీఆర్ అయితే, బూతుల సీఎం రేవంత్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. -
పుస్తకాల ద్వారానే జ్ఞాన సముపార్జన
గద్వాలటౌన్: పుస్తకాల ద్వారానే జ్ఞాన సముపార్జన లభిస్తుందని, ప్రతి విద్యార్థి తన జీవితంలో పుస్తక పఠనం అటవాటుగా మార్చుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. గత వారం రోజులుగా కొనసాగిన జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మనిషి జీవితంలో విలువలు ఒకరు నేర్పేది కాదని మనకు మనమే నేర్చుకోవాలని, అలాంటి విలువలు కేవలం పుస్తకాల్లోనే లభిస్తాయని అన్నారు. దొరికిన ప్రతి పుస్తకం చదవాలని, ఆ తర్వాత ఏది మంచిదో నిర్ధారించుకోవాలన్నారు. వికాసంతో పాటు విజ్ఞానం, ఉన్నత లక్ష్యసాధన గ్రంథాలయాలతోనే సాధ్యమని, అందుకే వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కథ, నవలలో సంతోషం, కష్టసుఖాలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు కూడా పోటీలలో పాల్గొనడమే ముఖ్యమని, గెలుపోటములు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నూతన భవన నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, రంగవల్లులు తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులతోపాటు షిల్డ్లను అందజేశారు. చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీపీఓ శ్యామ్ సుందర్, కార్యదర్శి శ్యాంసుందర్, జిల్లా గ్రంథాలయ అధికారి రామంజనేయులు పాల్గొన్నారు. -
పుస్తకాల ద్వారానే జ్ఞాన సముపార్జన
గద్వాలటౌన్: పుస్తకాల ద్వారానే జ్ఞాన సముపార్జన లభిస్తుందని, ప్రతి విద్యార్థి తన జీవితంలో పుస్తక పఠనం అటవాటుగా మార్చుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. గత వారం రోజులుగా కొనసాగిన జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మనిషి జీవితంలో విలువలు ఒకరు నేర్పేది కాదని మనకు మనమే నేర్చుకోవాలని, అలాంటి విలువలు కేవలం పుస్తకాల్లోనే లభిస్తాయని అన్నారు. దొరికిన ప్రతి పుస్తకం చదవాలని, ఆ తర్వాత ఏది మంచిదో నిర్ధారించుకోవాలన్నారు. వికాసంతో పాటు విజ్ఞానం, ఉన్నత లక్ష్యసాధన గ్రంథాలయాలతోనే సాధ్యమని, అందుకే వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి కథ, నవలలో సంతోషం, కష్టసుఖాలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు కూడా పోటీలలో పాల్గొనడమే ముఖ్యమని, గెలుపోటములు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నూతన భవన నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, రంగవల్లులు తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులతోపాటు షిల్డ్లను అందజేశారు. చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీపీఓ శ్యామ్ సుందర్, కార్యదర్శి శ్యాంసుందర్, జిల్లా గ్రంథాలయ అధికారి రామంజనేయులు పాల్గొన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్త గూడెం జిల్లాలోని పలు ఇసుక రిచ్‌ల నుంచి గద్వాల జిల్లాకు ఇసుకను ప్రభుత్వ అనుమతులతో వ్యాపారులు ఇసుకను తీసుకువస్తున్నారు. అయితే పోలీసుల తనిఖీలో మాత్రం సామర్థ్యానికి మించి ఇసుక లారీలలో రావడంతో అధికారులు అవాక్కవుతున్నారు. సాధారణంగా 26 టన్నుల ఇసుక ఉండాల్సిన క్రమంలో 39 టన్నుల ఇసుకను చేరవేయడం గుర్తించిన పోలీసులు తనిఖీలు చేయడంతో దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అక్రమార్కులపై కేసులు నమోదు చేశారు. అయితే, చాలామటుకు ఇసుక వ్యాపారస్తులు, ఆయా శాఖల అధికారుల మధ్య నెలకొన్న చీకటి ఒప్పందాల మేరకు సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్నా.. వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
భయపెట్టి.. పైపులతో కొట్టి
ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తించినట్లు తెలిసింది. కడుపు నొప్పి మొదలైన వెంటనే విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా.. తరగతి గదిలో ఉంచి ప్లాస్టిక్ పైపుతో కొట్టి బెదిరించినట్లు కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. అయితే 3 గంటల తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో అప్పుడు వైద్యసిబ్బందికి సమాచారం చేరవేశారని ఆరోపించారు. అయితే పాఠశాలలో మొత్తం 598 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం 426 మంది హాజరయ్యారని హెచ్ఎం మురళీధర్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు నీలమ్మ, శ్రీనివాసులు పాఠశాలను సందర్శించి.. నమూనాలు సేకరించారు. మక్తల్/మాగనూర్: మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఫుడ్‌పాయిజన్‌కు గురైన వంద మంది విద్యార్థుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు పెట్టారు. ఇది తిన్న కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలలాడారు. అయితే మొదట తేలికగా తీసుకున్న ఉపాధ్యాయులు.. బాధితులు పెరగడంతో ఏఎన్ఎం, ఆశాలను పాఠశాలకు పిలిపించి చికిత్స అందించారు. వారు విద్యార్థుల పరిస్థితిని గమనించి స్థానిక పీహెచ్సీ డాక్టర్‌ను సైతం పాఠశాలకు పిలిపించారు. ఆయన 17 మంది విద్యార్థులకు చికిత్స అందించి.. అందులో 15 మందిని మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, నందిని, అనిల్, నవ్య, మేఘన, శివ, జగదీశ్, మహేష్, విజయ్, భీమశంకర్, రాకేష్, విజయ్‌కుమార్, మధు, ప్రశాంతి, శివసాయి ఉన్నారు. అపరిశుభ్రంగా వంట గది.. విద్యార్థులకు వంట చేసేందుకు నిర్మించిన వంట గదితో పాటు పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. చెత్తాచెదారం మొత్తం అక్కడే వేస్తున్న పరిస్థితులు కనిపించాయి. వంట చేసేందుకు వినియోగించిన కూరగాయలు, కారం పొడి తదితర సామగ్రి మొత్తం వంట ఏజెన్సీ వారు ఎప్పటికప్పుడు బయటి నుంచి తీసుకువస్తున్నారని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు వాపోయారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి వీరే వంట చేస్తున్నారని, వీరిని మార్చాలని డిమాండ్ చేస్తున్నా.. ఉపాధ్యాయులు మాత్రం వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థులకు శుద్ధి నీరు అందించే ఫిల్టర్ వాటర్ మిషన్ సైతం మరమ్మతుకు గురైనా బాగు చేయకపోవడంతో.. నిత్యం మిషన్ భగీరథ నీరు తాగుతున్నారు. వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 15 మందికి సీరియస్ కడుపు నొప్పితో విలవిలలాడినబాలబాలికలు విషయం బయటకు రాకుండా ఉపాధ్యాయుల ప్రయత్నం పరిస్థితి విషమించడంతోమహబూబ్నగర్కు తరలింపు నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహైస్కూల్లో ఘటన పాఠశాలలో లోపించిన పారిశుద్ధ్యం -
ఇసుకాసురుల నయా దందా
పట్టుబడిన ఘటనలు ఇలా.. ¢ నవంబర్ 1వ తేదీన ఏపీ నుంచి హైద్రాబాద్‌కు లారీలో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి ఉండవెల్లి పోలీసులు ఇటిక్యాల పాడు (ఘార్ ధాబా) వద్ద లారీని సీజ్ చేసి డ్రైవర్, యాజమానిపై ఉండవెల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ¢ అక్టోబర్ 2వ తేదిన మంత్రాలయం నుంచి ధరూరు మీదుగా లారీలో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి ధరూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని లారీని సీజ్ చేసి డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. తుంగభద్ర నది అవతలి వైపున ఉన్న కర్నూల్ పట్టణ శివారు ప్రాంతాల నుంచి రెండు రాష్ట్రాల సరిహద్దుల నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. ●ఉపేక్షించం.. అనుమతులు లేకుండా ఇసుక రావాణా చేస్తే సహించేది లేదు. అలాగే, సామర్థ్యానికి మించి ఇసుకను రిచ్‌ల వద్ద లోడ్ చేసినట్లు విచారణలో తేలితే సంబంధిత రిచ్ అధికారులపై చర్యలు ఉంటాయి. నాసీరకం ఇసుక అమ్మకాలపై నిఘా ఉంచి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. త్వరలో కలెక్టర్ అనుమతితో జిల్లాలోని ఇసుక రిచ్‌ల నుంచి ఇసుక అందేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎస్పీ గద్వాల క్రైం: జిల్లాలో ఇసుక వ్యాపారులు నయా దందాకు తెరలేపారు. ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుకను సైతం అక్రమంగా ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికితోడు ఏపీ ప్రభుత్వం జీరో ఇసుక పాలసీ ప్రవేశపెట్టిన తరుణంలో సరిహద్దు జిల్లాగా ఉండడం ఇక్కడి ఇసుక వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. జిల్లా.. అటు ఏపీ, ఇటు కర్ణాటక రాష్ట్రాకలు సరిహద్దు కావడంతో అర్ధరాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున వ్యాపారులు ఇసుకను రాష్ట్ర సరిహద్దులకు రహస్యంగా చేరవేస్తున్నారు. అక్కడి నుంచి ఇసుకను డంపు చేసుకుని ఎడ్ల బండ్లపై తరలిస్తు అనుమానం లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అనుమతులతో అక్టోబర్ 28న గద్వాల పట్టణంలోకి సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్న మూడు భారీ వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఉండవెల్లి, ఇటిక్యాల, రాజోళీ, ధరూర్ పోలీసు స్టేషన్లో సైతం ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఫిల్టర్ ఇసుక దందా.. గద్వాల మండలంలోని గోనుపాడు, సంగాలకు చెందిన కేటుగాళ్లు సంగాల చెరువు సమీపంలో ఒండ్రు, సౌడు మట్టి నుంచి నాసీరకం (ఫిల్టర్) ఇసకను డంపులుగా ఏర్పాటు చేసుకుని గృహనిర్మాణదారులకు నాణ్యత లేని ఇసుకను విక్రయిస్తున్నారు. అయితే జూన్ 4వ తేదీన ఫిల్టర్ ఇసుకను గుట్టుగా ట్రాక్టర్ ద్వారా గద్వాలకు తరలిస్తున్న క్రమంలో సంగాల గ్రామానికి చెందిన ఓ కూలి గ్రామ శివారులో ట్రాక్టర్ కిందపడి మృతి చెందడంతో ఫిల్టర్ ఇసుక విషయం వెలుగులోకి వచ్చింది. అయినా ఫిల్టర్ ఇసుక సైతం యథేచ్ఛగా కొనసాగడం కొసమెరుపు. నాయకుల సహకారంతో వ్యాపారులు ఫిల్టర్ ఇసుకను గృహ నిర్మాణాదారులకు చేరవేస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాల అనుమతులతో.. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీలో పోలీసు బ్యారక్ నిర్మాణాలకు ఇసుక తరలింపు కోసం ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్‌కు అనుమతులు జారీ చేసింది. ఈ ఇసుకను గద్వాలకు చెందిన ఇసుక వ్యాపారులు అక్రమంగా గృహ నిర్మాణాదారులకు విక్రయించడం పరిపాటిగా మారింది. పోలీసు భవనాల నిర్మాణ కోసం ఇసుకను తీసుకెళ్తున్నట్లు వ్యాపారులు చూపిస్తూ.. ఈ దందా కొనసాగిస్తున్నారు. అయితే నాణ్యతతో వస్తున్న ఇసుక వాహనాలలో ఫిల్టర్ ఇసుకను లోడ్ చేసుకుని అక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఇసుక రిచ్‌లు ఉన్నా.. జిల్లాలో తుంగభద్ర పరివాహక ప్రాంతాలైన తుమ్మిళ్ల, వేణిసోంపురాం, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, కేశవరం వద్ద ప్రభుత్వం ఇసుక రిచ్‌లను ఏర్పాటు చేసి మన ఇసుక మన వాహనం పేరుతో గృహ నిర్మాణాదారులకు ఇసుకను ప్రభుత్వం విక్రయిస్తుంది. అయితే గత ఐదు నెలలుగా రిచ్‌ల వద్ద ఇసుక విక్రయాలు నిలిచిపోయాయి. ఇదే అదునుగా ఏపీ, తెలంగాణకు చెందిన ఇసుక వ్యాపారులు రెండు రాష్ట్రాల నాయకులతో ఒప్పందాలు చేసుకుని ఏపీలో జీరో ఇసుక పాలసీ ఉండడంతో ఇక్కడి ఇసుకను సైతం తరలిస్తున్నారు. ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుక పక్కదారి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం ఇదే అదునుగా ఫిల్టర్ ఇసుక విక్రయాలు జిల్లాలో ఓవర్ లోడ్ వాహనాలపై ఇటీవల కేసులు సైతం నమోదు -
ఉపాధ్యాయులకు చెబితే..
మేం రోజు మాదిరిగానే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశాం. అయితే ఒంటిగంటకు భోజనం చేసి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నాం. కొంత సమయానికి కడుపు నొప్పి మొదలైంది. ఈ విషయం మొదట ఉపాధ్యాయులకు చెబితే లైట్‌గా తీసుకుని..పట్టించుకోలేదు. – మహేష్, 7వ తరగతి నాణ్యతగా ఉండదు.. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడం వల్లనే అనారోగ్యానికి గురయ్యాం. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించడం లేదు. ఈ విషయమై ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వంట ఏజెన్సీని మార్చి నాణ్యమైన భోజనం అందించాలి. – జగదీశ్, 7వ తరగతి వెంటనే స్పందించాం.. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి చికిత్స అందేలా చూశాం. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం మధ్యాహ్న భోజనమా అనేది ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – మురళీధర్‌రెడ్డి, హెచ్ఎం ●వైద్యులతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి -
కేసీఆర్‌తోనే సస్యశ్యామలం
రూ.4వేల కోట్ల వ్యయంతో 6.50 లక్షల ఎకరాలకు నీరిచ్చాం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల. ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ కృషి చేశారు’ అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. 50 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు టీడీపీ ఈ జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం. కల్వకుర్తి, నెట్టెపాండు, బీమా, కోయిల్‌సాగర్ కింద రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లందించాం అని తెలిపారు. ఇంకా హరీశ్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్, టీడీపీలు పాలమూరును వలసల జిల్లాగా మారిస్తే.. వలసలను వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదే.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు కట్టడం వల్ల భూగర్భజలాలు పెరిగి ఈ రోజు వ్యవసాయం పండుగగా మారింది. రైతుల క్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన నాయకుడు కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం.. ఈ ప్రభుత్వం ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కురుమూర్తిస్వామికి మొక్కులు.. మార్గమధ్యంలో ధాన్యం కేంద్రాల్లో రైతులతో మాటామంతి.. కొనుగోళ్ల తీరుపై ఆరా పాలమూరు పేరును చెడగొడుతున్నారు.. రేవంత్‌రెడ్డికి వచ్చేది రెండే. ఒకటి దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం. మరొకటి ప్రతిపక్షాన్ని తిట్టడం. రైతులకు రూ.15 వేల రైతుబంధు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అన్ని రకాల పంటలకు బోనస్ అంటూ మోసం చేశారు. రైతు కూలీలకు రూ.12 వేలు అంటూ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయలు. కానీ పాలమూరు పేరును రేవంత్‌రెడ్డి చెడగొడుతున్నారు. రేవంత్ సీఎం అయ్యారంటే కేసీఆర్ భిక్షనే.. రైతులకు రూ.41 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ తర్వాత రూ.31వేల కోట్లు అని, అనంతరం బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. చివరకు చేసింది ఎంత అంటే రూ.17 వేల కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి 20 లక్షల మందికి మాత్రమే చేశారు. సగం కంటే రుణ మాఫీ కాలేదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. రైతులకు మేలు జరుగుతుందంటే నా ఎమ్మెల్యే పదవిని సైతం వదులు కోవడానికి సిద్ధపడ్డాను. కానీ పూర్తి రుణమాఫీ చేయ డంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రానికి రేవంత్ సీఎం అయ్యావంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే. హైడ్రా మూసీ పేరుతో ఇళ్లను కూలగొట్టడమే తప్ప ఇల్లు కట్టడం తెలియదు రేవంత్‌రెడ్డికి. ప్రజలపై ఆగ్రహం చూపొద్దని మొక్కా.. కురుమూర్తి స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాలకుడే దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే దైవాగ్రహానికి గురవుతాం. రేవంత్‌రెడ్డి చేసిన పాపానికి ఆ స్వామిని దర్శించుకుని క్షమించమని, ప్రజలపై ఆగ్రహం చూపొద్దని మొక్కా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాన్ని పాలించే పాలకుడు ప్రజలను మోసం చేయకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించా. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదు.. ఎప్పుడు వస్తే అప్పుడు 100 సీట్లతో కేసీఆర్‌ను గెలిపిస్తారు. -
అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్ర సాంస్కృతి సారథి కళా బృందం ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ వరకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్ వద్ద తెలంగాణ సాంస్కృతిక కళాయాత్ర ప్రదర్శనల కోసం వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయగా ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం ధరూరు మండల కేంద్రంతో పాటు, భూరెడ్డిపల్లి, మార్లబీడులో కళాకారులు సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజావిజయోత్సవాలు ఈనెల 19డిసెంబర్ 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మీ, గృహజ్యోతి, రైతురుణ మాఫీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటిపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గురువారం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాలులో సాయంత్రం 5గంటలకు ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలను రాష్ట్రస్థాయి కళాకారులతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి అయిజ: ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తామని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయనతోపాటు ఎమ్మెల్యే విజయుడు మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకుడు జహీర్ మృతదేహానికి పూలమాలవేసి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బీఆర్స్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్డీఎస్ ద్వారా యాసంగి పంటలకు నీరు అందించేలా కృషిచేస్తానని, పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అదికారులను ఆదేశిస్తామని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులతో, వైద్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు సకాలంలో ఆస్పత్రికి చేరుకొని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని,30 పడకల ఆస్పత్రి నిర్మాణం పనులు నిలిచి పోయాయని, త్వరలోనే పనులు పూర్తిచేసేవిధంగా కృషిచేస్తానని అన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు ఎర్రవల్లి మండలం కొండేరు శివారులోని కంపెనీ నుంచి వస్తున్న విష వాయువులతో కొండేరు, జింకలపల్లి, షేక్‌పల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీ యాజమాన్యంపై చర్యతీసుకోవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, పలువురు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు
గద్వాలటౌన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని.. యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి గంట కవితాదేవి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్థానిక గ్రంథాలయం కార్యాలయం, సంతాన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేసి తమ సృజనాత్మకతను చాటారు. కొన్ని ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగులద్దుకున్న రంగవల్లులతో పుడమితల్లి పులకించింది. గ్రంథాలయ ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి గంట కవితాదేవి హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలను మరింత అభివృద్ధిపరిచి.. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే యువతకు అన్నిరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. తెలుగు సంప్రదాయాన్ని చాటుతూ ముగ్గులు వేసిన విద్యార్థినులు, మహిళలను అభినందించారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీకగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కాంతమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గ్రంథాలయ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
23లోగా సర్వే పూర్తి చేయాలి
గద్వాల: ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేను ఈనెల 23వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అఽధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కన్ఫరెన్స్ హాల్లో సమగ్ర కుటుంబ సర్వేపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే వివరాల నమోదు కోసం అవసరమైన కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్ వంటి వసతులను సమకూర్చాలని అధికారులకు సూచించారు. సర్వే డాటాలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఒకే మెయిల్ ఐడీ ద్వారా డేటా నమోదు చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను సమన్వయం చేసి, సర్వేను వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. 19 రోజులపాటు ప్రజా విజయోత్సవాలు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు 19 రోజులపాటు ప్రజాపాలన –ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో కళాజాతా వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలపై ప్రజల్లో చైతన్యం పరిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో పెద్దఎత్తున ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఏఓ వీరభద్రప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, జెడ్పీ సీఈఓ కాంతమ్మ పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లలో వేగం పెంచండి ఉండవెల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవెల్లి శివారులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద పత్తి వాహనాలు బారులుదీరడానికి గల కారణాలను తెలుసుకున్నారు. రైతులకు జారీ చేసిన టోకెన్ల మేరకు రావడం లేదని.. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉండటంతో పత్తి వాహనాలు అధికంగా వచ్చాయని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేందుకు వ్యవసాయశాఖ, సీసీఐ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమశాతం పరిశీలించి, త్వరగా కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. కొనుగోలు చేసిన పత్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కాగా, దళారులు రైతుల పేరుతో పత్తిని తీసుకువస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. అధికారులు పూర్తి వివరాలు సేకరించి, పత్తిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి పుష్పమ్మ, ఏడీఏ సక్రియా నాయక్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కుమార్, డైరెక్టర్ శ్రీకాంత్, మార్కెట్ కార్యదర్శి ఎల్లస్వామి, ఏఓ సుబ్బారెడ్డి, సీసీఐ ప్రతినిధి రాహుల్, ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు. -
22న దివ్యాంగులకు క్రీడా పోటీలు
గద్వాల అర్బన్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 22న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు సీ్త్రశిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్స్ విభాగంలో 10–17 ఏళ్ల బాలబాలికలు, సీనియర్స్ విభాగంలో 18–35 ఏళ్ల సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా ఆటల పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు, ఆధార్, సదరం సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఎవరి ట్రైసైకిల్ వారే తెచ్చుకోవాలని తెలిపారు. జిల్లాలోని శారీరక, అంధ, బధిర, మానసిక దివ్యాంగులు, దివ్యాంగ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వరికొయ్యలు కాల్చడంతో అనర్థాలు గద్వాల రూరల్: పంట పొలాల్లో వరికొయ్యలను కాల్చడంతో తీవ్ర అనర్థాలు సంభవిస్తాయని వ్యవసాయశాఖ డివిజన్ సంచాకురాలు సంగీతలక్ష్మి అన్నారు. మండలంలోని చెనుగోనిపల్లిలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరికొయ్యలు కాల్చడంతో గాలిలో ఏర్పడే విష వాయువులతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వరికొయ్యలకు నిప్పు పెట్టకుండా ఎస్ఎస్పీ 50 కేజీలు, 20 కేజీల యూరియా చల్లాలని.. తద్వారా భూమిలో పోషకాలు పెరిగి, పంటకు అందుతాయని చెప్పారు. అదేవిధంగా భూమి గుల్లబారి పంటకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని.. తగిన నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ సిబ్బంది ఉన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే విద్వేష రాజకీయాలు గద్వాల అర్బన్: ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ విద్వేష రాజకీయాలను సృష్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వేస్లీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ వంటి అంశాలతో ముందుకెళ్తూ.. ప్రజల మధ్య విభజన రాజకీయాలను పెంచి, దేశ ప్రతిష్టను దిగజారుస్తుందని విమర్శించారు. బీజేపీ విధానాలను ప్రజలు వ్యతిరేకించి, తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. పెండింగ్‌లో నెట్టెంపాడ్ ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని.. అన్ని విభాగాల్లో పూర్తిస్ధాయిలో అధికార యంత్రాంగాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ, జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, రాజు, వీవీ నర్సింహ, రేపల్లే దేవదాస్, పరంజ్యోతి, ఈదన్న, ఉప్పేరు నర్సింహ ఉన్నారు. సహకార సంఘాలతోనే అభివృద్ధి సాధ్యం రాజోళి: సహకార సంఘాలతోనే చేనేత కార్మికుల అభివృద్ధి సాధ్యమని డీసీఓ శ్రీనివాస్ అన్నారు. సహకార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాజోళిలోని చేనేత సహకార సంఘం కార్యాలయంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి సహకార సంఘాలు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారా అందిస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలని కార్మికులకు సూచించారు. -
వాతావరణం
అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉదయం, రాత్రివేళ చలి విపరీతంగా ఉంటుంది. ప్రైవేటుకు తరలుతున్న ధాన్యం.. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం కన్నా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకే ఎక్కువ ధాన్యం తరలుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యంగా కొనసాగడం, రోజుల తరబడి రైతులు నిరీక్షించలేక ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,300 ఇస్తుండగా, సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 అందిస్తోంది. బోనస్ ధరతో కలుపుకుని సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,800 రైతులకు అందించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేవలం రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు నుంచి ధాన్నాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోగా కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,300 రైతు ఖాతాలో జమ అవుతాయని, మరుసటి రోజున 24 గంటల్లోపు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే చాలాచోట్ల రైతులు మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు నిరీక్షించకుండా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధర కన్నా రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, సకాలంలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం
గద్వాలటౌన్: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూలై 1న ఉత్తర్వులు జారీ చేశాయి. అప్పటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ.. వ్యాపారుల వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. 120 మైక్రాన్లలోపు ఉండే కవర్లు, వస్తువులను తయారు చేయడం, అమ్మడం, వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కొంత మందికి జరిమానాలు సైతం విధించారు. కొద్ది రోజులపాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం.. ఆ తర్వాత ప్లాస్టిక్ నిషేధాన్ని అటకెక్కించారు. మార్పు వచ్చే సమయంలో.. జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం పాటిస్తూ వ్యాపారులు నిషేధిత కవర్ల వినియోగించడాన్ని నిలిపివేశారు. చేతిసంచులు తీసుకురావాలని వ్యాపారులు సూచించడంతో ప్రజలు కూడా ఇంటి నుంచే సంచులు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురాడంతో వెనక్కి తగ్గి తనిఖీలను నిలిపివేశారు. ఆ తర్వాత వ్యాపారులు అన్ని వస్తువులను ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుండటంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్మయమైంది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల విక్రయం, వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో సైతం ఆర్భాటమే తప్ప.. ఆచరణ కనిపించడం లేదు. కేవలం చెత్త సేకరణ ట్రాక్టర్ల మైకు ద్వారానే ప్రచారం చేస్తున్నారు తప్పితే.. క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నిషేదానికి తీసుకున్న చర్యలు శూన్యంగా మారాయి. కనిపించని తనిఖీలు.. మున్సిపాలిటీల్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుపరిచేందుకు సిటీ లెవల్ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో కమిషనర్, శానిటరీ సూపర్వైజర్లు, పోలీసు కానిస్టేబుల్ సభ్యులుగా ఉంటారు. వీరంతా రోజు దుకాణ సముదాయాలను తనిఖీలు చేయడంతో పాటు ప్రజలు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువుల గురించి వివరించాల్సి ఉంటుంది. ఈ కమిటీ తనిఖీలు ఎక్కడా కనిపించడం లేదు. స్వచ్ఛ ర్యాంకులపై ప్రభావం.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో ప్లాస్టిక్ నిషేధం అమలుతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలకు మార్కులు కేటాయిస్తారు. ప్రస్తుతం మున్సిపల్ పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఈ విభాగంలో ఎక్కడా మార్కులు పడే అవకాశం కనిపించడం లేదు. అవగాహన కల్పిస్తున్నాం.. గతేడాది నుంచే ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారులు, సిబ్బందితో కలిసి దాడులు చేసి ప్లాస్టిక్ విక్రయాలను అడ్డుకుంటున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం నిర్మూలన సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలతో పాటు దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. – బీఎస్ కేశవ్, మున్సిపల్ చైర్మన్, గద్వాల మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా పాలిథిన్ కవర్ల వినియోగం నియంత్రణపై చర్యలు శూన్యం కనిపించని సిటీ లెవల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ తనిఖీలు -
ఊపందుకోని కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాని ధాన్యం కేంద్రాలు● చాలాచోట్ల తేమశాతం పేరుతో ముందుకు సాగని వైనం ● సింహభాగం ప్రైవేటు వ్యాపారులకే తరలుతున్న సన్నాలు ● ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోల్పోతున్న రైతులు సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చాలాచోట్ల ఇప్పటివరకు ధాన్యం సేకరణ మొదలుపెట్టలేదు. తేమశాతం పేరుతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఓ వైపు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం, నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబోసేందుకు వీలుకాక తక్కువ ధరకే ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఈసారి సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ ధరను ప్రకటించినప్పటికీ చాలామంది రైతులు ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ధరను లబ్ధిపొందలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 8,360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మిగతా చోట్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 564 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు సేకరించారు. వనపర్తి జిల్లాలో 3,266 మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 3,107 మెట్రిక్ టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 750 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్ణీత తేమ శాతం 14 లోపు ఉంటేనే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల తేమశాతం ఉన్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించడం లేదని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు జిల్లా కొనుగోలు ప్రా.వి ఇప్పటివరకు కొన్న కేంద్రాలు ధాన్యం (మెట్రిక్ టన్నుల్లో) మహబూబ్‌నగర్ 189 189 8,360.60 నాగర్‌కర్నూల్ 252 252 564 వనపర్తి 262 183 3,266 జోగుళాంబ గద్వాల 64 64 750 నారాయణపేట 101 101 3,107ప్రా.వి: ప్రారంభించినవినామమాత్రంగా కొనుగోళ్లు.. నాలుగు రోజులుగా పడిగాపులు.. మాకున్న పొలంలో 2 ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. ఈ రోజో రేపో కొనుగోళ్లు ప్రారంభిస్తారని చెప్పడంతో ధాన్యాన్ని ధరూరు కేంద్రానికి తెచ్చి వారం రోజులుగా వడ్లకు కాపలాగ ఉంటున్నాం. పందుల బెడద తీవ్రంగా ఉంది. 10 నిమిషాలు మనిషి లేకపోతే ధాన్యమంతా పందుల పాలవుతోంది. – వీరేష్, రైతు, ధరూరు తేమశాతం ఉండట్లేదు.. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నిర్ణీత తేమశాతం కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా ఇందుకు సమయం పడుతోంది. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కేవలం రెండు రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రాజయ్య, జిల్లా పౌర సరఫరాశాఖ మేనేజర్, నాగర్‌కర్నూల్ -
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
ఎర్రవల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పౌర సరఫరా అధికారి స్వామి కుమార్ అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండల పరిదిలోని కొండేరులో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు తేమ శాతాన్ని తనిఖీ చేయడంతో పాటు తాలు, మట్టి పెల్లలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ. 2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరను అందించడంతోపాటుగా సన్న రకాలకు బోనస్‌గా మరో రూ.500 వరకు ఇవ్వనున్నట్లు వివరాలు తెలిపేలా కొనుగోలు కేంద్రం వద్ద చార్ట్‌ను రూపొందించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు తప్పకుండా అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఓపీఎంఎస్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ ప్రవళిక, సిసి బీచుపల్లి, ఐకేసి సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
ఎర్రవల్లి: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఏఈ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీ గార్లపాడులో రూ.25 లక్షల వ్యయంతో ఓ కాంట్రాక్టర్ మైనారిటీ కమ్యూనిటీ భవనం (షాదీఖానా)ను నిర్మించి బిల్లు కోసం ఎంబీ రికార్డుల్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావును ఇటీవల సంప్రదించాడు. ఈ క్రమంలో తనకు కాంట్రాక్ట్ బడ్జెట్ ప్రకారం 2 శాతం కమీషన్‌గా రూ.లక్ష ఇస్తేనే ఎంబీలో బిల్లు ఎక్కిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏఈతో చర్చలు జరిపి చివరికి రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు పథకం ప్రకారం సోమవారం ఉదయం బాధితుడు ఎర్రవల్లి కూడలిలోని జమ్జమ్ హోంనీడ్స్ దుకాణంలో ఏఈకి నగదు డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏఈ నుంచి వివరాలు సేకరించి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. ఏసీబీ దాడుల్లో సీఐలు లింగస్వామి, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు. ● ఎంబీ రికార్డు చేసేందుకు రూ.50 వేలు డిమాండ్ ● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు -
జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పుష్పలత
జడ్చర్ల: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్కు చెందిన కోనేటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్కు చెందిన చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మిపై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దింపిన తర్వాత తదుపరి చైర్పర్సన్ ఎవరా అంటూ దాదాపు మూడు నెలల పాటు చర్చలు కొనసాగాయి. చివరికి చైర్‌పర్సన్‌గా పుష్పలత ఏకగ్రీవం కావడంతో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. అయితే మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలుపుకోగలిగింది. ప్రశాంతంగా ఎన్నిక.. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. నిర్ణీత సమయానికి క్యాంపు నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లతోపాటు మాజీ చైర్పర్సన్ లక్ష్మి సైతం ఎన్నికకు హాజరయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ నవీన్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఎన్నికను నిబంధనల మేరకు నిర్వహించారు. బీఆర్ఎస్కు చెందిన 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలతను చైర్పర్సన్ అభ్యర్థిగా 26వ వార్డు కౌన్సిలర్ శశికిరణ్ ప్రతిపాదించగా 9వ వార్డు సభ్యురాలు చైతన్య బలపరిచారు. చైర్పర్సన్ అభ్యర్థిగా కోనేటీ పుష్పలతను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 26 మంది సభ్యులు ఆమోదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ నవీన్‌కుమార్ ప్రకటించి ధ్రువీకరించారు. పుర పీఠాన్ని నిలుపుకొన్న బీఆర్ఎస్ పార్టీ -
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్–3 పరీక్షలు
గద్వాలటౌన్: టీజీపీఎస్సీ గ్రూప్–3 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగే పరీక్షలో భాగంగా రెండవ రోజు సోమవారం జిల్లా పరిధిలో జరిగాయి. మొత్తం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థులను హాల్లోకి అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగిన పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్) పరీక్ష కొనసాగింది. మొత్తం 8,570 మంది అభ్యర్థులకు గాను 4,756 మంది అభ్యర్థులు (55.49 శాతం) హాజరయ్యారు. 3,814 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అభ్యర్థులను లోపలికి అనుమతించడానికి వీలు లేదని అధికారులు ఆయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఉదయం 8గంటల నుంచే పట్టణంలో గ్రూప్–3 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులతో సందడి నెలకొంది. పరీక్ష రాయడానికి వచ్చిన చాలామంది అభ్యర్థులకు చంటిపిల్లలు ఉండటంతో వారికి సహాయకులుగా వారి కుటుంబ సభ్యులు పరీక్షా కేంద్రాలకు వచ్చారు. -
అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
గద్వాల అర్బన్: బీజేపీ అనుసరిస్తున్న కుల అణచివేత, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా దళితులను సమీకరించి పోరాటాలు ఉధృతం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవనంలో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కల్గిస్తూ, లౌకికత్వ భావనకు తూట్లు పొడుస్తుందన్నారు. దళితులపై దాడులు చేస్తూ అంటరానితనం, వివక్షను పెంచి పోషిస్తూ దళిత జాతిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తోందని విమర్శించారు. దళిత జాతి ఐక్యంగా ఉండి బీజేపీ మతోన్మాద విధానాలను సంఘటితంగా ప్రతిఘటించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ చేయాలని, కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, దళితవాడల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, దళిత మహిళల ఆర్థిక సాధికారత కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పరంజ్యోతి, ఉపాధ్యక్షులు మారెన్న, విజయ్‌కుమార్, సవారన్న, జిల్లా కార్యదర్శి కరెప్ప, సహయ కార్యదర్శులు రాజు, ఆంజనేయులు, వెంకటస్వామి, సభ్యులు మద్దిలేటి, నాగరాజు, ప్రభుదాస్ తదితరులు ఉన్నారు. -
రాజ్యాధికారంతోనే అభివృద్ధి
మేమెంతో.. మాకంత కావాలి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాజ్యాధికారంతోనే ఏవర్గమైన అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుత తరుణంలో రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయని బీసీ, కుల సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే నాయకులు, ప్రతినిధులు తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ కార్యదర్శి సైదులు, కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. వారు చెప్పిన అభిప్రాయాలను వినడంతో పాటు వినతిపత్రాలను స్వీకరించారు. సంఘాల వారీగా ప్రత్యేకంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాజకీయ ప్రాతినిథ్యం లేని కులాలు చాలా ఉన్నాయని, వాటికి కూడా రిజర్వేషన్ల ద్వారా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మొత్తం 65 సంఘాల నాయకులు కమిషన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర పాల్గొన్నారు. కులగణన ఆధారంగా.. రాజకీయ ప్రాధాన్యం లేకుంటే ఏమీ జరగదు బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలి బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు వెల్లువెత్తిన వినతులు మహబూబ్‌నగర్ కలెక్టరేట్ బీసీ రిజర్వేషన్ల గుర్తింపుపై బహిరంగ విచారణ ముదిరాజ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.. బీసీ జనాభాలో సగభాగం ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యత లేదు. రాష్ట్రంలో 12,760 గ్రామాలకు గాను 8వేలకుపైగా గ్రామాల్లో ముదిరాజ్‌ల జనాభా అధికంగా ఉంది. వందశాతం ముదిరాజ్‌లు ఉన్న గ్రామాలు వందల్లో ఉన్నా రాజకీయ ప్రాధాన్యత లేదు. స్థానిక సంస్థల్లో ముదిరాజ్‌ల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. – కృష్ణ ముదిరాజ్, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరేమన్నారంటే.. యాదవులకు పొలిటికల్ పవర్ ఉండాలని, అందుకనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని యాదవ సంఘం అధ్యక్షుడు కాశన్న విన్నవించారు. రోస్టర్ పద్ధతిలో ఉన్న రిజర్వేషన్‌ను ఎస్టీ ఎరుకులకు తీసి వేశారని, గ్రామాల వారిగా రోస్టర్ తీసుకోవాలని ఎరుకుల సంఘం బాలయ్య కోరారు. 50 కులాలకు ఇంక రాజకీయ ప్రాధాన్యత రాలేదని సగర సంఘం అధ్యక్షుడు ప్రణీల్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ పెంచాలని విన్నవించారు. పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని సంఘం నాయకుడు సారంగి వినయ్‌కుమార్ పేర్కొన్నారు. సచార్ కమిటీ సిఫారస్సులను అమలు చేయాలని బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మోసిన్‌ఖాన్ కోరారు.పేదలకు న్యాయం చేయాలి.. 90 శాతం ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు న్యాయం చేయాలి. వారు ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు తదితర సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందించాలి. భూమి లేని ప్రజలందరికీ ఎకరం వ్యవసాయ సాగు భూమి, 200 గజాల స్థలంలో 4 గదులతో కూడిన ఇల్లు నిర్మించి ఇవ్వాలి. – విశారదన్ మహారాజ్, ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో వచ్చిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలి. జిల్లాలో అత్యధికంగా బీసీలు ఉన్నారని, రేపు కులగణన జరిగిన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. – శ్రీనివాస్‌సాగర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
సమగ్ర కుటుంబ సర్వేలో తప్పులకు తావివ్వొద్దు
మానవపాడు: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు తెలిపిన వివరాలు పొందుపర్చాలని, ఎట్టి పరిస్థితిలో తప్పులకు తావివ్వొద్దని ప్రత్యేక ఐఏఎస్ అధికారి రవిచందర్, డిఎస్ఓ నాగర్జునగౌడు సూచించారు. సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో సమగ్ర కుటుంబ సర్వేను వారు తనిఖీ చేశారు. గ్రామాల్లో సర్వేకు వెళ్లిన ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని, తాళం వేసిన ఇంటికి మరుసటి రోజు వెళ్లాలని, లేదా సమీప ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. అర్థమయ్యేలా ప్రశ్నలు వివరించి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ భాస్కర్, తహసీల్ధార్ వాహిదా ఖాతూన్, ఆర్ఐ గరురాజ్ పాల్గొన్నారు. అలరించిన పౌరాణిక నాటకాలు గద్వాలటౌన్: అలనాటి పౌరాణిక నాటక కళావైభవం మరోసారి గద్వాల బాలభవన్పై వెళ్లివిరిసింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా రంగస్థల కళాకారులు ప్రదర్శించిన నాటకాలు అందరి దృష్టిని తమవైపు మల్చుకున్నారు. పౌరాణిక నాటకాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్థానిక బాలభవన్‌లో కళాకారులు పౌరాణిక నాటక ప్రదర్శన ఇచ్చారు. పడక సీను, చింతామణి భవాని, శ్రీరామంజనేయ యుద్ధం సన్నివేశాలను తమ అభినయంతో నాటకాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి ఉపశమనం పొందేందుకు సాంప్రదాయ కళలు, నాటకాలు పరిపూర్ణంగా దోహద పడతాయని పలువురు పేర్కొన్నారు. సమాజాన్ని చైతన్య పర్చేలా పౌరాణిక నాటక ప్రదర్శనలను రూపొందించాలని సూచించారు. వరికొయ్యలను కాల్చొద్దు నాగర్‌కర్నూల్ రూరల్: రైతులు వరికోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా కుళ్లింపజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికొయ్యలను కుళ్లించడంతో భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరికొయ్యల అవశేషాలపై ఎకరాకు 50 సూపర్ సల్ఫేట్, 10 నుంచి 15 కిలోల యూరియా చల్లాలని సూచించారు. నీటి తడి ద్వారా డీకంపోజింగ్ చేసుకోవచ్చని.. లేదా రోటవేటర్‌తో దమ్ము చేసుకోవాలని తెలిపారు. భూమిలో పోషకాలను కాపాడుకోవడం కోసం రైతులు అవసరమైన ఎరువులను వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనాన్ని తగ్గించడంతో భూసారం పెంచుకోవడంతో పాటు వా యు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ధాన్యంతో కిక్కిరిసిన బాదేపల్లి యార్డు జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు పంట దిగుబడులతో కిక్కిరిసింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి 9,326 క్వింటాళ్ల ధాన్యం యార్డుకు విక్రయానికి వచ్చింది. ఇంత ధాన్యం యార్డుకు రావడం ఈ సీజన్లో ఇదే మొదటిసారిగా అధికారులు తెలిపారు. అదేవిధంగా 2081 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలు గరిష్టంగా రూ.2,417, కనిష్టంగా రూ.1,912 ధరలు లభించగా ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.1,550, హంస రకం రూ.2,011, రాగులు రూ.2,222, వేరుశనగ గరిష్టంగా రూ.6,213, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. ఎన్టీఆర్‌లో స్పాట్ అడ్మిషన్లు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో మిగిలిన పీజీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, జువాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో బుధవారంలోగా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం సెల్ నం.96404 14429ను సంప్రదించాలని చెప్పారు. -
కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం విక్రయించుకోవాలి
ధరూరు: రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్‌ను ఆయన మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించడంతోపాటు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రభుత్వం సన్న రకం వడ్లకు నిర్ణయించిన మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ పొందాలని సూచించారు. అందుకు గాను తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, బయటి మార్కెట్లో విక్రయించి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కేటాయించిన, నిర్ణయించిన మద్దతు ధరలకు విక్రయించుకోవాలని కోరారు. గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు తేమ శాతం వచ్చిన వడ్లను తూకాలు చేసి నిర్ధేశిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. -
ముస్లింలకు న్యాయం చేయాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం ఉన్న వెనకబడిన ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలి. ముస్లింలలో 50 వెనకబడిన కులాలు ఉండగా.. వీటిలో 30 దాకా సంచార తెగలు ఉన్నాయి. వీరిని ఎస్టీలుగా, మిగిలిన 20 కులాలను బీసీలుగా గుర్తించి వెనకబడిన ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు పెంచాలి. – షేక్ ఫరూక్ హుస్సేన్, ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు రజకులకు అన్యాయం రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల జనాభా ఉన్న రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండాపోయింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నామని, ఇంకా తమను అంటరానివాళ్లుగానే సమాజం చూస్తుంది. తమ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి. – పురుషోత్తం, రజక సంఘం అధ్యక్షుడు -
రిజర్వేషన్ కల్పించాలి..
సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణలో 129కి పైగా బీసీ తరగతులు ఉండగా.. ఇప్పటికీ అత్యధిక శాతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. సంచార జాతులు, ఎంబీసీ కులాలలో సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం విపరీతంగా ఉంది. వీరిపై దాడులు, దౌర్జన్యాలు, కులవివక్ష, మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. 11 బీసీ ఎంబీసీ కార్పొరేషన్ల ఫెడరేషన్లకు పాలక వర్గాలను నియమించి తగిన బడ్జెట్ కేటాయించాలి. – మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు