Jogulamba District News
-
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
గద్వాల న్యూటౌన్: జిల్లాలో ప్రథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 నుంచి 30ఏళ్లలోపు వయసు గల యువతకు 30 రోజులు ఉచితంగా ఎలక్ట్రీ షియన్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ ఇంటర్, డిగ్రీ, ఎలక్ట్రీషియన్ (ఐటీఐ ఎలక్ట్రీ షియన్) అర్హత కల్గి, శిక్షణ పూర్తి చేసిన వారికి ఎన్ఎస్డీసీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. వివరాలకు సెల్ నం. 6303430789, 9030421360 ను సంప్రదించాలని సూచించారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
గద్వాల క్రైం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని.. వాటిని చేరుకునేందుకు పట్టుదలతో చదవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి గంటా కవితాదేవి అన్నారు. గురువారం బుర్ధపెట కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జడ్జి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలోని సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అయితే పాఠశాల ఆవరణలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని జడ్జి దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే రాత పూర్వకంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. -
సరిహద్దులో తనిఖీలు ముమ్మరం
అలంపూర్: రాష్ట్ర సరిహద్దులోని జాతీయ రహదారిపై తనిఖీలు కొనసాగుతున్నాయి. అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయరహదారిపై ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు నిరంతర తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ధాన్యపు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇచ్చి మద్దతు ధరతో ధాన్యం కోనుగోలు చేస్తుంది. దీంతో పక్క రాష్ట్రాల ధాన్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం రాత్రి ఏపీ రాష్ట్రం నుంచి ధాన్యంతో వచ్చిన 9 లారీలను తనిఖీ అధికారులు నిలిపివేసినట్లు తెలిపారు. ధాన్యపు లారీలో రెండు సెస్ చెల్లించడంతోపాటు వేబిల్లు ఉండటంతో రెండు వాహనాలను గురువారం రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన 7 లారీలలో ధాన్యానికి సెస్ చెల్లించినప్పటికి వే బిల్లులు లేకపోవడంతో తిరిగి వెనక్కి పంపినట్లు తెలిపారు. -
నల్లమలలో కారిడార్
●సురక్షిత ప్రయాణానికి హైదరాబాద్– శ్రీశైలం వరకు ఫోర్లైన్ల రహదారి ● మన్ననూర్– పాతాళగంగ మార్గంలో 62 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్ ● ప్రాజెక్టు వ్యయం అంచనా రూ.7,700 కోట్లు ● శ్రీశైలం డ్యాం వద్ద నాలుగు వరుసల భారీ వంతెన ● మల్లన్న సన్నిధికి తగ్గనున్నప్రయాణ భారం డ్యాం వద్ద ఐకానిక్ బ్రిడ్జి హైదరాబాద్– శ్రీశైలం– తోకపల్లి జాతీయ రహదారిలో శ్రీశైలం డ్యాం వద్ద ఐకానిక్ వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ మార్గంలో పాతాళగంగ వద్ద ఇరుకై న బ్రిడ్జి ఉంది. ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు తెలంగాణలోని ఈగలపెంట, ఆంధ్రప్రదేశ్‌లోని సున్నిపెంట గ్రామా ల మధ్య కృష్ణానదిపై 173 మీటర్ల ఎత్తు, 670 మీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ వైపు 180, ఏపీ వైపు 340 మీటర్ల సపోర్ట్ బ్రిడ్జి డిజైన్ రూపొందించారు. దీంతో శ్రీశైలానికి మరో 9 కి.మీ., దూరం తగ్గుతుంది. ప్రతిపాదనలు పూర్తయ్యాయి.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి రెండు వరుసల నుంచి నాలుగు వరుసలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. నల్లమలలో ఎలివేటెడ్ కారిడార్‌తో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయి. ఒకవైపు వన్యప్రాణులను సంరక్షిస్తూనే.. శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు ఈ కారిడార్ మేలు చేయనుంది. దక్షిణకాశీగా పిలిచే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరిగితే నిత్యం రద్దీగా ఉండే శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట సానుకూలంగా స్పందన.. హైదరాబాద్– శ్రీశైలం రోడ్డు విస్తరణకు సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని భూత్పూర్– మన్ననూర్– మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ)– సిరిగిడిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు ఒక రహదారి, పుల్లూరు– అలంపూర్ మీదుగా కొల్లాపూర్– అచ్చంపేట– దేవరకొండ– నల్లగొండ వరకు మరో జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. – మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్ సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: ఒకవైపు అరుదైన వన్యప్రాణులు, వృక్షజాతులను సంరక్షిస్తూనే.. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు నల్లమల వేదిక కానుంది. నల్లమల అటవీ ప్రాంతం గుండా సుమారు 62 కి.మీ., మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో హైదరాబాద్– శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల జీవనానికి ఆటంకం కలిగించకుండా భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రూ.7,700 కోట్ల నిధులతో ఈ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టేందుకు అవసరమైన డీపీఆర్ రూపొందించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 30 అడుగుల ఎత్తులో.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 గుండా శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులతో రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ మార్గంలో సుమారు 62.5 కి.మీ., మేర నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మన్ననూరు గ్రామం నుంచి పాతాళగంగ వరకు సుమారు 30 అడుగుల ఎత్తులో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో వన్యప్రాణుల భయం లేకుండా ఎత్తు నుంచే గమ్యాన్ని చేరుకునేందుకు వీలుంది. హైదరాబాద్– ఏపీలోని ప్రకాశం మధ్య 45 కి.మీ., మేరకు దూరభారం తగ్గనుంది. డీపీఆర్ పూర్తయితే భూసేకరణ హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ కోసం 2022– 23లో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని 128.6 కి.మీ., నుంచి 191 కి.మీ., వరకు రోడ్డు విస్తరణకు ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. జనావాసాలు ఉన్న మన్ననూర్, దోమలపెంటల వద్ద బైపాస్, మూలమలుపులు ఉన్నచోట నేరుగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు ఉన్నాయి. డీపీఆర్ పూర్తయితే అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి– మన్ననూర్ నుంచి ఈగలపెంట– పాతాళగంగ వరకు సుమారు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఇందులో 128.63 హెక్టార్లు అటవీ భూమి కాగా.. మరో 18.68 హెక్టార్ల అటవీయేతర భూమి సేకరించనున్నారు. 24 గంటల పాటు రాకపోకలు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం గుండా ఈ రహదారి వెళ్తుండటంతో ప్రస్తుతం మన్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీశాఖ అనుమతించడం లేదు. వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా వాహనాల వేగం సైతం గంటకు 30 నుంచి 40 కి.మీ.కే పరిమితమవుతోంది. ఈ రోడ్డుపై నిత్యం 8 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. శని, ఆదివారాల్లో రద్దీ 10 వేల వాహనాలకు మించుతోంది. -
నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలి
గద్వాల: జిల్లాలో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌హాలులో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ, టీఎస్ఎంఐడీసీ, ఈడబ్ల్యూడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న పనుల పురోగతి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కేజీబీవీ, బాలసదన్ నిర్మాణాలు పూర్తి చేసి నివేదికలు అందించాలన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలో కొనసాగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బీటీరోడ్లు, కనెక్టింగ్ రోడ్లు, సీసీ రోడ్లు, భవనాల నిర్మాణం పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖలలో కొనసాగుతున్న పనులన్నీ పూర్తి చేయాలని, అదేవిధంగా పనుల పురోగతిపై త్వరలోనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కాంతమ్మ, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. సమన్వయంతో.. గట్టు మండలంలో వైద్య, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌హాలులో గట్టు మండల అభివృద్ధి పై అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంలంలో కొన్ని శాఖల అధికారులు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి చేయడంలో వెనకబడి ఉన్నారని పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాటు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి
గద్వాలటౌన్ : క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు పేరు తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీలలో భాగంగా గురువారం తాయిక్వాండో, హ్యాండ్‌బాల్, సెపక్తక్రా, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, సోమనాద్రి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు, శారీరక దృఢత్వానికి కరాటే దోహదం చేస్తుందని చెప్పారు. క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని ఆరోగ్యకర వాతావరణంలో సానుకూల దృక్పథంతో జయాపజయాలను స్వీకరించాలన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశమన్నారు. డీవైఎస్ఓ బీఎస్ ఆనంద్ మాట్లాడుతూ క్రీడాకారులను ఉత్సాహపర్చడమే కాకుండా వారి మధ్య స్నేహభావం పెంపొందించేందుకు పోటీలు తోడ్పడుతుందన్నారు. చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతోపాటు, మానసిక దృడత్వం లభిస్తుందని చెప్పారు. గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్, పీఈటీలు నగేష్‌బాబు, హైమవతి, సుహాసిని, కృష్ణయ్య, శ్రీనివాసులు, రత్నమాల, నిర్మల, మల్లీశ్వరి, నర్సింహారాజు, సతీష్‌కుమార్, ఆనంద్‌కుమార్, స్వప్న, అరుణతార, రఘు తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ట్రాన్స్‌కో ఇన్చార్జ్ ఎస్ఈ తిరుపతిరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 27, 28 తేదీల్లో వైజ్ఞానిక ప్రదర్శన గద్వాలటౌన్: విద్యార్థుల్లోని వినూత్న ఆలోచనలకు రూపం కల్పించి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యాశాఖ ఓ వేదిక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు స్థానిక ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. గురువారం స్థానిక బాలభవన్‌లో డీఈఓ అబ్ధుల్ ఘనీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంఈఓ, హెచ్ఎం, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం, ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వైజ్ఞానిక ప్రదర్శనపై దిశానిర్ధేశం చేశారు. విద్యార్థుల చేత మెరుగైన ప్రాజెక్టులను రూపొందించేలా వారిని సిద్దం చేయాలని డీఈఓ సూచించారు. ఈ సారి జిల్లా నుంచి ఒక్క ప్రదర్శన అయినా జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 29 మంది వార్డు అధికారుల నియామకం గద్వాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి కొత్త వార్డు అధికారులను, ఉద్యోగులను కేటాయించింది. గత నెలలో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–4 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 29 మంది అభ్యర్థులను గద్వాల మున్సిపాలిటీకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 25 మంది వార్డు అధికారులు, ఇద్దరూ జూనియర్ అకౌంటెంట్లు, ఇద్దరూ జూనియన్ అసిస్టెంట్లు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 13 మంది వార్డు అధికారులు, ఇద్దరూ అకౌంటెంట్లు రిపోర్టు చేశారు. మరో 14 మంది రిపోర్టు చేయాల్సి ఉంది. మున్సిపల్ కమిషనర్ దశరథ్ వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. వార్డు అధికారుల నియామకంతో మున్సిపాలిటీలో సేవలు మెరుగుపడనున్నాయి. పౌరసేవలు సత్వరం అందే అవకాశం ఉంది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలి గద్వాలటౌన్: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణం క్రమబద్ధీకరించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గురువారం సైతం కేజీబీవీ సీఆర్టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతబట్టి దీక్ష చేపట్టారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేసి తమ జీవి తాలలో వెలుగులు నింపాలంటూ దీక్ష శిబిరంలోని ఉద్యోగులు క్రొవ్వొత్తులు వెలగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. 20 ఏళ్లుగా పనిచేస్తూ గురుకులాలతో సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రతి ఉద్యోగికి జీవిత భీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులందరిని క్రమబద్దీకరించాలని, అప్పటి వరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు హుస్సేనప్ప, గోపాల్, ప్రణీత, శేషన్న, ఖాజా, సమి, శ్యామ్, శ్రీనివాసులు, రామంజనేయులు, ఎస్ఓలు ఆసియాబేగం, గోపిలత, శ్రీదేవి, పద్మ, చంద్రకళ పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ..!
పత్తి కొనుగోళ్లకు తరచూ అంతరాయం మూడు రోజులైంది వచ్చి.. నాకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. రెండు ఎకరాలకు కలిపి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. బయటి మార్కెట్లో ధర లేకపోవడంతో దూరమైన సీసీఐ కేంద్రానికి వచ్చాను. ఇక్కడికి రావడానికి ట్రాక్టర్ కిరాయి రూ.4 వేలు అయ్యింది. ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది. కానీ సెలవని కాంటా వేయడం లేదు. చేసేది లేక ఇక్కడే ఉంటున్నాను. – సత్యారెడ్డి, పత్తి రైతు, మల్లెందొడ్డి, మల్దకల్ మండలం సామర్థ్యం తక్కువగా ఉండటంతోనే.. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంది. ఎక్కువ పత్తి నిల్వ చేస్తే వేడి పెరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇటీవలే చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగింది. అందుకే అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నాం. రైతుల నుంచి చివరి వరకు పత్తి కొనుగోలు చేస్తాం. – ఎల్లస్వామి, మార్కెట్ యార్డు కార్యదర్శి, అలంపూర్ అలంపూర్: పత్తి పంట సాగు ఒక ఎత్తు అయితే.. దానిని విక్రయించడం మరో ఎత్తులా మారింది. సీసీఐ కేంద్రం వద్ద పత్తి విక్రయించాలంటే ముందుగా టోకెన్ తీసుకోవాలి.. దానికి బారెడు క్యూలో గంటలపాటు వేచి ఉండాలి. తీరా టోకెన్ దక్కితే కేటాయించిన తేదీ రోజు వాహనంలో పత్తి లోడ్ చేసుకొని కేంద్రం వద్దకు రావాలి. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. జిల్లాలో ఒకే ఒక్క పత్తి కొనుగోలు కేంద్రం (సీసీఐ) ఉండగా.. అది కూడా తరచూ కొనుగోళ్లు నిలిపివేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం ప్రారంభించి 45 రోజులు అయితే.. ప్రభుత్వ సెలవులు, నిల్వలు పేరుకుపోయాయి తదితర కారణాలు చెబుతూ కేవలం 29 రోజులు మాత్రం కొనుగోళ్లు జరిపారు. దీంతో సీసీఐ కేంద్రం వద్ద నిత్యం వాహనాలు బారులు తీరగా.. తమ టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందో అంటూ రైతులు అక్కడే వంటలు చేసుకుంటూ చలికి ఇబ్బందులు పడే దుస్థితి నెలకొంది. జిల్లాలో ఒకే సీసీఐ కేంద్రం జిల్లాలో ఈ ఏడాది ఒకే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీవరసిద్ధి వినాయ కాటన్ మిల్లులో కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినా.. ఒక్క అలంపూర్ నియోజకవర్గంలోనే ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. దీంతో జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన రైతులు ఇక్కడికే రావాల్సి వస్తోంది. దీంతో పండించిన పత్తిని అమ్ముకోవడానికి అటు దూరభారం.. ఇటు వాహనాల అద్దె ఖర్చు లు.. ఎదురుచూపులతో ఇబ్బందులు తప్పడంలేదు. 45,296 క్వింటాళ్ల పత్తి కొనుగోలు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో 1,360 మంది రైతుల నుంచి 45296.50 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఈ పత్తి విలువ సుమారు రూ.33.17 కోట్లు. సీసీఐ కేంద్రంలో పత్తికి తేమ 8 నుంచి 12 శాతం, నాణ్యతతో ఉన్న పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు తక్కువగా రూ.7121 నుంచి రూ. 7521 అందించారు. ప్రస్తుతం క్వింటాకు మద్దతు ధర రూ.7121 నుంచి రూ.7421 చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.6500 నుంచి రూ. 6800 వరకు పలుకుతుంది. సీసీఐ కేంద్రంలో క్వింటాకు రూ.600 నుంచి 800 వరకు అదనంగా ఉండటంలో రైతులు సీసీఐ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. మూడు రోజులు నిలిపివేత సీసీఐ కేంద్రం వద్ద రోజుల తరబడి రైతుల పడిగాపులు.. జిల్లాలో ఒకే పత్తి కొనుగోలు కేంద్రం.. పేరుకుపోతున్న నిల్వలు ఇప్పటి వరకు 45,296 క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిరంతరాయంగా కొనుగోళ్లు జరపాలని రైతుల వేడుకోలు ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీవరసిద్ధి వినాయ కాటన్ మిల్లులో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేశారు. తాజాగా పత్తి కొనుగోళ్లు ఈ నెల 20, 21, 22 మూడు రోజులపాటు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎల్లస్వామి తెలిపారు. కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వలు పేరుకుపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. తిరిగి ఈ నెల 23వ తేదీన కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, నవంబర్ 4వ తేదీన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రం ఏర్పాటు చేసిన పత్తి మిల్లులో నిల్వల సామర్ధ్యం తక్కువగా ఉండటంతో 45 రోజుల్లో కేవలం 29 రోజులు కొనుగోళ్లు జరగగా మిగిలిన 16 రోజులు సెలవులే ఉన్నాయి. కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగకపోవడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. టోకెన్లు పొందడానికి కొన్ని రోజులు, టోకెన్లు పొందిన తర్వాత అమ్మడానికి కొన్ని రోజులు పడిగాపులు తప్పడం లేదు. కేంద్రంలో రోజుకు 1500 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంత కంటే ఎక్కువ పత్తి కేంద్రానికి వస్తోంది. చేసేదిలేక అధికారులు శని, ఆదివారాలతోపాటు అదనంగా సెలవులు ప్రకటించి తాత్కాలికంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
గద్వాలటౌన్: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణం క్రమబద్ధీకరించాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బుధవారం దీక్ష శిబిరం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంటా ఫ్లకార్డులు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. డిమాండ్లను నెరవేర్చాలని నినదించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కేజీబీవీ సీఆర్టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతబట్టి దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజయ్‌కుమార్‌తో పాటు పులు సంఘాల నాయకులు దీక్ష శిబిరానికి సంపూర్ణ మద్దతును ప్రకటించి ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. గతేడాది ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీంఎ రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసే వరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు హుస్సేనప్ప, గోపాల్, రామంజనేయులు, శ్రీధర్, ఆల్తాఫ్, సమీ, మురళి, రాజేందర్‌తో పాటు కేజీబీవీ ఎస్ఓలు, సీఆర్టీలు పాల్గొన్నారు. -
సస్యరక్షణతోనే నారుమడుల సంరక్షణ
కొన్ని రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వరి నార్లు, మిరపనార్లు తదితర పంటల విషయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపై నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఙానకేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వరి నారు మొదటి దశ నుంచే రైతులు జాగ్రత్తలు పాటించాలి. నారుమళ్లలో నిలిచిన నీటిని సాయంత్రం వేళల్లో పూర్తిగా తొలగించాలి. ఉదయం పూట మళ్లీ నారుమడిని నీటితో నింపాలి. రాత్రి వేళల్లో నారుమళ్లలో నీరు లేకుండా చూసుకుంటే చలి నుంచి రక్షణ ఉంటుంది.● మిర్చి నార్లు, ఇతర పంటలు ఏవైనా రసాయనిక ఎరువులను తక్కువ మోతాదులో దశల వారీగా వినియోగించాలి.– సాక్షి, నాగర్‌కర్నూల్ -
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
శాంతినగర్/మానవపాడు: ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా కేజీబీవీల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డీఈఓ అబ్దుల్ ఘని.. డ్యూటీ టీచర్లు, వర్కర్లకు సూచించారు. బుధవారం ఆయన వడ్డేపల్లి కేజీబీవీ, మానవపాడు మండలం చంద్రశేఖర్గనర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్న కారణంగా కేజీబీవీల్లో పరిస్థితి ఎలా వుందనే విషయమై పాఠశాలను, తరగతి గదులు, భోజనం తదితర సమస్యలు ఏవైనా తలెత్తుతున్నాయనే విషయమై డీఈఓ పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తారని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆయన హామీ ఇచ్చారు. వారు విధుల్లో చేరేవరకు జాగ్రత్తగా వుండాలని సూచించారు. అలాగే, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అన్ని అంశాలపై కనీస పరిజ్ఞాన్ని అందించాలన్నారు. మధ్యాహ్న భోజన మెనూను తప్పక పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట వడ్డేపల్లి ఎంఈఓ నరసింహ, ఉండవెల్లి ఎంఈఓ శివప్రసాద్ ఉన్నారు. -
మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వేగవంతం
గద్వాల: మున్సిపాలిటీలకు ఆదాయాలను పక్కాగా నిర్వహించి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూరు, మున్సిపాలిటీలకు 15వ ఫైనాన్స్ నిధులు, సీఎం అష్యూరెన్స్ఫండ్స్, స్థానికంగా పన్నులు, నిర్మాణాల అనుమతులు, ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే నిధులపై కమీషనర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఆదాయం, మంజూరైన నిధులను వినియోగించుకుని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు, శానిటేషన్, తాగునీరు సరఫరా, విద్యుత్ నిర్వహణ వంటివి పక్కాగా చేపట్టాలన్నారు. అదేవిధంగా నిధుల మళ్లింపు ప్రక్రియ చేయకుండా పక్కాగా వినియోగించుకోవాలన్నారు. స్వచ్ఛభారత్ నిధుల కింద చేపట్టిన మరుగుదొడ్లు, పబ్లిక్‌టాయిలెట్స్, కమ్యూనిటీ హాల్స్ వంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మున్సిపల్ కమీషనర్లు, డీఈలు పాల్గొన్నారు. -
క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
గద్వాలటౌన్ : రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించారని డీవైఎస్ఓ బీఎస్ ఆనంద్ అన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీలలో బాగంగా బుధవారం ఫుట్‌బాల్, చెస్, షటీల్, హాకీ పోటీలను నిర్వహించారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను డీవైఎస్ఓ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కప్ పోటీల వేధిక ద్వారా ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్పారు. పోటీలలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. చెస్ సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో ప్రహల్దాస్ విన్నర్‌గా, అజయ్ రన్నర్‌గా, బాలికల విభాగంలో నికిత విన్నర్‌గా, విజయ రన్నగా నిలిచారు. ఫుట్‌బాల్ బాలురు పోటీలలో గద్వాల జట్టు విజేతగా నిలువగా, మల్థకల్ జట్టు రన్నర్‌గా నిలిచింది. బాలికల పోటీలలో గద్వాల జట్టు విన్నర్‌గా, ఉండవెల్లి రన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంస పత్రాలు, మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్, ఆయా క్రీడల కన్వీనర్లు బషీర్, నగేష్‌బాబు, హైమవతి, సుహాసిని, కృష్ణయ్య, శ్రీనివాసులు, రత్నమాల, నిర్మల, నర్సింహారాజు, వెంకట్రాములు, మోహనమురళి, సతీష్‌కుమార్, శ్రీనివాసులు, విజయ్, స్వప్న, స్రవంతి, రఘు తదితరులు పాల్గొన్నారు. -
‘పీజేపీ’ సమీపంలోనే కోర్టు సముదాయాలు
గద్వాల క్రైం: జిల్లా కోర్టు సమూదాయాలు తరలించే విషయంపై గద్వాల బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం కోర్టు బయట నిరసన దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ పార్టీ, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ వైద్యులు సైతం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్, మోహన్‌రావు, కిషోర్‌కుమార్, అతికూర్ రహిమాన్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడారు. అన్ని వసతులు కలిగిన జిల్లా కేంద్రంలోని పీజెపీ క్యాంపు ప్రభుత్వ స్థలంలో నూతన కోర్టు సమూదాయాల కోసం స్థలం కేటాయించాలన్నారు. అందరికి యోగకరమైన వాతావరణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న క్రమంలో కోర్టు సమూదాయాలను మాత్రం 10 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనుక మోసపూరితమన్నారు. కక్షిదారులు, వివిధ కేసులోని బాధితులకు అనువుగా పాత సమూదాయాలు అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతో అభినందనీయమన్నారు. తాజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ మాత్రం యోగ్యత లేదన్నారు. న్యాయవాదులు చేపట్టిన నిరసన ఆమోదకరంగా ఉందని, ఇప్పటికై న ప్రభుత్వ ఽఅధికారులు పూడుర్ శివారులోని హ్యండ్లూం పార్కు సమీపంలో ఇచ్చిన స్థల విషయంలో పునరాలోచన చేయాలన్నారు. న్యాయవాదుల నిరసనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ సభ్యులు రాఘురామిరెడ్డి, ఖజ్జమైన్దుదిన్, రాజశేఖర్‌రెడ్డి, వైద్యులు నళ్లీని, ఆశ్వీని, అనుపమ, భాస్కర్‌రెడ్డి, నవిన్క్రాంతి, ఆశోక్ తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,659 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు బుధవారం 432 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6659, కనిష్టం రూ.3750, సరాసరి రూ.4840 ధరలు పలికాయి. అలాగే, 2 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 5429 ధర లభించింది. దీంతోపాటు 787 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2609, కనిష్టం రూ.1759, సరాసరి రూ.2472 ధరలు పలికాయి. 18 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 1856 ధర వచ్చింది. ఎకో టూరిజం పార్కు మరింత అభివృద్ధి కొల్లాపూర్ రూరల్/పెద్దకొత్తపల్లి: కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎకో టూరిజం పార్కును మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ అన్నారు. బుధవారం అటవీశాఖ అధికారులతో కలిసి ఎకో టూరిజం పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో చేపట్టిన పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సోమశిల కృష్ణానది తీరంలో ఎకో టూరిజం కింద అనేక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అదే విధంగా నేషనల్ హైవే ప్రాజెక్టుతో పాటు సోమశిల – సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిపై కేబుల్ బ్రిడ్జి ప్రతిపాదనలు అటవీశాఖకు అందినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానంగా అటవీ ప్రాంతం పరిధి ఉందని.. ఆయా ప్రతిపాదనలపై అవసరమైన చర్యలు చేపడతామన్నారు. సోమశిలలో ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా సఫారి రివర్ బోటు ఏర్పాటు చేశామన్నారు. నల్లమలలో పర్యాటకులు చూడాల్సిన ప్రాంతాలు అనేకం ఉన్నాయని.. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అనంతరం ఎకో పార్కులో కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. ప్రధాన రహదారి నుంచి పార్కు పైభాగం వరకు సీసీరోడ్డు నిర్మిస్తామని తెలిపారు. త్వరలోనే పర్యాటకులకు పార్కును అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం సోమశిలలో అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
రోగాలులు వస్తున్నాయి
●కాచి చల్లార్చిన నీరు తాగాలి కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. చలికాలంలో చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం, చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే ఆహారం తీసుకోవాలి. ఇంటి పరిసరాలు, ఆవరణలో దోమల నివారణ చర్యలు చేపట్టాలి. శీతల పానియాలు, ఐస్క్రీంలకు దూరంగా ఉండాలి. చిన్నారులకు స్వెట్టర్లు వేయకుండా ఇంట్లో, బయట తిరగనివ్వొద్దు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చలి వేళ వీలైనంత మేర బయట తిరగొద్దు. రాత్రి సమయల్లో ఎక్కువగా బయట తిరిగితే గుండెపోటు, చాతినొప్పి వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామాలు వీలైనంత వరకు చలి తగ్గి, సూర్యుడు వచ్చాకే చేయాలి. స్వెట్టర్ ధరించడమే కాకుండా తల, కాళ్లు, చేతుల రక్షణకు జాగ్రత్త వహించాలి. విటమిన్ – సీతో కూడిన పండ్లు, ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం సోకితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. వారి సూచనలతో ముందులు వాడాలి. – సిద్ధప్ప, జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి గద్వాల క్రైం: చలి తీవ్రత పెరగడం.. ప్రధానంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో ప్రజలు రోగాల భారినపడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి తగ్గకపోగా.. సాయంత్రం 5గంటల నుంచే చల్లిని గాలులు మొదలవుతుండడం.. వాతావరణంలో అనూహ్య మార్పులకు తోడు చలి తీవ్రత కారణంగా చాలా మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా ఆస్పత్రుల్లో ఓపీ కేసులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆసుపత్రులకు వస్తున్న కేసుల్లో జ్వరంతో పాటు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండగా న్యుమోనియా బారిన పడ్డ చిన్నారులు, వృద్ధులే అధికం. గద్వాల, గట్టు, మల్దకల్, ఇటిక్యాల, అలంపూర్, ధరూర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతుండగా.. చలి ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై అధికంగా ఉంటోందని, జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని వైద్యులు వివరిస్తున్నారు. ఆస్పత్రులకు క్యూ.. వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా వారం రోజులుగా జిల్లాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు రోజుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. చలికోట్లు, స్వెటర్లు, తలకు తువాలు చుట్టుకొని బయటకు రావాల్సి వస్తోంది. ఇదిలాఉండగా, చలి తీవ్రతతో ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఓపీ సేవలు రోజుకు 450 నమోదు అవుతున్నాయి. ఇందులో 340 జ్వరం, దగ్గు, జలుబు, న్యుమోనియా బారిన పడిన వారే. మిగతా వారు వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి బట్టి కొందరు మందులు తీసుకొని ఇళ్లకు వెళ్తుండగా.. మరికొందరు ఇన్‌పేషంట్‌గా చేరి చికిత్స పొందుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా చిన్నారుల్లో ఆస్తమా, న్యుమోనియా సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను రోగుల సంఖ్య పెరిగింది. జిల్లా ఆస్పత్రిలో ఓపీ సేవల వివరాలిలా.. తేదీ ఓపీ ఐపీ 13 467 77 14 491 38 15 440 62 16 438 45 17 470 28 18 467 39 జ్వరం, జలుబు, న్యుమోనియా బాధితులే అధికం ఆస్పత్రుల్లో పెరుగుతున్న కేసులు రాత్రి వేళల్లో అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి చలికాలంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధారణ సమయాన జలుబు, దగ్గు, జ్వరంతో ప్రమాదం లేకున్నా.. చలికాలంలో ఈ సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాలి. చల్లటి వాతావరణంలో బయటికి వెళ్లాల్సి వస్తే.. మాస్క్ ధరించాలి. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులకు రక్త ప్రసరణ మందగించి గుండె జబ్బులు పెరిగే అవకాశముంది. వీరికి పౌష్టికాహారం అందిస్తూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేలా చూడాలి. నిత్యం వ్యాయామం చేయడం ఎంతో మేలు. –డాక్టర్ వంశీ, జనరల్ ఫిజీషిషన్, జిల్లా ఆస్పత్రి -
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు నిధులు మంజూరు
గద్వాలటౌన్ : ప్రాక్టికల్స్ పరీక్షల కోసం ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కళాశాలలకు రూ.2లక్షలు నిధులు మంజూరయ్యాయి. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గత కొన్నేళ్లుగా ఇంటర్ కళాశాలలకు ప్రాక్టికల్స్ కోసం నిధులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు సుమారు వెయ్యి మంది వరకు ఉన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ఏడాదికి 20+20 చొప్పున, జువాలజీ, బోటనీలకు ఏడాదికి 12+12 తరగతుల చొప్పున విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కో కళాశాలకు రూ. 25 వేల చొప్పున జిల్లాలోని 8 కళాశాలలకు గాను రూ.2 లక్షలు మంజూరయ్యాయి. ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులతో అవసరమైన పరికరాలు, రసాయనాలు కొలుగోలు చేస్తామని డీఐఈఓ హృదయరాజ్ తెలిపారు. -
జోగుళాంబ గద్వాల
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024జిల్లాలో వారం రోజులుగా చలితీవ్రత పెరిగిందని.. పశువులు, ఇతర పెంపుడు జంతువులను చలి బారి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరుబయట కాకుండా షెడ్లలో ఉంచాలని, పాకల చుట్టూ గోనె సంచులు ఏర్పాటుచేయాలని తదితర సలహాలు, సూచనలు జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ● గేదెలు, తెల్లజాతి పశువులు, గొర్రెలు, మేకలను షెడ్లలో లేదా పాకలలో కట్టివేయాలి. పాకలపైన జమ్ము లేదా వరిగడ్డిని వేయాలి. షెడ్డు, పాకల చుట్టూ గోనెసంచులు కట్టాలి. సాధారణంగా చలి ఉన్నప్పుడు దోమలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి కాపాడడానికి షెడ్డు, పాకలలో వేపాకు లేదా మోదుగ ఆకులతో పొగవేయాలి. ఉదయం 10గంటల తర్వాత మేతకు తీసుకెళ్లి సాయంత్రం 5గంటలలోపు తీసుకరావాలి. న్యూస్‌రీల్ పెంపుడు కుక్కలను చిన్నపాటి షెడ్ లేదా చిన్న గదిలో ఉంచాలి. కోళ్లకు జాలిలతో కూడిన చిన్న షెడ్లలో సంఖ్యను బట్టి 40 నుంచి 100 వాట్స్ బల్బులను ఏర్పాటు చేయాలి.అనారోగ్యానికి గురైన జీవాలకు క్యాల్షియం, లివ ర్ టానిక్, బీ కాంప్లెక్స్ మందులు.. కుక్కలకు బీ కాంప్లెక్స్, న్యూరోబియాన్ మందులు, కోళ్లకు బీకాంప్లెక్స్ టానిక్ మందులు వాడాలి. -
అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పరిశీలన
గద్వాలటౌన్: కలెక్టర్ సంతోష్ పట్టణంలో కలియతిరిగి వివిధ అభివృద్ది పనులను పరిశీలించారు. బుధవారం మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని రెండు గంటల పాటు నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నది ఆగ్రహారంలో తాగునీటి పథకం కింద చేపట్టిన ఫిల్టర్‌బెడ్‌ను సందర్శించి, అందులో ఉన్న అన్ని విభాగాలను పరిశీలించారు. అమృత్ 2.0 పథకం కింద ప్రతిపాదిత కొత్త వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 5 ఎంఎల్డీ సామర్థ్యాంతో చేపట్టే ఓవర్ హెడ్ ట్యాంకు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబారీ టౌన్షిప్ పనులను పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం హామీ నిధుల కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. నల్లకుంట కాలనీలో చేపడుతున్న మల్టీపర్పస్ ఆడిటోరియం పనులను పరిశీలించి, ప్రహరీ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. తేరుమైదానం, కృష్ణవేణి చౌరస్తాలలో ఉన్న అండర్ గ్రౌండ్ వర్షపు నీటి కాలువను పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ మల్లేష్, ఏఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
90 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు
అయిజ: ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 90 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలుపర్చాలని డీఐఈఓ హృదయరాజు అధ్యాపకులను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాలలో 90 రోజుల కార్యాచరణ అమలు తీరును పరిశీలించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల హాజరు పట్టికలు, టీచింగ్ డైరీలు, యూనిట్ టెస్ట్‌లు, అర్ధసంవత్సరపు మార్కులను పరిశీలించారు. ఫెయిల్ అయిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ అలంపూర్: రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ బలోపేతం అవుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అలంపూర్ పట్టణంలోని టూరిజం హోటల్లో బీజేపీ పోలింగ్ బూత్‌ల అధ్యక్షులను ఎంపిక చేసి, నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఏడాది గడిచినా అమలు చేయలేదన్నారు. మోసపూరిత మాటలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తరమికొట్టడం ఖాయమన్నారు. త్వరలోనే జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అలంపూర్ చౌరస్తాలో బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులు ఎన్నిక నిర్వహించారు. ఉండవెల్లి మండలంలో 22 బూత్ కమిటీల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర శర్మ, జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వర్, నాగేశ్వర్ రెడ్డి, నాగమల్లయ్య, రాము నాయడు, లక్మణ్ నాయుడు, శరత్, సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ. 6,511 గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 501 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ. 6,511, కనిష్టంగా రూ. 3,099, సరాసరి రూ. 5,839 ధరలు పలికాయి. 31 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 5,525, కనిష్టంగా రూ. 5,369, సరాసరి రూ. 5,479 ధరలు లభించాయి. 1143 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,589, కనిష్టంగా రూ. 1,822, సరాసరి రూ. 2,519 ధరలు వచ్చాయి. 386 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 8,589, కనిష్టంగా రూ. 2,100, సరాసరి రూ. 7269 ధరలు పలికాయి. -
సమగ్రశిక్ష ఉద్యోగుల మౌన ప్రదర్శన
గద్వాలటౌన్: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు మంగళవారం వివిధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్ష శిబిరంలో ఉద్యోగులు మౌన ప్రదన్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా పనిచేస్తూ గురుకులాలతో సమానంగా ఫలితాలు సాధిస్తున్నా.. శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్రశిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
ఆదిశిలా క్షేత్రం.. భక్తజనసంద్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేదపండితులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు చక్రస్నానంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అక్కడి నుంచి భాజా భజంత్రీలతో కల్యాణ మండపం వరకు స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ధీరేంద్రాదాసు ఆధ్వర్యంలో బ్రాహ్మ ణ పండితులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ నందీకర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు రమేషాచారి, భీంసేనాచారి, మధుసూదనాచారి, రవిచారి, ప్రసన్నాచారి, శశాంక్, శేషదాసుల వారి వంశస్థులు ప్రకాష్‌రావు, రా ఘవేంద్రదాసు, విష్ణుదాసు, అరవిందరావు, నాగ రాజు శర్మ, చంద్రశేఖర్‌రావు, ముకుందరావు, బాబురావు, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
వణికిస్తోన్న చలి..!
గద్వాలటౌన్/కేటీదొడ్డి: చలి అంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరినీ గజగజలాడిస్తోంది. శీతాకాలం ఆరంభంలో మొదట చలి తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల స్థాయికి పడిపోయింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సాయంత్రం 5 నుంచి చలి మొదలై ఉదయం 9 గంటల వరకు వణికిస్తుంది. తీవ్రమైన చలితో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది స్వె టర్లు, శాలువాలు, దుప్పట్లతో చలి నుంచి రక్షణ పొందడానికి యత్నిస్తున్నారు. చీకటి పడగానే రోడ్లు నిర్మానుష్యం..వారం రోజుల వ్యవధిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ద్విచక్ర వాహనంపై తిరగలేని పరిస్థితి ఉంది. చీకటి పడగానే రోడ్లు, ప్రధాన చౌరస్తాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, బస్టాండ్లు జనం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 9 గంటలు దాటినా పట్టణాల్లో జన సంచారం కనిపించడం లేదు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు.వారం రోజులుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు..10th 19.811th 18.812th 14.713th 17.914th 17.215th 14.816th 11.5 -
కోర్టు భవన నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తాం
గద్వాల న్యూటౌన్: ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ఎదురవుతున్న అవాంతరాలపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సందిగ్ధం!’ కథనానికి కలెక్టర్ బీఎం సంతోష్ స్పందించారు. ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి గద్వాల మండలం పూడూరు శివారులోని సర్వే నంబర్ 368లో కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లొకేషన్ మ్యాప్‌ను చూశారు. అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. కోర్టు నిర్మాణానికి సంబంధించి రెండు వర్గాల న్యాయవాదుల నుంచి సమస్యలపై ఆరా తీశారు. కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి రహదారి కనెక్టివిటిని కూడా పరిశీలించారు. ప్రధాన రహదారి నుంచి కోర్టు భవనానికి కేటాయించిన స్థలం వరకు రహదారిని నిర్మించవచ్చని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం కోర్టు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. వారి వెంట తహసీల్దార్ మల్లిఖార్జున్, ఇరువర్గాల బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ బీఎం సంతోష్ -
ఇబ్బందులు పడుతున్నాం..
చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం సమయంలో చలిలోనే పారిశుద్ధ్య పనులు చేస్తున్నాం. వయసు పైబడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నాం. – నర్సింహులు, పారిశుద్ధ్య కార్మికుడు, కేటీదొడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తుంది.. చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. రాత్రివేళ పంటకు నీరు పెట్టేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లాలంటే జంకుతున్నాం. కూరగాయల అమ్మకందారులు, వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 6 గంటలు అయిందంటే ఇంట్లోనే ఉంటున్నాం. – గద్వాల తిమ్మప్ప, రైతు, కేటీదొడ్డి -
చిన్నారులపై శ్రద్ధ అవసరం..
● పొడి చర్మం ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందిపడే అవకాశం ఉంది. చర్మం పగుల్లిచ్చి మంట పుడుతుంది. అందువల్ల చర్మం పొడిబారి పోకుండా చూసుకోవాలి. ఇందుకోసం వ్యాస్‌లెన్, పెట్రోలియంజెల్లి, మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానానికి కూడా గ్లీజరిన్, మాయిశ్చరైజర్ ఉన్న సబ్బులు వాడటం ఉత్తమం. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాతావరణ మార్పుల వల్ల చిన్నారులు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం, సాయంత్రం వారిని బయట తిరగనీయొద్దు. గ్రామాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు ఉదయం సమయాల్లో బస్సు, ఆటోల్లో వెళ్లే విద్యార్థులు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించాలి. పిల్లలకు ఎక్కువగా జలుబు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.