khelo india
-
చేయాల్సింది చాలావుంది!
ప్యారిస్ వేసవి విశ్వక్రీడా సంరంభం ముగిసింది. దాదాపు 850 పతకాలు విజేతలను వరించిన ఈ 2024 ఒలింపిక్స్‌లో 10 ప్రపంచ రికార్డులు, 32 ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం 42 రికార్డులు బద్దలయ్యాయి. మరి, భారత్ సాధించినదేమిటి అన్నప్పుడే ఆశ నిరాశలు దోబూచులాడతాయి. 117 మంది అథ్లెట్లతో, 16 క్రీడాంశాల్లో పోటీపడుతూ భారత ఒలింపిక్ బృందం ఎన్నో ఆశలతో విశ్వ వేదికపై అడుగుపెట్టింది. ఈసారి రెండంకెల్లో పతకాలు సాధిస్తామనే ఆకాంక్షను బలంగా వెలి బుచ్చింది. తీరా ఒలింపిక్స్ ముగిసేవేళకు అరడజను పతకాలతోనే (5 కాంస్యం, 1 రజతం) తృప్తి పడాల్సి వచ్చింది. గడచిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన 7 పతకాల అత్యుత్తమ ప్రదర్శనతో పోలిస్తే... ఇది ఒకటి తక్కువే. ఈ సంరంభంలో మొత్తం 84 దేశాలు పాల్గొంటే, ప్రపంచంలో అత్యధికంగా 145 కోట్ల జనాభా గల మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. మన పతకాలు, జనాభా నిష్పత్తి చూస్తే, ప్రతి 25 కోట్ల మందికి ఒక్క పతకం వచ్చిందన్న మాట. ‘ఖేలో ఇండియా’ పేరిట కోట్లు ఖర్చుచేస్తున్నామంటున్న పాలకులు ఆత్మశోధనకు దిగాల్సిన అంశమిది.ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం, పొంచివున్న దాడుల పట్ల భద్రతా సిబ్బంది భయం, ఫ్రెంచ్ ప్రజానీకంలో పెద్దగా ఉత్సాహం లేకపోవడం... వీటన్నిటి మధ్య ప్యారిస్ ఒలింపిక్స్ సరిగ్గా జరుగు తాయో జరగవో అని అందరూ అనుమానపడ్డారు. అన్నిటినీ అధిగమించి ఈ విశ్వ క్రీడోత్సవం విజయవంతంగా ముగిసింది. పైగా, అస్తుబిస్తుగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అత్యవ సరమైన కొత్త ఉత్సాహమూ నింపింది. క్రితంసారి కోవిడ్ మూలంగా టోక్యోలో ప్రేక్షకులు లేకుండానే పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్ల నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఒత్తిడి ఉంది. నిర్వాహకులు మొత్తం ప్యారిస్ను ఓపెన్–ఎయిర్ ఒలింపిక్ క్రీడాంగణంగా మార్చేసి, అందరూ ఆహ్వానితులే అనడంతో ఊహించని రీతిలో ఇది దిగ్విజయమైంది. పోటీల్లో పాల్గొన్న ఒకరిద్దరు క్రీడాకారుల జెండర్ అంశం, భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వ్యవహారం లాంటివి మినహా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అతిగా వివాదాస్పదం కాలేదనే చెప్పాలి. ఉక్రెయిన్, గాజా లాంటి భౌగోళిక రాజకీయ అంశాలు, అలాగే అమెరికాలో ఎన్నికల వేడి, బ్రిటన్‌లో అల్లర్లు, బంగ్లాదేశ్‌లో సంక్షోభం లాంటివి పతాక శీర్షికలను ఆక్రమించేసరికి ఒలింపిక్స్ వివాదాలు వెనుకపట్టు పట్టాయనీ ఒప్పుకోక తప్పదు. ప్యారిస్ వేసవి ఒలింపిక్స్‌కు తెర పడింది కానీ, ఈ ఆగస్ట్ 28 నుంచి అక్కడే పారా ఒలింపిక్స్–2024 జరగనుంది. తదుపరి 2028 వేసవి ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెల్స్ సిద్ధమవుతోంది. కేవలం రెండే పతకాలు సాధించిన 2016 నాటి రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే, భారత్ మెరుగైన మాట నిజమే. అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, మహిళా బ్యాడ్మింటన్‌లో వెనుకబడినా టేబుల్ టెన్నిస్, షూటింగ్లలో కాస్త ముందంజ వేశామన్నదీ కాదనలేం. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా 22 ఏళ్ళ మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. గోల్‌కీపర్ శ్రీజేశ్ సహా హాకీ బృందమంతా సర్వశక్తులూ ఒడ్డి, వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో ఊరించి చేజారిన పతకాలూ చాలా ఉన్నాయి. భారత మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ సంచలన విజయాలు నమోదు చేసినా, వంద గ్రాముల అధిక బరువు రూపంలో దురదృష్టం వెన్నాడకపోతే స్వర్ణం, లేదంటే కనీసం రజతం మన ఖాతాలో ఉండేవి. షట్లర్ లక్ష్యసేన్, అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ అర్జున్ బబుతా సహా కనీసం 6 సందర్భాల్లో మనవాళ్ళు ఆఖరి క్షణంలో నాలుగో స్థానానికి పరిమితమ య్యారు. లేదంటే పతకాల పట్టికలో మన దేశం మరింత ఎగబాకేదే. పతకాలు, విజయాల మాటెలా ఉన్నా, మన మార్కెటింగ్ విపణికి కొన్ని కొత్త ముఖాలు దొరికాయి. గాయాల నుంచి ఫీనిక్స్ పక్షిలా లేచిన నీరజ్ చోప్రా, పీవీ సింధుల మొదలు నిలకడగా ఏళ్ళ తరబడి ఆడిన శ్రీజేశ్, రెండు పతకాల విజేత మనూ భాకర్, బ్యాడ్మింటన్ క్రేజ్ లక్ష్యసేన్ దాకా పలువురు బ్రాండ్లకు ప్రీతిపాత్రులయ్యారు. కానీ ఇది సరిపోతుందా? ఆర్చరీ, బాక్సింగ్ సహా పలు అంశాల్లో నిరాశాజనక ప్రదర్శన మాటే మిటి? మిశ్రమ భావోద్వేగాలు రేగుతున్నది అందుకే. ఇప్పటికైనా మన ప్రాధాన్యాలను సరి చేసుకో వాలి. అత్యధిక జనాభా గల దేశంగా ప్రతిభకు కొదవ లేదు. ప్రతిభావంతుల్ని గుర్తించి, ప్రోత్సహించి, సరైన రీతిలో తీర్చిదిద్దడమే కరవు. మనకొచ్చిన 6 పతకాల్లో 4 దేశ విస్తీర్ణంలో 1.4 శాతమే ఉండే హర్యానా సంపాదించి పెట్టినవే. అంటే, మొత్తం పతకాల్లో హర్యానా ఒక్కదాని వాటా 66 శాతం. మరి, మిగతా దేశం సంగతి ఏమిటి? అక్కడి పరిస్థితులేమిటి? ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ మనదని జబ్బలు చరుచుకుంటున్న పాలకులు ఇవాళ్టికీ క్రీడలకు సరైన రీతిలో వస తులు, వనరులు ఇవ్వట్లేదు. పేరొచ్చాక సాయం చేస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఆటగాళ్ళకు నారు పోసి, నీరు పెట్టాలి. మన క్రీడా సంఘాలు, ప్రాధికార సంస్థలు రాజకీయ నేతల గుప్పెట్లో ఇరుక్కుపోవడం పెను విషాదం. పతకాలకై పోరాడాల్సిన ఆటగాళ్ళు లైంగిక వేధింపులు సహా అనేక సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితిని కల్పించడం మన ప్రభుత్వాల తప్పు కాదా? క్రీడా సంస్కృతిని పెంచి పోషించడానికి బదులు రాజకీయాల క్రీనీడలో ఆటను భ్రష్టు పట్టిస్తే, పతకాలు వచ్చేదెట్లా? అంతర్జాతీయ స్థాయిలో విజయానికి దూరదృష్టి, సరైన వ్యూహం, నిరంతరం పెట్టుబడి, స్పష్టమైన క్రీడా విధానం రాష్ట్ర స్థాయి నుంచే కీలకం. ఆ దిశగా ఆలోచించాలే తప్ప దాహమేసినప్పుడు బావి తవ్వితే కష్టం. అందుకే, 1900 తర్వాత నూటపాతికేళ్ళలో ఒలింపిక్స్‌లో ఇది మన రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఇకనైనా అపూర్వ క్రీడాదేశంగా మనం అవతరించాలంటే, పాలకులు చేయాల్సింది చాలా ఉంది. -
Manu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం..
ఒలింపిక్ పతకం గెలిచిన షూటర్ మనూ భాకర్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. కఠిన శ్రమతోనే ఆమెకు ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ‘ఖేలో ఇండియా’లో మనూ భాకర్ భాగమైందని.. ఆమె శిక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.భారత్‌ను గర్వపడుతోందిమహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో హర్యానాకు చెందిన మనూ భాకర్ కాంస్యం గెలిచింది. తద్వారా విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా ఆమె చరిత్రకెక్కింది. 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మనూపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. ‘‘ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలవడం ద్వారా మనూ భాకర్ భారత్‌ను గర్వపడేలా చేసింది. తనను ప్రశంసించిన క్రమంలో.. తానూ ఖేలో ఇండియాలో భాగమయ్యానని ఆమె తెలిపింది. ప్రధాని మోదీ చొరవతో ఖేలో ఇండియా కార్యక్రమం రూపుదిద్దుకుంది.ఆమె శిక్షణ కోసం రూ. 2 కోట్లు ఖర్చు చేశాంపాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. వారిని మెరికల్లా తీర్చిదిద్దే బాధ్యతను కోచ్‌లకు అప్పగిస్తున్నాం. మనూ భాకర్ శిక్షణ కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశాం. ట్రెయినింగ్ కోసం ఆమెను జర్మనీ, స్విట్జర్లాండ్‌కు పంపించాం.తను కోరుకున్న కోచ్‌ను శిక్షకుడిగా నియమించాం. కావాల్సిన ఆర్థిక సహాయం అందించాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మన క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మన వాళ్లు సత్తా చాటుతారని నమ్మకం ఉంది. మన ఆటగాళ్లకు మనం ఎల్లవేళలా మద్దతుగా ఉండాలి. మన అథ్లెట్లు అద్భుతంగా ఆడి పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో తలపడుతున్న అథ్లెట్లకు మన్సుఖ్ మాండవీయ ఆల్ ది బెస్ట్ చెప్పారు.చదవండి: ‘మీ అహానికి అభినందనలు’: నాడు కోచ్‌తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ.. -
బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు... ‘ఖేలో ఇండియా’కే రూ. 900 కోట్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చే వార్షిక బడ్జెట్‌ను స్వల్పంగా పెంచింది. మంగళవారం ప్రకటించిన 2024–25 ఆరి్థక సంవత్సర బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇచి్చన రూ.3,396.96 కోట్లతో పోలిస్తే ఇది రూ.45.36 కోట్లు ఎక్కువ. ఎప్పటిలాగే ఇందులో ఎక్కువ మొత్తం దిగువ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి తీర్చిదిద్దే ‘ఖేలో ఇండియా’ పథకానికే కేటాయించింది. గత ఏడాదికంటే రూ.20 కోట్లు ఎక్కువగా ‘ఖేలో ఇండియా’కు ఈసారి రూ.900 అందిస్తున్నట్లు ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ల నిర్వహణతో పాటు అత్యుత్తమ స్థాయి శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు, అక్కడ సౌకర్యాల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్టేడియాల నిర్వహణ, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోసం ఖర్చు చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ప్రభుత్వం రూ.822.60 కోట్లు కేటాయించింది. దేశంలోని వివిధ క్రీడా సమాఖ్యలకు ఈ సారి రూ.340 కోట్లు అందజేస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా), జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్)ల కోసం వరుసగా 21.73 కోట్లు, రూ. 22 కోట్ల చొప్పున కేటాయించారు. -
Interim Budget 2024: బడ్జెట్లో క్రీడలకు రూ. 3,442 కోట్లు
Interim Budget 2024- న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్రీడల కోసం రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. 2023–24 వార్షిక బడ్జెట్లో రూ. 3,396.96 కోట్లు క్రీడలకు వెచ్చిస్తే ఈసారి రూ.45.36 కోట్లు పెంచారు. కేంద్ర క్రీడాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కోసం రూ. 900 కోట్లు (రూ.20 కోట్లు పెరుగుదల), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 822.60 కోట్లు (రూ.26.83 కోట్లు పెంపు) కేటాయించారు. మౌలిక వసతుల కల్పన, అథ్లెట్లకు అధునిక క్రీడాసామాగ్రి, కోచ్‌ల నియామకం కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ 340 కోట్లు (రూ.15 కోట్లు పెంచారు) ఇవ్వనున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బలోపేతానికి రూ. 22.30 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూ. 91.90 కోట్లు (రూ.8.69 కోట్లు హెచ్చింపు) కేటాయించారు. చదవండి: భారత్‌తో డేవిస్‌కప్ మ్యాచ్‌పై పాకిస్తాన్లో అనాసక్తి -
ఇంటి వద్ద పాలు పోస్తూనే సాధన.. పోటీకి వెళితే పతకమే! కాంస్యంతో సత్తా చాటి..
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతిభతో ముందుకు దూకుతున్నారు ఆ హైజంపర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అచంచల ఆత్మ విశ్వాసంతో క్రీడా సాధన చేస్తున్నారు. పార్ట్‌టైం జాబ్ చేస్తూనే రాణిస్తున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన ఖేలో ఇండియా నేషనల్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుని తన సత్తాచాటారు షేక్ మొహిద్దీన్. పేద కుటుంబం మొహిద్దీన్ది కాకుమాను మండలం రేటూరు గ్రామం. తండ్రి షేక్ షంషుద్దీన్ పదేళ్ల క్రితం మరణించారు. తల్లి నూర్జహాన్ గృహిణి. ఇంటి వద్దే పాలవ్యాపారం చేస్తున్నారు. మొహిద్దీన్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలిస్తున్నారు. ఇద్దరక్కలు పెళ్లిళ్లై వెళ్లిపోయారు. ప్రస్తుతం మొహిద్దీన్ ఇంటి వద్ద పాలు పోస్తూనే గుంటూరులో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి వరకు హైజంప్ సాధన చేస్తున్నారు. పోటీకి వెళితే పతకమే హైజంప్ వైవిధ్యమైన క్రీడ. పోటీ తక్కువగా ఉన్నా, సాధనలో తేడా వస్తే వైకల్యం సంభవించే అవకాశం ఉంది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన మొహిద్దీన్ ఏ పోటీలకు వెళ్లినా పతకం సాధించి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 20కుపైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 10 బంగారు, మరో 10 రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏడుసార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. అన్నింటా ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పూర్తిగా సాధనలో నిమగ్నమైతే దేశానికి అతి త్వరలోనే ప్రాతినిధ్యం వహించే అవకాశముందని అతని శిక్షకులు అంటున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలు కావడంలేదు. స్పాన్సర్షిప్ ఇప్పించండి ఖేలో ఇండియా నేషనల్స్‌లో కూడా 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేశాను. ఇది బెస్ట్ మీట్ రికార్డ్. అందుకే కాంస్య పతకం వచ్చింది. సాధన, పోటీల్లో పాల్గొనేందుకు స్పాన్సర్షిప్ ఇప్పించాలని మనవి. ఇటీవల శాప్ పెద్దలను కలిశాను. ఒక్క ఏడాది మనస్సుపెట్టి సాధన చేస్తే తప్పకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాను. హైజంప్‌కు నా దేహం చాలా బాగా సహకరిస్తుందని జాతీయస్థాయి శిక్షకులూ చెప్పారు. ఎప్పటికై నా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరిక – షేక్ మొహిద్దీన్, నేషనల్ హైజంపర్. చదవండి: సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ షురూ.. ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు: రవిశాస్త్రిని ఏకిపారేసిన గంభీర్ -
మనవాళ్ళు బంగారం
ఇది మన అమ్మాయిలు రాసిన కొత్త చరిత్ర. ఒకటీ రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలు. అదీ అంతర్జాతీయ పోటీల్లో! ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మన దేశ మహిళా బాక్సింగ్ జట్టు నాలుగు పసిడి పతకాలతో ప్రపంచమంతా తలతిప్పి చూసేలా చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శనివారం నీతూ ఘంఘాస్ (48 కిలోల విభాగం), స్వీటీ బూరా (81 కిలోలు) బంగారు పతకాలు సాధిస్తే, ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కిలోలు) పసిడి కాంతులు పూయించారు. మొత్తం నలుగురూ తమ బాక్సింగ్ పంచ్‌లతో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. నిన్నటి మేరీ కోమ్ వారసులుగా బాక్సింగ్‌లో మరింత మంది యువతులు ముందుకొచ్చిన చరిత్రాత్మక సందర్భం పతకాల సాక్షిగా వెల్లడైంది. హర్యానా ఆడపిల్ల నీతూ, తెలంగాణ యువతి నిఖత్, అస్సామ్ అమ్మాయి లవ్లీనా, హర్యానాకే చెందిన సీనియర్ క్రీడాకారిణి స్వీటీ... నలుగురూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. స్వర్ణపతకం సాధించి తల్లి మెడలో దాన్ని అలంకరించాలని ఓ అమ్మాయి, బహుమతిగా వచ్చే పారితోషికంతో కొత్త మెర్సిడెస్ కారు కొని తల్లితండ్రులను తమ సొంతవూరు నిజామాబాద్‌కు తీసుకెళ్ళాలని మరో యువతి, సరైన ఫామ్‌లో లేవంటూ కొట్టిపారేసిన విమర్శకుల నోళ్ళు మూయించాలని ఇంకో వనిత, ఇష్టదైవతారాధన, ఆశీస్సులతోనే విశ్వవేదికపై విజయం సాధ్యమని భావించే వేరొక హర్యానా యువతి – ఇలా ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ప్రేరణ. మొత్తం 13 దేశాల నుంచి వచ్చి, ప్రపంచపోరులో ఫైనల్స్‌కు చేరిన మహిళలు 24 మంది. వారిలో భారత మహిళా బాక్సింగ్ చతుష్టయం సత్తా చాటింది. భారత్‌తో పాటు ఒక్క చైనా నుంచే నలుగురు ఫైనల్స్‌కు చేరుకొని, స్వర్ణాల కోసం పోటీపడ్డారు. గత ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 పతకాలు సాధించిన భారత్ ఈసారి 4 పతకాలు గెలిచి, మునుపటి రికార్డును మెరుగుపరుచుకోవడం విశేషం. గత ఏడాది 52 కిలోల విభాగంలో వరల్డ్ టైటిల్ సాధించిన 26 ఏళ్ళ నిఖిత్ ఈసారి కొత్తగా 50 కిలోల విభాగం ఎంచుకొని, అందులో తన సత్తా చాటారు. గతంలో రెండుసార్లు ఏషియన్ ఛాంపియన్ అయిన వియత్నామ్‌కు చెందిన ప్రత్యర్థి నూయెన్ తీ తామ్‌పై ఫైనల్లో 5–0 తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఆఖరి మూడు నిమిషాల ఆటలో, ప్రత్యర్థి చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, శరీర దార్ఢ్యం, మానసిక బలం తోడుగా నిఖత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ పోటీల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణాలు సాధించి, చరిత్రకెక్కారు. మేరీ లానే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా సైతం ఫైనల్లో రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అయిన ఆస్ట్రేలియాకు చెందిన గెయిట్లిన్ పార్కర్‌పై హోరాహోరీ పోరాడి, 5–2 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎప్పుడూ ఎదురుదాడి అనే ఏకైక వ్యూహంతో సాగే నీతూ ఆటలో పరిస్థితి, ప్రత్యర్థిని బట్టి వ్యూహాన్ని మార్చుకొనే కళను అలవరుచున్నారు. బాక్సింగ్ మెలకువల్లో ఆరితేరిన నిఖత్ సైతం తాను పోటీపడ్డ ఒలింపిక్ వెయిట్ వర్గంలోని ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్లతో తలపడి, మెరుగైన ఆటతీరుతో దుమ్మురేపడం గమనార్హం. రానున్న ఆసియా క్రీడోత్సవాలకు సిద్ధం కావడానికీ, తప్పులు సరిదిద్దుకోవడానికీ ఈ ప్రపంచ బాక్సింగ్ పోటీలు మన అమ్మాయిలకు మంచి అవకాశమయ్యాయి. మరో 16 నెలల్లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకు సాగే ఊపు తెచ్చింది. నిజానికి, క్రీడల్లో మన దగ్గర ప్రతిభాపాటవాల కొరత లేదు. యువతరంలో బోలెడంత ఉత్సాహం, ఉత్తేజం ఉన్నాయి. అయితే, ఆ యువ క్రీడాప్రతిభను సరైన పద్ధతిలో తీర్చిదిద్ది, దోవలో పెట్టే వేదికలే ఎప్పుడూ కరవు. 2018లో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతినీ, ప్రాథమిక వసతి సౌకర్యాలనూ పెంపొందించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లో ‘ఖేల్ మహాకుంభ్’ను ప్రారంభించారు. క్రమంగా అది బిహార్, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, కశ్మీర్‌లలోని గ్రామాలకు విస్తరించింది. దేశంలో కనీసం 200 మంది దాకా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఖేల్ మహాకుంభ్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇవన్నీ దిగువ, మధ్యాదాయ కుటుంబాల యువతుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. సాంప్రదాయిక పురుషాధిక్య రంగంలోనూ మహిళలు పైకి రావడానికి దోహదపడ్డాయి. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ తర్వాత పాలకుల ‘ఖేలో ఇండియా’ పథకం నవతరం ఆశలకు కొత్త ఊపిరి. మెరుగైన శిక్షణకు క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ యువతరానికి, ముఖ్యంగా యువతులకు వరం. మీడియా దృష్టిపెట్టని అనేక భారతీయ ఆటలు ఈ పథకంతో జనం ముందుకు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనే అథ్లెట్లకు ప్రోత్సాహం అందుతోంది. మగవారివే అనుకొనే క్రీడల్లోనూ మన వనితల జైత్రయాత్రకు ఇలాంటి ప్రయత్నాలు ఓ ఉత్ప్రేరకం. లింగభేదాల గోడలను బద్దలుకొట్టి, అందరికీ అభిమాన బాక్సర్‌గా నిఖత్ అవతరించడం అవిస్మరణీయం. గమనిస్తే, మన దేశపు ఒలింపిక్ పతకాల పట్టికలోనూ మహిళలే మహారాణులు. ఇంటా బయటా ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆరుసార్లు ప్రపంచ టైటిళ్ళు సాధించిన బాక్సర్ మేరీ కోమ్ ఆదర్శంగా మరిన్ని జాతి రత్నాలు వెలుగులోకి వచ్చాయి. 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ విజయ గాథ తర్వాత మన పురుషుల బాక్సింగ్ కొంత స్తబ్దుగా మారినవేళ బాక్సింగ్‌ను భారత్‌కు పతకాల అడ్డాగా మార్చిన మహిళలూ మీకు జోహోర్లు! -
తెలంగాణకు మరో స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బుధవారం తెలంగాణ కుర్రాడు లక్ష్మణ్ జూడోలో (50 కేజీలు ) పసిడి పతకం గెలిచాడు. స్విమ్మింగ్‌లో బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సాయి నిహార్ కాంస్యం... బాలికల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రితి అగర్వాల్ రజతం నెగ్గారు. రోయింగ్‌లో బాలుర క్వాడ్రాపుల్ స్కల్స్ రేసులో తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ -
ఏపీ: ఖేలో ఇండియాకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలకు ఏపీ క్రీడాకారుల బృందం సమాయత్తం అవుతోంది. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల విభాగంలో దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 13 క్రీడాంశాల్లో ఏపీ బృందం అర్హత సాధించగా 87 మంది క్రీడాకారులు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఖేలో ఇండియాకు వెళ్తోన్న క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. రెండు వారాల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని స్పెషల్ కోచ్‌లతో క్రీడాకారులకు శిక్షణ అందించనుంది. ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఖేలో ఇండియా పోటీల్లో క్రీడాకారులు పతకాలు సాధించేలా శాప్ ప్రోత్సహిస్తోంది. 53 మంది బాలురు, 32 బాలికల క్రీడాకారులతో ప్రత్యేక శిక్షణ క్యాంప్‌నకు శ్రీకారం చుట్టింది. అథ్లెటిక్స్ (ఏఎన్‌యూ), షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ (కాకినాడ డీఎస్ఏ), స్విమ్మింగ్ (ఈడుపుగల్లు), జూడో (అనకాపల్లి డీఎస్ఏ), బాక్సింగ్ (విజయనగరం డీఎస్ఏ), బ్యాడ్మింటన్, కానోయింగ్ అండ్ కయాకింగ్, ఆర్చరీ (విజయవాడ), ఖోఖో, జిమ్నాస్టిక్స్ (బీఆర్ స్టేడియం గుంటూరు), మల్లఖంబ (భీమవరం), గటక్ (రేణిగుంట)లో ఈ నెల 17 నుంచి కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించనుంది. క్రీడాకారులకు డీఏ ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిని, జబల్పూర్, మండల, బాలాఘాట్, ఖర్గోన్ వేదికగా జరగనున్నాయి. భారత క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాకారులకు ప్రయాణ సౌకర్యాన్ని కలి్పస్తుండగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క క్రీడాకారుడికి నేరుగా డీఏను అందించనుంది. ఖేలో ఇండియాకు అత్యధికంగా బాక్సింగ్‌లో 10 మంది, మల్లఖంబలో 12 మంది, వెయిట్ లిఫ్టింగ్‌లో 19 మంది క్రీడాకారులు ఏపీ నుంచి అర్హత సాధించడం విశేషం. పతకాలు నెగ్గేలా తర్ఫీదు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే ప్రతి మీట్లో పతకాలు సాధించేలా తరీ్ఫదును అందిస్తున్నాం. ఈ సారి ఖేలో ఇండియా పోటీల్లో అర్హత సాధించిన క్రీడాంశాలతో పాటు వయిల్కార్డ్ ద్వారా పాల్గొన్న క్రీడాకారులు కూడా కచి్చతంగా పతకం నెగ్గేలా ప్రణాళిక రూపొందించాం. అందుకే రాష్ట్రంలోని నిపుణులైన కోచ్‌లతో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. – ఆర్కే రోజా, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి. -
ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?
ఇటీవల 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... గత పాలకుల వైఫల్యం, క్రీడల్లో బంధుప్రీతి, అవినీతి, తీవ్రమైన మౌలిక వసతుల కొరత వంటి కారణాలవల్ల ప్రపంచ క్రీడా వేదికలపై మనం వెనుకపడ్డామని అన్నారు. విద్యావిధానంలో భాగంగా క్రీడా విధానాన్ని చూసినప్పుడే క్రీడలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. మన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరచాయి. 1968లో ఇందిరాగాంధీ, 1986లో రాజీవ్ గాంధీ, 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానంలో మార్పులు చేసినప్పటికీ క్రీడలకు సముచిత స్థానం కల్పించలేకపోయాయి. కానీ మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన నూతన విద్యా విధానం – 2020లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘గ్రాస్ రూట్ టాలెంట్ హంట్’ అనే నినాదంతో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌ను తీసుకురావడం కొంతవరకు మంచి సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇంకా అనేక అంశాలలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర జనాభా కన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా ఒలింపిక్స్‌లో మొదటి పది దేశాల జాబితాలో ఉంటున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఈవెంట్స్, ఈత కొలనులో జరిగే పోటీల్లో అత్యంత వెనుకబడిన దేశాలూ ఎన్నో పతకాలను కొల్లగొడు తున్నాయి. కాబట్టి మనం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధపెడితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యాహక్కు చట్టం–2009 ప్రతి పాఠశాలలో క్రీడాస్థలం, క్రీడలకు కావాల్సిన సౌకర్యాలు ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించు కున్నట్టు కనిపించదు. చదువు కన్నా ఆటలను ఇష్టపడే వయసులో ఉన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో ఉంటారు. ఆ వయసులోనే పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న క్రీడా నైపుణ్యాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు కనిపించరు. క్రీడల్లో అగ్రదేశాలకు సవాల్ విసురుతున్న చైనా... అతిచిన్న వయసులోనే పిల్లలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న విష యాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. అందుకే ముందుగా ప్రాథమిక పాఠశా లల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులను నియ మించాలి. పాఠశాలలూ, కళాశాలల్లోనే కాక... గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి శిక్షకులనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడే మన దేశంలో ఎంతో మంది పీవీ సింధులు, నికత్ జరీన్‌లు, నీరజ్ చోప్రాలు మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడిస్తారు. (క్లిక్ చేయండి: వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!) – జంగం పాండు, ఏబీవీపీ ఖేల్ స్టేట్ కన్వీనర్ -
Khelo India University Games 2021: స్విమ్మర్ అభిలాష్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. బెంగళూరులో జరిగిన ఈ గేమ్స్‌లో అభిలాష్ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్టీయూ తరఫున పాల్గొన్నాడు. -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్‌లోని తొలి సింగిల్స్‌లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్‌పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్‌లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్ కోచ్‌గా, సయ్యద్ ఫారూఖ్ కమాల్ మేనేజర్‌గా వ్యవహరించారు. చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు -
స్పోర్ట్స్ కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఖేలో ఇండియా కేంద్రాల్లో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు 13 మంది కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీకాంతో పాటు సమాన విద్యార్హత, ఎన్ఎస్ఎన్ఐఎస్ డిప్లొమా, ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు, జాతీయ స్థాయి పతక విజేతలు, ప్రాతినిధ్యం వహించినవారు కూడా అర్హులన్నారు. నెలకు రూ.25 వేలు వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయానికి లేదా kisce.ap@gmail. comకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు www.sports. ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకంలో భాగంగా జిల్లాకు ఒక్కో క్రీడాంశం చొప్పున 13 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. -
క్రీడా బడ్జెట్లో రూ. 230 కోట్లు కోత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ క్రీడా రంగం కుదేలైన వేళ బడ్జెట్లో క్రీడల ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు. సోమవారం 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమె క్రీడా బడ్జెట్లో రూ. 230.78 కోట్లు కోత విధిం చారు. గతేడాది క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2596.14కోట్లతో సరిపెట్టారు. ► మరోవైపు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి సైతం బడ్జెట్లో ప్రాధాన్యం భారీగా తగ్గింది. గతేడాది రూ. 890.42 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి గానూ రూ. 657.71 కోట్లకు కుదించారు. దీంతో ఏకంగా రూ. 232.71 కోట్లపై కోత పడింది. ► అయితే జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను, క్రీడాకారులను, సంస్థలను పర్యవేక్షించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తోపాటు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు (ఎన్ఎస్ఎఫ్) కేంద్రం సముచిత ప్రాధాన్యాన్నిచ్చింది. బడ్జెట్ కేటాయింపులో గతేడాదితో పోలిస్తే భారీ పెంపును ప్రకటించింది. దీంతో ‘సాయ్’ నిధులు రూ. 500 కోట్లు నుంచి రూ. 660.41 కోట్లకు చేరగా... సమాఖ్యల బడ్జెట్ రూ. 245 కోట్లు నుంచి ఏకంగా రూ. 280 కోట్లకు పెరిగింది. ► క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ. 25 కోట్లుగా నిర్ధారించారు. ► కామన్వెల్త్ క్రీడల సన్నాహాల బడ్జెట్‌ను రూ. 75 కోట్లు నుంచి రూ. 30 కోట్లకు తగ్గించిన కేంద్రం... జమ్ము కశ్మీర్లో క్రీడా సదుపాయాల కల్పన నిధులు (రూ. 50 కోట్లు), జాతీయ క్రీడాకారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో (రూ. 2 కోట్లు) ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదు. ► గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ విద్య సంస్థ బడ్జెట్‌ను యథాతథంగా రూ. 55 కోట్లుగా కొనసాగించింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు కేటాయించే నిధుల్ని రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్లకు పెంచింది. -
క్రీడా రంగానికి కేటాయింపులెన్నో!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి లభించే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో క్రీడారంగానికి ప్రాధాన్యత పెరిగినప్పటికీ, కేటాయింపుల్లో నిలకడ లోపించింది. గతేడాది (2020–21) ఖేలో ఇండియా గేమ్స్ కోసం రూ. 890 కోట్లను కేటాయించిన కేంద్రం... భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల నిధుల్లో కోత విధించింది. 2019లో రూ. 615 కోట్లుగా ఉన్న ‘సాయ్’ కేటాయింపులు గతేడాది రూ. 500 కోట్లకు తగ్గగా... క్రీడా సమాఖ్యలకు (రూ. 245 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు తగ్గింపు) సైతం భారీ కోత పడింది. అయితే కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సిద్ధం చేసిన ఈ బడ్జెట్లో క్రీడారంగానికి ఎన్ని నిధులు దక్కుతాయనేది ఆసక్తికరం. ► లాక్డౌన్ కారణంగా యూత్ స్పోర్ట్స్‌కు ఆదరణ పెరగడంతో ఈసారి బడ్జెట్లో క్రీడలపై ఎక్కువ వెచ్చించే అవకాశముంది. ► మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే అందుకు తగిన నిధులు కేటాయించాల్సిందే. ► లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు, క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకున్న మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది. దీనితో పాటు ఒలింపిక్స్ ఏడాది కావడంతో ఆటగాళ్లకు దన్నుగా నిలిచేందుకు ‘సాయ్’, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ► కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో గతేడాది గేమింగ్ సెక్టార్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈస్పోర్ట్స్, గేమింగ్ సెక్టార్లను అభివృద్ధి చేసే స్వదేశీ గేమ్ డెవలపర్స్, స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తూ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇస్తే... నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోన్న మేకిన్ ఇండియా బ్రాండ్‌కు మంచి ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది. -
‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో వైఎస్సార్ జిల్లాలోని ‘డా. వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్’ ఎంపిక కావడం విశేషం. ఈ పథకంలో స్థానం దక్కడంతో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో మౌలిక వసతులు, హై పెర్ఫార్మెన్స్ అధికారులు, కోచ్‌లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్‌సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ ప్రకటించగా... తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లు చేరాయి. -
తెలంగాణాలో ‘ఖేలో ఇండియా’ కేంద్రం
న్యూఢిల్లీ: భవిష్యత్ ఒలింపిక్స్ చాంపియన్లను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. తొలి దశలో తెలంగాణతోపాటు ఒడిశా, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రూ. 95.15 కోట్ల బడ్జెట్‌ను క్రీడాశాఖ వెచ్చించనుంది. ఎంపిక చేసిన రాష్ట్రాల క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ల ఏర్పాటు, నిపుణులైన కోచ్‌ల నియామకం, ఆటగాళ్ల కోసం ఫిజియోథెరపిస్టులతో పాటు స్ట్రెంథెనింగ్ కండిషనింగ్ నిపుణులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రాల సహకారంతో ఈ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను నిర్వహిస్తామని కేంద్ర క్రీడా శాఖ పేర్కొంది. ‘ప్రతీ ఎక్స్‌లెన్స్ కేంద్రం 14 ఒలింపిక్స్ క్రీడాంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఇందులో మూడు క్రీడాంశాలకు ఆయా రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తాయి. ఈ అత్యాధునిక కేంద్రాలు ఒక నిర్దిష్ట క్రీడలో నైపుణ్యం ఉన్న అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తాయి. 2028 నాటికి పతకాల జాబితాలో టాప్–10లో భారత్ నిలిచేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రంగా స్పోర్ట్స్ స్కూల్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది. అందులో తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా కేఐఎస్‌సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్ లభించనుంది. కేఐఎస్‌సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. -
‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు రూ. 30 వేలు: సాయ్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) 2,749 మంది ‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.30 వేలు చెల్లించింది. ఖేలో ఇండియా స్కాలర్షిప్లో భాగంగా ఏడాదికి రూ. 1.20 లక్షలు ఒక్కో అథ్లెట్‌కు చెల్లిస్తారు. 2020–21 సీజన్లో తొలి త్రైమాసికానికి ఆ మొత్తాన్ని అథ్లెట్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని ‘సాయ్’ తెలిపింది. ఖేలో ఇండియా అథ్లెట్ల జాబితాలో మొత్తం 21 క్రీడాంశాలకు చెందిన 2,893 మంది ఉన్నారని, వీరిలో 2,749 మందికి చెల్లింపులు చేశామని, మిగతా 144 మందికి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని సాయ్ అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు, వ్యక్తిగత, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రతి త్రైమాసికానికి రూ. 30 వేలు భత్యంగా చెల్లిస్తారు. -
100 మీటర్ల రేసులో దీప్తికి స్వర్ణం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణకు మరో స్వర్ణం లభించింది. గువాహటిలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఆదివారం జరిగిన అండర్–17 బాలికల 100 మీటర్ల విభాగం ఫైనల్లో జీవంజి దీప్తి విజేతగా నిలిచింది. దీప్తి 12.26 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త మీట్ రికార్డు నెలకొల్పింది. రుతిక శరవణన్ (తమిళనాడు), షెరోన్ మారియా (తమిళనాడు)లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. -
తెలంగాణ నుంచి బరిలో 115 మంది
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర జట్టు సిద్ధమైంది. గువాహటిలో నేటి నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 115 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 16 క్రీడాంశాల్లో తెలంగాణ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్–17, అండర్–21 బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ మెగా టోర్నీలో 90 మంది వ్యక్తిగత ఈవెంట్లలో, 24 మంది టీమ్ విభాగాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు చెఫ్ డి మిషన్‌గా రవీందర్ వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్ల వివరాలు: ∙ ఆర్చరీ: శంకర్ పట్నాయక్, కె. సింధూజ. అథ్లెటిక్స్: మహేశ్, అనికేత్, రుచిత, పద్మశ్రీ, దీప్తి, అక్షయ్చౌదరీ, జి. మహేశ్వరి, నందిని, బ్యాడ్మింటన్: నవనీత్, పి. విష్ణు, సామియా ఇమాద్ ఫరూఖీ, శ్రీవిద్య, గంధం ప్రణవ్, పుల్లెల గాయత్రి, మొహమ్మద్ ఖదీర్, శ్రీయ సాయి, మేఘన రెడ్డి, తరుణ్, అచ్యుతాదిత్య రావు బాక్సింగ్: నిహారిక. సైక్లింగ్: చిరాయుశ్, తనిష్క్, ఆశీర్వాద్ సక్సేనా, సాయిరామ్, ఉదయ్ కుమార్, ప్రణయ్, రాకేశ్, అరుణ్, యశ్వంత్ కుమార్, రాజ్‌కుమార్, దామోదర్ ముదిరాజ్. జిమ్నాస్టిక్స్: అక్షితి మిశ్రా, సురభి ప్రసన్న, విశాల్, అనన్య, సౌమ్య, సూర్యదేవ్, కె. సాయి హరిణి. జూడో: సాయిరామ్ దేవేందర్. కబడ్డీ: అంజి, ప్రవీణ్ కుమార్, జి. రాజు, శివకుమార్, రాజు నాయక్, తేజావత్ శ్రీనాథ్, మనోజ్, శ్రీ ప్రకాశ్, మేఘావత్ లక్కీరామ్, సుశాంక్, సంతోష్, సాహిల్. ఖో–ఖో: శ్రీరామ్, అన్వేశ్, ప్రసాద్, మనోజ్, ఉదయ్ కుమార్, జీవిత్ రావు, టి. మహేశ్, గణేశ్, వెంకటేశ్, సోమరాజు, తరుణ్ కుమార్, సతీశ్, అశోక్, సాయికుమార్, మన్మథరావు, జగపతి, ప్రవీణ్ కుమార్, నరేశ్ నాయక్, ప్రశాంత్, మహేందర్, నరేశ్, శ్రీనాథ్, హేమంత్, వసంతరావు. షూటింగ్: రుద్రరాజు ఆయుశ్, హోమాన్షిక రెడ్డి, ధనుశ్ శ్రీకాంత్, జహ్రా ముఫద్దల్ దీసవాలా, మునేక్, కాత్యాయని, ధీరజ్. స్విమ్మింగ్: గోలి జాహ్నవి, వై. జశ్వంత్ రెడ్డి, సాయి నిహార్, తనుజ్. టేబుల్ టెన్నిస్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, నైనా, మొహమ్మద్ అలీ, వరుణి. టెన్నిస్: శ్రీవల్లి రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర, సంజన సిరిమల్ల, సాయికార్తీక్ రెడ్డి, శ్రావ్య శివాని, ఆయుశ్, సామ సాత్విక, వేదరాజు ప్రపూర్ణ, తీర్థశశాంక్. వెయిట్ లిఫ్టింగ్: ఎం. హనుమాన్ నిహాల్రాజ్, కార్తీక్, గణేశ్, సాహితి, గంగా భవాని, గురునాయుడు, సాగరిక, గంగోత్రి, స్వప్న, అనూష, సింధూజ, రాజేశ్వరి, శివాని, అఖిల్. -
కూలీబిడ్డలు.. బాక్సింగ్ కింగ్‌లు
కరీంనగర్ స్పోర్ట్స్: వారంతా కూలీల బిడ్డలు. ఇల్లుగడవడమే కష్టంగా ఉన్న తరుణంలో వారి తల్లిదండ్రులు తమ పిల్లలను బాక్సర్లుగా చూడాలనుకున్నారు. మేరీకాం లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నారు.దేశానికి ఒలింపిక్ పతకం తేవాలనుకున్నారు.ప్రపంచానికి ఇండియా పంచ్ పంచ్ చూపించాలనుకుంటున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో రెండ్రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి నేపథ్యంపై కథనం.. కూలీబిడ్డ కాంస్య పతక విజేత వరంగల్ జిల్లా హన్మకొండకు సీహెచ్.దివ్య బాక్సింగ్‌లో దిట్ట. నాన్న కూలీ చేస్తుండగా అమ్మ గృహిణి. ఇప్పటి వరకు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గత సంవత్సరం పాఠశాలల జాతీయక్రీడా పోటీల్లో అద్వితీయ పోరాటపటిమ కనబరిచి కాంస్య పతకం సాధించింది. మేరీకామ్ స్ఫూర్తితో ఒలింపిక్లాంటి మెగాపోటీల్లో ప్రాతినిథ్యం వహించాలనుకుంటోంది. ఆటోడ్రైవర్ కొడుకు భాగ్యనగరంలో బాక్సింగ్‌లో రాణించి ఇండియన్ బాక్సర్‌గా పేరుసంపాదించడమే తన ఆశయమంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన వేణు. నాన్న సిటీలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. నాలుగుసార్లు జాతీయస్థాయితో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో పాల్గొని సత్తా చాడాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఖేలో ఇండియాలో కూలీకొడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణేష్ బాక్సింగ్‌లో దిట్ట. మంథనిలోని గురుకుల కళాశాలలో చదువుతున్నాడు. ఇప్పటి వరకు 8సార్లు సత్తా చాటాడు. తండ్రి కూలీ పనిచేస్తుండగా తల్లి గృహిణి. గతేడాది జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో కరీంనగర్ నుంచి సత్తాచాటాడు. గణేష్ భవిష్యత్‌లో ఐపీఎస్ అధికారిగా సేవలందించాలనుకుంటున్నాడు. -
రాజ్యవర్ధన్ నయా ఛాలెంజ్
న్యూఢిల్లీ: గతంలో క్రీడాకారులు, బాలీవుడ్ తారలకు ఫిట్నెస్ చాలెంజ్ విసిరిన కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా మరో సవాల్‌కు శ్రీకారం చుట్టారు. బుధవారం పుణేలో ‘ఖేలో ఇండియా’ క్రీడాపోటీలను ప్రారంభించిన ఆయన #5MinuteAur పేరుతో చేసిన కొత్త చాలెంజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన రెండు చేతులతోనూ టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. ‘చిన్నప్పుడు మనం హోమ్‌వర్క్ చేసుకోకుండా ఆడుకుంటూ ఉంటే అమ్మ మనల్ని వారించేది. వచ్చి హోమ్‌వర్క్ చేసుకోవాలని హెచ్చరించేది. అప్పుడు మనం ‘ఇంకో ఐదు నిమిషాలే’ అని అనే ఉంటాం. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురయ్యే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఐదు నిమిషాల పాటు క్రీడల గురించి ఆలోచించండి. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే పంచుకోండి’ అంటూ ఈ వీడియో సందేశాన్ని ఆయన వినిపించారు. ఈ చాలెంజ్ ప్రాముఖ్యాన్ని చెబుతూ భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రీడా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి పట్ల నెటిజన్లు ఫిదా అవుతూ.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Bas #5MinuteAur-haven't v all asked fr it-in playgrounds,exam halls or on the phone? Let's b the voice of our young athletes & say it loud- #5MinuteAur #KheloIndia Aur Khelenge Toh Aur Jitenge! Share ur story of #5MinuteAur @imVkohli @NSaina @deepikapadukone @BeingSalmanKhan pic.twitter.com/dg91JfzN7z — Rajyavardhan Rathore (@Ra_THORe) 9 January 2019 -
క్రీడా ప్రగతికి కృషి చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడా ప్రగతి చాలా జరిగిందని, క్రీడాభివద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శాట్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మన రాష్ట్రంలో క్రీడాభివద్ధికి తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు. ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు ప్రభుత్వ వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తన సొంత గ్రామమైన చిన్న చింతకుంట మండలం (మహబూబ్‌నగర్)లో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ. 1.30 కోట్లు మంజూరు అయ్యేలా కషి చేశామని తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు రూ. 10,000 స్టయిఫెండ్, ఎల్బీ స్టేడియం పునర్నిర్మాణం, నూతనంగా 200 కోచ్‌ల నియామకం, ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్మాణానికి కషి చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార అభివద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత గుప్తా, కాచిగూడ కార్పొరేటర్ కన్నా, తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ గేమ్స్‌నూ వీడని చీడ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఈవెంట్లు, జాతీయ స్థాయి టోర్నీలలో డోపింగ్ వివాదాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటాయి. పెద్ద స్థాయిలో ఇలాంటివి కొత్త కాదు. కానీ పాఠశాల స్థాయిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో కూడా డోపింగ్‌లో పట్టుబడటం అసాధారణం. తొలిసారి నిర్వహించిన ఈ క్రీడల అండర్–17 విభాగంలో మొత్తం 12 మంది డోపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. వీరిలో ఐదుగురు స్వర్ణ పతకాలు నెగ్గిన వారుండటం గమనార్హం. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నివేదిక ప్రకారం నిషేధిత ఉత్ప్రేరకం వాడిన ఈ 12 మందిలో నలుగురు రెజ్లర్లు, ముగ్గురు బాక్సర్లు, ఇద్దరు జిమ్నాస్ట్‌లతో పాటు జూడో, వాలీబాల్, అథ్లెటిక్స్‌కు చెందిన ఒక్కో ఆటగాడు ఉన్నాడు. వీరిలో ఒక అమ్మాయి కూడా ఉంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు ‘ఖేలో ఇండియా’ క్రీడలు దేశంలోని వివిధ నగరాల్లో జరిగాయి. ‘పట్టుబడిన ఆటగాళ్లలో ఎక్కువ మంది ఫ్యూరోసెమైడ్, టర్బు టలైన్ వాడినట్లు తేలింది. అయితే ‘వాడా’ నిబంధనల ప్రకారం ఈ ఉత్ప్రేరకాలు ప్రత్యేక కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఇంకా నిషేధం గురించి ఆలోచించలేదు’ అని అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిగా నిషేధం ఉన్న స్టెనజలోల్ను వాడిన ఒక బాక్సర్‌పై మాత్రం తాత్కాలిక నిషేధం విధించారు. డోపింగ్‌లో దోషులుగా తేలితే వీరందరిపై కనీసం 2 నుంచి 4 సంవత్సరాల నిషేధం పడుతుంది. -
క్రీడల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే చాలదని, క్రీడాభివృద్ధి కూడా జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన యువతలో క్రీడా నైపుణ్యానికి లోటు లేదని, ప్రపంచ యవనికపై భారత్‌ను నిలబెట్టే సత్తా క్రీడాకారులకు ఉందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ (కేఐఎస్‌జీ)’ బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఖేలో ఇండియా పోటీలు క్రీడల్లో భారత్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారుల చిన్ననాటి కోచ్‌లను సత్కరిస్తామని చెప్పారు. అండర్–17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌తో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు.