Rajiv
-
నమ్మకమే పునాది.. కోల్పోతే కష్టమే!
సంధ్య, రాజీవ్ ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరూ యాంబిషస్ ప్రొఫెషనల్స్. సంధ్య ఒక సాఫ్ట్వేర్ డెవలపర్‌గా, రాజీవ్ ప్రోడక్ట్ మేనేజర్‌గా ఒక అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, ఇల్లు కట్టుకోవడం, వివిధ దేశాలకు టూర్ వెళ్లడం వంటి కలల గురించి తరచుగా మాట్లాడుకునేవారు. పరస్పర గౌరవం, ఎమోషనల్ ఇంటిమసీతో ఉండేవారు. అయితే, పెళ్లికి ఆరునెలల ముందు పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. కొత్త ప్రాజెక్ట్ రావడంతో ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం, డెడ్‌లైన్‌కు ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఒత్తిడి, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనుల కారణంగా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయారు. ఎప్పుడైనా మాట్లాడుకున్నా, అతిథుల జాబితాలు, బడ్జెట్లు, లాజిస్టిక్స్ చుట్టూ తిరిగేవి. డేట్ నైట్స్, ఫిజికల్, ఎమోషనల్ ఇంటిమసీలు తగ్గిపోయాయి.సంధ్య మామూలుగానే రిజర్వ్డ్ వ్యక్తి. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు పనిలో మరింతగా మునిగిపోయింది. తన కెరీర్లో రాణించి, పెళ్లి సజావుగా జరిగితే మిగతావన్నీ సవ్యంగా సాగుతాయని భావించింది. కాని, రాజీవ్ మాత్రం ఎమోషనల్‌గా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తరచుగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ‘పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగనివ్వు రాజీవ్. పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు టైమ్ అంతా మనదే కదా’ అంటూ అతని మాటలను తోసివేసేది సంధ్య. ఆ సమయంలోనే రాజీవ్ టీమ్‌లోకి ప్రియ అనే కొత్తమ్మాయి చేరింది. చురుగ్గా, సరదాగా ఉండే వ్యక్తి. ప్రాజెక్ట్ టైమ్‌కి పూర్తిచేయాలని లేట్ అవర్స్‌లో కూడా పనిచేసేది. మొదట్లో రాజీవ్, ప్రియల సంభాషణలు ప్రొఫెషన్‌కు సంబంధించినవే ఉండేవి. క్రమేపీ అవి పర్సనల్ స్థాయికి చేరాయి. రాజీవ్ ఆలోచనలను ప్రియ ప్రశంసించేది. అతని పని ఒత్తిడి పట్ల సహానుభూతి చూపించి, సంధ్య నుంచి అందని మద్దతును అతనికి అందించగలిగింది. ఫ్రెండ్లీ బాంటర్ త్వరగా ఫ్లర్ట్గా మారింది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా, అదేమీ హానికరం కాదని, తన పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపించదని రాజీవ్ సమర్థించుకునేవాడు. వారాలు గడిచేకొద్దీ అతను తన ఫోన్‌ను సంధ్య నుంచి దాచడం ప్రారంభించాడు. ఓ రోజు ఇద్దరూ కలిసి ఔటింగ్‌కు వెళ్లారు. డ్రింక్స్ తీసుకెళ్లడానికి రాజీవ్ పక్కకు వెళ్లిన సమయంలో వచ్చిన నోటిఫికేషన్ చూడటానికి సంధ్య అతని ఫోన్ ఓపెన్ చేసింది. ప్రియ, రాజీవ్‌ల మధ్య జరిగిన చాటింగ్ ఆమె కంటపడింది. అంతే, ఆమె మనసు ముక్కలైంది. రాజీవ్‌పై పెట్టుకున్న నమ్మకం ధ్వంసమైంది. ఆ తర్వాత రాజీవ్‌తో సమయం గడపడం సంధ్య జీవితంలో అతి కష్టమైన పని అయింది. కోపం, బాధ, అవమాన భావాలతో సతమతమయ్యేది. ఇదంతా భరించలేక ఒకరోజు రాజీవ్‌ను అడిగేసింది. రాజీవ్ తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ సంధ్య అతన్ని క్షమించలేకపోయింది. తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు. అయినా రాజీవ్ పై మళ్లీ నమ్మకం ఉంచడం చాలా కష్టమనిపించింది. అతనికి మరో అవకాశం ఇవ్వాలా? లేక పెళ్లిని రద్దు చేసుకోవాలా? అనే సందేహంలో ఉంది సంధ్య. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌కి వెళ్లింది. ఇద్దరికీ మూడు నెలల కౌన్సెలింగ్ తర్వాత, ఒకరిపై ఒకరికి మళ్లీ పూర్తిగా నమ్మకం ఏర్పడ్డాక పెళ్లి చేసుకున్నారు. నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి పది సూత్రాలు..» క్రమబద్ధమైన మంచి చర్యల ద్వారా నమ్మకం పెరుగుతుంది.» మోసం చేసిన వ్యక్తి పూర్తి బాధ్యతను స్వీకరించాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి.» తప్పు చేసినవారిని క్షమించడం మీ మానసిక శాంతి కోసమే, అది నిదానంగా జరుగుతుంది.» ఎమోషనల్ ఓపెన్నెస్ బంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది.» హద్దులను నిర్దేశించుకోవడం, గౌరవించడం ఆరోగ్యకరమైన బంధానికి కీలకం.» నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి భాగస్వాములిద్దరూ కృషి చేయాలి.» భాగస్వాములిద్దరూ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం వ్యక్తిగత వృద్ధికి, బంధం బలమవ్వడానికి దోహదం చేస్తుంది.» బంధానికి విలువ ఉందా లేదా అన్నది ఆలోచించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి.» బంధాన్ని బలంగా, మంచి పునాదితో తిరిగి నిర్మించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి.» అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలి. -
పసిడి రుణాలే కీలకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పసిడి రుణాలకు డిమాండ్ పెరుగుతోందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ) డిప్యూటీ సీఈవో రాజీవ్ యాదవ్ తెలిపారు. రాబోయే 3–5 ఏళ్లలో తమ బ్యాంకు వృద్ధి వ్యూహాల్లో గోల్డ్ లోన్లు కీలక పాత్ర పోషించగలవని సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఇరవై నిమిషాల్లోపే రుణాల మంజూరుతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ పసిడికి డిమాండ్ పటిష్టంగానే ఉంది. ఐబీఈఎఫ్ అధ్యయనం ప్రకారం, పసిడిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెపె్టంబర్ మధ్య కాలంలో గోల్డ్‌కు డిమాండ్ 18 శాతం పెరిగింది. ఆర్థిక అనిశి్చతులతో పాటు ఫైనాన్సింగ్ ఆప్షన్‌గా బంగారం రుణాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గోల్డ్ లోన్లకు డిమాండ్ పెరుగుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్‌లో కుటుంబాల వద్ద 25,000 టన్నుల పైగా బంగారం ఉన్నట్లు అంచనా.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సత్వరం, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకోవాలనుకునే వ్యక్తులు, వ్యాపారవర్గాలకు బంగారం రుణాలు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారాయి. మేము తక్కువ డాక్యుమెంటేషన్, సరళతరమైన ప్రక్రియతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నాం. 12.99 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటు, 20 నిమిషాల్లోపే వేగవంతంగా రుణ వితరణ, వ్యక్తిగత పరిస్థితులను బట్టి సరళతరమైన రీపేమెంట్ ఆప్షన్లు మొదలైన మార్గాల్లో మేము కస్టమర్లకు సరీ్వసులు అందిస్తున్నాం. విశ్వసనీయత, పారదర్శకత, సౌకర్యానికి పెద్ద పీట వేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ధోరణులు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గోల్డ్ లోన్ ధోరణులు భిన్నంగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ ఖర్చులు, చిన్న వ్యాపారాలు, అత్యవసర పరిస్థితుల కోసం బంగారం రుణాలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రుణ సాధనాల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల కోసం గ్రామీణ ప్రాంతాల కస్టమర్లు బంగారం రుణాలపై ఆధారపడుతుంటారు. ఇక పట్టణ ప్రాంతాల విషయానికొస్తే.. గోల్డ్ లోన్లను నిర్వహణ మూలధన అవసరాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తల వెంచర్లు, లైఫ్ స్టయిల్ ఖర్చులు మొదలైన వాటికోసం తీసుకుంటున్నారు.పట్టణ ప్రాంతాల కస్టమర్లు సౌకర్యం, వేగానికి ప్రాధాన్యమిస్తూ సత్వరమైన, టెక్ ఆధారిత సొల్యూషన్స్‌ను కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే మేమూ సరీ్వసులు అందిస్తున్నాం. పసిడి ధరలు ఆల్–టైమ్ గరిష్ట స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో ఇటు బ్యాంకు అటు కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఏయూ ఎస్ఎఫ్బీ పటిష్టమైన రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు పాటిస్తుంది. మెరుగైన లోన్–టు–వేల్యూ (ఎల్టీవీ) నిష్పత్తులను పాటిస్తుంది. ఎప్పటికప్పుడు పసిడి ధరల ధోరణులు, మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, పాలసీలను అలాగే పథకాలను తదనుగుణంగా మార్చుకుంటూ ఉంటోంది. వృద్ధి ప్రణాళికలు .. మా పసిడి రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 1,986 కోట్లుగా ఉంది. క్యూ1లో ఇది రూ. 1,791 కోట్లు. వచ్చే 3–5 ఏళ్లలో బ్యాంకు వృద్ధి వ్యూహాల్లో గోల్డ్ లోన్లు కీలక పాత్ర పోషించనున్నాయి. మా రిటైల్, ఎంఎస్ఎంఈ పోర్ట్‌ఫోలియోలను విస్తరించడంలో పసిడి రుణాలు గణనీయంగా తోడ్పడే అవకాశముంది. టెక్నాలజీని వినియోగించుకుంటూ, బ్రాంచ్ నెట్‌వర్క్‌ను విస్తరించి, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆఫర్లను అందించడం ద్వారా మా గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోను మరింతగా పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయి. -
ఈ నేతల స్నేహం ఎందుకు గట్టిపడింది? ఇందిర చనిపోయాక అమితాబ్ ఏం చేశారు?
రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండరని అంటుంటారు. రాజకీయాల్లో అధికారం అందుకోవడమే లక్ష్యంగా స్నేహాలు కొనసాగుతుంటాయి. స్నేహానికి రాజకీయాలకు దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో స్నేహానికి సంబంధించిన అనేక కథలు వినిపిస్తుంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా మధ్య ఉన్న స్నేహం, దేశ మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ-అమితాబ్ బచ్చన్, నితీష్ కుమార్- లాలూ యాదవ్‌ల మధ్య స్నేహం మనకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. అటల్- అద్వానీ అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీల మధ్య ఉన్న స్నేహం నాటి రోజుల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఇద్దరూ దాదాపు కలిసే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించినప్పుడు, రథయాత్రతో పేరు తెచ్చుకున్న అద్వానీ తన రాజకీయ ఆశయాలను పక్కనబెట్టి, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశారు. నరేంద్ర మోదీ- అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షాపై నమ్మక అధికం అని చెబుతుంటారు. వీరిద్దరి మధ్య దాదాపు 40 ఏళ్ల స్నేహం ఉంది. వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే అమిత్ షా హోం శాఖ సహాయ మంత్రి అయ్యారు. నేడు మోదీ ప్రధానిగా ఉండగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత భారత రాజకీయాల్లో అమిత్ షా, మోదీల స్నేహానికి తులతూగేలా మరెవరూ కనిపించరు. మోదీ, షాల స్నేహం వారి రాజకీయ ఆశయాలను నెరవేర్చుకోవడానికి దోహదపడింది. లాలూ-నితీష్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మధ్య గాఢమైన స్నేహం ఉంది. అయితే రాజకీయాల్లో ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా వ్యతిరేకించుకున్నట్లు కనిపిస్తారు. వీరి స్నేహంలో ఎన్నో విబేధాలు వచ్చాయి. చాలాసార్లు నితీష్ కుమార్ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుని, లాలూ స్నేహాన్ని పక్కన పెట్టి, బీజేపీ పక్షాన నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ- అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్- రాజీవ్ గాంధీ బాల్య స్నేహితులు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అమితాబ్ పుట్టినరోజు వేడుకలో వారు కలుసుకున్నారు. అమితాబ్ తల్లి తేజీ బచ్చన్, రాజీవ్ గాంధీ తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమితాబ్‌ను ఇందిర తన మూడో కొడుకుగా భావించారు. ఇందిరా గాంధీ మరణం తరువాత అమితాబ్ ఆమె మృతదేహం దగ్గరే చాలసేపు కూర్చున్నారు. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? -
‘సీబీఎన్’ అంటే కొత్త అర్థం చెప్పిన వైఎస్సార్సీపీ నేత కొండా రాజీవ్
సాక్షి, అమరావతి: ప్రజా జీవితంలో ఉండేందుకు లోకేష్‌కు అర్హత లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు లోకేష్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? లోకేష్ భాష ప్రపంచంలోనే ఎవరూ మాట్లాడరు. లోకేష్‌కు వచ్చేంది పచ్చి బూతుల భాష మాత్రమే. సీబీఎన్.. అంటే చంద్ర బూతుల నాయుడు అని పెట్టుకోండి’’ అంటూ దుయ్యబట్టారు. లోకేష్.. ఐరన్ లెగ్ ఆఫ్ ఏపీ. లోకేష్ బతుకంతా ఫెయిల్. సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇలాగే మాట్లాడితే లోకేష్‌కు గుణపాఠం తప్పదు. సీఎం జగన్ పెట్టిన అభ్యర్థిపై లోకేష్ ఓడిపోయారు. మంగళగిరిలో ఆర్కే పులి.. లోకేష్ పిల్లి. పాతికేళ్ల డీఎస్సీ సమస్య పరిష్కరించిన ప్రభుత్వం మాది. లక్షలాది గ్రామ, వార్డు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. విశాఖ అన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన ప్రాంతం. కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల వద్ద చలి కాచుకోవడం చంద్రబాబుకు అలవాటు’’ అని కొండా రాజీవ్ ధ్వజమెత్తారు. చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు -
హాట్ కేకులవుతున్న స్వగృహ ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్: అవన్నీ దాదాపు పదేళ్లకు పైగా వృథాగా పడిఉన్న నివాస భవనాలు. కొనేవారు లేరన్న సాకుతో ఇప్పటివరకు అమ్మకుండా వదిలేశారు. తాజాగా అమ్మకానికి పెడితే అవే ఇప్పుడు హాట్‌కేకులుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను (ఫ్లాట్లు) కొనేందుకు జనం పోటీ పడుతున్నారు. నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఉన్న స్వగృహ ఇళ్లను ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, దానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి 3,716 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యా హ్నం నాటికి 18,400 దరఖాస్తులు అందా యి. ఇంకా 18 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇళ్లు అమ్మకా నికి ఉంచటంతో డిమాండ్ బాగా పెరిగింది. బండ్లగూడలో ఒక్కో ఇంటికి 7 దరఖాస్తులు అటు ఎల్బీనగర్.. ఇటు ఉప్పల్.. మెట్రో రైలుతో అనుసంధానమైన ప్రాంతం.. వెరసి బండ్లగూడలోని స్వగృహ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇక్కడ 2,246 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు 15,600 దరఖాస్తులు అందాయి. ఇక్కడ 2, 3 బీహెచ్‌కే, సాధారణ, డీలక్స్ మోడల్ ఇళ్లు కలిపి తొలుత 1,501 ఫ్లాట్లను విక్రయానికి ఉంచాలని భావించారు. ఆ తర్వాత 745 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా చేర్చి నోటిఫికేషన్ జారీ చేశారు. దీని వెనుక భాగాన బాగా పేరున్న ఓ ప్రైవేటు వెంచర్, ఓ పక్కన వందల సంఖ్యలో చెట్లున్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఉండగా.. ప్రధాన రహదారికి అతి చేరువగా ఉండటంతో ఇక్కడ ఫ్లాట్ కొనేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఒక ఇంటికి ఏడు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. పోచారంలో రెట్టింపు బండ్లగూడతో పోలిస్తే నగరానికి కాస్త దూరంగా ఉన్న పోచారంలో ఉన్న ఇళ్లకు పోటీ కొంత తక్కువగా ఉంది. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వరకు 1,470 ఇళ్లకు గాను 2,800 దరఖాస్తులు అందాయి. అంటే ఇళ్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు దరఖాస్తులు వచ్చాయన్నమాట. అయితే బండ్లగూడలో పోటీ ఎక్కువగా ఉండి, లాటరీలో ఇల్లు మంజూరు కాని పక్షంలో, కనీసం పోచారంలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తులో రెండో చాయిస్‌గా పోచారం ప్రాజెక్టును కూడా సూచిస్తున్నారు. ఇలావుండగా కొందరు బిల్డర్లు కూడా భారీగా ఇళ్లను బుక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకు ఈ ఇళ్లను దక్కించుకుని వాటిని ముస్తాబు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకునే ఉద్దేశంతో దరఖాస్తు చేస్తున్నారని సమాచారం. వృద్ధుల బ్లాక్‌కూ నోటిఫికేషన్ బండ్లగూడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వంద ఇళ్లతో ఓ బ్లాక్‌ను అప్పట్లోనే నిర్మించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడితే, నగరంలో ఉండే వృద్ధులైన తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించారు. నడిచేటప్పుడు పట్టుకోవటానికి వీలుగా గోడలకు హోల్డింగ్ బార్స్, టాయిలెట్లలో జారి పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు, వైద్యుల కోసం ఏర్పాటు, ఓ సమావేశ మందిరం, సొంతంగా వండుకునే ఓపికలేని వారికోసం కామన్ కిచెన్ లాంటి వసతులు ఇందులో ఉన్నాయి. కాగా వీటిని కూడా విక్రయించేందుకు 3 రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మూడు రోజుల్లో వీటికి 25 దరఖాస్తులు రావటం విశేషం. మిగతా ఇళ్ల ధరలకే వీటినీ విక్రయిస్తారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ (బుధవారం) ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. రాజీవ్ త్యాగి మరణించాడని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాజీవ్ త్యాగి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. నిజమైన దేశభక్తుడు, బలమైన నేతను కోల్పోయామని తెలిపింది. త్యాగి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించింది. (చదవండి: కేంద్ర మంత్రి యశోనాయక్ శ్రీపాదకు కరోనా) కాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఓ ప్రముఖ వార్తా చానెల్లో ఆయన డిబేట్లో పాల్గొన్నారు. డిబేట్ అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇదిలాఉండగా.. గత అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్‌లో మీడియా ఇన్చార్జిగా నియమించారు. త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన కీలకంగా పనిచేశారు. త్యాగి మృతి పట్ల కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షురాలు సోనియా గాంధీ , రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, బీజేపీ నేత సబిత్ పాత్రా, ఎన్సీపీ నేత నవాబ్‌మాలిక్ ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. (కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!) -
అరుదైన ఘనత సాధించిన మాధురి కనిత్కర్
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసిన మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతిలో భాగంగా సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందిన మూడవ మహిళగా గుర్తింపుపొందారు. అదే సమయంలో ఆర్మీలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా పీడియాట్రిషియన్‌గా ఘనత సాధించారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డారు. ఇది కేటాయించిన బడ్జెట్ వినియోగాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి ప్రణాళిక, సమైక్యత ద్వారా సేవల సేకరణ, శిక్షణ కార్యకలాపాలలో మరింత కృషి చేయనున్నారు. పూణే సాయుధ దళాల మెడికల్ కాలేజీ మాజీ డీన్ మేజర్ జనరల్ మాధురి కనిత్కర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి పంపారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్, లెఫ్టినెంట్ జనరల్ అయిన ఆమె భర్త రాజీవ్ సాయుధ దళాలలో ర్యాంకు సాధించిన మొదటి జంటగా గుర్తింపు పొందారు. చదవండి: ‘నమస్తే ట్రంప్; నేను ఎగ్జయిట్ కాలేదు’ -
స్టార్‌కు ఓ న్యాయం... మాకో న్యాయమా?
సాక్షి, చెన్నై: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఓ న్యాయం...తమకు మరో న్యాయమా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని రాజీవ్ హత్యకేసు నింధితులు ప్రశ్నించే పనిలో పడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు సంజయ్‌దత్‌ను విడుదల చేసినట్టుగానే రాజీవ్ హత్య కేసు నిందితుల్ని కూడా విడుదల చేయాలని న్యాయవాదులు పట్టుబట్టే పనిలో పడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్, రవిచంద్రన్‌తో పాటు ఏడుగురి విడుదల వ్యవహారం రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించినా, రాజ్‌భవన్‌లో స్పందన లేని దృష్ట్యా, చివరకు గవర్నర్ బన్వరిలాల్‌ను ప్రశ్నిస్తూ నిందితుల తరఫున రవిచంద్రన్ ఓలేఖ కూడా రాశారు. నిర్ణయం ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పేరరివాలన్ కొన్నేళ్లుగా చేసిన న్యాయ పోరాటం, తీవ్ర ప్రయత్నాలకు ఫలితంగా ప్రస్తుతం ఓ కేసు విషయంగా కీలక ఆధారాల్ని సేకరించారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా జైలుశిక్షను సైతం అనుభవించిన బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ విడుదల వ్యవహారాన్ని పేరరివాలన్ గతంలో అస్త్రంగా చేసుకున్నారు. సీబీఐ విచారిస్తున్న, విచారించిన కేసుల్లో ముందస్తు విడుదల వ్యవహారంలో కేంద్రం ఆదేశాలు, నిర్ణయం తప్పనిసరి అన్న వాదనను పరిగణించి సమాచార హక్కు చట్టం మేరకు సంజయ్‌దత్ విడుదలకు వర్తింపచేసిన నిబంధనల వివరాలను పేరరివాలన్ సేకరించారు. ఇందులోని అంశాలన్ని పేరరివాలన్ తరఫు న్యాయవాదులు మీడియా దృష్టికి తెచ్చారు. ఇదేనా న్యాయం.. సంజయ్‌దత్‌ను ముందస్తుగా విడుదల చేసిన వ్యవహారంలో ఎలాంటి కేంద్రం అనుమతుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం పొందనట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు తేలాయి. మహారాష్ట్ర జైళ్ల శాఖ నింబంధనలకు అనుగుణంగానే ఆయన్ను విడుదల చేసి ఉండటం గమనార్హం. సంజయ్ దత్‌కు శిక్ష విధించిన సమయంలో కోర్టు తీవ్రంగానే స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మరిన్ని వివరాలను రాబట్టి ఉన్నారు. అలాగే, సంజయ్ దత్ కేసును సీబీఐ విచారించిందని, అది కూడా బాంబు పేలుళ్ల కేసు అని, ఆ కేసులో కేంద్రం అనుమతి అన్నది పొందనప్పుడు, ఈ ఏడుగురి విడుదల విషయంలో మాత్రం ఎందుకు కేంద్రం అనుమతి...? అని పేరరివాలన్ న్యాయవాదులు ప్రశ్నించారు. సంజయ్ దత్‌కు ఓ న్యాయం...రాజీవ్ హత్య కేసు నింథితులకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తుండటం విచారకరంగా పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని అంశాల్ని అస్త్రంగా చేసుకుని న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అదే సమయంలో ఆ సమాచార హక్కు చట్టం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జైళ్ల శాఖ నిబంధనల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సెక్షన్ 161 మేరకు ఎవ్వరి అనుమతి అన్నది లేకుండా తమిళనాడు ప్రభుత్వానికే ఆ ఏడుగురి విడుదల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. అంతే గాని, మంత్రి వర్గం ఆమోదాన్ని రాజ్ భవన్‌కు పంపించి, అక్కడ ఆమోదం కోసం ఎదురు చూడకుండా,త మిళనాడు ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్చేస్తున్నారు. -
అప్రూవర్‌గా మారనున్న సక్సేనా!
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఈడీ, సక్సేనాల తరఫు న్యాయవాదులు ఓ అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించాయి. సక్సేనా దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ అనంతరం ఇరువర్గాలు సక్సేనా అప్రూవర్‌గా మారే విషయమై ఉమ్మడి పిటిషన్ దాఖలు చేస్తాయన్నాయి. సక్సేనా న్యాయవాది గీతా లూథ్రా స్పందిస్తూ.. ఈడీ అధికారుల విచారణకు సక్సేనా అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉందనీ, 4 స్టెంట్లు వేశారని వెల్లడించారు. అంతేకాకుండా సక్సేనాకు లుకేమియా(రక్త కేన్సర్) ప్రాథమిక దశలో ఉందన్నారు. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో అగస్టా హెలికాపర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరింది. అయితే ఈ సందర్భంగా భారీగా ముడుపులు చేతులు మారినట్లు వార ్తలు రావడంతో కేంద్రం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. సక్సేనా బెయిల్ పిటిషన్‌ను గురువా రం విచారిస్తామని ఢిల్లీలోని ఓ కోర్టు తెలిపింది. -
ఏడాదిలో 2,000 మంది నియామకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ సేవల రంగంలో ఉన్న ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెద్ద ఎత్తున నియామకాలను చేపడుతోంది. ఏడాదిలో కొత్తగా 2,000 మందిని చేర్చుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ రాజీవ్ యాదవ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,200 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ‘11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. 14 లక్షల మంది కస్టమర్లున్నారు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) రూ.2,899 కోట్లుంది. 2021కి ఏయూఎం రూ.10,000 కోట్లకు చేర్చాలన్నది ధ్యేయం. అలాగే 40 లక్షల కస్టమర్లకు చేరుకోవాలనేది లక్ష్యం. బ్యాంకింగ్ ఔట్లెట్లు ప్రస్తుతమున్న 532 నుంచి 5,000ల స్థాయికి తీసుకెళతాం. డిపాజిట్లపై వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు 9.5%, ఎన్ఆర్ఐలకు 9 -
వాళ్ల పెళ్లిలా ఇదీ హిట్టే!
‘‘రాజీవ్, సుమ నేను తీసిన ఓ యాడ్‌లో నటించారు. ఇద్దర్నీ వేర్వేరుగా రమ్మంటే... నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చారు. ఇప్పుడు ఇదీ (జుజుబీ టీవీ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ నిర్మించడం) నాకు చెప్పకుండా స్టార్ట్ చేశారు. సో, హిట్టే. ‘సుమ రాజీవ్ క్రియేషన్స్’ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ప్రవీణ్ యండమూరి, శ్రీముఖి మేకల జంటగా సందీప్ మెండి దర్శకత్వంలో ప్రపూర్ణ ప్రొడక్షన్ హౌస్ తో కలసి సుమరాజీవ్ క్రియేషన్స్ నిర్మించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘అలనాటి రామచంద్రుడు’. త్వరలో ‘జుజుబీ టీవీ’ (యూట్యూబ్ ఛానల్)లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ట్రైలర్‌ను రాఘవేంద్రరావు, పాటల సీడీలను వరా ముళ్లపూడి, ‘జుజుబీ టీవీ’ ప్రోమోను కొరటాల శివ విడుదల చేశారు. ‘‘మా ఆత్మను తృప్తిపరిచే చిత్రాలు తీస్తూ, యువతను ప్రోత్సహించడానికి ‘జుజుబీ టీవీ’ స్టార్ట్ చేశాం’’ అన్నారు రాజీవ్ కనకాల. -
అర్ధరాత్రి హైడ్రామా...
- కుకునూర్‌పల్లికి శ్రవణ్, రాజీవ్ - స్థానిక పోలీసుల హెచ్చరికలతో వెంటనే తిరుగుముఖం హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్(21), వల్లభనేని రాజీవ్ (31) పోలీస్ కస్టడీ మంగళవారం ముగియడంతో బుధవారం ఉదయం 10 గంటలకు వారిని కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల పాటు వీరిద్దరినీ కస్టడీకి తీసుకుని శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల నేపథ్యంలో జరిగిన ఘటనలను పునర్విచారించారు(క్రాస్ చెకింగ్). రాజీవ్, శ్రవణ్ శిరీషను హింసించడం వల్ల ఆమె అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో స్పష్టం కావడంతో వీరిపై అదనంగా మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 16న వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పోలీసుల దర్యాప్తులో ఏం చెప్పారో కస్టడీలోనూ అవే విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అవమానంతోనే శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడుతుండటం కళ్లారా చూశామని వెల్లడించారు. అయితే అత్యాచారం జరిగిందా? లేదా? అన్నదానికి లేదన్న సమాధానమే ఇచ్చారు. ప్రియురాలు తేజస్వినిని, వివాహేతర సంబంధం పెట్టుకున్న శిరీషను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసిన విషయం వాస్తవమేనా అని రాజీవ్‌ను ప్రశ్నించగా.. వారిద్దరినీ దూరం చేసుకుని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు. మీడియా కళ్లుగప్పి.. కస్టడీలో భాగంగా రాజీవ్, శ్రవణ్‌లను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో హైడ్రామా మధ్య కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు మీడియాకు ఉప్పందించి.. అక్కడ పరీక్షల అనంతరం మీడియా కళ్లుగప్పి అడ్డదారిలో కుకునూర్‌పల్లికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుకునూర్‌పల్లిలో అక్కడి పోలీసులు వీరిని లోనికి అనుమతించలేదు. పది నిమిషాలు అక్కడ ఉంటే విధ్వంసం జరిగే అవకాశం ఉందని, విషయం బయటకు పొక్కితే ప్రజలు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిం చడంతో బంజారాహిల్స్ పోలీసులు కుకునూర్ పల్లి పోలీస్‌స్టేషన్ బయటి నుంచే తిరుగుముఖం పట్టారు. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఇదేనా? ఈ స్టేషన్ వెనకాల ఉన్న క్వార్టర్స్‌కు వచ్చారా? ఎక్కడి నుంచి వెళ్లారు? అనే వివరాలను స్టేషన్ బయటే నిందితులను అడిగి నిమిషాల్లోనే అక్కడి నుంచి వెనుదిరిగారు. తెల్లవారుజామున 5.30 గంటలకు మళ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. -
శిరీషను హింసించారు
రాజీవ్–శ్రవణ్ అమానుషంగా ప్రవర్తించారని నిర్ధారించిన పోలీసులు హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు నిర్ధారించారు. కుకు నూర్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిం చడం, దాడి చేయడం, కొట్టడం తదితర చర్యల కు పాల్పడినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో నిందితులపై తొలుత నమోదు చేసిన ఐపీసీ 306, 109 సెక్షన్లకు తోడు 324, 354, 509 సెక్షన్లను అదనంగా చేర్చారు. రాజీవ్–శ్రవణ్ కస్టడీ గడువు మంగళవారంతో ముగిసింది. నిందితులిద్దరినీ బుధవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచాలని అధికారులు నిర్ణయించారు. వచ్చేప్పుడు ఏం జరిగింది..? మంగళవారం నిందితుల రెండోరోజు విచార ణలో కుకునూర్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో జరిగిన ఘటనలపైనే దృష్టి సారించారు. మార్గమధ్యంలో శిరీష కారు నుంచి ఎందుకు దూకాలనుకుంది..? ఆమెను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అన్న అంశాలపై నిందితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. శిరీషపై కుకునూర్‌పల్లిలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుచిత ప్రవర్తన, తిరిగి వచ్చే సమయంలో శ్రవణ్, రాజీవ్ ఆమెను అవమానిస్తూ కొట్టడం, ఇక రాజీవ్ తనను వదిలిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు శిరీష తెలుసు కోవడం తదితర పరిణామాల నేపథ్యంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు నిర్థారణకు వచ్చారు. కుకునూర్‌పల్లి ఎస్సై క్వార్టర్స్‌లో శిరీషపై అత్యాచారయత్నం జరిగినప్పుడు శ్రవణ్, రాజీవ్ అక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్లారా? అనేది లోతుగా ఆరా తీశారు. నిందితులు తాము ఆ సమయంలో క్వార్టర్స్ బయటే ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. ఆర్జే ఫొటోగ్రఫి స్టూడియోలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు నిందితుడు చెప్పిన వివరాలు, సమయం కరెక్టుగా ఉందో లేదో అన్నది క్రైమ్ సీన్ రీ–కనస్ట్రక్షన్ ద్వారా నిర్థారించాలని నిర్ణయించారు. తేజస్విని వాంగ్మూలం నమోదు శిరీషను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న రాజీవ్ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు మంగళవారం రికార్డు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం గచ్చిబౌలిలోని తేజస్విని నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి అక్కడే వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసు విచార ణలో తేజస్విని ఈ ఆత్మహత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య తనను చాలా కల చి వేసిందని, ఆమె తన కుటుంబం విషయం ఆలోచించి.. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నట్లు సమాచారం. శిరీష ఆత్మహత్య విషయం 13న తెలిసిందని, ఆ సమయంలో తాను విజయవాడలో ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య చేసు కుందని తెలియగానే కన్నీరుమున్నీరయ్యానని.. సాటి మహిళగా చాలా బాధపడ్డానని పోలీసులకు తెలిపింది. తాను రాజీవ్‌ను ప్రేమించిన విషయం వాస్తవమేనని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని అయితే రాజీవ్–శిరీష సన్నిహితంగా ఉండటం తనకు నచ్చలేదని వాపోయినట్లు తెలుస్తోంది. తమ ప్రేమకు అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో పలుమార్లు శిరీషడ ను తమ మధ్య నుంచి తప్పుకోవాలని చెప్పిన మాట వాస్తవమేనని.. తన స్థానంలో ఎవరు న్నా అలాగే చేస్తారని విచారణలో తేజస్వి ని పేర్కొన్నారు. 12న తాను విజయవాడ వెళ్లి రాజీవ్ తల్లిని కలిశానని, అయితే పెళ్లి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదని, రాజీవ్‌తో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పానని పేర్కొన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి తాను తన ఇంటికి వచ్చేశానని, తెల్లవారిన తర్వాత శిరీష ఆత్మహత్య విషయం తెలుసుకున్నానని చెప్పిన ట్లు తెలుస్తోంది. తనకు రాజీవ్ ఫేస్బుక్లో పరిచయం కాగా.. కొద్దిరోజుల్లోనే ప్రేమకు దారి తీసిందని.. అతడు తనను పెళ్లి చేసుకుం టానని చెప్పడంతో నమ్మానని వెల్లడించినట్లు సమాచారం. గత నెల 30న అనివార్య కారణాల నేపథ్యంలో రాజీవ్, శిరీషపై ఫిర్యాదు చేయడానికి తాను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తేజస్విని పోలీసుల ఎదుట అంగీకరించింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నాం.. శిరీష వ్యవహారంపై పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘శిరీషది ముమ్మాటికీ ఆత్మహత్యే. ఆమె వస్త్రాలతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లు సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపాం. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ వస్తే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలం. కుకునూర్‌పల్లిలో జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నాం’ అని చెప్పారు. -
పోలీసుల కస్టడీకి రాజీవ్, శ్రావణ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రావణ్లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ సెంలట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. రాజీవ్, శ్రావణ్లను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆడియే టేపులపై కూడా దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. -
4రోజుల కస్టడీకి శ్రవణ్, రాజీవ్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఏ1 నిందితుడు బి.శ్రవణ్, ఏ2 నిందితుడు వల్లభనేని రాజీవ్‌లను రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లిలోని మూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సోమ, మంగళవారాల్లో వీరిద్దరినీ కస్టడీకి ఇస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. శిరీష ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకులుగా రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయగా న్యాయమూర్తి ఈ మేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించారు. -
పోలీస్ కస్టడీకి రాజీవ్, శ్రవణ్
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26,27 తేదీల్లో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. కాగా శిరీష మృతి కేసులో అనుమానాల నివృత్తి కోసం బంజారాహిల్స్ పోలీసులు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్ ఏ1, రాజీవ్‌ను ఏ2గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 13న తేదీ మంగళవారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య అనంతరం జరిగిన ఆందోళనపై సిద్ధిపేట పోలీసులు మూడు వేరు వేరు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. -
రాజీవ్... రాసలీలలు!
పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటికి... హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య ఘటనలో అరెస్టయిన ఆర్జే స్టూడియో యజమాని రాజీవ్ వల్లభనేని లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజీవ్.. శిరీష సహా నలుగురు యువతులతో సన్నిహితంగా ఉన్నట్లు, నెల క్రితం మరో యువతితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసినట్లు సెల్‌ఫోన్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్.. తర్వాత ఒక్కొక్కరినీ దూరంగా పెడుతూ వచ్చాడు. వారి అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి వారి నుంచి తప్పించుకునేవాడు. ఇలా ఇద్దరిని మోసం చేసిన తర్వాత వివాహిత శిరీషను ప్రేమలో దింపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజీవ్‌ను ప్రేమించిన తేజస్విని ఒక వైపు పోలీసుస్టేషన్లో కేసు పెడతానని బెదిరిస్తూనే... విజయవాడ వెళ్లి అతడి తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెను దూరంగా ఉంచాలని రాజీవ్ పథకం వేసినట్లు తెలుస్తోంది. ముందు శిరీషను దూరంగా ఉంచితే.. ఆ తర్వాత తేజస్వినిని కూడా పక్కకు తప్పించవచ్చని రాజీవ్ భావించినట్లు సమాచారం. యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే వీడియోలను తన ఫోన్లో చిత్రీకరించడం రాజీవ్‌కు అలవాటని దర్యాప్తులో తేలింది. అతడి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అనేక వీడియోలు, ఫొటోలు గుర్తించి నిర్ఘాంతపోయారు. ఆర్జే ఫొటోగ్రఫీలో కొన్ని హార్డ్ డిస్క్లలోనూ అతడి రాసలీలలు బయటపడ్డాయి. -
శిరీషను ఆ ముగ్గురే కొట్టి చంపారు
హంతకులను పోలీసులే కాపాడుతున్నారు శిరీష మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి మృతురాలి బాబాయి, పిన్ని డిమాండ్ సాక్షి, అమరావతి బ్యూరో: బ్యూటీషియన్ శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆమె బాబాయి శ్రీనివాసరావు, పిన్ని దుర్గారాణి డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కర్ణాటకలోని రాయచూరులో ఉండే శిరీష బాబాయి, పిన్ని శ్రీనివాసరావు, దుర్గారాణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వెళుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద మీడియాతో మాట్లాడారు. హంతకులను కాపాడేందుకే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే శిరీష మీద అపనిందలు మోపుతున్నారని విమర్శించారు. రాజీవ్‌తో శిరీష నాలుగేళ్లుగా సహజీవనం చేసిందని అపనిందలు వేశారని వారు ఆరోపించారు. శిరీష 2016, జూలై వరకు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో సొంతంగా బ్యూటీపార్లర్, ఓ కిరణా దుకాణం నిర్వహించిందన్నారు. గత ఆరు నెలలుగా మాత్రమే ఆమె రాజీవ్‌కు చెందిన ఆర్జే ఫొటో స్టుడియోలో పనిచేస్తోందన్నారు. శిరీష పేదింటి పిల్ల కాబట్టి డబ్బు ప్రభావానికి గురైందని కూడా మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని, తమది మధ్యతరగతి కుటుంబమని వారు స్పష్టం చేశారు. రాజీవ్, శ్రావణ్, ఎస్ఐ ప్రభాకరరెడ్డి కలసి తమ బిడ్డను కొట్టి, హింసించి, హత్యచేశారని, అనంతరం ఎస్ఐ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడన్నది వాస్తవమన్నారు. శిరీష ఆత్మహత్య చేసుకుంటే వంటిపై గాయాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఆమెను ఎలాగైనాసరే లొంగదీసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతోనే హత్య చేశారని ఆరోపించారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మేనమామ సూర్యారావు పేర్కొన్నారు. రాజీవ్, శ్రావణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాలని కోరారు. అదే విధంగా ఈ కేసులో అనుమానస్పద పాత్ర పోషించిన తేజస్వినిని ఎందుకు బయటకు తేవడం లేదని శ్రీనివాసరావు, దుర్గారాణి ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏకపక్షంగా కేసును ముగించాలని శిరీష నడవడిక మీద అపనిందలు వేయడం దారుణమని ఆరోపించారు. శిరీష ఫోన్ సంభాషణల పేరుతో ఏవో టేపులు తెచ్చి ఆమె ప్రవర్తనను తప్పుపట్టేలా పోలీసులు ప్రచారం చేయడం దారుణమన్నారు. వాస్తవాలను వెలికితీసేలా విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
శిరీష వ్యవహారమే కారణం!
► ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ నివేదిక సిద్ధం ► శిరీష అంశంతో పరువుపోతుందనే ఆందోళనతోనే ఆత్మహత్య ► నేడు డీజీపీకి నివేదిక అందించే అవకాశం సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహ త్యకు బ్యూటీషియన్ శిరీష వ్యవహారమే కారణమంటూ ఈ కేసులో విచారణాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఏసీపీ వేధించినట్లుగా వచ్చిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాల్లే వని వెల్లడైన ట్లుగా అందులో నిర్ధారించినట్లు సమాచారం. ఈ నెల 14న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్‌రెడ్డిది హత్య అని కొంద రు, ఉన్నతాధికారుల వేధింపుల తో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుం బీకులు ఆరోపించారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ ఈ ఘటనపై అదనపు డీజీపీ గోపీకృష్ణతో విచారణకు ఆదేశించారు. ఆయనతోపాటు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న విచారణ జరిపారు. వారు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను, ఎస్సై క్వార్టర్స్‌ను పరిశీలించారు. శిరీష ఆత్మహత్య కేసులో అరెస్టయిన రాజీవ్, శ్రవణ్ లను.. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల వేధింపులకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయేమో నని ఆరా తీశారు. అయితే గజ్వేల్ ఏసీపీ కావాలనే ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని వేధించినట్లుగా వచ్చిన ఆరోపణల్లో ఎక్కడా ఆధారాల్లేవని విచారణాధికారులు ధ్రువీకరించుకున్నట్టు తెలుస్తోంది. అయితే మెటర్నిటీ సెలవు విష యంలో, పాత కేసుల క్లోజింగ్ విషయంలో ఏసీపీ వేధించినట్టు ఆధారాలున్నాయని.. చార్జిమెమోల విషయంలో ఆధారాలేమీ లేవని గుర్తించినట్లు సమాచారం. శిరీష వ్యవహారం లో ఆరోపణలు వస్తే సమాజంలో పరువు పోతుందన్న భయం, మానసిక ఒత్తిడి, క్షణికా వేశంలోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్టు గా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఆందోళన చేసినవారిపై కేసులు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట చేసిన ఆందోళన, దాడులను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీస్‌శాఖపై ఆరోపణలు చేసిన సిబ్బందితో పాటు మీడియా వాహనాలు, పోలీస్ వాహనాల ధ్వంసానికి యత్నించిన ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్సై ఆత్మహత్య వ్యవహారాన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యగా తప్పుడు ప్రచారం చేసేందుకు యత్నించినట్టుగా విచరణాధికారులు నివేదికలో పొందుప రిచినట్టు తెలిసింది. వారిపై కుట్ర కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించను న్నట్లు సమాచారం. ఈ నివేదికను శుక్రవారం డీజీపీకి అందించనున్నట్లు తెలిసింది. -
ఎవరీ నందు, నవీన్?
శిరీష కేసులో తెరపైకి మరో రెండు పేర్లు ► వారితో జరిపిన సంభాషణలు వెలుగులోకి.. శిరీష స్నేహితులుగా అనుమానం ► ముందు తేజస్విని విషయం వారికే చెప్పిన శిరీష ► అంతా అయిపోయిందంటూ ఫోన్లో చెప్పిన ఇరువురూ ► అయినా ఫలితం లేకపోవడంతో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వివాదం ► రాజీవ్, శ్రవణ్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు ► తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియోల్లో ఉన్న అంశాలివీ.. హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. నందు, నవీన్ అనే ఇద్దరితో శిరీష మాట్లాడినట్లు భావిస్తున్న రెండు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాల్ రికార్డింగ్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. వెలుగులోకి వచ్చిన ఆడియోలను పరిశీలిస్తే.. తనకు, రాజీవ్‌కు తేజస్వినితో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా శిరీష తొలుత నందును కోరినట్లు తెలుస్తోంది. అతడితో పాటు అతడి స్నేహితుడైన నవీన్ సైతం తేజస్వినితో మాట్లాడామని, విషయం సెటిల్ అయి పోయిందని, ఇక ఆమె మీ జోలికి రాదంటూ శిరీషతో చెప్తున్న మాటలు ఆడియోల్లో ఉన్నాయి. వీరిలా చెప్పినా తేజస్వినితో ఇబ్బందులు కొనసాగిన నేపథ్యంలోనే శిరీష మరో స్నేహితుడైన శ్రవణ్ సహాయం కోరి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శిరీష–రాజీవ్.. శ్రవణ్ ద్వారానే కుకునూర్‌పల్లి వెళ్లడం, అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని కలవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. రాజీవ్ ఇబ్బంది పడకూడదని.. రాజీవ్‌ను శిరీష ఎంతో సన్నిహితంగా భావించినట్లు ఈ ఆడియోల్లో స్పష్టమవుతోంది. ఫోన్ సంభాషణలో నందు.. రాజీవ్‌ను ఉద్దేశించి ‘వాడు’అని సంబోధించగా.. దీన్ని శిరీష తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతి సందర్భంలోనూ రాజీవ్ ఇబ్బంది పడకూడదని, అతడికి ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదని శిరీష ప్రయత్నించినట్లు ఆడియో రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. తేజస్విని నుంచి ఎదురైన ఇబ్బందుల వల్ల ఆమెపై పెంచుకున్న ద్వేషంతోనే నందు, నవీన్ ఆమెను ఫోన్లో ఏమని దూషించారో తెలుసుకోవాలని శిరీష భావించింది. వారు తేజస్వినితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ పంపమని వారిని పదేపదే కోరడం ఆడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరూ ఎవరు.. నందు, నవీన్ ఎవరు? శిరీష కోరిన మీదట వారు తేజస్వినితో మాట్లాడారా? లేక మాట్లాడామంటూ శిరీషతో చెప్పారా? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. శిరీష కాల్ డిటైల్స్ ఆధారంగా వీరిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అరెసై్టన రాజీవ్, శ్రవణ్‌లను తదుపరి విచారణ నిమిత్తం ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరు కస్టడీలోకి వచ్చిన తర్వాత నందు, నవీన్ వివరాలు రాబట్టాలని నిర్ణయించారు. ఎక్కడివా ఆడియోలు? మీడియాలో హల్చల్ చేస్తున్న శిరీష –నందు –నవీన్ సంభాషణల ఆడి యోలు ఎక్కడివనేది ఇప్పు డు కీలకంగా మారింది. వీటిని ఎవరో ఉద్దేశపూర్వ కంగా లీక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంభాషణను బట్టి అవి శిరీష, ఆమె స్నేహితుడు నందు ఫోన్ల మధ్య జరిగినట్లు తెలు స్తోంది. వారి ఫోన్లలోనే వీటి రికార్డింగ్‌కు ఆస్కారం ఉంది. శిరీష చనిపోయిన రోజే ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేసిన శుక్రవారం వారి ఫోన్లతో పాటు శిరీష ఫోన్‌ను సీజ్ చేశామని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని పేర్కొంటున్నారు. అయితే మంగళవారం రాత్రి నుంచి ఈ ఆడియోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో వచ్చిన తర్వాతే ఆడియోల విషయం తమకు తెలిసిందని, కొత్తగా తెరపైకి వచ్చిన నందు, నవీన్‌ల విషయం రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీలోకి తీసుకున్నాక ఆరా తీస్తామని పోలీసులు చెపుతున్నారు. శిరీష ప్రవర్తనపై మచ్చ తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వీటిని కొందరు లీక్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఫోన్ నుంచి లీక్ అయ్యాయా? లేక రాజీవ్ స్నేహితులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. శిరీష ఫోన్లో అనేక ఆడియోలు ఉండగా.. వాటిలో ‘ఎంపిక’చేసిన వాటినే లీక్ చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కస్టడీ పిటిషన్లో పలు అంశాలు.. శ్రవణ్, రాజీవ్‌ల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని కోణాలు వెలికి తీయాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో తేజస్విని పాత్రపై ఆరా తీయాల్సి ఉందని, ఆమెకు, శిరీషకు ఉన్న గొడవలకు కారణాన్ని వెలికితీయాల్సి ఉందని, రాజీవ్–తేజస్విని మధ్య సంబంధాలను ఆరా తీయాల్సి ఉందన్నారు. శిరీష–శ్రవణ్–రాజీవ్ కారులో కుకునూర్‌పల్లి వెళ్లే దారిలో ఏమైందనే దానిపై అనుమానాలు ఉన్నాయని, వాటినీ నివృత్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కుకునూర్‌పల్లి వరకు ఉన్న మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు వాటిని నిందితులకు చూపించి ధ్రువీకరించుకోవాల్సి ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్లో జరిగిన అంశాలను రూఢీ చేసుకోవాల్సి ఉందని, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి నిందితుల్ని విచారించాలని పేర్కొన్నారు. మొదటి కాల్ రికార్డింగ్ నందు: డార్లింగ్. నాకు రికార్డింగ్ అయితే కనపడట్లేదు. శిరీష: నీ పక్కన రవికి ఫోన్ ఇయ్. నందు: రవియా..? నా పక్కన రవి ఎవరూ ఉండరు. నా పక్కన ఉండేది నవీన్. శిరీష: ఊ.. వాడికివ్వు.. నవీన్: హలో.. శిరీష: హలో.. వాడు.. ఇందాక మాట్లాడింది నీతోనే కదా..? నవీన్: ఆఆఆ శిరీష:గుర్తుందా..శిరీషఇందాక మాట్లాడాను.. నవీన్: బాలకృష్ణ.. నాకైతే గుర్తుంది.. నీకైతే గుర్తుందా..? శిరీష: ఆ.. నవీన్: గుర్తుంది.. ఇందాక మాట్లాడా శిరీష నీతోనే.. నేను నవీన్ మాట్లాడేది.నువ్వొక కాల్ రికార్డింగ్ పంపియ్యమన్నావు.. నువ్వే కదా? శిరీష: నేనే నేనే.. వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట. ప్లీజ్ కొంచెం వెతికి పంపించవా? కావాలంటే నంబర్ చెప్తాను దీనిది(తాను మాట్లాడుతున్న ఫోన్‌ది).. నవీన్: ఇప్పుడు ఎవరు.. ఇందాక మాట్లాడిందా? దాన్నైతే(తేజస్విని) గలీజ్ గలీజ్ తిట్టి ––––– ఓకేనా.. శిరీష: తిట్టాడు కానీ నాకు ఆ రికార్డు కావాలి నవీన్: ఓకే తను నీకేమవుద్ది? ఫ్రెండా? ఎనిమీ అయిద్దా? శిరీష: ఎనిమీ.. నా ఎనిమీ అది(తేజస్విని) నవీన్: ఇంక నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్ చూపెట్టాం దానికి.. దానికైతే టార్చర్ చూపెట్టాడు నందు. శిరీష: నాకు రికార్డు కావాలి. ప్లీజ్.. అర్థం చేసుకోండి. ఎందుకు నన్నిలా చేస్తున్నారు? నవీన్: శిరీష, శిరీష.. కాల్ రికార్డింగ్ ఆల్రెడీ ఆన్ ఉందా?(నందుని ఉద్దేశించి అడిగిన నవీన్). సారీ కొత్త ఫోన్ కదా మనోడు ఇంకా రికార్డింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోలే.. శిరీష: ఇందాక దాంట్లో రికార్డింగ్ నోక్కాడు. రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడికి (నందుకు). ఫోన్లో రికార్డు అయింది ఆ.. నవీన్: ఒక్క నిమిషం శిరీష నేనే చెక్ చేస్తా.. ఒక్కసారి లైన్లో అట్లానే ఉండు. నువ్వు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపు అట్లానే.. శిరీష: ఆ.. సరే.. రెండో కాల్ రికార్డింగ్.. శిరీష:హలో..హలో..(వెనక నుంచి గందర గో ళంతో కూడిన శబ్దాలు) ఏహే.. వాడు ప్రతి కాల్‌రికార్డింగ్ చేసుకుంటున్నా అన్నాడు నాతో.. నవీన్: లైన్లో అట్లానే ఉండు.. దానికి (తేజస్వినికి) ఫోన్ చేసి కలుపుతా.. నువ్వు కామ్‌గా ఉండు. శిరీష: ఇంకా కెలికితే అది ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు చేస్తదేమో.. నవీన్: –––– ఏం కాదు. నందు ఉన్నాడు. నేనున్నాకదా. హైదరాబాద్ తోపులం. ఎట్లా అంటే హైదరాబాద్ మనదే ఓకేనా.. శిరీష: ఆహ్హా .. మీద ఫైర్ అవుతుంది కదా.. నవీన్: అట్లంటావా మామూలుగా అయితే దాన్ని కెలుకుతా. లైన్లో కలుపుతా ఓకేనా? శిరీష: ఏయ్ వద్దు ఇంక వదిలేసెయ్యండి. నవీన్: ఏం లేదు ఇప్పుడే మాట్లాడి పెట్టేసినం. అందరం మాట్లాడినం.. నేను, నందు. శిరీష: ఏం మాట్లాడారు? నవీన్: నువ్వెంత? నీ బతుకెంత అని మాట్లాడాడు నందు శిరీష:దాన్నా..? నవీన్: ఆ.. శిరీష: అయితే నువ్వేం మాట్లాడావు? నవీన్: నేను.. నేను ఎవరు నువ్వనుకున్నా? ఈళ్ళ ఫ్రెండేమో అని గుంజుకుంది నేనే ఫోను. ఇప్పుడెందుకులే అని.. నందు మాట్లా డతాడు అంట మాట్లాడు..(ఫోన్ నందుకు ఇచ్చాడు) శిరీష: హలో.. నందు: ఆ చెప్పు.. శిరీష: ఏమని తిట్టావురా దాన్ని.. నందు: నీ కెందుకు.. నీ –––, నీ––– అని తిట్టా ఓకేనా? శిరీష: నా నంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? ఏం చెప్పావు? నందు: అదేమీ మాట్లాడలా.. నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు అంది శిరీష: ఏమంది? నందు: నాకు ఆడు తెలుసు ఈడు తెలుసంది.. శిరీష:ఎవడు తెలుసంట? ఏమంటుంది? నీకు నంబర్ ఎవరిచ్చారు? చంపిస్తా? బెదిరిస్తా అంటోందా? నందు: ఎవర్నీ నన్నా.. ఏంటి? శిరీష: ఏమంటోంది అసలు..? నందు: ఏం లేదు సైలెంటైపోయింది. ఇంకోసారి నీకు కాల్ చెయ్యదు. శిరీష:ఆ..నాక్కాదు రాజీవ్‌కి కాల్ చేసి బెదిరిస్తే.. నందు: చెయ్యదు. చేస్తే నాకు చెప్పు.. శిరీష: ఆ.. నందు: చెయ్యదు అన్నాగా..? శిరీష: రాజీవ్‌కు నాకు ఇద్దరికీ చెయ్యదుగా.. ష్యూర్.. నందు: చెయ్యదు. ఓసారి రాజీవ్‌తో ఈ నంబర్‌కు కాల్ చెయ్యమని చెప్పు. శిరీష: ఊ.. సరే చెప్తాలే. ఎందుకు పాపం తనను ఇన్వాల్వ్ చెయ్యడం, తన టెన్షన్స్ తనకు ఉన్నాయి. నందు:ఒకసారి కాల్ చెయ్యమని చెప్పవే వాణ్ణి శిరీష:ఆడు అంటా వేంట్రా? చంపేస్తా.. నందు: కుర్రోడే కదా.. మనోడే కదా.. శిరీష: మనోడైతే రాజీవ్ అనొచ్చుగా.. నందు: నీ––– శిరీష: సరే.. నేను చెయ్యమంటాలే. ఆడు గీడు అనకు నాకు కోపం వస్తది. నువ్వైతే అది నా జోలికి, రాజీవ్ జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా.. హలో.. నందు: ఆఆఆ శిరీష: మా ఇద్దరి జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతా.. నందు: సరే సరే.. -
శిరీష దుస్తులపై మరకలు దేనికి సంకేతం?
- అత్యాచారం జరిగిఉంటుందని పోలీసుల అనుమానం - రిమాండ్ డైరీలో సంచలన అంశాలు హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు.. శిరీష లోదుస్తులపై మరకలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టులు ఇంకా రావాల్సిఉందని, ఆ తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్‌లు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్ క్వార్టర్లో చోటుచేసుకున్న విషయాలను సైతం పోలీసులు రిమాండ్ డైరీలో కోర్టుకు వివరించారు. శిరీష కేసులో ఏ1 శ్రవణ్.. గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లకముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్‌లో పంపాడని రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. అంతకముందు జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో శ్రవణ్ మాట్లాడాడని వెల్లడైంది. ‘సెక్స్‌వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. రాజీవ్, శ్రవణ్‌లను క్వార్టర్స్‌నుంచి బయటికే పంపే ప్రయత్నం చేశాడు. అందుకు రాజీవ్ ఆసక్తిప్రదర్శించాడు. దీంతో శ్రవణ్.. సిగరేట్ నెపంతో రాజీవ్‌ను బయటికి తీసుకొచ్చాడు. గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషను ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. ‘సాయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేమిట’ని నిలదీసింది. ‘నేను అలాంటిదాన్ని కాదం’టూ ఎస్సైని వెనక్కి నెట్టేసింది. అయినాసరే ప్రభాకర్‌రెడ్డి వినకుండా మళ్లీ దగ్గరకు వెళ్లడంతో శిరీష బిగ్గరగా కేకలు వేసింది’ అని రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. శిరీష విషయంలో తప్పంతా రాజీవ్‌దే: ఏ1 శ్రవణ్ -
శిరీష విషయంలో తప్పంతా రాజీవ్‌దే: ఏ1 శ్రవణ్
హైదరాబాద్: సంచలనం రేపిన మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధమ నిందితుడు(ఏ1) శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శిరీష మరణంలో తన ప్రమేయమేదీ లేదని, జరిగిన విషయాలన్నింటికీ కారణం రాజీవేనని అన్నాడు. శనివారం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన సమయంలో శ్రవణ్ తన గోడును మీడియా ముందు వెళ్లగక్కాడు. రాజీవ్‌ను కాకుండా, శ్రవణ్‌ను ఏ1గా చేర్చడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లైంది. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన శ్రవణ్ ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్లు సంబంధిత ఫొటోలు కూడా టీవీల్లో ప్రసారమయ్యాయి. ఎస్సై పరీక్షలకు కోచింగ్ పేరుతో హైదరాబాద్‌లో ఉంటుండగా శిరీష, రాజీవ్‌లు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఎస్సై ప్రభాకర్ రెడ్డితో నల్లగొండలో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. శిరీష కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న శ్రావణ్, రాజీవ్‌లకు శనివారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఇరువురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. (ఆఫీస్ బాయ్ ద్వారా విషయం బయటపడి..) -
శిరీష కేసులో తాజా అప్డేట్స్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్, రాజీవ్‌లను పోలీసులు నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. అంతకుముందు వీరిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి వీరిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అందుకు వీరు పరోక్షంగా కారణమవడం, ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయడం వంటి కారణాల దృష్ట్యా కనీసం వీరిద్దరికి పదేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. మరిన్ని వార్తా కథనాలకై చదవండి శిరీషది ఆత్మహత్యే -
శిరీషది ఆత్మహత్యే
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ - రాజీవ్ విషయంగా తేజస్విని–శిరీష మధ్య వివాదం - దాన్ని పరిష్కరించాలంటూ కుకునూర్‌పల్లికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్, శిరీష.. మద్యం మత్తులో ఆమెపై ఎస్సై ప్రభాకర్ అత్యాచారయత్నం - గొడవ చేసిన శిరీష.. ఆమెపై చేయి చేసుకున్న రాజీవ్ - స్టూడియోకు చేరుకున్నాక ఉరివేసుకున్న శిరీష - ఈ విషయం బయటపడుతుందని ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యగా తేలిందని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. తేజస్వినికి సంబంధించిన వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు రాజీవ్, శ్రవణ్‌లతో కలసి ఆమె కుకునూర్‌పల్లి వెళ్లారని.. అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సహా నలుగురూ మద్యం తాగారని చెప్పారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం మత్తులో శిరీషపై అత్యాచారయత్నం చేసినట్లు తేలిందని.. వారు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఎ.వెంకటేశ్వరరావు, బి.లింబారెడ్డిలతో కలసి ఆయన ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తేజస్వినిపై ఎలాంటి కేసూ ఉండదని, శ్రవణ్ కుట్రతో వ్యవహరించినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్‌కు నష్టాలు రావడంతో.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఎ.విజయలక్ష్మి అలియాస్ శిరీష వృత్తిరీత్యా బ్యుటీషియన్. 13 ఏళ్ల క్రితం ఎ.సతీష్‌చంద్రతో ఆమెకు వివాహం జరిగింది. వారికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలం బ్యూటీపార్లర్ నిర్వహించిన శిరీష.. నష్టాలు రావడంతో నాలుగేళ్ల కింద ఫిల్మ్‌నగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో మేనేజర్ కమ్ మేకప్ ఆర్టిస్ట్‌గా చేరింది. విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌కుమార్ ఈ స్టుడియోకు యజమాని. రాజీవ్‌కు, శిరీషకు అంతకుముందే ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే స్టుడియోలో ఉద్యోగమిచ్చాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు రాజీవ్‌కు దాదాపు ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారానే బెంగళూరుకు చెందిన తేజస్విని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె తరచూ హైదరాబాద్‌కు వచ్చి రాజీవ్‌ను కలిసేది. ఇది ప్రేమగా మారి శారీరకంగానూ ఒక్కటయ్యారు. వివాహం చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తేజస్విని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆఫీస్ బాయ్ ద్వారా విషయం బయటపడి.. తేజస్వినికి తొలుత శిరీష–రాజీవ్‌ల మధ్య సంబంధం తెలియదు. అయితే కొద్దిరోజుల కింద ఆమె స్టూడియోకు వచ్చి రాజీవ్ గురించి అడగగా.. ఆయన తన భార్యతో కలసి బయటికి వెళ్లారని ఆఫీస్ బాయ్‌లు చెప్పారు. అదేమిటని ఆరా తీయడంతో శిరీష–రాజీవ్ మధ్య సంబంధం తెలిసింది. అప్పటి నుంచి ఈ విషయంపై వివాదం మొదలైంది. గత నెల 30న స్టూడియోకు వచ్చిన తేజస్విని.. రాజీవ్‌తో ఉన్న సంబంధంపై శిరీషతో వాగ్వాదానికి దిగింది. గొడవ ముదిరి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో రాజీవ్ ‘100’ద్వారా పోలీసులకు సమాచారమిచ్చాడు. స్టూడియోకు వచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆ ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై శ్రీనివాస్‌కు తేజస్విని, శిరీష ఒకరిపై ఒకరు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఎస్సై వారికి కౌన్సెలింగ్ చేసి పంపేశారు. తేజస్విని బెదిరింపులతో.. గొడవ ఘటన తర్వాత నుంచి పోలీసు కేసు పెడతానంటూ తేజస్విని పలుమార్లు రాజీవ్, శిరీషలను బెదిరించింది. వాట్సాప్ ద్వారా శిరీషకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలుపెట్టింది. దీనితో విసిగిపోయిన శిరీష ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ.. తన స్నేహితుడైన బోదాసు శ్రవణ్‌కుమార్‌ను కోరింది. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన రియల్టర్ శ్రవణ్‌కుమార్.. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉండి ఎస్సై పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ఓ బొటిక్కు వస్తున్న నేపథ్యంలో శిరీషతో పరిచయమై, స్నేహంగా మారింది. శిరీష విజ్ఞప్తి మేరకు తేజస్విని వివాదం పరిష్కరించడానికి శ్రవణ్ సిద్ధమయ్యాడు. ఇందుకోసం తన స్నేహితుడైన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని సహాయం కోరాడు. ప్రభాకర్‌రెడ్డి దేవరకొండలో ప్రొబేషనరీ ఎస్సైగా పనిచేసినప్పుడు శ్రవణ్‌తో పరిచయమైంది. అయితే ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్సైగా పనిచేసే తన స్నేహితుడు హరీందర్ వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో రాజీవ్, శ్రవణ్ ఎస్సై హరీందర్‌ను కలిశారు. అదే పోలీస్‌స్టేషన్‌లోని మరో ఎస్సై శ్రీనివాస్ వద్దకు అంతకుముందే ఈ వివాదం వచ్చిందని తెలియడం, పనిఒత్తిడిలో ఉండటంతో హరీందర్ వారిని కొద్దిరోజుల తర్వాత రమ్మని సూచించారు. అప్పటికప్పుడు కుకునూర్‌పల్లికి.. బంజారాహిల్స్ ఎస్సైని కలసి వచ్చిన తర్వాత రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గరూ బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లారు. అక్కడ కూర్చున్న సమయంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కుకునూర్‌పల్లికి రావాలని సూచించడంతో రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురూ రాజీవ్‌కు చెందిన ఎండీవర్ కారులో బయలుదేరారు. మధ్యలో బంజారాహిల్స్‌లో మద్యం, రాయదుర్గం రోడ్లో తినుబండారాలు కొనుక్కుని వెళ్లారు. రాత్రి 11.30 గంటల సమయంలో నేరుగా కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ పక్కన ఉన్న ఎస్సై క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నలుగురూ అర్ధరాత్రి 2 గంటల వరకు క్వార్టర్స్‌లోనే మద్యం తాగారు. ఈ సమయంలోనే తేజస్విని వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను శిరీష, రాజీవ్‌లు ప్రభాకర్‌రెడ్డికి వివరించగా.. తాను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే మధ్యలో శిరీష మినహా మిగతా ముగ్గురూ సిగరెట్ తాగడానికి క్వార్టర్స్ నుంచి బయట ఆవరణలోకి వచ్చారు. శిరీష కూడా వస్తుండగా.. సెంట్రీ చూస్తే ఇబ్బందంటూ లోపలే ఉండాలని సూచించారు. వ్యభిచారుల వద్దకు వెళ్లాలంటూ.. క్వార్టర్స్ ఆవరణలో ఉన్న సమయంలో ప్రభాకర్‌రెడ్డి వ్యభిచారిణుల ప్రస్తావన తెచ్చాడు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో అందమైన వ్యభిచారిణులు ఉంటారని, వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని సూచించాడు. ఈ సమయంలో వారి మాటలు విన్న శిరీష కీడు శంకించింది. రాజీవ్, శ్రవణ్‌లు అలా వెళితే తాను ఒంటరిగా మిగిలిపోతాననే భయంతో ‘రాజీవ్ ప్లీజ్ డోంట్ లీవ్.. బీ విత్ మీ’అంటూ రాజీవ్‌కు వాట్సాప్ సందేశాలు పంపింది. అనంతరం ముగ్గురూ క్వార్టర్స్‌లోకి వెళ్లారు. తిరిగి అందరూ కలసి మరికొంత మద్యం తాగారు. కొద్దిసేపటికి రాజీవ్, శ్రవణ్ మళ్లీ సిగరెట్ తాగివస్తామంటూ క్వార్టర్స్ బయట ఆవరణలోకి వెళ్లారు. ఈ సమయంలో ఒంటరిగా మిగిలిన శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడు. దానిని ప్రతిఘటించిన శిరీష.. రోదిస్తూ కేకలు వేసింది. దీంతో లోపలికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్‌లు ఆమెకు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా ఆమె గొడవ చేయడంతో ప్రభాకర్‌రెడ్డిని బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ప్రభాకర్‌రెడ్డి మరోసారి రాజీవ్, శ్రవణ్‌లను వ్యభిచారిణుల వద్దకు వెళ్లాలని సూచించాడు. శిరీషపై చేయి చేసుకున్న రాజీవ్ అయితే శిరీష గొడవచేయడం ఆపకపోవడంతో రాజీవ్ దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ గొడవతో పోలీస్ క్వార్టర్స్‌లోని ఇతరులు మేల్కొంటారనే ఉద్దేశంతో.. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ప్రభాకర్‌రెడ్డి సూచించాడు. దీంతో ఆమెను రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను కారులో ఎక్కించుకుని.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆమె గొడవ చేయడం ఆపలేదు. తనను వ్యభిచారిగా చూస్తున్నారంటూ.. కారు దిగి పారిపోయే ప్రయత్నం చేసింది. శ్రవణ్ కారు దిగి వెళ్లి ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కారు ఎక్కించాడు. ఈ సమయంలో రాజీవ్ మరోసారి ఆమెపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె తల, ముఖం, పెదవులు, కడుపు భాగంలో గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ వచ్చేసరికి ప్రభాకర్‌రెడ్డి రెండుసార్లు శ్రవణ్‌కు ఫోన్ చేశాడు. తమ ప్రాంతం దాటారా.. లేదా? ఆమె గొడవ చేయడం ఆపిందా? అంటూ ఆరా తీశాడు. తిరిగి రాగానే ఆత్మహత్య రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గురూ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియో వద్దకు చేరుకున్నారు. వెంటనే లోపలికి వెళ్లిన శిరీష.. తన స్కార్ఫ్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇది చూసిన రాజీవ్.. అప్పటికే క్యాబ్‌లో వెళ్లిపోతున్న శ్రవణ్‌కు ఫోన్ చేసి వెనక్కి పిలిచాడు. శిరీషను కిందికి దింపి మంచంపై పడుకోబెట్టాడు. శ్రవణ్ కూడా వచ్చి అంబులెన్స్, పారామెడికల్ స్టాఫ్‌ను పిలిపించగా.. అప్పటికే శిరీష మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో రాజీవ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రభాకర్‌రెడ్డి విషయం బయటకు వెల్లడించవద్దని రాజీవ్, శ్రవణ్‌లు నిర్ణయించుకున్నారు. బంజారాహిల్స్ ఎస్సై నుంచి ప్రభాకర్‌రెడ్డికి వివరాలు శిరీష భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు మంగళవారం రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏం జరుగుతోందనే ఆందోళనతో ప్రభాకర్‌రెడ్డి తన స్నేహితుడైన ఎస్సై హరీందర్‌కు పలుమార్లు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం 10.05 గంటలకు ఫోన్ చేసినప్పుడు ‘ముగ్గురూ (రాజీవ్, శ్రవణ్, శిరీష) నీ దగ్గరకు వచ్చారట కదా! నలుగురూ కలిసి మద్యం తాగారట కదా..’అని హరీందర్ పేర్కొన్నారు. దీంతో తాను, శ్రవణ్ మాత్రమే మద్యం తాగామంటూ ప్రభాకర్‌రెడ్డి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత కొంత సేపటికే ప్రభాకర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో శేష ప్రశ్నలెన్నో..! బ్యూటీషియన్ శిరీషది కచ్చితంగా హత్యేనని.. ఈ వ్యవహారంలో ఎన్నో సందేహాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డిమాండ్ చేస్తున్నా రు. వారు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి .. 1. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదు? అసలు ఫాల్స్ సీలింగ్ ఉన్న గదిలో మంచంపై నిల్చుని ఫ్యాన్‌కు ఉరేసుకోవడం సాధ్యమేనా? 2. కుకునూర్‌పల్లిలో శిరీష, రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కలసి మద్యం తాగారని... మిగతా ఇద్దరు సిగరెట్ కాల్చ డానికి బయటకు వచ్చిన సమయంలో శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడన్న వాదనను పోలీసులు ఎలా నమ్మారు? సిగరెట్ కాల్చి వచ్చే వ్యవధి లోనే అలా చేయడం సాధ్యమా? 3. ఏడాది కింద పరిచయమైన తేజస్వినికి రాజీవ్ సన్నిహితమయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని.. శిరీషను వదిలించుకోవాలని భావించాడు. అలాంటి వ్యక్తి చెప్పిన కథనం ఎంత వరకు నమ్మశక్యం? 4. కుకునూర్‌పల్లిలో శిరీషపైనే అత్యాచారయ త్నం జరిగింది. బాధితురాలి పైనే రాజీవ్ ఎందుకు చేయిచేసుకోవాల్సివచ్చింది? 5. ఆమె మరణించిన తర్వాత నిందితులు ఆమెకు సంబంధించి చెప్పిన వివరాలను పోలీసులు ఎలా నమ్మారు? వారి మాటలు నమ్మి శిరీష, తేజస్వినిల వ్యక్తిగత జీవితా లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా? -
శిరీషపై గతంలోనూ దాడి?
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతుండగానే ఆమెకు సంబంధించిన మరింత సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతురాలు శిరీషకు.. ఆమె పనిచేసే స్టుడియో యజమాని రాజీవ్‌కు మధ్య విభేదాలున్నట్లు, వాటిని పరిష్కరించుకునేందుకే కుకుమానూర్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి వెళ్లినట్లు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. కాగా, గతంలో శిరీషపై రాజీవ్ పలుమార్లు భౌతిక, లైంగికదాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజీవ్ కొట్టిన దెబ్బల ధాటికి ముఖం కమిలిపోయిన శిరీష ఫొటో ఒకటి గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘ఈ దెబ్బలేంటన’ని ఇంట్లో వాళ్లు ప్రశ్నించగా, యాక్సిడెంట్ అయిందని శిరీష చెప్పినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న కథనం ప్రకారం.. తన దగ్గర ఉద్యోగం చేస్తోన్న శిరీషను రాజీవ్ పలుమార్లు వేధించేవాడని, ఆమెపై భౌతిక, లైంగిక దాడికి పాల్పడేవాడని, ఈ విషయాలన్నీ ఎవరికైనా చెబితే శిరీష కూతుర్ని చంపేస్తానని బెదిరించేవాడని తెలుస్తోంది. పెళ్లిళ్లలో ఫొటోషూట్లు చేసే సమయంలోనూ రాజీవ్ అమ్మాయిల పట్ల అదోరకమైన ధోరణితో వ్యవహరించేవాడని సమాచారం. అయితే ఇదంతా నిజమో కాదో పోలీసు దర్యాప్తులో తేలనుంది. శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు