Rajya Sabha
-
ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఘన్‌శ్యామ్ తివారీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ నియమితులయ్యారు. అక్టోబర్ 10 నుంచి ఈ కమిటీ మనుగడలోకి వస్తుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఎథిక్స్ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ వై.విజయసాయి రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), డెరెక్ ఒబ్రియాన్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), శస్మిత్ పాత్రా (బీజేడీ), ప్రేమ్‌చంద్ గుప్తా (ఆర్జేడీ), మేధా విశ్రామ్ కులకర్ణి, దర్శనా సింగ్ (బీజేపీ)లు కమిటీలోని ఇతర సభ్యులు. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డిని రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీ నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల స్టాండింగ్ కమిటీకి మారుస్తూ ధన్‌ఖడ్ ఆదేశాలు జారీచేశారు. -
‘నా ఛాంబర్లో చొరబాటు’.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఖర్గే లేఖ
ఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్( సీపీడబ్ల్యూడీ ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), టాటా ప్రాజెక్ట్‌ల అధికారులు సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్‌లోని తన గదిలోకి ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు లేఖ రాశారు.‘‘ఇది చాలా అసాధారణ విషయం. నా ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలా నా ఛాంబర్లోకి చొరబాడటం... అగౌరవపర్చటంతో పాటు ఆమోదయోగ్యం కాదు. ఎవరి అదేశాలు, సూచనల ప్రకారం వారు అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి ప్రవేశించారో తెలియజేయాని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి' అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.అయితే.. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అప్డేట్ లేదని రాజ్యసభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖపై.. సీఐఎస్ఎఫ్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఛాంబర్లతో ఏవైనా నిర్మాణ మరమత్తు పనులు జరుగుతున్న సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్‌లోని ప్రోటోకాల్‌లో భాగంగా ఇతర ఏజెన్సీలతో కలిసి ఉంటారని ఓ అధికారి తెలిపారు.‘‘పలు కార్యాలయాల్లో మరమత్తు పనులు జరిగాయి. కార్యాలయాల తాళాలు సీఐఎస్ఎఫ్ వద్ద లేవు. పార్లమెంటు అంతటా భద్రత కోసం మాత్రమే సీఐఎస్ఎఫ్ ఉంది. నిర్వహణ పనుల జరగుతున్న సమయంలో వారు.. అధికారులతో పాటు పలు కార్యాలయాలకు వెళ్లి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూశారు’ అని చెప్పారు. -
బీజేడీ నుంచి ఎంపీ బహిష్కరణ.. కాసేపటికే బీజేపీలోకి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్‌ను మాజీసీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.దీంతో సుజీత్‌కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కఢ్ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది. ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు. BJD expels party leader Sujeet Kumar for "anti-party activities."He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw— ANI (@ANI) September 6, 2024 -
పార్టీ మార్పు పుకార్లపై గొల్ల బాబూరావు రియాక్షన్
-
రాజ్యసభ: మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే.. 12 మంది ఏకగ్రీవం
ఢిల్లీ: రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మంగళవారం.. మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీ వారు కాగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ప్రస్తుతం ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఉండగా, మరో నాలుగు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 119. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే పార్టీకి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి. -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి
భోపాల్: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ను భోపాల్‌లో నామినేషన్ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.ప్రస్తుతం జార్జ్ కురియన్ మోదీ 3.0 కేబినెట్లో ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బుధవారం ఉదయం భోపాల్ చేరుకున్న కురియన్‌కు అక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో సీఎం యాదవ్, ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవదా, రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.ఇక పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్‌వీత్‌సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ.. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి పోటీకి దించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.కాగా, తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థితత్వాన్ని ఏఐసీసీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు. Congress President Mallikarjun Kharge has approved the candidature of Abhishek Manu Singhvi as Congress candidate to contest the ensuing bye-election to Rajya Sabha from Telangana. pic.twitter.com/gj9EpkNENz— ANI (@ANI) August 14, 2024కాగా రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు మూడో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఇక, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, వారంతా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
వంకర బుద్ధుల పెద్దలు
ఏం చదివితే ఏమి? ఏ పదవిలో కూర్చుంటే ఏమి? పితృస్వామ్య భావజాలం నరనరాన జీర్ణించుకున్నప్పుడు ప్రతి ఒక్కడూ ఒక మనువే అవుతాడు. ఇందుకు రాజ్యసభలో జయాబచ్చన్ పట్ల చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహారశైలే ఒక ఉదాహరణ.ప్రజలందరి స్వేచ్ఛా సమానత్వాలను కాపాడటానికి కృషి చేసే చట్టసభల్లో మహిళా సభ్యులు అవమానాలకు, వివక్షలకు గురి కావడం భారతదేశంలో చాలా సహజంగా మారిపోయింది, చర్చించవలసిన విషయం కాకుండా పోయింది. ఇందిరాగాంధీ, జయ లలిత, సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీతో సహా రాష్ట్రాల మహిళా శాసనసభ్యులు అనేకమంది ఇలాంటి వాటిని ఎదుర్కొన్నవారే. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, రెండు దశాబ్దాలుగా భారత పార్లమెంటేరియన్; ఆస్తులు, హోదాలు, కుటుంబపు దన్ను, సామాజిక ఆధిపత్య స్థానంలో ఉన్న జయాబచ్చన్ కూడా రాజ్యసభలో తన పేరును వ్యంగ్యంగా కాక గౌరవంగా పిలవడం కోసం పోరాటం చేస్తోంది. ‘తోటి సభ్యురాలి పేరుకి విలువ ఇవ్వనివారు, మా హక్కులను ఎలా కాపాడతారని’ ప్రజలు ప్రశ్నిస్తే చట్టసభలు ఏమని సమాధానం ఇస్తాయి? మొన్నటి రాజ్యసభ సమావేశాల్లో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తను మాట్లాడ టానికి అవకాశం ఇమ్మని కోరిన జయను ఉద్దేశించి– ‘ఇపుడు జయా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడతారని’ ధన్‌ఖడ్ అన్నారు. ‘అమితాబ్’ పేరుని ఒత్తి పిలవడంతో, అందులోని వ్యంగ్యాన్ని జయ గుర్తించి అందుకు అభ్యంతరం చెప్పింది. అప్పటికి అది నాలుగోసారి జయ పేరుని ధన్‌ఖడ్ ఆ తీరులో పలకడం! తనని జయాబచ్చన్ అని మాత్రమే పిలవమని ప్రతిసారీ ఆయనకు చెబుతూనే ఉంది. తను భర్త చాటు భార్యను కాననీ, స్త్రీగా తన ఉనికిని గుర్తించాలని స్పష్టంగా చెప్పింది. ఒక స్త్రీ, అందునా ప్రతిపక్షంలో ఉన్న స్త్రీ కచ్చితంగా చెప్పడం ఎంతటి ఉదారులకైనా నచ్చు తుందా! ఎన్నికల అఫిడవిట్లో జయ పేరు ‘జయా అమితాబ్ బచ్చన్’ అని ఉంటుంది. అందుకే అలా పిలిచానని ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యుల పేర్లన్నీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే పిలవడం లేదు కదా! దీన్ని బట్టి చూస్తే జయని రెచ్చగొట్టడానికే పదేపదే అలా పిలిచారు. అయితే పేరు పిలవడం కేవలం సాంకేతిక విషయం కాదు. పైకి మామూలుగా కనిపించే మాటకు మనం అద్దే స్వరం ద్వారా ఉద్దేశించిన అర్థం మారి పోవచ్చు. తనొక కళాకారిణిననీ, ఎదుటివారి హావభావాలు తనకి ఇట్టే తెలిసిపోతాయనీ, ‘పిలిచిపుడు మీ టోన్ బాలేద’నీ చెప్పింది జయ. చట్టసభల్లో సభాధ్యక్షులు ఎలా వ్యవహరించాలి అన్నదానికి మనకి కొన్ని సంప్ర దాయాలు ఉన్నాయి. చైర్మన్ ఏ పార్టీ నుంచి ఎన్నిక అయినా సరే సభలో ఉన్న అన్ని పార్టీలు, సభ్యుల పట్ల తటస్థ వైఖరితో వ్యవహరించాలి. కానీ జగదీప్ ధన్‌ఖడ్ సభా నిర్వహణ చాలా స్పష్టంగా ఒక పక్షం వైపు పనిచేస్తూనే ఉంది. ఆయన ముందుగానే ప్రతిపక్ష సభ్యులతో వాదం వేసుకుని అధికారపార్టీ సభ్యుల పని సులువు చేస్తారు. దేశ ప్రజలందరికీ ఆదర్శమైన వ్యక్తిత్వంతో ఉండాల్సిన మనిషి, పరుషమైన భాష, వ్యంగ్యపు హావభావాలు, కటుత్వం, ఆధిపత్యపు మొగ్గు, సభా సంప్రదాయాలను పట్టించుకోకపోవడం ద్వారా ప్రతిపక్ష సభ్యుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. తను కళాకారిణిని కాబట్టి హావభావాలు గ్రహించానని చెప్పడం, ‘మనం కొలీగ్స్ కదా’ అని జయ అనడంతో ధన్‌ఖడ్ ద్వంద్వానికి గురయ్యారు. ‘మీరు సెలబ్రెటీ అయితే ఏమిటి, సభలో అందరూ ఒక్కటే’ అన్న మరుక్షణమే ‘మనం ఒకటి ఎలా అవుతాం! అధ్యక్ష స్థానానికి విలువ ఇవ్వరా!’ అంటూ ధన్‌ఖడ్ పెద్దస్వరంతో మాట్లాడడం రాజ్యసభ ప్రసారాలు చూసినవారికి ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్ష సభ్యులంతా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. జయకి సోనియాగాంధీ మద్దతుగా నిలబడింది. ధన్‌ఖడ్ స్వభావం గురించి చెబుతూ సభ్యులను తరచుగా ‘శూన్యబుద్ధి’ అంటారని, మాట్లాడుతుంటే ‘న్యూసెన్స్’ అంటారని జయ చెప్పింది. ఈ సందర్భంలో జయ ప్రస్తావించిన ‘మాటల్లో ధ్వని’ గురించి మాట్లాడుకోవాలి. ‘ఇప్పుడు ఆడవాళ్ళని ఒక మాటని బతకగలమా!’ అన్నది తరచూ వింటున్న మాట. స్త్రీలమీద జరిగే రకరకాల వేధింపులు, దాడులను అరికట్టడానికి కొన్ని చట్టాలు వచ్చాక నిస్సంకోచంగా స్త్రీలను అవమానించడం కొంతమేరకు తగ్గి ఉండవచ్చు. కానీ ఆ మేరకు కొత్త సాధనాలను పితృస్వామ్యం సమకూర్చుకుంటుంది. అందులో ఒకటి ధ్వని గర్భితంగా మాట్లాడటం! తాము వాడే ప్రతీ పదం రాజకీయంగా తప్పులేకుండా చూసుకుని– స్వరంలోని హెచ్చుతగ్గులు, తమకి అవసరమైన పదాలను ఒత్తి పలకడం, హావభావాల ద్వారా వివక్షను చూపడం! రాజ్యసభలో ఈ తెలివైన వివక్షకే జయ గురయింది. దీని వెనుక ఉన్న కారణం ఒక్కటే. ఇప్పటికీ స్త్రీలు రెండవతరగతి పౌరులు! అటువంటివారు చట్టసభల్లోకి వచ్చి మౌనంగా కూర్చోకుండా సవాళ్ళు విసురుతారు, గట్టి గొంతుతో మాట్లాడతారు.అందుకే జేపీ నడ్డా లాంటి వారికి జయలో సభా మర్యాదలు, ప్రజాస్వామిక విలువలు పాటించడం తెలియని గర్వపోతు కనపడింది. స్త్రీలు ఎంతటి స్థానానికి ఎదిగినా వారు సమాజం కళ్ళకు స్త్రీలుగానే కనపడతారు. అందుకే సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోవాలని ఆశిస్తారు. సునీత రెండో పెళ్లి చేసుకోవద్దని డిమాండ్ చేస్తారు. తులసి చందు తన యూట్యూబ్ ఛానెల్ ఆపేయాలని బెదిరిస్తారు. దేశంలోని మామూలు మనుషులంతా ఆ కుస్తీపిల్లని గుండెల్లో పెట్టుకుంటే మతతత్వ వాదులు ఆమె ఒంటి మీది దుస్తులను విప్పాలని చూస్తారు. జయను ఎలా పిలవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు! కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి తీర్మానం?
న్యూఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తీరును విమర్శిస్తూ విపక్ష పార్టీల 'ఇండియా' కూటమిలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ పదవి నుంచి ధన్‌ఖర్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) ప్రకారం.. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు అని ఇండియా కూటమి పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టికల్ 67(బీ) అనుగుణంగా ధన్ఖర్పై చర్య తీసుకోవాలనే ప్రతిపాదనపై 87 మంది సభ్యులు సంతకం చేసినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నాయి. రెండ్రోజుల క్రితమే విపక్షాలు ధనఖర్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయని రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డాకు సమాచారం అందిందని జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం, అమర్యాదగా మాట్లాడడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విపక్ష పార్టీ నేతలు మాత్రం సభను నిబంధనల ప్రకారం నడపాలని కోరుకుంటున్నాయని, సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ వర్గాలు తెలిపాయి.రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్షంపై పక్షపాత వైఖరని ప్రదర్శిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు శుక్రవారం సభలో ఆందోళన చేపట్టాయి. ఆమోదయోగ్యం కాని విధంగా సభలోని సభ్యుల్ని అగౌరపరుస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎగువ సభలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ధన్ఖర్ ఇవ్వడం లేదని పేర్కొన్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. -
‘జయా అమితాబ్ బచ్చన్’ వివాదం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: ‘జయా అమితాబ్ బచ్చన్’ ప్రస్తావన రాజ్యసభలో మరోసారి గందరగోళాన్ని సృష్టించింది. సమాజ్‌వాదీ ఎంపీ అయిన జయా బచ్చన్‌ను రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్ఖర్ జయా అమితాబ్ బచ్చన్‌గా సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే జయా బచ్చన్నుఇప్పటికే రెండు సార్లు ఆ పేరుతో పిలవడం వల్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరోసారి ఇదే తంతు పునరావృతం కావడంతో జయా బచ్చన్ అసహనానికి గురయ్యారు. మరోసారి అలా పిలవొద్దని అన్నారు. దీనిపై దన్ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘నాకు పాఠాలు బోధించవద్దు’ అని తీవ్రంగా స్పందించారు. అయితే ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా వాకౌట్ చేశాయి. జయా బచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ తర్వాత జయా బచ్చన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అవమానకరమైన అనుభవమని తెలిపారు. అధికార బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. ‘ చైర్మన్ ఏదీ మాట్లాడిన చెల్లుతుందా? ఆయన కూడా మనలంటి ఎంపీనే. ఛైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మేం స్కూల్ పిల్లలం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు.ప్రతిపక్ష నేత (కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే) మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట తీరు బాధించింది. మైక్ కట్ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి నేను పట్టించుకోనంటూ తీవ్ర పదజాలం వాడుతుంటారు. ఆయన పట్టించుకోవాలని నేను అడగడం లేదు. ఐదోసారి నేను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాకు తెలీదా ఏం మాట్లాడాలో..? ఇలాంటి ప్రవర్తన పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడిన తీరు మహిళలకు అగౌరపరిచేలా ఉంది. దీనిపై క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆమె వెంట సోనియా గాంధీ కూడా ఉన్నారు.కాగా ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వానించారు. దీనిపై జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అంటూ చెప్పగా.. ‘మహిళలను వారి భర్త పేరుతోనే పిలస్తారా, వారికంటూ స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ మండిపడ్డారు. అనంతరం గత సోమవారం కూడా జయా అమితాబ్ బచ్చన్ అని సంభోధించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ.. జయా బచ్చన్ అని సంబోధిస్తే సరిపోతుందని అన్నారు.పార్లమెంట్ నిరవధిక వాయిదాపార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
రాజ్యసభకు వినేశ్ ఫోగట్?
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పండింది. ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వినేశ్ అనర్హత అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుపట్టాయి. తాజాగా వినేశ్ ఫోగట్ అనర్హత మాజీ హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హూడా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉంటే వినేశ్ పేరును ప్రతిపాదించేవాడిని. ఆమె మనందిరికీ చాలా గర్వకారణం’’ అని అన్నారు. మరోవైపు.. భూపేంద్ర సింగ్ హూడా తనయుడు ప్రస్తుత కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ దీపేందర్ హూడా సైతం స్పందిస్తూ.. రాజ్యసభలో ఒక సీట్ ఖాళీ కాబోతోందని, దానికి ఫోగట్‌ను నామినేట్ చేస్తామని అన్నారు. ఆమె ఓడిపోలేదని, మన అందిరి మనసులు గెలిచిందన్నారు.అయితే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వినేశ్ ఫోగట్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందించారు. వారి మాటలు ఒక పోలిటికల్ స్టంట్ అని అన్నారు. భూపేందర్ సింగ్ హూడా హర్యానా సీఎంగా ఉన్న సమయంలో తన కూతురు గీతా ఫోగట్ సైతం పలు పతకాలు సాధించిందని, కానీ ఆమెను రాజ్యసభకు పంపలేదని అన్నారు. మెజార్టీ ఉంటే వినేశ్‌ను రాజ్యసభకు పంపేవాడినని భూపీందర్ హుడా ఇప్పుడు అంటున్నారు. మరీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గీతా ఫోగట్‌ను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మాటాలు పొలిటికల్ స్టంట్ మాత్రమేనని అన్నారు. -
మధ్యతరగతిపై పన్నుల భారాన్ని తగ్గించాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: రకరకాల పన్నులతో ప్రజలపై భారం మోపడమే తప్ప.. వాళ్లకు ఒనగూరుతోంది ఏంటని? వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ఓవైపు ఆదాయపన్ను, మరోవైపు జిఎస్టి, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు ఒనగురుతున్నది ఏంటి?. కేవలం రోడ్లు భవనాలు నిర్మిస్తున్నామంటే సరిపోదు. మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలి’’ అని ప్రసంగించారు.‘‘పెన్షన్‌పై ఎలాంటి పన్నులు వేయవద్దు. లక్ష రూపాయల వరకు పెన్షన్లు టాక్స్ ఫ్రీ చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే.. సీనియర్ సిటిజన్లో కోసం ఐటీ ఫైలింగ్ కోసం ప్రత్యేక సహాయ యంత్రంగా ఏర్పాటు చేయాలి. పీపీఎఫ్ వడ్డీరేట్లు, ఎఫ్డీ రేట్లకంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పీపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచాలి పొదుపును ప్రోత్సహించాలి. సరైన సమయంలో ఆదాయ పన్ను ఫైల్ చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’ అని కేంద్రాన్ని కోరారాయన. వీటితో పాటు.. తక్కువ వడ్డీకే వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వాలని, అలాగే.. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని తగ్గించాలి అని ఆయన వైఎస్సార్సీపీ తరఫున కేంద్రాన్ని కోరారు. -
బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిణామాలపై రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఢాకాలోని భారత్ దౌత్య కార్యాలయం ద్వారా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.బంగ్లాదేశ్‌లో 19,000 మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ వెల్లడించారు. వీరిలో 8,000 మంది విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకున్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని, మైనార్టీల రక్షణకు అక్కడున్న సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు.‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో భారతీయ యువకులు వెనక్కి రావాలనుకుంటున్నారు. భారతీయ యువకులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. బంగ్లాదేశ్‌లోని భారతీయులు, మైనారిటీల భద్రతపై అక్కడి ఆర్మీతో మేము టచ్‌లో ఉన్నాం. అక్కడి శాంతి భద్రతనలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని తెలిపారు -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్‌వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్‌గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లకు బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్‌లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్‌లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్‌పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించాలి: ఆప్ ఎంపీ
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన చద్దా గురువారం మాట్లాడుతూ.. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం ప్రజలు 35 సంవత్సరాలలోపే ఉన్నారని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారని చెప్పారు. ‘‘యువ భారతం మనది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ప్రస్తుత కాలానికి సరిపోదు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఇక 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే. దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి లోక్‌సభ ఎన్నికైనప్పుడు 26 శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే.ఇక రెండు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరం. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని రాఘవ్ చద్దా అన్నారు. #WATCH | In Rajya Sabha, AAP MP Raghav Chadha demands the minimum age for contesting elections in India should be reduced from 25 years to 21 years. He says "India is one of the youngest countries in the world. 65% of our population is less than 35 years old and 50% of our… pic.twitter.com/NjL8p2Qjmb— ANI (@ANI) August 1, 2024 -
రాష్ట్ర సమస్యలపై రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రసంగం
-
విశాఖలో మెట్రో రైలు నిర్మించాలి.. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్
సాక్షి, ఢిల్లీ: విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన రాజ్యసభలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ విశాఖపట్నంలో 76.9 కిలోమీటర్ల లైట్ మెట్రో నిర్మించాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పునర్విభజన చట్టంలో "సాధ్యమైతే, అవకాశం ఉంటే" అనే పదాలు ఉపయోగించడం వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు. బడ్జెట్లో రూ. 24వేల కోట్ల రూపాయలు మెట్రో రైలుకు కేటాయిస్తే, విశాఖకు మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కేంద్ర ప్రభుత్వం విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి వర్షానికి పార్లమెంటు ఆవరణలోనే మోకాలు లోతు నీరు ప్రవహించింది. డ్రైన్ల పూడిక తీయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వెంటనే డ్రైనేజీలు, మౌలిక వసతులను మెరుగుపరచాలి. సింధులోయ నాగరికత సమయంలోనే అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థలు నిర్మించగలిగారు. ఇప్పుడు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు నిర్మించలేకపోతున్నారు?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.నగరాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచాలి. అల్పాదాయ వర్గాలలో 90 శాతం మందికి ఇళ్లు లేవు. దీనివల్ల మురికివాడలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జనాభా లెక్కలు చేపట్టాలి. నగరాల్లో 17 శాతం మురికివాడలు ఉన్నాయి. మురికివాడలలో బహుళ అంతస్తులు భవనాలు నిర్మించాలి. నగరాలలో ఉపాధి కల్పన పెంచాలి. మురికివాడలలో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా ముందుకు తీసుకెళ్లాలి’’ అని రాజ్యసభలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
రాజ్యసభలో ఖర్గే భావోద్వేగం.. ‘ఆ వ్యాఖ్యలు తొలగించాలి’..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. తన రాకీయ జీవితంపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ సభలో మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. తన కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉందని ఘన శ్యామ్ తివారీ అన్నారని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని కోరారు. అయితే ఖర్గే మాటలకు సభ ఛైర్మన్ జదగీప్ ధన్ఖర్ స్పందించారు. ఖర్గేను బాదపెట్టిన ఏ పదం రికాల్లో ఉండదని హామీ ఇచ్చారు. మరోవైపు ఖర్గే మా ట్లాడుతూ.. తమ కుటుంబంలో తానే మొదటితరం రాజకీయ నాయకుడినని తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌లో చేరడంతో తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందని అన్నారు. తాను చేపట్టిన వివిధ పదవుల గురించి ఆయన వివరించారు.అయితే తన తండ్రి 85 ఏ ళ్ల వయసులో మరణించాడని ఖర్గే తెలపగా.. దీనికి చైర్మన్ స్పందిస్తూ.. తన తండ్రి కంటే ఎక్కువ సంత్సరాలు ఖర్గే జీవించాలని ఆకాంక్షించారు. అయితే ఈ వాతావరణంలో ఎక్కువ కాలం జీవించాలనే కోరిక తనకు లేదని ఖర్గే బదులిచ్చారు.అనంతరం తివారీ మాట్లాడిన సమయంలో తాను సభలోనే ఉన్నానని, బీజేపీ నేత తప్పుగా ఉద్దేశించి మాట్లాడినట్లు తాను భావించడం లేదని అన్నారు. రికార్డులను సూక్ష్మంగా పరిశీలించి, అటువంటి వ్యాఖ్యలు ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. -
Wayanad Landslides: కేరళను ముందుగానే హెచ్చరించాం, కానీ: అమిత్ షా
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అతీతంగా కేరళ ప్రజలు, ప్రభుత్వానికి ప్రధాని మోదీ అండగా ఉంటారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాజ్యసభలో అమిత్‌షా మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం జులై 23నే హెచ్చరించిందని పేర్కొన్నారు.వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందని, దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని పేర్కొన్నారు. అయితే సకాలంలో ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అన్నారుఅయితే ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల దేశాలలో భారత్ ఒకటని అన్నారు. ఒకవేళ ఎన్డిఆర్ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉంటే కొండచరియలు విరిగిపడటంతో మరణాలను తగ్గించవచ్చని షా అన్నారు. వయనాడ్ దుర్ఘటనను ఎదుర్కొనేందుకు నరంద్ర మోదీ.. కేరళ ప్రభుత్వం, ప్రజలకు మద్దతుగా ఉన్నారని అన్నారు. మంగళవారం రాత్రి వాయనాడ్‌లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ పర్యటించారని, ప్రధాని మోదీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.కాగా కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో మంగళవారం వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 158 మందికి పైగా మరణించారు, మరో 200 మంది గాయపడ్డారు. ఇక 180 మంది గల్లంతవ్వగా వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
భర్త పేరుతో పిలవటంపై ఎంపీ జయా బచ్చన్ అసహనం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సోమవారం సీనియర్ నటీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భర్తతో పేరుతో కాకుండా జయా బచ్చన్ అని పిలిస్తే చాలని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌తో అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎస్పీ రాజ్యసభ సభ్యురాలైన ఆమెను మాట్లాడావల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్.. ‘శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ, ప్లీజ్’ అని కోరుతారు. అయితే స్పీకర్ పూర్తి పేరుతో పిలవడంపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే చాలని ఆమె స్పీకర్‌కు బదులు ఇచ్చారు. అయితే దీనిపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ.. మీపేరు పార్లమెంట్ రికార్డుల్లో అధికారికంగా జయా అమితాబ్ బచ్చన్ అని ఉందని తెలిపారు. పార్లమెంట్ రికార్డుల్లో ఎలా రాసిఉందో.. అలాగే తాను పిలిచినట్లు డిప్యూటీ స్పీకర్ అన్నారు. అయినప్పటికీ జయా బచ్చన్ అభ్యంతం తెలిపారు. ‘‘ఇది చాలా కొత్తగా ఉంది. మహిళలను వారి భర్తలపేరుతో గుర్తించటం. భర్త పేరు లేకుండా గుర్తించడానికి మహిళలకు వారి సొంతం ఉనికి, సాధించిన విజయాలు ఉండవా?’’ అని ఆమె అన్నారు.Watch: "It's a very painful incident and we should not bring politics into the matter," says Samajwadi Party MP Jaya Bachchan on the death of the UPSC student in Old Rajinder Nagar pic.twitter.com/4928QcZoNS— IANS (@ians_india) July 29, 2024అనంతరం ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై మాట్లాడారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఈ విషయంలో రాజకీయలను తీసుకురాము’ అని జయా బచ్చన్ అన్నారు. -
కోచింగ్ సెంటర్లు వ్యాపారంగా మారిపోయాయి: రాజ్యసభ ఛైర్మన్
‘కోచింగ్ వ్యవస్థ పూర్తిగా వాణిజ్యంగా మారింది. ఎప్పుడూ వార్తాపత్రికలను చదువుదాం అని తెరిచిన ప్రతిసారీ ముందు ఒకటి రెండు పేజీల్లో వారి ప్రకటనలే కనిపిస్తాయి’ అంటూ అని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరదనీటిలో మునిగి యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను ఉద్దేశిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు పిలుపునివ్వడం సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు.