shruthi hasaan
-
Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ
టైటిల్:వాల్తేరు వీరయ్య నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని,రవిశంకర్ దర్శకత్వం: కేఎస్ రవీంద్ర(బాబీ) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: ఆర్థన్ ఎ.విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమనే విడుదల తేది: జనవరి 13,2023 గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్‌తో కలిసి రవితేజ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై స్టార్టింగ్ నుంచే హైప్ క్రియేట్ అయింది.దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాస్ సాంగ్, పూనకాలు లోడింగ్ పాటలు జనాల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 13)విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. చిరంజీవి సినిమా అనగానే అభిమానులు కొన్ని లెక్కలేసుకుంటారు. మంచి ఫైట్ సీన్స్, డ్యాన్స్, కామెడీ.. ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. అందుకే కథ ఎలా ఉన్నా.. ఈ హంగులన్నీ పెట్టడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. వాల్తేరు వీరయ్యలో కూడా అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు బాబీ. అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్, తన మార్క్ కామెడీ, భారీ యాక్షన్ సీన్లతో కథను తీర్చిదిద్దాడు. అలా అని ఇది కొత్తగా ఉంటుందని చెప్పలేం. ఈ తరహా కథలు టాలీవుడ్లో చాలానే వచ్చాయి. కాకపోతే చిరంజీవి ఇమేజ్‌పై దృష్టి పెట్టి.. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంతో ఎక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ రాదు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఉండడం సినిమాకు మరింత ప్లస్ అయింది. పోలీస్ స్టేషన్లోనే పోలీసులను సాల్మన్ అతికిరాతంగా చంపడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఫస్ట్ సీన్లోనే విలన్ పాత్ర ఎంత కిరాతకంగా ఉండబోతుందో చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత నేవీ దళాన్ని కాపాడడానికి సముద్రంలో వీరయ్య చేసే ఓ భారీ ఫైట్‌తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. వీరయ్య మలేషియాకు షిఫ్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సాల్మన్‌ని కిడ్నాప్ చేయడానికి వీరయ్య టీమ్ వేసే ప్లాన్ నవ్వులు పూయిస్తుంది. అలాగే శ్రుతీహాసన్‌తో చిరు చేసే రొమాన్స్ అభిమానులను అలరిస్తుంది. కానీ కథనం నెమ్మదిగా సాగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది. ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. ఏసీపీ విక్రమ్‌గా రవితేజ ఎంట్రీ, అన్నదమ్ముల మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో చిరంజీవి సినిమా డైలాగ్ రవితేజ చెప్పడం.. రవితేజ సినిమా డైలాగ్ చిరంజీవి చెప్పడం నవ్వులు పూయిస్తుంది. అయితే ఇవన్ని ఇలా వచ్చి అలా పోతుంటాయి కానీ.. ఎక్కడా వావ్ మూమెంట్స్‌ని ఇవ్వలేకపోతాయి. అలాగే అన్నదమ్ముల మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనేది బలంగా చూపించలేకపోయాడు. డ్రగ్స్ పట్టుకునే సీన్స్ కూడా పేలవంగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ కారులో చిరంజీవి, రవితేజ మాట్లాడుకోవడం.. చిరు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురిచేస్తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. అభిమానులు కోరుకునే అంశాలతో ఓ రొటీన్ కథను అంతే రొటీన్‌గా చెప్పాడు డైరెక్టర్. అయితే చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంలో మాత్రం బాబీ సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. వీరయ్య పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ని మాస్ లుక్‌లో చూస్తారు. ఒకప్పుడు చిరు చేసే కామెడీ, ఫైట్ సీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. తెరపై చాలా యంగ్‌గా కనిపిస్తాడు. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టేశాడు. ఇక ఏసీపీ విక్రమ్‌గా రవితేజ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అదితిగా శ్రుతిహాసన్ ఉన్నంతలో చక్కగా నటించింది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఫైట్ సీన్లో మాత్రం అదరగొట్టేసింది. డ్రగ్స్ మాఫియా లీడర్ సాల్మన్ సీజర్గా బాబీ సింహా, అతని సోదరుడు మైఖేల్‌గా ప్రకాశ్ రాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. కానీ వాళ్లది రొటీన్ విలనిజమే. వెన్నెల కిశోర్ కామెడీ పంచ్‌లు బాగున్నాయి. పోలీసు అధికారి సీతాపతిగా రాజేంద్రప్రసాద్‌తో పాటు షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. 'బాస్ పార్టీ' నుంచి 'పూనకాలు లోడింగ్' సాంగ్ వరకు డీఎస్పీ కొట్టిన సాంగ్స్ ఓ ఊపు ఊపేశాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆర్థన్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్ డెస్క్ -
Veera Simha Reddy : కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో బాలకృష్ణ అభిమానుల సందడి (ఫొటోలు)
-
Veera Simha Reddy Review: వీరసింహారెడ్డి రివ్యూ
టైటిల్: వీరసింహారెడ్డి నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, నవీన్‌చంద్ర మురళీశర్మ,తదితరులు నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్ దర్శకత్వం : గోపిచంద్ మలినేని సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2023 అఖండ’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘వీరసింహారెడ్డి’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య గురువారం(జనవరి 12) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘వీరసింహారెడ్డి’ కథేంటంటే.. జై అలియాస్ జైసింహారెడ్డి(బాలకృష్ణ) తన తల్లి మీనాక్షి(హనీరోజ్)తో కలిసి ఇస్తాంబుల్‌లో ఉంటాడు. అతనికి అక్కడే తెలుగమ్మాయి ఈషా(శ్రుతీహాసన్)పరిచయం అవుతుంది. వీరద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయాన్ని ఈషా తన తండ్రి(మురళీ శర్మ)కి చెబుతుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం కోసం జై తల్లిదండ్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. అయితే అప్పటి వరకు తండ్రి లేడనుకున్న జైకి తల్లి ఓ నిజం చెబుతుంది. అతనికి తండ్రి ఉన్నాడని, పేరు వీరసింహారెడ్డి(బాలకృష్ణ) అని, రాయలసీమపై ప్రేమతో అక్కడి ప్రజలకు అండగా ఉన్నాడని చెబుతుంది. పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి ఇస్తాంబుల్ రావాల్సిందిగా వీరసింహారెడ్డికి కబురు పంపుతుంది. కొడుకు పెళ్లి కోసమై వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. ఇదే అదునుగా భావించిన ప్రతాప్‌రెడ్డి(దునియా విజయ్), వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి(వరలక్ష్మీ శరత్ కుమార్) అతన్ని చంపడానికి ప్లాన్ వేస్తారు. సొంత చెల్లెలే వీరసింహారెడ్డిని చంపాలని ఎందుకు పగ పట్టింది? ప్రతాప్‌రెడ్డికి వీరసింహారెడ్డికి మధ్య ఉన్న వైరం ఏంటి? మీనాక్షి, వీరసింహారెడ్డిలు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? తండ్రి ప్లాష్‌బ్యాక్ తెలిసిన తర్వాత జైసింహారెడ్డి ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫ్యాక్షన్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. అందులో బాలయ్యకు మరీనూ. వీరసింహారెడ్డి కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. ఇందుతో కొత్త విషయం ఏంటంటే.. ఫ్యాక్షన్ స్టోరీకి సిస్టర్ సెంటిమెంట్‌ని జోడించడం. అయితే తెరపై అనుకున్నంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. పుట్టి పెరిగిన ఊరి కోసం ఓ వ్యక్తి కత్తి పట్టడం.. అతన్ని ప్రజలు దేవుడిగా ఆరాధించండం.. అదేసమయంలో మరో గ్యాంగ్ అతన్ని చంపడానికి ప్రయత్నించడం.. ఓ ఫ్లాష్‌బ్యాక్.. ఇదే వీరసింహారెడ్డి కథ. అయితే అతన్ని చంపే గ్యాంగ్‌లో చెల్లెలు కూడా ఉండడంతో కథపై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ తెరపై వచ్చే సన్నివేశాలు మాత్రం ఆ ఆసక్తిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో కథ ఏమీ ఉండడు. ప్రతిసారి విలన్ గ్యాంగ్ వీరసింహారెడ్డిపై దాడికి ప్రయత్నించడం.. చివరకు అతని చేతిలో తన్నులు తిని బయటకు రావడం..ఇలాగే సాగుతుంది. మధ్య మధ్యలో ఒకటిరెండు డైలాగ్స్. దర్శకుడు హీరోయిజం మీద పెట్టిన దృష్టి కథపై పెట్టలేదనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే ఫైట్ సీన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో యాక్షన్ కంటే సిస్టర్ సెంటిమెంట్ మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. బాలకృష్ణ, వరలక్ష్మీ షరత్ కుమార్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరసింహారెడ్డిపై చెల్లెలు ఎందుకు పగ పెంచుకుంది? శేఖర్(నవీన్‌చంద్ర) ఎవరు? మీనాక్షి, వీరసింహారెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారనేది సెకండాఫ్‌లో చూపించారు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. విపరీతమైన హింసకు తావిచ్చేరనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌తోనే సినిమాను లాక్కొచ్చాడు దర్శకుడు. అయితే నందమూరి అభిమానులకు మాత్రం ఈ చిత్రం శాటిస్ఫై చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. మరోసారి బాలకృష్ణ తనదైన నటనతో విజృంభించాడు. గ్రామ పెద్ద వీరసింహారెడ్డిగా, అతని కొడుకు జైసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. శ్రుతీహాసన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ తనది. అయితే పాటల్లో మాత్రం బాలయ్యతో హుషారుగా స్టెప్పులేసి అలరించింది. మీనాక్షి పాత్రకి హనీరోజ్ న్యాయం చేసింది. వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతిగా వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే డబ్బింగ్ ఆమెతో కాకుండా మరొకరితో చెప్పిస్తే బాగుండేదేమో. ప్రతాప్‌రెడ్డిగా దునియా విజయ్ విలనిజాన్ని బానే పండించాడు. బ్రహ్మానందం, అలీ పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. లాల్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, మురళీ శర్మ, అజయ్ ఘోష్ తదితరుతు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు ప్లస్. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
‘మా బావ మనోభావాలు..’సాంగ్ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదుర్స్
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'మా బావ మనోభావాలు' అంటూ సాగే ఈ పాట..మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశాడు. హీరోయిన్లు హానీ రోజ్, చంద్రికా రవిలతో బాలయ్య వేసే స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ చక్కగా ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. -
అటు విహార యాత్ర.. ఇటు వీరయ్య యాత్ర.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు మేకర్స్. జనవరి 13న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ విదేశాలకు బయలుదేరాడు. ఈ విషయాన్ని చిరు తన ట్విటర్లో పంచుకున్నారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' ఫ్యామిలీతో అటు విహార యాత్ర. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర' అంటూ పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ శృతిహాసన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తాజాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ తో అటు విహార యాత్ర హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర 😊 #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022 -
NBK107 Mass Poster: కత్తి పట్టిన బాలయ్య.. మాస్ లుక్ అదిరింది!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నేడు(మే 28)దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు 100వ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. తెలుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో ప్రత్యేకమైన కత్తిని పట్టుకొని బాలయ్య యంగ్ అండ్ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు.హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ‘బాలకృష్ణ కెరీర్లో 107వ చిత్రమిది. ఇప్పటి వరకు 40శాతం షూటింగ్ పూర్తయింది. ఎక్కడా రాజీపడకుండా భారీ బాడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సరికొత్త లుక్‌లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రానికి 'జై బాలయ్య' టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. #NBK107 🔥🔥 pic.twitter.com/lTR9poxqfi — Mythri Movie Makers (@MythriOfficial) May 28, 2022 -
మీ లిప్ సైజ్ ఎంత ?.. శ్రుతి హాసన్ స్ట్రాంగ్ కౌంటర్..
Shruti Haasan Epic Reply To Who Asked Lip Size: హీరోయిన్ శ్రుతి హాసన్ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. తర్వాత కొన్ని రోజులు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ క్రాక్ మూవీతో మాసివ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సలార్, ఎన్బీకే 107, మెగా154 చిత్రాలతో ఫుల్ బిజిగా ఉంది. వరుస సినిమాలతో అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో, సినిమా అప్డేట్లతో అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సెషన్‌ను నిర్వహించింది శ్రుతి హాసన్. ఈ సెషన్లో శ్రుతి హాసన్‌కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. ఈ సెషన్లో ఓ నెటిజన్ శ్రుతి హాసన్‌ను 'మీ పెదాల సైజు ఎంత?' అని అడిగాడు. ఈ ప్రశ్నకు ధీటుగా స్పందించింది శ్రుతి హాసన్. 'లిప్ సైజ్ కూడా ఉంటుందా ?' అని నెటిజన్ను తిరిగి ప్రశ్నించింది. అలాగే 'నువ్వే కొలుచుకో' అని ఒక సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్ చేసింది. శ్రుతి హాసన్ రిప్లైకి నెటిజన్‌కు నోటమాట రానుట్టుంది. శ్రుతి హాసన్ ఎపిక్ రిప్లై పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. శ్రుతి హాస్ ఎప్పటిలానే తనకు ఎదురయ్యే పరిస్థితులకు చాలా కూల్‌గా సమాధానమిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ట్రోలింగ్, బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు శ్రుతి హాసన్ చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: భయంతోనే ఇండస్ట్రీకి వచ్చాను, ఐరన్ లెగ్ అన్నారు: శ్రుతి హాసన్ -
బాలయ్య సినిమా కోసం శ్రుతీహాసన్‌కి భారీ రెమ్యునరేషన్.. ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే గోపిచంద్ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం శ్రుతీహాసన్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ కోసం శ్రుతీ.. రూ.2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రుతీహాసన్ డిమాండ్‌కు ఓకే చెప్పారట. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషికం కావడం గమనార్హం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై బాలయ్య’అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య.. మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. -
ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ 107వ సినిమా
బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమాకి కొబ్బరికాయా కొట్టారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశాలనికి దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా.. డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకులు కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు కలిసి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. -
సామాజిక బాధ్యత ఫీల్ అవ్వండి!
ఈ కోవిడ్ సంక్షోభంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. కోవిడ్ బాధితులకు, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మన మంచి మాటలతో ధైర్యాన్ని నింపడం కూడా సాయమే అవుతుందంటున్నారామె. ‘‘కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్డౌన్ అప్పుడు ఇంట్లోనే ఉండి వంటలు, వ్యాయామాలు, ఆన్లైన్ క్లాసులతో రోజులను గడిపాం. కానీ ఇప్పటి కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులు వేరు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఫీలై ఒకొరికొకరం సాయం చేసుకోవాల్సిన తరుణం ఇది’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ సమయంలో కొంతమందికి సోషల్ మీడియా ఓ మంచి సాధనంగా ఉపయోగపడుతోంది. కోవిడ్ సహాయ సమాచారాలను తెలుసుకోగలుగుతున్నాం. అయితే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు. నా వరకు కచ్చితమైన వివరాలనే షేర్ చేయడానికే ప్రయత్నిస్తాను. నా టీమ్ గ్రౌండ్ లెవల్లో కొంత వర్క్ చేసిన తర్వాతనే నా టైమ్‌లైన్‌లో సమాచారాన్ని షేర్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ – ‘‘లాక్‌డౌన్‌కు ముందే ఓ హిందీ ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను. ‘సలార్’ చేయాల్సి ఉంది. కమిటైన మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో మరికొన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
ఆర్థిక ఇబ్బందులున్నాయి.. అందుకే తప్పడం లేదు: శృతి హాసన్
కమల్‌హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత తన నటనతో అవకాశాలను సంపాదించుకుంటుంది. టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి.. తనకూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఈ కరోనా ఎప్పుడు అయిపోతుందా అని చూస్తూ ఇంట్లో కూర్చోలేను, లాక్డౌన్ ముగిసిన వెంటనే నేను షూటింగ్లో పాల్గొనాలి. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో మాస్క్ లేకుండా షూటింగ్ చేయడం చాలా కష్టమే అయినప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల పని చేయక తప్పదు. అందుకే షూటింగ్స్ ప్రారంభించిన వెంటనే సెట్స్‌లోకి వెళ్లిపోతా. గత 11ఏళ్లుగా నా ఖర్చులకి నేను సంపాదించుకుంటున్నా. నేను ఒక ఇండిపెండెంట్ మహిళను. నా బిల్లులు చెల్లించుకోవడానికి అమ్మానాన్నలను డబ్బులు అడగలేను. నా కాళ్ల మీద నిలబడటానికే నేను ప్రయత్నిస్తాను. అందుకే పనిచేసి తీరాలి. నా పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించి నేనే నిర్ణయాలు తీసుకుంటా. ఇక కరోనా వల్ల చాలామంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనుక్కోలేదని చెబుతుంటారు. కానీ నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. నా వెనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతాను’ అని పేర్కొంది. అయితే సడెన్‌గా శృతి ఈ కామెంట్స్ ఎందుకు చేసిందా అంటూ నెటిజన్లు సందేహాంలో పడ్డారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం కమల్ ఓటమిపై శృతి హాసన్ ఎమోషనల్ రియాక్షన్ -
శృతి ప్రియుడికి థాంక్స్ చెప్పిన కమల్!
చెన్నై: ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటి శృతిహాసన్ తన ప్రేమాయణంతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఆమె ప్రేమలో పడినట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శృతి పుట్టినరోజు నాడు శాంతను విష్ చేసిన తీరు, షేర్ చేసిన ఫొటోలు ఇందుకు మరింత ఊతమిచ్చాయి. ఇక ఇటీవల ప్రేయసితో పాటు శాంతను చెన్నై వెళ్లి ఆమె తండ్రి, విశ్వనాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌హాసన్‌ను కలవడంతో వీరి ప్రేమ వ్యవహారం నిజమేనని కన్ఫాం చేసేస్తున్నారు గాసిప్‌రాయుళ్లు. ఇందుకు మరింత బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు కమల్‌హాసన్. శాంతను తనకు అందించిన బహుమతి గురించి నెటిజన్లతో పంచుకున్నారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. 234 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ కొత్త కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతేగాక తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటన కూడా చేశారు. అదే విధంగా మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం ఆరంభిస్తానని, 7 నుంచి విడతల వారీగా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్‌లైట్(మక్కల్ నీది మయ్యం గుర్తు) పట్టుకుని ఎన్నికల సమరానికి సిద్ధమైనట్లుగా ఉన్న కమల్ చిత్రాన్ని శాంతను రూపొందించాడు. దీనిని షేర్ చేసిన కమల్.. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, తన శ్రమను గుర్తించినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపాడు. View this post on Instagram A post shared by Kamal Haasan (@ikamalhaasan) -
గోవాలో ఆటా పాటా
‘డాన్ శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో రవితేజ–డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నేటి నుంచి గోవాలో జరుగుతున్న చివరి షెడ్యూల్లో రవితేజ, శ్రుతీహాసన్‌లపై ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఒక ఇంటెన్స్ స్టోరీతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన ‘భూమ్ బద్దల్’ అనే ప్రత్యేక పాట బ్లాక్‌బస్టర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
థ్రిల్ చేస్తారు
ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారట రానా, శ్రుతీహాసన్. ఈ ఇద్దరూ ఓ వెబ్ సిరీస్‌లో కలసి నటించబోతున్నారని టాక్. నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోయే భారీ వెబ్ సిరీస్‌లో జంటగా నటిస్తారట రానా, శుత్రి. పది ఎపిసోడ్ల ఈ సిరీస్ థ్రిల్లర్ జానర్లో ఉంటుందట. అయితే ఈ సిరీస్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయని తెలిసింది. తెలుగు భాషలో చిత్రీకరించినప్పటికీ ఈ సిరీస్‌ను మిగతా ప్రాంతీయ భాషలన్నింటిలోకి అనువదించనున్నారని సమాచారం. -
అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది
‘‘ప్రస్తుతం అందరం ఎదుర్కొంటున్న సమస్య కరోనా. కానీ ప్రజల్లో ఐకమత్యం కనిపించడంలేదు. ఐకమత్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగలం’’ అంటున్నారు శ్రుతీహాసన్. లాక్ డౌన్ సమయాల్లో ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారామె. వర్కౌట్స్, మేకప్ టిప్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుత సమయాల్లో కావాల్సింది ప్రేమ, దయ అన్నారు. ఈ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘కొన్ని వార్తలు వింటుంటే చాలా దారుణం అనిపిస్తోంది. కొందరు వ్యక్తులు మానవత్వం మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమయాల్లోనూ వివక్ష చూపిస్తున్నారు అంటే మనుషులు ఎలా ఉన్నారో అర్థం అవుతోంది. కానీ వైరస్‌కి అలాంటి వివక్ష ఏమీ ఉండదు. అందర్నీ సమానంగా దాడి చేస్తుంది. దాన్ని ఎదుర్కోవాలంటే ఒకరి మీద ఒకరు ప్రేమ, దయను చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య కూడా మనల్ని ఏకం చేయకపోతే ఇంకేం ఏకం చేస్తుందో దేవుడికే తెలియాలి’’ అన్నారామె. -
పాత బస్తీలో డిష్యుం డిష్యుం
పాతబస్తీలో రౌడీమూకలను ర ఫ్ఫాడిస్తున్నారు ఆఫీసర్ రవితేజ. మరి ఆ రౌడీలు తప్పు తెలుసుకున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. శ్రుతీహాసన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఓ పెద్ద ఫైట్‌ని చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్‌లో సాగే ఈ ఫైట్‌ను రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ చక్కగా డిజైన్ చేశారట. ఈ సినిమా షూటింగ్ సుమారు 25 శాతం పూర్తయిందని తెలిసింది. వేసవికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
శ్రుతి కుదిరిందా?
చిన్న బ్రేక్ తర్వాత వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు శ్రుతీహాసన్. రవితేజతో ‘క్రాక్’ సినిమా చేస్తున్నారామె. ఇపుడు మరో పెద్ద సినిమాలో కూడా కనిపించబోతున్నారని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతీహాసన్ పేరుని పరిశీలిస్తున్నారట దర్శకుడు వంశీ పైడిపల్లి. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జోడీగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఎవడు’ సినిమాలోనూ శ్రుతీహాసనే హీరోయిన్. వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మహేశ్, శ్రుతీ రెండోసారి జోడీ కడతారా? వేచి చూడాలి. -
ఇకపై విడిగా నడుద్దాం
కొంతకాలంగా శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. చెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఒకరి బర్త్‌డేను మరొకరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం, సెల్ఫీలతో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం... ఇలా చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది దృష్టిలో పడ్డారు. వీరి ప్రేమకు శ్రుతీ తండ్రి కమల్ కూడా అంగీకారం తెలిపారు, త్వరలోనే శ్రుతీ, మైఖేల్ ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్నారని వినిపించింది. అయితే కహానీలో ట్విస్ట్ వచ్చింది. శ్రుతీ, మైఖేల్ విడిపోతున్నారు. ఎవరో కల్పించిన వార్తలు కాదు. మైఖేలే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా బ్రేకప్ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘జీవితం మమ్మల్ని (శ్రుతీ–మైఖేల్) అనుకోకుండా భూమికి చెరో వైపు (తాను లండన్, శ్రుతి ఇండియన్ అనే అర్థంతో) ఉంచింది. బహుశా అందుకే మేమిద్దరం విడివిడిగా నడవాలనుకుంటా. విడిపోయినప్పటికీ శ్రుతీహాసన్ నా బెస్ట్ ఫ్రెండ్‌లానే ఉంటుంది. తను నా ఫ్రెండ్‌గా దొరకడం నా అదృష్టం’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు కోర్సలే. పరస్పర అంగీకారం ప్రకారమే ఈ ఇద్దరూ విడిపోయారని, విడిపోయినప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌లానే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారు అని శ్రుతీ–మైఖేల్‌ల కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. -
ఫొటోషూట్ రెడీ
కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. ఎందుకంటే ఆయన తర్వాతి చిత్రం కోసం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఈ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఇటీవల చిరంజీవిపై ఓ ఫొటోషూట్ జరిగిందని సమాచారం. త్వరలో చిత్రీకరణ స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చిరంజీవి బరువు కూడా తగ్గుతారని తెలిసింది. ఇందులో కథానాయికగా తమన్నా, నయనతార, శ్రుతీహాసన్ పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరో ఒకరు చిరంజీవికి జోడీగా నటిస్తారా? లేక వేరే హీరోయిన్ ఎవరైనా ట్రాక్‌లోకి వస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్క్రీన్ టెస్ట్
పదే పదే వినాలనిపించే పాట ఏ సినిమాకైనా ప్లస్ అవుతుంది. ఆడియో రిలీజయ్యాక ఆ పాట విని, సినిమా చూడటం కోసం థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. ఇలాంటి పసందైన పాటలు సంగీత దర్శకులు, పాట రాసినవారు, పాడిన వారు, నటించిన వారు, ఎంతోమంది సాంకేతిక నిపుణుల కృషి ఫలితమే. 2018లో బాగా విసిపించిన ఇలాంటి క్రేజీ సాంగ్స్ గురించి ఈ వారం క్విజ్. పాడుకుంటూ చదవండి. 1 ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...’ పాటలో హీరో విజయ్ దేవరకొండతో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) రష్మికా మండన్నా బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) లావణ్యా త్రిపాఠి డి) నివేథా థామస్ 2 రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్రంలోని హై వోల్టేజి సాంగ్ ‘జిల్ జిల్ జిల్ జిల్...జిగేలు రాణి...’లో నటించిన ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) కియరా అద్వానీ బి) తమన్నా భాటియా సి) పూజా హెగ్డే డి) శ్రుతీహాసన్ 3 ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని మెలోడియస్ సాంగ్ ‘పెనివిటి...’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సిరివెన్నెల బి) శ్రీమణి సి) అనంత శ్రీరామ్ డి) రామజోగయ్య శాస్త్రి 4 ‘భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను..’ పాట ‘భరత్ అనే నేను’ చిత్రం లోనిది. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) గోపి సుందర్ సి) యం.యం. కీరవాణి డి) తమన్ 5 ‘దారి చూడు దుమ్ము చూడు మామా, దున్నపోతుల మేరే చూడు...’ పాట నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోనిది. ఆ పాట రచయిత, గాయకుడు ఎవరో తెలుసా? ఎ) పెంచల్ దాస్ బి) రేలా కుమార్ సి) శివనాగులు డి) వరంగల్ శ్రీను 6 ‘వారు వీరు అంతా చూస్తూ ఉన్న...’ పాట నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలోనిది. ఆ పాటలోని మేల్ వాయిస్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మరి లేడీ వాయిస్ ఎవరిదో తెలుసా? ఎ) గీతా మా«ధురి బి) సునీత సి) అంజనా సౌమ్య డి) రమ్య బెహరా 7 ఆర్. నారాయణమూర్తి నటించి, దర్శక నిర్మాతగా చేసిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రంలోని ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేన వేల వందనాలమ్మ ...’ పాట గాయకుడు ఎవరు? ఎ) వందేమాతరం శ్రీనివాస్ బి) గద్దర్ సి) వంగపండు డి) గోరేటి వెంకన్న 8 1993లో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది...లగ్గాయత్తు..’ సాంగ్ సూపర్ హిట్. ఆ పాటను ‘సవ్యసాచి’ చిత్రం కోసం సంగీత దర్శకుడు యం. యం. కీరవాణి రీమిక్స్ చేశారు. హీరో నాగచైతన్య సరసన ఈ పాటలో నటించిన నూతన నటి ఎవరో తెలుసా? ఎ) పాయల్ రాజ్‌పుత్ బి) నిధీ అగర్వాల్ సి) నభా నటేశ్ డి) ప్రియాంక జవాల్కర్ 9 సుధీర్ బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రంలోని ‘ఓ చెలి తార... నా మనసారా...’ పాట సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) వివేక్ సాగర్ బి) చైతన్య భరద్వాజ్ సి) సాగర్ మహతి డి) ప్రశాంత్ విహారి 10 ‘పిచ్చి పిచ్చిగా నచ్చావురా.. మనోహరా...’ అంటూ ‘నర్తనశాల’ చిత్రంలోని విరహగీతాన్ని ఆలపించిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) లిప్సికా బి) మోహన భోగరాజు సి) సమీరా భరద్వాజ్ డి) దామిని బాట్ల 11 ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, కాళిదాస ప్రేమ కావ్యమా, త్యాగరాజు సంగీతమా... గీతమా’ పాట పాడిన ప్రముఖ గాయని ఎవరో తెలుసా? ఎ) శ్రేయా ఘోషల్ బి) మానసి సి) కల్పన డి) కౌసల్య 12 ‘బయటికొచ్చి చూస్తే టైమేమో... త్రీ ఓ క్లాక్.. ఇంటికెళ్లే 12బి రూటు మొత్తం రోడ్డు బ్లాక్..’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) సంతోశ్ నారాయణ్ బి) యువన్ శంకర్‌రాజా సి) హిప్ హాప్ తమిళ డి) అనిరు«ద్ రవిచంద్రన్ 13 ‘రంగస్థలం’ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్. ఆ సినిమాకి సింగిల్ కార్డు రైటర్‌గా సాహిత్యాన్ని అందించిన రచయితెవరు? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) చంద్రబోస్ సి) భువనచంద్ర డి) అనంత శ్రీరామ్ 14 ‘అయామే లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో...’ అంటూ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) విజయ్ దేవరకొండ 15 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మెహబూబా’. ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఓ ప్రియా... నా ప్రియా.. మెహబూబా...’ రచయితెవరో తెలుసా? ఎ) సుద్ధాల అశోక్‌తేజ బి) పూరి జగన్నాథ్ సి) భాస్కరభట్ల రవికుమార్ డి) కందికొండ 16 ‘చూసి చూడంగానే నచ్చేశావే, అడిగి అడగంగానే వచ్చేశావే...’ పాట ‘ఛలో’ చిత్రంలోనిది. ఆ చిత్రంతోనే దర్శకునిగా అరంగేట్రం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) అజయ్ భూపతి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) వెంకటేశ్ మహా 17 ‘మహానటి’ చిత్రంలోని ‘చివరకు మిగిలేది...’ అనే పాటను ‘సిరివెన్నెల’ రచించారు. ఆ పాటను ఆలపించిన గాయని ఎవరో కనుక్కోండి? ఎ) చిన్మయ్ శ్రీపాద బి) సునీత ఉపద్రష్ట సి) చిత్ర డి) యస్పీ శైలజ 18 2018లో సూపర్‌హిట్ అయిన ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి..’, ‘మాటే వినదుగ, వినదుగ..’, ‘ఉండి పోరాదే గుండెల్లోన’, ‘యంతరలోకపు సుందరివో..’ పాటలను పాడిందెవరు? ఎ) సిథ్ శ్రీరామ్ బి) రేవంత్ సి) కార్తీక్ డి) కైలాశ్ ఖేర్ 19 2018లో విడుదలైన చిత్రాల్లో ఒక్క పాట కూడా లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమేంటో కనుక్కోండి? (థీమ్ సాంగ్ మాత్రం ఉంది). ఎ) గూఢచారి బి) కేరాఫ్ కంచరపాలెం సి) అ! డి) ఈ నగరానికి ఏమైంది 20 ఈ ఏడాది చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమవుతున్న బాలీవుడ్ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) శంకర్ ఎహసాన్ లాయ్ బి) అమిత్ త్రివేది సి) హిమేశ్ సేషమ్మియా డి) విశాల్ భరద్వాజ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ2) సి 3) డి 4) ఎ 5) ఎ 6) సి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) ఎ 12) డి 13) బి 14) బి 15) సి 16) బి 17) బి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
నల్ల నిర్మాత అవుతా
‘‘కెరీర్లో చాలా మంది నిర్మాతలు నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ని ఎగ్గొట్టారు. కానీ నిర్మాతగా నేనలా చేయను’’ అంటున్నారు శ్రుతీహాసన్. యాక్టర్‌గా, సింగర్‌గా తన టాలెంట్‌ను పరిచయం చేశారు శ్రుతీహాసన్. ప్రస్తుతం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించబోయే ‘ది మస్కిటో ఫిలాసఫీ’ చిత్రాన్ని నిర్మించనున్నారామె. నిర్మాతగా ఎలాంటి సినిమాలు నిర్మిస్తారని శ్రుతీని అడగ్గా – ‘‘నేను చేయాలనుకొని, చేయలేకపోయిన సినిమాలను నా బ్యానర్‌పై నిర్మిస్తాను. బిజినెస్ పరంగానూ భలే ఆసక్తిగా ఉంది. ఎందుకంటే... నిర్మాతగా నేను ఎంచుకునే సినిమాలు ఎలా ఆడతాయి? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ స్క్రిప్ట్స్‌ని మార్కెట్ పరంగానూ వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీ కథ చెప్పాలి. నిర్మాణంలో నాకు ఎటువంటి అనుభవం లేదు. మా అమ్మగారు చూసుకుంటున్నారు. ఆవిడకు అనుభవం ఉంది. అనుభవం ఉన్న నిర్మాతల దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటాను. అనుభవం లేకపోయినప్పటికీ నా యాక్టింగ్ కెరీర్ నిర్మాణం గురించి నాకో విషయం నేర్పింది. నాతో పని చేసే యాక్టర్స్‌కు, టీమ్‌కు సరైన రెమ్యునరేషన్ ఇవ్వాలని తెలిపింది. నా నిర్మాణంలో పని చేసే వాళ్లందరికీ నల్ల ప్రొడ్యూసర్ (మంచి నిర్మాత) అవ్వాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
శ్రుతీ కొత్త రాగం
కేవలం హీరోయిన్‌గానే కాదు.. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా శ్రుతీహాసన్ పేరు సంపాదించుకున్నారు. కానీ ఇటీవల సినిమాలను కాస్త తగ్గించి మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. అందుకే మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్‌తో ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు శ్రుతీహాసన్ పాడిన పాట ఒకటి నవంబర్‌లో బయటకు రానుంది. ఈ పాటకు లిరిక్స్ కూడా ఆమెనే రాశారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ నూక్లియాతో ఆమె కలిసి పని చేశారు. ‘‘నూక్లియాతో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఫన్‌గా ఉండే ట్రాక్ కోసం ట్రై చేశాం. ఇలాంటి కొత్త జానర్స్ పట్ల ఒక ఆర్టిస్టుగా నేనెప్పుడూ ఆసక్తిగానే ఉంటాను. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వరల్డ్‌లో నేను ట్రావెల్ కావడానికి నూక్లియాలాంటి మంచి వ్యక్తి సహాయం చాలా అవసరం’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హిందీ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారామె. ఇందులో విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారు. అన్నట్లు.. శ్రుతీహాసన్ పాటలు పాడటం ఇది కొత్త కాదు. ఇప్పుడు కొత్త పాట పాడారంతే. ఓసారి వెనక్కి వెళితే ‘రేసు గుర్రం’లో ‘డౌన్ డౌన్ డుప్పా డుప్పా..’, ‘ఆగడు’లో ‘జంక్షన్లో...’ ఇలా చాలా పాటలు పాడారు. ఆ మాటకొస్తే.. చిన్నప్పుడే ‘హేరామ్’లో తండ్రి కమల్‌హాసన్‌తో కలసి ‘రామ్ రామ్’ పాట పాడారామె. -
స్క్రీన్ టెస్ట్
1. ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌తో చిన్నప్పటి నుండి స్నేహంగా ఉండే పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రుతీహాసన్ బి) హన్సిక సి) సమంత డి) నిత్యామీనన్ 2. స్నేహంపై తీసిన ‘కొండపల్లి రాజా’ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) వెంకటేశ్ బి) భానుచందర్ సి) బాలకృష్ణ డి) రాజేంద్ర ప్రసాద్ 3. ‘ఆర్య 2’ చిత్రంలో అల్లు అర్జున్, నవదీప్ స్నేహితులుగా నటించారు. వారిద్దరు ఏ హీరోయిన్ కోసం తంటాలు పడతారో తెలుసా? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) గౌరీ ముంజల్ డి) షీలా 4. ‘ప్రేమదేశం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇద్దరు స్నేహితులుగా అబ్బాస్, వినీత్ నటించారు. ఈ ఇద్దరూ లవ్ చేసే అమ్మాయిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) సోనాలీ బింద్రే సి) ఐశ్వర్యా రాయ్ డి) మనీషా కోయిరాల 5. ‘స్నేహం కోసం’ చిత్రంలో చిరంజీవి, విజయ్‌కుమార్ స్నేహితులుగా నటించారు. ఈ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) సురేశ్ కృష్ణ బి) కె.యస్ రవికుమార్ సి) పి. వాసు డి) భారతీరాజా 6. ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా... కాలం నీ నేస్తం ముస్తఫా...’ అనే పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) భువనచంద్ర బి) వెన్నెలకంటి సి) సిరివెన్నెల డి) వేటూరి సుందర రామమూర్తి 7. ‘ ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో హీరో రామ్‌కి బెస్ట్ ఫ్రెండ్‌గా నటించిన మరో హీరో ఎవరో తెలుసా? ఎ) నారా రోహిత్ బి) నాగ శౌర్య సి) శ్రీవిష్ణు డి) నవీన్ చంద్ర 8. హీరో గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఓ హీరో పేరు చెప్తారు. ఎవరా హీరో? ఎ) ప్రభాస్ బి) కల్యాణ్‌రామ్ సి) రవితేజ డి) నాగార్జున 9. జగపతిబాబు స్నేహితుడు అనగానే గుర్తుకు వచ్చే హీరో ఎవరో తెలుసా? ఎ) నాగార్జున బి) అర్జున్ సర్జా సి) శ్రీహరి డి) ప్రకాశ్ రాజ్ 10. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండకు బెస్ట్ ఫ్రెండ్‌గా నటించిన నటుడెవరో తెలుసా? ఎ) రాహుల్ రామకృష్ణ బి) ‘వెన్నెల’ కిశోర్ సి) ప్రియదర్శి డి) సత్య 11. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఓ ప్రముఖ హీరోయిన్‌కు బెస్ట్ ఫ్రెండ్. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) అంజలి బి) సమంత సి) రాశీ ఖన్నా డి) రెజీనా 12. అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సినిమాలో కథానాయకునిగా నటించిన హీరో ఎవరో తెలుసా? ఎ) నిఖిల్ బి) ఆది పినిశెట్టి సి) శర్వానంద్ డి) సందీప్ కిషన్ 13. రాజీవ్ కనకాల ఓ పెద్ద హీరోకి బెస్ట్ ఫ్రెండ్. ఆ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అల్లు అర్జున్ బి) జూనియర్ ఎన్టీఆర్ సి) రామ్ చరణ్ డి) మహేశ్‌బాబు 14 ‘దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్...పాట ‘పెళ్లి పందిరి’ చిత్రంలోనిది. ఆ పాటలో ఇద్దరు స్నేహితులు నటించారు. అందులో ఒకరు పృథ్వీ. మరో హీరో ఎవరు? ఎ) తరుణ్ బి) శ్రీకాంత్ సి) జగపతిబాబు డి) జె.డి. చక్రవర్తి 15 ‘వసంతం’ సినిమాలో వెంకటేశ్ క్లోజ్ ఫ్రెండ్‌గా నటించిన హీరోయిన్ గుర్తుందా? ఎ) గజాల బి) రాశి సి) సిమ్రాన్ డి) కళ్యాణి 16. ఈ ఫొటోలో రజనీకాంత్‌తో ఉన్నది ఆయన చిరకాల మిత్రుడు. ఆ ఫ్రెండ్ పేరేంటో తెలుసా? ఎ) రాజా బహదూర్ బి) రాజా రవివర్మ సి) రాజన్ డి) రాజమణి 17. ‘నీ స్నేహం ఇక రాదు అని...’ పాట పాడిన సంగీత దర్శకులు ఎవరు? ఎ) యం.యం. కీరవాణి బి) ఆర్పీ పట్నాయక్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) ఇళయరాజా 18. ‘స్నేహితుడా.. స్నేహితుడా రహస్య స్నేహితుడా...’ పాట ‘సఖీ’ చిత్రం లోనిది. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఏఆర్ రెహమాన్ బి) హారిస్ జయరాజ్ సి) దేవా డి) యువన్ శంకర్ రాజా 19. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ‘టైసన్’ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఫ్రెండ్షిప్కు ఎంతో విలువనిచ్చే పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నిఖిల్ బి) వరుణ్ సందేశ్ సి) రాహుల్ డి) వంశీ చాగంటి 20. బాపు అనగానే వెంటనే రమణ గుర్తుకొస్తారు. స్నేహమంటే వారిద్దరిదే అని అందరూ చెప్పుకుంటారు. వారిద్దరూ కలిసి చేసిన ఆఖరి చిత్రమేదో చెప్పుకోండి ఎ) రాధా గోపాళం బి) శ్రీ రామరాజ్యం సి) సుందరాకాండ డి) రాంబంటు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) బి 4) ఎ 5) బి 6) ఎ 7) సి 8) ఎ 9) బి 10) ఎ 11) బి 12) ఎ 13) (బి) 14) సి 15) డి 16) ఎ 17) బి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
వాళ్లు అడిగితే ఓకే
యాక్టర్‌గా శ్రుతీహాసన్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అక్షర కూడా నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరి కూతుళ్ల కెరీర్ సక్సెస్‌లో తండ్రి కమల్ హాసన్ సలహాలు, సూచనలు ఎంతో కొంత భాగం ఉంటాయనుకోవచ్చు. కానీ, కూతుళ్ల కెరీర్ విషయంలో కమల్ ఎప్పుడూ సలహాలివ్వరట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ–‘‘ కెరీర్ అడ్వైజ్‌ని నేను ఎప్పుడూ ఇష్టపడను. నా పద్దెనిమిదేళ్ల వయసులో యాక్టర్‌గా, అన్నీ నేను తీసుకున్న నిర్ణయాలే. ఎవ్వరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోలేదు. నా కూతుళ్లు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుకుంటాను. మా తల్లిదండ్రులు కూడా అదే చేశారు. వాళ్లు అడిగినప్పుడు మాత్రమే వాళ్లు చేసే పనిని విమర్శిస్తా, హెల్ప్ చేస్తా, సహాయం చేస్తా’’ అని పేర్కొన్నారు. -
ఇండియన్ కంటే ముందే..
ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ తండ్రీ కూతుళ్లుగా కమల్‌హాసన్, శ్రుతీహాసన్ యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘శభాష్ నాయుడు’. ఈ చిత్రం గత ఏడాదే ప్రారంభం అయినప్పటికీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఈ సినిమాను ‘ఇండియన్ 2’ (భారతీయుడు సీక్వెల్) స్టార్ట్ అయ్యేలోపే కంప్లీట్ చేస్తామని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘దశావతారం’ సినిమాలోని బలరామ్ నాయుడు క్యారెక్టర్‌కి కొన సాగింపుగా స్వీయ దర్శకత్వంలో ‘శభాష్ నాయుడు’ సినిమాని రూపొందిస్తున్నారు కమల్ హాసన్. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి కమల్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్2’తో బిజీగా ఉన్నాను. అది అయిపోగానే ‘శభాష్ నాయుడు’ పనులు మొదలుపెడతాం. ‘ఇండియన్ 2’ షూటింVŠ స్టార్ట్ చేయడానికి కంటే ముందే ఈ సినిమాను కంప్లీట్ చేసి, వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. కమల్ హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొం దించిన ‘విశ్వరూపం 2’ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది.