Siddipet District News
-
కొనుగోళ్లలో అక్రమాలు సహించం
గజ్వేల్: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు సహించబోమని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని సేకరించామన్నారు. రెండుమూడ్రోజుల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం గజ్వేల్ మార్కెట్ యార్డులో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు బాబుతో మాట్లాడారు. కేంద్రం నిర్వాహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ధాన్యం అమ్ముకోవడానికి కేంద్రానికి వచ్చిన ముట్రాజ్‌పల్లి రైతు రాయగిరి యాదగిరితో మాట్లాడారు. తేమశాతం చూసుకొని, జల్లి పట్టుకొని ధాన్యం తీసుకొచ్చానని చెప్పడంతో కమిషర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ రైతుకున్న అవగాహనను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ కూడా వేస్తున్నామని, ఇప్పటికే రూ.15కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దు కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. దుద్దెడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అలాగే ధాన్యం తీసుకువచ్చిన రైతులతో అడిగి సమస్యలు తెలుసుకున్నారు. 14లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం సేకరణ రెండు, మూడ్రోజుల్లోనే రైతులకు చెల్లింపులు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ గజ్వేల్‌లో కొనుగోలు కేంద్రం పరిశీలనధాన్యం కొనుగోళ్లపై సమీక్షసిద్దిపేటరూరల్: కలెక్టరేట్లో కలెక్టర్ మనుచౌదరితో కలిసి డీఎస్ చౌహాన్ వరిధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు రూ.171 కోట్ల 56 లక్షల విలువైన 73,947 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రచార వాహనం ప్రారంభం... ప్రజా పాలన– ప్రజా విజయోత్సవాల సందర్భంగా రూపొందించిన ప్రజా పాలన కళాయాత్ర వాహనాలను మంగళవారం డీఎస్. చౌహన్ కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీఆర్ రవికుమార్, డీపీఆర్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మరో కాంట్రాక్టర్‌కు అప్పగింత
సాక్షి, సిద్దిపేట: మత్స్యకారులకు చేయూతను అందించేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది పంపిణీ చేసేందుకు మత్స్య శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించారు. మొదటి సారి జూలై 23వ తేదీ వరకు టెండర్లు ఆహ్వానించగా ఎవరు ముందుకు రాలేదు. దీంతో గడువును ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ ఎవరు ముందుకు రాకపోవడంతో మళ్లీ ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. ఇద్దరు కాంట్రాక్టర్లు ముందుకురాగా వారికి చేప పిల్లల ఫాం లేకపోవడంతో వారు అనర్హులయ్యారు.ఇతర జిల్లాల్లో పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్ లక్ష్మీనరసింహ ఫిష్ సీడ్ సప్లయర్స్‌కు జిల్లాకు సరఫరా చేసే బాధ్యతలు సైతం అప్పగించారు. సుమారు 6 లక్షల వరకు చేప పిల్లలను పంపిణీ చేసి.. సీడ్ లేదని సరఫరా చేయలేను అని చెప్పారు. దీంతో మరో కాంట్రాక్టర్ సూర్య అయ్యప్పకు అప్పగించారు. అతను ఇప్పటి వరకు 6.34లక్షల చేప పిల్లలు మాత్రమే సరఫరా చేశారు. రెండోసారి నియమించిన కాంట్రాక్టర్ పంపిణీ చేయడం లేదని ఇటీవల డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్‌కు జిల్లా మత్స్యశాఖ అధికారి లేఖను రాశారు. మరో కాంట్రాక్టర్‌ను నియమించాలని లేఖలో పేర్కొన్నారు. -
మార్కెట్ రేటుకు మూడింతల పరిహారం
కోహెడరూరల్(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఎలా పరిహారం చెల్లించమో అలాగే కెనాల్లో భూములు కోల్పోతున్న వారికీ మార్కెట్ విలువకు మూడింతల పరిహారం అందిస్తున్నట్లు ఆర్డీవో రామ్మూర్తి అన్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామంలో గౌరవెళ్లి ప్రాజెక్టు కెనాల్ కాలువ భూసేకరణ కోసం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరెళ్ల గ్రామ పరిధిలో 11ఎకారల 30గుంటల భూమి అవసరం ఉందన్నారు. భూసేకరణకు ప్రతి రైతు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భూసేకరణ డీటీ అరవింద్, ఆర్ఐ ఎల్లయ్య, ఇరిగేషన్ ఈఈ తదితరులు పాల్గొన్నారు.ముంపునకు గురవుతున్న రైతులతో ఆర్డీఓ రామ్మూర్తి -
చేతులెత్తేసిన.. చేపల కాంట్రాక్టర్లు
టెండర్లకు స్పందన కరువు ● మూడుసార్లు గడువు పొడిగించినా స్పందన నిల్ ● 1,715 చెరువుల్లో 2.21కోట్ల చేపపిల్లల పంపిణీకి నిర్ణయం ● నగదు ఇస్తేనే మేలంటున్న మత్స్యకారులుమత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ముందుకు సాగడంలేదు. పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఒక్కొక్కరుగా చేతులెత్తేస్తుండటమే ఇందుకు కారణం. గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సైతం 1,715 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు 2.21కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. గత నెలలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మధ్యలోనే కాంట్రాక్టర్లు చేప పిల్లలు పంపిణీ చేయలేం అని వెళ్లిపోతున్నారు. ఇదిలాఉంటే చేప పిల్లలకు బదులుగా నగదును అందజేయాలని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు.నగదు ఇవ్వాలి చేప పిల్లలు వదిలేందుకు అదను దాటిపోయిందని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. తమ సొంత డబ్బులతో ప్రైవేట్ ఫిష్ ఫాంలో కొనుగోలు చేసి పెంచుతున్నామని తెలిపారు. ప్రతి ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే చేప పిల్లల పంపిణీ పూర్తయ్యేది. నవంబర్ 19వ తేదీ వచ్చినా ఇప్పటి వరకు పంపిణీ ఐదు శాతం మాత్రమే జరిగింది. సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని పంపిణీ చేయని చెరువులకు సంబంధించి నగదును సొసైటీలకు అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.ఇంకా 2.08 కోట్ల చేప పిల్లలు.. గత ఏడాది 4.41కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సారి ప్రభుత్వం కోత పెట్టి 2.21కోట్ల చేప పిల్లలు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో 35 నుంచి 40ఎంఎం చేప పిల్లలు 84.35లక్షలు, 80 నుంచి 100ఎంఎం 1,31,92,000 పంపిణీ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు 25 చెరువుల్లో 12.34లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు. ఇంకా సుమారుగా 2.08 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. -
గజ్వేల్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు
గజ్వేల్: ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లోనూ కాంగ్రెస్ గ్రూపు విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంగళవారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా పార్టీ శ్రేణులు పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్తోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా అసమ్మతి నేత బండారు శ్రీకాంత్‌రావు సైతం తన వర్గంతో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించడంతోపాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.రెండు గ్రూపులుగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు -
భూసేకరణలో ఎవరినీ నొప్పించం
హుస్నాబాద్: ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణ విషయంలో రైతులు సహకరించాలని, నిర్బంధాలు, దౌర్జన్యాలు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ విశాల సహకార పరపతి సంఘం నూతన కార్యాలయం భవనం, 1200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతనంగా నిర్మించిన గోదాంను మంగళవారం మంత్రి ప్రారంభించారు. సంఘం వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ లక్ష్మీకాంతారావు సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. హుస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సంఘం ఆధ్వర్యంలో రైస్‌మిల్లు, విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ సంఘం ద్వారా రూ.504 కోట్లు రుణ మాఫీ జరిగిందని, ఇంకా 204 మందికి రుణ మాఫీ జరగాల్సి ఉందని తెలిపారు. చౌటపల్లిలో వ్యవసాయాధారిత పరిశ్రమలు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల నిర్మాణాలకు భూ సేకరణ కోసం అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామన్నారు. కాలువల కోసం రైతులు సహకరించాలన్నారు. కాలువల డిజైన్ చేసింది తాము కాదని, ఇంజనీర్ల సూచనల ద్వారానే కాలువల అలైన్మెంట్ జరుగుతుందన్నారు. పారిశ్రామిక కారిడార్ తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాలుష్యాన్ని వెదజల్లె పరిశ్రమలు కాకుండా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు కొండూరి రవీందర్, తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత పాల్గొన్నారు. నిర్బంధాలు, దౌర్జన్యాలు ఉండవు పరిశ్రమలకు రైతులు సహకరించాలి సహకార సంఘాల అభివృద్ధికి కృషి మంత్రి పొన్నం ప్రభాకర్ -
గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోండి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పోటీ పరీక్షల అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జయశ్రీ పాల్గొని మాట్లాడారు. తాను 24 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి, గ్రూప్స్ రాసి జిల్లా ఆడిట్ ఆఫీసర్ గా నియమితులైనట్లు తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఆడిట్ అధికారిని గ్రంథాలయ ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
పీజీ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లు
సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట (స్వయం ప్రతిపత్తి)లో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఎమ్మెస్సీ బాటని, జువాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎం.కామ్, ఎంఏ తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ విభాగాలలోని ిపీజీ కోర్సులలో మిగిలిన సీట్లకు ఈ నెల 22న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ అయోధ్యలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 22న స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో సంప్రదించాలన్నారు. మధుమేహ వ్యాధి నియంత్రణ మనచేతుల్లోనే..సిద్దిపేట ఎడ్యుకేషన్: రోజువారి దినచర్యలతో మధుమేహ వ్యాఽధిని నియంత్రించవచ్చని ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దేశం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో మధుమేహం వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ దేశం మాట్లాడుతూ వంశపారంపర్యంగా, ఆహారపు అలవాట్ల ద్వారా మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మధుమేహం బారీన పడుతున్నారన్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు రిఫైండ్ ఆహార పదార్థాలు, ఉడికించిన దుంపలు తినకూడదని సూచించారు. సరైన మందులు, దినచర్యలో మార్పులు తీసుకురావడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నేహిక, మెడిసిన్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలరించిన శతావధానంప్రశాంత్నగర్(సిద్దిపేట): అవధానాలతో పద్య, విద్య అభివృద్ధి చెందుతుందని, ప్రముఖ కవి, పండితులు దోర్బల ప్రభాకరశర్మ అన్నారు. సిద్దిపేట హరిహర రెసిడెన్సిలోని శ్రీలలితా చంద్రమౌళీశ్వర ఆలయ వార్షికోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా పండరి రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన శతావధానం అలరించింది. ముఖ్య అతిథిగా హాజరైన పండితులు దోర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ పద్యం రసనైవేద్యం అన్నారు. పద్య కవిత్వం మధురంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమాపతి రామ శర్మ, ఉజ్జయిని మహాకాళేశ్వరరావు, వరుకోలు లక్ష్మయ్య, భ్రమరాంబిక, బిట్టు బాబు, కట్టా రంజిత్ కుమార్, తాటికొండ శివ కుమార శర్మ , చొప్పదండి సుధాకర్, వైభవి మొదలైన పృచ్చకులు పాల్గొన్నారు. ఆరుబయట చెత్తవేస్తే జరిమానా సిద్దిపేటజోన్: స్వచ్ఛ సిద్దిపేట మనందరి లక్ష్యమని, ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సూచించారు. మంగళవారం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చెత్తను వేరుచేసి ఇవ్వకుండా అంతా కలిపి ఇవ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రికి రూ.50 వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో తడి, పొడి, హానికర చెత్త అని మూడు రకాలుగా విభజన చేసి పారిశుద్ధ్య కార్మికులకు, చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. ఆరుబయట చెత్తే వేస్తే జరిమానా తప్పదన్నారు. రెండు సార్లు ఆస్పత్రి అధికారులను హెచ్చరించినా మార్పు రాలేదని దీనితో జరిమానా విధించాల్సి వచ్చిందన్నారు. అంతకుముందు మైత్రి వనంలోని పిల్లల పార్క్ పరిశీలించి మరమ్మతులు చేయాలని సూచించారు. మొక్కలకు ప్రతి రోజు నీరు పట్టాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజావాణిపై నిర్లక్ష్యం తగదు
బీటీ రోడ్డు పనులు వేగిరం చేయండి సిద్దిపేటరూరల్ మండలం పుల్లూరు నుంచి రామంచ వరకు బీటీ రోడ్డు పనులు వేగిరం చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు ఉమేశ్ మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరైనప్పటికీ పనులు మాత్రం నామమాత్రంగా జరిగాయన్నారు. రాత్రి వేళలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం ముదిరాజ్, అసెంబ్లీ ఇన్చార్జి పంగబాబు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సంపత్, తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేటరూరల్: సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిపై నిర్లక్ష్యం తగదని, జిల్లా అధికారులు, ఆయా శాఖలకు చెందిన సబార్డినేట్ లు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ప్రజావాణికి వస్తారన్నారు. స్వీకరించిన ఫిర్యాదులపై అధికారులు సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా హాజరు కావాలని, వారి శాఖలకు సంబంధించిన సబార్డినేట్లను ప్రజావాణికి పంపరాదన్నారు. సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సమస్యలపై ప్రజావాణికి మొత్త 48 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అత్యాచారాలను అరికట్టండి రోజురోజుకు దళితులపై పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులికల్పన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో టీహెచ్ఆర్ నగర్‌కు చెందిన దళిత మహిళపై, మర్కుక్ మండలం ఎర్రవెల్లి , వర్గల్ మండలం మాదారం గ్రామాలకు చెందిన మహిళల అనుమానాదాస్పద మరణాలకు కారకులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. నిందితులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు. అధికారులందరూ హాజరుకావాలి కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సబార్డినేట్ల హాజరుపై కలెక్టర్ సీరియస్ -
కూలీలందరికీ పని కల్పించండి
హుస్నాబాద్‌రూరల్: జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా 2023–24 సంవత్సరానికి మండలంలో రూ.3.11 కోట్ల పనులు చేపట్టారు. దీనిపై సోమవారం మండల పరిషత్ ఆవరణలో ప్రజావేదిక నిర్వహించి పనుల ఆడిట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ బాలకిషన్ మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ పనులు చేయడంతో పాటు నీటి నిల్వకు ఫారంపాండ్లు తవ్వించడం వలన నీటి ఊటలను పెంచుతుందని అన్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులను ఆడిట్ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు కొన్ని లోపాలు వెలుగు చూసినట్లు చెప్పారు. ఒకరికి బదులు మరొకరు పనులు చేయడం, పశువుల పాకల విస్తీరణం లేకపోవడం లాంటి లోపాలను గుర్తించి నివేదించారు. అడిట్ బృందాలు ఇచ్చిన నివేదికలతో సిబ్బందితో చర్చించి రూ.50 వేల పనుల పై వివరణ కోరమన్నారు. తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ, ఏపీఓలకు సూచించారు. గ్రామాల్లోని కూలీలకు పనులు కల్పించే విధంగా ప్రణాళికలను రూపొందించి పనులు చేయించాలని చెప్పారు. కూలీలకు వెంటనే బిల్లులు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, గ్రామాల అభివృద్ధి పనులను గుర్తించి కూలీల చేత చేయించాలన్నారు. ఈ ప్రజావేదికలో ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీఓ రమేశ్, ఏపీఓ పద్మ, సీసీ పర్షరాములు తదితరులు పాల్గొన్నారు. అదనపు డీఆర్డీఓ బాలకిషన్ ఉపాధిహామీ పనులపై ప్రజావేదిక -
మా భూములు తీసుకోండి
ఇండస్ట్రియల్ పార్క్‌కు ఒప్పుకుంటున్నాం● కలెక్టర్ మనుచౌదరిని కలిసిన రైతులు ● 55ఎకరాల భూముల పట్టాపాస్ పుస్తకాలు అందజేతఅక్కన్నపేట(హుస్నాబాద్): ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి పచ్చ జెండా పడినట్లే. అక్కన్నపేట మండలం చౌటపల్లి క్రాసింగ్ వద్ద ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి తాము ఒప్పుకుంటున్నామని, మా భూములు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ మనుచౌదరిని కలిశారు. ఈ సందర్భంగా సుమారు 55ఎకరాలకు సంబంధించిన పట్టాపాస్ పుస్తకాల జిరాక్స్ ప్రతులను కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇండస్ట్రీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఇంకా 28ఎకరాలే...ఈ చౌటపల్లి క్రాసింగ్ వద్ద సర్వే నంబర్ 312లో దాదాపు 83ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఈ భూమిని గతంలో పేదలకు అసైన్డ్ చేసి పంపిణీ చేశారు. ఈ భూములన్నీ హుస్నాబాద్ నుంచి అక్కన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉంటాయి. మరికొద్ది రోజుల్లో ఈ ప్రధాన రహదారి నాలుగు లేన్లుగా మారనున్నది. ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భాగంగా సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్న రైతులే ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. దీంతో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇంకా సుమారు 28ఎకరాలే కావాల్సి ఉంది. -
దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంచండి
సిద్దిపేటకమాన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు పెన్షన్ రూ.6వేలకు పెంచి, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా నరసింహ, జిల్లా ఇన్చార్జి పర్సన్‌గా ఆంజనేయులును నిమమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, దుర్గయ్య, బాలకృష్ణ, అనిల్, బాను తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం బిక్కుబిక్కు
సిద్దిపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రమాదం పొంచి ఉంది. రోడ్డుపై కొన్ని చెట్లు ప్రమాదకరంగా ఒరిగి ఉన్నా.. ఇనుప రేలింగ్ విరిగినా మున్సిపల్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ సైతం లోపించిందని అంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటరోడ్డుపైకి వరిగిన చెట్టు -
నిమ్మయ్యకు జాతీయ అవార్డు
జగదేవ్‌పూర్(గజ్వేల్): గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న జగదేవ్‌పూర్ పీస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో పాన్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ముఫై ఏళ్లుగా పీస్ సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి పాన్ ఇండియా నేషనల్ అవార్డును ఎమ్మెల్సీ కోదండరాం, ప్రముఖ కవి గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మయ్య మాట్లాడుతూ నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరింత బాధ్యత పెంచిందన్నారు. గ్రామాభివృద్ధికి కృషి, సామాజిక కార్యక్రమాలు చేయడం సంస్థ లక్ష్యమన్నారు. గుణాత్మకమైన విద్యను అందించాలిజిల్లా సెక్టోరియల్ అధికారి నర్సింహులు దౌల్తాబాద్(దుబ్బాక): విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సెక్టోరియల్ అధికారి నర్సింహులు అన్నారు. మండల పరిధిలోని దౌల్తాబాద్, ముబారస్పూర్లోని ఎంజేపీ బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలను సోమవారం ఆయన సందర్శించారు. రికార్డులను, విద్యార్థుల సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసి విద్యాబోధన చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ గజ్జెల కనకరాజు, హెచ్ఎంలు ప్రకాశం, అప్జల్ హుస్సేన్, దుర్గా ప్రసాద్, సీఆర్పీలు, ఎమ్మార్సీలు తదితరులు పాల్గొన్నారు. దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్మిరుదొడ్డి(దుబ్బాక): దోమల నివారణకు ఆయిల్‌బాల్స్ వేసే కార్యక్రమాన్ని మిరుదొడ్డి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రారంభించారు. ఆయిల్ బాల్స్‌ను తయారు చేసి మురుగు కాలువల్లో వేస్తున్నారు. చిన్న చిన్న గోనె సంచుల్లో చెక్క పొట్టును నింపి బాల్స్‌లా తయారు చేస్తున్నారు. అలా తయారైన బాల్స్‌ను కిరోసిన్‌లో తడుపుతున్నారు. వాటిని ప్రధాన మురుగు కాలువల్లో అక్కడక్కడా వేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధిచెందకుండా పూర్తిగా నిర్మూలించవచ్చని పంచాయతీ కార్యదర్శి ఫహీం తెలిపారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బుచ్చిరెడ్డిసిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ముత్యాల బుచ్చిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడి నుంచి నియామక పత్రాన్ని అందుకున్న బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు హరికృష్ణ , శ్రీనివాస్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
నాలుగు ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
సిద్దిపేటకమాన్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, పాలిక్లినిక్ సెంటర్లపై చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, పాలి క్లినిక్ సెంటర్లను వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని గురు సాయి కంటి ఆసుపత్రి, నిరామయ, బజరంగ్ పాలి క్లినిక్, మారుతి పాలి క్లినిక్‌లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఆస్ప త్రుల సమాచారం, రిజిస్ట్రేషన్, వసతులు, ధరల పట్టక ప్రదర్శన, రెన్యువల్ వంటి ఇతర అన్ని రకాల వివరాలు హెచ్ఐఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయా లన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే వాటిపై చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రుల రికార్డులు, పేషెంట్ల కేషీట్ల పూర్తి వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు. ఆస్పత్రుల పేర్లు, డాక్టర్ పేరు మార్చినా జిల్లా వైద్యారోగ్యశాఖ డీఆర్ఏ ద్వారా అనుమతి పొందాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకళ, డాక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాల్సిందే లేదంటే చర్యలు తప్పవు డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ -
ప్రశాంతంగా ముగిసిన గ్రూపు 3 పరీక్షలు
సిద్దిపేటఅర్బన్: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూపు 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని 37 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించింది. నిమిషం నిబంధనతో అఽభ్యర్థులు సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం జరిగిన పరీక్షకు 13,401 మంది అభ్యర్థులకు 7,349 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. గ్రూపు–3 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖకు, సహకరించిన ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు.రెండో రోజూ హాజరు సగమే.. -
ఎన్నాళ్లీ యాతన
● నత్తనడకన జాతీయ రహదారి పనులు ● ముందుకు సాగని మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి రహదారి నిర్మాణం ● వాహనదారులకు తప్పని తిప్పలు ● త్వరగా పూర్తిచేయాలంటూ వినతులుమెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు ఇలాగే సాగితే మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టిసారించి పనులు త్వరగా పూర్తిచేసేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు. సాక్షి, సిద్దిపేట: మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి (765డీజీ) జాతీయ రహదారి పనులను 2022లో వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 133.61 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.1,461కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు రెండు ప్యాకేజీలుగా జాతీయ రహదారుల శాఖ విభజించింది. అందులో మొదటి ప్యాకేజీ మెదక్ నుంచి సిద్దిపేట.. 69.97కిలో మీటర్లకు రూ.882కోట్లు, రెండో ప్యాకేజీ సిద్దిపేట నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు 63.64 కిలోమీటర్లకు రూ.579 కోట్లను కేటాయించారు. ఏడాదిన్నరగా సాగుతున్న పనులు రోడ్డు విస్తరణ పనులు ఏడాదిన్నరగా సాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల దగ్గర 8 నుంచి 10మీటర్ల వెడల్పుతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. పందిళ్ల సమీపంలో టోల్ ప్లాజా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన 400 ఫీట్ల వెడల్పు స్థల సేకరణ ఇంకా చేపట్టలేదు. అలాగే ఆరెపల్లి నుంచి కోహెడ వరకు 1.3 కిలో మీటర్లు రోడ్డు ఎక్కువగా మలుపులున్నాయి. ఎలాంటి మలుపులు లేకుండా చేసేందుకు ఇంకా స్థల సేకరణ చేపట్టాలి. అలాగే హుస్నాబాద్ పట్టణంలో విస్తరణ పనులు జరుగుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి కాకపోవడంతో తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేయడంతో అది కోట్టుకపోయి వాహనాల రాకపోకలు వారం రోజుల పాటు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు రాకపోకలు సాగిస్తుంటే విపరీతంగా దుమ్ము లేస్తుండటంతో ఇబ్బందులు అన్నీఇన్నీకావు. పనులు నెమ్మదిగా సాగుతుండటంతో మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.పలువురు మృత్యువాత రోడ్డు విస్తరణ సందర్భంగా నిబంధనలు పాటించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తీసిన గుంతలవద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కొందరు మృత్యువాత, మరికొందరు తీవ్రగాయాల పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.మార్చిలోగా పూర్తిచేస్తాం మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి రోడ్డు పనులు మార్చిలోగా పూర్తయ్యేందకు కృషి చేస్తాం. క్రాసింగ్‌లు లేకుండా ఉండేందుకు, టోల్‌ప్లాజా కోసం కొంత స్థల సేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ఆలస్యం కాకుండా చూస్తాం –కృష్ణారెడ్డి, ఈఈ, జాతీయ రహదారులు -
సుందరీకరణకు బ్రేక్!
చొరవ చూపని నేతలుగజ్వేల్: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు సగంలోనే ఆగిపోవడం, మరికొన్ని ప్రారంభానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అభివృద్ధికి నమూనాగా ఊదరగొట్టిన నేతలు ప్రస్తుతం మిన్నకుండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రత్యేకించి పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టాలనుకున్న.. ఎనిమిది జంక్షన్ల అభివృద్ధి పనుల పెండింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. రెండున్నరేళ్ల క్రితం మున్సిపల్ పాలకవర్గం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించింది. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. కూడళ్లను సుందరీకరించేందుకు.. పట్టణంలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తా, తూప్రాన్ రోడ్డులోని బాబుజగ్జీవన్‌రామ్ వై జంక్షన్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సర్కిల్, ముట్రాజ్‌పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిద్దిడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్ చౌరస్తా, బాబూజగ్జీవన్‌రామ్ చౌరస్తా, ముట్రాజ్‌పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేశారు. మిగతా చోట్ల పనుల ఊసే లేదు. ప్రత్యేకించి ఇందిరాపార్కు చౌరస్తాలో జంక్షన్‌ను అభివృద్ధి చేయాలంటే ప్రస్తుతమున్న చౌరస్తాను విస్తరించాల్సి ఉంటుంది. దీని ద్వారా జంక్షన్‌కు మరింత శోభ చేకూరే అవకాశముంది. కానీ విస్తరణలో కొన్ని ముఖ్యమైన భవనాలను కొంత భాగం కట్ చేయాల్సి వస్తుందనే భావనతో ఈ ప్రతిపాదన ముందుకు సాగడం లేదని తెలుస్తున్నది. ఇందిరాపార్కు కూడలి కీలకం.. మున్సిపాలిటీకి ఇందిరాపార్కు కూడలి అత్యంత కీలకమైనది. ఇక్కడ జంక్షన్ అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టినట్లవుతుంది. అంతేకాకుండా ఈ జంక్షన్ పట్టణానికి తలమాణికంగా నిలవనుంది. కానీ ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపడం లేదు. అదేవిధంగా ఐఓసీ వద్ద కూ డా జంక్షన్ అభివృద్ధి చేయాల్సి ఉండగా...ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. దీంతో ఈ ప్రదేశంలో పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు.గజ్వేల్ పట్టణంలో సుందరీకరించాల్సిన ఇందిరాపార్కు జంక్షన్ ఇదే‘లవ్ జీపీపీ’ అంతేనా?గజ్వేల్ మున్సిపాలిటీలో నిలిచిన ప్రగతి ఎనిమిది జంక్షన్లలో మూడు మాత్రమే పురోగతి రూ.2కోట్ల నిధులున్నా పనులు సగమే.. ప్రతిపాదనల్లో మరిన్ని నిర్మాణాలు రెండు నెలల్లో పాలకవర్గం పదవీ కాలం పూర్తిగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణ పనులకు బ్రేక్ పడింది. పట్టణంలోని ఎనిమిది జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా.. కేవలం మూడింటిని మాత్రమే అభివృద్ధి చేసి చేతులు దులుపుకొన్నారు. రూ.2కోట్ల నిధులున్నా పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల్లో మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం కూడా ముగియనుంది. అయినా ఈ పనులపై ఏమాత్రం పట్టింపులేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.ఇకపోతే ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద ‘లవ్ జీపీపీ’ పేరుతో ఏర్పాటు చేయాలనుకున్న స్వాగత ద్వారం పనులు పెండింగ్‌లో పడ్డాయి. కాగా పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తాల సుందరీకరణ కూడా ముందుకుసాగటం లేదు. ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం సైతం మరో రెండు నెలల్లో ముగియనుండగా.. ఈ పనులపై ఇప్పటికీ కనీస పట్టింపులేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు వేగిరం చేస్తాం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో జంక్షన్ల అభివృద్ది పనులు పెండింగ్‌లో పడిన మాట వాస్తవమే. ఐఓసీ వద్ద కోర్టు కేసు కారణంగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందిరాపార్కు చౌరస్తా వద్ద అందరి సహకారంతో పనులు సాగేలా ప్రయత్నిస్తాం. మిగతా చోట్ల కూడా పరిశీలన జరుపుతాం. – గొల్కొండ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ -
ఉరుకులు.. పరుగులు
● గ్రూప్ 3పరీక్షలకు హాజరు అంతంతే.. ● మొదటి పేపర్‌కు 5,981 మంది.. రెండో పేపర్‌కు 5,989 మంది గైర్హాజరు ● నిమిషం నిబంధనతో 40 మంది దూరం ● పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీసిద్దిపేటజోన్: గ్రూప్ 3 పరీక్షల నిబంధనలు అభ్యర్థులను ఉరుకులు.. పరుగులు పెట్టించాయి. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 13,401 మందికి 37 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన మొదటి పేపర్లో 5,981మంది, మధ్యాహ్నం పరీక్షలో 5,989 మంది గైర్హాజరు అయ్యారు. మరోవైపు ఒక్క నిమిషం నిబంధనతో పట్టణంలోని ఆయా కేంద్రాల్లో 40 మందిని అనుమతించలేదు. దీంతో వారు పరీక్ష రాయకుండానే వెనుదిరిగివెళ్లారు. బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. మరోవైపు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్ ప్రక్రియ పరిశీలించారు. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా? ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అర్బన్ తహసీల్దార్ సలీమ్ తదితరులు ఉన్నారు. మరోవైపు జిల్లా పోలీసు కమిషనర్ అనూరాధ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ప్రక్రియపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, మల్లారెడ్డి, ఏసీపీ మధు, త్రీ టౌన్ సీఐ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో రౌడీయిజం జాన్తానై..
జోగిపేట(అందోల్): రాజకీయాల్లో గూండాయిజం, రౌడీయిజం చెల్లదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రశ్నించే, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందన్నారు. తాము కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై శాంతియుతంగా పోరాటాలు నిర్వహించామన్నారు. కానీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ నేతలు కలెక్టర్ స్థాయి అధికారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అందుకు వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు చేసిన కుట్రలు బయటపడగా అందులో నుంచి బయట పడేందుకు ఢిల్లీస్థాయిలో పైరవీలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. 32 వేల ఎకరాలు ముంపునకు గురైతే 1600 మంది రైతులు కోర్టును ఆశ్రయించి ప్రతీకేసును గెలిచారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 54 వేల పోస్టులను భర్తీ చేసిందన్నారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీని సంపూర్ణంగా చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నిర్మల తదితరులు పాల్గొన్నారు.ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి దామోదర రాజనర్సింహ -
అన్నదానం మహాపుణ్యం
సిద్దిపేటజోన్: ‘ఆపదలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రికి ఎందరో పేదలు వస్తుంటారు. వారికి అన్నం పెట్టడం పుణ్యకార్యంతో సమానం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన సేవలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి రోజుల పాటు నిస్వార్థంగా పేదలకు అన్నదానం చేయడం చాలా పుణ్యమైన పనిగా అభివర్ణించారు. మనుషులు ఆరాధించే భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాలు మానవసేవయే మాధవ సేవ అని చెబుతున్నాయన్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా పేదలకు మంచి చేయమనే చెబుతున్నాయని, అలాంటి మంచి కార్యక్రమాలకు సంపూర్ణంగా సహకారం అందిస్తానని అన్నారు. అనంతరం పేదలకు వడ్డించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిది అతిక్ అహ్మద్‌ను సన్మానించారు. అంతకుముందు పట్టణంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు మోహిజ్, సాయి కుమార్ పాల్గొన్నారు. వెయ్యి రోజుల పాటు దానం గొప్ప పని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు -
పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తిరుపతి
దుబ్బాక: పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా దుబ్బాక పట్టణానికి చెందిన గాజుల తిరుపతి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. నేతన్నలకు కుల వృత్తిలో తగిన ఉపాధి కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నమ్మకంతో తనకు పదవీబాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి పోరాటంబెజ్జంకి(సిద్దిపేట): ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సీపీఎం మూడో మహాసభ ఆదివారం బెజ్జంకిలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది సీపీఎం పార్టీయేనని అన్నారు. పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాల్లబండి శశిధర్, మండల కార్యదర్శి శ్రీనివాస్, దాసరి ప్రశాంత్, బొమ్మిడి సాయికృష్ణ, ఎల్లయ్య, లింగం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పరిహారం ఇవ్వడంలేదని..మహిళ ఆత్మహత్యాయత్నం దుబ్బాకరూరల్: భూమికి సంబంధించిన పరిహారం డబ్బులు రాక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మండలంలోని కమ్మర్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోడ మల్లవ్వకు ఎకరం భూమి ఉంది. మల్లన్న సాగర్ ఉప కాలువ నిర్మాణంలో భూమి కోల్పోయింది. పలుమారు అధికారులు పరిహారం డబ్బులు చెల్లించాలని వేడుకుంది. ఎవరూ స్పందించకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులపై వేధింపులు ఆపాలి జహీరాబాద్ టౌన్: సమగ్ర కులగణన సర్వే చేస్తున్న ఉపాధ్యాయులపై అధికారుల వేధింపులను నిలిపివేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్ యూనియన్ (ఎస్జీటీయూ) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా 150–180 వరకు గృహాల సర్వే చేయాలంటూ ఆదేశాలున్నాయన్నారు. కానీ అంతకన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల సర్వే సకాలంలో పూర్తి కావడం లేదన్నారు. ఈ విధులు నిర్వహిస్తున్న టీచర్ల పట్ల మండల అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. న్యాల్కల్ మండలం చాల్కి ప్రభుత్వ పాఠశాలో పని చేస్తున్న టీచర్ శంకర్‌ను మండల ఎంపీఓ సురేశ్ దూషించారన్నారు. సర్వే ఫారాల కోసం శంకర్ ఎంపీఓ ఇంటికి వెళ్లినందుకు స్కూల్‌కు వచ్చి అసభ్యంగా తిట్టారన్నారు. వెంటనే ఈ విషయమై ఎంపీడీఓకు ఫిర్యాదు చేశామన్నారు. ఉపాధ్యాయుడి పట్ల దురుసుగా వ్యవహరించిన ఎంపీఓపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనట్లయితే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
సదర్ అందరి పండుగ
సిద్దిపేటజోన్: సదర్ అంటేనే అందరి పండుగ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు సదర్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ అనేది కులాల మధ్య ఐక్యత పెంచుతుందన్నారు. కేసీఆర్ హయాంలోనే యాదవుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రేవంత్ పాలనలో లా అండ్ ఆర్డర్ పోయిందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో దీపావళి తర్వాత సదర్ పెద్ద ఎత్తున సాగుతోందన్నారు. సదర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు రఘురాం, సుందర్, మోహిజ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటలో కనులపండువగా సదర్ ఉత్సవం -
సంక్షేమ పథకాలు అందించేందుకే సర్వే..
సిద్దిపేటరూరల్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో కొనసాగుతున్న సమగ్ర సర్వేను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్యుమరేటర్లతో మాట్లాడుతూ సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 35 శాతం సర్వే పూర్తియిందన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం సర్వేను తప్పుదోవ పట్టిస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలో రూ.2లక్షలపైగా ఉన్న రైతుకు కూడా రుణ మాఫీ చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ శ్రీరాములు, ఎంపీఓ శ్రీనివాస్‌రావు, నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.