Srikakulam District News
-
నేడు తడబడి
ఇంగ్లిష్‌లో మాట్లాడడం నేర్చుకున్న బిడ్డను చూసి నాడు సామాన్యుడు ఉప్పొంగిపోయాడు. ఆ ఆనందం ఇప్పుడు దూరమవుతోంది.. రూపాయి ఖర్చు లేకుండా పిల్లల చేతికి అందిన ఖరీదైన ట్యాబులు చూసి పేదలు మురిసిపోయారు. ఆ సంబరం ఇప్పుడు లేకుండాపోయింది.. ప్రభుత్వ బడుల్లో శిథిల గదులకు నాడు–నేడు కొత్త ఊపిరి పోసింది.. ఆ చొరవ ఇప్పుడు కనిపించడం లేదు. పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మ ఖాతాలో ఠంచనుగా డబ్బు పడేది.. మాటలు కోటలు దాటుతున్నా ఖాతాలో రూపాయి జమ కావడం లేదు.. ప్రభుత్వ విద్యావ్యవస్థ గతమెన్నడూ చూడని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపురూప సంస్కరణలు ప్రవేశపెట్టారు. కానీ ఆ పథకాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఉత్త మాటలు చెబుతూ సామాన్యుల బిడ్డల చదువులను వెక్కిరిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తెలకు గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తుండగా శుక్రవారం కారు ఢీ కొట్టటంతో తల్లీకుమార్తెలు యతిరాజుల చంద్రకళ, కుమార్తె మౌనిక గాయపడ్డారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస నవోదయ పాఠశాలలో కుమార్తె 10వ తరగతి చదువుతోంది. ఆమెను స్వగ్రామం కేశవరావుపేటకు తీసుకువచ్చేందుకు తల్లి స్కూటీపై వెళ్లింది. ఇద్దరూ బండిపై వస్తుండగా నవభారత్ నుంచి కింతలి మిల్లు వైపు సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో కొయ్యరాళ్లు కూడలి సమీపంలో కారు వీరి బండిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తల్లీకుమార్తెలు రోడ్డుపై పడిపోయారు. ఇద్దరికీ చిన్న దెబ్బలే తగలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు నంబర్ ప్లేట్ రోడ్డుపై పడిపోవటంతో ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్‌కుమార్‌కు వాట్సాప్‌లో స్థానిక ప్రయాణికులు ఫొటో పంపించారు. అనంతరం 108లో శ్రీకాకుళం రిమ్స్‌లో క్షతగాత్రులు చేరారు. శ్రీకాకుళం సమీపంలో ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ కూడలి వద్ద సీఎంఆర్ నూతన షోరూమ్ 40వ బ్రాంచ్‌ను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంత పెద్ద బంగారు, వస్త్ర దుకాణం శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయ మని అన్నారు. కార్యక్రమంలో సినీ తార శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను గత 4 దశాబ్దాలుగా ఏపీ, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపా రు. శ్రీకాకుళం నగరంలో ఇంత పెద్ద షోరూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎంఆర్‌లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు. కుటుంబమంతటికీ న చ్చేలా అన్ని రకాల వస్త్రాలు తక్కువ ధరకు అందించడం సీఎంఆర్ ప్రత్యేకత అని తెలిపారు. సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సీఎంఆర్ అందిస్తుందన్నారు. అనంతరం సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ సీఎంఆర్ అంటేనే ది వన్ స్టాప్ షాప్ అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వైరెటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. ప్రస్తుత యువతరానికి నచ్చేవిధంగా అన్ని రకాల వైరెటీలు లభిస్తాయన్నారు. జనమంతా ఆమె ‘లీల’లోనే.. సినీతార శ్రీలీలను చూసేందుకు వందలాది మంది యువత షోరూమ్ వద్దకు వచ్చారు. జోరువానను కూడా లెక్క చేయకుండా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. షోరూమ్ ప్రారంభోత్సవంలో జ్యోతి ప్ర జ్వలన చేసిన శ్రీలీల అన్ని సెక్షన్లు తిరిగి అన్ని రకా ల వస్త్రాలను పరిశీలించారు. ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు నాణ్యమైనవి ఉంటాయని, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు తగిన ధరల్లో చీరలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా అభిమానులతో సెల్ఫీలు దిగి, స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ప్రము ఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ కె.సోమేశ్వరరావు, టెక్ట్స్‌టైల్ మొదటి కొనుగోలుదారులుగా అంధవరపు ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త పత్తి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
వెబ్సైట్లో మున్సిపల్ టీచర్ల పదోన్నతుల సీనియారిటీ జాబితా
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు.. జిల్లాలోని నిర్దే శించిన మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూళ్లలో టీచర్ల పదోన్నతుల సీనియారిటీ జాబితా డీఈఓ అధికారిక వెబ్సైట్లో సిద్ధంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తెలిపా రు. జిల్లాలోని ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాల సహాయకుల పోస్టుల కోసం అర్హులైన ఎస్జీటీలు, తత్సమానమైన కేడర్ కలిగిన ఉపాధ్యాయుల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చినట్టు చెప్పారు. జాబితాపై అభ్యంతరాలుంటే..ఈనెల 23వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని డీఈఓ కోరారు. -
పవన్ అనుచిత వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోరా ?
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి: వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై చెప్పు చూపించి అనుచితంగా మాట్లాడాననే కారణంతో తనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని, అయితే అప్పట్లో ఇదే పవన్‌కల్యాణ్ వైఎస్సార్సీపీ మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోరా అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్‌పై ఎమ్మెల్సీ దువ్వాడ అనుచితంగా వ్యాఖ్యలు చేశారనే కారణంతో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఇటీవల పోలీసులు దువ్వాడకు నోటీసులు అందజేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం టెక్కలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్‌పై దుర్భాషలాడాననే కారణంతో తనకు నోటీసులు ఇచ్చారని అయితే అందులో తేదీ, సమయం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలుగా మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దువ్వాడ దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తాను భయపడేది లేదన్నారు. పోలీసులతో తప్పుడు చర్యలకు ప్రోత్సహిస్తున్నారని ఇది మంచిది కాదన్నారు. ఎన్నికల మునుపు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ఇలా కక్షపూరితమైన చర్యలపై దృష్టి పెట్టడం సిగ్గుచేటుగా ఉందని దువ్వాడ మండిపడ్డారు. -
‘పవర్ ప్రేమికుడు’కి మొదటి బహుమతి
జి.సిగడాం: స్థానిక మోడల్ పాఠశాలలో పదో తర గతి చదువుతున్న విద్యార్థులు విద్యుత్ వినియోగదారుల కోసం తీసిన లఘు చిత్రం ‘పవర్ ప్రేమికుడు’ రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. శుక్రవారం విజయవాడలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు చేతులమీదుగా తెలుగు అధ్యాపకులు కోట తిరుపతిరావు, విద్యార్థులు వి.వైకుంఠరావు, డోల వరప్రసాదరావు, ఎ.ఈశ్వర్, ఆర్.తేజలకు రూ.20వేలు నగదు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎపిఎస్ఈసిఎం) నిర్వహించిన పోటీల్లో పవర్ ప్రేమికుడు లఘు చిత్రంలో విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నా శామ్యేల్ లెంక, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
పీజీ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ మూడో సెమిస్టర్ పరీక్షలు జరగుతున్నాయి. వర్సిటీలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు విద్యార్థులతో ల్యాబుల్లో పరీక్షలు రాస్తున్నట్లు సైతం ప్రచారం జరుగుతోంది. ఇన్విజిలేషన్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అప్పగించగా, వారు నాన్ టీచింగ్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించి వారి వ్యక్తిగత పనులు చూసుకుంటున్నట్లు స మాచారం. దీంతో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. పలువురు విద్యార్థులు సైతం ఈ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్ వద్ద ఈ విషయం ప్రస్తావించగా, చూసి రాతలకు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. ఇన్విజిలేటర్లుగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధన సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పనులు వేగంగా పూర్తి చేయాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధి హామీ పను లను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన పంచాయతీ రాజ్ ఇంజినీర్లు, కాంట్రా క్టర్లతో సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులు అప్లోడ్ చేయాలని చెప్పారు. బీటీ, సీసీ రోడ్లు, తదితర పనులు వర్షాలు తగ్గిన వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం సమీక్షిస్తానన్నారు. సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. 31 వరకు ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు అవకాశం శ్రీకాకుళం న్యూకాలనీ: 2025–26 విద్యా సంవత్సరానికిగాను కొత్తగా ప్రైవేటు ఉన్నత పాఠశాలల ఏర్పాటుకు, పాఠశాలల అప్‌గ్రెడేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసే ప్రాంతంలో విద్యార్థుల సంఖ్య లేదా అప్పటికే నడుస్తున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి లేదా అవసరాన్ని బట్టి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని డీఈఓ పేర్కొన్నారు. ఏపీ పాఠశాల విద్య డైరెక్టర్ అమరావతి వారి దేశాల మేరకు ఈనెల 31 వరకు ఆన్లైన్లో నిర్దేశించిన నిబంధనల ప్రకా రం వివరాలు సమర్పించాలన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల్లో సృజనను వెలికి తీసి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్ర వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలసి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజాను అఽధికారులు సత్కరించారు. తడిసిన ధాన్యం కొంటాం: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అంతటా వానలు పడుతున్నందున వరి నష్టపోకుండా జాగ్రత్తలు చేపట్టామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. వర్షాల వల్ల ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద న్నారు. తడిసి ముద్దయిన, రంగు మారిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట నియోజక వర్గాల పరిధిలో పొలాల్లో ధాన్యం ఉందని, వాటిని సంరక్షించుకోవాలన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. -
నాడు గర్వపడి..
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ విద్య తిరోగమనంలో వెళ్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక విప్లవంలా జరిగిన సంస్కరణలకు ప్రస్తుత ప్రభుత్వం చరమ గీతం పాడుతోంది. డిసెంబర్ 21 వస్తే 8వ తరగతి పిల్లల చేతికి కొత్త ట్యాబ్ అందేది. కానీ ఈ ఏడాది ఎంతగా ఎదురుచూసినా ట్యాబ్‌లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రాలేదు. దీంతో విద్యార్థులంతా గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వరుసగా రెండేళ్లు ట్యాబ్‌ల అందజేత ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యను మరింత చేరువ చేసేందుకు 8వ తరగతి చదివే బాలబాలికలకు ట్యాబ్‌ల పంపిణీకి నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. 2022 డిసెంబర్ 21న, 2023 డిసెంబర్ 21వ తేదీన రెండేళ్లపాటు ట్యాబ్‌లను అందించారు. 8వ తరగతి పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు కలిపి 25953 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. రెండో ఏడాది 25289 మంది విద్యార్థులకు శాంసంగ్ కంపెనీ తయారుచేసిన నాణ్యమైన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. వీటిని బైజూస్ కంటెంట్‌తో అందజేశారు. అలాగే 4, 5, 6, 7, 9, 10వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చించింది. సాంకేతికంగా వినూత్న ఫీచర్లు కలిగిన ట్యాబ్‌లో సిమ్‌కార్డు, ప్రీ లోడెడ్ ఎడ్యుకేషనల్ యాప్స్‌ను అందించింది. జగన్ సంస్కరణలు కానరాకుండా కుయుక్తులు.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను విమర్శకు లు సైతం ప్రశంసించారు. కానీ ఆ సంస్కరణలు అటు ప్రజలు, ఇటు విద్యార్థులు మర్చిపోయేలా చేయాలనే రీతిలో కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. నాడు–నేడుతో పాటు పాత పథకాలేవీ అమలు చేయడం లేదు. ప్రభుత్వ వైఖరిని విద్యావేత్తలు, ప్రజాసంఘాల నాయకులు గుర్తించి విస్తుపోతున్నారు. ఆ సంస్కరణలు మర్చిపోగలమా..? 8 తరగతి విద్యార్థులకు ఆగిపోయిన ట్యాబ్‌ల పంపిణీ గత ప్రభుత్వ పథకాలకు తూట్లు పొడుస్తున్న కూటమి సర్కారు తీవ్రంగా నష్టపోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యారంగంలో వినూత్న సంస్కరణలు ప్రవేశ పెట్టిన వైఎస్ జగన్ పేద పిల్లలను బడికి చేరువచేసేలా తల్లికి ఆర్థికంగా బాసటగా ఉండాలని అమ్మఒడి ద్వారా రూ.15వేలు అందజేశారు. అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి ఈ ఆలోచన చేయలేదు. పేద, మద్యతరగతి విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కానుక నాలుగేళ్లపాటు వరుసగా అందజేశారు. ఉన్నత, వృత్తి విద్యాకోర్సులు చదువు కోసం జగనన్న విద్యాదీవెన, హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల అవసరార్థం జగనన్న వసతిదీవెను, విదేశాల్లో చదువుకుని ఉన్నతస్థాయిలో నిలదొక్కుకునేలా చేసేందుకు జగనన్న విదేశీ దీవెనను అందజేశారు. సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి, సీబీఎస్ఈ సిలబస్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. 3వ తరగతి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి పాఠ్యాంశాల బోధనతోపాటు టీచర్లకు క్రమం తప్పకుండా తర్ఫీదును అందించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. డిజిటల్ విద్యను సర్కారీ బడులకు చేరువ చేశారు. ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను పాఠశాలలు, కళాశాలలకు అందజేశారు. ఇలా చేసిన ఏకై క సీఎం వైఎస్ జగన్. జగనన్న గోరుముద్ద పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని శుచికరంగా, రుచికరంగా మార్చేశారు. రాగీమాల్ట్ను అందించి విద్యార్థుల్లో ఐరన్, పోషకాలు పెరిగేలా చేశారు. మనబడి నాడు–నేడు పేరిట ప్రభుత్వ బడులు, కాలేజీలు, వసతి కేంద్రాలకు కొత్త శోభ తీసుకొచ్చారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏటా ట్యాబ్‌లను అందజేసి వారిని అంతర్జాతీయస్థాయిలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా తీర్చిది ద్దాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. చదువులను ప్రోత్సహించాలి ఫీజు రీయింబర్స్‌మెంటు, అమ్మ ఒడి, వసతి దీవెనతో పాటు పలు పథకాలు పేదలకు ఎంతో దోహదపడ్డాయి. వీటిని ఏ ప్రభు త్వం వచ్చినా కొనసాగించాలి ఉంది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కొనసాగించాలి. – ఎంఆర్ జ్యోతీ ఫ్రెడరిక్, విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
చివరి రోజు క్రీడలు వాయిదా
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన అంతర్ పాలిటెక్నిక్ ప్రాంతీయ క్రీడలు శుక్రవారం ముగియాల్సి ఉండగా, వానల కారణంగా వాయిదా పడ్డాయి. శుక్రవారం వర్షం కారణంగా ఆటలు ప్రారంభం కాలేదు. దీంతో ముగింపు కార్యక్రమం వాయిదా పడింది. వాన లు తగ్గిన తరువాత విద్యార్థులకు సమాచారం ఇస్తామని, చివరి రోజులు క్రీడలు నిర్వహణ, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.జానకి రామయ్య శుక్రవారం తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు కాశీబుగ్గ: చెక్‌బౌన్స్ కేసులో నిందితుడికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ పలాస సివిల్ కోర్టు జడ్జి యు.మాధురి గురువారం తీర్పు ఇచ్చారు. శ్రీరామ్ చిట్స్ పలాస బ్రాంచ్‌కి బకాయి నిమిత్తం పలాసకి చెందిన తంగుడు శ్రీధర్ రూ.1,47,000కు చెక్ ఇచ్చారు. ఈ చెక్ తీసు కొని చిట్స్ యాజమాన్యం బ్యాంక్‌కు వెళ్లగా బౌన్స్ అయిందని సంబంధిత అధికారులు తెలిపారు. కంపెనీని శ్రీధర్ మోసం చేశాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో పలాస జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ఫస్ట్ క్లాస్ న్యాయ అధికారి విచారణ జరిపారు. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడికు ఆరు నెలల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు అరసవల్లి: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఈమేరకు ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ పొదుపు అవగాహనపై నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీ ల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, బహు మతులను ప్రదానం చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చినబడాం గ్రామంలో శుక్రవారం ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. గ్రామ సమీపంలోని చెట్టు వద్ద ఉరికి వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని చినబడాంకు చెందిన అట్టాడ మురళి(26)గా గుర్తించారు. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మురళి, అదే గ్రామానికి చెందిన అక్షయ అనే అమ్మాయి ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్షయ తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ ఇళ్ల నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది పా టు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో కొద్ది రోజులు కిందట కలహాలు ఏర్పడ్డాయి. గర్భం దా ల్చిన అక్షయ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లి పోయింది. భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. భార్య అక్షయ, ఆమె తల్లిదండ్రులు ఇటీవల మురళితో గొడవపడ్డారని, తప్పుడు కేసులు కూడా పెట్టారని వారు పోలీసులకు వివరించారు. భార్య మురళిని వేధించేదని, ఆమె తీరుపై మురళి తీవ్రంగా మనస్తాపం చెందేవాడని మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య తరఫు వారే చంపేసి గ్రామంలోని ఎగువ చెరువు గట్టుపై చెట్టుకు ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఏఏస్ఐ చంద్రరావు వెల్లడించారు. -
వేధింపులతో అభివృద్ధికి చెక్
అభివృద్ధి చూసి ఓర్వలేకనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏ గ్రామ పంచాయతీలో చేపట్టని విధంగా ఇక్కడ పనులు చేశాం. వాటిని చూసి ఓర్వలేకనే అసూయపడి చెక్ పవర్‌ను రద్దు చేయించారు. ప్రగతిని పరిగణనలోకి తీసుకోకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారికి వత్తాసు పలుకుతూ జిల్లా పంచాయతీ అధికారి చర్యలకు ఉపక్రమించడం దారుణం. ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమే. – కొణపల సురేష్‌కుమార్, సర్పంచ్ కంచిలి: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. అన్ని రంగాల్లో తన ఊరిని అభివృద్ధి చేసిన మఠం సరియాపల్లి పంచాయతీ సర్పంచ్ కొణపల సురేష్‌పై స్థానిక టీడీపీ నేతలు కక్ష కట్టారు. పంచాయతీలో ఎప్పుడూ జరగని స్థాయి లో అభివృద్ధి జరిగినప్పటికీ ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడుల సిఫారసులతో జిల్లా పంచాయతీ అధికారులు ఆగమేఘాలపై చర్యలకు ఉపక్రమించారు. సర్పంచ్ సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందకుండా చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేశారు. పంచాయతీలో జరిగిన కొన్ని అభివృద్ధి పనులు.. ● పంచాయతీ పరిధి నారాయణబట్టి గ్రామం వద్ద మండల పరిషత్ నిధులతో ప్రయాణికులు విశ్రాంతి మండపం నిర్మించారు. ● మఠం సరియాపల్లి ప్రాథమిక పాఠశాల ప్రవేశ ద్వారాన్ని ఉపాధిహామీ నిధులతోపాటు తన సొంత నిధులతో నిర్మించారు. ● నెయ్యిల వీధిలో పంచాయతీ నిధులతో సామాజిక మండపం నిర్మాణం చేశారు. ● కొత్తవీధిలో మండల పరిషత్, పంచాయతీ నిధులతో సామాజిక మండపం నిర్మాణం చేశారు. ● దాలేశ్వరం గ్రామంలో ఎంపీపీ నిధులతో సామజిక మండపం నిర్మించారు. ● రాగుపురం గ్రామంలో ఎంపిపి, పంచాయతీ నిధులతో సామాజిక మండపం కట్టారు. ● దాలేశ్వరం గ్రామంలో ఎంపీపీ, ఉపాఽధిహామీ నిధులతో శ్మశాన మండపం ఏర్పాటు చేశారు. ● మఠం సరియాపల్లి గడప గడకూ వైఎస్సార్, గ్రామ పంచాయతీ నిధులతో వై.ఎస్.ఆర్ పార్కు ఏర్పాటు చేశారు. ● గ్రామ పంచాయతీ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. ● వైఎస్సార్ పార్కులో పిల్లలు ఆడుకునే వస్తువులను పంచాయతీ నిధులతో ఏర్పాటు చేశారు. సరియాపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ సిఫారసులతో చర్యలు -
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తెలకు గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తుండగా శుక్రవారం కారు ఢీ కొట్టటంతో తల్లీకుమార్తెలు యతిరాజుల చంద్రకళ, కుమార్తె మౌనిక గాయపడ్డారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస నవోదయ పాఠశాలలో కుమార్తె 10వ తరగతి చదువుతోంది. ఆమెను స్వగ్రామం కేశవరావుపేటకు తీసుకువచ్చేందుకు తల్లి స్కూటీపై వెళ్లింది. ఇద్దరూ బండిపై వస్తుండగా నవభారత్ నుంచి కింతలి మిల్లు వైపు సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో కొయ్యరాళ్లు కూడలి సమీపంలో కారు వీరి బండిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తల్లీకుమార్తెలు రోడ్డుపై పడిపోయారు. ఇద్దరికీ చిన్న దెబ్బలే తగలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు నంబర్ ప్లేట్ రోడ్డుపై పడిపోవటంతో ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్‌కుమార్‌కు వాట్సాప్‌లో స్థానిక ప్రయాణికులు ఫొటో పంపించారు. అనంతరం 108లో శ్రీకాకుళం రిమ్స్‌లో క్షతగాత్రులు చేరారు. శ్రీకాకుళం సమీపంలో ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి
గార: జైలులో ఉండే ముద్దాయిలు, ఖైదీలు న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలులో సంస్థ కార్యదర్శి జిల్లా సీనియర్ జడ్జి ఆర్.సన్యాసినాయుడుతో కలిసి లైబ్రరీ, వంటగదులు, బ్యారెక్లను పరిశీలించారు. అనంతరం న్యా య అవగాహన సదస్సులో మాట్లాడుతూ జైలులో ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. బెయిల్‌కు సంబంధించి ప్రతి వారం న్యాయవాదులు, పారా వలంటీర్లను పంపించడం జరుగుతుందన్నారు. జైలు సూపరింటెండెంట్ వి.సన్యాసిరావు, దివాకర్ నాయుడు, పి.అంజనీకుమార్, హర్షవర్ధన్, వైద్య సిబ్బంది, లీగల్ ఎయిండ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
ఢీకొట్టి పరారైన ఆటో
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో ఉన్న శ్రీనివాస కూడలి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వృద్ధుడు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని ఆటో అతివేగంగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. వృద్ధుడు గాయాలతో రోడ్డుపై పడిపోవడంతో ఆటో డ్రైవర్ పరారైపోయాడు. క్షతగాత్రుడిని పలాస మండలం చిన్నమాకన్నపల్లి గ్రామానికి చెందిన జుత్తు కామేష్‌గా గుర్తించారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించగా పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఢీ కొట్టి పరారైన ఆటోకు సంబంధించిన సీసీ పుటేజీలు కాశీబుగ్గ పోలీసులు సేకరిస్తున్నారు. -
వదలని వాన
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాను ముసురు వదలడం లేదు. గడిచిన రెండు రోజులు కంటే శుక్రవారం వర్షాలు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 540 మిల్లీమీటర్ల వాన పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో చలి తీవ్రత కూ డా పెరిగింది. మరో 24 గంటలు ఇదే వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముసురు పట్టినట్టు వాన ఏకధాటిగా పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా వరి పంట కుప్పలతో పొలాల్లో ఉండిపోవటం, కురుస్తున్న వర్షాలకు కుప్పల కిందకి వర్షపు నీరు వెళ్లడంతో పంట పాడవుతుందని భయపడుతున్నారు. అలాగే వరి కుప్పలు పైనుంచి వర్షం పడడంతో కుప్పలు నానిపోతున్నాయని, వరి గింజ మొక్కలు మొలిచే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు గోనె సంచులు ఇవ్వకపోవడం, సరైన గోదాము సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నారు. వాన పడుతుందని తెలిసినా.. తుఫాన్‌పై వాతావరణ శాఖ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదు కునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేసే ప్రయత్నాలేవీ కనిపించలేదు. దీంతో నూర్చిన పంట కూడా పొలాల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలుకు లక్ష్యం పెట్టుకోగా.. 2,36,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. నూర్పులు జరిగి పొలాల్లో ఉండిపోయిన ధాన్యం లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఈ ధాన్యం తడిచిపోతోంది. ఈ ఏడాది పీపీసీల్లోనూ, ధాన్యం సేకరణ తర్వాత గోదాము సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టార్పాలిన్లు కూడా అధికార పార్టీ కళ్లాలకు చేరినంత సులువుగా సామాన్యులకు చేరడం లేదనే విమర్శ ఉంది. పాతపట్నం 16.4 మెళియాపుట్టి 16.2 జి.సిగడాం 16.8 బూర్జ 16.4 కొత్తూరు 14.2 పలాస 11.4 సంతబొమ్మాళి 11.0 టెక్కలి 10.8 నందిగాం 8.2 మందస 7.8 కవిటి 3.0 కంచిలి 2.8 సోంపేట 2.2 ఇచ్ఛాపురం 1.8 వజ్రపుకొత్తూరు 1.0 మండలం వర్షపాతం (మిల్లీమీటర్లలో) గార 40.2 శ్రీకాకుళం 34,8 ఎచ్చెర్ల 31.4 సరుబుజ్జిలి 29.0 ఆమదాలవలస 28.4 లావేరు 28.2 రణస్థలం 26.4 నరసన్నపేట 26.6 హిరమండలం 23.0 పోలాకి 20.8 కోటబొమ్మాళి 19.8 సారవకోట 19.4 పొందూరు 19.8 జలుమూరు 18.2 శుక్రవారం జిల్లాలో 540 మిల్లీమీటర్ల వర్షం మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఎల్ఎన్ పేట: వాడవలస వద్ద మొక్కజొన్న పొలంలోకి చేరిన నీరు -
‘అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’
టెక్కలి: అనర్హుల పింఛన్లు తొలగించి అర్హులైన వా రందరికీ కొత్త పింఛన్లు అందజేస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. శుక్రవారం కోటబొమ్మాళిలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకుంటున్నామని, పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడు బోయిన రమేష్ తో పాటు సభ్యులు మంత్రిని కలిశారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పలువురు విన్నవించారు. -
జిల్లా దేవదాయ శాఖ ఇన్చార్జి అధికారిగా భద్రాజీ
అరసవల్లి: జిల్లా దేవదాయ శాఖ ఇన్చార్జి అధికారిగా వై.భద్రాజీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు జిల్లా అధికారిగా బాధ్యతల్లో ఉన్న ప్రసాద్‌పట్నాయక్ సెలవులోకి వెళ్లడంతో ఆ బాధ్యతలను అరసవల్లి ఈఓగా ఉన్న భద్రాజీకి అప్పగించారు. అరసవల్లి ఆలయానికి డిప్యూటీ కమిషనర్/ఈఓగా పనిచేస్తున్న భద్రాజీకి రథసప్తమి ఉత్సవాల నిర్వహణ బాధ్యతలున్న నేపథ్యంలో జిల్లా శాఖ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న నేపధ్యంలో జిల్లా బాధ్యతలను పొరుగు జిల్లాలకు చెందిన అధికారులకు అప్పగించకుండా అరసవల్లి ఈఓకు అప్పగించడంపై సంబంధిత శాఖలోనే చర్చనీయాంశమైంది. -
వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనాలి
నరసన్నపేట: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21న ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం మండల కేంద్రాలు, నియోజక వర్గ కేంద్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ సమన్వయకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఇతర పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ సభ్యు లు, నాయకులు అందరూ పాల్గొనాలని సూ చించారు. అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలా గే నరసన్నపేటలో శనివారం ఆస్పత్రిలో పండ్లు పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రధాన నాయకులు అందరూ ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించాలి పాతపట్నం: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయాధికారి ఎన్.బాలాజీ అన్నారు. పాతపట్నం బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా లక్ష్యాన్ని పెట్టుకుని చదువు కోవాలన్నారు. విద్యార్థుల వంట గది, మరుగుదొడ్లను పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థినుల భోజనం, కూరను పరిశీలించారు. పదో తరగతి, ఇంట ర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అర్చన, కొల్లివలస ప్రిన్సిపాల్ డి.దేవేంద్రరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టెన్త్ మోడల్ పేపర్ల ఆవిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పదో తరగతి ఇంగ్లిష్ మీడియం మోడల్ పేపర్స్‌ను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆవిష్కరించారు. మంచి మార్కుల స్కోరింగ్‌కు ఉపయోగపడే ఈ పుస్తకాన్ని విద్యార్థులకు సరసమైన ధరలకు అందించడం మంచి పరిణామమని జాయింట్ కలెక్టర్ అన్నారు. యూటీఎఫ్ సంస్థ ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు విద్యార్థుల సంక్షేమాన్ని కూడా చూడడం చాలా ఆనందించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్ కుమార్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, జిల్లా కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శి హెచ్ అన్నాజీరావు, అకడమిక్ కమిటీ కన్వీనర్ ఎల్వీ చలం, కోదండ రామయ్య పాల్గొన్నారు. కూర్మనాథుని సన్నిధిలో మైరెన్ ఎస్పీ రవివర్మ గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని తీర ప్రాంత రక్షణ దళం (మైరెన్) ఎస్పీ రవివర్మ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహాత్యాన్ని వివరించగా.. ఈవో జి.గురునాథరావు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు కళింగపట్నం మైరెన్ స్టేషన్‌ను తనిఖీ చేశా రు. తీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల వద్ద పర్యవేక్షించాలని సూచించారు. ఆయనతో పాటు కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బూర ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
తీర ప్రాంత పరిరక్షణకు చర్యలు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: తీర ప్రాంత పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. తీర ప్రాంత భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తొలుత సమీక్షించారు. సముద్రతీర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద గస్తీ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందుకోసం గజ ఈతగాళ్లను ఏర్పాటుచేయాలని ఎస్పీ కోరారు. వాచ్ టవర్స్ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తీరప్రాంతాల్లో హోర్డింగ్స్, బారువ, కళింగపట్నం ప్రాంతాల్లో లైఫ్ జాకెట్స్, బోట్స్ అవసరమని సభ్యులు కోరగా కలెక్టర్ తదుపరి చర్యలు నిమిత్తం సంబంధిత అధికారులను ఆదేశించారు. సముద్రం వేటకు వెళ్లే మత్స్యకారులు మత్స్యశాఖ జారీ చేసే బయోమెట్రిక్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకువెళ్లడం లేదని తెలియజేయడంతో మత్స్యకారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో కోస్టల్ గార్డ్ ఎస్పీ రవి వర్మ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.రాము, మత్స్య శాఖ ఉపసంచాలకులు పీవీ శ్రీనివాసరావు, సహా య సంచాలకులు టి.సంతోష్ కుమార్, తీర ప్రాంత సీఐలు, ఎస్ఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తగదు
సోంపేట: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోంపేటలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయవద్దని ప్రధాన మంత్రికి పోస్టుకార్డులు పంపించా రు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాయన్నారు. లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉ ద్యోగాలు తొలగించడం న్యాయం కాదన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, ప్రైవేటు పరం చేస్తే మళ్లీ ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు, విజయ దుర్గా ఆటోయూనియన్ అధ్యక్షుడు పిట్ట హేమచంద్రరావు, జింకిభద్ర ఉపసర్పంచ్ సాహుకారి జాని, సంఘ ప్రతినిధులు అంజిత్‌కుమార్, కణితి లోకేష్, తెలుకుల మోహనరావు, తెప్పల అఽశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీరే కడుపు నింపాలిక..
గార: బందరువానిపేటలో ముందుకు వచ్చిన సముద్రం వజ్రపుకొత్తూరు /ఎచ్చెర్ల క్యాంపస్ వరుస తుఫాన్లు మత్స్యకారుల బతుకుల్లో అలజడి రేపుతున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబరు నెలల్లో జిల్లాపై తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా మత్స్య సంపద అధికంగా లభించే సమయంలో తుఫాన్లు వస్తుండడంతో గంగపుత్రులకు నష్టం తప్పడం లేదు. జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం 11 మండలాల్లో విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, సంతబొమ్మాళి, పోలాకి, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో సముద్రంలో చేపల వేట చేసి బతుకుతున్న మత్స్యకార కుటుంబాలు దాదాపు 16,569 ఉన్నా యి. వేట సాగితేనే వీరికి రోజులు గడుస్తాయి. ప్రస్తుతం వాతావరణం అనుకూలించక సంద్రంలోకి వెళ్లడమే కుదరడం లేదు. దీనికి తోడు అధికార కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కష్టాలపై కన్నెత్తి కూడా చూడడం లేదు. 2014–19 మధ్య కూడా మత్స్యకారులకు వేట నిషేధ భృతి పేరుతో అరకొరగా ఐదారు వేల మందికి కేవలం రూ.4000 అందజేసేవారు. అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వంలో తేదీ చెప్పి మరీ రూ.10వేలు సాయం అందించారు. వేట నిషేధ సమయం ముగియగానే ఏటా మే నెల 2వ వారంలో గంగపుత్రుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు పడేవి. ఈ ఏడాది మాత్రం వేట నిషేధ భృతి ఊసే లేదు. బెంగ తీర్చని భృతి.. ఏటా తుఫాన్లు, వేట నిషేధం కష్టాల నుంచి గంగపుత్రులను గట్టెక్కించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేట నిషేధ భృతి, మత్స్యకార భరోసా అనుకున్న సమయానికి వేసేది. డీజిల్ సబ్సిడీ నేరుగా పెట్రోల్ బంకుల వద్దే అమలు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల పథకాలన్నీ గాలి కొదిలేసింది. మత్స్యకార భరోసా రూ.20వేలకు పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దానిపై కసరత్తు కూడా చేయలేదు. ఏరివేత జాబితా సిద్ధం జిల్లాలో 16 లక్షల టన్నుల చేపలు ఏడాదికి ఉత్పత్తి చేస్తుండగా, అందులో దాదాపు 5.60 లక్షల టన్ను ల చేపలు ఎండు చేపలుగా మార్చి కోళ్ల ఫారాలకు మేతగా తరలిస్తున్నారు. వేట సన్నగిల్లండంతో గత నాలుగు నెలలుగా ఉత్పత్తి తగ్గి గంగపుత్రులు తీవ్రంగా నష్టపోయారు. మత్స్యశాఖ మే నెలలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయగా నవశకం బెనిఫి షియరీ మేనేజ్మెంట్ పోర్టల్‌లో ఆరు దశల్లో వడపోయగా 2423 మందిని అనర్హులుగా తేల్చారు. ఇందులో 100 లీటర్లు కనీస వినియోగం లేని మోటారు బోట్లలో పని చేస్తున్న 1890 మందికి అనర్హులుగా పేర్కన్నారు. దీంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. గార: బందరువానిపేటలో ఒడ్డున ఉన్న పడవలు వేట సాగటం లేదు అల్పపీడనం, వాయుగుండాలు వల్ల వరుస తుఫాన్లు వస్తున్నాయి. చేపల వేటకు వెళ్లవద్దని అధికారులే దండోరాలు వేయిస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నాను. ఇస్తామన్న రూ.20వేల భరోసా ఇచ్చి ఉంటే ఖర్చులు గట్టెక్కేవి. అప్పుల భారం పెరిగిపోయి మా ఊరులో చాలా మంది గోవా, కాండ్లా వలస పోతున్నారు. – సీహెచ్ నీలయ్య, మత్స్యకారుడు భావనపాడు పరిహారం ఇవ్వాలి తుఫాన్ల సమయంలో వేట కు వెళ్లవద్దని చెబుతున్న ప్రభుత్వం ఆ సమయంలో మాకు నష్టపరిహారం ఇవ్వాలి. డీజిల్ సబ్సిడీలు పెంచాలి. ఐదారుగురం కలిసి వేటకు వెళితే కనీసం డీజిల్ ఖర్చులు రావటం లేదు. ప్రభుత్వం వేట నిషేధ భృతి ఇవ్వడంతో పాటు ఆధునిక వేట సామగ్రి సబ్సిడీపై అందించాలి. – జి.శంభూరావు, మత్స్యకారుడు, మంచినీళ్లపేట వరుస తుఫాన్లతో మత్స్యకారుల గుండెల్లో గుబులు వేట సాగక ఇబ్బంది పడుతున్న గంగపుత్రులు గత పదేళ్లలో అక్టోబర్ –డిసెంబర్ మధ్య 13 తుఫాన్లు రూ.20వేలు భృతి ఇస్తామంటూ ఇవ్వని కూటమి ప్రభుత్వం -
పెట్రోల్ బంక్‌లో మంటలు
టెక్కలి: స్థానిక పాత జాతీయ రహదారిలో గల ఆయుష్ పెట్రోల్ బంక్‌లో గల ఫిల్లింగ్ పంప్లో గురువారం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. పట్టణానికి మధ్యలో వేలాది లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వలతో ఉన్న బంకులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందోనని సమీప ప్రాంతాలకు చెందిన స్థానికులు, వ్యాపారులు భయపడ్డారు. బంక్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫిల్లింగ్ పంపు మా ర్పు చేసే క్రమంలో ఒక్క సారిగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. అయితే పెట్రోల్, డీజిల్ నిల్వలు కలిగిన ట్యాంకుల వద్ద ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫిల్లింగ్ పంపు మెషిన్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని బంక్‌లో మంటలు వ్యాపించడంపై విచారణకు ఆదేశించారు. అలాగే టెక్కలి సీఐ విజయ్‌కుమార్, ఎస్ఐ రాముతో పాటు ఆర్ఐ ఢిల్లేశ్వరరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫిల్లింగ్ పంపులు మార్పు చేస్తుండగా ఘటన భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది చొరవతో తప్పిన ప్రమాదం -
చలిగాలులు.. చిరు జల్లులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయి. వాతావర ణం చల్లబడి, చలి కూడా పెరిగింది. చాలా గ్రామాల్లో వరి కోతలు పూర్తయ్యి పొలాల్లో కుప్పలు పెట్టి ఉన్నారు. వాటిని జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం నాటికి జిల్లాలో 99.00 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కంచిలిలో 17.2, కవిటిలో 14.0, జి సిగడాంలో 8.8, సరుబుజ్జిలిలో 6.2, సోంపేటలో 5.2, లావేరులో 4.2, బూర్జలో 4.2, టెక్కలిలో 4.0, పొందూరులో 3.8, ఎచ్చెర్లలో 3.4, రణస్థలంలో 3.2, శ్రీకాకుళంలో 2.8, ఇచ్ఛాపురంలో 2.6, ఆమదాలవలసలో 2.6, సంతబొమ్మాళిలో 2.4, సారవకోటలో 2.2, పలాసలో 2.2, గారలో 1.8, నందిగాంలో 1.6, పాతపట్నంలో 1.4, హిరమండలంలో 1.4, మెళియాపుట్టిలో 1.2, కోటబొమ్మాళిలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. మిగిలిన మండలాల్లో వర్షం కురవలేదు. అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. -
విద్యుత్‌శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం
అరసవల్లి: ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిద్దామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎంవి.గోపాలరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సంస్కరణల ముసుగులో ప్రభుత్వ ఆధీనంలో విద్యుత్ శాఖను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం తగదన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆందోళనకు దిగిన విద్యుత్ కార్మికులపై ఎస్మా విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ రెండు రాష్ట్రాల కార్మికులకు సంఘీభావంగా మన రాష్ట్రంలో కూడా విద్యుత్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ను డీబీటీ విధానంలో ఇస్తా మని చెబుతూ ప్రైవేటీకరణకు దారులు తెరుస్తున్నారని..ఈ విధానంపై తామంతా నిరసనలు ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జి.రమేష్‌కుమార్, సభ్యులు జె.సురేష్‌కుమార్, గురునాథరావు, లోకేశ్వరరావు, సూర్యనారాయణ, రాజారావు, టి.వి.సుబ్రహమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు వీరే
శ్రీకాకుళం నియోజకవర్గం మార్పు దుర్గా పృథ్వీరాజ్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ అలీబేగ్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు ఎచ్చెర్ల నియోజకవర్గం గొర్లె అప్పలనాయుడు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నేతింటి నీలమప్పడు జిల్లా పంచాయతీరాజ్వింగ్ అధ్యక్షుడు లంకపల్లి ప్రసాద్ జిల్లా వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు నరసన్నపేట నియోజకవర్గం కేసీహెచ్ గుప్తా జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పుట్టా ఆదిలక్ష్మి జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షులు దోమ మన్మధరావు జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడు ఆమదాలవలస నియోజకవర్గం ముత్తా విజయ్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బట్టా సత్యనారాయణ జిల్లా వీవర్స్(చేనేత) విభాగం అధ్యక్షుడు పప్పల రాధాకృష్ణ జిల్లా ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు కొప్పల ఈశ్వరరావు జిల్లా మేధావుల ఫోరం విభాగం అధ్యక్షుడు పాతపట్నం నియోజకవర్గం సొంట్యాన తమ్మినాయుడు జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు గొంటి రామ్మోహనరావు జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు వెలమల బాలరాజు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు టెక్కలి నియోజకవర్గం బుడ్డా మోహన్‌రెడ్డి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆరంగి లక్ష్మీపతి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చింతాడ వరుణ్ జిల్లా డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు పలాస నియోజకవర్గం సవర డుంబురు జిల్లా ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రుకునాన వెంకటరమణ జిల్లా సోషల్‌మీడియా విభాగం అధ్యక్షుడు ఇచ్ఛాపురం నియోజకవర్గం ఉలాల భారతి దివ్య జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు మద్దిల కాళిదాసు జిల్లా వలంటీర్ల విభాగం అధ్యక్షులు పత్తి అన్వేష్ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తాడి ఆదిరెడ్డి జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ)/ ఎచ్చెర్ల క్యాంపస్/నరసన్నపేట/ ఆమదాలవలస/ఎల్.ఎన్.పేట/టెక్కలి/కాశీబుగ్గ/కంచిలి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ అనుబంధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను నియమిస్తూ గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.