states
-
దేశంలో అధిక ధనవంతులు గల రాష్ట్రాలు(ఫొటోలు)
-
ధనవంతులు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలు: తెలంగాణ ఎక్కడుందంటే..
2024లో దేశంలో ఎక్కువ మంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఇందులో ఏ రాష్ట్రంలో ఎంతమంది ధనవంతులనున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2020తో పోలిస్తే ధనవంతుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఇది ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను మాత్రమే కాకుండా.. సంపద సృష్టిని ప్రతిబింబిస్తుంది. ● భారతదేశంలో ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాలో అగ్రగామిగా మహారాష్ట్ర ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో మొత్తం 470 మంది ధనవంతులున్నట్లు సమాచారం. 2020తో (247 మంది) పోలిస్తే ఈ సంఖ్య 222 పెరిగినట్లు తెలుస్తోంది. ● 2020లో 128 మంది ధనవంతులతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఇప్పుడు 213మందితో మళ్ళీ అదే స్థానంలో నిలిచింది. ● గుజరాత్ రాష్ట్రంలో 129 మంది, తమిళనాడులో 119 ధనవంతులున్నట్లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో 2020లో వరుసగా 60, 65 మంది ధనవంతులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే గుజరాత్, తమిళనాడులో కూడా ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. ● తెలంగాణాలో 109 మంది ధనవంతులు, కర్ణాటకలో 108 మంది ధనవంతులున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2020లో ఈ రెండు రాష్ట్రాల్లో 54, 72 మంది ధనవంతులున్నారు. తెలంగాణ ఇప్పుడు ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల్లో కర్ణాటకకు అధిగమించింది. ● పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా 70, 40, 36, 28 మంది ధనవంతులున్నారు. 2020లో ఈ రాష్ట్రాల్లో ఉన్న ధనవంతుల సంఖ్య వరుసగా 32, 16, 9, 9 మాత్రమే. 2024లో ఈ రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.2020లో ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న తమిళనాడు, కర్ణాటక ఈ సారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2024లో మన దేశంలో ఉన్న ధనవంతుల సంఖ్య 1,322 మంది. 2020లో ఈ సంఖ్య 693 మాత్రమే. దీని ప్రకారం 2024లో 629 మంది ధనవంతులు కొత్తగా జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ రాష్ట్రాలదే: సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: పారిశ్రామిక మద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇండస్ట్రీయల్ ఆల్కహార్ తయారీ, అమ్మకాలను నియంత్రించే చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవరం తీర్పునిచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేనని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని ఎనిమిది మంది సభ్యులు ఈ పిటిషన్‌కు మద్దతు తెలపగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు. పారిశ్రామిక మద్యంపై శాసనాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని ఆమె వాదించారు. దీంతో 8:1 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.అయితే యూపీ స్టేట్ వర్సెస్ సింథటిక్స్ అండ్ కెమికల్స్ కేసులో పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తూ 1990లో ఇచ్చిన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం రద్దు చేసింది. సీజేఐ చంద్రచూడ్, మెజారిటీ అభిప్రాయాన్ని అందజేస్తూ.. ‘డినేచర్డ్ స్పిరిట్స్' అని పిలవబడే 'పారిశ్రామిక మద్యం'పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ అధికారాలను రాష్ట్రాల నుండి తొలగించలేమని స్పష్టం చేశారు. వారి అధికార పరిధిలో పారిశ్రామిక మద్యం ఉత్పత్తి, సరఫరాను నియంత్రించడానికి వీలుందని ఆయన పేర్కొన్నారు. -
భిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యలు (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో పోటెత్తిన ఆలయాలు ... భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు (ఫోటోలు)
-
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాజస్థాన్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్‌లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్‌లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్‌లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
బడ్జెట్లో 26 రాష్ట్రాల పేర్లులేవు: నిర్మలాసీతామరామన్ క్లారిటీ
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో 26 రాష్ట్రాల ఊసే లేదని, అంత మాత్రాన ఆ రాష్ట్రాలకు కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024 బడ్జెట్‌పై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవారం(జులై 30) ఆమె సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని చెప్పారు. గతంలో యూపీఏ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపుల లెక్కలు వెల్లడించారు. వరుసగా మూడోసారి ఎన్డీయేకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలని, ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారన్నారు. -
‘వికసిత భారత్’ సాకారంలో... రాష్ట్రాలదే కీలక పాత్ర: మోదీ
న్యూఢిల్లీ: 2047 కల్లా వికసిత భారత్ కలను సాకారం చేసుకోవడంలో రాష్ట్రాలది ప్రధాన పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘పేదరిక నిర్మూలనే మన లక్ష్యం కావాలి. గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి దాకా ఆ దిశగా కార్యాచరణ ఉండాలి. ఇందుకు ప్రతి జిల్లా, రాష్ట్రం 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయి దాకా వికసిత్ భారత్ ఆకాంక్ష చేరాలి’’ అని సూచించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ భేటీ శనివారం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. భేటీకి సారథ్యం వహించిన మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధే లక్ష్యంగా పాలనలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి సాగాలని అభిలషించారు. ‘‘ఇది సాంకేతిక మార్పుల దశాబ్ది. ఎదిగేందుకు అపారమైన అవకాశాలున్నాయి. వాటిని రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించాలంటే శాంతిభద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు చాలా కీలకం. జల వనరుల సమర్థ వినియోగానికి రివర్ గ్రిడ్లు ఏర్పాటు చేసుకోవాలి’’ అని సూచించారు. ముఖ్యమంత్రులు తమ అవసరాలు, ప్రాథమ్యాలను వివరించారు. పేదరిక నిర్మూలన (జీరో పావరీ్ట) లక్ష్యాలను సాధించిన గ్రామాలను పేదరికరహిత గ్రామాలుగా ప్రకటిస్తామని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. భేటీలో చర్చించిన విషయాలపై 45 రోజుల్లో ‘విజన్ ఇండియా 2047’ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు. -
Weather Update: 9 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈరోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (మంగళవారం)9 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
పొంచివున్న వర్ష బీభత్సం.. పలు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాలకు వాతావరణశాఖ భారీ వర్ష సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం వేచిచూస్తున్న జనానికి ఉపశమనం కలగడంతోపాటు ప్రతీరోజు వర్షాలు కురిసే అంచనాలున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. बिहार में 10-12 जुलाई, 2024 के दौरान अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) वर्षा से बहुत भारी (115.5-204.4 मिलीमीटर) वर्षा होने की संभावना है। Bihar is likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) during 10th-12th July, 2024. pic.twitter.com/Q3lsEOWQLK— India Meteorological Department (@Indiametdept) July 8, 2024భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై 8 నుంచి 12 వరకూ హిమాలయప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. అదేవిధంగా జూలై 12 వరకూ జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్టాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి.మరోవైపు భారీ వర్షాల కారణంగా బీహార్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పూర్వ్ చంపారణ్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారణ్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ముంబై, ఠాణె, నవీ ముంబైతో పాటు రత్నగిరి, సింధుదుర్గ్ తదితర గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.तटीय कर्नाटक में 08 जुलाई, 2024 को अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) से बहुत भारी वर्षा (115.5-204.4 मिलीमीटर) के साथ अत्यंत भारी वर्षा (>204.4 मिलीमीटर) होने की प्रबल संभावना है। pic.twitter.com/7iaS8uRXCl— India Meteorological Department (@Indiametdept) July 8, 2024 -
వాతావరణశాఖ అలర్ట్: ఐదు రాష్ట్రాలకు రెడ్.. 16 రాష్ట్రాలకు ఆరెంజ్
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్, 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. -
14 రాష్ట్రాలకు భారీ వర్షసూచన
ఢిల్లీ ఎన్సీఆర్తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ,తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో దేశంలోని 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో 115.5 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని తెలిపింది.సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దేశంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణశాఖ హీట్‌వేవ్ హెచ్చరికను కూడా జారీ చేసింది. పంజాబ్, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గత 24 గంటల్లో జైసల్మేర్ (పశ్చిమ రాజస్థాన్)లో అత్యధికంగా 45.0 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, ఎన్సీఆర్, తూర్పు యూపీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది. -
నేడే ఆరో దశ పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు పశి్చమబెంగాల్‌లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాం«దీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. -
ఐదో దశ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం ఆందోళన?
2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈసారి 57.5 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత సారి అంటే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఇప్పటి ఓటింగ్ ఐదు శాతం తక్కువ.2019 ఎన్నికల ఐదో దశలో 62.0 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటింగ్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడం అటు రాజకీయ పార్టీల్లో, ఇటు ఎన్నికల సంఘంలో మరోసారి ఆందోళన పెంచింది. ఐదో దశలో మహారాష్ట్రలో 13, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, ఒడిశాలో 5, జమ్ము-కశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్‌లో 52.55 శాతం, జమ్మూకశ్మీర్‌లో 54.21 శాతం, జార్ఖండ్‌లో 63 శాతం, ఒడిశాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.43 శాతం, లడఖ్‌లో 67.15 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం ఈ దశలో అంచనా వేసిన ఓటింగ్ శాతం 57.38గా నమోదైంది.2019లో ఈ సీట్లలో నమోదైన ఓటింగ్ శాతం విషయానికొస్తే బెంగాల్‌లోని ఈ స్థానాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో 55.7 శాతం, బీహార్‌లో 57.2 శాతం, జమ్మూ కాశ్మీర్లో 34.6 శాతం, జార్ఖండ్‌లో 65.6 శాతం, ఒడిశాలో 72.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 58.6 శాతం, లడఖ్‌లో 71.1 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి 54 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం. ఈసారి మొత్తం ఓటింగ్ శాతం 54.21, ఇది 1984లో ఈ నియోజకవర్గంలో 58.84 శాతం ఓటింగ్ తర్వాత అత్యధికం. లోక్‌సభ ఎన్నికలకు ఇంక రెండు దశలు మాత్రమే మిగిలాయి. మే 25న ఆరో దశ, జూన్ ఒకటిన చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ముగియడంతో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
లోక్‌సభ ఎన్నికలు: నాలుగు దశల ఓటింగ్ ఖాతాలో విశేషాలివే..
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొదటి, రెండవ, మూడవ, నాల్గవ దశలకు సంబంధించిన ఓటింగ్ పూర్తయ్యింది. నాలుగో దశతో దేశంలోని సగానికి పైగా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 26న రెండో దశలో 12 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 7న మూడో దశలో 11 రాష్ట్రాల్లోని మొత్తం 93 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 13న 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తంమీద ఇప్పటి వరకు దేశంలోని 379 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇంకా ఐదో దశలో 49, ఆరో దశలో 58, ఏడో దశ(చివరి)లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, గోవా, అసోం, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌లో నాలుగో దశతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.దేశంలో అతి తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన మొదటి ఈశాన్య రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది అన్రిజర్వ్డ్. ఏప్రిల్ 19న మొదటి దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. దీని తరువాత తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన రెండవ రాష్ట్రం నాగాలాండ్. ఇక్కడ కూడా ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్. తొలి దశలోనే నాగాలాండ్‌లో కూడా ఓటింగ్ జరిగింది. మిజోరంలో ఒక లోక్‌సభ స్థానం కూడా ఉంది. ఇది ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యింది. ఇక్కడ కూడా ఏప్రిల్ 19న ఓటింగ్ ప్రక్రియ జరిగింది.మొదటి దశలో అత్యధికంగా త్రిపురలో 80 శాతం ఓటింగ్ జరిగింది. బీహార్‌లో అత్యల్పంగా 48 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో త్రిపురలో గరిష్టంగా 78.63 శాతం ఓటింగ్ జరిగింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో అత్యల్పంగా 54శాతం పోలింగ్ నమోదైంది. మూడో దశలో అసోంలో అత్యధికంగా 81.71 శాతం ఓటింగ్ జరిగింది. యూపీలో అత్యల్పంగా 57.34 శాతం ఓటింగ్ నమోదైంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏప్రిల్ 19న సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. ఒడిశాలోని 147 స్థానాలకు నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి. -
Lok Sabha Election 2024: నాలుగో దశ ప్రచారానికి తెర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ప్రచారం శనివారంతో ముగిసింది. అవినీతి, నిరుద్యోగం, పేట్రేగిన ధరలకుతోడు అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న శ్యామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యానాలు, అయ్యర్ పాక్ అణుబాంబు మాటలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దూషణలు నాలుగోదశ ప్రచారానికి మరింత వేడిని అందించాయి. బరిలో దిగ్గజాలు.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(యూపీలోని కనౌజ్), కేంద్ర మంత్రులు గిరిరాజ్‌సింగ్ (బిహార్‌లోని బెగుసరాయ్), నిత్యానంద్ రాయ్(బిహార్‌లోని ఉజియాపూర్), కాంగ్రెస్ నేత అ«దీర్ రంజన్ చౌదరి(పశ్చిమబెంగాల్లోని బహరాంపూర్), బీజేపీ నాయకురాలు పంకజ ముండే(మహారాష్ట్రలోని బీడ్) తదితరులు మే 13న జరిగే నాలుగోదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2021నాటి లఖీంపూర్‌ఖేరీ రైతుల మరణాల కేసులో నిందితుడైన ఆశిశ్ తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈసారి యూపీలోని ఖేరీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం చెమటోడుస్తున్నారు. నాడు 40 చోట్ల ఎన్డీఏ విజయం నగదుకు ప్రశ్నలు ఉదంతంలో పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా మరోసారి బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి పోటీకి నిలబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున షియా నేత అఘా సయ్యద్ రుహుల్లా మెహ్దీ, పీడీపీ తరఫున వహీద్ పారా, ఆప్ తరఫున ఆష్రాఫ్ మీర్ పోటీచేస్తున్నారు. ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ గెలుపు దాదాపు ఖాయమైంది. ఇక్కడ ‘నోటా’కు ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారంచేసింది. నాలుగోదశలో పోలింగ్ జరుగుతున్న ఈ 96 స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 40 చోట్ల విజయం సాధించింది. ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనున్నాయి. అన్నింటికీ కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపడతారు. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నాలుగుదశల్లో జరగనున్నాయి. వీటిలో తొలి దశలో 28 స్థానాలకు సంబంధించిన ప్రచారం సైతం శనివారమే ముగిసింది. -
Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 49 సీట్లకుగాను 1,586 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల పరిశీలన పూర్తికాగా 749 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించామని ఈసీ తెలిపింది. బరిలో మొత్తం 695 మంది అభ్యర్థులున్నట్లు బుధవారం వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 14 మంది పోటీలో ఉన్నారు. -
Lok Sabha Election 2024: నేడే మూడో దశ పోలింగ్
అహ్మదాబాద్/బెంగళూరు: పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులుకేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా), మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్‌సింగ్(రాజ్‌గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్‌గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2 -
రెండోదశలో తగ్గనున్న ఓటింగ్ శాతం? కారణం ఇదే?
రెండో దశ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు ఓటింగ్ జరగనుంది. అయితే ఆ రోజుల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఎన్నికల కమిషన్‌ను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26, రెండవ దశ ఓటింగ్ రోజున తూర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేడి గాలులు వీయనున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. పశ్చిమ బెంగాల్లో విపరీతమైన వేడి గాలులుల వీయనున్నాయనే అంచానాలున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల తర్వాత వేడిగాలు వీచే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదు రోజుల పాటు హిట్ వేవ్ ఉండనుంది. ఏప్రిల్ 26న ఈ రాష్ట్రాలన్నింటిలో రెండో దశ పోలింగ్ జరగనుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం వేసవి సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోని ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఓటర్లు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాన్ని ప్రారంభించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ 94 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్బందర్ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్‌లోని భగవాన్‌గోలా, కర్ణాటకలోని షోరాపూర్ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! -
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపం నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్‌ను తీసుకురావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పథకాలను సమీక్షించడంపై తమకున్న అధికారాలు పరిమితమని జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్ఎఫ్ఎస్ఏ) చట్టం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో స్కీమ్ తీసుకురావాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, గతంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి పిల్లల్లోపోషకాహార లోపాన్ని, ఆకలి చావులను నివారించేందుకు అవసరమైన చర్చలు జరపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్ రూపొందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ ప్రజా పయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
Supreme Court Of India: బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుంది
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీలు, ఎస్టీల్లో ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అనే అంశంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేయరాదని తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు సజాతీయ సమూహాలు అయినందున వీరిలో వెనుకబడిన, బలహీన కులాలకు కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. -
Republic Day: జెండాల గౌరవం కాపాడండి : కేంద్రం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో మువ్వన్నెల జెండాల వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. జెండా వందన కార్యక్రమాలు పూర్తయ్యాక కాగితపు జెండాలను ఇష్టం వచ్చినట్లుగా నేలపై పారేయకూడదని కోరింది. జెండా గౌరవానికి భంగం కలగకుండా వాటిని గౌరవ ప్రదంగా, రహస్యంగా డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ విషయంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అన్ని ఇతర ఈవెంట్లలో వాడే జెండాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 26న దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీచదవండి.. సభలో మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య -
అప్రమత్తంగా ఉందాం.. భయమొద్దు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్(ఉపరకం) జేఎన్.1 (COVID subvariant JN.1) కారణంగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష కోసం బుధవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ రాష్ట్రాల అధికారుల కీలక సూచనలు చేశారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాలకు తెలిపారు. आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की। बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा। pic.twitter.com/rYkDCIkg2F — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 20, 2023 పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ జేన్.1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. మరోవైపు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది.