Sunny Deol
-
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
బాలీవుడ్ హీరో తెలుగు సినిమా.. 100 కేజీల కేక్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్! (ఫొటోలు)
-
పవర్ఫుల్ యాక్షన్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (అక్టోబరు 19) సన్నీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాత్’ టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
Bollywood Stars: అక్కడ హీరో.. ఇక్కడ విలన్
బాలీవుడ్ నుంచి ఎక్కువగా హీరోయిన్లు టాలీవుడ్‌కి వస్తుంటారు. ఈసారి పలువురు నటులు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కొందరు నటులు, నటీమణులు కనిపించగా... త్వరలో రానున్న బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కన్నప్పతో ఎంట్రీబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కన్నప్ప’. హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కి వచ్చి, తన పాత్ర షూటింగ్‌ని అక్షయ్ కుమార్ పూర్తి చేసి వెళ్లారు. అక్షయ్ వంటి స్టార్ హీరో ‘కన్నప్ప’లో భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. అయితే అక్షయ్ కుమార్ ఏ పాత్రలో నటించారు? అనే విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోన్న ‘కన్నప్ప’ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓమీ భాయ్బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్నారు ఇమ్రాన్ హష్మీ. హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఆయన తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మీ. మార్చిలో ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజుని పురస్కరించుకుని, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న ఓమీ భాయ్ పాత్రని పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తన లుక్‌పై ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’ సినిమాలోని ఓ డైలాగ్‌తో స్పందించారు. ‘గంభీరా... నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ్ర΄ామిస్... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది’ అంటూ ట్వీట్ చేశారాయన. ఇక గూఢచారితోనూ తెరపై కనిపించనున్నారు ఇమ్రాన్. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘జీ 2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అనీల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ‘జీ 2’. ఈ మూవీలో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని టాక్. దేవరతో జోడీఅతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండి΄ోయే ΄ాత్రలు చేశారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని శ్రీదేవి అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించనుంది. ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు..’పాటలో జాన్వీ కపూర్ ఫుల్ గ్లామరస్‌గా కనిపించడంతో ఈ సాంగ్ ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. మరి సినిమా విడుదల తర్వాత జాన్వీకి ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో వేచి చూడాలి. కాగా ‘దేవర’ తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జాన్వీకి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెండితెరపై చిరంజీవి–శ్రీదేవిలది సూపర్ జోడీ. వారి వారసులు రామ్ చరణ్– జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇది రెండవ చిత్రం. ఒకప్పటి హిట్ జోడీ అయిన చిరంజీవి–శ్రీదేవిల వారసులు రామ్‌చరణ్–జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ ΄ాన్ ఇండియా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. వీరమల్లుతో పోరాటం గత కొన్నేళ్లుగా బాబీ డియోల్ కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ (2023) సినిమా తర్వాత ఈ బాలీవుడ్ నటుడి క్రేజ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో ఆయన నటించిన విలన్ పాత్రకి అద్భుతమైన పేరు రావడంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఆయన నటిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కల్యాణ్, నిధీ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో ఆయన తప్పుకున్నారట. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. ఏఎమ్ రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్బీకే 109’ (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. 1998లో విడుదలైన హీరో నాగార్జున ‘చంద్రలేఖ’ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో కనిపించారు సంజయ్ దత్. దాదాపు ఇరవైఆరేళ్ల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన తెలుగు సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. విలన్ బిగ్ బుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఆయన నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ (తెలుగు–హిందీ) సినిమాతో తెలుగులో పరిచయమైన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం జూన్ 27న విడుదలైంది. ఈ సినిమా రెండో భాగంలోనూ దీపిక నటించనున్నారు. వెర్సటైల్ యాక్టర్‌గా పేరొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ ఏడాది ‘సైంధవ్’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. వికాస్ మాలిక్‌గా విలన్ పాత్రలో తనదైన శైలిలో అలరించారాయన. ఇలా ఈ ఏడాది ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగుకి పరిచయం కాగా... మరెందరో రానున్నారు. -
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది. -
Border 2 : పాతికేళ్ల తర్వాత వచ్చేస్తున్న సీక్వెల్
సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా తదితరులు లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ ‘బోర్డర్’ని అంత సులువుగా మరచిపోలేం. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్ సీక్వెల్లోనూ హీరోగా నటిస్తారు. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో లీడ్ రోల్ చేస్తారు. కాగా ‘బోర్డర్’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్ దత్తా ‘బోర్డర్ 2’కు ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భారతదేశ సైనికుల త్యాగాలు, గొప్పతనం గురించి తెలిపేలా ఉండే ఈ సినిమాను రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని, జనవరి 23 పర్ఫెక్ట్ డేట్ అని యూనిట్ భావించిందట. ఇక ఈ సీక్వెల్లో వచ్చే వార్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
సన్నీ సీటును ఆక్రమించిన దినేష్ ఎవరు?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రకియ ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ తన ఎనిమిదవ జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి సన్నీ డియోల్ స్థానంలో దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది. అప్పటి నుంచి దినేష్ సింగ్ బబ్బు పేరు వార్తల్లో నిలుస్తోంది. బీజేపీ నేత దినేష్ సింగ్ బబ్బు(62) పంజాబ్‌లోని సుజన్పూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2007, 2012, 2017లో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే 2022లో సుజన్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ పూరి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ ఆయనకు గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని అప్పగించింది. దినేష్ సింగ్ బబ్బు అండర్ గ్రాడ్యుయేట్. పఠాన్‌కోట్‌లోని భంగోల్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన తన రాజకీయ జీవితాన్ని భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రారంభించారు. కాగా గురుదాస్‌పూర్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాకర్‌పై బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్ 82,459 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే సన్నీ డియోల్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరనే ఆరోపణలు వినిపించాయి. ఈసారి కూడా విజయాన్ని నిలబెట్టుకోవాలని భావించిన బీజేపీ దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది. -
బీజేపీ 8వ జాబితా రిలీజ్.. ప్రముఖ బాలీవుడ్ హీరోకు నో టికెట్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బ్లాక్ బస్టర్ గదర్ హీరో సన్నీ డియోల్‌కు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్‌పూర్ నుంచి దినేష్‌సింగ్ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్ ఇచ్చారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్‌సింగ్ సంధుకు అమృత్సర్ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్‌కుమార్ రింకూను జలంధర్ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్ సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కు కటక్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్‌మెషిన్‌ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు -
లోక్ సభలో నోరు మెదపని ఎంపీలు వీరే..
దేశంలోని ఓటర్లు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తారు. అయితే దీనికి విరుద్దంగా ప్రవర్తించిన ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలం ముగియనుండడంతో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 17వ లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీలు తమ పదవీ కాలంలో ఒక్కసారి కూడా సభలో మాట్లాడనేలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ ఎంపీలలో అమితమైన ప్రజాదరణ పొందినవారు కూడా ఉన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సన్నీ డియోల్, శతృఘ్న సిన్హా సభలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలో శత్రుఘ్న సిన్హా చేరారు. శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. గతంలో శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పార్లమెంటులో ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. అదేవిధంగా కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపి రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ నియోజకవర్గం ఎంపీ అతుల్ రాయ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. -
లోహ్రీ రోజు దానం చేయాలి : అమితాబ్
సంక్రాంతి పండగ సంబరాలు ఆరంభమయ్యాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ లోహ్రీ (భోగి పండగ) శుభాకాంక్షలు. లోహ్రీ అంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. లోహ్రీ రోజు జానపద కళాకారులు ‘లోహ్రీ దా టక్కా దే, రబ్ యానూ బచ్చా దే’ అంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి దానం ఇవ్వడం ఆనవాయితీ. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా పండగ తాలూకు విషయాలు చెప్పేవారు’’ అని సోషల్ మీడియా ద్వారా అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. T 4889 - Happy Lohri .. 'लोहड़ी दा टक्का दे, रभ थानू बच्चा दे ' ... 😁 this is how the chanting went when they came to homes and families to collect donations on the occasion of Lohri .. Maa used to tell us these stories .. pic.twitter.com/t9rVu8Kb2j — Amitabh Bachchan (@SrBachchan) January 13, 2024 ‘‘లోహ్రీ తాలూకు వెచ్చదనాన్ని, పండగ సందర్భంగా మా అమ్మగారు చేసిన స్వీట్స్‌ని తలుచుకుంటున్నాను. ఇరుగు పొరుగుతో పంచుకున్న నవ్వులతో నా మనసు నిండిపోయేది. నేటి బిజీ జీవితంలో అప్పటి ఆనందకర సాధారణ రోజులను తలచుకుని, ఆనందిస్తున్నాను. అందరి జీవితాల్లో లోహ్రీ ఆనందం నింపాలని కోరుకుంటున్నా’’ అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. ఇంకా అక్షయ్ కుమార్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, ఇషా డియోల్, నేహా ధూపియా వంటి తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆచూకీ చెబితే రూ. 50 వేలు!
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పంజాబ్‌లో ఆయన అదృశ్యం అయ్యారంటూ పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు సన్నీ డియోల్ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించారు. సన్నీ డియోల్ అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి సన్నీ డియోల్ గురుదాస్‌పూర్-పఠాన్‌కోట్ లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ. సన్నీడియోల్ ఎంపీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పఠాన్‌కోట్ జిల్లాలోని హల్కా భోవాకు చెందిన జనం సర్నా బస్టాండ్‌లో సన్నీ డియోల్ అదృశ్యంపై పోస్టర్లపై అతికించి, అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని హల్కా, పఠాన్‌కోట్, సుజన్‌పూర్‌లలో సన్నీ డియోల్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఇంత జరుగుతున్నా సదరు ఎంపీ స్థానికుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన లోక్‌సభ నియోజకవర్గానికి ఎప్పుడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరసనకు దిగిన జనం బస్సులకు ఈ పోస్టర్లను అతికించారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత సన్నీ డియోల్ తన లోక్‌సభ నియోజకవర్గానికి ఏనాడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో సన్నీ డియోల్ విజయం సాధించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని నిరసనకారులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు! -
రోడ్డుపై తాగి వీరంగం సృష్టించిన బాలీవుడ్ స్టార్? వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నడిరోడ్డుపై తాగి తూగుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పూటుగా తాగడమే కాకుండా పబ్లిక్‌లో ఇలా వీరంగం సృష్టిస్తున్నాడేంటని నెటిజన్లు సన్నీని తిట్టిపోస్తున్నారు. పేరుకే సెలబ్రిటీ.. కానీ చేసే పనులు ఇలా ఉంటాయని విమర్శిస్తున్నారు. దీంతో ఈ ట్రోలింగ్‌కు చెక్ పెడుతూ ఈ వైరల్ వీడియో వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టాడు నటుడు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒరిజినల్ వీడియో షేర్ చేశాడు. ఇందులో కెమెరాలు పట్టుకుని నడుస్తుండగా వాటి ముందు సన్నీ తాగి తూలుతున్నట్లుగా నటిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి.. టాక్సీని ముందుకు రమ్మనండి అని చెప్పడంతో కారు నడిపే వ్యక్తి సన్నీదగ్గరకు పోనిచ్చాడు. అంటే సినిమా చిత్రీకరణలో భాగంగా సన్నీ డియోల్ ఇలా ప్రవర్తించాడన్నమాట. ఇప్పటికైనా పుకార్లకు చెక్ పడుతుందని ఆశిస్తున్నానంటూ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు నటుడు. ఇది చూసిన అభిమానులు.. నిన్ను ద్వేషించేవాళ్లు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. వాటినేమీ పట్టించుకోవద్దు, ఆల్ ద బెస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. మీ డైహార్డ్ ఫ్యాన్‌గా మీరేంటో నాకు తెలుసు.. మీకు మద్యం తాగే అలవాటు లేదు. ఒకవేళ డ్రింక్ చేసినా ఇలా చీప్‌గా ప్రవర్తించరు. మీ నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని ఓ అభిమాని రాసుకొచ్చాడు. మరికొందరేమో ప్రమోషనల్ స్ట్రాటజనీ బాగుంది అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సన్నీ డియోల్ హీరోగా గదర్ 2 సినిమా చేశాడు. ఈ మూవీ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఇతడు బాప్, లాహోర్ 1947, సూర్య సినిమాలు చేస్తున్నాడు. Ye bjp MP Sunny Deol kaha ghum raha raat ko? Lagta hai jada daaru pee liya kya?#SunnyDeolpic.twitter.com/oHCyuqcq47 — Pawan Shukla (@Shukla8175) December 5, 2023 Afwaahon ka ‘Safar’ bas yahin tak 🙏🙏#Shooting #BTS pic.twitter.com/MS6kSUAKzL — Sunny Deol (@iamsunnydeol) December 6, 2023 చదవండి: తెలుగింటి హీరోయిన్.. అందంగా లేదని వెక్కిరించినవాళ్లే కుళ్లుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. -
సన్నీడియోల్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు!
చండీగఢ్: గదర్-2 హీరో సన్నీడియోల్‌పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైరయ్యారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ పర్యటన సందర్భంగా కేజ్రీవాల్ సన్నీడియోల్‌పై విమర్శల దాడి చేశారు. గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సన్నీడియోల్ ఎప్పుడైనా మీకు మొహం చూపించారా అని ప్రజలను ప్రశ్నించారు. ఓటు వేసిన వారిని సన్నీడియోల్ మోసం చేశారని విమర్శించారు. ‘సన్నీ డియోల్‌ను మీరు గెలిపించారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి అతడు మళ్లీ ఎప్పుడైనా వచ్చాడా? అతని ముఖాన్ని మీరేప్పుడైనా మళ్లీ చూశారా?. పెద్ద హీరో అనుకుని మనం అతనికి ఓట్లేశాం. అలాంటి పెద్దవాళ్లను ఎన్నుకుంటే వాళ్లేం చేయరు. అందుకే సామాన్యుడిని(ఆమ్ఆద్మీ)ని గెలిపించాలి. ఆమ్ ఆద్మీ అయితే మీరెప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు’ అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో ప్రతిపక్షాలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆపార్టీలకు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప వేరే ఏం పనిలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఖాళీ చేసిన ఖజానాను ఏడాదిన్నరలో ఆప్ ప్రభుత్వం నింపిందన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. ఇదీచదవండి.. ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’ -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్‌హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్‌లో అతనొక్కడే: ఎన్టీఆర్‌పై గదర్ డైరెక్టర్
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2 భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం 2001 బ్లాక్‌బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథకు ఆధ్యాత్మిక సీక్వెల్‌గా పనిచేస్తుంది. తారా సింగ్ మరియు సకీనా వంటి వారి ప్రియమైన పాత్రలలో సన్నీ మరియు అమీషా తిరిగి రావడాన్ని ఆస్వాదిస్తూ ప్రేక్షకులు ఈ చిత్రం ద్వారా లోతుగా హత్తుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత కూడా హృదయాలను దోచుకునే వారి కెమిస్ట్రీపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు, ఇది ఇప్పటికీ ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుంది. అసలు గదర్ నేటి కాలంలో రూపొందితే తారా సింగ్ పాత్రలో ఎవరిని తీసుకుంటారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు అనిల్ శర్మను అడిగారు. ప్రస్తుత తరం నుండి ఆ ఐకానిక్ క్యారెక్టర్లోకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అడుగు పెట్టగలడని తన అభిప్రాయం అని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) అనిల్ శర్మ మాట్లాడుతూ.. ' ప్రస్తుత హీరోల్లో ఆ పాత్రకు సరిపోయే వారు ఎవరూ కనిపించలేదు. ముంబయిలో అయితే ఎవరూ లేరు. సౌత్‌లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు సరిపోతాడు. అతనైతేనే ఈ పాత్రను చేయగలడు. అతనికి ఏ పాత్రలోనైనా చేయగల సత్తా ఉంది.' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది విన్న జూనియర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అభిమానుల స్పందన త్వరలోనే ఎన్టీఆర్ దేవరతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను అలరిస్తాడని అంటున్నారు. తారక్ మాత్రమే అత్యంత పర్ఫెక్ట్గా ఎలాంటి పాత్రనైనా చేయగలడంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. (ఇది చదవండి: గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్! ) -
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కానీ అదే ట్విస్ట్!
ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా అందరూ సినిమాలు తెగ చూసేస్తున్నారు. దీనితోపాటు ప్రతివారం థియేటర్లలో కొత్త మూవీస్ రిలీజ్ కావడం లేటు.. వాటి టాక్ ఏంటి? ఒకవేళ బాగోలేకపోతే ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయి అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఓ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఇప్పుడు స్వయంగా దర్శకుడే క్లారిటీ ఇచ్చేశాడు. అది కాస్త కన్ఫ్యూజ్ చేస్తోంది. సినిమా టాక్ ఏంటి? 2001లో 'గదర్' సినిమా రిలీజ్ అద్భుతమైన టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది. దానికి 22 ఏళ్ల సీక్వెల్ తీసి, ఈ మధ్యే రిలీజ్ చేయగా ఇప్పుడు కూడా బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పటివరకైతే దాదాపు రూ.450 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కెరీర్ అయిపోయిందనుకున్న సన్నీ డియోల్ కి ఈ సినిమా మంచి జోష్ తీసుకొచ్చింది. నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి మరీ చూస్తుండటం విశేషం. (ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ) ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ శర్మ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అలానే ఓటీటీ రిలీజ్ గురించి స్పందించారు. 'ప్రస్తుతం ప్రేక్షకులు 'గదర్ 2'ని థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. నాకు తెలిసినంతవరకు మరో ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని అనుకుంటున్నాను' అని అనిల్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆరు నెలలు.. కుదరదేమో? అయితే 'గదర్ 2' హిట్ అయిన ఆనందంలో ఉన్న దర్శకుడు అనిల్ శర్మ.. ఓటీటీ రిలీజ్ ఆరు నెలల తర్వాత అన్నాడు. కానీ అన్ని నెలలు ఎవరూ వెయిట్ చేయరు. అలానే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5.. అంతకాలం అస్సలు సినిమాని దాచిపెట్టుకోదు కదా. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. 5-6 వారాల తర్వాత అనుకున్నాసరే సెప్టెంబరు చివరికల్లా 'గదర్ 2' ఓటీటీలోకి వచ్చేయొచ్చు. (ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?) -
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్‌కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్‌డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్‌లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్‌కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం. -
Ameesha Patel: గదర్ 2 సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ (ఫోటోలు)
-
అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!
బాలీవుడ్ చాలారోజుల తర్వాత మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య థియేటర్లలో రిలీజైన 'గదర్ 2' సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుండటమే దీనికి కారణం. కెరీర్ ఇక అయిపోయిందనకున్న టైంలో సన్నీ డియోల్ ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అలాంటిది ఈ హీరో ఇప్పుడు కోట్ల రూపాయల అప్పు చేసి ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. అతడి ఖరీదైన విల్లాని వేలానికి రావడంతో ఈ విషయం బయటపడింది. ఏం జరిగింది? ముంబయి జుహూ ప్రాంతంలో గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ డియోల్ కి ఒక విల్లా ఉంది. అయితే దీనిని గ్యారంటీగా పెట్టి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్లు లోన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు దాన్ని చెల్లించే విషయంలో మాత్రం మొహం చాటేశాడు. బ్యాంక్ నోటీసులు పంపినా సరే స్పందించలేదు. దీంతో ఏకంగా ఆదివారం (ఆగస్టు 20) ఓ ప్రముఖ పేపర్లో విల్లాని వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. డబ్బుల్లేవా? బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర వారసుడు అయిన సన్నీ డియోల్.. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఇతడికి సరైన హిట్ అనేది లేదు. దీంతో అందరూ ఇతడి గురించి మర్చిపోయారు. ప్రస్తుతం 'గదర్ 2'తో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇలాంటి హీరో లోన్ తీసుకుని కట్టకపోవడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పు తీర్చకపోవడం అనేది ఇతడికి పెద్ద సమస్య కాదు. తలుచుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో తీర్చేయొచ్చు. కానీ సన్నీ డియోల్ ఎందుకలా చేస్తున్నాడనే విషయం ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. చూడాలి మరి ఈ వేలంలో ఏం జరుగుతుందనేది? (ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?) -
మీరేమి బాడీ బిల్డర్లు కాదు.. యంగ్ హీరోలపై సన్నీ సెటైర్లు!
గదర్- 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్గా నటించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ శర్మ తనయుడు ఉత్కర్ష్ శర్మ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో సన్నీడియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కొత్త తరం నటీనటులను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. పరిశ్రమకు నటులు కావాలని.. బాడీబిల్డర్లు అవసరం లేదని చురలకలంచటించారు. గదర్ -2 సక్సెస్ కావడంతో సన్నీ నేటి యువ హీరోలకు ఓ సలహా ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువనటులు బాడీబిల్డింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టకుండా.. నటనపైనా దృష్టి పెడితే బాగుంటుందని సూచించాడు. సన్నీ మాట్లాడుతూ.. "బాడీబిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేయండి. నటనపైనే దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే మనకు కావల్సింది అదే. మీరేమి బాడీ బిల్డర్లు కాదు. మీరు ఫిట్‌గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. సంగీతం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. మీరందరూ నా పాత చిత్రాలను చూశారని తెలుసు. అంతకుముందు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇప్పడున్న చాలా మంది కొత్తవారు గొప్పగానే పని చేస్తున్నారు. మీరు కేవలం కండలు తిరిగిన వ్యక్తుల కంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని హీరోలుగానే చూసేలా ఉండండి.' అంటూ సలహా ఇచ్చాడు. గదర్ -2 గురించి సన్నీ మాట్లాడుతూ.. 'ఇది చాలా పాత చిత్రంలా అనిపిస్తుంది. కానీ మేము ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా తెరకెక్కించాం. ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందని సన్నీని ప్రశ్నించగా.. సినిమా తీసే విధానం మారలేదు.. సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది మరింత వేగంగా విస్తరించింది.అయినప్పటికీ మన సంస్కృతి, విలువలు, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.' అని అన్నారు. కాగా.. గదర్- 2 అనేది 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించారు. -
నా సినిమాలపై విషప్రచారం.. మాఫియా పనే అంటూ కంగనా ఫైర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చంద్రముఖి-2, ఎమర్జెన్సీ, తేజస్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే బీ టౌన్లో ఎప్పుడు ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కంగనా. తాజాగా మరోసారి ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా విమర్శలతో వార్తల్లో నిలిచింది. తన సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. దేవుడా అలాంటి వారి ఆత్మకు శాంతి కలిగించు వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. దీని వెనుక ఓ మాఫియా ముఠా ఉందంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!) తన సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా సినిమాల్లో రూ.150 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాలను ఫ్లాప్స్ అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించింది. ప్రతిరోజూ 10-15 కథనాలు నా చిత్రాలు ఫ్లాప్స్ అంటూ రాస్తున్నారు. ఇతరుల పట్ల ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎలా వస్తాయంటూ నిలదీస్తోంది. వీటి కోసం పగలు, రాత్రి ప్లాన్ చేసి.. ఇతరులను చెడుగా చూపించడానికి వారు స్వంత డబ్బును ఖర్చు చేస్తున్నారంటూ కంగనా తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో 2015లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, సన్నీ డియోల్ నటించిన చిత్రం ఐ లవ్ న్యూ ఇయర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్ర తర్వాత కంగనా కెరీర్ ముగిసిపోయిందనే పెద్దఎత్తున వార్తలొచ్చాయి. అయితే కంగనా ఆ ఆరోపణలను ఖండించింది. తాజాగా సన్నీ డియోల్ నటించిన గదర్- 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని కంగనా ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు సన్నీ డియోల్‌కు నేను ఓ పెద్ద ఫ్యాన్‌ను అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో తనపై గూఢచర్య చేస్తున్నారని ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్) -
ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తనయుడు, నటుడు కరణ్ డియోల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి దృష ఆచార్యతో ఏడడుగులు నడిచాడు. జూన్ 18న ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టే వివాహ వేడుక కోసం సుందరంగా ముస్తాబైందీ కొత్త జంట. నూతన వధువు ఎరుపు లెహంగాలో మెరిసిపోగా, వరుడు కరణ్ డియోల్ షేర్వానీ ధరించాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆదివారం రాత్రి సినీప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇకపోతే కరణ్ డియోల్.. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుక సైతం ఘనంగా జరిగింది. బరాత్ వేడుకలో కరణ్ తండ్రి సన్నీ డియోల్‌తో పాటు బాబీ, అభయ్ డియోల్, తాతయ్య ధర్మేంద్ర కూడా స్టెప్పులేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం?: ఆదిపురుష్ రచయిత -
నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?
బాలీవుడ్లో సన్నీడియోల్, అమీషా పటేల్ నటిస్తున్న 'గదర్-2' వివాదానికి దారి తీసింది. ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన వల్ల గురుద్వారా నిర్వాహకులతో పాటు సిక్కు మతస్థులు చిత్ర యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ తెలిపారు. (ఇదీ చదవండి: కుటుంబ పోషణ భారమై డ్రైవర్‌గా మారిన హీరో? నిజమేంటంటే?) కొన్నిరోజుల క్రితం తిరుపతిలో కృతిసనన్ చెంపపై ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరోకటి జరగడంతో ఛీ.. ఛీ దేవాలయాల్లో ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కనీసం వారు క్షమాపణలు చెబితే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇక పోతే, తెలుగులో అమీషా పటేల్ పవన్ సరసన 'బద్రి'తో మెప్పించింది. ఆ తరువాత మహేష్‌తో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడులో నటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్‌గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్‌కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్‌ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్‌కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్‌కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్‌గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్‌గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్‌కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు.