transgender
-
అమెరికా పార్లమెంట్లో బాత్రూమ్ గొడవ
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్ నేత, ట్రాన్స్‌జెండర్ సారా మెక్బ్రైడ్పై అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్జెండర్లు ఏ బాత్రూమ్ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్‌లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్‌లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్‌జెండర్ చట్టసభ మెంబర్‌పై రిపబ్లికన్ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డి్రస్టిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్‌జెండర్‌గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్రూమ్లోకి అనుమతించబోమని రిపబ్లికన్ నాయకురాలు, సౌత్ కరోలినా ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు. అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్ రూమ్, చేంజింగ్ రూమ్‌లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్ ప్రోటోకాల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్ డిమాండ్‌చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు. -
అమెరికా నుంచి వెళ్లిపోతా.. ఎలన్ మస్క్ కుమార్తె
వాషింగ్టన్: అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని, దేశాన్ని వీడి వెళ్తానని ఎలన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె వివియన్ విల్సన్ ప్రకటించారు. 2022 నుంచి తండ్రికి దూరంగా ఉంటున్న వివియన్.. ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత మెటా థ్రెడ్స్‌లో తన ఆలోచనలను పంచుకున్నారు. ‘‘నేను కొంతకాలంగా ఈ విషయం మీద ఆలోచిస్తున్నా. నిన్నటిరోజును చూశాక నిర్ణయం తీసుకున్నాను. నేను అమెరికాలో ఉండేలా భవిష్యత్ కనిపించడం లేదు’’అని రాసుకొచ్చారు. దీనిపై మస్క్ స్పందించారు. ‘‘మైండ్ వైరస్ నా కొడుకును చంపేసింది’’అని మరోసారి ట్వీట్ చేశారు. నేను అలసిపోయాను.. మళ్లీ.. తన తండ్రి పోస్ట్ స్క్రీన్ షాట్‌ను థ్రెడ్స్‌లో షేర్ చేస్తూ.. ‘‘మీరు ఇప్పటికీ నా బిడ్డ ఏదో ఒక వ్యాధి బారిన పడ్డారంటున్నారు. మీరు నన్ను ద్వేషించడానికి పూర్తిగా కారణం అదే. దయచేసి దాని జోలికి పోవద్దు. ప్రతి సన్నివేశంలో నేను బాధితురాలిని తప్ప మరేమి కాదు. నేను అలసిపోయాను. నాకు విసుగ్గా ఉంది’’అని ఆమె జత చేశారు. ఆ తరువాత మరోపోస్ట్‌లో... ఒకరిపై అధికారం కోల్పోయాననే తన తండ్రి అలా పిచి్చగా మాట్లాడుతున్నారని వివియన్ పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగా పరిణితి చెందని మీరు భ్రమలో ఉన్నారు, ఒకరి మీద నియంత్రణ కోల్పోయాననే కలతతో ఉన్నారు. మీరెలాంటివారో మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికీ తెలుసు. అది నా సమస్య కాదు’’అని ఆమె తెలిపారు. -
రికార్డు: తొలిసారి అమెరికా సెనేట్‌కు ట్రాన్స్‌జెండర్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్స్ కూడా బుధవారం(నవంబర్ 6) వెలువడుతున్నాయి. డెలవేర్‌లోని ఎట్ లార్జ్హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సెనేట్‌కు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు.దీంతో సారా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డులకెక్కారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ 3తో,సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు.ఈ ఎన్నికలో సారాకు 95శాతం ఓట్లు పోలవగా వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.తాను ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.కాగా,సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్ల డాలర్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2010 నుంచి డెలవేర్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
నేను నిన్ను మోసం చేసాను..
జవహర్‌నగర్: ఉరి వేసుకొని ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జవహర్‌నగర్ కార్పొరేషన్ సంతోష్‌నగర్ కాలనీలో దొంతి సంతోష్ (31), భార్య బాలమణి, కుమారుడితో కలిసి నివసించేవారు. 2012 సంవత్సరంలో వీరికి వివాహం అయింది. కాగా గత నాలుగు సంవత్సరాల క్రితం సంతోష్ ట్రాన్స్‌జెండర్‌గా మారి సరితగా పేరు పెట్టుకున్నాడు. అప్పటి నుండి కుటుంబానికి దూరంగా ఉంటూ వికలాంగుల కాలనీ రేణుకానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా ఇటీవల భార్య కుషాయిగూడలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లితో ఉంటోంది. శుక్రవారం ఉదయం ట్రాన్స్‌జెండర్ సరిత భార్య బాలమణితో వీడియోకాల్‌లో మాట్లాడారు. ‘నేను నిన్ను మోసం చేశానని, నువు లేకుండా ఉండలేకపోతున్నానని, నువ్వు వెంటనే రావాలని, లేకుంటే చనిపోతానని’ చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేసిన భార్య బాలమణి చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి చెప్పింది. అయితే ఇంటి పక్కనవారు వెళ్లి చూసేసరికి సరిత చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. బాలమణి సంఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే సరిత మృతిచెందింది. తన భర్త ట్రాన్స్‌జెండర్‌గా మారి కుటుంబానికి ద్రోహం చేశాడని మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుననారు. -
ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు
గొల్లపల్లి: ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. ఈ ఘటన గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మ్యాట్నీ మల్లేశం, లత దంపతుల కొడుకు శ్రీనివాస్.. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బాసవేని శంకరయ్య, సుశీల దంపతుల కుమారుడు (ట్రాన్స్‌జెండర్) అంజలి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం కొన్నాళ్లు గల్ఫ్ వెళ్లాడు. స్వగ్రామానికి రాగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులను ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజే చప్పుళ్ల మధ్య ట్రాన్స్జెండర్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. -
దేశంలోనే తొలి ట్రాన్స్ఉమెన్ డైరెక్టర్ సంయుక్త విజయన్ సక్సెస్ స్టోరీ
పొల్లాచ్చిలో పుట్టి శాన్ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన ఈ ట్రాన్స్ ఉమన్ మన దేశ తొలి ట్రాన్స్ ఉమన్ డైరెక్టర్‌గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీల నిర సూర్యన్’ పేరుతో సినిమా తీయడమే కాదు ముఖ్యపాత్ర పోషించింది. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త పరిచయం. 2016.తమిళనాడు–తిరుచ్చిలోని సొంత ఇంటికి దీపావళి పండక్కు వచ్చిన సంతోష్ అమెరికాకు తిరిగి వెళుతూ ‘అమ్మా... వచ్చే దీపావళికి నేను అమ్మాయిగా వస్తాను’ అని చెప్పాడు. తల్లి ఉలిక్కి పడలేదు. కన్నీరు కార్చలేదు. ‘నీ ఇష్టంరా. నీకెలా సంతోషంగా ఉంటే అలా చెయ్’ అంది. అమెరికాకు వెళ్లాక సంతోష్ ట్రాన్స్ ఉమన్‌గా మారడానికి అవసరమైన వైద్యం, చికిత్సలు చేయించుకున్నాడు. శనివారం వరకూ అబ్బాయి రూపంలోనే వెళ్లిన సంతోష్ సోమవారం నుంచి ‘సంయుక్త’ గా ఆఫీస్‌లో అడుగు‘పెట్టింది’. అయితే స్నేహితులు ఎటువంటి తేడా చూపించలేదు. అబ్బాయి సంతోష్‌తో ఎంత స్నేహంగా ఉన్నారో అమ్మాయి సంయుక్తతో అంత స్నేహంగా ఉన్నారు. ‘అందరి కథ ఇంత సులువుగా ఉండదు. అందుకే సినిమా తీశాను’ అంటుంది సంయుక్త.బీటెక్ గ్రాడ్యుయేట్సంయుక్త తండ్రి టైలర్. తల్లి గృహిణి. ముగ్గురు కుమారుల్లో ఒకడుగా పుట్టాడు సంతోష్. ‘అయితే నా భౌతిక రూపానికి నా మానసిక స్వభావానికి పొంతన కుదరలేదు. నాలోని స్త్రీనే నేను స్వీకరించాను. నా తల్లిదండ్రులు ఇందుకు నన్ను ఇబ్బంది పెట్టకపోయినా బయట నేను సంప్రదాయవాదుల గేలిని, అల్లరిని, అవమానాన్ని భరించాను. ట్రాన్స్పర్సన్ల జీవితం వెండి తెర మీద రావడం తక్కువ. మగవాళ్లు కొందరు ఆ పాత్రలు ధరించారు. ఇటీవల ‘తాలి’ సినిమాలో సుస్మితా సేన్ బాగా చేసింది. కాని నేను ట్రాన్స్ఉమన్గా ఉంటూ సినిమా తీయడం వల్ల మేమూ ఇండస్ట్రీలో మా కథలు చెప్పగలం అని నిరూపించదలుచు కున్నాను’ అంటుంది సంయుక్త.సినిమా అంటే తెలియకపోయినా...‘మా పొల్లాచ్చిలో రోజూ షూటింగ్‌లే. కాని ఏవీ నేను చూడలేదు. షార్ట్‌ఫిల్మ్‌లు తీయలేదు. అసిస్టెంట్‌గా పని చేయలేదు. 2020లో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలన్న సంగతిని యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకున్నాను. వందల వీడియోలు చూసి రెండేళ్ల పాటు స్క్రిప్ట్ రాశాను. నా జీవితాన్ని, నావంటి వారి జీవితంలోని ఘటనలను కలిపి ‘నీల నిర సూర్యన్’ సినిమా తీశాను. అంటే నీలి రంగు సూర్యుడు అని అర్థం. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది బ్లూ సన్‌షైన్’ పేరుతో ప్రదర్శితమవుతుంది. తమిళ విడుదల కోసం తమిళ పేరు పెట్టాను’ అని తెలిపింది సంయుక్త.సొంత డబ్బు పెట్టి...సంయుక్త అమెరికాలో అమేజాన్‌లో ఉన్నత ఉద్యోగంలో ఉంది. తన సంపాదనలోని కొంత భాగాన్ని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. ‘సినిమాల్లో థర్డ్ జెండర్‌ని హాస్యానికే వాడి అపచారం చేశారు. ఇక మీదైనా ట్రాన్స్పర్సన్లను మర్యాదకరమైన రీతిలో ఇన్క్లూజివ్గా చూపి చేసిన పాపాన్ని కడుక్కోవాలి సినిమావారు. పరిస్థితి ఇంకా చిన్న ఊళ్లలో మారలేదు. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్ని పిల్లలు గౌరవిస్తారు. కాని ఆ టీచర్ ట్రాన్స్ ఉమన్ అయితే తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ΄ోవాలి. నేను తీసిన సినిమా కథ మాలాంటి వాళ్ల అస్తిత్వాన్ని గౌరవించవలసిందిగా అర్థం చేసుకోమని కోరుతుంది’ అందామె.స్త్రీగా మాత్రమేసంయుక్త తనను తాను స్త్రీగా తప్ప ట్రాన్స్‌జెండర్‌గా చెప్పడానికి అంగీకరించదు. ‘నేను స్త్రీగా మారదల్చుకున్నాను. మారాను. కనుక నా ఆధార్ కార్డులో స్త్రీ అనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ట్రాన్స్‌జెండర్ అనే అస్తిత్వం అవసరమైతే దానిని కొందరు స్వీకరించవచ్చు. కాని నేను పూర్తిగా స్త్రీ అస్తిత్వంతో ఉండాలని కోరుకుంటాను’ అంటుంది సంయుక్త. ఆమె మంచి భరతనాట్య కళాకారిణి. చెన్నయ్‌లో ఆరంగేట్రం చేస్తే చాలామంది మెచ్చుకున్నారు. విస్మరణకు గురైన జీవితాలకు సంబంధించి ఇవాళ అనేక సినిమాలు వస్తున్నాయి. సంయుక్త విజయన్ తీసిన ‘నీల నిర సూర్యన్’ మరో ముఖ్యమైన కథను చెబుతోంది. మరిన్ని కథలు సంయుక్త నుంచి మనం చూడొచ్చు.‘మా కథలు మేము చెప్పుకోవడం ఈ దేశంలో అంత సులువు కాదు’ అంటుంది సంయుక్త విజయన్. -
ఆ ఫోబియాకు పుస్తకాల శక్తితో చెక్ పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్!
ట్రాన్స్జెండర్లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్. ఎవరీ నియోగ్? ఏం చేస్తోందంటే..అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్ ఫోబియా అంటారు. తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది. అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్ జెండర్‌గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్‌లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ. తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్‌కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు. View this post on Instagram A post shared by Rituparna (@the_story_mama) (చదవండి: అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!) -
మోదీ ప్రమాణస్వీకారం.. అతిథుల్లో కూలీలు, హిజ్రాలు
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ఎందరో అతిథులు విచ్చేయనున్నారు. ఆదివారం(జూన్9) జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని ప్రత్యేకతలుండటంతో పాటు కొంత మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరుకానున్నారు.కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్తా నిర్మాణంలో పాల్గొన్న కూలీలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేసిన అధికారులతో పాటు పలువురు హిజ్రాలు, శానిటేషన్ సిబ్బంది, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులకు మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమాకి ఆహ్వానాలు అందాయి. కాగా, మోదీ ప్రమాణస్వీకారానికి పలువురు ఇతర దేశాల అధినేతలు కూడా రానున్నారు. -
ప్రత్యేక ఏర్పాట్ల కోసం టాన్స్ జెండర్ అభ్యర్థి ధర్నా
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలు చోట్ల ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణ ఢిల్లీకి చెందిన ఏకైక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి రాజన్ సింగ్ పోలింగ్ బూత్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.రాజన్ సింగ్ ఓటు వేసేందుకు సంగం విహార్‌లోని జె బ్లాక్‌లో గల ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 125కి వచ్చారు. అయితే అక్కడ ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఏర్పాట్లు లేవన్న కారణంతో రాజన్ ఓటు వేయడానికి నిరాకరించారు. పోలింగ్ కేంద్రం బయట ధర్నాకు దిగారు.కొద్దిసేపటి తరువాత ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ రాజన్ సింగ్‌కు పోలీసు రక్షణ మధ్య ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. తాను ట్రాన్స్‌జెండర్ ఓటరునని, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థినని పోలింగ్ బూత్‌లోని ప్రభుత్వ అధికారికి తాను చెప్పినప్పటికీ, తనను నెట్టివేశారని రాజన్సింగ్ ఆరోపించారు.అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద రెండు లైన్లు మాత్రమే ఉన్నాయని, అవి మగవారికి, ఆడవారికి మాత్రమే ఉన్నాయని, ట్రాన్స్జెండర్ల కోసం ఎలాంటి క్యూ ఏర్పాటు చేయలేదని రాజన్ సింగ్ ఆరోపించారు. అలాగే ట్రాన్స్ జండర్లుకు పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయలేదని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, తాము ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నామని రాజన్ వాపోయారు. -
ఢిల్లీలో తొలి ట్రాన్స్‌జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
పవన్ కల్యాణ్‌పై చర్మకారుడి పోటీ
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఒక ట్రాన్స్‌జెండర్ ప్రకటించగా.. తాజాగా ఓ చర్మకారుడు కూడా ఆయనపై పోటీకి సిద్ధమంటున్నాడు. డిగ్రీ చదువుకున్నా కానీ కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పట్టభద్రుడిని కాబట్టే చట్ట సభలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అందుకే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని అంటున్నారు పిఠాపురానికి చెందిన చర్మకారుడు ఏడిద భాస్కరరావు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ వద్ద చెట్టు కింద 20 ఏళ్లుగా చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినీ యాక్టర్ పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి అందరూ పోటీ చేస్తూంటే స్థానికుడిగా బీఏ పొలిటికల్ సైన్స చదువుకున్న తానెందుకు పోటీ చేయకూడదని అనిపించిందన్నారు. అందుకే నాలుగు నెలలుగా నియోజకవర్గ సమస్యలను పత్రికల ద్వారా సేకరించానన్నారు. పిఠాపురంలో ఇప్పుడు పవన్ పరిష్కరిస్తానంటున్న సమస్యలను తాను 4 నెలల క్రితమే గుర్తించానన్నారు. పేద కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి, ప్రజల సమస్యలు తీర్చాలంటే చట్ట సభలే వేదిక అని తలచి పోటీలో ఉండాలనుకుంటున్నానన్నారు. తనకు తెలిసిన వారందరి మద్దతూ కోరుతున్నానని, చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. ఎలాగైనా పవన్ కల్యాణ్‌పై గెలుస్తాననే నమ్మకం తనకుందన్నారు. త్వరలో తాను కూడా ఓ మేనిఫెస్టో తయారు చేసుకుని, ప్రకటిస్తానని భాస్కరరావు తెలిపారు. -
ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్‌జెండర్ గురించి తెలుసా?
లక్నో: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్‌జెండర్ కూడా పోటీ చేస్తున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ (ABHM) ఉత్తరప్రదేశ్ విభాగం తరఫున మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ స్థానాల్లో ఈ హిందూ మితవాద సంస్థ పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో చివరి దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి కాంగ్రెస్ తమ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్‌ను పోటీకి దింపింది. 2019లో వారణాసిలో ప్రధాని మోదీ 63 శాతం ఓట్లతో విజయం సాధించారు . సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ తర్వాత రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ గీతా బోధకురాలు హేమాంగి సఖి గుజరాత్‌లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి మారింది. సఖి కొంతకాలం కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు. ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. తరువాత, ఆమె హేమాంగి సఖి మాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ భగవద్గీత బోధకురాలు. తన ఫేస్బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవద్ కథ , రామ కథ, దేవి భగవత్ కథలను బోధించారు. 2019లో పట్టాభిషేకం 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్‌గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్‌లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. -
లైలా.. ఓ అంబాసిడర్
సాక్షి, హైదరబాద్: లైలా ఓరుగంటి. ఒక ట్రాన్స్‌జెండర్. దశాబ్దాలుగా ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్త. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆమెను అంబాసిడర్‌గా నియమియారు. వివిధ సామాజిక వర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అన్ని వర్గాలకు చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్ వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన క్యాంపెయిన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి లైలా ఎన్నికల అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.‘తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.కానీ ఓటర్లుగా నమోదైన వాళ్లు కనీసం 3 వేల మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.’అని లైలా అభిప్రాయపడ్డారు. వివక్ష తొలగలేదు... చాలామంది ట్రాన్స్జెండర్లుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ ఓటింగ్‌లో మాత్రం ‘పురుషులు’ లేదా ‘మహిళలు’గా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.‘ట్రాన్స్జెండర్లు’గా నమోదు కావడం లేదు. దీంతో సామాజికంగా లక్షన్నర మంది ట్రాన్స్జెండర్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం 2,737 మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా నమోదయ్యారు. ఈ వర్గంపైన ఉండే సామాజిక వివక్ష కారణంగా తమ ఉనికిని చాటుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గోప్యంగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంఖ్యరీత్యా మెజారిటీగా ఉండే ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే రాజకీయ పారీ్టలు ట్రాన్స్జెండర్లను గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సామాజిక రుగ్మతను తొలగించుకొనేందుకు ప్రతి ట్రాన్స్‌జెండర్ ఓటరుగా నమోదు కావలసి ఉందని లైలా పేర్కొన్నారు. గత పదేళ్లలో ట్రాన్స్జెండర్ల సంఖ్య రెట్టింపయింది.‘అనేక రకాలుగా ‘ట్రాన్స్’గా జీవనం కొనసాగిస్తున్నవాళ్లు ఉన్నారు.కానీ కుటుంబం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచి్చన వాళ్లు నిర్భయంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కమ్యూనిటీకి చెందిన పుష్ప ఎన్నికల్లో పోటీ చేయగా, 2018లో జరిగిన ఎన్నికల్లో చంద్రముఖి ఎన్నికల బరిలో నిలిచారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పోటీ ఎంతో దోహదం చేసిందని ఆ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ లైలాను అంబాసిడర్‌గా నియమించడాన్ని కూడా ట్రాన్స్జెండర్లు, సామాజిక సంస్థలు ఆహ్వానిస్తున్నాయి.కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ చదివిన లైలా ... స్వచ్చంద సంస్థల ద్వారా ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పథకాలు అందడం లేదు... వివిధ కారణాల వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకుండా బతుకుతున్న తమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, చదువుకున్న వాళ్లకు కూడా ఉద్యోగా లు లభించడం లేదని లైలా ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగులు, పేద మహిళలు, తదితర వర్గాలకు లభించే రాయితీ సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, అణగారిన వర్గాలకు ఇళ్లు, ఇంటిస్థలాలు అందజేస్తున్నట్లుగానే తమకు కూడా సొంత ఇళ్లకు ఆర్ధికసహాయం అందజేయలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల సంఖ్య 1.50 లక్షలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లుగా నమోదైన ఓటర్లు : 2000 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు : 2,885 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు : 2,557 ప్రస్తుతం జరుగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన ట్రాన్స్‌జెండర్ ఓటర్లు : 2,737. -
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక టాటా కంపెనీలో ఉద్యోగాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఉద్యోగాల కోసం ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల నుంచి టాటా స్టీల్ దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్‌లో మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో, ఏదైనా విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్‌లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే.. 2022 ఫిబ్రవరిలో కూడా టాటా స్టీల్ 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్జెండర్లను ఒడిశాలోని కళింగనగర్ ప్లాంటు కోసం నియమించుకుంది. దీనికి ముందు గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) కార్యకలాపాల కోసం, ఝార్ఖండ్‌లోని వెస్ట్ బొకారో కోసం 14 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసింది. 2025 నాటికి 25శాతం లింగవైవిధ్యం కలిగిన ఉద్యోగులు ఉండేలా చూడాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
ట్రాన్స్‌జెండర్‌గా మారి వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేయించిన భార్య
సిద్దిపేట కమాన్: ట్రాన్స్‌జెండర్‌గా మారి వేధిస్తున్నాడంటూ సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ భార్య. సుపారీ కింద రూ.18 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని.. రూ.4.60 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించింది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్‌పూరకు చెందిన దరిపల్లి వెంకటేశ్(33)కు 2014లో వివాహమైంది. 2015లో వీరికి ఒక పాప జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వెంకటేశ్‌కు మానసిక ఆలోచనల్లో మార్పు వచ్చింది. అమ్మాయిలాగా ప్రవర్తించడం చెవులకు కమ్మలు, ముక్కుకు పుడక పెట్టుకుని రాత్రి సమయంలో ఆడవారి దుస్తులు ధరించడం చేస్తుండేవాడు. అదనపు కట్నం కోసం కూడా వేధింపులకు గురి చేసేవాడు. 2019లో ఏకంగా వెంకటేశ్ ట్రాన్స్‌జెండర్‌గా మారి భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులకు ఉద్యోగం పోవడంతో పగబట్టి.. రోజాగా పేరుమార్చుకున్న వెంకటేశ్ పలుమార్లు చీరకట్టుకుని వేదశ్రీ పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి వేధిస్తుండటంతో తన ఉద్యోగాన్ని కోల్పోయింది. మరో స్కూల్లో చేరినా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తనకు పరిచయమైన సిద్దిపేట నాసర్‌పూర వాస్తవ్యుడు బోయిని రమేశ్‌తో తన బాధను చెప్పుకొని వాపోయింది. తనను, పాపను వేధిస్తున్న వెంకటేశ్ (రోజా)ను ఎలాగైనా అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో వేదశ్రీ, రమేశ్ కలిసి పట్టణంలోని కాకతీయ ఫుట్‌వేర్ యజమాని రమేశ్‌తో వెంకటేశ్(రోజా) హత్య కోసం 2023 సెప్టెంబర్‌లో రూ. 18లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అడ్వాన్స్‌గా వేదశ్రీ మొదటగా రూ.2లక్షలు చెల్లించింది. ఈ క్రమంలో ఫుట్‌వేర్ రమేశ్‌కు మిత్రుడైన నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్‌కు హత్య విషయం తెలిపారు. దీంతో ఇప్పల శేఖర్ ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా వెంకటేశ్ (రోజా)తో పరిచయం చేసుకుని తరచూ అతడిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇప్పల శేఖర్ వెంకటేశ్(రోజా)కు ఫోన్ చేసి వరంగల్ నుంచి సిద్దిపేటకు పిలిపించాడు. -
శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్‌జెండర్
నల్గొండ : కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. -
కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారిగా శబరిమల..
సూర్యపేట: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్ జెండర్ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్‌జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జండర్లు చాలా మంది అయప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది. తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది ఒక శుభ పరిణామమని.. తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని పేర్కొంది. ఇవి చదవండి: New year 2024: సరి ‘కొత్తగా’ సాగుదాం! -
ట్రాన్స్‌జెండర్‌గా సీజన్-7 బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ విన్నర్‌గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్లో టాప్-3లో ప్రశాంత్, అమర్దీప్, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్‌బాస్ కంటే ముందే ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్-6లో నిలిచారు. అయితే అర్జున్ హౌస్‌లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేశాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!) ఆ తర్వాత మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్‌గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్‌బాస్ షోను ఎంచుకున్నారు. అర్ధనారిలో ట్రాన్స్‌జెండర్‌గా.. అర్ధనారి సినిమాలో అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్లో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్-6లో నిలిచారు. అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య
భోపాల్: ఇన్‌స్టా రీల్‌కు ద్వేషపూరిత కామెంట్లు రావడంతో ఓ ట్రాన్స్‌జెండర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో జరిగింది. దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోకు అసభ్యకరమైన కామెంట్లు వచ్చాయని, ఆ కారణంగానే ఆర్టిస్టు మరణించాడని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అన్నారు. ప్రన్షు(16) ఉజ్జెయినికి చెందిన ట్రాన్స్ జెండర్ సొంతంగా మేకప్ కళను నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా నడుపుతున్నాడు. మేకప్ కళ, బ్యూటీ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే.. ఈ వీడియోకు 4,000 ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి రక్షణ కల్పించడంలో ఇన్‌స్టా యాజమాన్యం విఫలమౌతోందని అన్నాడు. View this post on Instagram A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin) ప్రన్షు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వీడియోకు వచ్చిన కామెంట్ల కారణంగానే ప్రన్షు మరణించాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు -
భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు
భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ట్రాన్స్జెండర్ల సంఘం సభ్యులు ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినా, తరువాత జరిగిన అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చూపాయి. అటువంటి స్థితిలో ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం! -
ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి పెళ్లి
నందిగామ: నందిగామకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్ జెండర్)ను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన లావూరి గణేష్ ప్రేమించాడు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైంది. ఏడాది నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. వీరు అక్టోబర్ 29న నందిగామ సమీపంలోని పల్లగిరిగుట్టపై ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం నందిగామ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. డీవీఆర్ కాలనీలోని గణేష్, దీపును పోలీసులు పిలిపించారు. తనకు దీపు అంటే ఇష్టమని, తనతోనే ఉండిపోతానని గణేష్ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పడంతో వెళ్లిపోయారు. గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ మనిషిని ట్రాన్స్‌జెండర్ ఇష్టపడితే జీవితాంతం ప్రేమను అందిస్తుందన్నాడు. దీపు మాట్లాడుతూ.. ఒకరి కోసం ఒకరం జీవిస్తామని తెలిపింది. -
హిజ్రాలకూ సభ్యత్వం కల్పిస్తా: ఆర్కే సెల్వమణి
మారుతీ ఫిలిమ్స్, టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు ఎస్.రాధాకృష్ణన్, ఎస్.హరి కలిసి నిర్మిస్తున్న చిత్రం డెవిల్. సవరకత్తి చిత్రం ఫేమ్ ఆదిత్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు మిష్కిన్ సంగీత దర్శకుడుగా పరిచయం కావడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన ఒక పాట పాడి కీలక పాత్రను పోషించారు. కాగా నటుడు విదార్థ్, పూర్ణ, ఆదిత్ అరుణ్, శుభశ్రీ రాయ్ గురు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో శుక్రవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా మిష్కిన్ నేతృత్వంలో లైవ్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు, పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బాల, వెట్రిమారన్, నిర్మాత థాను పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడిగా పరిచయం అయిన మిష్కిన్ మాట్లాడుతూ కథలన్నీ ఒక కథ నుంచే పుడుతాయన్నారు. అదే విధంగా ఈ డెవిల్ చిత్ర కథ అలాంటిదేనని పేర్కొన్నారు. ఒక ప్రశాంతమైన ఇంటిలోకి చీకటి చొరబడుతుందన్నారు. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. ఆ తరువాత దాన్నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు. తనకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాన్ని నేర్పించిన రామమూర్తి తనకు ఒక గురువు కాగా మరొక గురువు ఉన్నారని ఆయనే ఇళయరాజా అని వారి పాదాలకు నమస్కారం చేస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు తాను చిన్న వయసు నుంచి చూస్తూ ఆశ్చర్యపడిన దర్శకుడు ఆర్కే సెల్వమణి అని, ఆయన ఆరి–2 కెమెరాతో చిత్రాలను చిత్రీకరించినా, పారా విజన్‌లో తీసినట్లు వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తాను ఆయనను ఒక కోరిక కోరుకుంటున్నానని, హిజ్రాలకు కూడా నటులుగా సభ్యత్వం కల్పించాలన్నదే ఆ కోరిక అన్నారు. దీనిపై స్పందించిన ఆర్కే సెల్వమణి సినీ పరిశ్రమకు చెందిన ఏ శాఖలో నైనా ఆసక్తి కలిగిన హిజ్రాలు చేరవచ్చునని చెప్పారు. బైలాస్‌లో కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. -
ట్రాన్స్‌జెండర్‌కు బీఎస్పీ టికెట్
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కలి్పంచారు. వరంగల్ తూర్పు నుంచి చిత్రపు పుష్ప తలయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బరిలోకి దింపడం గమనార్హం. ఈ నెల 3న 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా 43 మందితో కూడిన రెండో విడత జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 63కు చేరింది. ఆ పార్టీలవి మాయమాటలు: ఆర్ఎస్ ప్రవీణ్.. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇతర రాజకీయ పారీ్టలు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మాయమాటలతో వంచించే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని ప్రజలను కోరారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. బీసీ కులాలకు చెందిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేని ఆ పార్టీ... బీసీని సీఎం చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశంలో బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీఎస్పీ జనబలం ముందు కేసీఆర్ ధనబలం పనికిరాదన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు.