warm-up match
-
తొలి ‘వామప్’ వర్షార్పణం
గువహటి: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌కు సరైన సన్నాహకం లభించలేదు. వామప్ మ్యాచ్‌లను వరుసగా రెండో రోజూ వాన వెంటాడటంతో ఆట సాధ్యం కాలేదు. భారీ వర్షం కారణంగా శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దయింది. రోజంతా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి కూడా వేసే అవకాశం లేకపోయింది. మ్యాచ్ ఆరంభానికి కాస్త ముందు పరిస్థితి మెరుగ్గా ఉండటంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ తర్వాత జోరందుకున్న వానతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. నిజానికి ఇరు జట్ల ఆటగాళ్లు అధికారికంగా అంపైర్లు ప్రకటించక ముందే మైదానం వీడి హోటల్‌కు వెళ్లిపోయారు. ఈ నెల 3న తిరువనంతపురంలో జరిగే తమ తర్వాతి వామప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. అయితే తాజా స్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్ నిర్వహణ కూడా సందేహంగానే ఉంది. వరల్డ్ కప్ అసలు సమరంలో ఈ నెల 8న చెన్నైలో ఆస్ట్రేలియాను టీమిండియా ఎదుర్కొంటుంది. -
పాకిస్తాన్ నెట్‌బౌలర్‌గా హైదరాబాద్ కుర్రాడు.. ఎవరంటే?
వన్డే ప్రపంచకప్-2023కు రంగం సిద్దమైంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. కాగా ప్రధాన టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు ఈ సన్నహాక మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి వేదికలగా మారనున్నాయి. పాకిస్తాన్ నెట్‌బౌలర్‌గా హైదరాబాద్ కుర్రాడు ఇక వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న పాక్ జట్టు తమ ప్రాక్టీస్ సెషన్స్‌ను కూడా మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ అండర్-19 ఫాస్ట్‌బౌలర్ నిశాంత్ సరను తమ నెట్‌బౌలర్‌గా పాకిస్తాన్ నియమించకుంది. కివీస్ వార్మప్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో పాక్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ చేస్తూ కన్పించాడు. ఈ యువ హైదరబాదీ పేసర్ గంటకు 140 నుంచి 150 వేగంతో బంతులు విసరగలడు. అదే విధంగా ఆరు అడుగులకు పైగా ఉన్న నిశాంత్ బౌన్సర్స్‌ను సంధించగలడు. నెట్స్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. నిశాంత్‌కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, కచ్చితంగా అతడు అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడని జమాన్ కొనియాడాడు. అదే విధంగా నిశాంత్ మాట్లాడుతూ.. తనకు ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ఆదర్శమని తెలిపాడు. అంతేకాకుండా హైదరాబాద్‌కు ఆడాలన్న తన కోరికను నిశాంత్ వ్యక్తం చేశాడు. చదవండి: WC 2023: చారిత్మాతక డీల్.. ఆటగాళ్లకు పీసీబీ గిఫ్ట్! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్ -
అఫ్రిది యార్కర్ దెబ్బ.. ఆస్పత్రి పాలైన ఆఫ్గన్ ఓపెనర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది యార్కర్ దెబ్బకు అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహమనుల్లా గుర్బాజ్ ఆస్పత్రి పాలయ్యాడు. విషయంలోకి వెళితే.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా అప్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య బుధవారం వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ షాహిన్ అఫ్రిది ఆఫ్గన్ బ్యాటర్లకు తన బౌలింగ్ పవర్ చూపించాడు. మ్యాచ్‌లో రహమనుల్లా గుర్బాజ్, హజరతుల్లా జజైయ్ల రూపంలో రెండు వికెట్లు తీసి దెబ్బతీశాడు. అయితే రహమనుల్లాను యార్కర్ డెలివరీతో ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అఫ్రిది వేసిన యార్కర్ రహమనుల్లా గుర్బాజ్ కాలికి బలంగా తగిలింది.దీంతో నొప్పితో విలవిల్లాడిన గుర్బాజ్ మైదానంలోనే ఫిజియోతో మసాజ్ చేయించుకున్నాడు. అయినప్పటికి నడవలేని స్థితిలో ఉన్న గుర్బాజ్‌ను సబ్‌స్టిట్యూట్ ఆటగాడు తన వీపుపై గుర్బాజ్‌ను ఎక్కించుకొని పెవిలియన్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఎక్స్‌రే నిమిత్తం గుర్బాజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే గాయం తీవ్రత ఎంత అనేది రిపోర్ట్స్ వచ్చాకే తెలియనుంది. ఒకవేళ గుర్బాజ్ గాయంతో దూరమైతే ఆఫ్గనిస్తాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక షాహిన్ అఫ్రిది వేసిన యార్కర్‌పై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. టీమిండియాతో మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొనే అఫ్రిది పదునైన యార్కర్‌తో హెచ్చరికలు పంపాడంటూ కామెంట్ చేశారు. ఇక గాయంతో ఆసియా కప్‌కు దూరమైన షాహిన్ అఫ్రిది టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం షాహిన్ అఫ్రిదియే. ఆ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ను తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ వార్షార్పణం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అప్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ నబీ 51 పరుగులతో రాణించగా.. ఇబ్రహీం జర్దన్ 35 పరుగులు, ఆఖర్లో ఉస్మాన్ ఘనీ 32 పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 2.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ దశలో ఆటకు వర్షం అంతరాయం కలిగించడం.. ఎంతకు తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. pic.twitter.com/dyXoaUxPBd — Guess Karo (@KuchNahiUkhada) October 19, 2022 చదవండి: గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?! 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం -
India vs Australia Warm-Up Match: షమీ అద్భుతం
బ్రిస్బేన్: ఇది ప్రాక్టీస్ మ్యాచే! గెలిస్తే పాయింట్లేమీ రావు. ఓడినా నష్టం లేదు! కానీ అద్భుతమైన ముగింపుతో క్రికెట్ ప్రేక్షకుల్ని మురిపించింది. ఫీల్డింగ్‌లో కోహ్లి మెరుపులు... షమీ ఆఖరి ఓవర్ నిప్పులతో భారత్ అనూహ్యంగా గెలిచింది. చేతిలో 4 వికెట్లున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతుల్లో 11 పరుగులు చేయలేక ఆలౌటైంది. మొత్తానికి టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ అదిరింది. భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) గెలుపు తీరాలకు తెచ్చినా... ఇన్నింగ్స్ మొత్తంలో ఒకే ఒక్క ఓవర్ వేసిన షమీ పేస్ (1–0–4–3)కు ఆసీస్ ఓడిపోయింది. ఆసీస్ చివరి ఆరు వికెట్లను తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది. భారత్ తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను బుధవారం న్యూజిలాండ్‌తో ఆడుతుంది. రాహుల్ ధనాధన్ ఓపెనర్ రాహుల్ తొలి ఓవర్ నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అతను కమిన్స్ వేసిన నాలుగో ఓవర్‌ను దంచి కొట్టాడు. 6 బంతుల్ని రాహులే ఎదుర్కొని 4, 0, 6, 4, 2, 4లతో 20 పరుగులు చేశాడు. 4 ఓవర్లయినా కెప్టెన్ రోహిత్ (2 బంతులే ఆడాడు) ఖాతా తెరువలేదు. జట్టు స్కోరేమో 47/0. ఇందులో రాహుల్‌వే 43 పరుగులు! 27 బంతుల్లో (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే అతను అవుట్‌కాగా, 6, 4తో టచ్‌లోకి వచ్చిన రోహిత్ (15; 1 ఫోర్, 1 సిక్స్) కూడా నిష్క్రమించాడు. 10 ఓవర్లలో భారత్ 89/2 స్కోరు చేసింది. వేగంగా ఆడే ప్రయత్నంలో కోహ్లి (13 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), చెత్త షాట్‌తో హార్దిక్ పాండ్యా (2) అవుటయ్యారు. కాసేపటికే దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) జోరుకు బ్రేక్ పడగా, కమిన్స్, స్టార్క్‌లను అవలీలగా ఎదుర్కొన్న సూర్య ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 32 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. ఫించ్ పోరాటం భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనకు దీటుగానే ఆసీస్ పరుగుల వేట సాగింది. ఓపెనర్లు మార్‡్ష (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్ ధాటిగా ఆడారు. 5.3 ఓవర్లలో ఓపెనింగ్ వికెట్‌కు 64 పరుగులు జోడించారు. కానీ తర్వాతి బంతికి మార్‡్షను భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు. అయితే ఫించ్ జోరు మాత్రం కొనసాగింది. స్మిత్ (11), మ్యాక్స్‌వెల్ (16 బంతుల్లో 23; 4 ఫోర్లు), స్టొయినిస్ (7)లతో కలిసి ఫించ్ జట్టును 19వ ఓవర్‌దాకా గెలుపు వైపు మళ్లించాడు. ఆ ఓవర్ తొలి బంతికి హర్షల్ అతన్ని క్లీన్‌బౌ ల్డ్ చేయగా, మరుసటి బంతికి టిమ్ డేవిడ్ (5)ను కోహ్లి మెరుపు వేగంతో డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. 19 ఓవర్ల దాకా విశ్రాంతినిచ్చిన షమీకి ఆఖరి ఓవర్ అప్పగించారు. అదే అతని తొలి ఓవర్ కాగా తొలి 2 బంతులకు 4 పరుగులిచ్చాడు. తర్వాత నాలుగు బంతుల్లో వికెట్లు రాలాయి. కమిన్స్ (7) షాట్‌కు లాంగాన్‌లో సిక్సర్‌గా వెళ్లే బంతిని కోహ్లి ఒంటిచేత్తో గాల్లో అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్. అగర్ (0) రనౌట్ కాగా, షమీ యార్కర్లతో ఇంగ్లిస్ (1), రిచర్డ్సన్ (0)లను బౌల్డ్ చేశాడు. -
కివీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాప్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు, షమ్సీ, పార్నెల్ రెండు వికెట్లు, మార్క్రమ్,జాన్సెన్, రబాడ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిఫ్స్(23), గప్టిల్(23) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక 99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాప్రికా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలోనే ఛేదించింది. దక్షిణాప్రికా బ్యాటర్లలో రుసౌ(54) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: IND Vs AUS: చెలరేగిన సూర్యకుమార్.. తగ్గేదే లే -
పంత్‌కు దినేశ్ కార్తిక్ పాఠాలు.. వీడియో వైరల్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌కు ముందు పంత్, కార్తిక్‌ల మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్‌కు ఫినిషర్ పాత్రలో ఎంపికైన కార్తిక్ వద్ద పంత్ ఏం సలహాలు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. బహుశా పంత్‌కు కార్తిక్ బ్యాటింగ్ పాఠాలు బోధించి ఉంటాడని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో పంత్, కార్తిక్‌లు చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పంత్, కార్తిక్‌లు విడివిడిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి.. మరొకటి ఓడింది. తొలి రెండు మ్యాచ్‌లో పెర్త్‌లో జరగ్గా.. తాజాగా డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ గబ్బాలో జరుగుతుంది. ఈ మ్యాచ్ గెలిచి.. పాక్‌తో పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని టీమిండియా భావిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57, సూర్యకుమార్ యాదవ్ 50, దినేశ్ కార్తిక్ 20 పరుగులు చేశారు. -
షమీ మ్యాజిక్.. ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆఖర్లో షమీ మ్యాజిక్‌తో టీమిండియా ఆరు పరుగులతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఫించ్ 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహ్మద్ షమీ ఆఖరి ఓవర్లో నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా.. ఒక రనౌట్ సహా ఓవరాల్‌గా షమీ ఓవర్లో నాలుగు వికెట్లు పడడం విశేషం. 19వ ఓవర్ వరకు మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఉన్నప్పటికి.. ఆఖరి ఓవర్లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించడమే గాక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 పరుగులు చేయగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, భువనేశ్వర్ 2, అర్ష్‌దీప్ సింగ్, చహల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. 13 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరెంతంటే? 13 ఓవర్లు ముగిసిసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఫించ్ 47, మ్యాక్స్‌వెల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 11 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్(35) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ►187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ భువనేశ్వర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఫించ్ 31, స్టీవెన్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్యకుమార్ ఫిప్టీ.. 20 ఓవర్లలో టీమిండియా 186/7 ►ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 59 పరుగులకే టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ 50 పరుగులు చేసి ఔటైనప్పటికి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. దినేశ్ కార్తిక్ 20 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్, మిచెల్ స్టార్క్‌లు తలా ఒక వికెట్ తీశారు. హార్దిక్ పాండ్యా ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా ►ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(2) విఫలమయ్యాడు. కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చిన పాండ్యా పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు విరాట్ కోహ్లి(19) స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సూర్యకుమార్ 26, దినేశ్ కార్తిక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ శర్మ ఔట్ ►80 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆగర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కేఎల్ రాహుల్ (57) ఔట్.. తొలి వికెట్ డౌన్ ►కేఎల్ రాహుల్(57) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అర్థ శతకం.. టీమిండియా 75/0 ►టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థ శతకంతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 55, రోహిత్ శర్మ 14 పరుగులతో ఆడుతున్నారు. దంచి కొడుతున్న కేఎల్ రాహుల్.. టీమిండియా 47/0 ►టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దంచి కొడుతున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో విజృంభిస్తున్న రాహుల్ 22 బంతుల్లోనే 43 పరుగులతో ఆడుతున్నాడు. రాహుల్ ధాటికి కెప్టెన్ రోహిత్‌కు బ్యాటింగ్ అవకాశం కూడా రాలేదు. ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. 2 ఓవర్లలో టీమిండియా స్కోరు 16/0 ►2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 12, రోహిత్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ►టి20 ప్రపంచకప్‌లో భాగంగా అసలు పోరుకు ముందు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ►ఈ మ్యాచ్‌లో టీమిండియా 15 మందితో బరిలోకి దిగనుంది. భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ , దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహల్. ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్ ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడింది. ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. అయితే ఈ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కావడంతో పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ అసలు మ్యాచ్‌లకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లో ఇరుజట్లు పూర్తిస్థాయిలో బరిలోకి దిగనున్నాయి. -
ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్.. ఆశ్చర్యపరిచిన జింబాబ్వే కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2022 వార్మప్ మ్యాచ్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(29 బంతుల్లో 54), హసరంగా(14 బంతుల్లో 37) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో రియాన్ బర్ల్, రజా, మాధవేరే, షుంబా, ఏవెన్స్ తలా వికెట్ సాధించారు. ఇక 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. జింబావ్వే బ్యాటర్లలో మాధవేరే(43) పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో మహేష్ తీక్షణ, కరుణరత్నే చెరో రెండు వికెట్లు, డి సిల్వా ఒక్క వికెట్ సాధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్ కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఏకంగా 11 మందితో బౌలింగ్ చేయించి అందరీ ఆశ్చర్యపరిచాడు. వారి టీ20 ప్రపంచకప్ 15 మంది సభ్యల జట్టులో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, వికెట్ కీపర్ చకబావా, మున్యోంగా, మదాండే మినహా మిగితా అందరూ బౌలింగ్ చేశారు. చదవండి: Women's Asia Cup 2022: డిఫెండింగ్ చాంపియన్ అవుట్! భారత్, పాక్, శ్రీలంకతో పాటు థాయ్‌లాండ్.. -
రాణించిన కెప్టెన్.. నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన స్కాట్లాండ్
T20 World Cup Warm Up Matches NET VS SCO: టీ20 వరల్డ్‌కప్-2022కు సన్నాహకాలైన వార్మప్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచే మొదలయ్యాయి. ఇవాళ తొలుత వెస్టిండీస్-యూఏఈ జట్లు తలపడగా.. ఆ మ్యాచ్‌లో విండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్-స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడ్డ నెదర్లాండ్స్ 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెర్రింగ్టన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు), లీస్క్ (21 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. మిగిలిన వారంతా నామమాత్రపు స్కోర్‌కు పరిమితమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లు బ్రాండన్ గ్లోవర్ (3/17), బాస్ డీ లీడ్ (3/20) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్ స్టెఫాన్ మైబుర్గ్ (4) వికెట్ కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (35 బంతుల్లో 43), విక్రమ్‌జీత్ సింగ్ (31) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడం, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు సాధించలేకపోవడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ 2, జోష్ డేవీ, మార్క్ వ్యాట్, క్రిస్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (అక్టోబర్ 11) శ్రీలంక-జింబాబ్వే, నమీబియా-ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ అనధికారిక మ్యాచ్‌లు అక్టోబర్ 19 వరకు సాగనున్నాయి. -
హాఫ్ సెంచరీతో చెలరేగిన కింగ్.. యూఏఈపై విండీస్ విజయం
టీ20 ప్రపంచకప్-2022 తొలి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్(45 బంతుల్లో 64), కెప్టెన్ పూరన్(31 బంతుల్లో 46) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిక్ 5 వికెట్లతో చెలరేగగా.. జహూర్ ఖాన్ రెండు, దౌడ్, ఫరీద్ తలా వికెట్ సాధించారు. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింద. యూఏఈ స్టార్ బ్యాటర్ మహ్మద్ వసీం(69 నటౌట్) అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. విండీస్ బౌలర్లలో రేమాన్ రీఫర్ మూడు వికెట్లు, స్మిత్, మెక్కాయ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన విండీస్ జట్టు.. నేరుగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఆర్హత సాధించలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్ తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: T20 World Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి -
T20 WC 2022: వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆడేది ఎవరితో అంటే..
ప్రతిష్టాత్మక ఐసీసీ టి20 వరల్డ్‌కప్ 2022 టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జట్లకు ప్రాక్టీస్ కోసం వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించడం ఆనవాయితీ. కాగా వార్మప్ మ్యాచ్‌లకు చెందిన షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 16 జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక టీమిండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో, 19వ తేదీన కివీస్‌తో భారత్ తలపడనుంది. వార్మప్ మ్యాచ్‌లను అధికారిక మ్యాచ్‌లుగా గుర్తించరన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టి20 వరల్డ్‌కప్ అక్టోబర్ 16వ తేదీన ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్ శ్రీలంక, నమీబియా మధ్య జరగనుంది. ఇక గ్రూఫ్-2లో ఉన్న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 24న ఆడనుంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలతో పాటు మరో రెండు జట్లను ఎదుర్కోనుంది. -
గల్లీ క్రికెట్‌ను తలపించిన టీమిండియా వార్మప్ మ్యాచ్.. ఔటైనా నాటౌటే..!
భారత్-లీస్టర్‌షైర్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ గల్లీ క్రికెట్‌ను తలపించింది. మూడో రోజు టీమిండియా బ్యాటింగ్ సమయంలో కొన్ని వింతలు చోటు చేసుకున్నాయి. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన మళ్లీ బ్యాటింగ్ కొనసాగించి అర్ధసెంచరీలు స్కోర్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ తరఫున ఆడిన నయా వాల్ పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తరఫున.. రెండు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా తరఫున ఆడిన శుభ్‌మన్ గిల్ లీస్టర్‌షైర్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి బ్యాటింగ్‌కు దిగాడు. వార్మప్ మ్యాచ్ కావడంతో టీమిండియా ఆటగాళ్లు రూల్స్‌ను పక్కకు పెట్టి గట్టిగా ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత ఆటగాళ్లంతా సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ మ్యాచ్‌లో మరో రోజు (నాలుగో రోజు) ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి లీస్టర్‌షైర్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. లీస్టర్‌షైర్ టీమిండియాపై గెలవాలంటే మరో 287 పరుగులు సాధించాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ (46), శామ్యూల్ ఈవాన్స్ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246/8.. రెండో ఇన్నింగ్స్‌లో 364/7 స్కోర్ల వద్ద డిక్లేర్ చేసింది. లిస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సమయానికి (జులై 1) రోహిత్ కోలుకోకపోతే బుమ్రా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే గాయం కారణంగా కేఎల్ రాహుల్, కోవిడ్ కారణంగా అశ్విన్ ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. -
కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు..
లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత బ్యాటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. నాలుగు రోజుల ఈ మ్యాచ్‌లో మూడో రోజు శనివారం భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి (98 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (89 బంతుల్లో 62; 11 ఫోర్లు), రవీంద్ర జడేజా (77 బంతుల్లో 56 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 80/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 7 వికెట్లకు 364 పరుగులు సాధించింది. శ్రీకర్ భరత్ (98 బంతుల్లో 43; 7 ఫోర్లు), హనుమ విహారి (55 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా రాణించారు. లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత బౌలర్లలో నవదీప్ సైనీ మూడు వికెట్లు, కమలేశ్ నాగర్కోటి రెండు వికెట్లు తీశారు. చదవండి: Ahmed Shehzad: 'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం' -
ఒంటి చేత్తో పంత్ కళ్లు చెదిరే సిక్స్.. వీడియో వైరల్
Rishab Pant One Hand Six.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ఒంటి చేత్తో కొట్టిన సిక్స్ వైరల్‌గా మారింది. మొయిన్ అలీ బౌలింగ్ ఇన్నింగ్స్ 13.4 ఓవర్లో లాంగాఫ్ దిశగా ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. అతని సిక్స్ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను స్కై స్పోర్ట్స్ తమ యూట్యూబ్ చానెల్లో షేర్ చేసింది. చదవండి: T20 World Cup IRE Vs NED: కర్టిస్ సంచలనం.. 4 బంతుల్లో 4 వికెట్లు! ఇక మ్యాచ్‌లో పంత్ (14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇషాన్ కిషన్ 70(రిటైర్డ్‌హర్ట్), కేఎల్ రాహుల్ 51 పరుగులతో ఆకట్టుకున్నారు. -
ఆటాడుకున్నారు
చెమ్స్‌ఫోర్డ్: సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఎస్సెక్స్ కౌంటీ జట్టుతో బుధవారం ఇక్కడ ప్రారంభమైన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 322/6తో మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన... ఓపెనర్ ధావన్ (0), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా (1), అజింక్య రహానే (17) వికెట్లను త్వరగానే కోల్పోయింది. దీంతో 44/3తో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో మరో ఓపెనర్ మురళీ విజయ్ (113 బంతుల్లో 53; 7 ఫోర్లు)కి కెప్టెన్ విరాట్ కోహ్లి (93 బంతుల్లో 68; 12 ఫోర్లు) జత కలిశాడు. నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించాక వీరు వెంటవెంటనే ఔటయ్యారు. అనంతరం ఎడాపెడా బౌండరీలు బాదుతూ కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 58; 12 ఫోర్లు), వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (94 బంతుల్లో 82 బ్యాటింగ్; 14 ఫోర్లు) స్కోరును ముందుకు నడిపించారు. ఆరో వికెట్‌కు మంచి రన్‌రేట్‌తో 114 పరు గులు జోడించారు. రాహుల్ వెనుదిరిగాక వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (56 బంతుల్లో 33 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా బ్యాట్ ఝళిపించడంతో జట్టు 300 మార్కును దాటింది. ఎస్సెక్స్ బౌలర్లలో కోల్స్ (2/31), వాల్టర్ (2/90) రెండేసి వికెట్లు పడగొట్టారు. -
4 కాదు... 3 రోజులే ఈ ‘ప్రాక్టీస్’
చెమ్స్‌ఫోర్డ్: కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆడాల్సిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత టీమ్ మేనేజ్మెంట్ మూడు రోజులకే కుదించింది. మధ్యాహ్నం ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్ ముగిశాక టీమ్ మేనేజ్మెంట్ మైదానాన్ని పరిశీలించింది. చెత్త పిచ్, అధ్వాన్నమైన అవుట్ ఫీల్డ్‌లపై అసంతృప్తి వెలిబుచ్చిన టీమిండియా మూడు రోజులే ‘ప్రాక్టీస్’ చేస్తామని చెప్పేసింది. ఈ నాటకీయ పరిణామాలతో ఆతిథ్య ఇంగ్లండ్ బోర్డు చేసేదేమీ లేక సరేనంది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పిచ్ నాణ్యత, మైదానం పరిస్థితిపై చర్చించారు. పిచ్‌పై పచ్చిక అసాధారణంగా ఉండటంతో పాటు అవుట్ ఫీల్డ్‌లో ఆటగాళ్లు గాయాలబారిన పడే ప్రమాదముందని అంచనాకు వచ్చారు. గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడాక చివరకు మ్యాచ్‌ను కుదించేందుకే మొగ్గుచూపారు. ప్రాక్టీస్‌కు అందుబాటులో ఉంచిన రెండు పిచ్‌లు పేలవంగా ఉండటంతో భారత్ అసంతృప్తి గురైనట్లు తెలిసింది. మూడు రోజులకు కుదించడమనేది ఏకగ్రీవ నిర్ణయమని రవిశాస్త్రి చెప్పారు. దీంతో ఈ సన్నాహక పోరు ‘ఫస్ట్‌క్లాస్’ అర్హత కోల్పోయింది. క్రికెట్ నిబంధనల ప్రకారం నాలుగు రోజుల మ్యాచ్‌లనే ‘ఫస్ట్‌క్లాస్’ మ్యాచ్‌లుగా పరిగణిస్తారు. గణాంకాలను నమోదు చేస్తారు. ఇప్పుడీ మ్యాచ్ పుటలకెక్కేందుకు దూరమైంది. అయితే టెస్టు జట్టుకు ఎంపికైన మొత్తం 18 మంది ఈ మ్యాచ్ బరిలోకి దిగుతారు. మంగళవారం భారత ఆటగాళ్లు రెండు గ్రూపులుగా వచ్చి నాలుగు గంటల పాటు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్‌లు స్లిప్ ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టారు. క్యాచ్‌ల్ని ప్రాక్టీస్ చేశారు. కోచ్ సూచనల మేరకు ఓపెనర్ ధావన్ షార్ట్‌బాల్స్‌ను ఎదుర్కొనే పనిలో పడ్డాడు. లోకేశ్ రాహుల్ ప్రాక్టీస్ ముగిశాక పుజారా బ్యాటింగ్‌కు దిగాడు. మిగతా ఆటగాళ్లంతా రెండో విడతలో వచ్చి నెట్స్‌లో చెమటోడ్చారు. ఇషాంత్ శర్మ, బుమ్రా, కరుణ్ నాయర్, అశ్విన్, జడేజా రెండో విడతలో వచ్చి సన్నాహాల్లో పాల్గొన్నారు. -
భారత్ బ్యాటింగ్ అదుర్స్
► బంగ్లాదేశ్‌కు భారీ లక్ష్యం ► భారత్ స్కోరు 324/7 లండన్: చాంపియన్స్ ట్రోఫికి సన్నహకంగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్ మెన్ సమిష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్‌కు భారత్ 324 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. దినేశ్ కార్తీక్ శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యాలు అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ బారీ స్కోరు చేయగలిగింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ(1) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే(11) మరోసారి నిరాశపర్చాడు. మరో ఓపెనర్ ధావన్, దినేష్ కార్తీక్ తో తన ఫామ్‌ను కొనసాగించాడు. వీరిద్దరు మూడో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 63 పరుగలుతో అర్ధ శతకం సాధించిన ధావన్ (7 ఫోర్లతో 60) పరుగులు చేసి సన్జాముల్ ఇస్లాం బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక 51 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన కార్తీక్ (8 ఫోర్లతో 94) పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. కేదార్ జాదవ్ (38), జడేజా(32) లు ఫర్వాలేదనిపించారు. ఇక యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వేగంగా ఆడుతూ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. అనంతరం రెచ్చిపోయిన పాండ్యా (6 ఫోర్లు, 4 సిక్సర్లతో) 80 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లో అశ్విన్(5) అవుటవ్వగా పాండ్యా చివరి బంతిని సిక్స్‌గా మలిచి ఇన్నింగ్స్‌ను ముగించాడు. భువనేశ్వర్ కుమార్(1) నాటౌట్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో రూబెల్ హుస్సేన్(3), సన్జాముల్ ఇస్లాం(2). ముస్తాఫిజుర్ రహ్మాన్ (1) వికెట్లు దక్కాయి. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీపర్ ధోని, యువరాజ్లు బ్యాటింగ్‌కు రాకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. -
వార్మప్ లో అదరగొట్టిన ధోని
లండన్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చాంపియన్స్ ట్రోఫి సన్నాహకంగా జరిగిన వార్మప్ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఇప్పటికే మైమరిపించే కీపింగ్, అద్భుత బ్యాటింగ్ తో ప్రశంసలు పోందిన ధోని.. వార్మప్ మ్యాచ్ లో రాణించి తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రత్యర్థులకు సవాలు విసిరాడు. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ధోని కీపింగ్, బ్యాటింగ్ తో అభిమానులను అలరించిన తీరు 'ప్రాక్టీస్' కు అందం తెచ్చింది. సూపర్ స్టంపింగ్.. ధోని వికెట్ల వెనుక ఉంటే ఎంత విధ్వంసకర బ్యాట్స్ మన్ అయినా క్రీజు వదలాలంటే జంకుతారు. అంత ఖచ్చితత్వంతో కీపింగ్ చేస్తాడు ధోని. ఇక వార్మప్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన గ్రాండ్ హోమ్ 22 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బంతులకు తడబడ్డాడు. ఇక పరుగులు రాబట్టాలనే ఉద్దేశ్యంతో క్రీజు వదిలి వెళ్లగా బంతిని అందుకున్న ధోని రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ఈ స్టంపింగ్ ను చూసిన ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు. సిక్స్ తో అలరించిన ధోని ధోని కేరిర్ లో ఎన్నోగొప్ప సిక్స్ లు కొట్టాడు. యార్కర్ బంతులను హెలికాఫ్టర్ షాట్ తో సిక్సర్ గా మలచడం ధోనికే ప్రత్యేకం. కానీ వార్మప్ మ్యాచ్ లో ఓ వైవిధ్యమైన సిక్స్ ను కొట్టి అబ్బురపరిచాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అజింక్యా రహనే, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చాడు. 25 ఓవర్లో మూడో బంతి ట్రెంట్ బౌల్ట్ ఆఫ్ సైడ్ దూరంగా వేసిన బంతిని ధోని కవర్స్ మీదుగా సిక్స్ గా మలిచిన తీరు అదుర్స్ అనిపించింది. ఈ బంతి గ్రాండ్ హోమ్ చేతిలో నుంచి జారి బౌండరి రోప్ మీద పడటం విశేషం. భారత్ 129/3 స్కోరు వద్ద వర్షం అడ్డంకిగా మారడంతో భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 45 పరుగుల తేడాతో గెలుపొందింది. కోహ్లీ (52), ధోని(17) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మంగళవారం భారత్ బంగ్లాదేశ్ తో ఇదే వేదికగా మరో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక ధోని ఆటపై ట్వీటర్ లో ప్రశంసల జల్లు కురుస్తుంది. -
శ్రేయస్ సూపర్ షో
→ డబుల్ సెంచరీతో రాణింపు → ఆసీస్, భారత్ ‘ఎ’ జట్ల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ ముంబై: యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సరిగ్గా శతకం బాదిన అతను ఈసారి అగ్రస్థాయి జట్టు ఆస్ట్రేలియాపై ఏకంగా అజేయ డబుల్ సెంచరీ (210 బంతుల్లో 202 నాటౌట్; 27 ఫోర్లు, 7 సిక్సర్లు)తో తానేమిటో చాటుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి బౌలింగ్‌ను ఏమాత్రం బెదరకుండా ఎదుర్కొని భారీ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి సెలక్టర్లను తనపై దృష్టి సారించేలా చేసుకున్నాడు. ఫలితంగా భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ మూడు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గౌతమ్ (68 బంతుల్లో 74; 10 ఫోర్లు; 4 సిక్సర్లు) వేగంగా ఆడాడు. స్పిన్నర్ లియోన్‌కు నాలుగు, బర్డ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 66 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌ను కుర్రాళ్లు తమ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టారు. దీంతో ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 4 వికెట్లకు 110 పరుగులు చేసింది. హ్యాండ్స్కోంబ్ (69 బంతుల్లో 37; 5 ఫోర్లు), వార్నర్ (49 బంతుల్లో 35; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. పాండ్యా, సైని, దిండా, పంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. శ్రేయస్ జోరు 176/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. శ్రేయస్ బ్యాటింగ్ జోరును కొనసాగించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు లియోన్, ఓకీఫ్‌లపై ఎదురుదాడికి దిగడంతో ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే 103 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. రెండో రోజు ఆటలో అయ్యర్ పేసర్ బర్డ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. అయితే చివరి రోజు అతడి బౌలింగ్‌నూ ఆడుకున్నాడు. అతడి రెండో ఓవర్లోనే మూడు ఫోర్లు బాది సెంచరీ పూర్తి చేశాడు. రిషభ్ పంత్ (40 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 55 పరుగులు జత చేశాడు. ఇషాన్ కిషన్ (4) త్వరగానే అవుట్‌కాగా అనంతరం వచ్చిన గౌతమ్ కూడా వన్డే తరహాలోనే ఆడడంతో స్కోరు బోర్డు పరిగెత్తింది. లియోన్ బౌలింగ్‌లోనే నాలుగు భారీ సిక్సర్లు బాది తొలి టెస్టుకు ముందు అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. 43 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అటు అయ్యర్ అద్భుత స్ట్రోక్ ప్లేతో స్పిన్, పేస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. దీంతో లంచ్ సమయానికి 32 ఓవర్లలోనే భారత్ 171 పరుగులను జత చేసింది. అయితే లంచ్ అనంతరం గౌతమ్‌ను ఓకీఫ్ బౌల్డ్ చేశాడు. అప్పటికి ఏడో వికెట్‌కు అయ్యర్, గౌతమ్ కలిసి 138 పరుగులు జత చేశారు. ఆ మరుసటి బంతికే షాబాజ్ నదీమ్ వికెట్ తీసినా హ్యాట్రిక్ అవకాశాన్ని దిండా వమ్ము చేశాడు. అటు అయ్యర్ మాత్రం తన ధాటిని కొనసాగిస్తూ ఓకీఫ్ వేసిన ఓవర్లో నాలుగు ఫోర్లు బాది 184 పరుగుల వ్యక్తిగత స్కోరు నుంచి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చివరి రెండు వికెట్లను లియోన్ పడగొట్టి భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. -
సమర భేరికి సన్నాహకం
నేటి నుంచి భారత్ ‘ఎ’తో ఆసీస్ వార్మప్ మ్యాచ్ తమ బలాన్ని పరీక్షించుకోనున్న స్మిత్ సేన ముంబై: భారత గడ్డపై ఈసారి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలనే కసితో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహకాలను ప్రారంభించనుంది. నేటి (శుక్రవారం) నుంచి భారత్ ‘ఎ’ జట్టుతో స్మిత్ సేన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తమ బల నిరూపణకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఆడిన గత మూడు టెస్టు సిరీస్‌ల్లో ఆసీస్ జట్టును పరాజయాలే వెక్కిరించాయి. దీంతో ఈనెల 23 నుంచి జరిగే తొలి టెస్టు కోసం ఈ ఏకైక సన్నాహక మ్యాచ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆ జట్టు భావి స్తోంది. జట్టు కూర్పుతో పాటు భారత ఉపఖండంలోని బలమైన స్పిన్ బౌలింగ్‌లో తమ స్థాయిని పరీక్షించుకునేందుకు ఇదే సరైన అవకాశం. మరోవైపు భారత జట్టు తమ రిజర్వ్ బెంచ్ సత్తా తెలుసుకునేందుకు ఎదురుచూస్తోంది. ముఖ్యంగా వన్డే, టి20ల్లో అదు్భతంగా రాణిస్తున్న యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ చక్కటి అవకాశంగా భావించవచ్చు. కెపె్టన్ గానూ బరిలోకి దిగుతున్న అతను ఇందులో రాణిస్తే తొలి రెండు టెస్టుల తుది జట్టులో ఉంచేందుకు కోచ్ అనిల్ కుంబ్లే, కెపె్టన్ విరాట్ కోహ్లి మొగ్గు చూపించవచ్చు. ఆస్ట్రేలియా లాంటి నాణ్యవైున బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు యువ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. రంజీల్లో దుమ్ము దులిపిన అతను బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ సెంచరీతో అదరగొటా్టడు. జాతీయ జట్టులో రిజర్వ్ ఓపెనర్‌గా చోటు దక్కించుకోవాలంటే ఇది అతనికి మంచి అవకాశం. కుర్రాళ్లకు భలే చాన్స్ దేశవాళీ టోర్నీల్లో సత్తా ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లకు పేసర్లు జోష్ హాజెల్‌వుడ్, మిషెల్ స్టార్క్‌లతో పాటు లియోన్ , ఓ కీఫ్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం ఈ మ్యాచ్ ద్వారా కలుగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ భారత్ ‘ఎ’ విశేషంగా రాణించింది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లపై సెలక్టర్లు కొంతకాలంగా దృష్టిసారించారు. తమ నిలకడైన ప్రదర్శనను మరోసారి కనబరచాలని ఈ యువ స్టార్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అయ్యర్ గత సీజన్ లో 1300లకు పైగా పరుగులు సాధించి ముంబైకి 41వ రంజీ టైటిల్ అందించినా ఈసారి మాత్రం ఆ జోరును ప్రదర్శించలేకపోయాడు. అటు గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ అదే స్థాయిలో రాణించి ఈసారి తమ జట్టును తొలిసారి చాంపియన్ గా మార్చాడు. మిడిలార్డర్లో అంకిత్ బానే ఆడనున్నాడు. బౌలింగ్ విభాగంలో ఎడమ చేతి స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, షాబాజ్ నదీంలతో పాటు మరో స్పిన్నర్ క్రిష్ణప్ప గౌతమ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ ను ఏమేరకు నియంత్రించగలరనేది ఆసక్తికరం. బెంగాలీ సీనియర్ అశోక్ దిండా, నవదీప్ సైనీ, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్‌లతో పేస్ విభాగం కూడా బలంగా ఉంది. స్పిన్నర్లపైనే దృష్టి తొలి టెస్టుకు ముందు జరిగే సన్నాహక మ్యాచ్ కాబట్టి తుది జట్టు ఆటగాళ్లనే బరిలోకి దించా లా.. లేక కీలక పేసర్లకు విశ్రాంతి కల్పించాలా అనేది కోచ్ లీమన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్టీవెన్ , డేవిడ్ వార్నర్, ఖాజా, హాండ్స్కోంబ్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తున్నా అతి ముఖ్యవైున స్పిన్ విభాగంపై ఆసీస్ మరింత దృష్టి పెట్టింది. నలుగురు ప్రధాన స్పిన్నర్లు నాథన్ లియోన్ , ఓ కీఫ్, ఆస్టన్ అగర్, స్వెప్సన్ కాంబినేషన్ కీలకం కానుంది. ఎందుకంటే వీరి రాణింపుపైనే మును్మందు జరిగే టెస్టు సిరీస్‌లో ఆసీస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అలాగే తొలిసారి భారత పర్యటనకు వచ్చిన రెన్ షా, స్వెప్సన్ , హ్యాండ్స్కోంబ్, అగర్, బర్డ్లకు ఇక్కడ పిచ్‌లు ఎలాంటి సవాల్ విసురుతాయో తెలుసుకునేందుకు ఈ మ్యాచ్‌ను చక్కటి అవకాశంగా వినియోగించుకోవచ్చు. ఏదేవైునా స్థానిక బ్రబౌర్న్ మైదానంలో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇది మాకో మంచి అవకాశం... ► సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ► ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యాఖ్య ముంబై: భారత వన్డే, టి20 జట్లలో రెగ్యులర్ సభ్యుడిగా మారినా... ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టలేదు. ఇంగ్లండ్ సిరీస్ కోసం జట్టులోకి ఎంపికైనా, మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటి సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని అతను అన్నాడు. తనతో పాటు జట్టులో ఉన్న కుర్రాళ్లందరికీ ఇది మంచి అవకాశమని అతను వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ‘మా యువ ఆటగాళ్లందరికీ ఇదో మంచి అవకాశం. నేను కూడా ఇక్కడ బాగా ఆడితే టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కుతుందని నమ్ముతున్నా. దీనిని మేము ప్రాక్టీస్ మ్యాచ్‌లా చూడటం లేదు. సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇది సరైన వేదికగా భావిస్తున్నాం. దూకుడుకు మారుపేరైన ఆసీస్‌తో పోరు ఆసక్తికరంగా సాగవచ్చు’ అని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను టెస్టు ఆటగాడిగా ఎదిగే క్రమంలో పలు విషయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని, తనకు కోహ్లి, కుంబ్లే కూడా అండగా నిలుస్తున్నారని పాండ్యా వెల్లడించాడు. భారత ‘ఎ’ జట్టు సభ్యుడిగా కోచ్ రాహుల్ ద్రవిడ్నుంచి అనేక అంశాలు నేర్చుకోగలిగానని పాండ్యా అన్నాడు. జట్లు... భారత్ ‘ఎ’: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), అఖిల్ హెర్వాడ్కర్, ప్రియాంక్ పాంచల్, అయ్యర్, అంకిత్ బానే, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ , షాబాజ్ నదీమ్, క్రిష్ణప్ప గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, అశోక్ దిండా, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, బాబా ఇంద్రజిత్. ఆసీస్: స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), వార్నర్, అగర్, జాక్సన్ బర్డ్, పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ హాజెల్‌వుడ్, ఉస్మాన్ ఖాజా, నాథన్ లియోన్ , మిషెల్ మార్ష్, షాన్ మార్ష్ మ్యాక్స్‌వెల్, ఓ కీఫ్, రెన్ షా, స్టార్క్, స్వెప్సన్ , వేడ్. -
ఆ జట్టుకు ధోనియే కెప్టెన్
ముంబై: టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనికి మరోసారి సారథ్య బాధ్యతలు దక్కాయి. ప్రధాన పోటీలో కాదు వార్మప్ మ్యాచ్‌లో. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు సెలక్షన్ కమిటీ శుక్రవారం జట్టును ఎంపిక చేసింది. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని రెండు ఫార్మాట్లలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తో జరగనున్న మొదటి వార్మప్ మ్యాచ్ కు కెప్టెన్ గా ధోనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత్ ‘ఎ’ జట్టుకు ధోని నాయకత్వం వహిస్తాడు. టీమిండియా టెస్టు జట్టుకు నాయకుడిగా ఉన్న విరాట్ కోహ్లికే వన్డే, టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ తో జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్ కు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మొదటి వార్మప్ మ్యాచ్ కు భారత్ ‘ఎ’ జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు కల్పించారు. మొదటి వార్మప్ మ్యాచ్ కు భారత్ ‘ఎ’ జట్టు ధోని (కెప్టెన్), ధావన్, మన్దీప్, రాయుడు, యువరాజ్, హార్ధిక్ పాండ్యా, సంజూ శామ్సన్, కుల్దీప్ యాదవ్, చాహల్, నెహ్రా, మొహిత్ శర్మ, సిద్ధార్థ కాల్ రెండో వార్మప్ మ్యాచ్ కు భారత్ ‘ఎ’ జట్టు రహానే(కెప్టెన్), పంత్, రైనా, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, షెల్డాన్ జాక్సన్, వి.శంకర్, నదీం, పర్వేజ్ రసూల్, వినయ్ కుమార్, పదీప్ సాంగ్వాన్, అశోక్ దిండా -
ముంబై దూకుడు
• సూర్యకుమార్, కౌస్తుభ్ సెంచరీలు • తొలి ఇన్నింగ్సలో 431/5 రోహిత్ విఫలం • న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. అరుుతే స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మాత్రం విఫలమయ్యాడు. అటు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సూర్యకుమార్ యాదవ్ (86 బంతుల్లో 103; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), కౌస్తుభ్ పవార్ (228 బంతుల్లో 100; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో రెచ్చిపోయారు. దీంతో ముంబై తమ తొలి ఇన్నింగ్సలో 103 ఓవర్లలో ఐదు వికెట్లకు 431 పరుగులు చేసింది. అర్మాన్ జాఫర్ (123 బంతుల్లో 69; 9 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్న సిద్ధేష్ లాడ్ (62 బంతుల్లో 82 బ్యాటింగ్; 7 ఫోర్లు; 7 సిక్సర్లు), ఆదిత్య తారే (76 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం ముంబై 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నా కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఈ ఫ్లాట్ పిచ్‌పై 40 బంతుల్లో 18 పరుగులే చేయగలిగాడు. కివీస్ తమ తొలి ఇన్నింగ్‌సను 324/7 వద్ద డిక్లేర్ చేసింది. చెలరేగిన సూర్యకుమార్ ఓవర్‌నైట్ స్కోరు 29/1తో శనివారం రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స ఆరంభించిన ముంబై కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వన్డే తరహాలో చెలరేగడంతో పరుగులు ధారాళంగా వచ్చారుు. బౌల్ట్, వాగ్నర్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న టీనేజ్ సంచలనం అర్మాన్, కౌస్తుబ్ రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రోహిత్ పదో బంతికి సిక్స్‌తో ఖాతా తెరిచినా విఫలమయ్యాడు. అరుుతే పవార్‌కు, సూర్యకుమార్ జత కలవడంతో ఆట స్వ రూపం మారింది. పరుగుల ఖాతా తెరవక ముందే సూర్యకుమార్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సోధి వదిలేయడంతో జట్టు తగిన మూల్యం చెల్లించింది. పేసర్లు బౌల్ట్, నీల్ వాగ్నర్‌తో పాటు ముగ్గురు స్పిన్నర్లను సూర్యకుమార్ ఓ ఆటాడుకున్నాడు. ఏకంగా 8 సిక్సర్లతో ఎదురుదాడికి దిగి వేగంగా సెంచరీ సాధిం చాడు. టీ విరామానంతరం తను సాన్‌ట్నర్ బౌలిం గ్లో వెనుదిరగ్గా అప్పటికే నాలుగో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆ తర్వాత పవార్ శతకం అనంతరం రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చివర్లో తారే, లాడ్ కూడా బౌలర్లకు చుక్కలు చూపిం చారు. ప్రస్తుతానికి ఆరో వికెట్‌కు వీరిద్దరూ అజేయం గా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. -
కివీస్ 324/7 డిక్లేర్
ఢిల్లీ: భారత్‌లో సుదీర్ఘ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ముంబై జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 324/7 వద్ద డిక్లేర్ చేసింది. టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ గప్టిల్(15) వికెట్‌ను తొందరగానే కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ లాథమ్(55 రిటైర్డ్ అవుట్ ;97 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఫస్ట్ డౌన్లో వచ్చిన కెప్టెన్ విలియమ్సన్(50;56 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇక న్యూజిలాండ్ మిగతా ఆటగాళ్లలో రాస్ టేలర్(41), సాంట్నార్(45) లు రాణించగా, నికోలస్ (29), వాట్లింగ్(21 రిటైర్డ్ అవుట్), క్రెయిగ్(33 నాటౌట్), సోథీ(29 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడారు. ముంబై బౌలర్లలో సంధూ రెండు వికెట్లు సాధించగా, దబోల్కర్, గోహిల్, లాడ్లకు తలో వికెట్ లభించింది. -
కుమ్మేసిన కిషన్, రికీ భుయ్
మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత యువ జట్టు దుమ్మురేపింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (86 బంతుల్లో 138 రిటైర్డ్ అవుట్; 16 ఫోర్లు, 7 సిక్సర్లు), ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ (71 బంతుల్లో 115 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు)లు వీరోచిత సెంచరీలు సాధించడంతో... శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల భారీ తేడాతో కెనడాను చిత్తు చేసింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 485 పరుగులు చేసింది. తర్వాత కెనడా 31.1 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. హర్ష్ (25) టాప్ స్కోరర్. కెప్టెన్ అబ్రాష్ ఖాన్ (22)తో సహా అందరూ విఫలమయ్యారు. భారత బౌలింగ్ ధాటికి కెనడా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరేలా కనిపించలేదు. లోమ్రోర్ 3, మావి, అన్సారి చెరో రెండు వికెట్లు తీశారు. -
ఆసీస్‌లో ఫుల్ ‘ప్రాక్టీస్’
ఆకట్టుకున్న భారత బ్యాట్స్‌మెన్ సీఏ ఎలెవన్‌తో మ్యాచ్ డ్రా అడిలైడ్: కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్ గడ్డపై భారత్‌కు ఫుల్ ‘ప్రాక్టీస్’ లభించింది. రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్లు తడాఖా చూపితే... రెండో రోజు బ్యాట్స్‌మెన్ నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు నమోదు చేయడంతో సీఏ ఎలెవన్‌తో శుక్రవారం ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా అయ్యింది. గ్లైడరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (94 బంతుల్లో 66 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు), విజయ్ (136 బంతుల్లో 60 రిటైర్డ్; 10 ఫోర్లు), రహానే (64 బంతుల్లో 56 రిటైర్డ్; 7 ఫోర్లు), సాహా (67 బంతుల్లో 51 రిటైర్డ్; 8 ఫోర్లు)లు రాణించారు. రోహిత్ శర్మ (48) ఫర్వాలేదనిపించాడు. తర్వాత సీఏ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 5 వికెట్లకు 83 పరుగులు చేసింది. సిల్క్ (41 నాటౌట్), షార్ట్ (26) ఓ మోస్తరుగా ఆడినా... మిగతా వారు విఫలమయ్యారు. ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 243 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ రిటైర్డ్ అవుట్ 60; ధావన్ (సి) ప్యాటిసన్ (బి) లాలర్ 0; పుజారా (సి) టర్నర్ (బి) లాలర్ 22; కోహ్లి రిటైర్డ్ అవుట్ 66; రహానే రిటైర్డ్ అవుట్ 56; రోహిత్ రనౌట్ 48; సాహా (సి) టర్నర్ (బి) మూడీ 51; రైనా (సి) సిల్క్ (బి) టర్నర్ 20; జడేజా (సి) కార్టర్స్ (బి) లాలర్ 23; కరణ్ (సి) టర్నర్ (బి) లాలర్ 4; ఉమేశ్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: (90 ఓవర్లలో ఆలౌట్) 375. వికెట్ల పతనం: 1-1; 2-36; 3-159; 4-169; 5-262; 6-272; 7-311; 8-351; 9-355; 10-375. బౌలింగ్: బర్డ్ 22-4-81-0; లాలర్ 17-4-59-4; గుల్బిస్ 17-3-48-0; మూడీ 13-1-56-1; షార్ట్ 8-0-47-0; ప్యాటిసన్ 7-1-32-0; టర్నర్ 6-1-40-1 సీఏ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 21 ఓవర్లలో 83/5.