Tamil Nadu
-
బాలుడిపై పోక్సో కేసు
సేలం: బాలికను గర్భవతిని చేసిన బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంకు చెందిన 15 ఏళ్ల బాలికకు ఇటీవల తరచూ కడుపునొప్పి వస్తుండడంతో ఆమె తల్లి తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు చేసిన వైద్యపరీక్షల్లో ఆరు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. ఇది విని షాక్‌కు గురైన బాలిక తల్లి తన కుమార్తెను వివరాలు అడిగింది. ఆ సమయంలో బంధువు కుమారుడైన 17 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే గర్భం దాల్చిందని బాలిక చెప్పింది. వెంటనే బాలిక తల్లి ఘటనపై గోపిశెట్టిపాలయం మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 17 ఏళ్ల బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ ఢీకొని దంపతుల దుర్మరణం అన్నానగర్: కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో దంపతులు దుర్మరణం పాలయ్యా రు. ఈ ఘటన తిరువొత్తియూర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. చైన్నెలోని తిరువొత్తియూర్ భారతీనగర్‌కు చెందిన విజయన్ (39) చైన్నెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇతని భార్య జయరాసిత (33). వీరిద్దరూ బుధవా రం రాత్రి తిరువొత్తియూర్ నుంచి బైక్‌లో మాఽ దవరం రౌండ్ఠానాకు వెళుతున్నారు. మాధవ రం మంజంబాక్కం చిన్నరౌండ్ఠానా సమీపం వద్ద వెళుతుండగా మనలి నుంచి మాధవరం వైపు వెళుతున్న కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడ్డ వీరిపై కంటైనర్ దూసుకెళ్లింది. ఈప్రమాదంలో దంపతులు ఇద్ద రు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తె లిసి మాధవరం పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ తెన్కాశికి చెందిన మురుగన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్య వివాహాలు అరికట్టాలి
వేలూరు: ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురష్కరించుకొని శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేలూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ సుబ్బలక్ష్మి ప్రారంభించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాలు, మహిళలపై జరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని ర్యాలీ నిర్వహించి అవగాహన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్న వయస్సులో సెల్ఫోన్లకు బానిస కాకుండా విద్యకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో బాలకార్మికులు లేకుండా బాలలను బడిలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలపై ఎక్కడైనా లైంగిక వేధింపులు జరిగితే వెంటనే 1098, 181 అనే నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. శిశుసంక్షేమశాఖ జిల్లా అధికారి సంజీత్, సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమ పాల్గొన్నారు. -
శివాలయాల్లో ఘనంగా ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని హరోంహర నామస్మరణల మధ్య, శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూరహారతులు పట్టారు. అనంతరం స్వామివార్లను అధికార నంది వాహనంలో కొలువుదీర్చి మాడ వీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అలాగే వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాల్లోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు పూజలు చేసి ప్రార్థనలు జరిపారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున ఆలయం కొండ చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల దూరం గిరివలయం వెళ్లడం ఆనవాయితీ. దీంతో ఆలయ నిర్వాహకులు గిరివలయం వెళ్లేందుకు సమయాన్ని విడుదల చేశారు. అందులో భాగంగా శుక్రవారం వేకువ జామున 5.43 ప్రారంభించి 16వ తేదీన 3.30 గంటల వరకు పౌర్ణమి ఉండడంతో ఆ సమయంలో భక్తులు గిరివలయం వెళ్లవచ్చని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. -
నయనతార చిత్రంలో వీర సమర్
తమిళసినిమా: నటనకు అర్హత ప్రతిభ ఒకటే. అది ఉంటే ఎవరైనా నటించవచ్చు అలా ఇ ప్పటికే పలు రంగాలకు చెందినవారు నటులుగా రాణిస్తున్నారు. అలాగే ప్రముఖ కళా దర్శకుడు వీర సమర్ కూడా నటుడిగా మంచి గుర్తింపు పొందుతున్నారు పలు చిత్రాలకు కళా దర్శకుడు గా పనిచేస్తున్న ఈయన ఇప్పటికే పలు చిత్రాల్లో కథానాయకుడిగా, గుణ చిత్ర పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరశేఖరన్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన ఈయనకు జంటగా నటి అమలాపాల్ కథానాయకగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాదల్, వెయిల్, పూ.పాండి, ముత్తుకు ముత్తాగా, వేలాయుధమ్, పాండి ఒలిపెరుక్కి నిలయం, కొంబన్, ఆరు కిడాయిన్ కరుణై మను,కడై కుట్టి సింగం, కుడిమగన్, నమ్మి వీటి పిళ్లై , జాక్‌పాట్, తన్నివండి, డీఎస్పీ, యాదుమ్ ఊరే యావరం కేళీర్, తమిళ్ కుడిమగన్, 1943 కప్పలేరియ తమిళన్, తదితర 30 చిత్రాలకు పైగా వివిధ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన కళా దర్శకుడుగాను కొనసాగడం విశేషం. కాగా తాజాగా నటి నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్న మన్నాంగట్టి చిత్రంలో వీర సమర్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం తనకు మరింత పేరును తెచ్చిపెడుతుందంటున్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న పరమశివన్ పాత్తిమా చిత్రంలో హాస్య పాత్రను, అదేవిధంగా ఇళయబాల దర్శకత్వంలో రూపొందుతున్న తొడర్పు ఎల్లైక్కు అప్పాల్ చిత్రంలోని మంచి పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు ఇకపోతే పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో కళాదర్శకుడిగా పని చేస్తూ కీలక పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. -
ఆడి కోసం ఆన్లైన్ బుకింగ్
సాక్షి, చైన్నె : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తమ కొత్త వాహనం కోసం ఆన్లైన్ బుకింగ్ నిమిత్తం వెబ్‌సైట్‌ను ప్రకటించింది. గురువారం ఈ వివరాలను ఆ సంస్థ ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిలాన్ స్థానికంగా ప్రకటించారు. కొత్త ఆడి క్యూ7 బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. ఔరంగాబాద్‌లోని ఏవీడబ్ల్యూఐపీఎల్ ప్లాంట్‌లో ఈ వాహనం తయారు చేస్తున్నట్టు వివరించారు. నవంబర్ 28వ తేదీ నుంచి బుకింగ్‌లను ఆడి ఇండియా వెబ్సైట్లలో చేపట్టనున్నామని పేర్కొంటూ, ఆ వాహనంలోని అత్యాధునిక లగ్జరీ సేవలను గురించి వివరించారు. డివిజన్ అకౌంట్ సహాయకుడు డిస్మిస్ సేలం: అవినీతికి పాల్పడిన డివిజన్ అకౌంట్ సహాయకుడిని డిస్మిస్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి ప్రసూతి ఆర్థిక సహాయం పథకం కింద పుదుకోట్టై జిల్లా కడియాంపట్టి ఆరోగ్య డివిజన్లో 5 ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో చైన్నె నుంచి బుధవారం వచ్చిన తనిఖీ బృందం కట్టియాప్పట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసింది. ఇందులో కడియాంపట్టి ఆరోగ్యశాఖ సహాయక ఉద్యోగి వెంకటేశ్‌కుమార్, డివిజన్ అకౌంట్ సహాయకుడు అరుణ్‌లు 16 నకిలీ ఖాతాలను తెరిచి, వాటి ద్వారా రూ.18.60 లక్షలు మోసానికి పాల్పడిట్టు తెలిసింది. దీనికి సంబంధించి పుదుకోట్టై ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రామగణేష్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. ఇదిలా ఉండగా బుధవారం వెంకటేష్ కుమార్‌ను సస్పెండ్ చేసిన అధికారులు అరుణ్‌ను డిస్మిస్ చేశారు. మోసం కేసులో మహిళ అరెస్టు తిరువొత్తియూరు: కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మించి రూ.15 లక్షలు మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చైన్నె విల్లివాక్కం రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి(41) ఓ కంపెనీలో పని చేస్తుంది. గోకుల్‌రాజ్ ద్వారా అతని భార్య సుచిత్ర (26), మహాలక్ష్మికి పరిచయం అయింది. సుచిత్ర గిండిలో ఒక సంస్థలో నగదు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని తెలిపారు. దీంతో మహాలక్ష్మి, సుచిత్ర చెప్పిన సమస్థకు పలు దఫాలుగా రూ.15 లక్షల డిపాజిట్ చేసింది. నగదు తీసుకున్న తర్వాత సుచిత్రను సంప్రదించడానికి వీలు కాలేదు. దీంతో అనుమానించిన మహాలక్ష్మి, సుచిత్ర కార్యాలయానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె ఈ విషయమై రాజమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చైన్నె రెడిల్స్ ప్రాంతానికి చెందిన సుచిత్రను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరపరిచిలో జైలులో పెట్టారు. దీనికి సంబంధించి మహమ్మద్ నసరుద్దీన్, మహమ్మద్ యూసఫ్ కోసం గాలిస్తున్నారు. -
వీరమణిపై ఈసీ కన్నెర్ర!
సాక్షి, చైన్నె: ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలను దాచి పెట్టిన మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీ నియర్ నేత కేసీ వీరమణి పై కేంద్ర ఎన్నికల కమి షన్ కన్నెర్ర చేసింది. ఆ యనపై గురువారం కేసు నమోదు చేసింది. కేసీ వీరమణి అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా పనిచేశారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట నుంచి ఆయన 2021లో పోటీ చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ప్రమాణ పత్రంలో ఆ స్తుల వివరాలను దాచి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అదేసమయంలో రామమూర్తి అనే సామాజిక కార్యకర్త ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు సహా ఫిర్యాదు చేయడమే కాకుండా, కోర్టును సైతం ఆశ్రయించారు. కోర్టు విచారణ లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా కేసీ వీరమణిపై కన్నెర్ర చేయడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందులోభాగంగా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీరమణిపై ఎన్నికల కమిషన్ గురువారం కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఇదిలాఉండగా ఇటీవల కాలంగా కేసీ వీరమణిని టార్గెట్ చేసి ఏసీబీ సోదాలు సాగుతున్న విషయం తెలిసిందే. లాటరీ కింగ్ లక్ష్యంగా ఈడీ సోదాలు ● వీసీకే నేత ఇంట్లో కూడా సాక్షి, చైన్నె: లాటరీ కింగ్ మార్టిన్ లక్ష్యంగా ఈడీ వర్గాలు చైన్నె, కోయంబత్తూరులలో గురువారం సోదాలు ముమ్మరం చేశారు. మార్టిన్ అల్లుడు, వీసీకే నేత అర్జున్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. కోయంబత్తూరు తుడియలూరుకు చెందిన లాటరీ వ్యాపారి మార్టిన్‌ను కింగ్ ఆఫ్ లాటరీ అని అందరూ పిలుస్తుంటారు. ఆ మేరకు లాటరీ టికెట్ల అమ్మకంపై కేరళ రాష్ట్రం నుంచి హక్కులు ఆయన పొంది ఉన్నాడు. సిక్కిం లాటరీ టికెట్ల అమ్మకాల్లో నియమాలను అతిక్రమించి కేరళలో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయనపై వచ్చిన ఆరోపణలతో గతంలో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. సిక్కిం లాటరీ టికెట్లను అమ్మి రూ.910 కోట్ల 30 లక్షల ప్రైజ్‌మనీలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ సొమ్ము ద్వారా అనేక కంపెనీలు స్థాపించి స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు కనుగొన్న సీబీఐ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. గతంలో సైతం ఆయన నివాసం, కార్యాలయాలు, విద్యా సంస్థలలో ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందులో లభించిన సమాచారంతో రాజకీ యపక్షాలకు సైతం మార్టిన్ ఎన్నికల విరా ళాలు ఇవ్వడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయనకు సంబంధించిన అనేక ఆస్తులను అటాచ్ చేశారు. ఈ పరిస్థితులలో గురువా రం ఉదయాన్నే, కోయంబత్తూరు, చైన్నెలలో ని ఐదు చోట్ల ఈడీ అధికారులు రంగంలోకి దిగి సోదాలలో నిమగ్నమయ్యారు. కోయంబత్తూరులోని మార్టిన్ నివాసం, కార్యాలయం, హోమియో పతి కళాశాలలో సోదాలు జరుగుతున్నాయి. చైన్నెలోని ఆయన అల్లుడు, వీసీకే నేత అర్జున్ నివాసం కార్యాలయాలలోనూ సోదాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల కేంద్ర బలగాల భద్రత నడుమ సోదాలు కొనసాగుతున్నాయి. మాదకద్రవ్యాల కేసులో ఈడీ చార్జ్‌షీట్ సాక్షి, చైన్నె: మాదకద్రవ్యాల కేసులో సీబీఐ కోర్టులో గురువారం ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సినీ నిర్మాత జాఫర్ సాధిక్, దర్శకుడు అమీర్‌తో పాటు 12 మందిని నిందితులుగా చేర్చారు. ఇటీవల ఢిల్లీలో రూ.2 వేల కోట్ల విలువ గల మాదకద్రవ్యాలు బయట పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణలో ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారి చైన్నెకు చెందిన సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాధిక్ అని తేలింది. మూడేళ్లలో జాఫర్ సాధిక్ ముఠా 3,500 కిలోల మత్తు పదార్థాలను తమిళనాడు నుంచి పలు దేశాలకు స్మగ్లింగ్ చేసినట్టు విచారణలో తేలింది. తనను ఎన్సీబీ టార్గెట్ చేయడంతో జాఫర్ సాధిక్ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి సోదరులు సలీం, మైదీన్ కూడా పత్తా లేకుండా పోయారు. ఎట్టకేలకు ఎన్సీబీ అధికారులకు సాధిక్ చిక్కాడు. జాఫర్ సాధిక్ సినిమాలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్టుగా విచారణలో వెలుగు చూసింది. ఈ కేసు చైన్నె సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌పై దృష్టి పెట్టి ఈడీ వర్గాలు సైతం విచారణ చేశాయి. ఇచార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు. సాధిక్, అతడి భార్య అమినాభాను, మహ్మద్ సలీం, మైదిన్ ఖణి, దర్శకుడు అమీర్ సహా 12 మంది పేర్లను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. -
నైపుణ్యాలతో ఉపాధికి మార్గం
● యూజీసీ చైర్మన్ ● కొత్త కోర్సులకు కసరత్తులు ● వారి వారి భాషలలో విద్యా బోధనకు చర్యలుసాక్షి, చైన్నె : ఉన్నత విద్య ప్రవేశం, సమానత్వంనెపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలు వివిధ వృత్తులలో రాణించాలనుకునే విద్యార్థులకు ఉపాధికి ప్రధాన మార్గాలు అని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ జగదీశ్‌కుమార్ అన్నారు. యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్, మద్రాసు ఐఐటీ నేతృత్వంలో జాతీయ విద్యా విధానం 2020పై స్వ యం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలల దక్షిణ జోన్ సమావేశం చైన్నెలో జరిగింది. జాతీయ విద్యావిధానంలోని వివిధ అంశాలను ఇందులో చర్చించారు. అనేక సంస్థలు, విద్యావేత్తల భాగ స్వామ్యాన్ని ఆహ్వానించారు. పాలసీకి సంబంధించిన వివరాలను వివిధ వాటాదారుల మధ్య వ్యాపింప చేయడానికి, ఉన్నత విద్యా సంస్థల ద్వారా ఈ విధానం అమలును నిర్ధారించడానికి జరుగుతున్న ప్రయత్నాలను విశదీకరించారు. ప్రొఫెసర్ జగదీష్‌కుమార్ మాట్లాడుతూ విద్యాసంస్థలు ఉన్నత విద్యను నాణ్యతతో విద్యార్థులకు విజయవంతంగా అందించేందుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి భారతీయ భాషలను ఉన్న త విద్యలో బోధనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ ఉన్నత విద్యా వ్యవస్థలో తమ గ్రాస్ ఎన్్రోల్మెంట్ రేషన్ దాదాపు 30% ఉందన్నారు. 2047 నాటికి సాంకేతికతపై మంచి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఎండ్ సెమిస్టర్ పరీక్షను కూడా నిర్వహించేందుకు యూజీసీ యూనివర్సిటీలకు అనుమతించిందన్నారు. విద్యార్థులు తమ సమయం, డబ్బును ఆదా చేసుకోవాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎండ్–సెమిస్టర్ పరీక్షలకు దూరంగా ఉండాలని సూచించారు. -
ఆగిన ఓపీ సేవలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా, నగర, రూరల్ హెల్త్ సెంటర్లలో గురువారం ఔట్ పేషంట్ వైద్యసేవలు ఆగాయి. కేవలం అత్యవసర సేవలను మాత్రమే అందించారు. తమకు భద్రత కల్పించాలన్న నినాదంతో వైద్యులు నిరసనలను హోరెత్తించారు. ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణియన్ బుజ్జగింపుతో మెట్టు దిగిన డాక్టర్లు సమ్మె వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాలుగు రకాల ట్యాగ్‌లతో గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. ఔట్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. చైన్నె గిండిలోని కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి స్మారక ఆస్పత్రిలో కేన్సర్ వైద్య చికిత్స నిపుణుడు బాలాజీపై ఓ యువకుడు బుధవారం కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా తొలి రోజున అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వ వైద్యులు బహిష్కరించారు. గురువారం నుంచి సమ్మె గంట మోగిస్తూ ప్రకటన చేశారు. దీంతో వైద్యులు, జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తించారు. ఔట్ పేషెంట్ సేవలను స్తంభింప చేశారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరయ్యారు. ఓపీ సేవలు ఆగడంతో రోగులకు అవస్థలు తప్పలేదు. గిండి ఆస్పత్రిలో అయితే, వైద్యం కోసం వచ్చిన ఓ యువతి స్పృహతప్పి కింద పడడంతో కలకలం రేగింది. చైన్నెలోని గిండి కలైంజ్ఞర్ ఆస్పత్రి, స్టాన్లీ, కీల్పాకం, రాయపేట, ఓమందూరార్, రాజీవ్‌గాంధీ జిహెచ్ల వద్ద నిరసనలు హోరెత్తాయి. ఓపీ సేవల కోసం వచ్చిన రోగులు నిరాశతో వెనుదిరిగారు. గిండిలో జరిగిన నిరసనలో వైద్యులు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. అదే సమయంలో తాను ఆరోగ్యంగా ఉన్నానని డాక్టర్ బాలాజీ ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే, గిండి ఆస్పత్రి డైరెక్టర్ పార్థసారథి స్పందిస్తూ ఇక్కడ ప్రతి ఒక్క రోగికి మెరుగైన చికిత్స అందించడమే కాదు, ఇక్కడి సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. బాలాజీపై దాడి చేసిన యువకుడు విఘ్నేష్‌కు న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు. వైద్యుల పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు మంత్రి బుజ్జగింపుతో మెట్టుదిగిన డాక్టర్లు సమ్మె వాయిదా రోగులకు గుర్తింపు కార్డులు మంత్రి బుజ్జగింపు... వైద్యులు సమ్మె నినాదం అందుకోవడంతో వారిని ఆరోగ్యమంత్రి ఎం.సుబ్రమణియన్ బుజ్జగించారు. డాక్టర్ బాలాజీని పరామర్శించిన తర్వాత డాక్టర్ల సంఘాలు, పోలీసు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దాడుల కట్టడి దిశగా చర్చించారు. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో వైద్యులు శుక్రవారం నుంచి చేపట్టదలచిన సమ్మెను వాయిదా వేసుకున్నారు. ఈ వివరాలను మంత్రి ఎం.సుబ్రమణియన్ ప్రకటించారు. డాక్టర్ బాలాజీ ఆరోగ్యంగా ఉన్నారని, నిందితుడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టామన్నారు. ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించడం తమ బాధ్యత అని, ఆదిశగా కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఆస్పత్రులలో సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతం చేయనున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల హాజరు రికార్డు, బయో మెట్రిక్ విధానం కొనసాగించే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో ఔట్‌పోస్టు, పోలీసుల పెట్రోలింగ్ పనులు పూర్తి స్థాయిలో ఏర్పాటు, ఔట్ పోస్టు లేని ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు, ఉన్న చోట్ల అదనపు సిబ్బంది నియామకానికి నిర్ణయించామన్నారు. ప్రధానంగా రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులతో పాటు అటెండెంట్లు, పరామర్శలకు వచ్చే వారికి నాలుగు రకాల గుర్తింపు కార్డులను అందజేయనున్నామన్నారు. సమావేశంలో నేషనల్ హెల్త్ గ్రూప్ డైరెక్టర్ అరుణ్ తంబురాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంగుమణి, మెడికల్ అండ్, గ్రామీణ సంక్షేమ శాఖ సంచాలకులు రాజమూర్తి, వైద్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా సమావేశానంతరం రాష్ట్రంలోని చైన్నె, మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, తూత్తుకుడి, సేలం, ఈరోడ్ నగరాల్లోని ప్రభుత్వాస్పత్రుల వద్ద తుపాకీ భద్రతతో పోలీసులను బందోబస్తుకు రంగంలోకి దించారు. -
పనుల వేగం పెంచండి
● అధికారులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి ఆదేశాలు ● తూత్తుకుడిలో మినీ టైడల్ పార్క్ ● రూ.300 కోట్లతో ఫర్నీచర్ పార్కు ● తిరుచెందూరుకు మాస్టర్ ప్లాన్ పరిశీలన మోటారు సైకిళ్లను పంపిణీ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్. చిత్రంలో మంత్రులు గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రుణాలను పంపిణీ చేస్తున్న ఉదయనిధి సాక్షి, చైన్నె : పనుల వేగం పెంచాలని, నిర్ణీత సమయానికి ప్రజలకు ప్రాజెక్టులను అంకితం చేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధికారులను ఆదేశించారు. తూత్తుకుడిలో మినీ టైడల్ పార్కు, అంతర్జాతీయ ఫర్నీచర్ పార్కు, తిరుచెందూరు మాస్టర్‌ప్లాన్ అమలు ప్రాజెక్టులపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. తూత్తుకుడిలో ఉదయనిధి స్టాలిన్ పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పథకాలు, ప్రాజెక్టుల గురించి అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. వాటి అమలుకు ఆదేశించారు. తూత్తుకుడి యువతకు ఉపాధి అవకాశాల మెరుగుపరిచే దిశగా మినీ టైడల్ పార్కు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫర్నీచర్ పార్కు రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనుల వేగం పెంచాలన్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో ప్రసిద్ధి చెందిన సుబ్ర మణ్యస్వామి ఆలయంలో భక్తుల కోసం అమలు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులపై సమగ్ర చర్చతో త్వరితగతిన సేవలను భక్తులకు విస్తృతం చేయాలని సూచించారు. కాగా, ఉదయనిధి పర్యటనకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కనిమొళి దూరంగా ఉన్నారు. అయితే, ఆమె విదేశాల్లో ఉన్నారని, ఆమెతో చర్చించిన అనంతరమే తాను ఈ జిల్లా పర్యటనకు నిర్ణయించినట్టు ఉదయ నిధి వ్యాఖ్యలు చేశారు. ముందుగా తూత్తుకుడిలో ఉదయ నిధికి డీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టేలా ఆహ్వానాలు పలికాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు గీతాజీవన్, అనిత ఆర్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. -
లంచం కేసులో వీఏఓ అరెస్ట్
సేలం: కున్నత్తూర్‌లో రూ.10 వేలు లంచం తీసుకున్న గ్రామ నిర్వాహక అధికారిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుప్పూర్ జిల్లా అవినాశి సమీపంలోని కున్నత్తూర్ పరిధిలోని ఇడయార్పాళయానికి చెందిన రైతు మురుగేశన్ (45). ఈయన, తన సోదరులు అందరికి సొంతమైన 35 సెంట్ల భూమి అదే ప్రాంతంలో ఉంది. ఆ భూమి వ్యాల్యువేషన్ చేసి ఇవ్వాలని ఇడయార్‌పాళయం గ్రామ నిర్వాహక కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం రూ.10 వేల లంచం అడిగాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని మురుగేశన్ తిరుపూర్ జిల్లా ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సూచన మేరకు బుధవారం రసాయనం పూసిన రూ.10 వేల నగదును మురుగేశన్ వీఏఓ విన్సెంట్ త్యాగరాజన్‌కు ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఏసీబీ పోలీసులు విన్సెంట్ త్యాగరాజన్‌ను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి తిరుపూర్ జైలుకు తరలించారు.వీఏఓ విన్సెంట్ త్యాగరాజన్ -
రూట్ గైడ్ రోబో ఆవిష్కరణ
● ప్రతిభ చాటిన ఐఐటీ మద్రాసు, ఓపీ జిందాల్ పరిశోధకులుసాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకుల సంయుక్త భాగస్వామ్యంతో టూర్ గైడ్ రోబోను రూపొందించారు. త్వరలో ప్రారంభం కానున్న భారత రాజ్యాంగ మ్యూజియం విజిటర్స్, ఇంటరాక్టివ్ డిస్ప్లేల కోసం స్మార్ట్ అసిస్టెంట్‌గా ఈ రోబో పనిచేయనుంది. ఈమేరకు ఈ రోబోను చైన్నెలో ఆవిష్కరించారు. అత్యాధునిక సాంకేతికత, ఏఐ ఇంటరాక్టివ్ అనుభవాలు, 3–ఈ ఇన్స్టలేషన్, ప్రోగ్రెసివ్ డిస్ప్లేలతో దీనిని సిద్ధం చేశారు. ఎస్ఏఎంబీఐడీ ప్రాజెక్టు సందర్శకుల అనుభవాన్ని ఇంటరాక్టివ్‌గా మార్చే అధునాతన భాషను ఈ రోబోట్ ఉపయోగించే విధంగా తీర్చిదిద్దారు. గైడెడ్ టూర్లు, ఎగ్జిబిట్ల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇది అందించనుంది. ఈసందర్భంగా ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి మాట్లాడుతూ చరిత్రకు ప్రాణం పోసే మానవరూప రోబోట్ అయిన ఎస్ఏఎంవీఐ ద్వారా భారతదేశ రాజ్యాంగ చరిత్రకు తాము సైతం సహకారంగా నిలవడం ఆందనంగా ఉందన్నారు. జిందాల్ గ్లోబల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఇది చరిత్ర, సంప్రదాయం, సాంకేతిక ఆవిష్కరణలను కలిపే వినూత్న ప్రాజెక్టుగా వివరించారు. ఐఐటీ మద్రాసు ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. రాజ్యాంగ మ్యూజియం కోసం టూర్ గైడ్ రోబోట్‌గా ప్రత్యేకంగా దీనిని రూపొందించామన్నారు. ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లు వెంకటేష్ బాలసుబ్రమణియన్, పాల్గొన్నారు. -
నెహ్రూకు ఘన నివాళి
సాక్షి, చైన్నె : మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని కాంగ్రెస్ వర్గాలు వాడవాడల్లో గురువారం ఘనంగా జరుపుకున్నాయి. చైన్నె గిండిలోని నెహ్రూ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఇక, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ నెహ్రూను స్మరిస్తూ బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, గిండి కత్తిపార వంతెన వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఉదయాన్నే మంత్రులు అన్బరసన్, నాజర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లోనూ వేడుకలు జరిగాయి. వివిధ పార్టీల నేతలు నెహ్రూ విగ్రహం, చిత్ర పటాలకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. అలాగే, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సైతం శుభకాంక్షలు తెలియజేశారు. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ విద్యార్థులకు చాక్లెట్ల పంచిపెట్టారు. చైన్నెలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మంత్రి అన్బిల్‌మహేశ్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ చాక్లెట్లను అందజేశారు. ఈసందర్భంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. విద్యార్థులు పాల్గొన్నారు. -
పాంబన్‌లో రైల్వే భద్రతా కమిషనర్ తనిఖీలు
సాక్షి, చైన్నె : రామనాథపురం జిల్లా రామేశ్వరం సముద్ర తీరంలో పాంబన్ రైల్వే వంతెన సిద్ధమైంది. 90 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి ట్రయల్ రన్‌ను విజయవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో గురువారం రైల్వే భద్రతా కమిషనర్ చౌదరి ఆ మార్గంలో పరిశీలన, తనిఖీలు నిర్వహించారు. ఆథ్యాత్మికంగాను, పర్యాటకంగాను రామేశ్వరం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి రైల్వే మార్గం పయనం ఎంతో ఆహ్లాదకరంగానే కాదు, ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మండపం నుంచి పాంబన్ మీదుగా రామేశ్వరం నగరానికి రైలు ప్రయాణం సముద్రం మధ్యలో సాగుతుంది. మండపం నుంచి రామేశ్వరం వైపుగా రైలు సాగేందుకు పాంబన్ దీవుల్ని తాకుతూ రైల్వే వంతెన నిర్మించి 105 ఏళ్లు అవుతుంది. ఈ వంతెన వైపుగా నౌకలు వచ్చే సమయంలో లోతైన ప్రాంతం వద్ద రెండుగా ఈ వంతెన తెరచుకుంటుంది. అప్పటి సాంకేతిక పరిజ్ఞానం మేరకు నిర్మించిన ఈ వంతెనకు ఇటీవల కాలంగా తరచూ ఏదో ఒక సమస్య తప్పడం లేదు. అలాగే వంతెన బీటలు వారడం వంటి పరిణామాలతో ప్రస్తుతం ఉన్న వంతెనకు పక్కనే కొత్తగా మరో వంతెన నిర్మాణానికి తగ్గ చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ వంతెన నిమిత్తం సముద్రంలో 140 పిల్లర్లను ఏర్పాటు చేశారు. నౌకలు వచ్చే సమయంలో వంతెన రెండుగా తెరచుకునే ప్రాంతం 22 మీటర్ల ఎత్తులో ఉండేలా వంతెన మార్గం 20 మీటర్ల ఎత్తులో ఉండే రీతిలో నిర్మాణాలు జరిగాయి. ఈ నిర్మాణాలు ప్రస్తుతం ముగిశాయి. ఈమార్గంలో ట్రయల్ రన్ పలు మార్లు ఇప్పటికే విజయవంతమైంది. తుది ట్రయల్ రన్‌తో రైలును ఈ మార్గంలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా అనుమతులు మంజూరు చేసేందుకు గాను రైల్వే భద్రతా కమిషనర్ చౌదరి నేతృత్వంలోని బృందం పరిశీలన జరిపింది. ఆ ట్రాక్‌ను తనిఖీ చేశారు. రైల్వే భద్రతా కమిషనర్ అనుమతి దక్కగానే పాంబన్కొత్త వంతెన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. -
ఘనంగా బాలల గేయాలు ఆడియో ఆవిష్కరణ
కొరుక్కుపేట: గేయాలతో విద్యార్థుల్లో ఒత్తిడి దూ రమై, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ప్రముఖ కెన్సస్ సంస్థల అధినేత నరసారెడ్డి అన్నారు. చైన్నె టి.నగర్‌లోని కేసరి మహోన్నత పాఠశాలలో ప్రముఖ బాలల గేయ రచయిత టీవీ స్వామి రూపొందించిన, ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరి వాసురావు స్వరపరచిన బాలల గేయాలు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. సంగీత దర్శకులు సాలూరి వాసురావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కేన్సస్ అధినేత నరసారెడ్డి, పాఠశాల కార్యనిర్వాహక సభ్యులు మొదలి శ్రీరామప్రసాద్, పాఠశాల కార్యదర్శి కేఎస్వీ ప్రసాద్ పాల్గొని బాలల గేయాలు ఆడియోను ఘనంగా ఆవిష్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య అతిథులను ఘనంగా సత్కరించారు. వ్యాఖ్యాతగా మదన్మోహన్, తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు కె.అనిల్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
క్లుప్తంగా
తలకిందులుగా నిలబడి.. లీటరు నీళ్లు తాగి.. – విరుదునగర్ యువకుడు గిన్నిస్ రికార్డు సేలం: తలకిందులుగా నిలబడి 17.24 సెక న్ల లో ఒక లీటరు నీళ్లు తాగి విరుదునగర్ యువకుడు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. విరుదునగర్ జిల్లా రాజపాళయం ముగవూర్ ప్రాంతానికి చెందిన పాప్పయ్యా, సుబ్బులక్ష్మి దంపతుల కుమారుడు అరుణ్‌కుమార్ (26) చైన్నెలోని ఒ క ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి ఏదైనా సాధించాలనే తపనతో ఉన్న అ రుణ్ కుమార్‌ను పలువురు తలకిందులుగా నీ ళ్లు తాగినా సాధించలేవని ఎగతాలి చేసినట్టు తె లిసింది. ఆ ఎగతాలి మాటలనే ఎందుకు సా ధించకూడదన్న ఆలోచనతో అప్పటి నుంచే అ రుణ్ కుమార్ తల కిందులుగా నిలబడి నీళ్లు తాగడాన్ని సాధన చేశాడు. అలా తొలి నాళ్లలో తల కిందులుగా ఉండి నీళ్లు తాగితే ప్రెషర్ కారణంగా ఒకసారి ముక్కులో నుంచి రక్తం కూడా కారింది. అయినా పట్టు వీడక అరుణ్ కుమార్ సాధన కొనసాగించాడు. అలా గత ఏడాది తలకిందులుగా నిలబడి 26.04 సెకన్ల సమయంలో ఒక లీటర్ నీళ్లు తాగి అరుణ్ కుమార్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. తర్వాత గత జనవరి నెల లో ఒక చేతిని నేలపై పెట్టి తల కిందులుగా ని లబడి 25.01 సెకన్లలో ఒక లీటర్ నీళ్లు తాగి గిన్నిస్ పుస్తకంలో స్తానం సంపాదించాడు. తన రికార్డును తానే బద్దలుకొట్టదలచిన అరుణ్ కు మార్ బుధవారం మళ్లీ తలకిందులుగా నిల బడి, తలను నేలకు తగలనివ్వకుండా ఒంటి చేతితో నిలబడి 18.23 సెకన్ల సమయంలో ఒక లీటర్ నీళ్లు తాగాడు. మళ్లీ మరో మారు 17.24 సెకన్లలో ఒక లీటర్ నీళ్లు తాగి రికార్డు సృష్టించాడు. ఆయన సాధనను గిన్నిస్ రికార్డు కోసం పంపించాడు. ఈ సందర్భంగా అరుణ్ కు మార్ను పలువురు అభినందిస్తున్నారు. సెల్‌ఫోన్ పేలి ఇంజినీర్ మృతి అన్నానగర్: సెల్‌ఫోన్ దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో అది పేలి ఓ ఇంజనీర్ మృతి చెందాడు. నైల్లె జిల్లాలోని నాంగునేరి పె రున్ వీధి ప్రాంతంలో వానుమలై, వీరలక్ష్మి ఉన్నా రు. వీరికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సెల్వసతీష్ (26) మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ స్థితిలో సె ల్వసతీష్ ఇద్దరు తోటి కార్మికులతో కలిసి నాగర్‌కోయిల్ సమీపంలోని ఆలూరు ప్రాంతంలో ఓ అ ద్దె ఇంట్లో ఉంటూ పెయింటింగ్ పనికి వెళ్లాడు. బుధవారం రాత్రి ముగ్గురూ పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్న సెల్వసతీష్ మాత్రం పైగదిలోని మంచంపై పడుకున్నా డు. మిగిలిన ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో ఆరుబయట నిద్రిస్తున్నారు. గురువారం ఉదయం సెల్వసతీష్ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగి వెంకటేష్ గదిలోకి వెళ్లి చూడగా సెల్వసతీష్ చనిపోయి ఉ న్నాడు. అతని సెల్‌ఫోన్ పేలి మంచం పైఉన్న ప రుపులు, కుర్చీలు కూడా కాలిపోయి శిథిలావస్థలో పడి ఉన్నాయి. దీంతో వెంకటేష్ పోలీసులకు స మాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘ టనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సెల్వ సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి విచారణ చేపట్టారు. సెల్వసతీష్ నిద్రిస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ను దిండు దగ్గర పెట్టుకున్నాడని పోలీసుల ప్రాథమిక వి చారణలో తేలింది. అప్పుడు సెల్‌ఫోన్ పేలిపోయి ఉండవచ్చని, సెల్వసతీష్ మద్యం మత్తు లో కింద దిగి నిద్రపోయి ఉండవచ్చని చెబుతున్నారు. బస్సు ఢీకొని వృద్ధురాలు.. సేలం: సత్యమంగళం బస్టాండ్‌లో గురువారం ఉదయం ప్రభుత్వ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈరోడ్ జిల్లా వెంకనాయకన్పాళయంలోని పులియంపట్టి ప్రాంతానికి చెందిన సావిత్రి (60). ఈమె గురువారం ఉదయం 6.30 గంటలకు సత్యమంగళం బస్టాండ్‌లోని పూల మార్కెట్‌కు వచ్చి పూలు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈరోడ్ జిల్లా తాళ్లవాడి నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రభుత్వ బస్సు ఈరోడ్ వైపు వెళుతోంది. సత్యమంగళం బస్టాండ్‌లోకి ప్రవేశించేందుకు ప్రభుత్వ బస్సు ప్రవేశ ద్వారం వద్ద మలుపు తిరుగుతుండగా, సావిత్రిని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సావిత్రి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న సత్యమంగళం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యమంగళం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.7లక్షల దోపిడీ – ముగ్గురి అరెస్టు సేలం: రాళ్ల క్వారీలో రూ.7 లక్షలు దోచుకున్న ముగ్గురు ఉత్తరాది కార్మికులను పోలీసులు అ రెస్టు చేశారు. నామక్కల్ జిల్లా సేందమంగళం సమీపంలోని కొండమనాయకన్పట్టి ప్రాంతంలో శ్రీపాలన్ రాళ్ల క్వారీ నిర్వహిస్తున్నాడు. అ క్కడ బుధవారం అర్ధరాత్రి చొరబడిన ముగ్గురు సెక్యూరిటీ పళనిస్వామి (53)ను కొట్టి, కార్యా లయ తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.7 లక్షల నగదును దోచుకెళ్లారు. పోలీసులు జరిపిన విచారణలో రాళ్ల క్వారీలో పనిచేస్తున్న వారే ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది. అ నంతరం బిహార్‌కు చెందిన మహ్మద్ అజాద్ (24), మహ్మద్ జలాల్ (25), ఆయన తమ్ము డు సులే(22) ఆ క్వారీలో పనిచేసిన వారని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణగిరి సమీపంలోని బస్సులో ముగ్గురు పరారవుతున్నట్టు తెలిసింది. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. వా రి నుంచి రూ.7 లక్షల నగదును స్వాధీనం చే సుకుని వారి వద్ద విచారణ జరుపుతున్నారు. -
లైంగిక వేధింపుల కేసులో ముగ్గురి అరెస్టు
అన్నానగర్: తారాపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో కొన్ని నెలలుగా ఉంటున్న 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన హాస్టల్ సూపరింటెండెంట్‌ను పొక్సో చట్టం కింద అరెస్టు చేశారు. అతనికి సహకరించినందుకు వైస్ ప్రిన్సిపల్సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. తిరుపూర్ జిల్లా తారాపురంలోని ఓ ప్రైవేట్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల సమీపంలో ఆ పాఠశాల హాస్టల్ ఉంది. ఇక్కడ సైనిక్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి సైన్యంలో చేరాలనుకునే 50 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ హాస్టల్లో పదో తరగతి విద్యార్థినులను హాస్టల్ సూపరింటెండెంట్ చరణ్ (25) నెలల తరబడి లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఓ విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పి బోరున విలపించింది. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, అతని బంధువులు హాస్టల్ సూపర్వైజర్ను అరెస్టు చేసేందుకు గురువారం పాఠశాల ఎదుట గుమిగూడారు. పాఠశాలను మూసివేయాలని, సీలు వేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు, పోలీసులు విద్యార్థులను విచారణ చేపట్టారు. హాస్టల్లో ఉంటున్న 17 మంది విద్యార్థినులను చరణ్ లైంగికంగా వేధించాడని తెలిసింది. అనంతరం పోక్సో చట్టం కింద అతడిని అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. చరణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థినులు పాఠశాల వైస్ ప్రిన్సిపల్, హాస్టల్ చీఫ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆ సమయంలో వెల్లడైంది. దీంతో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సురేష్ కుమార్ (50), చీఫ్ సూపరింటెండెంట్ రాంబాబు (34)ను అరెస్టు చేశారు. -
మత్తు పదార్థాల అక్రమరవాణా
– ఆరుగురి అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె నగరంలో రెండు వేర్వేరు ఘటనల్లో మత్తు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె తిరువొత్తియూరు ప్రాంతంలో గంజాయి తరలిస్తున్నట్లు ప్రత్యేక బృందం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో గోమాత నగర్లో గుర్తుతెలియని యువకులు చేతిలో సంచిని పట్టుకుని నడిచి వెళుతున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. వారి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా అందులో గంజాయి ఉండడాన్ని గుర్తించారు. విచారణలో వారు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కరూర్ జిల్లా కృష్ణ రాయపురం ప్రాంతానికి చెందిన ప్రభు (26), పులియూరు ప్రాంతానికి చెందిన హరీష్ (26), కోవై జిల్లాకు చెందిన 17 సంవత్సరాల బాలుడు అని తెలిసింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇన్స్పెక్టర్ రజనీస్ కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే విరుగంబాక్కం ప్రాంతంలో కొరియర్లో మత్తు పదార్థాలులను దిగుమతి చేసుకున్న ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విరుగంబాక్కం ప్రాంతంలో మసీదు వీధికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అన్బుగిరి (36)కి కొరియర్లో బెంగళూరు నుంచి పార్శిల్ వచ్చింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని, తనిఖీ చేశారు. జీన్స్ ప్యాంట్ పార్శిల్లో హైగ్రేడ్ డ్రగ్ శ్రీమెథాంఫెటమైన్ఙ్ దాచి ఉండగా గుర్తించారు. అన్బుగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 4 గ్రాముల మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అన్బుగిరి డ్రగ్స్‌ను పార్శిళ్ల ద్వారా కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అలాగే చైన్నె ఐనావరం ప్రాంతంలో ఎంటీఎంఏ అనే మత్తుమాత్రలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో తీవ్రంగా నిఘా వేశారు. ఆ సమయంలో సందేహాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తనిఖీలో వారి వద్ద ఖరీదైన గంజాయి 30 గ్రాములు, ఎంటీఎంఏ అనే మత్తుమాత్రలు 167 ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పాడి అభయ్ అవ్వై నగర్ ప్రాంతానికి చెందిన రాజేష్ (36), కొరటూరు కండ్రిగ నగర్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ (38) అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
శ్రీ చందన గోపాలకృష్ణాలయం కూల్చివేతకు యత్నం
● స్థానికులు అడ్డగింత ● తాత్కాలికంగా నిలిపివేత ● భక్తులపై పోలీసుల లాఠీచార్జి.. తోపులాట ● స్థానికుల రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయంతిరువళ్లూరు: పుల్లరంబాక్కంలోని శ్రీ చందన గోపాల కృష్ణాలయం కూల్చివేతకు అధికారులు యత్నించారు. అయితే వారి చర్యను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రుక్ష్మిణీ సత్యభామ సమేత శ్రీ చందన గోపాలకృష్ణ శ్రీ సంతాన వినాయకుడి ఆలయం ఉంది. ఆలయానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన వనిత శ్రీధరన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆమె ఆలయానికి వెనుక భాగంలో బాత్రూమ్, టాయ్‌లెట్ నిర్మించారు. అయితే ఆలయానికి వెనుక భాగంలో బాత్రూమ్, టాయ్లెట్లు ఉండడంతో స్థానికులు అధికారులకు రెండేళ్ల కిందట ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు వనిత శ్రీధరన్ నిర్మించిన బాత్రూమ్ ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఉండడంతో దాన్ని తొలగించారు. తన ఇంటికి సమీపంలో నిర్మించిన బాత్రూమ్ను స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు తొలగించడంతో గ్రామస్తులపై కోపంతో బాధితురాలు వనిత శ్రీధరన్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటికి సమీపంలో గోపాల కృష్ణుడి ఆలయం ఉందని, రోడ్డును ఆక్రమించి ఆలయాన్ని నిర్మించారని కోర్టులో పిటిషన్ వేశారు. నడిరోడ్డులో ఆలయం ఉండడం వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని కోర్టుకు నివేదించారు. మహిళ వేసిన పిటిషన్ విచారణ దాదాపు రెండేళ్ల నుంచి విచారణ సాగిన క్రమంలో నడిరోడ్డులో ఉన్న ఆలయాన్ని తొలగించాలని రెవెన్యూ అఽధికారులను కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితురాలు మళ్లీ అప్పీల్ చేశారు. దీంతో కోర్టు సీరియస్‌గా జోక్యం చేసుకుని వారం రోజుల్లో ఆలయాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తహసీల్దార్ వాసుదేవన్ ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉండడంతో డీఎస్పీ తమిళరసి, లోకేశ్వరన్ తదితరుల నేతృత్వంలో భారీగా బందోబస్తును మోహరించి, జేసీబీతో ఆలయాన్ని కూల్చివేయడానికి యత్నించారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని ఆలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. జేసీబీపై రాళ్లు రువ్వి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆలయాన్ని కూల్చివేయవద్దని కోరుతూ రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, గ్రామస్తులను చెదరగొట్టి ఆలయానికి రెండు వైపులా వున్న ప్రహరీగోడను కూల్చివేశారు. అయితే స్థానికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆలయాన్ని కూల్చివేసే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. -
సమస్యలు చిన్నవే.. సర్దుకుపోదాం
– మాజీ మంత్రి రమణ తిరువళ్లూరు: పార్టీలో నేతల మధ్య ఉన్న సమస్యలు చిన్నవేనని, వాటిని సర్దుకుని ఎన్నికల్లో విజయం సాధించడానికి కార్యకర్తలు, నేతలు ముందుకు రావాలని అన్నాడీఎంకే జిల్లా కన్వీనర్ మాజీ మంత్రి రమణ పిలుపునిచ్చారు. తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే నేతలు కార్యకర్తల ప్రత్యేక సమావేశం జరిగింది. కార్యక్రమానికి నగర అధ్యక్షుడు కందస్వామి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జిల్లా కన్వీనర్ రమణ హాజరై ప్రసంగించారు. అన్నాడీఎంకేలో పార్టీ నేతలు కార్యకర్తల మధ్య చిన్నచిన్న సమస్యలు మనస్పర్థలు ఉన్నాయి. వీటిని గుర్తించి సర్దుకుపోతే వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం పెద్దగా కష్టం కాదన్నారు. పార్టీ నిరుపేదల కోసం గతంలో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు ఇటీవల డీఎంకే పెంచిన బస్‌చార్జీలు, విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నుతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఎన్నికల పరిశీలకుడు ఎస్ఆర్ విజయకుమార్, పార్టీ నేతలు తుకారామ్, త్యాగు, బాలజీ, రామ్‌కుమార్, జ్యోతి, సుమిత్రవెంకటేషన్ తదితరులు పాల్గొన్నారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
–ఒకదానికొకటి రాసుకున్న బస్సులు –ప్రయాణికులు సురక్షితం తిరుత్తణి: పట్టణ శివారులో గురువారం మధ్యాహ్నం ఆంధ్ర ఆర్టీసీ, ప్రైవేటు బస్సు రాసుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుత్తణి నుంచి గురువారం మధ్యాహ్నం ప్రైవేటు బస్సు కాంచీపురం నగరానికి బయలుదేరింది. ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో కాంచీపురం నుంచి తిరుపతికి వెళ్లే ఆర్టీసీ బస్సు తిరుత్తణి సమీపంలోని వళ్లియమ్మపురం వద్ద వస్తుండగా అరక్కోణం హైవేలో రోడ్డు పనుల కోసం ఒన్‌వేగా రోడ్డును మార్చారు. ఆ ప్రాంతంలో వేగంగా వచ్చిన రెండు బస్సులు ఒన్‌వేలో చిక్కుకుని రాసుకున్నాయి. రెండు బస్సుల అద్దాలు పగలడంతో ప్రయాణికులు ఆందోళన చెందిన బస్సు నుంచి సురక్షితంగా గాయాలు కాకుండా దిగారు. వెంటనే పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని రోడ్డులో చిక్కుకున్న బస్సులను తొలగించి, ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. తిరుత్తణి పోలీసులు ప్రమాదం పట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మాహుతి సాక్షి, చైన్నె: చైన్నె అశోక్‌నగర్‌లో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె శోక్నగర్ 3వ అవెన్యులో ప్రభుత్వ మహోన్నత పాఠశాల, క్రీడాకారులకు హాస్టల్ భవనం ఉంది. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో మంటల్లో కాలుతూ ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆపాఠశాల ప్రవేశమార్గం వద్ద కుప్పకూలాడు. ఈ దృశ్యాన్ని చూసిన హాస్టల్లోని క్రీడాకారులు రక్షించే ప్రయత్నంచేసినా ఫలితం శూన్యం. అప్పటికే అతడు పూర్తిగా కాలిపోయాడు. సమాచారం అందుకున్న అశోక్‌నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుంది. పూర్తిగా యువకుడి శరీరం ఆహుతి అయింది. సంఘటన స్థలంలోనే అతడు మృతిచెందాడు. ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, పాఠశాలకు సమీపంలో ఆ యువకుడు పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్న దృశ్యాలు బయటపడ్డాయి. మంటల్లో కాలుతూ ఆ యువకుడు పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయ త్నించి, చివరకు మంటల తీవ్రతతో కుప్పకూలడం వెలుగుచూసింది. శరీరం గుర్తుపట్టనంతగా కాలిపోవడంతో ఆ యువకుడి ఆచూకీ కనిపిపెట్టడం పోలీసులకు శ్రమగా మారింది. అదే సమయంలో ఆయువకుడు ఎందుకు ఆత్మా హతి చేసుకున్నాడు, పాఠశాలలోకి ప్రవేశించే ప్రయత్నం ఎందుకు చేశాడు, అక్కడ ఎవరైనా అతడికి కావాల్సిన వాళ్లు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
వేగంగా అద్దాల వంతెన పనులు
సాక్షి, చైన్నె: త్రివేణి సంగమ క్షేత్రంలో అద్దాల వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో పదిహేను రోజుల్లో పనులు ముగించే విధంగా సీఎం స్టాలిన్ ఆదేశించారు. బంగాళాఖాతం, హిందూ, అరేబియా మహాసముద్రాల త్రివేణి సంగమంతో పర్యాటకంగా బాసిళ్లుతున్న క్షేత్రం కన్యాకుమారి. సూ ర్యోదయం, సూర్యాస్తమయాన్ని తన్మయత్వంతో తి లకించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశం కూడా. ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో సముద్రం మధ్యలో నల్ల చలువరాతితో వివేకానందరాక్ స్మా రక మందిరం ఉంది. ఇక్కడికి కూతవేటు దూరంలో పరమశివుడ్ని పరిణయం ఆడేందుకు పార్వతి దేవి తపస్సు చేసినట్టు చాటే శిలారూపంలోని ఆమె పాదముద్రలను వీక్షించొచ్చు. ఇక తమిళుల మహా కవి తిరువళ్లువర్ 133 అడుగుల నిలువెత్తు విగ్రహం ఇక్కడే కొలువుదీరి ఉంది. దక్షిణాసియాలోని ఎత్తైన విగ్రహాల జాబితాలో ఇది కూడా ఒకటి. వీటిని వీక్షించాలంటే పడవలో పయనించాల్సిందే. అలాగే, ఆధ్యాత్మికతకు నెలవుగా భగవతి అమ్మన్ ఇక్కడ ప్రసిద్ధి చెంది ఉంది. అద్దాల వంతెన స్వామి వివేకానంద ధ్యానం చేసిన రాక్ వద్దకు ఒడ్డు నుంచి పూంబుహార్ పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్లీ పడవలో తిరువళ్లువర్ 133 అడుగుల విగ్రహం వద్దకు పర్యాటకులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, అలల తాకిడి కారణంగా తరచూ తిరువళ్లువర్ విగ్రహం వద్దకు వెళ్ల లేని పరిస్థితి. వివేకా నందరాక్ నుంచి తిరువళ్లువర్ విగ్రహం వరకు అద్దాలతో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.37కోట్లతో 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ వంతెన రూపుదిద్దుకుంటోంది. పనుల న్నీ ముగింపు దశకు చేరాయి. మరో పదిహేను రోజుల్లో అన్ని పనులు ముగించే విధంగా అధికారులను సీఎం ఆదేశించారు. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీల్లో జరిగే తిరువళ్లువర్ విగ్రహం సిల్వర్ జూబ్లీ వేడుక రోజున ఈ అద్దాల వంతెన ప్రారంభోత్సవానికి నిర్ణయించారు. -
పిల్లలకు ఆడుకునే స్వేచ్ఛను ఇవ్వాలి
తిరువళ్లూరు: పిల్లలకు ఆడుకునే స్వేచ్ఛను ఇవ్వాలని, వారు చేసే పనుల్లో మంచిచెడును వివరించి చెప్పాలని చిన్నపిల్లల విభాగం ప్రభుత్వ వైద్యశాల హెచ్ఓడీ డాక్టర్ శ్రీదేవి సూచించారు. తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చిల్డ్రన్స్‌డే వేడుకలను గురువారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమానికి సేవాలయ ట్రస్టీ అమిత్చంద్జైన్ అధ్యక్షత వహించగా వైద్యశాల చిన్నపిల్లల వైద్యవిభాగం హెచ్ఓడీ డాక్టర్ శ్రీదేవీ హాజరై ప్రసంగించారు. చిన్నపిల్లలను నిర్బంధంలో వుంచకూడదన్నారు. వారి ఇష్ట్రపకారం ఆడుకునే స్వేచ్ఛను కల్పించడంతో పాటు సెల్‌ఫోన్‌కు దూరంగా వుంచాలన్నారు. పిల్లలు ఆడుకోవడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుదల వుంటుందన్న ఆమె, ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వడానికి యత్నించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలోని చిన్నపిల్లల వార్డును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి గోడలపై బొమ్మలు, కార్టూన్స్‌ను సేవాలయ సహకారంతో వేశామని వివరించారు. రెండు వందల మంది చిన్నారులకు బ్రెడ్, పండ్లు, బిస్కెట్లను అందజేశారు. సేవాలయ వైస్ ప్రెసిడెంట్ కింగ్స్టన్, వ్యాపారవేత్తలు సంతోష్‌జైన్, అశోక్‌కుమార్‌జైన్ పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని యువతి దుర్మరణం
సేలం: బస్సు ఢీకొని యువతి దుర్మణం చెందిన సంఘటన నెల్లైలో జరిగింది. ఈ ప్రమాద ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెల్లై రామైయ్యన్పట్టి సమీపంలో ఉన్న వెంప్పంకుళం ప్రాంతానికి చెందిన పాల్దురై కార్మికుడిగా జీవిస్తున్నాడు. ఇతనికి భార్య ఎస్తెర్ మేరి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మూడో కుమార్తె సెల్వం (19) పాలయంకోట్టై పెరుమాల్పురంలో ఉన్న కళాశాలలో చదువుతోంది. రెండో కుమార్తె సుదర్శనా నెల్లై టౌన్లో ఉన్న కార్పొరేషన్ బాలికల మహోన్నత పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చెల్లెలు సుదర్శనను పాఠశాలకు పంపించడం కోసం రామయ్యన్పట్టి శివాజీ నగర్ బస్టాండ్‌లో టౌన్ బస్సులో సుదర్శనను ఎక్కించింది. బస్సు అక్కడే నిలబడి ఉండగా, బస్సులో ఉన్న చెల్లెలు కళ్ల ఎదుటే బైక్‌లో రోడ్డు దాటుతున్న సెల్వంను నెల్లై వైపుగా వేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొంది. దీంతో బస్సు ముందు వైపు చక్రం కింద బైకు చిక్కుకుంది. దీంతో సెల్వం తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటే సంఘటనా స్థలానికి చేరుకుని సెల్వం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నెల్లై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కేసుల వివరాలను దాఖలు చేయండి
– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కొరుక్కుపేట: చైన్నెలో గత పదేళ్లలో కాలేజీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణల ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చైన్నెలోని ఓ కాలేజీ విద్యార్థిపై అక్టోబర్ 4వ తేదీన చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో పచైయప్పన్ కాలేజీ విద్యార్థులు దాడి చేశారు. విద్యార్థి సుందర్ అక్టోబర్ 9వ తేదీన మరణించాడు. తదనంతరం, పచైయప్పన్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బె యిల్ ఇవ్వాలని విద్యార్థుల బిల్లుపై హాజరైన న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో జైలులో ఉన్న విద్యార్థుల గురించి మాత్రమే పట్టించుకునే నీతి, చనిపోయిన విద్యార్థి కుటుంబం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. -
డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి
చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్‌పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున్న ప్రేమే.. నా కుమారుడితో ఇంత పనిచేయించింది. వాడి తప్పేమీ లేదు. నాకు క్యాన్సర్ ఉంది. కీమో థెరఫీ అవసరం లేదని డాక్టర్ బాలాజీ చెప్పి వెళ్లిపోయారు. నేను ఆయనకు ఏమైనా శత్రువునా? అని ప్రశ్నించారు.చెన్నైలో కలకలం రేపిన ప్రభుత్వ వైద్యుడిపై దాడి ఘటనలో నిందితుడి తల్లి మీడియాతో మాట్లాడారు. నాకు క్యాన్సర్ స్టేజ్ 5లో ఉంటే గిండి కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పారు. అలా ఎలా చెబుతారు? ఆర్థిక ఇబ్బందుల కారణంగా అడయార్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకో లేకపోయాను. ఈ (కలైజ్ఞర్ సెంటినరీ) ఆస్పత్రికి వస్తే క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీ నాకు మరో కీమోథెరపీ అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఆయనకు శత్రువునా? అని ప్రశ్నిస్తూ.. డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్య గురించి చెబుతుంటే డాక్టర్ బాలాజీ నావైపు చూసేందుకు ఇష్టపడలేదు. నాపై ఉన్న ప్రేమ విఘ్నేష్‌తో ఇంత పనిచేయించింది. విఘ్నేష్ హార్ట్ పేషెంట్. మూర్ఛతో బాధపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. Prof.Balaji Jagannathan, Professor & HOD, Medical Oncology, Govt Kalaignar Hospital, #Chennai, stabbed by 7 times by criminal from Peringalathur, whose mother ws being Rx fr stage 4 lung #Cancer at this hospital.Prof Balaji is very, very serious now. 🙏. #MedTwitter #medX pic.twitter.com/eG2uN3mKqp— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 13, 2024 ఏం జరిగిందంటే?చెన్నై గిండిలోని కలైజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న క్యాన్సర్ విభాగ వైద్యుడు బాలాజీపై చెన్నై పెరుంగళత్తూర్కు చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ కత్తితో దాడి చేశాడు. దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న తన తల్లికి డాక్టర్ బాలజీ సరైన వైద్యం అందిచం లేదనే ఆవేదనతో దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై డాక్టర్ బాలాజీని అడిగానని, వైద్య ఖర్చులు ఇవ్వాలని అడిగితే తనను కిందకి నెట్టివేశాడని, దీంతో కత్తితో దాడిచేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం వైద్యుడిపై దాడి ఘటన సంచలనంగా మారింది.