Tamil Nadu
-
పన్నీరు సోదరుడు రాజకు విముక్తి
● పూజారి మరణం కేసులో విడుదల సాక్షి, చైన్నె: మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ రాజకు పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసు నుంచి విముక్తి కలిగింది. రాజతో పాటుగా ఏడుగురిని విడుదల చేస్తూ దిండుగల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. ఓ పన్నీరు సెల్వం సీఎంగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు, పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్ ఓ రాజ సాగించిన వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను అన్నాడీఎంకే అధిష్టానం అప్పట్లో తీవ్రంగానే పరిగణించింది. అదే సమయంలో కై లాసనాథ ఆలయం పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసులో రాజ ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణలతో ఆయనపై కన్నెర్ర చేశారు. సీబీసీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. గత కొన్నేళ్లుగా సాగుతూ వచ్చిన ఈ కేసు విచారణ ఇటీవల ముగిసింది. 196 పేజీల చార్జ్ షీట్‌లోని అంశాలు, 23 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. కాగా దీనిపై బుధవారం న్యాయమూర్తి మురళీధరన్ తీర్పు వెలువరించారు. ఓ రాజతో పాటు ఏడుగురిని ఈకేసు నుంచి విడుదల చేస్తూ తీర్పు వెలువరించారు. -
రూ. 190 కోట్లతో ఆలయాల అభివృద్ధి
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాల కల్పన దిశగా రూ.190.40 కోట్లతో 29 కొత్త ప్రాజెక్టులకు బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 42.75 కోట్లతో పూర్తి చేసిన 27 ప్రాజెక్టులను ప్రారంభించారు. అందరికీ అర్చకత్వంతో పాటు ఆలయాల అభివృద్ధి, కుంభాభిషేకాలు అంటూ చారిత్రక ప్రాజెక్టులపై రాష్ట్ర హిందూ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక సేవే కాదు, కొత్త విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు దేవదాయ శాఖలోని వ్యవహారాలన్ని కంప్యూటరీకరణ పనులు వేగవంతం చేశారు. ఈ పరిస్థితులలో హిందూ ధర్మాదాయ శాఖ ద్వారా 18 దేవాలయాలు, 4 కార్యాలయాలలో కొత్త ప్రాజెక్టులకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు మదురై జిల్లా అళగర్ ఆలయంలో రూ. 49.25 కోట్లతో అభివృద్ధి పనులకు నిర్ణయించారు. అలాగే తిరువణ్నామలై అరుణాచలేశ్వర ఆలయంలో రూ. 44.57 కోట్లతో సిబ్బందికి గృహాలు, అభివృద్ధి పనులు, కుబేర లింగం సమీపంలోని కమర్షియల్ కాంప్లెక్స్, కొత్తగా విద్యుదీకరణతో అలంకరణ పనులు, తండరాం పట్టు వనపురం మారియ్మన్ ఆలయంలో రూ. 5.63 కోట్లతో ఏడు తీర్థాల పునరుద్ధరణ, తిరువణ్ణామలైలో రూ.107 కోట్లతో కొత్త వివాహ వేదిక, తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయంలో రూ. 25.62 కోట్లతో అభివృద్ధి పనులు, నాగపట్నం జిల్లా తులసీయ పట్నంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో రూ. 18.95 కోట్లతో అభివృద్ధి పనులు, కోయంబత్తూరు జిల్లా మరుదమలై సుబ్రమణ్యస్వామి ఆలయంలో రూ. 6.90 కోట్లతో భక్తులకు సౌకార్యలు, కరుమత్తం పట్టి ఆలయంలో రూ. 2.29 కోట్లతో ఐదు అంచెల కొత్త రాజగోపురం నిర్మాణం, తిరుపూర్ జిల్లా, పెరుమానల్లూర్ కాళియమ్మన్ ఆలయంలో రూ. 5.40 కోట్లతో వివాహ వేదిక, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో రూ. 3.80 కోట్లతో తిరుపతి పాదయాత్రకు వెళ్లే భక్తుల కోసం వసతి గృహం నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈరోడ్ జిల్లా కొడుముడిలోని సడయప్పస్వామి ఆలయంలో రూ.3.80 కోట్లతో పనులు, పెరుందురై సర్కిల్, తంగమేడు, కలై జయన్ స్వామి ఆలయంలో రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో అన్నదాన కేంద్రం, చైన్నె ట్రిప్లికేన్ కబాలీశ్వర ఆలయంలో రూ. 2.35 కోట్లతో, నామక్కల్ జిల్లా వలపూర్నాడులోని అరపలీశ్వర స్వామి ఆలయంలో రూ. 210 కోట్లు. పళణియాండవర్ ఆలయంలో రూ. 1.35 కోట్లతో అంటూ మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు మొత్తం రూ. 190.4 కోట్ల తో 29 ప్రాజెక్టులకు వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవాలు.. కోయంబత్తూరు మరుద మలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రూ. 4.39 కోట్లతో, మేట్టుపాళయం వన భద్రకాళియమ్మన్ ఆలయంలో రూ. 1.79 కోట్లతో, నాగపట్నంనవనీదేశ్వర స్వామి ఆలయంలో రూ.1.07 కోట్లతో, సమయపురంలో రూ. 4.63 కోట్లతో, మైలాడుతురై శివలోకనాథ ఆలయంలో రూ. 3.20 కోట్లతో అంటూ మొత్తంగా 15 దేవాలయాలు, 2 కార్యాలయాల్లో పూర్తి చేసిన 25 ప్రాజెక్టులను సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, హిందూ, ధర్మాదాయ శాఖ కార్యదర్శి చంద్రమోహన్, అధికారులు శ్రీధర్, సుకుమార్, పెరియస్వామి, జయరామన్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల కుటుంబానికి నిధులు తమిళనాడు న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి 10 మంది న్యాయవాదుల కుటుంబాల రూ. కోటి నిధులను సీఎం స్టాలిన్ అందజేశారు. ఈ మొత్తాలను న్యాయవాదుల వారసులకు ఆర్థిక సాయంగా అందజేశారు. తమిళనాడు, పుదుచ్చేరి అడ్వకేట్స్ గ్రూప్ ద్వారా నిర్వహిస్తున్న తమిళనాడు న్యాయవాదుల సంక్షేమ నిధికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధి నుంచి మరణించిన న్యాయవాదుల వారసులు 10 మందికి తలా రూ. 10 లక్షలను అందజేశారు. అలాగే ఇది వరకు ఈ నిధికి ఇస్తున్న రూ. 8 కోట్లను తాజాగా రూ.10 కోట్లకు పెంచుతూ సీఎం నిర్ణయించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్. రఘుపతి, ఎంపీ విల్సన్, సీఎస్ మురుగానందం, హోంశాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్, లీగల్ సెక్రటరీఎస్. జార్జ్ అలెగ్జాండర్, తమిళనాడు, పుదుచ్చేరి న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు బి.ఎస్. అమల్‌రాజ్, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎస్. ప్రభాకరన్, చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.ఎస్. రామన్, తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ డిప్యూటీ ఛైర్మన్ వి. కార్తికేయ , సీనియర్ న్యాయవాదులు అరుణాచలం, మోహన కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పోషకాహారం నిర్ధారణ లక్ష్యంగా కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం నిర్ణయించింది. అరియలూరులో రూ. 22 కోట్లతో పోషకాహార లోపంతో బాధ పడుతున్న పిల్లల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దీనిని శుక్రవారం సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. పనులకు శంకుస్థాపన సీఎం స్టాలిన్ రూ. 27 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం -
వైద్యుడిపై కత్తితో దాడి!
● ప్రభుత్వాస్పత్రిలో యువకుడి వీరంగం ● తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ అమానుషం ● విధులు బహిష్కరించిన డాక్టర్లు ● రాష్ట్రవ్యాప్తంగా ఆగిన వైద్య సేవలు ● వైద్య సంఘాలతో డిప్యూటీ సీఎం, మంత్రుల చర్చ సాక్షి, చైన్నె: క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి ఆరు నెలలగా సరైన వైద్యం అందించ లేదంటూ బుధవారం ప్రభుత్వ వైద్యుడిని చైన్నెలో ఓ యువకుడు విచక్షణా రహితంగా పొడిచేశాడు. ఏడు చోట్ల కత్తి గాయాలతో ఆ వైద్యుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యులలో ఆగ్రహం నెలకొంది. అత్యవసర సేవల మినహా తక్కిన వైద్య సేవలను బహిష్కరిస్తూ ఆందోళన బాట పట్టారు. వివరాలు.. చైన్నె గిండిలో దివంగత డీఎంకే అధినేత కరుణానిధి శత జయంతి స్మారక మల్టీ సూపర్ సెషాలిటీ ఆస్పత్రిలోని క్యాన్సర్ విభాగంలో వైద్యుడిగా బాలాజీ జగన్నాథన్ పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆస్పత్రిలోని ఆయన చాంబర్లోకి ప్రవేశించిన యువకుడు లోపల గడియ పెట్టేసుకుని ఆయనపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. లోపల ఆయన పెడుతున్న కేకలతో బయట ఉత్కంఠ నెలకొంది. గొంతు, చాతి తదితర ఏడు చోట్ల విచక్షణా రహితంగా కత్తితో పొడిచి పడేసి ఉడాయించే ప్రయత్నం చేసిన ఆ యువకుడిని అక్కడున్న వారు పట్టుకుని గిండి పోలీసులకు అతడిని అప్పగించారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలాజీకి అదే ఆస్పత్రిలో తీవ్ర చికిత్సను అందించారు. వైద్యులలో పెల్లుబికిన ఆగ్రహం.. వైద్యుడిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడి చేసిన సమాచారం రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లలో ఆగ్రహాన్ని రేపింది. తక్షణం ఓపీ సేవలను వైద్యులు బహిష్కరించారు. అలాగే, వార్డులలో చికిత్సలలో ఉన్న వారికి సైతం సేవలు ఆగాయి. జూనియర్లకు శిక్షణ కార్యక్రమాలను నిలుపుదల చేశారు. అత్యవసర విభాగం సేవలు తప్ప, మిగిలిన అన్ని సేవలను ఆపేసి ఆందోళన బాట పట్టారు. తమకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని నినదించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అవస్థలు తప్పలేదు. విధుల బహిష్కరణతో సమ్మెబాట పట్టినట్టుగా వైద్య సంఘాలు ప్రకటించాయి. డిప్యూటీ సీఎం పరామర్శ దాడి సమాచారంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్వానంగా మారాయని, వైద్యులకే భద్రత కరువైందంటూ ప్రతిపక్షాలు అధికార పక్షంపై దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్, బీజేపీ నేత తమిళిసై సౌందరాజన్, పీఎంకే నేత అన్బుమణి రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తదితరులు ఈ దాడిని ఖండించారు. ప్రభుత్వం వైద్యులకు భద్రత కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. అదే సమయంలో సీఎం స్టాలిన్ కూడా దాడిని ఖండించారు. ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇక డిప్యూటీ సీఎం ఉదయనిధి, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని వైద్యుడు బాలాజీని పరామర్శించారు. మెరుగైన చికిత్సలకు ఆదేశించారు. ఈసందర్భంగా వైద్యులు డిప్యూటీ సీఎం ఉదయనిధి వాహనాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు. భద్రత కల్పించాలని నినదించారు. దీంతో వైద్య సంఘాలను బుజ్జగించే విధంగా చర్చలలో మంత్రి ఎం. సుబ్రమణియన్ నిమగ్నమయ్యారు. వైద్యం అందించ లేదన్న ఆగ్రహంతోనే.. దాడి చేసిన యువకుడిని చైన్నె శివారులోని పెరుంగళత్తూరుకు చెందిన విఘ్నేష్‌గా పోలీసులు గుర్తించారు. ఇందులో అతడి తల్లి ప్రేమ క్యాన్సర్‌తో బాధ పడుతూ ఉన్నట్టు తేలింది. ఆమెకు గత ఆరు నెలలుగా డాక్టర్ బాలాజీ వైద్యం చేసినట్టు, అయితే, సరైన వైద్యం అందించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలాజీ తీరును విఘ్నేష్ తీవ్రంగా పరిగణించినట్టు విచారణలో వెలుగు చూసింది. ఆరు నెలలుగా తన తల్లికి సరైన వైద్యం అందించక పోవడంతో చివరకు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి కిమో థెరఫీ అందిస్తూ వచ్చినట్టు గుర్తించారు. అదే సమయంలో కిమో థెరఫీ విషయంగా బాలాజీకి ఇది వరకు తాను నగదు ఇచ్చినట్టు ఆ మొత్తం ఇవ్వాలని నిలదీయగా, తన మీద దాడి చేశాడని, అందుకే తన వద్ద ఉన్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచేసినట్లు విఘ్నేష్ ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై 5 సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేగినా, ప్రభుత్వ వైద్యులు మాత్రం తీవ్రంగా పరిగణించి ఆందోళనకు దిగారు. -
చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం
సాక్షి, చైన్నె : రాజధాని నగరం చైన్నెలోని కోయంబేడు వద్ద అతిపెద్ద మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడికి రోజూ వందలాది వాహనాల్లో సరకులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. ఇక్కడి నుంచి చిల్లర వర్తకులు, కిరాణ దుకాణదారులు వస్తువులు, కూరగాయలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. వ్యాపారులకే కాదు, నగర, శివారుల్లోని ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన అన్ని రకాల వస్తువుల్ని కొంటుంటారు. ఇక్కడ చిరు వర్తకుల సంఖ్య భారీగా ఉంటుంది. టోకు వర్తకుల నుంచి పండ్లు , కూరగాయలు వంటి వాటిని వీరు కొనుగోలు చేసి ఆ పరిసరాలలో విక్రయిస్తున్నారు. వీరంతా రోజు వారి తమ వ్యాపారం కోసం కంతు వడ్డీ, స్పీడ్వడ్డీ ఇచ్చే వారిని ఆశ్రయించాల్సి ఉండేది. కొందరు అయితే, ఉదయం అప్పు తీసుకుని , రాత్రి సమయంలో ఒక రోజువడ్డీతో తిరిగి చెల్లిస్తుంటారు. అధిక వడ్డీల కారణంగా చిరు వర్తకులకు మిగిలేది కన్నీళ్లు, గతంలో కంతు వడ్డీదారుల వేధింపులు భరించలేక చిరు వర్తకులు బలవన్మరణాలకు సైతం పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక నష్టాలు, కష్టాల బారిన పడే మరెందరో రాత్రికి రాత్రే చెప్పపెట్టకుండా మకాం మార్చేసి ఏమయ్యారో అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. టాడ్కో అప్పన్న హస్తం.. తమిళనాడులో ఆది ద్రావిడర్లకు గృహ నిర్మాణాలు లక్ష్యంగా ఏర్పాటైన టాడ్కో ప్రస్తుతం చిరు వర్తకులకు ఆపన్నహస్తం అందిస్తోంది. గత ఏడాది చైన్నె కోయంబేడులో టాడ్కో ద్వారా ప్రయోగాత్మకంగా రుణ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిరు వర్తకులకు ఈ రుణాలను అందజేశారు. వీరు టోకు వర్తకుల నుంచి వస్తువులను కొనుగోలు చేసి ఆ పరిసరాలలో, తోపుడు బండ్లు లేదా రోడ్డు పక్కగా పుట్‌ఫాత్ తదితర ప్రాంతాలలో చిరు వర్తకంతో పండ్లు, పువ్వులు, కూరగాయలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ విభాగం తరపున 4 శాతం, టాడ్కో ద్వారా 2.5 శాతం అంటూ మొత్తంగా 6.5 శాతం వడ్డీతో రూ. 1.25 లక్షల చొప్పున ఒక్కో చిరు వర్తకుడికి అంటూ మొత్తంగా 46 మందికి తొలి విడతలో అందజేశారు. రెండవ విడతగా 69 మంది, మూడవ విడతగా 74 మంది అంటూ ఇప్పటి వరకు 250 మంది చిరు వర్తకులకు రుణాలను టాడ్కో అందజేసింది. చైన్నెలో రుణ ప్రయోగం విజయవంతం కావడంతో చిరు వర్తకులకు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పవచ్చు. కష్టాలతో రాత్రికి రాత్రే మకాం మార్చే వాళ్లూ ప్రస్తుతం లేరు. ఈ రుణం చెల్లింపునకు మూడేళ్ల కాల పరిమితి ఉన్నా, త్వరితగతిన చెల్లించి మళ్లీ రుణాలు తీసుకునే చిరు వర్తకులు అధికంగానే ఉన్నారు. చిరు వర్తకుల సంక్షేమమే ధ్యేయంగా తమిళనాడు ఆదిద్రావిడర్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టాడ్కో–టీఏహెచ్డీసీఓ) రుణ సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీతో రుణాలు భారీ ఎత్తున అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మదురై, తిరుచ్చి వంటి నగరాలలోని అతిపెద్ద మార్కెట్లలోని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిరు వర్తకులకు రుణాలను అందించనుంది. కాగా ప్రస్తుతం చైన్నెలో అమలులో ఉన్న ఈ రుణ పథకాన్ని కేంద్రం సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రుణసాయంతో ఆపన్నహస్తం మరింత విస్తృతం కానున్న టాడ్కో సేవలు మదురై, తిరుచ్చి తదితర మార్కెట్ ప్రాంతాలకు విస్తరణ విస్తరణకు నిర్ణయం.. కోయంబేడులో విజయవంతంగా సాగుతున్న టాడ్కో రుణ సేవను మదురైలోని మాట్టుథావని మార్కెట్, దిండుగల్ ఒట్టన్ చత్రం మార్కెట్, తిరుచ్చి తదితర జిల్లాలోని అతి పెద్ద మార్కెట్లలోని చిరు వర్తలకు ఆపన్నహస్తం అందించేందుకు టాడ్కో వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ రుణ సేవను విస్తృతం చేయడానికి కార్యాచరణ రూపకల్పన చేశారు. మలి విడతగా తొలుత మదురై మార్కెట్, తదుపరి నెలల వ్యవధిలో అన్ని మార్కెట్లలోని చిరు వర్తలకు ముఖాలలో చిరునవ్వులు లక్ష్యంగా, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం రుణాలను విస్తృతంగా అందించబోతున్నారు. రూ. 100 కోట్ల రుణాల పంపిణీ దిశగా టాడ్కో వర్గాలు కసరత్తులు చేసి ఉన్నాయి. టాడ్కో ద్వారా లేదా జైభీం కార్మి, చిరు వర్తక సంఘాలలో సభ్యులుగా చేరే ఎస్సీ, ఎస్టీలు ఈ రుణం పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. 18 సంవత్సరాలు పైబడిన చిరు వర్తకులకు ఈ రుణాలను విస్తృతంగా, త్వరితగతిన అందించేందుకు తగిన ప్రణాళికతో టాడ్కో వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో తమిళానాడులో ప్రయోగాత్మకంగా కోయంబేడులో అమలు చేసిన ఈ రుణ సేవ విజయవంతంపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టి పెట్టడం విశేషం. కేంద్ర బృందం ప్రతినిధులు దీనిపై అధ్యయనం చేసి వెళ్లి ఉన్నారు. టాడ్కో వర్గాలు పేర్కొంటూ ఆదిద్రావిడర్ సామాజిక వర్గానికి గృహాల కేటాయింపు, నిధుల సమీకరణ మీద తొలినాళ్లలో దృష్టి పెట్టిన, తాము ప్రస్తుతం చిరు వర్తకుల జీవితాలలో చిరునవ్వు, ఆర్థిక పరిస్థితి మెరుగు దిశగా ప్రభుత్వ ఆదేశాలతో రుణ పంపిణీ విస్తృతం చేస్తున్నామని ప్రకటించారు. -
క్లుప్తంగా
క్రికెట్ ఆడుతూ జవాన్ మృతి తిరువొత్తియూరు: తేని జిల్లా కంభం సమీపంలో ఉన్న కన్నుడయన్ కాలని ప్రాంతానికి చెందిన పర మన్ కుమారుడు పాల్ పాండి (28) ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నారు. నెల రోజులకు సెలవు తీ సుకుని సొంత ఊరికి వచ్చారు. ఈ క్రమంలో సరదాగా తన స్నేహితులతో కలిసి మైదానంలో క్రికె ట్ ఆడుతూ గుండెపోటుకు గురై పడిపోయాడు. వెంటనే అతన్ని స్నేహితులు మోటార్ సైకిల్ పై కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ పాల్ పాండి మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడు వివాహం కోసం సంబంధాలు చేసేందుకు సెలవుపై ఇంటికి వచ్చినట్లు తెలిసింది. శిక్షణ పొందుతూ ఎస్ఐ.. తిరువళ్లూరు: ఆవడి కమిషనరేట్ కార్యాలయంలో స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచే స్తూ శిక్షణ తీసుకుంటున్న అధికారి స్పృ హతప్పి కిందపడగా వైద్యశాలకు తరలించే క్రమంలో మృతిచెందిన సంఘటన విషాదాన్ని నింపింది. వేలూరు జిల్లా జోలార్పేటకు చెందిన ప్రభాకరన్(53). ఇతను 1997వ సంవత్సరంలో పోలీసు శాఖలో సెకండరీ గ్రేడ్ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యారు. ఇతడికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈయన కుటుంబంతో కలసి పట్టాభిరామ్ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం వుంటున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్‌లో సీసీబీ విభాగంలో స్పెషల్ సబ్ ఇన్పెక్టర్గా ప్రభాకరన్(53) విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్పెషల్ సబ్‌ఇన్పెక్టర్ స్థాయి(ఎస్ఎస్ఐ) నుంచి రెగ్యులర్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది కమిషనరేట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం యథావిధిగా ఏడు గంటలకు శిక్షణకు హాజరైన క్రమంలో హఠాత్తుగా స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆవడి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దర్శనానికి వెళుతూ కానరాని లోకాలకు.. తిరువళ్లూరు: అమ్మవారి దర్శనానికి వెళుతూ స్ప్పహతప్పి కిందపడ్డ వృద్ధుడిని వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. చైన్నె మైలాపూర్‌కు చెందిన నరసింహన్ కుమారుడు జయగోపాల్(60). ఇతను కుటుంబసభ్యులతో కలసి పెద్దపాళ్యం భవాని అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్టు తెలిసింది. మంగళవారం రాత్రి స్థానికంగా వున్న లాడ్జీలో వుంటూ ఉదయం ఆలయానికి బయలుదేరారు. ఈక్రమంలో హఠాత్తుగా ఫిట్స్ రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు స్థానికంగా వున్న ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాతమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చైన్నె రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. అమ్మవా రి దర్శనం కోసం వచ్చిన వృద్ధుడు హఠాత్తుగా మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ట్రాక్టర్ బోల్తా: విద్యార్థి దుర్మరణం అన్నానగర్: ట్రాక్టర్ బోల్తా పడి ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కం పక్కనే ఉన్న ఎలప్పక్కం గ్రామంలో విద్యుత్ స్తంభాలను నాటడానికి అచ్చరపాక్కం విద్యుత్ బోర్డు కార్యాలయం నుంచి ఆరు విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్లో తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేందుకు అచ్చరపాక్కం ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న కట్టక్కరుణి ప్రాంతానికి చెందిన రోహిత్ (16), తిమ్మవరం ప్రాంతానికి చెందిన అభిషేక్ (16), కిషోర్‌కుమార్ (16) లిఫ్ట్ అడిగి ట్రాక్టర్ ఎక్కారు. ఆ కాలనీలో వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న పాఠశాల విద్యార్థులు అభి షేక్, రోహిత్, కిషోర్‌కుమార్, ట్రాక్టర్ డ్రైవర్ అశోక్ విద్యుత్ స్తంభాల మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అచ్చరపాక్కం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ అభిషేక్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ఖైదీల ఆత్మహత్యాయత్నం తిరువొత్తియూరు: పాళయం సెంట్రల్ జైలులో పా ళయం కృష్ణాపురానికి చెందిన ముత్తయ్య, కోవిల్ పట్టి ప్రాంతానికి చెందిన విగ్నేష్ విచారణ ఖైదీలు గా ఉన్నారు. వీరు బుధవారం సెంట్రల్ జైల్లో తమ చేతులను ఇనుప ముక్కతో కోసుకొని ఆత్మహత్య కు ప్రయత్నించారు. ఇది చూసిన అక్కడున్న వార్డన్లు వారిని సెంట్రల్ జైలులోని ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు వారికి చికిత్స అందిస్తున్నారు. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య అన్నానగర్: ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. చైన్నెలోని పురసైవాక్కం వెల్లాల వీధికి చెంది న చరణ్‌కుమార్ (32). ఇతని తండ్రి కుమార్, త ల్లి ఉషారాణి. ఐటీ ఉద్యోగి అయిన చరణ్‌కుమార్ ఆన్లైన్లో జూదం ఆడేందుకు ఆసక్తి చూపుతూ బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఈ నేపథ్యంలో బుధవారం చరణ్‌కుమార్ తండ్రి, తల్లి ఇ ద్దరూ వాణియంబాడి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న చరణ్‌కుమార్ తన స్నేహితురాలికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. షాక్ తిన్న స్నేహితురా లు వెంటనే చరణ్‌కుమార్ ఇంటికి వెళ్లింది. అక్కడ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న చరణ్‌కుమార్ మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. అనంతరం ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల విచారణలో చరణ్‌కుమార్ రూ.60 లక్షల వరకు అప్పులు తీసుకుని ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇందులో నష్టం ఏర్పడింది. చేసిన అప్పు తీర్చలేక మనస్తాపంతో చరణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. -
భక్తులకు వసతులు సిద్ధం చేయండి
● బ్రహ్మోత్సవాలకు 3,408 ప్రత్యేక బస్సులు ● వంద ప్రత్యేక వైద్యశిబిరాలు ● మంత్రులు ఏవావేలు, శేఖర్‌బాబు వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు 3,408 ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రులు ఏవావేలు, శేఖర్‌బాబు అధికారులను ఆదేశించారు. కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 4వ తేదీ నుంచి పదిరోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజు 13వ తేదీన మహాదీపోత్సవం జరగనుంది. ఉత్సవాలను తిలకించేందుకు 45 లక్షల మంది భక్తులు తిరువణ్ణామలై చేరుకోనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్లపై మంత్రులు ఏవా వేలు, శేఖర్‌బాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి ఏవావేలు మాట్లాడుతూ అన్ని వసతులు కల్పించడంతోపాటు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మాడ వీధుల్లో పది రోజులపాటు స్వామివారి వాహనాలు భక్తులకు దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో వెంటనే మాడ వీధుల్లోని మొత్తం ఆక్రమణలు తొలగించాలన్నారు. పట్టణంలో 24 ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేసి పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా వందచోట్ల వైద్య శిబిరాలు, అక్కడక్కడ అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎంపీ అన్నాదురై, ఎమ్మెల్యేలు గిరి, శరవణన్, కలెక్టర్ భాస్కరపాండియన్, ఎస్పీ సుధాకర్, దేవదాయశాఖ అదనపు కమిషనర్ సుకుమార్, దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ జీవానందం, ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు. -
దుకాణ యజమానిపై పీఎంకే నాయకుడు దాడి
తిరువొత్తియూరు: చైన్నె పల్లావరం సమీపంలో వాహనం పార్కింగ్ చేసే విషయంపై చోటు చేసుకున్న గొడవలో దుకాణ యజమానిపై దాడి చేసిన పీఎంకే నాయకుడు, అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పల్లావరం సమీపంలోని మొలిచాలూరు ప్రధాన రోడ్డులో చరణ్ రాజుఇంటికి అవసరమైన వస్తువులు విక్రయ దుకాణం నడుపుతున్నాడు . ఇతను అక్టోబర్ 29న తన దుకాణము తెరిచి వ్యాపారము చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మొలిచులూరు పంచాయతీ వార్డు సభ్యుడు, పీఎంకే నాయకుడు సురేష్ బైకును చరణ్ రాజు దుకాణం ముందు నిలిపాడు. బైకును పక్కకు పెట్టమని దుకాణం యజమాని కోరాడు. దీంతో చరణ్‌రాజ్‌కు సురేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత సురేష్ తన భార్య, బంధువులతో కలిసి దుకాణ యజమాని చరణ్ రాజుపై తీవ్రంగా దాడి చేశారు. ఇందులో గాయపడిన చరణ్ రాజ్ శంకర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు .దీని మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీ లో ఉన్న పిఎంకె ప్రముఖుడు సురేష్ అతని భార్య బంధువు బంధువును కోసం గాలిస్తూ గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం అదే ప్రాంతంలో సురేష్ ను అతని భార్య, బంధువు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వైద్య విద్యార్థి బలవన్మరణం
అన్నానగర్: పోరూరులోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో బుధవారం తెల్లవారుజామున వైద్య విద్యార్థి ఉరివేసుకుని మృతిచెందిన ఘటన సంచలనం సృష్టించింది. నామక్కల్ జిల్లా కుమారపాళయంకు చెందిన రిషికేశ్ (18). పోరూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో బుధవారం తెల్లవారుజామున కాలేజీ హాస్టల్ గదిలో రిషికేశ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోరూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో రిషికేశ్ మూడేళ్లుగా కుమారపాలైయానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. పోరూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరిన తన ప్రియురాలిని కలవలేకపోయానని మనస్తాపం చెందాడు. ప్రియురాలు ఇటీవల సెల్‌ఫోన్ మాట్లాడడం మానేసిందని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన రిషికేశ్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
జాతీయస్థాయి అవార్డు ప్రదానం
సాక్షి, చైన్నె: పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) జాతీయ అవార్డును చైన్నెకు చెందిన కెటలిస్టు పబ్లిక్ రిలేషన్స్ దక్కించుకుంది. ఈ వివరాలను బుధవారం స్థానికంగా ప్రకటించారు. పీఆర్సీఐ 14వ అవార్డుల ఉత్సవంలో డిజిటల్ పబ్లిిషింగ్ విభాగంలో కాంస్య పతకంతో జాతీయ అవార్డును కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి. కృష్ణ భట్, పీఆర్సీఐ వ్యవస్థాపకుడు ఎంబీ జయరామ్, అతిథులు గీతా శంకర్, మమత లాలా చేతుల మీదుగా కెటలిస్ట్ పబ్లిక్ రిలేషన్స్ కస్టమర్ సర్వీస్ విభాగం అధ్యక్షుడు పి. అమర్ నాథ్ అందుకున్నారు. -
అనాగరిక విమర్శలు వద్దు
● కేడర్‌కు విజయ్ సూచన ● చిన్నమ్మ కీలక వ్యాఖ్యలు సాక్షి, చైన్నె: అనాగరిక వ్యాఖ్యలతో ఎవ్వర్నీ విమర్శించ వద్దని కేడర్, నాయకులకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సూచించారు. ఈ మేరకు రాజకీయంగా నాగరిక అంశాలతో ఎలా విమర్శించాలో అన్న విషయంగా నాయకులకు శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. వివరాలు..విజయ్ను ఇటీవల కాలంగా నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్తోపాటు కొందరు తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్నారు. ఇది విజయ్ అభిమానులు, తమిళగ వెట్రి కళగం వర్గాలలో ఆగ్రహాన్ని రేపుతోంది. దీంతో పోస్టర్లతో వ్యాఖ్యల తూటాలు, ఎదురు దాడిచేస్తున్నారు. కొందరు అయితే, బహిరంగంగానే తమ మీద విమర్శలు చేస్తున్న వారిపై ఎదురు దాడి తో తూటాలను పేల్చుతున్నారు. ఇది కాస్త అనాగరికంగా మారుతుండటంతో విజయ్ అలర్ట్ అయ్యారు. నాగరిక రాజకీయం చేయడానికి వచ్చామని, ఆ దిశగానే ముందుకెళ్దామని నేతలకు సూచిస్తూ ఆయన లేఖ రాసి ఉన్నారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావిస్తూ అనాగరిక వ్యాఖ్యలు, విమర్శలు వద్దే వద్దు అని, రాజకీయం నాగరికంగా ఉండే విధంగా ముందుకెళ్దామని, అదే తమిళ వెట్రి కళగంకు బలాన్ని చేకూరుస్తుందని నేతలకు సూచించడం గమనార్హం.ఇ దిలా ఉండగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు ప్రజల మద్దతు తప్పకుండా కనిపిస్తుందని దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మశశికళ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ, నటుడు విజయ్‌కి ప్రజల మద్దతు 2026 ఎన్నికలలో కనిపిస్తుందని వ్యాఖ్యలు చేశారు. 2026 ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాజకీయాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎన్నికలు కీలకం పరిణామాలకు దారి తీస్తాయని అభిప్రాయపడ్డారు. -
ముగ్గురు రౌడీల అరెస్ట్
కొరుక్కుపేట: తాంబరం అటవీ ప్రాంతంలో తుపాకీ కల్గి ఉన్న ముగ్గురు రౌడీలను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. పేరు మోసిన రౌడీ లెనిన్, ఇతని అనుచరులు ఎరుమయూర్ సమీపంలోని ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తలదాచుకున్నట్టు డిప్యూటీ కమిషనర్‌కు చెందిన స్పెషల్ పోలీసు ఫోర్స్‌కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న స్పెషల్ స్క్వాడ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎరుమయూర్ అటవీ ప్రాంతంలోకి పోలీసు రావడం చూసి అక్కడ దాకున్న రౌడీ లెనిన్ సహా మగ్గురు వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని చుట్టుముట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మధువీరపట్టు ప్రాంతానికి చెందిన లెనిన్ (36)పై 27కిపైగా కేసులు ఉన్నాయి. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి వచారణ చేస్తున్నారు. అఘోరాపై లైంగిక వేధింపుల ఫిర్యాదు అన్నానగర్: చైన్నెకి చెందిన కలైయరసన్ అనే యువకుడు అఘోరాగా మారి జ్యోతిష్యం చెపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అఘోరి కలయరసన్పై అతని భార్య భాగ్యలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అఘోరి కలైయరసన్ నిధి, చేతబడి వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తేలింది. దీంతో ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. విద్యార్థినికి లైంగిక వేధింపులు –పూజారికి దేహశుద్ధి అన్నానగర్: కోయంబత్తూరులోని కన్నప్పనగర్లో కళాశాల విద్యార్థినిని లైంగికంగా వేధించిన పూజారిపై జిల్లా శిశు సంక్షేమ అధికారి విచారణ చేపట్టారు. కోయంబత్తూరులోని కన్నప్పనగర్కు చెందిన రమేష్ (47) పూజారి. గాంధీపురం ప్రాంతంలోని ధర్మాదాయ శాఖ ఆధీనంలోని ఓ ఆలయంలో గత 10 ఏళ్లుగా అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కన్నప్పనగర్లోని ముత్తుమారియమ్మన్ ఆలయంలో కూడా పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పిల్లలను పూజకు వెళ్లే ప్రాంతాలకు తీసుకెళ్లడం ఆనవాయితీ. రెండు రోజుల క్రితం గుడిలో పూజాకార్యక్రమం ఉందని చెప్పారు. కన్నప్పనగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినిని పూజకు తీసుకెళ్లాడు. అనంతరం అర్చకుడు విద్యార్థినిని ఆలయంలోని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. షాక్‌కు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక కుటుంసభ్యులు, స్థానికులు పూజారికి దేహశుద్ధి చేశారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 23 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,446 మంది స్వామివారిని దర్శించుకోగా 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
బలహీన పడ్డ ద్రోణి
● పలు జిల్లాల్లో వానలు ● పనులను పరిశీలించిన మంత్రి నెహ్రూ సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం మరింతగా బలహీన పడింది. అయినా, కొన్ని జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం చైన్నె, శివారులలో అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ ద్రోణి తమిళనాడు వైపుగా కదిలింది. దీంతో మరింతగా చైన్నె, శివారు జిల్లాలకు వర్షాలు ఎదురు చూడ వచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే, బుధవారం అక్కడక్కడా చిరు జల్లుల వర్షంకురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ ద్రోణి మరింతగా బలహీన పడినట్టు వాతావరణ కేంద్రం ప్రకటించినా, మరో మూడురోజులు వర్షాలు అనేక జిల్లాలో కొనసాగనున్నాయి. బుధవారం కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి తంజావూరు, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల భారీగానే వర్షం కురిసింది. సముద్రంలో అలల తాకిడి అధికంగా ఉండటంతో తీర వాసులను అప్రమత్తం చేశారు. గడిచిన 24 గంటలలో నాగపట్నం శీర్గాలిలో అత్యధికంగా 13 సెం.మీ వర్షంకురిసింది. తిరువారూర్‌లో వర్షం దాటికి 50 ఎకరాల వరి పంట నీటమునిగింది. మదురైలో అయితే వైగై నదీలో నీటి ఉధృతి పెరగడంతో తీర వాసులను అలర్ట్ చేశారు. అనేక చోట్ల నదీ జలాలు రోడ్లమీదకు రావడంతో అవస్థలు తప్పలేదు. ఇక చైన్నెలో వర్షాలను ఎదుర్కొనే విధంగా చేసిన ఏర్పాట్లు, జరుగుతున్న పనులను నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్ నెహ్రూ పరిశీలించారు. 329 శిబిరాలు, 36 పడవలను చైన్నెలోని లోతట్టు ప్రాంతాలలో సిద్ధంగ ఉంచామని మంత్రి ప్రకటించారు. అతి భారీ వర్షాలు కురిసిన పక్షంలో సేవలు అందించేందుకు 18 వేల మంది స్వచ్ఛంద సేవకులకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. -
నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి
తిరువళ్లూరు: నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని అనారోగ్యానికి అవసరమైన మందు ఆఽహారం ద్వారా లభిస్తుందని తిరువళ్లూరు ఫుడ్ సేఫ్టీ అధికారి సుభాష్ చంద్రబోస్ వివరించారు. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ విభాగం ఉమ్మడిగా నాణ్యమైన ఆహారం తీసుకోవడంతోపాటు ఆహారంలో పోషకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం ఎల్లాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కార్యక్రమానికి తిరువళ్లూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుభాష్‌చంద్రబోస్ హాజరై ప్రసంగించారు. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, జంక్‌ఫుడ్‌కు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు. కల్తీలేని ఆహారం తీసుకోవడంవల్ల మనిషిలో వుండే అనారోగ్యానికి మందుగా కూడా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం నాణ్యమైన ఆహారంపై విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. పాడి పరిశ్రమ టెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ కుమరవేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాతంగి, నిత్యాలక్ష్మి పాల్గొన్నారు. -
అక్షయ పాత్రతో బీడబ్ల్యూ ఎల్పీజీ ఒప్పందం
సాక్షి, చైన్నె: అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అందించే మధ్యాహ్న భోజనం తయారీకి అవసరమయ్యే గ్యాస్‌ను బీడబ్ల్యూ ఎల్పీజీ అందజేయనుంది. ఈ మేరకు స్థానికంగా ఒప్పందాలు జరిగాయి. అధునాతన కిచెన్ టెక్నాలజీలతో పోషకాహారం, విద్యా ఫలితాలను బలోపేతం చేయడం లక్ష్యంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ పాఠశాలలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2,200 కంటే ఎక్కువ పాఠశాలలకు చెందిన 12 మిలియన్ల పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందిస్తూ వచ్చారు. ఈ సంఖ్య 2024–25 ఆర్థిక సంవత్సరంలో 42.7 మిలియన్లకు చేరింది. అదనంగా మూడు కిచెన్లను సైతం ఏర్పాటు చేశారు. ఈతయారీకి మరింత బలోపేతం దిశగా గ్యాస్ సరఫరాకు బీడబ్ల్యూ ఎల్పీజీ ముందుకు వచ్చింది. బిడబ్ల్యూ ఎల్పీజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ క్రిస్టియన్ సోరెన్సెన్ మాట్లాడుతూ, అక్షయ పాత్రకు ఎనర్జీ పార్టనర్‌గా ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సకాలంలో తయారు చేసి అందించే వంట శాలలో తమ సహకారం ఉంటుందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌లో చీఫ్ రిసోర్స్ మొబిలైజేషన్ – మార్కెటింగ్ ఆఫీసర్ ధనంజయ్ గంజూ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం మానవతా ప్రయత్నాలకు కూడా విస్తరించిందన్నారు. అత్యాధునిక సాంకేతికత వనరులను మరింతగా పెంచుతుందన్నారు. -
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి
తిరువళ్లూరు: యూనియన్ పరిధిలోని పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పది రోజుల్లో పూర్తిచేయాలని తిరువళ్లూరు యూనియన్ చైర్పర్సన్ జయశీలి అధికారులు, కౌన్సిలర్లను ఆదేశించారు. తిరువళ్లూరు యూనియన్ కౌన్సిల్ పదవీ కాలం డిసెంబర్ 31 నాటికి ముగియనున్న క్రమంలో చివరి సమావేశం బుధవారం ఈకాడు బీడీఓ కార్యాలయంలో చైర్పర్సన్ జయశీలి అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లలో చైర్‌పర్సన్‌గా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించానని, నిధుల కేటాయింపులోనూ సమ న్యాయం పాటించినట్టు తెలిపారు. డిసెంబర్ 31తో తన పదవీ కాలం ముగుస్తుందని, తిరువళ్లూరు యూనియన్ను అన్ని విధాల శక్తివంచన లేకుండా అభివృద్ధి చేశామని చెప్పారు. కౌన్సిలర్లు, అధికారుల సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్న ఆమె, పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపధికన పూర్తిచేయాలని ఆదేశించారు. వైస్ చైర్మన్ బర్గతుల్లా, బీడీఓలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
తిరుమలలో వర్షం
– ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు, చెట్లు తిరుమల : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమలలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. వర్షం ప్రభావంతో రెండో ఘాట్ రోడ్డులోని రెండో మలువు వద్ద రోడ్డుకు అడ్డంగా కొండచరియలు, విరిగిపడ్డాయి. వృక్షాలు కూలాయి. దీంతో కొంత సమయం ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది రోడ్డుపై పడిన కొండచరియలు, చెట్లను తొలగించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. అలిపిరి వద్ద ఎప్పటికప్పుడు వాహన చోదకులను అప్రమత్తం చేసి, ఘాట్‌రోడ్డులో పంపుతున్నారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఘాట్ రోడ్డు పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. -
రూ.3.80 కోట్లతో విశ్రాంతి భవనం
తిరుత్తణి: ఆర్కాడుకుప్పంలో రూ.3.80 కోట్ల వ్యయంతో తిరుమలకు పాదయాత్రగా వెళ్లే భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి భవనానికి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం పనులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చైన్నె నుంచి తిరుపతికి స్వామి దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తుల సౌకర్యార్ధం తిరుత్తణి సుబ్రహ్యణ్యస్వామి ఆలయ నిధుల నుంచి విశ్రాంతి భవనం నిర్మించనున్నట్లు హిందూదేవదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు ప్రకటన చేశారు. ఈక్రమంలో విశ్రాంతి భవనం నిర్మాణానికి సంబంధించి తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి అనుబంధంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలోని ఆర్కాడుకుప్పం చోళీశ్వరస్వామి ఆలయానికి సొంతమైన స్థలంలో భక్తుల విశ్రాంతి భవనానికి స్థలం ఎంపిక చేశారు. రూ.3.80 కోట్లతో నిర్మించనున్న విశ్రాంతి భవనం పనులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆర్కాడుకుప్పంలో భూమిపూజలో తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్ పాల్గొని పనులకు సంబంధించిన భూమి పూజలో పాల్గొన్నారు. -
జాతీయస్థాయి అవార్డు ప్రదానం
సాక్షి, చైన్నె: పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) జాతీయ అవార్డును చైన్నెకు చెందిన కెటలిస్టు పబ్లిక్ రిలేషన్స్ దక్కించుకుంది. ఈ వివరాలను బుధవారం స్థానికంగా ప్రకటించారు. పీఆర్సీఐ 14వ అవార్డుల ఉత్సవంలో డిజిటల్ పబ్లిిషింగ్ విభాగంలో కాంస్య పతకంతో జాతీయ అవార్డును కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి. కృష్ణ భట్, పీఆర్సీఐ వ్యవస్థాపకుడు ఎంబీ జయరామ్, అతిథులు గీతా శంకర్, మమత లాలా చేతుల మీదుగా కెటలిస్ట్ పబ్లిక్ రిలేషన్స్ కస్టమర్ సర్వీస్ విభాగం అధ్యక్షుడు పి. అమర్ నాథ్ అందుకున్నారు. -
తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్‌పై దాడి
తల్లికి వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు చెన్నైలోని గిండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడు ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకు తన తల్లి ప్రేమకు క్యాన్సర్ వైద్యం చేయించాడు. ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో వైద్యుడు బాలాజీ జగన్నాథన్పై కక్ష పెంచుకుని దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ యువకుడు ఉద్యోగి వేషధారణలో వచ్చి.. ప్రభుత్వ వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన ఛాతీ పైభాగానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తితో పొడిచి పారిపోతుండగా నిందితుడిని వైద్యసిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కలైంజర్ సెంటెనరీ హాస్పిటల్‌లోని ఓపీడీ లేదా ఔట్ పేషెంట్ విభాగంలో.. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశారని కక్ష పెంచుకొని ఆ యువకుడు ఈ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. యువకుడు చిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భద్రతా లోపం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. డాక్టర్‌కు వైద్య సహాయం హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి దాడి మళ్లీ జరగదని హామీ ఇచ్చారు.“సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు సహా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీవైపు పయనిస్తోంది. అల్పపీడనం ప్రభావం తమిళనాడులోని 12 జిల్లాలతో సహా ఏపీలోకి దక్షిణ కోస్తా, రాయలసీమపై పడనుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తమైంది. Villupuram, Pondy, Cuddalore, Mayiladuthurai stretch getting very good rains. Rains will continue for next few hours.Our chennai radar is clear, no heavy rains expected for next 1/2 hours. Get ready for Schools and Colleges :(#ChennaiRains | #ChennaiRainsUpdate | #RainAlert pic.twitter.com/lvTvFtog2Y— TamilNadu Weather (@TamilNaduWeath2) November 13, 2024 -
స్టార్టప్‌లకు ప్రోత్సాహం
పాంబన్ వంతెనపై ఆందోళన చేస్తున్న జాలర్ల కుటుంబాలు ● హిజ్రాలు, దివ్యాంగులకు నిధి సాయం ● డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ● చైన్నెలో ముగిసిన చెస్ టోర్నీ సాక్షి, చైన్నె : కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు సంపూర్ణ ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తెలిపారు. ఈ ఏడాది నుంచి స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చే దివ్యాంగులు, హిజ్రాలకు నిధి ప్రోత్సాహం అందించేందుకు సీఎం స్టాలిన్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. మద్రాసు ఐఐటీ పరిశోధన విభాగంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ నేతృత్వంలో కొత్త స్టార్టప్‌ల ఏర్పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో కొత్త ఆవిష్కరణలను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరిచయం చేశారు. అర్హులైన వారికి ప్రోత్సహకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 2030 నాటికి ట్రిలియన్ ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సీఎం స్టాలిన్ పరిశ్రమలకు, చిన్న, మధ్య తరహా స్టార్టప్‌లకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. వెనుకబడిన సామా జిక వర్గం నుంచి పారిశ్రామిక ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు రూ. 30 కోట్లు గతంలో కేటాయించారని, ప్రస్తుతం ఈమొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచుతున్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి కోసం ప్రత్యే నిధి కేటాయించి ఉన్నామని గుర్తు చేస్తూ, ఈ ఏడాది నుంచి దివ్యాంగులు, హిజ్రాలను సైతం ప్రోత్సహించే విధంగా ముందుకెళ్లబోతున్నామన్నారు. కొత్త ఆలోచనలు, కొత్త అంశాలతో వచ్చే వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆలోచలనతో వస్తే చాలు అందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధం అని, అవసరం అయితే, శిక్షణ అందించేందుకు కూడా రెడీ అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి అన్బరసన్, ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ చైన్నెలో జరుగుతూ వచ్చిన చైన్నె గ్రాండ్ మాస్టర్స్ 2024 చెస్ టోరీ సోమవారం రాత్రి జరిగిన వేడుకతో ముగిసింది. వారం రోజులు చైన్నెలో జరిగిన ఈ పోటీల ఫైనల్స్ సోమవారం జరిగింది. ఇందులో గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను రాష్ట్రానికి చెందిన అరవింద్ చిదంబరం దక్కించుకున్నారు. రాత్రి అన్నా శత జయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. చెస్ క్రీడాకారులు అరవింద్ చిదంబరం, ప్రణవ్‌లకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ట్రోఫీ, నగదు బహుమతి చెక్కులను అందజేశారు. సింగపూర్‌లో జరగనున్న వరల్డ్ చెస్ పోటీలకు సిద్ధమవుతున్న గ్రాండ్ మాస్టర్ గుకేష్ కు రూ. 10 లక్షలు చెక్కును అందజేశారు. చైన్నె గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్స్ విభాగంలో మొదటి బహుమతి రూ. 15 లక్షలు, ఛాలెంజర్స్ విభాగంలో ప్రథమ బహుమతి రూ. 6 లక్షలు అందజేశారు. ఈ పోటీలో బహుమతులు గెలుచుకున్న లెవాన్, అర్జున్, అమీన్, మాగ్జిమ్. బర్హమ్, అలెక్సీ, విదిత్ సంతోష్ మురళి, ప్రాణేష్, అభిమన్యు, హారిక, వైశాలి తదితరులను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ అభినందించారు. ఈ పోటీలలో మొత్తంగా రూ. 70 లక్షలను అందజేశారు. కార్యక్రమంలో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ , క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ సీఈఓ, సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై పరీక్షల్లో తిరుకురల్ ప్రశ్నలు తప్పనిసరి
● మదురై హైకోర్టులో ప్రభుత్వం వెల్లడి సేలం : మదురైకి చెందిన రామ్‌కుమార్ అనే వ్యక్తి మదురై హైకోర్టులో గతంలో ఓ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ క్రమంలో 2016 సంవత్సరం హైకోర్టు తిరుకురళ్లో ఉన్న కొంత భాగాన్ని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశంలో చేర్చాలి అని ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు 2017వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ వెల్లడించిన ప్రకటనలో 1050 తిరుకురల్ పద్యాలను చేర్చాలని ప్రభుత్వం వెల్లడింది. అయితే ఆ ఉత్తర్వులు అమలుకు మాత్రం నోచుకోలేదు. దీంతో వెంటనే వాటిని ఆయా తరగతి పా ఠ్యాంశాలలో ఉండే విధంగా ఉత్తర్వులు చేయాలని, మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల్లో కూడా ప్రశ్నలుగా ఉండాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, మరియాక్లాట్ బెచ్ ముందు మంగళవారం విచారణకు వచ్చింది. అప్పుడు ప్రభుత్వం తరపున అన్ని తరగతులలోను తిరుకురళ్ పాఠ్యాంశంగా చేర్చామని, తిరుకురళ్తో పాటు దాని తాత్పర్యం, సారాంశం కూడా పాఠ్యాంశాలలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో ప్రశ్నలుంటాయని వివరించారు. వారి వ్యాఖ్యలను నమోదు చేసుకున్న న్యాయమూర్తులు ఈ కేసును ముగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. -
నీలగిరి ఎక్స్‌ప్రెస్‌లో మరమ్మతుకు గురైన ఇంజిన్
● ప్రయాణికుల ఇక్కట్లుకొరుక్కుపేట: కొరుక్కుపేట వద్ద నీలగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ దెబ్బతింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా ఎలక్ట్రిక్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. వివరాలు.. మంగళవారం ఉదయం నీలగిరి ఎక్స్‌ప్రెస్ రైలు మేట్టుపాళయం నుంచి చైన్నె సెంట్రల్‌కు వచ్చింది. ప్రయాణికులు దిగారు. సరుకులను దించిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌ను ఎన్నూర్‌కు తీసుకెళ్లారు. కొరుక్కుపేట వద్ద వెళ్తుండగా డీజిల్ ఇంజన్ ఒక్కసారిగా చెడిపోయి ట్రాక్ మధ్యలో ఆగిపోయింది. దీంతో ఈ మార్గంలో వెళ్లే విద్యుత్ రైళ్లన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిబ్బంది ఇంజిన్‌కు మరమ్మతు చేశారు. ఈ ఘటనతో ఈ మార్గాన్ని ఎన్నూరు మీదుగా సెంట్రల్, గమ్మిడిపూండి తదితర ప్రాంతాలకు మళ్లించారు. సూళ్లూరుపేట వెళ్లే సబర్బన్ ఎలక్ట్రిక్ రైళ్లు అక్కడక్కడా నిలిచిపోయాయి. గుమ్మిడిపూండి నుండి వచ్చే అన్ని రైళ్లు ఎన్నూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే ముందు ఆపివేయబడ్డాయి. దీంతో ప్రయాణికులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు సమయానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
మానవ అభివృద్ధిలో విద్య పాత్ర కీలకం
● వీఐటీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడువేలూరు: మానవ అభివృద్ధిలో విద్య మరింత కీలకమని, విద్య ద్వారానే యువతకు విజ్ఞాన్ని అందించడంతో పాటు వారిలో మానవీయ విలువలను బయటకు తీయాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వేలూ రు వీఐటీ యూనివర్సిటీ 40 సంవత్సరాల వీఐటీ ప్రస్థానం వేడుకలను వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అద్యక్షతన ఆయన ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ఆవరణలోనే సరోజిని నాయుడు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా వీఐటీ యూనివర్సిటీని అంచలు అంచలుగా ప్రపంచమే తిరిగి చూసే స్థాయికి తీసుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మ ద్య అంతరాన్ని తగ్గించేందుకు యువత కృషి చేయా ల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత యూనివర్శిటీలపై ఉందన్నారు. అవసరానికి మించి సాంకేతికతను వాడడం వల్ల అనేక శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రకృత్తిని ప్రేమించడం, ప్రకృత్తితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఏ భషలో విద్యను అభ్యసించినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరవరాదన్నారు. మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ చాన్స్‌లర్ విశ్వనాథన్ చిన్న వయస్సు నుంచే విద్యార్థి కమిటీ చైర్మన్‌గాను, పార్లమెంట్ సభ్యుని గా, ఎమ్మెల్యేగా గెలిచి ఇతరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో 180 మంది విద్యార్థులు, తొమ్మిది మంది అధ్యాపక బృందంతో ప్రారంభించిన వీఐటీని నేడు 44 వేల మంది విద్యార్థులకు విద్యనందించే స్థాయికి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 82 చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు భారత జాతి గొప్పదనంపై అవగాహన కల్పించేందుకే పలువురి మేధావుల పేర్లను ఇక్కడి కట్టడాలకు పెడుతున్నామన్నారు. ప్రభుత్వా లు ఉచితాలను రద్దు చేసి విద్య మాత్రమే వారికి అందజేస్తే చాలన్నారు. అనంతరం మాజీ అధ్యాపక బృందం, మాజీ విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లును అందజేశారు. వీఐటీ ఉపాద్యక్షులు శంకర్, శేఖర్, జీవి సెల్వం, కాదంబరి విశ్వనాథన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంద్య పెంటారెడ్డి, వైస్ చాన్స్‌లర్ కాంచన పాల్గొన్నారు. -
జాలర్ల ఆందోళన
● శ్రీలంకలో మగ్గుతున్న తమిళ జాలర్ల విడుదలకు డిమాండ్ ● కేంద్ర మంత్రికి సీఎం లేఖ సేలం: శ్రీలంకలో జైలులో ఉన్న జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాలర్లు మంగళవారం పాంబన్ వంతెనపై ఆందోళన చేపట్టారు. గత జనవరి నెల నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్ర జాలర్ల 66 పడవలను స్వాధీనం చేసుకుని, 497 మంది జాలర్లను శ్రీలంక సముద్రతీర బలగాలు అరెస్టు చేశారు. శ్రీలంక అరెస్టు చేసిన జాలర్లపై ఆ దేశ చట్టాల ప్రకారం జైలులో బంధిస్తున్నారు. ఈ విధంగా 90 మంది జాలర్లు ఆరు నెలలో నుంచి రెండేళ్ల శిక్షతో ఖైదీలుగా మగ్గుతున్నారు. ఈ స్థితిలో ఆదివారం అరెస్టు చేసిన 23 మంది జాలర్లను, మంగళవారం అరెస్టు చేసిన 12 మంది జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాలర్ల కుటుంబాలు పాంబన్ వంతెనపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. అనంతరం జాలర్లు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. శ్రీలంకలో మగ్గుతున్న జాలర్లను విడుదల చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సంఘటన అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆందోళన చేపట్టిన జాలర్ల వద్ద జిల్లా పోలీసు కమిషనర్ సతీష్ అధ్యక్షతన పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అనంతరం జాలర్ల కుటుంబాలు ఆందోళనను విరమించారు. ఈ కారణంగా పాంబన్ – మదురై జాతీయ రహదారి రెండు గంటల పాటు వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విదేశాంగ మంత్రి సీఎం లేఖ రామేశ్వరంకు చెందిన 23 మంది జాలర్ల ఈ నెల 9వ తేది శ్రీలంక సముద్రతీర బలగాలు అరెస్టు చేసిన స్థితిలో మంగళవారం నాగపట్నంకు చెందిన 12 మంది జాలర్లను సరిహద్దులు దాటి చేపలు పడుతున్నారని ఆరోపిస్తూ శ్రీలంక బలగాలు అరెస్టు చేశారు. శ్రీలంక సముద్ర తీర బలగాలు అరెస్టు చేసిన తమిళ జాలర్లు అందరినీ, వారి పడవలను వెంటనే విడుదల చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను మంగళవారం ఒక లేఖ రాశారు.