Jangaon
-
విద్యపై ఆసక్తి పెంచుకోవాలి
జనగామ రూరల్: బాల్యం నుంచి విద్యపై ఆసక్తి పెంచుకోవాలి.. అప్పుడే జీవితంలో ఉన్నత లక్ష్యాల ను చేరుకుంటారని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సం సందర్భంగా బుధవారం పట్టణంలోని తెలంగాణ బాలుర సోషల్ వెల్ఫేర్ స్కూల్, జూనియర్ కళాశాల డీఎల్ఎస్ఏ, డీసీపీయూ, చైల్డ్‌లైన్, స్కోప్ ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యాన బాలల హక్కులు, చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థినీ విద్యార్థులు బాలల హక్కులు, బాధ్యతలను తెలుకోవడంతోపాటు యువత చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఉప్పలయ్య, బాలల పరిరక్షణ అధికారి రవికాంత్ ప్రసంగించారు. ఎవరైనా బాలలు ఆపదలో ఉంటే 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ మనోజ్‌కుమార్, ప్రణయ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ -
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: జిల్లా స్థాయి అథ్లెటి క్స్ ఎంపిక పోటీలు 22న ధర్మకంచలోని మినీస్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ఎంపికై న 8, 10, 12 ఏళ్ల బాల బాలికలు డిసెంబర్ 1న మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులు నేడు(గురువారం) ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరా లకు గంగిశెట్టి మనోజ్ కుమార్(9885046437), ఆవుల అశోక్(99124 53220), వంచ చంద్రశేఖర్‌రెడ్డి(77995 52233)ని సంప్రదించాలని కోరారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలిజనగామ రూరల్: దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వార్యాన బుధవారం కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. పింఛన్ పెంచుతామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విస్మరించిందన్నారు. ఈ సమస్యను పరి ష్కరించకుంటే ఈనెల 26న ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీక్షలో చిరంజీవి, రాజశేఖర్, నర్సయ్య, గడ్డం సందీప్, రవి, ప్రశాంత్, వెంకటేశ్వర్లు, వంశీ, సిద్ధిరాములు, తదితరులు పాల్గొన్నారు. -
దళితుల అభ్యున్నతికి సీఎం కృషి
● ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి దళితుల అభ్యున్నతికి పాటు పడుతున్నారని ఎస్సీ కార్పొరేష న్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ అన్నారు. జిల్లా పర్యట నలో భాగంగా ఆయన బుధవారం ఆర్టీసీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 13, 16, 30 వార్డుల్లో ఎన్జీఓ గీతాచార్య ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహించి న కుట్టు మిషన్ శిక్షణ తరగతుల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి నినాదంతో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల కు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలు సమస్యలపై జనగామ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు గంధమాల మల్లేష్, తిప్పారపు ప్రసాద్, గంగారపు కిషన్.. చైర్మన్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కల్యాణి మల్లారెడ్డి, కౌన్సిలర్లు మల్లిగారి చంద్రకళ రాజు, గాదెపాక రామచందర్, బొట్ల శ్రీనివాస్, పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజమౌ ళి, బొట్ల నర్సింగరావు, గణిపాక మహేందర్, మిద్దెపాక స్టాలిన్, గాదెపాక ప్రసాద్, ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ మిద్దెపాక సిద్ధులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర సమాచారం
ఒక్క క్లిక్..జనగామ రూరల్: విద్యా వ్యవస్థ సమగ్ర సమాచా రాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు యూ డైస్ ప్లస్(యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) వెబ్సైట్ రూపొందించింది. ఇక నుంచి ఒక్క క్లిక్‌తో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర సమాచారం వెబ్సైట్లో ప్రత్యక్షం కానున్నది. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారంతో పాటు మౌలిక వసతులు ఏ పాఠశాలలో ఎలా ఉన్నాయి.. ఎంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారనే విషయాలు యూ డైస్ ప్లస్ ద్వారా స్పష్టంగా తెలియనుంది. యూడైస్ నుంచి యూడైస్ ప్లస్ 2021–22 వరకు యూడైస్గా కొనసాగిన ఈ వ్యవస్థను.. ఆ తర్వాత యూ డైస్ ప్లస్‌గా ఆధునికీకరించారు. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్డేట్ చేయగా.. ఇకపై మూడు గంటలకోసారి సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌ను పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యూల్స్ అనే మూడు భాగాలుగా విభజించి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యాన ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పాఠశాలల స్థితిగతులు అంశాల వారీగా వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. మొత్తం సమాచారం నిక్షిప్తం.. జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న ప్రతీ విద్యార్థి వివరాలు వెబ్సైట్లో పొందు పరుస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు ఉండగా.. ప్రస్తుత సమాచారంతో అప్డేట్ చేస్తున్నారు. అలాగే పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదులు, తాగునీరు తదితర సదుపాయాల వివరాలు, వాటి స్థితిగతులపై తాజా సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. అక్రమాలకు చెక్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్కారు పరంగా అందుతున్న వసతుల కల్పనకు యూడైస్ ప్లస్‌లోని వివరాలు కీలకం కానున్నాయి. అవినీతికి పాల్పడకుండా ఈ విధానం ఉపయోగపడనున్నది. వెబ్సైట్లో నమోదైన విద్యార్థులకే ఇకపై యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర వాటిని అందించనున్నారు. అలాగే వసతుల కల్పనకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కానున్నాయి. ప్రతీ విద్యార్థికి నంబర్ కేటాయింపు యూ డైస్ ప్లస్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాన నడుస్తుంది. ప్రతి ఏడాది అన్ని పాఠశాలల్లో సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులోని ప్రతీ విద్యార్థికి ఒక పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్(పీఈఎన్) కేటా కేటాయిస్తారు. దీని ద్వారా ఆ విద్యార్థి దేశవ్యాప్తంగా ఏఏ పాఠశాలల్లో ఏఏ తరగతులు చదివాడనేది కచ్చితంగా తెలుస్తుంది. పదో తరగతి విద్యార్థి బోర్డు పరీక్షలు రాయాలంటే ఇందులో నమోదై ఉండాల్సిందే. నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్ డేట్ చేసే అవకాశం ఉండేది. ఇకపై మూడు గంటలకోసారి సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేస్తారు. అలాగే.. యూ డైస్ ప్లస్‌లోని సమాచారం ఆధారంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈనెల చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాం. – రాము, జిల్లా విద్యాధికారిజిల్లాలో అన్ని యజమాన్యాల కింద 662 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 75,070 మంది విద్యార్థులు ఉన్నారు. జీరో స్కూల్స్ 75 ఉండగా 1 నుంచి 100 మంది ఉన్న పాఠశాలలు 442, 100 కంటే ఎక్కవ మంది విద్యార్థులున్నవి 165 ఉన్నాయి. మండలం పాఠశాలలు విద్యార్థుల సంఖ్య బచ్చన్నపేట 52 4,860 చిల్పూర్ 42 2,906 దేవరుప్పుల 60 4,542 స్టేషన్‌ఘన్‌పూర్ 59 10,534 జనగామ 112 24,288 కొడకండ్ల 42 3,548 లింగాలఽఘణపురం 38 3,403 నర్మెట 40 3,762 పాలకుర్తి 82 7,693 రఘునాథపల్లి 69 4,522 తరిగొప్పుల 24 1,179 జఫర్‌గఢ్ 42 3,833పాఠశాలల అభివృద్ధికి ‘యూ డైస్ ప్లస్’ దీని ఆధారంగా నిధుల కేటాయింపు జిల్లాలో 662 ప్రభుత్వ పాఠశాలలు -
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
జనగామ: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమకొండ, హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే యశ్వంతాపూర్, పెంబర్తి జంక్షన్ల(టర్నింగ్ పాయింట్)లో స్పీడ్ బ్రేకర్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, అలాగే రఘునాథపల్లి ఫ్లై ఓవర్ ఏరియాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. జిల్లా పరిధి ఎన్‌హెచ్ రహదారి పొడవునా, అప్రోచ్‌రోడ్లు, బస్టాప్లున్న చోట వాహ న డ్రైవర్లకు అర్థమయ్యేలా సైన్ బోర్డులు, లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రద్దీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, పాదచారులు రోడ్డు దాటే క్రమంలో ఇబ్బంది లేకుండా జీబ్రా క్రాసింగ్, రోడ్డుపై రిఫ్లెక్టింగ్ లైటింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు సీటు బెల్ట్, ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని చెప్పారు. మద్యం తాగి వాహనం నడిపినా, మైనర్లకు వాహనం ఇచ్చినా చట్టరీత్యా నేరమ ని స్పష్టం చేశారు. సమీక్షలో ఏసీపీ పార్థసారథి, ఆర్అండ్బీ ఎస్ఈ పి.సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీజీఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఆర్టీసీ డీఎం స్వాతి, 108 అంబులెన్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సర్వే వివరాల నమోదులో తప్పులుండొద్దు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆన్లైన్ నమోదుపై మాస్టర్ ట్రెయినర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేలో సేకరించిన వివరాల నమోదును ఈ నెల 22 నుంచి ప్రారంభించాలన్నారు. జిల్లా మాస్టర్ ట్రెయినర్లు మండల స్థాయిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయ సేకరణ స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై బహిరంగ విచారణకు నేడు(గురువా రం) అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జిల్లాలోని బీసీ, కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను హనుమకొండ కలెక్టరేట్లో డెడికేషన్ చైర్మన్ బూపాని వెంకటేశ్వరరావు తదితరులకు అందజేయాలని కోరారు. సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జనగామ రూరల్: జిల్లా స్థాయి అథ్లెటి క్స్ ఎంపిక పోటీలు 22న ధర్మకంచలోని మినీస్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ఎంపికై న 8, 10, 12 ఏళ్ల బాల బాలికలు డిసెంబర్ 1న మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులు నేడు(గురువారం) ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరా లకు గంగిశెట్టి మనోజ్ కుమార్(9885046437), ఆవుల అశోక్(99124 53220), వంచ చంద్రశేఖర్‌రెడ్డి(77995 52233)ని సంప్రదించాలని కోరారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలిజనగామ రూరల్: దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వార్యాన బుధవారం కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. పింఛన్ పెంచుతామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విస్మరించిందన్నారు. ఈ సమస్యను పరి ష్కరించకుంటే ఈనెల 26న ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీక్షలో చిరంజీవి, రాజశేఖర్, నర్సయ్య, గడ్డం సందీప్, రవి, ప్రశాంత్, వెంకటేశ్వర్లు, వంశీ, సిద్ధిరాములు, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అభివృద్ధి ప్రదాత మోదీ
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్‌రెడ్డి జనగామ రూరల్: తెలంగాణ అభివృద్ధి ప్రదాత ప్రధాని మోదీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించడాన్ని ఓర్వలేక చిల్లర విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాకతీయుల గడ్డ ఓరుగల్లుకు స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కాజీపేట వ్యాగన్ పరిశ్రమ, రామప్పకు యూనిస్కో, గిరిజన యూని వర్సిటీ.. ఇవన్నీ ఇచ్చిన మోదీ కాళ్లు కడిగి నీళ్లు తలపై చల్లుకోవాలన్నారు. పేదల ఇళ్లను కూల్చడ మే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగ రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సౌడ రమేష్, దుబ్బ రాజశేఖర్‌గౌడ్, సభ్య త్వ ప్రముఖ్ కొంతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
లింగాలఘణపురం: జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించి పులకించి పోయారు. వరంగల్ ఎంపీ కడి యం కావ్య, ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితులు గట్టు శ్రీనివాసాచార్యులు, విజయసారథి, రాఘవాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో 31 మంది పుణ్య దంపతులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అర్చకులు భార్గవాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు, రఘురామాచార్యులు, బుచ్చయ్యశర్మ పాల్గొనగా దేవస్థాన చైర్మన్ మూర్తి, స్థానిక ఈఓ వంశీతో పాటు డిప్యూటేషన్‌పై లక్ష్మీప్రసన్న, డీపీఓ స్వరూప, ఆర్డీఓ గోపీరా మ్, తహసీల్దార్ ఆండాలు, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ శ్రీనివాసురెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్, ఎన్సీసీ కేడెట్లు భక్తులకు సేవలందించారు. కల్యాణోత్సవ అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ మొదటిసారి జీడికల్ సీతారాముల కల్యాణం తిలకించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే రూ.5 లక్షలతో సెంట్ర ల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది లోగా గుట్టపై ఉన్న గుండాల వరకు మెట్లు నిర్మిస్తాన ని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. శ్రీ రామచంద్రస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది మరింత వేడుకగా కల్యాణం జరిగేలా కృషి చేస్తామన్నారు.వైభవంగా సీతారాముల కల్యాణం జీడికల్ వీరాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు -
ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
● రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాలకుర్తి టౌన్: సహజ కవి బమ్మెర పోతన జన్మస్థలాన్ని ఆధ్యాత్మిక సాహితీ కేంద్రంగా తీర్చిదిద్దుతా మని పర్యాటక, ఎకై ్సజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం బమ్మెరలోని పోతన స్మృతి వనం, అభివృద్ధి పనులను ఆయన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డతో కలిసి సందర్శించారు. పోతన సమాధి, పోతన వ్యవసాయ క్షేత్రం, బావిని పరిశీలించాక ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అసంపూర్తిగా ఉన్న పోతన పర్యాటక ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోత న సమాధి, వ్యవసాయ బావి సమీప వాగుపై చెక్‌డ్యాం.. అలాగే పర్యాటకులకు హరిత హోటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి ఆరు నెలల్లో పోతన స్మృతి వనాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు.. ఎర్రబెల్లి నైజం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం ఎర్రబెల్లి దయాకర్‌రావుది.. ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో పదవులు పట్టుకొని పాకులాడిన చరిత్ర దయాకర్‌రావుది అని అన్నారు. ఇక్కడ సరైన ప్రత్యర్థి లేక ఇన్ని రోజులు ఆయన ఆటలు సాగాయని, ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లిని ఓడించి సరైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. -
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాల్ చైర్మన్ పోకల జమున లింగయ్య పేర్కొన్నారు. 57 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పుల్లయ్య కళా నిలయం కార్యదర్శి ముసురం రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బాలికలకు రంగోలి పోటీలను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ము న్సిపాల్ చైర్మన్ పోకల జమున లింగయ్య హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ విధిగా గ్రంథాలయాల కు వచ్చి పుస్తకాలను చదవాలన్నారు. దీనివల్ల విజ్ఞానం ఎంతో పెరుగుతుందన్నారు. అనంత రం రంగోలి పోటీల్లో గెలుపొందిన బాలికలకు బ హుమతులు అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్లు రామచందర్‌నాయక్, కృష్ణ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయవద్దని సీఎస్ శాంతికుమారి అన్నారు. మంగళవారం సీఎస్ కలెక్టరేట్‌కు రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వే వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సాఫీగా కొనసాగుతుందని.. చె ల్లింపులు కూడా ఎప్పటికప్పుడు అయ్యేలా రైతుల వివరాలను నమోదు చేస్తున్నారని కలెక్టర్ తెలి పారు. ఇప్పటి వరకు దొడ్డు రకం ధాన్యంకు రూ.78 కోట్లు, సన్నరకం ధాన్యంకు రూ.1 కోటి వరకు చె ల్లించడం జరిగిందన్నారు. అలాగే ఇప్పటి వరకు జి ల్లాలో 93.5 శాతం సర్వే పూర్తయిందన్నారు. డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ పెంబర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ రోహిత్సింగ్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతం, ధాన్యం కాంటా, రవాణా, ఆన్లైన్ తదితర వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, డీఎస్ఓ సరస్వతి, శ్రీనివాస్, రాంమోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర స్టేషన్‌ఘన్‌పూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామారావునాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మండలంలోని నమిలిగొండ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మంగళవారం డీఏఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరిపంట సాగు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులతో రైతునేస్తం కార్యక్రమంలో నేరుగా వీసీలో మాట్లాడించారు. జిల్లాలో వరిపంట సాగు, దిగుబడి, ధాన్యం కొనుగోళ్లు తదితర వివరాలను డీఏఓ వివరించారు. నమిలిగొండ గ్రామం నుంచి అత్యధికంగా రిక్కల సంపత్‌రెడ్డి 111 క్వింటాళ్లు కొనుగోలు సెంటర్లో విక్రయించగా మద్దతు ధర రూ.2,57,520, బోనస్ డబ్బులు రూ.55వేలు, మొత్తం రూ.3,13,020 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రన్‌కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సీఎస్ శాంతికుమారి ధాన్యం సేకరణ, సమగ్ర సర్వేపై సమీక్ష -
ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం, నమస్కరిస్తున్న సీఎం రేవంత్రెడ్డినేడు బమ్మెరకు మంత్రి జూపల్లి రాక పాలకుర్తి టౌన్: మండలంలోని బమ్మెరకు నేడు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ప్రొహిబిషన్, ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు. మహాకవి పోతన జన్మస్థలం బమ్మెరలో పోతన ప్రాజెక్టు పనులను సందర్శించి, పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. నేడు కొడకండ్ల మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం కొడకండ్ల: నూతనంగా నియామకమైన కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్ర మాణ స్వీకారం నేడు (బుధవారం) ఉదయం 11 గంటలకు మార్కెట్‌యార్డు ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. మార్కెట్ చైర్‌పర్సన్‌గా నల్ల అండాలు, వైస్ చైర్మన్‌గా ఈరంటి సాయికృష్ణ, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేపు డెడికేటెడ్ బీసీ కమిషన్ రాకవరంగల్: హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు, సభ్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు అవసరమైన రిజర్వేషన్లను దామాషా ప్రకారం కల్పించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజలు, సలహాలు, అభ్యర్థనలు, ఆక్షేపణలను కమిషన్‌కు సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలతో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.పూర్తి వివరాలు సేకరించాలిరఘునాథపల్లి: సమగ్ర కుటుంబ సర్వేలో పూర్తి వివరాలు సేకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో జరుగుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను ఆయన పరిశీలించారు. సూపర్వైజర్, ఎన్యుమరేటర్లను సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చూపిన మార్గదర్శకాల ఫార్మెట్లో సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల సమాచారం తప్పనిసరి నమోదు చేయాలన్నారు. కాగా మండలంలో 15 వేల కుటుంబాలకు సర్వే చేశామని, మరో 4 వేల కుటుంబాలకు సర్వే చేయాల్సి ఉందని ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ మోహ్సిన్‌ముజ్తబ, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, సూపర్వైజర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రాములోరి కల్యాణానికి ఎదుర్కోలు లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో నేడు జరిగే కల్యాణోత్సవ తంతులో భాగంగా మంగళవారం రాత్రి ఎదుర్కోలు కార్యక్రమాన్ని వేదపండితులు శ్రీనివాసాచార్యులు, భార్గవాచార్యులు నిర్వహించారు. అంతకుముందు సీతారాముల కల్యాణోత్సవానికి దేవతల ఆహ్వానానికై ధ్వజా రోహణం, గరుడముద్ద కార్యక్రమాలను నిర్వహి ంచారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థాన చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, జనగామ ఉప్పలమ్మ దేవా లయ ఈఓ రాములు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక స్వావలంబనే లక్ష్యం జనగామ రూరల్: ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్ర తాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 500 వాహనాల్లో తరలివెళ్లారు. ప్రజాప్రభుత్వంపై ప్ర జలకు పెరుగుతున్న ఆదరణ, ప్రభుత్వం ప్ర జలకు చెప్పిన దాని కంటే ఎక్కువ పనులు చే స్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీని వాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్, మేడ శ్రీనివాస్, వంగాల కల్యాణి మల్లారెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, తరలివెళ్లారు.సాక్షి, వరంగల్: ఓరుగల్లు వేదికగా మంగళవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మహిళాలోకం కదిలి వచ్చింది. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి మహిళలు నగరానికి తరలివచ్చారు. ఎక్కడ చూసినా వారే కనిపించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆడబిడ్డలపై వరాల జల్లు కురిపించారు. ‘రానున్న పదేళ్లలో మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం. సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తాం. ఒకప్పుడు టాటా, బిర్లాలుంటే.. ఇప్పుడు అంబానీ, అదానీలను మించిన పారిశ్రామికవేత్తలుగా మహిళలను మారుస్తాం’ అని స్పష్టం చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా.. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తొలుత కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం (ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం) లో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయి. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే చారిత్రక వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అభివృద్ధికి సుమారు రూ.ఆరువేల కోట్లు కేటాయించాం. వరంగల్ అభివృద్ధి చెందితే.. సగం తెలంగాణ అభివృద్ధి చెందినట్లే. నగరాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు’ అని సీఎం చెప్పిన మాటలకు మంచి స్పందన వచ్చింది. ‘ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది మన ఆడబిడ్డనే. ఆనాడు భద్రకాళి అమ్మవారు, సమ్మక్క–సారలమ్మ తల్లుల సాక్షిగా చెప్పా.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతామని ‘మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీదుగా మాట ఇస్తున్నా.. మిగిలిన అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత మాది’ అనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, సారయ్య, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, కమిషనర్ అశ్వినితానాజీ వాకడే పాల్గొన్నారు. స్టెప్పులే స్టెప్పులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్లతో పాటు పలు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో మహిళలు సభకు తరలివచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా జనాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి రాగానే.. ‘మూడు రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు మన రేవంతన్న’ అనే పాటకు మహిళలు స్టెప్పులు వేశారు. సభలో అర్జున అవార్డు గ్రహీతలు ఇషాసింగ్, నిఖత్ జరీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూస్రీల్సీఎం పర్యటన సాగిందిలా... మధ్యాహ్నం 2.39 గంటలకు: హైదరాబాద్ నుంచి హనుమకొండకు ప్రత్యేక హెలికాప్టర్లో రాక.. ముందుగా నగరం మొత్తం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 2.50 : కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ప్రజాకవి కాళోజీ కాంస్య విగ్రహావిష్కరణ 2.54: హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన రూ.4,601.15 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన 2.57 : కాళోజీ కళాక్షేత్రం భవన ప్రారంభోత్సవం 2.59 : కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ ఫొటో గ్యాలరీ సందర్శన 3.18 : ఆడిటోరియాన్ని సందర్శించి.. ప్రజాకవి కాళోజీపై రూపొందించిన బయోపిక్వీక్షణ 3.30 : కాళోజీ కళాక్షేత్రం నుంచి బస్సులో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి పయనం 3.41 : ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణానికి రాక, ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ సందర్శన సాయంత్రం 4.16: మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికపైకి రాక, ఆ తర్వాత ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళి 5.22: సీఎం ప్రసంగం మొదలు.. 34 నిమిషాలు కొనసాగిన స్పీచ్ 5.58 : 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన 6.00 : సభాస్థలి నుంచి సీఎం హైదరాబాద్‌కు పయనం సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి దూరంసభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం.. మరోసారి కాంగ్రెస్‌పార్టీలో చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ పాదయాత్ర సందర్భంగా మొదలైన వీరిమధ్య మనస్పర్థలు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇంకా సద్దుమణగలేదన్న విషయం ఈ అతిపెద్ద సభతో మరోసారి బహిర్గతమైనట్లయ్యింది. దొంతి మాధవరెడ్డి గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా సీనియారిటీ పరంగా సముచిత స్థానమిచ్చి గౌరవించకపోవడం వల్లనే సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే దొంతి దూరంగా ఉంటున్నారని ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కుర్చీ దొరకక.. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణికి సీటు దొరక్కపోవడంతో ఇబ్బందిపడ్డారు. వేదికపైకి.. అక్కడున్న సిబ్బంది వెనకాల కుర్చీ తీసుకొచ్చి వేయడంతో ఆమె కూర్చున్నారు. ‘ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం’ నుంచి సీఎం వరాలు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామన్న రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృది్ధ చెందినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి సభికులనుంచి అనూహ్య స్పందన అంతకుముందు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన స్టాళ్ల పరిశీలన హన్మకొండ చౌరస్తా: ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని సభా ప్రాంగణం ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషీ, పెయింటింగ్స్, మాస్క్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు తదితర స్టాళ్లను పరిశీలించారు. స్టాళ్ల నిర్వాహకులను వ్యాపారం ఎలా ఉంది.. ఏయే వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు.. టర్నోవర్ ఎంత? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలన్నీ ఇలాగే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ దర్శనం.. గొప్ప అనుభూతి అని డైరీలో రాశారు. కాగా, పలు స్టాళ్ల నిర్వాహక మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన చిత్రపటాన్ని అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. వరంగల్‌లో నార్కొటిక్ పీఎస్.. ప్రారంభించిన సీఎం – వివరాలు 8లోu -
కాళోజీ కళాక్షేత్రం ఆవిష్కృతం
హన్మకొండ అర్బన్: జిల్లా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రానికి చేరుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి రూ.4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా చేశారు. గ్రేటర్ మాస్టర్ ప్లాన్–2041 మ్యాపును విడుదల చేశారు. అనంతరం కళాక్షేత్రం భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కాళోజీ వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫొటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈసందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్యమంత్రికి కాళోజీ జీవితం, అక్కడి వస్తువుల గురించి వివరించారు. అనంతరం ఆడిటోరియంలో కాళోజీ జీవిత విశేషాలతో ప్రముఖ సినీ దర్శకుడు డాక్టర్ ప్రభాకర్ జైనీ నిర్మించిన బయోపిక్‌ను వీక్షించారు. ఈసందర్భంగా ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, ట్రస్ట్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహం ఆవిష్కరణ -
‘ప్రజా పాలన’ ప్రచార వాహనాలు ప్రారంభం
జనగామ రూరల్: ప్రజాపాలన విజయోత్సవాలపై ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలను మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులతో కళాయాత్ర కొనసాగుతుందన్నారు. జనగామ డివిజన్‌కు 11 మంది, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్‌కు 10 మంది కళాకారులకు 2 వాహనాలను ఫ్లెక్సీ, మైక్ సిస్టంతో ప్రచార వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె.శ్రీనివాసరావు, కార్యాలయం సిబ్బంది, సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. -
రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.సీనియర్ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
నేడే గ్రూప్–3 పరీక్ష
జనగామ రూరల్: జిల్లాలో నేటి నుంచి జరిగే గ్రూప్–3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఘ టనలు జరగకుండా పరీక్ష రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్–1, 18వ తేదీన ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్–3 పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 16 సెంటర్లలో 5,446 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు (16), డిపార్ట్మెంటల్ అధికారులు (16), అబ్జర్వర్లు (16), ఫ్లయింగ్ స్క్వాడ్ లు 4, బయోమెట్రిక్ అధికారులు (43), ఐడెంటిఫికేషన్ అధికా రులు (55), నాలుగు రూట్లలో నలుగురు రూట్ అధికారులను నియమించారు. వంద శాతం బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోగా పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. 144 సెక్షన్ అమలు రెండు రోజుల పాటు జరిగే గ్రూప్–3 పరీక్షకు ఎలాంటి సంఘటనలు కాకుండా పోలీస్‌లు పరీక్ష కేంద్రాల వద్ద భద్రత నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం డీసీపీ రాజామహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ పార్థసారధితో కలిసి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెంటర్ వద్ద 144 సెక్షన్ (163 బీఎంఎస్ఎస్) అమలులో ఉంటుందన్నారు. పరీక్షల కోసం 4 రూట్ మ్యాప్ చేసినట్లు తెలిపారు. సందేహాల నివృత్తికి కంట్రోల్ నంబర్.. అభ్యర్థుల సందేహాల నివృత్తికి కలెక్టరేట్లో కంట్రో ల్ నంబర్ 9052308621 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్లో కలర్ ప్రింట్ తీసుకోవాలని, తాజా పాస్ పోర్టు ఫొటోను అతికించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, ఆభరణాలు ధరించరాదని సూచించారు. పరీక్ష కేంద్రాల వివరాలు ఏబీవీ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, సాన్‌మారియా హైస్కూల్, సెయింట్ పాల్స్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మకంచ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సెయింట్ మేరీస్ హైస్కూల్ హైదరాబాద్ రోడ్డు, గీతాంజలి హైస్కూల్, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల, ఏకశిల డిగ్రీ కళాశాల, క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల, నారాయణ హైస్కూల్, ఏకశిల బీఎడ్ కళాశాల, అరబిందో హైస్కూల్, ఏకశిల పబ్లిక్ స్కూల్, వైష్ణవి హైస్కూల్. సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం జిల్లాలో 16 కేంద్రాల్లో 5,446 మంది అభ్యర్థులు సీసీ నిఘాలో పరీక్షల నిర్వహణ కలెక్టరేట్లో 9052308621 కంట్రోల్ నంబర్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు -
ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం
సాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వేడుకలకు చకచకా ఏ ర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల కోసం శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరగగా.. శనివారం మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్, కొండా సురే ఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ హనుమకొండలో ఏర్పాట్లు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హనుమకొండకు చేరుకున్న టీపీసీసీ చీఫ్, మంత్రు ల బృందానికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ.. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 19న హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సక్సెస్‌పై గంటన్నరకు పైగా ఆయన ఈ కీలక భేటీ నిర్వహించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున నిర్వహించే ఈ విజయోత్సవ సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్రజలను తరలించే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా సీఎం కాన్వాయి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణానికి చేరేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి హెలిపాడ్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందిని తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో లక్ష మంది మహిళలు ఉండేలా చూడాలని టీపీసీసీ చీఫ్ ప్రజాప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. జన సమీకరణ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభం, ఏర్పాట్లపై నేడు, రేపు అధికారులతో మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి : టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. హనుమకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని.. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే రేవంత్‌రెడ్డి సర్కారు ఆయా రంగాలను అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తోందని పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లతో రైతులకు రుణమాపీ చేశామని, 40 శాతం కాస్మోటిక్స్ చార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచిందని తెలిపారు. కేసీఆర్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడని విమర్శించారు. పదేళ్లలో నిరుద్యోగులను విస్మరించి తన కుటుంబ సభ్యులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుందని, సైద్ధాంతిక పరంగా విమర్శించుకున్నా అవసరమైనప్పుడు అందరం కలిసే పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’లో సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను కలెక్టర్ ప్రావీణ్య.. వారికి వివరించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనా రాయణరావు, మురళీనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మహ్మద్ రియాజ్, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చై ర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, శివసేనారెడ్డి, తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. ప్రజా పాలన విజయోత్సవ సభా వేదికకు నామకరణం.. ఓరుగల్లులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిర జయంతి రోజునే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ భేటీ.. దిశానిర్దేశం -
● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక విద్యార్థులతో కలిసిపోతున్న ఫారినర్స్ ● ఇక్కడి చారిత్రక ప్రదేశాలకు ఫిదా ● బతుకమ్మ పండుగ, సర్వపిండి ఎంతో ఇష్టమని వెల్లడి ● స్వదేశానికి వెళ్లినా ఓరుగల్లు సంస్కృతీసంప్రదాయాలకు గౌరవం
జీడీపీలో 7.5శాతం ఐటీ రంగానిదే.. దేశ జీడీపీలో 7.5 శాతం ఐటీ రంగానిదేనని, టెక్నాలజీ రంగంలో అపార ఉద్యోగావకాశాలు ఉన్నాయని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు.అయ్యప్ప మాలధారులకు.. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ సంస్థ ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. వాతావరణం జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి. ఆదివారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2024– 8లోuవిదేశీయులం కాదు మేం ఓరుగల్లు స్వదేశీయులం అంటున్నారు.. నిట్ వరంగల్ క్యాంపస్‌లో విద్యనభ్యసిస్తున్న ఫారినర్స్. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను అక్కున చేర్చుకుని నిట్ క్యాంపస్ అమ్మలా ఆదరిస్తోంది. వారి భద్రతకు పెద్దపీట వేస్తోంది. సొంతూరిలో ఉన్న అనుభూతిని కల్పిస్తోంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. – కాజీపేట అర్బన్సర్వే వేగవంతం చేయాలి● కలెక్టర్ రిజ్వాన్ బాషా చిల్పూరు: ఇంటింటి సర్వేను మరింత వేగవంతంగా చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆయన శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ రజిత నింపిన ఫామ్స్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోడ్ ప్రకారం తప్పులు లేకుండా సర్వే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ శంకర్‌నాయక్, క్లస్టర్ ఇన్చార్జ్ మధుసూదన్, సూపర్వైజర్ సింగపురం కిరణ్‌కుమార్, కార్యదర్శి తౌటి శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి జనగామ రూరల్: ఈనెల 19వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా ఆర్ట్స్ కళాశాలలో స్వయం సహాయక సంఘాలచే స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులకు తెలిపారు. పెంబర్తి హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, జౌళి శాఖ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులపై మొత్తం నాలుగు స్టాళ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఓటరుగా నమోదు చేయించాలిస్టేషన్ఘన్పూర్: అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించేలా బీఎల్ఓలు బాధ్యతగా పనిచేయాలని ఓటరు నమోదు ప్రక్రియ రాష్ట్ర పరిశీలకులు, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ ఆయూషామస్రత్ ఖానమ్ అన్నారు. ఘన్పూర్ డివిజన్‌కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్స్టేషన్లను ఆమె శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్స్టేషన్లను పరిశీలించి బీఎల్ఓలతో మాట్లాడారు. 1.1.2025 నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకున్న ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. అనంతరం హైస్కూల్లో నిర్వహిస్తున్న డిజిటల్ క్లాస్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎన్నికల డీటీ సదానందం, ఆర్ఐ రవీందర్, సత్యనారాయణ, అభినయ్, హెచ్ఎం సంపత్, పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, బీఎల్ఓలు రాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. జనగామ రూరల్: జనగామ పట్టణంలోని పలు పోలింగ్స్టేషన్లను ఓటరు నమోదు ప్రక్రియ రాష్ట్ర పరిశీలకులు ఆయూషామస్రత్ ఖానమ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధి కారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు. సైన్స్‌తో విజ్ఞానం పెంపొందించుకోవచ్చుకొడకండ్ల: సైన్స్‌తో విద్యార్థి విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని, విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సైన్స్ ఎగ్జిబిట్లు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖాధికారి కె.రాము అన్నారు. శనివారం మండలకేంద్రంలోని టీజీఆర్ఎస్ జేసీ గురుకులంలో ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్‌కుమార్ అధ్యక్షతన సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల నుంచే సైన్స్‌పై ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. ప్రఖ్యాత సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు విజయ్, సుధాకర్, ప్రియవేదాంతంలు సైన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘునందన్‌రెడ్డి, ఎంఈఓ గ్రేస్ఖజీయారాణి, సిరి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ఇదునూరి శ్రీనివాస్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. జీడికల్ ఆలయ రూపురేఖలు మారుస్తాలింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ రూపురేఖలు ఏడాదిలోగా మారుస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ నెల 20న జరిగే కల్యాణోత్సవ ఏర్పాట్లపై శనివారం ఆలయ ప్రాంగణంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఆర్డీఓ గోపిరామ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్రం కలిగిన ఆలయాన్ని అందరి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అంతకు ముందు ఆలయ పరిసరాలను పర్యవేక్షించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్ఓ మల్లికార్జున్ తెలిపారు. ఈ సమీక్షలో డీపీఓ స్వరూప, ఏసీపీ భీమ్‌శర్మ, ట్రాన్స్‌కో ఎస్ఈ వేణుమాధవ్, డాక్టర్ రవితేజ, సీఐ శ్రీనివాసురెడ్డి, పీఆర్ డీఈ రవీందర్, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, గుడి వంశీధర్‌రెడ్డి, మూర్తి, అధికారులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా రాంబాబుజనగామ: జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్‌గా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లికి చెందిన మారుజోడు రాంబాబును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, 1999లో జనగామ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో రఘునాథపల్లి టీడీపీ మండల అధ్యక్షుడిగా పని చేసిన ఆయన, 2001లో జెడ్పీటీసీగా గెలుపొంది, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. రఘునాథపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఆయనకు కడియం బాధ్యతలు అప్పగించారు. జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌గా పని చేసి, కడియం శ్రీహరి నాయకత్వంలో కావ్యను ఎంపీగా గెలుపించేందుకు కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్ర భుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూ రి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ప్రతి ఒక్కరి సహకారంతో జిల్లా గ్రంథా లయ చైర్మన్‌గా అవకాశం వచ్చిందని, ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జిల్లా గ్రంథాలయ చైర్మ న్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉద్యోగ నియామక ఇంటర్వ్యూలుజనగామ: జిల్లాలో 108, 102 అంబులెన్స్ డ్రైవర్లు (పైలట్), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల (ఈఎంటీ) ఉద్యోగ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నల్ల గొండ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎస్కె నసీరొద్దీ న్, జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ పైలట్, ఈఎంటీ ఉద్యోగాలకుఈ నెల 18న (సోమవారం) జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 108 కార్యాలయంలో ఉదయం 10 గంటల ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 800893 5522 నంబర్లో సంప్రదించాలన్నారు. ●సంతోషంగా బతుకమ్మ ఆడుతా మాది ఖతర్. నాకు నిట్ వరంగల్‌కు రావాలంటే మొదట భయం వేసింది. అడ్మిషన్ తీసుకున్నాక స్నేహితులు పెరిగారు. భయం పూర్తిగా తగ్గిపోయింది. మా దగ్గర లేని ఎన్నో పండుగలను నిట్ వరంగల్‌లో జరుపుకుంటాం. నాకు ప్రత్యేకంగా బతుకమ్మ ఆట అంటే చాలా ఇష్టం. ఎంతో ఉత్సాహంగా నేను మా స్నేహితులం బతుకమ్మ ఆడతాం. పండుగలు జరుపుకోవడం అంటే ఆనందం పంచుకోవడమే కాకుండా పరస్పరం ఒకరి గురించి మరొకరం తెలుసుకునే అవకాశం ఉంటుంది. – గాయత్రి, ఖతర్, మెకానికల్ సెకండియర్ ఇంటిని తలపించే వాతావరణం నిట్ వరంగల్ క్యాంపస్ సొంత ఇంటిని తలపించేలా ఉంది. నేను భూటాన్ నుంచి వచ్చినా కూడా.. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు అంటే చాలా ఇష్టమయ్యేలా నిట్ వరంగల్ నేర్పించింది. ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు కై ట్స్ ఎగురవేస్తున్నాం. దసరా, దీపావళి, హోలీ పండుగలను కలర్ఫుల్గా జరుపుకుంటున్నాం. భూటాన్‌లోని మా సొంత ఊరికి వెళ్లినప్పుడు తెలంగాణ పండుగలను మా వారికి పరిచయం చేస్తున్నా. – సోనమ్ షెవాంగ్, భూటాన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సెకండియర్తెలంగాణ ఫుడ్ చాలా ఇష్టం నేను ఇండోనేషియా నుంచి నిట్ వరంగల్‌లో దాసా ద్వారా అడ్మిషన్ పొందిన తర్వాత ఇక్కడి ఫుడ్‌ను టేస్ట్ చేయడం ప్రారంభించా. నిట్‌లోని హాస్టల్స్‌లో అందించే నార్త్ ఇండియన్తోపాటు తెలంగాణ ఫుడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకంగా తెలంగాణ చికెన్, సర్వ పిండి ఎంతో ఇష్టంగా తింటాను. ఇండోనేషియాకు వెళ్లడం కంటే ఇండియాలోనే ఉండిపోవాలని ఉంది. – ఫర్రాస్ చైదర్, ఇండోనేషియా, మెకానికల్ థర్డ్ ఇయర్ నిట్ చాలా బాగుంది.. నిట్ వరంగల్ క్యాంపస్ చాలా బాగుంది. అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. రష్యా కంటే కూడా నిట్ వరంగల్ క్యాంపస్ ఎంతో సేఫ్ అనిపిస్తుంది. తరచూ నగరంలోని భద్రకాళి, వేయిస్తంభాల ఆలయం దర్శిస్తుంటా. నిట్ వరంగల్‌కు దగ్గరలో ఉన్న దాబాలో టేస్టీ ఫుడ్ తినడం చాలా ఇష్టం. ఎంటెక్ కూడా నిట్‌లో చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రతీ ఏడాది నిట్‌లో నిర్వహించే టెక్నోజియాన్, స్ప్రింగ్‌స్ప్రీ ప్రోగ్రాంలో తెలుగు విద్యార్థులతో పోటీ పడి పాల్గొంటున్నా. – సామ్రాట్, రష్యా, సీఎస్ఈ ఫోర్త్ ఇయర్ న్యూస్రీల్పరదేశీ విద్యార్థులను అక్కున చేర్చుకుంటున్న వరంగల్ నిట్నిట్ వరంగల్‌లో విదేశీ విద్యార్థులు చేరేందుకు 2001లో అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా దాసా భవనం ఏర్పాటు చేశారు. కాగా.. ప్రతీ ఏడాది బీటెక్ ప్రథమ సంవత్సరంలోకి 1,300 మంది విద్యార్థులు జేఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా జోసా అడ్మిషన్స్‌తో ప్రవేశం పొందుతున్నారు. 1,300 సీట్లలో 90 సీట్లను డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్(దాసా) పేరిట విదేశీ విద్యార్థులకు ప్రవేశం లభిస్తోంది. ఈ విద్యాసంస్థలో ఇండోనేషియా, రష్యా, ఖతర్, నేపాల్, నైజీరియా తదితర దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. అడ్మిషన్ ఫీజు తక్కువే.. విదేశాల్లో రూ.లక్షల్లో అడ్మిషన్ ఫీజులు ఉండగా.. నిట్ వరంగల్‌లో దాసా విద్యార్థులకు 42,500 అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు దాసా ద్వారా నిట్ వరంగల్‌లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాబోధనతోపాటు క్యాంపస్ సెలక్షన్స్‌కు ప్రత్యేక వేదికగా నిలుస్తున్న నిట్ వరంగల్‌లో చేరేందుకు విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. భద్రత, స్నేహభావానికి ప్రతీక ఓరుగల్లు విదేశీయులు తమ సొంత ఊరిలో ఎలా స్వేచ్ఛగా భద్రంగా జీవనం కొనసాగిస్తారో.. అంతకు మించి భద్రతను కల్పిస్తున్నది ఓరుగల్లు నగరం. ఇక్కడ విద్యనభ్యసించేందుకు తమ పిల్లలను పంపించేందుకు విదేశాల్లో ఉన్నవారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇక్కడి పండుగల్లో స్థానిక విద్యార్థులతో కలిసి విదేశీయులు పాల్గొంటున్నారు. -
‘సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా’
జనగామ జిల్లా: దేవునూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.‘ దమ్ముంటే రాజయ్య నా సవాల్‌ను స్వీకరించాలి. దళితబంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తా. సవాల్లో ఓడితే.. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ. మరోసారి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబం. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
గిరిజనుల ఆశాజ్యోతి బిర్సాముండా
జనగామ రూరల్: గిరిజనుల ఆశాజ్యోతి బిర్సాముండా అని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన గౌరవ దినోత్సవ సమారోహం వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అధికారులుతో కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ భాగస్వాములు అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం దర్తి ఆబా జన గ్రామ ఉత్కర్శ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రాంభించారు. జిల్లాలో జనగామ, నర్మెట, తరిగొప్పుల, చిల్పూరు, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలను ఈ పథకం ద్వారా ఎంపిక చేసి ఆయా మండలాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరీకి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి ప్రేమకళ, వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్, విద్యాశాఖ అధికారి రాము, ఏఓ మన్సూరి, గోపి, వాసు నాయక్, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కలెక్టరేట్లో 150వ జయంతి -
రేపు ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: కమల్‌కింగ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి జి.రాంప్రసాద్ తెలిపారు. అండర్–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగంలో నిర్వహించే పోటీల వాల్‌పోస్టర్లను శుక్రవారం ప్రభుత్వ న్యాయవాది కె.నర్సింహరావు ఆవిష్కరించారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించే ఈపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని రాంప్రసాద్ తెలిపారు. పేర్లు నమోదు, ఇతర వివరాల కోసం 96760 56744 నంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో షేక్సలీమ్, మార్టిన్ పాల్గొన్నారు. -
అభివృద్ధి బాటలో రైల్వే ఈసీసీఎస్
కాజీపేట రూరల్: రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఈసీసీఎస్)ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఈసీసీఎస్ ఎం.డి, మజ్దూర్ యూనియన్ ఏడీఎస్ చిలుకుస్వామి అన్నారు. కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్ ఎదుట శుక్రవారం రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్.కె.జానీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. ఈమీటింగ్‌లో చిలుకుస్వామి మాట్లాడుతూ.. డిసెంబర్ 4, 5 తేదీల్లో జరిగే ఎన్నికల్లో జెండా గుర్తుకు ఓటు వేయాలన్నారు. సీసీఎస్ సొసైటీలో మజ్దూర్ యూనియన్ పాలక మండలి ఎనిమిది నెలల్లో రెండు సార్లు డివిడెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైల్వే కార్మికుల సమస్యల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచీ సెక్రటరీ పి.వేదప్రకాశ్, ట్రెజరర్ జి.రాజేశ్వర్‌రావు, అసిస్టెంట్ సెక్రటరీ యాదగిరి, నరేశ్‌యాదవ్, వైస్ చైర్మన్ తిరుపతి, భాస్కర్‌రెడ్డి, వి.యాదగిరి, నాగరాజు, డి.వెంకట్, అశోక్, సంఘీ శ్రీనివాస్, వి.శ్రీనివాస్, చేరాలు, శ్రీధర్, రవీందర్, శంకర్, చంద్రమౌళి, నలినికాంత్, జానీ, సుబానీ, అజిముద్దీన్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలన విజయోత్సవం
వరంగల్ వేదికగా... సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ వేదిక కానుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ’సభను ఓరుగల్లులో నిర్వహించాలని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి... శుక్రవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులతో జరిపిన సమీక్షలో నిర్ణయించారు. ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 9 వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ తొలిసభకు వరంగల్‌ను వేదిక చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే రోజు వరంగల్ వేదిక నుంచి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల వరంగల్ పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభావేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాలకు సంబంధించి రూట్ మ్యాప్ తయారీలో అధికార యంత్రాంగం బిజీ అయ్యింది. హైదరాబాద్‌లో కలెక్టర్లతో సీఎస్ సమీక్ష.. ముఖ్యమంత్రి రేవంత్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు శుక్రవారం పరిశీలించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, పనుల సమీక్ష, తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి వారు చర్చించారు. హెలిపాడ్‌తోపాటు సభను నిర్వహించే ఆర్ట్స్ కళాశాల మైదానం, బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రం, కాజీపేట ఆర్వోబీని పరిశీలించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో కలెక్టర్లు, కమిషనర్లతో సీఎస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో హుటాహుటిన శుక్రవారం సాయంత్రం రెండు జిల్లాల కలెక్టర్లు డా.సత్యశారద, ప్రావీణ్య, పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సచివాలయం ఆవరణలో రాత్రి వరకు రాష్ట్ర అటవీ, పర్యాటకశాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన, రూట్ మ్యాప్, సభావేదిక ఏర్పాటు తదితర అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది. 19న ఓరుగల్లుకు సీఎం రేవంత్.. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ సభ ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రుల హాజరు 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు ఇక్కడినుంచే శ్రీకారం నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం సీఎం సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు.. కలెక్టర్లు, కమిషనర్లతో సీఎస్ అత్యవసర భేటీ... ఏర్పాట్లపై నేడు వరంగల్‌కు టీపీసీసీ చీఫ్, మంత్రులు...నేడు హనుమకొండకు పీసీసీ చీఫ్, మంత్రులు... ప్రజాపాలన విజయోత్సవ సభ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి శనివారం హనుమకొండకు వస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, రెండు రోజులుగా కలెక్టర్లు, పోలీసు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌తో పాటు మంత్రులు హెలిపాడ్, సభావేదిక, కాళోజీ కళాక్షేత్రం, కాజీపేట ఆర్వోబీ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. విజయోత్సవ సభ, సీఎం పర్యటన సక్సెస్ కోసం జనసమీకరణపై చర్చించనున్నారు. -
అరగంట ముందే చేరుకోవాలి
జనగామ రూరల్: జిల్లాలో గ్రూప్– 3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ మూడు దఫాలుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పరీక్ష రాసేలా అన్ని చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ విధానంపై చీఫ్ సూపరింటెండెంట్, బయోమెట్రిక్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు. ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు పేపర్–2, 18న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్– 3 పరీక్ష జరగనుంది. ఇప్పటికే కలెక్టరేట్‌కు పరీక్షాకు సంబందించిన ఓఎంఆర్ షీట్లు చేరుకున్నారు. శనివారం వరకు ప్రశ్న పత్రాలు చేరుకోనున్నాయి. 16 పరీక్ష కేంద్రాలు.. జిల్లాలో మొత్తం 5,446 మంది అభ్యర్థులకు 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరుకానున్నట్లు పరీక్షల కన్వీనర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య వివరించారు. పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు 16, డిపార్ట్మెంటల్ అధికారులు 16, అబ్జర్వర్లు 16, ఫ్లయింగ్ స్క్వాడ్లు 4, బయోమెట్రిక్ అధికారులు 43, ఐడెంటిఫికేషన్ అధికారులు 55, నాలుగు రూట్లలో నలుగురు రూట్ అధికారులను నియమించారు. కాగా రెండు రోజుల పాటు జరిగే గ్రూప్–3 పరీక్షకు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుండా సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉండేలా ఆర్టీసీ డీఎం స్వాతి ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల సందేహాల నివృతికి ఇబ్బందుల రాకుండా కలెక్టరేట్లో కంట్రోల్ నంబర్ 9052308621ను ఏర్పాటు చేశారు. గ్రూప్–3 పరీక్షకు సర్వం సిద్ధం జిల్లాకు చేరుకున్న ఓఎంఆర్ షీట్స్ సందేహాల నివృత్తికి 9052308621 కంట్రోల్ నంబర్ -
యంత్రాలు ఇచ్చారు.. టెక్నీషియన్లను మరిచారు
జనగామ: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 134 రకాల ఉచిత వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో పూర్తి స్థాయి సేవలు లేనప్పటికీ, ఖరీదైన పరీక్షలు చేస్తున్నారు. మండలాల వారీగా జిల్లా ఆస్పత్రి, ఎంసీహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల నుంచి రోజువారీగా వైద్యుల సలహాలు, సూచనల మేరకు రక్త నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. ఇక్కడ పరీక్షలు చేసిన తర్వాత నేరుగా రోగుల మొబైల్ నంబర్‌కు జనరల్ మెసేజ్ వెళుతుంది. దీని ఆధారంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకుంటారు. ఇప్పుడున్న సేవలను పెంచాలనే లక్ష్యంగా పలు రకాల పరీక్షలకు సంబంధించి రూ.లక్షలు ఖరీదు చేసే యంత్రాలను ప్రభుత్వం మంజూరీ చేసింది. కానీ యంత్రాల ద్వారా పరీక్షలు చేసే టెక్నీషియన్లు, కెమికల్స్ ఇవ్వడం మరిచింది. ఫ్లోరోసిన్ మైక్రోస్కోప్ యంత్రం ధర సుమారు రూ.14లక్షల వరకు ఉంటుంది. మోకాళ్ల నొప్పులను గుర్తించేందుకు వ్యక్తి శరరీంలో రక్తం శాంపిళ్లను సేకరించి దీనిపై పరీక్షిస్తారు. ప్రైవేట్‌లో ఈ పరీక్షలకు సుమారుగా రూ.15వందల వరకు ఖర్చు అవుతుంది. ఈ యంత్రంపై రక్త పరీక్షలు చేసేందుకు మైక్రో బయాలజిస్టు టెక్నీషియన్ ఉండాలి. పైఫొటో కనబడుతున్న యంత్రం కో ఆగ్లో మీటర్. రక్తం గడ్డ కట్టడానికి 18 ఫ్యాక్టర్లు అవసరం. ఏ ఫ్యాక్టర్‌లో లోపం ఉందని తెలుసుకునేందుకు ఈ యంత్రంపై పరీక్షిస్తారు. రూ.18 ల క్షల విలువ చేసే ఈ పరికరాన్ని రెండేళ్ల క్రితం డయాగ్నోస్టిక్‌కు పంపించారు. ఈ పరీక్షలు ప్రైవేట్‌లో చేయించుకోవాలంటే సుమారు రూ.12 వందల వరకు ఖర్చు అవుతుంది. పాథాలజిస్టు, శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి. మూలనపడిన విలువైన పరికరాలు ఉత్సవ విగ్రహంలా టీజీ డయాగ్నోస్టిక్