Nandyala
-
‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
నంద్యాల(న్యూటౌన్): ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణంలోని టెక్కె పురపాలక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి సిలబస్, ఫలితాల పెంపు, మధ్యాహ్న భోజనం తదితర వాటిపై ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి టీచర్ అర్థవంతంగా విద్యాబోధన చేసి వందశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. ఎవరైనా విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బ్రహ్మంనాయక్, సీఆర్పీలు పాల్గొన్నారు. పనుల్లో నాణ్యత తప్పనిసరి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన సిబ్బందికి సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహనిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పరిపాలనాంశాల్లో భాగంగా పలు ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. ముందుగా సున్నిపెంటలో నిర్మిస్తున్న వసతి గృహాలను పరిశీలించారు. జంగిల్ క్లియరెన్స్, సంప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిల్లలు అడుకునేందుకు వీలుగా వసతిగృహాల వద్ద అటస్థలం కూడా ఉండాలన్నారు. హఠకేశ్వరం వద్ద భక్తులు సేదతీరేందుకు యాత్రిక షెడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. శౌచాలయాలు, స్నానపుగదులు, జల్లుస్నానం ఏర్పాటు చేయాలని అన్నారు. నీటిగుండం చుట్టు కటాంజనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం గణేశసదనంను పరిశీలించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి, డీఈఈ చంద్రశేఖరశాస్త్రి, సుబ్బారెడ్డి, ఏఈలు పాల్గొన్నారు. జిందాల్ ఫ్యాక్టరీకి పొడి చెత్త నంద్యాల(న్యూటౌన్): నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని కంపోస్టు యార్డు నుంచి పొడి చెత్తను జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం కంపోస్టు యార్డును పరిశీలించిన ఆయన పొడి చెత్తను తీసుకెళ్లేందుకు కంపెనీ యాజమాన్యం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ ఇంజినీర్ డీఈ రసూల్, శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్, జిందాల్ ఫ్యాక్టరీ ఏజీఎం అన్వేష్, సీనియర్ మేనేజర్ గోపి, తదితరులు పాల్గొన్నారు. అన్నదానం మిన్న ఆళ్లగడ్డ: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాలన్ అన్నారు. దిగువ అహోబిలం దేవాలయ ప్రాంగణంలో బుధవారం రంగారావు గోష్టి వారి ఆధ్వర్యంలో కార్తీకమాసం అన్నదానం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానార్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారావు గోష్టి సభ్యులు పెనముర్తి ప్రసాదారావు, రవికాంత్ చౌదరి, హిమబిందు, ఉప్పల ప్రసాద్, వీరచంద్ర తదితరులున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మల్లీశ్వరి బొమ్మల సత్రం: నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా మల్లీశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పులివెందుల జీజీ హెచ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమెను ఉన్నతాధికారులు ఇటీవల ఇక్కడికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన కొంత సేపటికే ఆమె తిరిగి సెలవులపై వెళ్లిపోయ్యారు. -
5 నెలలుగా కోచింగ్
చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపై పెట్టడంతో ఏం ఆలోచించకుండా వెంటనే కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నంద్యాలలో డీఎస్సీ కోచింగ్ బాగుంటుందని స్నేహితులు చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. నెలకు రూ.5వేలు చొప్పున ఐదునెలలుగా హాస్టల్లో ఉంటున్నాను. డీఎస్సీ కోచింగ్‌కు రూ.14వేలు కట్టాను. మొత్తం ఇప్పటి వరకు రూ.50 వేలవరకు ఖర్చు అయ్యింది. డీఎస్సీ ఊసే లేదు. ఎన్ని నెలలు ఇక్కడ ఉండాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలి. –చంద్రకాంత్, రాచర్ల, ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ విడుదల చేయాలి డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సొంత ఊర్లు వదిలి ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నాం. వేలాది రూపాయలు కోచింగ్‌లు, హాస్టళ్లకు ఖర్చు అవుతు న్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. వాయిదాల మీద వాయిదా లు వేస్తోంది. నంద్యాలలో గత మూడు నెలలుగా నేను కోచింగ్ తీసుకుంటున్నా. ఎన్ని నెలలు కోచింగ్ సెంటర్లో ఉండాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి హామీని నెరవేర్చుకోవాలి. –లీలావరలక్ష్మి, బద్వేల్, వైఎస్సార్ జిల్లా -
వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం చేయండి
పాణ్యం/బేతంచెర్ల: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 6 మండలాల్లో 138 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బేతంచెర్ల మండల పరిధిలోని బుగ్గానిపల్లె తండా వద్ద ఉన్న నీటి శుద్ధి ప్లాంట్‌ను బుధవారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిపై మెగా సంస్థ ప్రతినిధులతో చర్చించారు. పనులకు ఎక్కడా అవాంతరాలు జరగకుండా ఆర్ డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికా రులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వాటర్ గ్రిడ్ పథకం ద్వారా బేతంచెర్ల పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే మార్చి నాటికి డోన్ అర్బన్, రూరల్‌కు తాగునీరు అందించే పనులు పూర్తి కావాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మనోహర్, డీఈ సోమశేఖర్ , మెగా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ వాసు, డోన్ ఆర్డీఓ నరసింహులు పాల్గొన్నారు. గోరుకల్లు జలాశయం పరిశీలన పాణ్యం మండల పరిధిలోని గోరుకల్లు జలాశయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సుభకుమార్తో నీటి నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత వాటర్ గ్రిడ్ పథకం కింద నిర్మించిన గోరుకల్లు–డోన్ పైపులైన్ పనులను పరిశీలించారు. ఇన్టెల్ వద్ద ప్రాజెక్టు రూపకల్పనను తిలకించారు. కలెక్టర్ వెంట డీఈఈ జ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి నంద్యాల: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఏపీఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐిసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ లక్ష్యాలు, ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడంలో పగిడ్యాల, కొత్తపల్లి, ఆత్మకూరు, డోన్, బేతంచెర్ల తదితర మండలాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని చెప్పారు. గ్రామానికి రెండు చొప్పున ఫాంపాండ్స్, మండలానికి పది చొప్పున ఫిష్ పాండ్స్, రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అలాగే జిల్లాలో గృహ నిర్మాణాల పనులు ముమ్మరం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మావేశంలో డ్వామా పీడీ జనార్దన్ రావు, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, ఈఈ హరిహర గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పైపు లైన్ పనుల పరిశీలనలో జిల్లా కలెక్టర్ -
స్టాంపుల కౌంటర్ ఏర్పాటు
ఆళ్లగడ్డ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపులు విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్ తెరిచారు. జిల్లాలో స్టాంపు పేపర్ల బ్లాక్ దందాపై ఈ నెల 15వ తేదీన ‘అక్రమాలకు స్టాంపు’ శీర్షికన సాక్షి ప్రచురించిన ప్రత్యేక కథనంపై అధికారులు స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన స్టాంపులను వాటిపై ఉన్న ధరకే విక్రయిస్తున్నారు. గత కొన్ని మాసాలుగా స్టాంప్ వెండర్లు కృతిమ కొరతను సృష్టించి స్టాంప్‌ల ధరను పది రెట్లు పెంచి విక్రయించారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రజలకు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయంలోనే సరసమైన ధరలకే స్టాంపులు దొరుకుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ చైతన్య రాయలు మాట్లాడుతూ స్టాంపులు కావలసిన వారు కార్యాలయంలో తీసుకోవాలన్నారు. వెండర్లు కూడా స్టాంపులపై ఉన్న ధరకే విక్రయించాలని, అధికంగా వసూలు చేసినట్లు పిర్యాదులు వస్తే వెంటనే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. -
ప్యాపిలి మండలంలో యురేనియం పరీక్షలకు టెండర్లు
ప్యాపిలి: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాల విషయం పూర్తిగా సద్దుమణగక ముందే నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో యురేనియం నిక్షేపాల పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. మండలంలోని మూడు గ్రామాల్లో బోర్ డ్రిల్లింగ్కు ఏఎండీ (అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్) టెండర్లు ఆహ్వానించినట్లు సమాచారం. మండల పరిధిలోని మామిళ్లపల్లి, రాంపురం, జక్కసానికుంట్ల తదితర గ్రామాల్లో 5 కి.మీ పరిధిలో డ్రిల్లింగ్కు టెండర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఒక్కో బోర్ 450 అడుగుల నుంచి 1,350 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ వేయాలని నిర్ణయం తీసుకుంది. గత నెల 10న టెండర్ ఆహ్వానించి ఈనెల 18 వరకు ఏఎండీ గడువు ఇచ్చింది. ఈ విషయంపై స్థానిక అధికారులను వివరణ కోరగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. కాగా ఇటీవలే కపట్రాళ్లతో పాటు మరో 15 గ్రామాల్లో యురేనియం తవ్వకాల కోసం 60 బోర్లు వేసే ప్రయత్నాలను స్థానికులు అడ్డుకోగా ప్రభుత్వం కొంత వెనకడుగు వేసిన విషయం విధితమే. -
డీఎస్సీ కోసం కుటుంబానికి దూరంగా ..
ఈమె పేరు దుర్గాభవాని. రాజమండ్రి పట్టణానికి చెందిన ఈమె ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తుండేది. టెట్ ఫలితాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో నమ్మింది. ప్రైవేట్ ఉద్యోగం వదిలేసి భర్త, కుటుంబ సభ్యులను ఒప్పించి డీఎస్సీ శిక్షణ కోసం నంద్యాలకు వచ్చింది. ఇక్కడ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. టెట్ ఫలితాలు విడుదలైనా నోటిఫికేషన్ వెలువడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతుంది. బాబును నమ్మి.. 50 వేలు ఖర్చు చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు హనుమంత్ నాయక్. సత్యసాయి జిల్లా కదిరి పట్టణం. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో ఆశతో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి కోచింగ్ కోసం నంద్యాలకు వచ్చాడు. నాలుగు నెలల నుంచి ఇక్కడి ఓ ప్రైవేటు హాస్టల్లో శిక్షణ తీసుకుంటూ ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ వస్తుందని గట్టిగా నమ్మాడు. ప్రస్తుతం ఆ ఊసే లేకపోవడంతో కోచింగ్, హాస్టల్‌కు ఇప్పటికే రూ. 50 వేలు ఖర్చు అయ్యాయని..ఇంకా ఎన్ని నెలలు ఎదురుచూడాలోనని వాపోతున్నాడు. -
డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. ఎన్నికల ముందు హడావుడి చేసి అధికారంలోకి వచ్చాక అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తోంది. చంద్రబాబు తొలి సంతకాన్ని నమ్మి ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి కొందరు, కుటుంబాన్ని, పిల్లలను దూరంగా వదిలేసి మరికొందర
నంద్యాల: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియడంతో డీఎడ్, బీఎడ్ చేసిన 40వేలకు పైగా మంది అభ్యర్థులు ఆశలు పెంచుకున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూశారు.తాను అధికారంలోకి రాగానే డీఎస్సీ పోస్టుల భర్తీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీంతో పలువురు నంద్యాల, కర్నూలు, విజయవాడ, అవనిగడ్డ, తిరుపతి వంటి పట్టణాలకు కోచింగ్‌కు వెళ్లారు. వీరిని నమ్మించేందుకు మరోసారి హడావుడిగా టెట్ నిర్వహించారు. తర్వాత ఈ పరీక్ష ఫలితాలు విడుదలైన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. టెట్ ఫలితాలు విడుదలై 15 రోజులు దాటినా నోటిఫికేషన్ రాలేదు. వేలకు వేలు ఖర్చు పెట్టుకొని నెలల తరబడిగా కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఎస్సీవర్గీకరణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ ఉండదా? డీఎస్సీ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన అనంతరం విడుదల చేస్తామని మంత్రి లోకేష్ చెప్పినట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు పత్రిక ముఖంగా ప్రకటించారు. అంతేగాకుండా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సైతం వర్గీకరణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ విడుదల చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన కూటమి సర్కారు ఇప్పుడు కావాలనే కాలయాపన చేస్తోందని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కమిషన్ వేయగా ఏపీ ప్రభుత్వం మాత్రం రెండు రోజుల క్రితం రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రాతో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక రెండు నెలల్లోగా ఇవ్వాలని గడువు విధించింది. ఆ సమయంలోగా నివేదిక ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని నెలలకు వర్గీకరణ చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ తరుణంలో అసలు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే విద్యాసంవత్సరం నాటికి విడుదల చేయడం కూడా కష్టమేనని కొందరు చెబుతున్నారు. అన్ని పనులు మానుకొని వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన తేదీని ప్రకటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో బాబు చెలగాటం అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా కాలయాపనే నోటిఫికేషన్‌పై నేటికీ కొరవడిన స్పష్టత జిల్లాలో వేలాది మంది అభ్యర్థుల ఎదురు చూపు ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు డీఎస్సీ ఉండదని ప్రచారం ఇప్పటికే కోచింగ్ కోసం వేలాది రూపాయలు ఖర్చు 2,645 ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం డీఎస్సీ పోస్టులు 40,000 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు రూ. 50 వేలు ఒక్కో అభ్యరి శిక్షణ, హాస్టల్ ఇతర వాటి ఖర్చు మొత్తం -
ఉపాధిలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
మిడుతూరు: ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ జనార్దన్ రావు హెచ్చరించారు. మిడుతూరు మండలంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన 17వ సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ కింద దాదాపు రూ.7 కోట్ల విలువ చేసే పనులు చేపట్టగా రూ. 26 లక్షలు అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ సభ్యులు వెల్లడించారు. చెరుకుచెర్ల, మిడుతూరు గ్రామ పంచాయతీల పరిధిలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగంతో పాటు కూలీలు లేకుండానే మస్టర్లో హాజరు నమోదు చేసినట్లు తేలిందన్నారు. అయితే, దుర్వినియోగం రూ. 26 లక్షలు జరిగితే డ్వామా అధికారులు రూ. 4, 66, 642 కు మాత్రమే రికవరీకి ఆదేశించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో చెరుకుచెర్ల ఫీల్డ్ అసిస్టెంట్‌పై డ్వామా పీడీ జనార్దన్ రావు విచారణకు ఆదేశించారు. నిబంధనల ప్రకారం 70 శాతం పనులు ఉపాధి కూలీలతో చేపడతామని, 30 శాతం రోలింగ్ చేయడానికి ఆవకాశం ఉన్నట్లు పీడీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దశరథరామయ్య, నంద్యాల డివిజన్ ఏపీడీ బాలజీ నాయక్, అసిస్టెంట్ డీవీఓ షీబారాణి, ఏపీఓ జయంతి, క్వాలిటీ కంట్రోల్ అధికారి గంగాద్రి, ఎస్ఆర్పీ మురాద్, , డీఆర్పీలు పాల్గొన్నారు. ● సామాజిక తనిఖీ బహిరంగ సమావేశంలో డ్వామా పీడీ జనార్దన్ రావు ● రూ. 4, 66, 642 రికవరీకి ఆదేశం -
‘స్వర్ణరథం’పై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఈ కార్యక్రమం నిర్వహించింది. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి ఆలయ నాలుగు మాఢవీధుల గుండా ఈ కార్యక్రమం సాగింది. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణ రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, సహయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
త్రిశంకు స్వర్గంలోస్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్
● ప్రారంభమై 8 నెలలైనా మొదలుకాని సేవలు ● రూ. కోట్ల విలువైన యంత్రాలున్నా అనుమతులు తెచ్చుకోలేని వైనం ● 120 పడకల ఆసుపత్రిలో ఒక్కటీ కూడా రాలేదు ● రోజుకు ఓపీ 10 నుంచి 15 దాటని వైనం ● గత ప్రభుత్వం నిర్మించిందనే కారణంతో కూటమి ప్రభుత్వం జాప్యం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవనం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 2017లో అంకురార్పణ జరిగింది. రూ.120 కోట్ల అంచనాతో నిర్మించిన ఈ ఆసుపత్రికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.50 కోట్లను విడుదల చేసింది. 2018లో టాటా ట్రస్ట్ వారు వచ్చి స్థలాన్ని పరిశీలించి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి వెళ్లింది. రాష్ట్ర వాటా కింద రూ.36 కోట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో రెండు లీనియర్ యాక్సిలరేటరీలు, ఒక సీటీ సిమ్యులేటర్, ఒక హైడోస్ రేట్ బ్రాకోథెరపీ మిషన్ల ఏర్పాటుకు అవసరమైన నాలుగు బంకర్ల నిర్మాణానికి అప్పట్లో టాటా అటానమిక్ ఎనర్జీ వారు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో ప్రస్తుతం హెచ్డీఆర్ బ్రాకోథెరపీ మిషన్ మాత్రం రావాల్సి ఉంది. రూ.30కోట్లతో లీనియర్ యాక్సిలరేటరీ, రూ.10కోట్లతో సీటీ స్టిమ్యులేటర్ ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి టాటా అటానమిక్ ఎనర్జీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. 2019 జనవరిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసినా ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కోవిడ్ రావడం, ఇసుక కొరత తదితర కారణాల వల్ల భవన నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇదే క్రమంలో 2022లో క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపీ ఎండీ పీజీ సీటును నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో ఆగిపోయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేలా చేసింది. ఈ క్రమంలో గత మార్చి నెలలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నికగన్న ఆసుపత్రి అవుతుందని ప్రారంభ సమయంలో అందరూ భావించారు. ఆ వెంటనే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించి, ప్రారంభించిందనే కారణంతో కూటమి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో తాత్సారం చేస్తోంది. పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కాకపోవడం, వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఇక్కడకు రోగులు సైతం ఓపీకి రావడం లేదు. ఈ మేరకు అధికారులు, వైద్యులు సైతం ధైర్యంగా ఇక్కడ అత్యాధునిక సేవలు అందుతాయన్న భరోసా కల్పించలేకపోతున్నారు. ఇందులో అదనంగా లీనియర్ ఆక్సలరేటర్, ఎక్స్టర్నల్ ఆర్టీ మిషన్, సీటీ స్కాన్లు, పలు రకాల పరికరాలు రావాల్సి ఉంది. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు గత ప్రభుత్వం 247 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు గత డిసెంబర్లో నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పోస్టులు భర్తీ చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మళ్లీ నోటి ఫికేషన్ ఇవ్వాలన్న ప్రయత్నాలు చేస్తోంది. ఈ కారణంగా ఆయా విభాగాలు, ఇతర ఆసుపత్రుల నుంచి 60 మంది వైద్యులు, సిబ్బంది మాత్రం ఇక్కడకు వచ్చి చేరారు. ప్రస్తుతం ఇద్దరు సర్జికల్ ఆంకాలజిస్టులు, ఒక మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజీలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. వీరితో పాటు ఇద్దరు పెథాలజిస్టులు, ఇద్దరు సైకియాట్రిస్ట్‌లు ఇక్కడ సేవలందిస్తున్నారు. ప్రీవెంటివ్ ఆంకాలజీ ఓపీ సైతం ప్రతి మంగళ, గురువారాల్లో నిర్వహిస్తున్నారు. కానీ రోగులే ఎవ్వరూ రావడం లేదు. మంజూరైంది 247... భర్తీ చేసింది 60 మందిని మాత్రమే ఓపీకి 10 మంది మాత్రమే రోగులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసో.. పేదలంటే అలుసో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వైద్య సేవలను విస్మరిస్తోంది. పాలకుల నిర్లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోతోంది. భవనం ఉన్నా అవసరమైన పరికరాలు, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులు ప్రైవేటు బాట పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు ఓపీలో కూర్చుంటున్నా పట్టుమని పది మంది కూడా రోగులు చికిత్స కోసం రావడం లేదు. మంజూరైన పోస్టుల్లో 30 శాతం కూడా పోస్టులు భర్తీ చేయకపోవడం, ఉన్న వారికి పనిలేకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతుంది. 120 పడకల్లో ఒక్కటీ రాలేదు 120 పడకలతో ఏర్పాటైన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పడక కూడా ఏర్పాటు చేయలేదు. ఈ కారణంగా పాత క్యాన్సర్ విభాగంలోనే అవసరమైన అడ్మిషన్లు చేస్తున్నారు. రోగులకు అవసరమైన ఆపరేషన్లు కూడా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి నెలా 15 మేజర్, 8 మైనర్ క్యాన్సర్ ఆపరేషన్లను వైద్యులు చేస్తున్నారు. క్యాన్సర్ విభాగంలో 8 ఐసీయూ పడకలు ఏర్పాటు చేసినా అవి అందుబాటులోకి రాలేదు. 9 ఎకరాల్లో నిర్మితమైన ఇంత పెద్ద భవనానికి కనీసం సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది కూడా కేటాయించలేదు. ఈ కారణంగా ఖరీదైన పరికరాలున్న ఈ భవనానికి రక్షణ లేకుండా పోయింది. అవసరమైన వైద్యులు, పారా మెడికల్, నర్సింగ్ సిబ్బందిని, నాల్గవ తరగతి ఉద్యోగులను నియమించి, తగిన పరికరాలను, పడకలను అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యసేవలు అందించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
త్వరగా పూర్తిస్థాయి సేవలందించాలి
కర్నూలు నగరంలో రాష్ట్రస్థాయి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావడం ఎంతో ఆనందకరం. ఇలాంటి ఆసుపత్రి సేవలను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత సమాజంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ మేరకు ప్రజల ఆహార, విహారాల్లో మార్పులు చేసుకునేలా సూచనలు చేయాలి. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలను చైతన్యపరచాలి. ఇది ఒక్క వైద్యులతోనే సాధ్యం అవుతుంది. ఒకవైపు వైద్యం చేస్తూనే మరోవైపు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలి. – డాక్టర్ ద్వారం ప్రభాకర్‌రెడ్డి, ఆయుర్వేద వైద్యులు, కర్నూలు ప్రభుత్వం వెంటనేవసతులు కల్పించాలి రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడో ఏర్పాటవుతుందనుకున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను కర్నూలులో ఏర్పాటైన ప్పుడు అందరూ సంతోషించారు. అయితే ఇది ప్రారంభమై 8 నెలలైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు కొనసాగకపోవడం బాధాకరం. ఇది పూర్తిస్థాయిలో సేవలు అందిస్తే రాయలసీమతో పాటు తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు సైతం ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం క్యాన్సర్ ఎంతో ఖరీదైన జబ్బుగా మారింది. దీనికి చికిత్సను పేదలు, మధ్యతరగతి ప్రజలు భరించేస్థితిలో లేరు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని అన్ని వసతులు, సౌకర్యాలు, పరికరాలతో పూర్తిస్థాయిలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో సేవలు అందించే ఏర్పాటు చేయాలి. – ఎ. వెంకట్, మెడికల్ రెప్, కర్నూలు ● -
శ్రీశైలానికి 4,479 క్యూసెక్కుల వరద ప్రవాహం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయానికి ఎగువ సుంకేసుల నుంచి మంగళవారం సాయంత్రం సమయానికి 4,479 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 160.9100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 874.40 అడుగులకు చేరుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,226 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 16,483 క్యూసెక్కుల నీరు విడుదలైంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3.127 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. పదిలో 100 శాతం ఫలితాలు సాధించాలి నంద్యాల(అర్బన్):పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను మంగళవారం ఆయన ఎంఈఓ బ్రహ్మంనాయక్తో కలిసి తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధన, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉంటే చదువు పూర్తిస్థాయిలో అబ్బుతుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలను మించి ఫలితాలు సాధించాలన్నారు. ఇందుకు ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శబరిమలకు ప్రత్యేక రైళ్లు నంద్యాల(రూరల్): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. డిసెంబర్ 23, 30 తేదీల్లో మచిలీపట్నం – కొల్లం (రైలు నెంబర్ 07147, 07148) వయా నంద్యాల మీదుగా ప్రత్యేక రైలు వెళ్తుంది. ఆయా తేదీల్లో రైలు రాత్రి 8.45 గంటలకు నంద్యాలకు చేరుకొని, కొల్లంకు మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుందని, అదేవిధంగా కొల్లంలో డిసెంబర్ 25, జనవరి 1 తేదీన ఉదయాన్నే 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 2.30 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని ఆయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఎంపీ శబరి మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. సాంకేతికతను మంచికే వినియోగించాలి బొమ్మలసత్రం: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా సూచించారు. మంగళవారం ఆయన స్థానిక కార్యాలయంలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాలు, సాంకేతికత వినియోగం, వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. చాలా మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో పడి మోసపోతున్నారన్నారు. వారి ప్రలోభాలకు లోనుకాకూడదన్నారు. ప్రసారమాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని అనాలోచితంగా ఇతరులతో పంచుకోరాదన్నారు. సైబర్ నేరాలకు పాల్పడితే విధించే శిక్షలు, తదనంతర పరిణామాలను వివరించారు. సీ్త్రల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఎలాంటి పరిస్ధితుల్లో అయినా పోలీసుల సహాయం కోసం 100, 112 నంబర్లకు, సైబర్ నేరాలతో మోసపోతే 1930 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ గాయత్రి, ఉపాధ్యాయులు సర్ఫరాజ్, అనిత, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో పరిహారం
● హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు కలెక్టర్ హామీ పాములపాడు: నేషనల్ హైవే 340 సి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ వారం రోజుల్లో పరిహారం అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం మండలంలోని యర్రగూడూరు, పాములపాడు, రుద్రవరం, క్రిష్ణారావుపేట గ్రామాల్లో జేసీ విష్ణుచరణ్‌తో కలిసి కలెక్టర్ పర్యటించారు. రహదారి నిర్మాణ పనులు పరిశీలించి బాధితులతో మాట్లాడారు. మండలంలో 1.98 కిలోమీటర్ల మేర రోడ్డుకు భూ సమస్య ఉందని, రహదారి నిర్మాణానికి ప్రజలు సహకరించడం లేదని నేషనల్ హైవే పీడీ కలెక్టర్‌కు తెలిపారు. పాములపాడు గ్రామంలోని సర్వే నెంబరు 62లో 0.38 సెంట్లకు గాను 1.11 ఎకరాలు స్థలం సేకరించారని స్థల యజమాని శ్రీనివాసరావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ అలైన్మెంట్ ప్రకారం తీసుకొని మిగతాది రైతుకు అప్పగించాలని హైవే అధికారులను ఆదేశించారు. ముర్తుజావలి, సుధాకర్ తదితర రైతులు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రహదారి నిర్మాణంలో భూములు, స్థలాలు కోల్పోతున్న వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2025 అక్టోబర్ నాటికి రహదారి నిర్మాణ పనులు పూర్తి కావాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంఈఓ బాలాజీనాయక్, డీటీ పఠాన్‌బాబు, ఆర్ఐ ఖాజాబీ తదితరులు ఉన్నారు. భూసేకరణ పూర్తి చేయండి నంద్యాల: జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మంగళవారం ఆమె తన చాంబర్లో జేసీ విష్ణు చరణ్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 340సి ప్యాకేజీ 4 కింద నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపా డు, ఆత్మకూరు మండలాలు మీదుగా వెళ్లే రహదారి కి సంబంధించిన భూసేకరణకు 39 ఎకరాలకు సంబంధించిన క్లెయిమ్స్ సంబంధిత మండల తహసీ ల్దార్ల నుంచి తెప్పించుకొని నిశితంగా పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని ఆర్డీఓలకు సూచించారు. 167కే ఒకటోప్యాకేజీ కింద (నంద్యాల నుంచిజమ్మలమడుగు వరకు) నంద్యాల, గోస్పాడు, దొర్నిపాడు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, సంజామల మండలాల మీదుగా వెళ్లే రహదారికి సంబంధించిన క్లెయిమ్స్ తెప్పించుకొని భూమిరాశి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. 167కే ప్యాకేజీ 4 కింద కొత్తపల్లె–ఆత్మకూరు, ఆత్మకూరు– వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల మండలాల్లో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ కూడా పాసయ్యాయని తెలిపారు. గుంటూరు – గుంతకల్ డబల్ రైల్వే లైనింగ్ పనులకు సంబంధించిన భూసేకరణను వెంటనే పూర్తి చేసి పంపాలన్నారు. -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
ఎమ్మిగనూరు రూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇంతకు మునుపు ఈనెల 19 వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. ఇప్పుడు దీనిని ఈనెల 26 వరకు పొడిగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అర్హులైన విద్యార్థులు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025 ఫిబ్రవరి 8వ తేదీన ఎంపిక పరీక్ష ఉంటుందని వెల్లడించారు. 9వ తరగతి విద్యార్థులు https://navodaya.gov.in వెబ్ సైట్లో, 11వ తరగతి విద్యార్థులు https:// cbseitms. nic. in/2023 వెబ్ సైట్లో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని కర్నూలు, నంద్యాల జిల్లాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
ఓం నమో శివ రుద్రాయ
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరి క్షేత్రం హర..హర..మహాదేవా అంటూ భక్తుల శివనామస్మరణతో మారుమోగింది. కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజాము నుంచే మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నేత్రానందభరితంగా సాగింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరి నేత్రానందభరితంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి -
శ్రీశైలక్షేత్రాభివృద్ధికి కృషి
● నూతన ఈఓ చంద్రశేఖర ఆజాద్ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవస్థానం నూతన ఈఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ అన్నారు. సోమవారం ఇన్చార్జి ఈఓ చంద్రశేఖరరెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకొని మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తామన్నారు. పది పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపు ఫీజు చెల్లించేందుకు గడువు ఉండగా ఈ నెల 26వ తేదీ వరకు పెంచారు. రూ.50 అపరాధ రుసుంతో 19 నుంచి 25వ తేదీలోపు, రూ.200 అపరాధ రుసుంతో 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ వరకు గడువు ఉందని డీఈఓ వెల్లడించారు. రెగ్యులర్ అభ్యర్థులకు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టులకుపైగా ఉంటే రూ.125, 3 సబ్జెక్టుల లోపు ఉంటే రూ.110, ఒకేషనల్ అభ్యర్థులకు అదనంగా రూ.60, తక్కువ వయస్సు కలిగిన అభ్యర్థులకు రూ.300, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం అవసరం అయితే రూ.80 ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు చెల్లింపు తదితర పూర్తి సమాచారం కోసం www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీఈఓ పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు బొమ్మలసత్రం: సున్నిపెంట గ్రామానికి చెందిన విఠల్ రావు, సంజయ్‌రెడ్డి, అనిల్ కుమార్ అనే వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.8.21 లక్షలు తీసుకుని మోసం చేశారని అదే గ్రామానికి చెందిన విక్టర్‌పాల్ ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ సమావేశ భవనంలో ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 78 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టపరమైన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక దాడి ఘటనపై డీఈఓ విచారణ
చాగలమర్రి: మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సదరు పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలను విచారించారు. కర్నూలు జువైనల్ హోంకు తరలించిన నిందితులిద్దరిని కూడా త్వరలో విచారిస్తామన్నారు. డీఈఓ వెంట డిప్యూటీ డీఈఓ బేగ్, జేసీబీఓ సువక్షల, ఎంఈఓలు అనురాధ, న్యామతుల్లా తదితరులు ఉన్నారు. -
ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి
నంద్యాల: వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ రాము నాయక్, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అ ర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాలవ్యవధిలో గా వాటికి పరిష్కారం చూపాలన్నారు. ఈవిషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు.పీజీఆర్ఎస్లో 183 దర ఖాస్తులొచ్చాయని, వీటిని పరిష్కరించాలన్నారు. ఎఫ్ఆర్బీఏ ఆధారంగానే జీతభత్యాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ బేస్డ్ అటెండెన్స్ (ఎఫ్ఆర్బీఏ) ఆధారంగానే జీతాల చెల్లింపు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు వివిధ అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకుని నిర్దేశించిన లక్ష్య సాధనపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో హౌస్ హోల్డ్ ఇమేజ్ జియో ట్యాగింగ్ సర్వే 35 శాతం పెండింగ్‌లో ఉందని తక్షణమే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అపార్ ఐడీ జనరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయిలో సిబ్బంది పనితీరు సరిగ్గా లేదని, జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం పీజీఆర్ఎస్కు 183 వినతులు -
న్యాయ సంస్థలు తరలిస్తే ఊరుకోం
అన్యాయాన్ని ప్రశ్నిద్దాం సీమ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని ప్రతి న్యాయవాది ప్రశ్నించాలి. ఇందుకు వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి సీమ ప్రజల గొంతుక వినిపించాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు విధులు బహిష్కరించి ప్రజా ఉద్యమం చేపట్టకపోతే న్యాయవాదులంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. గడిచిన 50 ఏళ్లుగా సీమ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఇకనైనా మనం మేలుకోవాలి. – వి.కృష్ణమూర్తి, న్యాయవాది ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కర్నూలులో ఏర్పాటైన వివిధ న్యాయ సంబంధ సంస్థలు తరలింపును కలిసికట్టుగా అడ్డుకుందాం. సర్కారు దిగి వచ్చే వరకు పోరాడదాం. సీమ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమానికి సహకరించి ప్రజల పక్షాన నిలవాలి. అప్పుడే ఈప్రాంతానికి న్యాయం జరుగుతుంది. – గోపాలకృష్ణయ్య, న్యాయవాది సీమ గొంతు కోస్తున్న బాబు అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంలో ఒకటైన కర్నూలును కొద్దో గొప్పో అభివృద్ధి చేద్దామని గత ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఎయిమ్స్, ట్రిపుల్ ఐటీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్, విద్యుత్ రెగ్యులేటరీ తదితర ప్రభుత్వ సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేసింది. వాటిని ఇప్పుడు చంద్రబాబు అమరావతికి తరలించి సీమ ప్రజల గొంతును కోయాలని చూడటం సరికాదు. – వజ్రం భాస్కర్, సీనియర్ న్యాయవాది పార్టీలకు అతీతంగా ఉద్యమం రాష్ట్ర విభజన నాటి నుంచి సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు, ప్ర జలు ఆందోళనలు చేశారు. గత ప్రభుత్వం స్పందించి కొన్ని సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అ న్ని సంస్థలను అమరావతికి తరలించాలని చూస్తోంది. ఇది దుర్మార్గం. దీనిపై పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపడతాం. – ఆర్.నరసింహులు, న్యాయవాది కర్నూలు (లీగల్): గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీక రణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగానే రాయలసీమ ముఖ్యద్వారమైన కర్నూలు ను న్యాయ రాజధానిగా ప్రకటించి పలు న్యాయ సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని తరలించేందుకు కుట్ర పన్నుతోంది. ఇప్పటికే కర్నూలులో ఏర్పాటైన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్లను అమరావతికి తరలించనున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు తెలపడం కూడా జరిగింది. దీనిని కర్నూలు జిల్లా న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యాయ సంస్థల తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కర్నూలు బార్ అసోసియేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో పలువురు జిల్లా న్యాయవాదులు పాల్గొని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పలుమార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించి బెంచ్ విషయం ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. రాయలసీమ వాసిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏర్పాటైన సంస్థలను అమరావతికి తరలించే ఆలోచన మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ కూటమి సర్కారు వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ నుంచి ఏ ప్రభుత్వ సంస్థను తరలించమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ న్యాయ సంస్థల తరలింపును అడ్డుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభు త్వం సీమ ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను ఎక్కడికీ తరలించరాదన్నారు. సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, కె.ఓంకార్ మాట్లాడుతూ మీరు గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తారని భావించి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు మళ్లీ పాత పంథానే అవలంభిస్తే ఎలా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజధాని కోస్తా ప్రాంతంలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలన్నారు. ఇది సీమ ప్రజల హక్కు అన్నారు. 2014 సంవత్సరంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోలేదన్నారు. టీడీపీ భాగస్వామ్య పార్టీలైనా బీజేపీ, జనసేన రాయలసీమకు హైకోర్టు తరలిస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటి వరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటికి అమరావతికి తరలిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా నేటి నుంచి న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరించి ప్రజలతో కలసి ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కాకుండా చంద్రబాబు కోర్టుల్లో పిటిషన్లు వేయించి అడ్డుకొని ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని సీనియర్ న్యాయవాదులు ఎం.సుబ్బయ్య, పి.సువర్ణారెడ్డి విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు బి.చంద్రుడు, శేషన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే గత ప్రభుత్వం న్యాయ రాజధాని ప్రకటన అందులో భాగంగానే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ తదితర ఏర్పాటు కూటమి ప్రభుత్వం వాటిని తరలించాలనుకోవడం దుర్మార్గం ఉపసంహరించుకోకపోతే ఉద్యమం జిల్లా న్యాయవాదులు హెచ్చరిక నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపు -
టీబీ డ్యాం సమాచారం
పూర్తి మట్టం (అడుగులు) : 1,633 ప్రస్తుతం : 1,630.81 సామర్థ్యం (టీఎంసీలు) : 105.788 ప్రస్తుతం : 97.102 ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) : 3,590 అవుట్‌ఫ్లో : 7,325ఇది కోవెలకుంట్ల పట్టణంలోని వెలగటూరు రస్తాలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం. 75 మంది విద్యార్థినులు ఉండే ఈ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉంది. పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండు గదులను మూసి వేశారు. హాస్టల్‌కు ఏర్పాటు చేసిన ప్రహారీ పూర్తిగా దెబ్బతినింది. సీసీ కెమెరాలు లేవు. ఇక మౌలిక సదుపాయాలు అస్సలే కానరావు. -
నంద్యాలలో..
● నంద్యాల పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇరుకై న అద్దె భవనంలో విద్యార్థులు వసతి పొందుతున్నారు. ● డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్న ఎస్సీ బాలుర జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థుల వసతి గృహంలో శుభ్రత కానరావడం లేదు. ప్రహరీ గోడలు లేవు. బాత్రూములు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. ఎస్టీ జూనియర్ కళాశాల బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో ఎవరూ వీటిని ఉపయోగించడం లేదు. రైల్వేట్రాక్ పక్కకు బహిర్భూమికి వెళ్తున్నారు. బనగానపల్లెలో : ● అవుకు కస్తూరిబాగాంధీ హాస్టల్లో ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యార్థినులు కడుపులు మాడ్చుకుంటున్నారు. విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ విద్యార్థినుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ● సంజామల కస్తూరిబాగాంధీ హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు, డైనింగ్ హాలు లేకపోవడంతో విద్యార్థినులు భోజనం చేసేందుకు సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. ● బనగానపల్లె పట్టణంలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీ లేకపోవడంతో విద్యార్థినులతో పాటు సిబ్బంది రాత్రి వేళల్లో హాస్టల్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ● కొలిమిగుండ్ల కస్తూరిబాగాంధీ బాలికల హాస్టల్లో విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్టుగా డైనింగ్ హాల్ లేక పోవడంతో భోజనం వరండాలో కూర్చోని తినాల్సి వస్తుంది. విద్యార్థినులకు సరిపడ్డ టాయిలెట్లు లేవు. రెగ్యులర్ ఎస్ఓ లేరు. శ్రీశైలంలో.. ఈ నియోజవకర్గంలోని వివిధ వసతి గృహాల్లో విద్యాభ్యాసం నిర్వహిస్తున్న విద్యార్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. శ్రీశైలం మండలంలోని శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఈ వసతి గృహాలకు సరైన ప్రహరీగోడలు లేకపోవడంతో చిరుతలు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలు మార్లు వసతి గృహాలకు సమీపాల్లో చిరుతలు సంచరించాయి. అలాగే ఈ నియోజకవర్గంలోని వసతి గృహాలకు సీసీ కెమెరాలు లేవు. దీంతో బాలికల రక్షణ గాలిలో దీపంగా మారింది. ఇక వసతి గదులు, మరుగుదొడ్ల గురించి చెప్పనవసరం లేదు. ఆత్మకూరు, బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది మండలాల్లో వసతి గృహాలు శిథిలావస్థకు చేరాయి. పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు అయిన సంఘటనలూ ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. వసతిగృహాల్లో ఆర్వో ప్లాంట్లు లేవు. గదులకు కిటికీలు లేవు. పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు ఇవ్వలేదు. డోన్‌లో... డోన్ నియోజకవర్గంలోని సంక్షేమ వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. డోన్‌లోని జ్యోతిరావుపూలే వసతి గృహానికి ప్రహరీగోడ, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో తరచుగా ఇక్కడి నుంచి బాలికలు పారిపోతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మోడల్, కస్తూరిబా బీసీ గురుకుల పాఠశాలలో 30 శాతం అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలీ ఎస్సీ వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూత పడటంతో విద్యార్థులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కుళాయి నీరు తాగుతూ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.● సంక్షేమ వసతి గృహాలను పట్టించుకోని ప్రభుత్వం ● పెచ్చులూడి శిథిలావస్థకు చేరిన పలు భవనాలు ● కానరాని శుభ్రత, ప్రహరీలు, సీసీ కెమెరాలు ● గాలిలో దీపంగా మారిన పేద పిల్లల భద్రత ● హైకోర్టు మొట్టికాయ వేసినా స్పందన లేని సర్కారు ● తీవ్ర అవస్థలు పడుతున్న విద్యార్థులు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మరుగుదొడ్లు మండలకేంద్రం దొర్నిపాడులోని ఎస్సీ బాలుర వసతి గృహంలోనివి. వీటికి తలుపులు, నీరు, విద్యుత్, వసతులు లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తల్లిదండ్రులు కోరుతున్నారు.అయితే, కూటమి సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.ప్రస్తుతం రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే పై చిత్రంలో కనిపిస్తున్న శిరివెళ్ల ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహం రక్షణ లేకుండా ఉంది. ఇది ప్రధాన రహదారికి సమీపంలో ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వసతిగృహానికి ప్రహరీ లేదు. దీంతో బాలికలు ప్రతి రోజు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. 62 భోజనాల్లో నాణ్యత పాటించని వసతిగృహాలు 67 మౌలిక వసతులు లేని హాస్టళ్లు 23,565 మొత్తం విద్యార్థుల సంఖ్య 137 జిల్లాలో మొత్తం హాస్టళ్లు 57 పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న హాస్టళ్లు -
చెంచు గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆత్మకూరు: చెంచు గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ధనుంజయ తెలిపారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గంలోని చెంచుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గురువయ్య, విజయలక్ష్మి తమ పొలాలకు బోరుబావులు కావాలని వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.జి.నాయక్, ఏపీఓ నాగార్జున, గిరిజనులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● తనకు రెండున్నర ఎకరాల పొలం కావాలని కొత్తపల్లి చెంచుగూడేనికి చెందిన ఉత్తలూరు నాగమ్మ వినతిపత్రం అందించారు. ● కొత్తపల్లి చెంచుగూడెం వరకు రోడ్లు నిర్మించాలని పలువురు గిరిజనులు విన్నవించారు. ● తన అత్తమామలకు చెందిన పొలాన్ని ఓబులేష్ అనే వ్యక్తి ఆన్లైన్లో ఎక్కించుకున్నాడని, న్యాయం చేయాలని ఓ మహిళ వినతి పత్రం అందించింది. ● తమ గూడేనికి తెలుగుగంగ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి పొలాలకు సాగునీరు అందించాలని, చెరువులకు నీటితోపాటు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాలని, భూమిలేని కుటుంబాలకు భూమి ఇవ్వాలని, 31 కుటుంబాల వారికి ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని బండిఆత్మకూరు మండలం నారపురెడ్డికుంటకు చెందిన గిరిజనులు అర్జీ ఇచ్చారు. -
ఆలయం.. అపచారం
● కొలనుభారతి క్షేత్రం ఆవరణలో సిగరెట్ తాగుతున్న పురోహితుడు, సిబ్బంది కొత్తపల్లి: రాష్ట్రంలోనే ఏకై క సరస్వతి క్షేత్రంగా వీరాజిల్లుతున్న కొలనుభారతి దేవి ఆలయ ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. పురోహితుడు అమ్మవారి క్షేత్ర ప్రాంగణంలోనే సిగరెట్ తాగడం, నిబంధనలు పాటించకుండా పూజలు చేస్తుండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు పురోహితుడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరుకు చెందిన కొంత మంది భక్తులు ఆదివారం మధ్యాహ్నం 12:25 గంటలకు కొలనుభారతి క్షేత్రానికి చేరుకున్నారు. అప్పటికే ఆలయ తలుపులను పురోహితుడు చక్రపాణి శర్మ మూసివేశారు. దూరం నుంచి వచ్చామని, అమ్మవారికి చీరె, సారె సమర్పించేందుకు ఆలయ తలుపులు తెరవాలని కోరినా పురోహితుడు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో భక్తులతో దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. అయినా బతిమాలడంతో తలుపు తీసి ఒకే ఒక్క నిమిషంలో మంత్రాలు చదివి పూజను మమ అనిపించి, రూ.501 చెల్లించాలని డిమాండ్ చేశారు. చేసేదేమీలేక భక్తులు రుసుం చెల్లించి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా అమ్మవారికి పూజ నిర్వహించే సమయంలోనూ పురోహితుడు నుదుటన కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవడం లేదని ఇదేమి సంప్రదాయమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అదే రోజు క్షేత్రంలోని ఓ గదిలో పురోహితుడు కుర్చీపై, మరో సిబ్బంది కింద కూర్చొని దర్జాగా సిగరేట్ కాల్చుతూ భక్తుల కంట పడ్డారు. క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈఓ రామలింగారెడ్డిని వివరణ కోరగా విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
జీఓలు అమలు చేయాలి
కర్నూలు(హాస్పిటల్): సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రాష్ట్ర ప్రతినిధి బృందంతో ఫిబ్రవరి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీఓలను అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు నిర్మలమ్మ, గౌస్‌దేశాయ్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి మాట్లాడారు. తమ ప్రభుత్వం వస్తే ఆశాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చి ఆరు నెలలైనా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లు చేసి ఆశ వర్కర్లకు మాత్రం 60 ఏళ్లకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నందున ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, ఇతర పనులను కూడా ఆశా వర్కర్లతో చేయిస్తూ అధిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఇకపై సచివాలయాల్లో డ్యూటీలు ఉండవని, అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను వారు నివాసం ఉండే ప్రాంతానికి బదిలీ చేస్తామని, పీహెచ్సీ డాక్టర్‌తో సెలవు తీసుకునే వీలు కల్పిస్తామని, ఆశా వర్కర్లకు ఆర్థికభారం లేకుండా 21 రికార్డులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చే విధంగా మాట్లాడతానని, ఎన్సీడీ సర్వేకు ఆశా వర్కర్‌తోపాటు ఇతర ఉద్యోగులను కలిపి టీం వర్క్ చేసే విధంగా కలెక్టర్‌తో మాట్లాడి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఐటీయూ నగర నాయకులు మహమూద్, కుమార్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుడి అక్రమ మైనింగ్‌కు కార్మికుడి బలి
● బండలు మీద పడి అక్కడికక్కడే మృతి ● కేసును నీరుగార్చుతున్న గని యజమాని ● గనిలోనే చనిపోయాడంటున్న మృతుని కుటుంబీకులు ● మృతుడి కాళ్లకు సున్నపురాయి మరకలు ● ఎవరూ ఫిర్యాదు చేయలేదంటున్న పోలీసులు డోన్/ప్యాపిలి: నంద్యాల జిల్లాలో ఓ టీడీపీ నాయకుడి అక్రమ మైనింగ్‌కు కార్మికుడు బలయ్యాడు. గనిలో బండలు మీద పడి కార్మికుడు మృతి చెందినా సమీపంలోని తోటలో కాలుజారి కింద పడి చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసినా పోలీసులు ఫిర్యాదు అందలేదని అంటున్నారు. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. ప్యాపిలి మండలం చండ్రపల్లికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి, గొర్రెల పెంపకందారుల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్, ఆయన సోదరుడు ఎర్రసాని లక్ష్మీనారాయణ (అలియాస్ లచ్చియాదవ్) వారి పొలం పక్కనే కొన్నేళ్లుగా లైమ్‌స్టోన్ (సున్నపురాయి)ని యథేచ్ఛగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. ఈ గనిలో సోమవారం హుసేనాపురం గ్రామానికి చెందిన శివయ్య (55) సున్నపు రాయిని ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా కాలుజారి కిందపడటంతో పెద్ద బండరాయి తలపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, శివయ్య సమీపంలోని తోటలో కాలు జారి కింద పడి మరణించినట్లుగా గని యజమాని లచ్చి యాదవ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తన తండ్రి గనిలో పనిచేస్తుండగానే మృతి చెందాడని, కాళ్లకు తెలుపు రంగు సున్నపురాయి మరకలు కూడా ఉన్నాయని మృతుడి కుమారుడు రవి చెబుతున్నాడు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. గతంలోనూ ముగ్గురి మృతి.. గత పదేళ్లలో టీడీపీ నాయకుడు లచ్చి యాదవ్ చేసే అక్రమ గనిలో ముగ్గురు కూలీలు ప్రమాదాల బారినపడి మృతి చెందినట్లు తెలిసింది. మృతుల కుటుంబ సభ్యులను భయపెట్టి కేసులు నమోదు కాకుండా చేశారని చెబుతున్నారు. ఇక్కడ అనుమతులు లేకుండానే చట్ట వ్యతిరేకంగా మైనింగ్ చేస్తున్నారని చండ్రపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.