AP Special
-
ధైర్యంగా బతకగలుగుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ధైర్యంగా బతకగలుగుతున్నా మా ఆయన తిక్కస్వామి వ్యవసాయ కూలీ. ఆయన సంపాదనతోనే కర్నూలు జిల్లా పెద్దతుంబళం గ్రామంలో ఒడుదొడుకులతో సంసారం సాగేది. పనిలేనిరోజు పస్తులుండాల్సి వచ్చేది. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. మాకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. భర్త మరణంతో కుటుంబ పోషణ చాలా భారమైంది. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబానికి ఆసరా దొరికినట్టయింది. రూ. 30 వేలు పొదుపు రుణం సున్నావడ్డీ కింద తీసుకుని కుట్టుమెషీన్ కొనుక్కున్నా. నాకు వితంతు పింఛను కూడా వస్తోంది. మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఒకరికి అమ్మ ఒడి కింద రూ.15వేలు అందుతోంది. బడిలో మంచి ఆహారం, అవసరమైన పుస్తకాలు, యూనిఫాం వంటివి అందిస్తున్నారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా మంజూరైంది. ఎలాంటి భయం లేకుండా బతుకుతున్నానంటే జగనన్న ఆశీర్వాదమే కారణం. – బయటిగేరి రాజేశ్వరి, పెద్దతుంబళం (కపటి రామచంద్ర, విలేకరి, ఆదోని రూరల్) సాయం చేసి.. ఉపాధి బాట వేసి.. నా భర్త ఏలేటి కిరణ్‌తోపాటు నేను కూడా అద్దె ఆటో నడుపుతూ రాజమహేంద్రవరం మండలం కొంతమూరులో ఇద్దరు మగ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నాం. అద్దె ఆటో కన్నా సొంత ఆటో కొనుగోలు చేయాలనుకున్నాం. ధర కనుక్కుంటే రూ.4.50 లక్షల వరకూ అవుతుందని తెలిసింది. అంత సొమ్ము భరించలేమని భయపడ్డాం. ఆ సమయంలో సీఎం జగనన్న ‘ఉన్నత మహిళా శక్తి’ పథకం ద్వారా ఉపాధికి భరోసా కల్పించారు. ఎటువంటి వడ్డీ లేకుండా రూ.2.79 లక్షల విలువైన ఆటోను ప్రభుత్వం అందించింది. దీంతో మా కుటుంబం కుదుటపడింది. అంతేగాకుండా ఇంటి స్థలాన్ని మంజూరు చేసి పట్టా అందించారు. ఇద్దరు మగ పిల్లల్లో ఏలేటి సంజయ్ సాత్విక్ ఐదో తరగతి, ఏలేటి సంజయ్ సంపత్ మూడో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరిలో చిన్నవాడికి అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. అంతేకాకుండా వైఎస్సార్ విద్యా కానుక ద్వారా పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్‌లు, షూలు, సాక్సులు సైతం అందించారు. జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం పౌష్టికాహారమైన భోజనాన్ని పెడుతున్నారు. సీఎం జగనన్న ద్వారా జరిగిన మేలు మా కుటుంబం మరచిపోదు. జీవితాంతం రుణపడి ఉంటాం. – ఏలేటి దేవీదుర్గ, ఆటో డ్రైవర్ కొంతమూరు (యెనుముల విశ్వనాథం, విలేకరి, రాజమహేంద్రవరం రూరల్) పోతాయనుకున్న ప్రాణాలు నిలిపారు దుకాణాల్లోనూ, ఇళ్లలోనూ ధూపం వేస్తూ, దిష్టి తాళ్లు కడుతూ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో జీవించే కుటుంబం మాది. జిల్లాలో కోవిడ్ బారిన పడిన మొదటి వరుసలోని వ్యక్తిని. దాంతో మేమంతా తీవ్ర భయభ్రాంతులకు గురై, తీవ్ర మానసిక వేదన అనుభవించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖర్చుకు వెరవకుండా అండగా నిలిచి ప్రాణాలు నిలిపారు. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి 16 రోజుల పాటు వైద్యం చేయించారు. రెండు పూటలా పౌష్టికాహారం అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం టిఫిన్ ఇచ్చారు. సమయానికి మందులు ఇచ్చి ప్రాణాలకు అండగా నిలిచారు. భయభ్రాంతుల నుంచి నేడు సాధారణ జీవితంలోకి వచ్చి మళ్లీ జీవనోపాధిలో ముందుకు సాగడం అంతా సీఎం జగన్ చలవే. అంతేగాకుండా మా కుటుంబానికి అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు, నా భార్యకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.36 వేలు లబ్ధి చేకూరింది. సీఎంకు మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. – షేక్ ఖాసీం, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా (గుర్రాల శ్రీనివాసరావు, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా) -
AP: ఎలక్ట్రానిక్స్ రంగంలో 36,205 మందికి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఓవైపు భారీ ఎత్తున పెట్టుబడులు, మరోవైపు యువతకు ఉద్యోగాల వెల్లువ కొనసాగింది. ముఖ్యంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ రంగం రికార్డు స్థాయి పెట్టుబడులను ఆకర్షించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. అంతేకాకుండా మరో రూ.15,711 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో బ్లూస్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హావెల్స్, సన్సీఆప్టెక్స్ వంటి అనేక దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రారంభించడంతోపాటు భారీ ఎత్తున విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 మే నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 24 కంపెనీల ద్వారా రూ.10,705 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవం రూపంలోకి రావడంతో ఏకంగా 36,205 మందికి ఉపాధి లభించింది. మరో 55,140 మందికి ఉపాధి గతేడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 23 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా మరో రూ.15,711 కోట్ల పెట్టుబడులతోపాటు 55,140 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లు, సెల్‌ఫోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంది. ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక కంపెనీలను స్వాగతించింది. అంతేకాకుండా వీటికి వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో కంపెనీలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. శ్రీసిటీలో భారీగా తయారీ యూనిట్లు కాగా దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్ కండీషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలోనే తయారవుతుండటం విశేషం. తిరుపతి జిల్లా శ్రీసిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకినే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారుచేస్తోంది. అంతేకాకుండా రెండో దశలో మరో 15 లక్షలు తయారుచేసేలా విస్తరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులను ఈ జపాన్ సంస్థ పెట్టింది. అలాగే, బ్లూస్టార్ ఏటా 12 లక్షల యూనిట్లను తయారుచేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. కొప్పర్తి ఈఎంసీతో మరో 28,250 మందికి ఉపాధి ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలకుపైనే ఉంటుందని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాకుండా రూ.749 కోట్లతో కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే డిక్సన్ వంటి కంపెనీలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. -
ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024–25) విద్యాహక్కు చట్టం కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఈ గడువు సోమవారంతో ముగుస్తుండగా, విద్యాశాఖాధికారులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాలి. వీరికి విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. దీనిప్రకారం ఇప్పటివరకు 49,208 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. విద్యార్థుల నివాసాలకు సమీపంలో ఉన్న ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్‌ను బోధిస్తున్న స్కూళ్లలోను పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని సమగ్రశిక్ష ఎస్సీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాసాలకు సమీపంలోని సచివాలయం లేదా ఇంటర్నెట్, ఎంఈవో కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్షా పాఠశాల విద్యాశాఖ (టోల్ ఫ్రీ) 18004258599 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. అర్హతగల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్.. ఇక ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో విద్యార్థి పేరు, ఇతర వివరాలు నమోదుచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పిల్లల ఆధార్ నంబర్, లేదా తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్లో కనిపించే స్కూళ్లలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులకు ఆన్లైన్ లాటరీ ద్వారా స్కూళ్లను కేటాయిస్తారు. http://cse.ap.gov.in/RTE వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్‌లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ -
చెక్ పోస్టుల వద్ద అవినీతికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అనుమతులన్నీ ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది. ప్రయోజనాలు ఇవీ... ♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది. -
క‘న్నీటి’ కష్టాలు తీరాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. క‘న్నీటి’ కష్టాలు తీరాయి మాది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం. వజ్రపుకొత్తూరు మండలం సీతాపురంలో చిన్నపాటి కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నా. నా భర్త చనిపోయారు. కొడుకు పెళ్లయ్యాక వేరే కాపురం ఉంటున్నాడు. కుమార్తె దివ్యాంగురాలు కావడంతో ఆమెను నేనే సాకుతున్నా. మా ప్రాంతంలో దశబ్దాలుగా కిడ్నీ వ్యాధిబారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. అనేక పరిశోధన సంస్థలు మా ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధికి తాగు నీరు ఒక కారణం అని తేల్చి చెప్పారు. మా గ్రామంలో ఉన్న బావి నీటిని తాగవద్దని అధికారులు చెప్పారు. అప్పటి నుంచి మంచి నీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ప్రాంతంలో ఇంటింటికి రక్షిత మంచి నీటిని కుళాయిల ద్వారా అందించి శాశ్వత పరిష్కారం చూపారు. గతంలో ఏ నాయకుడు మా బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. మా ఇంటికి కుళాయి నీరు వస్తుందని కలలో కుడా ఊహించలేదు. నాకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వచ్చింది. సున్నా వడ్డీ కింద రూ.5,694 వచ్చింది. నాకు, నా కుమార్తె(దివ్యాంగురాలు)కు పెన్షన్ వస్తుండటంతో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఉద్దాన ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కోటి జయమ్మ, సీతాపురం (కుసుమూరి చలపతిరావు విలేకరి, వజ్రపుకొత్తూరు రూరల్) ఇంత సాయం ఎన్నడూ ఎరుగం మాది నిరుపేద కుటుంబం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో నా భర్త అల్లు నరసింహారావు ఆర్ఎంపీ వైద్యునిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాకు ఏవిధమైన ఆస్తులు లేవు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సహాయ పడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున అందింది. జగనన్న ఇళ్ల కాలనీలో ఒకటిన్నర సెంటు స్థలం కూడా మంజూరైంది. మా అమ్మాయి ప్రసవానికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.35 వేల విలువైన చికిత్సను ఉచితంగా చేశారు. మా మనుమలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున సాయం అందిస్తున్నారు. మా లాంటి ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోడుగా నిలిచారు. మేమంతా ఆయనకు ఎంతో రుణపడి ఉంటాం. – అల్లు మాధవి, మామిడి కుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడి కుదురు) ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం నేను ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్ సమీపంలో టీ కొట్టు నడుపుకునేదాన్ని. నా భర్త సామ్యూలు గేదెల మారుబేరం వ్యాపారం చేసేవారు. ఏడాది క్రితం పక్షవాతం రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ సమయంలో ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. జగనన్న ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18750, రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 వంతున వచ్చింది. ఆ మొత్తంతో టీకొట్టు మానేసి ఇంటి వద్దే చిల్లర కొట్టు పెట్టుకున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించగలుగుతున్నా. నా భర్తకు పక్షవాతం రావడంతో నెలకు రూ.3 వేల వంతున పింఛన్ వస్తోంది. రెండో కొడుకు దివ్యాంగుడు కావడంతో పింఛన్ వస్తోంది. ఇప్పుడు నా కుటుంబం గడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మా కుటుంబానికి అండగా నిలిచిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – గుంటి మార్తమ్మ, బేస్తవారిపేట (పెరుమారెడ్డి హనుమంతారెడ్డి, విలేకరి, బేస్తవారిపేట) -
అన్నదాతకు అండ
సాక్షి, అమరావతి: ఆరు గాలం శ్రమించే అన్నదాతకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకాల ద్వారా అవసరమైన ఆర్థిక చేయూతనిస్తోంది. అలాగే బ్యాంకర్ల సాయంతో ముందెన్నడూ లేని రీతిలో రైతులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు అయ్యేలా చూస్తోంది. గతంలో రుణాల కోసం అన్నదాతలు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. అయినా సకాలంలో అప్పులు పుట్టక వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. సీఎం జగన్ పాలనలో ఆ పరిస్థితి మారింది. అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. రైతులకు లబ్ధి చేకూరుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా బ్యాంకులు సైతం వ్యవసాయ రంగానికి రుణాల మంజూరును ఏటా పెంచుతున్నాయి. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల లబ్ధి చేకూర్చింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు అందించింది. ఫలితంగా రైతుల ఆర్థిక పరపతి గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రికార్డు స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. వాటికి మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో తీసుకున్న రుణాలను రైతులు కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. రికార్డు స్థాయిలో మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి. 2019–20లో మొండి బకాయిలు 3.57 శాతం ఉండగా, 2023–24కు వచ్చేసరికి 2.50 శాతానికి తగ్గింది. దీంతో గత ఐదేళ్లుగా రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో మంజూరు.. 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో 3.97 కోట్ల మందికి రూ.3,64,624 కోట్ల రుణాలు మంజూరు చేస్తే.. గత 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 5.27 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.8,70,964 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. అంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏటా సగటున 79 లక్షల మందికి రూ.72,925 కోట్ల రుణాలిస్తే.. వైఎస్ జగన్ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 1.05 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.1,74,193 కోట్ల రుణాలు బ్యాంకులు అందించాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రైతుల సంఖ్య దాదాపు 30 శాతం పెరిగితే, మంజూరు చేసిన రుణాలు ఏకంగా 142 శాతం పెరిగింది. అంటే ఏ స్థాయిలో రుణాలు మంజూరయ్యాయో అర్థం చేసుకోవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 2024 ఫిబ్రవరి నాటికి 99.65 లక్షల మందికి 2.08 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందించాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది షార్ట్ టర్మ్ రుణాలు రూ.1.22 లక్షల కోట్లు కాగా, అగ్రి టర్మ్ రుణాలు రూ.66 వేల కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగానికి రూ.20,816 కోట్లు మంజూరు చేశాయి. కౌలు రైతులకు వెన్నుదన్ను భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను జారీ చేస్తోంది. వైఎస్ జగన్ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 5.80 లక్షల మంది చొప్పున 26 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. అలాగే ఈ ఐదేళ్లలో 15 లక్షల మందికి రూ.8,577 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.31 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా.. వీరిలో ఇప్పటికే 5.48 లక్షల మందికి రూ.1,908 కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయి. -
కష్టాల నుంచి బయటపడ్డాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్టాల నుంచి బయటపడ్డాం మాది సామాన్య కుటుంబం. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని నంబర్–1 పాఠశాల సమీపంలో నివసిస్తున్నాం. నా భర్త 2014లో మృతి చెందిన తరువాత నేను టైలరింగ్ చేయడం మొదలుపెట్టాను. అయినా కుటుంబాన్ని పోషించుకోవడం కొంచెం కష్టంగా మారింది. జగనన్న అధికారంలోకి వచ్చాక మేం ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం. మా ఇంటికి వలంటీర్ వచ్చి నాతో పింఛనుకు దరఖాస్తు చేయించారు. పింఛన్ మంజూరైంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ మొత్తం రూ.54,400లు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750లు వంతున అందింది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున వచ్చింది. నా కుమారుడు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. నేను ప్రస్తుతం టైలరింగ్ చేసుకుంటూ జగనన్న పుణ్యంతో çఎటువంటి సమస్యలూ లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. జగనన్న అందిస్తున్న సాయానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. – షేక్ మీరా బేగం, మొగల్తూరు (వి.లక్ష్మీ గణేష్, విలేకరి, మొగల్తూరు) సమస్యలు తీరి సంతోషంగా జీవనం మాది పేద కుటుంబం. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం ఇందుకూరుపేటలో గతంలో కూలీ పనులు చేసుకుని జీవించేవాళ్లం. వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. వయసు రీత్యా కొంత అనారోగ్యంతో పనులకు వెళ్లలేకపోయాం. గత ప్రభుత్వం ఏ విధంగానూ మాకు సాయం అందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు కొండంత అండగా నిలిచాయి. వైఎస్సార్ పింఛన్ అందుతోంది. నా భార్యకు కాపు నేస్తం కింద ఏడాదికి రూ.15 వేలు వంతున అందింది. రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు ఏటా రూ. 13,500లువంతున, టైలరింగ్ చేసే నా కోడలికి జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.50 వేలు జమయ్యాయి. నా మనవరాలికి అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు అందింది. జగనన్న ప్రభుత్వంలో మా పేద కుటుంబం కష్టాలు తీరాయి. మా కుటుంబమంతా జగనన్నకు రుణపడి ఉంటుంది. – రావిపాటి చెల్లారావు, దేవీపట్నం (కె.వెంకటేశ్వరరావు, విలేకరి, దేవీపట్నం) అద్దె ఇంటి బాధ తప్పింది మాది వ్యవసాయ కుటుంబం. నా భర్త కుటుంబరావుకు నేను తోడుగా ఉండి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో వ్యవసాయం చేసేవాళ్లం. అన్ని సీజన్లూ అనుకూలంగా ఉండేవి కాదు. అప్పుడప్పుడు పంట చేతికందకపోతే నష్టాలు చవిచూసేవాళ్లం. అప్పుడు అప్పులు చేయాల్సి వచ్చేది. మమ్ములను గత ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదు. కనీసం ఇల్లయినా మంజూరు చేయలేదు. ఇక సొంతిల్లు కలగానే మిగిలిపోతుందని భయపడ్డాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ కల తీరింది. మాకు ఇంటి స్థలమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఇంటినిర్మాణం పూర్తికావచ్చింది. మా అబ్బాయి ఉన్నత చదువులు చదువుతున్నాడు. వాడికి జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.90,500లు, వసతి దీవెన ద్వారా రూ.50 వేలు వచ్చింది. నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.13,909, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.6,255, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున వచ్చింది. ఇన్ని విధాలుగా ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – వల్లూరి వాణి, మైసన్నగూడెం (అచ్యుతరామ్, విలేకరి, జంగారెడ్డిగూడెం రూరల్) -
సొంతింటి కల నెరవేరింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సొంతింటి కల నెరవేరింది నా భర్త 30 ఏళ్ల క్రితమే వదిలేశాడు. విశాఖ పట్నంలోని 89వ వార్డు నాగేంద్ర కాలనీలో ఉంటున్న అక్క ఇంటి వద్దే నివసిస్తున్నాను. మా అక్కకు చిన్న టీ దుకాణం ఉంది. అక్కడే పని చేస్తూ జీవిస్తున్నా. నాకు ఒక పాప. పాపను త్రిబుల్ ఐటీ చదివించాను. ఇపుడు ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత ప్రభుత్వంలో నాకు ఏ ప్రయోజనం అందలేదు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంటరి మహిళ పింఛను రూ.3,000 వస్తోంది. చేయూత ద్వారా రూ.18,750 అందుకున్నా. ఇప్పుడు నాకు ఇంటి స్థలం వచ్చింది. ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆ ఇంటి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. నా ఇంటి కల జగనన్న వల్లే నెరవేరింది. – షేక్ అన్నపూర్ణ, నాగేంద్ర కాలనీ 89వ వార్డు, విశాఖపట్నం సిటీ (చింతాడ వెంకటరమణ, విలేకరి, గోపాలపట్నం) మా బతుకులకు చింతలేదు మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం డి.పోలవరప్పాడు. మా గ్రామంలో మాకు కొద్దిపాటి భూమి ఉంది. కడుపు నింపుకోవడానికి నా భార్య రామయ్యమ్మతో కలిసి కూలి పనుల కోసం వలస వెళ్లేవాళ్లం. వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ జరిగేది. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా పేద కుటుంబాన్ని నవరత్నాల పథకాలు ఎంతో ఆదుకున్నాయి. రైతు భరోసా కింద ఏటా నాకు అందిన రూ.13,500 సొమ్మును జీడి మామిడి తోట సాగుకు ఉపయోగించా. దిగుబడి బాగుండడంతో అప్పులు తీర్చేశా. దీంతో పాటు నాకు ప్రతి నెలా వైఎస్సార్ పింఛన్ వస్తోంది. నా భార్య డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. ఆమెకు చేయూత పథకం కింద నాలుగు విడతల్లో రూ.75,000 జమయింది. నా కుమార్తె సావిత్రి నాలుగో తరగతి చదువుతోంది. ఏటా అమ్మఒడి సొమ్ము వచ్చింది. నా బిడ్డకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు, బ్యాగులు, షూ తదితర సామగ్రి అందుతోంది. సీఎం జగనన్న వల్ల మా కుటుంబానికి కలిగిన మేలు ఎప్పటికీ మరిచిపోం. మా బతుకులకు ఎటువంటి చింతా లేదు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి. – వంతల బిరసయ్య, డి.పోలవరప్పాడు (సింగిరెడ్డి శ్రీనివాసరావు, విలేకరి, అడ్డతీగల) కూలి పని మానేసి వెల్డింగ్ షాపు పెట్టుకున్నా మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి. షాపులో కూలిగా పని చేసుకునే నేను సొంతంగా షాపు పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పుణ్యమే. ఏడో తరగతి వరకూ చదువుకున్న నేను 2019 వరకు ఒక వెల్డింగ్ షాపులో రోజువారీ కూలీగా పనిచేశా. నాకు భార్య, ముగ్గురు పిల్లలు. డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న నా భార్య నాగ వెంకట జ్యోతికి రూ.70 వేల రుణం మంజూరైంది. ఆ సొమ్ముతోపాటు మరికొంత జత చేసి మా ఊళ్లోనే గీతిక వెల్డింగ్ షాపు పేరుతో సొంతంగా పనులు చేయడం ప్రారంభించా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి చేకూరిన రూ.36 వేలు, సున్నా వడ్డీ ద్వారా వచ్చిన రూ.5,028.. షాపు నడపడానికి అవసరమైన పెట్టుబడిని సమకూర్చాయి. ఆ తర్వాత జగనన్న కాలనీలో ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. ఇంటి స్థలం విలువతో కలిపి జగనన్న ప్రభుత్వ హయాంలో నాకు మొత్తం రూ.5.47 లక్షల మేర ప్రయోజనం చేకూరింది. – గారపాటి నాగరాజు, తేతలి (కె.కృష్ణ, విలేకరి, తణుకు టౌన్) -
ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : గత ఏడాది అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం జనన, మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికెట్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ఈ జనన ధృవీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు. పాస్‌పోర్టు, ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు ఓటరు, వివాహ నమోదుకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పసరి చేసిందని సీఎస్ స్పష్టంచేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతర ప్రయోజనాలు పొందాలన్నా కూడా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఆయన తెలిపారు. కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల నమోదును కేంద్రం తప్పనిసరి చేసిందని, ఈ విషయంపై క్షేత్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఆస్పత్రులు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీల్లో కలిపి మొత్తం 14,752 జనన, మరణాల నమోదు యూనిట్లు ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి.. ఇక కొత్త చట్టం ప్రకారం జనన, మరణాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తిచేసి సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉందని సీఎస్ చెప్పారు. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాల చీఫ్ రిజి్రస్టార్లు, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో జనన, మరణాల డేటాను నిర్వహిస్తారన్నారు. ఏ అథారిటీకైనా ఈ డేటా కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరముంటుందని ఆయన తెలిపారు. జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్లు, రేషన్ కార్టు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ల డేటాబేస్లు ఉంటాయని ఆయన వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అన్ని జననాలను హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు నివేదించాల్సి ఉందని, ఇందులో జాప్యంలేకుండా సమీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎస్ కలెక్టర్లను కోరారు. -
Fact Check: రొయ్య రాతల గొయ్యిలో రామోజీ
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా గత 57 నెలలుగా రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ప్రతీ కౌంట్‌కు ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేయడమే కాదు.,. పెంచిన ఫీడ్ ధరలను 3 సార్లు ఉపసంహరించుకునేలా ఈ ప్రభుత్వం చేసింది. ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్తును అందిస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులూ భారీగా పెరిగాయి. రొయ్యల ఉత్పత్తి బాబు ఐదేళ్ల పాలనలో 1.74 లక్షల టన్నులకు మాత్రమే పెరిగితే.. సీఎం జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లలోనే ఏకంగా 6.94 లక్షల టన్నులకు పెరిగింది. బాబు హయాంలో జాతీయ స్థాయిలో రొయ్యల ఉత్పత్తి 67 శాతం ఉండగా, ప్రస్తుతం 77.55 శాతానికి పెరిగింది. ఇవేమీ రాజగురువు రామోజీకి మాత్రం కన్పించడం లేదు. ఆక్వా రంగానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నప్పటికీ, అదే పనిగా విషం కక్కుతూనే ఉన్నారు. తాజాగా ‘రొయ్య ఎగరలేదు..రైతు ఎదగలేదు’ అంటూ అబద్ధాలను అచ్చేశారు.. వాస్తవాలు ఏమిటంటే.. ఆరోపణ : పెరగని రొయ్యల ఉత్పత్తి వాస్తవం..: రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో మంచినీటి, 54 వేల హెక్టార్లలో ఉప్పునీటి కల్చర్ విస్తీర్ణం ఉండగా, 1.75 లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఈ–ఫిష్ ద్వారా ఆక్వాసాగును గుర్తిస్తూ, వారికి అందాలి్సన అన్నిసంక్షేమ ఫలాలను అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. 2018–19లో 39 లక్షల టన్నులు ఉన్న రొయ్య/మత్స్య ఉత్పత్తులు 2022–23కు వచ్చేసరికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు, ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి ఏకంగా 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. ఇలా ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11.09 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. ఆరోపణ : ఎగుమతులు పెరగలేదు వాస్తవం..: ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు చంద్రబాబు హయాంతో పోల్చుకుంటే గణనీయంగా పెరిగాయి. 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు ఎగుమతులు జరిగితే.. 2022–23లో ఏకంగా రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. జీవీఏ చూసుకుంటే రూ.48 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.68 వేల కోట్లకు పెరిగింది. ఏటా సగటున 5.12 శాతం వృద్ధిరేటు నమోదవుతోంది. గ్రోత్ రేట్ ఐదేళ్లలో జాతీయ స్థాయిలో 19.37 శాతం ఉంటే, ఏపీలో 25.59 శాతంగా నమోదవుతోంది. నాణ్యమైన ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక చర్యల కారణంగా నాలుగేళ్ల క్రితం 86 శాతం ఉన్న యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ ఇప్పుడు 26 శాతానికి తగ్గాయి. దీంతో ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ఎగుమతులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఆరోపణ : సిండికేట్‌గా మారి దోపిడీ వాస్తవం..: నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరాకు ప్రభుత్వం ఐదేళ్లుగా ఎన్నో చర్యలు చేపట్టింది. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచి్చన అప్సడా చట్టం ద్వారా. కంపెనీలు, సరఫరాదారులను రైతులకు జవాబుదారీతనంగా నిలిచేలా చేసింది. బాబు హయాంలో ఐదేళ్ల పాటు సాగిన వారి దోపిడీకి జగన్ పాలనలో అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయంగా ముడిపదార్థాల ధరలు 28 శాతం మేర పెరగడం వల్ల ఆ మేరకు రొయ్య మేత ధర 21.36 శాతం (రూ.72 నుంచి రూ.91.50లకు) మేర పెరిగింది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860 పడకుండా అడ్డుకుంది. ఆరోపణ : నియంత్రణా ...అదెక్కడ? వాస్తవం..: రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది. ప్రతీ 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చుతగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతీ రైతుకు, ప్రతీ రొయ్యకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 100 కౌంట్ రొయ్యకు రూ.210 ప్రభుత్వం నిర్ణయిస్తే, రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470కు కొనుగోలు చేస్తోంది. ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రతీ ఆక్వా రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిది.ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ప్రభుత్వం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ–2020. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020లను అమలులోకి తీసుకొచి్చంది. ఇవే నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆరోపణ: రాయితీ విద్యుత్తుకు మంగళం వాస్తవం..: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 57 నెలలుగా యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్తు సరఫరా చేసింది. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుచేసే 3.34 లక్షల ఎకరాలకు ఆక్వా సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ఫిష్ సర్వే ద్వారా రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, ఇందులో జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఆక్వా సాగు చేసే వారికి సాయంగా 3.34 లక్షల ఎకరాలకు సబ్సిడీ విద్యుత్తు వర్తింప చేస్తున్నారు. మొత్తం 66,993 కనెక్షన్లలో 54,072 కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. జోన్ పరిధిలో ఉన్న కనెక్షన్లలో 95 శాతం మంది ఆక్వా సబ్సిడీ పొందుతున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల బకాయిలతో పాటు ఈ 57 నెలల్లో రూ.3,306 కోట్లు ఆక్వా సబ్సిడీ కింద ఈ ప్రభుత్వం ఖర్చుచేసింది. ఆరోపణ : ఆక్వా రైతులకు ఆదరణేది? వాస్తవం..: స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్ ఆంధ్రా బ్రాండింగ్‌తో డొమెస్టిక్ మార్కెటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు, నాలుగు వేల మినీ అవుట్‌లెట్స్, 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు అన్నీ కలిపి 2,500 యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల్లో నియమించిన 732 ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వడమే కాక, పంట సాగు వేళ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్‌ఫుట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు. దక్కాయి. ఇవేమీ రామోజీకి కన్పించడం లేదు. రామోజీ వక్రభాష్యాలకు హద్దూపద్దూ లేదు. చంద్రబాబు సాధించలేని ప్రగతిని సీఎంగా జగన్మోహన్ రెడ్డి సాధిస్తే ఓర్వలేనితనం, కడుపుమంట నిలువెల్లా రామోజీకి కంటగింపుగా మారాయి.. ప్రభుత్వం అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం ఏ మంచి చేసినా, అది మంచే కాదని వక్రీకరణే పనిగా పెట్టుకుని పవిత్రమైన జర్నలిజానికే కళంకం తెస్తున్నారు. ఆక్వారంగంలో జగన్ సాధించిన నీలి విప్లవ పురోగమనం జాతీయ స్థాయిలోనే అబ్బురపరిచే ఫలితాలనిస్తుంటే...ఆ అభివృద్ధిని రామోజీ ఓర్వలేక పోతున్నారు.. చేపలు, రొయ్యల ఉత్పత్తులు బాబు హయాంలో 39 లక్షల టన్నులుంటే , అది జగన్ పాలనలో 51 లక్షల టన్నులకు పెరగడం ఈనాడుకు కనిపించలేదు. జాతీయ స్థాయిలో చూసినా బాబు పాలన నాటికి ఉన్న రొయ్యల ఉత్పత్తి అయిదింతలు పెరిగినా, అదీ రామోజీకి గొప్పగా అనిపించదు. ఎగుమతుల్లో ఏటా సగటున 5.12 శాతం వృద్ధి రేటు నమోదవుతున్నా అదీ తనకు నచ్చదు. ఇలా... జగన్ ప్రభుత్వం ఏ రంగంలో చూసినా అన్నీ నూరుశాతం ప్రగతిని సాధించినవే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా పాలనలో తనదంటూ ముద్ర ఏర్పరుచుకోలేక నిస్సహాయుడిగా మిగిలిపోయిన చంద్రబాబును గొప్పగా ప్రొజెక్టు చేయడానికి రామోజీ పడరాని పాట్లు పడుతున్నారు... వాస్తవాలకు ఈనాడు ఎంత మసిబూసి మారేడు కాయ చేయాలనుకన్నా , నిజాలను దాచేసి అబద్ధాలను అచ్చేయాలనుకున్నంత మాత్రాన సత్యాలు అసత్యాలుగా మారిపోవుకదా...ఆక్వా రంగంలో జగన్ ప్రభుత్వ విజయాలు, చంద్రబాబు వైఫల్యాలు ఇవిగో... -
పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రగామి
ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండటంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ రూపాల్లో సాయం అందిస్తుండటంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలను సోమవారం వెల్లడించింది. - సాక్షి, అమరావతి 1.81 కోట్ల టన్నులతో మనమే టాప్ 2023–24 ఆర్థిక ఏడాదిలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర 1,42,78,250 టన్నుల పండ్లు ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 1,27,02,060 టన్నుల పండ్ల ఉత్పత్తితో మూడో స్థానంలో నిలిచింది. అరటి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. బత్తాయి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. నిమ్మ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. బొప్పాయి ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ విస్తీర్ణమే ఉన్నా పండ్ల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రఫ్రదేశ్‌లో పండ్లు సాగు విస్తీర్ణం 7,80,310 హెక్టార్లు ఉండగా.. మహారాష్ట్రలో 8,48,370 హెక్టార్లలో పండ్ల సాగు విస్తీర్ణం ఉంది. -
ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించి ఎట్టకేలకు పీటముడి వీడింది. ఏపీ భవన్ విభజన అంశం పరిష్కారం అయ్యిందని తాజాగా హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్- జీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 11.536 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్రం ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణకు 8.245ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ-ఇక్కడ క్లిక్ చేయండి -
YSRCP 2024: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసిన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జాబితాలో సోషల్ ఇంజినీరింగ్ ఉండనుంది. సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం జగన్ సీట్ల కేటాయింపు చేశారు. అభ్యర్థుల జాబితాలో బీసీలు, మహిళలు, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకు 50 శాతం సీట్లు కేటాయించారు. మొత్తం వంద సీట్లలో 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీ స్థానాలకు అవకాశం కల్పించారు. ►25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. ►ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అదనంగా 11 సీట్లు కేటాయించిన సీఎం వైఎస్ జగన్. ►2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయింపు. ►2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో నాలుగు స్థానాలు పెంపు. ►2019లో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా.. 2024లో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు. ►2019లో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే.. ఈసారి ఒకసీటు అదనంగా మూడు సీట్లకు పెంపు. ►2019లో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు కాగా.. 2024లో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయింపు. ►2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయింపు. ►2024 ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపు. ►2019లో మహిళలు, మైనార్టీలకు 18 సీట్లు ఇస్తే.. ►2024లో ఆరు సీట్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 24 సీట్లు ఇచ్చి తన మార్క్ చాటుకున్న సీఎం జగన్. ►2019 ఎన్నికల్లో మహిళలకు 15 చోట్ల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. ఈసారి ఆరు సీట్లు పెంచి 24 చోట్ల అవకాశం. ►2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 12 ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వ దర్శనానికి 10 గంటలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (ఆదివారం) 66,322 మంది స్వామివారిని దర్శించుకోగా 24,672 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.39 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 5 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఆ లావాదేవీల జాబితా ఇవ్వండి..
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి.. గత 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంసీ) అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఈసీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. అయితే, అంతకుమించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించి గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖతోపాటు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాలని ఎస్ఈసీ కోరారు. ప్రలోభాలపై నిఘా.. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామాగ్రి అక్రమ తరలింపుపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని ముకేశ్‌కుమార్ చెప్పారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో నివేదించేందుకు ఈసీఎంసీ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఐటి, జీఎస్టీ, పోలీస్, ఎౖMð్సజ్ తదితర 22 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీరు సీజ్‌చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తామన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అందులోకి లాగిన్ కావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రశీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈఓ కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టికల్స్‌పై కన్ను.. ఆయా మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో వాటి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు.. సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలన్నారు. ఈ విషయమై మీనా అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ (ఎంసీ అండ్ ఎంసీ) కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. నిర్దేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తామన్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ ఆర్డరు కాపీ నెంబరును ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు. -
మీ ధ్యాసంతా భ్రమరావతేనా?
చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో రామోజీకి చెత్త రాతల ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే రోజుకో తప్పుడు కథనంతో ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికీ పనికి రాని చంద్రబాబు కలల రాజధాని భ్రమరావతిపై ఇంకా మోజు తీరక.. అక్కడేదో జరగరానిది జరిగిపోతున్నట్లు కల కంటున్నారు. అక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వివిధ గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పిస్తూ గెజిట్ జారీ చేస్తే.. అదంతా కుట్ర పూరితమంటూ వక్ర రాతలు రాశారు. చంద్రబాబు రైతులను వంచించి, అవసరానికి మించి భూములు లాక్కున్నప్పుడు మీరేం చేశారు రామోజీ? సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని పేరుతో తమ నుంచి బలవంతంగా భూములు సేకరించారని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలోనూ వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బలవంతంగా సేకరించిన భూమిని వెనక్కి ఇస్తామని చెప్పారు. ఈ హామీకి అనుగుణంగా న్యాయ అడ్డంకులను దాటి వారికి భూమిని వాపస్ చేయడానికి ఇటీవల గెజిట్ జారీ చేశారు. అంతే.. అమరావతిపై మరో విచ్చిన్నకర కుట్ర అంటూ ఈనాడు రామోజీ శోకాలు పెట్టారు. రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి గుట్టుగా గెజిట్ విడుదల చేశారంటూ గగ్గోలు పెట్టారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తమ అనుమతి లేకుండానే రాజధాని పేరిట తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పలువురు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి ప్రమేయం లేకుండానే తీసుకుని మాస్టర్ ప్లాన్‌లో పెట్టి రోడ్లకు కేటాయించేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆ రైతులందరూ సీఆర్డీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల ఇబ్బంది పడ్డ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏ సమావేశంలో వారి భూములను భూసేకరణ పరిధి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 11న తీర్మానం చేశారు. కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచ్చికల పాలెం, ఐనవోలు, రాయపూడి, కొండమారాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రామోజీకి ఆగ్రహం తెప్పించడంతో ఓ తప్పుడు కథనం వండిపడేశారు. అందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : గుట్టుగా గెజిట్ జారీ చేశారు వాస్తవం: రాజధాని నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం 34,281 ఎకరాలను సేకరించింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రానిచోట్ల భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. అలా 1,317.90 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి 274.86 ఎకరాలు పూలింగ్‌లో ఇచ్చేందుకు రైతులు ముందుకు రాగా, మిగిలిన భూమిని బలవంతంగా తీసుకున్నారు. అందులో 217.76 ఎకరాలు రోడ్లకు కేటాయించారు. కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే వారి స్థలాల్లో రోడ్లు వేయడమే కాకుండా రిటర్నబుల్ ప్లాట్ల కింద కొంత మందికి రిజి్రస్టేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 625.25 ఎకరాల భూమిపై ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తు చేసింది. సీఆర్డీఏకు చెందిన డిప్యూటీ కలెక్టర్లతో పలుమార్లు సమావేశమై రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గెజిట్ జారీ చేశారు. ఆయా రైతులకు ఈ మేరకు సమాచారం అందించారు. ఆయా గ్రామాల సచివాలయాల్లో గెజిట్‌ను అందుబాటులో ఉంచారు. గెజిట్‌కు పత్రికా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో దాన్ని ఇవ్వలేదు. ఆరోపణ : భూసేకరణ ఉపసంహరణ గెజిట్లను విడుదల చేసే ముందు రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేయాలి వాస్తవం: ఇప్పుడు గెజిట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు. అందువల్ల అసలు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపుల ప్రసక్తే రాదు. ఉండవల్లి గ్రామంలో 113.60 ఎకరాలు, పెనుమాక గ్రామంలో 458.45 ఎకరాలను భూసేకరణ నుంచి మినహాయించింది. ఈ రెండు గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్ కింద 117.18 ఎకరాలు కవర్ అయింది. ఇదిపోగా మిగిలిన 572.05 ఎకరాలను మాత్రమే మినహాయించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను రైతులు ఉపసంహరించుకుని, భవిష్యత్తులో ఎలాంటి నష్టపరిహారం అడగబోమన్న హామీ కింద మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల 21 గ్రామాల్లోని రైతులతో పాటు, ఉండవల్లి, పెనుమాక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది తట్టుకోలేని ఈనాడు కడుపుబ్బరంతో దిగజారి ప్రభుత్వంపై బురద జల్లే పనికి పూనుకుంది. ఆరోపణ: భూసేకరణ పరిధి నుంచి ఈ గ్రామాలను తప్పిస్తే మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బందులు వస్తాయి వాస్తవం: ఈ అంశంపై అధికారులు భారీ కసరత్తు చేశారు. బాధిత రైతుల నుంచి కన్సెంట్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్‌లో వారి భూముల్లో నుంచి రోడ్లు వెళ్తుంటే వాటిని మినహాయించి మిగిలిన భూమికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఆ స్థలాల్లో దేనికైనా కేటాయింపులు జరిగి ఉంటే ఆ భూముల జోలికి వెళ్లలేదు. దేనికీ కేటాయించని భూములను మాత్రమే భూసేకరణ పరిధి నుంచి మినహాయించారు. -
రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేస్తావా?
సాక్షి, మచిలీపట్నం: ‘ప్రభుత్వ ఆదేశాలతో పని చేసే రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం చేస్తావా?, ఒక బీసీ మహిళా అధికారిని తోలు తీస్తా అనడం కొల్లు అహంకారానికి నిదర్శనం’ అని టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో అధికారులు రాత్రి వేళల్లో పనిచేయలేదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయమని, మళ్లీ అధికారంలోకి వచ్చాక పేదలకు మంచి చేసేదీ తామే అని అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని తనపై కొల్లు చేసిన ఆరోపణలకు పేర్ని నాని ఘాటుగా జవాబు ఇచ్చారు. కొల్లు హయాంలో పేదలతో పాటు విలేకరులకు ఇచ్చిన దొంగ పట్టాలు, ఆర్ఎస్సార్ రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్లను మీడియా ముందు ఆధారాలతో చూపారు. రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పారు. కొల్లు మంత్రిగా ఉండి మామతో కలిసి ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టాడని విమర్శించారు. తమ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తామన్నారు. తాను ప్రజలకు ఏ రోజూ దొంగ పట్టాలు ఇవ్వలేదన్నారు. పదవి పోయే పది రోజుల ముందు విలేకర్లకు ఎలాంటి వార్డు నంబర్లు లేకుండా కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చారని, ఆ రోజు అందుకు ప్రభుత్వ అనుమతి, జీవో ఉందా అని ప్రశ్నించారు. విలేకరులకే దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేసిన కొల్లు శ్రీరంగ నీతులు చెప్పడం ఏమిటన్నారు. 1977–78 తుపాన్లో నష్టపోయిన గిరిపురం మత్స్యకారులకు ఒక్కరికైనా టీడీపీ నేతలు ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదని, వారికి అండగా నిలిచి, రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించింది తానే అని చెప్పారు. విజయవాడలో నివసిస్తూ ఎన్నికల వేళ ఓట్లు కోసం బందరుకు వచ్చే కొల్లుకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తన కుమారుడు పేర్ని కిట్టు బోగస్ శంకుస్థాపనలు చేస్తున్నారని అరోపించారని, అవి 70 శాతం పూర్తయిన పనులని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కిట్టు ఎమ్మెల్యే అవటం ఖాయమని.. ప్రజలకు అతడే పట్టాలిస్తాడని అన్నారు. ఈ సమావేశంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు భారతి, విజయలక్ష్మీ, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోర్టు ఉత్తర్వులకూ తప్పుడు భాష్యం
సాక్షి– అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ప్రతీ రోజూ తప్పుడు కథనాలు వండివారుస్తున్న ఈనాడు దినపత్రిక, తాజాగా కోర్టు ఉత్తర్వుల విషయంలోనూ అదే వైఖరిని బయటపెట్టుకుంది. కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్లు ప్రచురించి, ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. ‘సాక్షి’ దినపత్రిక సర్క్యులేషన్ వివరాలను వెల్లడించవద్దంటూ ఆడిట్బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్‌ను (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా తప్పుడు కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. వాస్తవానికి సర్క్యులేషన్ వివరాలను తనకు సీల్డ్ కవర్లో సమర్పించాలని ఏబీసీని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు... ఈ నెల 27వరకూ ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్ వివరాలనూ వెల్లడి చేయవద్దని స్పష్టంగా తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ‘ఈనాడు’తో సహా తెలుగు దినపత్రికలన్నింటికీ వర్తిస్తాయి. కానీ ‘ఈనాడు’ మాత్రం... ఒక్క సాక్షి పత్రిక సర్క్యులేషన్ వివరాలను మాత్రమే వెల్లడించవద్దని ఏబీసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా కథనాన్ని ప్రచురించటంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని వివరాలు చూస్తే... విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేసుకోవటానికి గ్రామ, వార్డు వలంటీర్లకు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఆ మేర బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఏ పత్రికను కొనాలన్నది చెప్పలేదు. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసుకోవచ్చునని వలంటీర్లకు ఛాయిస్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రై వేట్ లిమిటెడ్ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వలంటీర్లు, సచివాలయాలు ఒకవేళ ‘సాక్షి’ దినపత్రికను కొనుగోలు చేస్తే ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్కులేషన్ను (ఏబీసీ) ఆదేశించడంతో పాటు నిర్ధిష్ట కాలాల్లో సాక్షి పత్రికు ఇచ్చిన సర్కులేషన్ సర్టిఫికేషన్‌ను పునస్సమీక్ష చేయాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ.వెంకట్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక ప్రభుత్వ జీవోల అమలును నిలిపేయడంతో పాటు, 2022 జూలై– డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్కులేషన్ను ఆడిట్ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. అనంతరం ఉషోదయ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేసింది. దీనిపై ఉషోదయ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత ఏడాది ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉషోదయ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉషోదయ వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గత ఏడాది జూలై నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక వాదనల సమర్పణకు సైతం ఆదేశాలిచ్చింది. అయితే సర్క్యులేషన్ వివరాలను వెల్లడి చేయకుండా ఏబీసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బుధవారం (మార్చి 13) ఉషోదయ మరో పిటిషన్ వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏబీసీ తరఫు న్యాయవాది ఎవరూ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజా సర్కులేషన్ వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంటూ ఏబీసీకి నోటీసులిచ్చింది. అంతేకాక ఈ నెల 27 వరకూ తెలుగు దినపత్రికలన్నింటి సర్కులేషన్ వివరాలను వెల్లడి చేయవద్దని కూడా ఏబీసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉంటే, ఈనాడు మాత్రం ఆ ఉత్తర్వులను దురుద్దేశాలతో తప్పుగా ప్రచురించింది. ఢిల్లీ హైకోర్టు ‘సాక్షి’ సర్కులేషన్ వివరాలను, గణాంకాలు ప్రచురించవద్దంటూ ఏబీసీని ఆదేశించినట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించి తన నైజాన్ని చాటుకుంది. -
ఏపీలో ‘ఐబీ’ అమలుపై ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేయడాన్ని అంతర్జాతీయ వేదికపై విద్యావేత్తలు ప్రశంసించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మూడు రోజుల ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు శుక్రవారం ముగిసింది. చివరిరోజు అసమానతలు లేని సమాజం కోసం సమగ్ర సమీకృత విద్యా బోధన ప్రతి ఒక్కరికీ అందించాలన్న అంశంపై చర్చ జరిగినట్టు యూఎన్వో స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 38 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు అంతర్జాతీయ వేదికపై చెప్పామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మారిన పరిస్థితులు, విద్యార్థి–ఉపాధ్యాయుల మధ్య బలపడిన సత్సంబంధాలపై ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కెపాసిటీ బిల్డింగ్, అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సహకరిస్తామని యునెస్కో ఇన్‌క్లూజన్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ హెడ్ తమరా మార్టి కసాడో హామీ ఇచ్చినట్టు షకిన్ పేర్కొన్నారు. ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషనల్ అవార్డు గ్రహీత డోనా రైట్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను ప్రశంసించారన్నారు. ప్రాథమిక విద్యపై ఎన్నో పరిశోధనలు చేసిన రైట్... ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం గొప్పదని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని ఐబీ సంస్థ ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ మేనేజర్ డాక్టర్ కళా పరశురామ్ “పాఠశాలల్లో స్థిరమైన సమ్మిళిత పద్ధతులు’పై పాన్ ఆసియా కమిటీ చర్చలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు సంబంధించిన అవసరాలు, విశ్లేషణలో భాగంగా తాము ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించామని, ప్రభుత్వం గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. -
మా మంచి సీఎం
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయడానికి గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆపదలో ఉన్నామని.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన వెంటనే మానవతా దృక్పథంతో వారికి ఆర్థిక సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులును సీఎం ఆదేశించారు. దీంతో వెంటనే కలెక్టర్ బాధితుల వివరాలు తెలుసుకుని 16 మందికి రూ.16.30 లక్షలను సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆర్థిక సాయం అందజేశారు. – సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వారి వివరాలు ► నంద్యాల పట్టణం గాంధీనగర్‌కు చెందిన లక్కా కేశవ పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స నిమి త్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష అందజేశారు. ► నంద్యాల పట్టణం గాంధీనగర్‌కు చెందిన కె.మార్తమ్మ మూర్ఛ వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం సంగపట్నానికి చెందిన షేక్ షరీఫ్ ఫిజియో థెరపీ చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన ఎస్.గణేష్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష అందజేశారు. ► అవుకు మండలం సింగనపల్లెకు చెందిన ఎ.తారకేశవ్ మాన సిక వికలత్వంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన కాటసాని గణేష్ బ్రెయిన్లో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. బాధితుని చికిత్స కోసం రూ. 50 వేల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► బనగానపల్లె మండలం గుండ్ల సింగవరం గ్రామానికి చెందిన కంబగిరి స్వామి మెదడులో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఒద్దిరాళ్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడవ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతనికి చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అనంతపురం పాతబస్తీకి చెందిన పి.ముష్కస్ బ్యాక్ బోన్ ఫ్యాక్చర్‌తో బాధపడుతోంది. ఆమెకు చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► రోడ్డు ప్రమాదంలో మోకాలు పోగొట్టుకున్న అనంతపురానికి చెందిన బాధితుడు ఎస్.ఖాజాకు రూ.50 వేల చెక్కును అందజేశారు. ► ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన సి.సోమశేఖర్ పేదరికం కారణంగా గృహ నిర్మా ణం నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► ప్రకాశం జిల్లా ఓబులంపల్లికి చెందిన బాల గురువయ్య వైద్య ఖర్చుల కోసం అతని భార్యకు రూ.లక్ష చెక్ అందజేశారు. -
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి రెండు డీఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, అలాగే గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్నారు. అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లిస్తారు. డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)కు జమ చేయనున్నారు. డీఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫున చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
జగనన్న చొరవ.. ఆ బాలుడి గొంతు పలికింది
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు. ఫిబ్రవరి 29న స్కూల్‌కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. మహ్మద్‌ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. అరుదైన శస్త్రచికిత్సతో.. కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్‌ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే.. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఏపీ సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు ఫోన్‌చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్ ప్లాంట్ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్ కేఏ పాల్‌ను ఆదేశించింది. ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నరేందర్ ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్‌కు స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
కొనసాగిన నిరసనలు
సాక్షి, నెట్వర్క్: తెనాలికి చెందిన గొల్తి గీతాంజలిని అసభ్యకర మెసేజ్‌లతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ, జనసేన పార్టీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలిపై ఈ రెండు పార్టీల సోషల్ మీడియా మూకలు అసభ్య సందేశాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రజలు చేస్తున్న నిరసనలు గురువారమూ కొనసాగాయి. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. ట్రోలింగ్ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలో న్యాయవాదులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ న్యాయస్థానాల సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్వో వి.శ్రీనివాసరావుకు న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ టీడీపీ చర్యలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుజాత, ఉషాజ్యోతి, సౌమ్య, జ్యోతి, సి.హెచ్.సాయిరామ్, పిళ్లా రవి, కె.జయరాజు, మన్మధరావు, కె.ప్రభాకర్, నిర్మల్ రాజేష్ , సూర్యనారాయణరెడ్డి, పూర్ణ, భార్గవ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద గీతాంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులరి్పంచి, గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి తదితరుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు.