AP Special
-
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి రెండు డీఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, అలాగే గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్నారు. అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లిస్తారు. డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)కు జమ చేయనున్నారు. డీఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫున చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
జగనన్న చొరవ.. ఆ బాలుడి గొంతు పలికింది
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు. ఫిబ్రవరి 29న స్కూల్‌కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. మహ్మద్‌ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. అరుదైన శస్త్రచికిత్సతో.. కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్‌ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే.. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఏపీ సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు ఫోన్‌చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్ ప్లాంట్ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్ కేఏ పాల్‌ను ఆదేశించింది. ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నరేందర్ ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్‌కు స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
కొనసాగిన నిరసనలు
సాక్షి, నెట్వర్క్: తెనాలికి చెందిన గొల్తి గీతాంజలిని అసభ్యకర మెసేజ్‌లతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ, జనసేన పార్టీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలిపై ఈ రెండు పార్టీల సోషల్ మీడియా మూకలు అసభ్య సందేశాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రజలు చేస్తున్న నిరసనలు గురువారమూ కొనసాగాయి. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. ట్రోలింగ్ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలో న్యాయవాదులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ న్యాయస్థానాల సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్వో వి.శ్రీనివాసరావుకు న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ టీడీపీ చర్యలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుజాత, ఉషాజ్యోతి, సౌమ్య, జ్యోతి, సి.హెచ్.సాయిరామ్, పిళ్లా రవి, కె.జయరాజు, మన్మధరావు, కె.ప్రభాకర్, నిర్మల్ రాజేష్ , సూర్యనారాయణరెడ్డి, పూర్ణ, భార్గవ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద గీతాంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులరి్పంచి, గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి తదితరుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు. -
జగన్‌లాంటి అన్న మీ దేశాల్లో ఉన్నారా!
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అసలైన అండదండ అని, సీఎం జగన్ వంటి అన్నలు మీ దేశాల్లోను, సమాజాల్లోను ఉన్నారా అని వివిధ దేశాల నుంచి హాజరైన మహిళలను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ, స్త్రీ శిశు సంక్షేమ సలహాదారు నారమల్లి పద్మజ అడిగారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి వారిద్దరూ హాజరయ్యారు. గురువారం జరిగిన సదస్సులో ఏపీలో అమలవుతున్న మహిళాభివృద్ధి కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, భద్రత అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను 6 నిమిషాల వీడియో ద్వారా ప్రతినిధులకు వివరించారు. ‘మహిళల కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు ద్వారానే ప్రగతిలో వేగం సాధ్యం’ అనే అంశంపై వారు మాట్లాడుతూ ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. యాక్సిలరేట్ ప్రోగ్రెస్’ అన్నది 2024లో ఐక్యరాజ్య సమితి నినాదమని, ఈ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లుగా ఆచరణలోకి తెచ్చారని వివరించారు. ఏపీలో అయిదేళ్ళుగా జెండర్ సమానత్వం పరంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. జగనన్న అమ్మ ఒడి లాంటి స్కీమ్‌లు మీ దేశాల్లో, మీ సమాజాల్లో కూడా తల్లులు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఇక్కడి పథకాలను అధ్యయనం చేసి మీ సమాజాల్లో అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఏపీలో అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పథకాల వల్ల మహిళల ఆర్థిక స్తోమతతోపాటు వారి ఆత్మగౌరవం పెరిగిందన్నారు. -
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు!
కర్నూలు (సెంట్రల్): శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 87 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది సహేతుక న్యాయం చేసేందుకు డీ సెంట్రలైజేషన్ (పరిపాలనా వికేంద్రీకరణ) విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అందులో భాగంగానే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని, రాష్ట్ర న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలో జగన్నాథగట్టు వద్ద 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు జరిగాయి. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తితో కలసి న్యాయ విశ్వ విద్యాలయం పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. న్యాయ విశ్వ విద్యాలయం నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ 87 ఏళ్ల క్రితం సహేతుక న్యాయం కోసం ఈ ప్రాంత ప్రజలు శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అప్పటి నుంచి అమలు కోసం నిరీక్షిస్తున్నారని గుర్తు చేశారు. లా యూనివర్సిటీకి సంబంధించిన శిలాఫలకం వద్ద సీఎం జగన్ 1937లో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఆ రోజుల్లోనే హైకోర్టును ఇక్కడే నెలకొల్పుతారని భావించారని చెప్పారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే నెలకొల్పే సామర్థ్యాన్ని లా యూనివర్సిటీ సంతరించుకుంటుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. త్వరలోనే వర్సిటీ నిర్మాణ పనులను చేపట్టి వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలుకు మరిన్ని న్యాయ సంస్థలు కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంతోపాటు మరిన్ని ప్రతిష్టాత్మక న్యాయ విభాగాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునళ్లను కర్నూలులోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు పని చేస్తున్నాయని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో ఆయా కమిషన్లు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయ సంస్థలన్నింటికీ జగన్నాథగట్టుపైనే భవన సముదాయాలను సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం నిలుస్తుందని, సీమ అభివృద్ధికి ఇది మచ్చు తునక లాంటిదని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. తుంగభద్రలో కాలుష్య విముక్తికి రూ.131.84 కోట్లు కర్నూలు నగర పాలకసంస్థలో అమృత్ 2.0 పథకం కింద రూ.131.84 కోట్లతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. రాంబొట్ల దేవాలయం, మామిదాలపాడు, మునగాలపాడు సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తుంగభద్ర నదికి మురుగునీరు, కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది. కార్యక్రమంలో మంత్రి బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా చైర్మన్ కరణం కిశోర్‌కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయమనోహరి, జేసీఎస్ జిల్లా అధ్యక్షుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అది రాయలసీమ, కర్నూలు వాసుల కోరిక: సీఎం జగన్ శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడే (కర్నూలు) హైకోర్టు పెడతామని చెప్పారు. ఈమేరకు ఆ రోజుల్లోనే ఇక్కడకు రావాల్సింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసినందున అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలు ఆ హోదాను కోల్పోతుండటంతో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పిన మాట మేరకు ఈరోజు మన అడుగులు ముందుకు పడుతున్నాయి. – సీఎం జగన్ కర్నూలు సమగ్ర నీటి సరఫరాకు రూ.115 కోట్లు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో నీటి కొరతను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. రూ.115 కోట్లతో అమృత్ 2.0 పథకం ద్వారా సమగ్ర నీటి సరఫరాకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జగన్నాథగట్టు వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్, సర్వీసు రిజర్వాయర్, గ్రావిటీ మెయిన్స్ విభాగాల ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. శుద్ధి అయిన నీటిని అక్కడి నుంచి కర్నూలు నగరానికి సరఫరా చేస్తారు. రోజుకు 50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీటిని శుద్ధి చేసేలా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అగ్రకుల పేదలను గుర్తించిన ఏకైక సీఎం జగన్ అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని గు ర్తించి మేలు చేస్తున్న ఏకైక సీఎం జగనే. గత ఎన్నికలకు ముందు నా భర్త మరణించగా వితంతు పింఛన్ అందలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు పింఛన్ మంజూరైంది. ఈబీసీ నేస్తం ద్వారా నాకు రూ.45 వేల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగాం. ఇప్పుడు ఇంటివద్దే వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. – పద్మావతి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, బనగానపల్లె -
గీతాంజలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేత
తెనాలి: టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల అసభ్యకర పోస్టింగులకు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన గొల్తి గీతాంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబానికి అందింది. గీతాంజలి కుమార్తెలు రిషిత, రిషికల పేరిట చెరొక రూ.10 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ పత్రాలను గురువారం సాయంత్రం గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు. ముందుగా గీతాంజలి చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావుతో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డిపాజిట్ పత్రాలను చిన్నారులకు అందజేశారు. ప్రభుత్వం ద్వారా తన కుటుంబానికి జరిగిన మేలును గీతాంజలి బహిరంగంగా మీడియాలో చెప్పటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వికృత పోస్టింగులతో ఆమె బలవన్మరణానికి కారకులయ్యారని ఎమ్మెల్యే శివకుమార్ ధ్వజమెత్తారు. తన చేత్తో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్న గీతాంజలి భౌతికకాయానికి తానే పూలమాల వేయాల్సి రావటం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతగానో కలచివేసిందన్నారు. అమాయక మహిళలపై ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల సాయం టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబానికి ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆయన పంపిన డబ్బును గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి, స్థానిక నేతలు గీతాంజలి భర్త బాలచంద్ర, చిన్నారులు రిషిత, రిషికలకు అందజేశారు. ఈ నగదు సాయం చేసిన ఎన్నారై పంచ్ ప్రభాకర్ వీడియో కాల్ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ఖర్చులను తన మిత్ర బృందంతో కలిసి తామే భరిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్థిక సాయం అందించిన పంచ్ ప్రభాకర్‌కు బాలచంద్ర ధన్యవాదాలు తెలిపారు. -
Fact Check: అసలే గుడ్డి.. ఆపై బాబు పొరలు
కళ్లకు చంద్రబాబు పొరలు కమ్మేసిన గుడ్డి రామోజీ మరోసారి బట్టలిప్పేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను జగన్ సర్కారు మోసం చేసిందంటూ చేతికొచ్చింది రాసి చిందులు తొక్కారు. తాను కట్టుకున్న కోట దాటి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ సీఎం జగన్ సృష్టించిన ఉద్యోగాల విప్లవం ఈ బధిరుడికి కనిపించేది. చంద్రబాబు స్కిల్ స్కామ్‌ను బయటకు తీశారన్న అక్కసుతో జగన్ ఏలుబడిలో ఉద్యోగాల కల్పన లేదంటూ పచ్చి అవాస్తవాలను అచ్చు వేశారు. పదే పదే అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రామోజీ ఒకసారి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఉద్యోగాలు కల్పించలేదంటూ రాగం తీస్తే అప్పుడు ఎవరు ఎవరి కాలర్ పట్టుకుని నిలదీస్తారో తెలుస్తుంది. ఈ రాతలపై మండిపడుతున్న యువత ఎవరి కాలర్ పట్టుకోవాలో ఇప్పటికే నిర్ణయించేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత జగన్ సర్కారుది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10–11 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తారు. దేశ చరిత్రలో ఒకేసారి కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించడం, వెంటనే భర్తీ చేయడం జరగనేలేదు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3 శాతం ఉంటే ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో కేవలం 4.1 శాతమే. ఈ గణాంకాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెలువరించినవి. 2014–19 మధ్య చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 34,108. చంద్రబాబు దిగిపోయే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,123 మాత్రమే. ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులు మొత్తం కలిపి 6,38,087 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు గాలికి వదిలేస్తే, వైఎస్.జగన్ సర్కారు 53,466 ఉద్యోగాలను భర్తీ చేసింది. నైపుణ్య శిక్షణ మీ బాబు భక్షణే అసలు ఈనాడు రామోజీ ఏడుపు అంతా చంద్రబాబు స్కిల్ స్కామ్‌పై విచారణ చేపట్టడమేనని అక్కసుతో రాసిన ఈ కథనం చెప్పకనే చెబుతోంది. స్కిల్ పేరుతో చంద్రబాబు దోపిడీ అంతా ఇంతా కాదు. స్కిల్ పేరుతో కోట్లాది రూపాయల నిధులు తన ఇంటికి మళ్లించేశారు. కానీ వైఎస్.జగన్ ప్రభుత్వం 175 శాసనసభ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి ఉండే విధంగా మొత్తం 192 స్కిల్ హబ్్సను ఏర్పాటు చేసింది. ఇక్కడ లెవెల్–4 లోపు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి తక్కువ కాకుండా మొత్తం 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. హై ఎండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు రాష్ట్ర విద్యార్థులు అందుకునే విధంగా స్కిల్ ఇంటర్నేషనల్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం పలు పరిశ్రమలు, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకొంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్యర్యంలో నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు 14,26,515 మంది యువతకు శిక్షణ ఇచ్చింది. అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం కేంద్రం విడుదల చేసిన ఇండియా 2023 స్కిల్ రిపోర్ట్ అత్యధిక ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని స్పష్టం చేసింది. సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పన భేష్ అని నివేదిక ప్రశంసించింది. ప్లేస్మెంట్లలో రూ.2.6 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్కిల్ రిపోర్ట్ పేర్కొంది. యువతకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందేలాగా ప్రోత్సహిస్తున్నది సీఎం వైఎస్.జగన్ మాత్రమే. -
మద్దతు ధరకు కొంటే విమర్శలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పండిన పంటలను రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నా విమర్శించడం సరికాదని మార్క్‌ఫెడ్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు చెప్పారు. పంట ఉత్పత్తుల కొనుగోలుపై ఈనాడు పత్రిక రాసిన కథనాన్ని ఆయన ఖండించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం యాప్ ద్వారా గ్రామాలవారీగా పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తూ, మద్దతు ధర దక్కని పంటలను ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 57 నెలల్లో 6.18 లక్షల రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను సేకరించామన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో శనగలు, మినుములు, పెసలు, వేరుశనగలు, జొన్నలు, మొక్కజొన్నలు కలిపి 3.88 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మొక్కజొన్న క్వింటాలు రూ.2,090 చొప్పున 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ 57 నెలల్లో రూ.1,648 కోట్ల విలువైన 9.10 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించామన్నారు. ఫలితంగా మార్కెట్లో మొక్కజొన్న ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మొక్కజొన్న గతేడాది రూ. 2 వేల నుంచి రూ.2,400 వరకు పలికిందన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు పౌల్ట్రీతో పాటు ఇథనాల్ పరిశ్రమల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్లో ఈ పంట ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాన మార్కెట్లలో క్వింటాలు రూ.2 వేల నుంచి రూ. 2,600 వరకు పలుకుతోందన్నారు. మార్కెట్ సదుపాయం లేని చోట్ల చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మొక్కజొన్న సేకరణకు అనుమతినిస్తుందని తెలిపారు. ప్రతి ఏటా మద్దతు ధర దక్కని పంటలకు రైతుకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కెట్లలో జోక్యం చేసుకుంటుందని చెప్పారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. సకాలంలో చెల్లింపుల కోసం రుణాలు తీసుకోవడం ఏటా జరిగే ప్రక్రియేనని చెప్పారు. సేకరించిన పంట ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించగా వచ్చే సొమ్ముతో రుణాలు సర్దుబాటు చేసుకుంటామని, అవసరమైతే పంట ఉత్పత్తుల సేకరణకు తీసుకునే రుణాలను వడ్డీతో సహా ధరల స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్నారు. ఇందులో తప్పేమిటని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే పనిగట్టుకొని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. -
AP High Court: ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు నేడు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. కాగా, వీరిద్దరూ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. ఈ ప్రమాణ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బాబు, పవన్‌కు విశ్వసనీయత, విలువల్లేవ్: సీఎం జగన్
సాక్షి, నంద్యాల: పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బనగానపల్లె నుంచి చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ.. తదితర ఓసీల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా రూ.15,000 చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ మూడేళ్లపాటు సహాయం అందించే కార్యక్రమంమే ఈ వైఎస్సార్ ఈబీసీ నేస్తం. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావు. అయినా వారికి త తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈరోజు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్కచెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగాం. ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సాయం అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు 65618 మంది అయితే, 107824 మంది నా అక్కచెల్లెమ్మలు ఇదే ఈబీసీ నేస్తం రెండు సార్లు పొందారు. 3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి అందుకున్నారు. అదే అక్కచెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ చేయిపట్టుకుని నడిపించగలిగితే, ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి ఉంటుంది. వారి కుటుంబాలన్నీ బాగు పడే పరిస్థితి వస్తుంది.ూ ఈ వ్యాపారంతో నెలనెలా కనీసం 610 వేలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. వైఎస్సార్ చేయూత ద్వారా 4560 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 4560 సంవత్సరాల వయసున్న కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడటం, ఆర్థిక సాధికారతకు సహకారం అందిస్తున్నట్లుగానే వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటున్నాం. అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 33,14,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 4,64,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి మంచి జరిగించాం. మొత్తంగా 4560 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలు 44,74,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి. అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ గానీ, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలపంపిణీ, అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్, ఇళ్లు కట్టించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని ఎక్కడా కూడా కులం చూడటం లేదు, వర్గం, మతం, ప్రాంతం, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడటం లేదుూ అర్హత ఉంటే చాలు.. ప్రతి అక్కచెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేస్తున్నాం. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ ఇస్తూ అండగా నిలబడుతున్న పరిస్థితి.ూ గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దకే సేవలందిస్తున్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. సంక్షేమ పథకాల్లో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల పేరుమీదే, వారి పేరు మీదే బ్యాంకు అకౌంటు తెరిచి అందులో నేరుగా జమ చేస్తూ వారి చేతికే అందిస్తున్న ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తున్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే.. .. మీ మీ బ్యాంకులకు మీరు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లతో అడగండి. 10 సంవత్సరాల డేటా ఇవ్వండని అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాలకు సంబంధించనది, మన 5 సంవత్సరాల పాలన డేటాను ఒకసారి చూసుకోండి. చంద్రబాబు 5 సంవత్సరాల డేటా చూస్తే మీ బ్యాంకు అకౌంటుకు ఒక్క రూపాయి అయినా పంపించాడా?.ూ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు అకౌంటు డీటెయిల్స్ చూస్తే ఎన్ని లక్షల రూపాయలు నేరుగా మీ చేతికే వచ్చిందన్నది కనిపిస్తుంది. గతంలో ఏ పథకం ఉందో ఎవడికీ తెలియదు. ఎప్పుడిస్తారో తెలియదు. అసలిస్తారో లేదో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మన గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్. ఒకటో తేదీ ఉదయం ఆదివారమైనా, సెలవుదినమైనా లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో ఇంటికే వచ్చి మీ మనవడిలా, మనవరాలిలా తోడుగా ఉంటూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు ప్రతి పథకం ప్రతి కుటుంబానికీ అందుతోంది. ఇలా ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం..ూ ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఇందులో రూ.1.89 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. మహిళా సాధికారత పరంగా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసి, అందులో ఏదైతే హామీలిచ్చామో ఆ హామీలన్నీ ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటికి వచ్చి మన ప్రజా ప్రతినిధులు మీరే చూడండి. చెప్పిన ప్రతి ఒక్కటీ జగనన్న చేసి చూపించాడని, మీరే టిక్కు పెట్టండని ధైర్యంగా మీ ఇంటి గడప తొక్క గలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ూ మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేయడం, రంగురంగుల హామీలివ్వడం, వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేయడం అనే సంప్రదాయాన్ని మారుస్తూ ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ గా భావించిన పరిస్థితి కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగింది. మరోవంక.. మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబును, దత్తపుత్రుడిని చూడండి. ూ వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది?. చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చేది బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది.ూ ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచీ గుర్తుకురాదు. ఒక్క స్కీము కూడా గుర్తుకురాని పరిస్థితి. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రస్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. ఏదేండ్లకోకసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్, ఓ వంచకుడు గుర్తుకొస్తాడు. ఒకరికి విశ్వసనీయత లేదు. మరొకరికి విలువలు లేవు. వీరు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు.. కాదు కాదు.. మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారు. ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కల్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలు ఇదే మాదిరిగేనే స్టేజీ మీద కూర్చొని ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చారు. చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఇందులో ఈయన రాసిన మాటలు, వాగ్దానాలు.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు 14205 కోట్లు మాఫీ చేస్తానని, నా అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకుగానీ, మీకు తెలిసిన వారికిగానీ ఒక్కరికైనా రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లోకి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నా. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి. 5 సంవత్సరాలకు రూ.1.25 లక్షలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా?. ఈ మాదిరిగా పాంప్లేట్లు చూపించాడు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. మేనిఫెస్టో అని తెచ్చాడు. అక్కచెల్లెమ్మలకు ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో పేజీ నంబర్ 16, 17లో.. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన 9 హామీలు గుర్తుచేస్తా. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తామన్నారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణులకు రూ.10 వేలు అందిస్తామన్నారు. పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ పై రూ.100 సబ్సిడీ. 5 ఏళ్లలో రూ.6,00 ఇస్తామన్నారు. హైస్కూలు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి తీసుకొచ్చి ఆర్థిక స్వావలంబన ఇస్తామన్నారు. మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్.. ఇవన్నీ కేవలం మహిళలకు సంబంధించిన 9 హామీలు... ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన సీఎం అయిన తర్వాత 2014-19లో ఆయన, ఆయనతోపాటు దత్తపుత్రుడు, ఈ బీజేపీ ముగ్గురూ కలిసి ఫొటోలు దిగి, మేనిఫెస్టో రిలీజ్ చేసి, సంతకాలు పెట్టి ఇంటింటికీ పంపిచాడు. ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని అడుగుతున్నా.. ఇంతటి దారుణంగా మోసం చేస్తున్న ఈ వ్యక్తులకు మనం మళ్లీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనల్ని మోసం చేస్తూ, రంగు రంగుల మేనిఫెస్టో అని పేర్లు చెబుతూ, మళ్లీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని చెబుతూ, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబితే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా, న్యాయమేనా? ఆలోచన చేయమని అడుగుతున్నా. మీ బిడ్డ ఒకవైపున మేనిఫెస్టో అనేది చెబితే 2019లో రిలీజ్ చేస్తే ఒక బైబిల్ గా, భగవద్గీత, ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి ఆశీస్సులు అడుగుతున్నాడు. మరోవైపున పచ్చి మోసగాళ్లు, పచ్చి దగాకోర్లు, పచ్చి మాయామాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేతకాదు. అబద్ధాలు చెప్పడం చేతకాదు. రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు, మోసాలు ఇంకా ఎక్కువ వింటాం. మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టోకన్నా ఇంకా రంగురంగుల మేనిఫెస్టో ఇస్తారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా, స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని పిలుపునిస్తున్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతామని గట్టిగా చెప్పండి. కాసేపటి క్రితం రామిరెడ్డి అన్న.. బనగానపల్లెకు ఔకు రిజర్వాయర్ నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారారూ.100 కోట్లు ఖర్చయ్యే నీళ్ల సప్లయ్ గురించి అడిగాడు. ఇది కచ్చితంగా చేసి తీరుతాం. ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. వంద పడక సీహెచ్ సీ ఆస్పత్రిని. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చారు. పారామెడికల్ స్టాఫ్ తో కూడా కలుపుకొంటే 100 మందికిపైగా హాస్పటల్ లో ఉండి అండగా ఉండే కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరిగింది. దేవుడి చల్లని దీవెనలుండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మీ అందరితో ఇంకో చిన్న విన్నపం చేయదల్చుకున్నా. ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది. బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తున్నాం ఈబీసీ నేస్తం కూడా. డబ్బులొచ్చే కార్యక్రమం ఒక వారం అటో ఇటో జరుగుతుంది. ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ డబ్బులు చేరుతాయి. ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఆంధ్రజ్యోతి టీవీ, టీవీ5 చూడొద్దండి. ఆటోమేటికలీ డబ్బులు పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా పర్లేదు. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయి ఉన్న మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తున్నాం. న్యాయంగా, ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి, అన్యాయంగా చూపించే ఒక చెడిపోయి ఉన్న కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడా యుద్ధం చేస్తున్నామన్నది మర్చిపోకండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడి దయతో నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. మన రామిరెడ్డి అన్న.. మీ అందరికీ పరిచయస్తుడే. నిరుడుకన్నా ఇంకా గొప్ప మెజార్టీతో ఆశీర్వదించమని కోరుతున్నా. అటువైపున టీడీపీ అభ్యర్థి చాలా ధనవంతుడు. చాలా డబ్బులున్నాయి.ఓటుకు రూ.2 వేలైనా రూ.3 వేలైనా ఇస్తాడు. రామిరెడ్డి అన్న ధనవంతుడు కాదు. ఆ మాదిరిగా ఇవ్వలేకపోవచ్చు. రామిరెడ్డి అన్నను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్కచెల్లెమ్మకూ కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయన్నది మనసులో పెట్టుకోండి. వాళ్లిచ్చే డబ్బులు రెండువేలిచ్చినా, మూడు వేలిచ్చినా వద్దనద్దండి. ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు, బటన్ నొక్కేటప్పుడు మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే రామిరెడ్డి అన్నను కచ్చితంగా గెలిపించుకోవాలన్నది గుర్తుపెట్టుకోండి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, అక్కచెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాల్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం పండుగగా జరగాలన్నా ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం.. ఇవన్నీ జరగాలన్నా. ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని ఒక మనవడిగా, మనవరాలిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా.. ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మర్చిపోవద్దండి. పొరపాటు జరిగిందంటే ఇక బటన్లు నొక్కడం, మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది. మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలొస్తాయి, ఎక్కడ పడితే అక్కడ లంచాలు, వివక్ష వస్తాయి.ూ పేదల బతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి. అంధకారమయమైపోతాయి. పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి ఉంటుందని మాత్రం అందరూ గుర్తెరగమని సవినంగా కోరుతున్నా. వీళ్లు ఎంత అన్యాయస్తులు వీరంటే.. ఇదే బనగానపల్లెలో మనం 3200 మంది ఇళ్ల స్థలాలిస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇదే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకుపోయి చంద్రబాబు గారు.. ఎక్కడ జగన్ కు మంచి పేరొస్తుందో, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఏకంగా ఇంటిస్థలాలు ఇవ్వకూడదని కోర్టుకుపోయి అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఇదే బనగానపల్లెలో కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలివ్వాలన్నా యుద్ధం చేయాలి, గవర్నమెంట్ బడుల్లో నాడునేడు చేయాలన్నా యుద్ధం చేయాలి. ఇంగ్లీషు మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి. పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామన్నది అందరూ గుర్తెరగాలి. ఈ కోర్టు కేసు కూడా దేవుడి దయతో రేపోమాపో జడ్జిమెంట్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. వారంరోజుల్లోపు 3200 కుటుంబాలకు మంచి శుభవార్త వస్తుందని సవినయంగా తెలియజేస్తున్నా. మంచి జరిగించేదానికి ఎప్పుడూ మీ బిడ్డ అండగా, తోడుగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. -
టీడీపీ రెండో జాబితా విడుదల.. పలువురికి షాక్
సాక్షి, గుంటూరు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక, రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. రెండో జాబితాలో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు. రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణమూర్తికి దక్కని చోటు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండి చేయి. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పీవీజీ కుమార్‌కు నిరాశ. మాడుగుల ఎన్నారై పైల ప్రసాద్‌కు అవకాశం.. గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్‌కు కేటాయింపు. గాజువాకలో జనసేనకు నిరాశ. సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు. రెండో జాబితాలో ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సీనియర్ నేతలకు దక్కని చోటు టిక్కెట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన నేతలు పెనమలూరులో బోడేకు నో టికెట్ టిక్కెట్ లేదని చంద్రబాబు నుంచి ఫోన్ కొన్ని అనివార్య కారణాలతో సీటివ్వలేకపోతున్నామని చంద్రబాబు నుంచి ఫోన్ టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనంలో బోడే ప్రసాద్ , బోడే అనుచరులు చివరి ప్రయత్నంగా టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి టిక్కెట్ ఇవ్వాలని అడిగేందుకు సిద్ధమవుతున్న బోడే టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధప్రసాద్, దేవినేని ఉమా మైలవరం టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమా , వసంత కృష్ణప్రసాద్ , బొమ్మసాని సుబ్బారావు అవనిగడ్డ టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్న మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ సీటు టీడీపీకి కేటాయించకపోతే సహకరించమంటున్న టీడీపీ నాయకులు టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధ ప్రసాద్ -
సీఎం జగన్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసలు..
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉందన్నారు. సీఎం జగన్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. కాగా, సుబ్రహ్మణ్యస్వామి ఈరోజు తిరుమలకు వచ్చారు. ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్లు పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ఇక, ఈ కేసు విచారణను ఈనెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అనంతరం, సుబ్రహ్మణస్వామి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సోనియా గాంధీతో కలిశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఎన్నికల కోసం సిద్ధమవ్వాలన్నారు. మరోవైపు, రాష్ట్రంలో సీఎం జగన్ పాలనపై స్పందిస్తూ.. ‘సీఎం జగన్ చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉంది. మరోసారి అది నిరూపించుకుంటారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
న్యాయ రాజధానికి మంచి జరగాలి: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజ.. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు. కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం. నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరుకుంటున్నాను. రూ.1000 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఈ యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలాజీకల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డ్, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. -
బరిలో ఉంటా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: రానున్న ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అసమ్మతి నేత వేటుకూరి శివరామరాజు స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేసేది రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తన పట్ల చంద్రబాబు తీరు కలచివేసిందన్నారు. టీడీపీ అధిష్టానం తీరుతో కలతచెందిన శివరామరాజు మంగళవారం భీమవరంలోని తన కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని.. అధిష్టానం ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందానన్నారు. ఉండి నుంచి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, అభ్యర్థి ఎంపిక విషయంలో తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. పదిహేను రోజులుగా పార్టీ నాయకత్వం కనీసం పట్టించుకుకోలేదన్నారు. అనుచరుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. -
ప్రభుత్వం వల్లే మా కుటుంబం బాగుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ప్రభుత్వం వల్లే మా కుటుంబం బాగుంది మాది వ్యవసాయ కుటుంబం. మేడి పడితే గానీ మా కడుపు నిండదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం, కోటపోలూరు గ్రామంలో మాకున్న పొలంలోనే కొడుకు, కోడలు వ్యవసాయం చేస్తుండేవారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయంపై ఎటువంటి సహాయం అందలేదు. అప్పు చేసి వ్యవసాయం చేశాం. వాటిని తీర్చలేక నానా కష్టాలు పడ్డాం. ఇక నష్టాన్ని భరించలేక ఉన్న వ్యవసాయ భూమిని అమ్ముకుని వెళ్లాలనుకున్నాం. కొంత కాలం సాగు నిలిపివేశాం. మా అదృష్టం కొద్దీ వైఎస్సార్పీసీ ప్రభుత్వం వచ్చింది. వారి దయవల్ల మళ్లీ వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ. 13,500 వంతున వచ్చింది. దాంతో 1.7 ఎకరాల్లో మళ్లీ వ్యవసాయం చేస్తున్నాం. పరిస్థితులు అనుకూలించడంతో గతంలో చేసిన అప్పులన్నీ తీర్చేశాం. ఇంతలో నాకు శ్వాస కోస సంబంధిత వ్యాధి రావడంతో.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. చికిత్స చేసే స్తోమత లేక సతమతమయ్యాం. ఇంతలో వలంటీర్ ఇంటికి వచ్చి ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పింది. వెంటనే నెల్లూరులో ఆపరేషన్ చేసుకున్నాను. రూ. 50వేలు ప్రభుత్వ సహాయం అందింది. నాకు ప్రతి నెలా పింఛన్ అందుతోంది. నా మనవరాలు చెంచు ప్రియకు అమ్మఒడి కింద ఏడాదికి రూ. 15వేలు వస్తోంది. పాఠశాలలో ఆనందంగా చదువుతోంది. పొదుపు ద్వారా నా కోడలు హైమావతి రూ.60 వేల రుణం తీసుకుని 2 బర్రెలను కొనుక్కుని నెలకు రూ.10వేల వరకు సంపాదిస్తోంది. స్త్రీనిధి ద్వారా మరో రూ.50 వేలు పొదుపు రుణం అందింది. వైఎస్సార్ ఆసరా కింద రూ.14వేలు వరకు వచ్చింది. నాకే కాకుండా మా కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా నిలిచింది. – గుమ్మడి కస్తూరమ్మ, కోటపోలూరు(మహమ్మద్ నాజీం, విలేకరి, సూళ్లూరుపేట రూరల్) సంక్షేమానికి జై‘కొట్టు’ నేను, మా ఆయన గతంలో చిన్నపాటి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లం. ఆ వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. ఎంతో కష్టమ్మీద పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. వారిద్దరూ వేరేగా కాపురం ఉంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉంటున్న నేను మహిళా సంఘ సభ్యురాలిగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదు. పైగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన నకిలీ హామీల కారణంగా చేసిన అప్పులు తీర్చకపోవడంతో ఆ వడ్డీకాస్తా ఎక్కువై మరింత ఆర్థికంగా కుదేలయ్యాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.60 వేలు వచ్చాయి. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750లు వంతున వచ్చింది. ఆ మొత్తంతో మా గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాం. ఇప్పుడు మాకు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి. హాయిగా కుటుంబం గడుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. – నెరుసు కుసుమ, తడికెలపూడి(యు.లక్ష్మీనారాయణ, విలేకరి, కామవరపుకోట) కూలిపని మాని వ్యాపారం చేసుకుంటున్నా.. నేను, నా భర్త గతంలో కూలిపనులు చేసేవాళ్లం. రోజువారీ వచ్చే డబ్బులతోనే జీవనం గడిచేది. పనులు లేనప్పుడు అప్పులు చేయక తప్పేది కాదు. ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకుందామని అనుకున్నా అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగనన్న పాలనలో మహిళలకు అన్ని విధాల బాగుంది. సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, స్త్రీనిధి పథకాలు మహిళలకు వరంగా మారాయి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల పంచాయతీ పుట్లూరువారి పల్లె గ్రామ సంఘంలో సభ్యురాలుగా ఉన్న నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750లు వంతున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.70 వేలు వచ్చింది. ఆ మొత్తానికి బ్యాంక్ ద్వారా తీసుకున్న లోన్ రూ.2 లక్షలు కలిపి కొనకనమిట్ల బస్టాండ్ సెంటర్లో భర్త వెంకటేశ్వర్లుతో కలిపి కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు కూలి పనులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గౌరవంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. అమ్మ ఒడి పథకం అందడంతో పిల్లల చదువుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. మేము ఈ పరిస్థితికి రావడానికి కారణమైన జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – శిగినం ఆదెమ్మ, పుట్లూరివారిపల్లి (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల మండలం) -
నేటి నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మొక్కజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం (ఈ నెల 14న) కొనుగోళ్లు ప్రారంభించి మే 15వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది. నాణ్యమైన క్వింటాల్ మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2,090 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్‌బాబు మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. రైతును నిలబెట్టేలా మద్దతు ధర రాష్ట్రంలో రబీ 2023–24లో 4.75 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 16.82 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా.. నెలాఖరు నాటికి ముమ్మరమవుతాయి. సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. పంట చేతికొచ్చే సమయంలోమార్కెట్ను బూచిగా చూపి వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తారేమోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర విషయంలో రైతులకు అండగా నిలవాలన్న సంకల్పంతో క్వింటాల్‌కు రూ.2,090 చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఇందుకోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేసి కనీసం 85 వేల టన్నులను సేకరించేందుకు అనుమతిచ్చింది. కొనుగోలుకు పక్కా ఏర్పాట్లు మొక్కజొన్న కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే అండ్ ఆర్) నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసింది. కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, తేమను కొలిచే మీటర్లు, డ్రయ్యర్లు, జల్లెడ, కుట్టు యంత్రాలు, వేయింగ్ మెషిన్లు వంటి వాటిని సమకూర్చే బాధ్యతను మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. మొక్కజొన్న సేకరణకు అవసరమైన నిధులను ధరల స్థిరీకరణ నిధి నుంచి సమీకరించుకునే వెసులుబాటును మార్క్‌ఫెడ్‌కు కల్పించింది. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రైతులకు సకాలంలో నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి తిరిగి చెల్లిస్తుంది. మొక్కజొన్నను నిల్వ చేసుకునేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీలతో పాటు వ్యవసాయ, ఇతర గిడ్డంగులను అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ధరలు పెరిగేలా చర్యలు మార్కెట్లో మొక్క జొన్న ధరల హెచ్చుతగ్గులను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. సమీప రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏ ఒక్కరూ తొందరపడి అమ్ముకోవద్దు. మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. ఇప్పటికే మినుము, పెసలు, వేరుశనగ, శనగ, జొన్నల సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాజాగా మొక్కజొన్న కొనుగోలుకు కూడా అనుమతి ఇచ్చింది. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
రామోజీ బధిర రాతలు
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) వేగంగా విస్తరిస్తుంటే ఐదేళ్లు గాఢ నిద్రలో ఉన్న ఈనాడు రామోజీ వాటిపై విషం కక్కుతూ ఒక కథనాన్ని వండి వార్చారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వ చర్యలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కీర్తించింది. కళ్లకు, చెవులకు గంతలు కట్టుకొని పడుకున్న రామోజీకి ఇవేవీ కనిపించలేదు. ‘‘ఐదేళ్లు నిద్దరపోయి ఐదురోజుల్లో ఉద్ధరిస్తారట!’’ అంటూ అవాస్తవ కథనాన్ని రాసేశారు. ఏషియన్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను కీర్తిస్తూ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర లాల్ దాస్ గడిచిన ఐదేళ్లలో ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మయోజన్, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పురోగతికి తిరుపతి, విజయవాడల్లో మరో రెండు ఎంఎస్ఎంఈ డీఎఫ్‌వో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు సుభాష్ చంద్ర ప్రకటించారు. మౌలిక వసతులకు పెద్ద పీట ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందుకోసం ప్రతీ జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది ఈ క్లస్టర్ల ప్రధాన ఉద్దేశ్యం. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. సుమారు రూ.531 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కు అందుబాటులోకి వస్తే 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి, కొప్పర్తిల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న యూనిట్లకు అండగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలుల్లో ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో మరో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఇలాంటిది విశాఖపట్నంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈల నుంచే కొనుగోలు చేయాలంటూ చట్టం కూడా తీసుకు వచ్చింది. ఏడు లక్షలు దాటిన ఎంఎస్ఎంఈలు ♦ గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530. ఈ ఏడాది ఆగస్టు ముగిసే నాటికి వాటి సంఖ్య ఏకంగా 7,72,802. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు ఇవి. ♦ ఈ నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది. ♦ గత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతీ నెలా సగటున కొత్తగా 11,379 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే ఈ ఒక్క ఏడాదిలోనే 19,476కు చేరింది. ♦కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈ రంగం పునర్జీవం పొందింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. అభివృద్ధి కోసం సర్వే చేయడం కూడా తప్పేనా రామోజీ? వచ్చే నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్యను, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో రూ.118 కోట్లతో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈల వివరాలను ప్రత్యేక సర్వే ద్వారా సేకరిస్తోంది. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్ఎంఈలను గుర్తించడం ఈ సర్వేలో ఓ భాగం. అవగాహన, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, బ్యాంకు రుణాలు, డిలేడ్ పేమెంట్, పోర్టల్‌కు అనుసంధానం వంటి ప్రయోజనాలను కల్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. -
న్యాయ రాజధానికి 'మరో మణిహారం'
న్యాయ రాజధాని కర్నూలు కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా కర్నూలును న్యాయ రాజధాని అని పునరుద్ఘాటించిన క్రమంలో మరో ముందడుగు పడుతోంది. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు దిశగా గురువారం శ్రీకారం చుడుతున్నారు. వర్సిటీ భవన నిర్మాణాలకు సీఎం జగన్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – కర్నూలు (సెంట్రల్) దేశంలో మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఒకటి. న్యాయ రాజధాని కాబోతున్న కర్నూలులో రెండోది, దేశంలో 29వ న్యాయ విశ్వ విద్యాలయం నిర్మాణానికి అంతా సిద్ధమైంది. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఈ విశ్వ విద్యాలయానికి 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అందులో భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 2025–26 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. అందుబాటులో న్యాయ విద్య ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ కలిపి 45 లా కాలేజీలు ఉన్నాయి. నాణ్యమైన న్యాయ విద్యను అందించేందుకు కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. అంతేకాక న్యాయ విద్యలో పీహెచ్‌డీలు, ఫెలోషిప్‌లకు అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో దేశం గర్వించదగ్గ న్యాయవాదులను అందించడంలో ఈ విశ్వవిద్యాలయం గొప్ప పాత్ర పోషిస్తున్నదనడంలో సందేహం లేదని ప్రఖ్యాత న్యాయ కోవిదులు చెబుతున్నారు. కాగా, న్యాయ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి న్యాయ విద్యార్థులు కర్నూలుకు రానున్నారు. సీమవాసుల ఆశలకు అనుగుణంగా.. సీమ వాసుల కల సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో పరిపాలన, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో 3 రాజధానుల చట్టాలు అమల్లోకి రాలేకపోయాయి. అయితే ప్రతిష్టాత్మక మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్త వంటి న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలుకు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు తరలింపునకు పచ్చజెండా ఊపారు. సీబీఐ కోర్టును కూడా కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీ ఈఆర్సీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ. 10 కోట్లతో ఏపీ ఈఆర్సీ భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘన విజయం సాధించాక హైకోర్టుతో పాటు అన్ని న్యాయ సంస్థలు, ట్రిబ్యునళ్లు కర్నూలుకు తరలివచ్చే అవకాశం ఉందని, పూర్తి స్థాయిలో న్యాయ రాజధాని అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. న్యాయ విశ్వ విద్యాలయం ఓ వరం కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయం. ఇది రాయలసీమ విద్యార్థుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. నాణ్యతా ప్రమాణాలతో కూడిన న్యాయ విద్య అందుబాటులోకి వస్తుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాల జాబితాలోకి కర్నూలు చేరడం సంతోషకరం. – మన్సూర్ రెహమాన్, రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, కర్నూలు హైకోర్టు కూడా కర్నూలుకు వస్తుంది సీఎం జగన్ కర్నూలు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన రెండోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా కర్నూలుకు హైకోర్టు వచ్చి తీరుతుంది. ఇప్పటికే కర్నూలులో ప్రతిష్టాత్మక లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు పలు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం. – జయపాల్‌రెడ్డి, రిటైర్డ్ జెడ్పీసీఈఓ, కర్నూలు కర్నూలుకు జాతీయ స్థాయిలో పేరు జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం కర్నూలు సిగలో న్యాయ మణిహారం. ప్రతిష్టాత్మక ఈ విశ్వవిద్యాలయం వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు న్యాయ విద్య కోసం కర్నూలుకు వస్తారు. జాతీయ స్థాయిలో కర్నూలుకు మంచి పేరు వస్తుంది. – మద్దెల శ్రీనివాసరెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కర్నూలు -
ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు
తణుకు అర్బన్/ భీమవరం/ కాకినాడ క్రైం/ విజయవాడస్పోర్ట్స్/ కడప/ సాక్షి,నెట్వర్క్:గీతాంజలి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు తగ్గడం లేదు. బుధవారం నాడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు టీడీపీ రాక్షస మూకలు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియా హంతకులు ఇద్దరు పిల్లల తల్లిని నిర్థాక్షిణ్యంగా చంపేశారని ధ్వజమెత్తారు. కక్షగట్టి ఆమె ప్రాణాలను బలిగొన్నారని, రాజకీయ లబ్ధే పరమావధిగా క్షోభకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదొంగలే పొట్టన పెట్టుకున్నారు. గీతాంజలిని టీడీపీ పచ్చ దొంగలే పొట్టనపెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తణుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీపీ దొంగలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారారని దుయ్యబట్టారు. మహిళలు, బాలికలను వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో వే«ధించే వారికి కఠిన శిక్షలు తప్పవని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన న్యాయవాది ఎం.చిత్రభాను స్పష్టంచేశారు. మహిళలు మానసికంగా ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళల వేధింపుల పట్ల ధైర్యంగా 111పోలీసులకు ఫిర్యాదు చేయాలని భీమవరానికి చెందిన వైద్యురాలు మాదిరెడ్డి స్వరాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీలో మహిళలకు గౌరవం ఎన్టీఆర్తోనే పోయింది టీడీపీపి స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలోనే ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఉండేదని డాక్టర్ నూరి పరి అన్నారు. ఆయన్ని వెన్ను పోటు పొడిచి ఈ లోకం నుంచి పంపించేసిన వ్యక్తులే ప్రస్తుతం ఆ పార్టీకి ఆధిపత్యం చెలాయిస్తూ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. పదో తరగతి విద్యార్ధిని మేఘనని, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడుతున్న మరో విద్యార్ధినిని ఇదే విధంగా ట్రోల్ చేసి మానసిక హింసకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలికేసులో అజయ్ సత్య అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తపై రాష్ట్రప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ముంబయి) కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని శిక్షించాలని అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సతీమణి శిల్పా నాగినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా కోరారు. వందలాది మంది మహిళలతో కలిసి ఆమె బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్వీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థినులతో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాక్షసుల వేధింపులకు బలైపోయిన ఆడబిడ్డ గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా రాక్షసుల వేధింపులకు బలైపోయిన విశ్వబ్రాహ్మణ జాతి ఆడ బిడ్డ గీతాంజలిని బలి తీసుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరూ తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. గీతాంజలికి పట్టిన దుర్గతి భవిష్యత్‌లో మరొకరికి జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనకు లబ్ది జరిగిన సంతోషాన్ని పంచుకుంటేనే టీడీపీ జనసేన నేతలు ఓర్వలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లెలో కొవ్వొత్తుల ప్రదర్శన టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాలకు, ఆయా పార్టీల సోషల్ మీడియా రాబందుల వికృతచేష్టలకు నిండుప్రాణం బలికావడం విచారకరమని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. వుయ్ స్టాండ్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ బెంగళూరు బస్టాండులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెనాలిలో స్వర్ణకార దుకాణాల బంద్ గీతాంజలి మృతికి సంతాపంగా బుధవారం తెనాలిలో స్వర్ణకారులు బంద్ పాటించారు. పట్టణ నడిబొడ్డులోని వెయ్యికి పైగా స్వర్ణకార దుకాణాలను మూసివేశారు. శ్రీకామాక్షీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వందలాది కార్మికులు మాజేటి నాగేశ్వరరావు వీధిలోని అసోసియేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా దౌర్జన్యానికి బలైన గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించటంపై హర్షం వ్యక్తంచేశారు. -
2018 గ్రూప్–1 మెయిన్స్ రద్దు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2018లో నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మాన్యువల్ మూల్యాంకనాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అందువల్ల గ్రూప్ –1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారమే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని చెప్పింది. పరీక్ష నిర్వహణకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 2022 మే 26న ఏపీపీఎస్సీ ప్రకటించిన అర్హుల జాబితాను కూడా రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం తీర్పు వెలువరించారు. ‘పబ్లిక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ఉండాలి. పోస్టుల భర్తీ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడంపైనే అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఒకసారికి మించి మాన్యువల్ మూల్యాంకనం చేసేందుకు నిబంధనలు అనుమతించకపోయినప్పటికీ, అధికారులు రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేశారు. మరికొన్ని పత్రాలను మూడోసారి కూడా మూల్యాంకనం చేశారు. ఇది చట్ట విరుద్ధం. రెండు, మూడోసారి చేసిన మూల్యాంకనం మొత్తం మూల్యాంకనంపైనే అనుమానాలు రేకెత్తించింది. ఇలాంటప్పుడు అర్హులైన అభ్యర్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అనర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని పిటిషనర్లు నిరూపించగలిగారు. మూల్యాంకనంలో నిష్పాక్షికతను కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారు. మూడుసార్లు జరిపిన మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడి ఎవరు లబ్ధి పొందారన్న విషయాన్ని గుర్తించడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల మొత్తం పరీక్షనే రద్దు చేయడం ఉత్తమం’ అని జస్టిస్ నిమ్మగడ్డ తన 85 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే పోస్టింగులు తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో మిగిలిన అభ్యర్థులతో సమానంగా ఎలాంటి హక్కులూ కోరబోమంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మూల్యాంకనంలో అక్రమాలంటూ పిటిషన్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత డిజిటల్ మూల్యాంకనంపైనా పిటిషన్లు దాఖలు చేశారు. పలు సందర్భాల్లో వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంటర్వ్యూలకు, ఎంపిక ప్రక్రియకు అనుమతినిచ్చింది. అయితే వారి నియామకాలన్నీ కూడా అంతిమంగా సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం సింగిల్ జడ్జి అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్నారు. బుధవారం తీర్పు వెలువరించారు. మూల్యాంకనం విషయంలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అక్రమాలు రుజువైనందున మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
‘ఆసరా’తో అగ్రపథం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పొదుపు సంఘాలు ఆదాయపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలోని సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం అత్యధికంగా ఉందని, 2019 నుంచి 2024 నాటికి వారి రోజువారీ ఆదాయం భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది. పొదుపు సంఘాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధిక సగటు ఆదాయం కలిగిన 20 జిల్లాల్లో 15 గ్రామీణ జిల్లాలే కాగా ఇందులో తొమ్మిది జిల్లాలు ఏపీలోనే ఉండటం గమనార్హం. డిజిటల్ లావాదేవీల్లోనూ ఆంధ్రప్రదేశ్ మహిళా పొదుపు సంఘాలు ముందు వరుసలో నిలిచాయి. పొదుపు సంఘాల సభ్యులు సాధికారతతో లక్షాధికారులుగా అవతరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. ఇటీవల వారి ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో మహిళా పొదుపు సంఘాల సభ్యుల క్రెడిట్ ఆదాయాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పొదుపు మహిళలను ప్రోత్సహిస్తూ అమలు చేసిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలు, బ్యాంకు రుణాలతో తోడ్పాటు, మల్టీ నేషనల్ కంపెనీలతో అనుసంధానం లాంటివి సత్ఫలితాలనిచ్చినట్లు స్పష్టమవుతోంది. తద్వారా ఎన్పీఏల రేటు గణనీయంగా తగ్గిపోయి రికవరీ బాగుండటంతో పెద్ద ఎత్తున రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సకాలంలో చెల్లింపులు కారణంగా వారి రుణ పరపతి సైతం పెరిగింది. గత సర్కారు హయాంలో ఏపీలో పొదుపు సంఘాల ఎన్పీఏలు ఏకంగా 18.36 శాతం ఉండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా ఆదుకుని జీవం పోయడంతో ఇప్పుడు ఎన్పీఏలు గణనీయంగా 0.17 శాతానికి తగ్గిపోయాయి. ♦ ఆంధ్రప్రదేశ్ తరువాత అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన మహిళా పొదుపు సంఘాల సభ్యుల్లో తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. మరో ఏడాదిలోగా హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జార్ఖండ్ పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మహిళా పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది. ♦ 2027 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేం‘ద్ర పాలిత ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులై గేమ్ ఛేంజర్‌గా నిలుస్తారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులుగా అవతరించడమే కాకుండా వారి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సంపదను సృష్టించి పునఃపంపిణీ చేస్తున్నారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లోని 72.7 శాతం మహిళా పొదుపు సంఘాల లావాదేవీలు ఇప్పుడు మెట్రో ప్రాంతాలకు, బయట జిల్లాలకు విస్తరించాయి. 20 కి.మీ. నుంచి 2,000 కి.మీ. పరిధిలో రాష్ట్రం లోపల, బయట కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా 65 శాతం మంది ఆదాయపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 30.5 శాతం గ్రామీణ ఏటీఎం లావాదేవీలు పట్టణాలు, మెట్రో ప్రాంతాలు, ఆయా జిల్లాల వెలుపల జరుగుతున్నాయి. ♦ పొదుపు సంఘాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యులు వారి సొంత జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి వ్యయం చేయడం పెరిగిన వారి కొనుగోలు శక్తిని సూచిస్తోంది. ♦ విజయనగరం జిల్లాకు చెందిన పొదుపు సంఘాల సభ్యులు 68 కి.మీ. ప్రయాణించి విశాఖలో వ్యయం చేయగా శ్రీకాకుళం జిల్లా సంఘాల సభ్యులు 1,115 కి.మీ. ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో వ్యయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 1,647 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో వ్యయం చేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 2,074 కి.మీ.ప్రయాణించి ఢిల్లీలో వ్యయం చేశారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వ్యాపారాల నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించి ఉంటారని పేర్కొంది. -
జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవ టికెట్లు, శ్రీవారి సేవ కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఈ నెలలో ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవ టికెట్లు, శ్రీవారిసేవ కోటా వివరాలను టీటీడీ తెలిపింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. విడుదల చేయనున్న టికెట్లు, శ్రీవారిసేవ కోటా వివరాలు.. ♦ ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జితసేవ టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలి. ♦ 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్ల కోటా విడుదల చేస్తారు. ♦ జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిõÙకం ఉత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ♦ ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు, దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. ♦ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ♦ 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు. ♦ 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. ♦ 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ♦ 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల చేస్తారు. ♦ 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారిసేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీతసేవ కోటాను, మద్యాహ్నం ఒంటిగంటకు పరకామణిసేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. -
బాధితులకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సహాయం కోరుతూ బాధితులు వినతులు అందించగా.. వారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాధితులు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న సీఎం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, సీఎం చేసిన సహాయానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కష్టాలను చెప్పుకున్న వెంటనే అర్థం చేసుకొని తక్షణమే స్పందించి సహాయం చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. సహాయం అందుకున్న వారు.. ► విస్సన్నపేట మండలం, నరసాపురం గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు భానుతేజ కేన్సర్‌తో బాధపడుతున్నాడని.. చికిత్స అవసరాల నిమిత్తం సాయం చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ. 2 లక్షలు సహాయాన్ని అందించారు. ► విజయవాడ, అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన 31 ఏళ్ల కంబా ఏడుకొండలు.. ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ.2 లక్షలు సహాయాన్ని అందించారు. -
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్‌గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్‌లోనే కోల్డ్ చైన్, ఐస్‌ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్‌షెడ్‌లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్‌లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది.