Automobile
-
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులకు కొదువే లేదు. అయితే రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ బైకులు గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్స్ జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 59,881 కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 71,383 (ఎక్స్ షోరూమ్). ఇది 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ సీటీ 110ఎక్స్రూ. 70,176 ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే బజాజ్ సీటీ 110ఎక్స్ కూడా మంచి మైలేజ్ అందించే బెస్ట్ బైక్. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.48 హార్స్ పవర్, 9.81 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర రూ. 59,998. సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్ కలిగిన టాప్ వేరియంట్ ధరలు రూ. 69,018 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 7.91 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ రేడియన్రూ. 59,880 నుంచి రూ. 81,394 మధ్య (ఎక్స్ షోరూమ్) లభించే టీవీఎస్ రేడియన్ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.08 హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ బైక్ 68.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: 90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటనహోండా ఎస్పీ 125హోండా ఎస్పీ 125 ధరలు రూ. 87,468 నుంచి రూ. 91,468 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 10.72 Hp, 10.9 Nm టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. ఈ బైక్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. -
90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. 'ఫ్యూయల్ పంప్లో సమస్య' కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది.2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 - అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది.హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్‌లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు 'వీఐఎన్'ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
క్రిప్టో కరెన్సీ ప్రమాదం!.. ఆర్బీఐ గవర్నర్
క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వానికి భారీ నష్టం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్-ట్యాంక్ కార్యక్రమంలో 'శక్తికాంత దాస్' ఈ వ్యాఖ్యలు చేశారు.క్రిప్టో కరెన్సీ ద్రవ్య స్థిరత్వానికి మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితిని కూడా ఇది సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు.క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలి. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలి. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నించిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు.భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కావడం గమనార్హం. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని శాంతికాంత దాస్ అన్నారు. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. -
మూడేళ్ళలో 10 లక్షల మంది కొన్న బైక్ ఇదే..
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన 'టీవీఎస్ రైడర్ 125' బైక్.. అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 2021లో లాంచ్ అయిన తరువాత మొత్తం 10,07,514 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. మూడేళ్ళ కాలంలో ఈ బైక్ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.గత ఆర్ధిక సంవత్సరం నాటికి టీవీఎస్ రైడర్ మొత్తం 7,87,059 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 2,12,941 యూనిట్ల సేల్స్ సాధించింది. మొత్తం మీద ఈ బైక్ సేల్స్ 10 లక్షల యూనిట్లు దాటేసింది.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇటీవల ఈ బైక్ ఐజీఓ ఎడిషన్ రూపంలో రూ. 98,389 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయింది. ఇది 124.8 సీసీ ఇంజిన్ కలిగి 11.22 Bhp పవర్, 11.75 Nm టార్క్ అందిస్తుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ చూడవచ్చు. -
పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు
ఈ పండుగ సీజన్లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో కార్ల తయారీ సంస్థలు స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేశాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా, జీప్, రెనాల్ట్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన స్పెషల్స్ ఎడిషన్స్ ఏవనే వివరాలు తెలుసుకుందాం.స్పెషల్ ఎడిషన్స్ ➺మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్➺మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్➺మారుతి గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్➺మారుతి బాలెనో రీగల్ ఎడిషన్➺టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా రూమియన్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్➺మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్➺జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్➺రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్➺ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్➺క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్పెషల్స్ ఎడిషన్స్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే పొందినట్లు సమాచారం. వీటికి అదనంగా యాక్ససరీస్ ఫ్యాక్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. ధరలు కొనుగోలుదారు ఎంచుకునే యాక్ససరీస్ ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని కార్లు ఈ నెల చివర వరకు మాత్రమే విక్రయానికి ఉండనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీ సమీపంలోనే కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
టీవీఎస్ మోటార్ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 588 కోట్లను అధిగమించింది. రికార్డ్ అమ్మకాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,933 కోట్ల నుంచి రూ. 11,302 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 9,297 కోట్ల నుంచి రూ. 10,428 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో ఎగుమతులతోపాటు ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాలు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 12.28 లక్షల యూనిట్లను తాకాయి. గత క్యూ2లో నమోదైన 10.74 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి. వీటిలో మోటార్ సైకిళ్ల విక్రయాలు 14 శాతం పుంజుకుని 5.6 లక్షల యూనిట్లకు చేరగా.. స్కూటర్ అమ్మకాలు 17 శాతం ఎగసి 4.9 లక్షల యూనిట్లను తాకాయి.ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం బలపడి 2.78 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక త్రిచక్ర వాహన అమ్మకాలు 5,000 యూనిట్లు తగ్గి 38,000కు పరిమితమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు 31 శాతం అధికంగా 75,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు బీఎస్ఈలో 3.6 శాతం పతనమై రూ. 2,565 వద్ద ముగిసింది. -
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్‌లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్‌గేట్, రియర్ బంపర్, హెడ్‌ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్‌లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్‌లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
రూ.24.99 లక్షల అమెరికన్ బ్రాండ్ కారు: భారత్‌లో లాంచ్
జీప్ కంపెనీ భారతదేశంలో తన మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ కలిగి 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. కొత్త మెరిడియన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరలో ప్రారంభమవుతాయి.అప్డేటెడ్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ 5-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన మూడు ట్రిమ్‌లు 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్‌తో హనీకూంబ్ మెష్ క్రోమ్ స్టడ్‌లను పొందుతుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. క్యాబిన్ లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ.. డ్యాష్‌బోర్డ్ కాపర్ స్టిచింగ్‌తో కొత్త స్వెడ్ ఫినిషింగ్‌ని పొందింది. 9 స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వాటితో పాటు.. ఈ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4x2, 4x4 వేరియంట్లతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ & 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వచ్చిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ గతంలో తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజులు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అందిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తాజాగా కంపెనీ పేర్కొంది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
బజాజ్ పల్సర్ ఎన్125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో కొత్తగా ఎన్125 ప్రవేశపెట్టింది. 124.59 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ స్పార్క్, 2 వాల్వ్ ఇంజన్ పొందుపరిచారు. 8,500 ఆర్పీఎం వద్ద 12 పీఎస్ పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఎల్ఈడీ డిస్క్ బీటీ, ఎల్ఈడీ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.98,707 ఉంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఎల్సీడీ స్పీడోమీటర్, మోనోషాక్ సస్పెన్షన్, ఐఎస్జీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు జోడించారు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.5 లీటర్లు. -
హ్యుండై విస్తరణ ప్లాన్.. మరిన్ని కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా సంస్థ హ్యుండై అనుబంధ కంపెనీ హ్యుండై మోటార్ ఇండియా తమిళనాడు ప్లాంటును విస్తరించాలని నిర్ణయించింది. ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను ఈ మేరకు దాఖలు చేసింది. దీని ప్రకారం కాంచీపురం జిల్లాలోని ఈ కేంద్రంలో రూ.1,500 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతారు.విస్తరణ పూర్తి అయితే 5.4 లక్షల చదరపు మీటర్లున్న ప్లాంటు స్థలం 7.21 లక్షల చదరపు మీటర్లకు పెరుగుతుంది. కొత్తగా 155 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధునీకరణ పనులకు కొత్తగా స్థలం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. మొత్తం 538 ఎకరాల్లో ఈ కేంద్రం నెలకొని ఉంది.ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లు. అయిదేళ్లలో విస్తరణ పనులు పూర్తి అవుతాయని సంస్థ భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రయాణికుల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ పెట్టుబడి కీలకమని హ్యుండై వెల్లడించింది. -
7 లక్షల వాహనాలకు రీకాల్: బీఎండబ్ల్యూ కీలక ప్రకటన
బీఎండబ్ల్యూ కంపెనీ చైనాలో దాదాపు 7,00,000 బ్రాండ్ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని కూలెస్ట్ పంపులో ఏర్పడిన సమస్య కారణంగా జర్మన్ కార్‌మేకర్ ఈ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. ఇందులో స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లు మాత్రమే కాకుండా.. దిగుమతి చేసుకున్న కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ వెల్లడించింది.బీఎండబ్ల్యూ మోడళ్లలో అమర్చిన లోపభూయిష్ట కూలెస్ట్ పంప్ ప్లగ్‌లు తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్లకు కారణమైతే.. వాహనంలో మంటలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు కంపెనీ దృష్టికి రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగా రీకాల్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.రీకాల్ ప్రకటించిన కార్లలో స్థానికంగా తయారైన బీఎండబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ వాహనాలు ఉన్నాయి. అలాగే దిగుమతి చేసుకున్న కార్లలో ఎక్స్ సిరీస్ కార్లు ఉన్నాయి. రీకాల్ కారణంగా కంపెనీ కార్ల సేల్స్ ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. గత నాలుగు సంవత్సరాల్లో అమ్మకాలు భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..కంపెనీ గత సెప్టెంబర్ నెలలో కూడా కాంటినెంటల్ ఏజీ ద్వారా సరఫరా చేసిన కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లలో సమస్య ఉందని గుర్తించి.. ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ లోపాన్ని కంపెనీ సరి చేయడానికి ఏకంగా 1.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. -
ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలో ఓ మంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని కొందరు ఆలోచించవచ్చు. అలాంటి వారు ఏ కారు కొనాలి? దాని ధర ఎంత ఉంటుందనే సమాచారం కోసం వెతికే అవకాశం ఉంది. ఇలాంటి వారి సందేహాలకు సమాధానమే ఈ కథనం..ఎంజీ విండ్సర్ ఈవీఇటీవల భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎంజీ విండ్సర్' పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.13.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని 38 కిలోవాట్ బ్యాటరీ 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.ఎంజీ కామెట్ ఈవీప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.99 లక్షలు. అయితే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. పరిమాణంలో చిన్నదిగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 230 కిమీ రేంజ్ అందిస్తుంది.టాటా టియాగో ఈవీటాటా కంపెనీకి చెందిన టియాగో ఈవీ నాలుగు వేరియంట్లు, రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ప్రీమియం అనుభవం కోసం హర్మాన్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన టెక్-ఫార్వర్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా పొందుతుంది.టాటా పంచ్ ఈవీదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ ఈవీ కూడా పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 265 కిమీ మరియు 365 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని ధరలు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.ఇదీ చదవండి: మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..సిట్రోయెన్ ఈసీ3ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఈసీ3 ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. -
శ్రీలంకకు బెంగళూరు ఎలక్ట్రిక్ స్కూటర్లు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ.. తన ఎలక్ట్రిక్ స్కూటర్లను శ్రీలంకకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపించించినట్లు సమాచారం. ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తమ మోడల్‌ల డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.శ్రీలంకకు ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిస్తున్న ఫోటోలను కంపెనీ సీఈఓ 'తరుణ్ మెహతా' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గత ఏడాది నేపాల్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన తరువాత ఏథర్ స్కూటర్లను దిగుమతి చేసుకుంటున్న విదేశీ మార్కెట్ శ్రీలంక.ఏథర్ 450ఎస్భారతదేశంలో ఏథర్ 450ఎస్ ధర రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే శ్రీలంకలో ఈ స్కూటర్ ధర ఎలా ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియాలో ఏథర్ ఎనర్జీ 450ఎక్స్, 450 అపెక్స్, రిజ్టా స్కూటర్లను కూడా విక్రయిస్తోంది.శ్రీలంకలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలనే ప్రణాళిక ఆగస్ట్‌లోనే మొదలైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ పండుగ సీజన్ ముగిసే నాటికి శ్రీలంకలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్ వంటి వాటితో జతకట్టింది. శ్రీలంకలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది.ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాండర్డ్, ప్రో ప్యాక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 2.9 కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఒకే బ్యాటరీ పొందుతుంది. ఈ స్కూటర్ ఒక చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంది.Ather’s second international market is set to go live by this festive!First shipment of 450s have left for Sri Lanka 🇱🇰 from our warehouses in 🇮🇳❤️ pic.twitter.com/EyfYCHPuIf— Tarun Mehta (@tarunsmehta) October 17, 2024 -
టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ టైజర్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.20,160 విలువ చేసే టయోటా జెనివిన్ యాక్సెసరీస్ కిట్‌ను ఆఫర్ చేస్తోంది.అన్ని టర్బో వేరియంట్లలో అక్టోబర్ 31 వరకే ఇది లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.10.56 లక్షలు. ఇప్పటికే కంపెనీ పండుగ సీజన్ కోసం ఇతర మోడళ్లలోనూ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తెచ్చింది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ కారు ఇదే..
బీఎండబ్ల్యూ కంపెనీ తన 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ కారును అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే దీనికి సంబంధించిన వివరాలను, ఫోటోలను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత బిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ ఒక పెద్ద ఎయిర్ డ్యామ్ పొందుతుంది. బంపర్ విశాలంగా ఉంటుంది. పరిమాణంలో కూడా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత పెద్దదిగానే ఉంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కొంత పెరిగినట్లు తెలుస్తోంది. లోపలి భాగం చాలా వరకు బ్లాక్ అవుట్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా ఇక్కడ ఫిజికల్ బటన్ల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వెనుక వైపు నెంబర్ ప్లేట్ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద పనితీరు కూడా దాని మునుపటి మోడల్ కంటే ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
రోజుకు 12వేల కొత్త కార్లు
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో విద్యుత్, ఇంధనాల వినియోగానికి, కార్లకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. రోజుకు కొత్తగా 12,000 కార్లు రోడ్డెక్కనున్నాయి. 2035 నాటికి ఎయిర్ కండీషనర్ల (ఏసీ) విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగాన్ని మించిపోనుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో చమురు, గ్యాస్, బొగ్గు, విద్యు త్, పునరుత్పాదక విద్యుత్ మొదలైన అన్ని రూపాల్లోనూ శక్తికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు వినియోగం, దిగుమతికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్‌లో చమురుకు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు డిమా ండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని తెలిపింది. 2023లో అయిదో భారీ ఎకానమీగా ఉన్న భారత్ 2028 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వివరించింది.నివేదికలో మరిన్ని వివరాలు.. → భారత్‌లో జనాభా పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దకాలంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇంధనాలకు డిమాండ్ మరింత పెరగనుంది. → 2035 నాటికి ఐరన్, స్టీల్ ఉత్పత్తి 70 శాతం, సిమెంటు ఉత్పత్తి సుమారు 55 శాతం పెరుగుతుంది. ఎయిర్ కండీషనర్ల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఏసీల కోసం విద్యుత్ డిమాండ్ అనేది వార్షికంగా యావత్ మెక్సికో వినియోగించే విద్యుత్ పరిమాణాన్ని మించిపోతుంది. → ఆయిల్ డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) నుండి 7.1 మిలియన్ బీపీడీకి చేరుతుంది. రిఫైనరీల సామర్థ్యం 58 లక్షల బీపీడీ నుండి 71 లక్షల బీపీడీకి పెరుగుతుంది. సహజవాయువుకు డిమాండ్ 64 బిలియన్ ఘనపు మీటర్ల (బీసీఎం) నుంచి 2050 నాటికి 172 బీసీఎంకి చేరుతుంది. బొగ్గు ఉత్పత్తి సైతం అప్పటికి 645 మిలియన్ టన్నుల నుంచి 721 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. → భారత్‌లో మొత్తం శక్తి వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం మేర పెరగనుండగా, విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకు చేరనుంది. → సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి దానికన్నా 30 శాతం అధికంగా ఉండనుంది. సోలార్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. 40 శాతం అవసరాలను తీరుస్తోంది. → రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వంటకోసం పర్యావరణహితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. విద్యుత్ రంగం విశ్వసనీయతను పెంచాలి. వాయు కాలుష్య స్థాయిని నియంత్రించాలి. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వడగాలులు, వరదల్లాంటి ప్రభావాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి. → భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుతుంది. (ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టొచ్చు). పరిశ్రమల్లో విద్యుత్, హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గుకు కూడా డిమాండ్ 2030 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. → 2, 3 వీలర్లకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కాగా, ప్యాసింజర్ కార్ల మార్కెట్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. → వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లో కొత్తగా 3.7 కోట్ల పైచిలుకు కార్లు, 7.5 కోట్ల పైగా 2,3 వీలర్లు రోడ్లపైకి రానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలూ వృద్ధి చెందుతాయి కనుక రహదారి రవాణా విభాగం విషయంలో చమురుకు డిమాండ్ 40 శాతం పెరుగుతుంది. దేశీయంగా ప్రతి రోజూ 12,000 కార్లు రోడ్లపైకి రానుండటంతో రహదార్లపరంగా మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. 2035 నాటికి రోడ్ మార్గంలో ప్రయాణికుల రవాణా రద్దీ వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం పెరుగుతాయి. -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ - వీడియో చూశారా?
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీదారు 'రాయల్ ఎన్ఫీల్డ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2024 నవంబర్ 4న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సంబంధించిన ఓ టీజర్ విడుదల చేసింది. అయితే నవంబర్ 4న రాయల్ ఎన్ఫీల్డ్ ఆవిష్కరించే ఎలక్ట్రిక్ బైక్ కేవలం కాన్సెప్ట్ అయి ఉండొచ్చని, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అవుతుందని సమాచారం.ఇప్పటికి లీకైన సమాచారం ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో బహుశా స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చని సమాచారం. పేటెంట్ ఇమేజ్ సింగిల్-సీట్ లేఅవుట్‌ను కలిగి ఉండనున్నట్లు వెల్లడిస్తున్నప్పటికీ.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగం అల్యూమినియం స్వింగ్ఆర్మ్, మోనోషాక్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ బైక్ ఎలక్ట్రిక్01 అనే కోడ్ నేమ్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా చాలా వివరాలు అధికారికంఘా వెల్లడి కావాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయితే ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. View this post on Instagram A post shared by Royal Enfield (@royalenfield) -
ఒకేచోట కోటి కార్లు: మారుతి సుజుకి సరికొత్త రికార్డ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్‌లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్‌లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్‌లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పుజపాన్కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం. -
బజాజ్ ఆటో రివర్స్‌గేర్.. చేతక్ అమ్మకాలు సూపర్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 1,385 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, డిఫర్డ్ ట్యాక్స్‌కు పెరిగిన కేటాయింపులు ప్రభావం చూపాయి. అయితే మొత్తం ఆదాయం రూ.10,838 కోట్ల నుంచి రూ. 13,247 కోట్లకు జంప్ చేసింది. మొత్తం వ్యయాలు రూ. 8,806 కోట్ల నుంచి రూ. 10,767 కోట్లకు పెరిగాయి. విక్రయాలు 16% అప్ ఈ క్యూ2లో బజాజ్ ఆటో స్టాండెలోన్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 2,005 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 10,777 కోట్ల నుంచి రూ. 13,127 కోట్లకు బలపడింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 16 శాతం ఎగసి 12,21,504 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 26 శాతం జంప్‌చేసి 6,36,801 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 5 శాతం పుంజుకుని 3,96,407 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 70,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. -
ఆఫర్లు పెట్టినా.. కార్ల అమ్మకాలు డౌన్!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈ ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని కొంతమేర నిరాశకు గురిచేసింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ఆశాజనకంగానే ఉన్నా కార్ల అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం అమ్మకాలు పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు అమ్మకాలు ఉన్నా, లేకున్నా అక్టోబర్‌పైనే ఆశలు పెంచుకొనే డీలర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మార్కెట్ కార్యకపాలు నెమ్మదించడం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడం వల్ల కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల విక్రయాలు తగ్గినట్లు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి 15 నుంచి 20 శాతం తగ్గుదల ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువ.. మొత్తంగా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ జీవితకాలపన్ను రూపంలో ఆర్టీఏకు వచ్చే ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువగా వచ్చింది. కార్లపై దాదాపు స్థిరంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. వాటితో పాటు మరో 50కి పైగా అనుబంధ షోరూమ్‌లు ఉన్నాయి. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావించే ప్రతిఒక్కరూ దసరా రోజులను శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు దసరా సందర్భంగా ప్రకటించే ఆఫర్లు కూడా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి కార్లపైన గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు ఇచ్చినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని పలువురు డీలర్లు అన్నారు.బైక్ ఓకే.. బైక్‌ల అమ్మకాలు మాత్రం గతేడాది కంటే పెరిగాయి. గత సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నుంచి 24 వరకు 32,306 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, ఈ అక్టోబర్ 3వ తేదీ నుంచి 13 వరకు 35,475 బైక్‌లు అమ్ముడయ్యాయి. సుమారు 3,169 ద్విచక్రవాహనాలను అదనంగా విక్రయించారు. ‘ఆటోమొబైల్ రంగానికి దసరా లైఫ్ వంటిది. అలాంటి దసరా ఈ సారి తీవ్రంగా నిరాశపర్చింద’ని తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్కోటేశ్వర్రావు చెప్పారు.చదవండి: ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..ఆటోమొబైల్‌పై ప్రభావం ఆటోమొబైల్‌పై కూడా ఈ ప్రభావం ఈసారి స్పష్టంగా ఉంది. గత సంవత్సరం దసరా సందర్భంగా 10 రోజుల్లో 10,878 కార్ల అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం అదే కాలానికి 10,139 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏటేటా రెట్టింపు చొప్పున పెరగాల్సిన అమ్మకాలు ఈసారి తగ్గుముఖం పట్టాయి. పైగా ఒకేసారి స్టాక్ తెచ్చి పెట్టుకోవడం వల్ల నష్టంగానే భావిస్తున్నాం’ అని సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వాహనాల్లోనూ చాలా వరకు రూ.20 లక్షలలోపు వాహనాలే ఎక్కువ. హైఎండ్ కేటగిరికి చెందినవి తక్కువే. వివిధ రకాల బ్రాండ్లకు చెందిన కార్లపైన రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ప్రోత్సాహకాలను ఇచ్చారు. గరిష్టంగా కొన్నింటిపైన రూ.లక్ష వరకు రాయితీ లభించింది. అలాగే రెండేళ్ల బీమా డబ్బులను కూడా డీలర్లే భరించారు. అయినప్పటికీ అమ్మకాలు పెరగలేదు. -
ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీలో ఉన్న ఓలాపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత, అమ్మకాల తర్వాత సేవకు సంబంధించి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించకపోవడంతో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలాకు నోటీసును జారీ చేసింది. నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) ఏడాది కాలంగా ఓలా ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిందిగా కంపెనీలో ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించినా వారు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ క్లాస్ యాక్షన్ కోసం ఈ ఫిర్యాదులను పరిశీలించడం ప్రారంభించింది.ఏడాదిలో ఎన్‌సీహెచ్‌కు 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని గుర్తించింది. చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సీసీపీఏ వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, సేవల్లో లోపాలు, తప్పుదారి పట్టించే దావాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంభించడంతో సీసీపీఏ అక్టోబర్ 7న ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రతిస్పందించడానికి కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. సీసీపీఏ నుండి షోకాజ్ నోటీసు అందుకున్నట్టు అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇవీ ఫిర్యాదులు..ఉచిత సేవా వ్యవధి/వారంటీ సమయంలో చార్జీల వసూలు, సేవలు ఆలస్యం కావడంతోపాటు అసంతృప్తికరం, వారంటీ ఉన్నప్పటికీ సర్వీసు తిరస్కరణ లేదా ఆలస్యం, సరిపోని సేవలు, పునరావృతం అవుతున్న లోపాలు, అస్థిర పనితీరు, అధిక చార్జీలు, ఇన్వాయిస్లో తేడాలు ఉంటున్నాయని ఓలాపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రీఫండ్ చేయకపోవడం, డాక్యుమెంటేషన్‌ను అందించడంలో వైఫల్యం, వృత్తిపర ప్రవర్తన, పరష్కారం కానప్పటికీ ఫిర్యాదుల మూసివేత, బ్యాటరీ, వాహన విడి భాగాలతో బహుళ సమస్యలను వినియోగదార్లు ఎదుర్కొంటున్నారు.చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!కాగా, నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌ను (ఎన్సీహెచ్) డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ పునరుద్ధరించింది. వ్యాజ్యానికి ముందు దశలో ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒకే పాయింట్‌గా ఎన్సీహెచ్ ఉద్భవించింది. ఇది దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు 17 భాషలలో టోల్–ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915 ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్, ఎస్ఎంఎస్, మెయిల్, ఎన్సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమంగ్ యాప్‌ల ద్వారా బాధితులు తమ సౌలభ్యం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.తగ్గుతున్న విక్రయాలు.. భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్‌లో 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. యూనిట్ల పరంగా అమ్మకాలు 11 నెలల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెప్టెంబర్‌లో ఇది 27 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 52,136 యూనిట్లను కంపెనీ విక్రయించింది. చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొద్ది నెలల్లోనే బజాజ్ చేతక్ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఇసుజు డీ-మ్యాక్స్ ఆంబులెన్స్: ధర ఎంతంటే..
ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 'డీ-మ్యాక్స్ అంబులెన్స్' లాంచ్ చేసింది. ఈ అంబులెన్స్ రోగులను తరలించే సమయంలో భద్రతను అందించేలా తయారైంది. దీని ప్రారంభ ధర రూ. 25.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో RZ4E 1.9-లీటర్, 4-సిలిండర్ వీజీఎస్ టర్బో ఇంటర్‌కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 కేడబ్ల్యు పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ అంబులెన్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన విధంగా ఉండేలా దృఢంగా నిర్మితమై ఉంది.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఇంటలిజెంట్ బ్రేక్ ఓవర్-రైడ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ వార్ణింగ్ సిస్టమ్, డ్రైవర్ & కో-డ్రైవర్ కొరకు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ క్యాబిన్ కొరకు కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, సైడ్ ఇంట్రూషన్ ప్రొటక్షన్ బీమ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌ను కంపెనీ రోగుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇందులో వార్నింగ్ లైట్లు, ఫ్లాషర్లు, సైరన్లు, సైడ్ లైట్లు, సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండేలా హై-విజిబిలిటీ స్టిక్కర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుడీ-మ్యాక్స్ అంబులెన్స్ లాంచ్ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ 'టోరు కిషిమోటో' మాట్లాడుతూ.. అత్యాధునిక ఫీచర్లతో దీనిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇసుజు ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఈ లాంచ్‌తో, ఇసుజు మోటార్స్ ఇండియా ఆటోమోటివ్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంతుందని అన్నారు.