Market
-
అప్పటికి బంగారం ధర రూ. లక్ష: కారణం ఇదే..
బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల పసిడి రూ.80,000, కేజీ సిల్వర్ రూ. 1 లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ.. గోల్డ్ కొనుగోలు చేసేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ధన త్రయోదశి సందర్భంగా బంగారం ఎక్కువగానే అమ్ముడైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.పరిస్థితులను బట్టి చూస్తుంటే.. ధరలు ఎంత పెరిగినా కొనుగోలుచేసి వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదని స్పష్టమైపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది దసరా, దీపావళి నాటికి గోల్డ్ రేటు రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వెండి కూడా రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షలకు చేరుకోవచ్చని అంచనా.ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకారం.. గత కొన్నేళ్లుగా వెండి మంచి లాభాలను ఇవ్వడంతో ధరల విషయంలో బంగారాన్నే మించిపోయింది. రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.2014లో రూ.28,006.50 వద్ద ఉన్న బంగారం ధర ప్రస్తుతం రూ. 81000 వరకు ఉంది. దీన్ని బట్టి చూస్తే.. పదేళ్లలో బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమవుతోంది.బంగారం ధరలు పెరగటానికి కారణంబంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల సంఖ్య పెరగడం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల రేట్లు పెరగడం వంటివి ప్రధాన కారణం అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు పతనమైన సమయంలో.. ఎక్కువమంది ఇన్వెస్టర్లు నష్టాల నుంచి తప్పించుకోవడానికి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఓ వైపు పండుగలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం అమ్మకాల పెరగటానికి కారణమయ్యాయి. -
భారీగా బంగారం కొనుగోళ్లు: రేటు పెరిగినా.. తగ్గని డిమాండ్
న్యూఢిల్లీ/కోల్‌కతా: ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ పసిడికి డిమాండ్ పటిష్టంగానే ఉంటోంది. ధన్‌తేరాస్ సందర్భంగాను అదే ధోరణి నెలకొంది. మంగళవారం ధన్‌తేరాస్ సందర్భంగా అమ్మకాలు ఉదయం పూట అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఎక్కువగా చిన్న ఐటమ్స్, నాణేలకు డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నాయి.బుధవారం మధ్యాహ్నం వరకు ధన్‌తేరాస్ ఉండటంతో మరింతగా వ్యాపారం జరగవచ్చని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నా డిమాండ్ పటిష్టంగా ఉన్నట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. అయితే, అధిక ధరల వల్ల విలువపరంగా అమ్మకాలు పెరిగినా, పరిమాణంపరంగా మాత్రం తగ్గొచ్చని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.‘రేటు అధికంగా ఉన్నా కొనుగోళ్లు మెరుగ్గానే ఉన్నాయి. పరిమాణంపరంగా గతేడాదితో పోలిస్తే 10 శాతం తగ్గినా, విలువపరంగా చూస్తే 20 శాతం అధికంగా ఉండొచ్చు‘ అని ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయ్యమ్ మెహ్రా తెలిపారు. రీసైకిల్డ్ ఆభరణాల అమ్మకాలు కూడా బాగున్నట్లు పేర్కొన్నారు. 2, 3, 4, 5, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్, తేలికపాటి ఆభరణాలు విక్రయాలు గణనీయంగా ఉన్నట్లు వివరించారు.ఆఫర్లు, డిస్కౌంట్లను కొనుగోలుదార్లు వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొత్తం అమ్మకాల్లో 30–40% వాటా వివాహ ఆభరణాలది ఉండగా, మిగతాది పండుగపరమైన నామమాత్రపు కొనుగోళ్లది ఉన్నట్లు సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువంకర్ సేన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే పసిడి అమ్మకాల పరిమాణం 15% తగ్గొచ్చని, విలువపరంగా మాత్రం 12% అధికంగా ఉండొచ్చన్నారు. ధన్‌తేరాస్, దీపావళి సందర్భంగా దేశీ మార్కెట్లో అమ్మకాలు రూ. 30,000 కోట్ల పైగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రేటు 33 శాతం జంప్.. గతేడాది నవంబర్ 11న ధన్‌తేరాస్ నాడు న్యూఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా 33 శాతం ఎగిసి రూ. 81,400కి చేరింది. వెండి ధర కేజీకి గతేడాది ధన్‌తేరాస్ నాడు రూ.74,000గా ఉండగా ఈసారి 35% పెరిగి రూ. 99,700గా ఉంది.సుంకాల తగ్గింపుతో బూస్ట్: ఎంఎంటీసీఇటీవల పసిడిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో ధన్‌తేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఊతం లభించిందని ఎంఎంటీసీ–పీఏఎంపీ ఎండీ వికాస్ సింగ్ తెలిపారు. కస్టమర్లు అధిక స్వచ్ఛత గల పసిడి ఉత్పత్తులపై ఆసక్తి కనపరుస్తున్నట్లు చెప్పారు. రాబోయే పెళ్లిళ్ళ సీజన్లోనూ ఇదే సానుకూల ధోరణి కొనసాగవచ్చని సింగ్ చెప్పారు. సీజన్‌తో సంబంధం లేకుండా సంప్రదాయాలపరమైన వివిధ వేడుకల కారణంగా కూడా పసిడికి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
మళ్ళీ షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు
ధన త్రయోదశి.. బంగారం కొనుగోలు చేస్తే శుభమని చాలామంది భావిస్తారు. అయితే నేడు పసిడి ధరలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. కాబట్టి దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (మంగళవారం) గోల్డ్ రేట్లు గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,450 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 73,750 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 600, రూ. 650 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 600, రూ. 650 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,750 వద్ద ఉంది.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 80,600 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 600, రూ. 650 పెరిగింది.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,900 వద్ద నిలిచింది. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 మాత్రమే తగ్గింది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మళ్ళీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 243.95 పాయింట్ల నష్టంతో 79,761.09 వద్ద, సెన్సెక్స్ 56.85 పాయింట్ల నష్టంతో 24,282.45 పాయింట్ల వద్ద సాగుతున్నాయి.నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, హీరోమోటోకార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నవంబర్ 6న స్విగ్గీ ఐపీవో!
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతిపాదిత రూ. 11,300 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 371 నుంచి 390 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూ నవంబర్ 8న ముగుస్తుందని, యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తేదీ నవంబర్ 5గా ఉంటుందని వివరించాయి.ఐపీవో కింద రూ. 4,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో రూ. 6,800 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, నార్త్‌వెస్ట్ వెంచర్స్ వాటాలను విక్రయించడం ద్వారా తమ పెట్టుబడులపై 35 రెట్లు రాబడులు పొందనున్నట్లు తెలిపాయి.తాజా ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 137 కోట్ల మొత్తాన్ని అనుబంధ సంస్థ స్కూట్నీ రుణాలను తీర్చేందుకు, రూ. 982 కోట్లను క్విక్ కామర్స్ సెగ్మెంట్లో డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ వేల్యుయేషన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 మార్చి 31 నాటికి వార్షికాదాయం 1.09 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 602.75 పాయింట్ల లాభంతో 80,005.04 వద్ద, నిఫ్టీ 158.35 పాయింట్ల లాభంతో 24,339.15 వద్ద నిలిచాయి. గత వారం భారీ నష్టాల్లో అడుగులు వేసిన స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది.శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐచర్ మోటార్స్, విప్రో, కెనరా బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండుగ ముందు.. పసిడి శుభవార్త!
Gold Price Today: ధన త్రయోదశి, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పసిడి ధరలు నేడు (అక్టోబర్ 28) దిగివచ్చాయి. మూడు రోజుల తర్వాత బంగారం రేట్లు తగ్గడంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది.తగ్గింపు ఎంత?తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.450 దిగివచ్చి రూ.73,150 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.490 తగ్గి రూ. 80,290 వద్దకు వచ్చింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గింపును నమోదు చేశాయి.ఇదీ చదవండి: బంగారాన్ని మించి.. దడ పుట్టిస్తున్న వెండిఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఈరోజు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.490 క్షీణించింది. ప్రస్తుతం వీటి ధరలు వరుసగా రూ.73,300, రూ.79,950 వద్దకు వచ్చి చేరాయి.Silver Price Today: దేశంలో వెండి ధరలు సోమవారం నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు వరుసగా మూడు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మార్కెట్లో మతాబులు వెలిగేనా?
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్‌కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో వెల్లువెత్తుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. 2.2 శాతం డౌన్ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్ గత నెలలో దేశీ స్టాక్స్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్‌లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్‌కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్‌పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్‌పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బిజినెస్ సైకిల్ ఫండ్స్ భేష్..
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రపంచంలో బిజినెస్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్‌కి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. విస్తృత మార్కెట్‌తో పోలిస్తే ఇవి మెరుగ్గా రాబడులు అందిస్తుండటం ఇందుకు కారణం. గత ఏడాది వ్యవధిలో ఈ ఫండ్స్ 56 శాతం వరకు రాబడులు ఇచ్చినట్లు పరిశ్రమ గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం హెచ్ఎస్బీసీ, మహీంద్రా మాన్యులైఫ్, క్వాంట్ మొదలైన ఫండ్ హౌస్‌ల స్కీములు 50 శాతం పైగా రాబడులు అందించాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ సూచీ 35.11 శాతం రాబడులు అందించింది. ఈ నేపథ్యంలో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలిపారు. నిర్దిష్ట ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల్లో రాణించే రంగాలకు చెందిన స్టాక్స్‌ని గుర్తించి, ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ సైకిల్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, రికవరీ తొలినాళ్లు, వృద్ధి మధ్య దశ, చివరి దశ వంటి పరిస్థితులను బట్టి వివిధ రంగాల్లో పెట్టుబడులను మారుస్తుంటాయి. ఉదాహరణకు మాంద్యం దశలో యుటిలిటీస్, ఫార్మా వంటి డిఫెన్సివ్ రంగాలు మెరుగ్గా రాణించగలవు. అయితే వృద్ధి ప్రారంభమయ్యే తొలినాళ్లలో ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు చెందిన స్టాక్స్ లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను అటూ–ఇటూ మారుస్తుండటమనేది ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్వల్ప సమయంలో అధిక రాబడులు అందిస్తుండటంతో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతోందని ఎప్సిలాన్ గ్రూప్‌లో భాగమైన మల్టీ ఆర్క్ వెల్త్ ఏవీపీ సిద్ధార్థ్ ఆలోక్ తెలిపారు. పరిస్థితులను బట్టి వివిధ సెక్టోరల్ ఫండ్స్‌కి మారేందుకు, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను పట్టుకునేందుకు వ్యక్తిగతంగా పరిశోధిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చునే భారాన్ని ఈ ఫండ్స్ తగ్గిస్తాయని విస్డమ్ ఎడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు భావేష్ దమానియా తెలిపారు. అయితే, సాధారణంగా థీమ్యాటిక్ ఫండ్స్ పనితీరును లెక్కగట్టేందుకు కనీసం అయిదేళ్ల పాటైనా కార్యకలాపాలు ఉండాలని, ఇవన్నీ ఈ మధ్యే వచ్చాయి కాబట్టి ఇటీవలి కాలంలో పనితీరుపైనే ఆధారపడటం సరికాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.16 ఫండ్స్..ప్రస్తుతం దేశీయంగా 16 బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఉండగా, 10 ఫండ్స్‌కి ఏడాది పైగా ట్రాక్ రికార్డు ఉంది. వీటిలో ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా గత 12 నెలల్లో నిఫ్టీ 500 టీఆర్ఐకి మించిన రాబడులు అందించాయి. పరిశ్రమ డేటా ప్రకారం 10 ఫండ్స్ సగటున 42 శాతం రాబడి అందించాయి. గత ఏడాది వ్యవధిలో అక్టోబర్ 17 వరకు.. హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 56.3 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 56.17 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 50.8 శాతం రాబడులు అందించాయి.మరిన్ని విశేషాలు..అధిక రాబడులు అందించిన వాటిలో బరోడా బీఎన్పీ పారిబా బిజినెస్ సైకిల్ ఫండ్ (44.58 శాతం రాబడి), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (42.27 శాతం), టాటా బిజినెస్ సైకిల్ ఫండ్ (41.26 శాతం), కోటక్ బిజినెస్ సైకిల్ ఫండ్ (40.03 శాతం), యాక్సిస్ బిజినెస్ సైకిల్ ఫండ్ (39.02 శాతం), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ (36.33 శాతం), హెచ్డీఎఫ్సీ బిజినెస్ సైకిల్ ఫండ్ (31.97 శాతం) ఉన్నాయి. →గత ఆరు నెలల వ్యవధిలో హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 26.72 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 20.88 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 17.7 శాతం రిటర్న్‌లు ఇచ్చాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ ఇండెక్స్ 15.2 శాతమే రాబడినిచి్చంది. మిగతా ఏడు ఫండ్స్ 13 శాతం నుంచి 23 శాతం వరకు రిటర్నులు ఇచ్చాయి. -
బంగారాన్ని మించి.. దడ పుట్టిస్తున్న వెండి!
బంగారం తర్వాత భారతీయులు వినియోగించే అత్యంత విలువైన లోహం వెండి. ఓ వైపు చుక్కలనంటుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతుండగా వెండి అంతకు మించిన వేగంతో కొండలా పెరుగుతోంది.రానున్న 12 నుండి 15 నెలల్లో వెండి ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కేజీకి రూ. 1,25,000, కమోడిటీ ఎక్స్చేంజ్ (COMEX)లో ఔన్సుకు 40 డాలర్లకుచేరుకునే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తెలిపింది.2024లో వెండి ఆకట్టుకునే వృద్ధిని కనబరిచింది. సంవత్సరానికి 40 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది . దేశీయంగా రూ. 100,000 మార్కును అధిగమించింది. వినియోగం, డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక బంగారం ధరలు 10 గ్రాములకు స్వల్ప కాలంలో రూ. 81,000 లకు, దీర్ఘకాలికంగా రూ.86,000కి చేరుకుంటాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. అలాగే కమెక్స్లో బంగారం మీడియం టర్మ్‌లో 2,830 డాలర్లు, దీర్ఘకాలికంగా 3,000 డాలర్లను తాకుతుందని అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: బంగారమంటే అంత నమ్మకం!ఇటీవలి సంవత్సరాలలో బంగారం స్థిరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆస్తులలో ఒకటిగా ఉంది. 2021 మినహా 2016 నుండి పసిడి దేశీయంగా మంచి పనితీరు కనబరుస్తూ వస్తోంది. ఈ సంవత్సరం బంగారం ధరలు కమెక్స్‌తోపాటు దేశీయ మార్కెట్లలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సంవత్సరానికి 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. -
సెబీ కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచే..
న్యూఢిల్లీ: వచ్చే నెల (నవంబర్) 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఒక పాన్ ద్వారా యూనిట్లలో రూ. 15 లక్షలకు మించి చేపట్టే అన్ని లావాదేవీలు రెండు రోజుల్లోగా కంప్లయెన్స్ అధికారికి వెల్లడించవలసి ఉంటుంది.సంబంధిత అధికారులు, ట్రస్టీలు లేదా సంబంధిత వ్యక్తులు ఆయా లావాదేవీల వివరాలను రెండు పనిదినాల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. ఒక త్రైమాసికంలో సింగిల్ లేదా అనేక లావాదేవీల ద్వారా రూ. 15 లక్షల విలువ ట్రాన్సాక్షన్ జరిగితే.. మినహాయింపులో ఉన్నవికాకుండా అన్ని పథకాలకూ తాజా నిబంధనలు వర్తించనున్నట్లు సెబీ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.వచ్చే నెల నుంచి ఏఎంసీలు త్రైమాసికవారీగా సంబంధిత అధికారులు, ట్రస్టీలు, సమీప బంధువుల హోల్డింగ్స్ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. అక్టోబర్ 31కల్లా కలిగి ఉన్న హోల్డింగ్స్‌ను నవంబర్ 15కల్లా వెల్లడించవలసి ఉంటుంది. ఆపై ప్రతీ త్రైమాసికం తదుపరి 10 రోజుల్లోగా వీటి వివరాలు దాఖలు పరచాలని సెబీ తెలియజేసింది. -
వామ్మో.. పసిడి దడ! నేడు ఎంతలా ఎగిసిందంటే..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ దడ పుట్టించేలా ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు నేడు (అక్టోబర్ 26) భారీగా ఎగిశాయి. ఈరోజు ఎక్కడెక్కడ ఎంత మేర రేట్లు పెరిగాయన్నది ఇక్కడ తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర అమాంతం రూ.650 పెరిగి రూ.73,600 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.710 ఎగిసి రూ. 80,290 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదేవిధంగా ధరలు భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: బంగారంపై పండుగ ఆఫర్లుదేశ రాజధాని అయిన ఢిల్లిలో కూడా ఈరోజు బంగారం ధరలు భారీగా ఎగిశాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.650 పెరిగి రూ.73,750 లను తాకగా, 24 క్యారెట్ల బంగారం కూడా రూ.710 పెరిగి రూ.80,440 వద్దకు ఎగిసింది.Silver Price Today: దేశంలో వెండి ధరలు శనివారం నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున భారీగా కేజీపై రూ.3000 క్షీణించిన వెండి నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కట్టండి జరిమానా.. రాధికా గుప్తాకు షాకిచ్చిన సెబీ
ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సీఈఓ రాధికా గుప్తాకు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ షాకిచ్చింది. మ్యూచువల్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీతోపాటు దాని సీఈఓ రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ త్రిదీప్ భట్టాచార్యపై మొత్తం రూ.16 లక్షల జరిమానా విధించింది.సెబీ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. మొత్తం రూ.16 లక్షల జరిమానాలో విడిగా ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్పై రూ. 8 లక్షలు, సీఈవో రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ భట్టాచార్యలకు చెరో రూ. 4 లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ పెనాల్టీలను 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరికఫోకస్డ్ ఫండ్స్ స్పష్టంగా (ట్రూ-టు-లేబుల్) ఉంటున్నాయా.. లేదా అనేదానిపై సెబీ పరిశ్రమవ్యాప్త సమీక్ష చేపట్టింది. ఇందులో ఎడెల్వీస్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ (EFEF) 88 రోజులలో 'గరిష్టంగా 30 స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం' నిబంధనను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. -
‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల భారీగా పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మదుపర్లకు సలహా ఇచ్చారు. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తోనే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్ ట్రెండ్‌కు తగిన వ్యూహం అనుసరించని వారు త్వరగా నష్టపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్లో కొన్ని అంశాలను పంచుకున్నారు.‘ఈక్విటీ మార్కెట్లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేనివారు లాభాలు ఆర్జించడం ఇప్పటివరకు చూడలేదు. మార్కెట్ ట్రేండ్‌కు తగిన ప్రణాళిక లేకుండా ట్రేడింగ్ చేసేవారు త్వరగా నష్టాల్లోకి వెళుతారు. మార్కెట్ రిస్క్‌లకు తగిన విధంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి. లేదంటే డబ్బు సంపాదించడం కష్టం. రిస్క్ తక్కువగా తీసుకుంటే రిటర్న్‌లు కూడా అందుకు అనుగుణంగానే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ప్రమాదం. కొన్నిసార్లు మొత్తం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ నిర్వహణ చాలా ముఖ్యం. పోర్ట్‌ఫోలియో ఆధారంగా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇది ట్రేడర్, ఇన్వెస్టర్ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని కామత్ అన్నారు.In the 20+ years in this business, I haven’t seen anyone who has kept profits from trading without good risk management. I know many who've lost quickly. If you don't have a plan to manage risk and size your bets, it's impossible to keep the money you make.Here are a few…— Nithin Kamath (@Nithin0dha) October 23, 2024ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఎన్నికలు, పెరుగుతున్న ఎఫ్ఐఐ అమ్మకాలు వెరసి స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. దీర్ఘకాలంలో రాబడులు ఆశించే ఇన్వెస్టర్లకు ఇలా మార్కెట్లు నష్టపోతుండడం మంచి అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మరిన్ని ఎక్కువ స్టాక్‌లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 662.87 పాయింట్ల నష్టంతో 79,402.29 వద్ద, నిఫ్టీ 218.60 పాయింట్ల నష్టంతో 24,180.80 వద్ద నిలిచాయి.ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, సన్ ఫార్మా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారు ఆనందం ఒక్క రోజులోనే ఆవిరి..
Gold Price Today: దేశలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు నేడు (అక్టోబర్ 25) స్వల్పంగా పెరిగాయి. క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇవ్వడంతో ఆనందించిన కొనుగోలుదారులకు మళ్లీ నిరాశ తప్పలేదు.ఎంత పెరిగిందంటే..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.100 పెరిగి రూ.72,950 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 బలపడి రూ. 79,580 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదేవిధంగా ధరలు స్వల్పంగా పెరిగాయి.ఇదీ చదవండి: ఎఫ్&వో ట్రేడింగ్ అంటే టైమ్‌పాస్ కాదు..ఇక ఢిల్లిలో కూడా ఈరోజు బంగారం ధరలు కాస్తంత పెరుగుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.73,100 వద్దకు చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 పెరిగి రూ.79,730 వద్దకు చేరింది.భారీగా క్షీణించిన వెండిSilver Price Today: దేశంలో వెండి ధరలు నేడు వరుసగా రెండోరోజూ భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.3000 క్షీణించింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.1,07,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎఫ్&వో ట్రేడింగ్ అంటే టైమ్‌పాస్ కాదు..
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ అనేదేమీ టైమ్‌పాస్‌గా చేసే ఆషామాషీ వ్యవహారం కాదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాలని మార్నింగ్‌స్టార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు.సెబీ అధ్యయనం ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్లే ఎఫ్‌అండ్‌వోలో లాభపడుతుండగా, 93 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని వెల్లడైన విషయాన్ని భాటియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలను ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తుండటం సరికాదని ఆయన తెలిపారు.2020లో కరోనా వైరస్ మహమ్మారి తర్వాత నుంచి ఎఫ్ అండ్ ఓలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయితే, ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మంచిదేమీ కాదని, ఆందోళనకరమని భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘అంతర్జాతీయంగా నమోదయ్యే డెరివేటివ్స్ వాల్యూమ్స్‌లో సగభాగం పైగా వాటా భారత్‌దే ఉండటం గొప్పగా అనిపించినా, ఇది మనం ధరించడానికి ఇష్టపడని కిరీటంలాంటిది’’ అని వ్యాఖ్యానించారాయన.మరోవైపు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో అసంబద్ధమైన హంగామాను నివారించేందుకు, ధరల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు నియంత్రణ సంస్థ, స్టాక్ ఎక్స్చేంజీలు ఈ విభాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని భాటియా తెలిపారు. త్వరలోనే సెబీ దీనిపై ఒక చర్చాపత్రాన్ని కూడా ప్రవేశపెట్టనుందని వెల్లడించారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 16.82 పాయింట్ల నష్టంతో 80,065.16 వద్ద, నిఫ్టీ 36.10 పాయింట్ల వద్ద 24,399.40 వద్ద నిలిచాయి.అల్ట్రా టెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, నెస్లే, బజాజ్ ఆటో వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎట్టకేలకు శుభవార్త.. బంగారం తగ్గిందోచ్..
Gold Price Today: బంగారం ఎట్టకేలకు కరుణించింది. దేశంలో పసిడి ధరలు నేడు (అక్టోబర్ 24) దిగివచ్చాయి. దాదాపు ఎనిమిది రోజులుగా దూసుకెళ్తూ కొత్త గరిష్టాలను చేరుతున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడటంతో పసిడి కొనుగోలుదారులకు కాస్తంత ఊరట కలిగినట్లయింది. బంగారం ధరలు ఎక్కడెక్కడ ఎంతెంత మేర తగ్గాయన్నది ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.550 తగ్గి రూ.72,850 లకు దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.600 క్షీణించి రూ. 79,470 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు క్షీణించాయి.ఇదీ చదవండి: Bank Holidays: నవంబర్‌లో బ్యాంకు సెలవులుఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ ఈరోజు బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.73,000 వద్దకు రాగా, 24 క్యారెట్ల బంగారం కూడా రూ.600 క్షీణించి రూ.79,620 వద్దకు వచ్చింది.భారీగా తగ్గిన వెండిSilver Price Today: దేశంలో వెండి ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.2000 క్షీణించింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.1,10,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!
బంగారం.. ఓ సింగారం.. ఓ ఆచారం.. ఓ అవసరం.. ఓ ఫ్యాషన్.. ఇలా పేరు ఏదైనా నిత్య జీవితంలో దీనితో పెనవేసుకున్న బంధం వెలకట్టలేనిది. ఇంతగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ పసిడి ధర ఇప్పుడు కొండెక్కింది. కొండంటే మామూలు కొండ కాదు.. ఏకంగా ఎవరెస్టే ఎక్కి జిగేల్ జిగేల్‌మంటోంది.సాక్షి ప్రతినిధి కర్నూలు: చరిత్రలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్‌ను దాటింది. బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ.80,070కి చేరింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలపై మరోసారి చర్చ మొదలైంది. చాలా వేగంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని కొందరు అంటుంటే.. ఇంకొందరు త్వరలోనే రూ.80 వేలు కాస్త రూ.లక్షకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు.ఇంకోవైపు.. ఆశ్వీయుజ మాసంలో పెళ్లిళ్లకు సిద్ధమైన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. బంగారం కొనుగోలు చేసే దేశాల్లో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది. బంగారం లేకుండా మన దగ్గర ఏ శుభకార్యం జరగదంటే అతిశయోక్తి కాదు. అయితే.. పదేళ్లుగా బంగారం ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. మూణ్ణెళ్ల కిందట జూలైలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.75వేల వరకూ ట్రేడ్ అయింది. అదే 22 క్యారెట్లు రూ.68,800 చేరింది.అయితే, కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా 10 గ్రాములపై రూ.6 వేల వరకూ తగ్గింది. అంటే.. 22 క్యారెట్ల బంగారం రూ.63 వేలకు.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.70వేలకు తగ్గింది. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంవల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని, మరింతగా తగ్గే అవకాశం ఉందని బంగారం కొనేందుకు ఇదే అనువైన సమయమని అప్పట్లో అంతా భావించారు. ఇంకొందరు మరికొంత తగ్గుతాయని వేచిచూశారు. కానీ, అక్కడి నుండి రోజూ ధరలు ధగధగలాడుతూ బుధవారం ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.80,070కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.73,400కు పెరిగింది. బులియన్ మార్కెట్ చరిత్రలో ఇదే గరిష్టం. 75 ఏళ్ల కిందట రూ.99 మాత్రమే.. నిజానికి.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.వందలోపే ఉండేది. 1950లో 10 గ్రాముల ధర రూ.99. ఐదేళ్ల తర్వాత అంటే 1955లో రూ.20 తగ్గి రూ.79కి చేరింది. ఆ తర్వాత ఐదేళ్లకు రూ.111కు చేరిన పుత్తడి, 1965లో ఏకంగా రూ.39 తగ్గి 20 ఏళ్లలో కనిష్టంగా రూ.72కు చేరింది. ఆ తర్వాత ఏటికేడు ధరలు పెరుగుతూ వచ్చాయి. 2008లో తొలిసారిగా పది గ్రాముల బంగారం రూ.10వేల మార్క్ దాటింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే నడిచింది. అయితే.. రెండేళ్లలోనే అంటే 2010లో ఏకంగా రూ.8 వేలకు పైగా పెరిగి రూ.18వేల మార్క్‌ను దాటింది. 2015లో రూ.26,343 ఉండేది. ఇప్పుడు రూ.24 క్యారెట్లు రూ.80,070, 22 క్యారెట్ల ధర రూ.73,400కు పెరిగిందంటే బంగారం ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో తెలుస్తోంది.ప్రభావం చూపని సుంకం తగ్గింపు! బంగారం, వెండి, ప్లాటినంతో పాటు విలువైన లోహాలపై 10 శాతం బీసీడీ (బేసిక్ కస్టమ్ డ్యూటీ) ఉండేది. దీనికి అదనంగా ఏఐడీసీ (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్) 5 శాతం ఉండేది. కేంద్రం బీసీడీని 5 శాతం, ఏఐడీసీని 4 శాతం తగ్గించింది. కస్టమ్స్ సుంకం ఆరు శాతానికే పరిమితం చేసింది. అయితే, జీఎస్టీలో మాత్రం మార్పుల్లేవు. మూడు శాతంగానే ఉంది. దీంతో మొత్తంగా జీఎస్టీతో కలిపి బంగారు, వెండిపై 18 శాతం ఉన్న సుంకం 9 శాతానికి తగ్గింది. ఫలితంగా.. బంగారు, వెండి ధరలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆగస్టు నుంచి తిరిగి పెరుగుతూ అక్టోబరులో ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. దీంతో కేంద్రం స్మగ్లింగ్‌ను నివారించేందుకు తగ్గించిన సుంకం మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.ప్లాటినం కంటే విలువైన లోహం..పదిహేనేళ్ల కిందటి వరకూ బంగారం కంటే ప్లాటినం విలువైన లోహం. బాగా డబ్బున్న కోటీశ్వరులు బంగారం కంటే ప్లాటినం ఆభరణాలు కొనుగోలు చేసేవారు. అప్పట్లో బంగారం కంటే ప్లాటినం ధర ఎక్కువగా ఉండటంతో ఏదైనా శుభకార్యానికి ప్లాటినం నగలతో వచ్చే స్త్రీలను ప్రత్యేకంగా చూసేవారు. అయితే, ఇప్పుడు ప్లాటినంను దాటి బంగారం ధర రెట్టింపు అయింది.బులియన్ మార్కెట్లో ఇలా జరుగుతుందని ఊహించలేదని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.73,400 ఉంటే, 10 గ్రాముల ప్లాటినం ధర రూ.30,500 ఉంది. దీనికి కారణమేంటని వ్యాపారులను ఆరా తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్లాటినంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు అధికమని.. ఫారెక్స్ మార్కెట్లో కూడా బంగారంపైనే పెట్టుబడులు పెడతారని, దీంతో అది భారీగా పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.12 లక్షలు ఉన్నాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?బంగారు కొనాలంటేనే భయం వేస్తోంది. గోల్డ్ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్షాపులకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. – నవిత, కిడ్స్ స్టూడియో నిర్వాహకులు, కర్నూలుగోల్డ్ కొనడం కష్టమే..బంగారం ధర రూ.80వేలు దాటింది. మేకింగ్ చార్జీలు, జీఎస్టీ అంతా కలిపి రూ. లక్ష అవుతోంది. 10 గ్రాముల బంగారాన్ని దాదాపు రూ.లక్ష పెట్టి కొనడమంటే చాలా కష్టం. చైన్ హుక్ పోతే చేయించడానికి రూ.10 వేలు అవుతోంది. ధరల పెరుగుదలను ఊహించలేకపోతున్నాం. మధ్య తరగతి కుటుంబాలు బంగారం అంటేనే అమ్మో అనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్లు ఉన్న వారికి పెరిగిన గోల్డ్ ధరలు అదనపు భారమే.– గౌతమి, కర్నూలు -
ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అలర్ట్ లిస్ట్‌లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్ లిస్ట్‌లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.రేంజర్ క్యాపిటల్, టీడీఎఫ్ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్ఎఫ్ఎక్స్, గ్రోలైన్, థింక్ మార్కెట్స్, స్మార్ట్ ప్రాప్ ట్రేడర్, ఫండెడ్నెక్ట్స్, వెల్ట్రేడ్, ఫ్రెష్ఫారెక్స్, ఎఫ్ఎక్స్ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్వన్ట్రేడ్ వీటిలో ఉన్నాయి. అలర్ట్ లిస్ట్ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానాఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్‌లో డీల్ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ (ఈటీపీ) ఆపరేట్ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్ లిస్ట్‌లో చేరుస్తారు. -
గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల రికార్డులు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో కేజీ వెండి ధర మంగళవారం రూ.1,500 పెరిగి రూ.1,01,000కు చేరింది. వెండి రూ.లక్ష దాటడం ఇదే తొలిసారి. గత ఐదు రోజులుగా వెండి లాభాల బాటన పయనిస్తోంది.బంగారం 99.9 పూర్తి స్వచ్ఛత ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.350 పెరిగి రూ.81,000కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.80,600కు చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లలో బంగారం, వెండి పటిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీనత విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ పెరగటమే వెండి ధర పరుగుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల భారీగా పడుతున్నాయి. దాంతో మదుపర్లు కొంత సేఫ్‌గా ఉండే బంగారంపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర పెరుగుతోంది. -
టపటపా!.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్‌లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్అండ్టీ 2%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి.