Extra
-
ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే! మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది. ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి. ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది. ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. -
ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!
ఈ ఏడాది దసరా వెకేషన్‌కి స్కూల్‌కెళ్లే పిల్లల పేరెంట్స్ హాయిగా పోర్బందర్ బాట పట్టవచ్చు. గాంధీజీ పుట్టిన నెలలో గాంధీజీ పుట్టిన నేల మీద విహరించడంలోని సంతృప్తిని ఆస్వాదించవచ్చు. జాతిపితకు నివాళులర్పించనూ వచ్చు. పిల్లలకు ఇది మరిచిపోలేని పర్యటనగా మిగిలిపోతుంది.ఈ టూర్లో బాపూ పుట్టిన ఇంటిని, ఆయన స్మారకార్థం నిర్మించిన కీర్తిమందిర్, అందులో ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలతో ఉన్న ఫొటో ఎగ్జిబిషన్, గాంధీజీ నూలు వడికిన రాట్నం... వీటన్నింటినీ చూసిన తర్వాత గాంధీజీకి చేతులెత్తి మొక్కుతాం. పిల్లల మనసులు గౌరవంతో నిండి΄ోతాయి. గాంధీజీ పుట్టిన ఇంటి నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది.ఉడెన్ కార్వింగ్, రాతి కిటికీలను పోలిన డిజైనర్ విండోలతో అక్కడక్కడా పర్షియన్ నిర్మాణశైలితో ఎగుమ మధ్యతరగతి కుటుంబాన్ని పోలి ఉంటుంది. ఇంటి లోపల ఏర్పాట్లను గమనిస్తే నిరాడంబర జీవనశైలి అనిపిస్తుంది. గోడల మీద ఆయిల్ పెయింటింగ్స్ కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. ఇంట్లో గాంధీ పుట్టిన ప్రదేశం ప్రత్యేకంగా మార్క్ చేసి ఉంటుంది. బాపూజీ ఇంటి వెనుక వైపునున్న కస్తూర్బా గాంధీ ఇంటిని మర్చిపోకూడదు.బాపూ మందిర్, కీర్తిమందిర్లను చూసిన తరవాత బయటకు వస్తే చౌరాస్తాలో గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆ సెంటర్‌ని గాంధీ చౌక్ అంటారు. ఈ టూర్లో గాంధీ స్మారకాలతోపాటు చూడాల్సినవి చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముని మందిరం, వాళ్ల గురువు సాందీపుని మందిరం, హుజూర్ ప్యాలెస్, బర్డ్ సాంక్చురీ, తారామందిర్ (ప్లానిటేరియం), భారత్ మందిర్(జామెట్రికల్ మాథ్స్ ప్రదర్శనాలయం), రామకృష్ణ మిషన్ ఉన్నాయి. చక్కటి ఎయిర్‌పోర్టు కూడా ఉంది. అరేబియా తీరంలో సూర్యాస్తమయం ఈ టూర్లో బోనస్.(చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
ధర్మం చెప్పింది విను..!
ధర్మం చెప్పడానికి ప్రమాణాలుగా శృతి, స్మతి, పురాణం, శిష్టాచారమ్ కాగా చిట్టచివరిది– అంతరాత్మ ప్రబోధమ్. లోపలినుంచి భగవంతుడు చెబుతుంటాడు... ఇది తప్పు.. అని చేయకు. ఇది సరైనదే..చెయ్..అన్నప్పుడు చేసేయ్. ఏది చేయమని అంతరాత్మ ప్రబోధించిందో అది ధర్మం. ఏది వద్దని హెచ్చరించిందో అది అధర్మం. అందువల్ల అంతరాత్మ ప్రబోధమ్ చివరి, అథమ ప్రమాణం. కర్తవ్యమ్... నేను చేయవలసినదేది? అక్కడ మొదలు కావాలని చెబుతుంది శాస్త్రం. నేనేమి చేయాలో నాకు తెలియాలి. అంటే దానికి చదువుకోవాలి.. ఇది దేనికోసం.. భగవంతుని అనుగ్రహం కోసం. భక్తి రెండుగా మొదలవుతుంది. భగవంతుడు వేరు, నేను వేరు అని... నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడం మొదలుపెడితే.. ΄ోయి ΄ోయి నది సముద్రంలో కలిసిపోయినట్టు.. అది ఒకటవుతుంది.. అప్పుడు ఇక తానెవరో తెలిసిపోతుంది. అంటే కర్తవ్యాన్ని నిర్వహిస్తూపోతే ఒక సత్యం తెలుస్తుంది. అదేమిటి? ఇది నేను కాదు –అని. నోటితో చెబితే అది తెలిసి΄ోయిందని కాదు... అనుభవంలోకి రావాలి. ఇది.. ఈ శరీరం.. నేను కాదు, లోపల ఒకటి ఉంది. అది నేను. అదే సత్యం. అది కత్తిచేత నరకబడదు, అగ్నిచేత కాల్చబడదు, నీటిచేత తడపబడదు, వాయువు చేత కొట్టబడదు.... అదే నేను. అంతే తప్ప ఇది.. అంటే ఈ శరీరం నేను కాదు. .. అని తెలుసుకోవడం. అలా తెలుసుకున్నట్టు గుర్తు ఏమిటంటే... ఇది .. ఈ శరీరం పడిపోతున్నా... ఇది ‘నేను’ కాదు అని లోపల ఉన్న ‘నేను’ చూస్తూ సాక్షీభూతంగా ఉండడం. ఆ అనుభవంలోకి మారడం దగ్గర ఈశ్వర కృప కావాలి. ఈశ్వర కృప ఎవరికిస్తారు? ‘‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరఃసంయతేంద్రియః/ జ్ఞానం లబ్ద్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి’’ ... శ్రద్ధావాన్ లభతే జ్ఞానం... గురువుగారు చెప్పిన మాట, శాస్త్రాలు చెప్పిన సూత్రం సత్యం అనిముందు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసంతో, శ్రద్ధతో ప్రారంభం అయినప్పుడు వారికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. చదువుకున్న దాని మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇంద్రియాలను కట్టడి చేస్తాడు. అక్కడ ‘ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతి చరితవ్యా... అక్కడ తనను తాను ధర్మచట్రంలో ఇముడ్చుకోగలుగుతాడు. ధర్మాన్ని అతిక్రమించని అర్థకామాలు ΄పొందుతాడు. అప్పుడు ధర్మకామార్థసిద్ధయేత్... గృహస్థాశ్రమానికి ఆశీర్వచనం అయి΄ోయింది. ‘నీకు ధర్మార్థ కామములు సిద్ధించుగాక. ధర్మము నుండి విడివడిపోకుండుగాక!.. మనుష్య జన్మను సద్వినియోగం చేసుకోవడానికి పరమ తేలిక మార్గం–గహస్థాశ్రమం. అంటే నీ కర్తవ్యం తెలియడం దగ్గర మొదలయింది. కర్తవ్యం తెలియకుండా నేనెవరో తెలుసుకుంటానంటే ... అది సాధ్యం కాదు. దానికది మార్గం కాదు. భగవాన్ రమణులలాగా గోచి పెట్టుకుని... నేనెవరో నాకు తెలిసిపోతుంది .. అంటానంటే కుదరదు. మీరు జ్ఞానిని అనుకరించలేరు. సాధన పండితేనే జ్ఞానం కలుగుతుంది. సాధనకు అర్హత.. అధ్యాపనం బ్రహ్మయజ్ఞః. ఏవి నీకోసం రుషులు ఇచ్చారో వాటిని చదువు. వేదాలన్నీ చదవనక్కరలేదు. రామాయణం, భాగవతం చదువు. భారతం పంచమ వేదం. అది సమస్త పురాణ సారాంశం. అవి చదువు. ఇవి లోకం కోసం ఇస్తున్నా.. అన్నాడు వ్యాసుడు. (చదవండి: మార్పు మనుగడ కోసమే...) -
కంప్లీట్ టూర్ : రిషికేశ్, రుద్రాక్షలు స్పెషల్
అక్టోబర్ వస్తోంది. దసరా సెలవులు వస్తాయి. కాలేజ్, ఉద్యోగం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం ఎటైనా టూర్‌కెళ్తే బావుణ్ననిపిస్తుంది. ఈ సీజన్లో మనదేశంలో ఏ ప్లేస్ బెస్ట్ అంటే ముందు రిషికేశ్ని గుర్తు చేసుకోవాలి. రిషికేశ్ టూర్ అంటే అట్లా ఇట్లా ఉండదు. ఒక అడ్వెంచరస్ టూర్, ఒక తీర్థయాత్ర, ఒక హనీమూన్ వెకేషన్, ఓ తథాత్మ్యత... అన్నీ కలిపిన తీర్థం, క్షేత్రం ఇది. గంగోత్రి నుంచి గంగానది కొండ వాలుల మధ్య ప్రవహిస్తూ నేల మీదకు వచ్చే వరకు ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. గంగోత్రి నుంచి రిషికేశ్కు 250 కిమీల దూరం ఉంటుంది. రిషికేశ్ పట్టణం సముద్రమట్టానికి పదకొండు వందల నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. రిషికేశ్ వరకు గంగానది ఎక్కువ వెడల్పు లేకుండాపాయలాగ వేగంగా ప్రవహిస్తూ ఆకాశం నుంచి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడి నుంచి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న హరిద్వార్ వరకు ప్రవాహం విశాలమవుతూ, పరుగు వేగం తగ్గుతుంటుంది. గంగానది కలుషితం కావడం హరిద్వార్ దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి అంతకంటే పైన రిషికేశ్ దగ్గర గంగాస్నానం చేయాలనుకుంటారు ఎక్కువ మంది. యువత అయితే గంగానదితోపాటు ఒక్క ఉదుటున భూమ్మీదకు దూకడం కోసం రిషికేశ్కు ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్లి అక్కడి నుంచి రాఫ్టింగ్ మొదలు పెడతారు. రిషికేశ్‌లో రివర్‌రాఫ్టింగ్ నిర్వహించే సంస్థలు ప్రతి వీధిలోనూ కనిపిస్తాయి. బంగీ జంప్, ఫ్లయింగ్ పాక్స్ కూడా చేయవచ్చు. నగరం ఎంత ఇరుకుగా ఉంటుందో నది తీరాన గుడారాల్లో క్యాంపింగ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కనిపిస్తాయి.లక్ష్మణ్ ఝాలాగంగానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి సస్పెన్షన్ బ్రిడ్జి ఉంది. దాని పేరు లక్ష్మణ్ ఝాలా. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీత కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు. సీత నది దాటడం కోసం లక్ష్మణుడు అడవి చెట్ల తీగలతో వంతెనను అల్లాడని, దాని పేరే లక్ష్మణ్ ఝాలా అని చెబుతారు. రిషికేశ్కు మరికొంత దూరంలో రామ్ ఝాలా ఉంది. అది రాముడు అల్లిన తీగల వంతెన. ఈ రెండు వంతెనలు నది దాటడానికి అనువుగా ఉండేవి. కాలక్రమంలో ఆ వంతెనల స్థానంలోనే ఇనుప వంతెనలు నిర్మాణం జరిగింది. పర్యాటకులు లక్ష్మణ్ ఝాలా మీద నుంచి అవతలి తీరానికి చేరి అక్కడి నుంచి పడవలో విహరిస్తూ ఇవతలి ఒడ్డుకు రావచ్చు. పడవలో మెల్లగా సాగుతూ ఒక ఒడ్డున మనుషులను, మరో ఒడ్డునున్న ఎత్తైన కొండలను, కొండవాలులో, నది తీరాన ఉన్న నిర్మాణాలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా తుళ్లింతలతో యువకులు రివర్ రాఫ్టింగ్ చేస్తూ దూసుకొస్తారు. నదిలో బోట్ షికార్ టికెట్ల మీద ప్రభుత్వ నిఘా పెద్దగా ఉండదు. ప్రైవేట్ బోట్ల వాళ్లు ఒక్క ట్రిప్‌కి వేలల్లో అడుగుతారు. పెద్ద బోట్లలో వెళ్లడమే శ్రేయస్కరం. గంగ పరవళ్లు తొక్కుతుంటుంది. చిన్న పిల్లలతో వెళ్లిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.యోగా క్యాపిటల్రిషికేశ్, హరిద్వార్ రెండూ నేషనల్ హెరిటేజ్ సిటీలు. కేరళలో ఉన్నట్లే ఆయుర్వేద వైద్యం, పంచకర్మ చికిత్స కేంద్రాలుంటాయి. హిమాలయాల నుంచి సేకరించిన ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. రిషికేశ్‌లో ఏటా యోగా, మెడిటేషన్ సెషన్లు జరుగుతాయి. భారత ప్రధాని కూడా రిషికేశ్ పర్యటన సందర్భంగా పట్టణంలోని ఒక గుహలో ధ్యానం చేశారు. భవబంధాలను వదిలి మోక్షసాధన కోసం జీవితంలో అంత్యకాలాన్ని ఇక్కడ గడపడానికి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. రోజూ సాయంత్రం గంగాహారతి కనువిందు చేస్తుంది. నది మధ్యలో ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహాన్ని చూడడానికి దగ్గరకు వెళ్లడం కంటే ఒడ్డున ఘాట్ నుంచి చూస్తేనే శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఉత్తరాఖండ్ వర్షాకాలం వరదల బారిన పడుతుంటుంది. కానీ ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. కాబట్టి సీజన్ వచ్చే సరికి టూరిస్టుల కోసం సిద్ధమైపోతుంది. అన్నట్లు ఈ టూర్ గుర్తుగా రుద్రాక్ష తెచ్చుకోవడం మర్చిపోవద్దు. మన దగ్గర జామచెట్లు ఉన్నట్లు ఎక్కడ చూసినా రుద్రాక్ష చెట్లే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్‌దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్‌లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్‌కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్‌తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్‌లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
వండర్లాలో రెండు రైడ్స్‌ను ఆవిష్కరించిన స్టార్ నాగ చైతన్య
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్లలో ఒకటైన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, వండర్లా హైదరాబాద్‌లో రెండు హైపర్‌వర్స్, జి-ఫాల్ అనే అత్యాధునిక రైడ్స్‌ను టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఆవిష్కరించారు. కంపెనీ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి , సీఓఓ ధీరన్ చౌదరి, పార్క్ హెడ్, మధు సూధన్ గుత్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జి-ఫాల్ రైడ్, 40 మీటర్ల ఎత్తులో, గుండ్రంగా చుట్టూ కూర్చున్న 12 మంది రైడర్లతో, అడ్రినలిన్ ప్రేమికులకు తప్పనిసరిగా పొందాలనే అనుభూతిని అందిస్తుంది.హైపర్‌వర్స్, అత్యాధునిక మెటావర్స్ 3డి థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది, లీనమయ్యే రీతిలో 5 నిమిషాల వీక్షణ కోసం సెషన్‌కు 30 మందికి పైగా వ్యక్తులకు వీక్షణ వసతి కల్పిస్తుంది. 8కె హై-రిజల్యూషన్ డిస్ప్లే, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్ లైట్ 270డిగ్రీ షాడో డిజైన్‌ను కలిగి ఉంటుంది. అద్భుతమైన 3డి విజువల్స్‌తో ఉత్కంఠభరితమైన రీతిలో ఎగిరే దృశ్యాలలోకి అతిథులను తీసుకుని వెళ్తుంది.ఈ సందర్భంగా వండర్లా హాలిడేస్ ఎండీ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, ‘‘వండర్లా వద్ద, వినోదవంతంగా ఉత్తేజకరమైన, విప్లవాత్మకమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో కొత్త రైడ్, హైపర్‌వర్స్, లీనమయ్యే సాంకేతికత సాహసోపేతమైన ముందడుగు అన్నారు.జి-ఫాల్ విషయానికొస్తే, ఇది అసాధారణమైన థ్రిల్స్ విభాగంలోకి మా సరికొత్త ప్రయాణం, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోవాలని సాహసించే వారందరికీ మరపురాని అనుభవాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సంచలనాత్మక ఆకర్షణలను ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశిస్తున్నామన్నారు.ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్లా హైదరాబాద్‌లో ప్రారంభించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను అన్నారు నాగ చైతన్య. గ్లోబల్ పార్కులతో సమానంగా భారతదేశానికి ప్రపంచ స్థాయి రైడ్లను వండర్లా ఎలా తీసుకువస్తోందో చూడటం తనకు థ్రిల్లింగ్‌గా ఉందనీ, విఆర్ - ఆధారిత అనుభవాల కోసం పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణులతో సమానంగా లీనమయ్యే వినోదం అందించటంలో వండర్లా టాప్‌లో ఉందని కొనియాడారు. ఇది సందర్శకులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నా అన్నారు.వండర్లా సందర్శకులను ఆన్లైన్ పోర్టల్ ముందుగానే తమ ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. నేరుగా పార్క్ కౌంటర్ల నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పార్క్‌ను : 084 146 76333 లేదా +91 91000 63636 వద్ద సంప్రదించవచ్చు.వండర్లా హాలిడేస్ లిమిటెడ్ గురించి భారతదేశపు అతిపెద్ద, ప్రీమియర్ అమ్యూజ్మెంట్ పార్క్ ఆపరేటర్, వండర్లా హాలిడేస్ లిమిటెడ్. ఇది అగ్రశ్రేణి వినోదం, వినూత్న ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్లలో నాలుగు ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ లను నిర్వహిస్తోంది. ఆహ్లాదం, కుటుంబ వినోదం కోసం బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది.మరింత సమాచారం కోసంవండర్లా హాలిడేస్ లిమిటెడ్+91 8136852848 -
'అంబాజీ ఆలయం': గర్భాలయంలో విగ్రహమే లేని శక్తిపీఠం!
దసరా సందడి కోలహాలం మొదలు కానుంది. ప్రతి చోట సంబరాల హడావిడి మొదలయ్యింది. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మని భక్తి కొద్ది కొలుచుకుని ఆమె అనుగ్రహంతో సంతోషం ఉండాలని కోరుకుంటారు. అలాంటి పర్వదినాన ఈ పుణ్యభూమిలో అలరారే విశేష శక్తి పీఠాలు స్మరించుకోవడం, సందర్శించడం వంటివి చేస్తుంటాం. వాటిలో మనకు తెలియని విచిత్రమైన శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుజరాత్‌లోని అంబాజీ ఆలయం. అయితే ఈ ఆలయంలో విగ్రహమే భక్తులకు కనిపించదు. కానీ పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు చేస్తారట. ఏంటా ఆలయ విశిష్టత? ఎలా చేరుకోవాలి? తదితర విశేషాలు తెలుసుకుందామా..!గుజరాత్-రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది ఈ అంబాజీ ఆలయం. మౌంట్ అబు నుంచి రెండు గంటల ప్రయాణం. ఈ ఆలయం అరసుర్ కొండలలో నెలకొంది. ఈ ప్రదేశం అంతా ఆ జగదంబికకే సొంతం. ఇక్కడ వెలిసిన అమ్మవారిని 'అరసురి అంబ' అని, అంబాజీ అని పిలుచుకుంటారు భక్తులు. శక్తి స్వరూపిణిగా భావించే దుర్గమ్మ అంశయే ఈ అంబాదేవి అని భక్తుల నమ్మకం. శివుని విశ్వతాండవం లేదా విధ్వంస నృత్యం సమయంలో సతీదేవి శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలలో ఇది ఒకటిగా చెబుతుంటారు. పురాణ ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతారు. దీన్ని సతిదేవి హృదయం పడిన ప్రదేశమని పురాణ వచనం. మరొక కథనం ప్రకారం..ఈ ప్రాంతంలోనే రెండు దేవాలయాలు ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంటో గబ్బర్ కొండపై మరొక ఆలయం ఉందట. దీన్ని దేవత నిజ ఆలయంగా చెబుతుంటారు ప్రజలు. అయితే కొండ ఎక్కి అమ్మవారిని దర్శించడం కష్టంగా ఉండటంతో దంతా రాజ్యపు రాజు దేవతను తన రాజ్యానికి వచ్చి ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడు. అందుకు అంగీకరించిన దేవతా రాజుకి ఒక షరతు పెడుతుంది. "రాజా నిన్ను అనుసరిస్తూ వస్తుంటాను కానీ వెనదిరగ కూడదు. మాటతప్పితే అక్కడ భూస్థాపితం లేదా అక్కడ వెలవడం జరుగుతుంది." అని రాజుతో చెబుతుంది దేవతా. అందుకు ఒప్పుకున్న రాజు సంతోషంతో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లుతుంటాడు. అయితే కొంత దూరం వెళ్లాక ఆమె పాదాల శబ్దం వినిపంచడం లేదనిపించి గిర్రున వెనుదిరుగుతాడు. అంతే అమ్మ అక్కడే భూమిలోకి పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే నేడు భక్తులచే పూజలందుకుంటున్న మహిమాన్వితమైన అంబాజీ దేవాలయం. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు బదులుగా దేవత చిహ్నమైన 'శ్రీ వీసా యంత్రం' ఉంటుంది. అది కూడా ముసుగుతో కప్పబడి ఉంటుంది. ఈ యంత్రాన్ని చూసేందుకు కూడా భక్తులకు అనుమతి లేదు. కానీ ఆలయ పూజారులు విగ్రహాన్ని పోలి ఉండే విధంగా గర్భాలయాన్ని అలంకరిస్తారు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతుంది. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అంబాజీ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించే హారతి(అంటే యంత్రాన్ని పూజించే ముందు వారి కళ్లకు తెల్లటి గుడ్డ కట్టుకోవాలి) అత్యంత వైభవోపేతంగా ఉంటుంది. ఆ కార్యక్రమంలోనే "గర్భా" అనే జానపద నృత్యాన్ని భక్తిపూర్వకంగా చేస్తారు. ఏడాదిపొడువునా ఈ ఆలయం భక్తుల కోలాహాలంతో సందడిగా ఉంటుంది. ఇక భాద్రపద పౌర్ణమి రోజు నిర్వహించే "భదర్వి పూనం" ఉత్సవమే ఈ శక్తిపీఠంలో జరిగే అతిపెద్ద వేడుక. ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ఇక్కడే ఐదు జైన దేవాలయాల సముహమైన కుంభారియా అనే జైన దేవాలయాన్ని కూడా చూడవచ్చు. అద్భుతంగా చెక్కబడిన పాలరాతి స్తంభాలకు ఇది ప్రసిద్ధి చెందింది.ఎలా చేరుకోవాలంటే..అహ్మదాబాద్ విమానాశ్రయానికి 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.అబురోడ్ రైల్వే స్టేషన్‌కి 21 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.(చదవండి: దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..! ..!) -
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
గ్లోబల్ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ : ఫైనలిస్ట్‌గా విశాఖ విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి పేరూరి లక్ష్మీ సహస్ర ప్రతిష్టాత్మక 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (TDCAC) గ్లోబల్ కాంపిటీషన్లో ఉత్తమ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఎంపికైంది. ఈ సందర్బంగా "టొయోటాస్ మెమరీ కార్" ఆర్ట్‌ను రూపొందించిన ఆమెను టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల సత్కరించింది. 90 దేశాలనుంచి 712,845 ఎంట్రీల్లో టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో లక్ష్మీ సహస్ర సంపాదించు కోవడం విశేషం. 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, రూ.2.51 లక్షల (3,000 డాలర్లు) బహుమతి గెల్చుకుంది.టొయోటా మోటార్ కార్పొరేషన్ 2004లో టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. "డ్రీమ్ కార్లను" తయారు చేసేలా విద్యార్థులను, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తుంది. లక్షల కొద్దీ పిల్లల ఆసక్తితో పోటీ విపరీతంగా పెరిగింది. ప్రారంభంనుంచి ఇప్పటిదాకా 144 దేశాలు, ప్రాంతాల 9.4 మిలియన్లకు పైగా పిల్లలు పాల్గొన్నారు, సృజనాత్మకతను పెంపొందించడం , రవాణా మరియు స్థిరత్వ భవిష్యత్తు గురించి ఆలోచించేలా యువతలో ఆలోచన రేకెత్తించడమే దీని ఉద్దేశం.15 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మూడు విభాగాలుగా విభజించారు: 7, 8–11 ,12–15 ఏళ్లలోపు. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 26 మంది విజేతలు ఎంపికయ్యారు. వీరిలో పేరూరి లక్ష్మీ సహస్ర కూడా ఒకరు.ఆమె కళాత్మక సృష్టి స్ఫూర్దిదాయకంటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ- మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానమైన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వానం పలకడమని టొయాటో సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. ప్రపంచ వేదికపై సహస్ర సాధించిన విజయం స్ఫూర్తిదాయకమన్నారు. చాలా సంతోషంగా ఉందిటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది లక్ష్మీ సహస్ర. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించా..అదే డ్రీమ్ కారు టొయోటాస్ మెమరీ కార్. సాంకేతికత అనేది మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో, అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. తన లాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటాకు కృతజ్ఞతలు చెప్పింది. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం, పేరూరి లక్ష్మీ సహస్ర అవార్డు-గెలుచుకున్న కారుఘార్ట్ ఇతర అద్భుతమైన ఎంట్రీలు చూడాలనుకుంటే, అధికారిక పోటీ వెబ్సైట్ toyota-dreamcarart.com. వీక్షించవచ్చు. -
ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో ఎన్నో గొప్ప విశిష్టత గల గ్రామలున్నాయి. వాటన్నింటిని వెనక్కినెట్టి రాజస్థాన్‌లోని ఈ గ్రామమే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎలా ఎంపికయ్యిందో వింటే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ తెలిస్తే.. ఈ రోజుల్లో కూడా ఇలా నియబద్ధంగా ఎవరు ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు. రాజస్తాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం పేరుకి తగ్గట్టుగానే చక్కటి జీవనశైలితో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ కూడా మాంసం, చేపలు, మద్యం ముట్టరట. ఇలా అందరూ నియమబద్ధంగా ఉండటం అంత ఈజీ కాదు గదా..!. అలాగే అక్కడ వేప కలపను ఎవ్వరూ కాల్చడం వంటివి చేయరట. అంతేగాదు కిరోసిన్ ఉపయోగించడం కూడా నిషిద్ధం. ఆ గ్రామంలో దేవ్‌నారాయణ్ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారట. మసుదా ఉపవిభాగంలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ గ్రామం సుమారు మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సిమ్మెంట్, కలపతో చేసిన పక్కా ఇళ్లు కూడా ఉండవు. అన్ని మట్టితో చేసిన ఇళ్లే ఉంటాయి. అయితే కొండపై వెలసిన దేవనారాయణుని అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక ఈ ఉత్తమ పర్యాటక గ్రామ పోటీని పర్యాట మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ గొప్ప సంస్కృతిని కొనసాగిస్తున్న గ్రామాలను గుర్తించి మరీ ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు.. ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాట గ్రామలను ఎంపిక చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటన్నింటి ఆధారంగానే 'దేవమాలి గ్రామం' ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యిందని మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "రాజస్థాన్ గర్వించదగ్గ ఘట్టం!. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది." అని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దేవమాలి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అనేది రాజస్థాన్‌కి ఎంతో గర్వకారణం అన్నారు. (చదవండి: అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!) -
దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..!
బొజ్జ గణపయ్య నవరాత్రులు పూర్తైన వెంటనే దసరా సందడి, హడవిడి మొదలైపోతుంది. ఇక శిల్పులంతా దుర్గాదేవి విగ్రహాల తయారీలో తలమునకలై ఉంటారు. అయితే ఈ దుర్గమ్మ విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత ఉంది. అది అనాదిగా వస్తున్న సంప్రదాయమని చెబుతున్నారు శిల్పకారులు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వింత చూసి ఎంతైన 'అమ్మ' కదా ఏ బిడ్డను చులకనగా వదిలేయదు కదా..అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్రత్యకత అంటే..దుర్గమ్మ విగ్రహాలు తయారు చేయాడానికి నాలుగు విషయాలు అత్యంత కీలకం. తయారీకి శిల్పులు గంగానది ఒడ్డును ఉన్న మట్టి, గోవు పేడ, గో మూత్రం, ఇంకా వేశ్యల ఇంటిలోని మట్టిని ఉపయోగిస్తారు. ఈ మట్టిని ” నిషిద్ధో పల్లిస్ ” అని పిలుస్తారు. ఇందులో ఏది లేకపోయినా విగ్రహం అసంపూర్ణమని వారు భావిస్తారట. అంతేగాదు అందుకోసం ప్రతి శిల్పకారుడు వేశ్య గృహాలకు వెళ్లి వారి ప్రాంగణంలో మట్టి కావాలని అభ్యర్థిస్తారట. తమకు మట్టి లభించేవరకు వాళ్లని ప్రాధేయపతారు. అంతేగాదు దసరా సీజన్ రాగానే వారిని గౌరవంగా, చిరునవ్వుతో పలకరించి మరీ మట్టిని తీసుకునే ప్రయత్నం చేస్తారట శిల్పకారులు. ఈ ఆచారాన్ని బెంగాలీ శిల్పకారులు ఇప్పటికీ పాటిస్తుండటం విశేషం. ఎందుకు ఇలానే అనేందుకు స్పష్టమైన వివరణ లేదు. కానీ కొన్ని కథానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ కారణం ఏంటంటే..దుర్గాదేవి మహిషాసురిడితో తలపడుతున్న సమయంలో ఆమెను తాకే ప్రయత్నం చేశాడట. దీంతో ఆమె కోపంతో తన పరాక్రమాన్ని అంతా ఉపయోగించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. అందుకే ఆ సంప్రదాయమని పండితుల వచనం. మరొక కథనం ప్రకారం..నారీ శక్తికి సూచన దుర్గమ్మ. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారని చెబుతుంటారు. అంతేగాదు ఇలా వేశ్య ఇంటిలోని మట్టితో దుర్గామాత విగ్రహం తయారు చేస్తే అందులోకి అమ్మవారి కళ వచ్చి శోభాయమానంగా కనిపిస్తుందట. మన పెద్దలు ఈ సంప్రదాయం ఎందుకని పెట్టారో స్పష్టంగా తెలియకపోయినా.. దేవుడి దృష్టిలో అందరూ సమానమే..ఎవ్వరిని కించపరచకూడదు, హేయభావంతో చూడకూడదు అనే చక్కని సందేశాన్ని ఇస్తోంది ఈ ఆచారం..!(చదవండి: Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!) -
ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్లను తీసుకెళ్లరాదు.పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్బిన్లలో వేయాలి. పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.నేచర్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్‌రికార్డర్, డీజే, మైక్‌లు పెద్ద సౌండ్‌తో పెట్టకూడదు. మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం. స్థానికులకు చాక్లెట్లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు. -
పరువు కాదు ముఖ్యం: ఆటిజం పిల్లలకు మాటివ్వండి!
యుకేలో ముప్పై ఏళ్లుగా పిల్లలు, టీనేజర్లు, వారి కుటుంబాలతో కలిసి పనిచేయడంలో నైపుణ్యం కలిగిన పీడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సియాన్ విల్సన్. ఆటిజంలో క్లినికల్ స్పెషలిస్ట్‌గా స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. సోషల్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు.భారతదేశం పిల్లల్లో డిజేబిలిటీ ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయంపై సమీక్ష జరపడానికి ఇండియాకు వచ్చారు. పాతికేళ్లుగా చిల్డ్రన్ డిజేబిలిటీస్ పై వర్క్ చేస్తున్న మాధవి ఆదిమూలం, సియాన్ విల్సన్ లు యుకెలోనూ, ఇండియాలోనూ ఉన్న పరిస్థితులు, అమలు చేయాల్సిన విధానాల గురించి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన ఈవెంట్లో డిజేబిలిటీ చిల్డ్రన్ తల్లిదండ్రులతో కలిసి చర్చించారు.నాటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక థెరపిస్ట్‌గా పిల్లల వృద్ధికి దోహదపడేవారు. ఇప్పుడు తల్లితండ్రీ మాత్రమే కాదు ఒంటరి తల్లుల సంఖ్య పెరుగుతున్న ఈరోజుల్లో పిల్లల పెంపకం సమస్యగానే మారుతోంది అంటున్నారు నిపుణులు.స్పెషలిస్ట్‌లు ఎక్కువ‘‘యుకేలో స్పెషల్ చిల్డ్రన్ డెవలప్మెంట్కి సంబంధించిన విధానం, ఖర్చు అంతా అక్కడి కౌన్సిల్ చూసుకుంటుంది. కొన్నాళ్లుగా ఇండియాలోని ప్రముఖ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్స్‌తో సంప్రదింపులు చేస్తున్నాను. ఇక్కడితో పోల్చితే యుకేలో స్పెషల్ చిల్డ్రన్ని చాలా చిన్నవయసులోనే గుర్తించడంలో అవగాహన అక్కడి పేరెంట్స్‌కు ఎక్కువ ఉంది. ఆటిజం చైల్డ్‌లో స్పీచ్ థెరపీ ద్వారా సరైన మెరుగుదలను తీసుకురావడానికి వారి స్థితిని బట్టి నార్మల్ స్కూల్ స్టూడెంట్స్‌తో కలుపుతారు. అయితే, అలాంటి ఒక చైల్డ్‌కి ఒక టీచర్ చొప్పున లెర్నింగ్ స΄ోర్ట్ అసిస్టెంట్‌ను కేటాయిస్తారు. అంటే, తన వయసు పిల్లలతో కలిసి ఉండే దోరణి వల్ల ఆ స్పెషల్ చైల్డ్‌లో మానసిక ఆరోగ్యం బాగవుతుంటుంది. ఎవరూ కూడా ఈ విధానానికి అడ్డు చెప్పరు’ అంటూ దేశంలో స్పెషల్ చైల్డ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేశారు సియాన్ విల్సన్.పరువు కాదు ముఖ్యం‘చాలా మంది తల్లులు తమ పిల్లల్లో ఉన్న ఆటిజం సమస్యను గుర్తించడమే లేదు. ఒక వేళ ఏదైనా డిజేబిలిటీ ఉన్నా బయటకు తెలిస్తే పరువు ΄ోతుంది అనుకుంటున్నారు. ‘మా అమ్మాయి/అబ్బాయిని ట్యూషన్‌కో లేదో మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్‌కో తీసుకెళుతున్నామని చెప్పి, తీసుకువస్తున్నామ’ని చెబుతున్నారు. టీనేజర్ స్థాయిలో ఉన్న పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచుతున్నారు. వారికి ఎలాంటి థెరపీ ఇవ్వక΄ోవడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. దీంతో అప్పుడు నిపుణులను కలుస్తున్నారు. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే, పరిష్కారం కూడా త్వరగా లభిస్తుంది’ అని వివరించారు థెరపిస్ట్ లక్ష్మీ ప్రసన్న.పరువుతో వెనకడుగు వేయద్దు‘‘అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పేరుతో 19 ఏళ్లుగా ఆటిజం పిల్లలకు సేవలు అందిస్తున్నాను. మా బాబు స్పెషల్ కిడ్ అవడంతో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన నేను స్పెషలైజేషన్ చేసి, ఈ తరహా పిల్లల కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు మా బాబు వయసు 24 ఏళ్లు. వాడు సంగీతంలో నైపుణ్యం సాధించడంతోపాటు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. మా బాబును ఇక్కడ సాధారణ స్కూల్లో చేర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎడీహెచ్‌డీ ఆటిజం ఉన్న పిల్లల్లో మెరుగుదల కనిపిస్తున్నప్పుడు వారిని, మిగతా అందరిలాగే స్కూళ్లో చేర్చగలిగే శక్తిని కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు సాధారణంగా ఎదుగుతారు. అంతేకాదు ఆటిజం పిల్లల పెంపకంలో వారిలో కొన్ని నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తమకు తాముగా పనులు చేసుకోవడమే కాదు నైపుణ్యాలను కూడా చూపుతారు. అందుకే ఈ విషయాల్లో గ్రామీణ స్థాయిలోనూ అవగాహన క్యాంపులను నిర్వహిస్తున్నాం. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. అక్యుపేషనల్ థెరపిస్ట్‌ల కొరత మన దగ్గర చాలా ఉంది. థెరపిస్ట్‌ల సంఖ్య, తల్లిదండ్రులలో అవగాహన పెరిగితే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది’ అని వివరించారు మాధవి ఆదిమూలం.– నిర్మలారెడ్డిఫొటోలు: బాలస్వామి, సాక్షి -
పెళ్లి క్యాన్సిల్ : బ్రేకప్ ప్రకటించిన బిగ్ బాస్ ఫేం, గాయకుడు
హిందీ బిగ్ బాస్ 16తో ఫేమస్ అయిన ప్రముఖ సింగర్ అబ్ధు రోజిక్ సంచలన విషయాన్ని ప్రకటించాడు. షార్జాకు చెందిన అమీరాతో త్వరలోనే పెళ్లి అని అట్టహాసంగా ప్రకటించిన అబ్ధుల్ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు తాజాగా వెల్లడించాడు. దీంతో ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నిర్ణయంతో షాక్ అయ్యారు.అబ్దు అమీరా ఏప్రిల్ 24, 2024న దుబాయ్‌లోని మజ్లిస్ షార్జాలో విలాసవంతమైన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 7న జరగాల్సిన వీరి పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. కానీ అబ్దు బాక్సింగ్ మ్యాచ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి నిర్ణయించు కున్నారు. తమ సాంస్కృతిక విభేదాలే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు ఇది అవసరమని పేర్కొన్నాడు. అందరూ అర్థం చేసుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు ప్రేమ తనను వెతుక్కుంటూ వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. (డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్) కాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్ తన సాంగ్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బిగ్ బాస్ 16 ద్వార ఒక రేంజ్లో క్రేజ్ సంపాదించాడు. సంగీత కెరీర్ ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మే 9న ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిశ్చితార్థ వేడుక చిత్రాలను కూడా పంచుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచాడు. అమీరా-అబ్దు పెళ్లికి సల్మాన్ ఖాన్, నే-యో, ర్యాన్ గార్సియా, జాసన్ డెరులో, మైక్ టైసన్ లాంటి టాప్ సెలబ్రిటీలు రానున్నారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. విభేదల పరిష్కారానికి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, వారు చివరికి విడిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతానికి, అబ్దుతన వ్యక్తిగత, ,వృత్తిపరమైన ఎదుగుదలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.ఇవీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖవింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా! -
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
వినాయక నిమజ్జనం రోజు ఆచరించే వ్రతం! ఎలా చేస్తారంటే..?
భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని 'అనంత చతుర్థి' అంటారు. ఈ రోజే వినాయక నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ఆచరించే అనంతపద్మనాభస్వామి వ్రతం అత్యంత మహిమాన్వితమైనది. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణడే పాండవులు సూచించాడని వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగిపోయి...విజయం, అభయం, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణ వచనం. అనంత వ్రతం అనగా..మాయాజూదంలో ఓడిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాల గురించి శ్రీ కృష్ణుడు తెలుసుకుంటుండేవాడు. అలా ఓసారి పాండవుల దగ్గరకు వెళ్లిన శ్రీ కృష్ణుడితో.. ఏ వ్రతాలను ఆచరిస్తే తమకు కష్టాలు తొలగిపోతాయో వివరించమని అడిగాడు ధర్మరాజు. అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు సూచించినదే అనంత పద్మనాభస్వామి వ్రతం. ఎవరీ అనంతడు...అనంత పద్మనాభుడు ఎవరని అడిగిన ధర్మరాజు ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. అనంతుడు అంటే ఎవరో కాదు స్వయంగా తానే అని వివరించాడు. అనంతుడు అంటే అంతటా వ్యాపించినవాడు, కాల స్వరూపుడు అని అర్థం. అనంత విశ్వంలో అణువణువు నిండి ఉండేది తానే అని వివరించాడు కృష్ణుడు. సృష్టి, స్థితి,లయలకు కారణం అయినా కాలస్వరూపుడి రూపంలో ఉన్నది, దశావతారాలు ఎత్తేది తానే అని చెప్పాడు. అందుకే చతుర్ధశ భువనాలు నిండి ఉన్న అనంతస్వరూపం అయిన అనంతుడిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్నాడు. ఏటా భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యోదయానికి తిధి ఉండడం ప్రధానం కాబట్టి చతుర్దశి ఏ రోజైతే సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజుని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇవాళ (సెప్టెంబరు 17, 2024) మంగళవారం ఉదయం 11 గంటలవరకూ చతుర్దశి ఉంది...అందుకే ఈ రోజే స్త్రీలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరించి ఆ దైవం అనుగ్రహంతో తమ కష్టాల నుంచి బయటపడతామని విశ్వసిస్తారు. వ్రత విధానం..ఏ పూజ తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలి..అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆరంభించే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం నవగ్రహ పూజ ఆచరించి ఆ తర్వాత అనంతపద్మనాభుడికి షోడశోపచార పూజ చేయాలి. 14 దారాలను కలిపి ఎరుపు రంగు తోరాన్ని పూజించి..వ్రతం అనంతరం కట్టుకోవాలి. ఇలా అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని 14 ఏళ్లు ఆచరించాలని శ్రీ కృష్ణుడు వివరించాడు. శ్రీకృష్ణుడి సూచన పాండవులు ఈ వ్రతం చేసి అడగడుగున ఎదురైన కష్టాల నుంచి బయటపడటమే గాక కోల్పోయిన తమ రాజ్యాన్ని సంపదను తిరిగి దక్కించుకోగలిగారు. కలిగే ప్రయోజనాలు..వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు..సంపద పెరుగుతుంది.వృత్తి జీవితంలో వెంటాడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.(చదవండి: ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..) -
ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..
కేరళలో ఓనమ్ పది రోజుల పంట పండుగ. ఈ సందర్భంగా సద్య తాళిని ఆస్వాదించడానికి, పూల అలంకరణలు చేయడానికి, పడవ పందాలను చూడటానికి, ఆటలు ఆడటానికి, దయగల, ఎంతో ప్రియమైన రాక్షస రాజు మహాబలి స్వదేశానికి రావడాన్ని గౌరవించే వేడుక ఓనమ్. ఈ వేడుకలలో నాల్గవ రోజున కేరళలోని అత్యంత అద్భుతమైన దేశీయ కళారూపాలలో పులికలిను ప్రదర్శించారు. కొన్ని ప్రదేశాలలో దీనిని కడువాకలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కళాకారులు పులి వేషం ఓనం రోజుల్లో పులికొట్టు లేదా డ్యాన్స్ తోపాటు వేసే దరువులు త్రిస్సూర్‌లో ప్రతిధ్వనిస్తాయి. త్రిస్సూర్‌లోని పులికలి తప్ప మరే ఇతర ప్రదేశంలోనూ ఈ ప్రత్యేక లయ లేదని చెప్పుకోవచ్చు. పులికలిక్కర్లు వారి నడుముకు గంటలు జోడించి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండే ఈ అసుర లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వందల ఏళ్ళ నృత్యంపులికలి 200 ఏళ్లనాటిది. అప్పటి కొచ్చిన్ మహారాజా రామవర్మ శక్తన్ థంపురాన్ దీనిని ప్రవేశపెట్టినట్లు చెబుతారు. సహజసిద్ధమైన రంగులను శరీరానికి పూసుకుని, కదులుతున్న పులుల వలె అలంకరింపబడిన పులికెత్తికళి ప్రదర్శనను స్థానికులు ఎంతగానో ఆస్వాదిస్తారు. త్రిస్సూర్‌లో ఈనాటికీ పురాతనమైన నృత్య శైలి మనుగడలో ఉంది. పులి వేషంలో నృత్యం చేసే కళాకారులను పులికలిక్కర్ అంటారు. వాద్యమేళం (కేరళకు చెందిన ఆర్కెస్ట్రా) లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పులికలిక్కర్ పెయింటింగ్‌లో చారలు ముదురు పసుపు, నలుపు రంగులో ఉంటాయి. పులినిపోలి ఉండేలా శరీరం మొత్తం పెద్ద మచ్చలతో ఈ ఆర్ట్ వేస్తారు. అట్టముక్కలు, సైకిల్ ట్యూబ్‌లు‘కళాకారులు ఓనమ్‌కి రెండు లేదా మూడు నెలల ముందే పులికాలి సన్నాహాలు ప్రారంభిస్తారు. బాగా తిని, పొట్టను సిద్ధం చేసుకుంటారు. దీని వల్ల కళలో వారు మంచి ప్రదర్శనను ఇవ్వగలుగుతారు‘ అని చెబుతారు. ఆరు రకాల చారలతో శరీరం అంతా పెయింట్ చేస్తారు. నేడు కళాకారులు ఫేస్ మాస్క్‌లతో మరింత నూతనంగా డిజైన్ చేస్తున్నారు. ఫేస్ మాస్క్ కోసం కాగితపు అట్టలను కత్తిరించి, దంతాలగా అటాచ్ చేయడానికి జిగురును ఉపయోగిస్తారు. నాలుకను సైకిల్ ట్యూబ్‌ను కత్తిరించి తయారు చేస్తారు. చివరి టచ్–అప్ ముఖానికి సాంప్రదాయక రంగులతో తగిన షేడ్స్‌ను సృష్టిస్తారు. ప్రాచీన నృత్యాలురంగుల ముసుగు నృత్యం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ మలబార్‌లోని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. మొదటి రోజు నుంచి ఓనమ్ నాల్గవ రోజు వరకు ప్రదర్శకులు ఇంటింటికీ వెళతారు. శరీరమంతా కప్పి ఉంచేలా పర్పటక గడ్డితో దుస్తులు సిద్ధం చేస్తారు. దేవతలు, మానవులు, జంతువులు కుమ్మట్టికలిలో కనిపిస్తాయి. కళాకారులు ధరించే పాత్రలు, ముఖాలలో శివుడు, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు, గణేశుడు, కాళి మొదలైనవారు ఉంటారు. ముసుగు వేసుకున్న కుమ్మట్టి (మాతృమూర్తి) నటన కళ్లారా చూడాల్సిందే. ఇతర నృత్యాలుస్త్రీలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చేసే ప్రత్యేకమైన నృత్యం. అలంకరించిన ముగ్గు, మధ్యన సంప్రదాయ దీపం.. దాని చుట్టూ మహిళలు చేరి నృత్యం చేస్తారు. నీటితో నిండిన పాత్ర , బియ్యం పాత్ర.. వంటివి కూడా ఉంచుతారు.(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!) -
30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!
మనం ఎకో ఫ్రెండ్లీ పేరుతో అందరూ మట్టి గణపతినే పెట్టుకుని పూజించేలా ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం. మరికొందరు అందులో భాగంగా ఉచితంగా మట్టి గణపతులను వితరణ చేసి పర్యావరణ స్ప్రుహను చాటుతున్నారు. కానీ మహారాష్ట్రకి చెందిన 32 ఏళ్ల బేకర్ వారందరికంటే ఇంకాస్త ముందుడుగు వేసి పర్యావరణం తోపాటు సమాజ హితంగా గణపతిని రూపొందించి శెభాష్ అని ప్రశంసలందుకుంటోంది. ఎవరామె అంటే..ఆమె పేరు రింటు రాథోడ్. ముంబైకి చెందిన రింటు ప్రతి ఏడాది ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహాలను తమ కమ్యూనిటీలోనూ ఇంటిలోనూ ప్రదర్శిస్తుంది. ఆమె 14 ఏళ్లుగా ఈవిధమైన ఆచారాన్ని పాటిస్తుండటం విశేషం. ఈసారి ఆమె చాక్లెట్లతో విలక్షణమైన వినాయకుడుని రూపొందించింది. స్త్రీ, పురుషుల ఐక్యతను చాటి చెప్పేలా అర్థనారీ రూపంలో గపతిని రూపొందించింది. సమాజంలో మహిళలపై పెరుగుతున్న నేరాల రేటు దృష్ట్యాజజ నేటి కాలంలో ఇలాంటి సందేశాత్మకమైన గణపతి విగ్రహాలు అవసరమని అంటోంది రింటూ. ఈ విలక్షణమైన గణపతి విశ్వంలో సామరస్యతకు, సమతుల్యతకు చిహ్నమని అంటోంది రింటు. అంతేగాదు ఈ ప్రకృతిలో స్త్రీ పురుషులిరువురు సమానం అనే విషయాన్ని ఈ గణపతి రూపం ఎలుగెత్తి చాటుతుంది. అయితే అర్థనారీశ్రుడు అనగానే శివపార్వతులే గుర్తుకొస్తారు. మరి గణపతిని ఇలా రూపొందిచాలని ఆలోచన రింటుకి ఎలా వచ్చిందంటే..గణపతికి సంబంధించి పలు వర్ణనలు, వివరణలు ఉన్నాయి. అయితే 11వ శతాబ్దానికి చెందిన హలాయుధ స్తోత్రం గణేశుడి అర్థనారీ రూపాన్ని ప్రస్తావిస్తుంది. అలాగే రాయ్‌గఢ్(మహారాష్ట్ర)లోని గోరేగావ్‌లో 800 ఏళ్ల పురాతన ఆలయంలో సగం పురుషుడు, సగం స్త్రీతో ఉన్న వినాయకుడి విగ్రహం ప్రతిష్టించారు. ఈ వినాయకుడుని చాలా మహిమాన్వితమైన దైవంగా ప్రజలు భావిస్తారు. అవన్నీ పరిగణలోని తీసుకుని తాను ఇలా వినూత్న రీతిలో గణపతిని రూపొందించినట్లు వివరణ ఇచ్చింది రింటు. ఇక రింటు వృత్తి రీత్యా కమర్షియల్ డిజైనర్ అయితే తన పిల్లలకు తల్లిగా పూర్తిగా సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో బేకరి వైపుకి అడుగులే వేసింది. ఆమె త్రీ డెమన్షియల్ ఎగ్‌లెస్ కేక్‌లు తయారు చేయడంలో స్పెషలిస్ట్. నిమజ్జనం మరీ స్పెషల్..ఇక రింటూ అర్థనారీ రూపు గణపతిని 30 కిలోల డార్క్ చాక్లెట్‌తో సుమారు 25 అంగుళాలు గణపతిని రూపొందించింది. ఈ విగ్రహానికి మొత్తం ఆహార రంగులతోనే పెయింట్ చేసింది. ఈ గణపతిని అనంత చతుర్దశి రోజున పాలలో గణపతిని నిజ్జనం చేస్తుంది. అలాగే ఆ గణనాథుడి ఆశీర్వాదాలు తనపై ఉండేలా నిమజ్జనం చేసిన చాక్లెట్ పాలను నిరుపేద పిల్లలకు పంచిపెడతుందట రింటు. గతేడాది ఆమె 40 కిలోల చాక్లెట్ మిల్లెట్ గణపతిని తయారు చేసి అందరిచేత శెభాష అనిపించుకుంది. అంతేగాదు సమాజానికి ఉపయోగపడేల నిరుపేదలకు, కేన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం వివిధ ఎన్జీవోల కలిసి పనిచేస్తోంది కూడా. View this post on Instagram A post shared by Rintu Kalyani Rathod (@rinturathod) (చదవండి: ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!) -
రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?
‘అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ?’ అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలికిపడి లేచి కూర్చుంది జూడీ. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటైంది. వేగంగా మంచం దిగి, పక్కనే ఉన్న గదికి వెళ్లి, లైట్ వేసి, రోండా(రోమ్) మంచం వైపు చూసింది. అక్కడ రోండా లేకపోవడంతో కంగారు కంగారుగా పరుగున వెనుకకు వచ్చి, తన మంచం మీద గాఢనిద్రలో ఉన్న భర్తను కుదిపి కుదిపి లేపింది. అతడు నిద్రమత్తులోంచి తేరుకోకముందే, ‘మన.. మన రో..మ్.. కనిపించడం లేదు బాబీ!.. మ..మంచం మీద లేదు.. నాకు చా..చాలా భయంగా ఉంది’ అంటూ తడబడుతూనే ఏడ్చేసింది జూడీ. బాబీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ‘ఏం మాట్లాడుతున్నావ్ జూడీ?’ అన్నాడు కంగారుగా.‘మన.. మన రోమ్ చచ్చిపోయింది. ఉన్నట్టుండి లోయలో పడిపోయింది. తనకి ఊ.. ఊపిరి ఆడటం లేదు. నా కళ్లముందే.. నా కళ్లముందే పడిపోయింది’ వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడీ. బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పరుగున లేచి వెళ్లి, లైట్ ఆన్ చేశాడు. గడియారం వైపు చూసి, టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకుని, జూడీకి తాగించాడు. పక్కనే కూర్చుని, ఓదార్పుగా ‘జూడీ! మన రోమ్ ఇంట్లో ఎందుకుంటుంది? క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి నిన్నే వెళ్లింది కదా, రేపు ఉదయాన్నే వస్తానంది కదా?’ అని నిదానంగా గుర్తు చేశాడు. దాంతో జూడీ పూర్తిగా తేరుకుంది.అప్పటిదాకా బిడ్డ కోసం మెలితిరిగిన కన్నపేగు అదంతా పీడకల అని గుర్తించింది. అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది. ‘బా..బీ..! నాకు చాలా భయంగా ఉంది. నాకొచ్చింది కలే కాని, నా బిడ్డ(రోండా) ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతోంది. అసలు తను ప్రాణాలతో ఉందా? ఇప్పుడే తనని చూడాలనుంది’ అంటూ ఏడ్చింది జూడీ. దాంతో బాబీ.. ‘పిచ్చిగా మాట్లాడకు. మన రోమ్‌కి ఏమీ కాదు. ఇప్పుడు టైమ్ చూడు, ఈ సమయంలో ఎక్కడికని వెళ్దాం? రేపు తనొస్తానన్న టైమ్‌కి రాకపోతే కచ్చితంగా మనమే వెళ్దాం సరేనా?’ అని నచ్చజెప్పాడు బాబీ.జూడీ, బాబీలకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రోండాకి పంతొమ్మిదేళ్లు. చదువు పూర్తిచేసుకుని, మూడు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది. ‘ఆఫీస్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అటు నుంచి రాత్రికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, రేపు మధ్యాహ్నానికి వస్తా’ అని చెప్పి వెళ్లింది.ఉదయం 6 దాటేసరికి కాలింగ్ బెల్ మోగింది. జూడీ తలుపు తీసేసరికి ‘రోండా మీ అమ్మాయేనా?’ అడిగారు ఎదురుగా ఉన్న పోలీసులు. ‘అవును ఏమైంది?’ అంది జూడీ కంగారుగా. ‘మీ అమ్మాయి కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఆమె చనిపోయింది’ చెప్పాడు వారిలో ఒక అధికారి. జూడీకి గుండె ఆగినంత పనైపోయింది. ‘నో.. నో..!’ అంటూ అక్కడే ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొట్టింది జూడీ. ‘నేను నమ్మను. నా బిడ్డకు ఏమీ కాదు. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇది నా కల! నిజం కాదు’ అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడీని పట్టుకున్నాడు. పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చురీకి పరుగు తీశారు.పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం రోండా బాడీలో బుల్లెట్ దొరికింది. కేవలం వెనుక సీట్లో కూర్చున్న వాళ్లే అలా కాల్చగలరని తేలింది. దాంతో యాక్సిడెంట్ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లు, డ్రైవర్ సీట్ వైపు డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు, కారుకి కాస్త దూరంలో రోండా నేలమీద బోర్లా పడి ఉన్నట్లు ఆ రాత్రే రెండు గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు.అపరిచితులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని రోండా, తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చే చాన్సే లేదని జూడీ, బాబీ నమ్మకంగా చెప్పారు. దాంతో రోండా పరిచయస్థులంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో క్రిస్మస్ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలసింది? ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి పన్నెండున్నరకు తన స్నేహితురాలిని డ్రాప్ చేసిన రోండా.. పది మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికే ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది. కారు, మృతదేహం రెండూ ఇంటికి అరమైలు దూరంలోనే దొరికాయి.అయితే ఆ రాత్రి అదే తోవలో వెళ్లిన ఒక సాక్షి ‘రోండా కారు దగ్గర ఒక నీలం కలర్ కారు చూశాను. అందులో ఇద్దరు యువకులు ఉన్నారు’ అని చెప్పాడు. మరో సాక్షి.. కారు ముందు వైపుకు.. రోండా వాలిపోవడం చూశానని, ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని, అయితే అది క్రైమ్ సీన్ అనుకోలేదని, తాగిన మత్తులో ఉన్న ప్రేమజంటగా భావించి, ఆగకుండా వెళ్లిపోయానని చెప్పాడు. అంటే ఆ సమయానికే రోండా చనిపోయిందని, అప్పుడు కిల్లర్ రోండా పక్కనే ఉన్నాడని అధికారులకు అర్థమైంది. వెంటనే ఆ సాక్షుల అంగీకారంతో వారికి హిప్నాసిస్ టెస్ట్ చేసి, కిల్లర్స్‌లో ఒకడు ముదురు గోధుమరంగు జుట్టుతో, 5.10 అడుగుల ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్‌ని కూడా గట్టిగానే నిలదీశారు.నిజానికి రోండా చదువుల్లోనే కాదు, ఆటల్లోనూ ఫస్టే! ప్రతిదానిలోనూ దూసుకునిపోయే రోండా, తన మరణానికి నెల్లాళ్ల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించిందట! ప్రతిదానికి భయపడటం, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, రాత్రి సమయాల్లో మెలకువగా ఉండటం, అర్ధరాత్రి వేళ స్నానం చేయడం లాంటివి చేసేదట! సాధారణంగా ౖలñ ంగిక వేధింపులకు గురైనవారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్ట్‌లు.. అధికారులకు చెప్పారు.ఆ క్రిస్మస్ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబట్టడంతో రోండా బలవంతంగా వెళ్లిందని పేరెంట్స్ గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి అయిన వారిని ప్రేమించడం, వారితో రిలేష¯Œ షిప్లో ఉండటం తప్పా?’ అని రోండా తన తల్లిని పదేపదే అడిగేదట! స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ. కానీ రోండా మరణం తర్వాత జూడీకి ‘రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా? అతడే కిల్లరా?’ అనే అనుమానం మొదలైంది. ఇప్పటికీ జూడీ, బాబీ దంపతులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.1981 డిసెంబర్ 22, నార్త్ కరోలినాలోని మౌంటైన్ రోడ్లో ఆమె ఇంటికి అర మైలు దూరంలోనే హత్యకు గురైంది. నేటికీ హంతకులు ఎవరో తేలక ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికే.. నిద్రలో ఉన్న తల్లి జూడీకి ఎలా తెలిసింది? అనేది కూడా మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
జ్యూల్ థీఫ్.. సేల్స్ గర్ల్ శ్రమ!
‘వెల్ డన్! నీ సీనియర్స్‌ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్‌ని ఇన్సెంటివ్‌గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్‌ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్‌ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్‌ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్‌తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్‌ని సంపాదించుకుంది.మరో పదిహేను రోజులకు.. ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్నిచ్చింది. వర్కింగ్ అవర్స్‌లో సెల్ ఫోన్‌ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్‌లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్‌కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్‌లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.ఒక ఉదయం.. పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్‌లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్‌లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్‌లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్లోకి వెళ్లాడు.ఆ షాప్‌కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్‌లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్‌లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్‌లో దొరికిన డైమండ్స్లోంచి ఒక డైమండ్‌ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్‌కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్‌గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్‌ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్‌చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్‌లోని డైమండ్స్‌ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్‌ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది -
మొక్కలు చీడపీడల్లేకుండా, పచ్చగా ఉండాలంటే, ఇవిగో చిట్కాలు!
పచ్చదనం అంటే.. ఎక్కడో పార్క్లకో, అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పెరట్లో నాలుగు మందార, గులాబీ,చేమంతి మొక్కలో ఉంటే సరిపోతుంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన తులసి మొక్క చాలు మనసు ప్రశాంతంగా ఉండటానికి. చిన్న చిన్న మొక్కలతో ఇల్లు అందంగా కనిపించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.అయితే మనకున్నచిన్న బాల్కనీలో, పెరట్లో మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు సాధారణంగా మొక్కలను ఇష్టపడేవారు బయటి నుంచి మొక్కలు తెచ్చి తమ తోటల్లో లేదా ఇళ్లలోని కుండీల్లో నాటుతారు. మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వాడిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎండిపోతాయి. సరైనపోషణతో కీటకాల బెడద లేకుండాపచ్చగా ఎదగాలంటే ఏం చేయాలి?మొక్కలు జాగ్రత్తగా పరిశీలించకపోయినా,పోషణ అందకపోయినా, నీళ్లు ఎక్కువైనా చని పోతాయి. పురుగులు కీటకాలు మొక్కలను మాత్రమే కాకుండా కుండలోని మట్టిని కూడా దెబ్బతీస్తాయి. జాగ్రత్తలు, చిట్కాలుదెబ్బతిన్న, చనిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీని వల్ల చెట్లు చక్కగా పెరుగుతుంది. కాబట్టి, వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది.మొక్కలకి నీళ్ళతో పాటు సరైన కాంతి అవసరం. మరీ ఎండలో కాకుండా సమానమైన ఎండ తగిలేలా చూసుకోవాలి. అలా అని చీకటికూడా మంచిది కాదు. కాస్తంత వెలుతురు కావాలి.మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకున్న అనేక ఎరువులు ఇస్తూ ఉండాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం, బనానా పీల్ ఫెర్టిలైజర్, పంచగవ్య, ఎండిన పశువుల ఎరువు, వేపనూనె, వేపగింజలు, ఆకుల కషాయం లాంటివి మొక్క, కుండా సైజును బట్టి ఇవ్వాలి.పుల్ల మజ్జిగ ద్రావణంగ్లాసు పుల్లటి మజ్జిగలో ఐదు గ్లాసులు నీళ్లుపోసి కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి మొక్కలపై చల్లాలి. ఉదయం సాయంత్రం ఒకసారి ఈ నీటిని మొక్కలు పోయడం వల్ల చీడపీడలు పోయి మొక్కలు చక్కగా పెరుగుతాయి.పచ్చి బఠానీతో పచ్చగా... పచ్చి బఠాణి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బఠాణి పిక్కలు తీసి తొక్కలను పారేస్తుంటాము. కానీ ఈ తొక్కలు మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. అందుకే తొక్కలను మిక్సీజార్‌లో వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో కాసిని నీళ్లు ΄ పోసి వడగట్టాలి. ఈ నీటిని గార్డెన్‌లోని మొక్కలకు పోషకాలు ఈ నీరు మంచి బలవర్థకమైన టానిక్‌లా పనిచేసి మొక్కలు చక్కగా పెరిగేందుకు దోహదపడతాయి.తెగుళ్లు, నివారణమొక్కలు సాధారణంగా పురుగులు,తెగుళ్లు నుంచి ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. తెల్ల నల్లి, గొంగళి లాంటి వాటిని చేతితో తీసేయవచ్చు. పసుపు, ఉప్పు, ఇంగువ నీళ్లు చల్లినా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారైనా మొక్కల్ని పరికించి చూడాలి. లేదంటే గొంగళిపురుగులు, ఆకుతొలిచే పురుగులు ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. మట్టిలో తేమ కారణంగా, కొన్నిసార్లు చిన్న నత్తలు లేదా పాకే పురుగులు మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. వీటికి పొడి గుడ్డు పెంకు పొడి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను పూర్తిగా శుభ్రం చేసి, పొడి చేసి మట్టిలో కలపాలి.పువ్వులపై మైనంలాగా కనిపించే తెల్లటి మీలీ బగ్స్ (మందార, గులాబీ మొక్కలపై) వాటిని వదిలించుకోవడానికి, ఒక లీటరు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా, 1 టీస్పూన్ షాంపూ, 2-3 చుక్కల వేపనూనె కలిపి మొక్కలపై చల్లుకోవాలి. టొమాటో, బెండకాయ, బీన్స్, ఓక్రా మొదలైన కొన్ని కూరగాయలపై కూడా ముందుగానే చల్లుకోవాలి. దాల్చిన చెక్క పొడికూడా బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా