Hyderabad City
-
నాంపల్లి రైల్వేస్టేషన్‌కు తప్పిన పెను ప్రమాదం
సాక్షి,హైదరాబాద్:నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బుధవారం(డిసెంబర్ 11) పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో ఉత్పన్నమైన రాపిడ్ ఫోర్స్‌తో మంటలంటుకున్నాయి. మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేసింది. బంక్ పక్కనే నాంపల్లి రైల్వేస్టేషన్ ఉండడంతో స్థానికులు కంగారు పడ్డారు. అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
HYD: మేడ్చల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్ బస్సుడిపో వద్ద మంగళవారం(డిసెంబర్ 10) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపో వద్ద దిగాడు.డ్రగ్స్‌తో దిగుతున్నాడని ముందే సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
HYD: యాప్రాల్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: కొంత కాలం గ్యాప్ తర్వాత హైడ్రా మళ్లీ తన జేసీబీలకు పని చెప్పింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని యాప్రాల్‌లో హైడ్రా శుక్రవారం (డిసెంబర్6) అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 32,14లో ఉన్న ఫంక్షన్‌హాల్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించినందుకు ఫంక్షన్హాల్లో కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు తెలిపారు.కూల్చివేతలు వివాదాస్పదమైనందున హైడ్రా తన దూకుడు కొద్దిగా తగ్గించింది. హైకోర్టు చివాట్లతో తన స్పీడుకు బ్రేకులు వేసింది. అక్రమ నిర్మాణాలని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు రంగంలోకి దిగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిన జవహర్‌నగర్ ప్రాంతంలో చాలా వరకు భూ కబ్జాలతో పాటు అక్రమ నిర్మాణాలున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఫిర్యాదులున్నాయి. -
ఘనంగా అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్
అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. అపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చదివిన 100 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.జనరల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడల్2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్‌కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. "కష్టపడి చదవడం వల్ల గోల్డ్ మెడల్ సాధించగలిగానని, తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, అత్యుత్తమ విద్య బోధించినందుకు అపోలోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" అవినాష్ తెలిపారు. ఇక డాక్టర్ ప్రతాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్‌ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.700 దాటిన అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లుఅపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్పటికీ పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఇదే విషయాన్ని కాన్వోకేషన్లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. "భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తోన్న అపోలోలో చదువుకునే అదృష్టం మీకు దక్కడం గొప్ప విషయం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలన్న మీ ధృడ సంకల్పం జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. -
బంగారం బిజినెస్ పేరుతో మోసం.. బాధితుల్లో టాప్ హీరోయిన్లు..?
సాక్షి,హైదరాబాద్:బంగారం వ్యాపారం ముసుగులో రూ.100 కోట్లకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించాడు.వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు.బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఆ ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్ చేసింది పెద్ద మోసం అని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజరెడ్డి అనే మహిళావ్యాపారవేత్త ఫిర్యాదుతో విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు.కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత,కీర్తిసురేష్, డిజైనర్ శిల్పారెడ్డి తదితర ప్రముఖులున్నట్లు సమాచారం.కాంతిదత్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 100 మందికిపైగా బాధితులున్నట్లు చెబుతున్నారు. -
HYD: లంగర్‌హౌజ్‌లో ‘హిట్ అండ్ రన్’.. దంపతులు మృతి
సాక్షి,హైదరాబాద్:లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మద్యం మత్తులో స్విఫ్ట్‌కారు నడుపుతూ టూ వీలర్‌తో పాటు ఆటోను ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.టూవీలర్‌పై వెళ్తున్న దంపతులు మొనా(34)& దినేష్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మోనా గర్భవతి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతులు మోనా,దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దినేష్ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల కోసం తన భార్యతో కలిసి లంగర్ హౌస్‌లోని అత్తారింటికి వచ్చాడు.లంగర్‌హౌస్ నుంచి బంజారాహిల్స్‌కు జూపిటర్ స్కూటీపై బయలుదేరారు. ఈ సమయంలోనే స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. మృతులు బంజారాహీల్స్ నంది నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు ఢీకొట్టిన ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డవారు ఆస్పత్రితో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
HYD:పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ఎనిమిది బైకులు దగ్ధం
సాక్షి,హైదరాబాద్: నగరంలో మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం బ్యాటరీ పేలింది. రామంతాపూర్ వివేక్‌నగర్‌లో బుధవారం(నవంబర్ 27) తెల్లవారుజామున 3గంటల30నిమిషాలకు ఘటన జరిగింది.పార్క్ చేసి ఉన్న బైక్‌లో ఉన్న బ్యాటరీ పేలింది.పేలుడు దాటికి బైకు పూర్తిగా దగ్ధమైంది.మంటల తీవ్రతకు పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ఎనిమిది బైకులు కాలి బూడిదయ్యాయి. ఇదీ చదవండి: ఫ్యాబ్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం -
HYD: డ్రగ్ కంట్రోల్ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: డ్రగ్ కంట్రోల్(డీసీఏ) అధికారులు నగరంలోని మెడికల్ షాపులపై ఆదివారం(నవంబర్17) ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లాల్లోని మెడికల్ షాపులపై ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని గాయత్రి మెడికల్ స్టోర్లలో మందులు సీజ్ చేశారు.1.25 లక్షల విలువగల 45 రకాల మందులు సీజ్ చేశారు. గడువు ముగిసిన మందుల నిల్వలు ఉండడం, అబార్షన్ మెడిసిన్ అనధికారికంగా విక్రయిస్తుండడాన్ని గుర్తించారు. గాయత్రి మెడికల్ షాపు నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.రామంతపూర్‌లోని ఓ మెడికల్ షాపులోనూ నిర్వహించిన తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.కంటి ఇన్ఫెక్షన్ నివారణ కొరకు అమ్ముతున్న నకిలీ మెడిసిన్‌ను సీజ్ చేశారు. -
మూసీ నిద్రలో కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: నల్గొండకు తాము వ్యతిరేకం కాదని, నల్గొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేకంగా శనివారం(నవంబర్ 16) అంబర్‌పేట తులసీరామ్‌నగర్‌లో మూసీ నిద్ర కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదు. కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలి. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదు.మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ రిటైనింగ్ వాల్ కట్టండి.లక్షా యాభై వేల కోట్లకు అదనంగా నా జీతం ఇస్తా.అవసరం అయితే ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఇస్తాం.నిజాంకు భయపడలేదు..నీకు భయపడతామా. బుల్డోజర్కు భయపడం.పేదలు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తానంటే అడ్డుకోము. ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదు. ఒక కేంద్ర మంత్రిగా..ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా..ఇల్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా. వారం రోజులు ఇళ్ళల్లో పనిచేస్తే ఎంత జీతం వస్తుందో అంత మొత్తం మూసీ ప్రక్షాళనకు పేదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడే భాష పద్ధతిగా లేదు.మూసీ పక్కన మట్టి పోస్తూ అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు వేశాం.వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ ఇంగ్లీష్ మీడియా స్కూల్ కట్టాం. వైఎస్సార్ ఉన్నప్పుడే అంబర్ పేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.పేద ప్రజలను రెచ్చగొట్టాలని లేదు.ముఖ్యమంత్రిని విమర్శించాలని లేదు. రాజకీయంగా చూడవద్దు..ప్రజల తరఫున..ప్రజల కోసం..ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది.ప్రజలు చేస్తున్న కార్యక్రమంలో బీజేపీ పాల్గొన్నది.ఎంత మందిని జైల్లో వేస్తావో..ఎంత మందిని తొక్కిస్తావో చూద్దాం.ప్రతి అడ్డమైనవాడు విమర్శలు చేస్తున్నారు..ప్రజల కోసం భరిస్తాం’అని కిషన్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: కిషన్‌రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా: మంత్రి పొన్నం -
ఇండియన్ ట్రెడిషన్..ఫ్యాషన్ వాక్..
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో సాగిన ఫ్యాషన్ వాక్ ఔరా అనిపించింది. ఆయా రాష్ట్రాల వస్త్రధారణతో సాగిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ భావజాలమైన వారసత్వ చేనేత వ్రస్తాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన అవతరణ్–2024లో భాగంగా బుధవారం ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఎఫ్‌డీడీఐ(ఫుట్‌వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్)లోని ఫ్యాషన్ డిజైన్ విభాగం రెండో సంవత్సరం విద్యార్థులు ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలిచే చీర కట్టు, పంచెకట్టుతో ర్యాంప్‌పై విద్యార్థులు మెరిశారు. యువతులు వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సాంఘిక సంస్కరణల చుట్టూ ఉండే సంప్రదాయ కథలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో వ్రస్తాలను డిజైన్ చేశారని ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.తేజ్ లోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ మధుప్రియ ఝా ఠాకూర్, ఎల్జీఏడీ సీనియర్ ఫ్యాకల్లీ సి.వేణుగోపాల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బెస్ట్ డిజైనర్, బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయనున్నారు. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?
సహజ సిద్ధంగా లభించే వెదురుతో తయారు చేసిన బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా.. వినడానికి కాస్త కొత్తగా అనిపించినా ఈ రకం బ్రష్‌లు చాలా కాలంగా వినియోగంలో ఉన్నాయి. ఉదయం లేచి ప్లాస్టిక్‌తో తయారైన బ్రష్‌లు వినియోగిస్తున్నంతగా వెదురు బ్రష్‌లకు ప్రచారం లభించలేదు. అయితే గత కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికులు మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు వెదురు బ్రష్‌ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ బ్రష్‌ల స్థానంలో వెదురు వస్తువులను అందుబాటులోకి తెస్తున్నారు. పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, తదితర ప్రదేశాల్లో తమవంతు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ సుమారు 30 వేల మంది ఇలా ప్లాస్టిక్ నుంచి వెదురు బ్రష్‌లకు మారినట్లు పేర్కొంటున్నారు.హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు, యూసఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్కు, మన్సూరాబాద్ పెద్దచెరువు, పీర్జాగూడ, భాగ్యనర్ నందనవనం పార్కు తదితర ప్రదేశాల్లో విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ సభ్యులు వెదురు బ్రష్‌ల వినియోగం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ కార్యక్రమంలో సేకరించిన ప్లాస్టిక్ బ్రష్‌లను విశాఖలోని రివర్స్ ఇంజినీరింగ్ ప్లాంట్‌కు తరలించి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ తయారీకి వినియోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ టూత్ బ్రష్‌ల ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ ఈ తరహా కార్యక్రమాలను చేపడుతున్నారు. మనమూ ఈ తరహా వెదురు బ్రష్‌లను ట్రై చేద్దామా.. సామాజిక బాధ్యతగానే..బ్రష్ అనేది నిత్యం ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువు. అయితే మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారు చేసినవి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి రెండు నెలలకు ఒక బ్రష్ పడేసినా కోట్ల బ్రష్‌లు వ్యర్థాల్లో కలిసిపోతున్నాయి. వాటిని నియంత్రించాలన్నదే మా ఆలోచన. మేం వ్యాపార ధోరణతో కాకుండా సామాజిక బాధ్యతగా ఈ ప్రమోషన్ వర్క్ చేస్తున్నాం. శనివారం కేబీఆర్ పార్కు దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్‌కు వాకర్స్ వచ్చి విషయం అడిగి తెలుసుకున్నారు. చాలా మంది మేమూ మారతాం అంటున్నారు. బ్రష్‌లను తీసుకుంటున్నారు. – అనూప్‌కుమార్, వాలంటీర్, విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ -
HYD: హోటళ్లలో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం(నవంబర్ 10) ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు.కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఎక్స్పైర్ అయిన పాడైన ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌తో వంట చేస్తున్నట్లు గుర్తించారు.దీంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ కిచెన్లలోనూ తనిఖీలు చేశారు.కుళ్ళిపోయిన టమాటో, పొటాటోలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారని తేలింది.వీటికి తోడు కాలం చెల్లిన పన్నీర్, మష్రూమ్‌లతో వంటల చేస్తున్నట్లు గుర్తించారు.ఇదీ చదవండి: HYD: హోటల్లో భారీ పేలుడు.. పక్కనున్న బస్తీలో ఎగిరిపడ్డ రాళ్లు -
HYD: హోటల్లో భారీ పేలుడు.. బస్తీలో ఎగిరిపడ్డ బండ రాళ్లు
సాక్షి,హైదరాబాద్:జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ వన్‌లోని ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం(నవంబర్ 10) తెల్లవారుజామున 4 గంటలకు పేలుడు జరిగింది. హోటల్ కిచెన్‌లో ఉన్న రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. పేలుడు ధాటికి హోటల్ ప్రహరీ గోడ ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు రాళ్ళు ఎగిరి పడి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి. రాళ్లు పడడంతో బస్తీలో ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. భారీ శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.పేలుడు ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం -
సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్‌ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ -
HYD: పంజాగుట్టలో కారు బీభత్సం.. హోంగార్డును ఈడ్చుకెళ్లి..
సాక్షి,హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు. కారు ఆపిన హోంగార్డును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్టలో కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్‌లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా నాగార్జున సర్కిల్ వద్ద హోంగార్డ్ రమేష్ ఓ కారును ఆపాడు. అయితే కారును ఆపకుండా హోం గార్డు రమేష్‌ని కారు డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడి ఆపకుండా ఈడ్చుకెళ్లాడు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో చోరీ.. పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులు -
HYD: మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: మెట్రోరైలులో సోమవారం(నవంబర్ 4) ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. కీలకమైన ఐటీ కారిడార్‌ను కనెక్ట్ చేసే నాగోల్-రాయదుర్గం లైన్‌లోని బేగంపేట-రాయదుర్గం మధ్య సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు 13 నిమిషాల పాటు ఆగిపోయాయి. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ ఫీడర్లో సమస్య కారణంగా మెట్రో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసు సమయం మించిపోతోందని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిథిగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.కాగా, గతంలోనూ పలుమార్లు మెట్రో రైలుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురై గంటలకొద్దీ నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ సందర్భాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇదీ చదవండి: సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్‌జామ్ -
HYD: బంజారాహిల్స్‌లో పోర్షే కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం -
HYD: బంజారాహిల్స్‌లో ‘మోమో’ల కలకలం
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్‌లో ఫుడ్‌పాయిజన్ ఘటన కలకలం రేపింది. నందినగర్‌లో వారాంతపు సంతలో రోడ్డుపై అమ్మే మోమోలు తిని పలువురికి ఫుడ్‌పాయిజన్ అయింది. మోమోలు తిన్న సింగాడికుంటకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది.ఇదే ఘటనలో 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మోమోల బాధితుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మోమోలు పాయిజన్ అవడంపై బాధితులు సోమవారం(అక్టోబర్ 28) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత -
HYD: నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు..కారణమిదే..
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు,పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉన్నందునే ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా నెల రోజులు సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో తెలిపారు.కాగా, ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు జరగడం తెలిసిందే. దీనికి తోడు గ్రూప్-1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్‌లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: జన్వాడ రేవ్‌పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు ఆదేశాలు -
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్‌లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య -
లిటిల్ చెఫ్ ! అపుడు అన్నం తినడానికి మారాం, ఇపుడు యూట్యూబ్ స్టార్‌గా
చిన్నారులకు అన్నం తినిపించాలంటే తల్లులకు పెద్ద టాస్క్. కథలు చెప్పాలి.. బుజ్జగించాలి.. లాలించాలి.. అంత చేసినా చివరకు సగం వదిలేస్తుంటారు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్లో ఏదో ఒక కార్టూన్లు, రైమ్స్ పెట్టి తినిపించేస్తున్నారు. అసలు పిల్లలు ఏం తింటున్నారో కూడా వారికి తెలియట్లేదు. అలా వారిపై ఫోన్ల ప్రభావం ఉంటోంది. ఇలాగే ఈ చిన్నారి కూడా అన్నం తిననంటూ మారాం చేస్తుండేదట. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. ఆ పాపతోనే వంటలు చేయించడం ప్రారంభించారు. వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సాక్షి, హైదరాబాద్లిటిల్ చెఫ్.. తినేటప్పుడు ఏడుపు మానిపించడానికి చేసిన ప్రయత్నం ఆ పాపకు వంటలపై మక్కువను పెంచేలా చేశాయి. దీంతో ప్రస్తుతం ఆ పాప మరింత యాక్టివ్‌గా తన హావభావాలతో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ పాప పేరే శ్రీనిత్య. బాచుపల్లిలో నివాసం ఉంటున్న నవీన్ చారి, శైలజ కూతురైన శ్రీనిత్య వయసు 8 ఏళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుకుంటోంది. కానీ వంటలతో పెట్టే వీడియోలతో యూట్యూబ్‌లో స్టార్‌గా మారింది.ఇదీ చదవండి: ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!చిన్నప్పటి నుంచే ఆసక్తి.. నాలుగేళ్ల వయసు నుంచే పాప కిచెన్‌లోని వస్తువులతో గడిపేదట. పాప ఆసక్తి చూసిన తండ్రి కిచెన్ సెట్ కొనిచ్చాడు. ఇక ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతూ ఉల్లాసంగా ఉండేదట. అయితే అన్నం తినకపోయేదట. దీంతో పాపకు అన్నంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వంట పాత్రల్లో వంటకాలు చేయించడం నేరి్పంచారట. ఆ పాప చేసిన వంటకాలను చాలా ఇష్టంతో తినడం గుర్తించిన నవీన్.. ఓ రోజు పాప వంటలు తయారుచేస్తున్న సమయంలో వీడియోలు తీసి, ఇన్‌స్టాలో పెట్టాడు. బంధువులు, స్నేహితుల నుంచి ప్రశంసలు రావడంతో వీడియోలు తీయడం కొనసాగించాడు. అందుకోసం డ్రెస్‌లతో పాటు అన్ని రకాల మినియేచర్ వంట పాత్రలనూ కొనుగోలు చేశాడు. దాదాపు 5 ఏళ్ల వయసు నుంచే పాపతో వెరైటీ వంటకాలు చేయించడం, వాటిని అప్లోడ్ చేయడం చేస్తున్నాడు. శ్రీనిత్య చిన్నప్పటి నుంచే బుజ్జిగా మాట్లడటమే కాకుండా ముఖంలో హావభావాలు అద్భుతంగా పలికిస్తోంది. దీంతో వీక్షకులు కూడా పాప వంటకాలకే కాకుండా ఆమె ముఖ కవళికలకు కూడా ఫిదా అవుతున్నారు. ఆహారంపై ఆసక్తి పెంచాలి.. శ్రీనిత్యకు ఎలాగైనా ఆహారంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో పాటు, వంటలు చేయడం ఎంత కష్టమో తెలియజేసేందుకు ఇలా వంటకాలు నేర్పించాం. వీడియోలు తీసేటప్పుడు ఎలా చెబితే అలా చేస్తుంటుంది. అస్సలు అలిసిపోదు. వీడియో షూటింగ్ అనగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటు స్కూల్లో కూడా బాగా చదువుకుంటుంది. వారాంతాల్లో ఎక్కువగా వంటలు చేయిస్తూ వీడియోలు తీస్తుంటాం. పాప వంటలు చేస్తుంటే ముద్దుముద్దుగా అనిపిస్తుంటుంది. వంటలు చేసుకుంటూ పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, మంచి మాటలు చెప్పిస్తుంటాం. – నవీన్ చారి నారోజు, నిత్య తండ్రి -
HYD: మల్కాజ్‌గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్‌బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
HYD: మియాపూర్‌లో చిరుత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు. -
కూల్చడం కుదరదు.. ఇళ్లకు ‘స్టే’ బోర్డులు
సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా తమ ఇళ్ళు కూల్చివేయవద్దంటూ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యనగర్, కొత్తపేటలో పలు ఇళ్ళ ముందు హైకోర్టు స్టే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని 400 మంది ఇళ్ల యజమానులు కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం మా ఇళ్లు ఇవ్వం అంటూ బాధితులు ఇటీవల ఆందోళన కూడా నిర్వహించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేసేందుకు నోటీసులిచ్చారు. దీంతో ఆయా కట్టడాల యజమానులు కోర్టుకు వెళ్లి కూల్చివేలకు వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా -
ముత్యాలమ్మ గుడి ఘటన.. కేటీఆర్ కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోందని, దాడికి పాల్పడ్డ అక్రమార్కులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం(అక్టోబర్ 14) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘ఇలాంటి తెలివితక్కువ చర్యలు మన నగరం యొక్క సహనశీలతకు మచ్చ. గడిచిన నెలరోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయని,దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉద్రిక్తత