BSE
-
చిన్న షేర్ల జోష్
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5 శాతం లాభపడింది. అయితే అత్యధిక శాతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో చిన్న షేర్ల ఇండెక్స్ బీఎస్ఈలో 8 శాతం పురోగమించింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల మద్దతిచ్చింది.న్యూఢిల్లీ: పలు ఆటుపోట్ల మధ్య 2024–25లో స్టాక్ మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 3,764 పాయింట్లు(5.1 శాతం) పుంజుకోగా.. బీఎస్ఈలో స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3,472 పాయింట్లు(8 శాతం) ఎగసింది. ఈ బాటలో మిడ్‌క్యాప్ సైతం 2,209 పాయింట్లు(5.6 శాతం) వృద్ధి చెందింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల దన్నుగా నిలిచింది. గతేడాది అక్టోబర్ నుంచి అమ్మకాల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెలలో ఉన్నట్టుండి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడంతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ సాధించాయి. దీంతో పూర్తి ఏడాదికి లాభాలతో నిలిచాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం మిడ్, స్మాల్‌క్యాప్ కౌంటర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నష్టాలకు చెక్ గతేడాది అక్టోబర్ మొదలు వరుసగా 5 నెలలపాటు నష్టాలతో ముగిసిన మార్కెట్లు గత నెలలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. తద్వారా గతేడాది నికరంగా లాభాలతో నిలిచినట్లు లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు సతీష్ చంద్ర ఆలూరి పేర్కొన్నారు. ప్రధానంగా మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు మార్కెట్లను మించి బలపడినట్లు తెలియజేశారు. అందుబాటు విలువలకు చేరిన పలు షేర్లకుతోడు దేశీయంగా నెలకొన్న ఆశావహ పరిస్థితులు, ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇందుకు కారణమైనట్లు వివరించారు. దీంతో ప్రస్తుతం చరిత్రాత్మక సగటులకు పలు కౌంటర్లు చేరినట్లు అభిప్రాయపడ్డారు. ఈక్విటీల విలువలు ఖరీదుగా మారడంతో అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు ‘బేర్’ ట్రెండ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌పీఐలు పెట్టుబడులవైపు మళ్లడంతోపాటు.. భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలనుంచి బయటపడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇది చివరికి మార్కెట్లు సానుకూల ధోరణిలో ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రీమియం విలువల ఎఫెక్ట్ నిజానికి బుల్ మార్కెట్లలో ప్రధాన ఇండెక్సులతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా ర్యాలీ చేయవలసి ఉన్నట్లు హైబ్రో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు తరుణ్ సింగ్ పేర్కొన్నారు. గతేడాది చిన్న షేర్ల ఇండెక్సులు రెండంకెల స్థాయిలో వృద్ఢి చూపకపోవడానికి మార్కెట్ల ర్యాలీ చాలా ముందుగానే ప్రారంభంకావడంతో షేర్ల ధరలు భారీగా పెరిగాయని, ఇందుకు తగిన స్థాయిలో కంపెనీల పనితీరు లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరచిందని వివరించారు. గత రెండు త్రైమాసికాలలో అంచనాలకంటే దిగువన వెలువడిన ఫలితాలు షేర్ల ప్రీమియం ధరలకు మద్దతివ్వలేకపోయినట్లు తెలియజేశారు. మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ భారత్‌సహా పలు దేశాలపై ప్రతీకార టారిఫ్‌లకు తెరతీయడం సెంటిమెంటును బలహీనపరచినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పాల్క అరోరా చోప్రా పేర్కొన్నారు. సరికొత్త రికార్డులు గతేడాది(2024) సెప్టెంబర్ 27న సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 85,978 పాయింట్లను అధిగమించగా.. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ అదేనెల 24న 49,701ను తాకి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 2024 డిసెంబర్ 12న 57,828 పాయింట్ల వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. నిజానికి బ్లూచిప్స్ లేదా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎఫ్‌పీఐలు అత్యధికంగా కొనుగోలు చేస్తే.. రిటైలర్లు చిన్న షేర్లపట్ల ఆకర్షితులవుతుంటారని విశ్లేషకులు వివరించారు. అయితే ఇకపై ఆయా కంపెనీల ఫలితాల ఆధారంగా స్టాక్ విలువలు సర్దుబాటుకానున్నట్లు తెలియజేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు, మార్కెట్ల ట్రెండ్‌సహా దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు, ప్రభుత్వ, ప్రయివేట్ పెట్టుబడులు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు వివరించారు.మార్చిలో బూస్ట్ఎఫ్పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్అరౌండ్ అయ్యాయి. సెన్సెక్స్ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. -
మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 14 శుక్రవారం హోలీ» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) -
2 నెలల్లో లక్ష కోట్లు ఉఫ్!
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతుండడంతో మార్కెట్లు పతనబాట పట్టాయి. 2024 అక్టోబర్ లో మొదలైన ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా సాగుతోంది. దీంతో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఇండెక్సుల్లో భారీ కరెక్షన్ జరుగుతోంది.. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలు కొత్త గరిష్టస్థాయిల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. సుమారు మూడేళ్లపాటు సాగిన స్టాక్ మార్కెట్ బుల్ పరుగు గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి స్పీడు తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెంటిమెంట్ బలహీనపడి మార్కెట్లు లాభాల బాట నుంచి యూటర్న్ తీసుకుని నష్టాల ప్రయాణం మొదలు పెట్టాయి. దీంతో 2024 సెపె్టంబర్ 27న చరిత్రాత్మక గరిష్టాలను తాకిన నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా తగ్గుతూ ఇప్పటివరకూ 14 శాతం పతనమయ్యాయి. బేర్ ట్రెండ్‌వైపు మళ్లాయి! కారణాలు ఇవీ...మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది. అధికారం చేపట్టాక భారత్‌సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్‌పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు. నేలచూపుల తీరిదీ బీఎస్ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ గత సెపె్టంబర్ 27న 85,978 వద్ద స్థిరపడింది. ఇదే రోజు నిఫ్టీ 26,277కు నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. ఈ స్థాయి నుంచి నిఫ్టీ 3,730 పాయింట్లు(14 శాతం) పతనమైంది. సెన్సెక్స్ 11,376 పాయింట్లు(13 శాతం) కోల్పోయింది. వెరసి గతేడాది అక్టోబర్ నుంచి మార్కెట్లు బేర్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. గత అక్టోబర్ మొదలు అమ్మకాలు కొనసాగిస్తున్న ఎఫ్‌పీఐలు కొత్త ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఫలితంగా ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ సెన్సెక్స్ 3,537 పాయింట్లు(4.5 శాతం) పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 1,097 పాయింట్లు(4.6 శాతం) వెనకడుగు వేసింది.నిపుణుల అంచనాలు నిజానికి మార్కెట్లలో నెలకొన్న దిద్దుబాటు పలు అంశాల కలయికతో జరుగుతుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. అధిక శాతం బ్లూచిప్ కంపెనీలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. వీటికితోడు ట్రంప్ టారిఫ్ భయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమవుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు. దీంతో మార్కెట్లు సాంకేతికంగా బలహీనపడినట్లు చెప్పారు. చైనాతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఖరీదుగా ఉండటంతో ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. భారీగా పుంజుకుంటున్న డాలరు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి క్షీణత, ఖరీదుగా మారిన దేశీ ఈక్విటీలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమనేది విశ్లేషకులు అభిప్రాయం.భారత్ బేర్ వర్ధమాన మార్కెట్లలో చూస్తే ప్రధానంగా ఆసియా దేశాలలో భారత్ నుంచే ఎఫ్‌పీఐలు అత్యధిక శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, మలేసియా తదితర మార్కెట్లతో పోలిస్తే 2025 తొలి రెండు నెలల్లో దేశీ స్టాక్స్‌లో భారీగా విక్రయాలు చేపట్టారు. ఆసియా దేశాలను పరిగణిస్తే ఫిలిప్పీన్స్‌లో అతితక్కువ అమ్మకాలు నమోదుకాగా.. భారత్‌లో అత్యధిక విక్రయాలకు తెరతీశారు. నిజానికి గత మూడేళ్లలో ఎఫ్‌పీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న భారత్ ఇటీవల పలు కారణాలతో పెట్టుబడులను కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆసియాలో మెటల్స్ ఎగుమతులతో చైనా, ఎల్రక్టానిక్స్‌లో వియత్నాం వంటి దేశాలు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను అధికంగా ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ అంశంలో భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ తదితర పలు ఇతర కారణాలతో ఎఫ్‌పీఐలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చిన్న షేర్లు విలవిల సిప్ పెట్టుబడులు డిప్
నాలుగేళ్లుగా దేశీ స్టాక్ మార్కెట్ల(Stock markets)లో బుల్ ట్రెండ్ కొనసాగడంతో ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను చేరాయి. అయితే ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టడం, రాజకీయ భౌగోళిక అనిశ్చితులు వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బకొట్టాయి. దీంతో గతేడాది అక్టోబర్ మొదలు స్టాక్ మార్కెట్లు(Stock markets) తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్స్‌లో కొద్ది రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టాల నుంచి 17 శాతానికిపైగా పతనమయ్యాయి. వెరసి గత ఆరు నెలల్లో పలు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో చేసిన పెట్టుబడులకు నష్టాలు వాటిల్లుతున్నాయి. మరోపక్క మార్కెట్ ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సైతం 12 శాతం క్షీణించాయి. సిప్ బేజారు...నిజానికి గత కేలండర్ ఏడాది(2024)లో క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్) భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 2.89 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. యాక్టివ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు గతేడాది రూ. 35,000 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇదే కాలంలో లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపు..! అయితే గత 6 నెలలుగా పలు స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు చెందిన సిప్ పథకాలపై రిటర్నులు ప్రతికూలంగా నమోదవుతున్నా యి. 2024 డిసెంబర్లో ఇన్వెస్టర్లు 4.5 మిలియన్ సిప్ ఖాతాలను మూసివేశారు. ఇంతక్రితం 2024 మే నెలలో మాత్రమే 4.4 మిలియన్ సిప్ ఖాతాలు నిలిచిపోయాయి. నేలచూపులో వివిధ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడుల తీరును గమనిస్తే.. మూడేళ్ల కాలంలో మంచి పనితీరునే చూపినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే ప్రతికూల ప్రతిఫలాలు నమోదవుతున్నాయి. వివిధ మిడ్ క్యాప్ ఫండ్స్ జాబితాలో క్వాంట్ను తీసుకుంటే గత మూడేళ్లలో 19 శాతం రిటర్నులు అందించగా.. గత 12 నెలల్లో 15.6 శాతం క్షీణతను చవిచూసింది. ఈబాటలో టారస్ మూడేళ్లలో 15 శాతం లాభపడగా.. ఏడాది కాలంలో 12 శాతంపైగా నీరసించింది. మిరే అసెట్ మూడేళ్లలో 18 శాతం పుంజుకోగా.. ఏడాదిలో 6 శాతంపైగా నష్టపోయింది. ఇదేవిధంగా టాటా గ్రోత్, యూటీఐ, ఏబీఎస్ఎల్, మహీంద్రా మాన్యులైఫ్ మూడేళ్లలో 20–24 శాతం రిటర్నులు అందించినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే 5–4 శాతం మధ్య తగ్గాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు2024 అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా అక్టోబర్ మొదలు ఇప్పటి(ఫిబ్రవరి7)వరకూ ఎఫ్‌పీఐలు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కొత్త ఏడాది(2025) జనవరి నుంచి చూస్తే రూ. లక్ష కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ ఏడాది కనిష్టాలకు..బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో 131 షేర్లు తాజాగా 52 వారాల కనిష్టాలను తాకాయి. ఈ జాబితాలో డెల్టా కార్ప్ హోనసా కన్జూమర్, జేకే టైర్, మిశ్రధాతు నిగమ్, టాటా కెమికల్స్, ఎన్సీసీ, రైట్స్, మదర్సన్ సుమీ, ఎస్కేఎఫ్ ఇండియా చేరాయి. గత రెండు నెలల్లో 433 చిన్న షేర్ల మార్కెట్ విలువలో 20%ఆవిరైంది. వీటిలో 100 షేర్ల విలువ 30–40% మధ్య పతనమైంది. గత నెల రోజుల్లో రెండేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న పలు కౌంటర్లు 40–30 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో న్యూజెన్ సాఫ్ట్వేర్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, అపార్ ఇండస్ట్రీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, జూపిటర్ వేగన్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, అనంత్‌రాజ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ చేరాయి. -
462 కంపెనీలపై దర్యాప్తు!
అనుమానాస్పద మోసపూరిత లావాదేవీల విషయమై కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు 462 కంపెనీలపై దర్యాప్తు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో కార్పొరేట్ మోసాలు పెరిగాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు (ఆర్డీలు), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అధికారులు సాధారణంగా మోసపూరిత లావాదేవీలపై దర్యాప్తు నిర్వహిస్తుంటారు. ఆర్డీలు, ఎస్ఎఫ్ఐవో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్న కేసుల వివరాలను కార్పొరేట్ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభకు లిఖిత పూర్వకంగా అందించారు. 2019–2020 మధ్య ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ శాఖ ఆర్డీలు 462 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించగా, ఎస్ఎఫ్ఐవో 72 కేసుల దర్యాప్తును చేపట్టినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శాఖ ఆర్డీలు 51 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలుబీఎస్ఈ నుంచి కొత్త ఇండెక్సులుస్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈ అనుబంధ సంస్థ ఏషియా ఇండెక్స్ తాజాగా ఐదు సూచీలను ప్రవేశపెట్టింది. మార్కెట్ నుంచి బీఎస్ఈ 1000సహా మరో 4 ఇండెక్సులను రూపొందించింది. దీని ద్వారా మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలకు తెరతీసింది. దీంతో దేశీయంగా తదుపరితరం వర్ధమాన కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు కల్పించనుంది. బీఎస్ఈ 1000తోపాటు బీఎస్ఈ నెక్ట్స్ 500, బీఎస్ఈ 250 మైక్రోక్యాప్, బీఎస్ఈ నెక్ట్స్ 250 మైక్రోక్యాప్, బీఎస్ఈ 1000 మల్టీక్యాప్తో కొత్త ఇండెక్సులకు తెరతీసింది. మొత్తం దేశీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 93 శాతాన్ని బీఎస్ఈ 1000 ఇండెక్స్ ప్రతిఫలించనున్నట్లు ఏషియా ఇండెక్స్ ఎండీ, సీఈవో అశుతోష్ సింగ్ పేర్కొన్నారు. వెరసి మొత్తం స్టాక్ మార్కెట్‌కు ప్రామాణిక ఇండెక్స్‌గా ఇది నిలవనున్నట్లు తెలియజేశారు. -
మార్కెట్లో మతాబులు వెలిగేనా?
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్‌కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో వెల్లువెత్తుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. 2.2 శాతం డౌన్ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్ గత నెలలో దేశీ స్టాక్స్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్‌లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్‌కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్‌పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్‌పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
రేసు గుర్రాలు.. చిన్న షేర్లు
కొద్ది నెలలుగా సరికొత్త గరిష్టాల రికార్డులను నెలకొల్పుతూ సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల మధ్య, చిన్నతరహా కౌంటర్లు సైతం జోరు చూపుతున్నాయి. వెరసి సెన్సెక్స్‌ను మించి బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..ఈ క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటివరకూ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. చిన్న షేర్లు మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. దీంతో పలు చిన్న షేర్లు పెద్ద(భారీ) లాభాలను అందిస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉండటం, మెరుగుపడిన లిక్విడిటీ తదితర అంశాలు తోడ్పాటునిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఈ ఏడాది జూలై 16(మంగళవారం)వరకూ చూస్తే బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 10,985 పాయింట్లు(30 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో స్మాల్‌క్యాప్ సైతం 11,628 పాయింట్లు(27 శాతంపైగా) జంప్‌చేంది. ఇదే కాలంలో బీఎస్ఈ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ కేవలం 8,476 పాయింట్ల(12 శాతం) ర్యాలీ చేసింది.ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్ రూ. 1,187 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 1,187 కోట్లకు పరిమితమైంది. వేసవి ఎండలు, సార్వత్రిక ఎన్నికల కారణంగా పెయింట్లకు డిమాండ్ మందగించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,575 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,182 కోట్ల నుంచి రూ. 8,970 కోట్లకు స్వల్పంగా నీరసించింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 7,305 కోట్ల నుంచి రూ. 7,559 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో డెకొరేటివ్ విభాగం అమ్మకాల పరిమాణం 7% పుంజుకున్నప్పటికీ ప్రొడక్ట్ మిక్స్‌లో మార్పులు, ధరల తగ్గింపు వంటి అంశాలు లాభదాయకతను దెబ్బతీసినట్లు అమిత్ పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు, సప్లైచైన్ సవాళ్లు సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు. అయితే ఇండ్రస్టియల్ బిజినెస్ 6% పుంజుకున్నట్లు తెలిపారు.పర్యాటకానికి పరిశ్రమ హోదా..జీఎస్టీ రేటు క్రమబదీ్ధకరించాలి ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ డిమాండ్ పర్యాటకానికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని, టూరిజానికి పరిశ్రమ హోదా కలి్పంచాలని ట్రావెల్ ఏజెంట్ల సమాఖ్య టీఏఏఐ కేంద్రాన్ని కోరింది. అలాగే వీసా నిబంధనలను సరళతరం చేయడం, వీసా–ఫ్రీ ఎంట్రీని ప్రోత్సహించడం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. దేశ జీడీపీలో సుమారు 5.8 శాతం వాటాతో, 2047 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల లక్ష్యం పెట్టుకున్న ట్రావెల్, టూరిజం రంగానికి బడ్జెట్‌పై సానుకూల అంచనాలు ఉన్నట్లు వివరించింది. వీటిని అమలు చేస్తే ఇటు వ్యాపారాలు, అటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరగలదని టీఏఏఐ పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, రైల్వేలు.. రహదారులు .. జలమార్గాల విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం రాబోయే బడ్జెట్లోనూ ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని కొనసాగించగలదని ఆశిస్తున్నట్లు టీఏఏఐ వివరించింది. జీఎస్టీపై సానుకూలంగా వ్యవహరిస్తే టూరిస్టులకు బస ఏర్పాట్లు అందుబాటు స్థాయిలోకి రాగలవని, ఈ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభించగలదని పేర్కొంది.మరోవైపు, హోటళ్లపై ప్రస్తుతం వివిధ రకాలుగా ఉన్న జీఎస్టీ రేటును 12 శాతానికి క్రమబదీ్ధకరించాలని ఆన్లైన్ ట్రావెల్ సేవల సంస్థ మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ మగోవ్ తెలిపారు. ప్రస్తుతం గది అద్దె, సీజన్ తదితర అంశాలను బట్టి ఇది 12 శాతం, 18 శాతంగా ఉంటోందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలు పాటించే హోటళ్లు, హోమ్‌స్టేలకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన చెప్పారు. ‘విద్యుత్ ఆదా చేసే లైటింగ్, నీటిని ఆదా చేసే డివైజ్‌లు, వ్యర్ధాలను తగ్గించే విధానాలను పాటించే వారికి పన్నులపరమైన మినహాయింపులు ఇస్తే పర్యావరణహిత లక్ష్యాల సాధనలో పరిశ్రమ కూడా భాగం కావడానికి తోడ్పడగలదు‘ అని రాజేష్ వివరించారు. పర్యాటకం, ఆతిథ్య రంగానికి మౌలిక పరిశ్రమ హోదా కలి్పస్తే మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్టర్న్ ఇండియా) ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు.బుల్ మార్కెట్ దేశీయంగా లిక్విడిటీ పరిస్థితులు బలపడటం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల వృద్ధికి కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు(పీఎంఎస్), ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిధులు చిన్న షేర్లలోకి ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా దీర్ఘకాలిక(స్ట్రక్చరల్) బుల్ ట్రెండ్‌లో మార్కెట్ కొనసాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లను మించి పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. అయితే లార్జ్‌క్యాప్ స్టాక్స్ సైతం ర్యాలీ చేస్తున్నప్పటికీ చిన్న షేర్లతో పో లిస్తే వెనకబడుతున్నట్లు వివరించారు. ఎఫ్ ఐఐల అమ్మకాలు ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం యూఎస్ అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా బుల్ మార్కెట్ల హవా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. షేర్ల విలువలరీత్యా చూస్తే లార్జ్ క్యాప్స్ మరింత బలపడేందుకు వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది చివర్లో అమ్మకాలకు ప్రాధాన్యత ఇచి్చన ఎఫ్ఐఐలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. సరికొత్త రికార్డులు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ మంగళవారం(16న) 48,175 పాయింట్లను అధిగమించి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. అంతకుముందే అంటే ఈ నెల 8న స్మాల్‌క్యాప్ 54,618 పాయింట్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. ఇక మరోవైపు సెన్సెక్స్ ఈ నెల 16నే 80,898ను తాకి చరిత్రాత్మక రికార్డుకు తెరతీసింది. ఇందుకు టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జూమర్ గూడ్స్ రంగాలు ప్రధానంగా దోహదపడినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరి్వందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అందుబాటులో షేర్ల విలువలు, అధిక వృద్ధికి వీలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో దిద్దుబాటుకు వీలున్నట్లు సునీల్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పటిష్ట లిక్విడిటీ పరిస్థితుల కారణంగా కరెక్షన్ సమయాన్ని అంచనా వేయలేమని తెలియజేశారు. విధానాల్లో మార్పులు, ఫలితాల్లో నిరాశ తదితర అంశాలు ఇందుకు దారిచూపవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే వారం వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్ సానుకూలంగా ఉండవచ్చని, దీంతో మార్కెట్ల ర్యాలీ కొనసాగేందుకు వీలున్నదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే దేశీ స్టాక్స్‌లో మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. సాధారణంగా చిన్న షేర్లను దేశీ ఫండ్స్, రిటైలర్లు కొనుగోలు చేస్తే, లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ ఫలితాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంటు, గ్లోబల్ మార్కెట్లు వంటి పలు అంశాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశిస్తుంటాయని మార్కెట్ నిపుణులు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్కెట్ రికార్డుల హ్యాట్రిక్
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల జోరు మూడో రోజూ కొనసాగింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికం షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 80,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయ లాభాలతో మొదలైన సూచీలు.., అధిక వాల్యుయేషన్ల ఆందోళనల తో పరిమిత శ్రేణిలో కదలాడాయి. అయినప్పటికీ.., ఒక దశలో సెన్సెక్స్ 233 పాయింట్లు బలపడి 80,862 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 24,635 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ సరీ్వసెస్, యుటిలిటీ, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.⇒ మొహర్రం సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు నేడు సెలవు. ట్రేడింగ్ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో మాత్రం సాయంత్రంసెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.వేదాంతా క్విప్ ధర రూ. 461 వేదాంతా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్)కి తెరతీసింది. షేరుకి రూ. 461.26 ఫ్లోర్ ధరలో రూ. 8,500 కోట్లు సమీకరించనుంది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. సోమవారం ముగింపు ధర రూ. 459.4తో పోలిస్తే ఫ్లోర్ ధర స్వల్ప ప్రీమియం. వేదాంతా షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 456 వద్ద ముగిసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్ల లాభంతో 74436 వద్ద నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 22644 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.అదానీ ఎంటర్ ప్రైజెస్,లార్సెన్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్ ట్రీ, భారతీ ఎయిర్టెల్,సిప్లా, టాటా కాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎథేర్ మోటార్స్ కొటక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్‌పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది -
జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్‌తో
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తన జెరోధా కైట్‌లో ట్రేడర్ల కోసం నోట్స్ అనే ఫీచర్‌ను డెవలప్ చేసింది.జెరోధా కైట్‌లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్విరామంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదే సమయంలో ట్రేడర్లు ఆయా స్టాక్స్‌పై ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నామో తెలుసుకునేందుకు ఈ నోట్స్ ఫీచర్స్‌తో ట్రాక్ చేసుకోవచ్చని జెరోధా ప్రతినిధులు చెబుతున్నారు. Introducing notes on Kite web.At any given point in time, you may be tracking multiple stocks for different reasons. Even if you add the stocks on your marketwatch, it's hard to remember all the reasons why you added them. Now, you can easily add a quick note about why you are… pic.twitter.com/Su7AKm34Ip— Zerodha (@zerodhaonline) May 14, 2024 ప్రస్తుతం ఈ ఫీచర్ కౌట్ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోయాపల్లో సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జెరోధా ట్వీట్ చేసింది. ‘ఏ సమయంలోనైనా, మీరు వివిధ కారణాల వల్ల పలు స్టాక్స్‌ను ట్రాక్ చేయొచ్చు. కొన్ని సార్లు మీరు ఆయా స్టాక్స్ ఎందుకు ఎంచుకున్నారో గుర్తించుకోవడం కష్టం. ఆ సమస్యను అధిగమించేలా నోట్ అనే టూల్‌ను అందిస్తున్నట్లు జెరోధా తన ట్వీట్లో పేర్కొంది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లో సరికొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. సోమవారం స్టాక్‌మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్‌టైం హైకి చేరుకుని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలు, ఐటీ, ఆటోమొబైల్ షేర్ల కొనుగోలు, రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు కొనసాగింపుగా పెట్టుబడి దారులు మళ్లీ ఆశాజనకంగా మారడంతో బ్యాంక్ నిఫ్టీ తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 494 పాయింట్లు లాభంతో 74,742 వద్ద ముగియగా, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 22,666 వద్ద ముగిసింది. ఎథేర్ మోటార్స్,మారుతి సుజికీ, ఎం అండ్ ఎం,ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్,నెస్లే, అపోలో హాస్పిటల్,విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
ఈయన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్ నియంత్రణ మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్ మార్కెట్ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్సైట్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది. దీంతో పాటు నేషనల్ బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.12 కోట్లను డిపాజిట్ చేయాలని సూచించింది.కాగా, రెగ్యులేటరీ బాడీ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని నిర్ధారిస్తూ, ఈ ఎస్క్రో ఖాతాలో నిధుల్ని సెబీ సంరక్షణలో ఉంటాయి. -
సాక్షి మనీ మంత్ర : ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 27.09 పాయింట్లు నష్టపోయి 73,876.82 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 22,434.70 వద్ద ముగింపు పలికాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. రియల్టీ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించగా, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మరోవైపు పవర్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ (0.6 శాతం పెరుగుదల)తో బ్రాడర్ ఇండెక్స్‌లు తాజా రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది. -
తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు
మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన. కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. చండీగఢ్‌కు చెందిన తన్మయ్ మోతీవాలా పీడియాట్రిక్ సర్జన్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నాయా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అయితే ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆరా తీశారు. 1994లో ఒక్కో షేర్ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయని డాక్టర్ మోతీవాలా వెల్లడించారు. The power of holding equity 😊 My Grand parents had purchased SBI shares worth 500 Rs in 1994. They had forgotten about it. Infact they had no idea why they purchased it and if they even hold it. I found some such certificates while consolidating family's holdings in a… pic.twitter.com/GdO7qAJXXL — Dr. Tanmay Motiwala (@Least_ordinary) March 28, 2024 -
25 షేర్లలో నేటి నుంచి కొత్త సెటిల్మెంట్.. టీప్లస్‌జీరో
స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నేటి(గురువారం) నుంచి టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీస్తున్నాయి. తొలుత 25 షేర్లలో ఆప్షనల్ పద్ధతిన అమలు చేయనున్నాయి. ఈక్విటీ నగదు మార్కెట్లో ప్రస్తుతం అమలవుతున్న టీప్లస్1 సెటిల్మెంట్కు జతగా పరిశీలన పద్ధతిలో టీప్లస్0కు శ్రీకారం చుడుతున్నాయి. కొద్దిమంది బ్రోకర్ల ద్వారా మాత్రమే ఇందుకు వీలు కలి్పస్తున్నాయి. వెరసి ఈ నెల 28 నుంచి లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. ఈ జాబితాలో బజాజ్ ఆటో, వేదాంతా, హిందాల్కో, ఎస్బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే, సిప్లా, ఎంఆర్ఎఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, అంబుజా సిమెంట్స్ తదితరాలున్నాయి. తాజా సెటిల్మెంట్తో సమయం, వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. మార్కెట్ లావాదేవీల్లో ఈ వ్యవస్థ మరింత పారదర్శకత తీసుకువస్తుందని భావిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగింపు పలికాయి. నిన్న నష్టాలతో ముగిసినా బుధవారం ఆటోమొబైల్, రియాలి, పవర్ అండ్ కేపిటల్ గూడ్స్ షేర్ల కొనుగోలుతో నేడు భారీ లాభాల బాట పట్టాయి. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 22,123 వద్ద ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా, హీరోమోటో కార్పో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రోలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : సూచీల సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్ 1,200+, నిఫ్టీ 300+
దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం యూఎస్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో నిపుణులు అంచనాల కంటే మెరుగ్గా ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా ఎక్కువ శాతం సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అందరి చూపు ఫిబ్రవరి ఆటోమొబైల్ సేల్స్ వైపే ఉండడంతో సంబంధిత స్టాక్స్ సైతం పుంజుకున్నాయి. ఇక శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1245 పాయింట్లు లాభంతో 73745 వద్ద, నిఫ్టీ 355 పాయింట్ల లాభంతో 22338 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. టాటా స్టీల్,జేఎస్‌డ్ల్యూ స్టీల్,టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, హిందాల్కో, మారుతి సుజికీ, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎస్బీఐ షేర్లు భారీ లాభాల్లో మూటగట్టుకోగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఇతర ఆసియా మార్కెట్ల మిక్స్డ్ ఫలితాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు లాభనష్టాలతో ఊగిసలాడాయి. అదే ధోరణి కొనసాగడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్ల నష్టంతో 72304 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 21951 వద్ద ముగిశాయి. హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎయిర్టెల్ షేర్లు లాభాల్ని గడించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్,ఎథేర్మోటార్స్, మారుతి సుజికి,బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఈ వారం తొలిరోజే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి 144 పాయింట్ల నష్టంతో 72998 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 22174 వద్ద కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, యూపీఎల్,అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,297)ని నమోదు చేసిన తర్వాత తీవ్ర ఊగిసలాటకు లోనైంది. కొనుగోళ్ల కొనసాగితే 22,300 – 22,500 స్థాయిని పరిక్షీణింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 22,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఇన్వెస్టర్లు పతనమైన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమం’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒకశాతం పెరిగాయి. సెన్సెక్స్ 716 పాయింట్లు, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా జనవరి గృహ విక్రయాలు, జపాన్ జనవరి ద్రవ్యోల్బణ డేటా ఫిబ్రవరి 27న, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు బుధవారం (28న) విడుదల కానున్నాయి. యూరోజోన్ ఫిబ్రవరి పారిశ్రామిక, సర్వీసెస్, కన్జూమన్ కాన్ఫిడెన్స్ డేటా బుధవారం వెల్లడి అవుతాయి. జపాన్ రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్లు, భారత క్యూ3 జీడీపీ వృద్ధి డేటా, అమెరికా నిరుద్యోగ, పీసీఈ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, జపాన్ నిరుద్యోగ రేటు, యూరోజోన్ హెచ్సీఓబీ కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, భారత్ ఆటో అమ్మకాలు, పారెక్స్ నిల్వల డేటా వెల్లడి కానున్నాయి. బుధవారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, జీడీపీ వృద్ధి డేటా ఈ గురువారం(ఫిబ్రవరి 29న) నిఫ్టీ సూచీకి చెందిన జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేరోజున ప్రస్తుత ఆర్థి క సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి డేటా విడుదల కానుంది. ప్రభుత్వ వ్యయంలో మందగమనం కారణంగా క్యూ2 జీడీపీ వృద్ధి (7.60%)తో తక్కువగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే వార్షిక ప్రాతిపదన గ త ఆర్థిక సంవత్సరం క్యూ3 జీడీపీ వృద్ధి(4.5%)తో పోలిస్తే అధికంగా ఉండొంచ్చంటున్నారు. డెట్ మార్కెట్లోకి రూ.18,500 కోట్లు భారత డెట్(రుణ) మార్కెట్లో ఫిబ్రవరి 2న నాటికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.18,500 కోట్లకు పైగా పట్టుబడులు పెట్టారు. త్వరలో భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చనున్న వార్తలు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. జనవరిలో భారత డెట్ మార్కెట్లోకి రూ.19,836 కోట్ల పెట్టుబడులు రాగా, ఇది ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ నెలవారీ ఇన్‌ఫ్లోగా నిలిచింది. గతంలో 2017 జూన్‌లో ఇన్‌ఫ్లో రూ. 25,685 కోట్లుగా నమోదైంది. సమీక్ష కాలంలో (ఫిబ్రవరి 1– 23 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.424 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జనవరిలో రూ.25,743 కోట్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. 3 ఐపీఓలు, 2 లిస్టింగులు ప్రాథమిక మార్కెట్ నుంచి ఆరు కంపెనీలు ఈ వారంలో రూ.3,330 కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికం టెలీ–సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూలు ఫిబ్రవరి 27న మొదలై 29న ముగియనున్నాయి. భారత్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ ఫిబ్రవరి 28– మార్చి 1 తేదీల మధ్య జరగనుంది. గతవారం ప్రారంభమైన జీపీటీ హెల్త్‌కేర్ ఐపీఓ ఫిబ్రవరి 26న(సోమవారం) ప్రారంభం కానుంది. ఇదేవారంలో ఫిబ్రవరి 28న జునియర్ హోటల్స్, మరుసటి రోజున జీపీటీ హెల్త్‌కేర్ షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస లాభాల్లో స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్టాక్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 73261 వద్ద నిఫ్టీ 35 పాయింట్ల స్వల్ప లాభంతో 22253 వద్ద కొనసాగుతుంది. హీరోమోటో కార్ప్, టైటాన్ కంపెనీ, గ్రాసిం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టీఐ మైండ్ ట్రీ, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో,సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా,మారుతి సుజికి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్ టీపీసీ, నెస్లే, హిందాల్కో, ఐటీసీ హేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయంలో సెన్సెక్స్ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 73134 వద్ద నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 22218 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్,గ్రాసిమ్,ఓఎన్జీసీ,బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, లార్సెన్, బజాజ్ ఆటో, హెచ్ సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 72592 వద్ద నిఫ్టీ43 పాయింట్ల స్వల్పంగా నష్టపోయి 22079 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ ,యూపీఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడగా...హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఎథేర్ మోటార్స్, బజాజ్ఆటో, బీపీసీఎల్, మారుతి సుజికి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తాజా ఆల్ టైమ్ హైని తాకడంతో ఫిబ్రవరి 19న సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ముగింపులో సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 72,708 వద్ద, నిఫ్టీ 81.60 పాయింట్ల లాభంతో 22,122 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. దాదాపు 2184 షేర్లు లాభాలు గడించగా... 1243 షేర్లు క్షీణించాయి. 123 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా టాప్ లాభాలు గడించగా, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ, విప్రో హెచ్డీఎప్సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. -
సాక్షి మనీ మంత్ర : సూచీల్లో కొనసాగుతున్న లాభాల పరంపర
దేశీయ సూచీల్లో లాభాల పరంపర కొనసాగుతుంది. ఫిబ్రవరి 16న నిఫ్టీ 22,000 ఎగువన భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలతో ముగిశాయి. విప్రో, ఎం అండ్ ఎం, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టి అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. చమురు అండ్ గ్యాస్, పవర్ మినహా, ఇతర అన్ని సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 1-2 శాతం వరకు గ్రీన్‌లో ట్రేడ్ అవ్వగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. -
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బీఎస్ఈ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్డ్ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. "తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్ల లాభంతో 71,833.17 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 96 పాయింట్లు పెరిగి 21,840 వద్ద ముగించింది. నిఫ్టీలో బీపీసీఎల్, ఎస్బిఐ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి, ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియల్టీ షేర్లు ఒక్కొక్కటి 1.2 శాతం పెరిగాయి. మరోవైపు ఐటీ, ఫార్మా సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లకు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసొచ్చాయి. ప్రధానంగా అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో మదుపర్లు ఆసియా మార్కెట్లలో మదుపు చేసేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికి.. మార్కెట్లు ముగిసే సమయానికి పుంజుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 482 పాయింట్ల లాభంతో 71555 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 21743 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఇక, కోల్ ఇండియా, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, విప్రో షేర్లు లాభాల్లో ముగియగా.. హిందాల్కో, గ్రాసిమ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్ల నష్టంతో 71072 వద్ద నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21616 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అపోలో హాస్పటిల్స్, దివీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగియగా.. కోల్ ఇండియా, హీరోమోటో కార్ప్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు మార్కెట్ ర్యాలీ విపరీంగా ఉన్న సమయంలో మదుపర్లలలో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా షేర్లు కొనుగోలు జరిగే సమయంలో ప్రతికూల వార్తలు ఇబ్బందే పెట్టే అవకాశం ఉందని భావించే ఇన్వెస్టర్లు కొనుగోలు, అమ్మకాల సమయాల్లో ఆచితూచి వ్యవహిరస్తుంటారు. ఫలితంగా ఫిబ్రవరి 12న మార్కెట్లు నష్టాలతో ముగిశాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర : లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం సాయంత్రం లాభాలతో ముగింపు పలికాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ పలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 71595 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల స్వల్ప లాభంతో 21782 వద్ద ముగించాయి. ఇక గ్రాసిం, ఎస్బీఐ, అపోలో హాస్పటిల్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, హీరోమోటో కార్ప్, అదానీ పోర్ట్స్, సిఫ్లా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగింపు పలకగా.. ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా స్టీల్, హిందాల్కో, యూపీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. యూఎస్ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు సైతం సానుకూల సంకేతాలు రావడం, విదేశీ మదుపరులు సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే దేశీయ సూచీలపై ఐటి షేర్లు ప్రభావం చూపినప్పటికీ, ఫైనాన్షియల్, రియల్టీ స్టాక్స్ పురోగతికి దారితీశాయి. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72152 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా ఒక పాయింట్ లాభంతో మార్కెట్‌కు ముగింపు పలికాయి. ఇక ఎస్బీఐ, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగియగా..టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, బీపీసీఎల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలతో మార్కెట్‌కు ముగింపు పలికాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో జాప్యం దేశీయ స్టాక్ సూచీలకు కలిసి వచ్చింది. ఫలితంగా మంగళవారం ఉదయం స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై.. మార్కెట్లు ముగిసే సమయానికి లాభాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. చైనా, హాంకాంగ్ మినహా గ్లోబల్ మార్కెట్లు ఆశించిన స్థాయిలో రాణించ లేనప్పటికి భారత్ స్టాక్ మార్కెట్లు మరిన్ని లాభాల్ని పుంజుకున్నాయి. ఇక మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 454.67 పాయింట్లు లాభంతో 72,186 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 21,939.20 వద్ద ముగిశాయి. బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, మారుతి సుజికి, విప్రో, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, లార్సెన్ షేర్లు లాభాలు గడించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్రిటానియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ సమయానికి బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభ మయ్యాయి. కొద్ది సేపటికే లాభాల్లోకి జారుకున్నాయి. ఇలా ఒడిదుడుకుల మధ్య ఉదయం 9.50 గంటల సమయానికి స్టాక్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 152 పాయింట్లతో 71292 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 21576 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎథేర్ మోటార్స్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. లార్సెన్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, ఎల్ టీఐ మైండ్ ట్రీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
స్టాక్‌మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్‌కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకంటే.. ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది. తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’.. మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట. లాభాలు ఇవే.. ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి. తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు. బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు. సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది. ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. -
ఐటీ షేర్ల అండ.. కొత్త శిఖరాలు
న్యూఢిల్లీ: ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్ల అండతో స్టాక్ సూచీలు శుక్రవారం ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బలపడటమూ కలిసొచ్చింది. ఐటీతో పాటు అధిక వెయిటేజీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇంధన షేర్లు, అలాగే సర్వీసెస్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, వినిమయ షేర్లు రాణించి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 72,568 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 21,895 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు స్థాయిలు కావడం విశేషం. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు 0.41%, 0.36% లాభపడ్డాయి. రికార్డుల ర్యాలీలోనూ ఫార్మా, ఆటో, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణ, ఉపాధి కల్పన అంచనాలకు మించిన నమోదు కారణంగా ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.\ ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలను విస్మరిస్తూ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 72,148 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 21,774 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉత్సాహంగా మొదలైన సూచీలు రోజంతా అదే రోజు కనబరిచాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగసి 72,721 వద్ద, నిఫ్టీ 282 పాయింట్లు బలపడి 21,928 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. ♦ సెన్సెక్స్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 4 సెషన్లలో రూ.6.88 లక్షల కోట్లు పెరిగి ఆల్ టైం హై రూ.373.29 లక్షల కోట్లకు చేరింది. ♦ఐటీ రంగ షేర్లు 8% ర్యాలీ చేసి సూచీలను సరికొత్త శిఖరాల వైపు నడిపించాయి. ♦దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌ల క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో ఈ రంగ షేర్లకు డిమాండ్ పెంచింది. ♦కోఫోర్జ్ 6%, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్టీఐఎం షేర్లు 5%, విప్రో, ఎంఫసీస్‌లు 4%, పెర్సిస్టెంట్ 3.50%, ఎల్టీటీఎస్ 2% లాభపడ్డాయి. ♦ అంచనాలకు తగ్గట్టు డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు ప్రకటిచడంతో ఇన్ఫోసిస్ షేరు 8% ఎగసి రూ.1612 వద్ద ముగిసింది. ♦ ఇదే క్యూ3లో మెరుగైన పనితీరుతో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించిన టీసీఎస్ షేరు 4% లాభపడి రూ.3,882 వద్ద స్థిరపడింది. ♦ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6%, యూనియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్‌లు 5%, పీఎస్బీ, యూకో బ్యాంక్, పీఎస్బీ, సెంట్రల్ బ్యాంక్‌లు 3% పెరిగాయి. ఎస్బీఐ, ఐఓబీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ షేర్లు 2–1% మధ్య లాభపడ్డాయి. -
సాక్షి మనీ మంత్ర : లాభాలతో ముగింపు పలికిన దేశీయ సూచీలు
అంతర్జాతీయంగా నెలకొన్ని ప్రతికూల పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసివచ్చాయి. ఫలితంగా దేశీయ, విదేశీయ మదుపర్లు.. భారత్ మార్కెట్లో పెట్టుపడులు పెట్టేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్ల లాభంతో 71657 వద్ద నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 21618 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, హెచ్‌సీఎల్, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆల్ట్రా టెక్ సిమెంట్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి. -
సాక్షి మనీ మంత్ర : లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
ఒడిదుడుకుల మధ్య సూచీలు జనవరి 9న వరుసగా రెండో సెషన్లో లాభాలతో ముగిశాయి. మంగళవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 30.99 పాయింట్ల లాభంతో 71,386 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు లాభంతో 21,544.80 వద్ద మార్కెట్లు ముగిశాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్ మరియు అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ ,ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలలో ఆటో, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్ రియల్టీ ఒక్కొక్కటి 0.5-2.5 శాతం వృద్ధిని సాధించాయి. లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది. -
సాక్షి మనీ మంత్ర : ఓపెనింగ్స్‌లో అదరగొట్టిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ ఓపెనింగ్స్‌లో అదరగొట్టాయి. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 71,565 వద్ద నిఫ్టీ 52 పాయింట్ల స్వల్ప లాభంతో 21569 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్,ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బీపీసీఎల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. -
కొత్త ఏడాది తొలి రోజు సరికొత్త రికార్డులు తాకి.. వెనక్కి
ముంబై: కొత్త ఏడాది తొలి ట్రేడింగ్ సెషన్లోనూ సూచీల రికార్డుల జైత్రయాత్ర కొనసాగింది. ఇంధన, సర్వీసెస్, టెలికం షేర్లు రాణించడంతో సోమవారం ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ కొత్త సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. అయితే లాభాల స్వీకరణతో తదుపరి వెనక్కి వచ్చాయి. ఉదయం స్వల్ప నష్టంతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 322 పాయింట్లు పెరిగి 72,562 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు బలపడి 21,834 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఆటో, బ్యాంకులు, కన్జూమర్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగి 72,271 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 21,742 వద్ద నిలిచాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.73%, 0.54% చొప్పున రాణించాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా మార్కెట్లకూ సెలవు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఆరు పైసలు పతనమై 83.22 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►డిసెంబర్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో ఆటో షేర్లు నష్టపోయాయి. ►ఎన్పీఏ పోర్ట్‌ఫోలియో విక్రయంలో భాగంగా జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీ నుంచి రూ.150 కోట్లు అందుకున్నట్లు ఎక్సే్చంజీలకు సమాచారం ఇవ్వడంతో యస్ బ్యాంక్ షేరు ఐదున్నర శాతం పెరిగి రూ. 22.64 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% లాభపడి రూ.22.99 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ►దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ.121 కోట్ల ఆర్డర్ దక్కించుకోవడంతో రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు 4.50% లాభపడి రూ.353 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 10% ఎగసి రూ.371 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. -
గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం..
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన స్థానంలో ఉంది. దేశ ఆర్థికాభివృద్ధి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇండియా ఎకానమి గ్రోత్‌కు సంబంధించి పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. అందుకు అనువుగా స్టాక్‌మార్కెట్లు మరింత పుంజుకుంటున్నాయి. కరోనా సమయంలో నిఫ్టీ సూచీ 8000 మార్కు వద్ద ఉండేది. ప్రస్తుతం 21,700 పాయింట్లతో జీవితకాల గరిష్ఠాన్ని చేరుతుంది. భారత్ వృద్ధిపై ఎలాంటి అనుమానం లేకుండా సమీప భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందనే భావన బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా చాలా మంది స్టాక్మార్కెట్లో మదుపు చేస్తున్నారు. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మదుపరుల డేటా విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 2023లో భారీగా పెరిగింది. ఈ ఏడాదితో మదుపుదారుల సంఖ్య తొలిసారి 8 కోట్లకు చేరింది. గతేడాది డిసెంబర్ 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్ మార్కెట్ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ గుజరాత్‌ను అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో యూపీ రెండో స్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: న్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే.. 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది. -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
ఈ ఏడాది చివరి ట్రేడింగ్ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిన్నమొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన సూచీలు నేడు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఫలితంగా శుక్రవారం ఉదయం 9.25గంటల సమయానికి సెన్సెక్స్ 174 పాయింట్ల నష్టంతో 72236 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 21723 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది టాటా కన్జూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్, టాటా మోటార్స్, మారుతి సుజికీ, సన్ ఫార్మా, ఎథేర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, కొటక్ మహీంద్రా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ, కోల్ ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. -
బుల్ జోరు.. రికార్డ్ స్థాయిలో దేశీయ సూచీల ర్యాలీ
ముంబై: వరుసగా అయిదో రోజూ కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం వంటి అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా స్టాక్ సూచీలు ఈ ఏడాది(2023) చివరి ఎఫ్అండ్ఓ గడువు ముగింపు రోజైన గురువారం మరోసారి ఇంట్రాడే, ముగింపుల్లో చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు పెరిగి 72,410వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 21,777 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పట్టకీ.., తిరిగి పుంజుకోగలిగాయి. అయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో ఒక దశలో సెన్సెక్స్ 446 పాయింట్లు బలపడి 72,484 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు దూసుకెళ్లి 21,801 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. పారిశ్రామిక, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.66%, 0.23% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4359 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.137 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 5 రోజుల్లో 1,904 పాయింట్ల లాభంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ సంస్థల మార్కెట్ విలువ రూ.12.80 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.363 లక్షల కోట్లకు చేరింది. గురువారం ఒక్కరోజే రూ.1.7 లక్షల కోట్లు పెరిగింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెవలరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించి రూ.402 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ డీజీజీఐ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో జొమాటో షేరు 3% నష్టపోయి రూ.123 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పతనమై రూ.121 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. హౌసింగ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో రూ. 14,500 కోట్ల ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రభుత్వ రంగ హడ్కో షేరు 12% పెరిగి రూ.128 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రావడం, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో డాలర్ మారకంలో రూపాయి గురువారం 17 పైసలు పెరిగి 83.17 వద్ద స్థిరపడింది. -
సాక్షి మనీ మంత్ర : దేశీయ మార్కెట్లో బుల్ జోరు
దేశీయ ఈక్విటీ మార్కెట్ బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుల్ జోరు కొనసాగుతుంది. బుధవారం మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.24 నిమిషాలకు సెన్సెక్స్ 257 పాయింట్లు లాభంతో 71,593 వద్ద నిఫ్టీ 70 పాయింట్లతో 21,519 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించాయి. అయితే అరగంటలో మార్కెట్ ట్రెండ్‌ను పసిగట్టిన మదుపర్లు అమ్మకాల్ని ఉదృతం చేశారు. దీంతో మార్కెట్లో బుల్ తన జోరును మరింత పెంచింది. వెరసి 10 గంటల సమయానికి సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 71717 వద్ద, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 21559 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్,బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్,ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, లార్సెన్, టాటా స్టీల్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్,సిప్లా, టైటాన్ కంపెనీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, మారుతి సుజికీ, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టాలతో ఊగిసలాడుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
స్టాక్ మార్కెట్ల భవిష్యత్తు ఏమిటి?
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ అమ్మకాల - కొనుగోళ్ల ట్రెండ్ ప్రారంభమైంది. నెలన్నర కాలంలో పెట్టుబడి దారులు స్టాక్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు. కానీ ఈ వారంలో అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్ట్ర్లలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో మార్కెట్లో ట్రెండ్ ఏవిధంగా ఉండబోతుంది. మదుపరులు ఇన్వెస్ట్ చేస్తారా? లేదంటే కొనుగోలు చేస్తారా? అనే అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు, ఆషికా మోహన్ ఇనిస్టిస్ట్యూషనల్ ఈక్విటీస్ కౌశిక్ మోహన్‌లు విశ్లేషించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. కారుణ్య రావు : గడిచిన సెషన్స్‌లో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కానీ రెండు సెషన్స్‌లో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. రానున్న రోజుల్లోనూ ఈ ఒడిదుడుకులు ఇలాగే కొనసాగుతాయా? లేదంటే మార్కెట్లు తిరిగి పుంజుకుంటాయా? కౌశిక్ మోహన్ : నాకు తెలిసి గత రెండు రోజుల నుంచి మార్కెట్లో ఒడిదుడుకులు (కన్సాలిడేషన్) లోనయ్యాయి. ఈ ప్రభావం ఎక్కువగా మిడ్, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్లోఉంది. దీనంతటికి దేశంలో కోవిడ్-19 కేసులు నమోదు ఇందుకు కారణమని చెప్పుకోవాలి. కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్న భయాలు ఒక్కరోజు మాత్రమే ఉన్నాయి. మరుసటి రోజు లాభాల్లోనే ట్రేడయ్యాయి. కారుణ్యరావు : ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు సెల్ చేయాలా? బై చేయాలా? లేదంటే వేచి చూడాలా? వారికి మీరిచ్చే సలహా? కౌశిక్ మోహన్ : మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఎవరైతే ఇన్వెస్టర్లు రుణాలు తక్కువగా ఉండి, తగినంత క్యాష్ కంపెనీలో ఉంటే .. ఆ ఫండమెంటల్ కంపెనీ అమ్మకాలు మూడేళ్లలో అమ్మకాలు, ఆదాయాలు రెట్టింపు అయ్యాయో వాటి స్టాక్స్‌ను కొనుగోలు చేయడం ఇదే మంచి సమయం. ఆదాయాల్ని బట్టి స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి. కాబట్టే కంపెనీని స్థాపించి మూడేళ్ల సమయం తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని పెట్టుబడి దారులకు సలహా ఇస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర : స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డ్‌లు
శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు తాజా రికార్డ్ స్థాయిలో గరిష్టాన్ని తాకాయి. నిఫ్టీ 21,300 వద్ద ప్రారంభమైంది ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్ 282.80 పాయింట్లు లాభంతో 70,797 వద్ద, నిఫ్టీ 87.30 పాయింట్లు లాభంతో 21,270 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. దాదాపు 1712 షేర్లు అడ్వాన్స్‌లో ట్రేడ్ అవుతుండగా , 411 షేర్లు క్షీణించాయి. 109 షేర్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, హిందాల్కో, జెఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉండగా, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎయిర్టెల్, నెస్లే, బ్రిటానియా నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : లాభాలతో ముగిసిన సూచీలు
తీవ్ర ఒడిదుడుకుల మధ్య శుక్రవారం దేశీయ స్టాక్ట్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్ల లాభాంతో 69,856 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల స్వల్ప లాభంతో 20,969 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హీరోమోటో కార్పొ, ఓఎన్జీసీ, బ్రిటానియా, ఎం అండ్ ఎం, దివిస్ ల్యాబ్స్ నష్టాలతో ముగిశాయి. -
సాక్షి మనీ మంత్ర : దేశీయ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల పరంపర
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతుంది. జాతీయ, అంతర్జాతీయ అనుకూల ప్రభావంతో బుధవారం సైతం మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో పాజిటీవ్ సంకేతాలు దేశీయ మార్కెట్లకు మరింత కలిసి వచ్చింది. ఫలితంగా మార్కెట్లు ముగిసే సమయానికి గంట ముందు నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త గరిష్టాల్ని తాకాయి. చివరిగా మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 405 పాయింట్ల భారీ లాభంతో 69,701 వద్ద నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 20,949 వద్ద ముగిశాయి. విప్రో, ఎల్అండ్ టీ మైండ్ ట్రీ,ఐటీసీ, లార్సెన్, టీసీఎస్, టాటామోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, యూపీఎల్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. కలిసొచ్చిన ఎన్నికలు దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి జై కొట్టడంతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. మదుపర్లకు ఉపశమనం కలగడంతో కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో దేశంలోకి విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయని మెహతా ఈక్విటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అభిప్రాయం వ్యక్తం చేశారు. తస్మాత్ జాగ్రత్త! దేశీయ స్టాక్ సూచీల ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రోగ్రెసీవ్ షేర్ బ్రోకర్స్ సంస్థ డైరెక్టర్ ఆధిత్య గర్గే.. ఇప్పటికే మార్కెట్లో భారీ ఎత్తున కొనుగుళ్లు జరిగాయని, ఈ విషయంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మార్కెట్లో ఆయా స్టాక్స్ పనితీరు ఎలా ఉందంటే? ♦డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ఇన్వెస్టర్లు టెక్నాలజీ స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నిర్ణయం ఈ రంగానికి కొంత మార్జిన్ ఒత్తిడిని తగ్గించగలదని నిపుణులు భావిస్తున్నారు. విప్రో , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎల్‌టిఐమైండ్‌ట్రీ షేర్లు దాదాపు 2-3 శాతం పెరిగాయి. ♦ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పాజిటీవ్ రేటింగ్ ఇవ్వడంతో ఆ సంస్థ షేర్ల కొనుగోలు జరిగాయి. ఆ షేర్ల విలువ ఒక శాతానికి పైగా పెరిగింది. ♦అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్సీ) హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అసంబద్ధం అని తేల్చడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ జోరు కొనసాగుతుంది. అదానీ పోర్ట్స్ 2 శాతం పెరిగి నిఫ్టీ 50లో టాప్ గెయినర్లలో ఒకటిగా నిలిచింది. ♦ఎథేర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు క్షీణించాయి. 1-2 శాతం పడిపోయాయి. పెన్నీ స్టాక్స్ జోరును కొనసాగించడం విశేషం. ♦బ్యాంకింగ్ పేర్లలో ప్రాఫిట్-బుకింగ్ మునుపటి సెషన్లో రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ♦నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.4 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.2 శాతం పెరిగాయి. -
దూసుకెళ్లిన షేర్లు.. 13లక్షల కోట్లకు చేరిన అదానీ గ్రూప్ కంపెనీల విలువ!
దేశీయ స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు అదరగొట్టేస్తున్నాయి. డిసెంబర్ 5న ఆ గ్రూప్‌కి చెందిన అన్నీ షేర్ల విలువ 20 శాతానికి ఎగబాకాయి. హిండేన్ బర్గ్ రీసెర్చ్ .. అదానీ పోర్ట్ మోసాలకు పాల్పడుతుందంటూ చేసిన ఆరోపణల్ని అమెరికా ఏజెన్సీ వ్యతిరేకించడం.. అదానీ గ్రూప్ కంపెనీలకు కలిసి వచ్చింది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్సీ) శ్రీలంకలో నిర్మించనున్న కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి 553 మిలియన్ల రుణాల్ని అదానీ గ్రూప్‌కు మంజూరు చేయాల్సి ఉంది. అంతకంటే ముందే హిండేన్ బర్గ్ చేస్తున్న ఆరోపణలు నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన అమెరికా ప్రభుత్వ అధికారులు అదానీ గ్రూప్‌పై విడుదల చేసిన హిండేన్ బర్గ్ రిపోర్ట్‌లపై దర్యాప్తు చేపట్టారు. అధికారుల దర్యాప్తులో శ్రీలకంలో నిర్మించబోయే కంటైనర్ టెర్మినల్‌లో అదాని గ్రూప్ ఎలాంటి కార్పొరేట్ మోసాలకు పాల్పడలేదని గుర్తించారు. హిండేన్ బర్గ్ చేసిన ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయని నిర్ధారిస్తూ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక వెలుగులోకి రావడంతో అదానీ గ్రూప్ షేర్ల కొనుగోళ్లు విజృంభించాయి. ఫలితంగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ షేర్ల విలువ 10 శాతం పెరిగి రూ.2,784 వద్దకు చేరాయి. ఎన్ఎస్ఈ మార్కెట్ కేపిటల్ విలువ 3లక్షల కోట్లకు చేరింది. 54 వారాల లో సర్క్యూట్ తర్వాత అదానీ షేర్లు 173 శాతానికి ఎగబాకాయి. దీంతో పాటు అదానీ గ్రూన్ ఎనర్జీ షేర్లు 17 శాతం, అలాగే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ 9 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 7శాతం, అదానీ పవర్ 7శాతం, అదానీ విల్మర్ 5శాతం, అంబుజా సిమెంట్స్ 5శాతం, ఏసీసీ 6శాతం, ఎన్డీటీవీ 7శాతం చొప్పున లాభపడ్డాయి. మొత్తంగా అదానీ గ్రూప్ కంపెనీల విలువ రూ.14 లక్షల కోట్లు దాటింది. -
సాక్షి మనీ మంత్ర : బుల్ రంకెలు.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ రంకేలేస్తుంది. ఫలితంగా వరుస సెషన్లలో భారీ లాభాల్ని మూటగట్టుకుంటుంది. మంగళవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 69296 వద్ద నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 20855 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, మారుతి సుజికీ షేర్లు లాభాల్లో ముగియగా.. ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, ఎథేర్ మోటార్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, విప్రో షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లోని బుల్ జోరుకు ఈ వారం కీలకమైన యూఎస్ జాబ్ డేటా విడుదల కంటే ముందే మదుపరులు అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ దేశీయ మార్కెట్లు పాజిటీవ్‌గా ట్రేడవ్వడంతో తాజా గరిష్టాలను తాకింది. దీంతో పాటు దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సానుకూలంగా జీడీపీ, యథాతథంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం వంటి అంశాలు కలిసి వచ్చాయని దేశీయ స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దూసుకెళ్లిన టాటా షేర్లు, ఒక్కో షేర్‌ను రూ. 500కి కొంటే.. ఒక్కరోజే ఇంత లాభమా!
దేశీయ స్టాక్ మార్కెట్లో టాటా టెక్నాలజీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఐపీఓ తర్వాత ప్రారంభమైన తొలిరోజు ఇంట్రా- డే ట్రేడింగ్‌లో టాటా టెక్నాలజీ షేర్లు 180 శాతం లాభంతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓ తర్వాత ప్రారంభమైన ట్రేడింగ్ టాటా టెక్నాలజీ షేర్ల తరహాలో ఇతర ఏ కంపెనీ ఈ స్థాయిలో షేర్లు రాణించలేదు. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో టాటా టెక్నాలజీ షేర్ ధర రూ.1,200 అమాంతం పెరగగా, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో అదే షేర్ వ్యాల్యూ రూ.1,199కి చేరింది. దీంతో ఆ స్టాక్ వ్యాల్యూ ఐపీఓ సమయంలో ఉన్న ధర కంటే 140 శాతం రెట్టింపు అయ్యింది. సరిగ్గా ఉదయం 11.47 గంటల సమయానికి 167 శాతానికి రూ.1338 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించాయి. ఇక మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో టాటా టెక్నాలజీ ధర రూ.1,327 వద్ద స్ధిరపడింది. బీఎస్ఈలో రూ.1,326 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. టాటా గ్రూప్ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా టెక్నాలజీస్ రూ.3042 కోట్లను సమీకరించేందుకు ఐపీఓకు భారీ స్థాయిలో సబ్స్క్రిప్షన్ వచ్చింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్ల స్పందన లభించింది. మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 దగ్గర లెక్కిస్తే ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లతో సమానం. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. రెండు నెలల తర్వాత తొలిసారి గ్లోబుల్ మార్కెట్లో సానుకూల సంకేతాలతో మదుపర్లు భారీ ఎత్తున కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 727 భారీ లాభంతో 66,901.91 వద్ద నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 20,096 వద్ద ముగిశాయి. హీరో మోటోకార్పొ,ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, విప్రో, టాటా మోటార్స్ లాభాల్లో ముగియగా.. ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, ఎథేర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలతో ముగింపు పలికాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి
ముంబై: ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో శుక్రవారం స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,970 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఎనిమిది పాయింట్లు తగ్గి 19,800 దిగువన 19,794 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం మిశ్రమంగా మొదలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఐటీతో పాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, కన్జూమర్, ఇంధన షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన చిన్న తరహా కంపెనీల షేర్లు రాణించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4–3 నూతన ఉత్పత్తులను ఆవిష్కరణతో పాటు నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధిస్తామని చైర్మన్ సిద్ధార్థ మొహంతి ధీమా వ్యక్తం చేయడంతో ఎల్ఐసీ షేరు 9.50% లాభపడి రూ.678 వద్ద ముగిసింది. లిస్టింగ్ నుంచి ఈ షేరుకిదే అతి పెద్ద ర్యాలీ. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.38 వేల కోట్లు పెరిగి రూ.4.28 లక్షల కోట్లకు చేరింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు పరిశీలించాలంటూ కోరుతూ ధాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేయడం అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్లూ లాభాల్లో ముగిశాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ (2.3%, అదానీ పవర్ 4.06%, అదానీ టోటల్ గ్యాస్ 1.2%, అదానీ ఎనర్జీ సెల్యూషన్స్ 0.84%, అదానీ గ్రీన్ ఎనర్జీ 0.77%, అంబుజా సిమెంట్ 0.31% చొప్పున లాభపడ్డాయి. -
సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 66060 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 19820 వద్ద ట్రేడవుతున్నాయి. సిప్లా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్రెడ్డీస్ ల్యాబ్స్,ఎన్టీపీసీ,పవర్ గ్రిడ్ కార్పొరేషన్,ఎల్‌టీఐమైండ్ ట్రీ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హిందాల్కో, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరోమోటో కార్ప్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బీపీసీఎల్, హెచ్‌యూఎల్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం థ్యాంక్స్ గివిండ్ డే సందర్భంగా అమెరికన్ స్టాక్‌మార్కెట్లు పనిచేయలేదు. శుక్రవారం మాత్రం సగం రోజు మాత్రమే ట్రేడింగ్ నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఆసియా మార్కెట్లు మిక్స్డ్ ఫలితాల్ని రాబట్టే అవకాశం ఉందని మార్కెట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు అనేకం ఉండగా.. వాటిల్లో ప్రధానంగా జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికం .. ఈ రెండు త్రైమాసికాలలో జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదింపుకు గురైందని విడుదల చేసిన ప్రభుత్వ డేటాలో తేలింది. మరోవైపు ఏఎస్ఎక్స్ (ఆస్ట్రేలియా), నిఖాయ్ (టోక్యో) మార్కెట్లు పాజిటీవ్‌లో ట్రేడ్ అవుతుండగా, కాస్పీ (కొరియా), షాంఘై (చైనా) ఈ మూడు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లే పడే అవకాశం ఉందని అంచనాల మద్య దేశీయ స్టాక్ సూచీలు మిక్స్డ్ ఫలితాల్ని రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలలోని ఒడిదుడుకులు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో బుధవారం ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 40 పాయింట్ల స్వల్ప లాభాంతో 65971 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లతో 19800 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. బీపీసీఎల్, టాటా,సిప్లా,టాటా మోటార్స్,కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్స్,జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మంగళవారం అమెరికన్ స్టాక్ మార్కెట్లో నాస్డాక్, ఎస్అండ్పీ 500 స్టాక్స్ వరుసగా ఐదు రోజుల పాటు లాభాల్లో కొనసాగినా.. చివరకు మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అటు ఆసియా మార్కెట్లు ఏఎస్ఎక్స్, షాంగాయ్, కాస్పీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 1న జరిగిన అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ సంబంధించి పూర్తి సమాచారం మంగళవారం విడుదలైంది. అయితే, వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? అని ఉత్కంఠతగా ఎదురు చూసిన అమెరికన్ స్టాక్ మార్కెట్లకు ఫెడ్ రిజర్వ్ తీరుతో అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మార్కెట్లు ఆశించిన స్థాయిలో ట్రేడవ్వలేదు. ఇక మానిటరీ పాలసీలో సైతం ఎలాంటి మార్పులు ఉండబోవని ఫెడ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్‌లో తేలింది. ఫలితంగా అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా సానుకూల సెంటిమెంట్ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం, అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు కలిసిరావొచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్ మినిట్స్, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళీ ఈ వారం ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. అలాగే ఈ వారంలో ఐదు కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చంటున్నారు. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపైనా దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అమెరికా బాండ్ల ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు కీలకం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు మార్కెట్ స్థిరంగా ట్రేడొచ్చు. తదుపరి మార్కెట్లపై గమనంపై ఓ అంచనాకు రావొచ్చు. నిఫ్టీ 19,850 స్థాయిని చేధించే వరకు స్థిరీకరణ దశలోనే ట్రేడవుతుంది. వచ్చే వారంలో నిఫ్టీ 19,700 – 19,900 పాయింట్ల పరిధిలో ట్రేడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణుడు సంతోష్ మీనా తెలిపారు. ద్రవ్యోల్బణ దిగిరావడంతో వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ఆగొచ్చనే అంచనాలతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో గతవారం సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతు అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 890 పాయింట్లు, నిఫ్టీ 307 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మంగళవారం ఫెడ్ రిజర్వ్ సమావేశ వివరాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నవంబర్ 1న నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు(ఫెడ్ మినిట్స్) మంగవారం విడుదల కానున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదలతో ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత వడ్డీ రేట్ల శ్రేణి 5.25–5.50% వద్ద నిలిపివేసే సాధ్యాసాధ్యాలను ఇన్వెస్టర్లతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే కమిటీ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారింవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా మంగళవారం అక్టోబర్ రిటైల్, గృహ అమ్మకాలు, నిరుద్యోగ డేటా బుధవారం వెల్లడి కానున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూరోజోన్, యూకే, అమెరికా దేశాల నవంబర్ తయారీ పీఎంఐ డేటా బుధవారం విడుదల కానున్నాయి. ఆయా దేశాల కీలక డేటా ప్రకటనకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించనున్నారు. మారుతున్న ఎఫ్ఐఐల వైఖరి గడిచిన రెండు నెలల్లో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ నవంబర్‌లో రూ.1,433 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు. అమెరికా బాండ్లపై రాబడులు, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం ఇందుకు ప్రధాన కారణం. ‘‘భారత్‌లో పండుగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎఫ్ఐఐలు పెట్టుబడులు పెట్టేందుకు మరింత ఆసక్తి కనబరచవచ్చు. ఇటీవల మార్కెట్ దిద్దుబాటుతో దిగివచ్చిన షేర్లను కొనేందుకు వారు ఆసక్తి చూపవచ్చు’’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెల 22–24 మధ్య రాకింగ్‌డీల్స్ ఐపీవో కన్జూమర్ రిటైల్ విభాగంలో బీటూబీ సోర్సింగ్ ప్లాట్‌ఫామ్‌గా సేవలందించే రాకింగ్‌డీల్స్ సర్క్యులర్ ఎకానమీ లిమిటెడ్ ఈ నెల 22న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 24న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 136–140గా నిర్ణయించింది. ఆఫర్లో భాగంగా 15 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 21 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్ట్‌కానుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 21న షేర్లను విక్రయించనుంది. నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, బ్రాండ్ పటిష్టత, మార్కెటింగ్ తదితరాలకు వినియోగించనుంది. -
సాక్షి మనీ మంత్ర : ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్ సూచీలు
జాతీయ, అంతర్జాతీయ ప్రతి కూల అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఫలితంగా లాభనష్టాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టం 65937 వద్ద నిఫ్టీ, 9 పాయింట్ల స్వల్ప లాభంతో కొనసాగుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, ఎంఅండ్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్,బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఐటీ, ఆటో, ఫార్మా షేర్ల పరుగులు
ముంబై: ఐటీ, ఆటో, ఫార్మా, వినిమయ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభాలు ఆర్జించాయి. విదేశీ ఇన్వెస్టర్ల తాజా కొనుగోళ్లు, అమెరికా ద్రవ్యోల్బణ దిగిరావడం, బాండ్లపై రాబడులు తగ్గుదల పరిణామాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 307 పాయింట్లు పెరిగి 65,982 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 90 పాయింట్లు బలపడి 19,765 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో నష్టాలు అ«ధిగమించి లాభాల బాటపట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 682 పాయింట్లు ర్యాలీ చేసి 66,358 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 19,875 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ట్రేడింగ్ చివర్లో మరోసారి అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సూచీల లాభాలు కొంతమేర తగ్గాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. ►ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డుల ద్వారా రుణాల జారీ, పంపిణీలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశాలతో బజాబ్ ఫైనాన్స్ షేరు ట్రేడింగ్ ప్రారంభంలో 4% నష్టపోయి రూ.6937 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు, ఈక్విటీ మార్కెట్ ర్యాలీ అంశాలు కలిసిరావడంతో షేరు బౌన్స్‌బ్యాక్ అయ్యింది. ట్రేడింగ్ నష్టాలు భర్తీ చేసుకొని చివరికి 2% లాభంతో రూ.7366 వద్ద స్థిరపడింది. ►ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు సన్నగిల్లడంతో ఎగుమతి ఆధారిత రంగ ఐటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ రెండున్నర శాతం ర్యాలీ చేసింది. సెన్సెక్స్ 30 షేర్లలో టీసీఎస్(3%), హెచ్‌సీఎల్‌టెక్(2.80%), టెక్ మహీంద్రా(2.70%), ఇన్ఫోసిస్(2.50%)లు తొలి నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. టాటా టెక్నాలజీస్ ః రూ. 475–500 ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజిటల్ సొల్యూషన్స్ అందించే ఇంజినీరింగ్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో ఐపీవో ఈ నెల 22న ప్రారంభంకానుంది. 24న ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్, ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌తోపాటు.. ప్రస్తుత వాటాదారు సంస్థలు అల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్–1 మొత్తం 6.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా దాదాపు రూ. 3,043 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తదుపరి డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి పబ్లిక్ ఇష్యూ ఇదికాగా.. ఇంతక్రితం 2004లో టీసీఎస్ లిస్టయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బలిప్రతిపద సెలవు తర్వాత నిన్న సూచీలు జోరును కొనసాగించాయి. ఫలితంగా సెన్సెక్స్ 814 పాయింట్లు ఎగసి 65,748 వద్ద, నిఫ్టీ 249 పాయింట్లు బలపడి 19,693 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. అయితే, గురువారం మాత్రం స్టాక్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంతో 65568 వద్ద నిఫ్టీ 36 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ, హీరోమోటోకార్ప్, కోల్ఇండియా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
బుల్ రన్, దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్
ముంబై: అమెరికా, భారత్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో బుధవారం దేశీయ స్టాక్ సూచీలు నెల గరిష్టంపైన ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు, బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు 14 ట్రేడింగ్ సెషన్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసొచ్చాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు రాణించడంతో బుధవారం సెన్సెక్స్ 742 పాయింట్లు పెరిగి 65,676 వద్ద ముగిసింది. నిఫ్టీ 232 పాయింట్లు బలపడి 19,675 వద్ద నిలిచింది. బలిప్రతిపద సెలవు తర్వాత ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ట్రేడింగ్‌లో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 814 పాయింట్లు ఎగసి 65,748 వద్ద, నిఫ్టీ 249 పాయింట్లు బలపడి 19,693 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.13%, 0.91% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.550 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.610 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ (హాంగ్‌సెంగ్) అత్యధికంగా 4% ర్యాలీ చేసింది. జపాన్ నికాయ్ 2.50%, కొరియా, థాయిలాండ్ సూచీలు 2%, ఇండోనేషియా, సింగపూర్ సూచీలు 1% చొప్పున లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1% మేర పెరిగాయి. అమెరికా మార్కెట్లు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ‘అమెరికా, బ్రిటన్, భారత్‌ల్లో ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఫెడరల్ రిజర్వ్‌తో సహా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేయొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు సంకేతంగా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టాయి. పండుగ సీజన్, మెరుగైన కార్పొరేట్ ఫలితాలతో ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపొచ్చు. ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ తిరిగి 20,000 స్థాయిని అందుకోవచ్చు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీపావళి బోనస్ : రూ.3.29 లక్షల కోట్లు దలాల్ స్ట్రీట్ ఒక శాతం ర్యాలీ చేసి ఇన్వెస్టర్లకు దీపావళి కానుకగా రూ.3.3 లక్షల కోట్ల బోనస్ ఇచ్చింది. సెన్సెక్స్ 742 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.3.29 లక్షల కోట్లు పెరిగి రూ.325.41 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 2%, ఇండస్ఇండ్ 1%, పవర్‌గ్రిడ్ 1% మాత్రమే నష్టపోయాయి. అదరగొట్టిన ఆస్క్ ఆటోమోటివ్ లిస్టింగ్ ఆస్క్ ఆటోమోటివ్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.282)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.305 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 12 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.317 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 10% లాభపడి రూ.310 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,115 కోట్లుగా నమోదైంది. రూపాయి రికవరీ జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి రూపాయి రికవరీ అయ్యింది. డాలర్ మారకంలో 24 పైసలు బలపడి 83.09 స్థిరపడింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ రెండేళ్ల కనిష్టాన్ని తాకడం దేశీయ కరెన్సీకి కలిసొచ్చింది. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో రిస్క్ సామర్థ్యం పెరిగిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఈ సోమవారం 83.33 వద్ద జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. కాగా బలప్రతిపద సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయలేదు. -
సాక్షి మనీ మంత్ర : బుల్ పరుగులు.. భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనాలు నిజమయ్యాయి. అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం డేటా అంచనాల కంటే ఎక్కువ వచ్చింది. ఆ ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్, యూరప్, ఆసియా మార్కెట్లపై పడింది. దీంతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 612 పాయింట్ల భారీ లాభంతో 65524 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల లాభంతో 19629 వద్ద కొనసాగుతుంది. హిందాల్కో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టాటాస్టీల్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బ్రిటానియా,పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా,ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
బీఎస్ఈ లాభం హైజంప్
న్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు దూసుకెళ్లి రూ. 118 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 29 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 53 శాతం జంప్‌చేసి రూ. 367 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 240 కోట్ల ఆదాయం సాధించింది. ఈక్విటీ విభాగంలో రోజువారీ సగటు టర్నోవర్ రూ. 4,740 కోట్ల నుంచి రూ. 5,922 కోట్లకు ఎగసింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐఎన్ఎక్స్)లో రూ. 22.36 కోట్లు, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐసీసీ)లో రూ. 33.88 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
ఐపీవోకు ఫెడ్‌ఫినా, ఇరెడా
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలుగా జులై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఐఆర్ఈడీఏ(ఇరెడా)సహా.. ఫెడ్‌ఫినా, ఇప్యాక్ డ్యురబుల్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటికి సెబీ అక్టోబర్ 30– నవంబర్ 10 మధ్య ఆమోదముద్ర వేసింది. ఐపీవో ద్వారా కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ నుంచి అనుమతులు పొందవలసిన సంగతి తెలిసిందే. ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ప్రమోట్ చేసిన ఫెడ్‌ఫినా ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ సంస్థ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూ నార్త్ ఫండ్ వీఐ ఎల్ఎల్పీ విక్రయానికి ఉంచనున్నాయి. ప్రాస్పెక్టస్ ప్రకారం ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ 5.38 కోట్లు చొప్పున షేర్లు ఆఫర్ చేస్తున్నాయి. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు ఫెడ్‌ఫినా వినియోగించనుంది. ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ ఐపీవోలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ 40.31 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 26.88 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్.. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ విక్రయానికి ఉంచనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ భవిష్యత్ పెట్టుబడి అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఇప్యాక్ డ్యురబుల్ రూమ్ ఎయిర్ కండిషనర్ల ఔట్సోర్స్డ్ డిజైన్ తయారీ సంస్థ ఇప్యాక్ డ్యురబుల్ ఐపీవోకింద రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను సైతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సభ్యులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడులు, తయారీ యూనిట్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 285 కోట్లను కంపెనీతోపాటు అనుబంధ సంస్థలు ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీ స్టాక్ సూచీలు
దీపావళి సెంటిమెంట్ దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిస్తాయని మార్కెట్ నిపుణులు భావించారు. కానీ అన్యూహ్యంగా స్టాక్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 278 పాయింట్లు నష్టపోయి 64980 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 19450 వద్ద కొనసాగుతున్నాయి. ఎథేర్ మోటార్స్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, హిందాల్కో, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ, గ్రాసిమ్, ఆసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
LIC Q2 Results: ఎల్ఐసీ లాభం 7,925 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 7,925 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 15,952 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం సైతం రూ. 1,32,632 కోట్ల నుంచి రూ. 1,07,397 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే తొలి ఏడాది ప్రీమియం రూ. 9,125 కోట్ల నుంచి రూ. 9,988 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం రూ. 2,22,215 కోట్ల నుంచి రూ. 2,01,587 కోట్లకు నీరసించింది. పెట్టుబడుల నుంచి మాత్రం ఆదాయం రూ. 93,942 కోట్లకు ఎగసింది. గత క్యూ2లో రూ. 84,104 కోట్లు లభించింది. స్థూల మొండిబకాయిలు 5.6 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 610 వద్ద ముగిసింది. -
మూరత్ ట్రేడింగ్ ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే?
ముంబై: సంవత్ 2079 ఏడాదికి స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో వీడ్కోలు పలికింది. ట్రేడింగ్ చివర్లో మెటల్, ఫైనాన్స్, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 251 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 72 పాయింట్ల లాభంతో 64,905 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 66 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఆఖరికి 30 పాయింట్లు పెరిగి 19,425 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్, ఆటో, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక ద్రవ్యోల్బణ కట్టడికి అవసరమైతే కఠిన ద్రవ్య పాలసీ విధాన అమలుకు వెనకాడమని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఈ సంవత్ 2079 ఏడాదిలో సెన్సెక్స్ 5,073 పాయింట్లు, నిఫ్టీ 1,694 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇదే కాలంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.44 లక్షల కోట్లు పెరిగింది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు లిస్టింగ్ రోజు 15% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.60)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.71 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 24% ర్యాలీ చేసి రూ.75 వద్ద గరిష్టాన్ని తాకింది. చివర్లో లాభాల స్వీకరణతో 15% లాభంతో రూ.69 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,555 కోట్లుగా నమోదైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 4 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్టం 83.33 స్థాయి వద్ద స్థిరపడింది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉపసంహరణ, క్రూడాయిల్ ధరల్లో అస్థిరతలు దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఈ సెప్టెంబర్ 18న 83.32 స్థాయి వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ డేటా రూపాయి గమనాన్ని నిర్ధేశిస్తాయని ట్రేడర్లు పేర్కొన్నారు. ఆదివారం మూరత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు ఆదివారం గంట పాటు ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. ఈ ఘడియల్లో షేర్లు కొనుగోలు చేస్తే మంచి లాభాలు గడిస్తాయిని మార్కెట్ వర్గాల నమ్మకం. బలిప్రతిపద సందర్భంగా నవంబర్ 14న(మంగళవారం) ఎక్సే్చంజీలకు సెలవు. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రతికూల అంశాలు ప్రభావం చూపడంతో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 64,756.11 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 65,014.06 పాయింట్ల గరిష్ఠానికి, 64,580.95 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. ముగింపు దశలో ఒక్కసారిగా కొనుగోళ్లు పుంజుకొని లాభాల్లోకి వెళ్లాయి. చివరకు 72 పాయింట్ల లాభంతో 64,904 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో 19,425 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా కంన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్‌లు లాభాలు గడించగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
దేశంలో ఎన్నికలు : ఈ సమయంలో బంగారంపై పెట్టుబడులు లాభాల్ని కురిపిస్తాయా?
వీక్షకులకు సాక్షి మనీ మంత్రా స్వాగతం. ప్రతి వారం సాక్షి నిర్వహించే మనీ మంత్రా ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు, ఇతర విశ్లేషకులు రాబోయే వారంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలా పెట్టుబడులు పెట్టాలనే అంశాల గురించి వివరిస్తారు. ఎప్పటిలాగే ఈవారం సాక్షి బిజినెస్ కన్సట్టెంట్ కారుణ్యరావు, హెక్సాగన్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ శ్రీకాంత్ భగవత్’లు గత అక్టోబర్ నెలలో స్టాక్ మార్కెట్లోని ఒడిదుడులు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే విశ్లేషణలతో పాటు ఇతర పెట్టుబడలు గురించి విశ్లేషించారు. ఆ వివరాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. కారుణ్యరావు : అక్టోబర్ నెలలో స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు, పలు ఈక్విటీ విభాగాల్లో అమ్మకాలు చూశాం. యూఎస్‌లో ట్రెజరీ బిల్స్ సైతం పెరిగాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని నవంబర్, డిసెంబర్ నెలలో ఫోర్ట్‌ఫోలియోని ఎలా రీబ్యాలెన్సింగ్, లేదంటే రివ్యూ ఎలా చేయాలి? శ్రీకాంత్ భగవత్ : మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొనే అవకాశం ఉంది. కొత్తగా ఇన్వెస్ట్ చేసే మదుపరులు మిడ్ క్యాప్,స్మాల్ క్యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని గత వారం సాక్షి మనీ మంత్రాలో చర్చించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే స్మాల్‌క్యాప్స్ స్టాక్స్ పడిపోయాయి. మిడ్‌క్యాప్స్, లార్జ్ క్యాప్స్‌లో దిద్దుబాట్లు జరిగాయి. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది నుంచి అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారత్ మార్కెట్లోని పెట్టుబడిదారులు మంచి రాబడులు పొందుతున్నారు. చైనాలో పెట్టుబడులు విషయంలో ఏమాత్రం సంతృప్తిగా లేని ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్లందరికి మంచి రిటర్న్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ బుకింగ్స్ జరిగాయి. ఆ సమయంలో అంతర్జాతీయంగా రాబడుల విషయంలో అనేక రిస్క్‌లు ఏర్పడ్డాయి. కాబట్టే భారత్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీయలు వారి పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. భారతీయులు సైతం ఇదే పని చేశారు. గత ఏడాది కాలంలో మిడ్, లార్జ్ క్యాప్స్లలో 30, 35శాతం లాభం ఉంటుందని భావించారో వాటిలో కొత్త భాగాన్ని వెనక్కితీసుకుని లాభపడ్డారు. కారుణ్యరావు : భారత్‌లో ఎఫ్‌పీఐ ( Foreign Portfolio Investors) ఇన్వెస్టర్లు స్టాక్స్‌ని కొనుగోలు చేస్తుంటారు. కానీ ఖరీదైన కంపెనీల స్టాక్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉండడం ఆ స్టాక్స్‌ని కంటిన్యూగా సెల్ చేస్తూ వచ్చారు. అలా సెల్ చేయడం దేశీయ స్టాక్ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. దీనితోడు యూఎస్ డాలర్ విలువ పెరగడం, వడ్డీ రేట్ల పెంపు, అక్కడి మార్కెట్లో మంచి లాభాలు వస్తున్న తరుణంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఇలా కొనసాగే అవకాశం ఉందా? శ్రీకాంత్ భగవత్ : దేశీయ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల స్టాక్స్ అమ్మకాలు తగ్గాయనే చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల క్రితం ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు ఇంకొంత కాలం ఉండదు’ అని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెరగవనే అభిప్రాయాలతో యూఎస్ స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు పెరిగి పాజిటీవ్‌గా కొనసాగుతున్నాయి. యూఎస్ అమెరికన్ మార్కెట్లో కొనుగోళ్లు పెరిగాయి. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500, యూరప్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లలో కొనుగోళ్ల జరిగాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆందోళనలో నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగానే ఉన్నారు. కాబట్టే దేశీయ స్టాక్స్‌లో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇతర మార్కెట్లలో ఇలాగే ఉంది. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి. కారుణ్యరావు : ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. నవంబర్ నెల అంటే స్టాక్ మార్కెట్లో లాభాలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించడం లేదు. మొత్తం పాజిటీవ్ అవ్వొచ్చు, నెగిటీవ్ అవ్వొచ్చు. అసలే పండగ సీజన్, పైగా న్యూయర్ ఇలాంటి సందర్భాల్లో మదుపుర్లు పెట్టుబడుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీకాంత్ భగవత్ : మిడ్ క్యాప్స్‌లో మంచి లాభాలు ఉన్నాయంటే వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. దీంతో పాటు లార్జ్ క్యాప్ ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్ ఈక్విటీలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మ్యాక్రో ఎకనామిక్స్ పరంగా భారత్‌లో సానుకూల ప్రభావం ఉన్నా రానున్న రోజుల్లో మార్కెట్లో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. ఏడాది పొడవునా ఎన్నికలు, ఇతర సమస్యల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. డెట్ ఫండ్స్‌లో లాభాలు పెరుగుతున్నాయి. ఈక్వెటీ మార్కెట్లో లాభాల్లో ఉన్నాయి కాబట్టి.. ఈక్విటీలోని పెట్టుడుల్ని డెట్‌లో పెట్టుకోవచ్చు. కారుణ్యరావు : గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమయంలో గోల్డ్ స్టాక్ ర్యాలీ బాగా జరిగింది. అయితే ఇప్పుడు గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చా? శ్రీకాంత్ భగవత్ : ఇప్పటి వరకు గోల్డ్ పెట్టుబడులు పెట్టని వారు గోల్డ్ విభాగంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. జియోపొలికల్ రిస్క్‌లు పెరగడం, ద్రవ్యోల్బణం పెరిగితే గోల్డ్‌లు మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంకులు సైతం ట్రెజరీస్ని కాపాడుకోవడం కోసం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి పసిడికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు, హెక్సాగన్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ శ్రీకాంత్ భగవత్’లు అందిస్తున్న పూర్తి విశ్లేషణను ఈ వీడియోలో చూడండి (Disclaimer:సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 395 పాయింట్లు లాభంతో 63544 వద్ద నిఫ్టీ 117 పాయింట్ల లాబాంతో 18974 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, గ్రాసిమ్,హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో టెక్ కంపెనీల కార్పొరేట్ ఫలితాలు అమెరికా మదుపర్లను నిరాశపర్చాయి. దాంతో అక్కడి మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మరోవైపు గత త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిరేటును నమోదు చేసింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ అంచనాల కంటే సుదీర్ఘకాలం వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిలో ఉంచే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లోనే పయనించాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 0.5 శాతం పెరిగి రూ.88.83 డాలర్లకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు
ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా వడ్డీరేట్ల పెంచాల్సిందేనన్నఫెడ్ నిర్ణయంతో పాటు ఇజ్రాయెల్ - హామాస్ యుద్ధంతో పాటు వివిధ ప్రతికూల అంశాలు దేశీయ మార్కెట్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకుపోతున్నాయి. దీంతో బుధవారం 9.50 గంటల సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 64711 వద్ద నిఫ్టీ 40 పాయింట్ల స్వల్ప లాభంతో 19322 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, ఎల్టీఐ మైండ్ ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, కొటక్ మహీంద్రా, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్, ఇన్ఫోసిస్, సిప్లా, ఎన్టీపీసీ, దివిస్ ల్యాబ్స్ ఎథేర్ మోటార్స్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఒక్కరోజే.. రూ.7.59 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి!
ముంబై: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతుండటంతో సోమవారం దేశీ సూచీలు క్షీణించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఒకే రోజున ఏకంగా రూ. 7.59 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు రోజుల వ్యవధిలో కీలక సూచీల పతనంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12,51,700 కోట్ల మేర హరించుకుపోయి రూ. 311,30,724 కోట్లకు క్షీణించింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సెన్సెక్స్ 826 పాయింట్లు (1.26%) క్షీణించి రూ. 64,572 వద్ద, నిఫ్టీ 261 పాయింట్లు (1.34%) తగ్గి 19,282 వద్ద క్లోజయ్యాయి. దసరా సందర్భంగా దేశీ మార్కెట్లు మంగళవారం పని చేయలేదు. గత బుధవారం నుంచి వరుసగా నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1,925 పాయింట్లు పతనమై కీలకమైన 65,000 మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ 530 పాయింట్లు తగ్గింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలకు తోడు ద్రవ్యోల్బణం, మరో దఫా వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు, అంతర్జాతీయంగా అనిశ్చితి మొదలైన వాటిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొందని, మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రో, ఎస్బీఐ మొదలైనవి క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. -
సాక్షి మనీ మంత్ర: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది. ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్‌గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఎస్ఎంఈ ఐపీవోలు.. రూ.3,540 కోట్లు
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు ఈ ఏడాది గణనీయ సంఖ్యలో వచ్చాయి. 139 సంస్థలు రూ.3,540 కోట్లు సమీకరించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇవి బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆఫీసులు, అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు) ఆసక్తి చూపిస్తుండడం, తగినంత లిక్విడిటీ ఉండడం, మార్కెట్ అనుకూల పరిస్థితులు ఇవన్నీ ఎస్ఎంఈల ఐపీవో ప్రణాళికలను విజయవంతం చేశాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమోటివ్ విడిభాగాలు, ఫార్మా, ఇన్ఫ్రా, అడ్వర్టయిజింగ్, హాస్పిటాలిటీ రంగాల నుంచి ఉన్నాయి. 2022లో 109 ఎస్ఎంఈలు రూ.1,875 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. రానున్న కాలంలోనూ ఎస్ఎంఈల నిధుల సమీకరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్ని రంగాల్లో వృద్ధికి మెరుగైన పరిస్థితులు ఉండడం, మార్కెట్లో లిక్విడిటీ, ఇన్వెస్టర్ సెంటిమెంట్ రానున్న రోజుల్లో ఎస్ఎంఈ ఐపీవోలను ముందుకు నడిపిస్తాయని అరిహాంట్ క్యాపిటల్ మార్కెట్స్ రీసెర్చ్ హెడ్ అభిషేక్ జైన్ పేర్కొన్నారు. మరో రెండు ఐపీవోలు ఈ వారంలో ప్యారాగాన్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్, ఆన్ డోర్ కాన్సెప్ట్స్ అనే రెండు ఎస్ఎంఈ ఐపీవోలు నిధుల సమీకరణకు రానున్నాయి. ఈ ఏడాది ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ, మూలధన అవసరాలు, రుణ భారం తగ్గించుకోవడానికి ఎస్ఎంఈలు ఉపయోగించనున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా సెప్టెంబర్ నెలలో 37 ఎస్ఎంఈ ఐపీవోలు నిధులు సమీకరణ చేశాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కు కూడా మంచి డిమాండ్ ఉంది. కొంత కాలం క్రితం ఈ చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన బడా ఇన్వెస్టర్లు, పీఈ సంస్థలు వాటిల్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపిస్తున్నారు. ఈ కోణంలోనూ ఐపీవోకు కొన్ని ఎస్ఎంఈలు వస్తున్నాయి. మార్కెట్లో లిక్విడిటీ మెరుగ్గా ఉండడం, వ్యాపారాలకు మెరుగైన వృద్ధి అవకాశాలు ఇవన్నీ నిధుల సమీకరణకు కలిసొస్తున్నట్టు క్లైంట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లీ అభిప్రాయపడ్డారు. -
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ : ఈవారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. ప్రపంచ భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, ముడిచమురు ధరలు తదితర పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మంగళవారం(24న) విజయదశమి పర్వదినం సందర్భంగా స్టాక్‌మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. విదేశీ అంశాలలో ప్రధానంగా మధ్యప్రాచ్యం పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ప్రభావితంకానున్నట్లు పలువురు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి మేఘాలు, భారీగా పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్, భౌగోళిక, రాజకీయ వివాదాల కారణంగా ప్రస్తుతం ప్రపంచ స్టాక్ మార్కెట్లు అత్యంత అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడ్డారు. రూపాయి కదలికలు ఇటీవల తిరిగి డాలరుతో మారకంలో రూపాయి భారీగా ఊగిసలాడుతోంది. మరోవైపు మధ్యప్రాచ్యంలో నెలకొన్న వివాద పరిస్థితులు ముడిచమురు ధరలకు ఆజ్యం పోసే వీలుంది. ఇది దేశ, విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. అక్టోబర్ నెల ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు గురువారం(26న) ముగియనుంది. 24న సెలవుకాగా.. దీంతో మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్– పాలస్తీనా యుద్ధం ఆధారంగా మార్కెట్లు కదిలే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా తెలియజేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు. ఇతర అంశాలు విదేశీ అంశాలలో యూకే పీఎంఐ సర్వీసులు, యూఎస్ తయారీ, సర్వీసుల పీఎంఐ, యూఎస్ జీడీపీ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. అంతేకాకుండా యూఎస్ నిరుద్యోగ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. దేశీయంగా దిగ్గజాలు యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, కెనరా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పీఎన్బీ, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు విడుదల చేయనున్నాయి. గత వారాంతాన ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా క్యూ2 పనితీరును వెల్లడించాయి. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో కనిపించే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా పేర్కొన్నారు. కాగా.. గత వారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ నికరంగా 885 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 208 పాయింట్లు చొప్పున కోల్పొయిన విషయం విదితమే. ఎఫ్‌పీఐల వెనకడుగు ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్ నుంచి నికరంగా రూ. 12,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ పెరుగుతుండటం, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ పరిస్థితులు ఇందుకు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో రుణ సెక్యూరిటీలలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పుంజుకోవడం గమనార్హం! డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 5,700 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇకపై విదేశీ ఇన్వెస్టర్ల దేశీ పెట్టుబడులను ప్రపంచ ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లతోపాటు.. ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదాలు ప్రభావితం చేయనున్నట్లు మార్నింగ్‌స్టార్ అడ్వయిజర్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 65,443 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 19,570 దగ్గర కొనసాగుతోంది. నెస్లే, అదానీ ఎంటర్ ప్రైజెస్,ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, టీసీఎస్,రిలయన్స్,ఓఎన్జీసీ,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్, దివిస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఆరంభం నుంచి నష్టాల్లో ట్రేడయిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభం నుంచి మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65629 వద్ద.. నిఫ్టీ 46.4 పాయింట్లను కోల్పోయి 19624 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 34.55 పాయింట్లు నష్టపోయాయి. హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ భయాలు మార్కెట్లను నష్టాల్లో పయనించేలా చేశాయి. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు ఆందోళనలకు కారణమౌతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే 3.4శాతం, ఆల్ట్రా టెక్ సిమెంట్ 2.8శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.9శాతం, ఎల్ అండ్ టీ 0.2శాతం లాభాల్లో ముగిశాయి. విప్రో 3 శాతం, సన్‌ఫార్మా 1.5శాతం, టెక్ మహీంద్రా 1.4శాతం, ఎన్టీపీసీ 1.3శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.1శాతం, భారతీఎయిర్‌టెల్ 1 శాతంమేర నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగింపు పలికాయి. ట్రేడింగ్ సమయంలో బ్యాంక్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ షేర్లు లాభాల్ని ఒడిసి పట్టుకుంటుంటే రియాలిటీ రంగ షేర్లు మాత్రం ఒత్తిడికి గురవుతున్నాయి. మంగళవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 261 పాయింట్ల లాభంతో 66,428 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 19,811 వద్ద ముగిశాయి. టాటా మోటార్స్,లార్సెన్,యూపీఎల్,ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, ఓఎన్జీసీ షేర్లు నష్టాలతో ముగియగా..బీపీసీఎల్,పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. ‘మార్కెట్ ట్రెండ్ వేగంగా మారుతోంది. ఇజ్రాయెల్-హమాస్ వివాదం వ్యాప్తి చెందదనే ఆశతో మదుపర్లు రిస్క్ వైపే మొగ్గు చూపుతున్నారు.ఇజ్రాయెల్- హమాస్ వివాదంలో ఇరాన్, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా బలగాలకు పరోక్షంగా అమెరికా హెచ్చరికలు జారీ, చేస్తూ...హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన, ఇజ్రాయెల్‌కు ఆయుధ సాయం చేస్తూ అగ్రరాజ్యం విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రంలో మోహరింపు వంటి పరిణామాలతో యుద్ధం వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాబట్టే మార్కెట్ ఆశాజనకంగా ఉంద’ని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికె విజయకుమార్ చెప్పారు. ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోలు ఒత్తిడితో యూఎస్ యూరోప్ స్టాక్కెక్స్ 600 ఇండెక్స్, యూఎస్ ఈక్విటీలు స్తబ్ధుగా పయనించాయి. టెలికాం రంగంలో బలహీనమైన డిమాండ్ కొనసాగుతుందని స్వీడిష్ 5జీ-పరికరాల తయారీదారు హెచ్చరించడంతో ఎరిక్స్న్ ఏబీలో షేర్లు 9శాతం కంటే ఎక్కువ క్షీణించాయి. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ షేర్లు మంగళవారం పురోగమించాయి. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఇజ్రాయెల్ - హమాస్‌ల మధ్య దాడులతో దేశీయ స్టాక్ సూచీలు నేలచూపులే చూశాయి. అయితే, అక్టోబర్ 10న ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సడలించింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 566 పాయింట్లు లాభంతో 66,079 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 19,689 వద్ద ముగిశాయి. కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు లాభాల్లో ముగియగా, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్,ఏసియన్ పెయింట్స్ నష్టాలతో ముగిశాయి. -
మార్కెట్లో ‘ఆర్బీఐ’ హుషారు
ముంబై: అంచనాలకు తగ్గట్లే ఆర్బీఐ వరుసగా నాలుగోసారీ కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ ర్యాలీ చేసింది. రేట్ల సంబంధిత ఫైనాన్స్, రియల్టీ, ఆటో షేర్లు రాణిండంతో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 65,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,654 వద్ద నిలిచింది. ఆసియా, యూరప్ మార్కెట్ల రికవరీ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. క్రూడాయిల్ ధరలు మరింత దిగిరావచ్చనే అశలూ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పాలసీ ప్రకటన వెల్లడి తర్వాత మరింత దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 464 పాయింట్లు బలపడి 66,096 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు దూసుకెళ్లి 19,676 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. -
బుల్ రన్..సెప్టెంబర్ నెలకు లాభాలతో వీడ్కోలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ నెలకు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఇటీవల పతనంలో భాగంగా కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన ఇంధన, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లలో వాల్యూ బైయింగ్ సూచీలను లాభాల బాట పట్టించింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్‌లో అధిక భాగం లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే శని, ఆది, సోమవారాలు ఎక్ఛేంజీలకు సెలవు కావడంతో ఇన్వెస్టర్ల ఆఖర్లో అప్రమత్తత వహిస్తూ కొంత లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 65,828 వద్ద స్థిరపడింది. ఒక దశలో 643 పాయింట్లు లాభపడి 66,152 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 115 పాయింట్లు బలపడి 19,638 వద్ద నిలిచింది. ఒక్క ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ సూచీలు వరుసగా 1.31%, 0.57 శాతం చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,686 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,751 కోట్ల షేర్లను కొన్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 181 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. యూరోజోన్, అమెరికా సెప్టెంబర్ ద్రవ్యోల్బణ అంచనాలకు తగ్గట్లే దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు రికవరీ బాటపట్టాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ఇంధన రంగ షేర్లైన రిలయన్స్ (0.50%), ఓఎన్జీసీ (2%), ఎన్టీపీసీ (3.50%), ఐఓసీఎల్ (1.28%), గెయిల్ (2.50%), బీపీసీఎల్ (1%), ఎన్‌హెచ్‌పీసీ (2%), హెచ్‌పీసీఎల్ (2%), పెట్రోనెట్ ఎల్ఎన్జీ (2%), ఇంద్రప్రస్థ గ్యాస్ (1%) రాణించాయి. ♦ఎంసీఎక్స్ వచ్చే వారం(అక్టోబర్ 3) నుంచి ప్రారంభించాలనుకున్న కొత్త కమోడిటీ డెరివేటివ్స్ ప్లాట్‌ఫామ్ లైవ్ ట్రేడింగ్‌ని వాయిదా వేయాలని సెబీ కోరడంతో షేరు 2.50% నష్టపోయి రూ.2049 వద్ద స్థిరపడింది. ♦లాభాల మార్కెట్లోనూ ఐటీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ తన వార్షిక, తొలి త్రైమాసిక ఆదాయ అంచనాలను తగ్గించుకోవడంతో దేశీయ ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎల్టీఐఎం, ఎల్టీటీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 3–1% పతనమయ్యాయి. కోఫోర్జ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. ♦ఇటీవల వరుస నష్టాలు చవిచూస్తున్న ఫార్మా షేర్లు లాభాల బాటపట్టాయి. అత్యధికంగా గ్లెన్‌మార్క్ ఫార్మా 10% ర్యాలీ చేసింది. అరబిందో ఫార్మా 5%, గ్రాన్యూల్స్ 4% లాభపడ్డాయి. లుపిన్, డాక్టర్ రెడ్డీస్, ఆల్కేమ్, సన్‌ఫార్మా, సిప్లా, బయోకాన్ లారస్ ల్యాబ్స్ షేర్లు 3–1% చొప్పున పెరిగాయి. రంగాల వారీగా బీఎస్ఈలో అత్యధికంగా ఫార్మా ఇండెక్స్ 2.60% ర్యాలీ చేసింది. -
సాక్షి మనీ మంత్ర : వరుస నష్టాలకు బ్రేకులు.. పాజిటివ్‌గా
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. శుక్రవారం ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 65639వద్ద నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 19566 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ,హిందాల్కో,యూపీఎల్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లార్సెన్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..ఇన్ఫోసిస్, విప్రో,ఎల్టీఐ మైండ్ ట్రీ, టీసీఎస్,ఏసియన్ పెయింట్స్,హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర : నేడు మళ్లీ నష్టాల్లోకి సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు మళ్లీ నేలచూపులు చూశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు కాసేపటికే కిందకు దిగజారుతూ వెళ్లాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 65759 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 19614 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ,సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, లార్సెన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎథేర్ మోటార్స్, ఐసిఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టంతో 65918 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో 19654 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎథేర్ మోటార్స్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్,లార్సెన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, హీరో మోటో కార్ప్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అపోలో హాస్పిటల్, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర : ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్ సూచీలు
అమెరికా గృహ అమ్మకాల డేటా విడుదల, క్రూడాయిల్ ధరల పెరుగుదల, యూఎస్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్లపై అధిక దిగుబడులతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర సెంటిమెంట్‌తో పాటు ఇతర కారణాల వల్ల సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభ నష్టాల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 46 పాయింట్ల స్వల్ప నష్టంతో 66011 వద్ద, నిఫ్టీ 1 పాయింట్ నష్టంతో 19672 వద్ద కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్,మారుతి సుజికీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్, హీరోమోటో కార్ప్, బ్రిటానియా, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ సూచీలు
గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయంగా ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో నిఫ్టీ 0.95 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, ఒఎన్‌జిసి, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఎయిర్టెల్, ఆల్ట్రా టెక్ సిమెంట్, కోల్ ఇండియా షేర్లు లాభపడగా .. హిందాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతి సుజికి, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర : వరుస లాభాల జోరు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో వరుసగా మూడోరోజు లాభాలతో ముగింపు పలికాయి. అన్నీ విభాగాలకు చెందిన మిడ్- స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనుగోళ్లతో నిఫ్టీ 19,550 పాయింట్లు దాటింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్ల మేర లాభపడి 65,780 వద్ద నిఫ్టీ 46 పాయింట్ల స్వల్ప లాభంతో 19,574 వద్ద ముగిసింది. అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, బీపీసీఎల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్ని గడించగా.. ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్, మారుతి సుజికీ, ఎథేర్ మోటార్స్ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నెల ప్రారంభంతో భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అదే శుభారంభంతో ముగింపు పలికాయి. ఫార్మా విభాగంలో భారీ కొనుగోళ్ల నేపథ్యంలో నిఫ్టీ 19,400 పాయింట్లకు ఎగబాకింది. ఇక మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 555 పాయింట్ల లాభంతో 65,387 వద్ద నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 19,435 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, మారుతి సుజికి షేర్లు భారీ లాభాల్ని గడించగా సిప్లా, హెచ్‌డీఎఫ్‌పీ, డాక్టర్ రెడ్డి లేబరేటరీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూశాయి. -
సాక్షి మనీ మంత్ర : బుల్ జోరు.. లాభాల్లో స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ వారంలో వరుసగా మూడవ రోజు సైతం అదే జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 274 పాయింట్లు లాభంతో 65350 వద్ద నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. టెక్ మహీంద్రా, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఆటోషేర్లు లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, హీరోమోటోకార్ప్, నెస్లే, ఎన్టీపీసీ, బ్రిటానియా షేర్లు నష్టాల వైపు కదలాడుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి.. -
బ్రైట్‌కామ్ సీఎండీ, సీఎఫ్‌వోల రాజీనామా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ సీఎండీ సురేశ్ రెడ్డి, సీఎఫ్‌వో నారాయణ రాజు రాజీనామా చేశారు. ఇరువురి రాజీనామాను ఆమోదించినట్టు కంపెనీ బోర్డు ప్రకటించింది. కొత్త సీఈవో, సీఎఫ్‌వో కోసం అన్వేషణ ప్రారంభించేందుకు సైతం బోర్డు ఓకే చెప్పింది. కాగా, కంపెనీ ఆర్థిక వ్యవహారాలలో అకౌంటింగ్ అక్రమాలు, తప్పుడు స్టేట్మెంట్లను వెల్లడించినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణలో తేలడంతో.. ఆగస్టు 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ద్వారా సీఎండీ, సీఎఫ్‌వోలను బోర్డు స్థానాల నుండి సెబీ నిషేధించిన సంగతి తెలిసిందే. కంపెనీ తన షేర్ల ప్రాధాన్యత కేటాయింపులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు కల్పితమని సెబీ కనుగొంది. దీనిని అనుసరించి బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను విక్రయించకుండా శర్మ, 22 ఇతర సంస్థలను సెబీ నిషేధించింది. -
సాక్షి మనీ మంత్ర : అవుట్ లుక్‌పైనే చూపు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని మదుపర్లు గ్లోబుల్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ అవుట్ లుక్‌పై ఎలా ఉండబోతుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాటికి అనుగుణంగా యూఎస్ ఈక్విటీలను అనుసరిస్తున్నారు. షేర్ల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో కొనసాగతున్నాయి. ఉదయం 9.20 గంటల సమయానికి 100 పాయింట్ల లాభంతో 65099 వద్ద, నిఫ్టీ అత్యంత స్పల 29 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. యూపీఎల్,సిప్లా, హీరో మోటో కార్ప్,హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్‌డ్ల్యూ స్టీల్,టాటా మోటార్స్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. రిలయన్స్, ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్ర : భారీగా పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు.. కారణం ఏంటంటే?
ఈ వారం చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. పెరిగిపోతుందనే ద్రవ్యోల్బణం అంచనాలు, ఎంపీసీలో కీలక రేట్లు యాథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడి, అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ నుంచి వడ్డీ రేట్ల గురించి ప్రకటన వంటి అంశాలతో మదుపరులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాలు సూచీల నష్టాలకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 65 వేల పాయింట్ల దిగువన ముగియగా.. నిఫ్టీ 19,300 మార్కును కోల్పోయింది. అయితే ఈ స్థాయి మార్కుకు పడిపోవడంపై మార్కెట్ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జులై నెలలో మార్కెట్లో ఊహించని విధంగా నిఫ్టీ, సెన్సెక్స్‌లు అంచనాల కంటే తక్కువగా ట్రేడ్ అయ్యాయి. తాజాగా ఇదే తరహాలో శుక్రవారం సైతం లోయర్‌లో ట్రేడింగ్‌ను ముగించాయి. అందుకు ప్రధాన కారణం ఇరాక్, ఇరాన్ దేశాల ఇన్వెస్టర్లు అమెరికా వడ్డీరేట్లు తీరుతెన్నులపై గమనించడం, దీంతో పాటు ట్రెండ్‌కు అనుగుణంగా మార్కెట్ ప్రారంభం నుంచి స్టాక్స్‌ను అమ్మే ధోరణి మార్కెట్ ముగిసే వరకు కనిపించింది. ఇలా మార్కెట్ అంచనాల కంటే తక్కువ స్థాయిలో ట్రేడ్ అయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి. -
మళ్లీ జియో ఫైనాన్స్ డీలా
ముంబై: వరుసగా రెండో రోజు జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మరోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 12.5 కోల్పోయి రూ. 239 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయి నష్టంతో రూ. 237 దిగువన స్థిరపడింది. సోమవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ గత నెలలో జరిగిన ధర నిర్ధారణ ట్రేడింగ్‌లో రూ. 262 ధర వద్ద స్థిరపడింది. తదుపరి ఈ కౌంటర్లో స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం(21) నుంచి 10 రోజులపాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో సాధారణ ట్రేడింగ్‌కు తెరతీశాయి. ఫలితంగా రోజుకి 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలుకానుంది. తొలి రోజు 5 శాతం పతనమై రూ. 250 సమీపంలో నిలిచింది. ఇండెక్సులలో.. ధరలో నిలకడను తీసుకురావడం, హెచ్చుతగ్గులను పరిమితం చేయడం వంటి లక్ష్యాలతో స్టాక్ ఎక్సే్ఛంజీలు జియో ఫైనాన్షియల్‌ను ప్రధాన ఇండెక్సులలో తాత్కాలికంగా భాగం చేశాయి. విలీనాలపై సవరించిన తాజా నిబంధనల అమలులో భాగంగా సెన్సెక్స్‌లో 31వ, నిఫ్టీలో 51వ షేరుగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజానికి ఈ షేరుని లిస్టింగ్ తదుపరి మూడు రోజులకు సెన్సెక్స్, నిఫ్టీల నుంచి తొలగించవలసి ఉంది. అయితే వరుసగా సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో ఈ షేరుని ఆగస్ట్ 29వరకూ సెన్సెక్స్, నిఫ్టీలలో కొనసాగించనున్నట్లు ఇండెక్సుల కమిటీ పేర్కొంది. అప్పటికి కూడా సర్క్యూట్ బ్రేకర్లను తాకడం కొనసాగితే.. మరోమారు ఇండెక్సుల నుంచి తొలగింపు వాయి దా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎల్ఐసీకి షేర్లు ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను జియో ఫైనాన్షియల్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ 1 ఆర్ఐఎల్ షేరుకిగాను 1 జియో ఫైనాన్షియల్‌ను కేటాయించింది. ఫలితంగా ఆర్ఐఎల్లోగల వాటాలకుగాను ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్‌లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా వెల్లడించింది. ఆటుపోట్ల మధ్య మార్కెట్ అక్కడక్కడే ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు బలపడి 65,220 వద్ద నిలిచింది. 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 19,346 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్ 147 పాయింట్ల వరకూ పుంజుకుని 65,396కు చేరింది. నిఫ్టీ సైతం 19,443–19,381 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూఎస్‌లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,165 లాభపడితే 1503 డీలాపడ్డాయి. పిరమిడ్ టెక్నో ఐపీవో సక్సెస్ ఇండ్రస్టియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు మంగళవారాని(22)కల్లా 18 రెట్లుపైగా సబ్‌్రస్కిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 75.6 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 13.83 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఈ ఆఫర్‌తో కంపెనీ రూ. 153 కోట్లు సమకూర్చుకుంది. రూపాయి రికవరీ 14 పైసలు అప్; 82.99 వద్ద ముగింపు న్యూఢిల్లీ: డాలరు మారకం విలువ తగ్గిన నేపథ్యంలో దేశీ కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 14 పైసలు బలపడి, 82.99 వద్ద ముగిసింది. అమెరికా డాలరు బలహీనత దీనికి కారణం. -
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ఐటీ, టెక్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ ఉదయం 125 పాయింట్ల నష్టంతో 65,026 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 396 పాయింట్లు పతనమై 64,755 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంతమేర నష్టాలు భర్తీ చేసుకుంది. చివరికి 202 పాయింట్లు క్షీణించి 64,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ రోజంతా 19,254 – 19,365 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 55 పాయింట్ల నష్టపోయి 19,310 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, మెటల్, ప్రభుత్వరంగ రంగ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.267 ఈక్విటీ షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.339 కోట్ల షేర్లను కొన్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 374 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►అమెరికాలో టెక్నాలజీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్డాక్ సూచీ పతన ప్రభావం దేశీయ ఐటీ షేర్లపై పడింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 2 నుంచి 1.50% పతనమయ్యాయి. ►ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒకశాతం లాభపడి రూ. 2,557 వద్ద స్థిరపడింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు సోమవారం లిస్టింగ్ అవుతున్నట్లు కంపెనీ చేసిన ప్రకటనతో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ►నష్టాల మార్కెట్లోనూ కాంకర్డ్ బయోటెక్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర(రూ.741)తో పోలిస్తే బీఎస్ఈలో 21% ప్రీమియంతో రూ.900 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 33% దూసుకెళ్లి రూ.987 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.942 వద్ద స్థిరపడింది. కంపెనీ విలువ రూ.9,853 కోట్లుగా నమోదైంది. ►4 ప్రాంతీయ చానెల్స్ లాంచ్‌కు సమాచార, ప్రసార శాఖ ఆమోదం తెలపడంతో ఎన్డీటీవీ షేరు 2% లాభపడి రూ.225 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 5% బలపడి రూ.232 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
సాక్షి మనీ మంత్ర : నష్టాల నుంచి భారీ లాభాలతో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లలో మెటల్, బ్యాంకులు మినహాయించి అన్ని రంగాలలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో బుధవారం నష్టాల నుంచి గరిష్ట లాభాలతో మార్కెట్లు ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 137.50 పాయింట్లు 65,539.42 వద్ద, నిఫ్టీ 30.50 పాయింట్లు పెరిగి 19,465 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభయ్యాయి. అలా ప్రారంభమైన గంట వ్యవధిలో పుంజుకున్నాయి. అయితే వెంటనే లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ చివరి గంట కొనుగోళ్లతో సూచీలు లాభాలతో గరిష్ట స్థాయికి చేరుకొని ముగింపు పలికాయి. నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్స్, ఎన్టిపిసి, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్లాభపడగా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, భారతీ ఎయిర్టెల్ నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి.. -
ఈక్విటీ మార్కెట్లో బలహీన సంకేతాలు.. షేర్ల అమ్మకాల వెల్లువ
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై రెండోరోజూ కొనసాగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం నష్టాలను చవిచూశాయి. ఉదయం సెన్సెక్స్ 40 పాయింట్ల స్వల్ప లాభంతో 65,728 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల పెరిగి 19,554 వద్ద మొదలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రోజంతా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, పారిశ్రామిక షేర్లు మినహా అన్ని రంగాలూ అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 414 పాయింట్లు నష్టపోయి 65,274 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు క్షీణించి 19,413 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి సెన్సెక్స్ 366 పాయింట్ల నష్టపోయి 65,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 19,428 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.13 %, స్మాల్ క్యాప్ సూచీ 0.31 శాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,073 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.500 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 82.85 స్థాయి వద్ద స్థిరపడింది. కాగా ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 399 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘వ్యవస్థలోకి వచ్చిన అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఆర్బీఐ ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను పదిశాతం పెంపు చర్యలతో స్టాక్ మార్కెట్ రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ద్రవ్యోల్బణ అంచనా పెంపుతో ఆందోళనలు మరింత అధికమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు తగ్గట్లే నమోదైంది. బ్రిటన్ జీడీపీ డేటా అంచనాలకు మించి నమోదైంది. అయినప్పటికీ అంతర్జాతీయ సెంటిమెంట్ బలహీనంగా ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►జూన్ క్వార్టర్లో నికరలాభం 14 రెట్లు పెరగడంతో ఎల్ఐసీ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 3% లాభపడి రూ.660 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.677 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ► ఎంఎస్సీఐ ఇండియా సూచీలో చోటు దక్కించుకున్న సుప్రీం ఇండస్ట్రీస్(6%), ఆర్ఈసీ(4%), అశోక్ లేలాండ్(0.50%) షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. కాగా ఇదే ఇండెక్స్ నుంచి స్థానం కోల్పోయిన ఏసీసీ షేరు స్వల్పంగా 0.25% కోల్పోయి రూ.1955 వద్ద స్థిరపడింది. అస్ట్రాల్, కమ్మిన్స్ ఇండియా, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేట్లు సైతం ఇండెక్సులో చేరనున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 65504 వద్ద నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 19486 వద్ద కొనసాగుతుంది. ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, ఎల్టీఐ మైండ్ ట్రీ, విప్రో, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, కొటక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, బ్రిటానియా షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
ఎల్ఐసీకి లాభాల పంట..14 రెట్లు పెరిగి ఏకంగా..
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజ సంస్థ ఎల్ఐసీ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 రెట్లు పెరిగి రూ.9,544 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.683 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.1,68,881 కోట్ల నుంచి రూ.1,88,749 కోట్లకు వృద్ధి చెందింది. కొత్త పాలసీలపై వచ్చే తొలి ఏడాది ప్రీమియం ఆదాయం తగ్గింది. ఈ రూపంలో జూన్ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం రూ.6,811 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.7,429 కోట్లతో పోలిస్తే సుమారు 9 శాతం క్షీణించింది. పెట్టుబడుల రూపంలో వచ్చిన నికర ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.69,571 కోట్ల నుంచి రూ.90,309 కోట్లకు పెరిగింది. సాల్వెన్సీ రేషియో 1.88 శాతం నుంచి 1.89 శాతానికి పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. వసూలు కాని నిరర్థక ఆస్తులు 5.84 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గాయి. బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు ఫ్లాట్‌గా రూ.642 వద్ద క్లోజయింది. ఫలితాలు మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 65663 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల స్వల్ప నష్టాలతో కొనసాగుతుంది. అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, టాటా, హెచ్డీఎఫ్సీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటో కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 54 పాయింట్లు లాభ పడి 66008 వద్ద నిఫ్టీ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 19617 వద్ద కొనసాగుతుంది. హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఎన్టీపీసీ, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎస్బీఐ, కోల్ ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, మారుతి సుజికీ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎథేర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ ఎం, నెస్లే, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్రా : లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఏమాత్రం చూపలేకపోతున్నాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 65851 పాయింట్ల వద్ద నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 19560 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎంఅండ్ఎం, గ్రాసిమ్,హిందాల్కో,ఎన్టీపీసీ,రిలయన్స్,హెచ్‌సీఎల్ టెక్, విప్రో, దివీస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ,టీసీఎస్,ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బ్రిటానియా,సిప్లా,ఐటీసీ, ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఏసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్రా : దలాల్ స్ట్రీట్‌లో బుల్ పరుగో పరుగు..!
ఈ వారం ప్రారంభం నుంచి అంతర్జాతీయ ప్రతికూల అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో వరుసగా మూడు రోజో సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే ఈ వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. శుక్రవారం దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 329 భారీ లాభాలతో 65570 వద్ద నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 19492 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సిప్లా,హిందాల్కో, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, ఎథేర్ మోటార్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,బీపీసీఎల్, హీరో మోటో కార్ప్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా : 'బేర్'మన్న మార్కెట్లు..భారీ నష్టాలతో ప్రారంభం
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల అంశాలతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయ 9.20 గంటలకు సెన్సెక్స్ 292 పాయింట్లు నష్టపోయి 66166 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 19647 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతి సుజికీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డిస్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, హీరోమోటో కార్పొరేషన్, లార్సెన్, దివీస్ ల్యాబ్స్,ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్రా: స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న లాభాల పరంపర
జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాలు దేశీయ స్టాక్ సూచీలపై ప్రభావాన్ని చూపాయి. దీంతో మంగళవారం ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 66567 వద్ద, నిఫ్టీ అత్యంత స్వల్పంగా 10 పాయింట్లు లాభపడి 19764 వద్ద కొనసాగుతుంది. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా,ఎథేర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, సిప్లా, హీరో మోటో కార్ప్,హెచ్‌సీఎల్ టెక్, ఎల్టీఐ మైండ్ ట్రీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
రేఖా ఝున్‌ఝున్ వాలా.. ఈ కంపెనీ స్టాక్స్‌తో ఒక్క రోజే 100 కోట్లు లాభం
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రేఖా ఝున్‌ఝన్‌వాలా ఈ రోజు తన నికర విలువలో గణనీయమైన వృద్దిని సాధించారు. అందుకు టాటా మోటార్స్ స్టాక్ పనితీరుతో పాటు జూన్ త్రైమాసిక ఫలితాలే కారణమని తెలుస్తోంది. రేఖా కొనుగోలు చేసిన టాటా షేర్లు బుధవారం 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40ను తాకింది. వెరసీ ఒక్కరోజే 132 కోట్లకు పైగా సంపాదించారు. రేఖా ఝున్ ఝున్ వాలా టాటా మోటార్స్‌లో 52,256,000 షేర్లు ఉన్నాయి. మంగళ వారం రోజు షేరు రూ.639.45 వద్ద క్లోజ్ అయినప్పుడు ఆమె హోల్డింగ్ విలువ రూ.3,341.50 కోట్లుగా ఉంది. బుధవారం రూ.665.40కు పెరగడంతో ఆమె షేరు విలువ రూ.3,477.11 కోట్లకు పెరిగింది. టాటా మోటార్స్ ఫలితాలు టాటా గ్రూప్ కంపెనీ విశ్లేషకులను, ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వ్యాపార పనితీరుతో బలహీనంగా ఉన్న త్రైమాసికంలో కంపెనీ పనితీరు అంచనాలను అధిగమించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. జేఎల్ఆర్ వ్యాపారం మరింత వృద్ధిని, లాభదాయకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్రా: షేర్ మార్కెట్ నయా రికార్డ్.. సెన్సెక్ @ 66,600
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం తొలి ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో మొదలు పెట్టాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 66,600 పాయింట్లను తాకి తాజాగా సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. తొలిసారి నిఫ్టీ 19,700 పాయింట్లను దాటింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 529.03 పాయింట్లు పెరిగి 66,589.93 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు లేదా పెరిగి 19,711.50 వద్ద ఉన్నాయి. రిలయన్స్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. క్యూ1 లాభం 30% జంప్ చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ధర ఇంట్రాడే కనిష్టం నుండి పుంజుకుంది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయిందన్న ఆందోళనల మధ్య ఆసియా స్టాక్‌లు క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని విశేషాలు మార్కెట్ తన రికార్డ్ ర్యాలీని కొనసాగించింది. జూలై 17న వరుసగా మూడవ సెషన్లో లాభాల పరంపరను కొనసాగించింది. ఆటో మినహా అన్ని రంగాల స్టాక్స్ కొనుగోళ్లు భారీ ఎత్తున జరిగాయి. దీంతో నిఫ్టీ 19,700 పై మార్క్‌ను దాటేందుకు దోహద పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా లాభపడగా, హీరో మోటోకార్ప్, ఒఎన్‌జిసి, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, జెఎస్డబ్ల్యు స్టీల్ నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పెరిగాయి. ఆటో మినహా, అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: బుల్ రన్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెలువడిన గణాంకాలు ఎకానమీకి కొంత ఊరటనిచ్చాయి. దీంతో పాటు పలు దేశీయ టెక్ కంపెనీలు క్యూ1 ఫలితాలు మార్కెట్ అంచనాలను మించి నమోదయ్యాయి. గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల వైపు పరుగులు పెడుతున్నాయి. ఉదయం 9.14గంటల సమయానికి సెన్సెక్స్ 273 పాయింట్ల భారీ లాభాలతో 65667 వద్ద నిఫ్టీ 110 లాభంతో 19495 వద్ద కొనసాగుతుంది. మార్కెట్ అంచనాలకు మించి ఆర్థిక సంవత్సరం క్యూ1 (తొలి త్రైమాసికం) ఫలితాల విడుదలతో టీసీఎస్‌తో పాటు, టాటా స్టీల్ షేర్లు లాభాలతో పరుగులు తీస్తున్నాయి. జులై 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీన ప్రక్రియ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో హెచ్డీఎఫ్సీ కనుమరుగైంది. హెచ్డీఎఫ్సీ షేర్లన్నీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం అవ్వడంతో.. హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటితో పాటు ఎస్బీఐ, బజాజ్ ఆటో, బ్రిటానియా, హిందాల్కో షేర్లు సైతం అదే రీతిలో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, యూపీఎల్, ఎథేర్ మోటార్స్, ఏసియన్ పెయింట్స్, నెస్లే, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలున్నప్పటికీ.. దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.17 గంటల సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో 655585 వద్ద నిఫ్టీ 64 పాయింట్ల స్వల్ప లాభంతో 19420 వద్ద కొనసాగుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్,బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్,ఎథేర్ మోటార్స్, సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటోకార్ప్,విప్రో, హెచ్‌యూఎల్,హిందాల్కో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ ఒత్తిడికి గురవుతున్నాయి. ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్ల ప్రారంభంలో 156 పాయింట్ల లాభంతో 65,446 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 19,392 వద్ద కొనసాగుతుంది. రిలయన్స్, బజాజ్ ఆటో,హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, ఎస్బీఐ హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్,టైటాన్ కంపెనీ, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ తీరుతెన్నులు జాబ్ డేటా విడుదల తర్వాత యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మిశ్రమంగా ముగిశాయి. ఆ ప్రభావం ఏసియన్ మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లలో జూన్ ద్రవ్యోల్బణం డేటా విడుదల, పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ తీరుతెన్నులపై బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు చెబుతున్నారు. దీంతో పాటు పలు కంపెనీల ఫలితాల, ఐపీవో వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటీవ్ ఎక్కువగా ఉందని అంటున్నారు. ►గత శుక్రవారం యూరప్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగింపు, అలాగే వాల్ స్ట్రీట్ క్రాష్ వంటి అంశాలకు ప్రధాన కారణం యూఎస్ జాబ్ డేటా విడుదలతో పాటు, వడ్డీ రేట్ల పెంపు కారణమని కారుణ్య రావు విశ్లేషించారు. ►ఇక, అంచనాల్ని తలకిందులు చేస్తూ చైనా జూన్ ద్రవ్యల్బణ డేటా విడుదలతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లు మిక్స్డ్ ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. దీంతో ఆసియా మార్కెట్లు ఈఎస్ఎస్ఎక్స్ (న్యూయార్క్) , కోస్పీ (Korea Composite Stock) నష్టాల్లో కొనసాగుతున్నాయి. ►షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ (SSE) ,షెన్జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (SZSE) లాభాల్లో ఉన్నాయి. వాటికి భిన్నంగా బీఎస్ఈ లాభాల్లో ఉంటే అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా నిఫ్టీ మార్కెట్లు గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. ►రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉన్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL)ని 2023 సెప్టెంబర్ నాటికి.. విడిగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇదే జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 36 లక్షల మంది రిలయన్స్ వాటాదారులకు జేఎఫ్ఎస్ఎల్ షేర్లను అలాట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మీ వద్ద ఒక రిలయన్స్ స్టాక్ ఉంటే.. ఈ డీమెర్జర్‌తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక షేర్ అదనంగా కలుస్తుంది. ఈ డీమెర్జర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపడంతో రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ►బ్యాంక్ నిఫ్టీలో..హెచ్డీఎఫ్సీ షేర్ల ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం నుంచి హెచ్డీఎఫ్సీ తీరుతెన్నుల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా, హెచ్డీఎఫ్సీ జులై 13 నుంచి ఎంఎస్‌సీఐలో( Morgan Stanley Capital International - msci)ఇండెక్స్ అవ్వనుంది. ►మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఫార్మా విభాగంలో జైడస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కీలక పరిణామం చోటు చేసుకుంది. మూర్ఛ చికిత్స కోసం ఆక్స్కార్బాజెపైన్ టాబ్లెట్స్ పేరుతో యూఎస్పీ, 150ఎంజీ, 300ఎంజీ, 600 ఎంజీ మెడిసిన్ తయారీ కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అనుమతి పొందింది. ►అరబిందో ఫార్మా సబ్సిడరీ కురాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Curateq Biologics Private Limited) అమెరికాకు చెందిన బయోఫ్యాక్చురాతో ప్రమాదకరమైన క్యాన్సర్, కోవిడ్ -19 నుంచి సురక్షితంగా ఉండేలా యాంటీ బాడీ మెడిసిన్‌ను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ►ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రైట్ ఇష్యూ ద్వారా రూ.22,000కోట్లను సమీకరించేందుకు బోర్డ్ అనుమతి ఇచ్చింది.బ్యాటరీ స్పైపింగ్ బిజినెస్ కోసం మరో సంస్థతో కలిసేందుకు అనుమతులు జారీ చేసింది. ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
రికార్డు ర్యాలీకి బ్రేకులు..మార్కెట్లో మరిన్ని సంగతులు!
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీకి శుక్రవారం బ్రేక్ పడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా వారాంతాపు రోజున సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోయి 65,280 వద్ద ముగిసింది. ఈ సూచీలో మొత్తం 30 షేర్లకు గానూ 25 షేర్లూ నష్టపోయాయి. నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించి 19,332 వద్ద నిలిచింది. ఈ సూచీ 8 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడినట్లైంది. సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. దేశీయంగా నెలకొన్న సానుకూలతల అండతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోవడమే కాకుండా స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 113 పాయింట్లు బలపడి 65,899 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 19,524 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను నమోదు చేయగలిగాయి. అయితే ఫైనాన్స్, ఐటీ, ఆయిల్ షేర్లలో తలెత్తిన అమ్మకాలతో మళ్లీ నష్టాల బాటపట్టాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.76%, 0.28% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.790 కోట్ల షేర్లను కొన్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 562 పాయింట్లు, నిఫ్టీ 143 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు క్షీణించి 82.73 స్థాయి వద్ద స్థిరపడింది. ‘‘అమెరికాలో ప్రైవేటు రంగ ఉద్యోగ కల్పన అనూహ్యంగా పెరగడంతో వడ్డీరేట్ల పెంపు అంచనాలు తెరపైకి వచ్చాయి. బాండ్లపై రాబడి సైతం పెరిగింది. ఈ పరిణామాలకు తోడు సూచీలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతుండటం, వారాంతపు రోజు కావడంతో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ఐడియా ఫోర్జ్ షేరు లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్ఈలో కంపెనీ ఇష్యూ ధర (రూ.672)తో పోలిస్తే 94% ప్రీమియంతో రూ.1305 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 100 శాతం మేర దూసుకెళ్లి రూ.1,344 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 93 శాతం లాభంతో రూ.1,295.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ మొత్తంలో 6.50 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. లిస్టింగ్ తొలిరోజున కంపెనీ మార్కెట్ విలువ రూ.5,398 కోట్లుగా నమోదైంది. వజ్రాభరణాల తయారీ, విక్రయ సంస్థ టైటాన్ షేరు మెరిసింది. బీఎస్ఈలో 1.25% లాభపడి రూ.3145 వద్ద ముగిసింది. రూ.3211 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ ఆదాయం 20 శాతం వృద్ధి చెందడంతో ఈ షేరుకు డిమాండ్ లభించింది. నష్టాల మార్కెట్లోనూ ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎన్బీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2% నుంచి 1.50% లాభపడ్డాయి. ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ షేర్లు ఒకశాతం పెరిగాయి. -
సాక్షి మనీ మంత్రా: ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప లాభాలతో 65,807 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 19,494 వద్ద ట్రేడవుతున్నాయి. టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ ఎం, ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్,జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటో కార్ప్, హిందాల్కో, నెస్లే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
బుల్ రన్.. ఒక్కరోజే రూ.1.80 లక్షల కోట్ల సంపద సృష్టి!
ముంబై: ఒకరోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్లో మళ్లీ కొత్త రికార్డులు నమోదయ్యాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలను విస్మరిస్తూ.., ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో గురువారం ఇంట్రాడే, ముగింపులోనూ సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 54 పాయింట్లు పతనమై 65,392 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 19,386 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. యుటిలిటీ, రియల్టీ, ఇంధన, విద్యుత్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో, హెల్త్‌కేర్ షేర్లకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 387 పాయింట్లు లాభపడి 65,833 వద్ద, నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 19,512 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 340 పాయింట్లు పెరిగి 65,786 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 19,497 వద్ద ముగిసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, వినిమయ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు క్షీణించి 82.47 స్థాయి వద్ద స్థిరపడింది. సూచీల రికార్డు ర్యాలీ తిరిగి మొదలవడంతో గురువారం ఒక్కరోజే రూ.1.80 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.301.70 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦టైర్ల కంపెనీ సియట్ షేరు 19% పెరిగి రూ.2498 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 20% ర్యాలీ చేసి రూ.2,511 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.10,000 కోట్లకు చేరింది. ♦ బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలపడంతో బీఎస్ఈ షేరు నాలుగు శాతం లాభపడి రూ.706 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఐదు శాతం పెరిగి రూ.711 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ♦ టాటా ఏఎంసీ వాటాను పెంచుకునేందుకు ఆర్బీఐ ఆమోదం తెలపడంతో డీసీబీ బ్యాంకు ఆరుశాతం పెరిగి రూ.129 వద్ద స్థిరపడింది. సెన్కో గోల్డ్ ఐపీవో సక్సెస్ జ్యువెలరీ రిటైల్ రంగ కంపెనీ సెన్కో గోల్డ్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు గురువారాని(6)కల్లా 73 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ నమోదైంది. కంపెనీ 94.18 లక్షల షేర్లు విక్రయానికి ఉంచగా.. 69.08 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. షేరుకి రూ. 301–317 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 405 కోట్లు సమీకరించింది. ప్రధానంగా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 181 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైలర్ల నుంచి 15.5 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. -
నాన్స్టాప‘బుల్స్’ : ఒక్కరోజే రూ.44,898 కోట్లు సంపాదించారు!
ముంబై: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం ర్యాలీకి తోడ్పడ్డాయి. సూచీలు నాలుగోరోజూ ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 299 పాయింట్ల లాభంతో 65,504 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 19,407 వద్ద మొదలయ్యాయి. తొలి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో సూచీలు కొంతమేర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల్లో అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇంట్రాడేలో వరుసగా నాలుగోరోజూ సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 65,673 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు బలపడి 19,434 కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 65,479 వద్ద ముగిసింది. ఈ సూచీకిది వరుసగా అయిదోరోజూ లాభాల ముగింపు. నిఫ్టీ మార్కెట్ ముగిసేసరికి 66 పాయింట్లు బలపడి 19,389 వద్ద స్థిరపడింది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు చిన్న, మధ్య తరహా షేర్లకూ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 0.22%, 0.05 % చొప్పున లాభపడ్డాయి. ఇంధన, ఆటో, కన్జూమర్, కమోడిటీ, టెలికం షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,134 కోట్లు ఈక్విటీ షేర్లు కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.785 షేర్లు అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి 11 పైసలు బలపడి 82.02 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయిదురోజుల్లో రూ.7.90 లక్షల కోట్లు సెన్సెక్స్ వరుస రికార్డుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. గడిచిన అయిదు రోజుల్లో ఈ సూచీ 2,500 పాయింట్లకు పైగా బలపడటంతో బీఎస్ఈ ఎక్సే్చంజీలో రూ.7.90 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.44,898 కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.2,98.57 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ షేరు లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.585)తో పోలిస్తే బీఎస్ఈలో 5% ప్రీమియంతో రూ.615 వద్ద లిస్టయ్యింది. తొలి సెషన్లో 15% ర్యాలీ రూ.670 స్థాయికి చేరింది. ఆఖరికి 0.04% స్వల్ప నష్టంతో రూ.584.75 వద్ద ఫ్లాటుగా ముగిసింది. ♦ ఐడీఎఫ్సీ విలీనానికి బోర్డు ఆమోదం తెలపడంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 4% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది. అయితే ఐడీఎఫ్సీ షేరు మాత్రం 6 శాతం పెరిగి రూ.116 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 2% పెరిగి రూ.111 వద్ద స్థిరపడింది. -
స్కాక్ మార్కెట్లో నయా రికార్డ్.. తొలిసారి 65,000 మార్క్ తాకిన సెన్సెక్స్
ముంబై: సానుకూల జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ సోమవారమూ కొనసాగింది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్ ద్వయం షేర్లు రాణించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. సెన్సెక్స్ ఉదయం 117 పాయింట్ల లాభంతో 64,836 వద్ద మొదలైంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 19,247 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తొలి గంట తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే మిడ్‌సెషన్ సమయంలో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఇంధన, ఆర్థిక, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇంట్రాడేలో వరుసగా మూడోరోజూ సెన్సెక్స్ 581 పాయింట్లు పెరిగి 65,300 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు బలపడి 19,345 కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. చివరికి సెన్సెక్స్ 486 పాయింట్ల లాభంతో 65,205 వద్ద ముగిసింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ ముగిసేసరికి 134 పాయింట్లు బలపడి 19,323 వద్ద స్థిరపడింది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు చిన్న, మధ్య తరహా షేర్లకూ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 0.56%, 0.30% చొప్పున లాభపడ్డాయి. జూన్ వాహన విక్రయాలు అంతంత మాత్రంగా ఉండటంతో ఆటో షేర్లు నష్టపోయాయి. ఐటీ, టెక్, విద్యుత్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 81.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.1.73 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.2.98 లక్షల కోట్లకు చేరింది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల సైకిల్‌ను ఆపేయ్యొచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఆసియాలో జపాన్ ఇండెక్స్ నికాయ్ 33 ఏళ్ల గరిష్టం(33,753) ముగిసింది. ‘‘మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీతో పలు షేర్ల వాల్యూయేషన్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ ఎఫ్వై 24 ఆదాయ అంచనాకు 20 రెట్ల అధిక ప్రీమియంతో ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే వీలుంది. ఏదైన చిన్న ప్రతికూలాంశం అనూహ్య దిద్దుబాటుకు దారి తీయవచ్చు. కావున పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ కుమార్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦విలీనం తర్వాత తొలి ట్రేడింగ్ సెషన్లో హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఇంట్రాడేలో హెచ్డీఎఫ్సీ,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు వరుసగా 4%, 3% చొప్పున ర్యాలీ చేసి రూ.2,926 వద్ద, రూ.1,758 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకాయి. చివరికి హెచ్డీఎఫ్సీ షేరు 2% లాభంతో రూ.2,871 వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు ఒక శాతం పెరిగి రూ.1,719 వద్ద స్థిరపడింది. మొత్తంగా ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువ రూ.14.93 లక్షల కోటక్లు పెరిగింది. ♦ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏడాది గరిష్టం (45,353) తాకింది. చివరికి ఒకశాతం లాభంతో 45,158 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్ సైతం 52 వారాల గరిష్టం(20,398) అందుకొని ఆఖరికి 1% లాభంతో 20,253 వద్ద నిలిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. -
ఇన్వెస్టర్లకు అలర్ట్: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్లో అంతరాయం..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) అధికారిక వెబ్సైట్ (bseindia.com)లో శనివారం (జూన్ 17) సాయంత్రం నుంచి అంతరాయం ఉంటుందని తెలియజేసింది. జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ పని చేయదని వెల్లడించింది. నిర్వహణ పనుల నిమిత్తం వెబ్సైట్ 12 గంటల పాటు అందుబాటులో ఉండదు. "మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా జూన్ 17 రాత్రి 9 గంటల నుంచి జూన్ 18 ఉదయం 9 గంటల వరకు వెబ్సైట్ అందుబాటులో ఉండదు" అని బీఎస్ఈ తన వెబ్సైట్లో పేర్కొంది. ఏదైనా అత్యవసర ఫైలింగ్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో corp.relations@bseindia.com ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
కొంపముంచిన ప్రకటన..టీసీఎస్‌కు 15 వేల కోట్ల నష్టం!
ఇండియన్ స్టాక్ మార్కెట్లో రెండో అత్యంత విలువైన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు వ్యాపారం పరంగా ఎదురు దెబ్బ తగిలింది. టీసీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. దీంతో టీసీఎస్ వేల కోట్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా కేంద్రంగా ట్రాన్సామెరికా హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు ఇతర ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, 2018 నుంచి 10 ఏళ్ల కాలానికి సేవలు పొందేందుకు దేశీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డీల్ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా టీఎస్ఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ట్రాన్సామెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లో టీసీఎస్ మార్కెట్ వ్యాల్యూ రూ.11,76,842 కోట్ల నుంచి రూ.11,61,840 వద్ద స్థిర పడింది. రూ.15,000 కోట్ల సంపద తరిగింది. ఏడాదికి 200మిలియన్ల ఆదాయం 2018 నుంచి ట్రాన్సామెరికాకు టీసీఎస్ సర్వీసుల్ని అందిస్తుంది. అందుకు గాను దేశీ టెక్ దిగ్గజం ఏడాదికి 200 మిలియన్ డాలర్ల ఆదాయన్ని గడిస్తుంది. ఈ సందర్భంగా అమెరికన్ ఆర్ధిక సేవల సంస్థ జేపీ మోర్గాన్.. తాము సైతం ఆర్ధిక అనిశ్చితి ఇబ్బంది పడుతున్నట్లు ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితులు గణనీయమైన లాభాల్ని సైతం పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు! -
ఆరు నెలల గరిష్టానికి మార్కెట్
సెన్సెక్స్ అరశాతానికి పైగా లాభపడటంతో మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.09 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 290 లక్షల కోట్లకు చేరింది. ముంబై: మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్ ఆరు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు ఒకటిన్నర శాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు పెరిగి 62,779 వద్ద, నిఫ్టీ 30 లాభంతో 18,632 వద్ద మొదలయ్యాయి. సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. మిడ్ సెషన్ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 425 పాయింట్లు పెరిగి 63,177 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 18,729 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఆఖరికి సెన్సెక్స్ 418 పాయింట్ల లాభంతో 63,177 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 18,716 వద్ద నిలిచింది. ఇరు సూచీలకు ఈ ముగింపు ఆరునెలల కనిష్ట స్థాయి కావడం విశేషం. రియల్టి , కన్య్సూమర్ డ్యూరబుల్స్, టెలీ కమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, మెటల్, షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.17%, 0.82 శాతం చొప్పున పెరిగాయి. ఆటో షేర్లు మాత్రమే నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 3 డాలర్లు దిగిరావడంతో బర్గర్ పెయింట్స్, కన్షాయ్ నెరోలాక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 4–2% శాతం బలపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,678 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 203 కోట్ల షేర్లను విక్రయించారు. డాలర్ మారకంలో రూపాయి ఐదు పైసలు బలపడి 82.38 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించవచ్చనే ఆశలతో ప్రపంచ ఈక్విటీ మా ర్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎంఆర్ఎఫ్ ః రూ. 1 లక్ష ఆరు అంకెల ధర తాకిన తొలి దేశీ షేరు ఇంట్రాడేలో రూ. 1,00,300; రూ. 99,950 వద్ద క్లోజింగ్ దేశీ టైర్ల దిగ్గజం ఎంఆర్ఎఫ్ షేరు కొత్త రికార్డు సృష్టించింది. రూ. 1 లక్ష మార్కును అధిగమించిన తొలి షేరుగా ఘనత దక్కించుకుంది. మంగళవారం బీఎస్ఈలో 52 వారాల గరిష్టం రూ. 1,00,300 స్థాయిని తాకింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 1.02% లాభంతో రూ. 99,950.65 వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో రూ. 1,00,439.95ని తాకి చివరికి 0.94% లాభంతో రూ. 99,900 వద్ద ముగిసింది. స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 12.89% పెరిగింది. -
సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
ఐకియో లైటింగ్ ధరల శ్రేణి రూ. 270–285
న్యూఢిల్లీ: లెడ్ లైటింగ్ సొల్యూషన్ల కంపెనీ ఐకియో లైటింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 6న ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 270–285గా కంపెనీ ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 90 లక్షల షేర్లను ప్రమోటర్లు హర్దీప్ సింగ్, సుర్మీత్ కౌర్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 606 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని చూస్తోంది. ఐపీవోలో భాగంగా 5న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 212 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటు కోసం వెచ్చించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 52 ఈక్విటీ షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ప్రధానంగా లెడ్ లైటింగ్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ప్రొడక్టుల సరఫరా చేపడుతోంది. 2021–22లో ఆదాయం 55 శాతం జంప్‌చేసి రూ. 332 కోట్లకు చేరింది. నికర లాభం 75 శాతం వృద్ధితో రూ. 50.5 కోట్లను తాకింది. -
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
దేశీ స్టాక్ మార్కెట్ల జోరు.. వరుసగా రెండో రోజూ దూకుడు!
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు, ఉపశమించిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ దూకుడు చూపాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 62,346కు చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 18,399 వద్ద నిలిచింది. వెరసి గతేడాది డిసెంబర్ 14 తర్వాత తిరిగి మార్కెట్లు గరిష్టాలకు చేరాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ప్రోత్సాహానికితోడు.. ఏప్రిల్‌లో టోకు ధరలు మైనస్‌కు చేరడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు పురోగమించి 62,563కు చేరింది. నిఫ్టీ 18,459ను తాకింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 4.3 శాతం జంప్‌చేసింది. రిటైల్, టోకు ధరలు తగ్గడంతో వడ్డీ రేట్లకు చెక్ పడనున్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ 2–0.7 శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యథాతథంగా నిలిచింది. రియల్టీ కౌంటర్లలో శోభా 11.5 శాతం దూసుకెళ్లగా.. డీఎల్ఎఫ్, మహీంద్రా లైఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లోధా 7.4–3.4 శాతం మధ్య జంప్ చేశాయి. టాటా మోటార్స్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, టాటా మోటార్స్ 3 శాతం పుంజుకోగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, టాటా స్టీల్, విప్రో, ఐషర్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే అదానీ ఎంటర్, సిప్లా, బీపీసీఎల్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, మారుతీ, అదానీ పోర్ట్స్, టీసీఎస్ 3–0.7 శాతం మధ్య నీరసించాయి. చిన్న షేర్లు ఓకే మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ కనిపించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,856 లాభపడితే, 1,802 డీలాపడ్డాయి. నగదు విభాగంలో వారాంతాన రూ. 1,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరింత అధికంగా రూ. 1,685 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేశాయి. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు రూ. 23,152 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! విదేశీ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారల్ 0.25 శాతం బలపడి 74.34 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు నీరసించి 82.31కు చేరింది. -
ఎల్అండ్టీ ఫైనాన్స్, గల్ఫ్ ఆయిల్స్ లూబ్రికెంట్స్ స్టాక్స్ కొనొచ్చా?
ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 96 టార్గెట్: రూ. 125 - కొనొచ్చు ఎందుకంటే: గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 47 శాతం జంప్‌చేసింది. రూ. 500 కోట్లను తాకింది. రుణ వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 1,680 కోట్లకు చేరింది. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం(పీపీవోపీ) అంచనాలకు అనుగుణంగా 9 శాతం బలపడి రూ. 1,240 కోట్లయ్యింది. అయితే మొత్తం రుణ ఆస్తులు 8 శాతం క్షీణించాయి. హోల్‌సేల్ రుణ ఆస్తులు 53 శాతం నీరసించడం ప్రభావం చూపింది. కాగా.. యాజమాన్య వ్యూహాల ప్రకారం రిటైల్ రుణ ఆస్తుల వేగవంత వృద్ధి కొనసాగింది. 35 శాతం ఎగశాయి. దీంతో కంపెనీ రుణ మిక్స్‌లో ప్రస్తుతం రిటైల్ రుణ ఆస్తుల వాటా 75 శాతానికి చేరింది. ఇటీవల నిర్వహించిన విశ్లేషకుల సమావేశంలో కంపెనీ యాజమాన్యం రిటైల్ విభాగంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా మొత్తం లోన్‌బుక్‌లో రిటైల్ విభాగం పోర్ట్‌ఫోలియోను 90 శాతానికి పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు వీలుగా గ్రామీణ, మైక్రో, గ్రూప్ రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. ఇక మరోవైపు వృద్ధికి వీలుగా అనలిటిక్స్‌పై ప్రత్యేక దృష్టి, ప్రస్తుత కస్టమర్లకు విభిన్న ప్రొడక్టుల విక్రయం, టెక్నాలజీపై నిరవధిక పెట్టుబడులు తదితరాలను చేపడుతోంది. వెరసి 2.8–3 శాతం ఆర్వోఏ సాధించే లక్ష్యంగా సాగుతోంది. రిటైల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం కంపెనీకి లబ్ధిని చేకూర్చే వీలుంది. గల్ఫ్ ఆయిల్స్ లూబ్రికెంట్స్ ప్రస్తుత ధర: రూ. 418 టార్గెట్: రూ. 813 కొనొచ్చు ఎందుకంటే: లూబ్రికెంట్స్ విభాగంలో దేశీయంగా క్యాస్ట్రాల్ తదుపరి రెండో పెద్ద కంపెనీగా గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా నిలుస్తోంది. మార్కెట్ వాటాను పెంచుకోవడంతోపాటు.. గత మూడేళ్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులలోనూ పటిష్టస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా సమర్ధతను చాటుకుంది. వాణిజ్య వాహన విభాగ వాతావరణం(సైకిల్) ఊపందుకోవడం, జాతీయ రహదారులపై రవాణా పుంజుకోవడం, జోరు చూపుతున్న పారిశ్రామికోత్పత్తి, యుటిలిటీ వాహన విక్రయాలలో వృద్ధి వంటి అంశాలు లూబ్రికెంట్స్‌కు డిమాండును పెంచనున్నట్లు అంచనా. వెరసి బిజినెస్ టు బిజినెస్(బీటూబీ) విభాగం నుంచి లూబ్రికెంట్స్ విక్రయాలు ఊపందుకోనున్నాయి. ఇది అంతిమంగా కంపెనీకి లబ్ధిని చేకూర్చనుంది. కంపెనీ లూబ్రికెంట్స్, చమురు అమ్మకాల పరిమాణంలో బీటూబీ విభాగం నుంచి 35– 40 శాతం నమోదవుతుండటం కంపెనీకి బలాన్నిస్తోంది. దీనికితోడు అమ్మకాలలో 65 శాతంవరకూ వాటాను ఆక్రమిస్తున్న బిజినెస్ టు కన్జూమర్(బీటూసీ) లూబ్రికెంట్ బిజినెస్ విస్తరణపైనా కంపెనీ కన్నేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రాంతాలలో డీలర్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. బీటూబీ బిజినెస్‌తో పోలిస్తే బీటూసీలో మెరుగైన మార్జిన్లు ఆర్జిస్తోంది. ఇలాంటి పలు వ్యూహాత్మక అంశాలు కంపెనీ మార్కెట్ వాటాను పెంచనున్నాయి. ఆర్థిక పనితీరు మెరుగుకు దోహదపడనున్నాయి. వెరసి భవిష్యత్‌లో దేశీ లూబ్రికెంట్స్ మార్కెట్లో నాయకత్వ స్థాయికి చేరే అవకాశముంది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
కార్వీ మాజీ ఉద్యోగులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో నిబంధనలను ఉల్లంఘించినందుకు.. కార్వీ గ్రూప్‌నకు చెందిన నలుగురు మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మొత్తం రూ.1.9 కోట్ల జరిమానా విధించింది. వీరిలో కేఎస్‌బీఎల్ ఎఫ్అండ్ఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ జి.కృష్ణ హరి, కాంప్లియెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు, కార్వీ స్టాక్ బ్రోకింగ్ అనుబంధ కంపెనీ కేడీఎంఎస్‌ఎల్ ఎండీ వి.మహేశ్ ఉన్నారు. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని సెబీ వీరిని ఆదేశించింది. కంపెనీ చేసిన తప్పులకు సహకరించిన, కుమ్మక్కైన కేఎస్‌బీఎల్‌కు చెందిన కీలక వ్యక్తులపై సెబీ న్యాయ విచారణను ప్రారంభించిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. -
స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే
ముంబై: వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో చివరకు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 61,761 వద్ద నిలవగా.. నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,266 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 264 పాయింట్లు ఎగసి 62,000ను అధిగమించింది. 62,028 సమీపానికి చేరింది. చివర్లో లాభాలను వీడటంతోపాటు 109 పాయింట్లు క్షీణించి 61,655ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 18,344– 18,230 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ముందురోజు సెన్సెక్స్ 710, నిఫ్టీ 195 పాయింట్లు జంప్‌చేసిన నేపథ్యంలో రెండో సెషన్ నుంచీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ నేలచూపు: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, ఆటో, ఫార్మా 0.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 2.75 శాతం పతనమయ్యాయి. రియల్టీ 1 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఇండస్ఇండ్, కోల్ ఇండియా, టీసీఎస్, యాక్సిస్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, విప్రో, ఇన్ఫీ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క యూపీఎల్, ఐటీసీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్ 3–1 శాతం మధ్య డీలాపడ్డాయి. రూపాయి నేలచూపు.. డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ డీలా పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 28 పైసలు క్షీణించి 82.06 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం రూపాయిని దెబ్బతీసింది. ఈక్విటీ మార్కెట్లు నీరసించడం దీనికి జత కలిసింది. -
ఒక్కరోజులోనే రూ. 2.27 లక్షల కోట్లకు పైగా లాభం
వారాంతాన పతన బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు నేలక్కొట్టిన బంతిలా పైకెగశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సమయం గడిచేకొద్దీ మార్కెట్లు మరింత జోరు చూపాయి. వెరసి సెన్సెక్స్ 710 పాయింట్లు జంప్‌చేసి 61,764కు చేరగా.. నిఫ్టీ సైతం 195 పాయింట్లు పురోగమించి 18,264 వద్ద ముగిసింది. ముంబై: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీ ప్రభావంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించింది. వారాంతాన యూఎస్ మార్కెట్లు భారీగా లాభపడగా.. ఫెడ్ రేట్ల పెంపునకు బ్రేక్‌పడనున్న అంచనాలు వడ్డీ ప్రభావిత రంగాలకు బూస్ట్‌నిచ్చాయి. ఫలితంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీ రంగాలకు జోష్ వచ్చింది. ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ 1.7 శాతం చొప్పున ఎగశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు దాదాపు ఇంట్రాడే గరిష్టాల సమీపంలోనే ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 218 పాయింట్లు జమ చేసుకుంది. యూఎస్ బ్యాంకింగ్ రంగ సమస్యలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ రంగాల పటిష్ట ఫలితాలు సైతం ఇందుకు జత కలసినట్లు పేర్కొన్నారు. అయితే ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్ 1 శాతం, మీడియా 0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. బ్లూచిప్స్ ర్యాలీ నిఫ్టీ–50 దిగ్గజాలలో 8 షేర్లు మాత్రమే నష్టపోయాయి. బ్లూచిప్స్‌లో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, బజాజ్ త్రయం, ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, యాక్సిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, మారుతీ, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ, టాటా స్టీల్ 5–1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే క్యూ4 ఫలితాలు నిరాశపరచడంతో కోల్ ఇండియా షేరు 2 శాతం క్షీణించి రూ. 233 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి కోటికిపైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ బాటలో అదానీ ఎంటర్ప్రైజెస్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఎల్అండ్టీ 1.5–0.4 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ కౌంటర్లలో మహీంద్రా లైఫ్, లోధా, శోభా, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 3.7–1.4 శాతం మధ్య లాభపడ్డాయి. చిన్న షేర్లు గుడ్ మార్కెట్ల బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 1–0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,998 లాభపడగా.. 1,654 వెనకడుగు వేశాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 778 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,199 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. స్టాక్ హైలైట్స్ ►ప్రోత్సాహకర ఫలితాలు (క్యూ4) ప్రకటించిన స్మాల్ క్యాప్ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 540 వద్ద నిలిచింది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ ఏకంగా 43 శాతం లాభపడింది. ►క్యూ4లో కన్సాలిడేటెడ్ నష్టం భారీగా తగ్గడంతో పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 724 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద జూమ్ మార్కెట్లు జోరందుకోవడంతో సోమవారం ఒక్క రోజులోనే లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్(విలువ) రూ. 2.27 లక్షల కోట్లకు పైగా లాభపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 2.76 లక్షల కోట్లను దాటింది. -
లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ సూచీలు
అంతర్జాతీయ సానుకూల అంశాలు, కంపెనీల కార్పొరేట్ ఫలితాలు పాజిటీవ్‌గా ఉండడంతో దేశీయ మదపర్లు పెట్టుబడులవైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా సోమవారం ఉదయం దేశీయ స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 434 పాయింట్లు లాభపడి 61489 పాయింట్ల వద్ద నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 18187 వద్ద కొనసాగుతున్నాయి. కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, ఏసియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్స్,ఇన్ఫోసిస్,అదానీ పోర్ట్స్ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఇండస్ ఇండ్,ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్ సర్వ్, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఓన్జీసీ,హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. -
ఫెడ్ ప్రకటనకు ముందు అప్రమత్తత
ముంబై: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి విధాన వైఖరి ప్రకటనకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో స్టాక్ సూచీల వరుస ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ షేర్ల బలహీన ట్రేడింగ్ సైతం ఒత్తిడిని పెంచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఉదయం సెన్సెక్స్ 80 పాయింట్ల పతనంతో 61,275 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 18,114 వద్ద మొదలయ్యాయి. ఇటీవల వరుస ర్యాలీ క్రమంలో బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లు భారీ ఎత్తున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఒక దశలో సెన్సెక్స్ 330 పాయింట్లు క్షీణించి 61,024 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు పతనమైన 18,042 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంతమేర నష్టాలు తగ్గాయి. ఫలితంగా సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 61,193 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 18,100 స్థాయి దిగువున 18,090 వద్ద నిలిచింది. దీంతో సెన్సెక్స్ ఎనిమిది రోజులు, నిఫ్టీ ఆరు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ల పడినట్లైంది. ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,338 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.584 కోట్ల షేర్లను అమ్మేశారు. సెన్సెక్స్ 161 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో రూ.1.63 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఆసియా మార్కెట్లు 0.50% నుంచి ఒకటిన్నర శాతం దాకా నష్టపోయాయి. -
8 రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో ట్రేడర్స్ జాగ్రత్త పడ్డారు. దీంతో 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇక, బుధవారం సాయంత్రం మార్కెట్లు సెన్సెక్స్ 61,193 వద్ద, నిఫ్టీ 18,090 వద్ద ముగిసింది. ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ షేర్లు 1శాతం నష్టపోయాయి. హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, నెస్లే షేర్లు భారీ లాభాలతో ముగింపు పలికాయి. -
బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: బ్యాంకింగ్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెంటిమెంట్ మరింత బలహీనపడింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. అయితే చివర్లో రియల్టీ, ఫార్మా షేర్లకు రాణించడంతో నష్టాలు కొంత మేరకే పరిమితం అయ్యాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 59,991 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 534 పాయింట్ల పరిధిలో 59,579 వద్ద కనిష్టాన్ని, 60,113 గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 184 పాయింట్లు నష్టపోయి 59,727 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 17,767 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 17,610–17,767 శ్రేణిలో కదలాడింది. చివరికి 47 పాయింట్ల పతనమై 17,660 వద్ద స్థిరపడింది. ఐటీ, మెటల్, ఫార్మా రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్ సూచీ అరశాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం చొప్పున లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఫలితాలు బలహీనంగా నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.810 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.401 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్‌తో సహా ఇతర కేంద్ర బ్యాంకులు కఠినతర ద్రవ్య విధాన వైఖరిని అవలంభించవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తొలి ఐపీఓ అవెలాన్ టెక్నాలజీస్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.436)తో పోలిస్తే ఒకశాతం డిస్కౌంట్‌తో రూ.431 వద్ద లిస్టయింది. ఒక దశలో 11 శాతం క్షీణించి రూ.388 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 9% నష్టపోయి రూ.397 వద్ద నిలిచింది. ►ఎక్సే్చంజీలో మొత్తం 3.17 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ వ్యాల్యుయేషన్ రూ.2,595 కోట్లుగా నమోదైంది. ►సోడా యాష్ ధరలు 3–4 శాతం తగ్గించడంతో టాటా కెమికల్స్ షేరు 6% నష్టపోయి రూ.932 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 6.50% క్షీణించి రూ.926 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామలతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 114.06 పాయింట్లు లాభంతో 60024 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 17742 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. హెచ్‌సీఎల్, టాటా మోటార్స్, ఎథేర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అపోలో హాస్పిటల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్, హెచ్‌యూఎల్, హీరోమోటో కార్ప్, సన్ ఫార్మా, టీసీఎస్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్లో డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి?
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇద్దరు వ్యక్తులు చట్టవిరుద్ధమైన డబ్బా ట్రేడింగ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా పేర్కొంది. స్టాక్ ఎక్ఛేంజీ ప్లాట్‌ఫామ్‌తో సంబంధంలేకుండా బయట షేర్లలో లావాదేవీలు చేపట్టడాన్ని డబ్బా ట్రేడింగ్‌గా వ్యవహరిస్తారు. ఇది చట్టవిరుద్ధంకాగా.. కొంతమంది ఆపరేటర్లు ఇలాంటి ట్రేడింగ్ రింగ్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఇతరులను అనుమతిస్తారు. వెరసి ఇలాంటి లావాదేవీలపట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా ఇన్వెస్టర్లను ఎన్ఎస్ఈ హెచ్చరించింది. డబ్బా ట్రేడింగ్‌ను నితిన్ శాంతీలాల్ నగ్డా, నరేంద్ర వి.సుమారియా ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. వీళ్లు ట్రేడింగ్ సభ్యులు(టీఎం)గా రిజిస్టర్కావడంతో అధీకృత వ్యక్తులు(ఏపీ)గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. వెరసి చట్టవిరుద్ధమైన ఎలాంటి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ లావాదేవీలు చేపట్టవద్దంటూ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరికలు జారీ చేసింది. వీటికి ఇన్వెస్టర్లే బాధ్యత వహించడంతోపాటు.. నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి లావాదేవీ లకు స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి ఎలాంటి అనుమతులు లభించవని స్పష్టం చేసింది. -
భారీ షాక్.. ఇన్ఫోసిస్‌కు ఒక్కరోజులోనే 58 వేల కోట్ల నష్టం!
ముంబై: స్టాక్ మార్కెట్లో గడచిన రెండేళ్లలో మునుపెన్నడూ సాగని తొమ్మిది రోజుల సుదీర్ఘ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇన్ఫోసిస్ క్యూ4 క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు నిపుణులు తెలిపారు. ఉదయం సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టంతో 60,385 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 17,863 వద్ద మిశ్రమంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే బలహీనంగా కదలాడిన సూచీలు చివరి దాకా అదే వైఖరిని ప్రదర్శించాయి. ఒక దశలో సెన్సెక్స్ 989 పాయింట్లు క్షీణించి 59,442 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు పతనమై 17,574 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరి గంటలో కనిష్ట స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. ఆఖరికి సెన్సెక్స్ 520 పాయింట్లు నష్టపోయి 59,911 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్లు పతనమై 17,707 వద్ద నిలిచింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఇంధన, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ సూచీలు అరశాతం చొప్పున లాభపడ్డాయి. పదిరోజుల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారి రూ.533 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.269 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 82.01 వద్ద నిలిచింది. సూచీలకు నష్టాలు ఎందుకంటే మొత్తం 9 ట్రేడింగ్ సెషన్లలో సూచీలు ఐదుశాతం ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. సూచీల్లో అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్(9%), హెచ్డీఎఫ్సీ(2%) షేర్లు పతనమవడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంక్ దిగ్గజ కంపెనీలు అంచనాల కంటే తక్కువగా త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రానున్న రోజుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు అనువుగా అమెరికాలో మెరుగైన ఉద్యోగాల గణాంకాలు నమోదయ్యాయి. రేట్ల పెంపు అంచనాలతో ఇన్వెస్టర్లు ఈక్విటీలను విక్రయించి సురక్షితమైన బాండ్లలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఆర్థిక మాంద్య భయాలు, వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ఆసియా మార్కెట్లు 1.50–1% పతనమయ్యాయి. యూరప్ సూచీలు పావు శాతం క్షీణించాయి. ఇన్ఫోసిస్‌కి క్వార్టర్ ఫలితాల షాక్ దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం నాలుగో క్వార్టర్ ఫలితాలు అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు మార్కెట్ అంచనాల కంటే తక్కువగా 4–7% ఉంటుందని పేర్కొంది. దీంతో పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈలో ఈ షేరు 12% క్షీణించి రూ.1,219 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివర్లో తేరుకొని 9.5% నష్టపోయి రూ.1,258 వద్ద నిలిచింది. షేరు భారీ పతనంతో ఒక్కరోజులోనే కంపెనీ రూ.58,000 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఈ ప్రభావం ఇదే రంగానికి చెందిన ఇతర ఐటీ కంపెనీల షేర్లపై పడింది. ఎల్టీఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, పర్సిస్టెంట్, హెచ్‌సీఎల్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఎంఫసిస్ షేర్లు 7–2% చొప్పున నష్టపోయాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా ఐదుశాతం నష్టపోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ∙నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు జీవితకాల గరిష్టాన్ని తాకింది. 0.5% లాభంతో రూ.393 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 2% బలపడి రూ.402 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. చివరికి 1% లాభపడి తొలిసారి రూ.400 స్థాయి వద్ద ముగిసింది. ∙చివరి క్వార్టర్ ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీగా లాభపడ్డాయి. అత్యధికంగా పంజాబ్ సింధ్ బ్యాంక్ షేరు 18 శాతం ర్యాలీ చేసింది. ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఐఓబీ, మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఇండియా, షేర్లు 8–4% చొప్పున పెరిగాయి. -
నిరాశపరిచిన ఐటీ షేర్లు.. నష్టాలతో ముగిసిన దేశీ స్టాక్ సూచీలు
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాలు, ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అయితే ఈ వారంలో ఆ లాభాలకు బ్రేకులు పడ్డాయి. సోమవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు నష్టపోయి 59910 వద్ద నిఫ్టీ 121 పాయింట్ల నష్టపోయి 17706 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా,హెచ్‌సీఎల్,ఎన్టీపీసీ,లార్సెన్, విప్రో, హెచ్డీఎఫ్సీ,టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్,సిప్లా షేర్లు నష్టపోగా.. నెస్లే,పవర్ గ్రిడ్ కార్పొరేషన్,ఎస్బీఐ, బ్రిటానియా, హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు గడించాయి. -
అదానీ స్టాక్స్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 280 పాయింట్ల లాభంతో 60,126 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 17,716 దగ్గర కొనసాగుతోంది. కొటాక్ మహీంద్రా, ఎథేర్ మోటార్స్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐటీసీ, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజికీ, దివిస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఆల్ట్రాటెక్ సిమెంట్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెంయిట్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయ్?
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే ఈ వారంలో స్టాక్ సూచీలు సానుకూలంగా కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు, తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం స్టాక్ ఎక్సే్చంజీలకు సెలవు. ఆర్బీఐ పరపతి విధానం సానుకూలంగా ఉండటంతో గతవారంలో సూచీలు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఆటో, ఫార్మా, మౌలిక షేర్ల మద్దతుతో సెన్సెక్స్ 841 పాయింట్లు, నిఫ్టీ 239 పాయింట్లు లాభపడ్డాయి. మహవీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కావడంతో గతవారం ట్రేడింగ్ మూడురోజులే జరిగిన సంగతి తెలిసిందే. ‘‘రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడంతో గతవారం సూచీలు కీలక సాంకేతిక స్థాయిలను అధిగమించగలిగాయి. డాలర్ ఇండెక్స్ పతనమైంది. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గింది. దేశీయ మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ రెండేళ్ల కనిష్టం 11.80స్థాయికి దిగివచ్చింది. ఇవి బుల్స్‌కు మరింత ఉత్సాహానిచ్చే అంశాలుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు సద్దుమణుగుతున్న వేళ .., మార్కెట్ వర్గాలు కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలపై దృష్టి సారించారు. అనుకున్నట్లే కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో కీలకమైన 17,600 – 17,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,300 వద్ద తక్షణ మద్దతు ఉంది’’ స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. ఆర్థిక ఫలితాల సీజన్ ఆరంభం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ బుధవారం (ఏప్రిల్ 12న) క్యూ4 క్వార్టర్ ఆర్థిక గణాంకాలను వెల్లడించి కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. మరో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆ మరుసటి రోజు(గురువారం) గణాంకాలను ప్రకటించనుంది. యూరప్, యూఎస్‌లో నెలకొన్న మందగమనం, ఆర్థిక అస్థిరతల దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాఫ్టేవేర్ దిగ్గజ కంపెనీల ఆదాయ అంచనాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల యాజమాన్య అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్ష్ణు్ణంగా పరిశీలించే వీలుంది. ఇదే వారంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డెల్టా కార్ప్‌లు ఆర్థిక పలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటా, మార్చి సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం(ఏప్రిల్ 12న) విడుదల కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం మార్చి నెల డబ్ల్యూపీ ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా వెల్లడి కానుంది. అదేరోజున ఆర్బీఐ ఏప్రిల్ ఏడో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. అంతర్జాతీయంగా సోమ వారం జపాన్ కరెంట్ అకౌంట్, వినియోగదారుల విశ్వాసం గణాంకాలు, మంగళవారం యూఎస్ రిటైల్ అమ్మకాలు, చైనా ద్రవ్యోల్బణ డేటా వెల్లడికాన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల యూ టర్న్... గడచిన నెలల్లో విక్రయాలకు పాల్పడిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో కొనుగోళ్లకు ఆస్తకి చూపుతున్నారు. ఈ ఏప్రిల్ మొదటి వారంలో రూ.1,600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పతనంతో ఎఫ్ఐఐలు ఈక్విటీల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ కరెన్సీ రూపాయి సైతం 82.75 – 81.74 శ్రేణిలో కదలాడటం కలిస్తోంది. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని నిపుణులు చెబుతున్నారు. -
అదానీ పవర్‌పై ఎక్స్ఛేంజీల కన్ను
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా అదానీ పవర్ కౌంటర్‌ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్ స్వల్పకాలిక ఏఎస్ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీ స్టాక్స్‌ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్ఎం రెండో దశ నుంచి స్టేజ్–1కు బదిలీ చేశాయి. ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మర్‌లను స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్ఎం నుంచి తప్పించాయి. ఏఎస్ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్ఎంలో చేర్చిన స్టాక్‌లో ఓపెన్ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్ రేటు పరిమితి ఉంటుంది. -
ఇండియాఫస్ట్ లైఫ్ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థలలో బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,30,56,415 షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. వాటాదారులలో కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లకుపైగా షేర్లు విక్రయించనుంది. ఇండియాఫస్ట్ లైఫ్‌లో బీవోబీ 65 శాతం వాటాను కలిగి ఉంది. వార్బర్గ్ పింకస్ సంస్థ కార్మెల్ పాయింట్‌కు 26 శాతం, యూనియన్ బ్యాంక్‌కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఇష్యూకి ముందు ప్రిఫరెన్షియల్ పద్ధతి లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్(రైట్స్ ఇష్యూ) ద్వారా రూ. 100 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. తాజా ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కంపెనీ గతేడాది అక్టోబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దేశీయంగా మూడో పెద్ద పీఎస్‌యూ బ్యాంక్ బీవోబీ, యూనియన్ బ్యాంక్ కంపెనీకి విస్తారిత బ్యాంకెస్యూరెన్స్ నెట్వర్క్ ద్వారా మద్దతిస్తున్నాయి. -
పతంజలి ప్రమోటర్ల వాటాలు సీజ్
న్యూఢిల్లీ: ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలన్న నిబంధన అమలులో విఫలమైనందుకు పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ల వాటాలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్తంభింప (ఫ్రీజ్) చేశాయి. ఈ చర్య కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని పతంజలి ఫుడ్స్ పేర్కొంది. పతంజలి ఆయుర్వేద్ సహా 21 ప్రమోటర్ సంస్థల వాటాలను స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఫ్రీజ్ చేసినట్టు పతంజలి అంతకుముందు ప్రకటించింది. ‘డిస్క్లోజర్’ నిబంధనల కింద స్టాక్ ఎక్సేంజ్‌లకు తాజా విషయాన్ని తెలియజేసింది. కనీస ప్రజల వాటా నిబంధన అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రమోటర్ల నుంచి తమకు సమాచారం అందినట్టు పతంజలి ఆయుర్వేద్ తెలిపింది. ప్రజల వాటాను పెంచేందుకు మెరుగైనది ఏదనే విషయమై వారు చర్చిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే కొన్ని నెలల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82 శాతం వాటా ఉంది. నిబంధనల ప్రకారం 75% మించకూడదు. అంటే మరో 5.82% వాటా విక్రయించాల్సి ఉంటుంది. నేపథ్యం..: రుచి సోయా ఇండస్ట్రీస్ (పతంజలి ఫుడ్స్ పూర్వపు పేరు)ని దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2019 సెప్టెంబర్‌లో పతంజలి గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థలో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 98.87 శాతం వాటా లభించింది. 2022 మార్చిలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు పతంజలి ఫుడ్స్ వచ్చింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 648 చొప్పున 6.61 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో ప్రజల వాటా 19.18 శాతానికి పెరిగింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి ప్రజల వాటా 25%కి చేర్చాల్సి ఉంది. మరో ఎఫ్‌పీవో: బాబా రామ్‌దేవ్ ఏప్రిల్‌లో మరో విడత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) చేపట్టనున్నట్టు పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. తద్వారా ప్రజల వాటా కనీసం 25% ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని తెలిపింది. పతంజలి గ్రూప్ అధినేత బాబా రామ్‌దేవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదన్నారు. పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎక్సే్ఛంజ్‌ల చర్య ప్రభావం చూపించదని భరోసా ఇచ్చారు. తాము 6% వాటాలను తగ్గించుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే జాప్యానికి కారణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాక ఏప్రిల్‌లో ఎఫ్‌పీవో చేపడతామన్నారు. -
నష్టాలే.. సెన్సెక్స్ 337 పాయింట్లు డౌన్.. నిఫ్టీ 17వేల మార్క్‌కు పరిమితం
ముంబై: అమెరికా బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు కొద్దిసేపటికి నష్టాల్లోకి మళ్లాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 571 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ చివరికి 338 పాయింట్ల పతనంతో 57,900 వద్ద స్థిరపడింది. ఒక దశలో నిఫ్టీ 17వేల స్థాయిని కోల్పోయింది. ఆఖరికి 111 పాయింట్లు నష్టపోయి 17,043 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు అయిదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ అరశాతం, స్మాల్ క్యాప్ సూచీ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3087 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2122 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు క్షీణించి రూ.82.37 వద్ద స్థిరపడింది. యూఎస్ సూచీల భారీ పతనం నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ‘‘బేర్స్ ఆధిపత్యం నాలుగోరోజూ కొనసాగింది. కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధాన వైఖరి, ద్రవ్యోల్బణం కారణంగా బాండ్లపై దిగుమతులు తగ్గేందుకు మరింత సమయం పడుతుంది. ఒక దశలో నిఫ్టీ ఆరంభ నష్టాలను భర్తీ చేసుకునేందుకు యతి్నంచింది. అయితే ఐటీ, బ్యాంకింగ్, ఇంధన షేర్లలో తలెత్తిన అమ్మకాలతో తేరుకోలేకపోయింది. యూఎస్ ద్రవ్యోల్బణ డేటా (మంగళవారం వెల్లడి) నేటి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపనుంది. ట్రేడర్లు రిస్క్ మేనేజ్మెంట్పై మరింత దృష్టి సారించాలి’’ జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఆటో ఉపకరణాల తయారీ సంస్థ దివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.590)తో పోలిస్తే ఐదుశాతం ప్రీమియంతో రూ.620 వద్ద లిస్టయ్యింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి రెండున్నరశాతం లాభంతో రూ.605 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 34.14 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.1,851 కోట్లుగా నమోదైంది. ► హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ(హెచ్‌సీసీ) షేరు 4% లాభపడి రూ.15 వద్ద స్థిరపడింది. మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్.. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి భారీ ఆర్డర్ దక్కించుకుంది. -
స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా.. ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసురుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల అంశాలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 897 పాయింట్లను భారీగా నష్టపోయి 58237 వద్ద, నిఫ్టీ 258 పాయింట్లు నష్టపోయి 17154 వద్ద ముగిసింది. నిఫ్టీ జోన్లు ప్రస్తుతం 17,250 పాయింట్ల వద్ద ఉండగా.. మార్కెట్లలో అనిశ్చితి ఇలాగే కొనసాగితే 17,000-16,800 స్థాయిల వైపు కొనసాగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ప్రతినిధి చందన్ తపారియా చెప్పారు. ఇక మార్కెట్లు ముగిసే సమయానికి ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎంఅండ్ ఎం, ఎథేర్ మోటార్స్,బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకును సైతం మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై ప్రభావం చూపిందని ట్రేడ్ నిపుణులు పేర్కొనగా.. సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.4 లక్షలకోట్ల మేర ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు అంచనా. -
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 817 పాయింట్ల నష్టంతో 58,989 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయి 17,386 దగ్గర కొనసాగుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్,హెచ్డీఎఫ్సీ,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్, అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, మారుతి సుజికి, బ్రిటానియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 72 పాయింట్ల నష్టంతో 60152 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 17,700 దగ్గర కొనసాగుతోంది. హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్,టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్,హెచ్‌సీఎల్ టెక్, ఎసియన్ పెయింట్స్, సన్ ఫార్మా,అపోలో హాస్పిటల్,టైటాన్ కంపెనీ, సిప్లా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, లార్సెన్,బజాజ్ ఆటో, అదానో పోర్ట్స్, ఎన్టీపీసీ, బ్రిటానియా,బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు లేని తరుణంలో ట్రేడర్లు అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు. ఇక ఉదయం 9.40గంటల సమయానికి సెన్సెక్స్ 569 పాయింట్లు లాభంతో 60378 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 17762 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. నిఫ్టీ 50లో బ్రిటానియా, సిప్లా, టాటా స్టీల్, ఆల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్,హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, టీసీఎస్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. కాగా,హోళీ సందర్భంగా మంగళవారం స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. -
సెన్సెక్స్ డెరివేటివ్స్‌పై బీఎస్ఈ దృష్టి
కోల్‌కతా: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈ తిరిగి సెన్సెక్స్–30 డెరివేటివ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సభ్యుల నుంచి ఇందుకు అవసరమైన సూచనలు, వివరాలను సేకరిస్తున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి వెల్లడించారు. ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్‌లో భాగమైన 30 షేర్లలో ఆప్షన్స్, ఫ్యూచర్స్(డెరివేటివ్స్)ను 2000లో బీఎస్ఈ ప్రవేశపెట్టింది. అయితే ప్రత్యర్థి ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈలో భాగమైన నిఫ్టీ–50 డెరివేటివ్స్తో పోలిస్తే ఇన్వెస్టర్ల నుంచి తగిన ఆసక్తిని సాధించలేకపోయింది. దీంతో మరోసారి సెన్సెక్స్–30 డెరివేటివ్స్ ప్రొడక్టులను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు రామమూర్తి తెలియజేశారు. దీనిలో భాగంగా మార్కెట్ పార్టిసిపెంట్ల ద్వారా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసో చామ్ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా రామమూర్తి సెన్సెక్స్ దిగ్గజాలలో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ప్రవేశపెట్టడంపై వివరాలు వెల్లడించారు. వెరసి ఎఫ్‌అండ్‌వో విభాగం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలో మెరుగుపరచవలసిన అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. బీఎస్ఈలో అత్య ధికంగా ట్రేడయ్యే 30 బ్లూచిప్ కంపెనీలు సెన్సెక్స్‌లో భాగమయ్యే సంగతి తెలిసిందే. వీటిలో డెరివేటివ్స్‌ను పునఃప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ట్లు రామమూర్తి పేర్కొన్నారు. నిఫ్టీ–50తో పోలిస్తే సెన్సెక్స్–30 డెరివేటివ్స్ కొంత విభిన్నంగా ఉండనున్నట్లు సూ చించారు. ఒకే విధమైన రెండు విభిన్న ప్రొడక్టులు అందుబాటులో ఉన్నపుడు వివిధ ట్రేడింగ్ వ్యూ హాలు, ఇంటర్‌ప్లే ద్వారా మార్కెట్లు మరింత వృద్ధి చెందేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
పరుగులు పెడుతున్న అదానీ షేర్లు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల అంశాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 488 పాయింట్లు లాభంతో 59386 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 17472 వద్ద కొనసాగుతుంది. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించి రూ.15,446 కోట్లు సమకూర్చుకోవడంతో ఈ గ్రూప్ షేర్లలో మూడోరోజూ ర్యాలీ కొనసాగింది. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్,రిలయన్స్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో దివిస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్,సన్ ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్స్,సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ షేర్లలో ర్యాలీ అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించి రూ.15,446 కోట్లు సమకూర్చుకుంది. గ్రూప్ షేర్లలో మూడోరోజూ ర్యాలీ కొనసాగింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి అదానీ పోర్ట్స్ 3.5%, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 3%, ఏసీసీ సిమెంట్స్ ఒకటిన్నర శాతం పెరిగాయి. గత రెండురోజుల్లో రూ.70,302 కోట్ల సంపద సృష్టి జరపడంతో గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది. -
నిపుణుల అంచనాల తలకిందులు.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ సోమవారం ఉదయం దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు నష్టపోయి 59239 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ఉండగా 76 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ కంపెనీకి చెందిన అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్ని ముటగట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్, ఎస్బీఐ, నెస్లే, బీపీసీఎల్,కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏసియన్ పెయింట్స్,హెచ్డీఎఫ్సీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, బ్రిటానియా షేర్లు పాజిటీవ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో,యూపీఎల్,ఇన్ఫోసిస్,ఎథేర్ మోటార్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎయిర్టెల్,హెచ్‌సీఎల్,టెక్ మహీంద్రా, విప్రో,టీసీఎస్, హీరో మోటో కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
అదానీ సంక్షోభం నుంచి తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీ అంశాలు కలిసొస్తున్నాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జాబ్ మార్కెట్‌పై వృద్ది సాధించేలా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వడ్డీ పెంచే అవకాశం ఉందంటూ ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ నివేదికలు, ఎస్‌జీఎక్స్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులతో మదుపర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఈ రోజు ఉదయం 10.30గంటలకు సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 61141 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభాలతో 17965 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇక ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ,ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎథేర్ మోటార్స్, లార్సెన్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, యూపీఎల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్, రిలయన్స్,నెస్లే, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. -
అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు, నష్టాల్లో దేశీ స్టాక్ సూచీలు
జాతీయ,అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాతో పాటు ఆసియా మార్కెట్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, భారత్‌లో యూనియన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మదపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. వెరసి మంగళవారం ఉదయం 9.37 గంటల సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టంతో 59341 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ అత్యల్పంగా 47 పాయింట్ల నష్ట పోయి 17601 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక బీపీసీఎల్, ఓఎన్జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎం అండ్ ఎం, మారుతి సుజికి, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, సిప్లా, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్, టీసీఎస్, లార్సెన్,హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: కేంద్ర బడ్జెట్ – 2023 ప్రభావిత అంశాలు, ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే నెల ఒకటిన జరిగే బడ్జెట్ కార్యక్రమంతో పాటు జనవరి వాహన విక్రయ గణాంకాలు, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. అదే రోజున ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీ నిర్ణయాలు వెల్లడికానున్నాయి. ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల పరిమాణాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. వీటితో పాటు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 1291 పాయింట్లు, నిఫ్టీ 17,604 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, దేశీయ అతిపెద్ద ఎఫ్‌పీఓ(ఆదానీ ఎంటర్‌ప్రైజస్) ప్రారంభం, టీ1 సెటిల్మెంట్ అమల్లోకి రావడం, బడ్జెట్ ముందు అప్రమత్తత తదితర పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫైనాన్స్, ఇంధన, మెటల్, మౌలిక షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ‘‘యూనియన్ బడ్జెట్, యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగొచ్చు. ఇటీవల పతనంతో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ ఒత్తిడికి లోనవుతున్నందున, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాలి. గత నాలుగు వారాలుగా నిఫ్టీకి కీలక మద్దతుగా ఉన్న 17,800 స్థాయి కోల్పోంది. దిగువ స్థాయిలో 17,470 – 17,420 శ్రేణి తక్షణ మద్దతుగా ఉంది. బడ్జెట్లో మార్కెట్ అనుకూలంగా నిర్ణయాలు వెలువడితే ఎగువ స్థాయిలో 17,800–18,200 శ్రేణిని చేధించే వీలుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.