Make in India
-
ఎయిర్‌బస్ హెలికాప్టర్లో ‘మేకిన్ ఇండియా’
మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్‌పీఎల్) ఎయిర్‌బస్ నుంచి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును పొందింది. ఎయిర్‌బస్‌కు చెందిన హెచ్ 130 లైట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్ తయారీ, అసెంబుల్ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇది భారతదేశ 'మేక్ ఇన్ ఇండియా' విజన్‌కు ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో నమ్మకమైన భాగస్వామిగా మహీంద్రా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ కార్యదర్శి వుమ్లన్మాంగ్ వుల్నామ్, భారత్, దక్షిణాసియాలో ఎయిర్‌బస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్, మహీంద్రా గ్రూప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీష్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్ 130 హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్‌లేజ్ అసెంబ్లీని మహీంద్రా ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఐరోపాలోని ఎయిర్ బస్ హెలికాప్టర్ల కేంద్రానికి రవాణా చేస్తారు. ఉత్పత్తి వెంటనే ప్రారంభం కానుంది. మొదటి క్యాబిన్ అసెంబ్లీ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది.మహీంద్రా ఇప్పటికే ఎయిర్ బస్ వాణిజ్య విమాన కార్యక్రమాల కోసం వివిధ రకాల విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్ లను సరఫరా చేస్తోంది. విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్లే కాకుండా భారీ, మరింత సంక్లిష్టమైన ఏరో స్ట్రక్చర్ తయారీ, సరఫరాకు మహీంద్రా తన సామర్థ్యాల పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్న క్రమంలో తాజా ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.ఎయిర్ బస్ కు భారత్ ప్రధాన మార్కెట్, వ్యూహాత్మక వనరుల కేంద్రంగా ఉంది. ప్రతి ఎయిర్ బస్ వాణిజ్య విమానంలోనూ భారతదేశంలో తయారైన విడిభాగాలు, సాంకేతికతలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ బస్ భారత్ నుంచి విడిభాగాలు, సేవల కొనుగోలు విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది.హెచ్ 130 అనేది ప్రయాణికుల రవాణా, పర్యాటకం, ప్రైవేట్, వ్యాపార విమానయానం, అలాగే మెడికల్ ఎయిర్ లిఫ్ట్, నిఘా మిషన్ల కోసం రూపొందించిన ఇంటర్మీడియట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో విశాలమైన, అడ్డంకులు లేని క్యాబిన్ ఉంటుంది. పైలట్, మరో ఏడుగురు ఇందులో ప్రయాణించవచ్చు. చుట్టూ పెద్ద విండ్ స్క్రీన్, వెడల్పాటి కిటికీల ద్వారా అద్భుతమైన విజిబిలిటీ ఉంటుంది. -
రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) శుక్రవారం ఆమోద ముద్రవేసింది. ఈ తేలికపాటి కాంబాట్ హెలికాప్టర్లను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి కొనుగోలు చేయనున్నారు. దేశంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇదొక ముందడుగు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన యుద్ధ హెలికాప్టర్లు ఇవే కావడం విశేషం. ప్రచండ్ హెలికాప్టర్లు 5 వేల మీటర్ల ఎత్తు వరకు ప్రయాణింగలవు. సీసీఎస్ ఆమోదం తెలపడంతో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన రెండు ఒప్పందాలపై రక్షణ శాఖ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో 66 హెలికాప్టర్లను భారత వాయుసేనకు, మరో 90 హెలికాప్టర్లను భారత నావికాదళానికి హెచ్ఏఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని, ఈ రెండు ఒప్పందాల వల్ల 8,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
మేకిన్ ఇండియా పాలసీ భేష్ : పుతిన్
మాస్కో: భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా ఫస్ట్ పాలసీ మేకిన్ ఇండియా అద్భుతమని రష్యాలో జరుగుతున్న15వ వీటీబీ ఇన్వెస్ట్ ఫోరమ్‌లో కొనియాడారు. ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు అమోఘం. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో స్థిరమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు మోదీ నేతృత్వంలోని భారత్ చేస్తున్న ప్రయత్నాలు భాగున్నాయి. ఈ సందర్భంగా భారత్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్‌బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్‌బస్ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం?
యూరప్ అవతల తొలిసారిగా విదేశంలో తయారవుతున్న సీ295 రకం విమానం ఇప్పుడు భారత రక్షణ విమానయాన రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. విదేశీ విమానాల తయారీ యూనిట్ ఆరంభంతో దేశీయంగా విమానయాన రంగం రూపురేఖలు మారే వీలుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. త్రివిధ దళాల సన్నద్ధతనూ ఈ విమానాలు మెరుగు పరుస్తాయని చెబుతున్నారు.మెరుపు స్థాయిలో మోహరింపు కొత్త విమానాల రాకతో భారత సైన్యం సన్నద్ధత స్థాయి పెరగనుంది. యుద్ధ సామగ్రి ఉపకరణాలతోపాటు సైన్యాన్ని సైతం వేగంగా అనుకున్న చోటికి తరలించవచ్చు. దీంతోపాటు సరకులను తీసుకెళ్లవచ్చు. విపత్తుల వేళ వైద్యసాయం కోసం మెడికల్ పరికరాలు, ఔషధాలనూ తరలించవచ్చు. తీరగస్తీ విధుల్లోనూ వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాలం చెల్లిన సోవియట్ ఆంటోనోవ్ ఏఎన్–32, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఏవిరో748 విమానాల స్థానంలో వీటిని వినియోగంలోకి తెస్తారు. అధునాతన సాంకేతికతలనూ దీనికి జోడించే వెసులుబాటు ఉందని రక్షణరంగ నిపుణులు కునాల్ బిశ్వాస్ చెప్పారు. పర్వతమయ చైనా, భారత్ సరిహద్దు వెంట అత్యవసరంగా సైనికులను దింపేందుకు వీలుగా చిన్నపాటి స్థలంలోనూ దీనిని ల్యాండ్ చేయొచ్చు. టేకాఫ్‌కు తక్కువ పొడవైన రన్‌వే ఉన్నా సరిపోతుంది. గంటలకు 482 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. తొమ్మిది టన్నుల బరువులను మోయగలదు. 71 మంది సాధారణ సైనికులను లేదంటే బరువైన ఆయుధాలున్న సాయుధ పారాట్రూప్ సైనికులు 48 మందిని ఒకేసారి తీసుకెళ్లగలదు. దీంతో వాయుసేన సన్నద్థత మెరుగుపడనుంది. జంట టర్బో ఇంజన్లుండే ఈ విమానం ద్వారా గాల్లోంచే సరకులను కిందకు దింపొచ్చు. ఎల్రక్టానిక్ సిగ్నల్ నిఘా, వేగంగా ఇంధనం నింపుకునే సామర్థ్యం ఇలా పలు ప్రత్యేకతలు దీని సొంతం. భారత రక్షణరంగంలో బహుళార్థ ప్రయోజనకారిగా ఈ విమానం పేరొందనుంది. మేక్ ఇన్ ఇండియాకు ఊతంరక్షణ రంగ ఉపకరణాల విడిభాగాలను దేశీయంగా తయారుచేసి ఈ రంగంలో స్వావలంభన సాధించాలనుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది. దిగుమతులు భారం తగ్గడంతో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత భారత్’ఆశయాలు ఈ ప్రాజెక్ట్‌తో మరింతగా సాకారం కానున్నాయి. అన్ని విడిభాగాలు ఇక్కడే తయారుచేసి అసెంబ్లింగ్ చేసి 2026 సెపె్టంబర్‌కల్లా తొలి విమానాన్ని తయారుచేయనున్నారు. ఒప్పందంలో భాగంగా 56 విమానాలు భారత్‌కు అందాల్సి ఉండగా 16 విమానాలను స్పెయిన్‌లోనే తయారుచేసి పంపిస్తారు. మిగతా 40 విమానాలను వడోదరలోని నూతన కర్మాగారంలో అసెంబ్లింగ్ చేస్తారు. సీ295 విమానానికి సంబంధించిన ముఖ్యమైన విడిభాగాల తయారీ హైదరాబాద్‌లో జరగనుంది. అక్కడి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మెయిన్ కాంపోనెంట్స్ అసెంబ్లీ యూనిట్లో వీటిని చిన్న భాగాలను జతచేస్తారు. తర్వాత పెద్ద భాగాలను వడోదరలో అసెంబ్లింగ్ చేసి పూర్తి విమానాన్ని తయారుచేస్తారు. ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల వృద్ధి ఏరోస్పేస్ మౌలికవసతుల విభాగంలో శిక్షణ, నిర్వాహణ వ్యవస్థలూ విస్తరించనున్నాయి. ఈ విమానాలను నడిపేందుకు, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పనులకు వాయుసేనలో అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీంతో అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వాడుతున్న విమానాలకు నిర్వహణ, విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు వంటి ఇతరత్రా విభాగాలూ విస్తరించనున్నాయి. ఈ మొత్తం వ్యవస్థల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో స్టిక్ హోల్డింగ్ విభాగం, ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణాకేంద్రాన్ని కొత్తగా నెలకొల్పనున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఎయిర్‌బస్, బోయింగ్, ఏటీఆర్సహా ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు తోడుగా టాటా వారి సంస్థలూ ఈ రంగంలో మరింతగా విస్తరించనున్నాయి. ఎగుమతులకూ ప్రోత్సాహం దేశీయ అవసరాలకు తీరాక అదనపు ఉత్పత్తుల ఎగుమతికీ ఈ ప్రాజెక్ట్ బాటలు వేయనుంది. సైనిక, సరకు రవాణా విమానాల తయారీకి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే బాగా విజయవంతమైతే భవిష్యత్తులో పౌరవిమానాల తయారీ చేపట్టే వీలుంది. అప్పుడిక వేల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విమానాలను కొనుగోలుచేసే బదులు దేశీయంగానే పౌరవిమానాలను తయారుచేయొచ్చు. తయారీ ఖర్చు సైతం గణనీయంగా తగ్గనుంది. భారతీయ ఏవియేషన్ రంగంలో ఆత్మనిర్భరతకు హామీ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని కొత్త ప్రాజెక్టుల రాకపై ఆశలు పెంచుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరగనున్న ఉపాధి అవకాశాలుఇన్నాళ్లూ హైదరాబాద్, బెల్గామ్, బెంగళూరులకే అధికంగా పరిమితమైన ఏరోస్పేస్ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్ కారణంగా వడోదరలో విస్తరించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక్కో విమానం తయారీకి 10 లక్షల పని గంటల సమయం పట్టనుంది. అంటే ఆమేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి వేలాది మందికి పని దొరుకుతుంది. -
PM Narendra Modi: పెట్టుబడులకు గమ్యస్థానం భారత్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు. నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం ‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం. అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు. వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనకు సహకరిస్తాం ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు. -
వేగంగా వృద్ధి చెందుతున్న రంగం
ఉత్పత్తి ఆధారిత ప్రోత్రాహకాల(పీఎల్ఐ) వల్ల మొబైల్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. పీఎల్ఐ పథకం కింద ఈ రంగం ఇప్పటికే లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం వాటా 17.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2024లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ చూపినట్లు తెలిపారు.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు‘పీఎల్ఐ పథకం వల్ల దేశీయంగా మొబైల్ ఉత్పత్తి రంగంలో ప్రాథమికంగా రూ.9,100 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వీటివల్ల రూ.6.61 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2014-15లో వీటి ఎగుమతులు కేవలం రూ.1,566 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దాదాపు రూ.1.2 లక్షల కోట్లు విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రంగం దాదాపు రూ.8.12 లక్షల కోట్లు ఉత్పత్తిని సాధిస్తుందని అంచనా. పీఎల్ఐ పథకం వల్ల మొబైల్ తయారీ రంగంలో దాదాపు లక్షకు పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వృద్ధికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో తోడ్పడింది’ అని కృష్ణన్ తెలిపారు. -
‘భారత్‌లో తయారీ’తో పెరిగిన ఎగుమతులు
న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ)తో భారత్ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తయారీకి భారత్‌ను కేంద్రంగా మలిచే లక్ష్యంతో 2014 సెపె్టంబర్ 25న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించింది. పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా దీనిపై ‘ఎక్స్’లో ప్రధాని ఓ పోస్ట్ పెట్టారు. ‘‘వివిధ రంగాల్లో ఎగుమతులు ఎలా పెరిగాయన్నది గమనించాలి. సామర్థ్యాలు ఏర్పడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. సాధ్యమైన అన్ని విధాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంస్కరణల విషయంలో భారత పురోగతి సైతం కొనసాగుతుంది’’అని తన పోస్ట్‌లో ప్రధాని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద 14 రంగాల్లో అదనపు సామర్థ్యాలపై ప్రోత్సాహకాలు కల్పించడం గమనార్హం. నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ విధానాలు సులభంగా మార్చడం, మెరుగైన వ్యాపార వాతావరణానికి సంబంధించి సానుకూల చర్యలు ఇందుకు మద్దతుగా నిలిచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనికితోడు అవినీతి పట్ల కఠిన వైఖరి, ఎల్రక్టానిక్స్ తదితర వర్ధమాన రంగాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం మేక్ ఇన్ ఇండియా విజయవంతానికి, దేశ, విదేశీ పెట్టుబడులు పెరగడానికి సాయపడినట్టు చెప్పారు. ‘‘మనం గొప్ప విజయం సాధించాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్ ఉంది’’అని గోయల్ పేర్కొన్నారు.తయారీ వాటా పెరుగుతుంది..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ వాటా పెరుగుతుందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 778 బిలియన్ డాలర్లకు చేరుకునేలా ఈ కార్యక్రమం సాయపడినట్టు మంత్రి తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు.100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు‘‘ఏటా 70–80 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏటా 100 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’అని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా సైతం ప్రకటించారు. ఎఫ్‌డీఐ దరఖాస్తుల అనుమతుల ప్రక్రియను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలుగా రక్షణ, రైల్వేలు, బీమా, టెలికం తదితర రంగాలకు సంబంధించి నిబంధనలను సరళతరం చేసినట్టు తెలిపారు. -
రక్షణ రంగంలో స్వదేశీ గర్జన
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపవుతోంది. ముడిసరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకూ స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో దూసుకుపోతూ ఐదేళ్ల కాలంలో 60 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.2023–24 ఆరి్థక సంవత్సరంలో రూ.1.26 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేయడం విశేషం. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్.. 2047 నాటికి పూర్తి 100 శాతం స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. – సాక్షి, విశాఖపట్నంస్వదేశీ విధానంతో ముందుకు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారత రక్షణ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా మారింది. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట రక్షణ రంగంలోనూ స్వావలంబన సాధించేందుకు తీసుకొచి్చన సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ ఇండ్రస్టియల్ కారిడార్లు ఏర్పాటు చేసింది. దేశీయ రక్షణ రంగ పరిశ్రమకు మూలధన సేకరణ బడ్జెట్లో 75% కేటాయించింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్), ఐడెక్స్ ప్రైమ్, ఐడెక్స్ అదితీ వంటి పథకాలు, ఆవిష్కరణలను ప్రారంభించడంతో సత్ఫలితాలు నమోదవుతున్నాయి.ప్రపంచ కేంద్రంగా భారత్ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఏకంగా రూ.1,26,887 కోట్ల విలువైన రక్షణరంగ ఉత్పత్తుల్ని భారత్ తయారు చేయడం విశేషం. గతేడాది కంటే 16.7 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23లో రూ.1,08,684 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారయ్యాయి. 2019–20 నుంచి పరిగణనలోకి తీసుకుంటే.. ఐదేళ్ల కాలంలో 60 శాతం పెరుగుదల కనిపించింది.అన్ని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లు (డీపీఎస్‌యూలు) ఇతర పీఎస్‌యూలు రక్షణరంగ వస్తువుల తయారీతో పాటు ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం దేశంలో రక్షణ ఉత్పత్తి విలువ రికార్డు స్థాయిలో ఉంది. 2023–24లో డీపీఎస్‌యూలు, పీఎస్‌యూల వాటా రూ.1,00,381 కోట్లు కాగా ప్రైవేట్ సంస్థలు రూ.26,506 కోట్ల ఉత్పత్తులు తయారు చేశాయి.ఎగుమతుల్లోనూ అదే దూకుడు స్వదేశీకరణ ప్రయత్నాలు నిరంతర ప్రాతిపదికన దూకుడుగా కొనసాగుతుండగా.. ఎగుమతుల్లోనూ అదే జోరు నమోదైంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధికి డిఫెన్స్ ఎగుమతులు దోహదపడుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 21,083 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,920 కోట్లతో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది. తేజస్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు సైతం ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందనీ భారత రక్షణరంగ వర్గాలు చెబుతున్నాయి.విడిభాగాల దిగుమతులు తగ్గుముఖంవివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి 4,664 కీలక విడిభాగాలు దిగుమతి అవుతున్నాయి. ఐదు విడతలుగా 3,318 విడిభాగాల దిగుమతుల్ని నిలుపుదల చేసిన భారత్.. వీటిని స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధిగా మారడానికి కట్టుబడి.. 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది. -
మేక్ ఇన్ ఇండియా.. ప్రశంసించిన మోదీ
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో 'మేక్ ఇన్ ఇండియా' చొరవ అనన్య సామాన్యమని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపుతున్నాయో అని చెప్పే విషయాన్ని మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిని మోదీ రీ పోస్ట్ చేశారు.మై గవర్నమెంట్ ఇండియా తన ఎక్స్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. లోకల్ క్రాఫ్ట్ నుంచి గ్లోబల్ ఇంపాక్ట్ వరకు మేడ్ ఇన్ ఇండియా సక్సెస్ స్టోరీ అని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులు అద్భుతమైన ఆదరణ పొందుతున్నాయి. సైకిల్స్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు ఇండియా వేగంగా దూసుకెళ్తోంది. అంటూ ట్వీట్ చేసింది.మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశంలో ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి మరియు సమీకరించడానికి.. పెట్టుబడులను ప్రోత్సహించడానికి కంపెనీలను రూపొందించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభమైన ఓ చొరవ. ఈ కార్యక్రమం ఉద్యోగ కల్పన, నైపుణ్య పెరుగుదల కోసం 25 ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అంతే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ రూపకల్పన, ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.2014లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా.. తయారీ రంగం వృద్ధి రేటును సంవత్సరానికి 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడం. 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో మిలియన్ల అదనపు ఉత్పాదక ఉద్యోగాలను సృష్టించడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్న విధంగానే తయారీ రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోంది. దీన్ని మోదీ ప్రశంసించారుఒకప్పుడు ఇండియా 80 శాతం మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 99.9 శాతం మనదేశంలోనే తయారవుతున్నాయి. యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ ఎగుమతి అవుతున్నాయి. రక్షణ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, స్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్, సెమీ కండక్టర్ మొదలైన రంగాలలో గణనీయమైన పెట్టుబడులు సమకూరుతున్నాయి.బీహార్ రాష్ట్రంలో తయారైన బూట్లు.. రష్యన్ ఆర్మీ ఉపయోగిస్తోంది. ఇది కూడా మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగమే. గతేడాది బీహార్ ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ జతల బూట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఈ కంపెనీల వల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.A glimpse of how 'Make In India' is propelling India's economy onto the global stage! https://t.co/xCfE4WYwmW— Narendra Modi (@narendramodi) July 16, 2024 -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు
మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ అమలు పరుస్తున్న విదేశి విధానాలు అసాధారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇటువంటి సమయంలో అన్ని రంగాల్లో ప్రపంచం వ్యాప్తంగా దూసుకుపోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి ధృడమైన నాయకత్వం ఉండటమే కారణమని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా ముందుకు నడిపించటంలో మోదీ గుర్తింపు పొందారని పుతిన్ అభిప్రాయపడ్డారు. గురువారం కలింగ్రాడ్ ప్రాంతంలో నిర్వహించిన ‘రష్యన్ స్టుడెంట్ డే’ కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ‘ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. సమర్థవంతమైన నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి భారత్‌కు ప్రధానిగా ఉన్నారు. ప్రధాని నాయకత్వ పటిమ వల్లనే ఇండియా ఈ రోజు మనం చూస్తున్న వృద్ధిలోకి వచ్చింది’ పుతిన్ పేర్కొన్నారు. ‘ప్రపంచ వేదికలపై భారత్.. రష్యాపై ఎప్పుడూ వ్యతిరేకమైన వైఖరితో నిర్ణయాలు తీసుకోలేదు. రష్యాపై ఇప్పటివరకు ద్వంద వైఖరిని భారత్ ప్రదర్శించలేదు. అందుకే భారత్, ఆ దేశ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమం రష్యాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా చర్చకు వస్తోందన్నారు. భారత్‌కు అంత్యంత ఎక్కువ విదేశి పెట్టుబడులు రష్యా నుంచి లభిస్తున్నాయని తెలిపారు. తమ దేశంలోని పలు కంపెనీలు భారత్‌లో ఇప్పటికే సుమారు సుమారు 23 బిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. చదవండి: ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం -
Make in India: ‘టెస్లా వస్తే రానీ.. కానీ దాన్ని మాత్రం మార్చొద్దు’
దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మేకిన్ ఇండియా పాలసీ నిలకడగా ఉండాలని, ఏ ఒక్క సంస్థ కోసమో దాన్ని మార్చేయరాదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఈవీ కమిటీ చైర్పర్సన్ సులజ్జా ఫిరోదియా మోత్వానీ వ్యాఖ్యానించారు. భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ ఇన్వెస్ట్ చేయాలంటే కొన్నాళ్ల పాటు తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్ సంస్థ టెస్లా.. కేంద్రానికి ప్రతిపాదించిన నేపథ్యంలో మోత్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎవరో దేశీయంగా తయారీపై ఇన్వెస్ట్ చేస్తామన్నంత మాత్రాన .. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా విధానాలను మార్చడం సరికాదు. ఒక విధానం ఉందని, దాన్ని పాటించాల్సిందేనని అందరూ గుర్తెరగాలి. టెస్లా సమర్పించిన ప్రతిపాదన గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ పాలసీ విషయంలో గందరగోళం ఉండకూడదని, నిలకడగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం‘ అని ఆమె వివరించారు. భారత్ కచ్చితంగా మేకిన్ ఇండియాపై దృష్టి పెట్టినప్పుడే దీర్ఘకాలికంగా పోటీతత్వం పెరగగలదని పేర్కొన్నారు. అలా జరగకపోతే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం విడిభాగాలన్నింటినీ దిగుమతే చేసుకోవాల్సి వస్తుందన్నారు. మరోవైపు, వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే చిన్న ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఫేమ్ స్కీమును (విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు సబ్సిడీలిచ్చే పథకం) వర్తింపచేయాలని కేంద్రాన్ని కోరినట్లు మోత్వానీ తెలిపారు. ఇదీ చదవండి: ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..! రూ. 20 లక్షల వరకు ఖరీదు చేసే కార్లకు దీన్ని వర్తింపచేసే అంశాన్ని పరిశీలించాలని ఫేమ్ మూడో విడతపై ఫిక్కీ సమరి్పంచిన సిఫార్సుల్లో పేర్కొన్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ.. వాణిజ్య రవాణా అవసరాలకు ఉపయోగించే త్రిచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, ఎలక్ట్రిక బస్సులకు ఫేమ్ స్కీము వర్తిస్తోంది. -
మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్రమదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మోదీ చేపట్టించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గొప్పదని కొనియాడారు. ఈ విధానాల అమలుకు ప్రధాని మోదీ చూపిస్తోన్న చొరవను మెచ్చుకున్నారు. దీనివల్ల దేశంలోని పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రష్యాలోనూ దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడంలో భారత్ విజయాలను అనుసరిస్తామని పేర్కొన్నారు ఈ మేరకు వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో పుతిన్ మాట్లాడుతూ..‘ఒకప్పుడు మన దగ్గర దేశంలో తయారు చేసిన కార్లు లేవు. కానీ ప్రస్తుతం మనం కార్లను తయారు చేసుకుంటున్నాం. అయితే అవి 1990లో భారీ మొత్తంలో మేము కొనుగోలు చేసిన మెర్సిడెస్, ఆడికార్ల కంటే సాదాసీదాగా కనిపిస్తున్నాయి. కానీ ఇది సమస్య కాదు. స్వదేశీ తయారీ విషయంలో మనం మన భాగస్వాములు తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించాలి’ అంటూ రష్యాలో తయారైన కార్ల గురించి ఎదురైన ఓ ప్రశ్నకు పుతిన్ సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ స్వదేశీ తయారీ,వినియోగంపై దృష్టి సారించింది. ఈ విషయంలో ప్రధాని మోదీ కరెక్ట్. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ సరైన విధంగా ముందుకు వెళ్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్' (IMEC) రష్యాను ఏ విధంగానూ ప్రభావితం చేయదని పుతిన్ అన్నారు. నిజానికి అది తమ దేశానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా ఇటీవల భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా కారిడార్ ప్రణాళికలను మోదీ ఆవిష్కరించారు. చదవండి: ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' -
ల్యాప్‌టాప్ ధరలు పెరగనున్నాయా? కేంద్రం ఏం చెప్పిందంటే
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ల ప్లాంటు నెలకొల్పేందుకు దేశీ దిగ్గజం వేదాంతతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) తప్పుకుంది. మరిన్ని వైవిధ్యమైన అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘పరస్పర అంగీకారం మేరకు, వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకు సాగరాదని నిర్ణయించుకున్నాం. వేదాంత యాజమాన్యంలోని సంస్థకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా పేరును జోడించి ఉంచడం వల్ల గందరగోళానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం‘ అని ఫాక్స్‌కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఆకాంక్షల సాకారానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని, స్థానిక అవసరాల మేరకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని పేర్కొంది. తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్, వేదాంత .. గుజరాత్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశీయంగా తొలి సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గతేడాది జేవీ కుదుర్చుకున్నాయి. ఏడాది పైగా దీనిపై కసరత్తు చేశాయి. సాంకేతిక భాగస్వామిగా యూరప్ సంస్థ ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం వేదాంత–ఫాక్స్‌కాన్ జేవీకి బ్రేక్ పడింది. ఫోన్లు, ఫ్రిజ్‌లు, కార్లలో ఉపయోగించే చిప్‌లు కేవలం కొన్ని దేశాల్లోనే తయారవుతున్నాయి. భారత్ కూడా చిప్‌ల తయారీలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి స్పందనగా వేదాంత–ఫాక్స్‌కాన్, ఐఎస్ఎంసీ, ఐజీఎస్ఎస్ దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, వేదాంత జేవీ మినహా మిగతా రెండింటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం.. కాగా సెమీకండక్టర్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వేదాంత స్పష్టం చేసింది. చిప్ ప్లాంటు ఏర్పాటులో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ‘సెమీకండక్టర్ల విషయంలో ప్రధాని విజన్‌ను సాకారం చేసేందుకు, మరింతగా కృషి చేస్తాం’ అని వేదాంత పేర్కొంది. సైయంట్ డీఎల్ఎం లిస్టింగ్ భళా ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్విసుల కంపెనీ సైయంట్ డీఎల్ఎం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 265తో పోలిస్తే బీఎస్ఈలో 51 శాతం ప్రీమియంతో రూ. 401 వద్ద లిస్టయ్యింది. ఆపై ఒక దశలో 61% దూసుకెళ్లి రూ. 426ను అధిగమించింది. చివరికి 59 శాతం(రూ. 156) లాభంతో రూ. 421 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో సైతం రూ. 403 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 427 వరకూ ఎగసి చివరికి రూ. 422 వద్ద స్థిరపడింది. వెరసి రూ. 157 లాభంతో ముగిసింది. భారత్ లక్ష్యాలపై ప్రభావం ఉండదు వేదాంతతో జేవీ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలగడమనేది భారత్ నిర్దేశించుకున్న చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటు లక్ష్యాలపై ప్రభావం చూపబోదు. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి -
దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలకం: ప్రధాని మోదీ
వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడంలో తెలంగాణ పాత్ర ఉందని.. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా దేశ చరిత్రలో దీని పాత్ర చాలా కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలుగు ప్రజల సామర్థ్యంతో దేశ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి, రవాణా సదుపాయాలు పెంచడానికి కేంద్రం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించిందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని.. సబ్కా సాథ్ సబ్ కా వికాస్‌ను అనుసరిస్తూ హైవేలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. రూ.6,109 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రూ.5,500 కోట్లకుపైగా ఖర్చయ్యే జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు.. కాజీపేటలో తలపెట్టిన రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఈ సందర్భంగా విడిగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పెట్టుబడులకు, ఎదుగుదల అవకాశాలకు భారతదేశం పెట్టింది పేరుగా మారింది. 21వ శతాబ్దపు మూడో దశాబ్దం స్వర్ణ సమయంగా మారింది. ప్రస్తుత కాలం యువ భారత్‌కు గోల్డెన్ పీరియడ్. ప్రతి సెకన్ను సద్వినియోగం చేసుకో వాలి. వేగంగా సాగుతున్న అభివృద్ధిలో దేశంలోని ఏ ప్రాంతాన్నీ వదలకుండా ముందుకు తీసుకెళ్తాం. సరి కొత్త లక్ష్యాల సాధన కోసం కొత్త మార్గాలు కనుక్కో వాలి. అప్పుడే దేశ అభి వృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇప్పుడున్న మౌలిక వసతు లతో ఇది అసాధ్యం కాబట్టే.. కొత్త మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అందుకే ఎక్స్‌ప్రెస్ హైవే లు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్థిక కారిడార్లను, జాతీయ రహదారు ల విస్తరణను చేపట్టి.. రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. చదవండి: స్వాగతానికి అధికారులు మాత్రమే! ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తెలంగాణ తెలంగాణలో జాతీయ రహదారుల నెట్వర్క్ గతంలో 2,500 కిలోమీటర్లే ఉండగా.. ఇప్పుడు 5 వేల కిలోమీటర్లకుపైగా పెరి గింది. మరో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా డజన్ల కొద్దీ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో కొన్ని తెలంగాణ మీదుగా వెళుతున్నాయి. హైదరాబాద్ – ఇండోర్ ఆర్థిక కారిడార్, చెన్నై – సూరత్ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – పనాజీ ఆర్థిక కారిడార్, హైదరాబాద్ – విశాఖపట్నం ఇంటర్ కారిడార్ ఆ కోవలోనివే. ఒక విధంగా తెలంగాణ చుట్టు పక్కల ఉన్న అనేక ఆర్థిక ప్రాంతాలకు, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా తయారవుతోంది. ఈ హైవేలతో ఎంతో ప్రయోజనం ఇప్పుడు శంకుస్థాపన చేసిన నాగ్‌పూర్ – విజయ వాడ కారిడార్‌లోని మంచిర్యాల–వరంగల్ సెక్షన్ నిర్మాణంతో.. తెలంగాణకు అటు మహారాష్ట్రతో, ఇటు ఏపీతో మెరుగైన అనుసంధానాన్ని కలిగిస్తుంది. మంచిర్యాల–వరంగల్ మధ్య దూరం తగ్గి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది. కరీంనగర్–వరంగల్ సెక్షన్‌ను నాలుగు లేన్ల రహదారిగా మార్చటం వలన హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ ఎస్ఈజెడ్ వంటివి ఎక్కువగా లబ్ధి పొందుతాయి. వ్యవసాయం, పరిశ్రమలతోపాటు కరీంనగర్ జిల్లా లోని గ్రానైట్ పరిశ్రమకూ ప్రయోజనం ఉంటుంది. యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశా లు కూడా పెరుగుతాయి. కనెక్టివిటీ పెర గడం వల్ల పర్యాటక రంగం కూడా లబ్ధి పొందుతుంది. భద్రకాళి ఆలయంలో మోదీ పూజలు వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. అర్చకులు, అధికారులు ప్రధానికి మేళతాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మోదీ గోశాలలో ఆవులకు గ్రాసం తినిపించి, ధ్వజస్తంభం వద్ద జ్యోతి వెలిగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు.. అమ్మవారి శేషవస్త్రంతో మోదీని సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించిందని ప్రధాని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా.. ఓ ఉద్యమం.. మేకిన్ ఇండియా ఒక ఉద్యమం. పీఎల్ఐ పథకంతో దేశంలో తయారీ రంగానికి ఎంతో ప్రోత్సా హం లభించింది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోనూ ఈ పథకం కింద 50కిపైగా పెద్ద సంస్థలు లబ్ధిపొందుతున్నాయి. దేశం ఈ ఏడాది రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో రికార్డు సృష్టించింది. తొమ్మిదేళ్ల కింద రూ.1,000 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు రూ.16 వేల కోట్లు దాటాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఇలా ఎగుమతులు చేసిన సంస్థల్లో ఉంది. తయారీ రంగంలో భారత రైల్వే కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మేడిన్ ఇండియా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. కాజీపేటలో ఈరోజు శంకుస్థాపన చేసిన రైల్వే తయారీ యూనిట్ మేకిన్ ఇండియాకు కొత్త జీవం పోస్తుంది. దీనితో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబమూ ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంది. అభివృద్ధి మంత్రంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలి..’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ చేసి చూపించారు.. పుతిన్ ప్రశంసలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రధాని మోదీ అద్భుతాలు సృష్టించి అనుకున్నది సాధించారని.. ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారాయన. మా మిత్ర దేశం ఇండియా.. ఆ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు. కొన్నేళ్ల కిందట మేక్ ఇండియా అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. సమర్థవంతంగా దానిని ఆయన తన దేశంలో అమలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అని మాస్కోలో జరిగిన ఓ ఈవెంట్లో అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చో ప్రధాని మోదీ భారత్‌లో చేసి చూపించారని.. రష్యా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని పుతిన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం దారుణంగా పడింది. ఈ నేపథ్యంలో.. స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడొచ్చని గత కొంతకాలంగా పుతిన్ రష్యా ప్రజలకు పిలుపు ఇస్తూ వస్తున్నారు. ఇదీ చదవండి: పెద్దన్నకు మతిమరుపే కాదు.. ఈ సమస్య కూడా ఉంది! -
భారత్‌లోకి టెస్లా రాకను కేంద్రం ఎందుకు వ్యతిరేకించింది?
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా కాన్ఫరెన్స్‌లో మస్క్ మాట్లాడుతూ..టెస్లా కార్యకలాపాలు భారత్‌లో ప్రారంభమవుతాయని మస్క్ వెల్లడించారు. త్వరలో దీనిపై స్పష్టత ఇస్తామని అన్నారు. దీంతో భారత్‌కు టెస్లా రాకపై అనేక ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. మస్క్ ఏం అన్నారు? ‘భారత ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా జరిగింది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అంతేకాదు మోదీకి నేను పెద్ద అభిమానిని. 2015లో కాలిఫోర్నియా టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. ఒకరికి గురించి ఒకరికి బాగా తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచంలోని ఏ పెద్ద దేశానికీ లేనంత శక్తిసామర్ధ్యాలు భారత్ కు మెండుగా ఉన్నాయని భావిస్తున్నాను’అని ఎలాన్ మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్‌కు టెస్లా.. అంతేకాదు, భారత్‌లో టెస్లా కార్య కాలాపాలపై మస్క్ మాట్లాడుతూ..త్వరలోనే టెస్లా భారత్‌కు వస్తుంది. దేశంలో పెట్టుబడులు పెట్టేలా మోదీ చేస్తున్న ప్రయత్నాలు అమోఘం అంటూ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. సరైన సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. అవి ఏమేరకు కార్యరూపం దాల్చనుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే? 2019 నుంచి ప్రయత్నాలు ముమ్మరం.. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా మోటార్స్ 2019 నుంచి భారత్‌లో ఈవీ మార్కెట్‌పై దృష్టిసారించింది. కానీ కార్లపై భారత్ విధించే దిగుమతి పన్ను టెస్లాకు అడ్డంకిగా మారింది. భారత ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం.. భారత్‌లోని ఆటోమొబైల్ సంస్థలు ఇతర దేశాల నుంచి కార్లను భారత్‌కు దిగుమతి చేసుకునే కార్ల ధర 40,000 డాలర్ల లోపు ఉంటే 60 శాతం, 40,000 డాలర్లు దాటితే దాటితే 100 శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. కానీ టెస్లా తయారీ చేసే అంత్యంత చవకైన కారు ధర 45,000 డాలర్లు (రూ.37లక్షలు). దీంతో టెస్లా సీఈవో భారత్ విధించే 100 శాతం పన్నును వ్యతిరేకిస్తున్నారు. దిగుమతి సుంకంతో టెస్లా కార్ల ధరలు పెరిగి, అమ్మే సామర్ధ్యం తగ్గిపోతుందని వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓ ట్విటర్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా..టెస్లా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటుంది. కానీ ప్రపంచంలోని ఏ అతి పెద్ద దేశంలో లేని విధంగా భారత్‌లో మాత్రమే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉందని అన్నారు. టెస్లా రాకను కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తుంది? ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలకు ‘మేకిన్ ఇన్ ఇండియా’ నినాదాన్ని వినిపిస్తున్నారు. ‘భారత్‌కు రండి. పెట్టుబడులు పెట్టి పరిశ్రమల్ని స్థాపించండి. తద్వారా మీకు తయారీ ఖర్చుతగ్గుతుంది. లాభాల్ని గడించ వచ్చంటూ’ వారిని ఆహ్వానిస్తున్నారు. టెస్లా వద్ద కేంద్రం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. గతంలో జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన సీఎఫ్‌వో అవార్డ్‌ల కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్లా తయారీ యూనిట్లను భారత్‌లో ప్రారంభించాలని అన్నారు. ఇక్కడే కార్లను తయారు చేసి రాయితీలు పొందవచ్చు. అలా కాకుండా చైనాలో తయారు చేసి భారత్‌లో అమ్ముతామంటే కుదరదు అని’ సూచించారు. టెస్లా ఏమన్నదంటే టెస్లా మాత్రం.. ఏ దేశంలోనైనా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలంటే ముందుగా.. ఆ దేశంలో మా కార్లను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలి. అమ్మకాలు జరిపిన తర్వాతే కార్ల తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తాం. అందుకు ఒప్పుకోని ఏ దేశంలోనూ తమ కార్లను తయారు చేసేందుకు ఒప్పుకోమని మస్క్ అన్నారు. దిగుమతి సుంకం తగ్గింపుపై టెస్లా పట్టుబట్టడం, మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్రం ఒత్తిడి చేయడంతో భారత్‌లో అడుగు పెట్టడాన్ని టెస్లా సైతం వ్యతిరేకించింది. ఇప్పుడు భారత్‌కు టెస్లా రాక.. గత నెలలో మస్క్ మాట్లాడుతూ.. టెస్లా బహుశా ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త తయారీ యూనిట్‌కు ఏర్పాటు కోసం భారత్‌లో స్థలాన్ని ఎంపిక చేసుకోవడం పూర్తవుతుందని అన్నారు. ఆ తర్వాత టెస్లా బృందం ఢిల్లీకి రావడం, ఇక్కడ పీఎంవో అధికారులతో మాట్లాడడం చకచకా జరిగాయి. అదే సమయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, టెస్లా భారత్‌లో తన కార్లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంది. భారత ప్రభుత్వం టెస్లాతో కలిసి పనిచేసుందుకు సుముఖంగా ఉందని రాయిటర్స్‌తో అన్నారు. భారత్‌కు ఎందుకు రావాలనుకుంటుంది.. 2030 నుండి ఏటా 20 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంతకంటే ముందే మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో ముందంజలో ఉన్నాయి. కాబట్టే ఎంత వీలైతే అంత త్వరగా భారత్‌లో టెస్లా అడుగు పెట్టే దిశగా మస్క్ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. టెస్లా ప్రస్తుతం ఆరు తయారీ ప్లాంట్లలో కార్లను తయారు చేస్తుంది. వాటిలో నాలుగు అమెరికాలో ఉన్నాయి. షాంఘై, బెర్లిన్‌లో రెండు గిగాఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో కార్లలో ఉపయోగించే బ్యాటరీలతో పాటు, కార్లను తయారు చేసే సామర్ధ్యం ఉంది. మరో గిగాఫ్యాక్టరీని మెక్సికోలో స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు మస్క్. భారత్‌లో టెస్లాకు ఎదురవుతున్న సవాళ్లు.. ఏరోడైనమిక్స్, మినిమలిస్ట్ డిజైన్లు, ఆటోపైలట్ వంటి హై-ఎండ్ ఫీచర్లు టెస్లా కార్లలో ప్రత్యేకం. దీంతో పాటు భారత ప్రభుత్వం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సెక్టార్లో ఆటో అమ్మకాలు ప్రస్తుతం టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈవీ ఎలక్ట్రిక్ కార్లను రూ.20లక్షల కంటే తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఇక, కార్ల ధరలు ఎక్కువ కావడంతో టెస్లా సవాళ్లను ఎదుర్కొనుంది. వాహనదారులకు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నా.. మార్కెట్లో పెరిగిపోతున్న పోటీ దృష్ట్యా కార్ల ధరల తగ్గించి విక్రయించాల్సి ఉంటుంది. మరి అందుకు టెస్లా ఒప్పుకుంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం! -
AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: దేశీయ బొమ్మల పరిశ్రమ దశ తిరిగింది. ఈ రంగం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం చిన్నపిల్లల ఆట వస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఏకంగా ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటోంది. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో బొమ్మల ఎగుమతులు ఆరు రెట్లకు పైగా పెరిగాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బొమ్మల ఎగుమతులు రూ.167 కోట్లుగా ఉంటే అది 2021–22 నాటికి రూ.2,601 కోట్లకు చేరుకుంది. కానీ, దేశీయ ఎగుమతులు భారీగా పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో ఇది ఒక శాతంలోపే ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ బొమ్మల ఎగుమతుల మార్కెట్ విలువ రూ.12,64,000 కోట్లుగా ఉంది. భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక దేశీయ బొమ్మల ఎగుమతుల్లో 77 శాతం అమెరికాకే జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో దేశంలో బొమ్మల దిగుమతులు భారీగా పడిపోయాయి. 2018–19లో భారత్ రూ.2,960 కోట్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకుంటే అది 2021–22 నాటికి 70 శాతం తగ్గి రూ.870 కోట్లకు పరిమితమయ్యింది. ఇందులో 90 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’తో సత్ఫలితాలు మరోవైపు..స్థానిక ఆట బొమ్మలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’ విధానం సత్ఫలితాలిస్తోంది. దేశీయ ఆట బొమ్మల మార్కెట్‌ను ఎటువంటి ప్రమాణాల్లేని చైనా వస్తువులు ఆక్రమించడంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. స్థానిక చేతి వృత్తి కళాకారులు తయారుచేసే బొమ్మలకు ప్రచారం కల్పిస్తూనే మరోపక్క దిగుమతులకు అడ్డుకట్ట పడే విధంగా వివిధ ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఆటబొమ్మల దిగుమతులపై సుంకాన్ని 2020లో 20 శాతం నుంచి ఏకంగా 60 శాతానికి పెంచింది. అంతేకాక.. పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం చూపకుండా ఉండేందుకు దిగుమతి అయ్యే బొమ్మలపై క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో బొమ్మలు తయారుచేసే ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించడానికి రూ.55.65 కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటుచేసింది. రూ.3,500 కోట్లతో మరో పథకం అదే విధంగా.. ఇతర దేశాలతో పోటీపడేలా బొమ్మల తయారీని పెద్దఎత్తున ప్రోత్సహించడానికి రూ.3,500 కోట్లతో ఉత్పత్తి ఆధారిత, ప్రోత్సాహక ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. ఈ చర్యలు రాష్ట్రంలోని బొమ్మల తయారీ కళాకారులకు చేయూతనిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను వన్ డిస్ట్రిక్ వన్ ప్రోడక్ట్ కింద చేర్చి ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో 2021–22లో రాష్ట్రం నుంచి రూ.3.66 కోట్ల విలువైన బొమ్మలు ఎగుమతి అయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
భారత్‌లో జేవీలపై యాపిల్ ‘చైనా’ సంస్థల ఆసక్తి
న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు సరఫరా చేసే చైనా సంస్థలు భారత్‌లోను తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను నెలకొల్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అవి త్వరలోనే కేంద్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఇప్పటికే అనధికారంగా సరఫరాదారుల జాబితాను అందించిందని పేర్కొన్నాయి. ఆయా సంస్థలతో ఎలాంటి సమస్యలు లేనందున వాటి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు వివరించాయి. ప్రస్తుతం దాదాపు 5-7 శాతం యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్‌లో జరుగుతున్నాయి. -
స్టార్టప్స్‌కు శామ్సంగ్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ డిజిటల్ భారత ప్రయాణంలో పాలుపంచుకుంటున్న స్టార్టప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ తెలిపింది. యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ వంటి సాంకేతికతలపై కలిసి పనిచేసేందుకు స్టార్టప్స్‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా వాలెట్, హెల్త్, ఫిట్నెస్ వంటి డొమైన్లలో భారత్‌లోని శామ్సంగ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, వ్యాపార విభాగాలతో స్టార్టప్‌లు భాగస్వాములవుతాయి. ఉత్పత్తులు, సేవలు శామ్సంగ్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. అవసరమైతే నిధులను సైతం సమకూరుస్తారు. -
మోదీ పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప ఒరిగిందేమీ లేదు
ఎనిమిదిన్నర ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజలకు మేలు చేసిన పని ఒకటి కూడా లేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు వేసి కడ గండ్లపాలు చేశారు. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి. ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016లో పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఏటా రెండు కోట్ల మంది నిరుద్యోగులకు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్ప మని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకొని అమ్ము కోండని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హోల్ సేల్‌గా బడా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో 35 సంస్థలను 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేశారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోదీ సర్కార్ జాలి పడి ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలి పించిన సామాన్య ప్రజలకు ఆసరాని ఇచ్చే అనేక సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నది. చివరకు నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పు తదితర వస్తు వులపైన కూడా జీఎస్టీని పెంచి సామాన్యుల బ్రతుకులను దుర్భరంగా మార్చారు. 2014 లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ. 1100 దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దు లేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి వసూలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోదీ సర్కార్. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్ట గొట్టడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహు లుగా చిత్రించింది. 750 మంది రైతుల మరణాలకు కారణ మైన నల్ల చట్టాలను చివరికి మోదీ సర్కార్ ఉపసంహ రించుకుంది. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి 83 రూపాయలకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ‘మేకిన్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వతంత్ర భారత దేశంలో 67 ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు రూ. 55.87 లక్షల కోట్లు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎని మిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు రూ. 135.87 లక్షల కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంక్ దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుంది. మన చుట్టూ ఉన్న దేశాల కంటే మన దేశంలోనే ఆకలితో అలమటించే వారు ఎక్కువని ఈ ర్యాంక్ స్పష్టం చేస్తోంది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడల మీద కత్తి పెట్టి బెదిరి స్తుంది మోదీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొ ద్దని ఆదేశిస్తున్నది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం కేంద్రం వివక్షకు సంకేతం. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణ లోని కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ, జాప్యం చేస్తూ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోసానికి పాల్పడింది మోదీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వేరే చోటుకు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అబద్ధాలు చెబుతూ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు కేంద్ర పెద్దలు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోదీ ప్రభుత్వం. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా మత విద్వేషాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. తమను వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేధించి లొంగదీసు కుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోదీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు పాలన సాగిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందిం చకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మె ల్యేలకు ఎరజూపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న క్రమంలో ఆ దొంగలు బయటపడ్డారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్‌ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. దీన్ని తిప్పి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. అధికార టీఆర్ఎస్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని వామపక్షాలు, అభ్యదయ, లౌకిక శక్తులు అందరినీ కలుపుకొని కేంద్రం మీద యుద్ధభేరి మోగించాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో తాను ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ప్రగతిభవన్‌లో ప్రజా దర్బార్ ప్రారంభించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ బాధ్యతను భుజానికెత్తు కోవాలి. ఇవన్నీ చేసినప్పుడే బీజేపీ ఆటలు సాగకుండా నివారించగలుగుతాము. అదే మనందరి కర్తవ్యం. - జూలకంటి రంగారెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే -
కీలక మైలురాయిని అధిగమించిన హోండా కార్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కొత్త మైలురాయిని అధిగమించింది. దేశీయంగా మొత్తం 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20లక్షల మార్క్‌గా ప్రీమియం సెడాన్ హోండా సిటీ కారును విడుదల చేసింది. ఇదీ చదవండి : మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో భారత్‌లో రాజస్తాన్‌లోని టపూకరా వద్ద సంస్థకు ప్లాంటు ఉంది. 1997 డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశంలో ఇప్పటి వరకు హోండా రూ.10,000 కోట్లను వెచ్చించింది. సిటీ, అమేజ్ మోడళ్లను 15కుపైగా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు సామర్థ్యం ఏటా 1,80,000 యూనిట్లుగా ఉంది. కాగా భారతదేశంలోని తన వినియోగదారుల కోసం ప్రీమియం, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించి కార్యకలాపాలను ప్రారంభించామనీ,"మేక్ ఇన్ ఇండియా" విజన్‌లో భాగంగా 2 మిలియన్ల మైలురాయిని దాటామని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో 2 మిలియన్ల కార్ల ఉత్పత్తి అనే చారిత్రాత్మక మైలురాయి దాటడం అంటే గత 25గా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి హోండా నిబద్ధతకు నిదర్శమ ని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ టకుయా సుమురా తెలిపారు. ఇదీ చదవండి : పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు -
రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెరుగుతున్న ఎగుమతులు దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది. సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అందించాం. డిఫెన్స్ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నాయి. పరిశోధనల అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి డీఆర్డీవోకి చెందిన నేవల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) ల్యాండ్ బేస్డ్ ప్రోటోటైప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్ బేస్డ్ ఏఐపీ సబ్మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది. శారదాపీఠంలో సతీష్‌రెడ్డి పూజలు సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. -
ప్రధానీ మోదీ, అంబానీ సమక్షంలో సైరస్ మిస్త్రీ పాత ప్రసంగం వైరల్
సాక్షి, ముంబై: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదివారం కన్నుమూసిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రసంగం ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. మేకిన్ఇండియాలో భాగంగా టాటా గ్రూపు తరపున ప్రసంగించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. భారత ఆర్థికవ్యవస్థకు మూలాధారంగా తయారీరంగాన్ని మార్చే ప్రాధాన్యత, కొన్ని సవాళ్లు పరిష్కారాలపై మిస్త్రీ మాట్లాడారు. భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేసేందుకు మేక్ ఇన్ ఇండియా సమయోచితమైన ప్రత్యేకమైన అవకాశమని మిస్త్రీ ప్రశంసించారు. భారతదేశం ఒక చారిత్రాత్మక తరుణంలో ఉందనీ, మనం కలిసి దేశాన్ని కొత్త మార్గంలోకి నడిపించే అవకాశం ఉందన్నారు. అలాగే జీడీపీలో తయారీ రంగం సహకారం 15 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు 2014లోనిర్వహించిన 'మేక్ ఇన్ ఇండియా' ఈవెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి జౌళి శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఉన్నారు. వీరితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేశశ్ అంబానీ, విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ తదిరులు హాజరైనారు. కాగా సైరస్ పల్లోంజీ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటాసన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. అనూహ్యంగా టాటా, మిస్త్రీ కుటుంబాల మధ్య బహిరంగ, వివాదాలు పొడసూపాయి. 2016 చివరిలో మిస్త్రీని పదవినుంచి తొలగించడంతో ఇది మరింత ముదిరి, సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర లేచింది. ఆ తరువాత ఫిబ్రవరి 2017చంద్రశేఖరన్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు . -
మేడ్ ఇన్ ఇండియాతో దేశాభివృద్ధి
‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’కారణంగా దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని స్కైవేస్ గ్రూప్ చైర్మన్ ఎస్ఎల్ శర్మ అన్నారు. సోమవారం చెన్నైలో లాజిస్టిక్స్ దిగ్గజమైన స్కైవేస్ గ్రూప్ 40 “వ్యవస్థాపక దినోత్సవం, చెన్నై శాఖ 20 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. నిజాయితీ, నిబద్ధత, కస్టమర్లకు మెరుగైన సేవలు ప్రధానంగా చేసుకుని నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఉత్పాదక నగరాలకు తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చెన్నైతో పాటు తిరుచ్చి, మధురై, కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్, వెల్లూరు, అంబూర్, తంజావూరు, వంటి అనేక నగరాలతోపాటు దక్షిణ భారత మార్కెట్‌పై స్కైవేస్ గ్రూప్ దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా వివరించారు. మేకిన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇండియాతో ఉత్పత్తి పెరిగి లాజిస్టిక్ సంస్థల్లో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ యాష్ పాల్ శర్మ పాల్గొన్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ! -
డీసీఐ చేతికి భారీ డ్రెడ్జర్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) చేతికి భారీ డ్రెడ్జర్ రానుంది. 12 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ట్రెయిలింగ్ సక్షన్ హాపర్ డ్రెడ్జర్ (టీఎస్‌హెచ్‌డీ) కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకానున్న ఈ డ్రెడ్జర్‌ను కొచ్చి షిప్‌యార్డులో తయారు చేయనున్నారు. ఈ తరహా భారీ డ్రెడ్జర్ ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదు. వాస్తవానికి వచ్చే పదేళ్లలో దేశంలో ఏకంగా 310 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుందని అంచనా. ప్రస్తుతం డీసీఐ చేతిలో రూ.900 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కొత్తగా భారీ డ్రెడ్జర్లు అవసరమైన నేపథ్యంలో ఈ భారీ డ్రెడ్జర్‌ను కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి ‘డీసీఐ డ్రెడ్జ్ బ్రహ్మపుత్ర’ అని నామకరణం చేశారు. డ్రెడ్జర్ కొనుగోలుకు సంబంధించి ఈ నెల 17న ఢిల్లీలో ఒప్పంద కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీసీఐ వర్గాలు తెలిపాయి. దీని కొనుగోలుకు సుమారు రూ.వెయ్యి కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది. డ్రెడ్జర్ పనితీరును పరిశీలించిన తర్వాత మరో రెండు భారీ డ్రెడ్జర్లను కొనుగోలు చేసేందుకు డీసీఐ సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
Reliance : తగ్గేదేలే.. ఇకపై ఈ రంగంలో పెను మార్పులే!
ఏ పని చేపట్టినా పక్కా వ్యూహంతో గ్రాండ్‌గా మొదలు పెట్టి సక్సెస్ కొట్టడమనేది రిలయన్స్ స్టైల్. ఫ్యూచర్ ఫ్యూయల్‌గా చెప్పుకుంటున్న హైడ్రోజన్ ఫ్యూయల్‌పై ఇప్పటిగా భారీగా పెట్టుబడులు పెడుతూ గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్‌లోకి ఎంటర్ అవుతోంది రిలయన్స్. రిలయన్స్ డిజిటల్ పేరుతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ స్టోర్లు ఈ గ్రూపు ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే వివిధ కంపెనీలకు చెందిన బ్రాండ్లనే ఇక్కడ విక్రయిస్తున్నారు తప్పితే రిలయన్స్‌కు అంటూ సొంత బ్రాండ్ లేదు. ఈ లోటును తీర్చే పనిలో పడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ సాన్మినాతో రిలయన్స్ జట్టు కట్టింది. సాని్మనా ఇండియాలో 50 శాతం షేర్లను రూ. 1670 కోట్లతో రిలయన్స్ కొనుగోలు చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి భారత్‌లో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు ఉత్పత్తి చేయనున్నాయి. సన్మినాకు చెన్నైలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ప్లాంటు ఉంది. తాజాగా కుదిరిన జాయింట్ వెంచర్ ప్లాన్స్‌ను అనుసరించి ఇదే ప్లాంటులో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని చేపడుతారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గటుగా ఇతర ప్రాంతాల్లోనూ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను నెలకొల్పుతామని రిలయన్స్ తెలిపింది. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ప్రవేశించినట్టు రిలయన్స్ తెలిపింది. దేశ అవసరాలకు తగ్గట్టు క్లౌడ్ కంప్యూటింగ్, 5జీ టెక్నాలజీ విస్తరణ, మెడికల్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్, క్లీన్టెక్, డిఫెన్స్, ఎయిరోస్పేస్ సెకార్టకు అవసరమై ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై ఫోకస్ చేస్తున్నామని రిలయన్స్ తెలిపింది. జియో రాకతో ఇండియాలో ఇంటర్నేట్ యూసేజ్‌లో పెను మార్పులు సంభవించాయి. ఈ కామర్స్ రంగం పది మెట్లు పైకి చేరుకుంది. పేపర్‌లెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. రిలయన్స్ రాక కారణంగా త్వరలో ఎలక్ట్రానిక్ సెక్టార్‌లోనూ ఇదే తరహా మార్పులు చూడవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ఏ అండ్ టీలో రిలయన్స్ రిటైల్ పెట్టుబడులు -
'మేక్ ఇన్ ఇండియా' కోసం భారీగా కస్టమ్స్ సుంకం మినహాయింపులు!
దేశీయంగా తయారీ ప్రోత్సహించడానికి 2022-23 బడ్జెట్లో 350 ముడిసరుకులపై కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 40కి పైగా ఉత్పత్తుల మీద కస్టమ్స్ మినహాయింపులను ప్రకటించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబిఐసీ) ట్వీట్ చేసింది. మొత్తంగా ఉత్పత్తుల మీద 350 కస్టమ్స్ సుంకాలను ఉపసంహరించుకుంటామని సీబిఐసీ తెలిపింది. వీటిలో మినహాయింపులు పొందుతున్న కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, బట్టలు, వైద్య పరికరాలు, మందులు లాంటివి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, హెడ్ సెట్స్ పరికరాలు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్ల వంటి ఉత్పతులను దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించేందుకు గ్రేడెడ్ రేట్ స్ట్రక్చర్‌ను అందించడానికి కస్టమ్స్ డ్యూటీ రేట్లను రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. మొబైల్ ఫోన్ ఛార్జర్ల, ట్రాన్స్ఫార్మర్ భాగాలు, మొబైల్ కెమెరా మాడ్యూల్ కెమెరా లెన్స్, కొన్ని ఇతర వస్తువులకు కూడా డ్యూటీ రాయితీలు కల్పిస్తామని ఆమె చెప్పారు. రత్నాలు, ఆభరణాల రంగానికి ఊతమిచ్చేందుకు కట్, పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి, సాన్ డైమండ్‌పై సున్నా శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ-కామర్స్ ద్వారా ఆభరణాలను ఎగుమతి చేయడానికి 2022 జూన్ నాటికి సరళీకృత నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆమె అన్నారు. తక్కువ విలువతో అనుకరణ ఆభరణాల దిగుమతిని అరికట్టేందుకు అనుకరణ ఆభరణాలపై కిలోకు 400 రూపాయల కస్టమ్స్ సుంకాన్ని విధించాలని చూస్తున్నట్లు తెలిపారు. (చదవండి: Elon Musk: అపర కుబేరుడు మరీ ఇంత పిచ్చోడా?) -
50 బిలియన్ డాలర్ల లక్ష్యం...! యాపిల్..మేక్ ఇన్ ఇండియా..!
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్‌లో మరిన్ని తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 50 బిలియన్ డాలర్లే లక్ష్యంగా..! వచ్చే 5-6 ఏళ్లలో భారత్‌లో యాపిల్ వార్షిక ఉత్పత్తిని సుమారు 50 బిలియన్ డాలర్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోకల్ మేడ్ ఐఫోన్స్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్ పాడ్స్ వంటి యాపిల్ ఉత్పత్తులను భారత్‌లో తయారుచేయాలని కేంద్రం కోరింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు యాపిల్ అధికారులతో ఇటీవల సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రితో సహా సీనియర్ ప్రభుత్వ అధికారులు హజరైనట్లు సమాచారం. పది లక్షల ఉద్యోగాల కల్పన..! వచ్చే ఐదారు ఏళ్లలో భారత్‌లో పది లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా కంపెనీ పనిచేస్తోందని యాపిల్ ప్రొడక్ట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అంతేకాకుండా 2017 నుంచి బెంగళూరులో ఫెసిలిటీ సెంటర్లో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని యాపిల్ ఏర్పాటు చేసిందనే విషయాన్ని గుర్తుచేశారు. ఐఫోన్ విడిభాగాల ఓఈఎమ్ సంస్థ ఫాక్సాకాన్ చెన్నైలో ఇప్పటికే ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11, ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్ల అసెంబ్లీ చేస్తోంది. చదవండి: చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు -
మేడిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పీసీలు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు సహా వివిధ రకాల పర్సనల్ కంప్యూటర్లను భారత్‌లో తయారు చేయడం ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం హెచ్‌పీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేసే విధంగా వీటిలో కొన్ని ఉత్పత్తులకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆర్డరు చేసేందుకు ఇవి అందుబాటులో ఉంటాయని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ కేతన్ పటేల్ తెలిపారు. ‘భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి చురుగ్గా పనిచేస్తున్నాం. కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మేకిన్ ఇండియా ప్రోగ్రాంకి అనుగుణంగా మేము దేశీయంగా తయారీని చేపట్టాము. మా తయారీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా స్వావలంబన భారత కల సాకారం కావడంలో అర్ధవంతమైన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కమర్షియల్ డెస్క్‌టాప్‌ల తయారీ కోసం ఫ్లెక్స్ సంస్థతో 2020 ఆగస్టులో హెచ్‌పీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ఫ్లెక్స్ ప్లాంటులో పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా విస్తృత శ్రేణి .. హెచ్‌పీ ఎలీట్‌బుక్స్, హెచ్‌పీ ప్రోబుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. డెస్క్‌టాప్ మినీ టవర్స్ (ఎంటీ), మినీ డెస్క్‌టాప్స్ (డీఎం), స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ (ఎస్ఎఫ్ఎఫ్) డెస్క్‌టాప్స్, ఆల్–ఇన్–వన్ పీసీలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల ఆప్షన్లతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు హెచ్‌పీ పేర్కొంది. ఫ్లెక్స్ ఫ్యాక్టరీ.. చెన్నై పోర్టుకు దగ్గర్లో ఉండటం వల్ల నిర్వహణపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని, ల్యాప్‌టాప్‌లు..ఇతర పీసీ ఉత్పత్తులకు అవసరమైన ముడివస్తువులను సమకూర్చుకోవడం సులభతరంగా ఉంటుందని తెలిపింది. -
యుద్ధ నౌకల తయారీకి, నావల్ గ్రూప్‌తో జీఆర్ఎస్ఈ జట్టు
కోల్‌కతా: మేకిన్ ఇండియాను మేక్ ఫ్రమ్ ఇండియాగా మార్చే కార్యక్రమానికి మద్దిస్తూ మినీరత్న పీఎస్‌యూ.. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) తాజాగా నావల్ గ్రూప్ ఫ్రాన్స్‌తో చేతులు కలిపింది. సర్ఫేస్ నౌకల తయారీకి అనువైన సాంకేతిక సహకారం కోసం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. తద్వారా దేశ, విదేశీ నౌకాదళాలకు అవసరమయ్యే అత్యున్నత యుద్ధనౌకల తయారీని చేపట్టనుంది. ఇందుకు రెండు సంస్థల అధికారులూ ఎంవోయూపై సంతకాలు చేశారు. యూరోపియన్ నౌకాదళ పరిశ్రమలో లీడర్‌గా నిలుస్తున్న నావల్ గ్రూప్‌తో జట్టు కట్టడం ద్వారా జీఆర్ఎస్ఈ గోవిండ్ డిజైన్ ఆధారిత యుద్ధ నౌకలను జీఆర్ఎస్ఈ రూపొందించనుంది. ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతో నౌకల తయారీని చేపట్టేందుకు పరస్పరం సహకరించుకోనున్నాయి. వెరసి దేశ, విదేశీ నావికా దళాల కోసం జీఆర్ఎస్ఈ 100 యుద్ధ నౌకలను నిర్మించనుంది. -
టీవీ రేట్లకు మళ్లీ రెక్కలు!
న్యూఢిల్లీ: టీవీల రేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి. టెలివిజన్ స్క్రీన్ల తయారీలో కీలకమైన ఓపెన్–సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని కేంద్రం భావిస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. దీన్ని వచ్చే మూడేళ్లలో క్రమంగా 10–12 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీన్ని అమల్లోకి తేవచ్చని.. ఫలితంగా అక్టోబర్ నాటికి టీవీల రేట్లు 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొన్నాయి. ఓపెన్ సెల్ ప్యానెళ్లు ఎక్కువగా చైనా నుంచి దిగుమతవుతున్నాయి. దేశీయంగా భారీ బ్రాండ్లలో శాంసంగ్, ఎల్జీ, సోనీ, థామ్సన్, కొడక్, వ్యూ, మి, వన్‌ప్లస్ వంటివి ఉన్నాయి. ఇలాంటి బ్రాండ్లన్నీ కూడా చైనా వంటి మార్కెట్ల నుంచి ఓపెన్–సెల్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ‘గత రెండేళ్లుగా (2020, 2021) భారత టీవీ పరిశ్రమకు గడ్డుకాలంగానే ఉంది. కోవిడ్–19 పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి వచ్చే దాకానైనా కాస్తంత ఊరట ఉండాలి‘ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జీఎస్టీ రేటును తక్షణం తగ్గించడం లేదా వచ్చే రెండేళ్ల పాటు ఓపెన్–సెల్ ప్యానెళ్లపై సుంకాలను రద్దు చేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒక చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ఏడాది ఇది మూడోసారి.. టీవీ రేట్లు పెరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కానుంది. ప్యానెళ్ల రేట్లు పెరుగుతాయనే కారణంతో జనవరి, ఏప్రిల్‌లో టీవీల ధరలను కంపెనీలు పెంచాయి. చైనాకు చెందిన ప్యానెళ్ల తయారీ సంస్థలు ధరలను పెంచడం కూడా ఇందుకు కొంత కారణం. కస్టమ్స్ డ్యూటీతో పాటు టీవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా వర్తిస్తోంది. 32 అంగుళాల దాకా టీవీలపై 18%, అంతకు మించిన వాటిపై గరిష్టంగా 28% మేర జీఎస్టీ ఉంటోంది. 2019 నుంచి మల్లగుల్లాలు.. వాస్తవానికి మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ గణనీయంగా పెంచాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో టీవీల తయారీ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా వాటి తయారీ సామర్థ్యాలను పెంచుకుంటే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ విధించబోమంటూ 2019 సెప్టెంబర్‌లో పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. కానీ టీవీల తయారీ సంస్థలు ఇప్పటిదాకా దేశీయంగా ప్యానెళ్ల తయారీకి ఏర్పాట్లు చేసుకోలేకపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి, తదుపరి లాక్డౌన్ తదితర పరిణామాలతో వాటి ప్రణాళికలకు అంతరాయం ఏర్పడింది. ప్రతీ మూణ్నెల్లకోసారి పెరుగుదల కరోనా వైరస్ మహమ్మారి తెరపైకి వచ్చినప్పట్నుంచీ టీవీల ధరలు దాదాపు ప్రతీ త్రైమాసికానికోసారి పెరుగుతూనే ఉన్నాయి. తొలుత చైనాలో తయారీ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల రేట్లు పెరిగాయి. కానీ ఆ తర్వాత డిమాండ్–సరఫరా పరిస్థితి స్థిరపడిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. 2019 డిసెంబర్ ఆఖరు వారంలో చైనాలో కోవిడ్ కేసులు బైటపడినప్పుడు టీవీ తయారీ సంస్థల్లో ఆందోళన నెలకొంది. టీవీల తయారీకి కీలకమైన ప్యానెళ్లను ఎక్కువగా చైనానే సరఫరా చేస్తున్నందున .. అక్కడ కార్యకలాపాలు కుంటుపడితే ముడి వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనని కంపెనీలు భయపడ్డాయి. ఆ భయాలన్నీ తర్వాత నెలలోనే నిజమయ్యాయి. 2020 జనవరిలో .. చైనాలోని తయారీ హబ్‌లలో ఉత్పత్తి నిల్చిపోయింది. దీంతో ప్యానెళ్లు సహా ఇతరత్రా కీలక విడిభాగాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా 2020 ఫిబ్రవరి నుంచే రేట్లు 10% పెరిగాయి. అటుపైన మార్చి వచ్చేసరికి భారత్‌లో దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఒకవైపు విడిభాగాలు, మరోవైపు టీవీ సెట్లకు కూడా కొరత ఏర్పడింది. జూన్ నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో .. అన్ని సైజుల్లోని కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) జూలై ఆఖరున నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా 80 అంగుళాలు ఆ పైన పరిమాణమున్న హై–ఎండ్ టీవీ సెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. ఇక ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో వివాదం రాజుకోవడంతో భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంటు ఎగిసింది. అప్పట్నుంచి చైనా నుంచి వచ్చే విడిభాగాలు, ఫినిష్డ్ గూడ్స్‌పై నిఘా కొనసాగుతుండటం.. భారత్‌లో ఉత్పత్తి జాప్యానికి దారితీస్తోంది. ఇదిలా ఉండగా సరిగ్గా దీపావళి పండుగ సీజన్‌కు ముందు సెప్టెంబర్‌లో ప్యానెళ్ల రేట్లు పెరగడంతో టీవీల ధరలు దాదాపు 25 శాతం దాకా ఎగిశాయి. ఆ వెంటనే అక్టోబర్ 1 నుంచి ఓపెన్–సెల్స్‌పై 5% కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి విధించింది. -
చిప్ మేకర్స్‌కు కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో సెమీ కండక్టర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతి కంపెనీకి కేంద్రం ఓ ఆఫర్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఈ నగదు ప్రోత్సాహాన్నిఇవ్వనున్నట్లు తెలిపింది. చైనా తర్వాత భారతదేశాన్ని రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారునిగా అంతర్జాతీయ మార్కెట్లో నిలబెట్టడానికి ఇది సహాయ పడుతుందని కేంద్రం భావిస్తోంది. "చిప్ ఫాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం 1 బిలియన్ డాలర్లకు ( సుమారు 7వేల కోట్ల రూపాయలు) పైగా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మీడియాతో అన్నారు. అంతేకాక కంపెనీలు తయారు చేసే చిప్‌లను ప్రభుత్వమే కొనుగోలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నగదు ప్రోత్సాహకాలను ఎలా పంపిణీ చేయాలో ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఆటో,ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో చిప్స్ కొరత కారణంగా ప్రపంచం వాటి కోసం తైవాన్‌పై ఆధారపడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రభుత్వాలు సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి సబ్సిడీలు, రాయితీలు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఎలక్ట్రానిక్స్, టెలికాం పరిశ్రమకు కావాల్సిన వస్తువుల కోసం చైనా వైపే చూస్తోంది. గత ఏడాది సరిహద్దు ఘర్షణ తరువాత భవిషత్తుల్లో డ్రాగన్ దేశంపై ఆధారపడటం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వదేశీ చిప్‌లు, సీసీటీవీ కెమెరాల నుంచి 5 జీ పరికరాల ఉత్పత్తుల్లో ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాకపోతే సెమీకండక్టర్ తయారీ కంపెనీలు తమ యూనిట్లను భారతదేశంలో ఏర్పాటుకు ఆసక్తి చూపించాయో లేదో ఆ ఆధికారులు ఏ సమాచారం ఇవ్వలేదు. ( చదవండి: ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు ) -
మరింత ‘స్మార్ట్’గా ఎంఐ తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ(మేకిన్ ఇండియా)కి ప్రాధాన్యతనిస్తూ చైనీస్ దిగ్గజం ఎంఐ తాజాగా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల తయారీకి బీవైడీ, డీబీజీ, రేడియంట్‌లతో చేతులు కలిపింది. దీనిలో భాగంగా ఎంఐ తరఫున బీవైడీ, డీబీజీ స్మార్ట్ ఫోన్లను తయారు చేయనుండగా.. స్మార్ట్ టీవీలను రేడియంట్ రూపొందించనుంది. తద్వారా దేశీయంగా స్మార్ట్ టీవీల తయారీని భారీగా పెంచుకోనుంది. హర్యానా యూనిట్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన డీబీజీ.. ఇకపై తమ బ్రాండ్ తయారీ సామర్థ్యాన్ని 20% పెంచనున్నట్లు షావోమీ ఇండియా ఎండీ మను జైన్ పేర్కొన్నారు. తమిళనాడులో ఏర్పాటైన బీవైడీ యూనిట్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభంకానున్నట్లు మను జైన్ తెలియజేశారు. 5 క్యాంపస్‌లు దేశవ్యాప్తంగా ప్రస్తుతం షావోమీ ఐదు క్యాంపస్‌లను కలిగి ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఫోన్లను అసెంబుల్ ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌లతో జట్టు కట్టింది. స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న భారీ డిమాండ్ నేపథ్యంలో తయారీ సామర్థ్యాన్ని విస్తరించవలసి ఉన్నట్లు జైన్ వెల్లడించారు. ఇంటివద్ద నుంచే ఆఫీస్ వర్క్, చదువులు కొనసాగుతున్న కారణంగా అత్యధిక కంటెంట్ వినియోగమవుతున్నట్లు చెప్పారు. దీంతో డిమాండుకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్న విడిభాగాలు స్థానికంగా తయారు చేసినవి లేదా అసెంబుల్డ్ అయినవేనని పేర్కొన్నారు. ఫోన్ల విలువలో 75 శాతంవరకూ స్థానికంగా సమకూర్చుకున్న విభాగాలతోనే రూపొందుతున్నట్లు వివరించారు. పీసీబీఏ, సబ్–బోర్డులు, కెమెరా మాడ్యూల్స్, బ్యాక్ ప్యానల్స్, వైర్లు, చార్జర్లు దేశీయంగా తయారవుతున్నట్లు వెల్లడించారు. వీటిని సన్నీ ఇండియా, ఎన్వీటీ, శాల్‌కాంప్, ఎల్వై టెక్, సన్వోడా తదితరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అన్ని కార్యకలాపాల ఫలితంగా 30,000 మందికి ఉపాధి కల్పించినట్లు జైన్ తెలియజేశారు. స్మార్ట్ టీవీ విభాగంలోనూ 1,000 మంది పనిచేస్తున్నట్లు తెలియజేశారు. 2020లో జూమ్: కోవిడ్–19 నేపథ్యంలో 2020లో 15 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్ నమోదయ్యాయి. కౌంటర్‌పాయింట్ గణాంకాల ప్రకారం అక్టోబర్–డిసెంబర్ కాలంలో వార్షికంగా 19 శాతం వృద్ధిని సాధించగా.. పోకో బ్రాండుతో కలిపి షావోమీ 26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టాప్ ర్యాంకులో నిలవగా.. 21 శాతం వాటాతో శామ్సంగ్, 16 శాతంతో వివో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక రియల్మీ వాటా 13 శాతంకాగా.. ఒప్పో 10 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 2021లో స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్స్ 16–16.5 కోట్ల యూనిట్లకు చేరవచ్చని జైన్ అంచనా వేస్తున్నారు. ఈ బాటలో ఓటీటీ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా స్థానికంగా తయారైన 30 లక్షల స్మార్ట్ టీవీలను విక్రయించినట్లు వెల్లడించారు. -
మెగా బూస్ట్: చెన్నైలో అమెజాన్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫైర్ టీవీ స్టిక్స్ సహా తమ డివైజ్‌లను చెన్నైలో తయారు చేయనుంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీతో జట్టు కట్టనుంది. మేకిన్ ఇండియాకు మెగా బూస్టింగ్‌గా భారతదేశంలో టెలివిజన్ స్ట్రీమింగ్ పరికరాల తయారీని ప్రారంభిస్తోంది. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా అమెజాన్ త్వరలో భారతదేశంలో ఫైర్‌టివి స్టిక్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రారంభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం వెల్లడించారు. ‘భారత్‌లో ఇది తొలి తయారీ కేంద్రం అవుతుంది. స్వావలంబన దిశగా భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి మేం కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. భారత్‌లోని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డివైజ్ తయారీ ప్రోగ్రాం కింద ఏటా పెద్ద ఎత్తున ఫైర్ టీవీ స్టిక్ డివైజ్‌లు (వీడియో స్ట్రీమింగ్కి ఉపయోగపడేవి) తయారు చేస్తాం‘ అని అమెజాన్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. మేకిన్ ఇండియా పట్ల తమ నిబద్ధతను ఇది సూచిస్తుందని, ఉద్యోగాల కల్పనకు, నూతన ఆవిష్కరణలను పెంచుతుందని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. అయితే, ప్లాంటు తయారీ సామర్థ్యం, ప్రాజెక్టుపై ఎంత ఇన్వెస్ట్ చేయనున్నదీ మాత్రం వెల్లడించలేదు. Held a very good conversation with @AmitAgarwal and @Chetankrishna of @amazonIN today. Delighted to share that soon Amazon will commence manufacturing of electronics products like FireTV stick in India. pic.twitter.com/BRpnUG6fA5 — Ravi Shankar Prasad (@rsprasad) February 16, 2021 -
భారత్ లక్ష్యం.. ‘మేక్ ఫర్ వరల్డ్’
సాక్షి, బెంగళూరు: రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని సాకారం చేసిన భారత్ తదుపరి లక్ష్యం ‘మేక్ ఫర్ వరల్డ్’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక సమీపంలో బుధవారం ప్రారంభమైన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగళూరులో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు యుద్ధ సామగ్రిని ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. దేశంలో రక్షణ సామగ్రి ఉత్పత్తి కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దాదాపు 500 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాల కోసం 1.3 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. దేశ సరిహద్దులతో పాటు నీరు, నేల రక్షణ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. భారత వాయుసేన తేజస్ ఎంకే1 లఘు యుద్ధ విమాన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా, ఏరో ఇండియా ప్రదర్శనలో భారత వైమానిక దళ పాటవం అబ్బురపరిచింది. యుద్ధ హెలికాప్టర్లు, విమానాలు, సూర్యకిరణ్ జెట్ల విన్యాసాలు సందర్శకులను అలరించాయి. ఏరో ఇండియా ప్రదర్శన ద్వారా భారత ఖ్యాతి మరింత వెలుగులోకి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్తో రూ.48వేల కోట్ల డీల్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రూ.48వేల కోట్లతో 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్సీఏ) కొను గోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఒప్పంద పత్రాలను రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు హెచ్ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్‌కు అందజేశారు. -
శాంసంగ్ మేకిన్ ఇండియా ఉత్పత్తులు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలోని పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్అండ్డీ) మీద దృష్టి సారించాలని, కొత్త ఉత్పత్తులను చేపట్టాలని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నిర్ణయించింది. మేకిన్ ఇండియా ఉత్పత్తులనే అభివృద్ధి చేస్తామని.. ఇక్కడి నుంచి ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని.. ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేశామని శాంసంగ్ తెలిపింది. (ఫేస్బుక్ ఇండియా లాభం రెట్టింపు) దేశంలో 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్త డిజిటల్ కార్యక్రమాలను బుధవారం ఆవిష్కరించింది. ఇందులో భాగంగా పవరింగ్ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఆర్అండ్డీ స్థానిక టెక్ టాలెంట్ పీపుల్, స్టార్టప్స్‌లను ఎంపిక చేసుకుంటుంది. 5జీ, ఏఐ, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కెన్ కాంగ్ తెలిపారు. విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో టెక్ ఇన్నోవేషన్‌ను మరింత పరిపుష్టం చేసేందుకు ఓపెన్ ఇన్నోవేషన్‌ను మరింత విస్తరిస్తామని చెప్పారు. డిసెంబర్ ముగింపుతో సామ్‌సంగ్‌కు ఇండియాలో పాతికేళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం శాంసంగ్‌కు దేశంలో మొబైల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు 2, ఆర్అండ్డీ సెంటర్లు 5, డిజైన్ సెంటర్ ఒకటి ఉంది. సుమారు 2 లక్షల ఔట్లెట్లు, 70 వేల మంది ఉద్యోగులున్నారు. -
‘మేక్ ఇన్ ఇండియా’.. అదే మన బ్రాండ్
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో దేశీయ ఉపకరణాల వినియోగానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల్లోనూ కొత్త కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్ పంపిణీ విభాగంలో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్లు, రియాక్టర్లు, స్విచ్ గేర్లు, సబ్స్టేషన్ల నిర్మాణ సామగ్రి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే హైడ్రో టర్బైన్స్, జనరేటర్స్ వంటి భాగాలన్నీ స్థానికంగా తయారైనవే వాడాలని సూచించింది. ఇవీ మార్గదర్శకాలు ► థర్మల్ విభాగంలో ఇప్పటివరకూ విదేశీ పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో స్వదేశంలో తయారైన ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బాయిలర్స్‌లో వాడే మిల్స్, ఎయిర్ ప్రీ హీటర్స్, టర్బైన్స్లో వినియోగించే ముఖ్యమైన విడి భాగాల విషయంలోనూ దేశీయంగా తయారైన వాటికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► చివరకు బొగ్గు నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే కన్వేయర్లు, ఇతర భాగాలు భారత్‌లో తయారైనవే ఉండాలి. ► బొగ్గును మండించడం ద్వారా వచ్చే బూడిదను నిల్వ చేసే విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలి. కేటగిరీలుగా విభజన.. ► దేశీయ, విదేశీ ఉపకరణాలు వాడే కాంట్రాక్ట్ సంస్థలను కేటగిరీలుగా విభజించాలి. ► దేశీయ పరికరాలు వాడే వారికి కాంట్రాక్ట్ విధానంలో సడలింపులు ఇవ్వాలి. ► విదేశీ, దేశీయ ఉపకరణాలు వాడాల్సిన పరిస్థితుల్లో భారత్‌లో లభించే వస్తువులను దిగుమతి చేసుకునే సంస్థలను ముందుగా గుర్తించి.. విదేశీ దిగుమతి అవకాశం కల్పించాలి. అవసరమైతే విదేశీ వస్తువుల దిగుమతికి వీలుగా దేశీయ కంపెనీలు ఇతరులతో ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ► ఈ ముసాయిదాను గతంలోనే విడుదల చేసిన కేంద్రం తాజాగా కొన్ని మార్పులతో రాష్ట్రాలకు పంపింది. దీనిపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరింది. -
రక్షణ రంగంలోకి.. మేఘా
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది. దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, వివిధ పరికరాలను తయారు చేసేందుకు ఎంఈ ఐఎల్కు అనుమతిస్తూ కేంద్ర హోం, వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. వివిధ దశల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఈ సంస్థ ఆయుధాలు, రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేం దుకు అనుమతి పొందింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉత్పత్తులు ఇవే... ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్‌ను ఉత్పత్తి చేయనుంది. అలాగే సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపీసీ) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసీవీ), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగలిగే తేలికపాటి యుద్ధ వాహనాలు (ఏసీటీవీ) మొదలైనవి ఉత్పత్తి చేయనుంది. మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్), మిస్సయిల్స్ వ్యవస్థను ఉపయోగించడానికి అనుకూలమైన ఎక్యూప్మెంట్ను కూడా ఉత్పత్తి చేయనుంది. దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంతో చమురు–ఇంధన వాయువు, విద్యుత్, సౌర విద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్Š సంస్థ ఈ పరిశ్రమ ద్వారా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది. ఇప్పటికే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో.. మేఘా గ్రూప్‌కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్రసాంకేతిక రంగాల్లో సహాయసహకారాలు అందిస్తోంది. óఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌తో పాటు విద్యుత్ ప్రసారం, సౌర రంగాల్లో కూడా నిమగ్నమై ఉంది. అధునాతన కమ్యూనికేషన్ రేడియోలు, జామర్లు, ఈడబ్ల్యూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరా చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశంలోనే తొలిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. మేకిన్ ఇండియాలో భాగస్వామ్యం.. దేశీయంగా ఆధునిక రక్షణ పరికరాలను తయారు చేయడానికి అవసరమైన అనుమతులన్నింటిని ఎంఈఐఎల్ పొందిందని సంస్థ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బొమ్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అత్యాధునిక శాస్త్రసాంకేతిక సామర్థ్యంతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కల, లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఆయన లక్ష్యంలో మేఘా గ్రూప్ కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు. -
ఆరోగ్యం @ మేకిన్ ఇండియా
ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు, ఐటీ ఉత్పత్తులను విరివిగా వినియోగించడం, టెలీ మెడిసిన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడం.. ఈ అంశాలపై విరివిగా చర్చ జరగాల్సి ఉంది. ఆరేళ్లలో మా ప్రభుత్వం 4 అంశాలపై దృష్టి పెట్టింది. మొదటిది వ్యాధి నివారణ.. రెండోది చవకగా వైద్య సేవలు. మూడోది సరఫరాలో మెరుగైన విధానాలు అవలంబించడం. నాలుగోది యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు. న్యూఢిల్లీ: మానవీయ అభివృద్ధి కోణంలో ప్రపంచమంతా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఆరోగ్య రంగంలో దేశాలు సాధించే అభివృద్ధి ప్రాముఖ్యత ఈ కరోనా సంక్షోభ సమయంలో మరింత పెరిగిందన్నారు. ‘ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు, ఐటీ ఉత్పత్తులను విరివిగా వినియోగించడం, టెలీ మెడిసిన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడం.. ఈ అంశాలపై విరివిగా చర్చ జరగాల్సి ఉంది’ అన్నారు. ముఖ్యంగా టెలీ మెడిసిన్‌కు మరింత ప్రాచుర్యం కలిగించేందుకు నూతన విధానాలను రూపొందించాల్సి ఉందన్నారు. బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన వీడియో సందేశం ఇచ్చారు. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు.. తదితర ఉత్పత్తులు దేశీయంగా పెద్దసంఖ్యలో తయారు కావడం అభినందనీయమన్నారు. కరోనాపై పోరులో ఆరోగ్య సేతు యాప్ కూడా గణనీయ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచం చూపు వైద్య సిబ్బంది వైపు... ప్రస్తుత కష్ట సమయంలో ప్రపంచమంతా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల వైపు ఆశగా, కృతజ్ఙతతో చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, వారితో దురుసుగా ప్రవర్తించడం ఆమోదనీయం కాదని మోదీ పేర్కొన్నారు. కొందరిలో ఉన్న మూక మనస్తత్వం వల్ల ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్నారు. దీనిపై వైద్య రంగమంతా ఆందోళన చెందుతున్న విషయం తనకు తెలుసన్నారు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్య సిబ్బంది కీలకమన్నారు. ‘వైద్యులు, వైద్య సిబ్బంది సైనికులతో సమానం. ఆర్మీ యూనిఫాంలో లేని సైనికులు వారు. కరోనా కనిపించని శత్రువే కానీ మన వైద్యులు అపజయం ఎరగని సైనికులు’ అన్నారు. వైద్యులపై హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్–19 చికిత్సలో పాలు పంచుకుంటున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడడం నాన్ బెయిలబుల్ నేరమని, అందుకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేస్తూ కేంద్రం ఏప్రిల్‌లో ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. గంగ దసరా సందర్భంగా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మేకిన్ ఏపీ.. తొలి అడుగు మేకిన్ ఇండియాకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటుండగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ విభాగాలూ... తమ అవసరాల కోసం జరిపే కొనుగోళ్లలో 25 శాతాన్ని స్థానిక ఎంఎస్ఎంఈల నుంచే చేయాలంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, రాజ్యాంగ బద్ధమైన సంస్థలు, ఎస్పీవీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రభుత్వరంగ సంస్థలకు వర్తిస్తాయి. ఈ 25 శాతంలో 4 శాతాన్ని ఎస్సీ/ఎస్టీలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి, 3 శాతాన్ని మహిళలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేయాలని తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. విదేశీ వస్తువుల జాబితా వెనక్కి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించేలా సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ బలగాలు) క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయాలను నిషేధిస్తూ తీసుకొచ్చిన వెయ్యి విదేశీ ఉత్పత్తుల జాబితాను ప్రభుత్వం ఉపసంహరించింది. జూన్ 1 నుంచి విక్రయాల జాబితా అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భండార్ మే 29న జారీ చేసిన ఈ జాబితాలో కొన్ని దేశీయ ఉత్పత్తులు కూడా ఉన్నాయని అందువల్లనే కేంద్ర హోం శాఖ సోమవారం ఈ జాబితాను ఉపసంహరించిందని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త జాబితాను విడుదల చేస్తామన్నారు. భారత కంపెనీలైన డాబర్, వీఐపీ ఇండస్ట్రీస్, యురేకా ఫోర్బ్స్, జాక్వెర్, నెస్లే వంటి సంస్థలకు చెందిన వస్తువులు కూడా తొలగింపునకు గురైన వస్తువుల లిస్టులో ఉన్నాయి. -
ఎఫ్‌డీఐ పరిమితి 49 నుంచి 75 శాతానికి పెంపు!
న్యూఢిల్లీ: రక్షణ రంగం, భద్రతా సిబ్బందికి అవసరమైన అధునాతన ఆయుధాలు, పరికరాలను భారత్‌లోనే తయారుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలపై క్రమక్రమంగా నిషేధం విధించి... ఆ జాబితాను నోటిఫై చేస్తామని తెలిపారు. అదే విధంగా రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఆటోమేటిక్ రూట్లో 49 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. దేశీయ మూలధన సేకరణ కోసం బడ్జెట్లో ప్రత్యేక ప్రొవిజన్ పెడతామన్నారు. రక్షణ పరికరాల దిగుమతి వ్యయాన్ని తగ్గించుకుంటామని పేర్కొన్నారు. మేకిన్ ఇండియాను బలోపేతం చేస్తూ... దిగుమతి చేసుకునే విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తామని వెల్లడించారు. (నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యం) ఇక రాబోయే కాలంలో భారత్ విమానాల నిర్వహణ, మరమతులు, పరిశోధనలకు గ్లోబల్ హబ్ మారుతుందని నిర్మల అన్నారు. భారత గగనతల వినియోగ నిబంధనలు సులభతరం చేస్తామని.. తద్వారా పౌర విమానయానం మరింత మెరుగుపడుతుందన్నారు. తద్వారా ఏడాదికి రూ. 1000 కోట్ల మేర విమానయాన రంగానికి లబ్ది చేకూరనుందని వ్యాఖ్యానించారు. పీపీపీ విధానంలో భాగంగా ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న 12 ఎయిర్‌పోర్టులతో పాటుగా.. మరో ఆరు విమానాశ్రయాలను సైతం ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబన భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ నిర్మలా సీతారామన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.(పన్నులు తగ్గించినా ఫలితం లేదు!) -
మేకిన్ ఇండియా
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న వేళ.. మన దేశం దాని కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. మేకిన్ ఇండియా దిశగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే వైద్య సిబ్బందికి అత్యావశ్యకమైన వ్యక్తిగత రక్షణ ఉపకరణాల (పీపీఈ) తయారీలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పీపీఈల కొరత తీవ్రంగా ఉందని మార్చి 3వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించగా.. అప్పటికి మన దేశం ఒక్క పీపీఈ కిట్‌ను కూడా సొంతంగా తయారు చేసే పరిస్థితి లేదు. కానీ.. ప్రస్తుతం దేశంలో రోజుకు 12 వేల పీపీఈ కిట్లను తయారు చేస్తున్నారు. నెల రోజుల్లోనే మన దేశం సాధించిన ఈ ఘనత వెనుక విశేషాల్లోకి వెళితే.. జీరో నుంచి.. ► కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బంది ఆ వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పించడంలో పీపీఈ కిట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కిట్‌లో ఫుల్ సూట్, బూట్లు, గాగుల్స్, గ్లౌజులు మొదలైనవి ఉంటాయి. ► ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి మన దేశం పీపీఈల విషయంలో పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతూ వచ్చింది. ప్రధానంగా చైనా నుంచే అయ్యే దిగుమతులే ఆధారం. ► డబ్ల్యూహెచ్‌వో ప్రకటన అనంతరం మన దేశం ఈ అంశంపై తక్షణ దృష్టి సారించింది. చైనా నుంచి దిగుమతులను పెంచడంతోపాటు యుద్ధ ప్రాతిపదికన దేశంలో పీపీఈ కిట్ల తయారీకి ఉపక్రమించింది. ► వీటి తయారీ ప్రమాణాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దక్షిణ భారత టెక్స్టైల్స్ రీసెర్చ్ సెంటర్ (సిట్ర) వెంటనే కార్యాచరణ చేపట్టింది. ► కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 12 కంపెనీలకు పీపీఈ కిట్ల తయారీకి అనుమతివ్వడంతో ఆ సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి. ► సిట్ర నుంచి అనుమతి పొందిన మరో 25 కంపెనీలు త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. ► ఫలితంగా ఏప్రిల్ 1 నాటికి రోజుకు 12 వేల పీపీఈ కిట్ల తయారీ చేసే స్థితికి మన దేశం చేరుకుంది. ► ఏప్రిల్ 15 నాటికి రోజుకు 20 వేలు, ఏప్రిల్ 25 నాటికి రోజుకు 30 వేల కిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం వస్తుంది. ఏప్రిల్ చివరి నాటికి రోజుకు 3 లక్షల కిట్లు ఉత్పత్తి అవుతాయి. మన రాష్ట్రంలోనూ.. ► తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌లో ఉన్న ‘పాల్స్ పల్స్’ సంస్థ రోజుకు 500 కిట్లు తయారు చేస్తోంది. రోజుకు 5 వేల కిట్ల సామర్థ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. ► మరోవైపు పీపీఈ కిట్ల తయారీకి హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కూడా ముందుకు వచ్చింది. రోజుకు 20 వేల కిట్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. -
వైద్య పరికరాల దిగుమతులకు చెక్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉపయోగించే వైద్య పరికరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేయాలని, వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా) సంయుక్తంగా నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. ఐబీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బయో ఆసియా వంటి సదస్సులు ప్రభుత్వాలకు, పరిశ్రమలకు ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. 17వ బయో ఆసియా సదస్సుకు 35 దేశాల నుంచి 2,000 మంది హాజరయ్యారని, వచ్చే ఏడాది ఈ సదస్సు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు అవార్డులు... బయో ఆసియాలో భాగంగా స్టార్టప్ కంపెనీల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదు కంపెనీలకు కేటీఆర్ నగదు బహుమతులు అందజేశారు. పోటీ కోసం వందల దరఖాస్తులు రాగా నిశిత పరిశీలన తరువాత 70 కంపెనీలకు బయో ఆసియాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించామని, సీసీఎంబీ, టెక్ మహేంద్ర వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలు 5 కంపెనీల ను విజేతలుగా నిర్ణయించారని ఐఐఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోకనాథన్ తెలిపారు. నవజాత శిశువులకు వచ్చే కామెర్ల రోగానికి చికిత్స అందించే పరికరాన్ని అభివృద్ధి చేసిన ‘హీమ్యాక్ హెల్త్ కేర్’, డాక్టర్ల అపాయింట్మెంట్లు మొదలు, వారి లభ్యత, ప్రత్యేకతల గురించి టెలిఫోన్లో వివరించేందుకు వాడే కృత్రిమ మేధ ఆధారిత సేవలను అందిస్తున్న ‘కాల్జీ’, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఊతపు కర్రలు (క్రచెస్)ను తయారు చేసిన ‘ఫ్లెక్సీ మోటివ్స్’, శరీర అవయవాల త్రీడీ మోడళ్ల ద్వారా గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకునే సమయాన్ని సగానికి తగ్గించే ‘లైకాన్ త్రీడీ’, ఈ–కోలీ బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా మందుల తయారీకి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేయగల ‘ఆంకోసెమిస్’కు ఈ అవార్డులు లభించాయి. -
మంటలు రేపిన మాటలు..
రాజకీయాలంటేనే ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం... నోటికి ఏదొస్తే అది మాట్లాడటంగా మారిపోయింది. 2019 సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో ఎందరో నేతలు నోరు జారారు. దిగజారుడుకు హద్దుల్లేవని నిరూపించారు. అలాంటి మాటలు కొన్ని చూస్తే... మేకిన్ ఇండియా కాదు రేపిన్ ఇండియా – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలీగ్ గ్రీన్ వైరస్ – యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం గాడ్సే దేశభక్తుడు – ప్రజ్ఞాఠాకూర్, బీజేపీ ఎంపీ జయప్రద లోదుస్తులు ఖాకీ – ఆజంఖాన్, ఎస్పీ నాయకుడు తీరైన తీర్పులు దశాబ్దాలే కాదు... కొన్ని శతాబ్దాల సందిగ్ధానికి కూడా సర్వోన్నత న్యాయస్థానం తెరదించిన సంవత్సరమిది. శ్రీరాముడి జన్మభూమిగా భావించే అయో«ధ్య అంశం మొదలుకొని... రాజకీయ యవనికను కుదిపేసిన రాఫెల్ డీల్ వరకు ఎన్నెన్నో కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో మత ప్రాధాన్యమైనవే కాదు!!. మహిళల హక్కులకు సంబంధించినవి... ఆఖరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చే తీర్పులూ ఉన్నాయి. ఆ మేటి తీర్పులు సంక్షిప్తంగా... జన్మభూమి... రాముడిదే! దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో హిందువులు రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి అనుమతిం చింది. ముస్లింలకు మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని వేరొకచోట కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. శబరిమలకు మహిళలు... కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్త్రుత ధర్మాసనానికి బదిలీచేస్తూ 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వయసు రీత్యా కొన్ని వర్గాలకు చెందిన మహిళల ప్రవేశంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై మాత్రం కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 14న ఈ తీర్పుని వెలువరించింది. న్యాయమా! నువ్వు ‘ఉన్నావ్’... ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై ఘోర అత్యాచారం జరగటంతో దేశం నిర్ఘాంతపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అధికార బీజేపీ ఎమ్మెల్యే కావటంతో కేసు ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పార్టీ అతన్ని బహిష్కరించింది. అయితేనేం!! నేరాన్ని కప్పిపుచ్చే యత్నాలు ఆగలేదు. బాధిత మహిళను కిడ్నాప్ చేయటం... ఆమె తండ్రి లాకప్ హత్య... బాధితురాలు సహా బంధువులను యాక్సిడెంట్ రూపంలో చంపే ప్రయత్నాలు... ఇలా ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నాయకుడు నిందితుడైతే కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ తిరిగింది. దీంతో ఈ కేసుపై యావద్దేశం ఒక్కటయింది. చివరికి సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుంది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితం... బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19న సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాఫెల్... విచారణకు నో! రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయటానికి ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన గత తీర్పులను పునఃపరిశీలించాలన్న డిమాండ్‌ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్ర మంత్రులు యశ్వంత్ సింగ్, అరుణ్ శౌరి దాఖలు చేసిన పిటిషన్లపై మే 10న కోర్టు విచారణ ముగించి తన ఉత్తర్వులను రిజర్వులో ఉంచింది. నవంబరు 14న తీర్పు వెలువరించింది. -
రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై లోక్‌సభ దద్దరిల్లింది. యావత్ భారతదేశాన్ని, ఆర్థిక ప్రగతిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యానించారంటూ సభలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రాహుల్ రేప్‌లను ఆహ్వానిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపిస్తే, పార్లమెంటులో కొనసాగే నైతిక హక్కు రాహుల్‌కి లేదని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారరాహుల్ గాంధీ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే భారత్ ‘రేప్ ఇన్ ఇండియా’గా మారుతోందని అన్నారు. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఓం బిర్లా రెండు సార్లు సభని వాయిదా వేసినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఆయన సభని నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలో రాహుల్‌ని గట్టిగా నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలు చూస్తే దేశంలో మహిళలపై అత్యాచారం చేయాలని పిలుపునిస్తున్నట్టుగా ఉందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్మృతి ఇరానీకి మద్దతు నిలిచారు. రాహుల్‌కు మద్దతుగా కనిమొళి.. బీజేపీ సభ్యులు సభలో తీవ్రంగా దాడి చేయడంతో రాహుల్‌కు ఎంపీ కనిమొళి మద్దతు పలికారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడడానికి స్పీకర్ అనుమతించకపోవడంతో ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని తాను క్షమాపణ చెప్పనని అన్నారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు రాహుల్ అత్యాచార వ్యాఖ్యల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు కేంద్ర ఎన్నిక సంఘాన్ని సంప్రదించారు. రాహుల్ అత్యాచారాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. వీలైనంత మేర ఆయనకు కఠిన శిక్ష విధించాలని ఈసీని కోరారు. చట్టబద్ధమైన పక్రియలన్నీ పూర్తయ్యాక తాము తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చినట్టు ఇరానీ వెల్లడించారు. -
‘రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటు’
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడులపై మేకిన్ ఇండియాను ఉటంకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆందోళన వ్యక్తం చేశారు. తాము మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంటే రాహుల్ చౌకబారు వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తరచూ మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారని అయితే దేశంలో పరిస్థితి మాత్రం రేపిన్ ఇండియాగా మారిందని జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని పార్లమెంట్లో పాలక పక్ష సభ్యులు డిమాండ్ చేయగా క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముంది : కనిమొళి
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్లో పెను దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలు మహిళలపై లైంగిక దాడులను ప్రోత్సహించేవిలా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడుతూ ఆయన క్షమాపణను డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ తేల్చిచెప్పినా ఆయన వ్యాఖ్యలపై పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని నిత్యం మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారని, దాన్ని తాము గౌరవిస్తామని అయితే వాస్తవంగా దేశంలో జరుగుతున్నదేంటని కనిమొళి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ మేకిన్ ఇండియా జరగకపోయినా దేశంలో మహిళలపై లైంగికదాడులు మాత్రం జరుగుతున్నాయని ఇదే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని చెప్పారు. కనిమొళి వ్యాఖ్యలపైనా స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కూడా మీరు పార్టీలకు అతీతంగా వ్యవహరించలేకపోతున్నారని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘మనది మేకిన్ ఇండియా కాదు’
-
‘మనది మేకిన్ ఇండియా కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్ ఇండియా దిశగా కాకుండా రేపిన్ ఇండియా వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రతి అంశంపైనా మాట్లాడే ప్రధాని మహిళలపై నేరాల గురించి మాత్రం నోరు మెదపకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశం క్రమంగా లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ హత్యాచార ఘటన, ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలు దేశంలో కలకలం రేపాయని అన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రజలు వేడుకగా జరుపుకున్నారని గుర్తు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై విమర్శలు చెలరేగినా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతించారని, సీనియర్ రాజకీయ నేతలు సైతం పోలీసుల చర్యను సమర్ధించారని చెప్పారు. -
ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ
(మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి): కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో 38 పరిశోధన సంస్థలు ఉన్నాయి. వాటిలో 4,500 మంది శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి సీఎస్ఐఆర్ పనిచేస్తోంది. పర్యావరణం మొదలు ఆరోగ్యం వరకు.. పలు రంగాల్లో అవసరమైన పరిశోధన ఫలితాలను దేశానికి అందించడానికి నిరంతరం పనిచేస్తున్నామని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండే చెప్పారు. ‘పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ.. మందులు, టీకాలు కనిపెట్టడానికి జన్యు శ్రేణి మన దేశ ప్రజల్లో ఉన్న వైవిధ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. జినోమ్ సీక్వెన్స్ (జన్యు శ్రేణి) కూడా మన వాళ్లలో ఉన్నంత విభిన్నంగా మరెక్కడా ఉండదు. అందువల్లే మనదేశంలో అరుదైన జెనెటిక్ డిజార్డర్స్ (జన్యు సంబంధిత సమస్యలు) ఎక్కువ. వీటిని అధిగమించడానికి 1008 మంది జన్యు శ్రేణులను రూపొందించాం. మందులు, టీకాలు కనిపెట్టడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మానవుల జన్యు బ్లూప్రింట్‌ను డీకోడ్ చేయడానికి జన్యు శ్రేణి పనికొస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్తంగా జన్యుశ్రేణి రూపకల్పన ప్రాజెక్టును చేపట్టాయి. అలాగే డెంటల్ ఇంప్లాంట్స్‌ను చౌకగా తయారుచేసే పరిజ్ఞానాన్ని రూపొందించాం. దీనివల్ల ఇప్పుడున్న ధరల్లో మూడో వంతుకే ఇంప్లాంట్స్ లభించనున్నాయి. స్పెంట్ వాష్‌ను శుద్ధి చేస్తే.. మద్యం తయారీ ప్లాంట్ల (డిస్టిలరీస్)లో వ్యర్థ జలాలను ‘స్పెంట్ వాష్’ అంటారు. దీన్ని శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటివరకు లేదు. ఒక లీటరు మద్యం తయారు చేస్తే 10–15 లీటర్ల వ్యర్థజలం (స్పెంట్ వాష్) వస్తుంది. మొలాసిస్ నుంచి మద్యం తయారుచేసే కర్మాగారాలు దేశంలో 300కు పైగా ఉన్నాయి. ఇవి ఏటా 250 కోట్ల లీటర్ల స్పెంట్ వాష్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని అంచనా. ఇవి స్పెంట్ వాష్, మిగతా వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు వదులుతున్నాయి. ఫలితంగా తీవ్ర దుర్గంధం వెలువడటంతోపాటు పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. స్పెంట్ వాష్‌లో కాలుష్యానికి కారణం.. పొటాష్. దీన్ని వేరు చేస్తే మిగతా వ్యర్థాలను తొలగించడం చాలా సులువు. పొటాష్‌ను వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) అభివృద్ధి చేసింది. పొటాష్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. స్పెంట్ వాష్‌ను శుద్ధి చేస్తే.. రూ.700 కోట్ల విలువైన పొటాష్‌ను ఉత్పత్తి చేయొచ్చు. శుద్ధి ప్రక్రియలో శుద్ధ జలం కూడా వస్తుంది. ఆ నీటిని డిస్టిలరీస్ వాడుకోవచ్చు. అయితే.. స్పెంట్ వాష్ శుద్ధి ప్లాంట్ ఏర్పాటు మరీ చౌక కాదు. 2.5 ఏళ్లలో పొటాష్ ఉత్పత్తి ద్వారా పెట్టుబడి వచ్చేస్తుంది. తర్వాత నుంచి లాభమే. వ్యర్థాల రీయూజ్‌కు పరిశోధనలు వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తీవ్ర కాలుష్య సమస్యలు వస్తున్నాయి. వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికి అనువైన పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించే దిశగా పరిశోధనలు చేస్తున్నాం. రైతులు ఆ వ్యర్థాలను సులువుగా ‘రీయూజ్’ చేసే పరిజ్ఞానాన్ని వచ్చే సీజన్‌కు సీఎస్ఐఆర్ అందిస్తుంది. అల్జీమర్స్ వ్యాధికి మందు అల్జీమర్స్ వ్యాధికి కుంకుమ పువ్వు నుంచి మందు తయారు చేశాం. క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రత్యామ్నాయ వనరుల నుంచీ బయోఫ్యూయల్ తయారీ.. దేశానికి ఇంధన భద్రతను అందించే శక్తి బయో ఫ్యూయల్‌కు ఉంది. కానుగ నుంచే ఇప్పటివరకు బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుంచి కూడా తయారు చేయొచ్చు. సీఎస్ఐఆర్ రూపొందించిన బయో ఫ్యూయల్‌తో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి విమానం నడిపాం. వాణిజ్యపరంగా బయోఫ్యూయల్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఇలా చేస్తే.. ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారీ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఇటు ప్లాస్టిక్ సమస్యను, అటు ఇంధన కొరతను అధిగమించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్లాస్టిక్ సమస్యను అధిగమించవచ్చు. ‘మేకిన్ ఇండియా’కు సహకారం మేకిన్ ఇండియా కార్యక్రమానికి సీఎస్ఐఆర్ తన వంతు సహకారమందిస్తోంది. వివిధ రంగాల్లో చేస్తున్న పరిశోధన ఫలితాలను పరీక్షించడానికి ఇటీవల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందించడానికి ఇది దోహదం చేస్తుంది. 19 సీట్ల విమానం సిద్ధమైంది.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, నేషనల్ ఏరోనాటిక్స్‌తో కలిసి తేలికపాటి విమానాల తయారీ మీద పరిశోధనలు చేస్తున్నాం. 19 సీట్ల ‘సరస్’ విమానం సిద్ధమైంది. దీన్ని పరీక్షిస్తున్నాం. 70 సీట్ల విమానం డిజైన్ ఆమోదం పొందింది. ఈ పరిశోధనలు పూర్తయితే.. దేశంలో చిన్న విమానాశ్రయాలకు కూడా విమానాలు తిరిగే అవకాశం ఉంటుంది. ‘విజిబిలిటీ’ తక్కువగా ఉన్నప్పుడు విమానాలు దిగడం (ల్యాండింగ్) పెద్ద సమస్య. దీన్ని అధిగమించడానికి హైలెవల్ సెన్సార్స్ ఉన్న ‘దృష్టి’ని రూపొందించాం. ప్రస్తుతం 50 ‘దృష్టి’ వ్యవస్థలను దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో వాడుతున్నారు. ఈ టెక్నాలజీని రెండు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చాం. ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు కూడా ఇవ్వబోతున్నాం. -
భారత తీరానికి యూరప్ హారం
ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలతో మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్ కూడా తమిళనాడు, గుజరాత్‌లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్‌ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మతులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా ఏపీ సరుకు రవాణా 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. కోటి జనాభాకు మించని గ్రీస్ దేశం ఏటా ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమానంగా షిప్పింగ్ బిజినెస్ ద్వారా ఆర్జించడం గమనార్హం. భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశంలోని రెండు తీర ప్రాంతాల్లో ‘సముద్ర వాణిజ్య సముదాయాలు’ (మారిటైమ్ క్లస్టర్ల)ను ఏర్పాటు చేస్తోంది. ఒకటి గుజరాత్లో... రెండోది పొరుగునున్న తమిళనాడులో. మరి సుదీర్ఘమైన తీర ప్రాంతంతో విరాజిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ లోనూ మరో మారిటైమ్ క్లస్టర్ రావాలి. దీనికి కేంద్రం పచ్చజెండా ఊపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇపుడెందుకంటే మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సముద్ర వాణిజ్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నౌకా నిర్మాణాలు, నౌకల మర మ్మతులకు సంబంధించిన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. దీనివల్ల విదేశాల నుంచి మన షిప్ యార్డులకు నౌకా నిర్మాణాల ఆర్డర్లు పెరిగే అవకాశముంది. దీంతో నిపు ణులు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దేశీ యంగా నౌకా నిర్మాణ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో నౌకా నిర్మాణ రంగంలో భారతదేశ వాటా కేవలం 1 శాతమే. కానీ తాజా చర్యలు మరో రెండేళ్లలో ఈ వాటాను 5 శాతానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు తమ తీర ప్రాంతాల్లో ప్రత్యేక క్లస్టర్లు ప్రారంభించి పరిశ్రమలను వృద్ధి చేశాయి. నౌకా నిర్మాణం, మరమ్మతులు, రవాణా వంటివి కూడా పెరిగి ఆయా దేశాలు అద్భుత ఫలితాలు సాధించేందుకు తోడ్పడ్డాయి. ఇదే కోవలో భారత్ కూడా తమిళనాడు, గుజరాత్‌లలో రెండు జాతీయ క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీలోనూ ఈ తరహా క్లస్టర్‌ను ఆరంభించి నౌకానిర్మాణం, మరమ్మ తులు, సముద్ర రవాణా, సముద్ర తీర పర్యాటక రంగం, సముద్ర ఆధారిత ఉత్పత్తులను పెంచితే 2025 కల్లా ఏపీ సరుకు రవాణా 50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఐరోపాతో భారత ఉప ఖండానికి సరైన వారధి సముద్రమే. తీరప్రాంతాలలో వెలసిన అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్, ప్రపంచం లోనే రెండో చిన్న ఖండమైన యూరప్ స్నేహగీతం ఆలపిస్తున్నాయి. నిజానికి నాగరిక జీవనం ఆరంభం నుంచీ భౌగోళిక, చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన యూరప్ నుంచి రాక పోకలకు భారత్ ప్రధాన ద్వారంగానే ఉంటూ వస్తోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఇరుదేశాల స్నేహపూర్వక సంబంధాలు సుహృద్భావ వాతావ రణాన్ని నెలకొల్పాయి. ఐరోపాకు తూర్పున కాస్పి యన్, పశ్చిమాన అట్లాంటిక్, ఉత్త రాన ఆర్కిటిక్, దక్షిణాన మధ్యదరా సముద్రాలతో పాటు ఆగ్నే యాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం సరి హద్దులుగా ఉన్నాయి. ఇక భారతదేశానికి అత్యధిక జనాభాతో పాటు ఏడు వేల కిలోమీ టర్లకు పైగా సముద్ర తీరం కూడా ఉంది. యూరప్ ఖండాన్ని, భారత్ ఉపఖండాన్ని మిత్ర దేశాలుగా ఉంచుతున్న ఈ సముద్రాలు... ఇరు దేశాల మధ్య వాణిజ్య అవ కాశాలను మరింత పెంచే అవకాశాలనూ అంది స్తున్నాయి. భారతదేశ వాణిజ్యమంతా సముద్రయానం పైనే ఆధారపడి ఉంది. 95 శాతం వ్యాపారం పూర్తిగా సముద్రం మీదుగానే సాగుతోంది. ముడి చమురు దిగుమతులలో భారత్‌ది 3వ స్థానం. గ్రీస్ నుంచి ఎల్ఎన్జీ, ఎల్పీజీలను దిగుమతి చేసుకోవడంలోనూ భారత్ వాటాయే అధికం. ఇక నౌకాయాన వాణిజ్యంలో ప్రపంచంలోనే మొదటి స్థానం భారత్‌ది. ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు సాగించే నౌకలలో 50 శాతం గుజరాత్‌లోని అలంగ్ పోర్ట్ నుంచే సాగుతున్నాయి. భారత నౌకా వాణిజ్యంలో ఎంతగా దూసుకుపోతోందో చెప్ప డానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. గ్రీస్, భారత్ దేశాల మధ్య సముద్రయాన వాణిజ్య సంబంధాల వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయి. ఇక భారత్‌లోని తీర ప్రాంతంలో 12 శాతం ఆంధ్రప్రదేశ్ సొంతం. 974 కిలోమీటర్ల ఈ తీరంలో ఒక మేజర్ పోర్టు, 14 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భాగ స్వామ్యంలో నిర్వహిస్తున్న మరో 6 పోర్టులూ ఉన్నాయి. సముద్రమార్గంలో అత్యధిక సరుకు రవాణా చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది గుజరాత్ తరువాతి స్థానం. 2018 నాటికి 15 కోట్ల మెట్రిక్ టన్నులున్న సరుకు రవాణా 2020 నాటికి 16.5 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుని 10 శాతం పెరు గుదల నమోదు చేస్తుందనేది తాజా అంచనా. ప్రాచీనకాలం నుంచి సముద్రరవాణాపై ఆధారప డిన గ్రీస్ దేశ జనాభా కోటికి మించదు. గ్రీకుల వాణిజ్యమంతా జల రవాణా ద్వారానే జరుగుతుం డటం మరో విశేషం. అందుకని ఏపీ సముద్ర రవా ణాకు, వాణిజ్యబంధానికి గ్రీస్ దేశం సరిగ్గా సరిపో తుంది. దీని కోసం ఏపీ తీరంలో మరిన్ని పోర్టులు, షిప్పింగ్ కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది. షిప్పింగ్ బిజినెస్ ద్వారా ఏటా 25 బిలియన్ల డాలర్లను గ్రీస్ దేశం ఆర్జిస్తోంది. ఇది ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమానం. నిజానికి గ్రీస్ స్థాయిలో నౌకా రవాణా, షిప్పింగ్ బిజినెస్‌లో వృద్ధి సాధిం చేందుకు ఏపీలో అనువైన పరిస్థితులే ఉన్నాయి. తీరప్రాంతంలో వాణిజ్య, వ్యాపారాలు సులభ తరం చేసేలా ప్రభుత్వాలు తగు వి«ధానాలు కూడా రూపొందించాయి. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ వీలు కల్పించాయి. రానున్న రోజుల్లో 35 ఏళ్ల లోపు యువతలో 65 శాతం దేశాభివృద్ధిలో భాగమయ్యే అవకాశం ఉంది. ఇక శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు చేయూతనం దించేందుకు గ్రీస్‌లో అవలంబిస్తున్న విద్యావిధానాలు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు భారత్‌లో కూడా అమలవుతున్నాయి. కాబట్టి తగు ప్రణాళిక లతో గ్రీస్ ఆలోచనలు, ఆచరణను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుంచి ఎగుమతులు దిగుమతులు (లక్షల మెట్రిక్ టన్నులలో) పోర్ట్ 2018 2020 నాటికి అంచనా విశాఖపట్నం 600 650 కృష్ణపట్నం 450 500 గంగవరం 230 250 కాకినాడ 200 220 రవ్వ 20 30 డా. గేదెల శ్రీనుబాబు వ్యాస రచయిత పల్సస్ సీఈవో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రితో కలిసి ఇటీవల గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రతినిధి -
టీవీ ధరలు దిగొస్తాయ్!
న్యూఢిల్లీ : దేశీయంగా టీవీల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానెళ్లపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. దీంతో వీటి దిగుమతుల ఆధారంగా దేశీయంగా తయారీ మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా. దిగుమతి సుంకం రద్దుతో టీవీ తయారీ ఖర్చులు 3 శాతం వరకు తగ్గుతాయి. అలాగే, ఓపెన్ సెల్ టీవీ ప్యానెళ్ల తయారీలో వినియోగించే చిప్ ఆన్ ఫిల్మ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీఏ), సెల్ (గ్లాస్‌బోర్డు/సబ్‌స్ట్రేట్)పైనా దిగుమ తి సుంకాన్ని రద్దు చేస్తు్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. డిమాండ్ తగ్గడంతో దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని పరిశ్రమ కొంత కాలంగా కోరుతోంది. 15.6 అంగుళాలు అంతకుమించిన కూడిన ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ ప్యానళ్లలో ఓపెన్ సెల్‌లపై ప్రస్తుతం 5% దిగుమతి సుంకం అమల్లో ఉండగా, ఇకపై ఉండదని బుధవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రముఖ జపనీస్ కంపెనీ ప్యానాసోనిక్ మాత్రం ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. 3–4% వరకు ధరలు తగ్గుతాయని ప్రకటించింది. ఎల్ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60–70% ఓపెన్‌సెల్ ప్యానళ్లకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలోని టీవీ తయారీ కంపెనీలు చాలావరకు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. 2017 జూన్‌లో టీవీ ప్యానెళ్లపై కేంద్రం ఈ దిగుమతి సుంకాన్ని ప్రవేశపెట్టింది. దేశీ టీవీ మార్కెట్ రూ.22,000 కోట్లుగా ఉంటుంది. సానుకూల ఫలితాలు.. కేంద్రం నిర్ణయం సానుకూలమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ ఎల్రక్టానిక్స్ గతేడాది భారత్‌లోని తన టీవీల తయారీ యూనిట్‌ను మూసేసి, వియత్నాంకు తరలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీయే. దేశీయంగా తగ్గిన వినియోగ డిమాండ్ టీవీ సెట్లపైనా ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు మందగమనం, మరోవైపు పెరిగిన పోటీ, పెద్ద టీవీలపై జీఎస్టీ రేటు ప్రతికూలతలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తయారీదారులకు ఉపశమనం ఇచ్చేదే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమ హర్షాతిరేకం సరిగ్గా పండుగల సీజన్‌కు ముందు టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని కేంద్రం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం పరిశ్రమను సంతోషానికి గురి చేసింది. ప్రభుత్వ నిర్ణయం టీవీల తయారీ వ్యయాన్ని తగ్గించడంతోపాటు దేశీయ తయారీని పెంచేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘పరిశ్రమ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. టీవీ తయారీపై ఒత్తిళ్లను ఇది తగ్గిస్తుంది. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టయితే పరిశ్రమలో డిమాండ్ పుంజుకుంటుంది. గతేడాది టీవీల అమ్మకాలు ఫ్లాట్‌గా నమోదైన తర్వాత సరైన సమయంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచి్చంది. టీవీల తయారీ వ్యయంలో అధిక భాగం ఓపెన్ సెల్స్‌పైనే వెచి్చంచాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పరిశ్రమ వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయగలదు. ధరలు 3–4 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది’’ అని ప్యానాసోనిక్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం టీవీల ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 32 అంగుళాలపైన టీవీలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని మనీష్ శర్మ కోరారు. అయితే, పండుగల సమయానికి రేట్ల తగ్గింపు అందుబాటులోకి రాకపోవచ్చన్నారు. పండుగల కోసం ఇప్పటికే స్టాక్స్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నూతనంగా దిగుమతి చేసుకునే వాటిపైనే దీని ప్రభావం 3 శాతం వరకు ఉంటుందన్నారు. మేకిన్ ఇండియాకు ఊతం.. ప్రభుత్వ నిర్ణయం భారత్‌లో తయారీని పెంచుతుందని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పేర్కొంది. ‘‘ఇది ఎంతో సానుకూల పరిణామం. ఇది భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా)కి ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తుంది’’ అని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా డైరెక్టర్ యూంచల్పార్క్ అన్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తొలగించడం భారత్‌లో టీవీల తయారీని పెంచాలన్న తమ ప్రయత్నాలకు సాయపడుతుందని సోనీ ఇండియా సైతం అభివరి్ణంచింది. ‘‘ప్రభుత్వ మేకిన్ ఇండియా కార్యక్రమానికి సోనీ ఇండియా చాలా కాలంగా కట్టుబడి ఉంది. టీవీ ఓపెన్‌సెల్ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని ఉపసంహరించడం స్థానిక తయారీకి బలమైన ఊతమిస్తుంది. ఈ దిశగా మేం మరిన్ని చర్యలు తీసుకునేందుకు వీలు పడుతుంది’’ అని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. పరిశ్రమ ఈ నిర్ణయం కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్బ్రగంజ అన్నారు. వృద్ధిని ప్రోత్సహించే ఏ చర్య అయినా స్వాగతించతగినదేనన్నారు. -
‘దేశ రక్షణ రంగంలో నేవీ కీలక పాత్ర’
సాక్షి, విశాఖపట్నం : మన దేశంలో తయారైన రక్షణ పరికరాలను ఇతర దేశాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పేర్కొన్నారు. నగరంలో జరిగిన నావికాదళ వార్షిక నాణ్యతా సదస్సులో అతుల్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేస్తున్నామని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తూనే నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రక్షణ రంగంలో నాణ్యతా ప్రమాణాలకు డీజీక్యూఏ(డైరెక్టరేట్ జనరల్ క్వాలిటీ అస్సురెన్స్) విభాగం అత్యంత కీలకమని, దేశ రక్షణలో నేవీ ప్రధాన పాత్ర పోషించడంలో ఈ విభాగం ముఖ్య పాత్ర నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లలో నావికాదళం దేశ రక్షణలో అత్యంత కీలకంగా ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ చౌహాన్, ఏడీజీ అతుల్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
మేకిన్ ఇండియా దిశగా మోదీ 2.0 బడ్జెట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సభలో సుదీర్ఘంగా చదివి వినిపించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించిన నిర్మల.. సందర్భోచితంగా చిన్న చిన్న సూక్తులు వినిపిస్తూ.. సభికులను ఆకట్టుకున్నారు. బడ్జెట్లో తమ ప్రభుత్వ కేటాయింపులను, ప్రాధాన్యాలను స్పష్టంగా ప్రకటించారు. ప్రసంగానికి ముందు ఆర్థిక మంత్రికి స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, ఇతర సహచర మంత్రులు అభినందనలు తెలిపారు. సుమారు 2 గంటల 15 నిమిషాలకుపైగా ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇంగ్లిష్‌లో ఆమె ప్రసంగించినా.. మధ్య, మధ్యలో హిందీ, తమిళం, ఉర్దు, సంస్కృత పదాలను సమయానుకూలంగా వాడారు. ఆమె కీలకమైన ప్రకటనలు చేసినప్పుడల్లా సహచర సభ్యులు బల్లలు చరుస్తూ సంతోషం వెలిబుచ్చారు. మొత్తం రూ. 27,86,349 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లో మేకిన్ ఇండియా దిశగా పలు రాయితీలు ప్రకటించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్‌లను మరిన్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకున్నారు. అలాగే కార్పొరేట్లకు పన్నుల్లో ఊరట కలిగించారు. కానీ సుంకం పెంపుతో పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. డజన్ల కొద్దీ వస్తువులపైన దిగుమతి సుంకాన్ని విధించారు. అయితే స్టార్టప్‌లకు, గృహనిర్మాణం, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం ద్వారా దేశాభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. విమానయానం, బీమా, మీడియాలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తామని ప్రకటించారు. ధనవంతులకు సర్ చార్జ్.. ఈ ఏడాది బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్‌ల్లో ఏ విధమైన మార్పులు చేయలేదు. కానీ ధనవంతుల ఆదాయానికి మాత్రం సర్‌చార్జ్ పెంచారు. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకూ పన్ను పరిధిలోని ఆదాయానికి 39 శాతం, రూ. 5 కోట్లు పైబడిన ఆదాయం సంపాదించే వారికి 42.47 శాతం సర్‌చార్జ్ విధించారు. దీనిపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అత్యంత ధనవంతులు మరింత తోడ్పాటు అందించాలని చెప్పారు. ఇక రూ. కోటి పైబడిన నగదు ఉపసంహరణపై 2 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. బంగారంపై కస్టమ్స్ సుంకం పెంపు.. పన్ను ఆదాయంలో పెరుగుదలకు, లోటును తగ్గించడానికి ప్రభుత్వరంగ సంస్థల్లోనివాటాలను విక్రయించడానికి ఆర్థిక మంత్రి ప్రణాళికలు ప్రకటించారు. అలాగే ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కంపెనీల నుంచి మరింత డివిడెండ్ వచ్చేలా చూడాలన్నారు. ఇక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.1, సెస్ రూ.1 విధించారు. బంగారం నుంచి ఆటోమొబైల్ పరికరాలు, పొగాకు ఉత్పత్తుల వరకూ డజన్ల కొద్దీ వస్తువులపై దిగుమతి సుంకాలను విధించారు. పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. కార్పొరేట్లకు ఊరట.. కార్పొరేట్ కంపెనీలకూ ఆర్థిక మంత్రి ఊరట నిచ్చా రు. రూ. 400 కోట్ల వరకూ ఆదాయం ఉన్న కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం రూ. 250 కోట్లు ఆదాయం ఉన్న కంపెనీలకు ఈ ట్యాక్స్ విధిస్తుండగా.. దాని పరిమితిని రూ. 400 కోట్లకు పెంచారు. దాదాపు 99.3 శాతం కంపెనీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు మేకిన్ ఇండియాకు ప్రోత్సాహం దిశగా కొన్ని పెట్టుబడులు, ముడిసరుకులపై రాయితీలు ఇచ్చారు. అదేవిధంగా కొన్ని వస్తువులపై సుంకాలను పెంచారు. విద్యుత్‌పై నడిచే వాహనాలను ప్రోత్సహించేందుకు ఆ వాహనాల తయారీకి కావాల్సిన పరికరాలపై కస్ట మ్స్ సుంకాన్ని తగ్గించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనా ల్లో ఉపయోగించే కొన్ని విడిభాగాలపై కస్టమ్స్ సుం కాన్ని పూర్తిగా ఎత్తివేశారు. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి తీసుకున్న అప్పునకు సంబంధించిన వడ్డీపై అదనంగా రూ. 1.5 లక్షల ఆదాయపు పన్నును తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని, ఇది ఆరో అతిపెద్ద వ్యవస్థ అని సీతారామన్ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరాల్లో దీనిని 5 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలిసారి ఇల్లు కొంటే.. రైతులకు నగదు సహాయం పెంపుతో పాటు ఒక కొత్త పింఛన్ పథకం తీసుకొచ్చారు. చిన్న మొత్తంలో పన్నులు కట్టేవారికి ఉపశమనం కలిగించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70 వేల కోట్ల మూలధన నిధిని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. తొలిసారి రూ. 45 లక్షల లోపు ఇల్లు కొంటే వారికి రూ. 1.5 లక్షలను అదనంగా వడ్డీ చెల్లింపులో తగ్గించాలని ప్రతిపాదించారు. బడ్జెట్లో కొన్ని రక్షణ పరికరాలకు ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. ఇక నిధుల సేకరణ కోసం తొలి గ్లోబల్బాండ్ను ప్రభుత్వం విక్రయించనుంది. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ. 100 కోట్లు వెచ్చించనున్నామని ఆమె చెప్పారు. ఇది గ్రీన్ బడ్జెట్: ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రజానుకూల బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ బడ్జెట్ భవిష్యత్‌పై ఆశలు కల్పించేదిగా ఉందన్నా రు. శుక్రవారం మీడియాతో ప్రధాని మాట్లాడుతూ..‘ఈ బడ్జెట్‌తో దేశంలోని పేదలకు సాధికారత చేకూరుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తిని పెంపొందించేందుకు బడ్జెట్ దృష్టి సారించింది. ఇది గ్రీన్ బడ్జెట్. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు నిర్మాణాత్మక సంస్కరణపై రోడ్‌మ్యాప్ రూపొందించాం’ అన్నారు. ఎన్నడూ ఇలా జరగలేదు: చిదంబరం ఇది పసలేని బడ్జెట్. ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం అస్పష్టంగా సాగడం విడ్డూరం. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. దేశంలోని ఏ వర్గం వారికి కూడా బడ్జెట్ ద్వారా ఊరట కల్పించలేకపోయారు. వివిధ మంత్రిత్వ శాఖలకు, ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు లేవు. ఆదాయ వ్యయ వివరాలు, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు వంటి వాటిని వెల్లడించలేదు. -
ఈ–కామర్స్ @ మేడిన్ ఇండియా
భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు ఈ–కామర్స్ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్ కోసం చైనా, మలేసియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్ కొన్నాళ్లుగా మేడిన్ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గుచూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది. ‘‘రెండేళ్ల క్రితం దాకా దాదాపు 100 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చైనా నుంచే వచ్చేవి. ప్రస్తుతం ఇది 50 శాతానికన్నా తక్కువకి పడిపోయింది. ఇక మా ఫర్నిచర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తం శ్రేణిని మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇది 50 శాతం కన్నా తక్కువే ఉంది’’ అని ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లేబుల్ బిజినెస్ విభాగం హెడ్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మార్క్యూ, పర్ఫెక్ట్ హోమ్స్, బిలియన్, స్మార్ట్ బై మొదలైన ప్రైవేట్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. ఇవి కంపెనీ మొత్తం అమ్మకాల్లో 8 శాతం దాకా ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్స్, ఆండ్రాయిడ్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్స్, చిన్న స్థాయి ఉపకరణాలు మొదలైనవాటిని దేశీయంగా సోర్సింగ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 50–60 శాతం యాక్సెసరీలను కూడా భారత్ నుంచే సోర్సింగ్ చేస్తోంది. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజాలను భారత్‌లో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారస్తుల నిరసనలు.. స్మార్ట్‌ఫోన్స్ దిగుమతులపై భారీగా సుంకాల వడ్డన ఉండటంతో యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఐఫోన్స్ తదితర ఖరీదైన ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఫాక్స్‌కాన్, విస్ట్రన్ వంటి సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. అమెజాన్ కూడా చాలా మటుకు ప్రైవేట్ లేబుల్స్‌ను భారత్‌లోనే రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఏసీలు, మొబైల్‌ఫోన్ యాక్సెసరీలు, నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఆహారోత్పత్తులు తదితర ప్రైవేట్ లేబుల్స్ అమెజాన్‌కు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దాదాపు 150 ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తులు సేకరిస్తుండగా.. వీటిలో 100 ఫ్యాక్టరీలు భారత్‌కి చెందినవేనని సంస్థ ప్రైవేట్ లేబుల్ వ్యాపార విభాగం హెడ్ మీనన్ పేర్కొన్నా రు. అయితే, విలువపరంగా చైనా, మలేసియాతో పోలిస్తే భారత ఉత్పత్తుల వాటా ఎంత ఉంటోందనేది మాత్రం తెలపలేదు. ఇలా సొంత ప్రైవేట్ లేబుల్స్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రవేశపెడుతుండటాన్ని గత రెండేళ్లుగా చిన్న వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల వీటితో పోటీపడేందుకు తాము అసంబద్ధ స్థాయిలో ధరలను తగ్గించుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థలు సొంత ప్రైవేట్ లేబుల్స్ ఏర్పాటు చేసుకోకుండా నియంత్రిస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను కేంద్రం గతేడాది డిసెంబర్లో మార్చినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ వివరణనివ్వడంతో ప్రైవేట్ లేబుల్స్‌కు కొంత వెసులుబాటు లభిస్తోంది. చిన్న సంస్థలకు తోడ్పాటు.. ధరలపరంగానో నాణ్యతపరంగానో చాలా వ్యత్యాసాలు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే ప్రైవేటు లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నామని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నాయి. మరోవైపు, వాల్‌మార్ట్‌కి చెందిన పలు ప్రైవేట్ లేబుల్స్ కూడా భారత్‌లో తయారవుతున్నాయని, ఇది తయారీ భాగస్వామ్య సంస్థలకు తోడ్పాటుగా ఉంటోందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్రైవేట్ బ్రాండ్స్ వ్యాపారం ద్వారా ఇటు దేశీ తయారీ సంస్థలు, ఉత్పత్తిదారులు .. ముఖ్యంగా లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధికి, నవకల్పనల ఆవిష్కరణలకు మరింత మద్దతు లభిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. -
ఏరో ఇండియా 2019
-
‘రక్షణ’లో పెట్టుబడులకు స్వాగతం
సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం మరింత విజయవంతమయ్యేలా వైమానిక రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని సంస్థలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. బుధవారం బెంగళూరులోని యలహంక వాయుసేన స్థావరంలో ఐదురోజుల అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా, 2019’ను నిర్మల ప్రారంభించారు. రక్షణ రంగంలో పరికరాల తయారీ కోసం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు. ఇందులో 600 దేశీయ, 400 విదేశీ సంస్థలు పాల్గొన్నాయి. అత్యాధునిక యుద్ధ, పౌర విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించాయి. పాకిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధం ఉగ్రవాదులు దాడులతో భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని నిర్మల అన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధమే వస్తే అందుకు కూడా సైనికులు సిద్ధమేనని చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో యుద్ధ విమానాలు, ఆయుధాలు, రక్షణరంగ పరికరాలను కొనుగోలుకు సంబంధించి భారత రక్షణశాఖ రూ. 1,27,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందన్నారు. 2 వేల పౌర విమానాలు అవసరం ప్రతీ భారతీయుడికి విమాన సేవలను అందిం చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు విమానయాన మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దేశానికి 2000కుపైగా పౌర విమానాల అవసరముందన్నారు. దేశంలో 235 నగరాలకు విమానసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కోసం 65 బిలియన్ డాలర్లను ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాల అధిపతులు, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఉన్నతాధికారులు, వందలాది మంది సందర్శకులు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా రఫేల్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్ యుద్ధవిమానం ఎయిర్‌షోలో సందర్శకుల మనసు దోచుకుంది. మంగళ వారం సూర్యకిరణ్ విన్యాసవిమానాలు ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్, పైలట్ సాహిల్ గాంధీకి నివాళిగా తక్కువ ఎత్తులో, తలకిందులుగా ప్రయాణించింది. షోలో డకోటా విమానం, ధృవ్, హాక్, హెచ్‌టీటీ40 తదితర విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాలతో సందర్శకులు అలరించాయి. -
‘వందే భారత్’కి జై!
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించా రు. ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి వరకు ప్ర యాణికులకు సేవలు అందించనుంది. ‘వందే భారత్ రైలును రూపొందించిన డిజైనర్లు, ఇంజనీర్లకు చాలా కృతజ్ఞుడినై ఉంటాను. నాలుగున్నరేళ్లుగా చాలా కఠోర శ్రమతో, నిజాయితీతో రైల్వే వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రయత్నిం చాం’అని ప్రధాని పేర్కొన్నారు. ‘ఏక్ భారత్– శ్రేష్ట్ భారత్’స్ఫూర్తికి వందే భారత్ రైలు ప్రతినిధి అని పేర్కొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ఆధునీకరణలో, డీజిల్ కోచ్‌లను ఎలక్ట్రిక్ కోచ్‌లుగా మార్చడంలో, మేకిన్ ఇండియాలో భాగంగా కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడంలో రైల్వే ఎంతో కృషి చేసిందని కొనియాడారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పారు. రైల్వేలో 2014 నుంచి ఇప్పటివరకు 1.5 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందని అధికారులు తనతో చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుత భర్తీ నోటిఫికేషన్లతో ఈ సంఖ్య 2.25 లక్షలకు చేరుతుందని చెప్పారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 18 నెలల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. ఈ రైలులో రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు సభ్యులు తదితరులు ప్రయాణించారు. రైలు లోపల సౌకర్యాల గురించి మోదీ, పీయూష్ గోయెల్‌కు వివరిస్తున్న రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ 8 గంటల్లో వారణాసికి.. ఢిల్లీ నుంచి బయల్దేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసికి 8 గంటల్లో చేరుకుంటుంది. సాధారణ రైళ్లలో మాత్రం 11.5 గంటల సమయం పడుతుంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. వారంలో ఐదు రోజుల పాటు నడవనుంది. ఈ రైలు ఫిబ్రవరి 17 నుంచి ప్రయాణికులకు అం దుబాటులోకి రానుంది. ఇందులో 16 ఏసీ కోచ్ లు ఉన్నాయి. మొత్తం 1,128 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఆటోమేటిక్ తలుపులు ఏర్పాటు చేశారు. వైఫై సదుపాయం, జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం ఇలా అనేక అధునాతనమైన సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కాగా, వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఫిబ్రవరి 17న అన్ని టికెట్లు అమ్ముడైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారణాసి నుంచి ఢిల్లీకి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించేందుకు రూ.3,310, చైర్‌కార్‌లో రూ.1,760 టికెట్ ధర నిర్ణయించారు. -
ఏసీలు, ఫ్రిజ్‌లూ మేకిన్ ఇండియా!
ముంబై: మోదీ సర్కారు మేకిన్ ఇండియా నినాదం స్మార్ట్ఫోన్లు... టీవీల తయారీ రంగంలో బాగానే పనిచేస్తోంది. ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసేందుకు విదేశీ కంపెనీలన్నీ పెట్టుబడులకు ముం దుకొచ్చాయి. మరి ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు వంటి వైట్ గూడ్స్ ఉత్పత్తి కంపెనీలు కూడా మేకిన్ ఇండియాను తలకెత్తుకోవడానికి సిద్ధమయ్యాయి. ఒకపక్క, ఆయా ఉత్పత్తులు, సంబంధిత విడిభాగాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా దిగుమతి సుంకాలను వడ్డించడంతో పాటు ఇటీవల కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణించ డం కూడా విదేశీ వైట్ గూడ్స్ కంపెనీల మేకిన్ ఇండి యా రాగానికి బాటలు వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీలు ఏకంగా రూ.6,500 కోట్ల పెట్టుబడులను దేశీయంగా కుమ్మరించనుండటం దీనికి నిదర్శనం. సుంకాల మోత... మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో తయారీని ప్రోత్సహించి... తద్వారా ఇక్కడ మరింతగా ఉద్యోగాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. అయితే, ఇప్పటివరకూ ఈ జాబితాలో స్మార్ట్ఫోన్లు, టీవీలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం టీవీలు, స్మార్ట్‌ఫోన్ దిగుమతులపై దిగుమతి సుంకాలను 20 శాతానికి పెంచింది. వీటికి సంబంధించిన విడిభాగాలపై కూడా ఈ ఏడాది సుంకాన్ని పెంచడంతో తప్పనిసరిగా ఆయా కంపెనీలు మేకిన్ ఇండియాకు ఓకే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే పరిస్థితి వైట్ గూడ్స్ రంగంలోనూ పునరావృతం అవుతోంది. రూపాయి ఘోరంగా పతనం కావడంతో కొన్ని అత్యవసరం కాని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచడం తెలిసిందే. ఇందులో వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై సుంకాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెట్టింపు చేసి 20 శాతానికి చేర్చారు. అదేవిధంగా ఏసీలు, ఫ్రిజ్‌ల కంప్రెషర్లపైనా దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. దీంతో దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు 10% ఎగబాకాయి. దేశీయంగా వైట్‌గూడ్స్ పరిశ్రమ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,000 కోట్లుగా అంచనా. ఇది ఏటా 7–8% వృద్ధి చెందుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ దిగ్గజాల క్యూ.. వైట్ గూడ్స్‌కు సంబంధించి జర్మనీకి చెందిన బాష్, సీమెన్స్, టర్కీ కంపెనీ ఆర్సెలిక్, చైనా సంస్థ మైడియా, హేయర్, టీసీఎల్, జపాన్ కంపెనీ పానాసోనిక్ వంటివి భారత్‌లో కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు, ఉన్నవాటిని విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. వీటికి తోడు దేశీయ సంస్థలైన గోద్రెజ్, బీపీఎల్ కూడా పెట్టుబడి ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. షాంగై హిటాచీ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ... గుజరాత్లో కంప్రెషర్ యూనిట్‌ను విస్తరిస్తోంది. జపాన్ సంస్థ హిటాచీ, చైనా కంపెనీ షాంగై హైలీ గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కంపెనీ ఇది. చైనాకు చెందిన గ్వాంగ్డాంగ్ మీజి కంప్రెషర్ కంపెనీ కూడా కొత్త ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. కూలింగ్ యూనిట్లలో ఉపయోగించే పరికరాలను ఇది తయారు చేయనుంది. కాగా, కంపెనీలు ప్రారంభ, మధ్య స్థాయి వైట్ గూడ్స్ ఉత్పత్తులను మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నాయి. ప్రీమియం మోడళ్లతోపాటు సంక్లిష్లమైన విడిభాగాల(హీట్ ఎక్సే్ఛంజ్ కాయిల్స్, కంప్రెషర్స్ వంటివి) విషయంలో మాత్రం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఎయిర్ కండిషర్లలో అయితే, ఏకంగా 50% విడిభాగాలు దిగుమతి చేసుకున్నవే ఉంటున్నాయి. కాగా, రానున్న కాలంలో మరింతగా దిగుమతి సుంకాలు పెరగవచ్చని.. దీంతో ఇక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఉత్తమం అని కంపెనీలు భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు. ‘అంతేకాకుండా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదాని కంటే స్థానికంగా తయారు చేస్తేనే ఉత్పాదక వ్యయం తగ్గుతుందని చాలా కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ తక్కువ వేతనాలకే కార్మికులు లభిస్తారు. దిగుమతులకు భారీగా రవాణా చార్జీలు చెల్లించక్కర్లేదు కూడా. డాలరుతో రూపాయి విలువ పతనం కూడా దిగుమతులకు భారంగా పరిణమిస్తోంది’ అని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వ్యాఖ్యానించారు. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమా) ప్రెసిడెంట్ కూడా ఆయన. జోరుగా పెట్టుబడులు... ‘తాజాగా కేంద్రం సుంకాలను పెంచడంతో మేం స్థానికంగా తయారీపై పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే కష్టమే’ అని బీఎస్‌హెచ్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ ఎండీ గుంజన్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్‌లో బాష్, సీమెన్స్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. చెన్నైకి సమీపంలోని ఫ్యాక్టరీలో బీఎస్‌హెచ్ ఇటీవలే వాషింగ్ మెషీన్ల తయారీని ప్రారంభించింది. ఇక్కడే రూ.800 కోట్ల పెట్టుబడితో ఫ్రిజ్‌ల ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. ∙చైనాకు చెందిన మైడియా గ్రూప్ ఇటీవలే రూ.1,350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో సగం కంప్రెషర్ల తయారీ కోసం వెచ్చించనుంది. చైనా వెలుపల తమకు ఇదే అతిపెద్ద పెట్టుబడి అని కంపెనీ ఇండియా ఎండీ క్రిషన్ సచ్దేవ్ తెలిపారు. ∙చైనాలో అతిపెద్ద అప్లయెన్సెస్ తయారీ సంస్థ హేయర్ కూడా నోయిడాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,000 కోట్ల పెట్టుబడులను ఖరారు చేసింది. పుణేలో ఈ సంస్థ యూనిట్‌తో పోలిస్తే ఈ పెట్టుబడి మూడింతలు ఎక్కువ కావడం విశేషం. నోయిడా ప్లాంట్‌లో విడిభాగాలతో పాటు ప్రీమియం మోడళ్లను ఉత్ప త్తి చేస్తామని హేయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. ∙తాము స్థానికంగా ఏసీ కంప్రెషర్లు ఇతరత్రా విడిభాగాల తయారీ కోసం సప్లయర్లతో చర్చలు జరుపుతున్నట్లు జపాన్ దిగ్గజం పానాసోనిక్ ఇండియా సీఈఓ మనీష్ శర్మ వెల్లడించారు. ∙ఇక మరో చైనా ఎలక్ట్రానిక్స్ అగ్రగామి టీసీఎల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద నెలకొల్పుతున్న రూ.2,000 కోట్ల ప్లాంట్‌లో వైట్ గూడ్స్, విడిభాగాల తయారీని వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక్కడ టీవీలను కూడా తయారు చేస్తామని కంపెనీ ఇండియా హెడ్ మైక్ చెన్ చెప్పారు. ∙టర్కీ కంపెనీ ఆర్సెలిక్ టాటా కంపెనీ వోల్టాస్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్లో తయారీ ప్లాంట్ కోసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. -
శాంసంగ్ కీలక నిర్ణయం : టీవీల తయారీ క్లోజ్
చెన్నై : ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఇటీవలే నోయిడాలో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌ను ఆవిష్కరించిన కొన్ని నెలల్లోనే శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో టీవీల ఉత్పత్తిని ఆపివేయాలని శాంసంగ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో ఉన్న తన ఒకేఒక్క టీవీల ఉత్పత్తి సౌకర్యాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని శాంసంగ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి. దీంతో వియత్నాం నుంచి టీవీలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాలని యోచిస్తోందని రిపోర్టులు తెలిపాయి. వియత్నాంలో ఉన్న టీవీల ఉత్పత్తి సౌకర్యం శాంసంగ్ అత్యంత పెద్ద ప్రొడక్షన్ హబ్. ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ స్థానికంగా ఉన్న సప్లయర్స్‌ను అలర్ట్ చేసినట్టు తెలిసింది. చెన్నైలో ఉన్న టీవీల తయారీ ప్లాంట్ ఏడాదికి 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేది. అయితే శాంసంగ్ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్‌ను మన దేశంలో ఏర్పాటు చేయడంతో, మేకిన్ ఇండియాకు బిగ్ బూస్ట్ వచ్చింది. కానీ కొన్ని నెలల్లోనే శాంసంగ్ మరో కీలక నిర్ణయం తీసుకుని, మేకిన్ ఇండియాకు షాకిచ్చింది. టీవీ ప్యానల్స్‌ను తయారు చేయడంలో ఉపయోగపడే పరికరాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో, శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. అయితే టీవీల ఉత్పత్తిని శాంసంగ్ ఆపివేస్తుందని వస్తున్న రిపోర్టులపై ఆ కంపెనీ ప్రతినిధి స్పందించారు. దేశీయంగా తయారు చేసేందుకే తాము కట్టుబడి ఉన్నామని, టీవీల యూనిట్ల ప్రొడక్షన్‌ను తరలించే ప్లాన్లపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. -
త్వరలో పట్టాలపైకి స్మార్ట్‌కోచ్
రైలు ప్రయాణాన్ని మరింత సుఖవంతం, సురక్షితం చేయడం కోసం భారతీయ రైల్వే త్వరలో ‘స్మార్ట్ కోచ్’లను ప్రవేశపెట్టనుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రాయబరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ స్మార్ట్ కోచ్‌లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన 100 స్మార్ట్ బోగీలను త్వరలోనే పట్టాలపైకి ఎక్కించనున్నారు. నమూనా బోగీనొకదాన్ని తయారు చేశారు కూడా. స్మార్ట్‌కోచ్ ప్రత్యేకతలేంటంటే... నిఘా కెమెరాలు: ప్రతి బోగీలో 6 సీసీ కెమెరాలుంటాయి. అవి బోగీలో పరిస్థితిని అనుక్షణం రికార్డు చేస్తాయి. కంట్రోల్ సెంటర్లో ఈ రికార్డింగులను పరిశీలిస్తారు. వాటర్ లెవల్ ఇండికేటర్: రైలు కంపార్ట్మెంట్లలో నీళ్లు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది దీని ద్వారా పరిశీలిస్తారు. సగానికంటే తక్కువ నీళ్లు ఉన్నట్టు తేలితే తర్వాత వచ్చే వాటరింగ్ స్టేషన్‌కు సమాచారం వెళ్తుంది. వచ్చే స్టేషన్లో నీళ్లు నింపుతారు. డిజిటల్ డెస్టినేషన్ బోర్డు: రైలు వేగం, రాబోయే స్టేషను పేరు, అది ఎంత దూరంలో ఉంది. ఎప్పటిలోగా ఆ స్టేషన్‌ను చేరుకోవచ్చు, ఆలస్యం ఏమైనా ఉందా.. అన్న వివరాలను ప్రయాణికులకు తెలియజేస్తారు. ముందుగా రికార్డు చేసిన ఈ సమాచారాన్ని జీపీఎస్ ద్వారా వెల్లడిస్తారు. వైఫై: బోగీలో ఏర్పాటు చేసే వైఫై ద్వారా ప్రయాణికులు తమ సెల్ఫోన్లో సినిమాలు, వీడియోలు వీక్షించవచ్చు. పాటలు వినొచ్చు. వీడియో గేములు ఆడుకోవచ్చు. తమ ప్రయాణ అప్డేట్స్ కూడా తెల్సుకోవచ్చు. రెండో తరం స్మార్ట్ కోచ్‌లలో బోగీలలో గాలి నాణ్యతను కొలిచే, స్వచ్ఛమైన గాలిని పంపే వ్యవస్థలు, ఫేస్ డిటెక్షన్, ఫైర్–స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు. అనుకోని ప్రమాదాలు జరిగితే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లున్నాయి. టాయ్లెట్లలో ఎవరైనా ఉన్నారో లేదో తెల్సుకోవడానికి, ఫిర్యాదు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందుబాటులోకి తేనున్నారు. కోచ్ డయాగ్నస్టిక్ సిస్టమ్ రైలు చక్రాలు, బేరింగ్లు, పట్టాల పరి స్థితిని ఈ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సెన్సార్ మానిటర్లతో సేకరించే ఈ సమాచారాన్ని జీపీఎస్/జీపీఆర్‌ఎస్‌ల ద్వారా కేంద్రీయ సర్వర్‌కు పంపుతారు.అక్కడి నిపుణులు సమాచారాన్ని విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటారు. -
స్వదేశీ టెక్నాలజీకే ఓటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దేశ రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం వాడకాన్ని మరింతగా పెంచడంతో పాటు దేశీయంగా పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇస్తామని డీఆర్డీఓ కొత్త చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. మన సాంకేతిక పరిజ్ఞానంతోనే సైన్యానికి కావాల్సిన పరికరాల్ని సమర్ధంగా తయారు చేయడమే ప్రధాన ఎజెండా అని, ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. డీఆర్డీఓ చైర్మన్‌గా తన ప్రాధాన్యతలు, దేశానికి తనవంతు చేయాల్సిన కర్తవ్యాలను, క్షిపణి రంగం స్థితిగతులు తదితర అంశాలపై ఆయ న ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. భవిష్యత్ భారత్ కోసం.. మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో ముందుకు సాగుతోంది. దానికి అనుగుణంగా అన్ని రంగాల్లో దేశీయ పరిజ్ఞానంతో వస్తు ఉత్పత్తులు జరగాలనేది ప్రభుత్వ సంకల్పం. దేశ రక్షణ రంగంలోనూ ఆ దిశగా సాగడమే నా ముందున్న ప్రధాన బాధ్యత. రానున్న కాలంలో స్వదేశీ ప్రయోగాల ద్వారా దేశ సైన్యానికి కావాల్సిన అన్ని పరికరాలను తయారు చేయటంలో డీఆర్డీఓ కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా దేశ సైన్యాన్ని సర్వం సన్నద్ధంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంగా డీఆర్డీఓ పనిచేయనుంది. ప్రస్తుతం భారత సైన్యం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీనిని తగ్గించి మన కాళ్లపైన మనం నిలబడే స్థాయికి ఎదిగే దిశగా దేశంలో పలు ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించి కొత్త పరికరాలను, పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తాం. క్షిపణి ప్రయోగాల్లో అగ్రగామిగా... క్షిపణి ప్రయోగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 30 ఏళ్ల నుంచి చేసిన పరిశోధనలు, కృషి వల్లే అది సాధ్యమైంది. మరింత స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. ఇప్పటికే ఆగ్ని, ఆకాష్, తిశ్రూల్ ఇలా అనేక ప్రయోగాలు విజయవంతంగా చేపట్టాం. భవిష్యత్‌లో క్షిపణి రంగంలో దిగుమతుల అవసరం లేకుండా చూస్తాం. క్షిపణి, రక్షణ రంగంలో అగ్రదేశాలకు ధీటుగా పోటీపడుతున్నాం. దేశం కోసం పని చేయడమే ప్రాధాన్యం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రక్షణ రంగంలో వెనుకంజలో ఉన్న విభాగాలపై పూర్తిగా దృష్టి పెట్టి.. వాటికి ప్రాధాన్యం ఇస్తాం. రక్షణ రంగంలో దేశాన్ని సమున్నత స్థాయిలో ఉంచడమే నా లక్ష్యం. దేశం కోసం పనిచేయడానికే నా ప్రథమ ప్రాధాన్యత. స్టారప్ట్లను బలోపేతం చేసి వారికి సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమ రంగంలోనూ అభివృద్ధికి సహకరించి వారి భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం. విద్యా సంస్థల్లో పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తాం. -
ఈ ప్రభుత్వం ఎంతపనికి మాలినదంటే
తమిళసినిమా: పెద్ద నోట్ల రద్దు తరువాత సినిమా నాశనం, వ్యవసాయం నాశనం. అంతా నాశనం ఇదేనా కేంద్రప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా పథకమా అంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ ఆవేశంగా ప్రశ్నించారు. ఇంతకు ముందు గ్యాస్ పథకం ద్వారా వ్యవసాయానికి, రైతులకు కలిగే నష్టం గురించి చర్చించిన తెరు నాయ్‌గళ్ చిత్రాన్ని నిర్మించిన ఐ క్రియేషన్స్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం పడిత్తవుడన్ కిళిత్తు విడవుమ్. తెరు నాయ్‌గళ్ చిత్ర దర్శకుడు హరి ఉత్రనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ సాధారణంగా తానే ఏ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నా చిత్రం బాగుంది, పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి లాంటివి మాట్లాడనన్నారు. అయితే ఈ చిత్ర టైటిల్ చూడగానే చిత్ర యూనిట్ ధైర్యాన్ని తెలుపుతుందన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు పథకానికి ముందు తమిళసినిమానే కాకుండా దక్షిణాది సినిమా బాగుందన్నారు. నోట్ల రద్దు తరువాత 500 మంచి చిన్న నిర్మాతలు కనిపించకుండా పోయారన్నారు. అదే విధంగా జంతు సంరక్షణ అనే సమాఖ్య ఏ జంతువుతోనూ సినిమా తీయకుండా చేస్తోందన్నారు. ఒక చిత్ర ప్రమోషన్ కోసం ఆడియో ఆవిష్కరణ, టీజర్ విడుదల వంటి కార్యక్రమాలు నిర్వహించి చిత్రంలో ఆసక్తికరమైన విషయాలను తెలిపి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకుంటున్నామన్నారు. అలాంటిది సడన్‌గా 8 రోడ్డు పథకాన్ని ప్రారంభిస్తున్నామంటోంది ప్రభుత్వం అని అన్నారు. దాన్ని ఎవరు అడిగారు? దాని అవసరం ఏమిటి? అందువల్ల ఎవరికి ఉపాధి కలుగుతుంది. ఎవరికి ప్రయెజనం? వంటివి వివరించాలిగా అన్నారు. సినిమాకు ప్రేక్షకులను రప్పించుకునే విధంగా ప్రభుత్వం 8 రోడ్ల పథక నిర్మాణం గురించి ఎందుకు వివరించడం లేదూ అని ప్రశ్నించారు. దీనికి బదులివ్వని ఈ ప్రభుత్వం ఎంతపనికి మాలినదంటే రూ.10 వేలకోట్లు వస్తుందని గ్రీన్‌వేస్ పథకం కోసం ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. కైవై, చిరువాణిల నీటిని ప్రయివేట్ సంస్థలకు అమ్ముకోవాలని ప్రయత్నిస్తోందన్నారు.ఆ తరువాత గాలి, ఆక్సిజన్ కూడా అమ్ముకుంటుందని అన్నారు. ఆపై తల్లి పాలను లీటర్ల లెక్కన పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తుందని దుయ్యపట్టారు. తమిళన్ మెలకువతో ఉండగానే అతని ప్యాంటును ఊడదీయాలని చూస్తోందన్నారు. తమిళుడంటే అంత అలుసైపోయ్యిందన్నారు. ప్రశ్నిస్తే ఇదంతా కేంద్రప్రభుత్వ పథకం అని అంటున్నారన్నారు. అప్పుడు నువ్వు ఉన్నదెందుకు ఉల్లిపాయలు అమ్ముకోవడానికా? వెంట్రుకలు పీక్కోవడానికా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రూ.7 లక్షల కోట్లలో ఏం ఖర్చు చేశారు? అందులో 5 పైసలు సాధారణ ప్రజలకు అందిందా? సినిమా నాశనం, వ్యవసాయం నాశనం. అంతా నాశనం ఇదేనా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా పథకమా? అంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రశ్నించారు. -
విజయాలు కూడా వెక్కిరిస్తాయి!
నాలుగేళ్లలో నలుగురు రక్షణ మంత్రులను దేశం చూసింది. మన మాజీ సైనికుల పింఛను బడ్జెట్ వచ్చే రెండేళ్లలో జీతాల బడ్జెట్‌ను మించిపోనున్నది. ఈ రెండూ కేపిటల్ బడ్జెట్‌ను దాటిపోయే విధంగా ఉన్నాయి. కానీ మన సైనిక శక్తి కాలదోషం పట్టిందే తప్ప, శక్తివంతమైనదీ, వ్యూహాత్మకమైనదీ కాదు. చైనా వారు సంవత్సరానికి మూడు యుద్ధనౌకలను తయారుచేస్తున్నారు. అయితే మనం మూడేళ్లలో ఒకటి నిర్మించుకోవడానికే కష్టపడుతున్నాం. అందులో క్షిపణులు, సెన్సార్ల అమరికకు మరో రెండేళ్లు పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ప్రైవేట్ రంగం అంటూ హడావిడి చేసిన తరువాత మనం సాధించినదేమిటో అర్థం కాకుండా ఉండిపోయింది. భారత్ విదేశ వ్యవహారాల, వ్యూహాత్మక వాతావరణ పరిస్థితిని చూస్తూ ఉంటే రైలు ప్రమాదాన్ని తలపిస్తున్నది. ఇది అమెరికా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి మాదిరిగా స్వొత్కర్షతో టు ప్లస్ టు చర్చలను మూడోసారి వాయిదా వేయడం వంటిది కాదు. భారత్ విదేశీ వ్యవహారాల పరిస్థితి ఒక సంవత్సరం క్రితం మనం చూసిన చిత్రానికీ ఇప్పటి దృశ్యానికీ అసలు పోలికే లేదు. అప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశ రాజధాని నుంచి ఇంకో దేశ రాజధానికి ఉరుకుతూ ఆయా దేశాల నేతలను ఆలింగనం చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు భారత్ వేగంగా ఎదుగుతున్న శక్తి. మోదీ అంటే భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న శక్తిమంతమైన, కలుపుగోలుతనం కలిగిన, అవిశ్రాం తంగా శ్రమపడగలిగిన నాయకుడు. అంతర్జాతీయ రాజకీయ రంగంలో ఒక తార. పారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో తన నిర్ణయాత్మక, సానుకూల జోక్యంతో ఆయన ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే ఇందుకు మంచి ఉదాహరణ. ఈ అభిప్రాయమంతా గడచిన ఆరు మాసాలలో చెదిరిపోయింది. సున్నితమైన, స్థిరమైన భారత్ ఎదుగుదల మాదిరి గానే మన మీద ఉన్న అంతర్జాతీయ దృష్టి కూడా అవమానకరంగా అధోముఖం పట్టింది. మోదీ మద్దతుదారులు దీనికి నిరసన ప్రకటిస్తారు. కానీ పక్షపాత ధోరణి కలిగిన రాజకీయులు మతిలేనివారిగా ఉండిపోతే, శక్తిమంతమైన వ్యవస్థ అన్న స్థాయిని ఊహించుకుంటున్న దేశం వాస్తవాలను గమనించలేదు. పెద్ద ప్రయాణం ఇలా క్రమంగా ఎందుకు బలహీనపడిందో మనం పరీక్షిం చాలి. కొన్ని వాస్తవాలు మాత్రం భారత్ అదుపు చేయగలిగిన స్థితిలో లేవు. అందులో డొనాల్డ్ ట్రంప్ ఆవిర్భావం ఒకటి. అదే సమయంలో ఇటీవల చొరవ తీసుకుని మరీ చేసినట్టు ఉన్న కొన్ని ఘోర తప్పిదాలు భారత అంతర్జాతీయ సంబంధాలను మానవ తప్పిదాలన్నట్టు చూపుతున్నాయి. నాయకులు తాము ఎంచుకున్న విధానాన్ని దౌత్యంలో ప్రవేశపెడతారు. మోదీ దౌత్య విధానం లావాదేవీలతో కూడినదన్న వాస్తవాన్ని సౌత్ బ్లాక్‌లోని ఆయన ఔత్సాహికులు పండుగలా జరుపుకుంటూ ఉంటారు. ఈ విధానానికి బీజేపీ ఆమోదం ఉంది. అలాగే బీజేపీకి అనుకూలంగా ఉండే అంతర్జాతీయ సంస్థలలోని బృందాలలో కూడా దానికి అనుకూలత ఉంది. అయితే ఏ కొద్దిమంది విషయంలో తప్ప మిగిలిన వారందరికీ నేడు దాని ఎడల నమ్మకం లేదు. మోదీ మొదటి మూడేళ్ల పాలనలో గొప్ప దౌత్య విజయాలంటూ ఒకదాని తరువాత ఒకటిగా విజయోత్సవాలు జరుపుకోవడం దీని ఫలి తమే. బాధ్యత కలిగిన శక్తులుగా మూడు అంతర్జాతీయ క్షిపణి అణు సాంకేతిక వ్యవస్థలను భారత్ అంగీకరించింది. ఉపఖండంలో అమెరికా విధానం పూర్తిగా ఎటూ మొగ్గని రీతిలోనే ఉంది. వ్యూహాత్మక బంధాలే వాస్తవికంగా కనిపిస్తున్నాయి. బిల్ క్లింటన్ రెండో దఫా పదవీకాలం నుంచి భారత్ విదేశీ వ్యవహారాలు మెరుగుపడడం మొదలైంది. విధానాల కొనసాగింపు, ఆర్థికవృద్ధి దిశలను నిర్దేశించాయి. మోదీ తన శక్తితో, వ్యక్తిగత శైలిలతో, పూర్తి మెజారిటీ ఉండడంతో దీనిని మరింతగా విస్తరించారు. అయితే రైలును పట్టాలు తప్పించినదేమిటి? అంతర్జాతీయంగా రెండు ప్రతికూలతలు సంభవించినా అవి మోదీ ప్రభుత్వ తప్పిదాల వల్లకాదు. అవి– అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎదుగుదల, చైనా కొత్త ప్రకటన. ట్రంప్ చర్యలు, మరీ ముఖ్యంగా ఇరాన్ సంబంధాలలో మార్పు దరిమిలా చమురు ధరలు పెరగడానికి ప్రత్యక్షంగా దోహదం చేశాయి. ఇదే భారత్ దేశీయ ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను అనిశ్చిత స్థితిలోకి నెట్టివేశాయి. భారత్ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా చైనా–పాకిస్తాన్ ఆర్థిక నడవా పథకాన్ని డ్రాగన్ ముందుకు తోస్తున్నది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులలో, బంగ్లాదేశ్‌లో చైనా వేస్తున్న అడుగులు కూడా మరొక అంశం. అంటే ఉపఖండంలో భారత్‌కు ఉన్న పూర్వ వైభవాన్ని యథాతథంగా కొనసాగించడానికి చైనా అనుకూలంగా లేదన్న సంగతి కూడా వాటితో స్పష్టమవుతుంది. అణు సరఫరాదారుల బృందం నుంచి భారత్‌ను తప్పించవలసిందంటూ జార్జి డబ్లు్య బుష్ ఫోన్ లోనే హు జింటావోను ఆదేశించిన రోజులు కావు ఇవి. ప్రస్తుత అధ్యక్షుడు జింగ్పింగ్ అలాంటి మాటలు వినడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే అలా ఫోన్లో చెప్పే పనికి ట్రంప్ కూడా పూనుకోడు. ఎందుకంటే, మోదీ లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తారు. ట్రంప్ వాటికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మోదీ ప్రభుత్వం పాల్పడిన దారుణమైన తప్పిదం ఒకటి ఉంది. అది– దేశీయ రాజకీయాల కోసం సున్నితమైన అంతర్జాతీయ సంబంధాలను ఉపయోగించుకోవడం. చరిత్రలో విజయవంతమైన నాయకులుగా చలామణీ అయినవారికి ఉన్న మొదటి లక్షణం వ్యూహాత్మక సహనం. వ్యూహాత్మక బంధాలను నిర్మించే క్రమంలో మంచి నాయకులు సునీల్ గావస్కర్ వలే బ్యాటింగ్ చేస్తారు గానీ వీరేంద్ర సెహ్వాగ్ వలె కాదు. కీలకమైన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అన్నింటి ప్రచార కార్యక్రమంలోను మోదీ విదేశాంగ విధానంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. అది విజయానికి ఉపయోగపడింది కూడా. కానీ దౌత్య విజయాల గురించి వెను వెంటనే వెల్లడించడం వల్ల ప్రమాదం ఉంది. మీకున్న వ్యూహాత్మక అవకాశాలు దానితో సన్నగిల్లిపోతాయి. ఇలాంటి వాటి విషయంలో ఇందిరాగాంధీ మూడో కంటికి తెలియనిచ్చేవారు కాదు. అలా అని ఆమె మూర్ఖురాలు కాదు. రాజకీయాలు తెలియనివారు కూడా కాదు. తక్షణ రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి వ్యూహాత్మక చర్యలను ఉపయోగించుకుంటే, ఆ విషయంలో ముందుకు వెళ్లడానికి మనకున్న మార్గాలు మూసుకుపోతాయి. ఇంకా దారుణమేమిటంటే– వాటి గురించి మీ శత్రువులకు అవగాహన పెరుగుతుంది. డోక్లాంతో, తరువాత జరిగిన పరిణామాలతో చైనా ఒక విషయం స్పష్టం చేసింది. భారత సైనిక పాటవానికి తాము భయపడేది లేదని ప్రకటించింది. ఇప్పుడు పాకిస్తాన్ చైనా నీడకు చేరింది. గడచిన నవంబర్ 13న మనీలాలో మోదీ, ట్రంప్ సమావేశ వ్యవహారం కూడా దౌత్య వర్గాలలో ఏమాత్రం దాగకుండా బయట ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ సమావేశంలో ట్రంప్ హావభావాలు, ప్రవర్తన గతంలో మాదిరిగా లేవు. ఆనాటి మర్యాద లేదు. మోదీని అనుకరిస్తూ ట్రంప్ మాట్లాడినట్టు ఉన్న వీడియో బయటపడడంతో మోదీ పట్ల అతడికి ఉన్న అమర్యాద కూడా బయటపడింది. ఆ తరువాతే భారత వాణిజ్య ప్రయోజనాల మీద ట్రంప్ దెబ్బ కొట్టారు. అదే సమయంలో వీసాల విషయంలో బ్రిటన్ కూడా దెబ్బ కొట్టింది. ఇండియా పాస్‌పోర్టుకు విలువ పెరిగిందంటూ చెబుతున్న మాట ఈ పరిణామాలతో భంగపడినట్టు ఉంటుంది. నాలుగేళ్లలో నలుగురు రక్షణ మంత్రులను దేశం చూసింది. మన మాజీ సైనికుల పింఛను బడ్జెట్ వచ్చే రెండేళ్లలో జీతాల బడ్జెట్‌ను మించి పోనున్నది. ఈ రెండూ కేపిటల్ బడ్జెట్‌ను దాటి పోయే విధంగా ఉన్నాయి. కానీ మన సైనిక శక్తి కాలదోషం పట్టినది తప్ప, శక్తివంతమైనదీ, వ్యూహాత్మకమైనదీ కాదు. చైనా వారు సంవత్సరానికి మూడు యుద్ధనౌకలను తయారుచేస్తున్నారు. అయితే మనం మూడేళ్లలో ఒకటి నిర్మించుకోవడానికే కష్టపడుతున్నాం. అందులో క్షిపణులు, సెన్సార్ల అమరికకు మరో రెండేళ్లు పడుతోంది. మేక్ ఇన్ ఇండియా, ప్రైవేట్ రంగం అంటూ హడావిడి చేసిన తరువాత మనం సాధించినదేమిటో అర్థం కాకుండా ఉండిపోయింది. నేనిలా అంటున్నందుకు మీరు నన్ను ఉరిమి చూడవచ్చు. కానీ ఇది ప్రపంచం మొత్తానికీ తెలుసు.సైనిక శక్తి పతనం అనేది ఆర్థిక వ్యవస్థ క్షీణతతో ముడిపడి ఉంటుంది. మీ స్థూల దేశీయోత్పత్తి –జీడీపీ–ని లెక్కించే పద్ధతిని మార్పు చేయడం ద్వారా మీరు మీ ప్రజలను సులువుగా ఏమార్చవచ్చు. దాన్ని విశ్వసించడం మీరు ప్రారంభించినప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. భారత్ వికాసం గురించి, మన విజ్ఞానాన్ని, దిశను యావత్ ప్రపంచమే ఎలా అబ్బురంగా తిలకిస్తోంది అనేదాని గురించి, క్రిస్మస్ పండుగకు పోటీగా యోగా దినోత్సవం ప్రస్తుతం భారత ఆధ్యాత్మికతా శక్తిని స్ఫురించే అంతర్జాతీయ వేడుకగా ఎలా మారింది అనే అంశం గురించి నిరంతరాయంగా చర్చిస్తున్నారు. ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్ ఇటీవలే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సమక్షంలో చేసిన అలాంటి ఒక ప్రసంగాన్ని చూడండి. భారత్ విశ్వగురువుగా మారే క్రమంలో ఉందని విజయగర్వంతో ప్రకటించారు కూడా. అలాంటప్పుడు అన్ని కాలాల్లోనూ మన ఉత్తమమైన మిత్రదేశం అమెరికాతో మన సంబంధాలు ఎందుకు దిగజారుతున్నట్లు? బంగ్లాదేశ్ మినహాయిస్తే చైనా కౌగిలిలో ఉన్న మన పొరుగుదేశాలన్ని మనతో శత్రువైఖరితో, అనుమానాస్పదంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? ఈ విశ్వగురు దేశానికి చెందిన ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంత అనాగరికంగా ఎలా వ్యవహరిస్తారు? ట్రంప్ పాలనాయంత్రాంగంలో అసాధారణ వ్యక్తిగా ఉన్న నిక్కీ హేలీ నేరుగా భారత్‌కి వచ్చి ఇరాన్‌తో మన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలని ఎలా ఆదేశి స్తారు? అలాగే చైనా అధ్యక్షుడు గ్జిని కలిసినప్పుడు మన మోదీ శరీరభాష పూర్తిగా ఎందుకు మారిపోయినట్లు? పాక్ అక్రమిత కశ్మీర్‌లోని భారతీయ భూభాగం గుండా సిపిఇసి రహదారిని నిర్మిస్తుండటంపై మన నాయకులు నిరనస తెలిపి ఎంతకాలమైంది?అందుకే ఊపిరి సలపకుండా మనం చేసుకుంటున్న వేడుకలకు మంగళం పాడాల్సిన సమయం ఇదే మరి. ఇప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకుని వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకుని అంతర్మథనం చేసుకోవడమే ఉత్తమం. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
ప్రధాని మోదీ ఫోన్ ‘మేడిన్ చైనా’ ది..
మండ్సోర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మేకిన్ ఇండియా'ను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ దేశంలో మోదీ మాత్రం ఉద్యోగాలు సృష్టించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీకి చెందిన టాప్ బాస్, సంపన్న వ్యాపారవేత్తలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారని విమర్శించారు. ‘ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎక్కడికి పోయాయి? రైతులకు ఇచ్చిన ఆర్థిక భద్రత హామీ ఎక్కడ? మేకిన్ ఇండియా పరిస్థితి ఏమిటి? ఒకవేళ మీరు ప్రధాని మోదీ ఫోన్ చూస్తే, అది మేడిన్ చైనాదిగా గుర్తించవచ్చు’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ కాంగ్రెస్‌కు అధికారంలోకి వస్తే, మండ్సోర్లోనే ఆ ఫోన్లను తయారీ చేయిస్తామని చెప్పారు. శివ్‌రాజ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను నిరోధించడం లేదన్నారు. ఇక్కడ రైతుల సమావేశంలో మాట్లాడిన రాహుల్, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చే ఒకే ఒక్క పార్టీ తమదేనని, వ్యవసాయ రంగానికి భద్రతనూ కల్పిస్తామని పేర్కొన్నారు. చైనాతో నెలకొన్న డోక్లామ్ వివాదంపై ప్రధాని ఎందుకు ఏం మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కోట్ల కొద్దీ రూపాయలు బ్యాంకు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి, విజయ్‌మాల్యాలకు దేశం విడిచి పారిపోవడానికి అవకాశం కల్పించారని, వారి వల్ల రైతులు ఎంతగా బాధ పడాల్సి వస్తుందో తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ పలు వాగ్దానాలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపిస్తే, 10 రోజుల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని గ్యారెంటీ ఇచ్చారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కంటే, తమ పార్టీ ప్రజల మన్ కీ బాత్‌నే ఎక్కువగా విశ్వసిస్తుందన్నారు. -
భారీ డీల్‌పై భిన్న స్పందనలు
న్యూఢిల్లీ : దేశంలో మునుపెన్నడూ ఎరుగని భారీ విదేశీ డీల్‌కు బుధవారం తెరలేసిన సంగతి తెలిసిందే. అమెరికా రిటైల్ అగ్రగామి.. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను తన చేజిక్కించేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తూ... ఆ కంపెనీని తన సొంతం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ డీల్‌పై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ దేశీయ స్టార్టప్‌ల విజయానికి ప్రతీకగా మార్కెట్ విశ్లేషకులంటుంటే.. ఈ డీల్ పూర్తిగా ‘అనైతికం’ అని, దేశ ప్రయోజనాలను ఇది దెబ్బతీస్తుందని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగ్రన్ మంచ్(ఎస్జేఎం) ఆరోపిస్తోంది. ఈ డీల్ భారత ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని చంపేస్తుందని హెచ్చరిస్తూ... ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్జేఎం లేఖ రాసింది. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన లేఖలో, ఈ డీల్ దేశీయ వ్యవస్థాపకతను, ఉద్యోగవకాశాల సృష్టిని హరింపజేస్తాయని, ఇది పూర్తిగా వ్యవసాయదారులకు వ్యతిరేకమని ఆరోపించింది. భారత మార్కెట్‌పై దాడి చేయడానికి వాల్‌మార్ట్ ఈ-కామర్స్ మార్గాన్ని ఎంచుకున్నట్టు పేర్కొంది. చాలా బరువెక్కిన హృదయంతో ఈ లేఖను తమకు రాస్తున్నామని, వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎస్జేఎం కోరింది. దేశీయ కంపెనీలు తమ సంస్థలను అతిపెద్ద బహుళ జాతీయ సంస్థలకు విక్రయించేస్తున్నాయని, ఇది తమ దేశీయ మార్కెట్‌కు చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ డీల్స్ మార్కెట్లో పలు రకాల అంతరాయాలకు పురిగొల్పి, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను, చిన్న చిన్న దుకాణాలను అసలకే లేకుండా చేస్తుందని ఎస్జేఎం తన అంచనాలను వెలువరించింది. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని, కింది స్థాయి వ్యాపారాలను కాపాడతారని ఆశిస్తున్నామని పేర్కొంది. చైనీస్ ఉత్పత్తులను దిగుమతి చేయడంలో వాల్‌మార్ట్ ప్రపంచంలో టాప్-7 దేశంగా ఉందని... ఇది చైనా ఉత్పత్తులను మన దేశంలోకి ప్రవేశపెట్టి, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను దెబ్బతీసి మేకిన్ ఇండియా కలను హరింపజేస్తుందని ఎస్జేఎం ఆరోపిస్తోంది. అటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌ను వ్యతిరేకిస్తోంది. -
తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత..
న్యూఢిల్లీ : సరిహద్దులో కాపలా కాసే సైనికుల కోసం భారత ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను సైనికులకు అందించాలన్న ప్రభుత్వం ఆశ తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత నెరవేరబోతుంది. ఈ మేరకు ‘మేకిన్ ఇండియా’ లో భాగంగా ప్రభుత్వం ఎస్ఎంపీపీ అనే ఢిల్లీకి చెందిన ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ.639 కోట్లు. మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను మూడు సంవత్సరాల్లో సైనికులకు అందేలా ఒప్పందం కుదిరిందని కంపెనీ తెలిపింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అన్ని రకాల బుల్లెట్లను తట్టుకునేలా తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. బోరాన్ కార్బైడ్ సెరామిక్ మెటీరియల్‌తో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ తయారు చేయడం వల్ల తేలికగా ఉంటుందని అలాగే బాలిస్టిక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా 1.86 లక్షలకు పైగా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కంపెనీ ఆర్మీకి అందించనుంది. కొత్త బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లలో మాడ్యులర్ భాగాలు ఉంటాయని, దీని వల్ల మరింత భద్రత లభిస్తుందని, వివిధ పరిస్థితుల్లో సైనికులకు కూడా ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్లను కూడా తట్టుకునేలా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న భారత ఆర్మీ ప్రతిపాదనకు అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఆర్మీ నిర్వహించిన ట్రయల్ టెస్టుల్లో బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు తయారు చేసే కంపెనీలు ఆ స్థితికి చేరుకోలేకపోయాయి. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ల అందిస్తామని ముందుకు వచ్చిన నాలుగు కంపెనీల్లో ఒక్క కంపెనీ మాత్రమే మొదటి రౌండ్లో పాసైంది. ఆ కంపెనీ కూడా రెండో రౌండ్లో ఫెయిల్ కావడంతో ఆ విషయం అప్పటి నుంచి మరుగున పడిపోయింది. 2016, మార్చిలో ఆర్మీ సుమారు 50 వేల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేసింది. ఇవి కూడా అనుకున్న స్టాండర్డ్స్‌ను అందుకోలేకపోయాయి. ప్రస్తుత భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఒప్పందంలో భాగంగా రానున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో భారత సైనికుల విశ్వాసం పెరగడంతో పాటు, భద్రతా దళాలకు నైతిక ప్రాబల్యాన్ని అందిస్తుందనడంతో సందేహం లేదు. -
నరేంద్ర మోదీ స్మార్ట్ సిటీలివిగో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ అంటూ వినిపించిన అభివృద్ధి నినాదాలు ప్రజలను ఎంతగా ఆకర్షించాయో దేశంలోని వంద నగరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన ‘స్మార్ట్ సిటీ’లుగా మారుస్తానన్న హామీ కూడా అంతకంటే ఎక్కువే ఆకర్షించింది. మరి మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా ఆయన స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానన్న నగరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ట్విటర్ పారడీ అకౌంట్ ‘ఎట్‌ద రేట్ ఆఫ్ హిస్టరీపిక్ ’ మంగళవారం నాడు ట్విటర్ యూజర్ల అభిప్రాయాన్ని కోరగా, దాదాపు రెండువేల మంది తమదైన శైలిలో ట్వీట్లు చేశారు. ఎక్కువ మంది ఫొటోలు, చిత్రాలతో స్పందించారు. కొందరు సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్ తరహాలో భారత నగరాలు అభివృద్ధి చెందినట్లు ఆర్కిటెక్చర్ డిజైన్లను పంపించగా, మరొకరు బుల్లెట్ రైలు ఇదిగో అంటూ లారీపైకి రైలు డబ్బా ఎక్కించిన ఫొటోషాప్ ఇమేజ్‌ని పంపించారు. భారత్ సిలికాన్ సిటీగా పేరుపడ్డ బెంగళూరు నగరం పకోడాపూర్గా మారిందని సూచిస్తూ ఇంకొకరు గ్రాఫిక్ డిజైన్‌ను పంపించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఇలా మారిందంటూ మరొకరు డిస్నీఐలాండ్ ఇంపోజ్డ్ చిత్రాన్ని పంపించారు. నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్‌గా అభివర్ణిస్తూ ఒంటెకు రెందు రాకెట్ బూస్టర్లను అమర్చుకొని, దానిపై రాకెట్లా దూసుకుపోతున్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేశారు. ఇక నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం అమెరికాలోని వైట్‌హౌజ్‌గా మారిందంటూ వైట్‌హౌజ్ భవనం ఫొటేనే పొస్ట్ చేశారు. వర్షాలకు కొట్టుకుపోయే భారతీయ రోడ్లను చూసి కోపం వచ్చిందేమో నీళ్లతో గుంతలు పడిన రోడ్డులో రవాణా ట్రక్కు కూరుకుపోయిన ద్యశ్యం ఫొటోను పంపించారు. ప్రయాణికులకు 24 గంటలపాటు తాగునీరు అందిస్తూ, ట్రక్కులకు ప్రత్యేక పార్కింగ్ వసతి కల్పిస్తున్న మధ్యప్రదేశ్‌లోని స్మార్ట్ సిటీ అంటూ ఒకరు పోస్టింగ్ పంపించారు. గోవాలోని పాంజిం నగరంలో అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటూ జలమయమైన ఓ రహదారి ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు. ట్విటర్లో అందరు వ్యంగ్యంగానే స్పందించారు. అందరి బాధ ఒకటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క నగరాన్నైనా సంపూర్ణ స్మార్ట్ సిటీగా మార్చలేకపోయిందన్నదే! -
2020 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా ప్రాజెక్టు.. ఫలాలు 2020 నుంచి అందుతాయని నీతిఆయోగ్ డైరెక్టర్ జనరల్-డీఎంఈఓ సలహాదారు అనిల్ శ్రీవాస్తవ తెలిపారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టు వల్ల 2020 నాటికి దేశంలో కొత్తగా 10 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన అంచనావేశారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ప్రాజెక్టుల వల్ల దేశంలో పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగయ్యాయని శ్రీవాస్తవ చెప్పారు. న్యూఢిల్లిలో జరిగిన స్మార్ట్‌టెక్ మ్యానేఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా-2017 సదస్సులో మాట్లాడారు. మేకిన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బాగంగా 2020 నాటికి భారత్.. తన దిగుమతులను సున్నాస్థాయికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ సదస్సులో దేశంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న అంశాలపై మేధావులు చర్చలు జరిపారు. -
ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గట్టి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షాకిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే బేసిక్ ఎక్సైజ్ సుంకంతో విదేశీ మొబైల్స్‌కు చెక్ చెప్పిన ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్స్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్ ఫోన్ల ధరలు మోత మోగనున్నాయి. మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లపై గతంలో విధించిన 10శాతం బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని తాజాగా 15శాతానికి పెంచింది. దీనికి సంబంధించి గురువారం రాత్రి రెవెన్యూ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కలర్ టీవీలు, మైక్రోవేవ్ అవెన్లపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 20శాతంగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ ఫిల్మెంట్, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రెస్సింగ్ సాధనాలు, డిశ్చార్చ్ లాంప్స్ లాంటి కొన్ని ఇతర అంశాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని సవరించింది. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహహంతోపాటు, ఇప్పటికే తయారీలో ఉన్న కంపెనీలకు గట్టి పోటీ ఉండేలా ఈ చర్య చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా గత జూలైలో మొదటిసారి బేసిక్ కస్టమ్ సుంకాన్ని విధించిన ప్రభుత్వం దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చేలా విదేశీ మొబైల్స్‌పై దీన్ని10శాతంగా పేర్కొన్న సంగతి విదితమే. -
మేడిన్ ఇండియా జాగ్వార్ ‘ఎఫ్–పేస్’
ముంబై: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘ఎఫ్–పేస్’ అసెంబుల్‌ను స్థానికంగానే ప్రారంభించింది. పుణే ప్లాంటులో దీన్ని తయారు చేస్తోంది. దీని ధర రూ.60.02 లక్షలు. దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న మోడల్ ధర రూ.68.4 లక్షలతో పోలిస్తే దీని ధర రూ.8.4 లక్షలు తక్కువ. స్థానికంగా తయారుచేస్తున్న ఎఫ్–పేస్ బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని నవంబర్ చివరి నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తామని పేర్కొంది. కంపెనీ పుణే ప్లాంటులో అసెంబుల్ చేస్తోన్న ఆరో మోడల్ ఇది. జాగ్వార్ ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎక్స్‌జే, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్యూ వంటి మోడళ్లను ఇందులో అసెంబుల్ చేస్తోంది. మేకిన్ ఇండియా పాలసీకి తాము ఎంత ప్రాధాన్యమిస్తున్నామో ఎఫ్–పేస్ లోకల్ అసెంబుల్‌ను చూస్తే అర్థమౌతుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. స్పోర్ట్స్ కారు డీఎన్ఏ, ఎస్యూవీ పనితీరు వంటి అంశాల మేళవింపుతో కంపెనీ ఎఫ్–పేస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. -
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఊతం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్–2020 (ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ)ని తీసుకొ చ్చింది. మేకిన్ ఇండియాలో భాగంగా అటోమోటివ్ మిషన్ ప్లాన్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాయితీలతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించిన సర్కారు... దానికి తుది మెరుగులు దిద్దుతోంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలద్వారా తెలుస్తోంది. తయారీ రంగానికి అధిక ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలో తయారీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు టీఎస్ఐపాస్ కింద అనుమతులు ఇవ్వనుంది. ఎన్‌ఈఎమ్‌ఎమ్‌పీ కింద కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై భారీ ఎత్తున నిధులు ఖర్చు చేయనుంది. పలు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్అండ్డీ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోనూ యూనిట్లు ఏర్పాటయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని కలకల్ వద్ద ఆటోమోబైల్ సెజ్ ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండడంతో అటువైపే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమల ఏర్పాటును పరిశీలిస్తోంది. ప్రభుత్వ ప్రణాళిక ఖరారైతే మరింత స్పష్టత రానుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. నెలన్నరలోపు ప్రకటిస్తాం హైదరాబాద్ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకత ఎంతో ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల వినియోగాన్ని అంచనా వేసి ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. నెలన్నరలోపు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కార్యాచరణ ప్రకటిస్తే పరిశ్రమల ఏర్పాటు వేగవంతం అవుతుంది. –జయేశ్‌రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి -
‘నాక్కూడా మేక్ ఇన్ ఇండియా ఇష్టం’
న్యూయార్క్ : మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తనకు కూడా ఇష్టమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అయితే, ఈ కార్యక్రమం ద్వారా ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలో వారినే మరుస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీనే ప్రవేశపెట్టాల్సి ఉండేదని, అంతకుముందే తమ పార్టీకి ఆ ఆలోచన ఉందని చెప్పారు. ’నాకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. కానీ, వారి దృష్టిని సారించాల్సిన వారిని పక్కన పెడుతున్నారు. నేనే ఆ పాలసీని అమలుచేస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ భావిస్తారు. మధ్యతరగతి, చిన్నతరహా కంపెనీలను లక్ష్యంగా పెట్టుకోవాలని నేను భావిస్తాను. ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి లభించేది ఈ రెండు రంగాల నుంచే’ అని రాహుల్ చెప్పారు. -
సాంకేతికత మా వద్దే ఉండాలి
న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తులను భారత్‌లో తయారుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంస్థలు ఆ సాంకేతికతపై తమకే పూర్తి హక్కులు ఉండాలని కోరుతున్నాయి. ఇందుకుకోసం రక్షణ మంత్రికి ఆగస్టులో ఓ లేఖ రాశాయి. స్థానిక భాగస్వాములతో కలసి ఉత్పత్తి చేసిన పరికరాల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని తమ తప్పుగా చూడకూడదన్నాయి. భారత సైన్యానికి యుద్ధ విమానాలను తయారుచేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ విమానాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ కనీసం 100 సింగిల్ ఇంజిన్ ఎఫ్–16 విమానాలను కొంటామంటే తమ ఉత్పత్తి కేంద్రాన్ని అమెరికా నుంచి భారత్‌కు మారుస్తామని లాక్‌హీడ్ ప్రకటించింది. అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ సంస్థలు ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభిస్తే ఆ సాంకేతికత మనకు లభిస్తుందనేది ప్రధాని మోదీ ఆలోచన. -
‘మేకిన్ ఇండియా’లో ఎఫ్–16 విమానాలు
న్యూఢిల్లీ: ఎఫ్–16 యుద్ధ విమానాలను భారత్‌లో తయారుచేయడానికి అమెరికా రక్షణ ఉత్పత్తుల సంస్థ లాక్‌హీడ్ ముందుకొచ్చింది. భారత వాయుసేన నుంచి ఈ విమానాలకు ఆర్డర్ లభిస్తే ‘మేకిన్ ఇండియా’ కింద వాటిని ఇక్కడే ఉత్పత్తి చేస్తామంది. అంతేకాకుండా భారత్ నుంచే వాటిని ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తామని తెలిపింది. అయితే వాయుసేనకు 100 ఎఫ్–16 జెట్ విమా నాలు సమకూర్చడానికి సంబంధించిన ఆర్డర్ కోసం స్వీడన్ కంపెనీ సాబ్తో లాక్‌హీడ్ పోటీ పడుతోంది. ఈ విమానాల తయారీ కేంద్రాన్ని భారత్‌కు తరలించాలన్న లాక్‌హీడ్ ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం మద్దతు తెలిపింది. -
కరెన్సీకి ‘మేకిన్ ఇండియా’ భద్రతా ఫీచర్లు
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి మరింతగా ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ సోమవారం కరెన్సీ భద్రత ఫీచర్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేస్తూ.. మేకిన్ ఇండియా ప్రమాణాలను తప్పనిసరి చేసే నిబంధనను జోడించి కొత్తగా మరో టెండర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సరఫరాదారు రెండేళ్ల వ్యవధిలో దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలి. అలాగే క్రమంగా స్థానిక కంటెంట్‌ను కూడా పెంచాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దేశస్తు లు లేదా ఆ దేశ మూలాలు ఉన్న వారి సర్వీసులను ఈ ప్రాజెక్టులో ఉపయోగించబోమని బిడ్డరు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ థ్రెడ్స్, ఇంకు, సెక్యూరిటీ ఫైబర్, అడ్వాన్స్డ్ వాటర్‌మార్క్ మొదలైనవి సరఫరా చేసేందుకు ఆర్బీఐ ఈ టెండర్‌ను ఉద్దేశించింది. -
ఔను! ఆ ఫోన్లు ఇక చౌకధరకే లభిస్తాయ్!
'మేకిన్ ఇండియా'కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్నే ప్రకటించింది. ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్ ఫోన్లపై పదిశాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం విధించనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే చార్జర్లు, హెడ్సెట్లు, బ్యాటరీలు, యూఎస్బీ కేబుళ్లకు కూడా ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటించిన ఈ నిర్ణయంతో 'మేడ్ ఇన్ ఇండియా' మొబైల్ ఫోన్లు చౌక ధరకే వినియోగదారులకు లభించే అవకాశముంది. గతంలో స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో 11.5శాతం వరకు వివిధ సుంకాలు కేంద్ర ప్రభుత్వం విధించేది. జీఎస్టీ రాకతో ఆ సుంకాలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే హైఎండ్ టాప్ మొబైల్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశముందని భావించారు. అయితే, తాజాగా కేంద్రం విదేశాల నుంచి వస్తున్న ఫోన్లపై సుంకం విధించడంతో మళ్లీ దేశీయ ఉత్పత్తులకు అనుకూలంగా వ్యవహరించినట్టు అయింది. అయితే, దేశీయ మొబైల్ తయారీదారులు ఎక్కువగా దిగుమతి చేసుకునే సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ (PCBA), కెమెరా మాడ్యూల్, టచ్ పానెల్, కవర్ గ్లాస్ అసెంబ్లీ, వైబ్రేటర్ మోటార్, రింగర్ లను ఈ ప్రాథమిక సుంకం నుంచి మినహాయించింది. దీంతో దేశీయంగా ఉత్పత్తి అయ్యే మొబైల్ ఫోన్లపై 12శాతం జీఎస్టీ మాత్రమే వర్తించనుంది. ఈ లెక్కన విదేశీ మొబైల్ ఫోన్లతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే ఫోన్లు తక్కువ ధరకు వినియోగదారులకు లభించే అవకాశముందని మొబైల్ ఫోన్ కంపెనీలు చెప్తున్నాయి. -
‘ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం’
పుణే: భారత నావికా దళం ప్రాబల్యం సముద్ర జలాల్లో విస్తరిస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా అన్నారు. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో ఓ నౌకను శాశ్వతంగా మోహరించామని, పశ్చిమ నేవీ కమాండ్‌కు చెందిన నౌక ఒకటి మధ్యదరా సముద్రం గుండా అంట్లాటిక్ చేరిందని తెలిపారు. పుణేలోని జాతీయ రక్షణ అకాడమీ(ఎన్డీఏ) గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి లాంబా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తూర్పు కమాండ్‌కు చెందిన నౌకలు సింగపూర్‌తో కలిసి దక్షిణ చైనా సముద్రంలో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాతో కూడా విన్యాసాలు చేపట్టేందుకు అవి బయల్దేరాయని తెలిపారు. ముంబైలో జరిగిన 26–11 లాంటి మరో దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా అమలు చేస్తామని పేర్కొన్నారు. నావికా దళం ఆధునీకరణ గురించి మాట్లాడుతూ... నేవీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోందని అన్నారు. 1960 నుంచి 200కు పైగా నౌకలను దేశీయంగా తయారుచేశామని తెలిపారు. ప్రస్తుతం 41 నౌకలు, జలాంతర్గాములు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. విధుల నుంచి తప్పించిన ఐఎన్ఎస్ విరాట్‌ను మ్యూజియంగా మార్చడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్డీఏ నుంచి 312 మంది శిక్షణను పూర్తిచేసుకున్నారు. వీరిలో 211 మంది ఆర్మీ నుంచి, 34 మంది నేవీ నుంచి, 67 మంది వాయుసేన నుంచి ఉన్నారు. -
సరికొత్త హెలికాప్టర్ చక్కర్లు
సాక్షి, బెంగళూరు: భారత రక్షణరంగ అమ్ములపొదిలో సరికొత్త హెలికాప్టర్ చేరికకు రంగం సిద్ధమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ (హెచ్ఏఎల్) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్) పీటీ–2 మంగళవారం మొదటిసారి గాల్లో చక్కర్లు కొట్టింది. ఇది 22 నిమిషాలు గగనవిహారం చేసింది. 3 టన్నుల బరువున్న ఎల్యూహెచ్ను సాయుధ దళాలతో పాటు పౌరసేవలకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. అద్దాల కాక్‌పీట్ ఉండటం పీటీ– 2 ప్రత్యేకత. ఇది 400 కేజీల బరువైన ఆయుధాలను మోసుకుపోగలదని హెచ్ఏఎల్ తెలిపింది. ఇది ఎల్‌యూహెచ్ పీటీ–1కు ఆధునిక వెర్షన్. -
రక్షణలో ప్రైవేటు భాగస్వామ్యం
ఖరారుచేసిన రక్షణ శాఖ న్యూఢిల్లీ : భారత్‌లోని ప్రైవేట్ కంపెనీలు విదేశీ సంస్థల సహకారంతో యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సైనిక వాహనాలను దేశీయంగా తయారుచేసే విషయమై కేంద్రం రూపొందించిన వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా(ఎస్పీఎం)కు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి జైట్లీ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) శనివారం ఈ ఒప్పందాన్ని ఖరారుచేసింది. ఆర్థిక శాఖ సమీక్షించాక ఎస్పీఎం కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ జాబితా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సైనికవాహనాలకే పరిమితమైనప్పటికీ తదుపరి దశలో మరిన్ని రక్షణ ఉత్పత్తుల్ని చేర్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిచ్చేలా..దేశీయంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ నమూనా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. భారత కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పారదర్శకంగా, పోటీతత్వంతో పనిచేసేలా నూతన విధానం ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల రక్షణ మంత్రి జైట్లీతో సమావేశమైన అశోక్ లేలాండ్, మహీంద్ర అండ్ మహీంద్ర తదితర సంస్థలు ప్రస్తుతమున్న జాబితాలో మరిన్ని రక్షణ ఉత్పత్తులను చేర్చాలన్నాయి. ఒప్పందం ఖరారయ్యాక సదరు సంస్థలపై న్యాయవిచారణ, తనిఖీలకు వీలు కల్పించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు. -
రుణమాఫీతో అంత ప్రమాదమా?
విశ్లేషణ దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా భారతీయ ఆర్థిక విధాన పండితులు శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే భారీ ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా ఉంటారు. అమెరికన్ అంతర్యుద్ధం 1865లో ముగిసిపోయినప్పుడు, అమెరికా పత్తి ఉత్పత్తి పునరుద్ధరణ జరిగి భారతీయ పత్తికి డిమాండ్ పడిపోయింది. బాంబే ప్రెసిడెన్సీలో రైతులు పత్తి పండించడం తగ్గిపోయింది. రైతులకు రుణం ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు తిరస్కరించేవారు లేదా అధిక వడ్డీరేట్లను విధించేవారు. దీంతో సెటిల్మెంట్ డిమాండ్లు పెరిగిపోయాయి. దీని ఫలితంగా పుణే సమీపంలోని సుపా గ్రామంలో 1875లో దక్కన్ తిరుగుబాటు జరిగింది. దాని ప్రేరణగా దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆగ్రహోదగ్రులైన రైతులు, వడ్డీవ్యాపారులపై దాడులు చేసి వారి ఇళ్లు తగులబెట్టారు. ఈ తిరుగుబాటు 30 గ్రామాలను ప్రభావితం చేసింది. గ్రామాల్లోని పోలీసు గస్తీ కేంద్రాలు త్వరలోనే రైతులను లొంగదీసుకున్నాయి కానీ గ్రామీణ ప్రాంతంలో నెలల తరబడి తిరుగుబాటు కొనసాగింది. దీంతో బాంబే ప్రెసిడెన్సీ 1878లో దక్కన్ రయట్స్ కమిషన్ని నెలకొల్పింది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఆహారం కోసం, విత్తనాలు, ఎద్దులు వంటి ఇతర అవసరాలకోసం రైతులు కొద్ది మొత్తంలో తీసుకునే రుణాలు ఎప్పుడో ఒకసారి చేసే వెళ్లి ఖర్చుల కంటే ఎక్కువగా వారిని అధిక రుణగ్రస్తులను చేస్తున్నాయని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. రైతుల రుణ భారాన్ని తగ్గించాలంటే, రుణాలు చెల్లించనివారిపై నిర్బం ధాన్ని నిషేధించాలని, రుణ బకాయి వసూలు కోసం రైతుల నివాస గృహాలను అమ్మకానికి పెట్టడం నుంచి మినహాయించాలని, రుణగ్రస్తుల నుంచి భారీ మొత్తాలను లాగేందుకు న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణ ప్రక్రియలను నిలిపివేయాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో రైతు దురవస్థ ఇప్పటికీ మారలేదనిపిస్తోంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో, రైతు అనుకూల విధానాలు కొత్తవేమీ కావు. 1989లో జనతాదళ్ ప్రభుత్వం ఒక్కో రైతుకు పదివేల రూపాయల వరకు రుణాల రద్దుకు అవకాశమిస్తూ వ్యవసాయ రుణాల మాఫీ పథకం ప్రవేశపెట్టింది. 1992లో ఇది 4.4 కోట్లమంది రైతులకు 6 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేసింది. 2008లో వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం ప్రవేశపెట్టగా 5 కోట్ల 97 లక్షల మంది పెద్ద రైతులతోపాటు 3 కోట్ల 69 లక్షలమంది సన్నకారు రైతులు 71,600 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం పొందారు. రాష్ట్ర స్థాయిల్లో కూడా ఇదేవిధమైన చర్యలు చేపట్టారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సన్నకారు, చిన్నకారు రైతులకు రుణమాఫీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈమధ్యే దిగిపోయిన ప్రభుత్వం రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న 50 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. తరువాత అవసరమైన రైతులకు మాత్రమే రుణాలను మాఫీ చేయాలని యూపీ నూతన ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాలి. అయితే ఇది సరిపోదు. ఇలాంటి రుణమాఫీలను దేశవ్యాప్తంగా సన్నకారు, చిన్నకారు రైతులందరికీ వర్తింపచేయాల్సి ఉంది. భారత్‌లోని 12.1 కోట్ల వ్యవసాయ భూముల్లో 9.9 కోట్ల భూములు సన్నకారు రైతులవే అయి ఉంటున్నాయి. బహుళ పంటల విధానం ద్వారా ఇలాంటి రైతులు దేశంలో పండే కూరగాయల్లో 70 శాతం, తృణధాన్యాల్లో 52 శాతం పండిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల అవసరం పెరగడంతో రైతులు విత్తన ధరల పెరుగుదల భారాన్ని మోయవలసివస్తోంది. అన్ని విత్తనాల ధరలు భారీగా పెరిగిపోయాయి. పాతకాలంలో మాదిరిగా రైతులు విత్తనాలను కులధనం లాగా తమ కుమారులకు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి పోయింది. దీనికి తోడు ఎరువుల ధరలూ పెరిగాయి. వ్యవసాయ మెషినరీకి ప్రత్యామ్నాయంగా ఉండే కూలీలకయ్యే ఖర్చు కూడా తదనుగుణంగా పెరిగింది. పశువుల వాడకం ఖర్చు కూడా బాగా పెరిగింది. ఇక పురుగుమందుల ద్వారా పంట రక్షణ ఖర్చు చుక్కలనంటింది. మన రైతులు తమ పంటలకు మార్కెట్ విలువను గుర్తించడంలో విఫలమవుతున్నారు. 1972లో కలకత్తాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక కమలాపండును మార్కెట్లో వినియోగదారు కొనుగోలు చేసే ధరలో కేవలం 2 శాతం మాత్రమే దాన్ని పండించిన రైతుకు అందుతోందని తెలిసింది. పంటవిలువలో అధిక భాగాన్ని మండీలు, మార్కెట్లే మింగేస్తున్నాయి. మోదీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా, ఇంతవరకు దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ సామగ్రి, పరికరాలను దేశంలోనే తయారు చేయడంపై దృష్టి పెట్టింది కాబట్టి భారత వ్యవసాయ సామగ్రి విధానాన్ని కూడా పూర్తిగా మార్చవలసి ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మన వ్యవసాయ సామగ్రి, పరికరాలను ప్రామాణీకరించాల్సి ఉంది. మన వ్యవసాయ పాలసీ తెగుళ్లను, పురుగులను ఎదుర్కోవడానికి జీవ, రసాయన, యాంత్రిక, భౌతిక విధానాలను మిళితం చేయడంపై దృష్టి సారించాలి. పురుగుమందుల వాడకాన్ని తొలగిం చడం లేక గణనీయంగా తగ్గించడంపై దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాలి. భారతీయ ఆర్థిక విధాన పండితులు దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్నయినా శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా మౌనంగా ఉంటారు. వాస్తవాలను పరిశీలి ద్దాం. ఆర్బీఐ ప్రకారం 2000– 2013 కాలంలో దేశంలో లక్షకోట్ల రూపాయల విలువైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేశారు. వీటిలో 95 శాతం రుణాలు బడా సంస్థల రుణాలే మరి. దీంతో పోలిస్తే ఎస్బీఐ ఇటీవల ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిపై రుణాలమీద 40 శాతం తగ్గింపుతో ఒక సెటిల్మెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 25 లక్షలవరకు రుణం తీసుకున్నవారికి 6 వేల కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తూ రుణాలను తగ్గించారు. రైతులలో రుణ చెల్లింపు సంస్కృతి లేక పోవడం వల్ల భారత్‌లో మొండిబకాయిలు పేరుకోవడం లేదు. మొండి బకాయిల్లో 50 శాతం వరకు మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చినవే. పిండదశలోని రుణ చెల్లింపు సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించే ముందు విమర్శకులు వ్యవసాయ రుణాల చరిత్రను గుర్తిస్తే బాగుంటుంది. దేశంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఉబ్బిన కడుపులు, అనాధ పిల్లల రూపంలో దోపిడీ పరిణామాలు నాలో చాలా కాలం క్రితమే బలమైన ముద్రవేశాయి. దిద్దుబాటు చర్యలు లేకుంటే మన రైతుల విధి అనిశ్చితంగానే ఉంటుంది. వరుణ్ గాంధీ వ్యాసకర్త, బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
మోదీ చెప్పారు.. 'రోబో2.0'లో రజనీ చేశారు!
భారీ ఖర్చుతో అత్యంత గ్రాండ్‌గా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ పెట్టింది పేరు. నిజానికి ఆయన సినిమాల్లో అత్యద్భుతమైన విదేశీ లోకేషన్లు కనువిందు చేస్తాయి. అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న 'రోబో 2.0' మాత్రం ఓ విశిష్టతను సంతరించుకోబోతున్నది. అదేమిటంటే ఈ సినిమా చిత్రీకరణ పూర్తిగా భారత్‌లోనే జరిగింది. అవును ఇది నిజం. పలు మీడియా కథనాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన కలల పథకం 'మేకిన్ ఇండియా' గురించి రజనీకాంత్‌తో పంచుకున్నారట. 'రోబో-2'ను పూర్తిగా భారత్‌లోనే చిత్రీకరించి.. ఈ పథకానికి ఒక ఉదాహరణగా నిలువాలని ఆకాంక్షించారట. మోదీ మాటను మన్నించిన తలైవా రజనీ... అన్నట్టుగానే '2.0' షూటింగ్ పూర్తిగా భారత్‌లోనే నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ చాలావరకు చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరిగింది. సినిమా క్లైమాక్స్‌ను మాత్రం ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో తీశారు. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న '2.0'ను.. చైనా విఖ్యాత సినిమా 'క్రౌచింగ్ టైగర్.. హిడెన్ డ్రాగన్' స్థాయిలో తీయబోతున్నట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ప్రకటించింది. 'క్రౌచింగ్ టైగర్.. హిడెన్ డ్రాగన్' సినిమాకు 2000 సంవత్సరం ఆస్కార్ అవార్డు లభించింది. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో.. వీఎఫ్ఎక్స్ అదనపు సాంకేతిక హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ- అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో పోటాపోటీగా తలపడుతున్న సంగతి తెలిసిందే. -
టెక్ దిగ్గజాలు ఎందుకు చెక్కేస్తున్నారు?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ పథకాలకు ఆకర్షితులై స్వదేశీ, విదేశీ ఆన్లైన్ కంపెనీలు ఎన్నో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు విస్తరించాయి. కళ్లు చెదిరే జీత భత్యాలను ఎరగా వేసి సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ దిగ్గజాలను తీసుకొచ్చి బాస్‌లుగా కూర్చోబెట్టాయి. కానీ ఈ బాసుల్లో ఎక్కువ మంది కంపెనీల్లో నిలదొక్కుకోకుండానే మరో చోటుకు చెక్కేస్తున్నారు. ఫలితంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు తెరవకుండా మూసుకోవాల్సి వస్తోంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి గతేడాది ఏప్రిల్ నెలలో పునీత్ సోని తప్పుకోగా, ఆ తర్వాత మే నెలలో స్నాప్‌డీల్ నుంచి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ ఆనంద్ చంద్రశేఖరన్ ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. 2014 ఫేస్బుక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నమితా గుప్తా, రెస్టారెంట్ లిస్టింగ్ స్టార్టప్ కంపెనీ ‘జోమాతో’ నుంచి ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. గతంలో లింక్డ్ఇన్ ఇండియాలో హెడ్‌గా పనిచేసిన నిశాంత్ రావు చెన్నైలో ఏర్పాటు చేసిన ‘ఫ్రెష్ డెస్క్’ స్టార్టప్ కంపెనీ నుంచి వారం కిందనే తప్పుకున్నారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో ఒక వెలుగు వెలిగిన ఈ దిగ్గజాలు మాతృదేశంలోని కంపెనీల్లో ఎందుకు నిలదొక్కుకోలేక పోతున్నారు? వారు మరింత ఎక్కువ జీతాలకు ఆశపడి పోతున్నారా? కంపెనీ వాతావరణం నచ్చడం లేదా? ఇక్కడి పని సంస్కతికి అలవాటు పడలేకపోతున్నారా? మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్థానిక వ్యాపార కంపెనీలు మార్కెట్‌పైనా, వచ్చే లాభాలపైన ప్రధానంగా దష్టిని కేంద్రీకరిస్తే భారత్‌కు వచ్చే స్టార్టప్ కంపెనీలు అంకెల మీద, మార్కెట్లో వాటా మీద (లాభాలతో సంబంధం లేకుండా) దష్టిని కేంద్రీకరించడం ప్రాథమిక లోపమని బెంగళూరులోని ‘స్టాంటన్ చేజ్’ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ కేఎన్ శ్రీపాద్ తెలిపారు. భారత్‌లో 30 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారని, వందకోట్ల మంది సెల్ఫోన్లను వాడుతున్నారన్న అంకెల ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు. సిలికాన్ వ్యాలీలో, భారత్‌లో బయటి నుంచి చూస్తే సజనాత్మకత ఒకటిగానే కనిపిస్తుందని, కానీ క్షేత స్థాయిలో తేడాలు ఉన్నాయని, ఆ తేడాల వల్లనే స్టార్టప్ కంపెనీల్లో ఎక్కువ మంది నిలదొక్కుకోలేక పోతున్నారని ‘హైడ్రిక్ అండ్ స్ట్రగుల్స్’ ఇంచార్జి పార్టనర్ వెంకట్ శాస్త్రీ తెలిపారు. వ్యాలీలో అనుభవజ్ఞులైన సీనియర్లు దొరికే వారని, వారి అనుభవం ఇక్కడి వారికి లేదని చెప్పారు. పైగా అక్కడి మార్కెట్ పరిణతి చెందినదని, ఏ రంగానికి ప్రాముఖ్యత ఉందో ఏ రంగాల్లో రాణించాలో మార్గనిర్దేశం చేసేవారు కూడా సిలికాన్ వ్యాలీలో ఎక్కువని ఆయన వివరించారు. ఇక్కడి కంపెనీల్లో వాతావరణం, అంటే ఉద్యోగుల మధ్య సఖ్యత, స్నేహభావం లేకపోవడం, పని సంస్కతి నచ్చక పోవడమే తాము భారత స్టార్టప్ కంపెనీల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమని తప్పుకుంటున్న నెట్ దిగ్గజాలు చెబుతున్నారు. అమెరికాలో టాలెంట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వగా, భారత్‌లో బంధు, మిత్ర సంబంధాల కారణంగా అనర్హులు కూడా ఉద్యోగాలు పొందుతున్నారని, వారి వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు పని వేళలు ఉంటాయని, వారాంతంలో రెండు రోజులు సెలవులు ఉంటాయని, భారత్‌లో పనివేళలు ఎక్కువ కావడమే కాకుండా ఎక్కువ వరకు విదేశీ కస్టమర్ల కోసం రాత్రిళ్లు పనిచేయాల్సి వస్తోందని, స్టార్టప్ కంపెనీలవడం వల్ల కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని వారన్నారు. భారత్‌లో రెడ్ టేపిజం కూడా ఎక్కువగానే ఉందన్నారు. వివిధ రంగాల్లో ఏర్పాటు చేయాల్సిందిపోయి కొన్ని రంగాల్లోనే ఎక్కువ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం కూడా భారత్‌లో జరుగుతున్న పొరపాటని, దాని వల్ల కంపెనీల మధ్య అనవసరమైన పోటీ పెరిగి మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
భారత్ లో ఆపిల్ కు మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : భారత్ లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్న టెక్ దిగ్గజం ఆపిల్ కు అడగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. భారత్ లో తయారీ సంస్థ ఏర్పాటుచేసేందుకు కంపెనీ అడుగుతున్న పన్ను మినహాయింపులను ఇవ్వలేమని, వారి అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. కంపెనీకి అలాంటి మినహాయింపులేమీ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పేసింది. మేకిన్ ఇండియాలో భాగంగా దీర్ఘకాలిక సుంకం మినహాయింపులతో పాటు పన్ను పరిమితుల నుంచి తమను తప్పించాలని కంపెనీ కోరుతోంది. అయితే ఈ డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరిస్తూ వస్తోంది. ఆపిల్ పన్ను డిమాండ్లతో పాటు కంపెనీ ప్రైమరీ అసెంబ్లర్ తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ కూడా మొబైల్ ఫోన్లను ఎగుమతి చేయడానికి మద్దతు కోరుతోంది. అదేవిధంగా త్వరలో అమలుకాబోతున్న ఏకీకృత పన్ను విధానం జీఎస్టీ నుంచి కూడా తమకు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ఆపిల్, ఫాక్స్ కాన్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. దిగుమతి చేసుకునే పరికరాలపై డ్యూటీలను, 15 ఏళ్ల పన్ను హాలిడేను కల్పించాలని కోరుతున్నాయి. అయితే ఈ డిమాండ్లను జీఎస్టీ పరిధిలోకి వస్తాయని తెలిపిన ఆర్థికమంత్రిత్వ శాఖ, వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్లను తయారుచేయడానికి బెంగళూరులో ప్లాంట్ ను నెలకొల్పబోతున్నట్టు కంపెనీ తెలిపిన సంగతి తెలిసిందే. -
దేశంలో బిగ్గెస్ట్ బ్రాండ్ ఇదే: మోదీ
అహ్మదాబాద్: రెండురోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌కు ఇప్పటివరకు ఉన్న బ్రాండ్లలో అతిపెద్ద బ్రాండ్ ‘మేకిన్ ఇండియా’ పథకమేనని అన్నారు. ఈ పథకం యువతలోని శక్తిని వెలికితీసుకొస్తున్న తీరు చాలా ముదావహంగా ఉందని అన్నారు. భారత్ ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్ లో ఆరో అతిపెద్ద దేశంగా ఉందని గుర్తుచేశారు. ప్రతి నిరుపేదకు సొంతింటిని కట్టించాలని, ప్రతి వ్యక్తికి ఉద్యోగాన్ని కల్పించాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయిలో ఇప్పుడు దేశంలోకి ఎఫ్‌డీఐలు వస్తున్నాయని, క్యాపిటల్ గూడ్స్ విషయంలో ఆసియా-పసిఫిక్ లో భారతే అగ్రస్థానంలో ఉందని మోదీ అన్నారు. పెట్టుబడులపై రిటర్న్స్ ఇవ్వడంలో ప్రపంచదేశాలన్నింటినీ భారత్ వెనుకకు నెట్టేసిందని గర్వంగా చెప్పారు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నోబెల్ సిరీస్ ఎగ్జిబిషన్ లో భాగంగా తొమ్మిది మంది నోబెల్ గ్రహీతల చర్చను ప్రారంభించారు. -
‘మేకిన్ ఇండియా’లో దేశీ టెక్నాలజీలకే పెద్దపీట
- రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి - ఐఐసీటీలో సిరామిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ఉద్దేశం విదేశీ కంపెనీలను ఇక్కడకు రప్పించడం కాదని... కొత్త కొత్త ఆలోచనలతో వస్తు, సేవలను ఇక్కడే రూపొందించి ప్రపంచానికి ఎగుమతి చేయడమని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే చాలా అంశాల్లో ఇప్పటికీ విదేశీ దిగుమతులపై ఆధారపడి ఉన్నామని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరమెంతైనా ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ‘సిరామిక్స్, గాజు రంగాల్లో కొత్త ఆవిష్కరణలు’ అన్న అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశీయ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మనమే తయారు చేసుకోవాలి... దేశంలోని ఏ ఫ్యాక్టరీకి వెళ్లినా జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలు కనిపిస్తున్నాయని.. బదులుగా మనమే వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో తొలి ప్రాధాన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీకేనన్నది గుర్తించాలని చెప్పారు. రక్షణ రంగంలో సిరామిక్స్ పాత్ర ఎంతో కీలకమని, అద్భుతమైన లక్షణాలు కలిగిన సిరామిక్స్ లేకుంటే క్షిపణుల్లో వాడే కీలకమైన పరికరాల తయారీ చాలా కష్టమయ్యేదని పేర్కొన్నారు. కానీ ఈ రంగంలో ఇప్పటికీ ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని అవసరమైన ఉత్పత్తులుగా మార్చే విషయంలో, తయారీ యంత్రాల విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఇక్కడి కంపెనీలకే ప్రాధాన్యం కొత్త టెక్నాలజీలు, పదార్థాల విషయంలో కేంద్రం దేశీ కంపెనీలకే ప్రాధాన్యమిస్తుందని సతీశ్‌రెడ్డి చెప్పారు. టెండర్లలో కనిష్ట ధర కోట్ చేసిన కంపెనీలకు కాకుండా.. ఆయా టెక్నాలజీలు దేశీయంగానే అభివృద్ధి చేసి ఉంటే, ధర ఎక్కువైనా ఆ టెక్నాలజీనే, పదార్థాన్నే వాడతామని తెలిపారు. దేశంలోని అన్ని రకాల పదార్థాలను సమర్థంగా వినియోగిం చుకునేందుకు వీలుగా కేంద్రం సరికొత్త విధానాన్ని సిద్ధం చేస్తోందన్నారు. డాక్టర్ బలదేవ్‌రాజ్ ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సిద్ధం చేసిన ఈ ముసాయిదాను మరో నెలలో ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీస్, ఆలిండియా పాటరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది పాల్గొంటున్నారు. -
ఆ పథకాలు విజయవంతమైతే భారతే సూపర్‌పవర్: ప్రణబ్
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘క్లీన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ వంటి పథకాలు విజయవంతమైతే భారతదేశం ప్రపంచంలోనే ఆధునిక ఆర్థిక శక్తిగా మారుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన సీఐఐ ఆగ్రో-టెక్ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యువెన్ రివ్లిన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం పలు కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సరికొత్త పథకాలను చేపట్టింది. వీటిని కనుక విజయవంతంగా అమలు చేసినట్లరుుతే భారతదేశం ప్రపంచంలోనే ఒక సుసంపన్నమైన, శక్తివంతమైన, ఆధునిక ఆర్థిక శక్తిగా మారడం తథ్యం’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఆధునిక ఆర్థిక శక్తిగా మారడానికిగాను మనకున్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. -
మహిళామణులకు చేయూత
- స్టాండప్ ఇండియా పథకంలో కదలిక - ఆర్థిక స్వావలంబన దశగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు - జిల్లాలో 30కిపైగా ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు - రూ.10 లక్షల నుంచి కోటి వరకు రుణ సదుపాయం - రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహణకు ఆదేశించిన సీఎస్ ఒంగోలు టూటౌన్ : జిల్లాలో దళిత మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా పథకంలో కదలిక మొదలైంది. పరిశ్రమలు స్థాపించేందుకు వినూత్న ప్రాజెక్టులతో ఔత్సాహిక దళిత మహిళలు ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 30 మందికి పైగా దళిత మహిళా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా వీరిలో 10 మంది ఔత్సాహికులకు బ్యాంకర్లు రుణ సదుపాయం కల్పించారు. మరో 10 యూనిట్ల స్థాపనకు బ్యాంకు అధికారులు ప్రాథమిక అంగీకారం తెలియజేయగా.. ఇంకొక పది యూనిట్ల దరఖాస్తులను అధికారులు పరిశీలన చేస్తున్నారు. గత యేడాది ఏప్రిల్ 5న ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే గత మేనెల 17న విజయవాడలో ఈ పథకం అమలపై రాష్ట్ర స్థాయి వర్క్ షాపు, జిల్లా స్థాయిలో వర్క్‌షాపులు జరిగాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకంను దిగువస్థాయిలో నిర్వహించాల్సిన కార్యాచరణకు సంబంధించిన అంశాలను వర్క్ షాపులలో అధికారులకు అవగహన కల్పించారు. అనంతరం జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, బ్యాంకర్లు, రూడ్సెట్, ఎపిట్కో.. డిక్కీ సంస్థకు చెందిన ప్రతినిధులు వర్క్‌షాపుల ద్వారా అవగహన కల్పించడంతో పథకంపై ఔత్సాహిక దళిత మహిళలు ముందుకొస్తున్నారు. పథకం ముఖ్య ఉద్ధేశం.. మేకిన్ ఇండియాలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సాహించడం ముఖ్య ఉద్ధేశం. ఇప్పటి వరకు బ్యాంకర్లు పేద మహిళలకు రుణ సదుపాయం కల్పించడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాని స్టాండప్ ఇండియా పథకం కింద కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ కనీసం ఇద్దరు ఎస్సీ, ఎస్టీల వర్గాలకు తప్పని సరిగా ఈ పథకం కింద రుణం ఇవ్వాలని నిబంధన విధించారు. యూనిట్‌కు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు హామీ లేకుండా రుణ సదుపాయం చేసేందుకు సీజీటీఎస్ఐఎల్(క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ స్టాండఫ్ ఇండియాలోన్స్) గా గతంలో ఉన్న సీజీటిఎంఎస్ఈకి బదులుగా సీజీటీఎస్ఐఎల్ను ప్రవేశపెట్టారు. 18 నెలల పాటు మారిటోరియం పిరియడ్ విధించడంతోపాటు ఔత్సాహికులు తప్పని సరిగా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం భరించాలని వివరించారు. ఈ పథకాన్ని ఇంకా తయారీ రంగంతో పాటు ట్రేడింగ్, సర్వీస్ సెక్టార్లకు విస్తరించారు. గ్రామీణ బ్యాంకులు కూడా ఈ పథకానికి చేయూత నందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు.. ఔత్సాహికులు తమ ప్రాజెక్టు నివేదికలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆరు దశలలో స్టాండప్ మిత్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు పంపాలి. కనీసం మూడు బ్యాంకులకు తమ ప్రతిపాదనలను పంపుకోవచ్చు. లీడ్ జిల్లా మేనేజర్, నాబార్డ్ ఏజీఎంఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి ఆయా బ్యాంకులకు దరఖాస్తులను పంపిస్తారు. అనంతరం బ్యాంకర్లు ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించి నెల రోజుల్లో తమ నిర్ణయాన్ని దరఖాస్తు దారులకు తెలియజేయాలి. స్పష్టత కోసం రాష్ట్ర స్థాయి వర్క్ షాపు.. ఈ పథకంపై ఇంకా స్పష్టత కోసం రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహణకు రాష్ర్ట సీఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్ల డి క్కీ జిల్లా కోఆర్డినేటర్ భక్తవత్సలం తెలిపారు. ఆన్లైన్ విధానంతోపాటు సెక్యురిటీ సబ్సిడీ, మార్జిన్ మని తదితర అంశాలలో నిర్ధిష్టత లేనందున బ్యాంకర్లు అధికారులు ఎవరికి వారు తమకు తోచిన విధంగా అన్వయించుకోవడం.. దరఖాస్తుదారులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే విషయాన్ని డిక్కీ ప్రతినిధులు ఇటీవల రాష్ర్ట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మళ్లీ రాష్ర్ట స్థాయి వర్క్ షాపు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ, బ్యాంకర్లు, అధికారులతో చర్చించి పథకంపై స్పష్టత ఇవ్వాలని, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. -
శ్రీసిటీని సందర్శించిన‘ ఆధార్ ’ చైర్మన్
సత్యవేడు : ఆధార్ వ్యవస్థ పర్యవేక్షణ సాధికార సంస్థ యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా( యుఐడీఏఐ) చైర్మన్ జే. సత్యనారాయణ శనివారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సెజ్‌లో మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీసిటీ ఒక గొప్ప ప్రాజెక్టని, దీని అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రమోటర్లను ప్రశంసించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ మంచి వసతులున్నాయని చెప్పారు. రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ సత్యనారాయణ 1990 ప్రాంతంలో తాను ఐటీ పరిశ్రమలో ఉన్నప్పుడు, ఆయన ఏపీ గవర్నమెంట్ ఉన్నతాధికారిగా పలు ఈ– గవర్నన్స్ ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. గతంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచారశాఖ(డైటీ) కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎలక్ట్రాక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లు(ఈఎంసీ) ఏర్పాటు విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని చెప్పారు. -
సర్జికల్స్ నుంచి సబ్బుల వరకు
మన దిగ్గజాలు దేశంలో ఆధునిక వైద్యం అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న కాలంలో సర్జికల్ పరికరాలతో వ్యాపారం మొదలుపెట్టాడాయన. మన్నిక గల తాళాలను, ఉక్కు బీరువాలను జనాలకు అందుబాటులోకి తెచ్చాడాయన. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఇప్పటిది కావచ్చు గాని, స్వాతంత్య్రానికి మునుపే తన ఉత్పత్తులపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని సగర్వంగా ముద్రించిన దార్శనికుడాయన. ఉక్కు బీరువాలకు తన ఇంటిపేరునే పర్యాయపదంగా చేసుకున్న ఆ పారిశ్రామికవేత్త అర్దేశిర్ గోద్రెజ్. ఆయన స్థాపించిన గోద్రెజ్ సంస్థ పలు రంగాల్లోకి విస్తరించి, దేశానికే గర్వకారణమైన పారిశ్రామిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. మూలధనం మూడువేలే... అర్దేశిర్ గోద్రెజ్ అసలు పేరు అర్దేశిర్ బుర్జోర్జీ సోరాబ్జీ గోదెరాజీ. సంపన్న పార్శీ-జొరాస్ట్రియన్ కుటుంబంలో 1868లో పుట్టారు. తండ్రి బుర్జోర్జీ, తాత సొరాబ్జీ అప్పట్లో బాంబేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. బుర్జోర్జీ 1871లో ఇంగ్లిష్ వాళ్లు కూడా తేలికగా పలకడానికి వీలుగా తన ఇంటిపేరును గోద్రెజ్గా మార్చుకున్నారు. అప్పటి నుంచి అదే ఇంటిపేరు స్థిరపడింది. అర్దేశిర్‌కు 1890లో బాచూబాయితో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాది తిరగకుండానే ఒక దురదృష్టకరమైన సంఘటనలో బాచూబాయి మరణించారు. ఆ తర్వాత అర్దేశిర్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అలాగని కుంగిపోలేదు కూడా. విషాదాన్ని మరచిపోవడానికి వ్యాపారంలో మరింతగా నిమగ్నం కావాలనుకున్నారు. తాత తండ్రులకు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా 1901లో మూడువేల రూపాయల మూలధనంతో కామా ప్రాంతంలో సర్జికల్ పరికరాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్రతో వాటి విక్రయాలను విజయవంతంగా సాగించారు. దేశంలో ఇళ్ల దోపిడీలు పెరుగుతున్నట్లు ఒకరోజు వార్తాకథనం చదివి, కట్టుదిట్టమైన తాళాలు ఉంటే ఇలాంటివి చాలా వరకు అరికట్టవచ్చు కదా అని భావించారు. వెంటనే తాళాల తయారీ, కొన్నాళ్లకే ఉక్కు బీరువాల తయారీ ప్రారంభించారు. గోద్రెజ్ తాళాలు, గోద్రెజ్ బీరువాలు నాణ్యతలో తిరుగులేనివిగా ప్రజల్లో నమ్మకం సంపాదించుకున్నాయి. వ్యాపారం విస్తరించడంతో 1906లో సోదరుడి వరుసయ్యే పిరోజ్షాకు భాగస్వామ్యం కల్పించారు. స్ప్రింగ్‌లెస్ తాళం కప్పల తయారీ కోసం 1908లో బ్రిటిష్ పేటెంట్ పొందారు. సబ్బుల తయారీలో సంచలనం సబ్బుల తయారీలో అర్దేశిర్ గోద్రెజ్ సంచలనమే సృష్టించారు. వ్యాపార యాజమాన్య హక్కులన్నింటినీ సోదరుడు పిరోజ్షాకు 1928లోనే బదలాయించేశారు. అయితే, వస్తువుల ఆవిష్కరణ ప్రయత్నాల్లో, వ్యాపారావకాశాల అన్వేషణలో ఆయన విరామం తీసుకోలేదు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సబ్బుల తయారీలో ఎక్కువగా జంతువుల కొవ్వులనే వాడేవారు. అందువల్ల సంప్రదాయవాదులైన శాకాహారులు సబ్బులను కనీసం తాకేందుకైనా ఇష్టపడేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా శాకాహార నూనెలను ఉపయోగించి సబ్బులను తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు అర్దేశిర్. పలచగా ఉండే శాకాహార నూనెలతో సబ్బుల తయారీ అసాధ్యం అంటూ అందరూ కొట్టి పారేశారు. అందరూ అసాధ్యమన్న దాన్నే ఆయన సుసాధ్యం చేశారు. శాకాహార నూనెలతో విజయవంతంగా సబ్బులను తయారు చేశారు. అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తేవడంతో గోద్రెజ్ సబ్బులు విపరీతంగా జనాదరణ పొందాయి. గోద్రెజ్ సంస్థ వ్యాపార విస్తరణలో తాళాలు, సబ్బులు గణనీయమైన పాత్రనే పోషించాయి. అందుకే గోద్రెజ్ గ్రూప్ ఎన్ని ఇతర రంగాలకు విస్తరించినా, తాళాలు, సబ్బుల ఉత్పత్తిని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. స్వావలంబనతోనే స్వాతంత్య్రం జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో తయారైన ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు వసూలు చేసేది. దీనిని ఖండిస్తూ దాదాభాయ్ నౌరోజీ ఒక పత్రికలో రాసిన వ్యాసాన్ని అర్దేశిర్ చదివారు. ఆ తర్వాత పన్నుల వసూలు అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆర్థిక స్వాతంత్య్రం, స్వావలంబనతోనే స్వాతంత్య్రం సాధించుకోగలమని, కేవలం విదేశీ వస్తువులను బహిష్కరించినంత మాత్రాన సాధించేదీ ఉండదని నిష్కర్షగా స్పష్టం చేశారు. స్వదేశీ ఉద్యమకారులను నిశితంగా విమర్శిస్తూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. పారిశ్రామిక ఆవిష్కరణల కోసమే జీవితంలో ఎక్కువకాలం వెచ్చించిన అర్దేశిర్ గోద్రెజ్ 1936లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తదనంతరం ఆయన స్థాపించిన వ్యాపార సామ్రాజ్యం సువిశాలంగా విస్తరించింది. -
భారతీయుల కలలకు రెక్కలు తొడిగాడు
మన దిగ్గజాలు విమానాన్ని వినువీధుల్లో నడిపిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. భారతీయుల కలలకు రెక్కలు తొడిగిన వాడు ఆయన. ‘మేక్ ఇన్ ఇండియా’ ఇటీవలి రాజకీయ నినాదం కావొచ్చేమో గాని, దశాబ్దాల కిందటే దానిని ఆచరణలోకి తెచ్చిన వాడు ఆయన. భారతీయ పారిశ్రామిక రంగానికి పునాదులను పటిష్టం చేసిన వాడు ఆయన. ఒక రకంగా భారతీయ పారిశ్రామిక రంగానికి పితామహుడు అనదగ్గ ఆయనే జె.ఆర్.డి.టాటా. ఫ్రాన్స్‌లో గడిచిన బాల్యం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 1904 జూలై 4న పుట్టిన ఆయన పూర్తి పేరు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా. తండ్రి రతన్జీ దాదాభాయ్ టాటా పర్షియన్. తల్లి సూజాన్ ఫ్రెంచి మహిళ. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టారు జె.ఆర్.డి.టాటా. టాటా పరిశ్రమలకు మూలపురుషుడైన జెమ్షెడ్జీ టాటాకు రతన్జీ సోదరుడి వరుస. టాటాలు స్వతహాగానే సంపన్నులు. పారిశ్రామిక విప్లవం ఫలితాలను శరవేగంగా అందిపుచ్చుకున్న వాళ్లు. జె.ఆర్.డి.టాటా బాల్యం ఫ్రాన్స్‌లోనే గడిచింది. భారత్‌కు తరలిన కుటుంబం సూజాన్ ఆకస్మిక మరణం తర్వాత రతన్జీ 1923లో తన కుటుంబాన్ని భారత్‌కు తరలించారు. ఉన్నత విద్య కోసం జె.ఆర్.డి.టాటాను ఇంగ్లాండ్‌కు పంపారు. ఇంగ్లాండ్‌లో ఆయన గ్రామర్ స్కూల్లో చేరారు. ఇంజనీరింగ్‌పై ఆసక్తి గల ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదవాలనుకున్నారు. అయితే, దేశంలోని యువకులందరూ తప్పనిసరిగా సైన్యంలో కనీసం ఏడాది కాలం పనిచేయాలన్న ఫ్రాన్స్ ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆయన తిరిగి పారిస్ చేరుకోవాల్సి వచ్చింది. ఫ్రెంచి సైన్యంలో ఏడాది పాటు పనిచేశారు. ఫ్రెంచి సైన్యంలోని లె సాఫిస్ రెజిమెంట్‌లో చేరారు. ఫ్రెంచి, ఇంగ్లిష్ భాషల్లో మంచి పట్టు ఉండటంతో త్వరలోనే కల్నల్ కార్యాలయంలో కార్యదర్శి స్థాయికి ఎదిగారు. సైన్యంలో తప్పనిసరి ఉద్యోగాన్ని ముగించుకున్నాక ఎలాగైనా మళ్లీ ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జిలో చేరాలనుకున్నారు. అయితే, కుటుంబ సంస్థలో పనిచేయడానికి భారత్ వచ్చేయాలంటూ తండ్రి కబురు చేయడంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశారు. టాటా సంస్థతో అనుబంధం తండ్రి పిలుపుతో భారత్ చేరుకున్న జె.ఆర్.డి.టాటా 1925లో టాటా అండ్ సన్స్ కంపెనీలో వేతనం లేని అప్రెంటిస్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1938 నాటికల్లా టాటా అండ్ సన్స్ చైర్మన్‌గా ఎదిగారు. అప్పటికి అది భారత్‌లోనే అతిపెద్ద సంస్థ. ఇక భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుని, 1929లో ఫ్రెంచి పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరుడిగా మారారు. ఒకవైపు టాటా సంస్థలో పనిచేస్తూనే ఉన్నా, ఆయన దృష్టి అంతా విమానయానంపైనే ఉండేది. తీరికవేళల్లో విమానాన్ని నడపడం నేర్చుకున్నారు. అప్పట్లో భారత్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 1929లో పైలట్ లెసైన్స్ పొందారు. పైలట్ లెసైన్స్ పొందిన తొలి భారతీయుడిగా అరుదైన ఘనత సాధించిన జె.ఆర్.డి.టాటా అక్కడితో ఆగిపోలేదు. టాటా అండ్ సన్స్ సంస్థలో 1932లో టాటా ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. తర్వాతి కాలంలో అదే ఎయిర్ ఇండియాగా మారి, భారత ఉపఖండంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా చరిత్ర సృష్టించింది. ఎయిర్ ఇండియా చైర్మన్‌గా ఆయన దాదాపు ముప్పయ్యేళ్లు సేవలందించారు. వైమానిక రంగంలో ఆయన నైపుణ్యానికి గుర్తింపుగా భారతీయ వైమానిక దళం ఆయనకు పలు గౌరవ పదవులను కట్టబెట్టింది. ఆనంద భారతమే ఆశయం జె.ఆర్.డి.టాటా తన ఆధ్వర్యంలో టాటా గ్రూప్‌ను అపారంగా విస్తరించారు. టాటా మోటార్స్, టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్, ఎయిర్ ఇండియా, టాటా టీ, టీసీఎస్ వంటి సంస్థలకు పునాదులు వేశారు. వాటన్నిటినీ విజయవంతంగా లాభాల బాటలో నడిపించారు. వ్యాపార విజయాలతో సంతృప్తి చెందకుండా, ధార్మిక సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. సర్ దోరాబ్జీ టాటా ట్రస్టుకు ట్రస్టీగా సేవలందించారు. బాంబేలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఆస్పత్రిని స్థాపించారు. ఇదే భారత్‌లోని మొట్టమొదటి కేన్సర్ ఆస్పత్రి. శాస్త్ర సాంకేతిక, సామాజిక, కళా రంగాలలో మేలైన బోధన, పరిశోధనల కోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి సంస్థలను స్థాపించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సహా అనేక బిరుదులు, గౌరవాలు దేశ విదేశాల్లో దక్కాయి. అలాగని, తన కంపెనీలను లాభాల బాట పట్టించడం, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం మాత్రమే ఆయన ఆశయం కాదు. భారత్ ఆర్థికశక్తిగా ఎదగడం కంటే, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించే పరిస్థితులు కల్పించడమే తన ఆశయం అంటూ ‘భారతరత్న’ పురస్కారాన్ని స్వీకరిస్తున్నప్పుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. కార్మిక సంక్షేమంలో ప్రభుత్వానికే మార్గదర్శి కార్పొరేట్ సంస్థలకు కార్మిక సంక్షేమం పెద్దగా పట్టదు. కార్మిక సంక్షేమ చట్టాలు ఎన్ని ఉన్నా, వాటిని అవి మొక్కుబడిగా మాత్రమే పాటిస్తాయి. ఇప్పటికీ చాలా కార్పొరేట్ సంస్థలది ఇదే తీరు. అయితే, కార్మిక సంక్షేమానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేని కాలంలో సైతం జె.ఆర్.డి.టాటా తన సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగానే పలు పథకాలను అమలు చేసేవారు. అవి ఇప్పటికీ టాటా సంస్థల్లో అమలవుతున్నాయి. ఉద్యోగి ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరిన సమయం నుంచే ‘ఆన్ డ్యూటీ’గా పరిగణించే పద్ధతికి ఆద్యుడు జె.ఆర్.డి.టాటా. ఉద్యోగి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఒకవేళ ఎలాంటి ప్రమాదానికి గురైనా పరిహారం చెల్లించేలా ఆయన తన కంపెనీ నిబంధనలను రూపొందించారు. తర్వాత ఇవే నిబంధనలతో మన దేశంలో కార్మిక పరిహార చట్టం (వర్క్‌మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్) అమలులోకి వచ్చింది. తమ సంస్థల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఉచిత వైద్యం, ప్రమాద పరిహారం తదితరమైనవి కల్పించడంలో టాటా సంస్థలు దేశంలోని మిగిలిన సంస్థలన్నింటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. పారిశ్రామికవేత్తగా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జె.ఆర్.డి.టాటా కిడ్నీ సమస్యతో బాధపడుతూ 1993 నవంబర్ 29న జెనీవాలో తుదిశ్వాస విడిచారు. పారిస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. జె.ఆర్.డి.టాటా చెప్పిన మాటలు ⇒ డబ్బు ఎరువులాంటిది. పోగుపెడితే ఇంకిపోతుంది. విస్తరిస్తే ఏపుగా పెరుగుతుంది. ⇒ ఏ పనినైనా అనుమానంతో కాదు, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలి. ⇒ సాటి మనుషులకు ప్రేమగా దిశానిర్దేశం చేయగల వాళ్లే నాయకులు కాగలరు. ⇒ లోపభూయిష్టమైన ప్రాధాన్యాలు, సాధ్యంకాని లక్ష్యాలే చాలా సమస్యలకు మూలం. -
ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు
అమరుల స్థూపాల సాక్షిగా వామపక్ష నేతల హెచ్చరిక యడ్లపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని పలువురు వామపక్ష నాయకులు హెచ్చరించారు. మండలంలోని తుమ్మలపాలెం వద్ద ఉన్న అమర్‌నగర్‌లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద బుధవారం సభ జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల సమాధులపై పూలు చల్లి, మృతవీరులకు నివాళులర్పించారు. అనంతరం న్యాయవాది రావిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ధ్వజం ఎత్తారు. మరోమారు ఉద్యమబాట పట్టక తప్పదంటూ హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘మేక్ ఇండియా’ ప్రకటనలకే తప్ప ఆచరణలో ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు వి.కృష్ణయ్య విమర్శించారు. విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానని, లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు పెట్టిస్తానంటూ చెప్పిన మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పాలనను కొనసాగిస్తున్నారన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణకు సిద్ధం అవుతున్నాయన్నారు. దేశాన్ని అమ్మేస్తున్నారు! భారతదేశం ఒకప్పుడు తాకట్టులో ఉండేదని, ఇప్పుటి పాలకులు ఏకంగా అమ్మేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకురాలు ఝాన్సీ అన్నారు. చంద్రబాబు దృష్టి బాకై ్సట్ ఖనిజాలున్న విశాఖపట్నం పైనే తప్ప ,దాని చుట్టూ ఉన్న అడవి బిడ్డలపై లేదన్నారు. 270 గిరిజన గ్రామాలు పొలవరంలో ముంపునకు గురైతే వారికి పునరావాసం కల్పించలేదన్నారు. కమ్యూనిస్టులందరూ ఒకే జెండా కిందకు రావాలని సీపీఐ చిలకలూరిపేట డివిజన్ ఏరియా కార్యదర్శి సీఆర్‌మోహన్ ఆకాంక్షించారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రజలకు కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు.ప్రస్తుత సమాజంలో దోపిడీ తీరు మారిందని, అందుకనుగుణంగా ఉద్యమాల తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు శివయ్య అన్నారు. -
'మేకిన్ ఇండియా' గ్రాండ్ సక్సెస్: మూడీస్
ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా' గ్రాండ్ సక్సెస్ అయ్యిందట. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వెల్లువెత్తుతున్నాయట. భారతదేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 2016లో గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 2004 నుంచి పోలిస్తే ఈ ఏడాది కరెంట్ అకౌంట్ లోటు కంటే ఎఫ్‌డీఐ ప్రవాహాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీనివల్ల భారత్ మళ్లీ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని మూడీస్ తెలిపింది. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సరళీకరణ విధానాలు, మేకిన్ ఇండియా విజయవంతం కావడం లాంటివి ఎక్కువ నిధుల ప్రవాహానికి తోడ్పడాయని మూడీస్ పేర్కొంది. 2016 జనవరిలో నికర విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని, 12 నెలల కాలంలో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఇప్పటివరకు వచ్చాయని చెప్పింది. కరెంట్ ఖాతా లోటును విదేశీ పెట్టుబడులు పూరిస్తున్నాయని మూడీస్ తెలిపింది. -
ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి కసరత్తు
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన ♦ బ్యాంకింగ్ సామర్థం పెంపుపై ♦ దృష్టి పెడతామని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు తాజా పెట్టుబడులను అందించి, పటిష్టపర్చిన అనంతరం వాటి విలీనాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యం పెంపునకూ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ‘భారత్ ఆకాంక్షలు-ఆర్థిక అవసరాలను కేపిటల్ మార్కెట్లు ఎలా నెరవేర్చగలుగుతాయి’ అన్న అంశంపై ఎన్ఎస్ఈ, ఐఐఎఫ్, ఎగ్జిమ్ బ్యాంక్‌తో కలిసి ఐఎఫ్‌సీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సులో జైట్లీ మాట్లాడారు. అందుబాటులో ఉన్న వనరులకు లోబడి ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనం సమకూర్చడం, వాటి పటిష్టతే ధ్యేయంగా కేంద్రం ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వడ్డీరేట్లు తగ్గుతున్న వ్యవస్థలో తయారీ రంగం మరింత పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అవుతుందన్నది తమ విశ్వాసమని అన్నారు. గడచిన ఏడాదిన్నరగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వృద్ధికి దోహదపడే ‘సరళతర విధానం’ దిశగా అడుగులు వేయడం హర్షణీయ పరిణామమని అన్నారు. రేటు కోతకు తగిన స్థూల ఆర్థిక అంశాలు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, విదేశీ మారకపు నిల్వల వంటి స్థూల ఆర్థికాంశాలు పటిష్టంగా ఉన్నట్లు వివరించారు. వ్యాపార వాతావరణం మెరుగుకు కృషి దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నమంతా చేస్తుందని జైట్లీ పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పారదర్శకత నెలకొల్పడానికి తగిన చర్యలు అన్నీ తీసుకుంటున్నామన్నారు. తక్కువ స్థాయిలో చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశంగా వివరించారు. దిగుమతులు పడిపోవడానికి అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కారణమని పేర్కొన్న జైట్లీ.. ఇలాంటి ఒడిడుడుకులు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరని అన్నారు. అంతర్జాతీయంగా ఎన్నో అవరోధాలు ఉన్నా... భారత్ వృద్ధి తగిన ఆర్థిక ఫలితాలను కొనసాగిస్తోందని వివరించారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న రంగాల్లో వ్యవసాయం ఒకటని అన్నారు. రెండేళ్ల నుంచీ నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముద్ర పథకం కింద గత ఆర్థిక సంవత్సరం దాదాపు మూడు కోట్ల మందికి రుణాలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరగాలన్నది లక్ష్యమని తెలిపారు. 25 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి దేశ వ్యాప్తంగా 25 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దేశంలో దాదాపు 160 ఎయిర్‌స్ట్రిప్స్ నిరుపయోగంగా పడిఉన్నట్లు పేర్కొన్నారు. విమానయాన రంగం పురోగతికి తగిన అన్ని ప్రయత్నాలనూ కేంద్రం చేస్తున్నట్లు తెలిపారు. -
యువతకు అండగా ఉంటాం
► స్కిల్స్‌పై శిక్షణకు ప్రణాళిక ► పరిశ్రమలకు ప్రోత్సాహం ► కేంద్ర మంత్రి దత్తాత్రేయ ► పరిశ్రమలు వృద్ధి చెందాలి ► ఉత్సాహంగా సృజన-16 తిమ్మాపూర్ : విద్యార్థులు మాస్టర్స్, రీసెర్చ్ చేయాలని, యువతకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న సృజన-16 రాష్ట్రస్థాయి టెక్నికల్ సింపోజియంను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు ఉన్నత విద్య చాలా ముఖ్యమని, టెక్నికల్ విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కేంద్రం రూ.18 వేల కోట్లు కేటాయించిందన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మేడిన్ ఇండియా లక్ష్యసాధన కోసం ప్రధాని నరేంద్రమోడీ దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లేనని, క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. యువత దేశాభివృద్ధికి, పునఃనిర్మాణానికి కృషి చేయాలని కోరారు. టెక్నాలజీలో దేశాన్ని నంబర్‌వన్‌గా నిలుపుతామన్నారు. చిన్న పరిశ్రమల స్థాపనను కేంద్రం ప్రోత్సహిస్తోందని, రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. పరిశ్రమలు వృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని, సాంకేతిక నైపుణ్యాలతో యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోందన్నారు. సింగరేణిలాంటి సంస్థల్లో ఇంజినీర్ల అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ‘సృజన’ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని, ఆలోచనను పెంచుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్న అతి పెద్ద సంస్థ ఏబీవీపీ అని అన్నారు. పలు సంస్థలు కుల, మత, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తుంటే, తామంతా భారతీయలమని గర్వంగా చెబుతున్న ఏబీవీపీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జేఎన్టీయూ రెక్టార్ కిషన్‌కుమార్‌రెడ్డి, శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ఎం.లక్ష్మారెడ్డి, సెక్రటరీ ముద్దసాని రమేశ్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నకేశవరెడ్డి, అయ్యప్ప, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్జీ, సృజన కార్యక్రమ కన్వీనర్ రాకేశ్, జాయింట్ సెక్రటరీ జగదీశ్, రిసెప్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చిరు వ్యాపారులకు వరం.. ముద్ర యోజన
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురికాకుండా.. కాల్‌మనీ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా శాశ్వత పరిష్కారం చూపడం కోసమే కేంద్రం ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు మంజూరు చేసే ముద్ర యోజన పథకం చిరు వ్యాపారులకు వరం లాంటిదన్నారు. ముద్ర యోజన పథకంపై మంత్రి దత్తాత్రేయ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ముద్ర యోజన కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా రుణాలు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 3,37,237 మంది లబ్ధిదారులకు రూ. 3,045 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. అదే విధంగా ఏపీలో కూడా 6,18,093 మంది లబ్ధిదారులకు రూ. 4,654 కోట్లు బ్యాంకుల ద్వారా ఇప్పించామన్నారు. దేశ వ్యాప్తంగా గతేడాది రూ. 85వేల కోట్ల రుణాలు ఇవ్వగా... ఈసారి లక్షా ఎనభైవేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదాలతో ముందుకెళ్తుంటే ... విపక్షాలు ఓర్వలేక బురద చల్లుతున్నాయని విమర్శించారు. వీసా కార్డు స్థానంలో రూపే కార్డును తీసుకురావడం ద్వారా రూ. 32వేల కోట్లు ఆదా చేయగలిగామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 64 లక్షల మందికి రూపే కార్డులను అందజేసినట్లు వివరించారు. అలాగే తాను ఈ ఏడాది మూడు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని అన్నారం షరీఫ్, సన్నూరు, నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలను దత్తత తీసుకున్నానని, ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పర్యటనలు నిర్వహిస్తామన్నారు. -
మేకిన్ ఇండియాకు ఏరోనాటిక్స్ సొసైటీ ఊతం
రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’కు తమ వంతు సహకారం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం డెరైక్టర్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లుమినరీ లెక్చర్ సిరీస్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ వైమానిక రంగంలో అందుబాటులో లేని పరికరాలు, తయారీ సౌకర్యాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోనాటికల్ సొసైటీల సహకారంతో ఈ లోటును భర్తీ చేసి తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అన్ని సొసైటీలకు లేఖలు రాశామన్నారు. వారి స్పందనల ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని వివరించారు. సెన్సర్లు మొదలుకొని అనేక ఇతర వైమానిక రంగ పరికరాల తయారీకి భారత్ కేంద్రం కావచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైమానిక రంగంలో కీలక పాత్ర పోషించే ఏరోనాటిక్స్ అభివృద్ధికి, విస్తృతికి హైదరాబాద్ సొసైటీ కృషి చేస్తోందన్నారు. వచ్చే నెలలో ఐఆర్ఎన్ఎస్ఎస్ తుది ఉపగ్రహం: ఇస్రో చైర్మన్ దేశీ జీపీఎస్ వ్యవస్థ సాకారమయ్యేందుకు మిగిలిన ఒకేఒక్క ఉపగ్రహాన్ని వచ్చేనెల చివరి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. మొత్తం ఏడు ఉపగ్రహాలతో ఏర్పడనున్న ఈ కొత్త వ్యవస్థ ఇతర వ్యవస్థల కంటే మెరుగైన లొకేషన్ ఆధారిత సేవలు అందిస్తుందన్నారు. ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసిన గగన్, భువన్ (గూగుల్ ఎర్త్ వంటి మ్యాప్) వ్యవస్థలతో కలిపి చూసినప్పుడు దేశీ జీపీఎస్ భారత్‌తో పాటు ఇరుగుపొరుగు దేశాలకు ఎంతో ఉపయుక్త సేవలు అందిస్తుందని వివరించారు. నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెరైక్టర్ శ్యామ్ చెట్టి తదితరులు పాల్గొన్నారు. -
'ప్రధాని ఇంకా సొంత రాష్ట్రం మోజులోనే ఉన్నారు'
ముంబై: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ గుజరాత్ పైనే ఇష్టంతో ఉన్నారని, ఆయన దేశం మొత్తానికి ప్రధానిగా కనపించడం లేదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. జాతీయత, జాతి అంటూ బీజేపీ ఇచ్చే సర్టిఫికెట్లు ఎవ్వరికీ అవసరం లేవని అభిప్రాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదంలో కేంద్ర జోక్యం అనవసరమని సూచించారు. సర్టిఫికెట్లు ఇవ్వకూడదంటూ బీజేపీ నేతలకు ఆయన సూచించారు. జేఎన్‌యూలో జరిగిన అంశంపై మరింత దుమారం రేపాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోకూడదని, ఇది ఏబీవీపీ కి మార్గం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుందన్నారు. ఎవరు జాతీయవాది.. ఎవరు జాతి వ్యతిరేకులో బీజేపీ తేల్చాల్సిన గత్యంతరం లేదంటూ విమర్శించారు. ముంబైలో ఈ నెలలో జరిగిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ.. కార్యక్రమాల నిర్వహణపైనే బీజేపీ దృష్టిపెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి పనులు ముందుగు సాగలేదని.. ప్రతి రెండు నెలలకు ప్రధాని ఓ కార్యక్రమం అంటూ ప్రజలు ముందుకు వస్తారని రాజ్ ఠాక్రే విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం ఏంటో అర్ధం కావడం లేదని, ఢిల్లీలో జరపకుండా ఈ వేడుకలు ముంబైలో ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. -
రాష్ట్రంలో శిల్పాశెట్టి సెల్‌ఫోన్ పరిశ్రమ
‘మేక్ ఇన్ ఇండియా’లో తెలంగాణ స్టాల్ సందర్శించిన శిల్ప సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్న హెచ్‌ఎస్‌జీఐ తెలంగాణలో సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 13 నుంచి ముంబైలో జరుగుతున్న మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భాగంగా.. తెలంగాణ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను శిల్పాశెట్టి దంపతులు సందర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే మైక్రోమాక్స్, సెల్కాన్ కంపెనీలు మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. అదే కోవలో తమ హెచ్‌ఎస్‌జీఐ ద్వారా తెలంగాణలో ‘వియాన్’ బ్రాండ్ పేరిట సెల్ఫోన్ల తయారీ పరిశ్రమ స్థాపనకు వారు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిగాయని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాతో కలసి గత ఏడాది హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ ద్వారా.. వారి కుమారుడు ‘వివాన్’ పేరిట సెల్ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణ స్టాల్లో టీఎస్ఐపాస్ ప్రతులను వివిధ దేశాలు, రాష్ట్రాల పరిశ్రమల ప్రతినిధులు పెద్దఎత్తున తీసుకెళ్తున్నార న్నారని అధికారులు వెల్లడించారు. -
అదృష్టం బాగుండి.. బతికిపోయా: అమితాబ్
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తాను అదృష్టం బాగుండి బతికిపోయానని.. లేకపోతే మంటల్లో చిక్కుకుని ఉండాల్సిన వాడినని బాలీవుడ్ పెద్దమనిషి అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాను అప్పుడే తన పెర్ఫార్మెన్స్ ముగించుకుని అక్కడి నుంచి కారులో బయల్దేరానని, కాసేపటికే అక్కడ మంటలు అంటుకున్నాయని అమితాబ్ చెప్పారు. అయితే అక్కడి వాళ్లు తనను కాసేపు అక్కడే ఉండి.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి వెళ్లాల్సిందిగా కోరారని, కానీ పని ఉండటంతో వెళ్లిపోయానని చెప్పారు. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే, తాను అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయేవాడినని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేవుడి దయ వల్ల వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని, అలాగే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరూ మృతి చెందకపోవడం అదృష్టమని ట్వీట్ చేశారు. అయితే ఇది మాత్రం చాలా భయానకమైన అనుభవం అన్నారు. ఇక బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ కూడా ఈ ప్రమాదం గురించి తన ఫేస్బుక్ పేజీలో రాశాడు. చౌపట్టిలో లైవ్ షో జరుగుతున్నప్పుడు అంత పెద్ద అగ్నిప్రమాదం సంభవించడం చాలా దురదృష్టకరం గానీ, ముంబై పోలీసులు, అగ్నిమాపక శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితిని చాలా చక్కగా హ్యాండిల్ చేశారని అన్నాడు. ఎవరూ కంగారు పడి తొక్కిసలాట జరగకుండా వీఐపీల నుంచి సామాన్యుల వరకు అందరినీ నిమిషాల మీద గ్రౌండునుంచి పంపారని, చిట్టచివరి వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేవరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అక్కడే ఉన్నారని చెప్పారు. T 2145 - First Off : I am safe and well .. a providential escape from fire at Make in India event where i had just finished performing ! — Amitabh Bachchan (@SrBachchan) February 14, 2016 T 2145 - What happened at event ? I just finished my performance got off stage and sat in my car and left .. just then fire on stage broke ! — Amitabh Bachchan (@SrBachchan) February 14, 2016 T 2145 - Production was wanting me to stay & go back on to meet the CM .. had I gone back would have been caught in fire .. providential — Amitabh Bachchan (@SrBachchan) February 14, 2016 T 2145 - But its God's grace that immediate action was taken and the fire brought under control .. and no casualties !! But frightening !! — Amitabh Bachchan (@SrBachchan) February 14, 2016 T 2145 - And thank you for the wealth of good wishes that have come from all .. I never knew so many would be concerned for my well being !! — Amitabh Bachchan (@SrBachchan) February 14, 2016 -
కొత్త సీసాలో పాత సారా 'మేక్ ఇన్ ఇండియా'
భారత్‌లో వ్యాపారాన్ని మరింత సరళతరం చేయడంలో భాగంగా విధానపరమైన సంస్కరణలను తీసుకొస్తామని, పన్నుల వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతామంటూ ప్రపంచ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊదరగొట్టారు. తన మానస పుత్రిక 'మేక్ ఇన్ ఇండియా' విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ముంబైలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 'మేక్ ఇన్ ఇండియా'లో పేర్కొన్న లక్ష్యాలన్నీ కూడా అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 2011లో తీసుకొచ్చిన 'జాతీయ ఉత్పత్తి విధానం'లో ఉన్నవేనన్న విషయాన్ని ట్విట్టర్ యూజర్లు కనిపెట్టడంతో మేక్ ఇన్ ఇండియా డొల్లతనం బయటపడింది. 1. జాతీయ స్థూల ఉత్పత్తిలో.. ఉత్పాదక రంగం వాటాను 2022 నాటికల్లా 16 శాతం నుంచి 25 శాతానికి పెంచడం మేక్ ఇన్ ఇండియా లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. యూపీఏ ఉత్పత్తి విధానంలో కూడా ఇవే అంకెలు, వివరాలు ఉన్నాయి. 2. 2022 నాటికి ఉత్పత్తి రంగంలో అదనంగా పది కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఇది కూడా యూపీఏ ప్రభుత్వం తన రెండో లక్ష్యమని ప్రకటించింది. 3. సమ్మిళిత అభివృద్ధి కోసం గ్రామీణ వలసదారులు, పట్టణ పేదలకు సముచిత నైపుణ్యాన్ని అందిస్తామని 'మేక్ ఇన్ ఇండియా'లో పేర్కొన్నారు. ఈ అంశం కూడా అక్షరం పొల్లుపోకుండా యూపీఏ జాతీయ ఉత్పత్తి విధానం నుంచి తీసుకున్నదే. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలుగా మోదీ ఊదరగొట్టిన లక్ష్యాలన్నీ పాత యూపీఏ విధానంలో ఉన్నవేనని, ఇది కొత్త సీసాలో పాత సారా కథలాంటిదేనని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌ను చైనాలాగా ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 'మేక్ ఇన్ ఇండియా' విధానాన్ని 2014 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ తీసుకొచ్చారు. -
రూ.21 కోట్ల అద్దె ఎవరు కడతారు..?
సాక్షి, ముంబై: ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ఎంఎంఆర్డీఏ మైదానంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ జోరుగా సాగుతోంది. అయితే కార్యక్రమానికి వినియోగిస్తున్న మైదానం అద్దె విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అద్దె చెల్లించే ప్రసక్తే లేదని ఎంఎంఆర్డీఏ ఎంఐడీసీ స్పష్టం చేయడంతో మరి రూ.21 కోట్లు ఎవరు కడతారన్నది ప్రశ్నార్థకమైంది. బీకేసీలో శనివారం నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. వారం రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 12 రోజుల ముందు అదీనంలోకి తీసుకుని ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏర్పాట్లు చేసిన రోజులకు సగం, కార్యక్రమం ముగిసేలోపు మిగతా అద్దె వసూలు చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మైదానాన్ని గతంలో ఉచితంగా ఇచ్చేవారు. ఇటీవల ఓ కార్యక్రమంపై తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెమ్మార్డీయే ఈ మైదానాన్ని ఉచితంగా ఇవ్వడం నిలిపేసింది. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం రాయితీ ఇస్తోంది. ఆ ప్రకారం మేకిన్ ఇండియా కార్యక్రమానికి రూ.21 కోట్లు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఎంఐడీసీకి ఎమ్మెమ్మార్డీయే స్పష్టం చేయగా చెల్లించలేమని ఎంఐడీసీ తెలిపింది. సమావేశమూ ఏర్పాటు చేయలేదు.. మైదానం ఉచితంగా ఇవ్వాల్సి వస్తే నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెమ్మార్డీయే ఓ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుంది. అయితే మేకిన్ ఇండియా కార్యక్రమానికి అద్దెకు ఇచ్చే ముందు అలాంటి సమావేశం జరగలేదు. దీంతో కార్యక్రమం అద్దె ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భారీ అగ్నిప్రమాదం
-
హునాన్ ప్రావిన్స్‌కు నిమ్జ్‌లో భూ కేటాయింపులు!
సాక్షి, హైదరాబాద్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన కంపెనీకి మెదక్ జిల్లాలోని నిమ్జ్‌లో భూములు కేటాయించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆసక్తి కనబరుస్తోంది. ముంబైలో మేక్ ఇన్ ఇండియాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్‌ను శనివారం హునాన్ ప్రావిన్స్‌కు చెందిన 12 మంది ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో హునాన్‌కు చెందిన కంపెనీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, అందుకు 2,500 నుంచి 3 వేల ఎకరాలు కావాల్సిందిగా ప్రతినిధి బృందం విన్నవించింది. దీనికి స్పందించిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మెదక్ జిల్లాలోని నిమ్జ్‌లో భూకేటాయింపులు చేస్తామన్నారు. -
పారిశ్రామికులారా.. రారండి
►భారత్‌లో పెట్టుబడులకిదే అదను ►ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ భరోసా ►‘మేక్ ఇన్ ఇండియా’ వీక్ ప్రారంభం ముంబై: పెట్టుబడులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమంటూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారదర్శకమైన, స్థిరమైన పన్ను విధానాలను అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. లెసైన్సుల విధానాలను సరళతరం చేయడం, కంపెనీ చట్టం ట్రిబ్యునల్ .. మేధోహక్కుల పరిరక్షణకు మరింత సమర్థ యంత్రాంగం వంటి ఎన్నో సంస్కరణలను అమలు చేయనున్నట్లు వివరించారు. భారత తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను తెలియజేసే లక్ష్యంతో తలపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వీక్‌ను శనివారం ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వెల్లడించారు. స్వీడన్ ప్రధాని క్యెల్ స్టెఫాన్ లోఫెన్, ఫిన్లండ్ ప్రధాని జుహా పెట్రి సిపిలా తదితర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా.. భారీ బ్రాండ్... గతంలో ఎన్నడూ ఎరుగనంత భారీ బ్రాండ్‌గా మేక్ ఇన్ ఇండియాను మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ తయారీ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు. ‘ఇది ఆసియా శతాబ్దం. దీన్ని మీ శతాబ్దంగా చేసుకోవాలనుకుంటే భారత్ కేంద్ర బిందువుగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగం కావాలన్నది నా సలహా. భారత్‌లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని, వృద్ధిలో పాలు పంచుకోవాలని ఇక్కడున్న వారితో పాటు ఇక్కడికి రానివారిని కూడా ఆహ్వానిస్తున్నాను’ అని మోదీ చెప్పారు. పన్నులపరంగా ఇప్పటికే పలు సవరణలు చేశామని, మార్పుల్లేని పారదర్శక, స్థిరమైన పన్నుల విధానాలను అమల్లోకి తెస్తామన్నారు. ‘ఇంకా వేచి చూస్తూ కూర్చోవద్దు. విశ్రమించొద్దు. భారత్లోఅపార అవకాశాలుఅందిపుచ్చుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపునిచ్చారు. తయారీకి తోడ్పాటు తయారీ రంగానికి తోడ్పాటునిచ్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. భారత వృద్ధి రేటు 7 శాతానికి పైగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడుతుందని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలే అంచనా వేస్తున్నాయన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక 48 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. తయారీ రంగంలో అవకాశాలను వివరిస్తూ... 50 నగరాల్లో మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీ పెట్టుబడులతో రోడ్లు, పోర్టుల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. మేకిన్ ఇండియా వీక్ ప్రారంభం సందర్భంగా పలు స్టాల్స్‌ను మోదీ ఈ సందర్భంగా సందర్శించారు. తర్వాత రతన్ టాటా, ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటి పారిశ్రామిక దిగ్గజాలతో విందులో పాల్గొన్నారు. టైమ్ ఇండియా తొలి విడత పురస్కారాలను టాటా స్టీల్ తదితర సంస్థలకు అందజేశారు. మేక్ ఇన్ ఇండియా వీక్ విశేషాలివీ.. ఫిబ్రవరి 18 దాకా జరిగే మేక్ ఇన్ ఇండియా వీక్‌లో సుమారు 2,500 పైచిలుకు విదేశీ, 8,000 పైచిలుకు దేశీ కంపెనీలు పాల్గొంటున్నాయి. 68 దేశాల నుంచి ప్రభుత్వాధికారుల బృందాలు, 72 పైగా దేశాల నుంచి వ్యాపార బృందాలు హాజరవుతున్నాయి. వేదికలో పలు రంగాలకు సంబంధించి దేశ విదేశీ సంస్థల పెవిలియన్లు ఉం టాయి. పలు రంగాలు, విధానాలు, మేధో హక్కులు తదితరాలపై సెమినార్లు ఉం టాయి. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడి ప్రతిపాదనలు రాగలవని ఆతిథ్య రాష్ట్రం మహారాష్ట్ర అంచనా వేస్తోంది. రూ.21,400 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు మేక్ ఇన్ ఇండియా వీక్ తొలి రోజున శనివారం సుమారు రూ.21,400 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఎల్సీడీ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం స్టెరిలైట్ గ్రూప్ సంస్థ ట్విన్‌స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ)తో దాదాపు రూ.20,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. విదర్భ ప్రాంతంలో జ్యూస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్తాన్ కోకకోలా బెవరేజెస్, జైన్ ఇరిగేషన్, మహారాష్ట్ర వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రూ.1,400 కోట్ల పెట్టుబడులతో గార్మెంట్స్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ఎంఐడీసీతో రేమండ్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే పదేళ్లలో భారత్‌లో 100 కోట్ల డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టనున్నామని చైనా కంపెనీ శానీ గ్రూప్ ప్రెసిడెంట్ టాంగ్ షివ్గో తెలిపారు. భారత్‌లో పెట్టుబడులను పెంచుకోవడంపై తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లాఫ్వెన్ చెప్పారు. పెట్టుబడులకు విఘాతం కలిగించే అంశాల పరిష్కారంపై ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఫిన్లాండ్ ప్రధాని సిపిలా చర్చించారు. -
ముంబైలో ఒరాకిల్ క్లౌడ్ కాన్ఫరెన్స్
ముంబై: సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ వార్షిక అంతర్జాతీయ క్లౌడ్ కాన్ఫరెన్స్‌ను ముంబైలో నిర్వహించనుంది. మేకిన్ ఇండియా వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ గ్లోబల్ సీఈవో శాఫ్రా కాట్జ్ శనివారం ఈ విషయం వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా 35 ఏళ్లలోపు యువ జనాభా భారత్‌లోనే ఉందని, ఇక్కడ అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా నినాదాలు మార్మోగుతున్న ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ సంస్థలు భారత్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు అత్యంత అనువైనదిగా కాట్జ్ పేర్కొన్నారు. ఒరాకిల్ భారత్‌లో దాదాపు 40 కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో కాట్జ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒరాకిల్ బెంగళూరులో అత్యాధునిక క్యాంపస్‌తో పాటు హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతీయ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్లను ఒరాకిల్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఏటా 5,00,000 పైచిలుకు భారతీయ విద్యార్థులకు శిక్షణనివ్వనుంది. ఇందుకు సంబంధించి ప్రధాని మోదీతో కాట్జ్ భేటీ అయ్యారు. భారత్‌లో దాదాపు పాతికేళ్లుగా ఒరాకిల్ కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికా కార్యాలయం తర్వాత అత్యధికంగా భారత్‌లోనే 40,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. -
టెక్నాలజీని వినియోగించుకోండి
భారతి శిక్షా సంస్థాన్ పాఠశాలలకు ప్రధాని సూచన న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ అనుబంధ పాఠశాలలకు సూచించారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి విజ్ఞానం ఎక్కడనుంచి లభించినా స్వీకరించాలని అన్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అన్ని రంగాల్లో అత్యవసర అంశంగా మారిందన్నారు. శుక్రవారం మోదీ విద్యాభారతి అఖిల భారతి శిక్షా సంస్థాన్ పాఠశాలల ప్రిన్సిపాళ్ల సదస్సులో ప్రసంగించారు. అఖిల భారతి శిక్షా సంస్థాన్ నడుపుతున్న 12 వేల స్కూళ్లలో ఎల్ఈడీ వాడాలని, దీంతో విద్యుత్‌తోపాటు డబ్బును కూడా ఆదా చేయవచ్చని అన్నారు. ప్రధానికి డాక్టర్ ఆఫ్ లా పురస్కారం.. ప్రధాని మోదీని డాక్టర్ ఆఫ్ లా పురస్కారంతో సత్కరించాలని బెనారస్ హిందూ వర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 22న జరిగే స్నాతకోత్సవంలో పురస్కారాన్ని అందజేయాలని భావిస్తోంది. కాగా,‘మేక్ ఇన్ ఇండియా’ వారోత్సవాలు శనివారం నుంచి ముంబైలో మొదలవుతున్నాయి. వీటిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. -
సాగరశాంతి సమష్టిబాధ్యత: మోదీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘సముద్రజలాలపై శాంతి, సుస్థిరత తీరప్రాంత దేశాలన్నిటి సమష్టి బాధ్యత. ప్రపంచశాంతికి ఇదే కీలకం. ఈ లక్ష్యాన్ని, బాధ్యతను తీరప్రాంత దేశాలన్నీ స్వీకరించాలి.’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సముద్రతీర దేశాలతో వ్యూహాత్మక, సుహృద్భావ సంబంధాలకు ప్రాధాన్యమిస్తామని, ఇందుకోసం ప్రపంచ మొట్టమొదటి మారిటైమ్ సదస్సును ఈ ఏప్రిల్‌లో ముంబైలో నిర్వహించనున్నామని ప్రధాని పేర్కొన్నారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐఎఫ్ఆర్-2016)లో భాగంగా ఆదివారం విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళం అద్భుతరీతిలో ప్రదర్శించిన సాహస విన్యాసాలను ప్రధాని తిలకించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఎఫ్ఆర్లో భాగంగా 51 దేశాల నౌకాదళాలు విశాఖ బీచ్‌రోడ్‌లో అంతర్జాతీయ పరేడ్ నిర్వహించాయి. సాహస విన్యాసాల అనంతరం బీచ్‌రోడ్‌లో అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి నరేంద్రమోదీ ప్రసంగించారు. విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయమని, విపత్తుబారిన పడినా 14 నెలల్లోనే ధైర్యంగా తేరుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే.... ఆర్థికాభివృద్ధికి సముద్రాలే మూలాధారం ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవడానికి సముద్రాలు మనకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వాటి నుంచి ఎంతగా ప్రయోజనం పొందుతామన్నది తీరప్రాంత దేశాల సమర్థతపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ వాణిజ్యం 90శాతం సముద్రాల ద్వారానే జరుగుతోంది. గత 50 ఏళ్లలో సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం 6 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 60శాతం ఇంధన ఉత్పత్తుల రవాణా సముద్రమార్గాల గుండానే సాగుతోంది. అందుకే సముద్రాలు ప్రపంచ శాంతికి, అభివృద్ధికి వారధులుగా నిలవాలి. సముద్రాలపై సుస్థిర శాంతి సాధించాలి తీరప్రాంత దేశాల మధ్య రాజకీయ విభేదాలు సమస్యలను మరింత జఠిలం చేస్తాయి. నౌకాయాన స్వాతంత్య్రాన్ని అందరూ గౌరవించాలి. తీరప్రాంత సవాళ్ల విషయంలో పరస్పరం సహకరించుకోవాలి గానీ పోటీపడకూడదు. దేశాల మధ్య సుహృద్భావంతోనే ప్రపంచ శాంతి, సుస్థిరతలను సాధించగలం. అందుకు ఆయా దేశాల నౌకాదళాలు తమవంతు భూమిక నిర్వర్తించాలి. అందుకు అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన చక్కటివేదికగా మారింది. 50 దేశాల నౌకాదళాలు పాల్గొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కీలకమైన సముద్రాలను 4సవాళ్ల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అవేంటంటే.. ► ప్రపంచ శాంతికి, సుస్థిరతకు భంగం కలిగిస్తున్న సముద్రతల ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. భారతదేశం కూడా సముద్రతల ఉగ్రవాద బాధిత దేశమే. ► సముద్రపు దొంగల ముప్పును పారదోలాలి. ► సునామీ, తుపానులు, ఇతర ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థను ఏర్పరచాలి. ► ఇంధన లీకేజీ, వాతావరణ కాలుష్యం వంటి మానవతప్పిదాల నుంచి సముద్రాలను పరిరక్షించాలి. భారత్ వ్యూహాత్మక భూమిక పోషిస్తోంది: తీరప్రాంత భద్రతలో భారత్ కీలక భూమిక పోషిస్తోంది. 7,500కి.మీ. పొడవైన తీరప్రాంతం ఉన్న భారత్‌కు ఘనమైన సముద్రయాన చరిత్ర ఉంది. సింధు నాగరికత కాలంలోనే గుజరాత్‌లోని లోథాల్లో పోర్టు నిర్మించి విదేశీ వర్తకం సాగించింది. హిందూ మహాసముద్రం మధ్యలో కీలక వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటంతోపాటు నౌకాయాన మార్గాల ద్వారా భారత్ మారిటైమ్ భద్రతలో తనవంతు పాత్ర పోషిస్తోంది. జాతీయ భద్రత దృష్ట్యా సముద్రాలపై ప్రత్యేకించి హిందూ మహాసముద్రంలో శాంతి నెలకొల్పడంలో భారత్ ప్రధాన భూమికి పోషిస్తోంది. అందుకోసం రూపొందించిన విజన్ ‘సాగర్(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్) మా దృక్పథాన్ని తెలియజేస్తోంది. సముద్రాల మీద ప్రత్యేకించి హిందూ మహాసముద్రంపై భారతదేశ రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాం. తీరప్రాంత దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు నెలకొల్పడానికి ప్రాధాన్యమిస్తాం. గ్లోబల్ మారిటైమ్ సదస్సును ఏప్రిల్ లో ముంబైలో నిర్వహించనున్నాం. ‘మేకిన్ ఇండియా’లో పెద్దపీట ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, నౌకానిర్మాణ రంగాలకు పెద్దపీట వేశాం. అందుకోసం స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా 80 కోట్ల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. సముద్ర వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తీరప్రాంతాల ప్రగతికి కొత్త ఆర్థిక పునాదులు నిర్మిస్తాం. తీరప్రాంతాలను కేవలం పర్యాటక అభివృద్ధికే పరిమితం చేయాలన్నది మా విధానం కాదు. తీరప్రాంత యువతకు సముద్ర పరిశోధన, మారిటైమ్ పరిశోధన, అభివృద్ధి, పర్యావరణ అనుకూల, మత్స్య పరిశ్రమ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తాం. దాన్ని మా బ్లూ ఎకానమీలో భాగం చేస్తాం. మేకిన్ ఇండియాపై ఫిబ్రవరి 13 నుంచి వారంరోజులపాటు ముంబైలో గ్లోబల్ సదస్సు నిర్వహిస్తున్నాం. -
ప్రాణాధార ఔషధాలు మరింత ప్రియం!
దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపును తొలగించిన కేంద్రం న్యూఢిల్లీ: కేన్సర్, హెచ్‌ఐవీసహా ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వాడే దాదాపు 74రకాలైన అత్యవసర ఔషధాలను కేంద్రం దిగుమతి సుంకం మినహాయింపు జాబితా నుంచి తొలగించడంతో దేశీయంగా వీటి ధరలు పెరగనున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు కష్టాలు మొదలుకానున్నాయి. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారైన ఔషధాల ఉత్పిత్తితోపాటు గిరాకీ పెంచడం, చైనా నుంచి ఔషధాల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం గత వారం ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతలు తగ్గడంతో ఏర్పడే ఔషధాల కొరతను అధిగమించాలంటే దేశీయంగా ఔషధాల ఉత్పత్తిని పెంచాలని, ఇందుకు కనీసం ఏడాది పడుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ సెక్రటరీ డీజీ షా తెలిపారు. ఈలోపు కేన్సర్, హెచ్ఐవీ, గుండె సంబంధిత, మూత్ర పిండాల్లో రాళ్లు, మధుమేహం, మూర్ఛ, ఎముకలు, ఇన్ఫెక్షన్లలో వాడే యాంటీబయోటిక్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, లుకేమియా, హెపటైటిస్, అలర్జీలు తదితర వ్యాధుల నివారణలో వాడే అతి ముఖ్యమైన 74 రకాల ఔషధాల ధరలు మరింత పెరగొచ్చు. కస్టమ్స్ సుంకం మినహాయింపు తొలగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ నిర్ణయం తీసుకోవడం వల్ల ధరలు దాదాపు 35% పెరిగేవీలుందని ఫార్మా వర్గాలు అంచనావేశాయి. -
మోదీ మొగ్గు ఎమ్మెన్సీలకే
♦ చిన్న సంస్థలకు ప్రోత్సాహకం లేదు: ఈటల విమర్శ ♦ ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీకి హాజరు సాక్షి, న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో మాత్రం బహుళజాతి కంపెనీలకు దారులు తీస్తూ వారివైపే మొగ్గుతున్నారు తప్ప చిన్న సంస్థలకు మేలు చేకూర్చడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్రం నుంచి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లకు ప్రోత్సాహం ఉండటం లేదన్నారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని చెప్పి రెండేళ్లు అయింది. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. 14వ ఆర్థిక సంఘం 42 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా కేంద్ర ప్రాయోజిత పథకాలను తగ్గించారు. పలు పథకాలను రద్దు చేశారు. కస్తూర్బా పాఠశాలలనూ ఎత్తేశారు. ఐసీడీఎస్ నిధుల్లో కోతలు పెట్టారు’’ అని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి సీఎస్టీ పరిహారం తక్షణమే ఇవ్వాలని జైట్లీని అడిగామన్నారు.. 2012-13 వరకే కాకుండా ఎప్పటివరకైతే జీఎస్టీ అమలు జరగదో అప్పటివరకు రాష్ర్టం కోల్పోతున్న ఆదాయాన్ని భర్తీ చేయాలని కోరామన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ యూనిట్ల ప్రోత్సాహ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1.5 కోట్ల రూ. 5 కోట్లకు పెంచడంతోపాటు వాటికి 5 శాతం వడ్డీ రాయితీ, పన్ను రాయితీ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని నెల నెలకు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని జైట్లీని అడిగామని, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా తెలంగాణకు ఎన్ని నిధులు ఇస్తారని అడిగినట్లు చెప్పారు. ‘‘కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కూడు, గుడ్డపై దృష్టి కేంద్రీకరించాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. పేదల పట్ల ప్రేమ ఉంటే మా పథకాలకు మద్దతు ఇవ్వండి.. దేశ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా తెలంగాణ వృద్ధి రేటు 15 శాతం ఉంది. మా ఉత్సాహానికి కేంద్రం కొంత తోడైతే బాగుంటుంది..’’ అని జైట్లీని కోరామన్నారు. సూరజ్‌కుండ్ మేళా సందర్శన: హరియాణాలోని సూరజ్‌కుండ్ మేళాను శనివా రం రాత్రి మంత్రి ఈటల సందర్శించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెబుతూ మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను అభినందించారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత వృద్ధి చెందినా మన సంస్కృతిని మరువరాదన్నారు. -
ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!
కస్టమ్స్ సుంకం మినహాయింపుల ఉపసంహరణ న్యూఢిల్లీ: లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ (ప్రాణాధార ఔషధాలు) దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాల మినహాయింపుల్ని ఉపసంహరించుకుంది. ఈ ఔషధాలపై 16 నుంచి 20 శాతం వరకూ కస్టమ్స్ సుంకాలను విధించనున్నట్లు కూడా సమాచారం. ‘మేక్ ఇన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా దేశంలోనే కీలక ఔషధాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య మంత్రిత్వశాఖలోని ఫార్మా శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇంతక్రితం ప్రభుత్వం వైద్య పరికరాలపై సుంకాలను 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. -
సహకారం పెంపొందాలి
భారత్-ఇజ్రాయెల్ సంబంధాలపై సుష్మాస్వరాజ్ జెరూసలెం: భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య బంధం మరింత బలపడాలని, కొత్త కొత్త రంగాల్లో పరస్పర సహకారం విస్తృతం కావాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో జరిగిన భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. స్థానిక భద్రతలో వినూత్న ఆలోచనలు, సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అన్నట్లుగా ఈ రెండు దేశాల మధ్య బంధానికి ఆకాశమే హద్దు కావాలన్నారు. రెండు దేశాల భాగస్వామ్యంలో సరికొత్త భవిష్యత్తును దర్శించాలని, భద్రత, వినూత్న ఆవిష్కరణలు, విద్య, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సహాయ, సహకారాలను విస్తృతపర్చుకోవాలన్నారు. ఆర్థిక సంబంధాలే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తాయని ఆమె చెప్పారు. పెట్టుబడులు, తయారీ, సేవల రంగాల నుంచి మేక్ ఇన్ ఇండియా వైపు కదిలామని మంత్రి తెలిపారు. నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ నాయకులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో ఉన్నతమైన సంబంధాలను కొనసాగించాలని భారత్ భావిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఇరు దేశాల ప్రజలను ఉద్దేశించి సుష్మ మాట్లాడుతూ భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పౌర సమాజాలు, పార్లమెంటేరియన్స్, మహిళా సంక్షేమం వంటి అంశాల్లో అభిప్రాయాలను పరస్పరం పంచుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలకపాత్రను పోషిస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న దేశాల్లో భారత్, ఇజ్రాయెల్ ఉన్నాయనే విషయాన్ని గమనించాలన్నారు. భారతీయులు కష్టజీవులని ఆమె అభివర్ణించారు. -
328 ఒప్పందాలు
-
328 ఒప్పందాలు
విలువ రూ.4.67 లక్షల కోట్లు: సీఎం చంద్రబాబు ప్రకటన (విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సు మంగళవారం ముగిసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ మూడురోజుల సదస్సులో మొత్తం 328 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, తద్వారా రూ.4.67 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. చివర్లో మరికొందరు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ విలువను దీన్లో చేర్చలేదని అన్నారు. ‘భారత్ సహా 41 దేశాల నుంచి 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు 32 ఎంఓయూలు కుదరగా... 2వ రోజు 248, మూడోరోజు 48 ఒప్పందాలు జరిగాయి. దాదాపు ప్రతి రంగంలోనూ దిగ్గజ సంస్థలు ముందుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. తయారీ రంగానికి సంబంధించి సుభాష్ చంద్ర సారథ్యంలోని ఎస్సెల్ గ్రూప్, అనిల్ అంబానీకి చెందిన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్, అమరరాజా, ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫార్మాలో దివీస్ ల్యాబొరేటరీస్, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ వంటి దిగ్గజాలు ముందుకొచ్చాయి. విద్యుత్ రంగంలో ట్రైనా సోలార్, సుజ్లాన్ వంటివి ఎంఓయూ చేసుకున్నాయి’ అని వివరించారు. రిటైల్ సహా మైనింగ్‌లోనూ దిగ్గజాలు రిటైల్ రంగంలో వాల్‌మార్ట్, ఫ్యూచర్ గ్రూప్, అరవింద్ రిటైల్, స్పెన్సర్స్ వంటి పెద్ద కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. మైనింగ్‌కు సంబంధించి ఎన్ఎస్ఎల్ మైనింగ్, సంఘీ సిమెంట్స్, మై హోమ్ గ్రూప్ ముందుకొచ్చాయని, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయని చెప్పారు. నగరాల అభివృద్ధికి సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. సదస్సుకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని, వచ్చే 30 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుకెళుతుందని పేర్కొన్నారు. ఎగుమతులకు అవసరమైన వస్తువుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారుతుందని, ముఖ్యంగా హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, సోలార్ రంగాలకు విపరీతమైన అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. గత రెండురోజుల్లో 44 ద్వైపాక్షిక సమావేశాల్లో తాను పాల్గొన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సదస్సు నిర్వహించేందుకు సీఐఐ అంగీకరించిందని వెల్లడించారు. ఎస్సెల్ ఇన్ఫ్రా భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ సోలార్ ఎక్విప్మెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జీ-టీవీ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఇందుకోసం చైనాకు చెందిన గోల్డెన్ కంకార్డ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (జీసీఎల్)తో కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13,000 కోట్లు) పెట్టుబడి పెడతామని, 15వేల ఉద్యోగాలొస్తాయని ఎస్సెల్ గ్రూప్ అధిపతి సుభాష్ చంద్ర మంగళవారం నాడిక్కడ చెప్పారు. ఈ యూనిట్‌కు దాదాపు 2వేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుందన్నారు. సోలార్ పరికరాల తయారీతో పాటు భారత, చైనా కంపెనీలు వివిధ సంస్థల్ని ఏర్పాటు చేయటం కోసం స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్కును కూడా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.58,500 కోట్లు) పెట్టుబడి అవసరమవుతుందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా మం గళవారం సీఎం చంద్రబాబునాయుడి సమక్షంలో ఆయన ఎంవోయూపై సంతకాలు చేశా రు. ఈ సందర్భంగా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ‘మేం ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నది మీడియాతో సహా సేవల రంగంలోనే. ప్రధానమంత్రి మేకిన్ ఇండియా పిలుపు మేరకు విదేశీ భాగస్వాములతో కలసి ఏదైనా ఏర్పాటు చేయాలని వివిధ దేశాలకు వెళ్లా. ఎన్ని తిరిగినా తయారీలో చైనాను మించిన దేశం కనిపించలేదు. అందుకే చైనా కంపెనీతో జట్టుకట్టా. ఇండియాలో చూసినపుడు వ్యాపారం చేయటానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపించింది. అందుకే ఇక్కడ పెట్టుబడికి సిద్ధమయ్యా’ అని వివరించారు. మేకిన్ ఇండియాలో తామూ భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని జీసీఎల్ వైస్ చైర్మన్ షు హువా చెప్పారు. తాము పెట్టుబడులతో పాటు ఫొటో వోల్టాయిక్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని కూడా ఇండియాకు తీసుకొస్తామని తెలిపారు. ఈ ఎక్విప్మెంట్ తయారీ కేంద్రాన్ని, స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా ఖరారు కాలేద ని, దీనిపైనే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. -
చైనా కరెన్సీ క్షీణత ఆందోళనకరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చైనా కరెన్సీలో క్షీణత భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర వాణిజ్య, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి రవ్నీత్ కౌర్ చెప్పారు. మూడేళ్లుగా మనదేశ ఎగుమతులు క్షీణిస్తుండటం ఆందోళనకరమైన అంశమని ఆమె అన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సులో సోమవారం ‘మేకిన్ ఇండియా - గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ స్ట్రాటజీ’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో రవ్నీత్ కౌర్ మాట్లాడుతూ దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో తగిన స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. 35 తయారీరంగ అంశాల్లో మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా భారత్ ప్రపంచ మార్కెట్లో బలీయ శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. ‘మేకిన్ ఇండియా’ అంశంపై ఫిబ్రవరిలో ముంబైలో గ్లోబల్ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోల్స్‌రాయిస్ ఇండియా ప్రై లిమిటెడ్ ప్రెసిడెంట్ కిశోర్ జయరామన్ మాట్లాడుతూ తమ సంస్థ వాహనాలను పూర్తిగా భారత్‌లో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అందుకు ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. దేశ స్థూల ఉత్పత్తిలో తయారీ రంగం వాటాను 16 శాతం నుంచి 25 శాతానికి పెంచడానికి ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం దోహదపపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్ ఇండియా ఎండీ జోష్ ఫోల్గర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను దేశీయంగా తయారు చేయడానికి భారతదేశం అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. లేకపోతే 2029నాటికి భారత ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల దిగుమతులు క్రూడాయిల్ దిగుమతులను అధిగమించే అవకాశం ఉందన్నారు. తమ సంస్థ ఏడాదిలో దేశంలో 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ రంగం 2029నాటికి 1.50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదుగుతుందని ఆయన చెప్పారు. అమెరికాకు చెందిన పాటన్ బోగ్స్ సంస్థ అంతర్జాతీయ సలహాదారు ఫ్రాంక్ జి.విస్నర్ మాట్లాడుతూ భారత ఎగుమతులు మూడేళ్లుగా క్షీణిస్తుండటం ఆందోళనకరమన్నారు. భారత్‌లో భూమి, పన్ను, కార్మిక చట్టాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ చర్చాగోష్టిలో దివీస్ లేబరేటరీస్ ఎండీ కిరణ్ ఎస్. దివి తదితరులు పాల్గొన్నారు. -
మోదీతో క్లోజింగ్ ఇండియా: తపన్‌సేన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం మేకిన్ ఇండియాకు బదులు క్లోజింగ్ ఇండియాగా మారనుందని సీఐటీయూ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ తపన్‌సేన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రచారహోరు, ఆకర్షణీయ నినాదాలు తప్ప దేశంలో పారిశ్రామికరంగాన్ని, ఉత్పత్తిరంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు లేవన్నారు. ఉన్న పరిశ్రమలే మూతపడే విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. గురువారం నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన సీఐటీయూ జాతీయకార్యదర్శి వరలక్ష్మి, రాష్ట్రనాయకులు రమ, సాయిబాబాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని హెచ్ఎంటీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి మూసేసేందుకు, విశాఖ పోర్టుతో సహా కోల్‌కతా, ముంబయి పోర్టులను ప్రై వేటీకరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెప్పారు. -
మేకిన్ ఇండియా నౌకలకు సాయం
భారత్‌లో నిర్మించే నౌకలకు 20% ఆర్థిక సహకారం కేంద్రం కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయంగా నౌకానిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో నిర్మించిన నౌకలపై 20 శాతం మేర ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ. 4,000 కోట్ల మేర బడ్జెట్‌పరమైన మద్దతు అవసరమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులు, టర్నోవరుపరంగానే కాకుండా ఉపాధి అవకాశాలపరంగా కూడా మౌలిక రంగం స్థాయిలో ప్రభావం చూపే నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నౌకానిర్మాణ రంగానికి పన్నులపరమైన ప్రయోజనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగ హోదా తదితర అంశాలు కూడా తాజా ప్రతిపాదనలో ఉన్నాయి. -
రాహుల్ కు చుక్కలు చూపించిన అమ్మాయిలు!
-
రాహుల్ కు చుక్కలు చూపించిన అమ్మాయిలు!
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకాలు 'స్వచ్ఛ భారత్', 'మేక్ ఇన్ ఇండియా'.. ఈ పథకాలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు ఆయనకే తిప్పికొట్టినట్టు కనిపించాయి. రాహుల్ గాంధీ బుధవారం బెంగళూరులోని ప్రతిష్టాత్మక మౌంట్ కార్మెల్ మహిళా కాలేజీలో ప్రసంగించారు. విద్యార్థులను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్ గాంధీ 'సూటు-బూటు' ప్రభుత్వం అంటూ మోదీ ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు కురిపించారు. మోదీ ప్రభుత్వం మాటలైతే మాట్లాడుతుందికానీ.. దానికి దిశానిర్దేశం లేదని ధ్వజమెత్తారు. 'మోదీ ప్రభుత్వం చెప్తున్న ఎన్నో మాటలు వింటున్నా. కానీ స్పష్టమైన దిశానిర్దేశం కనిపించడం లేదు. సీరియస్ గా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యూహాత్మక జాతీయ పథకం ఉండాల్సిన అవసరముందా? అసలు ఇది పనిచేస్తుందా?' అని రాహుల్ ప్రశ్నించారు. ఆహూతుల నుంచి 'లేదు' అనే సమాధానం వస్తుందని ఆశించారు. కానీ ఆయనను బిత్తరపరుస్తూ 'అవును' అని విద్యార్థినుల నుంచి బదులు వచ్చింది. దీంతో తడబడ్డ రాహుల్ మరింత బిగ్గరగా 'అది అమలవ్వడం మీరు చూశారా?' అడిగారు. 'అవును' (యెస్) అంటూ మరింత బిగ్గరగా అమ్మాయిలు సమాధానం ఇచ్చారు. ఈ అనుకోని షాక్ నుంచి తేరుకున్న ఆయన 'ఓకే. స్వచ్ఛ భారత్ బాగా పనిచేస్తున్నట్టు నాకైతే కనిపించడం లేదు' అని చెప్పారు. అనంతరం రాహుల్ మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. 'మేక్ ఇన్ ఇండియా' పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈసారి కొంతమంది అవును, కొంతమంది కాదు అన్నారు. ఇక ప్రశ్నలు అడుగడం మానుకున్న రాహుల్ మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదంటూ తన ప్రసంగాన్నికొనసాగించారు. -
చిత్ర పరిశ్రమతో ‘మేక్ ఇన్ ఇండియా’ విస్తృతి
ముంబై: మన సంస్కృతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లగల భారతీయ చిత్ర పరిశ్రమ.. ‘మేక్ ఇన్ ఇండియా’ను విస్తృత పరిచేందుకు సరైన మాధ్యమమని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అసోచామ్ వెలువరించిన ‘డిజిటలైజేషన్ అండ్ మొబిలిటీ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే పుస్తకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న షారుఖ్ మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమ మేక్ ఇన్ ఇండియాను విస్తృత పరచగలదన్నారు. -
విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘మేక్ ఇన్ ఇండియా’ కింద దేశ వ్యాప్తంగా కొత్తగా పరి శ్రమలను నెలకొల్పేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్రప్రభుత్వం ఆహ్వానిస్తోందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. ‘ముద్ర’ పథకం కింద చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త పథకాలను అమలు చేస్తోందన్నారు. నాబార్డు ద్వారా ‘సెజ్’లు, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రూ. 2,000 కోట్ల నిధులను జమ చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో వంద ఎకరాల్లో రూ.120 కోట్ల అంచనాతో నిర్మించనున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ‘స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్కు’ను సోమవారం కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ శంకుస్థాపన చేశారు.. కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది 3 మెగాఫుడ్ పార్క్‌లను మం జూరు చేసినట్లు తెలిపారు. నల్లగొండలో రూ. 140 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.113 కోట్లతో మెగాఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను కాపాడే మూడు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా రాష్ట్రానికి మంజూరు చేసినట్లు తెలిపారు. లక్కంపల్లి ‘సెజ్’ భూముల్లో రెండేళ్లలో పూర్తిస్థాయిలో అన్ని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై నిజామాబాద్ ఎంపీ కవితను అడిగి తెలుసుకుంటానని చెప్పారు. లక్కంపల్లిలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా సుమారుగా 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయ న్నారు. పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు కు కేంద్రం సహకారం ఉంటుందన్నారు. -
స్వైప్ టెక్నాలజీ ‘మేకిన్ ఇండియా’
జనవరిలో తొలి ఉత్పాదన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టెక్నాలజీ కంపెనీ స్వైప్ టెక్నాలజీస్ పుణే సమీపంలో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది. ఆరు అసెంబ్లింగ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రంలో ట్యాబ్లెట్ పీసీలతోపాటు స్మార్ట్ఫోన్లను రూపొందిస్తారు. తయారీ, మార్కెటింగ్‌కుగాను వచ్చే రెండేళ్లలో కంపెనీ రూ.130 కోట్లు ఖర్చు చేస్తోంది. మేకిన్ ఇండియా తొలి ఉత్పాదన జనవరి 1న ఆవిష్కరిస్తామని స్వైప్ వ్యవస్థాపకులు శ్రీపాల్ గాంధీ తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఎలీట్-2 మోడల్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాగా4జీ స్మార్ట్‌ఫోన్ ఎలీట్-2 ధర రూ.4,666. ఫ్లిప్‌కార్ట్‌లో నవంబరు 8 నుంచి లభిస్తుంది. -
ఆశయం సరే.. ఆచరణ సంగతి!
విశ్లేషణ: ఎన్నికలలో ఇచ్చిన 'ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి' హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' కేవలం నినాదప్రాయంగా మిగలనున్నదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలవని అనుకుంటున్న 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' పథకాలు కేవల నినాదాలుగానే మిగిలిపోతాయా? యువతలో నెలకొన్న ఈ భయాందోళనలను వెంటనే తొలగించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకున్న చైనాలో ఇటీవల ఏర్పడిన ఆర్థిక మందగమనం భారత్‌కు అందివచ్చిన అవకాశం. ఈ ఏడాది చైనా ఆర్థిక రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో తన జీడీపీ వృద్ధిరేటు లక్ష్యాన్ని 7 నుంచి 6.5 శాతానికి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కిందటేడాది ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా గురించి దేశంలో ఆశలు చిగురించాయి. కొన్నేళ్లుగా దేశ స్థూల జాతీ యోత్పత్తిలో 15 శాతంకంటే మించలేకపోతున్న తయారీ రంగం (మాన్యు ఫాక్చరింగ్ సెక్టార్) వాటాను 2020 నాటికి 25 శాతానికి పెంచి, కనీసం 10 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించడానికి మోదీ మేక్ ఇన్ ఇండియా మిషన్ ఆరంభించారు. ఒక అంచనా ప్రకారం దేశంలో దాదాపు 8 కోట్ల మంది నిరు ద్యోగులున్నారు. చదువుకు తగిన ఉద్యోగాలు లేక నిరాశానిస్పృహలకు లోన వుతున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 368 ప్యూన్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడగా 23 లక్షల దర ఖాస్తులు అందాయి. అందులో 255 మంది డాక్టరేట్లు. ఆంధ్రప్రదేశ్ విభజ నకు ముందు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అధిక సంఖ్యలో పోస్టు గ్రాడ్యు యేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల తెలంగాణలో 856 విద్యుత్ ఇంజ నీర్ల ఖాళీలకు 1.09 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ దేశంలో ఉన్న నిరు ద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పట్టేవే. ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు ఆవశ్యకమే. 2025 నాటికి దేశ జనాభా ప్రస్తుతం ఉన్న 128 కోట్ల నుంచి దాదాపు 150 కోట్లకు చేరుకోబోతోందని అంచనా. ఉన్నత విద్యను అభ్యసించే యువత సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి కోట్లాది ఉద్యో గాలను సృష్టించుకోవాలి. ఉపాధి అవకాశాలు విస్తృతపరచాలి. ఎగుమతుల స్థాయికి ఉత్పత్తులు ఉద్యోగావకాశాల కల్పనకు ఉద్దేశించిన మేక్ ఇన్ ఇండియా మిషన్ 25 ప్రాధా న్యతా రంగాలను గుర్తించింది. వాటిని అభివృద్ధి చేసుకుని చైనాకు దీటుగా ఆసియాలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరించి దేశీయ అవసరాలను తీర్చుకుంటూ ఎగుమతులను కూడా చేపట్టే స్థాయిలో పారిశ్రామికోత్పత్తు లను అందించాలన్నది మిషన్ లక్ష్యం. ఇందుకు అనుకూల పరిస్థితులు కూడా భారత్‌కు ఉన్నాయి. దేశ జనాభాలో 65 శాతం 35 సంవత్సరాలలోపు యువతే కావడం గొప్ప మానవ వనరు. ఒకప్పుడు చైనాలో అధిక జనాభా సమస్య అనుకునేవారు. కానీ జనాభాయే అన్ని సమస్యలకు పరిష్కారమని చైనా నిరూపించింది. ఆ బాటలోనే భారత్ పయనించాలని అనుకుంటున్నది. కానీ ఈ అనుకూలతలతో పాటు, అనేక ప్రతికూలతలు కూడా వ్యవస్థీకృ తంగా మారిన విషయాన్ని విస్మరించలేం. దేశంలో విద్యాసంస్థలు, విశ్వవిద్యా లయాలు ఆశించిన స్థాయిలో సాంకేతిక నిపుణులను అందించలేకపోతున్నాయి. దేశంలో వృత్తి నైపుణ్యతా శిక్షణ కలిగిన వారు 2.3 శాతమే. మేక్ ఇన్ ఇండియా ఆశిస్తున్న ఫలితాలు రావాలంటే, అందుకు సరిపడే నైపుణ్యం కలిగిన యువత భారత్‌లో ఉన్నదా? లేకుంటే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి? ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. మేక్ ఇన్ ఇండియా ఆలోచనకు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలైన రతన్ టాటా, ముకేశ్ అంబానీ, ఆజీమ్ ప్రేమ్‌జీ తదితరులు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని ముందుకు వచ్చారు. వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రా మికోత్పత్తులు దేశంలోనే తయారుకావాలన్న భావన మేక్ ఇన్ ఇండియాలో ప్రతిబింబించినప్పటికీ, అది ఆచరణాత్మకం కావడానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రావలసి ఉంది. అందుకే మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ, 'స్కామ్‌ల ఇండియా కాదిప్పుడు, స్కీమ్‌ల ఇండియా' అంటూ ఇన్వె స్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు తెలియచేస్తున్నారు. నిజానికి ఎన్డీఏ అధికారం లోకి వచ్చాక స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ కూడా బలపడి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో సుస్థిర పారిశ్రామి కాభివృద్ధికి దోహదం చేసేవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే. విదేశీ పెట్టుబడులే ప్రధానం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి దేశీయంగా వివిధ రాష్ట్రాలు ఎలా పోటీ పడుతున్నాయో, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కూడా అందుకు తీవ్ర పోటీ నెలకొని ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం అంత సుల భం కూడా కాదు. నిర్దిష్టమైన ప్రామాణికతలను పరిగణనలోనికి తీసుకున్న తరవాతే విదేశీ పెట్టుబడిదారులు ముందుకు వస్తారన్నది వాస్తవం. ప్రతిష్టా త్మకమైన వివిధ ఏజెన్సీలు ఇచ్చే నివేదికలను, రేటింగ్లను వారు ప్రామా ణికంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై 'రీజన బుల్ రిటర్న్స్' (సహేతుకమైన లాభాలు)ను ఆశిస్తారు. ప్రపంచ బ్యాంకు దాదాపు 190 దేశాల్లో నెలకొని ఉన్న పారిశ్రామిక వాతావరణంపై సర్వే చేసి అందించిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే సమగ్ర నివేదికలో తాజాగా భారత్‌కు లభించినది 130వ ర్యాంకు మాత్రమే. ఆశ్చర్యమేమిటంటే, అఫ్ఘా నిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు భారత్ కంటే మెరుగైన ర్యాంకింగ్‌లు పొం దాయి. ప్రపంచ మార్కెట్ల దృక్కోణం నుంచి చూసినప్పుడు భారతదేశంలో సంక్లిష్టమైన అధికార యంత్రాంగపు ప్రమేయం ఎక్కువ. అలాగే, సరుకులు చేరవేయడానికి వివిధ ప్రాంతాల మధ్య సరైన రవాణా సౌకర్యాలు లేకపోవ డం మరొక ప్రధాన లోపం. ప్రపంచీకరణకు అనువైన సంస్కరణలు చేపట్టక పోవడం, అన్నింటికీ మించి అడుగడుగునా 'అవినీతి' తాండవించడం లాంటి సమస్యలనేకం ఉన్నాయి. వ్యవస్థీకృతంగా మారిన ఈ సమస్యలు తొలగించా లంటే ఉక్కు సంకల్పం కావాలి. 'వ్యాపారం చేసుకోవడానికి అనువైన పరిస్థి తులు'కల్పించకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించడం ఆశించినంత సులభం కాదు. ఇక, దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతున్న నకిలీ వస్తువులు (కొన్ని రకాల ఉత్పత్తులు... దేశీయ ఉత్పత్తులకంటే నాణ్యమైనవి) తయారీ రంగం అభివృద్ధికి నిరోధకాలుగా తయారయ్యాయి. చైనా వస్తువులు భారత్ మార్కె ట్లను ముంచెత్తడంతో ఒక దశలో దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ ప్రమాదం ఇప్పటికీ తొలగిపోలేదు. 'ఇల్లిసెట్ మార్కెట్స్, ఎ థ్రెట్ టు అవర్ నేషనల్ ఇంట్రెస్ట్స్'(జాతీయ ప్రయోజనాలకు గండికొడుతున్న అక్రమ వ్యాపార సామ్రాజ్యాలు) అనే నివే దిక కొన్ని విభ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడించింది. కిందటేడాది... అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,381 కోట్ల మేర దేశంలో అక్రమ వ్యాపారం జరిగింది. లక్ష కోట్ల రూపాయల పైబడిన అమ్మకాల్ని దేశీయ ఉత్పత్తి కంపెనీలు నష్టపోయాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల పన్ను ఆదాయం నష్టం కలిగింది. 'ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ రైట్స్'(మేధోసంపత్తి హక్కులు) విషయంలో మనం తీసుకోవాల్సిన ఆవిష్కరణ లకు చొరవ చూపకపోవడం, సరిహద్దుల్ని దాటుకొని అక్రమంగా వస్తున్న వస్తువుల్ని నిరోధించలేకపోవడం లాంటి లోపాలతో దేశీయ ఉత్పత్తి దారులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. ఇబ్బందులూ ఉన్నాయి 'మేక్ ఇన్ ఇండియా మిషన్' పురోగతిని విశ్లేషిస్తే... ఈ ఏడాదిన్నర వ్యవ ధిలో సాధించిన ఫలితాలు కొంత మేరకు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో... గత ఏడాదితో పోలిస్తే 40 శాతం అభివృద్ధి కనిపిస్తుండగా, (23.7 బిలియన్ల డాలర్లు) భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ మదుపరుల రంగంలో కిందటేడాది కనిపించిన 0.6 శాతం అభివృద్ధి రేటును దాటుకొని 2.7 శాతం మేర వృద్ధి సాధించగలిగింది. ఐతే, ఇది వచ్చే ఐదేళ్లలో ఏ మేరకు స్థిరమైన అభివృద్ధికి దారితీస్తుందో వేచిచూడాలి. మౌలికమైన పరి పాలనా సంస్కరణలు, ప్రజల ఆరోగ్యం, విద్య, సాంకేతిక పరిజ్ఞానం మొద లైన ఉత్పాదక పనిముట్ల (ప్రొడక్షన్ టూల్స్)ను మెరుగుపర్చకుండా కేవలం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తరచూ విదేశీ పర్యటనల మీదనే ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా... ఇప్పటికీ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న 60 శాతం పైగా ఉన్న ప్రజానీకానికి కావలసిన ఉపాధి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించకుండా, మరోపక్క సత్వర పారిశ్రామికీకరణ పేరుతో వ్యవసాయం చేయడంతో రాజకీయ ప్రతిష్టం భన ఏర్పడి పెద్ద ఎత్తున వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవు తున్నది. భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనున్నదా అనే ఆందో ళనలు కలుగుతున్నాయి. దీంతో, పారిశ్రామికీకరణ ప్రతిపాదనల ఉద్దేశంపైనే నీలినీడలు కమ్ముకోనున్నాయా! అనే సందేహం కలుగుతుంది. ఇక నరేంద్రమోదీ 'మేక్ ఇన్ ఇండియా' ప్రకటన చేయగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్'అంటూ వెనువెంటనే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తుల తయారీ మెరుగుపర్చాలన్నది బహుశా ఆయన ఆంతర్యం కావచ్చు. దానిని ప్రజలు ఆహ్వానిస్తారు. కాని, ఆచరణలో ఆ దిశగా అడుగులు పడటం లేదు. రాష్ట్ర రాజధాని 'అమరావతి' నిర్మాణం ఆలో చన ఆరంభంలోనే విదేశీ సాంకేతికత కోసం సింగపూర్, జపాన్, జర్మనీ లాంటి దేశాలవైపు పరుగులెత్తడం దేశీయ వనరుల పట్ల తనకున్న చిన్నచూపు బహిర్గతమవుతున్నది. కొసమెరుపు ఏమిటంటే- రూ.2,500 కోట్లతో గుజరాత్లో నిర్మించనున్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ‘స్టాట్యూ ఆఫ్ పీస్’ విగ్రహం రూపకల్పన బాధ్యత చైనాలోని ఒక ప్రముఖ సంస్థకు అప్పజెప్పారు. అలాంటప్పుడు 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్'ల పరమార్ధం ఏమిటని ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతం కావాలంటే ఆకర్షణీయమైన పారిశ్రామిక వాతావరణం కల్పించాలి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనివార్యం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా కేంద్రం మీద ఒత్తిడి పెంచడంలేదు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కారణాలవల్ల ప్రత్యేకహోదా అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల మంది గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీచేయకపోవడం, డీయస్సీ నిర్వహించకపోవడం నిరుద్యోగ యువతలో నైరాశ్యం పెంచుతున్నది. ఎన్ని కలలో ఇచ్చిన 'ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగభృతి' హామీ కూడా అమలుకు నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కేవలం నినాదప్రాయంగా మిగలనున్నదా అన్న ప్రశ్న తలె త్తుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలవని అనుకుంటున్న మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పథకాలు కేవల నినాదాలుగానే మిగిలి పోతాయా? యువతలో నెలకొన్న భయాందోళనలను వెంటనే తొలగించాలి. వ్యాసకర్త, ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మొబైల్: 99890 24579 -
వన్‌ప్లస్ మొబైల్స్ ‘మేక్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న చైనా స్టార్టప్ కంపెనీ వన్‌ప్లస్.. బెంగళూరు వేదికగా నేడు కొత్త మోడల్ ఆవిష్కరణతోపాటు మేక్ ఇన్ ఇండియా ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. ఫోన్ల తయారీకిగాను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలైన ఫాక్స్‌కాన్ తదితర సంస్థలతో కంపెనీ చర్చిస్తోంది. మేక్ ఇన్ ఇండియా ఫోన్‌ను ఈ ఏడాదే తీసుకొస్తామని వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అయితే సోమవారం నాటి అధికారిక ప్రకటన గురించి సమాధానం దాటవేశారు. బెంగళూరు కార్యక్రమానికి సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో పీట్ లూ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వన్‌ప్లస్ మూడో మోడల్ పేరు ‘ఎక్స్’ లేదా ‘మినీ’ అని సమాచారం. 5 అంగుళాల స్క్రీన్, 1.9 గిగాహెట్జ్ ప్రాసెసర్, 4జీ, 1,920/1,080 రిసొల్యూషన్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వన్‌ప్లస్ వన్, వన్‌ప్లస్-2 మోడళ్ల కంటే ఇది తక్కువ ధర ఉంటుంది. ఇక ఎటువంటి ఇన్విటేషన్ లేకుండానే వన్‌ప్లస్-2 కొనుక్కోవచ్చు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్య అమెజాన్ ద్వారా ఈ అవకాశం ఉంది. -
'భారత్‌లో ఐటీ విప్లవం మొదలైంది'
బెంగళూరు : 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాన్ని సుసాధ్యం చేసి 125 కోట్ల భారతీయుల కలలను నెరవేర్చుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్‌తో కలిసి ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంగళవారం కర్నాటక వచ్చారు. తమ పర్యటనలో భాగంగా బెంగళూరులోని బాష్ ఇంజినీరింగ్ సెంటర్‌ను వీరు సందర్శించారు. ప్రత్యేక విమానంలో మోదీ, మోర్కెల్‌లు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగి, అనంతరం బాష్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు 77వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై మోర్కెల్, మోదీలు సంతకాలు చేయనున్నారు. జర్మనీకి చెందిన పది ప్రముఖ సంస్థలు కర్ణాటకలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. మోదీ ప్రసంగంలోని అంశాలు: అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్‌ని తీర్చిదిద్దడం భారత్-జర్మనీ ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉండాలి గత 15 నెలలుగా వ్యాపారానికి అణువైనదిగా భారత్‌ని చేయడానికి తీవ్రంగా కృషిచేశాం విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన తరుణం.. మంచి అవకాశం ఇక్కడ భారీగా వస్తువుల, ఉత్పత్తుల తయారీ చేపట్టి 'మేక్ ఇన్ ఇండియా'కి న్యాయం చేస్తాం జీఎస్టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాం. వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశం ఉంది. పరిశ్రలకు కావాల్సిన లైసెన్స్ కాలవ్యవధిని పెంచుతాం భారత్‌లో ఐటీ విప్లవం వచ్చింది. 125 కోట్ల భారతీయుల లక్ష్యాలను సాంకేతిక పరిజ్ఞానంతో సాధిస్తాం -
మేక్ ఇన్ ఇండియా సక్సెస్‌కు మౌలిక పెట్టుబడులు పెరగాలి
- అసోచామ్ నివేదిక వెల్లడి చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం నూరుశాతం సఫలీకృతం చేసేందుకు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అసోచామ్ తాజా నివేదిక సూచించింది. అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్), థాట్ ఆర్బిట్రేజ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్(టారీ) సంస్థలు మేక్ ఇన్ ఇండియా-ద నెక్ట్స్ లీప్ పేరుతో సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన నివేదికను అసోచామ్ డెరైక్టర్ జనరల్ డీఎస్ రావత్, టారీ సంస్థ సంచాలకులు క్షమా కౌసిక్ సోమవారం చెన్నైలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోచామ్ దక్షిణ భారత విభాగం అధ్యక్షుడు, శ్రీ సిటీ వ్యవస్థాపక నిర్వాహక సంచాలకులు రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, స్కిల్స్ ఇండియా వంటి ప్రధాని నరేంద్ర మోదీ నినాదాలు సక్రమంగా అమలు చేయగలగితే దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని అన్నారు. -
నవంబర్‌లో నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణరంగ యంత్రాల ప్రదర్శనను బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. ‘ఎక్స్‌కాన్ 2015’ పేరుతో నవంబర్ 25 నుంచి 29 వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో 275 విదేశీ కంపెనీలు పాల్గొంటాయని సీఐఐ చైర్పర్సన్ (తెలంగాణ) వనితా దాట్ల తెలిపారు. ఎక్సకాన్ 2015 రోడ్‌షోలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారని, 35,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు రోజుల ప్రదర్శన సందర్భంగా సుమారు 200 కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలకానున్నాయి. దేశీయ నిర్మాణరంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేకిన్ ఇండియా విజయవంతం కావడానికి అనుసరించాల్సిన విధానాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెడుతుందన్నారు. -
మేక్ ఇన్ ఇండియా ‘రక్షణ’!
ఆయుధోత్పత్తికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ పెట్టుబడులు భారత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు లేకపోవటంతో మొదటి నుంచి దిగుమతుల కోసం రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. 2010 సంవత్సరం వరకు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న చైనా స్థానాన్ని నేడు మన దేశం ఆక్రమించింది. మన రక్షణ దిగుమతుల్లో 25 శాతం తగ్గితే 1.20 లక్షల మందికి ఉన్నత నైపుణ్య ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వచ్చే 5 సంవత్సరాల వ్యవధిలో రక్షణ ఉత్పత్తుల్ని భారత్‌లో 70 శాతం సమకూర్చుకోగలిగితే దేశంలో ఉపాధి, ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహంతోపాటు అమూల్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా నిలుపుకోవచ్చు. ధీరేంద్ర సింగ్ కమిటీ ఏర్పాటు బెంగళూరులోని ఎలహంకలో పదో వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా-2015’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తూ రక్షణ రంగంలో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణకు సంబంధించి యుద్ధ పరికరాలను తయారుచేయటానికి ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. రక్షణ రంగ తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన చర్యలు సత్వరమే చేపడతామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. రక్షణ రంగంలో సేకరణకు సంబంధించి నూతన విధానాల రూపకల్పన (న్యూ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ-డీపీపీ) కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి ధీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇటీవలే తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సిఫార్సులు ఈ కమిటీ రక్షణ రంగంలోని వివిధ విభాగాలను, త్రివిధ దళాధిపతులను, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)ను సంప్రదించి 43 సిఫార్సులను చేసింది. ఇందులో 15 సిఫార్సులు ప్రత్యక్షంగా భారత్‌లో తయారీ విధానంతో ముడిపడి ఉన్నాయని, మిగిలినవి సేకరణకు సంబంధించినవని పేర్కొంది. ఈ నివేదికకు ‘కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎమెండ్మెంట్ టు డీపీపీ-2013’ అని పేరు పెట్టారు. క్లిష్టమైన రక్షణ ప్రాజెక్టులలోను, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలోనూ ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా ప్రైవేటు రక్షణ కంపెనీలను కూడా తీసుకోవటం. ప్రొక్యూర్మెంట్(సేకరణ విధానం)లో ఏకైక బిడ్డింగ్(అమ్మకం) జరిగినపుడు సదరు అమ్మకందారు మధ్యలోనే ప్రాజెక్టును నిలిపేసి వెనక్కి వెళ్లకుండా నిలుపుదల చేయటం. రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థలకు, ఆయా ప్రాజెక్టులకయ్యే వ్యయంలో 85 శాతం ఏవిధంగానైతే ఇస్తున్నారో, అదే విధంగా ప్రైవేటు కంపెనీలకు వర్తింపజేయాలి.చిన్న, మధ్య తరహా కంపెనీలకు రూ.500 కోట్లలోపు ఉన్న రక్షణ ప్రాజెక్టులను ఏ విధంగా కేటాయించాలనే విషయంపై ఒక ప్రత్యేక విధి విధానాన్ని రూపొందించాలి.ప్రైవేటు సంస్థల్లో షేర్ల వాటా స్వరూప స్వభావాలను మార్చటానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి. క్రాస్ హోల్డింగ్‌కు పాల్పడకూడదు.ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) మౌలిక సదుపాయాలను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి. 2014-15 బడ్జెట్లో నూతనంగా కేటాయించిన రూ.100 కోట్ల సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, చిన్న, మధ్య తరహా(ఎస్ఎంఈ) సంస్థలకు చేయూతనివ్వాలి.రక్షణ ఎగుమతులకు స్వయం ప్రతిపత్తిగల ఏకగవాక్ష పద్ధతిని ఏర్పాటుచేయాలి.యుద్ధ విమానాలు, రవాణా పరికరాలు; యుద్ధ నౌకలు, జలాంతర్గాములు; సాయుధ యుద్ధ వాహనాలు; సంక్లిష్ట క్షిపణుల తయారీ; నిఘా, సమాచార నియంత్రణ, కమాండ్ మొదలైన విభాగాలు; కీలకమైన పేలుడు ముడిపదార్థాలైన టైటానియం, అల్యూమినియం, కార్బన్, నికెల్, కోబాల్ట్లు, వాటి సమ్మేళనాలు- వంటి ఆరు విభాగాల్లో స్వదేశీ పరికరాలు, ఉత్పత్తులను ప్రోత్సహించాలి. 2027 నాటికి 70 శాతం సైనిక విభాగాలకు అవసరమైన పరికరాల తయారీలో స్వావలంబన. ‘మేక్ ఇన్ ఇండియా’ను దృష్టిలో ఉంచుకొని త్రివిధ దళాల ఆయుధాల అవసరాల సేకరణలో ప్రస్తుతం ఉన్న 30-40 శాతం నుంచి 2016-17 సంవత్సరానికి 60 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.విదేశాల నుంచి కొనుగోలు చేసినా, దేశీయంగా తయారు చేసినా.. రక్షణ సేకరణ విధానం పటిష్టంగా ఉండాలి. లేకపోతే బోఫోర్స్ కుంభకోణం, అగస్టావెస్ట్‌లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్లలో అక్రమాల వంటి పరిణామాలు పునరావృతమవుతాయి. వివిధ వర్గాల అభిప్రాయాలు ధీరేందర్ సింగ్ కమిటీ రిపోర్టును రక్షణ మంత్రిత్వ శాఖ తొలిసారిగా బహిర్గతపరచి (పబ్లిక్ డొమైన్) పారిశ్రామిక వర్గాల, ప్రభుత్వ విభాగాల, వివిధ వర్గాల ప్రజల నుంచి విలువైన సూచనలు, సలహాలను తీసుకుంటోంది. దేశీయ పరిశ్రమల వాటాను ప్రతి ఏటా పెంచే విధంగా నిబంధన చేర్చాలి.‘మేక్ ఇన్ ఇండియా’ అంటే సేకరించిన విడిభాగాలను భారత్‌లో బిగించటం కాదు కదా! మేధోసంపత్తిని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు సెజ్(స్పెషల్ ఎకనమిక్ జోన్)లు ఏర్పాటుచేస్తున్న విధంగానే రక్షణ రంగ పరికరాల ఎకనమిక్ జోన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కొన్ని పారిశ్రామిక సంస్థలు సూచించాయి. క్రాస్హోల్డింగ్ నిబంధనల ద్వారా పరిశ్రమలను నియంత్రిస్తున్నాయి అని కొన్ని పరిశ్రమలు వాదిస్తున్నాయి. ఆధునికీకరణ దిశగా చర్యలు దేశంలో 9 ప్రభుత్వరంగ రక్షణ సంస్థలు (డీపీఎస్‌యూ)లతోపాటు 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 50 డీఆర్డీఓ ప్రయోగశాలలు, రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, 760 కోట్ల డాలర్ల ఆయుధ ఉత్పత్తిని సాధిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆధునికీకరణ జరగలేదు. ప్రస్తుతం టీసీఎస్, టాటాపవర్, గోద్రెజ్, హెచ్‌సీఎల్, ఎల్ఎండ్టీ, మహింద్రా, కిర్లోస్కర్ వంటి మల్టీనేషనల్ సంస్థలతోపాటు 6 వేల చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా రక్షణ ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నాయి. క్షిపణుల అభివృద్ధిలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం భారీగా ఉన్నప్పటికీ రక్షణ రంగ పరికరాల తయారీలో వీటి పాత్ర అంతగా లేదు. రక్షణ రంగ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.2,46,727 కోట్లు కేటాయించింది. ఇందులో అగ్రభాగం త్రివిధ దళాలు, ప్యారామిలిటరీ దళాల జీతభత్యాలకే!! రక్షణ రంగ పరికరాల పరిశోధన, అభివృద్ధిపై 7 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తోంది. తమ రక్షణ బడ్జెట్లో ఆర్ అండ్ డీకి చైనా 20 శాతం, అమెరికా 12 శాతం కేటాయిస్తున్నాయి. భారత్ 2010-14 మధ్య అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నుంచి రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంది. మొత్తం అంతర్జాతీయ రక్షణ పరికరాల దిగుమతుల్లో ఇది 15 శాతం. సౌదీ అరేబియా 5 శాతం, చైనా 4 శాతం, పాకిస్థాన్ 4 శాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి మన దేశం ఏటా దిగుమతుల కోసం ఎంత పెద్ద మొత్తం కేటాయిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాతో జరిగిన ఒప్పందాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు భారత్‌కు వచ్చినప్పుడు రక్షణ రంగానికి సంబంధించి అనేక కీలక కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. డ్రోన్ల దిగుమతి, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, ఆపదల్లో కూడా రక్షణ పరికరాలను, సహాయ సామగ్రిని మోసుకుపోయేందుకు ఉపయోగపడే అత్యాధునికమైన సి-130 యుద్ధ వాహక విమానాల తయారీకి సంబంధించినవి ఇందులో ముఖ్యమైనవి. రక్షణ తయారీ రంగంలో విదేశీ కంపెనీల ప్రమేయాన్ని భారత్ అంతగా ఇష్టపడనప్పటికీ ఇంత భారీస్థాయిలో దిగుమతి ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ కమిటీలు 1992లో అప్పటి రక్షణ మంత్రి సలహాదారు, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సారధ్యంలో ఏర్పాటైన కమిటీ స్వావలంబన దిశగా కీలక సిఫార్సులు చేసింది. రక్షణ ఉత్పత్తుల్లో 30 శాతం స్వదేశీ, 70 శాతం విదేశీగా ఉన్న పరిస్థితిని తిరగరాయాలని పేర్కొంది. అయితే ఇప్పటికి కేవలం 10 శాతం మాత్రమే పెంచుకోగలిగాం. 2004లో ఏర్పాటైన కేల్కర్ కమిటీ సైతం దేశీయ ప్రైవేటు రంగానికి రక్షణ ఉత్పత్తుల్లో చురుకైన పాత్ర కల్పించాలని, డీఆర్డీఓకు నూతన జవసత్వాలను కల్పించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ప్రభావవంతంగా అమలుకాలేదు. కేంద్రం చర్యలు రక్షణ ఉత్పత్తుల విడిభాగాలు, పరికరాలు, ఉపవ్యవస్థలు భారతదేశంలోనే తయారయ్యేలా సమీకరించింది. సరళంగా, త్వరితంగా నిర్ణయాలు తీసుకునేలా, జవాబుదారీతనంతో నూతన విధానాల రూపకల్పన చేస్తోంది. సాంకేతిక రంగ అభివృద్ధి నిధిని ప్రారంభించి, రక్షణ రంగ ఉత్పత్తుల నమూనాల తయారీకి 80 శాతం వరకూ నిధుల్ని సమకూర్చే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనుంది. రక్షణ రంగ పరిశోధనల్లో ఇకపై శాస్త్రవేత్తలు, సైనికులు, విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సేవల్ని కూడా వినియోగించుకోనుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ అమలు చేస్తే రక్షణ రంగ అతిపెద్ద దిగుమతిదారు అనే అపప్రద తొలగించుకొని స్వావలంబన దిశగా అడుగులు వేయవచ్చు. -
'మేక్ ఇన్ కాదు.. మోదీ జీ కా టేక్ ఇన్ ఇండియా'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కిసాన్ సమ్మాన్ ర్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ల్యాండ్ బిల్లును కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ప్రజావిజయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ బిల్లులు ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించినది.. 'మేక్ ఇన్ ఇండియా కాదు.. మోదీ జీ కా టేక్ ఇన్ ఇండియా' అని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇబ్బందులే ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించటానికి మోదీకి సమయమే దొరకట్లేదా? అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
భారత్‌లో ప్యానాసోనిక్ రిఫ్రిజిరేటర్ల తయారీ ప్లాంటు
ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియా ఫోన్ ♦ రూ.6 వేలలోపు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా ♦ ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న ప్యానాసోనిక్ భారత్‌లో రిఫ్రిజి రేటర్ల తయారీ ప్లాంటును ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తోంది. రూ.200-300 కోట్ల అంచనా వ్యయంతో 6-10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పోలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌తోపాటు మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల కు ఇక్కడ తయారైన రిఫ్రిజిరేటర్లను ఎగుమతి చేస్తామని వెల్లడించారు. భారత్‌ను హబ్‌గా చేసుకుంటామని వివరించారు. మేక్ ఇన్ ఇండియా ఫోన్.. మొబైల్ ఫోన్లను సైతం కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేస్తోంది. ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియ ఫోన్ తీసుకొస్తామని ఎండీ పేర్కొన్నారు. సొంతంగా ప్లాంటు పెట్టడమా, లేదా థర్డ్ పార్టీ కంపెనీతో చేతులు కలపడమా త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తయారీ సామర్థ్యం నెలకు 10 ల క్షల యూనిట్లు ఉంటుందన్నారు. ‘2014-15లో ఆదాయంలో మొబైల్స్ విభాగం వాటా 5 శాతం మాత్రమే. 2015-16లో ఇది 20 శాతం చేరనుంది. నెలకు 3.20 లక్షల మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్నాం. మార్చికల్లా రూ.6 వేలలోపు ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తాం’ అని వెల్లడించారు. ధరలు పెరగొచ్చు: రూపాయి పతనం కారణంగా వివిధ కంపెనీల గృహోపకరణాల ధరలు అక్టోబరు నుంచి 3-5 శాతం పెరిగే చాన్స్ ఉందని కంన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సియామా) ప్రెసిడెంట్ కూడా అయిన మనీష్ శర్మ తెలిపారు. గతేడాది పరిశ్రమ రూ.48,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ఈ ఏడాది రూ.52,000 కోట్లు దాటుతుందని అంచనాగా చెప్పారు. ఫైనాన్స్ కంపెనీల జీరో ఫైనాన్స్ పథకాలతో అమ్మకాలకు బూస్ట్నిస్తుందన్నారు. వ్యాపార అవకాశాలు ఉన్న దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు పరిశ్రమకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే మేక్ ఇన్ ఇండియా విజయవంతం అవుతుందని చెప్పారు. -
శ్రీసిటీలో జియోనీ ఫోన్ల తయారీ
- ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపిన కంపెనీ - తయారీకి మూడేళ్లలో రూ.330 కోట్ల వ్యయం - జియోనీ ఇండియా ఎండీ అరవింద్ వోరా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న జియోనీ ‘మేక్ ఇన్ ఇండియా’ బాటపట్టింది. మొబైల్స్ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్, డిక్సన్ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటుతోపాటు డిక్సన్‌కు చెందిన నోయిడా ప్లాంటులో ఫోన్లు తయారు కానున్నాయి. అక్టోబరులో మేక్ ఇన్ ఇండియా తొలి ఉత్పాదన మార్కెట్లోకి రానుంది. ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో మూడు అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 5 లక్షల యూనిట్లు. డిక్సన్ నోయిడా ప్లాంటులో 9 అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి. తయారీ సామర్థ్యం నెలకు 7 లక్షల యూనిట్లు. రెండు ప్లాంట్ల వద్ద జియోనీ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. వచ్చే మూడేళ్లలో తయారీకి రూ.330 కోట్లు ఖర్చు చేస్తామని జియోనీ ఇండియా ఎండీ అరవింద్ రజనీష్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్ నుంచి విదేశాలకు: చైనాలోని సొంత ప్లాంటులో తయారైన ఫోన్లను జియోనీ దిగుమతి చేస్తోంది. ఇక నుంచి జియోనీ ఎఫ్ సిరీస్, పీ సిరీస్ స్మార్ట్ఫోన్లను ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులో తయారు చేస్తుంది. ఇతర స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లను డిక్సన్ ఉత్పత్తి చేయనుంది. దేశీయంగా తయారీ చేపట్టడం ద్వారా త్వరితగతిన కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు కంపెనీకి వీలవుతుంది. అలాగే దిగుమతి సుంకాలు ఆదా అవుతాయి. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. చైనా వెలుపల తయారీ కేంద్రంగా భారత్‌ను నిలుపుతామని జియోనీ ప్రెసిడెంట్ విలియం లూ పేర్కొన్నారు. నెలకు ఒక మోడల్: భారత్ మార్కెట్లో నెలకు ఒక మోడల్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు అరవింద్ తెలిపారు.రూ.8,000 ఆపైన ధరలో వచ్చేవన్నీ 4జీ మోడళ్లని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఫోన్లను విక్రయిస్తామని వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు ఇతర ఇ-కామర్స్ కంపెనీలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని జియోనీ ఇండియా ఆర్జించింది. ఈ ఏడాది రూ.6,000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
భారత్‌లో మరిన్ని పెట్టుబడులపై యూఏఈ ఆసక్తి
న్యూఢిల్లీ: కేంద్రం తలపెట్టిన మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆసక్తి వ్యక్తం చేసింది. భారత్‌తో సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తెలిపారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కాగా భారత్-యూఏఈ వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునేలా పరస్పరం సహకరించుకునేందుకు ఒక వాణిజ్య సమావేశం సందర్భంగా రెండు దేశాల పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, ఎఫ్‌సీసీఐ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. -
మేక్ ఇన్ ఇండియా కాదు...క్వాలిటీ ఇన్ ఇండియా కావాలి!
సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ సూచన న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కన్నా క్వాలిటీ ఇన్ ఇండియాకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సుజుకీ మోటార్ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ ఒసాము సుజుకీ చెప్పారు. ముఖ్యంగా వాహన విడిభాగాల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తే అమెరికా, చైనాలను తోసిరాజని భారత్ అగ్రస్థానంలో ఉంటుందని వివరించారు. వాహన విడిభాగాల తయారీదారుల భారత సమాఖ్య(ఏసీఎంఏ-ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సమావేశంలో ఆయన మాట్లాడారు. విడిభాగాల వ్యాపారంలో వచ్చిన లాభాలను వేరొక విభాగాల్లో కాకుండా... తిరిగి ఆ వ్యాపారంలోనే ఇన్వెస్ట్ చేయాలని ఆయన సూచించారు. -
మోదీని కలిసిన టయోట చైర్మన్, ఎరిక్సన్ సీఈవో
న్యూఢిల్లీ : టయోట మోటార్ కార్పొరేషన్ చైర్మన్ టకేశి ఉచియమద, స్వీడన్‌కు చెందిన టెలికం సంస్థ ఎరిక్సన్ సీఈవో హన్స్ వెస్ట్‌బర్గ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో కంపెనీ వృద్ధి అంశంతోపాటు ఇండో-జపానీస్ ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించామని ఉచియమద తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమ విజయానికి తమ వంతు కృషి అందిస్తామన్నారు. టయోట భారత్‌లో 1997 నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఎరిక్సన్ కంపెనీ 15-20 మిలియన్ డాలర్లతో పుణేలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. -
యుద్ధం కత్తితో కాదు.. కరెన్సీతో
యువాన్ విలువ వరసగా రెండుసార్లు తగ్గించిన చైనా అంతర్జాతీయంగా తన ఉత్పత్తుల డిమాండ్ పెంపే లక్ష్యం దాంతో పోటీ పడాలంటే మిగతా దేశాలూ తగ్గించాల్సిందే ఆర్బీఐ చర్యలతో రెండేళ్ల కనిష్ఠానికి పతనమైన రూపాయి మేకిన్ ఇండియా నెరవేరాలన్నా;తయారీ రంగం వృద్ధి చెందాలన్నా ఇది తప్పదు... సాక్షి, బిజినెస్ విభాగం : రచయిత సాల్మన్ రష్దీ చెప్పినట్లు... ఇదివరకు యుద్ధం జరిగితే దాన్లో భాగస్తులు కాని వారంతా దూరంగా ఏదో కొండెక్కి చూసే వీలుండేది. కానీ ఇపుడు జరుగుతున్న ఆర్థిక యుద్ధాలను ఆ రకంగా చూసే వీలులేదు. ఎందుకంటే ఈ యుద్ధాల్లో అసలు పాల్గొనని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా... అది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక గ్రీసు ఒకవేళ దివాలా తీసి ఉంటే దాంతో వాణిజ్యం చేసే దేశాలన్నీ అతలాకుతలమయ్యేవి. అందుకే యూరో దేశాలన్నీ కలిసి కొత్త అప్పులిచ్చి మరీ దాన్ని గట్టెక్కించాయి. ఇపుడు చైనా వంతు. కొన్నేళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన తీరు ప్రపంచదేశాలన్నిటికీ పాఠ్యాంశమే. ఏ వస్తువునైనా తయారు చేసి, యావత్ ప్రపంచానికీ ఎగుమతి చేస్తూ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందీ డ్రాగన్. దీంతో చైనీయుల జీతాలు, జీవితాలు కూడా మారాయి. చైనా కరెన్సీ యువాన్ సైతం బాగా బలపడింది. పదేళ్ల కిందట డాలరుతో యువాన్ మారకం విలువ 8.27. ఇపుడది ఏకంగా 30 శాతానికి పైగా వృద్ధి చెంది 6.33కు చేరింది. అయితే ఇక్కడ గమనించాల్సిందొకటి ఉంది. చైనా ఉత్పత్తులకు యువాన్లలోనే రేటు నిర్ణయిస్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలను ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులన్నీ యువాన్ బలపడితే ఖరీదెక్కువైనట్టే కదా!!. అపుడు డిమాండ్ తగ్గుతుంది. మరి ఎగుమతులపైనే ప్రధానంగా ఆధారపడ్డ చైనా ఆర్థిక వ్యవస్థ డిమాండ్ తగ్గితే ఏమవుతుంది? ఇదిగో ఈ సమస్యను ఎదుర్కోవటానికే చైనా కరెన్సీ యుద్ధానికి తెరతీసింది. గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తన కరెన్సీ విలువను రెండు రోజుల్లో ఏకంగా 3.6 శాతం కోత కోసేసింది. తన ఉత్పత్తులను మిగతా దేశాలకంటే తక్కువ ధరకు అందించడానికి ఈ చర్య తీసుకుంది. మిగతా దేశాలదీ అదే బాట... నిజానికి చైనా తన కరెన్సీ విలువను కోసేయటంతో ప్రపంచం నివ్వెరపోయింది. తాము ఊహిస్తున్నదానికన్నా చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందేమోనన్న భయాలు ఆర్థిక మార్కెట్లను వెన్నాడాయి. అందుకే రెండు రోజులుగా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇక చైనా కరెన్సీ కోతతో దాని ప్రధాన దిగుమతుల్లో ఒకటైన ఇంధన బిల్లు మరింత భారమయ్యే అవకాశముంది. దీనివల్ల విమాన కంపెనీల లాభాలు పడిపోతాయన్న ఆందోళనతో ఎయిర్ చైనా సహా ఆ రంగంలోని కంపెనీల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. నిజానికిపుడు చైనా కరెన్సీ విలువ కోత వల్ల భారత్‌తో సహా దాంతో వస్తువుల విషయంలో పోటీపడే దేశాలన్నీ వాటి విలువల్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ చర్యల ఫలితమేనేమో... యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ల కరెన్సీలు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రపంచ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఇప్పటివరకూ మన కరెన్సీ పటిష్టంగా నిలవడానికి డాలర్లు ఖర్చుచేస్తూ వస్తున్న రిజర్వు బ్యాంక్ కూడా రెండు రోజులుగా రూపాయి పడిపోయేందుకు బాట వేసింది. దాంతో ఇది రెండేళ్ల కనిష్ట స్థాయికి పతనమైపోయింది. మన టెక్స్టైల్స్, జ్యువెల్లరీ తదితర తయారీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో చైనాతో పోటీ పడాలంటే రూపాయి క్షీణించక తప్పదు. లేనిపక్షంలో తయారీదారులకు తగిన ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలి. అలా చేసేంత బలం మన ఆర్థిక వ్యవస్థకు లేదు కనక ఆర్బీఐ రూపాయి క్షీణతకు బాటవేసింది. కరెన్సీ బలంగా వుంటే ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశ నెరవేరే అవకాశమూ తక్కువే. ఆర్బీఐకి కత్తిమీద సామే... మిగతా దేశాల కేంద్ర బ్యాంకులతో పోలిస్తే మన రిజర్వు బ్యాంక్‌కు రూపాయిని బ్యాలెన్స్డ్గా నిలపడం అత్యవసరం. ఎందుకంటే ఎక్కువగా ముడి చమురు, బంగారం దిగుమతులపై ఆధారపడిన దేశం మనది. రూపాయిని మరీ ఎక్కువ క్షీణింపచేస్తే దిగుమతుల బిల్లు పెరిగిపోయి పెనుభారమవుతుంది. ఆర్థిక వ్యవస్థ చితికిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి, తిరిగి ద్రవ్యోల్బణం ఎగిసిపోతుంది. అలాగని కరెన్సీని పెర గనిస్తే అధికశాతం మందికి ఉపాధి కల్పించే తయారీ రంగం కుప్పకూలుతుంది. అందుచేత ఆర్బీఐ ఈ కరెన్సీ యుద్ధంలో ఆచితూచి పాల్గొనాల్సి ఉంటుంది. చైనా ‘యువాన్’.. కోత మీద కోత బీజింగ్: చైనా సెంట్రల్ బ్యాంక్.. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) ప్రపంచ స్టాక్, కమోడిటీ మార్కెట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వరుసగా రెండో రోజూ డాలరుతో తమ దేశ కరెన్సీ యువాన్ మారకం విలువకు కోత(డీవేల్యూ) పెట్టింది. దీంతో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా చైనా బాటనే అనుసరించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, బుధవారం పీబీఓసీ యువాన్ విలువను మరో 1.6% నుంచి 6.33కి తగ్గించింది. మంగళవారంనాటి 2 శాతం తగ్గింపుతో కలుపుకొని రెండు రోజుల్లోనే 3.6% కోత విధించినట్లయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనా.. 1994 తర్వాత తమ దేశ కరెన్సీ విలువను ఇంత భారీగా తగ్గిండచం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, ఈ చర్యలను పీబీఓసీ సమర్థించుకుంది. కరెన్సీమారకం విలువకు సంబంధించి మార్కెట్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేసేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని.. ఇది వన్‌టైమ్ సర్దుబాటేనని పేర్కొంది. అంటే ప్రధాన విదేశీ కరెన్సీలకు డిమాండ్, సరఫరాను పరిగణనలోకి తీసుకొని క్రితం రోజు ముగింపు ఆధారంగా యువాన్ మారకం విలువ రోజువారీ రిఫరెన్స్ రేటును పీబీఓసీ ప్రకటిస్తుంది. దీని ఆధారంగానే కరెన్సీ ట్రేడింగ్ జరుగుతుంది. కాగా, పీబీఓసీ చర్యలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) స్వాగతించింది. ఎక్స్ఛేంజ్ రేటు నిర్ణయంలో మార్కెట్ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. యువాన్ దెబ్బకు రూపాయి విలవిల 59 పైసలు క్షీణత; 64.78 వద్ద ముగింపు రెండేళ్ల కనిష్ట స్థాయి ముంబై : చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గింపు ప్రకంపనలతో అటు స్టాక్, ఇటు కరెన్సీ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ వరుసగా ఐదో రోజూ పతనబాటలోనే కొనసాగింది. బుధవారం ఈ పతన తీవ్రత మరింత పెరిగింది. దేశీ కరెన్సీ ఏకంగా 59 పైసలు క్షీణించి 64.78 స్థాయికి పడిపోయింది. ఇది రెండేళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. మొత్తంమీద ఆరు రోజుల్లో రూపాయి విలువ 104 పైసలు(1.63%) ఆవిరైంది. యువాన్ విలువ తగ్గింపు ప్రభావంతో అంతర్జాతీయంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువ పుంజుకోవడం రూపాయి పతనానికి దారితీసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి డాలరుకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనబాట కూడా రూపాయి నేలచూపులకు కారణమేనని వారు అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని.. 65.60 వరకూ పడిపోవచ్చనేది కొంతమంది ఆర్థికవేత్తల అంచనా. -
జూలై ఆన్లైన్ నియామకాల వృద్ధి 32%
న్యూఢిల్లీ : భారత్‌లో ఆన్లైన్ నియామకాల జోరు పెరిగింది. జూలై నెలలో ఆన్లైన్ నియామకాల వృద్ధి 32 శాతంగా నమోదైంది. మాన్స్టర్.కామ్ ఉద్యోగ సూచీ జూలై నెలలో 50 పాయింట్లు పెరిగి 204 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలలో ఈ సూచీ 154 పాయింట్ల వద్ద ఉంది. జూన్‌తో పోలిస్తే జూలైలో మాన్స్టర్ ఉద్యోగ సూచీ 2 పాయింట్లు పెరిగింది. ఆన్లైన్ ఉద్యోగ నియామకాల్లో పెరుగుదల నమోదుకావడంతో మాన్ స్టర్.కామ్ సూచీ ఈ ఏడాది 32 శాతం వృద్ధితో గరిష్ట స్థాయికి చేరిందని మాన్స్టర్.కామ్ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా) సంజయ్ మోదీ తెలిపారు. వంద స్మార్ట్ నగరాల ఏర్పాటు, మేకిన్ ఇండియా కార్యక్రమం వంటి పలు కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో వ్యాపార అనుకూల పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఆన్లైన్ నియామకాల వృద్ధి అత్యధికంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో (73 శాతం) నమోదైంది. దీని తర్వాతి స్థానాల్లో తయారీ (72 శాతం), ఆటోమేషన్ రంగాలు ఉన్నాయి. ఆన్లైన్ నియామకాల వృద్ధిని పట్టణాల వారీగా చూస్తే.. బరోడా 55 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో పుణే (43 శాతం), ముంబై (39 శాతం), బెంగళూరు (39 శాతం) ఉన్నాయి. -
‘దండకారణ్య ప్రజారాజ్యం’ కావాలి
విరసం 45వ ఆవిర్భావ సభలో వరవరరావు మేక్ ఇన్ ఇండియాకు ప్రత్యామ్నాయం అదే ప్రపంచీకరణలో భాగంగానే తెలంగాణ, ఏపీలో విధానాల అమలు సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్పొరేట్ల అనుకూల మేక్ ఇన్ ఇండియాకు ప్రత్యామ్నాయంగా దండకారణ్య పాలన లాంటి ప్రజారాజ్య నిర్మాణం అవసరమని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం 45వ ఆవిర్భావ సభ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే మోదీ మేక్ ఇన్ ఇండియా, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ, ఏపీ సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో హరితహారం అమలు జరుగుతోందన్నారు. కేసీఆర్ దోపిడీ భూ సంసర్కరణలు, పారిశ్రామిక విధానాలను అమలు చేస్తుంటే ఏపీ రాజధానికి భూసేకరణ పేరుతో చంద్రబాబు విధ్వంసక అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని వరవరరావు ఆరోపించారు. దేశమంతా వ్యతిరేకించిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను చంద్రబాబు, కేసీఆర్ అమల్లోకి తెచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌ను చెత్త హైదరాబాద్‌గా మార్చారని ధ్వజమెత్తారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగానే రెండు రాష్ట్రాల్లో విధానాలు అమలవుతున్నాయన్నారు. ముస్లిం యువకులను, ఎర్రచందనం కూలీలను, విప్లవకారులను కాల్చి చంపడంలో రెండు విధానాలు ఒక్కటేనన్నారు. ఉద్యమ స్ఫూర్తితో 16 రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజ్య స్థాపన నిర్మాణం సాగుతుంటే దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ హంట్ పేరుతో ప్రజలపై యుద్ధం ప్రకటిస్తున్నాయన్నారు. దీనిపై పోరాడేందుకు గ్రామస్థాయి నుంచి గెరిల్లా జోన్వరకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నారు. పథకాల అమలుతో అభివృద్ధి అసాధ్యం: ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని విరసం నేత పాణి అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా-కాషాయీకరణ-జనతన సర్కార్ ప్రత్యామ్నాయం’ అంశంపై ఆయన మాట్లాడుతూ దండకారణ్యంలో ప్రతి కుటుంబానికి ఇల్లు, భూమి, నిర ంతర విప్లవ భూసంస్కరణలు అమలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం ప్రజల నుంచి భూములను లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. తెలంగాణ పునర్మిర్మాణం బూర్జువ మాట అని, తెలంగాణను తిరిగి గెరిల్లా జోన్‌గా మార్చాలన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ అంశంపై న్యాయవాది రవికుమార్ మాట్లాడుతూ భూములు సాగు చేసే వారికే భూహక్కులు ఉండేలా ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సి ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పాలకుల ఎజెండా-ప్రజల ఎజెండా అంశాలపై కాశీం, వరలక్ష్మీ తదితరులు ప్రసంగించారు. విరసం ప్రతినిధులు రివేరా, రాంకీలు అధ్యక్షత వహించిన ఈ సభలో పలు పుస్తకాలను ఆవిష్కరించారు. నాటి పరిస్థితులే నేడూ ... విరసం ఆవిర్భావం నాడున్న పరిస్థితులే నేటికీ కొనసాగుతున్నాయని వరవరరావు అన్నారు. ఆనాడు విశాఖ విద్యార్థులు రచయితలారా మీరు ఎటువైపు అని ప్రశ్నించినట్లుగానే పాలక వర్గం సృష్టించే భ్రమలలో కొట్టుకుపోతున్న నేటి రచయితలనూ ఈ తరం అదే విధంగా ప్రశ్నిస్తుందన్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ పరిస్థితులను సాహిత్యంలో ఆవిష్కరించాలన్నారు. -
కార్మికుడిని దేశ నిర్మాత చేస్తాం
* కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ * ప్రైవేటు ఉద్యోగులకూ సామాజిక భ ద్రత కల్పించాం * ఎన్డీఏ ఏడాది పాలనలో ఇదే మా ఘన విజయం సాక్షి,హైదరాబాద్: మేకిన్ ఇండియాతో కార్మికుడిని దేశ నిర్మాతగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎన్డీయే ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దత్తాత్రేయ శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేటు, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించామని పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వ ఘన విజయమని చెప్పారు. మేకిన్ ఇండియాతో దేశ స్వరూపం పూర్తిగా మారనున్న నేపథ్యంలో తొలుత కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించడంతో పాటు కార్మికులకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని చట్టాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్మికుల కనీస పింఛనుగా రూ.1,000 అందించటంతో పాటు ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్ల వివరాలను సంబంధిత కార్మికులకు తెలియచేసేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వసతులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయటం, ఉన్న ఆస్పత్రుల స్థాయి పెంచేందుకు కార్యాచరణ ప్రారంభించామని, వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల్లో సేవలను విస్తృతం చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన కు కేంద్ర సాయం... తెలంగాణ ప్రభుత్వ స్వచ్ఛ హైదరాబాద్ పథకానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, మూసీని ప్రక్షాళన చేసేందుకు రూ.875 కోట్ల పథకానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు. -
ప్రపంచ మార్కెట్టే లక్ష్యం కాకూడదు
‘మేక్ ఇన్ ఇండియా’పై రాజన్ అభిప్రాయం శ్రీనగర్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై తన అభిప్రాయాన్ని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యం కాకూడదని అన్నారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన జరుపుతున్న రాజన్, ఇక్కడ ఒక బిజినెస్ స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ తయారీ పరిశ్రమకు భారత్ కేంద్రం కావాలని, పెరుగుతున్న జనాభాకు తద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని ప్రధాన లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై రాజన్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే... ⇒ భారత్‌లో తయారీ రంగం పురోభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో విలువైనది అనడంలో సందేహం లేదు. అయితే ప్రపంచ మార్కెట్ మాత్రమే ఈ కార్యక్రమానికి లక్ష్యం కాకూడదు. ⇒ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటడానికి మనం తగిన ప్రయత్నం చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. భారీ డిమాండ్ లేదు. ఈ అంశాలన్నింటినీ భారత్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యంగా ఉంటే కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ⇒ తయారీ, సేవల రంగం వృద్ధికి మౌలిక అలాగే నియంత్రణాపరమైన తగిన వాతావరణాన్ని దేశం లో ఏర్పాటు చేయాలి. ఆయా అంశాలూ ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడతాయి. ⇒ ఎవరికోసం ఉత్పత్తి జరుగుతోందన్న అంశాన్ని మనం నిర్ణయించుకోకూడదు. ఇక్కడ ప్రధానంగా మనం తయారీ రంగం వృద్ధికి అవసరమైన మౌలిక పరిస్థితులు రూపకల్పన, వ్యాపారాలు తేలిగ్గా చేసుకునేలా నియమ నిబంధనల్లో సవరణలు, సుశిక్షుతులైన మానవ వనరుల అభివృద్ధి కీలకం. -
ప్రధాన రాయబారి మోదీ..!
ప్రధాని విదేశాంగ విధానం సక్సెస్ - ఆ వేగం కొనసాగించటమే సవాల్ తొలి ఏడాదిలో 18 దేశాల్లో నరేంద్రమోదీ పర్యటన ప్రపంచం దృష్టిని భారత్ వైపు ఆకర్షించటంలో సఫలం అమెరికా, చైనాలతో ఏక కాలంలో సన్నిహిత స్నేహం పాక్‌తో మరింత దెబ్బతింటున్న సంబంధాలు ఏడాది కాలపు విదేశాంగ విధానంపై మిశ్రమ విశ్లేషణలు ఏడాది కిందట ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ.. ఈ ఏడాది పాలనా కాలంలో సాధించిన అతిపెద్ద విజయం విదేశాంగ విధానమేనని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఏడాదిలో 18 దేశాల్లో పర్యటించిన మోదీ రికార్డు సృష్టించారు. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో.. మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయ ప్రపంచ శక్తిగా పరిగణిస్తున్న కమ్యూనిస్టు చైనాతో ఏక కాలంలో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మోదీ తనదైన ‘దౌత్య రాజకీయాలు’ నెరిపారు. తానే భారత ప్రధాన రాయబారిగా వ్యవహరించా రు. ఈ ఏడాదిలో భారత్‌ను సరికొత్తగా ప్రపంచం ముందు నిలపటానికి.. పెట్టుబడులు పెట్టటానికి ఆకర్షణీయమైన మార్కెట్‌గా ప్రపంచం దృష్టిని మళ్లీ భారత్ మీదకు తీసుకురావటంలో సఫలమయ్యారు. అలాగే.. దక్షిణాసియాపై ప్రధాన దృష్టి పెట్టిన మోదీ, పశ్చిమాసియాను పూర్తిగా విస్మరించారని.. బలమైన పొరుగుదేశం చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే దిశలో విజయం సాధించినప్పటికీ.. భారత్‌కు అతి పెద్ద సవాలుగా ఉన్న మరో పొరుగుదేశం పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో విఫలమయ్యారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విజయం కొనసాగేలా చూడటం సవాలు: ఏడాదిలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించిన మోదీ.. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా వారికి విశ్వాసం కల్పించటంలో.. దేశంలో పెట్టుబడులకు ఉన్న ఆటంకాలను తొలగించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నామని నమ్మకం కలిగించటంలో కృతకృత్యమయ్యారు. దీర్ఘ కాలంగా అమలుకాకుండా నిలిచిపోయిన అణు ఒప్పందం అమలుపై అమెరికాతో సంయుక్త ప్రకటన, చైనాతో సరిహద్దు పరిష్కారానికి ప్రమాణాలను నిర్ణయించటం వంటి ఘనమైన విజయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం మరో గణనీయ విజయం. అలాగే.. దక్షిణాసియాలో ఉమ్మడి సుసంపన్నత అనే ఆకాంక్షను విశదీకరించిన మోదీ.. అందులో భారత నాయకత్వాన్ని చక్కగా చూపారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో అనేక దేశాలతో లక్షల కోట్ల పెట్టుబడులపై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కృషిని అదే ఉత్సాహం, వేగంతో కొనసాగించటం.. ఫలితాలు వచ్చేలా చూడటం మోదీ ముందున్న సవాళ్లని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే క్రైస్తవులు, చర్చిలు, విదేశీ ఎన్జీవోలపై తరచుగా జరుగుతున్న దాడులు.. పశ్చిమ దేశాల ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశముందని.. వారి దృష్టిలో ‘భారత్ విజయగాథ’ అనేది మత స్వేచ్ఛ లేని దేశంగా మారిపోయే అవకాశముందని ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. అటూ ఇటూ.. స్నేహం..: ప్రపంచ దేశాల్లో రెండు ముఖ్యమైన శక్తులు - అమెరికా, చైనాలతో మోదీ వ్యవహార శైలి.. ఆ దేశాలతో సంబంధాలను బలపరచుకోవటంతో పాటు.. భారత ప్రయోజనాలకు అనుగుణంగా నడచుకోవటం విస్పష్టంగా కనిపిస్తోంది. ‘‘అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి (ఢిల్లీకి) వచ్చినపుడు.. ఆయనతో కలిసి మోదీ హిందూ మహాసముద్రంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోదీ చైనా వెళ్లినపుడు.. చైనా అధ్యక్షుడితో కలిసి వాతావరణ మార్పుల అంశంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత ప్రయోజనాల విషయంలో రెండు వైపులా వ్యవహారాలు నడపటానికి ఆయన సంకోచించలేదు. ఇది ఆయన వ్యవహారిక సత్తా వాదానికి అద్దం పడుతోంది. ఈ విధంగా చూస్తే.. అలీన విధానమైన భారత విదేశాంగ విధానానికి కొనసాగింపుగానే మోదీ విధానాన్ని భావించవచ్చు’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన శ్రీనాథ్ రాఘవన్ పేర్కొన్నారు. దక్షిణాసియాలో కొత్త మైత్రి..: నేపాల్‌లో మోదీ పర్యటన ఆ దేశంతో భారత్ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. అయితే.. నేపాల్‌లో పెను భూకంపం నేపథ్యంలో ఆ దేశ రాజ్యాంగ రూపకల్పన, దేశ పునర్నిర్మాణంలో భారత్ పాత్ర సవాళ్లతో కూడుకుని ఉంటుందని చెప్తున్నారు. ఇక శ్రీలంకలో మోదీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను పునఃనిర్వచించింది. అయితే.. లంకలో తమిళుల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండటం.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదం విషయంలో బీజేపీ వైఖరిని వదిలిపెట్టి.. ఆ దేశంతో భూ సరిహద్దును ఖరారు చేయటం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసింది. కానీ తీస్తా నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. మోదీ ఈ ఏడాది జూన్‌లో బంగ్లాలో పర్యటించనున్నారు. పాకిస్తాన్‌పై తీరు మారలేదు..: మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను ఆహ్వానించి ద్వైపాక్షిక దౌత్యానికి మంచి ఆరంభాన్నిచ్చినా.. దాన్ని అదే స్థాయిలో కొనసాగించలేకపోయారు. తనకు ముందు పాలకుల తరహాలోనే తొలుత దౌత్య చర్చలతో ప్రారంభించి.. తర్వాత చర్చల నిలిపివేతకే మొగ్గుచూపారు. ఈ క్రమంలో పాక్‌తో సంబంధాలు మరింతగా దెబ్బతింటున్నాయి. పాక్‌తో సంబంధాల్లో ప్రతిష్టంభన.. అఫ్ఘానిస్తాన్‌తో భారత్ సంబంధాలపైనా ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాపై ప్రేక్షక పాత్ర..: అంతర్గత సంక్షోభాలతో పశ్చిమాసియా కల్లోలంగా ఉంటే.. భారత్, మోదీ ఆ ప్రాంతంపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. పలు సంక్షుభిత ప్రాంతాల నుంచి భారతీయులను రక్షించి తేవటానికే భారత్ పరిమితమైంది. వ్యవస్థీకృత ప్రణాళికా లోపంతో చిక్కులే..: విస్తృత విదేశీ విధానం ఎత్తుగడలకు సంబంధించి సరైన వ్యవస్థీకృత ప్రణాళిక లేకపోవటం వల్ల.. భారత్‌కు మున్ముందు చాలా దేశాలతో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన శ్రీనాథ్ రాఘవన్ అభిప్రాయపడ్డారు. తొలి ఏడాదిలో ఎదురైన సవాళ్లివీ... మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గత జూలైలో తొలి దౌత్య సవాలు ఎదురైంది. ఇరాక్‌లో 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారన్న వార్త వచ్చింది. ఆ తర్వాత అదే దేశంలో తలెత్తిన అంతర్గత సంక్షోభంలో భారతీయ నర్సులు చిక్కుకుపోయారన్న వార్త వచ్చింది. బలమైన దౌత్య కృషితో నర్సులను విడిపించగలిగారు. కానీ.. 39 మంది భారతీయుల ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. -
ఎరువుల ధరలు పెరగవు..
- ఈ ఏడాదిలో 3వేల జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు - వరంగల్‌లో కాటన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తా - వచ్చే నెలలో కాజీపేట నుంచి ముంబై ప్రత్యేక రైలు - కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ పోచమ్మమైదాన్ : బీజేపీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగానే దేశంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎనిమిది ఎరువుల ఫ్యాక్టరీలు మంజూరు చేశామని, ఇందులో ఒకటి తెలంగాణలోని రామగుండంలో పునఃప్రారంభిస్తున్నామని, దీంతో రానున్న నాలుగేళ్లు ఎరువుల ధరలు పెరగవని పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని వెంకటేశ్వరగార్డెన్‌లో వరంగల్ మహానగర ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా బీజేపీ పోరుసభ బుధవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా హన్సరాజ్ గంగారామ్ అహిర్ హాజరై మాట్లాడారు. జనస్తుతి పథకంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 3వేల జనరిక్ మెడికల్ షాపులు, రానున్న మూడు సంవత్సరాల్లో 55 వేల జెనరిక్ మెడికల్ షాపులను ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కోల్ స్కామ్ వెలికితీయడం ద్వారా దేశానికి రూ.2లక్షల కోట్లు కలిసి వచ్చాయన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పార్క్, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, వరంగల్‌లో కాటన్ పరిశ్రమ ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని అధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందన్నారు. వచ్చే నెలలో కాజీపేట నుంచి ముంబైకి ప్రత్యేక రైలును ప్రారంభిస్తామన్నారు. గవర్నర్ సమాధానం చెప్పాలి.. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇది పార్టీ ఫిరాయింపు చట్టం పరిధిలోకి రాదా అనే దానిపై గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. అన్ని మాఫియాలకు కేరాఫ్‌గా టీఆర్ఎస్ పార్టీ మారిందన్నారు. ఓయూ భూములను లాక్కోవడంపై మాట్లాడిన విద్యార్థులను అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛహైదరాబాద్‌ను కేసీఆర్ మొదలుపెట్టారని విమర్శించారు. మిషన్ కాకతీయ ఎంత ఫలితాలు ఇస్తాయో ఇంకా తెలియాల్సి ఉందన్నారు. వరంగల్‌లో నాలుగురోజుల ఉన్న సీఎం కనీసం రూ.నాలుగు లక్షల అభివృద్ధి పనులనైనా చేయలేదని విమర్శించారు. ప్రజాసమ్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు సీఎం అపాయింట్మెంట్ అడిగితే నెలలు గడిచినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్ రెడ్డి నగర సమస్యలపై తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈసభలో బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు, జిల్లా ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాందాటి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాములు, నాయకులు రావు పద్మ, విజయలక్ష్మి, వంగాల సమ్మిరెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, బొడిగె గట్టయ్య, మాచర్ల సాంబయ్య, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నాగపురి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
అఫ్ఘాన్ ప్యాలెస్‌లో ఆతిథ్యమిస్తాం
భారత ఇన్వెస్టర్లకు అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు ఘని ఆహ్వానం న్యూఢిల్లీ : అఫ్ఘానిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టదల్చుకునే భారతీయ ఇన్వెస్టర్లకు భారీ ఆఫర్లు ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. 50 మిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసేవారు స్వయంగా తనతోనే సమావేశం కావొచ్చని చెప్పారు. ఇక 200 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేవారికి పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యమున్న రాజభవంతిలో ఆతిథ్యమిస్తామని తెలిపారు. మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన ఆయన ఆఖరు రోజున భారత వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. అఫ్ఘానిస్తాన్ యుద్ధాల నీడల నుంచి బయటపడి సుసంపన్నంగా ఎదగడంలో భారత ఇన్వెస్టర్లు కీలక పాత్ర పోషించగలరని ఆశిస్తున్నట్లు ఘని చెప్పారు. తమ దగ్గర రైల్వేలు, విద్యుదుత్పత్తి, మైనింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు. మేకిన్ ఇండియా తరహాలోనే భారత ఇన్వెస్టర్లు మేకిన్ అఫ్ఘానిస్తాన్‌కు చేయూతనిచ్చి, అక్కణ్నుంచి ఎగుమతులు చేసుకోవచ్చని ఘని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు వీసా నిబంధనలను సరళం చేయనున్నట్లు వివరించారు. 10 బిలియన్ డాలర్లతో చేపట్టిన తుర్క్మెనిస్తాన్-అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్-ఇండియా(టాపి) గ్యాస్ పైప్‌లైన్ వచ్చే అయిదేళ్లలో పూర్తి కాగలదని ఘని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి.అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్‌స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. ‘ఇంజనీరింగ్, టెక్నాలజీ.. దశాబ్దాలుగా ఎవర్గ్రీన్ రంగాలు. నేటికీ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. అకడమిక్స్ పరంగానూ ఎంతో క్రేజ్ కలిగిన విభాగాలివి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మేక్ ఇన్ ఇండియా.. అంతర్జాతీయంగా గ్లోబల్ దృక్పథం కారణంగా.. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో సమీప భవిష్యతలో మరింత డిమాండ్ ఏర్పడనుంది. ఆ మేరకు మానవ వనరుల అవసరం ఉంటుంది. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు మహీంద్రా ఎకోల్ సెంట్రేల్ డెరైక్టర్ ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండే. 12ఏళ్లు ఐఐటీ-కాన్పూర్ డెరైక్టర్‌గా పనిచేయడంతోపాటు ఐఐటీ-రాజస్థాన్ ఫౌండర్ డెరైక్టర్‌గా, ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ సంజయ్ జి.ధాండేతో గెస్ట్‌కాలం.. జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలను పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ నిపుణులకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాతో రానున్న ఐదేళ్లలో ఉత్పత్తి రంగం మరింత వృద్ధి చెందనుంది. ఈ కార్యక్రమం సమర్థంగా అమలైతే ప్రస్తుతం జీడీపీలో 17 శాతంగా ఉన్న ఉత్పత్తి రంగం వాటా 25 శాతానికి పెరగనుంది. అంటే.. కొత్త ఉత్పత్తులు, పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది. ఇది ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఇతరులతో సమన్వయంతో పనిచేయాలి: అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. నేటి తరం విద్యార్థులు ముఖ్యంగా నాలుగు అంశాల్లో నైపుణ్యాలు సాధించాలి. అవి సింథసిస్(సమన్వయం), ఇంటర్నేషనలైజేషన్, సాఫ్ట్‌స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. కారణం.. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్పత్తి రంగంలో పలు విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతరులతో సమన్వయంతో ముందుకు సాగడం చాలా అవసరం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ఒక ఉత్పత్తికి సంబంధించి విశ్లేషించే నైపుణ్యాలు ఉంటే విధుల్లో సమర్థంగా రాణించగలుగుతారు. టీంలో పనిచేసేటప్పుడు కమ్యూనికేషన్, సాఫ్ట్‌స్కిల్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కరిక్యులం.. ఆర్ అండ్ డీ: విద్యార్థులకు నైపుణ్యాలు అలవడాలంటే కరిక్యులంను పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించే నైపుణ్యాలను అందించేలా రూపొందించాలి. సమీప భవిష్యత్తులో సదరు రంగంలో రానున్న మార్పులు అంచనా వేసి ఆ మేరకు శిక్షణ ఇచ్చేలా కరిక్యులం రూపొందించాలి. అప్పుడే విద్యార్థులు అధునాతన పరిజ్ఞానంతో జాబ్ మార్కెట్లో రాణించగలరు. మన దేశంలో ఇటీవల కాలంలో ఇన్స్టిట్యూట్ల పరంగా ఆర్ అండ్ డీపై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇన్స్టిట్యూట్లు ఆర్ అండ్ డీ దృక్పథంతోపాటు పరిశ్రమ వర్గాలు కోరుకునే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా కార్పొరేట్ సంస్థలు సొంతంగా ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఆర్ అండ్ డీ, పరిశ్రమలకు అనువుగా రాణించడం కోసమే! గ్లోబల్ దృక్పథం కావాలి: విద్యార్థులు లోకల్, ఇంటర్నేషనల్ అనే కోణంలో ఆలోచించడం మానేయాలి. పూర్తిగా ‘గ్లోబల్’ దృక్పథంతో నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. ఇప్పుడు కంపెనీల పరంగా లోకల్, ఇంటర్నేషనల్ అనే హద్దులు చెరిగిపోయాయి. పెద్ద కంపెనీలు అన్నీ వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎంఎన్సీలుగా పరిగణనలో ఉన్నాయి. ఎంఎన్‌సీలు అంటే మన దేశంలో ఉన్న విదేశీ సంస్థలుగానే భావిస్తాం. కానీ ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన దేశంలోని సంస్థలు కూడా ఎంఎన్‌సీలే. ఉదాహరణకు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు ఇతర దేశాల్లో సర్వీస్ డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. మన దేశంలోని సంస్థలో పనిచేస్తున్నా, విదేశాల్లోని కంపెనీలో చేరినా.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పనిచేసేలా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి: ఇంజనీరింగ్‌కు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం. ఉదాహరణకు ఇటీవల కాలంలో డిజిటల్ ఫ్యాబ్రికేషన్, 3-డి ప్రింటింగ్ వంటి వాటి ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా.. సరికొత్త టెక్నాలజీలో నైపుణ్యాలు పొందేలా శిక్షణ తీసుకోవాలి. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఆవిష్కరణలకు కీలకమైన ప్రాథమిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం విద్యార్థుల్లో సమస్యగా మారింది. ఇంజనీరింగ్ ఔత్సాహిక, ఇప్పటికే ఈ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. స్వీయ లెర్నింగ్‌తో..: మంచి కాలేజీలో చేరితేనే మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయి అనే అపోహను వీడండి. కాలేజ్/ఇన్స్టిట్యూట్ స్థాయి ఏదైనా.. ఇంజనీరింగ్ వంటి కోర్సులో స్వీయ ఆసక్తితో, సొంతగా నేర్చుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక అంశం చెబితే దానికి అనుసంధానంగా ఉన్న ఇతర అంశాలపై పరిజ్ఞానం పొందేందుకు విద్యార్థి సొంతగా కృషి చేయాలి. దాంతోపాటు ప్రొఫెసర్లు చేసే పరిశోధనల్లో పాల్గొనేలా వ్యవహరించాలి. ఒక బ్రాంచ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌లోని కోర్సులకే పరిమితం కాకుండా.. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. అప్పుడే ఎలాంటి కాలేజీలో చేరినా.. భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు!! -
యూజీసీ నెట్.. పరిశోధనలకు పిలుపు!
సాహిత్యం నుంచి స్పేస్ సైన్స్ వరకు రోజురోజుకీ పెరుగుతున్న రీసెర్చ్ ఆవశ్యకత..మేక్ ఇన్ ఇండియా.. స్కిల్ ఇండియా తదితర పథకాలతో భవిష్యత్‌లో ఆర్ అండ్ డీ విభాగాల్లో విసృ్తత అవకాశాలు.. పరిశోధన దిశగా ఔత్సాహికుల సంఖ్యను పెంచేందుకు భారీగా పెరిగిన ఆర్థిక ప్రోత్సాహకాలు.. దేశంలో పరిశోధనల ప్రాధాన్యాన్ని తెలిపే నిదర్శనాలివి.. ఈ పరిశోధనల అవకాశాలను.. ఆపై ఉన్నత కెరీర్‌ను అందుకునేందుకు తొలి అడుగే.. యూజీసీ నెట్(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్). బోధన రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించడానికి కూడా యూజీసీ నెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఏటా రెండు సార్లు నిర్వహించే యూజీసీ నెట్.. నోటిఫికేషన్ (యూజీసీ నెట్- జూన్ 2015) వెలువడిన నేపథ్యంలో నెట్లో విజయానికి మార్గాలు.. అవకాశాలపై విశ్లేషణ... ► నెట్ అభ్యర్థులందరికీ మొదటి పేపర్ ఒకే విధంగా ఉంటుంది. ఈ పేపర్లో అభ్యర్థిలోని రీసెర్చ్ ఆప్టిట్యూడ్; టీచింగ్ ఆప్టిట్యూడ్; జనరల్ అవేర్నెస్ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 60 ప్రశ్నలు ఉండే ఈ పేపర్లో.. తప్పనిసరిగా 50 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ► పేపర్-2, 3లు అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ సంబంధిత పేపర్లు. ► పేపర్-2లో 50 ప్రశ్నలు అడుగుతారు. అన్నిటికీ సమాధానం ఇవ్వడం తప్పనిసరి. ► పేపర్-3లో 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్లోనూ అన్నిటికీ సమాధానం ఇవ్వాలి. ప్రతి పేపర్‌కు వేర్వేరుగా కనిష్ట ఉత్తీర్ణత యూజీసీ నెట్లో మూడు పేపర్లలో ఉత్తీర్ణత శాతం వేర్వేరుగా ఉంటుంది. పేపర్-1, పేపర్-2లకు కనీసం 40 శాతం; పేపర్-3లో కనీసం 50 శాతం మార్కులు పొందితేనే మెరిట్ లిస్ట్ ప్రకారం తదుపరి దశకు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మూడు పేపర్లలో సగటు మార్కులను గణించి అందులో మొదటి 15 శాతం అభ్యర్థులతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు నెట్ అర్హుల జాబితా రూపొందిస్తారు. ఈ జాబితా నుంచే జేఆర్ఎఫ్ కోసం ప్రత్యేకంగా మెరిట్ లిస్ట్‌ను తయారుచేస్తారు. 70 శాతం మార్కులు లక్ష్యంగా నెట్ ఔత్సాహిక అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులు లక్ష్యంగా సాధన చేస్తే జేఆర్ఎఫ్ అవకాశాలు మెండుగా ఉంటాయి. యూజీసీ నెట్ జూన్ - 2014లో ఆయా సబ్జెక్ట్‌లలో పేర్కొన్న కటాఫ్‌లే ఇందుకు నిదర్శనం. యూజీసీ నిర్వహించే నెట్ ద్వారా 3200 జేఆర్ఎఫ్లు అందిస్తుంది. ఈ క్రమంలో యూజీసీ నెట్ 2014ను 95 సబ్జెక్ట్‌లలో నిర్వహించగా.. జనరల్ కేటగిరీల్లో అన్ని విభాగాల్లో జేఆర్ఎఫ్ కటాఫ్ పర్సంటేజీ 60 శాతం నుంచి 70 శాతం మధ్యలో నమోదైంది. ఆబ్జెక్టివ్ పరీక్షకు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ► మొత్తం మూడు పేపర్లుగా పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే నెట్లో ఉత్తీర్ణతకు అభ్యర్థులు డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించడం మంచిది. ► అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి పీజీ స్థాయి సిలబస్‌ను ఔపోసన పట్టడం ఎంతో అవసరం. ► అందరికీ ఉమ్మడిగా ఉండే పేపర్-1లో ఎక్కువగా టీచింగ్ ఆప్టిట్యూట్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, దేశంలో ఉన్నత విద్య-ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం ఆయా రంగాల్లో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ► వీటితోపాటు పేపర్-1లో డేటా ఇంటర్‌ప్రిటేషన్; లాజికల్ రీజనింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలు కూడా అడుగుతారు. అభ్యర్థుల పరిశీలన నైపుణ్యం, నిర్దిష్ట అంశంలోని ‘క్లూ’ పాయింట్లను గుర్తించడం, నిర్దిష్ట డేటా నుంచి ముఖ్యాంశాలను గుర్తించే విశ్లేషణ వంటి నైపుణ్యాలను ప్రాక్టీస్ ద్వారా సొంతం చేసుకోవాలి. ► పేపర్-2, 3లలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ఎలక్టివ్స్ నుంచి పీజీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ వాటికి నేపథ్యం తెలిస్తేనే సమాధానం ఇవ్వగలిగేలా ఉంటాయి. కాబట్టి సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో చదవాలి. ► ప్రతి అంశాన్ని బేసిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ► సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధిత సబ్జెక్ట్‌ల అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► వారానికో చాప్టర్ పూర్తి చేసుకునే విధంగా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. ► గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం చాలా అవసరం. ► మాక్ టెస్ట్‌లు రాయడం కూడా లాభిస్తుంది. ఈ మాక్ టెస్ట్‌లను కూడా పరీక్షలో లభించే నిడివిలోనే పూర్తిచేయాలి. ► పేపర్-2, 3లలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అయితే ఈ విషయంలో ఆందోళన చెందడం కంటే శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి. ► నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ముందుగా సమాధానాలు బాగా తెలిసిన ప్రశ్నలన్నిటినీ పూర్తిచేసి; సమాధానం తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్ టెక్నిక్ ఆధారంగా గుర్తించాలి. యూజీసీ నెట్ - జూన్ 2015 అర్హతలు ► అభ్యర్థులు హ్యుమానిటీస్; సోషల్ సైన్స్, మేనేజ్మెంట్, సైన్స్ విభాగాల్లో మొత్తం 85 సబ్జెక్ట్‌లలో నిర్వహించే నెట్లో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి పీజీ స్థాయిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. ► ఆయా సబ్జెక్ట్‌లలో పీజీ ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి: జూన్ 1, 2015 నాటికి 28 సంవత్సరాలు. ఓబీసీ (నాన్ - క్రీమీలేయర్), ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యుడీ తదితర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు. ► అసిస్టెంట్ ప్రొఫెసర్ ఔత్సాహిక అభ్యర్థులకు వయో పరిమితి లేదు. దరఖాస్తు విధానం ► అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఠీఠీఠీ.ఛిఛట్ఛ్ఛ్ట.జీఛి.జీ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేసి కేటాయించిన అప్లికేషన్ నెంబర్ ఆధారంగా లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి. నిర్దేశిత ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించొచ్చు. మూడు బ్యాంకుల్లో (సిండికేట్ బ్యాంక్/ ఐసీఐసీఐ బ్యాంకు/ కెనరా బ్యాంకుల) నెట్ ఈ-చలాన్ పేమెంట్ సదుపాయం కల్పించారు. ఈ-చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలనుకునే అభ్యర్థులు దాన్ని డౌన్లోడ్ చేసుకుని సంబంధిత బ్యాంకులో ఫీజును చెల్లించి వివరాలను మళ్లీ పొందుపర్చాలి. యూజీసీ వెబ్సైట్లో సిలబస్ నెట్ నిర్వహించే సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్ సిలబస్ యూజీసీ వెబ్సైట్ ఠీఠీఠీ.ఠజఛి.్చఛి.జీలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు కచ్చితంగా ఈ సిలబస్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆ మేరకు ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించాలి. యూజీసీ నెట్ జూన్ 2015 ముఖ్య తేదీలు ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2015, ఏప్రిల్ 16. ► ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2015, మే 15. ► ఈ-చలాన్/డెబిట్ కార్డ్/క్రెడిట్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ : 2015, మే 16. ► పరీక్ష తేదీ: 2015, జూన్ 28. ► అడ్మిషన్ కార్డ్ డౌన్లోడ్: జూన్ మొదటి వారం ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్. వెబ్సైట్ : www.cb.senet.nic.in యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు ► నెట్ ఉత్తీర్ణతతో ప్రతిష్టాత్మక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందేందుకు అర్హత లభిస్తుంది. ► నెలకు రూ. 25 వేల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందుకోవచ్చు. ► ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణులకు రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ప్రాధాన్యం. పీఎస్‌యూలకూ ప్రామాణికంగా నెట్ స్కోర్ యూజీసీ నెట్‌కు సంబంధించి తాజా మార్పు.. యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా పబ్లిక్ సెక్టార్ సంస్థలు నియామకాలు చేపట్టొచ్చనే నిర్ణయం. ఆయా పీఎస్‌యూల్లో ఆర్ అండ్ డీ, మేనేజ్మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో నియామకాలకు నెట్ ఉత్తీర్ణులను తీసుకునే అవకాశం కల్పిస్తూ యూజీసీ గత నవంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యూజీసీ నెట్ డిసెంబర్ 2014 మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులతో మేనేజ్మెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇదే బాటలో మరికొన్ని పీఎస్‌యూలు కూడా పయనించనున్నాయి. విశ్లేషణ, పరిశీలన నైపుణ్యాలు అవసరం యూజీసీ నెట్లో ఉత్తీర్ణతకు ప్రధాన సాధనాలు.. విశ్లేషణ, పరిశీలన నైపుణ్యాలు. ముఖ్యంగా కంపల్సరీ పేపర్స్‌గా అభ్యర్థుల ఎలక్టివ్ సబ్జెక్ట్స్‌లో ఈ నైపుణ్యాలు ఎంతో ఉపకరిస్తాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్ సమయంలో తులనాత్మక అధ్యయనం అవసరం. అప్పుడే ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. యూజీసీ నెట్‌కు సంబంధించి ఇటీవల కాలంలో లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల(ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర)కు కూడా ఆదరణ పెరుగుతోంది. ఆయా సబ్జెక్ట్‌లలో పీజీ స్థాయిలో అకడమిక్‌గా మంచి పట్టున్న అభ్యర్థులు ప్రస్తుత సమయంలో సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే మెరిట్ జాబితాలో చోటుసంపాదించొచ్చు. కేవలం రీడింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. తద్వారా తమ సామర్థ్యం తెలుసుకుని నైపుణ్యం పెంచుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. - ప్రొఫెసర్ ఎం.ఎ.అజీమ్, కో ఆర్డినేటర్, యూజీసీ నెట్ కోచింగ్ సెంటర్,మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ -
మేకిన్ ఇండియాకు డిమాండ్ కీలకం: రాజన్
చండీగఢ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే దేశీయంగా తగినంత డిమాండ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయంగా విదేశీ కంపెనీలతో దీటుగా పోటీపడేలా దేశీ సంస్థలకు తోడ్పాటునివ్వాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు మేకిన్ ఇండియాను ఉపయోగించుకోవచ్చని రాజన్ పేర్కొన్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. -
మీ సహకారం మాకు అవసరం
బెర్లిన్: మేకిన్ ఇండియాకు జర్మనీ సహకారం ఎంతో అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మోర్కెల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన ఆయన నైపుణ్యానికి పెట్టింది పేరు జర్మనీ అని కొనియాడారు. జర్మనీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న ఆయన తయారీ రంగంలో ఆ దేశమే టాప్ అని చెప్పారు. జర్మనీ నుంచి భారత మానవ వనరులకు కావాల్సిన సూచనలు, సహకారాలు అందితే మేటి శక్తిగా ఎదుగుతామని చెప్పారు. జర్మనీతోపాటు ఇండియా కూడా భద్రతా మండలిలో శాశ్వత సభ్యురాలిగా ఉంటే ప్రపంచానికే మేలు అని సూచించారు. ఉగ్రవాదం అనూహ్య రీతిలో పడగ విప్పుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. దానిని అణిచివేసేందుకు సమగ్ర ప్రణాళిక కావాలని కోరారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారిని తాము ఏమాత్రం సహించబోమని చెప్పారు. -
‘మేకిన్ ఇండియా’ మరిచారా!
సంపాదకీయం తన విదేశీ పర్యటనలకు అవసరమైన ప్రాధాన్యతనూ, ఆకర్షణనూ కలగ జేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలానే సఫలీకృతులయ్యారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు ఇప్పుడు మీడియాలో లభిస్తున్న ప్రచారం ఈ సంగతిని రుజువు చేస్తున్నది. అయితే, ఈ పర్యటనలో మిగిలిన అన్ని అంశాల కంటే అందరినీ ఆకర్షించింది ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదిరిన ఒప్పందం. సరిగ్గా మూడేళ్లక్రితం యూపీఏ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తిచేసే ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్‌తో ఒప్పందానికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. రూ. 54,000 కోట్ల విలువైన ఆ ఒప్పందం కింద డసాల్ట్ సంస్థ మొత్తం 126 యుద్ధ విమానాలను మన దేశానికి సమకూర్చాలి. వీటిలో 18 విమానాలను 2015కల్లా సమకూరుస్తామని డసాల్ట్ పూచీ పడింది. మిగిలిన 108 విమానాలనూ అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడం ద్వారా మన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేందుకు ఏడేళ్ల పాటు సహకరిస్తానని ఆ సంస్థ అంగీకరించింది. ఈ విషయంలో డసాల్ట్- హెచ్ఏఎల్ మధ్య జరిగిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతోపాటు... భారత వైమానికి దళానికి నాసిరకం యుద్ధ విమానాలను అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఒప్పందం కాస్తా మూలనబడింది. వాస్తవానికి మన వైమానిక దళం యుద్ధ విమానాల కొనుగోలు కోసం 2000 సంవత్సరంనుంచి ఒత్తిళ్లు తెస్తున్నది. మన దేశం చుట్టూ చైనా కుంపట్లు రాజేస్తున్నదని అడపా దడపా వస్తున్న వార్తలు... పాకిస్థాన్ షరా మామూలుగా కయ్యానికి కాలుదువ్వడం వంటివన్నీ మన రక్షణ సంసిద్ధత పెరగాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో రక్షణ దళాలకు వరస విజయాలు సాధించిపెట్టిన మిగ్-21 విమానాల వయసు మీరింది. అవి క్రమేపీ మూలనబడుతున్నాయి. వరస ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. హఠాత్తుగా యుద్ధం వస్తే రణరంగంలోకి ఉరకడానికి అవసరమైన సాధనాసంపత్తి మన వైమానిక దళానికి లేదన్నది నిజం. వైమానిక దళం చేసిన అభ్యర్థనలపై ఏడేళ్ల తర్వాత అంటే... 2007లో తొలిసారి గ్లోబల్ టెండర్లు పిలిచారు. అందులో మిగిలినవాటిని కాదని డసాల్ట్ సంస్థను ఖరారు చేయడానికి మరో అయిదేళ్లు పట్టింది. ఇంతాచేసి 2012నుంచీ ఆ ఒప్పందం కాస్తా మూలనబడింది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఉన్న శంకలైతేనేమి... విమర్శలైతేనేమి అంత తేలిగ్గా కొట్టిపారేయదగ్గవి కాదు. రాఫెల్‌ను ఎంపిక చేయడానికి ముందు అమెరికాకు చెందిన ఎఫ్/ఏ-18, ఎఫ్-16, స్వీడన్‌కు చెందిన గ్రిపెన్, రష్యాకు చెందిన మిగ్-35 విమానాలను 2011లో జరిగిన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత పక్కనబెట్టారు. ఇక రంగంలో రాఫెల్‌తో పాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల కన్షారియం ఉత్పత్తి చేసే టైఫూన్లు మిగిలాయి. చివరకు 2012లో రాఫెల్‌ను ఖరారుచేశారు. అయితే దీని ఎంపిక ఆదినుంచీ వివాదాస్పదంగానే ఉంది. బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, సౌదీ అరేబియా సహా పలు దేశాలు నిరాకరించిన రాఫెల్ మనకెలా నచ్చిందని విమర్శలొచ్చాయి. ఈ ఎంపికలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. రాఫెల్‌ను సాంకేతిక కారణాలు చూపి మనమే ఒకప్పుడు వద్దనుకున్నామని రక్షణ రంగ నిపుణులు గుర్తుచేశారు. వీటన్నిటికీ తోడు డసాల్ట్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అనేక మెలికలు పెట్టడంవల్ల ఈ మూడేళ్లనుంచీ ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడిందని మరిచి పోకూడదు. ఇప్పుడు ప్రధాని మోదీ కుదుర్చుకున్న ఒప్పందానికీ, పాత ఒప్పందానికీ సంబంధం లేదు. ఇప్పుడు కుదిరింది డసాల్ట్‌తో కాదు...ఫ్రాన్స్ ప్రభుత్వంతో. ఇరు ప్రభుత్వాలమధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే రెండేళ్లలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు మన వైమానిక దళానికి సమకూరుతాయి. ‘అత్యవసర నిర్వహణా అవసరాల’కింద ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. మధ్యశ్రేణి బహువిధ యుద్ధ విమానంగా పేరుగాంచిన రాఫెల్ వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మన అవసరాలు తీరతాయని ప్రభుత్వం చెబుతున్న మాట నిజమే కావొచ్చు. అయితే, నరేంద్ర మోదీ అధికారంలోకొచ్చినప్పటినుంచీ హోరెత్తిస్తున్న ‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తికి ఇది విరుద్ధమని వస్తున్న విమర్శల మాటేమిటి? ‘మేకిన్ ఇండియా’ నినాదం సంగతలా ఉంచి... రక్షణ రంగంలో స్వావలంబన సాధించలేని మన అశక్తతపై నిపుణులు ఆదినుంచీ ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. దిగుమతుల వల్ల మన తక్షణ భద్రతా అవసరాలు తీరుతాయన్న వాదనలో నిజమున్నా... భద్రత కోసమంటూ వ్యయం చేస్తున్న వేలాది కోట్ల రూపాయల్లో 70 శాతం విదేశీ సంస్థల ఖాతాలకే చేరుతున్నాయన్నది వాస్తవం. మన భద్రతా అవసరాలు తీరేలా... ఆ క్రమంలో వేలాదిమంది శాస్త్ర, సాంకేతిక నిపుణులకు, కార్మికులకు పని లభించేలా చేస్తే అది మన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది. ఇప్పుడున్న మన రక్షణ పరిశోధనా సంస్థలకు కేటాయింపులను ఎక్కువచేస్తే రక్షణ ఎగుమతుల సామర్థ్యాన్ని సైతం మరింత పెంచుకోవడానికి వీలుంటుంది. ఎయిర్‌బస్ సంస్థ భారత్‌లో ఉత్పత్తులు ప్రారంభించడానికి సిద్ధమేనని మోదీ సమక్షంలో ప్రకటించింది. డసాల్ట్ సంస్థ సైతం తన వైఖరిని సడలించుకుని సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపునకు అంగీకరించేలా చేయగలిగి ఉంటే మన దేశానికి అది ఉపయోగపడేది. ‘మేకిన్ ఇండియా’ నినాదం తర్వాత మిగిలిన రంగాల మాటెలా ఉన్నా రక్షణ పరిశోధనారంగం బలోపేతమవుతుందని, శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఉంటుందని పలువురు నిపుణులు ఆశించారు. అలాంటి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని ఆశిద్దాం. -
‘మేకిన్ ఇండియా’.. ఒక ఉద్యమం
జర్మనీ పర్యటనలో ప్రధాని మోదీ ఉద్ఘాటన ⇒ ఫ్రాన్స్‌తో చర్చలపై సంతృప్తి ⇒ హోలాండ్కు భారతీయ పెయింటింగ్ బహూకరణ హనోవర్: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జర్మనీ చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌తో విస్తృత చర్చల అనంతరం ఆయన జర్మనీలో అడుగుపెట్టారు. హనోవర్‌లో జరిగిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘మేకిన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) ఒక జాతీయ ఉద్యమమని, దీంతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. భారత్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చేం దుకు జర్మనీ సహకరించాలని కోరారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో జర్మనీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మోదీ కృషి చేయనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో పాటు జర్మన్ వ్యాపార వర్గాలతో మోదీ చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంపు, టెక్నాలజీ మార్పిడిపై ప్రధాని దృష్టి సారిస్తారు. ఫ్రాన్స్‌లో విద్యార్థులకు మరింత గడువు ఇకపై ఫ్రాన్స్‌లో చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు మరికొంత కాలం అక్కడే ఉండవచ్చు. ఫ్రెంచ్ విద్యార్థులు కూడా భారత్‌లో ఇలాగే ఉండొచ్చు. ఈ మేరకు ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఇరు దేశాల్లో 12 నెలల కాలం పూర్తి చేసుకున్న విద్యార్థుల వీసా గడువును మరో 12 నెలలు పొడిగిస్తారు. జర్మనీకి వెళ్లే ముందు ఫ్రాన్స్ పర్యటన ముగింపు సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్తో కల సి మోదీ ప్రకటన జారీ చేశారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని దృఢం చేసుకునే దిశగా జరిగిన చర్చలపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంస్కృతిని పరస్పరం అర్థం చేసుకునేలా విద్యార్థులకు వీసా గడువు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, వీడ్కోలు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఓ అద్భుత పెయింటింగ్‌ను బహూకరించారు. ‘ట్రీ ఆఫ్ లైఫ్’గా పిలిచే ఈ చిత్రాన్ని ఒడిశాకు చెందిన ప్రఖ్యాత కళాకారుడు భాస్కర్ మహాపాత్ర వేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మోదీ ప్రసంగం ఫ్రాన్స్‌లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్యారిస్‌లో ఇక శనివారం రాత్రి మోదీ ప్రసంగించారు. దేశంలో మూడున్నర లక్షల మంది సంపన్నులు సబ్సిడీ గ్యాస్‌ను వదులుకున్నారని, ఈ రకంగా మిగిలే నిధులను పేదలకు గ్యాస్ అందించేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. దేశంలోని పేదలందరికీ బ్యాంకు ఖాతాలు తెరవాలన్న లక్ష్యం పెట్టుకున్నామని, భారత్ ఇకపై పేద దేశంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఈ సందర్భంగా బొగ్గు స్కాంను ప్రస్తావించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల విషయంలో గత యూపీఏ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 204 బొగ్గు బ్లాకుల్లో కేవలం 20 బ్లాకుల వేలానికే రూ. రెండు లక్షల కోట్లు వచ్చాయన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు చెబుతున్నాయని, ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. హనోవర్‌లో గాంధీ విగ్రహావిష్కరణ జర్మనీలోని హనోవర్‌లో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. మహాత్ముడి బోధనలు, విధానాలు ఉగ్రవాదం, భూతాపోన్నతి వంటి సవాళ్లకు తగిన సమాధానాలని అన్నారు. మూడు రోజుల పర్యటన కోసం జర్మనీకి వచ్చిన మోదీ మొదటిరోజైన ఆదివారం హనోవర్‌లో పర్యటించారు. ‘మండలి’లో శాశ్వత సభ్యత్వం భారత హక్కు ప్రపంచశాంతి కోసం మొదటి ప్రపంచయుద్ధం నుంచీ భారత్ ఎన్నో త్యాగాలు చేసిందని, ఇప్పటికీ శాంతి పరిరక్షకదళంలో అతిపెద్ద భాగస్వామిగా ఉందని మోదీ తెలిపారు. ప్రపంచదేశాలు దీన్ని గౌరవించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఇకపై ఇందుకోసం భారత్ వేడుకోబోదని, అది తమ దేశహక్కని చెప్పారు. ఈ ఏడాది 70వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఐరాస ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. లక్షలాది భారత సైనికులు ప్రపంచ శాంతి కోసం యుద్ధాల్లో పాల్గొన్నారని, ఇతర దేశాల కోసం ప్రాణాలొదిలారని, భారత్ అంటేనే త్యాగాలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్‌ను వీడుతున్న సందర్భంగా ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్‌లో తన పర్యటన విజయవంతమైందంటూ ఇంగ్లిష్, ఫ్రెంచ్‌లో ట్వీట్ చేశారు. -
జర్మనీలో ప్రధాని మోదీ పర్యటన