Rainy season
-
వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..?
ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిదని అంటారు. అలాంటి ఆకుకూరలను వర్షాకాలంలో మాత్రం తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో ఎందుకు తీసుకోకూడదు..?. నిపుణులు ఏమంటున్నారంటే..ఈ వర్షాకాలంలో ఆకుకూరలు బురద బురదగా ఉంటాయి. పైగా గాల్లో ఉండే తేమ కారణంగా వైరస్, బ్యాక్టీరియా ఆకులను ఆశ్రయించి ఉంటుంది. చెప్పాలంటే ఈ టైంలో వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసే ప్రదేశంగా ఆకుకూరలను మారుస్తుంది. మనం ఈ కాలంలో వీటిని గనుక సరిగా క్లీనింగ్ చేయకుండా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, డయేరియా, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా అని ఈ సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండాల్సిన పనికూడా లేదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు అమిత. హాయిగా ఈ కాలంలో కూడా ఆకుకూరలు తినొచ్చుని చెబుతున్నారు. అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించినట్లియితే బేషుగ్గా తినవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా కడగడం ఎలా అంటే..ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే తాజా ఆకులను వేరు చేయాలి. తర్వాత నిస్తేజంగా ఉన్న వాటిని శుభ్రం చేసి, బాగానే ఉన్నాయనిపిస్తే వినియోగించాలి. ఆ తర్వాత ఆకులన్నింటిని ఒక్కోక్కటిగా ఓపికతో క్లీన్ చేయాలి. వాటిని పొడి క్లాత్‌పై వేసి చక్కగా ఆరబెట్టండి.వండటానికి ముందు ఆకుకూరలను చక్కగా ఉప్పు వేసిన వేడినీటిలో 30 సెకన్లపాటు ఉంచి వడకట్టండి. ఆ తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లో వేసి చక్కగా వండుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా వండినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.(చదవండి: డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..) -
వర్షాకాలం..వ్యాధుల కాలం..వీటి బారినపడకూడదంటే..!
సూర్యుడి భగభగలు నుంచి తొలకరి జల్లులతో వర్షాకాలం సమీపించి చల్లదనంతో సేదతీరేలా చేస్తుంది. కానీ ఇది ఎంత చల్లగా ఆహ్లాదంగా ఉన్నా..ఈ తేమకు ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ప్రజలు. వీటిని ఎలా ఎదుర్కోవాలి?, ఈ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.!వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.జలుబు, జ్వరం..ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వ సాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం. కాబట్టి, వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.దోమలు..రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. దీని వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి.డెంగ్యూ..డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యే. ప్రాణాంతకంగా మారింది. ఇది డెంగ్యూ వైరస్ కారణంగా వచ్చినప్పటికీ, క్యారియర్ దోమ, కాబట్టి, దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు.కలరా..కలరా అనేది కలుషిత నీటి ద్వారా వచ్చే సమస్య. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది.టైఫాయిడ్..టైఫాయిడ్ ఫీవర్ కూడా కలుషిత ఆహారం, నీటి కారణంగా వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ వల్ల వచ్చే మరో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు.హెపటైటిస్..కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకడం, కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. ఈ సమస్య లక్షణాలు జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైనవి వస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వలన ఎక్కువగా జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మాస్క్ ధరించి దీని బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు వేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక గొంతు నొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు అయిల్ ఫుడ్‌ని దూరంగా పెట్టాలని సూచించారు. ఆహారం తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని, ఉప్పు నీటిని వాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీ నుండి తప్పించుకోవచ్చు. అంతేగాదు వర్షాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందు నుంచి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.పోషకాహారం తీసుకోవాలి.ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.కాచి చల్లార్చిన నీటిని తాగాలి.దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..దీంతో అతడి రక్తం..! -
వర్షాకాలంలో ఈ పప్పు ధాన్యాలు తింటున్నారా..?
సూర్యుడి భగభగలు నుంచి చల్లటి తొలకరి చినుకులతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇక ఎప్పుడు ముసురుపట్టి వర్షం పడుతుందో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. ఓ పక్క వంటిట్లో వస్తువులు నిల్వ చేసుకోవడం కష్టమంటే, మరోవైపు వర్షాలకు బ్యాక్టీరయి, వైరస్‌లతో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఊపందుకుంటాయి. ఇలాంటి వర్షాకాలంలో అందుకు తగ్గట్టు మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పలు రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో సవివరంగా చూద్దాం. పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. ఎందకంటే వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. సెనగపప్పు..సెనగపప్పులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్‌ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మసూర్ పప్పు లేదా ఎర్ర పప్పువాటిలో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపానవాయువుకు కారణమవుతుంది.మినపప్పు..ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం, ఉబ్బరానికి దారితీస్తుంది.తినకూడని ఇతర ఆహారపదార్థాలు..వేయించిన ఆహారాలు..వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి కాలేయంపై ఏర్పడుతుంది. పచ్చి ఆకుకూరలు..సలాడ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఈ కాలంలో వాటిని నివారించడం ఉత్తమం. ఆకుల్లో తరుచుగా వ్యాధికారక కీటకాలు ఉంటాయి. వాటిని తొలగించడం కష్టం. అందువల్ల వాటిని బాగా శుభ్రం చేసుకుని తినడం లేదా దూరంగా ఉండటం మంచిది. (చదవండి: -
వానల్లో వార్మ్‌గా, బ్రైట్‌గా.. ఉండాలంటే ఇలా చేయండి..
మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది! వానజల్లులు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి కానీ ఇంటి వాతావరణాన్ని గ్లూమీగా మార్చేస్తాయి. మనసుతో ఇల్లూ పోటీపడాలంటే ఇంటీరియర్ బ్రైట్‌గా ఉండాల్సిందే! అందుకే..ఇంట్లో రంగు రంగుల వాల్ ఆర్ట్, కళాత్మక వస్తువులు, కుండీలు, క్యాండిల్ హోల్డర్లు.. వంటి ఉపకరణాలను చేర్చండి. గదిలోని ఒక గోడను బ్రైట్ కలర్‌తో పెయింట్ చేయండి. దీంతో ఆ స్థలం సజీవంగా మారిపోతుంది. లేదంటే కంటికింపైన వాల్‌పేపర్‌ను అతికించినా సరే! కుషన్ కవర్లు, కర్టెన్లూ డార్క్ కలర్స్వే ఎంచుకోండి.వర్షాకాలం తేమ ఎక్కువ కాబట్టి వుడెన్ కాకుండా ఫైబర్, మైక్రో ఫైబర్ ఫర్నీచర్‌ను తెచ్చుకోండి. దీపాలతో వెలుగుకే పరిమితం కాదు. గాలినీ శుద్ధి చేస్తాయి. వెచ్చదనాన్నీ అందిస్తాయి. అయితే సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను వెలిగిస్తే చుట్టూ ఉన్న వాతావరణం మరింత ప్లెసెంట్ మారుతుంది. çపుస్తక ప్రియులు ఒక ఫైబర్ బుక్ షెల్ఫ్‌ను కిటికీలకు దగ్గరగా అమర్చుకోవచ్చు. చినుకుల సొగసును ఆస్వాదిస్తూ, నచ్చిన పుస్తకం చదువుకుంటూ, వేడి వేడి తేనీటిని సేవించవచ్చు. ఇలా మీ సృజనకూ పని చెప్పి.. మాన్సూన్లో మీ ఇంటిని ఇంకింత అందంగా మలుచుకోవచ్చు.ఇవి చదవండి: ఒకప్పుడు ఇది మాఫియా డెన్.. కానీ ఇప్పుడిది? -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయన్నారు. తాగునీటి కాలుష్యం మూలంగానే అతిసార వ్యాధి, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలæ కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో అతిసార ప్రబలిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభ సమావేశ మందిరంలో అత్యవసరంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. నీరు కలుషితమైన చోట నీటి సరఫరా ఆపేసి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను పవన్ ఆదేశించారు.కార్యాచరణ సిద్ధం చేయాలిపైపులైన్ల తనిఖీ ఎప్పటికప్పుడు జరిగేలా చొరవ తీసుకోవాలని, మరమ్మతులు అవసరమైతే తక్షణమే చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ తగదని, ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులను అరికట్టేందుకు పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అతిసార వ్యాధి నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుందా..!? వానల కోసం పిల్లుల ఊరేగింపు.. ఈసారీ వింతగా..
వానలు కురవడం ఆలస్యమైతే కప్పల పెళ్లిళ్లు జరిపించడం మనవాళ్లకు తెలిసిన ఆచారం. వానలు కురవడం ఆలస్యమై, కరవు దాపురించే పరిస్థితులు ఎదురైతే పిల్లుల ఊరేగింపు జరపడం కంబోడియా, థాయ్‌లాండ్, మయాన్మార్, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాలలో చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశాలే! ఈ దేశాలలో వరి ప్రధానమైన పంట.వరి బాగా పండాలంటే వర్షాలు కీలకం. వర్షాలు సకాలంలో కురవకుంటే, దేవతల ప్రీతి కోసం ఇక్కడి జనాలు ఊరూరా పిల్లుల ఊరేగింపు జరుపుతారు. వానల కోసం పిల్లుల ఊరేగింపు జరిపే ఈ వేడుకను ‘హే న్యాంగ్ మ్యావ్’ అంటారు. ఆడపిల్లులను, ముఖ్యంగా నల్లపిల్లులను, ప్రస్ఫుటమైన నల్లని మచ్చలు ఉన్న పిల్లులను ఎంపిక చేసుకుని, వాటిని వెదురు బుట్టల్లో కూర్చుండబెట్టి ఊళ్లోని ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ఊరేగింపు జరుపుతారు.ఈ ఊరేగింపులో ఉపయోగించడానికి సయామీస్ జాతికి చెందిన పిల్లులు శ్రేష్ఠమైనవని భావిస్తారు. అసలు పిల్లులతో పాటు బుట్టల్లో పిల్లుల బొమ్మలను కూడా పెట్టి జనాలు ఊరేగింపులో పాల్గొంటారు. ఆడపిల్లుల ‘మ్యావ్’ రావాలకు వానదేవుడు కరుణిస్తాడని జనాల నమ్మకం. పిల్లుల ఊరేగింపులో ఊళ్లలోని పిల్లా పెద్దా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ వాద్యాలను వాయిస్తూ, పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతారు. ఊరేగింపు తర్వాత ప్రార్థనలు జరిపి, సామూహికంగా విందు భోజనాలు చేస్తారు.ఇవి చదవండి: ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!! -
ఇవీ.. వానాకాలం జాతరలు! ‘త్షెచు’ అంటే అర్థమేంటో తెలుసా?
హిమాలయాలకు చేరువలో ఉన్న భూటాన్‌లో ఏటా పలు పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఎక్కువ మంది బౌద్ధమతానికి చెందిన వారే అయినా, వారు తమ వేడుకలను పురాతన సంప్రదాయాల ప్రకారం నేటికీ జరుపుకుంటూ ఉండటం విశేషం. ఏటా వేసవి ముగిసి వానాకాలం వచ్చే రోజుల్లో వానాకాలానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ జరుపుకొనే రెండు వేర్వేరు జాతరలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.వీటిలో మొదటిది ‘నిమాలుంగ్ త్షెచు’. ‘త్షెచు’ అంటే జాతర అని అర్థం. భూటాన్ నడిబొడ్డు ఉన్న నిమాలుంగ్ బౌద్ధ ఆరామంలో ఈ వేడుకలను ఘనంగా మూడురోజుల పాటు జరుపుకొంటారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి 16 వరకు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో సంప్రదాయ నృత్య గానాలతో కోలాహలంగా నిమాలుంగ్ బౌద్ధారమం వరకు ఊరేగింపులు జరుపుతారు. తర్వాత ఆలయంలో ప్రార్థనలు జరిపి, బౌద్ధ గురువుల ఆశీస్సులు తీసుకుంటారు.ఇదేకాలంలో జరుపుకొనే రెండో జాతర ‘కుర్జే త్షెచు’. ఇది భూటాన్‌లోని కుర్జే పట్టణంలోని కుర్జే బౌద్ధారామంలో ఏటా జూన్ 16న జరుగుతుంది. కుర్జేలోని బౌద్ధారామాన్ని భూటాన్ బౌద్ధులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. భూటాన్‌లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన తొలిగురువు పద్మసంభవుడు ఇక్కడ ఎనిమిదో శతాబ్ది ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తనువు చాలించిన తర్వాత ఇక్కడ ఆయన భౌతికకాయం ముద్రను రాతిపై శిల్పంగా చెక్కారు.‘కుర్’ అంటే శరీరం, ‘జే’ అంటే ముద్ర. గురువు శరీర ముద్రను రాతిపై చెక్కి శాశ్వతంగా పదిలపరచడం వల్ల ఈ ప్రదేశానికి కుర్జే అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆరామాన్ని పదిహేడో శతాబ్దిలో నిర్మించారు. ‘కుర్జే త్షెచు’ జాతరలో జనాలు రకరకాల కొయ్య ముసుగులు ధరించి సంప్రదాయ నృత్య గానాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత ఆలయం వద్ద ప్రార్థనలు జరుపుతారు. కొయ్యముసుగులు ధరించి ఊరేగింపు జరపడం వల్ల వానాకాలంలో మంచివానలు కురుస్తాయని, తమ పంటలకు దుష్టశక్తుల బెడద ఉండదని నమ్ముతారు.ఇవి చదవండి: వానా.. వానా.. వల్లప్పా! -
వానా.. వానా.. వల్లప్పా!
వేసవిలోని మండుటెండలు మనుషులను మలమలలాడించిన తర్వాత కురిసే వాన చినుకులు ఇచ్చే ఊరట చెప్పనలవి కాదు. ఈసారి వేసవిలో ఎండలు ఇదివరకు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మండిపడ్డాయి. ఉష్ణోగ్రతలు ఊహాతీతంగా పెరిగినా, మొత్తానికి ఈసారి రుతుపవనాలు సకాలంలోనే మన దేశంలోకి అడుగుపెట్టాయి. గత మే చివరివారంలో అండమాన్‌ను తాకిన రుతుపవనాలు అవరోధాలేవీ లేకుండా సజావుగా తెలుగు రాష్ట్రాల్లోకి చేరుకున్నాయి.ఈసారి రెండు రోజుల ముందుగానే– జూన్ 2 నాటికే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకాయి. జూన్ 4 నాటికి తెలంగాణలో ప్రవేశించాయి. భారత్ వంటి వ్యవసాయాధారిత దేశాలకు వానల రాకడ ఒక వేడుక. సజావుగా వానలు కురిస్తేనే పంటలు సుభిక్షంగా పండుతాయి. వానాకాలం ప్రకృతిలో జీవం నింపుతుంది. నెర్రెలు వారిన నేలలో పచ్చదనాన్ని నింపుతుంది. జీవరాశి మనుగడకు ఊతమిస్తుంది. ఇప్పటికే వానాకాలం మొదలైన తరుణంలో కొన్ని వానాకాలం ముచ్చట్లు చెప్పుకుందాం.ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటికీ వానాకాలం ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ కొద్దిరోజులు అటు ఇటుగా జూన్, జూలై నెలల్లో వానాకాలం మొదలవుతుంది. ఇక్కడ వానలు మొదలైన ఆరునెలలకు దక్షిణార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలకు వానాకాలం మొదలవుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఈ దేశాల్లో ఏటా వానాకాలం వస్తుంది. నైరుతి రుతుపవనాల రాకతో మన దేశంలో మాత్రమే కాకుండా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయాన్మార్ తదితర దేశాల్లో వర్షాకాలం వస్తుంది.ఈ దేశాల్లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. దాదాపు ఇదేకాలంలో రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లోను; పశ్చిమ, ఆగ్నేయ, దక్షిణాఫ్రికా దేశాల్లోను; తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోను వానాకాలం మొదలవుతుంది. మన దేశంలో వానాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే, కొన్నిచోట్ల వానాకాలం ఏప్రిల్ నుంచి మొదలై నవంబర్ వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది.గొడుగులకు పని మొదలు..వానాకాలం వచ్చిందంటే గొడుగులకు పని మొదలవుతుంది. గొడుగులతో పాటు రెయిన్ కోట్లు, గమ్ బూట్లు వంటివి అవసరమవుతాయి. వానాకాలంలో వానలు కురవడం సహజమే గాని, ఏ రోజు ఎప్పుడు ఏ స్థాయిలో వాన కురుస్తుందో చెప్పలేం. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు గొడుగులను, రెయిన్ కోట్లను వెంట తీసుకుపోవడం మంచిది. కార్లలో షికార్లు చేసేవారికి వీటితో పెద్దగా పని ఉండకపోవచ్చు గాని, పాదచారులకు గొడుగులు, ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేవారికి రెయిన్కోట్లు వానాకాలంలో కనీస అవసరాలు.గొడుగులు, రెయిన్ కోట్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి. వింత వింత గొడుగులు, రెయిన్ కోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న చిన్న చిరుజల్లుల నుంచి గొడుగులు కాపాడగలవు గాని, భారీ వర్షాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం రెయిన్ కోట్లు వేసుకోక తప్పదు. ఈసారి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయి కంటే కాసింత ఎక్కువగానే నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనాను ప్రకటించడంతో గొడుగులు, రెయిన్కోట్లు వంటి వానాకాలం వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు తమ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా గొడుగులు, రెయిన్ కోట్లు తదితర వానాకాలం వస్తువుల మార్కెట్ 2022 నాటికి 3.80 బిలియన్ డాలర్ల (రూ.31,731 కోట్లు) మేరకు ఉంది. ఈ మార్కెట్లో సగటున 5.4 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. ఆ లెక్కన 2032 నాటికి వానాకాలం వస్తువుల మార్కెట్ 6.40 బిలియన్ డాలర్లకు (రూ.53,442 కోట్లు) చేరుకోగలదని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘బ్రెయినీ ఇన్సైట్స్’ అంచనా.వానలతో లాభాలు..వానాకాలం తగిన వానలు కురిస్తేనే వ్యవసాయం బాగుంటుంది. పంటల దిగుబడులు బాగుంటాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయంపైనే ఆధారపడి మనుగడ సాగించే రైతులు, వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఉంటుంది. వర్షాలు పుష్కలంగా కురిస్తేనే జలాశయాలు నీటితో నిండుగా ఉంటాయి. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. ప్రజలకు నీటిఎద్దడి బాధ తప్పుతుంది. వానాకాలంలో తగినంత కురిసే వానలు ఆర్థిక రంగానికి ఊతమిస్తాయి.మన దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపైన, వ్యవసాయాధారిత రంగాలపైన ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలో వ్యవసాయానిది కీలక పాత్ర. భారతీయ స్టేట్‌బ్యాంకు పరిశోధన నివేదిక ప్రకారం మన జీడీపీలో 2018–19 నాటికి 14.2 శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2022–23 నాటికి 18.8 శాతానికి పెరిగింది. ఈసారి వానాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాను ప్రకటించిన నేపథ్యంలో మన జీడీపీలో వ్యవసాయం వాటా మరో 3 శాతం వరకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటలకు, పత్తి వంటి వాణిజ్య పంటలకు పుష్కలమైన వానలే కీలకం. వానాకాలంలో మంచి వానలు కురిస్తే విద్యుత్తు కోతల బెడద కూడా తగ్గుతుంది. మన దేశం ఎక్కువగా జలవిద్యుత్తుపైనే ఆధారపడుతోంది. బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేని ప్రాంతాల్లో జలవిద్యుత్తు ద్వారానే విద్యుత్ సరఫరా ఉంటోంది. తగిన వానలు కురవని ఏడాదుల్లో ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తప్పవు.వాతావరణ మార్పులూ, వర్షాలూ..ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, ముఖ్యంగా భూతాపోన్నతి వర్షాకాలంపై కూడా ప్రభావం చూపుతోంది. దీనివల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవిలో వడగాల్పులు, అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, కరవు కాటకాల వంటివన్నీ వాతావరణంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల మార్పుల ఫలితమేనని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీసీ) నిపుణులు చెబుతున్నారు.వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం ఇప్పటికే మన దేశం అంతటా కనిపిస్తోంది. ఈ ప్రభావం కారణంగానే ఇటీవలి వేసవిలో పలుచోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తడం, పంటనష్టాలు, కరవు కాటకాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు వంటి విపత్తులు తరచుగా తలెత్తుతున్నాయి. సకాలంలో తగిన వానలు కురిస్తేనే పలు దేశాల్లోని పరిస్థితులు చక్కబడతాయి.వాతావరణ పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం, పునర్వినియోగ ఇంధనాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం, అడవుల నరికివేతను అరికట్టడంతో పాటు విరివిగా మొక్కలు నాటడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంది.వానాకాలం కాలక్షేపాలు..వాతావరణం పొడిగా ఉన్నప్పుడు బయట తిరిగినంత సులువుగా వాన కురుస్తున్నప్పుడు తిరగలేం. తప్పనిసరి పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే తప్ప వానల్లో ఎవరూ బయటకు రారు. చిరుజల్లులు కురిసేటప్పుడు సరదాగా తడవడానికి కొందరు ఇష్టపడతారు గాని, రోజంతా తెరిపిలేని వాన కురుస్తుంటే మాత్రం ఇల్లు విడిచి బయటకు అడుగుపెట్టడానికి వెనుకాడుతారు.వాన కురుస్తున్నప్పుడు ఇంటి అరుగు మీద కూర్చుని, వీథిలో ప్రవహించే వాన నీటిలో కాగితపు పడవలను విడిచిపెట్టడం చిన్న పిల్లలకు సరదా కాలక్షేపం.. కొందరు ఉత్సాహవంతులు వానాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెకింగ్, పచ్చని అడవులు, చక్కని సముద్ర తీరాల్లో నేచర్ వాకింగ్ వంటివి చేస్తుంటారు. ఇంకొందరు వాన కురుస్తున్నప్పుడు నదుల్లో సరదాగా బోటు షికార్లకు వెళుతుంటారు. వాన కురుస్తున్నప్పుడు చెరువులు, కాలువల ఒడ్డున చేరి చేపలను వేటాడటం కొందరికి సరదా.అందమైన వాన దృశ్యాలను, వానాకాలంలో ఆకాశంలో కనిపించే హరివిల్లు అందాలను కెమెరాలో బంధించడం కొందరికి ఇష్టమైన కాలక్షేపం. వానాకాలంలో జలపాతాలు ఉద్ధృతంగా ఉరకలేస్తుంటాయి. వాన కురిసేటప్పుడు జలపాతాలను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. వాన కురుస్తున్న సమయంలో ఎక్కువ మంది వేడివేడి పకోడీలు, కాల్చిన మొక్కజొన్న కండెలు వంటి చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు. తెరిపి లేని వానలు కురిసేటప్పుడు రోజుల తరబడి కదలకుండా ఇంట్లోనే కూర్చుని గడిపే కంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని, ఇలాంటి సరదా కాలక్షేపాలతో వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.రెయిన్‌కోట్ ఫ్యాషన్లు..ఆధునిక రెయిన్కోట్లు పంతొమ్మిదో శతాబ్దంలో అందుబాటులోకి వచ్చాయి. స్కాటిష్ రసాయనిక శాస్త్రవేత్త చాల్స్ మాకింటోష్ తొలిసారిగా 1824లో పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోటును రూపొందించాడు. రెండు పొరల వస్త్రాల మధ్య నాఫ్తాతో శుద్ధిచేసిన రబ్బరును కూర్చి తొలి రెయిన్‌కోటును తయారు చేశాడు. తర్వాత నీటిని పీల్చుకోని విధంగా ఉన్నిని రసాయనాలతో శుద్ధిచేసి రూపొందించిన వస్త్రంతో రెయిన్కోట్లు తయారు చేయడం 1853 నుంచి మొదలైంది.ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో సెలోఫెన్, పీవీసీ వంటి ప్లాస్టిక్ పదార్థాలతో రెయిన్కోట్ల తయారీ ప్రారంభమైంది. వానలో శరీరం తడవకుండా కాపాడటానికే రెయిన్కోట్లను రూపొందించినా అనతికాలంలోనే వీటిలోనూ ఫ్యాషన్లు మొదలయ్యాయి. అమెరికా, చైనా తదితర దేశాల్లో రెయిన్కోట్లు ఫ్యాషన్ మార్కెట్లో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం రెయిన్కోట్లలో ఫ్యాషన్ ధోరణి కొంత తక్కువే! వానలో తల, ఒళ్లు తడవకుండా ఉంటే చాలు అనే ధోరణిలోనే మన ప్రజలు రెయిన్కోట్లను కొనుగోలు చేస్తారు.మన దేశంలో తరచుగా వానలు కురిసేది కూడా మూడు నాలుగు నెలలు మాత్రమే! అందుకే మన ఫ్యాషన్ డిజైనర్లు కూడా రెయిన్కోట్ల డిజైనింగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫ్యాషన్ రెయిన్కోట్లు దొరుకుతాయి.వానాకాలం కష్టాలు..వానాకాలంలో వీథులన్నీ బురదమయంగా మారుతాయి. రోడ్లు సరిగా లేని చోట్ల గోతుల్లో నీరు నిలిచిపోయి ఉంటుంది. మ్యాన్‌హోల్ మూతలు ఊడిపోయి, డ్రైనేజీ నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద నడవడం, వాహనాలు నడపడం కష్టంగా మారుతుంది. మురుగునీటి ప్రవాహాలకు పక్కనే పానీపూరీలు, పకోడీలు, మొక్కజొన్న కండెలు అమ్మే బడ్డీలు ఉంటాయి. పగలు ఈగల బెడద, రాత్రి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రోగాల బెడద పెరుగుతుంది.వానాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు సర్వసాధారణం. ఇవి కాకుండా ఎక్కువగా కలరా, డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, చికున్ గున్యా, మలేరియా సహా పలు రకాల వైరల్ జ్వరాలు, కళ్ల ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. వానాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.వేడి వేడి చిరుతిళ్ల మీద ఎంత మోజు ఉన్నా, వానాకాలంలో ఆరుబయట తినకపోవడమే మంచిది. రోడ్డు పక్కన మురికినీటి ప్రవాహాలకు దగ్గరగా బళ్లల్లో అమ్మే బజ్జీలు, పకోడీలు, పానీపూరీలు, చాట్లు వంటి చిరుతిళ్లు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే!వానాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. చిట్లిన మంచినీటి పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరి, ఇళ్లల్లోని కొళాయిల ద్వారా కలుషితమైన నీరు వస్తుంది. నీటిని వడగట్టి, కాచి చల్లార్చి తాగడం మంచిది. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కాలంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.వానాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో దుమ్ము, ధూళి, బూజులు పేరుకోకుండా చూసుకోవాలి. వానజల్లు ఇంట్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు అపరిశుభ్రంగా, తడి తడిగా ఉన్నట్లయితే ఈగలు, దోమలు సహా క్రిమికీటకాల బెడద పెరిగి, ఇంటిల్లిపాది రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వానాకాలాన్ని ఆస్వాదించవచ్చు. -
పొదల్లో బుస్.. బుస్
రాయవరం: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువవుతోంది. వాతావరణంలో వేడి తగ్గి భూమి చల్లబడిన సమయంలో విష పురుగులు సహజంగా బయటకు వస్తుంటాయి. ఇలా బయటకు వచ్చిన విషసర్పాలు, పురుగులు రాళ్ల గుట్టలు, దట్టమైన పొదల మాటున ఉంటాయి. పొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే పొలాల్లోని గడ్డివాములు, గట్ల వెంబడి తిరుగుతుంటాయి. ఇళ్ల పరిసరాలు, పొలాల్లోనూ సంచరించే విష సర్పాలు, తేళ్లు, ఇతర విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నాగుపాము, కట్లపాము, పొడపాము, రక్తపింజర వంటి వాటివల్లే ప్రమాదం అఽధికంగా ఉంటుంది. సాధారణంగా 50 శాతం పైగా పాముల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.రైతన్నా.. జాగ్రత్త అవసరంపొలం గట్ల వెంబడి వెళ్లేటప్పుడు కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. రాత్రి పూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లేటప్పుడు టార్చిలైట్లు తీసుకు వెళ్లాలి. ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు, తడిగా ఉంటే కప్పలు తిరుగుతాయి. వాటిని ఆహారంగా తీసుకునేందుకు పాములు చేరతాయి. అలాగే తేళ్లు, జెర్రెలు వంటి ప్రమాదకర ప్రాణులు సంచరించే అవకాశముంది. ఎక్కువగా పాములు పొదలు, గోడల వారగా చేరతాయి. ప్రజలు చీకట్లో బయటకు వెళ్తే తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి.విషసర్పాల కాటు లక్షణాలువిషసర్పం కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏమీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారవచ్చు. కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. నాగుపాము అత్యంత ప్రమాదకరం. ఇది కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. ఈ పాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎవరినైనా పాము కరిస్తే అది విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స కచ్చితంగా చేసేందుకు వీలవుతుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలి. నాటు వైద్యం, మంత్రాల జోలికి వెళ్లరాదు. పాముకాటుకు గురైన వారు ఆందోళన చెందితే గుండెపోటు వచ్చే అవకాశముంది.జిల్లాలో పరిస్థితి ఇదీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 191 మందికి పాము కాటుకు గురయ్యారు. 2022 జూలైలో అధికంగా 25 మంది, నవంబరులో 24 మంది పాముకాటు బారిన పడ్డారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 154 మంది పురుషులు, 37 మంది మహిళలు పాముకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 జూన్ నుంచి ఇప్పటి వరకూ 227 మంది పాటుకాటుకు గురయ్యారు. ఈ బాధితులకు జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ మందులు అందుబాటులో ఉంచారు. బాధితులకు ఉచితంగా మందులు వేస్తున్నారు.వైద్యం ఆలస్యం కారాదుపాముకాటు వేసిన వారికి ధైర్యం చెప్పి, వెంటనే వైద్యం అందించేందుకు ప్రయత్నించాలి. ముందుగా ప్రథమ చికిత్స చేయాలి. కట్ల, నాగుపాములు కాటువేస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి బాధితుడు కోమాలోకి వెళ్లే అవకాశముంది. పాముకాటు వేయగానే నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ప్రథమ చికిత్స చేయించి, ఆసుపత్రిలో చేర్చాలి.–వి.అనిరుథ్, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరంఆసుపత్రుల్లో ఉచితంగా మందులుజిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో యాంటీ స్నేక్ వీనమ్ (పాము కాటు మందులు) అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత ఏర్పడితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ద్వారా మందులు కొనుగోలు చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా కొరత లేదు.–దుర్గారావుదొర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అమలాపురం -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
కర్నూలులో వజ్రాల వేట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలువజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.‘సీమ’లో ఏజెంట్ల తిష్టవర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత (క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు.విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.ఈ ఏడాది లభ్యమైన వజ్రాల వివరాలు👉 ఈ నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది.👉 మే 20న రామాపురంలో రూ.50 వేల విలువైప వజ్రం దొరికింది.👉 మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది.👉 మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు.👉 మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు లభించాయి. 👉 మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు.👉 మే 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు.👉 తాజాగా తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి మంగళవారం ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు.ఐదోసారి వచ్చావానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నా. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం.– ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా వజ్రాన్ని గుర్తు పడతాంమాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం.– రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లాఒక చిన్న వజ్రం దొరికినా చాలుమా ఊళ్లో పనుల్లేవు. వజ్రాలు దొరికాయని పేపర్లు, టీవీల్లో వచ్చింది. ఖాళీగా ఉండలేక ఇక్కడికి వచ్చాం. నాతో పాటు మా ఊరోళ్లు పదిమంది వచ్చారు. వజ్రాలు వెతుకుతున్నాం. కొన్ని రాళ్లు మెరుస్తున్నాయి. అవి వజ్రాలు కాదంటున్నారు. కొద్దిరోజులు చూస్తాం. చిన్న వజ్రం దొరికినా కష్టం తీరకపోతుందా అనే ఆశతో చూస్తున్నాం.– లక్ష్మక్క, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా -
దోమలతో జాగ్రత్త.. డెంగీ, మలేరియాతో జనం ఇబ్బందులు
వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభావం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేరు నమోదుకు జనం బారులు తీరుతున్నారు. ఇందులో చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా వైరల్ కేసులు పెరిగాయి. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచాన పడుతున్నారు. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ప్రారంభించారు. విష జ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు చేపడతున్నారు. ముఖ్యంగా డయేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలి విష జ్వరాలు పెరిగే అవకాశం ఉంది. దుర్శేడ్‌లో ఒకరికి డెంగీ కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో డెంగీ కేసు నమోదు కావడంతో అధికారులు సోమవారం నియంత్రణ చర్యలు చేపట్టారు. దుర్శేడ్‌కు చెందిన కాశిపాక అర్జున్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫుడ్ డెలివరీ సంస్ధలో పనిచేస్తున్నాడు. రెండురోజులక్రితం జ్వ రం రావడంతో దుర్శేడ్‌కు వచ్చిన అర్జున్ ఆది వారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సర్పంచు గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచు సుంకిశాల సంపత్‌రావు, వార్డుసభ్యుడు అశోక్, ఏఎన్ఎం పద్మ, ఆశావర్కర్లు అనిత, లక్ష్మి తదితరులు అర్జున్ ఇంటిని సందర్శించారు. కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. ఇంటి పరిసరాలను పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లారు. అనంతరం చామనపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సమీపంలోని నివాస గృహాల్లోని వ్యక్తులకు వైద్యపరీక్షలు చేశారు. అందుబాటులో వైద్యులు, మందులు వ్యాధులు ప్రబలుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో మందులు, వైద్యులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. పేషెంట్లు ఏ సమయంలో వచ్చినా చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా వైరల్ ఫీవర్లు, డయేరియా బారిన పడుతున్నారు. చాలా మంది ఓపీ చూపించుకొని మందులు తీసుకెళ్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కృష్ణప్రసాద్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
అల్పపీడనం బలహీనపడడంతో రాష్ట్రంలో ఉక్కపోత
-
వర్షాల్లోనూ పెట్టుబడులకు రక్షణ
ఎకానమీ, పెట్టుబడుల విశ్లేషణలకు సంబంధించి నిశితంగా పరిశీలించే అంశాల్లో రుతుపవనాలు, ‘‘సాధారణ’’ వర్షపాతం గణాంకాలు కూడా ఉంటాయి. నైరుతి రుతుపవనాలతో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాల సీజన్ ప్రారంభమవుతుంది. ఇటు ఖరీఫ్, అటు రబీ రెండు పంటలకు అవసరమయ్యే మొత్తం నీటి వనరుల్లో దాదాపు 75 శాతం భాగాన్ని ఇవి అందిస్తాయి. ఖరీఫ్ పంటల సీజన్ జూలై నుంచి అక్టోబర్ వరకు, రబీ పంటల సీజన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటలపై నేరుగా ప్రభావం చూపడమే కాకుండా.. తదుపరి రబీ పంటల కోసం వినియోగించే నీరుని రిజర్వాయర్లు, చెరువులు మొదలైన వాటిల్లో నిల్వ చేసుకునేంతగా వర్షాలనిస్తాయి. ఇలాంటి వర్షాలు అటు పంటలపైనే కాదు మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోనూ ప్రభావితం చేస్తాయి. ఎలాగంటే... ద్రవ్యోల్బణం: వ్యవసాయోత్పత్తిపై వర్షాల ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. బియ్యం, సోయాబీన్, చెరకు, నూనెగింజలు మొదలైన వాటి దిగుబడిని వర్షం ప్రభావితం చేస్తుంది. వర్షాభావం వల్ల పంటలు సరిగ్గా పండక.. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముడి వస్తువుల ధరలు : తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతరత్రా పంటలతో వివిధ పరిశ్రమలకు అవసరమైన ముడి వస్తువులు సమకూరుతాయి. వ్యవసాయోత్పత్తి ప్రభావం అటు ముడి వస్తువుల రేట్లపైనా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటు: రుతుపవనాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయి. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపై ఆధారపడే కంపెనీల ధరలు, రంగాలపైనా మీద ప్రభావం పడుతుంది. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ (ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు), ఎరువులు, క్రిమిసంహారకాలు వంటి రంగాలు వీటిలో ఉంటాయి. ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చు.. అగ్రి–ఎకానమీకి, మార్కెట్ సెంటిమెంటుకి రుతుపవనాలు ముఖ్యమే అయినప్పటికీ.. గత కొన్నేళ్లుగా మొత్తం మీద ఎకానమీపై వాటి ప్రభావం గణనీయంగా తగ్గింది. స్టాక్ మార్కెట్ కదలికలను ఏ ఒక్క అంశమో ప్రభావితం చేయలేవు. ఎఫ్ఐఐ పెట్టుబడులు, వడ్డీ రేట్లు, కార్పొరేట్ ఫలితాలు, భౌగోళికరాజకీయాంశాలు, రుతుపవనాలు మొదలైనవన్నీ ప్రభావం చూపుతాయి. కాబట్టి వర్షపాతం గురించి అంచనాలు వేసుకోవడం, వాటిని బట్టి స్పందించడం కాకుండా.. ఇన్వెస్టర్లు సరైన ఆర్థిక ప్రణాళికలను వేసుకుని దానికి కట్టుబడి ఉండటం ముఖ్యం. ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకోవడంలో సహాయం అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజరును సంప్రదించడం శ్రేయస్కరం. -
వర్షాకాలంలో ఇలా చేస్తే బిస్కెట్లు క్రిస్పీగా ఉంటాయి..
వర్షాకాలంలో కూడా బిస్కెట్లు మెత్తగా అవకుండా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి... ప్లాస్టిక్, అల్యమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. గాలిచొరబడకుండా పెడితే ఎక్కువ రోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యపేపర్లు వేసి తరువాత బిస్కట్లు పెట్టాలి. బిస్కట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. జిప్‌లాక్ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. గాలిచొరబడని డబ్బాలు, జిప్‌లాక్ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో పదినిమిషాలు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి. వీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. -
పది లక్షల ఎకరాలు మునక
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వానాకాలం పంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొలక దశలో ఉన్న వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 10.76లక్షల ఎకరాల్లో నేరుగా నీటి ముంపునకు గురికాగా, మరో 4 లక్షల ఎకరాలు అధిక వర్షాల తాకిడితో మొలక స్థాయిలో ఉన్న పంటలు, వరి నార్లకు నష్టం జరిగింది. ఇలా 16 లక్షలకు పైగా ఎకరాలపై వర్షాల ప్రభావం పడిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా కిష్టాపురం, మౌగిలాయకోట, శాంతినగర్, లక్కవరం, గోండ్రియాల, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కూడా వరి నాట్లు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలోని జక్కపల్లి, సిద్దెపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి, బుద్దారం తదితర గ్రామాల్లో పంటలపై కూడా వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరి నది రెండు వైపులా ఉప్పొంగి కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తుకుంటూ పారింది. అనేక ప్రాంతాల్లో ఒక్క పంట కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు. పత్తిపై అధిక ప్రభావం ఈ సీజన్లో ఇప్పటివరకు 40.73లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఈ పంటపైనే పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా వేసి న పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్త కుండానే భూమిలోనే మురిగిపోయాయి. ఇక మొలక స్థాయి లో ఉన్న పత్తి నీటిలో మునిగి దెబ్బతింది. వరినాట్లు కూడా నీట మునిగాయి. ఇప్పటివరకు 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. వీటిలో 5లక్షలకు పైగా ఎకరాల్లో నీరు చేరిందని అధికా రులు చెబుతున్నారు. వరి నార్లు మొత్తం దెబ్బతిన్నాయని, మళ్లీ నార్లు పోసుకోవాల్సిందేనని రైతు లు అంటున్నారు. ఇక సోయాబీన్ సాగు ఇప్పటివరకు 4.14లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఆదిలా బాద్ జిల్లాలో ఈ పంటపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పొలాలను ముంచేసిన గుర్రపుడెక్క భూదాన్‌పోచంపల్లి: భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి చెరువు నిండి అలుగుపోస్తోంది. ఈ చెరువులోని గుర్రపు డెక్క కూడా కొట్టుకువచ్చి వరి పొలాలను కమ్మేసింది. దీనితో పోచంపల్లిలో 30ఎకరాలు, పిలాయిపల్లిలో 2ఎకరాల వరికి నష్టం జరిగింది. -
ఇది మెడలో వేసుకుంటే అలెర్జీలకు చెక్!..ధర ఎంతంటే..
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్షా్మతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
వర్షాకాలంలో పెరుగు తింటున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే
వర్షాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ఎంతో ముఖ్యం.ఈ క్రమంలో వర్షాకాలంలో చాలామంది తమ డైట్‌ను కూడా మార్చుకుంటుంటారు. ఇక ప్రతిరోజు మనం తినే పాలు, పెరుగు, మజ్జిగ,నెయ్యి వంటివి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పెరుగు వినియోగానికి కాస్త దూరంగా ఉండాలంటున్నారు. దీనికి కారణం ఏంటి? వర్షకాలంలో పెరుగు తినడం మంచిదా? కాదా? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఈ సీజన్లో జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. ఆ లిస్ట్‌లో పెరుగు కూడా ఉంది. చాలామందికి భోజనం చివర్లో పెరుగు లేకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతుంటారు. అయితే ఈ సీజన్లో పెరుగు తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వర్షకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగు తినడం వల్ల కఫం ఏర్పడుతుంది. దీని వల్ల గొంతు నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ సీజన్లో ఒకవేళ పెరుగు తినాలనుకున్నా మధ్యాహ్న భోజనంలో తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగులోని ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. కానీ పెరుగు తినాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా క్వాంటిటీని తగ్గించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, అలెర్జీ ఉన్నవారు వర్షాకాలంలో పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. -
వర్షాకాలం: పకోడీలు, బజ్జీలు ఇలా చేస్తే క్రిస్పీగా..
పకోడీలు, బజ్జీలు క్రిస్పీగా రావాలంటే... పిండిని కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి.∙ అరగంట ముందే పిండిని చల్లని నీటితో కలిపి పక్కన పెట్టుకోవాలి. పకోడీలు, బజ్జీలను నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసేటప్పుడు పదేపదే తిప్పకూడదు. ఎక్కువగా తిప్పితే మెత్తగా మారతాయి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు మాత్రమే తిప్పుతూ ఫ్రైచేయాలి. పచ్చిమిర్చి, పాలకూర, వంకాయ, అరటికాయ, బంగాళ దుంప వంటివాటితో బజ్జీలు వేసేముందు శుభ్రంగా కడిగి, కాటన్ గుడ్డతో తడిలేకుండా తుడిచి ఫ్యాన్ గాలికింద ఆరబెట్టాలి. తరువాత పిండిలో ముంచితే ముక్కలకు పిండి చక్కగా అంటుకుని బజ్జీలు క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. కిచెన్ టిప్స్ ఊరగాయలను నిల్వచేసుకునే చిన్న జాడీలను పొడిగా ఆరబెట్టిన తరువాత, వేడివేడి నూనెను జాడీలోపల రాయాలి. తరువాత ఊరగాయ పెడితే బూజు పట్టదు. రోజూ మూతతీసి వాడుతున్నప్పటికి పచ్చడి ఎక్కువరోజుల పాటు నిల్వ ఉంటుంది. -
వర్షాకాలంలో విటమిన్-డి తీసుకోవడం ఎలా? సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్-డి ఒకటి. దీన్ని ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరీనాకి కాల్షియం అందించడంలో విటమిన్-డి ఎంతో ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి సరైన మోతాదులో విటమిన్-డి లభించకపోతే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్ కంటే సూర్యకాంతిలో విటమిన్-డి సమృద్దిగా దొరుకుతుంది. మరి ఈ వర్షాకాలంలో విటమిన్-డిని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టోరీలో చూసేద్దాం. ►భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. విటమిన్-డి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్-డి ఉంటుంది. పాలలో విటమిన్-డితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి నారింజలో విటమిన్-సితో పాటు విటమని్-డి కూడా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, సోయా పాలు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్-డి ఎంత మొత్తం తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఎముకలు, కాల్షియం, మెటబాలిజం మెయింటేన్ చేయాలంటే తగిన మోతాదులో విటమిన్-డి అవసరం. పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వారిలో 800 ఐయూ (20 ఎంసీజీ) అవసరం. ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి. -
Interior Designs: వర్షాకాలం.. ఇంటి మేకోవర్ మార్చేయండి ఇలా
మండే ఎండల నుంచి చినుకుల చిత్తడిలోకి వాతావరణం మారిపోయింది. ఇంటి మేకోవర్నూ మర్చాల్సిన సమయం వచ్చింది. సో.. వానాకాలంలో మీ ఇల్లు ఆహ్లాదంగా ఉండేందుకు ఇంటీరియర్ డిజైనర్స్ ఇచ్చే సూచనలు కొన్ని... ► బయట వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి బ్రైట్‌గా ఉండే ఫర్నిషింగ్ ఎంచుకోవాలి. అంటే, దిండ్లు, కర్టెన్లు, రగ్గులు వంటివాటిని ముదరు రంగుల్లో తీసుకుంటే ఇంటి వాతావరణం ఉల్లాసంగా.. ఉత్తేజంగా ఉంటుంది. ► ఈ కాలం వుడెన్ ఫర్నిచర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఏ కొద్దిగా తడిసినా, తేమ చేరుకున్నా సమస్యలు తలెత్తుతాయి. అందుకని వానా కాలం.. ఇంట్లో వీలైనంత వరకు వుడెన్ ఫర్నిచర్‌ను తగ్గిస్తే మంచిది. ► రుతుపవనాలు మనల్ని ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాయి. వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఆస్వాదించాలనుకునేవారు.. ఇంట్లో నచ్చిన కార్నర్ ప్లేస్‌ను ఎంచుకొని.. పుస్తకాలను అమర్చుకోవడానికి ఒక షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఈ సీజన్ ఉన్నంత వరకు వేడి వేడి కాఫీ లేదా టీతో అటు బయటి వాతావరణాన్నీ.. ఇటు ఇష్టమైన పుస్తకంలోని అంతకన్నా ఇష్టమైన పంక్తులనూ ఆస్వాదించవచ్చు! ► వెచ్చగా, బ్రైట్‌గా ఉండే లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఎల్ఈడీ బల్బులు, ఫెయిరీ లైట్లను ఉపయోగించుకోవచ్చు. కాంతి పెరగాలంటే ల్యాంప్ షేడ్స్, ఫ్లోర్ లేదా టేబుల్ ల్యాంప్లనూ ఎంచుకోవచ్చు. ► గోడలకు వాల్ పేపర్ లేదా వాల్ ఆర్ట్‌తో ప్రయోగాలు చేయవచ్చు. దీని వల్ల గ్లూమీగా ఉండే వాతావరణం ఒక్కసారి ఆసక్తిగా మారిపోతుంది. ► తేమ ఎక్కువ ఉండే రోజులు కాబట్టి.. ఒకరకమైన తడి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సువాసన గల కొవ్వొత్తులను ఉంచాలి. లేదా సిట్రస్, లావెండర్ వంటి సువాసనలతో కూడిన ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్‌లను ఉపయోగించాలి. తాజా వాసన కోసం వార్డ్ రోబ్లలో ఎండిన పువ్వులు లేదా సుగంధ మూలికలతో నింపిన సాషేలను వేలాడదీయాలి. ► సువాసనలు గల కొవ్వొత్తులను లివింగ్ రూమ్.. దాని పక్కనే ఉన్న గదుల మధ్యలో ఉంచినట్లయితే అవి మరింత ఆహ్లాదంగా మార్చేస్తాయి. -
వర్షాకాలమే కదా.. మొక్కలకు నీళ్లు పోయాలా?
వర్షాలు పడుతున్నాయి కదా ఇంక మొక్కలకు నీళ్లు పోయనవసరంలేదని కొంతమంది అనుకుంటారు. కానీ వర్షాల్లో కూడా కొన్నిరకాల మొక్కలకు నీళ్లు పోస్తేనే గార్డెన్ పచ్చగా కళకళలాడుతుంది. అందుకు ఇవే కారణాలు... ♦సాధారణంగా మొక్కలకు వర్షాకాలంలో సహజసిద్ధంగా నీళ్లు అందుతాయి. కానీ, కుండీల్లో ఉన్న మట్టి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచలేకపోతే, మొక్కలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు తేమను చూసుకుని మొక్కలకు నీళ్లు పోయాలి. ♦కుండీల్లో పెరుగుతోన్న కొన్ని రకాల మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. దట్టంగా ఉన్న ఆకులు, కొమ్మలు కూడా వెడల్పుగా విస్తరించి చినుకులను అడ్డుకుంటాయి. ♦ వర్షం చినుకులు కొమ్మలపై పడి పక్కకు జారిపోతాయి. దీనివల్ల వేర్లకు సరిగా నీరు అందదు. అందువల్ల గుబురుగా ఉన్న కుండీ మొక్కలకు తప్పని సరిగా నీళ్లుపోయాలి. -
నైరుతి వాన.. 30శాతం లోటే! 23 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వానాకాలం మొదలై దాదాపు నెలన్నర కావొస్తున్నా, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి మూడు వారాలు దాటినా ఎక్కడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. జూన్‌లో వానల జాడే లేక పోగా.. జూలైలో అక్కడక్కడా చిరుజల్లులు, మోస్తరు వానలు మాత్రమే కురుస్తున్నాయి. భారీ వర్షాల ఊసే లేదు. దీనితో పంటల సాగుకు అదును దాటిపోతుండగా.. సీజన్‌పై ఆధారపడ్డ ఇతర రంగాలు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నాయి. గత మూడేళ్లుగా సమృద్ధిగా వానలు పడ్డాయని.. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొందని, ఇది కరువు తరహా పరిస్థితులకు సంకేతమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. వ్యవసాయం,సాగునీటితోపాటు పలు ఇతర శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా భేటీ అయిన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కరువు పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 30శాతం లోటు సాధారణంగా మే నెలాఖరు లేదా జూన్ తొలివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి జూన్ మూడో వారంలో రాష్ట్రాన్ని తాకాయి. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతటా విస్తరించడంతో.. వానలు ఆశాజనకంగా ఉంటాయని తొలుత భావించినా, తర్వాత ఆ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడగా.. మిగతా ప్రాంతాల్లో అడపాదడపా తేలికపాటి వానలు మాత్రమే కురుస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో లోటు ఉంది. రాష్ట్రంలో సాధారణంగా నైరుతి సీజన్లో ఇప్పటివరకు(జూలై 10వ తేదీ వరకు) సగటున 19.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 13.49 సెంటీమీటర్ల మేర మాత్రమే కురిసింది. అంటే 30శాతం లోటు ఉంది. ఇందులోనూ కొన్ని జిల్లాల్లో తీవ్రమైన లోటు ఉంది. కొనసాగుతున్న లోటు.. జూన్ నెలలో రాష్ట్రంలో సగటున 12.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 7.20 సెంటీమీటర్లు అంటే 55.68 శాతమే వర్షం మాత్రమే కురిసింది. జూలైలో ఇప్పటివరకు 6.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణమే అయినా.. ఇప్పట్లో వానలు పడే అవకాశాలు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలకరి వానలతో సాగు మొదలుపెట్టిన రైతులు ఆందోళనలో పడ్డారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో వర్షాలు ఆశించినంతగా లేవు. 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ జిల్లాల్లోనూ కొన్నిప్రాంతాలకే వానలు పరిమితం అయ్యాయని అధికారులు చెప్తున్నారు. మిగతా 23 జిల్లాల్లో లోటు, అత్యంత లోటు వర్షపాతమే ఉన్నట్టు వివరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై కసరత్తు లోటు వర్షపాతం కొనసాగితే ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఉన్నతాధికారులు వివిధ రంగాలు, అంశాల వారీగా పడే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అధికారులు తెలిపారు. -
వానకు తడిచిన బట్టల నుంచి వాసన రాకుండా ఇలా చేయండి..
ఇంటిప్స్ ►వానాకాలంలో బట్టలను ఉతికాక కర్పూరం కలిపిన నీటిలో జాడించడం వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ► ఆరీ ఆరని దుస్తులను ఇస్త్రీ చేసినా అదోవిధమైన వాసన వస్తాయి. అందువల్ల దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాతనే ఐరన్ చేయాలి. ► అల్మారాలో బట్టలను పెట్టేముందు అక్కడక్కడ కొన్ని కర్పూరం బిళ్లలు ఉంచాలి. దీనివల్ల చిమటల వంటి కీటకాలు చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా బట్టల్లో దుర్వాసన తొలగితుంది. -
ఫ్యాషన్ టాక్: వానలో తడవకుండా స్టయిల్‌గా కనిపించాలా? పాంచోస్ బెస్ట్
చిటపట చినుకులను ఆనందించాలి. తడవకుండా మెరిసిపోవాలి. కొత్తగా ఉండాలి. స్టయిల్‌గా కనిపించాలి. మబ్బు పట్టిన సమయమైనా ముసురు పట్టిన రోజులైనా డ్రెస్‌కు అడ్రెస్‌గా ఉంటూ టెన్షన్ ఫ్రీగా గడిపేయాలనుకునేవారికి డిజైనర్ వాటర్ ప్రూఫ్ పాంచోస్ రెడీ టూ వేర్ గా ఆకట్టుకుంటున్నాయి. వానల్లో తడవకుండా ఉండటానికి గొడుగు లేదా లాంగ్ జాకెట్స్ మనకు వెంటనే గుర్తుకువస్తాయి. అంతకు మించి వానకాలంలో స్టయిల్‌గా కనిపించాలనుకుంటే ఇంకేమీ లేవా అనుకునేవారికి వాటర్ ప్రూఫ్ పాంచోస్ మేమున్నామని గుర్తు చేస్తున్నాయి. సహజంగా వేసవి కాలాన్ని సౌకర్యంగా మురిపించిన సిల్క్ అండ్ కాటన్ పాంచోస్ ఇప్పుడు వానకాలాన్ని వాటర్‌ప్రూఫ్‌తో ముస్తాబు చేసుకొని వచ్చాయి. పోల్కా డాట్స్, త్రీడీ ప్రింట్స్, లైన్స్, ఫ్లోరల్స్, యానిమల్ ప్రింట్స్‌తో ఆకట్టుకునే ఈ పాంచోస్ ఒక్కోరోజును ఒక్కో రంగుతో ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉన్న ఈ పాంచోని డ్రెస్ కలర్‌ని బట్టి కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. -
36 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో 36 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదికను అందజేసింది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 28.99 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 24.86 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 49.15 శాతం పత్తి సాగైందని నివేదిక వెల్లడించింది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.39 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.80 శాతంలో వరి సాగైందని తెలిపింది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో (21.25%) సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.23 లక్షల ఎకరాల్లో (54.18%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, 87,179 ఎకరాల్లో సాగైందని వెల్లడించింది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 92 శాతం సాగు... రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాల్లో 92.05 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 82.86 శాతం విస్తీర్ణంలో, నారాయణపేట్‌లో 55.85 శాతం విస్తీర్ణంలో సాగ య్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 2.41 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు కాగా, కేవలం 5,474 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగ య్యాయి. కాగా, రాష్ట్రంలో 3 జిల్లాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాభావం నెలకొందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమో దైందని పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో మాత్రం సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. కాగా, మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు కలిపి చూస్తే సరాసరి 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 44 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, ఈ నెల లో ఐదు రోజుల్లో 29 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో ఏకంగా 74 శాతం చొప్పు న లోటు వర్షపాతం నమోదుకాగా, కరీంనగర్ జిల్లాలో 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మూసీ ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కేతేపల్లి: నల్లగొండ జిల్లాలోనిమూసీ ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో అధికారులు బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి పెద్దగా ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ తుపాను ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్ట్‌లో నీటిమట్టాన్ని తగ్గించాలని మూసీ అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 641.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. మూసీ ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.67 టీఎంసీల నీరు ఉంది. -
డేంజర్.. వర్షకాలంలో రోజూ పానీపూరీ తింటున్నారా?
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాధారణంగానే సాయంత్రం కాగానే వీధి చివర్లోని పానీపూరీ బండి వద్ద గుమిగూడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.కాస్త చినుకులు పడగానే పానీపూరీల కోసం జనాలు ఎగబడతారు. అయితే వర్షాకాలంలో పానీపూరీ తినడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. పానీపూరీ అంటే ఆహా ఓహో అంటూ లొట్టలు వేసుకొని తినేవాళ్లు చాలామందే ఉంటారు. తినేటప్పుడు అది ఎలా తయరుచేశారో, ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించరు. అయితే ఇలా అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ పానీపూరీ తింటే మాత్రం రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పానీపూరీలు అమ్మే స్థలం పరిశ్రుభంగా లేకపోయినా, తయారు చేసే వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా అవి మీకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో పానీపూరీలు తినాలనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అపరిశుభ్రమైన నీళ్లు తాగడం వల్ల టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. ► పానీపూరీకి ఉపయోగించే నూనె మంచిది కాకపోతే డేంజరే. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ చాలావరకు ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. ఇలా నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ► పానీపూరీలో పాన్ మసాలా కలుపుతారు అన్న విషయంలో చాలా మందికి తెలియదు. ఇది క్యాన్సర్‌కు కారకం అవుతుంది. ► పానీపూరీలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ► వీటితో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇది కేవలం పానీపూరీకే వర్తించదు. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్, పరిశ్రుభత పాటించని హోటళ్లు చాలానే ఉన్నాయి. వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బయటి ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. -
2043లో ఒక వానాకాలం
అదేమిటో...వర్షాకాలం రాగానే రోడ్లు మాట తప్పకుండా చెరువులు అవుతాయి. బైక్లేమో ‘నేనేమైనా బోట్ అనుకున్నావా’ అంటూ ముందుకు వెళ్లడానికి మొరాయిస్తాయి. వర్షాకాలంలో రోడ్లు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ఫ్యూచరిస్టిక్ రెయిన్వేర్, రోడ్ల చెరువులపైనా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయే అత్యాధునిక ఆటోల ఏఐ ఇమేజ్‌లను సృష్టించి ‘ఇవి నిజమైతే ఎంత బాగుంటుంది!’ అనిపించాడు. సైన్స్–ఫిక్షన్, హారర్ ఎలిమెంట్స్‌ను ఏఐకి జోడించి ‘ఔరా’ అనిపిస్తున్నాడు ప్రతీక్. ‘వానకాలంలో ముంబై రోడ్లు హారర్ సినిమాల్లా భయపెడతాయి. టెక్నాలజీతో కూడిన ప్రత్యేక దుస్తులు, ప్రత్యేక వాహనాలు ఉంటే తప్ప బయటికి రాలేని పరిస్థితి ఉంది. మీ ఇమేజ్‌లు నిజం కావాలి’ అంటూ నెటిజనులు స్పందించారు. -
రాష్ట్రంపై డెంగీ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోందని.. ఈ ఏడాది ఇప్పటివరకు 583 డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. అందులోని ఇటీవలి మే, జూన్ నెలల్లోనే అధికంగా కేసులు నమోదయ్యాయని నివేదికలో వెల్లడించింది. సాధారణంగా వానాకాలం సీజన్ మొదలయ్యాక డెంగీ, ఇతర విష జ్వరాలు వ్యాపిస్తుంటాయి. కానీ ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలోనే డెంగీ కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 218 డెంగీ కేసులురాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ జిల్లాల్లో 38 చొప్పున కేసులు నమోదయ్యాయి. వానలు మొదలైన నేపథ్యంలో డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆ పది జిల్లాల్లో రిస్క్ రాష్ట్రంలో డెంగీ హైరిస్క్ జిల్లాలను ప్రజారోగ్య కార్యాలయం గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది నమోదైన డెంగీ కేసుల్లో ఈ జిల్లాల్లోనే 80 శాతం వరకు నమోదైనట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 121 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను హైరిస్క్ జిల్లాలుగా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. గతేడాది రాష్ట్రంలో నమోదైన మలేరియా కేసుల్లో ఈ ఏడు జిల్లాల్లోనే 91.5 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది. అధికారులతో మంత్రి సమీక్ష వానాకాలం మొదలైన నేపథ్యంలో డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్‌రావు తాజాగా సమీక్ష నిర్వహించారు. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథతో తగ్గిపోయాయని.. కానీ కీటకాలతో వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. మలేరియాను గుర్తించే 8 లక్షల ర్యాపిడ్ కిట్లను, డెంగీని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపామని తెలిపారు. -
కురిసింది వాన.. జిల్లా అంతటా వర్షాలు అన్నదాతల్లో హర్షం
ఆదిలాబాద్‌టౌన్: రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు జిల్లాలో ఓ మోస్తారు నుంచి సాధారణ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. విత్తనాలు విత్తుకునే అదను దాటుతున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా, ఈసారి కనీసం 20 శాతం కూడా రైతులు విత్తనాలు వేసుకోలేదు. పత్తి పంట విత్తుకునేందుకు జూలై రెండో వారం వరకు, సోయా పంట వేసుకునేందుకు జూలై మొదటి వారం వరకు గడువు ఉందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇన్నిరోజుల పాటు తీవ్ర ఉక్కపోతకు గురైన జిల్లా వాసులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు. జిల్లా అంతటా వర్షాలు.. ఇచ్చోడలో 56.0 మి.మీ, బజార్హత్నూర్లో 34.3 మి.మీ, నార్నూర్‌లో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది సగటున 1,100 మి.మీ.లు కురువాల్సి ఉంది. జూన్‌కు సంబంధించి 190 మి.మీ.లు కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 29 నుంచి 35 మి.మీ.ల వర్షం కురిసిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా 87 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉందని పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాలతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. తడిసి ముద్ద.. ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురువడంతో పట్టణమంతా తడిసి ముద్దయ్యింది. జనాలు వర్షంలో తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ద్విచక్ర వాహనాలపై ఆయా పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తడుస్తూ వెళ్లగా మరికొంతమంది రెయిన్ కోట్లు ధరించి వెళ్లారు. -
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..వ్యాధులు పరార్!
మొన్నటివరకు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు జూన్ వచ్చిందంటే చాలు హమ్మయ్యా! అని ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే?.. ఋతుపవనాలు మారి ఒక్కసారిగా తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి. వర్షాకాలం అంటే చల్లగా హాయిగా ఉంటుందని భావిస్తాం కానీ ఇది వ్యాధులు ముసురుకునే కాలం. అంతేగాదు మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వైరస్లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో జలబు, దగ్గు, గొంతులో కఫం, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడతారు. దీనికి తోడు దోమల బెడద కూడా ఎక్కువ అవ్వడంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు అవకాశాలు అక్కువ. ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరూ ఆయా వ్యాధుల బారిని పడుతుంటారు. అలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి ఔషధాలు తయారు చేసుకుని సులభంగా ఆయా వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 👉ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్ల ఉండకూదు 👉దోమలు లేకుండా ఉండేలా చేసుకోండి 👉నిండుగా దుస్తులు ధరించండి. బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించండి 👉తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి 👉పచ్చికాయగూరలు తినొద్దు 👉మరిగించి చల్లార్చిన నీటిని తాగండి ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే మసాల దినుసులతో ఈ కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఆయా వ్యాధుల బారిన పడుకుండా ఉండోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కషాయం తయారు చేసే విధానం: ధనియాలు: రెండు స్పూన్లు లవంగ-4 యాలుకలు-2 దాల్చిన చెక్క-అంగుళం ముక్క మిరియాలు-8 జీలకర్ర-అరస్పూన్ అల్లం లేదా శోంఠి: అర అంగుళం ముక్క తయారీ విధానం: పైన చెప్పిన వాటిని అన్నింటిని దంచుకుని పొడి చేసుకుని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుండి. కాచిన నీటిలో ఈ పొడిని చిటికెడు వేసుకుని, ఉప్పు వేసుకుని తాగొచ్చు లేదా నిమ్మరసం కలుపుకుని పరగడపున తీసుకుంటుంటే వర్షాకాలంలో వచ్చే ఎలాంటి వ్యాధులు మీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. మీరు కూడా ఓసారి దీన్ని ట్రై చేసి చూడండి. (చదవండి: ఫుల్లుగా తిన్నారా...ఆందోళన వద్దు) -
ధాన్యం అమ్మాలన్నా.. నగదు అందాలన్నా..రోడ్డెక్కాల్సిందేనా..?
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం అమ్ముకోవడమే కాదు.. ఆ నగదు జమ కావాలన్నా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధాన్యం విక్రయించి నెల రోజులు గడిచినా నగదు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పు చెల్లించడానికి, సాగు పెట్టుబడికి నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాల్లో 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ నెల 16వరకు జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిసాయి. తరుగు, మిల్లర్ల తిరకాసు, గన్ని సంచులు, లారీల కొరత, అకాల వర్షాలతో అరిగోస పడ్డారు. క్వింటాల్‌కు ఐదు నుంచి పది కిలోల వరకు కోతలు పెట్టారు. ధర్నాలు, ఆందోళనలతో రోడ్డెక్కి ధాన్యం విక్రయించినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. నగదు కోసం మరోసారి ఆందోళనలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. నగదు రూ.147.33 కోట్లు పెండింగ్ ఈ సీజన్లో 25,088 మంది రైతుల నుంచి 1,80,483.040 టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.353,74,67,584 రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 16,578 మందికి గాను రూ.206,41,63,488 ఖాతాల్లో జమైంది. ఇంకా 8,510 మందికి రూ.రూ.147,33,04,096 అందా ల్సి ఉంది. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చే సిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ నెల గడుస్తున్నా డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు పనులు చేపట్టారు. నగదు అందని రైతులు ఇంకెప్పుడు చెల్లింపులు చేస్తారోనని ఆందోళనలో ఉన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, జమ అయిన వరకు రైతులకు బది లీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నెలరోజులు దాటింది.. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటింది. అయినా డబ్బులు ఖాతాలో జమ కాలేదు. 239 బస్తాలు తూకం వేసినా డబ్బుల చెల్లింపు లేకపోవడం దారుణం. రెండు రోజులలో పడుతయని చెప్పి నెల రోజులుగా తిప్పతున్నారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారు. వానాకాలం సాగు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో పైసలు లేక తిప్పలు పడుడు అయితంది. – రైతు శివలాల్, గ్రామం: లింగపూర్, మం:దండేపల్లి ధాన్యం డబ్బుల కోసం రైతుల రాస్తారోకో దండేపల్లి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం విక్రయించిన 40రోజులు దాటినా నగదు చె ల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. మండలంలోని లింగా పూర్ గ్రామనికి చెందిన పలువురు రైతులు స్థాని కంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించారు. ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెబుతున్నారని, 40 రోజు లు గడుస్తున్నా ఖాతాలో జమ కావడం లేదని ఆరోపించారు. సహకార సంఘం కార్యాలయాని కి వెళ్లి అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారని అన్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రసాద్ రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
బోరు బావులకు వర్షాలే ఆధారం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు సమయాన్ని ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. వానాకాలం ముందుగా చేపడితే యాసంగిలో సైతం మార్చి నాటికి పంట చేతికి వచ్చేలా సీజన్లను కుదించాలని నిర్ణయించింది. రైతులు వానాకాలంలో సాగునీటి వనరుల కింద సాధారణంగా జూన్ నుంచి నవంబర్ చివరి వరకు, వర్షాధారంతో జూన్ నుంచి డిసెంబర్ వరకు పంటల సాగు చేపడుతున్నారు. ఇలా చేయడం వల్ల తదుపరి పంటలకు వేసవిలో వడగళ్లు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లి రైతులు నష్టపోతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూముల స్థితిగతులపై సర్వే చేయించింది. జిల్లాలో పండుతున్న పంటలపై ప్రభుత్వం సమగ్ర వివరాలను పంపించాలని కోరడంతో వారం రోజులుగా క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు సర్వే చేస్తున్నారు. ఏటా అతివృష్టి, అనావృష్టితో పంటలకు నష్టం జరుగుతుండటంతో సాగుకాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా.. జిల్లాలో ఏయే పంటలు పండిస్తున్నారు, సాగునీటి సౌకర్యం ఎన్ని ఎకరాలకు ఉంది, వర్షాధారంగా ఎన్ని ఎకరాలలో పంటలు సాగు చేస్తారనే సమాచారాన్ని ప్రభుత్వం కోరింది. వ్యవసాయశాఖతో పాటు నీటిపారుదల, విద్యుత్ శాఖల భాగస్వామ్యంతో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ కావడంతో వారం రోజుల పాటు సర్వే చేపట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ● కరువు జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన మహబూబ్‌నగర్‌లోని ఉన్న ఏకైక కోయిల్‌సాగర్ ప్రాజెక్టు తప్పితే ఈ జిల్లాలో నీటి వనరులపై ఆధారపడి చేస్తున్న సాగు తక్కువగానే ఉంది. మరోపక్క నిర్మాణంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతుండటంతో సాగునీరు ఇప్పట్లో అందనే లేదు. దేవరకద్ర నియోజకవర్గంలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద వానాకాలంలో 35 వేల ఎకరాలు, యాసంగిలో 12 వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. నీటి పారుదల, వర్షాధారంపైనే ఈ ప్రాంత రైతులు పంటలు పండిస్తున్నారు. నీటి వనరుల కంటే వర్షాధారంపైన 1,49,741 ఎకరాలల్లో పంటల సాగవవుతోంది. వ్యవసాయ సమగ్ర సర్వేలో అధికారులు ఈ లెక్కలను పక్కాగా తేల్చారు. ముందస్తు సాగు కోసం.. పంట చేతికి అందే సమయంలో ఏటా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టం జరుగుతున్న నేపథ్యంలో పంట కాలాన్ని ముందుకు తీసుకెళ్లి.. రైతులు పంటలు సాగు చేసేలా వానాకాలం, యాసంగి ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగు సమాచారాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు ఏటా సేకరిస్తున్నారు. ఈ లెక్కలతో ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారం వస్తోంది. అయితే ఇప్పటివరకు సాగునీటి కింద, వర్షాధారం ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు నమోదు కావడం లేదు. పైగా శాఖల వారీగా సాగునీటి సమాచారం పొంతన లేకుండా ఉంది. సాగునీటి సౌకర్యం ఎన్ని ఎకరాలకు ఉంది.. విద్యుత్ వినియోగం ఎంత అవుతుందనే సమాచారంలో వ్యత్యాసం ఉంటుంది. క్లస్టర్ల వారీగా ఆయా శాఖల అధికారుల సమన్వయంతో సమగ్ర సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమగ్ర సమాచారం సేకరించాం ప్రభుత్వ ఆదేశాల మేర కు గ్రామాల వారీగా వర్షాధారంతో పాటు సాగునీటి సౌకర్యంతో పండించే విస్తీర్ణం ఎంత అనే వివరాలు సేకరించాం. సీజన్ ప్రారంభం కాగానే పంటల వారీగా సమగ్ర సర్వే ఉంటుంది. ప్రస్తుతం రైతులతో అనుబంధంగా ఉండే అన్ని శాఖల సమన్వయంతో సర్వే వివరాలు నమోదు చేశాం. కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి నివేదించాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
వరుణుడు కరుణిస్తాడని...కలవరపెడుతున్న వానాకాలం
మంచిర్యాలఅగ్రికల్చర్: జూన్ వచ్చిందంటే చాలు అన్నదాతలు వానాకాలం సాగు పనుల్లో బిజీగా కనిపిస్తారు. కానీ.. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తొలకరి కోసం నేటికీ రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ఆలస్యమవుతుండగా అదునుదాటుతుందని ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణించకపోతాడా.. అని పలువురు రైతులు ఎప్పటిలాగే మృగశిరకార్తె (మిరుగుకార్తె) నుంచి పొడి దుక్కుల్లోనే విత్తనాలు వేస్తున్నారు. ఇంకా వానలు కురియ క పోవడంతో వేసిన విత్తనాలు దుక్కుల్లోనే మాడి పోతుండగా, మరోసారి విత్తనం వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని దిగులు చెందుతున్నారు. ఈ సమయానికే జిల్లాను రుతుపవనాలు తాకాల్సి ఉంది. కానీ ఇంకా ఎండలు తగ్గక రైతన్నను వానాకాలం కలవరం పెడుతోంది. వానాకాలం ఆరంభమై పక్షం రోజులు గడిచినా వర్షాలు పడలేదు. దీంతో అన్నదాత గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలు వేస్తున్నారు. కాగా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి భూమిలో తేమ శాతం పెరిగితేనే విత్తనాలు వేయాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అడుగంటుతున్న జలాశయాలు జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం ఈదురుగాలులు, మబ్బులు పడుతున్నా వర్షాలు మాత్రం కురవడం లేదు. మృగశిర కార్తె బుధవారంతో ముగుస్తుండగా గురువారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం కానుంది. ఈ పాటికి జోరువర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగి పొర్లుతుండాలి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో కొత్తనీరు చేరి జలమట్టం క్రమేపి పెరుగుతుండాలి. ఇందుకు భిన్నంగా ఇంకా ఎండలు మండుతుండగా జలాశయాలు అడుగంటిపోతున్నాయి. 94శాతం లోటు వర్షపాతం ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. కానీ.. ఇప్పటివరకు 7వేల ఎకరాల వరకు పత్తి విత్తుకున్నట్లు తెలుస్తోంది. ఆశించిన వర్షాలు కురిస్తే ఈ సమయానికి 50వేల ఎకరాల వరకు విత్తనాలు వేసుకోవాల్సి ంది. గతేడాది ఇదే సమయానికి 45 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతుండగా ప్రస్తుత పరిస్థితులు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సగటున 119 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా, ఈ ఏడాది 07 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఈ నెల 20వరకు సాధారణ వర్షపాతం 101.7 మిల్లిమీ టర్లు కురవాల్సి ఉండగా 6.2 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది. 94 శాతం లోటు వర్షపాతం నెలకొంది. మృగశిర కార్తె ఆరంభానికి ముందే ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఆ తర్వాత చినుకు పడక విత్తనం మొలకెత్తక ఆదిలోనే నష్టాలు చవి చూశారు. తేమ లేకుంటే ప్రమాదమే.. నేలలో తేమ లేనిదే విత్తనం వేసుకోవద్దని వ్యవసాయశాఖ ఓ వైపు హెచ్చరిస్తున్నా రైతులు విత్తనాలు వేస్తూనే ఉన్నారు. రెండు, మూడు భారీ వర్షాలు కురిసి 60–70శాతం తేమ నేలలో ఉంటేనే విత్తుకోవాలంటున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న పంటలు విత్తుకునేందుకు వచ్చే నెల వరకు సమయం ఉందని చెబుతున్నారు. దుక్కి వేడి తగ్గకుండానే విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు. విత్తిన ఐదురోజుల వరకు వాన పడకుంటే విత్తనం చెడిపోతుందని చెబుతున్నారు. కొన్ని విత్తనాలు మొలకెత్తినా మొలక దశలోనే మాడిపోతాయని పేర్కొన్నారు. ఇలా.. మొలక ఎండిపోయిన స్థానంలో రెండుమూడుసార్లు విత్తుకుంటే అదనపు ఖర్చుతో పాటు మొక్కల ఎదుగుదలలో వ్యత్యాసమేర్పడి కలుపు తీయడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వానలు పడుతయనుకున్న నిరుడు మిరుగుకార్తెలోనే ప త్తి విత్తనం వేసిన. ఈసారి నాలుగురోజులు ఆలస్యంగా ఎనిమిదెకరాల్లో విత్తనాలేసి న. వారంరోజులైనా వర్షాలు పడుతలేవు. విత్తనాలు మొలకెత్తలేదు. ఎండలకు దుక్కిలోనే మాడిపోతున్నయ్. ఈ రెండుమూడ్రోజు ల్లో వాన పడకుంటే నేను పెట్టిన పెట్టుబడి రూ.35 వేల దాకా నష్టపోవుడే. – ముదరకోల సదయ్య, రైతు, నెన్నెల తొందరపడి విత్తనాలు వేయొద్దు తుఫాన్ కారణంగా రుతుపవనాల రాక కొంత ఆలస్యమైంది. ఈనెల 25నుంచి ఉ మ్మడి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రైతులు ఒకట్రెండు భారీ వర్షాలు కురిసి 60–70 శాతం తేమ ఉన్న తర్వాతే విత్తనాలు వేసుకోవాలి. పత్తి విత్తేందుకు సమయం ఉంది. తొందరపడి విత్తుకుంటే మొలక రాదు. – శ్రీధర్‌చౌహాన్, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త -
ఎటుపోయావు వానమ్మా..
సూపర్‌బజార్(కొత్తగూడెం): జూన్ మాసం వచ్చి 20 రోజులు గడిచినా తొలకరి పలుకరించలేదు. ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు. వరుణుడు కరుణించకపోవడంతో వానాకాలం పంట సీజన్ ఆరంభంలోనే నిరాశ చెందుతున్నాడు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు రాష్ట్ర పభుత్వం ఈసారి వానాకాలం సీజన్‌ను ఒకనెల ముందుగానే ప్రారంభించాలని దిశా నిర్దేశం చేసింది. వ్యవసాయ, ఉద్యాన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతాంగాన్ని ఆ దిశగా చైతన్యం చేయాలని సూచించింది. చినుకు లేకపోవడంతో ముందస్తు మాటేమోకానీ ఎప్పటి లాగే రైతులు వానాకా లంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. వరుణుడు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి నానా కష్టాలు పడ్డ రైతన్నలకు వానాకాలంలో అనా వృష్టి వెంటాడుతోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ఎర్రనేలల్లో 50–60 మి.మీ, నల్లరేగడిలో 60–70 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ, ఉద్యాన, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలో కొన్ని చోట్ల రైతులు వర్షం వస్తుందనే నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి నష్టపోయారు. ప్రధానంగా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో కొందరు రైతులు పత్తి గింజలు వేశారు. వర్షాభావంతో అవి మొలకెత్తక చిత్తయ్యారు. వేసవి తీవ్రతకు నాటిన విత్తనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఎండతీవ్రత విపరీతంగా ఉండటంతో జిల్లాలోని చెరువులు, కుంటలు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో జరిగిన చెరువుల పండుగలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఆయా నీటివనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడి దీవెనల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో గత వానాకాలం కంటే అదనంగా 72,398 ఎకరాలలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాభావ పరిస్థితులతో సాగుకు ముందుకు సాగడంలేదు. లోటు వర్షపాతం.. జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 225.3 మి.మీ నమోదు కావాల్సి ఉంది. ఇప్పటివరకు అక్కడక్కడా వర్షాలు పడగా 144.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 56.6 మి.మీ లోటు ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎదురు చూస్తున్నాం వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం. వ్యవసాయ సీజన్లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతికొచ్చే సమయానికి వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టపరుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షం రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంది. –ప్రసాద్, రైతు, లక్ష్మీదేవిపల్లి వర్షాలు వచ్చాకే విత్తుకోవాలి వర్షాలు వచ్చిన తర్వాతే విత్తనాలు వేయాలి. ముందస్తుగా విత్తనాలు వేసి రైతులు నష్టపోవద్దు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని ప్రచారం చేశాం. రైతులు అప్రమత్తంగా ఉండాలి. –కొర్స అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి -
కూరగాయలు వండుకొనలేం..
ఇల్లెందురూరల్: జిల్లాలో వర్షాభావం వల్ల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయలు కొనాలన్నా అమాంతం వాటి ధర పెరిగిపోవడంతో అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి వరకు ఎండల కారణంగా కూరగాయల దిగుబడులు ఆశించిన మేర లేవు. వర్షాకాలం ప్రారంభమైనా వరణుడి కరుణ లేకపోవడంతో వాటి ఉత్పత్తి తగ్గి ధరలు చుక్కల సరసన చేరాయి. విపణిలో వాటిని కొనుగోలు చేయడానికి వెళ్లిన వారికి ధరలు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే ధరలు ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలే నిత్యావసర ధరలు నింగినంటుతుంటే కనీసం కూరగాయలు తినే పరిస్థితి లేకపోవడంపై వంటింటి గృహిణులు పెదవి విరుస్తున్నారు. 12 వేల ఎకరాల్లో సాగు టమాట ధర అప్పుడే కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగిపోయింది. బీరకాయలు కిలో రూ.80, చిక్కుడుకాయలు కిలో రూ.100 వరకు పలుకుతున్నాయి. నాలుగైదు రకాలు తప్ప ప్రతి కూరగాయ ధర కొండెక్కుతోంది. జిల్లావ్యాప్తంగా ఏటా 12 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయని ఉద్యానశాఖ అధికారులు చెపుతున్నారు. వర్షాకాలంలో 6 వేల ఎకరాల్లో.. వేసవిలో 2,500 ఎకరాల్లో.. చలికాలంలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో రైతులు కూరగాయల పంటలను సాగుచేస్తుంటారని పేర్కొంటు న్నారు. ఉద్యాన పంటల్లో అంతర్పంటగా కొంద రు, సీజన్‌కు అనుగుణంగా కూరగయాల సాగు చే సే రైతులు మరికొందరు ఉన్నారని వివరిస్తున్నారు. కూరగాయలు సాగయ్యే గ్రామాలివే.. జిల్లాలో ఇల్లెందు మండలంలోని కొమరారం, పోచారంతండా, పోలారం, మాణిక్యారం, రేపల్లెవాడ, రాఘబోయినగూడెం తదితర గ్రామపంచాయతీల నుంచి కూరగాయలు అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంటాయి. ఆ తరువాత అశ్వారావుపేట మండలంలో సాగవుతున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, తిప్పనపల్లి, మాచినేనిపురం, వినోభానగర్, గుండ్లరేవు, సుజాతనగర్, సింగభూపాలెం, రాఘవాపురం, బంగారుచెలక, జగన్నాథపురం, జగ్గారం, అశ్వాపురం, ఇరవండి, పట్టేనగర్, చిన్నబండరేవు, పెద్దబండరేవు, దుమ్ముగూడెం, గుమ్మారం, తీగలేరు, జానంపాడు, కరకగూడెం, సంపత్‌నగర్, ఆళ్లపల్లి, మామకన్ను తదితర గ్రామాల్లో సాగుచేస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి వర్షాకాలం ప్రారంభమైనా సరైన రీతిలో వర్షాల్లేక కూరగాయల పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం ఉన్న సాగు విస్తీర్ణం జిల్లా అవసరాలకు ఏమాత్రం సరిపోదు. చాలా వరకు కూరగాయలను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. టమాట మదనపల్లి నుంచి, మిర్చి బాపట్ల నుంచి.. ఇలా పలు చోట్ల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే స్థానికంగా లభ్యమయ్యే కూరగాయల ధరలు కూడా తక్కువేం లేకపోవడం గమనార్హం. ఎందుకీ పరిస్థితి జనాభా అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తికి అవసరమైన ప్రోత్సాహం రైతులకు అందడం లేదు. కనీసం ఉప ఉత్పత్తులపైనన్నా ప్రజలను పూర్తిస్థాయిలో అధికారులు చైతన్యం చేయడం లేదు. 12 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా కూరగాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌స్టోరేజ్ లేదు. పండించిన పంట మార్కెట్‌కు తప్ప నిల్వ చేసుకునేందుకు వేరే మార్గం కనిపించడం లేదు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కానీ ఏఒక్క కమిటీ కూడా కూరగాయలు నిల్వ చేసేందుకు కూల్చాంబర్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వలేదు. జిల్లాలో ఎక్కువగా చిన్న కమతాల్లోనే కూరగాయలు పండిస్తున్నారు. హెక్టార్ల కొద్ది విస్తీర్ణంలో సాగు జరగడం లేదు. -
వానాకాలం సాగుపై రైతుల కలవరం
విత్తనాలు వేసేందుకు సిద్ధం రోహిణి కార్తె ఆరంభంతో చేను చదును చేసి దుక్కి దున్ని సిద్ధం చేసుకున్న. మృగశిర కార్తె నుంచి ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు పత్తి విత్తనం వేద్దామని ఎదురుచూస్తున్న. మృగశిర కార్తె వెళ్లి వారం గడుస్తున్నా చినుకు రాలడం లేదు. పొద్దంతా విపరీతమైన ఎండ కొడుతోంది. సాయంత్రం ఈదురుగాలులు పెడుతున్నయి తప్ప చినుకు పడం లేదు. పోయినేడాది భారీ వర్షాలకు వరదల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వానాకాలం ఆలస్యమయ్యేటట్లు ఉంది. ఎల్‌నినో ప్రభావం ఏమాత్రం..? నైరుతి రుతుపవానాల రాక ఆలస్యమైన రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా లేక.. ఆశించిన వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత జూన్ సాధారణ వర్షపాతం కురువగా జూలైలో భారీ వర్షాలతో రెట్టింపు వర్షపాతం నమోదైంది. వాగులు, ఒర్రెలు వరదలతో ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటి మునిగి నష్టపోయారు. మంచిర్యాలఅగ్రికల్చర్: తొలకరి వర్షాలు పలుకరించకపోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. జూన్ నెల ప్రారంభమై 15రోజులు.. మృగశిర కార్తె ఆరంభమై వారం గడుస్తోంది. ఇప్పటికే చేన్లు దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు వేసేందుకు రైతాంగం సిద్ధమైంది. సకాలంలో తొలకరి వర్షాలు కురిస్తే ఇప్పటికే విత్తనాలు వేయాల్సింది. సాగు ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో కొందరు పొడిలోనే విత్తనాలు వేస్తున్నారు. గత ఏడాది ఈ సమయానికే వర్షాలు కురిసి విత్తనాలు వేసుకోగా.. ఈ ఏడాది వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. ఈ సమయానికే రుతు పవనాలు జిల్లాను తాకి జోరు వర్షాలు కురువాల్సి ఉండగా.. మేఘాలు సాయంత్రం అక్కడక్కడ కమ్ముకున్నట్టే కమ్ముకుని అట్టే కనుమరుగై చినుకు రాలడం లేదు. గత వారం రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్య, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మండిపోతుండగా.. వర్షం ఎప్పుడు పడుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. సారవంతం చేసుకుని మృగశిర కార్తె ఆగమనంతో అన్నదాతలు వ్యవసా య పనులు వేగవంతం చేశారు. సమయానికి బ్యాంకు రుణాలు అందకపోయినా అప్పు చేసి విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధం చేసుకున్నారు. తొలకరి వర్షాలు పడితే ఈ సమయానికి 25శాతం మంది రైతులు పంటలు విత్తకోవాల్సి ఉండేది. గత ఏడాది జూన్ రెండో వారం నుంచే నైరుతి రుతు పవనాలు విస్తరించి వర్షాలు కురవడంతో పత్తి, కంది పంటలు విత్తుకున్నారు. కానీ ఈ ఏడాది వర్షాలేక రైతుల్లో చింత కనిపిస్తోంది. అదును దాటుతోందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆందోళన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, రుతుపవనాల రాక ఆలస్యమైనా గాబరా పడాల్సిన అవరసం లేదని చెబుతున్నారు. ఈ వానాకాలం సాగు రైతులకు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 3.60లక్షల ఎకరాల్లో.. జిల్లాలో ఈ ఏడాది 3.60 లక్షల ఎకరాల వరకు పంటలు సాగవుతాయని, అధికారులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారు. జిల్లాలో పత్తి, వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది 1.80 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం సేంద్రియ కర్బనంగా వాడే పచ్చిరొట్టె విత్తనాలు మాత్రమే అందిస్తోంది. ఇప్పటికే మండలాల్లో వ్యవసాయ అధికారులు 5500 క్వింటాళ్ల జీలుగ, జనుము రాయితీ విత్తనాలు అందజేస్తున్నారు. పత్తి, కంది, వరి, మొక్కజొన్న తదితర విత్తనాలు ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. 3.60 లక్షల పత్తి విత్తనాలు ప్యాకెట్లు రైతులకు అవసరమని ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. 80 వేల మెట్రిక్ టన్నులు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ తదితర ఎరువులు ఉన్నాయి. జిల్లాలో పంటల సాగు కోసం ఇప్పటికే 24 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. -
45 రోజులైనా..రైతుల ఖాతాల్లో జమకాని ధాన్యం డబ్బులు
సుభాష్‌నగర్ : ధాన్యం అమ్మి 45 రోజులైనా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. మొత్తం రూ.529 కోట్లకుపైనే రైతులకు రావాల్సి ఉంది. అందులో ఓటీపీఎస్ పూర్తయిన వారికే రూ.330.76 కోట్లు జమ చేయాల్సి ఉంది. మరో వైపు వానాకాలం సీజన్ మొదలైంది. ఇప్పటికే నార్లు పోసి, నాట్ల కోసం మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ధాన్యం డబ్బులు రాకపోవడం.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా 459 కొనుగోలు కేంద్రాల ద్వారా 93,150 మంది రైతుల నుంచి 6.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.1,313.05 కోట్లు ఉంటుంది. అందులో రూ.1129 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయ్యింది. ఇంకా రూ.184 కోట్ల విలువైన ధాన్యానికి ఓటీపీఎస్ సొసైటీల్లో పూర్తి చేయాల్సి ఉంది. ● రూ.784 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం రూ.529 కోట్లకుపైగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ● ట్యాబ్ ఎంట్రీ, ట్రక్ షీట్ జనరేటెడ్, మిల్లర్ ఎక్నాలెడ్జ్మెంట్, ఓటీపీఎస్ తర్వాతే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. వారం రోజుల్లో రూ.345 కోట్లు జమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా సుమారు 100 వరకు లారీల ధాన్యం వివిధ రైస్‌మిల్లుల్లో అన్లోడింగ్ అవుతున్నాయి. డబ్బుల కోసం ఎదురుచూపులు! గత 15 రోజులుగా డబ్బులు జమ కావడం లేదని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కాగా ఇప్పటికే నార్లు పోసుకుని, నాట్లు వేసుకునేందుకు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. సోయా, శనగ, ఇతర పంటల సాగుకు దుక్కులు పూర్తయ్యాయి. ఈనెల 19 తర్వాత ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం డబ్బులు చేతిలో లేక అవస్థలు పడుతున్నారు. రూ. లక్ష వరకు రావాల్సి ఉంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించి నెల రోజులు గడి చిపోయింది. 130 బస్తాలను విక్రయించాను. సుమారు రూ.లక్ష వర కు రావాల్సి ఉంది. జూన్ పూర్తిగా పెట్టుబడుల నెల. పిల్లల స్కూల్ ఫీ జులు, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడికి డబ్బుల్లేక ధాన్యం విక్రయించిన సొ మ్ము కోసం ఎదురుచూస్తున్నాను. ఎరువులు, విత్తనాలు, వరి కోత యంత్రాలు, ట్రాక్టర్ అద్దె చెల్లించేందుకు డబ్బులు లేవు. సొసైటీలో అడిగితే త్వరలో వస్తాయని చెప్తున్నారు. వెంటనే ధాన్యం డబ్బులు జమ చేసేలా చూడాలి. – కేపీ నర్సారెడ్డి, రైతు, నల్లవెల్లి, ఇందల్వాయి మండలం వారంలోపు రూ.345కోట్లు జమ రైతులు అమ్మిన ధా న్యానికి సంబంధించి ఓటీపీఎస్ పూర్తయిన రూ.345 కో ట్లు వారం రోజుల్లో జమ అవుతాయి. రై తుల వివరాలను ఇప్పటికే నివేదించాం. డ బ్బులు జమ కావడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. మిగతా డబ్బులు కూడా వీలైనంత త్వరగా జమ చేసేలా చర్య లు చేపడుతున్నాం. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. – జగదీష్‌కుమార్, -
ముందస్తు వరిసాగే మేలు
నీటివసతి ఉంటేనే... వానాకాలంలో వరిసాగును ముందుకు జరపాలంటే నీటివసతి తప్పనిసరి. బోరు,బావుల కింద సేద్యం చేసేచోట సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పంటసాగు కాలం ముందుకు జరిపినా ముందుగానే రైతులు బోరు,బావుల ద్వారా నార్లు పోసుకుంటారు. ప్రాజెక్టులు, కాల్వలు, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువుల ద్వారా వరిసాగు చేసే చోటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు నార్లు పోసుకోవాలన్నా, వాటిని పెంచాలన్నా, ఆయా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి విడుదల తేదీలను కూడా ముందుకు జరపాలి. ఇంకా చేయాల్సినవి... ● పంటకాలం ముందుకు జరిపే క్రమంలో రైతులకు సబ్సిడీపై అందజేసే విత్తనాలు కూడా ముందుగానే రైతులు చేరేలా చూడాలి. ● నార్లు పోసే నాటి నుంచి నాట్లు వేసే వరకు అవసరమైన ఎరువులు కూడా ముందుగా అందుబాటులో ఉంచాలి. ● రైతులకు పెట్టుబడి అవసరాలు ఉంటాయి. బ్యాంకుల నుంచి అందే కొత్త రుణాలు, రుణాల రెన్యూవల్, రైతుబంధు కింద ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కూడా రైతులకు ముందస్తుగా అందాలి. ● పంటకాలం ముందుకు జరపాలన్న ప్రతిపాదనలు ● రోహిణి కార్తె నుంచి నార్లు పోసుకోవడం పాత పద్ధతే సాక్షి, సంగారెడ్డి డెస్క్ : యాసంగిలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా మార్చి నుంచి మే నెల వరకు కురిసే వర్షాల కారణంగా ధాన్యం దిగుబడి బాగా తగ్గుతోంది. చేతికొచ్చే కొద్దిపాటి పంటలోనూ నాణ్యత లోపిస్తోంది. యాసంగిలో వరిసాగుచేసే రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వరిసాగుకు సంబంధించి పంటకాలాన్ని ముందుకు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అకాల వర్షాల నుంచి రైతులు బయటపడొచ్చు. దీనిపై వ్యవసాయశాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. ● సాధారణంగా అయితే వానాకాలం వరిసాగుకు సంబంధించి జూలైలో నార్లు పోసి ఆగస్టు వరకూ నాట్లు వేస్తారు. ● యాసంగిలో అయితే డిసెంబర్లో నార్లు పోసి జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాట్లు వేస్తారు. యాసంగిలో సాగు చేసిన వరిపంట మే నెలలో కోతకు వస్తుంది. ● వానాకాలం సీజన్లో అయితే అక్టోబర్‌లో, యాసంగి సీజన్లో అయితే మార్చి రెండోవారం నుంచి ఏప్రిల్ నెల వరకు అకాలవర్షాలు కురుస్తాయి. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. ● ప్రకృతి వైపరీత్యాల బారిన రైతులు పడకుండా ఉండేందుకు, వరి పంటను కాపాడుకోవడానికి ఒకటే మార్గం ఉంది. అదే పంటసాగును ఒక నెలరోజులు ముందుకు జరపడమే. ● వానకాలంసాగుకు సంబంధించి జూన్‌లో నార్లు పోసుకొని జూలై నాటికి నాట్లు పూర్తి చేయాలి. ● యాసంగిలో అయితే నవంబర్‌లో నార్లు పోసి డిసెంబర్లో నాట్లు పూర్తి చేయాలి. ● వానాకాలంలో 140 రోజులు అంతకన్నా ఎక్కువ సమయం గల దీర్ఘకాలిక రకాల సాగుకు మే 25 నుంచి జూన్ 5లోగా నారు పోసుకోవాలి. ● 130 నుంచి 135 రోజుల వ్యవధిగల మధ్యకాలిక రకాల సాగులో జూన్ 15 వరకు నారు పోయాలి. ● 120 నుంచి 125 రోజుల వ్యవధి గల స్వల్పకాలిక రకాల సాగుకు జూన్ 25 వరకు నారు పోసుకోవాలి. ● సాగు చేసేది ఎలాంటి రకాలైనా సరే జూలై నెల వరకు వానాకాలంలో వరినాట్లు పూర్తికావాలి. ● వానాకాలం వరికోత అక్టోబర్ 3వ వారంనుంచి నవంబర్ మొదటివారం లోపు పూర్తి చేయాలి. ● యాసంగిలో నవంబర్ 20వ తేదీలోపు నారు పోసుకోవాలి. ● పంటకాలం ముందుకు జరిపితే వానాకాలం వరికోతలు నవంబర్ మొదటి వారంలోపు పూర్తవుతాయి. అయితే యాసంగి నారు కోసం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ● రైతులు వానాకాలం సాగు సమయంలోనే ముందు జాగ్రత్తగా యాసంగి నారు కోసం ఒక చిన్న మడిని వదిలేసుకుంటే బాగుంటుంది. దీంతో వానాకాలం పంటలు కాస్త ఆలస్యమైనా వదిలేసిన మడిలో యాసంగి కోసం సరైన సమయంలో నారు పోసుకొనే వీలుంటుంది. ముందు నారు పోస్తే పంటకు బలం హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు రాంగోపాల్‌రావు 15 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది వానాకాలంలో వరి సాగు చేయడంతో పాటు యాసంగి మిర్చి సాగు చేస్తే మంచి లాభాలు వచ్చాయి. ఈ వానాకాలం 15 ఎకరాల్లో వరిసాగు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా రాంగోపాల్‌రావు మాట్లాడుతూ వ్యవసాయ పంటలు ప్రారంభానికి రోహిణి, ఆరుద్ర కార్తెలే అనుకూలం. ఈ రెండు కారెల్లో విత్తనం వేస్తే పంట బలంగా వస్తుంది. ఒకేసారి 15 ఎకరాల far వేయాలంటే కూలీల కొరత ఉంది. అందుకే 15 రోజుల గడువు తీసుకొని మూడు దఫాలుగా నారు పోశాను. యాసంగిలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మెదక్ జిల్లాలో 32,884 ఎకరాల్లో, సిద్దిపేట జిల్లాలో 53 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో పంటనష్టం నమోదు ఎక్కడా జరగలేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
వరి విత్తనరకాలు, పంటకాలం, నారుపోసే సమయం
వరిసాగుకు సంబంధించి పంట కాలాన్ని ముందుకు జరిపే క్రమంలో ఏఏ రకాల విత్తనాలతో నార్లు పోసుకోవచ్చని, వాటి పంట కాలం తదితర వివరాలను సిద్దిపేట జిల్లా తోర్నాల ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సీహెచ్.పల్లవి వివరించారు. ● దీర్ఘకాలిక రకాలు: పంటకాలం 140 రోజులపైనే. ఇందులో ప్రధానమైన వరి విత్తన రకాలు వరంగల్ 44 (సిద్ది), కంపాసాగర్ 2874, సాంబమసూరి. మే 25 నుంచి జూన్ 5వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి ● మధ్యకాలిక రకాలు: పంటకాలం 135 రోజులు. ఇందులో ప్రధానమైన రకాలు రాజేంద్రనగర్ 2458 (కృష్ణ), వరంగల్ 32100 (వరంగల్ సన్నాలు), వరంగల్ 915, జగిత్యాల 384, పొలాస ప్రభ, జగిత్యాల 28545, జగిత్యాల 27356, వరంగల్ 1487 జూన్ 15వ తేదీ వరకు నార్లు పోసుకోవాలి ● స్వల్పకాలిక రకాలు : పటకాలం 120 నుంచి 125 రోజులు. ఇందులో ప్రధానమైనవి సన్న రకాలైన కునారం–1638, వరంగల్ 962. రాజేంద్రనగర్–21278, రాజేంద్రనగర్– 15048 (తెలంగాణ సోనా), దొడ్డురకాల్లో కునారం–118 (కూనారం సన్నాలు), జగిత్యాల – 24423, జగిత్యాల – 18047 (బతుకమ్మ), రాజేంద్రనగర్–29325, మారుటేరు–1010 (కాటన్ దొర సన్నాలు). ● వానాకాలం వరిపంటకు జూన్ 25 లోపు నారు పోసుకుంటే...అక్టోబర్ మూడో వారం నుంచి నవంబరు మొదటి వారంలోపు కోతలు పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మళ్లీ యాసంగిలో వరి ఆరుతడి పంటలను సకాలంలో సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఇక యాసంగిలో వరి సాగుకు స్వల్పకాలిక రకాలను ఎంచుకొని నవంబర్ 15 నుంచి 20వతేదీలోపు విత్తుకుంటే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదట్లో పంట కోతకు వస్తుంది. తద్వారా వర్షాల నష్టం నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. -
ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి రైస్‌మిల్లులకు తరలించిందన్నారు. ఆలస్యంగా వరి నాట్లేయడం వల్ల ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 24 వరకూ సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. శనివారం ఇక్కడ మంత్రి గంగుల ఆ శాఖ అధికారులతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడి ఏయేటికాయేడు పెరుగుతోందన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అక్టోబర్ 21 నుంచి మొదలైన వానాకాలం పంట సేకరణ మూడునెలలకు పైగా నిరంతరాయంగా సాగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 7,024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13,570 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9.76 లక్షలమంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఓపీఎంఎస్లో నమోదైన రైతులకు రూ.12,700 కోట్లు చెల్లించామని చెప్పారు. పంజాబ్ తరువాత తెలంగాణనే.. దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రంలో 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఏడు బహిరంగ మార్కెట్లలో అత్యధిక ధర లభించడంతో రైతులు లాభసాటిగా ప్రైవేటుగా ధాన్యం విక్రయించుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు. ఈ సీజన్లో అత్యధికంగా నిజామాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్లగొండలో 4.13, మెదక్‌లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. కాగా, ఈ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టాప్.. నిజామాబాద్ ఆఖరున ఆదిలాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 63.20 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ కారణంగా.. దాదాపు 65 లక్షల టన్నులకు మించి సేకరణ జరిగే అవకాశం కనిపించడం లేదు. ముప్పావువంతుకుపైగా జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించగా, అతితక్కువ సేకరణలో ఆదిలాబాద్ నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 7,015 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,100 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 20 వరకు కొంత మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. రెండు, మూడు స్థానాల్లో కామారెడ్డి, నల్లగొండ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రూ.1,204.36 కోట్ల విలువైన 5,85,661 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మూడేళ్లుగా పౌరసరఫరాల సంస్థ నిజామాబాద్‌లోనే అత్యధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఆ తరువాత స్థానాల్లో 4,75,082 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లతో రెండోస్థానంలో కామారెడ్డి జిల్లా ఉండగా, 4,11,827 మెట్రిక్ టన్నులతో మూడోస్థానంలో నల్లగొండ జిల్లా ఉంది. 2,198 మెట్రిక్ టన్నులతో ఆఖరున ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో వరిసాగు అతితక్కువగా ఉండడమే అందుకు కారణం. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం రాష్ట్రంలో ధాన్యం సేకరణకు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు ఆధార్, ఫోన్ నంబర్ అనుసంధానం చేయడంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో చాలా జిల్లాల్లో రైతులు ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయించుకున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట వంటి జిల్లాల్లో నాణ్యమైన సన్న ధాన్యాన్ని మిల్లర్లు కల్లాల మీదే కొనుగోలు చేసి, బియ్యంగా మరపట్టించి విక్రయించారు. అగ్గువకో, సగ్గువకో తక్షణమే నగదు వస్తుండటంతో రైతులు కూడా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు భారీ ఎత్తున విక్రయించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు రావలసిన ధాన్యం తగ్గింది. 30 లక్షల టన్నులకు పైగా ధాన్యం ప్రైవేటు వ్యాపారుల ద్వారా బహిరంగ మార్కెట్‌కు తరలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని సేకరించగా, రూ.12,430 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణలో వరి సాగే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సాగు 1.28 కోట్ల ఎకరాలకు చేరింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 58,28,686 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్టు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి గురువారం అందచేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, అదనంగా మరో 13.28 లక్షల ఎకరాలు ఎక్కువే వరినాట్లు వేశారు. దీంతో ఈ వానాకాలంలో అన్ని పంటల కంటే వరి సాగు అత్యధికంగా జరిగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తరువాత పత్తి 48,95,905 ఎకరాల్లో సాగైంది. వానాకాలంలో అత్యధికంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాల ని సర్కారు నిర్ణయించింది. రైతులు సైతం పత్తి సాగుకు మొగ్గు చూపినా ఈ జూలై, ఆగసులో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టంతో పాటు మళ్లీ సాగుచేయలేని పరిస్థి తి ఏర్పడింది. దీంతో పత్తిసాగు తగ్గింది. -
మీ వాహనం సేఫ్‌గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): వర్షాకాలంలో వాహనాల వినియోగంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా బైకులు, కార్లు వినియోగించే వారు ఈ మాత్రం నిర్లక్ష్యం వహించినా బండి హఠాత్తుగా ఆగిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిద్దాం.. చదవండి: పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి.. ద్విచక్ర వాహనాల రక్షణ ఇలా.. ♦ద్విచక్ర వాహనాల బ్యాటరీలు ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు, పడిన తర్వాత వేగంగా వెళ్లడం ప్రమాదకరం. లైనర్స్, వీల్డ్రమ్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీల్డ్రమ్స్, బైక్ లైనర్స్లోకి నీరు వెళ్తే వెంటనే మెకానిక్ వద్దకు వెళ్లి శుభ్రం చేయించాలి. రోజుల తరబడి ఆలస్యం చేస్తే వాహనాలు పాడవుతాయి. ♦ద్విచక్ర వాహనాలు వర్షానికి తడిసినప్పుడు, నీళ్ల నుంచి వెళ్లినప్పుడు చైన్ గ్రీజ్ పోతుంది. అలాంటి సమయంలో చైన్ కవర్లను తీసి కిరోసిన్ గానీ, ఆయిల్‌గానీ వేయాలి. తర్వాత మెకానిక్కు చూపించి గ్రీజ్ పెట్టించాలి. నిర్లక్ష్యంగా ఉంటే చైన్ స్పాకెట్, వీల్ బేరింగ్ దెబ్బతింటాయి. ♦సైలెన్సర్లలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీటిలో పూర్తిగా మునిగిన వాహనాన్ని సర్వీసింగ్ చేయకుండా స్టార్ట్ చేయకూడదు. నీటి మడుగులోంచి వెళ్లాల్సివస్తే ఎక్స్‌లేటర్‌ను ఏమాత్రం తగ్గించినా వెంటనే స్పార్క్‌ప్లగ్, సైలెన్సర్లోకి నీరు చేరి బైక్ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సైలెన్సర్‌లోని నీరు బయటకు వచ్చేలా వాహనాన్ని వెనక్కి వంచాలి. స్పార్క్ప్లగ్ను శుభ్రం చేసి కిక్ కొట్టి మిగతా నీటిని బయటకు పంపాలి. అయినా స్టార్ట్ కాకపోతే మెకానిక్ వద్దకు వెళ్లాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంజన్ పాడయ్యే ప్రమాదముంది. ♦ప్రతి వాహనానికి తప్పనిసరిగా పెట్రోల్ ట్యాంక్ కవర్ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే వర్షం కురిసిన సమయంలో నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ♦బైక్‌లో కార్బేటర్ది కీలకపాత్ర. దీంట్లోకి నీరు చేరితే వాహనం స్టార్ట్ కాదు. కిక్ కొట్టినా స్టార్ట్ కాకపోతే వెంటనే కార్బేటర్ను శుభ్రం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే కార్బేటర్లోకి తెల్లని ఫంగస్ చేరి వాహనం మైలేజ్ పడిపోతుంది. ♦వీలైనంత మేరకు వాహనాలు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. బయట ఉంటే కవర్లు కప్పాలి. లేదంటే షెడ్ల కింద పార్కింగ్ చేయాలి. వర్షాకాలంలో వ్యాక్స్ పాలిష్ చేయించుకోవాలి. కార్లు– జాగ్రత్తలు ♦వర్షాకాలంలో ఆథరైజ్డ్ క్యాంపుల్లో కార్లను తనిఖీ చేయించాలి. బండి బయటకు తీసే ముందే టైర్లను పరీక్షించాలి. దీనివల్ల దుర్ఘటనలను నివారించుకోవచ్చు. ఎగుడు దిగుడుగా అరిగి ఉండటం, అసలు గ్రిప్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. ♦‘యూజర్ మాన్యువల్‘లో సూచించిన విధంగా టైర్ ప్రెజర్ ఉండాలి. టైర్ల మన్నిక కూడా పెరుగుతుంది. ♦వర్షాలకు కారు లోపలికి నీరు వెళ్తుంటుంది. రబ్బర్ మ్యాట్స్‌కు బదులు ఫ్యాబ్రిక్స్ మ్యాట్స్ వినియోగించడం మంచిది. ♦ఏసీ దుర్వాసన వెదజల్లే కాలం కూడా ఇదే. అందుకే ఏసీని నిర్దేశిత సెట్టింగ్స్‌లో ఉంచుకోవాలి. పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్‌ను కారులో పెట్టుకుంటే శుభ్రం చేసుకోవచ్చు. ♦వర్షాకాలంలో వైపర్స్ పక్కాగా పనిచేసేలా చూసుకోవాలి. సాధారణంగా విండ్ స్క్రీన్ వైపర్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటాం. చాలామంది కారు కొన్న దగ్గర నుంచి అవే వైపర్లను వాడుతుంటారు. సరైన సమయంలో వాటిని మార్చాలి. లేకపోతే విజిబిలిటీ స్పష్టంగా ఉండదు. -
అసలే వర్షాకాలం.. లో దుస్తుల విషయంలో జాగ్రత్త! ఇలా మాత్రం చేయకండి!
సాధారణంగా చాలా మంది దుస్తుల కోసం వేల రూపాయలు ఖర్చుపెడుతుంటారు. అయితే... లో దుస్తుల విషయంలో మాత్రం తగిన శ్రద్ధ వహించరు. చవకరకం లోదుస్తులు వాడతారు. దానివల్ల ఎంతో అసౌకర్యం. మామూలుగా రోజువారి ధరించే లో దుస్తులు వర్షాకాలంలో ధరించకూడదు. మరి ఎలాంటి లో దుస్తులు వేసుకోవాలో చూద్దాం.. జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు! వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరవు. ఉతికిన దుస్తులు ఎండటానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుంది. అలా రెండు, మూడు రోజులు బయట ఉన్నవాటిని ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పూర్తిగా ఎండకుండా.. తడిగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల బాక్టీరియా తయారై.. జననాంగాల్లో ఇన్ఫెక్షన్లు సంభవించే ప్రమాదం ఉంది. వ్యాయామం చేసిన తర్వాత అంతేకాదు, వర్షాకాలంలో కూడా వ్యాయామం చేసిన తర్వాత కాళ్ల దగ్గర చెమటలు వస్తాయి. అప్పుడు లో దుస్తులు తడిసిపోతాయి. వాటిని అలానే ఉంచుకుంటే.. దురద లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. వ్యాయామం తర్వాత వెంటనే లో దుస్తులు మార్చుకోవాలి. కాటన్‌వి అయితే! ►ఇక బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించకూడదు. దానివల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి.. కొద్దిగా వదులుగా ఉండే లో దుస్తులు ధరించడమే ఉత్తమం. ►లోదుస్తులను చాలా రకాల మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు కానీ స్వచ్ఛమైన కాటన్‌వి అయితేనే మంచిది. ►అలాగే, లోదుస్తులను శుభ్రపరిచే డిటర్జెంట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ►గాఢమైన వాసనలతో ఉండే డిటర్జెంట్లు వాడకపోవడం మంచిది. ►ఎందుకంటే వాటిలోని రసాయనాలు రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కూడా పాటించండి! ►ఈ సీజన్లో బ్యాగ్‌లో ఎప్పుడూ కొన్ని పాలిథిన్ కవర్లు ఉంచుకోవాలి. ►అలాగే తేలికగా ఉండే రెయిన్ కోట్ ఒకటి స్పేర్‌లో ఉంచుకోవాలి. ►వీటితోపాటు జలుబు, దగ్గుకు వాడే ట్యాబ్లెట్లు, హ్యాండ్ కర్చీఫ్‌లు, విక్స్, లవంగాలు వంటివి ఉంచుకోవడం మంచిది. ►గొంతులో గరగరగా ఉన్నప్పుడు లవంగాలు బాగా పని చేస్తాయి. చదవండి: Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్! Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్.. -
Fashion Tips: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్!
Comfortable Wardrobe Ideas For Monsoon: అసలే ముసురు. అలాగని వెచ్చగా ఇంట్లో మునగదీసుకుని పడుకుందామంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. అలాకాకుండా ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్ ఏవి బాగుంటాయి... చూద్దాం. వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి ముదురు రంగు దుస్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగని భారీగా ఉండకూడదు. తేలికపా వి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం ఇవి బాగుంటాయి! ►కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది. ►సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. ►స్కిన్ టైట్, లెగ్గింగ్స్ కూడా బాగుంటాయి. ►అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది. ►హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం. ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు! ►మరో విషయం ఏమిటంటే... వర్షాకాలం లో పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. ►బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. ►తెలుపు రంగు బట్టలకు మురికి పట్టిందంటే తొందరగా వదలదు. ►ఏ చిన్న మరక పడ్డా అల్లంత దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది. ►ముసురు తగ్గాక దుప్పట్లు, రగ్గులు, బొంతలు, దిళ్లు, పరుపులు, మందపాటి బట్టలను కాసేపు అలా ఎండలో వేస్తే బావుంటాయి. వాసన కూడా రాదు. ►శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి. ►శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ. ►వానాకాలం అన్నాళ్లూ బయటికెళ్లేటప్పుడు గొడుగు/రెయిన్‌కోట్ వెంట వుండాలి. ►వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది. జీన్స్ అసలే వద్దు! ►ఈ కాలంలో జీన్స్ జోలికి వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా టైట్ జీన్స్ అసలు వద్దు. ►అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్ కంటే షూ వాడడం బెటర్. లేదంటే శాండిల్స్ అయినా ఫరవాలేదు. ►స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి. ►అంతేకాకుండా బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశం ఉంది. చదవండి: Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
వామ్మో...ఎండలు!
కడప కల్చరల్: ఇవేమి ఎండలలు నాయనా..ఈ మధ్య కాలంలో ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు...అంటూ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. దాదాపు నెల రోజులుగా తేలికపాటి వర్షంతో వాతావరణం చల్లగానే ఉంది. వేసవి తాపం నుంచి బయట పడ్డామని భావించిన ప్రజలకు ఇటీవలి ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచినా వెంటనే తీక్షణమైన ఎండ చిటపటలాడిస్తోంది. ఊహించని విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట తీవ్రమైన ఎండలను భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉభయ జిల్లాల్లో నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 9 గంటలకే బయట కొద్దిసేపు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు రోజులు వాతావరణంలో 35–37 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఇళ్లలో ఫ్యాను, ఏసీ వాడక తప్పడం లేదు. పాఠశాలల విద్యార్థులు ఉదయం ప్రార్థన చేసేందుకు కూడా ఎండ ఆటంకంగా నిలుస్తోంది. వీధుల్లో వెళ్లే ప్రజలు గొడుగులు, టోపీలు, టవళ్లు వాడక తప్పడం లేదు. ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ పడేంత వరకు వాహనదారులకు ఎండలో ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. నిపుణులు ఏమంటున్నారంటే.. రుతు పవనాల్లో ఏర్పడిన అంతరాయం వల్లే ఆకస్మిక ఎండలను ఎదుర్కోవాల్సి వస్తోందని యోగివేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కృష్ణారెడ్డి చెబుతున్నారు.కొద్దిరోజులు వర్షాభావ స్థితి ఉండడం, తాత్కాలికంగా ఈశాన్యం నుంచి వేడిగాలులు వస్తుండడంతో రాయలసీమ ప్రాంతంలో సాధారణ వాతావరణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు. -
Health Tips: వర్షాకాలం.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. వేడి నీటితో స్నానం చేస్తే!
సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. తడిసిన తరువాత స్నానం చేయాలి మనమందరం వర్షంలో తడిసి ఆనందిస్తుంటాం.. అందులోనూ చిన్నారులు మరింత ఉత్సాహం చూపిస్తుంటారు. వర్షంలో తడిసిన తరువాత తప్పకుండా స్నానం చేయాలి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబును నివారించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. నీరు తాగాలి ఈ సమయంలో తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో ప్యాక్డ్ వాటర్, కియోస్క్‌లు, ధాబాస్ లేదా షాపుల నుంచి వడకట్టని నీటిని తాగరాదు. వాటర్ ప్యూరిఫైయర్ నుంచి మాత్రమే నీరు తాగండి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. వెంటిలేషన్ ఉండాలి మనం ఎక్కువ సమయం గడిపే స్థలం కూడా వర్షాకాలంలో ప్రభావితం చేస్తుంది. ఇరుకైన ప్రదేశంలో ఉంటే అంటు వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతుంటాయి. వీలైనప్పుడల్లా ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. తప్పకుండా చేతులు కడుక్కోవాలి వాష్‌రూమ్ డోర్, ట్యాప్, ఫ్లష్ మొదలైన వాటి ద్వారా సూక్ష్మక్రిములు మన చేతుల్లోకి వస్తాయి. మీరు భోజనానికి ముందు ఆ తరువాత తప్పనిసరిగా సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇది అంటువ్యాధులను నివారించడానికి మీకు సహాయపడుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచండి వర్షాకాలంలో ఇంట్లో చాలా దుమ్ము వచ్చి చేరుతుంది. వర్షంతో వచ్చే తడితో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. అవి అంటువ్యాధులను, ఇన్ఫెక్షన్లను మోసుకొస్తుంటాయి. సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇంటి శుభ్రతతో దోమలు, ఇతర కీటకాల పెంపకాన్ని నివారించవచ్చు. ఇది వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా తగ్గిస్తుంది. ►చర్మ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వేడినీటితో రోజు రెండు పూటలా స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, క్రిములు తొలగిపోతాయి. అలర్జీలు దరి చేరకుండా చూసుకోవచ్చు. చదవండి: Rainy Season Healthy Diet: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి! Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా డేంజర్..! అవి కూడా అతిగా వద్దు! 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
Health Tips: వర్షాకాలం.. పచ్చి ఆకు కూరలు, సీ ఫుడ్ వద్దు.. ఇవి తినండి!
వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడి వేడి మిర్చి బజ్జీలో, పకోడీలో తింటూ... ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూనో, సంగీతం వింటూనో కాలం గడపడం అందరికీ ఇష్టమైన పనులే.. అయితే వర్షాకాలం కేవలం వీటినే కాదు.. ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఆలవాలం. డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు వర్షా కాలంలోనే ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటితోపాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు కూడా చికాకు పెడుతుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు, చిట్కాలు పాటించడం మంచిది. అవేమిటో చూద్దాం. వర్షాకాలం ఆరోగ్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో అనేక రోగాలు చుట్టుముట్టి బాధిస్తుంటాయి. వర్షాలు పడడంతో దోమలు, ఈగలు వంటి కీటకాల బెడద పెరుగుతుంది. ఇవి వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి. తరచూ జలుబు, దగ్గు వంటి వాటితో అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. అధిక వర్షాల వల్ల ఆరోగ్యానికి ముప్పు కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని నిరోధించడానికి కింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందువల్ల, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం మంచిది. ఇవి తగ్గించాలి.. ఇవి తినాలి ►జంక్, స్పైసీ, జిడ్డుగల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ►పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవి మన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇచ్చే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. ►పచ్చి ఆకు కూరలను తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. ఒకవేళ తినాలని భావిస్తే మితంగా తినడం మేలు. ►పేగులకు అనుకూలమైన, తేలికగా జీర్ణమయ్యే తేలికైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ►పచ్చి కూరగాయలకు బదులుగా ఆవిరి మీద ఉడికించిన కూరగాయలను తినాలి. ►అలాగే కాచి చల్లార్చిన నీరు తాగడం అవసరం. ►వర్షాకాలంలో కడుపు, పేగు, కాలేయ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ►ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల కారణంగా రోగాలు అకస్మాత్తుగా దరిచేరే అవకాశం ఉంటుంది. ►కాబట్టి వేడి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలు తినరాదు. సీ ఫుడ్ వద్దు: ►వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీ ఫుడ్ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా, డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీతో బాధపడే అవకాశం ఉంటుంది. ►ఆహారం తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు మానుకోండి. వర్షం కారణంగా వ్యాయామాలు చేసేందుకు బయటకు వెళ్ళలేని పరిస్ధితి ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియలు సాఫీగా ఉండాలంటే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి! ►ఆహారం కలుషితమై ఉండే అవకాశాలు ఉన్నందువల్ల రకరకాల రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ►తక్కువ మొత్తంలో తినేలా చూసుకోవాలి. అధిక మొత్తంలో ఆహారం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ►దీనివల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. నూనెతో తయారు చేసిన పదార్థాల జోలికి వెళ్లనే వెళ్ళవద్దు. చల్లని డ్రింక్‌లు వద్దు.. వేడి సూప్లే ముద్దు ►వర్షాకాలంలో వెచ్చని సూప్ తాగడం చాలా బాగుంటుంది. చికెన్ సూప్ నుంచి క్యారెట్ సూప్, మష్రూమ్ సూప్ లేదా వెజిటబుల్ సూప్ మొదలైన అనేక సూప్‌లను తీసుకోవచ్చు. అంతేకాదు తులసి, పసుపు, దాల్చిన చెక్క, ఏలకులతోపాటు నిమ్మకాయ వంటి ఇతర రోగనిరోధక శక్తిని పెంచే టీ (చాయ్)లను తీసుకోవచ్చు. ►వీలయినంతవరకు వర్షం పడేటప్పుడు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించడం మేలు. ఈ విధంగా మీరు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. చదవండి: Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..! -
మూడు జోన్లు.. మూడు ‘వానలు’
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలోని మూడు వాతావరణ జోన్లలో ప్రస్తుత వర్షాకాల సీజన్లో మూడు రకాలుగా వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ (ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు)లో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండగా మధ్య తెలంగాణలో (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలు) ఓ మోస్తరుగా, దక్షిణ తెలంగాణ (ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు)లో సాధారణ వర్షాలే కురుస్తున్నాయి. అప్పుడే లక్ష్యానికి చేరువై... నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో నాలుగు మాసాల్లో కురవాల్సిన వర్షం 72.04 సెంటీమీటర్లుకాగా జూన్ 1 నుంచి జూలై 18 వరకు 56.41 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. అంటే 120 రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం 48 రోజుల్లోనే 78 శాతం మేరకు కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతమే నమోదైనా (14.26 సెంటీమీటర్లు), జూలై 18 వరకు 11.7 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఏకంగా 42.03 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 85.5 సెంటీమీటర్ల వర్షం (253 శాతం) కురవగా జగిత్యాల (230 శాతం), కరీంనగర్ (211 శాతం), నిర్మల్ (205 శాతం), భూపాలపల్లి (190 శాతం) అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు అన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 125 శాతం నుంచి 253 శాతం వరకు అధిక వర్షాలు కురిశాయి. కొన్ని గంటలపాటు క్లౌడ్‌బరస్ట్ వల్లే ఉత్తర తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్లో మధ్యస్థం.. సెంట్రల్ తెలంగాణ జోన్‌లోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాలు కురిశాయి. అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఇంకా కురువలేదు. ఒక్క ములుగు జిల్లాలో మాత్రం అతిభారీ వర్షాలతో 158 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దక్షిణాన వెనకబడ్డ గద్వాల.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం రంగారెడ్డి జిల్లాలో 91 శాతం అధికంగా నమోదైతే, అత్యల్పంగా జోగులాంబ గద్వాలో 35 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. ఉత్తర, మధ్య తెలంగాణలతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నా అన్ని జిల్లాలు ఇప్పటికే సాధారణ సగటు వర్షపాతాన్ని మించిపోవడం విశేషం. వర్షాల రికార్డులు ఇవీ... ►ఈ సీజన్లో నిజామాబాద్ జిల్లా నవీపేట సాధారణం కంటే 365 శాతం అధిక వర్షపాతంతో రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షం కురిసిన ప్రాంతంగా రికార్డు సృష్టించగా కుమురం భీం జిల్లా లింగాపూర్ 344 శాతంతో రెండో స్థానంలో 308 శాతం అధిక వర్షంతో జైనూర్ మూడవ ప్లేస్‌లో నిలిచింది. ►గత 50 ఏళ్లలో అత్యధిక వర్షపాతం రికార్డు ములుగు జిల్లా వాజేడులో నమోదైంది. 2013 జూలై 19న వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం జిల్లా దహేగాన్లో 2013 జూలై 23న 50.36 సెంటీమీటర్లు, 2005 సెప్టెంబర్ 20న భద్రాద్రి జిల్లా ములకపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షం పడింది. ►24 గంటల్లో 0.25 సెంటీమీటర్ల మేర వర్షం కురిస్తే దాన్ని ఒక్క రెయినీ డేగా గుర్తిస్తారు.గత 30 ఏళ్ల సగటు వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే సంవత్సరంలో అత్యధికంగా భద్రాద్రి జిల్లా 80 రెయినీ డేస్‌తో మొదటి స్థానంలో ఉంది. 74 రోజులతో ములుగు రెండవ స్థానంలో 72 రోజులతో కుమురం భీం మూడవ ప్లేస్‌లో ఉంది. ►జోగులాంబ గద్వాలలో ఏడాదిలో కేవలం 47 రోజులు, వనపర్తిలో 49, హైదరాబాద్‌లో 51 రోజులు మాత్రమే రెయినీ డేస్ ఉన్నాయి. అల్పపీడనాలే ఎక్కువ... తెలంగాణలో సాధారణ సగటు వర్షపాతం కంటే అల్పపీడనాల వల్లే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అల్పపీడనాలు ఒడిశా వైపు మళ్లే సమయంలో ఉత్తర తెలంగాణలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీంతో అతిభారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా తీర ప్రాంతంతో పోలిస్తే గోదావరి పరీవాహకంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉండటం కూడా అక్కడ అత్యధిక వర్షాలకు ఓ కారణం. – వై.కరుణాకర్‌రెడ్డి, వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ ఇదీ వర్షం లెక్క.. (ప్రతి గంటకు) తేలికపాటి వర్షం: 1 సెంటీమీటర్ మోసర్తు వర్షం: 1–2 సెంటీమీటర్లు భారీ వర్షం: 2–3 సెంటీమీటర్లు అతి భారీ వర్షం: 3–5 సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షం: 5–10 సెంటీమీటర్లు క్లౌడ్ బరస్ట్: 10 సెంటీమీటర్లపైన -
టో బాలెట్ ఫ్లాట్స్ .. ప్లాస్టిక్ శాండల్స్.. వానాకాలంలో ఏ చెప్పులు బెస్ట్!
పాదాలకు అనువుగా ఉండాలి. పారుతున్న నీళ్లలో జారకుండా ఉండాలి. తడిసినా పాడవకుండా ఉండాలి. పాదాలకు వేసే చెప్పులే అయినా కాలానుగుణంగా ఉండాలి. ఎటు తిరిగినా అందంగానూ ఉండాలి. ఆ ఎంపిక ఎప్పుడూ బెస్ట్ అనిపించాలి. వర్షాకాలంలో రెయిన్కోట్లు, గొడుగు ఎంత ముఖ్యమో ఈ కాలం వేసుకోదగిన చెప్పులు కూడా అంతే ముఖ్యం. ఏవి ఈ సీజన్‌కి సరైనవో ఎంపిక చేసుకోవడం మరీ ముఖ్యం. రబ్బర్ షూస్, పీవీసీ షూస్ ఈ కాలానికి అనువుగానే కాదు ఫ్యాషనబుల్‌గా పర్ఫెక్ట్గా అమరుతున్నాయి. వాటిలో .. ఫ్లిప్ ఫ్లాప్స్, స్లిప్–ఆన్ క్రాస్లైట్ శాండల్స్ వర్షాకాలానికి అనువైనవి. స్లిప్–ఆన్‌లో హీల్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈ సీజన్లో స్టైలిష్ కన్నా సౌకర్యవంతంగా అమరేవే చూడాలి. పాదాలను పట్టినట్టుగా ఉంటూనే వదలడానికి అనువుగా, ప్లాట్ నమూనాతో ఉండటం వీటి ప్రత్యేకత. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. టో బాలెట్ ఫ్లాట్స్ కాలి మునివేళ్లను దగ్గరగా ఉంచుతూ పాదాలను రక్షణ కలిగిస్తాయి. రంధ్రాలు ఉండే ఈ ఫ్లాట్స్ స్టైలిష్‌గానూ ఉంటాయి. ఇండియన్, వెస్ట్రన్.. ఏ స్టైల్ దుస్తులకైనా బాగా నప్పుతాయి. కాలేజీ, ఆఫీస్ వేర్, క్యాజువల్ వేర్.. అన్నివేళలా ధరించడానికి అనువైనవి. బురద అంటినా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. రబ్బరు లేదా ప్లాస్టిక్ శాండల్స్ లెదర్ వాటిలా కనిపించే షూస్, శాండల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇవి రబ్బరు లేదా ప్లాస్టిక్‌తో తయారుచేసినవి. హై టాప్ రెయిన్ షూస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, ట్రావెలర్స్‌కు సూట్ అవుతాయి. స్ట్రాప్ శాండల్స్ పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పలు, ఫ్లిప్–ఫ్లాప్స్ జారిపోతాయి అనుకునేవారు స్ట్రాప్ ఉన్న శాండల్స్ లేదా స్ట్రాప్ చెప్పులు ఎంచుకోవచ్చు. బాలెరినా షూస్ రబ్బరు లేదా లైక్రా బాలెరినా బూట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే పాదాలను బురద నుంచి కాపాడతాయి. హీల్స్ లేనివే ఎంపిక నీళ్లు, బురదతో నిండిన రోడ్ల మీద నడిచేటప్పుడు జారకుండా ఉండాలంటే పట్టీలు ఉన్నప్పటికీ హీల్స్‌ని మాత్రం ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం. పేస్టెల్, నియాన్ షేడ్స్ గల శాండల్స్ ఈ సీజన్‌కి మరింత అందాన్ని తీసుకువస్తాయి. చదవండి: Cyber Crime Prevention Tips: రుణం కోసం అడ్వాన్స్.. చెల్లిస్తున్నారా?! అయితే ప్రమాదంలో పడ్డట్లే! ఈ జాగ్రత్తలు పాటించండి! C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? -
ఆకస్మిక చలి.. ఆరోగ్యం జాగ్రత్త.. వాట్సాప్, ఫేస్బుక్లో సందేశాల వెల్లువ
సాక్షి, సిటీబ్యూరో: 'వాతావరణంలో ఏర్పడుతున్న ప్రత్యేక పరిస్థితి కారణంగా గత శుక్రవారం నుంచి అనూహ్యంగా చలి పెరిగింది. ఈ చలి తీవ్రత వల్ల నెలన్నర రోజుల పాటు ప్రజలకు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తనున్నాయి’. ఈ మేరకు వాట్సాప్, ఫేస్బుక్ తదితర మాధ్యమాలలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆకస్మికంగా తీవ్రమైన చలి, దగ్గు, జలుబు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనేది తెలిసిందే. అలా తిరిగే క్రమంలో సంవత్సరానికి ఒకసారి సూర్యుడి నుంచి భూమి నిర్ధిష్ట దూరం కన్నా ఎక్కువ దూరంగా జరుగుతుంది. దీనిని అఫెలియన్ స్థితి అని పేర్కొంటారు. చలి పెరిగి...అనారోగ్యం కలిగి.. సూర్యుడి నుంచి భూమి దూరంగా కదులుతున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం సహజంగానే ఉంటుంది. ఈ రకమైన అఫెలియన్ స్థితి గురువారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైందనీ, ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో సమయంలో దీని ప్రభావం ప్రారంభమవుతుందని సోషల్ సందేశాలు చెబుతున్నాయి. అలాగే ఈ పరిస్థితి ఆగస్ట్ 22న ముగుస్తుందనీ అంటున్నారు. భూమికి సూర్యునికి మధ్య దూరం సాధారణం కంటే 6.6 శాతం ఎక్కువ కావడం వల్ల ఈ అఫెలియన్ కాలంలో చలి బాగా పెరిగి, దీంతో ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కావున వెచ్చని వస్త్రాలు ధరించాలని, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు, సప్లిమెంట్లను వినియోగించాలని సూచనలు కూడా జోడిస్తున్నారు. వాస్తవం ఉందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? దీనిపై నగరానికి చెందిన వాతావరణ నిపుణులొకరు మాట్లాడుతూ...ఇప్పటికే నాసా దీనిపై స్పష్టత ఇచ్చిందన్నారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రకారం, భూమికీ సూర్యునికీ మధ్య సగటు దూరం దాదాపు 150 మిలియన్ కిమీ కాగా, అఫెలియన్ సమయంలో అది దాదాపు 152 మిలియన్ కి.మీ.కి చేరుతుందనీ, ఈ వ్యత్యాసం ఉష్ణోగ్రతపై ప్రభావం చూపడానికి సరిపోదన్నారు. నిజానికి అఫెలియన్ అనేది ఏటేటా సర్వసాధారణంగా ఏర్పడే పరిస్థితేనన్నారు. భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నందున, సూర్యుడు భూమి మధ్య దూరం సంవత్సరం పొడవునా మారుతూ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా, భూమి సాధారణం కన్నా ఎక్కువగా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు పెరిహెలియన్ స్థితి అంటారనీ , అఫెలియన్ సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రారంభమైతే, జనవరి 2వ తేదీన పెరిహెలియన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. వీటివల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయనేందుకు ఎటువంటి రుజువులు లేవన్నారు. వాతావరణ మార్పులతోనే ఆరోగ్య సమస్యలు బంజారాహిల్స్: వానాకాలంలో వాతావరణ మార్పుల వల్ల విస్తరించే వైరస్‌లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ‘మా’ఈఎన్టీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఎన్టీ చీఫ్ సర్జన్ డాక్టర్ కే.ఆర్. మేఘనాథ్ మాట్లాడారు. ప్రస్తుతం జ్వరం, జలుబు, చెవి, గొంతు నొప్పి, దగ్గులకు వైరస్ కారణంగా ఆయన చెప్పారు. మాస్క్ ధరించే అలవాటు కొనసాగించడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందదన్నారు. జలుబు, దగ్గు తదితర సమస్యలు తీవ్రంగా లేకపోతే ఆవిరి పట్టడం, కషాయం వంటివి ఉపకరిస్తాయన్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకుంటే రోగాలతో పోరాడేందుకు మరింత శక్తి సమకూరుతుందన్నారు. - డాక్టర్ కేఆర్ మేఘనాథ్ -
Hyderabad: పెను గాలులు, జడివానలకు దడ పుట్టిస్తున్న శిథిల భవనాలు
సాక్షి, హైదరాబాద్: పెను గాలులకు హోర్డింగ్‌లు.. జడివానలకు శిథిల భవనాలు కుప్పకూలడం తెలిసిందే. ఈ సమస్యల పరిష్కారానికి ఆయా సీజన్లు రావడానికి ముందే తగిన చర్యలు చేపట్టాలి. కానీ, జీహెచ్ఎంసీలో మాత్రం సీజన్లు వచ్చేంతవరకూ అశ్రద్ధ వహించడం.. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తంతుగా మారింది. జీహెచ్ఎంసీలో శిథిల భవనాలను వర్షాకాలం వచ్చేలోగా కూల్చివేయడమో, మరమ్మతులు చేయడమో, వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించడమో చేయాలి. కానీ ఇందుకు గత కొన్నేళ్లుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో విఫలమవుతున్నారు. యంత్రాంగం విఫలం.. వరుస వర్షాలతో నగరంలోని శిథిల భవనాలు భయంగొల్పుతున్నాయి. నగరంలో ప్రతియేటా వర్షాల సమయంలో పురాతన భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. శిథిల భవనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రక టిస్తున్నప్పటికీ తూతూమంత్రంగా కొద్దిమేర చర్యలతో సరిపెడుతున్నారు. బలహీనుల దగ్గర ప్రభావం చూపిస్తున్నప్పటికీ, బలవంతుల భవనాల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ఏడాది సైతం ఇప్పటి వరకు 128 శిథిల భవనాలను కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల లెక్కల మేరకే చర్యలు తీసుకోవాల్సినవి ఇంకా 257 శిథిల భవనాలు ఉన్నాయి. వారి లెక్కలోకి రానివి ఇంకా ఎక్కువే ఉంటాయి. నగరంలో ప్రతిసంవత్సరం కూడా జూలై నుంచి అక్టోబర్ మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇరుకు గల్లీల్లో 20 గజాల స్థలంలోనే అయిదంతస్తులు నిర్మించిన భవనాలు సైతం నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు శిథిల భవనాలకు సంబంధించి వేగిరం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సెల్లార్ల తవ్వకాలపైనా చర్యలు.. సెల్లార్ల నిర్మాణాల విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇలా.. ► నగరంలో శిథిల భవనాలు మొత్తం: 584 ► కూల్చినవి: 128 ► మరమ్మతులు చేసినవి, లేదా ఖాళీ చేయించినవి:199 ► చర్యలు తీసుకోవాల్సినవి: 257 -
వాన కురవాల్సిందే!
కాలచక్ర భ్రమణంలో రుతువులు మారడం ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మంలో భాగంగా రుతుపవ నాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు చండప్రచండంగా ఎండలతో చెలరేగిపోయిన సూర్యు డికి అడ్డుగా మబ్బుతెరలు వచ్చి చేరుకున్నాయి. దేశంలో దాదాపు ప్రతిచోటా చినుకుల చిటపట సందడి మొదలైంది. అక్కడక్కడా అడపాదడపా జడివానలూ కురుస్తున్నాయి. మొత్తానికి తొలకరి జల్లులతో వర్షాకాలం వచ్చేసింది. ఉక్కపోతతో ఊపిరి సలపనివ్వకుండా ఉడుకెత్తించిన వాతా వరణం చల్లబడింది. వానల రాకడతో ప్రకృతి కొత్త ఊపిరి పోసుకుంటోంది. వర్షాకాలం చాలామందికి హర్షకాలం. ఆకాశంలో దట్టంగా ముసురుకునే మేఘతతులు వర్షా గమనానికి నాందీప్రస్తావనలు. నింగి నుంచి వానధార నేల మీదకు జలజలా జారుతుంటే వ్యాపించే మట్టి పరిమళంతో కలిగే ఆనందమే వేరు! ‘చిటపటమంటా ఎండుటాకులో/ చినుకొక్కటి పడి చిటిలి రాలితే/ కోరికలే గుది గుచ్చుకొన్న ఒక/ హారమె తెగినట్లదురు పుడతది’ అంటూ పడుచు మనసులోని వాన గిలిగింతలను కొనకళ్ల వెంకటరత్నం ‘మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై’ పాటలో కమనీయంగా వర్ణించారు. వర్షాలు సకాలంలో సజావుగా కురిస్తే, అందరికీ హర్షదాయకమే! కురవాల్సిన సమయంలో వానలు కురవకున్నా, కురవరాని సమయంలో తెరిపి లేకుండా కురిసినా, కన్నీళ్లు తప్పవు. వర్షాల వల్ల కలిగే హర్షాతిరేకాలకు, వర్షాల వల్ల కలిగే విషాదాలకు అందరి కంటే ఎక్కువగా స్పందించేది రైతులే! ప్రకృతినే నమ్ముకుని బతికే కష్టజీవులు వాళ్లు. వర్షాలు సకాలంలో కురిస్తే పొంగిపోతారు. అకాలంలో కురిస్తే అల్లాడిపోతారు. వర్షాలు తెచ్చే ఆనంద విషాదాలను కవులు, రచయితలు కళ్లకు కట్టిన దాఖలాలున్నాయి. వర్ష బీభత్సాన్ని, విపత్కర పరిస్థితుల్లో మానవ స్వభావాన్ని అద్భుతంగా చిత్రించిన పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’ తెలుగు కథను అంతర్జాతీయ స్థాయిలో నిలిపింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని, జోరుగాలి వీస్తుండగా కురిసే వర్షధారను ‘విరిసెను మేఘపరంపర/ మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్...’ అంటూ శేషేంద్ర తన ‘ఋతు ఘోష’లో వర్షసౌందర్యాన్ని కళ్లకు కట్టారు. వాన కురిసే ముందు ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు తూనీగలు గుంపులు గుంపులుగా ఎగురుతూ తిరగడం కద్దు. పొలాలు, తోటలు ఉండేచోట ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వాన చినుకుల చిటపట తాళానికి భేకరాజాల బెకబెకల సంగీతమూ తోడవుతుంది. ‘వానతూనీగ లాకాశ పథమునందు/ సరస ఝంకార రవములు సలుపుచుండె...’ అంటూ తన ‘కృషీవలుడు’ కావ్యంలో వర్ణించారు దువ్వూరి రామిరెడ్డి. అంతేకాదు, ‘తటములకు నాకసమున కంతరము లేక/ నీలనీరద మాలలు వ్రేలుచుంట/ నేలపై మిన్ను పడనీక నిలుపు చుండు/ స్తంభము లనంగ గిరులు దృశ్యంబులయ్యె’ అంటూ మంటికి మింటికి ఏకధారగా కురిసే కుంభవృష్టి కోలాహలాన్ని వర్ణించారాయన. అక్కడక్కడా శ్రుతిమించి మితిమీరిన వానలు వరదలతో ముంచెత్తుతుంటాయి. అంతమాత్రాన వర్షాలను వద్దనుకోలేం. వర్షాలే లేకపోతే ఈ భూమ్మీద జీవమే ఉండదు. ప్రకృతిలోని మిగిలిన రుతువులన్నీ ఒక ఎత్తయితే, వర్షరుతువు ఒక ఎత్తు. రుతువులన్నింటిలోనూ అత్యంత అనిశ్చితమైన రుతువు వర్షరుతువు! వేసవిలో చలి వణికించదు, చలికాలంలో ఉక్కపోత ఉండదు. అయితే, వర్షాకాలంలో ఒక్కోసారి ఆకాశంలో మబ్బుతునక మచ్చుకైనా కనిపించక ఎండలు కాయవచ్చు. చినుకు కోసం ఎదురుచూపులతో నేల గొంతెండిపోయి నెర్రెలువారే పరిస్థితులు దాపురించవచ్చు. అలాంటి అనావృష్టి వల్లనే కరవు కాటకాలు పీడిస్తాయి. మన పురాణాల ప్రకారం వానలకు వరు ణుడు అధిదేవుడు. రోజుల తరబడి ఎదురుచూపులు చూస్తున్నా, వానలు కురవకపోతే ఒకప్పుడు యజ్ఞాలు చేసేవాళ్లు. అలాగే వానల కోసం కప్పల పెళ్లిళ్లు చేయడం ఆచారం. కప్పల పెళ్లిళ్ల వల్ల కచ్చితంగా వానలు కురుస్తాయనే భరోసా ఏదీ లేకపోయినా, అదో నమ్మకం. మాయదారి లోకంలో మనుషులను ముందుకు నడిపేవి నమ్మకాలే! నమ్మకాలే లేకపోతే జీవితాలు బీడువారి పోవూ! వర్షరుతువులో వానల అనిశ్చితి కారణంగానే ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అనే నానుడి పుట్టింది. పాశ్చాత్య ప్రపంచంలో కూడా వానకు సంబంధించిన నానుడులు అనేకం వాడుకలో ఉన్నాయి. వానలు కురిసేటప్పుడు అప్పుడప్పుడు ఆకాశంలో అందాల హరివిల్లులు కనిపిస్తుంటాయి. వాననీటిలో సూర్యకాంతి ప్రతిఫలనం వల్ల ఏర్పడే అద్భుత దృశ్యం ఏడురంగుల హరివిల్లు. చాలా తక్కువసేపు మాత్రమే కనిపించి, కనువిందు చేస్తుంది. ‘మగువల సౌందర్యం, అడవిలోని ప్రతిధ్వని, ఆకాశంలోని హరివిల్లు అతి త్వరగానే అంతరించి పోతాయి’ అని ఇంగ్లిష్ సామెత. ఇది జీవితంలోని క్షణభంగురతకు అద్దం పడుతుంది. ‘దరిద్రుడు తల కడిగితే వడగళ్ల వాన’అని మనకో సామెత ఉంది. ఇంచుమించు ఇలాంటి సామెతే ఒకటి ఇంగ్లిష్‌లోనూ ఉంది. అది: ‘నేను ఉప్పు అమ్మడానికి పోతే వాన కురుస్తుంది, పిండి అమ్మడానికి పోతే పెనుగాలి వీస్తుంది.’ జీవితంలో దురదృష్టం వెంటాడేటప్పుడు ప్రతికూల పరిస్థితులు అకాల వర్షంలాగానే ముంచుకొ స్తాయి. అయితే,‘దై ఫేట్ ఈజ్ ది కామన్ ఆఫ్ ఆల్/ ఇన్టు ఈచ్ లైఫ్ సమ్ రెయిన్ మస్ట్ ఫాల్’ అంటాడు అమెరికన్ కవి హెన్నీ వాడ్స్‌వర్త్ లాంగ్‌ఫెలో. అందరి తలరాతలూ ఒకేలా తగలడినప్పుడు, ప్రతి జీవితంలోనూ కాసింత వాన కురవాలనేది ఆయన ఆకాంక్ష పాపం. మనసుల్లో ఆశలు మొలకెత్తాలంటే, జీవితాల్లో కాసింత వాన కురవాల్సిందే కదా! -
నెలకావట్టే.. నేల చదునాయే! మేఘమా.. మరువకే!
నేలకొండపల్లి (ఖమ్మం): వానాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. వరుణుడి రాక కోసం రైతన్న ఆకాశం వైపు చూడక తప్పడం లేదు. ఇంకా పెద్ద వర్షం రాకపోదా.. అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజూ మేఘాలు ఊరిస్తున్నప్పటికీ చిరుజల్లులకే పరిమితమవుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తిస్థాయిలో విత్తనాలు విత్తేందుకు సరిపడా వర్షాలు కురవడం లేదు. రైతులు ఇప్పటికే ఏదో ఒక చోట దొరికిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. 60 మిల్లీ మీటర్ల వర్షపాతం వరకు రెండు, మూడు దఫాలు వర్షాలు కురిస్తేనే పూర్తిస్థాయిలో విత్తనాలు వేసుకునేందుకు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అదును అయ్యే వరకు విత్తనాలు వేయకపోవటమే మేలని పేర్కొంటున్నారు. తప్పని ఎదురుచూపులు.. సాధారణంగా వరుణుడు ముందస్తుగా కురిస్తే రోహిణిలో లేదంటే మృగశిర కార్తెలో వానాకాలం ప్రారంభమవుతుంది. సీజన్ ప్రారంభమై నెల రోజులవుతున్నా పాలేరు డివిజన్లో 10 శాతం విత్తనాలు కూడా విత్తుకోలేదు. దీంతో పెసర, మినుము విత్తుకోవటమే మేలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయినా కొందరు ధైర్యం చేసి విత్తనాలు విత్తుకోగా, మరికొందరు ఇళ్లలోనే పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. విత్తుకున్న విత్తనాలు సైతం ఇంకా మొలకెత్తలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తుకున్న వారు.., విత్తుకోవాల్సిన వారి చూపులు ఆకాశం వైపు చూడక తప్పడం లేదు. ఆగిన సబ్సిడీ పథకాలు.. గతంలో వ్యవసాయ యాంత్రీకరణ యంత్రలక్ష్మి పథకాలు కింద ట్రాక్టర్లు, యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, పిచికారీ యంత్రాలు తదితర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా వాటిని ఇవ్వకపోవడంతో రైతులు పూర్తి ధరలు చెల్లించి మార్కెట్లో కొనుగోలు చేసుకుంటున్నారు. నిధులు కోసం ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరు కావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు కూడా అందుబాటులో లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
గ్రీన్ చాలెంజ్ తరుణమిదే..ఎలాంటి మొక్కలు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: వానా కాలం సీజన్ మొదలైంది. గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటిన్నర జనాభాకు చేరువైన సిటీలో హరితం శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల 42 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతిఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణ వేత్తలు స్పష్టంచేస్తున్నారు. కాగా మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా..నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అంతగా దోహదం చేయలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హరితహారంలో ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రేటర్లో ఉన్న గ్రీన్‌బెల్ట్ 20 నుంచి 30 శాతానికి పెంచాలని స్పష్టంచేస్తున్నారు. లక్ష్యం చేరని హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 2016 నుంచి ఏటా హరితహారం చేపట్టారు. ఐదేళ్లుగా సుమారు మూడు కోట్ల మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి,కలబంద,క్రోటన్,పూల మొక్కల వంటి చిన్నమొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీప్రదేశాలు,చెరువులు,పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి,పర్యావరణ వేత్త హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి,ఆక్సీజన్ అందించేవి,కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. గ్రీన్‌చాలెంజ్ ఇలా... ► నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. ► తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ► సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ►నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. ► నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. -
రంగురంగుల దుస్తులు.. చినుకులతో కలిసి చిందేయ్యండి
వసంతమాసంలోనే పువ్వుల సింగారం గురించి మాట్లాడుకుంటాం. కానీ, చినుకు సందడి చేసే వర్షాకాలంలోనూ పువ్వుల సందడి ఎంత అందాన్నిస్తుందో మాటల్లో చెప్పలేం.పచ్చని ప్రకృతి చినుకు స్నానం చేస్తుంటే.. పూల సింగారం విహారానికి వస్తే..మబ్బు పట్టిన నింగి నుంచి నేలకు మెరుపు దిగివచ్చినట్టే. మీదైన ముద్ర తెలియాలంటే ఈ కాలం రకరకాల ప్రింట్ల దుస్తులను ఎంపిక చేయండి. రంగురంగులుగా చినుకులతో కలిసి చిందేయ్యండి. రంగుల వర్ణాలు వేడి నుండి చినుకులు ఉపశమనం ఇచ్చేదే ఈ సమయం. కాకపోతే చెత్త రోడ్లు, తడిపాదాలు, ట్రాఫిక్ మనకు రకరకాల పరీక్షలను తీసుకువస్తాయి. కాబట్టి, రుతుపవనాలు మీ స్టైల్‌ను ఎలా తగ్గించబోతున్నాయనే దాని గురించి చింతిస్తున్నట్లయితే ముందుగా, రెయిన్ గేర్ ఎంపిక బెస్ట్ ఎంపిక అంటారు ఇండియన్ డిజైనర్ మసాబా గుప్త. ‘ఈ కాలం ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, పసుపు, గులాబీ, నీలం రంగులు మబ్బుగా ఉండే వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సరైనవి. లైక్రా లేదా పాలిస్టర్ వంటి లైట్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్లను ధరించడం మంచిది. ఎందుకంటే అవి ముడతలు పడకుండానూ, సులభంగా పొడిగా మారడానికి ఉపయోగపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు బిగుతుగా ఉండే ఏదైనా బాటమ్‌ను ఎంచుకోండి. కానీ డెనిమ్, కాడ్రాయ్ల నుండి దూరంగా ఉండండి. పలాజోలు కూడా బాటమ్‌గా ఈ కాలం బాగుంటాయి. ►ఈ కాలం లెదర్ చెప్పులు, బ్యాగులకు దూరంగా ఉండండి. బదులుగా, రంగురంగుల బాలేరినా ఫ్లాట్లు, జెల్లీ షూస్, ఫ్లిఫాప్స్, ఫ్లోటర్లు లేదా క్రోక్స్‌ను ఎంచుకోండి. వాటర్‌ప్రూఫ్, టోట్తో చేసిన అధునాతన బ్యాగ్‌లు వాడటం మేలు. ►తేమతో కూడిన వాతావరణం కారణంగా జుట్టు చిట్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి, చక్కని బన్ను లేదా పోనీ టైల్ మంచిది. హాట్ బ్లో డ్రైయింగ్, కర్లింగ్ లేదా స్ట్రెయిటెనింగ్ ఐరన్‌లతో కూడిన హెయిర్స్టైల్స్కు ఈ కాలం దూరంగా ఉండటమే మంచిది. ►మేకప్ విషయానికి వస్తే చాలా తక్కువ చేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ మస్కారాకు బదులు కొద్దిగా పెట్రోలియమ్ జెల్లీతో మీ కనురెప్పలను దిద్దుకోవచ్చు. ముఖం కోసం బ్రౌన్, న్యూడ్ లేదా కాఫీ రంగులో క్లీన్ టోన్లను ఉపయోగించాలి. పీచ్ సూపర్ మ్యాట్ లిప్స్టిక్స్ బాగుంటాయి. ముఖ్యంగా, శుభ్రం చేయడానికి కష్టంగా ఉండే మేకప్‌కు దూరంగా ఉండాలి’ అని తెలియజేస్తున్నారు. కాంతిమంతం ►అబ్స్ట్రాక్ట్ ప్రింట్లు ఉన్న సిల్క్ డ్రెస్సులు, చీరలు ఈ కాలాన్ని మరింత ఉత్తేజితంగా మార్చేస్తాయి. ►చిన్నపాటి గెట్ టుగెదర్ పార్టీలకు ప్రింటెడ్ ఆర్గంజా వంటివి బాగుంటాయి. అయితే, వర్షంలో తడిస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కనుక ఇబ్బందిగా ఉంటుంది. కానీ, డల్‌గా ఉన్న వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేసే సుగుణం ఈ ప్రింట్లకు ఉంటుంది. ►ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ .. సౌకర్యంగా ఉండే ఏ డ్రెస్ అయినా ఏదో ఒక చిన్న ప్రింట్ అయినా ఉన్నవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. తేలికైన సిల్క్ ప్రింట్లు ‘వర్షాకాల వివాహాలకు పూల ప్రింట్లు సరైనవి. తేలికగా ఉండే షిమ్మర్ బ్లైజ్, సిల్క్ లెహంగాకు పెద్ద పెద్ద బార్డర్లు లుక్‌కి గ్లామరస్ టచ్‌ని జోడిస్తాయి. అంతేకాదు రంగుల ఎంపికలలో పీచ్, పగడపు రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు చిన్న పొట్లీ వంటి ఆభరణాలు మరింత అందాన్నిస్తాయి’ అంటారు ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి. -
Hair Care: వర్షంలో తడిసినపుడు జుట్టుకు ఆయిల్ పెడితే!
రాబోయేది వర్షాల సీజన్. ఈ కాలంలో కురులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలి. వర్షంలో తడిచినా వెంటనే తలస్నానం చేసి జుట్టుని ఆరబెట్టాలి. జుట్టుకు ఆయిల్ పట్టించి గంటతరువాతే తలస్నానం చేయాలి. అదే విధంగా... వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి. నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో మరో నాలుగు టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి కలిపి జుట్టు కుదళ్ల నుంచి చివర్లకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇవన్నీ పాటించడం ద్వారా వర్షాకాలంలోనూ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చదవండి👉🏾: Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
సాక్షి కార్టూన్: 11-06-2022
-
వడ్లకు ర'వాన' భయం
సాక్షి, హైదరాబాద్: రోహిణి కార్తె ముగిసి రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయం సమీపించినా.. రాష్ట్రంలో ఇంకా యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. సీజన్ మొదలైనప్పటి నుంచి తప్పుల తడక ప్రణాళికలతో సాగిన పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు వచి్చనా గాడిన పడలేదు. దీంతో ఇప్పటికీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం వరి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. రెండు మూడుసార్లు కురిసిన అకాల వర్షాలకు నానిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడ్డ రైతన్నలు.. రుతుపవనాల ప్రభావంతో కురిసే భారీ వర్షాలను తలచుకుని భయాందోళనలకు గురవుతున్నారు. కొత్త గన్నీ బ్యాగులు లేకపోయినా, పాత బ్యాగులతోనే యాసంగి కథ నడిపించిన పౌరసరఫరా శాఖ.. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు, మిల్లుల నుంచి గోడౌన్లకు రవాణా సౌకర్యాన్ని కలి్పంచేందుకు అపసోపాలు పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. మరోవైపు మిల్లులూ ఫుల్లయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు తన వడ్లు కొనుగోలు చేయడం లేదని ఏకంగా ఐకేపీ సెంటర్ సీఈవోపైనే పెట్రోల్‌తో దాడి చేయగా, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాస్తారోకోలు జరుగుతున్నాయి. పది రోజుల్లో కష్టమేనా? రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 43.70 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 7.77 లక్షల రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన 6,584 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయిన 3,252 కేంద్రాలను ఇప్పటికే మూసేశారు. మరో పదిరోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కానీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లోనే కుప్పలుగా పడి ఉంది. కిందటి యాసంగిలో ఇప్పటికే 79 ఎల్ఎంటీ ధాన్యాన్ని కొనుగోలు చేయగా... ఈసారి అందులో దాదాపుగా సగానికే పరిమితం కావడం, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడడం అధికారుల అలసత్వాన్ని చాటుతోంది. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పట్లో కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రవాణా లేక ఇబ్బందులు సిద్దిపేట జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించారు. కాంట్రాక్టర్లు వాహనాలు సరిగా ఏర్పాటు చేయక పోవడంతో పాటు రైస్ మిల్లుల్లో స్థలం లేక పోవడంతో అన్ లోడ్ ఆలస్యం అవుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు జోకుతున్నా, మిల్లర్ల వద్ద దించుకోవడం సమస్యగా మారింది. మిల్లులకు వెళ్లిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి అన్లోడింగ్ కోసం వేచి చూసే పరిస్థితి ఇప్పటికీ సిద్దిపేట, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఉంది. మరోవైపు కాంట్రాక్టు కుదుర్చుకున్న లారీలు కూడా సమయానికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులు సొంతంగా ట్రాక్టర్లు సమకూర్చుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపించినా తీసుకోవడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లో 12 ఎల్ఎంటీ వరకు ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు దాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదు. మిల్లుల్లోనే వానాకాలం ధాన్యం గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన సుమారు 30 ఎల్ఎంటీల వరకు ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) కోసం రైస్ మిల్లుల్లోనే ఉంది. దీనికి తోడు ఇప్పటివరకు 43 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లుల్లో జాగ లేక ప్రైవేటు గోడౌన్లలో కూడా ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఈ పరిస్థితుల్లోనే ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ధాన్యాన్ని పంపించినా, దించుకోకపోవడంతో ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం) లో నమోదు కావడం లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించినా రికార్డులకెక్కడం లేదు. లారీలు, ట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఉంటే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవలసిన పౌరసరఫరాల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మిల్లుల్లో ఖాళీ లేకనే ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వడ్ల పైసల్ పడుతలెవ్వు .. సాధారణంగా ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము వచ్చి చేరుతుంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లిన వెంటనే ఓపీఎంఎస్ ద్వారా రైతు విక్రయించిన ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లోకి చేరతాయి. తదనుగుణంగా జిల్లా ఖజానా నుంచి రైతు బ్యాంకుల్లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ఈసారి రైతులకు ధాన్యం డబ్బులు ఆలస్యం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఓపీఎంఎస్లో రైతు వివరాలు చేరకపోవడమే. ఇప్పటివరకు 7.77 లక్షల మంది రైతులు రూ.8,553.79 కోట్ల విలువైన ధాన్యం విక్రయించగా, ఓపీఎంఎస్‌లోకి నమోదైన రైతుల సంఖ్య కేవలం 5.26 లక్షలే. వారికి చెల్లించాల్సిన మొత్తం 5,789.84 కోట్లు. కానీ 3.47 లక్షల మందికి మాత్రమే రూ.5,233.18 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇంకా ఓపీఎంఎస్ బ్యాలెన్స్ రూ. 556.66 కోట్లు ఉండగా, ఓపీఎంఎస్‌లోకి ఎంటర్ కాని రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,320.61 కోట్లుగా ఉంది. కొనుగోళ్ల తాజా స్థితి ఇదీ... ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు: 6,584 కొనుగోళ్లు ముగిసి మూతపడ్డ కేంద్రాలు: 3,252 ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం : 43.70 ఎల్ఎంటీ ఇంకా మార్కెట్‌కు రానున్న ధాన్యం (అంచనా) :12 ఎల్ఎంటీ ధాన్యం విక్రయించిన రైతులు : 7,77,013 విక్రయించిన ధాన్యం విలువ : రూ. 8,553.79 కోట్లు ఓపీఎంఎస్ అయి రైతుల ఖాతాల్లోకి చేరిన మొత్తం : రూ. 5,233.18 కోట్లు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం అంకిరెడ్డి పల్లిలోని కొనుగోలు కేంద్రంలో రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్ల బస్తాలను మిల్లులకు చేరవేసేందుకు లారీలు, ట్రాక్టర్లను అధికారులు సమకూర్చకపోవడంతో 15 రోజులుగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులు అంకిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రోడ్డుపై రాస్తారోకో జరిపారు. వీరానగర్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటింది. ఇప్పటికీ బస్తాలు ఇక్కడే ఉన్నాయి. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున భయంగా ఉంది. రోజూ ఇక్కడే పడుకోవాల్సి వస్తోంది. – మన్నె స్వామి, రైతు, వీరానగర్, సిద్దిపేట జిల్లా -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సమీపిస్తున్న నేపథ్యం లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ ఎంలతో నెల వారీ సమీక్షను మంత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల మందులను సరఫరా చేస్తుంది కాబట్టి ఎక్కడా మందులు లేవనే మాట రావొద్దని స్పష్టం చేశారు. ఈ– ఔషధి ద్వారానే అన్ని రకాల మందుల పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్సీడీ స్క్రీనింగ్‌ను ఈ నెల చివరికల్లా వంద శాతం పూర్తి చేయాలన్నారు. రోగ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మం దుల కిట్లను వెంటనే అందజేయాలని సూచించారు. పీహెచ్‌సీలు, ప్రభుత్వా సుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలని చెప్పారు. ఎనీమియా ఉన్న గర్భి ణులను గుర్తించి క్రమం తప్పకుండా మందులు అందించాలని ఆదేశించారు. పుట్టిన బిడ్డలకు మొదటి గంటలోనే తల్లి పాలు అందేలా చూడాలన్నారు. గర్భిణులను ప్రసవాలు, తనిఖీల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొస్తున్న ఆశ కార్యకర్తల కోసం ప్రత్యేక గది, కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఉన్నతాధికారులు జిల్లాల పర్యటన చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా ఆ పనులు పూర్తి చేయకుంటే ఉద్యోగం ఊస్టే!
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వేటు తప్పదని హెచ్చరించడంతో ఆమేరకు చర్యలకూ ప్రభుత్వం వెనుకాడబోదని భావిస్తున్న ఉన్నతాధికారులు.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సంబంధిత అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్‌హోళ్ల వంటి ప్రాంతాలతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌ల మార్గాల్లో సైతం గోతులుండరాదని మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ మెమో జారీ చేసిన నేపథ్యంలో.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రాణాపాయం జరిగితే ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తుందని పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. నాలా సేఫ్టీలో భాగంగా చేపట్టాల్సిన పనులతో పాటు ఇతర ప్రాంతాల్లోని పనుల్ని సైతం వెంటనే పూర్తిచేయాలని, పూర్తయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో బారికేడింగ్స్తో పాటు ఇతరత్రా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారుల టీమ్స్‌కు నాలుగైదు రోజుల క్రితమే సర్క్యులర్లు జారీ చేశారు. సేఫ్టీ ఆడిట్లో భాగంగా పైపైనే చూస్తే సరిపోదని తాము సర్వేచేయాల్సిన ప్రాంతాల్లో అన్ని ప్రదేశాలకూ నడిచి వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితులు క్షుణ్నంగా పరిశీలించి, రక్షణ ఏర్పాట్లు నూరు శాతం ఉన్నట్లు నిర్ధారించుకొని ధ్రువీకరించాలని పేర్కొన్నారు. ఇవీ బాధ్యతలు.. ►మాన్సూన్ సేఫ్టీ ఆడిట్లో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన బృందాల్లో నియమించిన డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగంలోని ఎస్ఈ, ఈఈలు, డీఈఈలు, ఏఈలు, టౌన్‌ప్లానింగ్ విభాగంలోని సీపీ, జోనల్ ఏసీపీలు, సర్కిల్స్థాయిల్లోని ఏసీపీలు, ఎస్ఓలు, శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఏఎంఓహెచ్‌లు, డిప్యూటీఈఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు కిందివిధంగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ►తాము సర్వే చేయాల్సిన ప్రాంతంలోని ప్రతి రోడ్డు, లేన్, బైలేన్లు, డ్రెయిన్ల వెంబడి నడచుకుంటూ వెళ్లి చూడాలి. వాహనాల్లో అయితే సరిగ్గా తెలియదని నడవాలని పేర్కొన్నారు. గుంతలు, రోడ్కటింగ్లు ఉంటే సంబంధిత ఈఈ దృష్టికి తెచ్చి వెంటనే పూడ్పించాలి. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న అన్ని నాలాలకు ఫెన్సింగ్ ఉండాలి. అంతకంటేతక్కువ వెడల్పున్న నాలాలకు పైకప్పులుండాలి. అన్ని క్యాచ్పిట్లపై మూతలుండాలి. మూతలకు పగుళ్లు ఉండరాదు. అలాంటివాటిని మార్చాలి. ►అన్ని కల్వర్టుల వద్ద రక్షణ కంచెలుండాలి.అవసరమైన అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులుండాలి. ఈ పనులు పూర్తి చేశాక అన్ని ప్రాంతాల్లో నూరు శాతం సేఫ్టీ ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారి, డిప్యూటీ కమిషనర్, ఈఈలు ధ్రువీకరించాలి. నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించే పరిస్థితి లేదని, తీవ్రంగా పరిగణించడంతో పాటు తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని, మరణాలు సంభవిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయనున్నట్లు తీవ్రంగా హెచ్చరించారు. -
నాలాల అభివృద్ధిపై జెడ్సీ సమీక్ష
బంజారాహిల్స్: వర్షాకాలం ప్రారంభం అయ్యేలోగా నాలాల రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ సూచించారు. ఆదివారం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన సంబంధిత ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన నాలాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి అన్నదానిపై సంబంధిత ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. సమీక్షలో పాల్గొన్న ఖైరతాబాద్ జెడ్సీ రవికిరణ్ -
వర్షాకాలం: ఆహారాన్ని సరిగ్గా ఉడికిస్తున్నారా లేదా!
ఋతువులు మారే కొద్దీ మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాకాలంలో ఐతే ఇక చెప్పక్కరలేదు. షరా మామూలే! అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి. మరెలాగని అనుకుంటున్నారా? వెరీ సింపుల్!! మన రక్షణా వ్యవస్థ పటిష్టంగా ఉంటేచాలు. ప్రముఖ నూట్రీషనిస్ట్ రాధికా కార్లే సూచించిన ఈ టిప్స్ పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి.. విటమన్ ‘సి’ అధికంగా ఉండే ఆహారం రెడ్ బెల్ పెప్పర్ లేదా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్, బొప్పాయి, నిమ్మ, టమాటాలలో విటమన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే మీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. బయట తినకపోవడం మంచిది ఇంటి వంటలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. సాధ్యమైనంత వరకు హోటళ్లు, రోడ్డు పక్క దొరికే చిరుతిండ్లు తినకపోవడం మంచిది. జొన్న లేదా అమరంత్ వంటి చిరు ధాన్యాల్లో కూడా ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. కూరగాయల ముక్కలు వేసి కిచిడీలా తయారు చేసుకుని తింటే రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. సుగంధ ద్రవ్యాలు పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వంటి మసాలా దినుసులు కూడా మీ ఇమ్యునిటీ పుంజుకునేలా చేస్తాయి. వంటకాల్లో ఈ మసాలా దినుసుల వాడకం ఉండేలా చూసుకోంది. అలాగే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన టీ లేదా నిమ్మ రసంలో కొన్ని అల్లం ముక్కలు చేర్చి ఉదయాన్నే తాగితే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. తగు మోతాదులో నీరు త్రాగాలి కాలాలతో సంబంధం లేకుండా అన్ని ఋతువుల్లో తప్పనిసరిగా సరిపడినంత నీరు త్రాగాలి. నీళ్లతోపాటు జ్యూస్‌లు, ఔషధ మూలికలతో తయారుచేసిన కషాయాలు తరచూ తాగుతూ ఉండాలి. ఆహారాన్ని సరిగ్గా ఉడికించాలి మార్కెట్ నుంచి కొని తెచ్చుకునే తాజా ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా కూడా వెన్నంటే ఉంటుంది. కాబట్టి తగినంత వేడి మీద ఆహారాన్ని ఉడికించాలి. అలాగే తొక్క ఒలిచి తినే పండ్లు అంటే.. అరటి, మామిడి, పుచ్చకాయ, ఆరెంజ్, లీచీ.. వంటి ఇతర ఫలాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఇమ్యునిటీ పుంజుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మేకప్‌తో దాచేసినా ఇబ్బంది తప్పదు.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్! -
జ్ఞాపకాల వాన
రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలను చీల్చుకుంటూ, భగ భగమని మండే గ్రీష్మతాపాన్ని వెక్కిరిస్తూ, నల్లటి మబ్బులు ఆకాశమంతా పహారా కాసే దృశ్యం ఓ అద్భుతం. ఎండవేడికి ఎడారిలా మారిన నేలతల్లిని ఆకాశం చూరు నుండి జారిపడ్డ వాన నీటి బొట్టు ముద్దాడే వేళ... గతజన్మను గుర్తు చేసే మట్టి పరిమళం.. ఎండాకాలపు కష్టాలన్నింటినుండీ విముక్తం చేసే ప్రకృతి మంత్రం. ఆకాశపు జల్లెడ నుండి కురిసే వర్షపు నీటి ధారలు చూస్తుండగానే పిల్లకాలువలై, ఏటి వాగులై, నదీ నదాలై... పరుగులు పెట్టే చల్లదనపు ప్రవాహం వర్షాకాలపు తొలి సంతకం. వాన చినుకు పడితే చాలు... ఈ రోజు బడికి సెలవిచ్చే స్తారన్న ఆనందాన్ని అనుభవించని బాల్యం ఉంటుందా అసలు? మాస్టార్ ఇచ్చిన హోమ్ వర్క్ చేయని రోజున ఈ ఒక్కరోజుకు వర్షం పడితే బాగుండునని దేవుడికి కోటి మొక్కులు మొక్కే చిన్నారుల ఆకాంక్షలు మేఘాలూ వింటాయి. విని చల్లటి వానతో మురిపించి బడికి సెల విప్పించిన వానాకాలపు చదువురోజులు అనుభవంలోకి రానివారెంతమంది? బడికెళ్లేటపుడు వాన లేకపోయినా, బడికెళ్లిన వెంటనే తరగతి గదిలో ఏ అప్పారావు మాస్టారో సుమతీ శతకపు పద్యాన్ని వల్లెవేయించేటపుడు పెంకుటింటి బడి పైకప్పుపై అమాంతం పెద్ద వాన పడి... పిల్లల పుస్తకాలపై వాన నీటి బొట్లు టపటపా రాలి పడుతుంటే.. అవే ముత్యాలుగా ఏరుకుని సెలవు పిలుపు ప్రకటించే బడిగంట కోసం ఆత్రుతగా ఎదురు చూసే చిన్ని చెవుల్లో ఇక పద్యాలు వినపడని హాయిని అందరూ చూసిన వాళ్లమే కదా. సెలవిచ్చి ఇంటికి రాగానే ఇంటి చూరు నుంచి నయాగరా జలపాతాల్లా జారిపడే వర్షపు నీటి చప్పుడుకు లయబద్ధంగా దానికి కోరస్ పాడే కప్పల బెక బెక కచేరీలను ఆలకిస్తూ... లోకాన్ని మర్చిపోవడం ఎంత గొప్ప జ్ఞాపకం. వాన నీటి కాలువలో... కాగితపు పడవలు వేసి అవి వేగంగా దూసుకుపోతూ ఉంటే... టైటానిక్ షిప్ యజమానుల వలే గర్వంగా నవ్వుకునే బాల్యం ఆనందాన్ని ఎవరైనా కొలవగలరా అసలు? అలా గమ్యం తెలియని తీరానికి వెళ్లే పడవ కాస్తా ఏ బుల్లి సుడిగుండంలోనో చిక్కుకుని మునిగి పోతే... మనసంతా బాధతో నిండిపోయి... ఏడుపొచ్చేసి కంటి చూరు నుంచి జారిపడే కన్నీటి బొట్లు బుగ్గలను ఓదారుస్తూ కిందకి జారిపోయే తియ్యటి బాధలు మళ్లీ మళ్లీ వస్తే బాగుండునని అనుకునే ఉంటారు కదా. వర్షం తగ్గాక ఇంటి కెదురుగా మోకాల్లోతు నీటిలో ఆడుతూ పాడుతూ తిరగడం ఎంత ఆనందం? ఆ తర్వాత ఇంట్లో అమ్మో నాన్నో చూసి వీపు విమానం మోత మోగిస్తే... ఉక్రోషంతోనూ... తమ రాజ్యం నుంచి తమని బలవంతంగా గెంటివేసిన శత్రుసైన్యంలా అమ్మానాన్నలపై మనసులోనే కోపంతో రగిలిపోయే ఆక్రోశం గుర్తొస్తే ఇపుడు నవ్వొస్తుంది కదూ. వానలో తడిసి ముదై్ద తల సరిగ్గా తుడుచుకోక ముతక వాసన వేయడం.. తడిసిన తల సరదాగా జలుబు తెచ్చి పెట్టడం.. ముక్కు కారుతూ ఉంటే ఎగపీల్పులతో... వర్షంతో పోటీ పడ్డం పిల్లలకు ఓ ఆటే. కానీ పెద్దాళ్లకు మాత్రం... వెధవా చెబితే విన్నావు కాదు... అంటూ ఓ టెంకిజెల్ల ఇచ్చుకుని... బల వంతంగా పొగలు కక్కే మిరియాల కషాయంతో పనిష్ మెంట్ ఇచ్చే చేదు జ్ఞాపకాలకూ కొదవుండదు. కషాయం తాగించడం కోసమే బెల్లం ముక్క తాయిలాన్నీ చేతిలో పెట్టుకునే పెద్దాళ్ల గడుసుతనం... ఆ బెల్లం ముక్క తీపిని ఊహించుకుంటూనే కారపు కషాయాన్ని అమాంతం గుటకేసి తాగేసే బాల్యం... ఇంటింటా ఓ అద్భుత చిత్రమే. ఎక్కడో శత్రు సేనలు గొడవ పడుతున్నట్లుగా వర్షా కాలంలో ఉరుములు చేసే బీభత్సం... మెరుపులు సృష్టించే భయానక వాతావరణం... కాసేపు భయపెట్టినా.. వాన చిను కులు పడుతుండగానే మళ్లీ ప్రత్యక్షమయ్యే ఎండను వాన ముద్దాడినపుడు ఆకాశంపై ఈ మూల నుండి ఆ మూలకి వయ్యారంగా వంగి మెరిసే ఏడురంగుల ఇంద్రధనుస్సు ఏ దేవుడు గీసిన రంగుల బొమ్మో? లేదా ఏ చిత్రకారుడు నేలపై కోపంతో ఆకాశంపై గీసిన చిత్రకళాఖండమో? తేల్చుకోవడం కష్టమే. ఆకుపచ్చ దనాన్నీ, హాయిదనాన్నీ అందరికీ అందించే ప్రకృతి ఖజానా ...వాన. వానాకాలపు జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా మధురంగానే ఉంటాయి. ప్రతీ వాన చుక్కకీ ఓ అనుభవం. నైరుతీ చుట్టాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హుషారుగా తిరిగేస్తున్నారు. వానాకాలం చల్లగా వచ్చేసింది. దాన్ని సాదరంగా స్వాగతించి... ఈ వానాకాలమంతా ఎన్నో జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారనే ఈ పాత జ్ఞాపకాల వానను మీ ముందుంచింది. – సి.ఎన్.ఎస్. యాజులు -
వయ్యారాలు పోతున్న నయగారాలను చూడాల్సిందే
ప్రకృతి ఒడిలో పాలపొంగులు.. ఎత్తైనకొండలు.. వాటిపైనుంచి జాలువారే పాల లాంటి నీళ్లు.. నిశ్శబ్దంగా ఉండే చిట్టడవిలో గలగల పారే సెలయేరులు.. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జోరందుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలపాతాలు.. వెరసి నాలుగు జిల్లాల ప్రజలను కనువిందు చేస్తున్నాయి. ఒకవైపు జోరువానలు.. రాళ్ల మధ్యలోంచి.. గుట్టలపై నుంచి వయ్యారాలు ఒలుకుతూ దూకుతున్న జలపాతాలు నయగారాలను తలపిస్తున్నాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. చేరుకోవడం కష్టమైనా.. ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పర్యాటకంగా పేరుగాంచకపోయినా.. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయీ జలపాతాలు.. ఎలా వెళ్లాలనే వివరాలు మీకోసం.. అద్భుతం.. పాండవలొంక పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట సమీపంలో పాండవలొంక జలపాతం ఉంటుంది. ఇక్కడ బండరాళ్లు పల్లపరుపుగా ఉండి వర్షం పడినప్పుడు నీరు ఏటవాలుగా అంచెలంచెలుగ కిందకి జారే అపురూప దృశ్యాలు ఆకట్టుకుంటాయి. పెద్దపల్లి నుంచి అడవి శ్రీరాంపూర్, పారుపెల్లి, ముత్తారం వెళ్లే బస్సులు, ఆటోల్లో కూనారం వెళ్లే దారిలో వెన్నంపల్లి మీదుగా జాఫర్‌ఖాన్‌పేటకు చేరుకోవచ్చు. అక్కడి ప్రభుత్వపాఠశాల పక్కనుంచి ఉన్న రోడ్డుపై మూడుకిలో మీటర్లు ప్రయాణిస్తే శ్రీ రామపాదసరోవర్ (చెరువు) వరకు వెళ్లొచ్చు. రామునిపాదాలు, ఆంజనేయస్వామి గుడి, నాగదేవతలను దర్శించుకుంటూ మూడుకిలోమీటర్ల దూరంలోని పాండవలంక జలపాతాన్ని చేరుకోవచ్చు. ప్రయాణం కొంచెం కష్టమైనా.. ఇక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకుంటాయి. లొంక రామన్న జలపాతం కోరుట్ల: కథలాపూర్ మండలం పోతారం గ్రామశివారులోని లొంక రామన్న జలపాతం ఈ ప్రాంత ప్రజలను అలరిస్తోంది. మానాల గుట్టల నుంచి వచ్చే నీరు లొంక రామన్న శివాలయం పక్కనే ఉన్న రాళ్ల గుట్టలపై నుంచి జాలువారుతోంది. ఈ ప్రాంతానికి వర్షాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కోరుట్ల నుంచి వేములవాడ రోడ్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కథలాపూర్ మండలకేంద్రానికి చేరాలి. ఇప్పపల్లి గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల వెళితే పోతారం వస్తుంది. పోతారం నుంచి కిలోమీటర్ దూరం వెళితే లొంకరామన్న జలపాతం చేరుకోవచ్చు. కోరుట్ల నుంచి 28 కిలోమీటర్ల దూరం. సిరిసిల్ల జిల్లావాసులు రుద్రంగి మీదుగా ఇప్పపల్లికి చేరుకుని పోతారం మీదుగా లొంక రామన్నను చేరుకోవచ్చు. పోతారం గ్రామం నుంచి కిలోమీటర్ రోడ్ తప్ప మిగతా అంతా బీటీ రోడ్డు ఉంది. రాయికల్ జలపాతం సైదాపూర్(హుస్నాబాద్): సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలతో జాలువారుతోంది. ఎత్తులో ఉన్న 18 గుట్టల పైనుంచి పడే వర్షపు నీటితో ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. రాయికల్, ఆకునూర్, పెరుకపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న నీలగిరి గొలుసుకట్టు గుట్టల నుంచి నీరు పారుతోంది. హుజూరాబాద్, హుస్నాబాద్, ముల్కనూరు మీదుగా జలపాత సందర్శనకు రోడ్డుమార్గం ఉంది. సైదాపూర్‌కు 10 కిలోవీుటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. మరో పొచ్చెర..‘గుండం’ కోరుట్ల: బోథ్సమీపంలోని ‘పొచ్చెర’కు తీసిపోని జలపాతం మల్లాపూర్– రాయికల్ సరిహద్దుల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో ‘వేంపల్లి గుండం’ ఉంది. గోదావరి మూడు పాయలుగా చీలి కొంత దూరం పయనించి మళ్లీ రెండు పాయలుగా మారి ‘వేంపల్లి గుండం’ వద్ద కలుస్తుంది. ఇక్కడ ఉన్న పెద్ద బండరాళ్ల మీదుగా గోదావరి జాలువారి జలపాతంగా మారింది. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. కాగా.. వెళ్లడం కాస్త కష్టం. కోరుట్లనుంచి అయిలాపూర్ మీదుగా 25 కిలోమీటర్లు పయనిస్తే గొర్రెపల్లి గ్రామం వస్తుంది. గొర్రెపల్లి స్తూపం నుంచి ఎడమవైపు వెళితే.. వేంపల్లి– వెంకట్రావ్పేట వస్తుంది. జగన్నాథ్‌పూర్ రూట్లో 8కిలోవీుటర్లు వెళ్లిన తరువాత ఎడమవైపు ఉన్న చిన్నపాటి అడవిలో అర కిలోమీటర్ దూరం మోటార్‌సైకిల్‌పై వెళితే.. వేంపల్లి గుండం జలపాతం చేరుకోవచ్చు.అరకిలోవీుటర్ అటవీప్రాంతం తప్ప మిగతా చక్కని బీటీ రోడ్డు ఉంది. అందాల గౌరీగుండాలు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి– మంథని మార్గమధ్యంలో ఉన్న సబ్బితం పంచాయతీ పరిధిలో గౌరీగుండాలు జలపాతం ఉంది. వర్షం కురిసినపుడు ధారగా వచ్చే నీటిలో సరదాగ గడిపేందుకు పర్యాటకులు వస్తుంటారు. కరోనా వైరస్వ్యాప్తి కారణంగా ఈ సారి పర్యాటకులు రావొద్దంటూ పంచాయతీ పాలకమండలి విజ్ఞప్తి చేసింది. పెద్దపల్లినుంచి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సబ్బితం మీదుగా యైటింక్లయిన్‌కాలనీ వెళ్లే బస్సులో చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చేవారు పెద్దపల్లి నుంచి మంథని మార్గంలో జలపాతానికి చేరుకోవచ్చు. -
జీహెచ్ఎంసీ అధికారులు సిగ్గుపడాలి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం వచ్చినా నగర వ్యాప్తంగా రోడ్ల మీద ఉండే గుంతలు పూడ్చివేయకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టు మండిపడింది. ఇద్దరు సీనియర్ సిటిజన్లు గత కొన్నేళ్లుగా వారికి వచ్చే పెన్షన్ డబ్బుతో ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను స్వచ్ఛందంగా పూడ్చుతున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిగ్గుపడాలని వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ అధికారుల జీతాల్లో కొంత మొత్తాన్ని తిలక్ దంపతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ పరిధిలో గుంతల పూడ్చివేతకు ఏం ప్రణాళికలు రూపొందించారు? ఎన్ని గుంతలను గుర్తించారు? వాటిలో ఎన్నింటిని పూడ్చివేశారు? తదితర వివరాలతో జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జోన్ల డిప్యూటీ కమిషనర్లు, సూపరిం టెండెంట్ ఇంజనీర్లు ఈ నెల 20లోగా వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి గంగాధర్ తిలక్ దంపతులు వారికి వచ్చే పెన్షన్ డబ్బులతో రోడ్లమీద గుంతలను పూడ్చుతున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. నగరంలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తిలక్ దంపతులు గుర్తించి వారి కారులో వెళ్లి ఆ గుంతలను పూడుస్తున్నప్పుడు.. జీహెచ్ఎంసీ అధికారులకు ఆ గుంతలు ఎందుకు కనిపించడం లేదని ధర్మాసనం నిలదీసింది. బడ్జెట్ తగ్గించాలని ఆదేశించాలా ? అధికారులు కష్టపడి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారని, వర్షాలతోపాటు భారీగా వాహ నాలు తిరుగుతుండడంతో తరచుగా గుం తలు ఏర్పడుతున్నాయని జీహెచ్ఎంసీ తరఫున హాజరైన న్యాయవాది పాశం కృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘గుంతలు ఏర్పడడానికి వర్షాలను ఎందుకు నిందిస్తారు? వాహనాలు తిరిగితే గుంతలు పడతాయని భావిస్తే, అవి తిరగకుండా నిషేధిస్తారా ? అధికారులు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. గుంతలతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఊరుకోవాలా? చేయాల్సిన పనిచేయనప్పుడు జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించాలని ఆదేశించాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఊపిరి పీల్చుకునే లోపే.. దోమల దాడి మొదలైంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్ ఉద్ధృతి మిగిల్చిన విషాదాన్ని సిటిజన్లు ఇంకా పూర్తిగా మరిచిపోకముందే.. డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న సీజనల్ వ్యాధులు గ్రేటర్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరుగుతోంది. కోవిడ్ కారణంగా ప్రభుత్వం గత ఏడాది ఇళ్లు, వీధులు, కాలనీలను శానిటైజ్ చేసింది. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ కూడా చేసింది. ఫలితంగా డెంగీ, మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం దోమలు విజృంభిస్తున్నాయి. సిటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరి పీల్చుకునే లోపే.. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు కూడా ఎత్తేసింది. ఏప్రిల్, మే నెలల్లో రోజుకు సగటున 1500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సగటున కేసులు 200 మించి నమోదు కావడం లేదు. వైరస్ ఉద్ధృతి తగ్గిందని అంతా ఊపిరి పీల్చుకునే లోపే.. డెంగీ, మలేరియా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు చాపకిందనీరులా విస్తరిస్తున్నాయి. ఇలా దాడి.. మలేరియాకు ‘ఆడ అనాఫిలన్’ దోమ కారణం. ఇది మురుగునీటిలో ఎక్కువగా పెరుగుతోంది. ఈ మలేరియా జ్వరాలు రెండు రకాలు కాగా, వీటిలో ఒకటి ప్లాప్మోడియం వైవాక్స్(పీవీ)కాగా, రెండోది ప్లాస్మోడియం పాల్సీఫారం (పీఎఫ్). రెండోది అత్యంత ప్రమాదకరం. నగరంలో ఏటా పాల్సీఫారం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చలిజ్వరం, తలనొప్పి, వాంతులతో పాటు తీవ్రమైన నీరసం ఉంటుంది. సాయంత్రం వేళల్లో జ్వరం ఎక్కువగా ఉంటుంది. చికిత్సను నిర్లక్ష్యం చేస్తే.. కాలేయం, మెదడు, మూత్ర పిండాలు దెబ్బతిని వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఈడిస్ఈజిప్టే (టైగర్) దోమ కుట్టడంతో డెంగీ సోకుతుంది. మూతల్లేని మంనీటి ట్యాంకులు, ఇంట్లోని పూలకుండీలు, కొబ్బరి బొండాలు, టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, అపార్ట్మెంట్ సెల్లార్లు, కొత్త నిర్మాణాల్లో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ దోమ కుట్టిన 7 నుం 8 రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, కళ్లు కదలించలేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కిత్సను నిర్లక్ష్యం చేస్తే.. సాధారణంగా శరీరంలో 1.50 లక్షల నుం 4 లక్షల వరకు ఉండే ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేలలోపు పడిపోయి కోమాలోకి వెళ్లిపోతారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా డయేరియా అతిసారం వ్యాపిస్తుంది. కలుషితమైన నీటిని సరిగా శుభ్రం చేయకుండా తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతుంటారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై ఈగలు వాలడం వల్ల ఆహారం కలుషితం అవుతుంది. అప్పుడే ఉడికించిన తాజా ఆహారంతో పాటు వేడిచేసి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఈ వ్యాధులు దరిచేరకుండా చసు కోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఒకవైపు కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. మరో వైపు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి సమీపంలో చెత్త కుప్పులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కూలర్లు, నీటి ట్యాంకులను శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డ్రై డేగా పాటించాలి. ఇంట్లోని పూలకుండీలు, ఇంటిపై ఉన్న పాత ప్లాస్టిక్ డబ్బాలు, టైర్లు, సీసాలు, కుండలు లేకుండా చూసుకోవాలి. -
జీహెచ్ఎంసీపై మంత్రి కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీపై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాల ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నాలాలపై క్యాపింగ్, ఫెన్సింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. చదవండి: యువగాయని పాటకు కేటీఆర్ ఫిదా.. చాన్స్ ఇచ్చిన దేవీశ్రీ -
కొత్త టెక్నాలజీతో వాటర్ ప్రూఫింగ్ చేయండిలా..
సొంతింటి కలలకు వాటర్ లీకేజీ సమస్యలు. వాటర్ లీకేజీ, సీపేజీలతో పాడవుతున్న ఫాల్స్ సీలింగ్. లీకేజీ సమస్యల కారణంగా దెబ్బతింటున్న గోడల నాణ్యత. వాటర్ ప్రూఫింగ్‌తో లీకేజీ సమస్యలకు చెక్. మార్కెట్లో అందుబాటులో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్. హైదరాబాద్ : సొంత ఇళ్లు అనేది మధ్య తరగతి ప్రజల కలల సౌధం. నెలనెల పొదుపు చేసో లేదా హోం లోన్లు తీసుకునో చెమటోడ్చి ఇంటిని నిర్మించుకుంటారు. అంతేకాదు లక్షలు వెచ్చించి ఇంటిలోపల ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన గెస్టుల అభినందనలు అందుకునేలా నేటికి ట్రెండ్‌కి తగ్గట్టు ఫాల్స్ సీలింగ్ కూడా చేయిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, చిన్న చిన్న లోపాల కారణంగా వర్షకాలం వచ్చిందంటే చాలు చినుకు పడితే కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా రూఫ్ వాలుగా కాకుండా చదునుగా ఉండే విధంగానే ఎక్కువ మంది ఇళ్లను నిర్మిస్తారు. రూఫ్ చదునుగా ఉండటం వల్ల అక్కడక్కడ నీరు నిలిచిపోయి సీపేజ్‌లు వస్తుంటాయి. పైగా ఎండ, చలి, వానల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లీకేజీలు ఏర్పడుతుంటాయి. వానాకాలంలో వర్షకాలం వస్తే లీకేజీలు ఉన్న ఇళ్లలో పై కప్పు నుంచి నీరు కురవడం, చెమ్మ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇంటికి , వాటర్ లీకేజీలు ఇబ్బంది పెడతాయి. ఇక ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూడా చెమ్మ వస్తూ ఉంటుంది. ఈ చెమ్మ రావడం వల్ల ఇంటి గోడల ధృడత్వం దెబ్బతినడంతో పాటు ఎంతో ముచ్చటపడి ఇంటిలోపలి వైపు చేసుకున్న ఇంటీరియర్ కూడా పాడైతోంది. ఫాల్స్ సీలింగ్‌కి మరకలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలకు చెక్‌పెట్టడం ఇప్పుడు ఎంతో ఈజీ. వాటర్ ప్రూఫింగ్ ఇంటి పైకప్పు నుంచి లీకేజీ, చెమ్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా వాటర్ ప్రూఫింగ్ చేయించడం ఉత్తమం. గతంలో వాటర్ ప్రూఫింగ్ చేయాంటే అయితే మోర్టారు సున్నం వేయడం లేదంటే డాంబర్ షీట్లు పరిచేయడం అనే పద్దతులే అందుబాటులో ఉండేవి. అయితే వీటి మన్నిక తక్కువ కావడంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. ఈ సమస్యకు తెర దించుతూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అధునాతన వాటర్ ప్రూఫింగ్ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి, గోడలకు పెయింట్ వేసినంత సుళువుగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. తద్వారా వాటర్ లీకేజీ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. రూఫ్ వాటర్ ప్రూఫింగ్ సిమెంట్‌కు కొన్ని రసాయనాల మిశ్రమాలను కలిపి, కొత్త రకం వాటర్ ప్రూఫింగ్ పద్దతులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పుకు వేయడం ద్వారా లీకేజీ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అయితే రసాయనాల నాణ్యతపై ఆధారపడి ఈ ప్రూఫింగ్ మన్నిక ఉంటుంది. ముఖ్యంగా ఆక్రిలిక్ రసాయనం కలిపిన వాటర్ ప్రూఫ్ సిమెంట్ తో ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇక ఏషియన్ పెయింట్ అయితే ఆక్రిలిక్ రసాయనంతో పాటు ‘ఫైబర్’ కంటెంట్‌తో కూడిన సిమెంట్‌ని రూపొందించింది. వీటిని డాంప్ ప్రూఫ్, డాంప్ ప్రూఫ్ ఆల్ట్రా పేరుతో వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్‌గా అందిస్తోంది. పైగా వీటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం చాలా సులువు. ఇదీ పద్దతి ముందుగా టెర్రస్ లేదా ఇంటి పైకప్పు వెలుపలి భాగాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పగుళ్లు, గ్యాప్‌లు వచ్చిన చోటంతా ఆక్రిల్ మ్యాక్స్ క్రాక్ సీల్‌తో పూడ్చేయాలి. అప్పటికే ఏదైనా పుట్టీ, లేదా పెయింట్ వేసి ఉంటే దాన్ని కూడా తొలగించాలి. ఆ తర్వాత మొదటి కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా లాంటి వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ని ఒక లేయర్‌గా వేయాలి. ఆ కోటింగ్‌ని 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత డాంప్ప్రూఫ్ అంచుల చుట్టూ రూఫ్ టేప్‌ని వేయాలి. మరోసారి రెండో కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ వేయాలి. మరోసారి 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం ద్వారా పదేళ్ల పాటు వాటర్ లీకేజీ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఏసియన్ పెయింట్స్ అయితే ఏకంగా వారంటీనే అందిస్తోంది. (Advertorial) మరిన్ని వివరాల కోసం : Asian Paints Water Proofing Solutions -
అసలే వర్షాకాలం, కారు ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా? ఏం చేయాలి?
వర్షాకాలం వచ్చింది అంటే చాలు వాహదారులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. చిన్న పాటి వర్షానికి మన మెట్రో నగరాలు సముద్రాలను తలపిస్తాయి. వర్షం కాలంలో వాహనాలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. అందుకే వర్షాకాలంలో ప్రతి సంవత్సరం ఇంజిన్ సమస్యలతో బీమా కంపెనీలకు భారీగా క్లెయిమ్స్ వస్తాయి. వర్షాకాలంలో వచ్చే చాలా క్లెయిమ్స్ ప్రకృతి కారణంగా నష్ట పోయినవే. నీరు లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కారణంగా కారు ఇంజిన్ డ్యామేజీ అవుతాయి. కారు యజమానుల నిర్లక్ష్యం చేత బీమా కంపెనీలు ఎక్కువగా ఈ క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయి. నీటి వల్ల ఇంజిన్ దెబ్బతినడం సాధారణంగా రెండు సందర్భాల్లో జరుగుతుంది. ఒకటి కారు నీటిలో మునిగిపోయినప్పుడు, రెండవది కారు యజమాని వరద నీటిలో నుంచి ప్రయాణించినప్పుడు. మొదటి సందర్భంలో కారు మునిగిపోయి తేలిన తర్వాత వాహన యజమాని ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు ఇటువంటి సందర్భంలో బీమా కంపెనీకి కాల్ చేయడం మంచిది. కాల్ చేశాక మీ పరిస్థితి వివరించి ఏమి చేయాలో అడగండి. తనిఖీ కొరకు వారు వాహనాన్ని దగ్గరల్లో ఉన్న అధీకృత గ్యారేజీకి తీసుకెళ్లాలని బీమా కంపెనీ సూచించవచ్చు. ఒకవేళ ఇంజిన్ పూర్తిగా పాడైపోయినట్లయితే అది ప్రమాదంగా పరిగణిస్తారు, అది నిర్లక్ష్యం కాదు. ఇక రెండవ సందర్భంలో నీటితో నిండిన ప్రాంతం గుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ డ్యామేజీని వివాద అంశంగా పరిగణిస్తారు. అయితే, డ్రైవ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి వారికి ఎలాంటి మార్గం లేనందున బీమా కంపెనీ ఇటువంటి క్లెయిమ్స్ తిరస్కరిస్తాయి. ఇలాంటప్పుడు ఏమి చేయాలంటే, వరద ప్రాంతంలో కారు మునిగిపోతే దానిని స్టార్ట్ చేయకుండా ఉండటం మంచిది. నీటి మట్టం తగ్గిన తర్వాత, బీమా కంపెనీకి కాల్ చేసి, ఏమి చేయాలో అడగండి. ఇటువంటి సమయంలో క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం తక్కువ. లోతట్టు ప్రాంతాలలో, ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న వారు ఇటువంటి వివాదాలను పరిష్కరించడం కొరకు, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్ ని తీసుకుంటే మంచిది. యాడ్ ఆన్ ఇంజిన్ కు అన్ని రకాల డ్యామేజీలను కవర్ చేస్తుంది. ఒకవేళ నీరు క్యాబిన్ లోనికి ప్రవేశించి, స్పీకర్ లు, సెన్సార్ లు, ఎలక్ట్రిక్ ఎక్విప్ మెంట్ వంటి భాగాలు డ్యామేజీ అయితే, బీమా కంపెనీ వీటికి నగదు చెల్లించదు. ఫ్యాక్టరీలో ఫిట్ చేయబడ్డ భాగాలకు మాత్రమే చెల్లిస్తుందని గమనించాలి. చదవండి: రెండో రోజు భారీగా పడిపోయిన బంగారం ధరలు -
వానలొస్తున్నాయ్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
తొలకరి చినుకులకు ప్రకతి పులకరింపు సహజం. ఇదే సమయంలో అణగారిఉన్న సూక్ష్మజీవులు జీవం పోసుకొని విజృంభించడం కూడా సహజమే!వర్షాలు పడడం స్టార్టయిందంటే చిన్నా పెద్దా అని తేడా లేకుండా జలుబు నుంచి టైఫాయిడ్ వరకుఏదో ఒక అనారోగ్యం కలగడం సర్వసాధారణం. వానాకాలం ఆరంభంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కమారుగా చల్లబడటం, ఈ క్లైమేట్ ఛేంజ్‌తో ఇమ్యూనిటీ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి రకరకాల రోగాలు... వర్షాకాలం సర్వసాధారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ బాధపడేది జలుబుతోనే! ఇది వైరల్ ఇన్ఫెక్షన్లలో అత్యంత కామన్ ఇన్ఫెక్షన్. ఈ జలుబు కొంతమందిలో క్రమంగా ఫ్లూ, నిమోనియా తదితర వ్యాధుల్లోకి దిగుతుంటుంది. వర్షాలు పడడంతో దోమల ప్రత్యుత్పత్తి వేగం పుంజుకుంటుంది. దీంతో వీటి జనాభా తీవ్రంగా పెరుగుతుంది. వీటి కారణంగా మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులు ప్రబలుతాయి. ∙వానలతో గ్రౌండ్‌వాటర్‌లో, ఉపరితల నీటివనరుల్లో రసాయన మార్పులు జరుగుతాయి. ఇవి నీటిలో బాక్టీరియా ఉధృతికి దోహదం చేస్తాయి. ఇలాంటి కలుషిత జలాలతో కలరా, టైఫాయిడ్, హెపటైటిస్‌లాంటి రోగాలు విజృంభిస్తాయి. కొత్తనీరు, పాతనీరు కలయికతో పెరిగే ఫంగస్ కారణంగా కొన్నిరకాల చర్మరోగాలు కలుగుతాయి. చదవండి: బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే వర్షాకాలం కరోనా ఎలా మారుతుంది? వేడి వేడి వేసవిలోనే ప్రపంచంపై ప్రతాపం చూపిన కరోనా మహమ్మారి, వానలు పడ్డాక మరింత చెలరేగుతుందని సామాన్య ప్రజల్లో చాలా భయం నెలకొంది. కానీ ఇందుకు సరైన ఆధారాల్లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది సైతం వర్షాకాలంలో కరోనా విజృంభణ చాలావరకు తగ్గింది. నిజానికి వర్షాకాలంలో కరోనా కన్నా సీజనల్ వ్యాధులే ఎక్కువ డేంజరని చెబుతున్నారు. వీటికి కరోనా జతకలిస్తే మరింత ప్రమాదమని, అందువల్ల సీజనల్ వ్యాధులను అరికడితే కరోనా ఆట కూడా కొంతమేర కట్టించవచ్చని సూచిస్తున్నారు. వర్షాలతో ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ డిపాజిట్లు కొట్టుకుపోతాయని కొందరు నిపుణుల అంచనా. అయితే ఇది పూర్తిగా నిజం కాదని, కరోనాను వర్షాలు కొంతమేర డైల్యూట్ చేయగలవు కానీ పూర్తి గా తొలగించలేవని డెలావర్ ఎపిడమాలజీ డిపార్ట్మెంట్ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వైరస్ సంగతేమో కానీ వాననీటితో బాక్టీరియా పెరుగుతుందని, ఇది కొత్త రోగాలను తెస్తుందని చెప్పారు. వర్షాలతో కరోనా విజృంభిస్తుందని చెప్పలేమని, సీజనల్ వ్యాధులతో కలిసి కరోనా మరింత కలకలం సృష్టిస్తుందని, అందువల్ల తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో కలిగే చిన్నపాటి శారీరక ఇబ్బందులకు వంటింటి చిట్కావైద్యాలు బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలు పాలు, పసుపు నీళ్ల ఆవిరి లాంటివి. సో... తగిన ముందు జాగ్రత్తలు తీసుకొంటే వానాకాలం రాగానే వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడం ఈజీనే! ఏం చేయాలి... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.. అంటే చికిత్స కన్నా నివారణే మేలు! వర్షాకాలంలో వచ్చే జబ్బులబారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ సీజన్లో సప్తసూత్రాలు పాటిస్తే చాలావరకు రైనీ సీజన్ రోగాలకు చెక్ పెట్టవచ్చు. ► ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం. బాగా ఉడికించిన ఆహారాన్ని, వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ►దాహం లేకున్నా వీలయినంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. అదికూడా ఫిల్టర్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి. ►వానలో తడిసేటప్పుడు మాత్రమే సరదాగా ఉంటుంది, తర్వాత వచ్చేరోగాలతో సరదా తీరిపోతుందని గ్రహించి సాధ్యమైనంత వరకు వానలో తడవకుండా జాగ్రత్త పడాలి. ►ఇంటిలోపల, చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు ముసిరే వాతావరణం కల్పించకూడదు. ►ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు మస్క్యుటో రిపల్లెంట్స్ వాడాలి. లేదంటే కనీసం ఇంట్లో వేపాకు పొగ పెట్టైనా దోమలను తరిమేయాలి. ►చలిగా ఉందని బద్దకించకుండా రోజూ రెండుపూట్లా శుభ్రంగా స్నానం చేయాలి. లేదంటే చర్మరోగాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ►చేతులతో ముక్కు, కళ్లు, నోరును సాధ్యమైనంతవరకు టచ్ చేయకుండా జాగ్రత్త పడాలి. -
వానలే..వానలు..
సాక్షి,సిటీబ్యూరో: వరుణుడి ప్రతాపంతో నిత్యం జోరుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ సిటీ తడిసి ముద్దవుతోంది. నైరుతి సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి జూలై 31 వరకు రెండునెలల్లోనే నగరంలో 22 శాతం అధిక వర్షపాతం నమోదవడం విశేషం. ఈ సీజన్లో సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో ఈసారి జడివానలు మహానగరాన్ని ముంచెత్తుతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జూన్–జూలై నెలల్లో సాధారణంగా నగరంలో 276.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈసారి ఏకంగా 338.6 మిల్లీమీటర్లమేర వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 22 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నమాట. రంగారెడ్డి జిల్లా పరిధిలో సాధారణంగా 244.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఏకంగా 326.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం విశేషం. మొత్తంగా ఈ జిల్లాలో రెండు నెలల కాలంలోనే 33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జడివాన కురిసింది. భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటమునిగాయి. సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్న వాహనదారులు ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. వర్షపునీరు వృథా..వ్యథ.. గ్రేటర్ పరిధిలో విస్తారంగా వర్షపాతం నమోదవుతున్నప్పటికీ వాన నీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడం, సిటీ కాంక్రీట్ మహారణ్యంలా మారడంతో వర్షపునీరంతా వృథాగా రహదారులపై ప్రవహించి మూసీలో కలుస్తోంది. మహానగరం పరిధిలో సుమారు 25 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలుండగా..ఇందులో ఇంకుడు గుంతలు 5 లక్షలకు మించి లేకపోవడంతో గ్రేటర్ పరిధిలో కురిసిన వర్షపాతంలో 70 శాతానికి పైగా వృథా అవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ బోరుబావికి దగ్గరగా ఇంకుడు గుంతను ఏర్పాటుచేసుకోవాలని భూగర్భ జలవనరులశాఖ, జలమండలి నిపుణులు సూచిస్తున్నారు. పలు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు.. గత రెండునెలలుగా నగరంలో అత్యధికంగా నాంపల్లి మండలంలో 45 శాతం, రాజేంద్రనగర్‌లలో 39, తిరుమలగిరిలో 41,బాలాపూర్‌లో 48 శాతం,హయత్‌నగర్‌లో ఏకంగా 55 శాతం అధిక వర్షపాతం నమోదుకావడం గమనార్హం. అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 4 శాతం, మారేడ్‌పల్లిలో 2 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. శుక్రవారం నగరంలో పలు చోట్ల కుండపోత దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో 3.1 కి.మీ ఎత్తు నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలో పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునగడంతో జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వరదనీటిని తొలగించాయి. పురాతన భవంతుల్లో నివాసం ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిని ముంచెత్తిన వరద నీరు
-
ముంపులో ఉస్మానియా ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగు నీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాతభవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా కారిడార్ మేల్ వార్డులు ఉస్మాన్సాగర్ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్తడంతో వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లు మాత్రమే కాదు..వారికి చికిత్సలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం బెంబేలెత్తిపోయారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. తరచూ పైకప్పులు పెచ్చులూడిపడుతుండటం, శ్లాబ్ సహా గోడలకు పగుళ్లు ఏర్పడటంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు కిందికి ఇంకుతుంది. అటకెక్కిన కొత్త భవనాల హామీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూలైలో సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించి, వారం రోజుల్లో రోగులను ఖాళీ చేయించి, పాతభవనం స్థానంలో అత్యాధునిక రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఆస్పత్రి నిర్మాణ ప్రస్తావనను కూడా పూర్తిగా విస్మరించడంతో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అటకెక్కింది. మురుగు నీటి వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో వర్షానికి ఆస్పత్రి ఆవరణలోని పలు మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటికి మురుగు నీరు తోడై..వార్డులను ముంచెత్తడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంతమంది రోగులు వరద నీటికి పరుపులను అడ్డుపెట్టి..నీటిని బయటికి తోడేశారు. మరికొంత మంది పడకల కింద నీరు చేరినప్పటికీ..విధిలేని పరిస్థితుల్లో అలాగే ఉండిపోయారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు రోగుల వద్దకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. -
వామ్మో.. పాము!
కర్నూలు(హాస్పిటల్): వర్షాకాలం ప్రారంభమైంది. జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భూమిలో ఉన్న వేడి ఆవిరి రూపంలో బయటకు వస్తోంది. ఈ క్రమంలో భూమి పొరల్లో ఉండే క్రిమికీటకాలు బయటకు వస్తాయి. తెలిసీతెలియక వాటిని తాకిన వారిని అవి కాటేస్తాయి. ప్రతి యేడాది జూన్ మొదటి వారం నుంచి క్రిమికీటకాలు కాటేయడం మనం చూస్తుంటాం. అయితే అన్ని కీటకాలకు విషం ఉండదు. కేవలం కొన్ని రకాల విషసర్పాలు, తేళ్లకు మాత్రమే తీవ్రమైన విషం ఉంటుంది. ఇవి కాటేసినప్పుడు కంగారుపడకుండా తగిన జాగ్రత్తలతో వైద్యం తీసుకుంటే సురక్షితంగా బయటపడవచ్చని చెబుతున్నారు వైద్యులు. గత ఐదేళ్ల కాలంలో జిల్లాలో వర్షాలు పెద్దగా కురియలేదు. కొన్ని సంవత్సరాలు తీవ్ర వర్షాభావం నెలకొంది. అయితే గత ఏడాది నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ యేడాది జూన్ ఒకటో తేదీ నుంచే వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వర్షాలకు భూమిలో దాగున్న విష సర్పాలు, తేళ్లు, కీటకాలు బయటకు వస్తున్నాయి. ఆదమరిచి ఉన్న వారిని ఇవి కాటేస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాలో పాముకాట్లు, విష పురుగుల కాట్లకు గురై ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు ఆయా ఆసుపత్రులకు నెలరోజుల నుంచి 60కి పైగా పాము, తేలు కాట్లు, ఇతర కీటకాల కాట్లతో చికిత్స కోసం వచ్చారు. ఇందులో కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే మరణించారు. వర్షాలు కరుస్తున్న కారణంగా ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో పొదలు పెరగడం వల్ల విషపురుగుల సంచారం అధికమైంది. ఒక్కోసారి అవి ఇళ్లల్లోకి రావడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. పాము కరవగానే ఏం చేయాలంటే.. ►పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి. ►పక్కనున్న వారు ఆ పాము విషసర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత కచ్చితంగా అందజేయవచ్చు. ►నాటు వైద్యం, మంత్రతంత్రాల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని నడిపించకుండా తీసుకెళ్లాలి. ►పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతోపాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయవద్దు. ఒక్కోసారి పాముకాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం. ►మరికొందరు పాము కరిచిన ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాముకాటు వేయగానే విషం రక్తంలో ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి హాని కలగవచ్చు కూడా. అన్ని పాముల్లో విషముండదు ►పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. త్రాచు, కట్ల పాముల వంటి 15 శాతంసర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది. ►అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదంలేని మామూలు గాయాలే. వీటికి సాధారణ చికిత్స తీసుకుంటే చాలు. ►పాము కాటు వేయగానే చాలా మంది షాక్‌కు గురవుతారు. ఆ పాముకు విషం లేకపోయినా వారు షాక్‌కు గురికావడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పాలి. ఇటీవల పాము, తేలు కాట్ల వివరాలు ►పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలో గత సోమవారం రాత్రి పాముకాటుతో కురవ లింగన్న(65), అతని కుమార్తె చిన్న మహాదేవి(18) మృతి చెందారు. గుడిసెలో నిద్రిస్తుండగా వీరిని పాము కాటు వేసింది. ►కౌతాళం మండల పరిధిలోని హల్వి గ్రామంలో గత శనివారం పాము కాటుతో ప్రియ(3) అనే చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు నిద్రిస్తుండగా తెల్లవారుజామున పాము కాటు వేసింది. ►ఆస్పరికి చెందిన లక్ష్మీనారాయణ(20) గత నెల 15వ తేదిన కూలీ పనులకు వెళ్లగా తేలు కాటు వేసింది. ఆస్పరిలో ప్రథమ చికిత్స చేయించుకుని మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గత సోమవారం మృతి చెందాడు. ►పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన సుభాష్‌చంద్ర(34) గతనెల 5వ తేదీన తన పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా తేలు కాటు వేసింది. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే విషప్రభావం అధికమై మృతి చెందాడు. విధిలేని పరిస్థితుల్లోనే కాటు పాము తన ఆత్మరక్షణ కోసం విధిలేని పరిస్థితుల్లో మాత్రమే ఎదుట ఉన్న వ్యక్తిని కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పాము కరిస్తే తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. అలాకాకుండా నాటు వైద్యం తీసుకుంటే చికిత్స ఆలస్యమై ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. పాములుండే ప్రదేశాలు.. ►ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరతాయి. వాటిని తినేందుకు పాములు వస్తాయి. ►దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు వాటి మధ్యలో పాములు, తేళ్లు ఉండే ప్రమాదం ఉంది. పిడకల మధ్య కూడా విష పురుగులు చేరతాయి. ►ముఖ్యంగా రాత్రిపూట పొలాల్లో మోటారు వేయడానికి, నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్ ఉపయోగించాలి. ఒక్కోసారి మోటార్òÙడ్లో, స్టార్టర్ దగ్గర గూడు లాంటి ప్రదేశాల్లో పాములు నక్కి ఉండొచ్చు. ►చేలగట్ల వెంబడి కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కిర్రుచెప్పులతో పాము కాటు ప్రమాదం తప్పుతుంది. విషసర్పం కాటు..లక్షణాలు ►కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్థాయి ఉంటుంది. ►సాధారణ త్రాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. ►నల్లత్రాచు(కింగ్‌కోబ్రా) విషంప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. ►కట్లపాము కాటు బాధ ఒకరకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. ►కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. ►నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. ►పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, చొంగకారవచ్చు. ►కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. ►బాధితునికి సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించకపోతే పరిస్థితి విషమించవచ్చు. ►విషం విరుగుడు ఇంజక్షన్ రూపంలో త్వరగా పనిచేస్తుంది. ►బాధితునికి ఆందోళన, షాక్ కారణంగా తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారింవచ్చు. ►సెలైన్ రూపంలో శక్తిని ఇస్తూ, చికిత్స మరింత మెరుగై అందించవచ్చు. ►పాముకాటు గాయానికి తగు చికిత్స చేయడం ద్వారా ఇతర ఇబ్బందులు లేకుండా చేయవచ్చు. ►చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్బంధు పథకం కింద పరిహారం లభించవచ్చు. మందులున్నాయి వర్షాకాలంలో రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో వారు తరచూ పాము, తేలు కాటుకు గురవుతుంటారు. ఇలాంటి వారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటి స్నేక్ వీనమ్(ఏఎస్వి) అందుబాటులో ఉంచాము. పాము, తేలు కాటు వేయగానే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. –డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్‌వో, కర్నూలు -
వెల్లువలా ఉల్లి! కిలో 10లోపే..
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంతో ఉల్లి ధరలు పెరుగుతాయి. కానీ.. ఈ ఏడాది కొత్త ఉల్లి పంట మార్కెట్లకు రావడంతో హోల్‌సేల్ ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 నుంచి రూ.15 దాటడంలేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద మొత్తంలో కొత్త ఉల్లి దిగుమతులు అవుతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్లో కిలో ఉల్లి హోల్‌సేల్‌గా రూ.30 వరకు ఉండగా.. ఈ ఏడాది రూ.15లోపే పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. 60 లారీల ఉల్లి.. గత ఏడాది ఇదే సీజన్లో మలక్‌పేట్ మార్కెట్‌కు 34 లారీల ఉల్లి వచ్చింది. ఈసారి 60 లారీ ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.30 వరకు ఉండగా, ఈ ఏడాది పదిహేను రూపాయల లోపే ఉన్నాయని తెలిపారు. ఉల్లి ఎక్కువ మొత్తంలో దిగుమతులు జరగడంతో రిటేల్ మార్కెట్లో ధరలు రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. అదే గత ఏడాది రిటేల్ ఉల్లి ధరలు రూ.30 నుంచి రూ.40 వరకు ఉండేవి. పెరిగిన స్థానిక దిగుమతులు.. నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లితోనే తీరుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు, కర్ణాటక నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతులు భారీగా అవుతుండటం.. మార్కెట్లలో స్టోరేజీ సౌకర్యం లేకపోవడంతో హోల్‌సేల్ వ్యాపారులు ఎక్కువగా నిల్వ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ధరలు సాధారణమే.. గత ఏడాదితో పోలీస్తే ఈసారి లోకల్ ఉల్లి మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతి అవుతోంది. గత ఏడాది మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడ్డాం. ఈ ఏడాది మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు కర్నూలు తదితర ప్రాంతాల నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.15 వరకు ధర పలుకుతోంది. చిన్నగడ్డకు రూ. 8 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఏమంత పెరగవు. కొత్త పంట రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈసారి దిగుమతులు రెట్టింపు అయ్యాయి. అదేవిధంగా లాక్‌డౌన్‌తో పాటు ఫంక్షన్స్, హోటల్స్ పూర్తి స్థాయిలో తెరుచుకొకపోవడంతో కూడా ఉల్లి వినియోగం అంతగా లేకుండాపోయింది. – దామోదర్, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ,మలక్‌పేట్ మార్కెట్ -
మీ బైక్ పాడయ్యిందా.. ఐతే ఇది చదవండి !
సనత్‌నగర్: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధుల ప్రభావమే కాదు.. బైక్ కష్టాలూ తప్పవు. నిత్యం మనల్ని గమ్యస్థానానికి చేర్చడంలో కీలకంగా నిలిచే ద్విచక్ర వాహనాలను పదిలంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా వర్షాకాలంలోబైక్లు మొరాయిస్తుండడం సహజం. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ కష్టాలను అధిగమించవచ్చంటున్నారు బైక్ మెకానిక్‌లు. ♦ వర్షాకాలంలో పవర్ ఫ్లగ్‌లు తరచూ పాడవుతుంటాయి. దీంతో ఎంతగా ప్రయత్నించినా∙బైక్ స్టార్ట్ కాదు. ♦ నిరంతరాయంగా కురిసే వర్షం కారణంగా కాయిల్స్ సామర్థ్యం తగ్గి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ♦ ప్రయాణంలో మార్గమధ్యలో భారీగా వర్షం నీరు నిలిచినప్పుడు చాలామంది అందులో నుంచే వాహనాన్ని నడిపేస్తుంటారు. ఈ క్రమంలో వాహనం మునిగి ఇంజన్‌లోకి నీరు వెళ్ళి పాడయ్యే ప్రమాదం ఉంది. అలాగే సైలెన్సర్లోకి నీరు వెళ్ళడం గానీ, కొన్ని బైక్‌లకు సీటు కింద ఉండే ఫిల్టర్ బాక్స్‌లోకి నీరు వెళుతుంది. దీంతో బైక్ మొరాయిస్తుంది. ♦ వర్షాకాలంలో రోడ్లు కొట్టుకుపోయి కంకర తేలుతాయి. ఈ క్రమంలో కంకర తేలిన రోడ్లపై నీరు నిల్వ ఉంటాయి. అయితే టైర్ల సామర్ధ్యం సరిగా లేకుంటే రాళ్లు దిగి పంక్చర్‌కు అవకాశం ఉంటుంది. ♦ చాలామంది వాహనాలు సెల్లార్లలో గానీ, లోతట్టు ప్రాంతాల్లో గానీ పార్క్ చేస్తుంటారు. దీంతో భారీ వర్షం కురిసినప్పుడు ఆయా వాహనాలు కొట్టుకుపోవడమే కాకుండా ఇంజన్‌లోకి నీరు వెళ్ళి పాడైపోతుంటాయి. ♦ కూర్చొనే సీటు సరైన క్వాలిటీ లేనిపక్షంలో వర్షం పడిన సమయంలో సీటు వర్షంలో నానిపోయి త్వరగా పాడైపోతుంది. ♦ వర్షాకాలంలో బైక్ ఎక్కువ సేపు తడిస్తే ఆ చల్లదనానికి బ్యాటరీ పవర్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో స్టార్టర్ నొక్కిన వెంటనే స్టార్ట్ అవ్వదు. బ్యాటరీ పవర్ డౌన్ అవడంతో హారన్, ఇండికేటర్స్ శబ్దాలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటాయి. ♦ వర్షాకాలంలో కీస్ రంధ్రంలోకి నీరు చేరి అరిగిపోతుంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే... ♦ వర్షాకాలానికి ముందే కొత్త పవర్ ఫ్లగ్‌లు వేయించుకుంటే మేలు. ♦ ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తుండడం ద్వారా కాయిల్ వీక్ కాకుండా చూసుకోవచ్చు. ♦ రోడ్డుపై భారీగా వరదనీరు చేరినప్పుడు డైరెక్ట్‌గా వాహనం ఆన్‌లో ఉంచి వెళ్ళడం కంటే సైలెన్సర్‌కు, సీటు కింద ఉన్న ఫిల్టర్ బాక్స్‌లకు ఉన్న రంధ్రాలను వస్త్రంతో మూసివేసి నడిపించుకుని వెళ్ళడం ఉత్తమం. ఆ తరువాత వాటిని తీసేసి కిక్ కొడితే త్వరగా స్టార్ట్ అవుతుంది. ♦ వర్షాకాలంలో కంకర తేలిన రోడ్లపై రాళ్లు గుచ్చుకుని తరచూ పంక్చర్ పడే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు టైర్ల సామర్థ్యం ఉండేలా చూసుకోవాలి. ♦ కీస్ రంధ్రంలోకి నీరు చేరకుండా ఉండేలా కవర్ అయ్యేలా చూసుకోవాలి. ♦ సీటు నాని పాడవకుండా ఉండేలా క్వాలిటీ కవర్లను తొడిగితే మేలు. ♦ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతం, సెల్లార్లలో కాకుండా సాధ్యమైనంతవరకు వాహనం మునగకుండా ఉండే చోట పార్క్ చేస్తే మేలు. తద్వారా ఇంజన్‌లోకి నీరు చేరకుండా ఉంటుంది. బ్యాటరీ సామర్ధ్యం కూడా తగ్గకుండా ఉంటుంది. వర్షాకాలంలో బైక్లకుఎక్కువ ముప్పు వర్షంలో సైతం రయ్‌మని దూసుకుపోతుంటారు. భారీగా నిలిచిన నీటిలో నుంచి కూడా బైక్‌లను నడిపేయడం వల్ల మునిగిపోయి ఇంజన్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధ్యమైనంతవరకు బైక్ మునిగిపోతుందనుకుంటే సైలెన్సర్‌ను మూసివేసి నడిపించుకుని వెళ్ళాలి. వర్షాకాలంలో ప్రధానంగా పవర్ ఫ్లగ్‌లు తరచూ మొరాయిస్తుంటాయి. ముందస్తుగా కొత్తది వేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. లేదంటే మార్గమధ్యంలో ఆగిపోతే ఇబ్బందులు పడాల్సివస్తుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే బైక్‌లను పదిలంగా ఉంచుకోవచ్చు. – శ్రీను, బైక్ మెకానిక్ -
కరోనాకు వర్షం తోడు..
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: స్వీయ సంరక్షణ తప్ప ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఏ మందూ లేదు.. మొన్నటి వరకు ఓ ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు.. వానాకాలం ప్రారంభమైంది. జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభించేందుకు అనుకూల సమయమిది. అసలే వ్యాధుల సీజన్.. ఆపై కోవిడ్–19 మరింత భయపెడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిబంధనలు పాటించకపోయినా మహమ్మారి మనల్ని చుట్టేయడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నాన్నారు. అసలే వానాకాలం సాధారణంగానే వానాకాలం అంటే వ్యాధుల సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. కరోనాకు సైతం ఇవే లక్షణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది చిన్నపాటి జలుబు, దగ్గుకు భయపడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి చిన్నగా తుమ్ము, దగ్గు వచ్చినా మిగతా వారు అనుమాన పడుతున్నారు. బేఖాతర్ చేస్తే అంతే ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో 20 రోజులుగా చాలా మంది కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారు. సడలింపులతో పాటు జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించినా చాలా మంది పట్టించుకోవడం లేదు. కొంత మంది కనీసం మాస్క్‌లు కూడా ధరించడం మరిచారు. భౌతిక దూరం నిబంధన సైతం కానరావడం లేదు. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో నిబంధనలు పాటించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా వచ్చింది.. జిల్లాలో కరోనా వైరస్ మార్చి 24న అడుగు పెట్టింది. లండన్ వెళ్లి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలు ఉండడంతో ఆయన్ని కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లి పరీక్షల అనంతరం అధికారులు కరోనా పాజిటివ్‌గా ధ్రువీకరించారు. ఆ తరువాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తులతో కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 26వ తేదీ వరకు జిల్లాలో ఈ కేసులు క్రమేపీ పెరుగుతూ 31గా నమోదయ్యాయి. వీరిలో దాదాపుగా 17 మంది అప్పటికే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ ఆయ్యారు. తరువాత ఈ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో మే నెలలో జి.మామిడాడకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడు. తర్వాత జి.మామిడాడ, బిక్కవోలు, ఊలపల్లి, రాయవరం, మేడపాడు, రామచంద్రపురం, పెద్దాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, అయినవిల్లిల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. పక్షం రోజుల వ్యవధిలోనే దాదాపు 460కి పైగా కేసులు నమోదవడం గమనార్హం. కొత్త కేసులన్నీ మహారాష్ట్ర, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వలస కార్మికులతో ముడిపడి ఉన్నవే. నిబంధనలను పట్టించుకోక.. కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ రక్షణే మందు. లాక్డౌన్ కఠినంగా అమలు చేసిన సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను పెడచెవిన పెడుతూ కొందరు తిరగడంతో కరోనా వ్యాప్తికి కారణమైంది. ముఖానికిమాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, అత్యవసరమైతే మినహా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, సమూహాలుగా కాకుండా దూరంగా ఉండటం, వంటి చిన్న జాగ్రత్తలను పాటించినా కరోనాను కట్టడి చేయవచ్చు. ప్రస్తుతం వానాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు. భయపడొద్దు.. జాగ్రత్తలే ముద్దు వానాకాలంలో జ్వరాలు, వివిధ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కరోనాకు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలి. జిల్లా ఆసుపత్రుల్లో నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా @ 39 జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 39 మందికి వైరస్ సోకింది. రాయవరం మండలం చెల్లూరు శివారు సూర్యారావుపేటలో మొత్తం 26 కరోనా కేసులు నమోదయ్యాయి. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో 4, పెద్దాపురంలో 1, తొండంగి మండలం ఏవీ నగరంలో 1, అయినవిల్లి మండలం ఎన్.పెదపాలెంలో 2, పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి గ్రామంలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్ సోకింది. ముంబయి నుంచి రైలులో వచ్చిన నాగుల్లంక శివారు పెదకందాలపాలెం గ్రామానికి చెందిన ఓ బాలికకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. -
క్లిక్ కొట్టు.. వాట్సాప్ పెట్టు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన సమస్యల్లో అగ్రస్థానంలో ఉండేవి రోడ్లే. వర్షాకాలం రావడంతో ఈ సమస్యలు మరింత పెరగనున్నాయి. వీటికి తక్షణ పరిష్కారాలు చూపేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. గ్రేటర్ ప్రధాన రహదారుల మార్గాల్లోని రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని ఐదేళ్లపాటు కాంట్రాక్టు ఏజెన్సీలకిచ్చిన నేపథ్యంలో ఒప్పందం మేరకు వాటి మార్గాల్లో రోడ్ల నిర్మాణాలతో పాటు మరమ్మతుల బాధ్యత వాటిదే. రోడ్లు ఎల్లవేళలా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి. రోడ్లు దెబ్బతిన్నా, గుంతలు ఏర్పడినా ఇతరత్రా సమస్యలను పరిష్కరించే బాధ్యత వాటిదే. ప్రజల నుంచి అందే ఫిర్యాదులనుపరిష్కరించాల్సిన బాధ్యత కూడా వాటిదే. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆయా ఏజెన్సీలు ఫోన్/వాట్సాప్ నంబర్లను అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చాయి. ప్రజలు తమకు కనిపించిన సమస్యను ఫోన్ చేసి చెప్పవచ్చు. ఫొటోతీసి వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా పరిష్కరించాలి. లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీకి జీహెచ్ఎంసీ పెనాల్టీ విధిస్తుంది. మ్యాన్‌హోల్ కవర్, క్యాచ్‌పిట్ కవర్ వంటి స్వల్ప సమస్యల్ని 6 గంటల్లోనే పరిష్కరించాలి. మీడియన్, ఫుట్‌పాత్‌ల మరమ్మతుల వంటి పనులైతే 48 గంటల్లో, పెద్ద ప్యాచ్‌లు 72 గంటల్లో పూర్తిచేయాలి. కాంటాక్ట్ ఏజెన్సీలు ముఖ్య కూడళ్లలో సైన్బోర్డులపై ఫోన్, వాట్సాప్ నంబర్లను ప్రదర్శించాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఆయా మార్గాల్లో రోడ్ల నిర్వహణ మొత్తం ఏజెన్సీలదే. నిర్ణీత వ్యవధుల్లో ప్రజల సమస్యలుపరిష్కరించకుంటే పెనాల్టీలు విధిస్తాం. ఏ కాంట్రాక్టు ఏజెన్సీకి చెందిన మార్గాల్లోని ముఖ్య కూడళ్లలో ఆ ఏజెన్సీ ఫోన్/వాట్సప్నంబర్తో సైన్‌బోర్డులు వెంటనే ఏర్పాటు చేస్తుంది. ప్రజలు ప్రధాన రహదారుల మార్గాల్లో తమ ప్రయాణానికి ఎదురయ్యే ఏ సమస్యనైనా ఫిర్యాదు చేయవచ్చు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ 040– 21 11 11 11 కు కూడా ఫోన్ చేయొచ్చు. – జియావుద్దీన్,చీఫ్ ఇంజినీర్,జీహెచ్ఎంసీ -
వర్షాకాలం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీ
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలి. మల్లన్న సాగర్ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపి అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలి. ఈ వానాకాలంలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్సారెస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది ) గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలన్నారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్‌లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రియల్ టైమ్ డేటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి వ్యవహారమంతా ఒకే శాఖ గొడుగు కిందకు రావాలని, ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్వహణ (ఓ అండ్ ఎం) మ్యాన్యువల్ రూపొందించాలన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన భూములు, కట్టల ఆక్రమణను తీవ్రంగా పరిగణించాలని ఆదేశించారు. గోదావరి బేసిన్‌లోని ప్రతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే అవకాశం ఉందన్న అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంత్రులు కె. తారక రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సమీక్షలో సీఎం కేసీఆర్ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు ⇒ వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలి. దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలి. చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంబించాలి. చెరువులకు నీరు అందించడానికి ఉన్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు 2–3 రోజుల్లోనే సమావేశం కావాలి. ⇒ చెరువులు నింపడం ద్వారా భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుంది. ⇒ చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వాలి. అధికారులు రైతులపై ఆంక్షలు పెట్టరాదు. ⇒ ఎల్ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా లేక సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి. ⇒ తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలి. ⇒ గౌరవల్లి లిఫ్టు పనులను వెంటనే పూర్తి చేసి ఈ సీజన్లోనే నీళ్లు అందించాలి. ⇒ దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలి. సమ్మక్క బ్యారేజీ పనులను వేగవంతం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలి. ⇒ వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి. వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ⇒ జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్రావుపేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. ⇒ భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి. అన్నీ నీటిపారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సీఈ/ఈఎన్సీ పరిధులు నిర్ణయించి నీటిపారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సీఈ రూ. 50 లక్షల వరకు ఎస్ఈ రూ. 25 లక్షల వరకు, ఈఈ రూ. 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వొచ్చు. ⇒ 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతమున్న గేజ్‌లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్‌లు సరిగ్గా పనిచేయట్లేదు. కొత్తగా గేజ్‌లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలి. ⇒ నీటిపారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలి. నీటిపారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలి. ⇒ ప్రాజెక్టుల భూములను ఆక్రమించిన వారిపై సీరియస్‌గా ఉండాలి. సేకరించిన భూమిని మ్యుటేషన్ చేయాలి. ⇒ కాల్వ కట్టలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేసేలా కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి. ⇒ ప్రాజెక్టుల నిర్వహణ కూడా ముఖ్యం. ప్రతి ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓఅండ్ఎం మ్యాన్యువల్ రూపొందించాలి. ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ⇒ ఎక్కడైనా భూసేకరణ మిగిలి ఉంటే పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
దాహంగా లేదా? అయినా తాగాలి
వర్షాకాలం చర్మ సమస్యలు తరచూ బాధిస్తుంటాయి. అయితే వంటగదిలో వాడే కొన్ని దినుసులు, పదార్థాలతో చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం. ►వర్షంలో తడిసి ఇంటికి రాగానే మంచి నీటితో ముఖాన్ని తప్పక శుభ్రపరుచుకోవాలి. రాత్రి పడుకునేముందు రోజ్‌వాటర్‌ని దూదితో అద్దుకొని ముఖమంతా తుడిచి, నీటితో కడిగేయాలి. ఈ జాగ్రత్తల వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మ కాంతి పెరుగుతుంది. ►ఈ కాలం ఫౌండేషన్, పౌడర్లను ఎంత తక్కువ వాడితే చర్మానికి అంత మంచిది. నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్లను కూడా తగ్గించాలి. తరచూ నీళ్లలో తడవడం వల్ల చర్మంపై పోర్స్ (రంధ్రాలు) తెరుచుకుంటాయి. ఇలాంటప్పుడు ఫౌండేషన్, పౌడర్ పోర్స్‌లోకి వెళ్లిపోయి ముఖం జిడ్డుగా మారే అవకాశం ఉంది. దీని వల్ల మొటిమలు, యాక్నె సమస్యలు తలెత్తుతాయి. ►టొమాటో రసం ముఖానికి, చేతులకు రాసుకుని ఆరిన తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మంపై జిడ్డు తగ్గుతుంది. పైనాపిల్, యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ గుజ్జు లేదా జ్యూస్‌లను కూడా ఈ విధంగా వాడుకోవచ్చు. ►ఓట్స్‌లో తేనె, పెరుగు, ఆరెంజ్ జ్యూస్ కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేసి ముఖానికి చేతులకు, పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మకాంతి పెరుగుతుంది. ►తేనె, ఆలివ్ ఆయిల్, పెరుగు సమపాళ్లలో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని పదినిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారదు. పొడి చర్మానికి ఇది మేలైన ప్యాక్. పొడి చర్మం గలవారు బాదంపప్పు పొడి, తేనె కలిపి కూడా వాడుకోవచ్చు. జిడ్డు చర్మం గలవారైతే ఆరెంజ్ ఆయిల్, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ప్యాక్ వేసుకోవాలి. ►ఈ కాలం రకరకాల అలర్జీలు తలెత్తుతుంటాయి. ఇవి చర్మం సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లు గల సమతుల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ►ఈ కాలం దాహంగా అనిపించదు. కానీ, రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పక తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడడం సమస్య దరిచేరదు. చర్మం పొడిబారి జీవం లేకుండా ఉంటే పైపైన మాయిశ్చరైజర్ వాడాలి. జిడ్డు చర్మం అయితే రోజుకు రెండు సార్లు తప్పక శుభ్రపరుచుకోవాలి. -
పూలకు సీతాకోక రెక్కలొచ్చాయ్..
సాక్షి, మహబూబాబాద్ : పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే భూ లోకమే ఆనందానికి ఇల్లు.. లోకంలో కన్నీరింక చెల్లు .. సీతాకోక చిలుకకు చీరలెందుకు అనే పాట భారతీయుడు సినిమాలోనిది.. ఆ పాట వింటుంటే భూలోకమే స్వర్గంగా భావిస్తారు అందరు. గత పది రోజులుగా వర్షాలు కురియడంతో వివిధ రకాల పచ్చని చెట్లకు పూసిన పూలపై సీతాకోకచిలుకలు వాలుతూ భూలోకమే స్వర్గంగా మారిందా అన్నట్లుగా కనువిందు చేశాయి. పూలకు రెక్కలొచ్చినట్లుగా ఎగురుతూ పూలలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పంచాయి. మహబూబాబాద్ శివారు ప్రాంతంలో ఈ దృశ్యాలు ‘సాక్షి’కెమెరాకు చిక్కాయి. -
వరి పొలంలో చేపల వేట
సాక్షి, వాజేడు : వరి పొలంలో చేపల వేట ఏమిటని అనుకుంటున్నారా ! అవునండి నిజమే. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరి నీరు ఎగ పోటుతో పొలాల్లోకి చేరింది. వరద పెరిగే సమయంలో గోదావరి నుంచి చేపలు వస్తాయి. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి కాచారం వద్ద పొలాల్లో రైతులు శుక్రవారం తోపెను వలతో చేపలు పట్టుకుంటుండగా ఆ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. -
మేఘమా.. కరుణించుమా!
ఆకాశం మబ్బులు పడుతుంది. అయితే వర్షం కురవడం లేదు. తొలకరి పలకరించినా నైరుతి ప్రభావం కనిపించలేదు. రుతుపవనం మందగమనంగా సాగుతోంది. జూన్ మొదటి వారంలో రావాల్సిన నైరుతి పవనాలు 20 రోజులు ఆలస్యంగా పలకరించినా ప్రభావం చూపలేదు. జూలై 20వ తేదీన జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురవడంతో అన్నదాతలు సేద్యానికి ఉపక్రమించారు. వారం రోజల నుంచి మళ్లీ వర్షాలు పడలేదు. ఆకాశం మేఘాలతో నిండి ఉంటున్నా చినుకు చుక్క పుడమి తల్లిని తాకడంలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, ఉదయగిరి: జిల్లాలో అధిక వర్షపాతం ఈశాన్య రుతుపవనాల ద్వారా నమోదువుతుంది. జూన్, జూలైలో కురిసే వర్షాలే ఖరీఫ్ పంటకు ప్రాణంగా నిలుస్తాయి. సాధారణంగా జూన్ 1,2 తేదీల్లో నైరుతి పవనాలు కేరళను తాకి వారం రోజలు వ్యవధిలో లేదంటే 10 రోజుల్లో జిల్లా అంతటా విస్తరించి వాతావరణం చల్లబడి వర్షాలు పడేవి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు కదిలిక, గమనం గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఆలస్యంగా జూన్ 25వ తేదీ వరకు సమయం తీసుకున్నాయి. అప్పుడైనా వర్షాలు కురిశాయా అంటే అదికూడా లేదు. గతి తప్పిన రుతుగమనం జూన్ మొదటి వారంలో ఆరేబియా సముద్రంలో ’వాయు’ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల కదిలికకు అంతరాయం ఏర్పిడింది. అది గుజరాత్ వద్ద తీరం దాటకుండా ఓమెన్ వైపు ప్రయాణించడంతో ఈ పరిస్థితి వచ్చిందని వాతావరణ నిపుణలు అంచనా వేశారు. ఆ తర్వాత కోస్తా ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, ఉత్తర బంగాళా ఖాతంలో మరో ఆవర్తనం కారణంగా జూన్ మొదటి వారంలో రావాలిసిన నైరుతి పవనాలు ఆ నెల 25వ తేదీ వరకు సమయం తీసుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆపైన రుతు పవనాల ప్రభావం జిల్లాపై అంతగా చూపలేదు. నైరుతి విస్తరించి జిల్లా అంతటా వర్షాలు పడాల్సి ఉన్నా, ఆ పరిస్థితి కనిపించలేదు. మే నెల్లో సాధారణ వర్షపాతం 107.4 మీ.మీ. కాగా, కేవలం 4.6 మీ.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్‌లో 56.8కి గానూ 12.9 మీ.మీ. వర్షం మాత్రమే కురిసింది. ఈ నెల్లో ఇంతవరకు 139.3గానూ 101 మాత్రమే వర్షపాతం నమోదైంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పుటి వరకు –27.5 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో ద్వితీయ పక్షంలో ఉదయగిరి మెట్టప్రాంతంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడడంతో మెట్ట రైతులు పంటలు వేసేందుకు ముందుస్తు దుక్కులు దున్నుతున్నారు. అక్కడక్కడా కంది సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో మెట్ట పైర్లు ఆగస్టు, సెప్టెంబర్‌లో మంచి వర్షాలు కురిస్తే సుమారు లక్ష ఎకరాల్లో మినుము, పెసర, కంది తదితర మెట్ట పైర్లు సాగు చేస్తారు. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలు ఆధారంగా చెరువులు, కుంటలు, జలాశాయల్లో నీరు చేరికను బట్టి ఖరీఫ్ వరి సాగు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ప్రధాన జలాశయం సోమశిల పూర్తిగా అడుగంటిపోయింది. గండిపాళెం, నక్కలగండి, కండలేరు తదితర జలాశయాలు నిండుకున్నాయి. గత రెండు రోజలు నుంచి మళ్లీ ఆకాశం మేఘావృతం అవుతెంది. ఆదివారం జిల్లా అంతటా దట్టమైన మేఘాలతో ఆకాశం ఆవరించి వర్షం కురుస్తుందనే భావన కలిగించింది. నీటి చుక్క నేలనైతే తాక లేదు. మరి వరుణదేవుడు కరిణస్తాడో... లేక మబ్బులతో దోబూచులాడి ఉస్సూరమనిపిస్తాడో లేక అన్నదాత ముఖాల్లో ఆనందం కురిపిస్తాడో వేచి చూడాలి. ఊరిస్తూ.. వాకాడు: జిల్లాలో వర్షాలు సకాలంలో కురవక పోవడంతో వ్యవసాయం గత ఐదేళ్లుగా కన్నీళ్ల సేద్యంగా మారింది. ఎండిపోయిన జలాశయాలు, అడుగంటిపోయిన భూ గర్భజలాలు వెరసి ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అయినా సరే సాగు విషయంలో మాత్రం రైతులు వెనకడుగు వేయడంలేదు. ఈ ఏడాదైనా పంట చేతికి రాకుండా పోతుందా..? అనే కొండంత ఆశతో రైతులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పడిన అరకొర వర్షాలతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని విత్తుకునే సమయానికి వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులుగా వాతవరణంలో మార్పు చోటు చేసుకుని వర్షం పడేలా నల్లని మేఘాలతో రైతులను ఊరిస్తూ నిరాశలోకి నెడుతున్నాడు. వరుణుడుపైనే ఆశలు గత మూడేళ్లు నుంచి ఖరీఫ్‌లో వర్షాలు లేక సేద్యం సకాలంలో చేయలేకపోయాం. ఈ దఫా వారం రోజలు క్రితం ఓ మోస్తరు వర్షాలు కురవడంతో దుక్కులు చేస్తున్నాం. వచ్చే నెల్లో మంచి వానలు పడితే మినుము, పెసర లాంటి మెట్ట పైర్లు వేసే అవకాశం ఉంది. దీంతో వరుడు దయపైనే ఆశలు పెట్టుకున్నాం. – దండా రామకృష్ణారెడ్డి, రైతు. ఎదురు చూస్తున్నాం వారం రోజులుగా వర్షం పడే విధంగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఊరిస్తున్నాయి. ఇటీవల పడిన కొద్దిపాటి వర్షాలకు దుక్కులు సిద్ధం చేసుకుని మరో జల్లు కోసం ఎదురు చూస్తున్నాం. మబ్బుల తీరును చూసి ఇప్పుడు వర్షం పడుతుందని అనుకునే లోపే మేఘాలు గాలులకు ఎగిరిపోతున్నాయి. – వల్లం బాలయ్య, రైతు, వాకాడు. వర్షాలు పడితేనే సేద్యం పనులు వాతారవరణ శాఖ నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ ఏడాది మంచి వర్షాలు పడుతాయనే ఆశ ఉంది. ఇప్పుటికే ఉదయగిరి ప్రాంతంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడినా, గత నాలుగేళ్ల నుంచి వానలు లేక నీరు గంటల వ్యవధిలోనే ఇంకిపోతుంది. ఇంకా మంచి వర్షాలు పడితే సేద్యం పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వం కూడా పచ్చి రొట్ట విత్తనాలు సరాఫరా చేసింది. వాన కోసమే ఎదురు చూస్తున్నాం. – సుబ్బారెడ్డి, రైతు. పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేశాం ఖరీఫ్ సాగుకు అదును దాటిపోయి పొలాలు బీళ్లుగా మారాయి. తరువాత సీజన్లోనైనా పంటల సాగుకు భూమిలో సారవంతం పెంచేందుకు పచ్చి రొట్టవిత్తనాలు సిద్ధం చేశాం. దుక్కి చేయడానికి పదును లేకపోవడంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. వారం రోజులుగా వాతావరణం చల్లబడి వర్షం పడేటట్లు సూచనలు కనిపిస్తున్నా చినుకు రాలడంలేదు. రోజూ రాత్రిళ్లు రెండు, మూడు చినుకులు పడి అంతటితో సరిపెట్టుకుంటుంది. –మామిడిపూడి వెంకటేశ్వర్లు, రైతు, వాకాడు -
ఆహా ఏమి రుచి..తినరా మైమరిచి
సాక్షి, కర్నూలు : వర్షాకాలం వచ్చింది..దాని వెంటే మొక్కజొన్న పొత్తులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడివేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జూలై నుంచి సెప్టెంబర్ నెల వరకు లభించే మొక్క జొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా కర్ణాటక పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. అక్కడ వుండే నేలస్వభావంతో వాటికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. సీజన్ ఉపాధి.. మొక్కజొన్న పొత్తుల సీజన్ పలువురికి ఉపాధిగా మారుతుంది. ఇతర ప్రాంతాల నుంచి సైతం దిగుమతి చేసుకోవడంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకొని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో దుకాణం, తోపుడు బండిపై వెయ్యి పొత్తుల వరకు కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు. స్థానిక మార్కెట్‌యార్డుకు దిగుమతి అయిన మొక్కజొన్నపొత్తులను హోల్‌సేల్‌గా ఒక్కటి రూ.7 నుంచి రూ.8వరకు కొని రిటైల్‌గా అమ్ముతుంటారు. ఒక్కో పొత్తు ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 వరకు సైజును బట్టి అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండటంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఎకరం మొక్కజొన్న పంట రూ.50వేలు మొక్కజొన్న సీజన్ ప్రారంభం కావడంతో ఇక్కడి వ్యాపారులు రాయచూర్, నారాయణపేట పలు ప్రాంతాలకు వెళ్లి మొక్కజొన్న పంటను కొంటారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట ఎకరా కాపు రూ.50వేల వరకు వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి ధరని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది పంటకు తెగుళ్లు, చీడపీడలు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు శివారు ప్రాంతాల్లో కూడా మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. -
వానాకాలం.. జరభద్రం!
సాక్షి, పాలమూరు : పొద్దు పొడిచింది మొదలు చిమ్మచీకటి పడే వరకు పొలం పనుల్లో తలమునకలయ్యే రైతన్న జీవితం నిత్యం ప్రమాదాలమయం. రైతులు సాగు చేసిన పంటను నిత్యం చేలల్లో తిరుగుతూ పరిశీలించాల్సి ఉంటుంది. అందుకోసం పొలం గట్లపై తిరుగుతుంటారు. అలాంటప్పుడు పాములు, తేళ్లవంటి విష పురుగులతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఎదురవుతాయి. వరిలో, ఇతర పంటలలో కలుపు తీసే సందర్భాల్లోనూ విష సర్పాలు కాటువేసి చనిపోయిన ఘటనలు అనేకం. ఏవైపు నుంచి.. ఏ రూపంలో ఎప్పుడు ఎలా ప్రమాదం వచ్చి పడుతుందో తెలియదు. ఉదయం పనులకు వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరే వరకు భయమే. అలాంటి రైతన్నకు వర్షాకాలం మరింత క్లిష్టమైనదని చెప్పవచ్చు. ఈ క్రమంలో రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ప్రమాదం జరిగితే.. పాముకాటు ప్రమాదాలు సంభవించినప్పుడు అది ఏ పామో గుర్తించాలి. ఒకటి, రెండు కాట్లు ఉంటే విషపూరితమైంది. అంతకంటే ఎక్కువ కాట్లతో కనిపించే గాయం ఉంటే విషపూరితం కానిది. విషపూరితమైన పాము అయితే వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించాలి. ఉన్నచోట నుంచి పరుగెత్తకూడదు. ఎవరైనా వచ్చే వరకు ఓపిగ్గా ఉండాలి. తినడం, తాగడం లాంటివి చేయకూడదు. కాటు వేసిన భాగాన్ని కదిలించకుండా ఉంచాలి. సహాయకులు వచ్చిన తర్వాత కాటేసిన భాగాన్ని పరిశుభ్రమైన నీరు, సెలైన్ వాటర్‌తో పంపులాంటి ధారలా పైనుంచి గాయం పడినచోట పోయాలి. దాని వల్ల గాయం వద్ద ఉన్న రక్తం, విషపు చుక్కలు కారిపోతాయి. ఆ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. ► పాము కాటేసిన చోట తాడుతో లేక ఇతర గుడ్డముక్కలతోనైనా కట్టాలి. ఆ వెంటనే చికిత్సకు తరలించాలి. ►పాము కాటేస్తే మూఢనమ్మకాలను నమ్మి మంత్రం వేసిన నీళ్లు తాగడమో.. భూమిలో కాలుపెట్టి చికిత్స తీసుకోవడం లాంటివి చాలాచోట్ల చేస్తుంటారు. ►మూఢనమ్మకాలకు దూరం ఉండి తక్షణమే ఆస్పత్రికి వెళ్లాలి. ►పొలానికి వెళ్లిన సమయంలో చెట్ల పొదల్లో అడుగు పెట్టేది ఉంటే కాళ్లకు పెద్ద సైజులో ఉండే నల్లని బూట్లు ధరించాలి. ►పొదల్లో పనిచేసే సమయంలో చేతులకు గ్లౌజులు ధరించడం మంచిది. పిల్లలను పొదలు ఎక్కువగా ఉన్నచోట ఆడుకోవడానికి పంపించరాదు. ► పల్లెల్లో ఇళ్ల పరిసరాలు చుట్టూ చెట్ల పొదలు ఎక్కువగా ఉండనివ్వకుండా చూసుకోవాలి. పొలాల్లోనే అధికం.. పొలాల్లో ప్రధానంగా తాచుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్న రక్తపింజర సంచారం ఉంటుంది. ఎలుక కన్నాల్లో, పందికొక్కుల బొరియల్లో, చెదల పుట్టల్లో నివాసాలు ఏర్పాటు చేసుంటాయి. అక్కడే గుడ్డు పెట్టడమే కాకుండా పిల్లలను ప్రసవిస్తాయి. నాగుపాము, కట్ల, రక్తపింజరం వంటి కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదకరం. -
వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలంనాటికి కాళేశ్వరంప్రాజెక్టు ద్వారా పొలాలకు సాగునీరు అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో జరిగిన ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఈటల మాట్లాడారు. అంతకు ముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పైవిధంగా స్పందిం చారు. రైతుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతీ పంటకు గిట్టుబాటు ధర అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో ఎర్రజొన్నలు, మొక్కజొన్నకు డిమాండ్ లేని సమయంలోనూ రైతులు నష్టపోకుండా అత్యధిక ధర కు ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.వ్యవసాయానికి 24గంటల కరెంటు అందిస్తున్నామని, మోటారు కాలిపోయిందని ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రకుల పేదల రిజర్వేషన్ల బిల్లు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. ఆడంబరాలకు పోయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం అమాంతం పెంచేస్తోందని, చివరకు రెవెన్యూ లెక్కలు కుదరక తిరిగి తగ్గిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మహ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత మేర బడ్జెట్ పెట్టి పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని వారు కోరారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్న సమయంలో మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్సీ మహ్మద్ జాఫ్రీ తదితరులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. భావోద్వేగానికి గురైన చైర్మన్ స్వామిగౌడ్ శాసనసభ చివరి రోజు సమావేశాల్లో చైర్మన్ స్వామిగౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. వచ్చే నెలాఖరు లో తనతో పాటు పలువురు సభ్యుల పదవీ కాలం పూర్తికానుండటంతో ఆయన తన అనుభవాలను పం చుకున్నారు. పలు రంగాల్లో మేధావులతో జరిగిన అర్థవంతమైన చర్చలు తనకు సంతృప్తినిచ్చాయన్నా రు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. మండలి సభ్యుడిగా, చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. ఏడు గంటలు... నాలుగు బిల్లులు... ఈ నెల 22వ తేదీన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్ర, శని, సోమ మూడ్రోజుల పాటు సమావేశాలు జరగగా... ఏడు గంటల పాటు సభ కొనసాగింది. ఇందులో ఇరవై మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారు. నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. -
కొమ్ముకూర భలే రుచి
పశ్చిమ గోదావరి, కొయ్యలగూడెం : వర్షాకాలం ప్రారంభం కావడంతోనే గిరిజనులు ఆతృతగా ఎదురుచూసే వంటకం కొమ్ములు (వెదురు) కూర. వెదురు పిడాల నుంచి మొలిచే గెడల చివరి భాగాన్ని కోసి చిన్న ముక్కలుగా తరిగి వెదురు వంటకం తయారు చేస్తారు. ప్రస్తుతం ఏ గిరిజన గ్రామాల్లో చూసినా ప్రతి ఇంటా కొమ్ములు కూర వండుతుంటారు. ముక్కలుగా తరిగిన వెదురుకు శాఖాహారంగా, మాంసంతో కలిపి వండుతారు. అడవుల్లోకి వంట చెరకు కోసం వెళ్లే మహిళలు వస్తూ తప్పనిసరిగా వెదురు కొమ్ములను వెంట తెచ్చుకుంటారు. తంగెళ్లగూడెం, బిల్లిమిల్లి, వంకాబొతప్పగూడెం, కిచ్చప్పగూడెం, మర్రి గూడెం గ్రామాల్లోని మహిళలు ప్రస్తుతం కొమ్ము కూరల వంటకంపైనే దృష్టిసారిస్తున్నారు. రుచిగా ఉండే కొమ్ము కూర శరీరంలోని కొవ్వును వేగంగా తగ్గిస్తుందని వంకా బొతప్పగూడెం మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ పేర్కొన్నారు. కేవలం వర్షాకాలం మూడు నెలల్లో ఇవి విరివిగా లభిస్తాయని తెలిపారు. ఆవు కొమ్ములు మాదిరిగా అడుగున్నర పొడవున వెదురు పిడాల్లో ఇవి మొలుస్తుంటాయని ఆయన చెప్పారు. -
రెయిన్ ట్రీట్.. హెయిర్ కట్
ముసురుతో వాతావరణం చల్లగా ఉంది. ఇంతకుమించిన వెదర్ ఉండదనుకుంటూ వాకింగ్‌కి బయలుదేరింది రవళి. అర కిలోమీటరు నడిచిందో లేదో సడెన్గాకుంభవృష్టి. నిమిషంలో తడిసి ముద్దయింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి జుట్టుపొడిబారింది. కానీ మొత్తం చిక్కులే చిక్కులు. అప్పుడిక తల స్నానం చేసే టైమ్‌లేక ఆదరాబాదరా దువ్వేసి ఆఫీస్‌కి వెళ్లింది. ఇలాంటి అలవాట్లు జుట్టుకు ఎంతైనా హానికరం అంటున్నారు కేశాలంకరణ నిపుణులు. సాక్షి, సిటీబ్యూరో : ‘వాన రాకడ... కరెంటు పోకడ’ చెప్పలేం అన్నట్టుగా ఉండే ఈ సీజన్లో నెత్తిన కురిసే నీళ్లు... మన ముఖ సౌందర్యానికి కారణమయ్యే వెంట్రుకలకు హానికరంగా పరిణమిస్తుంటాయి. ఎడాపెడా తడవడం, పొడి బారడం... మళ్లీ తడవడం, పొడిబారడం తరచూ ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఈ సీజన్లో సహజం. అయితే దీని వల్ల జుట్టు చిక్కులు పడిపోవడం లాంటి సాధారణ సమస్యల నుంచి వెంట్రుకలు ఊడిపోవడం తదితర తీవ్రమైన సమస్యలూ వస్తాయని, వర్షాకాలం జుట్టుకు చేసే హాని అంతా ఇంతా కాదని అంటున్నారు కేశాలంకరణ నిపుణులు. దీనికి సంబంధించి వీరు ఇస్తున్న సూచనలివీ... ⇔ వాన నీరు మురికి, ఎసిడిక్‌గా ఉంటుంది. అందుకే వర్షంలో తడిసిన వెంటనే తలని శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా గంటల తరబడి, రోజుల తరబడి అలానే ఉంచుకుంటే జుట్టుకి హాని కలిగే అవకాశాలెక్కువ. ⇔ వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తలకు షాంపూ పెట్టుకోవాలి. మైల్డ్ డీప్ క్లీన్సింగ్ షాంపూ వాడితే మురికిని మూలాల నుంచి తొలగిస్తుంది. ⇔ వెంట్రుకల కుదుళ్లను సైతం శుభ్రపరిచి ఫంగల్ బ్యాక్టీరియా అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించే ప్యాంటీన్ ప్రొ–వి లాంటి షాంపూని తల ఉపరితలానికి పట్టేలా వినియోగించాలి. ⇔ జుట్టు పొడిబారుతుంది కాబట్టి నూనె పట్టించాలి. డీప్ కండిషనింగ్గా కూడా ఇది పనిచేస్తుంది. ⇔ ఈ సీజన్లో హెయిర్‌ని ముడివేసే స్టైల్స్ మంచిది కాదు. వర్షం నీరు నెత్తిపై నిల్వ ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. తప్పదనుకుంటే లూజ్ పోనీటెయిల్స్ లేదా బన్స్కు పరిమితమవ్వాలి. ⇔ వీలుంటే నాణ్యమైన వాటర్ ప్రూఫ్ జాకెట్ లేదా హుడీ (తల మీద నుంచి నడుము వరకు ఉండే కోట్)ని ధరించి బయటకు వెళ్లడం ఉత్తమం. ⇔ సరైన దువ్వెన, పళ్ల మధ్య తగినంత గ్యాప్ ఉండేది ఎంచుకోవాలి. దీనితో కుదుళ్ల నుంచి దువ్వడానికి అవకాశం ఉంటుంది. ⇔ అత్యధికంగా కండిషన్నర్ వాడొద్దు. కండిషనర్‌ని కేవలం వెంట్రుకల చివర్లు, లెంగ్తŠస్ మీద మాత్రమే అప్లయ్ చేయండి. ⇔ వెంట్రుకల కుదుళ్ల నుంచి శక్తివంతంగా మార్చడానికి ప్రొటీన్, ఐరన్ ఉండే ఆహారం తీసుకోవాలి. మ్యాకెరెల్, సాల్మన్ లాంటి చేపలు... వాల్నట్స్, పెరుగు, పాలకూర తదితర బాగా తీసుకోవాలి. ⇔ ఈ సీజన్లో హెయిర్ స్టైల్స్ మెయింటెయిన్ చేయడం సవాల్. అందుకే షార్ట్‌గా కత్తిరించుకుంటే బెటర్. జాగ్రత్తలు అవసరం... తల వెంట్రుకలకి వర్షాకాలం పరీక్ష లాంటిదని చెప్పాలి. ఈ సీజన్లో హెయిర్‌ని పరిరక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఒక్కోసారి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొంచెం కేర్ తీసుకుంటే ఈ సీజన్‌ని తేలిగ్గా దాటేయవచ్చు. – సృజన, కేశాలంకరణ నిపుణురాలు -
జలుబుకు ఏ సూప్ మంచిదంటే!
వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో బాధిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జులుబు, జ్వరం, దగ్గు సమస్యల ఉపశమనానికి... చికెన్ సూప్: ఉల్లికాడలు, ఉల్లిపాయలు, మిరియాల పొడి కలిపి తయారుచేసుకున్న చికెన్ సూప్ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇస్తుంది. మష్రూమ్/పాల కూర సూప్: శాకాహారులు పుట్టగొడుగులు, పాలకూరలతో సూప్‌లను తయారుచేసుకోవచ్చు. దీంట్లోనూ ఉల్లికాడలు, మిరియాలు, వెల్లుల్లి, జిలకర్ర కలిపి తయారుచేసుకొని సేవించాలి. ♦ సూప్‌లు ఏ సమయంలోనైనా వేడి వేడిగా తీసుకుంటే రుచిగానూ ఉంటాయి. అనారోగ్యసమస్యల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... ♦ రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ‘సి’ విటమిన్, యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ♦ ఈ సీజన్లో నీటి కాలుష్యం ఎక్కువ. వడకట్టడం, మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పెరుగు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. ♦ వారానికి ఒకరోజు లేదా 15 రోజులకొకసారి ఉపవాసం ఉండాలి. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా కాదు. ఆ రోజు మొత్తం కూరగాయలు, పండ్లు, పళ్ల రసాలు, నీళ్ల మీదే ఉండాలి. వేరే ఇతర ఆహార పదార్థాలేవీ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో మలినాలు తొలగి, జీర్ణవ్యవస్థ పనితీరు చురుకు అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా శాతం పెరిగి అనారోగ్యసమస్యలు దరిచేరవు. ♦ ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్‌లు ఈ కాలం చాలా మంచివి. ♦ ఈ కాలం మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. అలాగే – ఊపిరితిత్తులు, ముక్కుకు సంబంధించినవి, మలబద్దకం సమస్యలకు అవకాశాలు ఎక్కువ. రోజులో 2–3 లీటర్లు శుభ్రమైన నీళ్లు సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది. ♦ కాయగూరల్లో బీట్రూట్, క్యారెట్ వంటి సూప్‌లను ఎర్రకందిపప్పును ఉపయోగించి తయారుచేసుకోవాలి. ఇది సలాడ్‌లా తయారుచేసుకొని భోజనంలా కూడా తినవచ్చు. ∙టొమాటో రసం, టొమాటో పప్పు.. టొమాటోతో కూడిన వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యకరం. ♦ జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడుతూ ఉంటాయి. అందుకని జీర్ణకోశాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ కాలం అంత ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని విస్మరించకూడదు. – డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్ -
వానమ్మా.. వచ్చిపోమ్మా!
ఒంగోలు సబర్బన్: జిల్లా రైతన్న కంటతడి పెడుతున్నాడు. ఆకుపచ్చని చీరకట్టినట్టు పచ్చదనం పరుచుకోవాల్సిన పంట పొలాలు బోసిపోయి బీటలు వారి చినుకు కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక వైపు ప్రకృతి, మరో వైపు పాలకులు రైతన్న జీవితాలతో పరిహాసమాడుతున్నారు. గతేడాది సాగును సగానికి తగ్గించుకొని ఆత్మస్థైర్యం కోల్పోయిన కొంతమంది రైతులు ఆత్మహత్యల వైపు అడుగులేశారు. ఇంకొంత మంది వలసబాట పట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది. జూన్ 15 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతాంగం చినుకు కోసం ఆకాశం వైపు మోరెత్తుకొని చూస్తున్నారు. ఆకాశంలో మేఘాలు అలా కమ్ముకుంటున్నాయి.. రెప్పపాటులో తిరిగి మాయమవుతున్నాయి. మేఘాలు ఆకాశాన్ని కమ్ముకున్నప్పుడల్లా రైతాంగం ముఖాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంతలోనే నిరాశమిగిలుతోంది. వెంటనే ఎండలు మంటలు రేపుతున్నాయి. ఇది జిల్లాలోని రైతాంగం పరిస్థితి. చినుకు రాలుతుందో లేదోనన్న ఆందోళనలో రైతాంగం సతమతమవుతోంది. దానికి తోడు నకిలీ విత్తనాలు ఎక్కడ కొంపముంచుతాయోనన్న బెంగ రైతన్నను వెంటాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షాలు లేకపోవడంతో పంటలు వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నా వాటిని కొనుగోలు చేసి ఏం చేసుకోవాలని రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాగానే సాధారణంగా జూన్, జూలై మాసాల్లో పొలాలను సాగుకు సిద్ధం చేసుకునేందుకు ఉపక్రమిస్తారు. దుక్కులు దున్నటం, పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం చేసుకోవటం, విత్తనాలు, ఎరువులు సేకరించటం, కొత్త రుణాలతో ఊపిరి సలపని పనుల్లో సతమతమవ్వాల్సిన రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లుగా దుర్భిక్షమే జిల్లాను నాలుగేళ్లుగా దుర్భిక్షం వెంటాడుతూనే ఉంది. ఏటా జిల్లా మొత్తం కరువు కోరల్లో విలవిల్లాడుతూనే ఉంది. గతేడాదిలో జిల్లాలోని 56 మండలాల్లో చీరాల మండలం మినహా 55 మండలాలూ కరువు మండలాలే. తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లాను వెంటాడుతూ వచ్చాయి. భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. అటు సాగు, ఇటు తాగు నీటికి కొరత ఏర్పడింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటి పోయాయి. జిల్లాలో పూర్తి స్థాయిలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం కూడా వచ్చి జిల్లాలో పర్యటించి వెళ్లింది. జిల్లా కేంద్రం ఒంగోలులో జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కరువు బృందానికి ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిస్థితిని కళ్లకు గట్టారు. ఒంగోలు నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్లిన కరువు బృందం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పి మరీ జిల్లా నుంచి వెళ్లిపోయారు. అయినా ఇప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ప్రస్తుత ఖరీఫ్ సాధ్యం కాదన్న భయం రైతుల్లో ఏర్పడింది. అయినా గత బాధలు...కష్టాలు ఎలా ఉన్నా...ప్రతి సీజన్‌కు సమాయత్తం కావటం హలదారునికి కొత్తేమీ కాదు. ఖరీఫ్‌లో వరి పంట విస్తీర్ణం చాలా తక్కువ. మెట్ట పంటలు అధికంగా వేస్తారు. గతేడాది ఖరీఫ్ లక్ష్యంలో 50 శాతం కూడా విస్తీర్ణం సాగులోకి రాలేదు. వేసిన పంటలు కూడా వర్షాలు లేక దిగుబడి కూడా 30 శాతం కూడా రాలేదు. ఈ సంవత్సరం ఖరీఫ్ లక్ష్యం 2.28 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం. ఖరీఫ్‌లో ప్రధానంగా 70 వేల హెక్టార్లలో కందులు, 40 వేల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారు. వాటితో పాటు వరి, జొన్న, సజ్జ, మినుము, పెసరతో పాటు పలురకాల మెట్ట పైరులు వేస్తారు. ఇప్పటికే భూసార పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 3.61 లక్షల మట్టి నమూనాల పరీక్షల ఫలితాల పత్రాలను రైతులకు అందించారు. మరో 3.61 లక్షల మట్టి నమూనా ఫలితాలు అందించాల్సి ఉంది. 75 శాతం సబ్సిడీతో అందించేందుకు వ్యవసాయ శాఖ పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను అందించేందుకు 6,500 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. మూడు వేల క్వింటాళ్ల కంది, వేరుసెనగ, మినుము, పెసర విత్తనాలు కూడా సిద్ధం చేశారు. -
ఆపదొస్తే ఆగమే!
సాక్షి,సిటీబ్యూరో : భారీ వర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భారీ భవంతులు కూలి పోవడం వంటి విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందించే ‘విపత్తు నివారణ వ్యవస్థ’ నగరంలో అధ్వానంగా మారింది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునుగుతూనే ఉన్నాయి. జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం బండారీ లేఅవుట్.. గతేడాది రామంతాపూర్ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా నీటమునిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాకాలంలో మళ్లీ ఏప్రాంతాలు నీటమునుగుతాయోనని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా నగరంలో వరదనీరు సాఫీగా వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదు. నాలాలు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారాయి. ఈ కారణాల వల్లే భారీ వర్షం కురిస్తే వరద నీరు వెళ్లే దారిలేక ఇళ్లను ముంచెత్తుతోంది. విశ్వనగరంలో గంటకో సెంటీమీటరు చొప్పున వర్షం కురిస్తే 24 గంటల్లో మహానగరం నీట మునగడం తథ్యమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సుమారు 234 నీట మునిగే(వాటర్‌లాగింగ్) ప్రాంతాలు, సుమారు 300 బస్తీలు తరచూ నీటమునుగతున్నట్లు బల్దియా లెక్కలు వేసినా..నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ నివాసం ఉండే రాజ్‌భవన్, అసెంబ్లీ, అమీర్‌పేట్ మైత్రీవనం, ఖైరతాబాద్ తదితర ప్రధాన ప్రాంతాలు నీటమునిగే జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళిక కానీ, చేసిన పనులు కానీ లేవంటే అతిశయోక్తి కాదు. 2016 సెప్టెంబర్ నెలలో మహానగరంలో ఒకే రోజు సుమారు 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నిజాంపేట్ పరిధిలోని బండారీ లేఅవుట్ సహా పదికిపైగా కాలనీలు నీటమునిగాయి. వందలాది బస్తీల్లో ఇళ్లలోకి నీరుచేరింది. వారం రోజులపాటు ప్రధాన రహదారులు మోకాళ్లలోతున వరదనీరు నిలిచి అధ్వాన్నంగా మారాయి. ఏడాది గడిచినా ఈ దుస్థితిలో ఎలాంటి మార్పురాకపోవడం గ్రేటర్ దుస్థితికి అద్దం పడుతోంది. కాగితాలపైనే కిర్లోస్కర్ నివేదిక.. నగరంలో వరదనీటి కాలువల అధ్యయనం..విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై గతంలోనే కిర్లోస్కర్ కన్సల్టెంట్స్‌కు బాధ్యత అప్పగించారు. 2003లో నివేదిక నందించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అందుకు దాదాపు రూ. 264 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాత ఎంసీహెచ్ పరిధిలోని 170 చ.కి.మీ. ఉన్న నగరంలో మేజర్ నాలాల అభివృద్ధికోసం కిర్లోస్కర్ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రోలెవల్ వరకు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కిర్లోస్కర్ కమిటీకి సూచించారు. 2007 ఏప్రిల్‌లో నగర శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్‌గా ఏర్పటయ్యాక విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది. దీంతో గ్రేటర్ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ప్లాన్ ..మేజర్, మైనర్ వరదకాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరదనీటి సమస్య పరిష్కారానికి రూ. 6247 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులతో మేజర్ నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. సుమారు 390 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలకు ఆనుకొని ఉన్న సుమారు 9 వేల ఆక్రమ నిర్మాణాలను తొలగించాలి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉంది. మెట్రో నగరాల్లో విపత్తు స్పందన భేష్.. ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా మెట్రో నగరాల్లో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాటు చేసిన విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉంది. ఇందులో ఆయా నగరపాలక సంస్థలు, జలబోర్డులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపత్తు నిర్వహణ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తారు. విపత్తు సంభవించిన ప్రతిసారీ సంస్థ సభ్యులు ఆయా విభాగాలను అప్రమత్తం చేయడంతోపాటు సుశిక్షితులైన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపడతారు. వీరికి అవసరమైన సాధనాసంపత్తి అందుబాటులో ఉంది. ఏదేని భవంతి నేలమట్టమయిన వెంటనే విపత్తు స్పందనా దళం సభ్యులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడతారు. విపత్తును ఇలా ఎదుర్కొంటేనే మేలు.... నగరంలో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు, వాతావరణశాఖ, అగ్నిమాపక శాఖ, హెచ్ఎండీఏల సమన్వయంతో విపత్తు స్పందనా దళం ఏర్పాటు చేయాలి. నగర భౌగోళిక పరిస్థితిపై విపత్తు స్పందన దళానికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇందుకు సంబంధించిన మ్యాప్‌లు వారి వద్ద సిద్ధంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు రాకముందే మాక్‌డ్రిల్ చేసిన అనుభవం బృందానికి ఉండాలి. విపత్తు స్పందన దళానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలి. గ్యాస్‌కట్టర్లు, రెస్క్యూల్యాడర్లు, ప్రొక్లెయిన్లు, ఫైరింజన్లు, క్రేన్లు, అగ్నినిరోధక దుస్తులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్ఎయిడ్కిట్లు, అంబులెన్స్ తదితరాలు సొంతంగా ఉండేలా చూడాలి. నగరంలోని పురాతన భవనాల్లో ఉన్న సూక్ష్మ పగుళ్లు, భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు బార్క్(బాబా ఆటమిక్ రీసెర్చ్‌సెంటర్)సిద్ధంచేసిన రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి. నగరంలోని అన్ని నాలాలు, లోతట్టు ప్రాంతాలకు జీఐఎస్ పరిజ్ఞానం ద్వారా గుర్తించి మ్యాపులు సిద్ధంచేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాలు ఏర్పాటుచేయాలి. వర్షాకాలానికి ముందే వరదనీటి కాల్వలు, నాలాలు, భూగర్భ డ్రైనేజి లైన్లను పూడిక తీయాలి. వరద ముప్పున్న ప్రాంతాల్లో అత్యవసర మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తోడాలి. ఇళ్లలోకి నీరు ప్రవేశించకుండా చూడాలి. ప్రతి నాలాకు రక్షణ వలయం, నాలాకు ఆనుకొని ఉన్న బస్తీలకు రక్షణ గోడను, ఇసుకబస్తాలను ఏర్పాటుచేసి రక్షణ కల్పించాలి. నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. -
వానొస్తే.. వరద మొదలైతే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు కొత్త సమస్య మొదలవుతుందేమోనన్న ఆందోళన పట్టుకుంది. కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతుండటంతో.. బ్యారేజీలు, పంపుహౌజ్‌ల నిర్మాణం ఇప్పుడున్న వేగంతో కొనసాగడం సవాలుగా మారనుంది. ముఖ్యంగా గోదావరిలో వరద మొదలైతే.. మేడిగడ్డ సహా పలు బ్యారేజీల పనులు నిలిచిపోయే అవకాశం ఉండనుంది. ముఖ్యంగా మేడిగడ్డ పంపుహౌజ్ పరిధిలోని గ్రావిటీ కెనాల్ కింద చేపట్టాల్సిన ఉన్న నిర్మాణాలకు ఇబ్బందులు కలుగనున్నాయి. ఈ నేపథ్యంలో పనులను ముమ్మరంగా కొనసాగించేందుకు.. నిర్మాణ ప్రాంతాల్లో యంత్రాలు, కార్మికుల సంఖ్యను మరింతగా పెంచాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. వరుసగా అవరోధాలు.. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌజ్‌లను జూలై నాటికి పూర్తిచేసి ఆగస్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం సంకల్పించినా.. వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇటీవలి వరకు తీవ్రమైన వేసవి, నలభై డిగ్రీలకుపైగా ఎండలు ఒకవైపు.. కార్మికుల కొరత మరోవైపు పనులు జాప్యం కావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు వర్షాలు, గోదావరి వరద భయం వెన్నాడుతోంది. పనులు ఇదే వేగంతో ముందుకు సాగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మొత్తంగా 85 గేట్లు బిగించే పనులను 11 బ్లాక్‌లుగా విడగొట్టి చేపట్టారు. ఇందులో 35 గేట్లు బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కాంక్రీట్ పనులు నెమ్మదించాయి. ఇక ఇక్కడ గరిష్టంగా 10 లక్షల క్యూసెక్కుల మేర వరద రావచ్చన్న అంచనాతో 44 గేట్ల మేర నిర్మించే 4వ బ్లాక్‌ను ప్రవాహానికి వీలుగా ఖాళీగా ఉంచారు. ఒకవేళ అంతకు మించి వరద వస్తే మిగతా బ్లాక్‌ల పరిధిలోని గేట్ల బిగింపు ప్రక్రియకు ఇబ్బంది ఎదురవక తప్పని పరిస్థితి. నెమ్మదించిన ఫ్లడ్ బ్యాంకుల పనులు ఇక గోదావరి వరదను నివారించేందుకు నదికి ఇరువైపులా ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణాన్ని చేపట్టారు. అందులో మహారాష్ట్ర వైపునే 10 కిలోమీటర్ల మేర ఫ్లడ్ బ్యాంకులు నిర్మించాల్సి ఉంది. అందులో 5 కిలోమీటర్ల మేర నిర్మాణం అత్యవసరం. నదిలో వరద మొదలవడానికి ముందే ఆ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నా.. ఇప్పటికే మొదలైన వర్షాల కారణంగా నల్లమట్టి తరలింపు, రివిట్మెంట్ పనులు నెమ్మదించాయి. అటు తెలంగాణ వైపున 6 కిలోమీటర్ల మేర ఫ్లడ్‌బ్యాంక్ నిర్మించాల్సి ఉండగా.. 5 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు కూడా వర్షాలతో ఇబ్బంది ఎదురవుతోంది. మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నా.. మేడిగడ్డ బ్యారేజీ పంపుహౌజ్ పరిధిలో నదిలోకి నీళ్లు రాకముందే డ్రాఫ్ట్ ట్యూబ్‌లు, హెడ్‌రెగ్యులేటరీ గేట్లు, బ్రెస్ట్ వాల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే వర్షాలు మొదలై నీరు వస్తుండటంతో.. ప్రత్యేకంగా మోటార్లు పెట్టి ఆ నీటిని తోడేస్తున్నారు. వర్షాలు పెరిగితే ఇక్కడి పనులు ఆలస్యం కానున్నాయి. ఇక 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనుల్లో 90 శాతం పనులు పూర్తికాగా.. మరో 12 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వాల్సి ఉంది. ఈ కెనాల్ పరిధిలో పెద్దవాగును దాటేందుకు 29 నిర్మాణాలు (స్ట్రక్చర్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 24 పురోగతిలో ఉన్నాయి. అయితే వర్షాలు పెరిగి పెద్దవాగులో నీటి ప్రవాహం మొదలైతే.. 9 అండర్‌టన్నెల్ నిర్మాణాల పనులు ఆగిపోనున్నాయి. అన్నారం, సుందిళ్ల వద్దా ఇదే పరిస్థితి అన్నారం బ్యారేజీలో మట్టిపని పూర్తికాగా.. 11 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులకుగాను 1.19 లక్షల క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉంది. ఇక్కడ 66 గేట్లకుగాను 45 గేట్లను సిద్ధం చేయగా.. అందులో 18 గేట్ల బిగింపు పూర్తయింది. అయితే వర్షాలతో కాంక్రీట్ పనులకు ఆటంకం ఏర్పడుతుండటంతో.. మిగతా గేట్ల తయారీ, బిగింపు పనుల వేగం పెంచాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 క్రేన్లతో పనులు చేస్తుండగా.. మరో 8 క్రేన్లు అదనంగా తెప్పించి పనులు చేయాలని సూచించారు. ఇక సుందిళ్ల పరిధిలో 10.09 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనికిగాను.. 8.53 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది. మిగతా పనిని జూలై 15 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక్కడ 74 గేట్లకు గాను 64 గేట్లు సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 17 గేట్లనే బిగించారు. ఇక అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలోనూ ఫ్లడ్ బ్యాంకుల పనులు చేయాల్సి ఉంది. వర్షాలు, వరద కారణంగా ఆటంకాలు ఎదురైతే.. నిర్మాణ పనులు ఆగస్టు వరకు కొనసాగే అవకాశముందని, సెప్టెంబర్ వరకు నీళ్లిచ్చే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వానాకాలం వేసవి
అనంతపురం అగ్రికల్చర్: వర్షాకాలంలోనూ భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో కొద్ది రోజుల పాటు జిల్లా అంతటా వాతావరణం చల్లబడింది. అయితే ఆ వెంటనే ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రిళ్లు ఉక్కపోతను ప్రజలు భరించలేకపోతున్నారు. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలి విసుగు తెప్పిస్తోంది. గురువారం శింగనమల మండలంలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పామిడి, యల్లనూరు, యాడికి, శెట్టూరు, కూడేరు, నార్పల, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, పుట్లూరు, కనగానపల్లి, బెళుగుప్ప, చెన్నేకొత్తపల్లి, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుత్తి, ధర్మవరం, పెద్దవడగూరు మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా మండలాల్లో 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 22 డిగ్రీలు ఉన్నాయి. గాలిలో తేమ ఉదయం 77 నుంచి 92 శాతం.. మధ్యాహ్నం 42 నుంచి 52 శాతం మధ్య రికార్డు అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాల తర్వాత గాలిలో తేమ శాతం పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరగడం వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు తెలిపారు. -
వానాకాలం.. విష సర్పాలతో జాగ్రత్త !
♦ ఇది విష పురుగులు కాటేసే సమయం ♦ వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు ♦ జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలకు రక్షణ రొళ్ల : వర్షాకాలం ప్రారంభం కాగానే ఖాళీ స్థలాలు, నీటిమడుగుల వద్ద, గడ్డిమొక్కలు ఉన్న ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటాయి.. కుంటలు, పశువుల పాకలు, గుబురు ప్రదేశాలు, గడ్డి వాములు, పేర్చిన కట్టెలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో విష పురుగులు సంచరిస్తుంటాయి. రాత్రనకా పగలనకా పంట పొలాల్లో తిరిగే రైతన్నలు తరచుగా పాము కాటుకు గురవుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్త (ఏ మరపాటుగా) ఉన్నా అవి కాటేసే ప్రమాదం ఉంది..ముఖ్యంగా రైతులు,కూలీలు అటవీ ప్రాంతాల్లో తిరిగేవారు, పొలాల వద్ద నివాసం ఉంటున్నవారు..ఖాళీ ప్రదేశాలకు సమీపంలో ఉంటున్న వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యాధికారులు, వ్యవసాయాధికారులు చెప్తున్నారు. పాము కాటేసే సమయాలు ఇవే : వర్షాకాలంలో ప్రధానంగా గ్రామీణప్రాంతాల్లో విషపురుగులు, పాములు అధికంగా సంచరిస్తుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి కాటు వేస్తాయి. వర్షాకాలంలో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, పాముకాటుకు గురయ్యే ప్రమాదాలు అనేకం ఉంటాయి. పాములు కూడా గుడ్లను పొదిగి పిల్లలను లేపే సమయం. కప్పలు కూడా బయటకు వచ్చే సమయం వర్షాకాలమే కావడంతో వాటిని వేటాడేందుకు పాములు సంచరిస్తుంటాయి. పొలం గట్టు, అటవీ ప్రాంతాల్లో, పొదల్లో ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ పాములు ప్రమాదకరం : కట్లపాములు, రక్తపింజర, తాచుపాములు, నీటి పాములు, తేళ్లు, జెర్రెలు ప్రమాదకరం. వాటి కాటుకు గురైన బాధితులకు సరైన సమయంలో వైద్యం అందకపోతే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తాచుపాము, నాగుపాము, కట్లపాము కాటేస్తే వాటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపిరితిత్తులపై పని చేస్తుంది. హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుండి రక్తం వస్తుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు. ఎలా గుర్తించాలి? పాము కాటు శరీరంపైన పడిందా లేక బట్టల పైన పడిందా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించాలి. శరీరం పైన కాటు వేస్తే ఎన్ని గాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. ఏం చేయాలి? ⇔ కాటు వేసిన శరీర భాగం నుంచి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగకుండా పై భాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టాలి. దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. దీంతో పాటు పాము కాటుకు గురైన వ్యక్తి నడవడం, పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ⇔ పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల గాయం మరింత పెద్దదై విషం చర్మంలోకి, చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరతిగతిన గుండెకు చేరుతుంది. జాగ్రత్తలు పడాల్సిన విషయాలు.. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తిరిగే వారు, అక్కడే నిద్రించే వారు వెంట లైటు(లాంతరు) ఉంచుకోవాలి. పాములు కిరోసిన్, పెట్రోలు వాసన భరించలేవు. ఎక్కువగా ఉన్నచోట వీటిని ఉపయోగిస్తే మంచిది. రైతులు,కూలీలు రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు వేసుకోవడం, గడ్డి పని చేసే వారు చేతికి రబ్బరు తొడుగులు తొడుక్కోవడం మంచిది. నివాసాల చుట్టూ ముళ్ల పొదలు లేకుండా చూసుకోవాలి. ప్రథమ చికిత్స ఇలా చేసుకోవాలి.. : ⇔ పాము కాటు వేసిన పైభాగంలో వెంటనే రక్త ప్రసరణ ఆడకుండా బిగించి తాడుతో కట్టి వేయాలి. కాటు వేసిన శరీర భాగాన బ్లేడుతో గాయం చేసి, రక్తం కారకుండా జాగ్రత్త పడాలి. ⇔ పాము కాటుకు గురైన వ్యక్తి ముందుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పక్కన మరో వ్యక్తి ఉంటే బాధితుడికి ధైర్యం చెప్తూ ఉండాలి. ⇔ కాటు వేసిన పాము అంతకు ముందు ఆహారం తిన్నా.. మరో జీవిని కాటు వేసినా విషం తీవ్రత తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ⇔ పాము కాటు వేసిన వ్యక్తికి ఆహారం ఇవ్వ కూడదు, నడిపించకూడదు.పరుగు పెట్టించరాదు. ⇔ నాటు మందు, మాత్రలు అని కాలయాపన చేయకుండా వెంటనే దగ్గరలోని వైద్యశాలకు తరలించాలి. ⇔ పాము కాటుకు గురైన వ్యక్తిని నిద్ర పోకుండా చూసుకొని, కదిలించకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. పాములు కాల్వగట్లు, పొదలు, గడ్డి వాములు, పొలం గట్లు, పశువుల పాకలు, పాడుబడిన ఇళ్లు, పెంట దిబ్బల్లో ఎక్కువగా విష పురుగులు సంచరిస్తుంటాయి.రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటకు వచ్చి బల్లులు, ఎలుకలు, కప్పలు, తొండలను పట్టుకుని ఆరగిస్తాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కుగా ఉన్న చోట పాములు కూడా ఎక్కువ శాతం తిష్టవేసి ఉంటాయి. పాములకు చెవులు లేనప్పటికీ వాటి శరీరం కింద భాగాన ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్ద ప్రకంపనలను గ్రహిస్తుంటాయి. వేడి రక్తం ప్రవహించే జంతువులు, మనుషులు సమీపంలోకి వచ్చినప్పుడు వెంటనే వాటిని గుర్తించి కాటు వేస్తాయి. పంట పొలాల్లో తిరిగే పాములు చాలా ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి. పాములు ఏకాంతానికి భంగం కలిగినప్పుడు,ప్రాణ భయం ఉన్నప్పుడు,ఎవరైనా వాటిపై కాలు మోపినప్పుడు అవి వెంటనే కాటు వేసే ప్రమాదం ఉంది. -
ఈ పాలసీలు... వర్షాలకు పనికొస్తాయ్
♦ డెంగీ, మలేరియా తరహా వ్యాధులకు ప్రత్యేక పాలసీలు ♦ మోటారు వాహనాలకూ వర్షాలతో నష్టమే ♦ తక్కువ ప్రీమియంతోనే వీటికి కవరేజీ వర్షాకాలం వ్యాధుల సీజన్. దోమల సంతతి బాగా పెరిగేది ఈ కాలంలోనే. వీటికి తోడు వైరస్ల రూపంలో ఎన్నో వ్యాధులు తరుముకొస్తుంటాయి. ఈ సమయంలో ఆస్పత్రి పాలైతే బిల్లు కూడా భారీగానే ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతీసే కొన్ని వ్యాధులకు ప్రత్యేకమైన పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, వర్షాకాలం మోటారు వాహనాలకు కూడా నష్టాలు తెచ్చే కాలమే. ఈ తరహా నష్టాల నుంచి రక్షణ కల్పించేందుకు మోటారు వాహన పాలసీలు సైతం ఉన్నాయి. పెరుగుతున్న డెంగీ, మలేరియా క్లెయిమ్‌లు ఏటా వర్షకాలంలో డెంగీ కేసులు చెప్పుకోతగ్గ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. బీమా కంపెనీలకొచ్చే డెంగీ క్లెయిమ్‌లు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్క ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వరకే చూసుకుంటే 2013–14లో 34 క్లెయిమ్‌లు రాగా, 2016–17లో వీటి సంఖ్య 943కు పెరిగింది. మలేరియా, డెంగీ లేదా మరొకటి కావచ్చు... ఈ తరహా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని, వీటికి సంబంధించి క్లెయిమ్‌లు కూడా పెరిగిపోతున్నాయని బీమా కంపెనీలు చెబుతున్నాయి. అసలు డెంగీ, మలేరియా తదితర వ్యాధులక్కూడా సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు కవరేజినిస్తుంటే ప్రత్యేకమైన పాలసీల అవసరమేంటన్న సందేహం రావచ్చు. కవరేజి ఉంటుంది కానీ... వీటికి కనీసం 24 గంటల పాలు ఆస్పత్రిలో చేరాలి వంటి నిబంధనలుంటాయి. ఔట్ పేషెంట్ విభాగంలో వైద్య సలహా పొంది మందులతో చికిత్స తీసుకుంటే ఈ తరహా పాలసీలద్వారా పరిహారం దక్కదు. అటువంటి సమయాల్లో విడిగా ప్రత్యేకమైన వ్యాధులకు కవరేజినిచ్చే పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. వైద్య బీమా పాలసీల్లో కొన్ని ఔట్ పేషెంట్ చికిత్సలకూ కవరేజి ఇస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ తరహా పాలసీ తీసుకుని ఉంటే విడిగా ప్రత్యేక పాలసీ అవసరం పడదు. డెంగీ కేర్ అపోలో మ్యునిచ్ ‘డెంగీ కేర్’ పాలసీ డెంగీ కారణంగా ఆస్పత్రి పాలైతే రూ.50,000 వరకు... ఔట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు రూ.10,000 వరకు పరిహారం చెల్లిస్తోంది. ప్రీమియం రూ.444 మాత్రమే. ఏ వయసు వారికైనా ఇంతే. వయసు, ఇతర అంశాల ఆధారంగా ప్రీమియంలో మార్పు లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కన్సల్టేషన్ ఫీజులు, ఇంట్లో తీసుకునే నర్సింగ్ సేవలు, ఫార్మసీ వ్యయాలకు పరిహారాన్ని గరిష్ట బీమా పరిమితి మేరకు చెల్లిస్తుంది. ఆస్పత్రిలో షేర్డ్ రూమ్ ఆప్షన్ ఎంచుకుంటే వైద్యేతర వ్యయాలను కూడా చెల్లిస్తుంది. రూ.లక్ష కవరేజీ పాలసీని కూడా అందిస్తోంది. దీనికి ప్రీమియం రూ.578. డెంగీ షీల్డ్ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ డెంగీ షీల్డ్ కవరేజి కూడా ఇలాంటిదే. డెంగీ ఫీవర్ వచ్చిందని పరీక్షల్లో నిర్ధారణయితే ఏకమొత్తంగా పరిహారాన్ని చెల్లించేస్తుంది. ప్లేట్లెట్ కౌంట్ 1,00,000 కంటే తక్కువకు పడిపోవడం, హెమటోక్రిట్ సాధారణ స్థాయికి 20 శాతానికి పైగా పెరిగిపోవడం, డెంగీ వచ్చినట్టు ఫిజీషియన్ నిర్ధారించడం వంటి కొన్ని షరతులకు లోబడి పరిహారం చెల్లిస్తుంది. అదే సమయంలో కనీసం 48 గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాలన్న షరతులు కూడా ఉన్నాయి. రూ.25,000 కవరేజికి ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ.365. ప్రత్యేకమైన ఈ తరహా పాలసీలు చౌకగా ఉండడంతోపాటు పరిహారం కోసం క్లెయిమ్ ప్రక్రియ సులభంగా ఉంటుందనేది డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎండీ అనూప్పబ్బి మాట. వాహనాలకు వర్షాకాల బీమా వర్షాకాలంలో రహదారులు చెరువుల మాదిరిగా కనిపించే దృశ్యాలు నగరాల్లోని వారికి అనుభవమే. రోడ్లపై రెండు మూడు అడుగుల మేర నీరు ప్రవహించడం వల్ల వాహనాల ఇంజన్లలోకి నీరు వెళ్లి నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక, భారీ గాలి వాన సమయాల్లో చెట్లు విరిగి వాహనాలపై పడితే... వర్షంలో ముం దున్న వాహనం సరిగా కనిపించక వెనుక నుంచి ఏ కారో, లారీయో వచ్చి ఢీకొట్టడం వల్ల కూడా వాహనానికి నష్టం ఏర్పడొచ్చు. నిజానికి ఈ తరహా క్లెయిమ్స్ బీమా కంపెనీలకు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో ఇంజన్ ప్రొటెక్ట్ అక్కరకు వస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని షరతులు కూడా ఉంటాయి. వాహనం పూర్తిగా నీటిలో మునిగి ఇంజన్ ఆగిపోతే... స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించకూడదు. దీనివల్ల ఇంజన్ దెబ్బతిని పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ఇది భారీ వ్యయంతో కూడుకున్నది. అందుకే ఈ షరతులను కంపెనీలు విధిస్తుంటాయి. వర్షపు నీరు కారణంగా ఇంజన్‌కు, ఇంజన్ భాగాలకు వాటిల్లే నష్టానికి ఇంజన్ ప్రొటెక్ట్ పాలసీలో పరిహారం లభిస్తుంది. ఈ పాలసీకి ప్రీమియం వాహనం విలువలో 0.2 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటుంది. వాహనం వయసు, బ్రాండ్‌ను బట్టి ఎంత శాతమన్నది కంపెనీ నిర్ణయిస్తుంది. కారు పాడైతే మొత్తం విలువ వర్షపు నీటిలో మునిగి తిరిగి రిపేర్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడితే వాహనం కొనుగోలు విలువ ఎంత ఉంటే ఆ మేర చెల్లించే పాలసీలు కూడా ఉన్నాయి. రహదారిపై ఆగిపోతే... తరచూ ప్రయాణాలు చేసే వారికి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజి పాలసీ ఉపయుక్తంగా ఉంటుంది. వాహనం ఉన్నట్టుండి ఆగిపోతే, ఆ ప్రదేశానికే వచ్చి సర్వీస్ అందించడం ఇందులోని సౌలభ్యత. బ్యాటరీ జంప్‌స్టార్ట్, టైర్ మార్పిడి, ఇంధనం నింపడం తరహా సేవలూ పొందొచ్చు. అక్కడికక్కడే సరి చేయలేని సమస్య అయితే ప్రత్యామ్నాయంగా మరో కారును ఏర్పాటు చేయడం లేదా రిపేర్ చేసే వరకూ హోటల్లో విడిది ఏర్పాటు చేయడం వంటి సేవలను అందుకోవచ్చు. కాంప్రహెన్సివ్ మోటారు పాలసీలు కొన్ని రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో కలిసి వస్తున్నాయి. ప్రీమియం ఎంత..? ఉదాహరణకు... హోండా అమేజ్ ఈఎంటీ 2016 మోడల్‌కు ఢిల్లీలో ఈడీవీ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ) రూ.4,06,324గా ఉంటే, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ కాంప్రహెన్సివ్ మోటారు ఇన్సూరెన్స్ పాలసీలో ఎటువంటి యాడాన్స్ లేకుండా రూ.11,423 ప్రీమియం చార్జ్ చేస్తోంది. యాడాన్స్ కూడా కలిపితే ఇది రూ.14,910 అవుతోంది. రోడ్డు సైడ్ అసిస్టెన్స్, జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్ట్ అన్నవి యాడాన్స్. అదే బజాజ్ అలయాంజ్లో అయితే యాడాన్స్ లేకుండా ప్రీమియం రూ.13,117 కాగా, యాడాన్స్ కూడా కలుపుకుంటే రూ.17,567కు పెరుగుతోంది. -
వర్షం అంటే భయం వేస్తోంది: కేటీఆర్
వర్షాకాలం అంటేనే ఒక రకంగా భయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు పడకపోయినా పర్వాలేదని, వర్షం పడితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచే ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన 70 మినీ జెట్టింగ్ మిషన్లను ప్రారంభించారు. సోమవారం నుంచే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మ్యాన్‌హోల్స్‌ను మాన్యువల్‌గా శుభ్రం చేయడాన్ని ఇక మీదట పూర్తిగా ఆపేస్తామని, దానికి బదులు ఈ మిషన్ల ద్వారా శుభ్రం చేయిస్తామని అన్నారు. సివరేజి వ్యవస్థ మొత్తం మారాలంటే రూ. 11 వేల కోట్లు అవసరం అవుతాయని ఆయన చెప్పారు. త్వరలోనే వర్షాలు రాబోతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. -
నగర ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు
- వర్షాకాల సమస్యలపై అప్రమత్తం - సీజన్ ముగిసే వరకు సిబ్బంది సెలవులు రద్దు - వివిధ విభాగాల అధికారులతో కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: నగరంలో గత వర్షా కాలంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా తగిన ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసే వరకు జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖల్లో అధికారులు, సిబ్బందికి సెలవుల్ని రద్దు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల ప్రణాళిక) పనులపై వివిధ శాఖల అధికారులతో శనివారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షా కాలంలో డ్రైనేజీ, నాలాల్లో పడి మరణించే ఘటనలు జరగడానికి ఇక వీల్లేదని, వాటిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈసారి ఎలాంటి ప్రాణనష్టం జరిగినా అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రోడ్లపై గుంత కనపడకూడదు... రోడ్లపై ఎక్కడా గుంతలు కనపడకూడదని సీఎం ఆదేశించారని కేటీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగా మూడు వారాల్లో నగర రోడ్లపై గుంత కనపడకుండా చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. గత వర్షాకాలంలో ప్రజల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి వాటికి ఆస్కారం లేకుండా నాలుగు నెలలుగా ఉమ్మడి సమన్వయ గ్రూప్ ఏర్పాటు చేసి, ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విపత్తు నివారణ సెల్... నగరంలో 2010 శిథిల భవనాలను గుర్తించగా, వాటిల్లో 1089 భవనాలను కూల్చివేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మిగతా వాటికి కూడా నోటీసులిచ్చి కూల్చివేతలు పూర్తిచేయాలని మంత్రి సూచించారు. నాలాలపై ప్రధాన అడ్డంకిగా ఉన్న 887 నిర్మాణాలను కూడా కూల్చివేయాలన్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా విపత్తు నివారణ సెల్‌లను ఏర్పాటు చేయాలన్నారు. నెలకోమారు నిర్వహిస్తున్న సిటీ కన్జర్వెన్స్ సమావేశాలను ఇకపై 15 రోజులకోమారు ఏర్పాటు చేయాలన్నారు. 40 వేల ఇళ్ల టెండర్లు పూర్తి... జీహెచ్ఎంసీ పరిధిలో 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మరో 20 వేల ఇళ్ల టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి తీరతామని పునరుద్ఘాటించారు. ఎస్సార్డీపీ పనుల వేగాన్ని పెంచాలన్నారు. ఇది ‘ఎగ్జిక్యూషన్’ సంవత్సరం... నగరంలో పెద్దయెత్తున ఎస్సార్డీపీ, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ఇతర భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న మంత్రి... ఈ ఏడాదిని ‘ఇయర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్’గా అభివర్ణించారు. రెవెన్యూ వసూళ్లలో జీహెచ్ఎంసీ దేశంలోనే ప్రశంసనీయమైన అభివృద్ధి సాధించడంపై అభినందించారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మునిసిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. అన్ని ఫిర్యాదులకూ ‘100’ నగర పరిధిలో ఎలాంటి ఫిర్యాదులకైనా ప్రస్తుతం ఉన్న వివిధ నంబర్ల స్థానంలో ప్రజలకు సౌకర్యంగా ఉండేలా 100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ చెప్పారు. రోడ్లు, సివరేజీ ఇంజినీరింగ్ మరమ్మతుల్లో పాల్గొనే కార్మికులకు చేతి గ్లౌజులు, బూట్లు తదితర రక్షణ పరికరాలను విధిగా అందజేయాలని స్పష్టం చేశారు. నీరు నిలిచే 220 ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రి దృష్టికి తేగా, ట్రాఫిక్ పోలీసులతో కలిసి మరోమారు సర్వే చేసి వాటి పరిష్కారానికి మంగళవారం లోగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. -
నీటి మట్టాలు పడిపోతున్నాయ్!
శ్రీశైలంలో ఇప్పటికే పడిపోయిన కనిష్ట నీటిమట్టం నాలుగు అడుగులు దాటితే సాగర్‌కూ అదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణకి ప్రధాన నీటి వనరుగా ఉన్న కృష్ణా నదిలో ఈ ఏడాది నీటికి కటకట తప్పేలా లేదు. వర్షాకాలం ఆరంభానికి మరో నాలుగు నెలల ముందే కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు అడుగంటి పోవడం కలవర పరుస్తోంది. ఇప్పటికే ఉన్న నీటినంతా సాగు, తాగు అవసరాలకు వాడేయడంతో శ్రీశైలంలో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోగా, మరో నాలుగు అడుగులు దాటితే నాగార్జునసాగర్‌కు అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినా, సాగర్‌లోకి పెద్దగా నీటి ప్రవాహాలు రాలేదు. ఎగువన శ్రీశైలానికి వచ్చిన నీటిని ఇష్టం వచ్చినట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడేయడంతో ఆ ప్రభావం సాగర్‌పై పడింది. దీంతో ప్రస్తుతం సాగర్‌లో నీటినిల్వ 590 అడుగులకుగానూ 514 అడుగులకు పడిపోయింది. ఈ మట్టంలో ప్రస్తుతం 138.56 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా, కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన లభ్యత ఉన్న నీరు 7.9 టీఎంసీలు మాత్రమే. దీంతో నాలుగు అడుగులు దాటితే చాలు ఇక్కడ కనీస నీటిమట్టానికి దిగువన నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే శ్రీశైలంలో 885 అడుగులకుగానూ నీటిమట్టం 824.7 అడుగులకు పడిపోయింది. ఇక్కడ కనీస నీటిమట్టం 834 అడుగులే అయినప్పటికీ అవసరాల కోసం దిగువకు వెళ్లి నీటిని వాడేస్తున్నారు. ఇక్కడ మరో నాలుగు అడుగుల వరకు అంటే 820 అడుగుల వరకు నీటిని తీసుకునే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. లభ్యత నీరు ఇలా ఉంటే రాష్ట్రాల అవసరాలు మాత్రం భారీగానే ఉన్నాయి. రాష్ట్రానికి తాగునీటికే నెలకు 2 నుంచి 4 టీఎంసీల చొప్పున మరో 15 టీఎంసీల మేర అవసరం ఉంటుంది. ఇక ఏపీ ఇప్పటికే తనకు రావాల్సిన వాటా కింద కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద 3 టీఎంసీలు వదలాలని పట్టుపడుతోంది. దీనికి వత్తాసుగా కృష్ణా బోర్డు సైతం ఏపీ వాటా నీటిని విడుదల చేయాలని తెలంగాణపై ఒత్తిడి పెంచుతోంది. అసలే నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ఈ ఒత్తిళ్లు మరింత తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. అవసరాలు ఇదే మాదిరి ఉంటే గతేడాది మాదిరే వీలైనంత దిగువకు వెళ్లి నీటిని తోడుకోవాలనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలు ఉన్నాయి. -
వర్షాకాలం ఏకరువు
ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలంలోనూ కరువుఛాయలు కమ్ముకున్నాయి. గత ఏడాది అధిక వర్షాలు కురిసి చెరువు నిండి, భూగర్భజలాలు పెరిగినా నేడు అవి అనూహ్యరీతిలో పడిపోయాయి. చినుకు జాడ కరువైంది. ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. వాతావరణం పొడిబారిపోయింది. వానలు పడుతాయోలేదోనన్న అనుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ స్థితిపై నిపుణుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం. యూనివర్సిటీక్యాంపస్: అక్టోబర్ నెల వర్షాలకు బాగా అనుకూలమైన మాసం. ఈ నెలలో బాగా వర్షం కురుస్తుంది. అంతే కాకుండా ఈనెల 30న దీపావళి. తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అంటే దాదాపు చలికాలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ దశలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాలి. మంచి వర్షాలు కురవాల్సిన సీజన్ ఇది. అయితే వర్షపు జాడ కనించడంలేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ వర్షపాతం కన్నా చాలా తక్కువ వర్షపాతం పడింది. ఆగస్టు నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 117.4 మిల్లీ మీటర్లు అయితే 22.5 మిల్లీ మీటర్లు మాత్రమే వర్షం పడింది. సెప్టెంబర్‌లో 141.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా కేవలం 36.4 మి.మీ మాత్రమే వర్షం పడింది. అక్టోబర్‌లో ఇప్పటివరకు 118.9 మిమీ వర్షపాతం పడాల్సి ఉండగా, ఇప్పటివరకు 23.9 మి.మీ మాత్రమే కురిసింది. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 558.3 మిల్లిమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా కేవలం 366.1 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైం ది. జూన్, జూలై మాసాల్లో వర్షాలు బాగా పడినప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వర్షాలు సరిగా పడడం లేదు. ఇకపోతే ఎం డలు వేసవిని తలపిస్తున్నా యి. సాధారణంగా సెప్టెం బర్, అక్టోబర్‌లో 30 సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా ప్రతిరోజూ 36 సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. గత మంగళవారం 37.5 సెంటీగ్రేడ్ల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిని తలపిస్తుం దని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పడప్పు డు మేఘావృతం అయినప్పటికీ వర్షం పడలేదు. బాగా వర్షాలు కురవాల్సిన పరిస్థితుల్లో వర్షం పడకపోవడం, ఉష్ణోగ్రత పెరగడం, వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడంపై శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు ఏమంటున్నారంటే... వాతావరణ అసమానతల వల్లే... ప్రాంతీయ వాతావరణంలో అసమానతలు(రీజనల్ వార్మింగ్) వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. ఒక్కసారిగా 4,5 కి.మీ పొడవునా చెట్లు లేకపోవడం, చెట్లు నరికి వేయడం, తడి, పొడి చెత్తను 2,3 నెలల పాటు నిల్వ చేసి ఒకేసారి కాల్చివేయడం, గ్రీన్హౌస్ ప్రభావం కన్పిస్తుంది. వాతావరణంలో మిథేన్, కార్బన్డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల వాతావరణంలో వేడెక్కి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. అంతే కాకుండా కరువు పరిస్థితుల వల్ల పంటలు వేయకుండా బీడు భూములు ఉండడంతో ఈ పరిస్థితి సంభవిస్తుంది. ముఖ్యంగా శని, ఆది వారాల్లో వాహనాల వినియోగం ఎక్కువగా ఉండి అవి విడుదల చేసే వాయువుల వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. - ప్రొఫెసర్ వైవీ . రామిరెడ్డి, రసాయన శాస్త్ర విభాగం, ఎస్వీయూ వాహనాల కాలుష్యం వల్ల... మోటార్ వాహనాల వినియోగం పెరిగింది. వీటి నుంచి వెలువడే వాయువుల వల్ల వాతావరణంలో క్లోరో, ప్లోరో కార్బన్ల శాతం అధికమౌతుంది. వీటి పరిమాణం పార్ట్ ఫర్ మిలియన్స్(పీపీఎం)లలో ఉండాల్సి ఉండగా ఎక్కువగా ఉంది. దీని వల్లే ఈ పరిస్థితి నెలకొంది. చెట్లను నరికి వేయడం, పచ్చదనం తగ్గడంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. - ప్రొఫెసర్ బి. దేవప్రసాద్‌రాజు , ఫ్యూచర్ స్టడీస్ విభాగం, ఎస్వీయూ మరో ఐదు రోజులు వర్షం లేనట్టే సెప్టెంబర్‌లో తక్కువ వర్షం పడగా, అక్టోబర్‌లో సైతం ఇదే పరిస్థితి ఉంది. మేలో మంచి వర్షం పడింది. జూన్, జూలైలో సాధారణ వర్షపాతం కురిసింది. అయితే ఆగస్టు నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో ఐదు రోజుల పాటు వర్షం కురిసే అవకాశాలు లేవు. ఐదు రోజుల పాటు పొడి వాతా వరణం నెలకొని ఉంటుంది. - డాక్టర్ టి. ప్రతిమ , సీనియర్ సైంటిస్ట్, ఆగ్రోమెట్ విభాగం, వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన స్థానం. -
వర్షాల్లో వాహన రక్షణ..
వర్షాకాలంలో చాలామంది లాంగ్ డ్రైవ్‌కు వెళ్తారు. దీనికి కారణం ఈ కాలంలో ప్రకృతి కొత్త అందాలతో మనల్ని ముగ్దుల్ని చేస్తుంది. అయితే రోడ్లన్నీ వర్షపు నీటితో దెబ్బతిని ఉంటాయన్నది కూడా గుర్తుంచుకోవాలి. దీని వల్ల వాహనాలు పాడవడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిల్లో ముఖ్యమైనది బీమా తీసుకోవడం. కొత్తగా వెహికల్ కొనుగోలు చేసేటప్పుడే బీమా తీసుకోవాలి. కానీ ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 50% వాహనాలకు సరైన బీమా లేదు. వర్షాకాలం వస్తోందంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.. వాహనాన్ని కండీషన్లో పెట్టుకోండి సర్వీసింగ్: వాహనాలను క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో సర్వీసింగ్‌కు ఇవ్వాలి. ఆయిల్ మార్చడం, ఎయిర్ /ఫ్యూయెల్ ఫిల్టర్లను శుభ్రం చేయడం వంటి పనులను తప్పక చేసుకోవాలి. సస్పెన్షన్ జాయింట్స్, సెలైన్సర్ పైప్స్‌ను చెక్ చేసుకోవాలి. ఇలాంటివే వర్షాకాలంలో ఎక్కువగా డ్యామేజ్‌కు గురవుతాయి. టైర్లు: వర్షపు నీటి వల్ల రోడ్లపై వాహనాలు జారిపోతుంటాయి. టైర్ల గ్రిప్ తగ్గడమే ఇందుకు కారణం. ఇలా జరగకుండా ఉండాలంటే వాహన టైర్లను ఒకటికి రెండుసార్లు బాగున్నాయో లేదో చూసుకోవాలి. బాగులేకపోతే వెంటనే మార్చుకోవడం ఉత్తమం. బాగుంటే సమస్య లేదు. హెడ్ లైట్స్/ఎమర్జెన్సీ లైట్స్: వాహనపు హెడ్ లైట్స్/ ఎమర్జెన్సీ లైట్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అని చూసుకోవాలి. వర్షాకాలంలో బండిని నడుపుతున్నామంటే ఇవి కచ్చితంగా ఉండాలి. అవి పగలి పోయినా.. పాడయినా.. వెంటనే మార్చుకోండి. కొత్త బల్బులను వేసుకోండి. బ్రేక్స్: వర్షపు నీటి వల్ల బ్రేక్ సరిగా పడకపోవచ్చు. అందుకే బ్రేక్స్ బాగా పడుతున్నాయా? లేదా? చూసుకోవాలి. బ్రేక్ ఆయిల్‌ను విధిగా మార్చుకోవడంతోపాటు దానికి సంబంధించిన ఇతర భాగాలు కండీషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వైపర్స్: ముఖ్యంగా వర్షాకాలంలో వీటితో మనకు చాలా అవసరం ఉంటుంది. అద్దంపై పడ్డ నీటిని ఇవే తొలిగించాలి. ఇవి బాగా పనిచేస్తుంటే పర్వాలేదు. లేకపోతే వెంటనే మార్చుకోండి. అలాగే డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మీ వాహనానికి, ముందు వెహికల్‌కు మధ్య ఎక్కువ దూరం ఉండేలా చూసుకోండి. మన వాహనం బ్రేక్ వేసిన వెంటనే నిలబడకపోవచ్చు. వీటిని మరిచిపోవద్దు ♦ వాహనానికి తప్పక బీమా చేసుకోండి. బండికి ఏదైనా డ్యామేజ్ అయితే బీమా మనకు బాసటగా నిలుస్తుంది. నష్ట నివారణలో మనకు తో డ్పాటునందిస్తుంది. పేరొందిన బీమా కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. ♦ ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే దానికి రెన్యువల్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. బీమాతోపాటు ఇంజిన్ గార్డ్ వంటి వాటిని తీసుకోండి. కొన్ని పాలసీలు ఇంజిన్ లోపలి భాగాలు డ్యామేజ్ అయితే వాటికి బీమా ఇవ్వటం లేదు. ఈ ఇంజిన్ గార్డ్ అందుకు ఉపయోగపడుతుంది. ♦ కారు ఇంజిన్లోకి నీళ్లు పోతే బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించొద్దు. మంచి మెకానిక్కు కాల్ చేసి, ఆయన సాయం తీసుకోండి. ♦ నీరు వాహన టైర్ల కన్నా పైకి ఉంటే అప్పుడు బండిని నడ పొద్దు. నిలిపేయండి. ♦ బండి నీటిలో మునిగిపోతే బ్యాటరీ కనెక్షన్‌ను తొలగించండి. ♦ ఇన్సూరెన్స్ కంపెనీ డాక్యుమెంట్లను బండిలో ఉంచుకోండి. అలాగే కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్లను నోట్ చేసుకోండి. డ్యామేజ్‌ను త్వరగా క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించండి. - పునీత్ సాహ్ని, ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
ఎంత కష్టమో!
కష్టపడి కాదు ఇష్టపడి చదవండి అని పెద్దలు చెబుతుంటారు. కానీ తమకు ఇష్టమైన చదువు కోసం ఎంతో కష్టపడాల్సి వస్తోందని ఆదివాసీ బాలలు అంటున్నారు. బడికి వెళ్లేందుకు వారు పడే ఇబ్బందులు చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఒడిశా రాష్ట్రం కొందమాల్ జిల్లా దరింగబడి సమితి అసురబొందా గ్రామంలో 150 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో వారు చదువుకునేందుకు మూడు కిలోమీటర్ల దూరంలోని గజలబడి గ్రామానికి వెళ్లాలి. అసురబొందా, గజలబడి గ్రామాల మధ్య ఒక ఏరు ఉంది. ఎండాకాలంలో వారు కాలువలో దిగి నడుచుకుని వెళతారు. వర్షాకాలం వస్తే మాత్రం నానాపాట్లు పడాల్సిందే. దీంతో కాలువకు ఈ ఒడ్డున, ఆ ఒడ్డున గల చెట్లకు రెండు తాళ్లు కట్టారు. చెట్టుపైకి ఎక్కి దాని మీద నుంచి ఒక తాడుపై నడుస్తూ పైనున్న తాడును పట్టుకుని ఆ ఒడ్డుకు వెళతారు. పిల్లలు తాడుపై వెళుతుంటే ఒడ్డున ఉన్న తల్లిదండ్రులు ఆందోళనతో చూస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తుంటాయి. అసురబొందా గ్రామ విద్యార్థుల కోసం ఏదో ఒక పథకం కింద ఇక్కడ వంతెనను నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
వానాకాలంలోనూ నీటి గోసే
నిత్యం నీటి కోసం పాట్లు ఆందోళనకు దిగిన బూర్గుపల్లి వాసులు పాలకులు పట్టించుకోవడంలేదని మండిపాటు సర్పంచ్‌ను నిలదీస్తే రాజీనామా చేస్తానని వెల్లడి మెదక్ రూరల్: తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు రోడ్డెక్కారు. ఆర్నెల్లుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదని వారు మండిపడ్డారు. మంగళవారం మండలంలోని బూర్గుపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోఆరు నెలలుగా తాగునీటి సమస్య నెలకొందని, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నీటి సమస్య తీరడం లేదన్నారు. ఇప్పటికీ గ్రామంలో మూడురోజులకోసారి ట్యాంకర్ వస్తుండటంతో అవసరాలకు సరిపడా నీళ్లు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ట్యాంకర్లు కూడా సకాలంలో రాకపోవడంతో వాటికోసం కూలీ పనులు వదులుకొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గ్రామంలో 15 వరకు బోర్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటికీ మోటార్లు బిగించి మరమ్మతులు చేయిస్తే నీటి సమస్య తీరుతుందన్నారు. నీటి సమస్యను సర్పంచ్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా బోర్లను మరమ్మతులు చేయించకుండా కొందరు క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం సొంత ట్యాంకర్లను పెట్టి నీటిని సరఫరా చేయిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్ దేవమ్మ వృద్ధురాలు కావడంతో సర్పంచ్ బాధ్యతలన్నీ ఆమె కొడుకు చూస్తుంటారు. కాగా ఆయన గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉండక పోవడంతో సమస్యలు ఎక్కడికక్కడా పేరుకు పోయాయని మండిపడ్డారు. గ్రామ పంచాయతికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల జాడేలేదని, ఇప్పటి వరకు గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనిచేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. నీటి సమస్య తీర్చాలని తాము సర్పంచ్ దేవమ్మను నిలదీస్తే ఆమె రాజీనామా చేస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని గ్రామస్తులు మండిపడ్డారు. కాగా ప్రభుత్వం నుంచి గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిక పడకేసిందని, మురికి కాల్వలు చెత్తా చెదారంతో పూడుకుపోయాయని, వీధుల్లో చెత్తా చెదారం నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు లేక రాత్రివేళ ఇంటి బయటకు రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మరోవైపు మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. కాగా ఈ సమస్యలపై తాము సర్పంచ్ దేవమ్మను నిలదీస్తే రాజీనామా చేస్తానని చెబుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరి సైతం సమస్యలను పట్టించుకోవడం లేదు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా సర్పంచ్‌కు చెప్పుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. కూలీ పనులకు వెళ్లలేక.. గ్రామంలో తాగునీటిని సరఫరా చేయక పోవడంతో కూలీ పనులు కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. మా సమస్యలను సర్పంచ్‌తోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. బోరుబావుల్లో నీటి మట్టం పెరిగినప్పటికీ వాటిని మరమ్మతులు చేయించకుండా ట్యాంకర్లతో నీటి సరఫరా చేయిస్తున్నారు. పనులు వదులుకొని ట్యాంకర్‌కోసం పడిగాపులు పడితేనే నీళ్లు దొరుకుతున్నాయి. లేకుంటే గుక్కెడు నీళ్లకోసం అవస్థలు తప్పడం లేదు. - మౌనిక, గ్రామస్తురాలు.బూర్గుపల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులు అభివృద్ధిపై హామీలు గుప్పిస్తారు. ఓట్లేశాక..గద్దెనెక్కి అన్ని మర్చిపోతారు. నిత్యం వారి చుట్టూ తిరిగినా ఏ సమస్య పట్టించుకోరు. సర్పంచ్ వృద్ధురాలు కావడంతో ఆమె ఏం చేయలేని పరిస్థితి. ఆమె కొడుకు ఎప్పుడు అందుబాటులో ఉండడు. సమస్యలు పట్టించుకోడు. రాజులేని రాజ్యంలా మా ఊరి పరిస్థితి దాపురించింది. - లెంక కిష్టయ్య, గ్రామస్తులు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
జిల్లా కేంద్ర ఆస్పత్రికి క్యూ కడుతున్న జ్వర పీడితులు అప్రమత్తత, పరిశుభ్రత ముఖ్యమంటున్న వైద్యులు సంగారెడ్డి టౌన్: వర్షాకాలంలో వచ్చే జబ్బులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు, అతిసార, డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. ఈక్రమంలో డెంగీతో సంగారెడ్డి పట్టణానికి చెందిన బాలరాజు సోలాంకి మృతిచెందిన విషయం తెలిసిందే. కలుషిత నీటితో కౌడిపల్లి మండలం బండ్లపోతుగల్ గ్రామం మొత్తానికి అతిసార సోకింది. వారం రోజులుగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి విషజ్వర పీడితులు వస్తూనే ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలు అవసరం కౌడిపల్లి మండలంలోని చిట్కూల్ గ్రామం, టేక్మాల్ మండలం, శివ్వంపేట మండలాల్లో కొన్ని గ్రామాలు విషజ్వరాలు, అతిసార విజృంభిస్తున్నాయి. జిల్లా మొత్తం వీటి బాధితులు ఎక్కువగానే ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని, వ్యాధుల బారిన పడకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోడ్లపై మురుగు, చెత్తాచెదారం పేరుకుపోవడం.. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. ఫలితంగా మలేరియా, డెంగీ అధికమయ్యే ప్రమాదం ఉంది. కలుషిత నీరు తాగడం, అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం వల్ల అతిసార సోకుతుందని చెప్పారు. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన వల్ల ఎక్కువగా అంటురోగాలు వ్యాప్తి చెందుతాయన్నారు. నెలలు తరబడి శుభ్రం చేయని ట్యాంకులో నీరు తాగడం కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. ట్యాంకుల్లో తరచూ క్లోరినేషన్, మురుగుకాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని వారు సూచిస్తున్నారు. పరిశుభ్రత ముఖ్యం పరిశుభ్రంగా ఉంటే ఏ రోగాలు రావు. ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. వాటర్ ట్యాంకులు 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. తినక ముందు, తిన్న తర్వాత.. మరుగుదొడ్డికి వెళ్లొచ్చిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. రెండుమూడుసార్లు విరోచనాలు అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. - డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ విషజ్వరాలు, వర్షాకాలం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ -
కాలుష్య కోరల్లో పల్లెలు
-తరచూ రోగాల బారిన ప్రజలు ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి రాత్రి వేళల్లో పరిస్థితి మరీ అధ్వానం -పట్టించుకోని అధికారులు కొండాపూర్: రాత్రి పూట ఘాటైన వాసనలు.శ్వాస పీల్చుకొంటే ముక్కుపుటలు అదిరిపోయేలా వచ్చే దుర్వాసన వలన తరచూ ఆయా గ్రామాల ప్రజలు రోగాల పాలవుతున్నారు. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు చూసీ చూడనట్లు వ్యవహరిçస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఆయా పరిశ్రమలు విడుదల చేసే పొగతో పాటు, వ్యర్థ పదార్థాలను సైతం బయటకు కాలువల ద్వారా మల్లెపల్లి చెరువులోకి వదిలేస్తున్నారు.దీంతో గ్రామాల్లో వ్యవసాయ బోర్లు వేస్తే కలర్ మారిన రంగు నీళ్ళే వస్తున్నాయనీ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ కొండాపూర్ మండలంలోని తేర్పోల్, చెర్లగోపులారం, ఎదురుగూడెం గుంతపల్లి గ్రామాల ప్రజల పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి, తేర్పోల్, గొల్లపల్లి, గుంతపల్లి తదితర గ్రామాల్లో సుమారు నాలుగు మద్యం పరిశ్రమలు, పది టైర్ల పరిశ్రమలు ఉన్నాయి. మద్యం పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల చేనులో ఏమాత్రం పంటలు పండడంలేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.టైర్ల పరిశ్రమల ఇతర ప్రాంతాల నుంచి టైర్లను తీసుకువచ్చి వాటిని కాల్చి ఆయిల్‌ను తీస్తారు.ఈ టైర్లను కాల్చేటప్పుడు ముక్కుపుటలదిరేలా భరించలేని దర్గుంధం వస్తుందని చుట్టూ పక్కల గ్రామస్థులు చెబుతున్నారు. పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఆయా పరిశ్రమలు యథేచ్ఛగా వ్యర్థ కాలుష్యాన్ని బయటకు వదులుతున్నాయి. దీంతో ఆ ఘాటైన వాసనలు పీల్చుకోలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.రాత్రి వేళ్ళల్లో అయితే పరిస్థితి మరీ దారుణం.ఆ ఘాటైన వాసనలు రావడం ద్వారా నిద్రకూడా రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థ జలాలను కాలువల ద్వారా మల్లెపల్లి చెరువులోకి పంపిస్తుండడంతో చుట్టూ పక్కల భూములన్నీ నల్లగా మారి బీటలుగా ఏర్పడుతున్నాయి. కాగా ఈ టైర్ల పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వల్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మహిళ గర్భస్రావం జరిగినట్లు గ్రీవెన్స్‌డే లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. మద్యం పరిశ్రమలు సాయంత్రం వేళలో విడుదల చేసే పొగ ద్వారా చిన్నచిన్న రేణువులు కంట్లోపడి కళ్ళు ఎర్రగా మారి వాహనాలు నడపడానికి ఇబ్బందిగా వుందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలుష్యాన్ని విడుదల చేసే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
వర్షాకాలం... స్క్రబ్ నాణ్యమైనదిగా ఉండాలి
బ్యూటిప్స్ వర్షాకాలం దుమ్ము కణాలు చర్మం మీద పేరుకుపోయే అవకాశం ఉంది. శుభ్రపరచకపోతే మృతకణాలు పెరిగి చర్మం తన మృదుత్వాన్ని, కాంతిమంతాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమస్యకు విరుగుడుగా... నాణ్యమైన స్క్రబ్‌ను ఉపయోగించి మృదువుగా చర్మంపై రుద్దాలి. దీని వల్ల స్వేదరంధ్రాల్లో మృతకణాలు తొలగిపోయి, సహజమైన మాయిశ్చరైజర్‌ని తగినంతగా ఉత్పత్తి చేస్తుంది. చర్మం మృదుత్వం దెబ్బతినదు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో చాలామంది సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం ఆపేస్తారు. వాతావరణం మబ్బుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవాలి. వర్షా కాలం హెవీ మేకప్‌కి వెళ్లకపోవడమే మంచిది. అంతగా ఉపయోగించాలనుకుంటే వాటర్‌ప్రూఫ్ మేకప్ మేలు. బ్లీచింగ్, ఫేసియల్స్ ఈ కాలం అంతగా అవసరం ఉండదు. వీటి వల్ల చర్మం గరకుగా తయారవుతుంది.రాత్రిపూట పెదవులకు పాల మీగడ, లేదా కొబ్బరి నూనె వంటివి రాసుకుంటే పగుళ్ల సమస్య బాధించదు. వాక్సింగ్, పెడిక్యూర్, మానిక్యూర్లు చేయించుకోవడం వల్ల పాదాలు, చేతుల సంరక్షణ బాగుంటుంది. -
మెరుగైన చర్మకాంతికి...
బ్యూటిప్స్ వర్షాకాలంలో కొందరికి చర్మం పొడిగా అయిపోవడం, డల్‌గా అవ్వడం, నల్లబడటం, బిరుసుగా అయిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడటానికే ఈ చిట్కాలు... ఓ బౌల్లో రెండు చెంచాల ముల్తానీ మట్టి, 1 చెంచా గంధపు పొడి, 2 చెంచాల లవంగ నూనె, కాసింత నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని నలుగు పిండి మాదిరిగా కాళ్లు, చేతులు, మెడకు రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వానాకాలం అయ్యేవరకూ వారంలో నాలుగైదు సార్లు ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి స్నానం చేస్తే... చర్మం మృదువుగా ఉండటంతో పాటు వానాకాలం వచ్చే చర్మవ్యాధులు కూడా దరిచేరవు. సువాసన కావాలనుకునేవారు కాస్త రోజ్‌వాటర్ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో కొంచెం బియ్యప్పిండి, నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనితో ఒళ్లు తోముకుని, ఆపైన వేణ్నీళ్లతో స్నానం చేస్తే చర్మం కాంతులీనుతుంది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నేడు ఉదయం 10 గంటలకు ఎంసెట్-2 పరీక్ష సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం (ఈనెల 9న) జరగనున్న ఎంసెట్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని.. విద్యార్థులను 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. వర్షాకాలం అయినందున వీలైనంత ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్లోకి వచ్చాక పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు వెళ్లనీయరని పేర్కొన్నారు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పరీక్ష రాయాలని... ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపై కలర్ ఫొటో అంటించి పరీక్ష కేంద్రంలో అందజేయాలని సూచించారు. పరీక్ష హాల్లోకి మొబైల్స్, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని స్పష్టం చేశారు. ఈసారి విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రం కింద ఉండే కార్బన్‌లెస్ జవాబుల కాపీని ఇస్తామని చెప్పారు. ఈ పరీక్ష ప్రాథమిక కీని శనివారమే విడుదల చేస్తామన్నారు. దానిపై 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, 14న ర్యాంకులు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 95 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 56,188 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అందులో తెలంగాణ నుంచి 38,245 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది పరీక్ష రాయనున్నారు. ఏపీకి చెందిన విద్యార్థుల కోసం కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు ప్రశ్నపత్రం సెట్ కోడ్ విడుదల ఎంసెట్-2 ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను శనివారం ఉదయం 6 గంటలకు విడుదల చేయనున్నారు. జేఎన్టీయూహెచ్లో వైద్య ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ కోడ్‌ను విడుదల చేస్తారు. -
జలగండం!
♦ మెరుగుపడని భూగర్భజలాలు ♦ వర్షాకాలంలోనూ 1.02 మీటర్లు పతనం ♦ సగటున 16.72 మీటర్ల లోతులో జలాలు ♦ గతనెలలో సాధారణ వర్షపాతం నమోదు ♦ అయినా జిల్లాలో పెరగని నీటిమట్టాలు భూగర్భజలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తీవ్ర వర్షాభావం కారణంగా జలసిరి పూర్తిగా పాతాళంలోకి జారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం భూగర్భజల మట్టాలు మెరుగుపడలేదని గణాంకాలు చెబుతున్నాయి. వానాకాలంలో కురుస్తున్న వర్షాలు భూగర్భజలాలను సమతుల్యం చేస్తాయని భావించినప్పటికీ.. తాజాగా భూగర్భ జలవనరుల శాఖ వెల్లడించిన గణాంకాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో కంటే ప్రస్తుత నీటిమట్టాలు మరింత పతనం కావడం కలవరపరుస్తోంది. ఏకంగా 1.02 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పతనమై సగటు 16.72 మీటర్లలోతుకు పడిపోయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత సీజన్లో కురిసిన అడపాదడపా వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలపై ప్రభావం చూపలేదు. గతనెలలో 10.39 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా.. ఏకంగా 13.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 3.3 సెంటీమీటర్ల వర్షం ఎక్కువగా కురిసింది. అయినా భూగర్భజలాలు మరింత పడిపోయాయి. జూన్ నెలలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. తూర్పు, ఉత్తర ప్రాంతంలో చిన్నపాటి వానలు కురవగా.. తాండూరు, వికారాబాద్, పరిగి డివిజన్లలోని కొన్ని మండలాల్లో కుండపోత వానలు పడ్డాయి. అయితే ఒక్కసారిగా కురిసిన వానలతో వరదలు పెరిగి చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. అయితే భూమిలోకి ఇంకిన నీటి శాతం పెద్దగా లేకపోవ డంతో భూగర్భజల మట్టాలు పైకిరాలేదు. మరోవైపు భూగర్భనీటి వినియోగం తగ్గకపోవడంతో అవి మరింత పతనమై 16.72 మీటర్ల లోతుకు చేరాయి. 30 మీటర్ల లోతులో.. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జిల్లాలో నీటిప్రాజెక్టులు లేనందున వర్షాధార పంటలను నమ్ముకుని రైతులు సాగుపనులు చేస్తున్నాయి. అయితే జిల్లా అంతటా వర్షాలు లేకపోవడం రైతులను ఆందోళన కలిగించే విషయమే. పశ్చిమ ప్రాంతంలో గతనెలలో భారీ వర్షాలు కురిసినప్పటికీ.. భూగర్భజలాలు మాత్రం మెరుగుపడలేదు. పరిగి, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, గండేడ్ మండలాల్లో 30 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ నీటిమట్టాలు నమోదైనట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా దోమ, వికారాబాద్, మర్పల్లి, పెద్దేముల్, యాచారం, మేడ్చల్, మహేశ్వరం, హయత్‌నగర్ మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భజలాలున్నాయి. మిగతా గ్రామీణ మండలాల్లో జిల్లా సగటు కంటే ఎక్కువలోతులోనే నీటిమట్టాలు నమోదు కావడం ఆందోళనకరం. -
వానా వానా... అలంకరణ
బ్యూటిప్స్ వర్షాకాలం వాతావరణంతో పాటు మన జీవనశైలి కూడా పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా వస్త్రధారణ. ఇప్పటి వరకు వేసిన కాటన్స్ మూలన చేరిపోతాయి. కొత్త కట్టుతో పరిసరాలనున ఆకట్టుకునేలా, సౌకర్యవంతంగా ఈ సీజన్‌ని ఆనందించాంటే.. * తేలికపాటి ఫ్యాబ్రిక్స్ అంటే వర్షం పడినా త్వరగా ఆరిపోయే షిఫాన్స్, పాలియస్టర్, జార్జెట్స్ చక్కగా అమరిపోతాయి. * బాటమ్స్ విషయానికి వస్తే నీలెంగ్త్ కెప్రీస్ సరైన ఎంపిక. మంచి రంగు గల ప్యాంట్స్, షార్ట్స్ ఈ కాలానికి హుషారు తెప్పిస్తాయి. * నీటిలో తడిసినా పాడవనివి కాంతిమంతమైన రంగుల్లో ఉండే రెండు జతల రబ్బర్ బూట్లు, ఫ్లిప్ ప్లాప్స్ తీసుకోండి. నీళ్లలో ఎంచక్కా తిరిగేయండి. * గొడుగుతో మీదైన స్టైల్‌ని కళ్లకు కట్టవచ్చు. రంగు రంగులు గొడుగులు.. వాటి మీద చిన్న చిన్న మోటిఫ్స్ ఈ సీజన్‌ని బ్రైట్‌గా మార్చేస్తాయి. * ఇంటి నుంచి బయటకు వచ్చాక కానీ గుర్తుకు రాదు వర్షంలో వాచీ తడిసిపోతుందని. వెంటనే దాన్ని తీసి బ్యాగ్‌లోకి చేరవేయడం చేస్తుంటారు. అలాంటి అవసరం లేకుండా వాటర్ ఫ్రూఫ్ వాచీలు రంగురంగుల ఆకట్టుకునేవి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. * వాటర్ ఫ్రూఫ్ బ్యాగ్స్, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్స్ ఈ సీజన్లో అత్యవసరమైన అలంకరణలు. * ఇంట్లోనే ముఖచర్మాన్ని కాపాడుకునే ప్యాక్స్ తేనె, దోస రసం. తేనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడితే, దోస క్లెన్సింగ్‌లా పనిచేస్తుంది. * వానలో తడిసిన రోజున గోరువెచ్చని నీళ్లు, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల మురికినీటి సమస్య నుంచి జుట్టును కాపాడుకోవచ్చు. -
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
శేరిలింగంపల్లి : వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, సర్కిల్-11 అబ్జర్వర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి సర్కిల్-11 కార్యాలయంలో గురువారం వర్షాల నేపథ్యంలో ఈ సీజన్లో తలెత్తే సమస్యలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం మ్యాన్‌హోల్స్‌పై మూతల ఏర్పాటు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే విధంగా వర్షపు నీరు డ్రెయిన్స్ ఉన్న ప్రాంతాల్లో వాటిపై కప్పులు ఉన్నాయా లేదా పరిశీలించి వాటిలో ఎవరు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బస్తీలు, కాలనీ మధ్య నుంచి నాలాల్లో పడకుండా ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు వాటిలో పూడికను కూడ తొలగించి వర్షపు నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు. జలమండలి విభాగం ఈ సీజన్లో పైప్లైన్ల ఏర్పాటు కోసం రోడ్లను కటింగ్ చేయవద్దన్నారు. ఏ పని చేపట్టినా ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ముందుకు సాగాలన్నారు. దుర్గం చెరువు వర్షపు నీరుతో నిండితే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అదే విధంగా గాలివానల కారణంగా కూలే ఎలక్ట్రికల్ లైన్లకు మరమ్మతులు చేపట్టేందుకు ఆ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సీజన్లో వచ్చే సమస్యల పరిష్కారానికి అన్ని విభాగాల వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర టీంలతో పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ఆయా పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్బంగా ఏ ఏ విభాగం ఏ పనులు చేపట్టాలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ మోహన్‌రెడ్డి, ఏసీపీ కష్ణమోహన్, డీఈ రాజ్‌కుమార్, నాగరాజు, జలమండలి డీజీఎం రాజశేఖర్, ఇరిగేషన్ డీఈ యాదగిరి, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్లు రమేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, అర్బన్ బయోడైవర్సిటీ సర్కిల్-11 మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ జలంధర్‌రెడ్డి, రెమెన్యూ, ఐలా, ప్రాజెక్టు డివిజన్ అధికారులు పాల్గొన్నారు. -
వచ్చింది రెండు టీఎంసీలే!
- వర్షాకాలం మొదలై 25 రోజులైనా ప్రాజెక్టుల్లోకి నీరు అంతంతే - కృష్ణా, గోదావరి బేసిన్‌లోని రాష్ట్ర ప్రాజెక్టుల్లో వర్షాభావ పరిస్థితులు - గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణం - గతేడాదితో పోలిస్తే 90 టీఎంసీల మేర తక్కువ నీరు సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం మొదలై 25 రోజులైనా కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. రాష్ట్ర పరీవాహకంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం 2 టీఎంసీల నీరు మాత్రమే రావడం ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. దిగువకు నీటిని ధారపోసే ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులే నీటి కొరతను ఎదుర్కోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. కర్ణాటకలో కేవలం 6.5 టీఎంసీల మేర నీరు మాత్రమే వచ్చింది. ఎగువ ప్రాజెక్టులు నిండకుంటే రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఒట్టికుండలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే ఈ ఏడాది ప్రాజెక్టుల కింద 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీరివ్వడం గగనంగా మారనుంది. ఎగువన రాకుంటే దిగువకు కష్టమే.. కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గ ణనీయంగా నీటి మట్టాలు పడిపోయాయి. రాష్ట్ర ప్రాజెక్టుల్లో 4-5 టీఎంసీలకు మించి వినియోగార్హమైన నీరు లేదు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ ప్రస్తుతం 504.6 అడుగులకు తగ్గగా నీటి నిల్వ 122.69 టీఎంసీలకు చేరింది. ఇందులో ఒకట్రెండు టీఎంసీలకు మించి వాడుకోవడానికి లేదు. శ్రీశైలంలో వాస్తవ నీటిమట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 779 అడుగులకు పడిపోయింది. అక్కడ వాస్తవ నీటి నిల్వ 215.8 టీఎంసీలకుగానూ 20.19 టీఎంసీలకు పడిపోయింది. గతేడాది ఈ సమయానికి 2 ప్రాజెక్టుల్లో కలిపి 25 టీఎంసీల మేర నీరు తక్కువగా ఉంది. జూరాల వాస్తవ సామర్థ్యం 11.9 టీఎంసీలుకాగా గతేడాది 6.17 టీఎంసీలు ఉండగా ఈ ఏడాది కేవలం 2.8 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభమై నెల కావస్తున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీరు కేవలం 2 టీఎంసీలు మాత్రమే. తుంగభద్ర పరీవాహకంలో కురిసిన వర్షాల కారణంగా వచ్చిన ప్రవాహాలతో జూరాలలో 0.62 టీఎంసీల నీరు రాగా, శ్రీశైలంలో 1.47 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. జూరాలకు 1,464 క్యూసెక్కులు, శ్రీశైలంలో 1,374 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇది మినహా ఎక్కడా చుక్క నీరు ప్రాజెక్టుల్లో చేరలేదు. దీనికితోడు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో మొత్తంగా 205 టీఎంసీల నీటి కొరత ఉంది. గత 25 రోజుల్లో ఎగువ ప్రాజెక్టుల్లో మొత్తంగా కేవలం 6.5 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఇందులో అత్యధికంగా నారాయణపూర్‌లో 4 టీఎంసీల మేర నీరు చేరింది. గతేడాది ఎగువన ప్రాజెక్టుల్లో ఇదే సమయానికి 42 టీఎంసీల మేర కొత్త నీరురాగా ఈ ఏడాది అక్కడా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరిలో చుక్క నీరు లేదు.. గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, కడెం, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 198 టీఎంసీల మేర ఉండగా ప్రస్తుతం లభ్యతగా ఉన్నది కేవలం 12.23 టీఎంసీలు మాత్రమే. గతేడాది నిల్వలతో పోలిస్తే సుమారు 14 టీఎంసీల మేర తక్కువగా లభ్యత నీరుంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ మొదలు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టులోకి ఇప్పటిరవకు కొత్తగా చుక్క నీరు చేరలేదు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఖానాపూర్ : వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున ఆరోగ్యశ్రీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి అన్నారు. శుక్రవారం ఖానాపూర్లోని సీహెచ్ఎన్సీ క్లస్టర్ కార్యాలయంలో పెంబి, కడెం, దస్తురాబాద్, మామడ పీహెచ్‌సీల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, జ్వరాల గురించి ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గత ఏడాది మలేరియా, డెంగ్యూ కేసులు ఈ ప్రాంతంలో అదికంగా నమోదయిన కారణంగా ముందే అప్రమత్తంగా ఉండాలన్నారు. హెల్త్ సూపర్వైజర్లు ఈసీజన్లో విధిగా గ్రామాల్లో పర్యటించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది, సమన్వయంతో టీం వర్క్చేసినపుడే వ్యాదులు ప్రబలకుండా పరిస్థితి అదుపులో ఉంటుందన్నారు. మామడ, పెంబి పీహెచ్‌సీల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రధానంగా వర్షాకాలం సీజన్లో హెల్త్ సూపర్వైజర్లు పంచాయతీ అధికారులు, సిబ్బందితో సమన్వంగా ముందుకెళ్తూ పారిశుధ్య నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో డెంగ్యూ, జ్వర పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది రక్తనమూనాలు సేకరించి మలేరియా డెంగ్యూ పరీక్షలపై ప్రజలకు తెలియపరుచాలన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సీఎం వేణుగోపాలకృష్ణ, కడెం పీహెచ్సీ వైద్యాదికారి మానస, సీహెచ్‌వో లింబాద్రి, పెంబి హెచ్‌ఈవో తుఫ్రాన్ వేణుగోపాల్, గాడ్పు రవి, గోపాల, సదయ్య, మహెందర్, బోజరెడ్డి తదితరులున్నారు. -
ఏదీ ప్రక్షాళన
► ముంచుకొస్తున్న వర్షాకాలం ► పూడుకుపోయిన డ్రైనేజీలు ► చినుకుపడితే రహదారులు గోదారే పట్టించుకోని అధికారులు సాక్షి,సిటీబ్యూరో: వర్షాకాలం సమీపిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లు తెరవడంలేదు. ఇటీవల నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకే రహదారులు గోదారులను తలపించాయి. డ్రైనేజీలు ఉప్పొంగగా, మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. గ్రేటర్లో మురుగు నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే ఆందుకు కారణం. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల మధ్య సమన్వయ లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు ఉన్నాయి. నిలువెల్లా నిర్లక్ష్యం..! వేసవి పూడికతీత పనులు చేపట్టేందుకు కాగితాలపై ప్రణాళికలు సిద్ధంచేసిన జలమండలి అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. గ్రేటర్ పరిధిలో 5000 కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థకు చెందిన పైపు లైన్లున్నాయి. ఇందులో 1500 కిలోమీటర్ల మేర పైప్లైన్లలో పూడిక పేరుకుపోయింది. వీటిని యుద్ధ ప్రాతిపదికన ఎయిర్‌టెక్ యంత్రాలతో శుద్ధిచేస్తేనే వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఉండదు. అయితే జలమండలి దీనిపై దృష్టి సారించకపోవడంతో నిత్యం డ్రైనేజీ లైన్లు పొంగి పొర్లుతున్నాయి. జలమండలి మెట్రో కస్టమర్ కేర్ సెంటర్‌కు రోజూ 200కు పైగా ఫిర్యాదులు అందుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 1500 కిలోమీటర్ల మేర ఒపెన్ నాలాలు, డ్రైనేజిలున్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతను జీహెచ్ఎంసీ చూస్తోంది. వీటిలో ఇప్పటివరకు సగం మేర మాత్రమే పూడిక తీశారు. మిగతా చోట్ల చెత్తా చెదారం పేరుకుపోవడంతో వరదనీటి ప్రవాహానికి తరచూ ఆటంకాలు ఏర్పడుతుండడంతో సమీప బస్తీలు, కాలనీలు జలమయమవుతున్నాయి. పలు నాలాలకు ఫెన్సింగ్ లేదు. నాలుగేళ్ల క్రితం పెద్ద నాలాలకు అరకొర రక్షణ ఏర్పాట్లు చేసి మహానగరపాలక సంస్థ చేతులు దులుపుకోవడం గమనార్హం. ఎక్కడి చెత్త అక్కడే.. ఏటా వేసవిలో డ్రైనేజి పైపు లైన్లలో పూడికతీత తొలగించడం ఆనవాయితీ. ఈసారి పనులు పూర్తిచేయడంలో జలమండలి అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ముంపు భయంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జలమండలి క్షేత్రస్థాయి అధికారులు,అత్యవసర కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. మత్యు బిలాలదీ అదే పరిస్థితి..... గ్రేటర్లో అడుగడుగునా నోళ్లు తెరచుకున్న మ్యాన్‌హోళ్లకు మూతలు లేక పోవడం నగర దుస్థితికి అద్ధంపడుతుంది. పగిలిపోయి శిథిలా వస్థలో ఉన్న మత్యుబిళాలపై మూతలు ఏర్పాటుచేయడంలో ఇటు జలమండలి, అటు జీహెచ్ఎంసీలు విఫలమౌతున్నాయి. నగరంలో 1.50 లక్షల మ్యాన్హోళ్లుండగా ఇందులో 25 వేల వరకు మూతలు లేకపోవడం గమనార్హం. కిర్లోస్కర్ కమిటీ సిఫారసులు బుట్టదాఖలు.. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాల్వల ఆధునికీకరణకు కి ర్లోస్కర్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఏడేళ్ల క్రితం విలువైన సిఫారసులు చేసింది. వీటిని గ్రేటర్ పరిధిలో అమలు చేయాలంటే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొంటున్నా.. నిధులను కేటాయించడంలో నగరపాలక సంస్థ చేతులెత్తేయడంతో పరిస్థితి నానాటికి ప్రమాదకరంగా మారుతోంది. -
గుట్కా తింటే... మౌత్ క్యాన్సర్..?
హోమియో కౌన్సెలింగ్ వర్షాకాలం వచ్చిందంటే చాలు... మా ఇంటిల్లిపాదికీ బయటికెళ్లాలంటే భయమే. తుమ్ములూ దగ్గులే కాదు, ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో అయినా మా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటారా? - కె. లక్ష్మి, అమరావతి వర్షాకాలం వచ్చిందంటే అతిసార, ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరం, మలేరియాలు వ్యాపించడం సర్వసాధారణం. కారణం... బ్యాక్టీరియా, ఇంటికీటకాలు, ఫంగస్ల వంటివి వర్షాకాలంలో విజృంభించేస్తాయి గనక. కొన్ని జాగ్రత్తలతోపాటు అవసరమైనప్పుడు వైద్యచికిత్సలు కూడా తీసుకుంటే ఆ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలర్జిక్ రైనటిస్: వరుసగా తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లు, ముక్కు దురదగా ఉండటం వంటివి ఇందులో కనిపిస్తాయి. సాధారణ జలుబు కాదని తేలిపోతే అది అలర్జీ సమస్యేననే నిర్ధారణకు రావచ్చు. గాలిలో ఉండే కొన్నిరకాల పదార్థాల కారణంగా ముక్కులోపలి కణజాలంలో వాపు రావడం ఇందులోని సమస్య. పొగ, దుమ్ము, కాలుష్యాలు, గాలిలో ఉండే ఉన్ని వంటివి మరికొన్ని అంశాలు. జాగ్రత్తలు: అలర్జిక్ రైనైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో సెన్సిటివిటీని తగ్గించుకునేలా శిక్షణ పొందాలి. చాలాకాలంగా వాడకంలో లేని ఉన్నిదుస్తుల వంటి వాటిని ధరించడానికి ముందు తప్పనిసరిగా ఉతికి మంచి ఎండలో ఆరేయాలి. చలివాతావరణానికి దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్, చల్లటివస్తువులు తీసుకోకూడదు. అలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలి. వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడి ఉంటే తగ్గించుకోవాలి. హోమియో చికిత్స: అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా వ్యాధి నివారణ అయేలా చేయొచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది. ఆస్తమా: ఇది ఊపిరితిత్తుల్లో వాయునాళాల్లో వచ్చే దీర్ఘకాలిక సమస్య. ఇది తేమ వాతావరణంలో ఉండే పుప్పొడి వంటి అలర్జన్ల వల్ల వస్తుంది. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలే ఎక్కువ అయినప్పటికీ వర్షాకాలంలో వచ్చే ఆస్తమా ఒకరకమైన అలర్జిక్ ఆస్తమా. పుప్పొడి, జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్ వంటి వాటి వల్ల కూడా వస్తుంది. ఆస్తమా ఒకసారి వస్తే ఇక ఎప్పటికీ తగ్గదని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో ఆర్సెనిక్ ఆల్బ్, ఇపికాక్, నైనట్రమ్ సల్ఫ్, కాలికార్బ్, కాల్కేరియా కార్బ్ వంటి మందులు వాడటం ద్వారా ఆస్తమాను శాశ్వతంగా నయం చేయొచ్చు. ఈ మందుల వాడకం వల్ల ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు కూడా. క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను పదిహేనేళ్లుగా గుట్కా తింటున్నాను. ఆర్నెల్లుగా నా నోటిలో వాపు, నొప్పి వస్తున్నాయి. ఒక నెలరోజులుగా ఈ బాధ మరీ ఎక్కువగా ఉంది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా చెప్పండి. - జి.ఆర్.ఆర్., హైదరాబాద్ గుట్కాలు/పొగాకు నమిలేవారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. అంటే చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలోని ఏ భాగంలో మీకు క్యాన్సర్ వచ్చిందో రాయలేదు. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే అది క్యాన్సర్ కాస్త ముదిరిన దశను సూచిస్తోంది. మొదట మీకు సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరుతెరవడం కష్టమవుతుంది. దాంతో క్యాన్సర్ కూడా కొంచెం ముదిరినట్లు అర్థం. వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించడం మొదట చేయాలి. ఆ తర్వాత తొలగించిన భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ-కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు మానాక, రేడియోథెరపీ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. మీరు మొదట గుట్కా నమలడం మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. సుమారు ఎనిమిది నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్నే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్య శాశ్వతంగా తగ్గే మార్గం చెప్పండి. - బాలకృష్ణ, ఖమ్మం మీరు రాసిన లక్షణాలు బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. నా వయసు 36 ఏళ్లు. గత ఏడాది కాలంగా తరచూ కడుపునొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎండోస్కోపీ చేయించి, గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్నట్లు తెలిపారు. ఆయన రాసిన మందులను క్రమం తప్పకుండా వాడాను. ఈ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? దీని నివారణ మార్గం చెప్పగలరు. - గిరిప్రసాద్, కాకినాడ గ్యాస్ట్రైటిస్ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రోజూ ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం, తరచూ పెయిన్‌కిల్లర్స్ వాడటం, సమయానికి భోజనం చేయడకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య ఎక్కవగా వస్తుంటుంది. మీకు మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయండి. పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటే డాక్టర్‌ను సంప్రదించాకే, వైద్యుల సలహా మేరకే వాటిని తీసుకోండి. వ్యాధి లక్షణాలు బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరోసారి మీ డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్య చెప్పండి. -
వర్షాభావ గండం..!
- రుతుపవనాల అనిశ్చితితో వృద్ధికి దెబ్బ! - ద్రవ్యోల్బణం కట్టడి కూడా కష్టమే - ఆహార నిర్వహణ వ్యూహం కావాలి - వార్షిక నివేదికలో ఆర్బీఐ వెల్లడి ముంబై: రానున్న కాలంలో దేశం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందటం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటం వంటి చర్యలకు వర్షాభావ గండం పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన రుతుపవనాల విస్తరణ, పురోగతిపై అనిశ్చితి నెలకొనడమే దీనికి కారణమని తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. ‘ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం బాగానే ఉంది. కరువు భయాలు తొలిగాయి. అయితే, సరైన సమయంలో రుతుపవనాలు విస్తరించలేదు. దీంతో వర్షపాతం విషయంలో అనిశ్చితి నెలకొంది. ఇది ఆర్థిక వ్యవస్థపైన, ద్రవ్యోల్బణంపైన రిస్క్‌లను పెంచుతోంది. ఈ నేపథ్యంలో వర్షాభావం వల్ల తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఒక సమగ్రమైన ముందస్తు ఆహార నిర్వహణ(ఫుడ్ మేనేజ్మెంట్) వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఆర్బీఐ వివరించింది. ఈ ఏడాది(2015-16) తొలి నాలుగు నెలల్లో సంకేతాలను పరిశీలిస్తే.. తమ వృద్ధి అంచనాలకు (7.6 శాతం) అనుగుణంగానే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లు కనబడుతోందని కూడా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం, రుతుపవనాల ఆరంభ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఏడాది జనవరికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండొచ్చని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్బీఐ అంచనా వేయటం తెలిసిందే. అయితే, బేస్ ఎఫెక్ట్కారణంగా ఆగస్టు వరకూ కాస్త తగ్గుముఖం పట్టినా, ఆ తర్వాత మళ్లీ పెరగవచ్చని... 2017 జనవరికల్లా 6 శాతం దిగువకు ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం ఉందని తాజాగా పేర్కొంది. ఇప్పటివరకూ తమ అంచనాలకు అనుగుణంగానే ద్రవ్యోల్బణం కదలికలున్నాయన్నారు. ద్రవ్యోల్బణం, మొండిబకాయిలపై దృష్టి: రాజన్ ఆర్బీఐ రెండు ప్రధానాంశాలపై దృష్టి సారిస్తోంది. అందులో ఒకటి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం. మరొకటి బ్యాంకుల మొండి బకాయిల సమస్య పరిష్కారం. వార్షిక నివేదికలో ఆర్బీఐ గవర్నర్రాజన్ ఈ విషయాలను తెలిపారు. ఎన్పీఏల పరిష్కారం దిశలో చర్యలు తీసుకుని, బ్యాంక్‌ల వద్ద తగిన మూలధనం ఉండేలా ఆర్బీఐ కృషి ఉంటుందని అన్నారు. బ్యాంకుల ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడి, మూలధన పరిపుష్టి చేకూరితే... రుణ సామర్థ్యం మెరుగుపడుతుందని, రెపో (ప్రస్తుతం 7.25 శాతం) ప్రయోజనాన్ని మరింతగా కస్టమర్లకు బదలాయించడం సులభతరం అవుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రభుత్వం, ఆర్బీఐ రెండూ తగిన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... ద్రవ్యోల్బణం కట్టడి, బ్యాంకులు బేస్ రేటు తగ్గింపు, తద్వారా వృద్ధికి ఊతం వంటి అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి పెడుతోందన్నారు. ఎన్పీఏలపై బ్యాంకుల భయాలను ఆసరాగా చేసుకుని కొన్ని బడా కార్పొరేట్ ప్రమోటర్లు అసమంజస డిమాండ్లతో రుణ పునర్వ్యవస్థీకరణలను కోరుతున్నారనీ అన్నారు. భారత్‌కు మరింత వృద్ధి సత్తా ఉందన్నారు. -
హామీలు తప్ప.. ఆచరణ ఏదీ?
- ఇళ్లలోకి చేరుతున్న వరదనీరు - 13వ వార్డులో అన్నీ సమస్యలే - ఐదేళ్లుగా వరుస ముంపునకు గురవుతున్న ఇళ్లు ఇబ్బందుల్లో ప్రజలు - ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోని వైనం సంగారెడ్డి మున్సిపాలిటీః సమస్యలపై నాయకులు హామీలిచ్చినా.. ఏండ్లు గడుస్తున్న అమలుకు నోచుకోవడంలేదు. వర్షాకాలం వస్తే చాలు రాత్రి వేళల్లో జాగారాం చేయాల్సి వస్తోంది. సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. నిత్యం సమస్యలపై అధికారులకు తెలిపినా వారు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. పట్టణంలోని 13వ వార్డులో ప్రధానంగా బొబ్బిలికుంట నుంచి వచ్చే వరద నీటితో ఈ వార్డులోని ఇండ్లలోకి నీరు వచ్చిచేరుతోంది. ఇందు కు ఇండ్ల మధ్య ఉన్న ప్రధాన వరద కాల్వ ఉండటమే. కాగా ఐదేళ్లుగా ప్రతి సారి వరద నీటితో ఈ ప్రాంతంలోని ఇండ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు. అందుకోసం శాశ్వత సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అప్పట్లో మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన జేసీ.డా.శరత్ రెవెన్యూ పరమైన సమస్యలుంటే తనదృష్టి కి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు. అందు కు ఇరిగేషన్ శాఖ అధికారులు రాజం పేట నుంచి బొబ్బిలికుంట మీదుగా మహబూబ్‌సాగర్ కాల్వ వరకు ఫీడర్ చానల్ కాల్వ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. అందుకు అవరమైన రూ. 5 కోట్లు మంజూరు చేయిస్తానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో హామీ ఇచ్చారు. ముంపు బాధితులకు శాశ్వత సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో అందుకు ప్రణాళి కలు తయారు చేశారు. ఇంతలోనే ప్రభుత్వం మారింది, వారి సమస్య మళ్లీ మొదటికి వచ్చిం ది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట య్యాక గత ఏడాది కురిసిన వర్షం కారణంగా ఇండ్లలోకి నీరు వచ్చింది. ఎమ్మెల్యే చింతాప్రభాకర్ బాధితులను పరామర్శించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఆ సమస్యను అలాగే వదిలేశారు. తిరిగి వర్షా లు కురుస్తుండటంతో వార్డు ప్రజలు ఆందోళనకు గురైతున్నారు. రూ.4 కోట్లతో ప్రతిపాదనలు వార్డులో నెలకొన్న సమస్యల్లో ప్రధానమైంది బొబ్బిలి కుంట వరద కాలువ. దీని నిర్మాణానికి రూ. 4 కోట్లకు ప్రతిపాదనలు పంపాం. ఈ కాల్వ నిర్మాణం పైనే దృష్టి సారించా. నిధులు మంజూరికి కృషి చేస్తు న్నా. రూ.48 లక్షలతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. మరికొన్ని నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం. -వార్డు కౌన్సిలర్, మహ్మద్ నజీం (హజ్జు) అభివృద్ధిలో ముందున్నాం.. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కంటే తాము ముందంజలో ఉన్నాం. 13 వార్డు లో ప్రధానంగా వరద కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దానికి ప్రతిపాదనలు పంపించాం. వార్డులో సుమారు ఇప్పటికే 65 లక్ష పనులు చేశాం, మరో రూ.20 లక్షల నుంచి రూ. 35 లక్షల విలువ చేసే పనులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయి. - మున్సిపల్ చైర్పర్సన్, విజయలక్ష్మి -
గుండెపోటుతో రైతు మృతి
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. పుచ్చకాయలమాడకు చెందిన రంగన్న సాగు కోసం రూ.4 లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. వర్షాభావ పరిస్థితులతో గత కొన్ని రోజులుగా అప్పులు ఎలా తీర్చాలన్న విషయమై తీవ్ర వేదన చెందుతున్న అతడికి బుధవారం ఉదయం గుండెపోటు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్టు చెప్పారు. -
పక్కనే మంజీరా..ఐనా అగచాట్లే!
తలవంపునే మంజీరా ఉన్నా.. పట్టణమంతా ఆ నీరు తాగుతున్నా.. ఈ కాలనీకి మాత్రం బోరునీరే దిక్కవుతోంది. నాయ కులు కనీసం మంజీరా నీరే ఇప్పిం చలేకపోయారు. పైపులైన్లు వేసినా.. కొందరు నీరు సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. - మంజీరా నీరు ఎరుగని గణేష్‌నగర్ - తాగునీటికోసం ఎన్నో పాట్లు - రోడ్డు తప్ప అన్నీ సమస్యలే.. - డెంగీ వచ్చినా.. పట్టించుకునే వారేలేరు.. సంగారెడ్డి మున్సిపాలిటీః కాలనీలలోని వివిధ ప్రాంతాలలో కోటి రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించినా.. మురికి కాల్వలు లేకపోవడంతో నీరంతా ఎక్కడికక్కడే నిల్వఉంటుంది. ఫలితంగా ప్రతి వర్షాకాలంలో డెంగీవ్యాధికి గురవుతున్న వారిలో అధికంగా ఈ కాలనీ వాసులే ఉన్నారు. తాజాగా మరో ఐదుగురు డెంగీ వ్యాధితో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కనీసం రాత్రి వేళల్లో లైట్లు వెలుగలేని పరిస్థితి నెలకొంది. గణేష్‌నగర్ రాత్రివేళల్లో అంధకారంతో దర్శనమిస్తోంది. కొత్తవారెవరైనా వస్తే చీకట్లో ఇండ్లను వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. పేరుకు ఎస్టీ రిజర్వడ్ అయిన ఈ వార్డు అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ఈ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అయినప్పటికీ కనీసం మంజీరా తీరు తాపించలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో అత్యధికంగా గిరిజనులు ఉంటున్న ఈ కాలనీ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. కానీ అభివృద్ధి మాత్రం ఎరగడం లేదు. కాలనీలో 2500 మంది ఓటర్లు న్నారు. ఐదు కాలనీలున్న ఏఒక్కకాలనీలో కూడా కనీస సౌకర్యాలు లేవు. గణేష్‌నగర్, ఆనంద్‌ఆర్ట్స్, సిద్దార్థనగర్, నారాయణరెడ్డి కాలనీ, మార్క్స్‌నగర్‌లలో మురికి కాల్వ వ్యవస్థ అధ్వానంగా ఉంది. కనీసం కచ్ఛాకాలువలైన (తాత్కాలిక కాలువలైన) లేకపోవడం వల్ల మురికి నీటితో పాటు వరదనీరు సైతం రోడ్లపైనే ప్రవహిస్తుంది. దీనికి తోడు పందులు సంచరించడంతో పాటు దోమల బెడద అధికమై అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తాం.. వైస్ చైర్మన్ గోవర్ధన్ పట్టణంలోని అన్ని వార్డులకు ఆదర్శంగా 21వ వార్డును అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ గోవర్ధన్ నాయక్ తెలిపారు. ఇప్పటికే కోటిరూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మురికి కాల్వల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని నిధులు రాగానే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కాలనీనీ మాడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకే రోడ్ల నిర్మాణం పూర్తిచేయడం జరి గిందని తెలిపారు. ఈ విడతలో మురికి కాల్వల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. మంజీరా నీటి విషయంలో కొంత జాప్యం జరిగిందని సాంకేతికత కారణంగా సరఫరా చేయడం లేదన్నారు. అభివృద్ధి కోసం ప్రతిపాదనలు.. పట్టణంలోని ఎస్టీ రిజర్వ్డ్ అయిన 21 వార్డును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. రూ. 10 లక్షలు సీసీ డ్రైన్‌కోసం నిధులు మంజూరయ్యాయి. టెండర్ వేయించి పనులు ప్రారంభిం చాల్సి ఉంది. మురికికాల్వలు, మంజీరా నీటి కోసం అవసరమైన నిధుల మంజూ రు కోసం ప్రతిపాదనలు పంపించాం. - గయాసొద్దీన్, మున్సిపల్ కమిషనర్ -
శ్రీశైలంలో జపపారాయణలు ప్రారంభం
శ్రీశైలం (కర్నూలు): వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం వేద పండితులు, అర్చకులు జప పారాయణ పూజలను ప్రారంభించారు. ఇవి 12వ తేదీ వరకు కొనసాగుతాయి. సోమవారం ఉదయం స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేశారు. అనంతరం ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు. సకల జనులు ఆయురారోగ్యంతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పం చెప్పారు. అనంతరం పుణ్యహవచానాన్ని చేసి స్థలశుద్ధి చేశారు. కాగా, బుధవారం ఉదయం 7.30 గంటలకు శ్రీమల్లికార్జునస్వామికి సహస్రఘటాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు, 11గంటలకు పూర్ణాహుతి, కలశోధ్వాసన, కలశ జలాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) సాగర్‌బాబు తెలిపారు. -
పిల్లలు... చినుకులు... తల్లులు...
వర్షాకాలంలో ఏ సమయంలో వాన పడుతుందో ఎవరికీ తెలీదు. గంటల తరబడి ట్రాఫిక్ జాములు, ఆరోగ్యసమస్యలు వంటివి ఎన్నో మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇవన్నీ ఒక రకం సమస్యలైతే ఈ కాలంలో తల్లులకు మరో టెన్షన్. అదే పిల్లల సంరక్షణ. పెద్దలు తీసుకునేంత జాగ్రత్తలు పిల్లలు తీసుకోలేరు. వారికి ఆ అవగాహన కూడా ఉండదు. కాబట్టి తల్లులు తమ పిల్లలు స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ కింది చిట్కాలను పాటిస్తే సరి. పిల్లలను స్కూల్‌కు పంపేటప్పుడు వీలయినంతవరకు వాటర్ ప్రూఫ్వే ఉపయోగిస్తే మంచిది. మంచి రెయిన్‌కోట్, గొడుగు, షూజ్ తప్పక పిల్లలకు కొనిపెట్టాల్సిందే. ఇవి లేకుండా పిల్లలను ఇంట్లోంచి బయటికి పంపకండి.వర్షంలో పిల్లల టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్ తడిసి, పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బుక్స్ అన్నింటినీ ఓ పాలిథిన్ కవర్లో ఉంచి, దానిని బ్యాగ్‌లో పెట్టాలి. {పథమ చికిత్స తప్పనిసరి: పిల్లలు వర్షంలో ఆడటానికి ఎంతో ఇష్టపడతారు. వద్దన్నా వినరు. అలా ఆడేటప్పుడు తరచూ దెబ్బలు తాకుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే అవకాశం ఉండటం వల్ల రోజూ రెండుసార్లు యాంటీ ఫంగల్ సోప్‌తో స్నానం చేయిస్తే మంచిది. ఆరోగ్యకర ఆహారం: ఈ వర్షాకాలంలో ముఖ్యంగా నీరు, ఆహారం కలుషితమవుతాయి. దాని కారణంగా పిల్లలు జబ్బు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు బయటి ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే స్కూల్ బ్యాగ్‌లో వాటర్ బాటిల్ పెట్టడం మరచిపోవద్దు. -
వానా... వానా... ఇలియానా!
♦ ఇలియానాకి వానంటే ఇష్టమా? ♦ వాన పడితే తనకి గుర్తొచ్చేది? ♦ వర్షాలప్పుడేం వేస్కుంటుంది? ♦ చిన్ననాటి వాన జ్ఞాపకాలేంటి? ♦ ఎండలకు సెలవు చెప్పి, వానలకు ఆహ్వానం పలకడానికి ఎంతో హుషారుగా ఎదురు చూస్తుంటా. తొలకరి జల్లు పడగానే పులకరించిపోతా. అప్పటివరకూ ఎండల కారణంగా అనుభవించిన కష్టమంతా ఆ జల్లులతో ఒక్కసారిగా పోయినట్లు ఉంటుంది. ♦ రుతు పవనాలు వచ్చేస్తున్నాయి అని టీవీల్లో, రేడియోల్లో చెప్పగానే నేను షాపింగ్‌కి రెడీ అయిపోతాను. రంగు రంగుల గొడుగులు, గమ్ బూట్స్, రెయిన్ కోట్, కలర్‌ఫుల్ స్వెటర్లు కొని తెచ్చుకుంటాను. ♦ వర్షాకాలంలో పసుపు రంగు దుస్తులు వాడితే బాగుంటుంది. అందుకని, ఎక్కువగా ఆ రంగు దుస్తులు వాడతాను. యెల్లో కాకపోతే వేరే ముదురు రంగు డ్రెస్సులు వేసుకుంటాను. ఈ సీజన్లో లేత రంగులు అంత బాగుండవు. రెయినీ సీజన్లో నేను జీన్స్ ప్యాంట్స్ వాడను. కురచ దుస్తులే వాడతాను. ట్రౌజర్స్, కలర్‌ఫుల్ టీ షర్ట్స్ వేసుకుంటాను. ♦ నేను మామూలుగా ఎప్పుడూ ఎత్తు మడమల పాదరక్షలే వాడతాను. కానీ, వర్షాకాలంలో వాటిని పొరపాటున కూడా షూ ర్యాక్ నుంచి బయటికి తీయను. ఫ్లాట్ స్లిప్పర్స్ వాడతాను. షూటింగ్స్ ఉంటే మాత్రం క్యారెక్టర్‌కి అనుగుణంగా బూట్లు, చెప్పులు సెలక్ట్ చేసుకుంటాను. ♦ వర్షాకాలం అంటే నాకు మా గోవా గుర్తొస్తుంది. ఇలా వాన పడిందో లేదో అలా పవర్ కట్ అవుతుంది. అందుకని కొవ్వొత్తులు రెడీగా ఉంచుకుంటాం. రాత్రిపూట క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేవాళ్లం. భలే గమ్మత్తుగా ఉండేది. అదేంటో ఎంత వాన వచ్చినా గోవా బాగానే ఉంటుంది. కానీ, ముంబయ్ చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. విడి రోజుల్లోనే ట్రాఫిక్ ఎక్కువ అనుకుంటే ఇక వర్షాకాలంలో చెప్పక్కర్లేదు. రోడ్లన్నీ బురద బురదగా తయారవుతాయ్. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయ్. నడిచి వెళ్లేవాళ్లకీ ఇబ్బందే, వాహనాల్లో వెళ్లేవాళ్లకీ ఇబ్బందే. ♦ చిన్నప్పుడు వానలో బాగా తడిచేదాన్ని. పాటలు కూడా పాడేదాన్ని. ఇప్పుడు దూరంగా నిలబడి ఎంజాయ్ చేయడంతో సరిపెట్టుకుంటున్నా. వానలో తడుస్తూ, పాటలు పాడితే చుట్టుపక్కలవాళ్లు విచిత్రంగా చూస్తారని భయం. ఆ భయాలు, బెరుకులూ తెలియని బాల్యం చాలా తీపిగా ఉంటుంది కదా! ♦ రెయినీ సీజన్లో ఆ చల్లదనానికి కాస్త బద్ధకంగా ఉంటుంది. బయటికెళ్లి వాకింగ్, స్విమ్మింగ్ చేసే వీలు కూడా ఉండదు. అందుకే ఈ సీజన్లో ఇన్డోర్ వ్యాయామాలే చేస్తాను. మా ఇంటి లోపల మెట్లు ఉంటాయి. వీలైనన్ని సార్లు అవి ఎక్కి దిగుతాను. అలాగే కార్డియో ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. ♦ వడగళ్ల వాన గురించి వినడం తప్ప ఎప్పుడూ చూడలేదు. పిడుగు శబ్దం వినపడితే మాత్రం ‘ఏ సముద్రంలోనో పడి ఉంటే బాగుంటుంది’ అనుకుంటాను. ఈ సీజన్లో షూటింగ్ ఉంటే ఎప్పుడెప్పుడు ప్యాకప్ చెబుతారా, ఎప్పుడు ఇంటికెళ్లిపోదామా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే వర్షాకాలంలో నాకు ఇంట్లో ఉండటం బాగా ఇష్టం. బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తుంటాను. ఆ సమయంలో వేడి వేడి కాఫీ తాగుతుంటే దీన్నే స్వర్గం అంటారేమో అనిపిస్తుంటుంది. అలాగే మా అమ్మగారు వేడి వేడి స్నాక్స్ తయారు చేసి ఇస్తారు. అవి తింటూ హ్యాపీగా టీవీ ముందు సెటిలైపోతా. మామూలుగా డైట్ విషయంలో జాగ్రత్త తీసుకున్నా ఆ టైమ్‌లో మాత్రం లెక్కలేకుండా తింటా. ఒంట్లోకి ఎన్ని కేలరీలు పంపించానా అని తర్వాత టెన్షన్ పడుతుంటా. -
ఈ కాలంలో.. చర్మం అందంగా ఉండాలంటే..
న్యూఢిల్లీ: వర్షాకాలంలో ఎక్కువ మందిని వేధించే సమస్యల్లో చర్మ వ్యాధులు ప్రధానమైనవి. వాతావరణ మార్పులు, కలుషిత నీరు తదితర కారణాల వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతాయి. దురద, మంటలు, బొబ్బర్లు వంటివి ఎక్కువ మందిని వేధిస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వర్షాకాలంలో ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చని ప్రముఖ చర్మవ్యాధుల నిపుణుడు నవీన్ తనేజా సూచిస్తున్నారు. తేనె చర్మ వ్యాధుల నివారణలో, చర్మం అందంగా తయారవడంలో తేనె మంచి హితకారిణిగా పనిచేస్తుంది. తేనెను పలు ఆహార పదార్థాలతో కలిసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. తేనె మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి మాస్క్‌లా చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. సున్నిత చర్మం కలవారికి కూడా ఇది చర్మం మృదువుగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది. తేయాకు నూనె తేయాకు, కొబ్బరి నూనెలను కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల నివారణకు కూడా ఇది ఉపకరిస్తుంది. అనేక సూపర్ మార్కెట్లలో తేయాకు నూనె లభిస్తుంది. పండ్లు మామిడి, దానిమ్మ వంటి పండ్లు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. మచ్చల్ని తొలగించడంతోపాటు చర్మానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి. కర్బూజా పండు కూడా ఇలాగే పనిచేస్తుంది. ఈ పండ్ల రసాల్ని మిల్క్ పౌడర్‌తో కలిసి చర్మానికి రాస్తే ఉపయోగం ఉంటుంది. కలబంద జెల్ పెరట్లోనూ పెరగగల కలబందతో అనేక ప్రయోజనాలున్నాయని మనకు తెలిసిందే. వర్షాకాలంలో సంభవించే చర్మ వ్యాధుల నివారణలో సైతం ఇది బాగా పనిచేస్తుంది. కలబంద రసాన్ని తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సౌందర్య ఉత్పత్తిగా వాడే కలబంద జెల్‌ని చర్మానికి రాసుకుంటే చర్మం కాంతిమంతంగా తయారవడమే కాకుండా ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. క్యాలమైన్ లోషన్ ఇది సూర్యకాంతి ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి లోషన్లతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కీటకాలు కరవకుండా ఈ లోషన్లు రక్షిస్తాయి. తేయాకు, కొబ్బరి నూనెలను కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల నివారణకు కూడా ఇది ఉపకరిస్తుంది. అనేక సూపర్ మార్కెట్లలో తేయాకు నూనె లభిస్తుంది. యాంటీ ఫంగల్ పౌడర్ మార్కెట్లలో లభించే యాంటీ ఫంగల్ పౌడర్లను కూడా వాడాలి. దీని వల్ల చర్మంపై హానికర బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంటువ్యాధులు రాకుండా ఈ పౌడర్ నియంత్రిస్తుంది. మాయిశ్చరైజర్ ఏ కాలంలోనైనా చర్మ సంరక్షణకు తోడ్పడేది మాయిశ్చరైజర్. అయితే దీన్ని మితంగానే వాడాలి. అతిగా వాడితే తిరిగి చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది. చర్మానికి సరైన ఆక్సిజన్ అందకుండా పోయేవీలుంది. అందువల్ల చర్మంపై కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. -
తెలంగాణలో భారీ వర్షాలు
హయత్‌నగర్‌లో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం సాక్షి, హైదరాబాద్: చినుకు కోసం ఆకాశంకేసి ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నకు ఉపశమనం లభించింది. రెండురోజులుగా వానలు జోరుగా కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌లో 8, నిజామాబాద్ జిల్లా పిట్లంలో 6, మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు, ఆలంపూర్, రంగారెడ్డి జిల్లా మర్పల్లి, నల్లగొండ జిల్లా భువనగిరి, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్‌లలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజులు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. -
వెండితెరకు ఏడాదంతా వర్షాకాలమే
బాలీవుడ్ బీట్ చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే అంటూ... ఒక తరం సినిమాలు పాటలు పాడాయి. తర్వాతి తరంలో... వానా వానా వెల్లువాయె... కొండ కోన తుళ్లిపోయే... అంటూ ఓ జంట వానజల్లులో తడుస్తూంటే వెండితెరకు వెయ్యి కళ్లొచ్చాయి. జల్లంత కవ్వింత కావాలిలే... అంటూ పడుచు పిల్ల గంతులేస్తుంటే... కెమెరా చూపు తిప్పుకోలేకపోయింది. అలాగే... ఈ భామలు హిందీలో అదే పనిలో ఉన్నారు. వాన చినుకు సవ్వడి అందెల రవళిలా మారుమోగినట్లు రెచ్చిపోయి వర్షంలో తడుస్తున్నారు. ప్రేక్షకులకు ఏడాదంతా వర్షాకాలం మధురిమలను అందిస్తున్నారు. వర్షం... వర్షాకాలం గురించి వాళ్లు చెప్పిన కబుర్లు... ఐశ్వర్యారాయ్ వర్షం ఎంత ఆనందాన్నిస్తుందో వర్షం కారణంగా షూటింగ్ ఆగితే అంత ఆందోళనగా ఉంటుంది. ఆగిన రోజు వర్క్‌కోసం డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక సతమతమయ్యేదాన్ని. ఇప్పుడైతే మా పాపాయితో కలిసి నేనూ వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నాను. అమృతారావ్ వర్షం సీన్లలో నటించేటప్పుడు పెద్దగా ఎంజాయ్ చేయలేను, కానీ వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. సీన్ చేసేటప్పుడు నా పాత్ర పలికించాల్సిన భావాలే నా ముఖంలో కనిపించాలి. నిజంగా వర్షంలో తడిచేటప్పుడు నా ఆనందం నా సొంతం. షూటింగ్‌కి బయలుదేరేటప్పుడు వర్షం వస్తే కలిగే చిన్నపాటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే వర్షం కురుస్తుంటే మనసంతా చాలా ఆనందంగా ఉంటుంది. దీపికా పడుకొనె మాన్సూన్ సీజన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇప్పటికీ వర్షం వస్తే చిన్నపిల్లనై పోతాను. షూటింగ్ సమయంలో తడిస్తే మేకప్, కాస్ట్యూమ్స్ పాడయి పని ఆగిపోతుందనే భయంతో ఆగిపోతానంతే. వేసవిలో రెయిన్ సీన్ చేయడం చాలా ఇష్టం. కరీనా కపూర్ నాకు వర్షం అంటే ఎంతిష్టమో అంత భయం కూడా. చిన్నపాటి వర్షంలో తడిసినా వెంటనే జుట్టు గురించే ఆలోచిస్తాను. ఈ కాలంలో జుట్టును తడిగా ఉంచకూడదు. వాన పాట షూటింగ్ చేశాక మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అసలే సైఫ్‌కి నా జుట్టంటే చాలా ఇష్టం. కట్ చేయడానికి ఒప్పుకోడు. -
వర్షాకాలంలో.. చక్కటి ఆహారం
సాక్షి: వేసవి వెళ్లింది. తొలకరి పలకరింపుతో వర్షాకాలం వచ్చేసింది. వస్తూవస్తూ అనేక వ్యాధులను వెంటబెట్టుకొచ్చే ఈ కాలంలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితులుంటాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లతో వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని శక్తిమంతంగా, హైడ్రేషన్లో ఉంచే పోషకాహారాన్ని ఎక్కుగా తీసుకుంటూ.. జీవక్రియను సక్రమంగా, చురుగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచి, ఆరోగ్యంగా ఉంచే మాన్సూన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. మంచి నీరు చలికాలంలో దాహం వేయలేదని మంచినీళ్లు తాగడం తగ్గిస్తారు కొంతమంది. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలా జరగకుండా శరీరాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవటానికి, ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సీజన్లో కూడా నీరు ఎక్కువగా తాగాలి. బాగా మరిగించి, వడపోసిన నీటిని తాగితే మరింత శ్రేయస్కరం. తాజా ఫలాలు వర్షాకాలంలో.. వ్యాధినిరోధకతను పెంపొందించే విటమిన్-సి అధికంగా ఉండే ఫలాలను తినాలి. అలాంటి వాటిల్లో దానిమ్మ, కివి,ఆరెంజ్ వంటివి ఉత్తమం. జలుబు, దగ్గుతో వంటి రోగాలతో బాధపడుతున్నట్లయితే నీటిశాతం అధికంగా ఉన్న ఫ్రూట్స్‌ను తినడం ఉత్తమం. వెచ్చని పానీయాలు వర్షాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. అందుకు గోరువెచ్చని సూపులు, పానీయాలు తరచూ తాగుతూ ఉండాలి. వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో సూపులు బాగా ఉపయోగపడుతాయి. అల్లం, లెమన్, గ్రీన్ టీలను తీసుకుంటే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. కూరగాయలు వర్షాకాలంలో తాజా కూరగాయలను తినటం ఆరోగ్యానికి మంచిది. కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగాలి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఇతర క్రిములు వాటిపై ఉండే అవకాశం ఉంది. కూరగాయలను ఉడికించి తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. వండిన ఆహారాలు ఈ సీజన్లో తీసుకునే ఆహారాలు బాగా ఉడికించినవై ఉండాలి. పచ్చి కూరలు తినటం పూర్తిగా నివారించాలి. డైరీ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసపు ఉత్పత్తులను ఉడికించి మాత్రమే తీసుకోవటం శ్రేయస్కరం. మాంసం ఈ కాలంలో బాగా ఉడికించిన మాంసాహారాలను మాత్రమే తీసుకోవాలి. కూరల్లో నూనె తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫ్రై చేసిన వాటికంటే గ్రిల్ చేసిన లేదా ఉడికించిన మాంసాహారాలు తీసుకోవటం ఉత్తమం. ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు వర్షాకాలంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఆయిల్ లేదా ప్రైడ్ ఫుడ్స్‌ను తినడం నివారించాలి. గ్రిల్డ్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవటం మంచిది. జీర్ణక్రియను మెరుగుపరచటంలో ఇవి దోహదపడుతాయి. యాంటీఆక్సిడెంట్స్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, శరీరానికి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనిటీ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో కాప్సికమ్, బెర్రీస్, గుమ్మడి వంటివి ఉత్తమమైనవి. అందువల్ల వీటిని తరచూ మీ డైట్లో ఉండేటట్లు చూసుకోవాలి. జ్యూస్‌లు వేసవి మాత్రమే కాకుండా అన్నికాలాల్లోనూ పళ్లరసాలు ఆరోగ్యానికి ప్రయోజనం. శరీరానికి తగిన హైడ్రేషన్‌ను అందివ్వటానికి తాజా పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూస్‌లను అధికంగా తీసుకుంటే మంచిది. తినకూడని పదార్థాలు.. వర్షాకాలంలో సాధారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. అందువల్ల జీర్ణమయ్యేందుకు ఎక్కవ సమయం తీసుకునే ఆహారం తీసుకోవటాన్ని నివారించాలి. పకోడాలు, రోడ్డుపక్కన దొరికే చాట్స్, కచోరిలు, సమోసాలు, ైఫాస్ట్ఫుడ్స్, ఆకుకూరలు, సీఫుడ్స్ తినడం తగ్గించాలి. ప్రధానంగా ఆకుకూరలు వండేటప్పుడు సరిగా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఎక్కువ. -
వర్షాకాలం.. జిడ్డుగా ఉంటే..
వర్షాకాలం చర్మం కొంత అయోమయాన్ని కలిగిస్తుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు నూనెగ్రంథులు ఎక్కువ నూనెను స్రవించడంతో చర్మం జిడ్డుగా అనిపిస్తుంది. వానలో తడిసి, ఆరగానే పొడిబారినట్టుగా గరుకుగా చేతికి తగులుతుంది. ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే... ♦ ఇంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, చర్మానికి బాగా ఇంకాక శుభ్రపరుచుకోవాలి. ♦ దానిమ్మలో చర్మం ముడతలు పడనివ్వని ఓషధ గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే విటమిన్-సి, యాంటీయాక్సిడెంట్లు ఈ కాలం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, కాంతిని పెంచుతాయి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ రసం, కప్పుడు ఓట్స్, 2 టేబుల్స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసి, కలపాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి, మెత్తగా అయ్యాక ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నిగారింపు పెరుగుతుంది. ♦ ఈ కాలం మాయిశ్చరైజర్ రాసుకోవచ్చా, లేదా! అనే సందేహం తలెత్తుతుంది. జిడ్డు ఎక్కువ అనిపించేది కాకుండానూ, అలాగని పొడిబారనీయని లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ఎంచుకోవాలి. ♦ వాతావరణం మబ్బులుగా ఉంటుంది కదా, సన్‌స్క్రీన్ అవసరం ఉండదని చాలా మంది అభిప్రాయం. కానీ, మబ్బుల దాటుకుని వచ్చే సూర్యకాంతిలోనూ అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. అందుకని బయటకు వెళ్లేముందు సన్‌ప్రొటెక్షన్ లోషన్ (ఎస్.పి.ఎఫ్ -30) రాసుకోవాలి. ♦ జిడ్డును నియంత్రించాలంటే 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టేబుల్‌స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి, ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ♦ ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మం త్వరగా పొడిబారుతుంది. అందుకని సోప్-ఫ్రీ ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ (మార్కెట్లో లభిస్తుంది) ని ఉపయోగించడం మేలు. -
ఇంట్లో కుక్క ఉందా?
పెట్టిల్లు వర్షాకాలం వాతావరణ మార్పుల వల్ల మనం దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల బారిన పడతాం. మరి మన పెంపుడు కుక్కల మాటేమిటి?! వాటికి ఈ కాలం ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ ఉదయం, సాయంత్రాలు బయట తిప్పినా కొద్దిగానైనా తడవక తప్పదు. అలాగే వదిలేస్తే ఈ కాలం బ్యాక్టీరియా వృద్ధి చెంది ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ⇒ అలాగని రోజూ స్నానం చేయించడం కుదరదు. అందుకని వాకింగ్ నుంచి తీసుకువచ్చిన తర్వాత బ్లో డ్రయ్యర్‌తో పూర్తిగా ఆరబెట్టండి. స్నానం చేయించిన ప్రతీసారి త్వరగా ఆరడానికి ఇదే చిట్కాను పాటించండి. అలాగే, స్నానానికి షాంపూ వాడితే మేలు. ⇒ బుజ్జి బుజ్జి కుక్కపిల్లల పాదాల దగ్గర చర్మం సున్నితంగా ఉంటుంది. ఇవి బయట తిరిగి, మురికి అలాగే ఉండిపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ కాలం వర్షంలో తడవకుండా ఉండేందుకు డాగ్స్‌కు కూడా షూస్ మార్కెట్లో ఉన్నాయి. వాటిని ట్రై చేయవచ్చు. ⇒ కుక్కల పడుకునే చోటు, వాటి బెడ్ శుభ్రంగా, తడి లేకుండా ఉండాలి. లేదంటే త్వరగా చెడువాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే వాటికి పెట్టే ఆహారం, తినే పాత్రపై మూతలు పెట్టి ఉంచడం మేలు. క్రిములు వృద్ధి చెందడానికి అవకాశం లేని, పొడిగా ఉండే బెడ్‌ను ఈ కాలం ఏర్పాటు చేయాలి. ⇒ వర్షాకాలం చాలా వరకు కుక్కలకు చెవి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అవి గుబిలి కారణంగానూ కావచ్చు. అందుకని చెవుల బయట, లోపల కూడా పొడిగా ఉండాలి. ⇒ ఈ కాలం ఆరుబయట విహారం కుక్కలకు అంత మంచిది కాదు. ఇంటి లోపలే అవి ఆడుకునేందుకు వీలుగా స్థలాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఉదా: కార్ గ్యారేజ్, అపార్ట్మెంట్ కింది స్థలం, మెట్ల కింద.. గాలి, వెలుతురు బాగా ఉండే చోటు ఇలా... -
పాములతో పారా హుషార్
వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఇన్నాళ్లూ ఎండ వేడిమితో సతమతమైన పాములు పుట్టలు, బొరియల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ సంచరిస్తున్నాయి. ఈ నెల 16న ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన నాగేంద్ర (40) పాముకాటుతో మృతి చెందాడు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రికే 170 మంది పాముకాటు బాధితులు వచ్చారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అనంతపురం మెడికల్ : వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువ. రక్తపింజర, నాగుపాము, తాచుపాము, కట్లపాము, నీరుకట్ట, కొండచిలువ, జెర్రిపోతు వంటివన్నీ విష సర్పాలే. ఇలా ఏ రకమైన పాము కాటు వేసినా ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. పాము కాటు వేయగానే తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణనష్టం తప్పదని వైద్యులు అంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి మొదట పాము కాటు వేసిన చోటును గుర్తించాలి. కాటు వేసిన పైభాగంలో రక్త ప్రసరణ తగ్గించేందుకు కట్టుకట్టాలి. లేకపోతే రక్తాన్ని పిండేయాలి. పాములు కాటు వేసిన సమయంలో భయాందోళనకు గురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి పాము కుట్టినా మొదట ఒత్తిడికి లోనుకాకూడదు. విషపూరిత పాము కాటేసినప్పుడు ఆ భాగాన్ని ఎక్కువగా కదలించకుండా సమీపంలోని ఆస్పత్రికి ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లాలి. ఏ పాము కుట్టినా శరీరంపై ప్రభావం చూపించడానికి 30 నుంచి 60 నిమిషాల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతారు. ఈలోగా సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు. విషపూరిత పాము కాటుకు యాంటీ స్నేక్ వీనం సరైన సమయంలో ఇస్తే ప్రాణాపాయం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు పాము కాటుకు సంబంధించి ‘యాంటీ స్నేక్ వీనం’ మందును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలా మంది పాము కాటు వేయగానే నాటు వైద్యం కోసం వెళ్తున్నారు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘యాంటీ స్నేక్ వీనం’ మందు అందుబాటులో ఉంది. గుంతకల్లు, హిందూపురం, గుత్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లాలోని 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందు అందుబాటులో ఉన్నట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. తడి ఎక్కువగా ఉండడం తో చల్లని వాతావరణం ఉంటుంది. దీంతో పాముల బెడదకూడా ఎక్కువే. రైతులు పొలం పనులకు వెళ్లేటప్పుడు కాళ్లకు పొడవైన బూట్లు వేసుకోవాలి. రాత్రి వేళల్లో పొలాలకు టార్చిలైట్ తీసుకుని పంచె కింద వరకు ధరించాలి. కర్రతో శబ్దం చేసుకుంటూ వెళ్లాలి. ఒక వేళ అనుకోకుండా పాము కాటు వేస్తే ఆందోళనకు గురికాకుండా సమీప ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకోవాలి. వీలైనంత వరకు వెలుతురు ఉండగానే పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటే మంచిది. - డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి, కేవీకే కో ఆర్డినేటర్, రెడ్డిపల్లి నాటు మందులతో ప్రమాదం చాలా మందు పాముకాటుకు నాటుమందు అంత సురక్షితం కాదు. ముందుగా పాముకాటుకు గురైన వారు ఒత్తిడికి లోనుకావద్దు. అలా చేస్తే విషం వేగంగా ప్రసరించి మెదడుపై ప్రభా వం చూపుతుంది. కాటు వేయగానే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆలస్యం చేయొద్దు. - షేక్ యాసిర్ అరాఫత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అనంతపురం ప్రభుత్వాస్పత్రి. -
వానాకాలం చదువుకు తోడు..
ఎన్నికల వ్యయం గురించి చెప్పేవన్నీ సాధారణంగా దొం గలెక్కలే. దీనిని నిరోధించే విషయంలో ఎన్నికల సంఘం కూడా చేతులెత్తేసింది. మరీ విస్తృతంగా కాదు గానీ, వారికి ఉన్న అసలు విద్యార్హతకు మించి లేదా విద్యార్హత సాధిం చడానికి ఉన్న అవకాశానికి మించి అర్హతలు ఉన్నట్టు రాజకీయ నాయకులు చెప్పు కుంటూ ఉంటారు. దీనితో వారంతా విద్యాధికులన్న కృతకమైన గౌరవం కలుగుతూ ఉంటుంది. స్మృతి ఇరానీ ఏల్ డిగ్రీ లేదా డిప్లొమా వివాదం, జితేంద్ర తోమర్ న్యాయశాస్త్ర పట్టా సంగతి మనం విన్నాం. ఆప్ శాసన సభ్యుడు విశేష్ రవి అయితే 2013లో బీకాం పట్ట భద్రుడినని రాశాడు. మళ్లీ 2015లో ఇందిరాగాంధీ సార్వ త్రిక విశ్వవిద్యాలయంలో (ఇగ్నో) బీఏ చదువుతు న్నట్టు పేర్కొన్నారు. నిజానికి మంచి విద్యను వృద్ధి చేసుకో వడానికీ, ఆ రంగంలో మంచి సంప్రదాయాలను అనుస రించడానికీ దోహదం చేసే చట్టాలను నిర్మించుకో వడం లో అలాంటి కపట విద్యాధిక్యత ఏమైనా ఉపయో గపడుతుందా? వాస్తవంగా తన విద్యార్హతలు ఏమిటో దేశానికి నమ్మకం కలిగించేటట్టు చెప్పవలసిన బాధ్యత ఇంకా స్మృతి ఇరానీ మీద ఉంది. సోనియా గాంధీ తన విద్యార్హ తకు సంబంధించి చాలా కాలేజీలు ఉండే కేంబ్రిడ్జ్ పేరు ను అలవోకగా ఉపయోగించుకున్నారు. అబద్ధం చెప్పా డా, లేక బీకాం తరువాత బీఏ చదువుతూ రెండు డిగ్రీల కోసం ప్రయత్నిస్తున్నాడా అనే అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే రవి కూడా మనకు చెప్పవలసి ఉంది. ఇటీవల ఇలాంటి వే మహారాష్ట్రలో కొన్ని కేసులు నమోదయ్యాయి. మరో ప్రముఖ రాజకీయ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ విద్యార్హ తల మీద ఒక ఉద్యమకారుడు ఎఫ్ఐఆర్ నమో దు చే యించాడు. ఆయన ప్రఖ్యాత విద్యా సంస్థ వీజేటీఐ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందినట్టు చెబుతారు. ఇప్పు డు ఆ సంస్థ డీమ్డ్ విశ్వవిద్యాలయం కూడా. అయినా తన వాస్తవ విద్యార్హతలు ఏమిటో భుజ్‌బల్ వెల్లడిం చలే దు. పైగా ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టిపా రేశారు. గోవా మంత్రివర్గ సభ్యుడు రామకృష్ణ ధావ్లికర్ తాను పట్టభద్రుడనని చెప్పుకుంటూనే, ఒక సబ్జెక్ట్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యాననీ, అయితే పట్టా మాత్రం ఉందనీ చెబుతారాయన. తాము దాఖలు చేసిన అఫిడవిట్లలో విద్యార్హత గురించి పేర్కొన్న అంశాలలో ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయో దాదాపు ఎనిమిది మంది శాసనసభ్యులు వివరించి చెప్పడం లేదు. గడచిన మూడు ఎన్నికలలో 288 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడ విట్లను విశ్లేషిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ అంశాలను వెల్లడించింది. ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల వారే. బయటకు తెలియని ఇలాం టి కేసులు దేశం నలుమూలలా ఇంకా చాలా ఉంటాయి. దేశంలో పాఠశాల విద్య ఎగుడుదిగుడుగా ఉంది. దీనిని రూపొందించిన వారు, పర్యవేక్షిస్తున్నవారు రాజకీ య నేతలే. ఉత్తరప్రదేశ్ పరీక్షా కేంద్రాలలో బల్ల లూ, ఇన్విజిలేటర్లను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నా రు. అభ్యర్థులు తెరిచిన పుస్తకాలు పెట్టుకుని, మొబైల్ ఫోన్ల సాయంతో నేల మీదే కాళ్లు బారజాపి కూర్చుంటు న్నారు. బిహార్‌లో పరీక్షలకి అంత బాగా సిద్ధం కాలేక పోయిన, లేదా అంత మంచి బోధనకు నోచుకోని అభ్యర్థి కుటుంబ సభ్యులంతా పరీక్షా కేంద్రానికి విచ్చేసి, గోడలెక్కి మరీ విద్యార్థికి సాయమందిస్తున్నారు. ప్రైవేటు విద్య ప్రభుత్వ పాఠశాలలను అణగ దొక్కేసింది. స్కూళ్ల ఇన్స్పెక్టర్ పరిధిలోకి ఎంతమాత్రం చేరని ‘ఇంటర్నేషనల్ స్కూల్స్’ పుట్టగొడుగుల్లా పెరిగి పోయాయి. వాళ్ల పాఠ్య ప్రణాళిక వాళ్లదే. బోధనా పద్ధతు లు, నిబంధనలు కూడా వాళ్లవే. చిరకాలంగా విద్యకు దూరంగా ఉండిపోయిన వర్గాల వారు ఇప్పుడు ఉత్తమ విద్య కోసం వాటి వెంట పడుతున్నారు. మున్సి పల్, ప్రభుత్వ పాఠశాలలు అధ్వానస్థితిలో ఉన్నాయి. లోదు స్తులు మార్చుకోవడానికి కనీస సౌకర్యం కూడా లేకపోవ డంతో బాలికలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు వారి వాస్తవ విద్యార్హ తలకు మించిన అర్హతలను చూపిస్తున్నారు. ఇదే వింత. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేశ్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
వర్షాలతో అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): రుతు పవనాల రాకతో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ‘మాన్సూన్’ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీరు నిండి కాలువలు పొంగి పొర్లినా.. ఇళ్లల్లోకి నీళ్లు చేరినా.. అత్యవసర పరిస్థితుల్లో స్పందించి రక్షణ చర్యలు చేపట్టేందుకు అధికారులను నియమించారు. ఆయా ప్రాంతాల వారీగా ఒక్కో అధికారిని ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి నవంబరు 2వ తేదీ వరకు ఆయా ప్రాంతాల వారీగా అధికారుల వివరాలను శనివారం ఉపకమిషనర్ మమత వెల్లడించారు. రెండు షిప్ట్‌ల వారీగా వీరు పనిచేస్తారని తెలిపారు. అత్యవసర కంట్రోల్ రూంను సైతం 24/7 పని చేసే విధంగా 040-23085845 ను కేటాయించారు. ఇక్కడ ఓ సిబ్బందిని నియమించి ఫోన్‌కు వచ్చే కాల్స్ ఆధారంగా అధికారులు అప్రమత్తమై సహాయక చర్యల్లో పాల్గొంటారని మమత తెలిపారు. -
జూన్‌కి ‘పంపు’ల నిర్మాణం పూర్తి
- ప్రకటించిన బీఎంసీ..రూ. 228 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి - వర్షపు నీటిని తరలింపు కోసం వాటర్ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం సాక్షి, ముంబై: వర్షకాలం మొదలుకాక ముందే వర్లీలోని రెండు స్టార్మ్‌వాటర్ పంపింగ్ స్టేషన్లను పూర్తి చేస్తామని బృహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే రూ. 228 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొంది. జూన్ మొదటి వారంలో ఈ పనులు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పనులు పూర్తయితే మహాలక్షి, దాదర్ ప్రాంతాల్లో వర్షపు నీటి సమస్య ఉండదని తెలిపింది. ప్రతి ఏటా వర్షకాలంలో దాదర్ రైల్వే స్టేషన్, పూల మార్కెట్, సేనాపతి బాపట్ మార్గ్, ఎన్.ఎం.జోషి మార్గ్ ఇతర దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయి. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పంపింగ్ స్టేషన్ల ద్వారా వరద నీటిని సముద్రంలో కలిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఐర్లా, హజిఅలీలో పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరిన్ని పంపింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని ఆరేళ్ల క్రితమే బీఎంసీ చేపట్టింది. రూ.3,535 కోట్లతో బ్రిమ్స్టోవాడ్ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది ప్రాంతాల్లో పంపింగ్ స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించింది. హజిఅలీ, జుహూలోని ఐర్లా, లవ్‌గ్రోవ్, క్లేవ్‌ల్యాండ్ బందర్ (ఈ రెండు వర్లీలోనే ఉన్నాయి) బ్రిటానియా (రే రోడ్), గజ్దర్బంద్ (ఖార్దందా), మొగ్ర సాంతక్రూజ్, మహుల్లలో వాటిని నిర్మించనుంది. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు పంపింగ్ స్టేషన్లను మాత్రమే బీఎంసీ పూర్తి చేసింది. దాదాపు రూ.115 కోట్లను క్లేవ్ బందర్‌కు, లవ్‌గ్రోవ్ పంపింగ్ స్టేషన్‌కు రూ.113 కోట్లను ఖర్చు చేశారు. క్లేవ్లో ఏడు పంపులు, లవ్గ్రోవ్లో 10 పంపులున్నాయి. ఈ పంప్‌ల ద్వారా దాదాపు 6,000 లీటర్ల వరద నీటిని ఒక్క సెకెండ్లో తొలగించవచ్చని సమాచారం. -
కట్ చేస్తే.. కళాఖండం
చిన్నప్పుడు కాగితాల పడవలతో వర్షాకాలం ఎంజాయ్ చేశాం. కాస్త పెద్దయ్యాక కాగితం విమానాలను గాలిలో గింగిరాలు కొట్టించాం. కాలేజీకొచ్చాక రాకెట్లు చేసి.. అమ్మాయిల జడకుచ్చుల్లోకి గురి చూసి కొట్టాం. పేపర్‌తో పూలు చేసి క్లాస్రూమ్ డెకరేషన్లో కటింగ్‌లు ఇచ్చాం. కాగితాలతో కెమెరాలు, విచిత్రాకృతులు ఎన్నో చేశాం. స్మార్ట్ యుగం వచ్చే సరికి ఇప్పుడవన్నీ మరచిపోయాం. కంప్యూటర్లు, ఫోన్లతో ఆడుకుంటున్న ఈ తరం పిల్లలకు పేపర్ క్రాఫ్ట్స్ మజాను రుచి చూపిస్తున్నారు దేవకిరణ్. ఇటీవల ఆయన నిర్వహించిన కిర్గామి (పేపర్ క్రాఫ్ట్) వర్క్‌షాప్‌లో పిల్లలే కాదు, పెద్దలూ హుషారుగా పాల్గొన్నారు. కాగితాలతో కళాఖండాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఇంట్లో మీ చిన్నారి చేతికి కత్తెర, కాగితం దొరికితే.. ఇళ్లంతా డస్ట్‌బిన్‌గా మారిపోతుంది. చిన్నప్పుడే కాదు కాస్త పెద్దయిన తర్వాత కూడా పిల్లలకు కత్తెర.. కాగితం కాంబినేషన్ క్రేజీగానే అనిపిస్తుంటుంది. దొరికిన కాగితం ముక్కను రకరకాలుగా కట్ చేస్తూ ఏదో రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని కాస్త ప్రోత్సహిస్తే.. అద్భుతమైన డిజైన్లు ఆవిష్కృతం అవుతాయంటున్నారు.. పేపర్ క్రాఫ్ట్ ఎక్స్పర్ట్ దేవకిరణ్. దీని ద్వారా విద్యార్థుల్లోని సృజనను వెలికి తీయవచ్చని చెబుతున్నారు. ఇలాంటి పిల్లల కోసమే సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రె డ్ స్పేస్‌లో పేపర్ క్రాఫ్ట్ట్పై శిక్షణ ఇచ్చేందుకు రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు దేవకిరణ్. ఈ వర్క్‌షాప్‌లో చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు. తమ చేతుల్లో రూపుదిద్దుకున్న రకరకాల డిజైన్లు చూసి మురిసిపోయారు. తమ పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకూడదని భావిస్తున్న తల్లిదండ్రులు కూడా.. చిన్నారులను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు. వందల రకాల డిజైన్లు.. మార్కెట్లో దొరికే గ్లేజ్, కైట్ పేపర్ తీసుకుని వాటిని తమకు కావాల్సిన డిజైన్‌తో సిజర్స్‌తో కట్ చేయడమే పేపర్ క్రాఫ్టింగ్. వీటితో ఇంట్లో డెకరేషన్ కోసం వాల్ డిజైనింగ్స్, హారాలు, చెట్లు, జంతువులు.. ఇలా రకరకాల ఆకృతులు కాగితాలతో రూపొందించవచ్చు. పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో వీటిని ప్రత్యేకంగా అలంకరించుకోవచ్చు. ‘ఒక్కో ఐటమ్ నుంచి వంద రకాల డిజైన్లు కూడా తయారు చేయవచ్చు. 8వ తరగతిలో పేపర్‌తో చిత్రాలు చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు పిల్లలకు ఇందులో శిక్షణనివ్వడం సంతోషంగా ఉంద’ని ఆనందంగా చెబుతారు దేవకిరణ్. పేపర్ క్రాఫ్ట్ కూడా ప్రత్యేకమైన ఆర్ట్ అని చెప్పే ఆయన.. దీనివల్ల పిల్లలకు ఆనందం కలగటంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. పెద్దవాళ్లు దీన్ని ఉపాధిగా కూడా మలుచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. స్కిల్స్ పెరుగుతాయి.. ‘నా కూతురు శ్రీనిధి ఇంట్లో కత్తెర పట్టుకుని పేపర్లతో ఓ యుద్ధమే చేస్తుంది. అందుకే తనకు పేపర్ క్రాఫ్ట్‌లో శిక్షణ ఇప్పించాలనుకున్నాను. తనతో పాటు నేనూ నేర్చుకుంటున్నా’ అని తెలిపారు గీతాంజలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో స్కిల్స్ డెవలప్ అవుతాయని చెబుతున్నారు స్రవంతి. అందుకే తన కూతురు వేదతో వర్క్‌షాప్‌నకు వచ్చానని తెలిపారు. ఇంకా ఎందరో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ వర్క్‌షాప్‌లో కాగితాలతో కుస్తీపడ్డారు. రంగుకాగితాలతో తమ చేతిలో తయారైన డిజైన్లను అపురూపంగా చూసుకున్న ఈ చిన్నారులు.. వాటిని పదిలంగా దాచుకుంటామంటున్నారు. -దార్ల వెంకటేశ్వరరావు (రాంగోపాల్‌పేట్) -
ఆగమైన బతుకులు
అదో మెట్టప్రాంతం.. ఎప్పుడూ కరువు ఛాయలే. జలయజ్ఞంలో భాగంగా అక్కడ రిజర్వాయర్ కడుతున్నారని తెలిసి రైతులు ఎంతో సంతోషించారు. సాగునీటితో భూములన్నీ సారవంతమవుతాయని, తాము నష్టపోయినా... మిగతా రైతులన్నా బాగుపడతారని భావించి తమ ఇళ్లు, భూములు అప్పగించారు. అలా గౌరవెల్లి రిజర్వాయర్‌కు పునాదిరాయి పడి ఇప్పటికి ఆరేళ్లయింది. అధికారులు పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు పేరిట ఊరినంతా బొందలగడ్డలు చేశారు. ఇళ్లచుట్టూ మట్టి తవ్వారు. వానాకాలం ఇళ్ల చుట్టూ నీరు చేరి బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఆ ఊరితో అనుబంధాన్ని పెంచుకుని, మట్టిలో మట్టిగా బతుకుతున్న ఆ కష్టజీవులను ఇప్పుడు కదిలిస్తే ఉబికివస్తున్న కన్నీళ్లు... పంటిబిగువున అణుచుకున్న బాధలే కనిపిస్తాయి. ఊళ్లో పనిలేక... పైసలు లేక మరెక్కడికీ పోలేక వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారి ముంపు బాధితుల హృదయాలను తడిమారు. వారి గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదనను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. న్యాయం చేస్తాం జలయజ్ఞంలో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్టుకు అనుసంధానంగా 2007లో గౌరవెల్లి, గండిపెల్లి, ఓగుళాపూర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఏడేళ్లు గడిచినా ఇంకా మధ్యమానేరు ప్రాజెక్టు పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఈ నియోజకవర్గంలో లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఓగులాపూర్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్ తట్టెడు మట్టి కూడా తియ్యలేదు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. నీళ్లు వచ్చిన ప్రాంతానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని నిర్ణయించినందున పరిహారం పంపిణీ చేస్తున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఇళ్లకు సైతం రూ.36 కోట్లు మంజూరయ్యాయి. ఇళ్లు కోల్పోతున్నవారికి డబ్బులు అందించేలా కృషి చేస్తాం. పొలాల్లోనే ఇళ్లు కట్టుకున్న విషయంలో అధికారులను పంపించి పరిశీలన చేసి అందరికీ డబ్బులు వచ్చేలా చూస్తాం. అందరికీ న్యాయం చేస్తాం. - వొడితెల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే గ్రామస్తుల డిమాండ్లు వ్యవసాయ భూములకు నూతన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలి. ఆంధ్రాలో లాగా ఎకరానికి రూ.25 లక్ష లు చెల్లించాలి. భూసేకరణ పూర్తిస్థాయిలో చేపట్టి రైతులకు పరిహారం అందించాలి.మునుగుతున్న ఇళ్ల ధరలను పెంచి జనవరి లోగా అందరికీ డబ్బులు పంపిణీ చేయాలి.ముంపు గ్రామంలోని అందరికీ ఒకేచోట నివాసాలు ఏర్పాటు చేయాలి.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేయాలి.ప్రతీ ఇంటికో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం కల్పించాలి. వొడితెల సతీశ్‌కుమార్ : మీ పేరేంటయ్యా? బొడిగ బాలయ్య : నా పేరు బొడిగ బాలయ్య సార్. మాకు మస్తు బాధలున్నయ్ సారు. ఐదేళ్లకిందట డ్యాం కడుతమని మట్టి తీసిండ్రు. మాకు పైసలు మాత్రం ఇయ్యలే. తవ్వుకున్న బాయిలు పోయినయ్. పత్తి ఏత్తే వానలు కొట్టి మొత్తం నట్టమైనా మాకు పైసలు ఇయ్యరట. మిమ్నల్ని ఎవుసం ఎవలు చేసుకొమ్మన్నరని మామీదికే గరమైతండ్రు. డ్యాంల మునిగిపోతున్నయని బ్యాంకోల్లు లోన్లు కూడా ఇత్తలేరు. మమ్ముల్ని బతుకుమంటరా? సావుమంటరా? సతీశ్‌కుమార్ : మీ ఇబ్బందులేంటి? బొడిగె కొంరయ్య : ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి ఆరేళ్లయింది. ముగ్గురు ఎమ్మెల్యేలు మారిండ్రు. ముగ్గురు ఆర్డీవోలు, ముగ్గురు ఎమ్మార్వోలు మారిండ్రు. తెనుగపల్లె, గుడాటిపల్లోళ్లకు ఇండ్ల జాగలు చూపిత్తమని చెప్పిండ్రు. ఇండ్ల జాగలు ఇయ్యలె. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కూడా మంచిగ చేత్తలేరు. గవర్నమెంట్‌కు చెప్పినం. స్పెషల్ కలెక్టర్ దగ్గరికి పోతే పైసల్ వచ్చినయని చెప్పిండ్రు. ఇత్తరని ఆశపడ్డం కానీ, ఇప్పటిదాకా ఇయ్యలే. లక్షలు పెట్టినా గిట్లాంటి భూమి దొరకదు. ఈ భూములకు ఎకరానికి పది లక్షలు ఇయ్యాలె. సతీశ్‌కుమార్ : ఏం పనులు చేసుకుంటున్నరు? బొడిగె మల్లయ్య : ఇరవై ఏండ్లనుంచి డ్యాం వస్తంది... డ్యాం వస్తంది అన్నరు. వైఎస్ ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టి పని మొదలువెట్టిండు. ఆరేండ్లయింది. ఇప్పటిదాకా పని పూర్తికాలె. డ్యాంల పోని పొలాలను అమ్ముదామంటే కొనేటోళ్లు లేరు. ఎవుసం లేదు. ఏం లేదు. పనికిపోదామంటే ఇక్కడ ఏం పనిలేకుండా అయ్యే. ఎట్లాగూ డ్యాంల మునుగుతందని ఉపాధి పని కూడా ఈడ ఇత్తలేరు. ఊర్లపొంట తిరిగి పనులు చేత్తన్నం. మమ్ముల్ని ముంచుతరో... తేల్తరో తెల్తలేదు. సతీశ్‌కుమార్ : భూములకు ఏం ఇవ్వాలే? ఎల్లరెడ్డి : బాయిలు, బొందలు తవ్వుకుని పొలాలన్నీ అచ్చుగట్టుకున్నం. డ్యాం వత్తదని సెప్పి మెల్లమెల్లగ బుదురకిచ్చి మా భూములన్నీ తీసుకున్నరు. మా బతుకులన్నీ కరాబైనయ్. మా ఊరికి పిల్లనిచ్చేటోళ్లు లేరు. ఈడి పిల్లను చేసుకునేటోళ్లు లేరు. ఇక్కడ పనిలేదు. అవతల కైకిలి లేదు. తిప్పలయితంది. మీరన్న న్యాయం చేసి మా భూములకు మంచి ధర కట్టియ్యాలె. సతీశ్‌కుమార్ : మీకు ఇళ్ల స్థలాలు ఎక్కడ చూపించారు? బోడ మల్లారెడ్డి : ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జప్పన ఇయ్యాలె. రామవంబోటికి ఇండ్లు ఇత్తమని అంటండ్రు. జంగల్ల ఉండుమంటే మాకు దిక్కెవడు. దీమెవలు. జంగల్ల కాకుండా ఊరికి దగ్గరన్న కాడ జాగలు ఇయ్యాలె. సతీశ్‌కుమార్ : ఇళ్ల డబ్బులు ఎంతమందికి రాలేదు? బొజ్జపురి బాబు : ఇళ్లకు డబ్బులు ఇస్తమని అంటండ్రు గనీ... ఇచ్చుడయితే లేదు. 687 ఇండ్లకు పైసలియ్యాలె. ఇళ్లకు అవార్డు కూడా సేసిండ్రు. పైసలు వచ్చినయని సెప్పుతండ్రు గనీ... ఇప్పటిదాకా ఇయ్యలే. సతీశ్‌కుమార్ : గవర్నమెంట్ స్కీంలు అందుతున్నాయా? కంప రవి : ఎవుసం పోయింది. చేద్దామంటే పని కూడా లేదు. ఈడ పనిలేదని పట్నం పోతే ఇక్కడి రేషన్కారట్ తీసేసిండ్రు. పని లేకనే పోతిమి. కారట్ తీసేత్తె ఎట్ల? గిట్ల సర్కారోళ్లు మమ్ములను కష్టపెడుతండ్రు. సతీశ్‌కుమార్ : మీ డిమాండ్లేంటి? గుర్రం ఎల్లారెడ్డి : మా భూములకు అప్పుడు రెండు లచ్చల పదివేలు ధర కట్టిండ్రు. కానీ, పైసలియ్యలె. ఇప్పుడు కొత్త రేట్లు కట్టిత్తమని అంటండ్రు. మా ఇండ్లకు కూడా కొత్త రేట్లు కట్టియ్యాలె. కొత్త జీవోను మాకూ వర్తింపజేయాలె. సతీశ్‌కుమార్ : పరిహారం విషయమై అధికారులేమంటండ్రు? నల్ల మహేందర్‌రెడ్డి : నాలుగెకరాల భూమి ఉంటే డ్యాంల రెండెకరాలు పోయింది. పైసలు ఇప్పటిదాక ఇయ్యలె. ఎవలను అడిగినా సప్పుడు జేత్తలేరు. మా భూమినంత అంగడంగడి సేసిండ్రు. జర మీరే మాకు పైసలు ఇప్పియ్యాలె. సతీశ్‌కుమార్ : మీ ఊరికి ఏం కావాలె? తాట్ల యాదమ్మ, సర్పంచ్ : మా ఊరి జనానికి గవర్నమెంట్ సాయం జెయ్యాలె. మీరు మా ఊరోళ్లకు అండగా ఉంటే మా ఇబ్బందులన్నీ పోతయ్. సతీశ్‌కుమార్ : మీ కష్టాలు ఎవరికన్నా చెప్పారా? పిట్టల జ్యోతిబస్ : మా కష్టాలు ఎందరికి ఎన్ని మాట్ల సెప్పినమో లెక్కలేదు. మాది పన్నెండెకరాల ఎవుసం. మూడు బాయిలు... ఒక బోరు. మొత్తం డ్యాంల పోయినయ్. పైసలు మాత్రం ఇంకా ఇయ్యలె. స్పెషల్ కలెక్టర్ దగ్గరికి పోతే ఓఎస్డీ అంటండు. మంత్రి దగ్గరికి పోతే పైసలు ఇత్తమని చెప్పిండు. ఇప్పటికి మా ఊళ్లె 36 కోట్లు పంచాలె. ఇండ్ల పైసలు కూడా ఇత్తలేరు. దయచేసి మమ్ముల్ని ఆదుకోండ్రి. -
వ్యాధుల కాలం.. పశువులు పైలం
గొంతువాపు వ్యాధి వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేది గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అంటారు. నీరసంగా ఉండే పశువులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుం ది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది. గొంతు పై భాగాన మెడ కింద వాపు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి. చికిత్స.. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాధి సోకిన పశువుకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్‌టాజు, ఎక్సెప్ట్ వంటి ఇంజక్షన్లు ఇవ్వాలి. వ్యాధి ముదిరితే ఏమీ చేయని పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న పశువుకు బూస్టర్ డోస్ తప్పక వేయించాలి. జబ్బవాపు.. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం చొవై అనే బ్యాక్టిరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఆరు మాసాల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పశువులకు ఎక్కువ సోకుతుంది. ఈ వయసులో పశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి, మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. వాపుతో పశువులు కుంటుతాయి. వెనక కాలు కాని ముందు కాలు గాని పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది. చికిత్స.. వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్, ఆక్సివంటి యాంటిబయాటిక్స్ వాడాలి. వాటితో పాటు డెక్ట్రోజ్ నార్మల్ సెలైన్ వాడాలి. వ్యాధిగ్రస్థ పశువుల్ని వేరుచేయాలి, చనిపోయిన పశువును ఉన్నట్లయితే గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి రాకుండా వర్షాకాలం ముందే జబ్బవాపు వ్యాధి టీకాలు వేయించాలి. గాలికుంటు వ్యాధి.. గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాల బలహీనంగా ఉంటుంది. పాలు ఇచ్చే గేదేలు చాలా నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. ఎడ్లు వ్యవసాయం పనులు చేయడానికి సాహసించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్లలో పెంచుకొనే పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం చేత పశువులు మేత, తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది. చికిత్స వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. అంతే కాకుండా ముందు జాగ్రత్తగా స్థానిక పశువైద్యాధికారులు జాతీయ గాలికుంటు వ్యాధి నివా రణ పథకం కింద టీకాలు కూడా ఉచితంగా వేస్తున్నారు. గొర్రెల్లో కాలి పుండ్లు.. వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వల్ల కాలి పుండ్ల వ్యాధి సోకుతుంది. బురదలో తిరిగినప్పుడు గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లిపోతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి మరింత జటిలం అయితే గిట్టలూడి పోతాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు 10 శాతం మైలతుత్తం, పది శాతం జింక్‌సల్ఫేట్, లేదా ఐదు శాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజక్షన్లు వరుసగా 3-5 రోజులు వేయించాలి. అంతే కాకుండా గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనీయొద్దు. గట్టి నేలల్లో మేపే విధంగా చూడాలి. -
భారీగా తగ్గిన భూగర్భ జలాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘జల’సిరి తరిగిపోతోంది. వర్షాకాలం ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. జిల్లాలో సగటున 13.76 మీటర్ల లోతులో భూగర్భజలాలు లభిస్తున్నట్లు భూగర్భజల వనరుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో 11.81 మీటర్ల లోతులో ఉన్న నీరు.. ప్రస్తుతం మరింత దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాగునీటి అవసరాలు, సాగునీటి వినియోగ భారమంతా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉండడంతో సంపద క్రమంగా తరిగిపోతోంది. వాస్తవానికి సీజన్ మొదట్నుంచి జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే భూగర్భ నీటిమట్టం పైకి వచ్చేది. కానీ ఆగస్టు చివరివారం వరకు వర్షాలు ముఖం చాటేయడంతో నీటిమట్టం మరింత పడిపోయింది. ఈ సీజన్లో జిల్లాలో సగటున రెండు మీటర్ల లోతుకు పాతాళగంగ పడిపోయినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరిగి, యాచారం మండలాలు మినహా మిగతా 35 మండలాల్లో నీటిమట్టాల పతనం అధికంగా ఉంది. గతేడాదితో పోలిస్తే బంట్వారం మండలంలో 24.57మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఉప్పల్ మండలంలో 6.57 మీటర్లు, గండేడ్ మండలంలో 6.13 మీటర్ల లోతుకు నీటిమట్టం తగ్గింది. ఆరు మండలాల్లో మరీ అధ్వానం.. జిల్లా వ్యాప్తంగా ఆరుమండలాల్లో భూగర్భ నీటిమట్టాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బంట్వారం మండలంలో 34.87 మీటర్ల లోతులో నీటిలభ్యత ఉన్నట్లు భూగర్భ జలవనరుల శాఖ తాజా నివేదికలు చెబుతున్నాయి. మల్కాజిగిరి మండలంలో, 26.76 మీటర్లు, మొయినాబాద్‌లో 23.26 మీటర్లు, మర్పల్లిలో 22.05 మీటర్లు, మహేశ్వరంలో 19.54 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. హయత్‌నగర్, శేరిలింగంపల్లి, శామీర్‌పేట, తాండూరు మండలాల్లో మాత్రం భూగర్భజలాల పరిస్థితి మెరుగ్గా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున భూగర్భజలాల పరిస్థితి కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురవకుంటే మాత్రం తాగునీటికీ కటకట ఏర్పడక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గాలికుంటుతో జాగ్రత్త
* రైతులకు పశువైద్యాధికారుల సూచన * నేటినుంచి సెప్టెంబర్ 10 వరకు అన్ని గ్రామాల్లో పశువైద్య శిబిరాలు * మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు * పశుపోషకులకు సదావకాశం వర్షాకాలంలో మూగజీవాలకు వచ్చే గాలికుంటు వ్యాధి విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యులు సూచిస్తున్నారు. పికోర్నా గ్రూపునకు చెందిన వైరస్ ద్వారా సోకే దీని వల్ల పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతాయని చెబుతున్నారు. ఈ వ్యాధి నివారణ కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరోధక టీకాలు ఇస్తున్నారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు వెటర్నరీ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై నంగునూరు వెటర్నరీ ఆస్పత్రి వైద్యుడు - డాక్టర్ వేణు, ఫోన్: 8790998014 అందించిన సలహాలు.. సూచనలు.. - నంగునూరు ఆరు నెలల వరకు వ్యాధి ప్రభావం మన ప్రాంతంలో ఓఏ, ఏఎస్ఐఏ-1 రకాల వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీని బారిన పడిన పశువుపై ఆరు నెలల వరకు వ్యాధి ప్రభావం ఉంటుంది. మూగజీవాల్లో రక్తహీనత ఏర్పడి శ్వాస తీయడం కష్టంగా మారి ఎప్పుడూ ఎగపోస్తుంటాయి (శ్వాస అధికంగా తీయడం). ఎండ వేడిమిని తట్టుకోలేక త్వరగా నీరసించిపోతాయి. ఈ వ్యాధి బారిన పడిన ఆవు, లేదా బర్రె పాలు తాగిన లేగలు, దుడ్డెలు మృత్యువాత పడే అవకాశం ఉంది. దేశవాలీ పశువులతో పోలిస్తే సంకర జాతి పశువులపై దీన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయినా దీని ప్రభావంతో పశువుల్లో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి బారిన పడ్డ పశువులు మేత సరిగ్గా మేయవు. దీని ప్రభావంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. - శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 ఫారిన్‌హీట్స్ ఉంటుంది. జ్వరం తీవ్రత అధికంగా కనిపిస్తుంది. - పళ్ల చిగుళ్లు, నాలుక, గిట్టల మధ్య, పొదుగు, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి చితికిపోతాయి. - బొబ్బలపై ఈగలు, పురుగులు, బ్యాక్టీరియా ఆశ్రయించడం వలన చీము ఏర్పడి పుండ్లు అవుతాయి. - నోటి నుంచి సొంగ కారడంవంటి లక్షణాలు కనిపిస్తాయి. - చూడి ఆవులు, బర్రెలకు ఈ వ్యాధి సోకితే గర్భస్రావం అవుతుంది. పాలు తాగిన దూడలు మృత్యువాత పడుతాయి. వ్యాప్తి ఇలా... పకో వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెంది ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. - అపరిశుభ్రంగా ఉండే పశువుల పాకలు, వీటిలో నిల్వ ఉంటే మురుగు వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. - లాలాజలం, మూత్రం, పేడ, వీర్యం, పాలు, చనుకట్ల పుండ్ల నుంచి వచ్చే స్రవాలు, కలుషిత పదార్థాల ద్వార కూడా ఇతర పశువులకు సోకుతుంది. ముందు జాగ్రత్తలు - మూగజీవాల్లో ఈ వ్యాధి రాకుండా పుట్టిన రెండు నెలల వ్యవధిలో మొదటి సారి నిరోధక టీకాలు వేయించాలి. అనంతరం ఒక నెల తర్వాత అంటే దూడలు మూడు నెలల వయసు ఉన్నప్పుడు బూస్టర్ డోస్ వేయించాలి. - అనంతరం విధిగా ప్రతీ ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. - పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలను విధిగా ఇప్పించాలి. పశువులకు చికిత్స - వ్యాధిసోకిన పశువులను ఆరోగ్యవంతమైన పశువుల నుంచి వేరు చేసి పశువైద్యున్ని సంప్రదించాలి. - వ్యాధి సోకిన పశువు శరీరంపై ఏర్పడిన పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం పరచాలి. - నోటిలోని పుండ్లను బోరో గ్లిజరిన్‌తో శుభ్రంచేయాలి. - కాలి పండ్లకు జింక్‌ఆక్సైడ్, లోరాక్సిన్ ఆయింట్మెంట్ రాయాలి. -పుండ్లపై ఈగలు వాలకుండా వేపనూనె, ఈగ మందులను స్ప్రేలను వాడాలి. - వ్యాధిసోకిన పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. - వ్యాధి నిర్మూలనకు మూడు నుంచి ఐదు రోజుల వరకు యాంటీబయోటిక్స్ మందులు వాడాలి. - నొప్పి నివారణకు అనాల్జిసిక్ మందులు వాడాలి. - సులభంగా జీర్ణమయ్యేందుకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి. - జావ, జొన్నలకు చిటికెడు ఉప్పు, బెల్లంలో కలిపి ప్రతి రోజూ తాగించాలి. బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇప్పించాలి. -
‘పాడి’కోసం పశుగ్రాసం..
నిజాంసాగర్ : పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి, పప్పుజాతి అని రెండు రకాలుంటాయి. జొన్నజాతికి చెందినవి ధాన్యపు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు. వీటికి కాయలుండవు. కంకులుండడం వల్ల పిండిపదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. పప్పుజాతి పశుగ్రాసాల పంటలకు కాయలు కాస్తాయి. వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. వీటి వేర్లలోని నత్రజని, బుడిపెల వల్ల నేలలో నత్రజని పెరిగి భూమి సారవంతం అవుతుంది. ఏడాది పొడవునా.. డెయిరీ ఫాంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నవారు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా పశుగ్రాసాలను సాగు చేయాలి. అప్పుడే పాడి పశువులకు పోషకాలు అంది, పాలదిగుబడులు పెరుగుతాయి. పాలల్లో వెన్నశాతం బాగుంటుంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తే 20 పాడి పశువులకు సరిపడా మేత ఏడాది పొడవునా లభిస్తుంది. నీటి వసతి ఉన్న భూముల్లో ఏపీబీఎన్-1, కొ1 పారావంటి ధాన్యపు జాతి, లూసర్న్ వంటి పప్పుజాతి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేస్తే మూడు నాలుగేళ్ల వరకు పశుగ్రాసం తిప్పలు ఉండవు. వర్షాధారంగా తేలికపాటి భూముల్లో ఎస్ఎస్జీ-59-3 రకం ధాన్యపు జాతి, అలసంద, పిల్లిపెసర వంటి పప్పుజాతి ఏకవార్షిక పశుగ్రాసాలను మిశ్రమపంటలుగా సాగు చేసుకోవచ్చు. అలసంద జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ పశుగ్రాసాన్ని పండించవచ్చు. ఇది ఏకవార్షిక, కాయజాతి పశుగ్రాసం. ఇది తీగలాగా పైకి వస్తుంది. కాండం పొడవుగా ఉంటుంది. పశువులకు పుష్టికరమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. అనువైన భూములు : అన్నిరకాల భూముల్లో సాగుచేసుకోవచ్చు. నీరు నిలవని భూముల్లో ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకుంటే మంచిది. అధిక దిగుబడినిచ్చే రకాలు : ఈసీ -4216, యూపీసీ-5286, 5287, అలసంద- 2201, ఎన్పీ-3 విత్తనాలు : ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. మిశ్రమ పంటగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేస్తే 6 నుంచి 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. కావాల్సిన ఎరువులు : విత్తనాలు వేసేముందు దుక్కిలో ఎకరానికి పది బండ్ల కంపోస్ట్ ఎరువు, పది కిలోల యూరియా, 20 నుంచి 24 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. నీటితడి : పదిహేను రోజులకోసారి నీటితడి అవసరం. వర్షాలు కురిస్తే నీరు పారించకపోయినా పరవాలేదు. వేసవిలో ఏడు రోజులకోసారి నీటిని పెట్టాలి. మేత దిగుబడి : విత్తిన రెండు నెలల తర్వాత మొదటి కోత అందుతుంది. పూతదశలో ఉండగా పంట యాభై శాతం కోయాలి. ఎకరానికి 8-10 టన్నుల పచ్చిమేత లభిస్తుంది. సజ్జ తక్కువ వర్షపాతం గల ప్రాంతాలకు అనువైన పశుగ్రాసం ఇది. తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ధాన్యపుజాతికి చెందినది. జొన్న రకాలకన్నా అధిక శాతం మాంసకృతులు కలిగి ఉంటుంది. అనువైన నేలలు : అన్నిరకాల నేలలు ఈ పంట సాగుకు అ నువైనవి. ఇసుక, చవుడు నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే రకాలు: టీ-55, కే-599, 533, ఐ-72, 74, జెంట్రాజ్కో 5-530. విత్తనాలు : ఎకరానికి 4-6 కిలోల విత్తనాలు అవసరం. మొక్క అంతరం : భూమిలో మూడు సెంటీమీటర్లకన్నా లోతులో విత్తనాలు వేయకూడదు. మొక్కకు మొక్కకు మధ్య 4 నుంచి 5 అంగుళాలు, సాళ్ల మధ్య 9 నుంచి 10 అంగుళాల అంతరం ఉండాలి. అనువైనకాలం : జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు కావాల్సిన ఎరువులు : దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 బండ్ల కంపోస్ట్ ఎరువులు వేయాలి. విత్తే ముందు 22 కిలోల యూరియా, 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి చల్లాలి. విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజులకు 20 కిలోల యూరియా వేయాలి. నీటితడి : వర్షకాలంలో(వర్షాలు కురుస్తున్నప్పుడు) నీరు పారించాల్సిన అవసరం లేదు. వేసవి కాలంలో 10నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడిపెట్టాలి. మేత దిగుబడి : విత్తిన 60 నుంచి 70 రోజులకు మొదటిసారి, తదుపరి 40, 45 రోజులకు రెండోసారి కోయవచ్చు. ఎకరానికి 12 నుంచి 14 టన్నుల పచ్చిమేత లభిస్తుంది. -
చినుకు పడక .. చెరువులు నిండక..
కీసర: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా చిరుజల్లులు తప్ప భారీవర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు వట్టిపోతున్నాయి. అడపాదడపా చిరుజల్లులు కురుస్తున్నా మండుతున్న ఎండలకు అవి కాస్తా ఆవిరైపోతున్నాయి. మండలంలో మొత్తం 12 నోటిఫైడ్ చెరువులు, మరో 30 వరకు చిన్నాచితక కుంటలు ఉన్నాయి. రాంపల్లి పాతచెరువు, నాగారం అన్నరాయిని చెరువులు మినహా మిగతా చెరువుల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా అడుగు నీరు లేకుండా పోయాయి. ఇక కుంటల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కొన్ని చోట్ల నీటి సంగతి దేవుడెరుగు కుంటల స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోవడంతో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. బోరుబావుల్లో నీటిమట్టాలు పడిపోవడంతో ఇటు పంటల సాగుకు, అటు ప్రజలకు తాగునీటికి కష్టాలు మొద లయ్యాయి. చెరువు కింద వ్యవసాయం చేసే రైతులు, బోరు బావులపై ఆధారపడి పంటలుసాగు చేద్దామని వరినార్లు పోసిపెట్టుకున్న రైతులకు ఈ సీజన్లో నష్టాలు తప్పడం లేదు. వరినాట్లు వేసే సమయం ముగిసిపోవడంతో చేసేది లేక నారుమడులను పొలంలోనే వదిలేశారు. మరోవైపు వచ్చే వేసవిలో తాగునీటి కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన చెరువులకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకలేదు. పూడికతీత, ముళ్లపొదలను తొల గించడం వంటి పనులు చేపట్టకపోవడంతో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కీసర నూర్‌మహ్మద్ చెరువు ఒక్కసారి నిండితే ఐదేళ్లపాటు కాలం లేకున్నా నీరు ఉండేది. చెరువు కట్టకు షేడ (రంధ్రం) పోవడంతో వర్షకాలంలో చెరువులోకి వచ్చి చేరే వరద నీరు వచ్చినట్లే బయటకు పోతోంది. ఇక గోదుమకుంట తీగల నారాయణ చెరువు, చీర్యాల పెద్ద చెరువు, చీర్యాల నాట్కాన్ చెరువు, రాంపల్లి సూర్యనారాయణ చెరువు, యాద్గారపల్లి గండి చెరువు, రాంపల్లిదాయర జాఫర్‌ఖాన్ చెరువు, కీసర పెద్దమ్మ, తిమ్మాయిపల్లి పెద్ద చెరువు, దమ్మాయిగూడ నర్సింహ చెరువులకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు నిల్వ ఉండడం లేదు. ఇప్పటికైనా మరమ్మతులు చేపడితే భవిష్యత్తులో వర్షాలు కురిస్తే చెరువుల్లో నీరు నిల్వ ఉం టుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. -
ముదిరిన నారుతో ముప్పే
సిద్దిపేట రూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి గడ్డు కాలాన్నే మిగిల్చింది. ఇప్పటి వరకూ జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. వరి నాట్ల కోసం పోసిన తుకాలు ముదిరిపోయాయి. ఈ క్రమంలో రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో 70 రోజుల నారును సైతం నాటేస్తున్నారు. ఇదే వీరి పాలిట శాపంగా మారుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నారు పోసిన 25 నుంచి 35 రోజుల్లోపు నాట్లు వేయాల్సి ఉన్నా మండలంలోని కొన్ని గ్రామాల్లో అవగాహన లేని పలువురు రైతులు ముదిరిన నారు కొనలను కత్తిరించి నాటేస్తున్నారు. బంజేరుపల్లికి చెందిన ఓ రైతు ఏకంగా సుమారు 70 రోజుల వరి నారును నాటు వేయడం కనిపించింది. ఇలాగైతే సరైన దిగుబడులు రాక నష్టపోయే ప్రమాదం ఉంది. నారు ముదిరితే తెగుళ్లు వస్తాయి వరి నారు పోసిన 25 నుంచి 35 రోజుల మధ్యలో నాటేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 35 నుంచి 45 మించి వాడకూడదు. దీన్ని కూడా చివర్లు కత్తిరించి దగ్గర దగ్గరగా ఎక్కువ పిలకలు నాటాలి. దుక్కి మందును అధికంగా వాడాలి. ముదురు నారును నాటితే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. - అనిల్‌కుమార్, ఏఓ, సిద్దిపేట, సెల్: 8886612490 -
ప్రబలుతున్న జ్వరం
వర్షాకాలం ప్రారంభమైంది. జ్వరాలు ప్రబలుతున్నాయి. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. వ్యాధులు మరింత తీవ్ర రూపం దాల్చకముందే పకడ్బందీగా నివారణ చర్యలు చేపట్టడం అవసరం. సాక్షి, కడప : వర్షాకాలం ప్రారంభమైందో లేదో అప్పుడే జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో జ్వర పీడితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జలుబు, జ్వరాలతో జనం ఎక్కువ బాధపడుతున్నారు. నియోజకవర్గాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల సమస్య తీవ్రంగా వేధిస్తుండగా, మరోవైపు జిల్లాలో పనిచేస్తున్న దాదాపు 20 మంది డాక్టర్లు పీజీ కోర్సుకు వెళ్లనున్న నేపథ్యంలో దాదాపు 25 స్థానాల్లో డాక్టర్ల కొరత ఏర్పడనుంది. రాయచోటి ఆస్పత్రికి రోజూ 150 మందికి పైగా జ్వర పీడితులు రాయచోటి ఏరియా ఆస్పత్రికి ప్రతిరోజు 500 నుంచి 600 మంది రోగులు వస్తుండగా, అందులో 150 నుంచి 200 మంది జ్వర పీడితులే ఉంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క రాయచోటిలోనే కాకుండా పులివెందులలోని ఏరియా ఆస్పత్రికి కూడా ప్రతిరోజు 30 నుంచి 40 మంది జ్వరాలతో వస్తున్నారు. అలాగే మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కడప తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. రెండు నెలల్లో రెండు డెంగీ కేసులు జిల్లాలో జూన్, జులై నెలల్లో రెండు డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. పెండ్లిమర్రి మండలంలోని చౌటపల్లెలో ఒకటి, జిల్లా కేంద్రమైన కడపలో ఒక కేసు ఇటీవలే నమోదయ్యాయి. అధికారికంగా రెండే అయినా డెంగీ సోకిన వెంటనే ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు పొంది అనంతరం కర్నూలు, హైదరాబాదు తదితర ప్రాంతాలకు వెళుతున్న కేసులు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాను వేధిస్తున్న వైద్యుల కొరత జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏరియా ఆస్పత్రులతోపాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు పీహెచ్సీలలో వైద్యుల కొరత వేధిస్తోంది. మైదుకూరు 30 పడకల ఆస్పత్రిలో కేవలం ఇద్దరు వైద్యులు ఉండగా, అందులో ఒక వైద్యుడు శిక్షణ నిమిత్తం వెళ్లడంతో మరొకరు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. కమలాపురంలో కూడా ఎనిమిది మంది వైద్యులకుగాను కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. పులివెందుల ఏరియా ఆస్పత్రిలో 18 మందికిగాను కేవలం 10 మందే ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 20 మంది వైద్యులు పీజీ కోర్సు చేసేందుకు వెళ్లారు. మరో ఐదు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో మొత్తం 25 మంది వైద్యులు అందుబాటులో లేరు. నియోజకవర్గ కేంద్రాల్లో డెంగీ కిట్లు అవసరం డెంగీ లక్షణాలతో ఎవరికైనా జ్వరం ఉన్నట్లయితే కడపలోని రిమ్స్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. అలా కాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో డెంగీ కిట్స్ అందుబాటులో ఉంటే అక్కడే పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకునేందుకు కొంత అవకాశముంటుంది. అందరినీ అప్రమత్తం చేశాం జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు పంచాయతీ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బంది, ఎంపీడీఓలను అప్రమత్తం చేశాం. నీటి ట్యాంకులు శుభ్రం చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలా వరకు వ్యాధులను అరికట్టవచ్చు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూనే దోమకాటుకు గురికాకుండా ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలి. 24 గంటలు పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ ప్రభుదాస్, డీఎంహెచ్ఓ, కడప. అన్నిచోట్ల డీటీటీ స్ప్రే చేస్తున్నాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మలేరియా, ఫైరత్రం, అబార్ట్, మలాథియన్ మందులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని అన్ని క్లస్టర్స్ యూనిట్ ఆఫీసర్ల దగ్గర ఉంచాం. అన్ని ప్రాంతాల్లో కూడా డీటీటీ స్ప్రే చేస్తున్నాం. అన్ని హాస్టల్స్‌లో ఫైరత్రం పంపిణీ చేస్తున్నాం. డెంగీ అనుమానం ఉన్న వారి బ్లడ్ సిరాను తీసి రిమ్స్‌కు పంపుతున్నాం. - త్యాగరాజు, జిల్లా మలేరియా అధికారి, కడప. -
పాము చంపేస్తోంది!
నిజామాబాద్‌అర్బన్ : అసలే వర్షకాలం. అడపాదడపా కురిసిన వర్షానికి పరిసరాలు చిత్తడిగా మారాయి. పచ్చిక పెరిగింది. వాతావరణం చల్లగా ఉండడంతో విషప్పురుగులు, సర్పాలకు సంచరించడానికి అనువైన వాతావరణం ఉంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్తున్నవారిని కాటేస్తున్నాయి. పరిసరాలు చిత్తడిగా ఉండడంతో ఇళ్లలోకీ వస్తున్నాయి. జూలై నెలలోనే జిల్లాలో ఆరుగురిని కాటేసి చంపాయి. సోమవారం రాత్రి రెంజల్ మండల కేంద్రానికి చెందిన తండ్రి, కూతురు పాము కాటుకు గురై మరణించారు. ఇదే నెల తొమ్మిదో తేదీన జలాల్పూర్ గ్రామానికి చెందిన శివలక్ష్మి(5) పాము కాటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. 12వ తేదీన లింగంపేట మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన సాయన్న(58) అనే మేకల కాపరి పాముకాటుకు గురై మరణించారు. 16వ తేదీన వర్ని మండలం రుద్రూర్ ప్రభుత్వ పాఠశాలలో సాకలి శ్రీను అనే విద్యార్థి పాము కాటుకు గురై మరణించిన విషయం విదితమే. 20న బిచ్కుంద మండలం చిన్నదడ్గి గ్రామానికి చెందిన లక్ష్మి(29)తెల్లవారుజామున ఇంటిలో వంట చేస్తుండగా పాముకాటుకు గురై చనిపోయారు. అంతేకాకుండా ఈనెల 11వ తేదీన బోధన్‌లోని బాలికల సంక్షేమ వసతి గృహంలో, 26న బాల్కొండ మండలం రెంజర్ల ప్రాథమిక పాఠశాలలో పాము ప్రత్యేక్షమైన విషయం తెలిసిందే. విద్యార్థులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. మాక్లూర్ ఎస్సీ కాలనీకి చెందిన నీరడి సవిత, నిజామాబాద్ మండలం మోపాల్ ప్రభుత్వ వసతి గృహంలో ఉండే శివకుమార్, నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లి, మల్కాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు బాలురు సైతం పాము కాటుకు గురైనా సకాలంలో వైద్యం అందడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అవగాహన లేక.. పాము కాటుకు గురైన వ్యక్తులు నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే నాటు వైద్యం పనిచేయక పరిస్థితి విషమిస్తుండడంతో ఆస్పత్రులకు తీసుకువెళ్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించి పాము కాటుకు గురైనవారు మరణిస్తున్నారు. నవీపేట మండలంలో గంగారాం అనే నాటు వైద్యుడుండేవాడు. గత నెలలో పాము కరవడంతో నాటు వైద్యం చేసుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించాడు. పాము కాటు వేయగానే ఆస్పత్రులకు తీసుకెళ్తే ప్రాణాపాయం తప్పే అవకాశాలుంటాయి. మందులు ఉన్నా.. జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 సబ్‌సెంటర్లు, 3 ఏరియా ఆస్పత్రులున్నాయి. 119 మంది వైద్యులు ఆయా ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. రాత్రివేళలో వైద్యం అందించేందుకు 24 గంటల ఆస్పత్రులు 29 ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ఆంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంది. కానీ ఇవి పాము కాటుకు గురైనవారిని కాపాడలేకపోతున్నాయి. పాముకాటు వేసిన వ్యక్తి ఆస్పత్రికి వెళ్తే సంబంధిత వైద్యుడు అందుబాటులో ఉండడం లేదు. ఆస్పత్రి సిబ్బంది పాము కాటుకు విరుగుడు మందు ఇవ్వడానికి జంకుతున్నారు. ఆంటీబయోటిక్, టీటీ ఇంజక్షన్లు ఇచ్చి సమీపంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రికో జిల్లా కేంద్ర ఆస్పత్రికో తీసుకెళ్లేసరికి పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నారు. తక్షణమే వైద్యం అందేలా చూడాలి పాముకాటుకు గురైన వ్యక్తికి తక్షణమే వైద్య స హాయం అందేలా చూడాలి. కరిచిన చోట స బ్బుతో శుభ్రంగా కడిగి ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. పాము కరిచిన 35 నిమిషాల్లో చికిత్స అందిస్తే ఫలితం ఉంటుంది. నాటు వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. -సురేశ్‌కుమార్, ఫిజీషియన్, నిజామాబాద్ రెంజల్లో తండ్రీకూతురు మృతి రెంజల్ : పాము రూపంలో వచ్చిన మృత్యువు తండ్రితోపాటు కూతురు ను కూడా బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేరోజు మృత్యువాత పడడంతో రెంజల్లో విషాదం అలుముకుంది. రెంజల్‌కు చెందిన అన్నం గంగారాం (44) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లా రు. రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చి కుటుం బ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంత రం భార్య లక్ష్మి, కూతురు సౌందర్య, చిన్న కుమారుడు వినోద్‌లతో కలిసి నిద్రపోయా రు. పెద్ద కుమారుడు యోగేశ్ స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తుండడంతో ఇంట్లో లేడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన పాము గంగారాం మెడపై కాటు వేసింది. నిద్ర మత్తులో ఉన్న ఆయన ఏదో పురుగు అనుకొని చేతిని విది ల్చాడు. అది పక్కనే పడుకున్న కూతురు సౌందర్య చెవిపై పడింది. ఆమె చెవిపై పాము కాటు వేసింది. పాము విషం ప్రభావంతో గంగారాం మేల్కొని వాంతులు చేసుకున్నా డు. దీంతో కుటుంబ సభ్యులు మేల్కొని చుట్టూ గాలించారు. ఏదైనా పురుగు కాటు వేసి ఉంటుందని భావించి తిరిగి నిద్రకు ఉపక్రమిస్తున్న తరుణంలో కూతురు కూడా వాం తులు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగువారిని పిలిచారు. వారు వచ్చి ఇద్ద రూ పాము కాటు కు గురైనట్లు గుర్తిం చి నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే నీటిని తాగిన గంగారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. నాటు వైద్యుడు వారిని పరీక్షించి ఆస్పత్రి కి తీసుకెళ్లాలని సూచించాడు. 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో సౌందర్య మరణించింది. జిల్లా ఆస్పత్రికి చేరుకున్న తర్వాత గంగారాం మృత్యువాతపడ్డారు. మృతురాలు సౌందర్య ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్దే తల్లికి చేదోడు గా ఉంటుంది. పాము ఒకే కుటుంబానికి చెం దిన ఇద్దరిని బలి తీసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
వ్యాధులొస్తున్నాయ్.. వైద్యులు వెళ్తున్నారు!
రిమ్స్ క్యాంపస్: వర్షాకాలం వచ్చింది. పెద్దగా వానలు లేకపోయినా.. అప్పుడప్పుడూ కురుస్తున్న చిన్న వర్షాలకే వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సీజనులో ఇటువంటి ప్రమాదం ఉంటుందన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందువల్ల పూర్తిస్థాయిలో సిబ్బంది, మందులు, ఇతరత్రా వనరులతో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖదే. ఎప్పుడు ఎక్కడ అవసరమొచ్చిన తక్షణమే వైద్య సిబ్బందిని పంపించాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలా కనిపించడంలేదు. పూర్తిస్థాయిలో వైద్యులే లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండగా, ఉన్న వారిలో కొందరు వైద్యు లు పీజీ కోర్సులు చేసేందుకు కొద్దిరోజుల్లో వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న వైద్యులతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాధులు ప్రబలే కాలంలో అలా సర్దుకుపోవడం సాధ్యమేనా.. పెలైట్ జిల్లాగా ఎంపిక చేసిన చోటే పరిస్థితి ఇలా ఉంటే వ్యా ధులను అదుపు చేయ డం ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి ప్రభుత్వం 143 వైద్యుల పోస్టులు మంజురు చేసింది. అయితే 101 పోస్టులకే రెగ్యులర్ నియామకాలు జరిగాయి. మరో 35 పోస్టుల కాంట్రాక్టు వైద్యులతో భర్తీ చేశామనిపించారు. అంటే 136 మంది వైద్యు లు ఉన్నట్లు లెక్క.. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు లేని పీహెచ్‌సీలకు ఇతర చోట్ల నుంచి వైద్యులను పంపించి ఇంతకాలం ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది.. ఇదే సమయంలో సరికొత్త సమస్య ఎదురైంది. రెగ్యులర్ వైద్యుల్లో 12 మంది పీజీ కోర్సు చేసేందుకు ఈ నెలాఖరున వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య 19కి పెరుగుతుంది. మరోవైపు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 35 మంది వైద్యుల కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30నాటికే ముగిసింది. దీన్ని డిసెంబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎండార్స్మెంట్ రాలేదు. దీంతో కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. ఎండార్స్మెంట్ రాకపోయినప్పటికీ డీఎంహెచ్ంవో గీతాంజలి విజ్ఞప్తి మేరకు వీరంతా ఇప్పటివరకు విధులకు హాజరవుతున్నారు. వైద్యులు లేని పీహెచ్‌సీలకు ఇతర పీహెచ్‌సీల నుం చి సర్దుబాటు చేస్తుండగా దూరాభారమైనప్పటికీ వెళుతున్నారు. అయితే వైద్యుల సంఖ్య ఇంకా తగ్గిపోనుండటంతో ఇబ్బం దులు సైతం పెరగనున్నాయి. పెలైట్ జిల్లా అయినా దిక్కు లేదు వైద్య ఆరోగ్యశాఖ పరంగా శ్రీకాకుళాన్ని పెలైట్ జిల్లాగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రకటిం చారు. ఆ మేరకు అవసరమైన పోస్టులను జిల్లాస్థాయిలోనే నియమించుకునే అధికారం ఉంది. గతంలో వైద్యుల కొరత ఏర్పడగానే ఇదే రీతిలో నియామకాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తమ ఆదేశాలు లేకుండా ఎటువం టి నియామకాలే చేపట్టరాదని ఆరోగ్య శాఖ డెరైక్టర్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో వైద్యుల కొరత ఏర్పడితే సమస్య తప్ప టం లేదు. జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టిసారించి పెలైట్ జిల్లా కింద వైద్యుల నియామకాన్ని జిల్లాస్థాయిలోనే చేపట్టేలా చూస్తే తప్ప వైద్యుల కొరత తీరదు. సకాలంలో ప్రజలకు వైద్యం అందదు. -
బుస్..స్స్
సాక్షి, మహబూబ్‌నగర్: వర్షాకాలంలో పాములు బయటకు రావడం సాధారణం. రాత్రివేళ ఇది ఎక్కువగా ఉంటుంది. పాముకాట్లు కూడా ఈ సీజన్లోనే అధికంగా ఉంటాయి. ఈ విషయం తెలిసినా వైద్య ఆరోగ్యశాఖ కనీస ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లాలో జూలైనుంచి ఇప్పటి వరకు 35మంది పాముకాటుకు గురయ్యారు. జూలై నెల మొదటి వారంలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అధికంగా గ్రామీణప్రాంత వాసులు, గిరిజనులే. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పాములు పుట్టలోనుంచి బయటకు వచ్చి తిరుగుతుంటాయి. అవి ఇళ్లలోకి చేరి పడుకున్న వారిని కాటేస్తున్నాయి. పాముకాటుకు గురైన వారిని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తే పాముకాటు విరుగుడుకు వాడే యాంటీ స్నేక్ వీనమ్ (ఏవీఎస్) మందు దొరకడం లేదు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితులను వంద కిలోమీటర్లకు పైగా దూరం నుంచి మహబూబ్‌నగర్‌కు తీసుకువచ్చే సరికి ఆలస్యం జరిగి విషం శరీరమంతా వ్యాపించి మార్గమధ్యంలోనే మరణిస్తున్నారు. పీహెచ్సీలలో ఏవీఎస్ నిల్ పాముకాటుకు గురవుతున్న గ్రామీణవాసులు అత్యంత దుర్భర పరిస్థితిని చవిచూస్తున్నారు. రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో విషసర్పాల బారిన పడి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వద్దకు బాధితులను తీసుకెళ్తే అక్కడ విషం విరుగుడు మందు ఉండడం లేదు. చాలా పీహెచ్సీలలో ఏవీఎస్ మందు లేక ప్రధాన ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా పాముకాటు నివారణ (ఏవీఎస్) మందులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పాముకాటుకు వైద్యమిలా... పాముకాట్లకు విరుగుడుగా యాంటీ స్నేక్ వీనం (ఏవీఎస్)ను అందిస్తారు. విషం తీవ్రతను బట్టి వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాసనందిస్తూ ఐవీ ప్లూయిడ్స్‌తో పాటు యాంటీబయాటిక్స్ వాడుతారు. పాముకాటుకు గురైన వారికి కనీసం 24 నుంచి 48 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచాలి. పాముకాటు వేసిన గంటలోపే చికిత్స అందిస్తే మెరుగైన ఫలితముంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది గ్రామీణులు నాటువైద్యులను ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. నాటుమంత్రాన్ని ఆశ్రయిస్తే... తలకొండపల్లి మండలం సాలార్‌పూర్ తండాకు చెందిన వడ్యావత్ నారాయణ, లలితల కుమార్తె మహాలక్ష్మి (10). ఈ నెల 6వ తేదీన ఆమెను పాముకాటు వేసింది. అయితే, మహాలక్ష్మి తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి కాకుండా మంత్రగాళ్ల వద్దకు తీ సుకెళ్లారు. అక్కడ చాలాసేపు ఉంచారు. ఈ లోపు విషమంతా బాలిక శరీరం మొత్తం వ్యాపించింది. అక్కడికక్కడే నురగలు కక్కుకుంటూ తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణం విడిచింది. వెంటనే చికిత్స అందించాలి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో పాముకాటు బాధితుల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా కప్పలు, ఎలుకలు ఉన్న ప్రాంతాల్లో పాముల సంచారం అధికం. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుకు గురైనవారు చాలా మంది వెంటనే చికిత్స తీసుకోకుండా మంత్రగాళ్లను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పాముకాటుకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రథమచికిత్స అనంతరం గంట వ్యవధిలో ఆసుపత్రికి తీసుకెళ్లి యాంటీ స్నేక్ వీన ం మందు అందేలా చూడాలి. రెండు రోజుల పాటు డాక్టర్ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. -కె.అమరేందర్‌రెడ్డి, నిష్ణాతులు, జువాలజీ టీచర్ -
పాములతో జర భద్రం
- కాటు కాలం.. జాగ్రత్త - నాటు వైద్యాన్ని నమ్మొద్దు - వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి ఆలేరు : వర్షాకాలం వచ్చిందంటే పాముల బెడద అధికంగా ఉంటుంది. వర్షాలకు పాములు బయటకు వస్తాయి. రాత్రి పూట ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఖరీఫ్ సీజన్లో సాగుకు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావటంసహజం. ప్రతి ఏటా పాము కాటుకు గురై మనుషులతో పాటు మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాముల విషప్రభావం కట్లపాము కాటేసిన క్షణాల్లో విషం రక్తకణాల్లో కలుస్తుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంట నే ఆస్పత్రిలో చేర్చాలి. నాగుపాము కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం శరీరంలోకి ఎక్కుతుంది.అలాగే జెర్రిపోతు,నీరుకట్ట కాటేసిన విషం ఉండదు. అయితే కాటువేసిన చోట చికిత్స చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు.విషంతో ఉన్న పాము కాటేసినపుడు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యులను ఆశ్రయిస్తే వారు మిడిమిడి పరిజ్ఞానంతో చేసే వైద్యం కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతారు. ఇదేమంటే ఆలస్యం చేశారని వారు మీ మీదనే తోసేస్తారు. విషంలేని పాముకాటుకు గురైన వారు ప్రాణాలతో బయట పడినా అది మంత్రగాళ్ల మహిమే అని నమ్ముతారు. ఇదే బాధితుల పాలిట ముప్పుగా మారుతోంది.సకాలంలో వైద్యం అందక మృత్యువాతపడుతున్నారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే కుట్టిన పామును బట్టి చికిత్స చేస్తారు. -
‘కడెం’ వెలవెల
కడెం : వర్షాకాలం వచ్చింది.. సగం కాలం గడిచింది.. కార్తెలూ వస్తున్నాయి.. అయిపోతున్నాయి. కానీ కాలం కావడం లేదు. వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. కడెం ఆయకట్టు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగితా ప్రాంతాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఇదే సమయానికి కడెం ప్రాజెక్టు ఆయకట్టు అంతా పచ్చదనంతో కళకళలాడింది. పచ్చని పొలాలతోఎటు చూసినా భూములున్నీ సాగులో ఉన్నాయి. ఈసారి వర్షాభావ పరిస్థితులతో ఎటు చూసినా భూములు బీడువారి కనిపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలు ఉన్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు కింద 85 వేల ఎకరాలు సాగు అవుతోంది. ప్రాజెక్టు కింద 87 వరకు చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి. గత ఏడాది ప్రాజెక్టులో ఇదే సమయానికి 700 అడుగుల నీటిమట్టం ఉంది. చాలాసార్లు వదర గేట్లు ఎత్తి నీటిని వృథాగా గోదావరినదిలోకి వదిలారు. ప్రస్తుతం నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు నీటిమట్టం 680 అడుగులుగా ఉంది. కనిష్ట నీటిమట్టం 675 అడుగులు. జలాశయంలో కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది మండలంలోని ఆయకట్టు కింద ఖరీఫ్‌లో 17,654 ఎకరాలు సాగయ్యాయి. పత్తి, వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఈసారి వ్యవసాయ పనులు ఇంకా ముందుకు సాగడం లేదు. వర్షాలు కురుస్తాయనే ఆశతో ఆయకట్టు రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకుని ఉన్నారు. ఆకాశం మేఘావృతం అవుతోంది.. కానీ వర్షాలు పడడం లేదు. మబ్బులు తేలిపోతూ రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో వర్షాల కోసం రైతులు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. మరి కొందరు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆయకట్టు కింద ఇదే దుస్థితి 2008లోనూ ఎదురైంది. వర్షాకాలం చివరలో కష్టంగా ప్రాజెక్టు నిండింది. -
పుణేలో తాగునీటికి కటకట
పింప్రి, న్యూస్‌లైన్: వర్షాకాలం మొదలై ఇన్నిరోజులైనా సరైన వర్షాలు కురవకపోవడంతో పుణే నగరంలో తాగునీటి సమస్య మొదలైంది. దీంతో నీటిని బ్లాక్‌లో కొని తాగాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అవసరాన్ని బట్టి ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లు ధరలను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నా అడిగే నాధుడే కరువయ్యాడు. నగరంలో నీటి కోతలు విధించడంతో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కార్పొరేషన్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కార్పొరేటర్లు, ప్రజలు ఒత్తిడి పెంచుతున్నారు. నగరంలో కార్పొరేషన్ ద్వారా సుమారు 150 ట్యాంకర్లను నడుపుతుండగా, కాంట్రాక్టు పద్ధతిలో కొన్ని వందల సంఖ్యలో ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయి. కార్పొరేషన్‌కు డిమాండ్ మేరకు ట్యాంకర్లను అందించడం సాధ్యం కావడం లేదు. దీంతో నీటిని అందించేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు నీటి సరఫరా బాధ్యతలను అప్పగించారు. కార్పొరేషన్ నిర్ణయించిన ధరల ప్రకారం వీరు రూ.10 వేల లీటర్ల నీటికి రూ.300, 10 నుంచి 15వేల లీటర్లకు గాను రూ.600 వసూలు చేయాల్సి ఉండగా 15 వేల లీటర్ల ట్యాంకు నీటికి డిమాండ్‌ను బట్టి రూ.800 నుంచి 1,500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కార్పొరేషన్ ప్రస్తుతం పర్వతి, పద్మావతి, నగర్ మార్గం, వడగావ్‌శేరి, ఎన్ఎన్డీటీలతోపాటు మరో ఏడు కేంద్రాల నుంచి నీటిని ట్యాంకర్లకు అందజేస్తోంది. అయితే కాంట్రాక్టర్లు ఈ పాయింట్ల నుంచి కాకుండా బయటి ప్రాంతాల్లో నీటిని నింపుకొని బ్లాక్‌లో అధిక రేటుకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. వడగావ్‌శేరి, లోహ్గావ్, ఖరాడి, విమాన్ నగర్, కాత్రజ్, వార్జే, పౌడ్, పాషాణ్, కొండ్వా, ముండ్వా, హడప్సర్తోపాటు అనేక ఉప నగర పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్లకు అధిక డిమాండ్ ఉంది. కార్పొరేషన్ నీటి కేంద్రాలలో ట్యాంకర్లకు జీపీఎస్... నీటిఎద్దడి నేపథ్యంలో దుర్వినియోగాన్ని నివారించేందుకు కార్పొరేషన్ ట్యాంకర్లతోపాటు ప్రైవేట్ ట్యాంకర్లు ఎన్ని పర్యాయాలు నీటిని నింపుకున్నాయని తెలుసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు ఆయా కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చారు. ఈ యంత్రాలు ఉన్న ట్యాంకర్లకు మాత్రమే కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లోకి అనుమతిస్తోంది.