World Health Organization
-
యవ్వనోత్సవం
జీవితంలో బాల్యం ఆటపాటల్లో శరవేగంగా గడచిపోతుంది. శరీరంలో శక్తులన్నీ ఉడిగిపోయినప్పుడు మీదపడే వార్ధక్యం కుంటినడకన సాగుతుంది. బాల్యంలో ఊహ తెలిసే దశకు వచ్చినప్పుడు త్వరగా యువకులుగా మారిపోవాలని కోరుకోవడం సహజం. నడివయసు కూడలికి వచ్చే సరికి యవ్వనం కొద్దిరోజుల్లోనే కరిగిపోతుందనే బెంగ మనసును పీడించడం కూడా అంతే సహజం. జీవితంలోని బాల్య వార్ధక్యాల మధ్య వచ్చే యవ్వనం ఒక కీలక దశ. అంతేకాదు, ఉత్పాదక దశ కూడా! బాల్య వార్ధక్య దశల్లో జీవనభారాన్ని మోసే శక్తి ఉండదు. ఒంట్లోని జవసత్త్వాలు ఉండే యవ్వనంలోనే జీవితాన్ని ఎంతోకొంత తీర్చిదిద్దుకోవడానికి కుదురుతుంది. జీవితంలో అందుబాటులో ఉన్న స్వేచ్ఛా సౌఖ్యాలను తనివితీరా అనుభవించడానికి వీలవుతుంది.యవ్వనాన్ని సార్థకం చేసుకోగలిగిన మనుషులు లోకంలో తక్కువగానే ఉంటారు. చాలామంది యవ్వనాన్ని నిరర్థకంగా గడిపేసి, వార్ధక్యంలో గడచిపోయిన రోజులను తలచుకుంటూ వగచి వలపోస్తారు. ‘లడక్పన్ ఖేల్ మే ఖోయా/ జవానీ నీంద్‌భర్ సోయా/ బుఢాపా దేఖ్కర్ రోయా’ అన్నాడు హిందీ సినీకవి శైలేంద్ర. బాల్యాన్ని ఆటపాటల్లో పోగొట్టుకుని, యవ్వనాన్ని ఒళ్లెరుగని నిద్రలో పోగొట్టుకుని, వార్ధక్యంలో వాటిని తలచుకుని రోదించే మనుషుల తీరును ఆయన మూడు ముక్కల్లో తేల్చేశాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుడు ‘బాల స్తావ త్క్రీడాసక్తః తరుణ స్తావ త్తరుణీసక్తః/ వృద్ధ స్తావ చ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కో2పి న సక్తః’ అని ఏనాడో చెప్పాడు.బాల్య వార్ధక్యాలను ఎక్కువ కాలం కొనసాగించాలని ఎవరూ కోరుకోరు గాని, యవ్వనాన్ని వీలైనంతగా పొడిగించుకోవాలని, కుదిరితే గిదిరితే జీవితాంతం నిత్యయవ్వనులుగా కొనసాగాలని కోరుకోనివారు ఉండరు. నిత్యయవ్వనం మానవమాత్రులకు అసాధ్యమని అందరికీ తెలుసు. ఇది తీరే కోరిక కాదని తెలిసినా, కోరుకుంటారు. తీరని కోరికలను కూడా కోరుకోవడమే కదా మానవ స్వభావం. శుక్రాచార్యుడి శాపం వల్ల ముదిమి పొందిన యయాతి తన కొడుకు పురుడి ద్వారా పునఃయవ్వనం పొందాడు. సుకన్యను చేపట్టిన చ్యవనుడు అశ్వనీ దేవతల అనుగ్రహంతో పునఃయవ్వనం పొందాడు. జరా మరణాలను జయించి అమరులు కావడానికి దేవతలు అమృతం తాగారు. అమృతం కోసం దానవులతో కలసి క్షీరసాగర మథనం చేశారు. అమృతం దానవులకు దక్కకుండా ఉండటానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం దాల్చి, దేవతలకు అమృతం పంచిపెట్టాడు. మన పురాణాల్లో ఉన్న ఈ గాథలు అందరికీ తెలిసినవే! ఇలాంటి గాథలు ప్రాచీన గ్రీకు పురాణాల్లోనూ ఉన్నాయి. గ్రీకుల యవ్వన దేవత హీబీ దేవతలకు ‘ఆంబ్రోజా’ అనే దివ్య ఫలహారాన్ని, ‘నెక్టర్’ అనే అమృతం వంటి పానీయాన్ని పంచిపెట్టిందట! ‘ఆంబ్రోజా’, ‘నెక్టర్’ల మహిమ వల్లనే దేవతలు నిత్య యవ్వనులు కాగలిగారని గ్రీకు పురాణాల కథనం.‘జీవితం మధుశాల యవ్వనం రసలీల/ రేపటి మాటేల? నవ్వుకో ఈవేళ’ అన్నారు వీటూరి. ‘పాడు జీవితము యవ్వనము మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యొ నీదు పరుగులెచ్చట కోయి’ అన్నారు ఆరుద్ర. జీవితం క్షణభంగురం అని వేదాంతులు చెబుతారు. కోరికలు దుఃఖ హేతువులని, వాటిని జయించాలని ప్రవచనాలు చెబుతారు. ఎవరు ఎన్ని చెప్పినా, జీవితాన్ని ఆస్వాదించడానికి యవ్వనం ముఖ్య సాధనమనే ఎరుక కలిగినవారే ఏ క్షణానికి ఆ క్షణమే యవ్వనోద్ధృతితో జీవితాన్ని నిండుగా ఆస్వాదిస్తారు. వెర్రి వేదాంతుల మాటలను తలకెక్కించుకునే అర్భకులు– క్షణభంగుర సిద్ధాంతం బుర్రలో బొంగరంలా గింగిరాలు తిరుగుతుంటే, యవ్వనాన్ని అనవసరంగా వృథా చేసుకుని, నిష్ప్రయోజకులుగా బతుకు చాలిస్తారు.పునఃయవ్వనం పొందినవాళ్లు మనకు పురాణాల్లోను, కాల్పనిక సాహిత్యంలోను తప్ప నిజజీవితంలో కనిపించరు. నిత్యయవ్వనం మానవాళి సామూహిక ఆకాంక్ష. దీనిని నెరవేర్చడానికే ఆధునిక వైద్య పరిశోధకులు కూడా శక్తివంచన లేకుండా పరిశోధనలు సాగిస్తున్నారు. వారి వైద్య పరిశోధనలు ఫలించినట్లయితే, పునఃయవ్వనం పొందడానికి జనాలు ఎగబడి మరీ పోటీలు పడతారు. పరిశోధనలు ప్రాథమిక దశలో ఉండగానే, కొందరు అపర కుబేరులు ఖర్చుకు వెనుకాడ కుండా తమ యవ్వనాన్ని పొడిగించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న ఉదంతాలు అడపాదడపా కథనాలుగా వెలువడుతూనే ఉన్నాయి. యవ్వనం ఉడిగి వయసుమళ్లి వార్ధక్యం ముంచుకు రావడాన్ని సహజ పరిణామంగానే చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తించ లేదు గాని, వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని కొందరు వైద్యపరిశోధకుల వాదన. వార్ధక్యాన్ని నివారించి, వయసును వెనక్కు మళ్లించే దిశగా వైద్య పరిశోధనలు ఇటీవలి కాలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. వయసును వెనక్కు మళ్లించడానికి అమృతం వంటిదేదీ అవసరం లేదని, అసలైన యవ్వన కీలకం మానవ దేహంలోనే ఉందని తాజాగా జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలో ఒత్తిడికి లోనయ్యే కణాలకు ‘ఏపీ2ఏ1’ అనే ప్రొటీన్ సరఫరాను నిలిపివేసినట్లయితే, శరీరంలోని ప్రతి కణం పునఃయవ్వనాన్ని పొందగలుగుతుందని చెబుతున్నారు. ‘ఏపీ2ఏ1’ ప్రొటీన్‌ను నియంత్రించడానికి చేపట్టే చికిత్స పద్ధతులే పునఃయవ్వన చికిత్స పద్ధతులు కాగలవని అంటున్నారు. వారి ప్రయోగాలే గనుక ఫలిస్తే, ముందుండేది ముసళ్ల పండుగ కాదు, మానవాళికి అది యవ్వనోత్సవమే అవుతుంది. -
కాలా అజార్.. భారత్ నుంచి పరార్
సాక్షి, అమరావతి: కాలా అజార్.. రెండు దశాబ్దాలకు పైగా ప్రజారోగ్యంపై ప్రభావం చూపిన ఈ ప్రాణాంతక వ్యాధిని భారత్ విజయవంతంగా నిర్మూలించింది. మలేరియాకంటే ప్రాణాంతకమైనదిగా భావించే ఈ వ్యాధి నిర్మూలనలో భారత్ పటిష్ట వ్యూహాన్ని అమలు చేసింది. 10 వేల జనాభాకు ఒకటికంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని 2023 నాటికి చేరుకుంది. గతేడాది ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. దీంతో త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను కాలా అజార్ రహిత దేశంగా ప్రకటించనుంది. వెక్టర్ బార్న్ డిసీజెస్‌లో మలేరియా తర్వాత రెండో ప్రాణాంతకమైన వ్యాధి కాలా అజార్ అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1824 – 25లో అప్పట్లో భారత భూభాగంలో ఉన్న జెస్సోర్‌లో (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఈ వ్యాధి ప్రబలింది. మూడేళ్లలోనే 7.50 లక్షల మందిని బలి తీసుకుంది. 1970లలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మనదేశంలోనే 11.5 శాతం ఉన్నాయి. 1990–91లో ఈ వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ, వైద్యం అందించడం, సమర్థవంతమైన సరై్వలెన్స్ వంటి వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. దీంతో క్రమంగా వ్యాధి తీవ్రత తగ్గింది. 1992లో దేశంలో 77,102 కేసులు 1,419 మరణాలు సంభవించగా, 1995లో కేసులు 22,625కు, మరణాలు 277కు తగ్గాయి. 2010 నాటికే ఈ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించగా, దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ 2023 వరకు పొడిగించింది. 2023లో 10 వేల జనాభాకు ఒకటికంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని సాధించింది. 2023లో దేశవ్యాప్తంగా కేవలం 524 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. పశి్చమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గతేడాది 438 కేసులు, రెండు మరణాలకు వ్యాధి తీవ్రత తగ్గినట్టు వెల్లడైంది. దీంతో వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.ఇదీ వ్యాధి కాలా అజార్ వ్యాధి ‘లీష్మానియా డోనోవానీ’ అనే పరాన్నజీవి సోకిన సాండ్ దోమలు కుట్టడం ద్వారా సోకుతుంది. కాలా (నలుపు) అనే హిందీ పదం, అజార్ (వ్యాధి) అనే పర్షియన్ పదం కలిపి ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. వ్యాధి సోకిన వారిలో క్రమం తప్పకుండా జ్వరం వస్తుంది. బరువు గణనీయంగా తగ్గుతారు.ప్లీహం, కాలేయం వాపు, తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రెండు సంవత్సరాల లోపు చనిపోతారు. 95 శాతంకంటే ఎక్కువ కేసుల్లో చికిత్స లేకుండానే బాధితులు ప్రాణాలు వదిలేస్తుంటారు. -
ఆ ‘సగమే’ అసలు బలం
శరీరంలో ఐరన్ లేమి స్త్రీలను బాధిస్తూ ఉంటుంది. గర్భధారణ, ప్రసవ సమయాలలో ఎంతో కీలకమైన ఐరన్ కోసం స్త్రీలు ఆహారం, మందుల మీద ఆధారపడుతుంటారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా ప్రకారం నేడు ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు 50 కోట్ల మంది ఐరన్ డెఫిషియెన్సీతో బాధ పడుతున్నారు.కాని వీరు తమ స్వభావంలో ఉక్కుగుణాన్ని మాత్రం ఎన్నడూ వదులుకోరు. వీరు మాత్రమే కాదు ప్రతి స్త్రీ తన జీవనంలో, పరిస్థితులను ఎదుర్కొనడంలో ఉక్కు మహిళే. ఆ మహిళ తెలుగు నాట మారుమూల పల్లెలో ఉండొచ్చు. ప్రపంచంలో వేరే మూలన మరో గూడెంలో ఉండొచ్చు. మహిళా దినోత్సవం ‘స్థానికం’గా నిర్వహించే తంతు కాదు.ఇది అంతర్జాతీయ వేడుక. ప్రపంచ మహిళలను ఏకం కావాలని కోరే సందేశ సందర్భం. 1910లో కోపెన్‌హెగెన్‌లో 17 దేశాల నుంచి వచ్చిన 99 మంది మహిళలు ‘శ్రామిక మహిళల హక్కుల దినోత్సవం’ కోసం పిలుపు ఇచ్చినప్పుడు అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాలనే కోరుకున్నారు. కారణం భూమ్మీద ఏ మూలన ఉన్న స్త్రీ అయినా స్థూలంగా ఎదుర్కొనే సమస్యలు ఒకటేనని భావించడం. అందరూ కలిసి సమస్యల పై పోరాడాలని కోరుకోవడం.ఇన్నేళ్లు గడిచినా రూపంలో, సారంలో స్త్రీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. యుద్ధాలు వస్తే వారు తమ ఇంటిని, భర్తను, సంతానాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేసే తవ్వకాలు, కట్టే పెను కట్టడాలు, ప్రకటించే సుందరీకరణాలు మొదటగా స్త్రీలు శ్రమపడి అల్లిన గూళ్లనే ధ్వంసం చేస్తున్నాయి. చట్టపరమైన అనుమతి కలిగిన వ్యసనాలు... మద్యపానం, ధూమపానం పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసి స్త్రీల మీద పెను ఒత్తిడి పెడుతున్నాయి. తాజాగా ఆన్లైన్ ట్రేడింగ్ అడిక్షన్ లక్షల కొద్ది అప్పును కుటుంబం మీద కుమ్మరించేలా చేస్తోంది. కడుపున పుట్టిన సంతానం పాలిట డ్రగ్స్, గంజాయి పెను పడగలు విప్పి ఉన్నాయి. స్త్రీ తన చేతులతో ఒండి పెట్టాల్సిన ఆహారం కలుషితాలను కలిగి బతుక్కు ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేకపోతోంది. నిత్యావసర ఖర్చులను స్త్రీయే అజమాయిషీ చేసి ఎంత పొదుపు చేయాలనుకున్నా అనారోగ్య ఖర్చు, చదువు ఖర్చు స్త్రీల ప్రధాన కార్యక్షేత్రమైన ‘ఇంటిని’ పూర్తిగా సంక్షోభంలో పడేస్తున్నాయి.దేశం సరిహద్దులోని సైన్యం, కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే నడుస్తోంది అనుకుంటే పొరపాటు. వీటన్నింటి మధ్య ఉక్కుగుణాన్ని వదుల్చుకోని స్త్రీలే దేశాన్ని నడుపుతున్నారు. అయినప్పటికీ వీరి స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి తగిన పీడనలను ఈ సమాజం వదులుతూనే ఉంది. లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ప్రేమకు ‘నో’ చెప్తే హత్యలు, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జీతభత్యాల వివక్ష, చట్ట సభల్లో ఇంకా దొరకని వాటా, గృహ హింస, వరకట్నం, తీరికే ఇవ్వని ఇంటి చాకిరి, పిల్లల పెంపకం, ఆడపిల్ల జననానికి అననుకూలత... ఇవన్నీ ప్రపంచవ్యాప్త స్త్రీలతో పాటు భారతీయ మహిళలకు మూగదెబ్బలుగా మారుతున్నాయి.నిజానికి ఇప్పుడు వారి బాధ్యత ఇంకా పెరిగింది. స్త్రీలు ముందుకు వస్తే తప్ప సరికాని సమస్యలు పెరుగుతున్నాయి. పురుషులు తెస్తున్న దేశాల మధ్య యుద్ధం, పర్యావరణ విధ్వంసం, ΄పౌర హక్కుల విఘాతం, న్యాయ వివక్ష, మత విద్వేషం, తప్పుడు వాట్సప్ సమాచారాల పంపిణి, బలహీనులపై బెదిరింపు... ఇవన్నీ మొదట ఎవరో మనకు తెలియని స్త్రీ ఇంటికే హాని కలిగించవచ్చుగాని కాలక్రమంలో అవి ప్రతి ఇంటికీ చేరుతాయి.స్త్రీలు తాము నివసించే ఇంటి లోపలి, బయటి ఆవరణాలను ప్రజాస్వామ్య స్వభావంతో ఉంచడానికి... సుహృద్భావన పెంచడానికి... పిల్లలకు అందరూ కలిసి ఆడే ఆటస్థలాలు ఇవ్వడానికి... సంపద కాస్తయినా దిగువ వర్గాలకు అందేలా చూడటానికి... విద్య, వైద్యంలో అతి డబ్బు ప్రమేయాన్ని నిరోధించడానికి.... ఆచార వ్యవహారాలు గుదిబండలుగా మారకుండా, రాజ్యాంగస్ఫూర్తిని రక్షించుకోవడానికి మరింత ఆలోచన, చైతన్యం కలిగించుకోవాలి. మరింత ఉక్కుగుణం సముపార్జించుకోవాలి.ప్రతి స్త్రీకి తను, తన కుటుంబం, తన సమాజం, తన దేశం, తన ప్రపంచం... ఇవన్నీ ముఖ్యం. దుర్మార్గం అనేది కేవలం ఇతరుల పాలిట జరిగితే ఊరుకోగలిగేది కాదు. దుర్మార్గం అందరూ ఖండించదగ్గది. పురుష సమాజం తన దుర్మార్గాలకు అడ్డెవరు నిలుస్తారులే అనుకుంటే జవాబు స్త్రీల నుంచే వస్తుంది. స్త్రీలకు ఇంటిని చక్కదిద్దుకోవడమే కాదు... పరిస్థితులను చక్కదిద్దడం కూడా తెలుసు. ఉక్కు మహిళలకు స్వాగతం.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో వారం రోజుల పాటు విశిష్ట కథనాలను అందించనున్నాం. -
యూఎన్హెచ్ఆర్సీకి ట్రంప్ గుడ్‌బై
న్యూయార్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి (యూఎన్హెచ్ఆర్సీ) కూడా గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై మంగళవారం ఆయన సంతకం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నిలువరించి అంతర్జాతీయంగా శాంతిభద్రతల స్థాపనకు కృషి చేసే లక్ష్యంతో ఐరాస స్థాపనకు అమెరికా సాయపడింది. కానీ ఐరాసకు చెందిన పలు ఏజెన్సీలు కొంతకాలంగా సంస్థ లక్ష్యానికి భిన్నంగా పని చేస్తున్నాయి. పైగా అమెరికా ప్రయోజనాలనే దెబ్బ తీస్తున్నాయి’’ అంటూ ఉత్తర్వుల్లో తూర్పారబట్టారు. పాలస్తీనా శరణార్థులకు ఆ సంస్థ అందిస్తున్న సాయానికి అమెరికా నిధుల సాయాన్ని తక్షణం నిలిపేయాల్సిందిగా కూడా ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు, ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), పాలస్తీనా శరణార్థుల సహాయ, పనుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ)ల్లో కొనసాగడం అవసరమా పరిశీలించాల్సిందిగా కూడా అధికారులకు సూచించారు. ‘‘మానవ హక్కుల ఉల్లంఘనదారులను యూఎన్హెచ్ఆర్సీ కాపాడుతోంది. విదేశీ ఉగ్ర సంస్థలుగా అమెరికా విదేశాంగ శాఖ చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన పలు మూకలు నానా ముసుగుల్లో యూఎన్ఆర్ డబ్ల్యూఏలో చొరబడ్డారు. ఇక యునెస్కో తనను తాను సంస్కరించుకోవడంలో నిత్యం విఫల మవుతూనే ఉంది’’ అని ఉత్తర్వుల్లో ట్రంప్ ఆక్షేపించారు. గాజా యుద్ధం విషంలో యూఎన్హెచ్ఆర్సీ తమపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందని ఇజ్రాయెల్, అమెరికా కొంతకాలంగా ఆరోపిస్తుండటం తెలిసిందే. ట్రంప్ తన తొలి హయాంలో కూడా యూఎన్హెచ్ఆర్సీ నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నారు. యూఎన్ఆర్డబ్ల్యూఏకు నిధులను నిలిపేశారు. -
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మద్యం
ఒక నూతన ఆరోగ్య హెచ్చరికతో ఈ నూతన సంవత్సరం మొదలైంది. మద్యం సేవించడం, క్యాన్సర్ ప్రమాదం పెరగడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అమె రికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో క్యాన్సర్‌ను ప్రేరేపించగల మూడో ప్రధాన కారణం ఆల్కహాల్ వినియోగం. ఏ రకమైన ఆల్కహాల్ తీసుకున్నా, అది కనీసం ఏడు రకాల క్యాన్సర్లు (రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి కుహరం, గొంతు, స్వరపేటిక) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని ఆ ప్రకటన తెలిపింది. అమెరికాలో 16.4 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ వినియోగం వల్లే సంభవిస్తున్నాయి. రొమ్ము, నోరు,గొంతు వంటి కొన్ని క్యాన్సర్ల విషయంలో, ‘రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువసార్లు మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు’ అని సలహాదారు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా కాలేయ మచ్చలు (లివర్ సిర్రోసిస్) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది. అయితే, మద్యం సేవించడం వల్ల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక జీవ, పర్యావరణ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఎంత తక్కువైనా రిస్కే!శాస్త్రీయ ఆధారాలకు సంబంధించిన క్రమబద్ధమైన మూల్యాంకనం ఆధారంగా, మద్యం సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు, హానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2023 ప్రకటనను అనుసరించి ఈ సలహా ఇవ్వడమైంది. మద్యం నేరుగా ప్రమాద కరమైన వ్యాధిని కలిగిస్తుంది. మద్యం గణనీయంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, ‘మద్యం వినియోగం విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయనంతటి తక్కువ మోతాదు అనేది లేనే లేదు’ అని పేర్కొంది.‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ సంస్థ, ఆల్కహాల్‌ను ‘గ్రూప్ 1 కార్సినోజెన్’గా 1980లలో వర్గీకరించింది. ఇది పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కలిగించే పదా ర్థాలలో అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ. ఇథనాల్ శరీరంలో ఇంకిపోవడం వల్ల జీవసంబంధమైన విధానాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. అందువల్ల, ఆల్కహాల్ కలిగిన ఏ పానీయం... అది బీర్, వైన్ లేదా విస్కీ ఏదయినా ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఏ రకమైనా హానికరమే!కొన్ని ఆల్కహాల్ పానీయాలను, ముఖ్యంగా రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే అపోహను ఈ ఆధారాలు బద్దలు కొడుతున్నాయి. దశాబ్దాలుగా, మద్య పరిశ్రమ కార్డియాలజిస్టులను ప్రోత్సహించి, మితంగా వైన్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదనే భావనను ప్రచారం చేస్తోంది.అలాంటి వాదనలకు ఎటువంటి విశ్వసనీయ శాస్త్రీయ అధ్యయ నమూ లేదని గ్రహించాలి. మరోవైపు, డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ ప్రాంతం నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్లలో సగం వరకు, సాధారణంగా వారానికి ఒక బాటిల్ వైన్ లేదా రెండు బాటిళ్ల బీర్ వంటి ‘తేలికపాటి’, ‘మితమైన’ వినియోగం వల్ల సంభవిస్తు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గుండె జబ్బులు లేదా మధుమేహంపై తేలికపాటి, మితమైన మద్యపానం వల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాలను గురించి తెలిపే అధ్యయనాలు లేవు.‘మీరు ఎంత ఎక్కువ తాగితే అంత హానికరం అని మేము కచ్చితంగా చెప్పగలం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంత తక్కువ తాగితే అంత సురక్షితం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఆల్కహాల్, అక్రమ మాదకద్రవ్యాల నిపుణురాలు కరీనా ఫెర్రీరా –బోర్జెస్ అన్నారు.హెచ్చరికలు మేలు చేస్తాయా?ఒక వస్తువు వల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడు, ఆ వస్తువు ద్వారా కలిగే హానిని తగ్గించడానికి ఉన్న ఎంపికలు ఏమిటి? డబ్ల్యూహెచ్ఓ చేసిన ఆల్కహాల్ ప్రకటన అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను ఎత్తిపడుతోంది. అలాగే అందుబాటులో ఉన్న విధాన ఎంపికలను కూడా ప్రభుత్వాలకు అందిస్తోంది. ప్రభుత్వాలు వాటిపై చర్య తీసుకో వలసి ఉంటుంది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి అత్యంత స్పష్టమైన మార్గాలలో ఒకటి ఏమిటంటే, మద్యం సీసాలపై హెచ్చరిక లేబుళ్ల ద్వారా, కలగనున్న హాని గురించి జనానికి అవగా హన కల్పించడం. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు ఏమి చేయాలని వివేక్ మూర్తి సూచించిన చర్యలలో ఇది ఒకటి. క్యాన్సర్ ప్రమాదాన్ని లెక్కించడానికి మద్యం వినియోగంపై మార్గ దర్శకాల పరిమితులను తిరిగి నిర్వచించాలని కూడా మూర్తి పిలుపునిచ్చారు.వివిధ దేశాలు పరిశీలిస్తున్న హెచ్చరిక లేబుల్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యానికి సాధారణ హాని; అధిక వినియోగం, దుర్వి నియోగం వల్ల కలిగే హాని; నిర్దిష్ట సమూహాలకు అంటే తక్కువ వయస్సు గలవారు, గర్భిణులు మొదలైన వారికి వ్యతిరేకంగా సందేశాలు వీటిలో కొన్ని. ఉదాహరణకు, 2026లో ఐర్లాండ్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్న హెచ్చరికలో, ‘మద్యం తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది’ అని ఉంది. 2019లో, భారతదేశం హార్డ్ లిక్కర్‌కు ‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనీ, తక్కువ ఆల్క హాల్ పానీయాలకు ‘సురక్షితంగా ఉండండి, తాగి వాహనం నడపవద్దు’ అని చెప్పే సాధారణ హెచ్చరికలను తప్పనిసరి చేసింది.ఇండియా ఇంకా చేయాల్సిందేమిటి?భారతదేశంలో హెచ్చరిక లేబుళ్లతో పాటు, ఆల్కహాల్ మార్కెటింగ్‌పై పరిమితులు కూడా అమలులో ఉన్నాయి. వార్తా పత్రికలు, రేడియో, టీవీల్లో ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించారు. అయితే ప్రకటనల నిబంధనలలోని లొసుగులను వాడుకుంటూ వాటిపై ప్రకటనలు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రహస్య ప్రకటనలు కొత్త సవాళ్లను కలిగిస్తున్నాయి.పొగాకు లేబుళ్లపై హెచ్చరికల మాదిరిగానే, మద్య పరిశ్రమ, పరిశ్రమ అనుకూల సమూహాలు ఆరోగ్య హెచ్చరిక లేబుళ్లు మద్య వినియోగాన్ని తగ్గించడంలో పెద్దగా ఉపయోగపడవని వాదిస్తు న్నాయి. కానీ, ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన ఇటీవలి సమీక్షలో నివేదించినట్లుగా, మద్య ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాయని ఆధారాలు ఎత్తి చూపు తున్నాయి. అవి మద్య సంబంధిత హానిపై అవగాహన పెంచు తాయి, మద్యం వాడకాన్ని సాధారణీకరించకుండా దోహదం చేస్తాయి. పైగా ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయ పడతాయి. తద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. హెల్త్ లేబుల్స్ ప్రభావం వాటి రూపకల్పనపై, కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే, ఆరోగ్య హెచ్చరిక లేబుల్స్‌కు ప్రామాణీకరణ లేదు. అంతేకాకుండా వాటి కంటెంట్ చాలా సాధారణమైనది. ఇది వినియో గదారులు ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడకపోవచ్చు.దాదాపు ఐదేళ్లుగా భారతదేశం మద్యం ఉత్పత్తులకు సంబంధించిన హెచ్చరిక లేబుళ్లపై నిబంధనలను అమలు చేస్తోంది. ఇది ఎంత ప్రభావవంతంగా ఉందో మనకు ఇంకా తెలియదు. హెచ్చరిక సందే శాల రూపకల్పన, కంటెంట్, వాటిపై వినియోగదారుల అభిప్రా యానికి సంబంధించి మనకు నిరంతర పరిశోధన అవసరం. పొగాకు ఉత్పత్తుల్లో ఆరోగ్య హెచ్చరికలు ప్యాకేజింగ్‌లో మంచి జాగాతో వివర ణాత్మకంగా ఉంటాయి. దీనికి భిన్నంగా మద్యం సీసాలపై హెచ్చరికలు చిన్న స్థలాన్ని ఆక్రమిస్తాయి, అస్పష్టంగా ఉంటాయి. ఆరోగ్య హెచ్చరికలతో పాటు, హైవేలపై మద్యం అమ్మకాల నియంత్రణ, తక్కువ వయస్సు గల వినియోగదారులకు అమ్మకాలను అరికట్టడం, తాగి వాహనం నడపడం వంటి అదనపు చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలి.భారతదేశంలో ఆరోగ్య సంబంధమైన, ఇతర నిబంధనలను నిలిపివేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పరిశ్రమ లాబీల నుండి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే ఆరోగ్య సంరక్షణ పెను భారాన్ని తగ్గించడానికి వివేక్ మూర్తి వంటి మరింత మంది ప్రజారోగ్య ఛాంపియన్లు అవసరం. క్యాన్సర్‌కీ పొగాకుకీ ఉన్న సంబంధంపై మొదటి హెచ్చరిక కూడా 1964లో ఒక సర్జన్ జనరల్ నుండే వచ్చిందని గుర్తుంచుకోండి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇక ఎయిడ్స్‌కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్‌కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్‌ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్‌లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్‌లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్‌లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
మొబైల్ ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని, ఎంతమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాయి. ఈ అంశంపై జరిగిన 5 వేలకుపైగా అధ్యయనాలను ఆ్రస్టేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనతో జరిగిన ఈ విశ్లేషణ వివరాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు, మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టంచేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీనిపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పాయి. 2011లో డబ్ల్యూహెచ్ఓ అనుబంధ విభాగమైన ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే, ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమై అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేలి్చచెప్పారు. ఫోన్లతో క్యాన్సర్లు వస్తాయన్న ఆపోహ వీడాలని సూచించారు. -
Israel-Hamas war: గాజాకు 3 రోజుల ఊరట
లండన్: గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచి్చంది. గాజాలో పోలియో వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇజ్రాయెల్ ఇందుకు అంగీకారం తెలిపిందని ఐరాస ప్రకటించింది. పాతికేళ్ల తరవాత గాజాలో ఓ బాలుడిలో పోలియో వ్యాధిని గుర్తించారు. దీని నివారణకు పిల్లలకు టీకా డ్రైవ్ నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. దాంతో ఇజ్రాయెల్ ‘మానవతా విరామం’ఇచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా యుద్ధవిరామం ఉండనుంది. ఇది విరామమే తప్ప కాల్పుల విరమణ కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మూడు దశల్లో డ్రైవ్... గాజా స్ట్రిప్ అంతటా సుమారు 6.4 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డబ్ల్యూహెచ్ఓ సీనియర్ అధికారి రిక్ పీపర్కోర్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్, యూఎన్ఆర్డబ్ల్యూఏ సహకారంతో పాలస్తీనా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది గాజా మధ్య, దక్షిణ, ఉత్తర భాగాల్లో మూడు దశల్లో జరుగుతుంది. గాజాలో ఇప్పటికే 12.6 లక్షల ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (ఎన్ఓపీవీ 2) డోసులున్నాయి. త్వరలో మరో 4 లక్షల డోసులు రానున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2,000 మందికి పైగా హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. గాజా లోపల వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్ట్రిప్ అంతటా 90% వ్యాక్సిన్ కవరేజీ సాధించాలని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. అందుకోసం అవసరమైతే మరో రోజు యుద్ధవిరామానికి ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. గాజాలో 2022లో 99% పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. గతేడాది 89%కి తగ్గింది. యుద్ధం వల్ల వ్యాక్సిన్ వేయక అధిక సంఖ్యలో పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదముందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని 6.5 లక్షలకు పైగా పాలస్తీనా బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో సహకరించేందుకు సిద్ధమని హమాస్ కూడా తెలిపింది. -
అప్పుడు కరోనా.. ఇప్పుడు డెంగీ
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్‌లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరంభారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్‌లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి. అలాగే థాయ్‌లాండ్‌లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు. ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులుసోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా. కాగా, ఇన్‌ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్‌లో 2023 ఆగస్టులో, థాయ్‌లాండ్‌లో అక్టోబర్‌లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్‌లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఆ సంస్థపైనే ఆధారం.. ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. 2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది. అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్‌లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్‌లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్‌కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్‌కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్‌ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్‌గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్‌నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్‌లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్‌లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్‌లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్‌బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్‌లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్‌బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డెంగీ హైరిస్క్ ప్రాంతాలు 2,071
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. దీంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా ఉన్నారని నిర్ధారించడం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరాల్లో వచి్చన డెంగీ కేసుల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడిస్తూనే, అప్రమత్తమై 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది.42 డెంగీ పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా, వాటిలో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు ఉన్నాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటినిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాజడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆమె శుక్రవారం డెంగీ, సీజనల్ వ్యాధుల పరిస్థితిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా ఆశ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని, నీటిలో డెంగీ కారక దోమల సంతానోత్పత్తిని నివారించాలని కోరారు. లార్వా వ్యాప్తి ఇతర జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది. జూలై నెలలోనే 800 కేసులు వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే... ఒక్క జూలైలోనే 800 వరకు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నిల్వలు భారీగా పెరుగుతుండటం, పారిశుధ్యలోపం కారణంగా ఆగస్టు, సెపె్టంబరు నెలల్లో డెంగీ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు డెంగీ బాధితులు వస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటున్నారు. -
డబ్ల్యూహెచ్‌వో చెప్పినా.. పెడచెవిన..
‘ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికసాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిటరాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్‌గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.రక్తస్రావం జరిగితే ప్రమాదకరండెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్ -
The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు. → భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. → ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు. → ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు. → భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. → స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. -
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
ఢైలీ రొటీన్‌ను ఇలా ప్లాన్ చేయండి
ఆర్థిక విషయాలను పకడ్బందీగా నిర్వహించడం ఎంత అవసరమో ఆరోగ్య భరోసానిచ్చే దైనందిన కృత్యాలు నిర్వహించడమూ అంతే అవసరం. ఆర్‌ఎన్‌ఎ- డీఎన్ఏ మొదలు గుండె–మెదడు వరకూ ప్రతీ అణువు, కణము శరీరంలో కీలకమే. ఒక్క అణువు విచ్ఛిన్నమైనా అనారోగ్యమే. సుమారుగా 37.2 ట్రిలియన్ కణాల సమూహంతో నిర్మితమైన మానవ దేహం నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకూ.. అంతవరకూ ఎందుకు నిద్రలో సైతం నిత్య జీవ క్రియలను కొనసాగిస్తుంది. మరి అంతటి అమూల్యమైన శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలంటే అందుకు తగినట్లుగా మన పని విధానం ఉండాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి..ఏమిటా పనులు? ఎలా చేయాలి? ఇలాంటి అంశాలపై హైదరాబాదీల కోసం ప్రత్యేక కథనం...– ఆరోగ్య భరోసానిచ్చే నిత్యకృత్యాలపై దృష్టి సారించండి– అందుకు తగ్గట్లుగా మీ పని విధానం, అలవాట్లు మార్చుకోండి– శారీరక, మానసిక, ఆరోగ్య సంరక్షణపై బీ కేర్ ఫుల్– పలు అధ్యయనాల పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడిఆహారం ఇలా... పెద్దలకు రోజుకు 1,600–3,000 కేలరీల ఆహారం అవసరం. 19–30 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు 1,800–2,400 కేలరీలు, పురుషులకు 2,400–3,000 కేలరీలు, 31–59 ఏళ్ల వయసున్న స్త్రీలకు 1,600–2,200 కేలరీలు, పురుషులకు 2,200–3,000 కేలరీలు అవసరం. అయితే, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కేలరీలు తినాలి అనేది ఆ వ్యక్తి జెండర్, వయస్సు, ఎత్తు, జీవనశైలిని బట్టి మారుతుంది. ఆహారంలో..క్యాల్షియం రోజుకు 1గ్రా, ఫైబర్ రోజుకు 40 గ్రా,–మెగ్నీషియం రోజుకు 410 మిగ్రా, విటమిన్ ఇ రోజుకు 15 మిగ్రా. విటమిన్ సి రోజుకు 75–90 మిగ్రా, విటమిన్ ఎ రోజుకు 600–900 గ్రా, విటమిన్ డి రోజుకు 600 ఐయూ, పొటాషియం రోజుకు 4.7 గ్రా,ప్రొటీన్ రోజుకు 46–56 గ్రా. ఐరన్ రోజుకు 15– 18 గ్రాల వరకూ కావాలి. జాతీయ పరిశోధనా సంస్థ ఐసీఎమ్ఆర్న్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్) సూచనల ప్రకారం..ప్రతి రోజూ తీసుకునే ఆహరంలో ధాన్యాలు–చిరు ధాన్యాలు 250 గ్రా, పప్పులు 85 గ్రా, పాలు–పెరుగు 300గ్రా, కూరగాయలు–ఆకుకూరలు 400 గ్రా, పండ్లు 100 గ్రా, నూనెగింజలు 35 గ్రా, కొవ్వులు–నూనెలు 27 గ్రా ఉండాలి. మెదడుకు మేత కావాలి... విజా్ఞనమే కాకుండా మానసిక స్పందనలపై పుస్తక పఠనం అత్యంత ప్రభావం చూపించేది. రోజుకు 30 నిమిషాల పుస్తక పఠనం లేదా పజిల్స్ సాల్వేషన్ మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. హైసూ్కల్, కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2–3 గంటల చదువు సరిపోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విరామం లేకుండా ఏకధాటిగా చదవడం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి విషయంలో పఠన సమయం వేరుగా ఉంటుంది.ప్రాణవాయువు ప్రాముఖ్యత... మనిషి రోజుకు 550 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలి. పీల్చే గాలిలో 15 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కాలుష్యరహిత పరిసరాల్లో రోజూ కొంత సమయం గడపడం ద్వారా తగినంత ఆక్సిజన్ పొందవచ్చు. నవ్వు...కరిగే కొవ్వు... ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల దాదాపు 40 కేలరీలు బర్న్ అవుతాయి. నవ్వు తర్వాత 45 నిమిషాల వరకూ కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, సహజమైన ఎండార్ఫిన్ విడుదల చేయడం, గుండెపోటు నివారణ తదితర విషయాల్లో మేలు చేస్తుంది. నవ్వడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని నార్వే అధ్యయనం వెల్లడించింది. కప్పు కాఫీ... శరీరానికి కెఫిన్లు ప్రమాదకరమే అయినా రోజుకు 400 మిల్లీగ్రాముల వరకూ సురక్షితమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది దాదాపు నాలుగు కప్పుల బ్రూ కాఫీ, 10 క్యాన్ల కోలా, రెండు ఎనర్జీ షాట్ డ్రింక్స్‌లతో లభిస్తుంది. ఈ కెఫిన్ మొదడు, నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అయితే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ కంటెంట్‌లో చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది రొ‘టీ’న్... రోజుకు సగటున 3 నుంచి 5 కప్పుల చాయ్ ఆరోగ్యకరమే. సాధారణ టీలో ఉండే సమ్మేళనాలకు శరీరం ప్రతిస్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. తాగు...ఆగు... రోజుకు 15–30 మి.లీ మించి ఆల్కహాల్ ప్రమాదకరం. బీర్, వైన్, జిన్, విస్కీ వంటి ఆల్కహాల్స్‌లో ఏదో ఒకటి మాత్రమే సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్ పరిమాణాల్లో తేడాలుంటాయి. మహిళలకు రోజుకు ఒక పానీయం, పురుషులకు రోజుకు రెండు పానీయాల పరిమితి మించకూడదు. వేడి...రెడీ... శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మానవ శరీరం 36 నుంచి 37.5 సె.. వరకూ వేడిని తట్టుకుంటుంది. ఇది 40సె మించితే ప్రమాదకరం. అతి వేడి డీహైడ్రేషన్‌తో పాటు ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశముంది. అలాగే 21 సె.డిగ్రీల వరకూ చల్లదనాన్ని తట్టుకుంటుంది. సిట్...రైట్ రోజులో 4 గంటల కన్నా మించి కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ప్రారంభమై, ఇది 8 గంటలకు చేరితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జస్ట్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఉద్యోగ రీత్యా 8 నుంచి 11 గంటల వరకూ కదలకుండా కూర్చోడం వల్ల ఒబెసిటీ సహా అనేక అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి.నిద్రే ఆరోగ్యం... అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలకు నిద్రలేమే ప్రధాన కారణమని పలు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. నిద్ర అలవాట్లు, పర్యవసానాల పై మ్యాట్రెస్ మేకర్ వేక్‌ఫిట్ నిర్వహించిన సర్వేలో భాగంగా నగరంలో 56 శాతం మంది వారి పని వేళల్లో నిద్ర మత్తుతో అవస్థలు పడుతున్నారని తేల్చంది. అంతేకాకుండా నిద్ర లేవగానే రిఫ్రెష్ ఫీలింగ్ అనిపించట్లేదని నగరవాసులు పేర్కొన్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ఙ్గా పిలువబడే ఈ సర్వేలో నగరంలో దాదాపు 33 శాతం మంది తమ నిద్రలేమికి కేవలం అర్థరాత్రి వరకూ డిజిటల్ స్క్రీల్లు తిలకించడమే కారణమని తద్వారా 32 శాతం మంది ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్తున్నారని తేల్చారు. ఆరోగ్యకర జీవనానికి రోజూ 7–8 గంటల నిద్ర అవసరం. అయితే వయస్సులను బట్టి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. 4 నుంచి 12 నెలల చిన్నారులకు 12 నుంచి 16 గంటల పాటు, 1–2 ఏళ్లు... 11–14 గంటలు, 3–5 ఏళ్లు 10–13 గంటలు, 6–12 ఏళ్లు... 9–12 గంటల నిద్ర 13–18 ఏళ్లు.. 8–10 గంటలు... ఆపై వయసు వారికి 7–8గంటలు, పీరియడ్స్‌లో ఉన్న ఆడవారికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు...ఇదే తీరు... మనిషి మనుగడకు ప్రామాణికం నీరు. శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతీరోజు పురుషులు రోజూ 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణుల సూచన. ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు అవసరం. సరైన మోతాదులో శరీరానికి నీరు అందకపోవడం రోగకారకంగా మారుతుంది. కేలరీలు కరగాలి...రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం శరీరాన్ని చురుగ్గా మార్చుతుంది. ఇందులో భాగంగా జిమ్, ఏరోబిక్, జుంబా వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. వారంలో కనీసం..150 నిమిషాలు(రోజుకి 20 ని.) వ్యాయామం చేయాలని హెల్త్ అండ్ హ్యూమన్ సరీ్వసెస్ గైడ్‌లై ప్రకటించిది. యోగా 20 నిమిషాలు. ధ్యానం 5 నుంచి 20 నిమిషాలు చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక ఆరోగ్యకరం. సాధారణంగా రోజుకు 10,000 అడుగులు వేయాలని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సైతం సిఫార్సు చేసింది. ఈత 30 నిమిషాలు, ఆటలైతే 30 నిమిషాల పాటు, సైక్లింగ్ రోజుకు 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాలకు మించి సైకిల్ తొక్కే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువని ఫిన్లాండ్ పరిశోధనలో తేలింది. బీ అలర్ట్ సిటీజన్నిద్ర లేచింది మొదలు... ఏమేం పనులు చేయాలి? ఏ టైమ్‌కి ఎక్కడ ఉండాలి? ఎవర్ని కలవాలి? తదితర పనుల జాబితాను ముందు రోజే సిద్ధం చేసుకునే అలవాటుందా? ఈ ప్రశ్నకు చాలా మంది సిటిజనుల నుంచి అవును అనే సమాధానం వస్తుంది. మరి అదే విధంగా రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవాలి? ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి? ఎన్ని గంటలు మొబైల్ చూడాలి?.. వగైరా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అని ప్రశి్నస్తే మాత్రం అవును అని బదులిచ్చేవారు అరుదే. ‘స్మార్ట్’గా వాడాలి... మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్ లను రోజులో 2 గంటల కన్నా ఎక్కువ సమయం చూడటం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సూచనల ప్రకారం..సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. ఐదేళ్లలోపు చిన్నారులు గంటకు మించి ఫోన్ వాడకూడదు. 10 మిలియన్ల రంగులను వేరు చేయగల శక్తి గల మనిషి కన్నుకు ఫోన్ హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు.. ఎక్కువైతే ముప్పు... శరీర క్రియల కోసం ప్రతిరోజూ 500మి.గ్రా సోడియం (ఉప్పు) అవసరం. ఇది నరాలను ప్రేరేపించడంతో పాటు కండర సంకోచానికీ సహాయం చేస్తుంది. ముఖ్యంగా దేహంలోని నీరు–ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. అతిగా వాడితే బ్లెడ్ ప్రెజర్, గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యానికి...‘పండు’గ రోజువారీ ఆహారంలో 25 నుంచి 30 శాతం పండ్లు ఉండాలనేది ఆరోగ్య నిపుణుల మాట. ద్రవ రూపంలో తీసుకోవాలనుకుంటే... రోజూ 150 మి.లీ లోపు పండ్ల రసాలు తీసుకోవాలి. అతిగా పండ్ల రసాలు సేవించడం వల్ల శరీరంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముంది. -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది. లేటుగా తింటే చేటే.. అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్ఫ్లమేషన్ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఐదో వంతు భారత్‌లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్‌లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుర్తిద్దాం... నివారిద్దాం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా చికిత్స అందించడం కన్నా నివారణ మార్గాలే అత్యంత ప్రామాణికమని కాంటినెంటల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఒకే రక్త పరీక్షతో కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించేలా కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ‘కేన్సర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్’విభాగాన్ని ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ ప్రోగ్రామ్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరోల్ సికోరా ఈ విభాగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రఖ్యాత కేన్సర్ సెంటర్ ఎండీ అండర్సన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో 40 ఏళ్ల పాటు పనిచేసి, ఆ అనుభవాన్నంతా దేశంలోనే సేవలందించాలనే లక్ష్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిని స్థాపించానని తెలిపారు. ఇప్పటికే 40 వేల మందిని పైగా కేన్సర్ కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన తమ కేన్సర్ కేర్ టీమ్... రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మరింత ఎక్కువ మందిని కేన్సర్ బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లిక్విడ్ బయాప్సీ టెస్ట్‌తో కేన్సర్ గుర్తింపు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కేన్సర్ విభాగంలో 40 ఏళ్లపాటు సేవలందించిన డాక్టర్ జగన్నాథ్ నిర్వహణలో కేన్స ర్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ కేన్సర్ డిటెక్షన్ విభాగం కొనసాగుతుందని గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగమైన లిక్వి డ్ బయాప్సీ టెస్ట్‌తో ముందుగా కేన్సర్‌ను గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుందన్నారు. ఈ మూడు టెస్ట్‌లతో... ఆస్పత్రిలో మూడు రకాల జన్యు పరీక్షలను ప్రారంభించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు మొదటగా కేన్సర్ ప్రిడిస్పోజిషన్ టెస్ట్... జన్యు అమరిక, వాటిలోని తేడాలను అర్థం చేసుకుని, భవిష్యత్‌లో ఏ రకమైన కేన్సర్ వ్యాధి బారిన పడతామో ముందుగానే గుర్తిస్తుందన్నారు. రెండోది కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్.. వంశపారంపర్యంగా వచ్చే కేన్సర్లను గుర్తించడానికి ఈ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జెనెటిక్ మేకప్‌ను సమగ్రంగా పరిశీలిస్తుందన్నారు. యూఎస్ఏలోని నేషనల్ కాంప్రహెన్సివ్ కేన్సర్ పేర్కొన్న విధంగా... రొమ్ము కేన్సర్, ఓవరిన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ వంటి ఐదు కేన్సర్లకు కారణం అయ్యే వంశపారంపర్యంగా వచ్చే జన్యువులను ఈ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. మూడోది నెక్స్ట్ – జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) ఆధారిత సీఎఫ్డీఎన్ఏ పరీక్ష. దీని ద్వారా రక్త ప్రవాహంలో తిరుగుతున్న సెల్ ఫ్రీ డీఎన్ఏను విశ్లేషించి కేన్స ర్ను చాలా ముందుగా గుర్తించవచ్చన్నారు. ఇలా 3 దశల్లో జన్యువులోని కేన్సర్ బారినపడ్డ, పడబోతున్న ప్రాంతాలను ఈ రక్త పరీక్ష ద్వారా చాలా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమగ్ర విశ్లేషణతో కేన్స ర్ చికిత్స మరింత సులభతరం అవుతుందన్నారు. అపోహలను తొలగించాలి: కరోల్ సికోరా ప్రొఫెసర్ కరోల్ సికోరా మాట్లాడుతూ... కేన్సర్ నివారించడం సాధ్యమేనా అనుకునే అపోహలను ప్రయత్నమనే ఒక్క అడుగుతో తొలగించవచ్చన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాధ్, డాక్టర్ రవీంద్రనాథన్, డాక్టర్ ఏవీ సురేష్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో భయాందోళనలు తొలగింపు.. కేన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని అందుకే వీటిపై అవగాహన కల్పించడానికి కాంటినెంటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రి వైద్యుల నేతృత్వంలో ఫిబ్రవరి నెలలో వందలాది మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఆడవారిలో వచ్చే కేన్సర్లు, లక్షణాలు, జాగ్రత్తలపైన, గ్యాస్ట్రో ఇంటస్టైన్, లివర్ కేన్సర్లపైన ఊపిరితిత్తులు, తల, మెడ కేన్సర్లు, గ్లాడర్, కిడ్నీ, ప్రొస్టేట్, చర్మ కేన్సర్ల పైన అవగాహన కల్పి ంచామన్నారు. మంచి చికిత్సను అందించడమే కాకుండా కేన్సర్ రాకుండా అవగాహన కల్పించడం బాధ్యతగా అలవర్చుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు వారి సేవల్లో కేన్సర్ బాధితులను చేర్చాల్సిన అవసరముందని, 70 శాతం మంది బాధితులు ఆర్థిక సమస్యలతోనే మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
వైద్యంలో ఏఐ తప్పులకు బాధ్యులెవరు?
అన్ని రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) వాడటం మొదలైంది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, చికిత్స, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం, మందుల అభివృద్ధి వంటి పనులకు తగు జాగ్రత్తలతో ‘ఎల్ఎంఎం’లను వాడొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆ మేరకు ఆరోగ్య సిబ్బందిపై భారం తగ్గుతుంది. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. అలాంటప్పుడు వీటి ద్వారా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది? ఆరోగ్య సేవలు, ఉత్పత్తులకు అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణాలను ఏఐ టెక్నాలజీలు, టూల్స్‌కు కూడా విస్తరించాలి. భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారీ వీటిని కచ్చితంగా ఆడిట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఛాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ టెక్నా లజీలను వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఈ విషయమై ఒక హెచ్చరిక జారీ చేసింది. ఛాట్‌జీపీటీ, బార్డ్ వంటి ఎల్ఎంఎం (లార్జ్ మల్టీ–మోడల్ మోడల్స్)లు అందించిన సమాచారం, వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా... అంతకంటే ఎక్కువ విషయాలపై వ్యాఖ్యానించగలవు. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చు కోవడం ఇవి చేసే పని. ఆరోగ్య రంగంలో వీటిని ఉపయోగించడం వల్ల తప్పుడు సమాచారం, ఏకపక్ష లేదా అసంపూర్తి సమాచారం అందే ప్రమాదాలు ఉంటాయనీ, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చుననీ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శిక్షణ ఇచ్చేందుకే తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తే పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుందన్నది ఈ హెచ్చరిక సారాంశం. ముఖ్యంగా జాతి, కులం, మతం వంటి విషయాల్లో ఏఐ టెక్నాలజీలు వివక్షతో కూడిన సమాచా రాన్ని తయారు చేసే ప్రమాదముంది. ఏఐ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ 2021లో సాధారణ మార్గదర్శకాలు కొన్నింటిని జారీ చేసింది. అదే సమయంలోనే ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంతో రాగల ప్రయోజనాలనూ గుర్తించింది. నైతికత విషయంలో కొన్ని స్థూల మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటి ప్రకారం... ఏఐ టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపా డేలా ఉండాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజాప్రయోజనాలు, పారదర్శకతలకు పెద్దపీట వేయాలి. తెలివిగా ప్రవర్తించడంతోపాటు వివరించేలా ఉండాలి. బాధ్యత స్వీకరించాలి. అందరినీ కలుపుకొని పోవాలి. వివక్ష లేకుండా చూసుకోవాలి. వివరించేలా ఉండటం అంటే... ఏఐ తాలూకూ డిజైన్ , వినియోగం విషయాల్లో దాపరికం లేకుండా తగినంత సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం! పారదర్శకత ఆశించగలమా? ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎల్ఎంఎంల ఆవిష్కరణతో ఇవి అనివార్యమయ్యాయి. ఎల్ఎంఎంల వాడకం గురించి అర్థం చేసు కోవాలంటే ఏఐ టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎల్ఎంఎం టూల్‌ను అభివృద్ధి చేయడంతో మొదలవుతుంది. అభివృద్ధి చేసేది కార్పొరేట్ కంపెనీ, యూనివర్సిటీ, స్టార్టప్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఆధారపడేది సమాచార లభ్యత, నైపుణ్యాల పైనే. తరువాతి దశలో అభివృద్ధి చేసిన ఎల్ఎంఎంకు ఓ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అందిస్తారు. లోటుపాట్లను సరిచేయడం, విస్తృత సమాచా రంతో శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఎల్ఎంఎంను భారీ సాఫ్ట్వేర్ వ్యవస్థలో భాగం చేయడం కూడా ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను సిద్ధం చేసే థర్డ్ పార్టీ బాధ్యతే. ఈ పని చేసిన తరువాత ఈ కృత్రిమ మేధ ద్వారా సేవలు అందుతాయి. లేదా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దశల్లో మూడోది వినియోగదారుడికి దీన్ని అందించే డిప్లాయర్. ఆరోగ్య రంగంలో ఈ డిప్లాయర్ ఎక్కువ సందర్భాల్లో ఆసుపత్రి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లేదా ఫార్మా కంపెనీ అయివుంటుంది. ఈ మూడు దశల్లో నైతికత, నియంత్రణకు సంబంధించిన చాలా ప్రశ్నలు, అంశాలు ఎదురవుతాయి. చాలాసార్లు డెవలపర్ పెద్ద టెక్ కంపెనీ అయి ఉంటుంది. ఎల్ఎంఎంల తయారీకి కావాల్సినన్ని నిధులు, టెక్నాలజీ నైపుణ్యాలు వీరి వద్దే ఉంటాయి. వీటి అభివృద్ధిలో వాడే అల్గారిథమ్స్, వాటి వల్ల రాగల ప్రమాదాల గురించి సామాన్యు లకు తెలిసే అవకాశాలు తక్కువే. కార్పొరేట్ కంపెనీ కాబట్టి పార దర్శకత, నిబద్ధతలను కూడా ఆశించలేము. నియంత్రణ ఎలా? ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్త ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు ఒక బెంగ పట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ ప్రస్తుత న్యాయ, చట్ట వ్యవస్థల్లోకి ఇముడుతాయా? మానవ హక్కు లకు సంబంధించిన అంశాలతోపాటు దేశాల డేటా పరిరక్షణ చట్టాల విషయంలోనూ ఈ సందేహముంది. ఎల్ఎంఎంల ప్రవేశం ఒక రకంగా ప్రభుత్వ, నియంత్రణ సంస్థలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో జరిగిందని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ విష యాన్నే తీసుకుందాం. ఎల్ఎంఎంలను చేర్చేందుకే వీరు ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్ చట్టాన్ని చివరి దశలో మార్చాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అల్గారిథమ్స్ ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థల పరిధిలోకి చేరే అవకాశం లేదు. మరోవైపు ఎల్ఎంఎంలు కూడా మనుషుల్లా చిత్తభ్రమలకు గురై తప్పుడు సమాచారాన్ని ఇవ్వవచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇంకో ఆందోళన ఏమిటంటే... ఈ ఎల్ఎంఎంల ద్వారా తప్పులు జరిగితే వాటికి బాధ్యత ఎవరిది? ఇలాంటి తప్పుల కారణంగా జరిగే నష్టం, కలిగే హాని, దుర్వినియోగాలకు ఎవరు బాధ్యులన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా ఈ ఎల్ఎంఎంలు సైబర్ సెక్యూరిటీ ముప్పులకు అతీతమేమీ కాదు. ఆరోగ్య రంగంలో వీటిని వాడితే రోగుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య రంగంలో ఏఏ అంశాలకు ఎల్ఎంఎంలను వాడవచ్చు నన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఒక స్థూల అంచనాకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, లక్షణాలను పరిశీలించడం, చికిత్స, పరిపాలన, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం వంటి పనులు... వైద్య, నర్సింగ్ శిక్షణ, శాస్త్రీయ పరిశోధన, మందుల అభివృద్ధి అన్న అంశాలకు మాత్రమే తగు జాగ్రత్తలతో ఎల్ఎంఎంలను వాడవచ్చునని సూచిస్తోంది. ఈ పనులన్నింటినీ ఎల్ఎంఎంలు చేస్తే ఆరోగ్య సిబ్బందిపై భారం అంతమేరకు తగ్గుతుంది. మరోవైపు ఓ కంపెనీ మెడికల్ ఎల్ఎంఎంను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, వైద్యపరమైన సమాచారాన్ని సంక్షి ప్తీకరించడం, అన్నింటినీ కలిపి వైద్యులకు స్థూల నివేదిక ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ఇలాంటివి ఎక్కువైన కొద్దీ వైద్యుడికి, రోగికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మరి ఏం చేయాలి? ఎల్ఎంఎంల వాడకాన్ని పూర్తిగా అడ్డుకోవ డమైతే కాదు. వీటిని అభివృద్ధి చేసే సమయంలో వీలైనంత ఎక్కువ పారదర్శకత తీసుకురావడం ఒకటైతే... వాడకం కూడా బాధ్యతాయు తంగా ఉండేలా చూసుకోవడం మరొకటి. ఈ దిశగా ముందు ప్రభు త్వాలు ఆరోగ్య రంగంలో వినియోగానికి తలపెట్టిన ఎల్ఎంఎంల మదింపు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏఐ వ్యవస్థల అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు, డేటా సెట్స్ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ వ్యక్తులూ వాడుకోగలిగితే తప్పు ఒప్పుల గురించి ఒక స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. ఆరోగ్య సేవలు, ఉత్ప త్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణా లను ఏఐ టెక్నాలజీలు, టూల్స్‌కు కూడా విస్తరించాలి. ఆరోగ్య, వైద్య అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారి ఏఐ టూల్స్, టెక్నాలజీలను కచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏఐతో వచ్చే లాభాలపై అతిగా అంచనాలూ పెట్టుకోవద్దు; రాగల ముప్పులను తక్కువ చేసి చూడనూ వద్దు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
World Health Organization: భారత్‌లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌ను క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెరి్వక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. -
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది. అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్వర్క్) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్‌సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు. ఎన్సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్‌పూర్‌లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది. 50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం. మరో సమస్య ఏమిటంటే, ఎన్సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్‌ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్టెయిల్ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్వర్క్ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్‌పూర్, బిహార్ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్లు,ముంబై అంతటా 22, హైదరాబాద్‌లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్లో ట్రాక్ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది. అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్), భివాడీ (రాజస్థాన్) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి. ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి. మనం ఎన్సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరతీ ఖోస్లా వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
డాక్టర్ల చేతికి ‘ఏఐ’స్కోప్!
సాక్షి, హైదరాబాద్: మనను పరీక్షించి, ఆరోగ్య సమస్య ఏమిటో గుర్తించే డాక్టర్లకు స్టెతస్కోప్ ఎలాంటిదో.. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) కూడా అలా అరచేతిలో ఉపకరణం కాబోతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్సల దాకా వీలైనంత తోడ్పాటు అందించనుంది. భవిష్యత్తులో వైద్యరంగంలో ఏఐ అత్యంత కీలకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఇప్పటికే రేడియాలజీ, టీబీ, కేన్సర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల కోసం ఏఐని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ మేరకు ‘వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం, నిర్వహణ, నైతికతపై డాక్యుమెంట్–2024’ను ఇటీవల విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ, క్రిటికల్ కేర్, క్లిష్టమైన కేసుల్లో వైద్యం చేయడంలో, వైద్య నిర్ధారణ పరీక్షలను సమీక్షించుకోవడంలో కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులతో కూడా వారి కుటుంబ సభ్యులు ఏఐ సాయంతో మాట్లాడవచ్చని.. వారికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు అందుకోవచ్చని తెలిపింది. వైద్యులు కేస్‌షీట్‌లో అన్ని వివరాలు రాసినా, వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించినా.. వాటన్నింటినీ క్రోడీకరించి, అనుసంధానం చేసి చూడటం ఒకింత కష్టమని స్పష్టం చేసింది. అదే ఏఐ ద్వారా డేటా మొత్తాన్ని అనుసంధానం చేస్తే.. సరైన, కచ్చితమైన నిర్ధారణకు రావొచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ♦ రోగుల వివరాలు అన్నింటి నమోదులో ఏఐ ఉపయోగపడుతుంది. ♦ డాక్టర్లు, రోగులు వేర్వేరు భాషల్లో మాట్లాడితే.. ఇతర భాషల్లోకి తర్జుమా చేస్తుంది. దీంతో ప్రపంచంలో ఏ వైద్యులతోనైనా మాట్లాడవచ్చు, చికిత్స పొందవచ్చు. రోగులు వాడిన మందులు, ప్రిస్కిప్షన్లు, వచ్చిన జబ్బులు, లక్షణాలు, ఇతర వివరాలను ఏఐ సాయంతో నమోదు చేసి పెట్టవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. సులువుగా వైద్యం చేయడానికి వీలవుతుంది. ♦ వైద్య, నర్సింగ్ విద్యలో విద్యార్థుల స్థాయిని బట్టి బోధనను అందించవచ్చు. వివిధ రోగాలకు సంబంధించిన లక్షణాలను, వైద్య పరీక్షల నివేదికలను ఏఐ సాయంతో వేర్వేరుగా సృష్టించి.. ఎలాంటి పరిస్థితిలో ఏ తరహా చికిత్స ఇవ్వాలన్న శిక్షణ ఇవ్వవచ్చు. ♦ వైద్య పరిశోధన, మందుల తయారీ కోసం చాలా డేటా అవసరం. దానికోసం తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. అదే ఏఐ ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. ♦ వేల మంది రోగుల డేటా, వైద్య రిపోర్టులను ఏఐలో పొందుపర్చితే వాటన్నింటినీ విశ్లేషించి, రోగ నిర్ధారణలో సాయం చేయగలదు. ♦ ఒకేసారి లక్ష మంది చెస్ట్ ఎక్స్‌రేలను పొందుపర్చినా ఏఐ వాటన్నింటినీ విశ్లేíÙంచగలదు. డాక్టర్లకు సమయం కలసి వస్తుంది. చికిత్స సులువు అవుతుంది. స్పెషలిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. ♦ వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2030 నాటికి కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతుందని అంచనా. కృత్రిమ మేధను వాడటం వల్ల ఉన్న సిబ్బందితోనే సమస్యను అధిగమించొచ్చు. ♦ యాక్సెంచర్ కంపెనీ నివేదిక ప్రకారం.. ఏఐని సరిగా వాడితే డాక్టర్లకు 40శాతం సమయం ఆదా చేస్తుంది. రోగులకు మరింత నాణ్యమైన సమయం కేటాయించే అవకాశం వస్తుంది. ♦ 2023లో యాక్స్డ్ అనే కంపెనీ కృత్రిమ మేధ సాయంతో ప్రొటీన్‌లో ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 60కోట్ల ప్రొటీన్ల సమాచారాన్ని సేకరించింది. ఎన్నో పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది. ♦ యూఎస్‌కు చెందిన ఒక కంపెనీ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక భాషపై మోడల్‌ను తీసుకొచ్చింది. జనవరి 2023లో అది ప్రారంభం కాగా.. రెండు నెలల్లో 10 కోట్ల మంది దాన్ని వాడారు. క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ సులువు అరుదైన, క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కృత్రిమ మేధ దాన్ని సులువు చేస్తుంది. వైద్య ఆవిష్కరణల వేగం గత 75 ఏళ్లలో 200 రెట్లు పెరిగింది. ఆ వేగాన్ని అందుకోవాలంటే వైద్యులకు సాయం అవసరం. కృత్రిమ మేధ ఆ లోటును పూడ్చగలదు. దీనిని సమర్థవంతంగా వాడితే వైద్యంలో కచ్చితత్వం పెరుగుతుంది. అయితే ఏఐలో కొన్ని అంశాలపై అసమగ్ర సమాచారాన్ని మనం పొందుపరిస్తే.. అది తనకుతాను ఊహించుకొని 3 నుంచి 27శాతం వరకు సొంత నిర్ణయాలు ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదమూ ఉంది. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడితే డాక్టర్లలో నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ -
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది. వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్‌లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్‌ను రెండు వెబ్సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది. యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది. -
భద్రం... బీ కేర్‌ఫుల్!
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం. సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి. ఆ వరుసలోదే భారత్‌లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్‌లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్‌ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్‌గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం. అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష. అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు. దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్‌లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్‌లో లేబరేటరీ నెట్వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ. గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి. ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు! -
గాజా ఒడ్డున విపత్తు వంటకం
సంధి గడువు ముగియగానే... గాజాపై ఇజ్రాయెల్ ఉద్దేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న దాదాపు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తోందని తెలుస్తోంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘విపత్తు వంటకం’గా అభివర్ణించారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు తొలిసారి శరణార్థులుగా మారిన గాజా ప్రజలు... ఇప్పుడు అల్–మవాసిలో చిక్కువడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. ఇప్పటివరకు అర్థం అవుతున్నదానిని బట్టి మన దృష్టి ఇజ్రాయెల్‌కూ, గాజాలోని పాలస్తీనా ప్రజలకూ మధ్య సంబంధాలపైన మాత్రమే కేంద్రీకతం అయి ఉంది. యుద్ధ సమయంలో ఇది అనివార్యంగా జరిగేదే. అయితే మీరు కనుక ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు మధ్య గల విస్తృతమైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇజ్రాయెల్ తన లక్షల మంది పాలస్తీనా పౌరులను, వారితో పాటుగా 1967 నుంచి చట్టవిరుద్ధంగా తన ఆక్రమణలో ఉంచుకున్న వెస్ట్‌బ్యాంక్ ప్రాంత పాలస్తీనియన్లతో ఎలా వ్యవహరిస్తూ వస్తున్నదో కూడా తెలుసు కోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇస్తున్న కొన్ని వాస్తవాలు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మొదటిది, ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య దేశం. కానీ అది యూదు పౌరులకు మాత్రమే. అక్కడి ‘నేషనల్ స్టేట్ చట్టం – 2018’ యూదు పౌరులకు, దేశంలోని పాలస్తీనా జాతీయులకు మధ్య వివక్షను పాటిస్తోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌లోని ‘పునరాగమన చట్టం’ (లా ఆఫ్ రిటర్న్) ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన యూదులైనా అప్రమేయంగా ఇజ్రాయెల్ పౌరసత్వం పొందేందుకు అనుమతిని ఇస్తోంది. కానీ అక్కడే పుట్టి, 1948 నక్బా (జాతి ప్రక్షాళన) విపత్తులో, 1967 యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌ను వదిలి వెళ్లిన పాలస్తీనా కుటుంబాల వారికి మాత్రం ఈ హక్కును నిరాకరిస్తుంది. తరలిపోయిన అన్ని పాలస్తీనా కుటుంబాలు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు హక్కును కల్పిస్తున్న ఐక్యరాజ్య సమితి 194వ తీర్మానాన్ని ధిక్కరించడమే ఇది. రెండవది–ఎటువంటి అభియోగమూ లేకుండా పాలస్తీనియన్లను నిర్బంధంలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చే ‘అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్ లా’ను ఇజ్రాయెల్ కలిగి ఉంది. ‘అల్ జజీరా’ చెబుతున్న ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో 7,200 మంది పాలస్తీనా ఖైదీలు ఉంటే వారిలో 2,200 మంది ఎలాంటి అభియోగమూ లేకుండా అరెస్ట్ అయినవారే. గత వారాంతంలో కాల్పుల విరమణ సందర్భంగా, ఇజ్రాయెల్ ఈ వైపు నుంచి 240 మందిని విడుదల చేస్తూనే, ఆ వైపు నుంచి 310 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. 3,100 మంది లేదా 7,200లో 43 శాతం మంది అక్టోబర్ 7 తర్వాత (ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన రోజు) అరెస్ట్ అయినవారే. ఇక, వెస్ట్ బ్యాంకు వైపు వెళ్దాం. 1967 నుండి 7,50,000 మంది ఇజ్రాయెలీలు వెస్ట్ బ్యాంక్ అనే పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి, లోపలి వాళ్లను ఖాళీ చేయించి తాము అక్కడ స్థిరపడిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమణదారులను అడ్డుకోక పోగా, వారికి రక్షణ కల్పించింది. దీనిని నెతన్యాహూ ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్న పాలస్తీనాను కుట్టడానికి వీలుకాని అతుకుల బొంతలా మార్చింది. వెస్ట్ బ్యాంక్‌కు వలస వచ్చి స్థిరపడిపోయిన ఇజ్రాయెలీలతో ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న హమాస్ ఘర్షణల్లో 240 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ‘అల్ జజీరా’ నివేదించింది. ‘‘వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై జరుగుతున్న తీవ్రవాద హింస ఆగాలని, హింసకు పాల్పడేవారిని జవాబుదారులను చేసి తీరాలని’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ నాయకులకు నొక్కి చెప్పి నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. కానీ బైడెన్ మాటలను నెతన్యాహూ లెక్క చేయలేదు. ‘‘స్థిరపడిన వారి కదలికల గురించి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని అధ్యక్షుడు బైడెన్‌కు చెప్పాను’’ అని పత్రికా సమావేశంలో అన్నారాయన. చివరిగా, çసంధి గడువులన్నీ ఒకసారి ముగిశాక గాజాపై ఇజ్రా యెల్ ఉద్దేశాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిన అంశం. నెత న్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న సుమారు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తూ ఉందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధిని ఉటంకిస్తూ ‘బీబీసీ’ దౌత్య సంబంధాల ప్రతినిధి పాల్ ఆడమ్స్ బహిర్గతం చేశారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు గాజా ప్రజలు తొలిసారి శరణార్థులుగా మారారు. ఇప్పుడు వారు అల్–మవాసిలో చిక్కు పడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. నిజంగా ఇది అధ్వాన్నమైన స్థితి. పాలస్తీని యన్ల సంక్షేమం కోసం పని చేస్తుండే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.ఆర్.డబ్లు్య.ఎ. కమ్యూనికేషన్్స డైరెక్టర్ జూలియెట్ తౌమా... అల్– మవాసి గురించి చెబుతూ ‘అక్కడ ఏమీ లేదు. కేవలం ఇసుక దిబ్బలు, తాటి చెట్లు మాత్రమే’ అని అన్నారు. ఆఖరికి ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి అయిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ హెక్ట్ కూడా ‘‘అల్–మవాసి భయానకం కాబోతోంది’’ అన్నారు. అల్–మవాసీలో అవసరం అయిన మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రులు లేవు. అంతే కాదు, అత్యధికులు గుడారాలలో నివసించవలసి వస్తుంది. చలికాలం మొదలయ్యాక చలి గజగజ లాడిస్తుంది. తరచు వర్షాలు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా... ‘‘మీ ప్రియమైన వారికి అల్–మవాసి అనుకూలమైన పరిస్థితులనే అంది స్తుంది’’ అని ఇజ్రాయెల్ రక్షణ దళానికి చెందిన మరొక ప్రతినిధి అవిచే ఆడ్రయీ చెబుతున్నారు. ‘‘అల్–మవాసికి సదుపాయాలు అందేలా చేయడం సహాయక సంస్థల బాధ్యతే’’నని ఇజ్రాయెలీ అధికారులు అన్నట్లు ‘బీబీసీ’ నివే దించింది. దీనిని బట్టి గాజావాసులను వారి కర్మకు వారిని ఇజ్రాయెల్ వదిలేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ మాటను వారు ఒప్పుకోడానికి సుముఖంగా లేరు. ‘‘గాజాలో జరగబోయే ఎలాంటి సురక్షిత ప్రాంత ఏర్పాటులోనూ మేము పాల్పంచుకోబోమని ‘ఐ.రా.స.’కు చెందిన 18 సంస్థలు, ఎన్జీవోలకు చెందిన అధినేతలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఈ అల్–మవాసి ప్రతి పాదనను... ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘‘విపత్తు వంటకం’’ అని అభివర్ణించారు. ‘‘సదుపాయాలు, సేవలు అందుబాటులో లేని అంత చిన్న ప్రదేశంలోకి అసంఖ్యాకంగా మనుషులను చేర్చడానికి ప్రయ త్నించడం వల్ల ఇప్పటికే ప్రమాదపుటంచున ఉన్న గాజా పౌరుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది’’ అని హెచ్చరించారు. ఇక్కడితో నేను ఆగిపోతాను. మీకు చేరని వాస్తవాలను, మన మీడియా వెల్లడించని ఇజ్రాయెల్ ఆలోచనలను మీకు తెలియ జేయడమే నా ఉద్దేశం. ఈసారి ఇజ్రాయెల్‌ను ఒక వర్ణవివక్ష రాజ్యం అని అనవలసి వచ్చినప్పుడు ఈ మాటలను దన్నుగా చేసుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎక్కువ పనిగంటలు ప్రమాదకరం!
యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్న మాటలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసలు భారత కార్మిక చట్టం, ఫ్యాక్టరీ చట్టం వంటివి ఏం చెబుతున్నాయి, రోజుకి 8 గంటలు పైబడి పని చేస్తే పర్యవసనాలు ఏమిటి వంటి అనేక విష యాలు చర్చించవలసిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో 49 పని గంటల విధానం అమల్లో ఉంది. మన దేశంలో రోజువారి విశ్రాంతి సమయం, వార్షిక సెలవులు కలిపి వారానికి 48 పనిగంటలు మించకుండా ఉండేలా చట్టాలు ఉన్నాయి. మనిషికీ మనిషికీ పని గంటల్లో తేడా; అలాగే డబ్బు, ప్రాంతం, సంస్కృతి, జీవన విధానం వంటి అనేక అంశాలతో పాటు ముఖ్యంగా జీతాలు, లాభాలు ఆధారంగా కూడా ఈ పని గంటలు మారుతూ ఉంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో వారి వారి అంగీ కారాన్ని బట్టి కూడా పని గంటలు నిర్దిష్టంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నియమిత పని గంటలు వారానికి 40 నుంచి 44గా అమలులో ఉన్నాయి. తాత్కాలిక, బదిలీ ఉద్యోగులకు ఒకలాగా; పర్మినెంట్ ఉద్యోగులకు ఒకలాగా, అలాగే రోజుకి ఇన్ని గంటలని వారానికి మొత్తంగా 48 గంటలు మించకుండా పనిగంటలు ఉండాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పని గంటలు వున్న దేశం జర్మనీ. ఇక్కడ సంవత్సరానికి 1340 గంటలు పని గంటలుగా ఉంటాయి. మెక్సికో, కొలంబియా, కోస్టారికాలలో ఎక్కువ పనిగంటలు (1886) ఉన్నాయి. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు అప్పటి వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్‌గా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కార్మికులకూ, ఉద్యో గులకూ రోజుకు 8 పని గంటలు ఉండాలని 1942లో మొదటిసారి డిమాండ్ చేశారు. అనేక వాదోపవాదాలూ, తర్జనభర్జనల మధ్య వైస్రాయ్ కౌన్సిల్ 9 పనిగంటలు ఉండాలనీ, దీనిలో 30 నిమిషాలు రెండు దఫాలుగా విశ్రాంతి ఉండాలనీ నిర్ణయించారు. ‘1948 ఫ్యాక్టరీ చట్టం’ సెక్షన్ 54 ప్రకారం ఈ తొమ్మిది గంటల పని, విశ్రాంతి సమయాన్ని అంబేడ్కర్ కార్మికుల పక్షాన పోరాడి సాధించారు. ఇటీవల మన దేశంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ‘కర్ణాటక ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు – 2023’ను ఆమోదించడం ద్వారా రోజుకు 12 పని గంటలు ఉండాలని నిర్ణయిం చింది (వారానికి 48 గంటలు మించకుండా). అలాగే భారత కార్మిక మంత్రిత్వ శాఖ రోజుకు12 పనిగంటలు ఉండాలని పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ... ‘ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ –1948’ ఓవర్ టైంతో కలిపి 50 నుంచి 60 పని గంటలు దాటకూడదనే నిబంధన కచ్చితంగా పాటించాలని చెప్పింది. 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంత ర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం, అంచనాల ప్రకారం ఎవరైతే వారానికి 55 గంటలు దాటి పని చేస్తారో వారిలో ప్రతి పది మందిలో ఒక కార్మి కుడు గుండె పోటుతో మరణిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 745,000 మంది కార్మికులు గుండెపోటుతో మరణించినట్లు నివేదిక తెలిపింది. దీనికి కారణం ఎక్కువ పని చేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థల సంయుక్త నివేదిక చెబుతున్నటువంటి సత్యం. పైన ఉదాహరించిన ఎక్కువ గంటలు పని చేయడం వల్ల జరిగిన మరణాలను పరిశీలిస్తే, యువత వారానికి 70గంటలు పని చేస్తే జరిగే నష్టం అంచనా వేయొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆయన రంగంలో ఆయన ఆదర్శప్రాయులు. వయస్సు రీత్యా కూడా పెద్దవారు. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో యువత అనేక ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అనేక వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆయన తన అభిప్రాయాలు మెజారిటీ మనోభావాలు దెబ్బతినే విధంగానూ, అశాస్త్రీ యంగానూ వ్యక్తపరిస్తే ఆ ప్రభావం సమాజం మీద కచ్చితంగా ఉంటుంది. యువత మానసిక స్థితి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక దారుఢ్యం, కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతా వరణం వంటివాటిని బట్టి ఉంటుంది. కాబట్టి విధాన నేర్ణేతలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – డా‘‘ గుబ్బల రాంబాబు, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు, ఏపీ -
ఆమెపై ఆగని అకృత్యాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని గొప్పగా చెప్తున్నా.. ఆధునికంగా ప్రపంచం ఎంత వేగంగా ముందుకు పయనిస్తున్నా.. మహిళలపై వేధింపులు, హింస తగ్గడం లేదు. వివక్ష అంతరించడం లేదు. పరువు హత్య లు, వరకట్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు.. ఎక్కడా మహిళలకు రక్షణ లేని దుస్థితి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఉజ్జయినిలో జరిగిన సంఘటన దీనికి మరో నిదర్శనం. అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక భయంతో వణికిపోతూ, అర్ధనగ్నంగా కిలోమీటర్ల దూరం సాయం కోసం పరుగెత్తడం.. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఘట నా ఇలాంటిదే. పోలీసు వ్యవస్థ ఎంత ఆధునిక పోకడలు పోతున్నా.. దేశంలో ఇంకా అనాగరిక దుష్కృత్యాలు కొనసాగడం ఆందోళనకరం. 2011–2021 మధ్య 87 శాతం పెరుగుదల.. గత దశాబ్దంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు దాదాపు 87 శాతం మేర పెరగడం ఏ అభివృద్ధికి సంకేతమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. మన దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస/వేధింపులు కొనసాగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగానే 2011లో 2,28,650 మంది మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే.. 2021నాటికి ఈ సంఖ్య 4,28,478కు అంటే.. 87శాతం మేర పెరగడం ఆందోళనకరం. అయితే దీనిని పోలీసు యంత్రాంగం మరో విధంగా చూస్తున్నట్టు సమాచారం. గతంలో మహిళలు కేసులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదని.. పెరిగిన విద్యావకాశాలు, పోలీసుల ఔట్రీచ్ కారణంగా ముందుకొచ్చి కేసులు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దేశ మహిళా జనాభాలో 7.5శాతం పశ్చిమ బెంగాల్లో ఉంటే.. అక్కడ మహిళలపై జరిగిన నేరాలు 12.7 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలు హింసను భరించాలని దేశంలోని దాదాపు 65శాతం మంది పురుషులు అభిప్రాయంతో ఉన్నారని ‘ఇంటర్నేషనల్ మెన్ అండ్ విమెన్ జెండర్ ఈక్వాలిటీ సర్వే (ఇమేజెస్)’స్పష్టం చేసింది. కుటుంబం కలసి ఉండాలంటే మహిళలు ఈ హింసను భరించాల్సిందేనన్న ధోరణి ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది. ఇక గృహ హింసకు సంబంధించి కుటుంబ పరువు పేరిట చాలా వరకు మహిళలు కేసులు పెట్టడం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచ మహిళా జనాభాలో కనీసం 33.7% మంది ఏదో ఒక సమయంలో నేరాలు/వేధింపులకు గురైనవారే. పరువు పేరిటహత్యలెన్నో.. దేశంలో ఇటీవలి కాలంలో పరువు హత్యలు పెరిగిపోయాయి.కుటుంబ పెద్దల అంగీకారం లేకుండా ప్రేమించి కుల, మతాంతర వివాహాలు చేసుకుంటున్నవారిని.. పరువుకు భంగం కలిగించారనే భావనతో వారి కుటుంబాలే హత్య చేయిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఖాప్ పంచాయతీలు నిర్వహించి మరీ మరణ శాసనాలు లిఖిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యాచార దారుణాలు.. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలూ దారుణంగా పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. గత దశాబ్దకాలంలో ఇలాంటి దారుణాలపై కేసులు బాగా పెరిగాయి. 2008లో దేశంలో 21,467 అత్యాచార కేసులు నమోదవగా.. 2021లో ఈ సంఖ్య 31,677కు పెరిగింది. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు కూడా.. తమపై వేధింపులకుసంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులూపెరిగాయి. 2022లో మొత్తం 33,906 నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 54.5 శాతం ఫిర్యాదులు ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్, హరియాణావంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగితేనే ప్రయోజనం దేశంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై హింస మరింత పెరిగి క్రూరమైన రూపాలను సంతరించుకుంటోంది. కరోనా లాక్డౌన్ కాలంలో స్త్రీలపై హింస విపరీతంగా పెరిగినట్టు మేం గమనించాం. మతం పేరిట, ఇతర రూపాల్లో ద్వేషం, విషపూరిత వాతావరణం నెలకొని గతంలోని స్నేహపూర్వక పరిస్థితి లేకుండా పోయింది. ఇది అన్నిరకాల హింసలకూ దారితీస్తోంది. నిర్భయ చట్టం తీసుకొచ్చినపుడు.. స్త్రీల హక్కులేమిటి? వారిపై హింసకు ఎందుకు పాల్పడకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు కేటాయించింది. ఇప్పుడైతే మహిళల హక్కులు అనే స్పృహ లేకుండా చేస్తున్నారు. మíహిళలకు సంబంధించిన రంగాలు, అంశాలపై బడ్జెట్ కేటాయింపులను కూడా తగ్గించడం దురదృష్టకరం. మహిళలపై ఎలాంటి దాడులకు పాల్పడినా తమకేమీ కాదులే అన్న మొండి ధైర్యం హింసకు దారితీస్తోంది. చట్టాలను అమలుచేయాల్సిన పోలీసు, ఇతర వ్యవస్థలు అవినీతితో పారదర్శకతను కోల్పోతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు దిగొస్తాయి. - వి.సంధ్య సామాజిక కార్యకర్త,పీవోడబ్ల్యూ -
భారత్‌లో డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్ తక్కువగా ఉండి.. కొవ్వులు, చక్కెర, ఉప్పుశాతం అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ భారతదేశాన్ని ముంచెత్తుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పులతో కూడిన స్నాక్స్ (హెచ్ఎఫ్ఎస్ఎస్)తో మధుమేహం, అధిక రక్తపోటు సహా పలురకాల దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగం పెరుగుతుంటే.. అందుకు విరుద్ధంగా భారత్‌లో హెచ్ఎఫ్ఎస్ఎస్ పెరుగుతుండటం మంచిది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ది గ్రోత్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్ ఇండియా’అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ఒక నివేదిక విడుదల చేసింది. అధిక కొవ్వు, కేలరీలతో.. ♦ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడంతోపాటు శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వస్తాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక స్పష్టం చేసింది. రోజుకు సగటున 1,580 కేలరీలుపైగా శక్తిని అందించే ఆహారం తీసుకోవడం సరికాదని.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌తో ఎక్కువ కేలరీలు వస్తాయని పేర్కొంది. రోజూ ప్రొటీన్లు 41 నుంచి 57 గ్రాములకు మించి, కొవ్వు 19–32 గ్రాములకు మించి తీసుకుంటే అధిక బరువు సమస్య వస్తుందని తెలిపింది. భారత్‌లోని ఏడు పెద్ద నగరాల్లో ప్రజలు రోజుకు సగటున 33 గ్రాముల కంటే ఎక్కువ కొవ్వు తీసుకుంటున్నారని.. వాస్తవంగా రోజుకు 20 గ్రాముల లోపే తీసుకోవాలని వెల్లడించింది. కిరాణా షాపులే కొంప ముంచుతున్నాయి ప్రస్తుతం దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లు అని.. ఇందులో ఉప్పుతో కూడిన సాల్టీ స్నాక్స్ వ్యాపారమే రూ.60 వేల కోట్లు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ధాన్యాలు, పప్పులు, నూనెలు, పాల వంటి నిత్యావసరాల మార్కెట్ విలువ రూ.5లక్షల కోట్లు మాత్రమేనని తెలిపింది. 2038 నాటికి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్ రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. చిన్న ప్యాకెట్లలో, తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం.. ఇలాంటి వాటిలో 70% కిరాణా షాపుల్లోనే దొరుకుతుండటంతో వినియోగం బాగా పెరుగుతోందని పేర్కొంది. గతంలో కంటే కూల్‌డ్రింక్స్ వాడకం తగ్గినా.. రెడీమేడ్ జ్యూస్, పాల ఆధారిత డ్రింక్‌ల మార్కెట్ పెరిగిందని తెలిపింది. ♦ పోర్చుగల్‌లో స్వీట్లు, బేవరేజెస్లపై ప్రత్యేక వినియోగ ట్యాక్స్ పెట్టడంతో 7% విక్రయాలు తగ్గాయని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. అదే భారత్‌లో హానికరమైనవైనా, మంచివైనా అన్నింటికీ ఒకే రకంగా జీఎస్టీ ఉంటోందని.. దీనివల్ల హానికరమైన వాటి విక్రయాలు తగ్గడంలేదని పేర్కొంది. ♦భారత్‌లో చక్కెర తక్కువ ధరలో దొరుకుతుందని, దీనికి ప్రత్యామ్నాయాలను వాడాలంటే పన్నులు ఎక్కువగా ఉంటుండటంతో.. వ్యాపారస్థులు, ప్రజలు చక్కెరనే ఎక్కువగా వాడుతున్నారని వివరించింది. హెచ్ఎఫ్ఎస్ఎస్లో 5 రకాలు 1) చక్కెర సంబంధిత పదార్థాలు: చాక్లెట్స్, బబుల్గమ్స్, లాలిపాప్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్లు, బిస్కెట్లు, కేక్స్ వంటివి. 2) అధిక ఉప్పుతో కూడినవి: నట్స్, ఆలూ చిప్స్, పాప్‌కార్న్, పాపడ్ తదితరాలు 3) బేవరేజెస్: సాఫ్ట్ డ్రింక్స్, రెడీమేడ్ జ్యూసులు, రెడీమేడ్ కొబ్బరి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటివి. 4) రెడీమేడ్ బ్రేక్ ఫాస్ట్: ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్, గ్రనోలా వంటివి 5) మిగతా రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్: డీప్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిల్డ్ర్ ఫ్రాజెన్ మీట్, ఫ్రాజెన్ సీఫుడ్, రెడీమేడ్ సూప్‌లు, కండెన్స్డ్ మిల్క్, లస్సీ, ఇన్స్టంట్ నూడుల్స్, పిజ్జాలు, బర్గర్లు, రెడీమేడ్ రైస్, సాస్‌లు, కెచప్‌లు, టేబుల్ సాల్ట్, టమాటా, సోయా డ్రింగ్స్, పెరుగు వంటివి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కొవ్వులు, ప్రొటీన్లు, చక్కెర, ఉప్పు అధికంగా శరీరంలోకి వెళతాయి. అధిక కొవ్వుతో ఊబకాయం, గుండె జబ్బులు.. అధిక ఉప్పుతో పక్షవాతం, బీపీ వస్తాయి. అధిక ప్రొటీన్లతో కిడ్నీ వ్యాధులు తలెత్తుతాయి. దేశంలో జాతీయ స్థాయిలో ప్రాసెస్డ్ ఫుడ్‌పై ఎలాంటి విధానం లేదు. ఆరోగ్యకర, అనారోగ్యకర ఆహార పదార్థాలకు సంబంధించి విధివిధానాలు లేవు. ప్రపంచమంతా చక్కెర, ఉప్పు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారంవైపు మళ్లుతుంటే.. భారత్‌లో వాటి వినియోగం పెరుగుతోంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
భారత్ దగ్గు మందు సురక్షితం కాదు: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
జెనీవా: ఇరాక్‌లో విక్రయిస్తున్న భారత్ తయారీ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో దగ్గు రూపొందించిన సిరప్ తయారీలో వాడే పదార్థాలు పరిమితికి మించి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన ఫోర్ట్స్ ల్యాబోరేటరీస్ కంపెనీ తయారు చేసిన కోల్డ్ అవుట్ అనే దగ్గు మందును ఇరాక్‌కు చెందిన దాబిలైఫ్ ఫార్మాకు విక్రయించింది. ఈ మందులో డైథిలీన్ ఇథలీన్ మోతాదుకు మించి ఉన్నట్టుగా డబ్ల్యూహెచ్ఒ గుర్తించింది. కోల్డ్ అవుట్లో 0.25% డైఇథలీన్, 2.1% ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. ఈ దీని వినియోగం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో సూచించింది చిన్నారులు ఈ మందు తాగితే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఇటీవల భారత్‌లో తయారైన సిరప్ గురించి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. కాగా గతంలో భారత్‌లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్థాన్‌లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సిరప్‌ను ఉజ్బెకిస్థాన్‌కు సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్ ల్యాబ్స్ కూడా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. -
ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
లియోన్: డైట్ సోడా తదితర ఎన్నో ఆహారపదార్థాల్లో వాడే నాన్ షుగర్ స్వీట్నర్(ఎన్ఎస్ఎస్) ఆస్పర్టెమ్తో కేన్సర్ వచ్చేందుకు అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. తమ అధ్యయనంలో తేలిందని డబ్ల్యూహెచ్‌వో అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఏఆర్సీ) తెలిపింది. ఆస్పర్టెమ్‌లో కేన్సర్ కారకాలుండేందుకు అవకాశమున్నట్లు మనుషులు, జంతువులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందని ఐఏఆర్సీ తెలిపింది. అయితే, ఆస్పర్టెమ్ పరిమిత వాడకం సురక్షితమేనంటూ ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ), డబ్ల్యూహెచ్‌వో ఎంపిక చేసిన నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రాన్సెస్కో బ్రాంకా మాట్లాడుతూ.. ఆస్పర్టెమ్‌ను మొత్తానికే మానేయాలని అనడం లేదు, మితంగా వాడాలని మాత్రమే చెబుతున్నామన్నారు. అత్యధికంగా వాడే వారు మాత్రమే తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాస్త ఎక్కువగా వాడినా ఎటుంటి అనర్థాలు ఉండవని బ్రాంకా చెప్పారు. ‘ఆస్పర్టెమ్తో కాలేయ క్యాన్సర్ రావొచ్చనేందుకు మాత్రం ఆధారాలు పరిమితంగానే లభించాయి. ప్రస్తుతం వినియోగించే స్థాయిల్లో ఆస్పర్టెమ్ ప్రమాదకరమని చెప్పేందుకు బలమైన ఆధారం దొరకలేదు. ఆమోదయోగ్యమైన వినియోగ స్థాయిలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులేదు. పరిమితంగా, మార్గదర్శకాలకు లోబడి వాడితే ఆస్పర్టెమ్ వల్ల సాధారణంగా ఎటువంటి హాని కలగదు’అని ఎఫ్‌డీఏ తెలిపింది. సాధారణంగా రోజుకు 14 కేన్ల వరకు ఆస్పర్టెమ్ ఉన్న డ్రింకులను తాగొచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్హాల్టెర్ తెలిపారు. -
మామూలు అరటిపండు కాదు.. ‘సూపర్ బనానా’.. ప్రపంచంలో ఇదే తొలిసారి
‘రోజుకో యాపిల్.. డాక్టర్‌ను దూరం పెడుతుంద’ని ఓ సామెత ఉంది. అది సీజనల్. రేటు కూడా కాస్త ఎక్కువే. అదే సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది అరటి పండు. ధర కూడా తక్కువే. మరి యాపిల్‌లా అరటిపండుతోనూ బోలెడన్ని పోషకాలు అందితే.. తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యం సొంతం. ఈ ఆలోచనతోనే ఉగాండా, ఆ్రస్టేలియా శాస్త్రవేత్తలు బిల్‌గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సూపర్ బనానా’ను రూపొందించారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. కోట్ల మందికి ప్రయోజనం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, కంటి చూపు దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి లేక రోగాల పాలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే విటమిన్ ఏ, ఇతర పోషకాలు అధికంగా ఉండే సూపర్ బనానాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బనానా21 ప్రాజెక్టు పేరిట.. జన్యు మార్పిడితో.. ♦ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందినఫౌండేషన్ ఆర్థిక సాయం, ఆ్రస్టేలియా వ్యవసాయ శాస్త్రవేత్త జేమ్స్ డేల్ సహకారంతో ఉగాండా జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు ‘సూపర్ బనానా’పై 2005లో పరిశోధన చేపట్టారు. ♦ అత్యవసర పోషకాలన్నీ ఉండటంతోపాటు తెగుళ్లు, ఫంగస్‌లను తట్టుకోవడం, కరువు ప్రాంతాల్లోనూ పండించగలిగేలా నీటి ఎద్దడిని తట్టుకోగలగడం వంటి లక్షణాలు ఉండేలా అరటిని అభివృద్ధి చేశారు. ♦ జన్యు మార్పిడి విధానంలో సుమారు 18 ఏళ్లపరిశోధన తర్వాత.. విటమిన్ ఏ సహా అత్యవసర పోషకాలన్నీ ఉండేలా సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేయగలిగారు. ప్రపంచంలో ఇదే మొదటిసారి.. ఇలా పోషకాలన్నీ ఉండేలా జన్యుమార్పిడి అరటి పండ్లను అభివృద్ధి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కొత్త అరటి రకం సాగుకు సిద్ధమైనట్టేనని, అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు. -
మనం మారాల్సిందే!
గణాంకాలు వాస్తవ పరిస్థితికి సూచికలు. అనేక సందర్భాల్లో భవిష్యత్ దృశ్యాన్ని ముందుగా కళ్ళ ముందు నిలిపి, గాఢనిద్ర నుంచి మేల్కొలిపే అలారం మోతలు. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనీ, అధిక రక్తపోటు సహా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతోందనీ తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించిన అంశాలు అలాంటివే. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సర్వేలోని అనేక విషయాలు ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులపై తక్షణ కార్యాచరణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మధుమేహం, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)పై అతి పెద్ద సర్వే ఇది. ఇందులో 2008 నుంచి 2020 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్ళు, ఆ పైబడిన వయసువాళ్ళను దాదాపు 1.13 లక్షల మందిని సర్వే చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులతో భారత వైద్య పరిశోధన మండలితో కలసి మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆందోళన రేపుతున్నాయి. 2017లో భారతీయుల్లో 7.5 శాతం మందికే మధుమేహం ఉండేది. 2021 నాటికి ఆ సంఖ్య 11.4 శాతానికి, మరో మాటలో 10.1 కోట్ల మందికి పెరిగింది. అలాగే 15.3 శాతం మంది, అంటే 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముందస్తు లక్షణాలతో జీవితం సాగిస్తున్నారు. అంటే ‘టైప్–2 డయాబెటిస్’ అన్న మాట. ఇక, దేశంలో 28.6 శాతం (25.4 కోట్ల మంది) సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం (35.1 కోట్ల మంది) ఉదర ప్రాంత స్థూలకాయంతో ఉన్నట్టు తేలింది. చెడ్డ కొవ్వు (ఎల్డీఎల్ కొలెస్ట్రాల్)తో 18.5 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. నూటికి 35.5 మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది. అసాంక్రమిక వ్యాధులు దేశంపై ఎంతటి భారం మోపుతున్నాయో కనుగొనేందుకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ అధ్యయనంలో భాగం చేసిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇది. దేశంలో ఎక్కువగా మధుమేహం ఉన్న రాష్ట్రాలు – గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం). అలాగే, షుగర్ వ్యాధిపీడితులు తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్లలో సైతం వ్యాధిపీడితుల సంఖ్య సర్రున పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిక. ముందుగా అనుకున్నదాని కన్నా భారత జనాభాలో మధుమేహం అధికంగా ఉందని ఈ సర్వేతో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గడియారం ముల్లు ముందుకు కదులుతున్న టైమ్ బాంబ్’ అని ఈ అధ్యయన సారథి అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరిని మధుమేహం పీడిస్తోందని లెక్క. షుగర్‌తో గుండె పోటు, అంధత్వం, కిడ్నీల వైఫల్యం ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక సరేసరి. ఈ నేపథ్యంలో కాయకష్టం, క్రమబద్ధమైన జీవనశైలి ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, ఆధునిక జీవనశైలి నిండిన పట్టణాల్లోనే మధుమేహం ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయన ఫలితం. ఇది ఓ కీలక సూచిక. మనం మార్చుకోవాల్సింది ఏమిటో చెప్పకనే చెబుతున్న కరదీపిక. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వగైరా వంశపారంపర్యం, ఆహారపుటలవాట్లు, జీవనశైలి ద్వారా వస్తాయనేది నిపుణుల మాట. జన్యుపరంగా కుటుంబంలోనే ఉంటే ఏమో కానీ, ఇతరులు మాత్రం తినే తిండి, బతికే తీరులో జాగ్రత్తల ద్వారా ఈ అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వచ్చినా... జీవనశైలి మార్పులతో యథాపూర్వ ఆరోగ్యాన్ని పొందవచ్చు. వైద్యులు పదేపదే చెబుతున్న సంగతే తాజా అధ్యయనం సైతం తేల్చింది. ఈ మాటను ఇకనైనా చెవికెక్కించుకోవాలి. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అనివార్యంగా జీవన శైలి మారింది. అది మన ఆహారపుటలవాట్లలో మార్పు తెచ్చింది. చివరకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని మనమే బలిపెట్టుకొనే దశకు చేరుకున్నాం. అందుకే ఇకనైనా అనారోగ్యం తెచ్చే ఆహారపుటలవాట్లు, జీవనశైలి సహా అనేకం మనం మార్చుకోవాలి. మరోపక్క అందుకు తగ్గట్టు ప్రజల్లో చైతన్యం పెంచే బాధ్యత ప్రభుత్వాల పైనా ఉంది. అది ఈ అధ్యయనం చెబుతున్న పాఠం. అలాగే, దేశంలో ఆరోగ్య రక్షణ రంగంలో చేయాల్సిన ప్రణాళిక, చేపట్టాల్సిన చర్యలకు ఈ తాజా సర్వే ఫలితాలు మార్గదర్శకమే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ ధోరణి ఒక స్థిరీకరణ దశకు చేరుకుంటే, అనేక ఇతర రాష్ట్రాల్లో అది పెరుగుతోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల తక్షణ చర్యలకీ అధ్యయనం ఉపకరిస్తుంది. మరోపక్క అన్నిచోట్లా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మరింత అందుబాటులో ఉండేలా చూడాలి. ఫాస్ట్‌ఫుడ్ మోజు, సోమరితనం వల్ల పిల్లల్లోనూ జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న వేళ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ముఖ్యం. ఆరోగ్యకరమైన తిండి, శారీరక శ్రమ వల్ల టైప్–2 మధుమేహాన్ని నూటికి 60 కేసుల్లో తగ్గించవచ్చట. అందుకని ప్రభుత్వాలు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, ప్రజలను ఆరోగ్యదాయక ఆహారం వైపు మళ్ళించవచ్చు. ప్రజల్ని అటువైపు ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలూ చైతన్యశీల పాత్ర పోషించాలి. ఈ జీవనశైలి వ్యాధులు జాతిని నిర్వీర్యం చేసి, అభివృద్ధిని కబళించే ప్రమాదం పొంచివుంది గనక తక్షణమే తగిన విధానాల రూపకల్పన అవసరం. పరిస్థితులు చేయి దాటక ముందే నష్టనివారణ చర్యలకు నడుంకట్టడం వివేకవంతుల లక్షణం. -
అలర్ట్: ప్రపంచంలో టాప్-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..
ఊపిరాడని పరిస్థితి. శ్వాసకోశ సమస్యలు పట్టిపీడిస్తున్న దుస్థితి. ఎక్కడో ఒక చోటే అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ప్రజానీకం పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనది కాదు. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 67 లక్షల మందికిపైగానే బలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలోని అంశాలే ఇవి. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ చేసిన అధ్యయనం ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. అందులో మన దేశానికి సంబంధించిన కొన్ని దారుణమైన వాస్తవాలనూ వెల్లడించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్–20 నగరాల జాబితాలో ఏకంగా 14 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళనకరం. ఇందులో దక్షిణాది రాష్ట్రాలేవీ లేకపోవడం కాస్త ఉపశమనం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో దానిని తగ్గించే చర్యలు చేపడుతుంటే.. వాటి స్థానంలో కొత్త నగరాలు వచ్చి చేరుతున్నాయి. –సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఆరు వేల నగరాల్లో పరిశీలించి.. 2022 సంవత్సరానికి సంబంధించి మొత్తం 117 దేశాల్లోని ఆరు వేల నగరాల్లో వాయు నాణ్యతను పరీక్షించామని.. మరికొన్ని దేశాల్లో వాయు నాణ్యతను పరీక్షించేందుకు సరైన పరికరాలు లేని కారణంగా పరీక్షించలేకపోయామని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అలాంటి వాటిలో చాలా వాయు కాలుష్యం ఉన్న నగరాలూ ఉండి ఉంటాయని తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోలేక.. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు వంటి వాయు కలుషితాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందే క్రమంలో అటవీ సంపదను నాశనం చేస్తుండటం, పరిశ్రమల ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతోంది. పరిశ్రమలు విడుదల చేసే వాయు, జల, భూకాలుష్యాలను అరికట్టే చర్యలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఏదో భోపాల్ దుర్ఘటన వంటివి జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మిన్నకుండిపోవడం సాధారణమైపోయింది. భద్రతా ప్రమాణాలను ‘గాలి’కి వదిలేయడం వల్ల వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలకు అపాయకరంగా మారుతోంది. వంటింటి పొగ ప్రాణాలు తీస్తోంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మందికిపైగా వంటింటి పొగకు బలవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభాలో మూడో వంతు కుటుంబాలు వంట కోసం కలప, బొగ్గు, పేడ, పంటల వ్యర్థాలను వాడుతున్నాయని.. తద్వారా వెలువడే వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్టు వెల్లడించింది. పరిశ్రమలు, వాహన, వంటింటి వాయు కాలుష్యం వల్ల మొత్తంగా ఏటా 67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడుతున్నట్లు తెలిపింది. ఏయే సమస్యలు వస్తున్నాయి? కలుషిత గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో మరణిస్తున్న వారిలో 32శాతం మంది ఇస్కామిక్ హర్ట్ డిసీజ్‌తో, 23 శాతం మంది గుండెపోటుతో, 21 శాతం లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, 19 శాతం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్‌తో, ఆరు శాతం మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదికలో పేర్కొంది. వాయు కాలుష్యం నివారణకు ఏం చేయాలి? ► వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు కూడా చేసింది. తగిన వాయు నాణ్యతా ప్రమాణాలను అనుసరించాలని స్పష్టం చేసింది. ► వాయు కాలుష్య కారక అంశాలను గుర్తించాలి. వాటి నియంత్రణ చర్యలను ప్రభుత్వ యంత్రాంగం నిత్యం పర్యవేక్షించాలి. ► వంటకు అవసరమైన కాలుష్య రహితమైన, నాణ్యమైన ఇంధనాన్ని సమకూర్చాలి. సురక్షితమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పాదచారులకు, సైక్లింగ్ ఫ్రెండ్లీ నెట్వర్క్ కల్పించాలి. ► వాహన కాలుష్యాన్ని అరికట్టేలా కఠిన చట్టాలు తీసుకుని రావాలి. వాటి అమలును నిత్యం పర్యవేక్షించేలా అధికార యంత్రాంగం పనిచేయాలి. ► పరిశ్రమల వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాల యాజమాన్య నిర్వహణను మరింత పెంచాలి. ► పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలి. అటవీ అగ్నిప్రమాదాలను అరికట్టాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సమస్య తీవ్రం సూక్ష్మరూపాల్లోని కాలుష్యాలు మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా పర్యావరణం, జీవవైవిధ్యం, పశుపక్ష్యాదులు, జంతు జాలం, పొలాలు, వ్యవసాయ ఉత్పత్తులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విష వాయువులతోపాటు పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మరూపాల్లోని కాలుష్య వ్యాప్తి మనుషుల ఆరోగ్యాన్ని కుంగదీస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశలో ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థల పరంగా పరిష్కారమార్గాలు ఆలోచించాలి. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త హైదరాబాద్‌లోనూ పెరుగుతున్న కాలుష్యం ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు డేటాను విశ్లేషిస్తూ గ్రీన్‌పీస్ ఇండియా విడుదల చేసిన నివేదికలో.. హైదరాబాద్‌లో పీఎం 10 స్థాయిలు నిర్దేశిత ప్రమాణాల కంటే ఆరేడుశాతం అధికంగా ఉన్నాయి. పరిశ్రమల విస్తరణ, రవాణా పెరగడం, చెత్త తగలబెట్టడం, భారీగా నిర్మాణ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్టిక్యులేట్ మేటర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పీఎం 2.5, పీఎం 10 వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఊపిరితిత్తులపై ప్రభావం చూపి.. శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. – హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి గాలి నాణ్యతను ఎలా నిర్ధారిస్తారు? గాలి నాణ్యతను ‘ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)’తో కొలుస్తారు. వాతావరణంలో ఒక క్యూబిక్ మీటర్ గాలిలో కెమికల్స్ రియాక్షన్స్‌తో ఏర్పడిన, లేదా దుమ్ము, ధూళి కణాలు, నిర్మాణ ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడే కాలుష్యాల (పర్టిక్యులేట్ మేటర్)ను లెక్కించి కొలుస్తారు. గంటకోసారి లేదా 8 గంటలకోసారి కొలవడం ద్వారా సగటు ఏక్యూఐని గుర్తిస్తారు. టాప్–20 వాయు కాలుష్య నగరాలు లాహోర్ (పాకిస్తాన్), హోటన్ (చైనా),భివండి, ఢిల్లీ (భారత్), పెషావర్ (పాకిస్తాన్) ఎన్ డీజమేనా (చాద్), దర్భంగా, అసోపూర్, పట్నా, ఘజియాబాద్, ధరెహారా (భారత్), బాగ్దాద్ (ఇరాక్), ఛాప్రా, ముజఫర్‌నగర్ (భారత్), ఫైసలాబాద్ (పాకిస్తాన్),గ్రేటర్ నోయిడా, బహదూర్‌ఘర్,ముజఫర్‌పూర్, ఫరీదాబాద్(భారత్) -
ఔషధ రంగ ప్రక్షాళనే మందు!
ఒంట్లో నలతగా ఉండటం మొదలుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చినా వైద్యుణ్ణి సంప్రదించటం, తగిన మందు వాడి ఉపశమనం పొందటం సర్వసాధారణం. కానీ ‘కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందాన’ ఔషధాలుంటే జనం ప్రాణాలు గాల్లో దీపంగా మిగిలిపోయినట్టే. ఔషధ సంస్థలన్నిటినీ అనలేంగానీ కొన్ని సంస్థలు అందరి కళ్లూ కప్పి నాసిరకం ఔషధాల ఎగుమతులతో లాభాలు గడించేందుకు తహతహలాడుతున్న తీరువల్ల మన దేశం పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి. ఈ విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం సంతోషించదగ్గ విషయం. ఇకపై ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మంచి విధానాలు (జీఎంపీ) పాటిస్తున్నట్టు ధ్రువపడితేనే ఆ ఉత్పత్తులను విడుదల చేయటానికి అంగీకరించాలనీ, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. ఫార్మా ఉత్పత్తుల్లో మన దేశం విశ్వగురు అయిందని రెండు నెలలక్రితం కేంద్ర ఇంధన శాఖ సహాయమంత్రి భగవత్ కూబా ఘనంగా ప్రకటించారు. కానీ ఇక్కడినుంచి ఎగుమతవుతున్న ఔషధాల వాడకంవల్ల పదులకొద్దీమంది మృత్యువాత పడిన ఉదంతాలు ఆ ఘనతను కాస్తా హరిస్తు న్నాయి. నిరుడు ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో దగ్గుమందు సేవించి 70 మంది పసిపిల్లలు మరణించగా, ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లలు చనిపోయారు. భారత్ నుంచి వచ్చిన కొన్ని ఔషధాల ప్రమాణాలు సక్రమంగా లేవని అమెరికా కూడా ప్రకటించింది. ఔషధాల్లో మోతాదుకు మించి రసాయనాలున్నాయని కొన్నిసార్లు, నిర్దేశిత ప్రమాణాల్లో లేవని కొన్నిసార్లు ఫిర్యాదు లొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పంపిన ఔషధాలు పంపినట్టు వెనక్కొస్తున్నాయి. నిజానికి గాంబియాకు ఎగుమతయిన దగ్గు మందు మన దేశంలో విక్రయానికి పనికిరాదని నిషేధించారు! అయినా అది నిరాటంకంగా గాంబియాకు చేరుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమే ఈ దుఃస్థితికి కారణం. దీన్ని ఎంత త్వరగా సరిదిద్దితే అంత మంచిది. ఔషధాల్లో వినియోగించే ముడి పదార్థాలు ప్రామాణికమైనవి అవునో కాదో, అవి నిర్దేశించిన పాళ్లలో ఉన్నాయో లేదో తనిఖీ చేయటం, రోగంనుంచి ఉపశమనమిస్తుందని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆ ఉత్పత్తి ఉందో లేదో నిర్ధారించటం నియంత్రణ వ్యవస్థల పని. అలాంటి సంస్థలు మన దేశంలో 38 వరకూ ఉన్నాయి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)తో పాటు రాష్ట్రాల్లో పలుచోట్ల ఔషధ పరీక్ష కేంద్రాలు(సీడీఎల్) ఉన్నాయి. కానీ ఏదీ సక్రమంగా అమలు కావటం లేదని పలుమార్లు రుజువైంది. గాంబియాలోనూ, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోనూ పసివాళ్ల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందులను హరియాణాలోని మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ తరచు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. తమ ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని తన వెబ్సైట్లో ఆ సంస్థ ఘనంగా ప్రకటించుకున్నా అదంతా ఉత్తదేనని తేలింది. అయినా ఏ నియంత్రణ విభాగం ఆ ఔషధ సంస్థపై చర్య తీసుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి తెస్తామంటున్న జీఎంపీ అయినా సక్రమంగా అమలు చేయగలిగితే మంచిదే. ఉత్పాదక ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ ఉత్పత్తులు కాస్తా కొద్ది రోజుల్లోనే దెబ్బతింటాయి. ఔషధాలు రోగం తగ్గించకపోయినా ఎంతోకొంత సరిపెట్టుకోవచ్చుగానీ ప్రాణాలే తీస్తే?! అసలే పౌష్టికాహార లోపం, వాతావరణ కాలుష్యం, విషాహారం తదితరాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు ఔషధాలు సైతం ఈ జాబితాలో చేరితే ఇక చెప్పేదేముంది? వాస్తవానికి ఎగుమతి చేసే ఔషధాలకు జీఎంపీ విధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ దాన్ని అమలు చేయటంలోనే అడుగడుగునా నిర్లక్ష్యం కనబడుతోంది. ఔషధాలు ఎగుమతి చేయ దల్చుకున్న ప్రతి దేశమూ తమ ఔషధ సంస్థలు నిర్దిష్టమైన ప్రమాణాలు అమలు చేస్తున్నట్టు నిర్ధారించుకోవాలని గాంబియా విషాద ఉదంతం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు నెలల క్రితం తెలిపింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ముడి పదార్థాల నాణ్యత మొదలు కొని కర్మాగారంలోని పరిసరాలు, యంత్రాలు, సిబ్బంది పాటించే పరిశుభ్రత వరకూ సమస్తం సరిగా ఉన్నాయో లేదో చూడటం ఈ మార్గదర్శకాల సారాంశం. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలోనూ పాటించే విధానాలను నమోదు చేసేందుకు అవసరమైన నమూనాను ఎవరికి వారు రూపొందించుకోవాలనీ, పకడ్బందీ తనిఖీలతో ఇవన్నీ సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు చూడాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. కేంద్రం ప్రకటించబోయే జీఎంపీ ఇకపై మన దేశంలో విక్రయించే ఔషధాలకు కూడా వర్తిస్తుందంటున్నారు. మంచిదే. అయితే ఎగుమతయ్యే ఔషధాల విషయంలో చూపిన అలసత్వమే ఇక్కడా కనబడితే అనుకున్న లక్ష్యం నెరవేరదు. కర్మా గారం దాటి బయటికొచ్చే ప్రతి ఔషధమూ అత్యంత ప్రామాణికమైనదన్న విశ్వాసం రోగుల్లో కలగాలి. ఔషధాల తనిఖీ విధానంలో మార్పులు తెస్తే తప్ప దీన్ని సాధించటం కష్టం. మన దేశంలో ఔషధ తయారీ సంస్థలు దాదాపు 30,000 వరకూ ఉన్నాయి. వీటిని సక్రమంగా తనిఖీ చేయాలంటే ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోరు. కనుక కొత్త నియామకాలపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే చాలా ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రయోగ ఫలితాల వివరాలను బహిరంగపరచటం లేదు. ఏమాత్రం పారదర్శకత పాటించని ఇలాంటి ధోరణులే కొంప ముంచుతున్నాయి. ఔషధ రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే ఈ పరిస్థితి మారుతుంది. -
డేంజర్ ‘లైఫ్‌స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్‌కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్‌లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
పిల్లలు, మహిళలపై రక్తహీనత పంజా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, పిల్లలను రక్తహీనత పట్టి పీడిస్తోంది. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిణమించింది. 15–49 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో 57.6 శాతం, ఐదేళ్ల లోపు పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో పలు వివరాలు పేర్కొంది. పిల్లల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 11 హెచ్‌బీ కంటే తక్కువగా ఉంటే రక్తహీనత కలిగినవారిగా వర్గీకరించారు. అంతకుముందు ఐదేళ్లతో పోల్చినప్పుడు మహిళల్లో రక్తహీనత ఒక శాతం పెరిగింది. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు మహిళల రక్తహీనతలో తెలంగాణ 16వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధికంగా లడక్‌లో 92.8 శాతం మంది, అత్యంత తక్కువగా లక్ష ద్వీప్‌లో 25.8 శాతం మంది రక్తహీనత బాధితులున్నారు. ఇదే వయసు గల గర్భి ణుల్లో 53.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. గర్భిణుల రక్తహీనతలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఐదేళ్లలో గర్భిణుల్లో 48.2 శాతం మంది రక్తహీనత బాధితులు ఉండగా, ఆ తర్వాత ఐదు శాతం పెరిగింది. ఇక 15–19 ఏళ్ల వయస్సుగల బాలికల్లోనూ రక్తహీనత శాతం 64.7 శాతముంది. అంతకుముందు ఐదేళ్లలో అది 59.7 శాతమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రక్తహీనత 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలి. పిల్లల్లో అత్యధికం లడాక్.. అత్యల్పం కేరళ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వయ సు గల 70 శాతం మంది పిల్లలు రక్తహీనత బారినపడ్డారు. 2019–21 మధ్య దేశంలో ఆ వయస్సు పిల్లల్లో అత్యధికంగా లడక్‌లో 92.5 శాతం మంది, గుజరాత్లో 79.7 శాతం మంది రక్తహీనతకు గురయ్యారు. పిల్లల్లో రక్తహీనత తక్కువగా ఉన్న రాష్ట్రాలు కేరళ (39.4 శాతం), అండమాన్– నికోబార్ దీవులు(40 శాతం), నాగాలాండ్ (42.7 శాతం) మణిపూర్ (42.8 శాతం) ఉన్నాయి. రక్తహీనత బారిన పడిన పి ల్లల విషయంలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలోపు పిల్లల్లో జాతీయ సగటు 67.1 శాతం కంటే రాష్ట్రంలో ఎక్కువగా రక్తహీనత బాధితులు ఉన్నారని పేర్కొంది. 2015–16 సంవత్సరంతో పోలిస్తే, 2019–21 మధ్య 9.3 శాతం మేర రక్తహీనత బాధితులు తెలంగాణలో పెరిగారని వెల్లడించింది. ఇవీ కారణాలు.. తల్లి విద్యాస్థాయి, వయస్సు, తల్లిపాలు ఇచ్చే వ్యవధి తదితర కారణాలు పిల్లల్లో రక్తహీనతపై ప్రభావం చూపిస్తాయి. ఇనుము లోపం రక్తహీనతకు అత్యంత సాధారణ కారణం. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. డయేరియా, మలేరియా, ఇతర ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతాయి. వివిధ సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక, విశ్వాసాల కారణంగా ఏర్పడే ఆహారపు అలవాట్లు కూడా రక్తహీనతకు కారణమవుతున్నాయి. రక్తహీనత సమస్యను అధిగమించాలంటే పుట్టిన తర్వాత మొదటి వెయ్యి రోజుల్లో తీసుకునే చర్యలు కీలకమైనవని డాక్టర్ కిరణ్ మాదల విశ్లేషించారు. -
కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్ మార్కెట్లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా మూలాలను అంచనా వేయడంలో ఈ సమాచారమే కీలకమని పేర్కొంది. కోవిడ్ పరిశోధనల ఫలితాలను అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటూ పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికింది. మహమ్మారి పుట్టుకను అర్థం చేసుకోవడం నైతిక, శాస్త్రీయ అవసరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెసియస్ అన్నారు. ‘‘వూహాన్‌లోని హునాన్ మార్కెట్లో సేకరించిన నమూనాల డేటాను ఈ ఏడాది జనవరి చివర్లో ఆన్లైన్ నుంచి తొలగించారు. దాన్ని తిరిగి అందరికీ అందుబాటులో ఉంచాలని చైనాకు చెప్పాం’’ అన్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో పుట్టిన కరోనా వైరస్ సార్స్–కోవ్–2 ప్రపంచమంతటా వ్యాపించి, లక్షలాది మరణాలకు కారణంగా మారడం తెలిసిందే. -
కరోనా మూలాల్ని తేల్చాలి: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. అప్పుడు మున్ముందు ఇతర వైరస్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసెస్ మాట్లాడారు. కరోనాతో లక్షలాది మంది మరణించారని, కొన్ని కోట్ల మంది లాంగ్ కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనాల్సిన నైతిక బాధ్యత ఉందని అన్నారు. కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్లో డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం 2021లోనే కొన్ని వారాలు గడిపి గబ్బిలాల నుంచి మనుషులకి ఈ వైరస్ సోకిందని నివేదిక సమర్పించింది. మరోవైపు అమెరికా అధ్యయనంలో ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని తేలింది. ఇలా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు ప్రచారంలో ఉండడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది.అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ చెప్పారు. అత్యంత ప్రమాదకర వైరస్‌లపై అధ్యయనానికి డబ్ల్యూహెచ్ఒ ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వయిజరీ గ్రూప్ కూడా ఇప్పటివరకు కరోనా వైరస్ పుట్టుకపై ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. కీలకమైన డేటా కనిపించడం లేదని కమిటీ అంటోంది. భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 113 రోజుల తర్వాత ఒకే రోజు 524 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,618కి చేరుకుంది. -
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్‌గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్‌కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్‌గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్‌ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్‌పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్‌పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్‌గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్‌తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
మంచిదేదో 'జంకు' లేకుండా చెప్పాలి!
జంక్ ఫుడ్‌తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజీ ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఇలా గుర్తించడం విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే, జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో భారతదేశాన్ని చిరుధాన్యాల ఎగుమతి కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ సిరి ధాన్యాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణానికీ మేలు చేసేవి. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ పండించగలగడం ఇందుకు కారణం. నిజానికి చిరుధాన్యాలు వందల ఏళ్లుగా భారతీయ ఆహారంలో భాగంగానే ఉన్నాయి. జొన్న, సజ్జ, రాగి వంటివి 1960వ సంవత్సరం వరకూ నలుగురిలో ఒకరు తినేవారు. కానీ, హరిత విప్లవం తరువాత చిరుధాన్యాల వాడకం క్రమేపీ తగ్గిపోయింది. అయితే ఇటీవలి కాలంలో ఈ చిరుధాన్యాలపై ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రమాదం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చిరు ధాన్యాలను మళ్లీ మన ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు కొంత కాలంగా సూచిస్తున్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం తగ్గుతున్న క్రమంలోనే దేశంలో ఆహారపు అలవాట్లూ మారిపోయాయి. శుద్ధి చేసిన ప్యాకేజ్డ్, ‘రెడీ టు ఈట్’ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మొదలైంది. అప్పట్లో వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా ఉండేందుకు, ఆహార వృథాను అరికట్టేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించా రన్నది మరువరాదు. ఆర్థిక సరళీకరణ విధానాల అమలు ప్యాకేజ్డ్ ఫుడ్ వాడకం మరింత ఎక్కువయ్యేందుకు కారణమైంది. 1991 తరువాత చక్కెర లతో నిండిన పానీయాలు దేశీ మార్కెట్లను ముంచెత్తాయి. అలాగే జంక్ ఫుడ్ అని ఇప్పుడు మనం పిలిచే రకరకాల ఆహార పదార్థాలూ అందుబాటులోకి వచ్చాయి. చక్కెరలు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాస్తా ఊబకాయం, అసాంక్ర మిక వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిరుధాన్యాలను మళ్లీ ప్రధాన ఆహారంగా మార్చడం పెద్ద సవాలే. ఒక పక్క రైతులు తమ పంటలు, పద్ధతులు మార్చుకునేందుకు తగిన ప్రోత్సాహాలు అందించడం... ఇంకోవైపు వినియోగదారులను చైతన్యపరచడం, వారి ఆహారపు అలవాట్లను మార్చడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. భయం ఏమిటంటే... ఎక్కడ ఈ జంక్ ఫుడ్ పరిశ్రమ చిరుధాన్యాలపై ప్రస్తుతమున్న ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందో అని! అసాంక్రమిక వ్యాధులు ప్రబలేందుకు జంక్ ఫుడ్ ఒక కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడైతే స్పష్టం చేసిందో, వీటిని పిల్లలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల నియంత్రణకు సూచనలు జారీ చేసిందో... అప్పటినుంచీ జంక్ ఫుడ్ పరిశ్రమ తమ ఉత్పత్తులను ఆరోగ్య కరమైనవనీ, సహజమైనవనీ చెప్పుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మల్టీ గ్రెయిన్ కుకీలు, చక్కెర తక్కువగా ఉన్న శీతల పానీయాలు, హృదయానికి దోస్తుల్లాటివని చెప్పే వంటనూనెలు, ‘పండ్ల’ రసాలు అని పేర్లు పెట్టి... ఇంట్లో వండుకునే ఆహారానికీ,పండ్లు, కాయగూరలకూ వీటిని ప్రత్యామ్నాయాలుగా చూపే ప్రయత్నం మొదలైంది. చిరుధాన్యాల ద్వారా కూడా ఈ మాయ చేసేందుకు కంపెనీలు కొన్ని ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ –నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వైపు పరుగులు పెడు తున్నాయి కూడా. జంక్ ఫుడ్ తయారీదారులు తమ ఉత్పత్తుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గొప్పగా చెప్పుకొంటూనే కీలక సమాచారాన్ని విని యోగదారుల కంటపడకుండా చూస్తాయి. ఆహారంలోని పదార్థాలు, హానికారక ‘అడిటివ్స్’(కలిపినవి) వివరాలు కనిపించకుండా చేస్తాయి. దేశ నియమ నిబంధనల ప్రకారం ఫుడ్ ప్యాకెట్స్‌పై ‘పోషక సమా చారం’ తప్పనిసరిగా నిర్దిష్ట పద్ధతిలో ప్రచురించాలి. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలు ఎంత మోతాదుల్లో ఉన్నాయో తెలపాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి పుణ్యమా అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇప్పుడు ‘ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ న్యూట్రిషన్ లేబలింగ్’ను ప్రతిపాదించింది. సాధారణంగా ప్యాకెట్ వెనుకభాగంలో ఉండే సమాచారాన్ని ముందు కూడా ప్రచురించాలని ఈ ప్రతిపాదన ఉద్దేశం. దీనివల్ల వినియోగదారులకు మరింత సమాచారం అంది ఆరోగ్యకరమైన అల వాట్లు చేసుకుంటా రని అంచనా. శాకాహార, మాంసాహార ఉత్పత్తు లను వేరు చేసేందుకు వాడినట్లు ఇవి కూడా గుర్తుల రూపంలో ఉంటాయి. జంక్ ఫుడ్ కంపెనీలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ కావాలని కోరుకుంటున్న స్టార్ రేటింగ్‌ల విషయంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అంత ఆరోగ్యకరం కాదని సూచించేందుకు రెండు స్టార్లను ఇచ్చినప్పుడు కూడా వినియోగదారులు వీటిని తీసుకునేందుకు మొగ్గు చూపు తున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసింది. పైగా ఈ స్టార్ రేటింగులు కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఇచ్చేవి కాబట్టి వాటిని పరిశ్రమ వర్గాలు తమకు అనుకూలంగా మర్చుకునే అవకాశముందని అంచనా. వీటికి భిన్నంగా వార్నింగ్ లేబుల్స్(హెచ్చరికలు) మాత్రం అందులో ఉన్న పదార్థాల ఆధారంగా తయారవుతాయి. కుకీలు, పాస్తా, నూడుల్స్ వంటివాటిల్లో కొంత మోతాదులో జొన్నలు, సజ్జలు కలిపి నంత మాత్రాన వాటికి ఆరోగ్యకరమైనవన్న ట్యాగ్ తగిలించాల్సిన అవసరమేమీ లేదు కదా! మరి పోషకాలపై మనకున్న అవగాహన ఎంత? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) అంచనా ప్రకారం అది చాలా తక్కువ. ఫుడ్ లేబుల్లోని సమాచారం అప్పు డప్పుడూ చదువుతాము కానీ... కొనుగోళ్ల సమయంలో ఎక్కువగా తయారీ, ఎక్స్పైరీ డేట్లనే చూస్తూంటామని ఎన్ ఐఎన్ నిర్వ హించిన ఒక అధ్యయనంలో అధికులు తెలపడం ఇక్కడ ప్రస్తావ నార్హం. ఇదే సమయంలో శాకాహార, మాంసాహారాలను వేరు చేసేందుకు ఉపయోగించే గుర్తులు మాత్రం బాగా ఉపయోగపడుతున్నట్లు వారు ఒప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అనారోగ్యతను సూచించేందుకు ట్రాఫిక్ సిగ్నళ్ల మాదిరి గుర్తులను వాడాలని కొంతమంది సూచి స్తున్నారు. కానీ కంపెనీలు మాత్రం ‘హెల్త్ స్టార్ రేటింగ్’ ఉంటే మేలు అంటున్నాయి. అయితే స్టార్ గుర్తు సానుకూలతను సూచిస్తుంది. ఒకట్రెండు అధ్యయనాల ప్రకారం కొందరు బాగా శుద్ధి చేసిన ఆహారం ప్యాకెట్లపై ఎర్రటి గుర్తు పెట్టడం మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ కూడా ప్యాకేజీల ముందువైపు సమాచారం ఇవ్వడం మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంటే జంక్‌ఫుడ్‌తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజి ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. ఈ లేబలింగ్ విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే జంక్ ఫుడ్ తయారీదారులు తమ మార్కెటింగ్ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్ చేసే ప్రమాదం ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
లైట్ తీస్కోవద్దు.. నాకేమవుతుందనుకుంటే ప్రమాదమే, తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: 2022 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 141.7 కోట్లు. అందులో 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సుగలవారు 34 శాతం మంది ఉన్నారు. ఆ వయస్సుగల పిల్లలు, టీనేజర్లు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 11–17 ఏళ్ల మధ్య వయస్సుగల వారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 11–17 ఏళ్ల మధ్య వయస్సువారు రోజుకు కనీసం 60 నిముషాలు కఠిన లేదా మధ్యస్థ వ్యాయామం చేయాలని సూచించింది. ఇక 18 ఏళ్ల పైబడినవారిలో పురుషుల్లో 25 శాతం, మహిళల్లో 40 శాతం శారీరక శ్రమ చేయడంలేదు. అంటే సరాసరి 32.5 శాతం అన్నమాట. వీళ్లు వారానికి 150 నిమిషాలు మధ్యస్థాయి వ్యాయామం లేదా 75 నిమిషాలు కఠిన వ్యాయామం చేయాలి. 70 ఏళ్లు పైబడినవారిలో పురుషులు 38 శాతం, మహిళలు 50 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. విచిత్రమేంటంటే... 11–17 ఏళ్ల వయస్సువారికంటే 70 ఏళ్లు పైబడిన వృద్ధులే నిర్ణీతంగా ఎక్కువగా వ్యాయామం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీర్ఘకాలిక జబ్బులు... ఏడాదికి రూ. 25,760 కోట్ల ఖర్చు శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దేశంలో దీర్ఘకాలిక జబ్బులు, మానసిక జబ్బులు పెరుగుతున్నాయి. ప్రధానంగా గుండెపోటు, పక్షవాతం, షుగర్, బీపీ, ఏడు రకాల క్యాన్సర్లు.. రొమ్ము, పెద్ద పేగు, గర్భసంచి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ వస్తాయి. అలాగే మతిమరుపు, కుంగుబాటు జబ్బులు వస్తాయని స్పష్టం చేసింది. దేశంలో జరిగే మరణాల్లో 66 శాతం దీర్ఘకాలిక జబ్బులే కారణమని పేర్కొంది. అందులో 25 శాతం గుండె, 10 శాతం క్యాన్సర్, 15 శాతం ఊపిరితిత్తులు, డయాబెటీస్ వల్ల 4 శాతం, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. శారీరక శ్రమ చేయకపోవడం వచ్చే ఈ జబ్బులను నయం చేసేందుకు ఏడాదికి ప్రజలు రూ. 25,760 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే పదేళ్లలో వీటివల్ల ప్రజలపై పడే ప్రత్యక్ష భారం రూ. 2.83 లక్షల కోట్లు ఉంటుందని హెచ్చరించింది. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానమేదీ? దేశంలో పిల్లలు కేవలం చదువులకే అతుక్కుపోతున్నారు. స్కూలు, కాలేజీల సమయంలో కనీసం 4 అడుగులు వేసే పరిస్థితి కూడా లేదు. స్పోర్ట్స్ వ్యవస్థ కుంటుపడింది. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ చేయించే వ్యవస్థ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అసలు జాతీయస్థాయిలో చిన్న పిల్లల్లో శారీరక శ్రమను పర్యవేక్షించే వ్యవస్థ లేదని ఎత్తిచూపింది. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం లేదని తెలిపింది. శారీరక శ్రమను బహిరంగ ప్రదేశాల్లో చేసేలా ప్రోత్సహించాలని, వాకింగ్, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని పేర్కొంది. పనిచేసే చోట కూడా శారీరక శ్రమను ప్రోత్సహించాలని ఇండియాకు సిఫార్సు చేసింది. రోజుకు 10–12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారి కంటే 1.5 రెట్లు ఎక్కువ. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి. శారీరక శ్రమను ప్రోత్సహించాలి డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని అంశాలు ఆలోచించదగినవి.. శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను, పెద్దలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. మానసిక ఉల్లాసం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు. –డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
స్మగ్లింగ్ కట్టడికి భారత్ నాయకత్వం వహించాలి
న్యూఢిల్లీ: వస్తు అక్రమ రవాణా (స్మగ్లింగ్) కారణంగా నష్టపోతున్న భారత్ దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ అనే సంస్థ ఓ నివేదికలో సూచించింది. ఈ విధమైన అక్రమ వాణిజ్య విధానాలను నిరోధించడం వల్ల ఏటా 31 బిలియన్ డాలర్లు (రూ.2.54 లక్షల కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు ఆదా అవుతుందని పేర్కొంది. అంతేకాదు, ఏటా 1,64,000 (2030 నుంచి) ముందస్తు మరణాలను కూడా అరికట్టొచ్చని సూచించింది. ఈ మరణాల్లో అధిక భాగం తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది. స్మగుల్డ్ ఉత్పత్తులను వినియోగించే పెద్ద మార్కెట్ల లో భారత్ కూడా ఉందంటూ.. దీని వల్ల ఏటా పెద్ద ఎత్తున ఆదాయం నష్టపోతున్నట్టు వివరించింది. అందుకే ఈ విషయంలో భారత్ ప్రపంచంలో నా యకత్వ పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. అతి పెద్ద వినియోగ దేశమైన భారత్‌దు చిట్ట విరుద్ధమైన ఉత్పత్తుల వల్ల నష్టపోతోందని, అంతర్జాతీయంగా దీనిపై సమన్వయానికి ముందుకు రావాలని కోరింది. ఒక్క పొగాకు ఉత్పత్తుల దొంగ రవాణా వల్ల ప్రపంచ దేశాలు ఏటా 40.5 బిలియన్ డాలర్లు (రూ.3.32 లక్షల కోట్లు) నష్టపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. కలసికట్టుగా పోరాడాలి.. అంతర్జాతీయంగా స్మగుల్డ్ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని థింక్ చేంజ్ ఫోరమ్ సంస్థ సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తు అక్రమ రవాణా పెద్ద సవాలుగా ఉన్నట్టు పేర్కొంది. అంతర్జాతీయ బ్రాండ్లు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఉన్నాయని, ఇవి స్మగుల్డ్ కంటే నకిలీ ఉత్పత్తుల సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘‘స్మగ్లింగ్ అనేది వినియోగ దేశం ఆదాయ నష్టపోవడానికి కారణమవుతుంది. అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి. స్మగుల్డ్ రూపంలో వినియోగదారులకు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. కనుక స్మగ్లింగ్ అంశంపై భారత్ అంతర్జాతీయంగా ఏకాభిప్రాయానికి కృషి చేయాలి’’అని ఈ నివేదిక సూచించింది. అంతర్జాతీయ వేదికపై స్మగ్లింగ్ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారత్ వర్ధమాన దేశాల స్వరాన్ని వినిపించొచ్చని, ప్రపంచ నేతగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. బ్రాండెడ్ ఉత్పత్తులు అక్రమ మార్గాల్లో భారత్‌లోకి వస్తే ఆయా ఉత్పత్తుల కంపెనీల యాజమాన్యాలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఈ ఫోరమ్ సూచించింది. ‘‘ఆయా బ్రాండ్ యజమానాలను కార్పొరేట్ శాఖ శిక్ష విధించాలి. అంతర్జాతీయంగా ఇదొక దురాచారంగా మారింది. పేరొందిన బ్రాండ్లు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో తక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. సబ్సిడరీ ద్వారా నేరుగా భారత్‌లోకి దిగు మతి చేసుకోకుండా, అవి అంతర్జాతీయ ట్రేడ ర్లు, పంపిణీదారులకు విక్రయిస్తున్నాయి. వారి నుంచి అక్రమ మార్గాల్లో ఉత్పత్తులు అనధికారిక మార్కెట్ల ను చేరుతున్నాయి’’అని నివేదిక పేర్కొంది. -
చెడు కొవ్వుతో చేటు.. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం అవే..
చెడు కొవ్వుతో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగం వల్ల గుండె రక్తనాళాల్లో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం గుండెపోటు మరణాలేనని స్పష్టం చేసింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యకర ఆహారం వల్ల 80 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. భారత్‌లో 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆ ఏడాది 1.44 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల చనిపోయారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల జరిగిన 1.78 లక్షల మరణాల్లో 80 శాతం భారత్‌లోనే సంభవించాయి. యూరప్‌లో 1.25 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల చనిపోయారు. 2022లో నిర్వహించిన పరిశోధనలో ఉజ్బెకిస్తాన్ జనాభాలో 12 శాతం మందికి గుండె జబ్బులు ఉన్నాయని తేలింది. ప్రపంచంలో టీఎఫ్ఏ కారణంగా సంభవించే గుండెపోటు మరణాల్లో ఈజిప్ట్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ 11వ స్థానంలో ఉంది. సాక్షి, హైదరాబాద్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) అంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఏర్పడే కొవ్వు ఆమ్లాలు. ఇది చెడు కొవ్వు. అంటే ఇది ఆరోగ్యానికి హానికరమన్నమాట. గ్రాము ట్రాన్స్ ఫ్యాట్లో 9 కేలరీలుంటాయి. ఆహారంలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బులు సంభవిస్తాయి. వంటనూనెలు, వేపుళ్లు, ప్యాక్ చేసిన లేదా శుద్ధి చేసిన ఆహారాల్లో టీఎఫ్ఏ ఉంటుంది. కేకులు, కుకీలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటిల్లోనూ ఉంటుంది. బరువు పెరుగుతారు. గుండె జబ్బులతో పాటు మధుమేహం, రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరానికి ట్రాన్స్ ఫ్యాట్ అవసరం లేదు. దాన్ని నివారించాల్సిందే. ప్రతి వంద గ్రాముల ఫ్యాట్లో రెండు శాతానికి మించి, కేలరీల్లో 0.5 శాతానికి మించి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండకూడదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరకు టీఎఫ్‌ఏను పూర్తిగా నియంత్రించాలి ప్రపంచలో 60 దేశాలు టీఎఫ్ఏ నియంత్రణ పరిధిలోకి వచ్చాయి. గతేడాది జనవరిలో భారతదేశం టీఎఫ్ఏ నియంత్రణను అమలులోకి తీసుకొచ్చింది. అన్ని దేశాల్లోనూ ఈ ఏడాది చివరికల్లా టీఎఫ్‌ఏను నియంత్రించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం పాక్షికంగా శుద్ధిచేసిన వంట నూనెలను నిషేధించాలి. పూర్తిగా శుద్ధి చేసిన నూనెలను వాడాలి. ఆహార పదార్థాల్లో టీఎఫ్ఏ ఎంత శాతం ఉందో ప్యాకెట్లపై ముద్రించాలి. నూనె, కొవ్వు వినియోగాన్ని తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో ఇప్పటికీ 32 కోట్ల మంది టీఎఫ్ఏ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. 2019 లెక్కల ప్రకారం గుండెపోటు మరణాల్లో టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల ఏఏ దేశాల్లో ఎంత శాతం మరణాలు సంభవిస్తున్నాయంటే.. నివేదికలోని ముఖ్యాంశాలు.. ►మెక్సికోలో కంపెనీలు టీఎఫ్ఏ నియంత్రణ సరిగా చేయకపోతే 40 వేల డాలర్లు జరిమానాగా నిర్ణయించారు. ►ఉజ్బెకిస్తాన్‌లో పామాయిల్ వినియోగం ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో ఆ దేశంలో ఏడాదికి 5 వేల టన్నులు వినియోగం ఉంటే, 2019 నాటికి అది పదిరెట్లకు అంటే 50 వేల టన్నులకు చేరింది. ►ప్రపంచంలోని 500 కోట్ల మంది జనాభా టీఎఫ్ఏ నియంత్రణ అమలు చేయని దేశాల్లో ఉన్నారు. తద్వారా వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. ►మన దేశంలో 2013లో టీఎఫ్‌ఏపై పాక్షిక నియంత్రణ మొదలైంది. 2020 డిసెంబర్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) టీఎఫ్‌ఏను ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. 2022 జనవరి నుంచి పూర్తిస్థాయి నియంత్రణ చేపట్టింది. ►ఎఫ్ఎస్ఎస్ఏఐ 2020 డిసెంబర్ నుంచి లేబొరేటరీల్లో టెస్టులు మొదలుపెట్టింది. ఇది ఆయిల్ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. ►అంతర్జాతీయంగా లేబొరేటరీలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై డబ్ల్యూహెచ్ఓ 2021లో ఒక అధ్యయనం చేసింది. మన దేశం సహా కెనడా, బ్రెజిల్, టర్కీ, పాకిస్తాన్, పోర్చుగల్, నైజీరియా, శ్రీలంక, చైనా, ఫిజీ, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే లేబొరేటరీలను పరిశీలించింది. ప్రతి లేబొరేటరీలో ఒకే విధమైన ఆహారపదార్థాలను పరీక్షించినా, వాటి ఫలితాలు మాత్రం ఒకేవిధంగా లేవని గుర్తించింది. దీంతో ఆహార పదార్థాలను పరిశీలించే లేబొరేటరీలపై అనుమానాలు నెలకొన్నాయి. నూనె తగ్గించాలి..పండ్లు, కూరగాయలు తినాలి వంటనూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉపయోగపడతాయి. అందుకే వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి సగటున మనిషి ఏ రూపంలోనైనా సరే రోజుకు 30 గ్రాములకు మించి వంటనూనెలను వాడకూడదు. ఆవిధంగా టీఎఫ్ఏ వినియోగం తగ్గించాలి. జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. సహజ సిద్ధమైన తాజా ఆహారం తీసుకుంటే కూడా మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు. రోజూ 400 గ్రాములకు తగ్గకుండా కూరగాయలు, పండ్లు తినాలి. నూనె వేపుడులకు దూరంగా ఉండాలి. ఎక్కువసార్లు వేడిచేసిన నూనెలు వాడకూడదు. లేనిపక్షంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి గుండె జబ్బు వస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. – డాక్టర్ గుత్తా సురేష్, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు -
రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో టీకా కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల వైద్య రంగంలో ఉన్న లోపాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయన్నారు, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తమ దగ్గర కావాల్సినన్ని వెంటిలేటర్లు లేవని న్యూయార్క్ గవర్నర్ అన్నారని, ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తే లైఫ్ సైన్సెస్‌కు పెద్దపీట వేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ మేరకు చేసిన కృషి వల్ల ప్రపంచంలోకెల్లా మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలోనే 40 శాతం ఫార్మసీ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. కరోనా తరహాలో మరే ఇతర మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనే రీతిలో టీకాలు అవసరమని గుర్తించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను సంప్రదించామని, అందుకు ఆ సంస్థ కూడా ఆసక్తి ప్రదర్శించిందని... త్వరలోనే తెలంగాణలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హబ్‌ను డబ్లు్యహెచ్‌వో ఏర్పాటు చేయబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే.. దేశంలో అత్యధిక వృద్ధి రేటు తెలంగాణలోనే ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కోవిడ్ ఉన్నా.. నోట్ల రద్దు చేసినా.. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 15 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ కేంద్రం తమకు సహకరించి ఉంటే తెలంగాణ మరింత వేగంగా వృద్ధి సాధించేదని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలన్నీ పనిచేసుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల మార్కును దాటేదన్నారు. మోదీ సర్కార్ అప్పు రూ.100 లక్షల కోట్లు.. మోదీ ప్రధాని కావడానికి ముందు దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లుగా ఉండగా మోదీ పాలనలో దేశం కొత్తగా రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులపాలైనట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 3.68 లక్షల కోట్లు అందించినా తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. -
భారత్‌లో దారుణమైన పరిస్థితులు.. దంత ఆరోగ్యంపై ఖర్చు ఇంత తక్కువా?
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో దంతాల ఆరోగ్యంపై నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనివల్ల భారీగా నష్టం కలుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. భారత్‌లో దంత ఆరోగ్యం కోసం ఏటా చేస్తున్న తలసరి సగటు ఖర్చు కేవలం నాలుగు రూపాయలేనని పేర్కొంది. ఈ మేరకు ‘ఓరల్ హెల్త్ ఇన్ ఇండియా’ పేరిట ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో నోటి అనారోగ్యాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తించ లేదని.. నోరు, దంతాలకు సంబంధించి వచ్చే ఐదు ప్రధాన జబ్బులతో దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.60 వేల కోట్ల నష్టం వస్తోందని తెలిపింది. ఇండియాలో ఒకటి నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసువారిలో 43.3 శాతం మందికి దంత సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఐదేళ్లపైబడిన వారిలో 28.8 శాతం మందికి తేలికపాటి దంత సమస్యలు ఉన్నాయని వివరించింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో 21.8 శాతం మందికి తీవ్రమైన దంత సమస్యలు ఉన్నాయని పేర్కొంది. 20 ఏళ్లు దాటినవారిలో దంతాలు లేనివారు నాలుగు శాతం మంది ఉన్నట్టు తెలిపింది. ఇక నోటి, పెదవుల కేన్సర్లకు సంబంధించి 2020లో 1.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని. ఇందులో మహిళలు 31,268 మంది, పురుషులు 1.04 లక్షల మంది ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. సగటున ప్రతి లక్ష జనాభాలో 9.8 మందికి నోటి, పెదవుల కేన్సర్ కేసులున్నాయని తెలిపింది. ఆల్కహాల్, పొగాకు, పంచదార ఉత్పత్తులే ఈ దంత సమస్యలకు కారణమని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని పలు కీలక అంశాలివీ ►మన దేశంలో ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో కలిపి రోజుకు సగటున 53.8 గ్రాముల పంచదార వినియోగిస్తున్నారు. ►15 ఏళ్లు పైబడినవారిలో పొగాకు ఉత్పత్తులు వాడేవారు 28.1శాతం కాగా..ఇందులో మహిళలు 13.7 శాతం, పురుషులు 42.4 శాతం. ►15 ఏళ్లు పైబడినవారిలో తలసరి సగటున ఏడాదికి 5.6 లీటర్ల మద్యం తాగుతున్నారు. ఇందులో మహిళలు 1.9 లీటర్లు, పురుషులు 9.1 లీటర్లు తాగుతున్నారు. ►2019 లెక్కల ప్రకారం ఇండియాలో దంత వైద్య సహాయకులు 3,515 మంది, దంతాలను కృత్రిమంగా అమర్చే టెక్నీషియన్లు 3,090 మంది, దంత వైద్యులు 2.71 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ►ఐదేళ్లలో ప్రతి పదివేల జనాభాకు ఇద్దరు మాత్రమే కొత్తగా దంత వైద్యులు అందుబాటులోకి వచ్చారు. ►దేశంలో అధునాతన దంత వైద్యానికి సంబంధించి బీమా సౌకర్యం లేదు. ప్రమాదాలు, ఇతర కారణాలతో దంతాలు పోయినా బీమా సౌకర్యం వర్తించడం లేదు. ►దేశంలో జాతీయ ఓరల్ పాలసీ ఉన్నా దంత ఆరోగ్యంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగడం లేదు. సమస్య తీవ్రమైతేగానీ బాధితులు పట్టించుకోవడం లేదు. దంత సమస్యలపై ప్రజల్లో అవగాహన తక్కువ మన దేశంలో దంత, గొంతు సమస్యలపై అవగాహన తక్కువ. దంత సమస్యలుంటే సంతులిత ఆహారం తీసుకోలేం. ఇవి దీర్ఘకాలిక జబ్బులకు కారణం అవుతాయి. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పొగాకు, ఆల్కహాల్, తీపి పదార్థాలకు దూరంగా ఉంటే జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. – డాక్టర్ హరిత మాదల, దంత వైద్యులు, నిజామాబాద్ పొగాకు వినియోగమే ప్రధాన కారణం నోటి కేన్సర్, దంతాల సమస్యలకు చాలా వరకు పొగాకు వినియోగమే ప్రధాన కారణం. ఐసీఎంఆర్ అంచనాల ప్రకారం దేశంలో కేన్సర్‌తో బాధితుల సంఖ్య 2025 నాటికి దాదాపు 29.8 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. కేన్సర్ చికిత్సకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ.. దాని మూలకారణమైన పొగాకు వినియోగం నియంత్రణపై తగినస్థాయిలో దృష్టి సారించడం లేదు. దేశంలో పొగాకు వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. టీనేజ్ పిల్లలు పొగాకు వ్యసనానికి గురికాకుండా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి. – నాగ శిరీష, వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -
అప్పుడే అయిపోలేదు.. మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు. అయితే మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ అని టెడ్రోస్ హెచ్చరించారు. అమెరికా సహా 21 దేశాల్లో గతవారం కొత్త కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికాలోనే 90శాతం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసులు తగ్గాయని అజాగ్రత్తగా ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల్లో అమెరికాలోనే అత్యధికంగా 42వేల కేసులు వెలుగుచూశాయి. యూరప్ దేశాల్లో 25వేల మందికి ఈ వైరస్ సోకింది. భారత్‌లో ఇప్పటివరకు 14మంది మంకీపాక్స్ బారినపడ్డారు. చదవండి: ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్‌కే! -
మందులా... మృత్యు గుళికలా!
ఒకే రోజు రెండు విషాద వార్తలు! రెండూ పసిపిల్లలకు సంబంధించినవే. థాయ్‌లాండ్‌లోని శిశు సంరక్షణాలయంపై ఉన్మాది బుల్లెట్లు కురిపించి 37 మంది ప్రాణాలు తీశాడు. మన దేశానికి చెందిన మేడెన్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఉత్పత్తి చేసిన మందుల కారణంగా ఆఫ్రికా ఖండ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు గత నెలలో ప్రాణాలు కోల్పోయారు. మారణాయుధంతో పసికూనలపై విరుచుకుపడిన రాక్షసుడికీ... కేవలం లాభార్జన కాంక్షతో కలుషిత ఉత్పత్తులకు ఔషధమన్న ముద్రేసి అంటగట్టిన సంస్థ యజమానులకూ తేడా ఏమీ లేదు. కొన్ని ఔషధ సంస్థల టక్కుటమార విద్యలపైనా, వాటి ఉత్పత్తులపైనా ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న దినేష్ ఎస్. ఠాకూర్ వంటి నిపుణులు తరచు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడిన చోట అలాంటివారిది అరణ్యరోదనే అవుతోంది. ఇప్పుడు గాంబియా పసిపిల్లల ఉసురు తీసిన మందులకు భారత్‌లో విక్రయించడానికి అనుమతుల్లేవని అంటున్నారు. మన దేశంలో విక్రయానికి పనికిరాని ఉత్పత్తులు గాంబియాకు ఎలా పోయాయి? అంతర్జాతీయంగా మన పరువు తీసిన ఈ ఉదంతం తర్వాతనైనా పాలకులు మేల్కొనవలసి ఉంది. ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంత దేశాల్లో మన ఫార్మా రంగ సంస్థలదే పైచేయి. ఆఖరికి రష్యా, పోలాండ్, బెలారస్ వంటి దేశాల్లోనూ మన ఔషధాలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు ఫార్మా ఉత్పత్తులు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. అయినా పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని పాలకులు గుర్తించలేదు! పౌష్టికాహారలోపం, వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన నీరు, విషాహారం తదితరాలు ప్రజలను రోగాలబారిన పడేస్తాయి. రోగగ్రస్తులకు అందుబాటులో ఉంటున్న ఔషధాలు జబ్బు తగ్గించటం మాట అటుంచి ప్రాణాలు తీయడమంటే అంతకన్నా ఘోరమైన నేరం ఉంటుందా? కానీ చట్టంలో ఉండే లొసుగుల కారణంగా ఈ నేరం నిత్యం జరుగుతూనే ఉంది. ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా గాంబియాలో సరైన ఔషధ నియంత్రణ వ్యవస్థ లేదనీ, జవాబుదారీతనం అసలే లేదనీ కొందరంటున్నారు. కానీ మనదగ్గరమటుకు ఏం ఉన్నట్టు? హరియాణాలోని కుండ్లీలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని గాంబియా విషాదం వెల్లడి కాకముందు మేడెన్ ఔషధ సంస్థ వెబ్సైట్ ఘనంగా చెప్పుకొంది. ప్రస్తుతం దాన్ని తొలగించి హరియాణాలోనే ఉన్న మరో ఫ్యాక్టరీకి, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు దక్కిందని ఆ సంస్థ గొప్పలు పోతోంది. అంతేకాదు... తమకు ఐఎస్ఓ గుర్తింపు కూడా వచ్చిందంటున్నది. మేడెన్ సంస్థ ఫ్యాక్టరీలనుగానీ, దాని ఉత్పత్తులనుగానీ తనిఖీలు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అటు ఐఎస్ఓ గుర్తింపు పొందిన ఔషధ సంస్థల జాబితాలో మేడెన్ లేనేలేదు. ప్రాణప్రదమైన ఔషధ సంస్థలు ఇలా ఇష్టానుసారం ప్రకటించుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతుంటే అన్ని వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఈ సంస్థపై గత దశాబ్దకాలంలో బిహార్, గుజరాత్, కేరళ, జమ్మూ, కశ్మీర్లు ఫిర్యాదులు చేశాయి. కానీ అవన్నీ నాసిరకమైన మందులకు సంబంధించిన ఫిర్యాదులు. ఇప్పుడు గాంబియా పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందుల్లో అత్యంత ప్రమాదకరమైన డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు మోతాదుమించి ఉన్నాయని తేల్చారు. ఇవి కిడ్నీలనూ, ఇతర అంగాలనూ తీవ్రంగా దెబ్బతీయటంతో పిల్లలు మరణించారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గ్లిసరిన్ను సాంద్రత బాగా తగ్గించి దగ్గు మందుల్లో వినియోగిస్తారు. గ్లిసరిన్‌తో పోలిస్తే ఈ రెండు రసాయనాలూ చవగ్గా లభిస్తాయని చాలామంది వాటివైపు మొగ్గుతున్నారు. అయితే పెయింట్లు, ఇంకులూ తయారీలో వినియోగించే ఈ రసాయనాలు ఏమాత్రం మోతాదు మించినా ప్రాణాంతకమవుతాయి. ఇప్పుడు గాంబియాలో జరిగింది అదే. మనకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) ఉంది. దేశంలో అనేకచోట్ల కేంద్ర ఔషధ పరీక్ష కేంద్రాలు (సీడీఎల్) ఉన్నాయి. రాష్ట్రాల స్థాయిలో ఔషధ తనిఖీ అధికారులున్నారు. దేశం వెలుపలికిపోయే ఔషధాల ప్రమాణాల నిర్ధారణకు సంబంధించి ఎన్నో నిబంధనలున్నాయి. కానీ మేడెన్ సంస్థ ఈ వ్యవస్థల కళ్లు కప్పగలిగింది. 2020లో జమ్మూ, కశ్మీర్లో ఈ దగ్గుమందు 14 మంది ప్రాణాలు తీసినప్పుడు ప్రజారోగ్య రంగ కార్యకర్త దినేష్ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సవివరమైన ఫిర్యాదు పంపితే దర్యాప్తు చేయటం మాట అటుంచి, కనీసం అది అందుకున్నట్టు చెప్పే దిక్కు కూడా లేకపోయిందంటే ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఔషధ ప్రమాణాల నిర్ధారణకూ, నియంత్రణకూ 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టమే ఆధారం. 2004లో రాన్‌బాక్సీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తి, ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాల నియంత్రణ సంస్థలు గగ్గోలు పెట్టినప్పుడు ఆనాటి పాలకులు ఇదంతా కుట్రగా తేల్చిపారేశారు తప్ప ఫార్మా రంగ సంస్కరణలకు పూనుకోలేదు. వర్తమాన అవసరాలకు తగ్గట్టు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. వర్ధమాన దేశాలకు చవగ్గా ఔషధాలందిస్తుందన్న ఖ్యాతిని నిలుపుకోవాలన్నా, ప్రపంచ ఫార్మా రంగంలో పెరుగుతున్న మన వాటా రక్షించుకోవా లన్నా ఔషధ నియంత్రణ వ్యవస్థ ప్రక్షాళనకు తక్షణం పూనుకోవాలి. లేదంటే మన ప్రతిష్ఠ అడుగంటడం ఖాయం. -
కరోనా కథ ముగిసింది: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా కథ ముగిసింది: ప్రపంచ ఆరోగ్య సంస్థ -
కరోనా కథ ముగిసింది!: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించిన కరోనా కథ ముగిసినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. కోవిడ్–19 తాలూకు అత్యంత భయానకమైన దశ ముగిసిపోయినట్టేనని వెల్లడించింది. ‘‘వైరస్ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయి. ఇకపై కేసుల అంతగా పెరుగుదల ఉండదు. అలాగని పూర్తిగా తగ్గి జీరో కేసులకు వచ్చే పరిస్థితి కూడా లేదు’’ అని అంచనా వేసింది. ‘‘రెండున్నరేళ్లుగా మనం చీకటి గుహలో బతుకులు వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు గుహ చివర్లో వెలుగు రేఖ కనిపిస్తోంది. అయితే అక్కడికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరముంది. అప్రమత్తంగా లేకుంటే ఇంకా ఎన్నో అడ్డంకులు వస్తాయి’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు. గురువారం ఆయన ఐరాస సర్వప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ బలహీనపడిపోయిందని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ కూడా అన్నారు. ఆయన తొలినుంచీ కరోనా కేసుల్ని ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేస్తున్నారు. కరోనా వైరస్‌కు మన శరీరాలు అలవాటు పడిపోయాయని, ఇక ఆ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడం జరగదని ఆయన ధీమాగా చెప్పారు. -
యాంటీ‘భయో’టిక్స్!
సాక్షి, హైదరాబాద్: తుమ్మినా..దగ్గినా..నీరసమున్నా..ఆయాసమున్నా.. వొళ్లు నొప్పులు.. వైరల్ జ్వరం.. ఏదైనా ఒక్కటే మందు..యాంటీబయాటిక్. ఇలా చిన్నాచితకా రోగానికీ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం చాలామందికి అలవాటై పోతోంది. చివరి అస్త్రంగా వాడాల్సిన వాటిని తొలిదశలోనే వాడేస్తున్నారు. వైద్యులు సూచించక పోయినా కొందరు సొంతంగా వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంటే అప్పటికే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములకు యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్) వచ్చి ఉంటుందన్న మాట. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను (యాంటీబయాటిక్స్) చల్లుతున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం పాడి పశువులకు ఇంజెక్షన్లు (యాంటీబయాటిక్స్) ఇస్తున్నారు. ఈ విధమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా అప్పటికే మానవ శరీరంలో అధిక శాతం యాంటీబయాటిక్స్ ఉంటున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌ల విక్రయం దేశంలో 2019లో 85 రకాలకు సంబంధించిన 280 కోట్ల యాంటీబయాటిక్స్ ప్యాక్‌లు అమ్ముడుపోయినట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యాంటీబయాటిక్స్‌పై చేసిన అధ్యయనం ఇటీవల లాన్సెట్‌లో ప్రచురితమైంది. ఇందులో 28 యాంటీబయాటిక్స్‌ను అత్యవసర మందుల జాబితాలో పెట్టారు. మిగితావి సాధారణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతి ఇచ్చిన యాంటీబయాటిక్స్ కేవలం 19 శాతమే కాగా మిగిలిన 81 శాతం రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థల పరిధిలో అమ్ముతున్నారు. వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది. అయినా కంపెనీలు ఇష్టమొచ్చినట్లుగా మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. ఔషధాల నియంత్రణలో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని దందా నిర్వహిస్తున్నాయి. అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్‌లో 85–90 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాక్టీషనర్లు రాస్తున్నవేనని అధ్యయనం తేల్చిచెప్పింది. ఆహారం ద్వారానే అత్యధిక శాతం యాంటీబయాటిక్స్! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో మాంసం, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, వివిధ రకాల పంటల (ఆహార పదార్ధాలు) వినియోగం ద్వారా 80 శాతం యాంటీబయాటిక్స్ మానవ శరీరంలోకి వెళ్తున్నాయని తేల్చింది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు బ్లడ్ ఇన్ఫెక్షన్లుగా మారితే, అక్కడున్న పెన్సిలిన్‌కు సంబంధించిన యాంటిబయాటిక్కు లొంగని పరిస్థితులు 65 శాతం ఉంటున్నట్లు తెలిపింది. దీంతో డోసు ఎక్కువున్న యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఉదర ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్గా మారితే.. యాంటీబయాటిక్స్‌కు లొంగని పరిస్థితులు 85 శాతం ఉంటున్నట్లు పేర్కొంది. శుభ్రత పాటించకపోవడంతో చేటు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటానికి ఇన్ఫెక్షన్లే ప్రధాన కారణం. ఇప్పటికీ 54 శాతం ఇళ్లల్లో శుచీ శుభ్రత పాటించడం లేదు. సబ్బుతో చేతిని కడుక్కోలేని స్థితి ఉన్న ఇళ్లు 32 శాతం ఉన్నాయి. నీటి వసతి లేని ఆసుపత్రులు ఆరు శాతం ఉన్నాయి. పారిశుధ్యం సరిగా పాటించని ఆసుపత్రులు 22 శాతం ఉన్నాయి. వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయని ఆసుపత్రులు 27 శాతం ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. వివిధ దశల్లో 90 రకాల వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించేలా, ఇన్ఫెక్షన్ రాకుండా చూసేలా ప్రపంచవ్యాప్తంగా 90 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. చాలారకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని, మొండి ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు రాకుండా నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
మంకీపాక్స్ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: మంకీపాక్స్ కేసులు వేగవంతంగా పెరుగుతన్న నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి వివక్షతకు దారితీస్తోందోనని డబ్ల్యూహెచ్ఓ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ విషయమై డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ రోసముండ్ లూయిస్ జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఈ వ్యాధికి సంబంధించిన తీవ్రమైన హాని ఏమి లేదని స్పష్టం చేశారు. ఇది స్వలింగ సంపర్కం వల్లే వచ్చిందే కానీ అందరకీ అలానే ఈ వ్యాధి సంక్రమించదని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం దాదాపు 75కు పైగా దేశాల్లో సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఐతే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మంకీపాక్స్ వ్యాధిని సరైన వ్యూహాలతో నియత్రించవచ్చు. అంతేకాదు మంకీపాక్స్ వ్యాధి ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం, అతని వస్తువులు వాడటం, లైంగికి సంబంధం పెట్టుకోవడం వంటి తదితరాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వ్యాధి గురించి ప్రజలను ఆందోళన చెందకూడదని, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. సమర్ధవంతమైన వ్యూహాలతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలమని విశ్వసిస్తున్నాని అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ వ్యాధి కారణంగా ప్రజలు సమాజంలో వివక్షతకు గురికాకుండా ఉండేలా ఈ వ్యాధి పేరు త్వరితగతిన మార్చాలని డబ్ల్యూహెచ్ఓ యోచిస్తున్నట్లు తెలిపింది. (చదవండి: మంకీపాక్స్ వద్దు.. మరో పేరు పెట్టండి! డబ్ల్యూహెచ్‌వోకు లేఖ) -
Monkeypox: మంకీపాక్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ హైలెవల్ మీటింగ్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మరునాడే సమావేశం జరగడం గమనార్హం. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీలో ఆదివారం నమోదైన కొత్త కేసుతో కలిపి దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా ఈ వ్యాధి సోకిన 34 ఏళ్ల వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర లేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తికి ప్రత్యేక శిబిరంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అంతకుముందు నమోదైన మూడు మంకీపాక్స్ కేసులు కేరళలోనే వెలుగుచుశాయి. వీరిలో ఇద్దరు యూఏఈలో పర్యటించగా.. ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా శనివారం ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. అన్ని దేశాలు అప్రమత్తమై తక్షణమే వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఈ వ్యాధిపై పోరాడాలని, వ్యాక్సిన్లు, మందుల సాయం అందించుకోవాలని పేర్కొంది. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
జలుబు లాగే కరోనా
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా కథ ముగిసింది. అది ఎండమిక్ (వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం) దశకు చేరుకుంది. ఇక నుంచి అది కేవలం సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుంది. ఒక సీజనల్ వ్యాధిగా మారిపోయింది. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఇది వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమైందని, కాబట్టి టీకా తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ కరోనా కొత్త వేరియంట్ వస్తే మాత్రం ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు. శ్రీనివాసరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేలకు పైగా క్రియాశీలక కేసులుంటే, అందులో 50 మంది వరకు మాత్రమే ఆసుపత్రుల్లో ఉన్నారన్నారు. మరణాలు సున్నా స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కరోనా, టీబీ సహా జలుబు, జ్వరం, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించాలని సూచించారు. లక్షణాలున్నవారు ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని, తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవచ్చని, కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసిందన్నారు. వర్షాలు తగ్గాక వ్యాధులు విజృంభిస్తాయి రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం పెరగడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. ‘వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు విజృంభిస్తాయి. ఇప్పటికే డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 516, కరీంనగర్లో 84, ఖమ్మంలో 82, మహబూబ్‌నగర్‌లో 54, మేడ్చల్‌లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ వ్యాప్తి చెందుతోంది. ఒక్క జూన్‌లోనే 565 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. అంతేగాక జూలైలో తొలి పది రోజుల్లోనే 222 కేసులొచ్చాయి. 2019 తర్వాత మళ్లీ 2022లో డెంగీ కేసుల్లో పెరుగుదల ఉంది. దీంతోపాటు జనవరి నుంచి ఇప్పటివరకు 203 మలేరియా కేసులూ తేలాయి’ అని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమ తెరల పంపిణీని ప్రారంభించిందన్నారు. నీళ్ల విరేచనాల కేసులు 6 వేలు నమోదయ్యాయని, జిగట విరేచనాల కేసులు ఈ నెలలో 600 నమోదయ్యాయని తెలిపారు. టైఫాయిడ్ కేసులూ భారీగా వచ్చాయన్నారు. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ తినడం వల్ల వచ్చినవేనని స్పష్టంచేశారు. అన్ని సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేలా.. కరోనా సహా అన్ని రకాల సీజనల్ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేవిధంగా ఉంటాయని, ఏమాత్రం అనుమానమున్నా పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను బట్టి వైద్యం తీసుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉండాలని, తద్వారా ఇతరులకు వ్యాపించకుండా చూడాలన్నారు. 10–20 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా రోగిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టాలని కోరారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. నీరు రంగు మారితే తప్పక కాచి చల్లార్చాకే తాగాలన్నారు. నిర్దేశిత తేదీ కంటే ముందే గర్భిణులు ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పామని, ఇప్పుడు కూడా 9154170960కు ఫిర్యాదు చేయాలని కోరారు. అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తయిందని, సీఎం ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వారందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. -
ఆశాదీపాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశావర్కర్స్కు ‘గ్లోబల్ హెల్త్లీడర్స్’ పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా వారి గురించి... కోవిడ్ సంక్షోభంలో ప్రపంచం తుఫానులో చిగురుటాకులా వణికిపోతున్న సమయంలో వారు ధైర్యంగా ముందడుగు వేశారు. కదం తొక్కుతూ, పదం పాడుతూ కదిలారు. బాటలు నడిచీ, పేటలు కడచీ, నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి అంటూ ఏటికి ఎదురీదారు. మృత్యుభయకంపిత ముఖాల్లో బతుకు ఆశ కలిగించారు... గుజరాత్‌లోని వాజీపూర్ వెయ్యికి పైగా గడపల ఊరు. ఈ ఊరికి నలభై రెండు సంవత్సరాల లక్ష్మీ వాఘేలా అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశ). ఆమె ఊరంతటికీ అమ్మలాంటిది. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిస్సంకోచంగా లక్ష్షి్మ దగ్గర చెప్పుకుంటారు. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన లక్ష్మి కోవిడ్ సమయంలో ఉదయం అయిదింటికి లేచి ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి బయలుదేరేది. ‘బయట పరిస్థితి ఏమీ బాగలేదు. ఉద్యోగం కంటే బతికి ఉండడం ముఖ్యం కదా. ఉద్యోగం వదిలెయ్’ అని చుట్టాలుపక్కాలు చాలామంది చెప్పారు. అయితే వారి మాట పట్టించుకోలేదు. ఆమె దృష్టిలో తాను చేస్తున్నది ఉద్యోగం కాదు. సమాజసేవలో భాగం కావడం. వ్యాక్సినేషన్ సమాచారానికి సంబంధించి డోర్–టు–డోర్ సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు చేయించుకోవడానికి భయపడేవారిని ఒప్పించడం, కోవిడ్ బాధితులకు నిరంతరం ధైర్యం చెప్పడం, అత్యవసర మందులను సరఫరా చేయడం... ఒకటారెండా ఊపిరి సలపనంత పని ఉండేది. అయితే ఎప్పుడూ చిరాకు పడింది లేదు. వెనక్కి తగ్గింది లేదు. ‘డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో అందరూ నన్ను అనుమానంగా చూసేవారు. ఎప్పుడూ ఆత్మీయంగా పలకరించేవాళ్లు కూడా భయపడి దూరం దూరంగా వెళ్లిపోయేవారు. ఇది చూసి నాలో నేను నవ్వుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మీ వాఘేలా. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా గ్రామాల్లో ఆశా కార్యకర్తలపై దాడులు జరిగాయి. మంచిపని కోసం వెళితే చెడు ఎదురయ్యేది. అయినా సరే భయపడుతూనో, బాధ పడుతూనో వెనక్కి వెళ్లలేదు. భయంతో వెనక దాక్కున్న వారిని ముందుకు తీసుకువచ్చారు. వారికి పరీక్షలు చేయించారు. ‘కోవిడ్ సమయంలో ఆశా వర్కర్స్ కనిపించగానే ముఖం మీదే తలుపు వేసేవారు. అలాంటి అవమానాలను మనసులోకి తీసుకోకుండా చాలా ఓపికగా బాధ్యతలు నిర్వర్తించారు. తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ప్రజలకు సేవలు చేస్తూ చనిపోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు’ అంటుంది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆశా వర్కర్స్ జనరల్ సెక్రటరీ బీవీ విజయలక్ష్మి. కేరళలోని కరింగరి గిరిజన ప్రాంతాలలోని పల్లెలపై వైద్య అధికారులు దృష్టి సారించే వారు కాదు. అయితే విచిత్ర వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 23 సంవత్సరాల విచిత్ర ఓ ఆశా వర్కర్. ప్రతి ఇంటికీ వెళ్లేది. వారి క్షేమ సమాచారాలు కనుక్కునేది. కోవిడ్ సమయంలో తాను ఆరునెలల గర్భిణి, ఇల్లు దాటి వెళ్లవద్దని ప్రతి ఒక్కరూ చెప్పారు. కొందరైతే... ‘నీకు వచ్చే కొద్దిపాటి నెల జీతం కోసం ఆశ పడితే...జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటీ’ అని విసుక్కునేవారు. ‘అన్నీ తెలిసిన వాళ్లు, బాగా చదువుకున్నవాళ్లే కోవిడ్ బారిన పడుతున్నారు. పాపం ఆ అడవి బిడ్డలలో చాలామందికి ఏమీ తెలియదు. వారిని జాగ్రత్త పరచడం, సహాయంగా ఉండడం అవసరం’ అంటూ బ్యాగ్ సర్దుకొని డ్యూటీకి బయలుదేరేది విచిత్ర. ఎన్నో గిరిజన గ్రామాలకు విచిత్ర బయటి నుంచి వచ్చిన ఉద్యోగి కాదు. తమ ఇంటిబిడ్డ. ఏ ఒక్కరోజైనా ఆమె రాకపోతే ఆందోళనగా తన గురించి ఆరా తీసేవారు. గుజరాత్‌లోని లక్ష్మీ వాఘేలా నుంచి కేరళలోని విచిత్ర వరకు ఎందరెందరో ఆశా ఉద్యమకారులు తమ వృత్తి నిబద్ధత చాటుకుంటూ జేజేలు అందుకున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశావర్కర్స్కు ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ పురస్కారాన్ని ప్రకటించింది. -
14 దేశాలు, 100కిపైగా కేసులు
వాషింగ్టన్/లండన్: యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. భారత్ కూడా ఈ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్ విస్తరిస్తున్న తీరుని పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది. లక్షణాలివే..: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?:తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా సోకుతుంది. చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. -
అంతటా పొల్యూషన్.. ఏదీ సొల్యూషన్!
పొద్దున, సాయంత్రం చల్లగాలి.. వారానికోసారి పార్కులోని చెట్ల గాలి.. ఆఫీసులు, ఇళ్లలో ఏసీ గాలి.. ఇలా ఏ గాలి అయినా ఒకటేనట. ఊరుదాటి వెళితే స్వచ్ఛమైన గాలి దొరుకుతుందన్నదీ ఉత్త మాటేనట. ఇక్కడా, అక్కడా అని కాదు.. భూమ్మీద ఉన్న 700 కోట్ల మంది జనాభాలో 99 శాతం కలుషిత గాలే పీల్చుకుంటున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. కరోనా మహమ్మారిని చూసి భయపడుతున్నాంగానీ.. అంతకంటే వేగంగా కాలుష్యం లక్షల మంది ప్రాణాలు తీస్తోందని పేర్కొంది. మరి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు, సూచనలేమిటో చూద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నాలుగేళ్లలో మరింత పెరిగి.. గాలిలో ఏయే కలుషితాలు గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో గాలి ఈ ప్రమాణాల మేరకు లేదని డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదికలో హెచ్చరించింది. అధిక ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఐదో వంతు మాత్రమే కాలుష్య పరిమితుల్లో ఉంటే.. పేద దేశాల్లో ఒక శాతం మాత్రమే తక్కువ కాలుష్యంతో ఉన్నాయని తెలిపింది. ఈ కలుషిత గాలి పీల్చడం వల్ల కోట్ల మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భూమ్మీద నాలుగేళ్ల కింద 90శాతంగా ఉన్న ఉన్న కాలుష్య ప్రభావ ప్రాంతం.. ఇప్పుడు 99 శాతానికి చేరిందని తెలిపింది. తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ కాలుష్యం వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారని, మరెంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో పర్యావరణ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా వెల్లడించారు. పెట్టుబడులు వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతున్నాయే తప్ప.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలిని అందించడం లేదని పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న కలుషితాలు మనుషులు ఏడాదిపాటు పీల్చేగాలిలో 2.5 పీఎం రేణువులు 5 గ్రాములకంటే ఎక్కువ ఉండొద్దు, 10 పీఎం రేణువులు 15 గ్రాములు దాటకూడదు. నైట్రోజన్ ఆక్సైడ్ సాంద్రత ఏడాదికి పదిగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ చాలా వరకు అధికాదాయ దేశాల్లోని నగరాలు ఈ స్థాయిలను ఎప్పుడో దాటి ప్రమాదకర స్థితికి వెళ్లిపోయాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. తక్కువ ఆదాయ దేశాల్లోని నగరాల్లో ఈ పరిస్థితి కొంత తక్కువగా ఉందని వెల్లడించింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి విషయంలో పేద, ధనిక తేడా లేదని.. అన్ని దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది. మొత్తంగా 4 వేల నగరాల్లోని 77 శాతం ప్రజలు నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి ఎక్కువున్న గాలినే పీలుస్తున్నారని వెల్లడించింది. తక్కువ స్థాయి వాయు కాలుష్య కారకాలు కూడా గణనీయమైన హానిని కలిగిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే తప్ప గాలి కాలుష్య స్థాయిని తగ్గించలేమని స్పష్టం చేసింది. ►పీఎం అంటే పర్టిక్యులేట్ మేటర్ (అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళి కణాలు). 2.5 మైక్రోమీటర్లకన్నా చిన్నవాటిని పీఎం 2.5, 10 మైక్రోమీటర్ల పరిమాణం ఉన్నవి పీఎం 10గా పేర్కొంటారు. నిర్మాణాలు జరుగుతున్న చోట, కచ్చారోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మంటలు, వివిధ రకాల పొగల నుంచి ఇవి ఏర్పడుతాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజైన్ ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, వాహనాల నుంచి ఎక్కువగా వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడొద్దు ‘ఒక మహమ్మారి నుండి బయటపడ్డామనుకుంటే... కాలుష్యాన్ని పెంచుకుంటూ, మనం నివారించగల మరణాలను కూడా కొని తచ్చుకుంటున్నాం. వాయు కాలుష్యం కారణంగా మంచి ఆరోగ్యాన్ని కోల్పోవడం ఆమోదయోగ్యం కాదు. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకత ఇప్పుడు మన ముందుంది. శిలాజ ఇంధనాలపై తక్కువ ఆధారపడే ప్రపంచం అవసరం’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ వ్యాఖ్యానించారు. 117 దేశాల్లో పరిశీలన చేసి.. డబ్ల్యూహెచ్‌వో 117 దేశాల్లోని 6 వేల నగరాల్లో కాలుష్య డేటాను పరిశీలించింది. వాహనాలు, రోడ్ ట్రాఫిక్ వల్ల ప్రమాదకరమైన నైట్రోజన్ ఆక్సైడ్ పెరిగిపోతోందంది. ప్రమాదకర దుమ్ము, ధూళి రేణువుల శాతం పెరిగిందని తెలిపింది. ఇవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతున్నాయని.. రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యలు, కేన్సర్లకు కారణమవుతున్నాయని తేల్చి చెప్పింది. దుమ్ము, ధూళికి తోడు నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో.. ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నట్లు హెచ్చరించింది. రవాణా, విద్యుత్, సాగు కోసం అధికంగా ఇంధనాన్ని కాల్చడమే కాలుష్యానికి ప్రధాన కారణమని తెలిపింది. ఇబ్బంది పడేవాళ్లెవరు..? కాలుష్యం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఇబ్బంది పడతారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అధికంగా ప్రభావితమవుతారు. ►కాలుష్యంతో తాత్కాలికంగా.. తలనొప్పి, ముక్కు, గొంతు, కళ్లు మంటలు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ►దీర్ఘకాలికంగా.. కేంద్రనాడీ వ్యవస్థపై ప్రభావంతో తలనొప్పి, యాంగ్జైటీ , గుండె సంబంధిత జబ్బుల పెరుగుదల, ఆస్తమా, కేన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు, కాలేయం, ప్లీహం, రక్త ప్రసరణపై ప్రభావం వంటివి తలెత్తుతాయి. మనమేం చేయొచ్చు ►వాహనాల వాడకాన్ని వీలైనంతగా తగ్గించడం. ►కరోనాతో సంబంధం లేకుండా మాస్క్ ధరించే అలవాటు కొనసాగించడం. ►దుమ్ము, ధూళి ఇంట్లోకి రాకుండా చూసుకోవడం. ►రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు కలుషి తాల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చేసుకోవడం. -
99 శాతం ప్రజలు పీల్చేది కలుషిత గాలే!
జెనీవా: ప్రపంచంలోని 99 శాతం జనాభా కలుషిత గాలి పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగినట్లుగా లేని గాలినే పీలుస్తున్నారని, దీన్ని నివారించాలంటే వెంటనే శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ఈ ఇంధన వాడకాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, దీనివల్ల రక్త సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలి ఏటా 70 లక్షల మరణాలు జరుగుతున్నాయని తెలిపింది. గాల్లో పీఎం 2.5, పీఎం10 అనే పర్టిక్యులేట్ మేటర్‌ను ఆధారంగా చేసుకొని వాయునాణ్యతను సంస్థ నిర్ధారిస్తుంది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలంది. -
కొత్త వేరియంట్ల ముప్పు అధికమే!
జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్‌తోనే మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన కోవిడ్–19 టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు అధికంగానే ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌లోని నాలుగు వేర్వేరు వెర్షన్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వైరస్ ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతోందని, ఉత్పర్తివర్తనాలు సంభవిస్తున్నాయని, కొత్త వేరియంట్ల పుట్టుకకు అవకాశాలు ఎన్నో రెట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. కరోనా కొత్త వేరియంట్ల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని, నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. కరోనా కేసులు 17 శాతం తగ్గాయ్ అంతకుముందు వారంతో పోలిస్తే కోవిడ్–19 పాజిటివ్ కేసులు గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కరోనా సంబంధిత మరణాలు 7 శాతం తగ్గిపోయానని తెలిపింది. అమెరికాలో పాజిటివ్ కేసులు ఏకంగా 50 శాతం పడిపోయాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే 97 శాతం ఉన్నాయని వివరించింది. మిగతా 3 శాతం కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఉనికిని గుర్తించారని స్పష్టం చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1.9 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 68,000 మంది మరణించారని తెలియజేసింది. కోవిడ్ నియంత్రణకు కొత్త కాంబో డ్రగ్! కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు ప్రయోగాత్మక ఔషధం బ్రెక్వినార్ను రెమ్‌డెసివిర్ లేదా మోల్నుపిరవిర్తో కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ పత్రికలో ప్రచురించారు. రెమ్‌డెసివిర్ లేదా మోల్నుపిరవిర్‌ను వేర్వేరుగా ఇచ్చినప్పటి కంటే బ్రెక్వినార్ కాంబినేషన్‌తో ఇస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు. అయితే, ఈ కాం బో డ్రగ్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. -
కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!
న్యూయార్క్: గత వారం ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక వారపు కేసులు ఇవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అయితే మరణాల సంఖ్య స్థిరంగా 50వేలకు పైగా కొనసాగుతున్నాయని పేర్కొన్నది. కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5 శాతం పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుదల కనిపిస్తోందని, మొత్తంగా చూస్తే పెరుగుదల రేటు మందగిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో 39శాతంతో అత్యధికంగా కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 36 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అమెరికాలలో మరణాలు పెరిగాయని, ఇతర ప్రాంతాలలో తగ్గాయని వివరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించింది. దేశాలన్నీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరింది. -
ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం
జెనివా: కరోనా ఎండమిక్ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో మాట్లాడుతూ తొమ్మిది వారాల కిందట ఒమిక్రాన్ వేరియెంట్‌ని గుర్తిస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది వైరస్ బారిన పడినట్టు తమకు నివేదికలు అందాయన్నారు. 2020 ఏడాది మొత్తంగా నమోదైన కేసుల కంటే ఇది ఎక్కువని చెప్పారు. కరోనా పరిస్థితులు దేశ దేశానికి మారిపోతున్నాయని చెప్పిన టెడ్రోస్ ఈ ఏడాది చివరి నాటికల్లా కోవిడ్–19 అత్యవసర పరిస్థితి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా కృషి చేస్తే కరోనా తుది దశకు చేరుకుంటామన్నారు. స్వల్పంగా తగ్గిన రోజువారీ కేసులు భారత్‌లో రోజు వారీ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,06,064 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 22,49,335కి యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 నమో దు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 17.03గా ఉంది. శరద్ పవార్‌కు కరోనా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కరోనా సోకింది. డాక్టర్ల సూచన ప్రకారం చికిత్స తీసుకుంటున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవార్ ట్వీట్ చేశారు. 81 సంవత్సరాల పవార్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సైతం ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానికి పవార్ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇటీవల కలిసినవారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని పవార్ సూచించారు. ఇటీవలే కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సోమవారం డిశ్చార్జయ్యారు. -
మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంగీకరించారు. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. -
ఒమిక్రాన్, డెల్టాల సునామీ.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
బెర్లిన్: ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అధనామ్ గెబ్రెయెసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్ ప్రబలుతుంటే... అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవి రెండూ కలిపి కేసుల సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పనిభారంతో బాగా అలసిపోయిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపై ఈ సునామీ మరింత ఒత్తిడిని పెంచుతుంద’ని విలేకరుల సమావేశంలో అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్‌తో ముప్పు తక్కువని ప్రాథమిక గణాంకాలు సూచించినా... అదే నిజమని అప్పుడే స్థిర అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని పేర్కొన్నారు. మరింత విశ్లేషణ జరిగాకే ఒమిక్రాన్ తీవ్రతపై పూర్తి స్పష్టతకు రావొచ్చన్నారు. అమెరికాలో ఒమిక్రాన్ ఇప్పటికే ప్రధాన వేరియెంట్‌గా మారగా... యూరప్‌లోని కొన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ బాగా ప్రబలుతోంది. ఒమిక్రాన్‌తో ముప్పు ఇప్పటికైతే తీవ్రమేనని డబ్ల్యూహెచ్‌వో తమ వారాపు నివేదికలో పేర్కొంది. డిసెంబరు 20–26 వరకు ప్రపంచవ్యాప్తంగా 49.9 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంటే రోజుకు సగటున 7.12 లక్షల కొత్త కేసులొచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 11 శాతం కేసులు పెరిగాయి. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3.56 లక్షల కేసులు రాగా, ఫ్రాన్స్‌లో ఇదివరకూ ఎప్పుడూ లేనంత ఎక్కువగా.. రికార్డు స్థాయిలో 2.08 లక్షల కేసులు నమోదయ్యాయి. యూకేలో 1.29 లక్షల కేసులు వచ్చాయి. చదవండి: (Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు) -
కోవోవ్యాక్స్, మొల్న్యుపిరావర్ అత్యవసర వాడుకకు సిఫార్సు
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టే ప్రక్రియలో సీరమ్ సంస్థ తయారీ కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించవచ్చని సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా కరోనా చికిత్సలో మొల్న్యుపిరావర్ మాత్రల ఉత్పత్తి, అత్యవసర వినియోగ అనుమతికి కూడా పచ్చజెండా ఊపింది. కోవోవ్యాక్స్పై నిపుణుల కమిటీ రెండుమార్లు పరిశీలన జరిపి చివరకు కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వాడేందుకు అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఇప్పటికే ఈ టీకా ఎమర్జన్సీ వాడుకకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. కరోనా సోకిన వయోజనుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, రిస్కు పెరిగిన సందర్భాల్లో మొల్న్యుపిరావర్ను వినియోగించవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఈ ఔషధాన్ని డా. రెడ్డీస్ సహా పలు కంపెనీ కన్సార్టియం ఉత్పత్తి చేస్తోంది. ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు దీన్ని వాడకూడదని, గర్భిణీలకు ఇవ్వకూడదని కమిటీ సిఫార్సు చేసింది. -
దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్‌వో బృందం
జోహన్నస్బర్గ్: కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియెంట్‌తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బృందం ఆ దేశానికి వెళ్లింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కి కేంద్రమైన గౌటాంగ్ ప్రావిన్స్‌లో కేసుల్ని పర్యవేక్షించడానికి డబ్ల్యూహెచ్ఒ తన బృందాన్ని పంపించింది. కరోనా బాధితులతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి పరీక్షలను అత్యధికంగా నిర్వహించడానికి ఈ బృందం దక్షిణాఫ్రికాకు వెళ్లినట్టుగా డబ్ల్యూహెచ్‌వో రీజనల్ డైరెక్టర్ ఫర్ ఆఫ్రికా డాక్టర్ సలామ్ గూయె చెప్పారు. దేశంలోని కేసుల్లో 80 శాతం దక్షిణాఫ్రికా ఎకనామిక్ హబ్ అయిన గౌంటెంగ్ ప్రావిన్స్‌లో వెలుగు చూశాయి. 10–14 ఏళ్ల వారిలో అధిక కేసులు దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియెంట్ విశ్వరూపం చూపిస్తోంది. నవంబర్ మొదట్లో రోజుకి 200 నుంచి 300 కేసులు నమోదైతే గురువారం ఒక్క రోజే దక్షిణాఫ్రికాలో 11,500 కొత్త కేసులు వెలుగులోకి రావడం ఆందోళన పుట్టిస్తోంది. ఎక్కువగా 10–14 ఏళ్ల వారికి సోకుతున్నాయి. 5ఏళ్లలోపు పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పారు. కొత్త వేరియెంట్ గురించి దక్షిణాఫ్రికా హెచ్చరించిన వారం రోజుల్లోనే 5రెట్లు ఎక్కువ కేసులు నమోదవడం దడ పుట్టిస్తోంది. శ్రీలంకలోనూ ఒమిక్రాన్.. శ్రీలంకలో తొలిసారిగా శుక్రవారం ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టు తేలిందని, అతను కుటుంబ సభ్యులతో క్వారంటైన్లో ఉన్నాడని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు అమెరికాలో ఒమిక్రాన్ వేరియెంట్ బ యటపడడంతో ప్రజలందరూ బూస్టర్ డోసుల్ని తీసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ లేకుండానే కరోనాను కట్టడి చేస్తామని బైడెన్ చెప్పారు. -
దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు..
జోహెన్నెస్‌బర్గ్/లండన్: దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నవంబర్ 24న బయటపడిన ఒమిక్రాన్ వేరియెంట్ తొమ్మిది రోజుల్లోనే భారత్‌సహా 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించారు. డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్ వ్యాపిస్తూ ఉండడం దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. నార్వేలో క్రిస్మస్ పార్టీకి వెళ్లిన వారికి ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. దీని వ్యాప్తి చాలా విస్తృతంగా ఉండడంతో వేరియెంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు ఫ్రాన్స్‌లో ఈ కొత్త వేరియెంట్ గురువారమే బయటపడింది. మరికొద్ది వారాల్లో కేసుల తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్టుగా ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణాఫ్రికా తర్వాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే కొద్ది నెలల్లో యూరప్‌లో నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా ఒమిక్రాన్ వేరియెంట్‌వే ఉంటాయని యూరోపియన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ ఈసీడీసీ అంచనా వేస్తోంది. యువతకే అధికంగా.. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్ధిష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో యువతకే అత్యధికంగా ఈ వేరియెంట్ సోకుతూ ఉందని, వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వివిధ దేశాల కఠిన నిబంధనలు ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయడంపై వివిధ దేశాలు దృష్టి సారించాయి. లాక్డౌన్, మార్కెట్లు మూసేయడం కంటే వ్యాక్సినేషన్, మాస్కులు సహా కోవిడ్–19 నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని వివిధ దేశాలు నిర్ణయించాయి. ► వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలను జర్మనీ పరిమితం చేసింది. నిత్యావసరాల దుకాణాలకు తప్పితే అలాంటి వారిని మరే ఇతర స్టోర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించబోమని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ గురువారం ప్రకటించారు. దేశంలో పరిస్థితి సీరియస్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనసరి చేయడాన్ని పార్లమెంటు పరిశీలిస్తుందని తెలిపారు. గత 24 గంటల్లో 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ► 60 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారి నెలవారీ పెన్షన్ నాలుగో వంతు కోత వేసే యోచనలో గ్రీస్ ప్రభుత్వం ఉంది.పెన్షన్‌లో నెలకు 100 యూరోల(రూ.8,471) కోత పడనుంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇంకా 17 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ప్రభుత్వం ఈ జరిమానా అస్త్రం ప్రయోగించింది. ► స్లోవేకియా మాత్రం 60 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంటే 500 యూరోలు (రూ.42,355) బోనస్‌గా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ► లాక్డౌన్లకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నెదర్లాండ్స్‌లో నిరసన ప్రదర్శనల్ని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. ► అమెరికా బూస్టర్ డోసుల్ని కూడా ఇస్తోంది. రెండు డోసులు పూర్తయినప్పటికీ కరోనా నుంచి మరింత రక్షణ కోసం బూస్టర్ డోసులు ఇస్తోంది. ► ఒమిక్రాన్ సోకిన వ్యక్తులతో ఎవరు సన్నిహితంగా మెలిగారనేది సదరు రోగుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా ఇజ్రాయెల్ తెలసుకుంటోంది. గోప్యత హక్కుకు ఇది భంగకరమని హక్కుల సంఘాలు ధ్వజమెత్తడంతో గురువారం దీన్ని ఆపివేసింది. ► 18 ఏళ్లు పైబడిన వారు ఆరునెలలకు ఒకసారి బూస్టర్ డోస్‌ను తీసుకోవడాన్ని చిలీ తప్పనసరి చేసింది. అప్పుడే పాస్ రెన్యువల్ అవుతుంది. ఈ పాస్ లేకపోతే రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లలేరు. -
దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్
లండన్/ జొహన్నెస్‌బర్గ్: అబ్బో... ఎన్నో వేరియెంట్లను చూసేశాం. అలసిపోయాం... ఇక కరోనాతో సహజీవనం మనకు అలవాటైపోయిందని ఒక రకమైన నిశ్చింతకు వచ్చాం. ఇంతలోనే దక్షిణాఫ్రికా మరో బాంబు పేల్చింది. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్ వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్ టామ్ పీకాక్ వెల్లడించారు. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్వనాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించినట్లు తెలిపారు. బి.1.1.529 ఎంతటి ప్రమాదకరం, దీని మూలంగా ఎదురయ్యే విపరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్తలు గురువారం సమావేశమయ్యారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్ఐవీ/ ఎయిడ్స్ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తూ.. దీని పరిణామక్రమాన్ని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. హాంగ్‌కాంగ్‌లోనూ ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. ► దీంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ► కె417ఎన్– కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను ఏమార్చగలదు ► ఈ484ఏ– యాంటీబాడీలకు చిక్కదు ► ఎన్440కే– యాంటీబాడీలను బొల్తా కొట్టించగలదు ► ఎన్501వై.. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది. ► ఈ వైరస్ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్లు ఉన్నాయి. ► ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ఇప్పటిదాకా వ్యాప్తిలో ఉన్న వేరియెంట్లనే (వైరస్‌పై ఉండే కొమ్ములనే) గుర్తుపట్టగలవు ► కాబట్టి ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగలదు. అక్కడి నుంచి వచ్చేవారితో జాగ్రత్త కొత్త వేరియెంట్ అనవాళ్లు బయటపడ్డ దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షించాలని, టెస్టులు ముమ్మరం చేయాలని భారత ప్రభుత్వం గురువారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రదేశాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ దేశాల మీదుగా (వయా) వస్తున్న వారినీ కఠిన పరీక్షల తర్వాతే అనుమతించాలని సూచించింది. అందరి శాంపిల్స్ తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. -
డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌గా టెడ్రోస్ ఏకగ్రీవ ఎన్నిక
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్. -
‘కరోనా’ మూలాలపై అన్వేషణ!
జెనీవా: భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలను కనుక్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి లీకయిందా? లేక సహజ సిద్ధంగానే సంక్రమించిందా? అన్న దిశగా ఇప్పటి వరకు జరిపిన విచారణ అసంపూర్తిగా ముగిసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వివిధ వైరస్ల గుట్టుని నిగ్గు తేల్చడానికి శాస్త్రవేత్తల బృందాన్ని డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసింది. ఈ బృందం కరోనా వైరస్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న వైరస్ల పుట్టుకపై అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా ఈ తరహా వైరస్ల పుట్టుకపై అధ్యయనాలు ఎలా చేయాలో సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కొన్ని మార్గదర్శకాలను సైతం రూపొందిస్తుంది. ఈ బృందంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 700 దరఖాస్తులు రాగా, అందులో 25 పేర్లను డబ్ల్యూహెచ్ఓ ఎంపిక చేసింది. బృంద సభ్యుల పేర్లతో త్వరలో తుది జాబితాను వెల్లడించనుంది. ఇదే ఆఖరి అవకాశం డబ్ల్యూహెచ్ఓ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఆరిజన్స్ ఆఫ్ నోవెల్ పాథోజెన్స్(సాగో) అని పిలిచే ఈ ప్రతిపాదిత బృందంలో ఒక భారతీయ శాస్త్రవేత్తకి సైతం చోటు లభించడం విశేషం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి గత ఏడాదే పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగఖేడ్కర్ డబ్ల్యూహెచ్ఓ బృందంలో పని చేసే అవకాశం ఉంది. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టే నిపుణుడిగా రామన్‌కు పేరుంది. ఐసీఎంఆర్‌లో పనిచేస్తూ రెండేళ్ల పాటు నిఫా వైరస్, కరోనా వైరస్‌లను ఎదుర్కోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కరోనాతో పాటు వివిధ వైరస్ల గుట్టుమట్లను తెలుసుకునేందుకు సైంటిస్టులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న డబ్ల్యూహెచ్ఓ వారిచ్చే సూచనల మేరకు నడుచుకోనుంది. కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ అధా్నమ్ ఘెబ్రాయసిస్ అన్నారు. గత బృందంలో సభ్యులుగా ఉండి, చైనాలో పర్యటించిన ఆరుగురు శాస్త్రవేత్తలకు ఈసారి కూడా చోటు కల్పించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ విచారణలో ఏమైనా రాజకీయపరమైన అవకతవకలు జరిగితే సహించేది లేదని చైనా హెచ్చరించింది. డబ్ల్యూహెచ్ఓ బృందానికి శాస్త్రీయంగా మద్దతు ఇస్తామే తప్ప రాజకీయం చేస్తే ఊరుకోబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ తేల్చి చెప్పారు. -
అక్టోబరు 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే : కరోనాకు చెక్ పెడదాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసంఅంతా కాదు. లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్న ఈ కరోనా మన దరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఒక్కటే మార్గం. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడంతోపాటు ఎల్లవేళలా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా కష్టకాలంలో పెద్ద నగరాలు, మారు మూల పల్లెల దాకా పెద్దలతో పాటు చిన్నారుల కూడా దీనిపై అవగాహన పెంచాలంటున్నారు నిపుణులు. ఫలితంగా అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అక్టోబరు 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా.. స్పెషల్ స్టోరీ. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 2021 థీమ్ : 2008 లో తొలిసారిగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరిగింది. ప్రతీ సంవత్సరం, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ "మన భవిష్యత్తు మన చేతుల్లో- కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’. జాతీయ ఆరోగ్య మిషన్ డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది పిల్లలు అతిసారం కారణంగా మరణిస్తున్నారు. హ్యాండ్ వాష్ చేయడం వల్ల డయేరియా మరణాల రేటును 40 శాతానికి పైగా తగ్గించవచ్చు: యునిసెఫ్ -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో భారత్ ఆరోగ్య రంగంలో ఎనలేని పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మసీ కేంద్రంగా అవతరించిందని అన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆది వారం ఆన్లైన్ ద్వారా ఆమె పాల్గొన్నారు. పోలియో నిర్మూలన, మాతా శిశు సంరక్షణ కోసం వేసే వ్యాక్సిన్ల ద్వారా భారత్ ఆరోగ్య రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని కొనియా డారు. అయితే కరోనా దెబ్బతో ఇతర అనారోగ్య సమస్యలకు భారత్ సహా ఇతర దేశాల్లో కూడా చికిత్స దొరకక పోవడం విచారకరమని అన్నారు. భారత్‌లో పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల లోపు చిన్నారులు అధికంగా మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ నివేదికను ప్రస్తావించిన ఆమె కరోనా ఈ దుస్థితిని మరింత తీవ్రం చేసిందని అన్నారు. కరోనా సంక్షోభంతో భారత్ సహా చాలా దేశాల్లో పేదరికం పెరిగిపోయిందని, పౌష్టికాహారం లభిం చక ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయన్నారు. -
డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు.. ఇకపై నర్సులూ..
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వైద్యంలో నర్సులకు స్థానం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మందుల చీటీ (ప్రిస్కిప్షన్) రాసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు మన దేశానికి కొన్ని సూచనలు చేస్తూ నివేదిక విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పూర్తయిన నర్సులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి వారితో మందులు ఇప్పించవచ్చని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లకు ప్రత్యేకంగా నిర్ణీత కోర్సు చేసినవారికి ప్రిస్కిప్షన్ రాసే అవకాశం కల్పించారు. ఆ రాష్ట్రంలో రూరల్ మెడికల్ అటెండర్ (ఆర్ఎంఏ) వ్యవస్థ ఉంది. వారికి కొన్ని రకాల మందులు రాసే అధికారం, వైద్యం చేసేందుకు అవకాశం కల్పిం చారు. ఎసిడిటీ మందులు, యాంటీబయోటిక్స్, టీబీ, మలేరియా, లెప్రసీ, అమీబియాసిస్, గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరస్‌కు సంబంధించిన మందులు ఇవ్వొచ్చు. వాంతులు, జ్వరాలు, నొప్పు లు, విరేచనాలు, ఆస్తమా, దగ్గు, గర్భం ఆపే మందులు, విటమిన్లు, సాధారణ ప్రసవాలు జరిగాక మందులను ఇచ్చే అవకాశం ఆర్ఎంఏలకు ఇచ్చారు. వాళ్లే కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. దెబ్బతగిలితే కుట్లు వేయడం, కాలిన గాయాలకు డ్రెసిం గ్ చేయడం, ఎముకలు విరిగితే కట్లు కట్టడం, ప్రమాదం జరిగితే రక్తస్రావం జరగకుండా చేయడం, ప్రసవాలు చేయడం, ప్రసవాల్లో చిన్నచిన్న సమస్యలు వస్తే వాటికి చికిత్స చేయడం, రక్తస్రావాలు జరిగితే ఆపడం వంటివి చేయాలి. అయితే పోస్ట్‌మార్టం, మెడికల్ లీగల్ కేసులు వంటి వాటిలో నర్సులకు అవకాశం కల్పించలేదు. ఇలా చత్తీస్ఘడ్ మాదిరిగా దేశవ్యాప్తంగా అమలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)లో మిడ్ లెవల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మందుల చీటీ ఇవ్వొచ్చని ఉంది. ఆ ప్రకారం నర్సులకు కూడా అవకాశం కల్పించాలని సూచించింది. డాక్టర్ల కొరత ఉన్నందున... కోవిడ్ వల్ల దేశంలో డాక్టర్లు ఆయా చికిత్సలపై దృష్టి సారించాల్సి వచ్చింది. పైగా భారత్‌లో డాక్టర్లు కొరత ఉంది. 11 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. తక్కువ ఉన్నందున ఆ కొరతను నర్సులతో పూడ్చవచ్చు. దేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. కాబట్టి వైద్య సిబ్బందిని వాడుకోవాలి. వైద్య పరిశోధనల్లో తేలిందేంటంటే.. ప్రాథమిక ఆరోగ్యంలో నర్సులు, వైద్యులు చేసే వైద్యంలో పెద్దగా తేడా లేదు. డాక్టర్లు, నర్సులు చేసిన చికిత్సలు సమానంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో శిక్షణ పొందిన నర్సులు వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరికొన్ని అంశాలు ►నర్సులు రోగంపై సొంతంగా నిర్ణయం తీసుకొని మందులు ఇవ్వడం లేదా డాక్టర్ పర్యవేక్షణలో ఇవ్వడం లేదా రెండు పద్ధతుల్లో ఇవ్వడం వంటివి చేయవచ్చు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఈ పరిస్థితి ఉంది. పోలండ్‌లో మాస్టర్ నర్సింగ్ కోర్సు చేసినవారికి మందులు ఇచ్చే అవకాశం కల్పించారు. డెన్మార్క్‌లో డాక్టర్ పర్యవేక్షణలో నర్సులు మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. ►భారత్‌లో దశల వారీగా కొన్ని నిర్ణీత జబ్బులకు మందులు ఇచ్చే అవకాశం కల్పించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ►ప్రస్తుతం ఇండియాలో మెడికల్ ప్రాక్టీషనర్లు మాత్రమే మందులు ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాన్ని సవరించాలి. ఆ ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ట్ యాక్ట్–1940ని సవరించాలి. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్–1947ను సవరిస్తూ, వారికి అధికారాలు కల్పించాలి. ఎన్ఎంసీ–2019 యాక్ట్‌లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ జాబితాలో నర్సులను చేర్చాలి. ►నర్సింగ్ విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి. ప్రాక్టీస్ చేయడానికి ముందు వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం మాస్టర్ నర్సింగ్‌లో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్ అనే కోర్సు ఉంది. దాని తరహాలో నర్సింగ్‌లో కోర్సు పెట్టాలి. ►కొన్ని మందులతో ప్రారంభించి వాటిని పెంచుకుంటూ పోవాలి. ప్రాథమిక వైద్యం డిగ్రీ నర్సింగ్‌లోనే కోర్సు ఉండాలి. ïజిల్లా, మెడికల్ కాలేజీల్లో పనిచేసే వారికోసం పీజీ లెవల్లో ప్రత్యేక కోర్సు ఉండాలి. -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
టీకాలకు లొంగని ఎంయూ వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
WHO Warns On MU Variant Of Covid 19 జెనీవా: కోవిడ్–19 మహమ్మారిలో ప్రమాదకరమైన కొత్త రకాలు పుట్టుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎంయూ (బి.1.621) అనే కొత్త వేరియంట్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలకు లొంగడం కష్టమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లను తట్టుకొనే శక్తి ఈ కొత్త వేరియంట్‌కు మెండుగా ఉందని తెలిపింది. బి.1.621 వేరియంట్ కరోనాను తొలుత ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో గుర్తించారు. అనంతరం యూరప్‌తోపాటు అమెరికా, యూకే, హాంకాంగ్‌లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తాజాగా తమ వీక్లీ బులెటిన్‌లో వెల్లడించింది. (చదవండి: న్యూయార్క్‌లో తుపాను బీభత్సం) ఇప్పటిదాకా 39 దేశాల్లో ఎంయూ రకం కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొంది. ఎంయూ అనేది నిశితంగా గమనించిదగ్గ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్) వేరియంట్ అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎంయూ వేరియంట్ కేసులు 0.1 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. కొలంబియా, ఈక్వెడార్‌లో మాత్రం దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఎంయూ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్ఓ ఆగస్టు 30న వాచ్‌లిస్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన బీటా వేరియంట్ తరహాలోనే ఎంయూ వేరియంట్ సైతం మనుషుల్లో రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటున్నట్లు తమ ప్రాథమిక అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. (చదవండి: కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్న టీఎస్ఆర్టీసీ..!) -
పాఠశాలలు ప్రారంభించాల్సిందే: డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్
జెనీవా: కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రపంచ దేశాలన్నీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం పరోక్షంగా విద్యారంగంపై తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. కోవిడ్–19 ఉందని పిల్లల్ని నాలుగ్గోడల మధ్య ఉంచితే దీర్ఘకాలంలో వారిలో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నిబంధనలన్నీ పాటిస్తూ, సకల జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను పునఃప్రారంభించడమే మంచిదన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది అందరికీ వ్యాక్సిన్లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇండోర్ సమావేశాలకి దూరంగా ఉండాలని సూచిస్తూ సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేశారు. భారత్‌లో కోట్ల మంది పిల్లలు హఠాత్తుగా స్కూలుకి వెళ్లడం మానేశారని, దీంతో వారి చదువు బాగా దెబ్బతిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై మూడో వేవ్ ప్రభావం చూపిస్తుందని అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ఆరునెలలు జాగ్రత్తలు పాటించాలి ‘నాకు తెలుసు అందరూ అలిసిపోయారు. ప్రతీ ఒక్కరూ బంధుమిత్రుల్ని కలుసుకోవాలని, విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాస్త ఓపిక వహించాలి. మరో ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి వ్యాక్సినేషన్ ఎక్కువ మందికి ఇవ్వడం పూర్తయితే నెమ్మదిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి’ అని అన్నారు. -
కోవాగ్జిన్‌పై ఆరు వారాల్లో నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)లో ఏదైనా కొత్త టీకాను చేర్చాలంటే అది నిర్దేశిత పనితీరు స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం మూడు నుంచి నాలుగు ట్రయల్స్‌కు చెందిన వివరాలను డబ్ల్యూహెచ్ఓకు అందించాలని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓలోని నిపుణుల సలహా బృందం ఆయా సమాచారాన్ని విశ్లేషించి అనుమతుల జారీపై తమ సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. కోవాగ్జిన్‌కు చెందిన సమాచారం ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు చేరిందని అని తెలిపారు. నెలన్నరలోగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైజర్/బయోఎన్‌టెక్, ఆస్ట్రాజెనెకా–ఎస్కే బయో/ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సెన్, మోడెర్నా, సినోఫార్మ్ టీకాలను డబ్ల్యూహెచ్‌వో తమ ఈయూఎల్ జాబితాలో ఇప్పటికే చేర్చింది. మరో 105 వ్యాక్సిన్లు కూడా వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని వెల్లడించారు. అందులో 27 వ్యాక్సిన్లు మూడు/నాలుగు ట్రయల్స్‌ను దాటాయని పేర్కొన్నారు. మరో 184 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇటీవల డెల్టా వేరియంట్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. -
డెల్టా ఉంది.. ల్యామ్డా వచ్చేసింది?
కొత్తా దేవుడండి.. కొంగొత్తా దేవుడండి... అప్పుడెప్పుడో వచ్చిన తెలుగు సినిమా పాట పల్లవిది! ఇప్పుడు తరచూ దీన్ని మార్చి పాడుకోవాల్సిన పరిస్థితి! ఎందుకంటారా? ఏముందీ.. ఇంకో కొత్త కరోనా రూపాంతరితం అవతరించిందట! ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్‌లు ఎక్కడికీ పోలేదు కానీ... పాతికకుపైగా దేశాల్లో ఇప్పుడు ల్యామ్డా కలకలం మొదలైంది! కంగారేమీ లేదు లెండి.. ప్రస్తుతానికి దీంతో ముప్పు తక్కువే. దేశంలో రెండో దశ కరోనాలో విధ్వంసం సృష్టించిన డెల్టా రూపాంతరితం ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తూంటే.. కొన్ని దేశాల్లో ల్యామ్డా ఆందోళన రేకెత్తిస్తోంది. నిజానికి ఇది కొత్తగా కనుక్కున్న రూపాంతరితం ఏమీ కాదు. గత ఏడాది ఆగస్టులోనే దక్షిణ అమెరికా దేశమైన పెరూలో దీన్ని గుర్తించారు. ఆ తరువాత అది సుమారు 30 దేశాలకు విస్తరిం చింది కూడా. కానీ ఇప్పటివరకూ భారత్‌లో ఈ కొత్త రూపాంతరిత వైరస్ సోకిన వారు ఎవరూ లేరు. గత నెల 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించింది. అప్పటివరకూ దీనికున్న సాంకేతిక నామం సి.37. కరోనా వచ్చిన తరువాత గుర్తించిన ఏడవ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇది. మనకేమైనా ప్రమాదమా? భారత్‌తోపాటు, మన ఇరుగుపొరగు దేశాల్లోనూ ఇప్పటివరకూ ల్యామ్డా రూపాంతరితాన్ని గుర్తించలేదు. ఆసియా మొత్తమ్మీద ఒక్క ఇజ్రాయెల్‌లోనే దీన్ని గుర్తించారు. అయితే యూరోపియన్ దేశాలు కొన్నింటిలో ఈ వైరస్ ఉన్న కారణంగా, ఆ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో ల్యామ్డాపై కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్లు వేసుకున్న వారికీ ఈ వైరస్ సోకే అవకాశం ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయమే. మూక నిరోధకతకు దగ్గరగా ఉన్న యూరోపియన్ దేశాల్లో కూడా మళ్లీ మళ్లీ కేసులు ఎక్కువ అవుతూండటం గమనించాల్సిన అంశం. లక్షణాలేమిటి? ల్యామ్డాను ఇప్పటివరకూ 30 దేశాల్లో గుర్తించారు. డెల్టా రూపాంతరితం మాదిరిగానే వేగంగా వ్యాపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని రూఢీ చేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ అధ్యయనాలు జరుగుతున్నాయి. పెరూతోపాటు దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో నమోదైన కేసుల్లో ల్యామ్డావే ఎక్కువ. ఒక దశలో పెరూలో నమోదైన కేసుల్లో 80 శాతం ఈ రూపాంతరితానివే కావడం గమనార్హం. ఇటీవలే యునైటెడ్ కింగ్డమ్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ఆరుగురికి ఈ వైరస్ సోకింది. ఫ్రాన్స్, జర్మ నీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాలతోపాటు ఆస్ట్రేలియాలోనూ దీని ఉనికిని గుర్తించారు. జన్యుమార్పులేమిటి? వైరస్ పరిణామ క్రమంలో మ్యుటేషన్లు (జన్యుమార్పులు) సహజం. అయితే ఈ మ్యుటేషన్లు అన్నీ ప్రమాదకరం కాదు. ల్యామ్డా విషయానికి వస్తే దీని కొమ్ము ప్రొటీన్‌లో ఏడు ముఖ్యమైన జన్యుమార్పులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టాలో ఈ సంఖ్య మూడు మాత్రమే. కొమ్ము ప్రొటీన్‌లో కీలకమైన మార్పులు జరిగాయి కాబట్టి ఈ వైరస్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, యాంటీబాడీలను (సహజంగా పుట్టేవైనా.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యేవైనా) నిరోధించగలదని కొంతమంది అంచనా వేస్తున్నారు. చిలీలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ల్యామ్డా రూపాంతరితం యూకే, బ్రెజిల్‌లలో ముందుగా గుర్తించిన ఆల్ఫా కంటే ఎక్కువ నిరోధకత (యాంటీబాడీలకు) కలిగి ఉన్నట్లు తెలిసింది. చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్కు ల్యామ్డా స్పందించడం లేదని కూడా స్పష్టమైంది. అయితే పూర్తిస్థాయి అంచనాకు వచ్చేందుకు మరింత విస్తృత స్థాయిలో ఈ రూపాంతరితం తాలూకూ జన్యుక్రమాలను నమోదు చేసి పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా వేరియంట్లపై ‘డెల్టా’దే ఆధిపత్యం
ఐరాస/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో కోవిడ్–19 వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలియజేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ వేరియంట్ రాబోయే రోజుల్లో ఆధిపత్య (డామినెంట్) వేరియంట్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2021 జూన్ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయని తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని పేర్కొంది. కరోనా వేరియంట్లను గుర్తించేందుకు అవసరమైన సీక్వెన్సింగ్ కెపాసిటీ చాలా దేశాల్లో పరిమితంగానే ఉందని వివరించింది. డెల్టా రకం కరోనా వల్ల పాజిటివ్ కేసులతోపాటు ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య పెరుగుతోందని వివరించింది. డెల్టా వ్యాప్తి తీరును గమనిస్తే ఇది రాబోయే కొన్ని నెలల్లో ఇతర అన్ని కరోనా వేరియంట్లను అధిగమించే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ విషయంలో ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలు, అమలు చేస్తున్న చర్యలు డెల్టాతో సహా ఆందోళనకరమైన వేరియంట్ల(వీఓసీ) నియంత్రణకు సైతం చక్కగా ఉపయోగపడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్ల డించింది. ఆందోళనకరమైన వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోందంటే అర్థం నియంత్రణ చర్యలను దీర్ఘకాలం కొనసాగించడమేనని తేల్చిచెప్పింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించింది. నియంత్రణ చర్యలను గాలికొదిలేయడం వల్లే.. ఇప్పటివరకు గుర్తించిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రెయెసుస్ గతవారమే ప్రకటించారు. కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో ఇది అమిత వేగంతో వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ పరిణామం పట్ల ప్రపంచ దేశాలతోపాటు తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాలను కరోనా ఆంక్షలను సడలించాయని, నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, దీనివల్లే ప్రమాదకర వేరియంట్లు పంజా విసురుతున్నాయని పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం.. అల్ఫా వేరియంట్ కేసులు 172 దేశాల్లో బయటపడ్డాయి. బీటా వేరియంట్ ఉనికి 120 దేశాల్లో వెలుగు చూసింది. ఇక గామా వేరియంట్ 72 దేశాల్లో, డెల్టా వేరియంట్ 96 దేశాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. -
పారదర్శకంగా రాష్ట్రాలకు టీకా పంపిణీ
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కోవిడ్–19 టీకా కేటాయింపులో వివక్ష కొనసాగుతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. జనాభా, కేసుల తీవ్రత, వినియోగ సామర్థ్యం, వృథా వంటి అంశాల ప్రాతిపదిక రాష్ట్రాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వివరించింది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ పారదర్శకంగా లేదంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారాలని తెలిపింది. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న మేలైన విధానాలు, శాస్త్రీయంగా, వివిధ అధ్యయనాల ఆధారంగా రూపుదిద్దుకుందని ఆరోగ్యశాఖ వివరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో ఈ కార్యక్రమం సమర్థనీయంగా, ప్రభావవంతంగా అమలవుతోందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ.. సరఫరా చేసిన, వినియోగించిన, నిల్వ ఉన్న టీకా డోసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నట్లు తెలిపింది. చదవండి: వచ్చే 10–12 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్–3లో ఉండాలి -
బాల భారతం.. బలహీనం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. ఫలితంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. బాల భారతం బలహీనంగా మారుతోంది. దేశంలో గత ఏడాది నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనే ఉన్నారని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 3,98,359 మంది, బిహార్‌లో 2,79,427 మంది బాధిత బాలలు ఉన్నారు. లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేకపోవడం గమనార్హం. అనారోగ్య ముప్పు అధికం ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘దేశంలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగ సమస్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలయ్యింది. ఫలితంగా ఆకలి రక్కసి కాటేస్తోంది. ఆకలి ఉన్నచోట పోషకాహార సమస్య కచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి’’అని హెచ్ఏక్యూ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఇనాక్షీ గంగూలీ సూచించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. 2020 నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్లో 45,749, ఛత్తీస్‌గఢ్‌లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్‌లో 12,059, ఆంధ్రప్రదేశ్‌లో 11,210, తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్‌లో 5,732 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడీ కేంద్రాలదే కీలక బాధ్యత అని ఇనాక్షీ గంగూలీ చెప్పారు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. -
విదేశీ టీకాలకు నో ట్రయల్స్!
న్యూఢిల్లీ: కోవిడ్–19పై అత్యధిక సామర్థ్యంతో పని చేస్తున్న ఫైజర్, మోడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు భారత్‌కు రావడానికి గల అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. భారత్‌లో అందరికీ కోవిడ్–19 వ్యాక్సిన్ ఇవ్వాలంటే విదేశాల్లోని వివిధ కంపెనీలకు చెందిన టీకాలకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన టీకాలు, అమెరికా, యూరోపినయన్ యూనియన్, యూకే, జపాన్లలో లక్షలాది మందిలో విజయవంతంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్న కోవిడ్–19 టీకాలను తిరిగి భారత్‌లో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆప్ ఇండియా (డీసీజీఐ) వెల్లడించింది. అయితే భారత్ దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లకు ఆయా దేశాల నేషనల్ కంట్రోల్ లేబొరేటరీల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలని డీజీసీఐ చీఫ్ వి.జి. సోమాని పేర్కొన్నారు. నష్టపరిహారంలోనూ సానుకూలంగా కేంద్రం మరోవైపు టీకాల వినియోగం తర్వాత నష్టపరిహారానికి సంబంధించిన కేసులన్నీ భారత ప్రభుత్వమే చూసుకోవాలని ఫైజర్, మోడెర్నా కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో టీకాలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఆ టీకాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు ఏమైనా ఉంటే తాము బాధ్యత వహించలేమని, న్యాయపరమైన అంశాలపై కూడా భారత్ ప్రభుత్వమే చూసుకోవాలని టీకా అభివృద్ధి కంపెనీలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 25కి పైగా దేశాలు ఇలాంటి షరతులకు అంగీకరించే టీకాలను దిగుమతి చేసుకున్నాయి. భారత్‌కు కూడా దీనికి అంగీకరిస్తే ఫైజర్, మోడెర్నా సహా విదేశీ టీకాలెన్నో భారత్‌కు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఫైజర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి 5 కోట్ల డోసులను అందిస్తామని చెబుతోంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి మాత్రమే తాము భారత్‌కు టీకాలు ఇవ్వగలమని మోడెర్నా స్పష్టం చేసింది. -
సినోవాక్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర అనుమతి
బీజింగ్/జెనీవా: చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్ తయారుచేసిన సినోవాక్ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం అత్యవసర అనుమతులిచ్చింది. చైనా నుంచి ఇప్పటికే సైనోఫార్మ్ వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. సినోవాక్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నందునే అనుమతులు ఇచ్చినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్ల లోటు ఏర్పడిన తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లు ఉండటం అత్యవసరమని డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య ఉత్పత్తుల అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మరియాంజెలా సిమానో తెలిపారు. కోవ్యాక్స్ ఫెసిలిటీ ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లను అందించాల్సిందిగా వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలను ఆమె కోరారు. ప్రపంచంలోని పేద దేశాలకు కోవ్యాక్స్ ద్వారా ఉచిత వ్యాక్సిన్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. మే 7న చైనాకు చెందిన సైనోఫార్మ్ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: వైరల్: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు) -
Corona: ‘ఇండియన్ వేరియంట్’ కంటెట్ తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ ఆంక్షలను పొడగిస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌కు సంబంధించి ‘ఇండియన్ వేరియంట్’ అని సూచించే ఎటువంటి సమాచారమైనా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని శుక్రవారం కేంద్ర సమాచార సాంకేతిక (ఐటి) మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా సంస్థలకు లేఖ రాసింది. ఇక B.1.617 అనేది ‘ఇండియన్ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వేరియంట్‌ను కేవలం B.1.617గా డబ్ల్యూహెచ్ఓ వర్గీకరించిందని పేర్కొంది. ‘ఇండియన్ వేరియంట్’ అని ప్రస్తావించడం అసత్యాన్ని వ్యాప్తి చేయడం వంటిదేనని తెలిపింది. ఇది దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి వాటి వ్యాప్తి చేస్తే నోటీసులు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాయిటర్స్ వార్త సంస్థను సూచించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లను వైద్యులు, ఆరోగ్య నిపుణులు సాధారణంగా గుర్తిస్తారు. ఇందులో భాగమే దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో గుర్తించిన కరోనా వేరియంట్స్ అని స్పష్టం చేసింది. అయితే చాలా మీడియా సంస్థలు ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ B.1.617ను ‘ఇండియన్ వేరియంట్’ అంటూ కథనాలను ప్రచురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర సమాచార సాంకేతిక (ఐటి) మంత్రిత్వ శాఖ ఆదేశాలపై ఓ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ.. ‘ఇండియన్ వేరియంట్’ పదాన్ని ఉపయోగించిన సమాచారాన్ని తీసివేయడం చాలా కష్టమని తెలిపారు. ఇటువంటి చర్య కీవర్డ్ ఆధారిత సెన్సార్‌షిప్‌కు దారి తీస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ముదురుతున్న టూల్‌కిట్ వివాదం) -
WHO: మరింత ప్రమాదకరంగా ఈ ఏడాది
జెనివా: కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. రోజుకు లక్షల కొద్ది కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక మహమ్మారి గురించి హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ మహమ్మారి వల్ల గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత ఘోరంగా ఉండనుంది అని హెచ్చరించింది. ఒలింపిక్స్ రద్దు చేయాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లో అత్యవసర పరిస్థితిని పొడిగించిన సమయంలోనే డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. "మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం మొదటిదానికంటే చాలా ప్రమాదకరంగా ఉండనుంది. మేం పరిస్థితులు సమీక్షిస్తున్నాం" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. 2019 చివరిలో వైరస్ మొదటిసారిగా వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 33,46,813 మంది మరణించినట్లు అధికారిక డాటా వెల్లడిస్తుంది. ఒలింపిక్స్‌కు రద్దుకు పెరుగుతున్న డిమాండ్ ఇక టోక్యో ఒలింపిక్స్‌కు వేదికగా నిలిచిన జపాన్‌లో కోవిడ్ విరుచుకుపడుతోంది. పోటీల నిర్వహణకు పది వారాల సమయం మాత్రమే ఉండగా తాజాగా దేశంలో మరో మూడు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే 3,50,000 మంది సంతకాలు చేసిన పిటిషన్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే టోక్యోలో ఎమర్జెన్సీ విధించగా. ఒలింపిక్ మారథాన్‌కు ఆతిథ్యమిచ్చే హిరోషిమా, ఓకాయామా ఉత్తర హక్కైడోలో తాజాగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక దేశంలో ఫోర్త్ వేవ్ ప్రవేశిస్తే.. అది వైద్య రంగాన్ని అతలాకుతలం చేస్తుందని.. ఇలాంటి వేళ ఒలింపిక్స్ నిర్వహించడం శ్రేయస్కరం కాదని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: తప్పుడు నిర్ణయాల వల్లే ఈ సంక్షోభం Tokyo Olympics: ‘రాజకీయాలతో చంపేస్తారా’ -
తప్పుడు నిర్ణయాల వల్లే ఈ సంక్షోభం
జెనీవా: విషయంలో వరుసగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ దారుణ సంక్షోభ పరిస్థితి నెలకొన్నదని కోవిడ్ 19పై అధ్యయనం చేసిన ఒక స్వతంత్ర కమిటీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో పాటు దాదాపు 33 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి ఈ తప్పుడు నిర్ణయాలే కారణమని ‘ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండెమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ (ఐపీపీపీఆర్)’ అభిప్రాయపడింది. సరైన సమయంలో స్పందించి తగు నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ ఉత్పాతాన్ని అడ్డుకోగలిగి ఉండేవారమని పేర్కొంది. వైరస్ విజృంభణకు సంబంధించి నిపుణుల హెచ్చరికలను పట్టించుకోలేదని విమర్శించింది. ప్రజా రక్షణలో వ్యవస్థలు విఫలమయ్యాయని, సైన్స్‌ను విశ్వసించని నాయకుల వల్ల ఆరోగ్య వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బుధవారం విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొంది. చైనాలో ఈ వైరస్‌ను గుర్తించిన వెంటనే ప్రపంచదేశాలు స్పందించకుండా, విలువైన కాలాన్ని వృథా చేశాయని విమర్శించింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత సంపన్న దేశాలు.. అత్యంత పేద దేశాలకు ముందుగా కనీసం వంద కోట్ల టీకా డోసులు విరాళంగా అందించాలని సూచించింది. అలాగే, ఇలాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న సంస్థలకు సాయం అందించాలని సంపన్న దేశాలకు విజ్ఞప్తి చేసింది. సమర్థ హెచ్చరిక వ్యవస్థ అవసరం కరోనా మహమ్మారిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గత సంవత్సరం మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు అభ్యర్థించడంతో ‘ఐపీపీపీఆర్’ ఈ నివేదికను రూపొందించింది. ఈ కమిటీకి న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ ప్రెసిడెంట్ ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ సంయుక్తంగా నేతృత్వం వహించారు. ఎలెన్ జాన్సన్‌కు 2011లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ‘కోవిడ్ 19– మేక్ ఇట్ ద లాస్ట్ ప్యాండెమిక్’ అనే పేరుతో ఈ నివేదికను రూపొందించారు. ఇలాంటి మరో మహమ్మారి రాకుండా ఉండాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ ఉండాలని ఈ కమిటీ సూచించింది. ‘వరుస వైఫల్యాలతో పాటు సంసిద్ధతలో, స్పందించడంలో అనవసర జాప్యాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సరిగ్గా స్పందించి ఉంటే ఈ పరిస్థితిని అడ్డుకుని ఉండేవాళ్లం’ అని ఎలెన్ జాన్సన్ పేర్కొన్నారు. ‘వ్యూహాత్మకంగా అసమర్థ నిర్ణయాలు, సమన్వయంలో లోపాలు, ఉదాసీనత, సత్వరమే స్పందించకపోవడం.. ఇవన్నీ కలిసి ఈ దారుణమైన సంక్షోభానికి కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. ఈ మహమ్మారిపై ప్రపంచ దేశాలన్నీ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాయని విమర్శించింది. ఈ సంక్షోభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం కూడా ఉందని పేర్కొంది. గత సంవత్సరం జనవరి 22వ తేదీననే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే బావుండేదని నివేదికలో పేర్కొంది. ఆ తరువాత, మరింత ఆలస్యంగా మార్చి నెలలో దీనిని మహమ్మారి(ప్యాండెమిక్)గా నిర్ధారించారని పేర్కొంది. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంలో చైనా ఆలస్యం చేసిందని, ఆ తరువాత తక్షణమే స్పందించడంలో ఇతర దేశాలు విఫలమయ్యాయని వివరించింది. ప్రస్తుతం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంపన్న దేశాలు కోవాక్స్ కార్యక్రమం కింద పేద దేశాలకు సెప్టెంబర్ 1లోపు వంద కోట్ల టీకా డోసులు, 2022 జూన్‌లోపు మరో వంద కోట్ల డోసులు అందించాలని సూచించింది. వ్యాక్సిన్ కోసం అవసరమైన 19 బిలియన్ డాలర్లలో 60 శాతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జీ 7 దేశాలు చెల్లించాలని సూచించింది. మిగిలిన జీ 20 దేశాలు మిగతా 40% భరించాలని కోరింది. టీకాలకు సంబంధించి లైసెన్సింగ్, టెక్నాలజీ బదిలీపై ప్రపంచదేశాలు ఒక అంగీకారానికి రావాలని పేర్కొంది. భవిష్యత్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాధినేతలు సభ్యులుగా గ్లోబల్ హెల్త్ థ్రెట్స్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయాలని సూచించింది. డబ్ల్యూహెచ్‌వోకు మరిన్ని అధికారాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు మరిన్ని అధికారాలు ఉండాలని నివేదిక పేర్కొంది. ప్రపంచదేశాల్లో ఇలాంటి వ్యాధుల గురించి అధ్యయనం జరిపేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేని హక్కు డబ్ల్యూహెచ్ఓకు ఉండాలంది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌గా ఎన్నికయ్యే వ్యక్తికి ఏడేళ్ల కాలపరిమితిలో ఒకేసారి అవకాశం కల్పించాలంది. మరోవైపు, ఈ నివేదికను పలువురు నిపుణులు విమర్శించారు. ఈ సంక్షోభానికి చైనా, డబ్ల్యూహెచ్‌వోలదే బాధ్యత అని నివేదిక స్పష్టం చేయలేదన్నారు. -
WHO Health Policy: ఉప్పుతో ముప్పు తప్పదు!
సాక్షి, అమరావతి: ఉప్పు లేని పప్పేమిటని మనం అంటుంటే ఉప్పు తింటే కొంపకు తిప్పలేనని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా ఆరోగ్య విధానపత్రంలో స్పష్టం చేసింది. మోతాదుకు మించి ఉప్పు తింటే గుండెజబ్బులు, ఊబకాయం, లివర్, మూత్రపిండాల వ్యాధులొస్తాయని ప్రకటించింది. పలు దేశాల్లో ప్రయోగాల అనంతరం ఈ విషయాన్ని పేర్కొంది. ప్యాక్డ్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువే.. అనేక సంపన్న దేశాలతో పాటు అల్పాదాయ దేశాల్లోనూ ఆహారంలో సోడియం బెడద ఉంది. బ్రెడ్, చిప్స్, తృణ ధాన్యాలతో తయారు చేసే ప్యాక్డ్ ఆహార పదార్ధాలు, ప్యాకింగ్ రూపంలో ఉండే మాంసం, జున్ను సహా పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు ఎక్కువగా వస్తోంది. ఉప్పుకు మరోపేరే సోడియం క్లోరైడ్.. ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్. శరీరంలోని నీటి పరిమాణాన్ని సోడియం నియంత్రించే ఖనిజం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక సోడియం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ట్రిక్ కాన్సర్, లివర్ సిరోసిన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రజలకు అవగాహన కలిగించాలి.. ఉప్పు ముప్పును తగ్గించేలా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రజలు రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియంతో సమానం) తినాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది. 2025 నాటికి 30 శాతం ఉప్పును తగ్గించాలన్నది 2013లో ప్రపంచ దేశాలు పెట్టుకున్న లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన దిశలో ప్రస్తుత ప్రపంచం లేనట్టుగా ఉందని ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. షుగర్ వ్యాధి, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులతో బాధ పడే వారే మన రాష్ట్రంలో ఎక్కువ. మనకు తెలియకుండానే మన పిల్లలకు చిప్స్, బ్రెడ్స్, కేకుల రూపంలో సోడియంను వంట్లోకి పంపిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతోనైనా ప్రజలు అప్రమత్తం కావాలి. మనం తినే అన్నం, కూరలలో కూడా ఎంతో ఉప్పు ఉంటుంది. అది సరిపోతుందని గమనించాలి. – డాక్టర్ విజయసారథి -
పాజిటివ్ అయితే వ్యాక్సిన్‌కు తొందర వద్దు
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ అయిన వారు వ్యాక్సిన్ కోసం తొందర పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. చాలామంది కరోనా పాజిటివ్ అయ్యాక కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. మరికొంతమంది తొలి డోసు వ్యాక్సిన్ తర్వాత పాజిటివ్ అయ్యారు. వీళ్లు కూడా రెండో డోసు వేయించుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. పాజిటివ్ నుంచి కోలుకున్నాక కనీసం 8 వారాల వరకూ వ్యాక్సిన్ అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకోగానే శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయి ఉంటాయని, ఈ దశలో కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదని, మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. సీడీసీఏ, డబ్ల్యూహెచ్‌వోలో 90 రోజులు చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలా అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. కానీ అమెరికాలోని సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ సంస్థ (సీడీసీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకూ వ్యాక్సిన్ అవసరం లేదని, ఆ తర్వాత వేయించుకోవాలని సూచించాయి. యాంటీబాడీస్ ఉంటాయి కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్నామంటేనే మనలో యాంటీబాడీస్ ఉన్నట్టు లెక్క. మూడు మాసాలు మళ్లీ కరోనా వచ్చే అవకాశం తక్కువే. ఆ తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది. కరోనా నుంచి కోలుకోగానే వ్యాక్సిన్ అవసరం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలి. –డా.చైతన్య, హృద్రోగ నిపుణులు, విజయవాడ -
కోవిడ్ ఇంకా ముగియలేదు..
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో ఇప్పటివరకూ 780 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కోవిడ్ కథ ముగియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసుస్ హెచ్చరించారు. మహమ్మారిని జయించేందుకు ఇంకా చాలా కాలం పడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సరైన చర్యల ద్వారా కోవిడ్‌ను కట్టడి చేయవచ్చని గత కొంత కాలంగా నిరూపితమైందని చెప్పారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ఉన్న శక్తిమంతమైన ఆయుధం వ్యాక్సిన్ ఒక్కటే కాదన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, వైరస్ సోకిన వారిని ట్రాక్ చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం ద్వారా కూడా కరోనాను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరిలో దాదాపు 6 వరుస వారాల పాటు కరోనా కేసులు తగ్గాయని, అనంతరం ఇప్పుడు ఏడు వరుస వారాల పాటు కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అంతేగాక గత నాలుగు వారాల నుంచి మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించారు. ఆసియా, మధ్యాసియాలోని పలు ప్రాంతాల్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. కోవిడ్ కేవలం పెద్దవారిని మాత్రమే కాదని, యువతీయువకులను సైతం అది కబళిస్తోందని తెలిపారు. దాన్ని కేవలం జలుబు అని కొట్టిపారేయవద్దని హెచ్చరించారు. వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడం, సరైన కరోనా నిబంధనలను పాటించడం ద్వారా కొద్ది నెలల్లోనే మహమ్మారి నుంచి బయటపడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
జంతువుల నుంచే కరోనా!
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చిందన్న వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), చైనా పరిశోధకుల ఉమ్మడి బృందం కొట్టిపారేసింది. ల్యాబ్ నుంచి లీకేజీకి అవకాశం లేదంది. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు మరో జంతువు ద్వారా సోకి ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపింది. కోవిడ్ తొలిసారిగా బయటపడిన చైనా నగరం వూహాన్‌ను జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ పరిశోధకుల బృందం సందర్శించి తయారుచేసిన ముసాయిదా నివేదిక మంగళవారం విడుదల కానుండగా ఆ ప్రతి ముందుగానే తమకు లభ్యమైందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. వైరస్ మొట్టమొదటగా ఎక్కడి నుంచి వచ్చిందనే కీలక విషయంతోపాటు పలు ప్రశ్నలకు నిపుణుల బృందం సమాధానాలను చూపలేకపోయింది. మున్ముందు సంభవించే ఇలాంటి మహమ్మారులను నివారించేందుకు ఈ నివేదికలోని వివరాలు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. వైరస్ మొదటగా ఎలా వ్యాపించిందన్న విషయంలో డబ్ల్యూహెచ్‌వో– చైనా నిపుణులు తయారు చేసిన ఈ ముసాయిదా నాలుగు అంశాలను ప్రస్తావించింది. అందులో మొదటిది.. గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషులకు సోకింది. ఇలా జరగటానికి చాలా అవకాశాలున్నాయి. ఒక వేళ గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు సోకిన పక్షంలో ‘కోల్డ్–చైన్’ఆహారోత్పత్తుల ద్వారా వ్యాపించడం సాధ్యం. కానీ ఇలా జరిగేందుకు అవకాశాలు లేవు. గబ్బిలాలను ఆశ్రయించి ఉండే కరోనా వైరస్లు, కోవిడ్‌కు కారణమైన సార్స్–కోవ్–2కు దగ్గరి సంబంధం ఉంది. అయితే, వీటి మధ్య అంతరం ఉంది. పంగోలిన్లలో ఉండే వైరస్‌కు, కరోనా వైరస్‌తో అత్యంత దగ్గర సంబంధం ఉంది. మింక్‌లు, పిల్లుల్లో వైరస్లు కోవిడ్ వైరస్ రకానికి అత్యంత సమీపంగా ఉంటాయి. ఇవి కూడా ఈ వైరస్ వాహకాలే’అని పేర్కొంది. చైనాలోని హువానన్ మార్కెట్లో మొదటిసారిగా వైరస్ కేసులు బయటపడటంపై ఈ నివేదిక ప్రస్తావిస్తూ..ఇతర ప్రాంతాల్లో మొదలై అక్కడికి వ్యాపించి ఉంటుందని వివరించింది. ఈ మార్కెట్లో భారీ సంఖ్యలో ఎలుకలు, దుప్పులు, మొసళ్లు వంటి రకరకాల జీవుల విక్రయాలు జరిగిన విషయం ప్రస్తావిస్తూ...వీటి ద్వారానే వూహాన్‌కు కొత్త వైరస్ వచ్చి ఉంటుందని అంచనా వేసింది. డిసెంబర్ 2019లో వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచే మొదటిసారిగా కోవిడ్ మొదలయిందా అనే విషయమై ఈ నివేదిక ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చైనా నగరం వూహాన్‌లోని ఓ ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రబలేందుకు కారణమైందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తదితరులు∙విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల పరిశోధకులు వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకేజీకి అవకాశాలున్నాయన్న వాదనలను బలపరిచారు. ఈ నివేదిక విడుదల పలుమార్లు వాయిదా పడటంతో చైనా అందులో తన అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేసిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఈ నివేదిక తయారీపై మాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ నివేదిక రూపకల్పనలో చైనా ప్రభుత్వ ప్రమేయం ఉంది’అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. డబ్ల్యూహెచ్‌వో బృందానికి బంధనాలు? వైరస్ మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్‌వో బృందానికి చైనా ప్రభుత్వం పలు పరిమితులు విధించింది. విచారణకు కీలకమైన పత్రాలేవీ వారికి అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపణలున్నాయి. వూహాన్‌లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లో పలువురు చైనా శాస్త్రవేత్తలను ఈ బృందం కలుసుకుంది. ఇక్కడ నాలుగు గంటలపాటు గడిపింది. వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావించే వూహాన్ మార్కెట్లో నాలుగు గంటలపాటు గడిపింది. కానీ, చాలా రోజులపాటు ఏ పనీ లేకుండా తమకు కేటాయించిన హోటల్లోనే కాలక్షేపం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు. -
మిమ్మల్నే మీకు వినపడుతోందా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జనాభాలో ప్రతీ నలుగురిలో ఒకరు 2050 నాటికి వినికిడి సమస్యతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. బుధవారం ‘వరల్డ్ హియరింగ్ డే’ను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా చెవుడుకు సంబంధించిన అంశాలపై ఒక నివేదిక విడుదల చేసింది. చెవుడుకు కారణాలు, దాని నియంత్రణకు సరైన కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఇక నుంచి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసింది. వినికిడి లోపాల నివారణకు జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వినికిడి లోపం వల్ల పరస్పర సంభాషణ జరగదు. పైగా విద్య, ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 18 మందిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 2050 నాటికి వినికిడి లోపం (ఏదో ఒక స్థాయిలో... అంటే ఓ మోస్తరు నుంచి తీవ్రమైన వినికిడి సమస్యలు) ఉన్నవారి సంఖ్య 250 కోట్లకు పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అందులో 70 కోట్ల మందికి తప్పనిసరిగా ఏదో రకమైన పరికరం, లేదా వారికి అవసరమైన సాయం తప్పనిసరి. చెవుడును ప్రజారోగ్య సమస్యగా గుర్తించాలని స్పష్టం చేసింది. తక్కువ సౌండ్‌తో వినడం మంచిది చిన్నతనంలో వైరస్, బ్యాక్టీరియా వంటి వాటివల్ల చెవుడు వస్తుంది. బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో పూర్తిగా వినికిడి లోపం వస్తుంది. రూబెల్లా, మెదడు వాపునకు వ్యాక్సిన్ వేయడం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్యలను 60 శాతం తగ్గించొచ్చు. అలాగే చీముతో వచ్చే ఇన్ఫెక్షన్లను ఆరంభంలోనే గుర్తించి నియంత్రించాలి. మాతృత్వ సేవలు మెరుగుపరచడం వంటివి చేయాలి. పెద్దయ్యాక ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉంటాయి. కానీ వారిలో శబ్ద కాలుష్యం వల్ల చెవుడు వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, టీవీల్లో, మ్యూజిక్ సిస్టమ్స్‌లలో (ఇయర్‌ఫోన్స్‌లో కూడా) వాల్యూమ్‌ను పరిమితికి లోబడి ఉండేలా చూసుకోవడం, చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. కొన్ని మందులు చెవి సామర్థ్యాన్ని తగ్గించేవి ఉంటాయి. ఉదాహరణకు ఎమెనో గ్లైకోజైడ్స్ వర్గానికి చెందిన యాంటీబయాటిక్ మందుల వాడకం కొందరిలో చెవుడుకు దారితీ స్తుంది. 50 శాతం వరకు వినికిడి సమస్య వచ్చాకే బయటపడుతుంది. అప్పటివరకు చాలామంది గుర్తించలేరు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో ముందే గుర్తించవచ్చు. వినికిడి సమస్య ఉన్నవారు తరచుగా చెక్ చేసుకోవాలి. చిన్న లోపం ఉన్నా ప్రారంభంలోనే డాక్టర్ సలహా తీసుకోవాలి. 10 లక్షల జనాభాకు ఒకరే ఈఎన్టీ డాక్టర్ వినికిడి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. చెవుడు వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు సమాజంలో వివక్షకు గురవుతారు. అలాంటి వారు వైద్యున్ని కూడా సంప్రదించకుండా మధనపడతారు. అల్పాదాయ దేశాల్లో ఈఎన్టీ డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. 78 శాతం పేదదేశాల్లో 10 లక్షల జనాభాకు ఒక్క ఈఎన్టీ డాక్టర్ కూడా లేడు. ఆడియాలజిస్ట్ (వినికిడి పరీక్షించేవారు), స్పీచ్ థెరపిస్ట్‌లు ఇంకా తక్కువ ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందువల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ల్లో వినికిడి సమస్యలకు చికిత్స జరగాలి. జనాభాలో ఎంతమందికి వినికిడి సమస్య ఉందో లెక్క తేల్చాలి. సార్వజనీన ఆరోగ్య పథకంలో వినికిడి సంబంధిత వ్యాధులను చేర్చాలి. -
వూహాన్ మార్కెట్లో డబ్ల్యూహెచ్ఓ బృందం
బీజింగ్/వూహాన్: కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం ఆదివారం చైనాలోని వూహాన్లో ఉన్న హూనన్ సీఫుడ్ మార్కెట్‌ను పటిష్టమైన భద్రత మధ్య సందర్శించింది. 2019లో కరోనా వైరస్ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న వాదన ఉంది. అయితే, దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు. తాము ఈరోజు ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శించామని నిపుణుల బృందం తెలియజేసింది. కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019 డిసెంబర్లో వూహాన్లో కరోనా కేసులు బయటపడిన తర్వాత ఈ మార్కెట్‌ను మూసివేసి, శుభ్రం చేశారు. -
కరోనా మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూహెచ్ఓ
వూహాన్: చైనాలోని వూహాన్లో కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు అధ్యయనం మొదలు పెట్టారు. కరోనా వైరస్ వచ్చిన తొలి రోజుల్లో రోగులకు చికిత్స చేసిన వూహాన్లో జిన్యింతన్ ఆస్పత్రిని శనివారం సందర్శించారు. చైనా శాస్త్రవేత్తలతో కలిసి మాట్లాడారు. జం తువుల ఆరోగ్యం, వైరాలజీ, ఫుడ్ సేఫ్టీ, ఎపిడిమాలజీలో నిపుణులతో కలిసి చర్చించారు. వైరస్ పుట్టుకకు గల కారణాలపై అన్ని వైపుల నుంచి అధ్యయనం చేస్తున్నారు. ఈ బృందంలో వివిధ రంగంలో నిష్ణాతులైన 10 మంది సభ్యులున్నారు. ‘కోవిడ్‌కి గల కారణమైన ఏ అంశాన్ని వదలకుండా అన్ని వైపుల నుంచి డబ్ల్యూహెచ్ఓ బృందం పరిశీలిస్తోంది’అని డబ్ల్యూహెచ్ఓ ట్వీట్ చేసింది.ఎన్నో రకాల గణాంకాలను పరిశీలించిన బృందం తొలుత వైరస్ సోకిన రోగులతో మాట్లాడనుంది. కరోనా వైరస్‌పై చైనా ముందస్తుగా ప్రపంచ దేశాల్ని హెచ్చరించలేదని, ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను వ్యాప్తి చేసిందని ఆరోపణలున్నాయి. -
రివైండ్ 2020: ప్రపంచానికి తాళం
ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూతపడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్ కాలనాగై కాటేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా పెనుసవాళ్లు విసిరింది. ఏడాది చివర్లో కరోనా కొత్తస్ట్రెయిన్ మరింత భయాందోళనల్ని పెంచుతున్నాయి. అయినా.. ఇకపై కరోనా, క్వారంటైన్, మాస్కులు, భౌతికదూరం అన్న మాటలు వినిపించకూడదన్న ఆశతో కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం చెప్పనుంది. అగ్రరాజ్యాల వణుకు కరోనా మహమ్మారి ప్రపంచంలో అగ్రదేశాల వెన్నులో వణుకుపుట్టించింది. అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలు కోవిడ్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తొలిసారిగా జనవరి 9న ప్రకటించింది. ఆ తర్వాత చాప కింద నీరులా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 15న తొలి కేసు నమోదైంది. మార్చి 11న డబ్ల్యూహెచ్ఓ కోవిడ్‌ని మహమ్మారిగా గుర్తించింది. భౌతిక దూరమే ఈ వైరస్‌పై బ్రహ్మాస్త్రం కావడంతో అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం మన జీవితంలో ఒక భాగమైపోయింది. కరోనా కట్టడిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 లక్షల మంది వరకు మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 2 కోట్ల వరకు కేసులు నమోదయ్యాయి. మూడున్నర లక్షల మంది మరణించారు. భారత్ ప్రపంచ పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ జనాభా ఆధారంగా చూస్తే కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నట్టే చెప్పాలి. బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా కరోనాతో తీవ్రంగా సతమతమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్, యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్‌తో ఇంకా భయాందోళనలు తొలగిపోలేదు. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ఎంత మేరకు కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పని చేస్తాయోనన్న ఆందోళనల మధ్యే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రభ ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై భారతీయం వెల్లివిరిసింది. అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తమిళనాడులో తులసెంథిరపురం కమల స్వగ్రామం. ఆమె తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలు కాగా తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అమితమైన ఇష్టం కలిగిన కమలా హ్యారిస్ విజయంతో భారతీయులు పండుగ చేసుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్‌కు ఎంపిక చేసిన 18 మందిలో హైదరాబాద్ మూలాలున్న రాజాచారికి స్థానం లభించడంతో జాబిల్లిపైనా భారతీయ వెలుగులు ప్రసరించనున్నాయి. ట్రంప్‌కి గుడ్‌బై కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే ఏర్పాట్లు చేసుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజలు బై బై చెప్పేశారు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడంలో, అమెరికాని ఆర్థికంగా నిలబెట్టడంలో ట్రంప్ వైఫల్యాలు ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి. జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ వలసదారుల్ని పలు ఇబ్బందులకు గురిచేయడం, కరోనా ఆంక్షల్ని పాటించకపోవడం, మాస్కు ధరించడాన్ని హేళన చేయడం వంటి చర్యలతో ట్రంప్ ప్రజాదరణ కోల్పోయారు. నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 306 ఎలక్టోరల్ స్థానాలతో విజయం సాధించినప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ తన ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఐ కాంట్ బ్రీత్ అమెరికాలోని మొనిసెటా రాష్ట్రంలో ఆఫ్రికన్ అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ (46) హత్యపై రేగిన ఆందోళనలు అంతకంతకూ ఉధృతమై జాతి వివక్షపై పోరాటానికి దారితీశాయి. తెల్ల తోలు అహంకారంతో డెరెక్ చావిన్ అనే పోలీసు ఫ్లాయిడ్ గొంతుపై తన బూటు కాళ్లతో తొమ్మిది నిమిషాల సేపు తొక్కి పెట్టి ఉంచడంతో ఊపిరాడక ఫ్లాయిడ్ చనిపోయాడు. ‘నాకు ఊపిరి ఆడట్లేదు(ఐ కాంట్ బ్రీత్)’ అంటూ ఫ్లాయిడ్ మొరపెట్టుకున్నా ఆ పోలీసు అధికారి పెడచెవిన పెట్టడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. మొత్తం 60 దేశాల్లో జాతి వివక్షపై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కరోనాని లెక్క చేయకుండా జనం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొనడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో శాంతి వీచికలు ఉద్రిక్తతలకు నిలయమైన మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగస్టు 13న ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ పరిణామాల్లో మైలురాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, యూఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్ జాయేద్ సాధారణ సంబ«ంధాలను పునరుద్ధరించడానికి అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. మెగ్జిట్ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కె ల్ రాజ ప్రాసాదాన్ని వీడుతున్నట్టుగా జనవరి 8న ప్రకటించారు. ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడడం కోసం ఈ జంట బకింగ్హమ్ ప్యాలెస్ వీడి వెళ్లింది. సోషల్ మీడియాలో నెటిజన్లు యువజంట స్వతంత్ర భావాలకు సలాం చేశారు. ప్యాలెస్ నుంచి మేఘన్ బయటకు రావడాన్ని మెగ్జిట్గా పిలుస్తున్నారు. అవీ ఇవీ ► అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ కడ్స్ దళాల జనరల్ ఖాసీం సులేమానీ మరణించారు. బాగ్దాద్ విమానాశ్రయంలో కారులో వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే సులేమానీని అమెరికా సైనికులు చంపేశారు. ► ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయల్దేరిన ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలింది. జనవరి 8న జరిగిన ఈ విషాద ఘటనలో విమానంలో ఉన్న 176 మంది మరణించారు. మూడు రోజుల తర్వాత ఆ విమానాన్ని పొరపాటున తామే కూల్చివేశామని ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది. ► అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపడం కోసం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం.. ఫిబ్రవరిలో సెనేట్‌లో వీగింది. ► పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి ప్రయాణిస్తున్న పైలట్ తప్పిదం కారణంగా కరాచీలోని నివాస ప్రాంతాలపై మే 22న కుప్పకూలింది. ఈ ఘటనలో 97 మంది మరణించారు. ► హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని నీరు కార్చేలా జాతీయ భద్రతా బిల్లుని జూన్‌లో చైనా ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ► లెబనాన్ రాజధాని బీరూట్ పోర్టులో ఆగస్టు 4న జరిగిన భారీ పేలుళ్లలో 200 మంది మరణిస్తే, వేలాది మంది గాయపడ్డారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగానే ఈ పేలుళ్లు సంభవించాయి. ► అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రూత్ బాడెర్ గిన్స్బర్గ్(87) సెప్టెంబర్ 18న పాంక్రియాటిక్ కేన్సర్‌తో మరణించారు -
యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం
లండన్/హేగ్/బెర్లిన్: యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు మరో రూపం సంతరించుకుని మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కొత్త రూపం 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్ ప్రభుత్వం ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు, కొన్ని నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అయితే, వైరస్ తమ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించకుండా పొరుగున ఉన్న పలు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు పలు ముందు జాగ్రత్తలు ప్రకటించాయి. వైరస్ వ్యాప్తి అదుపు తప్పింది బ్రిటన్‌లో తాజాగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు కొన్ని నెలలపాటు కొనసాగే అవకాశాలున్నాయని ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ తెలిపారు. ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను రద్దు చేయాలని తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. అయితే, కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నందున, దానిని అడ్డుకోవ డమే ప్రభుత్వ అభిమతమన్నారు. కొత్త రకం వైరస్ వ్యాప్తి అదుపు తప్పిందని వ్యాఖ్యానిస్తూ ఆయన.. ప్రతి ఒక్కరూ తమకు వైరస్ సోకిందని భావించి అప్రమత్తతతో ఉండాలని కోరారు. కొత్తగా బయటపడిన కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత 70 శాతం ఎక్కువగా ఉందని హాంకాక్ అన్నారు. ఈ వైరస్‌తో మరణాలు పెరిగాయా అన్న విషయం నిర్థారణ కాలేదన్నారు. క్రిస్మస్ రోజు కూడా వ్యాక్సినేషన్ వారాంతంలోగా 5 లక్షల మందికి కోవిడ్ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా శని వారం వరకు 3.50 లక్షల మందికి వ్యాక్సి నేషన్ పూర్తయిందని ఆరోగ్య మంత్రి హాంకాక్ వివరించారు. క్రిస్మస్ రోజున కూడా వ్యాక్సినేషన్ కొనసాగనుంది. కరోనా కొత్త రూపం వ్యాప్తితో దేశంలో తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు యూకే ఆరోగ్య శాఖ సోమవారం అత్యవసరంగా భేటీ కానుంది. అప్రమత్తమైన ఈయూ దేశాలు బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి పై ఈయూ దేశాలు అప్రమత్తమ య్యా యి. ఆదివారం నుంచి జనవరి ఒకటో తేదీ వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానా లపై నెదర్లాండ్స్ నిషేధం విధించింది. యూకే నుంచి అన్ని రకాల ప్రయాణా లను నిషేధిస్తున్నట్లు ఇటలీ తెలిపింది. 24 గంటలపాటు యూకే నుంచి వచ్చే విమా నాలను రద్దు చేస్తున్నట్లు బెల్జియం తెలి పింది. రైలు సర్వీసులను నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించింది. జర్మనీ ప్రభుత్వం కూడా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. యూకే నుంచి వచ్చే వారికి క్వారంటైన్ నిబంధనలను కఠిన తరం చేస్తున్నట్లు చెక్ రిపబ్లిక్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది? కరోనా వైరస్ కొత్త రూపం వ్యాప్తిపై యూకే ప్రభుత్వంతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొత్త వైరస్ జాడలు సెప్టెంబర్‌లోనే కనిపించాయని వెల్లడించింది. ఇది వైరస్ కొత్త రూపమా? కాదా? ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోంది? అనే విషయాలపై లోతుగా అధ్యయనం జరుపుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికారి మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ఇలాంటి వైరస్‌ను ఇప్పటికే డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలో గుర్తించామన్నారు. ఒక్కో కేసు చొప్పున బయటపడిందనీ, వ్యాప్తి అంతటితో ఆగిపోయిందని వివరించారు. -
చైనాపై మరోసారి అమెరికా మండిపాటు
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు చైనాదే బాధ్యతంటూ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇదే విషయమై మరోసారి పలు తీవ్ర ఆరోపణలు చేసింది. వూహాన్లో వైరస్ జాడను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేపట్టిన విచారణకు కమ్యూనిస్టు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చైనా తయారు చేస్తున్న వివిధ టీకాల సమర్థత కు సంబంధించి డేటాను బహిర్గతం చేయడం లేదు. క్లినికల్ ట్రయల్స్‌లో పారదర్శకత, ప్రమాణాలు పాటించడం లేదు. ఇటువంటి చర్యలతో చైనా పౌరులతోపాటు ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’అని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. లక్షలాది మరణాలకు, కోట్లాదిగా ప్రజల జీవనోపాధి దెబ్బతినేందుకు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై పారదర్శకంగా వ్యవహరించేలా చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాలన్నారు. -
చాలా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: కోవిడ్-19 మహమ్మారిలో ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్ శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరార్థ గోళంలో కరోనా విజృంభణ విపరీతంగా ఉందని, ఆయ దేశాలు ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నాయని టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల్లో వైద్య, ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ‘మనం ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని ఫిబ్రవరి నాటికి పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే నేపథ్యంలో మనం ఇంకా కీలక దశలోనే ఉన్నాం. రాబోయే నెలలు పలు దేశాలకు పరిస్థితులు మరింత కఠినంగా మారబోతున్నాయి. తక్షణ చర్యలుగా పాఠశాలలను మూసివేసి, వైద్య సేవలు మరిన్ని అందించాలని మేం ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ విషయాన్ని మేం ఫిబ్రవరిలోనే చెప్పాం. మరలా ఇప్పుడు చెబుతున్నాము’ అని టెడ్రోస్ పేర్కొన్నారు. చదవండి: భారత్‌తో చర్చలు.. అమెరికా కీలక వ్యాఖ్యలు -
మోదీపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ప్రశంసలు
న్యూయార్క్: కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచ మానవాళి పట్ల మీ సంఘీభావానికి కృతజ్ఞతలు. వనరులు, బలాలు ప్రోది చేసుకుని పరస్పర సహకారంతో జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తేనే కోవిడ్ 19 మహమ్మారి నుంచి బయటపడొచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు. ప్రపంచ శాంతి కోసం భారత్ పనిచేస్తోందని తెలిపారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసిందని తెలిపారు. భారత్‌లో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ జరుతున్నాయని తెలిపారు. దాంతోపాటు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని నిల్వకు సంబంధించి ఇతర దేశాలకు సాయం చేస్తామని చెప్పారు. అదే సమయంలో కరోనా విషయంలో ఐక్యరాజ్యసమితి చేయగలిగినంత చేస్తోందా? అని ప్రశ్నించారు. 9 నెలలుగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి ఉమ్మడి కార్యచరణ, ప్రభావవంతమైన ప్రతిస్పందన ఎక్కడ? అని ప్రశ్నించారు. (చదవండి: నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ?) -
40 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం తాజాగా 83,341 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,747కు చేరుకుంది. రెండు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 66,659 మంది కోలుకోగా, మరో 1,096 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68,472కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 8 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,31,124గా ఉంది. రికవరీ రేటు 77.15 శాతానికి పెరిగిందని కేంద్రం తెలిపింది. జూన్ తర్వాతే వ్యాక్సిన్ జెనీవా/మాస్కో : వచ్చే ఏడాది జూన్ వరకు కరోనా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకివచ్చే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. అన్ని ప్రయోగాలను దాటుకొని వ్యాక్సిన్ ఎంత సమర్థంగా ఎంత సురక్షితంగా పని చేస్తుందో తేలడానికి సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ చెప్పారు. ఇప్పటివరకు తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్లన్నీ సమర్థవంతంగా పని చేస్తాయని నిర్ధారణ కాలేదని జెనీవాలో అన్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం ఈ టీకాలేవీ 50% కూడా సురక్షితం కాదని మార్గరెట్ చెప్పారు. రెండు నెలల్లోనే మానవ ప్రయోగాలు పూర్తి చేసి వ్యాక్సిన్‌కు రష్యా అనుమతులు మంజూరు చేయడం, అమెరికా కూడా నవంబర్‌కి వ్యాక్సిన్ సిద్ధంగా చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా వ్యాక్సిన్ సురక్షితమే.. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ సురక్షితమేనని లాన్సెట్ జర్నల్ ఓ పరిశోధనను వెలువరించింది. మొత్తం 76 మందిపై జరిపిన ట్రయల్స్ వివరాలను వెల్లడించింది. ఈ ట్రయల్స్‌లో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులేమీ కనపడలేదని తెలిపింది. -
కరోనా సీజనల్ వైరస్ కాదు: డబ్ల్యూహెచ్‌వో
లండన్: కోవిడ్ –19 సీజనల్‌గా వచ్చిపోయే వైరస్లాగా కనిపించడం లేదని, అందుకే దీన్ని కట్టడిచేయడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సేవల విభాగం డాక్టర్ మైఖేల్ రయాన్ వెల్లడించారు. ఈ వైరస్ ఏ సీజన్లో వస్తుందో చెప్పలేకపోతున్నామని, శ్వాస సంబంధిత వైరస్ ఇన్ఫ్లుయెంజా ప్రధానంగా శీతాకాలంలో వ్యాప్తి చెందుతుందని, అయితే కరోనా వైరస్ మాత్రం వేసవిలో కూడా విజృంభిస్తోందని ఆయన అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు కరోనా వైరస్ ఎండ వేడిమికి తట్టుకోలేదని, వేసవి కాలంలో మనగలగలేదని గతంలో ఊహించారు. వైరస్‌ని ఎంత అణచివేయాలని చూసినప్పటికీ అది తిరిగి విజృంభిస్తూనే ఉందని రయాన్ అన్నారు. -
24 గంటల్లో 2.84 లక్షల కేసులు
జెనీవా: శుక్రవారం ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు, పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కొత్తగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య గత 24 గంటల్లో 2,84,196గా రికార్డు అయ్యింది. ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా అత్యధికంగా 9,753 కోవిడ్ మరణాలు సంభవించడం ఆందోళనకలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా కోవిడ్ సోకిన వారిలో, దాదాపు సగం మంది అమెరికా, బ్రెజిల్‌లకు చెందినవారే. ప్రధానంగా అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలు ప్రపంచంలో కోవిడ్‌తో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాలు. జూలై 25, సాయంత్రం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 6,34,325 మరణాలతోసహా, 1,55,38,736 కోవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కోవిడ్ వ్యాప్తి విజృంభిస్తున్నంత కాలం మనమంతా ప్రమాదపుటంచుల్లో ఉన్నట్టేనని, అందుకే ఎవరైనా బయటకు వెళితే, ఎక్కడికి వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారు? అక్కడ ఎవరిని కలవబోతున్నారు? ఏం చేయబోతున్నారనే విషయాలు ఇప్పుడు ప్రతిఒక్కరికీ జీవన్మరణ సమస్యగా మారిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియోసస్ చెప్పారు. -
మాస్క్‌తో రిస్క్
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కొద్దీ మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది. కరోనా కట్టడికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ అధికారవర్గాలతోపాటు సాధారణ ప్రజలుమాస్కులను తప్పనిసరిగా ధరిస్తున్నారు. వీటిల్లో మెడికల్ మాస్కులు అయిన ఎన్95 మాస్కులు, సర్జికల్ మాస్కులతోపాటు పలు రకాలున్నాయి. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 10 కోట్ల మాస్కులు వాడుతున్నారు. ► దేశంలో సగటున రోజుకు దాదాపు 25 లక్షల మెడికల్ మాస్కులు వినియోగిస్తున్నట్లు భారత వైద్య మండలి(ఎంసీఐ) అంచనా వేసింది. ► మన రాష్ట్రంలో రోజుకు దాదాపు 1.20 లక్షల మెడికల్ మాస్కులు వాడుతున్నారు. వందేళ్ల వరకు మట్టిలోనే.. ► మెడికల్ మాస్కులు సింథటిక్ రేసిన్‌తో తయారవుతాయి. వాటిలో పాలిస్టిరిన్, పాలికార్బనేట్, పాలిథిలియన్ వంటివి ఉంటాయి. ఆ మాస్కులు మట్టిలో కలసిపోకుండా వందేళ్ల వరకూ భూమిలోనే ఉంటాయి. పర్యావరణానికి తీవ్ర హానికరంగా మారతాయి. ► ఈ ఏడాది 130 బిలియన్ల మాస్కుల వ్యర్థాలు సముద్రంలో చేరతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకునిదర్శనం. అదే జరిగితే సముద్ర జలాల్లోజెల్లీఫిష్‌ల కంటే మాస్కుల వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ► 2030నాటికి సముద్ర జలాల్లోచేరతాయని అంచనా వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు పదేళ్లు ముందుగానే 2020లోనే పోగుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యర్థాల నిర్వహణ ఇలా.. ► మాస్కుల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుంటే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ప్రభుత్వ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు విధానాలు నిర్దేశించాయి. ► ఎన్95, సర్జికల్ మాస్కులను ఒకసారి మాత్రమే వాడాలి. ► వైద్యులు, వైద్య సిబ్బంది వాడిన మాస్కులను 850 డిగ్రీల సెల్సియస్ నుంచి 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక గ్యాస్ క్లీనింగ్ ఎక్విప్మెంట్తో కాల్చివేయాలి. ► సాధారణ ప్రజల వాడేసిన మాస్కులను ఇతర వ్యర్థ పదార్థాలతో కలపకూడదు. పారిశుధ్య సిబ్బంది వాటిని సేకరించి బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీతో కాల్చివేయాలి. లేదా పదడుగుల లోతున భూమిలో పాతిపెట్టాలి. కత్తిమీద సాము.. ► మాస్కుల వ్యర్థాల నిర్వహణ ప్రపంచవ్యాప్తంగా కత్తిమీద సాముగా మారింది. ఇంతగా మాస్కులు, మెడికల్ వ్యర్థాలు రోజూ పోగవుతాయని ఎవరూ ఊహించలేదు. వాడిన మాస్కులను ఎక్కడపడితే అక్కడ పారేస్తుండటంతో పరిస్థితి దిగజారుతోంది. ► ఢిల్లీలో ఆసుపత్రుల నుంచి సేకరించిన మెడికల్ వ్యర్థాలలో 70శాతం మాత్రమే శాస్త్రీయంగా నిర్వహిస్తుండగా 30 శాతం రోడ్లపక్కన, నీటివనరుల్లో పడి ఉంటున్నాయి. ఇతర దేశాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ► కరోనా వైరస్ జన్మస్థలం చైనాలోని వూహాన్లో 1.10 కోట్ల జనాభా ఉంది. ఆ నగరంలో సగటున రోజుకు 200టన్నుల మెడికల్ వ్యర్థాలు పోగయ్యాయి. అందులో నాలుగో వంతు వ్యర్థాల నిర్వహణకు మాత్రమే అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్నాయి. చేపల్లో చేరి మళ్లీ మనుషుల్లోకి.. ► ఒక్కో మెడికల్ మాస్కులో దాదాపు 25 గ్రాముల వరకు పోలిపాలిథిన్ ఉంటుంది. దీనివల్ల చేపలతోపాటు 600 రకాల జీవజాతులకు ప్రమాదం పొంచి ఉంది. ఆ చేపలను తినడంతో మనుషులుకూడా అనారోగ్యసమస్యలకు గురవుతారు. ► జర్మనీలో నెలకు 1.70కోట్ల మాస్కులు వాడుతుండటంతో పర్యావరణంలోకి 850 టన్నుల కార్బన్ డయాక్సైడ్వదులుతున్నట్లేనని నిపుణులు అంచనా వేశారు. ఒక కారులో ప్రపంచం చుట్టూ 1,060సార్లు తిరిగితే విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్కు ఇది సమానమని తెలిపారు. రీసైక్లింగ్ సాధ్యమా? భారీ సంఖ్యలో వాడుతున్న మెడికల్ మాస్కులను రీసైక్లింగ్ చేయడం ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. వాడేసిన మాస్కులను సేకరించి వేరుచేసి రీసైకిల్ చేసి కొత్త మాస్కు తయారు చేయాలి. కానీ అందుకు అయ్యే ఖర్చు ఆ మాస్కు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. మాస్కుల రీసైక్లింగ్ అచరణ సాధ్యంకాదని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ► మెడికల్ మాస్కులతో పొంచి ఉన్న పర్యావరణ ముప్పును తప్పించాలంటే ప్రత్యామ్నాయ మాస్కుల వాడకాన్ని ప్రోత్సహించాలని, వైద్య సిబ్బంది మినహా మిగిలిన వర్గాలు కాటన్ మాస్కులను వాడాలని సూచిస్తున్నారు. ► కాటన్మాస్కులు డిటర్జెంట్/ డెట్టాల్‌తో ఉతికి ఎండలో ఆరవేసి మళ్లీ వాడుకోవచ్చు. పలు కంపెనీలు, కుటీర పరిశ్రమలు కాటన్‌తో చేసిన మాస్కులను తయారీ చేసి విక్రయిస్తున్నాయి. ఇళ్లల్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ► ఫైబర్‌తో తయారైన రీయూజబుల్ మాస్కులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. -
కరోనా కట్టడిలో ధారావి భేష్
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి దీనికి అతి పెద్ద ఉదాహరణ అని ప్రశంసించింది. కరోనా బాంబు పేలుతుందనుకున్న ప్రాంతంలో కట్టుదిట్టమైన ప్రణాళికతో కరోనాని కట్టడి చేశారంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ధారావిలో తీసుకున్న చర్యల్ని కొనియాడారు. జన సాంద్రత అత్యధికంగా ఉన్న ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా మూడు నెలల్లోనే కరోనాని నియంత్రించింది. శుక్రవారం టెడ్రోస్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సామాజిక సహకారం, జాతీయ ఐక్యత, ప్రపంచ సంఘీభావంతో తీసుకునే చర్యల ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు. ఇటీవల చాలా దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిపోతూ ఆందోళన పెంచుతున్న సమయంలో ధారావిలో తీసుకున్న చర్యలు వైరస్‌ని నియంత్రించగలమన్న భరోసాని నింపుతున్నాయని ప్రశంసించారు. ‘కరోనాని మనం కట్టడి చేయగలం. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, «ముంబైలో జనసాంద్రత్య అత్యధికంగా ఉన్న ధారావి.. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి’అని టెడ్రోస్ పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం, వివిధ వర్గాల భాగస్వామ్యం, సమష్టి బాధ్యతతో వైరస్‌ను నియంత్రించగల మన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా కరోనా చైన్‌ను బద్దలు కొట్టవచ్చునని టెడ్రోస్ పేర్కొన్నారు. మరోవైపు కజకిస్తాన్‌లో న్యుమోనియా లక్షణాలతో వస్తున్న కేసులు కరోనా వైరస్‌కి చెందినవేనని డబ్ల్యూహెచ్ఓ అదికారి డాక్టర్ ర్యాన్ అనుమానం వ్యక్తం చేశారు. కజకిస్తాన్‌లో ఇప్పటివరకు 50 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. -
గాలి ద్వారా కరోనా.. !?
జెనీవా/ న్యూయార్క్: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కొట్టిపారేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన స్వరం మార్చింది. వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని పూర్తిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో, ఇరుగ్గా ఉండే గదుల్లో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అంటోంది. దీనిపై మరిన్ని బలమైన ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందంది. ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం కరోనా సూక్షా్మతి సూక్ష్మ క్రిములు (5 మైక్రాన్ల కంటే చిన్నవి) గాలిలో ఒక మీటర్ పరిధిలో విస్తరించి చాలా ఎక్కువ సేపు ఉంటాయని, ఆ గాలి పీల్చే వారికి వైరస్ సోకుతుందని డబ్ల్యూహెచ్ఓకి ఒక లేఖ రాశారు. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ టెక్నికల్ లీడ్ బెనెడెట్టా అలెగ్రాంజి గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అయితే ఇవన్నీ ప్రాథమిక ఆధారాలు మాత్రమేనన్నారు. వైరస్ గాలిలో ఎంతసేపు ఉంటుందో, ఆ సమయంలో మరొకరికి సోకే అవకాశం ఎంతవరకు ఉందో ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉందని చెప్పారు. ఒకవేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశమే ఉంటే డబ్ల్యూహెచ్ఓ తన మార్గదర్శకాలను సవరించుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు కోవిడ్ రోగి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మి నప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఒ చెబుతున్న విషయం తెలిసిందే. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్‌లో కోవిడ్ విజృంభిస్తున్న వేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేమని డబ్ల్యూహెచ్ఒ చేసిన ప్రకటన ప్రభుత్వం, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతోంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని రుజువైతే మాస్కులు ధరించడం అత్యంత కీలకంగా మారుతుంది. ఇప్పటివరకు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ధరించే ఎన్–95 మాస్కులు సాధారణ ప్రజలు కూడా వాడాల్సిన అవసరం రావచ్చునని, జనం గుమిగూడే కార్యక్రమాల్ని పూర్తిగా రద్దు చేయాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. గాలి ద్వారా వ్యాపిస్తుందన్న అధ్యయనాలివే.. ► వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని మొదటిసారిగా నేచర్ పత్రిక ప్రచురించింది. ఆస్పత్రిలో కారిడార్లలో కంటే చిన్న గదుల్లో, టాయిలెట్లలో గాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. ► అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఈజేఎం) ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనంలో వైరస్ గాలిలో మూడు గంటల వరకు ఉంటుందని తేలింది. ► రోగులు మాట్లాడేటప్పుడు అత్యధికంగా తుంపర్లు బయటకు వస్తే గాల్లో ఎక్కువ సేపు వైరస్ ఉంటోందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మేలో చేసిన అధ్యయనంలో తేలింది. -
గాలి ద్వారానూ కరోనా?
న్యూయార్క్: కరోనా వైరస్ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు. దగ్గు, తుమ్ముల నుంచి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటివరకూ చెబుతూండగా.. గాలి ద్వారా సోకుతుందని, అతి సూక్ష్మ స్థాయి కణాలూ వైరస్‌ను మోసుకెళ్లగలవని శాస్త్రవేత్తలు ప్రకటించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలింపుతో ప్రజలు బార్లు, కార్యాలయాలు, మార్కెట్లలో గుమికూడటం ఎక్కువైందని, దంతో రోగుల వారి సమూహాలు పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్నిబట్టి కరోనా వైరస్ గాల్లో ఎక్కువకాలం మనగలగడమే కాకుండా ఇతరులకు సోకుతోందని అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి డబ్ల్యూహెచ్‌వో ఇచ్చే సలహా, సూచనల్లో మార్పులు చేయాలని వారు కోరారు. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్ఓ అది కేవలం దగ్గు, తుమ్ముల ద్వారా తుంపర్లతోనే ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పడం తెల్సిందే. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చునని ఆ సంస్థ అందరికీ సూచనలు కూడా చేసింది. అయితే గత నెల 29న మాత్రం వైద్య ప్రక్రియల సమయంలో వెలువడే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ సైజున్న తుంపర్ల ద్వారా వైరస్ సోకే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ భవనాల లోపల కూడా, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ద్వారా సోకుతుందన్న సమాచారానికి ప్రాధాన్యమేర్పడింది. భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తలకు సాధారణ మాస్కుల స్థానంలో అతిసూక్ష్మమైన కణాలను అడ్డుకోగల ఎన్95 మాస్కులు ఇవ్వాల్సి వస్తుందని తెలిపింది. పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో వెంటిలేషన్ వ్యవస్థలను సరిచేసుకోవాల్సి ఉంటుందని, అతినీలలోహిత కిరణాల సాయంతో భవనాల్లోపల శుద్ధి చేసుకోవడం మేలని డాక్టర్ బెనెడెట్టా అలెగ్రాంజీ తెలిపారు. -
క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు: డబ్ల్యూహెచ్‌వో
బెర్లిన్: కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు ఈ ఔషధం పని చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు నిర్వహించిన పరీక్షను ముగించినట్లు వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్/రిటోనవిర్ కాంబినేషన్ డ్రగ్‌ను హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సలో వాడుతున్నారు. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనాను నయం చేస్తుందని ప్రచారం కావడంతో దీనిపై డబ్ల్యూహెచ్‌వో పరీక్ష చేపట్టింది. ఈ కాంబినేషన్ డ్రగ్ కరోనా బాధితులకు ఉపయోగపడినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది. క్లోరోక్విన్ ఇచ్చినప్పటికీ బాధితుల్లో మరణాల రేటు తగ్గలేదంది. -
ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వాక్సిన్
లండన్: ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావంతో ఉన్నట్టు ఆ సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వైరస్ తాజా ఔష«ధ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ సౌమ్య మాట్లాడారు. పదిమందిపై వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగం జరుగుతోందని, వారిలో కనీసం ముగ్గురు వ్యాక్సిన్ సామర్థ్యాన్ని రుజువు చేసే ప్రయోగం మూడవ దశకు చేరుకున్నారని డాక్టర్ సౌమ్య చెప్పారు. గేమ్ చేంజర్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కితాబిచ్చిన హైడ్రాక్సిక్లోరోక్విన్‌కి కోవిడ్ మరణాలను నివారించే శక్తి లేదని మానవ ప్రయోగాల్లో తేలిపోయిందని సౌమ్య చెప్పారు. -
ఒకే రోజు లక్షా 36 వేల కేసులు
జెనీవా: ప్రపంచ దేశాల్లో రోజురోజుకీ కోవిడ్ విజృంభిస్తోందని, ఈ వైరస్‌పై నిర్లక్ష్యం వద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అమెరికా, దక్షిణాసియా దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రాస్ అద్నామ్ ఘెబ్రెయాసస్ చెప్పారు. ఆదివారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,36,000 పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘కరోనా వైరస్ బట్టబయలై ఆరు నెలలైంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీగా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ఏ దేశం కూడా ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వెయ్యకూడదు’ అని అన్నారు. ఈ కేసుల్లో 75శాతం అమెరికా, బ్రెజిల్, దక్షిణాసియా దేశాలకు చెందినవేనని వెల్లడించారు. యూరప్‌లో కేసులు తగ్గుముఖం పడితే ఆఫ్రికా దేశాల్లో వైరస్ విస్తరిస్తోందన్నారు. అదే సమయంలో చాలా దేశాలు వైరస్‌పై విజయం సాధించడం ఊరట కలిగించే అంశమని అన్నారు. అయితే నిర్లక్ష్యంతో ఉంటే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని టెడ్రాస్ హెచ్చరించారు. నిరసన ప్రదర్శనల్లో జాగ్రత్తలు వహించాలి ఆఫ్రికా అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రాస్ అన్నారు. జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగే ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమానికి తాము ఎప్పుడూ మద్దతుగా ఉంటామని, అయితే ఈ ప్రదర్శనలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రతీ నిరసనకారుడు ఒక మీటర్ దూరాన్ని పాటించాలని, దగ్గినప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం వంటివి చేయాలని అన్నారు. -
హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సోమవారం కీలక ప్రకటన చేసింది. కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రగ్ వాడకం వల్ల కోవిడ్-19 రోగుల చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందంటూ లాన్సెట్ నివేదిక వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వర్చువల్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ఈ యాంటీ మలేరియా డ్రగ్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సాలిడారిటీ ట్రయల్ అని పిలవబడే ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో అనేక దేశాల్లోని వందలాది ఆస్పత్రులు కరోనా పేషంట్లను చేర్చుకుని వారి మీద రకరకాల ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వీరికి హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడుతున్నారు. (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై యూఎస్ హెచ్చరిక) ఈ నేపథ్యంలో సేఫ్టీ మానిటరింగ్ బోర్డు భద్రతా డాటాను సమీక్షించే వరకు సాలిడారిటీ ట్రయల్స్‌లో కరోనా రోగుల మీద క్లోరోక్విన్ డ్రగ్ వాడకాన్ని తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు టెడ్రోస్ ప్రకటించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా ఆర్థరైటిస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ ఔషధాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం బ్రెజీల్ ఆరోగ్యమంత్రి ఒకరు తేలికపాటి కోవిడ్-19 కేసులకు చికిత్స చేయడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు యాంటీ మలేరియా క్లోరోక్విన్‌ను ఉపయోగించాలని సిఫారసు చేశారు. అయితే ఈ రెండు మందుల వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు, ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది.(మలేరియా మందు భేష్!) -
వ్యాక్సిన్ దిశగా.. ముందుకు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు వేగం పుంజుకున్నాయి. క్లినికల్ ట్రయల్స్ పలు దశలు దాటుతున్నాయి. 50 లక్షల మందికి పైగా సోకి 3.3 లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్‌ను అదుపుచేసేందుకు ప్ర పంచంలోని పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు 100కు పైగా వ్యాక్సిన్ శాంపిళ్లపై పరిశోధనలు చేస్తున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి 12 నుంచి 18 నె లల సమయం పడుతుందనే అంచనాలున్నాÆ ుు. అ యితే అంతకంటే ముందే మార్కెట్లోకి తెచ్చేందు కు చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో 9 సంస్థలు ముందంజలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా అంటోంది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ చేస్తున్న కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయనే వార్తలొస్తున్నా.. కొంద రు వ్యాక్సిన్ తయారీ కంపెనీల ప్రతినిధులు మా త్రం వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నాటికి దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్నారు. ఎంఆర్ఎన్ఏ సాయంతో.. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడర్నా ఐఎన్ సీ ఈ ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం విజయ వంతమైంది. ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ తయారీకి పూనుకున్న ఈ సంస్థ మొదటి ప్రయత్నంలో భాగంగా 8 మందిపై ప్రయోగం జరపగా, మంచి ఫలితాలొచ్చాయని, ఈ వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ పై పోరాడే యాంటీబాడీస్ వృద్ధి చెందాయని తేలిం ది. ఎంఆర్ఎన్ఏ–1273 వ్యాక్సిన్ పేరుతో మార్చి లో జరిపిన ఈ పరిశోధనల గురించి ఇటీవలే ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలైలో మరో ప్రయత్నం చేస్తామని ఆ సంస్థ అంటోంది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ కూడా కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌లో ఉన్న జన్యుపదార్థంతో అడినోవైరస్ అనే సాధారణ జలుబును కలిగించే వైరస్‌ను కలిపి ప్రయోగం చే సింది. చైనాలోని బీజింగ్‌కు చెందిన సినోవ్యాక్ బ యోటెక్ లిమిటెడ్ కంపెనీ కూడా పీకోవ్యాక్ అనే వ్యాక్సిన్ తయారుచేస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీ కూడా తొలిదశ పూర్తి చేసుకుని తదుపరి దశకు చే రిందని ఆ కంపెనీ చెబుతోంది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ కోతుల్లో యాంటీబాడీస్‌ను వృద్ధి చేయలేకపోయినా సినోవ్యాక్ సంస్థ తెస్తున్న పీకోవ్యాక్ మాత్రం మంచి ఫలితాలనిచ్చిందని తెలుస్తోంది. వచ్చేస్తోందా..? కరోనా వ్యాధికి విరుగుడు మరో ఐదారు నెలల్లో వ్యాక్సిన్ వస్తుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండి యా గ్రూప్ డైరెక్టర్ పురుషోత్తం నంబియార్ పేర్కొ న్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ మానవులపై ప్రయోగించే దశకు చేరుకుందని, వివిధ దేశాల్లో జ రుగుతున్న ఈ ప్రయోగాలు పలు దశల్లో ఉన్నాయని, ప్రపంచానికి ఈ వ్యాక్సిన్‌ను తామే పరిచయం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీరమ్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద కంపెనీ. దీనికి ఎగుమతులు, దిగుమతుల విభాగం డైరెక్టర్‌గా ఉన్న నంబియార్ కరోనా వ్యాక్సిన్ తయారీపై ఓ మలయాళీ పత్రికకు ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ‘కరోనా వ్యాక్సిన్ త యారీకి ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రయత్నాలు చేస్తోంది. అవి సఫలమైతే ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్ తయారీకి ట్రయల్స్ ఊపందుకున్నాయి. మా నవులపై ప్రయోగం చేసే స్థాయికి వచ్చాయి. అంతా సవ్యంగా జరిగితే ఐదారు నెలల్లో వ్యాక్సిన్ భారత మార్కెట్లోకి వచ్చేస్తుంది. తక్కువ ధరకే దేశీయ మార్కెట్లోకి తెస్తాం. వ్యాక్సిన్ యూనిట్ రూ.వె య్యి వరకు ఉండొచ్చు. జూలై, ఆగస్టులో ధరను నిర్ణయిస్తాం. కరోనా వైరస్ అంతరించేది కాదు. దాం తో కలసి మనం జీవించాల్సిందే. భవిష్యత్తులో ఈ వైరస్ బారిన పడే వారికి మేం తయారు చేసే వ్యా క్సిన్ ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని చాలా కంపెనీలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నా యి. అయితే మేమే ఈ వ్యాక్సిన్‌ను అందరికంటే ముందే తయారు చేయబోతున్నాం. ఆక్స్ఫర్డ్ వర్సి టీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. మేం ఆస్ట్రా జెనెకా కంపెనీతో కలసి పనిచేస్తున్నాం. ఆక్స్ఫర్డ్ నుంచి వ్యాక్సిన్ త యారీ సాంకేతికతతో పాటు సెల్ బ్యాంకు తీసుకుంటున్నాం. ఈ సెల్ బ్యాంకును పుణేలోని మా ఫ్యాక్టరీలో ఫార్ములేట్ చేసి బల్క్ వ్యాక్సిన్లు తయారు చేసే పనిలో ఉన్నాం’ అని నంబియార్ వెల్లడించారు. భారత్‌లోనే ముందుగా తయారీ..! ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కరోనాకు కళ్లెం వేసే మందు మన దేశంలోనే ముందుగా ఉత్పత్తి కానుంది. ఇటీవల డబ్ల్యూహెచ్‌వో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు కూడా భారత్‌కు ఆ సామ ర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీకి స్ట్రైడ్స్ ఫార్మా, గ్లెన్‌మార్క్‌లతో పాటు పలు సంస్థలు క్లినికల్ ట్రయల్స్ దశకు తమ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చాయి. ఆ యుర్వేద రంగంలో అశ్వగంధ మూ లికలతో మందును తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ ఈ దిశలో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ఫైజర్ అనే కంపె నీ కూడా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థతో కలసి ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ తయారీ పనిలో పడింది. బీఎన్టీ–162 పేరుతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 360 మందిపై ప్రయోగించి విజయవంతమయ్యారని, జూలైలో ఏకంగా అమెరికా వ్యాప్తంగా 8 వేల మందిపై ప్రయోగించనున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికాకే చెందిన నోవా వ్యాక్స్ అనే సంస్థ ఎన్వీఎక్స్–కరోనా2373 పేరుతో తయా రుచేస్తున్న వ్యాక్సిన్‌ను ఆస్ట్రేలియాకు చెందిన 130 మంది వలంటీర్లపై ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ కూడా పొగాకులో ఉండే ప్రోటీన్ల సాయంతో వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డట్లు వెల్లడించింది. గినియా పందులపై ప్రయోగించి విజయవంతంగా యాంటీబాడీస్‌ను వృద్ధి చేసిన ఇనోవియో అనే కంపెనీ కూడా తన ప్రయోగశాలల్లో ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 40 మంది వలంటీర్లకు 2 డోసుల చొప్పున ఇచ్చామని, జూన్ నెలాఖరుకు మరింత పురోగతి వస్తుందని చెబుతోంది. -
వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్లు
లుసానే: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే అంతర్జాతీయ హాకీ టోర్నీలు జరుగుతాయని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్పష్టం చేసింది. ఈమేరకు వివిధ స్థాయిల్లో పోటీల పునరుద్ధరణ కోసం ‘ఐదు దశల ప్రక్రియ’ను అనుసరించబోతున్నామని ఎఫ్ఐహెచ్ ప్రకటించింది. ఈ ప్రక్రియ చివరి మెట్టుకి చేరుకున్నాక మాత్రమే అంతర్జాతీయ హాకీ టోర్నీలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ‘ఈ సమయంలో హాకీ పునరుద్ధరణ చాలా తొందరపాటే అవుతుంది. ఆటను మళ్లీ పాత పరిస్థితుల్లో నిర్వహించేలా ఐదు దశల ప్రక్రియను పాటించబోతున్నాం. తొలుత సామాజిక దూరం పాటిస్తూ శిక్షణను ప్రారంభిస్తాం. మరో దశలో రీజియన్ల స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. తదుపరి పొరుగు దేశాల్లో జరిగే టోర్నీల్లో తలపడతాం. ఆ తర్వాత ఖండాంతర పోటీలు... ఇలా చివరి దశలో వ్యాక్సిన్ వచ్చాకే పోటీ ప్రపంచంలో మళ్లీ అడుగుపెడతాం. అయితే ఒక్కో దశ ఎన్ని రోజులుంటుందనేది మాత్రం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని ఎఫ్ఐహెచ్ వివరించింది. అంతర్జాతీయ హాకీ పునరుద్ధరించాక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే నడుచుకుంటామని ఎఫ్ఐహెచ్ తెలిపింది. -
కరోనాపై ‘ప్రపంచ’ దర్యాప్తు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి బారినపడినవారి సంఖ్య 49 లక్షలకు చేరువవు తుండగా ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై అంతర్జాతీయ స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించడం కీలక పరిణామం. సంస్థ కార్యనిర్వాహక విభాగం ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్ఏ) వీడియో కాన్ఫరెన్స్‌లో 120 దేశాలు తీర్మానానికి అనుకూలమని ప్రకటించాయి గనుక చైనాకు కూడా ఇక గత్యంతరం లేకపోయింది. వాస్తవానికి ఈ తీర్మానంలో వివాదాస్పద అంశాలేవీ లేవు. యూరప్ దేశాలు తెరవెనక చేసిన ప్రయత్నాలు ఫలిం చడం వల్లనే ఇది సాధ్యమైందని తెలుస్తూనేవుంది. చైనాపై నేరుగా ఆరోపణలు చేస్తే తీర్మానం ఆమోదం పొందడం సంగతలావుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంక్షోభంలో చిక్కుకునేది. దర్యాప్తు మొదలైతే దాని ముందు హాజరై జవాబిచ్చుకునే బాధ్యత చైనాపైనే వుంటుంది. వైరస్ ఆనవాళ్లు ముందుగా ఆ దేశంలోని వుహాన్‌లో బయటపడ్డాయి గనుక జరిగిందేమిటో, తన వంతుగా తీసుకున్న చర్యలేమిటో, దాన్ని అదుపు చేయడంలో మొదట్లో ఎందుకు విఫలం కావాల్సివచ్చిందో అది వివరిం చక తప్పదు. ముందూ మునుపూ తేలేది ఏమైనా ప్రపంచ ప్రజానీకం దృష్టిలో చైనా ‘అనుమానిత దేశం’గా ముద్రపడుతుంది. అయితే తననే ముద్దాయిని చేసేవిధంగా తీర్మానం లేదు గనుక దాన్ని వ్యతిరేకించడానికి చైనా సిద్ధపడలేదు. వాస్తవానికి మొదట్లో దర్యాప్తు ఎందుకంటూ అది అభ్యంతర పెట్టింది. కానీ కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించిన తీరు, ఆ వైరస్ పుట్టుక తెలుసుకోవడానికి ‘నిష్పాక్షికమైన, స్వతంత్రమైన, సమగ్రమైన మదింపు’ వేయడానికి అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరపాలని డబ్లు్యహెచ్‌ఓను తీర్మానం కోరడంతో దాన్ని చైనా కాదన లేకపోయింది. ఆ తీర్మానం పదజాలం ఎలావుండాలో జరిగిన చర్చలో ఆ దేశం కూడా పాల్గొంది. అయితే ఇటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీ మోత’ అన్నట్టు వుంది. చైనాను అనుమానిస్తూ ఆయన చేసిన ప్రకటనకు స్వదేశంలో ఇంతవరకూ పెద్దగా మద్దతు దొరక్కపోయినా ప్రపంచ ఆరోగ్య సంస్థలో క్రమేపీ అన్ని దేశాలూ గొంతు కలిపాయి. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, ట్రంప్ ఏర్పాటు చేసిన కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు అయిన ఆంథోనీ ఫాసి ఈ వైరస్ మానవ సృష్టి అని చెప్పడానికి ఆధారాల్లేవని ట్రంప్ సమక్షంలోనే మొదట్లోనే నిర్మొహమాటంగా చెప్పారు. వైరస్ జన్యు చిత్రపటాన్ని అధ్యయనం చేస్తే ఇది జంతువుల ద్వారా వ్యాపించింది తప్ప, కృత్రిమంగా రూపొందలేదని తేలిందన్నారు. అత్యంత కీలకమైన జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ కార్యాలయం సైతం ఈ నెల మొదట్లో ఈ మాటే చెప్పింది. వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ వాటా నిధులను నిలిపేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. తీర్మానాన్ని ప్రతిపాదించిన 61 దేశాల్లో మన దేశం కూడా వుండటం సహజంగానే ఆసక్తికరమైనది. ఆన్లైన్లో జరిగిన ఈ సదస్సులో అమెరికా ఆచితూచి మాట్లాడిన తీరు కూడా గమనించదగ్గది. బయట ఇంతవరకూ ట్రంప్ ఏం చెప్పినా.. డబ్లు్యహెచ్‌ఓలో మాత్రం చైనా విషయంలో ఆ దేశం బాధ్యతాయుతంగానే మాట్లాడుతోంది. అమెరికా ప్రతినిధిగా పాల్గొన్న ఆరోగ్య మంత్రి అలెక్స్ అజర్ మాట్లాడుతూ ‘వైరస్ విరుచుకుపడుతున్న సంగతిని ఒక దేశం దాచిపెట్టడం వల్ల ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింద’ని అనడమే తప్ప నేరుగా చైనాపై విరుచుకుపడలేదు. అయితే డబ్లు్యహెచ్‌ఓను మాత్రం వదల్లేదు. ఆ సంస్థ వైఫల్యం వల్లే పరిస్థితి చేయిదాటిందని విమర్శించారు. ఇంతక్రితం జీ–7 దేశాల విదేశాంగమంత్రుల సదస్సులో ఏమైందో గుర్తుంచుకుంటే డబ్లు్యహెచ్‌ఓలో అమెరికా తీరు మారడానికి కారణమేమిటో అర్థమవుతుంది. మార్చి 25న జీ–7 సదస్సు జరిగినప్పుడు దానికి సారథ్యం వహించిన అమెరికా ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి అందులో ‘వుహాన్ వైరస్’కు కారణం చైనాయేనంటూ నిందించింది. అయితే ఇతర దేశాలు అందుకు అంగీకరించలేదు. కరోనా వైరస్‌ను ‘వుహాన్ వైరస్’గా చిత్రించడం, చైనానే దోషిగా చేయడం ఉపసంహరించుకుంటే తప్ప తీర్మానాన్ని అంగీకరించలేమని తేల్చిచెప్పాయి. అమెరికా దీనికి ససేమిరా అనడంతో చివరకు ఎలాంటి తీర్మానం లేకుండానే ఆ సదస్సు ముగిసింది. బహుశా డబ్లు్యహెచ్‌ఓలో కూడా అమెరికా పట్టుదలకు పోయివుంటే అదే జరిగేది. కరోనా వైరస్ మహమ్మారికి బాధ్యులెవరో తేల్చడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అది ఖచ్చితంగా వెల్లడికావలసిందే. అయితే దానికి సశాస్త్రీయమైన, సాధికారికమైన ఆధారాలు సేకరించాలి. అదే జరిగితే కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ ఎటువంటి ఆధారాలూ లేకుండా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ప్రమాదకరమైనది. అలాంటి ధోరణులు ప్రపంచం మరింత సంక్షోభంలో కూరుకుపోయేందుకు దారితీస్తాయి. చైనాయే వైరస్ సృష్టికర్త కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చివుంటే అమెరికా శాస్త్రవేత్తలు, అక్కడి ఇంటెలిజెన్స్ సంస్థల పెద్దలు ఆ సంగతి చెప్పడానికి సందేహించరు. గతంలో ఇలాంటి ప్రమాదకర వ్యాధులను ఎదుర్కొనడంలో చైనాకు తగినంత అనుభవం వున్నా కరోనా విషయంలో అది తొట్రుపాటుకు లోనైన మాట వాస్తవం. మొదట్లోనే దాని తీవ్రతను అంచనా వేసుకుని, తాను చర్యలు తీసుకోవడంతోపాటు ప్రపంచాన్ని హెచ్చరించివుంటే అన్ని దేశాలూ జాగ్రత్త పడేవి. అప్పుడు ఈ స్థాయిలో ప్రపంచమంతా సంక్షో భంలో చిక్కుకునేది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయబోయే దర్యాప్తులో ఈ వైఫల్యాలన్నిటికీ అది జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే వైరస్ జన్యువులను అధ్యయనం చేయడంలో తోడ్పాటు నందించాల్సివస్తుంది. ఈలోగా అందరూ సంయమనం పాటించి దర్యాప్తు సక్రమంగా సాగేందుకు సహకరించాలి. -
కరోనాపై విచారణకు భారత్ ఓకే
న్యూఢిల్లీ/జెనీవా: కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న ప్రపంచదేశాల డిమాండ్‌కు భారత్ మద్దతిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వహించిన వర్చువల్ సదస్సులో దాదాపు 120 దేశాలు ఒక తీర్మానం చేస్తూ వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రపంచదేశాల తీరుతెన్నులను సమీక్షించాలని నిర్ణయించాయి. ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్ఏ) పేరుతో సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సమావేశంలో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అదనపు నిధులను ఎలా సమీకరించాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. కరోనా పుట్టుకకు చైనానే కారణమని, జరిగిన నష్టానికి పరిహారం కోరతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ల నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యమేర్పడింది. నిన్నమొన్నటివరకూ విచారణకు ససేమిరా అన్న చైనా.. తాజాగా కాస్త మెత్తబడటంతోపాటు కరోనాపై పోరుకు రెండేళ్లలో రూ.15 వేల కోట్లిస్తాననడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్ఏ) సోమవారం 27 యూరోపియన్ దేశాలు చైనా పేరు ప్రస్తావించకుండా వైరస్ పుట్టుకపై విచారణ జరగాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అన్నిదేశాల ప్రాతినిధ్యంతో శాస్త్రీయమైన విచారణ జరగాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు మేలైన పద్ధతులు అందుబాటులోకి వస్తాయని తీర్మానంలో ప్రతిపాదించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌లపై ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు. భారత్‌తోపాటు ఆఫ్రికా ఖండంలోని 50 దేశాలు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కెనడా, ఖతార్, రష్యా, యూకే, ఐర్లాండ్ తదితర దేశాలు ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. తీర్మానానికి మద్దతిచ్చిన దేశాల జాబితాలో అమెరికా లేదు. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డబ్ల్యూహెచ్ఓ సదస్సులో పాల్గొన్నారు. అన్ని వివరాలూ ఇచ్చాం: జిన్‌పింగ్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చామని, కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా నియంత్రించేందుకు దాదాపు రూ.15 వేల కోట్లిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ డబ్ల్యూహెచ్ఓ సదస్సులో ప్రకటించారు. విపత్తును ఎదుర్కొనేందుకు రెండేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. కరోనాపై ప్రపంచం స్పందించిన తీరుపై సమగ్ర దర్యాప్తునకూ చైనా మద్దతిస్తుందన్నారు. ఈ విచారణ అనేది శాస్త్రీయపద్ధతిలో జరగాలన్నారు. ఈయూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఝావ్ బీజింగ్‌లో చెప్పారు. భవిష్యత్తులో కరోనా వంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండటం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ పుట్టకతోపాటు ఈ అంశంపై ప్రపంచదేశాల స్పందనపై వీలైనంత తొందరగా స్వతంత్ర విచారణ చేపడతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రేయేసస్ స్పష్టం చేశారు. -
చైనా తక్కువ చేసి చూపింది: అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ తీవ్రతను తక్కువగా చేసి చూపడం ద్వారా చైనా అత్యవసరమైన వైద్య సామగ్రిని అక్రమంగా నిల్వ చేసుకుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ (డీహెచ్ఎస్)భావిస్తోంది. చైనా నేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యాధి తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని తొక్కిపెట్టారని, ఇది ఈ ఏడాది జనవరి తొలినాళ్లలో జరిగిందని డీహెచ్ఎస్ ఓ నిఘా నివేదికను సిద్ధం చేసిందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. వైరస్ ప్రభావాన్ని తక్కువ చేసి చూపిన చైనా ఆ సమయంలో వైద్య సామాగ్రి దిగుమతులు పెంచి, ఎగుమతులు తగ్గించిందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపింది. వైరస్ సాంక్రమిక లక్షణం ఉందని జనవరి ఆఖరు వరకూ చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలపలేదని నివేదికలో పేర్కొన్నారు. -
భారత్ భళా
అభివృద్ధి చెందిన దేశాల కంటే సమర్థవంతంగా కరోనా కట్టడి 130 కోట్ల జనాభా ఉన్న దేశం.. అరకొరగా వైద్య సదుపాయాలు కలిగిన దేశం. కంటికి కనిపించని శత్రువుపై అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించింది. కరోనా వైరస్ భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తుందని అంచనా వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మన దేశాన్ని వెన్నుతట్టి ప్రశంసిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల కంటే కరోనా కొమ్ములు విరచడంలో మనమే ముందున్నాం. అయినప్పటికీ మే3న లాక్డౌన్ ఎత్తివేయాలా వద్దా అన్న మీమాంస కొనసాగుతోంది. పరీక్షా సమయం కోవిడ్–19 పరీక్షలు చేయడంలోనూ భారత్ కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు ఎక్కువగా రాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 8 లక్షల 50 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియా కంటే సంఖ్యలో ఇది ఎక్కువ. కానీ జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం స్వల్పమే. చాలా తక్కువ కేసులు నమోదైన వెంటనే భారత్ మేల్కొంది. లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గిపోయింది. ఫలితంగా కేసుల సంఖ్యను నివారించింది’ – లక్ష్మీనారాయణ్, సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకానమిక్స్, పాలసీ డైరెక్టర్ ముందస్తుగా లాక్డౌన్ ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే లాక్‌డౌన్‌పై భారత్ చాలా చురుగ్గా స్పందించింది. చాలా తక్కువ కేసులు నమోదవగానే లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఏయే దేశాలు ఎన్ని కేసులు నమోదయ్యాక లాక్డౌన్ ప్రకటించాయంటే.. -
అందరూ అదే మాట.. నిజం చెప్పిన నేత
‘‘చాలా కాలం తర్వాత భారతదేశంలో ఓ రాజకీయ నాయకుడి నోటి వెంట ఒక వాస్తవికమైన, సున్నితమైన ప్రకటన విన్నా’’ – హృతిక్ మిశ్రా, (ట్విటర్లో ఓ నెటిజన్ వ్యాఖ్య) సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘కరోనాను మనం ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు కాబట్టి దాంతోపాటే జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. నాకైనా, ఎవరికైనా సోకవచ్చు.. భయపడాల్సిన పనిలేదు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యకు నెటిజన్ల నుంచి వచ్చిన స్పందన అది. ఉన్న పరిస్థితిని చాలా వాస్తవికంగా ఉన్నదున్నట్లు చెప్పిన అరుదైన రాజకీయ నాయకుడు అంటూ జగన్మోహన్రెడ్డిని ప్రశంసిస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముందుముందు మనం కరోనాతో కలసి జీవించక తప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలు దేశాల అధినేతలు, పలువురు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఒక వర్గం మీడియా మాత్రం కోడిగుడ్డుకు ఈకలుపీకుతూ ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు మభ్యపెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనాతో కొనసాగాల్సిన పరిస్థితి.. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. మరణాల రేటు తక్కువ. వైరస్‌కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఇంకో ఏడాది కూడా పట్టొచ్చు. లేదా ఎయిడ్స్‌కు మందు లేనట్లే కరోనాకూ మందు తయారు చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కరోనాతో కలసి జీవించాల్సిందే. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా కరోనా సోకిన వారిని గుర్తించి వారిని ఐసోలేషన్‌లో అందుబాటులో ఉన్న వైద్యం అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే చాలు కరోనాకు దూరంగా ఉండవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోది, ఫ్రాన్స్ ప్రధాని ఫిలిప్పీ సహా అనేక మంది దేశాధినేతలు అదే చెబుతున్నారు. ‘‘కరోనా వైరస్ అనేది ఓ వాస్తవం.. ఇపుడు దానితో కలసి ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకోవలసి ఉంది..’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక అధికారి డేవిడ్ నెబారో ఇండియా టుడే కిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఎప్పటికి కట్టడి అవుతుందనేది కాలమే చెబుతుందనీ; అది ఇప్పటికే బాగా వ్యాపించినందున దానితో మనం సహజీవనం చేయక తప్పదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు. కానీ ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ చెబితే మాత్రం ప్రతిపక్షానికి రుచించడం లేదు.. పరీక్షలు పెంచుతూ కేసులన్నీ తేల్చేసే పద్ధతి.. కరోనా వైరస్ బారిన పడినవారిని గుర్తించి క్వారంటైన్ చేయడం, చికిత్స అందించడం తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ఇదీ ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న పద్ధతి. దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇదే పద్ధతి విజయవంతమైంది. ఒక్కల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి ఇపుడు రాష్ట్రంలో 9 ల్యాబ్‌లు పనిచేసే స్థితికి చేరుకుంది. దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా మిలియన్ జనాభాకు 1649 పరీక్షలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ రేటు (1.51శాతం) ఏపీలోనే తక్కువగా ఉంది. బుధవారం వరకు 88,061 టెస్టులు జరిగాయి. ఒక దశలో పరీక్షలు జరగకపోవడం వల్లనే కేసులు తక్కువగా ఉన్నాయన్న ప్రతిపక్షం ఇపుడు కేసులు పెరగడం అంటే రాష్ట్రప్రభుత్వ అసమర్థతగా ఆరోపణలు చేస్తోంది. పారాసిటమాల్.. బ్లీచింగ్ పౌడర్.. వైరస్ కారణంగా జ్వరం వస్తే అది తగ్గేందుకు, దానితోపాటు కనిపించే తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు తగ్గేందుకు ఇచ్చే తొలి మాత్ర ‘పారాసిటమాల్’. అందుకే భారత్ నుంచి దాదాపు 30 దేశాలు పారాసిటమాల్ టాబ్లెట్లను దిగుమతి చేసుకున్నాయి. కరోనా వైరస్‌తో వచ్చే జ్వరం, ఒళ్లునొప్పులకు పారాసిటమాల్ దివ్యౌషధమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించింది. ‘‘ఇతర వైరస్ల మాదిరిగానే ఏదైనా ఉపరితలంపై ఉన్న కరోనా వైరస్‌ను చంపడంలో బ్లీచింగ్ పౌడర్ సమర్థవంతంగా పనిచేస్తోంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మెడికల్ సెంటర్లో అంటువ్యాధుల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పాల్ పాటింగర్ ప్రకటించారు. కరోనా వైరస్ ఇప్పటికే బాగా వ్యాపించినందున దానితో మనం సహజీవనం చేయక తప్పదు – సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ కరోనా వైరస్ అనేది ఓ వాస్తవం.. ఇపుడు దానితో కలసి ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకోవలసి ఉంది.. – డేవిడ్ నెబారో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక అధికారి సాధారణ కేసులే అధికం కరోనా వైరస్ సోకితే ఆసుపత్రి కొద్దిమందికే అవసరమౌతుంది. 81 శాతం మందికి ఇళ్లలోనే నయమవుతుంది. అసలు కరోనా సోకినట్లు ఈ 81 శాతంలో చాలా మందికి తెలియదు. ఎలాంటి లక్షణాలూ కనిపించవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. 13.8 శాతం కేసుల్లో ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 4.7 శాతం కేసుల్లో మాత్రమే ఐసీయూ చికిత్స అవసరమౌతుంది. చైనాలోనూ, ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ పలు అధ్యయనాల అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది. అందుకే భయపడాల్సిన పనిలేదని వైఎస్ జగన్ పేర్కొంటే దానిపైనా విమర్శలు చేశారు. -
కోవిడ్ తిరగబెట్టదని గ్యారంటీ లేదు
జెనీవా: కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వారికి ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్న వివిధ దేశాల తీరుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తప్పు పట్టింది. కోవిడ్ వ్యాధి మళ్లీ తిరగబెట్టదని ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఆఫీసులకి వెళ్లడానికి, ప్రయాణాలు చేయడానికి వీలుగా చిలీ వంటి దేశాల్లో ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాయి. అయితే, వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. -
కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
జెనీవా : కరోనా వైరస్ ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది. ఇంకా చాలా దేశాల్లో కరోనా తొలి దశలోనే ఉందని హెచ్చరించింది. కరోనా నియంత్రణలో ఉందని భావించిన కొన్ని దేశాల్లో.. వైరస్ తిరిగి పుంజుకుందని గుర్తుచేసింది. ఆఫ్రికా, అమెరికాలలో ఈ రకమైన పరిస్థితులు కనిపించాయని చెప్పింది. కరోనా నియంత్రణలో ఎటువంటి పొరపాటు చేయరాదని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌తో మనం చాలా కాలం ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. అన్ని దేశాలు కరోనా నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా సరైన సమయంలో(జనవరి 30న) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించామని గుర్తుచేశారు. పశ్చిమ యూరప్‌లో కరోనా విజృంభణ కొద్దిగా తగ్గిందన్నారు. అయితే ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌లో కేసులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాలు మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నియంత్రణలో ఎలాంటి పొరపాటు చేయకూడదని.. ఇంకా చాలా కాలం దీనిపై పోరాడాల్సి ఉందని సూచించింది. భౌతిక దూరం నిబంధనను కఠినంగా అమలు చేయడం ద్వారా కొన్నిదేశాలు కరోనా వ్యాప్తి నెమ్మదించేలా చేయడంలో విజయవంతం అయ్యాయని.. కానీ కరోనా మహమ్మారి చాలా ప్రమాదకరమైనదని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చాల వేగంగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని అన్నారు. మరోవైపు అయితే కరోనా నియంత్రణలో డబ్ల్యూహెచ్ఓ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతుంది. టెడ్రోస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే తను రాజీనామా చేసేది లేదని టెడ్రోస్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేత విషయంలో అమెరికా పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికిపైగా కరోనా సోకింది. వారిలో 1.78 లక్షల మందికి పైగా మృతిచెందారు. చదవండి : ‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’ -
‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’
జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిధులు నిలిపివేయడంపై అమెరికా పున: పరిశీలన చేస్తోందని ఆశిస్తున్నట్టు ఆ సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. తనను రాజీనామా చేయాలని కొందరు అమెరికా చట్ట సభ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని.. కానీ తాను మాత్రం ప్రజల ప్రాణాలు కాపాడటానికి కృషి చేస్తున్నానని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గతవారం యూఎస్ ప్రతినిధులు సభలో కొందరు రిపబ్లికన్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు స్వచ్ఛందంగా నిధులు ఇవ్వాలని అనుకుంటే టెడ్రోస్ రాజీనామా చేయాలనే షరుతు విధించాలని ట్రంప్‌కు సూచించారు. దీనిపై టెడ్రోస్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని దేవుడు అందించిన గొప్ప పనిగా భావించి రాత్రి, పగలు ప్రజల ప్రాణాలను కాపాడటానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా నియంత్రణపై ఉందని పేర్కొన్నారు. మరోవైపు డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నిధులు నిలిపివేయడంపై ఆ సంస్థ అత్యవసర విభాగం చీఫ్ మైక్ ర్యాన్ స్పందించారు. ఈ నిర్ణయం సంస్థ ప్రధాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. అవసరమై న వైద్య సేవలు, పిల్లల్లో రోగనిరోధకత, పోలియో నిర్మూలన సేవలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. కాగా, కరోనా మహమ్మారి తీవ్రతను దాచిపెట్టడంతో పాటుగా, నియంత్రించడంలో డబ్ల్యూహెచ్ఓ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ట్రంప్ ఆ సంస్థకు నిధులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసింది. దాదాపు 60 నుంచి 90 రోజుల పాటు డబ్ల్యూహెచ్‌వో నిధులను నిలిపివేసే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల విషయంలో అతిపెద్ద దాతగా ఉన్న అమెరికా.. ప్రతి ఏడాది కొన్ని కోట్ల డాటర్లు అందజేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : 90% సాధారణ వైద్యంతోనే కోలుకుంటున్నారు కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు -
కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు
తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వంటి వైరస్లు, వరదలు వంటి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కొన్న అనుభవం కేరళకి బాగా కలిసి వచ్చింది. భారత్‌లో తొలి కేసు నమోదైన రాష్ట్రమైన కేరళ రికవరీలోనూ ముందుంది. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. చదరపు కిలోమీటర్‌కి 860 మంది వరకు నివసిస్తారు. విదేశీ రాకపోకలు ఎక్కువే. గల్ఫ్ దేశాలలో కేరళ కార్మికులే ఎక్కువ. ఇక చైనాలోని వూహాన్లో చదువుకునే వైద్య విద్యార్థులు అధికభాగం కేరళ వారే. 60 ఏళ్ల వయసు పై బడిన జనాభా 12 శాతం. ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు ఎక్కువే. అయినా కరోనా కట్టడి చర్యల్లో కేరళలో అధికార లెఫ్ట్ ప్రభుత్వం ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటోంది. ఐక్యరాజ్య సమితి కేరళని భళా అంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేరళని చూసి పాఠాలు నేర్చుకోవాలని చెప్పింది. లాన్సెట్ జర్నల్‌దీ అదే మాట. సమన్వయంతో సగం విజయం చైనాలోని వూహాన్ నుంచి కేరళలోని త్రిసూర్కి వచ్చిన వైద్య విద్యార్థినికి జనవరి 18న కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయడంతో సగం విజయం సాధించినట్టయింఇ. తొలి కేసు నమోదైన వెంటనే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న అయిదు విమానాశ్రయాల్లో అంబులెన్స్‌లు, అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా ఆసుపత్రులను సిద్ధం చేసింది. కరోనా పాజిటివ్ ఎవరికైనా సోకితే వెంటనే వాళ్లంతా ఎవరెవరిని కలిశారో గూగుల్ మ్యాప్ సహకారంతో వెతికి పట్టుకొని మరీ పోలీసులు క్వారంటైన్ చేసేవారు. విపత్తుల సమయంలో ప్రజల్ని తరలించడానికి ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ఈ సంక్షోభ సమయంలో కేరళని ఆదుకున్నాయి. ప్రతీ గ్రామాల్లోనూ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. దీనివల్ల సమాచారం అందించుకోవడం సులభమైపోయింది. కేరళ ఆరోగ్య మంత్రి శైలజ స్వయంగా కరోనా రోగులతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనాపై యుద్ధానికి రూ.20 వేల కోట్లు నైరుతి రుతుపవనాలు మొట్టమొదట తాకే కేరళలో వ్యాధులు కూడా ఎక్కువే. ఫ్లూ, డెంగ్యూ వంటి జ్వరాలు అక్కడ సర్వసాధారణం. అందుకే కొత్త వైరస్ ఏది వచ్చినా ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తుంది. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో నిధులు భారీగా కేటాయిస్తుంది. ఇప్పుడు కరోనా దాడి మొదలవగానే అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ.20వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పీపీఈ కిట్స్, మందులు పెద్ద మొత్తంలో తెప్పించింది. మాస్క్‌లు, శానిటైజర్లు భారీగా తయారు చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. కేరళ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కావడం.. విద్యాధికులే ఎక్కువ ఉండడంతో కరోనా ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకొని ప్రజలంతా క్రమశిక్షణతో భౌతిక దూరం పాటించారు. అందరినీ మానసికంగా సిద్ధం చేశాక కేంద్ర ప్రభుత్వం కంటే ముందే మార్చి 11న ముఖ్యమంత్రి పి. విజయన్ లాక్డౌన్ ప్రకటించారు. గత రెండు వారాలుగా కేరళలో రోజుకి ఒకటీ రెండు కేసులు కంటే ఎక్కువ నమోదు కాకపోవడం ఆ రాష్ట్రం సాధించిన ఘన విజయంగా చెప్పుకోవాలి. ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి వలస కూలీలకు, నిలువ నీడలేని వారికి ఆహార పొట్లాలు అందిస్తోంది. ఉపాధి పనులు కోల్పోయిన వారికి బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసరాలు ఇంటింటికీ వెళ్లి పంచేపనిలో ఉంది. 28 రోజుల క్వారంటైన్ కరోనా అనుమానితుల్ని అన్ని రాష్ట్రాల్లోనూ 14 రోజుల క్వారంటైన్లో ఉంచితే కేరళ ముందుజాగ్రత్తగా 28 రోజులు క్వారంటైన్లో ఉంచింది. అదే సరైన చర్యని ఇప్పుడు రుజువు అవుతోంది. 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు బయటకు వచ్చే కేసులు ఉన్నాయి. } కేరళలో అధికార వికేంద్రీకరణ ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామాల స్థాయిలో స్థానిక మండళ్లు, సమర్థంగా పనిచేసే మున్సిపాల్టీలు, వరదలు వంటి విపత్తుల్ని ఎదుర్కొనే యంత్రాంగం ఇప్పుడు బాగా కలిసి వచ్చింది. – జాకబ్ జాన్, ఆర్థికవేత్త ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేరళ ఆరోగ్యం, విద్యా రంగం మీద అత్యధికంగా ఖర్చు చేసింది. అందరికీ ఆరోగ్యం కోసం మూడు అంచెల విధానం అమల్లో ఉంది. ఆ వ్యవస్థ కరోనాపై అపారమైన పోరాట పటిమ ప్రదర్శిస్తోంది. – బి. ఇక్బాల్, ప్రభుత్వ సలహాదారు, వైరస్ల నియంత్రణ మండలి -
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్?
లండన్: వచ్చే నెలకల్లా 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షిస్తారని బ్లూమ్‌బెర్గ్ సంస్థ తెలిపింది. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యా న్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ బృందం ప్రయోగం మొదటిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న 70 సంస్థలను గుర్తించగా, అందులో మూడు సంస్థలు ఇప్పటికే మనుషులపై ప్రయోగం చేశాయి. గిల్బర్ట్ ప్రయోగం తొలిదశలో 510 మంది వలంటీర్లను ఐదు గ్రూపులుగా విభజించి వారికి వ్యాక్సిన్ ఇచ్చి, వారిని ఆరు నెలల పాటు పర్యవేక్షిస్తారు. తొలి ఇమ్యునైజేషన్ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఈ ఐదు గ్రూపుల్లో ఒక గ్రూపు వారికి వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తారు. వేసవి కాలంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే తీరునిబట్టి వ్యాక్సిన్ పనితీరుని గుర్తిస్తారు. అదే కాలంలో ఇతర దేశాల్లోని భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్ ఫలితాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోవిడ్ వ్యాక్సిన్లు తయారుచేస్తోన్న ప్రతి ఒక్కరికీ వారి ప్రాథమిక నిర్ధారణలను, వారి ఆలోచనలను పంచుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు గిల్బర్ట్ లాన్సెట్ పత్రికకు చెప్పారు. -
అమెరికాలో మూడు లక్షలు
వాషింగ్టన్/బీజింగ్/జెనీవా: ఇదీ కరోనా మహమ్మారి చేస్తున్న విలయం తాండవం. కోవిడ్–19 అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు నమోదైతే, అదే సమయంలో 1,500 మంది మరణించారు. ఈ పరిణామాలతో అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలందరూ సాధారణ మాస్క్‌లే ధరించాలని చెప్పారు. తీవ్రంగా మాస్క్‌ల కొరత ఎదుర్కొంటున్న అమెరికా వైద్యసిబ్బందికి అవసరమయ్యే ఎన్95 మాస్క్‌లు పౌరులు వాడవద్దని సూచించారు. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ వేసుకోవాలన్నారు. అయితే తాను మాత్రం మాస్క్ వేసుకోనని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం. ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పగా, అమెరికా శాస్త్రవేత్తలు కేసుల సంఖ్య పెరగడానికి గాలి ద్వారా వైరస్ సోకుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో కేసులు ఇంచుమించుగా 3 లక్షలకి దగ్గర్లో ఉంటే, మృతులు 7 వేలు దాటేశాయి. గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలి: యూఎన్: కరోనా విశ్వరూపం చూపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ అన్నారు. యుద్ధవాతావరణం ఉండి, పెద్ద సంఖ్యలో శరణార్థులు ఉన్న సిరియా, లిబియా, యెమన్ వంటి దేశాలకు వైరస్ విస్తరిస్తే ఎంతటి కల్లోలం రేగుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని అన్నారు. కోవిడ్ మృతులకు చైనా నివాళి కోవిడ్‌తో మృతి చెందిన వారికి చైనా జాతియావత్తూ శనివారం నివాళులర్పించింది. కరోనా వైరస్‌పై తొలిసారిగా హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్తో సహా 3,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి సంతాప సూచకంగా ప్రజలందరూ మూడు నిముషాలపాటు మౌనం పాటించారు. జాతీయ జెండాను అవనతం చేశారు. స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి పొడిగింపు స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య రాను రాను పెరిగిపోతూ ఉండడంతో జాతీయ అత్యవసర పరస్థితిని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని సాంచెజ్ ప్రకటించారు. శనివారానికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,744కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్షా 24 వేలు దాటేసింది. ఇటలీలో మరో 766 మంది మరణిస్తే కొత్త కేసుల సంఖ్య పెరుగుదల నాలుగు శాతం మాత్రమే నమోదైంది. జర్మనీలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 6,082 మందికి వైరస్ సోకింది. కువైట్‌లో శనివారం తొలి మరణం సంభవించింది. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకేరోజు 708 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,313కి చేరుకుంది. న్యూయార్క్‌లో రెండున్నర నిమిషాలకో మరణం కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న న్యూయార్క్‌లో అంతిమ సంస్కారానికి కూడా వేచి చూసే పరిస్థితులు నెలకొని ఉంటే మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంచుమించుగా ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒక మరణం నమోదవుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్యూ క్యూమో వెల్లడించారు. గత 24 గంటల్లో 562 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య దాదాపుగా 3 వేలకు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్ష దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 11,69,262 మరణాలు: 62,730 కోలుకున్న వారు: 2,41,762 -
ఆ నీళ్లతో కరోనా రాదు...
సాక్షి, హైదరాబాద్: ‘తాగునీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుంది. ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీటిని తాగొద్దు. ఇతర పనులకు కూడా వినియోగించుకోవద్దు.’ఇజ్రాయెల్ దేశం నుంచి సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న తప్పుడు ప్రచారమిది. అయితే దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుపట్టింది. నీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ తాగునీటి విషయంలో ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది. (ఇవి కచ్చితమైన లెక్కలు కావు: నిక్కీ హేలీ) ఇజ్రాయెల్‌లో నమోదవుతున్న కరోనా బాధితుల సంఖ్యకు, తాగునీటికి ఎలాంటి సంబంధం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిఖ్ లాజరెవిచ్ వెల్లడించారు. గతంలో కూడా ఈ వైరస్ గాలి ద్వారా సంక్రమించే అవకాశం ఉందని వదంతులు వచ్చాయని, కేవలం ఒక మనిషిని ఇంకో మనిషి తాకడం ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుందే తప్ప గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటి బరువైనది ఈ వైరస్ కాదని ఆయన స్పష్టంచేశారు. కనీసం మనిషికి, మనిషికి మధ్య మీటర్ దూరం పాటించడం, ముఖ భాగాలను తాకకపోవడం మాత్రమే కరోనా వైరస్‌ను నియంత్రిస్తాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. (కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం) -
హోం ఐసొలేషన్‌కు మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారు విధిగా ఐసొలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శకాలు ఇలా.. ► విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సంబంధం ఉన్న వారు.. జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపించిన వారు హోం ఐసొలేషన్‌లో ఉండాలి. ► వైరస్ సోకిన వ్యక్తిని ఆరోగ్యవంతుడు కలిసినప్పుడు ఇది అతనికీ వర్తిస్తుంది. ► ఒక ఇంట్లో పాజిటివ్ వ్యక్తి ఉన్నప్పుడు మిగతా వారికి హోం ఐసొలేషన్ వర్తిస్తుంది. ► పాజిటివ్ ఉన్న వ్యక్తి ఎవరినైనా భౌతికంగా తాకినా ఇది వర్తిస్తుంది. ► హోం ఐసొలేషన్‌లో ఉన్న వారు లైజాల్ లేదా హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేసి, గాలి వెలుతురు ఉన్న ఇంట్లో ఉండాలి. ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. ► పదే పదే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఉమ్మి వేయడం, ఎదురుగా వచ్చి దగ్గడం చేయరాదు. కుటుంబంలో ఇతరులతో కలవ రాదు. ప్లేట్లు, గ్లాసులు విడిగా ఉంచుకోవాలి. ► దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే 104కు కాల్ చేయాలి. హోం ఐసొలేషన్‌లో 14 రోజులు ఉన్న తర్వాత తిరిగి నమూనాలు పరీక్షించాలి. నెగిటివ్ అని తేలితేనే బయటకు రావాలి. ► ఫిబ్రవరి 10 తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ► ఈ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అనేది జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, హెల్త్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలి. -
అమెరికాలో అసాధారణం
వాషింగ్టన్/ప్యారిస్/రోమ్/మాడ్రిడ్: ప్రపంచవ్యాప్తంగా 185 దేశాలు, ప్రాంతాల్లో కోవిడ్ కరాళ నృత్యం కొనసాగుతోంది. మంగళవారం నాటికి 40,673 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోగా 8,19,038 మంది వ్యాధి బారినపడ్డారు. అమెరికాలో తీవ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. యుద్ధ సమయాల్లో కనిపించే క్షేత్రస్థాయి ఆసుపత్రులు న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటయ్యాయి. మన్‌హట్టన్ సమీపంలో ఓ యుద్ధ నౌకలో వెయ్యి పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఉపాధి కోల్పోయిన పలువురు నగరంలోని ఫుడ్‌బ్యాంకుల్లో ఆహారం కోసం క్యూ కడుతున్నారు. వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చినప్పటికీ రానున్న నెల రోజులు అమెరికా అతిపెద్ద సవాలు ఎదుర్కోబోతోందన్న ఆయన హెచ్చరిక అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికాలో 3,400 మంది కోవిడ్‌కు బలికాగా, 1,74,665 మందికి వైరస్ సోకింది. ఖండాలు, ప్రాంతాల వారీగా.. యూరప్‌లో మొత్తం 4,29,362 కోవిడ్ కేసులు ఉండగా, ఆసియాలో ఈ సంఖ్య 1,08,143గా ఉంది. యూరప్‌లో 27,740 మంది ప్రాణాలు కోల్పోగా ఆసియాలో 3878 మంది బలి అయ్యారు. మధ్యప్రాచ్యంలో కోవిడ్ కేసుల సంఖ్య 54,642 కాగా, మరణాలు 2999గా ఉంది. లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో 16,399 కేసులు, 417 మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో 5,343 కేసులు, 170 మరణాలు నమోదయ్యాయి. శోక సంద్రంలో ఇటలీ: ఆరు కోట్ల జనాభా ఉన్న ఇటలీలో ఇప్పటివరకు 11,591 మంది కోవిడ్‌కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారికి బలైన వారిలో మూడోవంతు మంది ఇటలీలోనే ఉండటం మరో విషాదం. మొత్తం బాధితుల సంఖ్య 1,01,739కు చేరుకుంది. లాక్‌డౌన్‌ను మరో 15 రోజులపాటు పొడిగించాలని నిర్ణయించింది. స్పెయిన్‌లో కోవిడ్ కారణంగా 24 గంటల్లోనే 849 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 8,269కు చేరుకుంది. చైనా.. ఫ్రాన్స్.. జర్మనీ చైనాలో తాజాగా 48 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం 81,518 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. సోమవారం ఒకరు మరణించడంతో వైరస్ మృతుల సంఖ్య 3,305కు చేరుకుంది. ఫ్రాన్స్‌లో వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 44,550 కాగా, 3,024 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో ఇప్పటి వరకు 682 మంది చనిపోగా 68,180 మందికి వ్యాధి సోకింది. బ్రిటన్‌లో మంగళవారం ఒక్కరోజే 381 మంది మృతిచెందడంతో కరోనా మరణాల సంఖ్య 1,408కు చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఆసియా ప్రాంత దేశాలకు కోవిడ్ ప్రమాదం తప్పినట్లుగా భావించరాదని, వ్యాధి కేంద్రబిందువులుగా యూరప్, అమెరికా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించడం తగదని డబ్ల్యూహెచ్‌వో ఆసియా పసిఫిక్ ప్రాంత డైరెక్టర్ డాక్టర్ తకేషీ కసాయ్ హెచ్చరించారు. వైరస్‌పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. -
ఆరోగ్యం... క్యూబా భాగ్యం!
1950 ప్రాంతాల్లో క్యూబన్ రివల్యూషన్ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ఓ వైద్య విధానాన్ని రూపొందించుకుంది. దాని పేరే ‘రూరల్ మెడికల్ సర్వీసెస్’. ఆ విధానం మేరకు మారుమూల పల్లెలకు సైతం వైద్యం అందితీరాలని క్యూబా ప్రతినబూనింది. పైపెచ్చు చికిత్స కంటే నివారణకు ఎంతో ప్రాధాన్యమిచ్చింది. అసలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు క్యూబా దగ్గర 750 మంది ఫిజీషియన్లే ఉన్నారు. 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో దేశాలన్నీ ‘అల్మా–ఆటా’డిక్లరేషన్ చేశాయి. ప్రతి వ్యక్తీ... శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉండాలంటూ... చేసుకున్న ఈ తీర్మానం పై ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు సంతకం చేశాయి. కానీ వీటిలో చాలా దేశాలు... ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. క్యూబా మాత్రం 1970లలోనే దేశమంతటా మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసుకుంది. అల్మా–ఆటా తర్వాత ఇది మరింత ఊపందుకుంది. 1980ల నాటికి ‘ఫ్యామిలీ డాక్టర్స్–నర్సెస్’అనే కార్యక్రమంతో మరింత ముందుకెళ్లింది. 1990 నాటికి దేశంలోని 95% జనాభాకు వైద్య ఆరోగ్య సేవలందించే స్థితికి చేరింది. అక్కడి కోటి మంది జనాభా ఉంటే వారిలో 1 శాతం... అంటే లక్ష మంది వైద్యులే. వారిలోనూ 33,000 మంది ఫ్యామిలీ ఫిజీషియన్లే. వైద్యరంగంలో క్యూబా సాధించిన ప్రగతి కారణంగా 2014 మేలో నిర్వహించిన ‘67వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’కి క్యూబా నేతృత్వం వహించింది. ఇదీ... క్యూబా ఘనత ► ఈ దేశ రాజ్యాంగంలో ‘ఆరోగ్య హక్కు’ఉంది. దీని ప్రకారం అందరికీ ఉచిత వైద్యం కల్పిస్తోంది. ఇక్కడ సగటు జీవనకాలం 79 ఏళ్లు. ► క్యూబా వైద్యులిపుడు ప్రపంచమంతా సేవలందిస్తున్నారు. అంధత్వాన్ని నివారించేందుకు లాటిన్ అమెరికా దేశాలైన బొలీవియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్యాటెమాలా, గయానా, హైతీ, హోండురాస్, గ్రనెడా, నికరాగ్వా, పనామా, పరాగ్వే, ఉరుగ్వే లాంటి 14 దేశాల్లో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ► క్యూబా 1998 నుంచీ లాటిన్ అమెరికన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (ఈఎల్ఏఎమ్) ద్వారా వేలమంది ఫిజీషియన్లను తయారు చేసింది. ఇప్పుడు కూడా 120 దేశాలకు చెందిన 11,000 మంది అక్కడ చదువుతున్నారు. ► 1960, 1972, 1990లలో చిలీ, నికరాగ్వా, ఇరాన్లలో భూకంపాలు వచ్చినప్పుడు అత్యవసర సహాయం కోసం క్యూబా డాక్టర్లు ముందుకొచ్చారు. ► 1998లో హరికేన్ విపత్తు వచ్చినప్పుడు అక్కడి వైద్యబృందాలు హోండురాస్, గ్వాటెమాలాకు తరలివెళ్లి... సేవలందించాయి. ► 2004 సునామీ సమయంలో శ్రీలంకకూ వచ్చి సేవలందించారు. పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ప్రబలినప్పుడు... ఎన్నో దేశాలు గడగడలాడినా... క్యూబా 62 మంది డాక్టర్లనూ, 103 మంది నర్సులను పంపింది. ► తాజాగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న ఇటలీకి దాదాపు 50 మందికి పైగా ఉన్న ఓ వైద్య బృందం చేరుకుని సేవలందించడం మొదలు పెట్టింది. అదో చిన్న దేశం. నిజం చెప్పాలంటే చాలా చాలా చిన్న దేశం. పిచ్చుక లాంటి ఆ దేశంపై అమెరికా అనునిత్యం ఆంక్షల బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తూనే వచ్చింది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు సైతం అవకాశం దొరికినప్పుడల్లా క్యూబాపై ఆంక్షలు విధిస్తూ... అక్కడి విధానాలను ఆడిపోసుకున్నాయి. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ పూనుకుని క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోపై 638 సార్లు హత్యాయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి. అలాంటి క్యూబా... ఈ సంక్షోభ సమయంలో అగ్రరాజ్యమైన ఇటలీకి తమ వైద్యుల్ని పంపి కొండంత అండగా నిలుస్తోంది. ఇంత చిన్న దేశమైన క్యూబా వద్ద అంత పెద్ద వైద్య వ్యవస్థ ఎలా ఉందని ఆశ్చర్యం కలగక మానదు. దాని వెనక పెద్ద కథే ఉంది. అది చూస్తే... -
వైరస్ల నియంత్రణకు శాశ్వత వార్డులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని రకాల వైరస్ల నియంత్రణకు శాశ్వతంగా ప్రత్యేక ఐసీయూలు, ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌తోపాటు స్వైన్‌ఫ్లూ, నిపా వంటి వైరస్‌లన్నింటికీ చికిత్స కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో 10 పడకలతో ఐసీయూలు, 20 పడకలతో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయనుంది. ఒక్కో ఐసీయూ ఏర్పాటుకు రూ. 2 కోట్ల చొప్పున రూ. 20 కోట్లు, ఒక్కో ఐసోలేషన్ వార్డుకు రూ. కోటి చొప్పున రూ. 10 కోట్లు లెక్కన మొత్తం రూ. 30 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నిబంధనల ప్రకారం ఐసీయూలు, ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చే యనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటికి ప్రత్యేక ప్రవేశ మార్గాలను సిద్ధం చేయనున్నారు. అలాగే రోగులు ఇళ్లకు వెళ్లేందుకు సైతం విడిగా మార్గాలను అందుబాటులోకి తీసుకురాను న్నారు. వాటిని ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ ప్రతినిధులు మంగళవారం ఆయా జిల్లాల కేంద్రాలకు వెళ్లారు. దీనిపై బుధవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. కాగా, నిన్న మొన్నటివరకు కోవిడ్ భయాలతో మా స్క్‌లు కావాలంటూ వైద్య ఆరోగ్యశాఖకు వీఐపీల నుంచి ఒత్తిడి నెలకొన్నా సీఎం కేసీఆర్ మాస్క్‌లు పెద్దగా అవసరం లేదని చెప్పడంతో వీఐపీల నుంచి మాస్క్‌ల డిమాండ్ తగ్గిందని అంటున్నారు. మరోవైపు లక్ష మాస్క్‌లు కావాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరినా ఇప్పటివరకు ఒక్క మాస్క్ కూడా రాలేదు. మహారాష్ట్రలో తయారీ యూనిట్లు ఉన్న మూడు చోట్ల నుంచి మాస్క్‌లు తెప్పించడంలో కేంద్రం సహకరించడంలేదని అధికారులు అంటున్నారు. కోవిడ్ దెబ్బతో బయోమెట్రిక్ బంద్ కోవిడ్ వైరస్ దెబ్బతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విద్యా సంస్థలు క్రమంగా నిలిపివేస్తున్నాయి. కోవిడ్ కారణంగా షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని, వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా ఒకరి తరువాత ఒకరు వేలి ముద్రలు వేయాల్సిన బయోమెట్రిక్ హాజరును తాత్కాలికంగా నిలి పివేస్తున్నాయి. ఇప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ అ గ్రికల్చర్ యూనివర్సిటీ బయోమెట్రిక్ హాజరు వి ధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా, కాకతీయ యూనివర్సిటీ కూడా తమ పరిధిలోని కాలేజీల్లో బ యోమెట్రిక్ హాజరు విధానం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానం నిలిపివేతపై ఆలోచనలు చేస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
కోవిడ్.. కంగారు వద్దు
న్యూఢిల్లీ/జెనీవా: కోవిడ్–19 కేసులు భారత్‌లో కూడా ఎక్కువైపోతూ ఉండడంతో అందరిలోనూ కంగారు మొదలైంది . ఏ నలుగురు కలిసినా కరోనా అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ వైరస్ సోకితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే చర్చ. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లెక్కలేనన్ని పోస్టులు షేర్ అవుతున్నాయి. ఇప్పటికే మనం వైరస్లు విసిరిన సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నాం. వాటినుంచి బయటపడ్డాం కూడా. కరోనా వైరస్ విస్తరించిన దేశాలు, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కోలుకుంటున్న వారు ఎక్కువగానే ఉన్నారు. కేరళలో మూడు కేసులు నమోదైతే ముగ్గురూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కూడా లెక్కల్ని తీస్తే 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి వైరస్ సోకినా ప్రాణాలకొచ్చే ముప్పేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) అధికారులు చెబుతున్నారు. సార్స్, మెర్స్ వంటి వైరస్‌లతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య, విస్తరించిన దేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉంది. 80 దాటితే ముప్పు ఎక్కువ కరోనా వైరస్‌తో వృద్ధులు, రోగనిరోధక శక్తి లేని వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరణాల రేటుని కూడా పరిశీలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారికి వైరస్ సోకితే కాస్త ప్రమాదకరమైతే 30 ఏళ్లకు లోబడి ఉన్న వారు అసలు భయపడనక్కర్లేదు. -
కోవిడ్-19 : 18 నెలల్లో తొలి వ్యాక్సిన్
జెనీవా : ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ నిరోధక టీకాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19 నిరోధకానికి సంబంధించిన మొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. అయితే ఈలోపు అందుబాటులో ఉన్న వనరులతోనే ఈ వైరస్‌పై పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అన్ని దేశాలకు సూచించారు. ఉగ్రవాద చర్య కంటే వైరస్ల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని డాక్టర్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రజా శత్రువుగా చూడాల్సి ఉందన్నారు. కాగా, కోవిడ్-19పై పోరాటానికి డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కోవిడ్-19 నిరోధక టీకాలు, మందుల పరిశోధనల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 400 మంది శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు ప్రాణాంతక కోవిడ్-19 చైనాలో కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఒకటి మంగశవారం బీజింగ్‌ను చేరుకుని వైరస్ నిరోధక చర్యల్లో సాయం అందించడం మొదలుపెట్టిందని చైనా ఆరోగ్య కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి : ప్రాణాంతక కరోనా పేరు మార్పు -
కరోనాపై డబ్ల్యూహెచ్ఓ యుద్ధం
బీజింగ్: చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మహమ్మారి నావల్ కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. భారత్ సహా ఇప్పటికే 20 దేశాలకు ఈ వ్యాధి త్వరితగతిన విస్తరిస్తోంది. తాజాగా బ్రిటన్‌లో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 వేల మంది ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు జెనీవాలో అత్యవసరంగా సమావేశమై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కాగా, ఈ వైరస్ సోకిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్రిశూర్ వైద్యులు తెలిపారు. చైనాకు బయల్దేరిన విమానం కరోనా వైరస్ భయంతో వూహాన్లో బిక్కుబిక్కు మంటూ ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా బీ746 విమానం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి చైనాకు బయల్దేరి వెళ్లింది. ఈ విమానంలో ఐదుగురు వైద్యులు అయిదుగురు, పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. 400 మంది భారతీయుల్ని తీసుకొని శనివారం మధ్యాహ్నం వెనక్కి వస్తుంది. మరోవైపు సరిహద్దు భద్రతా దళం ఐటీబీపీ ఢిల్లీలో 600 పడకల ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచింది. అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీ అంటే.. ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడి ఏదైనా వ్యాధి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఉంటే అన్ని దేశాలు కలసికట్టుగా పోరాడడానికి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీనినే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (పీహెచ్ఈఐసీ) అని అంటారు. పీహెచ్ఈఐసీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రపంచ దేశాలు ఈ వ్యాధిపై సంయుక్తంగా పోరాటం చేయాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తారు. ఇప్పటివరకు గ్లోబల్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అయిదు సార్లు విధించారు. 2009 – స్వైన్ ఫ్లూ; 2014 – ఎబోలా 2014 – పోలియో మళ్లీ పడగ విప్పినప్పుడు 2016– జికా వైరస్ 2019– ఎబోలా -
చైనాను వణికిస్తున్న ‘కరోనా’
వూహాన్: పొరుగుదేశం చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. నిన్నమొన్నటివరకూ వూహాన్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైందనుకున్న సూక్ష్మజీవి కాస్తా ఇప్పుడు ఖండాలు దాటి తైవాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియాలకూ పాకినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంగళవారం నాటికి చైనాలో ఈ వైరస్ బారిన పడ్డవారు సుమారు ఆరుగురు మరణించగా మరో 300 మంది వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. చైనా కొత్త సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువై ఈ కరోనా వైరస్ మరింత విజృంభిస్తుందన్న అంచనాలతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. మరోవైపు ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వ నిపుణుడు ఝాంగ్ నాన్షాన్ సోమవారం ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. గత నెల చివరిలో తొలిసారి ఈ కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలిసింది. మధ్య చైనాలోని వూహాన్ ప్రాంతంలో తొలి కేసు నమోదు కాగా తరువాతి కాలంలో బీజింగ్, షాంఘై, గువాంగ్డాంగ్ ప్రాంతాల్లోనూ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. మంగళవారం 80 వరకూ కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ సుమారు 300 మంది వైరస్ బారిన పడినట్లు అయింది. మరో 900 మంది వైద్యుల పరిశీలనలో ఉండటం గమనార్హం. వేగం దాని లక్షణం... మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది. లూనార్ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తారని, ఫలితంగా ఈ వ్యాధి మరింత ఎక్కువ మందికి సోకే అవకాశముందని చైనా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2002–2003లో సార్స్ వైరస్ విస్తృతిని గుర్తించేందుకు సాయపడిన ఝాంగ్.. ప్రభుత్వ టెలివిజన్ సీసీటీవీలో మాట్లాడుతూ గువాంగ్ డాంగ్ ప్రాంతంలో ఇద్దరికి కుటుంబ సభ్యుల నుంచే వైరస్ సోకిందని స్పష్టం చేయగా, 15 మంది వైద్యాధికారులూ వైరస్ బారిన పడినట్లు వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ఇదిలా ఉండగా.. వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని, ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని అందుకోవాలని అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశించారు. ఏమిటీ కరోనా వైరస్... జలుబు నుంచి తీవ్రస్థాయి శ్వాసకోశ వ్యాధులకు కారణమైన వైరస్ల కుటుంబానికి చెందింది. ఎంఈఆర్ఎస్, సార్స్ వంటి వాటిని ఇప్పటికే గుర్తించగా.. ఏడవ రకం వైరస్ అయిన కరోనా వైరస్‌ను వూహాన్లో తొలిసారి గుర్తించారు. చైనా, హాంకాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్కానర్ వ్యాప్తి ఇలా.. ఈ వైరస్ జంతువుల్లోను, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు. –గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. వైరస్ బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే. –వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్.. ఈ వ్యాధికి కేంద్ర స్థానమని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు అప్రమత్తం.. వూహాన్ కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఆసియాదేశాలు ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు ప్రారంభించాయి. 2002 –2003లో చైనా నుంచే సార్స్ వైరస్ వ్యాపించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై పరీక్షలు జరపడం మొదలుపెట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వైరస్ ఉధృతిని గుర్తించడంతోపాటు, నియంత్రణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరినీ థర్మోస్ స్కాన్లు తీసేందుకు థాయ్‌లాండ్ సిద్ధమవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోని మూడు విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్ ప్రక్రియ మొదలైంది. జపాన్ కూడా అప్రమత్తమయింది. అంతేకాకుండా, హాంకాంగ్‌లోనూ విమాన ప్రయాణీకుల స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరోవైపు వైరస్ ప్రభావం పర్యాటక రంగంపై పడుతుందన్న అంచనాలతో ఆసియా స్టాక్ మార్కెట్లలో షేర్లు పతనమయ్యాయి. -
దోమను చూస్తే... ఇంకా దడదడే!
దేశంలో మలేరియా కేసుల నమోదులో గణనీయ తగ్గుదల కనిపిస్తున్నా.. ఇప్పటికీ ఆగ్నేయాసియాలో మొదటి స్థానంలో మనమే ఉండటం కలవరపరుస్తోంది. అలాగే ప్రపంచంలోనూ ఆఫ్రికా దేశాల సరసన నిలబడి 11వ స్థానంలో భారత్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ మలేరియా నివేదిక–2019 స్పష్టం చేసింది. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఆగ్నేయాసియాలో 11 దేశాలుంటే, వాటిల్లో కేవలం 3 దేశాల్లోనే 98 శాతం మలేరియా కేసులు నమోదయ్యాయి. అందులో భారత్‌లోనే ఎక్కువగా 58 శాతం కేసులు నమోదవగా.. ఇండోనేసియాలో 30 శాతం, మయన్మార్‌లో 10 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే మలేరియా మరణాలు సైతం భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 శాతం మలేరియా కేసులు 19 దేశాల్లోనే నమోదవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఐదేళ్లలో భారత్‌లో తగ్గుముఖం.. 2020 నాటికి మలేరియా కేసుల సంఖ్యను 40 శాతం కంటే ఎక్కువగా తగ్గించాలని, 2030 నాటికి మలేరియాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు మార్గనిర్దేశనం చేసింది. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ ముందుకు సాగుతోందని, సాపేక్షికంగా చూస్తే మలేరియా కేసులు గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2014లో భారత్‌లో 11.02 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా, 562 మంది చనిపోయారు. అయితే తర్వాత మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2018లో మలేరియా కేసుల సంఖ్య ఏకంగా 3.99 లక్షలకు తగ్గింది. మరణాల సంఖ్య కూడా 85కు పడిపోయింది. ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభు త్వం విడుదల చేసిన నివేదికలో నూ వెల్లడించింది. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2014లో 5,189 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 1,327 మలేరియా కేసులే నమోదయ్యాయి. 38 దేశాలు మలేరియా రహితం.. మన పక్కనే ఉన్న మాల్దీవులు, శ్రీలంక దేశాలు మలేరియా రహితంగా కొనసాగుతున్నాయి. మొత్తం 38 దేశాలు మలేరియా రహితమని ధ్రువీకరించడం గమనార్హం. ఇక 2018లో 27 దేశాల్లో 100 కంటే తక్కువ మలేరియా కేసులున్నట్లు తేలింది. ప్రపంచంలో గతేడాది ఏకంగా 4.05 లక్షల మంది మలేరియా కారణంగా మరణించారని నివేదిక తెలిపింది. అందు లో 2.72 లక్షల (67%) మంది ఐదేళ్ల పిల్లలే కావడం గమనార్హం. ఈ మరణాల్లో 85 శాతం భారత్ సహా ఆఫ్రికన్ ప్రాంతంలోనే సంభవించడంపై విచారం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో మలేరియాను ఎదుర్కోవాలన్న సవాల్లో పురోగతి మందగించిందని ప్రపంచ మలేరియా నివేదిక వ్యాఖ్యానించింది. వెయ్యిలో 57 మందికి.. 2010–18 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియా తీవ్రత తగ్గిందని ప్రపంచ మలేరియా నివేదిక తెలిపింది. 2010లో ప్రతీ వెయ్యిలో 71 మంది మలేరియాకు గురికాగా, 2018లో ఆ సంఖ్య 57 కేసులకు పడిపోయింది. ఏదేమైనా 2014–2018 వరకు మలేరియా వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గింది. గర్భిణీలు, పిల్లలు ఎక్కువ గా మలేరియా బారిన పడుతున్నా రు. వీరిపై దృష్టి పెట్టకపోతే ఎటువంటి పురోగతి సాధించలేమని మలేరియా నివేదిక తెలిపింది. -
ఇష్టారాజ్యంగా సిజేరియన్లు
కంకిపాడుకు చెందిన విజయలక్ష్మి అక్టోబర్ 29న ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో చేరింది. బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు చేసేది లేక ఓకే అన్నారు. అర గంటలోనే సిజేరియన్ ప్రసవం పూర్తయింది. మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచి రూ.48 వేల బిల్లు వేసి ఇంటికి పంపారు. సాక్షి, అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో సుఖప్రసవం గగనమైంది. సుఖప్రసవానికి అవకాశం ఉన్నా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు డబ్బు కోసం సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు తగ్గిపోతుండగా, ప్రైవేటులో మాత్రం ఏటా పెరుగుతుండటం ఆందోళన పెంచుతోంది. సిజేరియన్ ప్రసవం వల్ల తల్లీబిడ్డకు ఇబ్బందులుంటాయని తెలిసినా కొంతమంది వైద్యులు సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి.. తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారికి, అధిక రక్తపోటు ఉన్నవారికి, హెచ్ఐవీ సోకిన గర్భిణులకు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు ప్రసవానికి వెళ్లినా సిజేరియన్లు చేస్తున్నారు. విజయవాడలాంటి నగరాల్లో ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు 62.16 శాతం సిజేరియన్ ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో తగ్గిన సిజేరియన్లు రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య సగటున 44.91 శాతంగా ఉంది. ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరగ్గా ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 40 శాతానికి తగ్గకుండా ఉండే సిజేరియన్ ప్రసవాల సంఖ్య ఇప్పుడు 30.27 శాతానికి దిగొచ్చింది. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఏటా పెరుగుతూ ఇప్పుడా సంఖ్య 61.04 శాతానికి చేరి కలవరపెడుతోంది. అంటే.. ప్రసవానికి వచ్చిన ప్రతి వంద మందిలో 61 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్కో సిజేరియన్‌కు కనిష్టంగా రూ.30 వేలు, గరిష్టంగా రూ.60 వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. సిజేరియన్లతో వచ్చే సమస్యలివే.. మొత్తం ప్రసవాల్లో గర్భిణులకు ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల 15 శాతం సిజేరియన్ ప్రసవాలు అవసరమవుతాయని, అంతకుమించి జరిగితే తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. దక్షిణాది దేశాల్లో ఈ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని తాజాగా వెల్లడించింది. - సిజేరియన్ వల్ల తల్లికి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. - అనస్థీషియా (మత్తు మందు) రియాక్షన్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్‌లోనూ అనేక రకాలు ఇబ్బందులు తలెత్తుతాయి. - రెండో ప్రెగ్నెన్సీ సమయంలో తల్లీబిడ్డకు ఇబ్బందులు తలెత్తుతాయి. - గాయం మానడానికి ఎక్కువ రోజులు సమయం పడుతుంది. - ఎక్కువగా రక్తస్రావం జరిగి కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. 20 శాతం లోపే ఉండాలి వాస్తవానికి 20 శాతం లోపే సిజేరియన్లు ఉండాలి. తల్లికీ, బిడ్డకూ రిస్క్ జరిగితే పేషెంట్లు, వారి బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది ప్రసూతి వైద్యులు సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్లు తక్కువ. వైద్యులతో పాటు పేషెంట్ కుటుంబీకులు కూడా వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుంటే సిజేరియన్లు తగ్గించవచ్చు. – డా.దుర్గాప్రసాద్, కమిషనర్, వైద్యవిధాన పరిషత్ -
నగరాలు.. రోగాల అడ్డాలు
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాలు అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. ట్రాఫిక్ మొదలుకొని ఫాస్ట్‌ఫుడ్ వరకు అనేక అంశాలు ఆరోగ్యంపై చూపెడుతున్న ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నగర జీవనశైలి వ్యాధులకు నిలయంగా మారుతోందని పేర్కొంది. ‘ఆరోగ్య నగరాలను ఎలా తయారు చేయాలి’అనే అంశంపై ఇటీవల ఒక నివేదిక తయారు చేసింది. ట్రాఫిక్ రద్దీ, మద్యం తాగి వాహనాలు నడపడం, సీటు బెల్టు, హెల్మెట్ ధరించకపోవడం, ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, వృద్ధులను పట్టించుకోకపోవడం ఇలా పలు సమస్యలు నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. వివిధ అంశాలపై విశ్లేషణ చేసింది. ట్రాఫిక్ రద్దీ.. నగరాలు, పట్టణాల్లో రహదారులు దారుణంగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ సరిగా లేకపోవడం, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి ఏడాది 5–29 సంవత్సరాల వయస్సు గలవారు 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. 5 కోట్ల మంది వరకు గాయపడుతున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. హెల్మెట్లు, సీట్ బెల్ట్‌ల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. రహదారులను మరింత సురక్షితంగా మార్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. మానసిక అనారోగ్యం.. మరోవైపు పేదరికం, నిరుద్యోగం, ట్రాఫి క్, శబ్ద కాలుష్యం, మౌలిక సదుపాయాలు, పచ్చని ప్రదేశాలు లేకపోవడం పట్టణవాసులు ఎదుర్కొంటున్న మరికొన్ని అడ్డంకులు. ఈ సమస్యలన్నీ మానసిక అనారోగ్యాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. దీంతో రద్దీ అధికంగా ఉంటుంది. శబ్ద కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి కలిపి సామాజిక ఒంటరితనానికి దారితీస్తాయి. నగరాల్లో గాలి నాణ్యత తగ్గింది. ప్రతీ పది మందిలో 9 మంది రోజూ కలుషితమైన గాలిని పీల్చుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా . వాయు కాలుష్యంతో గుండె, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారితీస్తుంది. పెరుగుతున్న పట్టణ హింస.. పట్టణాలు, నగరాల్లో హింస పెచ్చుమీరుతోంది.15–44 ఏళ్ల మధ్య వయసు వారు అధికంగా హింసకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులతో సహా ప్రాణాంతకమైన హింసతో ఏటా 10 లక్షల మంది గాయపడుతున్నారు. వేలాది మంది హత్య కు గురవుతున్నారు. అధిక జనాభా సాంద్రత ఉన్న నగరాల్లో హింస ఎక్కువగా కనిపిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారం.. అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారం, పానీయాలను అందించే ఫాస్ట్‌ఫుడ్ దుకాణాలు నగర ఆరోగ్యానికి సవాల్‌గా మారింది. ఆహార పదార్థాల మార్కెటింగ్ పిల్లలను లక్ష్యంగా చేసుకుం టు న్నాయి. బయటి ఆహారానికి నగర ప్రజలు అలవాటు పడుతుండటంతో బీపీ, షుగర్, ఊబకాయం అధికమవుతున్నాయి. కొరవడుతున్న శారీరక శ్రమ.. గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, బీపీ, కొన్ని కేన్సర్లను నివారించడంలో శారీరక శ్రమ సాయపడుతుంది. వ్యాయామం చేయడానికి బహిరంగ, పచ్చని ప్రదేశాలు లేకపోవడంతో శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇదే నగర పౌరులను అనారోగ్యంగా మార్చుతోంది. వృద్ధులకు వసతులు ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య ఇతర వయసుల వారికంటే వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా నగర నిర్మాణాలుండాలి. పిల్లలు దూరంగా వెళ్లిపోవడం, భాగస్వామి చనిపోవడంతో వృద్ధులు ఒంటరితనానికి గురవుతున్నారు. సామాజిక సంబంధాలు విచ్ఛిన్నం కావడంతో వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. కాబట్టి నగరాల్లో వృద్ధులకు ఆరోగ్య కేంద్రం, సూపర్ మార్కెట్, సమాజ జీవితంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. -
ప్లాస్టిక్ భూతం.. అంతానికి పంతం
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణవిుంచింది. ఇటీవలికాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచి్చన మృత తిమింగలం ఉదరంలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. నేలనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాలను ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అనర్థాలపై పౌరసమాజం స్పందిస్తోంది. ఇదిలా ఉద్యమరూపం సంతరించుకుంటే ఉపద్రవం తొలగుతుందన్న భరోసా కలుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్ ఫోమ్ కప్పులు, కోడిగుడ్డు, మాంసం ట్రేలు, ప్యాకింగ్ పీనట్స్, కోట్ హ్యాంగర్స్, యోగర్ట్ కంటైనర్స్, ఇన్సులేషన్, ఆటబొమ్మలు. రీసైక్లింగ్ మేనేజ్ చేయగలిగినవి ప్యాకేజింగ్ ఫిలిం, షాపింగ్ బ్యాగ్స్, బబుల్ ర్యాప్, ఫ్లెక్సిబుల్ బాటిల్స్, వైర్ అండ్ కేబుల్ ఇన్సులేషన్, బాటిల్ టాప్స్, డ్రింకింగ్ స్ట్రాస్, లంచ్ బాక్సులు, ఇన్సులేటెడ్ కూలర్లు, ఫ్య్రాబ్రిక్ అండ్ కార్పెట్ టారప్స్, డైపర్స్. తెనాలి (గుంటూరు జిల్లా): ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్ అండ్ త్రో’ ప్లాస్టిక్ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా రూపొందించాలని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. ప్లాస్టిక్ వస్తువులకు కూరగాయలు... గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటి తెనాలిలో రోజుకు అర టన్ను చొప్పున నెలకు 15 టన్నులు ప్లాస్టిక్ చెత్త వస్తోంది. రీసైక్లింగ్‌కు వీలుకాని 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను మున్సిపాలిటీ నిషేధించింది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తడిచెత్త, పొడిచెత్త పేరుతో వేర్వేరుగా చెత్తను సేకరించటమే కాకుండా ప్లాస్టిక్ చెత్తను కూడా సేకరిస్తున్నారు. ప్రజలనూ భాగస్వాముల్ని చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత ఇక్కడి గాంధీనగర్ రైతుబజారులో ‘ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి వెళ్లండి...కూరగాయలు తీసుకెళ్లండి’ అనే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా చేపట్టారు. స్వచ్ఛందంగా ముందు కొచ్చిన రైతులు షేక్ అబ్దుల్ రషీద్, రావిపూడి శ్రీనివాసరావు స్టాల్స్‌లో అమలు చేస్తున్నారు. ‘ప్లాస్టిక్‌కు బదులుగా కూరగాయలు’ ప్రారంభంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ బీవీ రమణ తదితరులు ఉచితంగా క్లాత్ బ్యాగులు.. ప్రతిరోజూ 10 కిలోలకు పైగా వస్తువులను ఇచ్చి కూరగాయలు తీసుకెళుతున్నట్టు రైతుబజారు ఏస్టేట్ అధికారి గుంటూరు రమేష్ చెప్పారు. ప్లాస్టిక్‌ను శానిటేషను సిబ్బంది తీసుకెళుతున్నారు. స్పందించిన శారదా సర్వీస్ సొసైటీ నిర్వహించిన వైద్యశిబిరంలో, గుడ్డతో చేసిన చేతిసంచులను ప్రజలకు పంపిణీ చేయటం విశేషం. ఇదేరీతిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి మొవ్వా సత్యనారాయణ సంస్థ పేరుతో 500 చేతిసంచులను రూపొందించి, సభ్యులకు, స్థానికులకు పంపిణి చేయనున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ వస్తువులకు నోటుపుస్తకాలు... నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు సహకారంతో కృష్ణా బాలకార్మిక విద్యాలయ పథకం ఇదే తరహాలో ప్లాస్టిక్ సేకరణకు ఉపక్రమించారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలోని పాఠశాలలో విద్యార్థులను కలిశారు. ఎవరైతే ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలను సేకరించి తీసుకొస్తారో వారికి నోటు పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. దీంతో పాఠశాల్లోని 120 మంది విద్యార్థులు కాలనీలో తిరిగి, వ్యర్థాలను సేకరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయరెడ్డికి అందజేశారు. తొలిరోజునే ఆ విధంగా 50 కిలోల ప్లాస్టిక్ చెత్త వచ్చింది. కిలోకు లాంగ్ సైజ్ నోటుబుక్ చొప్పున విద్యార్థులకు అందజేశారు. ఈ విధానాన్ని కొనసాగిసూ్తనే కృష్ణాజిల్లాలోని 16 బాల కార్మిక పాఠశాలల్లో అమలు చేస్తామని ఆంజనేయరెడ్డి ప్రకటించారు. సేకరించిన ప్లాస్టిక్ చెత్తను విజయవాడ నగర పాలక సంస్థకు అప్పగిస్తున్నారు. ఎక్స్పైరీ తేదీ లేని ప్లాస్టిక్... ఏ వస్తువుకైనా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది...ప్లాస్టిక్ మినహా అని చెప్పాలి. వీటిలో ఒక్కసారి వాడి పారేసే కప్పులు, క్యారీబ్యాగులు, నీళ్ల సీసాలు, బాటిల్ మూతలు, స్ట్రాలు, స్పూన్లు, ఆహారంపై ర్యాపర్లు, పాలప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనెలు, మసాలాల సాచెట్లు, చాక్లెట్లు, చిప్స్ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు వీలుపడదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ డీకంపోజింగ్‌కు వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కలుగా ‘మైక్రో ప్లాస్టిక్స్’గా మారతాయి. నీరు, మట్టిని కలుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్ చేసి సమస్యలను సృష్టిస్తాయి. ప్లాస్టిక్ తయారీలో వాడే హానికర రసాయనాలు జంతువుల కణజాలంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రంలోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని వెల్లడెంది. రీసైక్లింగ్ చేయదగిన వస్తువులు... బేవరేజ్ బాటిల్స్, ఫుడ్ జార్స్, క్లాతింగ్ అండ్ కార్పెట్ ఫైబర్, కొన్ని షాంపూలు, మౌత్‌వాష్ బాటిల్స్.డిటర్జంట్, బ్లీచ్ బాటిల్స్, స్నాక్ బాక్సులు, మిల్కా జగ్గులు, బొమ్మలు, బకెట్లు, క్రేట్స్, కుండీలు, గార్డెన్ ఫర్నిచర్, చెత్త కుండీలు రీసైక్లింగ్ అతికష్టం క్రెడిట్ కార్డులు, కిటికీ, తలుపు ఫ్రేములు, గట్టర్స్, పైపులు, ఫిటింగ్స్, వైర్, కేబుల్, సింథటిక్ లెదర్, నైలాన్ ఫాబ్రిక్స్, బేబీ బాటిల్స్, కాంపాక్ట్ డిసు్కలు, మెడికల్ స్టోరేజి కంటైనర్స్, కార్ పార్ట్స్, వాటర్ కూలర్ బాటిల్స్. ఉడతా భక్తి సాయం... ఆరేళ్లుగా రైతుబజారులో ఉంటున్నా...ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఆ చెత్త సేకరణకు నేనూ, మరో రైతు ఉడతాభక్తిలా సహకరించాలని ప్లాస్టిక్‌ను తీసుకుని కూరగాయలు ఇస్తున్నాం. కనీసం ఒక నెలరోజులు ఇస్తాం. – షేక్ అబ్దుల్ రషీద్, రైతు రాష్ట్రంలోనే తొలిసారి... రైతుబజారులో ప్లాస్టిక్ వస్తువులు తీసుకుని కూరగాయలు ఉచితంగా ఇవ్వడం ఇదే తొలిసారి. సామాజిక బాధ్యతగా ప్రజలను చైతన్యం చేయాలనేది మా ఉద్దేశం. – గుంటూరు రమేష్, ఏస్టేట్ అధికారి, రైతుబజారు -
డెంగీ వ్యాక్సిన్ కనబడదేం?
సాక్షి, హైదరాబాద్: నాలుగైదేళ్లుగా సీజన్ మారగానే దేశానికి డెంగీ జ్వరం పట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా లక్షలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయ్. మన రాష్ట్రంలోనూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండగా.. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు పండుగ చేసుకుంటున్నాయి. అయినా దేశవ్యాప్తంగా డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అనేక దేశాలు డెంగీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా భారత్ మాత్రం దాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు రాకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కార్పొరేట్ లాబీయింగ్ వల్లే డెంగీ వ్యాక్సిన్ ఇంతవరకు భారత్‌లోకి రాలేదనే చర్చ జరుగుతోంది. అయితే.. వ్యాక్సిన్ పనితీరుపై వివాదాలు నెలకొన్నందునే భారత్ ముందడుగు వేయడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో 5.24 లక్షల భారతీయులకు.. ప్రపంచంలో అనేక దేశాలను డెంగీ వణికిస్తోంది. భారత్‌లో గత నాలుగేళ్లుగా డెంగీ జ్వరాలు ప్రజలను పీల్చి పిప్పిచేశాయి. కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం డెంగీ కేసులను లెక్కగట్టగా.. ఒక్క 2015లోనే దేశంలో లక్ష మందికి డెంగీ సోకింది. అందులో 220 మంది చనిపోయారు. 2016లో 1.26 లక్షల మందికి డెంగీ జ్వరం రాగా.. ఇందులో 245 మంది చనిపోయారు. 2017లో 1.88 లక్షల మందికి డెంగీ రాగా, అందులో 325 మంది చనిపోయారు. 2018లో 1.01 లక్షల మంది బాధితుల్లో.. 172 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 5,504 మందికి డెంగీ రాగా ఐదుగురు చనిపోయినట్లు తేల్చారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 967మంది చనిపోయారు. తెలంగాణలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో 17,476 మందికి డెంగీ సోకగా.. 8 మంది మాత్రమే చనిపోయినట్లు కేంద్ర నివేదిక పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసులను మాత్రమే కేంద్రం పరిగణన లోకి తీసుకుంది. ప్రైవేటుతో కలిపితే ఈ సంఖ్య ఏకంగా 5రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో డెంగీ కేసులు నమోదవుతుంటే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్‌తో డెంగీకి చెక్! ‘డెంగ్వాక్సియా’అనే వ్యాక్సిన్ 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మాత్రం ఈ ఏడాది మాత్రమే ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. అలాగే గతేడాది చివర్లో యూరోపియన్ కమిషన్ కూడా.. యూరప్‌లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలలో ఈ టీకా వాడేందుకు అనుమతిచ్చింది. మరో 19 దేశాలలో ఈ వ్యాక్సిన్‌కు పచ్చజెండా ఊపారు. తాజాగా లాటిన్ అమెరికా సహా ఆసియాలోని 10 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు ‘డెంగ్వాక్సియా వ్యాక్సిన్’ను గతంలో ఓసారి డెంగీకి గురైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మరోసారి వారికి డెంగీ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్పొరేట్ లాబీకి తలొగ్గేనా? లక్షలాది మందికి ఇప్పటికే ఓసారి సోకినప్పటికీ మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ను ఎందుకు ప్రవేశపెట్టడంలేదన్న చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్‌కు అనుమతిస్తే డెంగీ ద్వారా వచ్చే వ్యాపారమంతా పోతుందన్న భావనలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు వ్యక్తం చేసినట్లు వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. భారత్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఉంది డెంగీ వ్యాక్సిన్ దేశంలో 4వ దశ ట్రయల్స్‌లో ఉంది. ఎఫ్‌డీఏ అనుమతి కూడా వచ్చినందున నాలుగో దశ ట్రయల్ తర్వాత ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. – డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్,సన్‌షైన్ ఆసుపత్రి, హైదరాబాద్. ఫ్లూ వ్యాక్సిన్ మాత్రమే ఉంది ప్రస్తుతం దేశంలో డెంగీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని ప్రవేశానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియదు. ప్రస్తుతం కేవలం ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. – డాక్టర్ శ్రీనివాసరావు, సంచాలకులు, ప్రజారోగ్యం, తెలంగాణ ప్రభుత్వం -
ఆటల్లేవ్.. మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: ఆరుబయట పిల్లలు ఆడే ఆటలతో ఒకప్పుడు కాలనీలు సందడిసందడిగా ఉండేవి. పాఠశాలల రోజుల్లోసాయంత్రం పూట.. వేసవి సెలవుల్లో రోజంతా ఆటలాడి శారీరకంగా అలసి పిల్లలందరూ ఇళ్లకు చేరేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి దాదాపు కనుమరుగైంది. స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక పిల్లలంతా గంటల తరబడి వాటితోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లలోనే అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఇదే విషయమే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, వీడియో గేమ్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. వీటి వాడకం పెరిగితే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, మున్ముందు మధుమేహం వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదముందని హెచ్చరించింది. రెండు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు రోజుకు గంట కంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించకూడదని, అంతకంటే చిన్నపిల్లలు అసలే వాడకూడదని తాజాగా నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. శారీరక శ్రమకు సెలవు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వల్ల పెద్దలు, పిల్లలు శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 23 శాతం మంది పెద్దలు, 80 శాతం టీనేజీ పిల్లలు శారీరకంగా ఉత్సాహంగా ఉండటం లేదని తేలింది. అత్యధికంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేల్చింది. మరో విస్మయం కలిగించే వాస్తవం ఏంటంటే ఊబకాయం వల్ల చిన్నతనంలోనే పిల్లల్లో డయాబెటిక్ రావడం. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల్లో తలనొప్పి అత్యంత సాధారణమైంది. అలాగే ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా ఉండటంలేదు. అలాగే సెల్ఫోన్లకు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలు సామాజిక సంబంధాలకు దూరమవుతున్నారు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా గ్రహించడంలేదు. యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది చూస్తున్నారని, అందులో పిల్లలు కూడా ఉన్నారని తేల్చింది. ఇది పిల్లల మెదళ్లపై చెడు ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అంతేకాదు అనేక పాఠశాలలు పిల్లలకు ట్యాబ్‌లను తప్పనిసరి చేయడం కూడా సమస్యలకు కారణంగా నిలుస్తుంది. ప్రపంచంలో ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో 42 శాతం మంది ట్యాబ్‌లను వినియోగిస్తున్నారని తేలింది. మాటలే కరువయ్యాయి.. పిల్లలు ప్రధానంగా తల్లిదండ్రులు, ఇతరులతో పరస్పరం మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో మనుషులతో సంబంధాలు కోల్పోతున్నారు. 24 గంటలూ మొబైల్లోనే మునుగుతూ ఇంట్లో పెద్దలతో మాట్లాడటం అనే మాటనే మరిచిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరిగిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక అనేక స్కూళ్లు చిన్నప్పటి నుంచే ట్యాబ్‌లను ప్రవేశపెట్టాయని, కొందరు విద్యార్థులు తమ రోజువారీ అసైన్మెంట్ల కోసం గాడ్జెట్లను వాడుతున్నారని తేలింది. ఆహారం తినిపించడానికీ గాడ్జెట్లే.. అనేకమంది తల్లిదండ్రులు పిల్లలను దారిలోకి తెచ్చుకోవడానికి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలకు ఆహారం తినిపించడానికి తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలు వినడంలేదన్న భావనతో వారి చేతికి సెల్‌ఫోన్ లేదా ట్యాబ్‌లు ఇచ్చి తినిపించడమో చేస్తున్నారు. వాటిల్లో వీడియో గేమ్స్ చూపించడం ద్వారా తినిపిస్తున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుంచి మొదలు పెడితే చిన్నచిన్న పట్టణాల్లోనూ 60–70 శాతం మంది తల్లిదండ్రులు గాడ్జెట్లనే ఆశ్రయిస్తున్నారని తేలింది. నూతన మార్గదర్శకాలు.. ► చిన్నపిల్లలు ఆరోగ్యవంతంగా పెరగాలంటే వాళ్లు తక్కువగా కూర్చొని.. ఎక్కువ శారీరకంగా ఆడాలి. ►ఐదేళ్ల చిన్నారులు అత్యంత తక్కువ సమయంపాటే టీవీలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల ముందు కూర్చోవాలి. ►ఎక్కువ సేపు ఆడాలి. అలసిపోయి నిద్రపోవాలి. అలాగే పిల్లలు మానసికంగా ఎదగడానికి పుస్తకాలు చదవాలి. కథలు చెప్పాలి. పజిల్స్ ఆడాలి. పాటలు పాడాలి. అదే వారి అభివృద్ధికి కారకంగా నిలుస్తుంది. ►ఏడాది లోపు పిల్లలు తప్పనిసరిగా రోజుకు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. ►ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలు కనీసం 3 గంటలపాటు వివిధ రకాల శారీరకమైన ఆటల్లో నిమగ్నమవ్వాలి. ►రెండేళ్లలోపు పిల్లలు గంటకు మించి ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో ఆడకూడదు. వాళ్లు రోజుకు కనీసం 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి. ►మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు 3 గంటలపాటు ఏదో ఒకరకమైన శారీరక శ్రమలో ఉండాలి. ఆడుతూ ఉండాలి. కనీసం గంటపాటు ఒకరకమైన ఆ వయసుకు సంబంధించిన కఠినమైన వ్యాయా మం ఉండాలి. ఈ వయసు వారు రోజుకు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. -
యాంటీ‘భయో’టిక్స్
సాక్షి, హైదరాబాద్: కాయిల్స్ వెలిగించినా దోమలు వచ్చి దాని చుట్టూ ఎగురుతుంటే ఏమంటాం? దోమలకు కాయిల్స్‌ను తట్టుకునే శక్తి వచ్చిందనుకుంటాం. అంటే దోమల నివారణకు వాడే కాయిల్స్ పనిచేయడంలేదన్న మాట. అలాగే మనుషుల్లో వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములకు కూడా యాంటీ బయోటిక్స్ మందులను తట్టుకునే శక్తి వచ్చేసింది. దీంతో జబ్బులు నయం కాకుండా పోతున్నాయి. అలా ఎన్ని యాంటీ బయోటిక్స్ మందులు వాడినా తట్టుకొని నిలబడే సూక్ష్మక్రిముల వల్ల జబ్బులు తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మంది చనిపోతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెలువరించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రతీ ఏడాది కోటి మంది చనిపోతారని హెచ్చరించింది. అంతేకాదు 2030 నాటికి యాంటీ బయోటిక్ పనిచేయని పరిస్థితి ఏర్పడటం, కుటుంబాల్లో ఎవరో ఒకరు చనిపోవడం తదితర కారణాలతో 2.40 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోతారని పేర్కొంది. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడకంలో వివిధ దేశాలతోపాటు భారత్ కూడా ముందుంది. ఇక్కడ ఏటా లక్ష మంది వరకు చనిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి మన దేశంలో 15 లక్షల మంది ఈ కారణంగా చనిపోతారని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదికను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక మెడికల్ ప్రాక్టీషనర్లు విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్ మందులను ఇస్తున్నారని, అవి పనిచేయని పరిస్థితులు ఏర్పడటంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. చిన్నచిన్న జబ్బులకు అధిక డోస్.. నానాటికీ సూక్ష్మక్రిములు యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకుని మొండిగా తయారవుతుండటంతో ఇప్పుడు చాలా రకాల వ్యాధులకు అత్యవసర మందులు కూడా పనిచేయకుండా పోతున్నాయి. చిన్నా చితకా జబ్బులకు కూడా మందుల్లేని పరిస్థితి ఏర్పడుతోంది. క్షయ, మలేరియా, గనేరియా, న్యూమోనియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సర్వసాధారణ వ్యాధులు కూడా పెను సమస్యలుగా పరిణమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. దీనివల్ల వైద్యులు ఎప్పుడో చిట్టచివరి అస్త్రంగా వాడాల్సిన యాంటీ బయోటిక్ మందులను తొలి దశలోనే వాడేయాల్సి వస్తుంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చినా ఇప్పుడు యాంటీ బయోటిక్స్ వాడటం సాధారణమై పోయింది. సాధారణ మందులతో తగ్గే అవకాశమున్నా త్వరగా కోలుకోవాలన్న ఆతృతతో బాధితులు కూడా వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. వైద్యులు కూడా వాటినే వాడేలా ఒత్తిడి చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం పెన్సిలిన్ అనే యాంటీ బయోటిక్స్ వేస్తే ఎటువంటి మొండి జబ్బు అయినా ఇట్టే తగ్గేది. కానీ అవి ఇప్పుడు పనిచేయడంలేదు. ఆ తరువాత అధిక డోస్ కలిగిన యాంటీ బయోటిక్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ పరిస్థితి ప్రపంచానికే సవాల్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూక్ష్మక్రిములు మన యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకుంటూ పోతే మున్ముందు చిన్నచిన్న గొంతు ఇన్ఫెక్షన్లు, చిన్నపాటి దెబ్బల వంటివి కూడా ప్రాణాలను కబలించడం ఖాయం. తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం దాదాపు 25 వేల మెడికల్ షాపులున్నాయి. గ్రామాల్లో అనర్హులైన అనేకమంది మెడికల్ ప్రాక్టీషనర్లూ ఉన్నారు. ప్రతి చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్ ఇవ్వడంతో అవి పనిచేయక జబ్బులు ముదురుతున్నాయి. పైగా వైద్యుల ప్రిస్కిప్షన్ లేకపోయినా మందుల దుకాణాలు యాంటీ బయోటిక్స్ మందులను ఇచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పురుగుమందుల వాడకం.. వ్యవసాయ పంటలకు విచ్చలవిడిగా పురుగుమందులను చల్లుతున్నారు. కూరగాయలు, ధాన్యపు గింజలకూ వాడేస్తున్నారు. అటువంటి ఆహార పదార్థాలను తిన్నాక మనుషుల్లోనూ వాటి ఆనవాళ్లు ఉండిపోతున్నాయి. దీంతో ఏదైనా జబ్బు వస్తే యాంటీ బయోటిక్స్ పనిచేసే పరిస్థితి ఉండటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. దీనివల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక గేదెలు అధికంగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కోళ్లకూ వాడుతున్నారు. తద్వారా పాల ఉత్పత్తులు వినియోగించడం, చికెన్ తినడం వల్ల మనుషుల్లోనూ ఈ సూక్ష్మక్రిములు చేరుతున్నాయి. ఇది మానవాళికి ప్రమాదకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక నేపథ్యంలో తెలంగాణలోనూ నిఘా ఏర్పాటుపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారిస్తుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో గుర్తించిన సమస్యలు - యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా అమ్మేయడం, అవసరం లేకున్నా వాడేయడం - వేగంగా కోలుకోవాలని, తక్కువ ఖర్చులో రోగం నయం అయిపోవాలని తాపత్రయపడడం - పశువులకు ఉద్దేశించిన యాంటీ బయోటిక్స్ కూడా తేలికగా దొరకడం - వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇవ్వకూడని యాంటీ బయోటిక్ మందులు మెడికల్ షాపుల్లో సులభంగా లభించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలు... - యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గించేందుకు ఆయా దేశాల్లో జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అందుకు అవసరమైన నిధులను కేటాయించాలి. - యాంటీ బయోటిక్స్ వాడకాన్ని తగ్గించేందుకు, వ్యవసాయంలో పురుగు మందులను, పశువులకు ఇష్టారాజ్యంగా ప్రేరేపిత యాంటీ బయోటిక్స్ వాడకుండా చూసేందుకు ఒక పటిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. - యాంటీ బయోటిక్స్‌ను తట్టుకొని నిలబడుతున్న సూక్ష్మక్రిములపై యుద్ధం చేసేలా సరికొత్త పరిజ్ఞానంతో కూడిన మందులను తీసుకురావాలి. అందుకు అవసరమైన నిధులను ఆయా దేశాలు కేటాయించాలి. -
ఆరోగ్యానికి ‘టెన్’షన్
శాస్త్ర సాంకేతికత, విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయ్. మొండిరోగాలకు చికిత్స అందుబాటులోకి వస్తున్నా.. ప్రాణాంతక రోగాలూ పెరిగిపోతున్నాయ్. ఈ నేపథ్యంలో మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నడుం బిగించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 300కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ కోసం ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించింది. సార్వత్రిక ఆరోగ్య పథకాల కింద 100 కోట్ల మంది లబ్ధి పొందేలా ఈ ప్రణాళికను రచించింది. అత్యవసర చికిత్సలందించడం ద్వారా మరో 100 కోట్ల మందిని కాపాడటం, ఇంకో 100 కోట్ల మంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా చేయడమే ఈ ప్రణాళిక లక్ష్యం. 2019 సంవత్సరంలో డబ్ల్యూహెచ్వోతోపాటుగా ఎన్జీవోలు దృష్టి సారించాల్సిన పది ముప్పులను గుర్తించడం జరిగింది. 1 వాయు కాలుష్యం,వాతావరణ మార్పు వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారు. మరో వంద కోట్లమందికి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గాలి కాలుష్యానికి సంబంధించి సురక్షిత స్థాయి అంటూ లేదు. కాలుష్యం ఏమాత్రం ఉన్నా అది ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. అందుకే.. వాయు కాలుష్యం ‘సరికొత్త పొగాక’ంటూ డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడాస్ అధన్మన్ అభివర్ణించారు. 2 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లేమి భారతదేశంలో చాలా చోట్ల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఇండియా స్పెండ్ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంగా ఉండడమన్నది కేవలం రోగాలు రాకుండా ఉండేందుకు మాత్రమే కాదు. కనీస వైద్య సదుపాయం ప్రజల హక్కు 40 ఏళ్ల క్రితమే 1978 నాటి ‘అల్మా–అటా డిక్లరేషన్’ ప్రకటించింది. 2018 అక్టోబర్ 26న ఈ డిక్లరేషన్‌ను పునరుద్ఘాటిస్తూ 197 దేశాలు సంతకాలు చేశాయి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించేందుకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పటిష్టం చేస్తామని ఆ దేశాలు ప్రతినబూనాయి. 3 ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ వైరస్) ఈ వైరస్ ఎవరిపై ఎప్పుడు విజృంభిస్తుందో అంచనాకు చిక్కడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ఈ వ్యాధి వైరస్ నిర్మూలనకు డబ్ల్యూహెచ్‌వో వివిధ దేశాలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టింది. 4 ఆరోగ్య సదుపాయాల లేమి ప్రపంచ జనాభాలో 22% మంది సరైన వైద్యసదుపాయాలు అందని ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కూడా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దుర్భిక్షం, కరువు, అంతర్గత ఘర్షణల కారణంగా వీరు కనీస ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారని, ఫలితంగా వివిధ వ్యాధులబారిన పడుతున్నారని తెలిపింది. 5 యాంటీబయోటిక్‌లు పనిచేయకపోవడం రోగాల నివారణ కోసం అధిక మోతాదులో యాంటీబయోటిక్స్‌ను వాడటం వల్ల కొంత కాలానికి రోగ కారక క్రిములు వాటిని తట్టుకునే శక్తిని సంపాదించుకుంటాయి. ప్రపంచంలో యాంటీబయోటిక్‌లను దుర్వినియోగం చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2000–2015 మధ్య కాలంలో భారత్‌లో యాంటీబయోటిక్‌ల వినియోగం 103% పెరిగిందని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (పీఎన్ఏఎస్) నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో వివిధ ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా విస్తరిస్తోందని ఆ నివేదిక వెల్లడించింది. 6 ఎబోలా వంటి ప్రాణాంతక వ్యాధులు 2018 నవంబర్‌లో కాంగోలో ఎబోలా వ్యాధి ప్రబలి 426 మంది చనిపోయారు. కాంగోకు ఎబోలా ముప్పు పొంచి ఉందని 2018 మేలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసే ఎబోలా వంటి వ్యాధులను డబ్ల్యూహెచ్‌వో ముందే గుర్తించి హెచ్చరిస్తోంది. 7 అంటువ్యాధులు కానివి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈరకమైన వ్యాధులకు గురవుతున్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ వయసులోనైనా ఈ వ్యాధులు రావచ్చునని డబ్ల్యూహెచ్‌వో ఓ నివేదికలో పేర్కొంది. గుండె జబ్బులు, కేన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక అనారోగ్యం వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటివల్ల ఏటా 4.1 కోట్ల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే మరణాల్లో 71% వాటా ఈ వ్యాధులదేనని ఆ నివేదిక తెలిపింది. మద్యం, పొగాకు వినియోగాన్ని మానేయడం, శారీక శ్రమ/వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 8 డెంగ్యూ ప్రపంచ జనాభాలో సగానికిపైగా డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏటా 5 నుంచి 10 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. 2020 నాటికి డెంగ్యూ మరణాలను 50% తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఓ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. 9 హెచ్ఐవీ ఎయిడ్స్‌గా పిలిచే మహమ్మారి హెచ్ఐవీ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2030 నాటికి ఎయిడ్స్ రహిత ప్రపంచంగా అన్ని దేశాలు కృషిచేస్తున్నాయని యునిసెఫ్ గతేడాది నివేదికలో పేర్కొంది. 2018–2030 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 3.6 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తగిన నివారణ చర్యలు తీసుకుంటే ఏటా 20 లక్షల మందిని ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడొచ్చని పేర్కొంది. 10 టీకాలంటే భయం వివిధ వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకాలు వేయడం సాధారణం. అయితే.. చాలా మంది అపోహలు, భయాల వల్ల టీకాలు వేయించుకోవడానికి వెనకాడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. టీకాల ద్వారా ఏటా 20–30 లక్షల మరణాలను నివారించవచ్చని పేర్కొంది. 2019లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెర్వికల్ కేన్సర్‌ను రూపుమాపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రణాళికలు వేస్తోంది. -
పెరిగిపోతున్న సిజేరియన్లు..
లండన్: సిజేరియన్తో తల్లీబిడ్డ దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించినా.. పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు లేదు. ఇతర దేశాలతో పాటు, మన దేశంలోనూ ప్రసవాల కోసం సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో 2005–06లో సిజేరియన్ల సంఖ్య 9శాతం ఉండగా, 2015–16లో ఇది 18.5 శాతానికి చేరినట్లు ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. బెల్జియంలోని ఘెంట్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య 2000–15 మధ్య ఏడాదికి 3.7శాతం చొప్పున పెరిగిందని, 2000లో సిజేరియన్ ద్వారా 1.6 కోట్ల మంది శిశువులు జన్మించగా..2015 నాటికి ఈ సంఖ్య 2.97 కోట్లకు పెరిగినట్టు తేలింది. కాన్పు కష్టమైనప్పుడే సిజేరియన్... నొప్పులు మొదలైన తర్వాత సహజంగా కాన్పు జరగడం కష్టమై, తల్లీబిడ్డకు హానిజరిగే సంకేతాలున్నప్పుడు మాత్రమే సిజేరియన్‌ను ఆశ్రయించాలని పరిశోధకులు సూచించారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణికి బ్లీడింగ్ అవుతున్నప్పుడు, బీపీ సంబంధిత వ్యాధులున్నప్పుడు మాత్రమే ప్రసవానికి ఆపరేషన్ నిర్వహించాలని చెప్పారు. వైద్య పరంగా ఇలాంటి క్లిష్ట సందర్భాలు కేవలం 10 నుంచి 15 శాతం మందికే ఎదురవుతాయని పరిశోధకుడు అగాఖాన్ తెలిపారు. కానీ, చాలామంది మహిళలు పురిటినొప్పులు భరించలేక భయంతో సిజేరియన్‌ను ఎంపిక చేసుకుంటున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. చాలా దేశాల్లో అవసరం లేకున్నా సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 15 దేశాల్లో సిజేరియన్ చేయించుకుంటున్న వారి సంఖ్య 40 శాతానికి పైగా ఉండటం గమనార్హం. 169 దేశాలపై అధ్యయనం... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి 169 దేశాల సమాచారాన్ని తీసుకుని పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. దక్షిణాసియాలో 2000 నుంచి ఏడాదికి 6.1శాతం చొప్పున సిజేరియన్ల ఆపరేషన్ల శాతం పెరుగుతూ 2015కు 18.1 శాతానికి చేరింది. ఆఫ్రికాలో మాత్రం సిజేరియన్లను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. బ్రెజిల్, చైనాల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్లో చదువుకున్న వాళ్లలో 54.4శాతం మంది సిజేరియన్‌ను ఎంపిక చేసుకుంటుండగా.. చదువుకోని 19.4 శాతం మంది మాత్రమే దీన్ని ఎంపిక చేసుకోవడం గమనార్హం. అమెరికా, బ్రెజిల్, బంగ్లాదేశ్‌ల్లో 25 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. పాలకులు చట్టాలు తేవాలి: తల్లీబిడ్డా ఆరోగ్యం దృష్ట్యా క్లిష్ట సమయాల్లో మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ చేసేలా వైద్యులు చొరవ తీసుకోవాలని, పాలకులు కూడా దీనిపై దృష్టి సారించి ప్రత్యేక చట్టాలు తేవాలని పరిశోధకు డు సాండల్ అభిప్రాయపడ్డారు. అవసరంలేకున్నా ఆపరేషన్ చేయించుకోవడం దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. -
‘కలుషిత పోలియో’ కలవరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ కలుషిత పోలియో మందు కలవరం సృష్టిస్తోంది. కేంద్రం ప్రకటించిన బ్యాచ్ నంబర్–బీ10048 కలుషిత వ్యాక్సిన్లను రాష్ట్రంలోని అనేకమంది చిన్నారులకు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు నిర్ధారించాయి. ఎంతమంది చిన్నారులకు వేశారో లెక్క తేలడం లేదు. ఆయా వ్యాక్సిన్ల వల్ల చిన్నారులకు ఎలాంటి ప్రమాదం తలెత్తదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. అవి ఏమాత్రం కలుషితమైనవి కావని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఓఎస్డీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ తాడూరి గంగాధర్ అన్నారు. కలుషిత వ్యాక్సిన్లు వాడారన్న ప్రచారంతో పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పిల్లల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వాడకం తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లోని చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేయించారని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఘజియాబాద్ బయోమెడ్ సంస్థ వీటిని తయారు చేసింది. 3 బ్యాచ్‌ల్లో 1.5 లక్షల యూనిట్ల కలుషిత వ్యాక్సిన్లను పంపిణీ చేయగా 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వీటిని వేశారు. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాక్సిన్లను చాలాకాలం క్రితమే వెనక్కి తీసుకున్నారు. టైప్–2 పోలియో వైరస్‌తో కలుషితమైన ఈ పోలియో చుక్కల ద్వారా ఇప్పటికే నాశనమైన ఓ వైరస్ చిన్నారుల్లోకి తిరిగి ప్రవేశించే అవకాశముంది. కలుషితమైనట్లు చెబుతున్న వ్యాక్సిన్లు రాష్ట్రంలో 15 లక్షల డోసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. వాటిని వెనక్కి తెప్పిస్తున్నామని, కొన్నింటిని తెప్పించామంటున్నారు. పోలియో రహితంగా ప్రకటించినా... 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ‘పోలియో ఫ్రీ’ దేశంగా ప్రకటించింది. 2016లో టైప్–2 స్ట్రెయిన్ ఉండే వ్యాక్సిన్లను మొత్తం వెనక్కు తీసుకుంది. మన దేశం అప్పటికే ఉన్న టైప్–2 వ్యాక్సిన్ నిల్వలను ధ్వంసం చేసింది. ఏప్రిల్ 2016 తర్వాత టైప్–1 లేదా టైప్–3 వ్యాక్సిన్లు బైవాలెంట్ వ్యాక్సిన్లనే అమ్మాలి. కానీ, ఘజియాబాద్ కంపెనీ నిషేధిత టైప్–2 వ్యాక్సిన్ ఎలా సరఫరా చేసింద నేది ప్రశ్నార్థకంగా మారింది. నెల క్రితం రాష్ట్రంలో పెంటావాలెంట్ టీకాతో ఓ చిన్నారి మృతి చెందిం ది. కొందరికి ప్రభుత్వమే హైదరాబాద్‌లో చికిత్స చేయించింది. దీనిపై సర్కారు నివేదిక తయారు చేసినా దాన్ని బయటకు పొక్కనీయలేదు. -
క్యాన్సర్ ఖర్చులకు బీమా భరోసా
మనిషిని శారీరకంగానే కాక ఆర్థికంగాను కుంగదీసేసే ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం క్యాన్సర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 2017లో 15 లక్షలుగా ఉన్న కేసులు 2020 నాటికి 17.3 లక్షలకు పెరిగే అవకాశమున్నట్లు అంచనా. క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అనుకోవడానికి లేదు. 70–90 శాతం క్యాన్సర్ కేసులు జీవన విధానం, పర్యావరణ కాలుష్య సంబంధమైనవే ఉంటున్నాయి. క్యాన్సర్ చికిత్స వ్యయాలు మామూలుగా రూ.25 లక్షల పైగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం బీమా సంస్థలు ప్రత్యేకంగా క్యాన్సర్ పాలసీలు అందుబాటులోకి తెచ్చాయి. వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలు, వీటిని తీసుకునేటప్పుడు చూడాల్సిన అంశాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. అసలెందుకు తీసుకోవాలి.. క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లయితే.. హాస్పిటలైజేషన్ తప్పనిసరి అనే నిబంధనతో పనిలేకుండా నిర్దిష్ట సమ్ అష్యూర్డ్‌ను క్యాన్సర్ బీమా ప్లాన్ ద్వారా అందుకోవచ్చు. అన్ని దశల్లో క్యాన్సర్‌కి కవరేజీ ఉంటుంది. ఆయా పాలసీని బట్టి ప్రతి దశలోనూ కొంత మొత్తం అందుకోవచ్చు. వీటితో పాటు ప్రారంభ దశలోనే ఉన్నట్లు తేలినా భవిష్యత్‌లో కట్టాల్సిన ప్రీమియంల నుంచి మినహాయింపు ఉండటం, వివిధ రకాల క్యాన్సర్స్‌కి కూడా క్లెయిమ్ చేసుకోగలగడం మొదలైన ఫీచర్లు ఈ పాలసీల్లో ఉంటున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్యాన్సర్ చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా బీమా పాలసీ రక్షణనిస్తుంది. ఇంతటి కీలకమైన క్యాన్సర్ పాలసీని ఎంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. అత్యధికంగా సమ్ అష్యూర్డ్ ఇస్తే... ఒక్కో క్యాన్సర్‌కి ఒక్కో రకమైన చికిత్స ఉంటుంది. దానికి తగ్గట్లే చికిత్స వ్యయాలూ మారుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవాలి. దేశీయంగా చికిత్స వ్యయాలను పరిశీలిస్తే కనీసం రూ. 20–25 లక్షల సమ్ అష్యూర్డ్నిచ్చే పాలసీని తీసుకోవడం మంచిది. వెయిటింగ్ పీరియడ్.. దేశీ బీమా సంస్థలు అందించే క్యాన్సర్ ఇన్సూరెన్స్ పాలసీలు వెయిటింగ్ పీరియడ్‌తోనే ఉంటున్నాయి. అంటే.. నిర్దేశిత గడువు తీరేదాకా క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే పాలసీలు చూసుకోవాలి. సాధారణంగా ఇది 180–365 రోజుల మధ్యలో ఉంటోంది. వివిధ దశల్లో చెల్లింపులు.. ప్రాథమిక స్థాయి నుంచి క్రిటికల్ స్థాయి దాకా ప్రతి దశలోని క్యాన్సర్‌కి బీమా కవరేజీ ఉంటోంది. ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు బైటపడితే బీమా సంస్థను బట్టి సమ్ అష్యూర్డ్‌లో 20–25 శాతం దాకా లభిస్తోంది. ఒకవేళ క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నట్లయితే మొత్తం 100 శాతం లభిస్తుంది. కొన్ని ప్లాన్స్‌లో 150 శాతం దాకా కూడా చెల్లింపులు ఉంటున్నాయి. మినహాయింపులు.. పరిమితులు క్యాన్సర్ పాలసీ తీసుకునేటప్పుడు కింది అంశాలకు సంబంధించి కూడా కవరేజీ ఉంటుందో లేదో చూసుకోవాలి. ఏవైనా మినహాయింపులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ►అప్పటికే క్యాన్సర్ ఉంటే కవరేజీ. Üచర్మ క్యాన్సర్‌కి కవరేజీ. ►క్యాన్సర్‌కి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హెచ్ఐవీ, లైంగిక వ్యాధుల మొదలైనవి కారకాలుగా ఉన్నా. ►జన్మతః వచ్చిన క్యాన్సర్, రసాయన.. అణు కాలుష్యం వల్ల వచ్చినా, అణుధార్మికత కారణంగా వచ్చే క్యాన్సర్‌కి కవరేజీ. సంతోష్ అగర్వాల్ అసోసియేట్ డైరెక్టర్, లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం, పాలసీబజార్డాట్కామ్ -
మానసిక రుగ్మతల్లో.. ఆంధ్రప్రదేశ్ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మానసిక వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. పట్టణాలకే పరిమితమైన మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు ఇప్పుడు పల్లెల్లోనూ కనిపిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, కుటుంబ కారణాలతో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతున్నా అందుకు తగిన వైద్యం మాత్రం అందడం లేదు. తగిన సంఖ్యలో మానసిక వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది బాధితులు ఆర్ఎంపీ డాక్టర్ల వద్దకు వెళుతుండటం.. వారు మోతాదుకు మించిన మందులు ఇస్తుండటంతో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఏ ప్రభుత్వాస్పత్రిలోనూ సైకియాట్రీ నిపుణులు లేరు. అటు ప్రైవేటు రంగంలోనూ మానసిక వైద్య నిపుణులు తక్కువగానే ఉన్నారు. దీర్ఘకాలిక మానసిక సమస్యలకు సరైన వైద్యం లేకపోవడం, కౌన్సెలింగ్ ఇచ్చేవారు లేకపోవడంతో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏపీలో 50 లక్షల మందికి పైగా బాధితులు దేశంలో మానసిక రుగ్మతలతో బాధపడే రోగులు ఎక్కువ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతుండటం అందరినీ కలవరపరుస్తోంది. ఏటా ప్రతి వేయి మందిలో 102 నుంచి 104 మంది కొత్త రోగులు ఏదో ఒక మానసిక సమస్యతో వైద్యుల వద్దకు వెళ్తున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి పైగానే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దేశంలో మానసిక రుగ్మతల విషయంలో రాష్ట్రంలో ఆందోళన చెందే విధంగా పరిస్థితి ఉన్నట్టు వెల్లడించింది. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో 80 శాతం మందికి సరైన కౌన్సెలింగ్ లేకపోవడం, వారి మానసిక స్థితికి తగ్గట్టు సకాలంలో వైద్యం అందించలేకపోవడం వల్లే మృతి చెందుతున్నట్టు తేలింది. ఇలా మానసిక ఆందోళనకు గురవుతున్న వారి వయసు 16 నుంచి 44 ఏళ్ల మధ్య లోపే ఉండటం విస్మయం కలిగిస్తోందని గుంటూరుకు చెందిన ఓ మానసిక వైద్యుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మానసిక వ్యాధులకు సంబంధించి విశాఖపట్నంలో మాత్రమే ప్రభుత్వ మానసిక చికిత్సాలయం ఉంది. గతేడాది అక్కడ కొత్తగా నమోదైన ఔట్పేషెంట్ల సంఖ్య 49 వేలకు పైగా ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు ఎక్కడ? 2017లో కేంద్ర ప్రభుత్వం ‘మెంటల్ హెల్త్ యాక్ట్’ చట్టాన్ని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలకు నిధులు కూడా మంజూరు చేసింది. ప్రతి జిల్లాలో మానసిక వైద్యుడు, మనస్తత్వ నిపుణులతోపాటు ప్రత్యేక సిబ్బందిని నియమించి పేషెంట్ల రిజిస్ట్రీని నమోదు చేయాలని సూచించింది. మానసిక రోగులకు గుర్తింపు లేని వైద్యులు ఎవరైనా వైద్యం చేసినట్టు ఫిర్యాదులొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రత్యేక కమిటీని నియమించాలని ఆదేశించింది. మానసిక రోగుల పట్ల వివక్ష చూపించకూడదని, వారికి తక్షణమే వైద్యసేవలు అందించాలని, చికిత్సా విధానాలు సంబంధిత అథారిటీకి చెప్పాలని కూడా తెలిపింది. దీనికోసం విశాఖపట్నంలో రూ.30 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏర్పాటు చేయలేదు. కేంద్రం పలుసార్లు సూచించినా మానసిక వైద్యానికి ఎలాంటి మార్గదర్శకాలూ రూపొందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మానసిక రుగ్మతల లక్షణాలివే.. - ఎదుటివారితో పోల్చుకుంటూ వారికంటే తక్కువగా ఉన్నామని బాధపడటం - ఆర్థిక, కుటుంబ కారణాలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవడం - తనకేమైనా ఆపద వస్తుందేమోనని ముందుగానే భయపడి ఒత్తిడికి గురవడం - ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు లోనవడం - జనంలో ఇమడలేక, ఒంటరిగా ఉండలేక ఒత్తిడికి గురవడం - చదువులతో ఒత్తిడికి గురై విద్యార్థులు మానసిక ఆందోళనతో ఉండటం - జీవితంలో అనుకున్నంతగా ఎదగలేకపోతున్నామని ఆందోళనకు గురవడం త్వరలోనే మార్గదర్శకాలు ఇప్పటికే కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. వాటిని త్వరలోనే అమలు చేస్తాం. వీటికి అనుగుణంగా వైద్యం అందిస్తాం. రాష్ట్రంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే. –డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు -
కిల్లర్ కలుపు.. గ్లైఫొసేట్!
మనం అమాయకంగా కలుపును చంపుదామని గ్లైఫొసేట్ రసాయనాన్ని చల్లుతున్నాం.. అది మనందరి దేహాల్లోకీ చొరబడి కేన్సర్‌ను, ఇంకా ఎన్నో మాయ రోగాలను పుట్టిస్తోంది.. మన భూముల్లోకి, నీటిలోకి, గాలిలోకి.. మనుషులు, జంతువుల మూత్రంలోకి.. చివరకు తల్లి పాలల్లోకీ చేరిపోయింది.. పంట భూములకు ప్రాణప్రదమైన వానపాములను, సూక్ష్మజీవరాశిని మట్టుబెట్టి నేలను నిర్జీవంగా మార్చేస్తున్నది. దీనివల్ల కేన్సర్ వస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారసహితంగా ప్రకటించి ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఇరవయ్యేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చావు డప్పు కొడుతోంది! అయినా, దీన్ని నిషేధించడానికి పాలకులు తటపటాయిస్తున్నారు. అదీ.. బహుళజాతి కంపెనీల సత్తా! కొన్ని దేశాలు నిషేధిస్తున్నాయి, ఎత్తివేస్తున్నాయి. మన దేశపు పంట పొలాల్లో ఈ కిల్లర్ కెమికల్ ఐదేళ్లుగా అక్రమంగా హల్చల్ చేస్తున్నా మన పాలకులు నిద్రనటించారు. కలుపు చప్పున చస్తుందన్న ఒక్క సంగతి తప్ప.. అది మన మూలుగల్నే పీల్చేస్తుందన్న సంగతి అమాయక రైతులకు తెలియజెప్పకపోవడం వల్ల దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. కూలీలు లేరు.. ఇదీ లేకపోతే సేద్యం ఎలా? అనే వరకు వచ్చింది. ఇన్నాళ్లూ చలనం లేని ప్రభుత్వాలు ఎట్టకేలకు ‘నిషేధం లాంటి ఆంక్షలు’ విధించిన నేపథ్యంలో.. కచ్చితంగా ఏరిపారేయాల్సిన గ్లైఫొసేట్‌పై ‘సాగుబడి’ ఫోకస్!∙ కలుపు మందులు మార్కెట్లో చాలా రకాలున్నాయి కదా.. గ్లైఫొసేట్పైనే ఎందుకింత రగడ జరుగుతున్నట్లు? ఎందుకంటే.. ఇది మామూలు కలుపు మందు కాదు. సాధారణ కలుపు మందు అయితే పిచికారీ చేసినప్పుడు ఏయే మొక్కలపై ఏయే ఆకులపై పడిందో అవి మాత్రమే ఎండిపోతాయి. ఆ మొక్క మొత్తం నిలువెల్లా ఎండిపోదు. దీన్నే ‘కాంటాక్ట్’ కెమికల్ అంటారు. ఇది అంతర్వాహిక(సిస్టమిక్) స్వభావం కలిగినది. అంటే.. గ్లైఫొసేట్ మొక్కపైన ఆకుల మీద పడినా చాలు.. దాని కాండం నుంచి పిల్ల వేర్ల వరకు నిలువునా ఎండిపోతుంది. అంటే.. ఇది చల్లిన పొలంలో మట్టిలోని వానపాములు, సూక్ష్మజీవరాశి కూడా చనిపోతుంది. దీని అవశేషాలు భూగర్భ నీటిని, వాగులు, వంకలు, చెరువు నీటిని కూడా కలుషితం చేస్తుంది. గ్లైఫొసేట్ పిచికారీ చేసే కార్మికులు ఏమాత్రం పీల్చినా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. మూత్రపిండాలు, కాలేయం, పెద్దపేగులో సూక్ష్మజీవరాశి దెబ్బతింటాయి. కేన్సర్ వస్తుంది. నాడీ వ్యవస్థ, నిర్ణాళ గ్రంథుల వ్యవస్థ అస్థవ్యస్థమవుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కారకమని ప్రకటించిన డబ్లు్య.హెచ్.ఓ. అత్యంత ప్రమాదకరమైన వ్యవసాయ పురుగుమందులు/కలుపు మందులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్య.హెచ్.ఓ.) ప్రకటించిన 15 రకాల్లో గ్లైఫొసేట్ ముఖ్యమైనది. డబ్లు్య.హెచ్.ఓ. అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.సి.) తర్జనభర్జనల తర్వాత 2017లో ఇది వాడిన చోట కేన్సర్ వ్యాపిస్తోందని తేల్చిచెప్పింది. గ్లైఫొసేట్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికాలో మోన్శాంటో కంపెనీపై సుమారు 4 వేల కేసులు దాఖలయ్యాయి. గ్లైఫొసేట్ వల్లనే తనకు కేన్సర్ సోకిందని ఆరోపిస్తూ డి వేనె జాన్సన్(46) అనే కార్మికుడు దావా వేశాడు. అయినా, కంపెనీల ఒత్తిళ్ల నేపథ్యంలో గ్లైఫొసేట్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వాలు తటపటాయిస్తూ.. నామమాత్రపు ఆంక్షలతో సరిపెడుతున్నాయి. 1974 నుంచి మార్కెట్లో.. కొత్త ఔషధం కనుగొనే ప్రయోగాల్లో అనుకోకుండా గ్లైఫొసేట్ 1950లో వెలుగుచూసింది. అయితే, ఇది కలుపుమందుగా పనికొస్తుందన్న సంగతి 1970లో బయటపడింది. మోన్శాంటో కంపెనీ 1974లో దీన్ని కలుపుమందుగా ప్రపంచవ్యాప్తంగా అమ్మటం మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ముఖ్యంగా జన్యుమార్పిడి పంటలు ఎక్కువగా సాగయ్యే దేశాల్లో గ్లైఫొసేట్ ఎక్కువ వాడుకలో ఉంది. ఇప్పటి వరకు 860 కోట్ల లీటర్లు వాడగా.. గత పదేళ్లలోనే ఇందులో 72% వాడారు. అమెరికా, అర్జెంటీనా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా,కొలంబియా, దక్షిణాఫ్రికాతోపాటు భారత్, శ్రీలంక దేశాల్లో విరివిగా వాడుతున్నారు. దీని వాడకంపై అమెరికాలోని 18 రాష్ట్రాల్లో, కెనడాలో 8 రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. కొలంబియా, శ్రీలంకల్లో నిషేధం విధించినా తర్వాత తొలగించారు. ఐరోపా యూనియన్ కూటమిలోని 9 దేశాలు గ్లైఫొసేట్ విక్రయ లైసెన్సులను రెన్యువల్ చేయరాదని నిర్ణయించాయి. మూడేళ్లలో నిషేధిస్తామని ఫ్రాన్స్ ప్రకటించగా, సాధ్యమైనంత త్వరగా దీని వాడకం నిలిపేయాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా.. పత్తి పొలాల్లో కలుపు మందులు చల్లుతూ విషప్రభావంతో నేలకొరిగిన/తీవ్ర అనారోగ్యం పాలైన రైతులు, రైతు కూలీల ఉదంతాలు మహారాష్ట్రలోని యావత్మాల్ తదితర ప్రాంతాల్లో గత ఏడాది వెల్లువెత్తిన ఉదంతాలతో గ్లైఫొసేట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి అక్రమంగా సాగులోకి వచ్చిన బీజీ–3 పత్తి వంగడంతో దీని వినియోగం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు, మూడేళ్లుగా అక్రమ బీజీ–3 పత్తి తోడై.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల నల్లరేగడి భూముల్లో గ్లైఫొసేట్ కలుపుమందు విచ్చలవిడిగా మరణమృదంగం మోగిస్తోంది. దీని వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మన దేశంలో గ్లైఫొసేట్‌ను తేయాకు తోటల్లో, ‘పంట లేని ప్రదేశాల్లో’నూ వాడొచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, అధికారుల అసలత్వం వల్ల ఇది బీజీ–3 పత్తితోపాటు సోయా, బత్తాయి, మామిడి తదితర తోటల్లో కూడా కలుపు నివారణకు ఇది వాడుతున్నారు. రైతులు అప్పటికప్పుడు కలుపు బాధ పోతుందన్న సౌలభ్యం చేస్తున్నారే తప్ప.. దీర్ఘకాలం పాటు అది తెచ్చే చేటును గ్రహించలేకపోతున్నారు. వీరికి అవగాహన కలిగించాల్సిన వ్యవసాయ శాఖలు నిమ్మకునీరెత్తినట్టు ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతుల వైపు దృష్టి సారించలేకపోతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ గ్లైఫొసేట్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ప్రత్యామ్నాయాలు ఏమిటి? అయితే, రైతులకు ప్రత్యామ్నాయం ఏమిటి? అన్నది ప్రశ్న. గ్లైఫొసేట్ వల్ల పొంచిఉన్న పర్యావరణ సంక్షోభం, కేన్సర్ తదితర జబ్బుల ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారోద్యమాన్ని చేపట్టాలి. రైతుల పొలాల్లో, తోటల్లో కలుపు తీతకు ఉపాధి కూలీలను ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. దీనితో పాటు.. చిన్న, మధ్యతరహా రైతులకు అందుబాటులో ఉండే సులభంగా కలుపు తీసే పరికరాలు, చిన్న తరహా కలుపు యంత్రాలను ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తేవాలి. వచ్చే ఏడాది బీజీ–3తో గ్లైఫొసేట్ కూడా పోతుంది ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పత్తిలో 85% బీజీ–2 ఉంటుంది.. 15% వరకు బీజీ–3 ఉంటుంది. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాల వల్లనే రైతులు గ్లైఫొసేట్ పిచికారీ చేస్తున్నారు. గ్లైఫొసేట్‌ను దాదాపు నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి వచ్చే ఏడాది నాటికి.. బీజీ–3 పత్తి విత్తనాలను విత్తన కంపెనీలు తయారు చేయవు, గ్లైఫొసేట్ కూడా అందుబాటులో ఉండదు, రైతులు కూడా కొనరు. కలుపు తీతకు ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని, కలుపుమందుతో రూ.2 వేలతో పోతుందని, అందుకే గ్లైఫొసేట్ వాడుతున్నామని రైతులు అంటున్నారు. అయితే, ఎకరానికి రూ.4 వేలు ఖర్చయినా గుంటకతోనో ట్రాక్టరుతోనో, కూలీలతోనో కలుపు నివారించుకోవాలే తప్ప గ్లైఫోసేట్ వంటి ప్రమాదకరమైన కలుపుమందులు వాడకూడదు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన వివిధ పద్ధతుల్లోనే రైతులు కలుపు నివారించుకునే ప్రయత్నం చేయటం రైతులకు, పర్యావరణానికి కూడా మంచిది. – డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్ బీజీ–3 పత్తిపై ఐదేళ్లుగా నిర్లక్ష్యం ప్రపంచ ఆహార సంస్థ గ్లైఫొసేట్ కలుపుమందు వల్ల మనుషులకు కేన్సర్ వస్తున్నదని గత ఏడాది నిర్థారించింది. దీన్ని తట్టుకునే పత్తి హైబ్రిడ్ (బీజీ–3) పంట తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం నుంచే సాగులో ఉంది. 2013 నుంచి అనేక దఫాలు పూర్తి ఆధారాలతో మేం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చాం. పట్టించుకోనందునే గత రెండేళ్లలో లక్షలాది ఎకరాలకు విస్తరించింది. మన దగ్గర పంటల్లో వాడటంతోపాటు.. కెనడా తదితర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న కందిపప్పు, బఠాణీలు, సోయా నూనెలు కలుపుమందులను తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలవే. వీటిల్లో గ్లైఫొసేట్ అవశేషాలు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి రావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. వీటిని దిగుమతి చేసుకునే ముందే కఠినమైన పరీక్షలు జరిపి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆహారంపై కచ్చితంగా లేబుల్ ముద్రించాలని మన చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. మనం గ్లైఫొసేట్ వాడమని చెప్పలేదు కాబట్టి, దీని వల్ల భూమిలో జీవరాశికి, నీటి వనరులకు, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరుగుతుందో ప్రభుత్వం కనీస అధ్యయనం కూడా చేయకపోవడం విడ్డూరం. సోయా, నువ్వు పంటలను నూర్పిడి చేయడంలో సౌలభ్యం కోసం కూడా పంటపైనే గ్లైఫొసేట్ పిచికారీ(డెస్సికేషన్) చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ఈ అవశేషాల ప్రభావం ఏమిటన్నది ఆందోళనకరం. – డా. జీవీ రామాంజనేయులు (90006 99702), సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ గ్లైఫొసేట్‌ను కేంద్రం నిషేధించాలి ఉపాధి కూలీలతో కలుపు తీయించాలి గ్లైఫొసేట్ కలుపుమందు వాడకం ఇంతకు ముందు నుంచే వున్నా.. కలుపుమందును తట్టుకునే బీజీ–3 పత్తి వల్ల రెండేళ్లుగా బాగా పెరిగింది. మహారాష్ట్రలోని యావత్మాల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవల సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు తెలిశాయి. ప్రభుత్వం ఆంక్షలు విధించినా అధికారుల ఉదాసీనత వల్ల దీని అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. పంట వేయడానికి ముందు, మొలక దశలో గడ్డి మొలిచినప్పుడు గ్లైఫొసేట్ కొడుతున్నారు. పాములు, పురుగూ పుట్రా చేరతాయని భయంతో కొడుతున్నారు. ఇదేమో కలుపును చంపే మందు.. అయితే, గులాబీ పురుగుకు కూడా గ్లైఫొసేట్ వాడుతున్నారని, ఇది పురుగుమందులకూ లొంగకుండా పోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. యావత్మాల్ ప్రాంతంలో పత్తి చేలల్లో వీళ్లు కలుపు అని చెబుతున్న మొక్కల్లో ఎక్కువ భాగం కొయ్య (తోట)కూర ఉంది. కొందరు రైతులు, కూలీలు దీన్ని పీకి ఇంటికి తీసుకెళ్తున్నారు.. వండుకు తినడానికి. అటువంటి దానిపై అత్యంత ప్రమాదకరమైన రసాయనంగా, కేన్సర్ కారకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గ్లైఫొసేట్‌ను చల్లుతున్నారు. ఈ పూట కలుపు చావడం గురించే ఆలోచిస్తున్నారు తప్ప.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి నశించి మంచి నల్లరేగడి భూములు కూడా నిస్సారమైపోతున్న సంగతి.. నీరు, గాలి కలుషితమవుతున్న సంగతిని ఎవరూ పట్టించుకోవడం లేదు.గ్లైఫొసేట్ చల్లుతూ ఉంటే కొన్నాళ్లకు కొయ్య తోట కూర వంటి కొన్ని రకాల మొక్కలే కొరకరాని కొయ్యలవుతాయి. అమెరికా పొలాల్లో కొన్ని రకాల కలుపు మొక్కలు 20 అడుగుల ఎత్తు వరకు బలిసిపోతున్నాయి. ఇప్పుడు చల్లితే మున్ముందు వేసే పంటల మీద కూడా దీని దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్లైఫోసేట్ను నిషేధించి, సక్రమంగా అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని కలుపుతీతకు అనుసంధానం చేస్తే రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. యంత్రం అవసరం లేకుండా నడిచే కలుపుతీత పరికరాలను రైతులకు విరివిగా అందించాలి. – డా. దొంతి నరసింహారెడ్డి (90102 05742), డైరెక్టర్, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పోలియోకు సూది మందు!
సాక్షి, హైదరాబాద్: రెండు చుక్కల మందుతో పోలియో మహమ్మారికి చెక్ పెట్టిన ప్రపంచం రెండోదశ పోరుకు సిద్ధమవుతోంది. చుక్కల మందు స్థానంలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్‌కు ప్రమాణాలను నిర్ధారించే ప్రయత్నాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో ఈ చుక్కల మందు వాడే అవకాశం లేని పరిస్థితుల్లో కొత్త సూది మందును సిద్ధం చేసేందుకు హైదరాబాద్ వేదికగా బుధవారం చర్చలు మొదలయ్యాయి. స్వచ్ఛంద సంస్థ పాథ్, బెల్ అండ్ మెలిండా గేట్స్లతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (అమెరికా), వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్, ప్రభుత్వ సంస్థలు సమావేశమై కొత్త సూదిమందు ఏ మోతాదులో ఇవ్వాలి? ఎలాంటి ప్రమాణాలతో తయారు చేయాలి? వంటి అంశాలపై చర్చించారు. ఈ వివరాలను పాథ్ ప్రాజెక్టు డైరెక్టర్ కుతుబ్ మహమూద్ విలేకరులకు వివరించారు. ప్రపంచ దేశాలన్నీ పోలియో రహితమైన తరువాత ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు స్థానంలో సూది మందు ఇవ్వాలని.. తద్వారా మాత్రమే పోలియో మహమ్మారి మళ్లీ విజృంభించకుండా అడ్డుకోగలమన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న చుక్కల మందులో సజీవ పోలియో వైరస్‌ను వాడుతుండగా... సూది మందులో నిర్జీవమైన పోలియో వైరస్ ఉంటుందని చెప్పారు. భారత్‌లో పోలియో కేసులేవీ లేనప్పటికీ నైజీరియా, పాక్, అఫ్గానిస్తాన్‌లో ఈ ఏడాది కొన్ని కేసులు బయటపడ్డాయని.. దీంతో ఈ సూది మందు వాడకం వాయిదా పడినట్లు అయిందని చెప్పారు. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికే రెండు రకాలుగా ఈ సూదిమందును తయారు చేస్తున్నాయని, వీటిల్లో ఒకటి మన దేశ అవసరాలకు ఏమాత్రం సరిపోదని కుతుబ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ వాడేందుకు అనుకూలమైన సాబిన్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్‌ను సిద్ధం చేసేందుకు, భారీ మొత్తంలో తయారీకి నియంత్రణ సంస్థలను సిద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలో కొత్త వ్యాక్సిన్: భారత్ బయోటెక్ ఇంకో ఐదేళ్లలో భారత్ బయోటెక్ పూర్తిస్థాయిలో సాబిన్ ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ టీకాలను తయారు చేస్తుందని సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యవసరమని, ప్రస్తుతం ఆ పనిలో ఉన్నామని బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. త్వరలోనే తొలిదశ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడతామని చెప్పారు. ఇవన్నీ పూర్తయ్యేందుకు నాలుగైదు ఏళ్లు పడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో సాబిన్ ఐపీవీ ప్రమాణాల నిర్ధారణకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారని వివరించారు. -
రాష్ట్రంలో 24 వేలకు పైగా పల్లెల్లో నీటి కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పల్లెల్లో నివసించే జనాభాకు వారి కనీస అవసరాలకు తగినంత నీరు సరఫరా కావడం లేదు. నీటి లభ్యత కూడా ఉండటం లేదని ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. విజన్ డాక్యుమెంట్లో భాగంగా రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో, ఏయే గ్రామాలకు నీటి సరఫరా ఎంత పరిమాణంలో జరుగుతోందనే వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో రాష్ట్రంలో 24,783 పల్లెలకు వాటి కనీస అవసరాలకు సరిపడా నీటి సరఫరా, లభ్యత లేదని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు ఒక్కో వ్యక్తికి అన్ని అవసరాలకు కనీసం రోజుకు 70 లీటర్ల నీరు అవసరం. ఆ మేరకైనా ప్రభుత్వాలు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. 24,783 పల్లెల్లో నివసిస్తున్నవారిలో ఒక్కో వ్యక్తికి రోజుకు 55 ఎల్పీసీడీ (లీటర్ ఫర్ కేపిటా ఫర్ డే) నీటిని కూడా సరఫరా చేయడం లేదని ప్రభుత్వ అధ్యయనంలోనే తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 4,999 పల్లెల్లో 55 ఎల్పీసీడీ నీటి సరఫరా కూడా లేదని స్పష్టమైంది. విశాఖ జిల్లాలో 3,489 పల్లెల్లో కూడా కనీసం 55 ఎల్పీసీడీ నీరు సరఫరా కావడం లేదని వెల్లడైంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత అన్ని గ్రామాలకు ఇంటింటికీ ట్యాప్ వాటర్ సరఫరా అంటూ వాటర్‌గ్రిడ్ పేరుతో హడావిడి చేశారు. అధికారులు కూడా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూపొందించారు. కానీ ఎందుకో స్వయంగా సీఎం చంద్రబాబే ఆ గ్రిడ్‌ను పక్కన పెట్టమని చెప్పడంతో అధికారులు అటకెక్కించారు. -
కొవ్వులందు ట్రాన్స్ఫ్యాట్లు వేరయా!
ట్రాన్స్ ఫ్యాట్స్.. మనం తినే కొవ్వుల్లో అత్యంత ప్రమాదకారి. ఆరోగ్యాన్ని హరిస్తోంది. ప్రాణాలను పిప్పి చేస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొవ్వులపై యుద్ధం ప్రకటించేసింది. ఆహారంలో ఈ కొవ్వులు అనేవి లేకుండా చూడాలని.. 2023 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ వాడకాన్ని ఆపేయాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో అసలు ట్రాన్స్ ఫ్యాట్స్ ఎలా ఏర్పడతాయి? వాటి వల్ల కలిగే దుష్పరిణామాలేంటో చూద్దాం. ఎలా ఏర్పడతాయి? వంటనూనెలను వేడి చేసినప్పుడు నీరు లేదా తేమ కలిస్తే ఏర్పడతాయి ఎందుకు వాడతారు? ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వఉంచడానికి ఆహారపు రుచిని పెంచేందుకు సహజంగానూ ఉంటాయా? మాంసం, పాల ఉత్పత్తుల్లో ప్రకృతి సహజంగా ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. కృత్రిమ ట్రాన్స్‌ఫాట్స్ అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలు కేకులు, పేస్ట్రీలు బ్రెడ్, బిస్కెట్లు ,శాండ్విచ్, చాక్లెట్స్, వేఫర్స్,మైక్రోవేవ్ పాప్‌కార్న్,పిజ్జా, ఐస్‌క్రీమ్,ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ ,రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు ట్రాన్స్ఫ్యాట్స్పై నిషేధం ఉన్న దేశాలు డెన్మార్క్, స్విట్జర్లాండ్,కెనడా, బ్రిటన్ అమెరికా ట్రాన్స్‌ఫ్యాట్స్ వినియోగంతో వచ్చే వ్యాధులు మధుమేహం ,గుండె సంబంధిత వ్యాధులు ,కేన్సర్ భారత్ ప్రణాళికలు ట్రాన్స్‌ఫాట్స్ కలిగిన వెజిటబుల్ ఆయిల్స్, వెజిటబుల్ ఫ్యాట్, హైడ్రోజెనేటెడ్ వెజిటబుల్ వాడ కాన్ని 2 శాతానికి తగ్గించాలని భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ప్రతిపాదిస్తోంది. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఫుడ్ ప్రోసెసింగ్ కంపెనీలు ఇప్పటివరకు 5% వరకు వాడ వచ్చని నిబంధనలు ఉన్నాయి. -
సిగతరగ
చాలా మంది సిగరెట్ మానేస్తున్నారు... మరి మీ సంగతి...? ప్రపంచవ్యాప్తంగా ధూమపానం తగ్గుముఖం పడుతోంది. ఇదొక ఆశాజనకమైన పరిణామం. ధూమపానం, పొగాకు వాడకం కనుమరుగవలేదు గాని, ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గింది. గడచిన దశాబ్ద కాలంలో దాదాపు అన్ని దేశాల్లోనూ పొగరాయుళ్ల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్లు దాదాపు వంద కోట్ల వరకు ఉన్నారు. పొగరాయుళ్లలో 80 శాతం మంది అల్పాదాయ దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంటున్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు... పొగాకుతో ‘చుట్ట’రికం పొగాకుతో ‘చుట్ట’రికం క్రీస్తుపూర్వం 1400 ఏళ్ల నాడే మొదలైంది. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని స్థానిక తెగల వారు పొగాకును దేవుని కానుకగా పరిగణించేవారు. వేడుకల్లో పొగతాగేవారు. పొగ చుట్టల నుంచి వెలువడే ధూమమేఘాల ద్వారా తమ ప్రార్థనలు భగవంతుని చేరుకుంటాయని వారు నమ్మేవారు. యూరోపియన్లు అమెరికాలో అడుగుపెట్టడం ప్రారంభమయ్యాక క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటికి పొగాకు క్రమంగా యూరోపియన్ దేశాలకు, ఆ తర్వాత శరవేగంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. బ్రిటిష్ వారి ద్వారా పొగాకు భారతదేశానికి చేరుకుంది. పొగాకు పరిచయం కావడానికి ముందు భారతదేశంలో ఎక్కువగా గంజాయితోనే పొగతాగేవారు. ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో పొగాకును ఔషధంగా పరిగణించేవారు. సిగరెట్ల కంపెనీలు వైద్యులతో వ్యాపార ప్రకటనలు ప్రచారం చేసుకునేవి. ఇరవయ్యో శతాబ్దిలో సగానికి సగం కాలం ఇలాగే గడిచింది. పొగాకు వల్ల క్యాన్సర్ వంటి అనర్థాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. పలు ప్రభుత్వాలు కూడా పొగాకు వాడకంపై ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. పొగాకు ఉత్పాదనలో టాప్–10 ►చైనా 29,95,400 ►భారత్ 7,20,725 ►ఇండోనేసియా 1,96,300 ►మలావి 1,26,348 ►జాంబియా 1,12,049 ► బ్రెజిల్ 8,62,396 ►అమెరికా 3,97,535 ►పాకిస్తాన్ 1,29,878 ►అర్జెంటీనా 1,19,434 ►మొజాంబిక్ 97,075 పొగ తక్కువ దేశాల్లో టాప్–10 దేశం – జనాభాలో పొగరాయుళ్ల శాతం ►స్వీడన్ 14.5 ►అమెరికా 15.4 ►ఆస్ట్రేలియా 16.6 ►కెనడా 17.7 ►న్యూజిలాండ్ 18.1 ►బ్రెజిల్ 18.3 ►దక్షిణాఫ్రికా 18.6 ►లగ్జెంబర్గ్ 18.8 ►ఐస్లాండ్ 19.0 ►భారత్ 19.5