Narayanpet
-
కార్మికులకు రూ.12వేల జీవనభృతి ఇవ్వాలి
నారాయణపేట: వ్యవసాయ కార్మికులందరికీ రూ.12 వేలు జీవనభృతిని ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీమ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేంత్‌రెడ్డి గతేడాది ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను ఇస్తామని, వ్యవసాయ కూలీలకు జీవన భృతి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వ్యవసాయ రంగంలో సన్న, చిన్న కారు రైతులు 50 శాతానికి పైగా వ్యవసాయ కూలీలు వ్యవసాయ ఉత్పత్తిలో మహిళా కార్మికులు అధికంగా ఉన్నారన్నారు. బీడీ, చేనేత కల్లుగీత కార్మికులకు ఇచ్చే విధంగా వ్యవసాయ కార్మికులకు నెలకు రెండు వేల పెన్షన్ వర్తింపజేయాలని, అసరా పించన్లను రూ.4 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లాలో వ్యవసాయ కార్మికులను గ్రామాల్లో పట్టణాల్లో సమీకరించి నవంబర్ 20 నుండి 30 తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, 25న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, 30న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజా, రైతు సంఘం నాయకులు హాజీ మలంగ్, వెంకట్ రాములు, నరసింహులు, కనక రాయుడు, మల్లేష్ , రాజు తదితరులు ఉన్నారు. -
ఆలస్యంగా వచ్చారు.. మిస్ అయ్యారు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రూప్–3 పరీక్షకు పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో కేంద్రంలోకి అనుమతి లభించలేదు. కలెక్టర్ తనిఖీకి వచ్చిన సమయంలోను ఆమెను సంప్రదించగా నిబంధనల ప్రకారం జరుగుతాయని చెప్పి లోపలికి వెళ్లిపోయారు. మొత్తంగా 16మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ● ధన్వాడకు చెందిన సుజాత నెలన్నర కూతురితో కృష్ణగోకులం పాఠశాలలోని పరీక్ష రాసేందుకు రాగా సమయం అయిపోయిందని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కనీసం మధ్యాహ్నం పరీక్ష కోసం వేచి చూడటానికి కేంద్రం పరిసరాల్లో కూర్చుంటుండగా పోలీసులు అనుమతించలేదు. దగ్గరలోని అంబేద్కర్ సర్కిల్ బస్ షెల్టర్‌లో గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం 4వ తరగతి చదువుతున్న తన అక్క కూతురు హాన్సికకు తన నెలన్నర కూతురుని ఇచ్చి పరీక్షకు వెళ్లింది. ● శిశుమందిర్ స్కూల్ వద్ద నలుగురు అభ్యర్థులు సెంటర్ చిరునామా ఆలస్యం కావడంతో పరీక్షకు హాజరుకాలేకపోయారు. ● మక్తల్‌కు చెందిన భార్యభర్తలు దీపిక, విజయ్ ఇరువురిలో సీఎన్ఆర్ డీసీలో భార్యకు, ప్రభుత్వ బాలికల స్కూల్లో భర్తకు కేంద్రాలు అలాట్ అయ్యాయి. బైక్‌పై ముందుగా భార్యను వదిలి తన సెంటర్‌కు భర్త వెళ్లాడు. అయితే సమయం అయిపోయిందని దీపికను అనుమతించకపోగా ఈమె తర్వాత వెళ్లిన విజయ్‌కు మాత్రం పరీక్ష రాసే అవకాశం దొరికింది. నిర్వాహకులు ఒక్కో సెంటర్లో ఒక్కోతీరుగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. -
9 రోజులు.. 68శాతం
జిల్లాలో వడివడిగా సమగ్ర కుటుంబ సర్వే ఈ ఫొటోలో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ పేరు భారతి. సమగ్ర కుటుంబ సర్వేలో ఆమెకు మద్ధెలబీడు గ్రామంలో 150 కుటుంబాలను సర్వే చేసేందుకు కేటాయించారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించిన సర్వేలో 87 కుటుంబాల సర్వేను పూర్తి చేశారు. ఒక్క కుటుంబ సమాచారం సర్వే ఫామ్‌లో నమోదు చేసేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. సర్వేలో స్వరాష్ట్రంలో వలసలకు ప్రత్యేక కాలం లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు స్థానికంగానే ఉంటున్నట్లు నమోదు చేయిస్తున్నారు. పలువురు లబ్ధిదారులు వివరాలను నమోదు చేయించిన తర్వాత మార్పులు చేర్పుల కోసం తిరిగి వారిని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడిగానే ఉన్న కుటుంబాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వివాహమైన వారు ఇంటికి అతికించిన ఎనుమరేషన్ బ్లాక్ ఇంటి సంఖ్యకు బై నెంబర్ల వేయించుకుని సర్వే వివరాలను నమోదు చేయిస్తున్నారని తెలిసింది. ●వంద శాతం పూర్తి చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా కుటుంబ సమగ్ర సర్వేను కలెక్టర్ దిశానిర్ధేశంతో వంద శాతం పూర్తి చేస్తాం. ముందుగా ఈ నెల 22 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రారంభించాం. కాగా రెండు, మూడు రోజులు ఆటు ఇటుగా పూర్తి అవుతుంది. – యోగానంద్, సీపీఓ, నారాయణపేట ఎన్యుమరేటర్లకు తప్పని తిప్పలు ఇంటింటా సమగ్ర సర్వేకు వె వెళ్లే ఎన్యుమరేటర్లకు ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9.30 గంటలు దాటితే ప్రజలు చాలామటుకు కూలి పనులకు, పొలం పనులకు వెళ్తున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకు వెళ్తే తప్ప ఉండడం లేదు. సాయంత్రం వేళల్లో వెళ్దామంటే 6 గంటల తర్వాత వాళ్లు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంటి దగ్గర ఉండే వృద్ధులను వివరాలను అడిగేందుకు ప్రయత్నిస్తున్నా వారితో సరైన సమాధానాలు రాకపోవడంతో ఏదో ఒకటి రాసుకొచ్చే పరిస్థితి ఉందని తెలుస్తోంది. నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో ఇప్పటివరకు 68శాతం పూర్తయ్యింది. ఈ నెల 9వ తేదీన ఈ సర్వే ప్రారంభం అయ్యింది. జిల్లాలో మొత్తం 1,55,999 కుటుంబాలు ఉండగా 1,06,326 కుటుంబాల వివరాలను ఇన్యుమరేటర్లు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1201 ఈ బ్లాకులకు గాను 1181 మంది ఎన్యుమరేటర్లు, 118 మంది సూపర్వైజర్లు విధుల్లోకి వెళ్లి తొలి రోజు 6,452 కుటుంబాలతో 75 ప్రశ్నలతో సమాచారాన్ని సేకరించగా.. 9 రోజులుగా చేపడుతున్న సర్వేతో 68 శాతానికి నమోదైంది. ఈ సర్వే పై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అడుగుతూ సర్వే రిపోర్టును ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటల వరకు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికను రాష్ట్ర ఉన్నాతాధికారులకు నివేదిస్తున్నారు. వంద శాతం సర్వే చేపట్టేందుకు ఇంకా 8 రోజుల సమయం ఉంది. ఆదివారం 6 శాతమే నమోదు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి ఇంటింటా సర్వేను చేపట్టారు. తొలి రోజు 6,452 కుటుంబాలను సర్వే చేయడంతో 4.1 శాతం నమోదైంది. 10వ తేదీ నాటికి 17,436 కుటుంబాలు (11.2 శాతం), 11 నాటికి 29,842 (19.1 శాతం) కుటుంబాల సర్వే పూర్తయ్యింది. 12, 13వ తేదీల నాటికి 43,708 కుటుంబాల సర్వే చేయడంతో మొత్తంగా 28 శాతానికి చేరుకుంది. 14వ తేదీ వరకు 71,340 కుటుంబాలు, 15 వరకు 83,452, 16 వరకు 97,550, 17న 1,06,326 కుటుంబాల సర్వే పూర్తి కావడంతో మొత్తంగా 68.2 శాతానికి చేరుకుంది. అయితే ఆదివారం కేవలం 6 శాతం మాత్రమే సర్వే జరిగిందని చెప్పవచ్చు. పలు ఆంశాలపై అనాసక్తి భూమిలేని వారికి సంబంధించి పది ప్రశ్నలకు ప్రజలు ఎలాంటి సమాధానాలు చెప్పడంలేదు . రిజర్వేషన్లపై ప్రశ్నలకు చాలావరకు సమాధానం చెప్పడానికి అనాసక్తి చూపిస్తున్నారు. విద్య, ఉద్యోగ ప్రయోజనాలు, ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి పొందిన పథకాల పేర్లు అన్న ప్రశ్నకు చాలామంది సామాన్యుల నుంచి సమాధానం రావడం లేదు. ఇల్లు, ఉపాధి, ఉద్యోగం, చేయడానికి కులవృత్తి ఎలాంటి అవకాశాలు లేని వారు ప్రభుత్వం నుండి పొందిన లబ్ధి, మహిళలకు ఆధార్ కార్డు ఉండి ఉచిత బస్సు ప్రయాణం పథకం పొందుతున్నారని దాన్నే ప్రభుత్వ లబ్ధిగా సర్వేలో రాసుకుంటున్నారు. రాజకీయ నేపథ్యమనేది ప్రజాప్రతినిధులకు సంబంధించినవి.. అది సామాన్యులకు సంబంధంలేని అంశంగా చాలామటుకు భావిస్తున్నారు. జిల్లాలో మండలాల వారీగా సర్వే వివరాలిలా.. మున్సిపాలిటీల వారీగా... గ్రామీణ ప్రాంతాల్లో వివరాల సేకరణకు అవస్థలు 1,55,999 కుటుంబాలకు.. 1,06,326 కుటుంబాల వివరాల సేకరణ ప్రతిరోజు కలెక్టర్, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన సామాన్యుడికి లాభమేంటి ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట పట్టణంలోని దూల్‌పేటకు చెందిన అనిల్. ఆదివారం ఇంటింటి సర్వేకు వచ్చిన అధికారి తో.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వల్ల సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం జరుగుతుందో చెప్పాలని కోరారు. సర్వేలో అడిగిన 56 ప్రశ్నలతో సామాన్యులకు ఎలాంటి లాభం జరుగుతుందో వివరించాలని వారిని ప్రశ్నించడం కనిపించింది. -
చుట్టుపక్కల విస్తరించడం ఆనందంగా ఉంది..
నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో నా ఇంటిపై ఇంత పెద్ద మిద్దె తోట తయారు చేసుకోగలిగాను. నా కుటుంబసభ్యులు రసాయనాలు వాడని కూరగాయలు, పండ్లు తినాలనే సంకల్పంతో మిద్దె తోటను ప్రారంభించాను. సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ఇంటిపై భాగంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు నాతోపాటు చుట్టుపక్కల వారు, మా బంధువులు సైతం ఇలాంటి మిద్దె తోటలు నిర్మాణం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రకృతి ప్రేమికుడిగా ప్రకృతి సేవాదళ్ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. – సత్యనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
నారాయణపేట: గ్రూప్– 3 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తుతో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎన్.లింగయ్య సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 100 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు, పరీక్ష కేంద్రాల్లోనికి అభ్యర్థులు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని, మిగతా వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని, గేటు దగ్గర తగు జాగ్రత్తలు పాటించాలని, దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడే వాహనాలు నిలిపేలా చూడాలన్నారు. పరీక్ష పూర్తి అయ్యి పేపర్లు రిటర్న్ వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఇచ్చేసమయంలో క్షుణ్ణంగా తనిఖీ చేశాలన్నారు. కార్యక్రమంలో సిఐ శివ శంకర్, పరీక్ష కోఆర్డినేటర్ శంకరయ్య, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు, కృష్ణదేవ్, నరేష్, రమేష్ పాల్గొన్నారు. -
మధ్య తరగతి కుటుంబాలు సైతం..
మార్కెట్లో కూరగాయలు, పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ధరలు వెచ్చించినా ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడంతో ఇంటి వద్దే కూరగాయాలు, పండ్ల మొక్కలు పెంచడంపై ప్రజలు దృష్టి పెట్టారు. అయితే పట్టణాల్లో అనువైన స్థలం లేకపోవడంతో మిద్దె తోటల సాగుపై ప్రజలు దృష్టి కేంద్రీకరించారు. తొలుత ఉన్నత వర్గాలు ప్రారంభించగా.. కరోనా ప్రభావం తర్వాత మధ్య తరగతి వర్గాలు సైతం మిద్దె సాగుపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ క్రమంలో పట్టణంలోని ఏనుగొండ, సగర కాలనీ, భగీరథ, రాజేంద్రనగర్, హౌసింగ్‌బోర్డు, బీకేరెడ్డి, మర్లు తదితర కాలనీల్లోని పలు ఇళ్లలో మిద్దె తోటల సాగు పెరిగింది. -
జిల్లాలోని పరీక్ష కేంద్రాలు, అభ్యర్థుల సంఖ్య ఇలా..
నారాయణపేట: తెలంగాణ పబ్లిక్ కమిషన్ గ్రూప్–3 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 4024 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆది, సోమవారాల్లో నిర్వహిస్తున్న గ్రూప్–3 పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈమేరకు శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ సైతం భద్రతా చర్యలపై సమీక్షించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్– 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష జరుగుతుంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 ఎకానమీ, డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. గంటన్నర ముందు నుంచే అనుమతి ఈ పరీక్షలలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 45 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, 4 రూట్ ఆఫీసర్లు, 13 మంది చీఫ్ సూపరింటెండ్లను నియమించారు. కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుండగా అభ్యర్థులను 8:30 వరకే లోపలికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుండగా 1:30 లోపే కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత, అభ్యర్థులను లోపలికి అనుమతించేది ఉండదని తెలిపారు. అభ్యర్థులు ఇటీవలి దిగిన పాస్ పోర్ట్ సైజు ఫొటో అంటించిన హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ తీసుకొని రావాల్పి ఉంటుందని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్స్, బ్లూటూత్, గడియారాలు, ఆభరణాలు, షూస్, టోపీ మొదలగునవి తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బంది ముందుగానే అన్ని కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. పరీక్షా సమయానికి అభ్యర్థులు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా అన్ని రూట్లలో బస్సులు అదనంగా నడపాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పోలీస్ శాఖ పూర్తిగా బందో బస్తును నిర్వహించాలని ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రానికి ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. 144 సెక్షన్ అమలు గ్రూప్–3 పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్స్ మూసి వేయాలని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. మార్గదర్శకాలను పాటించాలి గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇన్విజిలేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఇచ్చిన అన్ని మార్గదర్శకాలను ఎటువంటి ఫిరాయింపులు లేకుండా పాటించాలని ఆదేశించారు. రవితేజ పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందిపరీక్ష కేంద్రం, ఏరియా హాజరుకానున్న అభ్యర్థులు కాకతీయ హైస్కూల్, ఆదర్శహిల్స్ 360 శ్రీసాయి కోఆపరేటివ్ జూనియర్ కళాశాల, 288 శ్రీసాయి విజయకాలనీ ద్వారక సెంట్రల్ స్కూల్, సింగారం చౌరస్తా 240 వేదసరస్వతి జూనియర్ కళాశాల, జిల్లా ఆస్పత్రి సమీపాన 240 స్ఫూర్తి డిగ్రీ కళాశాల,శాతవాహన కాలనీ 312 బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్, శ్రీసాయి విజయకాలనీ 312 సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్, 222 సింగార్బేష్, ఎల్లమ్మ టెంపుల్ చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రికళాశాల, 564 అంబేద్కర్ చౌరస్తా దగ్గర క్రిష్ణ గోకులం హైస్కూల్,అంబేద్కర్ చౌరస్తా వద్ద 240 లిటిల్ స్టార్స్ హైస్కూల్, ఆర్డీఓ కార్యాలయం సమీపాన 312 టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్జేసీ, ఎర్రగుట్ట, యాద్గీర్రోడ్ 384 గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్,జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద 238 రవితేజ హైస్కూల్, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా 312 -
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా 11రకాలైన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. వాటిలో సింగారం క్రాస్‌రోడ్డులో ఉన్న సీబీఎస్సీ విద్యాలయం మినహాయిస్తే మిగితా వాటిలోని పదో తరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారు. ఆరు ప్రభుత్వ, 70 లోకల్‌బాడి, రెండు ఎయిడేడ్, 32 ప్రైవేటు పాఠశాలలు, మూడు జ్యోతిరావుఫూలే, రెండు మోడల్ స్కూల్లు, రెండు మైనార్టీ గురుకులాలు, ఆరు సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్లలో మొత్తం 124 ఉన్నత పాఠశాలలో 8040మంది టెన్త్ పరీక్ష రాసేందుకు యూ డైస్ ప్లస్‌లో నమోదు చేసుకున్నారు. -
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
నారాయణపేట: గ్రూప్– 3 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తుతో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎన్.లింగయ్య సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 100 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు, పరీక్ష కేంద్రాల్లోనికి అభ్యర్థులు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని, మిగతా వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని, గేటు దగ్గర తగు జాగ్రత్తలు పాటించాలని, దూరంగా పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడే వాహనాలు నిలిపేలా చూడాలన్నారు. పరీక్ష పూర్తి అయ్యి పేపర్లు రిటర్న్ వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఇచ్చేసమయంలో క్షుణ్ణంగా తనిఖీ చేశాలన్నారు. కార్యక్రమంలో సిఐ శివ శంకర్, పరీక్ష కోఆర్డినేటర్ శంకరయ్య, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు, కృష్ణదేవ్, నరేష్, రమేష్ పాల్గొన్నారు. -
సమగ్ర కుటుంబ సర్వే వేగవంతం చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: మున్సిపాలిటీలలో సమగ్ర కుటుంబ సర్వే మందకొడిగా సాగుతోందని, వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ గ్రూప్– 3 పరీక్షల నిర్వహణ, వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. గ్రూప్ –3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని సివిల్ సప్లై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలలో అవసరమైనన్ని టార్పాలిన్లు, డిజిటల్ మైక్రో మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో చర్చించారు. సామాజిక సర్వే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. సర్వే సమగ్ర వివరాల డాటా ఎంట్రీకి ఎంతమంది ఆపరేటర్లు అవసరమో గుర్తించి సోమవారం నుంచి డాటా ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. డాటా ఎంట్రీ కోసం మీసేవ ఆపరేటర్లను వినియోగించుకోవాలన్నారు. అవసరమైనన్ని కంప్యూటర్లు ఉన్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తి వివరాలపై డీపీఓ నివేదికను కోరారు. సర్వే పూర్తిచేసిన ఫారాల భద్రత స్టోరేజ్ పై ఎంపీడీవో, కమిషనర్లదే అని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలం, ఆర్డీవో రామచందర్, జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
మినహాయింపు దక్కట్లే!
●ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్ఎస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల హెచ్ఎంలకు వాటి ప్రతిని అందించాం. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే తప్పకుండా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20వేలు, పట్టణాల్లో రూ.24వేలు దాటకూడదు. అలాంటి దరఖాస్తులు రావడం కొంతమేర కష్టం. బీసీ హాస్టల్, కేజీబీవీలకు చెందిన విద్యార్థులు నేరుగా ఫీజు రాయితీతో పరీక్షకు హాజరవుతున్నారు. – ఎండీ అబ్దుల్‌ఘని, డీఈఓ నారాయణపేట రూరల్: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు తప్పనిసరిగా ఆదాయ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉండగా.. ఇటీవల ప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితిలో నిబంధనలు విధించడం, దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులకు ఫీజు మినహాయింపు దక్కట్లేదు. మొత్తంగా ప్రభుత్వం ప్రకటించడానికి.. అధికారులు చెప్పుకోడానికే పరిమితమైతంది తప్పా కొందరికే టెన్త్ వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు దక్కుతోంది. వెనకబడిన వారికి మినహాయింపు అన్ని రకాల యాజమాన్య పాఠశాలల్లో వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ దృవపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24వేలలోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికి ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపచేస్తుంది. ఇందుకు గరిష్ఠ ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. అయితే గత 30 ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోతుంది. హాస్టల్లో విద్యార్థులకు ప్రత్యేకం ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న బీసీ విద్యార్థులకు ఆశాఖ కమిషనర్ ఏటా ఇచ్చే ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలుగుతున్నారు. అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం బాలికలకు ఫీజు రాయితీ వచ్చింది. కానీ తల్లిదండ్రుల వార్షిక ఆదాయ ధ్రువపత్రంతో మాత్రం కాదనేది విస్పష్టం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్పేర్ గురుకులాలతో పాటు కేజీబీవీ విద్యార్థులు మాత్రమే ఈ రాయితీ నేరుగా పొందుతుండగా, మిగితా విద్యార్థులకు ఈ అవకాశం లభించడంలేదు. కొత్త ప్రభుత్వమైన దీనిపై దృష్టిసారించి వాఱ్షిక ఆదాయం సవరించాలని కోరుతున్నారు. ఫీజు చెల్లింపు తేదీలు ఇలా.. ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్ 18 రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2 రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 12 రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 21 పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు కొందరికే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో చేకూరని లబ్ధి ఏటా 15శాతం మంది మాత్రమే వినియోగించుకున్న వైనం వసతిగృహాలు, గురుకులాల వారికి నేరుగా రాయితీ పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా.. ఏటా అక్టోబర్‌లోనే పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లిమెంటరీ విద్యార్థులు 3 సబ్జెక్టులోపునుకు రూ.110, మూడు దాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటిని సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గత నవంబర్ వరకు ఉండింది. అదేవిధంగా రూ.50 ఫైన్, రూ.200, రూ.500 అపరాధరుసుం చెల్లించే గడువు ముగిసింది. గత ఏడాది తత్కాల్ పేరుతో రూ.వెయ్యి ఫైన్‌తో పరీక్ష ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వగా ఈ సారి నోటిఫికేషన్లో లేదు. -
చుట్టుపక్కల విస్తరించడం ఆనందంగా ఉంది..
నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో నా ఇంటిపై ఇంత పెద్ద మిద్దె తోట తయారు చేసుకోగలిగాను. నా కుటుంబసభ్యులు రసాయనాలు వాడని కూరగాయలు, పండ్లు తినాలనే సంకల్పంతో మిద్దె తోటను ప్రారంభించాను. సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ఇంటిపై భాగంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు నాతోపాటు చుట్టుపక్కల వారు, మా బంధువులు సైతం ఇలాంటి మిద్దె తోటలు నిర్మాణం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రకృతి ప్రేమికుడిగా ప్రకృతి సేవాదళ్ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. – సత్యనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
ఉపేక్షించేది లేదు.. కఠినంగా వ్యవహరిస్తాం..
పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ అనేది ఇప్పటి వరకు లేదు. ఈ ఘటనే మొదటిది. ర్యాగింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిస్తాం. పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులకు పనిష్మెంట్ కింద 20 రోజుల పాటు ఇంటికి పంపించాం. దీనిపై డీఎంఈకి నివేదిక అందజేస్తాం. మున్ముందు ర్యాగింగ్ అనే పదం కళాశాలలో వినిపించొద్దు. ర్యాగింగ్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టి.. పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళల్లో వసతి గృహాల వద్ద వార్డెన్లు, ఇతర సిబ్బందికి విధులు కేటాయించాం. – డాక్టర్ రమేష్, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ ● -
‘స్వచ్ఛత’కు.. మరో చాన్స్
నర్వ: సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా.. స్వచ్ఛభారత్ నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాయి. ప్రతి కుటుంబానికి వ్యక్తి గత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టేలా చేయడానికి స్వచ్ఛభారత్ మిషన్(ఎస్బీఎం) కార్యక్రమం నాలుగేళ్ల క్రితం పెద్ద ఎత్తున చేపట్టారు. 90 శాతం మేర జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టడంతో జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. మూడేళ్ల కిందట ఈ పథకం ద్వారా ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. అయితే తాజాగా తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ 2.0 పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివాహాలు కావడం, వేల సంఖ్యలో కొత్త ఇంటి నిర్మాణాలు జరగడంతో తిరిగి పథకాన్ని ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కార్యదర్శులకు ఈమేరకు అవగాహన కల్పించారు. ప్రజలు నేరుగా లేదా కార్యదర్శి ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. రెండు విడతల్లో రూ.12వేలు.. గతంలో జిల్లా వ్యాప్తంగా 280 గ్రామ పంచాయతీలుండగా దాదాపు 60 శాతంకు పైగా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు శతం శాతం దిశగా జరిగాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు అందించారు. ఇలా జిల్లాలో 66 వేల మరుగుదొడ్లను నిర్మించగా వీరికి రూ.74 కోట్లు బిల్లులు చెల్లించారు. ఇటీవల వచ్చిన ఆదేశాల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి సైతం ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12 వేలు అందించనుంది. మంజూరైన లబ్ధిదారుడికి మొదటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన స్థలంలో నిల్చోబెట్టి ఉపాధి అధికారులు ఫొటో తీసి వెబ్సైట్లో నమోదు చేస్తే రూ.6 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత చివరి ఫొటో అప్లోడ్ చేస్తే మిగితా డబ్బులు జమఅ వుతాయి. దీని ప్రకారం ఇప్పటికే 3977 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా మండలాల్లో 4 బృందాలు ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీటిలో 54 మందికి అధికారికంగా మంజూరు అనుమతులు వచ్చాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు గతంలో పంచాయతీల ద్వారా మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేయాల్సి ఉండగా ఈసారి పంచాయతీలతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆన్లైన్ గురించి తెలిసిన వారు గూగుల్‌లో ట bm.gov.in అనే వెబ్సైట్లో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఐఏఏఔ డ్యాష్‌బోర్డుపై క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. తరువాత బ్యాంకు ఖాతా, ఆధార్, మొబైల్ ఫోన్ నెంబర్, చిరునామా వివరాలు నమో దు చేస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తులను ఎంపీడీఓ పరిశీలించి డీఆర్డీఓ లాగిన్‌కు వెళ్తుంది. అక్కడ పరిశీలించి డీఆర్డీఓ మంజూరు ఇస్తారు. నిర్మించుకోవాలి గతంలో జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో చేపట్టాం. దీంతో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా అప్పట్లో ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో మరో మారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోని మరుగుదొడ్లు నిర్మించుకోవాలి. – మాలిక్, ఎస్బీఎం జిల్లా సమన్వయకర్త సద్వినియోగం చేసుకోవాలి స్వచ్ఛభారత్ మిషణ్ గ్రామీణ్ 2.0 కార్యక్రమం ద్వారా వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాలకు మరో అవకాశం కల్పించింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని కార్యదర్శులు, లేదా ఆన్లైన్ ద్వారానైన దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కారణంగా లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేస్తాం. – మొగులప్ప, డీఆర్డీఓ నారాయణపేట వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు దరఖాస్తుల స్వీకరణ స్వచ్ఛభారత్ మిషణ్, గ్రామీణ్ 2.0 ద్వారా నిర్మాణాలు జిల్లాలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఇప్పటివరకు 3977 దరఖాస్తులు -
ర్యాగింగ్ కలకలం
పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వెలుగులోకి.. ● గోడకుర్చీలు వేయించడంతోజూనియర్ల మనస్తాపం ● 10 మంది సీనియర్వైద్య విద్యార్థుల సస్పెన్షన్ ● యాంటీ ర్యాగింగ్ కమిటీ పనితీరుపై విమర్శలు ● తూతూమంత్రంగా అవగాహన కార్యక్రమాలు ● పోలీస్‌శాఖ చొరవ చూపాలని సూచిస్తున్న విద్యారంగ నిపుణులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. సీనియర్ మెడికోలు అది, ఇది అంటూ జూనియర్లకు పని చెప్పడం.. చేయకపోతే గోడ కుర్చీలు వేయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులను 20 రోజుల పాటు సస్పెన్షన్ వేటు చేశారు. అయితే ఈ ఘటనపై అధికారులు చెరోమాట మాట్లాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో సదరు విద్యార్థులకు పనిష్మెంట్ ఇచ్చామని అంటుండగా.. మరో అధికారి ఆల్కహాల్ సేవించి రావడంతో చర్యలు తీసుకున్నామని చెబుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ ఉన్నట్టా.. లేనట్టా.. ? కళాశాలలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాంటీ ర్యాగింగ్ కమిటీలో వైద్యకళాశాలతో పాటు పోలీస్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు మెంబర్లుగా ఉంటారు. వీరు ఎన్జీఓలు, మీడియా, విద్యార్థులు, తల్లిదండ్రు ల భాగస్వామ్యంతో ర్యాగింగ్ నివారణకు సమష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ.. ఇలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవని విద్యార్థులే చెబుతున్నారు. కొత్తగా తరగతులు ప్రారంభమైన క్రమంలో తప్పకుండా విద్యార్థులతో సమావేశమై ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు అలాంటి కార్యక్రమం జరగలేదని తెలిసింది. ఇప్పటికై నా పోలీస్‌శాఖ చొరవ చూపి ర్యాగింగ్ భూతాన్ని ఆదిలోనే తరిమికొట్టాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. గోడ కుర్చీలు వేయించడంతో.. పాలమూరు మెడికల్ కళాశాలలో 2024–25 బ్యాచ్ తరగతులు ఇటీవల ప్రారంభమయ్యాయి. 175 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఇటీవల ఫస్టియర్‌లో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఎదిర సమీపంలో ఉన్న కళాశాల క్యాంపస్‌లో 2023 బ్యాచ్‌కు చెందిన కొందరు సీనియర్లు.. కొత్తగా వచ్చిన జూనియర్లపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించారు. సుమారు రెండు వారాలుగా వారితో ఏదో ఒక పని చేపిస్తూ వచ్చారు. అయితే పది రోజుల క్రితం రాత్రి తాము చెప్పిన పని చేయడం లేదని పలువురు జూనియర్లను గోడ కుర్చీలు వేయించారు. మనస్తాపానికి గురైన జూనియర్లు.. సదరు సీనియర్ వైద్య విద్యార్థులపై కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్.. సీనియర్లపై జూనియర్లు ఫిర్యాదు చేయగా.. డైరెక్టర్ రమేష్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేశారు. నిజమేనని తేలడంతో పదిమంది సదరు సీనియర్ వైద్య విద్యార్థుల తల్లిదండ్రులను ఈ నెల పదో తేదీన కళాశాలకు పిలిపించారు. వారి సమక్షంలోనే ఆ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత సదరు పది మంది విద్యార్థులను క్రమశిక్షణ చర్యల కింద డిసెంబర్ ఒకటో తేదీ వరకు సస్పెండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సదరు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో లెటర్లు రాయించుకున్నట్లు తెలిసింది. -
దయనీయం.. విద్యాలయం
ధన్వాడ: బండలు పగిలి ఇసుక తేలిన తరగతి గదులు.. కూర్చునేందుకు బెంచీలు లేక నేలపైన ల్యాబ్ పరీక్షలు.. మరమ్మతుకు నోచుకోని తాగునీటి మినరల్ ప్లాంట్.. విరిగిన కిటికీలు.. పనిచేయని ఫ్యాన్లు.. ఇదీ ధన్వాడ మోడల్ స్కూల్ దుస్థితి. మొత్తంగా మోడల్ పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాలలో కనిస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లో ఎక్కడ చూసినా బండలు పగిలి గుంతలు ఏర్పడ్డాయి. తరచూ విద్యార్థులు అటుగా వెళ్తూ గమనించక గాయాలపాలవుతున్నారు. ఇక ల్యాబ్‌లలో కూర్చునేందుకు బెంచీలు లేక నేలపైనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి కోసం మినరల్ ప్లాంట్ ఉన్నా మరమ్మతుకు నోచుకోకపోవడంతో వృథాగా మూలనపడింది. దీంతో విద్యార్థులు బోరు నీటిని తాగాల్సిన పరిస్థితి దాపురించింది. చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. తరగతి గది కిటికీలు విరిగిపోయాయి. ఫ్యాన్లు సైతం మరమ్మతుకు నోచుకోక అలంకార ప్రాయంగా ఉండిపోయాయి. ఇదిలాఉండగా, సమస్యల విషయమై ప్రిన్సిపాల్ ఉమయ్ఆష్రాను వివరణ కోరగా.. పాఠశాల మరమ్మతుకు ఎలాంటి నిధులు రాలేదని, నేను కొత్తగా బాధ్యతలు చేప్పట్టానని, పాఠశాల పరిస్థితిపై ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. మోడల్ పాఠశాలలో కనీస వసతులు కరువు ఇబ్బందుల్లో విద్యార్థులు -
దరఖాస్తులకు ఆహ్వానం
నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నారాయణపేటలో స్టెనో, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టెనో /టైపిస్ట్ 1 (జనరల్), రికార్డ్ అసిస్టెంట్ 1 పోస్ట్ (జనరల్), డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి అభ్యర్థులు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఈ నెల 30 సాయంత్రం 5 గంటలలోగా చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ప్రాంగణం నారాయణపేట కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతోపాటు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400 డీడీ రూపంలో ‘ది సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నారాయణపేట‘ పేరున చెల్లించి డీడీ జతపర్చాలని పేర్కొన్నారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు, వివరాలకు (ecourts.gov.in/ narayanpet) సంప్రదించాలని తెలిపారు. -
చెదరనీకు ఆ చిరునవ్వు..!
రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఉత్సాహంగా పాల్గొన్న బాలసదన్, రిహాబిలిటేషన్ సెంటర్ల బాలలు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పులకింత చిన్నారులకు బహుమతులు అందించిన ఉన్నతాధికారులుసంగారెడ్డి/నారాయణపేట రూరల్/నిజామాబాద్ నాగారం/కామారెడ్డి: వసంతకాలంలో పువ్వులను.. పసి మోముల్లోని నవ్వులను ఎంత చూసినా తనివి తీరదు. పసి బిడ్డల ముఖాల్లోని నవ్వులు స్వచ్ఛతకే కాదు.. కొన్నిసార్లు సహజ స్థితిగతులకూ అద్దంపడతాయి. తల్లిదండ్రుల సంరక్షణ ఉంటేనే పిల్లలు తమ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలరు. కానీ, ఎంతో మంది బాలలు తమకు తెలియకుండానే అనాథాశ్రమాల్లో, రిహాబిలిటేషన్ సెంటర్లలో మగ్గిపోతున్నారు. అలాంటి బాలల ముఖాల్లో చిరునవ్వులు పూయించాలని ‘సాక్షి’ మీడియా సంకలి్పంచింది. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పలువురు ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు అందించి బాలలను ఉత్సాహపరిచారు.నిజామాబాద్‌లో ‘సాక్షి లిటిల్ స్టార్స్’.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్లో ‘సాక్షి లిటిల్‌స్టార్స్’కార్యక్రమం ఘనంగా జరిగింది. సాక్షి మీడియా, అగ్గు భోజన్న నారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ముఖ్య అథితిగా హాజరై సాక్షి మీడియా ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వేడుకల్లో చిన్నారుల దేశభక్తి గేయాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. వేడుకల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి షేక్ రసూల్‌బీ, అగ్గు భోజన్న నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అగ్గు భోజన్న, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డిలో..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో సాక్షి మీడియా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధుశర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను తమ జీవిత లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలు, పాటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, ఇన్చార్జ్ డీడబ్ల్యూవో చందర్‌నాయక్, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలసదనం అధికారులు, ఉద్యోగులు, సాక్షి విలేకరులు పాల్గొన్నారు. నారాయణపేటలో..నారాయణపేటలోని బాలసదన్‌లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సిక్తా పటా్నయక్ పాల్గొన్నారు. చిన్నారులు గులాబీ పువ్వులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాలసదన్‌లోని పిల్లలతో ఆమె సరదాగా గడిపారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించడంతో పాటు, నృత్యాలు చేసి అలరించిన చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మైనారిటీ శాఖ అధికారి రషీద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు యాదయ్య, కమలమ్మ, డీసీపీఓ తిరుపతయ్య, చి్రల్డన్ హోం ఇన్చార్జ్ నిహారిక, సాక్షి సిబ్బంది ఆనంద్, రాజేష్ పాల్గొన్నారు. సంగారెడ్డిలో..‘సాక్షి’మీడియా గ్రూపు, సహారా సొసైటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సహారా ప్రైమరీ రిహాబిలిటేషన్ సెంటర్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై చిన్నారులతో ఉల్లాసంగా గడిపారు. వివిధ రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న సహారా సెంటర్‌ను అభినందించారు. -
18న డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పర్యటన
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా ఐడీఓసీలో ఈనెల 18 సోమవారం ఉదయం 10:30 గంటలకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పర్యటన బి.వెంకటేశ్వరరావు బృందం నేతృత్వంలో సమావేశం ఉంటుందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు డెడికేటెడ్ కమిషన్ బృదం సభ్యులకు నమోదిత లేదా నమోదు కాని అసోసియేషన్ సంఘాల ప్రజాప్రతినిధులు వారికి అవసరమైన రిజర్వేషన్, దామాషాను, వాదనలను, ఆక్షేపణలు, సలహాలు, అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. బీసీలకు స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లను, దామాషాను క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకునేందుకు ఈ బృందం పర్యటిస్తున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలోని వివిధ సామాజిక వర్గాల వారు ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా బృందానికి తెలియజేయవచ్చని తెలిపారు. -
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
నర్వ: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి రాబోవు పరీక్షలకు సన్నద్ధం చేయాలని డీఈఓ అబ్దుల్గని అన్నారు. గురువారం పాథర్చేడ్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. శుచి శుభ్రత పాటిస్తూ, మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్నారు. అనంతర బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాలల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, మహనీయులని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. పదోతరగతి విద్యార్థుల ప్రగతిని తెలుసుకొని వందశాతం ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఉత్తమ గ్రేడ్లు సాధించాలని విద్యార్థులకు సూచించారు. సెక్టోరియల్ అధికారి రాజేందర్, నాగార్జున్‌రెడ్డి, యాదయ్యశెట్టి, హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయులు శైలజ, సత్యనారాయణరెడ్డి, సదన్‌రావు, అనిత పాల్గొన్నారు. -
భవిష్యత్‌కు బాటలు వేద్దాం
నారాయణపేట/నారాయణపేట రూరల్: తల్లిదండ్రులు లేని పిల్లలకు సరికొత్త జీవితాన్ని అందిస్తూ.. వారి కష్టాలు, కన్నీళ్లను దూరం చేసి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు బాటలు వేయడమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందడుగు వేద్దానమి కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ‘సాక్షి’ దినపత్రిక, లయన్స్‌క్లబ్ ఆఫ్ నారాయణపేటటౌన్ వారితో కలిసి గురువారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో చిల్డ్రన్స్ డే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులతో సరదాగా గడిపారు. రోజువారి దినచర్య, భోజనం మెనూ, చదువు, క్రీడలు, సాంస్కృతిక అంశాలకు సంబందించిన విషయాలను మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలను తిలకించి వారిని ప్రోత్సహించడంతో పాటు క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. అంతకుముందు నెహ్రూ చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించగా.. కలెక్టర్‌తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయకు చిన్నారులు గులాబీ పువ్వులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, విద్యతోనే భవిష్యత్ అని.. క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. బాలసదనంలో పిల్లలకు చక్కటి ఏర్పాట్లు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలల చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని, పిల్లలను పనిలో పెడితే చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. బాల్యవివాహాలు చేయడం నేరమని హెచ్చరించారు. మీడియా నాలుగో స్తంభం ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వారధిలా ఉండే మీడియా సమాజానికి నాలుగో స్తంభమని, విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించడం హర్షణీయమన్నారు. ‘సాక్షి’ దినపత్రిక ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. జర్నలిస్టులు చేస్తున్న సేవలు ఎంతో ఉన్నతమైనవని, కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో కుటుంబం, తమ ప్రాణాలను తెగించి సేవలను అందించారని కొనియాడారు. సమాజంలో పేదల కోసం లయన్స్‌క్లబ్ చేస్తున్న సేవలు ఎంతో అభినందించాల్సిన విషయమని అన్నారు. టౌన్ క్లబ్ సేవలను తెలుసుకోవడంతోపాటు విజేతలకు చెస్‌బోర్డు, క్యారమ్స్ తదితర క్రీడా వస్తువులను అందించడంపై అధ్యక్షుడు లిఖి రఘుబాబును అభినందించారు. ప్రధాన సమస్యలపరిష్కారం దిశగా.. బాలసదనంలో బాలల దినోత్సవం నిమిత్తం వెళ్లిన ‘సాక్షి’ బృందం అక్కడి సమస్యలను గుర్తించి సమావేశంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారులకు హాల్ లేకపోవడంతో కార్యక్రమాల నిర్వహణ, ఇతర విషయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో షెడ్ ఏర్పాటు ప్రతిపాదనపై మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ స్పందించారు. నిర్మాణానికి సంబందించిన విషయం కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పారు. చిన్నారులు పాఠశాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందిపై టౌన్ లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు రఘుబాబు స్పందిస్తూ.. వాహన సౌకర్యంపై అన్ని క్లబ్‌లతో చర్చించి సమస్య పరిష్కారానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘సాక్షి’ కార్యక్రమంతో ప్రధాన సమస్యలకు తాత్కాలిక పరిష్కారం లభించడంపై విద్యార్థులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎండీ రషీద్, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, సభ్యులు కమలమ్మ, యాదయ్య, డీసీపీఓ తిరుపతయ్య, చిల్డ్రన్ హోం ఇన్చార్జ్ నిహారిక, డాక్టర్ విరోజ, సాక్షి సిబ్బంది ఆనంద్‌గౌడ్, రాజేష్‌కుమార్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సరికొత్త జీవితాన్ని అందిద్దాం బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత మీడియా ఇలాంటి కార్యక్రమాలునిర్వహించడం భేష్ ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
సంస్కృతి సాంప్రదాయలను అలవర్చుకోవాలి
నారాయణపేట: నేటిబాలలే రేపటి పౌరులని, దేశానికి ఉపయోగపడే మార్గ దర్శకులని దేశ సంస్కృతి సాంప్రదాయలను బాల్య దశలో అలవర్చుకోవాలని, తల్లిదండ్రులతోపాటు సమాజంలో పెద్ద వారిని గౌరవించాలని బాలకేంద్ర కన్వీనర్, డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు.గురువారం బాలకేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు మూడు రోజుల పాటు నిర్వహించిన నృత్యం, పాటలు చిత్రాలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు అనంతరం చిన్నారుల చేత కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో వైద్య నిపుణురాలు డాక్టర్ గీతవిశ్వనాథ్ జనరల్ ఫిజీషియన్ గందె కార్తీక్, హెచ్ఎం నారాయణ, బాలకేంద్ర సిబ్బంది మహిపాల్ రెడ్డి, నర్సింహులు, వసంత్ పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులుకలగకుండా చూడాలి
నారాయణపేట: మార్కెట్‌కు ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షేలం అధికారులకు సూచించారు. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎన్ని టార్పాలిన్ కవర్లు అందజేశారని, ప్యాడీ క్లినర్స్ తదితర వాటిపై మార్కెట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని అడిగారు. మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కార్యదర్శి భారతి తదితరులు ఉన్నారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట: సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. లోన్ యాప్స్ ద్వారా అప్పు తీసుకుంటే ప్రాణాలకు ముప్పు వస్తుందని.. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావొద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక కుటుంబ సర్వేను అసరా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌నంబర్‌కు ఓటిపి వచ్చిందని మాకు చెప్తే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, మోసపూరితమైన మాటలు నమ్మవద్దని, ఎలాంటి ఓటీపీలను ఆధార్ నెంబర్లను గుర్తు తెలియని వ్యక్తులు అడిగిన చెప్పవద్దని తెలిపారు. అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలని ఎవరో చెప్పింది విని, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోరాదని, ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తే నమ్మవద్దని సూచించారు. లోన్‌యాప్స్ వేధింపులకు మీలో మీరే బాధపడవద్దు, క్షణికావేశాలకు పోవద్దని, కుటుంబ సబ్యులకు, స్నేహితులకు చెప్పాలని, 1930 కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి తోటి వారిని సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు. జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకం మక్తల్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలో గురువారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 71 కేజీల విభాగంలో మక్తల్‌కు చెందిన వడ్ల జాహ్నవి సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటినట్లు కోచ్ సంపత్‌కుమార్ విలేకర్ల తెలిపారు. హైదరాబాద్ హకీంపెట స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్న జాహ్నవి వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతుంది. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చి రజత పతకం సాధించి సత్తా చాటిందని తెలిపారు. ఈ విషయం తెలియడంతో జాహ్నవి కుటుంబసభ్యులకు బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. యాదాద్రి తరహాలో ఘాట్ రోడ్డు నిర్మాణం చిన్నచింతకుంట: యాదాద్రి తరహాలో కురుమూర్తిస్వామి ఆలయం వద్ద ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడుతామని ఆర్అండ్బీ ఈఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ మోహన్‌నాయక్ అన్నారు. గురువారం ఆయన కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొండ దిగువన రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేసిందన్నారు. యాద్రాది తరహాలో కురుమూర్తి ఆలయం వద్ద ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. టెండర్ల పక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటయ్య, అధికారి సంధ్య పాల్గొన్నారు. -
కొత్త జట్టు కూర్పు..
పూర్తిస్థాయిలో యూనివర్సిటీని గాడిలో పెట్టేందుకు కొత్త జట్టును సిద్ధం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. గత వీసీ పీయూలో ఉన్న సీనియర్ అధ్యాపకులు గిరిజ, పవన్‌కుమార్‌లను రిజిస్ట్రార్లుగా నియమించారు. ప్రస్తుత వీసీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిజిస్ట్రార్‌ను నియమించుకున్నారు. మరీ ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 13 మంది సభ్యులను కూడా త్వరలో నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం వాటిని ఆమోదించాల్సి వస్తుంది. వీరితో పాటు యూజీ, పీజీ జాయింట్ డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, వివిధ డిపార్ట్మెంట్ల కోఆర్డినేటర్ పదవులకు సంబంధించి మార్పులు, చేయాల్సి ఉంది. కొన్ని పోస్టులు ఒక్కరి దగ్గరే ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. త్వరలో యూనిర్సిటీని న్యాక్ బృందం సందర్శించినున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో సిబ్బంది మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది. -
ఆనందంగా ఉంది : చిన్నారి మహేశ్వరి
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో బాలసదనంలో చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించడం, మాతో ఆటలు ఆడించడంతో ఆనందంగా ఉందని బాలసదనం చిన్నారి మహేశ్వరి వివరించింది. వేడుకల్లో భాగంగా మాట్లాడుతూ.. ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఎంతో ఎంజాయ్ చేశామని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకోవడం, వారితో కలిసి కాసేపు సరదాగా గడపడం సంతోషంగా ఉందన్నారు. చదువు, వసతి తదితర అంశాలపై చర్చించడం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం, ప్రతి ఒక్కరు మాకు అండగా ఉంటామని చెప్పడం మర్చిపోలేమని హర్షం వ్యక్తం చేసింది.