-
గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు
తిరుపతి(అలిపిరి)/తిరుమల: రాష్ట్రంలో గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిణామాలు చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, బాలికలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే పట్టుకుంటున్నట్టు తెలిపారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నేతలు పాకులాడుతున్నారని, గత ప్రభుత్వం కారణంగానే చిన్నపిల్లల సంచుల్లోకి గంజాయి చేరుతోందని ఆరోపించారు. గంజాయిని రాష్ట్ర పంటగా పండించింది వైఎస్సార్సీపీ నేతలేనని.. లిక్కర్‌పైన పెట్టిన దృష్టి గంజాయిపై ఎందుకు పెట్టలేదన్నారు. పోలీసుల్ని కాపలాకు ఉపయోగించుకున్న గత ప్రభుత్వంలోనే వందలాది మంది బాలికలు కనిపించకుండా పోయారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, కాలినడక మార్గంలోనే శ్రీవారి దర్శనం టికెట్లు జారీచేయాలని హోం మంత్రి అనిత కోరారు. అలిపిరి కాలినడక మార్గాన నడుచుకుంటూ ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అనిత చెప్పారు. -
వినుకొండలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య గురించి తెలియగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ బృందం వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చింది. వైఎస్ జగన్ గురువారం ఉదయం వినుకొండ రానున్నారు. రోడ్డు మార్గంలోంచి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రషీద్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుమారు 15 మంది వరకు రషీద్‌ను చంపడానికి పథకం వేశారు. రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడన్న విషయాలు తెలుసుకుని ముండ్లమూరు సెంటర్లో నిఘా వేశారు. షాపు నుంచి వచ్చాక జిలానీ దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు ఈ హత్యలో నరసరావుపేటకు చెందిన సిద్ధు, ఇమ్రాన్, జానీ, రఫీ, షఫీ, సాయిబాబాతో పాటు మరికొందరికి సంబంధం ఉందని రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే‹Ùరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు పడేషా, బడీబీలు తమ కుమారుడిని టీడీపీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని, చంపొద్దని వేడుకున్నా.. దారుణంగా చంపేశారని నాయకుల వద్ద బోరున విలపించారు. రషీద్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. సుమారు 200 మందికి పైగా పోలీసులు ఆస్పత్రి చుట్టు పక్కల మోహరించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రషీద్ బంధువులు వంద మందికి పైగా మహిళలు రోడ్డుపై ఆందోళన చేసేందుకు వస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమను లాఠీలతో కొట్టారంటూ ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్ ఉందని, ఎలాంటి బంద్‌లు, నిరసనలకు అనుమతి లేదనే పోలీసుల సూచనల మేరకు వారు ఆందోళన విరమించారు. మరోవైపు టీడీపీ నాయకులు ఈ హత్యను ఖండించకుండా జిలానీ కూడా వైఎస్సార్సీపీ వాడేనంటూ ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి జిలానీ ఏడాది క్రితమే తెలుగుదేశంలో చేరాడు. అతని సోదరుడు వినుకొండ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు హత్యకు సాకుగా తెలుగుదేశం నాయకులు, పోలీసులు చూపిస్తున్నారు. కాగా, రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
వినుకొండ(నూజెండ్ల): రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే టీడీపీ గూండాలు చెలరేగిపోయి..రాష్ట్రమంతటా రక్తపాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు క్షీణించి.. ప్రజలకు రక్షణ కరువైందన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండా చేతిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు గురువారం నివాళులర్పించారు. రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితుడు టీడీపీకి చెందిన వాడైనప్పటికీ సోషల్ మీడియాలో తమ పార్టీవాడు కాదంటూ టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారాన్ని వారు ఖండించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఇతర టీడీపీ నాయకులతో నిందితుడు సన్నిహితంగా దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల అండతోనే రషీద్ హత్య: మర్రి రాజశేఖర్వినుకొండ నడిబొడ్డున వందలాదిమంది చూస్తూండగా వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ గూండా జిలానీ అత్యంత కిరాతకంగా కత్తితో నరికాడంటే రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేరాలన్నింటికీ చంద్రబాబే బాధ్యత వహించాలి. టీడీపీ ఎమ్మెల్యేల చెప్పినట్లుగా జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే పల్నాడులో హత్యలు మొదలయ్యాయి. టీడీపీ నాయకుల అండదండలతోనే ఈ హత్య జరిగింది. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించి బాధ్యులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. హత్యా రాజకీయాలు మానుకోవాలి: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికూటమి పార్టీలు గెలిచినప్పటి నుంచి కేవలం నెల రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. పల్నాడు ప్రాంతంలో 1,500కు పైగా కుటుంబాలు గ్రామాలు విడిచి పెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. హత్యారాజకీయాలను వెంటనే మానుకోవాలి. ఇప్పటికైనా హామీల అమలు మొదలుపెట్టి..ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి.3 రేప్‌లు, 30 హత్యలుగా పాలన: కాసు మహేశ్రెడ్డిఏపీలో టీడీపీ ప్రభుత్వ పాలన 3 రేప్‌లు, 30 హత్యలుగా కొనసాగుతోంది. ప్రశాంతంగా ఉన్న వినుకొండలో మొహర్రం రోజున రషీద్ అనే యువకుడిని టీడీపీ గూండా హత్య చేశాడంటే..టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకూ అర్థమవుతోంది. పట్టణంలో నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా రషీద్‌ను అత్యంత పాశవికంగా నరికి చంపడం దారుణం. కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడవేసి..రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తోంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాం. హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్భలంతోనే జిలానీ అనే టీడీపీ గూండా నడిరోడ్డుపై వినుకొండలో అత్యంత దారుణంగా రషీద్‌ను హత్య చేశాడు. మృతుని కుటుంబానికి అండగా ఉంటాం.15 నుంచి 20 మంది యువకులు ముందుగానే రషీద్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు. కేవలం ఒక యువకుడే వెంబడించి రషీద్‌ను రాక్షసత్వంగా చంపేశాడు. పోలీస్ శాఖ ఈ హత్యకు బాధ్యత వహించాలి. మృతుని కుటుంబానికి పార్టీ పరంగా ఆర్థికంగా భరోసా అందిస్తాం. -
అడ్డూ అదుపు లేకుండా దాడులు
టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ అరాచకాలకు మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి కేంద్ర బిందువుగా మారింది.పెదవడ్లపూడికి చెందిన పాలేటి రాజ్‌కుమార్‌ను లోకేశ్ అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. మోకాళ్లపై కూర్చుని లోకేశ్ చిత్రపటానికి దండం పెడుతూ క్షమాపణలు చెప్పకపోతేహతమారుస్తామని హెచ్చరించారు.ప్రాణభయంతో రాజ్‌కుమార్ వారు చెప్పినట్టు చేశారు. దీన్ని టీడీపీ నేతలు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. లోకేశ్ నియోజకవర్గాన్ని ఆయన సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారు. చిత్తూరులో రాజు అనే యువకుడిని కిడ్నాప్ చేసి గుర్తుతెలియని ప్రాంతానికితీసుకువెళ్లి కర్రలు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు సైతం ఇటీవల ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. విజయవాడలో టీడీపీ గూండాలు ఏకంగా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి మరీ మద్దెల పవన్ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేశారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్చూరులోని ఎస్సీ కాలనీపై 50మందికి పైగా టీడీపీ గుండాలు దాడి చేశారు. ఇలా 40 రోజుల్లో 1,050 వరకు దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. ఇళ్లు నేలమట్టం.. కార్యాలయాలు ధ్వంసం 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే అక్కసుతో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో 40మంది పేదల ఇళ్లను కూల్చివేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 జిల్లాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అనంతరపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో టీడీపీ గుండాల దాడులతో స్వైర విహారం చేస్తున్నారు. ప్రధానంగా సర్పంచిలు, స్థానిక సంస్థల ప్రతినిధులను, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను దహనం చేస్తున్నారు. ఇలా 560 వరకు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. వీటిలో ఒక్క చిత్తూరు జిల్లాలో 100 ఘటనలు జరిగాయి.భయంతో బతకలేక.. వలసబాటఊరు వదిలి వెళ్లినకుటుంబాలు 2,700టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. విగ్రహాలపైనా అక్కసు 468 వైఎస్సార్ విగ్రహాలుధ్వంసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపైనా టీడీపీ మూకలు తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తమకు జరిగిన మేలును తలచుకుంటూ అన్ని అనుమతులతో ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసుకున్న విగ్రహాలను సైతం అడ్డగోలుగా కూల్చివేస్తున్నారు. పెట్రోల్ పోసి నిప్పు పెడుతున్నారు. వైఎస్సార్ విగ్రహాల చేతులు, కాళ్లు, తల, ముక్కు.. ఇలా ఒక్కో భాగాన్ని ముక్కలుముక్కలుగా చేసి తాలిబన్ల తరహాలో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కలిపి 468 విగ్రహాల వరకు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. జగన్ జాడ ఉండకూడదని..2,260 శిలాఫలకాలు ధ్వంసందేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. వాటిలో 1,35,819 మంది ఉద్యోగులను, 2.66లక్షల మంది వలంటీర్లను నియమించారు. అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు తమ ఇంటి వద్దకే చేర్చారు. ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తు నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలను చేరువచేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు ద్వారా పాడుబడిన పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలా పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పాలన గురుతులను చేరిపివేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి భవనాల వద్ద ఉన్న శిలాఫలకాలు, నవరత్నాలు బోర్డులను ఘోరంగా ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి శిలాఫలకాలను సైతం కూలి్చస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,260 వరకు శిలాఫలకాలను నేలమట్టం చేశారు.ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం 490 ప్రభుత్వఆస్తుల ధ్వంసం ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది. ప్రతి జిల్లాలో జూన్ 4వ తేదీ తర్వాత నిత్యం గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై పచ్చముఠాలు దాడులు చేసి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తద్వారా ఇక తమకు గ్రామాల్లో ఎదురులేదని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు కేవలం 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 52 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పత్రికా స్వేచ్ఛపైనా దాడి టీడీపీ అరాచకాలతో రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కూడా ప్రమాదంలో పడింది. ఎన్నికల హామీని టీడీపీ తుంగలో తొక్కి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రచురించిన డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. విశాఖపట్నంలోని డెక్కన్‌క్రానికల్ కార్యాలయం బోర్డులు తగలబెట్టి బీభత్సం సృష్టించారు. ఇక నుంచి ఎవరైనా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇలానే ఉంటుందనే తరహాలో హెచ్చరికలు జారీచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చన 40 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని జాతీయస్థాయిలో మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.ఠాణా..తందానా! బీఆర్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ... లోకేశ్ విరచిత రెడ్‌బుక్ రాజ్యాంగానికి దాసోహమైంది. రెడ్‌బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ కళ్లుండీ కబోదిగా వ్యవహరిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాలకు గొడుగుపడుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అరాచకానికి తెరతీస్తే... నియోజకవర్గ స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ దౌర్జన్యాలకు అడ్డువస్తే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పూర్తిగా అదుపు తప్పిన శాంతిభద్రతలు మున్ముందు మరింతగా దిగజారుతాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!
మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్ నాజీ నియంత హిట్లర్ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి నేడువరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. నిన్నపల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం. కక్ష కట్టి కత్తివేటు... హత్యలు31 హత్యాయత్నాలు 300టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి దారుణంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎరికలయ్య.. విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.భరించలేక.. బలవన్మరణాలు ఆత్మహత్యలు 35 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జడ ఆనంద్ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.చిన్నారులనేకనికరం లేకుండా.. లైంగిక దాడులు20టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎనిమిదేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్లో జూన్ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
తిరుపతిలో దారుణం.. మాస్క్ పెట్టుకుని ఇంట్లోకి చొరబడి..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో దారుణ హత్య జరిగింది. ముఖానికి మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి మహిళలను హత్యచేసి పారిపోయాడు. ఈ క్రమంలో అడొచ్చిన మహిళ మనువరాలిపై దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం..‘తిరుపతిలోని రాయల్ నగర్లో హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాము. జయలక్ష్మీ(67) అనే వృద్దురాలిని దుండగుడు హత్య చేశాడు. నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం, ఆమెను చంపి పారిపోయే క్రమంలో మృతురాలి మనుమరాలు నియతి(14) గొంతుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కోడలు సురక్షపై కూడా దాడి చేశాడు.ఇక, ఈ హత్యకు సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయి. సీసీ కెమెరాల్లో నిందితుడి ఆచూకీలు లభించాయి. ఈ దాడి నగలను దోచుకోవడానికి దాడి జరగలేదు. త్వరలోనే ఈ కేసు మిస్టరీని చేధిస్తాము. వీలైనంత తొందరగానే నిందితుడిని పట్టుకుంటాము’ అని తెలిపారు. -
అంతా అధికార పార్టీ నేత అనుచరుడి పనే!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముచ్చుమర్రికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు బాలురులో ఓ బాలుడి తాత.. ఆ నియోజకవర్గంలో అధికార పారీ్టకి చెందిన ఓ నాయకుడి కుటుంబం వద్ద నాలుగు దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది. 1994 ప్రాంతంలో ఆ నాయకుడికి ఫ్యాక్షన్‌లో అడ్డొచ్చిన కొందరిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకు ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్సయిన వ్యక్తుల ఆచూకీ నేటికీ తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది.అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెబుతున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసినా శవం బయటకొస్తుందని కొందరంటున్నారు. బ్యాక్ వాటర్‌లో పడేయడంతో మొసళ్లు ఆహారంగా తీసుకుని ఉంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్లే లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే మృతదేహం ఇక దొరకదు! ఈనెల 7న పాత ముచ్చుమర్రిలో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఆరో తరగతి బాలుడు, పదో తరగతి చదివే ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఆపై పాప ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి వెంటనే పాప గొంతు నులిమి చంపేశారు. వీరిలో ఒకడు విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి.. ఆ చిట్టితల్లిని గోనె సంచిలో వేసి, దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పడేశారు. పోలీసుల విచారణలో ఆ ముగ్గురి పిల్లల తండ్రులు చెప్పిన విషయం ఇది. అయితే చిన్నారిపై అత్యాచారం చేసింది నిజం.. చంపింది నిజమేగానీ, శవాన్ని మాయం చేసిన విధానంపై చెబుతోంది మాత్రం అబద్ధం. ఈ రెండు ఊర్లే కాదు. ఈ 12 రోజుల్లో ఆ నోటా, ఈ నోటా చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి ముచ్చుమర్రి–హంద్రీ నది అప్రోచ్ చానల్లో పడేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద వేశామన్నారు. శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేశామని మరోసారి చెప్పారు. లేదు.. కొణి§ð ల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు.. అయితే వీటిలో ఏదీ వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. ముగ్గురి బాలురలో ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్‌లో అక్కడక్కడా పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని.. మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెబుతున్నారు.ఎక్స్‌గ్రేషియా ఏది? సాక్షి, నంద్యాల: ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారానికి సంబంధించి ఘటనలో బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం అందజేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. గురువారంతో మూడు రోజులవుతున్నా ఇంత వరకూ బాధిత కుటుంబానికి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు పరిహారం ప్రకటిస్తే గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు ఆ సాయాన్ని అందించేవారు. సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ బాధితులను కలిసి భరోసా కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్, చంద్రబాబునోరు మెదపరేం? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నటి ఎన్నికల ప్రచారం వరకూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు టీడీపీతో పాటు తమ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి.. 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరెత్తలేదు. ముఖ్యమంత్రీ స్పందించలేదు. హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడమేనని చెప్పుకొంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు, వారి తండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని.. అందువల్లే ఘటనను తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తోంది. -
నరరూప రాక్షసుల్లా టీడీపీ గూండాలు.. ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ గూండాలు నరరూపరాక్షసుల్లా తయారయ్యారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. వినుకొండ వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు రషీద్‌పై టీడీపీకి చెందిన గూండా జిలానీ పాశవికంగా కత్తితో దాడిచేసి హతమార్చారని ఆరోపించింది. అందరూ చూస్తుండగా, దారుణంగా రెండు చేతులు నరికి మెడపై కూడా పదేపదే కత్తితో వేటువేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడని తెలిపింది. కొన ఊపిరితో ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడని పేర్కొంది. టీడీపీతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ టీడీపీ వాళ్ల రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలి? అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. -
నెల్లూరులో ఘోరం.. ముచ్చుమర్రి తరహా ఘటన
సాక్షి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముచ్చుమర్రి ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. అటవీ ప్రాంతంలో చిన్నారిని హత్య చేశాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామ సమీపంలో బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, చిన్నారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. -
విశాఖలో కత్తి దూసిన ప్రేమోన్మాదం.. చేతులెత్తేసిన పోలీసులు
విశాఖపట్నం, సాక్షి: అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు. అయితే ఈ ఘటనలోనూ పోలీసుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాలేజ్ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్ చేశాడు. అయితే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. టపాసులు పేల్చి హ్యాపీ బర్త్‌డే అంటూ నానా హంగామా చేశాడు. ఆపై ఇంట్లోకి దూరి ఫర్నీచర్‌ను పగలకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. అయితే అది గమనించి ఆమె పారిపోయింది. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు.. దాడి తరువాత పరారీ అయిన సిద్ధూ ఆచూకీని 24 గంటలు గడిచినా కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే.. ఈ ఫోటో లో వ్యక్తి కనిపిస్తే, సమాచారం ఇవ్వండి అంటూ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. అటు అనకాపల్లి ఘటనలోనూ.. ఇటు ఇప్పుడు పోలీసులు నిందితుల విషయంలో ఇలా ఆలస్యంగా స్పందించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు
ప్రత్తిపాడు/ఫిరంగిపురం/టి.నరసాపురం: బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు కేసులు.. ఏలూరు జిల్లాలో ఓ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన దళిత బాలిక (13) నడింపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ నెల 12న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గండికోట వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకట్ పాఠశాలకు సమీపంలోని పంట పొలాల్లోకి బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్ఐ రవీంద్ర వెంకట్‌పై పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు.వేధింపులతో బాలిక ఆత్మహత్య ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉంటుంది. ఈమెకు కొన్నాళ్ల కిందట బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో ఫిరంగిపురం తిరునాళ్లకు వచ్చింది.ఆ సమయంలో ఆ యువకుడు తన మిత్రులతో వెళ్లి బాలిక గురించి అసభ్యంగా మాట్లాడటంతో బాలిక తండ్రి యువకుడిని మందలించాడు. ఆ యువకుడు మరికొంతమందితో ఆ గ్రామానికి వెళ్లి బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బంధువులు తరలించగా..చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడితో పాటు మరికొంతమందిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, బాలికను వేధిస్తున్న యువకుడు ఆదివారం అర్థరాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.హోటల్ గదిలో బంధించి లైంగిక దాడిబాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై టి.నరసాపురం పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలేనికి చెందిన బాలిక (16) జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 6న బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు దర్యాప్తు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఈ నెల 15న టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి నలుగురు యువకులు బాధ్యులని చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో అదృశ్యం కేసును పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మార్పు చేశారు. ఆమె ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. బాలిక హైసూ్కల్లో చదువుతున్న సమయంలోనే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఆమెను వేధించేవాడని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను జంగారెడ్డిగూడెంలోని ఓ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్ నుంచే బాలిక ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 6 నుంచి కనిపించలేదు. ప్రేమిస్తున్నానన్న యువకుడికి మరో ముగ్గురు యువకులు సహకరించడంతో..వారంతా కలిసి బాలికను కిడ్నాప్ చేసి విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్ గదిలో బాలికను బంధించిన యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
ఇన్‌స్టాలో లైక్‌ల కోసం వన్యప్రాణుల వేట
వేంపల్లె: ఇన్‌స్ట్రాగామ్‌లో లైక్‌ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్‌చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్‌వో సందీప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు. -
కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాలు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. నెలల పసిపాప మొదలుకొని ఆడవారిపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కొస్తాంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్నిచోట్ల జరుగుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనుమానాస్పద మారణాలతో ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక.. జరుగుతున్న ఘటనలను నిలువరించలేకపోయినా.. కనీసం నిగ్గు తేల్చలేకపోతున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటన, విజయనగరం జిల్లా జిలకవలస ఘటన, గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డి పాలెం ఘటన ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమరి మైనర్ బాలికి అదృశ్యమై నేటికి 10 రోజులు గడుస్తున్నా కేసు ఇంకా వీడలేదు. నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారిమళ్లిందా? అని అనుమానం వ్యక్తమవుతోంది. బాలిక ఆచూకీ తేలేదెప్పుడూ.. నిందితులకు శిక్ష పడేదెప్పుడూ అని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నేతలు. ఇక.. ఈ కేసులో ముగ్గురిన అరెస్ట్ చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పినా.. ఆ జిల్లా పోలీసులు మాత్రం నిన్నరాత్రి వరకు అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులకు జిల్లా టీడీపీ పెద్దలు కొమ్ముకాస్తున్నారని, అందుకే పోలీసులు కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు, బాలికపై అఘాయిత్యాల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నానాయాగి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ఉండి కూడా నంద్యాల ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక అదృశ్యంపై నోరు మెదపకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో? లేదో? ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే నిందితులను శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి చెబుతున్నారు. కానీ, ఆడపిల్లలపరై అఘాయిత్యాల కేసుల్లో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించకపోవటంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ
నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్‌పై తీసుకెళ్లి.. బాలిక డెడ్‌బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. వాళ్లను అలా వదిలేయొద్దు‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’:::బాలిక తల్లిదండ్రులుఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ? -
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు దగ్ధం
సాక్షి,మహబూబ్‌నగర్ జిల్లా: జడ్చర్లలో సోమవారం(జులై 15) తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై భూరెడ్డి పల్లి వద్ద ఏపీలోని ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొని దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బస్సు ధర్మవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
తెల్లారితే గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం
విడపనకల్లు : తెల్లారితే నూతన గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి అంజి, హేమంత్ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె మానస(మూగ) ఉన్నారు. మారెప్ప పెద్దలు దాదాపు 60 ఏళ్ల క్రితం మట్టితో కట్టించిన ఇంట్లోనే ఉండేవారు. అయితే.. భార్యాభర్త కాయాకష్టం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇటీవల నూతన గృహాన్ని నిరి్మంచుకున్నారు. ఆదివారం గృహ ప్రవేశం పెట్టుకున్నారు. కాగా, శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే మారెప్ప, లక్ష్మి దంపతులు కుమార్తెతో కలసి పాత మట్టి మిద్దెలో పడుకున్నారు. వీరితో పాటు లక్ష్మి తమ్ముడు రాము కూడా అదే ఇంట్లో నిద్రించాడు. ఇద్దరు కుమారులు మాత్రం ఇంటి ఆరుబయట మంచంపై పడుకున్నారు. వర్షానికి తడిసిన కారణంగా మట్టి మిద్దె ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడి లేచారు. మారెప్ప ఇల్లు కూలిపోయిందని గమనించి అరుపులు, కేకలు వేయడంతో కాలనీవాసులంతా వచ్చి మట్టి కింద పూడుకునిపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే మారెప్ప, భార్య లక్ష్మి ప్రాణాలు విడిచారు. కుమార్తె మానసకు చేయి విరిగింది. రాముకు చేతులు, వేళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని 108లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై ఎస్ఐ ఖాజా హుస్సేన్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
ఆగని టీడీపీ విధ్వంసాలు
సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంస చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇష్టారీతిన వ్యవహరించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంçÜం చేశారు. వీఆర్వో కుటుంబంపై దాడిచేశారు. » పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలోని గ్రామ సచివాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని శనివారం రాత్రి విరగ్గొట్టారు. విగ్రహం ధ్వంసంపై వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకుడు కానాల పుల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోగుల అంజిబాబు, నేతలు చిమటా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి అయ్యప్ప, షేక్ దమ్మాలపాటి బుజ్జి, గంటా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్‌వలి, ఇందూరి వెంకటరెడ్డి, మహంకాళిరావు, జయరావు, బి.రాజు కోరారు. » ఏలూరు జిల్లా దెందులూరులోని లైబ్రరీ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతుల్ని విరగ్గొట్టారు. ఈ విధ్వంసంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. » కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామ వీఆర్వో తిరుపాల్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. వీఆర్వో కథనం మేరకు.. మండలంలోని తిమ్మందొడ్డి గ్రామ ఎస్సీ కాలనీలో వీఆర్వో తిరుపాల్ తన కుటుంబంతో నివాసముంటున్నారు. అదే గ్రామంలో బీసీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వీఆర్వో కుటుంబసభ్యుల్ని కులం పేరుతో దూషించి, కించపరిచారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపాల్ భార్య దేవమ్మ తిట్టిన వారిని ప్రశి్నంచడంతో ‘ఎస్సీ కులానికి చెందినదానవు, నీవు మా ఇళ్ల దగ్గరకు వస్తావా..’ అంటూ మరోసారి దూషించారు. అంతటితో ఆగకుండా ఇంటిమీదకు వెళ్లి తిరుపాల్, దేవమ్మ దంపతులపైన, వారి కుమారుడు జానుపైన దాడిచేశారు. తమపై టీడీపీకి చెందిన పెద్దశేషన్న కుమారుడు హరి, ముత్యాలు కుమారులు వెంకన్న, గిడ్డయ్య, గౌరన్న కుమారుడు హరి దాడిచేసినట్లు వీఆర్వో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కలి్పంచి, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వో కోరారు. ఈ విషయమై ఎస్.ఐ. తిమ్మరెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై తనకు సమాచారం వచి్చందని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఊయలలో పసికందుపై అఘాయిత్యం
రామభద్రపురం: రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో 6 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే.. విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీ మధుర గ్రామ పరిధిలోని జీలికవలసలో శనివారం 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో పసి పాపకు స్నానం చేయించిన తల్లి ఊయలలో నిద్ర పుచ్చి0ది. గ్రామంలోకి నిత్యావసర సరుకులు రావడంతో.. కొనుగోలు చేసేందుకు తల్లి వీధిలోకి వెళ్లింది. ఇంతలో అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన నేరళ్లవలసకు చెందిన.. బాధిత చిన్నారికి తాత వరసైన బోయిన ఎరకన్నదొర (40) ఊయలలో నిద్రలో ఉన్న పాపపై లైంగిక దాడి చేయడంతో ఏడ్చింది. పక్కింటి వారు పాప ఏడుస్తున్న విషయాన్ని తల్లికి కేక వేసి చెప్పగా.. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడమని తన పెద్ద కుమార్తెకు చెప్పింది. పెద్ద కుమార్తె చూసి ‘చెల్లిని తాతయ్య ఎత్తుకున్నాడు. రక్తం వస్తోంది’ అని తల్లికి చెప్పింది. తల్లి పరుగున వచ్చేసరికి ఎరకన్నదొర పాపను ఊయలలో వేసేసి పారిపోయాడు. పసిపాపకు రక్తస్రావం కావడాన్ని చూసిన తల్లి ఎరకన్నదొరను వెంబడించి అతడిపైకి కర్ర విసిరింది. ఆమె వెంబడించడం చూసి గ్రామస్తులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా.. ఎరకన్నదొర తప్పించుకుపోయాడు. పాపను బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విజయనగరంలోని ఘోషాస్పత్రికి తరలించారు. బాడంగి వైద్యాధికారులు పోలీసులను సంప్రదించాలని సూచించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్లూస్‌టీం సహాయంతో జీలికవలస గ్రామానికి వెళ్లి పాప దుస్తులను సీజ్ చేశారు. ఆదివారం వేకువజామున నేరళ్లవలసలో నిందితుడు ఎరకన్నదొరను అదుపులోకి తీసుకుని అతని దుస్తులపై ఉన్న రక్తపు మరకలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం పాప విజయనగరం ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. డీఎస్పీ వెంట సీఐ తిరుమలరావు, ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఉన్నారు.బాలల హక్కుల కమిషన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ఆరు నెలల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఘోషాస్పత్రి పర్యవేక్షణ అధికారిణి అరుణ శుభశ్రీతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. కాగా.. ఈ ఘటనను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు ఖండించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిండితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ
మచిలీపట్నం టౌన్: బందరు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరుతున్న ఐదు రోజుల శిశువును ఓ మహిళ అపహరించింది. నర్సు వేషంలో వచ్చి.. తల్లితో మాటలు కలిపి.. ఆమె నిద్రపోగానే శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన చిట్టూరి స్వరూపరాణి ఈ నెల 8వ తేదీన డెలివరీ కోసం మచిలీపట్నంలోని సర్వజనాస్పత్రిలో చేరింది. 9వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ.. స్వరూపరాణితో మాటలు కలిపింది. కొద్దిసేపటికి స్వరూపరాణి నిద్రలోకి జారుకోగా.. ఆ మహిళ శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలకు స్వరూపరాణి మెలుకువ వచ్చి లేచి చూడగా.. పొత్తిళ్లలోని శిశువు కనిపించలేదు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. స్వరూపరాణికి సహాయం చేసినట్లు నటించిన నర్సు వేషంలో ఉన్న మహిళే శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో..కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో సెల్ఫోన్లు చోరీకి గురవ్వడంతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితుడికి.. శిశువును కిడ్నాప్ చేసిన మహిళే బెయిల్ ఇచ్చిందని ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ రాజు పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆమె వివరాలు సేకరించారు. గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకల్లా పోలీసులు శిశువును క్షేమంగా తల్లి స్వరూపరాణి చెంతకు చేర్చారు. దీంతో స్వరూపరాణి సంతోషం వ్యక్తం చేసింది. ఆడబిడ్డ కోసమని..!నిందితురాలిని తమ్మిశెట్టి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక రామానాయుడుపేట సెంటర్లో కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డ కోసమని తాను శిశువును అపహరించానని నిందితురాలు విచారణలో తెలిపింది. తాను ఎత్తుకొచ్చింది మగ శిశువనే విషయాన్ని గమనించలేదని వెల్లడించింది. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సు దీవెన, సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఎస్ఎన్సీయూ విభాగంలోని ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ గార్డులకు చార్జ్ మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
పోదొడ్డిలో బరితెగించిన టీడీపీ శ్రేణులు
డోన్: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తి తదితరులపై శుక్రవారం మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ సమీపంలోని వశిష్ట క్రషర్ మిషన్‌లో పనులు జరగకుండా టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ నారాయణ, ఆయన అనుచరులు కూలీలను అడ్డుకుంటూ దాడులకు తెగబడుతున్నారు. క్రషర్ నడవాలంటే స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుమతి తీసుకోవాలని, కప్పం కట్టాలని నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శుక్రవారం మూడోసారి క్రషర్ దగ్గరకు వెళ్లి మూసేయాలని బెదిరించారు. క్రషర్ మిషన్ ఏర్పాటుకు సహకరించిన వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తిని దుర్భాషలాడటమేగాక ఆయన అంతుచూస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి క్రషర్ మిషన్ వద్దకు వెళ్తుండగా గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఉన్న టీడీపీ నాయకుడు నారాయణ, అతడి అనుచరులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో కృష్ణమూర్తి, రామరంగడు, శేషు, ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బంధువులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సందర్భంగా కృష్ణమూర్తి అనుచరులు ప్రతిఘటించడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ, నడిపి ఓబులేసు, శ్రీనివాసులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అనుమతులతోపాటు ప్రభుత్వపరమైన అనుమతులు ఉన్నా వశిష్ట క్రషర్ నిర్వాహకులు, కూలీలు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. ఈ క్రషర్ నిర్వాహకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు బంధువులనే కారణంతో.. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో మండల, గ్రామ టీడీపీ నాయకులు క్రషర్‌పై దాడులకు దిగుతుండటం గమనార్హం. చెలరేగుతున్న తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనివిధంగా కోట్ల ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేస్తున్నారు. ఇటీవల డోన్ మండలం వెంకటనాయునిపల్లిలో రెండు కుటుంబాల మధ్య పొలం గట్టు తగాదాలో ఒక వర్గానికి చెందిన మాధవయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేసి గాయపరిచారు. అతడు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. మాధవయ్య అనుచరులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడిచేసి ద్విచక్రవాహనాలు, టీవీలు, నిత్యావసర వస్తువులు ధ్వంసం చేయడమేగాక పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారికి గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు మద్దతునిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెపాన్ని వైఎస్సార్సీపీ నాయకులపైకి నెట్టేందుకు ప్రయతి్నంచడం పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్వారీ నాది కాదు...అయినా టీడీపీ గూండాలు దాడి చేస్తున్నారుక్వారీ అక్రమమో.. సక్రమమో? తేల్చాల్సింది ప్రభుత్వమేమాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టీకరణ సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లాలో ప్యాపిలి మండలం పోదొడ్డిలోని కంకర క్వారీ తనది కాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన దగ్గర నుంచి స్థానిక టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ.. క్వారీపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వేటకొడవళ్లతో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారని.. వేయింగ్ బ్రిడ్జిని లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల తీరుతో పోదొడ్డి గ్రామంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో చివరకు గ్రామంలోని మరొక వర్గం టీడీపీ అరాచకాలను ప్రశ్నించడంతో ఘర్షణ తలెత్తిందని చెప్పారు. తనకు సంబంధం లేకపోయినా.. తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్వారీ సక్రమమా? లేదా అక్రమమా? అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే గానీ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు, ఆ పారీ్టకి చెందిన గూండాలు కాదన్నారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్న టీడీపీ గూండాల తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. -
టీడీపీ నేత గంజాయి సాగు
సాక్షి టాస్క్‌ఫోర్స్: గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నిత్యం ప్రచార పటాటోపం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలే గంజాయి పండిస్తున్నారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన టీడీపీ నేత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం మండలం టి.వీరాపురంలో టీడీపీ నాయకుడు చిలకరి వన్నూరుస్వామి మామిడి తోటలో గంజాయి మొక్కలు పెంచుతూ పట్టుబడ్డాడు. వన్నూరుస్వామి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ముఖ్య అనుచరుడు.టి.వీరాపురం గ్రామ సమీపాన కణేకల్లు క్రాస్‌కు చెందిన రవి అనే రైతు 9.5 ఎకరాల భూమిలో మామిడి, అల్ల నేరేడు పెంపకం చేపట్టాడు. ఈ తోట కాపరిగా టీడీపీ నాయకుడు వన్నూరుస్వామి కొంతకాలంగా ఉంటున్నాడు. పండ్ల తోటల మధ్య బంతి, కనకాంబరాల సాగు మొదలుపెట్టాడు. అందులోనే గుట్టుగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించి.. జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటలక్ష్మమ్మకు సమాచారాన్ని చేరవేశాడు. ఆమె సెబ్ పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగారు. 7.25 కిలోల బరువు ఉన్న నాలుగు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. శుక్రవారమే గంజాయి పట్టుబడగా 24 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిచ్చింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.21 వేలు ఉంటుందని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నిందితుడికి గంజాయి తీసుకునే అలవాటు ఉందని, ఈ కారణంగానే నాలుగు మొక్కలు పెంచుకున్నాడనే విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. -
ఇంకా మిస్టరీగానే నంద్యాల ముచ్చుమర్రి కేసు!
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఆరో రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి కనిపిచటం లేదు. ఒక్క బోటుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక తల్లిదండ్రులను ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించపోవటంతో ముచ్చుమర్రి ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎదురు చూపులు చూస్తున్నారు. అభం శుభం తెలియని తొమిదేళ్ళ చిన్నారి అదృశ్యంపై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటన స్థలానికి చేరుకుని సీను రికస్టక్షన్ చేసినా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.చదవండి: రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు! -
ఆగని టీడీపీ విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. గురు, శుక్రవారాల్లో అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్లు, ఇళ్ల పునాదుల్ని ధ్వంసం చేయించారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తీయించేశారు. డివైడర్‌ను, బస్ షెల్టర్‌ను, పిల్లర్లను ధ్వంసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పగులగొట్టారు. » తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీకి చెందిన నిరుపేద వంకా సుధాకర్ నిర్మిస్తున్న ఇంటిని టీడీపీ ఒత్తిడితో అధికారులు కూల్చేశారు. స్థానిక చెరువులో సుధాకర్ అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే సుమారు రూ.8 లక్షలు వెచ్చించి గోడలు కట్టుకున్నాడు. కొందరు టీడీపీ నాయకులు, కొంత మీడియా వారు అది కూల్చేయాల్సిందేనని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడున్న మిగిలిన ఇళ్లనుగానీ, పట్టణంలో ఉన్న పలు ఆక్రమణలనుగానీ పట్టించుకోని అధికారులు సుధాకర్ నిర్మించుకుంటున్న ఇంటిని జేసీబీతో కూల్చేశారు. » ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వైఎస్సార్ïÜపీ ప్రభుత్వ హయాంలో కోనేటి చెరువు వద్ద రోడ్డును వెడల్పు చేసి ఆర్అండ్బీ ఆధ్వర్యంలో డివైడర్ నిర్మించారు. ఈ డివైడర్‌ను టీడీపీ వారు పొక్లెయిన్‌తో ధ్వంసం చేసి తొలగించారు. దీంతోపాటు పాత బస్ షెల్టర్‌ను, నూతనంగా నిర్మిస్తున్న బస్ షెల్టర్ పిల్లర్లను కూల్చేశారు. » శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు చెన్నేకొత్తపల్లి చేరుకుని వైఎస్సార్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు నిరసన తెలుపుతున్న వారివద్దకు చేరుకుని.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ శివాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దుండగులు ధ్వంసం చేసిన వైఎస్సార్ విగ్రహం స్థానంలో ఒకటిరెండు రోజుల్లో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు.» శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ జగనన్న కాలనీలో పునాదులను అధికార పార్టీ నాయకులు ధ్వంసం చేయించారు. జగనన్న ఇళ్ల కోసం ఈ సచివాలయం పరిధిలోని కొయ్య మోహిని, త్రివేణీ బడియా, బాకి భవానీ, కొండ మోహిని, నందికి శ్రావణి, లండ చందరమ్మ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 30న అప్పటి తహసీల్దార్ పి.మీనాదేవి అనుమతి ఇచ్చారు. వారు ఆ స్థలాల్లో పునాదులు వేసుకున్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు అక్రమ కట్టడాలు అంటూ రెవెన్యూ అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఇళ్లపై గత నెల 25న ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆ కట్టడాలను పరిశీలించి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. ఈ క్రమంలోనే శుక్రవారం రెవెన్యూ అధికారులు చూడామణిరెడ్డి, వీఆర్వో సాలిన కృష్ణ, మండల సర్వేయర్ తవిటినాయుడు ఆధ్వర్యంలో జేసీబీతో పునాదులను నేలమట్టం చేశారు.విషయం తెలుసుకున్న సర్పంచ్ ప్రతినిధి ఇసురు తులíÜరాం, బాధిత లబ్ధిదారులు అక్కడికి చేరుకుని కూల్చివేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ అంశంపై స్థానిక తహసీల్దార్ ఎం.భాస్కర అప్పారావును వివరణ కోరగా.. గతంలో పనిచేసిన తహసీల్దార్ ఇళ్లను మంజూరు చేయడం వాస్తవమేనని చెప్పారు. వారికి వారం రోజుల్లో మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. -
జీపుతో ఢీకొట్టి కిడ్నాప్..
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణ నడిబొడ్డున అందరూ చూస్తుండగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి శ్రీనును జీపుతో ఢీకొట్టి.. ఆపై కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ ఇంట్లో.. ఆమె సమక్షంలో తీవ్రంగా కొట్టి పట్టణ శివారులో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డికి లింగందిన్నెకు చెందిన చాకలి శ్రీను అనుచరుడు. శుక్రవారం ఆరోగ్యం సరిగాలేదని ఆళ్లగడ్డలోని మెడికల్ స్టోర్‌కు వచ్చి, మందులు తీసుకుని మరో యువకుడితో కలిసి బైక్‌పై లింగందిన్నెకు బయలుదేరాడు. వారిని వాహనంలో వెంబడిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బైక్‌ను ఢీకొట్టారు. దీంతో శ్రీను, మరో యువకుడు కిందపడ్డారు. వెంటనే కర్రలు, రాడ్లతో వాహనంలోంచి దిగిన టీడీపీ రౌడీ మూకలు శ్రీనును కొట్టుకుంటూ వాహనంలో వేసుకుని ఎమ్మెల్యే ఇంట్లోకి తీసుకెళ్లారు. మరో యువకుడు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించారని పోలీసులకు చెప్పినా ఫలితం లేదు. తుదకు శ్రీనును చంపొద్దని బతిమాలడంతో స్పృహ కోల్పోయేలా కొట్టి పొలాల్లో పడేశారు. ఆపై పోలీసులు 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 3 గంటలకు పైగా ఉత్కంఠ శ్రీనును కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించిన విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. టీవీ చానళ్లలో ప్రముఖంగా ప్రసారమైంది. అయినా పోలీసులు చలనం లేకుండాపోయింది. సుమారు 3 గంటలకు పైగా బాధితుడిని ఇంట్లో ఉంచి కొడుతున్నా.. అరుపులు బయటకు వినిపిస్తున్నా.. పోలీసులు మౌనం వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే.. విడిచి పెట్టాలని కోరుతున్నామని చెప్పారే తప్ప కనీసం ఆ ఇంటి వద్దకు కూడా వెళ్లక పోవడం విమర్శలకు తావిస్తోంది. విషయం వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. టీడీపీ శ్రేణులతో చర్చలు కొనసాగించినట్లు తెలుస్తోంది. కొట్టి పొలాల్లో పడేస్తామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ముందుగానే పోలీసులు 108 వాహనాన్ని సిద్ధం చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి ఆళ్లగడ్డలో ప్రథమ చికిత్స కూడా చేయించకుండా 50 కి.మీ దూరంలోని నంద్యాల వైద్యశాలకు తరలించడం గమనార్హం. -
రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు!
సాక్షి, నంద్యాల/పగిడ్యాల/నందికొట్కూరు : అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారి అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియక పోవడం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత బాలురు చెబుతుండటంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు నిద్ర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో పోలీసుల విచారణ నత్త నడకను తలపిస్తోంది. దీంతో తమ బిడ్డ ఆచూకీ తెలియజేయండని బాలిక తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. బాలిక ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోమవారం రాత్రి పోలీసులు మేల్కొన్నారు. మంగళవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు కొత్త ముచ్చుమర్రి పార్క్‌లో పనిచేసే సిబ్బందిని విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని చోట్లా వెతికినా ఫలితం శూన్యం నిందితులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన సుమారు 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను కృష్ణా నది నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌజ్ వరకు ఉన్న లింక్ చానల్లో పడేశామని చెప్పడంతో పోలీసు సిబ్బంది కాలువను జల్లెడ పట్టారు. స్పీడ్ బోట్లతో కాలువ మొత్తం గాలించారు. గజ ఈత గాళ్ల సాయం తీసుకున్నారు. వలలు వేసి వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి నిందితులను మరోసారి విచారించగా లింక్ చానల్లో కాదు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లో పడేశామని చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరూ నేరం తాను చేయలేదని వాడే చేశాడంటూ ఒకరిపై ఒకరు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తనకేమీ తెలియదని, బాలికను వారిద్దరే చంపేశారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు ఆచితూచి విచారిస్తున్నారు. నీటి కుక్కలు తినేశాయా? చిన్నారిని ఆదివారం రాత్రే గొంతు నులిమి విద్యార్థులు హత్య చేసినట్లు సమాచారం. వీరికి పెద్దలు ఎవరైనా సహకారం అందించారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ లింక్ చానల్లో పడేసినట్లయితే మూడు రోజులకే మృతదేహం నీటిపై తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న నీటి కుక్కలు శవాన్ని పీక్కుతినేశాయా అనే అనుమానం పోలీసులను వేధిస్తోంది. శుక్రవారం సీన్ రీ కన్స్ట్రక్షన్ (బాలికను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు.. ఎక్కడ రేప్ చేశారు.. ఎలా గొంతు నులిమి చంపేశారు.. అన్న వివరాలను నిందితుల నుంచి స్పాట్‌కు తీసుకెళ్లి రాబట్టడం) చేసినట్లు తెలిసింది. అయినా బాలిక ఆచూకీ తెలుసుకోలేక పోవడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ విజయరావు ఘటనా స్థలికి ఇలా వచి్చ.. అలా వెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మైనర్ బాలిక ఫ్లెక్సీతో బంధువులంతా రోడ్డెక్కి ‘వుయ్ వాంట్ జస్టిస్’ అని నినదించారు. కొత్త ముచ్చుమర్రి నుంచి పాత ముచ్చుమర్రి క్రాస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి స్టేషన్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు. ఆరు రోజులైనా తమ పాప ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఐజీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్ఐ జయశేఖర్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సంయమనం పాటించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకీయా బేగం పరామర్శించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులుబాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు బ్రాహ్మణకొట్కూరు వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితుల వద్దకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఎట్టకేలకు బాధిత చిన్నారి తండ్రినే అక్కడికి పిలిపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీహార్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ప్రతిపక్ష పార్టీల నాయకులను బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపిస్తున్నారన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిళ్లతో ఇలా చేస్తున్నారని ప్రశి్నంచారు. తన సొంత గ్రామంలో బాలిక హత్య జరిగితే, ఆ కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు. ముచ్చుమర్రికి తాను వెళితే నిజాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారా అని నిలదీశారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, చంద్రమౌళి, రవియాదవ్, తులసిరెడ్డి, రమే‹Ùనాయుడు, ఉపేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, ఓంకార్‌రెడ్డి, శ్రీకాంత్, నాగభూషణంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.