Forbes
-
పడి.. లేచి.. బబుల్ టీతో వేల కోట్లకు పగడలెత్తాడు
మీరు ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా (business ideas in telugu) కోసం చూస్తున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్ ఐడియాతో ఎక్కువ లాభం అర్జించాలని అనుకుంటున్నారా? అయితే, ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కొత్త బిజినెస్ ఐడియా ఏంటో తెలుసా? బబుల్ టీ. మనకు సాధారణ టీ గురించి, టీ ఫ్రాంచైజీల గురించి తెలుసు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసు. మరి బబుల్ టీ(Bubble tea). ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్సే ఈ బబుల్ టీ బిజినెస్. బబుల్ టీని అమ్మి తాజాగా 38 ఏళ్ల యునాన్ వాంగ్ (Yunan Wang) చైనాలో బిలియనీర్ అవతారం ఎత్తారు.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఇటీవల యునాన్ వాంగ్ సంస్థ ‘మింగ్ హోల్డింగ్స్’ ఐపీవోకి వెళ్లింది. ఈ ఐపీవోలో అదరగొట్టేలా 233 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో వాంగ్ నికర విలువ 1.2 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా చైనా బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మింగ్ హోల్డింగ్స్ ‘గుడ్మీ’ పేరుతో బబుల్ టీని విక్రయిస్తుంది. 2023 చివరి నాటికి చైనాలోని తొలి ఐదు బబుల్ టీ బ్రాండ్లలో 9.1శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతుంది. యునాన్ వాంగ్ ఎవరు?38 ఏళ్ల యునాన్ వాంగ్ చైనాలోని ప్రముఖ బబుల్ టీ కంపెనీ గుమింగ్ హోల్డింగ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అతని తల్లిదండ్రులు మయన్మార్ సరిహద్దుల్లో చిన్న రిటైల్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. యునాన్ వాంగ్ 2010లో జెజియాంగ్ సైన్స్-టెక్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్,ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ ఏడాది దాదాపు 15 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన డాక్సీలో బబుల్ టీ షాపును ప్రారంభించాడు. బబుల్ టీ బిజినెస్ ప్రారంభంలో అనేక ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. రోజుకి వాంగ్ బబుల్ టీ అమ్మకాలు కేవలం 100 యువాన్ల (సుమారు $18.50) వరకు మాత్రమే అమ్మకాలు జరిగేవి. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన వాంగ్ తన సహ వ్యవస్థాపకుడి కూల్‌డ్రింక్‌ను అమ్మేవారు. ఫ్రాంచైజీలు రోజులు గడిచే కొద్ది వాంగ్ అమ్మే బబుల్ టీ షాపుకు కస్టమర్ల తాకిడి ఎక్కువైంది. అమ్మకాలు జోరందుకున్నాయి. చైనా వ్యాప్తంగా మొత్తం 10వేల బబుల్ టీ ఫ్రాంచైజీలతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. తాజా బబుల్ టీ బిజినెస్‌లో బిలియనీర్ అయ్యాడు.బబుల్ టీ క్రేజ్బోబా టీనే బబుల్ టీగా అవతరించింది. 1980లలో తైవాన్‌లో పుట్టిన బబుల్ టీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుర్రకారుకు యమక్రేజ్. ఈ బబుల్ టీని చల్లని పాలు, పండ్ల రసాలు, టాపియోకా (టాపియోకా అనేది కాసావా (Cassava) అనే మొక్క వేరు నుండి తయారు చేసే పిండి పదార్థం) , జెల్లీ ముక్కలతో తయారు చేస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా తైవాన్, చైనా, ఇతర ఆసియా దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఈ బబుల్ టీ అమ్మకాలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో మన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. వివిధ రకలా పండ్ల రుచులు, చాక్లెట్, ఇతర ప్రత్యేక రుచులతో బబుల్ టీని విక్రయిస్తున్నారు. -
ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితా
పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియా, దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025 జనవరి ప్రారంభం నాటికి పోర్బ్స్ ఆసియా(Forbes Asia) కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ(Ambani) మొదటిస్థానంలో నిలువగా, గౌతమ్ అదానీ(Adani) రెండో స్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ మొత్తం సంపద 96.6 బిలియన్ డాలర్లు ఉండగా, గౌతమ్ అదానీ సంపద 62.1 బిలియన్ డాలర్లుగా ఉంది.ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఆసియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (ఇండియా, అదానీ గ్రూప్)జోంగ్ షాన్షాన్ - 53.6 బిలియన్ డాలర్లు (చైనా, నోంగ్ఫు స్ప్రింగ్)ప్రజోగో పంగేస్తు - 55.9 బిలియన్ డాలర్లు (ఇండోనేషియా, బారిటో పసిఫిక్ గ్రూప్)తడాషి యానై అండ్ ఫ్యామిలీ - 47.2 బిలియన్ డాలర్లు (జపాన్, ఫాస్ట్ రిటైలింగ్)జాంగ్ యిమింగ్ - 45.6 బిలియన్ డాలర్లు (చైనా, బైడ్‌డ్యాన్స్, టాక్‌టాక్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఇండియా, జిందాల్ గ్రూప్)మా హువాటెంగ్ - 43.3 బిలియన్ డాలర్లు (చైనా, టెన్సెంట్ హోల్డింగ్స్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాబిన్ జెంగ్ - 37.2 బిలియన్ డాలర్లు (హాంకాంగ్, కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీ-సీఏటీఎల్)ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?ఫోర్బ్స్ ప్రకారం 2025 ప్రారంభం నాటికి ఇండియాలోని టాప్ 10 ధనవంతులుముఖేష్ అంబానీ - 96.6 బిలియన్ డాలర్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)గౌతమ్ అదానీ - 62.1 బిలియన్ డాలర్లు (అదానీ గ్రూప్)సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 44.3 బిలియన్ డాలర్లు (ఓపీ జిందాల్ గ్రూప్)శివ్ నాడార్ - 40 బిలియన్ డాలర్లు (హెచ్‌సీఎల్ టెక్నాలజీస్)రాధాకిషన్ దమానీ - 31.5 బిలియన్ డాలర్లు (డీమార్ట్)ఉదయ్ కోటక్ - 28 బిలియన్ డాలర్లు (కోటక్ మహీంద్రా బ్యాంక్)సునీల్ మిట్టల్ - 27 బిలియన్ డాలర్లు (భారతీ ఎంటర్ప్రైజెస్)లక్ష్మీ మిట్టల్ - 26 బిలియన్ డాలర్లు (ఆర్సెలర్ మిట్టల్)కుమార మంగళం బిర్లా - 25 బిలియన్ డాలర్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)అనిల్ అగర్వాల్ - 24 బిలియన్ డాలర్లు (వేదాంత రిసోర్సెస్) -
నాడు నమ్మి లోన్ ఇవ్వలేదు.. నేడు రూ.40 వేల కోట్ల కంపెనీ
వ్యాపార రంగంలో రాణించడం అంత సులువు కాదు.. అందునా మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయినా దశాబ్దాల క్రితం దేశంలో ఓ మహిళ వ్యాపారం ప్రారంభించడమంటే పెద్ద సాహసమే. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.కిరణ్ మజుందార్ షా కథ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.విద్య, నేపథ్యంకర్ణాటకలోని బెంగళూరులో 1953 మార్చి 23న జన్మించిన కిరణ్ బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో తన బీఎస్సీ పూర్తి చేశారు. సైన్స్‌పై ఆకాంక్షతో, ఆమె ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి మాల్టింగ్ అండ్ బ్రూయింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె భారత్‌కు తిరిగి రావడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు కార్ల్టన్ & యునైటెడ్ బ్రూవరీస్లో ట్రైనీ బ్రూవర్‌గా పనిచేశారు.జాబ్ ఇవ్వని కంపెనీలుభారత్కు తిరిగి వచ్చిన తర్వాత బ్రూయింగ్‌లో కెరీర్‌ను నిర్మించుకోవాలని కిరణ్ భావించారు. అయితే ఆ సమయంలో భారతీయ పరిశ్రమ పురుషులకు ప్రత్యేకమైన వృత్తిగా బ్రూయింగ్ను చూసేది. దీంతో విద్యార్హతలు ఉన్నప్పటికీ ఢిల్లీ, బెంగళూరులోని కంపెనీలు ఆమెకు జాబ్ ఇవ్వకుండా తిరస్కరించాయి.ఇలా ఉండగా ఐరిష్ వ్యాపారవేత్త లెస్ ఆచిన్‌క్లోస్‌ను కలుసుకోవడం ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించమని కిరణ్ మజుందార్ షాను ఆయన ప్రోత్సహించారు. ప్రారంభంలో సంశయించిన ఆమె ఐర్లాండ్‌లోని బయోకాన్ బయోకెమికల్స్‌లో ఆరు నెలల శిక్షణ కోసం ఆయన ప్రతిపాదనను అంగీకరించారు. ఒక వేళ ఆమెకు వ్యాపారం సరిపడకపోతే ఉద్యోగం కల్పించడంలో సహాయం చేస్తానని కూడా ఆచిన్‌క్లోస్ హామీ ఇచ్చారు.రూ.10,000తో బయోకాన్ ప్రారంభం1978లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కిరణ్ బయోకాన్ బయోకెమికల్స్తో భాగస్వామిగా ఉంటూ కేవలం రూ.10,000 పెట్టుబడితో బయోకాన్ ఇండియాను స్థాపించారు. చిన్న గ్యారేజీలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె బొప్పాయి సారం నుండి ఎంజైమ్‌లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆమె ఉత్పత్తులు యూఎస్, యూరప్‌లో మార్కెట్‌ను పొందాయి. బయోకాన్‌కు మొదటి విజయం దక్కింది.తరువాత బీర్ వడపోతలో ఉపయోగించే ఐసింగ్లాస్ను తయారు చేయడం ప్రారంభించారు. బయోకాన్ దేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. దీని విలువ రూ.40,000 కోట్ల కంటే ఎక్కువ.లోన్ ఇవ్వని బ్యాంకులుకిరణ్ తొలిరోజులలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో బయోటెక్నాలజీ భారత్‌లో ఒక నూతన రంగం. ఒక మహిళా వ్యాపారవేత్తగా ఆమె రాణించగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పరిశ్రమలో విజయం సాధించగల ఆమె సామర్థ్యాన్ని అనుమానిస్తూ బ్యాంకులు ఆమెకు రుణాలు మంజూరు చేసేందుకు నిరాకరించాయి. అయినప్పటికీ, ఆమె సంకల్పం, వినూత్న విధానం సందేహాల వ్యక్తం చేసినవారి కళ్లు తెరిపించాయి. -
ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. వరుసగా ఆరోసారి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 21వ వార్షిక ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాది నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలిచారు.ప్రతీ ఏడాది వినోద, వ్యాపార, రాజకీయ, దాతృత్వం, తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రభావాన్ని చూపిస్తున్న మహిళా వ్యాపారవేత్తలు, ఎంటర్టైనర్లు, రాజకీయ నాయకులు, దాతలు, విధాన రూపకర్తలతో కూడిన వార్షిక జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. నిర్మలా సీతారామన్‌తోపాటు, ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా 81వ స్థానంలో నిలవగా, బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో ఉన్నారు.ఇక శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం, 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలో నిలిచారు. యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వరుసగా మూడోసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , మొదటి ఐదు స్థానాల్లో కొత్తవారు మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ చోటు దక్కించుకున్నారు. -
కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్
ప్రపంచంలో అత్యధిక విలువైన కరెన్సీ అంటే అంతా అమెరికన్ డాలర్ అనుకుంటారు. అది కొంతవరకూ నిజమే. ప్రపంచంలో అత్యధిక లావాదేవీలు డాలర్‌తోనే జరుగుతాయి. అక్టోబరు 7 నాటికి.. ఒక డాలర్ విలువ మన కరెన్సీలో సుమారు రూ.84.కానీ, కొన్ని కరెన్సీలు ఒక్కో యూనిట్ కొనాలంటే ఒకటి కంటే ఎక్కువ అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాలి. అలా చూసినప్పుడు ప్రపంచంలో అత్యధిక విలువ ఉన్న కరెన్సీ కువైట్ దీనార్. ఇది ఒక యూనిట్ సుమారు రూ.274. ఒక దీనార్ కొనాలంటే 3.26 డాలర్లు ఖర్చు పెట్టాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన లేదా ఖరీదైన కరెన్సీ టైటిల్‌ను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ స్థానిక, అంతర్జాతీయ అంశాల సమగ్ర విశ్లేషణ అవసరం. ఈ కారకాలలో విదేశీ మారకపు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ డైనమిక్స్, ద్రవ్యోల్బణం రేట్లు, దేశీయ ఆర్థిక వృద్ధి, సంబంధిత సెంట్రల్ బ్యాంక్ అమలు చేసే విధానాలు, దేశం మొత్తం ఆర్థిక స్థిరత్వం ఉన్నాయి. -
చనిపోయినా.. చచ్చేంత సంపాదన
చచ్చీచెడీ సంపాదించాననే మాట వినే ఉంటారు. కానీ నిజంగానే చనిపోయినా వందల కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు? సాధారణంగా మ్యుజీషియన్లు, సింగర్లు, రైటర్లకు వారి పాటలను, రచనలను వాడుతున్నవారు రాయల్టీగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సృష్టించినవారు చనిపోయినా.. వారి పేరిట రాయల్టీ వసూలై వారసులకు అందుతూనే ఉంటుంది. మరి ఇలా ‘చనిపోయినా’ అత్యధి కంగా సంపాదిస్తున్నవారు ఎవరో తెలుసా?టాప్ మైఖేల్ జాక్సన్ఫోర్బ్స్ '2024లో అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీల' జాబితా ప్రకారం.. మైఖేల్ జాక్సన్ గత ఏడాది రాయల్టీల ద్వారా 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,044 కోట్లు) సంపాదించాడు. రూ.2,102 కోట్లతో సింగర్, రైటర్ ఫ్రడ్డీ మెర్క్యూరీ, రూ.630 కోట్లతో రైటర్ డాక్టర్ సియస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
సక్సెస్ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్ లెవల్ అంతే! ఎవరీ బిలియనీర్ మహిళ
విజయవంతమైన వ్యాపార కుటుంబం నుంచి వారసులు చాలామంది వస్తారు. కానీ ఆ విజయాన్ని అంది పుచ్చుకుని అసాధారణ వృద్ధితో ఎదిగిన వ్యాపార దిగ్గజాలు కొంతమందే ఉంటారు. ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ 'మెట్రో బ్రాండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఫరా మాలిక్ భాంజీ కథ అలాంటిదే. బిలియనీర్ ఫరా మాలిక్ భాంజీ గురించి ఇంట్రస్టింగ్ సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు. కంపెనీ సీఎండీగా ఫరా మాలిక్ భాంజీ రూ. 28,773 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. మెట్రో బ్రాండ్స్ ఛైర్మన్ రఫీక్ మాలిక్ రెండో కుమార్తె. తన నలుగురు సోదరీమణుల మాదిరిగానే, లంచ్ టేబుల్ వద్ద షాప్ టాక్ వింటూ పెరిగింది. కానీ కంపెనీ పగ్గాలు చేపట్టిన తరువాత ఫరా మార్గదర్శకత్వంలో, గతంలో 'మెట్రో షూస్'గా పిలువబడే మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. డిసెంబర్ 8 నాటికి 35,117 కోట్ల చేరడం విశేషం.ముంబై కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ కంపెనీ. ఫరా తాత మాలిక్ తేజాని 1955లో తిరిగి స్థాపించారు. మోచి, మెట్రో , వాక్‌వే వంటి విజయవంతమైన బ్రాండ్ల రాకకు పునాది. పాదరక్షల పరిశ్రమలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది ఫరా. ఆమె వినూత్న విధానం , ఫార్వర్డ్-థింకింగ్ స్ట్రాటజీలు కంపెనీని నెక్ట్స్ లెవల్‌కి చేర్చాయి. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు చదివి కంపెనీలో మార్కెటింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది. ఇదే ఆ తర్వాత మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ సరఫరా గొలుసును పునరుద్ధరించడానికి తోడ్పడింది.2010లో వెబ్సైట్ ఏర్పాటు చేసి, ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించారు. దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్ చేసిన మెట్రో విదేశీ పాదరక్షల జోడింపుతో ‘మెట్రో బ్రాండ్స్’గా అవతరించింది.మెట్రో బ్రాండ్స్ పాదరక్షల దిగ్గజం క్రాక్స్ ఇండియా లిమిటెడ్ (CIL)తో ఒప్పందం నిబంధనలు, మార్పులతో తన భాగస్వామ్యాన్ని కూడా విస్తరించింది. దీని ప్రకారం భారతదేశంలోని పశ్చిమ , దక్షిణ రాష్ట్రాలలో Crocs "ఫుల్ కాస్ట్ " దుకాణాలనిర్వహణకు మెట్రో బ్రాండ్లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా 200కి పైగా ప్రత్యేకమైన క్రోక్స్ స్టోర్లను నిర్వహిస్తోంది.స్కేచర్స్, క్లార్క్స్ వంటి ఇతర గ్లోబల్ టైటాన్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాలున్నాయి. 2021లో మెట్రోని ఐపీవోకు వచ్చింది. రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఫరా మాలిక్ భాంజీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు, పరిశ్రమ దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా ఉన్నారు. -
2024 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితా
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్బ్లేజర్లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు."30 అండర్ 30 ఆసియా" జాబితాసియాన్ డాసన్ - ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్జు యుయాంగ్ - చైనా: ఎంటర్ప్రైజ్ టెక్నాలజీఅక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీజాంగ్ జికియాన్ - చైనా: హెల్త్‌కేర్ & సైన్స్భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ -
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా బిలియనీర్‌గా నిలిచారు. సుబ్బమ్మ గత నెలలో ఫోర్బ్స్ జాబితాలో అరంగేట్రం చేశారు. ఆమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.91.9 వేల కోట్లు) చేరుకుంది.ఎవరీ సుబ్బమ్మ..?సువెన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు వెంకటేశ్వరులు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి. ఈమె హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈమె కుమారుడు వెంకటేశ్వరులు 1970, 1980లలో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు. ఫోర్బ్స్ ప్రకారం, 2022లో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది.సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు. ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె 2,653 స్థానంలో ఉన్నారు. భారతీయ మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే సావిత్రి జిందాల్ 34.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. -
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
సంపన్నులైన వ్యాపార దిగ్గజాలు వారి బిజినెస్ కార్యకలాపాలను తమ వారసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆసియాలోనే కుబేరుడైన ముఖేశ్ అంబానీ తన వారసులకు వ్యాపారాలను అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థులు తమ తర్వాత తరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఫోర్బ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ ర్యాంకింగ్ 2024లో ఉన్న 2,781 మందిలో దాదాపు మూడింట ఒకవంతు మంది అంటే మొత్తం 934 మంది తమ వారసులకు వ్యాపారాన్ని అప్పగించారు. వీరు నడిపిస్తున్న కంపెనీలు, వాటి మార్కెటింగ్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.ముఖేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద దాదాపు 113.5 బిలియన్ అమెరికన్ డాలర్లు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్‌కు తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. కూతురు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.బెర్నార్డ్ ఆర్నాల్ట్ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు డెల్ఫిన్ ఆర్నాల్ట్, ఆంటోయిన్ ఆర్నాల్ట్, జీన్ ఆర్నాల్ట్, ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్, అలెగ్జాండర్ ఆర్నాల్ట్ అనే వారసులున్నారు. తన కుటుంబ సంపద మొత్తం 214.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. తన వారసులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెల్ఫిన్ ఆర్నాల్ట్(49) 2023లో మాంటిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్(46) ఎల్వీఎంహెచ్ కమ్యూనికేషన్స్, ఇమేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. అలెగ్జాండర్ ఆర్నాల్ట్(31) కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్రెడెరిక్ ఆర్నార్ట్(29)ట్యాగ్‌హ్యూర్ పదవీకాలం తర్వాత 2024లో ఎల్వీఎంహెచ్ వాచెస్‌కు సీఈఓగా చేరారు. జీన్ ఆర్నాల్ట్(25) 2021లో ఎల్వీఎంహెచ్లో చేరారు. లూయిస్ విట్టన్ వాచీల విభాగానికి మార్కెటింగ్ హెడ్‌గా చేస్తున్నారు.అదానీ గ్రూప్గౌతమ్ అదానీ ఛైర్మన్‌గా ఉన్న ఈ గ్రూప్ సంపద సుమారు 102.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఆయనకు కరణ్, జీత్ అదానీలు ఇద్దరు కుమారులు. పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన కరణ్ తన తండ్రి తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు.షాపూర్జీ పల్లోంజీ గ్రూప్షాపూర్ మిస్త్రీ స్థాపించిన ఈ గ్రూప్ సంపద 37.7 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడిగా పల్లోన్ మిస్త్రీ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్‌నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఇందులో టాటా సన్స్ వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టుఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్లాఓరీల్ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 94.5 బిలియన్ డాలర్ల సందప కలిగి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సౌందర్య సాధనాల దిగ్గజ సంస్థగా లాఓరీల్‌కు మంచి పేరుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ వారసులు జీన్-విక్టర్, నికోలస్ మేయర్స్. జీన్-విక్టర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. నికోలస్ మేయర్స్ కుంటుంబం పెట్టుబడి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..
ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల్లో మొదటి పది మందిలో రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. మరోసారి భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం.. 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు. 2023లో ఆయన సంపద 83.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌లో రెండో సంపన్నుడైన గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 47.2 బిలియన్ డాలర్ల నుంచి 84 బిలియన్ డాలర్లకు పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ సహవ్యవస్థాపకుడు శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్-కుటుంబం (33.5 బి.డాలర్లు) 46వ స్థానంలో, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి (26.7 బి.డాలర్లు) 69వ స్థానంలో నిలిచారు. సైరస్ పూనావాలా (21.3 బి.డాలర్లు) 90వ స్థానం, కుషాల్ పాల్ సింగ్ (20.9 బి.డాలర్లు) 92వ స్థానం, కుమార్ బిర్లా (19.7 బి.డాలర్లు) 98వ స్థానం దక్కించుకున్నారు. ఇదీ చదవండి: గూగుల్ రహస్య బ్రౌజర్.. రూ.41,000 కోట్ల దావా! తెలుగు రాష్ట్రాల నుంచి ఫోర్బ్స్‌లో చోటు సంపాదించిన వారి వివరాలు కింది విధంగా ఉన్నాయి. మురళి దివి, కుంటుబం 6.2 బిలియన్ డాలర్ల సంపదతో(రూ.51వేలకోట్లు) 469 ర్యాంకులో నిలిచారు. ప్రతాప్ సి రెడ్డి 3 బిలియన్ డాలర్లతో(రూ.26వేలకోట్లు) 1104 ర్యాంకు జీఎం రావు 2.9 బిలియన్ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు పీవీ రామ్ ప్రసాద్‌రెడ్డి 2.9 బిలియన్ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు జూపల్లి రామేశ్వర్రావు 2.3 బిలియన్ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు పీపీ రెడ్డి 2.3 బిలియన్ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు పీవీ కృష్ణారెడ్డి 2.2 బిలియన్ డాలర్లతో(రూ.18వేలకోట్లు) 1496 ర్యాంకు ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్ డాలర్లతో(రూ.16వేలకోట్లు) 1623 ర్యాంకు కె.సతీశ్‌రెడ్డి 1.8 బిలియన్ డాలర్లతో(రూ.15వేలకోట్లు) 1764 ర్యాంకు జి.వి.ప్రసాద్ 1.5 బిలియన్ డాలర్లతో(రూ.12వేలకోట్లు) 2046 ర్యాంకు -
ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళ.. ఎవరీ రేణుకా జగ్తియాని?
భారతీయుల ఆస్తులు అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మరో 25 మంది చేరారు. వారిలో ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈఓ రేణుకా జగ్తియాని ఒకరు. ఆమె నికర విలువ సుమారు 4.8 బిలియన్లు రేణుకా జగ్తియాని ఎవరు? భారతి సంతతికి చెందిన రేణుకా జగ్తియాని భర్త మిక్కి జగ్తియాని ల్యాండ్‌మార్క్ గ్రూప్‌ను స్థాపించారు. అయితే గతేడాది మిక్కి జగ్తియాని మరణించడంతో కంపెనీ ఛైర్ ఉమెన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థలో మొత్తం 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రేణుకా జగిత్యాని ఆర్ట్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి పూర్తి చేశారు. రేణుకా జగిత్యాని జనవరి 2007లో ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్‌లో అత్యుత్తమ ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత జనవరి 2012లో గల్ఫ్ బిజినెస్ ఇండస్ట్రీ అవార్డ్స్‌లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా, 2014లో వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరమ్ ఆమెను ప్రపంచ వ్యాపార వేత్తగా గౌరవించింది. 2015లో ఆమె ఇండియన్ సీఈఓ అవార్డ్స్‌లో స్ట్రాటజిక్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా, 2016లో స్టార్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్ నుండి ఆమె కెప్టెన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవార్డును, 2017లో ఆమె వరల్డ్ రిటైల్ కాంగ్రెస్‌లో 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చబడింది. రేణుకా జగిత్యాని ఇటీవలే ఫోర్బ్స్ ‘న్యూ బిలియనీర్స్’లో 4.8 బిలియన్ల నికర విలువతో కొనసాగుతున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఆర్తి, నిషా, రాహుల్‌లు ల్యాండ్ మార్క్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 నివేదిక ప్రపంచవ్యాప్తంగా 2,781 బిలియనీర్లను గుర్తించింది. ఈ ఏడాది 265 మంది కొత్త బిలియనీర్లు చేరగా.. గత ఏడాది 150 మందితో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది. -
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్‌లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్‌లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్‌లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్‌వర్త్‌తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే.. -
రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ : ‘ఫైటింగ్’ వైరల్
ప్రేమపక్షులుగా అందరి నోళ్లలో నానుతున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి చుట్టూ చాలా కాలంగా డేటింగ్ పుకార్లు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతోపాటు, ఇద్దరూ విహార యాత్రలు, రహస్యంగా కలిసి సందడి చేస్తూ ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల వీరి నిశ్చితార్థం ఫిక్స్ అంటూ పుకార్లు వ్యాపించాయి కూడా. తాజాగా మరో ఆసక్తికర పరిణామం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది. ప్రతిష్టాత్మక ‘ఫోర్బ్స్ ఇండియా అండర్ 30’ జాబితాలో తాజాగా స్థానం దక్కించుకుంది రష్మిక. దీంతో ఆమెను అభినందిస్తూ విజయ్ దేవరకొండ షేర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఇలాగే ఉన్నత స్థాయికి ఎదగాలని.. మరెందరిగో స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ఇంతవరకు బాగానే ఉంది కానీ, డియర్ కామ్రేడ్' మేకింగ్ సమయంలో 2018లో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్ల స్వీట్ వార్ నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది. ఫోర్బ్స్‌లో ప్లేస్ దక్కినందుకు రష్మిక పార్టీ అడిగితే.. నేను నీ కోసం పోరాడుతుంటే, నువ్వు పార్టీ కోసం అడుగుతున్నవా? అన్న ట్వీట్‌కు రష్మిక రిప్లైయ్ కూడా ఇచ్చింది. ‘‘విజయ దేవరొండ ఓహ్ ప్లీజ్!! ఫోర్బ్స్ జాబితాలో మీరు కూడా ఉన్నారు..ఇది వావ్!! కాబట్టి కంజూస్‌గా(పిసినారిగా) ఉండటం మానేసి.. ఇప్పటికైనా పార్టీ ఇవ్వండి!!” అంటూ పోస్ట్ పెట్టింది. ఇపుడు మళ్లీ 2018 నాటి పోస్ట్ పిక్‌ను కూడా జోడిస్తూ సోషల్ మీడియాలోతెగ షేర్ అవుతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna 💙 (@rashmika_mandanaahh) 'గీత గోవిందం'తో మొదలై 'డియర్ కామ్రేడ్' దాకా వీరి ఆన్-స్క్రీన్ మ్యాజిక్ ఆన్-స్క్రీన్కు పాకిందని ఊహాగానాలొచ్చాయి అయితే వీరిద్దరూ పెదవి విప్పడంలేదు. కాగా తెలుగుతో పాటు భాషల్లో బ్లాక్ బస్టర్స్ మూవీలతో ప్యాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది రష్మిక. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉందీభామ. ఇటీవల మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో స్టైలిష్ లుక్‌తో అందర్నీ కట్టి పడేసింది. కాగా 2018లో ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీగా ‘ఫోర్బ్స్ ఇండియా అండర్ 30’ విజయ్ దేవరకొండకి స్థానం దక్కింది. వరుసగా రెండుసార్లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. -
శ్రీవల్లి అరుదైన ఘనత.. ఆ జాబితాలో అగ్రస్థానం!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజాగా ఈ కన్నడ భామ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా- 30- అండర్- 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. కాగా.. ప్రతి సంవత్సరం పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇవాళ విడుదల చేసిన జాబితా 30 ఏళ్లలోపు ఉన్నవారిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసింది. ఈ లిస్ట్‌లో రష్మిక నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ సరసన పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Gratitude.. 🤍#Forbes30under30 pic.twitter.com/u0YliOF0g9 — Rashmika Mandanna (@iamRashmika) February 15, 2024 -
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ 'నెక్స్ట్ వేవ్' స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన 'శశాంక్ గుజ్జుల' ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన 'అనుపమ్ పెదర్ల' ఐఐటీ ఖరగపూర్లో బి.టెక్ పూర్తి చేశాడు. ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని 'రాహుల్ అత్తులూరి'తో కలిసి 'నెక్స్ట్ వేవ్' స్థాపించారు. నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు. అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకుంటున్నారు. ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకు, ఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు. నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటి నైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం. -
Forbes Billionaires 2023: నూతన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్
పారిస్: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్ మస్క్ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్ ఆస్తిలో 18 మిలియన్ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్వీఎంహెచ్ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 388.8 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్వీఎంహెచ్తోపాటు లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయెర్, డామ్ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్వీఎంహెచ్ గుర్తింపు పొందింది. -
రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. భారత్‌లోకి అమెరికా రియల్ ఎస్టేట్ దిగ్గజం
భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం భారత్‌లో అడుగు పెడుతోంది. మీడియా నివేదికల ప్రకారం యూఎస్ ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్.. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ పేరుతో భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ ఇప్పటికే 26 దేశాలలో తన ఉనికిని నెలకొల్పింది. 17,000 ఏజెంట్ల నెట్‌వర్క్‌తో ఖాతాదారులకు రియల్ ఎస్టేట్ సేవలను అందిస్తోంది. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ అనేది ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ విస్తరణ సంస్థ. ఇది ఇన్విటేషన్ ఓన్లీ (సభ్యులు మాత్రమే) నెట్‌వర్క్‌గా పనిచేస్తుంది. భారత్‌లో ఎంపిక చేసిన నగరాల్లో వ్యాపారం నిర్వహిస్తుంది. విలాసవంతమైన జీవనం కోసం ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడం ద్వారా భారతదేశం అంతటా ప్రత్యేకమైన ఆస్తులతో సంపన్నులు, పెట్టుబడిదారులకు వేదికను ఏర్పాటు చేయడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం. సంపన్నవర్గాలే టార్గెట్ సంస్థ విస్తరణ పట్ల ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ సీఈఓ మైఖేల్ డబ్ల్యూ జల్బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. అల్ట్రా-లగ్జరీ నివాసాలను కోరుకునేవారికి అపరిమిత అవకాశాలను కల్పిస్తామన్నారు. భారత విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించాడాన్ని గౌరవాన్ని భావిస్తున్నట్లు బోర్డ్ అధిపతి మాట్ బీల్ పేర్కొన్నారు. భారత జనాభాలోని ఎలైట్ సెగ్మెంట్ లక్ష్యంగా భారతీయ రియల్ ఎస్టేట్‌లో లగ్జరీకి కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తుందని ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ హెడ్ ఏకే శర్మ తెలిపారు. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ చేపట్టే ప్రాజెక్ట్‌లలో హిమాచల్ ప్రదేశ్‌లోని పెద్ద ఎస్టేట్లు, ముంబైలోని అరేబియా సముద్రం వీక్షణలతో కూడిన ఉన్నత స్థాయి పెంట్‌హౌస్‌లు వంటి విభిన్న ఎంపికలు ఉండనున్నాయి. న్యూ ఢిల్లీలోని ప్రారంభ ప్రాజెక్ట్‌లో 7 ఎకరాల ప్లాట్‌లో హై-ఎండ్ రిటైల్ స్పేస్‌లు, క్లబ్, విలాసవంతమైన హోటల్ ఉంటాయి. రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభ వెంచర్లలో ఒకటిగా ముంబైలో 1200 ఎకరాల భూమి అభివృద్ధికి ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ స్థానిక ఆరెంజ్ స్మార్ట్ సిటీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ 10 లక్షల కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టింది. -
ఈ ఏడాది ప్రపంచ కుబేరులు వీరే.. జాబితా ఇదే!
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో వ్యాపారవేత్తలు తమదైన రీతిలో బిజినెస్ చేస్తూ నువ్వా.. నేనా అన్నట్లు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 10 మంది జాబితా విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ కుబేరుడిగా మళ్ళీ టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) నిలిచాడు, ఆ తరువాత స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ, జెఫ్ బెజోస్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో స్టీవ్ బాల్మెర్ (మైక్రోసాఫ్ట్), సెర్గీ బ్రిన్ (గూగుల్) నిలిచారు. టాప్ 10 ప్రపంచ కుబేరుల జాబితా ఇలాన్ మస్క్ (Elon Musk) - 227.8 బిలియన్ డాలర్స్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ - 179.3 బిలియన్ డాలర్స్ జెఫ్ బెజోస్ - 174.0 బిలియన్ డాలర్స్ లారీ ఎల్లిసన్ - 134.9 బిలియన్ డాలర్స్ మార్క్ జుకర్‌బర్గ్ - 130.2 బిలియన్ డాలర్స్ బిల్ గేట్స్ - 119.9 బిలియన్ డాలర్స్ వారెన్ బఫెట్ - 119.2 బిలియన్ డాలర్స్ లారీ పేజీ - 118.7 బిలియన్ డాలర్స్ స్టీవ్ బాల్మెర్ - 115.4 బిలియన్ డాలర్స్ సెర్గీ బ్రిన్ - 113.8 బిలియన్ డాలర్స్ -
Soma Mondal: క్వీన్ ఆఫ్ స్టీల్
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా... ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్– 2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు. అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం... ‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది... ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్‌పర్సన్‌గా బా«ధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు. అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేçస్తాయి’ అంటుంది సోమా మండల్. -
ఫోర్బ్స్ జాబితాలో నలుగురు భారతీయులకు చోటు!
ప్రతి ఏడాది అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి ఆ జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకుని 32వ స్థానంలో నిలిచారు. ఇక ఆమె తోపాటు మరో ముగ్గురు భారతీయ మహిళల్లో..హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా(60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమ మొండల్(70వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(76వ స్థానం)లో ఉన్నారు. ఇక సీతారామన్ 2019లో భారతదేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆమె కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. అంతేగాక రాజకీయాల్లోకి రావడానికి ముందు సీతారామన్ యూకే ఆధారిత అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్లోనూ, BBC వరల్డ్ సర్వీస్‌లోనూ విభిన్న రోల్లో సేవలందించడమే గాక జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారని ఫోర్బ్స్ పేర్కొంది. అలాగే హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో మల్లోహత్రా ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ కుమార్తె. ఆమె హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా, కంపెనీకి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు చాకచక్యంగా తీసుకుంటుందని వెల్లడించింది ఫోర్బ్స్. ఆమె తర్వాత స్థానంలో నిలిచిన మోండల్ సెయిల్‌కి మొదటి మహిళా చైర్పర్సన్ మాత్రమే గాక నాయకురాలిగా బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదిలోనే మూడు రెట్లు లాభలు అందుకున్నారు. ఆమె ఉక్కు తయారీ రంగంలో అనూహ్యంగా ఆర్థిక వృద్ధిని గడించి ఉక్కులాంటి మహిళ అని నిరూపించుకుందని ఫోర్బ్స్ పేర్కొంది. కాగా, ఫోర్బ్స్ ప్రకారం ఇది నాలుగు కీలక కొలమానాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తుంది. వాటిలో.. డబ్బు, మీడియా, ప్రభావం, ప్రభావ రంగాలు తదితరాలను పరిగణలోనికి తీసుకుంటుంది. (చదవండి: ఎవరీ ప్రేరణ దేవస్థలి? ఏకంగా యుద్ధ నౌకకే అధికారిణిగా..!) -
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే?
Top 5 Youngest Billionaires: ఫోర్బ్స్ ఇటీవల ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో ఎవరు ఉన్నారు, వారు ఎలా సంపాదిస్తున్నారు, వారి ఆస్తులు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్లెమెంటే డెల్ వెచియో ఫోర్బ్స్ విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో అగ్ర స్థానం పొందిన వ్యక్తి 'క్లెమెంటే డెల్ వెచియో'. ఇతని ఆస్తి 4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ. ఇటాలియన్ బిలియనీర్ లియోనార్డో డెల్ వెచియో కుమారుడు క్లెమెంటే, తండ్రి మరణం తర్వాత వారసత్వంగా 12.5 శాతం వాటాను పొంది.. 18 సంవత్సరాలకే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు. కిమ్ జంగ్ యౌన్ సౌత్ కొరియాకు చెందిన 'కిమ్ జంగ్ యౌన్' ఫోర్బ్స్ విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానం పొందిన యువకుడు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారు కూడా. తన తండ్రి కిమ్ జంగ్-జు 2022లో 54 ఏళ్ల వయసులో మరణించిన తరువాత ఇతని ఆస్తి 2.5 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇతని వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. కెవిన్ డేవిడ్ లెమాన్ జర్మనీకి చెందిన కెవిన్ డేవిడ్ లెమాన్ దేశంలోని డ్రగ్‌స్టోర్ చైన్ డీఎమ్ (Drogerie Markt)లో 50 శాతం యాజమాన్య వాటాను కలిగి ఉన్నాడు. దీని వార్షిక ఆదాయం 14 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. గొయెట్జ్ వెర్నర్ జర్మనీలోని కార్ల్స్రూహ్లో తన మొదటి డిఎమ్ స్టోర్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటికి 3,700 కంటే ఎక్కువ ప్రదేశాలలో స్టోర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. 1974లో కెవిన్ డేవిడ్ లెమాన్ తండ్రి గెంతెర్ (Guenther) 'డీఎమ్'లో పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత 2017లో కెవిన్ డేవిడ్‌కు 50శాతం వాటాను బదిలీ చేశారు. ఇతని ఆస్తి ఫోర్బ్స్ ప్రకారం 1.7 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. కిమ్ జంగ్ మిన్ ఫోర్బ్స్ జాబితా ప్రకారం, కిమ్ జంగ్ మిన్ నాలువ అతి తక్కువ వయసున్న బిలియనీర్. దక్షిణ కొరియాకు చెందిన ఈమె NXCలో సుమారు 31 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ప్రఖ్యాత ఆన్లైన్ గేమింగ్ దిగ్గజం నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారుగా కూడా ఉంది. కిమ్ జంగ్ మిన్ ఆస్తి 1.4 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: 19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! లూకా డెల్ వెచియో ఫోర్బ్స్ జాబితాలో ఐదవ యంగెస్ట్ బిలియనీర్ లూకా డెల్ వెచియో. 22 సంవత్సరాల ఇతడు దివంగత లియోనార్డో డెల్ వెచియో ఆరుగురి సంతానంలో ఒకరు. తండ్రి ఆస్తిలో 12.5 శాతం వారసత్వ వాటా రావడం మాత్రమే కాకుండా.. ఇతడు ఎస్సిలర్లుక్సోటికా హోల్డింగ్‌లు, ఇన్సూరెన్స్ జనరల్‌లో షేర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ కోవివియోలో కూడా షేర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. -
19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
ప్రతి ఏటా మాదిరిగానే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా బిలియనీర్స్ కాబితాలో ఎక్కువగా సీనియర్ పారిశ్రామిక వేత్తలు ఉంటారని అందరికి తెలుసు. కానీ ఈ ఏట మాత్రం అందరి దృష్టి 'క్లెమెంటే డెల్ వెచియో' (Clemente Del Vecchio) పై పడింది. ఇంతకీ ఇతడెవరు? ఇతని సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. క్లెమెంటే డెల్ వెచియో వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇతడు బిలియనీర్ల కాబితాలో చేరిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేసాడు. నిజానికి క్లెమెంటే తండ్రి ఇటాలియన్ బిలియనీర్ 'లియోనార్డో డెల్ వెచియో'. ఇతడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐ-గ్లాసెస్ (కళ్లద్దాలు) సంస్థ 'EssilorLuxottica' మాజీ చైర్మన్. ఈయన గతేడాది జూన్‌లో 87వ ఏట కన్నుమూశారు. ఆ తరువాత ఇతని ఆస్తి (25.5 బిలియన్ డాలర్లు) అతని భార్య, ఆరుగురు పిల్లలకు సంక్రమించింది. తండ్రి ఆస్తిలో సుమారు 12.5 శాతం వాటాను వారసత్వంగా పొందిన క్లెమెంటే డెల్ వెచియో తన 18 సంవత్సరాల వయస్సులో బిలియనీర్ అయ్యాడు. ఫోర్బ్స్ ప్రకారం.. ఇతని సంపద 4 బిలియన్ డాలర్లుగా ఉంది (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ). ఇదీ చదవండి: ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ! క్లెమెంటే డెల్ వెచియో ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నప్పటికీ.. చదువు మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆసక్తి ఉన్న ఇతడు రాబోయే రోజుల్లో ఈ రంగంలోనే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. క్లెమెంటే డెల్ వెచియో ఇటలీలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో లేక్ కోమోలోని విల్లా, మిలన్లోని అపార్ట్మెంట్ వంటివి ప్రధానంగా చెప్పుకోదగ్గవి. -
బిలియనీర్ జాబితాలో ఎంట్రీ.. రూ.8వేల కోట్ల సంపద.. ఎలా సాధ్యమైందంటే
మంచి బిజినెస్ ఐడియా ఉంటే కోటీశ్వరులు కావడం సులువేనని చాలా మంది నిరూపిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ స్థాపించి లాభాలు పొందుతున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఓ ద్వారా స్టాక్మార్కెట్లో లిస్ట్ అయి కోట్లు గడిస్తున్నారు. దాంతో ఏళ్లుగా మార్కెట్లో ఉంటున్న సంపన్నుల సరసన కొత్త బిలియనీర్లు చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత బిలియనీర్ల జాబితాలో కొత్తగా ప్రదీప్ రాథోడ్ స్థానం సంపాదించారు. అసలు ఈయన ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటారు.. వంటి అంశాల గురించి తెలుసుకుందాం. వంట గదుల్లో ఉపయోగించే వస్తువులు, థర్మోవేర్ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ సెల్లో వరల్డ్ ఛైర్మన్‌గా ప్రదీప్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మార్కెట్లోని డిమాండ్ వల్ల పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ స్టాక్‌ను కొనుగోలు చేయడంతో స్టాక్ ధర అమాంతం పెరిగింది. దాంతో తన సంపద కూడా పెరిగి బిలియనీర్‌గా మారిపోయారు. ఆయనకు కంపెనీలో 44 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ వద్ద రూ.8,300 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా కొనసాగుతున్నారు. జేఐటీఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సెల్లోవరల్డ్ కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2017లో గాజు ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. 1974లో ఈ కంపెనీని స్థాపించారు. కంపెనీ తయరుచేస్తున్న ఉత్పత్తులు, కంపెనీ రాబడులు, వ్యాపార విస్తరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మార్కెట్లో లిస్ట్ చేశారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్, చెన్నై, కలకత్తాల్లో కలిపి 13 తయారీ కేంద్రాలు కలిగి ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది. ఇదీ చదవండి: పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాథోడ్ కుటుంబం విమ్‌ప్లాస్ట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సెల్లో బ్రాండ్‌కు అనుబంధంగా ఉంటూ అనేక ప్లాస్టిక్ ఫర్నిచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇది గతంలోనే బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఈ కంపెనీ రూ.700 కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. -
ఫోర్బ్స్ కుబేరుల జాబితా: అంబానీ, అదానీ ర్యాంకు ఎంతో తెలుసా?
అమెరికన్ బిజినెస్ మేగజీన్ ఫోర్బ్స్ (Forbes) 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన 37వ ఎడిషన్‌లో ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరిగి టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నారు. 90.8 బిలియన్ల నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దేశంలోని 167 మంది బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) 2023 ఏడాది ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 240.7 బిలయన్ డాలర్లతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. అలాగే ఫ్రాన్స్ కు చెందిన లూయీస్ వీటన్ (Louis Vuitton) బ్రాండ్ ఫౌండర్ ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ అర్నాల్ట్ ప్రంపంచలో టాప్ 2 ప్లేస్ కొట్టేశారు సంపద 231.4 బిలియన్ డాలర్లు. 154.9 బిలియన్ డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. ఇండియాలో టాప్-10 లో ఉన్నది వీరే భారత్‌లో దాదాపు 167 మంది బిలియనీర్లలో, ముఖేష్ అంబానీ వరుసగా 14 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ, సైరస్ పూనావల్లా, శివనాదా తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఐదో స్థానంలో సావిత్రి జిందాల్ నిలిచారు. ♦ గౌతమ్ అదానీ 54.9 బిలియన్ డాలర్లు ♦ సైరస్ పూనావాలా 29.1 బిలియన్ డాలర్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ♦ శివ్ నాడార్ 25.6బిలియన్ డాలర్లు HCL టెక్నాలజీస్ ♦ సావిత్రి జిందాల్ & కుటుంబం 20.3 బిలియన్ డాలర్లు JSW గ్రూప్ ♦ దిలీప్ షాంఘ్వీ 18.2 బిలియన్ డాలర్లుసన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ♦ లక్ష్మి మిట్టల్ 16.9 బిలియన్ డాలర్లుఆర్సెలర్ మిట్టల్ ♦ రాధాక్రిషన్ దమానీ 16.7 బిలియన్ డాలర్లు DMart, అవెన్యూ సూపర్ మార్కెట్లు ♦ కుమార్ బిర్లా 15.8 బిలియన్ డాలర్లు ఆదిత్య బిర్లా గ్రూప్ ♦ ఉదయ్ కోటక్ 14.2బిలియన్ డాలర్లు బి కోటక్ మహీంద్రా బ్యాంక్ -
వీళ్ల సంపాదన ఎంతో తెలుసా?
-
అమెరికాలో శ్రీమంతురాళ్లు.. వీళ్ల సంపద ఎంతో తెలుసా?!
న్యూయార్క్: Forbes Among America's 100 Richest Self Made Women : అమెరికాలోని టాప్ 100 సంపన్న మహిళల్లో (స్వయంగా ఆర్జించిన) నలుగురు భారత సంతతి వనితలకు చోటు లభించింది. పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి(67), అరిస్టా నెట్వర్క్స్ (కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ) ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్(62), సింటే (ఐటీ కన్సల్టెంగ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేతి(68), కన్‌ఫ్లూయెంట్ (క్లౌడ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే (38) ఫోర్బ్స్ ‘అమెరికా సంపన్న మహిళల’జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ఉమ్మడి సంపద 4.06 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33292 కోట్లు)గా ఉంది. 100 మంది మహిళలు ఉమ్మడిగా 124 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారని, ఏడాది క్రితంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది. జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల సంపదతో 15వ ర్యాంకులో ఉన్నారు. ఉన్నత విద్యను అమెరికాలో అభ్యసించారు. నీర్జా సేతి 990 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. తన భర్తతో కలసి స్థాపించిన సింటెల్‌ను ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈకి 3.4 బిలియన్ డాలర్లకు 2018లో విక్రయించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన తర్వాత ఆక్లాండ్ వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. నార్కడే 520 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 38వ స్థానంలో ఉన్నారు. కన్ఫ్లూయెంట్లో ఆమెకు 6 శాతం వాటాలున్నాయి. మరొకరితో కలసి ఆసిలర్ పేరుతో కొత్త కంపెనీని 2023 మార్చిలో స్థాపించారు. ఇంద్రా నూయి 2019లో పెప్సీకో సీఈవోగా రిటైర్ అయ్యారు. 350 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 77వ స్థానంలో నిలిచారు. -
Neha Narkhede: టెక్నోస్టార్
పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్రూమ్ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది! ఫోర్బ్స్ అమెరికా ‘రిచ్చెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ నేహ నర్ఖాడే.... మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది. తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్‌మోడల్స్ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ. పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్’లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్ ఇన్’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్‌లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్‌ఫామ్ కల్పిస్తుంది. ‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల తరువాత ‘కన్‌ఫ్లూయెంట్’ అనే ఫుల్–స్కేల్ డాటా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్‌ఫ్లూయెంట్’ నుంచి సేవలు పొందుతున్నాయి. కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్ కల్చర్‌పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది. నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి? ‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్ప్రెన్యూర్లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ. నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్‌మోడల్, తన రోల్‌మోడల్ మాత్రం ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్. ‘రోల్‌మోడల్ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి. – నేహ -
ధనవంతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఎక్కడుందంటే?
ప్రపంచంలోని ధనవంతుల జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలలో ప్రపంచంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ప్రపంచంలో మొత్తం 2,640 మంది బిలియనీర్లు ఉన్నట్లు తెలిసింది. ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశమేది, చివరి స్థానంలో ఉన్న దేశమేది, ఇందులో ఇండియా స్థానం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఫోర్బ్స్ వెల్లడించిన నివేదికల ప్రకారం, అత్యధిక బిలినియర్లు ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తమ్ 735 మంది బిలినియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులున్న దేశం అమెరికా అయినప్పటికీ ప్రపంచ ధనవంతుడు మాత్రం ఫ్రాన్స్‌కు చెందిన వాడు కావడం గమనార్హం. ప్రపంచ జనాభలో మాత్రమే కాకుండా.. ఎక్కువ మంది బిలినీయర్లు ఉన్న దేశంగా చైనా రెండవ స్థానం ఆక్రమించింది. చైనాలో మొత్తం 495మంది ధనవంతులున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో వెల్లడైన జాబితాలో మొత్తం 539 మంది ధనవంతులను, దీన్ని బట్టి చూస్తే ఈ సరి చైనాలో ధనవంతుల సంఖ్య తగ్గింది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారత్, ధనవంతుల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మన దేశంలో మొత్తం 169మంది బిలినియర్లు ఉన్నట్లు సమాచారం. భారతేశంలో ఉన్న బిలినియర్ల సంపద సుమారు 675 బిలియన్ డాలర్లు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో జర్మనీ, రష్యా ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న బిలినియర్ల సంఖ్య వరుసగా 126, 105 మంది. జర్మనీలోని రిచెస్ట్ పర్సన్‌గా స్క్వార్జ్ గ్రూప్ అధినేత డైటర్ స్క్వార్జ్ నిలిచారు. ఆయన సంపద ప్రస్తుతం 42.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే గత ఏడాది నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో దిగ్గజ వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చివరి స్థానంలో హంగేరి, స్విజర్లాండ్ వంటి దేశాలు 58వ స్థానంలో ఉన్నాయి. -
చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!
సాధారణ ఎగువ మధ్యతరగతి కుంటుంబ నేపథ్యంనుంచి వచ్చి బ్యాంకింగ్ నేపథ్యం ఏమీ లేకుండానే దేశీయంగా టాప్ బ్యాంకర్‌గా ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. క్రికెట్లో రాణించాలనుకుని, తొలుత కుటుంబ వ్యాపారం, తదుపరి బ్యాంకింగ్ రంగంలోjకి ఎంట్రీ ఇచ్చి, ఎదురులేని లీడర్‌గా దూసుకుపోతూ ఒంటిచేత్తో కోటక్‌మహీంద్ర బ్యాంకును విజయ తీరాలకు నడిపించడమే కాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్న బ్యాంకర్లలో ఒకరిగా నిలిచిన బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి తెలుసుకుందాం...! ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితా ప్రకారం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న బ్యాంకర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్. దేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ కూడా. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ఇండెక్స్ ప్రకారం, అతని నికర విలువ 14.8 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు). ఉదయ్ కోటక్ విజయ ప్రస్థానం 1959, మార్చి 15న పత్తి పరిశ్రమలో ఉన్న ఎగువ మధ్య తరగతికి చెందిన గుజరాతీ కుటుంబానికి చెందినవారు ఉదయ్ కోట్.ముంబైలోని సిడెన్హామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీ, జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీజీ చేశారు. టాప్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ, తండ్రి ప్రోత్సాహంతో ఫ్యామిలీ వ్యాపారంలో ప్రవేశించారు. రీజినబుల్ రేట్లలో చిన్న చిన్న రుణాలివ్వడం ప్రారంభించారు. దేశ ఆర్థికపరిస్థితి క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో 1985లో ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒకవైపు లోన్లపై అధిక వడ్డీరేట్లు, మరోవైపు డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఒక విప్లవానికి బీజం పడింది. అతిస్వల్ప కాలంలోనే కేంద్ర బ్యాంకు ఆర్బీఐ నుంచి పూర్తి బ్యాంకింగ్ లైసెన్స్‌ని అందుకున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీగా అవతరించింది. ఆ తరువాత,బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోకి ప్రవేశించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 22 మార్చి 2003 న, భారత కార్పొరేట్ చరిత్రలో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి సంస్థగా అవతరించింది. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) క్రికెటర్ అయ్యేవాడిని భారతదేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ పురోగతికి ఉదయ్‌కోటక్ కృషి అమోఘం. తాను వ్యాపారవేత్తను కాకపోయి ఉండి ఉంటే క్రికెట్ ప్లేయర్‌గా ఉండేవాడిని అంటూ క్రికెట్‌పై తన ప్రేమను అనేక ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు కోటక్ అలాగే గణితంలో మాంచి ప్రావీణ్యమున్న ఉదయ్ కోటక్ చిన్నతనంలో సితార్ వాయించేవారట. పెద్ద ఉమ్మడి కుటుంబంలో 60 మందితో ఉన్న ఇంట్లో సోషలిజాన్ని, పనిలో పెట్టుబడిదారీ విధానాన్ని నేర్చుకున్నానని చెబుతారు. ఆయన సతీమణి పేరు పల్లవి కోటక్. కుమారుడు జే కోటక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే బ్యాంకు, నియోబ్యాంక్ ప్లాట్‌ఫారమ్ 811కి కో-హెడ్‌గా కూడా పనిచేస్తున్నారు చిన్న కుమారుడు ధావల్ గత ఏడాది కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నివేదికల ప్రకారం ఉదయ్ కోటక్ వార్షిక వేతనం 3.24 కోట్లు జీతం. అయితే కోవిడ్ కారణంగా మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరం కోటక్ వార్షిక వేతనం రూ.2.65 కోట్లకు పడిపోయిందని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తెలిపింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 1,752 శాఖలను కలిగి ఉంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర ఆదాయం 31శాతం ఎగిసి 27.9 బిలియన్ రూపాయలకు (337 మిలియన్ల డాలర్లు) చేరింది. కొత్త సీఈవో కోసం వేట, రేసులో కుమారుడు మరోవైపు ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకారం భారతీయ వ్యాపార అధిపతుల పదవీకాలాన్ని పరిమితం చేసిన తర్వాత, వచ్చే ఏడాది చివరి నాటికి బ్యాంకు సీఈవో పదవి నుండి వైదొలగాలని భావిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్త శోధనకు గాను కన్సల్టింగ్ సంస్థ ఎగాన్ జెహెండర్ను నిమగ్నమైందని తెలుస్తోంది. గ్రూప్ ప్రెసిడెంట్లు, హోల్ టైమ్ డైరెక్టర్లు శాంతి ఏకాంబరం, కెవిఎస్ మణియన్తోపాటు, వారసుడు జేకోటక్ కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం. -
ఆసియా కుబేరుల్లో మళ్లీ అంబానీనే నెం.1.. అదానీకి ఎన్నో స్థానమంటే!
ఆసియా ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 83.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. ప్రపంచ ధనవంతుల స్థానాల జాబితాలో 9వ స్థానం దక్కించుకున్నారు. ఆసియా దేశాల రిచెస్ట్ పర్సన్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయినట్లు బ్లూమ్ నివేదించింది. ఈ ఏడాది జనవరి 24న దాదాపు 126 బిలియన్ల విలువతో అదానీ ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నిరాధారమైన నివేదికల కారణంగా అదానీ షేర్లు పతమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సంపాదనలో సరికొత్త రికార్డ్‌లు ఫోర్బ్స్ - 2023 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతీయులు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. దేశం మొత్తం మీద బిలియనీర్ల జాబితా 169 మందికి చేరింది. గత ఏడాది ఆ సంఖ్య 166గా ఉంది. హెచ్‌సీఎల్ అధినేత శివ్ నాడార్ సంపద ఏడాది క్రితం నుండి 11 శాతం తగ్గి $25.6 బిలియన్లకు పడిపోయింది. అయితే అతను దేశంలోని అత్యంత సంపన్నల జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. దేశీయ వ్యాక్సిన్ కింగ్ సైరస్ పూనావాలా దేశంలో బిలియనీర్ల జాబితాలో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయినప్పటికీ అతని నికర విలువ ఏడాది క్రితం నుండి 7 శాతం పడిపోయి $22.6 బిలియన్లకు చేరుకుంది. స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ మిట్టల్ 5వ స్థానంలో ఉన్నారు. తర్వాత ఓపీ జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్, దిలీప్ శాంఘ్వీ, రాధాకిషన్ దమానీలు ఉన్నారు. కుమార్ మంగళం బిర్లా 9వ స్థానంలో, ఉదయ్ కోటక్ 10వ స్థానంలో ఉన్నారు. కొత్తగా ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో జీరోధా అధినేత, అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ 36 ఏళ్ల నిఖిల్ కామత్ చేరారు. చదవండి👉 మంచులా కరిగిన ఆస్తులు.. దివాళా తీసిన అత్యంత ధనవంతుడు! -
LeenaTewari:దేశంలో రెండో సంపన్న మహిళ: పాములు, బల్లులంటే పిచ్చి...!
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త లీనా తివారీ ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండో స్థానాన్ని సాధించారు. తాజా నివేదికల ప్రకారం రూ. 30,000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన భారతదేశపు రెండవ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. వ్యాపార మహిళా దిగ్గజాలు బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా, నైకా ఫౌండర్, ఫల్గుణి నాయర్, జోహో కార్ప్‌కి చెందిన రాధా వెంబు వంటి వారి కంటే లీనా తివారీ ముందుకు దూసుకొచ్చారు. ఫిబ్రవరి 12, 2023న నాటి ఫోర్బ్స్ వివరాల ప్రకారం ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి సంస్థ యుఎస్వీ ఇండియా ఛైర్మన్ లీనా గాంధీ తివారి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30వేల కోట్ల పైన)ను అధిగమించి భారతదేశంలో రెండో అత్యంత సంపన్న మహిళగా ఉండగా, రాజకీయవేత్త , వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ తర్వాత టాప్-1లో అన్నారు. అలాగే రూ. 21కోట్ల విరాళాలతో 2022లో భారతదేశపు అత్యంత ఉదారమైన మహిళగా లీనా తివారి నిలిచారు. కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగాలలో భారతదేశంలోని మొదటి ఐదు స్థానాల్లో కంపెనీ ఉంది. ఇది క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాలు (APIలు), ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్ ఔషధాలను కూడా తయారు చేస్తుంది.యూస్వీకి చెందిన గ్లైకోమెంట్ అని యాంటీ-డయాబెటిక్ ఫార్ములేషన్ దేశీయ పరిశ్రమలో టాప్ 3లో ఉంది. 1961లో విఠల్ బాల కృష్ణ గాంధీ యుఎస్వీని స్థాపించారు అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు మహిళల,వారి హక్కులను గౌరవించే సంస్థగా పేరొందింది. తివారీ ఎక్కువగా ముంబైలోని సోషల్ సర్క్యూట్, పార్టీలకు దూరంగా ఉంటారు కానీ పరోపకారి అని ఫార్చ్యూన్ పేర్కొనడం గమనార్హం. యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్ చదివారు. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ బాగా పాపులర్ అయింది. అలాగే బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త జుహీ చావ్లా తివారీ ఇద్దరూమంచి స్నేహితులు కూడా. జంతువులు, అడవులంటే ఇష్టపడే లీనాకు పాములన్నా, బల్లులన్నా పిచ్చి అట. బాలికలకు అకడమిక్, డ్యాన్స్ , కంప్యూటర్ శిక్షణను డాక్టర్ సుశీల గాంధీ సెంటర్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్‌కి లీనా సాయం చేస్తారు. లీనా భర్త యూఎస్వీ ఎండీ ప్రశాంత్ తివారీ. వీరి కుమార్తె అనీషా గాంధీ తివారీ.మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్డీ చేసిన అనిషా ఆగస్టు 2022లో యూఎస్వీ బోర్డులో చేరడం విశేషం. -
అలా కలిసొచ్చింది.. ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిపోర్టు పరిణామాలతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. దీంతో ఆ లిస్టులో ఆసియా దేశాల నుంచి ఏకైక కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిల్చారు. ఫోర్బ్స్ వెబ్సైట్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గత వారం వరకు మూడో స్థానంలో కొనసాగిన అదానీ ర్యాంకు తాజాగా 15వ స్థానానికి తగ్గింది. ఆయన సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంది. -
అదానీకి మరో షాక్.. ఒకదాని తర్వాత మరొకటి, 3 రోజుల్లోనే
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో అతలాకుతలమవుతున్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీకి మరో షాక్ తగిలింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన సంపద రోజు రోజుకూ పతనం వైపు పరుగులు పెడుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన ర్యాంకింగ్ మరింత కిందకి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు. టాప్ 10లో స్థానం పాయే హిండెన్‌బర్గ్ నివేదికతో గౌతమ్ అదానీ సంపద చూస్తుండగానే మంచులా కరిగిపోతుంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. అదానీ సంపద 3 రోజుల్లోనే 34 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రాకముందు ఆయన మూడో స్థానంలో ఉండేవారు. భారత్ నుంచి టాప్ 10 చోటు దక్కించుకున్న సంపన్నుడిగా కొన్నాళ్లు కొనసాగారు. అదానీ గ్రూప్ మూడు రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. ఆయన వ్యాపారం, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, రుణ భారంపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదిక ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. ఈ ఆరోపణలు నిరాధారమని అదానీ 413 పేజీల వివరణ నివేదిక కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేకపోయింది. ఈ దెబ్బకు ఆ సంస్థ కీలక డాలర్ బాండ్లు కూడా తాజా కనిష్ట స్థాయిని తాకాయి. చదవండి: రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ? -
ఫోర్బ్స్ టాప్-25 జాబితాలో పీవీ సింధు
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించింది. ఫోర్బ్స్ టాప్ 25 స్పోర్ట్స్‌వుమెన్ జాబితాలో పీవీ సింధు చోటు సంపాదించింది. మహిళల అథ్లెట్లలో అత్యధికంగా సంపాదిస్తున్న 25 క్రీడాకారిణిల జాబితాను ఫోర్బ్స్ శుక్రవారం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో షట్లర్ పీవీ సింధు 12వ స్థానంలో ఉంది. జపాన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ప్లేయర్ నవోమీ ఒసాకా తొలి స్థానంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్, కామన్వెల్త్గేమ్స్ సింగ్సిల్‌లో గోల్డ్, డబుల్స్‌లో సిల్వర్ గెలిచిన సింధు.. ఈ ఏడాది ఏడు మిలియన్ల డాలర్లు అర్జించినట్లు తెలుస్తోంది. వరుసగా మూడోసారి ఒసాకా ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఈ జాబితాలో ఎక్కువ శాతం మంది టెన్నిస్ ప్లేయర్లే ఉన్నారు. టాప్ 10 లిస్టులో ఒసాకాతో పాటు సెరీనా, ఎమ్మా రాడుకాన, ఇగా స్వియాటెక్, వీనస్, కోకో గౌఫ్, జెస్సికా పెగులాలు ఉన్నారు. -
వామ్మో.. లియోనల్ మెస్సీ ఆస్తుల చిట్టా వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
మూడున్నర దశాబ్ధాల అర్జెంటీనా నిరీక్షణ ఫలించింది. ఆదివారం అంత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. జగజ్జేతగా మెస్సీ బృందం నిలిచింది. అలాంటి ఫుట్‌బాల్ మైదానంలో మెస్సీ కొదమ సింహంలా పోటీ పడుతుంటే స్టేడియంలో ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఉగిపోయేలా చేసింది. అలాంటి ఫుట్‌బాల్ లెజెండ్‌లో వే(ఆ)టగాడే కాదు ఓ మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ►మెస్సీ గతేడాది ఆశ్చర్యంగా 75 మిలియన్లు సంపాదించాడు. ఈ సంపాదన భూమ్మిద ఉన్న ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ ►ఫుట్ బాల్ టీమ్ పారిస్ సెయింట్-జర్మైన్ ఎఫ్‌సీ ఇచ్చే జీతం మాత్రమే సంవత్సరానికి 35 మిలియన్లు. అంటే మెస్సీ వారానికి 738,000 డాలర్లు , రోజుకు 105,000 , గంటకు 8,790 సంపాదిస్తారు. ►గత వేసవిలో అర్జెంటీనా ఫ్రెంచ్ జట్టు కోసం సైన్ చేసిన మెస్సీ ఏకంగా 25 మిలియన్లు సంపాదించారు. రోజర్ ఫెదర్తో సమానంగా ►గతేడాది మెస్సీ ఆఫ్ ఫీల్డ్ సంపాదన 55 మిలియన్లు ఉండగా..టెన్నిస్ ఐకాన్ రోజర్ ఫెదరర్, ఎన్బీఏ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ మాత్రమే ఎక్కువ సంపాదించిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ►క్రిప్టోకరెన్సీ ఫ్యాన్ టోకెన్ ప్లాట్‌ఫారమ్ సోషియోస్తో సంవత్సరానికి 20 మిలియన్ల భాగస్వామ్యంతో పాటు, 35 ఏళ్ల ఎండార్స్మెంట్ పోర్ట్‌ఫోలియోలో అడిడాస్, బడ్వైజర్,పెప్సికోతో ఒప్పందాలు ఉన్నాయి. ►గత జూన్‌లో, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ మొట్టమొదటి అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరించాడు. 1 బిలియన్ కంటే ఎక్కువే ఫోర్బ్స్ ప్రకారం, మెస్సీ ఆటగాడిగా, ఇతర బిజినెస్‌లలో రాణిస్తూ 1.15 బిలియన్ల కంటే ఎక్కువ సంపాదించారు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్ మాత్రమే సంపాదనలో ముందంజలో ఉన్నారు. పైన పేర్కొన్న వారి కంటే రోజర్ ఫెదరర్, ఫ్లాయిడ్ మేవెదర్ మాత్రమే కెరీర్ సంపాదనలో 1 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపాదించారు. కార్లంటే మహా ఇష్టం మెస్సీ సంపాదనలో సగ భాగం కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మెస్సీ వద్ద 2 మిలియన్ల ధర పలికే పగని జోండా ట్రైకలర్, ఫెరారీ ఎఫ్4 30 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ ఎస్ఆర్టీ8, మసెరటి గ్రాన్ టురిస్మో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. 2016 అర్జెంటీనాలో 37 మిలియన్లకు 1957 ఫెరారీ 335 స్పోర్ట్ స్పైడర్ స్కాగ్లియెట్టి అనే ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు పుకారు వచ్చింది. అయితే, ఇదే నా కొత్త కారు అంటూ బొమ్మ కారును పట్టుకొని ఆ పుకార్లకు చెక్ పెట్టారు. విలాసవంత మైన భవనాలు మెస్సీ ఆస్తులలో అత్యంత విలాసవంతమైనది బార్సిలోనా శివార్లలో 7 మిలియన్ల భవనం. నో-ఫ్లై జోన్ సబర్బ్‌లో ఉన్న భవనంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ జిమ్, థియేటర్, స్పా ఉన్నాయి. ఫుట్‌బాల్ పిచ్ కూడా మెస్సీకి ఇంద్ర భవనాన్ని తలపించాలే ఎకో-హౌస్ ఉంది. అర్జెంటీనాలోని తన సొంత పట్టణం రోసారియోలో ఒక భవనం, ఫ్లోరిడాలోని సెయింట్ ఐల్స్ బీచ్‌లోని ఒక విలాసవంతమైన కండోమినియంలు ఉన్నాయి. ఇందుకోసం గతేడాది 7.3 మిలియన్లు చెల్లించాడు. 2017 నుండి మెజెస్టిక్ హోటల్ గ్రూప్ నిర్వహించే ఇబిజా, మజోర్కా, బార్సిలోనాలో రిసార్ట్‌లతో పాటు , ఎంఐఎం పేరుతో ఉన్న హోటల్ చైన్లు సైతం మెస్సీకి చెందినవే. 2021లో మెస్సీ వింటర్ సీజన్లో విడిది కోసం అరన్ వ్యాలీలో పైరినీస్ నడిబొడ్డున రిసార్ట్‌ను ప్రారంభించారు. ఫోర్బ్స్ ప్రకారం..ఫోర్ స్టార్ హోటల్లో 141 గదులు ఉన్నాయి. స్పా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, మౌంటెన్ గైడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బాల్కనీ పెద్దగా ఉందని మెస్సీ 2017లో 35 మిలియన్లు పెట్టి ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ భవనంలో బాల్కనీ పెద్దగా ఉందని.. మొత్తాన్ని కూల్చేయించారు. కారణంగా బాల్కనీలను తీసివేయడానికి, తగ్గించడానికి ఏదైనా ప్రయత్నం చేసినా హోటల్ కూలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపించలేక మొత్తం పడగొట్టాల్సి వచ్చింది 15 మిలియన్ల ప్రైవేట్ జెట్ మెస్సీకి గల్ఫ్‌స్ట్రీమ్ వీ అనే ప్రైవేట్ ఉంది. అందులో రెండు కిచెన్లు, బాత్రూమ్లు ఉన్నాయి. గరిష్టంగా పదహారు మంది ప్రయాణికులు సేద తీరే సౌకర్యాలు ఉన్నాయి. దానంలో కలియుగ కర్ణుడు 2007లో యునిసెఫ్ భాగస్వామ్యంతో లియోనెల్ మెస్సీ ఫౌండేషన్ ప్రారంభమైంది.ఆ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంది. యునిసెఫ్ ప్రకారం..2017లో మెస్సీ సిరియాలో 1,600 మంది అనాథ పిల్లలకు తరగతి గదులను నిర్మించడంలో ఫౌండేషన్‌కు సహాయం చేయడానికి తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. 2019లో కెన్యా పౌరులకు ఆహారం, నీటిని అందించడానికి ఫౌండేషన్ $218,000 విరాళంగా అందించింది. చివరిగా కండోమినియం అంటే? అమ్మకం కోసం ఒక పెద్ద ఆస్తిని ఒకే యూనిట్లుగా విభజించినప్పుడు దానిని కండోమినియం కాంప్లెక్స్‌గా సూచిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మహిళల్లో నిర్మలా సీతారామన్
-
‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్
న్యూయార్క్: అమెరికా బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ వార్షిక జాబితాలో ఆరుగురు భారతీయులకు స్థానం దక్కింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(36), బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా(ర్యాంకు 72), నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్(ర్యాంకు 89), హెచ్‌సీఎల్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (ర్యాంకు 53), సెబీ చైర్పర్సన్ మాధవీ పూరి (ర్యాంకు 54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండాల్ (ర్యాంకు 67) ఈ జాబితాలో చోటు సాధించారు. -
మరోసారి ఫీట్ రిపీట్ చేసిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తన ఫీట్‌ను రిపీట్ చేశారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక గ్లోబల్ టాప్-100 శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మల మరోసారి చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకున్నారు. ఈమెతోపాటు ఆరుగురు భారతీయ మహిళలుకూడా ఉన్నారు. (సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!) 2022 ఫోర్బ్స్ లిస్టులో సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు. 2021లో మంత్రి జాబితాలో 37వ స్థానంలో 2020లో 41వ స్థానంలోనూ, 2019లో 34వ స్థానంలోనూ ఉన్నారు. ఇంకా హెచ్‌సిఎల్‌టెక్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 53 ర్యాంకు సాధించారు. సెబీ తొలి చైర్పర్సన్ మధాబి పూరి బుచ్ 54, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండల్ 67ను స్థానంలో నిలిచారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా 72వ ప్లేస్‌ను, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 89వ ప్లేస్‌లోనూ నిలిచారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం) కాగా ఫోర్బ్స్ టాప్-100 మోస్ట్ పవర్ ఫుల్ మహిళల జాబితాలో యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ టాప్ ప్లేస్ కొట్టేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి నేత కమలా హ్యారిస్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలవడం విశేషం. 100వ ర్యాంక్‌లో, ఇరాన్‌కు చెందిన జినా "మహ్సా" అమిని మరణానంతరం ప్రభావవంతమైన జాబితాలో చేరారు. సెప్టెంబరులో ఆమె మరణం ఇస్లామిక్ దేశంలో హక్కుల కోసం అపూర్వమైన మహిళల నేతృత్వంలోని విప్లవానికి దారితీసింది. జాబితాలో 39 మంది సీఈవోలు, 10 దేశాధినేతలు,11 బిలియనీర్లు ఉన్నారని వీరిసంపద సంయుక్తంగా 115 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ ప్రకటించింది. -
Sanket Jadia: సంకేత చిత్రం
‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు. సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ.... సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్‌కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు. పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా! ‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్. పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్‌ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు. సూరత్‌లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్‌పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది. ‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆర్టిస్ట్‌లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు. ‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు. హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్‌లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు. నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు. ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి. ‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ. ఏ ఫ్యూచర్ అండర్ కన్స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన సంకేత్‌కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం. -
ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్ అధినేత
న్యూయార్క్: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజా అంచనా ప్రకారం.. బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు. అమెజాన్ సంస్థను నిర్మించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, అలాగే సమాజ సేవ కూడా అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ తదితరులు సమాజ సేవకు అంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జెఫ్ బెజోస్ ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేదంటూ గతంలో విమర్శలు వచ్చాయి. -
Forbes World Best Employers for 2022: దేశంలో అత్యుత్తమ సంస్థగా రిలయన్స్
న్యూఢిల్లీ: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు 2022 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ వరుసగా ఉన్నాయి. అంతేకాదు 2 నుంచి 12వ స్థానం వరకు ర్యాంకులు అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి. 13వ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూపు ఉంది. అమెజాన్ 14, డెకథ్లాన్ 15వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. టాప్–100లో రిలయన్స్ ఒక్కటే ఫోర్బ్స్ తాజా జాబితాలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థల్లో 2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్సెడెజ్ బెంజ్, కోకకోలా, హోండా, యమహా, సౌదీ అరామ్కో రిలయన్స్ వెనుకే ఉండడం గమనార్హం. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 137, బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూపు (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్అండ్టీ (354), ఐసీఐసీఐ బ్యాంకు (365), హెచ్‌సీఎల్ టెక్ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంటర్ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ర్యాంకులతో నిలిచాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, ఉన్నత అవకాశాలు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు, ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. 57 దేశాల పరిధిలో 1,50,000 మంది పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్ ఈ ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది. జాబితాలో మొత్తం 800 కంపెనీలకు ర్యాంకులు లభించాయి. -
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు!
ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఇండో- అమెరికన్ మహిళలు చోటు దక్కించుకున్నారు. భారతీయ మూలాలున్న మహిళలు ఆయా రంగాల్లో రాణించడమే కాదు.. దిగ్గజ సంస్థల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో నిలిచిన వారిలో జయశ్రీ ఉల్లాల్,నీర్జా సేథి,నేహా నార్ఖడే,ఇంద్ర నూయి,రేష్మా శెట్టిలు ఉన్నారు. జయశ్రీ ఉల్లాల్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో 15వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అరిస్టా నెట్వర్క్స్ కోఫౌండర్‌గా నీర్జా సేథి 24 ర్యాంకు దక్కించుకున్నారు. ఇక మాజీ పెప్సికో సీఈవోగా ఇంద్రా నూయి ఫోర్బ్స్ జాబితాలో 85వ స్థానం దక్కింది. జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. వారి ఆస్తులు ఎంతంటే ♦జయశ్రీ ఉల్లాల్ పోర్బ్స్ విడుదల చేసిన అమెరికాలో సెల్ఫ్ మేడ్ బిలియనిర్ల జాబితాలో 15వ స్థానం దక్కించుకున్న ఆమె..1.9 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు. 2018 నుంచి అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా పనిచేస్తున్న జయశ్రీ ఆ సంస్థలో 5శాతం వాటా ఉన్నారు. ♦ఫోర్బ్స్ విడుదల చేసిన మహిళా ధనవంతుల జాబితాలో 24వ స్థానాన్ని కైవసం చేసుకున్న నీర్జా సేథి టోటల్ నెట్ వర్త్ 1 బిలియన్ డాలర్లగా ఉంది.1980లలో అమెరికా మిచిగాన్ నగరం ట్రాయ్‌లో సొంత అపార్ట్ మెంట్లో భర్త భరత్ దేశాయ్‌తో కలిసి ప్రారంభ పెట్టుబడి 2వేల డాలర్లతో ఐటీ కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్ సంస్థ సింటెల్‌ను ప్రారంభించారని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. ♦సంస్థ కో-ఫౌండర్‌గా, మాజీ సీటీవోగా పనిచేస్తున్న నేహా నార్ఖడే 490 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ జాబితాలో 57వ స్థానాన్ని దక్కించుకున్నారు. పూణేకి చెందిన నేహా జార్జీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. ఆమె విద్యాభ్యాసం తర్వాత లింక్డిన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు. ♦మాజీ పెప్సికో సీఈవోగా ఉన్న ఇంద్రా నూయి 320 మిలియన్ల డాలర్లతో ఫోర్బ్స్ బిలియనిర్ల జాబితాలో 85వ స్థానం దక్కించుకున్నారు. ♦చివరిగా 220 మిలియన్ డాలర్లతో జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి.. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. 2009లో రేష్మా శెట్టి భర్త బ్యారీ కాంన్టాన్తో పాటు మరో నలుగురు భాగస్వాములతో కలిసి సింతటిక్ బయో టెక్నాలజీ కంపెనీ జింగో బయోవర్క్స్ను నెలకొల్పారు. -
Vivan Marwaha: దేశం చుట్టిన యువకుడు
‘యూత్’ అనేది ఒక పుస్తకం అనుకుంటే.. చాలామందికి ముఖచిత్రం మాత్రమే తెలుసు. పుస్తకం లోపలికి వెళితే ఏ పేజీలో ఏముందో ఎవరికెరుక! ఆ యూత్‌లోనే ఒకరైన 26 ఏళ్ల వివన్ మర్వాహ దేశమంతా తిరిగి యూత్‌ను అన్ని కోణాలలో అర్థం చేసుకునే అద్భుతమైన పుస్తకం రాశాడు. తాజాగా అతడి పేరు ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా’ జాబితాలో చోటుచేసుకుంది... ‘మా జనరేషన్‌కు మీ జనరేషన్‌కు అసలు సంబంధమే లేదు. ఎంతో తేడా కనిపిస్తుంది!’ అంటాడు నాన్న. ‘మారోజుల్లో స్కూల్లో మగపిల్లలతో మాట్లాడడానికి భయపడేవాళ్లం’ అంటుంది అమ్మ. ‘మీ తరానికి ఖర్చు చేయడం తప్ప పొదుపు చేయడం తెలియదు’ అంటాడు తాత. నిజంగా మనకు మిలీనియల్స్ గురించి ఎంత తెలుసు? ఎంత తెలియదు? అసలు వారి ప్రపంచం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు వెదుక్కోవడానికి ఆ మిలీనియల్స్‌లో ఒకరైన వివన్ సుదీర్ఘమైన దూరాలు ప్రయాణం చేశాడు. అలా మొదలైంది... దిల్లీలో పెరిగిన వివన్ పైచదువుల కోసం కాలిఫోర్నియా(యూఎస్)కు వెళ్లాడు. అక్కడ తాను గమనించింది ఏమిటంటే మిలీనియల్స్ మానసిక ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం వివిధ రూపాల్లో నిర్మాణాత్మకమైన కృషి చేయడం. ‘యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఇలాంటి ప్రయత్నం ఎందుకు జరగడం లేదు’ అని ఆశ్చర్యపోయాడు వివన్. కాలేజి చదువు పూర్తయిన తరువాత ‘నెక్స్›్ట ఏమిటీ?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఒక పుస్తకం రాయాలనిపించింది. మనదేశంలోని మిలీనియల్స్ ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాడు. దీనికి ముందస్తు సన్నాహంగా మన దేశ మిలీనియల్స్‌కు సంబంధించిన సమాచారం కోసం వెదికితే నిరాశే ఎదురైంది. తనకు లభించిన అరకొర సమాచారంతోనే నోట్స్ రాసుకొని అమెరికా నుంచి బయలుదేరాడు. ఇండియాకు వచ్చి నలుదిక్కులలోని 13 రాష్ట్రాలలో 30,000 కి.మీ దూరం ప్రయాణించాడు.‘మిలీనియల్స్ గురించి తెలుసుకోవాలంటే కాలేజిలకు వెళితే సరిపోతుంది’ అనే కాన్సెప్ట్‌ను నమ్ముకోలేదు వివన్. సెల్‌ఫోన్ రిపేర్ చేసేవారి నుంచి సెలూన్లో పనిచేసేవారి వరకు అందరినీ కలిశాడు. వారి అభిప్రాయాల్లో దాపరికాలు, ముసుగులు లేవు. మనసులో ఉన్నది బయటికి స్వేచ్ఛగా మాట్లాడేస్తున్నారు. ‘ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కనిపించే నిరుద్యోగం ఇప్పుడు లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. నా ఫ్యూచర్ గురించి ఇంట్లో వాళ్లు బాధ పడ్డారు. ఇప్పుడు నేను సెల్‌ఫోన్ రిపేరింగ్ షాప్ నడుపుతున్నాను. నా సంపాదన ప్రభుత్వ ఉద్యోగి నెలజీతంతో సమానంగా ఉంది’ అంటున్నాడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అక్షిత్ అనే కుర్రాడు. బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళితే... ‘లవ్మ్యారేజ్ని ఇష్టపడతావా? పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే ఇష్టమా?’ అనే ప్రశ్నకు నీళ్లు నమలకుండా ‘పెద్దలు కుదిర్చిన పెళ్లినే ఇష్టపడతాను’ అన్నాడు ఒక కాలేజి కుర్రాడు. ఇదే అభిప్రాయం చాలా మంది నోటి నుంచి వినిపించింది. ఇంఫాల్(మణిపూర్)లో ఒకచోట...‘మనం ఎక్కడ ఉన్నామనేది సమస్య కాదు. మెగా సీటిలో ఉన్నా మారుమూల పల్లెలో ఉన్నా సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా సాధనాల ద్వారా అనేకానేక విషయాలు తెలుసుకోవచ్చు. మనకు కావాల్సింది ఆసక్తి మాత్రమే’ అంటోంది యూత్. అయితే ఒక అంశంపై అన్ని ప్రాంతాలలోనూ ఒకేరకమైన అభిప్రాయాలు వినిపించడం లేదు. ‘మీ లక్ష్యం ఏమిటి?’ అని దిల్లీ, ముంబై యువతరాన్ని ప్రశ్నిస్తే స్టార్టప్‌ల గురించి చెప్పారు. జబల్పూర్లాంటి పారిశ్రామిక పట్టణాల్లో ప్రభుత్వ ఉద్యోగం, భద్రజీవితమే తమ లక్ష్యం అంటుంది యువతరం. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పట్టణాలు తిరిగి...కెరీర్, రాజకీయాలు, మతం, కులం, ఆశలు, ఆశయాలు...మొదలైన వాటిపై మిలీనియల్స్ అభిప్రాయాలను లోతుగా తెలుసుకొని ‘వాట్ మిలీనియల్స్ వాంట్’ పేరుతో పుస్తకం రాశాడు వివన్. ఈ పుస్తకానికి ‘ఇండియన్ మిలీనియల్స్ బయోగ్రఫీ’ అంటూ ప్రశంసలు లభించాయి. జీక్యూ ఇండియా ‘టాప్ నాన్ ఫిక్షన్ బుక్ ఫర్ 2021’ జాబితాలో నిలిచింది. ‘అమెరికా, చైనాలతో పోల్చితే ఇండియన్ మిలీనియల్స్ ఏమిటి?’ వివన్ మాటల్లో చెప్పాలంటే...‘1993లో ఇండియా, చైనా జీడిపి ఇంచుమించుగా ఒకేస్థాయిలో ఉండేది. ఆ తరువాత మాత్రం చైనా దూసుకుపోయింది. ఫలితంగా మన మిలీనియల్స్‌తో పోల్చితే చైనా వాళ్లు ఆర్థికస్థిరత్వంతో ఉన్నారు. వారిలో అభద్రతా కనిపించడం లేదు. అమెరికాలో గత తరాలతో పోల్చితే చాలా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనదేశంలో మాత్రం సంప్రదాయాలను గౌరవించే ధోరణి పెరిగింది’ క్షేత్రస్థాయిలోకి వెళితే ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి అని చెప్పడానికి బలమైన ఉదాహరణ...వాట్ మిలీనియల్స్ వాంట్. -
అర్జెంటీనా స్టార్ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. 2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. బుధవారం ప్రకటించిన ఫోర్బ్స్ అథ్లెట్ జాబితాలో మెస్సీ తొలిస్థానంలో ఉండగా.. దిగ్గజ ఎన్బీఏ ఆటగాడు లెబ్రన్ జేమ్స్ రెండు, పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో మూడో స్థానంలో ఉన్నాడు. మే 1, 2022 ముగిసేనాటికి మెస్సీ 131 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నాడు. ఇందులో 55 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపంలో సంపాదించాడు. ఇక రెండో స్థానంలో ఉన్న ఎన్బీఏ ఆటగాడు లెబ్రన్ జేమ్స్ 121 మిలియన డాలర్ల పారితోషికం తీసుకోగా.. తర్వాత వరుసగా పోర్చుగల్ కెప్టెన్ రొనాల్డో(115 మిలియన్ డాలర్లు), బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్(95 మిలియన్ డాలర్లు), మూడుసార్లు ఎన్బీఏ చాంపియన్ స్టీఫెన్ కర్రీ(92.8 మిలియన్ డాలర్లు)తో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఎన్బీఏ ఆటగాడు కెవిన్ డురంట్(92 మిలియన్ డాలర్లు) ఆరో స్థానంలో ఉండగా.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(90.7 మిలియన్ డాలర్లు) ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాల్లో మెక్సికన్ బాక్సర్ కానెలో అల్వరెజ్(90 మిలియన్ డార్లు), ఏడుసార్లు సూపర బౌల్ చాంపియన్ టామ్ బ్రాడీ(83.9 మిలియన్ డాలర్లు), ఎన్బీఏ చాంపియన్ గియనిస్ (80.9 మిలియన్ డాలర్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి 33.9 మిలియన్ డాలర్లతో(31 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపంలో) 61వ స్థానంలో ఉన్నాడు. కోహ్లి తప్ప మరే భారతీయ ఆటగాడు టాప్-100లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక ఈ ఫోర్బ్స్ జాబితాను ప్రతీ ఏడాది ప్రకటించడం ఆనవాయితీ. ఆటగాళ్ల వార్షిక సంపాదన, ఎండార్స్మెంట్, బోనస్, స్పాన్సర్షిప్ డీల్స్, లైసెన్స్ ఇన్కమ్ ద్వారా వివరాలను వెల్లడిస్తుంటారు. చదవండి: MS Dhoni: సినీరంగ ప్రవేశం చేయనున్న టీమిండియా మాజీ కెప్టెన్ The World’s 10 Highest-Paid Athletes 2022 https://t.co/MIB7ZF8u5I pic.twitter.com/ujPt4ny41s — Forbes (@Forbes) May 12, 2022 -
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు భారీ షాక్!
ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు భారీషాక్ తగిలింది. మార్చి 16న ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో విజయ్ శేఖర్ బిలియనీర్ల స్థానాన్ని కోల్పోయారు. దేశంలోనే ఆదరణ పొందిన స్టార్టప్‌లలో ఒకటైన పేటీఎం షేర్ గత నాలుగు నెలల్లో దాని ఇష్యూ ధర రూ.2,150 నుండి 70 శాతానికి పైగా పడిపోయిందని ఫోర్బ్స్ డేటా తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం..నవంబర్ 18,2021న పేటీఎం ఐపీవోకి వెళ్లింది. అంతకు ముందు విజయ్ శర్మ సంపద 2.35 బిలియన్ల డాలర్ల గరిష్ట స్థాయి నుండి 999 మిలియన్లకు చేరుకుంది. అయితే ఆ రోజు నుంచి పేటీఎం ఫౌండర్ ప్రతిరోజు దాదాపు రూ.88 కోట్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సంస్థ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లను సమీకరించింది. నవంబర్ 18న దీని విలువ 1.39 ట్రిలియన్లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 50 అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కానీ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో దాదాపు 1 ట్రిలియన్ నష్టపోయి ఆ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు పేటీఎం వ్యాల్యూ రూ.40వేల కోట్లకు తగ్గింది. దీంతో పేటీఎం అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 112వ స్థానంలో ఉంది. కంపెనీ ప్రతినిధి ప్రకారం, డిసెంబర్ త్రైమాసికం నాటికి, వన్97 కమ్యూనికేషన్స్‌లో శర్మ వాటా 8.9శాతం లేదా దాదాపు 57.67 మిలియన్ షేర్లు. యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు దాదాపు 30.97 మిలియన్ షేర్లు కూడా శర్మ తరపున ఉన్న ట్రస్ట్ షేర్లు. ఆయన వాటా విలువ రూ.5,558 కోట్లుగా ఉంది. చదవండి: పేటీఎమ్‌పై సంచలన ఆరోపణలు..! అందుకే బ్యాన్..! -
వాసి వాడి తస్సాదియ్యా! 23 ఏళ్లకే 400 కోట్ల సంపాదన!
డబ్బు సంపాదించేందుకు మార్గాలు ఎన్నో(తప్పుడు దోవలో కాకుండా) ఉన్నాయి. కావాల్సిందల్లా ఉన్నపెట్టుబడిలో తెలివి, శ్రమను సరిగ్గా ఉపయోగించడం. ఒకప్పుడు తన వీడియోలను లెక్క పెట్టుకుంటూ గడిపిన (2017లో కౌంటింగ్ టు 1, 00, 000 వీడియోతో ఫేమస్ అయ్యాడు).. జిమ్మీ డొనాల్డ్సన్, ఇప్పుడు ఏడాదికి 400 కోట్ల రూపాయలు సంపాదించే ఇంటర్నెట్ పర్సనాలిటీగా గుర్తింపు దక్కించుకున్నాడు. జిమ్మీ డొనాల్డ్సన్.. ఈ పేరు చెబితే ఈ యూట్యూబర్ గురించి తెలియదు. మిస్టర్‌బీస్ట్ అని పిలిస్తే మాత్రం చాలామంది గుర్తు పడతారు. యూట్యూబ్‌లో విలువైన స్టంట్ల ద్వారా పేరు దక్కించుకున్న అమెరికన్ ఇతను. 13 ఏళ్ల వయసులో యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ఆరంభించి.. ఛాలెంజ్, డొనేషన్ల వీడియోలతో వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యాడు. ఫోర్బ్స్ జాబితాలో 2021 ఏడాదికి గానూ 23 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్సన్ ‘యూట్యూబ్ హయ్యెస్ట్ ఎర్నింగ్ కంటెంట్ క్రియేటర్’గా నిలిచాడు. తన వీడియోలకు పది బిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకుని.. 54 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైనే) వెనకేసుకున్నాడు. ముఖ్యంగా ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో భారీ స్టేడియంలో అతను నిర్వహించిన హైడ్ అండ్ సీక్ ఆటకు భారీ స్పందన లభించింది. కిందటి ఏడాది మిస్టర్‌బీస్ట్ ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 45 మిలియన్ డాలర్ల సంపాదనతో జేక్ పాల్ రెండో స్థానంలో నిలిచాడు. మనసున్నోడు కూడా.. డొనాల్డ్సన్ యూట్యూబ్ ఛానెల్‌కి 88 మిలియన్ పైగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. మిస్టర్ బీస్ట్ కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు.. పరోపకారి కూడా. యూట్యూబ్‌లో సంపాదించిన దానిని మాత్రమే కాదు.. ఎన్జీవోలు, ఆర్గనైజేషన్లు, దాతల ద్వారా వచ్చినదంతా ఇతరులకు దానం చేస్తుంటాడు. ఇళ్లు లేనివాళ్లకు, జబ్బులతో బాధపడుతున్నవాళ్లకు, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరికైనా సరే సడన్ సర్ప్రైజ్లతో సాయం చేస్తుంటాడు. 2018 డిసెంబర్లో లక్ష డాలర్లను ఇళ్లు లేని వాళ్లకు దానం చేయడం, గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి ఆర్థిక సాయం, ఆస్పత్రులకు విరాళం.. లాంటివెన్నో ఉన్నాయి. కిందటి ఏడాది ‘మిస్టర్ బీస్ట్ బర్గర్’ (వర్చువల్ రెస్టారెంట్చెయిన్)ను స్థాపించి.. యాభై మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు ఈ కుర్రాడు. మిస్టర్ బీస్ట్కి ఇంతేసి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం చాలా మందికి కలగడం సహజం. డొనేషన్స్ తో పాటు పలు కంపెనీలు అతని వీడియోలకు స్పానర్షిప్ చేస్తుంటాయి. అందులో క్విడ్ లాంటి బడా కంపెనీలు కూడా ఉన్నాయి. డొనాల్డ్సన్ వీడియోలు చాలామట్టుకు ఆకట్టుకునేలా ఉంటాయి. తొలినాళ్లలో ఒక్కడే కష్టపడగా.. ఇప్పుడు అతని బాల్య స్నేహితులు తోడయ్యారు. తొలినాళ్లలో మిస్టర్ బీస్ట్ దగ్గర కెమెరామ్యాన్‌గా పని చేసిన కార్ల్ జాకోబ్స్.. ఇప్పుడు సొంతగా యూట్యూబర్‌గా ఎదిగాడు. ఇంత నేమ్-ఫేమ్ దక్కినప్పటికీ.. తన సొంత యూట్యూబ్ ఛానెల్ మిస్టర్ బీస్ట్ లాస్లో నడుస్తోందంటూ తాజాగా డొనాల్డ్సన్ ప్రకటించుకోవడం!. ఇన్స్టాగ్రామ్ మోడల్ మ్యాడీ స్పైడెల్తో డేటింగ్లో ఉన్నాడు జిమ్మీ డొనాల్డ్సన్. మ్యాడీ ఒక వీడియో గేమ్ కామెంటేటర్‌గా ( Let's Plays) ప్రారంభించి.. ఇప్పుడు ప్రపంచంలోనే క్రేజీయెస్ట్ యూట్యూబర్‌గా నిలిచాడు. ప్యూడీపై వర్సెస్ టీ సిరీస్ కాంపిటీషన్ టైంలో ప్యూడీపైకి మద్దతుగా నిలిచి మిస్టర్‌బీస్ట్ తన సబ్ సస్క్రయిబర్స్ను విపరీతంగా పెంచేసుకున్నాడు. -
ఈ సంవత్సరం ఏం చేసింది?.. వీరిని స్ఫూర్తిదాతలుగా నిలిపింది..
2021 సంవత్సరం ఏం చేసింది? చెప్పులు లేని ఒక మహిళను పార్లమెంటులో సగౌరవంగా నడిపించింది. భుజానికి మందుల సంచి తగిలించుకుని తిరిగే సామాన్య ఆరోగ్య కార్యకర్తను ‘ఫోర్బ్స్’ పత్రిక ఎంచేలా చేసింది. ఈ సంవత్సరం ఒక తెలుగు అమ్మాయిని అంతరిక్షాన్ని చుంబించేలా చేసింది. ఈ సంవత్సరం ఒక దివ్యాంగురాలికి ఒలింపిక్స్ పతకాలను మెడ హారాలుగా మలిచింది. ఈ సంవత్సరం భారత సౌందర్యానికి విశ్వకిరీటపు మెరుపులు అద్దింది. ఈ సంవత్సరం దేశ మహిళ జాతీయంగా అంతర్జాతీయంగా తానొక చెదరని శక్తినని మరోమారు నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. 2021 మెరుపులు ఎన్నో. కాని 2022లో ఈ శక్తి మరింత ప్రచండమై స్ఫూర్తిని ఇవ్వాలని.. కీర్తిని పెంచాలని కోరుకుందాం. కరోనా వారియర్! మెటిల్డా కుల్లు (45) ► అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కోవిడ్‌పైనా, ఆరోగ్య విషయాలపైన విస్తృతంగా అవగాహన కల్పించింది మెటిల్డా కుల్లు. దానికిగాను ఆమెకు ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తింపు లభించింది. ► భుజానికో చిన్న చేతి సంచి, కాలి కింద సైకిల్ పెడల్, గుండెనిండా సంకల్పం, సంచి నిండా ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రింటింగ్ మెటీరియల్‌తో బయలుదేరింది ఒడిశా సుందర్ఘర్ జిల్లాలోని గర్గద్బహాల్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి అంటేనే ప్రపంచమంతా గడగడలాడుతున్న సమయమిది. ఇంతటి క్లిష్టమైన తరుణంలోనూ ఎంతో భరోసా ఇస్తూ కోవిడ్ కిట్లూ, ఇతర సామగ్రితో కొండాకోనల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్‌పై ఇంటింటికీ తిరిగింది. అసలే వెనకబడిన ఖారియా అనే ఓ గిరిజన తెగకు చెందిన మహిళ. చుట్టూ ఆమె మాటలు లెక్కచేయని కులతత్వాలూ, ఆధునిక వైద్యాన్ని నమ్మని చేతబడులూ, మంత్రతంత్రాలను నమ్మే ప్రజలు. ఈ నేపథ్యంలో పడరానిపాట్లు పడుతూ, మూఢనమ్మకాలను నమ్మవద్దంటూ నచ్చజెప్పింది. ► కేవలం కోవిడ్పైనేగాక... మలేరియా గురించి, గిరిజన తండాల్లోని మహిళలకు పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పింది. అంగన్వాడీ మహిళలతో కలిసి కుటుంబనియంత్రణ అవసరాల గురించి బోధించి, ఎరుకపరచింది. అత్యంత దుర్గమ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ కనీసం తినడానికి తిండి లేక మలమలమాడిపోయినా తన లక్ష్యాన్ని విడువలేదు. తాను చికిత్స అందించాల్సిన 250 ఇళ్లలోని 964 మందిలో ప్రతి ఒక్కరికీ వైద్య సహాయాన్ని అందించింది. ఇలా అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని సమూహాలను ప్రభావితం చేసినందుకు భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన, ప్రభావపూర్వకమైన 21 మంది మహిళల్లో తానూ ఒకరంటూ ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తించేలా పేరుతెచ్చుకుంది. మరెందరికో స్ఫూర్తిమంతంగా నిలిచింది. ఫైటర్ అండ్ షూటర్! అవనీ లేఖరా (20 ) ► పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రతిష్ఠ సాధించింది. అంతేకాదు మహిళల పది మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణిగా నిలిచింది. ► అవని లేఖరా తన పదకొండవ ఏట ఓ కారు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో ‘పారాప్లీజియా’ అనే మెడికల్ కండిషన్‌కు లోనైంది. ఫలితంగా ఓ వైపు దేహమంతా చచ్చుబడిపోయింది. అయినా ఏమాత్రం నిరాశ పడలేదు. ఏదైనా క్రీడను ఎంచుకుని రాణించాలంటూ తండ్రి ప్రోత్సహించారు. దాంతో అభినవ్ భింద్రా నుంచి స్ఫూర్తి పొంది తానూ ఓ షూటర్‌గా రాణించాలనుకుంది. సుమా శిశిర్ అనే కోచ్ నేతృత్వంలో తన 15వ ఏట ఎయిర్ రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందడం ప్రారంభించింది. ఈ ఏడాది జరిగిన పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు... ఒకే పారా ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు పొందిన తొలి మహిళగానూ రికార్డులకెక్కింది. పది మీటర్ల రైఫిల్ విభాగంలో బంగారు పతకంతో పాటు 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. దేశ కీర్తిపతాకను సగర్వంగా నిలిపిన అవని ప్రస్తుతం అసిస్టెంట్ ఫారెస్ట్ కన్సర్వేటర్ (ఏసీఎఫ్)గా పనిచేస్తోంది. ‘బ్యూటీ’ఫుల్ విజయం ఫాల్గుణి నాయర్ (58) ► మల్టీ–బ్రాండ్ బ్యూటీ రిటైలర్ ‘నైకా’ వ్యవస్థాపకురాలు. ► సరైన శిక్షణ, చదువు, మద్దతు ఉంటే మహిళలు ఎంత ఎత్తుకైనా చేరుకోగలరు, దేనినైనా సాధించగలరు అనడానికి నిలువెత్తు నిదర్శనం. అత్యంత తక్కువ మొత్తంతో ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తుల సామ్రాజ్యం నైకా ఆమెను దేశంలోని తొలి 20 మంది సంపన్నుల జాబితాలో నిలిపింది. ► తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొని ఎదిగిన మహిళగా పేరున్న ఫాల్గుణి నాయర్ గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగిన ముంబయ్వాసి. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కోటక్ మహింద్ర గ్రూప్‌లో 20 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆమెది. ఆ తర్వాత సేవింగ్ మనీ బిజినెస్‌కు సంబంధించిన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2012లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ‘నైకా’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది. మేకప్ పట్ల ఉన్న ప్రేమతో ఆమె ఎంచుకున్న ఈ వ్యాపార మార్గం భారతదేశంలో ఆన్లైన్ మార్కెట్‌కు కొత్త ఒరవడిని సృష్టించింది. ► ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన ఫాల్గుణి నాయర్ వారు ఎదిగి, పైచదువుల కోసం అమెరికా వెళ్లాక ఉన్న ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారు. ‘నేను మంచి స్విమ్మర్‌ను కాదు. కానీ, ముందు దూకేస్తాను. ఆ సమయంలో కాలో చెయ్యో విరిగితే ఎలా? అనే ఆలోచనే నాకు రాదు’ అంటూ చిరునవ్వులు చిందిస్తారు. ఆమె విజయంతో పోల్చుతూ ఇతర మహిళల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే – ‘మహిళలు సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, అవసరమైన సమాచారాన్ని పొందడంతో పాటు, రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెంచుకోవాలి. అప్పుడు ఎంతటి ఎల్తైన శిఖరాలైనా అవలీలగా అధిరోహిస్తారు’ అంటారు ఫాల్గుణి. కేవలం ఎనిమిదేళ్లలో సాధించిన ఆమె వ్యాపార ఘనత గురించి అంతర్జాతీయంగానూ అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు. ‘మిస్’ కిరీటం మానసా వారణాసి (24) ► ఫెమినా నిర్వహించిన అందాల పోటీల్లో గెలిచిన ‘మిస్ ఇండియా (వరల్డ్) 2020 పెజంట్’ కిరీటధారి. రాబోయే ఏడాది ప్యూయెర్టో దీవిలోని సాన్ జాన్ నగరంలో జరిగే ‘మిస్ వరల్డ్ 2021 పెజెంట్’లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. (కరోనా కారణంగా ఈ పోటీల నిర్వహణ ఆలస్యమైంది). ► ఈ తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టింది, మలేసియాలో పెరిగింది. కాలేజ్ చదువుకి తిరిగి హైదరాబాద్ వచ్చిన మానస కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సే్ఛంజ్ ఎనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. సంగీతం, డాన్స్, యోగా సాధన, మోడలింగ్ ఆమె హాబీలు. అందాల పోటీల మీద ఆమెకు కాలేజ్ రోజుల్లోనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో ‘మిస్ ఫ్రెషర్’ టైటిల్ కైవసం చేసుకుంది. ఫెమినా ‘మిస్ ఇండియా’ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలో జరిగిన పోటీల్లో మానసా వారణాసి విజయం సాధించి ‘మిస్ ఇండియా వరల్డ్ 2020’ అందాల కిరీటానికి తలవంచింది. ఈ పోటీల్లో జరిగిన అనేక ఈవెంట్లలో ఆమె ‘మిస్ ర్యాంప్‌వాక్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ► అందాల పోటీ విజేతలు నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యతల్లో భాగంగా మానసా వారణాసి పిల్లల రక్షణ చట్టాల పటిష్టత కోసం పని చేయనుంది. ఇందులో భాగంగా ‘వియ్ కెన్’ పేరుతో పిల్లల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామి బండ్ల శిరీష (34) ► ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజినీర్. వాణిజ్య వ్యోమగామి. వర్జిన్ గెలాక్టిక్ అధినేతతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన తెలుగు సంతతి అమ్మాయి. అంతరిక్ష రేఖ దాటిన రాకేష్‌శర్మ, కల్పనా చావ్లా, సునితా విలియమ్స్ తర్వాత నాల్గవ భారతీయురాలుగా బండ్ల శిరీష గుర్తింపు పొందారు. ► గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్ వెళ్లి, అక్కడే చదువు పూర్తి చేశారు. అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. నాసా వ్యోమగామి కావాలనుకున్నా, కంటిచూపులో వైద్యపరమైన కారణాలతో తన ఆశకు దూరమైంది. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో చేరి, అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శీరిష వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 టెస్ట్ ఫై్టట్లో ఆరుగురు సభ్యుల బృందంతో కలిసి అంతరిక్షయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనితో శిరీష ‘ఫెడరల్ ఏవిషయన్ అథారిటీ’ స్పేస్ టూరిస్ట్ జాబితాలో నిలిచారు. అంతరిక్షంలో విజయ కేతనం స్వాతి మోహన్ (38) ► భారత సంతతికి చెందిన అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ స్వాతి మోహన్. నాసా ప్రయోగించిన రోవర్‌ని మార్స్పైన విజయవంతంగా ల్యాండ్ చేయడంలో మిషన్ గైడెన్స్, కంట్రోల్స్ ఆపరేషన్స్ లీడర్‌గా సమర్థంగా నిర్వహించారు. ► బెంగుళూరులో పుట్టిన స్వాతి ఏడాది వయసులోనే ఆమె తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. స్వాతి 9వ యేట టీవీలో స్టార్ ట్రెక్ చూసి, అంతరిక్షంపై ఎనలేని ఆసక్తి చూపించారు. పిల్లల డాక్టర్ కావాలనుకుని 16 ఏళ్ల వయసులో ఫిజిక్స్‌ను ఎంచుకున్నా, ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనే వృత్తిగా కొనసాగించడానికి మార్గమైన ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి పూర్తి చేయడానికి ముందు కార్నెల్ విశ్వవిద్యాలయంలో మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ► ప్రొఫెసర్ డేవ్ మిల్లర్‌తో కలిసి స్పేస్ సిస్టమ్స్ లాబొరేటరీలో ఆన్–ఆర్బిట్ కార్యకలాపాలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనేక పరీక్షలను నిర్వహించారు. పూర్వ విద్యార్థుల వ్యోమగాములతోనూ, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం స్పేర్స్ జీరో రోబోటిక్స్ పోటీలో కూడా పనిచేశారు. కాలిఫోర్నియాలోని పసాదేనాలో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పనిచేస్తున్నారు స్వాతిమోహన్. 2013లో రోవర్‌ను మోసుకెళ్లే అంతరిక్ష నౌక అంగారక గ్రహానికి ప్రయాణించేటప్పుడు, గ్రహం ఉపరితలంపై ల్యాండింగ్ చేసేటప్పుడు సరైన దిశలో ఉండేలా చూసుకునే బాధ్యతను పోషించారు. ఫిబ్రవరి 18, 2021న అంగారకుడిపై పెర్సెవెరెన్స్ రోవర్ ల్యాండ్ అయినప్పుడు మిషన్‌ను కంట్రోల్ నుంచి ల్యాండింగ్ ఈవెంట్లను వివరించారు. ఆమె ‘టచ్ డౌన్ కన్ఫర్మ్’ అని ప్రకటించగానే జెపిఎల్ మిషన్ కంట్రోల్ సెంటర్లో సంబరాలు మిన్నంటాయి. చప్పట్ల హోరుతో ఆమెకు అభినందనలు తెలిపారు. గతంలో, స్వాతి మోహన్ శని గ్రహానికి సంబంధించిన కాస్సిని మిషన్‌లో పనిచేశారు. అలాగే చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని మ్యాప్ చేయడంలో అంతరిక్ష నౌక గ్రెయిల్కు బాధ్యత వహించారు. నడిచే వన దేవత తులసీ గౌడ (72) ► కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడను దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారమైన ‘పద్మశీ’ వరించింది. తులసీ గౌడ పెద్ద చదువులు చదువుకోలేదు. ఆ మాటకొస్తే బడి చదువు కూడా పూర్తి చేయలేదు. అయితేనేం, నడిచే వనదేవతగా, ఔషధ మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు. ► పేదవాళ్లయిన ఆమె తల్లిదండ్రులు కనీసం పెళ్లి చేసి ఓ అయ్య చే తిలో పెడితే అయినా కడుపునిండా అన్నం తినగలదనే ఉద్దేశంతో పదకొండేళ్ల్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు కుంగిపోకుండా ఆమె 12 ఏళ్ల వయస్సున్నప్పటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. అటవీశాఖలో టెంపరరీ వాలంటీర్‌గా చేరింది. ప్రకృతిపై ఆమెకున్న అంకితభావమే ఆ తర్వాత అదే డిపార్ట్మెంట్లో ఆమె ఉద్యోగాన్ని సుస్థిరం చేసింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే నెలకొల్పిందామె. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునేందుకు తోడ్పడింది. ► ఈ వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను మొత్తాన్ని కూడా ఇందుకే ఖర్చు చేస్తున్నారామె. టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. కేవలం మొక్క నాటితేనే సంతృప్తి రాదు.. అది కొత్త చివుళ్లు పెట్టి శాఖోపశాఖలుగా విస్తరించి మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం. ‘యూపీఎస్సీ’లో రెండో స్థానం జాగృతి అవస్థి (24) ► యూపీఎస్సీ పరీక్షల్లో దేశంలోనే రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఇక మహిళల్లోనైతే ఆమెదే ఫస్ట్ ర్యాంక్. ► భోపాల్‌కు చెందిన 24 ఏళ్ల జాగృతి అవస్థి ఓ సాధారణ మధ్యతరగతి మహిళ. తండ్రి ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. తల్లి మధులత సాధారణ గృహిణి. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మానిట్) నుంచి 2017లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది జాగృతి. ప్రతిష్ఠాత్మకమైన ‘గేట్’ పరీక్షలోనూ మంచి ర్యాంక్ సాధించింది. తొలుత బీహెచ్ఈఎల్ (భోపాల్)లో ఇంజనీర్‌గా చేరింది. రెండేళ్లపాటు పనిచేశాక యూపీఎస్ఈ పరీక్షల కోసం పూర్తికాలం కేటాయించాలకుంది. మొదట్లో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుందామని అనుకుంది. కానీ కరోనా కారణంగా ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివింది. తల్లిదండ్రులూ ఎంతగానో ప్రోత్సహించారు. దేశానికి ఎలాంటి సేవలందిస్తావంటూ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ‘మన దేశం పల్లెపట్టులకు నెలవైన ప్రదేశం. అందుకే గ్రామీణాభివృద్ధే తన లక్ష్యం’ అంటూ వినమ్రంగా చెప్పింది జాగృతి. గర్జించిన కంఠం స్నేహా దూబే (28) ► ఘనత: ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శి. ‘ఐరాస’ వేదికపై ‘పాక్’పై నిప్పులు కురిపించి దీటైన జవాబు చెప్పడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ► కొన్నిసార్లు ‘మాటలు’ కూడా తూటాల కంటే శక్తిమంతంగా పేలుతాయని అంతర్జాతీయ వేదికగా నిరూపించింది స్నేహా దూబే. ► ‘ఉగ్రవాద బాధిత దేశం మాది అని చెప్పుకుంటున్న పాకిస్థాన్ మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. తన ఇంటికి తానే నిప్పు పెట్టుకొని ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది’ అంటూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ► ‘పాక్’ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఆమె మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ‘ఎవరీ స్నేహ?’ అని ఆరా తీసేలా చేశాయి. ► గోవాలో పుట్టిన స్నేహ అక్కడ పాఠశాల విద్య, పుణేలో కాలేజి విద్య పూర్తి చేసింది. దిల్లీ జేఎన్‌యూ, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీ నుంచి ఎంఫిల్ పట్టా తీసుకుంది. 2012 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ అయిన స్నేహా దూబే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి (యూఎన్)లో భారతదేశం మొదటి కార్యదర్శి. ► పన్నెండు సంవత్సరాల వయసులో సివిల్ సర్వీస్ గురించి గొప్పగా విన్నది స్నేహ. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ప్రపంచంలోని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే తనకు మొదటి నుంచి ఆసక్తి. ఈ ఆసక్తే తనను ‘ఐఎఫ్ఎస్’ను ఎంచుకునేలా చేసింది. ఏ సివిల్స్ పరీక్షలు పూరై్త, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ఇంట్లోని అద్దం ముందు నిల్చొని గట్టిగా మాట్లాడుతూ బాడీలాంగ్వేజ్‌ను పరిశీలించుకుంటూ తనలోని బెరుకును పోగొట్టుకున్నది స్నేహ. విశ్వ సౌందర్యం హర్నాజ్ కౌర్ సంధూ (21) ► రెండు దశాబ్దాల తర్వాత మన దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన అందాల యువతి. ► ఇజ్రాయెల్‌లోని ఇల్లియాట్‌లో డిసెంబర్ 14న జరిగిన 70వ అందాల పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె కంటే ముందు లారా దత్తా 2000వ సంవత్సరంలో ఈ టైటిల్‌ను అందుకోగా, తిరిగి 21 ఏళ్ల తర్వాత çహర్నాజ్ కౌర్ సంధూను వరించింది. ► పంజాబ్ ప్రాంతానికి చెందిన హర్నాజ్ కౌర్ సంధూ తనకెంతో ఇష్టమైన మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. మిస్ యూనివర్స్ టైటిల్ కన్నా ముందు ఆమె మిస్ దివా 2021 కిరీటాన్ని గెలుచుకుంది. గతంలో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2019లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ► మార్చి 3, 2000 చంఢీగఢ్‌లో జన్మించిన సంధూ శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. ► ఐదడుగుల తొమ్మిందంగుళాల పొడవున్న సంధూ, మానసిక సౌందర్యంలోనూ మిన్న అని నిరూపించుకుని ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన విశ్వసుందరి పోటీలో విజయం సాధించింది. View this post on Instagram A post shared by Miss Universe (@missuniverse) -
ఫోర్బ్స్ ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితా.. ఇద్దరు భారతీయులకు చోటు
The World's 100 Most Powerful Women 2021 in the World List: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక ప్రచురించే ప్రపంచ శక్తివంతులైన మహిళల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. ప్రతీ ఏడు ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా పాలసీ మేకర్స్, వ్యాపారం, దాతృత్వం, సీఈవోలు ఇలా వివిధ కేటగిరిలకు చెందిన మహిళలను పరిశీలించి ఈ జాబితాను ప్రకటిస్తుంది. ఇద్దరికి చోటు తాజాగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్‌కు చోటు దక్కించుకున్నారు. వంద మంది మహిళలతో కూడిన ఈ జాబితాలో నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో నిలవగా ఫాల్గుని నాయర్ 88వ స్థానంలో నిలిచారు. బీబీసీ నుంచి భారత రాజకీయ చరిత్రలో తొలిసారిగా మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందారు. అంతకు ముందు ఆమె రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె బీబీసీలో పని చేశారు. సెల్ఫ్‌మేడ్ నైకా ఐపీవోతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఫాల్గుని నాయర్. బ్యూటీ ప్రొడక్టులు వ్యాపారంలోకి వచ్చిన ఫాల్గుని నాయర్ అనతి కాలంలోనే మార్కెట్లో మంచి పేరు సాధించారు. ఇటీవల ఐపీవోకి వచ్చిన మరుసటి రోజే బిలియనీర్‌గా మారారు. సెల్ఫ్‌మేడ్ ఇండియన్ ఫిమేల్ బిలియనీర్‌గా రికార్డులకెక్కారు. మొదటి స్థానంలో మెకెంజీ ఇక ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో మెకెంజీ స్కాట్ నిలిచారు. అమెరికన్ నావెలిస్ట్ అయిన మెకెంజీ స్కాట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ మాజీ భార్య. కాగా దాతృత్వం విభాగంలో ఆమె చేసిన ఛారిటీ సేవలకు గాను ఫోర్బ్స్ ఈ గుర్తింపు ఇచ్చింది. కాగా గత జాబితాలో తొలి స్థానంలో ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఈసారి 15వ స్థానంలో నిలిచారు. చదవండి: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్.. ఎందుకంటే..? -
ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలన్‌మస్క్‌ను ఫోర్బ్స్ గుర్తించింది. కేవలం యాభై ఏళ్ల వయసులోనే ఎంతోమంది సీనియర్ వ్యాపారవేత్తలను వెనక్కి నెట్టి ఎలన్‌మస్క్ ఈ స్థానం దక్కించుకున్నారు. దీంతో ఎలన్‌మస్క్ చిన్న వయసులోనే ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. మహీంద్రా ఇలా చెప్పారు ఎలన్‌మస్క్ విజయ రహస్యం ఏంటనే అంశంపై ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా సరికొత్తగా స్పందిస్తూ.. ఈ రోజు మార్కెట్ క్యాపిటల్ అనేక రెట్లు పెరగడం వల్ల ఎలన్ మస్క్ ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడు కాలేదు. ఆశయం, ధైర్యం, తెగింపు వంటి లక్షణాలు అనేక రెట్లు ఆయనలో ఉన్నాయి. అలా ఉన్న వారి సంపాదన భవిష్యత్తులో మిగిలినవారి కంటే ఎక్కువగా ఉంటుంది అనే అర్థం వచ్చేలా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. Market value is now not a multiple of current earnings but a multiple of Audacity, Ambition & Courage. Rightly, that is a formula that promises outsize future earnings… https://t.co/EAEBB45Zpj — anand mahindra (@anandmahindra) October 19, 2021 వాళ్లిద్దరు కలిసినా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ట్యాగ్‌లైన్ ఎలన్‌మస్క్, జెఫ్ బేజోస్ల మధ్య కొంత కాలంగా దోబూచులాడుతోంది. అయితే ఇటీవల ఎలన్‌మస్క్‌కి సంబంధించిన టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల షేర్ల ధరలు పెరిగాయి. దీంతో వాటి మార్కెట్ క్యాపిటల్‌లో కొత్తగా 70 బిలియన్ డాలర్ల సంపద వచ్చి చేరింది. దీంతో ఆ రెండు సంస్థలకు ఓనరైన ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా మారారు. సుదీర్ఘకాలం ఈ స్థానంలో కొనసాగిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు వారన్ బఫేట్ల ఇద్దరి సంపాదన కలిపినా సమం కాని స్థితికి ఎలన్‌మస్క్ చేరుకున్నాడు. చదవండి:ఆనంద్ మహీంద్రా చెప్పిన బిజినెస్ పాఠం! -
‘ఫోర్బ్స్’ ప్రభావంతమైన నటుల జాబితా విడుదల.. టాప్‌లో రష్మిక
ఫోర్బ్స్ భారతదేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన నటుల’ జాబితాలో నటి రష్మిక మందన్నా అగ్రస్థానం సంపాదించింది. సమంత, విజయ్ దేవరకొండ, యష్, అల్లు అర్జున్ వంటి హేమహేమీలను దాటుకుంటూ టాప్‌కి చేరింది. బెంగుళూరుకు చెందిన రష్మిక తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా స్థానం సంపాదించుకుంది. త్వరలోనే సిద్ధార్థ్ మల్హోత్రాకి జోడిగా నటిస్తుండడంతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించింది. దీంతో సౌత్‌లోని మంచి మంచి నటులను దాటుకుంటూ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు సోషల్ మీడియాలో పెరిగిన ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్, వ్యూస్ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ జాబితాని తయారు చేశారు. ఇందులో 10 పాయింట్లకు 9.88 సాధించింది ఈ రష్మిక. కాగా 9.67తో విజయ్ దేవరకొండ రెండో స్థానం, 9.54తో కన్నడ హీరో యశ్ మూడో స్థానం, 9.49తో సమంత నాలుగో స్థానం, 9.46తో అల్లు అర్జున్ ఐదో స్థానంలో నిలిచారు. చదవండి: పుష్ప నుంచి శ్రీవల్లి సాంగ్ విడుదల -
ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్.. ఈ సంస్థకే మొదటి ర్యాంకు
రిలయన్స్ సంస్థకి మరో అరుదైన గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గాను ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన బెస్ట్ ఎంప్లాయర్ ర్యాకింగ్స్లో 52వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 750 కంపెనీలను ఈ ర్యాంకింగ్స్ కోసం పరిశీలించగా రిలయన్స్ సంస్థకి 52వ స్థానం దక్కింది. టాప్ 100లో ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డులకు సంబంధించి టాప్ 100 జాబితాలో మొత్తం నాలుగు సంస్థలకే చోటు దక్కింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 52వ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 65వ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 77, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 90 ర్యాంకును దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక ఎస్బీఐ 117వ, ఎల్ అండ్ టీ 127వ స్థానాలకే పరిమితం అయ్యాయి. నంబర్ వన్ ఇక ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకులను పరిశీలిస్తే శామ్సంగ్ సంస్థ ప్రథమ స్థానంలో నిలవగా ఐబీఎం కంప్యూటర్స్ ద్వితీయ స్థానం దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, గూగుల్, డెల్, హువావేలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. లక్షన్నర మంది నుంచి ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలకు చెందిన 750 కంపెనీల నుంచి 1,50,000ల మంది ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కంపెనీ ఆర్థిక ప్రణాళిక, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత, టాలెంట్ డెవలప్మెంట్ తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఇతర ఇండియన్ కంపెనీలు ఫోర్బ్స్ బెస్ట్ఎంప్లాయర్ ర్యాకింగ్స్లో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ కంపెనీల విషయానికి వస్తే బజాజ్ 215, యాక్సిస్ బ్యాంక్ 215, ఇండియన్ బ్యాంక్ 314, ఓన్ఎన్జీసీ 404, అమర్‌రాజా గ్రూపు 405, కోటక్ మహీంద్రా 415, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496, ఎల్ఐసీ 504, ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూపు 746వ స్థానాలు దక్కించుకున్నాయి. చదవండి : 40 ఏళ్లకే తరగనంత సంపద -
ఫోర్బ్స్ రిచెస్ట్ బిజినెస్ విమెన్ లిస్ట్.. దివ్య సంపద ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: గుర్తుపెట్టుకో. నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ.. నీ టార్గెట్ పదో మైల్ అయితే.. పదకొండో మైల్‌పై గురిపెట్టు అంటాడు బిజినెస్ మ్యాన్ సినిమా హీరో. సరిగ్గా ఇదే థీరీని తన జీవితానికి అన్వయించుకుందీ యువ మహిళా పారిశ్రామిక వేత్త దివ్య గోకుల్ నాథ్. తన ధ్యేయం, లక్ష్య సాధన వైపు దివ్యమైన అడుగులు వేస్తూ సంపదలో రివ్వున దూసుకుపోయింది. ఫలితంగా దేశంలోనే 100 మంది మహిళా ధనవంతులైన ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది దివ్యగోకుల్‌నాథ్. ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్ సహ వ్యవస్థాపకురాలైన దివ్య గోకుల్‌నాథ్ కేవలం 35 ఏళ్ల వయసులో ఈ లిస్ట్‌లో ఆరుగురు దిగ్గజ మహిళా పారిశ్రామికవేత్తల సరసన దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ చదువులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో గోకుల్‌నాథ్ సంపద గత సంవత్సరంలో దాదాపు రూ. 7,477 కోట్లు పుంజుకుని ప్రస్తుతం ఏకంగా సుమారు రూ. 3.02 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా ధనవంతుల జాబితాలో 47వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి 71 ఏళ్ల సావిత్రీ జిందాల్, హ్యావెల్స్ ఇండియా అధినేత్రి 76 ఏళ్ల వినోద్ రాయ్ గుప్తా, యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత్రి లీనా తివారి, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్‌షా, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అధినేత్రి మల్లికా శ్రీనివాసన్ లాంటి లెజెండ్స్‌తో పోటీపడ్డారు. దివ్య అంతకుముందు కూడా అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఉమెన్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2020 ఫెమినా పవర్ లిస్ట్. ఫోర్బ్స్ ఆసియా పవర్ బిజినెస్ ఉమెన్ , ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డుతోపాటు, 2021 మేకర్స్ ఇండియా కాన్ఫరెన్స్, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు. 1987లో బెంగళూరులో బెంగళూరులో జన్మించింది దివ్య. తండ్రి అపోలో హాస్పిటల్స్‌లో నెఫ్రాలజిస్ట్, ఆమె తల్లి దూరదర్శన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్. ఏకైక సంతానమైన దివ్యకు చిన్నతనంనుంచే సైన్స్, గణితం శ్రద్ధగా నేర్పించారు. కష్టపడే తత్వాన్ని, లక్ష్యాల్ని సాధించే కమిట్మెంట్ను అమ్మానాన్నల నుంచి అలవర్చుకున్న దివ్య చదువులో బాగా రాణించింది. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి పైచదువులకు విదేశాలకు వెళ్లేందుకు 2007లో జీఆర్ఈ కోచింగ్ సందర్భంలో బైజూస్ రవీంద్రన్తో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడే టీచింగ్ వృత్తిని ఎంచుకుంది. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్తో ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. ఇద్దరుబిడ్డలకు జన్మనిచ్చింది. బోధనలో కొత్త పద్ధతులు అవలంబించాలనే కోరికతో 2011లో, దివ్య తన భర్తతో కలిసి బైజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌కు నాంది పలికింది. సింపుల్ లెర్నింగ్ టెక్నిక్స్‌తో విద్యార్థుల విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ప్రస్తుతం బైజూస్‌లో ఏడున్నర కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. -
Leena Gandhi Tewari: మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం.. 3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో
Leena Gandhi Tewari Inspirational Story: ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి కంపెని యుఎస్వీ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక తోట ఉంటుంది. ఆ తోటలోనే కాదు కార్యాలయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడా అరుపులు, కేకలు వినబడవు. ప్రశాంతమైన వాతావరణంలో పని జరుగుతుంటుంది. ‘నేను నీ కంటే ఎక్కువ. నువ్వు నా కంటే తక్కువ... అనే వాతావరణం మా సంస్థలో కనిపించదు. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటుంది లీనా గాంధీ తివారి. యుఎస్వీ చైర్పర్సన్ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్ ‘100 రిచెస్ట్ ఇండియన్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళలలో రూ.3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో నిలిచింది. చదవండి : Divya Gokulnath: ఫోర్బ్స్ లిస్ట్‌లో.. సంపద ఎంతో తెలుసా? ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, సోషల్ రెస్పాన్స్‌బిలిటీ భిన్న ధృవాలుగా కనిపిస్తాయి. కానీ మనసు ఉన్న వాళ్లకు రెండు వేరు వేరు కావు. లీనా తివారి ఇలాంటి వ్యక్తే. వ్యాపార నైపుణ్యం, సామాజిక బాధ్యతను మిళితం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది లీనా. ‘డా. సుశీలగాంధీ– సెంటర్ ఫర్ అండర్ ప్రివెలేజ్డ్ ఉమెన్’ తరఫున అట్టడుగు వర్గాల మహిళలకు అనేక రకాలుగా సహాయంగా నిలుస్తుంది. పేద గ్రామీణ విద్యార్థులకు విద్య చెప్పించడం నుంచి కంప్యూటర్లో శిక్షణ ఇప్పించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ‘మహిళలు తమ సొంతకాళ్ల మీద నిలబడేలా చేయడానికి సహకరించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడవాళ్లు ఎంత చదువుకున్నా పురుషులతో సమానం కాదు అనే ఆధిపత్య భావజాలాన్ని తొలగించడం మరో ఎత్తు. మొదటి లక్ష్యం సులభమేకాని రెండోది మాత్రం క్లిష్టమైనది. దానికి నిరంతర కృషి కావాలి. క్లిష్టమైన వాటిని దారికి తేవడం ఎంటర్ప్రెన్యూర్ చేసే పనుల్లో ఒకటి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను అదే చేయాలనుకుంటున్నాను’ అంటున్న లీనా మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మాట నిలబెట్టుకుంటుంది. యుఎస్వీలో ఉన్నతస్థానాల్లో మహిళలు ఉన్నారు. వారి ప్రతిభ, కృషి సంస్థ విజయానికి ఇంధనంగా పనిచేస్తుంది. ‘మొదట్లో ఏ మహిళలకైనా ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తే...నేను చేయలేనేమో అన్నట్లుగా మాట్లాడేవారు. నువ్వు తప్పకుండా చేయగలవు. నీలో ఆ ప్రతిభ ఉంది...అని ప్రోత్సహిస్తే కీలక బాధ్యతలను భుజాన వేసుకోవడం మాత్రమే కాదు తమను తాము నిరూపించుకున్న మహిళలు మా సంస్థలో ఎంతోమంది ఉన్నారు’ అంటుంది లీనా. 1961లో యుఎస్వీ ఏర్పాటయింది. అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు స్త్రీలను గౌరవించే సంస్కృతికి కూడా సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. పెద్దలు పాదుకొల్పిన ఈ విలువలను మరింత ముందుకు తీసుకువెళుతుంది లీనా. ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్’లో పట్టా పుచ్చుకుంది. వ్యాపార పాఠాలు మాత్రమే కాదు జీవితపాఠాలను కూడా చదువుకుంది లీనా. అందుకే ‘ఫోర్బ్స్’ మాత్రమే కాదు ఫిలాంత్రోపి జాబితాలోనూ ఆమె అగ్రస్థానంలో ఉంటుంది. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం. దీనిలో ఒక వాక్యం... ‘నువ్వు గెలవడమే కాదు ఇతరుల గెలుపు గురించి కూడా ఆలోచించు' లినా తివారీ గాంధీ వ్యక్తిత్వానికి అద్దం పట్టే వాక్యం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: World Post Day: జ్ఞాపకాల మూట -
కరోనా షాక్, ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఔట్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ దిగ్గజానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25 సంవత్సరాలలో తొలిసారిగా అమెరికాలోని అత్యంత ధనవంతుల ఫోర్బ్స్ 400 జాబితాలో స్థానాన్ని కోల్పోయాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి అతను 600 మిలియన్ డాలర్లు సంపదను కోల్పోయాడు. ట్రంప్ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే మరో 400 మిలియన్ డాలర్లు అవసరమని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. (Yesudasan: ప్రముఖ కార్టూనిస్ట్ కన్నుమూత, సీఎం సంతాపం) గత ఏడాది చివర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ చేతిలో ఓటమి పాలైన ట్రంప్ ఆస్తుల విలువ ఏమాత్రం పెరగలేదు. ఫలితంగా అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌కు చోటు దక్కలేదు. తాజాగా ‘ఫోర్బ్స్ 400’ జాబితాలో ట్రంప్ చోటు కోల్పోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారని ఫోర్బ్స్ వెల్లడించింది. గత ఏడాదికాలంలో ట్రంప్ మొత్తం ఆస్తుల విలువ 2.5 బిల్లియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం నికర విలువ యధాతథంగా ఉన్నట్లు తెలిపింది. -
Saloni Sacheti: బాన్సూలీ అంటే ఏమిటో తెలుసా.. ఈ నగలు ధరిస్తే!
సలోని లా కాలేజి విద్యార్థి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వివిధ మారుమూల ప్రాంత వాసులను కలిసే అవకాశం వచ్చింది. వచ్చామా, పని చూసుకుని వెళ్లామా అనుకోలేదు సలోని. తన ఇంటర్న్‌షిప్‌తోపాటు పర్యటిస్తోన్న గ్రామాల్లో.. ముఖ్యంగా గిరిజనుల ఆర్థికస్థితిగతులు, జీవన శైలి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంది. వీరికోసం ఏదైనా చేసి మంచి జీవితం ఇవ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఐదుగురు మహిళలతో కలిసి వెదురుతో జ్యూవెలరీని తయారు చేయించడం మొదలు పెట్టింది. ఈ వెదురు నగలు అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో విక్రయాలు బాగానే జరిగేవి. గిరిపుత్రికలకు శిక్షణ ఇస్తున్న సలోని అలా 13 నెలలు గడిచిపోయాక సలోని ప్రాజెక్టు వర్క్ పూర్తయింది. దీంతో తన సొంత ఊరు వెళ్లడం, ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ వెదురుతో జ్యూవెలరీ తయారు చేస్తూ ఉపాధి పొందవచ్చని గ్రహించిన గిరిజన మహిళలు .. తమ జ్యూవెలరీ వర్క్‌ను మరింత ముందుకు తీసుకెళ్లమని సలోనిని అడగడంతో.. సలోనికి మళ్లీ రంగంలో దిగక తప్పలేదు. వెంటనే ‘బాన్సూలి’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించి.. గిరిజన మహిళలు సొంత ఊరు వదిలి, వలస వెళ్లకుండా అక్కడే ఆనందంగా, ఆర్థిక భరోసాతో జీవించేలా ఉపాధి కల్పిస్తోంది. అల్వార్ అమ్మాయి రాజస్థాన్‌లోని అల్వార్‌లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించింది సలోని సఛేతి. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఫిలాసఫీ చేసింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే సలోని కాలేజీలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేది. డిగ్రీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా అందుకుంది. బిఏ తరువాత బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో చేరింది. ఎల్ఎల్బీ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా గుజరాత్‌లోని డ్యాంగ్ జిల్లాలో వివిధ గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకునేది. ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాలను పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఉపాధిలేక పేదరికంతో అల్లాడడం చూసింది. పొట్టచేతబట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్తున్న వారి దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయి 2009లో ‘బాన్ సూలి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. బాన్సూలీ అంటే బాన్ అంటే వెదురు. సూలీ అంటే నగలు బాన్సూలీ అంటే నగల నమూనా అని అర్థం. బాన్సూలీ ద్వారా డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడ అధికంగా దొరికే వెదరును జూవెలరీ తయారీలో వినియోగించడం విశేషం. సమకాలిన ఫ్యాషన్‌కు అద్దం పట్టేలా వెదురుకు రాళ్లు, రత్నాలు, పూసలు జోడించి జ్యూవెలరీని తయారు చేస్తున్నారు. ఎక్కువ బరువు లేకుండా కేవలం ఏడు నుంచి పది గ్రాముల్లోపే ఆకర్షణీయమైన ఆభరణాలను రూపొందించి విక్రయిస్తున్నారు. తొలినాళ్లలో ఆర్యా, మిమనాస, ద్యుతి, బోగన్ విలియ డిజైన్లను రూపొందించగా, ప్రస్తుతం రెండువందలకు పైగా విభిన్న రకాల డిజైన్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటిలో జ్యూవెలరీతోపాటు లాప్టాప్ స్టాండ్స్, లైట్ స్టాండ్స్, రాఖీలు, దియాలు, కిచెన్, గృహాలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ప్రారంభంలో బాన్సూలీ డిజైన్లను... ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేజీలు క్రియేట్ చేసి వాటిల్లో వీరి సరికొత్త వెదురు జ్యూవెలరిని అప్లోడ్ చేసేవాళ్లు. అంతేగాక వివిధ నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి వెదురు నగలను ప్రదర్శించేవారు. వీటికి మంచి స్పందన రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొరియర్ కంపెనీలతో కలిసి బాన్సూలీ జ్యూవెలరినీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బాన్సూలీ పదిహేనులక్షల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తోంది. దీని ద్వారా దాదాపు నలభై మంది గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో... బాన్సూలీ ఉత్పత్తుల విక్రయాలు ఆశించిన దానికంటే అధికంగా జరగడంతో అనేక సంస్థలు సలోని కృషికి గుర్తింపుగా వివిధ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని పేరు ఉండడం విశేషం. ఇవేగాక 3ఎమ్ సీఐఐ ఇన్నోవేటర్ ఛాలెంజ్ అవార్డు, ఎన్ఐఆర్డీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ‘‘బెస్ట్ స్టార్టప్ అవార్డు’’, టాప్ 18 సోషల్ ఇన్నోవేటర్, సోషల్ సెక్టార్లో ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డులను దక్కించుకుంది. ఒక్క గుజరాత్లోనేగాక వెదురు అధికంగా లభ్యమయ్యే ప్రాంతాల్లో బాన్సూలిని విస్తరించనున్నట్లు సలోని చెబుతోంది. చదవండి: Humans Of Patuli: కొత్త చీరలు కొని డొనేట్ చేస్తున్నారు.. ఎందుకంటే.. -
ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్
మెక్సికో సిటీ: ఇంటెలిజెన్స్ కోషెంట్.. దీన్నే షార్ట్‌కట్‌లో ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఓ కొలమానం అనొచ్చు. సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. అయితే ఇప్పటి వరకు అత్యధిక ఐక్యూ ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫేన్ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్ 160 వరకు ఉన్నట్లు ప్రచారం ఉంది. ఐక్యూ విషయంలో వీరిని మించిపోయింది మెక్సికన్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక. ఈ చిన్నారి ఐక్యూ ఏకంగా 162గా గుర్తించారు. ఆ వివరాలు.. మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ (8) అనే చిన్నారి మెక్సికోలోని తలాహుక్ మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. అయితే మూడేళ్ల ప్రాయంలో ఉండగా అధారా అస్పెర్జర్ సిండ్రోమ్ (ఆటిజం కోవకు చెందిన వ్యాధి)బారిన పడింది. ఫలితంగా డిప్రెషన్‌తో బాధపడుతుండేది. స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ క్రమంలో అధారా తల్లిదండ్రులు ఆమెను థెరపీ కోసం సైక్రియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధారాను పరీక్షించిన వైద్యులు చిన్నారిలో అసమాన తెలివితేటలు ఉండటం గమనించారు. (చదవండి: నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి) ఈ క్రమంలో అధారాను టాలెంట్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ అధారా ఐక్యూని పరీక్షించగా.. 162గా తేలింది. ఇక టాలెంట్ కేంద్రంలో ఒకే రకమైన స్కిల్స్ ఉన్న విద్యార్థులను చేర్చుకుని వారికి చదువు చెప్తారు. ఈ క్రమంలో అధారాను అక్కడ చేర్చుకున్నారు. (చదవండి: Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్) టాలెంట్ కేర్ సెంటర్లో చేరిన అధారా ఎనిమిదేళ్ల వయసు వచ్చే సరికే ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అంతేకాక రెండు ఆన్లైన్ డిగ్రీలు పొందింది అధారా. తన అనుభవాల గురించి తెలియజేస్తూ.. ‘డు నాట్ గివ్ అప్’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఇక మానసిక వైకల్యం ఉన్న వారి ఎమోషన్స్‌ని నిత్యం పరిశీలించేందుకు గాను ఓ స్మార్ట్ బ్రాస్లెట్ని అభివృద్ధి చేసింది. ఆస్ట్రోనాట్ అయి అంతరిక్షం వెళ్లాలని.. అంగారకుడిపై వలస రాజ్యం స్థాపించాలనేది అధారా కోరిక. (చదవండి: ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు) తన ప్రతిభ ఆధారంగా అధారా ఫోర్బ్స్ మెక్సికో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా అధారా తల్లి మాట్లాడుతూ ‘‘అస్పెర్జర్ సిండ్రోమ్ కారణంగా బాల్యంలో నా కుమార్తె ఎవరితో త్వరగా కలిసేది కాదు. ఓ సారి తను ఓ చిన్న ఇంట్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఫ్రెండ్స్ అధారాను గదిలో పెట్టి బంధించారు. బయట నుంచి తనను హేళన చేయసాగారు. ఆ రోజు నా కుమార్తె పడిన బాధ చూసి.. తనను ఒంటరిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు తన తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
ప్రపంచానికి కొత్త కుబేరుడు.. రెండో స్థానంలో జెఫ్ బిజోస్
ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోకి కొత్త కుబేరుడు వచ్చి చేరుడు. ఇప్పటి వరకు ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడుగా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ రెండవ స్థానానికి పడిపోయారు. లగ్జరీ గూడ్స్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో 13 లక్షల 57వేల 737 కోట్ల పైనే. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. ఆ సంస్థ స్టాక్స్ 765 మిలియన్ డాలర్ల మేర పెరగడంతో ఆర్నాల్ట్ కుటుంబం ఆస్తులు జెఫ్ బిజోస్‌ను మించి పోయాయి. లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద అనేక బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ ద్వారా లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఆయా బ్రాండ్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పెరగడంతో ఆర్నాల్ట్ ఆస్తులు వృధ్ధి చెందాయి. ప్రస్తుతం జెఫ్ బిజోస్ ఆస్తుల విలువ 186 బిలియన్ డాలర్లు. మరోవైపు ప్రపంచం కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 147.3 బిలియన్ డాలర్లు. ఎల్ఎమ్ హెచ్ వి కంపెనీ 2021 మొదటి త్రైమాసికంలో 14 బిలియన్ యూరోల రెవిన్యూ నమోదు చేసింది. 2020 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. చదవండి: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు -
తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించబోతోందెవరు..?
ఫోర్బ్స్ ఎప్పుడూ టాప్ 10 ‘బిలియనీర్’లు అనే జాబితాను మాత్రమే ఇస్తుంటుంది? ట్రిలియనీర్ల జాబితాను ఇవ్వదు. ఎందుకు? ఎందుకంటే ఈ భూమి మీద ట్రలియనీర్లే లేరు!! బిలియనీర్ అంటే కనీసం వెయ్యి మిలియన్ల విలువైన నికర ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తి. ట్రిలియనీర్ అంటే కనీసం వెయ్యి బిలియన్ల విలువైన నికర ఆస్తి ఉన్న వ్యక్తి. ఫోర్బ్స్మ్యాగజీన్లో తరచు కనిపించే జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వీళ్లంతా కూడా (డాలర్ల లెక్కలో) బిలియనీర్లే. ట్రిలియనీర్లు కారు. భవిష్యత్తులో వీళ్లే ట్రిలియనీర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరైతే వీళ్లలో ఎవరు తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించవచ్చు? బిలియనీర్లుగా ఇప్పుడు తొలి రెండు స్థానాలలో ఉంటూ వస్తున్న జెఫ్ బెజోసా? లేకా ఎలాన్ మస్కా? వీళ్లిద్దరూ కాకుండా మిగతావాళ్లెవరైనా?! ఊహించగలరా? మన ఊహలన్నీ పైపైన అంచనాలుగా ఉండొచ్చు. మన అంచనాలు నిజం కూడా అవొచ్చు. అయితే ప్రస్తుతం ఈ భూమండలం మీద ఉన్న బిలియనీర్లలో ఎవరికి మొదటిసారి ‘ట్రిలియనీర్’ అనే గుర్తింపు దక్కుతుందా అని లెక్కలు వేసిన కొందరు.. ఎలాన్ కానీ, జెఫ్ బెజోస్ కానీ అంటున్నారు. వాళ్లిద్దరిలో కచ్చితంగా ఎవరో, వాళ్లిద్దరూ కాకుండా మిగతా వాళ్లలో ఎవరో చెప్పలేమని కూడా చేతులు ఎత్తేస్తున్నారు! చేతులు ఎత్తేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. స్టాక్ మార్కెట్‌ను బట్టి రాత్రికి రాత్రి బిలియనీర్ల పొజిషన్ల మారిపోతున్నప్పుడు.. తొలి ట్రిలియనీర్‌ను ఎవరో సరిగ్గా వేసిన అంచనా కూడా ఆఖరి నిముషంలో తలకిందులు అవొచ్చు! అయితే అందరికన్నా ముందు ‘ట్రిలియన్’కు ఎవరైతే టచ్ అవుతారో వారే చరిత్రలో ఎప్పటికీ ‘తొలి ట్రిలియనీర్‌గా’గా ఉండిపోతారు. మర్నాడే ఇంకొకరు ట్రిలియన్ మార్క్‌ని రీచ్ అయినా ‘తొలి ట్రిలియనీర్’ అన్న రిచ్‌నెస్ ఎక్కడికీ పోదు. ఆ ఎక్కడికీ పోనీ రికార్డు అయితే ఎలాన్ మస్క్‌దే అవుతుందని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ బిలియనీర్ చామంత్ పలిహపతయ నమ్ముతున్నారు. అంటే.. కాబోయే తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నమాట! ఆయన నమ్మితే సరిపోతుందా? చామంత్ ఊరికే నమ్మడం లేదు. మనల్ని నమ్మమని చెప్పడం లేదు. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ ట్రావెల్, ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ బిజినెస్‌లో ఉన్నారు. ఈ భూమి మీద మారుమూల ప్రాంతాలను సైతం కనెక్ట్ చేయగల ‘స్టార్లింగ్’ స్పేస్ ఇంటర్నెట్ కూడా ఆయనదే. ప్రతి ఒక్కరికీ అవసరమైనది ఇవ్వగల వ్యాపారి (ఇది చిన్నమాట) ప్రతి ఒక్కరి నుంచీ పొందగల వ్యాపారి అవుతాడు కనుక ఎలాన్ మస్కే మొదటి ట్రిలియనీర్‌గా ఈ భువనాధీశుడు అవుతాడు. మార్స్‌లో కాలనీని నిర్మించబోతున్నది కూడా అతడేనన్న విషయం మనం మరువకూడదు. ఇక ఎలాన్ మస్కే తొలి ట్రిలియనీర్ అవుతారని చామంత్ అతడిలో ఇంకా ఏం చూసి చెబుతున్నారంటే.. వాతావరణ మార్పుల్ని ‘మానవయోగ్యం’గా మెరుగు పరిచేవారు వరల్డ్స్ రిచెస్ట్ అవుతారు కనుక.. కేవలం కార్లను మాత్రమే తయారు చేయకుండా, ఎన ర్జీ కంపెనీగా కూడా ఎనర్జీని పండిస్తున్న, ఎనర్జీని స్టోర్ చేస్తున్న ‘టెస్లా’ అతడిని టాప్10 లోని మిగతా వాళ్ల కన్నా ముందు ‘ట్రిలియనీర్’ను చేయవచ్చట! ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు బిజినెస్‌లో ఇప్పుడు పోటాపోటీగా ఉన్నారు. ఒకటీ రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనే వారు పైకీ కిందికి మారుతున్నారు. ప్రస్తుతం వాళ్ల ఆస్తుల నికర విలువ ఇంచుమించు 150 బిలియన్ డాలర్ల దగ్గర కిందా మీదా అవుతోంది. ఇంత ‘నెక్ టు నెక్’లో ఉన్నప్పుడు జెఫ్ బెజోస్ తొలి ట్రిలియనీర్ కాకూడదనేముంది?! అవును ఏముంది? అవొచ్చు. 1994లో బెజోస్ ‘అమెజాన్.కామ్’ అనే పేరుతో ఆన్లైన్ బుక్‌స్టోర్ ప్రారంభించారు. ఇప్పుడు అమెజాన్ పేరుతో ఉన్న మొత్తం ఆస్తులు 192 బిలియన్ డాలర్లు. కరోనా వైరస్ అతడిని మరింత ధనికుడిని చేసింది. ఆ వైరస్ ప్రపంచాన్ని కమ్ముకోవడంతో కోట్లమంది వినియోగదారులు బెజోస్ ఆన్లైన్ వ్యాపారంపై ఆధారపడి అతడి రాబడిని ఒక్కసారిగా పెంచేశారు. ఒక్క 2020 లోనే బెజోస్ ఆన్లైన్ వ్యాపారం దాదాపుగా 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ప్రస్తుతం బెజోస్ నికర ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంది. అమెరికన్ వెబ్సైట్ ‘బిజినెస్ ఇన్సైడర్’ అంచనాల ప్రకారం 2026 నాటికి బెజోస్ ట్రిలియనీర్ అవొచ్చు. అప్పటికి ఆయనకు 62 ఏళ్లు వస్తాయి. చిన్న వ్యాపారాల ఆర్థిక సలహాల వేదిక ‘కంపారిజన్’ నివేదిక కూడా బెజోసే తొలి ట్రిలియనీర్ కావచ్చని ఊహిస్తోంది. అయితే తొలి ట్రిలియనీర్ అయ్యే తొలి ‘యంగెస్ట్ పర్సన్’ జుకర్‌బర్గ్ కావచ్చునని అంచనా వేస్తోంది. ప్రస్తుతం జుకర్‌బర్గ్ వయసు 36 ఏళ్లు. అతడికి 51 ఏళ్లు వచ్చేనాటికి .. అంటే మరో పదిహేనేళ్లలో అతడు ట్రిలియనీర్ అవొచ్చని కంపారిజన్ అంటోంది. తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాత బిల్ గేట్స్ నిలుస్తారని మరికొన్ని అంచనాలు చెబుతున్నాయి. గేట్స్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం అటూ ఇటుగా 140 బిలియన్ డాలర్లు. అయితే 2018 నాటి ‘ఆక్స్‌ఫామ్’ నివేదికను బట్టి చూస్తే మస్క్, బెజోస్ కన్నా ముందే గేట్స్ ‘ట్రిలియనీర్’ అవుతారు. గేట్స్ 2013లో తన గేట్స్ ఫౌండేషన్ ద్వారా లోక కల్యాణానికి 28 బిలియన్ డాలర్లను ధారపోశారు. ప్రస్తుతం ఆయన వయసు 65. ఈ ధారపోయడం కొనసాగకపోతే కనుక భవిష్యత్తులో ఆయన ఎవరి అంచనాలకూ అందనంత ధన సంపన్నుడు అవుతారని రెండేళ్ల క్రితం నాటి ఆక్స్‌ఫామ్ అంచనాలను బట్టి లెక్క వేయవచ్చు. మస్క్, బెజోస్, గేట్స్.. ఎవరు తొలి ట్రిలియనీర్ అయినా వారు చరిత్రలో నిలిచిపోతారు. అది వారొక్కరి సంపదే కాదు. వారి నుంచి ఏదైతే పరిజ్ఞానాన్ని, ఏవైతే సేవల్ని, ఏ విధమైన అభివృద్ధిని అందుకుందో ఆ ప్రపంచ మానవాళి సంపద కూడా. -
కుబేరులకు కేంద్రంగా భారత్..
న్యూయార్క్: అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిల్చింది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 614 నుంచి 724కి చేరింది. చైనాలో 456 నుంచి 698కి చేరింది. ఈ రెండు దేశాల తర్వాత అత్యధికంగా 140 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో ఉంది. జర్మనీ (136), రష్యా (117) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ 35వ వార్షిక బిలియనీర్ల జాబితా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక బిలియనీర్స్ జాబితా ప్రకారం పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో చైనా వ్యాపార దిగ్గజం జాక్ మాను రెండో స్థానానికి నెట్టారు. ముకేశ్ అంబానీ 84.5 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ 10 అంతర్జాతీయ బిలియనీర్స్ జాబితాలో మరోసారి పదో స్థానం దక్కించుకున్నారు. అటు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భారత్‌లో రెండో స్థానంలోనూ అంతర్జాతీయంగా 24వ స్థానంలోనూ ఉన్నారు. ఆయన సంపద విలువ 50.5 బిలియన్ డాలర్లు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (23.5 బిలియన్ డాలర్లు) దేశీయంగా మూడో స్థానంలో, అంతర్జాతీయంగా 71వ ర్యాంకులోనూ నిల్చారు. నంబర్‌వన్‌గా నాలుగోసారి బెజోస్ .. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపక సీఈవో జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ లిస్టులో అగ్రస్థానంలో నిల్చారు. ఆయన సంపద 64 బిలియన్ డాలర్లు పెరిగి 177 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 151 బిలియన్ డాలర్ల సంపదతో (126 బిలియన్ డాలర్ల వృద్ధి) రెండో స్థానంలో ఉన్నారు. బిలియనీర్స్ జాబితాలో సంపన్నుల సంఖ్య 660 పెరిగి 2,755కి చేరింది. వీరి సంపద విలువ 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ] -
రూ.4 లక్షల కోట్లు దానం చేస్తాను: బిలియనీర్
సియోల్: పేదవారిని, ధనికులును తయారు చేసేది సమాజంలోని పరిస్థితులు. నిజాయతీగా కష్టపడేతత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే నైజం ఉన్న వారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కోటీశ్వరులవుతారు. అయితే తాము వచ్చిన దారిని వారు మర్చిపోరు. ఆ బాటలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తాము సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయడానికి కూడా వెనకాడని వారు ఉంటారు. ఎందుకంటే వారి దృష్టిలో ఆ సంపద ఈ సమాజానికి చెందినదే తప్ప వారి వారసులది కాదు. అయితే ఇలాంటి మనసున్న మారాజులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మన దేశంలో టాటా గ్రూప్, అజీం ప్రేమ్ జీ వంటి వారు ఈ వరుసలో ముందుంటారు. ఇక తాజాగా ఈ కోవలోకి మరో బిలియనీర్ చేరారు. తన సంపదలో సగానికి పైగా అంటూ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు సమాజానికి తిరిగిచ్చేస్తానని ప్రకటించారు. ఇంతకు ఆ వ్యక్తి.. ఎవరు.. ఏంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. దక్షిణ కొరియాలో అతిపెద్ద మొబైల్ మెసెంజర్ కకావోటాక్. దీని వ్యవస్థాపకుడు కిమ్ బీమ్ సు. ఆయన సంపద 9.4 బిలియన్ డాలర్లు(6,85,55,61,00,000 రూపాయలు). ఈ మొత్తంలో నుంచి సగానికి పైగా అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు సమాజానికి ఇస్తానని ఆయన సోమవారం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిమ్ బీమ్ సు.. ‘‘నా సందలో సగానికి కంటే ఎక్కువగా సామాజిక సమస్యల పరిష్కారం కోసం వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’అంటూ తన కంపెనీ కకావోటాక్ ఉద్యోగులకు మెసేజ్ చేశారు. కిమ్ బీమ్ సు 2010లో కకావోకో మెసేంజర్ని ప్రారంభించారు. అనేక విశేషాలున్న ఈ యాప్‌కు దక్షిణ కొరియాలో ఎంత క్రేజ్ అంటే దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. మెసేంజర్, ఆన్లైన్ గేమ్స్, ఈ కామర్స్‌కు ఉపయోగపడే ఈ యాప్ వాడకం కరోనా కాలంలో ఇంకా ఎక్కువగా పెరిగింది. దాంతో లాభాలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఫోర్బ్స్ ప్రకారం కరోనా వైరస్ కాలంలో కిమ్ దేశంలోనే అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ మిలియనీర్లు బిల్ అండ్ మిలిండా గేట్స్, అలాగే వారెన్ బఫెట్ల చొరవతో ‘గివింగ్ ప్లెడ్జ్’ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఇష్టం ఉన్న బిలియనీర్లు తమ సంపదలో సగానికి పైగా విరాళం ఇవ్వడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది సంపన్నులు ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసినట్లు గివింగ్ ప్లెడ్జ్ వెబ్సైట్ తెలిపింది. అయితే తూర్పు ఆసియాకు చెందిన వారు చాలా కొద్ది మంది మాత్రమే దీనిలో చేరారు. చైనా, హాంకాంగ్, తైవాన్ నుంచి చాలా కొంతమంది దాతలు మాత్రమే ఈ జాబితాలో చేరగా.. జపాన్, దక్షిణ కొరియా నుంచి ఇంత వరకు ఎవరూ లేరు. కిమ్ బీమ్ సు ప్రకటనతో ఈ జాబితాలో చేరిన తొలి దక్షిణా కొరియా దేశస్తుడిగా నిలిచారు. తన ప్రతిజ్ఞను తప్పక నేరవేరుస్తానని, తన విరాళం వివరాలపై చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని కిమ్ తెలిపారు. మూడవ త్రైమాసికంలో కకావో 120 బిలియన్ డాలర్ల లాభాలు చవి చూసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 103 శాతం పెరగడమే కాక 2020 సంవత్సరానికి రికార్డు స్థాయిలో వార్షిక లాభాలను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ ‘కీర్తి’ కోవిడ్-19 వెంటాడినా తరగని కుబేరుల సంపద -
చదువులమ్మ ఈ లాయరమ్మ
అనాథ పిల్లలు రోజు గడవడానికే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. జీవితంలో ఎదుగుదలకు లక్ష్యం ఏర్పాడటానికి ఊతంగా నిలిచే చదువు లభించాలంటే అందుకు దైవం నుంచి వరం లభించాల్సిందే. అలాంటి అనాథ పిల్లల చదువుకు వరప్రదాయినిగా కృషి చేస్తోంది లాయర్ పౌలోమి పావిని శ్లుక్లా. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ 30 సంవత్సరాల వయస్సులో సేవా రంగంలో గణనీయమైన కృషి చేసిన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది అనాథల విద్య కోసం కృషి చేస్తున్న పావిని పేరును ఆ 30 మంది జాబితాలో చేర్చింది. అనాథ పిల్లలకు సరైన విద్యను అందించడం ఎలాగో 28 ఏళ్ల సుప్రింకోర్టు న్యాయవాది పావినికి తెలుసు. ఆమె చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఆమె కుటుంబమే అతి పెద్ద మద్ధతు. పావిని తల్లి అరాధన శుక్లా మాట్లాడుతూ –‘దేశంలో తమ గొంతు వినిపించలేని అనాథ పిల్లలు చదువులో రాణించడం వల్ల వారి హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఏమీ లేని పిల్లలు జీవితంలో ఎదిగేందుకు ప్రోత్సాహమిస్తున్నది ఒక న్యాయవాది. ఆమె నా కూతురు అవడం మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆనందంగా పావిని చేస్తున్న పనిని అభినందించారు ఆమె తల్లి. స్వీయ రచన లక్నోలో ఉంటున్న రచయిత, న్యాయవాది, సామాజిక కార్యకర్త పౌలోమి పావిని శుక్లా దేశం గర్వించదగిన వ్యక్తుల జాబితాలో చేరడం ఒకే రోజులో జరగలేదు. దాని వెనక పదేళ్లుగా ఆమె చేస్తున్న కృషి ఉంది. సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లైన ఆరాధన శుక్లా, ప్రదీప్ శుక్లాల కూతురు పౌలోమి పావిని శుక్లా. 2015 లో భారతదేశంలో అనాథ పిల్లల దుస్థితి గురించి తన సోదరుడితో కలిసి ‘వీకెస్ట్ ఆన్ ఎర్త్– ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకం రాసింది. పావిని అదే ఏడాది అనాథల కోసం లక్నోలో ‘అడాప్ట్ ఎ అనాథాశ్రమం’ ప్రారంభించింది. ఆశ్రమ నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. వీరి నుంచి నగరంలోని పాఠశాలల నిరుపేద పిల్లలకు, అనాథ పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ ఫీజులను ఇచ్చి చదివించగలిగింది. పిల్లలను చదివించడానికి గల కారణాలను పావిని తెలియజేస్తూ– ‘నా తొమ్మిదేళ్ల వయసులో నా పుట్టిన రోజున మా అమ్మ అనాథాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ నేను పిల్లలతో కలిసి ఆడుకున్నాను. మాట్లాడాను. చదువుకోవాలనే వారి ఆశను స్వయంగా తెలుసుకున్నాను. అప్పటి నుండి అనాథల కోసం ఏదైనా చేయాలి అని బలంగా అనుకునేదాన్ని. దాంట్లో భాగంగానే వారి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాను’ అని వివరించింది. పదేళ్ల కృషి సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథ పిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపు దశాబ్దం పాటు కృషి చేస్తూనే ఉంది పావిని. విద్యార్థులకు అవసరమైన కోచింగ్, ట్యూషన్ల కోసం ఉత్తరప్రదేశ్ విద్యాశాఖతో కలిసి కీలక పాత్ర పోషించింది. ఎనిమిది నగరాల్లో 13 స్కూళ్లలోని నిరుపేద పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ డబ్బును అందజేసింది. లాక్డౌన్ సమయంలో నగరంలోని అన్ని అనాథాశ్రమాలలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. దీని వల్ల ఆ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలకు ఆ¯Œ లైన్ విద్య సౌకర్యం లభిస్తోంది. ఈ పని ప్రారంభాన్ని వివరిస్తూ, పావిని ఇలా అన్నారు ‘ఫోర్బ్స్ జాబితాలో నా పేరు చూడటం చాలా సంతోషంగా ఉంది. అనాథల కోసం ఎక్కువ పని చేయమని సూచించిన ఈ స్థానం నన్ను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది’ అని తెలిపారు. -
ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ ‘కీర్తి’
సాక్షి, దుబ్బాక: ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ప్రచురించే ప్రతిభాశీలుర జాబితాలో తెలంగాణకు చెందిన కీర్తిరెడ్డికి చోటు లభించింది. 30 ఏళ్ల లోపు ఉండి ఉన్నతంగా రాణిస్తున్న 30 మందితో ఫోర్బ్స్ పత్రిక ఈ జాబితాను ప్రచురిస్తుంటుంది. ఈసారి ఆ జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం ముద్దుబిడ్డ కొత్త కీర్తిరెడ్డి నిలిచారు. 24 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన కీర్తిరెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూతురు. చిన్ననాటి నుంచే వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లే కీర్తిరెడ్డి.. కరోనా వ్యాక్సిన్ నిల్వకు సంబంధించిన కంపెనీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్ పత్రిక ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆమె కంపెనీని పరిశీలించి ఈ విషయంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా 30 ఏళ్లలోపు అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో చోటు కల్పించారు. చిన్ననాటి నుంచే చురుగ్గా.. కీర్తిరెడ్డి చిన్ననాటి నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్ చిరెక్ కళాశాలలో చదివింది. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి బీబీఎం పట్టా పొందారు. అలాగే ఆమె ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ మేనేజ్మెంట్’లో గ్లోబల్ మాస్టర్ పట్టాను పొందారు. ప్రస్తుతం ఆమె స్టాట్విగ్ అనే బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత వ్యాక్సిన్ సరఫరా నిర్వహణ ఫ్లాట్ ఫాం కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు (సీఓఓ)గా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్లు, ఆహారం వృథాను అరికట్టేందుకు అవసరమైన వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పలువురి ప్రశంసలు స్వతహాగా ఏదైనా కంపెనీని స్థాపించాలన్న ఆలోచనతో ఆమె హైదరాబాద్‌లో స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ సరఫరా, నిర్వహణ ఫ్లాట్ ఫాం కంపెనీని ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎలా నిల్వ చేయాలి.. ఎంత ఉష్ణోగ్రతల్లో ఉంచాలి.. నాణ్యతా ప్రమాణాలు, నిర్దేశిత ప్రదేశాలకు వ్యాక్సిన్ సరఫరా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల్లో ఆమె ప్రతిభను ఫోర్బ్స్ పత్రిక గుర్తించింది. కాగా, తన కూతురు ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు కీర్తిరెడ్డిని అభినందించారు. -
శక్తివంతమైన మహిళగా నిర్మల
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో 41వ స్థానంలో నిలిచారు ఆర్థిక మంత్రి. నిర్మలా సీతారామన్‌తో పాటు హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణీ నాడార్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా ఈ జాబితాలో నిలిచిన మిగతా భారతీయ మహిళలు. ఇక ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా పదో సారి ప్రథమ స్థానంలో నిలవగా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తొలసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటిసారే ఆమె ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. (చదవండి: సూపర్ కుమార్) Announcing the World's 100 Most Powerful Women of 2020: https://t.co/fSEkDPz9Nh #PowerWomen pic.twitter.com/8u6uB1LTYI — Forbes (@Forbes) December 8, 2020 ఇక గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితురాలైన నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో రోషిణీ నాడార్ 55 స్థానంలో నిలవగా.. కిరణ్ మజుందార్ షా 68వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన వారిలో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు ఎంటర్టైనర్లు ఉన్నారు. వీరందరి వయస్సు, జాతీయత, ఉద్యోగ వివరణలో విభిన్నంగా ఉన్నప్పటికి.. వారు 2020 లో తలెత్తిన ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు "అని ఫోర్బ్స్ తెలిపింది. -
ఫోర్బ్స్ జాబితాలో నల్లగొండ వాసి
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ పట్టణానికి చెందిన కోణం సాందీప్.. ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. హెల్త్‌కేర్ సెక్టార్‌కు సంబంధించి వినూత్న రీతిలో వైద్య, ఆరోగ్య సేవలందిస్తున్న సాందీప్.. ఈ నెల 1న ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అండర్– 30 పదవ వార్షిక జాబితాలోని 30 మందిలో మొదటి వరుసలో నిలిచాడు. కోణం సాందీప్ 2018 ఫిబ్రవరిలో డాక్టర్ శివ్‌రావ్‌తో కలసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్జ్ పేరుతో యాప్ సృష్టించి హెల్త్‌కేర్ రంగంలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు తమ కంపెనీకి 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో బీటెక్ నల్లగొండ పట్టణానికి చెందిన కోణం శ్రీనివాస్, అనురా ధ దంపతుల కుమారుడు సాందీప్ ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో మైనర్ డిగ్రీ పూర్తి చేశాడు. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో రోబోటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు. సాందీప్ డ్రోన్లు, రోబోటిక్స్ రంగంలో పలు ఆవిష్కరణలు చేశాడు. హెల్త్‌కేర్ టెక్నాలజీకి సంబంధించి వివిధ అప్లికేషన్స్‌ని కూడా రూపొందించాడు. పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న కోణం సాందీప్‌ను పలువురు అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది: సాందీప్ ఫోర్బ్స్ అండర్ 30 జాబితాకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా యాప్ అబ్రిడ్జ్.. ఈ ఏడాది అమెరికాలో కోవిడ్ –19 వైద్య సేవలు అందించే విషయంలో మంచి గుర్తింపు పొందింది. కోణం ఫౌండేషన్ పేరుతో చారిటీ సంస్థను స్థాపిం చి పేదలకు సేవలందిస్తున్నాం. విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. -
ఆర్జనలో మెస్సీ నంబర్‌వన్
లండన్: అంతర్జాతీయస్థాయిలో తన జట్టుకు ఎలాంటి గొప్ప టైటిల్స్ అందించలేకపోయినా... ఆర్జనలో మాత్రం అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ లయెనల్ మెస్సీ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ‘ఫోర్బ్స్’ పత్రిక వివరాల ప్రకారం ఈ ఏడాది అత్యధిక మొత్తం సంపాదించిన ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మెస్సీకి తొలి స్థానం దక్కింది. అతను ఈ ఏడాదిలో 12 కోట్ల 60 లక్షల డాలర్లు (రూ. 927 కోట్లు) ఆర్జించాడు. ఇందులో 9 కోట్ల 20 లక్షల డాలర్లు వేతనం ద్వారా రాగా... మిగతా 3 కోట్ల 40 లక్షల డాలర్లు వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదించాడు. 15 ఏళ్ల నుంచి స్పెయిన్‌కు చెందిన విఖ్యాత క్లబ్ బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ ఈ ఏడాది బార్సిలోనా జట్టు ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడంతో క్లబ్‌ను వీడాలనుకుంటున్నానని తెలిపాడు. కానీ ఒప్పందం ప్రకారం మెస్సీ వచ్చే ఏడాది వరకు బార్సిలోనా జట్టుతోనే ఉండాలి. ముందుగానే వెళ్లిపోతే భారీస్థాయిలో పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మెస్సీ తన ఆలోచనను విరమించుకొని మరో ఏడాదిపాటు బార్సిలోనాతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా గొప్ప విజయాలేమీ సాధించకపోయినా... యూరప్ ప్రొఫెషనల్ లీగ్ పోటీల్లో మాత్రం మెస్సీ మహిమతో బార్సిలోనా జట్టు 34 ట్రోఫీలు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాలర్‌గా పేరున్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు... ఎండార్స్మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందాడు. మెస్సీ, రొనాల్డో తర్వాత మూడో స్థానంలో నేమార్ (బ్రెజిల్–పారిస్ సెయింట్ జెర్మయిన్–పీఎస్జీ), నాలుగో స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్–పారిస్ సెయింట్ జెర్మయిన్), సలా (ఈజిప్ట్–లివర్‌పూల్) ఉన్నారు. -
‘ఒకే ఒక్కడు అక్షయ్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించే టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్ నుంచి బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ఒక్కరికే చోటుదక్కింది. జూన్ 2019 నుంచి మే 2020 వరకూ దాదాపు రూ .366 కోట్ల సంపాదనతో బాలీవుడ్ ఖిలాడీ ప్రపంచంలోనే అత్యంత రాబడి కలిగిన టాప్ 100 సెలబ్రిటీల సరసన చేరారు. కాస్మెటిక్ ప్రపంచ రారాణి కైలీ జెన్నర్ రూ 4453 కోట్ల ఆర్జనతో అగ్రస్ధానంలో నిలిచిన ఈ జాబితాలో అక్షయ్ కుమార్‌కు 52వ స్దానం లభించింది. 2019 జాబితాలో 33వ స్ధానంలో నిలిచిన అక్షయ్ కుమార్ ఈసారి 19 ర్యాంకులను కోల్పోయినా టాప్ 100లో తన స్ధానం పదిలపరుచుకున్నారు. గత ఏడాది అక్షయ్ రాబడి రూ 490 కోట్లు కాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సంపదపై కరోనా వైరస్ ప్రభావం పడిందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్‌తో అక్షయ్ కుమార్ డిజిటల్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఈ ఏడాది అత్యధిక రాబడి పొందే టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కేందుకు దోహదపడింది. అక్షయ్‌తో అమెజాన్ ప్రైమ్ డిజిటల్ సిరీస్ కోసం రూ 75 కోట్లతో ఒప్పందం చేసుకుందని ఈ నివేదిక పేర్కొంది. ఇక బెల్ బాటమ్, బచ్చన్ పాండే వంటి రానున్న సినిమాల కోసం రూ 100 కోట్ల దాకా వసూలు చేశారని నివేదిక వెల్లడించింది. మరోవైపు ఫోర్బ్స్ టాప్ 10 అత్యధిక రాబడి కలిగిన సెలబ్రిటీల జాబితాలో వరుసగా కైలీ జెన్నర్, కన్యే వెస్ట్, రోజర్ ఫెదరర్, క్రిస్టియనో రొనాల్డో, లియోనెల్ మెస్పీ, టేలర్ పెర్రీ, నేమార్, హోవర్డ్ స్టెమ్, లెబ్రాన్ జేమ్స్, డ్వానే జాన్సన్‌లు చోటు సంపాదించారు. చదవండి : సోదరి కోసం విమానం.. ఖండించిన అక్షయ్ -
ఫెడరర్ సంపాదన రూ. 803 కోట్లు
వాషింగ్టన్: ఏడాది కాలంలో అత్యధిక ఆర్జనగల క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలిసారి టాప్ ర్యాంక్‌లో వచ్చాడు. ‘ఫోర్బ్స్’ పత్రిక విడుదల చేసిన టాప్–100 క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ ఐదో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు. 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి ఫెడరర్ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు (రూ. 803 కోట్లు) సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీలు ఆడటం ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ. గతేడాది ‘టాప్’లో నిలిచిన పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 10 కోట్ల 50 లక్షల డాలర్ల ఆర్జనతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ (10 కోట్ల 40 లక్షల డాలర్లు) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. గతేడాది 100వ ర్యాంక్‌లో నిలిచిన కోహ్లి ఈసారి 2 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 196 కోట్లు) ఆర్జనతో 66వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లికి ఎండార్స్మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా... 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్–100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లినే కావడం విశేషం. -
రుణం తగ్గింది.. రుణ పరపతి పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: దేశంలో రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైంది కాదని, ఒడిదుడుకులు సర్వసాధారణమని మరోమారు వెల్లడైంది. అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన ఇండియా సంచిక లో వెల్లడించిన వివరాల ప్రకారం గత ఐదేళ్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి అప్పులివ్వడం తగ్గిపోయింది. అయితే, రుణ మొత్తం తగ్గి నా రుణ పరపతి పెరిగిందని, ఈ మొత్తంలో 100 శాతం వృద్ధి కనిపించిందని ఆ లెక్కలు చె బుతున్నాయి. 2015 నుంచి యేటా పెద్ద మొ త్తంలో రుణాలు తీసుకుంటున్న యూనిట్ల సం ఖ్య తగ్గిపోతోందని, దీంతో పరపతి పెరుగుతోందని, అంటే దేశంలో నానాటికీ భారీ వెంచ ర్లు పెరిగిపోతున్నాయని అర్థమవుతోంది. గత ఐదేళ్ల లెక్కలను పరిశీలిస్తే..: గత ఐదేళ్లలో దేశంలోని రియల్ సంస్థలు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను ఫోర్బ్స్ వెల్లడించింది. దీని ప్రకారం ఏటా రుణాలు పెరగ్గా.. 2019లో మాత్రం తగ్గిపోయా యి. 2015 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1,506 రియల్ఎస్టేట్ యూనిట్లకు 1.48 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. అంటే ప్రతి యూనిట్‌కు కనీసం రూ.98 కోట్ల పెట్టుబడిని రుణాల ద్వారా సమీకరించారన్నమాట. అదే 2016, 2017, 2018లో రుణాలు తీసుకున్న యూనిట్ల సంఖ్య వరుసగా తగ్గిపోగా, రుణ మొత్తం మాత్రం ఏటేటా పెరిగిపోయింది. ఇక 2019లో కూడా రుణాలు తీసుకున్న యూనిట్ల సంఖ్య తగ్గిపోగా, 2015 తో పోలిస్తే రుణమొత్తం తగ్గిపోయింది. 2018తో పోలిస్తే ఈ రుణమొత్తం 33 శాతం తగ్గిపోయి 1.27 లక్షల కోట్లకే పరిమితమైంది. మూడోవంతు రుణమొత్తం తగ్గిపోయినా 2019లో రియల్ రుణపరపతి యూనిట్‌కు రూ.198 కోట్లకు ఎగబాకడం గమనార్హం. కరోనా దెబ్బకు కుదేలు కరోనా దెబ్బ దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంపై తీ వ్ర ప్రభావాన్ని చూపబోతోంది!. ఎన్రాక్ ప్రాపర్టీస్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం..దేశవ్యాప్తంగా 2020 మొదటి త్రైమాసికంలో 45,200 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 42 శాతం,గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం తక్కువ. ఇందుకు కరోనానే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అయితే, మొదటి త్రైమాసికం వ్యాపారంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే మార్కె ట్లే మొత్తం అమ్మకాల్లో 84 శాతం జరిపాయని తెలిపింది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో 15.62 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇందులో సింహభాగం ఢిల్లీ, ముంబైలలోనేనని తెలిపింది. ఇప్పటికే ఈ నగరాల్లో పెం డింగ్ ప్రాజెక్టులు ఎక్కువయ్యాయని, మళ్లీ ఇక్కడే మిగులు కనిపించడం ఆందోళనకరమని ఈ సర్వేలో తేలింది. -
ఫోర్బ్స్‌పై కంగన సోదరి ఫైర్
బాలీవుడ్ ‘క్వీన్’ కంగన రనౌత్ సోదరి రంగోలీ చందేల్ ఫోర్బ్స్ ఇండియా పత్రికపై విరుచుకుపడ్డారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన సెలబ్రిటీల గణాంకాలన్ని తప్పుడు గణాంకాలంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. ఈ జాబితాలో పేర్కొన్న సెలబ్రిటీల ఆదాయానికి రుజువులు కావాలని డిమాండ్ చేశారు. కాగా ఫోర్బ్స్ ఇండియా 2019 సంవత్సరంలో అత్యధిక ఆదాయాన్ని గడించిన ప్రముఖ 100 మంది సెలబ్రిటీల వార్షిక ఆదాయ గణాంకాలను విడుదల చేసింది. కంగన ఈ ఏడాది రూ.17.5 కోట్లు సంపాందించి 70వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఈ విషయంపై రంగోలీ చందేల్ స్పందిస్తూ.. ‘అవును.. ఫోర్బ్స్ ఇండియా గణాంకాలు అన్ని మోసపూరితమైనవి. వారి మాగజైన్లో పేర్కొన్న ప్రతి ఒక్క సెలబ్రిటీల ఆదాయాన్ని నిరూపించాలి. మీకు తెలుసా.. కంగన ఈ జాబితాలో పేర్కొన్న ఆదాయం కంటే ఎక్కువగానే ట్యాక్స్ కడుతుంది. ఆదాయాన్ని ఏ ప్రాతిపదికన అంచనా వేశారో మాకు చూపించండి’ అంటూ ఫోర్బ్స్ ఇండియాకు ఆమె సవాలు విసిరిరారు. అదేవిధంగా ఈ విషయంలో సరైన రుజువులు చూపిస్తే తాను బహిరంగ క్షమాణలు అడగడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కోన్నారు. దీనిపై ఫోర్బ్స్ ఇండియా వేంటనే సమాధానం ఇవ్వాలంటూ రంగోలీ తన ట్విటర్లో రాసుకొచ్చారు. ‘ఈ ఏడాది కంగనా ఎంత ఆదాయాన్ని గడిచిందో తనకే తెలియదు. తన ఆదాయానికి సంబంధించిన ప్రతి విషయం నాకు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కు మాత్రమే తెలుసు. ఈ విషయం చాలా గోప్యంగా ఉంటుంది. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియక ముందే వారికి ఆదాయ వివరాలు ఎలా వచ్చాయ’ని ప్రశ్నించారు రంగోలీ. కాగా ఈ జాబితా ప్రకారం, బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్ ఈ సంవత్సరంలో రూ. 293.25 కోట్ల ఆదాయంతో 2వ స్థానంలో నిలిచి... గత మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్‌ను అధిగమించారు. అలాగే అలియా భట్ 8, దీపికా పదుకొనే 10వ స్థానంలో నిలిచి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. ఇక టాప్ 10లో ఉన్న మరో బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్ 6, రణవీర్ సింగ్ 7వ స్థానంలో ఉన్నారు. (సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్ కోహ్లి) -
సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్ కోహ్లి
ఫోర్బ్స్ ఎంటర్టైన్మెంట్ రంగంలో టాప్-100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా వారికున్న క్రేజ్‌ను బట్టి స్థానాలను కేటాయించినట్లు పేర్కొంది. ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్లను వెనక్కునెట్టి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారిగా బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్, దీపిక పదుకునే టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్‌ను వెనక్కునెట్టి కిలాడీ అక్షయ్ కుమార్(రూ.293.25 కోట్లు) రెండో స్థానం సంపాదించుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అగ్ర స్థానంలోనే కొనసాగుతూ వచ్చిన సల్మాన్‌ఖాన్(రూ.229.25కోట్లు) ఈ యేడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ బ్యూటీలు అలియా భట్, దీపిక పదుకునే 8, 10 స్థానాల్లో పాగా వేశారు. ‘కౌన్ బరేగా కరోడ్‌పతి’తో ప్రేక్షకులకు మరింత దగ్గరైన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రూ.239.25 కోట్లతో నాలుగో తర్వాతి స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. గతేడాది ఈ జాబితాలో పేరు కానరాని డార్లింగ్ ప్రభాస్(రూ.35 కోట్లు) ఈ సారి ఏకంగా 44వ స్థానంలో ఉన్నాడు. నిరుడు 33వ స్థానంలో ఉన్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు(రూ.35 కోట్లు) 54వ స్థానానికి పరిమితమయ్యారు. తొలిసారిగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్(రూ.21.5 కోట్లు) 77వ స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఈ యేడు సెలబ్రిటీల ఆదాయం 22 శాతం పెరిగినట్టుగా ఫోర్బ్స్ వెల్లడించింది. -
ఈ బుడతడి సంపాదన రూ. 26 విలియన్ డాలర్లు?!
ఆడుకుంటున్న వయసులోనే ఓ బాలుడు కోట్లు గడిస్తూ సంపన్నుల జాబితాలో చేరాడు. యూట్యూబ్‌లో తన పేరు మీద ఉన్న ఛానల్ ద్వారా అత్యధిక సంపాదన కలిగిన యూట్యూబర్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇక తను ఆడుకునే వీడియోలను షేర్ చేస్తూ.. దాదాపు 26 మిలియన్ల డాలర్లు సంపాదించి ఈ ఘనత సాధించాడు. టెక్సాస్‌కు చెందిన ఈ బాలుడి పేరు ర్యాన్ కాజి. తన పేరు మీద అతని తల్లిదండ్రులు ‘ర్యాన్ వరల్డ్’ అనే చానెల్‌ను 2015లో క్రియేట్ చేశారు. ర్యాన్ ఆడుకుంటున్న వీడియోలను ఈ చానెల్లో షేర్ చేసేవారు. ఈ చానెల్ స్థాపించిన మూడు సంవత్సరాలకే 22.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. అయితే మొదట్లో ర్యాన్ వీడియోస్ అంతగా ఆదరణ ఉండేది కాదట. అయితే ఓ సారి ఈ బాలుడు ‘ర్యాన్ ఫిక్సర్’ అనే కారు బొమ్మకు రివ్యూ చెప్పాడు. ఆ వీడియో బాగా వైరల్ కావడంతో ర్యాన్ సెలబ్రిటీగా మారిపోయాడు. అలాగే మరిన్ని కారు బొమ్మలకు రివ్యూలు చెప్పడం మొదలు పెట్టాడు. తద్వారా నెటిజన్ల ఆదరణతో పాటు వివిధ బొమ్మల కంపెనీల నుంచి ఆఫర్లు అందకున్నాడు. అలా ‘ర్యాన్ వరల్డ్’గా ఉన్న ఈ ఛానల్‌ను ‘ర్యాన్ టాయ్ రివ్యూ’ అనే పేరుగా మార్చారు. ఈ క్రమంలో ర్యాన్ ఒక్కో వీడియోకు కనీసం బిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఈ బాలుడు ఏకంగా రూ. 26 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇక ర్యాన్ ఛానల్‌కు, వీడియోస్‌కు వస్తున్న పాపులారిటీ దృష్ట్యా బొమ్మల వీడియోలతో పాటు, చదువుకు సంబంధించిన వీడియోలు కూడా చేయాలంటూ ప్రతిపాదనలు కూడా రావడం విశేషం. -
నిర్మలా శక్తి రామన్!
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేయగా.. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిస్థాయి బాధ్యతలు వహిస్తూ దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో సత్తా చాటుతోన్న నిర్మలా సీతారామన్ ప్రతిభకు నిదర్శనంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది. ఇక మన దేశం నుంచి మరో ఇద్దరు మహిళలకు ఈ జాబితాలో స్థానం లభించింది. హెచ్‌సీఎల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్, సీఈఓ రోష్ని నాడార్ మల్హోత్రా 54వ స్థానంలో నిలిచారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందార్ షా బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్‌పర్సన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నికర సంపద రూ.310 కోట్ల అమెరికా డాలర్లు (2019). దేశంలోనే అతిపెద్ద బయోఫార్మాసూటికల్ కంపెనీ ఏర్పాటుచేసి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక రోష్ని నాడార్ విషయానికొస్తే, ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ (2019) ప్రకారం, భారత్‌లోనే అత్యంత మహిళా సంపన్నురాలు. అగ్రస్థానంలో ఏంజెలా మెర్కల్ ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలోనూ జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్ టాప్‌లో నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూనే ఉన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీనా లగార్డ్ రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్ నాన్సీ పెలోసీ మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్(4 వ ర్యాంకు), జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా(5) బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(29), అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్(42) ఉన్నారు. కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 23 మందిలో పర్యావరణ పరిక్షణకోసం గళమెత్తిన స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థంబర్గ్ కూడా ఉన్నారు. ఆమె 100వ స్థానంలో నిలిచారు. -
ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ హవా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు దక్కించుకున్న ఆమో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఈ లిస్ట్‌లో క్వీన్ ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె,సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా వెనక్కి నెట్టి ముందుకు దూసుకొచ్చారు. న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ కంటే నిర్మలా సీతారామన్ ముందున్నారు. 'ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలో 34 వ ర్యాంకులో నిలిచారు. క్వీన్ ఎలిజబెత్-2 15 పాయింట్లు క్షీణించి 38వ స్థానం, ఇవాంకా ట్రంప్ 18 ర్యాంకులు పడిపోయి 42 వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ మహిళల్లో రోష్ని నాదర్ మల్హోత్రా, 54 వ స్థానంలో నిలవగా, కిరణ్ మజుందార్ షా 65 వ స్థానంలో ఉన్నారు. 61 వ స్థానంలో రిహానా, 66 వ స్థానంలో బెయోన్స్ నోలెస్, 71 వ స్థానంలో టేలర్ స్విఫ్ట్, 81 వ స్థానంలో సెరెనా విలియమ్స్, 90 వ స్థానంలో రీస్ విథర్స్ స్పూన్, స్వీడిష్బాలిక గ్రెటా థన్‌బెర్గ్ 100 వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ వరుసగా తొమ్మిదిసారి కూడా ఈ జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ (2), నాన్సీ పెలోసి (3), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (4), జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బార్రా (5) మేరీ బార్రా (5), మెలిండా గేట్స్, అబిగైల్ జాన్సన్, అనా ప్యాట్రిసియా బోటిన్, గిన్ని రోమెట్టి, మారిలిన్ హ్యూసన్ మిగిలిన టాప్ 5 స్థానాలను దక్కించుకున్నారు. -
ఫోర్బ్స్ టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని ‘రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్’ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్ పేర్కొంది. గురువారం ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,01,555 కోట్లకు చేరి.. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా నిలవటం తెలిసిందే. కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో రూ.1,580 చేరిన నేపథ్యంలో ప్రమోటర్ సంపద అమాంతం పెరిగిపోయింది. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ.. ఈసారి ఏకంగా టాప్–10లోకి చేరి... ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్ డాలర్లు... అంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిలిచారు. -
రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
వాషింగ్టన్: హాంకాంగ్‌కు చెందిన ఓ 24ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించాడు. వివరాల్లోకి వెళ్తే సైనో బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీ పింగ్, చేంగ్ లింగ్ చెంగ్‌ల కుమారుడు ఎరిక్ త్సేకు కంపెనీలో ఐదవ వంతు మూలదన షేర్లను అంటే సుమారు 3.8బిలియన్ డాలర్ల రూపాయలు లభించాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫోర్బ్స్ ప్రకటించిన 550 అత్యంత ధనవంతుల జాబితాలో చోటు లభించడం విశేషం. అయితే, సంపన్న జాబితాలో ఇతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రఖ్యాత దర్శకుడు స్పీల్‌బర్గ్‌ల కంటే కూడా ముందు వరుసలోకి వచ్చేశాడు. ఎరిక్ త్సే సయోటల్‌లో జన్మించాడు. తన విద్యాభ్యాసాన్ని బీజింగ్, హాంగ్‌కాంగ్‌లో పూర్తి చేశాడు. ఇతడికి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కమిటీలో చోటు లభించింది. కాగా, సంవత్సరానికి ఐదు లక్షల డాలర్లను బోనస్‌గా పొందనుండడం విశేషం. మరోవైపు ఎరిక్ త్సేకు కుబేరుల జాబితా పట్ల పెద్దగా ఆసక్తి లేదట. -
ఫోర్బ్స్ అత్యుత్త్తమ జాబితాలో 17 భారత కంపెనీలు
న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్ బెస్ట్ రిగార్డెడ్ కంపెనీస్’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలి్చతే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్ (105), ఎల్ అండ్ టీ(115), మహీంద్రా అండ్ మహీంద్రా (117), హెచ్డీఎఫ్సీ (135), బజాజ్ ఫిన్సర్వ్ (143), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (149), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (153) ), హెచ్‌సీఎల్ టెక్ (155), హిందాల్కో (157), విప్రో (168), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (204), సన్ ఫార్మా (217), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (224), ఐటీసీ (231), ఏషియన్ పెయింట్స్ (248) స్థానాల్లో నిలిచాయి. జాబితాలో అత్యధిక స్థానాలను అమెరికా కైవసం చేసుకుంది. మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా, ఇందులో 59 యూఎస్ కంపెనీలే. ఇక అంతర్జాతీయ చెల్లింపుల సాంకేతిక సంస్థ వీసా టాప్‌లో.. ఇటాలియన్ కార్ల దిగ్గజం ఫెరారీ రెండవ స్థానంలో నిలిచాయి.