Mohan Babu
-
చట్టం ముందు అందరూ సమానులే: డీజీపీ జితేందర్
కరీంనగర్ క్రైం: చట్టం ముందు అందరూ సాధారణ పౌరులేనని, నటులు అల్లు అర్జున్, మోహన్‌బాబు కూడా ఇందుకు అతీతులు కారని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ము న్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన మహిళా భద్రతా విభాగం డీఐజీ రెమా రాజేశ్వరితో కలసి ప్రారంభించారు. భరోసా కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చట్టం దృష్టిలో అల్లు అర్జున్ అయినా, మోహన్‌బాబు అయినా.. ఇతరత్రా ఎవరైనా అందరూ సమానులేనని, తప్పు చేస్తే ఎలాంటి తారతమ్యాలు లేకుండా చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు. మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.బాలికలు, మహిళల భ ద్రత కోసం ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలోని 23 ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించామని వివరించారు. ఈ కేంద్రాలు కేవలం తెలంగాణలోనే ఉన్నా యని, వీటి పనితీరును సుప్రీంకోర్టు కూడా అభినందించిందని గుర్తు చేశారు. ఈ కేంద్రాలు పోక్సో కేసుల దర్యాప్తులో సహాయపడతాయని, నిందితులకు శిక్ష పడే శాతాన్ని పెంచుతాయని డీజీపీ చెప్పారు. బాధితులు, మద్దతుదారులకు భద్రత కలి్పంచడంతోపాటు సాక్ష్యాలను సేకరించి కోర్టులో నిందితులకు శిక్ష పడేలా ఈ కేంద్రాలు కృషి చేస్తాయన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా పనిచేస్తుందని అన్నారు. ఎఫ్ఐఆర్ మొదలు.. తుది పరిష్కారం వరకు భరోసా కేంద్రం బాధితులకు బాసటగా నిలుస్తుందన్నారు. కాగా, కరీంనగర్ భరోసా కేంద్రంలో నియామకాలు చేపట్టామని, ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సీపీ అభిõÙక్ మహంతి, శిక్షణ ఐపీఎస్ వసుంధరాయాదవ్, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, భరోసా కేంద్రం ఏసీపీ మాధవి, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.బౌన్సర్లూ.. హద్దు దాటొద్దుతెలంగాణ పోలీసుల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: సినిమా తారలు, ఇతర ప్రముఖులకు రక్షణగా ఉండే బౌన్సర్లు, ప్రైవే టు బాడీగార్డులు.. చట్టాన్ని అతిక్రమిస్తే చర్య లు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బౌన్సర్లు, బాడీగార్డుల పేరిట.. చట్టానికి వ్యతిరేకంగా ఇతరులపై దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతోపాటు జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి బౌన్సర్లు, బాడీగార్డులు, వీరిని సమకూర్చే సంస్థలు ప్రభుత్వ, పోలీస్ నిబంధనలకు లోబ డి చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ పెట్టారు. -
మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవనే దీనికి కారణం. ఈ వివాదంలో బోలెడన్ని టర్న్స్, ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తండ్రి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే రూమర్స్, పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం.. మధ్యలో ఊహించని విధంగా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి, ఆపై పోలీసు కేసు.. ఇది కాదన్నట్లు అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరి, కొన్నిరోజులకు డిశ్చార్జ్ కావడం.. ఇలా ఒకటేమిటి ఇండస్ట్రీ మొత్తం ఈ వివాదం గురించే చర్చించుకున్నారు. ప్రస్తుతానికి ఇది కాస్త సద్దుమణిగినట్లే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు ఓవైపు నడుస్తోంది. మరోవైపు తన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్స్‌ని గూగూల్, సోషల్ మీడియాలో ఉపయోగించద్దని ఢిల్లీ హైకోర్ట్‌లో ఈయన పిటిషన్ వేశారు. దీనికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. మోహన్ బాబు కంటెంట్‌ని గూగుల్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో మంచు ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్.. గూగుల్ నుంచి డిలీట్ అవుతాయి.(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో) -
నా మిత్రుడు చిరంజీవితో నటించడం మరిచిపోలేనిది: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇటీవల వరుసగా ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. గతంలో నటించిన తన ఫిల్మోగ్రఫీలోని సినిమాలను రోజు ఒకటి గుర్తు చేసుకుంటున్నారు. వాటిలో సూపర్ హిట్ చిత్రాలతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇవాళ పట్న వచ్చిన ప్రతివ్రతలు సినిమా గురించి తన అనుభవాన్ని పోస్ట్ చేశారు.1982లో నటించిన పట్నం వచ్చిన ప్రతివ్రతలు సినిమాకు నా ప్రయాణంలో ప్రత్యేకమైన స్థానం ఉందని మోహన్ బాబు అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మౌలీ తన పాత్రను అద్బుతంగా తీర్చి దిద్దారని కొనియాడారు. అంతేకాకుండా నా మిత్రుడు చిరంజీవితో అన్నదమ్ములుగా నటించడం నా కెరీర్లోనే మరిచిపోలేని పాత్ర అని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని చిత్రాల్లో పట్నం వచ్చిన ప్రతివ్రతలు కచ్చితంగా ఉంటుందని మోహన్ బాబు ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Patnam Vachina Pativrathalu (1982) holds a special place in my journey. Directed by the talented Sri. Moulee, I truly cherished portraying my role, especially sharing the screen with my dear friend, Sri. Chiranjeevi, as brothers. This movie remains one of the most unforgettable… pic.twitter.com/fBU68OVpR9— Mohan Babu M (@themohanbabu) December 20, 2024 -
మోహన్ బాబుకు దక్కని ఊరట.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు!
తెలంగాణ హైకోర్టులో సినీనటుడు మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.మోహన్‌బాబు పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్తున్నారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదంటూ మోహన్ బాబు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది.అసలేం జరిగిందంటే..మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్‌కు మధ్య వివాదం తలెత్తింది. జల్పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియా తీసుకుని ఆ ఇంటివద్దకు వెళ్లారు. అదే సమయంలో సెక్యూరిటీ మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే మనోజ్ గేటు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న మోహన్‌బాబును ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన ఆగ్రహాని గురయ్యారు. అతని మైక్‌తోనే మీడియా ప్రతినిధిని కొట్టారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇవాళ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. -
విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు : నిర్మల మోహన్ బాబు
-
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. -
Mohan babu: గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు
-
కేక్ వంకతో విష్ణు ఇంట్లోకి వచ్చారు: మనోజ్
-
జర్నలిస్ట్ రంజిత్‌కు మోహన్ బాబు పరామర్శ (ఫొటోలు)
-
జర్నలిస్ట్‌పై దాడి.. రంజిత్‌కు మోహన్‌బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
నేను ఎక్కడికి పారిపోలేదు.. మోహన్ బాబు ట్వీట్
-
Mohan Babu: గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును కోరిన పోలీసులు
-
మోహన్ బాబుకు మరోసారి బైండోవర్ నోటీసులు
-
మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ట్వీట్ వైరల్
ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మూడు రోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో ఈయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బాధితుడికి క్షమాపణ చెప్పినప్పటికీ.. కేసు ఇంకా న్యాయస్థానంలో ఉంది. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం ఈయన హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టేసింది. అప్పటినుంచి మోహన్ బాబు.. పోలీసులకు కనిపించకుండా పోయాడని న్యూస్ వస్తోంది. వీటిపై ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు.ఈ హంగామా అంతా నడుస్తున్న టైంలో మోహన్ బాబు ఇప్పుడు ట్వీట్ చేశాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)అయితే మోహన్ బాబు స్టేట్మెంట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. ఈయన అందుబాటులో లేకుండా పోయాడని న్యూస్ వచ్చింది. దీంతో ఐదు బృందాలుగా ఏర్పడి.. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడులో పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. ఇప్పుడు మోహన్ బాబు స్వయంగా ట్వీట్ చేయడంతో రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టినట్లయింది.మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం చాలా హంగామా నడిచింది. అయితే విషయం తెలుసుకుందామని మీడియా వాళ్లు.. మోహన్ బాబు ఇంటికి వెళ్లగా ఒకరిపై ఈయన మైకుతో దాడి చేశాడు. దీంతో హత్యాయత్నం కేసు పెట్టారు. (ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)False propaganda is being circulated.! Anticipatory bail has NOT been rejected and currently. I am under medical care in my home. I request the media to get the facts right.— Mohan Babu M (@themohanbabu) December 14, 2024 -
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుపై సినీ నటుడు మంచు మోహన్‌బాబు దాడి చేసిన కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి (19వ తేదీ)వాయిదా వేసింది. తన కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారమే కేసు నమోదైనప్పటికీ న్యాయ సలహాలు తీసుకున్న పోలీసులు, గురువారం బీఎన్ఎస్ 109 (హత్యాయత్నం) సెక్షన్ జోడించారు.కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జర్నలిస్ట్లమంటూ చాలామంది ఇంట్లోకి తోసుకొచ్చారని, ఈ క్రమంలో అనుకోకుండా దాడి జరిగింది తప్ప కావాలని చేసింది కాదని చెప్పారు. ఏపీపీ జితేందర్‌రావు వాదనలు వినిపిస్తూ..మోహన్‌బాబు కుమారుడు మనోజ్ ఆహ్వానం మేరకే వారు వచ్చారని చెప్పారు. చానల్ లోగోతో కొట్టడంతో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. -
హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. !
టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా.. ఇటీవల జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి చేశారంటూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)ఈ ఘటనపై మోహన్‌బాబు మీడియాను క్షమాపణలు కోరారు. తాను చేసిన పనికి ఎంతో బాధపడుతున్నానని ఆడియో సందేశం కూడా విడుదల చేశారు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టి రావడం న్యాయమేనా? అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు.హైకోర్టులో మోహన్ బాబుకు షాక్..టాలీవుడ్ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో ఎలాంటి దర్యాప్తు, అరెస్ట్ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు. తాజాగా ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
ప్రముఖ నటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈయన కుటుంబంలో ఆస్తి విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఆ తర్వాత తండ్రి ఇంటికెళ్లిన మనోజ్.. గేట్లు బద్ధలు కొట్టుకుని లోపలికెళ్లాడు. అయితే రీసెంట్గా మోహన్ బాబు ఇంటి దగ్గరకెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై ఈయన దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సి పొందిన మోహన్ బాబు.. గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై క్షమాపణ చెప్పారు. తాను ఈ విషయమై పశ్చాత్తాప పడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ లెటర్ రిలీజ్ చేశారు. దాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)'అనారోగ్య కారణాల దృష్ట్యా.. ఈ సంఘటనపై తక్షణమే స్పందించలేకపోయాను. ఆ టైంలో నా ఇంటి గేటు విరిగిపోయింది. 30-50 మంది మనుషులు తోసుకుంటూ లోపలికి వచ్చేశారు. నేను నియంత్రణ కోల్పోయాను. ఇదంతా జరుగుతున్న టైంలో మీడియా అక్కడికొచ్చింది. అప్పటికే నేను అలసిపోయి ఉన్నాను. దీంతో అనుకోని పరిస్థితుల్లో మీడియా ప్రతినిధికి నా వల్ల గాయమైంది. ఈ విషయమై పశ్చాత్తపడుతున్నాను. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన ఇబ్బందికి తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మోహన్ బాబు ఆడియో సందేశం ఒకటి రిలీజ్ చేశాడు. మీడియాపై దాడి జరిగినందుకు ఎంతో చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని, తన కొడుకులతో కలిసి సమస్యని తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ')pic.twitter.com/PxcuHTxzbB— Mohan Babu M (@themohanbabu) December 13, 2024 -
మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై 3 కేసులు : సీపీ సుధీర్ బాబు
-
అలా చేయాల్సిన అవసరం నాకు లేదు: మోహన్ బాబు సంచలన కామెంట్స్
ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన మోహన్ బాబు మరో ఆడియో సందేశం రిలీజ్ చేశారు. ఈ ఘటన జరిగినందుకు తాను ఎంతో చింతిస్తున్నట్లు ఆడియో సందేశమిచ్చారు. మొదట తాను నమస్కారం పెట్టానని.. అయినప్పటికీ అతను మైక్ పెట్టాడని అన్నారు. జర్నలిస్టును కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. మీడియాపై దాడి ఘటనపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు.నా కన్నుకు మైక్ తగలబోయిందని.. తృటిలో తప్పించుకున్నానని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా మీడియా ప్రతినిధులపై దాడి చేయాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదన్నారు. నా ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం న్యాయమేనా?అని ప్రశ్నించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? అనేది ప్రజలు, నాయకులు ఆలోచించాలని మోహన్ బాబు కోరారు.(ఇది చదవండి: ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్)నా ఇంట్లోకి వచ్చింది మీడియా వాళ్లు అవునో, కాదో తనకు తెలియదని మోహన్ బాబు చెప్పారు. నా ఇంటి లోపలికి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని అన్నారు. ఆవేశంలో తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని.. ఈ ఘటనకు బాధపడుతున్నానని వివరించారు. జర్నలిస్టును కొట్టాలని ఆ దేవుడి సాక్షిగా తాను అనుకోలేదని మోహన్ బాబు వెల్లడించారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని.. నా పిల్లలతో కలిసి తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.పోలీసులపై సంచలన వ్యాఖ్యలు..పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. పోలీసుల ప్రవర్తనను ప్రజలంతా గమనించాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎవరి కుటుంబంలోనైనా ఇలాంటి గొడవలు సహజమేనని ఆడియో సందేశంలో మాట్లాడారు. -
మోహన్ బాబు కొత్త ఆడియో విడుదల
-
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్
-
మంచు ఫ్యామిలీ వివాదం లేటెస్ట్ న్యూస్
-
రాష్ట్రంలో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్: రాచకొండ సీపీ
మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వివాదంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. దీంతో పాటు మనోజ్‌ను ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీపీ వివరించారు. ఆయన నుంచి లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ తీసుకున్నామని పేర్కొన్నారు.మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు బౌన్సర్లు గొడవ పడటమే వివాదానికి కారణమని సీపీ అన్నారు.బైండోవర్ అంటే ఏంటో తెలుసా?ఎవరి వల్ల అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఆ వ్యక్తిని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయనని బాండ్ పేపర్‌పై అతనితో లిఖితపూర్వకంగా సంతకం తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండ్ ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్ సమయంలో చేసిన డిపాజిట్ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీషీట్ తెరవొచ్చు. -
ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద గొడవ జరిగిన అనంతరం అస్వస్థతకు గురైన మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకున్న మోహన్ బాబు ఇవాళ ఇంటికి వెళ్లారు. అయితే వారం రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం చివరికీ పోలీసుల వద్దకు చేరింది. మంచు మనోజ్, మోహన్‌బాబు మధ్య గొడవకు దారితీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు రిలీజ్ చేశారు.(ఇది చదవండి: హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!)అంతేకాకుండా ఈ విషయంపై మంచు విష్ణు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ గొడవని.. ఎవరి కుటుంబాల్లోనైనా సాధారణంగా ఉండేవని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని వెల్లడించారు. ఈ వివాదంపై రాచకొండ సీపీ ఎదుట మంచు విష్ణు, మనోజ్ హాజరై జరిగిందంతా వివరించారు. తన వైపు ఎలాంటి గొడవ జరగదని సీపీకి మంచు మనోజ్ హామీ ఇచ్చారు.