vishnu kumar raju
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆగ్రహం
-
మీ ఆశకు అంతుండాలి.. స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఫైర్
విశాఖ, సాక్షి : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని బీజేపీ నేతలు అవమానిస్తున్నారు. మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీపై కార్మికుల ఆశకు అంతుండాలి. అర్థం పర్థం లేకుండా యూనియన్ నేతలు మాట్లాడుతున్నారు. కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడడం సరికాదు. మీకు ఇష్టమైతే ఉండండి లేదా రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ మండిపడ్డారు. అంతకు ముందు కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు కంటితుడుపు చర్యగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో కూుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు. తాజాగా, ఎమ్మెల్యే విష్ణుకుమార్ సైతం అవమానించేలా మాట్లాడడం స్టీల్ ఫ్లాంట్ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీ ఎమ్మెల్యే చిల్లర మాటలు చంద్రబాబు పిచ్చి నవ్వులు..
-
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'గ్లాస్ గుచ్చుకుంది'..!
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు గ్లాసు గుర్తు గట్టిగానే గుచ్చుకుంటోందట. ఇప్పటికే జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన ఓట్లనే చీల్చుతారని తెగ ఇదైపోతున్నారట. దీనికి గ్లాసు గుర్తు తోడు కావడంతో భయపడ్డ ఆయన, గ్లాస్ గుర్తు దక్కిన స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి మరీ బతిమాలుకున్నారట.తను గెలిచాక అధిక మొత్తం ముట్టజెప్తానని హామీ ఇచ్చారట. అయి తే 2014లో ఆయన తీరు గుర్తుకొచ్చి తక్షణ బేరం మాట్లాడుకున్నారట. కాస్త ‘భారీ’స్థాయిలో బతిమాలుకున్నాకే ఆ అభ్యర్థి వెనక్కి తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి పరువు తప్ప, అధికారం మాత్రం దక్కదన్న నమ్మకానికొచ్చేశారట..!ఇవి చదవండి: 'పులుసు కారుతోంది'..! -
విష్ణుకుమారుడి బెదిరింపులు!
సాక్షి, విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్‌రాజుకు ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఆయన బెదిరింపులకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తన గెలుపు కోసమే పనిచేయాలన్న భావనతో ఆయన ఉన్నారు. అలా ఎవరైనా తన ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిస్తే ఆయన సహించలేక పోతున్నారు. ఆయా సంస్థల యజమానులకు ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. ‘మీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఫలానా వ్యక్తి నా ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. ఆయన ప్రత్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొనవద్దని చెప్పండి.. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారని తెలిసింది. ఇలా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి యజమానికి ఫోన్ చేసి ఇలానే బెదిరింపులకు దిగడంతో సదరు యజమాని ‘మా ఆస్పత్రి పని వేళలు ముగిశాక ఆయన ఏం చేసుకున్నా ఆయన వ్యక్తిగతం.. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు..’ అని ఖరాఖండీగా చెప్పారని సమాచారం. దీంతో చేసేది లేక విష్ణుకుమార్‌రాజు అసహనంతో ఫోన్ పెట్టేసినట్టు తెలిసింది. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తున్న మరో వ్యక్తి గురించి కూడా సంబంధిత యజమానికి ఫోన్ చేసి ఇదే తరహాలో హెచ్చరించినట్టు చెబుతున్నారు. ఆ యజమాని కూడా గట్టిగానే సమాధానం చెప్పడంతో విష్ణుకుమార్‌రాజు మిన్నకుండి పోయినట్టు భోగట్టా. ఇలా విష్ణుకుమార్‌రాజు పలువురి పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని, తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయనతో నిత్యం ప్రచారంలో తిరిగే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బతిమలాడుకునో, బుజ్జగించుకునో, కాళ్లా వేళ్లాబడో ఓట్లు వేయించుకోవడం పరిపాటి. కానీ విష్ణుకుమార్‌రాజు మాత్రం అందుకు భిన్నంగా బెదిరింపులకు పాల్పడడమేమిటని ఉత్తర నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. ఓటమి భయంతోనే ఆయన ఇలా అసహనానికి గురవుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.2019లో పోలైనవి 18,790 ఓట్లే..విష్ణుకుమార్‌రాజు 2014 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. ఆ తర్వాత 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 18,790 ఓట్లే పోలై నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకే రాజుకు 65,408 ఓట్లు, జనసేన అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్‌కు 19,139 ఓట్లు లభించాయి. ఈ లెక్కన కేకే రాజుకంటే 46,618 ఓట్లు, ఉషాకిరణ్కంటే 349 ఓట్లు తక్కువ వచ్చాయి.వివాదాల రాజువిష్ణుకుమార్రాజుకు వివాదాస్పదుడన్న పేరు సొంత పారీ్టలోనే ఉంది. ఎప్పుడు ఎవరిని పొగడ్తలతో ముంచెత్తుతారో, ఎవరిని విమర్శిస్తారో ఆయనకే తెలియదన్న పేరు గడించారు. గతంలో ఏపీ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నానని, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్టు పెనుమత్స పేర్కొనడం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. దీనిపై సీరియస్ అయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బెదిరింపులకు దిగడాన్ని ఆ పార్టీ శ్రేణులు సైతం తప్పు పడుతున్నారు. తన గెలుపు కోసం విష్ణుకుమార్‌రాజు ఏటికి ఎదురీదే పరిస్థితులున్నందునే ఆయన అసహనానికి కారణమని చెబుతున్నారు. -
విష్ణుకుమార్ వ్యాఖ్యలపై మండిపడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళ కార్యకర్తలు
-
వివాదాల విష్ణుకుమార్ రాజు.. మాటలు ఎప్పుడు కోటలు దాటాల్సిందేనా?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పారీ్టలోనూ, అటు ఇతర పారీ్టల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు సాక్షాత్తూ సొంత పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నాను అనడం, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్లు పేర్కొనడం వంటివి అధిష్టానం సీరియస్ అవడానికి కారణమయ్యాయి. దీంతో ఆయనకు రాష్ట్ర పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది. ఎందుకు మీపై చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇది పారీ్టలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆ కుతూహలం వల్లే..? : ఇప్పటికే విష్ణుకుమార్‌రాజు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. టీడీపీకి చేరువ కావడం ద్వారా ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న కుతూహలం ఆయనకు ఎప్పట్నుంచో ఉందని బీజేపీలోనే పలువురు చర్చించుకుంటున్నారు. అదే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ వ్యతిరేకమన్న విషయం తెలిసి కూడా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విష్ణుకుమార్‌రాజు అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా అధిష్టానానికి రుచించలేదని అంటున్నారు. షోకాజ్ నోటీసు జారీ : ఒకపక్క పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతుండడం, టీడీపీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం, మరోపక్క తాజాగా టీవీ ఇంటర్వ్యూలో పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వెరసి అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై విష్ణుకుమార్‌రాజు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. టీవీ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటి పరిస్థితులకనుగుణంగా చేసినవి కావని, 2019 ఎన్నికలకు ముందు మోదీ చేసినవని అందులో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని ఇతర పార్టీల నాయకులకంటే సొంత బీజేపీ నాయకులే ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. పార్టీ నేతల్లోనూ అసంతృప్తే.. విష్ణుకుమార్‌రాజు వైఖరిపై బీజేపీలోని కొంతమంది ముఖ్య నాయకులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై లోలోన సంతోస్తున్నారు. గతంలో పార్టీని బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో తనకు టీడీపీ, మరికొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నానంటూ ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీలో కీలక పదవిలో ఉంటూ ఇలా తరచూ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విష్ణుకుమార్‌రాజుపై తాజా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ వ్యాఖ్యల నేపథ్యంలోనైనా చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. విష్ణుకుమార్‌రాజుపై చర్యలుంటాయా? షోకాజ్తోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాలి. -
జీఐఎస్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం జగన్ కృషి - విష్ణుకుమార్ రాజు
-
ప్రధాని రోడ్డు షో సక్సెస్: సోము వీర్రాజు
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు షో విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖలో శనివారం ప్రధాని బహిరంగ సభ అనంతరం వీర్రాజు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ప్రధాని రోడ్డు షోను విజయవంతం చేసిన ఇన్చార్జిలు, వివిధ విభాగాల బాధ్యులను ఆయన అభినందించారు. ప్రధాని మోదీతో కోర్ కమిటీ సమావేశంలో జరిగిన చర్చ, రాజకీయ అంశాల ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతిపై నేతలతో ఆయన చర్చించారు. వివిధ అంశాలపై వీర్రాజు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఏపీ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదు: విష్ణుకుమార్ రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి భారీ బహిరంగ సభ జరగలేదని, ఇకపై జరగబోదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సభని అత్యద్భుతంగా విజయవంతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ప్రధాని సభ అత్యద్భుతం: జీవీఎల్ నరసింహారావు మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖలో ప్రధాని సభ అత్యద్భుతంగా జరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని విశాఖ పర్యటన విజయవంతమైందని.. ఊహించిన దానికంటే ప్రజలు అత్యధికంగా హాజరవడంతో ఏయూ గ్రౌండ్ కిక్కిరిసిపోయిందన్నారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ వేలాది మంది సభ బయట ఉండిపోయారని, ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సభాస్థలికి రాలేకపోయారన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన గురించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. -
చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: విష్ణుకుమార్ రాజు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సభ జరగలేదని.. భవిష్యత్తులోనూ జరగబోదని విశాఖ పట్నం సభను ఉద్దేశించి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు. సభను విజయవంతం చేసిన సీఎం జగన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారంటూ ప్రశంసించారు. చదవండి: (పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?!) -
టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్దారు
-
విశాఖలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నా
-
చట్టాల్లో మార్పులు రావాలి:విష్ణుకుమార్ రాజు
సాక్షి, విశాఖపట్నం: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చట్టాల్లో మార్పులు రావాలని, మహిళలపై దారుణాలకు పాల్పడే వారిని పబ్లిక్‌గ్గా ఉరితీసే చట్టంతో పాటు, పబ్లిక్‌గా షూట్ చేసే చట్టం కూడా రావాలన్నారు. రెండు నెలల్లో ఇలాంటి కేసులను క్లోజ్ చేసేలా చట్టం రూపొందించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, డే టూడే గానో కాలపరిమితి విధించి రెండు నెలల్లో నిందితులను ఉరితీసే విధంగా చట్టం చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. (చదవండి: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి: చిరంజీవి) -
సిట్‌ను ఆశ్రయించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మధురవాడలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ గురువారం బీజపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సిట్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఆశ్రయించి కబ్జాదారులు భూములను మింగేస్తున్నారని ఆరోపించారు. సిట్ ద్వారా ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములపై కూడా విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ల్యాండ్ పూలింగ్ రద్దును స్వాగతించిన బీజేపీ నేత
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. జీవో రద్దు చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల విశాఖపట్నంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విష్ణుకుమార్ ఆరోపించారు. ఈ విధానం వల్ల అక్రమార్కులు లాభపడ్డారు కానీ రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేని వారికి ఇంటిని నిర్మించి ఇవ్వడానికి కొత్త విధానం తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయడం అభినందనీయమన్నారు. -
ల్యాండ్ పూలింగ్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు
-
‘టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలి’
సాక్షి, అమరావతి : బీజేపీ సంఘటనా పర్వ్ 2019 సభ్యత నమోదు కార్యక్రమాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్రాజు ఆదివారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని కొనియాడారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్ నివేదిక బహిర్గతం చేయాలని అందులో ఉన్న పచ్చపాములు బండారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. -
బ్యాగ్ లేకుండా బడికి పంపడం అభినందనీయం: బీజేపీ
విశాఖపట్నం: వారంలో ఒక్క రోజు బ్యాగ్ లేకుండా విద్యార్థులను బడికి పంపడం అభినందనీయమని, అలాగే పోలీస్ శాఖలో ఒక్క రోజు సెలవు ఇవ్వడం మంచి విధానమని బీజేపీ మాజీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. ఇసుకపై ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామన్న కొత్త విధానం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కానీ విధానం ఇంకా అమల్లోకి రాకముందే ఇసుక రవాణా జరిగితే..పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక మాఫియాపై గత టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని వెల్లడించారు. బీజేపీపై అక్రమంగా బురద జల్లడం వల్లే ఏపీలో టీడీపీ నామరూపాలు లేకుండా పోయిందని తూర్పారబట్టారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం తప్పదని 2019 ఎన్నికల ద్వారా రుజువైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటనలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. -
ఢిల్లీ వచ్చి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వృథా
-
సైకిల్ పంక్చర్.. గంటా స్థానమదే..!
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని.. సైకిల్ పంక్చర్ అయిందని బీజేపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. గంటా శ్రీనివాసరావు కబ్జా దాహానికి నియోజవర్గంలో కొండలు, గుట్టలు మాత్రమే మిగిలాయని చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడ్డానని తనపై వచ్చిన ఆరోపణలకు విష్ణుకుమార్ రాజు ఖండించారు. నియోజకవర్గంలో కొందరు పచ్చనేతలు తనపై బురద జల్లుతున్నారని, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ నార్త్ బీజేపీ క్యాడర్లో కొంతమందిని లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎన్ని చేసినా ఇక్కడ గంటా మూడో స్థానంలోనే ఉంటారని జోస్యం చెప్పారు. -
మీడియా ముందు పరువు తీస్తారు, రాను: గంటా
సాక్షి, విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం వైజాగ్ జర్నలిస్టు ఫోరమ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం అభ్యర్థుల ముఖాముఖికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఉంటే తాను రానని, మీడియా ముందు తన పరువు తీస్తారంటూ మంత్రి గంటా ముఖం చాటేశారు. ఈ మేరకు ఆయన వీజేఎఫ్ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. కాగా విశాఖ నార్త్ నుంచి వైఎస్సార్ సీపీ నుంచి కేకే రాజు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు, ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థిగా పి. ఉషాకిరణ్, కాంగ్రెస్ అభ్యర్థిగా గోవిందరాజు బరిలో ఉన్న విషయం తెలిసిందే. వీజేఎఫ్ ముఖాముఖికి మిగతా వారంతా హాజరు కాగా, ఒక్క గంటా శ్రీనివాసరావు మాత్రం గైర్హజరు కావడం విశేషం. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. గంటా ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కాకపోవడం నియోజకవర్గ ప్రజలను, వీజేఎఫ్ను అవమానపరచడమే అని అన్నారు. ఏపీలో బీజేపీది ఎప్పుడు ప్రతిపక్ష పాత్రేనన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కాగా గంటా శ్రీనివాసరావు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో నెంబర్‌వన్ అని, ఓటును రూ.10వేలకు కొంటున్నారంటూ ....విష్ణుకుమార్ రాజు ఇప్పటికే ఘాటు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి మరోపేరు అయిన గంటా పోలింగ్ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి అని, ఆయన గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో గంటా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ఆయన పోలింగ్ ఏజెంట్లనే కొనేస్తారు’
సాక్షి, విశాఖపట్నం: పోల్ మేనేజ్మెంట్లో మంత్రి గంటా శ్రీనివాసరావు నెంబర్‌వన్ అని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. ఓటును రూ.10వేలకు కొంటున్నారని గంటా స్నేహితులే తనతో చెపుతున్నట్లు ఆయన ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి ఇక్కడ పోటీస్తున్నారని, గంటా శ్రీనివాసరావు విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని విమర్శించారు. బూత్ కమిటీల్లో అన్ని రాజకీయల పార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో టీడీపీని ఓడిండమే తన లక్ష్యమని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి గంటా శ్రీనివాసరావు దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాగా గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని ఇప్పటికే ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. అవినీతికి మరోరూపం గంటా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘మోదీ కోసం.. బాబు జీరో అయ్యారు’
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. పోలవరం, అమరావతి సందర్శన యాత్రల పేరుతో కోట్లు ఖర్చుపెడుతూ చంద్రబాబు మతి, గతీ లేనట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీని ఎలాగైనా దెబ్బకొట్టాలని బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆ క్రమంలోనే జీరోగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేనని అన్నారు. విద్యా, వ్యవసాయం, సంక్షేమం, బెల్ట్‌షాప్‌లు తొలగించడం వంటి మేనిఫెస్టోతో బీజేపీ ప్రచారంలోకి రాబోతోందని వివరించారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవడం గంటాకు అలవాటని చురకలంటించారు. ఏ పార్టీ మారతారో చూడాలి.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న విష్ణుకుమార్‌రాజు మంత్రి గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక కుంభకోణాలు, దోపిడీలు చేసింది శ్రీనివాసరావేనని ఆరోపించారు. గంటా చరిత్ర చూస్తే.. అధికారం మారినప్పుడల్లా పార్టీ మారే వ్యక్తి అని విమర్శించారు. ‘25వ తేదీ వరకు సమయం ఉంది. గంటా మళ్లీ ఏ పార్టీ మారతారో చూడాలి. విశాఖ నార్త్‌లో పోటీ రెండు పార్టీల మధ్య కాదు. నీతి, నిజాయితీకి, అవినీతి పరుడైన గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో పరిపాలనపై కంట్రోల్ పోయిందని విమర్శించారు. -
అవినీతి ‘గంటా’ను ఓడించడమే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి అవినీతి చక్రవర్తి రాష్ట్రంలో మరొకరు ఉండరని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక్క హుదూద్ ఇళ్ల స్కాంలోనే సుమారు ఏడున్నర కోట్ల అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం భాగంగా పలు ప్రాంతాలు పర్యటించిన విష్ణుకుమార్ రాజు.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాస్‌పై విరుచుకపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ నియోజకవర్గంలోనూ అక్రమాలు, దోపిడీలు చేయడం గంటాకు అలవాటని విమర్శించారు. దీంతో భీమిలి ప్రజలు వెళ్లగొడితే.. విశాఖపై పడ్డారని మండిపడ్డారు. ఆయనకు ఇదే ఆఖరి నియోజకవర్గం అవుతుందని జోస్యం చెప్పారు. (ఇక ‘ఉత్త’ర గంట) గంటా అవినీతిపై సిట్ రిపోర్టు బయటపెట్టి ఉంటే పోటీ చేయడానికి అర్హత లేకుండా పోయేదని పేర్కొన్నాడు. పేదలను దోచుకునే స్థాయికి మంత్రి దిగజారడం సిగ్గుచేటన్నారు. అన్ని పార్టీలు గంటాకు టికెట్ నిరాకరించాయని.. దీంతో గత్యంతరం లేకే టీడీపీని పట్టుకొని వేలాడుతన్నారన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద శాతం అతడిని ఓడించడానికే ఇక్కడి నుంచి పోటీ చేస్తునాన్నని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రానికి పట్టిన అవినీతి చీడ పురుగును ఓడిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపాడు. -
రైల్వే జోన్‌తో టీడీపీ గుండెల్లో రైళ్లు: విష్ణు
విశాఖపట్నం: రైల్వే జోన్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుళ్లు, కుతంత్రంతో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య సభలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..బీజేపీపై బురదజల్లే కార్యక్రమం విశాఖ కేంద్రంగా టీడీపీ చేపట్టిందని ఆరోపించారు. రైల్వేజోన్‌తో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. టీడీపీకి ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉందని అన్నారు. ప్రజలు టీడీపీ నాయకులను అధికారం నుంచి బయటకు పంపే సమయం కోసం వేచిచూస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు, అధికారులను మేనేజ్ చేసి నకిలీ పత్రాలు తయారు చేసి భూములు కాజేశారని ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ కమిటీ నివేదిక ఇంకా బయటపెట్టలేదని, ఆ నివేదిక బయటపెడితే పసుపు పచ్చ పాములు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు. బాబుకు మోదీ జ్వరం: సోము చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ జ్వరం పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. మోదీని ఏపీకి రావద్దనే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పవన్ కల్యాణ్, మోదీ ఇద్దరూ కలిసి కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు డబ్బు జబ్బు పట్టుకుందని తీవ్రంగా విమర్శించారు. ఈ రాష్ట్రానికి రూ.50 వేల కోట్లు ఎన్‌ఆర్‌జీఎస్‌కు నిధులొస్తే, అందులో రూ.16 వేల కోట్లు మట్టి తవ్వి.. 30 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. -
కుంభకోణలపై మాట్లాడారా?
-
చేసేది గోరంత.. చెప్పేది కొండంత
-
ప్రధాని విశాఖ పర్యటన 27కు వాయిదా
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16వ తేదీన జరగాల్సిన ప్రధాని పర్యటన 27వ తేదీకి వాయిదా పడినట్లు పీఎంవో గురువారం ఓ ప్రకటన చేసింది. కాగా ఈ నేపథ్యంలో ప్రధాని సభకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం కేటాయించాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఇదే అంశంపై ఆయన గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. -
పవన్‌పైకి టీడీపీ ప్రేమ బాణాలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై ఉన్నట్టుండి ప్రేమ కురిపిస్తున్నారని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రేమ ఎక్కువైపోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్నటి వరకూ టీడీపీ నేతలు ప్రతి ఒక్కరూ పవన్‌ను తిట్టారని, ఇప్పుడేమో ప్రేమ బాణాలు విసురుతున్నారని, ఈ ప్రేమకు సమాధానం టీడీపీ నేతలే చెప్పాలని ఆయన అన్నారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. విమర్శల విషయంలో పవన్ స్థానంలో కేసీఆర్‌ను ఎందుకు పెట్టారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తానేదో జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు టీడీపీ నేతలు అంటున్నారని, హోదా విషయంలో ఎవరు యూటర్న్ తీసుకున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 650 అవార్డులు వచ్చాయంటున్నారు.. మళ్లీ అమిత్‌షా, మోదీపై బురదజల్లుతారు.. ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తే, రాష్ట్రమే అంతా చేసిందని డబ్బాలు కొట్టుకుంటున్నారని చెప్పారు. అలాగే విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలోని దారుణ పరిస్థితులే రాష్ట్రంలోని వైద్య రంగం పనితీరుకు ఉదాహరణ అని చెప్పారు. రైల్వే జోన్ కూడా ప్రారంభించేస్తారా? ‘కడపలో స్టీల్‌ప్లాంటు నిర్మిస్తామంటూ ఒక రాయి వేశారు. రేపు విశాఖ రైల్వే జోన్ నిర్మిస్తామంటూ మరో రాయి వేస్తారేమో’ అంటూ విష్ణుకుమార్ రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు కలుగజేసుకుంటూ స్టీల్ ప్లాంట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. -
జగన్ హోదా ఎత్తుకున్నాకే టీడీపీ యూటర్న్: విష్ణుకుమార్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాటం చేయడం మొదలుపెట్టాకే టీడీపీ యూటర్న్ తీసుకుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీ–టీడీపీల బంధం బాగానే ఉండేదని, కానీ జగన్ హోదా కోసం ఎప్పుడైతే ముందడుగు వేశారో.. ఆయన కంటే ఎక్కడ వెనుకబడిపోతామో అని కంగారుపడి టీడీపీ యూటర్న్ తీసుకుని తమతో విభేదించిందని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుందని, బీజేపీ అన్యాయం చేసిందనేది సాకు మాత్రమేనని విమర్శించారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు’ అంశంపై ఆయన మాట్లాడారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం సభ్యులు పదేపదే అడ్డు తగులుతూ సంబంధం లేని వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ టీడీపీ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రకరకాల డ్రామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తోనే జతకట్టిందంటే పసుపు రంగు అపవిత్రమైందని విమర్శించారు. మేడా ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి.. విష్ణుకుమార్‌రాజు ప్రసంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుకుంటూ.. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాకే మాట్లాడాలని, లేదంటే మాట్లాడనిచ్చేది లేదన్నారు. దీంతో ముందు మేడా మల్లికార్జునరెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలంటూ విష్ణుకుమార్‌రాజు దీటుగా బదులిచ్చారు. దీనికంటే ముందు ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఎందుకు చేయించలేదో టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. జగన్ తరఫున మాట్లాడుతున్నారా? ఈ సమయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు లేచి.. విభజన అంశాల్ని మాట్లాడకుండా జగన్ తరఫున మాట్లాడుతున్నారని, జగన్ పార్టీలోకి ఏమైనా వెళుతున్నారా? అని ప్రశ్నించారు. విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ.. మరో రెండునెలలాగితే ఎవరు ఏపార్టీలోకి వెళతారో, ఇక్కడున్న సభ్యుల్లో ఎంతమంది బయటకు వెళతారో తెలుస్తుందని బదులిచ్చారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. విభజన గురించే విష్ణుకుమార్‌రాజు మాట్లాడాలని, మిగతా అంశాలు లేవనెత్తితే మాట్లాడనివ్వమన్నారు. తన ప్రసంగానికి పదేపదే టీడీపీ సభ్యులు అడ్డుతగలడం, ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండడాన్ని విష్ణుకుమార్‌రాజు తప్పుపట్టారు. మీరు వ్యవహరించే తీరు వల్లే ప్రతిపక్ష సభ్యులు సభకు రావట్లేదని, బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. జాతీయ రహదారులపై అయ్యన్నపాత్రుడే ప్రశంసించారు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 4,193 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని ఇప్పుడవి 7,246 కిలోమీటర్లకు చేరాయంటే బీజేపీ ఘనతేనని, దీనిపై స్వయానా మీ మంత్రి అయ్యన్నపాత్రుడే ప్రశంసించారని విష్ణుకుమార్‌రాజు అన్నారు. మీకు ఎంతసేపూ ఓట్ల గురించేనా? ఇక్కడ ఖర్చుచేసిన నిధులు కనిపించట్లేదా? అని నిలదీశారు. అభివృద్ధి తెలుగుదేశం సభ్యులకు తెలియదు, మనమైనా చెప్పాలి అధ్యక్షా.. అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం మంచిపని చేస్తే వీళ్లు వక్రీకరిస్తారు, బురద జల్లుతారు, ఏమైనా మాట్లాడితే అపోజిషన్ పార్టీకి అంటకాగుతున్నావా అంటారు.. అంటూ టీడీపీపై మండిపడ్డారు. టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని అనుసరించింది... టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని అనుసరించిందని, వాస్తవాలను మభ్యపెడుతూ వస్తోందని విష్ణుకుమార్‌రాజు దుయ్యబట్టారు. విభజన జరిగినప్పుడు టీడీపీ ఇక్కడ లేదా? లేఖలిచ్చింది వాస్తవం కాదా? సమన్యాయం చేయమని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీలు పొత్తుకు వెళ్లడంపై ప్రజలంతా ముక్కుమీద వేలేసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘‘హోదా సాధ్యం కాదు, ప్యాకేజీ ఇస్తామంటే ఇదే సభలో నరేంద్ర మోదీపై సీఎం నుంచి సభ్యుల వరకూ ప్రశంసలు కురిపించలేదా? 2015లో మోదీకి ధన్యవాదాలు చెబుతూ లేఖ రాయలేదా? మరి ఇప్పుడెందుకు విభేదించారు... అది కేవలం జగన్ హోదాపై పోరాటం చెయ్యడంతోనే. ఆ తర్వాతే మమ్మల్ని పక్కనపెట్టి డైవర్షన్ తీసుకున్నారు’’ అని తప్పుపట్టారు. ‘‘బీజేపీకి టీడీపీ మిత్రద్రోహం చేసింది. టీడీపీ, పవన్‌కల్యాణ్, బీజేపీలు కలసి పోటీ చేసినందువల్లే మీరు ఆ స్థానంలో కూర్చున్నారు. మొన్నటి వరకు పవన్, జగన్, మోదీ విలన్లు.. ఇప్పుడేమో పవన్‌కు మెల్లగా ప్రేమబాణాలు వేస్తున్నారు. ఆ స్థానంలో కేసీఆర్‌ను కూర్చోబెట్టారు. ఎన్నికలకు ముందు రకరకాల డ్రామాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారా లేదా అనే విషయాన్ని చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. -
రాజకీయ స్వార్థం కోసం బాబు మిత్రదోహం చేశారు
-
రాష్ట్రంలో విచ్చలవిడిగా భూ దోపీడి చేస్తున్నారు
-
చంద్రబాబుకు భయం పట్టుకుంది
-
టీడీపీ నేతలకు నితిన్ గడ్కరీ సవాలు
సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సాయం మరెవరూ అందించలేదని, దీనిపై టీడీపీ నేతలకు ఛాలెంజ్ విసురుతున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నితిన్ గడ్కరీ హాజరై మాట్లాడుతూ..' అందరికి సుపరిపాలన అందించాలన్నదే మోదీ లక్ష్యం. గత ప్రభుత్వాల హయాంలో టెర్రరిజం పెరిగిపోయింది. ప్రధానిగా మోదీ వచ్చిన తరువాత టెర్రరిజంను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. 2022 నాటికి ఆర్థికంగా వెనుకబడిన పేదలు అందరికి ఇళ్లు కట్టిస్తాము. కేంద్రం ఆర్థిక పరంగా రాష్ట్రానికి చేయాల్సినందంతా చేస్తోంది. మోదీ రాష్ట్రానికి ఎంతో చేస్తున్నా, చంద్రబాబు రాజకీయంగా ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం ఖర్చు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికి పోలవరం 62 శాతం పూర్తయింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. దీనిపై ఎవరికి సందేహాలు వద్దు. భారతమాలలో భాగంగా 44 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేస్తున్నాము. అనంతపురం అమరావతి హైవే నిర్మాణం 20 వేల కోట్లతో పూర్తి చేస్తాము. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి చేస్తాము. కాకినాడలో పెట్రో కెమికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము. బీజేపీ కుటంబ పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. యాబై ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్ల కాలంలో జరిగింది. దీనిపై మేము ఛాలెంజ్‌కు సిద్ధం. పోర్టులు, రోడ్లకు నా శాఖ నుంచి రూ. లక్ష 25 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చాము' అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించినందుకు గడ్కరీని రాష్ట్ర బీజేపీ నేతలు సన్మానించారు. చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుంది : కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం ఇచ్చిన పథకాలతోనే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని బీజేపీనే విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో టీడీపీ విడిపోయిన తరువాతే రాష్ట్రానికి 24 వేల కోట్ల నిధులు ఇచ్చామన్నారు. చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుంది. మోదీ అంటే భయంతో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావడం లేదన్నారు. సర్వేలు చూస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది : విష్ణుకుమార్ రాజు రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇసుక దోపిడీ ద్వారా రూ.2 వేల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు.16,200 కోట్లతో రోడ్ల పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఇప్పటికీ ఇసుక దోపిడీని సీఎం చంద్రబాబు అరికట్టలేక పోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారని తెలిపారు. భూములు ఆక్రమమించిన పచ్చ పాములు పేర్లు బైటకు వస్తాయని సిట్ నివేదికను తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. ఎన్నికల సర్వేలు చూస్తుంటే చంద్రబాబుకు భయమేస్తోందన్నారు. మొన్నటి వరకు బీజేపీ, వైఎస్ జగన్, పవన్ ఒక్కటే అని విమర్శలు చేసిన టీడీపీ నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తొలగించి టీఆర్ఎస్ పేరు చేర్చారన్నారు. ప్రతి స్కీమ్‌ను ఒక స్కామ్‌గా మార్చారు : పురందేశ్వరి అగ్రవర్ణాల్లో పేదల కోసం ఎవరు ఊహించని విధంగా రిజర్వేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టారని మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అగ్రవర్ణాల్లో పేదల కోసం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి స్కీమ్‌ను ఒక స్కామ్‌గా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నీతి నిజాయితీతో కూడిన పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కట్టినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
వైఎస్ జగన్ కేసు..దర్యాప్తు ఎలా ఉంటుందో
విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. విశాఖపట్నంలో విష్ణుకుమార్ విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌పై దాడి దిగ్భ్రాంతికరమన్నారు. ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన గంటకే నిందితుడు జగన్ అభిమాని అంటూ ఫోటోలు బయటకు రావడం ఇంకా ఆశ్చర్యకరంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. కేసులో నిజానిజాలు తెలియాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలని కోరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ ద్వారా కోరాలని సూచించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి ఎవరు దరఖాస్తు చేసినా , అది ప్రజాస్వామ్యంపైనే కుట్ర చేసినట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతపై దాడి చిన్న విషయం కాదని చెప్పారు. రేపే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షునికి లేఖ రాస్తానని వెల్లడించారు. వైఎస్ జగన్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై అనుమానాలు: బీజేపీ
విశాఖపట్నం: అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలున్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో విష్ణుకుమార్ రాజు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోందని అన్నారు. బాధితులకు ఉపశమనం లేకపోగా..రాను రానూ మనోధైర్యం కోల్పోతున్నారని బాధ వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు బయటకు రాక ముందు కొంతమంది రాజకీయ నేతలు, వారి బినామీలపైన కొనుగోలు చేసిన మాట వాస్తవమని చెప్పారు. అందుకే అగ్రిగోల్డ్ ఆస్తుల అసలు విలువ ఎంతో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి హైటెక్ ముఖ్యమంత్రని, ఫిన్‌టెక్ కోసం వచ్చారు కానీ అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినడానికి మాత్రం రాలేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ కేసుకు మూడున్నరేళ్లు: ఎమ్మెల్సీ మాధవ్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేటికి మూడున్నర ఏళ్లు అయినా అతీగతీ లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రిలయన్స్, ఎస్ఎల్ గ్రూప్ కంపెనీలు వారి వద్ద అతిచౌకగా కమిషన్లను కొట్టే కుట్ర జరగడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ప్రభుత్వ కుట్రను బయట పెట్టడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు నిరసన దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానం ద్వారా సీబీఐ విచారణ కోరతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
‘హీరో శివాజీకి ముందే ఎలా తెలుసు?’
సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ పార్టీ నోటీసుల డ్రామా ఆడుతోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఐదు వందలతో పోయే కేసును పట్టుకొని ఎదో జరిగిపోయినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, ఇటువంటి ప్రచారం వలన ఎటువంటి సానుభూతి రాదని పేర్కొన్నారు. ఇదివరకు నోటీసులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అందుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అదే నోటీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడేవారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయించారనడం హాస్యాస్పదమన్నారు. స్టేలు తెచ్చుకోవడం కొత్తేంకాదు హీరో శివాజీతో డ్రామా ఆడించింది టీడీపీ నాయకులేనని, ఈ డ్రామాలు ప్రజలకు తెలియదనుకోవడం వారి మూర్ఖత్వమని మండిపడ్డారు. అరెస్టు వారెంట్ విషయం వారం రోజుల ముందు శివాజీకి ఎలా తెలసని ప్రశ్నించారు. టీడీపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని వివరించారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదని విష్ణుకుమార్ రాజు ఎద్దేవ చేశారు. -
ఆపరేషన్ గరుడా అంటే ఏంటో నాకు తెలియదు
-
ఇసుక బకాసురుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
అమరావతి: రాష్ట్రంలో ఇసుక మాఫియా రాక్షసంగా తయారయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ఎమ్మెల్యేలు బకాసురుల్లా ఇసుకను తినేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు సైతం ఈ కుంభకోణంలో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పేదవాళ్లకు ఇసుక అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఏపీలో నీతిలేని పరిపాలన నడుస్తోందని, వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కోసమే ఇసుకను టీడీపీ ఆదాయవనరుగా మార్చుకుందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..టీడీపీ, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇసుక మాఫియాను వ్యతిరేకించానని తెలిపారు. సీఎంకు చేతకాకపోతే నాకు అధికారం ఇవ్వండి..నెల రోజుల్లో ఇసుక మాఫియాను అరికడతామని సవాల్ విసిరారు. రోజురోజుకీ ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించండని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడగటంలో న్యాయముందని చెప్పారు. -
టీడీపీపై విష్ణుకుమార్ రాజు మండిపాటు
సాక్షి, గన్నవరం : విశాఖపట్నం రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీలను ఏపీకి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల జూన్ 13న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ నేతలు కలవడం జరిగిందని, త్వరలో విశాఖ రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే పోర్టు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే పెడుతుందని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం కడప ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ గురించి ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మీరు ధర్నాలు చేయదలచుకుంటే ఏపీలో జరిగే అవినీతి, ఇసుక మాఫియా, లంచగొండితనంపై చేయాలని అన్ని పార్టీలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షులు కన్నాతో పాటు సమావేశంలో పాల్గొన్న 16 మంది కోర్ కమిటి సభ్యులు, ఇతర బీజేపీ ముఖ్యులు హాజరయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఎవరేం చేయాలో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశానికి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభం హారిబాబు గైర్హాజరయ్యారు. -
మంత్రి గంటా ఐఐఎంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి
-
రైల్వేజోన్ పేరిట టీడీపీ డ్రామాలు
-
సీఎం రమేష్‌కు గిన్నిస్ రికార్డ్ రావడం ఖాయం
-
టీడీపీ దీక్షలను చూసి జనం నవ్వుకుంటున్నారు
-
టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయొచ్చు కదా ?
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో అసహనం పెరిగిపోయిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు నాయుడులో అసంతృప్తి పెరిగిపోయిందని, అందుకే బీజేపీ నేతలపై దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు దీక్షలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆరోపించారు. పార్లమెంట్ లాబీలో ఆ పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోందని, ఉక్కు పరిశ్రమ ఇస్తున్నారని తెలిసికూడా రాజకీయాలకు పాల్పడుతున్నారని మాధవ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఉద్యోగాల పేరుతో మంత్రలు కోట్లు దండుకుంటున్నారని, మంత్రుల ఇళ్లలోనే నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పదవులకు రాజీనామా చేయొచ్చు కదా! : తెలుగదేశం పార్టీ దీక్షలన్నీ రాజకీయం, మైలేజే కోసమేనని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. నాలుగేళ్లు పనులు చేయకుండా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు ఎందుకు దీక్ష చేస్తున్నారో ప్రజలకు తెలుసునని.. దీక్షలకు బదులు రాజీనామా చేసి పోరాడాలంటూ డిమాండ్ చేశారు. దొంగ దీక్షల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. -
సొంతపార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఘటు విమర్శలు
సాక్షి, అమరావతి : సొంత పార్టీనేతలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడాన్ని తప్పుబట్టారు. ‘సీఎం ఇక్కడ పులి.. ఢిల్లీలో పిల్లి’ అని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించడం తప్పని పేర్కొన్నారు. సాక్షర భారత్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలుగా సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనల వల్లే 2014లో బీజేపీకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయన్నారు. పొత్తుల విషయం అదిష్టానం చూసుకుంటుందని, 2019లో తమ మద్దతు లేకుండా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. -
‘ఏపీ సీఎంను డిసైడ్ చేసేది బీజేపీనే’
సాక్షి, విశాఖపట్నం : కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గెలుపును అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టారని ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించారు. కన్నడ ప్రజాతీర్పుపై ఆయన స్పందిస్తూ.. బీజేపీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన తెలుగువారికి, కన్నడిగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాక్షాత్తు ఎన్జీవో సంఘంతో తమ పార్టీకి ఓటేయద్దని టీడీపీ ప్రచారం చేయించినా మోదీ నాయకత్వంలోని బీజేపీకి బ్రహ్మరథం పట్టారని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే 2019 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పే కల్లబొల్లి మాటలు ప్రజలు వినరని స్పష్టమైందని, సీఎంను ఎన్నుకునే ప్రక్రియలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని విష్ణు కుమార్రాజు జోస్యం చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలకు చరమగీతం టీడీపీ నీచ, నికృష్ట రాజకీయాలకు కన్నడ తెలుగువారు చరమగీతం పాడారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించాలనుకున్న టీడీపీ తమ్ముళ్ల పప్పులు ఉడకలేదని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు తీర్పు ఏకపక్షంగా బీజేపీ వైపు ఉందని మాధవ్ తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు విభజన రాజకీయాలు మానుకుని, నిర్మాణాత్మక ధోరణిలో వెళ్లాలని సూచించారు. కన్నడనాట విజయం బీజేపీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని నింపిందని వివరించారు. -
చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
తిరుమల : హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చిన ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడు, కర్ణాటక ప్రజలను బీజేపీకి ఓట్లు వేయవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ..తెలుగు, కన్నడ ప్రజల మధ్య విభేదాలు తలెత్తే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడి ఫ్యామిలీ తప్ప రాష్ట్రంలో మరెవరూ టీటీడీపీకి ఓట్లు వేయరని అన్నారు. 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ఏపీకి కాబోయే సీఎం అని జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారని, బాబు పిలుపులను కర్ణాటక ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, త్వరలోనే టీడీపీ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. -
టీడీపీ కాంగ్రెస్‌తో చేతులు కలపాలని చూస్తోంది
-
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది
-
టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..
తిరుమల : టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైఎస్సార్సీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని, విడిగా పోటీ చేస్తే టీడీపీ పతనం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడి గ్రాఫ్ పడిపోయిందని, అలాగే ఇప్పుడు వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తిరుపతిలో చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాటం కాదని, అధర్మ పోరాటమని ఎద్దేవా చేశారు. పట్టిసీమపై 15 రోజులలో సీబీఐ చేత విచారణ చేయించాలని కోరతామని తెలిపారు. విచారణ జరిగితేనే దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహర్ రెడ్డి ఏం చెబితే..చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడని చెప్పారు. -
బాబు దీక్ష వల్ల రాష్ట్ర ఖజానాకు 20 కోట్ల నష్టం
-
మే 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి
విశాఖపట్నం : అధికార టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే నెల 15 తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు ఉంటాయన్నారు. అలాగే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా విశాఖపట్నం వచ్చినప్పుడు తాను కూడా కలుస్తానని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత విషయం అని విష్ణుకుమార్ రాజు తెలిపారు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దీక్ష అయిపోయిందని, దాని వల్ల రాష్ట్ర ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు జరుగుతుందని కాదని..సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని..ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పట్టిసీమలో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. టీడీపీతో పొత్తు కారణంగా చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. టీడీపీ కుటుంబ పార్టీ అని, మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. కొత్తగా ఏచూరికి పదవి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు. దోపిడీపై ఉద్యమించేవారికి కాంగ్రెస్‌తో పనేంటి? : విశాఖ ఎంపీ హరిబాబు దోపిడీపై ఉద్యమిస్తామంటున్న కమ్యునిస్టు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి పోరాటం చేస్తామనడంలో ఆంతర్యం ఏమిటని హరిబాబు ప్రశ్నించారు. దేశంలో అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతుందని, ముద్రా రుణాలు కోట్ల మంది ప్రజలకు ఇస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతోన్న ప్రధాని మోదీపై ఎలా విమర్శలు చేస్తారని సూటిగా అడిగారు. ఇరవైకి పైగా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేని సీపీఎం మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని విమర్శించారు. ఒక్కప్పుడు రెండో స్థానంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు అట్టడుగు స్థానానికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒంటరిగా రాష్ట్రంలో బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పలేదని, రాజకీయ పరిణామాల దృశ్యా మార్పులు చోటు చేసుకోవడం సహజమన్నారు. ఏపీలో అధికార, ప్రతిప్రక్షాలు తమపై విమర్శలు చేస్తుంటే తమ పార్టీ ఎంత ఎదిగిందో గమనించాలని తెలిపారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను...అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఐబీ అధికారులు రాజకీయ నాయకులను కలవడం సహజమని, కేంద్రం అనవసరంగా ఎవ్వరి మీదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని తేల్చిచెప్పారు. -
ఏపీ ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారు
-
బాలకృష్ణ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది..
సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే భయం టీడీపీకి పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్యే విష్టు కుమార్ రాజు అన్నారు. పుట్టిన రోజు నాడైనా చంద్రబాబు నిజాలు మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఎమ్మెల్యే మండిపడ్డారు. కొందరి డైరెక్షన్లో బాబు నడుస్తున్నారు.. టీడీపీ కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే అని బీజేపీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ‘బాలకృష్ణ వ్యాఖ్యలతో ఆయన తండ్రి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. ఇంట్లో ఇద్దరిని హత్య చేసి.. మాపీ చేయించిన పెద్దమనిషి బాలకృష్ణ. కుటుంబ పాలన గురించి ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలుసు. ఈ రోజు సాయంత్రం(ఏఫ్రిల్ 20) 7 గంటల్లోగా ప్రధానికి, హిజ్రాలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. బాలయ్య సినిమాల్లో స్టంట్లు, ఇంటికి వచ్చిన వాళ్లను కాలుస్తారని తెలుసు.. కానీ మిడిమిడి జ్ఞానంతో కూడా మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది’ అని విష్ణుకుమార్ రాజు విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఏడాదిలో విశాఖకు కచ్చితంగా రైల్వేజోన్ వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. -
అవినీతి జరగలేదంటే.. ఏ శిక్షకైనా నేను సిద్ధం
-
అవినీతి జరగలేదంటే.. ఏ శిక్షకైనా నేను సిద్ధం
సాక్షి, అమరావతి: పట్టిసీమలో అవినీతి జరిగింది.. జరగలేదంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసే ఏ శిక్ష కైనా తాను సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్సీ విష్ణు కుమార్ రాజు సవాల్ విసిరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే పట్టిసీమపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోషూట్ కోసమే సీఎం పార్లమెంటు మెట్లకు మొక్కారని ఎద్దేవా చేశారు. రోజూ ఇసుక కుంభకోణంలో కోట్లు కొల్ల గొడుతున్నారని, పట్టిసీమ, ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఇది భారత దేశ ప్రజలను అవమానించడమే. సీఎం 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని మంత్రి గంటా శ్రీనివాస రావు బీజేపీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులతో ఉద్యమానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు’ అని విష్ణు కుమార్ వ్యాఖ్యానించారు. -
పట్టిసీమ పనులపై సీబీఐ విచారణ జరిపించాలి
-
విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం!
-
విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం
సాక్షి, అమరావతి : బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదురైంది. నవ్యాంధ్ర నూతన రాజధానిలో నిర్మించే రోడ్లు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయన్ని చూపించేందుకు ఎమ్మెల్యేలను మంత్రి నారాయణ తీసుకెళ్లారు. ఆ నేతల బృందంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. అయితే ఆయన భవన సముదాయాలను పరిశీలిస్తుండగా ఇతర నేతలతో కలిసి మంత్రి నారాయణ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన నేతల్లో తానొక్కడినే ఉండిపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే కొంత సమయం అక్కడే ఉన్నారు. కారు వచ్చేంతవరకు ఎదురుచూసిన ఆయన కారు రాగానే అందులో వెళ్లిపోయారు. తాను కూడా నేతల బృందంలో ఉన్నానని భావించి నేతలు వెళ్లిపోయారని విష్ణుకుమార్ రాజు చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారా లేదా చెక్ చేసుకోకుండా మంత్రి నారాయణ సైతం ఎలా వెళ్లిపోతారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. -
‘అక్కడ మొక్కితే.. ప్రధానికి మొక్కినట్టే’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవని వ్యాఖ్యానించారు. ‘నేను సభలో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తున్నా.. నన్ను పట్టించుకోవడం లేదు. పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో గ్రామాల్లోకి వెళ్లలేకపోయేవాళ్లం.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత టీడీపీ చేస్తోన్న వాదనను ప్రజలు నమ్మడం లేదు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టే పైనుంచి నిధులు కట్ చేసి ఉంటారనే భావనలో ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కన్పిస్తోంది. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయం. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపింద’ని మాణిక్యాలరావు తెలిపారు. మరో బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే.. పార్లమెంటులో అత్యున్నత స్థానంలో కూర్చొన్న ప్రధానమంత్రికి మొక్కినట్టే అన్నారు. రాఫెల్ డీల్ వంటి విషయాల గురించి మాట్లాడేంత పెద్ద వాళ్లం కాదని.. శాండ్, ల్యాండ్ గురించి మాట్లాడతామని అన్నారు. -
చట్టసభల్ని చంద్రబాబు సొంత ప్రచారానికి వాడుకుంటున్నాడు
-
చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్లారు?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేవాలయం లాంటి శాసనసభను రాజకీయ సభలా వాడుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత వచ్చేలా చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు, పవన్ కల్యాణ్ మీటింగ్ పెట్టి ప్రశ్నించినప్పుడే ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటి వరకూ 29 సార్లు ఢిల్లీ వెళ్లామని చెపుతున్నారు.. కానీ ఎందుకు అన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. కేవలం 11 సార్లు మాత్రమే అపాయింట్మెంట్ అడిగి, ప్రధాని మోదీని కలిశారని తెలియచేశారు. పట్టిసీమను బీజేపీ వ్యతిరేకించలేదని, ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మాత్రమే వ్యతిరేకించిందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపమని మూడు నెలలుగా కోరుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. అవినీతి జరగకపోతే విచారణకు సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. స్వలాభం కోసం విద్యార్థులు, యువకులను వాడుకుంటారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో రైల్వే జోన్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరుగుతున్న మొదటి రాష్ట్రం ఆంద్రప్రదేశ్ అంటూ అసెంబ్లీ నిర్వహణా తీరును విమర్శించారు. -
రాజధాని నిర్మాణంపై టీడీపీని నిలదీసిన బీజేపీ ఎమ్మెల్యే
-
కేంద్రం నిధులు ఇవ్వందే రాష్ట్రం అభివృద్ది సాధించిందా?
-
చంద్రబాబుకు బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, అమరావతి: ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతామని చెబుతూనే కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పర్వం కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీపై బీజేపీ రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ ముఖ్యమంత్రి, మంత్రులు సహా టీడీపీ నేతలు పదేపదే ప్రకటనలు చేస్తుండడం పట్ల మండిపడ్డారు. టీడీపీ వైఖరిపై కొంతకాలం వేసిచూసి, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఒకవైపు టీడీపీ తీరును గమనిస్తూనే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందజేస్తున్న సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించింది. కేంద్రంలో టీడీపీ మంత్రులు, రాష్ట్రంలో బీజేపీ మంత్రుల రాజీనామా తదనంతర పరిణామాలపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ ఆదివారం సమావేశమైంది. పార్టీ కేంద్ర పరిశీలకుడు సతీష్జీ నేతృత్వంలో విజయవాడలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా, టీడీపీ నేత, సినీ నటి కవిత ఆదివారం బీజేపీలో చేరారు. విభజన చట్టంలోని 85 హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలోనే నెరవేర్చిందని హరిబాబు చెప్పారు. ఇంత చేసినా రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదంటూ మిత్రపక్షం టీడీపీతో సహా పలు పార్టీలు విమర్శిస్తున్నాయని తప్పుపట్టారు. కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ భేటీలో పాల్గొన్న నేతలు -
ఏపీ ప్రజలు రోడ్ల మీదికి రారు : చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలు సున్నిత మనస్కులని, ఏదైనా కష్టం వస్తే బాధపడతారేగానీ, ఆందోళనల పేరుతో రోడ్ల మీదికి రారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేశారు. కేంద్రంతో తాడోపేడో తలేల్చుకుంటామని నిన్నంతా లీకులిచ్చిన ఆయన.. ప్రత్యేక హోదాపై మళ్లీ పాతపాడేపాడారు. పైగా కేంద్రం ఏమీ ఇవ్వకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. పది రూపాయలు నష్టం జరిగినా ఫర్వాలేదు కానీ ఆత్మాభిమానం, హక్కును కాదన్నప్పుడు మాత్రం ఎక్కడలేని బాధ, వ్యధ కలుగుతుందని, నాలుగేళ్ల తర్వాత తనదిప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితేనని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై సీఎం సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డుపడిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాబుపై బీజేపీ ఫైర్, టీడీపీ ఎదురుదాడి : ఏపీ అభివృద్ధిని చూసి దేశం గర్వపడాలి : పోలవరం, వృద్ధిరేటు, కేంద్ర సాయం తదితర అంశాలపై సీఎం మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ‘పోలవరం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న ముఖ్యమంత్రి మాటలు నిజం కాదు. నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఒక వేళ సీఎం చెప్పినట్లు బిల్లులు ఆగితే.. ఆ వివరాలు నాకివ్వండి.. నేను క్లియర్ చేయిస్తా’నని విష్ణుకుమార్ రాజు అనగా, ‘రాష్ట్రంలో ఇంత వెనుకబాటు ఉంటే, రెండంకెల వృద్ధిరేటు ఎలా చూపుతారు? అందువల్లే కేంద్రం సాయానికి వెనుకడుగు వేస్తున్నదేమో!’ అని మరో బీజేపీ సభ్యుడు అన్నారు. హోదా రాష్ట్రాలకు 2020 దాకా పన్ను మినహాయింపులు ఇచ్చారన్న సీఎం వ్యాఖ్యలకు.. ‘ అది కాలపరిమితికి లోబడి తీసుకున్న నిర్ణయమేగానీ, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు’ అని ఇంకో సభ్యుడు పేర్కొన్నారు. ఇలా బీజేపీ నేతలు మాట్లాడిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా లేచి కాసేపు ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బీజేపీకి సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు.. ఏపీ అభివృద్ధిని చూసి దేశం గర్వపడాలి : ‘‘కేంద్ర సాహాయం లేకపోయినా, ఏపీ రెండంకెల వృద్ధిరేటు (11.3 శాతం) సాధించినందుకు యావత్ దేశం గర్వపడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కారణంగా నిధులు రావడంలేదనడం సరికాదు. కోఆపరేటివ్ ఫెడరలిజంలో అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలి. కానీ కేంద్రం మన డబ్బును తీసుకెళ్లి మధ్యప్రదేశ్‌లో ఖర్చుపెడుతోంది! 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్నారు. సరేనని మేం ప్యాకేజీకి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు కేంద్రం.. హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు 2020 దాకా పన్నుల మినహాయింపులను పొడిగించడం దారుణం’’ అని చంద్రబాబు అన్నారు. -
తారాస్థాయికి చేరిన బీజేపీ-టీడీపీ మాటల యుద్ధం
-
హత్యలు చేసేవారికి టీడీపీ పదవులు ఇస్తోంది
-
రూ.10 లక్షలిస్తే నన్ను కూడా చంపేస్తారు..
సాక్షి, అమరావతి : బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గుండాలకు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.5 లక్షలు ఇస్తే హత్య చేసేవారిని ప్రోత్సహిస్తున్నారని విష్ణుకుమార్ రాజు మంగళవారమిక్కడ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ రూ.10 లక్షలను ఇస్తే నన్ను కూడా చంపేస్తారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ హుందాగా నిరసన చేస్తే బాగుండేది. మోదీ మెడలు వంచినట్లు ఆయన నిరసన తెలిపారు. రౌడీలను అద్దెకు తెచ్చి టీడీపీ ధర్నాలు చేయిస్తోంది. హత్యకేసులో నేరస్తుడు ...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేయడమా?. అటువంటి వారికి నగర ఉపాధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించం. గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టి ప్రధానిపై నీచంగా నిరసన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. మోదీపై నిరసన చేపట్టిన వారిని అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. వారిపై కేసులు నమోదు చేయాలి. ఇటువంటి వ్యక్తులు ఉన్న టీడీపీ చాలా దారుణంగా ఉంది. మేము నోరు విప్పతే టీడీపీ బండారం బయటపడుతుంది. మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టే సంయమనంతో ఉన్నాం. మేము నోరు తెరిస్తే చాలా చెప్పాల్సి ఉంటుంది’ అని ధ్వజమెత్తారు. -
‘మిత్రపక్షం దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం’
విశాఖ సిటీ: రాష్ట్రంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయ విమర్శలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. దేశంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకురాని విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చానంటూ గతంలో ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాటమార్చేయడం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ఆర్థిక సాయం.. మొదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తమపై వస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలనే అస్త్రంగా సంధించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం శనివారం విశాఖపట్నంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మిత్రపక్షం టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై చర్చించారు. తగిన రీతిలో బదులిస్తాం.. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది, ఏం చెయ్యబోతోంది అనే అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీకి తగిన రీతిలో సమాధానం చెప్పాలని నిర్ణయించామన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ... కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకొచ్చానని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బంద్ చేపడితే తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
ఆ వ్యాఖ్యలు కాకతాళీయం: బీజేపీ ఎమ్మెల్యే
విశాఖపట్నం : ఈ నెల 24వ తేదీన తాను వైఎస్సార్సీపీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలు కాకతాళీయమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..తాను పీఏసీ సభ్యుడిగా ఆ సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. అది వైఎస్సార్సీపీ కార్యాలయం అనేది వాస్తవమన్నారు. సమీపంలోవున్న కార్యాలయాన్ని మీడియాతో మాట్లాడేందుకు ఉపయోగించుకోవడమే వివాదానికి కేంద్రబిందువైందన్నారు. అసందర్బంగా అడిగిన ప్రశ్నకు తాను స్పందించడమే సంచలనానికి కారణమైందన్నారు. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం తప్పే అనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వ్యాఖ్యానించారు. అది నా వ్యక్తిగత అభిప్రాయమని, దీన్ని రాజకీయకోణం నుంచి చూడాల్సిన అవసరంలేదన్నారు. తాము సంకీర్ణధర్మాన్ని పాటిస్తామని, పొత్తుల గురించి మాట్లాడే స్ధాయి తనది కాదని, ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. అసెంబ్లీ లాబీలో సెక్యూరిటీ అధికారి వద్దనడంతోనే వైస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడానని చెప్పారు. తాను వైస్సార్సీపీ లో చేరడం లేదని స్పష్టం చేశారు. -
'బీజేపీ వద్దంటే మాదారి మేం చూసుకుంటాం'
-
బీజేపీతో పొత్తుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మాట్లాడారు. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నేతలు గత కొంతకాలంగా గళమెత్తుతున్నారు. వీటిపై నేరుగా స్పందించని ముఖ్యమంత్రి ‘బంధం’లో ఉండాలనుకుంటున్నారో? తెంచుకోవాలనుకుంటున్నారో? ఆలోచించుకోవాలని నర్మగర్భంగా మాట్లాడారు. -
‘ఆ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఎన్డీయేదే’
సాక్షి, అమరావతి : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ చేసిన వాఖ్యలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే, ఎంపీల ఫిరాయింపుపై చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదేనన్నారు. చట్టాన్ని తెస్తే స్వాగతిస్తామని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే శివసేన నేత సురేష్ ప్రభును మంత్రి వర్గంలోకి తీసుకోలేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని తీసుకురావాల్సింది ఎన్డీయే ప్రభుత్వమేనని మండిపడ్డారు. తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో ఇదే విధంగా పార్టీలు ఫిరాయించిన ప్రజా ప్రతినిధులు ఉన్నారని..వాటి మాటేమిటని ఎదురు ప్రశ్నించారు. అంతకుముందు ఉక్కు పరిశ్రమ, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నియోజకవర్గ నేతలతో మంత్రులు చర్చించారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రంలోని పెద్దలతో సీఎం చర్చించారని సోమిరెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఈక్విటీ షేర్ ఇవ్వడానికి సీఎం సంసిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూల పరిస్థితి ఉందని చెప్పారు. -
కేంద్రానికి హరిబాబు కీలక లేఖ
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఈనెల 11న ఆయన లేఖ రాశారు. తమ రాష్ట్రం నుంచే పాలన సాగాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, దీనికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు తన అధికారిక కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ, రాజధాని అమరావతి నుంచే పాలన సాగుతోందని తెలిపారు. హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విడగొట్టాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తున్న నేపథ్యంలో అమరావతిలో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుకు అడుగులు పడ్డాయని వెల్లడించారు. అలాగే తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌ను నియమించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ నరసింహన్‌ను వెంటనే మార్చాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఇంతకుముందు డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు. బీజేపీ నాయకులు గవర్నర్ నరసింహన్‌ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
’వైఎస్ జగన్‌ది సంకల్ప బలం’
-
విష్ణు–మూర్తిల వివాదం!
పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యేబండారు సత్యనారాయణమూర్తి,విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజుల మధ్య వివాదం రాజుకుంటోంది.ముదపాక భూముల వ్యవహారం వీరిద్దరి మధ్య రగడకు కారణమయింది.ఎప్పుడూ వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలతో ప్రతిపక్షనేతలపై నోరు జారేబండారు ఈ సారి తమ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుపైవిరుచుకుపడ్డారు. వాడు, వీడు అన్న పదజాలాన్ని ఉపయోగించారు. తననియోజకవర్గంలో అతడికేంపని? ముదపాక భూముల గురించి అతడికేంతెలుసు? అని ప్రశ్నించారు. ‘రాజులు పెట్టే బిర్యానీలు తిని ఇక్కడకు వచ్చి వీరంగం చేస్తుంటారు’ అంటూ దళిత రైతులను అవహేళన చేశారు. ఆయనకేంటి ఇక్కడ పని : బండారు ‘అతనెవరో విష్ణుకుమార్‌రాజు అంట.. బీజీపీ ఎమ్మెల్యే.. పేరుకు మా పార్టీకి దగ్గరి ఎమ్మెల్యే(బీజేపీ–టీడీపీ పొత్తు)అయినంత మాత్రాన మా నియోజకవర్గంలో అతడికేం పని. ముదపాక భూముల గురించి, మా నియోజకవర్గం గురించి అవగాహన లేకుండా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఎన్నటికీ అమ్ముడు కాని అసైన్డ్ భూములను వుడా ద్వారా మా ప్రభుత్వం తెగనమ్మి రైతులకు న్యాయం చేస్తుంటే అతడేమో మాపై, మా నాయకులపై ఫిర్యాదులు చేస్తాడు.. పేరుకు బీజేపీ ఎమ్మెల్యే కానీ వైఎస్సార్ సీపీకి సపోర్ట్ చేస్తారు’ ఇవీ పెందుర్తి మండలం ముదపాకలో శనివారం నిర్వహించిన ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై చేసిన పరుష వాఖ్యలు. పెందుర్తి నీ జాగీరు కాదు : విష్ణుకుమార్‌రాజు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలకు విష్ణుకుమార్‌రాజు కూడా ఘాటుగా స్పందించారు. ఇన్నాళ్లూ బండారును సీనియర్ నాయకుడనుకున్నానని, కానీ ఆయన వ్యాఖ్యలతో తనకు ఆ అభిప్రాయం పోయిందని పేర్కొన్నారు. ‘పెందుర్తి మీ జాగీరు కాదు.. సీఎం చంద్రబాబు నీకేమీ రాసివ్వలేదు.. మీపై ఉన్న గౌరవంతోనే నేను ఇన్నాళ్లూ ముదపాక వెళ్లలేదు. నేను సకాలంలో స్పందించకపోయి ఉంటే ముదపాక భూముల్లో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగి ఉండేది. ఎకరానికి రైతుకు రూ.10 లక్షలు ఇచ్చేసి రూ.కోటిన్నర నుంచి 2 కోట్లు కొట్టేయాలని చూశారు. ముదపాక భూసేకరణ జీవోలో మార్పులు చేయించి ఆ రైతులకు మేలు జరిగేలా చేశాను. అన్యాయం జరుగుతోందంటూ దళిత రైతులు రోడ్డెక్కినప్పుడు మీరు కనబడలేదు. అప్పట్లోనే మీరు స్పందించి ఉంటే మాలాంటి వాళ్లం స్పందించే వారం కాదు.. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ముదపాక వెళ్లి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దమ్ముంటే సీఎంతో విచారణ వేయించండి. ఈ కుంభకోణంలో ఎవరెవరున్నారో తేలిపోతుంది. నేను శాసనసభలో ఫ్లోర్‌లీడర్‌ను. ప్రజా సమస్యలపై ఎక్కడికైనా వెళ్లొచ్చు. చర్చించవచ్చు. ఆ విషయం తెలుసుకోండి.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది’ అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు బండారుకు సూచించారు. సాక్షి, విశాఖపట్నం: పెందుర్తి మండలం ముదపాకలో దళితులకు చెందిన సుమారు 400 ఎకరాల అసైన్డ్ భూములను వుడా ల్యాండ్ పూలింగ్‌లో కారుచౌకగా తీసుకోవడానికి భారీగా లబ్ధిపొందడానికి బండారు, ఆయన అనుచరగణం స్కెచ్ వేసిందన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అసైనీలు తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును ఆశ్రయించడంతో ఆయన స్పందించి వారికి బాసటగా నిలిచారు. అసైనీలకు నష్టం వాటిల్లే ఆ జీవోను నిలుపుదల చేయించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి అనుకూలంగా సవరణలు చేయించారు. ఇది మింగుడు పడని బండారు అప్పట్నుంచి విష్ణుకుమార్‌రాజుపై గుర్రుగా ఉన్నారు. పరిస్థితి తనకు ప్రతికూలంగా మారడంతో బండారు తన నియోజకవర్గంలోని ముదపాక పరిసరాల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఇంటింటికి టీడీపీలో భాగంగా ఆయన ముదపాకలో మందీ మార్బలంతో అడుగుపెట్టారు. అక్కడ జరిగిన సమావేశంలో విష్ణుకుమార్‌రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
కాకినాడలో పొత్తు ధర్మం పాటించట్లేదు