chilli
-
వరంగల్ చపాట మిర్చికి జీఐ ట్యాగ్
సాక్షి, వరంగల్/సిద్దిపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్) లభించింది. ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్తోపాటు మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులు జీఐ గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో దేశంలోని తీపి మిర్చి రకాల్లో ఒకటైన చపాట మిరప చేరింది.చపాట మిరపకు జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (ఐపీవో) తాజాగా ఆమోదించింది. ‘జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్’ లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తక్కువ ఘాటుతో ఎర్రని టమాటా పండులాంటి రంగు కలిగి ఉండటం ఈ మిర్చి ప్రత్యేకత. అందుకే దీనిని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు. -
చపాటా మిర్చికి త్వరలో జీఐ ట్యాగ్!
సాక్షి, సిద్దిపేట: ఒక ప్రాంతంలో పండించే పంటలకు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభిస్తుంది. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 17 రకాల ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి. మరిన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో వరంగల్ చపాటా మిర్చికి జీఐ గుర్తింపు లభించే అవకాశం ఉంది. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూగెం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో చపాటా మిర్చిని పండిస్తున్నారు.సుమారు 7 వేల ఎకరాల్లో దీని సాగు జరుగుతోంది. పంటను వరంగల్, ఖమ్మం, గుజరాత్, ముంబై, ఆహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇంగ్లండ్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగును నిషేధించిన దేశాల్లో ఈ చపాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాటా మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి ఓల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్‌గా వినియోగిస్తారు. మన దగ్గర వీటిని ఎక్కువగా పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు.తిమ్మంపేట చిల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ నర్సంపేట, వరంగల్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ పంటకు జీఐ ట్యాగ్ కోసం 2022లో దరఖాస్తు చేశాయి. ఎంత మంది రైతులు దీనిని పండిస్తున్నారు. దీని వలన లాభాలు తెలుపుతూ పలు అంశాలతో కూడిన నివేదికను చెన్నైలోని జీఐ కార్యాలయంలో అందజేశారు. ఈ క్రమంలో ఈ నెలలో రైతులతో చెన్నైలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సాగు విధానం, ఉపయోగాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ లభించే అవకాశం ఉంది. సాధారణ మిర్చిని క్వింటాల్ రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు విక్రయిస్తుండగా..చపాటా మిర్చి రూ.30 వేల నుంచి 35 వేలు పలుకుతుంది.మరికొన్ని పంటలకు కూడా..⇒ ఆర్మూరు పసుపునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి జీఐ ట్యాగ్ సాధించేందుకు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందుకు నాబార్డు సహకరిస్తోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. అధిక ధరలు పలకడంతో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. దీనికి జీఐ ట్యాగ్ కోసం కూడా ఉద్యాన వర్సిటీ కసరసత్తును ప్రారంభించింది. వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. అలాగే కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్లగొండ పచ్చడి దోసకాయలు, నిజామాబాద్ గుత్తి బీరకాయలు సైతం జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియలో ఉన్నాయి. ప్లాంట్ అథారిటీలో నల్లగొండ పచ్చడి దోసకాయను నమోదు చేయించేందుకు ఉద్యాన వర్సిటీ దరఖాస్తు చేయించింది. నమోదు జరిగితే ఈ దోసకాయకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది.జీఐ ట్యాగ్ ఉన్న 17 ఉత్పత్తులివే..పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ ఫిలిగ్రీ, గద్వాల చీరలు, నిర్మల్ బొమ్మలు, చేర్యాల నకాశి కళ, నిర్మల్ ఫర్నిచర్, నారాయణపేట చీరలు, పుట్టపాక తేలియా రుమాలు, గొల్లభామ చీరలు, ఆదిలాబాద్ డోక్రా ఇత్తడి బొమ్మలు, వరంగల్ డర్రీస్, నిర్మల్ చిత్రాలు, తాండూరు కందిపప్పు, పాతబస్తీ లక్కగాజులు, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, బంగినపల్లి మామిడి ఉన్నాయి.ఎన్నో ప్రయోజనాలుజీఐ ట్యాగ్‌తో పంటల ఎగుమతులు పెరిగేందుకు, అధిక ధరలు లభించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు మేలు జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పతుంది. ఈ ఉత్పత్తులను ఇతరులు అనధికారికంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. – నీరజ ప్రభాకర్, వీసీ, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం -
కమ్మగా నోరూరించే.. వెజ్ నాన్‌వెజ్ వంటకాల తయారీ ఎలాగో తెలుసా!
వెరైటీ వంటకాలు.. కొంచెం కారంగా, కొంచె తీయగా.. అటు వెజిటేరియన్, ఇటు నాన్ వెజిటేరియన్లను మిక్స్ చేస్తూ సరికొత్తగా వంటకాలను తయారుచేయండిలా...యాపిల్ ప్రాన్స్..కావలసినవి..పెద్ద రొయ్యలు – అర కిలో (శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి)మిరియాల పొడి – పావు టీ స్పూన్,కార్న్‌పౌడర్ – అరకప్పుమైదా పిండి – ఒకటిన్నర కప్పులు,గుడ్డు – 1,కొత్తిమీర తురుము – కొద్దిగానీళ్లు – కావాల్సినన్ని,నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా,కెచప్ – పావు కప్పు, ఉప్పు – తగినంత,యాపిల్స్ – 3 (గింజలు తొలగించి.. సగం పేస్ట్‌లా చేసుకుని.. మిగిలిన సగం నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, గ్రీన్ ఆపిల్ లేదా అవకాడో లేదా మామిడికాయనూ తీసుకోవచ్చు గార్నిష్ కోసం!)కారం, మిరియాల పొడి, ధనియాల పొడి – కొద్దికొద్దిగా (అన్నీ బాగా కలుపుకోవాలి)తయారీ..ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కార్న్ పౌడర్, మైదా పిండి, గుడ్డు వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా కలపాలి.కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బ్లెండర్ సాయంతో కాస్త జారుగా కలుపుకుని.. అందులో రొయ్యలువేసి, కలుపుకొని ఆ బౌల్‌కి పైన ఓ కవర్ చుట్టబెట్టి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.అనంతరం నూనెలో వాటిని డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో యాపిల్ గుజ్జు, కెచప్ బాగా కలుపుకుని పెట్టుకోవాలి.సర్వ్ చేసుకునే సమయంలో కొన్ని రొయ్యలను ఒక బౌల్లోకి తీసుకుని.. దానిపైన కొద్దిగా యాపిల్–కెచప్‌ల మిశ్రమాన్ని వేసుకుని.. దానిపైన కారం మిశ్రమాన్ని జల్లుకుని.. అవకాడో లేదా మామిడి కాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ రొయ్యలు.అవకాడో–పొటాటో కట్లెట్..కావలసినవి..బంగాళాదుంపలు – 2 మీడియం (మెత్తగా ఉడికించుకోవాలి),అవకాడో – 1 పెద్దది (పండినది)ఓట్స్ – అరకప్పు (పౌడర్లా చేసుకోవాలి)మెంతికూర – అర కప్పు (తురుముకుని పేస్ట్‌లా చేసుకోవాలి),పచ్చిమిర్చి ముక్కలు – 2 లేదా 3 (చిన్నగా తరగాలి),వెల్లుల్లి తురుము – కొద్దిగాలవంగాల పొడి – కొద్దిగానిమ్మరసం – 1–2 టేబుల్ స్పూన్లుఉప్పు – రుచికి, నూనె – సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని.. బంగాళదుంప ముక్కలు, అవకాడో ముక్కలు వేసుకుని పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి.ఓట్స్ పౌడర్, మెంతికూర పేస్ట్, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, లవంగాల పొడి, ఉప్పు, నిమ్మరసం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.అనంతరం పాన్ లేదా కళాయిలో నూనె వేడి చేసుకుని.. ఫ్రిజ్‌లోని మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ.. కట్లెట్స్లా చేసుకుని దోరగా వేయించుకోవాలి.పచ్చి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.అవకాడో–పొటాటో కట్లెట్, బీట్రూట్ స్వీట్ పొంగనాలుబీట్రూట్ స్వీట్ పొంగనాలు..కావలసినవి..బీట్రూట్ – 2 కప్పులు,బెల్లం పాకం – ముప్పావు కప్పు (వడకట్టినది),కొబ్బరి కోరు,గోధుమ పిండి,బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున,ఏలకుల పొడి – పావు టీ స్పూన్ బేకింగ్ సోడా – చిటికెడు,నూనె,ఉప్పు – సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్లో బీట్రూట్ గుజ్జు, బియ్యప్పిండి, కొబ్బరి కోరు, గోధుమ పిండి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో ఏలకుల పొడి, బేకింగ్ సోడా, ఉప్పు, బెల్లం పాకం వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత పొంగనాల పాన్ కు బ్రష్‌తో నూనె రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని.. ఉడికించుకోవాలి.వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
ఫ్రైడ్రైస్లోకి కశ్మీరీ చట్నీ సూపర్ కాంబినేషన్.. ఇలా చేసుకోండి
కశ్మీరీ చట్నీ తయారీకి కావల్సినవి: కశ్మీరీ మిరపకాయలు – ఇరవై; నూనె – ఐదు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి తురుము – ఐదు టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు –రెండు టేబుల్ స్పూన్లు; టొమాటో కెచప్ – ఐదు టేబుల్ స్పూన్లు; రెడ్‌చిల్లీ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు; సోయాసాస్ – టేబుల్ స్పూను; మిరియాల పొడి – టేబుల్ స్పూను; అరోరూట్ పొడి – టేబుల్ స్పూను, చక్కెర – టేబుల్ స్పూను; వెనిగర్ – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: మిరపకాయలను నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.మిరపకాయలు చక్కగా నానాక మిక్సీజార్‌లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె మొత్తం వేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో వెల్లుల్లి తురుము, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి మీడియం మంట మీద వేయించాలి తరువాత ఎండుమిర్చి పేస్టు వేసి వేయించాలి.తరువాత టొమాటో కెచప్, రెడ్‌చిల్లీసాస్, సోయాసాస్, మిరియాల పొడి, అరోరూట్ పోడి, చక్కెర వేసి ఐదు నిమిషాలు తిప్పాలి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, వెనిగర్ వేసి రెండు నిమిషాల పాటు వెయించి దించేయాలి. నెలరోజుల పాటు నిల్వ ఉండే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, నూడుల్స్, ఎగ్ఫ్రైడ్రైస్ల్లోకి మంచి కాంబినేషన్. -
గుంటూరు మిర్చి: అ‘ధర’గొట్టిన ఎగుమతులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు మిర్చి ధరతో పాటు ఎగుమతుల్లోనూ తనకు పోటీ లేదని నిరూపించుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.10,445 కోట్ల మార్కును దాటా యి. మిర్చి ఎగుమతుల చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డు కావటం విశేషం. ఎగుమతుల పరంగా పరిమాణంలో కొంతమేర తగ్గినప్పటికీ.. ధర ఎక్కువ గా ఉండటంతో గత ఏడాది కంటే రూ.1,861 కోట్ల ఆదాయం అధికంగా లభించింది. మిర్చి ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 78 వేల హెక్టార్లు కాగా.. 2022– 23లో అత్యధికంగా 84,861 హెక్టార్లలో సాగు చేశారు. అంతర్జాతీయంగా పెరిగిన గిరాకీ ప్రస్తుతం మన దేశం నుంచి చైనా, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా సుమారు 20 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. కారం, విత్తనాలను సైతం ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోని మార్కెట్లపైనా గురిపెట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్నిరకాల మిర్చికి ఎగుమతుల హబ్‌గా తయారు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ఇతర మసాలా ఉత్పత్తులతోపాటు పత్తి, నూలు ఎగుమతులపైనా దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎక్స్‌పోర్టు హబ్‌గా మారుస్తాం గుంటూరును మిర్చి ఎక్స్పోర్ట్ హబ్‌గా మారిస్తే మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ, ముడి పదార్థాల లభ్యత పెంపు, నైపుణ్యం పెంపు, సాంకేతికత బదిలీ జరుగుతుంది. టూరిజాన్ని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెటింగ్ ఈవెంట్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. – ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్, గుంటూరు చిల్లీస్ బోర్డు ఏర్పాటు చేయాలి స్పైసెస్ బోర్డులో అత్యధిక విదేశీ ఆదాయాన్ని సమకూరుస్తున్న మిర్చి పంట కోసం కేంద్రం ప్రత్యేకంగా చిల్లీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. పంట చేతికొచ్చిన తర్వాత విదేశాలకు ఎగుమతులపై దృష్టి పెడుతున్న బోర్డు, రైతులకు కావాల్సిన మంచి విత్తనం, దీనికి సంబంధించిన పరిశోధనలపై దృష్టి పెట్టడం లేదు. అందుకే చిల్లీస్‌కు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. – తోట రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, చిల్లీస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ధర ‘తేజో’మయమే ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర క్వింటాల్‌కు రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలుకుతోంది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేల వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.12,500 నుంచి రూ.23,500 వరకు, ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.14 వేల నుంచి రూ.25,500 వరకు ధర లభిస్తోంది. కారం తయారీకి అధికంగా ఉపయోగించే 341, దేవనూరు డీలక్స్, 334 రకాల మిర్చి క్వింటాల్ రూ.23 వేలకు పైగా పలుకుతోంది. -
చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసినవి: పుట్టగొడుగులు (మష్రూమ్స్)-1 కప్పు, కాప్సికం ముక్కలు-1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసినవి),వెల్లుల్లి- 4 రెబ్బలు, టొమాటో కెచప్-2 టేబుల్ స్పూన్లు, వెనిగర్-1 టేబుల్ స్పూన్, సోయా సాస్-2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి-2 టేబుల్ స్పూన్లు, ఉప్పు-సరిపడా, నీళ్లు- కొద్దిగా, ఉల్లికాడ ముక్కలు- గార్నిష్‌కి, నూనె-తగినంత తయారీ: ముందుగా పుట్టగొడుగులను నూనెలో మీడియం మంట మీదే దోరగా వేయించాలి. అదే సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, సోయాసాస్, వెనిగర్‌ను ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయి తీసుకుని, 2 గరిటెల నూనె వేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలతో పాటు.. క్యాప్సికమ్ ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఆపై పుట్టగొడుగుల్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. అనంతరం మిగిలిన టొమాటో కెచప్‌తో పాటు.. మొక్కజొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కీమా పోహా కావలసినవి: కీమా-పావు కప్పు (మెత్తగా ఉడికించుకోవాలి), అటుకులు(పోహా)-ముప్పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు-అర టీ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి), కారం-అర టీ స్పూన్, గరం మసాలా, ఆమ్ చూర్ పౌడర్-1 టీ స్పూన్ చొప్పున, గ్రీన్ బఠాణీ-కొద్దిగా (నానబెట్టి, ఉడికించినవి), పసుపు-అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు-3 టేబుల్ స్పూన్లు, టొమాటో, క్యారెట్ ముక్కలు-కొన్ని (చిన్నగా కట్ చేసినవి) కరివేపాకు, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా. తయారీ: ముందుగా 2 టీ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. అందులో టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం ఉడికించిన కీమా వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. తర్వాత ఆమ్ చూర్ పౌడర్, గ్రీన్ బఠాణీ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈలోపు అటుకులు తడిపి, వెంటనే నీళ్లు లేకుండా గట్టిగా పిండి, కీమాలో వేసుకుని తిప్పుతూ ఉండాలి. కళాయికి మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర, కారప్పూస వంటివి వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. వాల్నట్ షీరా కావలసినవి: రవ్వ-1 కప్పు (దోరగా వేయించుకోవాలి), వాల్నట్స్-1 కప్పు (మెత్తగా మిక్సీ పట్టుకోవాలి), కొబ్బరి కోరు- పావు కప్పు, ఏలకుల పొడి-కొద్దిగా, నెయ్యి- పావు కప్పు, పంచదార-1 కప్పు (అభిరుచిని బట్టి మరికొంత పెంచుకోవచ్చు), పాలు-రెండున్నర కప్పులు, చాక్లెట్ పౌడర్-పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు-గార్నిష్ కోసం(అభిరుచిని బట్టి). తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. బౌల్లో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఏలకుల పొడి, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కొంత సేపు తర్వాత చాక్లెట్ పౌడర్, వాల్నట్స్ గుజ్జు వేసుకుని కలుపుతూ ఉండాలి. రవ్వ, కొబ్బరి కోరు వేసుకుని దగ్గర పడేదాక గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా నెయ్యి వేసుకుని బాగా దగ్గర పడేదాకా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుందీ వాల్నట్ షీరా. అభిరుచిని బట్టి పైన మరిన్ని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. -
ఛాలెంజ్ నెగ్గిన నాసా.. ‘స్పేస్’లో మిరపకాయలు?
అంతరిక్షంలో నివాస యోగ్యత గురించి పరిశోధనలు-ప్రయోగాలు ఎన్నేళ్లు సాగుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అయితే విశ్వంలోని కొన్ని మర్మాలను చేధించడం, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకు వేసింది. స్పేస్ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది. 15,000 వేలకోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మిరపకాయల్ని పండిస్తోంది నాసా. మెక్సికన్ రకానికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరప గింజలు ఈ జూన్‌లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్ కిమ్బ్రాగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు. కిచెన్ ఓవెన్ సైజులో ఉండే ‘సైన్స్ క్యారియర్’ అనే డివైజ్‌లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణించుకుంటోంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు, దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్‌లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్‌గా తీసుకున్న నాసా.. సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన, రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు ‘స్పైసీ’ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది. 🌶️ Chile peppers are spicing up the @Space_Station! Recently, @astro_kimbrough added water to NASA’s Plant Habitat-04 experiment. In less than 4⃣ months, @NASA_Astronauts will pick their first harvest. Follow along as these space peppers kick up the heat: https://t.co/KpCVpd850U pic.twitter.com/KS3qvRoz22 — NASA's Kennedy Space Center (@NASAKennedy) July 14, 2021 -
గుంటూరు: టిక్కీకి రూ.150 అద్దె
సాక్షి, అమరావతి: మిర్చిని నిల్వ చేసుకునే రైతుల నుంచి టిక్కీకి రూ.150 అద్దె వసూలు చేసేందుకు గుంటూరు కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులు అంగీకరించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డును ప్రభుత్వం మూసివేసింది. దీంతో కొందరు రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకుంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేందుకు కొందరు నిర్వాహకులు రైతుల నుంచి రూ.200 అద్దెను వసూలు చేస్తున్నారు. దీనిపై రైతులు బుధవారం మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాలను సేకరించిన ముఖ్యకార్యదర్శి కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులతో గురువారం చర్చలు జరిపి, ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా అద్దెను నిర్ణయించారు. సీజను పూర్తయ్యేవరకు రైతుల నుంచి ఒక్కో టిక్కీకి రూ.150 అద్దెను వసూలు చేసే విధంగా, హమాలీల ఎగుమతి, దిగుమతి ఖర్చులను నిర్వాహకులే భరించాలని నిర్ణయించారు. (259 మంది ఖైదీల విడుదల) -
రాణిస్తాన్ వంట గది
ఇవిగో రాజస్తాన్ వంటలు.స్నాక్‌స్నాక్‌లో రాజసం కనపడుతుంది.మీ ఇంటి రాజావారి కోసం ...రాణీవారు ప్రేమగా వండితే...అవి రాణిస్తాన్ వంటకాలు కావా మరి! ఘేవార్ కావలసినవి నెయ్యి – అర కప్పు; ఐస్ క్యూబ్ – 1 (పెద్దది); మైదా పిండి – 2 కప్పులు; పాలు – అర కప్పు; చల్లటి నీళ్లు – 3 కప్పులు; నిమ్మరసం – ఒక టీ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్ తరుగు – అలంకరించడానికి తగినన్ని; మిఠాయి రంగు – చిటికెడు; పంచదార పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – పావు కప్పు తయారీ ►ఒక పాత్రలో అర కప్పు నెయ్యి వేసి, ఆ నేతిని ఐస్ క్యూబ్‌తో బాగా రుద్దాలి ►నెయ్యి బాగా తెల్లగా అవుతుంది ∙రెండు కప్పుల మైదా పిండి వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి ►అర కప్పు చల్లటి పాలు జత చేసి మరోమారు కలపాలి ∙ఆ తరవాత మరో మూడు కప్పుల చల్లటి నీళ్లు, ఒక టీ స్పూను నిమ్మరసం వేసి దోసె పిండిలా కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ►గరిటెడు పిండి తీసుకుని, కాగిన నూనెలో కొద్దికొద్దిగా ఆగుతూఆగుతూ వేస్తుండాలి ►మధ్యలో రంధ్రం ఉండేలా జాగ్రత్తపడాలి ►బంగారురంగులోకి వచ్చే వరకు వేయించి, కాడలాండి దానితో ఘేవార్ను ప్లేట్లోకి తీసుకోవాలి (నూనె కారిపోయేలా నిలబెట్టాలి) ►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. పంచదార పాకం తయారీ ►ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద సన్నని మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి ►మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిఠాయి రంగు, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జతచేసి బాగా కలిపి, తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ►తయారుచేసి ఉంచుకున్న ఘేవార్ల మీద గరిటెడు పంచదార పాకం సమానంగా పోయాలి ►డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాలి. గులాబ్ శక్రీ కావలసినవి చిక్కటి పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; అరటి పండు గుజ్జు – ఒక కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – 3 టేబుల్ స్పూన్లు తయారీ ►ఒక గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి, మరిగించాలి (పాలు సగానికి ఇగిరిపోవాలి) ►కొద్దికొద్దిగా నిమ్మ రసం జత చేస్తూ, పాలు విరిగేవరకు కలుపుతుండాలి ∙పాలు విరిగినట్లు తెలియగానే ఇక నిమ్మరసం వేయక్కర్లేదు ∙అరటి పండు గుజ్జు జత చేసి కలపాలి ∙పంచదార కూడా జత చేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక కుంకుమ పువ్వు వేసి కలపాలి ∙డ్రై ఫ్రూట్స్ తరుగు, అరటి పండు ముక్కలతో అలంకరించి అందించాలి. చుర్మా కావలసినవి గోధుమ పిండి – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు; నూనె – ఒకటిన్నర కప్పులు; పాలు – తగినన్ని; బొంబాయి రవ్వ – 4 టేబుల్ స్పూన్లు; పంచదార లేదా బెల్లం పొడి – అర కప్పు; డ్రైఫ్రూట్స్ తరుగు – 4 టేబుల్ స్పూన్లు ►ఒక పెద్ద పాత్రలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి కలపాలి ►నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు రాకుండా జాగ్రత్తగా చేతితో కలపాలి ►కొద్దికొద్దిగా పాలు పోస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి ►తడి వస్త్రంతో మూత వేయాలి ►పిండి గట్టిపడ్డాక, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ►ఒక్కో బాల్ని చేతిలోకి తీసుకుని కొద్దిగా ఒత్తాలి ►ఈ విధంగా అన్నిటినీ ఒత్తుకోవాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాచాలి ►ఒక్కో ఉండను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►బాగా చల్లారాక ఈ బాల్స్‌ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పెద్ద పాత్రలోకి, ఈ పొడి వేసి, కరిగించిన నెయ్యిని, బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ∙డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి వెంటనే అందించాలి. ఆనియన్ కచోరీ కావలసినవి స్టఫింగ్ కోసం నూనె – 3 టీ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను (చేతితో మెదపాలి); సోంపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; తరిగిన పచ్చిమిర్చి – 1; అల్లం ముద్ద – అర టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; గరంమసాలా – అర టీ స్పూను; ఆమ్చూర్ పొడి – పావు టీ స్పూను; పంచదార – పావు టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; శనగ పిండి – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. పూరీ పిండి కోసం మైదా పిండి – 2 కప్పులు; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ ►ఒక పాత్రలో రెండు కప్పుల మైదా పిండి, ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ, అర టీ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేయాలి ►అర కప్పు నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి ►ఒక టీ స్పూను నూనె వేసి బాగా కలిపి, తడి వస్త్రంతో కప్పేసి 20 నిమిషాలు ఉంచేయాలి. ఆనియన్ స్టఫింగ్ ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, ధనియాలు, సోంపు, ఇంగువ వేసి దోరగా వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►మంట బాగా తగ్గించాలి ►పావు టీ స్పూను పసుపు, మిరప కారం, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, పంచదార, ఉప్పు జత చేసి బంగారురంగులోకి వచ్చేవరకు కలియబెట్టాలి ►పావు కప్పు సెనగ పిండి జతచేసి మరోమారు కలపాలి ►కొత్తిమీర జత చేసి కలిపితే, ఆనియన్ స్టఫింగ్ సిద్ధమైనట్లే ►కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ►ఒక్కో ఉండను తీసుకుని చేతితో పల్చగా ఒత్తాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఆనియన్ స్టఫింగ్ ఒక టీ స్పూను తీసుకుని, ఒత్తిన పూరీ మధ్యలో ఉంచి, అన్నివైపులా మూసేసి, చేతితో కొద్దిగా అదమాలి ►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కచోరీలను నూనెలో వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టమాటా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. దిల్ కుశాల్ కావలసినవి సెనగ పిండి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; పచ్చి కోవా తురుము – ఒక కప్పు ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార పాకం కోసం: పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; అలంకరించడం కోసం: పిస్తా తరుగు – తగినంత తయారీ. ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►శనగ పిండి జత చేసి దోరగా వేయించాలి ►మిగిలిన నెయ్యి వేసి మరోమారు కలిపి, బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించాలి ►పచ్చి కోవా తురుము, ఏలకుల పొడి జత చేసి మరో పది నిమిషాలు కలిపి దింపి చల్లారనివ్వాలి. పంచదార పాకం ►ఒక పాత్రలో పంచదార, నీళ్లు వేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాల పాటు మరిగించాలి ►రెండు టేబుల్ స్పూన్ల పాలు జత చేసి తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ►చల్లారిన శనగ పిండి మిశ్రమం మీద ఈ పాకం పోసి బాగా కలపాలి ►ఒక పళ్లానికి నెయ్యి పూసి, ఈ మిశ్రమాన్ని ఆ పళ్లెంలో పోయా లి ►పిస్తా తరుగు, బాదం తరుగులను పైన చల్లి, సుమారు ఐదు గంటల పాటు ఆరబెట్టాక, చాకుతో ముక్కలు కట్ చేసి అందించాలి. పాపడ్ కీ సబ్జీ కావలసినవి నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; కశ్మీరీ మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; అప్పడాలు – 4; ఉప్పు – పావు టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు. తయారీ ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక నాలుగు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి ►అర టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను మిరప కారం, అర టీ స్పూను ధనియాల పొడి జత చేసి, సన్నటి మంట మీద వేయించాలి ►బాగా వేగిన తరువాత ఒక కప్పుడు నీళ్లు, ఒక కప్పుడు చిలికిన పెరుగు జత చేయాలి ►అన్నీ బాగా కలిసేవరకు ఆపకుండా కలుపుతుండాలి ►వేయించిన అప్పడాలను ముక్కలుగా చేసి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలపాలి ►పావు టీ స్పూను ఉప్పు జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి ►అర టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూను కసూరీ మేథీ, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి కలిపి దింపేయాలి ►ఈ సబ్జీ చపాతీలలోకి రుచిగా ఉంటుంది. గట్టే కీ సబ్జీ కావలసినవి శనగ పిండి – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 టేబుల్ స్పూన్లు; ఆనియన్ పేస్ట్ కోసం ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; అల్లం తరుగు – అర టీ స్పూను; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు; గ్రేవీ కోసం జీలకర్ర – ఒక టీ స్పూను; లవంగాలు – 3; దాల్చిన చెక్క ముక్క – చిన్నది; ఏలకులు – 2; ఎండు మిర్చి – 2; పెరుగు – ఒక కప్పు; ఇంగువ – చిటికెడు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; గట్టేలను ఉడికించిన నీళ్లు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు గట్టే తయారీ ఒక పాత్రలో రెండు కప్పుల శనగ పిండి వేయాలి ∙కొద్దిగా ఇంగువ, పావు టీ స్పూను పసుపు, అర టీ స్పూను వాము, అర టీ స్పూను మిరప కారం, ఒక టీ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూను ఉప్పు వేసి కలపాలి ∙మూడు టేబుల్ స్పూన్ల నూనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు జత చేసి అన్నీ బాగా కలిసేవరకు కలియబెట్టాలి ∙నీళ్లు పోసి పిండి గట్టిగా వచ్చేలా సుమారు పది నిమిషాల పాటు కలపాలి అవసరాన్ని బట్టి నీళ్లు జత చేసి, పూరీ పిండిలా తయారుచేసుకోవాలి ∙అలా చేయడం వలన గట్టేలను తేలికగా ఒత్తుకోవచ్చు. ఉడికించడం... ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి కలిపి ఉంచుకున్న శనగ పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను పొడవుగా కడ్డీలా ఒత్తి, అంగుళం పొడవుగా ముక్కలు చేయాలి తగినన్ని ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి ∙బాగా ఉడికి, పైకి తేలిన తరువాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆనియన్ పేస్ట్ తయారీ మిక్సీ చిన్న జార్లో ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయాలి గ్రేవీ తయారీ ఒక పాత్రలో ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా అయ్యేవరకు బాగా గిలక్కొట్టాలి గట్టేను ఉడికించిన కప్పు వేడినీళ్లను పక్కన ఉంచాలి ఉడికించిన గట్టేలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చే యాలి జీలకర్ర, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ఆనియన్ పేస్ట్ జత చేసి మరోమారు వేయించి దింపేయాలి గిలక్కొట్టిన పెరుగు వేసి బాగా కలిపి మళ్లీ స్టౌ మీద ఉంచి మంట బాగా తగ్గించాలి పెరుగును ఆపకుండా కలుపుతుండాలి బాగా ఉడికిన తరువాత పసుపు, మిరప కారం, ధనియాల పొడి, ఇంగువ వేసి కలియబెట్టాలి ►గట్టేకు ఉడికించిన నీళ్లను జత చేయాలి ∙తగినంత ఉప్పు వేసి కలపాలి ►గ్రేవీ బాగా ఉడికిన తరువాత గట్టే ముక్కలను అందులో వేసి మృదువుగా కలపాలి ∙గ్రేవీ బాగా చిక్కబడ్డాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించాలి ∙రోటీలతోను, పరోటాలతోను తింటే రుచిగా ఉంటుంది. -
మిర్చి చాలా మేలు గురూ!
మనం వంటకాల్లో మిరపకాయను కారం కోసం వాడతాం. అయితే దాని కారం చాలా రకాల క్యాన్సర్లకు కూడా ఘాటుగానే పరిణమిస్తుందని అధ్యయనాల్లో తేలింది. అందుకే క్యాన్సర్ రోగులకు మిరప ఒక వరప్రదాయని. మిరపలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లతో పోరాడతాయి. దాంతో పాటు మిరప వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... ♦ మిరపకాయలలోని క్యాప్ససిన్ అనే పదార్థం వల్లనే దానికి ఆ కారపు రుచి వస్తుంది. ఈ కారపు ఘాటు తాకగానే ముక్కు, సైనస్‌లలోని మ్యూకస్ పలచబారి బయటకు వచ్చేస్తుంది. ఇలా మిరపకాయ జలుబునూ, సైనస్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తుంది. ♦ మిరపకాయలో పొటాషియమ్, మ్యాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటి చాలా రకాల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియమ్ మన రక్తపోటును నియంత్రిస్తుంది. మ్యాంగనీస్ను అనేక దేహం అనేక యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ తయారీలో ఉపయోగించుకుంటుంది. ♦ మిరప కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది. ♦ మిరపకాయలో విటమిన్–సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. వాటి కారణంగానే మిరపకాయలు తినేవారిలో వారిలో మేని నిగారింపు ఎక్కువ. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ♦ మిరపలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. చర్మంపై ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మిరపకాయలు తింటే అవి వేగంగా తగ్గుతాయి. ♦ మిరపలో విటమిన్–కె కూడా ఎక్కువే. అది గాయాలైనప్పుడు రక్తస్రావం అయ్యే ప్రమాదాలను అరికట్టడమే కాకుండా ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది. ♦ మిరప రక్తంలోని చక్కెర పాళ్లను గణనీయంగా నియంత్రిస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అందుకే డయాబెటిస్ ఉన్న వారికి (తగిన మోతాదులో తింటే) మిరప మేలు చేస్తుంది. మిరప వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ... దానిలోని కారం గుణం కారణంగా దాన్ని పరిమితమైన మోతాదులోనే తీసుకోవాలి. ఈ మోతాదు తమ వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. -
పోషక యాజమాన్యంతో సత్ఫలితాలు
- మెలకువలు పాటిస్తే టమాటా, మిరపలో మేలైన దిగుబడి - సేంద్రియ, రసాయనాలతో పాటు ఫర్టిగేషన్ ఇవ్వాలి - కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : టమాట, మిరపలో సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల ఆశించిన దిగుబడి రావడం లేదని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. దుక్కిలో వేయడంతో పాటు డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో సకాలంలో సరైన మోతాదులో ఎరువులు అందిస్తే పంట దిగుబడులకు డోకా ఉండదన్నారు. టమాటా : చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటే సమయంలో ఎకరాకు 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ పాస్ఫేట్), 24 కిలోలు పొటాష్ (40 కిలోల మ్యూరేట్ ఆప్ పొటాష్) ఎరువు వేయాలి. 48 నుంచి 60 కిలోల నత్రజని ఎరువును మూడు సమపాళ్లుగా చేసి నాటిన 30, 45, 60 రోజుల సమయంలో పైపాటుగా వేసుకొని బోదెలను ఎగదోయాలి. పూత దశలో 20 గ్రాములు యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే 15 నుంచి 20 శాతం దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరాకు 8 నుంచి 12 కిలోలు చొప్పున బోరాక్స్ వేస్తే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరాకు 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేస్తే జింకు లోపం ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. నాటిన తర్వాత 30, 45 రోజుల సమయంలో 2 గ్రాములు జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత దశలో ఎకరాకు ఎకరాకు 400 గ్రాములు 2,4–డీ మందును 200 లీటర్ల నీటికి కలిపి లేదా 1 మి.లీ. ప్లానోఫిక్స్ నాలుగు లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పూత, పిందె రాలకుండా కాపాడుకోవచ్చు. ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువులు : టమాటా నాటిన 15 నుంచి 40 రోజుల వరకు ఒక కిలో 19–19–19 + ఒక కిలో యూరియా + 500 గ్రాములు 12–61–0 ఎరువులు ఫర్టిగేషన్ పద్ధతిలో అందజేయాలి. 45 రోజుల నుంచి 70 రోజుల వరకు 250 గ్రాములు 13–0–45 + ఒక కిలో తెల్ల పొటాష్ + 50 గ్రాములు రిక్సోలీన్ ఎరువులు ఇవ్వాలి. 70 రోజుల నుంచి పంట కోత వరకు 750 గ్రాములు 13–0–45 + 500 గ్రాములు 0–0–50 + ఒక కిలో కాల్షియంనైట్రేట్ ఎరువులు డ్రిప్ ద్వారా అందించాలి. వీటితో పాటు పంట నాటిన తర్వాత నుంచి పంట కోత వరకు పైన తెలిపిన ఎరువులతోపాటు 500 గ్రాములు బోరాన్, 500 గ్రాములు జింక్ చిలామిన్ + 2.5 కిలోలు మెగ్నీషియం సల్ఫేట్ లాంటి సూక్ష్మపోషకాలు అందజేయాలి. మిరప : ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి. హెక్టారుకు వర్షాధార పైరుకు 60 కిలోలు నత్రజని, 40 కిలోలు భాస్వరం, 50 కిలోలు పొటాష్ ఎరువులు వేయాలి. ఆరుతడి పంటల పైరుకు హెక్టారుకు 300 కిలోలు నత్రజని, 60 కిలోలు భాస్వరం, 120 కిలోలు పొటాష్ ఎరువు వేయాలి. ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా నాటిన 15వ రోజు నుంచి 45వ రోజు వరకు అర కిలో వైట్ పొటాష్ + ఒక కిలో యూరియా + 500 గ్రాములు సీఎన్ ఇవ్వాలి. 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఒక కిలో 19–19–19 + 500 గ్రాములు 12–61–0 ఎరువులు వేయాలి. 90 రోజుల నుంచి 150 రోజుల వరకు ఒక కిలో 13–0–45 + అర కిలో యూరియా + అర కిలో అమ్మోనియం సల్ఫేట్ అందజేయాలి. 150 రోజుల నుంచి 210 రోజుల వరకు 1.5 కిలోలు యూరియా + అర కిలో 13–0–45 + అర కిలో 0–0–50 + ఒక కిలో సీఎన్ ఎరువులు డ్రిప్ ద్వారా అందజేయాలి. -
పొరుగు రాష్ట్రాల్లో విక్రయానికే మిర్చిరైతుల మొగ్గు
ఇప్పటికే 70 శాతం పంట జగదల్పూర్లో విక్రయం తీవ్రంగా నష్టపోతున్న వైనం నెల్లిపాక: సరైన ధరలేక తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మద్దతు ధర ప్రకటనలు మాయగా మారాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్వెన్షన్ స్కీం విలీన మండలాలవారికి ఏ మాత్రం ఉపయోగపడదంటున్నారు. ఇప్పటికే ఇక్కడి మిర్చి రైతులు పొరుగు రాష్ట్రాల్లో తమ పంటను విక్రయిస్తున్నారు. 80 శాతం మిర్చి పంటను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో విక్రయించారు. గిట్టుబాటు ధర రాకపోయినా ఇక్కడి మార్కెట్ ధర కంటె పక్క రాష్ట్రంలోనే బాగుందన్న అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఎటపాక, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో సుమారు 5,200 మంది రైతులు 10 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని గుంటూరు మార్కెట్లో క్వింటాలు మిర్చికి సుమారు రూ. 3,200 వరకు ధర పలుకుతోంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ మార్కెట్లో సుమారు రూ. 4,500 ధర పలుకుతోంది. దాంతో రవాణా ఖర్చులు అధికమైనప్పటికీ మిర్చి పంటను జగదల్పూర్లో అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. అనేక నిబంధనలకు లోబడి గుంటూరు మార్కెట్‌కు పంటను తరలించినా సకాలంలో అమ్ముకునే వీలుండటం లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు 20 క్వింటాళ్ల వరకు క్వింటాలుకు రూ. 1,500 అదనంగా చెల్లిస్తామని చేసిన ప్రకటన ఏవిధంగానూ ఇక్కడి రైతులకు ఉపయోగపడలేదు. కొందరు రైతులు మిర్చిని గుంటూరు మార్కెట్‌కు తరలించినా పంటను కొనేవారులేక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. దాంతోతో గుంటూరు మార్కెట్లో విక్రయానికి విలీన మండలాల రైతులు అనాసక్తి చూపుతున్నారు. 80 శాతం వరకూ పంటను అమ్ముకున్నాక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన పథకాలు కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే అని వారు విమర్శిస్తున్నారు. ఈఏడాది పెట్టుబడులు అధికం కావటం, గిట్టుబాటు ధర రాకపోవటం, ప్రభుత్వం రైతులను సకాలంలో ఆదుకోక పోవటంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విలీన మండలాల్లో మిర్చి పంట వివరాలు (వ్యవసాయశాఖ అంచనా) మండలం రైతులు ఎకరాలు దిగుబడి సీజీలో విక్రయం ఎటపాక 3076 5000 98000 70శాతం వీఆర్ పురం 534 1254 25000 80శాతం కూనవరం 1500 1945 38940 80శాతం చింతూరు 50 300 6000 90శాతం గుంటూరు మార్కెట్‌కు వెల్లినా ఫలితం లేదు గుంటూరు మార్కెట్‌కు 30క్వింటాళ్ల మిర్చిని తీసుకెళ్లను. అక్కడ అనేక షరతులు విధించటంతో వారం రోజులు మార్కెట్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. ఈలోగా సుమారు రూ. 1500 ధర పతనమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రోత్సాహకం అందలేదు. - కోడూరు నవీన్, ఎటపాక -
మిరప పంట దగ్ధం
మద్దికెర: మద్దికెర గ్రామంలో 40 క్వింటాళ్ల మిరపపంట అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. దాదాపు రూ.4 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రైతు ఉమామహేశ్వరరావు వేలాది రూపాయలు అప్పులు చేసి ఎండు మిర్చి పంటను సాగు చేశాడు. పంటను కోసి తోటలో ఎండబెట్టాడు. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది.స్థానిక రైతులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఫైరింజన్‌తో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పంట మొత్తం దగ్ధమైంది. మద్దికెర పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అబ్దుల్‌జహీర్ తెలిపారు. -
కూరగాయల పంటల్లో ‘వేసవి’ జాగ్రత్తలు
అనంతపురం అగ్రికల్చర్ : వేసవిలో అధికంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో కూరగాయల పంటల యాజమాన్యంపై రైతులకు నిర్వహించిన శిక్షణలో సేంద్రియ విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబుతో కలిసి డాక్టర్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. పంట మార్పిడి తప్పనిసరి కూరగాయల పంటల సాగు ద్వారా అధిక దిగుబడులు సాధించాలంటే ఒకేరకమైన పంట వేసుకోకూడదు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. లేదంటే ఎరువులు, నీరు, ఇతరత్రా పెట్టుబడి ఎంత పెట్టినా పంట రావడం కష్టం. రసాయన ఎరువులతో పాటు సమపాళ్లలో సేంద్రియ ఎరువులు తప్పనిసరిగా వాడాలి. వైరస్ తెగులు నివారణకు జాగ్రత్తలు పాటిస్తే కూరగాయల పంటల్లో మంచి దిగుబడులు తీసుకోవచ్చు. నీటి యాజమాన్యంలో మెలకువలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి యాజమాన్యం విషయంలో మెలకువలు పాటించాలి. ప్రస్తుతం వంగ, మిరప పంటలు, కర్భూజా, కళింగర పంటల నారు పోసుకోవచ్చు. ఏప్రిల్ 15 తర్వాత నాటుకోవాలి. ఇపుడు ఏరకం కూరగాయలు పంటలు సాగు చేసినా మల్చింగ్ పద్ధతి అవలంబించాలి. దీని వల్ల నీటి ఆదా, కూలీల ఖర్చు తగ్గుతుంది. ప్రధాన పొలం చుట్టూ రక్షణ పంటలుగా నాలుగైదు సాళ్లు జొన్న, మొక్కజొన్న, సజ్జ ఒత్తుగా వేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. వీటి వల్ల పురుగులు, తెగుళ్లు, వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. - వేసవిలో కూరగాయల పంటల్లో పూత రాలే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఉదయం సమయాల్లో 2 మి.లీ ప్లానోఫిక్స్ + 5 గ్రాములు 19–19–19 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. - రసంపీల్చు పురుగుల నివారణకు 6 నుంచి 8 కిలోలు వేపపిండికి 6 నుంచి 8 కిలోలు కార్బోఫ్యూరాన్ గులికలు లేదంటే 6 నుంచి 8 కిలోలు పిప్రోనిల్ గులికలు ఎకరాకు వేయాలి. తొలకర్లు కురిసే వరకు కూరగాయల పంటలకు పెద్దగా తెగుళ్లు, పురుగులు సోకే అవకాశం ఉండదు. కేవలం నీటి ఎద్దడికి గురికాకుండా కాపాడుకోవాలి. - బెండ, కాకర, బీర, సొర, దోస, గుమ్మడి , కూర గుమ్మడి, పొద చిక్కుడు, గోరుచిక్కుడు తదితర తీగజాతి కూరగాయల పంటలు సాగు చేసే వారు భూములను బాగా దుక్కి చేసుకుని ఎంపిక చేసుకున్న విత్తనాలను నాటుకోవాలి. నత్రజని స్థాపించే రైజోబియం కల్చరుతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. చివరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 నుంచి 32 కిలోల భాస్వరం, 20 నుంచి 24 కిలోలు పొటాష్ ఎరువులు ఎకరాకు వేసుకోవాలి. నత్రజని ఎరువులను రెండు భాగాలుగా చేసుకుని విత్తిన 25 రోజులు, 45 రోజుల సమయంలో పైపాటుగా వేసుకోవాలి. -
గుంటూరులో 70లక్షల కల్తీ కారమ్ స్వాదీనం
-
కళ్లల్లో కారం కొట్టి..
చాపాడు: ఓ వృద్ధురాలి కళ్లలో కారం పొడి కొట్టి మెడలోని బంగారు తాళిబొట్టు సరుడును ఇద్దరు దొంగలు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం సాయంత్రం మండలంలోని ఖాదర్‌పల్లె రోడ్డులో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పల్లవోలుకు చెందిన బాలమ్మ పొలంలో వేసిన నారుమడిని చూసేందుకు ఖాదర్‌పల్లె రోడ్డుపై మూడో మోరి వద్ద వెళ్తుండగా, ఖాదర్‌పల్లె నుంచి వస్తున్న ఇద్దరు దుండగులు ఆమెతో మాటలు కలిపారు. దగ్గరికి రాగానే కళ్లలో కారంపొడి చల్లారు. ఆమె తేరుకోకముందే మెడలో ఉన్న రూ.1.35 లక్షల విలువ చేసే 4.50 తులాల బంగారు తాళిబొట్టు సరుడును లాక్కెళ్లారు. ఈ క్రమంలో తాళిబొట్టు బిళ్లలు అక్కడే పడిపోయాయి. వాటిని ఆమె తీసుకున్నారు. వారిని చూస్తే గుర్తిస్తానని బాలమ్మ చెబుతోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. -
రెపరెపలాడే రుచులు
రంగులు జెండాలకే కాదు... వంటలకూ ఉన్నాయి... ఒక్కో రంగు వంటకం ఒక్కో విటమిన్‌ని అందిస్తుంది... మూడు రంగుల మేళవింపు జెండా... లెక్కలేనన్ని రంగులు సమాహారం పోషకాహారం... రిపబ్లిక్‌డే జాతీయ పండుగ... ఈ సందర్భంగా విభిన్న రాష్ట్రాల రుచులను ఆస్వాదిద్దాం... భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపిద్దాం... కావలసినవి: నూనె - 200 గ్రా.; ఆవాలు, మెంతులు, జీలకర్ర - పోపుకి తగినన్ని; ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూను; చింతపండు - 125 గ్రా. (నానబెట్టి, చిక్కగా పులుసు తీయాలి); పచ్చి మిర్చి - అర కేజీ (శుభ్రంగా కడిగి మధ్యకు గాటు పెట్టాలి); కొబ్బరి తురుము - 125 గ్రా.; టొమాటోలు - 8 (మీడియం సైజువి); కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట మసాలా పేస్ట్ కోసం: నువ్వులు - 50 గ్రా.; జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు; (ఈ మూడు పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తే మసాలా తయారవుతుంది) తయారీ: బాణలిలో నూనె కాగాక ముందుగా పచ్చి మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి మసాలా, చింతపండు పులుపు జత చేసి కలియబెట్టి, కొద్దిగా నీళ్లు, వేయించి ఉంచుకున్న పచ్చి మిర్చి, టొమాటోలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాక కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి దింపేయాలి. బెల్ పెపర్స్ అండ్ టొమాటో కర్రీ కావలసినవి: పనీర్ - కప్పు (మెత్తగా మెదపాలి); బంగాళదుంపలు - 3 (ఉడికించి, తొక్కు తీసి మెదపాలి); కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; కిస్మిస్ - 3 టేబుల్ స్పూన్లు; మిరియాల పొడి - తగినంత; ఉప్పు - తగినంత; గరం మసాలా పొడి - పావు టీ స్పూను; కారం - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; రెడ్ క్యాప్సికమ్ - 4 (పెద్దవి); నూనె - తగినంత కూర కోసం...: ఏలకుల పొడి - అర టీ స్పూను; బిరియానీ ఆకు - 1 ; వెల్లుల్లి రేకలు - 6 (కచ్చాపచ్చాగా చేయాలి); ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా తరగాలి); టొమాటోలు - 3 (చిన్న ముక్కలుగా వచ్చేలా తరగాలి); పాలు - అర కప్పు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; కారం - టీ స్పూను; గరం మసాలా పొడి - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; క్రీమ్ - టేబుల్ స్పూను; నూనె - 4 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; నీళ్లు - తగినన్ని; జీడిపప్పులు - కొద్దిగా; పుదీనా ఆకులు - కొన్ని తయారీ: ఒక పాత్రలో పనీర్, ఉడికించిన బంగాళదుంప వేసి, వాటికి కొత్తిమీర, కిస్మిస్, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కారం, జీల కర్ర పొడి జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి రెడ్ క్యాప్సికమ్ పై భాగం కొద్దిగా కట్ చేసి అందులోని గింజలను బయటకు తీసేయాలి ఒక్కో క్యాప్సికమ్‌ను ముందుగా తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంతో స్టఫ్ చేయాలి స్టౌ మీద పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి కాగాక స్టఫ్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్‌లను వేసి వేయించి కొద్దిసేపయ్యాక రెండవ వైపు కూడా తిప్పి బాగా వేగాక తీసి పక్కన ఉంచాలి. కూర తయారీ: బాణలిలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఏలకుల పొడి, బిరియానీ ఆకు వేసి రెండు నిమిషాలు వేయించాలి వెల్లుల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు కలపాలి ఉల్లి తరుగు వేసి బాగా వేగాక, టొమాటో తరుగు, జీడి పప్పు పలుకులు, పాలు వేసి వేయించి సుమారు ఐదారు నిమిషాలు మీడియం మంట మీద ఉంచి టొమాటో తరుగు గుజ్జులా మెత్తబడే వరకు కలపాలి బాగా చల్లారాక అందులో నుంచి బిరియానీ ఆకు తీసేయాలి అదే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి కారం, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, అర కప్పు నీళ్లు వేసి బాగా కలియబెట్టి, మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించాక మూత తీసి క్రీమ్, కొత్తిమీర తరుగు వేసి క లిపి, చివరగా స్టఫ్డ్ క్యాప్సికమ్ వేసి ఉడికించి దించేయాలి పుదీనా తరుగు, జీడిపప్పులతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. దిల్ బహార్ కావలసినవి: పాలు - లీటరు; పంచదార - ముప్పావు కప్పు; పాల పొడి - అర కప్పు; పచ్చి కోవా - అర కప్పు; జీడిపప్పులు - తగినన్ని; చెర్రీ - తగినన్ని; పిస్తా పప్పులు - కొన్ని; కుంకుమ పువ్వు - చిటికెడు తయారీ: ముందుగా పాలను మరిగించాలి నిమ్మరసం నీళ్లు జత చేసి పాలను పనీర్గా చేయాలి పనీర్‌ను ప్లేట్లోకి తీసి, మీకు నచ్చిన ఆకృతిలో తయారుచేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో మూడు కప్పుల నీళ్లు, ముప్పావు కప్పు పంచదార వేసి స్టౌ మీద ఉంచి, మరిగించాక అందులో గుండె ఆకారంలో తయారుచేసిన వాటిని వేసి, అవి పాకం పీల్చుకుని రెట్టింపు పరిమాణంలోకి పెరగ్గానే, స్టౌ మీద నుంచి దింపేసి, సుమారు నాలుగు గంటలు వాటిని అందులోనే నాననివ్వాలి ఒక పాత్రలో అర కప్పు పంచదార, పచ్చి కోవా వేసి స్టౌ మీద ఉంచి, మిశ్రమం బాగా చిక్కబడ్డాక కిందకు దింపేయాలి ఒక ట్రేలో పనీర్‌తో తయారుచేసి ఉంచుకున్న దిల్ బహార్లను వేసి వాటి మీద కోవా మిశ్రమం వేసి, జీడిపప్పు, చె ర్రీ, పిస్తా పప్పులు, కుంకుమ పువ్వులతో అలంకరించి చల్లగా అందించాలి. కాజు కట్లీ కావలసినవి: జీడిపప్పు - కప్పు; పంచదార - అర కప్పు; నీళ్లు - 5 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టేబుల్ స్పూను; రోజ్ వాటర్ - టీ స్పూను; బటర్ పేపర్లు - తగినన్ని; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; ఫుడ్ కలర్ - కొన్ని చుక్కలు (ఆరెంజ్, గ్రీన్) తయారీ: ముందుగా జీడిపప్పులను మిక్సీలో వేసి పొడి చేయాలి. (ముద్దగా కాని, జిడ్డుగా కాని ఉండకూడదు) బాణలిలో పంచదార, నీళ్లు వేసి సన్న మంట మీద ఉంచాలి ఈలోగా ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి ఉంచుకోవాలి. బటర్ పేపర్లు సిద్ధంగా ఉంచుకోవాలి పంచదార బాగా కరిగాక, జీడిపప్పు పొడి వేసి ఉండ కట్టకుండా బాగా కలుపుతుండాలి మిశ్రమం బాగా చిక్కబడ్డాక జీడిపప్పు పలుకులు వేసి, బాగా కలిపి మంట మీద నుంచి దింపి, గరిటెతో బాగా కలిపి పళ్లెంలో వేసి అట్లకాడ సహాయంతో సమానంగా పరచాలి పూర్తిగా చల్లారాక మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి బటర్ నైఫ్‌తో జాగ్రత్తగా కాజు కట్లీలను విడిగా తీసి గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచాలి. -
సాగులో.. స్వయంకృషి
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న స్వయం సహాయక సంఘాల మహిళలు సాగులోనూ సగం అని నిరూపిస్తున్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి, వెల్టూర్ గ్రామాల్లో ఎన్‌పీఎం ఆధ్వర్యంలో వీరు పండిస్తున్న పంటలు సాగు రంగానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని పరిశీలించేందుకు వస్తున్న దేశ, విదేశాల ప్రతినిధులు, అధికారులు భేష్ అని మెచ్చుకుంటున్నారు. మండలంలో ప్రస్తుతం 15 గ్రామాల్లో ఈ పద్ధతిన పలు రకాల పంటలు సాగవుతున్నాయి. 400 గ్రూపులకు చెందిన 4,792 మంది మహిళా రైతులు 10,393 ఎకరాల్లో శ్రీవరి, పసుపు, కంది, బెం డ, కాకర, వంకాయ, మిర్చి, టమాటా, సోరకాయ, బీరకాయ, ఆకు కూరలతో పాటు ఉల్లిగడ్డ తదితర పంటలను పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఎన్‌పీఎం తరఫున కంబాలపల్లి, పొట్టిపల్లి, మద్దికుంట, వెల్టూర్, నిజాంపూర్ గ్రామాలకు 50 వేలు మంజూరయ్యాయి. సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే మహిళలకు ఎన్‌పీఎం నిధులను సమానంగా పంపిణీ చేశారు. స్త్రీనిధి ద్వారా కూడ కూరగాయల పంటలు పండించేందుకు మహిళలు డబ్బులు రుణంగా తీసుకున్నారు. పంటచేతికి వచ్చిన తరువాత నెలసరి వాయిదాల్లో వీటిని తిరిగి చెల్లిస్తున్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి విక్రయించేందుకు ముందుకు వచ్చిన గ్రామానికి చెందిన ఒక్కో మహిళకు రూ.10 వేలు అందజేశారు. ఈమె ఇంటి వద్ద ఎన్‌పీఎం దుకాణం ఏర్పాటు చేసి ఒక లీటరుకు రూ.2 నుంచి రూ.5 వరకు తీసుకుంటుంది. ఎన్‌పీఎం ఆధ్వర్యంలో మహిళలు పండించిన కూరగాయలను సదాశివపేట పట్టణానికి తరలించి విక్రయిస్తున్నారు. ఎరువుల తయారీ ఇలా రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే మహిళలు కూరగాయల పంటలు పండిస్తున్నారు. చీడపీడల నివారణకు ఎన్‌పీఎం దుకాణంలో ఎరువులు, మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో నాడెపు కంపోస్టు ఎరువు, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎరువులను వాడుతున్నారు. నాడెపు కంపోస్టు దీని తయారీకి ఇంటి వద్ద పెరట్లో ఇటుకలతో 60 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పు, మూడు ఫీట్ల ఎత్తులో గొయ్యి తీస్తారు. దీనిలో 100 కిలోల ఆకులు (ఏవైనా), వ్యర్థాలు వేసి వాటిపై ఆవుపేడ పూసి మూడు నెలల పాటు నిల్వ ఉంచ డంతో నాడెపు కంపోస్టు తయారవుతుంది. దీన్ని పంట వేసే ముందు దుక్కుల్లో వేసుకుంటే భూసారం పెరగడంతో పాటు మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. నీమాస్త్రం కూరగాయ మొక్కలు మొలకెత్తాక ఎలాంటి చీడపీడలు సోకకుండా నీమాస్త్రం అందించాలి. ఒక ఎకరాకు సరిపడా ఎరువు, ద్రావణ తయారీకి.. 10 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఆవుపేడ తీసుకుని డ్రమ్ములో వేసి 100 లీటర్ల నీటితో కలియబెట్టాలి. ఇలా 48 గంటలపాటు ఉంచాక నీమాస్త్రం తయారవుతుంది. దీన్ని నీటి కాలువల ద్వారా కానీ, మొక్కలపై కానీ పిచికారీ చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి దీన్ని మొక్కలకు అందించాలి. బ్రహ్మాస్త్రం మొక్కలకు తెగుళ్లు సోకకుండా దీన్ని వాడతారు. దీని తయారికి ఐదు రకాల చెట్ల ఆకులను 2 కిలోల చొప్పున తీసుకుని ముద్దగా నూరి 10 లీటర్ల ఆవు మూత్రంలో కలపాలి. ఒక పాత్రలో పోసి మూతపెట్టి అరగంటపాటు ఉడకబెట్టాలి. ద్రావణం చల్లారిన తర్వాత గుడ్డతో వడబోయాలి. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. 100 లీటర్ల నీటికి 2 నుంచి 3 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలిపి 10 రోజులకు ఒకసారి మొక్కలపై స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
పండుగ పూట రైతు ఇంట్లో చీకట్లు
కురవి/మహబూబాబాద్‌టౌన్ : ఊరంతా వెలుగులు నింపే దీపావళి పండుగపూట ఆ రైతు ఇంట్లో చీకట్లు ఆవరించాయి. పండుగ పూట దీపాలతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది. కరెంట్ రాత్రిపూట సరఫరా అవుతుండడంతో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ మండలం మాధవపురం శివారు చీకటిచింతల తండాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. తండా వాసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం... చీకటిచింతల తండాకు చెందిన బానోత్ వెంకన్న(38)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్నాడు. ఇప్పటికే బావిలో నీళ్లు అడుగంటడంతో పొలం ఎండిపోయింది. దీంతో క్రేన్ సాయంతో బావిలో పూడిక తీయిస్తున్నాడు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కరెంట్ సరఫరా అవుతుండడంతో కరెంట్ రాగానే అతడు బావి వద్దకు వెళ్లాడు. మోటార్‌ను ఆన్ చే సే ముందు ఫ్యూజులను సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కుప్పకూలాడు. నీళ్లు పెట్టేందుకు వచ్చిన సమీప రైతులు బానోత్ రామా, వీరమ్మ అతడి అరుపులు విని సంఘటన స్థలానికి పరుగెత్తుకొచ్చారు. వెంకన్న స్టార్టర్ బాక్స్ పక్కన షాక్‌తో విలవిలలాడుతుండడం గమనించిన వారు వెంటనే అతడిని కర్రతో పక్కకు లాగారు. కొనఊపిరితో ఉన్న అతడిని బతికించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. వెంకన్న మరణవార్త తెలియగానే అతడి భార్య విజయ, కుమార్తెలు కల్యాణి, రోజా, కుమారుడు బాలాజీ బోరున విలపిస్తూ బావి వద్దకు పరుగులు పెట్టారు. మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యూరు. పిల్లల రోదన చూసి బంధుమిత్రులు, తండా వాసులు కంటతడి పెట్టారు. మృతదేహంతో ఆందోళన రాత్రి, తెల్లవారుజామున కరెంట్ సరఫరా చేయడం వల్లే వెంకన్న మృతిచెందాడని ఆగ్రహించిన తండా వాసులు మృతదేహాన్ని అయ్యగారిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు ట్రాక్టర్లో తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న మరిపెడ-మానుకోట ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి సుమారు రెండుగంటలపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు నల్లు సుధాకర్‌రెడ్డి, ఎన్.సురేందర్ కుమార్, కన్నె వెంకన్న, గునిగంటి రాజన్న, గంధసిరి శ్రీనివాస్, దుడ్డెల రాంమూర్తి, బజ్జూరి పిచ్చిరెడ్డి ధర్నాకు మద్దతుగా నిలిచారు. రైతు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కురవి సీఐ కరుణాసాగర్‌రెడ్డి చేరుకుని ఆందోళన విరమించాలని కోరగా ఆర్డీఓ రావాలని, ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఈ రాజారత్నంను అక్కడికి పిలిపించగా.. రూ.2 లక్షలు పరిహారం వస్తుందని, మరో రూ.50 వేలు అదనంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కారప్పొడితో స్వామీజీకి అభిషేకం
వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఓ స్వామీజీ కారం కలిపిన నీటితో అభిషేకం చేసుకుని స్థానికులను ఆశ్చర్యపరిచారు. సత్వచ్చారి గంగమ్మ ఆలయ సమీపంలోని ఓ తోటలో నాలుగు నెలలుగా ఓ స్వామీజీ నివసిస్తున్నాడు. ఆయన పేరు, వివరాలు ఎవరికీ తెలీవు. ప్రత్యంగరా దేవిని పూజించే స్వామీజీకి తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషలు వచ్చు. మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన కారంపొడి నీటితో అభిషేకం చేసుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామీజీ ముందుగా చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక పెద్దపాత్రలో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అనంతరం నీటితో అభిషేకం చేశారు. -
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం!
ఘట్కేసర్ టౌన్: అమ్మహస్తం పథకం ప్రజలకు మొండిచెర్య చూపుతోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు రూ. 185కే ఉప్పు, కారం, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పామాయిల్, పంచదార, కందిపప్పు, పసుపు సరుకులను అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఉగాది పండుగకు ప్రారంభమైన ఈ పథకం ఏడాదిలోపే నీరుగారిపోరుుంది. తొమ్మిది సరుకులు అందించాల్సి ఉన్నా కేవలం పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమలు అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. నాణ్యత లేని సరుకులు.. అవ్ము హస్తం పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కరువైంది. దీంతో లబ్ధిదారులు ఈ సరుకులను తీసుకెళ్లడం లేదు. కాలం చెల్లిన చింతపండు, పురుగులు తిరుగుతున్న గోధుమపిండి, వినియోగించలేని విధంగా ఉన్న కారం పొడి, పసుపు, ఉప్పు సరుకులు సరఫరా అవుతుండటంతో వినియోగదారులు రేషన్ దుకాణాలకు బదులు బయుట సరుకులు కొనుగోలు చేయుడంతో పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు. రేషన్ దుకాణాల్లో కిలో గోధుమలు రూ.7కు లభిస్తుండగా మార్కెట్లో రూ. 15, పామాయిల్ రూ.40కిగాను రూ. 65-70లు, కందిపప్పురేషన్ దుకాణంలో రూ. 50లు ఉండగా మార్కెట్లో రూ. 70- 75లకు లభిస్తోంది. వూర్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తుండటంతో జిల్లా లో ఉన్న 10.8 లక్షల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులపై రూ. కోట్లాడి భా రం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని పేదలు కోరుతున్నారు. -
తెగుళ్ల దిగులొద్దు
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగవుతున్న పలు పంటల్లో ప్రస్తుత తరుణంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3.5 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2.1 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఇలా ఉన్నాయి. పత్తి పత్తి సాధారణ విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం జిల్లాలో 1.57 లక్షల హెక్టార్లలోనే దీన్ని సాగు చేస్తున్నారు. పత్తి పెరుగుదల లోపించటం, రసంపీల్చు పురుగులు, ఎండుతెగులు వంటివి వస్తున్నాయని రైతులు అంటున్నారు. దీనిపై డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుదల తక్కువగానే ఉంటుంది. పోషకాలను ఉపయోగిస్తే పంట సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మొక్క వయసును బట్టి 10-20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగులు, పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ ఉధృతి అధికంగా ఉంటే నివారణకు మోనోక్రొటోఫాస్ నీరు 1:4 నిష్పత్తిలో కలిపి మొక్క వయస్సు 30, 45, 60 రోజుల దశలో కాండానికి మందు పూయాలి. వీటి నివారణకు పిచికారీ మందులైతే మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిటామెసిడ్ 0.2 గ్రాములు లేదా ఫాప్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి మందులను మార్చి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పిండినల్లి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 3 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనితో పాటు లీటరుకు 0.5 గ్రాముల సర్ఫ్ పౌడర్ కలిపితే ఫలితం బాగుంటుంది. తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంటే టైజోఫాస్ 2 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి జిల్లాలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 1.32 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 31,083 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నారుమళ్లలో, నాటిన పొలాల్లో జింక్ధాతులోపం ఎక్కువగా ఉంది. దీని నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం నాటు వేసిన వరిలో కలుపు నివారణకు నాటిన 3-5 రోజుల దశలో బుటాక్లోర్ 1.25 లీటర్లు లేదా అనిలోఫాస్ 500 మి.లీ లేదా ప్రిటిలాక్లోర్ 600 మి.లీ లేదా ఆక్సాడయార్జిల్ 35 గ్రాములు, 20-25 కిలోల ఇసుకలో కలిపి ఎకరం పొలంలో చల్లాలి. మొక్కజొన్న మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 14 వేల హెక్టార్లు ప్రస్తుతం పది వేల హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తున్నారు. జింక్ లోపం, కాండం తొలిచే పురుగులు వ్యాపిస్తున్నాయి. జింక్ లోపం నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు 10-12 రోజుల పైరుపై మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 20-25 రోజుల దశలో గమనిస్తే కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకు సుడులలో వేసుకోవాలి. పెసర పెసర ఖరీఫ్ విస్తీర్ణం 8.8 వేల హెక్టార్లు ఉండగా 5.7 వేల హెక్టార్లలో విత్తారు. పెసరలో మరూకా మచ్చల పురుగు, సల్లాకు తెగులు గమనించ దగినవి. మరూకా మచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 2.0 మి.లీ క్వినాల్ఫాస్ లేదా 1.0 మి.లీ నోవల్యూరాన్ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ లేదా ఫ్లూబెండిమైడ్ 0.2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని అరికట్టడానికి ట్రైజోఫాస్ 1.25 మి.లీ లేదా ఎసిఫేట్ గ్రాము లేదా ఎసిటామిప్రెడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 7-10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి. మిరప నారుమడి దశలో ఉన్న మిరపలో నారుకుళ్లు తెగులు ఆశిస్తుంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా రిడోమల్ ఎంజెడ్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి నారు మళ్లను తడపాలి. కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించింది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములతో స్ట్రెప్టోమైసిన్ లేదా ప్లాంటామైసిన్ గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
వండేదెట్టా.. తినేదెట్టా..!
కర్నూలు(కలెక్టరేట్): మిరపకాయ ఘాటెక్కింది.. ఉల్లిగడ్డ కోయకండానే కన్నీరు తెప్పిస్తోంది..చింతపండు పులుపు తగ్గనంటోంది.. సన్న బియ్యం ఉడకనంటోంది..పెసరపప్పు అటకెక్కి దిగిరానంటోంది.. మండే ఎండలు పోయి వర్షాకాలం ప్రారంభమయినా.. కూరగాయల ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఆకాశన్నంటిన నిత్యావసర సరుకుల ధర దిగిరానంటున్నాయి. ఫలితంగా జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారు పస్తులుండాల్సి వస్తోంది. జూన్ నెల గడిచినా వర్షాల జాడ లేకపోవడం కూరగాయల ధర పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం వంకాయ, బెండ పండుతోంది. టమాట, పచ్చి మిరప, బీర, క్యాబేజి, చిక్కుడు, బీట్రూట్ వంటి కూరగాయలన్నీ బెంగళూరు నుంచి దిగుమతి అవుతున్నాయి. ఆలుగడ్డలు మాత్రం హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. గతంలో జిల్లా నుంచి అన్ని రకాల కూరగాయలు దేశం నలుమూలలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా దిగుమతి చేసుకోవాల్సి రావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ఈ ఏడాది కూరగాయల సాగు తగ్గినట్లు విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు కొరత ఏర్పడకుండా ఉద్యాన అధికారులు తగిన చొరవ తీసుకోవాలి. బావులు, బోర్లు, ఇతర నీటి పారుదల కింద కూరగాయల సాగును ప్రోత్సహించాలి. ఇందుకోసం సబ్సిడీపై విత్తనాలను రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇవేమి చేయకపోవడంతో సాగు తగ్గి.. కూరగాయల కొరత వినియోగదారులను హడలెత్తిస్తోంది. ధరలు పెరుగుతున్న సందర్భంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంది. కూరగాయలు బాగా పండే ప్రాంతాల నుంచి తెప్పించి తక్కువ ధరలకు రైతు బజార్ల ద్వారా పంపిణీ చేయించాలి. జిల్లాలో ధరలు పెరిగిపోతున్నా.. వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. -
వేసవిలో కుండపోత
ఖమ్మం, న్యూస్‌లైన్: మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపించాడు... ఎండవేడిమికి జనం అల్లాడారు...అంతలోనే ఆకాశంలో మబ్బులు ఆవరించాయి... మధ్యాహ్నం నుంచి రాత్రి వర కు భారీవర్షం కురిసింది. ఇలా జిల్లాలో శుక్రవా రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోత కురియగా... పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అకాలవర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి పోయాయి. విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటఉత్పత్తులు తడిసి ముద్ద అయ్యాయి. పిడుగుపాటు కారణంగా పినపాక మండలంలో ఓ మహిళ మృతిచెందగా, ఇల్లెందు మండలం లో 32 మేకలు చనిపోయాయి. గాలి దుమారం తో పలుచోట్ల లైన్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో డ్రైన్లు పొంగి పొర్లడంతో రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం మూలంగా జిల్లాలో సుమారు రూ. 30కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రైతులు సంఘాల నాయకులు చెబుతుండగా.. అసలు నష్టమే జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం గమనార్హం. భారీవర్షంతో... ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తెచ్చిన మిర్చి, పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులు తడిసి పోయాయి. నగరంలో డ్రైన్లు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావడంతో రోడ్లు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాలనీల్లో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రఘునాధపాలెం మండలంలో వీవీపాలెం, రఘునాథపాలెం, చింతగుర్తి, వేపకుంట్ల, గణేశ్వరం, మల్లేపల్లి, ఈర్లపుడి, రాంక్యాతండా, పంగిడి, మంచుకొండ, బూడిదంపాడు, చిమ్మపుడి, కోటపాడు ప్రాంతాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. కూరగాల పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలో వరి చేతికొచ్చే దశలో భారీవర్షం కురవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. మామిడి నేలరాలింది. కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. మాణిక్యారం గ్రామానికి చెందిన సూర్నపాక వీరభద్రం మేకల గుంపు మీద పిడుగు పడగా 32 మేకలు అక్కడిక్కడే మృతి చెందాయి. సుమారు రూ. 1.50 ల క్షలు నష్టం వాటిల్లింది. బయ్యారం మండలంలో 500 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. వెంకట్యాతండాలో ఇంటి గోడ కూలి రెండు గొర్రె పొట్టేళ్లు మృతి చెందాయి. టేకులగుంపులో పిడుగు పడి దుక్కిటెద్దు మృతి చెందింది. మధిర నియోజకవర్గంలోని బోనకల్, చింతకాని మండలాల్లో గంటపాటు వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్నమిర్చి, ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిశాయి. ముష్టికుంట్ల, బోనకల్, ఆళ్లపాడు, మోటమర్రి గ్రామాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉంది. ముదిగొండ మండలంలోని మాధాపురం, ఎడవల్లి, మేడేపల్లి, కమలాపురం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. ఈవర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులు ఉరుకులు పరుగులతో మొక్కజొన్నలపై పట్టాలు కప్పారు. ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి, చిరుమర్రి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. వర్షపునీటితో వీధులన్నీ జలమయ్యాయి. పినపాక మండలంలో పిడుగుపాటుకు చిరుమల్ల గ్రామంలో ఈసం సుజాత(35)అనే మహిళ మృతి చెందినది. బూర్గంపాడు మండలంలోని 200ల ఏకరాల్లో మామిడి నేలరాలింది. 50ఎకరాల్లో వరిపంట తడిసింది. అదే విధంగా మార్కెట్ గోడౌన్‌కు తీసుకువచ్చిన ధాన్యం సైతం తడిసిపోయింది. అశ్వాపురం మండలంలో కురిసిన వర్షం, గాలి దుమారానికి 50ఎకరాల వరిపంట నేలకొరిగింది. మణుగూరు మండలంలో సాంబాయిగూడెం, రామానుజవరంలో కోసిన పనలు తడిసినాయి. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, సుబ్లేడు, పాతర్లపాడు తదితర గ్రామాలలో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటి ల్లింది. వెదుళ్లచెరువు, కొక్కిరేణి గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన పసుపు పంట కూడా తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది. నేలకొండపల్లి, కూసుమంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల, ముత్తగూడెం, కొత్తూరు, ఏదులాపురం, గోళ్లపాడు తదితర గ్రామాలలో కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న కంకులు వర్షానికి తడవడం, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేంసూరు మండలంలో శుక్రవారం వీచిన గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. పెనుబల్లి మండలంలో రబీ వరి పంట మూడు వేల ఎకరాలలో ఇంకా కోతలు పూర్తి కాకపోవటంతో నేలవాలింది. మిషన్లతో కోతలు కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిపోయింది. తల్లాడ మండలంలో కల్లాల్లో కాటా వేసిన ధాన్యం తడిసింది. వైరా నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా వైరా మండలంలో కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ధాన్యం పొలాల్లో తడిసిపోయింది. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ఏఎంసీ ప్రాంగణంలో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం 200 క్వింటాళ్ళు తడిసి పోయాయి. కొణిజర్ల మండలంలో వరి 600 ఎకరాల్లో కోయాల్సి ఉండగా పూర్తిగా వరి పనలు వాలిపోయాయి. మరో 600 ఎకరాలల్లో ధాన్యం తడిసిపోయింది. మిర్చి కూడా కల్లాల్లో తడిసిపోయింది. ఏన్కూరు మండలంలో మొక్కజొన్న 60 ఎకరాలలో పూర్తిగా తడిసిపోయింది. పత్తి 100 క్వింటాళ్ళు ఏఎంసీలో తడిసిపోయింది. కారేపల్లి మండలంలో మామిడి కాయాలు నేల రాలగా, కల్లాల్లో మిర్చి తడి సిపోయింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో దాదాపు 500 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చంద్రుగొండ మండలంలో కల్లాల్లోని మిర్చి తడిసి ముద్దయింది. కొత్తగూడెం నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షం కారణంగా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కొత్తగూడెం పట్ణణంలో అండర్‌బ్రిడ్జిలో భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాజేడు మండలంలో కల్లాల్లో ఆరబోసిన 6వేల క్వింటాళ్ల మిర్చి, 500 క్వింటాళ్ల వరి ధాన్యం వర్షార్పణం అయింది. దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి, బైరాగుల పాడు, బండిరేవు గ్రామాలలో కోసివుంచిన వరిపనలు వర్షానికి తడిసిముద్దయ్యాయి.