common wealth games
-
ఒలింపిక్స్‌కు ముందు ‘కామన్వెల్త్’ నిర్వహించండి.. భారత్‌కు సీజీఎఫ్ చీఫ్ సూచన
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఇటీవల తరచూ ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం తహతహలాడుతోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే భారత్ లక్ష్యం విశ్వక్రీడలైతే ముందుగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తే ఇది మెగా ఈవెంట్‌కు ముందు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) సీఈఓ కేటీ సాడ్లియెర్ సూచించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏ దేశానికైనా ఒలింపిక్స్ ఆతిథ్యమనేది గొప్ప కీర్తిని తెస్తుంది. అయితే అలాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కామన్వెల్త్ క్రీడలు (2030) నిర్వహిస్తే మేటి అంతర్జాతీయ ఈవెంట్‌కు సరైన సన్నాహకంగా, చక్కని ముందడుగుగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ టాప్–10లో నిలుస్తుందని ఆమె చెప్పారు. ‘భారత్ దశ, దిశ ఇప్పుడు మారుతోంది. సరైన నాయకత్వం, మౌలిక వసతుల కల్పన, ప్రామాణిక శిక్షణతో క్రీడల భవిష్యత్ మారబోతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రదర్శన, పతకాలనేవి ఆ దేశ ప్రతిష్టను కచ్చితంగా పెంచుతాయి. తప్పకుండా భారత్ క్రీడాశక్తిగా ఎదుగుతుంది’ అని కేటీ సాడ్లియెర్ తెలిపారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం భారత్ ఒకే ఒక్కసారి 2010లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర కుర్రాడికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఎ.కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్ రెడ్డి క్యాడెట్ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్ (సైప్రస్) రజతం, హారిసన్ లుకాస్ (స్కాట్లాండ్), జేకబ్ కట్లర్ (ఇంగ్లండ్) కాంస్య పతకాలు గెలిచారు. -
భారత స్టార్ రెజ్లర్ భర్త అనుమానాస్పద మృతి
Commonwealth Games 2022 Bronze Medallist Pooja Sihags Husband Dies: బర్మింగ్‌హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజర్ల్ పూజా సిహాగ్ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఆగస్ట్ 27) రాత్రి సిహాగ్ భర్త అజయ్ నందల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హర్యానాలోని రోహ్తక్ నగర పరిసర ప్రాంతంలో నందల్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నందల్ మృతదేహం లభించిన ప్రాంతంలో అతని స్నేహితుడు రవి, మరో వ్యక్తిని అచేతనావస్థ స్థితిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా, అజయ్ నందల్ ఆకస్మిక మరణంపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అజయ్‌కు అతని స్నేహితుడు రవి డ్రగ్స్ అలవాటు చేశాడని, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే అజయ్ మృతి చెంది ఉంటాడని ఆరోపించాడు. అజయ్ తండ్రి ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని వెల్లడించారు. స్వతహాగా రెజ్లర్ అయిన అజయ్ నందల్.. క్రీడల కోటాలో ఇటీవలే ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజయ్ నందల్ భార్య, భారత స్టార్ మహిళా రెజ్లర్ పూజా సిహాగ్.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ -
అథ్లెట్‌పై అమానుష దాడి.. వీడియో వైరల్
జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గ్రెనాడాలో ఓ బీచ్ పార్టీకి హాజరైన అండర్సన్ పీటర్స్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పడవలో నుంచి నీళ్లల్లోకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే గొడవ ఎందుకు జరిగింది?దాడి ఎవరు చేశారు? ఏం జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా దాడిలో స్వల్పంగా గాయపడిన అండర్సన్ పీటర్స్, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు గ్రెనాడా పోలీసులు పేర్కొన్నారు. కాగా అండర్సన్ పీటర్స్‌పై దాడిని ఒలింపిక్ కమిటీ ఖండించింది. ‘పీటర్స్‌పై దాడి అమానుష చర్య. నేషనల్ స్పోర్ట్స్ స్టార్, హీరో అయిన అండర్సన్‌పై దాడి చేసిన ఐదుగురిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. అతనిపై దాడి చేసిన వాళ్లు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు కాదని తెలిసింది.’ అంటూ పేర్కొంది. గ్రేనడా దేశానికి చెందిన అండర్సన్ పీటర్స్.. 2019, 2022 జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 93.07 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన అండర్సన్ పీటర్స్, ఆ తర్వాత స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. #AndersonPeters being beaten by five non-national in #Grenada pic.twitter.com/NrVBJwu2t9 — Do.Biblical.Justice. (@StGeorgesDBJ) August 11, 2022 -
34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం
అభినవ్ బింద్రా.. ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చేది 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో గెలుచుకున్న స్వర్ణ పతకం. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా అభినవ్ బింద్రా చరిత్ర లిఖించాడు. అందుకే క్రీడాభిమానులు అంత తొందరగా అభివన్ బింద్రా పేరు మరిచిపోలేరు. 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ ఈవెంట్లో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా 2017లో 34 ఏళ్ల వయసులోనే బింద్రా అధికారికంగా షూటింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే తన రిటైర్మెంట్కు ముందు జరిగిన 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికి అభినవ్ బింద్రా పతకం సాధించలేకపోయాడు. తాజాగా బర్మింగ్హమ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఈసారి గేమ్స్‌లో 61 పతకాలు సాధించిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇండియా ఖాతాలో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బింద్రా స్పందించాడు.'' కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. ఈసారి పతకాలు సాధించిన వారిలో ఎక్కువమంది అథ్లెట్ల జీవితాలు అందరికి ఆదర్శప్రాయం కావడం జాతికే గర్వకారణం. మనందరం భారతీయులం.. ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం'' అంటూ పేర్కొన్నాడు. కాగా బింద్రా ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే ఒక అభిమాని.. మీరు తొందరగా రిటైర్ అవ్వడానికి గల కారణాలు ఏంటో చెబుతారా అని అడిగాడు. దానికి బింద్రా మూడు ముక్కల్లో ముగించాడు. '' (1).. నా నైపుణ్యం కాస్త మసకబారినట్లుగా అనిపించింది.. (2).. ఒకసారి పతకం తెచ్చాను.. ఇంకోసాది దేశానికి పతకం తేవాలన్న నా కళ ఫెయిల్ అయింది.. (3).. 34 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఇచ్చానంటే కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసమే. ఈ రోజుల్లో మన భారత్‌లో యంగ్ టాలెంట్ విరివిగా ఉంది.. ప్రోత్సహించడమే మన లక్ష్యం.. దానిని పాడు చేయొద్దు.. అందుకే గౌరవంగా తప్పుకున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. 1.) Recognised my fading skills 2). Failed in two successive Games 3). Was the appropriate time to give my spot to a younger athlete and talent ! ( did not just want to hold on to it ) — Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) August 11, 2022 Why he retired too early is something he will answer someday to his fans.. — The Patriot..🇮🇳 (@Indian_567) August 11, 2022 చదవండి: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌కు వేధింపులు -
కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లిన బృందంలో 10 మంది లంక ఆటగాళ్లు అదృశ్యం
కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హమ్ వేదికగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 8న ముగిశాయి. ఈ గేమ్స్‌కు 72 దేశాలు పాల్గొనగా.. అందులో శ్రీలంక కూడా ఉంది. ఈసారి కామన్వెల్త్ లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను లంక.. 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు)తో కూడిన అథ్లెట్ల బృంధం బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది. అయితే గేమ్స్ జరుగుతున్న సమయంలోనే 10 మంది లంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు సమాచారం. కాగా ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం విశేషం. వీళ్లకు ఆరునెలల పాటు వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే అదృశ్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్‌హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు. లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఒక్కపూట తిండి దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో బర్మింగ్‌హామ్ కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అదృష్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక.. ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించి పతకాల పట్టికలో 31వ స్థానంలో నిలిచింది. -
'అంచనాలకు మించి.. అదే చేత్తో కోహినూర్ వజ్రాన్ని'
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు అంచనాలు మించి రాణిస్తున్నారు. ఇంతకముందు మనకు ఎన్నడూ రాని విభాగాల్లోనూ పతకాలు కొల్లగొడుతున్న ఆటగాళ్లు.. అచ్చొచ్చిన క్రీడల్లో స్వర్ణ పతకాలతో చెలరేగుతున్నారు. తొమ్మిది రోజులు ముగిసేసరికి భారత్ ఖాతాలో 40 పతకాలు ఉండగా.. అందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. కాగా ఇందులో 22 పతకాలు కేవలం రెండు క్రీడల్లోనే రావడం విశేషం. రెజ్లింగ్‌లో 12 పతకాలు రాగా.. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 10 పతకాలు వచ్చి చేరాయి. ఇంకో విశేషమేమిటంటే.. రెజ్లింగ్ విభాగంలో మనవాళ్లు 12 మంది పోటీ పడితే.. 12 మంది పతకాలు తేవడం విశేషం. అందులో భజరంగ్ పూనియా, రవి దహియా, వినేష్ పొగాట్, దీపక్ పూనియాలు స్వర్ణాలు గెలిచారు. ఇక పదోరోజు కూడా భారత్ ఖాతాలో దండిగానే పతకాలు వచ్చి చేరనున్నాయి. మరి సోమవారంతో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొడుతుందనేది వేచి చూడాలి. కాగా కామన్వెల్త్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పతకాల కోసం పోటీ పడడం ఆనందాన్ని కలిగిస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అంచనాలకు మంచి రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. అదే చేత్తో బ్రిటీష్ వాళ్లు పట్టుకెళ్లిన మన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకురండి'' అంటూ కామెంట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు వెస్టిండీస్ గడ్డపై రోహిత్ సేన టి20 సిరీస్ గెలవడంపై కూడా జాఫర్ ట్వీట్ చేశాడు.''విదేశీ గడ్డపై మరో సిరీస్ గెలిచినందుకు రోహిత్ సేనకు కంగ్రాట్స్. జట్టులో ఆటగాళ్లందరు ఒకరినొకరు సహకరించుకుంటూ బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వెల్డన్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా ఇవాళ విండీస్‌తో చివరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. Indian athletes are doing so well at the Commonwealth Games that at this rate they might even bring the Kohinoor back 😄 #CWG2022 #IndiaAt75 — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 Congratulations @ImRo45 and Team India on another series win 👏🏽 Total team effort with both bat and ball with almost everyone contributing. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 DISTINGUISHED WRESTLER VINESH🥇 Watch moments from the medal ceremony. Our champ @Phogat_Vinesh Looked fantastic with 🥇 Proud of you Girl! #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @ddsportschannel @SonySportsNetwk @IndiaSports pic.twitter.com/8mocOYGxj9 — SAI Media (@Media_SAI) August 7, 2022 🇮🇳's Dhakad youth wrestler Naveen' s confidence is worth the applaud 👏 Watch moments from his medal🥇 ceremony 👇 Congratulations 👏 #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @IndiaSports @YASMinistry @CGI_Bghm pic.twitter.com/44XpKWcXYk — SAI Media (@Media_SAI) August 7, 2022 PLAYING FOR G🥇LD!!#Tokyo2020 Olympian and Gold🥇 Medalist at #B2022, @ravidahiya60 steals the show🤩 Watch his winning moment🏅 from yesterday's match👇#Cheer4India🇮🇳#India4CWG2022 🤟@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @IndiaSports @YASMinistry pic.twitter.com/oaZK41S6zr — SAI Media (@Media_SAI) August 7, 2022 చదవండి: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. భారత మహిళా బ్యాటర్లలో స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్‌లు తమ కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో రేణుకా సింగ్ తన మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా భారత మహిళల జట్లు కొత్త రికార్డు నెలకొల్పనుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు ఇక శనివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఆసీస్ మహిళలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అమేలియా ఖేర్ 40 పరుగులతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ 3, తాహిలా మెక్‌గ్రాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెత్ మూనీ 36, తాహిలా మెక్‌గ్రాత్ 34 పరుగులు చేశారు. చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' Katherine Brunt CWG 2022: ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ -
ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ
ఇంగ్లండ్ మహిళా ఫాస్ట్ బౌలర్ కేథరిన్ బ్రంట్‌కు ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ కేథరిన్‌ను హెచ్చరించడమే గాక మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఇక డిసిప్లీనరి యాక్ట్ కింద ఒక పాయింట్ కోత విధించింది. ఏడాది కాలంలో కేథరిన్ బ్రంట్ ఐసీసీ నిబంధన ఉల్లఘించడం ఇది రెండోసారి. ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లు ఉండడంతో.. మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే మాత్రం ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. విషయంలోకి వెళితే.. శనివారం ఇంగ్లండ్, టీమిండియా మహిళల మధ్య కామన్వెల్త్ గేమ్స్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ కేథరిన్ బ్రంట్ వేసింది. దీప్తి శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ విడిచిపెట్టడంతో కేథరిన్ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది. ఆమె వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో మ్యాచ్ అనంతరం ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.3 నిబంధన ఉల్లఘించిన కేథరిన్ బ్రంట్‌కు హెచ్చరిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశారు. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. చదవండి: Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు -
థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలుపు.. ఫైనల్‌కు భారత పురుషుల హాకీ జట్టు
భారత పురుషుల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్ 2022లో తమ జోరును ప్రదర్శిస్తోంది. శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 3-2 తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన భారత్ స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి క్వార్టర్లో ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే అభిషేక్ గోల్ కొట్టడంతో భారత్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత మణిదీప్ సింగ్ మరో గోల్ మెరవడంతో భారత్ 2-0తో ఆధిక్యంలో వెళ్లింది. ఇక మూడో క్వార్టర్లో సౌతాఫ్రికా తరపున రెయాన్ జూలిస్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో క్వార్టర్ మొదలైన రెండో నిమిషంలోనే డ్రాగ్ ఫ్లికర్ జుగ్రాజ్ గోల్ కొట్టడంతో భారత్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక సౌతాఫ్రికా తరపున రెండో గోల్ నమోదు చేసింది. అయితే చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి భారత్ ప్రత్యర్థిని గోల్స్ చేయకుండా అడ్డుకొని ఫైనల్లోకి ప్రవేశించింది. చదవండి: CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో శనివారం భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ మహిళల సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు 12-10 11-2 11-9తో నైజీరియాకు చెందిన ఇఫెచుక్వుడే క్రిస్టియానా ఇక్‌పెయోయ్‌పై విజయం సాధించి క్వాడ్రినియెల్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఇక సోనాల్‌బెన్ మనుభాయ్ పటేల్ కూడా మహిళల సింగిల్స్ క్లాస్‌లో 3-5తో కాంస్యం సాధించి భారత్‌కు పతకాన్ని అందించింది. 34 ఏళ్ల భారత ఆటగాడు కాంస్య పతక ప్లే ఆఫ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన స్యూ బెయిలీపై 11-5 11-2 11-3 తేడాతో విజయం సాధించారు. అయితే, పురుషుల సింగిల్స్ తరగతుల్లో రాజ్ అరవిందన్ అళగర్ 0-3తో నైజీరియాకు చెందిన ఇసౌ ఒగున్‌కున్లే చేతిలో 3-5తో కాంస్య పతక ప్లే-ఆఫ్‌తో ఓడిపోయాడు. కాగా కామన్వెల్త్ గేమ్మ్ తొమ్మిదో రోజు భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. పలు కాంస్య పతకాలు గెలుచుకుంది. మొత్తం ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ 40 మెడల్స్‌తో ఐదో స్థానంలో ఉండగా.. అందులో 13 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం ఉన్నాయి. Our country is constantly being brought up with the stellar performance of Indian sports talent in #CommonwealthGames2022. In this sequence, in the Para Table-Tennis match, Gujarat's pride, Bhavinaben Patel, won the GOLD🏅medal and made the nation proud. You are a champion 👏 pic.twitter.com/ANWtyMiksA — Sports Authority of Gujarat (@sagofficialpage) August 6, 2022 చదవండి: Commonwealth Games 2022: ‘పసిడి’కి పంచ్ దూరంలో... -
సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు..
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీపై సిందూ గెలుపొందింది. తొలి సెట్లో 19-21 తేడాతో ఓటమి పాలైన సింధు .. రెండో సెట్లో తిరిగి పుంజుకుని 21-14తో అద్భుతమైన విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో 21-18తో ప్రత్యర్ధిని మట్టికరిపించి సెమీస్‌లో సింధు అడుగు పెట్టింది. ఇక సెమీ ఫైనల్లో సింధు గెలిపొందితే భారత్‌కు మరో పతకం ఖాయమవుతోంది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా తొమ్మిదో రోజు భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. రెండు రజత పతకాలు భారత ఖాతాలో చేరాయి. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సాధించగా, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్ ఖాతాలో 28 పతకాలు వచ్చి చేరాయి. వాటిలో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: CWG 2022 9th Day: భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం -
ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్ మాత్రం మారదు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పెనాల్టీ షూటౌట్లో భాగంగా ఆసీస్ చేతిలో భారత్ 3-0తో పరాజయం చవిచూసింది. అయితే పెనాల్టీ షూటౌట్ ప్రారంభానికి జరిగిన ఒక చిన్న తప్పిదం భారత మహిళలను ఓటమి వైపు నడిపించింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఆస్ట్రేలియా డిపెండర్ అంబ్రోషియా మలోనే షూటౌట్‌కు సిద్దమైంది. ఆమె షాట్ ఆడగా.. భారత గోల్‌కీపర్ సవితా అడ్డుకుంది. అలా ఆసీస్ ఒక పెనాల్టీ వృథా చేసుకుందని మనం సంతోషించేలోపే అంపైర్ మధ్యలో దూరింది. సారీ.. షూటౌట్ క్లాక్ టైంలో తప్పిదం ఉందని.. మళ్లీ ప్రారంభించాలని చెప్పింది. అప్పటికే షూటౌట్ చేయడానికి వచ్చిన భారత క్రీడాకారిణికి విషయం చెప్పి అక్కడి నుంచి పంపించేసి మల్లీ అంబ్రోషియాను పిలిచింది. తొలిసారి మిస్ అయిన అంబ్రోషియా ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ కొట్టగా.. భారత్ మాత్రంఒక్క గోల్ చేయలేకపోయింది. అలా భారత మహిళల హాకీ జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. అయితే పెనాల్టీ షూటౌట్ సమయంలో అంపైర్ విధానంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడుతున్నది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అని మరిచిపోయి.. క్లాక్‌టైం మిస్టేక్ అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్ కావాలనే ఇలా చేసిందేమో అంటూ కామెంట్స్ చేశారు. ఇదే విషయమే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అంపైర్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ''ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్ కాగానే అంపైర్ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్‌గా చెప్పేసింది. అంపైర్లు ఇలా ఎందుకుంటారో అర్థం కావడం లేదు. క్రికెట్.. హాకీ ఇలా ఏదైనా ఒక్కటే.. అంపైర్లు తమకుండే సూపర్ పవర్‌తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. ఇలాంటివి క్రికెట్లో బాగా జరిగేవి.. అందుకే మేం హాకీలోకి కూడా త్వరలోనే ఎంటరవుతాం.. అమ్మాయిలు.. ఓడిపోయారు పర్లేదు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. మరోవైపు భారత్- ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్‌పై విమర్శలు పెరగడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ కూడా స్పందించింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్ చిన్న తప్పిదం వల్ల క్లాక్ సెట్ చేయకముందే ప్రారంభమయింది. అందుకే మళ్లీ ప్రారంభించాం. ఈ తప్పిదానికి మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని కామెంట్ చేసింది. కాగా సెమీస్‌లో ఓడినప్పటికి భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమవనుంది. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌పై 2-0 తేడాతో విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక కాంస్య పతక పోరులో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు పోటీ పడనున్నాయి. Penalty miss hua Australia se and the Umpire says, Sorry Clock start nahi hua. Such biasedness used to happen in cricket as well earlier till we became a superpower, Hockey mein bhi hum jald banenge and all clocks will start on time. Proud of our girls 🇮🇳pic.twitter.com/mqxJfX0RDq — Virender Sehwag (@virendersehwag) August 6, 2022 My heart goes out to the Indian women’s hockey team who fought like bravehearts against Australia. No shame in losing in penalties to the Aussies. Our ladies gave everything on the pitch. As fans, we cannot expect more. Really proud of the this team. 🇮🇳🏑❤️ — Viren Rasquinha (@virenrasquinha) August 5, 2022 చదవండి: 'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు -
'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు
భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై హాలివుడ్ స్టార్.. థోర్(క్రిస్ ఎమ్‌స్వర్త్) ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి ప్రదర్శనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. మార్వెల్ కామిక్స్‌లో థోర్ పాత్ర చేతిలో ఉండే సుత్తి చాలా బరువు ఉంటుంది. ఆ సుత్తిని అతను తప్ప ఎవరూ ఎత్తలేరు. అందుకే చాను సాధించిన విజయాన్ని కీర్తిస్తూ..'' ఎంత బరువైనా ఎత్తేస్తుంది.. థోర్ ఇక నీ సుత్తిని వదిలేయాల్సిన సమయం వచ్చేసింది.'' అన్నట్టుగా క్రిస్ హెమ్స్ను ట్యాగ్ చేశాడు సదరు అభిమాని. అభిమాని చేసిన ట్వీట్‌పై హెమ్స్‌వర్త్ స్పందించాడు. ''ఇక నేను సుత్తిని వదిలి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆమె నా సుత్తిని కూడా అవలీలగా ఎత్తేస్తుందేమో. అయినా అందుకు ఆమె అర్హురాలే. కంగ్రాట్స్.. సికోమ్.. నువ్వొక లెజెండ్'' అంటూ కామెంట్ చేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. గత శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి పతకం అందుకుంది. కాగా స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది మీరాబాయి చాను. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. She is worthy! Congrats, Saikhom, you legend. — Chris Hemsworth (@chrishemsworth) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా
స్కాట్లాండ్కు చెందిన జార్జ్ మిల్లర్ ‘లేట్ వయసు’లో గ్రేట్ అనిపించుకున్నాడు. 75 ఏళ్ల 8 నెలల జార్జ్ ‘లాన్ బౌల్స్’ మిక్స్డ్ పెయిర్లో బంగారు పతకం సాధించాడు. మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు (భారత్) 21–10, 21–9తో కొబుగెబ్ (ఉగాండా)పై... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–9, 21–12తో దిమిందు అబెవిక్రమ (శ్రీలంక)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 21–2, 21–4తో జెమీమా –గనెసా ముంగ్రా (మారిషస్) జోడీని ఓడించింది. 4X400 రిలే ఫైనల్లో భారత్: అథ్లెటిక్స్ పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే విభాగంలో అనస్, నోవా నిర్మల్, అజ్మల్, అమోజ్ జేకబ్‌లతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యెర్రాజీ 13.18 సెకన్లలో లక్ష్యానికి చేరి ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. సెమీస్‌లో శ్రీజ: టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో 11–7, 8–11, 11–8, 11–13, 11–9తో ఫిచ్‌ఫోర్డ్–హో టిన్టిన్ (ఇంగ్లండ్) జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 9–11, 11–4, 6–11, 9–11, 11–5, 11–4, 11–8తో మో జాంగ్ (కెనడా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. -
మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్?
ఒక ఇంట్లో తండ్రి మంచి క్రీడాకారుడైనంత మాత్రాన అతడి వారసులు(కొడుకు లేదా కూతురు) అలాగే అవ్వాలని ఎక్కడా రాసిపెట్టి ఉండదు. అయితే, కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ వారసులు కూడా క్రీడాకారులు అవ్వాలని.. రాణించాలని ఆశపడుతుంటారు. మరికొంత మంది మాత్రం తాము ఏం కావాలనుకుంటున్నామో అన్న నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తారు. ఆ ప్రయత్నంలో కొంతమంది పిల్లలు విఫలమైతే.. మరికొందరు మాత్రం వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతారు. ఆ కోవకు చెందినవాడే భారత్ హై జంప్ స్టార్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్. తన అపూర్వ విజయంతో తల్లిదండ్రులతో పాటు యావత్ భారతావనిని గర్వపడేలా చేశాడు. బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో హై జంప్ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకి రజతం ఒడిసిపట్టాడు. ఇక శ్రీశంకర్ ఆర్థికంగా ఏనాడు ఇబ్బంది పడనప్పటికి.. ఈరోజు పతకం సాధించాడంటే అందులో తన పాత్ర ఎంత ఎందో.. కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే కావడం శ్రీశంకర్‌కు కలిసి వచ్చింది. తల్లి కెఎస్ బిజ్మోల్ 800 మీటర్ల క్రీడాకారిణి.. తండ్రి ఎకోస్ బిజ్మోల్ అథ్లెటిక్స్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులిద్దరు క్రీడా విభాగంతో పరిచయం ఉంటే శ్రీశంకర్ క్రీడాకారుడు కాకుండా ఇంకేం అవుతాడు. కుటుంబంతో మురళీ శ్రీశంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు మురళీ శ్రీశంకర్. అపెండిస్ రూపంలో అతనికి సమస్య వచ్చి పడింది. నొప్పిని భరించలేక కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. లాంగ్ జంప్ చేస్తే సమస్యలు చుట్టుముడుతాయన్నారు వైద్యులు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో ఈ నాలుగేళ్లలో తనను తాను చాలా మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. మురళీ శ్రీశంకర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ►శ్రీశంకర్ తాను సాధన చేసే సమయంలో ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా చూసుకోవడం అలవాటు. తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ అంతేనంట. ఒక సందర్బంలో శ్రీశంకర్ తండ్రి మొబైల్‌కు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు. ఆ పాట సౌండ్ శంకర్‌కు వినిపించింది. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి నా ప్రాక్టీస్ సమయంలో నాకు ఎలాంటి సౌండ్ వినిపించొద్దు.. అలా అయితే నేను డిస్ట్రబ్ అవుతా అని చెప్పాడట. అంతే ఆప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీశంకర్ ప్రాక్టీస్ సమయంలో తండ్రి మ్యూజిక్‌ను బ్యాన్ చేస్తూనే వచ్చాడు. శ్రీశంకర్ తెచ్చిన ఈ రూల్ ఇప్పటికి ఆ కుటుంబసభ్యులు పాటిస్తూనే ఉన్నారు. 11 గంటల తర్వాత టీవీ కట్.. ►ఇక రాత్రి 11 గంటల తర్వాత శ్రీశంకర్ ఇంట్లో ఎవరు టీవీ చూడరు. అది ఎంత పెద్ద మ్యాచ్ గాని.. ఇంట్లో మాత్రం టీవీ ఆన్ చేయరు. తాజాగా శ్రీశంకర్ ఒక మెగాటోర్నమెంట్‌లో పాల్గొంటూ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసి కూడా టీవీ పెట్టలేదంటే వాళ్లు తమ నిర్ణయానికి ఎంత కట్టుబడి ఉన్నారో తెలుస్తోంది. తమ కొడుకు కామన్వెల్త్లో రజతం సాధించాడన్న వార్తను ఆ తల్లిదండ్రులు ఉదయమే తెలుసుకోవడం విశేషం. ►శ్రీశంకర్ తనకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి దూరంగా ఉన్నాడు. తల్లిదండ్రులు తనపై ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని ఏనాడు నెగిటివ్‌గా తీసుకోలేదు. వాళ్లు పెట్టే కండీషన్స్ వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీశంకర్ బలంగా నమ్ముతాడు. చదువులో మెరిట్.. ►సాధారణంగా క్రీడాకారులుగా మారేవాళ్లకు సరిగ్గా చదువు అబ్బదంటారు. కానీ ఈ విషయంలో శ్రీశంకర్ పూర్తిగా వేరు. ఆటలో ఎంత చురుకుగా ఉండేవాడో.. చదువులోనూ అంతే చురుకుదనాన్ని చూపించేవాడు. మ్యాచ్‌లు లేని సమయంలో చదువుకునే శ్రీశంకర్.. ఒకవేళ తాను పాల్గొనబోయే గేమ్స్‌లో సమయం దొరికితే కూడా చదువుకునేవాడు. అలా 10వ తరగతి, ఇంటర్మీడియెట్లు 95 శాతం మార్కులతో పాసయ్యాడు. ►ఆ తర్వాత నీట్ పరీక్షలో స్పోర్ట్స్ కోటాలో సెకండ్ ర్యాంక్ సాధించిన మురళీ శ్రీశంకర్ మెరిట్లో బీఎస్సీ మాథ్స్‌ను పూర్తి చేశాడు. నీట్లో తనకొచ్చిన మార్కులతో మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికి వేరే కారణాల వల్ల మెడిసిన్ చేయలేదు. ఇక్కడ విచిత్రమేంటంటే.. మెరిట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికి శ్రీశంకర్ ఇప్పటికి నిరుద్యోగే.'' చదువు మనకు బ్రతికే తెలివిని నేర్పిస్తుంది.. నాతో సహా నా మిత్రులందరూ ఇప్పటికీ ఏ ఉద్యోగాలు చేయడం లేదంటే నమ్ముతారా.. భారత్ కదా ఈ పరిస్థితి మాములే'' అని ఒక సందర్బంలో చెప్పుకొచ్చాడు. మద్యం, సిగరెట్లకు ఆమడ దూరం ►శ్రీశంకర్ ఇచ్చే పార్టీల్లో ఫ్రూట్ జ్యూస్‌లు తప్ప ఇంకేం కనిపించవు. ఎందుకంటే శ్రీశంకర్ ఆల్కహాల్‌ను ఎంకరేజ్ చెయ్యడు. తన మిత్రుల్లో చాలా మంది మందు, సిగరెట్లు అలవాట్లు ఉన్నవారే. కానీ శ్రీశంకర్ పార్టీలిచ్చినా.. ఏ పార్టీలకు వెళ్లినా అక్కడ నో ఆల్కాహాల్.. నో సిగరెట్. ఎందుకంటే శ్రీశంకర్‌కు మేమిచ్చే గౌరవమని అతని స్నేహితులు పేర్కొంటారు. ''శంకు(మురళీ శ్రీశంకర్ ముద్దుపేరు) నా కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా వాడు చూపించే ప్రేమ, గౌరవం ఎప్పుడు తగ్గిపోలేదు. స్కూల్ వయసు నుంచి వాడిని ఒక మంచి అథ్లెట్‌గా చూడాలని కఠిన నిబంధనల మధ్య పెంచినా.. ఒక్కసారి కూడా మాకు ఎదురుచెప్పడం చూడలేదు. అందుకే ఈరోజు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడు'' - తల్లి కెస్ బిజ్మోల్ ''వాడు(శ్రీశంకర్) కష్టపడే తత్వాన్ని ఎప్పుడు వదల్లేదు. ఏనాడు షార్ట్‌కట్స్, అడ్డదారులు తొక్కలేదు. చిన్నప్పటి నుంచి కష్టపడిన తత్వమే ఈరోజు ఈస్థాయిలో నిలబెట్టింది. ఒక తండ్రిగా నాకు ఇంతకమించి ఏముంటుంది. నా మాటకు ఎదురుచెప్పకుండా ఎన్నో చేశాడు.. అలాంటి వాడి కోసం నేను చేసిన త్యాగాలు చాలా చిన్నవి. వాడు నా కొడుకుగా పుట్టడం నాకు గర్వకారణం' - తండ్రి ఎకోస్ బిజ్మోల్ Keep watching that 8.08m jump on a loop...it's a Silver Medal for #India from Murli Sreeshankar 🇮🇳#CommonwealthGames2022 Congratulations India, Congratulations Sree!@birminghamcg22 pic.twitter.com/Rzec3zHWyO — Athletics Federation of India (@afiindia) August 5, 2022 The First Medal of the Day 💪 Murali Sreeshankar wins the first medal of the day with his 🥈 win and takes India to a medal count of 19 in #CWG2022 🔥#BirminghamMeinJitegaHindustanHamara 🫶#B2022 #SirfSonyPeDikhega #SonySportsNetwork pic.twitter.com/dcbAFO0Wgu — Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్; కట్‌చేస్తే -
భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది. కాగా పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు అలాగే అతను ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు. హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు. HISTORIC GOLD FOR INDIA 🔥🔥🔥 Asian Para-Games Bronze medalist, #Sudhir wins 🇮🇳's 1st ever GOLD🥇 medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name 💪💪 Sudhir wins his maiden 🥇 in Men's Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India 1/1 pic.twitter.com/cBasuHichz — SAI Media (@Media_SAI) August 4, 2022 This is so special 😍 6 gold 🥇for Bharat 🇮🇳 thanks to Sudhir lifting 212 kg in para power lifting setting new Games record !! Many congrats to u bhai 👏👏 Billion Indian’s proud of you 👏 #ParaPowerlifting #Sudhir pic.twitter.com/TZ6VEnef4b — Soug (@sbg1936) August 4, 2022 చదవండి: CWG 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం -
మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. బుధవారం హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించిన ఆ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో భారత్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల లాంగ్ జంప్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో ఇది మూడో పతకం. ఇంతకముందు 2002 ,2010లో మహిళల లాంగ్ జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జీ(కాంస్యం), ప్రజూషా మాలిక్కల్(రజతం) పతకాలు సాధించారు. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన లాంగ్ జంప్ ఫైనల్లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. కాగా బహమాస్‌కు చెందిన లకాన్ నైర్న్ కూడా 8.08 మీటర్లే దూకి స్వర్ణం గెలిచాడు. ఎందుకంటే లకాన్ రెండో ఉత్తమ ప్రదర్శన(7.98 మీటర్లు).. శ్రీశంకర్(7.84 మీటర్లు) కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్(8.05 మీటర్లు) దూకి కాంస్యం గెలిచాడు. కాగా కేరళకు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు. అపెండిస్ సమస్యతో కామన్వెల్త్కు దూరమైన మురళీ శ్రీ శంకర్ ఇకపై లాంగ్ జంప్ చేయకపోవచ్చు అని అంతా భావించారు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా లాంగ్‌జంప్‌లో తనను తాను మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. SOARING HIGH 🤩🤩 🥈 #SreeshankarMurali after the historic feat at #CommonwealthGames in Men's Long Jump 😍😍#Cheer4India #India4CWG2022 pic.twitter.com/BdPt80MQwo — SAI Media (@Media_SAI) August 4, 2022 -
వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో ‘సమోవా’ దేశానికి చెందిన డాన్ ఒపెలాజ్ మంగళవారం స్వర్ణ పతకం గెలుచుకున్నాడు... అయితే 24 గంటలు తిరగక మందే ఒపెలాజ్ కుటుంబంలో మరో పతకం వచ్చి చేరింది. బుధవారం 109 కేజీల కేటగిరీలో డాన్ సోదరుడు జాక్ ఒపెలాజ్ రజతం సాధించాడు. కామన్వెల్త్ క్రీడల పతకాలతో ఈ కుటుంబ అనుబంధం చాలా పాతదే. సరిగ్గా చెప్పా లంటే ఆ దేశంలో వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’. 12 మంది సభ్యుల కుటుంబంలో 10 మంది అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్లే కావడం విశేషం. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో డాన్ సోదరు డు న్యూసిలా ఒపెలాజ్ స్వర్ణం గెలుచుకోగా (105 కేజీలు), అదే రోజు అతని సోదరి ఎలె ఒపెలాజ్ కూడా 75 కేజీల కేటగిరీలో పసిడి సొంతం చేసుకుంది. న్యూసెలా 2002 మాంచెస్టర్ క్రీడల్లోనూ కాంస్యం సాధించగా, 2014లో ఎలె ఖాతాలో రజతం చేరింది. మరో సోదరి మేరీ ఒపెలాజ్ 2014 గ్లాస్గో క్రీడల్లో రజత పతకం అందుకుంది. గత గోల్డ్ కోస్ట్ క్రీడల్లోనూ డాన్ ఒపెలాజ్ రజతం సాధించగా... అందరికంటే చిన్నవాడు జాక్ పతకం సాధించడంతో ఈ కుటుంబం కామన్వెల్త్ క్రీడల్లో గెలుచుకున్న పతకాల సంఖ్య ‘8’కు చేరింది. పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు 2 లక్షల జనాభా ఉండే సమోవా ఒలింపిక్స్‌లో సాధించిన ఏకైక పతకం కూడా ఎ లె ఒపెలాజ్దే కావడం విశేషం. 2008 బీజింగ్ క్రీడల్లో 75+ కేజీల కేటగిరీలో ఎలె రజతం గెలుచుకుంది. -
వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్
తేజస్విన్ శంకర్.. వారం క్రితం కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయిన భారత బృందంలో పేరు లేదు. హై జంప్ విభాగంలో క్వాలిఫై స్టాండర్డ్స్ అందుకోలేదన్న కారణంగా చూపి భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అధికారులు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించిన తేజస్విన్ శంకర్ ఆఖరి నిమిషంలో కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లనున్న భారత బృందంలో బెర్త్ దక్కించకున్నాడు. తనను ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధో తెలియదు కానీ.. ఇవాళ 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో హై జంప్ విభాగంలో కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రికార్డును బ్రేక్ చేయలేదన్న బాధ ఉన్నప్పటికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున హై జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. మరి బర్మింగ్హమ్లో కాంస్యం సాధించిన తేజస్విన్ శంకర్ హై జంప్ ప్రాక్టీస్ ఎలా చేశాడో తెలిస్తే షాకవుతారు. తాను రోజు ప్రాక్టీస్ చేసే జేఎల్ఎన్ గ్రౌండ్లో మూడు కుక్కలు ఉండేవి. వాటిని మచ్చిక చేసుకున్న శంకర్ హై జంప్ ప్రాక్టీస్ చేసేవాడు. రోజు వాటికి ఆహారం అందిస్తూ స్టిక్స్ ఏర్పాటు చేసి వాటి వెనకాల పరిగెత్తుతూ హై జంప్ చేసేవాడు. అలా హైజంప్‌లో మరింత రాటు దేలే ప్రయత్నం చేశాడు. అయితే భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అతనికి షాక్ ఇచ్చింది. అయితే కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా విజయం సాధించిన తేజస్విన్ శంకర్ కామెన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టాడు. వాస్తవానికి అథ్లెట్ల సంఖ్య కోటా ఎక్కువగా ఉన్నందున శంకర్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తర్వాత తేలింది. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం హైజంప్ విభాగంలో జరిగిన ఫైనల్లో తేజస్విన్ శంకర్ 2.22 మీటర్ల ఎత్తు దూకి కాంస్యం ఒడిసిపట్టాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినా ఇది కూడా గొప్ప ఘనత కిందే లెక్కించొచ్చు. ఇక ఈ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. A week back Tejaswin Shankar was practising in front of 3 dogs at JLN Stadium, after not being named to the CWG squad despite meeting the AFI QF standard. Included at the last minute after taking the fed to court, today in front of 30000, he wins a high jump bronze in Birmingham. pic.twitter.com/1YDiEsvjE3 — jonathan selvaraj (@jon_selvaraj) August 3, 2022 ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది? -
వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది?
భారత మహిళా బాక్సర్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో కనీస కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మహిళల బాక్సింగ్ 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ బౌట్లో 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌కు ప్రవేశించింది. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం నిఖత్ జరీన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బుధవారం నిఖత్ జరీన్ తల్లి పర్వీన్ సుల్తానా పుట్టినరోజు. తల్లి పుట్టినరోజు నాడే క్వార్టర్స్ మ్యాచ్ గెలిచి కనీసం కాంస్య పతకం ఖరారు చేయడంతో నిఖత్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్ నుంచి కిందకు దిగగానే.. ''హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి'' అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్ జరీన్ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించింది. ఇక నిఖత్ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్(57 కేజీలు) కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించింది. అయితే కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన లవ్లీనా బొర్హంగైన్ మాత్రం నిరాశపరిచింది. మిడిల్ వెయిట్ క్వార్టర్ఫైనల్లో వేల్స్‌కు చెందిన రోసీ ఎక్లెస్ చేతిలో 3-2తో ఓడిపోయింది. మరో బాక్సర్ ఆశిష్ కుమార్(80 కేజీలు) ఇంగ్లండ్‌కు చెందిన ఆరోన్ బోవెన్ చేతిలో 4-1తో ఓడి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. The beautiful thing by @nikhat_zareen after winning QF.. "Happy Birthday ammi, Allah aapko khush rakhe" ❤️😍 #B2022 #boxing #NikhatZareen #CommonwealthGames2022 #CWG2022 #TeamIndia @WeAreTeamIndia @Media_SAI pic.twitter.com/lqp4fVkhoX — Sagar 🕊️ (@imperfect_ocean) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే -
CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు సృష్టించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్ ఫైనల్స్‌లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినప్పటికీ హైజంప్‌లో దేశానికి తొలిపతకం తీసుకొచ్చిన ప్లేయర్‌గా మాత్రం చరిత్రలో నిలిపోయాడు. తాజా పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక కాంస్య పతకం సాధించిన శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ''తేజస్విని శంకర్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.'' అంటూ తెలిపారు. ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా శంకర్‌ను అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు. ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు 🇮🇳🥇 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂! Tejaswin Shankar - remember the name! 💪 This is India's first medal in Athletics at #B2022.#TejaswinShankar #B2022 #CWG2022 #HighJump #TeamIndia #BharatArmy pic.twitter.com/7zQ2S8eMAA — The Bharat Army (@thebharatarmy) August 3, 2022 Tejaswin Shankar creates history. He wins our first high jump medal in the CWG. Congratulations to him for winning the Bronze medal. Proud of his efforts. Best wishes for his future endeavours. May he keep attaining success. @TejaswinShankar pic.twitter.com/eQcFOtSU58 — Narendra Modi (@narendramodi) August 4, 2022 -
CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ జూలు విదిల్చారు. బుధవారం బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. షఫాలీ వర్మ(26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో దీప్తి శర్మ(28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) దుమ్మురేపడంతో భారత్ మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ మహిళల జట్టు భారత్ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. కోషోనా నైట్ 16 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌లో తలపడనుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమైనట్లే. A fantastic victory for #TeamIndia. They win by 100 runs and advance into the semi-finals at the #CWG2022 👏👏 Scorecard - https://t.co/upMpWogmIP #INDvBAR #B2022 pic.twitter.com/uH6u7psVmG — BCCI Women (@BCCIWomen) August 3, 2022 -
CWG 2022: హర్మన్‌ప్రీత్ సేనకు చావో రేవో.. గెలిస్తేనే సెమీస్‌కు
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు బుధవారం(ఆగస్టు 3న) బార్బడోస్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఒక రకంగా భారత్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న హర్మన్ ప్రీత్ సేన బార్బడోస్‌తో గెలిస్తేనే ముందుకు వెళుతుంది. పాక్‌పై గెలిచి.. ఆస్ట్రేలియాతో ఓటమి చవి చూసిన భారత్.. బార్బడోస్‌తో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. అటు బార్బడోస్ జట్టుది కూడా అచ్చం ఇదే పరిస్థితి. పాకిస్తాన్‌పై విజయం.. ఆసీస్‌తో చేతిలో ఓటమితో ఆ జట్టకు కూడా భారత్‌తో మ్యాచ్ కీలకం కానుంది. మరి తొలిసారి టీమిండియా మహిళలు ఆడుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీస్‌కు చేరి పతకం దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. టీమిండియా వుమెన్స్‌లో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఇక ఇతర మ్యాచ్‌లు పరిశీలిస్తే.. భారత పరుషుల, మహిళల హాకీ జట్టు కెనడాతో అమితుమీ తేల్చుకోనుండగా.. బాక్సర్లు లవ్లీనా బొర్హంగైన్, నికత్ జరీన్, నీతు గంగాస్లు క్వార్టర్ ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆరవ రోజు భారత్ ఆటగాళ్లు పాల్గొనబోయే మ్యాచ్‌ల షెడ్యూల్.. పూర్తి వివరాలు అథ్లెటిక్స్: మహిళల షాట్‌పుట్ ఫైనల్ - మన్‌ప్రీత్ కౌర్ (గురువారం ఉదయం 12.35) పురుషుల హైజంప్ ఫైనల్ - తేజస్విన్ శంకర్ (11.30 pm ) బాక్సింగ్ మహిళల 45kg-48 kg క్వార్టర్ ఫైనల్స్ – నీతు గంగాస్ (సాయంత్రం 4.45) 48-50 కిలోల (లైట్ ఫ్లై వెయిట్) క్వార్టర్ ఫైనల్స్ – నిఖత్ జహ్రీన్ (11.15 PM) 66-70 కిలోల (లైట్ మిడిల్ వెయిట్) క్వార్టర్-ఫైనల్ - లోవ్లినా బోర్గోహైన్ (12.45 AM) పురుషులు 54-57 కేజీలు (ఫెదర్ వెయిట్) క్వార్టర్ ఫైనల్స్ – హుస్సామ్ ఉద్దీన్ మహమ్మద్ (సాయంత్రం 5.45) క్రికెట్ మహిళల T20 - భారతదేశం వర్సెస్ బార్బడోస్ - 10.30 PM హాకీ మహిళల పూల్ A - ఇండియా వర్సెస్ కెనడా - 3.30 PM పురుషుల పూల్ B - ఇండియా వర్సెస్ కెనడా - 6.30 PM జూడో మహిళల 78 కేజీల క్వార్టర్-ఫైనల్ - తులికా మన్ - మధ్యాహ్నం 2.30 PM పురుషుల 100 కేజీల ఎలిమినేషన్ రౌండ్ 16 - దీపక్ దేశ్వాల్ - మధ్యాహ్నం 2.30 PM లాన్ బౌల్స్ పురుషుల సింగిల్స్ - మృదుల్ బోర్గోహైన్ - 1 PM- 4 PM మహిళల జంట - భారతదేశం vs నియు - 1 PM - 4 PM పురుషుల ఫోర్- భారత్ vs కుక్ ఐలాండ్స్ మరియు ఇంగ్లండ్ - రాత్రి 7.30-10.30 PM మహిళల ట్రిపుల్ - ఇండియా vs నియు - 7.30 PM స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 వర్సెస్ శ్రీలంక - 3.30 PM వెయిట్‌లిఫ్టింగ్: పురుషుల 109 కేజీలు - లోవ్‌ప్రీత్ సింగ్ - 2 PM మహిళల 87 కేజీలు - పూర్ణిమ పాండే - సాయంత్రం 6.30 PM పురుషుల 109+కేజీలు - గుర్దీప్ సింగ్ - రాత్రి 11 PM 𝙄𝙩 𝙝𝙖𝙥𝙥𝙚𝙣𝙨 𝙤𝙣𝙡𝙮 𝙖𝙩 𝙩𝙝𝙚 𝘾𝙤𝙢𝙢𝙤𝙣𝙬𝙚𝙖𝙡𝙩𝙝 𝙂𝙖𝙢𝙚𝙨 🙌 Guess who were out there to cheer for our women's hockey team?😎💪 🏏@BCCIWomen 🤝 @TheHockeyIndia🏑 📷 @imharleenDeol/@WeAreTeamIndia | #B2022 pic.twitter.com/KHyw61Qvja — Team India (@WeAreTeamIndia) August 2, 2022 చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’ -
CWG 2022: అథ్లెటిక్స్ ఫైనల్లో ముగ్గురు...
కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, మొహమ్మద్ అనీస్ యాహియా... మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ శ్రీశంకర్ 8.05 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచాడు. గ్రూప్ ‘బి’లో యాహియా 7.68 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. రెండు గ్రూప్‌ల నుంచి కలిపి టాప్–12లో నిలిచినవారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. షాట్‌పుట్ క్వాలిఫయింగ్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఇనుప గుండును 16.78 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఏడో ర్యాంక్‌తో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఐదో హీట్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 11.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ద్యుతీచంద్ 27వ ర్యాంక్‌లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం -
పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. భారత బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ విభాగం రజత పతకం సాధించింది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముందుగా భారత షెట్లర్లు చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయి యిక్‌తో జరిగిన పురుషులు డబుల్స్ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 21-18,21-15 తేడాతో చిరాగ్-సాత్విక్ జంట ఓటమి చవిచూసింది. అనంతరం సింగిల్స్‌లో భాగంగా పీవీ సింధు.. మలేషియా స్టార్ జిన్ వెయ్-గోహ్‌ను 22-20, 21-17తో మట్టికరిపించి మ్యాచ్ గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్.. మలేషియా షెట్లర్ జె యోంగ్ చేతిలో 21-19,6-21,21-16తో ఓడిపోయాడు. దీంతో మలేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిర్ణయాత్మకమైన నాలుగో మ్యాచ్ అయిన మహిళల డబుల్స్‌లో భారత్ జోడి త్రీసా జోలీ-గాయత్రి గోపిచంద్ చేతులెత్తేసింది. మలేషియన్ జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్ చేతిలో 21-18,21-17తో భారత్ జంట ఓటమి పాలవ్వడంతో భారత్ ఖాతాలో రజతం వచ్చి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణం, ఐదు రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. SILVER FOR INDIA 🇮🇳 Indian #Badminton Mixed Team puts up a brilliant show of team play, grit, resilience to bag its 2nd consecutive medal🥇🥈 at #CommonwealthGames A mix of comebacks & dominance by our Champs lead 🇮🇳 to this 🥈 at @birminghamcg22 Well played 👏#Cheer4India pic.twitter.com/AMj8q9sAik — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’ CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం! -
Lan Bowls: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’
సాధారణంగానైతే కామన్వెల్త్ క్రీడల్లో పతకం... అదీ స్వర్ణం సాధించిన వారి గురించి ఇలాంటి పరిచయ కార్యక్రమం అవసరం ఉండదు. కానీ లాన్ బౌల్స్ ఆట గురించే అరుదుగా తెలిసిన దేశంలో అందులోని క్రీడాకారుల గురించి అంతకంటే ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. అసలు ప్రాచుర్యం పొందని ఆటను ఎంచుకోవడంలోనే ఒక సాహసం ఉంటే ఇప్పుడు అదే క్రీడలో కామన్వెల్త్ క్రీడల పసిడి గెలుచుకోవడం అసాధారణం. కానీ పై నలుగురు మహిళలు దానిని చేసి చూపించారు. ఒక్కసారిగా అందరి దృష్టీ తమపై పడేలా చేశారు. సగటు క్రీడాభిమాని భాషలో... ‘ఆట గురించైతే పూర్తిగా తెలీయదు, కానీ ఫలితం చూస్తే ఆనందం మాత్రం వేసింది’ అనడం సరిగ్గా సరిపోతుందేమో! –సాక్షి క్రీడా విభాగం లాన్ బౌల్స్ స్వర్ణం గెలిచిన నలుగురికీ క్రీడాకారులుగా ఇది రెండో ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. గాయాల కారణంగా లవ్లీ, నయన్మోని కెరీర్లు అర్ధాంతరంగా ఆగిపోతే క్రీడల్లో కొనసాగాలనే ఆసక్తితో మరో కొత్త ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్ ఆడిన పింకీ పని చేస్తున్న పాఠశాల ఒకసారి నేషనల్ లాన్ బౌల్స్‌కు వేదికైంది. ఆ సమయంలో ఆటను చూసిన ఆమె కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది. టీమ్ గేమ్ కాకుండా వ్యక్తిగత క్రీడకు మారాలనుకున్న రూప అనుకోకుండా బౌల్స్ వైపు వచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారం కబడ్డీకంటే ఎక్కువగా ఉండటంతో ఇక్కడే కొనసాగింది. మన దేశంలో లాన్ బౌల్స్ ఆడేందుకు తగిన సౌకర్యాలు కనిపించవు. ప్రమాణాలకు అనుగుణంగా లాన్స్ లేకపోవడంతో పాటు బౌల్స్ కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో వీరు ప్రతికూలతలను దాటి ఇలాంటి విజయం సాధించడం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మాజీ క్రికెట్ అంపైర్ అయిన మధుకాంత్ పాఠక్ వీరందరికీ కోచింగ్ ఇచ్చారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత ఆటగాళ్లు సింథటిక్ గ్రాస్‌పై ప్రాక్టీస్ చేయగా... అక్కడికి వెళ్లాక సహజమైన పచ్చిక ఎదురైంది. దాంతో వారి ఆటలో గందరగోళం కనిపించింది. సహజ పచ్చికపై బౌల్ చేసేందుకు ఎక్కువగా భుజ బలం అవసరం. అక్కడ దెబ్బతిన్న వీరు ఆ తర్వాత సాధనను మార్చారు. ప్రైవేట్ రిసార్ట్‌లలో మాత్రమే ఉండే సౌకర్యాలను సొంత ఖర్చులతో ఉపయోగించుకున్నారు. వేర్వేరు పోటీల ద్వారా పరిచయమైన ఈ నలుగురు దాదాపు పదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో పెయిర్స్ విభాగంలో రూప, పింకీ కాంస్యానికి చేరువగా వచ్చి పతకం కోల్పోయారు. వీరిద్దరితో పాటు 2014, 2018లో లవ్లీతో కలిసి ‘ట్రిపుల్స్’ ఆడగా క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు నయన్మోని కలిసి రాగా నలుగురి బృందం ‘ఫోర్స్’లో గోల్డ్‌వైపు సాగిపోయింది. గత ఓటముల బాధ తాజా విజయపు ఆనందాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. గెలుపు ఖరారైన క్షణాన, పతకాలు అందుకునేటప్పుడు వారి సంబరాల్లో అది స్పష్టంగా కనిపించింది. నలుగురితో పాటు దశాబ్దకాలంగా జట్టు మేనేజర్‌గా ఉన్న అంజు లుత్రా పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. తన కుమార్తెలవంటి వీరితో సుదీర్ఘ కాలంగా సాగించిన ప్రయాణం తర్వాత దక్కిన ఈ పతకం ఆమెనూ భావోద్వేగానికి గురి చేసింది. ఒక రకంగా వీరందరికీ కామన్వెల్త్ క్రీడలు చావో, రేవోగా మారాయి. ఎవరూ పట్టించుకోని ఆటలో ఇంకో పరాజయం అంటే ఇక కెరీర్లు ముగిసినట్లే అని భావించారు. ఇప్పటి వరకు ఎంతో కొంత సహకారం అందించివారు కూడా సహజంగానే వెనక్కి తగ్గుతారు. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కచ్చితంగా వారితో పాటు ఆటను కూడా ఒక మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. లవ్లీ చౌబే: వయసు 42 ఏళ్లు, మాజీ స్ప్రింటర్, పోలీస్ కానిస్టేబుల్, జార్ఖండ్ పింకీ: 41 ఏళ్లు, మాజీ క్రికెటర్, పీఈటీ, ఢిల్లీ రూపా రాణి టిర్కీ: 34 ఏళ్లు, మాజీ కబడ్డీ క్రీడాకారిణి, జిల్లా క్రీడాధికారి, జార్ఖండ్ నయన్మోని సైకియా: 33 ఏళ్లు, మాజీ వెయిట్‌లిఫ్టర్, అటవీ అధికారి, అసోం HISTORY CREATED 🥳 1st Ever 🏅 in Lawn Bowls at #CommonwealthGames Women's Fours team win 🇮🇳 it's 1st CWG medal, the prestigious 🥇 in #LawnBowls by defeating South Africa, 17-10 Congratulations ladies for taking the sport to a new level🔝 Let's #Cheer4India#India4CWG2022 pic.twitter.com/uRa9MVxfRs — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Commonwealth Games 2022: బౌల్స్‌లో బంగారం... టీటీలో పసిడి Emma McKeon: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం!
మాములుగా మనం తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ధర రూ.100కు మించి ఉండదు. కానీ బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌కు వెళితే.. అక్కడ మీరు కొనుక్కునే ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్, సాసేజ్ బాక్స్ ధర ఎంత తెలుసా అక్షరాల వెయ్యి రూపాయలు. సాధారణంగా ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ పెట్టే షాపుల్లో బయటికన్నా ధరలు రెట్టింపు ఉండడం సహజం. కానీ కామన్వెల్త్ గేమ్స్‌కు వస్తున్న అభిమానులు ఏమైనా తినాలంటే పర్సు ఖాళీ చేయాల్సిందే. అంతలా మండిపోతున్నాయి అక్కడి రేట్లు. కామన్వెల్త్లో ఆయా దేశాలు ఆటగాళ్లు పతకాల పంట పండిస్తుంటే.. అక్కడి వ్యాపారులు మాత్రం కామన్వెల్త్ చూసేందుకు వస్తున్న అభిమానుల జేబులకు చిల్లు పెడుతూ తమ పంట పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ ఉన్న బాక్సును ఏకంగా 9.80 యూరోలకు అమ్మేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.వెయ్యి రూపాయలు. అంటే ప్రేక్షకులు ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ తీసుకుంటూ వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే ఒక అభిమాని ట్విటర్ వేదికగా తన గోడును వెల్లబోసుకున్నాడు. ''కామన్వెల్త్ గేమ్స్ చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చాం. ఏమైనా తినాలని కొనడానికి వెళ్తే పర్సు ఖాళీ అవుతుంది. పోనీ అంత భారీ రేటుతో కొన్నా ఫ్రైంచ్ ఫ్రైస్ పచ్చిగానే ఉంటుంది.. వాటిని ఫ్రై చేయడానికి ఇంకా డబ్బులు తగలేస్తున్నామంటూ?'' ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తుంది. నాలుగు రోజుల్లో భారత్ ఖాతాల్లో 9 పతకాలు జమవ్వగా.. అందులో మూడు స్వర్ణం, మూడు రజతం.. మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. Hello @FootyScran, this is the sausage and chips I had at the Sandwell Leisure Centre ahead of tonight's swimming events at @birminghamcg22. This cost £9.80! 🙂 pic.twitter.com/cZAaRg25Cl — Matthew (The Pieman) Williams (@Matthew23732409) July 29, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్ Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత సైక్లిస్ట్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో పాల్గొన్న భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. విషయంలోకి వెళితే.. గేమ్స్‌లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే ఈ మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది. దీంతో బ్రయోనీ బోథా కూడా సైకిల్‌పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైడర్‌లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే లీ వ్యాలీవెలో పార్క్ వద్ద ఇది రెండో ప్రమాదం. ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్లో సైకిల్‌పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు. Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82 — Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం -
కామన్వెల్త్ గేమ్స్ ఐదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు తమ జోరు చూపిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు ఉండగా.. మూడు స్వర్ణం, 3 రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఇక ఐదో రోజు ఆటలో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొట్టనుందనేది ఆసక్తికరంగా మారింది. ఐదోరోజు భారత్ పాల్గొనబోయే ఈవెంట్స్ ఒకసారి పరిశీలిస్తే.. ►1 PM (లాన్ బౌల్స్): మహిళల జంట- భారత్ vs న్యూజిలాండ్ మహిళల ట్రిపుల్స్- భారత్ vs న్యూజిలాండ్ ►2 PM (వెయిట్ లిఫ్టింగ్):మహిళల 76 కేజీలు- పూనమ్ యాదవ్ ►2:30 PM (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్): పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫైయింగ్- ఎం శ్రీశంకర్, మహమ్మద్ అనీస్ యాహియా ►3:04 PM (స్విమ్మింగ్): పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ -శ్రీహరి నటరాజ్ ►3:30 PM (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్): మహిళల షాట్‌పుట్ క్వాలిఫైయింగ్- మన్‌ప్రీత్ కౌర్ ►4:10 PM (స్విమ్మింగ్): పురుషుల 1500మీ ఫ్రీస్టైల్ హీట్ 1- అద్వైత్ పేజీ ►4:15 (లాన్ బౌల్స్): మహిళల ఫోర్స్ ఫైనల్స్- భారత్ vs సౌతాఫ్రికా పురుషుల సింగిల్స్- మృదుల్ బోర్గోహైన్ vs షానన్ మెసిలోరీ ►4:28 PM (స్విమ్మింగ్): పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్ 2- కుశాగ్రా రావత్ ►5:17 PM (అథ్లెటిక్స్):మహిళల 100మీ రౌండ్ 1 - హీట్ 5 - ద్యుతీ చంద్ ►06:00PM (టేబుల్ టెన్నిస్): పురుషుల టీమ్ ఫైనల్ - ఇండియా vs సింగపూర్ ►6:30PM (హాకీ): మహిళల మ్యాచ్- భారత్ vs ఇంగ్లండ్ ►6:30 PM (వెయిట్ లిఫ్టింగ్): పురుషుల 96 కేజీలు- వికాస్ ఠాకూర్ ►8:30 PM (స్క్వాష్): మహిళల సింగిల్స్ ప్లేట్ సెమీఫైనల్స్- సునయన సనా కురువిల్లా vs ఫైజా జాఫర్ ►8:45 PM (లాన్ బౌల్స్): పురుషుల ఫోర్లు- భారత్ vs ఫిజీ మహిళల ట్రిపుల్స్- భారత్ vs ఇంగ్లండ్ ►9:15PM (స్క్వాష్): పురుషుల స్క్వాష్ సెమీఫైనల్స్- సౌరవ్ ఘోసల్ vs పాల్ కోల్ ►10:00PM (బ్యాడ్మింటన్): మిక్స్డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ - ఇండియా vs మలేషియా ►11 PM (వెయిట్ లిఫ్టింగ్): మహిళల 87 కేజీలు- ఉషా బన్నూర్ ఎన్కే ►11:45 PM (బాక్సింగ్): పురుషుల వెల్టర్ వెయిట్- రోహిత్ టోకాస్ vs ఆల్ఫ్రెడ్ కోటే ►12:52 AM (ఆగస్టు 3): (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్) మహిళల డిస్కస్ త్రో ఫైనల్- సీమా పునియా, నవజీత్ కౌర్ ధిల్లాన్ Day 5️⃣ at CWG @birminghamcg22 Take a 👀 at #B2022 events scheduled for 2nd August Catch #TeamIndia🇮🇳 in action on @ddsportschannel & @SonyLIV and don’t forget to send in your #Cheer4India messages below#IndiaTaiyaarHai #India4CWG2022 pic.twitter.com/0waVvMwsI9 — SAI Media (@Media_SAI) August 2, 2022 -
కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం
బర్మింగహమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచి ఆరు పతకాలు కొల్లగొట్టిన భారత్.. తాజాగా ఆ విభాగంలో ఏడో పతకం సాధించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్ కేటగిరీలో 93 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 119 కేజీలు.. మొత్తం 212 కేజీలు ఎత్తి కాంస్యం ఒడిసి పట్టింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ స్వర్ణం దక్కించుకుంది. తాజా పతకంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో తొమ్మిదో పతకం చేరగా.. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు.. మరో మూడు కాంస్యాలు ఉన్నాయి. కాగా స్నాచ్ కేటగిరిలో మొదటి ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తడంలో హర్జీందర్ విఫలమైంది. తన రెండో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తిన ఆమె.. మూడో ప్రయత్నంలో 93 కేజీల బరువును ఎత్తి కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో 113 కేజీలు, రెండో ప్రయత్నంలో 116 కేజీలు విజయవంతగా ఎత్తిన హర్జీందర్ కౌర్.. మూడో ప్రయత్నంలో 119 కేజీల బరువును ఎత్తి ఓవరాల్‌గా 212 కేజీలతో కాంస్యం దక్కించుకుంది. 9️⃣th medal for 🇮🇳 at @birminghamcg22 🤩🤩 After high voltage 🤯 drama India's #HarjinderKaur bags 🥉 in Women's 71kg Final with a total lift of 212Kg 🏋♂️ at #B2022 Snatch- 93kg Clean & Jerk- 119kg With this #TeamIndia🇮🇳 wins its 7️⃣th Medal in 🏋♀️🏋♂️ 💪💪#Cheer4India🇮🇳 pic.twitter.com/D13FqCqKYs — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి?
బర్మింగ్‌హామ్: లాన్ బౌల్స్... కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైన నాటినుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉంది. 2010 నుంచి మాత్రమే పాల్గొంటున్న భారత్ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మన మహిళలు కొత్త చరిత్రను సృష్టించారు. లాన్ బౌల్స్ ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేశారు. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ, నయన్మోని సైకియా సభ్యులుగా ఉన్న భారత బృందం సెమీఫైనల్లో 16–13 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో విజయం సాధిస్తే భారత్‌కు స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడితే రజతం లభిస్తుంది. భారత పురుషుల జట్టు మాత్రం 8–26 తేడాతో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ‘లాన్ బౌల్స్’ ఎలా ఆడతారంటే... సింగిల్స్, డబుల్స్‌లతో పాటు టీమ్‌లో నలుగురు ఉండే ‘ఫోర్స్’ ఫార్మాట్లు ఇందులో ఉన్నాయి. పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో ‘బౌల్స్’గా పిలిచే రెండు పెద్ద సైజు బంతులతో పాటు ‘ది జాక్’ అని చిన్న బంతి కూడా ఉంటుంది. టాస్ వేసి ముందుగా ఎవరు బౌల్ చేస్తారో, ఎవరు జాక్‌ను విసురుతారో తేలుస్తారు. ముందుగా ఒకరు ‘జాక్’ను అండర్ ఆర్మ్ త్రో తో విసురుతారు. ఆపై మరో జట్టు సభ్యులకు బౌల్స్ విసిరే అవకాశం లభిస్తుంది. ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్ (ఎండ్)లో ఎనిమిది త్రోలు విసరవచ్చు. ఇలా 18 రౌండ్లు ఉంటాయి. ‘జాక్’కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్ చేయడమే ఫలితాన్ని నిర్దేసిస్తుంది. ప్రత్యర్థికంటే ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో జాక్‌కు దగ్గరగా బౌల్ చేయగలరో అన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో ఈ పాయింట్లను లెక్కకట్టి విజేతను నిర్ణయిస్తారు. 🇮🇳 Creates History at @birminghamcg22 🔥 India's #LawnBowl Women's Four team creates history by becoming the 1st Indian Team to reach the Finals of #CommonwealthGames India 🇮🇳 16- 13 🇳🇿 New Zealand (SF) They will now take on South Africa in the Finals on 2nd Aug#Cheer4India pic.twitter.com/tu64FSoi8R — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం -
అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డాటిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. డాటిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించింది. కాగా జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆమె దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలిపింది. "14 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్లో నాకు మద్దతుగా నిలిచిన వెస్టిండీస్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు. నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా దేశవాళీ క్రికెట్ ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ట్విటర్లో డాటిన్ పేర్కొంది. కాగా డాటిన్ ప్రస్తుతం కామన్ వెల్త్‌గేమ్స్‌లో బార్బడోస్ జట్టు తరపున ఆడుతోంది. కామన్ వెల్త్‌గేమ్స్‌లో భాగంగా ఆగస్టు 3న భారత్ మహిళల జట్టుతో బార్బడోస్ తలపడనుంది. అయితే డాటిన్ ఈ మ్యాచ్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం బార్బడోస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది. చదవండి: Eng VS SA: స్టబ్స్ అద్భుత విన్యాసం.. ఒంటిచేత్తో అవలీలగా! ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు! Thanks to all for the love and support with in my past 14 years of playing cricket for West Indies! I look forward to be playing domestic cricket around the world pic.twitter.com/Vmw6AqpYQJ — Deandra Dottin (@Dottin_5) July 31, 2022 -
మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి ఛానును బింద్యారాణి దేవి రోల్ మోడల్‌గా భావించింది. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని కడు పేదరికం నుంచి వచ్చిన బింద్యారాణ దేవి ఇవాళ అంతర్జాతీయ వేదికపై భారత పతకాన్ని రెపరెపలాడించింది. మీరాబాయి చానులాగే మణిపూర్ నుంచి వచ్చిన బింద్యారాణి దేవి, ఒకే అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఓ చిన్న గుడిసెలో జీవనం సాగించిన మీరాబాయి ఛాను లైఫ్ స్టైల్, ఒలింపిక్ మెడల్ తర్వాత పూర్తిగా మారిపోయింది. అయితే తనలాగే పేదరికాన్ని అనుభవిస్తూ కూడా భారత్‌కి పతకాలు సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న బింద్యారాణి దేవి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మీరాబాయి ఛాను... ఖరీదైన బూట్లను కానుకగా ఇచ్చింది. అవే బూట్లు వేసుకొని బరిలోకి దిగిన బింద్యారాణి దేవి తాజాగా కామన్వెల్త్ గేమ్స్ 2022లో 55 కేజీల విభాగంలో రజతం సాధించింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. ఇక మ్యాచ్ అనంతరం బింద్యారాణి దేవి మాట్లాడుతూ.. ‘నా సక్సెస్‌లో మీరా దీ పాత్ర చాలా ఉంది. నా టెక్నిక్, ట్రైయినింగ్‌లో మీరా ఎంతగానో సాయం చేసింది. క్యాంప్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఎంతో అప్యాయంగా పలకరించి, మాట్లాడింది. నా దగ్గర బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసి, తన షూస్ నాకు ఇ్చింది. ఆమె నాకు ఆదర్శం... నేను తనకి పెద్ద అభిమానిని అయిపోయా...’ అంటూ చెప్పుకొచ్చింది. -
అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఏలో భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 3-1 తేడాతో ఘన విజయం అందుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తరపున వందనా కటారియా(ఆట 26, 48వ నిమిషం), గుర్జీత్ కౌర్(ఆట 28వ నిమిషం)లో గోల్స్ చేయగా.. వేల్స్ తరపున గ్జెన్నా హ్యూజెస్(ఆట 45వ నిమిషం) గోల్ చేసింది. ఇక భారత్ తమ తర్వాతి మ్యాచ్ ఆగస్టు 2న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. కానీ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే దృడ సంకల్పంతో ఉంది. మరోవైపు ఎలాగైనా స్వర్ణం సాధించాలని బరిలోకి దిగన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఘనాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. GOAL! And the avalanche of goals continues with #TeamIndia's third goal. IND 3:1 WAL #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI — Hockey India (@TheHockeyIndia) July 30, 2022 -
భారత్ ఖాతాలో నాలుగో పతకం.. వెయిట్లిప్టింగ్లో బింద్యారాణికి రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలుపొందింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. అయితే బింద్యారాణి క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు. అయితే చివరి రౌండ్లో పుంజుకున్న బింద్యారాణి..116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. కాగా, బింద్యారాణి సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్యం లభించింది. SUPER SENSATIONAL SILVER FOR BINDYARANI 🔥🔥 Bindyarani Devi 🏋♀️wins 🥈in the Women's 55kg with a total lift of 202kg, after an amazing come back 💪💪 Snatch - 86 kg (PB & Equalling NR) Clean & Jerk - 116 kg (GR & NR) With this 🇮🇳 bags 4️⃣🏅 @birminghamcg22#Cheer4India pic.twitter.com/iFbPHpnBmK — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి -
CWG 2022 3rd Day: భారత ఆటగాళ్ల మ్యాచ్ షెడ్యూల్.. పూర్తి వివరాలు
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆదివారం భారత్ ఆటగాళ్ల షెడ్యూల్.. పూర్తి వివరాలు ►1:00 PM: తానియా చౌదరి vs షానా ఓ నీల్ (నార్తర్న్ ఐలాండ్) (లాన్ బాల్స్) ►1:30 PM: యోగేశ్వర్ సింగ్ - పురుషుల ఆల్ అరౌండ్ ఫైనల్ (జిమ్నాస్టిక్స్) ►2:00 PM: జెరెమీ లాల్రిన్నుంగా - పురుషుల 67 KG (వెయిట్ లిఫ్టింగ్) ►2:00 PM: పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (టేబుల్ టెన్నిస్) ►2:32 PM: ఎసోవ్ అల్బెన్, రొనాల్డో లైటోంజమ్, డేవిడ్ బెక్హాం – పురుషుల స్ప్రింట్ క్వాలిఫైయింగ్ (సైక్లింగ్) ►3:07 PM: సజన్ ప్రకాష్ – పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్ 3 (ఈత) ►3:27 PM: పురుషుల స్ప్రింట్ 1/8 ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►3:30 PM: భారత్ vs పాకిస్థాన్ (క్రికెట్) ►3:31 PM: శ్రీహరి నటరాజ్ – పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్ 6 ►4:00 PM: భారతదేశం vs ఇంగ్లాండ్ - లాన్ బౌల్ పురుషుల పెయిర్స్ ►4:04 PM: పురుషుల స్ప్రింట్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►4:20/4:59 PM: వెంకప్ప కెంగళగుత్తి, దినేష్ కుమార్ – పురుషుల 15KM స్క్రాచ్ రేస్ క్వాలిఫైయింగ్ (సైక్లింగ్) ►4:45 PM: నిఖత్ జరీన్ vs హెలెనా ఇస్మాయిల్ బాగూ (MOZ) – 48 – 50KG (రౌండ్ ఆఫ్ 16) (బాక్సింగ్) ►5:15 PM: శివ థాపా vs రీస్ లించ్ (SCO) – 60 – 63.5KG (రౌండ్ ఆఫ్ 16) ►6:00 PM: జోష్నా చినప్ప vs కైట్లిన్ వాట్స్ (NZL) - మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (స్క్వాష్) ►6:30 PM: పాపీ హజారికా - మహిళల 59KG (వెయిట్ లిఫ్టింగ్) ►6:45 PM: సౌరవ్ ఘోసల్ vs డేవిడ్ బైలార్జన్ (CAN) - పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (స్క్వాష్) ►7:00 PM: మహిళల ఆల్ అరౌండ్ ఫైనల్ ►7:30 PM: మహిళల నాలుగు క్వార్టర్ ఫైనల్స్ (లాన్ బాల్స్) ►7:40 PM: పురుషుల స్ప్రింట్ సెమీఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►8:30 PM: భారతదేశం vs ఘనా - పురుషుల పూల్ A (హాకీ) ►9:02 PM: త్రియషా పాల్, మయూరి లూట్ - మహిళల 500M టైమ్ ట్రయల్ ఫైనల్ (సైక్లింగ్) ►10:00 PM నుండి: మిక్స్డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (బ్యాడ్మింటన్) ►10:12 PM: పురుషుల స్ప్రింట్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►10:30 PM: పురుషుల పెయిర్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (లాన్ బాల్స్) ►10:30 PM: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే) (లాన్ బాల్స్) ►11:00 PM: అచింత షెయులీ - పురుషుల 73 KG (వెయిట్ లిఫ్టింగ్) ►11:12 PM: పురుషుల 15KM స్క్రాచ్ రేస్ ఫైనల్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►11:37 PM: శ్రీహరి నటరాజ్ – పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్ (స్విమ్మింగ్) ►11:58 PM: సజన్ ప్రకాష్ – పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఫైనల్ (స్విమ్మింగ్) ►12:15 AM (AUG 1): సుమిత్ vs కల్లమ్ పీటర్స్ (AUS) – 71 – 75KG కంటే ఎక్కువ (రౌండ్ ఆఫ్ 16) ►1:00 AM (AUG 1): సాగర్ vs మాక్సిమ్ యెగ్నాంగ్ ఎన్జీయో (కామెరూన్) - 92KG కంటే ఎక్కువ ►1:30 AM (AUG 1): మహిళల టీమ్ సెమీఫైనల్స్ (టేబుల్ టెన్నిస్) -
నాలుగేళ్ల కిందటి హామీ.. పతకధారిగా ‘పాన్వాలా’
నాలుగేళ్ల క్రితం... గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో గురురాజ పుజారి పోటీ పడుతున్నాడు. తన ‘పాన్ షాప్’లో కూర్చొని ఈ ఈవెంట్‌ను సంకేత్ టీవీలో చూస్తున్నాడు. గురురాజ 56 కేజీల విభాగంలో రజతం సాధించాడు. ఆ సమయంలో సంకేత్ ‘నాలుగేళ్ల తర్వాత ఎలాగైనా నేనూ అక్కడికి వెళతాను. కష్టపడి కచ్చితంగా పతకం సాధిస్తాను’ అని తనకు తాను చెప్పుకున్నాడు. నిజంగానే అతను తన కల నెరవేర్చుకున్నాడు. 2013 నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు 22 ఏళ్ల వయసులో కామన్వెల్త్ పతకంతో సత్తా చాటాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో సంకేత్ తండ్రికి పాన్‌షాప్‌తో పాటు చిన్నపాటి టిఫిన్ సెంటర్ కూడా ఉంది. మొదటినుంచి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే అతను ఆటపై దృష్టి పెట్టాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న తండ్రి ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్ వైపు నడిచాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా తండ్రి మహదేవ్ ఎప్పుడూ సంకేత్‌ను నిరుత్సాహపర్చలేదు. ఒక వైపు వెయిట్‌లిఫ్టర్‌గా గుర్తింపు వస్తున్న సమయంలో సంకేత్ కూడా ఏనాడూ పాన్‌షాప్‌లో కూర్చొని పని చేయడాన్ని తక్కువగా భావించలేదు. 2020లో కోల్‌కతాలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో సంకేత్ తొలిసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఏడాది సింగపూర్‌లో మొత్తం 256 కేజీల బరువు ఎత్తడంతో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అర్హత లభించింది. ఫిబ్రవరిలో పటియాలలోని నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం లభించిన తర్వాత హెడ్ కోచ్ విజయ్ శర్మ పర్యవేక్షణలో మరింతగా రాటుదేలిన సంకేత్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ‘ఇప్పటి వరకు అంతా సంకేత్ పాన్వాలా అని పిలిచేవారు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల పతక విజేత సంకేత్ పాన్వాలా అని పిలుస్తారేమో’ అని ఉద్వేగంగా చెప్పాడు. సోదరుడి బాటలో వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగు పెట్టిన అతను చెల్లెలు కాజల్ ఇటీవలే ఖేలో ఇండియా గేమ్స్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణం గెలవడం విశేషం. -
ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్ రా బాబు!
Common Wealth Games 2022.. డోపింగ్ టెస్టులో అడ్డంగా దొరికిన ఘనా బాక్సర్ షాకుల్ సమద్‌ను కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు సస్పెండ్ చేశారు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన యాంటీ డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. షాకుల్ నిషేధిత డ్రగ్(ఫ్యూరోసిమైడ్) తీసుకున్నట్లు యాంటీ డోపింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో బాక్సర్ షాకుల్ సమద్‌పై కామన్వెల్త్ సస్పెన్షన్ వేటు విధించింది. కాగా ఇంతకముందు టోక్యో ఒలింపిక్స్‌లోనూ షాకుల్ సమద్ వెయిట్ విషయంలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వెయిట్ కేటగిరి విషయంలో తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడంతో నిర్వాహకులు మ్యాచ్ ఆడేందుకు అనుమతించలేదు. దీంతో తన ప్రత్యర్థి ఆటగాడికి వాకోవర్ లభించింది. తాజాగా కామన్వెల్త్లో పతకం సాధిస్తాడనుకుంటే ఈసారి ఏకంగా డోపింగ్ టెస్టులో దొరికిపోయి గేమ్స్ నుంచి సస్పెండ్ అయ్యాడు. దీంతో ఈ ఘనా బాక్సర్ ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే పనిగా పెట్టుకున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా! Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా!
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్ రేసు ఆదివారం జరగనుంది. కాగా బెంగళూరుకు చెందిన నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన నాలుగో భారత స్విమ్మర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సందీప్ సెజ్వాల్, విరాద్వాల్ కాదేలు ఫైనల్ చేరగా.. 2018లో సాజన్ ప్రకాశ్ ఫైనల్లో అడుగుపెట్టినప్పటికి పతకాలు సాధించలేకపోయారు. మరి ఈసారైనా నటరాజ్ మెరిసి పతకం తెస్తాడని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ సంచనలనం నమోదు చేసింది. భారత్ నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అనహత్ సింగ్ తొలి రౌండ్‌ను దిగ్విజయంగా ముగించింది. రౌండ్ ఆఫ్ 64.. స్క్వాష్ గేమ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్ జరగ్గా.. సెయింట్ విన్సెంటి అండ్ గ్రెనడైన్స్కి చెందిన జాడా రాస్‌ను ఓడించిన అనహత్ సింగ్ రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన అనహత్ జాడా రాస్‌ను 11-5,11-2,11-0తో వరుస గేమ్‌ల్లో ఓడించింది. తొలి రౌండ్ గేమ్‌లో జాడా రాస్ ఐదు పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికి.. ఏ మాత్రం తడబడని అనహత్.. ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లడమే గాక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్స్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక రౌండ్ ఆఫ్ 32లో అనహత్ సింగ్.. వేల్స్‌కు చెందిన ఎమిలి విట్లాక్తో తలపడనుంది. చదవండి: Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు -
బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్
-
ఆత్మ విశ్వాసంతో ఆడండి..!!
-
కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని
ఇంగ్లండ్ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అథ్లెట్లలో స్ఫూర్తిని నింపేందుకు బుధవారం మోదీ వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.."ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి బాగా ఆడండి. ఎలాంటి బెదురు, బెరుకు లేకుండా ఆడండి. తికమకపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి" అని అథ్లెట్ల బృందంతో అన్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్‌కు 322 మంది సభ్యులతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. 215 మంది అథ్లెట్లు 19 క్రీడా విభాగాలలో 141 విభిన్నఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించ నున్నారు. చదవండి: WAC 2022: నిరాశ పరిచిన సబ్లే.. 11వ స్థానంతో ముగించి... "Play well with all your strengths, without stress. You must have heard the saying 'Koi Nahi Hai Takkar mei, Kyun Pade Ho Chakkar Mei', so play with the same attitude at Commonwealth Games," PM Modi to India's CWG 2022 squad pic.twitter.com/TIgUAF6nJU — ANI (@ANI) July 20, 2022 -
కామన్వెల్త్ క్రీడలకు జంబో టీమ్‌ను ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం
బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడలకు జంబో టీమ్‌ను ప్రకటించింది భారత ఒలింపిక్ సంఘం (ఐవోసీ). ఆటగాళ్లు, అధికారులతో కూడిన 322 మంది సభ్యుల వివరాలను ఐవోసీ శనివారం విడుదల చేసింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు, 107 మంది అధికారులు, ఇతర సహాయక సిబ్బంది ఉన్నారు. ఈ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పించడంతో హర్మాన్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు కూడా వీరితో పాటే బర్మింగ్‌హామ్ ఫ్లైట్ ఎక్కనుంది. క్రీడాకారులందరికీ ఐదు గ్రామాల్లో వేర్వేరు చోట్ల వసతి ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో భారత్ 15 విభిన్న క్రీడా విభాగాల్లో పోటీ పడుతోంది. వీటితో పాటు నాలుగు పారా స్పోర్ట్స్‌లోనూ భారత్ పాల్గొంటుంది. #CWG2022All set: Sports minister Anurag Thakur, IOA acting president Anil Khanna and the Indian contingent for the Commonwealth Games at the kit unveiling and send-off ceremony in New Delhi.📸: Shiv Kumar Pushpakar pic.twitter.com/6IHNBR54Pf— Sportstar (@sportstarweb) July 7, 2022 ఐవోసీ ప్రకటించిన 215 మంది సభ్యుల బృందంలో నీరజ్ చోప్రా, పీవీ సింధు, లోవ్లీనా బోర్గొహైన్, మీరాబాయి చాను, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, మనీకా బాత్రా, హిమ దాస్, తేజేందర్ పాల్ సింగ్ టూర్, అమిత్ పంఘాల్ వంటి మేటీ క్రీడాకారులు ఉన్నారు. కాగా, కామన్వెల్త్ గేమ్స్ చివరిసారిగా 2018లో ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. చదవండి: 90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా -
'ఆమె'నే పెళ్లి చేసుకుంటా.. మహిళా అథ్లెట్ సంచలన వ్యాఖ్యలు
భారత స్టార్ మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రిలేషన్షిప్లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది. తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వాపోయింది. తన లాంటి వాళ్లు ట్రాక్‌తో పాటు సమాజంతో కూడా పోరాడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌లో సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్ట వ్యతిరేకమన్న ప్రశ్నపై సమాధానం దాటవేసింది. కాగా, మరో మహిళతో (మోనాలిసా) సహజీవనం చేస్తున్న విషయాన్ని ద్యుతీ గతంలోనే ప్రకటించింది. ద్యుతీ శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు అధికంగా ఉన్నాయన్న కారణంగా ఆమెపై 2014 కామన్వెల్త్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. ఐదేళ్ల న్యాయపోరాటం అనంతరం ఈనెల (జులై) 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మెగా ఈవెంట్లో ద్యుతీ 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది. చదవండి: భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం -
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత టి20 జట్టు ఇదే.. ఆంధ్ర క్రికెటర్‌కు పిలుపు
ముంబై: ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘనకు కూడా జట్టులో చోటు లభించింది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్ రాణా. -
కామన్వెల్త్ బెర్తు కోసం కోర్టుకెక్కిన టీటీ ప్లేయర్లు
న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్‌లో మరో క్రీడాకారిణి కామన్వెల్త్ గేమ్స్ బెర్తు కోసం కోర్టుకెక్కింది. డబుల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన అర్చన కామత్ తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక విషయమై కోర్టుకెక్కిన నాలుగో ప్లేయర్ అర్చన. గతంలో దియా, మానుశ్ షా, స్వస్తిక ఘోష్‌లు కూడా కోర్టు తలుపు తట్టారు. ప్రస్తుతం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) వ్యవహారాలను పరిపాలక మండలి (సీఓఏ) పర్యవేక్షిస్తోంది. తొలుత టీటీఎఫ్ఐ సెలక్టర్లు అర్చనను ఎంపిక చేశారు. కానీ ఆమె ఇటీవలి ప్రదర్శన బాగోలేదంటూ బర్మింగ్‌హామ్ ఈవెంట్ నుంచి ఉన్నపళంగా తప్పించారు. చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి'.. మాజీ సైక్లింగ్ కోచ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు -
కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్
భారత మహిళా దిగ్గజ బాక్సర్.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగింది. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. విషయంలోకి వెళితే.. కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌లో భాగంగా శుక్రవారం 48 కేజీల విభాగంలో నీతూతో తలపడింది. మ్యాచ్ ఆరంభంలోనే మేరీకోమ్ మోకాలికి గాయమైంది.మెడికల్ చికిత్స పొందిన తర్వాత బౌట్‌ను తిరిగి ప్రారంభించారు. అయితే నొప్పి ఉండడంతో మేరీకోమ్ చాలా ఇబ్బందిగా కనిపించింది. ఇది గమనించిన రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆర్ఎస్సీఐ తీర్పు మేరకు నీతూను విజేతగా ప్రకటించారు. ఈ ఓటమితో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ గేమ్స్‌పై ఆమె దృష్టి పెట్టారు. -
రిఫరీపై అమానుష దాడి.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో అనుచిత ఘటన చోటు చేసుకుంది. బౌట్లో అప్పటిదాకా గెలుపు ధీమాతో ఉన్న సర్వీసెస్ రెజ్లర్ సతేందర్ మలిక్ ఫలితం బౌట్ వెలుపలి జోక్యంతో మారింది. ప్రత్యర్థికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చిన విధానంపై రిఫరీ జగ్బీర్ సింగ్‌ను సతేందర్ ప్రశ్నించాడు. ఇది సహించలేని రిఫరీ జగ్బీర్ సింగ్ రెజ్లర్ చెంప చెళ్లుమనిపించాడు. ఒక్కసారిగా రిఫరీ తనపై చేయి చేసుకోవడంతో సతేందర్ సహనం కోల్పోయి ఆ వెంటనే జగ్బీర్ సింగ్‌ను తిరిగి కొట్టాడు. మొత్తం ట్రయల్స్‌కే మచ్చ తెచ్చిన ఈ ఉదంతంపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కఠిన నిర్ణయం తీసుకుంది. రిఫరీపై ఎలాంటి చర్య తీసుకోకున్నా... క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ లేని సతేందర్‌పై జీవితకాల నిషేధం విధి స్తున్నామని ప్రకటించింది. ఈ సంఘటన వీడియో పరిశీలిస్తే మాత్రం ముందుగా రిఫరీనే సతేందర్‌పై చేయి చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసలేం జరిగింది! ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడే రెజ్లర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 125 కేజీల ఫైనల్ బౌట్లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సతేందర్ మలిక్... మోహిత్‌తో తలపడి 3–0తో ముందంజలో నిలిచాడు. ఇంకో 18 సెకన్లలో బౌట్ ముగియనున్న దశలో మలిక్‌ను మోహిత్ మ్యాట్‌పై (టేక్‌డౌన్)పడగొట్టాడు. ఓ పట్టుపట్టి పక్కకు నెట్టేశాడు. బౌట్లో ఉన్న రిఫరీ వీరేందర్ మలిక్ ‘టేక్‌డౌన్’కు పాయింట్లు ఇవ్వకుండా... కేవలం నెట్టేసిన దానికి ఒక పాయింట్ ఇచ్చాడు. దీనిపై అసంతృప్తితో ఉన్న మోహిత్ ‘చాలెంజ్’కు వెళ్లాడు. ఈ అప్పీల్‌ను సీనియర్ రిఫరీ జగ్బీర్ సింగ్ టీవీ రిప్లేలో పరిశీలించారు. టేక్డౌన్ను పరిగణనలోకి తీసుకున్న జగ్బీర్ రెండు పాయింట్లు కేటాయించాడు. దీనివల్ల సతేందర్, మోహిత్ 3–3తో సమంగా నిలిచారు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం స్కోరు టై అయినపుడు ఆఖరి పాయింట్ ఎవరు చేస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. చివరి పాయింట్ మోహిత్ చేయడంతో అతన్నే విజేతగా ప్రకటించారు. అప్పీల్ (చాలెంజ్)తో తారుమారైన ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయిన సతేందర్ పక్కనే 57 కేజీల ఫైనల్ బౌట్ వేదికపై నుంచి నడుచుకుంటూ వెళ్లి రిఫరీ జగ్బీర్ నుంచి వివరణ కోరే ప్రయత్నం చేశాడు. అయితే జగ్బీర్ నుంచి సమాధానం బదులు సతేందర్ చెంపదెబ్బ తిన్నాడు. సతేందర్ కూడా క్షణికావేశానికి లోనై జగ్బీర్ను రెండు దెబ్బలేశాడు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న డబ్ల్యూఎఫ్ఐ ఉన్నతాధికారులు, రెజ్లర్లు, పలువురు అభిమానులు ఖిన్నులయ్యారు. ఈ గందరగోళంలో రవి దహియా, అమన్‌ల మధ్య జరుగుతున్న 57 కేజీల ఫైనల్ బౌట్‌ను నిలిపి వేశారు. వీఐపీ వేదికపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఈ బౌట్లను చూస్తున్నాడు. రెజ్లర్ అనుచిత ప్రవర్తనపై కన్నెర్ర చేసిన ఆయన ఇకపై బౌట్లో దిగకుండా కఠిన చర్య తీసుకున్నారు. చదవండి: ‘కామన్వెల్త్’కు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ -
‘కామన్వెల్త్’కు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్
లక్నో: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భారత జట్టులో పునరాగమనం చేసింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్టులో వినేశ్ చోటు సంపాదించింది. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మరో సీనియర్ రెజ్లర్ సాక్షి మలిక్ కూడా జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. సోమవారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ 53 కేజీల విభాగంలో... సాక్షి 62 కేజీల విభాగంలో విజే తగా నిలి చి కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. వినేశ్, సాక్షిలతోపాటు పూజా (50 కేజీలు), అన్షు (53 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు) కూడా ‘కామన్వెల్త్’లో భారత్ తరఫున ఆడతారు. -
‘కామన్వెల్త్’ టీటీ ప్రాబబుల్స్‌లో స్నేహిత్, శ్రీజ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను ఎంపిక చేసేందుకు 16 మంది క్రీడాకారులతో కూడిన ప్రాథమిక జాబితాను ప్రకటించారు. ఈనెల 23 నుంచి 30 వరకు బెంగళూరులో జరిగే శిక్షణ శిబిరం తర్వాత తుది జట్లను ఎంపిక చేస్తారు. ప్రాబబుల్స్‌లో ప్రస్తుత జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ... తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్‌లకు చోటు లభించింది. ఇప్పటివరకు ఐదు కామన్వెల్త్ గేమ్స్‌లో కలిపి భారత టీటీ క్రీడాకారులు మొత్తం ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు సాధించారు. -
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం
Mary Kom To Skip World Championships And Asian Games: ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. యువ తరానికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌పై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ)కి లేఖ ద్వారా తెలియజేసింది. మేరీ కోమ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. కాగా, ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఈ ఏడాది మే 6 నుంచి 21 వరకు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరగనున్నాయి. అలాగే, జులై 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబరు 10 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. చదవండి: IPL2022: సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై..! -
స్వర్ణంతో కామన్వెల్త్ గేమ్స్‌కు మీరాబాయి చాను అర్హత
సింగపూర్: భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (55 కేజీలు) సింగపూర్ అంతర్జాతీయ టోర్నీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 105) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు సింగపూర్ టోర్నీకి క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మీరాబాయి స్వర్ణపతక ప్రదర్శనతో కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. భారత్‌కే చెందిన సంకేత్ సాగర్ (పురుషుల 55 కేజీలు–స్వర్ణం), రిషికాంత సింగ్ (55 కేజీలు–రజతం), బింద్యారాణి దేవి (మహిళల 59 కేజీలు–స్వర్ణం) కూడా కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌లను సాధించారు. -
24 ఏళ్ల తర్వాత క్రికెట్ రీ ఎంట్రీ.. అయితే..?
Cricket Returns To Commonwealth Games: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కామన్వెల్త్ క్రీడల్లోకి క్రికెట్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బర్మింగ్హమ్(ఇంగ్లండ్) వేదికగా జరిగే 22వ ఎడిషన్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించింది. అయితే, ఈ సారికి కేవలం మహిళల క్రికట్‌కు మాత్రమే అనుమతి ఇచ్చింది కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్). టీ20 ఫార్మాట్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో సాగే ఈ గేమ్స్‌లో మొత్తం 8 జట్లు(భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, బార్బడోస్, సౌతాఫ్రికా, శ్రీలంక) పాల్గొనేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. జులై 29న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఈ క్రీడలు.. ఆగస్ట్ 7న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌తో ముగుస్తాయి. ఈ మేరకు ఐసీసీ, సీజీఎఫ్ మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా, 1998(మలేషియా)లో చివరిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు(50 ఓవర్ల ఫార్మాట్) ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. నాడు షాన్ పొలాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా పురుషుల జట్టు స్టీవ్ వా సారధ్యంలోని ఆస్ట్రేలియాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. ఇదిలా ఉంటే, 72 దేశాలకు చెందిన 4500 అథ్లెట్లు జులై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటారు. చదవండి: IPL 2022 Auction: వేలంలో పాల్గొనబోయే యువ భారత చిచ్చరపిడుగులు వీళ్లే.. -
కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా ‘ఢీ’
బర్మింగ్‌హామ్: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో (సీడబ్ల్యూజీ) అరంగేట్రం చేయనున్న మహిళల క్రికెట్ ఆరంభ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రికెట్ ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 8 జట్లు బరిలో ఉండగా... వీటిని రెండు గ్రూప్‌లుగా విభజిం చారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బడోస్ ఉండగా... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. జూలై 31న పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఆగస్టు 3న బార్బడోస్‌తో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక రెండు గ్రూప్‌ల్లోనూ టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు ఆగస్టు 6న జరుగుతాయి. సెమీస్‌లో విజేతగా నిలిచిన జట్లు ఆగస్టు 7న పసిడి పతకం కోసం... ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోస పోటీ పడతాయి. మ్యాచ్‌లన్నీ టి20 ఫార్మాట్లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్నాయి. -
కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకున్న భారత జట్లు
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల బరి నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్ బరి నుంచి తప్పుకున్న భారత జట్లు.. ఆసియా క్రీడలపై దృష్టిసారించనున్నాయని నింగోంబం తెలిపారు. ఆసియా క్రీడల్లో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు కానుందని, అందుకే కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, 2022 జులైలో కామన్వెల్త్ క్రీడలు, ఆగస్టులో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. -
బర్మింగ్‌హామ్‌లో ‘బెస్టాఫ్ లక్’
సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 22వ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మెగా ఈవెంట్‌కు మరో సంవత్సరం ఉన్న నేపథ్యంలో ‘కౌంట్‌డౌన్’గా హైదరాబాద్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్ భారత క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ తదితరులతో పాటు వచ్చే క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉన్న వర్ధమాన అథ్లెట్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... క్రీడల నిర్వహణ కోసం ఇంగ్లండ్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, బరి్మంగ్‌హామ్ నగర విశిష్టతల గురిం చి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యం లో సీడబ్ల్యూజీ–2022లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు అంకితా రైనా పరాజయం సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ప్లేయర్ అంకితా రైనాకు అర్హత పోరులోనే నిరాశ ఎదురైంది. హోరాహోరీగా తన సమ ఉజ్జీలాంటి ప్రత్యర్థితో సాగిన పోరులో చివరకు ప్రపంచ 193వ ర్యాంకర్ అంకితకు ఓటమి తప్పలేదు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లోనే ఆమె అమెరికాకు చెందిన ప్రపంచ 194వ ర్యాంకర్ జేమీ లోయబ్ చేతిలో 3–6, 6–2, 4–6 తేడాతో ఓటమిపాలైంది. -
కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్.. షెడ్యూల్ ప్రకటించిన నిర్వహకులు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్ అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వహకులు మంగళవారం ప్రకటించారు. ఈ పోటీలను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం ఎనిమిది జట్లు గ్రూప్‌లుగా విడిపోయి, ఆగస్టు 4 వరకు మ్యాచ్‌లు ఆడతాయని, ఆగస్టు 6న సెమీస్ పోరు ఉంటుందని తెలిపారు. కాంస్య పతకానికి సంబంధించిన మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ను ఆగస్టు 7న నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 1 నాటికి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ఈ పోటీలకు అర్హత సాధిస్తాయని, మిగిలిన రెండు బెర్త్‌ల కోసం అర్హత పోటీలు నిర్వహించనున్నామని నిర్వహకులు వివరించారు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించడం ఇది తొలిసారేమీ కాదు. 1998 కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు తొలిసారిగా పాల్గొంది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల చేత సీడబ్యూజీలో క్రికెట్‌కు ప్రాతినిధ్యం దక్కలేదు. తిరిగి 24 ఏళ్ల తర్వాత ఈ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: Cricket History: మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున ఏం జరిగిందంటే..? -
షూటింగ్‌కు వచ్చే నష్టమేమీ లేదు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించి నంత మాత్రాన షూటింగ్‌కు వచ్చే నష్టమేమీ లేదని 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, షూటర్ గగన్ నారంగ్ అభిప్రాయ పడ్డాడు. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్‌ను తొలగిస్తున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఒలింపిక్ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం స్పందించిన గగన్ ‘ఇదేమీ షూటింగ్‌కు ఎదురుదెబ్బ కాదు. ఉదాహరణకు క్రికెట్‌నే చూడండి. అదేమీ ఒలింపిక్స్‌లో లేదు.. అలాగే కామన్వెల్త్ గేమ్స్‌లోనూ లేదు. అయినా అది ఎదగలేదా.. అలాగే స్క్వాష్ కూడా.. జరిగిందేదో జరిగింది. కామన్వెల్త్లో షూటింగ్ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి 2022లో జరిగే ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి సారించండి’ అంటూ హితవు పలికాడు. అలాగే భవిష్యత్తులో షూటింగ్ తిరిగి కామన్వెల్త్ గేమ్స్‌లో రీ ఎంట్రీ ఇస్తుందనే నమ్మకం తనకుందని నారంగ్ అన్నాడు. -
కామన్వెల్త్ గేమ్స్ విజేతలకు రాష్ట్రపతి ప్రశంసలు
-
పసిడి వెలుగులు కొనసాగాలి
పన్నెండేళ్ల తరవాత మళ్లీ తాను ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 2006లో మెల్బోర్న్లోను, తాజాగా గోల్డ్‌కోస్ట్‌లో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యాలు– మొత్తం 198 పతకాలు మెడలో వేసుకుంది. బ్రిటన్ వలస దేశాల మధ్య నాలు గేళ్లకోసారి జరిగే ఈ క్రీడల్లో 71 దేశాలు పాల్గొనగా 36 దేశాలు కనీసం కాంస్యమైనా సాధించి పతకాల జాబితాలో తమ పేరును చూసుకున్నాయి. మన జట్టు విషయానికొస్తే– పతకాల సంఖ్య దాదాపుగా అంతే. కానీ ప్రతిభ మెరుగుపడింది. నాలుగేళ్ల కిందట 15 స్వర్ణాలకు పరిమితమైన భారత క్రీడాకారులు ఈ సారి 26 పసిడి పతకాలు సాధించి సత్తా చూపించారు. 2014లో యూకేలోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో 64 పతకాలకే పరిమితం కాగా, ఈసారి 26– 20– 20 చొప్పున మొత్తం 66 పత కాలతో మూడో స్థానంలో నిలిచారు. ఇక గ్లాస్గోలో నిర్వహణ దేశంగా టాప్ ర్యాంక్‌లో నిలిచిన ఇంగ్లండ్ ఈసారి 45 స్వర్ణాలు, 45 రజతాలు, 46 కాంస్యాలతో 136 పతకాలు గెలిచి రెండో స్థానానికి పరిమితమయింది. ప్రపంచమంతా పాల్గొనే ఒలింపిక్స్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, కజకిస్థాన్ వంటి దేశాల దిగ్గజాలు పాల్గొనే ఆసియా గేమ్స్‌తో పోలిస్తే కామన్వెల్త్ క్రీడల స్థాయి తక్కువే. అయినా ఈసారి భారత క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 1930 నుంచీ పాల్గొంటున్న భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఎనిమిదేళ్ల కిందట సొంతగడ్డపై జరిగిన ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 39 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలు కలిపి 101 పతకాలు గెలిచి రెండో స్థానం సాధించింది. ఆ తరవాత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీమ్ విభాగాలతో పాటుగా వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు మెరిపించి పతకాలతో మురిపించారు. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా, షూటింగ్లో మను భాకర్, అనీశ్ భన్వాలా, బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి, వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్, టేబుల్ టెన్నిస్‌లో మనిక బాత్రా, బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయి రాజ్, మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో భారత క్రీడా భవితకు భరోసానిచ్చారు. బాక్సింగ్‌లో మేరీకోమ్, షూటింగ్లో తేజస్విని సావంత్, సంజీవ్ రాజ్‌పుత్, టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ తదితరులు మూడు పదుల వయసు దాటిపోయినా యువ క్రీడాకారులకు దీటుగా రాణిస్తూ, పట్టుదల ఉంటే అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించడం సాధ్యమేనని నిరూపించారు. గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో భారత్‌కు తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలూ ఎదు రయ్యాయి. క్రీడల ప్రారంభానికి ముందే క్రీడా గ్రామంలో భారత బాక్సర్లు బస చేసిన చోట సిరంజ్‌లు దొరకడం కలకలం రేపింది. వెంటనే బాక్సర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అందరికీ క్లీన్చిట్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. క్రీడా గ్రామంలో ‘నో నీడిల్స్’ నిబంధనపై అవగాహన లేకపోవటం వల్లే ఈ పొరపాటు జరిగిందని భారత బృందం ఇచ్చిన వివరణతో నిర్వాహకులు సంతృప్తి చెంది హెచ్చరికతో వదిలేశారు. కానీ పోటీల చివర్లో అథ్లెట్స్ ఇర్ఫాన్, రాకేశ్‌బాబు గదిలో సిరంజ్‌లు దొరకడంతో వారిద్దరినీ క్రీడా గ్రామం నుంచి బహి ష్కరించారు. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపిస్తామని, దోషులుగా తేలితే వారిద్దరిపై చర్యలు తీసుకుంటామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించింది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన తండ్రికి క్రీడా గ్రామంలో ప్రవేశం పొందేలా అక్రెడిటేషన్ జారీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడల నుంచి వైదొ లుగుతానని సైనా హెచ్చరించడంపై విమర్శలు రేగాయి. భారత ఒలింపిక్ సంఘం అధికారులు సైనా సమస్యను పరిష్కరించటంతో వివాదం సద్దుమణిగింది. ఇక జాతీయ క్రీడ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతో తిరిగి రావటం, బాస్కెట్‌బాల్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించటం, లాన్ బాల్స్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్‌లలో మనోళ్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటం... ఇవన్నీ నాణేనికి మరోవైపు. నిజానికి కామన్వెల్త్ క్రీడల్లో కొన్నేళ్లుగా భారత్ టాప్–10లో ఉంటోంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ఒలింపిక్స్, ఆసియా క్రీడలంత స్థాయి లేదు. అక్కడా ఇలాంటి ప్రదర్శన సాధ్యం కావాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలి. స్కూల్ స్థాయి నుంచే క్రీడలను పిల్లల రోజువారీ జీవితంలో భాగం చేయాలి. అంతర్జాతీయ వేదికలపై పతకాలు గెలిచి వచ్చాక వారిపై కోట్ల వర్షం కురిపించడం రివాజైపోయింది. మరింతమంది క్రీడాకారులు తయారయ్యేందుకు, భవిష్యత్తులో విజయాలు సాధించేందుకు ఇలాంటి నజరా నాలు ఔషధంలా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. కానీ మొక్కకు నీరుపోస్తేనే కదా చెటై్ట ఫలాలిస్తుంది! చెటై్ట పళ్లు ఇచ్చాకే చుట్టూ కోట కడతామంటే ఎలా? అద్భుతమైన క్రీడాకారులుగా ఎదిగేందుకు క్షేత్రస్థాయి నుంచే క్రీడా మౌలిక వసతులు కల్పించాలి. గెలిచిన వారికి కోట్లు కాకుండా సత్తా ఉన్నవారిని గుర్తించేందుకు, వారిని గెలిచేలా తీర్చి దిద్దేందుకు కోట్లు ఖర్చుపెట్టాలి. మట్టిలో మాణిక్యాలను వెదికే క్రీడా ప్రతిభాన్వేషణ ప్రక్రియ నిరంతర ప్రక్రియగా మారాలి. స్కూల్ స్థాయిలో ప్రతిభను గుర్తించే సదుద్దేశంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవలే ‘ఖేలో ఇండియా జాతీయ స్కూల్ గేమ్స్’కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ క్రీడల్లో 12 మంది యువ క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడటం కలవరపరిచే అంశం. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ క్రీడల మంత్రిగా ఉన్నారు. క్రీడలపై క్రీడాకారుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటే క్రీడాభివృద్ధికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ‘గోల్డ్ కోస్ట్’ ప్రదర్శన గాలివాటం కాదని, భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోందనే విష యంలో నిజం ఉందని తేలాలంటే ఆగస్టు–సెప్టెంబర్‌లో జకార్తాలో జరగబోయే ఆసియా క్రీడల్లో మన ప్రతిభ మెరుగుపడాలి! -
సిక్కిరెడ్డికి స్వర్ణం
అంతర్జాతీయ వేదికపై ఓరుగల్లు క్రీడాతేజం ప్రతిభ కనబరిచింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో వరంగల్ ముద్దుబిడ్డ సిక్కిరెడ్డి షటిల్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. భారత కీర్తిపతాకను ప్రపంచపటాన రెపరెపలాడించింది. ఇప్పటికే షటిల్ బ్యాడ్మింటన్‌లో అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఆమె ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్‌మెడల్ సాధించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులు, క్రీడాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ రూరల్, నర్సింహులపేట(డోర్నకల్): ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డి స్వర్ణం సాధించారు. మిక్స్డ్ డబుల్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి భారత కీర్తిపతాకను ప్రపంచపటాన రెపరెపలాడించారు. డబుల్ మిక్స్డ్ విభాగం ఫైనల్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన వివాన్ షూ, మీ కూన్ చౌతో ఇండియా తరఫున సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప తలపడ్డారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 21–18, 21–19 తేడాతో మలేషియా టీమ్‌పై గెలిచారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి బాల్యం నుంచే ఆటలపై ఆసక్తి కనబరిచేవారు. కొన్నేళ్లుగా ఆమె హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 101 సార్లు ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించి పోటీల్లో పాలొన్నారు. 16 బంగారు పతకాలు, మూడు బ్రాంజ్, ఐదు సిల్వర్ పతకాలు సాధించారు. ఆమె ప్రపంచంలో పాకిస్థాన్ మినహా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలు జరిగిన దాదాపు అన్ని దేశాల్లో ఆడడం విశేషం. ఎంబీఏ పూర్తి చేసిన సిక్కిరెడ్డి షటిల్ బ్యాడ్మింటన్‌లో నంబర్ వన్ ర్యాంకింగ్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. దక్షిణ కొరియాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఆమెకు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఆమె సాధించిన మరికొన్ని ప్రముఖ టైటిల్స్ ♦ 2013లో జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి జంట స్వర్ణం సాధించింది. ♦ మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ♦ పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీని సిక్కిరెడ్డి జోడీ గెలుచుకుంది. ♦ తొలిసారిగా భారత మహిళా జట్టు ఉబెర్ కప్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఘనత కూడా సిక్కిరెడ్డిదే కావడం విశేషం. గోపీచంద్ అకాడమీలోమూడో క్రీడాకారిణి 2004 నుంచి సింగిల్స్‌లోనే షటిల్ ఆడిన సిక్కిరెడ్డికి 2010లో మోకాలికి సర్జరీ కావడంతో డబుల్స్‌లోనే ఆడుతున్నారు. కొన్నేళ్లుగా గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతూ అంతర్జాతీయ స్థాయి టైటిల్ దక్కించుకున్న వారిలో సిక్కిరెడ్డి మూడో క్రీడాకారిణి. మొదటి, రెండు స్థానాల్లో సైనా నెహ్వాల్, సింధూ ఉన్నారు. వారు సింగిల్ ప్లేయర్స్ కాగా.. సిక్కిరెడ్డి డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో సత్తా చాటుతున్నారు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్‌మెడల్ సాధించడంతో క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కామన్ వెల్త్ గేమ్స్: భారత్‌కు మరో స్వర్ణం
-
మంత్రి పద్మారావుకు ఆస్ట్రేలియాలో ఘనస్వాగతం
మెల్బోర్న్: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వచ్చిన తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావుకు అక్కడి టీఆర్ఎస్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 4 నుంచి 15వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వచ్చిన క్రీడామంత్రి పద్మారావు, శాప్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రటరీ బూర వెంకటేశం, ఇతర అధికారులకు మెల్బోర్న్ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా టీఆర్ఎస్ శాఖ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, టీఆర్ఎస్ విక్టోరియా రాష్ట్ర ఇన్చార్జి సాయిరాం ఉప్పు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ మనదేశం తరఫున కామన్వెల్త్ క్రీడల్లో 221 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, అందులో 12 మంది తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్ర క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్‌లో పథకాలు సాధించి, మనదేశం, రాష్ట్రం ప్రతిష్టను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు సాయిప్రసాద్ యాదవ్, ఉదయ్సింహరెడ్డి, రామ్‌ప్రసాద్ యాదవ్, ఏల్లూరు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘట్టమనేని ఘటికురాలు
అలల రూపంలో ఎగసిపడుతూ వస్తున్న కష్టాలకు ఎదురునిలిచి గెలుస్తూ వచ్చిన ఆ యువతి పేరు ఘట్టమనేని సాయిరేవతి. తండ్రిని కోల్పోయి పేదరికమే పెద్ద దిక్కయిన ఇంట్లో తానే ఓ శక్తిగా మారింది. చిన్న వయసులోనే కుటుంబ భారం తెలిసిన ఆమెకు పవర్ లిఫ్టింగ్‌లో బరువులు తేలికగానే అనిపించాయి. చెదరని ఆత్మబలానికి కఠోర దీక్షను జత చేసింది. అంతే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 40కుపైగా స్వర్ణ, రజక పతకాలు ఆమెకు తలవంచాయి. కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు మెడలో మణిహారమయ్యాయి. మరోవైపు చదువుల్లో మేటిగా రాణించి ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగమూ సాధించింది సాయి రేవతి. తెనాలిరూరల్: తెనాలి సమీపంలోని పెదరావూరు సాయి రేవతి నివాసం. చదువులు, బరువుల వేటలో అద్భుతంగా రాణిస్తున్న ఆమె జీవితం చాలా మందిలా వడ్డించిన విస్తరి కాదు. వీరి స్వస్థలం బుర్రిపాలెం. ఆరోతరగతిలో ఉండగా అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి పద్మావతి సాయిరేవతినీ, పెద్దమ్మాయి యామినీజ్యోతిని తీసుకుని పెదరావూరులోని పుట్టింటికి చేరింది. ‘అమ్మమ్మ శాఖమూరి సీతారావమ్మ పెద్దమనసుతో ఆదరించింది. వారికుంది ఎకరం పొలమే. ఆ ఆదాయంతోనే అందరం సర్దుకున్నాం’ అని చెప్పింది సాయిరేవతి. అతికష్టం మీద ఇంటర్ పూర్తి చేసి తెనాలిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరింది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తే, పోలీసు అధికారి కావాలన్న కోరిక నెరవేరుతుందన్న భావన కలిగింది. కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం, వ్యాయామ అధ్యాపకుల పర్యవేక్షణతో సాధన ఆరంభించింది. శరీర గాయాలతో, పౌష్టికాహారానికి తగిన డబ్బులు లేక బాధపడిన సందర్భాలెన్నో! అన్నిటినీ తట్టుకుంటూ చేసిన సాధనకు ఇప్పుడు ఫలితం లభించింది. కామన్వెల్త్లో మెరిసిన రేవతి.. సాధనతో ఎత్తే బరువులనే కాదు, మానసిక బలాన్ని పెంచుకుంటూ వెళ్లింది. దక్షిణాఫ్రికాలో గతేడాది జరిగిన 7వ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2007లో మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అంతకు కొద్ది రోజుల ముందే కేరళలోని అలెప్పీలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. డెడ్‌లిఫ్ట్‌లో 2016లో జమ్ములో తాను నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త రికార్డుతో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్ ప్రతిభలోనూ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. 2015లో ఉత్తరాఖండ్‌లో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో 350 కిలోల విభాగంలొ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓవరాల్‌లో తన ప్రతిభ 360 కిలోలకు పెరిగింది. 2016 డిసెంబరులో జార్ఖండ్‌లోని టాటానగర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ‘స్ట్రాంగ్ విమెన్’, ‘బెస్ట్ లిఫ్టర్’గా రెండు స్వర్ణ పతకాలను గెలిచింది. ఈ విజయాలతో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ పోటీలకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు గుంటూరు జిల్లా యువతుల్లో సాయిరేవతి ఒకరు. అంతర్జాతీయపోటీల్లో సత్తా 2014లో థాయ్‌లాండ్‌లోని నార్త్ఛాంగ్మయి యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొంది. 2009–10 నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆరేళ్లు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇందులో 4 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా 3 సార్లు స్ట్రాంగ్ విమెన్‌గా నిలిచింది. కాకినాడలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు అక్కడా ఐదేళ్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా, మరో రెండేళ్లు స్ట్రాంగ్ విమెన్‌గా, ఒకసారి బెస్ట్ అథ్లెట్‌గా బహుమతులు గెలుచుకొంది. మరో ఏడాది ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది యూనివర్శిటీ’ అవార్డును అందుకోవటం విశేషం. బీకాం, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచి, బీపీఈడీ చేసింది. అదే స్ఫూర్తితో ‘నాగార్జున’ పీజీ సెట్ (2015)లో టాపర్‌గా నిలిచింది. లక్ష్యంపైదృష్టి సారించాలి చిన్నతనంలో నాకు ఎదురైన కష్టాలే సవాళ్లను నేర్పించాయి. తండ్రిని కోల్పోయాక ఉద్యోగం సాధించాలని దృఢంగా అనుకున్నాను. వెయిట్ లిఫ్టింగ్ రంగం ఎంచుకున్నాక బాగా శ్రమించాను. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడంతో విజయాలు వాటంతట అవే వచ్చాయి. నేటి యువత సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాలపై పెట్టిన శ్రద్ధ కెరీర్‌పై ఉంచడం లేదు. ఈ ధోరణి మారాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకుని శ్రమించాలి. – సాయిరేవతి,కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ -
'సుశీల్ రెచ్చగొట్టి దాడి చేయించాడు'
న్యూఢిల్లీ:ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మద్దతుదారులు తనపై చేయిచేసుకోవడంపై సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణా స్పందించాడు. సుశీలే స్వయంగా అతని మద్దతుదారులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని రాణా ఆరోపించాడు. ఈ క్రమంలోనే సుశీల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘సెమీస్ బౌట్ ముగిసిన వెంటనే సుశీల్ .. అతని మద్దతుదారులను నాపైకి ఉసిగొల్పాడు. రాణా ఇక్కడే ఉన్నాడు చూసుకోండి అని చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. దగ్గరుండి మరీ ఇలా చేయించడం దారుణం. ఆ రోజు దాడిలో నా సోదరుని తలపై కుర్చీతో దాడి చేశారు. నా సోదరుడు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు' అని రాణా పేర్కొన్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం. వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించినా వివాదం మాత్రం సుశీల్‌ను వీడటం లేదు. -
భారత్ అయ్యేనా ‘హీరో’!
నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ ఆశల పల్లకిలో టీమిండియా తొలి మ్యాచ్‌లో జర్మనీతో ‘ఢీ’ కెప్టెన్ సర్దార్, రూపిందర్ అనుమానం! ఈ ఏడాది భారత హాకీకి అన్నీ కలిసొచ్చాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం... ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2016 రియో డి జనీరో ఒలింపిక్స్‌కు అర్హత... విశ్వవిజేత ఆస్ట్రేలియాపై తొలిసారి సిరీస్ విజయం... జూనియర్ జట్టు సుల్తాన్ జోహర్ కప్‌ను నెగ్గడం.... ఇలా వరుస విజయాలతో మన హాకీ చలాకీ అయ్యింది. ఏడాది పొడవునా నిలకడైన ప్రదర్శనతో కొత్త ఆశలు రేపిన టీమిండియా సీజన్‌ను ఘనంగా ముగించాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై శనివారం మొదలుకానున్న ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ మనోళ్లకు ఈ సువర్ణావకాశం కల్పిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తొలిసారి 1978లో జరిగింది. 1980 నుంచి ప్రతి ఏడాదీ ఈ టోర్నీని నిర్వహించారు. అయితే 2012లో హాకీ వరల్డ్ లీగ్‌ను ప్రవేశపెట్టడంతో ఇక నుంచి చాంపియన్స్ ట్రోఫీ రెండేళ్లకోసారి జరుగుతుంది. భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఏనాడూ ఫైనల్‌కు చేరలేదు. 1982లో మూడో స్థానం సాధించడమే టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన. ఈ సంవత్సరం గొప్ప విజయాలతో జోరుమీదున్న సర్దార్ సింగ్ బృందం సొంతగడ్డపై సత్తా చాటుకోవాలని... చాంపియన్స్ ట్రోఫీలో తమ రికార్డును మెరుగుపర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో తలపడనుంది. ఈ టోర్నీకి ముందు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా చేయడం భారత జట్టుకు కాస్త ప్రతికూలాంశం. వాల్ష్ పర్యవేక్షణలోనే భారత్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. వాల్ష్ నిష్ర్కమణ తర్వాత టీమిండియాకు ఎదురవుతున్న అసలు సిసలు సవాలు చాంపియన్స్ ట్రోఫీ. ఎనిమిది మేటి జట్ల మధ్య జరిగే ఈ టోర్నీలో భారత్‌కు ప్రతి మ్యాచ్ కఠినంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం భారత్ తీవ్రంగానే శ్రమించింది. మిడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్... ‘డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్... గోల్ కీపర్ శ్రీజేష్... రక్షణశ్రేణిలో బీరేంద్ర లాక్డా, గుర్బాజ్ సింగ్... ఫార్వర్డ్ శ్రేణిలో రమణ్‌దీప్ సింగ్, సునీల్, నికిన్ తిమ్మయ్యల ప్రతిభ... పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సొంతగడ్డపై అనుకూల వాతావరణ పరిస్థితులు, అభిమానుల మద్దతు భారత్‌కు లాభించే అంశాలు. అయితే తొలి మ్యాచ్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. సర్దార్ కాలి పిక్క నొప్పితో బాధపడుతుండగా... రూపిందర్‌కు జ్వరం వచ్చింది. అయితే ఈ ఇద్దరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... మ్యాచ్ సమయానికి వీరిద్దరూ కోలుకుంటారని అసిస్టెంట్ కోచ్ జూడ్ ఫెలిక్స్ తెలిపారు. డిఫెండర్లకు హెల్మెట్లు ఇటీవల బౌన్సర్ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం పాలైన నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హాకీ ఆటగాళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇక నుంచి పెనాల్టీ కార్నర్ల సమయంలో డ్రాగ్ ఫ్లికర్స్ శక్తివంతంగా సంధించే షాట్లను అడ్డుకునేందుకు డిఫెండర్లకు గ్రిల్స్‌తో కూడిన హెల్మెట్ తరహా పరికరాలు ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిబంధన 2015 జనవరి నుంచి అమలవుతుంది. భారత్ షెడ్యూల్ డిసెంబరు 6: జర్మనీతో డిసెంబరు 7: అర్జెంటీనాతో డిసెంబరు 9: నెదర్లాండ్స్‌తో డిసెంబరు 11న క్వార్టర్ ఫైనల్స్ భారత్ మ్యాచ్‌లన్నీ రాత్రి గం. 7.30 నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం గం.12 నుంచి మ్యాచ్‌లు మొదలవుతాయి. టెన్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. డిసెంబరు 13న సెమీస్, 14న ఫైనల్స్ జరుగుతాయి. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ఇంగ్లండ్, బెల్జియం, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ గ్రూప్ ‘బి’: భారత్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ 13 చాంపియన్స్ ట్రోఫీని అత్యధికంగా ఆస్ట్రేలియా జట్టు 13 సార్లు గెల్చుకుంది. 2 చాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన ఆసియా జట్ల సంఖ్య (పాకిస్తాన్, దక్షిణ కొరియా) 3 ఈ మెగా టోర్నీకి భారత్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 1996, 2005లలో రెండుసార్లు చెన్నై ఈ పోటీలకు వేదిక అయ్యింది. 3 ఈ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన మూడో స్థానం (1982లో). మరో ఆరుసార్లు నాలుగో స్థానంలో నిలిచింది. 1 చాంపియన్స్ ట్రోఫీని వరుసగా ఐదుసార్లు నెగ్గిన ఏకైక జట్టు ఆస్ట్రేలియా. 2008 నుంచి ఆస్ట్రేలియా జట్టు చాంపియన్‌గా నిలుస్తోంది. -
అభినవ్ బింద్రా విఫలం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ గ్రనాడా (స్పెయిన్): కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన విభాగంలో భారత మేటి షూటర్ అభినవ్ బింద్రా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... బింద్రా ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో బింద్రా 624.8 పాయింట్లు స్కోరు చేసి 15వ స్థానంలో నిలిచాడు. టాప్-8లో నిలిచినవారే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇదే విభాగంలో భారత షూటర్లు సంజీవ్ రాజ్‌పుత్ 624.2 పాయింట్లతో 20వ స్థానంలో, రవి కుమార్ 616.2 పాయింట్లతో 78వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్లో రెండు రౌండ్ల తర్వాత మానవ్‌జిత్ సంధూ 50 పాయింట్లతో మరో 11 మందితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ 46 పాయింట్లతో 93వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఈ విభాగంలో మరో మూడు రౌండ్లు ఉన్నాయి. -
రీతూ రాణికే పగ్గాలు
ఆసియా క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన రీతూ రాణి సారథ్యంలోనే భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లోనూ బరిలోకి దిగనుంది. బీపీ గోవిందా, హర్బీందర్ సింగ్, సురీందర్ కౌర్, హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఓల్ట్‌మన్స్, చీఫ్ కోచ్ నీల్ హవ్గుడ్లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఈనెల 13న ఇంచియోన్కు బయలుదేరుతుంది. ఆసియా క్రీడలు ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు జరుగుతాయి. కామన్వెల్త్ గేమ్స్ కంటే మరింత మెరుగైన స్థానం సాధించాలన్న లక్ష్యంతో ఆమెను ఎంపిక చేశామని ప్యానెల్ తెలిపింది. జట్టు: రీతూ రాణి (కెప్టెన్, మిడ్ ఫీల్డర్), సవిత (గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, సునీతా లక్రా, నమితా టోపో, జస్ప్రీత్ కౌర్, సుశీలా చాను, మోనిక (డిఫెండర్లు), లిలిమా మిన్జ్, అమన్‌దీప్ కౌర్, చంచన్ దేవి (మిడ్ ఫీల్డర్లు), రాణి రాంపాల్, పూనమ్ రాణి, వందన కటారియా, నవజ్యోత్ కౌర్ (ఫార్వర్డులు). -
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు
-
ప్రారంభ కార్యక్రమంలో సచిన్
గ్లాస్గో: నేడు అట్టహాసంగా జరిగే కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా కనిపించనున్నాడు. మాస్టర్ ప్రస్తుతం యూనిసెఫ్ తరఫున గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. గ్లాస్గో సీడబ్ల్యుజీ నిర్వాహకులు, కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యలతో యూనిసెఫ్ భాగస్వామ్యంగా ఉంది. ఈ కారణంగా అంబాసిడర్ సచిన్ కూడా ఈవెంట్స్‌లో తళుక్కుమననున్నాడు. అయితే ఇందులో సచిన్ పాత్ర ఎలా ఉండబోతుందనేది సస్పెన్స్‌గా ఉంది. రాణి రెండో ఎలిజబెత్, ప్రధాని కామెరూన్‌తో పాటు సచిన్ కార్యక్రమంలో పాల్గొంటాడా? లేదా అనేది నిర్వాహకులు చెప్పడం లేదు. -
‘పసిడి’ ద్రాక్ష అందేనా!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు సత్తాకు పరీక్ష సాక్షి క్రీడావిభాగం ఘనమైన నేపథ్యం కలిగిన భారత పురుషుల హాకీ జట్టు దాదాపు అన్ని అంతర్జాతీయ మెగా ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అయితే ఈ జాబితాలో ఇప్పటిదాకా కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతకం మాత్రమే చేరలేదు. 84 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్రీడల్లో హాకీని తొలిసారి 1998లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన నాలుగు పర్యాయాల్లో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకొని రజత పతకంతో సంతృప్తి పడింది. క్రితంసారి 2010లో స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత్ 0-8 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. హాకీ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చాంపియన్‌గా నిలుస్తోన్న ఆస్ట్రేలియా (1998, 2002, 2006, 2010)ను కంగారెత్తించి అందని ద్రాక్షగా ఉన్న పసిడిని సొంతం చేసుకోవాలంటే భారత బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని టీమిండియా సవాల్‌కు సిద్ధమై, స్వర్ణం సాధిస్తుందో లేక మళ్లీ రజతంతో సరిపెట్టుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. సెంటిమెంట్... యాదృచ్ఛికమో మరేమిటోకానీ 1998 నుంచి 2010 వరకు ప్రతి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాను మినహాయిస్తే మరో జట్టు ఒక్కోసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. 1998లో మలేసియా, 2002లో న్యూజిలాండ్, 2006లో పాకిస్థాన్, 2010లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్ నేపథ్యంలో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంటుందో లేదో వేచి చూడాలి. ‘డ్రా’ అనుకూలం... జాతీయ ఒలింపిక్ సంఘంలో వివాదాల కారణంగా ఈసారి పాకిస్థాన్ హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌కు దూరంగా ఉంది. దాంతో భారత జట్టుకు ‘డ్రా’ అనుకూలమైంది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మినహాయిస్తే... దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, వేల్స్ జట్లపై భారత్ నుంచి భారీ విజయాలు ఆశించవచ్చు. ఇక గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, మలేసియా, కెనడా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, మలేసియాలలో రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయం. సెంటిమెంట్‌ను పక్కనబెడితే... స్థాయికి తగ్గట్టు ఆడితే భారత్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధిస్తుందనడంలో సందేహంలేదు. సమతూకంతో జట్టు ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచినా చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకొని భారత్ మూల్యం చెల్లించుకుంది. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా భారత బృందం పట్టుదలతో ఉంది. గోల్‌కీపర్ శ్రీజేష్ అద్భుత విన్యాసాలు, మిడ్‌ఫీల్డ్‌లో సర్దార్ సింగ్ అప్రమత్తత... ‘స్టార్ డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్, రూపిందర్‌పాల్ సింగ్ గురితప్పని షాట్లు... ఫార్వర్డ్ శ్రేణిలో గుర్విందర్ సింగ్ చాంది, డానిష్ ముజ్తబాల చేరికతో భారత్ సమతూకంతో కనిపిస్తోంది. మహిళల జట్టుపై ఆశలు భారత పురుషుల జట్టుతో సాధ్యంకానిది మహిళల జట్టు 2002లోనే చేసి చూపించింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ గేమ్స్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించింది. 2006 మెల్బోర్న్ గేమ్స్‌లో రజతం నెగ్గింది. అయితే 2010 ఢిల్లీ గేమ్స్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి భారత మహిళల జట్టు నుంచి కనీసం కాంస్యం ఆశించవచ్చు. లీగ్ దశలో న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాలపై నెగ్గితే భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశముంది. భారత మ్యాచ్‌ల షెడ్యూల్ పురుషుల విభాగం జూలై 25: వేల్స్‌తో; జూలై 26: స్కాట్లాండ్తో; జూలై 29: ఆస్ట్రేలియాతో; జూలై 31: దక్షిణాఫ్రికాతో. మహిళల విభాగం జూలై 24: కెనడాతో; జూలై 27: న్యూజిలాండ్‌తో; జూలై 28: ట్రినిడాడ్ అండ్ టొబాగోతో; జూలై 30: దక్షిణాఫ్రికాతో. -
‘కామన్వెల్త్’కు సైనా దూరం
గాయం కారణంగా వైదొలిగిన షట్లర్ భారత్ పతకావకాశాలకు దెబ్బ న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందే భారత పతకావకాశాలకు దెబ్బ తగిలింది. కనీసం రెండు పతకాలు సాధిస్తుందనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ ఈనెల 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరుగుతాయి. ‘జూన్ చివరి వారంలో సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా తొలి రౌండ్ మ్యాచ్‌లో గజ్జల్లో గాయమైంది. ఆ తర్వాత పాదంలో బొబ్బలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ అన్నింటికీ ఓర్చుకొని టైటిల్ సాధించాను. స్వదేశానికి చేరుకున్నాక రెండున్నర వారాల సమయం లభించింది. కోలుకోవడానికి వారం పట్టింది. కానీ శిక్షణ తీసుకోవడానికి వారం కంటే తక్కువ సమయం లభించింది. దాంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం నా మనసును ఎంతో గాయపరిచింది’ అని సైనా వివరించింది. నాలుగేళ్ల క్రితం సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ విభాగంలో రజతం సాధించింది. ‘ప్రాక్టీస్ కూడా ప్రారంభించాను. కామన్వెల్త్లో వెళ్లి ఆడతానని కూడా అనుకున్నాను. కానీ మళ్లీ గాయపడదల్చుకోలేదు. తదుపరి సీజన్ కోసం పూర్తి ఫిట్నెస్తో ఉండటం తప్పనిసరి. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని సైనా వ్యాఖ్యానించింది. -
పతకం నిలబెట్టుకుంటా
కామన్వెల్త్ గేమ్స్‌పై సైనా బంజారాహిల్స్: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం నిలబెట్టుకుంటానని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆమె తన కెరీర్ ఫొటోలతో కూడిన ఫొటోబుక్‌ను ఆ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్రతో కలిసి ఆవిష్కరించింది. నగరంలోని ఓ హోటల్లో బుధవారం జరిగిన ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ త్వరలో గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది చివరికల్లా మెరుగైన ర్యాంకుకు చేరుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ హైదరాబాదీ స్టార్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఐఓబీ చైర్మన్ నరేంద్ర మాట్లాడుతూ తమ బ్యాంక్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సైనా కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో తమ బ్యాంక్ ఏడో స్థానంలో కొనసాగుతుండగా సైనా కూడా ఏడో ర్యాంక్‌లోనే ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అయితే త్వరలో ఆమె టాప్ ర్యాంకుకు చేరుకోవాలన్నారు. విద్య, సాంస్కృతిక, క్రీడల్లో రాణించిన వారికి తమ బ్యాంక్ ప్రోత్సాహాకాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, సైనా తల్లిదండ్రులు ఉష, హర్వీర్సింగ్ పాల్గొన్నారు. -
పేరు గొప్ప... ఊరు దిబ్బ!
అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేముందు భారత క్రీడాకారులు అక్కడ శిక్షణ తీసుకోవడం పరిపాటి. కనీసం రెండు, మూడు వారాలైనా ఆ కేంద్రంలో అగ్రశ్రేణి క్రీడాకారుల సన్నాహాలు ఉంటాయి. భారత్‌లోనే మేటి క్రీడా శిక్షణ సంస్థగా పేరొందిన ఆ కేంద్రంలో సౌకర్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని భావిస్తుంటారు. కానీ అక్కడి దృశ్యాలను పరిశీలిస్తే... భారత్‌లో అధికారిక జాతీయ క్రీడా శిక్షణ సంస్థ పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ క్రీడా శిక్షణ సంస్థ మరేదో కాదు... 1961లో స్థాపిం చిన పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్). న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ మొదలుకానున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే భారత జట్లకు పాటియాలాలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ శిబిరాలు నిర్వహించారే తప్ప... ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అని పట్టించుకునే నాథుడు కనిపించలేదు. ముఖ్యంగా భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు, ‘డబుల్ ఒలింపియన్’ ఆచంట శరత్ కమల్ ఇక్కడ ఉన్న సౌకర్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 2010లో ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు అందించాడు. పాటియాలాలోని ఎన్ఐఎస్లో వసతి అంటే ‘పీడకల’తో సమానం అని శరత్ కమల్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఆటపరంగా ఎన్ఐఎస్లో సౌకర్యాలు ఫర్వాలేదు. కానీ వసతి సౌకర్యాలు దారుణంగా ఉన్నాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు ఈ తరహా ఏర్పాట్లు చేయడం అమోదయోగ్యం కాదు’ అని ఏథెన్స్, బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్ అన్నాడు. ‘ఇక్కడి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. బాత్రూమ్లు రోతపుట్టించే విధంగా ఉన్నాయి. ఎయిర్ కండిషనర్లు సరిగ్గా పనిచేయడంలేదు. మేము అద్భుత సౌకర్యాలు కల్పించాలని అడగడంలేదు. సాధారణ సౌకర్యాలు కావాలని కోరుతున్నాం. నాకు కేటాయించిన గదిలో నిద్రపోయే పరిస్థితి లేకపోవడంతో నేను మన విదేశీ కోచ్‌కు ఏర్పాటు చేసిన అపార్ట్మెంట్ గదికి వెళ్లి పడుకున్నాను’ అని ఈ క్రీడల్లో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరిన శరత్ కమల్ తెలిపాడు. -
మూడు పతకాలు గెలుస్తాం
సింగిల్స్‌లో ఎదురులేదు డబుల్స్‌లోనే పోటీ క్లిష్టం ‘కామన్వెల్త్’ బ్యాడ్మింటన్‌పై జ్వాల వ్యాఖ్య కోల్‌కతా: ‘కామన్వెల్త్ గేమ్స్’ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ కనీసం మూడు పతకాలు గెలుస్తుందని డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ధీమా వ్యక్తం చేసింది. సింగిల్స్‌లో సైనా, సింధులకు ఎదురేలేదని... డబుల్స్‌లోనే పోటీ తీవ్రంగా ఉంటుందని డబుల్స్ డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆమె వ్యాఖ్యానించింది. ఉబెర్ కప్‌లో రాణించిన అనుభవంతో గ్లాస్గోలోనూ ముందంజ వేస్తామని చెప్పింది. ఈసారి మిక్స్డ్ విభాగంలో ఆడటం లేదని తెలిపింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్ కోసం భారత బ్యాడ్మింటన్ బృందం 19న అక్కడికి వెళ్లనుంది. 24 నుంచి పోటీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. సత్తాచాటుతాం గత ‘కామన్వెల్త్’లో నాలుగు పతకాలు గెలిచిన మేం... ఈసారి మూడు పతకాలు సాధిస్తాం. సింగిల్స్‌లో భారత క్రీడాకారిణిలకు ఎదురులేదు. సైనా, సింధులే ఫైనల్‌కు చేరుతారు. ఆటతీరు చూసినా ర్యాంకింగ్స్ పరంగా చూసినా వీరిద్దరిని ఓడించే సత్తా ఎవరికీ లేదు. కానీ డబుల్స్‌లోనే తీవ్రమైన పోటీ నెలకొంది. మలేసియా, ఇంగ్లిష్, సింగపూర్ క్రీడాకారులతో క్లిష్టమైన పోరు ఉంటుంది. అశ్విని బెస్ట్ ప్లేయర్ మహిళల డబుల్స్‌లో అశ్విని మేటి క్రీడాకారిణి. ప్రపంచ బెస్ట్ ప్లేయర్లలో ఆమె ఒకరు. స్మాష్‌లలో దిట్ట. తనదైన శైలిలో రాణిస్తుంది. ఆమెతో కలిసి ఆడటం అదృష్టం. మేమిద్దం మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోరాడతాం. ఢిల్లీ అయినా, గ్లాస్గో అయినా పోటీలో మార్పేమీ ఉండదు. విదేశాల్లో గతంలోనూ గెలిచిన రికార్డు మాకుంది. సచిన్ తెలీదంటే వివాదమా రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తనకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలీదన్నంత మాత్రాన వివాదాస్పదం చేయడం తగదు. క్రికెట్ 12 దేశాలే ఆడతాయి. అదే టెన్నిస్ అయితే 200, బ్యాడ్మింటన్‌ను 150 దేశాలు ఆడతాయి. ఒక ఆట దిగ్గజం గురించి మరొకరి తెలియకపోతే ఏంటి? ఈ మాత్రానికే రాద్దాంతం చేయడం తగదు. -
కామన్వెల్త్కు 224 మంది భారత అథ్లెట్లు
న్యూఢిల్లీ: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ భారీ బృందాన్ని పంపనుంది. 14 అంశాల్లో మొత్తం 224 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ఇందులో ఏడుగురు పారా అథ్లెట్లు ఉన్నారు. కోచ్‌లు, సహాయక సిబ్బందితో కలిసి 90 మంది అధికారులు కూడా ఈ బృందం వెంట వెళతారు. ఈనెల 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న ఈ టోర్నీలో 17 అంశాల్లో 261 మెడల్ ఈవెంట్స్ ఉన్నాయి. అయితే నెట్‌బాల్, రగ్బీ, ట్రయథ్లాన్‌లలో భారత్ పాల్గొనడం లేదు. పారా అథ్లెట్స్ 22 ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 495 మంది అథ్లెట్లను బరిలోకి దించి రికార్డు స్థాయిలో 101 పతకాలు సాధించింది. గ్లాస్గో గేమ్స్‌లో ఆర్చరీ, టెన్నిస్‌లను పక్కనబెట్టడంతో భారత్ పతకాలు గెలిచే అవకాశాలపై కాస్త ప్రభావం చూపనుంది. అయితే వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించేందుకు కృషి చేస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఈ క్రీడలకు అదనంగా మరో 100 కోట్లు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. సమయం లేకపోవడం వల్ల ఆసియా గేమ్స్-2019 బిడ్‌ను దాఖలు చేయలేకపోయామన్నారు. అయితే ఇందులో ఐఓఏను గానీ, క్రీడా శాఖను గానీ తప్పుబట్టలేమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. -
‘కామన్వెల్త్’కు బోల్ట్
కింగ్స్టన్: భారత్‌లో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు డుమ్మా కొట్టిన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఈసారి మాత్రం గ్లాస్గోలో జరిగే క్రీడల్లో పాల్గొంటున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే ఈ క్రీడల కోసం జమైకా ప్రకటించిన అథ్లెట్ల జాబితాలో బోల్ట్ పేరు ఉంది. అలాగే మరో స్టార్ స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ కూడా ఈ గేమ్స్‌లో పాల్గొంటుంది. అయితే ఈ ఇద్దరూ క్రీడలకు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక బోల్ట్, షెల్లీ 100 మీటర్ల పరుగులో స్టార్స్ అయినప్పటికీ.. స్కాట్లాండ్లో 4x100 మీటర్ల రిలేలో పాల్గొనే అవకాశం ఉంది. -
గగన్ నారంగ్‌కు నిరాశ
10 మీ. ఎయిర్ రైఫిల్‌లో దక్కని చోటు కామన్వెల్త్ క్రీడలకు షూటర్ల ఎంపిక న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ పతకం సాధించిన ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్. తన కెరీర్లో సాధించిన ఘనతలు ఇందులోనే ఎక్కువ. నారంగ్ ప్రధాన ఈవెంట్ ఇదే. కానీ జులై, ఆగస్టుల్లో స్కాట్లాండ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో గగన్‌కు 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో చోటు దక్కలేదు. కామన్వెల్త్ క్రీడల కోసం జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ)ప్రకటించిన జాబితాలో నారంగ్‌కు... 50 మీ. త్రీ పొజిషన్ రైఫిల్, 50 మీ. ప్రోన్ విభాగాల్లో మాత్రమే చోటు దక్కింది. ఇటీవల ఎయిర్‌రైఫిల్ ఈవెంట్లో అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉందంటూ ఎన్ఆర్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా తనకిష్టమైన 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో చోటు దక్కించుకున్నాడు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు ఐఏబీఎఫ్ సన్నాహాలు
గుర్తింపు లేదని తేల్చిన ఐబా న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) తమ సభ్యత్వాన్ని రద్దు చేసినా భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్) అధికారుల వైఖరిలో మార్పు రావడం లేదు. తమ ఆధ్వర్యంలో పురుషుల, మహిళల జాతీయ చాంపియన్‌షిప్‌లను జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు తమ ఆమోదం ఉండదని ఇదివరకే ఐబా తేల్చి చెప్పింది. మే 18 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో పురుషుల జాతీయ చాంపియన్‌షిప్, అదే నెల 8 నుంచి 11 వరకు ఐదో సీనియర్ మహిళా జాతీయ చాంపియన్‌షిప్‌ను జరుపుతామని మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా ఆయా రాష్ట్ర యూనిట్స్‌కు సమాచారమిచ్చారు. అంతేకాకుండా మహిళల నేషనల్స్.. కామన్వెల్త్ గేమ్స్‌కు సెలక్షన్స్ ట్రయల్స్‌గా ఉపయోగపడతాయని కూడా ప్రకటించారు. కానీ భారత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన కారణంగా ఈ ఈవెంట్స్‌కు అనుమతి లేదని ఐబా స్పష్టం చేసింది. ‘ప్రస్తుతానికి భారత్‌లో ఏ జాతీయ పోటీలను కూడా ఐబా గుర్తించడం లేదు. బాక్సింగ్ సమాఖ్యకు గుర్తింపు లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఐబా పీఆర్ అండ్ కమ్యూనికేషన్ డెరైక్టర్ సెబాస్టియన్ గిల్లట్ పేర్కొన్నారు. -
‘టింటూ స్వర్ణం తెస్తుంది’
ముంబై: భారత యువ అథ్లెట్ టింటూ లూకాకు ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించగల సత్తా ఉందని ఆమె కోచ్, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష విశ్వాసం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న తన శిష్యురాలు ఈసారి మాత్రం పసిడి పతకంతో తిరిగొస్తుందని ఆమె ధీమాతో చెప్పింది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జులై 21 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతాయి. ‘ప్రస్తుతం టింటూ లూకా మంచి ఫామ్‌లో ఉంది. ఆమె 800 మీటర్ల రేసును ఒక నిమిషం 59 సెకన్లలోపు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది పలు ముఖ్య పోటీలు ఉన్న నేపథ్యంలో టింటూకు వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది’ అని ఉష పేర్కొంది. -
ఏసీబీకి ‘వీధిదీపాల’ రికార్డులు!
న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ సర్కారు హయాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల సమయంలో వెలుగుచూసిన వీధిదీపాల కుంభకోణం కేసులో అన్ని రికార్డులను పరిశీలించనున్నట్లు శుక్రవారం ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్ సర్కార్ ఆదేశం మేరకు గురువారం ఏసీబీ మొదటి ఎఫ్ఐఆర్ నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ వీధిదీపాల కొనుగోలు ఫైల్‌ను అప్పటి సీఎం షీలాదీక్షిత్ స్వయంగా ఆమోదించారు. దాంతో ఈ కుంభకోణంలో షీలా పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీడబ్ల్యూజీ కుంభకోణంలో అప్పటి షీలా ప్రభుత్వంతోపాటు, కార్పొరేషన్ అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలని అవినీతి నిరోధక విభాగాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన మొదటి ఎఫ్ఐఆర్లో షీలాదీక్షిత్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఈ కొనుగోలులో అని ఒక వాక్యం చేర్చడంతో మున్ముందు ఈ కుంభకోణంలో షీలా పేరును కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఈ వీధిలైట్ల కొనుగోలుపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై విచారణకు మాజీ కాగ్ వి.కె.షుంగ్లూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రధానమంత్రి స్వయంగా నియమించారు. ఈ కమిటీ తన నివేదికలో వీధిలైట్ల కొనుగోలులో అప్పటి సీఎం షీలా అనవసరం జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. కాగ్ 2011లో ఇచ్చిన నివేదికలోనూ ఈ విషయంలో షీలా ప్రమేయాన్ని తప్పుపట్టింది. కామెన్వెల్త్ గేమ్స్ సమయంలో పలు స్టేడియాల వద్ద రోడ్లపై విదేశీ లైట్లు ఏర్పాటు చేసినప్పుడు తగిన ప్రమాణాలను పాటించలేదని పేర్కొంది. అయితే అప్పటి సీఎం ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించడంతో ప్రభుత్వానికి రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఏసీబీ వీధిలైట్ల కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. కాగా షుంగ్లూ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని ఈ కేసులో ముందుకుపోవాలని ఏసీబీ భావిస్తోంది. ‘ఈ కుంభకోణంలో నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించాం. మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇందులో మేం ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకుని కేసు నమోదుకు అనుమతించలేదు..’ అని మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ‘కామన్వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీ సర్కార్ అధీనంలో చేపట్టిన అన్ని పనులపైనా ఏసీబీ దర్యాప్తు జరుపుతుంద’ని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భర్తీ స్పష్టం చేశారు. -
నిజంగానే ‘ఊడ్చే’స్తారా?!
కేజ్రీవాల్ పోటీలో పైచేయికి అంచులలోనే తారట్లాడుతున్నారు. సంప్రదాయక పార్టీలు తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఉన్నదనే విశ్వాసాన్ని కలుగజేస్తున్నాయి. కాబట్టే వారికి అధికంగా మద్దతు లభిస్తోంది. అలా అని ప్రజా మద్దతు రేఖ అలాగే నిలిచి పోయేదేం కాదు. ఏదో ఒక వైపునకు అది మొగ్గక తప్పుదు. ఒక ప్రభుత్వంగా ఆమ్ ఆద్మీ పార్టీ బాగా పనిచేస్తుందో లేదో తెలీదు. కానీ ఢిల్లీకి కావాల్సిన శాసన సభా ప్రతిపక్షం మాత్రం అదే. రాజధాని నగరమే జాతీయ రాజకీయ రంగస్థలిపై ప్రధాన నర్తకి కావడం అనివార్యం. లం డన్ మేయర్ లేదా ఢిల్లీ శాసన సభ ఎన్నికలకు పెద్ద రాష్ట్ర ఎన్నికలంతటి సంరంభం తప్పదు. లండన్ మేయర్ పదవిలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి విలువ కూడా అధికారం కొలబద్ధతో కొలవగలిగేది కాదు. కాబట్టే పెట్టుబడిదారునిగా బాగా రాణించిన బ్రిటన్ పెట్టుబడిదారుడు బోరిస్ జాన్సన్ తన జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి లండన్‌ను పునాదిగా చేసుకున్నారు. విస్తరించిన పెద్ద మునిసిపాలిటీ లాంటి ఢిల్లీ పీఠం కోసం షీలా దీక్షిత్ నేడు నాలుగోసారి పోటీ పడుతున్నారు. ఏ ప్రజాస్వామిక ప్రమాణాలతో చూసినా ఆమె తమ పార్టీకి ప్రధాని అభ్యర్థి కావలసింది. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ నేత. ఆ పార్టీలో ఆమెకు ఏ బాధ్యతలైనా లభిస్తాయి... నిజంగా లెక్కలోకి వచ్చే ఒక్క ప్రధాని పదవి తప్ప. అందుకే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడికి చేరాం. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని తుడిచి పెట్టేసే పోరాటాన్ని లక్నోలోనో లేదా ముంబైలోనో చేపట్టివుంటే... ఈ యుద్ధంలో ఆయన ఒక అజ్ఞాత యోధునిగా మిగిలిపోయేవారు. ఢిల్లీలో ఈ పోరాటం చేపట్టారు కాబట్టే మీడియా ఆయన లక్ష్యానికి ఆవశ్యకమైన మంచి ఊపును ఇచ్చింది. కామన్వెల్త్ క్రీడలు మొదలుకొని అంతన్నదే లేకుండా కథలు కథలుగా వెల్లువెత్తుతున్న యూపీఏ మంత్రుల అవినీతికి ఢిల్లీ నగరం దిగ్భ్రాంతికి గురైంది. యాదృచ్ఛికంగా ఆ నగర వీధుల్లో పుట్టిన ఉద్యమం నుంచి కేజ్రీవాల్ ఆవిర్భవించారు. ఇతర మహా నగరాల్లాగానే ఢిల్లీ కూడా కిక్కిరిసిన పలు పట్టణ గ్రామాల బృహత్ సముదాయం. అక్కడి పౌరులు పాలక వర్గ ఉన్నత శ్రేణులకు భౌతికంగా అతి సమీపంగా నివసిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యం త విలాసవంతమైన బంగ్లాల ముందు నుంచి బస్సులో ప్రయాణించడానికి మించిన భాగ్యమెరుగని అభాగ్యులు వారు. ప్రజల ఓట్లను సంపాదించుకున్న అదృష్టానికి రాజకీయ నేతలు ఆ వైభోగాలను అనుభవిస్తుంటారు. మంత్రుల కాలం చెల్లిన జీవన శైలి విషయంలో ఢిల్లీకి సాటి రాగల ప్రజాస్వామ దేశ రాజధాని ప్రపంచంలోనే మరొకటి లేదు. అది చూస్తూ బస్సులో ఆఫీసులకు పోయే వారికి కడుపు మంట రగలక మానదు. వారు స్త్రీలే అయినా, పురుషులే అయినా ఏమీ చేయలేని వారి నిస్సహాయత మాత్రం అందుకు కారణం కాదు. కేజ్రీవాల్ మరో అడుగు మందుకు వేయడానికి యత్నించగల దృఢ సంకల్పాన్ని చూపారు. తిరుగుబాటు నుంచి సంస్థాగత నిర్మాణానికి కష్టభరితమైన పరివర్తనను సాధించ గలిగారు. ఆయనకు ఇప్పుడు తెలిసి వస్తున్నట్టుగా సిద్ధాంతం నుంచి ఆచరణకు జరిగే మార్పు సులువైనదేమీ కాదు. కేజ్రీవాల్ పుట్టిందే ఆగ్రహంలో. కాబట్టి ఆగ్రహంతో ఉన్నవారి ఓట్లను ఆయన కూడగట్టుకోగలుగుతారు. అయితే ఈ ఓటింగ్‌ను పరిష్కారం చూపే ఓటింగ్‌గా ఆయన మార్చగలరా? అరుపులు ముగిసిపోయి, యుద్ధం జరిగి గెలిచిన తర్వాత ఢిల్లీకి కావలసినది విద్యుత్ కంపెనీలను పారిపోయేట్టు చేయకుండానే చార్జీలను తగ్గించ డం, సుస్థిరమైన వాణిజ్యపరమైన అనుసంధానాలు తెగిపోకుండానే ఉల్లి ధరలను తగ్గించడం. కేజ్రీవాల్ కాస్త తక్కువ కర్కశంగా ఉంటే అది ఆయనకు తోడ్పడేదే. కానీ అది ఆయన నుంచి అతిగా ఆశించడమే అవుతుంది. ఆ కర్కశ స్వరంతోనే ఆయన ఇంత దూరం చేరారు. ఆయనకు అది అలవాటుగా మారిపోయింది. ‘చీపురు’ ఆగ్ర హాన్ని వ్యక్తం చేసే ఆయుధమే తప్ప పరిష్కారం కాదు. ఈసారి గెలిచినా ఓడినా, వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన ‘కలం’ గుర్తును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆయనకు నేడు ఎదురవుతున్న ఇబ్బందుల ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజలు ఆయనను ఉన్నత ప్రమాణాల గీటురాయితోనే చూస్తారు, నిర్ణయిస్తారు. ఇతరుల నుంచి ఆయన అలాంటి ప్రమాణాలను ఆశించడమే బహుశా అందుకు కారణం కావొచ్చు. మూడో స్థానానికి, ఒకటో స్థానానికి మధ్య తేడాను నిర్ణయించేది ముస్లింలే. ముస్లిం లలో తగినంతగా పట్టు లభించడం లేదని కేజ్రీవాల్ పార్టీలో అంతర్గతంగా జరిపిన అభిప్రాయ సేకరణ చెప్పి ఉండాలి. సమీపంలోని ముల్లా దగ్గరికి ఆయన పరుగు పెట్టడానికి ఉన్న హేతుబద్ధమైన వివరణ అదే మరి. సంప్రదాయక ఓటు బ్యాంకు నిర్ణేతల దిశగా గంతు వేసి ఆయన తప్పుచేశారు. అందుకు బదులుగా ఆయన... అవి నీతి కుల, మతాలకు అతీతంగా పౌరులలో ప్రతి ఒక్కరికీ హానిని కలిగిస్తోందంటూ ముస్లిం యవతకే నేరుగా విజ్ఞప్తి చేసి ఉండాల్సింది. అయితే ఆ పని చేయడానికి ఆయనకు ఇంకా సమయం ఉంది. కేజ్రీవాల్ తరచుగా మధ్య దళారులను విమర్శిస్తుండేవారు. మరి ఆయనకు ఎన్నికల ఒప్పందంలో వారి అవసరం ఎందుకు వచ్చినట్టు? బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మూడింటిలో టికెట్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆ మూడు పక్షాలకు ఆవకాశాలు తెరుచుకునే ఉన్నాయని అది సూచిస్తోంది. బీజే పీ, కాంగ్రెస్‌లలో పైనుంచి కింది దాకా అంతా అసంతృప్తితో గుర్రుమంటున్నారు. కాగా ఆమ్ ఆద్మీలో పైనుంచి కింది వరకు విస్తరించిన పలు అంచెల నిర్మాణ వ్యవస్థ లేకపోవడమనే సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అది ఏ ఉద్యమంలోనైనా ఉండేదే. ఆదర్శవాదం ప్రేరణతో వచ్చిన క్యాడర్లకు, గట్టి మద్దతుదార్లకు ఎన్నికలు పరమ అధ్వానంగానూ, మురికిగానూ ఉంటాయని తెలిసి వస్తోంది. ఆచరణాత్మక ప్రయోజనాల అన్వేషణలో ఆదర్శాలను త్యజించరాదని హేతుబద్ధంగా ఆ యువతకు వివరించడానికి తగినంత సమయం లేకపోవచ్చు. కేజ్రీవాల్ పోటీలో పైచేయికి అంచులలోనే తారట్లాడుతున్నారు. కానీ సంప్రదాయక పార్టీలు తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఉన్నదనే విశ్వాసాన్ని ఎక్కువగా కలుగజేస్తున్నాయి. కాబట్టే వారికి అధికంగా మద్దతు లభిస్తోంది. అలా అని ప్రజా మద్దతు రేఖ అలాగే నిలిచి పోయేదేం కాదు. మూడు దిక్కుల్లో ఏదో ఒక వైపునకు అది మొగ్గక తప్పుదు. విజయం భారీ లాభాలను పట్టుకొచ్చి అందిస్తుంది. వైఫల్యం రాజకీయ మరణ శిక్షను విధిస్తుంది. ప్రత్యేకించి నిలకడగా మనగలిగిన పార్టీ నిర్మాణం, విధేయులు లేని పార్టీకి అది తప్పదు. ఆమ్ ఆద్మీ పార్టీ గాలి బుడగ కంటే ఎక్కువ బలమైనదే. అయితే ఆది ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తే తప్ప దానికి జవసత్వాలు సమకూరవు. ఒక ప్రభుత్వంగా ఆ పార్టీ బాగా పనిచేస్తుందో లేదో తెలీదు. కానీ ఢిల్లీకి కావాల్సిన శాసన సభా ప్రతిపక్షం మాత్రం అదే. -
ఈ ఏడాది కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణ
సాక్షి క్రీడావిభాగం గత నాలుగేళ్లలో అంతర్జాతీయస్థాయిలో ప్రముఖ టైటిల్స్ సాధించి భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా మారిపోయిన సైనా నెహ్వాల్ దూకుడు ఈ ఏడాది మాత్రం తగ్గిపోయింది. 2009 నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ హైదరాబాదీ ఈ ఏడాది మాత్రం ఏ ఒక్క టోర్నీలోనూ కనీసం ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం సైనా పది టోర్నమెంట్లలో బరిలోకి దిగింది. మలేసియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్‌లో మినహా మిగతా టోర్నమెంట్లలో ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. ఒకప్పుడు చైనా క్రీడాకారిణుల నుంచే గట్టిపోటీని ఎదుర్కొన్న సైనాను ఇటీవల కాలంలో ఇతర దేశాల వారూ ఓడిస్తున్నారు. బ్యాడ్మింటన్ రాకెట్ పట్టినప్పటి నుంచి చిరకాల స్వప్నంగా నిలిచిన ఒలింపిక్ పతకాన్ని గత ఏడాదే నెగ్గడం... సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించడం... ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకం... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... ఇలా సైనా నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఒక్కోటి అధిగమిస్తూ వస్తోంది. అయితే ఏడాది కాలంగా సైనా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే ఆమె రాకెట్లో పదును తగ్గినట్టే అనిపిస్తోంది. సైనా ఆటతీరుపై, వ్యూహాలపై ఆమె ప్రత్యర్థులు పక్కా హోంవర్క్ చేసి బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లు చైనా క్రీడాకారిణుల ఆధిపత్యాన్ని సవాలు చేసిన సైనాకు కొత్త ప్రత్యర్థులు ఎదురవుతున్నారు. ఈ ఏడాది సైనాను ఎనిమిది వేర్వేరు దేశాల క్రీడాకారిణులు ఓడించడం గమనార్హం. డెన్మార్క్ ఓపెన్‌లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యోన్ జూ బే (దక్షిణ కొరియా)... సింగపూర్ ఓపెన్‌లో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)... ఇండోనేసియా ఓపెన్‌లో జూలియన్ షెంక్ (జర్మనీ)... థాయ్‌లాండ్ ఓపెన్‌లో జువాన్ గూ (సింగపూర్)... ఇండియా ఓపెన్‌లో యు హషిమోటో (జపాన్)... స్విస్ ఓపెన్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్).... మలేసియా ఓపెన్‌లో జూ యింగ్ తాయ్ (చైనీస్ తైపీ)... కొరియా ఓపెన్‌లో లీ హాన్ (చైనా) సైనాను ఓడించారు. ఈ ఏడాది సైనా మరో మూడు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌లో నాలుగో సీడ్‌గా పోటీపడనున్న సైనాకు ఈ టోర్నీలోనూ క్లిష్టమైన ‘డ్రా’ ఎదురయింది. ఆమె పార్శ్వంలోనే సింధు, యోన్ జూ బే, రత్చనోక్, లీ హాన్, షిజియాన్ వాంగ్ ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత నవంబరు 12 నుంచి 17 వరకు చైనా ఓపెన్‌లో... నవంబరు 19 నుంచి 24 వరకు హాంకాంగ్ ఓపెన్‌లో సైనా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. డిసెంబరు 11 నుంచి 15 వరకు జరిగే సీజన్ ముగింపు టోర్నీ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోనూ ఈ భారత స్టార్ పోటీపడవచ్చు. 23 ఏళ్ల సైనా తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకొని... పూర్తి ఫిట్నెస్తో బరిలో దిగి... మెరుపులు మెరిపిస్తే ఆమెకు తదుపరి టోర్నీలలో విజయావకాశాలున్నాయి. ఈ ఏడాది సైనా ప్రదర్శన డెన్మార్క్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్ ప్రపంచ చాంపియన్‌షిప్-క్వార్టర్ ఫైనల్ సింగపూర్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్ ఇండోనేసియా ఓపెన్-సెమీఫైనల్ థాయ్‌లాండ్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్ ఇండియా ఓపెన్-ప్రిక్వార్టర్ ఫైనల్ స్విస్ ఓపెన్-సెమీఫైనల్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-సెమీఫైనల్ మలేసియా ఓపెన్-సెమీఫైనల్ కొరియా ఓపెన్-క్వార్టర్ ఫైనల్ గత నాలుగేళ్లలో సైనా నెగ్గిన టైటిల్స్ 2009-2 (ఇండోనేసియా ఓపెన్, ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్) 2010-4 (ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, హాంకాంగ్ ఓపెన్, ఇండియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్) 2011-1 (స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్) 2012-4 (ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్) -
ఇండియా గేట్ వద్ద క్వీన్స్ బ్యాటన్
న్యూఢిల్లీ: భారత్‌కు చేరుకున్న గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ బ్యాటన్‌ను ప్రతిష్టాత్మక ఇండియా గేట్ వద్ద శనివారం ప్రదర్శించారు. డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా, షూటర్ సమరేశ్ జంగ్, వెయిట్ లిఫ్టర్ కత్తుల రవికుమార్, రెజ్లర్లు యోగేశ్వర్ దత్, అమిత్ కుమార్, అనిల్ కుమార్, అనితా తొమర్, హాకీ ప్లేయర్లు శ్రీజేష్, రఘునాథ్, సునీల్ బ్యాటన్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి భారత్‌కు చేరుకున్న బ్యాటన్‌ను శనివారం ఉదయం ఆగ్రాకు తీసుకెళ్లారు. గంటపాటు తాజ్‌మహల్ వద్ద ఉంచి.. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు. -
‘అర్జున’కు కొలమానం ఏమిటి?
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాలను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... ప్రతిపాదిత ‘అర్జున పురస్కారాల’ క్రీడాకారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు జాతీయ క్రీడా పురస్కారాల ఎంపికకు కొలమానం ఏమిటో అర్థం కావడంలేదని ఈ ‘లండన్ ఒలింపియన్’ బాధపడుతున్నాడు. కెరీర్లో అద్భుత విజయాలు సాధించినా కేంద్ర ప్రభుత్వ అవార్డుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మనోజ్ అన్నాడు. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించేందుకు కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్‌ను కలుసుకోవాలని భావిస్తున్నాడు. ‘మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నా బాధ ఆయనతో చెప్పుకోవాల్సి ఉంది. అసలు అవార్డు కోసం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనేది అర్థం కావడం లేదు’ అని మనోజ్ అన్నాడు. మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన కవితా చహల్‌కు మాత్రమే ఈ సారి అర్జున అవార్డు దక్కే బాక్సింగ్ జాబితాలో ఉంది. మనోజ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్దాకా వెళ్లగా రెండుసార్లు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించాడు. ఇటీవల సైప్రస్‌లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ కప్‌లో రజతం నెగ్గాడు. -
అవినీతిపరులకు చోటు లేదు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇక నుంచి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. ఈమేరకు ఐఓఏ రాజ్యాంగ సవరణను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించింది. 43 పేజీల సవరణ ముసాయిదాలో పలు అంశాలను చేర్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆఫీస్ బేరర్ లేక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఐఓఏ సభ్యుడై ఉండడమే కాకుండా అన్ని పౌర హక్కులు కలిగిన భారత పౌరసత్వం ఉండాలి. ముఖ్యంగా ఏ కోర్టులోనూ కేసులు ఎదుర్కోకుండా ఉండాలి. అలాగే శిక్షార్హమైన క్రిమినల్ లేక అవినీతి కేసుల్లోనూ ఇరుక్కోకుండా ఉండాలి. ఈ నిబంధనలు కామన్వెల్త్ గేమ్స్ స్కామ్‌లో చార్జిషీట్లు నమోదైన సురేశ్ కల్మాడీ, లలిత్ బానోత్, వీకే వర్మలకు ప్రతిబంధకాలు కానున్నాయి. -
ఈసారి భారత స్టార్‌కు మంచి అవకాశం
జూనియర్ ప్రపంచ చాంపియన్ టైటిల్... సూపర్ సిరీస్ టోర్నీలోనూ విజయాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకం... ఒలింపిక్స్‌లో కాంస్యం... దాదాపు అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలు సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం లోటుగా కనిపిస్తోంది. గత మూడు పర్యాయాలు ఈ హైదరాబాద్ అమ్మాయి పతకానికి విజయం దూరంలో ఉండిపోయింది. నాలుగోసారైనా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించి ‘చాంపియన్’గా నిలుస్తుందో? లేదో? వేచిచూడాలి. గ్వాంగ్జూ (చైనా): ఈ ఏడాదిలో ఒక్క టైటిల్‌ను గెలువలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమైంది. సోమవారం మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పతకం సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం పకడ్బందీగా సిద్ధమైన సైనాకు ఈసారి అనుకూలమైన ‘డ్రా’నే పడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సైనాకు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఊరిస్తోంది. హైదరాబాద్ (2009), పారిస్ (2010), లండన్ (2011)లలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సైనా క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది. ఈ ప్రతిష్టాత్మక పోటీల నిబంధనల ప్రకారం సెమీఫైనల్స్‌కు చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఇప్పటివరకు ఈ పోటీల చరిత్రలో భారత్‌కు వచ్చిన రెండు పతకాలు కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్‌లో... 2011లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. బుధవారం బరిలోకి... సోమవారం ఈ పోటీలు ప్రారంభమవుతున్నా సైనా మాత్రం తన తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. నాలుగోసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న ఈ హైదరాబాద్ అమ్మాయికి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఓల్గా గొలోవనోవా (రష్యా) లేదా అలీసియా జైత్సావా (బెలారస్)లలో ఒకరితో సైనా ఆడుతుంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే మూడో రౌండ్లో ఆమెకు 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్) లేదా జేమీ సుబంధి (మలేసియా) ఎదురవుతారు. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో సైనాకు ప్రత్యర్థిగా ఎనిమిదో సీడ్ మినత్సు మితాని (జపాన్) లేదా సయాకా తకహాషి (జపాన్) లేదా 13వ సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) లేదా త్సాజ్ కా చాన్ (హాంకాంగ్)లలో ఒకరుంటారు. ఈ అవరోధాన్ని అధిగమించి సెమీఫైనల్‌కు చేరుకుంటే సైనాకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. అంతా సజావుగా సాగితే సెమీఫైనల్లో సైనాకు టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) ఎదురయ్యే అవకాశముంటుంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా), నాలుగో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధుకు కూడా తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో యశ్వందరి (ఇండోనేసియా) లేదా ఇమబెపు (జపాన్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. తొలిసారి భారీ బృందం ఈ పోటీల చరిత్రలో భారత్ తొలిసారి ఐదు విభాగాల్లో (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) రెండేసి ఎంట్రీలను పంపించే అర్హతను సంపాదించింది. భారత్ నుంచి మొత్తం 11 మంది పోటీపడుతుండగా ఇందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులే కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు... పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్... పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కోనా తరుణ్... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి రాష్ట్రానికి చెందినవారు. కశ్యప్ ఁ రౌల్ తొలి రోజున భారత నంబర్‌వన్, ప్రపంచ 13వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 98వ ర్యాంకర్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో; వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్-అశ్విని పొన్నప్ప జంట హషిమోటో-మియూకి మయెదా (జపాన్) జోడితో; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్ జోడి లారెన్ స్మిత్-గాబ్రియెలా వైట్ (ఇంగ్లండ్) జంటతో ఆడతాయి.