Earthquake
-
ఇరాన్ భూగర్భ అణుపరీక్షలు?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. -
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.All tsunami warnings lifted for Japan's Izu and Ogasawara islands after earlier 5.6 magnitude earthquake https://t.co/bWfknc7WAj— Factal News (@factal) September 24, 2024క్రెడిట్స్: Factal Newsఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్‌లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్‌లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
Russia: రష్యాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడుగా నమోదైంది. భూకంప కేంద్రం తూర్పు కంచట్కా ద్వీపకల్ప తీరంలో ఉందని వెల్లడయ్యింది. ఈ భూకంపం దరిమిలా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు.భూకంపం అంటే భూమిలోని క్రస్ట్ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు విడుదలవుతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు అది బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. అయితే భూకంప తీవ్రత అధికంగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకూ విస్తరిస్తాయి. Magnitude 7.0 earthquake strikes off #Russia, tsunami warning issued: #US monitors. https://t.co/eLyx1YCU4L pic.twitter.com/wWvMMnmKZb— Arab News (@arabnews) August 17, 2024 -
జపాన్ను కుదిపేసిన తీవ్ర భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది. భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్‌వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్‌లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. -
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్లోభారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్‌స్కేల్‌పై తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది . జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్‌లోని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది.ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.అదే విధంగా జపాన్‌కు వాతావరణ శాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
USA Earthquake: కాలిఫోర్నియాలో భూకంపం.. 4.9 తీవ్రత నమోదు
అమెరికాలోని కాలిఫోర్నియాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. లాస్ ఏంజెల్స్‌లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం బార్స్టో సమీపంలో ఉంది. కాలిఫోర్నియాలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విపత్తు కారణంగా చోటుచేసుకున్న ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు.యూఎస్ టుడే అందించిన వివరాల ప్రకారం శాన్ బెర్నార్డిగో కౌంటీతో పాటు, లాస్ ఏంజిల్స్, కెర్న్, రివర్సైడ్, ఆరెంజ్ కౌంటీలలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. కాలిఫోర్నియాలోని ప్రజలు భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే వారి అనుభవాలను తెలియజేశారు.భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని బార్స్టో ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్ బెటాలియన్ చీఫ్ ట్రావిస్ ఎస్పినోజా తెలిపారు. లాంగ్ బీచ్ మేయర్ రెక్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటివరకు నగరంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు. -
జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.జమ్ముకాశ్మీర్‌లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. -
ఫిలిప్పీన్స్‌లో 7.1 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్‌లో ఈరోజు(గురువారం)బలమైన భూకంపం సంభవించింది. సోక్స్సర్జెన్కు 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలెబ్స్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపం లోతు 620 కిలోమీటర్లు.భూకంపం ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపించినప్పటికీ భారీగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ వార్తలు లేవు. అలాగే భూకంపం తర్వాత ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఫిలిప్పీన్స్‌లోని మిండానావోలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. EQ of M: 6.7, On: 11/07/2024 07:43:18 IST, Lat: 6.02 N, Long: 123.31 E, Depth: 650 Km, Location: Mindanao Philippines. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/d5AEc6OJZP— National Center for Seismology (@NCS_Earthquake) July 11, 2024 -
ఇరాన్లో భూకంపం.. నలుగురు మృతి
ఇరాన్‌లోని కష్మార్‌లో భూకంపం సంభవించంది. ఈ విపత్తులో నలుగురు మృతిచెందారు. 120 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. భూకంపం కారణంగా మృతిచెందివారి వారి సంఖ్యను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరీయత్మదారి ధృవీకరించారు.భూకంపం బారినపడి తీవ్రంగా గాయపడిన 35 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. భూకంపం కారణంగా కష్మార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాత భవనాలు దెబ్బతిన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో సంభవించింది. ఇరాన్ టెలివిజన్ భూకంపం ఫుటేజీని ప్రసారం చేసింది. దానిలో కొన్ని భవనాలు బీటలువారడం కనిపిస్తుంది. అలాగే కార్మికులు భవన శిధిలాలను తొలగిస్తున్న దృశ్యాలను కూడా చూపించారు.ఇరాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు మృతిచెందారు. 800 మందికి పైగా జనం గాయపడ్డారు. కాగా 2003లో ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. బామ్ నగరంలో 6.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 31వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. -
దక్షిణ కొరియాలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు
దక్షిణ కొరియాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు బువాన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ఈ వివరాలను వాతావరణ శాఖ మీడియాకు తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైనట్లు పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ దక్షిణ కొరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే. అయితే ఈ భూకంపం కారణంగా నష్టం వాటిల్లినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. నార్త్ జియోల్లా ప్రావిన్స్‌లోని అగ్నిమాపక శాఖ అధికారి జో హే-జిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపానికి సంబంధించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సుమారు 80 కాల్స్ వచ్చాయన్నారు. ఈ భూకంపం కారణంగా బువాన్లో ఓ ఇంటి గోడ కూలిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.భూకంపాలను వాటి తీవ్రత పరంగా వివిధ వర్గాలుగా విభజిస్తారు. 2.5 నుండి 5.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు మైనర్ కేటగిరీలో ఉంటాయి. 5.5 నుండి 6 తీవ్రతతో వచ్చే భూకంపం స్వల్ప స్థాయిలో ప్రమాదకరమైన భూకంపంగా పరిగణిస్తారు. 6 నుండి 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లయితే, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 7 నుండి 7.9 తీవ్రతతో సంభవించే భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. -
రాజస్థాన్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
రాజస్థాన్‌లో శనివారం అర్థరాత్రి కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం సికార్ జిల్లాలోని హర్ష పర్వతం అని తెలుస్తోంది. భూకంపం కారణంగా జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శనివారం అర్థరాత్రి 11.47 గంటలకు ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. భూకంపానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన జనం చాలాసేపు ఇళ్ల బయటనే ఉండిపోయారు. పరిస్థితి కుదుటపడ్డాక వారంతా తిరిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. -
పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు
తైవాన్‌లో వచ్చిన అతిపెద్ద భూకంపం అక్కడి ప్రజలను వణికించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడం ప్రకపనలు రేపింది. పెద్ద పెద్ద భవనాలు, నివాస గృహాలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా మార్గాలు స్థంభించాయి. ఈ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోను, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజనుల అభిమానాన్ని సంపాదించుకుంది. భూకంపం ప్రభావం అక్కడి ఆసుపత్రులను కూడా ప్రభావితంచేశాయి. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న వారు, ఆపరేషన్ థియేటర్లలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ఆయా విభాగాల వైద్యులు, నర్సులు అప్రమత్తమవుతారు.ప్రాణాలకు తెగించి మరీ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఘటనే తైవాన్ భూంకపం సమయంలోనూ చోటు చేసుకుంది. (చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!) భూకంపం తైవాన్ను అతలాకుతలం చేస్తున్న సమయంలో స్థానిక ఆసుపత్రిలోని నర్సులు వెంటనే స్పందించారు. ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో పసికందుల ప్రాణాలు కాపాడడానికి రంగంలోకి దిగారు. భూప్రకంపనలను గుర్తించిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఉయ్యాలలో నిద్రపోతున్న శిశువులను రక్షించే ప్రయత్నం చేయడం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ప్రసూతి యూనిట్‌లోని నలుగురు సిబ్బంది ఉయ్యాలలను కదలకుండా ఉంచడానికి, గట్టిగా పట్టుకోవడానికి కష్టపడ్డారు. ఒక పక్క బిల్డింగ్ అటూ ఇటూ ఊగుతోంది. దీనికి పసిబిడ్డలు ఉయ్యాలలూ కదిలిపోతున్నాయి. మరోవైపు కిటికీలు పగులుతాయోమోనన్న భయం. ఈ సమయంలో వారి ఆందోళన, కష్టం సీసీటీవీలో రికార్డైనాయి. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) These nurses risk their lives to literally save lives of babies during earthquake in Taiwan. Real life heros! Be safe🙏pic.twitter.com/Q8YLdSKQkJ — Nico Gagelmann (@NicoGagelmann) April 4, 2024 -
Japan Earthquake: జపాన్‌లో కంపించిన భూమి..
టోక్యో: తైవాన్ భూకంప ఘటన మరువకముందే తాజాగా జపాన్‌లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీంతో, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. కాగా, తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తైవాన్‌లో భూకంపం వచ్చిన మరుసటి రోజే నేడు జపాన్‌లో భూమి కంపించింది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 🚨🇯🇵 BREAKING: 6.3 magnitude earthquake near the east coast of Japan pic.twitter.com/Ro97HguPVZ — Kacee Allen 🇺🇸 (@KaceeRAllen) April 4, 2024 ఇదిలా ఉండగా.. తైవాన్‌లో బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. A dog sensed an earthquake in Taiwan seconds before it happened and alerted its owner..🐕🐾😳#Taiwan #Tsunami #Japan #TaiwanEarthquake #earthquake pic.twitter.com/10SdmUDENd — Zainab Fatima (@ZainabFati18) April 4, 2024 తైవాన్‌లో భూకంపం సందర్భంగా చిన్నారులను కాపాడిన నర్సులు.. ⚡️Nurses in a #Taiwan Hospital protecting babies during #earthquake.#Taiwan #earthquake #Japanpic.twitter.com/rF5It43iYO — Tajamul (@Tajamul132) April 4, 2024 -
తైవాన్‌లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్‌ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్‌ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్‌లో ఉంది. -
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. జనజీవనం అతలాకుతలం (ఫొటోలు)
-
తైవాన్ లో భారీ భూకంపం
-
తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు
తైవాన్‌లో అత్యంత భారీ భూకంపం తైవాన్ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024 Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g — Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024 -
తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7. 4 తీవ్రత.. సునామి హెచ్చరికలు జారీ
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తీ, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. -
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
మహారాష్ట్ర, అరుణాచల్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు!
మహారాష్ట్ర, అరుణాచల్‌లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్‌తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
Earthquake: ఢిల్లీలో భారీ భూప్రకంపనలు
ఢిల్లీ: పొరుగు దేశం చైనాలో భారీ భూకంపంతో.. మన దేశ రాజధాని ప్రాంతం వణికిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు చోటు చేసుకోగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. చైనా దక్షిణ ప్రాంతం జిన్జియాంగ్లో రిక్టర్ స్కేల్‌పై 80 కిలోమీటర్ల లోతున 7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ ప్రభావం ఢిల్లీతో పాటు ఎన్సీఆర్(National Capital Region)లోనూ కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH — National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024 ఇదిలా ఉంటే.. చైనా భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. అక్కడ వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 🔺#Breaking :A 7.1-magnitude #earthquake jolted Wushi County in Aksu Prefecture in northwest China's #Xinjiang Uygur Autonomous Region at 2:09 a.m. on Jan 23 (Beijing Time), according to the China Earthquake Networks Center. Stay Safe‼️ pic.twitter.com/GE9vkkMuCh — Record GBA (@RecordGBA) January 23, 2024 మరోవైపు.. దేశ రాజధాని ప్రాంతం తరచూ భూ ప్రకంపనలకు కేంద్రంగా ఉంటోంది. పొరుగు దేశాల్లో ఎక్కడ భూమి కంపించినా .. ఏ స్థాయిలో ప్రకంపనలు సంభవించినా.. ఆ ప్రభావం ఢిల్లీ రీజియన్‌లో కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో 6.1 తీవ్రతతో అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అంతకు ముందు నేపాల్ భూకంప ప్రభావమూ కనిపించింది. -
ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు
కాబూల్: ఆఫ్గనిస్థాన్‌లో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమి లోపల 17 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా తెలియదు. గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఆఫ్ఘనిస్థాన్‌లో ఇదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఇదీ చదవండి: హౌతీలపై అమెరికా మిత్రపక్షాల వైమానిక దాడులు -
ఉత్తర భారత్‌ను వణించిన భూకంపం..
న్యూఢిల్లీ: ఉత్తర భారతం భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ రీజియన్, పంజాబ్, ఘజియాబాద్ జమ్ము కశ్మీర్లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Another Earthquake in Islamabad Pray for everyone safety#Earthquake #Islamabad pic.twitter.com/ykMZ3tNuUS — Muhammad Fayyaz (@fayyaz_85) January 11, 2024 భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో గుర్తించింది పరిశోధన కేంద్రం. భూకంపం తీవ్రతకు జమ్మూకశ్మీర్ పూంచ్ సెక్టార్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఎవరికి ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. Earthquake of Magnitude:6.1, Occurred on 11-01-2024, 14:50:24 IST, Lat: 36.48 & Long: 70.45, Depth: 220 Km ,Location: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/fN2hpmK3jO @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/q5pkBVscsW — National Center for Seismology (@NCS_Earthquake) January 11, 2024 Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India.#Earthquake #Delhi #DelhiNews #EarthquakeNews #Noida #JammuAndKashmir #earthquake #DelhiNCR #Earthquake pic.twitter.com/bR6xWokMcJ — Neha Bisht (@neha_bisht12) January 11, 2024 🇮🇳Earthquake tremors felt in Poonch, India, too.#JammuAndKashmir #Earthquake #Delhi #India #climatecrisis #emergency #DelhiNCR pic.twitter.com/YreWZoOHTF — Attentive Media (@AttentiveCEE) January 11, 2024 -
90 ఏళ్ల మృత్యుంజయురాలు
టోక్యో: జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం మిగిలి్చంది. వంద మందికిపైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. 90 ఏళ్లకుపైగా వయసున్న ఓ వృద్ధురాలు శిథిలాల నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడం ఆశ్చర్యం కలిగింది. ఇషికావా జిల్లాలోని సుజు సిటీలో భూకంపం వల్ల కూలిపోయిన రెండంతస్తుల భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ వృద్ధురాలు బయటకు వచి్చంది. ఆహారం, నీరు లేక బలహీనంగా మారిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించారు. ఏకంగా 124 గంటలపాటు ఆమె ఈ శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, మాట్లాడగలుతోందని, ఆమె కాళ్లకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. జపాన్‌లో ఆరు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో కనీసం 126 మంది మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు.