farooq
-
నేనే మంత్రి.. నాదే పెత్తనం!
రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారం అండతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెచ్చిపోతున్నారు. నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫరూక్.. ఈ జిల్లాలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులు, మదర్సాలను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారిపై ఆస్తుల కబ్జా ఆరోపణలూ వస్తున్నాయి. వీరి చర్యలను సొంత పార్టీలోని ఓ మంత్రి, ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా మంత్రి, ఆయన కుమారుడు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెప్పినట్లు చేయని ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలు కర్నూలు పాతబస్తీ గడ్డా వీధిలో ‘అంజుమన్ ఈ షంషియా మదర్సా’కు 60 ఏళ్లకు పైగా ఉన్న కమిటీని మంత్రి తొలగించి, అన్ని నిబంధనలను ఉల్లంఘించి తన వారిని నియమించుకోవడం మైనార్టీల్లో కలకలం రేపింది. కర్నూలు తొలి మునిసిపల్ చైర్మన్ సలాం ఖాన్ ఈ మదర్సాకు ఆస్తులు రాసిచ్చారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులే చైర్మన్‌గా దానిని నడిపిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కమిటీని గౌరవించేవారు. ఈ కమిటీ కాలపరిమితి ఫిబ్రవరితో ముగిసింది. వక్ఫ్ బోర్డు సభ్యులే కమిటీని రెన్యువల్ చేయాల్సి ఉంది. అప్పట్లో వక్ఫ్ బోర్డు లేనందున, రెన్యువల్ జరగలేదు. ఇప్పటికీ, బోర్డు ఏర్పడలేదు. కమిటీ రెన్యువల్, కొత్త కమిటీని నియమించే అధికారం బోర్డు సీఈవోకు లేదు. అయినా మంత్రి ఆదేశాలతో ఈ నెల 8న ఐదుగురితో కొత్తగా కమిటీని నియమిస్తూ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సిఫార్సు చేయడం, అదే రోజు సీఈవో నియామకం ఉత్తర్వులు జారీ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. కొత్త అధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్ స్థానికుడు కాదు. నిబంధనల మేరకు స్థానికేతరుడికి కమిటీలో చోటే కల్పించకూడదు. కానీ ఏకంగా అధ్యక్షుడినే చేశారు. కూటమి ప్రభుత్వంలో మరో మంత్రి, టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా ఈ మదరసా విషయంలో జోక్యం చేసుకోవద్దని కొరినా, మంత్రి లెక్క చేయలేదని సమాచారం. ఈ మదరసాకు రూ.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, భూముల అద్దె, ఆదాయంపై పెత్తనం కోసమే కమిటీని మార్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సలాంఖాన్ వారసులు కోర్టులో సవాల్ చేసినట్లు సమాచారం. జీఏడీ, ఆర్థికశాఖను కాదని కార్పొరేషన్ ఉద్యోగి ప్రభుత్వంలో విలీనం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబిహా ఫరీ్వన్ను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేయడమూ విమర్శలకు దారితీసింది. సాధారణంగా కార్పొరేషన్ ఉద్యోగిని ప్రభుత్వంలో విలీనం చేయరు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే జీఏడీ, ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలి. కానీ జీఏడీ, ఆర్థికశాఖను బైపాస్ చేసి ప్రభుత్వం మంగళవారం జీవో 110 జారీ చేసింది. కార్పొరేషన్లో సరిపడినంత సిబ్బంది లేనందున ఆమెను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేసేందుకు నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ ఇచ్చేందుకు కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరాకరించింది. అయినప్పటికీ మంత్రి ఫరూక్ ఒత్తిడితో ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. పైగా నాన్ గెజిటెడ్ ఉద్యోగి అయిన సబియాను గెజిటెడ్ ర్యాంకులో నియమించడమూ నిబంధనలకు విరుద్ధమే. నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన స్థలం కబ్జా! నంద్యాలలో పద్మావతి నగర్ అత్యంత విలువైన ప్రాంతం. ఇక్కడ ఫరూక్ మేనత్తకు సర్వే నంబర్ 706–ఏ9లో 1.16 ఎకరాల స్థలం ఉంది. ఆమె వారసులు ఖతీఫ్ ఖాజా హుస్సేన్, నూర్ అహ్మద్ అందులో 28 సెంట్లు రామిశెట్టి వెంకటన్నకు, 30 సెంట్లు నిమ్మకాయల బాలనారాయణకు విక్రయించారు. ఇక్కడ సెంటు కోటి రూపాయల పైనే ఉంది. ఈ లెక్కన ఈ స్థలం విలువ రూ.58 కోట్లు చేస్తుంది. ఈ స్థలం పక్కనే సర్వే నంబర్ 700ఏలో మంత్రి ఫరూక్ స్థలం ఉంది. దీంతో పక్కనే బంధువులు విక్రయించిన ఆస్తిని కబ్జా చేసేందుకు యతి్నంచారు. ఈ స్థలంపై ఇరువర్గాలు కోర్టులను ఆశ్రయించాయి. అయితే ఎక్కడా ఫరూక్ తన ఆస్తి అని నిరూపించుకోలేకపోయారు. దీంతో తమ స్థలానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) నిర్ధారించాలని వెంకటన్న, బాలనారాయణ మునిసిపల్ అధికారులను కోరగా.. ఆర్వో వెంకటకృష్ణ, ఆర్ఐ గులాం హుస్సేన్ ఆ స్థలానికి రూ.55,980 ట్యాక్స్ నిర్ధారించారు. దీనిపై మంత్రి పీఏ అనిల్ ఈ నెల 20న మునిసిపల్ ఆఫీసుకు వెళ్లి వారితో ఎలా ట్యాక్స్ తీసుకుంటారంటూ బూతులతో విరుచుకుపడ్డారు. అదే రోజు ఆర్వో, ఆర్ఐని అధికారులు సస్పెండ్ చేశారు. మంత్రి అధికార బలంతోనే వారిని సస్పెండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కమిటీ తొలగింపు పై హైకోర్టులో కేసు వేశాం మా తాత సలాంఖాన్ కర్నూలు మునిసిపాలిటీ తొలి చైర్మన్. ఆయన మదరసా ఏర్పాటు చేశారు. దానికి మా పూరీ్వకులు ఆస్తులు ఇచ్చారు. తరాలుగా ఆస్తులను కాపాడుతున్నాం. ఒక్క రూపాయి మేం వాడుకోం. మదర్సాకు 60 ఏళ్లకుపైగా మా కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షుడిగా మా కుటుంబ సభ్యులే ఉండాలి. అధ్యక్షుడు నచ్చిన వారిని సభ్యులుగా నియమించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఒత్తిళ్లతో కమిటీని మార్చారు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం. – అల్తాఫ్‌ఖాన్, మాజీ అధ్యక్షులు, షంషియా మదర్సాఆ స్థలం మా పెద్దల నుంచి వచ్చింది నంద్యాల సర్వే నంబర్ 700ఏ7బీ, 709ఏ9లో 4.16 ఎకరాల భూమిని మేము కబ్జా చేయలేదు. ఆ స్థలం మా పెద్దల నుంచి సంక్రమించింది. ఎన్ఎండీ ఫరూక్ మేనత్త సారంబి వారసులు వారి వాటా ఆస్తిని వెంకటన్న, బాలనారాయణకు విక్రయించారు. ఆ సమయంలో హద్దులు మార్చి 2010లో రిజిస్టర్ చేయించారు.ఆ డాక్యుమెంట్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మొదట హద్దులు సవరించాలని.. ఆ పరిధి కోర్టుది కాదని తెలియజేస్తూ కోర్టు కేసును తిరస్కరించింది. ఇదే స్థలానికి చెందిన మరో కేసు సారంబి వారసులు, జైనబ్బి వారసుల మధ్య నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టులో నడుస్తోంది. – మంత్రి ఫరూక్ సోదరుడు ఎన్ఎండీ ఖుద్దూస్, కుమారుడు ఫిరోజ్ రూ.14 కోట్ల విలువైన పనులు నిలిపివేతనంద్యాలలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పీఎంజేకే) ద్వారా హాస్టల్, స్కూలు భవనాలతో పాటు 6 మేజర్ పనులు రూ.14 కోట్లతో జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఈ పనులు నిలిపివేయించారు. మంత్రితో మాట్లాడిన తర్వాతే తిరిగి మొదలెట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. షాదీఖానా కమిటీని రాజీనామా చేయించిన వైనం ఫరూక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నంద్యాలలో ఎన్టీఆర్ షాదీఖానా కమిటీని కూడా బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ పదవీ కాలం జూన్ 27తో ముగుస్తుందని చెప్పినప్పటికీ, జూన్ 20నే సభ్యులతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ షాదీఖానాను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రూ.కోటి నిధులతో ఆధునికీకరించారు. ఇప్పుడు తమ అస్మదీయులతో కమిటీ నియమించి షాదీఖానాను గుప్పిట్లో పెట్టుకోనున్నారు. -
అధికారమే అండ.. అక్రమాలే అజెండా
సాక్షి, నంద్యాల/నంద్యాల (సిటీ): అధికారమే అండగా న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ రెచి్చపోతున్నారు. కనిపించిన భూమిని హస్తగతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. సామాన్యులను వేధిస్తూ మాట వినని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. సుప్రీం కోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తీరు మారడం లేదు. నంద్యాల పద్మావతి నగర్‌లోని సర్వే నంబర్ 706–ఏ9లో 1.16 సెంట్ల భూమి ఉంది.ఇందులో 58 సెంట్లను రామిశెట్టి వెంకటన్న (28 సెంట్లు), నిమ్మకాయల బాలనారాయణ (30 సెంట్లు) ఖతీఫ్ ఖాజా హుస్సేన్, ఖతీఫ్ నూర్‌అహ్మద్ నుంచి 2010లో కొనుగోలు చేశారు. ఈ స్థలం పక్కనే సర్వే నంబర్ 700–ఏలో మంత్రి ఫరూక్‌కు స్థలం ఉంది. దీంతో పక్కనే ఉన్న స్థలంపై ఆయన కన్ను పడింది. స్థలాన్ని కబ్జా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. డాక్యుమెంట్స్ పక్కాగా ఉండటంతో కోర్టుల్లో దొంగ కేసులు వేసి బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. సర్వే రిపోర్టు బయటకు రాకుండా రిట్ మంత్రి వేధింపులు భరించలేక రామిశెట్టి వెంకటన్న, నారాయణ ఇద్దరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు సాగిన తర్వాత 2023లో బాధితులకు అనుకూలంగా తీర్పు వచి్చంది. ఆర్డర్ కాపీని స్థానిక కోర్టులో అందజేశారు. ఆ తర్వాత తమ స్థలాన్ని సర్వే చేయాలని కోరుతూ ఇద్దరు ప్రభుత్వానికి చలానాలు కట్టారు. ఇదే అంశంపై అదే ఏడాది జూలై 10న నంద్యాల కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. తమ స్థలాన్ని సర్వే చేసి తమకు అప్పగించాలని కోరారు.స్పందించిన అప్పటి కలెక్టర్ సెపె్టంబర్ 5న సిబ్బందితో సర్వే చేయించి నివేదికను సిద్ధం చేశారు. నివేదిక బాధితులకు అనుకూలంగా ఉందన్న విషయం తెలుసుకున్న ఫరూక్ హైకోర్టులో అధికారులపై ఆగమేఘాల మీద రిట్ పిటిషన్ వేశారు. తప్పుల తడకగా సర్వే చేశారని గొలుసుల ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా సర్వే చేయడంతో తప్పులు దొర్లినట్టు రిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సర్వే అంశం మాత్రమే కోర్టులో నడుస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. సుప్రీం తీర్పుతో ఖాళీ స్థలానికి పన్ను 706–ఏ9లో ఉన్న భూమి మంత్రి ఫరూక్, ఆయన బంధువులకు చెందినదిగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చడంతో బాధితులకు కొండంత భరోసా వచి్చంది. సుప్రీం తీర్పు కాపీని స్థానిక మున్సిపల్ కార్యాలయానికి కూడా పంపించారు. దీంతో ఇన్చార్జి ఆర్వో వెంకటకృష్ణ, ఆర్ఐ గులాం హుస్సేన్ సంబంధిత స్థలానికి రూ.55,980 వీఎల్టీ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) వేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పీఏ అనిల్ మంగళవారం మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి ఇద్దరు అధికారులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ మీ అంతు చూస్తామని బెదిరించారు. మంత్రి ఒత్తిడి మేరకు అదే రోజు రాత్రి ఎలాంటి విచారణ చేయకుండానే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.కౌన్సిల్ ఆమోదానికి చైర్‌పర్సన్‌పై ఒత్తిడి మునిసిపల్ పరిధిలోని ఆస్తి లేదా స్థలాలపై ఒకసారి పన్ను విధిస్తే దాన్ని రద్దు చేయాలంటే కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. దీంతో 706–9ఏపై విధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను కౌన్సిల్ ముందుంచి రద్దు చేయాలని మంత్రి అనుయాయులు మునిసిపల్ చైర్‌పర్సన్‌పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అధికారం తమ చేతిలోనే ఉందని.. తమకు అనుకూలంగా పని చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ స్థలం విలువ రూ.58 కోట్లపైనే..పట్టణ నడి»ొడ్డున గల ఈ స్థలం విలువ సెంటు రూ.కోటిపైనే పలుకుతోంది. రూ.58 కోట్లకు పైగా విలువ కలిగిన 58 సెంట్లను కొట్టేసేందుకు మంత్రి ఫరూక్ తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. మరోవైపు పట్టణంలో ఆయనకు చెందిన థియేటర్‌ను సెటిల్మెంట్లకు అడ్డాగా చేసుకున్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద భూములకు సెటిల్మెంట్ చేయడం, అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు, తన అనుచరులకు సంబంధించిన గొడవల సెటిల్మెంట్లు అన్నీ థియేటర్ నుంచే సాగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. -
చెప్పలేని మాటల్లో దుర్భాషలాడుతూ.. మంత్రి ఫరూక్ పీఏ వీరంగం
నంద్యాల, సాక్షి: ‘‘లం..కొడకల్లారా..మీకు కళ్లు కనపడవా..ఒక్కొక్కడికి ఉందిరా.. ఎవరి ఆస్తో తెలియకుండానే ట్యాక్స్ వేస్త్రారా’’ అంటూ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పీఏ అనిల్ నంద్యాల మునిసిపల్ అధికారులపై రెచ్చిపోయారు. నంద్యాలలోని మునిసిపల్ కార్యాలయానికి మంత్రి పీఏ అనిల్ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు. వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెంకట కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గులాం హుస్సేన్‌లను మునిసిపల్ చాంబర్‌కు పిలిపించారు. వారు చాంబర్లోకి అడుగుపెట్టగానే తాళం వేసి ఇష్టమొచ్చినట్లు తిట్టారు. గట్టిగా అరుస్తూ మీ అంతు తేలుస్తా.. ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బూతుపురాణం అందుకున్నారు. కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నంద్యాలలోని పద్మావతినగర్‌లో మంత్రి ఫరూక్‌కు చెందిన స్థలం ఉంది. దీనికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను మునిసిపల్ సిబ్బంది వేరొకరి పేరు మీద వేశారు. విషయం తెలుసుకున్న పీఏ అనిల్ రెచ్చిపోయారు. మునిసినల్ చాంబర్‌కు తాళాలు వేసి అధికారులను చెడామడా తిట్టారు. గంట సేపు అటువైపు ఎవ్వరినీ రానివ్వలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం మంత్రి పీఏ అనిల్ చేసిన రభసపై మునిసిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా..‘అదేదో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ. నాకు పూర్తిగా తెలియదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
కలహాలు.. కలవని నేతలు
సాక్షి, నంద్యాల: తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ప్రకటనతో నంద్యాలలో భగ్గుమన్న విబేధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరూ సర్దుకుపోవాలని సూచించినా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అలక వీడకపోవడంతో మాజీ మంత్రి ఫరూక్ వర్గంలో అయోమయం నెలకొంది. నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గతేడాది నవంబర్ వరకు ఉన్నారు. టికెట్ తనకే ఇస్తారన్న ఆశతో నాలుగున్నరేళ్ల పాటు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, ఆర్థికంగానూ నష్టపోయారు. అయితే కనీస సమాచారం ఇవ్వకుండా ఆయన స్థానంలో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కి ఇన్చార్జిగా టీడీపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి బ్రహ్మం వర్గం స్తబ్ధుగా ఉంటోంది. కొత్త ఇన్చార్జ్గా నియమితులైన ఫరూక్‌కు కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదు. అయినప్పటికీ చివరిలోపు టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో భూమా బ్రహ్మం ఉంటూ వచ్చారు. వ్యక్తిగతంగా కార్యక్రమాలకు హాజరవుతూ తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే భూమా బ్రహ్మానికి షాక్ ఇస్తూ టీడీపీ నంద్యాల అభ్యర్థిగా ఫరూక్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంతో ఖరారు చేయడంతో భూమా వర్గం ఒక్కసారిగా కంగుతింది. బాబు మాట బేఖాతర్.. నంద్యాల టికెట్ ఫరూక్‌కి ఇస్తున్నట్లు ప్రకటించడంతో భూమా బ్రహ్మం పది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేదు. దీంతో మూడు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి ఇద్దరు కలిసి పనిచేయాలని భూమా బ్రహ్మానికి సూచించారు. అయినా బ్రహ్మం అలక వీడలేదు. స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వకపోవడంతో కలిసి పనిచేస్తానని చెప్పలేదు. దీంతో మాజీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఫరూక్, భూమా బ్రహ్మాన్ని అనంతపురం పిలిపించుకుని మాట్లాడారు. అధికారంలోకి వస్తే తగిన పదవి ఇచ్చి గౌరవిస్తామని చెప్పారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడతో బ్రహ్మం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. లోకేశ్‌తో మాట్లాడిన అనంతరం ఎలాంటి ప్రకటన చేయకుండా నంద్యాలకు రాకుండా నేరుగా హైదరాబాద్‌కి వెళ్లిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భూమా, ఫరూక్ ఎడమొహం, పెడ మొహంగా ఉండటంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి వెంట నడవాలో లేక నాలుగున్నర్రేళ్ల పాటు తమకు అండగా ఉన్న నేత వెంట నడవాలో తెలియక డైలమాలో పడ్డారు. -
పోటీ చేద్దామా.. వద్దా?
సాక్షి, నంద్యాల: టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం నానుస్తుండడంతో నంద్యాలలో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడింది. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కే టికెట్ అని గతంలో చంద్రబాబు చెప్పినా ప్రస్తుత నాన్చుడు ధోరణితో ఆయన ముందుకు కదలడం లేదు. పైగా ఎన్నికల్లో పోటీ చేయాలా... వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఓడిపోయే సీటు నుంచి పోటీ చేసేందుకు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జే డైలమాలో ఉండడంతో కార్యకర్తలు తలోదిక్కు చూసుకుంటున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోట. 2017 ఉప ఎన్నికలో తప్ప ప్రతీసారీ వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ నుంచి ఈసారీ గెలవడం అసాధ్యమని ఫరూక్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ నుంచీ ఆశించినంత మద్దతు లేకపోవడంతో పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఫరూక్, బ్రహ్మానందరెడ్డి ఎడమొహం పెడమొహం మరోవైపు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ఎడమొహం పెడమొహంగా మెలుగుతున్నారు. టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా గతేడాది నవంబర్ 27న ఫరూక్ చార్జి తీసుకున్న నాటి నుంచి నేటి వరకు వీరిద్దరూ కలిసింది లేదు. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కలిసి మాట్లాడదామని ఫరూక్ అనేకసార్లు భూమా బ్రహ్మానందరెడ్డిని కోరినా ఫలితం లేకపోయింది. ఫరూక్ ముఖం చూసేందుకు కూడా భూమా ఇష్టపడడం లేదని చెబుతున్నారు. కేడర్ తన ఆధీనంలో ఉందని, టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని బ్రహ్మం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఈ మేరకు కొంతమంది నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ మద్దతు కోరుతున్నారు. కేడర్‌లో గందరగోళం ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం కొరవడడంతో కేడర్ గందరగోళంలో పడింది. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం దక్కడం కష్టం.. ఇక కలహాలతో గెలవడం అసాధ్యమన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పోటీ చేసేందుకు ఫరూక్ తటపటాయింపు, ఇద్దరు నేతల అనైక్యతతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధిష్టానం ఉంది. -
గోద్రా దోషికి బెయిల్
న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషి, యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఫరూఖ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అతడు గత 17 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడని, అందుకే బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఫరూఖ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులోని కొన్ని వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అతడి బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్లో ఆగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దుండుగులు నిప్పు పెట్టారు. ఎస్56 కోచ్ పూర్తిగా దహనమయ్యింది. అందులోని 59 మంది ప్రయాణికులు మరణించారు. రాళ్లు రువ్విన ఘటనలో ఫరూఖ్‌సహా కొందరు దోషులుగా తేలారు. -
ఎంపీ రఘురామపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు అయ్యింది. రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా రఘురామ, ఏ2 భరత్, ఏ3 సీఆర్పీఎఫ్ ఏఎస్సై, ఏ4 కానిస్టేబుల్ సందీప్, ఏ5 పీఏ శాస్త్రిని చేర్చారు. పోలీసుల ప్రకటన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషాపై ఎంపీ రఘురామ కృష్టంరాజు కుటుంబ సభ్యులు దాడిపై ఏపీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. రఘురామ కృష్ణం రాజు ఇంటి వద్ద ఎలాంటి పోలీసులను పెట్టలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్ ఐఎస్బీ గేట్ వద్ద స్పాటర్‌గా ఉన్నాడని తెలిపారు. కానిస్టేబుల్ ఫరూక్ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రఘురామ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఫరూక్ విధుల్లో ఉన్నాడని వెల్లడించారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉన్నాతాధికారులు సస్పెండ్ చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. నా కాళ్లు, చేతులు కట్టేయమని చెప్పాడు: పరూక్ నన్ను చంపటానికి వచ్చావా అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనపై దాడి చేశారని కానిస్టేబుల్ ఫరూక్ తెలిపారు. తన కాళ్లు, చేతులు కట్టేయమని తన మనుషులకు చెప్పినట్లు పేర్కొన్నారు. కరెంటు షాక్ ఇవ్వాలంటూ తన కుమారుడిని ఆదేశించారని అన్నారు. నా జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టారని తెలిపారు. ‘రఘురామ వెళ్లాక రంగంలోకి దిగిన ఆయన కుమారుడు భరత్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను రెచ్చగొట్టాడు.మా ఇంట్లో తింటూ, నెలనెలా మామూళ్లు తీసుకుంటూ వాడిని చిన్నగా కొడతారేంటంటూ మాట్లాడాడు.భరత్ హెచ్చరికతో పి.ఏ. శాస్త్రి, సీఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు మళ్లీ దాడికి దిగారు. చాలాసేపటి తర్వాత వచ్చిన పోలీసులు నన్ను రక్షించి గచ్చిబౌలి పీఎస్‌కు తీసుకెళ్లారు’ అని ఫరూక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్ చేశారు. కొందరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లతో వచ్చి నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లోనే ఉండటం గమనార్హం. -
Masarat Farooq: కశ్మీర్ లోయకు ట్యూషన్ చెబుతోంది
తుపాకుల మోతలు.. ఉగ్రవాదదాడులు ఇవి కశ్మీర్ అంటే గుర్తుకు వచ్చేది. కాని అక్కడి పిల్లలు చదువుకు చాలా విలువ ఇస్తారు. తరచూ స్కూళ్లకు వచ్చే ‘భయం సెలవులకు’ బాధ పడతారు. వారి భయం పోవాలంటే వాళ్ల ఇళ్లకే వెళ్లి ట్యూషన్ చెప్పాలి అని నిశ్చయించుకుంది మస్రత్ ఫారూక్. తానే ఒక ఎంట్రప్రెన్యూర్‌గా మారి, లోయ మొత్తం దాదాపు 100 మంది టీచర్లను ఉద్యోగంలోకి తీసుకుంది. వీళ్లు సాయంత్రమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ట్యూషన్ చెప్పాలి. మస్రత్ ఆలోచన పెద్ద హిట్ అయ్యింది. తాజాగా కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ ఆమెకు ‘కశ్మీర్ విద్యారంగంలో తొలి మహిళా ఎంట్రప్రెన్యూర్’గా గుర్తింపు ఇచ్చారు. 26 ఏళ్లు మస్రత్ ఫరూక్‌కు. కాని కాశ్మీర్‌లోయ అంత ముఖ్యంగా శ్రీనగర్ అంతా ఆమెను ‘మాస్టర్జీ’ అని పిలుస్తారు. నర్వారా నుంచి ఒక తండ్రి ఫోన్ చేస్తాడు.. ‘మాస్టర్జీ... మా అబ్బాయికి ట్యూషన్ కావాలి’... రేషి మొహల్లా నుంచి ఒక తల్లి ఫోన్ చేస్తుంది.. ‘మాస్టర్జీ... మా పిల్లలకు ట్యూషన్ కావాలి’... టాటా బ్రాండ్, బాటా బ్రాండ్‌లాగా నమ్మకానికి, ఫలితాలకు ఒక గ్యారంటీగా మస్రత్ ఒక బ్రాండ్ అయ్యింది ట్యూషన్లకు ఆ అందమైన లోయలో... కలతల నేలలో. పాఠాలు చెప్పడం ఇష్టం శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో పుట్టి పెరిగిన మస్రత్ పదో క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఇరుగు పొరుగు పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ‘నాకు పాఠాలు చెప్పడం ఇష్టం’ అంటుంది మస్రత్. ఇంటర్ చదువుతూ, డిగ్రీ చదువుతూ కూడా స్కూళ్లలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేసింది మస్రత్. క్లినికల్ సైకాలజీలో ఎం.ఎస్సీ చేసింది. అయితే 2019 అక్టోబర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో శ్రీనగర్‌లో స్కూళ్లు మూతపడ్డాయి. ఆ సమయంలో పిల్లలు చదువుకు అంతరాయం కలగడం గమనించింది మస్రత్. ఆ వెంటనే 2020లో ఫిబ్రవరి నుంచి కోవిడ్ ప్రతిబంధకాలు వచ్చాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినా ఆ క్లాసులు జరిగే సమయంలో పిల్లలు ఏ మాత్రం శ్రద్ధ పెట్టకపోవడం తన సొంత కజిన్స్ చదువు కుంటుపడటం కూడా గమనించింది. ఒక్కోసారి ఉగ్రవాద చర్యల వల్ల కూడా స్కూళ్లు సరిగ్గా నడవవు. బడి దగ్గర పిల్లలు అనే భావన కంటే పిల్లల దగ్గరకే బడి అనే భావన సరైనదని మస్రత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ముగ్గురు టీచర్లు... 20 మంది పిల్లలు విద్య గురు ముఖతా ఉండాలి... టీచర్ సమక్షం లో ఉంటూ టీచర్‌ను చూస్తూ నేర్చుకుంటే చదువు సరిగ్గా వస్తుందనేది మస్రత్‌కు తెలుసు. అందుకే స్కూల్ ఎలా నడిచినా హోమ్ ట్యూషన్లు పిల్లలకు మేలు చేస్తాయని భావించింది. తానొక్కతే అందరికీ చెప్పలేదు కనుక తన ఆధ్వర్యంలో పని చేసే టీమ్ ఉండాలనుకుంది. ఒక ముగ్గురు టీచర్లు దొరికితే 20 మంది పిల్లల ఖాతాలు దొరికితే చాలు అనుకుంది. ‘స్మార్ట్క్లాసెస్ హోమ్ ట్యూషన్స్’ పేరుతో సంస్థ ప్రారంభించి పత్రికల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చింది. చాలామంది అప్లికేషన్స్ పంపారు. కాని టీచింగ్‌కు ఎవరు పనికి వస్తారో కనిపెట్టడమే మస్రత్ విజయానికి కారణం. అలాంటి ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ట్యూషన్లు ఎవరికి చెప్పాలో తాను నిర్ణయించి పంపుతుంది. ఎంతమందికి చెప్తే ఆ మొత్తం నుంచి టీచరు, తాను షేర్ చేసుకుంటారు. అదీ ఒప్పందం. కాని వెంటనే స్పందన రాలేదు. కొన్ని రోజులకు రవూఫ్ అనే యూరాలజిస్ట్ తన పిల్లలకు ట్యూషన్ చెప్పమని కోరాడు. మస్రత్ టీచర్ని పంపింది. పిల్లలు చదువుకుంటున్న పద్ధతికి ఆ డాక్టరు చాలా ఆనందించాడు. ఊళ్లో తనకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ పదే పదే మస్రత్ టీమ్ గురించి చెప్పాడు. విద్యార్థులు పెరుగుతూ పోయారు. నేడు శ్రీనగర్ అంతా 200 మంది పిల్లలు మూలమూలన సాయంత్రమైతే దీపం వెలిగించి మస్రత్ పేరు తలుచుకుంటారు. ఎందుకంటే ట్యూషన్ మొదలయ్యేది అప్పుడే కదా. 80 మంది టీచర్లు మస్రత్ కింద పని చేస్తున్నారు. 50 వేల వరకూ జీతం మస్రత్ చెప్పడం ‘నా ట్యూషన్ల వల్ల 98 శాతం మార్కులు గ్యారంటీ’ అని. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ పిల్లలకు అలాగే మార్కులు వస్తున్నాయి. క్లాసును బట్టి ఫీజు నిర్ణయించడం వల్ల ఒక టీచరు చెప్పగలిగినన్ని ట్యూషన్లు చెప్పే స్వేచ్ఛ ఉండటం వల్ల తన దగ్గర పని చేస్తున్నవారిలో కొందరు నెలకు 50 వేలు (ఆమె వంతు షేర్ పోను) సంపాదిస్తున్నారని మస్రత్ చెప్పింది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్‌డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’ అంటుంది మస్రత్. ఆమె ఇప్పుడు శ్రీనగర్‌లో రెండు కంప్యూటర్ సెంటర్లు నడుపుతోంది. త్వరలో స్కూల్ తెరవాలని అనుకుంటోంది. ఆమె చొరవ వల్ల ఒక వైపు చదువు, మరో వైపు ఉపాధి కలుగుతుండటంతో శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ నిన్హా ఆమెను తాజాగా సత్కరించారు. అది మస్రత్‌కు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఆన్లైన్ ట్యూషన్లతో కొందరు సక్సెస్ అయ్యారు. నాకు ఆన్‌లైన్‌తో సంబంధమే లేదు. నా విధానం నేరుగా పిల్లలకు విద్యావిధానం’ అని చెబుతున్న మస్రత్ త్వరలో మరిన్ని విజయాలు సాధిస్తుంది. ఆమె సామర్థ్యం, ఆత్మవిశ్వాసం అలాంటిది. ‘నా దగ్గర పని చేస్తామని పిహెచ్‌డిలు చేసిన వారు పెద్ద చదువులు చదివిన వారు వస్తున్నారు. వీరికి ఇంత చిన్న పని ఇవ్వడం కష్టం. కాని వారంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ స్వశక్తితో ఏం చేయవచ్చో ఆలోచించాలి. నేను అలాగే చేశాను’. -
పెళ్ళిలో ఫుల్ జోష్‌గా కశ్మీర్ మాజీ సీఎం..
-
మంత్రి ఫరూక్‌కు నిరసన సెగ
సాక్షి, కర్నూలు : ఆత్మకూరులో షాదీఖానా నిర్మాణం కోసం చేపట్టిన భూమి పూజ కార్యక్రమం రసాభాసగా మారింది. భూమి పూజ చేసేందుకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్‌ను హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ అడ్డుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అహ్మద్ కుమారుడితో సహా పలువురు నిరసనకు దిగారు. ఫరూక్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మైనార్టీలను అణగదొక్కాలని చూస్తున్నారంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలే గానీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తించడం సరికాదంటూ మంత్రి ఫరూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్, బుడ్డా రాజశేఖరరెడ్డి, అహ్మద్ హుస్సేన్ తదితరులతో కలిసి షాదీఖానా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. -
ఏపీ కేబినెట్లోకి కొత్తగా ఇద్దరు మంత్రులు
-
ఏపీ కేబినెట్లో కొత్త ముఖాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కేబినెట్లో కొత్తగా మరో ఇద్దరు మంత్రులు చేరారు. కొత్త మంత్రులుగా ఎన్ఎమ్డీ ఫరూక్, కిడారి శ్రవణ్ కుమార్‌లు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాస ప్రజావేదికలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. ఫరూక్ తెలుగులో, శ్రవణ్ కుమార్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిద్దరికి శాఖలను కేటాయించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్‌కు వైద్య, ఆరోగ్యశాఖ, మైనార్టీ వెల్ఫేర్ శాఖలను, విశాఖపట్నం జిల్లాకు చెందిన కిడారి శ్రవణ్ కుమార్‌కు గిరిజన సంక్షేమశాఖను కేటాయించారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రులు, పార్టీనేతలు తదితరులు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన కుమారుడు శ్రవణ్‌కుమార్‌కు కేబినెట్లో చోటు కల్పించారు. దాంతో శ్రవణ్‌కుమార్ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందినట్లయ్యింది. -
ఛూ ‘మంత్రి ఖాళీ’!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాజా మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపించారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న షరీఫ్‌కు మైనారిటీ కోటాలో చాలా కాలంగా మంత్రి పదవి ఇస్తామని ఊరిస్తూ వచ్చారు. చివరికి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయనను పక్కన పెట్టి రాయలసీమకు చెందిన వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎస్టీ కోటాలో పోలవరం నుంచి మొడియం శ్రీనివాస్ ఒక్కరే అధికార పార్టీ నుంచి గెలుపొందారు. అయితే గత నాలుగేళ్లలో ఎస్టీల నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. గత విస్తరణలో మొడియంకు మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది దక్కలేదు. తాజాగా వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని మావోల చేతిలో చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించడంపైజిల్లా నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. షరీఫ్‌కు మరో‘సారీ’..! జిల్లాకు చెందిన మహ్మద్ అహ్మద్ షరీఫ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి మొండిచెయ్యి చూపించారు. చివరిసారిగా జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించడం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ, పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న షరీఫ్‌కు మంత్రివర్గంలో స్థానం ఇక దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. మైనార్టీ వర్గం నుంచి షరీఫ్‌కు బెర్త్ ఖాయం చేస్తారని మూడేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మూడేళ్ల కాలంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన ప్రతిసారీ షరీఫ్‌కు మంత్రి పదవి ఖాయం అని పార్టీ అధిష్టానం, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు ఊరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో తనపై ఖచ్చితంగా చంద్రబాబు కరుణ చూపిస్తారని షరీఫ్ కూడా ఆశగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి షరీఫ్ పార్టీకి పలు రూపాల్లో సేవలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే పార్టీలో చేరిన వ్యక్తి షరీఫ్. 1982లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటన చేయగానే, నరసాపురంలో 11 మందితో పార్టీలో చేరారు. కొత్తపల్లి లాంటి వారూ షరీఫ్ తరువాత వచ్చినవారే. 1990–97 మధ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత 1997 నుంచి 2000 సంవత్సరం వరకూ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా, 2002లో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. 2011లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. గుంటూరులో టీడీపీ అట్టహాసంగా మైనార్టీ సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో అయితే అదే వేదికపై షరీఫ్‌కు మంత్రి పదవిని చంద్రబాబు ప్రకటిస్తారని ప్రచారం సాగింది. షరీఫ్ వైఖరిలో మార్పు మంత్రి పదవి ఊహాగానాలు రాగానే షరీఫ్ కూడా తమ అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ప్రతిపక్షంపై వివాదాస్పదమైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సౌమ్యుడిగా పేరున్న షరీఫ్ వైఖరిలో మార్పు రావడం అప్పటిలో పెద్ద చర్చనీయాంశమైంది. పదవి కోసం పడుతున్న తంటాలుగా షరీఫ్ కొత్త వైఖరిని రాజకీయవర్గాలు విశ్లేషించాయి. కానీ అవేమీ చంద్రబాబును ఆకర్షించలేదు. పార్టీకి వీరవిధేయుడైనా మైనార్టీ కార్డు కూడా చంద్రబాబుకు కనిపించలేదు. మొత్తంగా షరీఫ్‌కు ఇక ఛాన్స్ లేదని తేలిపోవడంతో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి శాసనమండలి చైర్మన్ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రి పదవిని ఆశించిన మాట వాస్తవమేనని, మండలి చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. పదవి కావాలని చంద్రబాబును తాను ఎప్పుడూ అడగలేదని పేర్కొన్నారు. ఎస్టీల నుంచి ఏకైక అధికారపార్టీ ఎమ్మెల్యే అయినా.. మరోవైపు రాష్ట్రంలోనే ఎస్టీల నుంచి గెలిచిన ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన మొడియం శ్రీనివాస్‌కు కూడా మంత్రి పదవి చేతిదాకా వచ్చి చేజారిపోయింది. గత మంత్రివర్గ విస్తరణ సమయంలో ముందురోజు సాయంత్రం మంత్రివర్గంలో బెర్త్ ఖరారు అయ్యింది. అర్జెంట్‌గా వచ్చి ముఖ్యమంత్రిని కలవాలని పేషీ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన బయలుదేరి వెళ్లారు. ఈలోగానే సమీకరణాలు మారి బీసీ కోటాలో జిల్లా నుంచి పితాని సత్యనారాయణకు పదవి దక్కింది. ఈసారి అసలు ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంతో మొడియం అసంతృప్తికి గురైనట్లు సమాచారం. -
శాసన మండలి చైర్మన్ ఫరూక్ రాజీనామా
సాక్షి, అమరావతి : ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు మైనారిటీలపై ప్రేమ పుట్టుకొస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ వర్గం నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ ఫరూక్‌కు మైనారీటీల తరఫున మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. దీంతో ఆయన శాసన మండలి చైర్మన్ పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆదివారం ఉయదం ఫరూక్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ షరీఫ్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మైనారిటీ, ఎస్టీలను ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు దగ్గరపడిన సమయంలో వారిని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోనుండటం గమనార్హం. ఎన్నికలకు ముందు ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు చంద్రబాబు ఈమేరకు జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని, ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల ప్రచారం కోసమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
షాక్ : దావూద్ అనుచరుడికి వీవీఐపీ ట్రీట్మెంట్!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ కు వీఐపీ ట్రీట్మెంట్ అందిన విషయం కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అతనికి పలువురు ప్రతినిధులు, అధికారులు సహకరించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫరూక్ పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 2011 ఫిబ్రవరి 7న ఫరూక్ తక్లా తన పాస్ పోర్ట్ రెన్యువల్‌కు దరఖాస్తున్నాడు. అయితే కేవలం 24 గంటల్లోనే దానిని అధికారులు పూర్తి చేశారంట. పైగా ఇందుకోసం ఓ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ముంబై పాస్‌పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చాడని ఆ కథనం సారాంశం. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణను, పి చిదంబరాన్ని ఈ వ్యవహారంపై బీజేపీ వివరణ కోరిందట. అయితే యూపీఏ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. కాగా, ముంబై పేలుళ్ల నిందితుడు అయిన యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1993లో పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్‌లో క్రియాశీలక ఏజెంట్‌గా ఎదిగాడు. తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై భారత్‌లో అతనిపై కేసులు నమోదయ్యాయి. 1995 లోనే ఇంటర్‌పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
దావూద్ అనుచరుడు ఫరూక్ అరెస్టు
న్యూఢిల్లీ: అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ తక్లా(57)ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతడు గురువారం దుబాయ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత ముంబై తరలించి బాంబు పేలుళ్ల కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడిని మార్చి 19 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. నిఘా వర్గాల ప్రయత్నాల ఫలితంగానే యూఏఈ ఫరూక్‌ను భారత్‌కు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబై బాంబు పేలుళ్లకు పాల్పడి దేశం నుంచి పరారయిన నిందితులకు ఫరూక్ సహాయకారిగా దోహదపడ్డాడు. -
ఏపీ శాసనమండలి చైర్మన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి ఫరూఖ్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ హోదాలో ఉన్న తన కాన్వాయ్‌ను ఆపడంపై మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి కార్లు పంపిణీ చేస్తున్న సమయంలో మండలి చైర్మన్ కాన్వాయ్ రావడంతో పోలీసులు ఆపారు. వేరే మార్గం గుండా అసెంబ్లీ లోపలికి వెళ్ళాలని చెప్పారు. పోలీసులు తీరుతో ఆగ్రహానికి గురైన ఫరూఖ్ చీఫ్ మార్షల్స్‌ను వివరణ కోరారు. -
శాసనమండలి చైర్మన్‌గా ఫరూక్
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్‌గా ఎన్ఎండీ ఫరూక్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఫరూక్‌కు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. ఫరూక్‌ను శాసనమండలి నేత యనమల రామకృష్ణ, బీజేపీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చైర్మన్ పీఠం వద్దకు తీసుకెళ్లగా ఆయన భాద్యతలు చేపట్టారు. కాగా మండలి చైర్మన్‌గా ఫరూఖ్‌కు అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ఆయనకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హమీ మేరకు ఫరూఖ్‌ను మండలి చైర్మన్‌గా నియమించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూఖ్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. శాసన సభలో ఇప్పటికే నలుగురు ఉన్న విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. శాసనసభలో చీఫ్ విప్‌గా పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్‌లను నియమించారు. అలాగే శాసనసభలో విప్‌లుగా ఎమ్మెల్యేలు గణబాబు, సర్వేశ్వరరావులను, శాసనమండలి విప్‌లుగా బుద్దా వెంకన్న, డొక్కా మాణిక్య వరప్రసాద్, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌లను నియమించారు. -
సంతకాలు చేయించుకొని.. రూ.60 లక్షలు స్వాహా
సాక్షి, హైదరాబాద్: రుణంపై వడ్డీ అస్సలే లేదు... వాయిదాలు సైతం ఏడాది తర్వాత నుంచి చెల్లించవచ్చు... అంటూ వచ్చిన ఫోన్ కాల్ ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని నిండా ముంచింది. ఆయన పదవీ విరమణకు సంబంధించిన బెనిఫిట్స్‌తో పాటు అమెరికా లో ఉన్న కుమారుడు సంపాదించిందీ సైబర్ నేరగాళ్ల పరం చేశారు. దీనిపై నారాయణగూడ ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం మంగళవారం సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయింది. ఇంటికే వచ్చి సంతకాలు చేయించుకుని... హైదరాబాద్ నారాయణగూడ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్ అబ్దుల్ ఫారూఖ్‌కు 2014లో.. ఎలాంటి వడ్డీ లేకుండా రూ.20 లక్షలు రుణం ఇస్తామంటూ ఓ ఫోన్‌కాల్ వచ్చింది. దీని వాయిదాలు సైతం ఏడాది తర్వాత నుంచి చెల్లించవచ్చని మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం అని చెప్పడంతో ఆశపడిన ఫారూఖ్ తనకు రుణం కావాలని చెప్పాడు. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.లక్ష చెల్లించమంటూ బ్యాంకు ఖాతాలో నేరగాళ్లు డిపాజిట్ చేయించుకున్నారు. రుణం హెచ్డీఎఫ్సీ బ్యాంకు మంజూరు చేస్తోందని, ఫారూఖ్ ఇంటికి వచ్చి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. వెళ్తూవెళ్తూ మరో రూ.లక్ష పట్టుకెళ్లారు. ప్రధాని మోదీ పేరు చెప్పి మరోసారి... ఇలా ఫారూఖ్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.3.4 లక్షలు స్వాహా చేసిన తర్వాత కొన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఆపై ఫారూఖ్‌కు ఫోన్ చేసిన అదే ముఠాకు చెందిన వ్యక్తి తాను ఫైనాన్షియల్ ఫ్రాడ్ విభాగం నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం మీరు సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.3.4 లక్షలు నష్టపోయారని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలా మోసపోయిన వారి డబ్బు తిరిగి ఇప్పిం చడానికి ప్రధాని మోదీ ఓ కొత్త పథకం ప్రారం భించారంటూ ఎర వేశారు. అలా చేయడానికి ప్రాసెసింగ్ చార్జీలు, యూనియన్ బ్యాంక్‌లో కొత్త ఖాతా తెరవాలని, ఇతర పన్నుల పేర్లు చెప్పి దాదాపు ఏడాది పాటు (2016 డిసెంబర్ వరకు) రూ.58.6 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడు పదవీ విరమణ తర్వాత తనకు వచ్చిన బెనిఫిట్స్‌తో పాటు అమెరికాలో ఉన్న కుమారుడు నెలనెలా పంపిస్తున్న సంపాదన సైతం సైబర్ నేరగాళ్ల పరం చేశాడు. కుమారుడు ఇల్లు కొందామనుకోగా... తాను మోసపోయానని తెలిసినప్పటికీ... పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేశాడు. ఈ ఏడాది జూలైలో అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు నగరానికి తిరిగి వచ్చాడు. ఇన్నాళ్లు తాను పంపిన డబ్బుతో ఇల్లు కొందామని భావించాడు. ఈ నేపథ్యంలో అసలు విషయం ఫారూఖ్ బయటపెట్టాడు. దీంతో కుమారుడి ఒత్తిడి మేరకు ఫారూఖ్ నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సైబర్ నేరం కావడంతో దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయడంతో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. ఆ ఖాతాల్లో ఉంది రూ.1,100 మాత్రమే... ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫారూఖ్ డబ్బు డిపాజిట్ చేసిన మూడు బ్యాంకు ఖాతాలపై దృష్టిపెట్టారు. ఢిల్లీ, ఘజియాబాద్‌ల్లో ఉన్న వీటిని ఫ్రీజ్ చేయిస్తే బాధితుడికి కొంత మొత్తమైనా దక్కుతుందని భావించారు. బ్యాంకు అధికారులకు లేఖ రాసిన పోలీసులు ఆ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. అయితే ఆ ఖాతాల్లో రూ.1,100 మాత్రమే ఉన్నాయని తేలింది. దుండగుడు వినియోగించిన సిమ్‌కార్డులన్నీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవిగా స్పష్టమైంది. ఓ నంబర్ మాత్రం కొన్నాళ్ల పాటు కూకట్పల్లి సమీపంలోని ఆల్విన్‌కాలనీలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫారూఖ్ వద్ద సంతకాలకు వచ్చిన సైబర్ నేరగాళ్లు అక్కడే ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. -
ఎమ్మెల్సీలుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్
సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీలు)గా నియమితులైన రామసుబ్బారెడ్డి(వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు), ఎన్ఎండీ ఫరూక్(కర్నూలు జిల్లా నంద్యాల)లతో మండలి ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం బుధవారం ప్రమాణం చేయించారు. అనంతరం ఫరూక్ మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో టీడీపీ గెలుపు కోసం ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలోనే ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్, రామసుబ్బారెడ్డిలను నామినేట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, ఆర్.రెడ్డప్పరెడ్డిల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో ఫరూక్, సుబ్బారెడ్డిలు నామినేట్ అయ్యారు. -
గవర్నర్ కోటాలో రామసుబ్బారెడ్డి, ఫరూక్
ఏపీ ఎమ్మెల్సీలుగా నియామకం సాక్షి, అమరావతి: గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా పి.రామసుబ్బా రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన ఎ.చక్రపాణి, ఆర్.రెడ్డెప్పరెడ్డిల పదవీ కాలం ఈ ఏడాది మే 27వ తేదీతో ముగిసింది. వారి స్థానంలో అధికార పార్టీ సూచన మేరకు వీరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. -
ఉందామా..పోదామా!
– ఎమ్మెల్సీ ఇవ్వనందుకు ఫరూక్ అసంతృప్తి – టీడీపీని వీడాలని అనుచరుల ఒత్తిడి – త్వరలో కార్యకర్తల సమావేశం నంద్యాల: ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందున టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అసంతృప్తికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న తనను పట్టించుకోకుండా.. జూనియర్లకు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తూ.. తనను పార్టీ అధిష్టానం అవమానించిందని ఆయన ఆవేదన చెందారు. సోమవారం స్థానిక రాజ్ థియేటర్లోని తన కార్యాలయంలో పార్టీ నాయకుల వద్ద తన బాధను వ్యక్త పరిచారు. దీంతో పలువురు టీడీపీ నాయకులు భావోద్వేగానికి గురై.. పార్టీని వీడాలని సూచించారు. ఈ విషయమై త్వరలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుమారుడు ఎన్ఎండీ ఫిరోజ్ భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీలో మైనార్టీ నేతగా ఉన్న ఫరూక్ గతంలో రెండుసార్లు మంత్రిగా, శాసన సభ ఉపసభాపతిగా పని చేశారు. రాజకీయంగా ఆయనకు 2004 నుంచి తిరోగమనం మొదలైంది. శాసన సభకు 2004లో, పార్లమెంట్ స్థానానికి 2009, 2014లో పోటీ చేసి ఓడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో మైనార్టీ ఎమ్మెల్యే ఎవరూ లేకపోవడంతో సీనియర్ నేత ఫరూక్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి రావచ్చునని ప్రచారం జరిగింది. అయితే చివరకు నిరాశే ఎదురైంది. కొరవడిన సహకారం.. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని ఫరూక్ తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీలో తానే సీనియర్ మైనార్టీ నేతనని, తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కోరారు. తర్వాత పార్టీలో సమకాలీకులైన పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి యనమల రామకృష్ణుడులను కలిసి సహకారాన్ని కోరారు. కాని సీఎం చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారు. -
ఐసిస్, పాకిస్తాన్ నినాదాలతో కాశ్మీర్లో ఉద్రిక్తత
శ్రీనగర్ః కాశ్మీర్ లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ కాలనీకి వ్యతిరేకంగా యాసిస్ మాలిక్ ఆధ్వర్యంలోని వేర్పాటువాదులు ఐసిస్, పాకిస్థాన్ జెండాలను ఎగురవేసి ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తంగా మారింది. కాశ్మీర్లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి, సాధారణ ప్రజలనుంచి విడిగా వారికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు వారికోసం కాలనీలు కట్టించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వేర్పాటు వాదులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో మిర్వైజ్ ఉమా ఫరూఖ్ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్ లోని కాశ్మీరీ పండిట్లు, సైనిక కాలనీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాశ్మీర్లో వేర్పాటు వాదులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రత్యేక కాలనీలు ఏర్పడితే తమ పట్టు సడలిపోతుందన్న భావనలో ప్రజల్లో విద్వేషాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలు నిర్మించడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కాలనీలకు వ్యతిరేకంగా, భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్, ఐసిస్ లకు అనుకూలంగా జెండాలను ఊపుతూ, జీవ్ జీవ్ పాకిస్తాన్ అన్న నినాదాలతో నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ళు రువ్వారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలను వారిపై ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాలనీల నిర్మాణానికి కావలసిన భూమిలేదంటూ పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ భారతీయ జనతాపార్టీ సైనిక, పండిట్ కాలనీల ఏర్పాటును సమర్థించడం స్థానికంగా ఆందోళనకు దారి తీసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూడ కాలనీల ఏర్పాటుకోసం శ్రీనరగ్ పుల్వామా, బడ్గమ్ జిల్లాల్లో భూమి అందుబాటులో లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. సైనిక కాలనీకోసం భూమి లేనప్పుడు కాలనీల ఏర్పాటు విషయాన్ని ఎలా అంగీకరిస్తారంటూ ప్రశ్నించారు.