gang of thieves
-
3 నగరాలు 4 దేశాలు
సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే ఒకటీ రెండు రోజులు బాధపడతాం. కాస్త విలువైన ఫోన్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దొరికితే దొరుకుతుంది లేదా కొద్దిరోజుల తర్వాత మర్చిపోతాం. కానీ ఈ సెల్ఫోన్ల చోరీ వెనుక పెద్ద వ్యవస్థీకృత దందా దాగి ఉందంటే మాత్రం విస్తుపోక తప్పదు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో దొంగల ముఠాల ద్వారా చోరీ అవుతున్న సెల్ఫోన్లు సీ ఫుడ్ ముసుగులో ఏకంగా దేశం దాటేస్తు న్నాయి. ప్రధానంగా మూడు నగరాల మీదుగా నాలుగు దేశాలకు తరలిపోతున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో స్థానికుల నుంచి విదేశీయుల వరకు ఉంటున్నారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా చోరీ ఫోన్ల ఫొటోలు షేర్ చేసుకుని, క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఓడ రేవుల్లో కార్యకలాపాలు సాగించే వారితో పాటు ఆయా దేశాల సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ మొత్తం దందా మూడు దశల్లో కొనసాగుతోంది. తొలుత దొంగల నుంచి స్థానిక వ్యాపారుల వద్దకు చేరుతున్న సెల్ఫోన్లు, అక్కడి నుంచి మెట్రో నగరాలకు చేరుకుని ఆ తర్వాత దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఫస్ట్ స్టేజ్..⇒ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు కలిసి ముఠాలుగా ఏర్పడుతున్నారు. బస్సుల్లో, బస్టాపులు, వైన్ షాపులు, బహి రంగ సభలు జరిగే చోట్ల, ఇతర రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగిలిస్తున్నారు. ఈ చోరీ ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలోని కొందరు వ్యాపారులకు విక్రయి స్తున్నారు.ఈ ఫోన్లు అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు టెక్నీషియన్లు పని చేస్తుంటారు. వీళ్లు చోరీ ఫోన్లు అన్‌లాక్ చేయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపరింగ్ చేస్తారు. నగరంలో చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న వ్యాపారులు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ‘హోల్‌సేల్ వ్యాపారులకు’ కలిపి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఇక్కడ ఫోన్లు కొంటున్న వ్యాపారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఫోన్ల ఫొటోలను వాటిల్లో పోస్టు చేస్తున్నారు.థర్డ్ స్టేజ్..⇒ చోరీ సెల్ఫోన్లు సూడాన్, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లకు ఎక్కువగా వెళ్తు న్నాయి. విదేశీ వ్యాపారులు ఎంపిక చేసు కున్న సెల్ఫోన్లను ఇక్కడి వ్యాపారులు ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేస్తున్నారు. ఐదేసి ఫోన్లు చొప్పున తొలుత ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో పార్శిల్ చేస్తున్నారు. తర్వాత ఇలాంటి 20 నుంచి 25 బాక్సులను థర్మా కోల్ పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. సీ ఫుడ్‌గా చెబుతూ ఓడ రేవుల ద్వారా సూడాన్, శ్రీలంక దేశాలకు పంపిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు మాత్రం థర్మాకోల్ పెట్టె ల్లోనే పార్శిల్ చేసి సరిహద్దు గ్రామాలకు చెందిన వారి ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు.రెండు వైపులా ఉండే సరిహద్దు గ్రామాలకు చెందిన కమీషన్ ఏజెంట్లు ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారు. కోల్‌కతా నుంచి తమ వద్దకు వస్తున్న ఫోన్లను ఆవలి వైపు ఉన్న వారికి చేరవేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. దీనికోసం సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. వీరికి ఒక్కో ఫోన్‌కు దాని మోడల్ ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు కమీషన్‌గా లభిస్తోంది. సీ ఫుడ్ పేరుతో వెళ్తున్న థర్మాకోల్ బాక్సుల్ని తనిఖీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తు న్నారా? లేక స్మగ్లర్లతో మిలాఖత్ అయ్యారా? తేలాల్సి ఉందని నగర పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేయాల్సి ఉంటుందని, ఇప్పటివరకు తాము పట్టుకున్న ముఠాల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను ఆయా ఏజెన్సీలకు పంపిస్తామని పేర్కొంటున్నారు.సెకండ్ స్టేజ్..⇒ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఇతర నగరాలకు చెందిన వ్యాపారులు తమకు నచ్చిన, అవసరమైన సెల్ఫోన్లను ఆ ఫొటోల ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు. బేరసారాల తర్వాత ఇక్కడి వ్యాపారులు అక్కడి వారు కోరిన వాటిని పార్శిల్ చేసి తమ మనుషులకు ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని వ్యాపారుల వద్దకు చోరీ సెల్ఫోన్లు చేరుతున్నాయి. సూడాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఉన్న వ్యాపారులు, ఈ నగరాల్లోని వ్యాపారులకు ఉమ్మడి వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. వాటిలో పోస్టు అవుతున్న ఫొటోల ఆధారంగా విదేశీ వ్యాపారులు ఫోన్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు.వరుస అరెస్టులతో అదుపులోకి చోరీలు⇒ నగరంలో సెల్‌ఫోన్ చోరీలు పెరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఫోన్ల కోసం దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు హత్యలూ జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక అదేశాలు జారీ చేశారు. నగరంలో వ్యవస్థీకృతంగా సాగుతున్న సెల్‌ఫోన్ చోరీలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు ముఠాలను పట్టుకున్నారు.మే ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా«ధీనం చేసుకున్నారు. గత నెల మొదటి వారంలో ముగ్గురిని పట్టుకుని 43 సెల్ఫోన్లు సీజ్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల 31 మందిని అరెస్టు చేసి 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ వరుస అరెస్టులతో నగరంలో సెల్‌ఫోన్ చోరీలు అదుపులోకి వచ్చాయి. దీంతోనీ వ్యవస్థీకృత ముఠాల వెనుక ఉన్న వారిని గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ దిశగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
దొంగల ముఠా.. దోచేయడంలో కన్ఫ్యూజ్ చేసి..!
ముంబై: మహారాష్ట్రలోని ఓ దొంగల ముఠా బస్పులు, రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోచేస్తోంది. ఈ బ్యాగ్ స్నాచర్ల ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని మహేంద్ర మోరే (45), మనోజ్ మేధే (33), అమిన్ షేక్ (49), శశికాంత్ కొల్వాల్కర్ (63), విజయ్‌కుమార్ గుప్తా (38), మనీష్ దర్జీ (34), శైతాన్సింగ్ రాజ్‌పుత్ (38) గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 19న, ముంబైలోని రద్దీగా ఉండే బస్సులో ఓ నగల వ్యాపారి ఉద్యోగి నుంచి రూ.46.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అయితే అతను చుటుపక్కల వారిని అప్రమత్తం చేయడానికి ప్రత్నించడంతో.. ఆ ముఠాలోని మరికొందరు అతడిని కలవరపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన సబర్బన్ అంధేరీ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. నిందితుల్లో కొంతమందిని గుర్తించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. వారిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో పట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ముఠాను గుర్తించడానికి ఓ పోలీసు బృందం రాజస్థాన్‌లో కూడా పర్యటించిందని అధికారి తెలిపారు. కాగా నిందితుల్లో ఆరుగురు ముంబైకి చెందినవారు కాగా, ఒకరు రాజస్థాన్‌కు చెందిన వారు అని ఆయన చెప్పారు. వారి నుంచి రూ.24.28 లక్షల విలువైన 475 గ్రాముల బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ (జోన్ 10) మహేశ్వర్ రెడ్డి అన్నారు. -
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
మహిళల వేషంలో హైవేపై దోపిడీలు దొరవారిసత్రం (సూళ్లూరుపేట) : జల్సాలకు అలవాటు పడిన ఆరుగురు యువకులు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను ఆదివారం దొరివారిసత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పొలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఇన్చార్జ్ గూడూరు డీఎస్పీ కే శ్రీనివాసాచారి విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి శ్రీరామ్, నెల్లూరులోని బోడిగాడుతోట ప్రాంతానికి చెందిన నాగుల అజయ్, ముత్తుకూరుకు చెందిన డేగా శీనయ్య, సోగా వెంకటేశ్వర్లు, నెల్లూరు వెంకటేశపురానికి చెందిన సోగా వినోద్, శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి వెంకటేష్ దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి తదితర మండల ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో లారీ డ్రైవర్లను దోచుకుంటున్నారు. వీరిలో శ్రీరామ్ మహిళ వేషంలో రహదారిపై నిలిచి లారీడ్రైవర్లు, క్లీనర్లను ఆకర్షిస్తుంటాడు. వీరిని పొదల్లోకి తీసుకెళ్లగా, అక్కడే ఉన్న మిగతా ఐదుగురు కలసి వారిని కొట్టి వారి వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. దోపిడీ దొంగల వ్యవహారంపై దొరవారిసత్రం ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, పోలీస్ సిబ్బంది శుక్రవారం రాత్రి నిఘా ఉంచారు. ఈ క్రమంలో దోపిడీ మఠా చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్లే రెండు లారీల డ్రైవర్లను ఇలాగే ఆకర్షించి గుమ్మిడిపూండి జోసెఫ్, జమ్మల రంగారావుపై ఆరుగురు దాడి చేసి వారి వద్ద నుంచి రూ.13 వేల నగదు దోచుకున్నారు. దుండగులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించారు. వెంకటగిరి శ్రీరామ్ నేర చరిత్ర కలిగిన యువకుడు. ఇతనిపై నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు కూడా ఉన్నాయి. బాధిత డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు రివార్డులు హైవే దోపిడీ ముఠాతో ఈ ప్రాంతంలో వాహనదారుల గత కొన్ని రోజులుగా హడలిపోయారు.దొరవారిసత్రం ఎస్సై, పోలీసులు పగడ్బందీగా హైవే ముఠా పట్టుకునేందుకు కృషి చేయడంపై జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ పోలీసులను అభినందించారు. హెచ్‌సీలు రాఘవ, వెంకటయ్య, పీసీలు సునీల్, బాబ్జి, కిషన్, వెంకటేశ్వర్లు, హెచ్‌జీ షాహుల్, డ్రైవర్ నరేష్‌కు డీఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. విలేకరుల సమావేశంలో నాయుడుపేట సీఐ రత్తయ్య, ఎస్ఐ రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ములకలచెరువు: అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాడులకు ఉపయోగించిన కర్రలు, ఇనుప రాడ్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ రుషికేశవ్ మంగళవారం తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 5 వ తేదీన మండలంలోని వేపూరికోట పంచాయతీ ఆవులవారిపల్లి క్రాస్ వద్ద అనంతపురం జిల్లాకు చెందిన ఈచర్ వాహనం డ్రైవర్ రామక్రిష్ణ(32)పై దోపిడీ ముఠా కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి రూ.23 వేలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాధు మేరకు పోలీసులు కేసునమోదు చేసి ధర్యాప్తు చేపట్టిన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దోపిడీ దొంగలు పెద్దపాళ్యం మీదుగా కదిరి వెళ్తున్నట్లు సీఐ రుషికేశవ్‌కు సమాచారం అందడంతో తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. తొమ్మిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఒక మహిళ ఉంది. వీరంతా కర్ణాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన వారు. జే.మల్లికార్జున(33), సుబ్రమణ్యం(22), ఎం.సతీష్(26), ఎస్.హసీనా(25), కే.నాని(24), ఎన్.మంజునాథ్(30), ఎన్.గంగాధర్(25), ఏ,నరేష్(22), ఆర్.సురేష్(22)లను అరెస్టు చేశారు. మహిళను అడ్డుపెట్టుకొని దాడులు: మహిళను అడ్డంపెట్టుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. రాత్రి సమయాల్లో వాహనాలను మహిళ సహాయంతో టార్చ్ లైట్ వేసి ఆపి, డ్రైవర్‌తో వ్యభిచారానికి భేరం కుదుర్చుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ముఠా సభ్యులతో దాడులు నిర్వహించి దోపిడీ చేస్తున్నారు. వీరు అనంతపురం, కదిరి తదితర ప్రాంతాల్లో సుమారుగా 30 చోట్ల దాడులు చేశారు. కానీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాధు అందలేదు. రెండు ద్విచక్రవాహనాలు, కారు స్వాధీనం: ముఠా సభ్యులు దాడులకు పాల్పడటానికి ఉపయోగించిన రెండు ద్విచక్రవాహనాలు, ఒక ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా రెండు టార్చ్లైట్లు, తొమ్మిది సెల్‌ఫోన్స్, ఆరు కర్రలు, మూడు ఇనుపరాడ్లను, రూ.1100 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలు: ముఠా సభ్యుల సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారిజామున పెద్దపాళ్యం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మదనపల్లి వైపు నుంచి కదిరి వైపుకు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు ఆపకుండా పోలీసు సిబ్బందిపైకి దూసుకొచ్చారు. గమనించిన సిబ్బంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతరం వారిని పోలీసులు వెంబడించి కారును పట్టుకున్నారు. కారు లోపల ఉన్న ముఠా సభ్యులు పోలీసులపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడులో క్రైం కానిస్టెబుల్ శిరాజ్బాషకు తీవ్రగాయాలయాయ్యి. గాయపడిన కానిస్టెబుల్‌ను మదనపల్లి ఏరీయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
దొంగల ముఠా నాయకుడు మాన్సింగ్!
♦ కాల్పులకు యత్నించింది అతనే ♦ గుల్బర్గాలో ముఠా ఏర్పాటు ♦ గతంలో పలు నేరాలు.. దోపిడీలు ♦ కొనసాగుతున్న విచారణ పరిగి: సినీ ఫక్కీలో పట్టుబడిన దోపిడీ ముఠా నాయకుడు మాన్సింగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాలుగు రోజుల క్రితం (శుక్రవారం అర్థరాత్రి) పరిగిలో ఓ ముఠాను అడ్డుకోగా పోలీసులపై కాల్పులకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని పోలీసులు పట్టుకోగా ఓ వ్యక్తి తప్పించుకు పారిపోయాడు. దొరికిన వారి సాయంతో పారిపోయిన దొంగతో పాటు మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముఠా సభ్యుల్లో ఒకడైన సమద్‌ను రిమాండ్‌కు తరలించిన సంగతి విధితమే. నాలుగు రోజులుగా పట్టుబడిన దొంగలను విచారించిన పోలీసులు వారిని వెంటబెట్టుకుని కర్ణాటక గుల్బర్గాకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దొంగలముఠా నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. కాల్పులకు యత్నించిన ఘటనలో గాయపడి ఆస్పత్రిపాలైన మాన్సింగే ముఠా నాయకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో నేరాలు చేసే క్రమంలో రివాల్వర్ సైతం ఎక్కడో కొట్టుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. కాల్పులకు యత్నించిన సమయంలో మాన్సింగ్ రివాల్వర్ పట్టుకుని కాల్పులు జరిపే ప్రతయ్నం చేశాడని.. ఆ సమయంలో రివాల్వర్‌లో ఆరు బుల్లెట్లు, అదనంగా జేబులో మరో మూడుతో కలిపి మొత్తం తొమ్మిది బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. పెనుగులాటలో సంఘటనా స్థలంలో మూడు బుల్లెట్లు పడిపోగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫైరింగ్లోనూ దిట్టే.. తెలుగు, కనడ, హిందీ భాషలు తెలిసిన మాన్సింగ్ గుంతకల్ వాసి. ఏడేళ్ల క్రితం అనంతాపూర్ జిల్లాలో, గుంతకల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు సమాచారం రాబట్టారు. గతంలో తుపాకులు పేల్చిన నేర చరిత ఉన్నట్లు తేల్చారు. పలు నేరాలు..దొంగతనాలు చేసిన అతను పోలీసులకు పట్టుబడడంతో జైలుకు వెళ్లి ఐదేళ్లు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గుంతకల్ నుంచి గుల్బర్గాకు మకాం మార్చాడు. గుల్బర్గాలో మామూలు గుడిసెలో నివాసం ఉంటూ అక్కడ ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. నెల, రెండు నెలలు విరామం ఇచ్చి వేర్వేరు ప్రాంతాల్లో నేరాలు చేయడం ఈ ముఠాకు అలవాటు. హైదరాబాద్ వెళుతూ.. స్విఫ్ట్ డిజైర్ కారులో హైదరాబాద్ బయలు దేరిన ఈ దోపిడీ ముఠా అనుకోని పరిస్థితిలో పరిగి పట్టణంలోకి వెళ్లి పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్‌కు అర్థరాత్రి వరకు చేరుకుని అక్కడ దొంగతనానికి పాల్పడాలని గుల్బర్గా నుంచి బయలుదేరిన వీరు పరిగికి చేరుకునే వరకు రాత్రి 2 గంటలైంది. హైదరాబాద్‌కు తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటే అక్కడ ఏ దొంగతనం చేయడానికి వీలుకాదని భావించి పరిగి పట్టణంలోకి కారును మళ్లించినట్లు సమాచారం. బ్యాంకే అని కాకుండా ఎక్కడో ఒకచోట దోపిడీ చేసి తిరిగి వెళ్లి పోవాలని పరిగిలోకి మళ్లడంతో అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. వీరి నుంచి గతంలో చేసిన దోపీడీలకు సంబంధించి సొత్తు రికవరీకి యత్నిస్తుండడంతో రిమాండ్‌కు తరలించేందుకు ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది. -
పశువుల దొంగల ముఠా ఆటకట్టు
♦ రూ. 12.50 లక్షలు రికవరీ ♦ ముఠా సభ్యుల్లో ఇద్దరి రిమాండ్ ♦ జిల్లా ఎస్పీ సుమతి కొండపాక : వ్యవసాయ బావుల వద్ద నుంచి పశువులను ఎత్తుకెళ్లే అంతర్ జిల్లా పశువుల దొంగల ముఠాను కుకునూర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. కొండపాక మండలం వెలికట్ట శివారులో గల జనగామ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముఠా గుట్టు రట్టయింది. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, తొగుట సీఐ ఏరుకొండ వెంకటయ్యతో కలిసి శనివారం జిల్లా ఎస్పీ సుమతి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన మహ్మద్ అయూబ్ (64), మహ్మద్ బాబా (40), హైదరాబాద్ బషీరాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్ ఖురేషీ (47), బహుదూర్ఫురాకు చెందిన మహ్మద్ ఇషాక్ ఖురేషీ (51) మరో ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ముఖ్యుడైన మహ్మద్ అయూబ్ 2001 నుంచి రోడ్డు పక్కన, వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువుల పాకలను టార్గెట్ చేస్తూ వంద పశువులను దొంగిలించాడు. అతనిపై 39 కేసులు నమోదు కాగా, జైలుకు వెళ్లి వచ్చాడు. అదే క్రమంలో ఈ ముఠా 68 లారీలను సైతం అపహరించింది. పశువులను అపహరించిన అనంతరం వాటిని తరలించేందుకు ఉనపయోగించే వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అపహరించి తెచ్చిన పశువులను మహ్మద్‌గౌస్ ఖురేషీ పశుమాంస విక్రయ దుకాణాలకు సరఫరా చేసేవాడు. వచ్చే డబ్బులను ఈ ముఠా విలాసాలకు వెచ్చించేది. సొంత ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసింది. ఇలా మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఈ ముఠా పశువులను అపహరించింది. ముఠా వాడిన వాహనాలు రాజీవ్ రహదారిపై, జాతీయ రహదారిలపై ఏర్పాటు చేసి సీసీ కెమేరా పుటేజీల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో నిఘా ఉంచిన తొగుట సీఐ వెంకటయ్య, కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి.. శనివారం ఉదయం వెలికట్ట శివారులో గల జనగామ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఈ ముఠాలోని మహ్మద్ అయూబ్, మహ్మద్ గౌస్ ఖురేషీ పట్టుబడ్డారు. వాహనాన్ని, రూ. 12.50 లక్షల నగదు, పశువులు అరవకుండా ఇచ్చే మత్తు ఇంజక్షన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠా నుంచి సుమారు 70 శాతం సొమ్మును రికవరీ చేశామని మిగతా 30 శాతాన్ని వారు కొన్న ఇళ్ల స్థలాల ద్వారా చేస్తామన్నారు. ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ సుమతి అభినందించారు. -
జైలు వార్డర్ కటకటాలపాలు
♦ వ్యసనాలకు బానిసై దొంగతో కలసి చోరీల బాట ♦ రూ.5.35 లక్షల ఆభరణాలను రికవరీ చేసిన పోలీసులు మంచిర్యాల టౌన్: అతను జైలు వార్డర్. వ్యసనాలకు బానిసగా మారి అప్పుల పాలయ్యాడు. జైలు లో దొంగలతో స్నేహం చేసి.. చోరీలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాల య్యాడు. ఓ అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు ఈ విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పోలీసుస్టేషన్లో ఏఎస్పీ విజయ్‌కుమార్ శుక్రవారం ఇద్దరు అంతర్జిల్లా దొంగల అరెస్టు చూపించారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయపూర్‌కు చెందిన దుబ్బెట బాలలింగం ఓ చోరీ కేసులో సిద్దిపేట సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడ జైలు వార్డర్ గంభీరావు వెంకటేశ్‌తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం బాలలింగం జైలు నుంచి విడుదల య్యాడు. తర్వాత జైలు వార్డర్ వెంకటేశ్, బాల లింగం కలసి ఆరుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. సిద్దిపేటలో బైక్‌ను దొంగిలించారు. చోరీ సొత్తును విక్రరుుంచేందుకు శుక్రవారం మంచిర్యాలకు కారులో రాగా పోలీ సులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరి నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, రూ.18 వేల నగదు, బైక్, కారు, డీవీడీ ప్లేయర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ. 5.35 లక్షల విలువైన ఆభరణాలు రికవరీ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వెంకటేశ్ తండ్రి రంగారావు కరీంనగర్ సబ్‌జైలులో డీఎస్పీగా పనిచేస్తున్నారు. -
జిల్లాలో దొంగలుపడ్డారు
జిల్లాలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. రాత్రీపగలూ తేడా లేకుండా... ఇళ్లు గుల్ల చేసేస్తున్నారు. దోపిడీలే కాకుండా అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ మండలాల్లో వీరి దాష్టికానికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. రైతులు పొలాల వద్ద ఉండే మోటార్ల నుంచి గుడిలోని హుండీలను కూడా వీరు వదలడం లేదు. ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడి గ్రామాల్లో రాత్రిపూట గస్తీ కాస్తున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, తిరుపతి/పుంగనూరు : జిల్లాలో దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. పట్టపగలే దోపిడీలకు దిగుతోంది. ముఖ్యంగా పలమనేరు, మదనపల్లె ప్రాంతాల్లో దొంగలు యథేచ్ఛగా గ్రామాల్లోకి చొరబడి దొంగతనాలు చేస్త్తున్నారు. సంచలనం సృష్టించిన సైకో సూదిగాడు మాదిరి ఈ దొంగల ముఠా పోలీసులకు సవాల్ విసురుతోంది. 15 రోజులుగా దొంగతనాలు జరుగుతున్నా కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నా రు. గ్రామాల్లో ప్రజలు వణికి పోతున్నారు. యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా రక్షక దళాలుగా ఏర్పడి గస్తీ నిర్వహిస్తున్నారు. ఒంటరిగా బయటికి పోవాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా మహిళల ఒంటిపై ఉన్న నగలు, చివరకు మంగళ సూత్రాలను సైతం దొంగలు లాక్కెళుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. మదనపల్లె నియోజకవర్గం పరిధిలో దొంగలు మంగళవారం భూతంవారిపల్లె, ఎర్రపల్లె గ్రామాల్లో చొరబడి దొంగతనాలకు యత్నించారు. గ్రామస్తులు అందరు కలిసికట్టుగా ఒకటై దొంగలపై తిరగబడడంతో పారిపోయారు. రాత్రి వేళల్లో దాడులకు తెగబడుతారేమోనని ఆ అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగతనాల తీరిదీ... ఆటోల్లో పగటిపూట గ్రామాల్లో వెళ్లి రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉండే మారుమూల గ్రామాలను ఎంపిక చేసుకొంటారు. 15 రోజుల ముందు బెరైడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లోని గ్రామాల్లో దొంతనాలు జరిగాయి. రూ.3 లక్షలకు పైగా విలువ చేసే బంగారు నగలను దోచుకెళ్లారు. ఐదుగురు సభ్యులు కలిగిన ముఠా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పొట్టిగా నల్లగా ఉండి, ముఖాలకు మంకీ క్యాప్ వేసుకొని ఉన్నట్లు తెలుపుతున్నారు. వీరి దుస్తుల నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతోపాటు, చిన్న పాటి కత్తులు కూడా ఉన్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. వీరు తాళాలను ధ్వంసం చేయడంలో సిద్ధ హస్తులుగా భావిస్తున్నారు. ఇళ్లలోకి దూరి కత్తులు చూపించి దాడులకు తెగబడి మహిళల ఒంటిపైన ఉన్న నగలు లాక్కొని పారిపోతున్నారు. గ్రామాల్లో దొంగల భయం ఎక్కువగా ఉందని రక్షణ కల్పించాలని కొంత మంది రైతులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
పంచలోహ విగ్రహాలు స్వాధీనం
* చోరీ చేసి అమ్మడానికి యత్నించిన ముఠా అరెస్టు * కేపీహెచ్బీలో వలపన్ని పట్టుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: పురాతన పంచలోహ విగ్రహాలను చోరీ చేసి అమ్ముతున్న ఆరుగురు సభ్యులున్న దొంగల ముఠాను పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వసంత్‌నగర్‌లో పక్కా వ్యూహంతో వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పంచలోహ విగ్రహాలు 12వ శతాబ్దం కాలం నాటివని తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ కోటి వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ నవీన్ మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వంగర మండలం తెనుగులవాడకు చెందిన కొండబత్తిని భిక్షపతి(75) తన వద్దకు వచ్చేవారికి తాయిత్తులు కట్టి డబ్బులు వసూలు చేస్తుండేవాడు. అయితే అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాశతో వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో ఉన్న చెన్న కేశవ స్వామి ఆలయంలోని 12వ శతాబ్దానికి చెందిన చెన్నకేశవ స్వామి, భూ దేవి, శ్రీదేవి పంచలోహ విగ్రహాలను చోరీ చేసి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అదే జిల్లాలోని వెంకటాపూర్ మండలం అందుగులమెడకు చెందిన బునేని సంపత్, ఆనందపురం గ్రామానికి చెందిన రెడ్డి రవితో కలసి విగ్రహాల చోరీకి పథకం వేశాడు. నూనె మల్లయ్య, గుర్రాల శంకర్, లెంకల మల్లయ్యలతో కలసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. జూలై 15న పథకం ప్రకారం చెన్నకేశవస్వామి గుడిలోని విగ్రహాలను దొంగిలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో వాటని అమ్మడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో వారం కిందట కూకట్‌పల్లిలో అమ్మేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ విషయం కూకట్పల్లి సీసీఎస్ పోలీసులకు తెలియడంతో ఇన్స్పెక్టర్ సి.హరిశ్చంద్ర రెడ్డి, ఎస్ఐలు కె.బాలరాజు, రాజేంద్ర, రవి కుమార్‌తో పాటు ఇతర సిబ్బందితో కలసి దొంగల ముఠాను పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. పంచలోహ విగ్రహాలను తిరిగి పర్లపల్లి గ్రామ పెద్దలకు అందజేశారు. గతంలో కూడా విగ్రహాలు చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
నరహంతక ముఠా పరారీ
* కోర్టు ప్రాంగణం నుంచి తప్పించుకున్న నలుగురు రిమాండ్ ఖైదీలు * వెంబడించి ఒకరిని పట్టుకున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పసిపిల్లలను సైతం దారుణంగా హత్య చేసే నరహంతక, దొంగల ముఠా గురువారం తప్పించుకుంది. పార్ధీగ్యాంగ్కు చెందిన ఈ సభ్యులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువస్తుండగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి పరారయ్యారు. వీరు మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 31 హత్యలు, పలు దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో పార్ధీ గ్యాంగ్ లీడర్ తరుణ్ బోస్లే అలియాస్ అరుణ్ బోస్లేతో పాటు లక్ష్మణ్ బోస్లే, కైలాస్, పరమేశ్‌లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, పరమేశ్‌ను పట్ణణంలోని సితారా సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. జరిగింది ఇలా.. నలుగురు పార్ధీ ముఠా సభ్యులతో పాటు మరో సాధారణ దొంగను పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు గురువారం తీసుకువచ్చారు. ఐదుగురు సభ్యులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే పోలీసులు ఎస్కార్టుగా వచ్చారు. సాధారణ దొంగను ముందుగా కోర్టులో హాజరుపరిచారు. పార్థీ గ్యాంగు సభ్యులను హాజరు పరిచేందుకు సమాయత్తం అవుతుండగా.. అందులోని ఒక సభ్యుడు పరమేశ్ ఒక్కసారిగా పరుగు లంఘించుకున్నాడు. అతణ్ని వెంబడిస్తూ ఇద్దరు పోలీసులు పరుగెత్తారు. ఎట్టకేలకు అతణ్ని సితారా టాకీసు సమీపంలో పట్టుకున్నారు. ఈలోగా మిగిలిన ముఠా సభ్యులు పరారయ్యారు. ఎస్కార్టు పోలీసు వారిని కాల్చి వేసేందుకు తుపాకీని లోడ్ చేసి గురిపెట్టగా.. అది పేలకుండా మొరాయించినట్టు సమాచారం. దొరికిన కొద్దిపాటి సమయంలో ముగ్గురు మెరుపులా మాయమయ్యారు. ఇవీ కేసులు.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పార్లీ వైద్యనాథ్‌కు చెందిన తరుణ బోస్లే, లక్ష్మణ్ బోస్లే, పరమేశ్వర్, కైలాష్లు కరడుగట్టిన నేరస్తులు. 2009 నాటికి ఈ గ్యాంగ్‌పై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో 31 హత్యలు, పలు దోపిడీ కేసులు నమోదయ్యాయి. వీళ్లు పట్టుబడిన సమయానికి వారి వయస్సు 18 ఏళ్ల యువకులు. 2012లో బయటికి వచ్చిన ఈ గ్యాంగ్ మళ్లీ హత్యలు, దోపిడీకి తెగబడింది. 2012 నుంచి 2014 వరకు దాదాపు రెండేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆరు హత్యలు, పలు దోపిడీ కేసులు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో ఒక ఇంట్లోకి చొరబడి తల్లీకూతుళ్లతో పాటు పసికందును దారుణంగా హత్య చేసి దోపిడీ చేయడంతో పార్ధీగ్యాంగ్ క్రూరత్వానికి సమాజం వణికిపోయింది. నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో ఒకరిని, కరీంనగర్లో వృద్ధ దంపతులను, సుల్తానాబాద్‌లో ఇద్దరిని హత్య చేశారు. మెదక్ జిల్లాలో వీరిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. రామచంద్రపురం మండలం నాగుపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న దోపిడీలు, హత్య కేసుల్లో రామచంద్రాపురం పోలీసులు దాదాపు 40 రో జుల పాటు పర్లీలో మకాం వేసిపట్టుకున్నారు. పట్టణం చుట్టూ అష్టదిగ్బంధనం సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న సంగారెడ్డి పట్టణం నలుమూలను అష్టదిగ్బంధనం చేశారు. మఫ్టీ పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. సాధారణంగా రైల్వే లైన్ ఉన్న ప్రాంతాలనే ఎంచుకొని దోపిడీలు చేసే అలవాటు ఉండటంతో పోలీసులు ఆ దిశగా నిఘా పెట్టారు. కదులుతున్న రైలు ఎక్కటానికి అవకాశం ఉన్న ప్రతి చోట పోలీసులను మొహరించారు. -
జల్సాల కోసం టూవీలర్స్ చోరీ
పంజగుట్ట (హైదరాబాద్) : జల్సాల కోసం ద్విచక్రవాహనాల దొంగతనాలకు అలవాటుపడిన ఏడుగురిని పంజగుట్ట పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వేమన అయ్యప్ప అలియాస్ అమిత్ అలియాస్ సంజు అలియాస్ బన్ని(21) నగరంలో బీజేఆర్ నగర్ యూసూఫ్‌గూడలో నివసిస్తుంటాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడు పంజగుట్ట మార్కెట్ బస్తీకి చెందిన కొర్ర మహేష్ అలియాస్ రాజా(23), బేగంపేట ప్రకాశ్ నగర్‌కు చెందిన అభిజిత్ చెటర్జి అలియాస్ సోన(20), బేగంపేట మయూరి మార్గ్‌కు చెందిన టేకు దొరబాబు అలియాస్ దొర (19), అమీర్‌పేటకు చెందిన తిరుమల వెంకటేశ్ అలియాస్ వెంకట్ (24), యూసూఫ్‌గూడకు చెందిన గుమ్మడి రవి కుమార్ అలియాస్ రవి, లడ్డు (19), బేగంపేటకు చెందిన కె. సచిన్ అలియాస్ నాని (19)లతో కలసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. వీరిలో అయ్యప్ప తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను ఎత్తుకుపోవటంలో దిట్ట. వీరు దొంగిలించిన వాహనాలను నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో పబ్‌లకు వెళ్తూ, స్నూకర్స్ ఆడుతుంటారు. వీరిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 4, రాంగోపాల్‌పేట పరిధిలో 1, కూకట్పల్లి పరిధిలో 1, నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 1 ద్విచక్రవాహనాల దొంగతనం కేసులున్నాయి. దొంగిలించిన వాహనంపై గురువారం అమీర్‌పేటలో ప్రధాన నిందితుడు అయ్యప్ప వెళుతుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అతన్ని వాహన పత్రాలు చూపమని అడగడంతో తడబడ్డాడు. వెంటనే అతన్ని అరెస్టు చేసి విచారించగా చేసిన దొంగతనాల చిట్టా బయటపెట్టాడు. దీంతో నిందితులందరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
వాహన దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు : రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 26,62,000 ల విలువైన రెండు బొలెరోలు, ఒక ఇండికా, ఒక టాటా ఏస్ వాహనాలతోపాటు 8 బైకులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకు చెందిన ప్రేమ్‌కుమార్(25), జయప్రకాశ్(35), రవి(36), రాజ్‌కుమార్(21)లను అరెస్ట్ చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
హైవే కిల్లర్స్..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఖరీదైన లోడుతో రోడ్డెక్కాలంటే లారీడ్రైవర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు లారీని హైజాక్ చేసి హత్య చేస్తారోనని భయపడుతున్నారు. అందుకు వరస సంఘటనలే నిదర్శనం. జిల్లాలో ఇటీవలి కాలంలో వరుసగా లారీలు హైజాక్‌కు గురవుతున్నాయి. దొంగలముఠా చేతిలో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. సినీపక్కీలో జరుగుతున్న లారీల హైజాక్ ముఠాలోని కొందరిని గురువారం తడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే లారీ హైజాక్ చేసే ముఠాలు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు రోజుల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్టీలు సామాన్లు తరలించే లారీ దొరవారిసత్రం వద్ద హైజాక్ గురైంది. లారీ డ్రైవర్‌ను దొంగలముఠా నమ్మించి మద్యం తాపించి హత్య చేసి క్యాబిన్లో దాచారు. వీరిని కావలి పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా గతంలో మరో లారీని హైజాక్ చేసి లారీ డ్రైవర్, క్లీనర్‌ను చంపి గూడూరు వద్ద పాతిపెట్టిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇకపోతే నెల్లూరు నవలాకులతోట వద్ద సోమవారం వేణుగోపాల్‌రావు లారీ కనిపించకుండా పోయింది. ఆ లారీ రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా వద్ద కనిపించింది. అయితే అందులో సామాన్లు, టైర్లు పట్టుకెళ్లారు. వారెవరనేది తెలియరాలేదు. ఏడాది క్రితం తడ పరిధిలోని సరిహద్దు పంచాయతీలు, పెరియవట్టు, పన్నంగాడు వద్ద అర్ధరాత్రి సమయంలో రెండు లారీలు అపహరణకు గురయ్యాయి. ఇందులో కలకత్తా నుంచి చాక్లెట్ల లోడుతో ఓ మినీ లారీ, ఇండోర్ నుంచి ఇనుప కడ్డీల లోడుతో వెళుతున్న మరో లారీని అపహరించుకు వెళ్లారు. ఇందులో ఇనుప కడ్డీల లారీ సరుకు లేకుండా చిత్తూరు జిల్లా పరిధిలో రోడ్డు పక్కన ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోడు లారీకి సంబంధించి పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకు రెండు లారీలను ఒకే ముఠా అపహరించిందని భావించిన పోలీసులు ఈ ముఠా అరెస్టు తర్వాత ఇది రెండు వేర్వేరు ముఠాల పనిగా గుర్తించారు. కానీ ఇనుపలోడ్డు లారీకి సంబంధించిన దొంగల ఆచూకీ మాత్రం లభించలేదు. హైజాక్ ముఠాలు... లారీలను హైజాక్ చేసే ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నై, ఒంగోలు, పలమనేరుకు చెందిన ముఠాలు ఇటువంటి పనుల్లో ఆరితేరిన వారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరు స్టీలు సామాన్లు, ఐరన్ ఓర్, ఇనుప సామగ్రితో దూర ప్రాంతాలకు తరలివెళ్తున్న లారీలే టార్గెట్ చేస్తారని వెల్లడించారు. ఈ ముఠాలు లోడు చేస్తున్న వివిధ పరిశ్రమల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. డ్రైవర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అతడిని ట్రాప్ చేస్తారు. అలా కుదరని పక్షంలో కిడ్నాప్‌చేసి హత్యచేసి లారీని అపహరించుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిత్తూరు జిల్లా పలమనేరు ముఠా లారీలను అపహరించుకెళ్లేవారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాకు శ్రీరాములు లీడర్‌గా వ్యవహరించేవాడు. పలమనేరు ముఠాను గతంలో తమిళనాడు ప్రాంతంలోని తూతుకూడి పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన మున్నా ముఠా కూడా లారీలను హైజాక్ చేసే వారని తెలిసింది. ఒక్కో ముఠాలో సుమారు 10 మంది సభ్యులు ఉంటారని తెలిసింది. వీరిలో కొందరు రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో కాపుకాచి ఉంటారు. లారీ లోడుతో బయలుదేరుతూనే ముఠా సభ్యులకు సమాచారం ఇస్తారు. పథకం ప్రకారం లారీని హైజాక్ చేస్తారు. మాట వినని లారీ డ్రైవర్, క్లీనర్‌ను కత్తితోనో.. ప్లాస్టిక్ వైర్లతో హత్యచేసి రహస్య ప్రాంతాల్లో పాతిపెట్టి లారీతో ఉడాయిస్తారని నిఘావర్గాలు వెల్లడించాయి. తాజా గా తడ వద్ద పట్టుబడ్డ హైజాక్ ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన వివిధ లారీల చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు తెలిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని తదితర ప్రాంతాలలో జరిగిన ఇలాంటి నేరాలతో వీరికి ఉన్న సంబందాలు ఉన్నాయా? లేదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. -
దొంగలు దొరికారు..
♦ మొబైల్ ట్రాక్ ఆధారంగా గుర్తింపు ♦ కర్నూలు పోలీసుల అదుపులో మధ్యప్రదేశ్ ముఠా ♦ కొనసాగుతున్న విచారణ ♦ త్వరలో వరంగల్‌కు తరలింపు మామునూరు నాలుగో బెటాలియాన్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరిన దొంగల ముఠా పట్టుబడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాను కర్నూలు పోలీసు లు విచారిస్తున్నారు. త్వరలో వారిని వరంగల్‌కు తరలించనున్నారు. వరంగల్ క్రైం : మామునూరు నాలుగో బెటాలియాన్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మార్చి 23వ తేదీన బెటాలియాన్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన దొంగలు ఆరు క్వార్టర్లలోని బంగారం, వెండి, నగదును దోచుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ క్వార్టర్స్‌లోనే దొంగతనం జరగడంతో కంగుతిన్న జిల్లా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసుల పరువుకు సంబంధించిన విషయం కావడంతో హుటాహుటిన ఆరు పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దొంగల ముఠా కోసం ఆరా తీశారు. ప్రాథమిక దర్యప్తులో మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా ఈచోరీలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. మొత్తం ఆరుగురు దొంగలు కారులో వచ్చి క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొబైల్ ట్రాక్ ఆధారంగా దొంగల గుర్తింపు... ఈ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు మొబైల్ ట్రాకింగ్‌ను ఉపయోగించారు. మార్చి 23వ తేదీన రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు బెటాలియన్ ప్రాంతంలోని టవర్ నుంచి ఎన్ని ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అర్ధరాత్రి సమయంలో అనేక కాల్స్ రాగా మూడు కాల్స్‌పై మాత్రమే పోలీసులు దృష్టిపెట్టారు. ఈ మూడు కాల్స్‌కు సంబంధించిన ఐడెంటిటీని గుర్తించగా ఇవి మధ్యప్రదేశ్ అడ్రస్‌తో ఉన్నాయి. దీంతో మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠానే ఈ దోపిడీకి పాల్పడిందని నిర్ధారణకు వచ్చారు. కొన్ని నెలలుగా ఇక్కడే మకాం వేసిన దొంగలు బెటాలియన్ దోపిడీకి ముందు నాయుడు పెట్రోల్ పంపు సమీపంలోని శ్రీసత్యసాయినగర్లో వరుసగా మూడిళ్లలోనూ దోపిడీకి పాల్పడ్డారు. ఆ తర్వాత నెల ఆగి పక్కా రెక్కీ నిర్వహించి బెటాలియన్‌లో దోపిడీకి పాల్పడ్డారు. కర్నూలుకు ఎలా వెళ్లారంటే... బెటాలియన్‌లో దోపిడీకి పాల్పడిన తర్వాత ఆరుగురు దొంగల ముఠా తమతో తెచ్చుకున్న కారులో పయనమయ్యారు. మొదట ఖమ్మం రూట్లో వెళ్లారు. పోలీసులు తమను గుర్తిస్తారనే ఉద్దేశంతో పలుమార్లు జిల్లాలు మారుస్తూ వచ్చారు. ఖమ్మం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నల్లగొండ జిల్లా సూర్యాపేట వైపు మళ్లారు. ఆ తర్వాత కోదాడకు చేరుకున్న దొంగలు మళ్లీ అనుమానం రాకుండా కర్నూలు వైపు వెళ్తున్నారు. దొంగల ఫోన్నంబర్లఆధారంగా మొబైల్ ట్రాకింగ్ చేస్తున్న పోలీసులు ఈ విషయాన్ని వరంగల్ ఉన్నతాధికారులకు చెప్పి కర్నూలు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కర్నూలు పోలీసులు అప్రమత్తమై కారులో ప్రయాణిస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్నారు. చోరీ జరిగిన రెండు రోజుల్లోనే దొంగల ఆటకట్టించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో నాలు గో బెటాలియన్‌తోపాటు నాయుడు బండ్ సమీపంలో శ్రీ సత్యసాయినగర్‌లో మూడిళ్లను దోచింది తామేనని ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతోపాటు కర్నూలులో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించి విచారణ జరుగుతోంది. కర్నూలు పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత ఆ దొంగల ముఠాను వరంగల్‌కు తీసుకురానున్నారు. మొత్తానికి బెటాలియన్ దొంగలను 48 గంటల్లోపే గుర్తించి అదుపులోకి తీసుకున్న వరంగల్ పోలీసులు మరోమారు తమ ప్రతిభ చాటారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఒక మహిళతో సహా ముగ్గురు సభ్యులు ఉన్నారు. వారి వద్ద నుంచి 21 ల క్షల విలువైన బంగారు, వెండి, ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, భారీ నగదు స్వాధీనం
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దృష్టి మరల్చి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు వారి ఆట కట్టించారు. అటు పోలీసులకు ఇటు ప్రజలకు కంటిమీద కులుకు లేకుండా చేస్తున్న ఈ ముఠా ఆట కట్టించేందుకు పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న చెన్నైకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
రూ.లక్షకు మూడు లక్షలు
అనంతపురం క్రైం : రూ. లక్ష పెట్టుబడితే చాలు రూ. 3 లక్షలు హవాలా డబ్బు ఇప్పిస్తామంటూ ఘరానా మోసం చేస్తున్న అంతర్రాష్ర్ట దొంగల ముఠాకు చెక్ పెట్టారు అనంతపురం సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు. ఈ మేరకు బుధవారం స్థాని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి సీసీఎస్ డీఎస్పీ విజయకుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు : స్థానిక జేఎన్టీయూ కళాశాల సమీపంలో నివసిస్తున్న పీకే వీరన్న ఇటీవల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బీకేఎస్ ఆనంద్ పీకే వీరన్నకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అయితే ఆర్నెళ్ల కిందట ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వీరన్నను కలిసినప్పుడు ఆనంద్ తనతో పాటు ఉన్న మరికొందరిని పరిచయం చేస్తూ తామంతా హవాలా డబ్బు మారుస్తుంటామని చెప్పాడు. బెంగళూరులో తమకు తెలిసిన వారి వద్ద హవాలా డబ్బు ఉందని రూ. లక్ష పెట్టుబడి పెడితే రూ. 3 లక్షలు ఇప్పిస్తామంటూ నమ్మబలికాడు. దీంతో నమ్మిన తాను అత్యాశకు పోయి రూ. 3లక్షలు సదరు ముఠాకు అందజేసి మోసపోయానంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేపథ్యం ఇది: అరెస్ట్ అయినవారిలో కర్నాట కకు చెందిన కృష్ణసింగ్, బీకేఎస్ ఆనంద్ ముఖ్యులు. బెంగళూరులతో తమకు తెలిసి న చాలామందితో హవాలా డబ్బు మూలుగుతోందని రూ. లక్షకు రూ. 3లక్షలు ఇస్తారంటూ నమ్మిస్తారు. హవాలా డబ్బు అసలైందనే తేల్చేలా ముఠా సభ్యులే తమవద్దనున్న కొంత డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయించి నిరూపిస్తారు. దీంతో అమాయక ప్రజలు నమ్మి వీరికి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఏదైనా అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని డబ్బుతో అక్కడికి రమ్మని సూచి స్తారు. తీరా డబ్బుతో వెళ్లాక...ఈ ముఠా మాటల్లో కలుపుతుండగానే మఫ్టీ పోలీసుల అవతారంలో ఈ ముఠాలోని మరికొందరు సభ్యులు అక్కడికి ప్రత్యక్షమవుతారు. పోలీ సులు వచ్చారంటూ కేకలు వేస్తూ అమాయకుల వద్దనున్న డబ్బును దోచుకెళ్తారు. అక్కడికీ డబ్బు ఇవ్వకపోతే వేటకొడవళ్లతో చం పుతామని బెదిరించి ఆ డబ్బును కొల్ల గొడతారు. ఇలా ఆర్నెళ్ల నుంచి జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేశారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు : ఈ విషయం ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికెళ్లింది. ఈ మోసాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ మోసం చేసిన ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి చేదించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి పర్యవేక్షణలో సీసీఎస్ డీఎస్పీ బి.విజయకుమార్, వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్, సీసీఎస్ సీఐలు దేవానంద్, రాజశేఖర్, ఎస్ఐలు విశ్వనాథ్‌చౌదరి, వెంకటరమణ, రాజు, వెంకటరెడ్డి, శ్రీరాం, ఏఎస్ఐ సాదిక్, హెచ్‌సీలు రజాక్, పైగంబర్వలి, కానిస్టేబుళ్లు శేషు, ఫరూక్, జాకీర్, శ్రీనివాసులు, రామాంజనేయులు, సుధాకర్, రామ్మోహన్, డోనాసింగ్ తదితరులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. డీఎస్పీ విజయకుమార్‌కు పక్కా సమాచారం రావడంతో బుధవారం స్థానిక ముసలమ్మకట్ట వద్ద నిందితులను పట్టుకున్నారు. రూ.16 లక్షల నగదు, నాలుగు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాల్యాద్రి మాట్లాడుతూ ఇలాంటి మోసాలకు గురి కావద్దని ప్రజలకు సూచించారు. -
పోలీసులపై దొంగల రాళ్ల దాడి
రామాయంపేట/చేగుంట: పశువులను అపహరించిన ఓ ముఠా సభ్యులు పోలీసులపై దాడి చేసి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద చోటుచేసుకుంది. పుల్యానాయక్‌కు చెందిన ఒక ఎద్దును, మల్లేశంకు చెందిన రెండు ఎద్దులను దొంగల ముఠా వ్యాన్‌లోకి ఎక్కించింది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ లోపే దుండగులు వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, ఏఎస్ఐ మురళి ఆధ్వర్యంలోని రామాయంపేట పోలీసులు దౌల్తాబాద్ క్రాస్ రోడ్డు వద్ద దొంగల వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు పోలీసులపై రాళ్ల దాడికి దిగి వాహనంలో చేగుంట వైపు వెళ్లారు. అయితే పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించి తమ వాహనాన్ని పేట్ బషీర్‌బాగ్ బషీరాబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వదిలి పారిపోయారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ రామకృష్ణ, హోంగార్డు కుతుబుద్దీన్‌లు గాయపడ్డారు. -
దొంగల భయంతో రాత్రంతా జాగారం
- పోలీసులకు సవాల్‌గా మారిన చోరీ ముఠా - వరుస ఘటనలతో హడలె త్తుతున్న ప్రజలు ములుగు : మండల ప్రజలను దొంగల భయం వెంటాడుతోంది. వారం రోజులుగా పలు గ్రామాల్లో దొంగల ముఠా పర్యటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు గ్రామాల్లో భద్రతను పెంచి.. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. వరుసగా ప్రచారంలోకి వస్తున్న వదంతులతో ప్రజలు హడలెత్తుతున్నారు.ఈ నెల 25, 26వ తేదీల్లో జాకారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు కలువల పోషాలు, కిరాణ వ్యాపారి యాద శ్రీను ఇంటికి దొంగలు వచ్చారని, వారు 27న మదనపల్లి గుట్టల్లో తలదాచుకున్నారని, ఆ రోజు రాత్రి కాశీందేవిపేట గ్రామస్తుడు సైకిల్‌పై వస్తుంటే ఆపి కొట్టారని, పోలీసులు వె ళ్లడంతో పత్తిపల్లి, కొడిశలకుంట, బుగ్గ ప్రాంతాల్లో తలదాచుకున్నారని జాకారం గ్రామస్తుల తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి ముదిరాజ్ కాలనీలో దొంగలు సంచరిస్తున్నట్లు తెలియడంతో కాలనీకి చెందిన మంద శ్రీను వెంబడించాడు. అతడిని గమనించిన దొంగలు చితకబాదారు. గ్రామస్తులు వచ్చేలోగా దొంగలు పారిపోయారు. వారి సమాచారంతో పోలీసులు చేరుకుని అబ్బాపూర్, జాకారం, ఇంచెన్చెర్వుల గ్రామాల పరిధిలో సోదాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దొంగల భయంతో జాకారం, అబ్బాపూర్, మల్లంపల్లి, ములుగు, అన్నంపల్లి, మదనపల్లి, పత్తిపల్లి తదితర గ్రామాల ప్రజలు రాత్రి భయం గుప్పిట్లో గడిపారు. మహిళలు తమ మెడలోని బంగారు ఆభరణాలు తీసి పసుపు తాడు వేసుకోవడం విశేషం. ఇక వ్యాపారులు, ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. జీవంతరావుపల్లిలో రాత్రి మహిళలు తమ వెంట కారం ముద్దలు ఉంచుకొని కాపలా ఉన్నట్లు తెలిసింది. ఆయా గ్రామాలకు వచ్చే దొంగలు హిందీలో మాట్లాడుతున్నట్లు గ్రామస్తులు చెప్పారు. వారి భాషను బట్టి వేరే రాష్ట్ర్రాలకు చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాత్రి పోలీసుల సోదాల్లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా పోలీసులకు దొంగల ముఠా కొరకరాని కొయ్యగా మారింది. -
తిరుపతిలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి: నగరంలో దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. అంతరాష్ట్ర దొంగల ముఠా ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యల్లో భాగంగా తిరుపతిలో బుధవారం ఏడు మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ దొంగతనాలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరినుంచి 20 బైకులు, 2 కంప్యూటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన ఏడుమంది దొంగలలో 6మంది విద్యార్థులు ఉండటం విశేషం. -
ధర్మవరంలో దొంగల ముఠా అరెస్ట్
జిల్లాలో ధర్మవరంలో దొంగల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ లింగరాజు సహా, ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 75 వేల విలువ చేసే బంగారు అభరణాలు, ఒక ఇన్నోవో కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగల ముఠాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. -
దొంగల ముఠాకు చెక్
సికింద్రాబాద్: ప్రయాణికుల దృష్టి మళ్లించి నగదు, నగలు ఎత్తుకెళ్తున్న ఓ ఘరానా ముఠా ఆట కట్టించారు గోపాలపురం పోలీసులు. నిందితుల నుంచి 105 తులాల బంగారు నగలు, 370 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ ఆర్.జయలక్ష్మి, గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్ ప్రాంతాల్లో మహిళా ప్రయాణికుల నగల చోరీతో పాటు జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో నిందితులను పట్టుకొనేందుకు ఉత్తర మండలం ఎస్ఐలు ఎంఎస్వీ కిషోర్, భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించిన ఈ బృందం.. రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న నిందితులు నలుగురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్‌లో నివాసముండే ఆవుల గణేష్ అలియాస్ ఆకుల రాజు (40) పాత నేరస్తుడు. ఎనిమిదేళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దృష్టి మళ్లించి చోరీలు, జేబుదొంగతనాలు చేస్తున్నాడు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన మరో నిందితురాలు దుర్గ (35) ఇదే తరహా నేరాలు చేస్తోంది. ఇటీవల బోయిన్పల్లి పోలీసులు దుర్గను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, జైలు నుంచి బెయిల్ విడుదలైన ఆవుల గణేష్ తన తరహాలోనే దోపిడీలకు పాల్పడే దుర్గతో పాటు అనంతపురం పట్టణానికి చెందిన గొల్ల సురేష్ (25), బలిజ ప్రశాంత్‌కుమార్ (28)తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళల వద్ద దుర్గ అపహరించిన నగలను గణేష్ బృందం బయటికి తరలిస్తుంది. గణేష్ బృందం మహంకాళి, గోపాలపురం, మార్కెట్, బోయిన్పల్లి, మారేడుపల్లి, కార్ఖానా, బొల్లారం పోలీస్స్టేషన్ల పరిధిలోని బస్టాప్‌ల్లో చోరీలకు పాల్పడింది. నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కిలో 50 గ్రాముల (105 తులాలు) బంగారు ఆభరణాలు, 370 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
తస్మాత్ జాగ్రత్త
సాక్షి, కర్నూలు: అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్ను కర్నూలు జిల్లాపై పడిందా..? దీనికి నిఘా వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. సినిమాను తలపించేలా వీరి వ్యూహం ఉంటోందని అనుమానిస్తున్నారు. వీరు ప్రాంతాలను పంచుకుని మరీ దొంగతనాలకు పాల్పడుతుండడం.. పని పూర్తిచేసుకుని ఎంచక్కా తిరిగి విమానాల్లో తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్న వైనం జిల్లా పోలీసులను దిగ్భాంతికి గురిచేస్తోంది. దొంగల కదలికలు పోలీసు యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. మాఫియా గ్యాంగ్‌లాగా దోపిడీ దొంగలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టడంతో కళ్లు తిరిగే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలను లక్ష్యంగా చేసుకుని అంతర్ రాష్ట్ర ముఠాలు భారీ దోపిడీలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో గత కొంతకాలం నుంచి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ప్రాంతాలు, పరిసరాలతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ తమ వంతు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. అయితే వీటిపై జరుపుతున్న దర్యాప్తులో కర్నూలు పోలీసు యంత్రాంగానికి విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ తమ చేతివాటం చూపేందుకు సిద్ధమైన దొంగల ముఠాలు.. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు వినిపిస్తుండగా.. దీనికి వెనుక భారీ నెట్వర్క్ ఉందన్న విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉత్తర భారతదేశానికి చెందిన పలువురు నేరగాళ్లు ఈ తంతు వెనక కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతుండగా.. అందులోనూ మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన వ్యక్తులు సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. వీరంతా గతంలో పలు కేసుల్లో నిందితులు కాగా, ఇప్పుడు బృందాలుగా ఏర్పడి దోపిడీలకు తెగబడుతున్నట్లు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బెంగళూరు నుంచి అపరేషన్! దోపీడీ దొంగల ముఠా సభ్యులు బెంగళూరు నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నేరాల్లో ఆరితేరిన గ్యాంగ్‌లోని సభ్యులంతా దొంగల ముఠాలుగా ఏర్పడి ఇలా వరుస చోరీలకు దిగుతున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను కొల్లగొట్టాలనే క్రమంలో దొంగలు విమానాలను సైతం ఆశ్రయిస్తున్నారన్న విషయం పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రాయానికి చేరుకుంటున్నవారు, సమీప ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నారు. అక్కడి నుంచి పక్కాగా వ్యూహాన్ని రూపొందించుకున్న అనంతరం రాయలసీమ జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఇందుకు బెంగళూరు, దేవనహళ్లి విమానాశ్రయాలను వీరు తమ రాకపోకలకు అనువుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన సూత్రధారులు బెంగళూరు కేంద్రంగానే రాకెట్ నడుపుతుండగా.. ముఠాలు మాత్రమే సీమ జిల్లాల్లో తిరుగుతున్నాయి. తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగిన కొన్ని గొలుసుకట్టు దొంగతనాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్కడి దొంగతనాల తీరుతెన్నులు, నేరగాళ్ల చేతివాటం ఆధారంగా పరిశీలిస్తే ఉత్తర భారత ముఠాల కార్యకలాపాలుగా స్పష్టమైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. సదరు ముఠాల సభ్యులు చాలా తెలివిగా నిఘా కెమెరాలకు సైతం దొరకకుండా, వేలిముద్రలు దొరక్కుండా దోపిడీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బృందాలు తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. వీఐపీల ఇళ్లు, భారీ షాపింగ్ మాల్స్, ప్రధాన వాణిజ్య కేంద్రాలను లూటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిఘా పెంచాం: కర్నూలు జిల్లాలో ఉత్తర భారత నేరగాళ్ల కదలికలు ఉన్న మాట వాస్తవమే. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిఘా పెంచాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలతో జల్లెడ పడుతున్నాం. ముఖ్యంగా బ్యాంకులు, పెట్రోల్ బంకులు, మాల్స్ వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. అనుమానితుల వివరాలను సేకరిస్తున్నాం. - ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ -
చోరీ ముఠా అరెస్ట్, 13 తులాల బంగారం స్వాధీనం
హైదరాబాద్: నగరంలో దొంగతనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చోరీలకు పాల్పడే వారు ముఠాలగా ఏర్పడి అందినకాడికి దోచు కెళుతున్నారు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించడం, ఆపై ఆ ఇళ్లలో చొరబడి చోరీలకు పాల్పడటం ఈ ముఠాలకు అలవాటైంది. ఇలాంటి ఘటనలు నగరంలో ఏదోచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్, సైదరాబాద్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకూ ఈ చోరీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 13తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
దొంగల ముఠా స్వైరవిహారం
తాండూరు,న్యూస్‌లైన్: తాండూరు పట్టణంలో తాజా గా మరో రెండు చోరీలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈనెల 20న ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి నివాసం ఎదురుగా కిరాణ వ్యాపారి చంద్రయ్య ఇంట్లో చోరీ చేసిన రోజు రాత్రే మరో రెండు ఇళ్లలోనూ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు ఇళ్లలో కలిపి రూ.90వేల నగదుతోపాటు రూ.12.5 తులాల బంగారు ఆభరణాలను దుండగలు అపహరించుకుపోయారు. మొత్తం సుమారు రూ.4.65లక్షల సొత్తు చోరీకి గురైంది. నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోట్ల రూ.11.65లక్షల సొత్తును దోచుకెళ్లారు. మెకానిక్ ఇంట్లో... పట్టణంలోని భవానీ నగర్లో నివసించే మహ్మద్ ఇస్మాయిల్ భార్య, కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 19న మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం దుద్యాలలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి ఇంటికి రాగా చోరీ జరిగినట్లు గుర్తించా రు. ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఉన్న మరో ద్వారం గొళ్లెం పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాలను పగులగొట్టి బట్టలన్నీ చిందరవందరగా పడేశారు. రూ.80వేల నగదు, 3.5 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. కిరాణ వ్యాపారి ఇంట్లో... పట్టణంలోని సాయిపూర్ యాదిరెడ్డి చౌక్ సమీపంలో నివసించే కిరాణ వ్యాపారి నరేందర్ ఈనెల 21న తన చిన్నకూతురు జన్మదిన వేడుకలను విశాఖపట్నంలో జరుపుకునేందుకు 19న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. దుండగులు ఇంటి ప్రధాన ద్వారానికి వేసిన తాళాన్ని పగుల కొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను పగులగొట్టి సుమారు 9తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు అపహరించుకుపోయారు. విశాఖపట్నం నుంచి నరేందర్ కుటుంబసభ్యులతో సోమవారం మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చే సరికి తాళం పగుల కొట్టి ఉండటంతో చోరీ వెలుగులోకి వచ్చింది. అర్భన్ సీఐ సుధీర్‌రెడ్డి, ఎస్ఐ రవికుమార్ చోరీల తీరును పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కిరాణ వ్యాపారి ఇంటి గేట్ వద్ద పోలీసులకు లభించిన లుంగీ, కువైట్ పేరుతో ఉన్న ఒక బాక్స్ తనవిగా మెకానిక్ ఇస్మాయిల్ గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ ప్రారంభం... మూడు చోరీల తీరును పరిశీలిస్తే ఒకే విధంగా ఉండటంతో ఇది ఒకే దొంగల ముఠా పని అని పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటక దొంగల ముఠానే ఈ చోరీల కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈనెల 20 నుంచి పాత నేరస్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, సెల్ఫోన్లో ఎవరితో మాట్లాడారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దొంగల ముఠాకు స్థానికంగా సహకారం అందించడం వల్లే పక్కాగా తా ళం వేసి ఇళ్లలో చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.