Greater
-
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్‌గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్‌గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
పార్కింగ్ కోసం గొడవ.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/iTA7e29Hu6 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి.. -
జనాభాలోనూ గ్రేటరే..! 140 దేశాల కన్నా హైదరాబాద్ జనాభా ఎక్కువ
హైదరాబాద్ జనాభా దాదాపు 140 దేశాల కంటే ఎక్కువ. చాలా దేశాల జనాభా కోటికి లోపు ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం లెక్కల మేరకు 2020లో కోటి కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 90 లక్షలపైన కోటి లోపు జనాభా ఉన్న దేశాలు ఆరు ఉన్నాయి. లక్ష జనాభా కంటే తక్కువగా జనాభా దేశాలు 35 ఉన్నాయి. మన దేశానికి వస్తే.. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే కూడా హైదరాబాద్ జనాభాయే ఎక్కువ. ఏదైనా రాష్ట్రం జనాభా అంటే కోట్లలో.. జిల్లా జనాభా అంటే లక్షల్లో ఉంటుందనేది మామూలే. కానీ మన గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా లక్షలనే కాదు.. కోటిని కూడా దాటేసింది. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా మేరకు గ్రేటర్ హైదరాబాద్ జనాభా ప్రస్తుతం 1.05 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి ఇది 1.08 కోట్లకు చేరనుంది. దేశంలో జనా భా లెక్కల గణాంకాల మేరకు.. వందేళ్ల క్రితం అంటే 1921లో హైదరాబాద్ జనాభా 4.05 లక్షలు. 2011 నాటి లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 67.31 లక్షలకు చేరింది. కరోనా కారణంగా 2021లో జనగణన నిర్వహించలేదు. అయినా సుమారు 82 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం తీసుకుంటే జన సంఖ్య కోటికి పైనే ఉంటుందని తేల్చారు. చదవండి: బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
∙వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షులు దుర్గేష్ మధురపూడి నుంచి భారీ కాన్వాయితో ఘనస్వాగతం పలికిన అభిమానులు దానవాయిపేట(రాజమహేంద్రవరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి డివిజన్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా నియామకం అనంతరం గురువారం నగరానికి వచ్చిన దుర్గేష్‌కు పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయి, మోటర్ సైకిళ్ల తో ర్యాలీగా ఆయన వెంట వచ్చారు. గాడాల, కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్ మీదుగా కంబాలచెరువు సెంటర్‌కు చేరుకుని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెలావారీ సమావేశాలు నిర్వహించి ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం చేస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టి పాలకుల వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళతామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చేలా పని చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, ఆచంట సుబ్బారాయుడు, ఆచంట కళ్యాణ్, గంటి నరసయ్య, సలాది ప్రసాద్, వెలుగుబంటి అచ్యుతరామయ్య, సాపిరెడ్డి సూరిబాబు, ముద్రగడ జమ్మి, యొజ్జు వాసు, చెరుకూరి సత్యనారాయణ, తాడేపల్లి గణేష్, తోరాటి శ్రీను, మెండా దత్తులు, యండ్ల మహేష్, మార్తి లక్షీ్మనాగేశ్వరావు, సిటీ, రూరల్ నియోజక వర్గాల నేతలు ఆయన వెంట ర్యాలీగా Ðð ంట వచ్చారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల అభినందనలు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా ఎన్నికైన కందుల దుర్గేష్‌ను ఆ పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకె సురేష్ గురువారం ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. -
విద్యుత్ వినియోగం పైపైకి..
గ్రేటర్లో 47.48 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ వాడకం మార్చి చివరినాటికి 60 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం వేసవిలో నిరంతరాయ సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ వినియోగం రోజురోజుకు మరింత పెరుగుతోంది. రెండు రోజుల క్రితం సిటీజనులు 47.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఫిబ్రవరి మొదటి వారంలో 40–42 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ వినియోగం..మూడో వారం నాటికి అదనంగా ఐదు మిలియన్ యూనిట్లు పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది వేసవిలో గరిష్టంగా 52–55 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈసారి 60 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది. భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డిస్కం ఇప్పటికే సర్కిళ్ల వారిగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఒత్తిడిని తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశారు. మార్చి తొలినాటికి పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని నిర్ణయించారు. ఒత్తిడి తట్టుకునేలా... హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్, రంగారెడ్డి సౌత్, రంగారెడ్డి నార్త్ సర్కిళ్ల పరిధిలో సుమారు 42 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 34 లక్షల గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, మిగిలినవి చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వచ్చే వేసవిలో వీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చాలంటే రోజుకు సగటున 60 మిలియన్ యూనిట్లకుపైగా అవసరం. రాబోయే ఒత్తిడిని తట్టుకుం టూ ఫీడర్లలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల నరికివేత, ఆయిల్ లీకేజీలను అరికట్టడం వంటి పనుల కోసం రూ.25 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. ఇప్పటికే సగం పనులు కూడా పూర్తి చేసినట్లు డిస్కం అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెబుతున్నారు. -
వైన్ షాపు.. వెల వెల..
• ‘గ్రేటర్’లో 60% పడిపోరుున మద్యం అమ్మకాలు • పాత నోట్ల కారణంగా బోసిపోయిన వైన్ షాపులు, బార్లు పెద్ద నోట్ల రద్దు గ్రేటర్లో మందుబాబులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. బుధ, గురువారాల్లో మహానగరం పరిధిలోని 300మద్యం దుకాణాలు, 571 బార్లలో మద్యం అమ్మకాలు 60% మేర పడిపోరుునట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణంలో కొనుగోలు కోసం వస్తున్న వారు రూ.500, రూ.1,000 నోట్లను తీసుకువస్తుండడంతో దుకాణదారులు ఆ నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో 50 నుంచి 60 శాతం మంది మద్యం కొనకుండానే తిరిగి వెళ్లిపోతున్నారని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి కటాన్ల కొద్ది మద్యం కొనుగోలు చేసేవారు సైతం దిక్కులేకపోవడంతో దుకాణాలు వెలవెలబోతున్నారుు. కోఠి రంగ్‌మహల్ చౌరస్తాలోని బగ్గా వైన్సలో ఈ రెండు రోజుల్లో 40% అమ్మకాలు మాత్రమే జరిగినట్టు దుకాణం యజమానులు తెలిపారు. హైదరాబాద్ వైన్ షాపుల నిర్వాహకులు వంద నోట్లు ఉంటేనే మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కొన్ని దుకాణాల్లో మాత్రం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా అమ్మకాలు సాగుతున్నారుు. మద్యం ప్రియులకు డెబిట్, క్రెడిట్ కార్డుల వల్ల మద్యం సీసాలు దొరుకుతుండడంతో వారు కొంత ఊరట చెందుతున్నారు. వైన్ షాపు నిర్వాహకులు సైతం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రం ఆహ్వానించి కార్డు స్వైప్ చేసుకుని మద్యం బాటిళ్లను వారి చేతుల్లో పెడుతున్నారు. బార్లు సైతం వెలవెల.. పెద్ద నోట్ల రద్దుతో బార్లు కూడా వెలవెలబోతున్నారుు. బారు వద్ద పార్కింగ్ నుంచి మొదలుకుని వెరుుటర్ వరకు వంద నోట్లు ఉన్నాయా అని మందుబాబులను ముందే ప్రశ్నిస్తున్నారు. బారులో బిల్లు వందల నుంచి వేల రూపాయల వరకు అరుునా దర్జాగా కట్టి వెరుుటర్కు ఓ వంద టిప్పు ఇచ్చే వాళ్లను సైతం వంద నోటు ఉంటేనే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దీంతో చాలా బార్లు మందుబాబులు లేక వెలవెలబోతున్నారుు. -
సకాలంలో మెట్రో పూర్తి
ఎల్అండ్టీ మెట్రో రైల్ డిప్యూటీ ఎండీ సుబ్రమణ్యన్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మెట్రో రైల్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సకాలంలో పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రో రైల్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టులో 67 శాతం పనులు పూర్తయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో పనులకు ఎదురవుతున్న ఆటంకాలను గుర్తించి వాటిని అత్యున్నత స్థాయిలో పరిష్కరిస్తున్నామన్నారు. తద్వారా పనుల జాప్యం లేకుండా చూస్తున్నామన్నారు. నాగోల్-రహేజా ఐటీపార్క్, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మెట్రో ప్రాజెక్టును 2018 డిసెంబరులోగా పూర్తిచేస్తామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతి ఇలా... * నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్ఆర్నగర్ రూట్లో మొత్తం 20 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు వీలుగా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ పత్రాలు అందాయి. * ఇప్పటికే 59 కి.మీ. మార్గంలో పునాదులు, 56.61 కి.మీ. మార్గంలో పిల్లర్లు, 35.70 కి.మీ. మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించేందుకు ట్రాక్ సిద్ధమైంది. హా అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్గ్రౌండ్స్ల వద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. * మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో 57 మెట్రో రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. * భరత్‌నగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మరో 7 ఆర్ఓబీల పని శరవేగంగా జరుగుతోంది. * సుల్తాన్‌బజార్, మలక్‌పేట్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో పనులు ఊపందుకున్నాయి. -
కేన్సర్ మందుల తయారీలో ‘గ్రేటర్’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వివిధ రకాల కేన్సర్ల మందుల తయారీకి రాజధాని గ్రేటర్ నగరం చిరునామాగా నిలుస్తోంది. నగరంలో 500కి పైగా అతిపెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోని నిత్యం ప్రతి ముగ్గురు వ్యక్తులు వాడేమందుల్లో ఒకరు వాడేవి హైదరాబాద్‌లో తయారైన మందులే. నగరంలో తయారవుతున్న పలు అరుదైన డ్రగ్స్ అమెరికా, యూరప్, ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాలకు ఎగుమతవుతున్నాయి’ అని ఇన్నోవేట్ -16 కన్వీనర్, పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్, డాక్టర్ వి. రామమోహన్ గుప్తా తెలిపారు. రవీంద్రభారతిలో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఇస్పోర్ ఇండియా తెలంగాణ చాప్టర్ సంయుక్తంగా జాతీయ ఔషధ విధానంపై అంతర్జాతీయ సదస్సు(ఇన్నోవేట్-16) నిర్వహించాయి. సదస్సులో పాల్గొన్న రామమోహన్ సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యాంటీ కేన్సర్ డ్రగ్స్ ఎక్కువగా హైదరాబాద్‌లోని పరిశ్రమల్లోనే తయారు చేస్తారని తెలిపారు. ఇక్కడ ప్రధానంగా బల్క్ డ్రగ్స్, ఫార్మేషన్ డ్రగ్స్ తయారు చేస్తారన్నారు. రెడ్డీస్, హెటిరో వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మెడిసిన్‌ను తయారు చేయటంలో పేరెన్నిక గన్నవన్నారు. కొన్ని కంపెనీలు యాంటీ సైకో మెడిసిన్‌ను కూడా ఇక్కడ తయారు చేస్తుండటం విశేషంగా చెప్పవచ్చని తెలిపారు. ముగిసిన అంతర్జాతీయ సదస్సు యూజ్‌ఫుల్ నేషనల్ మెడికల్ పాలసీ(జాతీయ ఔషధ విధానం) పై రెండు రోజుల పాటు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సదస్సు గురువారం ముగిసిందని డాక్టర్ రామమోహన్ తెలిపారు. ఇందులో మలేసియా, థాయ్‌లాండ్ నుంచి మూడు వర్సిటీ ప్రతినిధులు పాల్గొని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చే శారని తెలిపారు. మలేసియా టైలర్స్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ పీటీ థామస్ సేప్‌రేషనల్ అపాడ్ బుక్ గుడ్ క్వాలిటీ డ్రగ్స్ అనే అంశంపై చేసిన ఉపన్యాసం ఫార్మసీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకారిగా ఉండబోతుందని చెప్పారు. మలేసియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జోరియా అజీజ్ ప్రత్యేకంగా మెటా అనాలిసిస్‌పై చేసిన ప్రసంగం ఫార్మసీ విద్యార్థులకు ఒక చరిత్రగా మిగిలిపోతుందన్నారు. ఐటీ పార్కు సిటీకి ఒక వైపు ఉన్నట్లుగానే ఫార్మా హబ్ కూడా శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్నదని రామమోహన్ గుప్తా తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు మందుల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన 12 మంది ఫార్మసీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారని ఆయన చెప్పారు. సదస్సు ముగింపు సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఫార్మసీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ ఔషధ విధానంపై నిర్వహించిన పోస్టర్ల ప్రదర్శన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. -
గ్రేటర్ లో ‘కేరళ మోడల్’ రోడ్లు
♦ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే ♦ 20 నుంచి 50 భాగాలుగా రోడ్ల విభజన ♦ నేటి వర్క్‌షాప్‌లో నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్లో రహదారుల దుస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏటా మరమ్మతుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఈ అవస్థలను ఇటీవలే గవర్నర్ నరసింహన్, మునిసిపల్ మంత్రి కేటీఆర్‌లు కూడా వీక్షిం చారు. వివిధ ప్రభుత్వ శాఖల నడుమ సమన్వ య లేమి, పనుల నాణ్యతపై శ్రద్ధ లోపించడం, ఎప్పుడు పడితే అప్పుడు .. ఎక్కడ పడితే అక్క డ తవ్వకాలు తదితరమైనవి ఇందుకు కారణాలని కేటీఆర్ గుర్తించారు. నగర రోడ్లను బాగు చేసేందుకు అవసరమైతే కొత్త విధానాల్ని అవలంభిస్తామని ఆరోజే ప్రకటించారు. వివిధ విభాగాల అధికారులు, నిపుణులతో గురువా రం జరుగనున్న వర్క్‌షాప్‌లో అన్ని అంశాలు పరిశీలించి ఈమేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా నగరంలో రోడ్ల నిర్వహణను రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రతిపాదనలు గతంలోనూ వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. గతంలో కృష్ణబాబు కమిషనర్‌గా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణను ప్రయోగాత్మకంగా ప్రైవేట్‌కు అప్పగించాలని భావించారు. కానీ అమలు కాలేదు. రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లకే డిఫెక్ట్ లయబిలిటీ కింద రెండేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలుండాల్సినప్పటికీ పట్టించుకోవడం లేరు. బీటీ రోడ్లు వర్షానికి నిలవవు కనుక ఏమీ చేయలేమని తప్పించుకుంటున్నారు. ఈపరిస్థితి నివారణకు ఐదు, పది, పదిహేనేళ్ల వరకు రోడ్ల నిర్వహణను కాంట్రాక్టర్లకే అప్పగించే ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంతో మంచి ఫలితాలున్నట్లు గుర్తించారు. అక్కడ కొన్ని రోడ్లను ప్రైవేటు నిర్వహణకిచ్చారు. వాటితో మంచి ఫలితాలు కనిపించడంతో గ్రేటర్‌లోనూ ఆవిధానాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నారు. నగరంలో దాదాపు 9 వేల కి.మీ.లమేర రహదారులున్నాయి. 625 చ.కి.మీ.ల విస్తీర్ణంలోని నగరాన్ని 20 నుంచి 50 యూనిట్ల వరకు విభజించి ఒక్కో యూనిట్ వంతున రోడ్ల నిర్వహణను కాంట్రాక్టుకిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేసే రోడ్డు బీటీయా, సీసీయా, వైట్టాపింగా అన్నదాంతో సంబంధం లేకుండా సాఫీ ప్రయాణానికి మన్నికగా ఉండే రోడ్లను నిర్మించే సంస్థ నిర్ణీత కాలవ్యవధి వరకు నిర్వహణ బాధ్యత వహించాలి. గడువు ముగిసేంత వరకు రోడ్ల నిర్వహణ పూర్తి బాధ్యత వారికే అప్పగిస్తారు. -
ఆన్లైన్ లుక్... అక్రమాలకు చెక్!
గ్రేటర్లో ఇక ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు * జూన్ 1 నుంచి అమలు * లేఔట్ అనుమతులు కూడా.. * 'టౌన్‌ప్లానింగ్’లో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే... * అవకతవకలకు అడ్డుకట్ట పడే అవకాశం సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. వచ్చేనెల (జూన్) ఒకటో తేదీ నుంచి భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్ అనుమతుల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఆన్లైన్ ద్వారానే అనుమతుల్ని జారీ చేయనున్నారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఈ దరఖాస్తులను సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తు అందజేశాక సైతం అనుమతుల కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్‌పెట్టేందుకు, పారదర్శక సేవల కోసం ఆన్లైన్ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆటో డీసీఆర్ సాఫ్ట్వేర్ వినియోగంతో వచ్చే ఒకటో తేదీనుంచి ఆన్లైన్ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ విధానంలో మొదట ఆటో డీసీఆర్ ద్వారా ఆటోక్యాడ్‌లో ప్లాన్‌ను రూపొందించి, సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తుల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఏవైనా లోటుపాట్లుంటే ప్రాథమిక దశలో ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. తద్వారా ఉద్యోగులకు సమయం కలిసి రావడమే కాక, నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం ఉంటుంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పుణేకు చెందిన సాఫ్టెక్ సంస్థ రూపొందించింది. ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలు ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సహకారం పొందవచ్చు. ఇందుకుగాను వారికి ఈనెల 6వ తేదీన భవననిర్మాణ, లే ఔట్ల అనుమతుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న లెసైన్సుడ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ అవ గాహన కార్యక్రమం ఉంటుందని కమిషనర్ తెలిపారు. సులభతరమైన పరిపాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ అప్రూవల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన వందరోజుల ప్రణాళికలోనూ ఈ కార్యక్రమం ఉంది. దీంతోపాటు జీహెచ్ఎంసీలో ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా ఈ- ఆఫీస్ ప్లస్‌ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దాదాపు ఏడాదిగా ఈ- ఆఫీస్ అమల్లో ఉన్నప్పటికీ, అది కేవలం అధికారులకు మాత్రమే పరిమితమైంది. ఈ-ఆఫీస్ ప్లస్‌తో ప్రజలు కూడా తమ ఫైలు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. విశ్వనగరంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌కు సైతం కొత్త హంగులద్దారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో తాజాగా ‘ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్‌సిటీ’ అనే నినాదం కొత్తగా దర్శనమిస్తోంది. వెబ్సైట్లో గతంలో లేని పింక్ కలర్‌ను చేర్చారు. ప్రయోజనాలెన్నో.. ⇒ ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించడం వల్ల దరఖాస్తు ఏ రోజు, ఏ సమయంలో సమర్పించింది స్పష్టంగా తెలుస్తుంది. ⇒ దరఖాస్తుతోపాటు జతపరచాల్సిన పత్రాలు జత చేయలేదనేందుకు, ఎవరైనా మాయం చేసేందుకు ఆస్కారం ఉండదు. ⇒ భవనం విస్తీర్ణానికి అనుగుణంగా సెట్బ్యాక్లు తదితరమైనవి ప్లాన్‌లో సరిగ్గా ఉన్నదీ లేనిదీ సాఫ్ట్‌వేరే గ్రహిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లేనివాటిని తిరస్కరిస్తుంది. తద్వారా అధికారులకు పనిభారం తగ్గుతుంది. సమయం కలసి వస్తుంది. అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. ⇒ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ లేదని కొర్రీలు వేస్తూ , ప్రజలను పదేపదే తిప్పేందుకు అవకాశం ఉండదు. ⇒ దరఖాస్తు ఎప్పుడు ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే వీలు. ⇒ దరఖాస్తు పరిశీలన పూర్తయి, అనుమతి జారీ అయితే ⇒ ఆ విషయం సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. ఈమెయిల్ ద్వారాను తెలుస్తుంది. ఎక్కడైనా ఫైలు ఎక్కువ రోజులు ఉంటే, ఆ విషయం పైఅధికారులకు తెలుస్తుంది. తద్వారా జాప్యం తగ్గుతుంది. ⇒ 30 రోజుల నిర్ణీత వ్యవధిలో అనుమతుల జారీకి అవకాశం. ⇒ నిర్లక్ష్యం కనబరుస్తూ, జాప్యం చేసే అధికారులకు పెనాల్టీలు వేసేందుకు వీలు. ⇒ 30 రోజుల్లోగా ఫైలు పరిష్కారమో, తిరస్కారమో తెలుస్తుంది. -
ఆర్టీసీ బస్సుల ‘బ్రేక్’ డ్యాన్స్
♦ ఎక్కడికక్కడే నిలిచిపోతున్న ఆర్టీసీ బస్సులు ♦ ప్రతిపాదనలకే పరిమితమైన మొబైల్ వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ ప్రతిపాదనలు ఆరంభశూరత్వమే అనిపిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లపై చెడిపోయి ఇటు ప్రయాణికులను, అటు వాహనచోదకులను సిటీ బస్సులు బెంబేలెత్తిస్తున్నాయి.రోడ్డెక్కిన బస్సు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో చెడిపోతుందో తెలియ ని పరిస్థితి నెలకొంది. బ్రేక్డౌన్స్ను అధిగమించేందుకు డిపోస్థాయిలోనే పూర్తిస్థాయి మరమ్మతులన్నారు.. రోడ్డుపై చెడిపోయిన బస్సుకు క్షణాల్లో రిపేరింగ్లన్నారు.. మొబైల్ మెకానిక్ కేంద్రాలన్నారు.. ఇవన్నీ ప్రతిపాదనలే.. ప్రణాళికలే.. ఆచరణలో మాత్రం అంతా శూన్యం. ఫలితంగా ఎప్పటిలాగే బస్సులు చెడిపోతున్నాయి. ప్రతి నెలా 200 నుంచి 300 బస్సులు రోడ్లపైనే ఆగిపోతున్నాయి. కాలం చెల్లిన వెయ్యికి పైగా డొక్కు బస్సులు గ్రేటర్ ఆర్టీసీ నష్టాలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతా ప్రహసనం ప్రతి రోజూ పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. మెట్రో పనుల వల్ల రహదారులు కుచించుకుపోవడం, అదే మార్గాల్లో బ్రేక్‌డౌన్స్ కారణంగా బస్సులు నిలిచిపోవడంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం బస్సుల్లో వెళ్లే ప్రయాణికులే కాకుండా, సొంత వాహనాలు, ట్యాక్సీలు, ఆటోలు వంటి వాటిల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్లపైనే నిలిచిపోవలసి వస్తోంది. బ్రేక్‌డౌన్స్ నియంత్రణ కోసం క్షణాల్లో బస్సు వద్దకు చేరుకొనే మొబైల్ రిలీఫ్ వాహనాలు, బైక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. విడిభాగాలు, మెకానిక్‌లతో కూడిన 6 మెబైల్ రిలీఫ్ వాహనాలు ట్రాఫిక్ రద్దీకి దారితీసే, మెట్రో పనులు జరుగుతున్న కోఠీ, లకిడికాఫూల్, ఎల్బీనగర్,ఈఎస్ఐ,లింగంపల్లి,సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడా వాటి జాడ కనిపించడం లేదు. రోజుకు 10 నుంచి 15 బస్సులు బ్రేక్‌డౌన్... గ్రేటర్లో 28 డిపోల నుంచి ప్రతి రోజు 3850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్ధ్యం లేనివి. నాణ్యతలేని విడిభాగాల కారణంగా చెడిపోయేవి రోజూ 10 నుంచి 15 బస్సులు ఉంటాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయం నిలిచిపోయినట్లే. ఈ లెక్కన 2500 కిలోమీటర్ల నుంచి 3750 కిలోమీటర్ల వరకు సర్వీసులు నిలిచిపోతున్నాయి. జీతభత్యాలు, ఇంధనభారం, విడిభాగాల కొనుగోళ్లు వంటి వివిధ కారణాల వల్ల రోజూ రూ.కోటి నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆర్టీసీకి ఇది మరింత ఆజ్యం పోస్తోంది. ఆక్యుపెన్సీ పడిపోతోంది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ రూ.289 కోట్ల నష్టాలను ఎదుర్కొంటోంది. వీటిలో ఏసీ బస్సులతో పాటు, కాలం చెల్లిన డొక్కు బస్సుల వల్ల నమోదైనవే ఎక్కువగా ఉన్నాయి. హడావిడి చేశారు... వదిలేశారు... అప్పట్లో ఎల్బీనగర్ నుంచి పటాన్చెరు వెళ్లే బస్సు ఒకటి పంజగుట్ట చౌరస్తాలో చెడిపోయింది. ఎలక్ట్రానిక్ డివైజ్ కంట్రోలర్ చెడిపోయినట్లు డ్రైవర్ గుర్తించాడు. దాంతో బస్సు అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి. క్షణాల్లో రెండు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు బస్సును అతి కష్టంగా పక్కకు తప్పించారు. ఆ మరుసటి రోజే అమీర్‌పేట్ మైత్రీవనవం వద్ద ఇదే తరహాలో మరో బస్సు చెడిపోయింది. రెండు చోట్ల ట్రాఫిక్ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ట్రాఫిక్ నిర్వహణలో కొరకరాని కొయ్యగా మారిన సిటీబస్సుల బ్రేక్డౌన్స్పై ఆర్టీసీ అధికారులు ఎంతో హడావిడి చేశారు. కానీ అంతా మూణాళ్ల ముచ్చటగానే మారింది. తిరిగి బ్రేక్‌డౌన్స్ సమస్య మొదటికొచ్చింది. ఇదీ పరిస్థితి నగరంలోని మొత్తం బస్సులు 3850 డిపోలు 28 ప్రయాణికులు 33 లక్షలు 2014 ఏప్రిల్-సెప్టెంబర్ వరకు బ్రేక్‌డౌన్స్ : 1596 (నెలకు సగటున 266 చొప్పున) 2015 ఏప్రిల్-సెప్టెంబర్ వరకు: 2100 (నెలకు సగటున 350 చొప్పున) 2016 జనవరి,ఫిబ్రవరి నెలల్లో సుమారు: 500 బస్సులు -
గ్రేటర్లో 9 బస్తీల్లో ‘డబుల్’ ఇళ్లు
రూ.150 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని తొమ్మిది బస్తీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ.. టెండర్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా నగరంలో 46 బస్తీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించినప్పటికీ.. పలు కారణాల రీత్యా ఈ బస్తీల సంఖ్యను 30కి కుదించారు. గ్రేటర్లో లక్ష ఇళ్ల నిర్మాణంలో భాగంగా సత్వరమే 9 బస్తీల్లో 2,158 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించటానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సయ్యర్ సాహాబ్ బాడలో జీ ప్లస్ త్రీ భవనాలు(అంతస్తులు), పిల్లిగుడిసెలు, సరళాదేవినగర్, కామ్గారి నగర్, లంబాడీ తండా, హమాలీ బస్తీ, చిలుకలగూడ, ఇందిరానగర్, జంగంమెట్ బస్తీల్లో జీప్లస్ 9 భవనాల(అంతస్తులు)లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడానికి సత్వరమే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని ఒక ప్రాంతంలో 2,300 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, మెదక్‌లో తొమ్మిది ప్రాంతాల్లో 6,385 ఇళ్లు, నిజామాబాద్‌లో తొమ్మిది ప్రాంతాల్లో 6,245 ఇళ్లు, ఆదిలాబాద్‌లోని ఒక ప్రాంతంలో 218 ఇళ్లు, కరీంనగర్లో 14 చోట్ల 5,447 ఇళ్లు, ఖమ్మంలో రెండు చోట్ల 2,022 ఇళ్లు, వరంగల్‌లో మూడు ప్రాంతాల్లో 1,784 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడానికి టెండర్ల కోసం పరిపాలన అనుమతులు మంజూరీ ఇస్తూ... ఆయా జిల్లాల గృహ నిర్మాణ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. -
గ్రేటర్ లో ఓటేసిన ప్రముఖులు
-
ముగిసిన గ్రేటర్ ప్రచార పర్వం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన ప్రచారపర్వం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మంగళవారం జరగనున్న పోలింగ్‌లో హైదరాబాద్ మహానగర ఓటర్లు 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నగర వ్యాప్తంగా 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఐదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
నగర అభివృద్ధి బాధ్యత నాదే: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే సత్తా ఒక్క టీఆర్ఎస్కే ఉందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం గ్రేటర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తప్పించి చేసిందేమీ లేదన్నారు. ఒక్క అవకాశం ఇస్తే హైదరాబాద్ నగర రూపురేఖలే మార్చేస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తే నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. -
'ప్రభుత్వ పథకాలు ఆపుతామంటున్నారు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలను నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం చివరిరోజు గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న ఆయన అబద్ధాలతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శింఆచరు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపుతామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీని ఒవైసీ కుటుంబానికి, న్యూ సిటీని కేసీఆర్ కుటుంబానికి రాసేసుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. -
ఉండేదెవరు?.. ఊడేదెవరు?
-
'టీఆర్ఎస్' ఓడితే రాజీనామా చేస్తా
-
ఎన్నికల్లో ముమ్మర ప్రచారం
-
ప్రభుత్వం ఎవరిపైనా విపక్ష చూపడంలేదు
-
ప్రచారానికి నేడు శ్రీకారం
-
గ్రేటర్ డిబేట్..
-
బీజేపీ శ్రేణులు గ్రేటర్లో ప్రతీ ఓటరును కలవాలి: దత్తాత్రేయ
బీజేపీ అభ్యర్థులకు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతీ ఓటరును కలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రేటర్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉందని, అధికార టీఆర్ఎస్కు బలం లేక ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులను డివిజన్ల బాధ్యతలు అప్పగించి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రచారం చేయాలని అభ్యర్థులకు దత్తాత్రేయ సూచించారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప ఆచరణలో అభివృద్ధిని, అమలును చూపించడం లేదని టీఆర్ఎస్ను కిషన్‌రెడ్డి విమర్శించారు. -
గల్లీల నోట.. గెలుపు పాట
►గ్రేటర్లో ఇవే కీలకం ►ఓటు బ్యాంకులుగా వినియోగం ►మౌలిక సదుపాయాలకు దూరం సిటీబ్యూరో: వాళ్లు ఉన్న ఇళ్లు... కిల్లీ కొట్ల కన్న సిన్నగున్నయీ... గల్లీ సిన్నది...’ అంటూ సాగిపోయే గోరటి ఎంకన్న పాట సంగతి ఎలాగున్నా... ఇప్పుడు ఈ గల్లీలే గ్రేటర్ దశను, దిశను మలుపు తిప్పబోతున్నాయి. కోటికి చేరువైన గ్రేటర్ జనాభాలో ఎంతోమంది ఈ ఇరుకు గల్లీల్లోనే జీవనం సాగిస్తున్నారు. రాజకీయ పార్టీల హామీలకు, వాగ్దానాలకు, మేనిఫెస్టోలకు మధ్య తరగతి, ఆ పై వర్గాల కంటే ఎక్కువగా ప్రభావితమయ్యేది... ఆకర్షితులయ్యేదీ ఇక్కడి జనాభాయే. ఏ పార్టీ నేత తమ ప్రాంతానికి వచ్చినా సాదరంగా ఆహ్వానించి... ముందు వరుసలో నిలుచొని జెండాలు మోసేదీ... నినాదాలు చే సేదీ ఈ గల్లీలే. అందుకే అన్ని రాజకీయ పార్టీల దృష్టి వీటిపై పడింది. కాలనీలు, అపార్ట్మెంట్ల కంటే గల్లీలను నమ్ముకుంటేనే కాసిన్ని ఎక్కువ ఓట్లు రాలుతాయనే ఆశ కావచ్చు. తమ హమీలను నమ్మేసి... ఓట్లేసేదీ గల్లీలే అనే ధీమా కావచ్చు.కానీ మొత్తంగా అటు వామపక్షాల నుంచి ఇటు పాలక పక్షాల వరకు అన్ని పార్టీలూ గల్లీల కే జైకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లీల సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.... అమలుకు నోచని హామీలు స్వచ్చంద సంస్థలు, హక్కుల సంఘాల సర్వేల ప్రకారం నగరంలో మొత్తం 2,200 మురికివాడలు ఉన్నాయి. వీటిలో 1,492 బస్తీలను ప్రభుత్వం గుర్తించింది. 30 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ఇరుకు గల్లీల్లో, బస్తీల్లో అనేక సమస్యల మధ్య జీవిస్తున్నారు. దినసరి కూలీలుగా, చిరు వ్యాపారులుగా, ఇళ్లలో పనులు చేస్తూ, ఆటోలు, ట్రాలీలు నడుపుతూ బతుకుతున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ర్టం మొదలుకొని ఇప్పటి ప్రత్యేక రాష్ర్టం వరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్‌ను మురికివాడల రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించినవే. ఏళ్లు గడుస్తున్నాయి... ఎన్నికల పైన ఎన్నికలు వస్తూనేఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులైన గల్లీల బతుకులు మాత్రం మారడం లేదు. కనీస సదుపాయాలు కరువు మురికివాడల ప్రజల ప్రధాన సమస్య పారిశుద్ధ్య లోపం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ఎన్ని వచ్చినా గల్లీల్లో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. మంచినీటి కొరత, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదు. వందలకొద్దీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ మరుగుదొడ్లు, తగినన్ని తరగతి గ దులు, ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నాయి. నగరంలో ఒకవైపు పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తరిస్తున్నాయి. మరోవైపు పేదల బస్తీల్లోని పాఠశాలలు విచ్ఛిన్నమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల వేళ అనేక హామీలతో మేనిఫెస్టోలను ముద్రించుకొని గల్లీల్లోకి ప్రవేశిస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు బస్తీ వాసుల కనీస సదుపాయాలపై దృష్టి సారించవలసి ఉంది. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించవలసి ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 95 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైద్యులు, నర్సులు లేరు. మందులు లేవు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు కూడా లేవు. మొత్తంగా గల్లీల్లో సర్కారీ వైద్యం శిథిలమైపోతోంది. దీంతో ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా జనం ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆస్పత్రులకు వెళ్లవలసి వస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు,తలనొప్పి వంటి చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు గర్భిణులు రక్తహీనతకు గురికాకుండా అందజేయవలసిన ఐరన్ మాత్ర లూ అందుబాటులో ఉండడం లేదు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిరోధించి, స్కూల్‌కు పంపించే దిశగా కృషి చేయవలసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పక్కా భవనాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలూ సక్రమంగా పని చేయడం లేదు. కార్యరూపం దాల్చని హాకర్స్ పాలసీ... నగరంలోని అనేక బస్తీలు ఏళ్ల క్రితమే తమ ఉపాధికి అనుగుణంగా ఏర్పాటయ్యాయి. మార్కెట్లను, ప్రధాన కూడళ్లను ఆశ్రయించుకొని మూసీకి అటూ.. ఇటూ ఇవి ఆవిర్భవించాయి. బస్తీల జనాభాలో ఎక్కువ శాతం వీధి వ్యాపారులే. మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, ఉస్మాన్‌గంజ్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మెహదీపట్నం, తదితర ప్రధాన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వీధి వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటు నాలుగు చక్రాల బండ్లతో వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి చిరు వ్యాపారులకు ‘స్ట్రీట్ వెండర్స్’గా గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు, సామాజిక భద్రత కల్పించే దిశగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హాకర్స్ పాలసీని రూపొందించింది. వీధి వ్యాపారుల సంఖ్యపై అప్పట్లో మెప్మా అనే సంస్థ సర్వే చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాలను ‘రెడ్, గ్రీన్, అంబర్’ రంగులతో హాకర్స్ జోన్‌గా విభజించారు. రెడ్జోన్లలో హాకర్స్ వ్యాపారం చేయడానికి వీల్లేదు. గ్రీన్ జోన్లో ఎప్పుడైనా అనుమతినిస్తారు. అంబర్ జోన్లలో నిర్ణీత వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. హాకర్స్ పాలసీ రూపొందించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటి వరకూ వారికి లెసైన్సులు ఇవ్వలేదు. దీంతో నిత్యం అభద్రతా భావంతో వారు వ్యాపారం కొనసాగిస్తున్నారు. మురికివాడలను ఓటు బ్యాంకులుగా పరిగణించే దృష్టితో కాకుండా వారి సమస్యల పరిష్కారం దిశగా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి. -
గ్రేటర్లో ఊపందుకున్న ప్రచారం
-
మెట్రో తొలి, మలిదశ మార్గాలిలా
మొదటి దశ మియాపూర్ - ఎల్బీనగర్ 29కి.మీ. జూబ్లీబస్‌స్టేషన్ - ఫలక్‌నుమా15 కి.మీ. నాగోల్ - రహేజాఐటీపార్క్ 28 కి.మీ. రెండో దశ ఎల్బీనగర్ - హయత్‌నగర్ 7 కి.మీ. మియాపూర్ - పటాన్చెరు 13 కి.మీ. ఫలక్‌నుమా - శంషాబాద్ 28 కి.మీ. తార్నాక - ఈసీఐఎల్ 7 కి.మీ. రాయదుర్గం-గచ్చిబౌలి-శంషాబాద్ 28 కి.మీ. గ్రేటర్ వాసుల కలల ప్రాజెక్టు... మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వనగరాల్లో ఉన్న 200 మెట్రో రైలు ప్రాజెక్టులకు భిన్నంగా నగరంలో అత్యాధునిక ప్రాజెక్టు ఈ ఏడాది ప్రథమార్థంలో అందుబాటులోకి రాబోతోంది. సుమారు రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో... ఈ ప్రాజెక్టు తొలిదశలో 72 కి.మీ మార్గంలో మూడు కారిడార్లలో పనులు చేపడుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ చెబుతోంది. కాగా రెండోదశ మార్గం ఐదు కారిడార్లలో 83 కి.మీ మార్గంలో ఏర్పాటుకానుంది. మెట్రో తొలి, మలిదశ మార్గాల వివరాలు గ్రాఫ్‌లో... -
భీమవరం నుంచి పోటీ చేస్తా!!
-
బీజేపీ- టీడీపీ మధ్య తేలని సీట్ల వ్యవహారం
-
దయనీయంగా మారిన టీడీపీ పరిస్థితి
-
‘గ్రేటర్’పై హైడ్రామా
-
'గ్రేటర్'లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: కేసీఆర్
-
'గ్రేటర్'లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: కేసీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం డివిజన్కొక ఎమ్మెల్యేతోపాటూ, నియోజ వర్గానికికొక మంత్రిని ఇంఛార్జ్‌గా కేసీఆర్ నియమించారు. -
గ్రేటర్ ఎన్నికలకు రెడీ
-
జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు ఇవీ..
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని షెడ్యూల్ తెగలు, కులాలు, మహిళలకు సంబంధించి రిజర్వేషన్లను కేటాయించింది. ఎస్టీ విభాగంలో మహిళ, జనరల్ కేటగిరిలో ఒక్కో వార్డును కేటాయించింది. ఎస్సీ విభాగంలో 8 వార్డులు జనరల్, నాలుగు వార్డులు మహిళలకు కేటాయించారు. కాగా బీసీలకు 33 వార్డులు జనరల్, 17 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. కాగా.. 28 వార్డులను జనరల్ మహిళలకు కేటాయించారు. మిగిలిన 58 వార్డులకు జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. ఆయా వార్డుల కేటగిరీలు ఇలా ఉన్నాయి: ఎస్టీ (జనరల్) అమీర్ పేట్ (99) ఎస్టీ (మహిళ) జంగమ్ మెట్ (26) ఎస్సీ (జనరల్) రాజేంద్రనగర్ (59), జియాగూడ (52) కవాడీగూడ (94), గచ్చిబౌలి (111), మచ్చ బొల్లారం (133), ఓల్డ్ మల్కాజ్ గిరి (139) మెట్టుగూడ (141), బన్సీలాల్ పేట్ (146) ఎస్సీ( మహిళ) అల్వాల్ (132), యాప్రాల్ (134), పద్మారావు నగర్ (145), అడ్డగుట్ట (150) బీసీ (జనరల్) మూసారంబాగ్ (18), చావ్ నీ (31), డబీర్ పురా (36), గౌలి పురా(41), ఆలియాబాద్(41), ఫతేదర్వాజా (46), బేగంబజార్ (50) గోషామహల్ ( 51), ధూల్ పేట (52), దూద్ బౌలి (54), రామ్‌నస్ పురా( 55), మైలార్ దేవ్ పల్లి( 58), మంగళ్ హాట్ (64), మురాద్ నగర్ (66), లంగర్ హౌస్ (69), టోలీ చౌకి (70), అహ్మద్ నగర్ (72), మల్లేపల్లి(75), సుల్తాన్ బజార్ (79), అంబర్ పేట (84), బాగ్ అంబర్ పేట్ (85), ఎర్రగడ్డ (102), రహ్మత్ నగర్ (107), శేరిలింగంపల్లి (112), హఫీజ్ పేట్ (113), చందానగర్ (114), పటాన్ చెరువు (116), గాజుల రామారం (125), జగద్గిరి గుట్ట (126), చింతల్ (127), షాపూర్ నగర్ (128), జీడిమెట్ల (130), సీతాఫల్ మండీ (142) బీసీ(మహిళ) ఫలక్ నుమా (43), నవాబ్ సాహిబ్ కుంట(44), జహానుమా(45), పురానా పూల్( 53), కార్వాన్(61), దత్తాత్రేయ నగర్ (63), ఆసిఫ్ నగర్(65), గుడిమల్కాపూర్(68), నానల్ నగర్(71), రెడ్ హిల్స్ (76), కాచిగూడ(82), రామ్ నగర్ (90), రామచంద్రాపురం(115), బౌద్ధనగర్ (143), చిలకల గూడ(144), రాంగోపాల్ పేట్ (147), మారేడ్ పల్లి (149), జనరల్ (మహిళ) ఉప్పల్ (5), మన్సూరాబాద్ (9), కర్మన్ ఘాట్(12), సరూర్ నగర్ (14), రామకృష్ణాపురం(15), గడ్డి అన్నారం(16), పీఅండ్ టీ కాలనీ(17), ఘన్సీ బజార్ (49), అత్తాపూర్ (60), విజయ్ నగర్ కాలనీ (73), చింతల్ బస్తీ(74), హిమాయత్ నగర్ (80), నల్లకుంట(87), అడిక్ మెట్(81), ముషీరా బాద్ (91), గాంధీనగర్ (93), దోమల్ గూడ(95), బల్కంపేట్(100), శ్రీనగర్ కాలనీ(104), బంజారాహిల్స్ (105), బోర బండ(108), జూబ్లీ హిల్స్ (109), డిఫెన్స్ కాలనీ(135), మౌలాలీ(136), సఫిల్ గూడ(137), గౌతమ్ నగర్ (138), తార్నాక (140), బేగంపేట్ (148) -
గ్రేటర్లో కనల్టెన్సీల మాయ..
-
'టీడీపీ పని అయిపోయింది'
హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కలుపుకుని పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీహెచ్ తెలిపారు. -
పార్టీల్లో 'స్థానిక' కలకలం
♦ రసవత్తరంగా మారుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల చిత్రం ♦ ఎంపీటీసీల ఆత్మగౌరవ పోరాటంతో అధికారపక్షంలో అలజడి ♦ టీఆర్ఎస్తో ‘అవగాహన’పై కాంగ్రెస్‌లో గందరగోళం ♦ అభ్యర్థులే దొరకని పరిస్థితిలో టీడీపీ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ వైపు పార్టీ ఫిరాయింపులు, మరోవైపు ఎంపీటీసీల ఆత్మగౌరవ పోరాటం, ఇంకోవైపు స్థానిక సంస్థల ప్రతినిధులకు పార్టీల తాయిలాలతో ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలకలం రేపుతున్నాయి. తమకు బలమున్న చోట కూడా గెలుస్తామో లేదోనన్న ఆందోళనలో అధికార పక్షంతో అవగాహనకు కాంగ్రెస్ తహతహలాడుతోంది. మహబూబ్‌నగర్ మినహా మరెక్కడా పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదు. దక్షిణ తెలంగాణలో మూడు నియోజకవర్గాలు మినహా కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. అటు ఖమ్మం లో సీపీఐకి మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయించిం ది. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా సీపీఐకి మద్దతు పలకాలని కాంగ్రెస్ స్థానిక నాయకత్వం యోచిస్తోంది. ఖమ్మంలో గుండుగుత్తగా మద్దతిస్తే తప్ప అవగాహన ఉం డదని టీఆర్ఎస్ మధ్యవర్తులు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ 'అవగాహన' పై విమర్శలు వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో డిపాజిట్ కో ల్పోయి ఘోర పరాజయం చవిచూసిన కాం గ్రెస్... 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార పార్టీతో అవగాహనకు ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇవి కాంగ్రెస్ పూర్తిగా భ్రష్టు పట్టడానికి కారణమవుతున్నాయంటూ పార్టీలోని మెజారిటీ నేతలు మండిపడుతున్నా రు. ఒకరిద్దరు మండలి ఎన్నికల్లో సులువుగా విజయం సాధించడం కోసం, మరో ముఖ్య నేత తన చిరకాల ప్రత్యర్థి (టీఆర్ఎస్ మండలి సీటు కోరుతున్న నేత)ని దెబ్బ తీయడం కోస మే ‘అవగాహన’ తెరపైకి వచ్చిందని మాజీ మంత్రి ఒకరు మండిపడుతున్నారు. వరంగల్ పరాజయం తరువాతైనా ముఖ్య నేతలు మార లేదని, వీరి ద్వారా పార్టీకి భవిష్యత్ ఉండదనేది ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆవేదన. గురువారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించినట్లు తెలిసింది. టీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకున్నా ఖమ్మంలో తమ మద్దతు సీపీఐకే ఉం టుందని ఆ జిల్లా ముఖ్య నేత ఒకరు చెప్పినట్టు సమాచారం. అభ్యర్థులే కరువు తమకు మెజారిటీ ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తప్ప మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీకి, మహబూబ్‌నగర్ మినహా మిగతా చోట్ల టీడీపీకి అభ్యర్థులు దొరకట్లేదు. కొందరు పోటీకి ముందుకొస్తున్నా పార్టీ నుంచి ఆర్థిక వనరులుంటేనే రంగంలోకి దిగుతామని స్పష్టం చేస్తున్నారు. ఇక టీడీపీ నాయకత్వం తీరు చూస్తుంటే... జిల్లాల్లో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో చేరుతున్నా వలసలు అరికట్టే ప్రయత్నమే చేయడం లేదు. మహబూబ్‌నగర్ నుంచి మాత్రం కొత్తకోట దయాకర్‌రెడ్డి పోటీ దాదాపుగా ఖాయమైంది. కాంగ్రెస్ విషయానికొస్తే నల్లగొండలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో రెండు సీట్లకు పోటీ చేయాలని డీకే అరుణ పట్టుపడుతుండగా... అవగాహనలో ఒకటి టీఆర్ఎస్కు ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఎంపీటీసీల ఆత్మగౌరవ నినాదం.. ప్రభుత్వం తమకు అధికారాలు అప్పగించడం లేదని ఎంపీటీసీలు కొంత కాలంగా రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటామంటూ ఎంపీటీసీల ఫో రం 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇది అధికార టీఆర్ఎస్కు ఇరకాటం తెచ్చిపెట్టడంతో వారిని పోటీ నుంచి తప్పించే మార్గాన్ని సీఎం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. ఎంపీటీసీల ఫోరం గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఆర్థిక మంత్రి ఈటలకు ఈ బాధ్యత అప్పగించినట్లు సమాచారం. వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని మంత్రి హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అప్పటికీ వారు వెనక్కితగ్గకపోతే గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఈటల హెచ్చరించినట్లు సమాచారం. -
'ఎంఐఎంతో మాకు సంబంధం లేదు'
హైదరాబాద్: గ్రేటర్ లో ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన రజతోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కారకర్తలు కృషి చేయాలన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని మోదీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేస్తోందని విమర్శించారు. దేశానికి నెహ్రూ, గాంధీ కుటుంబాలు చేసిన సేవలను తగ్గించే కుట్ర జరుగుతోందని ఉత్తమ్ అన్నారు. -
గ్రేటర్లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు
► తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ► ఓటర్ల సవరణను సద్వినియోగం చేసుకోండి.. తప్పులుంటే మార్చుకోండి ► నవంబర్ 4 వరకు ఓటర్ల సవరణ.. కొత్త ఓటర్లకు అవకాశం ► నియోజకవర్గాలవారీగా ముసాయిదా జాబితాల ప్రచురణ ► తెలంగాణలో 2.54 కోట్ల మంది, ఏపీలో 3.51 కోట్ల మంది ఓటర్లు ► ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల సవరణ.. కొత్త ఓటర్ల నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి మొదలైన ఈ ప్రక్రియ వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. షెడ్యూలు ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రచురించినట్లు చెప్పారు. తెలంగాణలో 2.54 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 3.51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. 2016 జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారని తెలిపారు. కొత్త ఓటర్లతో పాటు ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జాబితాల్లో ఉన్న ఓటర్లు తమ పేర్లు, చిరునామాల్లో మార్పులుంటే సవరించుకోవాలన్నారు. ఓటర్లు ఆన్లైన్లో తమ దరఖాస్తులు సమర్పించే వీలుందని, రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు అందించవచ్చని చెప్పారు. ఖాళీగా ఉన్న వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని నియోజకవర్గాలు, నారాయణ్ఖేఢ్ నియోజకవర్గంలోనూ ఓటర్ల సవరణకు వీలుందన్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలను పంపాలని కోరిందని, 3 రోజుల్లో పంపుతామని చెప్పారు. గ్రేటర్లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా 6.3 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు భన్వర్‌లాల్ చెప్పారు. వీరితో పాటు మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ జాబితాలను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామని, ఈ నెల 8 నుంచి ఇంటింటి సర్వే చేపట్టి వీటిని పరిశీలిస్తామన్నారు. పార్టీల తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను పంపించాలని కోరామని.. వారు సహకరిస్తే ఓట్ల తొలగింపుతో పాటు అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతవకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పారు. అకారణంగా ఓటర్లను జాబితాలో నుంచి తొలగించినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఓటర్ల జాబితాల్లో తమ పేరు తొలిగించినట్లు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని.. వారి పేర్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో ప్రత్యేక సవరణ ఈ నెల 11, నవంబర్ 1న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్ల సవరణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోనే బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని.. అక్కడే దరఖాస్తులు సమర్పించే వీలు కల్పించినట్లు చెప్పారు. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయా.. లేదా తెలుసుకునేందుకు వీలుగా పంచాయతీ కార్యాలయాలు, మండల రెవెన్యూ కార్యాలయం, డివిజన్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 8790499899 ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి ఓటు వివరాలను తెలుసుకునే వీలుందన్నారు. ఓట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తమ గుర్తింపు కార్డు నంబర్‌ను.. ఈ నంబర్‌కు పంపిస్తే క్షణాల్లోనే వివరాలు అందుతాయన్నారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు భన్వర్‌లాల్‌కు అఖిలపక్షం ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 6.30 లక్షల ఓట్లను తొలగించారని, మరో 19 లక్షల ఓటర్లకు నోటీసులు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. బతికి ఉన్న వారిని సైతం చనిపోయినట్లుగా చూపించి ఓట్లను గల్లంతు చేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్‌గా మారారని, తప్పులకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించినట్లుగా భన్వర్‌లాల్ దృష్టికి తెచ్చారు. ఓటర్ల సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తరఫున మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం నుంచి జాఫ్రీ, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నుంచి కె.శివకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోనే నిజామాబాద్ నంబర్‌వన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నందున ఓటర్ల నమోదుకు, సవరణకు ఆధార్‌తో సంబంధం లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఆధార్ సీడింగ్ నూటికి నూరు శాతం పూర్తయిందని భన్వల్‌లాల్ చెప్పారు. దేశంలోనే ఆధార్ సీడింగ్ పూర్తి చేసిన మొదటి జిల్లా నిజామాబాద్ అని తెలిపారు. -
కాలుష్య కోరలకు కత్తెర !
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న గ్రేటర్లో పర్యావరణ కాలుష్యం మోతాదు మించుతోన్న ప్రాంతాలపై ఇక నుంచి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) దృష్టి సారించనుంది. ప్రస్తుతం పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్ పరిధిలో పర్యావరణ కాలుష్యం అవధులు దాటుతుండడంతో గత కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలు, వాయు, జల, ఘన, భూగర్భ కాలుష్యం నమోదవుతున్న తీరుతెన్నులపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను పరిశీలించడంతోపాటు నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తగు సలహాలు, సూచనలు అందజేస్తోంది. ఇక నుంచి ఈ జాబితాలో మరిన్ని ప్రాంతాలు చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కూకట్పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో నమోదవుతున్న వాయు, జల కాలుష్య నివేదికలను ప్రతి ఆరు నెలలకోమారు సీపీసీబీ నిపుణులు పరిశీలించనున్నారు. సీపీసీబీ పర్యవేక్షణ ఇలా... పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాల్లో జల, వాయు కాలుష్యంపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా రాష్ట్ర పీసీబీకి సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సర్కారు నుంచి ఈ నివేదికలను స్వీకరించిన సీపీసీబీ నిపుణులు వివిధ కాలుష్య కారకాల మోతాదును మరోసారి ప్రైవేటు ల్యాబ్‌ల సౌజన్యంతో పరీక్షిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ కాలుష్య సూచీ(సెపీ) ఆధారంగా కాలుష్య ఉద్గారాల తీవ్రతను లెక్కగడతారు. దీని ప్రకారం సూచి 55 పాయింట్లు దాటిన ప్రాంతాల్లో అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలుగా, సూచీ 70 దాటిన పక్షంలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న నమోదయ్యే ప్రాంతాలుగా గుర్తించి ప్రకటిస్తాయి. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు కాలుష్య ఉద్గారాల కట్టడికి తీసుకున్న చర్యలు, జీరో లిక్విడ్ డిశ్ఛార్జీ(తక్కువ కాలుష్యం విడుదల)కు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలు, సూచనలు సీపీసీబీ అందిస్తుంది. ఎంత మోతాదులో.. గతంలో పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్పరిధిలో సూచీ 70.07గా నమోదైనట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరోవైపు కూకట్పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాల్లోనూ సూచీ 55 పాయింట్లకు మించి నమోదయ్యేఅవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామన్నాయి. తాజాగా రూపొందించే నివేదిక ఆధారంగా ఆయాప్రాంతాల్లో ఎంత మోతాదులో కాలుష్యం నమోదవుతుందో తెలుస్తుందని వెల్లడించాయి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశాలున్నాయని స్పష్టం చేశాయి. -
గులాబీ కండువా? కాషాయ తీర్థమా?
అంతర్మథనంలో టీటీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదంటున్న నేతలు టీఆర్ఎస్, బీజేపీల వైపు చూపులు కంటోన్మెంట్ ఫలితాలతో గ్రేటర్‌పై కూడా సడలిన నమ్మకం పార్టీ మారే యోచనలో మరికొందరు ఎమ్మెల్యేలు, జిల్లాల నాయకులు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు న మ్మడం లేదని ఆ పార్టీ నాయకులు నిర్ధారణకు వచ్చారా..? భవిష్యత్తులో పార్టీకి పునాదులు లేకుండా పోతాయని భయపడుతున్నారా? తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీనే చూస్తున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితిని చూస్తే అదే నిజమనిపిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ టీడీపీనే టార్గెట్‌గా చేసుకొని తెలంగాణలో ఆంధ్రపార్టీలకు స్థానం లేదని చెపుతూ ఆ దిశగా పావులు క దుపుతున్నారు. దానికి తోడు చంద్రబాబు తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు.., కరెంటు, సాగునీరు, ఎంసెట్ తదితర విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణలో ఆ పార్టీ నేతలకు సైతం రుచించడం లేదు. ఇప్పటి వరకు టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న కొన్ని వర్గాల ప్రజలు కూడా బాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తుండడంతో దాన్ని కేసీఆర్ తనకు అనువుగా మలచుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తింది. టీడీపీ కరడుగట్టిన నేతలుగా పేరు పొందిన తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర్ రావు వంటి నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ మినహా మరో ప్రాంతీయ పార్టీకి ఇక్కడ స్థానం లేదనే సంకేతాలను పంపించారు. దీంతో ప్రస్తుతం పార్టీలో మిగిలిన టీడీపీ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. పలు నియోజకవర్గాల ఇన్చార్జులు, పార్టీ ముఖ్య నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్లో చేరే అవకాశం లేని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ బలపడుతుందని భావిస్తున్న నాయకులు కాషాయ జెండా పుచ్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్‌లు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ నేతలతో చర్చిస్త్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ కొందరు బీజేపీ వైపు దృష్టి పెట్టినట్లు సమాచారం. మిగతా ఎమ్మెల్యేల్లో ఎందరు ఉంటారో? రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో తన పట్టు పెంచుకుంది. మొన్నటి ఎన్నికల వరకు టీడీపీ బలంగా కనిపించిన హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు సైతం ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరుతున్నాయి. ఎల్బీనగర్ నుంచి గెలిచి, పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కష్ణయ్య బీసీలంతా కలిసొస్తే సొంతపార్టీ ఏర్పాటు చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా లేని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల్లో రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్లోకి వెళ్లే అవకాశాలు లేవు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని పార్టీ మారాలని ఆ నియోజకవర్గ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా పార్టీ మారే విషయాన్ని సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అక్కడ జరగబోయే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత భవితవ్యం తేల్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని పదిమంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరు పార్టీ మారగా, మరో ఐదుగురు టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఫలితాలతో డీలా! గ్రేటర్ హైదరాబాద్‌లో తాజా కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లాయి. కంటోన్మెంటులోని 8 వార్డుల్లో బీజేపీ, టీడీపీ కూటమి పోటీ చేసింది. ఐదు వార్డుల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేయగా, పార్టీ కార్యాలయం నుంచి ఒక్కో వార్డుకు రూ. 50 లక్షల వరకు అందినట్టు తెలిసింది. రెండున్నర కోట్లు ఖర్చు చేసినా ఐదింటిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. టీఆర్ఎస్, ఆపార్టీ రెబెల్స్ ఏకంగా 6 వార్డుల్లో విజయం సాధించడంతో టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారు. జీహెచ్ఎంసీలో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా మొన్నటి వరకు పనిచేసిన సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇక ముషీరాబాద్ ఇన్చార్జి ఎం.ఎన్. శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. -
కొవ్వుకేక
గ్రేటర్‌లోని ప్రతి ఆరుగురిలో ఒకరికి అధిక బరువు సమస్య ‘కొవ్వు కరిగింపు’లో సిటీ టాప్ ఒబెక్యూర్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: ఊబకాయం... మోసేవారికే కాదు... చూసేవారికీ ఇబ్బంది కలిగించేది. ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఇది. ఒబెక్యూర్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధ పడుతుంటే, గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఆరుగురు పెద్దవాళ్లలో ఒకరు, ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక రు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ప్రతి ఏడుగురు బాధితుల్లో ఒకరు 100 కేజీలకు పైగా బరువు ఉన్నవారే. బాధితుల్లో 65 శాతం మహిళలు ఉంటే, 35 శాతం పురుషులు ఉంటున్నారు. ఇక్కడే కరిగించుకుంటున్నారు తగ్గిన శారీరక శ్రమ.. నిశిరేయిలో విందులు, వినోదాలు.. పిజ్జాలు, బర్గర్లు... వెరసి శరీరంలో కొవ్వు కొండలా పేరుకుపోతోంది. పీల గా ఉన్న వారిని సైతం పీపాలా తయారు చేస్తున్నాయి. దీంతో త్వరగా సన్నబడాలనే కాంక్షతో సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిష్ణాతులైన వైద్యులు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య పరికరా లు హైదరాబాద్‌లో అందుబాటులో ఉ న్నా యి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వైద్య ఖర్చులు కూడా ఇక్కడ తక్కువ. దీంతో నగర వాసులే కాకుండా టాంజానియా, ఇథియోపియా, కెన్యా దేశీయులు సైతం గ్రేటర్ వైద్యులనే ఆశ్రయిస్తుండటం విశేషం. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2012-13లో దేశ వ్యాప్తంగా 6వేల శస్త్రచికిత్సలు జరిగితే, అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 800కు పైగా నిర్వహించారు. ఢిల్లీలో నెలకు 50, ముంబైలో 40, గ్రేట ర్లో 70కిపైగా ఆపరేషన్లు జరుగుతున్నా యి. 1400 కేలరీలు చాలు అవసరమైన దానికంటే అధిక ఆహారం తీసుకోవడం, దాని ద్వారా లభించే కేలరీలు ఖర్చయ్యే స్థాయిలో శారీరక శ్రమ లేకపోవడం సమస్యగా మారింది. ప్రాసెస్డ్ ఆహారం, పిజ్జాలు, బర్గర్లు విరివిగా లభిస్తున్నాయి. వీటిని ఒకసారి తింటే చాలు.. ఆ రోజుకు సరిపడే కేలరీలు లభిస్తాయి. ఇవి ఎంత త్వరగా విడుదలవుతాయో అంతే త్వరగా జీర్ణమవుతాయి. ఇవి ఖర్చుకాకపోతే బరువు పెరుగుతుంది. రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2300-2500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారు 1400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్‌ఫుడ్ తీసుకుంటే శరీరంలో అదనంగా కేలరీలు పోగవుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయం ఓ తీవ్రమైన జబ్బు కాకపోయినా.. పరోక్షంగా ఇది మధుమేహం, గుండెపోటు, మోకాలి నొప్పులు, హైపర్‌టెన్షన్, మిహ ళల్లో సంతానలేమి, రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తుంది. మితాహారమే ఉత్తమం సాధ్యమైనంత వరకు బరువు పెరుగకుండా చూసుకోవాలి. నిత్యం కనీసం అరగంటైనా వ్యాయమం చేయాలి. పరిమితికి మించి ఆహారం తీసుకోవద్దు. మాంసాహారం, మద్యంపై నియంత్రణ ఉండాలి. లైపోసక్షన్, బెరియాట్రిక్ సర్జరీలు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. కాస్మోటిక్ సర్జరీల వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. - డాక్టర్ మహిధర్ వల్లేటి, బెరియాట్రిక్ సర్జన్, నోవా స్పెషాలిటీ ఆస్పత్రి లైపొసక్షన్ సర్జరీ శరీరంలోని కొవ్వును రెండు పద్ధతుల్లో తొలగిస్తారు. ఇందులో మొదటిది లైపొసక్షన్ సర్జరీ. ఇది కాస్మోటిక్ సర్జరీ. ఇంజక్షన్ సాయంతో శరీరంలోని కొవ్వును తొలగిస్తారు. ఈ చికిత్సలో ఫలితం చాలా త్వరగా ఉంటుంది. ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత.. మళ్లీ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సినీ తారలు ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత కొవ్వును తీసేసిన ఖాళీ ప్రదేశంలోకి నీరు చేరి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెరియాట్రిక్ సర్జరీ రెండోది బెరియాట్రిక్ సర్జరీ. ఇది 1950 నుంచి అందుబాటులో ఉంది. గతంలో పొట్టను పూర్తిగా కోసి కొవ్వును తొలగించేవారు. తాజాగా ల్యాప్రోస్కోపిక్ విధానంతో పొట్టపై చిన్న కోతపెట్టి, జీర్ణకోశం సైజును తగ్గిస్తారు. శరీరంలోని కొవ్వునంతా ఒకేసారి తొలగింకుండా రోజు వారీ వ్యాయామం, ఆహార నియంత్రణతో నెమ్మదిగా బరువును తగ్గిస్తారు. తొమ్మిది నెలల్లో 60-70 శాతం కొవ్వు దానంతటదే శరీరంలో కరిగిపోతుంది. కేవలం బరువే కాకుండా బీపీ, షుగర్, నొప్పులు కూడా తగ్గుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. -
కాంట్రాక్టర్లే సైంధవులు
ఆపరేటర్ల ఎంపికలో డీఈలు, కాంట్రాక్టర్ల మధ్య వివాదం వినియోగానికి దూరంగా21 సబ్స్టేషన్లు ప్రజలకు తప్పని లోఓల్టేజీ కష్టాలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సబ్ స్టేషన్లు లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. వీటి నిర్వహణ విషయంలో కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య తలెత్తిన వివాదం ప్రజలకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆపరేటర్ల నియామకం విషయమై ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో సబ్ స్టేషన్లు ఎందుకూ కొరగాకుండాపోతున్నాయి. చంపాపేట్, ఆల్మాస్‌గూడ, నాదర్గుల్, బైరమల్గూడ, ఇంజాపూర్, సాహెబ్‌నగర్, వనస్థలిపురం, బాలాజీన గర్, ఎన్ఎన్నగర్, సైనిక్‌పురి కాలనీ, చింతల్, ఎర్రకుంట, మామిడిపల్లి, మాతశ్రీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, జేటీపీఎల్, నిజాంపేట్, మియాపూర్, హయత్‌నగర్, వ సంతపురి, మల్కజ్గిరిలలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ సబ్ స్టేషన్లు నేటికీ రీ చార్జికి నోచుకోలేదు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన లైన్స్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి అక్రమార్కులకే వంతపాడుతుండటం కొసమెరుపు. ముందుకు కదలని పనులు గ్రేటర్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్-ఏపీడీఆర్పీ కింద తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీఎస్పీడీసీఎల్)కి రూ.806.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.143.84 కోట్లతో 64 సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. 2014 చివరికి పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతలో 19 సబ్స్టేషన్లు నిర్మించి, సేవలను వినియోగంలోకి తెచ్చింది. రెండో విడతలో 21 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. పనులు పూర్తి కావడంతో ట్రయల్న్ రకూడా చేశారు. ఇదంతా పూర్తయి ఎనిమిది నెలలైనాఇప్పటి వ రకు వినియోగంలోకి తీసుకురాలేదు. డీఈలపై కత్తిగట్టిన కాంట్రాక్టర్లు సబ్స్టేషన్ల నిర్వహణ కోసం ఆపరేటర్ల నియామకానికి రంగారెడ్డి లైన్స్ విభాగం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆపరేటర్ల ఎంపికలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు డిస్కం కొన్ని నిబంధనలు విధించింది. ఐటీఐ పూర్తి చేసిన స్థానిక యువకులనే ఆపరేటర్లుగా ఎంపిక చేయాలని సూచించింది. ఇలా చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అక్రమాలకు తావుండదని అధికారుల అభిప్రాయం. అ క్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది కాంట్రాక్టర్లకు ఇది మింగుడు పడలేదు. ఈ నిబంధనను ఎత్తివేయాలని కొందరు కాంట్రాక్టర్లు డీఈలపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు లొంగకపోవ డంతో వారిపై కత్తిగట్టారు. తమ పలుకుబడినిఉపయోగించి, అధికారుల యత్నాన్ని అడ్డుకునే పనిలో పడ్డారు. ఇంతలో మరికొంతమంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించి, పనులను నిలిపివేయించడంతో సబ్ స్టేషన్లు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. గ్రేటర్‌కు మంజూరైన 33/11కేవీ సబ్స్టేషన్లు : 64 తొలి దశలో పూర్తయినవి : 19 రెండో దశలో పూర్తయినవి : 21 వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నవి : 24 విద్యుత్ డిమాండ్... 2006లో : 1538 మెగావాట్స్ 2010లో : 1881 మెగావాట్స్ 2014లో : 2500 మెగావాట్స్ గ్రేటర్లో విద్యుత్ వినియోగదారుల సంఖ్య... 2006లో : 24.12 లక్షలు 2010లో : 29.75 లక్షలు 2014లో : 38 లక్షలు -
రేపే మహాయాత్ర
గ్రేటర్ నగరం ఆధ్యాత్మిక సాగరమైంది. వీధివీధినా విభిన్న రూపాల్లో వినాయకుడిని కొలువుదీర్చిన జనం తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పూజలు... భజనలు... సాంస్కృతిక కార్యక్రమాలతో గణేశుని మండపాల పరిసరాల్లో సందడి నెలకొంది. శనివారం నాటికి తొమ్మిది రోజులు పూర్తి కావడంతో భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనం చేశారు. మేళతాళాలు.. డప్పుల దరువులు.. విచిత్ర వేషధారణలతో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, దుర్గం చెరువుల్లో గణేశ నిమజ్జనం పూర్తి చేశారు. మరోవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాగణపతి కొలువైన ఖైరతాబాద్ పుణ్యక్షేత్రాలను తలపించింది. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది విశ్వరూప మహాగణపతిని దర్శించుకున్నారు. ఒక్క శనివారమే 2 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అంచనా. నిమజ్జనానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఆదివారం సుమారు 3-4 లక్షల మంది ఖైరతాబాద్‌కు తరలి రానున్నారని అంచనా. మరోవైపు సోమవారం మహా గణపతితో పాటు సామూహిక నిమజ్జనానికి విగ్రహాలను తరలించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల ఉత్సవ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ఇలా.. 30 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 800 సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. 605 సమస్యాత్మక ప్రాంతాలుగా, 310 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 410 మొబైల్ పార్టీలు ముందుజాగ్రత్త చర్యగా 30 బాంబ్ డిస్పోజబుల్ బృందాలను ఏర్పాటు చేశారు. మండపాల నుంచి విగ్రహాలను లారీల్లోకి ఎక్కించేందుకు 71 మొబైల్ క్రేన్లను వినియోగిస్తున్నారు. రద్దీ ప్రాంతాలైన రైల్వే, బస్సు స్టేషన్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌తోపాటు వాహనాల తనిఖీలను నిమజ్జనం పూర్తయ్యే వరకు చేపడతారు. నగరానికి చేరుకున్న విశాఖపట్నం నేవీకి చెందిన గజ ఈతగాళ్లు అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిపి గత నెల 28 నుంచి చార్మినార్ వద్ద గల సర్దార్మహల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కొనసాగిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌తోపాటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌పై ఉన్న గాంధీనగర్ ఔట్‌పోస్టు వద్ద పోలీసు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కూడా జనం వచ్చే అవకాశం. నగరంలో మొత్తం 23 వేల గణేశ్ విగ్రహాలను నెలకోల్పారు. మూడు, ఐదు, ఏడో రోజుల్లో పలు విగ్రహాలను నిమజ్జనం చేయగా సామూహిక నిమజ్జనానికి మరో ఏడు వేల వరకు మిగిలి ఉన్నాయి. సైబరాబాద్‌లో.. 9,400 మందితో బందోబస్తు ఇందులో ఏడుగురు డీసీపీలు, 25 మంది ఏసీపీలు, 90 మంది సీఐలు, 490 మంది ఎస్ఐలు ఉన్నారు. బాంబ్ స్వ్కాడ్స్ 109 చోట్ల వాహనాల తనిఖీలు 312 చోట్ల పికెట్స్, 112 మొబైల్ పార్టీలు 57 పిక్ యాక్షన్ టీమ్‌లు 51 క్రైమ్ కంట్రోల్ టీమ్‌లు 30 ప్లటూన్ల స్పెషల్ పోలీస్ -
విశ్వనగరానికి...రోడ్ మ్యాప్
రూ.10 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి తొలి దశలో రూ.150 కోట్ల వ్యయం అనుమతి కోసం సర్కారుకు జీహెచ్ఎంసీ లేఖ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్...ఇందులో భాగంగా నగరంలోని రహదారులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలివిడతగా 30-40 కి.మీ.ల మేర రహదారులను తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూ.150 కోట్లతో పనులకు సిద్ధమయ్యారు. పరిపాలనపరమైన అనుమతులు ఇవ్వాల్సిందిగా శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. రూ.10 వేల కోట్లతో రహదారులు నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ నగరాల తరహాలోరహదారుల నిర్మాణంతో పాటే కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,ల ఇరువైపులా పచ్చదనం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు, పబ్లిక్ టాయ్లెట్లు, బస్షెల్టర్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్లో బస్సులు ప్రయాణించే ప్రధాన రహదారులు 1100 కి.మీ. ఉన్నాయి. ఇందులో వెయ్యి కిలోమీటర్ల పనులకు అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ పనులకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. టెండర్ దక్కించుకునే సంస్థలు కనీసం ఐదేళ్ల పాటు రోడ్డు నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి సైతం ఈ అంశానికి ప్రాధాన్యమివ్వడంతో ఏ మార్గాల్లో పనులు చేయాలో గుర్తించే పనిలో పడ్డారు. ఈ పనులకు కన్సల్టెంట్స్ సేవలను తీసుకోనున్నారు. ఏ మార్గంలో ఎలాంటి డిజైన్ ఉపయుక్తమో కన్సల్టెంట్స్ తమ నివేదికతోపాటు అందజేస్తారు. పనుల పూర్తికి మూడేళ్లు పడుతుందని అంచనా. డక్టింగ్లో ఏర్పాటు చేసే కేబుళ్లకు కేబుల్ సంస్థల నుంచి చార్జీలు వసూలు చేస్తారు. నాలాల అభివృద్ధికి మరో రూ. 10వేల కోట్లు రహదారులతో పాటు మరో రూ. 10 వేల కోట్లతో నాలాల ఆధునీకరణ పనులు చేపడతామని క్రెడాయ్ ప్రాపర్టీషోలో కేసీఆర్ హామీ ఇచ్చారు. నాలాల అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చవుతాయని కన్సల్టెంట్స్ సంస్థలు గతంలో నివేదించాయి. దాదాపు 1500 కిలోమీటర్ల మేర నాలాల ఆధునికీకరణ పనులు జరగాల్సి ఉంది. జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా మంజూరైన రూ.266 కోట్లు కూడా జీహెచ్ ఎంసీ ఖర్చు చేయలేకపోయింది. భూసేకరణ ఇబ్బందులతో ఈ పనులు ముందుకు కదల్లేదు. వీటినీ జాతీయ/అంతర్జాతీయ సంస్థలకు అప్పగించనున్నట్లు సమాచారం. -
జనమే జనం
సర్వే చిత్రం శివారుల్లో పెరుగుతున్న జనాభా వలసలతో పెరుగుతున్న కుటుంబాలు విద్యా సంస్థలూ ఓ కారణమే ఉద్యోగం కోసం...ఉపాధి కోసం వలస వచ్చేవారికి మేమున్నానంటూ గ్రేటర్‌లోని శివారు ప్రాంతాలు ఆశ్రయమిస్తున్నాయి. అక్కునచేర్చుకుంటున్నాయి. గూడు కల్పిస్తున్నాయి... ఫలితంగా ఆ ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది. అదీ మామూలుగా కాదు... జెట్ స్పీడుతో. ఇదేదో అంచనాతో చెబుతున్న మాట కాదు.. సమగ్ర కుటుంబ సర్వే సాక్షిగా వెల్లడైన వాస్తవం. నగరంలో భారమైన అద్దెలు...పెరుగుతున్న కాలుష్యం...వెరసి జనాలను శివారు బాట పట్టిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో గడచిన మూడేళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో దాదాపు రెండింతలైంది. కోర్ సిటీ కంటే శివార్లలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఎల్బీనగర్లో మూడేళ్ల క్రితం 1,39,419 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం అవి 2,26,796కు చేరాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లిల్లోనూ గణనీయంగా కుటుంబాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్‌లో గతంలో 94,875 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 1.80 లక్షలకు చేరాయి. అంటే సంఖ్య దాదాపు రెట్టిం పైంది. కూకట్‌పల్లిలో 1,27,655 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 2,10, 343కు పెరిగాయి. సగటున కుటుంబానికి నలుగురిని లెక్కేసుకున్నా నాలుగు లక్షల జనాభా పెరిగింది. ఉప్పల్ సర్కిల్లో మాత్రం పెరుగుదల స్వల్పంగా నమోదైంది. గతంలో 41,188 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 6,441 కుటుంబాలు పెరిగి, మొత్తం 47,629కు చేరుకున్నాయి. శేరిలింగంపల్లి-2, మల్కాజిగిరి సర్కిళ్లలో 40 వేలకు పైగా పెరిగాయి. చాలా కుటుంబాల వారు ఉమ్మడిగా ఉంటున్నప్పటికీ.. జనగణనలో విడివిడిగా నమోదు చేయించుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేయించుకోని పక్షంలో భవిష్యత్‌లో గ్యాస్, పాస్‌పోర్టు వంటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయేమోననే తలంపుతో ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. కోర్‌సిటీలోని ఖైరతాబాద్, అబిడ్స్ వంటి సర్కిళ్లలో పెరుగుదల పెద్దగా లేదు. వలస వచ్చే కుటుంబాలు.. జీవనోపాధి కోసం వచ్చేవారు శివారుల్లోనేఎక్కువగా ఉంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. శివార్లలో లెక్కకు మిక్కిలి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు కూడా అక్కడ జనాభా పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. పిల్లల చదువుల కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. కోర్‌సిటీలో అద్దెల భారంతో పాటు కొత్త నిర్మాణాలు లేనందున అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టం కావడంతో నగరానికి వలస వచ్చేవారు శివార్లకే మొగ్గు చూపుతున్నారు. -
గ్రేటర్లో పాగాకు టీఆర్ఎస్ కుయుక్తులు
ఎంఐఎంతో పొత్తుకు.. గ్రేటర్‌ను ముక్కలు చేసేందుకు ఎత్తులు బీజేపీ కార్యవర్గ సమావేశంలో నేతల ధ్వజం సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సత్తాలేక ఎంఐఎంతో జతకట్టి గ్రేటర్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోందని, ఇందులో భాగంగానే మజ్లిస్‌కు అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తోందని బీజేపీ శాసన సభాపక్ష నేత, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసేందుకు పూనుకున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 21, 22 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్లో నగర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మణ్ మాట్లాడుతూ అమిత్‌షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు నగర శాఖ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ కార్పొరేషన్‌ను మూడుగా విభజించి హైదరాబాద్‌ను ఎంఐఎం కైవసం చేసుకునే దశగా ఆ పార్టీ ఎత్తులు వేసిందని విమర్శించారు. తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రాజముద్రలో చార్మినార్ ఉండేలా చేసిందన్నారు.గ్రేటర్‌ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తే మరో 6 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కార్యకర్తలంతా సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంఐఎం ఆశీస్సుల కోసం మహా నగరాన్ని మూడు ముక్కలు చేయాలని టీఆర్ఎస్ ఆతృతగా ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలవని ఎంఐఎం సాయంతో గ్రేటర్లో పాగా వేయాలనే ఉత్సుకత కేసీఆర్‌లో కనపడుతోందని ఎద్దేవా చేశారు. సర్వేతో నగరం ఖాళీ రాష్ట్ర పరిధిలో లేని విషయాల్లో సీఎం జోక్యం చేసుకోవడం సమంజసం కాదని బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆక్షేపించారు. ఈనెల 21న సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రేటర్ బీజేపీ ఆధ్వర్యంలో స్వాగత సన్మాన సభ, 22న గ్రామ అధ్యక్షులతో ఎల్బీనగర్లోని మున్సిపల్ స్టేడియంలో సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్రాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి శ్రీనివాస్, బన్వర్‌లాల్ వర్మ, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
78 ఎఫ్‌ఓబీలు, సబ్‌వేలు
జీహెచ్ఎంసీకి ‘ట్రాఫిక్’ ప్రతిపాదనలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు/ సబ్‌వేల ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. అవసరమైన ప్రాంతాలను సూచిస్తూ ప్రతిపాదనలు పంపాలని ట్రాఫిక్ పోలీసులను కోరింది. 78 ప్రాంతాల్లో పాదచారులకు ఇబ్బందులున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు సదరు జాబితాను జీహెచ్ ఎంసీకి అందజేశారు. దీనిపై అధ్యయనానికి జీహెచ్ఎంసీ త్వరలో టెండరు పిలవనుంది. కన్సల్టెంట్ల నివేదికకనుగుణంగా వీటిని ఏర్పాటు చేస్తారు. ఎక్కడెక్కడంటే.. సంగీత్, బోయిన్పల్లి, తాడ్‌బండ్, ప్యారడైజ్, తాడ్బన్, బోయిన్పల్లి, టోలిచౌకి (టెంపుల్), నానల్‌నగర్ జంక్షన్లు, రేతిఫైలి బస్టాప్, చిత్రదర్గ, శ్రీకార్ ఉపకార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ చౌరస్తా, చిక్కడపల్లి పిల్లల పార్కు, అబిడ్స్ జీపీఓ, చర్మాస్, హిమాయత్‌నగర్ వీధినెంబరు 9, వీధినెంబరు 6, లిబర్టీ, లక్డీకాపూల్ లక్కీ హోటల్-అయోధ్య జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డునెం. 45, బంజరాహిల్స్ రోడ్డునెంబరు 1/12, ఎంజే మార్కెట్, కోఠి ఆంధ్రాబ్యాంక్, సుల్తాన్‌బజార్ గాంధీ జ్ఞానమందిర్, ఐఎస్ సదన్, సైబర్ గేట్‌వే, కూకట్పల్లి బస్టాప్, కేపీహెచ్‌బీ బస్టాప్, మియాపూర్, విప్రో సర్కిల్, మాదాపూర్ వీఆర్ నగర్, చందానగర్, నిజాంపేట, మూసాపేట, నర్సాపూర్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ రింగ్రోడ్డుకిరువైపులా, సరూర్‌నగర్ సాయిబాబా గుడి, అష్టలక్ష్మి ఆలయం, బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్, జీవీకేమాల్ రోడ్‌నెం 1, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా, ట్యాంక్‌బండ్‌పై రెండు చోట్ల, బాలానగర్ జంక్షన్, సరోజిని కంటి ఆస్పత్రి, షాదాన్ కాలేజి, ఎంజీబీఎస్, కొండాపూర్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, బీహెచ్ఈఎల్ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఉప్పల్ బస్టాప్, ఉప్పల్, ఉప్పల్ రింగురోడ్డు, వనస్థలిపురం ఎన్జీఓ కాలనీ, హయత్‌నగర్ బస్టాప్, బీఎన్ రెడ్డి నగర్, సాగర్ రింగ్‌రోడ్డు, జేబీఎస్, విక్రంపురి, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ బస్టాప్, వెంకటాపురం బస్టాప్, సుచిత్ర సర్కిల్, కొంపలి సినీప్లానెట్, కండ్లకోయ, మేడ్చల్ బస్టాప్, నిమ్స్ గేట్ (బంజారాహిల్స్ రోడ్డు నెం.1), రైల్‌నిలయం. -
ధూళి పంజా
కాలుష్య భూతం గ్రేటర్ వాసులను కాటేస్తోంది. పరిశ్రమలు,వాహనాల కాలుష్యంతో పాటు దుమ్ము, ధూళి సిటిజన్లకుప్రాణసంకటంగా మారాయి. నగరంలో పెరుగుతున్న కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సర్వే చేసింది. ఇందులో విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి. పీల్చే గాలిలో ధూళి రేణువుల సాంద్రత బాగా పెరిగిందని పీసీబీ గుర్తించింది.దీనివల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరవాసుల పరిస్థితి ఆందోళనకరంగా మారనుందనడం నిర్వివాదాంశం. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పరిశ్రమలు, వాహన కాలుష్యంతో పాటు రోడ్లపై దుమ్ము, ధూళి కాలుష్యం భారీగా పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 40 లక్షలు వాహనాలు తిరుగుతున్నాయి. ఏటా రెండు లక్షల వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. పీల్చే గాలిలో ధూళిరేణువుల మోతాదు గణనీయంగా పెరిగిపోతోందంటూ పీబీసీ ఆందోళన చెందుతోంది. పొగచూరుతున్న పౌరజీవనం గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య సుమారు 40 లక్షలకు చేరింది. వీటికి ఏటా 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కు పడిపోతోంది. దీంతో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరిగింది. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి ఆర్‌ఎస్‌పీఎం(ధూళి రేణువులు) వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. అంతటా అదే తీరు... క్యూబిక్ మీటరు గాలిలో ధూళిరేణువులు(ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండబుల్ పార్టిక్యులార్ మ్యాటర్) వార్షిక సగటు 60 మైక్రోగ్రాములకు మించరాదు. అయితే సర్వేలో అత్యధికంగా బాలానగర్‌లో క్యూబిక్ మీటరు గాలిలో ఆర్‌ఎస్‌పీఎం మోతాదు 121 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఆబిడ్స్‌లో 109, ప్యారడైజ్ వద్ద 102, ఉప్పల్‌లో 101, పంజగుట్టలో 99, చార్మినార్ వద్ద 81, జూపార్కు వద్ద 39, జూబ్లీహిల్స్ వద్ద 64 మైక్రోగ్రాములుగా ధూళి కణాల సాంద్రత నమోదైనట్టు పీసీబీ తాజా నివేదిక తెలిపింది. ఈ విపరిణామం వల్ల నగరవాసుల్లో శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అలర్జీ, సైనస్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధూళి రేణువులతో (ఆర్‌ఎస్‌పీఎం) దుష్ర్పభావాలు.. * ఆర్‌ఎస్‌పీఎం రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, * పొడిదగ్గు, బ్రాంకైటీస్‌కు కారణమవుతున్నాయి. * దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది. * చికాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. * తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది. * ఆర్‌ఎస్‌పీఎం మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. * ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటీస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే. * ట్రాఫిక్రద్దీలో ప్రయాణం చేసిన వారు చురుకుదనం కోల్పోయి ఒళ్లంతా మగత, నొప్పులతో బాధపడుతున్నారు. * ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ర్పభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. -
అంకెల్లో హైదరాబాద్
గ్రేటర్ పరిధిలో సగటు వేతన జీవులకు వీకెండ్ వినోదం భారంగా పరిణమిస్తోంది. అరకొర వేతనాలతో సతమతమవుతున్న సిటీజనులు శని, ఆదివారాల్లో విందు, వినోదాలకు చేసే ఖర్చు ఇంటి బడ్జెట్‌ను తారుమారు చేస్తోంది. ఇద్దరు పిల్లలతో భార్య, భర్త కలిసి వారాంతంలో సినిమాకి వెళ్తే రూ. 500 ఖర్చవుతుంది. బయటే డిన్నర్ కూడా కానిస్తే రూ. 1,500 నుంచి రూ. 2,000 పెట్టాల్సిందే. ఈ లెక్కన నెలకు రూ. 10,000 వరకు జేబుకు చిల్లు పడాల్సిందే.. బడ్జెట్ గురించి పేపర్లన్నీ తిరగేశారా? అంకెలూ, లెక్కలూ, టేబుల్సూ, రంగురంగుల రింగులూ, రూపాయి రాకడా పోకడా అంతా గందరగోళంగా ఉందా? మీకే కాదు పేపర్లో రాసేవాళ్లకి కూడా సగం అంతుపట్టదు. కాస్త అర్థమయ్యేలా ఓ కథ ఉంది. చిత్రకారుడు చంద్ర ఎప్పుడో రాశాడు. కథ పేరు ‘‘బడ్జెట్.’’ -
రూ.6750 కోట్లతో సుజలం
గోదావరి, కృష్ణా మూడోదశ పనులు సహా బ్రాండ్ ఇమేజ్ పెంపుపై దృష్టి తాగునీటి వసతులకు రూ.5500 కోట్లు ఇవ్వండి కలుషిత జలాల నివారణకు రూ.1250 కోట్లు కేటాయించండి పురాతన పైపులైన్లు మారిస్తేనే మంచినీరు ప్రభుత్వానికి జల మండలి నివేదిక నేడు సీఎం సమీక్ష? సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్‌ను విశ్వ విఖ్యాత నగరంగా తీర్చిదిద్దాలన్నా... అంతర్జాతీయ విపణిలో నగర బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్నా2017 నాటికి నగరంలోని అన్ని ప్రాంతాలకు పుష్కలంగా మంచినీటిని సరఫరా చేయాలి. ఇందుకు రూ.5500 కోట్లు అవసరం (మొత్తం రూ. 6750 కోట్లు). మరోవైపు కలుషిత జలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సి ఉంది. దీనికి రూ.1250 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని జలమండలి ప్రభుత్వానికి నివేదించింది. మంచినీటి ఎద్దడితో జనం పడుతున్న అవస్థలు, పాతనగరం సహా నిత్యం ఏదో ఒక చోట తెలెత్తుతోన్న కలుషిత జలాల సమస్య... పరిష్కార మార్గాలు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు జలమండలి పరంగా తీసుకోవాల్సిన చర్యలు, కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకం పనుల పురోగతి... అందుకు ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం, అవసరమైన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మంచినీటికి రూ.5500 కోట్లు... 2017 నాటికి గ్రేటర్ జనాభా అనూహ్యంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి, జూరాల మంచినీటిపై ఆధారపడి నూతనంగా కొన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. రాబోయే మూడేళ్లలో నగరానికి అదనంగా 10 టీఎంసీల నీటిని ఆయా జలాశయాల నుంచి తరలించాల్సి ఉంది. దీనికి రూ.5500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జలమండలి కోరింది. కలుషిత జలాల నుంచి విముక్తికి... కలుషిత జలాల నుంచి నగర వాసులకు విముక్తి కల్పించాలంటే నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 1156 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైపులైన్లను మార్చాల్సిందేనని, ఇందుకు రూ.1250 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి జలమండలి నివేదించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర వాసులకు సురక్షిత మంచి నీరందించేందుకు రూపొందించిన వాటర్ సేఫ్టీ ప్లాన్(రక్షిత మంచినీటి ప్రణాళిక)కు గత ప్రభుత్వాలు కేవలం రూ.37 కోట్లు మాత్రమే కేటాయించడంతో పురాతన పైపులైన్లను మార్చలేకపోయినట్లు నివేదికలో పొందుపరిచారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సైతం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విషయంలో స్పందిస్తూ.. నగర ప్రజలకు రక్షిత మంచి నీరందించడం జలమండలి బాధ్యతని పేర్కొన్న విషయాన్నీ నివేదికలో ప్రస్తావించారు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తేనే గ్రేటర్ సిటిజనులకుకలుషిత జలాల ముప్పు తప్పుతుందని నిపుణులు స్పష్టం చేస్తుండడం ఇక్కడ గమనార్హం. పాత పైపులతోనే ఈ దుస్థితి... గ్రేటర్‌లోని జలమండలి పరిధిలో8.10 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నగరం నలుమూలలా ఉన్న నల్లాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు 600 కిలోమీటర్ల మేర భారీ మంచినీటి సరఫరా పైపులైన్లు ఉన్నాయి. వీటి ద్వారా కాలనీలు, బస్తీలకు తాగునీరందించేందుకు మరో 7980 కిలోమీటర్ల మేర పంపిణీ (డిస్ట్రిబ్యూటరీ) పైపులైన్లు ఉన్నాయి. వీటిలో 30 ఏళ్లకు పైబడిన పురాతన లైన్లు 1156 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఇందులో ఆర్సీసీ, ఏసీ, పీవీసీ, హెచ్డీపీఈ, జీఐ రకం పైపులే అత్యధికం. వీటి కాల పరిమితి ముగిసిపోవడంతోతరచూ ఏదో ఒక చోట లీకేజీలు చోటుచేసుకుంటున్నాయి. వాటి పక్కనే ఉన్న మురుగునీటి పైపులైన్ల నుంచి వెలువడే వ్యర్థజలాలు మంచినీటి పైపులైన్లలోకి చేరుతున్నాయి. దీంతో పాతనగరంలోని అనేక ప్రాంతాలకు తరచూ రంగుమారి, దుర్వాసన వెదజల్లే జలాలు సరఫరా అవుతున్నాయి. ఇదే తరహాలో 2009లో జరిగిన భోలక్‌పూర్ ఘటనలో కలుషిత జలాలు సరఫరా అయిన కారణంగా 14 మంది మత్యువాత పడిన విషయాన్నీ నివేదికలో ప్రస్తావించారు. ఈ పరిస్థితి సమూలంగా మారాలంటే పురాతన పైపులైన్లను తక్షణం మార్చాల్సిందేనని సూచించారు. రిజర్వాయర్లకూ చికిత్స చేయాల్సిందే.. కలుషిత జలాల సమస్య తీరాలంటే సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, మంజీర, సింగూరు జలాలతో పాటు జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాలను నిల్వ చేస్తున్న పురాతన మంచినీటి స్టోరేజీ రిజర్వాయర్లను సైతం పునర్నిర్మించాలని జలమండలి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్రగడ్డ, మారేడ్‌పల్లి, తార్నాక, బంజారా సెకెండ్ స్టేజి, అల్వాల్, లింగంపల్లి, హైదర్‌నగర్ పురాతన రిజర్వాయర్ల స్థానే కొత్తవి నిర్మాణానికి మరో రూ.100 కోట్లు అవసరమవుతాయని నివేదికలో పేర్కొన్నారు. పైపులైన్లు మార్చాల్సిన ప్రదేశాలివే.. భోలక్‌పూర్, కవాడిగూడ, గాంధీనగర్, చార్మినార్, బహూదూర్‌పురా, చాంద్రాయణ గుట్ట, కట్టెలమండి, వినాయక్ వీధి, కుల్సుంపురా, చాదర్‌ఘాట్, దారుషిఫా, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, ఛత్రినాక, ఫలక్‌నుమా, జహానుమా, కార్వాన్, పత్తర్‌ఘట్టీ, డబీర్‌పురా పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో తక్షణం పురాతన పైపులైన్లు మార్చాల్సి ఉందని జలమండలి నివేదికలో పొందుపరిచింది. ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష.. గ్రేటర్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రజల దాహార్తిని తీర్చే కీలక మంచినీటి పథకాలను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను సైతం జలమండలి నివేదికలో పొందుపరిచింది. ఆ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలిస్తే... కృష్ణా మూడో దశ.. నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి నగర శివారులోని సాహెబ్‌నగర్ వరకు సుమారు రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినకృష్ణా మూడో దశ పనులు ఇప్పటివరకు 70 శాతం మేర పూర్తయినట్లు జలమండలి నివేదించింది. పథకంలో భాగంగా చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణ పురోగతి బాగుందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపింది. గోదావరి మంచినీటి పథకం... కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారులోని శామీర్‌పేట్ వరకు రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి మంచినీటి పథకం పనులు ఇప్పటివరకు 70 శాతం పూర్తయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ పథకానికి ఎదురవుతున్న అడ్డంకులు, ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం తదితర అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా శామీర్‌పేట్ ప్రాంతంలో హెరిటేజ్ రాక్ క్లియరెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.260 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి రింగ్ మెయిన్ పనులు... రూ.350 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్ మెయిన్ పనులకు బడ్జెట్లో పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపాలని కోరారు. -
రాత్రి మరో గంట కోత.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది.అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. తాజాగా శనివారం నుంచి రోజూ రాత్రిపూట గంట పాటు సరఫరా నిలిపివేయాలని డిస్కం సూచించింది. ఈ మేరకు ఆయా సబ్స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటల చొప్పున నాలుగు గంటల పాటు కోతలు అమలు చేస్తున్న డిస్కం తాజాగా రాత్రిపూట కూడా కరెంట్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించడంతో కోత వేళలు అధికారికంగా ఐదు గంటల పాటు అమలవుతున్నాయి. ఇక, అనధికారికంగా ఇంకా ఎక్కువ సమయమే కోతలు విధిస్తున్నారు. ఈ పరిణామాలు నగరవాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. -
గ్రేటర్.. నో వాటర్
-
జలసిరి ఆవిరి
శివారు ప్రాంతాలకు నీటి సరఫరాలో కోత వట్టిపోయిన జంట జలాశయాలు వరుణుడి కరుణపైనే జలమండలి ఆశలు ఇప్పటికైతే లోటు వర్షపాతం నమోదు ఆందోళన చెందుతున్న జలమండలి అధికారులు, జనం సాక్షి, సిటీబ్యూరో: గతేడాదితో పోలిస్తే జలాశయాల్లో రెండు మూడడుగుల మేర నీటి నిల్వలు ఎక్కువే ఉన్నట్టు గణాంకాలు చూపిస్తున్నారు. కానీ, సరిపడా తాగునీటిని సరఫరా చేయలేక నగరవాసుల గొంతెండబెడుతున్నారు. ఇదీ జలమండలి అధికారుల తీరు. వర్షాకాలంలోనూ నగరంలో నీటికి కటకట ఏర్పడింది. సీజన్ ప్రారంభమై నెలవుతున్నా లోటు వర్షపాతం నమోదు కావడంతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ఫలితంగా మంచినీటి సరఫరాలో జలమండలి అధికారులు కోతలు విధిస్తుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఇవేం కోతలంటూ మండిపడుతున్నారు. నైరుతి రుతుపవనాలు నగరాన్ని తాకినా ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లో నీటినిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుణుడు కరుణించని పక్షంలోనీటి నిల్వలు మరింత తగ్గే ప్రమాదం ఉందని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరుస వర్షాలతో ఇప్పటికే జలాశయాలు జలకళ సంతరించుకోవాల్సిన తరుణంలో ఈదురుగాలులు, ఎండవేడిమితో ఆయా జలాశయాల్లోని నీరు ఆవిరవుతోంది. సాధారణంగా ఏటా జూన్ చివరి నాటికి మహా నగరం పరిధిలో సాధారణ వర్షపాతం 121.8 మిల్లీమీటర్లుగా నమోదు కావాలి. కానీ ఈసారి కేవలం 81.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఏర్పడింది. మరోవైపు జలాశయాల ఎగువ ప్రాంతాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇన్‌ఫ్లో(జలాశయాల్లోకి వచ్చే నీరు) లేకుండా పోయింది. అదీగాక ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో రోజురోజుకూ ఆవిరయ్యే నీటిశాతమూ పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం వల్లే జూన్‌లో వర్షాలు కురవలేదని, జూలై మొదటి వారంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 3.50 లక్షల కుళాయిలకు అరకొర నీటి సరఫరా అప్రకటితవిద్యుత్ కోతలు, జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వల నేపథ్యంలో నగరంలో జలమండలి నీటి సరఫరాలో కోతలు విధిస్తోంది. పాతనగరం, కాప్రా, మల్కాజిగిరి, అల్వాల్, బోడుప్పల్, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్, ఉప్పల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి తదితర శివారు ప్రాంతాలకు వారం, పది రోజులకోమారు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. జలమండలి పరిధిలో 8.05 లక్షల కుళాయి కనెక్షన్లు ఉండగా ఏకంగా 3.50 లక్షల కనెక్షన్లకు అరకొర నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల వాసులు మంచి నీటికి నిత్యం అవస్థలు పడుతున్నారు. సాంకేతికంగా ఇబ్బందులు.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌తోపాటు నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటిమట్టం డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. విచిత్రమేమిటంటే గత ఏడాది జూన్ 28 నాటికి ఈ ఏడాది అదే తేదీ నాటికి జలాశయాల నిల్వలను పరిశీలిస్తే ఈసారి కాస్త ఎక్కువే ఉన్నట్టున్నా.. సాంకేతికంగా పరిశీలిస్తే నీటిమట్టాలు గత ఏడాదికంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు. -
ఏకధాటిగా 8 గంటలు ‘కోత’
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటంతో కోతలు విధించక తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారం సరఫరా నిలిపివేస్తుండటంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. సైదాబాద్, కర్మన్‌ఘాట్, భూపేష్గుప్తానగర్, ఉప్పల్, నాగోల్, వనస్థలిపురం, రాజేంద్రనగర్, కాటేదాన్ తదితర శివారు ప్రాంతాల్లో శుక్రవారం వరుసగా 8 గంటల పాటు సరఫరా నిలిపేశారు. ఉక్కపోతకు విద్యుత్ కోతలు తోడవటంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సేవా కేంద్రాల్లో విద్యుత్, మంచినీటి, ఆస్తిపనులు చెల్లింపులు, కుల, ఆదాయ, నివాస, జనన, మరణ, తదితర సర్టిఫికెట్ల జారీకి అవాంతరం కలిగింది. భూముల రిజిస్ట్రేషన్లు, బ్యాంకుల్లో ఆర్థికలావాదేవీలు స్తంభించిపోయాయి. కోతల వల్ల డీజిల్, పెట్రోల్ అమ్మకాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. -
జలమండలికి ఇద్దరు కొత్త సారథులు..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కీల కమైన మంచినీటి సరఫరా విభా గం జలమండలికి ప్రభుత్వం ఇద్దరు కొత్త సారథులను నియమించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చింది. గురువారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎం.జగదీశ్వర్ (1993 బ్యాచ్ ఐఏఎస్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అహ్మద్ బాబు (2003 బ్యాచ్ ఐఏఎస్) నియమితులయ్యారు. జగదీశ్వర్ గతంలో రెండున్నరేళ్లకుపైగా జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎండీగా పనిచేసిన జె.శ్యామలరావును తప్పించారు. ఆయన ఏపీ సర్కార్‌లో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చినందునే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని తెలి సింది. ఆయన సుమారు 22 నెలలుగా ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. జలమండలి ఈడీగా ఉన్న జగన్మోహన్ ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడి కలెక్టర్ అహ్మద్ బాబు జలమండలి ఈడీగా నియమితులయ్యారు. బదిలీల్లో కన్పించిన హరీష్‌రావు మార్క్..! జలమండలి ఎండీ, ఈడీల బదిలీ విషయంలో బోర్డు గుర్తింపు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులైన ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. గతంలో జలమండలి మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన ఎం.జగదీశ్వర్‌కు హరీష్‌రావు ఆశీస్సులున్నట్టు సమాచారం. అందుకే ఆయనకు తిరిగి కీలకమైన ఎండీ బాధ్యతలు అప్పగించడంలో హరీష్ చక్రం తిప్పినట్టు తెలిసింది. కలెక్టర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న ఈడీ డాక్టర్ జగన్మోహన్కు ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్యతలు దక్కడం వెనుక హరీష్‌రావు సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త ఎండీకి సమస్యలే స్వాగత తోరణం.. మూడున్నరేళ్లవిరామం తర్వాత తిరిగి జలమండలి ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎం.జగదీశ్వర్‌కు పలు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. అవి.. వివాదాస్పదమైన జీపీఈ(జనరల్ పర్పస్ ఎంప్లాయ్) పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం. బోర్డులో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్, హెచ్ఆర్ కార్మికులకు న్యాయం చేయడం.సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న మంచినీటిలో సరఫరా నష్టాలను 40 నుంచి 20 శాతానికి తగ్గించాల్సి ఉంది.జలమండలికి రావాల్సిన రూ.200 కోట్ల నీటిబిల్లులను వసూలు చేయాలి. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, మంచినీటి వసతులను కల్పించాలి. ఇందుకోసం జేఎన్ఎన్యూఆర్ఎం రెండో దశ కింద మంజూరైన పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ జలమండలి నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులైన జగదీశ్వర్ గురువారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ప్రస్తుత ఎండీ శ్యామలరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన విధుల్లో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హౌసింగ్ స్కీమ్‌పై స్పెషల్ డ్రైవ్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో చేపట్టిన హౌసింగ్స్కీమ్ ప్రయోజనాల గురించి లబ్ధిదారులకు తెలిసేలా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ హైదరాబాద్ కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులకు సూచించారు. శనివారం తన చాంబర్లో హౌసింగ్ స్కీమ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్స్కీమ్కు లబ్ధిదారులు చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ చెల్లించకపోవడం..రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం తదితర ఇబ్బందులున్నాయని అధికారులు తెలిపారు. అందుకు స్పందిస్తూ కమిషనర్ బ్యాంకర్ల జాబితా..రుణాల వివరాలతో నివేదిక రూపొందించాలని అన్నారు. అవసరమైతే ఆయా బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తే ముందుకొస్తారంటూ ఆస్తిపన్ను వసూళ్లకు ఇటీవల నిర్వహించిన ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రస్తావించారు. సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విజయవాడ గ్రేటర్ అవుతుందా?
ఇప్పటికైనా విజయవాడ గ్రేటర్ నగరంగా మారుతుందా.. నగర ప్రజలను ఆలోచింపజేస్తున్న అంశమిది. ఐదేళ్లుగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం విజయవాడ నగరాన్ని గ్రేటర్ కాకుండా అడ్డుకున్నారు. విజయవాడకన్నా చాలా చిన్న నగరమైన వరంగల్ కూడా గ్రేటర్‌గా మారిపోయింది. విజయవాడ మాత్రం అలాగే మిగిలిపోయింది. రాష్ట్రం విడిపోయి రాజధాని కోసం పోటీ పడుతున్న తరుణంలోనైనా గ్రేటర్ చేస్తారా.. లేదా అన్న సందేహాలు నగర ప్రజల్లో ఉన్నాయి. సాక్షి, విజయవాడ : హైదరాబాద్, విశాఖపట్నం తర్వాత ఆ స్థాయి గుర్తింపు ఉన్న నగరం విజయవాడ. ఇప్పటికే గ్రేటర్‌గా మారిన హైదరాబాద్, విశాఖ నగరాలు మాత్రం ఎన్యూఆర్ఎం నిధుల్లో తన వాటాకు సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చుకోగలిగాయి. విజయవాడ నగరం మాత్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దుస్థితి. గ్రేటర్ ప్రతిపాదనను గత ఎంపీ రాజగోపాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత పద్ధతిలో విజయవాడ గ్రేటర్‌గా మారితే కార్పొరేషన్లో తమ పట్టుపోతుందనే భయంతో కాంగ్రెస్ నాయకులు గ్రేటర్‌కు మోకాలడ్డారు. దీంతో కార్పొరేషన్‌కు ఆదాయవనరులు పరిమితంగానే ఉండిపోయాయి. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి, ఆఖరికి చెత్తను డంపింగ్ చేయడానికి కూడా స్థలం చాలని పరిస్థితి విజయవాడ నగరపాలక సంస్థకు ఏర్పడింది. మొదట్లో గ్రామపంచాయతీల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను సాకుగా చూపించారు. తర్వాత వాటి పాలకవర్గాలు రద్దయి మూడేళ్లపాటు ప్రత్యేక పాలనలో ఉన్నా నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు పంచాయతీలకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటికి ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. ఈ నేపథ్యంలో విజయవాడను గ్రేటర్‌గా చేయడానికి కోర్టు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. 2005 తర్వాత కౌన్సిల్లో రెండుసార్లు తీర్మానాలు చేసి పంపించారు. పంచాయతీల కాలపరిమితి ముగిసిన తర్వాత గ్రేటర్ విజయవాడకు ఆమోదం తెలుపుతూ కూడా తీర్మానం చేసింది. ఒక దశలో కార్పొరేషన్ అధికారులు తమ భవనాలను కూడా భవిష్యత్ అవసరాలకు విస్తరించేందుకు సిద్ధం అయ్యారు. గ్రేటర్ అయితే కలిసే ప్రాంతాలను గుర్తించి మ్యాప్ కూడా సిద్ధం చేశారు. గ్రేటర్ విజయవాడ అయితే జనాభా నాలుగో వంతు పెరిగినా విస్తీర్ణం మాత్రం రెండు రెట్లు పెరుగుతుంది. విజయవాడ నగరానికి చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాలను కలిపి గ్రేటర్ విజయవాడగా చేయాలని అధికార యంత్రాంగం భావించింది. కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి, నిడమానూరు, దోనేఆత్కూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు, ఫిర్యాది నైనవరం, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి గ్రామాలను నగరంలో కలపాలని నిర్ణయించారు. ప్రస్తుతం విజయవాడ విస్తీర్ణం కేవలం 61,88 చదరపు కిలోమీటర్లు మాత్రమే. గ్రేటర్‌గా మారితే విజయవాడ విస్తీర్ణం 189.37 కిలోమీటర్లు అవుతుంది. ఒక దశలో గ్రేటర్ పరిధిని 43 గ్రామాలకు పెంచి గన్నవరం, కంకిపాడు వరకూ విస్తరించడానికి కసరత్తు జరిగింది. ప్రస్తుతం నగర జనాభా 10.5 లక్షలు. 43 గ్రామాలతో గ్రేటర్ విజయవాడను ఏర్పాటుచేస్తే జనాభా 15 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉన్న నేపథ్యంలో మహానగరంలో దాన్ని కలిపేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, పాలకపక్షం చిత్తశుద్ధితో గ్రేటర్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయవాడ నుంచి గ్రేటర్ ప్రతిపాదన ఆయన ముందు పెడతామని చెబుతున్నారు. ఆచరణలో ఎంతవరకు సాధ్యమో చూడాలి. -
నిమిషం లేటైనా... నో ఎంట్రీ
కన్వీనర్ ఎన్వీ రమణరావు రేపే ఎంసెట్-2014 ప్రవేశపరీక్ష నగరంలో 8 జోన్లు.. 148 పరీక్ష కేంద్రాలు గ్రేటర్ నుంచి 81,445 మంది అభ్యర్థులు మెడిసిన్‌కు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికం సాక్షి, సిటీబ్యూరో: ‘ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)-2014 గురువారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరుగుతాయి. అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తాం. నిమిషం లేటుగా వచ్చినా అనుమతించం. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చే శాం. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టాం’ అని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు పేర్కొన్నారు. నగరంలో ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన విలేకరులకు వివరించారు. మరో 24గంటల్లో ఎంసెట్ పరీక్షకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. కన్వీనర్ ఏం చెప్పారంటే.. నగరంలో మెట్రోపనులు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు వారి నివాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల రేడియస్‌లో పరీక్షా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకు ఈసారి మెడికల్ పరీక్ష ఉన్న కేంద్రాల్లో ఇంజినీరింగ్ అభ్యర్థుల సంఖ్యను తగ్గించాం. గతంలో మాదిరిగానే ‘నిమిషం లేటు’ నిబంధన ఈసారి కూడా అమల్లో ఉంది. ఒక్క నిమిషం లేటైనా అనుమతించం. అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులు పరీక్షాకేంద్రాన్ని ఒకరోజు ముందుగా చూసుకుంటే మేలు. చివరి నిమిషంలో పరీక్షాకేంద్రం ఎక్కడుందోనన్న హైరానా తప్పుతుంది. అలాగే ఒక అభ్యర్థి వెంట అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు వీలైనంత వరకు(ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా) రాకుండా ఉంటే మంచిది. అభ్యర్థులు తమ వెంట కేవలం బాల్‌పాయింట్ పెన్నులు, హాల్‌టికెట్, ఆన్లైన్ దరఖాస్తు ఫారం, ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారైతే కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే చాలు. సెల్ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలు.. వగైరా గ్యాడ్జెట్లు నిషేధం. తెల్లకాగితం తెచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షాకేంద్రాల సమీపంలో ఉండే హోటళ్లు, దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలపై మఫ్టీలో ఉన్న పోలీసుల నిఘా ఉంటుంది. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్ష హాల్లోనూ ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. 24న ప్రాథమిక కీ ప్రకటిస్తాం. వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి తుది కీని వెలువరిస్తాం. జూన్ 9న ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశాం. దళారులను నమ్మొద్దు. ప్రలోభాలకు గురికావద్దు. మాయమాటలు చెబుతున్న వారి సమాచారాన్ని పోలీసులకు గానీ, ఎంసెట్ అధికారులకు గానీ తెల్పండి. ఎంసెట్ ప్రక్రియంతా పారదర్శకంగా ఉంటుంది. 81,445మంది అభ్యర్థులు ఎంసెట్-2014కి నగరం నుంచి 81,445మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు 58242మంది అభ్యర్థులు ఉండగా, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 23203మంది అభ్యర్థులున్నారు. ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో అబ్బాయిలు 37,644మంది ఉండగా, అమ్మాయిలు 20,598మంది ఉన్నారు. మెడికల్ అండ్ అగ్రికల్చర్‌కు మాత్రం అబ్బాయి కంటే అమ్మాయిలే అధికంగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష 7197మంది అబ్బాయిలు రాస్తుండగా, రెట్టింపు సంఖ్యలో 16006 మంది అమ్మాయిలు రాస్తున్నారు. నగరంలో ఇంజినీరింగ్ పరీక్షకు 100 కేంద్రాలు, మెడికల్ పరీక్షకు ఏకంగా 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ప్ర‘జల’పై నిర్లక్ష్యం
నీటిబొట్టు ఇంకేదెట్టా? 16 వేల ఇంకుడు గుంతల లక్ష్యం కాగితాల్లోనే.. 3 వేలు కూడా పూర్తి కాని వైనం వృథా కానున్న వర్షపు నీరు పట్టనట్టు వ్యవహరిస్తున్న జలమండలి, జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో : నీటి బొట్టును ఒడిసిపట్టాలన్న ‘గ్రేటర్’ లక్ష్యం నిర్లక్ష్యం మాటున నీరుగారిపోతోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే 1500 అడుగుల లోతుకు తవ్వినా నీటిచుక్క కానరావడం లేదు. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నా వర్షపు నీటిని కాపాడాలన్న శ్రద్ధ ఇటు జలమండలి, అటు జీహెచ్ఎంసీలో కానరావడం లేదు. రుతుపవనాలు మరో పక్షం రోజుల్లో గ్రేటర్‌ను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని కాపాడుకొని, భూగర్భ జలసిరిని పెంచేందుకు చర్యలు తీసుకోవడంలో జలమండలి, జీహెచ్ఎంసీలు దారుణంగా విఫలమౌతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ నిలువెల్లా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇంకుడు గుంతలు (రీచార్జింగ్ పిట్స్)ను మహోద్యమంగా చేపట్టకపోతే గ్రేటర్‌కు జలగండం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఈ రెండు విభాగాలకు పట్టడం లేదు. గతేడాది రూ.6 కోట్ల అంచనా వ్యయంతో గ్రేటర్ పరిధిలో సుమారు 10 వేలు ఇంకుడు గుంతలు తవ్వాలన్న బల్దియా లక్ష్యం కాగితాలకే పరిమితమవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు ఇంకే దారులేవీ..? జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాల సంఖ్య 12 లక్షలు. కానీ వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అందుబాటులో ఉన్న రీచార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంతలు) ఎనిమిది వేలు మాత్రమే. ఇది భూగర్భ జలశాఖ ప్రకటించిన చేదు వాస్తవం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్ సిటీలో విలువైన వర్షపు నీటిని ఒడిసిపట్టే దారి లేకపోవడంతో పాతాళగంగ కనుమరుగవుతోంది. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలిలు వినియోగదారుల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.64 కోట్లు వసూలు చేశాయి. ఆ నిధులతోఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో భూగర్భ జలాలు అథఃపాతాళానికి మళ్లుతున్నాయి. మహానగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయానికీ రీచార్జింగ్ పిట్స్ అత్యవసరం. ఈ పరిస్థితి లేకనే మారేడ్‌పల్లి, బోయిన్పల్లి, బోడుప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో 1500 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటిచుక్క జాడ కనిపించడం లేదు. విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వడాన్ని నిషేధిస్తూ తొమ్మిదేళ్ల క్రితం చేసిన వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఇంటి అవసరాల కోసం వ్యయప్రయాసల కోర్చి బోరుబావులు తవ్వుతున్న వినియోగదారులు నీటిబొట్టు కానరాక బావురుమంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రీచార్జింగ్ పిట్స్ తవ్వే ప్రక్రియను మహోద్యమంగా చేపట్టాల్సిన సంబంధిత విభాగాలు నిద్రమత్తు వీడకపోవడంతో ప్రస్తుతం వర్షపునీరు వృథా అయ్యే పరిస్థితి తలెత్తింది. జనానికి అవగాహన కల్పించడంలో విఫలం భూగర్భ జల మట్టాలను పెంపొందించేందుకు రీచార్జింగ్ పిట్స్ తవ్వాల్సిన అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పించడంలో జలమండలి, జీహెచ్ఎంసీలు దారుణంగా విఫలమౌతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల సమయం లో రీచార్జింగ్ పిట్స్ తవ్వేందుకు జీహెచ్ఎంసీ నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తుంది. ఈ విషయంలో జలమండలి కూడా తక్కువేం తినలేదు. నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినపుడు వినియోగదారుల నుంచి విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు ముక్కుపిండి రాబడుతున్నారు. ఒక వేళ వినియోగదారుడు సొంతంగా పిట్ ఏర్పాటు చేసుకున్నారని క్షేత్రపరిశీలన సమయంలో తేలితే ఈ మొత్తాన్ని మినహాయిస్తున్నారు. అందుబాటులో ఎనిమిది వేలే... గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి నిల్వకు కేవలం ఎనిమిది వేల ఇంకుడు గుంతలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు భూగర్భజలశాఖ గతంలో ప్రకటించింది. వీటిలోనూ పలు పిట్స్‌పై మట్టి, పెద్ద బండరాళ్లు, సిమెంట్, చెత్తాచెదారం పడడంతో వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చే పరిస్థితి లేదని తేలింది. వీటిని పునరుద్ధరించే విషయంలో వినియోగదారులను చైతన్యం చేసే విషయంలోనూ జీహెచ్ఎంసీ, జలమండలిలు విఫలమౌతున్నాయని స్పష్టమైంది. గతేడాది రూ.6 కోట్ల వ్యయంతో పదివేల ఇంకుడు గుంతలు తవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ వీటిలో పూర్తయినవి వెయ్యి దాటకపోవడం గమనార్హం. ఇక జలమండలి మరో ఆరువేల రీచార్జింగ్ పిట్స్ ఏర్పాటుచేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు రెండు వేలకు మించి ఇంకుడు గుంతలు తవ్వకపోవడం ఆయా విభాగాల నిర్లక్ష్యానికి పరాకాష్ట. రీచార్జింగ్ పిట్ ఇలా ఉండాలి మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడెల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీసి ఇందులో 50 శాతం మేర 40 ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం దొడ్డు ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జింగ్ సులువవుతుంది. దీనివల్ల బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుంది. ప్రతి ఇల్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుంది. -
‘గ్రేటర్’ గులాబీ దళపతి ఎవరో?
పెరుగుతున్న ఆశావహుల సంఖ్య సాక్షి, హైదరాబాద్:‘గ్రేటర్’లో ఖాళీగా ఉన్న టీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ వీడడంలేదు. ఈ పదవిలో కొనసాగిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని రెండు నెలలు కావస్తున్నా ఈ పదవీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరికీ కట్టబెట్టకపోవడంతో నగరంలో ఈ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఊపుతో ఉన్న గులాబీ దళం గ్రేటర్ పరిధిలోనూ ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనన్న నమ్మకంతో ఉన్న ఆపార్టీ శ్రేణులు నగరంలో బలహీనంగా ఉన్న పార్టీని పటిష్టం చేసేందుకు యువకుడు,సమర్థులైన వారికే ఈ పదవిని కేటాయించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఈ పదవిపై కన్నేసిన పలువురు నాయకులు ఇప్పటికే అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో పార్టీ గ్రేటర్ అధికార ప్రతినిధి మురుగేష్, గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మహేందర్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, సికింద్రాబాద్‌కు చెందిన ఆళ్లకుంట హరి ముందున్నారు. మురుగేష్ వైపే అధిష్టానం మొగ్గు.. ఇప్పటికే గ్రేటర్ టీఆర్ఎస్ కార్యవర్గంలో చురుకుగా పనిచేస్తున్న అధికార ప్రతినిధి మురుగేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సైతం ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల అధినేత కేసీఆర్‌ను కలిసి తాను పార్టీ పటిష్టతకు చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై వివరించినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు సైతం ఆయనకే మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌తో అనుబంధం ఉన్న నాయకుడు, అందరికీ సుపరిచితుడైన వివాదరహితుడినే ఈ పదవికి ఎంపిక చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
గ్రేటర్‌లోపందేల జోరు..!
అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కాయ్ రాజా కాయ్ లక్షల్లో చేతులు మారుతున్న డబ్బు సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక పోరు ముగిసింది. గెలుపు అంచనాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు తలమునకలై ఉన్నారు. ఇదే తరుణంలో గ్రేటర్లో బెట్టింగ్ జోరందుకుంది. పాతనగరం, ప్రధాన నగరం, శివారు ప్రాంతమన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కాయ్ రాజా కాయ్‌లు పందెం కాసేస్తున్నారు. మహానగరం పరిధిలో దాదాపు 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పందేలు గురువారం ఉదయం నుంచి ఊపందుకున్నాయి. పందెంరాయుళ్ల స్తోమతను బట్టి వందలు.. వేలు.. లక్షలు ఇలా వివిధ స్థాయిల్లో బెట్టింగ్‌లు షురూ అవుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి నగదు పెరుగుతూనే ఉంది. అభ్యర్థుల గెలుపు, ఓటమి, మెజార్టీ వంటివన్నీ బెట్టింగ్‌కు ముడి సరుకులే అయ్యాయి. ఫలానా పార్టీ అభ్యర్థికి ఈ సారి ఓటమి ఖాయం.. మరో అభ్యర్థి గెలుపు ఖాయం.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి న ఓ నాయకుడికి ఈ సారి మెజార్టీ తగ్గడం తథ్యం.. ఈ అంశాలపైనే సాగుతున్నాయి బెట్టింగ్‌లు. కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్ కోసమే ప్రత్యేకంగా అడ్డాలు వెలియడం గమనార్హం. శివార్లలోని రిసార్టులు, లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు పందేనికి అడ్డాలుగా మారుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో జోరెక్కువ... నగరంలో తాజా మాజీ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖైరతాబాద్, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్, మల్కాజిగిరీ పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, మహేశ్వరం, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఈసారి పోలింగ్ శాతం పెరగకపోవడంతో గెలుపు అవకాశాలు ఎవరికి అధికంగా ఉంటాయోనన్న అయోమయం నెలకొనడంతో పందెంరాయుళ్లకు వరంగా మారింది. అల్పాదాయ వర్గాలు సైతం.. బెట్టింగ్ జోరులో సంపన్నులే కాదు.. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతన జీవులు సైతం తమ కష్టార్జితాన్ని బెట్టింగ్‌లో పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సంపన్నులు కాస్తున్న పందేలు లక్షలు దాటుతుండగా.. అల్పాదాయ వర్గాలు వేలల్లోనే బెట్టింగ్ కాస్తున్నారు. కాగా పందెం నిర్వహించేవారు, పందెం కాసేవారు ఎవరికీ అనుమానం రాకుండా సెల్ఫోన్లలోనే వ్యవహారం సాగిస్తుండడంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. మరికొందరు శివార్లలోని రిసార్టులో చిన్నపాటి పార్టీలు నిర్వహించి అక్కడే బెట్టింగ్ కాస్తుండడం కూడా సంచలనం సృష్టిస్తోంది. -
షి‘కారు’ ఎలా..?
ఎన్నికల వేళ గ్రేటర్ టీఆర్ఎస్లో సంక్షోభం పార్టీని వీడిన కట్టెల,దోసోజు, కాచం కారు జోరుకు బ్రేకులు బరిలోకి దిగిన అభ్యర్థుల్లో టెన్షన్ సాక్షి,సిటీబ్యూరో: మరో పదహారురోజుల్లో ఎన్నికలుండగా గ్రేటర్ టీఆర్ఎస్లో సంక్షోభం నెలకొంది. కీలక సమయంలో పార్టీ గెలుపునకు మార్గదర్శనం చేయాల్సిన పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, పోలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జీ కాచం సత్యనారాయణ సహా పలువురు ద్వితీయశ్రేణి నాయకులు కాంగ్రెస్ పంచన చేరడంతో కారు జోరుకు బ్రేకులు పడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుతో జోష్‌లో ఉన్న పార్టీలో..ఈ పరిణామమంతో షి‘కారు’ ఎలా అని ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యమస్ఫూర్తితో పనిచేయాల్సిన పార్టీ నాయకగణం, కేడర్ అప్పుడే డీలా పడడంతో బరిలోకి దిగిన నేతలు కలవరపడుతున్నారు. ఎలక్షన్ సమయంలో ముఖ్యనాయకులు పార్టీని వీడడం,టికెట్ల కేటాయింపులో సీనియర్లను పక్కనబెట్టడం,మహానగరాభివృద్ధిని ప్రతిబింబించే లా మేనిఫెస్టో లేకపోవడం,ఉద్యమకారులను,జేఏసీ నాయకులను విస్మరించడం,సొంతబలంపై నమ్మకం లేక ఇతర పార్టీల నేతలను నమ్ముకోవడం వంటి అంశాలన్నీ పార్టీకి చేటు చేస్తాయని పార్టీ వర్గాలు కుండబద్దలు కొడుతున్నారు. ఈ ప్రతికూల పరిణామం పార్టీపై ఆశలు పెట్టుకున్న పది నియోజకవర్గాలపైనా తప్పక ప్రభావం చూపుతాయని అవి చెబుతున్నాయి. గ్రేటర్‌వ్యాప్తంగా జనంనాడిని తెలుసుకొని ప్రచారం చేసేందుకు ప్రచారకర్తలు సైతం లేకపోవడం కూడా పార్టీకి శాపంగా పరిణమిస్తోందన్నది ఆ వర్గాల భావన. ప్రతినియోజకవర్గంలో సెటిలర్లఓట్లు కీలకంగా మారడం, ఎనిమిది స్థానాల్లో ఎంఐఎం బలంగా ఉండడం,పార్టీలో నెలకొన్నసంస్థాగత లోపాలు, కిందిస్థాయి కేడర్‌కు సరైన దిశానిర్దేశం లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రతికూలంగా మారినట్లు ముఖ్యనాయకులు సైతం వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ముగిసేవరకు గ్రేటర్ అధ్యక్షపీఠంలో ఎవరినీ కూర్చోబెట్టరన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగీ వర్సెస్ కారు : పొత్తు ప్రతిపాదన లు ఆదిలోనే వికటించి ఒంటరిపోరుకు సిద్ధమైన కాంగ్రెస్,టీఆర్ఎస్లు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ముమ్మరయత్నాలు చేస్తుండడంతో రాజకీయం రంజుగా మారుతోంది. ఒకపార్టీ నుంచి మరొక పార్టీకి నేతల వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టికెట్లు దక్కక కొందరు,అధినాయకత్వం ఒంటెత్తు పోకడలు,కుటుంబపాలన నచ్చక మరికొందరు వెంటనే గోడ దూకేస్తున్నారు. అధినాయకత్వం ఇప్పటికైనా కళ్లుతెరచి అసంతృప్త నేతలను బుజ్జగించే యత్నం చేయకుంటే ఎన్నికల వేళ పార్టీకి నష్టమేనని పార్టీవర్గీయులు స్పష్టంచేస్తున్నారు. -
పోరు షురూ
ఇక పోటాపోటీ తప్పుకున్న రెబల్స్ పార్టీలకు లైన్ క్లియర్ ప్రచారాస్త్రాలకు పదును గ్రేటర్ అసెంబ్లీ బరిలో 511 మంది లోక్‌సభ స్థానాలకు పోటీలో 91 మంది సాక్షి, సిటీబ్యూరో: టికెట్ వస్తుందో రాదోనని టెన్షన్.. తీరా వచ్చాక అన్ని ప్రధాన పార్టీల గుండెల్లో మోగిన రె‘బెల్స్’.. నిన్నటి వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని దారికి తెచ్చుకునేందుకు తంటాలు.. ఇప్పుడిక బుజ్జగింపులు, బేరసారాలు ముగిశాయి. అన్నీ సర్దుకున్నాయి. ఉత్కంఠకు తెరపడింది. అసలు పోరు షురూ అయింది. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో విస్తృత ప్రచారానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మరోపక్క ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు అధికారులు సన్నాహాల్లో మునిగారు. ప్రధానంగా ఈవీఎంలపై దృష్టి సారించారు. ఒక్కో ఈవీఎంలో 16 మీటలుండగా, ఒకటి నోటాకు కేటాయించారు. ఇదిపోను దీనిపై 15 పార్టీ గుర్తులకు అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు పోటీలో ఉన్నచోట రెండేసి ఈవీఎంలు ఉండాల్సిందే. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 13,150 ఈవీఎంలను సిద్ధం చేశారు. అసెంబ్లీ స్థానాలకు 511 మంది.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 511 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీలతో పాటు పలువురు స్వతంత్రులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెబల్స్‌ను బరి నుంచి తప్పించడంలో ప్రధాన పార్టీలు సఫలమయ్యాయి. గోషామహల్, పటాన్‌చెరులలో బీజేపీ రెబల్ అభ్యర్థులు నందకిశోర్‌వ్యాస్, సి.అంజిరెడ్డి పోటీ నుంచి తప్పుకోలేదు. ఇంతకుమించి చెప్పుకోదగ్గ రెబల్స్ ఎవరూ ఆయా పార్టీల్లో బరిలో లేరు. గ్రేటర్‌లోని అంబర్‌పేట నియోజకవర్గంలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 31 మంది, కూకట్పల్లి, ఎల్బీనగర్లలో 29 మంది తుది పోరులో నిలిచారు. అత్యల్పంగా కంటోన్మెంట్ నుంచి పది మంది పోటీలో మిగిలారు. లోక్‌సభ స్థానాల్లో 91 మంది.. గ్రేటర్ పరిధిలోని 4 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. సికిం ద్రాబాద్ లోక్‌సభకు 34 అర్హమైన నామినేషన్లు ఉండగా, శనివారం నలుగురు పోటీ నుంచి తప్పుకున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా 15 మంది మిగిలారు. మల్కాజిగిరి లోక్‌సభ నుంచి 30 మంది, హైదరాబాద్ లోక్‌సభ నుంచి 16 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. బెట్టు చేసి.. మెట్టు దిగి.. ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా ఉన్న సామ రంగారెడ్డి, కాచం సత్యనారాయణ, మల్కాజిగిరి కుమార్, శోభారాణి, ఎస్.వెంకటసుబ్బయ్య, సునీతప్రకాశ్‌గౌడ్, నగేశ్ ముదిరాజ్, జి.సాల్మన్‌రాజు, జగదీశ్వర్‌గౌడ్, మొవ్వా సత్యనారాయణ, పీఎల్ శ్రీనివాస్, ఉప్పల శారద, నదీముల్లా తదితరులు పార్టీ అధినేతల బుజ్జగింపులు, హామీలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ రెబల్స్‌కు దానం, సబితా, టీడీపీ రెబల్స్‌కు చంద్రబాబునాయుడు తగు హామీలిచ్చి మెత్తబరిచారు. పోటీలో ప్రముఖులు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ప్రకాశ్‌గౌడ్, అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖేశ్‌గౌడ్, కె.లక్ష్మణ్, జి.బాల్‌రెడ్డి, ముఠాగోపాల్, కూన శ్రీశైలంగౌడ్, కొలను శ్రీనివాసరెడ్డి, ఆర్.కృష్ణయ్య, సుధీర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బిక్షపతియాదవ్, ముక్కా రూపానందరెడ్డి, ముంతాజ్‌అహ్మద్‌ఖాన్, బద్దం బాల్‌రెడ్డి, జయసుధ, విజయారెడ్డి, జాఫర్‌హుస్సేన్, మల్రెడ్డి రంగారెడ్డి, జి.సాయన్న, పాషాఖాద్రి, మోజంఖాన్, బలాల, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. లోక్‌సభ స్థానాలకు పోటీలో ఉన్న ప్రముఖుల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భగవంతరావు పవార్ (హైదరాబాద్), బండారు దత్తాత్రేయ, అంజన్‌కుమార్, భీమ్సేన్, సయ్యద్ సాజిద్‌అలీ, ఛాయారతన్ (సికింద్రాబాద్), సర్వే సత్యనారాయణ, వి.దినేశ్‌రెడ్డి, జేపీ, డాక్టర్ నాగేశ్వర్, మల్లారెడ్డి (మల్కాజిగిరి) ఉన్నారు. -
ముహూర్తం బాగుంది
ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం అధిక సంఖ్యలో పడ్డ నామినేషన్లు పార్టీ తరఫున.. స్వతంత్ర అభ్యర్థులుగానూ దాఖలు సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. శుక్రవారం ముహూర్తం బాగుందన్న సెంటిమెంట్‌తో 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు అధికారిక అభ్యర్థుల్ని ప్రకటించకముందే ఆ పార్టీలకు చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. ఇందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. శుక్రవారం మంచిరోజైనందున నామినేషన్లు వేశామని కొందరు ప్రకటించగా.. అధికారికంగా వెల్లడయ్యాక మరోమారు నామినేషన్ దాఖలు చేస్తామన్నవారు కూడా ఉన్నారు. కాగా.. ఆయా పార్టీల్లో పొత్తుచిక్కులు తేలకపోవడంతో, ఎక్కడ తమకు సీటు రాకుండా పోతుందోననే ఆందోళనతో నామినేషన్లు వేసినవారూ ఉన్నారు. నామినేషన్ వేసినందున ఆ తర్వాతైనా అధిష్టానాన్ని ఒప్పించగలమన్న ధీమాతో నామినేషన్ వేసినవారూ వీరిలో ఉన్నారు. ఆయా పార్టీల నడుమ పొత్తులతో కొందరు.. తాము కోరుకున్న సీటు తమకు రాకుండా పోతుందేమోననే సందేహంతో ఇంకొందరు ఎందుకైనా మంచిదనే తలంపుతో నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు సైతం... అధికారిక ప్రకటనకు ముందే నామినేషన్లు దాఖలు చేసిన వారిలో మంత్రులు సైతం ఉండటం విశేషం. మిగతా వారి సంగతటుంచి తాజా మాజీ మంత్రులైన ఎం. ముఖేశ్‌గౌడ్, దానం నాగేందర్‌లతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ వంటి వారు కూడా ఉండటం ‘గ్రేటర్’లో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వాస్తవానికి దానం నాగేందర్, ముఖేశ్‌లు తమ నియోజకవర్గాలు మారాలనుకున్నారు. దానం నాగేందర్ నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెరిగిన వ్యతిరేకత తదితర అంశాలతో ఆయన ఈసారి ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని భావించినా.. అధిష్టానం అందుకు నో అనడంతో ఖైరతాబాద్ నుంచే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖేశ్‌గౌడ్‌కు సైతం గోషామహల్లో పెరిగిన వ్యతిరేకతతో ఆయన ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి కానీ.. అధిష్టానం అనుగ్రహిస్తే సికింద్రాబాద్ లోక్‌సభకు కానీ పోటీ చేయాలనుకున్నారు. రెంటికీ చుక్కెదురవడంతో గోషామహల్ నుంచే తిరిగి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు సెట్ల నామినేషన్లు వేసిన ఆయన ఒకటి కాంగ్రెస్ పేరుతో, మరొకటి ఇండిపెండెంట్‌గా దాఖలు చేశారు. కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలంగౌడ్ సైతం కాంగ్రెస్ పేరిట రెండు సెట్లు.. ఇండిపెండెంట్‌గా రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణతో ఉన్న విభేదాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న టీడీపీ నాయకుడు తీగల కృష్ణారెడ్డి.. తన అనుచరులతో కలిసి ఆ సీటును బీజేపీకి ఇవ్వవద్దంటూ చంద్రబాబును కోరిన మర్నాడే.. ఎందుకైనా మంచిదని నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మంచి రోజనే నమ్మకంతో నామినేషన్లు వేసిన వారూ ఉన్నారు. వివిధ పార్టీలవారు, ఇండిపెండెంట్లు వీరిలో ఉన్నారు. పార్టీ అధిష్టానం నుంచి అందిన సమాచారం మేరకే నామినేషన్లు వేశామన్నవారూ వీరిలో ఉన్నారు. ఆయా పార్టీల నుంచి తమకు టికెట్ లభించగలదనే నమ్మకంతోనూ.. అధిష్టానం నుంచి అందిన సమాచారంతోనే పలువురు నామినేషన్లు వేసినప్పటికీ.. అనూహ్యంగా తమకు టికెట్ రాకుంటే ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
ఆస్తులున్నా.. ‘లెక్కే’లేదు
‘గ్రేటర్’ నిర్లక్ష్యం ఆస్తుల వివరాలు లేవు సిబ్బంది ఇష్టారాజ్యం కార్పొరేషన్‌కు టోపీ ‘నాక్కొంచెం తిక్క ఉంది... దానికో లెక్క ఉంది...’ ఆ మధ్య హిట్టైన సిన్మాలో హీరో పాపులర్ డైలాగ్ ఇది. సరదాకే అన్నా తిక్కకూ ఓ లెక్క ఉందన్నది ఆ హీరో వాదన. ఘనత వహించిన మన జీహెచ్ఎంసీ వద్ద అసలు దేనికీ లెక్కే లేదు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, చెరువులు, పార్కులు, హోర్డింగ్‌లు, శ్మశానవాటికలు.. వెరసి తమకెన్ని ఆస్తులున్నాయో తెలీదు. ఈ దుస్థితిపై ఎవరన్నా ఏమన్నా అంటారన్న భయం అంతకన్నా లేదు. ఉన్నదేమైనా ఉందంటే.. అది లెక్కలేనితనమే. సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు అవసరమైన రహదారులు, పారిశుధ్యం తదితర సేవలెన్నో అందించడంతోపాటు ఇంటి నిర్మాణం జరపాలన్నా, వ్యాపార సంస్థలకు లెసైన్సులివ్వాలన్నా, ఐదంతస్తుల్లోపు ఫైర్‌సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసీ ఇవ్వాలన్నా జీహెచ్ఎంసీకే అధికారం ఉంది. అంతేకాదు.. తనకున్న ఎన్నో షాపింగ్ కాంప్లెక్సుల్లోని ఎన్నో దుకాణాల్ని ఎందరికో అద్దెలకిచ్చింది. ఇన్ని ఆస్తులు, బాధ్యతలున్న జీహెచ్ఎంసీ వద్ద వాటికి సంబంధించిన వివరాలన్నీ ఉండాలి. కానీ.. కార్పొరేషన్లో ఏ ఒక్కదానికీ లెక్కాపత్రం ఏమీ లేదు. ఆటస్థలాలు ఎన్ని కబ్జా అయ్యాయో తెలియదు! పార్కు స్థలాలు ఎన్ని పరాధీనమయ్యాయో రికార్డుల్లేవు. ఏయే శ్మశానవాటికల్లో ఎవరు తిష్ట వేశారో లెక్కల్లేవు! ఎన్ని మార్కెట్లలో ఎవరుంటున్నారో.. ఏ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎవరికి దుకాణాలు కేటాయించారో.. వాటిల్లో ఎవరుంటున్నారో సమాచారం లేదు!! లీజు పొందిన స్థలాలు, భవనాల్లో ఎందరు లీజు సొమ్ము చెల్లిస్తున్నారో.. ఎవరెంత చెల్లించారో కూడా తెలియదంటే తెలియదు. ఎన్ని బహిరంగ ప్రదేశాలున్నాయో.. ఎన్ని భవనాలకు అనుమతులిచ్చారో.. ఎన్ని అక్రమ భవనాలు వెలిశాయో కూడా వివరాలు లేవు. నగరంలో తాను వేసిన రోడ్లు ఎన్ని ఉన్నాయో.. వేటిని ఎవరు పర్యవేక్షించాలో కనీస సమాచారం కూడా ఇంతవరకూ లేదు. ఆస్తిపన్ను వసూళ్లు తదితరమైన వాటిదీ అదే దారి! ఇలా చెప్పుకుంటూ పోతే.. జీహెచ్ఎంసీకి తెలియని జాబితా కొండవీటి చాంతాడంత అవుతుంది. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీరు ! సిబ్బంది ఇష్టారాజ్యం ఆస్తులకు సంబంధించి.. రావాల్సిన ఫీజులు, పన్నులకు సంబంధించి సరైన లెక్కలంటూ ఉంటే లోపాలెక్కడున్నాయో తెలుసుకోవచ్చు. వివరాలే లేనప్పుడు ఎవరెంత దోచుకున్నా గుర్తించడం తరం కాదు. జీహెచ్ఎంసీలో జరుగుతున్నదదే. రికార్డులు లేని పరిస్థితిని ఆసరా చేసుకున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా సొంత వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికితోడు అధికారుల అంతులేని నిర్లక్ష్యమూ ఇబ్బందికరంగా మారింది. ఆయా ప్రాంతాల్లోని అక్రమాలపై ప్రజలు సమాచారమిస్తున్నా చర్యలు లేవు. కబ్జాపాలవుతున్న చెరువులు, పార్కులపై సమాచారమిచ్చినా పట్టించుకోరు. దొంగ రసీదులతో వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ముడుపులు పుచ్చుకొని ప్లింత్ ఏరియాను తక్కువ చూపుతూ జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్నారు. ఆస్తిపన్ను అసెస్మెంట్లలో ఎక్కువ విస్తీర్ణంలోని భవనాలను తక్కువ విస్తీర్ణంలో చూపుతూ ప్రైవేటు వ్యక్తులకు సాయపడుతున్నారు. అందుకుగాను వారిచ్చే ముడుపులతో లాభపడుతున్నారు. జీహెచ్ఎంసీలోని కొన్ని విభాగాలను పరిశీలించినా దాని పనితీరు ఎలా ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఎన్ని విద్యాసంస్థలకు, ఎన్ని ప్రార్థనా మందిరాలకు ఆస్తిపన్నులో మినహాయింపు ఉందో తెలపాల్సిందిగా కోరినా.. ఏ సర్కిల్/జోన్లో ఎన్ని భవనాలకు అనుమతిచ్చారో తెలపాలని ఆర్టీఐల ద్వారా కోరినా సమాధానం లేదు. చెరువుల లెక్కల్లేవు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని చెరువులున్నాయో.. వాటిల్లో వేటి ఎఫ్టీఎల్ ఎంతో.. ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయో కచ్చితమైన సమాచారం లేదు. తొలుత 178 చెరువులున్నాయన్నారు. అనంతరం వాటిని 168గా తగ్గించి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో 126కు మించి కనిపించడం లేవని చెబుతున్నారు. చెరువుల భూములు కబ్జా కాకుండా ఎఫ్టీఎల్ నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ, ఆ పని పూర్తికాకముందే ఆయా చెరువులకు ఫెన్సింగ్ పేరిట రూ.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. ప్రకటనలపైనా పట్టింపు లేదు గ్రేటర్‌లోని ప్రకటనల ఆదాయం మొత్తం జీహెచ్ఎంసీకే చెందాల్సి ఉండగా.. నగరంలో ఎన్ని హోర్డింగులున్నాయో వివరాల్లేవు. ఆదాయం వచ్చే ప్రకటనల్లో ముఖ్యమైనవి.. హోర్డింగులు, నియాన్/ గ్లో సైన్‌బోర్డులు, ఆర్చిలు, గోడలపై పెయింటింగ్‌లు, ఫ్లెక్సీబోర్డులు, గ్లాస్ పోస్టర్లు, షాప్ షట్టర్లు, లాలీపాప్స్, బస్షెల్టర్లు, బెలూన్లు. వీటిద్వారా ఏటా రూ. 100 కోట్ల మేర ఆదాయం రావాలి. కానీ చూసీ చూడనట్లు వదిలేస్తుండటంతో రూ.25 కోట్లు కూడా వసూలు కావడం లేదు. ఏదీ ఫైర్‌సేఫ్టీ ? ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే జీహెచ్ఎంసీ.. తర్వాత ఆ విషయం మరచిపోతుంది. ఫైర్‌సేఫ్టీ లేని సంస్థల లెసైన్సులు రద్దు చేస్తామని మూడేళ్లుగా చెబుతున్నప్పటికీ ఫైర్‌సేఫ్టీ లేని సంస్థలు నగరవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో సమాచారమే లేదు. ఆయా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు హూంకరింపులు తప్ప.. ఆపై చర్యలు లేవు. ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ టింబర్‌డిపోలు ఏర్పాటైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, పాఠశాలల సమాచారం కోసం జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆస్పత్రుల సమాచారం కోసం ‘అప్నా’కు, సినీ సంస్థలకు సంబంధించిన సమాచారం కోసం ఫిల్మ్‌చాంబర్‌కు లేఖలు రాశారు. 2009 నుంచి ఈ విభాగం పని ప్రారంభించినప్పటికీ , కావాల్సిన సమాచారాన్నే ఇంతవరకు సమకూర్చుకోలేకపోయింది. ఏవీ లేవు.. టౌన్‌ప్లానింగ్ ఎన్ని భవనాలకు అనుమతులున్నాయో డేటా బేస్ లేదు. ఎన్ని సెల్ టవర్లున్నాయో లెక్క లేదు. శిథిల భవనాలు సిటీలైట్ హోటల్ ప్రమాదం జరిగినప్పుడు శిథిల భవనాలపై నిద్ర లేచారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు కాకముందు ఎప్పుడో చేసిన గణాంకాలతో 558 శిథిల భవనాలున్నాయన్నారు. సిటీలైట్ ప్రమాదం తర్వాత 737 ఉన్నట్లు చెప్పారు. అంతకన్నా ఎక్కువే ఉంటాయనేది అంచనా. గుర్తించిన శిథిల భవనాలపై తగు చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇంజనీరింగ్ ఏ డివిజన్లో ఎన్ని కి.మీ.ల మేర రోడ్లున్నాయో.. వాటిమరమ్మతులను పర్యవేక్షించే ఇంజనీర్లెవరో తెలియదు. ఏ రోడ్డును ఎప్పుడు నిర్మించారో తెలియదు. అవి ఎప్పటిదాకా మన్నికగా ఉండాలో తెలియదు. ఏ రోడ్డు కింద ఏ పైపులున్నాయో తెలియదు. గోతులేర్పడ్టప్పుడు మాత్రం హడావుడి చే యడం.. ఆపై మరచిపోవడం పరిపాటిగా మారింది. ఫ్లై ఓవర్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారమూ లేదు. ఆరోగ్యం, పారిశుధ్యం ఏయే మార్గాల్లో ఎవరు ఏయే విధులు నిర్వహిస్తున్నారో ఇప్పటిదాకా తెలియదు. ఇటీవలే.. ఇందులో సంస్కరణలు ప్రారంభించారు. కొనసాగిస్తారో, అర్ధాంతరంగా ఆపేస్తారో తెలియదు. ఎస్టేట్స్ ఎస్టేట్స్ విభాగమంటూ ఒకటి ఉన్నప్పటికీ.. ఎన్ని ఆస్తులున్నాయో.. లీజుదార్లెందరో.. అద్దెలెన్ని వస్తున్నాయో, ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో తెలియదు. సాక్షాత్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే.. కార్పొరేషన్‌తో సంబంధం లేనివారు యూనియన్ల పేరిట, అసోసియేషన్ల పేరిట కార్యాలయాలను ఆయాచితంగా వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ట్రేడ్ లెసైన్సులు ఆదాయ వనురుల్లో ఒకటైన ట్రేడ్ లెసైన్సులకు సంబంధించిన డేటాబేస్ లేకపోవడంతో లెసైన్సులే లేని వ్యాపారసంస్థలెన్నో తెలియదు. లెసైన్సులు పొందాక సక్రమంగా ఫీజులు చెల్లించని వారెందరో.. వారి నుంచి ఎంతమొత్తం రావాలో వివరాల్లేవు. ఏ దుకాణం నుంచి ఎంత ఫీజు వసూలు కావాలో రికార్డుల్లేవు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యం సాగుతోంది. ఎలక్ట్రికల్ విభాగం ఏ వీధిలోఎన్ని విద్యుత్ దీపాలు ఎప్పుడు వేసిందీ లెక్కలుండవు. కొత్త బల్బులు వేసినప్పుడు పాత బల్బులనేం చేస్తున్నారో తెలియదు. ఇక ఆయా ప్యాకేజీల్లో ఉండాల్సినంతమంది కార్మికులు విధుల్లో ఉంటున్నదీ లేనిదీ తెలియదు. అంతా అయోమయం. రవాణా విభాగం ఇందులో అక్రమాలకు అంతు లేదు. కార్మికుల నుంచి ఇంధనం దాకా, అద్దె వాహనాల నుంచి స్పేర్‌పార్ట్స్ దాకా అంతా అక్రమాలే. అన్నింటికీ విద్యార్థులే.. ప్రకటనల హోర్డింగుల్ని గుర్తించడం జీహెచ్ఎంసీ సిబ్బంది వల్ల కాకపోవడంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు వాటికి సంబంధించిన సర్వే బాధ్యతలు అప్పగించారు. ఫైర్‌సేఫ్టీ లేని భవనాలను గుర్తించే పనినీ, ఇంటినెంబర్లకు సంబంధించిన సర్వే పనిని సైతం వారికే అప్పగించారు. ఏ విభాగంలోనూ తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సర్వే వంటి ఏ పని చేయాలన్నా పాలిటెక్నిక్ విద్యార్థులకు అప్పగించడమో.. ప్రైవేటు సంస్థలకు అప్పగించడమో చేస్తున్నారు. వాటి ద్వారానైనా మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారా అంటే అదీ లేదు. అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ట్రేడ్ లెసైన్సుల కోసం వాణిజ్య సంస్థల సర్వే, ఆస్తిపన్ను వసూళ్లకు భవనాల సర్వేను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. అవి ఎంతవరకు పూర్తయిందో తెలియదు. -
‘గ్రేటర్’లో ఆందోళనలకు తెర
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో అటు కార్మికుల సమ్మె.. ఇటు ఇంజినీర్ల నిరసన.. రెండూ ముగిశాయి. శనివారం జీహెచ్ఎంసీ అధికారులు రెండు సంఘాల నేతలతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు రెండు సంఘాల నేతలు ప్రకటించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రూ. 16,500కి పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించిన జీహెచ్ఎంసీ కార్మికులు శుక్రవారం మధ్యాహ్నానికి సమ్మెను విరమించారు. జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) వందన్‌కుమార్.. జనవరి 16లోగా డిమాండ్లను తీరుస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు,గోపాల్ ప్రకటించారు. అంతకుముందు.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించిన కార్మికులనుద్దేశించి జీహెచ్ఎంఈయూ నేతలు మాట్లాడారు. ముగిసిన ఇంజినీర్ల నిరసన ఇటీవలి జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవ మానానికి నిరసనగా, పెన్‌డౌన్, సామూహిక సెలవులకు దిగిన జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తమ నిరసన ను ముగించారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ శుక్రవా రం ఉదయం తగిన హామీ ఇచ్చారని ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకులు ఎం.ఎ.రహ్మాన్, కె.కిషన్, చెన్నారెడ్డి, ప్రభాకర్ విలేకరులకు తెలిపారు. హామీ అమలు కాకుం టే తిరిగి జనవరి 14 నుంచి కార్యాచరణకు దిగుతామన్నారు. కమిషనర్‌తో చర్చలు జరిపిన వారిలో ఈఎన్సీ ధన్సింగ్, అసోసియేషన్ నాయకులు ఉన్నారు. -
గ్రేటర్లో ఈ-వేస్ట్ చట్టానికి తూట్లు..
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాన్ని ఈ-వేస్ట్ ముంచెత్తుతోంది. రోగాలకు హేతువైన మూలకాలను విడుదల చేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. కాలుష్య రూపంలో కనబడకుండానే ఆరోగ్యానికి పొగబెడుతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణ, నిర్వహణకు ఉద్దేశించిన ఈ-వేస్ట్ నిర్వహణ చట్టం ‘గ్రేటర్’లో నీరుగారుతోంది. గ్రేటర్ నగరంలో తరచూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్) చెత్తకుండీలు, డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పోగవుతున్నా.. ఇటు జీహెచ్ఎంసీ, అటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాలను పునఃశుద్ధి చేసి పర్యావరణాన్ని పరిరక్షించడంలో దారుణంగా విఫలమవుతున్నాయి. చెత్తకుండీల పాలవుతున్న ఈ-వ్యర్థాలు పెనుప్రభావం చూపుతున్నాయి. వీటిని దహనం చేయడం వల్ల విడుదలయ్యే సీసం, క్రోమియం, కాడ్మియం వంటి మూలకాలు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. కాలుష్య అవధులు శృతి మించితే ఏకంగా క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు పర్యావరణ వేత్తలు. ఈ వేస్ట్ నిర్వహణ చట్టం నగరంలో అమలు కావట్లేదు. ఫలితం జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా సుమారు 4 వేల టన్నుల చెడిపోయిన ఎలక్ట్రానిక్ విడిభాగాల (ఈ-వేస్ట్)కు సంబంధించిన చెత్త ఉత్పత్తవుతోందని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) లెక్క తేల్చింది. ఇదంతా డంపింగ్ యార్డుల్లో చేరి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. నగరంలో ఈవేస్ట్ సేకరణ కేంద్రాలు మచ్చుకు ఒక్కటైనా లేవు. వీటిని ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా పీసీబీ, జీహెచ్ఎంసీలకు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ఈ-వేస్ట్ ఉత్పత్తిలా.. మహా నగరంలో సుమారు 70 లక్షల సెల్ఫోన్లున్నట్లు ఓ అంచనా. వీటిలో ఏటా సుమారు 25-30 శాతం చెత్తకుండీల పాలవుతున్నాయి. అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చేరుతున్నాయి. యార్డులో వీటిని దహనం చేస్తే వాటిలో ఉండే సీసం, క్రోమియం, కాడ్మియం వంటి మూలకాలు పర్యావరణంలో చేరుతున్నాయి. ఇవి తీవ్రమైన వాయు కాలుష్యానికి కారణమవడంతో పాటు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌కు కారణభూతమవుతున్నాయి. ఇక టీవీల్లోని క్యాథోడ్ రేస్ ట్యూబ్‌లు, కంప్యూటర్లలోని మదర్‌బోర్డులు, రిఫ్రజిరేటర్ల స్టెబిలైజర్లు, కండెన్సర్లలోనూ పై మూలకాల శాతం అధికంగా ఉందని నిర్ధారణ అయ్యింది. ఈ-వేస్ట్‌ను వృథాగా పడవేస్తే వాటిలోని హానికారక మూలకాలు భూగర్భంలోకి చేరి భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తాయని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా 4 వేల టన్నుల వ్యర్థాలు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా సుమారు నాలుగువేల టన్నుల ఈ-వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వీటిని శాస్త్రీయంగా శుద్ధి జరగడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో ఏటా 25 శాతం మేర వృద్ధి నమోదవుతుందని పీసీబీ వర్గాలు ఁసాక్షిరూ.కి తెలిపాయి. చట్టమెక్కడో..? ఈ-వ్యర్థాల నిర్వహణ, సేకరణ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను నొక్కిచెబుతూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ 2012 మేలో ఈ -వ్యర్థాల నిర్వహణ చట్టాన్నిచేసింది. దీని ప్రకారం భారీ స్థాయిలో ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు, జీహెచ్ఎంసీ సహకారంతో తప్పనిసరిగా కలెక్షన్ సెంటర్లను సొంతంగా ఏర్పాటు చేయాలి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ కేంద్రాలు అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోంది. కానీ నగరంలో ఈ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతుండడం గమనార్హం. ప్రేక్షక పాత్రలో పీసీబీ.. న గరంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారులు, డీలర్లు, వాటి ఉత్పత్తి, అందులో వాడుతున్న హానికారక పదార్థాలపై పీసీబీ పర్యవేక్షణ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయరీదారులకు పీసీబీ అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అన్న నిబంధన లేకపోవడంతో ఆయా కంపెనీల ఉత్పత్తులు నగర పర్యావరణానికి పొగ బెడుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రాల అనుమతి ఉంటే చాలన్న నిబంధన కూడా జీెహ చ్ఎంసీ ప్రేక్షక పాత్రకు కారణమవుతోంది. కొందరికే పర్యావరణ స్పృహ... హైటెక్ సిటీగా పేరొందిన మన నగరంలో కొన్ని బహుళజాతి కంపెనీలు మాత్రమే తమ వద్ద నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, మదర్‌బోర్డుల వంటి వాటిని బెంగలూరులోని ఈ-వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిసింది. కానీ వందలాది కంపెనీలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ వద్ద పోగుపడిన వ్యర్థాలను చెత్తకుండీల్లో పడవేస్తున్నాయి. వివిధ దశల్లో పునఃశుద్ధి బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఈ-వేస్ట్‌ను శాస్త్రీయ విధానాల్లో శుద్ధి చేస్తున్నారు. ఆ ప్రక్రియ ఇలా.. ఉత్పత్తి అయ్యే చోటనే ఈ-వేస్ట్ కలెక్షన్ కేంద్రాలను నెలకొల్పారు ఈ-వ్యర్థాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించడం (రెడ్యూస్), వాటిని శాస్త్రీయంగా శుద్ధి చేయడం(రీసైక్లింగ్), కొన్నింటిని తిరిగి వినియోగించడం (రీయూజ్). ఇలా మూడు పద్ధతుల్లో ఈ వ్యర్థాలను నిర్వహిస్తున్నారు మదర్‌బోర్డులు, పీసీలు, రిఫ్రజిరేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాలను వేర్వేరుగా సేకరిస్తున్నారు వాటిలో ఉండే హానికారక మూలకాలను మొదట తొలగిస్తున్నారు. వీటిని పునఃశుద్ధి కేంద్రానికి తరలించి శాస్త్రీయ విధానాల్లో, నిపుణుల పర్యవేక్షణలోనే రీసైక్లింగ్ చేపడుతున్నారు కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాలను రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించేలా చేస్తున్నారు కంప్యూటర్ విడిభాగాలను బెంగలూరులోని ఈ వ్యర్థాల పునఃశుద్ధి కేంద్రం పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో వాటిలోని హానికారక మూలకాలను తొలగిస్తోంది. ఈ విధానం సత్ఫలితాన్నిస్తోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
బయట తినాలంటే..భయం
సాక్షి, సిటీబ్యూరో :‘గ్రేటర్’లో కల్తీ నిత్యకృత్యమై పోయింది. పసిపిల్లల పాల నుంచి మొదలు పెడితే.. ప్రాణాధారమైన నీటి నుంచి తినే తిండి దాకా అన్నింటా కల్తీయే. ఈ విషాహారం తింటే జరిగే అనర్థం వేల రూపాయల ఆస్పత్రి బిల్లు నుంచి ప్రాణాలు పోయేంతదాకా! అయినప్పటికీ ప్రజలకు ప్రాణాం తకంగా పరిణమించిన ఈ ఆహార కల్తీపై జీహెచ్ఎంసీ చోద్యం చూస్తోంది. కేవలం వంద రూపాయల జరిమానా విధించి, ఓ హెచ్చరిక ముఖాన పారేసి చేతులు దులుపుకొంటోంది. దీంతో కర్రీపాయింట్ల నుంచి స్టార్‌హోటళ్ల వరకూ యథేచ్ఛగా కల్తీలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది లేమి.. ఇతరత్రా లోపాలు.. లొసుగులు.. ఆమ్యామ్యాలు.. కారణాలేవైతేనేం కల్తీ రక్కసి సిటీజనుల జీవితాలను కకావికలం చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని హోటళ్లు, ఇతరత్రా ఆహార కేంద్రాల్లోని వంటకాలు తింటూ నిత్యం వందల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. సాక్షాత్తూ జీహెచ్ఎంసీయే పాలల్లోనూ యథేచ్ఛగా కల్తీ జరుగుతున్నట్లు గుర్తించింది. అయినా ఇటు ఆహార కల్తీని అరికట్టలేక, అటు పాల కల్తీని నిరోధించలేక చేష్టలుడిగి చూస్తోంది. గత నాలుగు సంవత్సరాల్లో జీహెచ్ంఎసీ అధికారులు ఆహార కల్తీకి సంబంధించి నమోదు చేసిన కేసుల సంఖ్య 223. దీన్ని చూస్తే చాలు వారి పనితీరు ఏ విధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడు ఉన్న నలుగురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లనే ప్రస్తుతం 70 లక్షల జనాభాకు వినియోగిస్తూ ప్రజలేమైపోతే తన కేంటన్నట్లు వ్యవహరిస్తోంది. నిర్మాణ లోపాలతో భవనాలు కూలినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని క్షమించే ప్రసక్తే లేదని డాంబికాలు పలుకుతున్న అధికారులు.. విషాహారంతో ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తున్న వారిని మాత్రం ఏమీ చేయకపోవడం విశేషం. లోకాయుక్త ఆదేశాల మేరకు వివిధ సంస్థల పాల ఉత్పత్తులను పరీక్షలు చేయించగా లోపాలు వెల్లడవడం తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకొనైనా ఆహార కల్తీకి పకడ్బందీ చర్యలు చేపట్టిందా అంటే అదీలేదు. వివిధ రకాల పన్నులు, ఫీజుల వసూళ్లపై జీహెచ్ఎంసీ చూపుతున్న శ్రద్ధ ప్రజారోగ్యంపై చూపకపోవడంపై పలు స్వచ్ఛంద సంస్థలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తనిఖీల్లేవు.. చర్యల్లేవు.. ఆహార కల్తీ జరగకుండా, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందాలంటే క్రమం తప్పని తనిఖీలు.. కల్తీలకు పాల్పడినవారిపై తక్షణ కఠిన చర్యలు అవసరం. కానీ.. గ్రేటర్‌లోని ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత దృష్ట్యా అది సాధ్యం కావడం లేదు. ఇతర ప్రాంతాల్లోని హోటళ్ల సంగతటుంచి సాక్షాత్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని క్యాంటీన్లోనే పరిశుభ్రత లోపించింది. ఈ క్యాంటీన్లో ప్రజలు తినడానికి పనికిరాని ఆహారం వడ్డిస్తున్నట్లు గుర్తించిన ఆరోగ్యం, పారిశుధ్యం విభాగం అధికారులు ఇటీవల దాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నతాధికారులెందరో కొలువై ఉన్న చోటే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో తేలిగ్గానే అంచనా వేసుకోవచ్చు. సిబ్బంది లేమితో ఇబ్బంది జీహెచ్ఎంసీ పరిధి, జనాభా కనుగుణంగా 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం నలుగురే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు 30 వేల హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి సంస్థల తనిఖీల బాధ్యత వీరిదే. నలుగురే అన్నింటినీ తనిఖీ చేయడం సాధ్యం కావడం లేదు. చేస్తున్న తనిఖీలు సైతం మొక్కుబడిగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రికార్డుల్లో చూపేందుకన్నట్లుగా కొన్ని కేసులు మాత్రం నమోదు చేసి, తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు.. అక్రమాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు లేకపోవడంతో హోటళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చిరు హోటళ్ల నుంచి స్టార్ హోటళ్లదాకా, ఇరానీ టీకొట్ల నుంచి బిర్యానీ సెంటర్ల దాకా ఇదే పరిస్థితి. గ్రేటర్‌కు 26 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఐదుగురు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టులైతే మంజూరైనప్పటికీ ఇప్పటికీ భర్తీ కాలేదు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల కనుగుణంగా సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణతోనే సర్కిల్కొకరు చొప్పున 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల్ని త్వరలో భర్తీ చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. నిబంధనలివీ.. ఆహార కల్తీ వల్ల చనిపోతే, బాధిత కుటుంబానికి హోటల్ యజమాని రూ.5 లక్షలు చెల్లించాలి. హోటల్‌ను సీజ్ చేయడంతో పాటు యజమానికి ఆర్నెల్ల జైలుశిక్ష వేయాలి. లెసైన్సు లేకుండా ఆహారపదార్థాల ఉత్పత్తి, సరఫరా చేస్తే రూ.25 వేల జరిమానా. కానీ.. ‘గ్రేటర్’లో సామాన్య శిక్షలే అమలవడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల బాధ్యతలివీ.. ఆహారం విక్రయించే మాల్స్, దుకాణాలు, హోటళ్లలో తరచూ తనిఖీలు. కల్తీ ఆహారం సరఫరా చేస్తే సీజ్ చేయడం.. లెసైన్సు రద్దు చేయడం. అనుమానిత పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షలు చేయించాలి. కలుషిత, నిల్వ ఉంచిన ఆహారం ధ్వంసం చేయాలి. {పజల నుంచి అందే ఫిర్యాదులకు తక్షణం స్పందించాలి. తనిఖీలు, ల్యాబ్‌ల నివేదికలతో రికార్డు నిర్వహణ. నలుగురే ఉండటంతో ఇవేవీ సక్రమంగా జరగడం లేదు. జరిమానాల తీరిదీ... సంవత్సరం జరిమానాలు సంవత్సరం జరిమానాలు 2010 రూ. 4500 2011 రూ. 5400 2012 రూ.13500 2013 ....... బిజీలైఫ్‌తో ముప్పు బిజీ లైఫ్‌తో నగరంలో చాలామంది హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, వేళకు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం, వండుకునే తీరిక లేకపోవడం వంటి కారణాలతో అధికసంఖ్యాకులు హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీపాయింట్స్పై ఆధారపడుతున్నారు. వీటిలో శుచి, శుభ్రతల గురించి పట్టించుకుంటున్న వారు లేరు. కర్రీ పాయింట్ల నుంచి మొదలు పెడితే స్టార్‌హోటళ్ల దాకా జరుగుతున్న కల్తీ, శుభ్రత పాటించకపోవడం తదితర కారణాలతో గ్రేటర్లో రోజుకు 50-100 మంది వరకు కల్తీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. -
గ్రేటర్లో విలీనంపై పెదవి విరుపు
‘గ్రేటర్’ హోదా చూసి సంబరపడ్డారు. అందులో కలిస్తే అభివృద్ధిలో వెనక్కి చూసే పనే ఉండదనుకున్నారు. తీరా కలిశాక.. ప్రగతి మాటేమో కానీ పాత దుస్థితి తొలగక అవస్థలు పడుతున్నారు. ఇదీ జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు ప్రాంత ప్రజల ఘోష. కాగా, కొత్తగా గ్రేటర్లో విలీనమైన గ్రామాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు. పన్నుల మోతే తప్ప పనులు జరగవని అంటున్నారు. అప్పట్లో.. నగరంతో సమానంగా శివార్లలో సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 900 కోట్లతో అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెండర్లు పిలవాల్సిన తరుణంలో ఆయన బదిలీ కావడంతో పథకం అటకెక్కింది. శివార్లలో ఎక్కడి సమస్యలక్కడే తిష్టవేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇటీవల గ్రేటర్లో విలీనమైన 35 గ్రామాలు శివాలెత్తుతున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్నాయి. నిజాంపేట.. కటకట నిజాంపేట: పచ్చటిపైర్ల మధ్య కళకళలాడిన నిజాంపేట.. ఇప్పుడు గ్రేటర్లో విలీనం నేపథ్యంలో పన్నుల మోతను తలుచుకుని బెంబేలెత్తుతోంది. ఇప్పటివరకు గ్రామ పంచాయితీలో వంద గజాల అనుమతికి రూ.2 వేలను చెల్లించే వారు. విలీనం తరువాత ఈ ప్రాంతవాసులు బెటర్మెంట్ చార్జీల కింద ఒకేసారి రూ.20 వేలు చెల్లించాలి. ఆస్తిపన్ను (ఇంటి పన్ను) సుమారు 200 శాతం పెరగనుంది. ఇప్పటివరకు రూ.వెయ్యి నుంచి రూ.1500 ఆస్తిపన్ను చెల్లించవారు రూ.15 వేలకు మించి చెల్లించాలి. గ్రామంలో జీప్లస్ వన్‌కే అనుమతి ఉంది. చాలా భవనాలు 4-5 అంతస్తుల వరకు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై గ్రేటర్లో 50 శాతం అదనపు పన్ను విధిస్తున్నారు. దీంతో నిజాంపేటలోని పలు భవనాలపై భారం పడనుంది. రాజేంద్రనగర్.. పరేషాన్ రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ గతంలో మున్సిపాలిటీ. 2009లో సర్కిల్లోని ప్రాంతాలను 4 డివిజన్లుగా విభజించి గ్రేటర్లో కలిపారు. అప్పట్లో వేసిన రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి, డ్రైనేజీ వ్యవస్థలే నేటికీ కొనసాగుతున్నాయి. విలీనం తరువాత అభివృద్ధిపై ప్రజలకు నిరాశే మిగిలింది. పన్నుల భారం మాత్రం మిగిలిందని, పనుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామం గ్రేటర్లో కంటే మున్సిపాలిటీలో ఉండగానే నయంగా ఉండేదని బుద్వేలు గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ మండల పరిధిలోని 13 గ్రామాలు గ్రేటర్లో కలిశాయి. నిన్నటి వరకు పంచాయతీ ఆధీనంలో ఉన్న కిస్మత్పూర్ చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించింది. విలీనం తరువాత ప్రగతి అనుమానమేనని గ్రామ ప్రజలు అంటున్నారు. ఫీర్జాదీగూడ.. గోడు ఉప్పల్/బోడుప్పల్: జీహెచ్ఎంసీలో తాజాగా విలీనమైన పీర్జాదిగూడలో రోడ్ల విస్తీర్ణం 25 కి.మీ.. ఇప్పటికి 10 కి.మీ. మేర సీసీ రోడ్లు వేయగా, ఇంకా 15 కిమీ మేర సీసీ రోడ్లు వేయాల్సి ఉంది. గ్రామంలో ప్రస్తుతం 50 శాతం వరకే భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టారు. దీంతో గ్రామంలో మురుగు సమస్య తలెత్తుతోంది. చెరువు నుంచి మూసీలో కలపడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయాల్సి వుంది. వారానికి ఒకరోజే తాగునీరు సరఫరా అవుతోంది. అదీ 45 నిమిషాలే.. చాలామంది నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు. విద్యుత్ సమస్య సరేసరి.. గ్రామంలోని ఇళ్లు 5 వేలు. నల్లా కనెక్షన్లు అదే సంఖ్యలో ఉన్నాయి. కొత్తగా గ్రేటర్లో కలిసినందున సమస్యలు తీరతాయన్న నమ్మకం గ్రామస్తుల్లో లేదు. పన్నులపై భయపడుతున్నారు. రామంతా‘పూర్’ డివిజన్ రామంతాపూర్ డివిజన్లోని కొన్ని బస్తీల పరిస్థితి మారుమూల గ్రామాలకన్నా దైన్యం.. ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్ గ్రామ పంచాయితీలు 1987లో మున్సిపాల్టీలుగా మారాయి. 2007లో గ్రేటర్లో విలీనమయ్యాయి. కుర్మానగర్, లక్ష్మీనర్సింహకాలని, ఉప్పల్ హిల్స్‌కు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. వెయ్యికి పైగా ఇళ్లున్న ఈ బస్తీల్లో మట్టిరోడ్లే గతి. 80 శాతం వరకు రోడ్లు వేయాల్సి ఉంది. డ్రైనేజీ వ్యవస్థదీ అదే దుస్థితి. మొదట అభివృద్ధి చేసి.. ఆపై విలీనం గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిన రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కుర్మానగర్, లక్ష్మీనరసింహ కాలనీలో నేటికీ మౌలిక వసతుల్లేవు. ఈ బస్తీలు అటు పంచాయితీలకు ఇటు గ్రేటర్ హైదరాబాద్‌కు కాకుండా పోయాయి. కనీసం మంచినీటి వసతి లేదు. మొదట సమగ్ర అభివృద్ధి చేసిన తరువాతే ఆయా ప్రాంతాలను గ్రేటర్లో విలీనం చేయాలి. - పబ్బతి శేఖర్‌రెడ్డి, ఉప్పల్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఇప్పటికే గ్రేటర్లో కలిసిన శివారు మునిసిపాలిటీల ప్రజలు ఎలాంటి సదుపాయాల్లేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారిపై పన్నుల భారం మోపడం తప్ప చేసిందేమిటి? ఇప్పుడు కొత్తగా 35 గ్రామాల విలీనం జరిగిందో లేదో ఆయా గ్రామాలపై పడి రికార్డులు స్వాధీనం చేసుకోవడం దారుణం. పన్నుల కోసమే గ్రామాల్ని కలుపుకొంటున్నట్టుంది. - టి.కృష్ణాగౌడ్, టీడీపీ బీసీ విభాగం నాయకుడు, అంబర్‌పేట ‘నీటి’ మీద ప్రతిపాదనలు శివార్లలోని 30 లక్షల మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి, ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు వారాలకోసా రి నీళ్లు వస్తున్నాయి. రోజూ నీటి సరఫరాకు స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలి. శివార్ల దాహార్తి తీర్చేందుకు రూ.2400 కోట్లతో 2008లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. కంచికి చేరిన ‘టిప్’ కోర్ ఏరియాతో సమానంగా ఆస్తిపన్ను చెల్లిస్తున్నా.. శివారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఈ క్రమంలో సమగ్ర మౌలిక స దుపాయాల కల్పన (టిప్)ద్వారా సౌకర్యాలు కల్పించాలని భావించా రు. అందుకు రూ. 900 కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధమై, బ్యాంకు రుణం తీసుకోవాల్సిన తరుణంలో.. పథకాన్ని మార్చారు. -
14 పంచాయతీలకు ఎన్నికలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం మెట్టు దిగింది. గ్రేటర్లో శివారు పంచాయతీల విలీనంపై వెనక్కి తగ్గింది. విలీనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన 14 పంచాయతీలకు నగారా మోగిం చిం ది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21న పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. శరవేగంగా సాగుతున్న నగరీకరణ నేపథ్యంలో రాజధాని పరిసరాల్లోని 36 పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక పంచాయతీల తీర్మానాలను కోరింది. అయితే, గ్రేటర్లో విలీనానికి అనుకూలంగా కొన్ని గ్రామాలు తీర్మానాలు కూడా చేశాయి. మరికొన్ని తోసిపుచ్చాయి. గ్రామాల విలీనంపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, ప్రభుత్వం తన విశేషాధికారాలను వినియోగించి 15 గ్రామాలను విలీనం చేసుకుంటూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. అదే క్రమంలో కోర్టు కేసులు ఉన్న 14 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత చూపింది. తమ గ్రామాలను గ్రేటర్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కోర్టుకెక్కారు. దీంతో వీటికి అప్పట్లో ఎన్నికలు జరగలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు దృష్టికి తెచ్చింది. దీంతో ఈ పంచాయతీల పోరుకు లైన్‌క్లియరైంది. వీటికి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఈసీని కోరింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మళ్లీ పల్లెపోరుకు తెరలేచింది. ఎన్నికల షెడ్యూల్ ఇలా... నామినేషన్ల స్వీకరణ : 6నుంచి 10వ తేదీవరకు పరిశీలన : 11న అప్పీల్ : 12న అప్పీళ్ల పరిశీలన : 13న నామినేషన్ల ఉపసంహరణ : 14న(3 గంటల్లోపు) అభ్యర్థుల ప్రకటన : 14న(3 గంటల తర్వాత) పోలింగ్ : 21న ( 7 గం॥నుంచి 1 వరకు) ఓట్ల లెక్కింపు, ఫలితాలు : 21న ( 2గంటల నుంచి) ఎన్నికలు జరిగే పంచాయతీలివే... మేడ్చల్ : గుండ్లపోచంపల్లి కుత్బుల్లాపూర్ : కొంపల్లి, ప్రగతినగర్, దూలపల్లి కీసర : నాగారం, దమ్మాయిగూడ ఘట్కేసర్ : చెంగిచర్ల, మేడిపల్లి, బోడుప్పల్ రాజేంద్రనగర్ : మణికొండ జాగీర్, కోకాపేట్, గండిపేట్, మంచిరేవుల శామీర్‌పేట్ : జవహర్‌నగర్ -
మరో వి‘భజన’
సాక్షి ప్రతినిధి, కర్నూలు:తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి జనం సమైక్యాంధ్ర కోసం ఉద్యమబాట పట్టగా... ఆ ఉద్యమస్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్ జిల్లా నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు నుంచే రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ అంటూ అధిష్టానం ముందు కూడా భిన్న వాదనలు వినిపించిన జిల్లా కాంగ్రెస్ నేతలు ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలోనూ తమ రాజకీయ కుట్రలను మానుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణతో కలిసి ఉండటమొక్కటే మార్గమంటూ మరో విభజనను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆంటోని కమిటీ ముందు అనంతపురం జిల్లా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, మధుసూదన్ గుప్తా బాహాటంగానే తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని కోరగా, జిల్లాకు చెందిన నేతలు మాత్రం పైకి సమైక్యాంధ్ర అంటూ లోపాయికారీగా రాయల తెలంగాణకు కూడా సిద్ధమేనంటూ తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. రోజుకో మాట: మంగళవారం ఆంటోని కమిటీ ముందు రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమకు రాళ్లే మిగులుతాయని చెప్పిన న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలంగాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నా రు. ఆయనతో పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటన వెలువడిన తర్వాత ‘ఉంటే సమైక్యంగా ఉంచండి... లేదంటే మూడు ముక్కలు చేయండి’ అని అధిష్టానానికి తేల్చిచెప్పారు. జిల్లాలో విలేకరుల సమావేశాల్లోనూ ఇదే మాట చెప్పుకొచ్చారు. తెలంగాణ ఒక్క రాష్ట్రాన్నే ఇవ్వాలని కేంద్రం భావిస్తే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలనే వాదన కూడా తీసుకొచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బహిరంగంగా సమైక్య మాటలు చెబుతూ ఢిల్లీలో రాయల తెలంగాణకు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి ఢిల్లీకే పరిమితమై తనకున్న పెద్దల సంబంధాలతో ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాతే ఆయన కర్నూలుకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు. మీటింగ్ సాకుతో దేశం విడిచిన టీజీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి భవిష్యత్ వ్యూహంపై మల్లగుల్లాలు పడుతున్న చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్ ప్రస్తుత పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఏకంగా దేశాన్నే వదిలి పెట్టారు. ఓ సమావేశంలో పాల్గొనే నెపంతో ఆయన బుధవారం అమెరికా పయనమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ వరకు అక్కడే ఉంటారు. కర్నూలు జిల్లాకు అన్యాయం చేసే విధంగా 72 జీవో జారీతో పాటు గుండ్రేవుల బ్యారేజీకి మోకాలడ్డుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఆయన జిల్లా వాసుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ రెండు నిర్ణయాలపై తనకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ముఖ్యమంత్రిని కూడా ఆయన తప్పు పట్టారు. ఇందులో భాగంగా సీమాంధ్ర ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకాని ఆయన మంగళవారం నాటి ఆంటోని కమిటీ ముందుకు కూడా వెళ్లలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లిపోవడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉద్యమం పట్ల అంటీ ముంటనట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వారిని ఎక్కడిక క్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. -
గ్రేటర్‌కు కొత్త జిలుగు
సాక్షి, సిటీబ్యూరో:విద్యుత్ పొదుపు.. ఆదాయం మదుపు చేస్తూనే వెలుగు జిలుగుల నగరాన్ని ఆవిష్కరించేందుకు జీహెచ్ఎంసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలోనే తొలిసారి ఇండక్షన్ ల్యాంప్‌ల వినియోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒకటి రెండు ప్రాంతాల్లో 50 రోజుల పాటు ఈ దీపాల్ని వినియోగించి విద్యుత్ పొదుపును అంచనా వేసిన జీహెచ్ఎంసీ.. క్రమేపీ వాటిని నగరమంతా ఏర్పాటు చేయడం ద్వారా ఇతర కార్పొరేషన్లలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు మార్గదర్శకం కానుంది. రోజు రోజుకూ తీవ్రమవుతున్న విద్యుత్ కొరత .. పొదుపు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రచారాల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌ను తగ్గించడంతోపాటు, చార్జీల భారాన్ని తగ్గించుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని జీహెచ్ఎంసీ అంచనా వేస్తోంది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఈస్ట్‌జోన్‌లో ప్రయోగాత్మకంగా ఒక ల్యాంప్ ద్వారా 50 రోజులకు ఆదా అయ్యే విద్యుత్‌ను లెక్కగట్టింది. సంప్రదాయ విద్యుత్ బల్బుల స్థానంలో ఇండక్షన్ ల్యాంపుల వాడకంవల్ల తక్కువ ఖర్చుతోపాటు, ప్రశాంతమైన వెలుతురు అందుతుందని గుర్తించింది. దీంతో నగరమంతా వీటిని ఏర్పాటుచేస్తే వీధిదీపాల విద్యుత్ ఖర్చుల కింద జీహెచ్ఎంసీ ఏటా చెల్లిస్తున్న కోట్ల రూపాయల్లో ఎంతో పొదుపు చేయవచ్చునని భావించింది. తొలి దశలో జీహెచ్ఎంసీకి చెందిన ఫ్లైఓవర్ల మార్గాల్లో దాదాపు 200 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు కాంట్రాక్టుకు టెండర్లు పిలవనున్నారు. ప్రయోజనాలివీ... ఎలక్ట్రోడ్స్, ఫిలమెంట్స్ కంటే వీటి జీవిత కాలం రె ట్టింపు హైమాస్ట్ లైట్లపై మూడు నెలలకోమారు నిర్వహణ భారం ఉంటుండగా, వీటిపై అదేమీ ఉండదు (కాంట్రాక్టు కనీస కాలపరిమితి ఐదేళ్లు) ఇండక్షన్ ల్యాంప్‌ల సగటు జీవిత కాలం లక్ష గంటలు. ఈ లెక్కన దాదాపు 20 ఏళ్ల వరకు బల్బులు మార్చాల్సిన పనిలేదు విద్యుత్ వినియోగ భారం 60 శాతం తగ్గుతుంది పర్యావరణహితమైన ఈ దీపాలను ఎన్నేళ్లు వినియోగించినా కాంతి తగ్గదు. ప్రశాంతమైన వెలుతురు వల్ల కళ్లకు హాని కలగదు ఓల్టేజి హెచ్చుతగ్గుల్ని తట్టుకునే సామర్థ్యం గలవి ఒక వాట్ సంప్రదాయ బల్బుల కన్నా దీని వెలుతురు ఎక్కువ ఇదీ ప్రయోగ ఫలితం.. ఈస్ట్ జోన్లో 50 రోజుల పాటు ప్రయోగాత్మకంగా వినియోగించి చూడగా హైమాస్ట్ బల్బు కంటే ఇండక్షన్ బల్బు వల్ల 230 యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. అంటే సగటున రోజుకు 4.6 యూనిట్లు తగ్గింది. జీహెచ్ఎంసీ వీధిదీపాలకు చెల్లిస్తున్న చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే, ఏడాదికి ఒక్క ల్యాంపు ద్వారా రూ.10,549 తగ్గుతాయి. కాంట్రాక్టు కొనసాగే ఐదేళ్లలో ఒక్క బల్బుకే రూ. 52,745 తగ్గుతాయి. ఈస్ట్‌జోన్‌లో ప్రస్తుత మాస్ట్ లైట్ల స్థానే ఇండక్షన్ ల్యాంప్‌లను వాడితే ఏడాదికి 14,50,656 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.92,40,679 విద్యుత్ చార్జీలు అదా అవుతాయి. 50 శాతం మేర సిస్టం లోడ్ తగ్గుతుంది. 16,236 మోడర్న్ లైటింగ్ ల్యాంపుల స్థానంలో ఇండక్షన్ ల్యాంపుల్ని వాడితే ఏటా దాదాపు రూ. 2.71 కోట్ల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.