hero
-
హీరో వరుణ్ తేజ్ మూవీ మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్‌లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్‌ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
హాలీవుడ్లో మనోడి సినిమా
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్లో సినిమా నిర్మించి, ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు. 11 ఏళ్ల క్రితం అమెరికాకు..వెంకట్‌సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్‌సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్‌లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్‌సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అనేక అవార్డులు పొందాడు. 14 రోజుల్లోనే సినిమా తీశాడు..తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్‌సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్‌సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డానుది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్లో ఎన్నైనా టేక్‌లు తీసుకోవచ్చు. హాలీవుడ్లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్‌వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్లో నటిస్తా. – గుండ వెంకట్‌సాయి ప్రపంచస్థాయిలో గుర్తింపునా కొడుకు వెంకట్సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్‌రా సాయి. – గుండ శ్రీనివాస్, వెంకట్‌సాయి తండ్రి -
మంచు మనోజ్- మౌనికల కూతురి అన్నప్రాసన.. అత్త లేకపోతే ఎలా? (ఫోటోలు)
-
హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్.. సంచలనాల సీఈవో..
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
హీరో విజయ్ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు)
-
నేరం అంగీకరించిన హీరో దర్శన్ !
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. హత్య తర్వాత అభిమాని మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ఇచ్చినట్లు తేలింది. ఈ నేరాన్ని దర్శన్ అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య కేసులో ఇప్పటికే దర్శన్‌ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్‌కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్ అంగీకరించాడు. దర్శన్ పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
దర్శన్ మేనేజర్ సూసైడ్
బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్‌లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. -
Rajasthan: జీరో నుంచి హీరోగా కాంగ్రెస్?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటింది. ఎన్డీఏ 288 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 240 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఇండియా అలయన్స్ కూడా మంచి ఫలితాలను రాబడుతోంది. మొదటి రెండు గంటల్లో 211 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్కటే 92+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ప్రారంభ పోకడలు పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని చూపాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.రాజస్థాన్ ట్రెండ్స్ చూస్తుంటే భారీ తిరోగమనం కనిపిస్తోంది. బీజేపీకి పెద్ద దెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ గతసారి బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఈసారి కాంగ్రెస్ ఊహించని రీతిలో దూసుకుపోతూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కంటే ముందుంది.గతంలో మోదీ హవాతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ దెబ్బతింది. 2014లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019లో 34.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే రాజ్‌సమంద్, జైపూర్, పాలి, అల్వార్ స్థానాలలో బీజేపీ ముందుంది. కరౌలి, బార్మర్, జైపూర్ రూరల్, సవాయ్ మాధోపూర్, టోంక్, భరత్పూర్ తదితర స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. -
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రూ.3.1 లక్షల జరిమానా విధించింది.ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో హీరో ఫిన్ కార్ప్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. హీరో ఫిన్ కార్ప్ తన కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాల చట్టబద్ధతను ఈ పెనాల్టీ ప్రశ్నించదని, రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించడంలో లోపాలను ఎత్తిచూపుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.2023 మార్చి 31 నాటికి హీరో ఫిన్‌కార్ప్ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ.. తమ ఆదేశాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్దారించి హీరో ఫిన్ కార్ప్ కు నోటీసులు పంపి, ఈ లోపాలకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరింది. దీనికి హీరో ఫిన్ కార్ప్ రాతపూర్వక, మౌఖికంగా ఇచ్చిన స్పందనను, అదనపు సమాచారాన్ని ఆర్బీఐ సమీక్షించి జరిమానా విధించింది. -
జోడీ రిటర్న్స్
కొన్ని జంటలు ‘హిట్’ అవుతాయి. వెండితెరపై హిట్ అయిన ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మళ్లీ ఆ జోడీకి తగ్గ కథ కుదరాలి, కథ కుదిరితే ఇద్దరి డేట్స్ సెట్ అవ్వాలి. ఈ రెండూ సెట్ అయి, వెంటనే రిపీట్ అయిన జోడీలు ఉంటాయి.. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్ అయ్యే జోడీలూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.విశ్వంభర పిలిచాడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ షెడ్యూల్లో ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. షష్ఠిపూర్తి సంబరం రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి మళ్లీ వెంటనే మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్స్‌లో, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, శకుంతల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కుటుంబకథా చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. అప్పటి ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాయే ఈ ‘షష్ఠిపూర్తి’ సినిమాకూ స్వరాలు సమకూర్చడం విశేషం. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మిస్తున్నారు. తెరపై యాభైఆరోసారి... మలయాళ సిల్వర్ స్క్రీన్‌పై మోహన్‌లాల్, శోభనల జోడీ సూపర్ హిట్. ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ (1985) సినిమా కోసం తొలిసారి మోహన్‌లాల్, శోభన జత కట్టారు. ఆ తర్వాత ‘మణిచిత్ర తాళు’, ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ సినిమాలతో పాటు యాభైసార్లకు పైగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్‌లాల్, శోభన. అయితే 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ తర్వాత మరోసారి మోహన్‌లాల్, శోభన కలిసి లీడ్ రోల్స్‌లో నటించలేదు.ప్రస్తుతం మోహన్‌లాల్ హీరోగా నటించనున్న 360వ చిత్రంలో శోభన ఓ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మోహన్‌లాల్, శోభన కలిసి నటిస్తున్న 56వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కు జోడీగా కనిపిస్తారట శోభన. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తారని టాక్. ఈ ఏడాది ఓనమ్‌కు సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పెళ్లి తర్వాత తొలి సినిమా? దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ (1999)లో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై జోడీగా కనిపించారు సూర్య, జ్యోతిక. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కక్క, మాయావి’ వంటి సినిమాల్లో సూర్య, జ్యోతిక హిట్ జోడీ అనిపించు కున్నారు. చివరిసారిగా 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్’ సినిమాలో సూర్య–జ్యోతిక జోడీగా కనిపించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య, జ్యోతిక రియల్ లైఫ్ జోడీ కూడా అయ్యారు. అయితే ‘సిల్లున్ను ఒరు కాదల్’ తర్వాత సూర్య, జ్యోతిక కలిసి సినిమా చేయలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ సమయం ఆసన్నమైందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘కేరళ కేఫ్’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అంజలీ మీనన్ ఓ కథ సిద్ధం చేశారని, ఈ కథతో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతిక జోడీగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. ఇంకా మరికొందరి హీరో హీరోయిన్ జోడీలు రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్‌లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
అల్లు అర్జున్‌తో ఛాన్స్.. నో చెప్పిన తెలుగు హీరో ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్‌కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
సుహాస్ మూవీతో 'నువ్వు నేను' హీరోయిన్ రీ ఎంట్రీ (ఫోటోలు)
-
క్రేజ్ కాపాడుకోలేకపోయాడు.. ఆ తప్పు వల్ల కెరీర్, జీవితం సర్వనాశనం!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్‌తో అద్భుతాలు జరిగిపోతాయా? అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే సమయంలో ఫస్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్నా తర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మరుగునపడ్డ హీరోలూ ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కునాల్ సింగ్ నటించిన తొలి సినిమా కాదల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా యాక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వాలు కనులదానా, ప్రేమ అనే పరీక్ష రాసి.. , దాండియా ఆటలు ఆడ.. ఇలా అన్ని పాటలు బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్టయింది. ఇంకేముంది.. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక్కడే తప్పటడుగులు వేశాడు. హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా అందుకున్నాడు. అతడు సంతకం చేసిన సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. (చదవండి: Vithika Sheru: మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. వితికా ఎమోషనల్ పోస్ట్) భార్య ఉండగా నటితో క్లోజ్.. మరికొన్ని షూటింగ్ జరిగినా విడుదలకు నోచుకోలేదు. ఐదేళ్లలోనే డీలా పడిపోయాడు. 2007లో చివరగా నంబనిన్ కాదలై అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్టర్‌గా రాణించడం కష్టమని తెలియగానే అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తాడు. తర్వాత నిర్మాతగానూ మారాడు. అయతే కునాల్, నటి లావిణ పంకజ్ భాటియా అత్యంత సన్నిహితంగా మెదిలేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ప్రేమ విషయం కునాల్ భార్య అనురాధకు తెలిసింది. దీని గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవట! ప్రాణాలు తీసుకున్నాడు ఆమె కోపంతో ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోవడంతో కునాల్ మనస్తాపానికి గురయ్యాడు. 2008 ఫిబ్రవరి 7న తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, నటి పంకజ్‌తో తన ఇంట్లోనే చర్చలు జరిపాడు. అందరూ వెళ్లిపోయాక పంకజ్ అక్కడే ఉన్న వాష్‌రూమ్‌ను వాడుకుందామని వెళ్లి వచ్చింది. అంతలోనే కునాల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఏమీ మిగల్లేదు అయితే పంకజ్‌కు, కునాల్‌కు మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే హీరో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పంకజ్ భాటియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. అంతకుముందు కూడా కునాల్ ఒకటీరెండు సార్లు చనిపోయేందుకు ప్రయత్నించాడట! ఒకవైపు కెరీర్ నాశనమైంది.. మరోవైపు సంసార జీవితం కూడా సవ్యంగా లేదు.. వీటికి తోడు నిర్మాతగా అప్పులపాలు అవడంతోనే అతడు తనువు చాలించాడని చెప్తుంటారు. ఏదేమైనా 31 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
స్టార్ హీరోయిన్లతో సినిమాలు.. ఇప్పుడేమో ఖరీదైన కారును అమ్మేసి!
సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా. 2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్‌గా సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్‌లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. -
సినిమా రక్తం
‘టప్’మంటూ లైట్ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్‌గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్‌లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు. హిందీలో ‘దుష్మన్’ అనే సినిమా పెద్ద హిట్. రాజేష్‌ఖన్నా హీరో. లారీ డ్రైవర్. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్’గా తీస్తే హిట్ అయ్యింది. ఇదే రాజేష్ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్‌లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్ దక్కే అవకాశం లేదు. పోలీస్జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్’లో అమితాబ్ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు. ‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్ తీసిన బి.ఎన్.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. ఎన్.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్ నియమం ఉండేది. అంతెందుకు? చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్‌కు పంపితే క్లయిమాక్స్‌లో సంజీవ్ కుమార్ గబ్బర్ సింగ్‌ను ఎలా చంపుతాడు... సెన్సార్ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్ రీషూట్ చేసి గబ్బర్ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది? రామ్‌గోపాల్ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్‌తోపాటు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్గన్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి. రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్‌బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి. సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్‌హాఫ్‌లో కాకపోతే సెకండ్ హాఫ్‌లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్’ పడవలసిందే కదా!! -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
Salaar Part 1 : డార్లింగ్ హీరో ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు
కథలు ఊహల్లో నుంచే కాదు.. వాస్తవ జీవితాల్లో నుంచి కూడా వస్తుంటాయి. ఇలా రియల్‌గా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కొందరు దర్శకులు రాసుకున్న కథలతో కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. రియల్ టు రీల్‌గా రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘డాన్ శీను (2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది కంప్లీట్ పీరియాడికల్ ఫిల్మ్ అని, ఆంధ్రప్రదేశ్‌లో 1991లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. మరోవైపు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ కూడా కొన్ని వాస్తవ ఘటనల ప్రేరణతో తెరకెక్కి, హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ► హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుంది. అయితే ఈ సినిమా కథలోని కొంతభాగం వాస్తవ ఘటనల ఆధారంగా ఉంటుందని ఈ చిత్ర రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ గత ఏడాది అక్టోబరులో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా రాజమౌళి అండ్ కో ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ► శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ, 2018 నవంబరులో పోరపాటున పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులకు బందీలుగా చిక్కారు. దాదాపు ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన వారి జీవితాల్లోని వాస్తవ ఘటనల సమాహారంగా ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబి నేషన్‌లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఇది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులోప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా వివాహం జరిగిన కొద్ది కాలానికే, తాను తండ్రి కాబోతున్న సమయంలోనే పాకిస్తాన్లో ఖైదు కాబడిన శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది చివర్లో ‘తండేల్’ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ► ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. హిందీ, తెలుగు భాషల్లో రూపోందిన ఈ ద్విభాషా చిత్రంతో శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో మానుషీ చిల్లర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వరుణ్ తేజ్ హిందీకి పరిచయం అవుతున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చోటు చేసుకున్న కొన్ని వైమానిక దాడుల వాస్తవ ఘటనల సమాహారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ్రపోడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. తొలుత ఈ సినిమాను డిసెంబరు 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిప్రారంభంలో విడుదల చేసే ఆలోచన ఉందని యూనిట్ వెల్లడించింది. ► సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హర: ది రివోల్ట్’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రధారి. కాస్త రివెంజ్ టచ్ ఉన్న ఈ సినిమా 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 22న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ తేదీకి ప్రభాస్ ‘సలార్’ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘హరోం హర’ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ► శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా రూపోందిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ఖుషీ రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఇతర ప్రధాన పాత్రలుపోషించారు. ఓ నిజజీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, చిత్రీకరణ సమయంలో కొన్ని ఘటనలు జరగడంతో కాస్త భయంగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ చిత్రదర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కానుంది. 1930, 1990.. ప్రస్తుతం.. ఇలా మూడు కాలాలతో ‘పిండం’ స్క్రీన్ ప్లే ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇలా వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుని, ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి.