indian army
-
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్: ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ ప్రత్యేక దళాలకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) మరణించగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఆదివారం ఉగ్రవాదులు, ఆర్మీ బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సైనికుడిని నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘‘జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వైట్ నైట్ కార్ప్స్ , అన్ని ర్యాంక్‌లకు చెందిన అధికారులమంతా నయాబ్ సుబేదార్ రాకేష్ కుమార త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. భార్త్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఉమ్మడి కౌంటర్ ఎదురుకాల్పుల ఆపరేషన్‌లో భాగమై వీరమరణం పొందారు. ఈ దుఃఖ సమయంలో మేం మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం’’ అని పేర్కొంది. #GeneralUpendraDwivedi #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of #Braveheart Nb Sub Rakesh Kumar who laid down his life in the line of duty in J&K. #IndianArmy offers deepest condolences and stands firm with the bereaved family in this hour of grief. https://t.co/bJRZY7w8d3— ADG PI - INDIAN ARMY (@adgpi) November 10, 2024గ్రామ రక్షణ గార్డులు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్ల బుల్లెట్‌తో కూడిన మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిన్న భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు అపహరించి హతమార్చిన తర్వాత గురువారం సాయంత్రం కుంట్వారా, కేష్వాన్ అడవుల్లో ఆర్మీ బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.చదవండి: జార్ఖండ్‌లో అవినీతిపరులను బీజేపీ విడిచిపెట్టదు: ప్రధాని మోదీ -
ఆర్మీచేతికి స్వదేశీ అస్మీ మెషీన్ పిస్టల్స్
జమ్మూ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘అస్మీ’మెషీన్ పిస్టళ్లు భారత సైన్యం చేతికొచ్చాయి. ‘‘దేశ ఆత్మనిర్భరత కార్యక్రమానికి మరింత ఊతమిస్తూ 100 శాతం భారత్ తయారీ ఆయుధాన్ని ఇండియన్ ఆర్మీ తమ అమ్ములపొదిలోకి తీసుకుంది’’అని డిఫెన్స్ జమ్మూ విభాగం ప్రజావ్యవహారాల శాఖ మంగళవారం ‘ఎక్స్’లో ట్వీట్‌చేసింది. ఇండియన్ ఆర్మీ కల్నల్ ప్రసాద్ బన్సూద్తో కలిసి సంయుక్తంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఈ పిస్టల్‌ను అభివృద్ధిచేసింది. ఈ పిస్టళ్లను హైదరాబాద్‌లోని లోకేశ్ మెషీన్స్ కర్మాగారంలో తయారుచేశారు. దీంతో కీలకమైన రక్షణ సాంకేతికలో భారత్ మరింత స్వావలంభన సాధించింది. అత్యంత చిన్నగా, తేలిగ్గా ఉండటం అస్మీ పిస్టల్ ప్రత్యేకత. శత్రువుతో అత్యంత సమీపం నుంచి పోరాడాల్సి వచ్చినపుడు వేగంగా స్పందించేందుకు ఈ పిస్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ పిస్టల్గా, సబ్ మెషీన్గన్గా రెండు రకాలుగా వాడుకోవచ్చు. స్వల్ప, మధ్య శ్రేణి దూరాల్లోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో షూట్ చేయొచ్చు. అత్యంత వేడి, చలి వాతావరణంలోనూ ఏమాత్రం మొరాయించకుండా పనిచేస్తాయి. 8 అంగుళాల బ్యారెల్‌కు 33 తూటాల మేగజైన్‌ను అమర్చవచ్చు. 9ఎంఎం బుల్లెట్‌ను దీనిలో వాడతారు. తొలి దఫా 550 పిస్టళ్లను నార్తర్న్ కమాండ్ పరిధిలోని జమ్మూకశీ్మర్, లద్దాఖ్ సరిహద్దులవెంట పహారా కాసే భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు అందజేశారు. వీటి తయారీ ఆర్డర్‌ను లోకేశ్ మెషీన్స్ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చారు. -
వీడియో: చరిత్రలో మొదటిరోజు.. దీపావళి వేడుకల్లో భారత్, చైనా బలగాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వేళ ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అటు, భారత సరిహద్దుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీపావళి సందర్బంగా భారత్-చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట పలుచోట్ల స్వీట్స్ పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్బంగా భారత్, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంట సరిహద్దుల్లో భారత్, చైనాలు తమ బలగాలను పూర్తిగా ఉపసహంరించుకున్నాయి. అంతేకాకుండగా.. తూర్పు లడఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణ పూర్తయ్యిందని, త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్ఏసీ వద్ద ఒప్పందం అమలు వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా చర్చలు కొనసాగుతాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. నేడు దీపావళి పండుగ సందర్భంగా భారత్, చైనాకు చెందిన సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. లఢఖ్ సెక్టార్‌లోని కోంగ్లా ప్రదేశంలో ఎల్ఏసీ వెంట రెండు దేశాలకు చెందిన సైనికులు కలుసుకోవడం విశేషం. ఈ సందర్బంగా సైనికులు ఆనందం వ్యక్తం చేశారు.Soldiers of the Indian and Chinese Army exchange sweets at KongkLa in Ladkah Sector on the occasion of #Diwali. (Source: Indian Army) pic.twitter.com/KKEJpEHgPo— ANI (@ANI) October 31, 2024 Just in: Indian, Chinese PLA troops exchange Diwali sweets in at least five border points along LAC in Ladakh; MoD statement says this marks a “new era of cooperation”.- Karakoram Pass, - Daulat Beg Oldie - Chushul-Moldo Meeting Point- Kongka La- Hot Springs pic.twitter.com/mepbzoFetG— Dhairya Maheshwari (@dhairyam14) October 31, 2024 -
ఉగ్రవాదుల చొరబాటు కట్టడికి అప్రమత్తంగా ఉన్నాం: ఆర్మీ
శ్రీనగర్: జమ్ము ప్రాంతంలోకి సరిహద్దు వెంబడి దాదాపు 50 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భారత ఆర్మీ అంచనా వేస్తోంది. ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో ఆర్మీ బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులను విజయవంతంగా అంతం చేసిన అనంతరం 10వ పదాతిదళ విభాగానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సమీర్ శ్రీవాస్తవ విలేఖరులతో మాట్లాడారు. ‘‘పౌరులకు హాని కలిగించే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఆర్మీ అడ్డుకుంటుంది. మంగళవారం ఉదయం అఖ్నూర్ సెక్టార్‌లోని ఒక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో 27 గంటల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరుకుంది. అఖ్నూర్ కఠినమైన నిఘాలో ఉంది. ...అఖ్నూర్లో ఉగ్రవాదుల శాశ్వత ఉనికి లేదు. మేము మా గార్డును వదులుకోం. చాలా కాలంగా ఈ ప్రాంతం చొరబాట్లను చూడలేదు. ప్రతి ఏడాది చొరబాటు విధానం మారుతోంది. ముఖ్యంగా చలికాలం సమయంలో మేము కూడా ఉగ్రవాదుల చొరబాటు కట్టడి విషయంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని అన్నారు.ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. సరిహద్దుల వెంబడి 50 నుండి 60 మంది ఉగ్రవాదులు ఉన్నారని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. అఖ్నూర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం భద్రతా బలగాలకు లభించిన పెద్ద విజయంగా అభివర్ణించారు.చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లతో సహా నలుగురి మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్‌గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్‌లోని నయీద్గామ్లోని బుద్గామ్కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్‌కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్‌లుగా గుర్తించారు.ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్‌లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
మోదీ, జిన్‌పింగ్ భేటీ సఫలం.. భారత బోర్డర్లో కీలక పరిణామం
ఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇటీవల బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో భాగంగానే బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత్, చైనా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు లఢఖ్ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు.అలాగే, ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. లడఖ్ నుంచి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎల్ఏసీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల బలగాలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నట్టు సమాచారం.Disengagement of troops of India and China has started at two friction points in Demchok and Depsang Plains in Eastern Ladakh sector. As per the agreements between the two sides, the Indian troops have started pulling back equipment to rear locations in the respective areas:… pic.twitter.com/CzwAZs4sJG— ANI (@ANI) October 25, 2024ఇదిలా ఉండగా.. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సందర్బంగా భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఇదే సమయంలో చైనా కూడా తన సైన్యాన్ని కోల్పోయింది. దీంతో, నాటి నుంచి ఎల్ఏసీ వెంబడి రెండు దేశాల బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. అయితే, గాల్వాన్ దాడిలోనే తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. -
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం
దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. వీటి విలువ రూ. 32,000 కోట్లు కాగా ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) సదుపాయాన్ని నెలకొల్పడంతో పాటు యూఎస్ నుంచి మొత్తం 31 MQ-9B హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు గత వారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అనుమతి ఇచ్చింది. మొత్తం 31 డ్రోన్లలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు.కాగా డెలావేర్లో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సు సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు జరిగిన నెలలోపే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాక ఈ డీల్ మొత్తం విలువ రూ.34,500 కోట్లకు పెరగే అవకాశం ఉంది. చెన్నై సమీపంలోని ఐఎన్ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్బందర్, ఉత్తరప్రదేశ్‌లోని సర్సావా మరియు గోరఖ్‌పూర్‌తో సహా నాలుగు సాధ్యమైన ప్రదేశాలలో భారతదేశం డ్రోన్లను ఉపయోగించనుంది.అయితే చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచేందుకు ఈ డ్రోన్లు అవసరమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు గరిష్టంగా గంటకు 442 కిమీ వేగంతో, దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. సుమారు 40 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. నాలుగు హెల్ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. ఇప్పటికే భారత్ వీటిల్లో మరోరకమైన సీగార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా జనరల్ అటామిక్స్ నుంచి లీజ్‌పై భారత్ తీసుకొంది. ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్టు ముగియగా.. మన నౌకాదళం మరో నాలుగేళ్లపాటు దీనిని పొడిగించింది. -
సర్జికల్ స్ట్రైక్: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016, సెప్టెంబర్ 18న కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో భారత సైనికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 18 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన తరువాత భారత జవాన్లు పాక్ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాధానం ఇప్పటికీ వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది.పాక్ ఉగ్రవాదులు ఉరీలో దాడి చేసి పది రోజుల తర్వాత అంటే 2016, సెప్టెంబర్ 18న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి, పాక్‌పై తగిన ప్రతీకారం తీర్చుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరీలో భారత సైన్యం క్యాంపుపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు భారత ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భారత సైనికులు నిద్రిస్తున్న గుడారాలకు నిప్పు పెట్టారు. ఈ దాడి అకస్మాత్తుగా జరగడంలో సైనికులకు తప్పించుకునే అవకాశం దొరకలేదు. ఈ దాడిలో 18 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం అక్కడ ఉన్న ప్రత్యేక బలగాలు నలుగురు పాక్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఉరీ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ నేపధ్యంలో పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో భారత సైన్యం పాక్‌పై ప్రతీకార దాడికి పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్లాన్‌లో భాగంగా ముందుగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు. 2016, సెప్టెంబర్ 28 నాటి అర్థరాత్రి భారత పారా కమాండోల బృందం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. భారత సైన్యం తన పని ముగించుకుని, విజయవంతంగా తిరిగి వచ్చింది. ఈ దాడిలో 50 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌కు ‘సర్జికల్ స్ట్రైక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. దీంతో నాడు దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.ఇది కూడా చదవండి: మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు -
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్‌లో బాంబు మోత మోగుతోంది. ఇప్పటికే కథువా, కిష్త్వార్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతుండగా.. తాజాగా బారాముల్లా జిల్లాలోనూ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. స్కూల్ బిల్డింగ్‌లో దాక్కున్న మిలిటెంట్లతో ఎదురుకాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి ఒక మిలిటెంట్ చనిపోగా, శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.చదవండి: మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతిఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్లడించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేపట్టనున్నారు.Joint operation with @JmuKmrPolice in progress at #Baramulla. https://t.co/YZY7MLjYeo pic.twitter.com/GkvBlwRJ2k— NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) September 14, 2024 -
పాక్ బరితెగింపు.. సరిహద్దులో కాల్పులు
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. మనదేశంతో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని అక్నూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు లక్ష్యంగా బుధవారం(సెప్టెంబర్11) తెల్లవారుజామున పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత జవాను ఒకరు గాయపడ్డట్లు సమాచారం. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ కాల్పులతో అప్రమత్తమైనట్లు బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘించడం గమనార్హం. సెప్టెంబర్ 18న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది.కాగా, 2021లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన తర్వాత సరిహద్దు వెంబడి భారత్,పాకిస్తాన్ మధ్య కాల్పులు పెద్దగా లేవు. గతేడాది మాత్రం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడొకరు మృతి చెందారు. ఇదీ చదవండి.. మళ్లీ రాజుకుంటున్న మణిపూర్ -
రెండో ప్రపంచయుద్ధవీరుడికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు
రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సైనికుడు, ప్రతిష్టాత్మక ‘బర్మా స్టార్ అవార్డ్’ గ్రహీత రిటైర్డ్ లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు వేడుకలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్చేయించి జన్మదిన వేడుకలను ఆరంభించారు. ఆర్మీ తరఫున సైతం బ్రిగేడియర్ అధికారి, సైనికులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా మారింది. 1924 సెపె్టంబర్ ఏడో తేదీన జన్మించిన చరణ్‌సింగ్ 1942 ఆగస్ట్ 26వ తేదీన భారత్‌లో బ్రిటిష్ సైన్యం ఫిరోజ్పూŠ కంటోన్మెంట్ యూనిట్లో చేరారు. రెండో ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడారు. సింగపూర్ నుంచి లాహోర్ దాకా పలు దేశాల్లో యుద్ధక్షేత్రాల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని యోల్ కంటోన్మెంట్‌లోనూ పనిచేశారు. ‘‘ 17 ఏళ్లపాటు సైన్యంలో చూపిన ప్రతిభకు బర్మా స్టార్ అవార్డ్‌ను, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్‌ను ఆయన పొందారు. 1959 మే 17న పదవీవిరమణ చేశారు. తర్వాత ప్రస్తుతం తన శేషజీవితాన్ని రోపార్ జిల్లాలోని దేక్వాలా గ్రామంలో గడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సొంతింట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బ్రిగేడియన్ అధికారి, సైనికులు పాల్గొన్నారు. దేశసేవలో తరించిన మాజీ సైనికులను గుర్తుపెట్టుకుని వారిని తగు సందర్భంలో గౌరవిస్తూ భారతసైన్యం పలు కార్యక్రమాలు చేస్తున్న విషయం విదితమే. ఇందులోభాగంగానే శనివారం చరణ్‌సింగ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సైన్యాధికారి ఒకరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ దశాబ్దాల క్రితం సైన్యంలో పనిచేసినా సరే ఆర్మీ దృష్టిలో అతను ఎప్పటికీ సైనికుడే. సైన్యంలో భాగమే. సైన్యానికి, పౌరులకు స్ఫూర్తిప్రదాతలుగా వారిని సదా స్మరించుకోవాలి. వారి నుంచి నేటి సైనికులు ఎంతో నేర్చుకోవాలి’ అని సైన్యం పేర్కొంది. – న్యూఢిల్లీ -
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్‌లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్‌ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్
ఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పోర్టబుల్ హాస్పిటల్‌ను విజయవంతంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌గా పేర్కొనే ఈ ఆస్పత్రిని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు పేర్కొంది. భీష్మా (భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి) అనే ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య మైత్రీ హెల్త్ క్యూబ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సంబంధించిన వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. ఇక.. ఇది ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ కావటం విశేషం.#IAF & #IndianArmy have jointly carried out a first-of-its-kind precise para-drop operation of Aarogya Maitri Health Cube at a high-altitude area close to 15,000 ft.These critical trauma care cubes have been indigenously developed under Project #BHISHM👉🏻https://t.co/QmA6ZYBPST pic.twitter.com/iEufwVcEG3— Defence Production India (@DefProdnIndia) August 17, 2024విపత్తుల సమయంలో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర సేవలు అందించాలనే ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. మారుమూల, పర్వత ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ పోర్టబుల్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇక.. పోర్టబుల్ హాస్పిటల్లో మొత్తం 72 క్యూబ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి 200 మందికి ఆరోగ్య సేవలందించవచ్చు. భారత వైమానికి దళానికి సంబంధించిన విమానం సీ-130జీని సాయంతో దీనిని నిర్దేశించిన ప్రాంతానికి చేరవేస్తుంది. -
కల్నల్ మన్‌ప్రీత్‌కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్‌కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్‌ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
వీడియో: వయనాడ్‌లో జవాన్లకు వీడ్కోలు.. కన్నీరుపెట్టిన బాధితులు
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా 400 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఇంకా 152 మంది ఆచూకీ దొరకలేదు. ఇక ఈ విపత్తు చోటుచేసుకున్న నాటి నుంచి దాదాపు 10 రోజుల పాటు భారత ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది. నేటితో సహాయక చర్యలు ముగియడంతో వయనాడ్ ప్రజలు.. జవాన్లకు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.కాగా, వయనాడ్‌లో ప్రకృతి విపత్తు జరిగిన నాటి నుంచి ఆర్మీ సహా సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మన ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే, వరదల్లో చిక్కుకున్న వారిని సహాసోపేతంగా కాపాడారు. ఎంతో తక్కువ సమయంలో వంతెన నిర్మించి దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. వయనాడ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యయప్రయాసలకు ఓడ్చి బాధితులకు బాసటగా నిలిచారు.అయితే, నేటితో సహాయక చర్యలు ముగియడంతో జవాను తిరుగు పయనం అయ్యారు. ఈ సందర్భంగా జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వయనాడ్ ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. జవాన్లు వెళ్తుండగా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. #WayanadLandslide Watch | Emotional send-off to #IndianArmy personnel from people of all walks of life at #Wayanad.Grateful for our brave heroes who risked everything during the landslide #RescueOps.Your courage & sacrifice won't be forgotten…#WeCare🇮🇳@giridhararamane pic.twitter.com/u2csEIo5r7— PRO Defence Kochi (@DefencePROkochi) August 8, 2024 -
భారత్‌లోకి చొరబడేందుకు 600 మంది బంగ్లాదేశ్ పౌరులు యత్నం
ఢాకా,ఢిల్లీ: ఇక్కడే ఉంటే తమకు భూమిపై నూకలు చెల్లినట్లేనని భావించిన సుమారు 600 మంది బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భారత్ భద్రతా బలగాలు వారిని నిలువరించాయి. రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ గురువారం (ఆగస్ట్8న)బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ప్రకటన చేశారు. అయినప్పటికీ అక్కడి విధ్వంసకర పరిస్థితులు అదుపులోకి రాలేదు. అల్లరి మూకలు పేట్రేగి పోయారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారుల్ని దారుణంగా హత మార్చుతున్నారు. అలా ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో 470 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.అల్లరి మూకల దమన కాండని ఆపేందుకు పోలీసులు తిరిగి విధుల్లోకి రావాలని, పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆ దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! ఆర్మీ సైతం చేతులెత్తేసింది. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడానికి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణమైన విద్యార్ధులే రంగంలోకి దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ తరుణంలో వందలాది బంగ్లాదేశ్ పౌరులు దేశం విడిచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లాలోని దక్షిణ్ బెరుబరి గ్రామం నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా వారిని బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు నిలిపివేశాయి. బలవంతంగా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించాయి. "Fear Being Killed": 600 Bangladeshis Try To Enter Bengal, Stopped By Border Force BSF https://t.co/NrH8JRrApU— ahmed (@ahmed_ebs) August 7, 2024 -
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా చరిత్రకెక్కిన సాధనా సక్సేనా
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా సాధనా సక్సేనా నాయర్ ( Sadhna Saxena Nair) రికార్డు సృష్టించారు. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.ఈ నియామకానికి కంటే ముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్ మార్షల్ సాధనా సక్సేనా నాయర్ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్ మార్షల్ హోదాకు చేరుకున్నారు. డిసెంబరు 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో నియమితులయ్యారు. 1986లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ , స్విట్జర్లాండ్‌లోని MME (మిలిటరీ మెడికల్ ఎథిక్స్)తో CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్) వార్ఫేర్లో శిక్షణ పొందారు.వైద్య విద్యపై ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు. న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ర్మీ మెడికల్ సర్వీసెస్‌కు డీజీగా ఎంపికయ్యారు. ఆమె అందించిన సేవలకు గాను విశిష్ట సేవా పతకాన్ని (VSM) అందుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కోసం ఆమెకు AOC-in-C (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్),చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రశంసలు లభించాయి. జనరల్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ (రిటైర్డ్)ని వివాహం చేసుకున్నారు. నాయర్ కుటుంబంలోని మూడు తరాలు గత 70 ఏళ్లుగా సాయుధ దళాలలో పనిచేశారు. -
వయనాడ్ విలయం: మేజర్ సీతాషెల్కేకు హ్యాట్సాఫ్! (ఫొటోలు)
-
ఆపరేషన్ ఆలౌట్ ఉగ్రమూకలను ఏరిపారేస్తున్న ఆర్మీ
-
ఒకే యూనిఫామ్, విధులతో.. లక్ష మంది అగ్నివీరులు చేరిక
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రథకం కింద ఇప్పటివరకు లక్షమంది అగ్నివీరులు శిక్షణపొంది వివిధ విభాగాల్లో చేరినట్లు ఆర్మీ పేర్కొంది. సుమారు 70 శాతం మంది అగ్నివీరులు వివిధ ఆర్మీ యూనిట్ల పనిచేస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ (ఆర్మీ అడ్జటెంట్ జనరల్) సీబీ పొన్నప్ప ఆదివారం తెలిపారు.‘2022 జూన్‌లో అగ్నిపథ్ పథకం అమలులోకి వచ్చింది. జనవరి, 2022 నుంచి 2023 మధ్య మొదటి బ్యాచ్ నియామకం పూర్తి అయింది. ఈ పథకం ద్వారా లక్ష మంది అగ్నివీరులో అర్మీలో జాయిన్ అయ్యారు. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు. ఇక.. రిక్రూట్ అయిన 70 వేల మంది అగ్నివీరులు వివిధ విభాగాలు, బెటాలియన్లలో చేరారు. ఇందులో కూడా 100 మంది మహిళలు ఉన్నారు’అని తెలిపారు.దీంతోపాటు మరో 50 వేల అగ్నివీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని 2024-25 ఏడాదికి గాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద రెండు రకాల సైనికులను ఆర్మీ తయారు చేస్తోందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.‘ఇతర సైనికుల మాదిరిగానే అగ్నివీరు అన్ని రకాల విధులను నిర్వర్తించాలి. నిబంధనల్లో కూడా పేర్కొన్నాం. ఆపరేషనల్, వృత్తిపరమైన విధులను అగ్నివీరులు నిర్వహించాలి. వీరంతా ఆయా యూనిట్లలో చేరి విధులు చేపడతారు. ఒకే విధమైన యూనిఫామ్, ఒకే విధమైన విధులు నిర్వహిస్తారు’అని లెఫ్టినెంట్ జనరల్ సీబీ పొన్నప్ప తెలిపారు.కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో సెలెక్ట్ అయినవారు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. వారిని అగ్నివీర్లు అంటారు. 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నాలుగు ఏళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారు. మిగతావారంతా రిటైర్ అవుతారు. ఈ పథకం విధివిధానాలు నియామక ప్రక్రియ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం ఈ పథకాన్ని రద్దు చేయాని డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్ట్‌లో సైతం ఈ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. -
ఉగ్రవాదుల ఏరివేత.. జమ్ములో సైనికుల మోహరింపు
జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించారు. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంటర్ కమాండ్‌లో మార్పులు చేశారు. కథువా, సాంబా, దోడా, బదర్వా, కిష్త్వార్లలో సైనికుల సంఖ్యను మరింతగా పెంచారు. వెస్ట్రన్ కమాండ్ నుండి కూడా ఇక్కడకు సైనికులను పంపారు.గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన సాయుధ ఉగ్రవాదులతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. మూడు వారాల్లో జమ్మూ ప్రాంతంలో ఇది మూడో అతిపెద్ద ఉగ్రవాద ఘటన. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. అంతేసంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.అంతకుముందు జూలై 9న కిష్త్వార్ జిల్లా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఉగ్రవాదులు పారిపోయారు. జూన్ 26న గండో ప్రాంతంలో ఒక రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదేవిధంగా జూన్ 12న జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడటంతో దోడాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరం చేశారు.గండోలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక పోలీసు గాయపడ్డాడు. 2005- 2021 మధ్య భద్రతా దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తర్వాత జమ్ము ప్రాంతం సాపేక్షంగా శాంతియుతంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో గత నెల నుంచి ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. -
‘జమ్ము కశ్మీర్లో కల్లోలానికి ఉగ్రవాదుల యత్నం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహద్దుల్లో చొరబాటుకు హత్నించిన ముగ్గురు ఉత్రవాదులను ఆదివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఈ ఘటనపై తాజాగా కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్కర్ణి మాట్లాడారు.‘జూలై 13,14 తేదీల్లో రాత్రి సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నించటంతో దాడులు జరిపాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతి పరిస్థితులకు భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నట్లు మాకు నిఘా సమాచారం ఉంది. ..అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇక్కడ కల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి.. జూలై 12నే మాకు ఇంటెలిజెన్స్ నుంచి మాకు సమాచారం అందింది. దట్టమైన అడవుల నుంచి కేరాన్ సెక్టార్ గుండా విదేశీ ఉగ్రవాదులు చొరబడతారన్న సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. జూలై 13, 14 తేదీ రోజుల్లో రాత్రి మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. .. ఆర్మీ, బీఎస్ఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసు సయుక్తగా ఉగ్రవాదుల చొరబడే చోట దాడులు చేశాం. అయితే చికటి ఉండటంతో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. టెర్రరిస్టుల వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయి. బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడటానికి యత్నించారు. ఇక.. మేము జరిపిన కాల్పుల్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయయ్యారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం’అని ఎన్ఆర్ కుల్కర్ణి తెలిపారు. -
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పెన్షన్, పీఎఫ్‌పై వివాదం.. స్పందించిన ఆర్మీ
అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన అన్షుమాన్ సింగ్‌కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసిందిఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.అయితే కోడలు స్మృతి సింగ్‌పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA— The Hindu (@the_hindu) July 14, 2024 వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు. -
జమ్ము కశ్మీర్లో చొరబాటుకు హత్నం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గరు టెర్రరిస్టులు హతమైనట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను ఆర్మీ చేపట్టింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన టెర్రరిస్టులపై సైనికులు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.‘జమ్ము కశ్మీర్ కెరాన్ సెక్టార్లో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. వారి వద్ద లభించినట్లు ఆయుధాలను స్వాధనం చేసుకున్నాం’ అని ఆర్మీ చినార్ కార్ప్స్ ‘ఎక్స్’ లో పేర్కొంది.OP DHANUSH II, KERAN #Kupwara03x Terrorists have been eliminated in the ongoing anti-infiltration operation on the #LoC in Keran Sector, alongwith recovery of weapons and other war-like stores. The operation is continuing #Kashmir@adgpi@NorthernComd_IA— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 14, 2024ఈ రోజు(ఆదివారం) భద్రతా బలగాలు ధనుష్-2 అనే కోడ్ పేరుతో కుప్వారాలోని కేరన్ సెక్టర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక.. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉంది.