jacques kallis
-
గంభీర్ స్ధానంలో దక్షిణాఫ్రికా లెజెండ్..?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ వేటలో పడింది. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్ పనిచేసిన గౌతం గంభీర్.. భారత హెడ్‌కోచ్‌గా వెళ్లిపోవడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో గంభీర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే మెంటార్ రేసులో ఇప్పటికే కుమార సంగర్కర, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్లు వినిపించగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్ పేరు చేరింది. ‘సంగ్బాద్ ప్రతిదిన్’ రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ మెంటార్ రేసులో సంగర్కకర, పాంటింగ్ కంటే కల్లిస్ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.కల్లిస్కు కేకేఆర్ ఫ్రాంచైజీతో మంచి అనుబందం ఉంది. ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ గతంలో గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ తరపున రెండు సీజన్ల పాటు ఆడాడు. అంతేకాకుండా కేకేఆర్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గానూ కల్లిస్ పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ యాజమాన్యం కల్లిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.చదవండి: IPL 2025: డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు! -
63 టెస్టులు.. 294 వికెట్లు! జాక్వెస్ కల్లిస్ రికార్డు బద్దలు
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ.. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అతడితో పాటు మహారాజ్ 4 వికెట్ల పడగొట్టడంతో ఆతిథ్య కరేబియన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రోటీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కీసీ కార్తీ(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 357 పరుగులకు ఆలౌటైంది.రబాడ అరుదైన ఘనత..ఇక ఈ మ్యాచ్‌లో కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సఫారీ బౌలర్‌గా రబడ రికార్డులకెక్కాడు. విండీస్ బ్యాటర్ కావెం హాడ్జ్‌ను ఔట్ చేసిన రబాడ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 63 టెస్టులు ఆడిన రబాడ 294 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ (291) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కల్లిస్‌ను రబాడ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో షాన్ పొలాక్(421), ఎన్తిని(390) ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డు
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఇంగ్లిష్ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకేఆతిథ్య జట్టు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ ఇన్నింగ్స్ విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 371 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, అరంగేట్ర బౌలర్ గుస్ అట్కిన్సన్, కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు కూల్చారు.ఇన్నింగ్స్ ఓటమి దిశగా విండీస్ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికే వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అయితే, ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఇదిలా ఉంటే.. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఓపెనర్ మిక్లే లూయీస్(14), వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెకాంజీ(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లోనూ మిక్లే లూయీస్(27) స్టోక్సే అవుట్ చేయడం విశేషం.చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డుఈ క్రమంలో స్టోక్స్ టెస్టుల్లో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఆరు వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు రెండు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు.ఓవరాల్‌గా.. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్, సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.కాగా 103 టెస్టుల్లో స్టోక్స్ ఇప్పటి వరకు 6320 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 258. ఇక టెస్టుల్లో తీసిన వికెట్లు 201.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పేస్ ఆల్‌రౌండర్ స్టోక్స్ బంతితో రాణించినా.. బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులే చేసి గుడకేశ్ మోటీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్?Kallis. Sobers. Stokes. Legends only, please. #EnglandCricket | #ENGvWI pic.twitter.com/zQADWlbOnJ— England Cricket (@englandcricket) July 11, 2024 -
KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్?
కోల్‌కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్‌లోని విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరొందింది. ముంబై ఇండియన్స్(5), చెన్నై సూపర్ కింగ్స్(5) తర్వాత అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో జట్టుగా నిలిచింది.టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచిన కోల్‌కతా(కేకేఆర్).. ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్-2024 విజేతగా అవతరించింది.ఈ విజయంలో కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్ పాత్ర కూడా కీలకం. ఈ నేపథ్యంలోనే అతడు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం విశేషం.అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానంలోఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని అతడితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గౌతీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు కొత్త మెంటార్ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్ స్థానంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా.. తాజాగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది.కేకేఆర్ మెంటార్‌గా సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్వెస్ కలిస్ కేకేఆర్ మెంటార్‌గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే.కేకేఆర్ 2012, 2014లో టైటిల్ గెలిచిన జట్టులో కలిస్ సభ్యుడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతాకు ఆడిన ఈ కేప్‌టౌన్ స్టార్.. 2015లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కొత్త అవతారం ఎత్తాడు.అనంతరం నాలుగు సీజన్ల పాటు కేకేఆర్ హెడ్ కోచ్‌గానూ వ్యహరించాడు. ఈ పదవి నుంచి వైదొలిగన తర్వాత సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కలిస్ నియమితుడయ్యాడు.ఈ నేపథ్యంలో తమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జాక్వెస్ కలిస్‌తో తిరిగి జట్టు కట్టేందుకు కేకేఆర్ యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ స్థానంలో కలిస్‌ను తమ మెంటార్‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ!.. ఏమిజరిగిందంటే? -
కోహ్లి ఇక ఆడకపోవచ్చు: సౌతాఫ్రికా దిగ్గజం
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియామకం పట్ల సౌతాఫ్రికా మాజీ ఆటగాళ్లు జాక్వెస్ కలిస్, డేల్ స్టెయిన్ హర్షం వ్యక్తం చేశారు. దూకుడైన ఆటకు మారుపేరైన గౌతీ శిక్షకుడిగా కూడా ఆకట్టుకోగలడని ధీమా వ్యక్తం చేశారు.కాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో అతడి స్థానాన్ని బీసీసీఐ గంభీర్‌తో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.శ్రీలంకతో జూలై 26 నుంచి మొదలుకానున్న ద్వైపాక్షిక సిరీస్ నుంచి ఈ మాజీ ఓపెనర్ కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. అయితే, గంభీర్ రాకతో సీనియర్ ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవని.. భావి జట్టును తీర్చిదిద్దే క్రమంలో అతడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశంముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా రవీంద్ర జడేజా వంటి సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఎంతటివారినైనా పక్కనపెట్టేందుకు గంభీర్ వెనుకాడడని పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్‌ను నేను వీరాభిమానిని. అతడి దూకుడైన స్వభావం నాకెంతో ఇష్టం.కోహ్లి ఇక ఆడకపోవచ్చునేను ఎదుర్కొన్న అత్యంత దూకుడైన భారత ఆటగాళ్లలో అతడూ ఒకడు. డెస్సింగ్ రూంలోనూ అలాంటి వాతావరణమే ఉండాలని కోరుకుంటాడు.నాకు తెలిసి విరాట్ కోహ్లి వంటి కొంత మంది సీనియర్లు ఇక ఎక్కువ కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. వాళ్లను పూర్తిగా పక్కన పెడతాడని చెప్పలేను కానీ.. కచ్చితంగా కఠినంగానే ఉంటాడనిపిస్తోంది’’ అని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.ఇక జాక్వెస్ కలిస్ స్పందిస్తూ.. ‘‘గంభీర్‌ది క్రికెటింగ్ బ్రెయిన్. సరికొత్త వ్యూహాలు రచించగలడు. జట్టులో జోష్ నింపుతాడు. దూకుడుగా ఆడటం తనకు ఇష్టం. జట్టును కూడా అలాగే తయారు చేస్తాడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు! -
హర్భజన్ మాయాజాలం.. కలిస్, గేల్ మెరుపులు వృధా
లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో నిన్న (నవంబర్ 20) జరిగిన మ్యాచ్‌లో మణిపాల్ టైగర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్.. హ్యామిల్టన్ మసకద్జ (37), తిసార పెరీరా (32), రాబిన్ ఉతప్ప (23) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జెయింట్స్ బౌలర్లలో రజత్ భాటియా 3, ట్రెంట్ జాన్స్టన్ 2, ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ, లడ్డా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్.. పర్వీందర్ అవానా (3-0-19-4), హర్భజన్ సింగ్ (4-1-14-2), తిసార పెరీరా (2-0-6-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్), జాక్ కలిస్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), పార్థివ్ పటేల్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్) జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 21) సథరన్ సూపర్ స్టార్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
Virat Kohli: కలిస్‌ను దాటేశాడు.. ఇక మిగిలింది ముగ్గురే..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో ఆల్‌టైమ్ రికార్డుకు చేరువవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన అతను.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు (212) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి సౌతాఫ్రికా లెజెండ్ జాక్ కలిస్ (211) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (264) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (217), శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (216) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో కోహ్లి మరో 53 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేస్తే సచిన్ ఆల్‌టైమ్ రికార్డును అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే, నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి ఖాతాలో మరిన్ని రికార్డులు.. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన కోహ్లి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 48వ సెంచరీని, ఓవరాల్‌గా (అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో) 78వ సెంచరీని నమోదు చేసిన కోహ్లి.. తాజాగా చేసిన 103 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్లో 26000 పరుగుల మైలురాయిని (26026 పరుగులు) దాటాడు. గతంలో ఈ మైలురాయిని సచిన్ (34357), సంగక్కర (28016), పాంటింగ్ (27483) మాత్రమే దాటారు. 26000 పరుగుల మార్కును చేరుకునే క్రమంలో కోహ్లి.. జయవర్ధనేను (25957) అధిగమించాడు. 26000 పరుగుల మైలురాయిని కోహ్లి అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (567) చేరుకోవడం విశేషం. కొద్ది రోజుల కిందట కోహ్లి అత్యంత వేగంగా 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. -
వరల్డ్‌కప్ 2023లో ఆ ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపడం ఖాయం..!
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023లో ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపగలరని సౌతాఫ్రికన్ లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్ కల్లిస్ అంచనా వేశాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా పేస్ గన్ ఎన్రిచ్ నోర్జే, ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణిస్తారని కల్లిస్ జోస్యం చెప్పాడు. కల్లిస్ ఈ ఐదుగురిని ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా విశ్లేషించాడు. ఆయా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌తో పాటు భారత్‌లో ఆడిన అనుభవం వారి కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇండియాలో ఆడనప్పటికీ, అతను ప్రపంచకప్‌లో తప్పక చెలరేగుతాడని తెలిపాడు. రషీద్ ఖాన్, నోర్జే, బట్లర్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం, భారత పిచ్‌లపై వారికున్న రికార్డు, అలాగే ఇండియన్ ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ వారిలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ ప్రపంచకప్‌లో అతన్ని ఆపడం కష్టమని తెలిపాడు. మునుపటితో పోలిస్తే, ప్రస్తుతం విరాట్ ఫామ్ చాలా భీకరంగా ఉందని, అతను మెగా టోర్నీలో అద్భుతాలు చేయడం ఖాయమని జోస్యం చెప్పాడు. విరాట్‌తో పాటు రషీద్ ఖాన్‌పై కూడా కల్లిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్‌కప్‌లో అతను రాణిస్తే ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలను నమోదు చేయడం ఖాయమని అన్నాడు. కల్లిస్.. ఐసీసీ షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయాలను పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్-2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అక్టోబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అక్టోబర్ 14న భారత్.. పాక్‌ను ఢీకొంటుంది. -
WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్ జోస్ బట్లర్ అని అంచనా వేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తొలి మ్యాచ్ అక్కడే డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రొటిస్ లెజెండ్ జాక్వెస్ కలిస్ వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక పరుగుల వీరుడిగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. భారత పిచ్‌లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇక ఇంగ్లండ్ ఈ వరల్డ్‌కప్‌లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉంది. భారత్‌లో వన్డే రికార్డు అంతంత మాత్రమే! ఈసారి బట్లర్ లీడ్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని విశ్వసిస్తున్నా’’ అని జాక్వెస్ కలిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్ బట్లర్ గతేడాది సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు అంతర్జాతీయ స్ధాయిలో 165 వన్డేలు ఆడిన బట్లర్ 41.49 సగటుతో 4647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, భారత్‌లో మాత్రం అతడి వన్డే రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 31. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం విశేషం. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్‌కప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుతమైన నాయకుడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. బట్లర్ లాంటి ఆటగాడిని కెప్టెన్‌గా కలిగి ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలం. కూల్ కెప్టెన్సీతో ఒత్తిడిని జయించి వరల్డ్‌కప్‌లో జట్టు రాణించేలా కృషి చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని బట్లర్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా బట్లర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కలిస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. మరి వన్డేల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బట్లర్ వెనక్కి నెట్టగలడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: వారెవ్వా.. నీరజ్! అత్యుత్తమ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్‌కు అర్హత -
47 ఏళ్ల వయస్సులో విధ్వంసం.. ఫోర్లు, సిక్సర్ల వర్షం! వీడియో వైరల్
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ మాస్టర్ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు కల్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా టెక్సాస్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా 47 ఏళ్ల కల్లిస్ చేలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన ట్రెడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. 31 బంతులు ఎదుర్కొన్న కల్లిస్.. 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిలాంద్ కుమార్( 28 బంతుల్లో 76 నాటాట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దిరి సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ ఛార్జర్స్ నిర్ఱీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగల్గింది. టెక్సాస్ బ్యాటర్లలో ముక్తర్ ఆహ్మద్(33), ఉపుల్ తరంగా(27) పరుగులతో రాణించారు. కాలిఫోర్నియా బౌలర్లలో నర్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిడిల్, పావెల్, సుయాల్ తలా వికెట్ సాధించారు. చదవండి: World cup 2023: బీసీసీఐకి హెచ్‌సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు? We've traveled back in time to witness @jacqueskallis75 deliver 🔝 batting performance for today's match 1! Tune-in to #USMastersT10OnStar Tomorrow | 6:30 PM onwards | Star Sports 1 & Star Sports 1 Hindi#Cricket pic.twitter.com/JLdxcH3idf — Star Sports (@StarSportsIndia) August 19, 2023 -
బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టు రసవత్తరంగా మారుతుంది. రెండో రోజు రెండో సెషన్లోనే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు 26 పరుగులు స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. అయితే తాను మొదటినుంచి చెప్పుకుంటున్న బజ్‌బాల్ ఆటను మరోసారి ఆస్ట్రేలియాకు రుచి చూపించాడు. ఫలితం సంగతి ఎలా ఉన్నా స్టోక్స్ మాత్రం తాను ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న స్టోక్స్ ఆ తర్వాత ఫాస్ట్‌గా ఆడాడు. అయితే ఏ జట్టైనా వికెట్లు కోల్పోతుంటే బ్యాటర్ కూడా స్లో ఆడడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్టోక్స్ మాత్రం ఎదురుదాడి చేశాడు.ఇంగ్లండ్ 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 106 బంతుల్లో 80 పరుగులు చేసిన స్టోక్స్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్టోక్స్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఆరువేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్‌రౌండర్‌గా స్టోక్స్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయడంతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్(13289 పరుగులు, 292 వికెట్లు), రెండో స్థానంలో విండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్(8032 పరుగులు, 235 వికెట్లు) ఉన్నాడు. చదవండి: #TamimIqbal: దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
హార్ధిక్.. కల్లిస్ లాంటోడు, అతను జట్టులో ఉంటే 12 మంది ఆటగాళ్లు ఉన్నట్టే..!
ఆసియా కప్ 2022లో భాగంగా పాక్‌తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యాపై పాకిస్థాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత క్రికెట్లో హార్ధిక్‌కు మించిన ఆల్‌రౌండర్ లేడని కొనియాడాడు. హార్ధిక్‌ను లెజెండరీ ఆల్‌రౌండర్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్ కల్లిస్తో పోలుస్తూ ఆకాశానికెత్తాడు. హార్ధిక్ జట్టులో ఉంటే, టీమిండియా 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్టేనని అన్నాడు. జట్టులోని ఓ ఆటగాడు టాప్-5లో బ్యాటింగ్ చేయడంతో పాటు స్ట్రయిట్ సీమ్ బౌలర్‌గా ఉంటే, ఆ జట్టు అదనపు ఆటగాడితో బరిలోకి దిగినట్టేనని హార్ధిక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. గత కొద్ది నెలలుగా హార్ధిక్ ఆటలో చాలా పరిణితి ప్రదర్శిస్తున్నాడని, ఒత్తిడిని ఎదుర్కోవడంలో అతను పూర్తిగా సఫలీకృతుడయ్యాడని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించడం ఇందుకు నిదర్శనమని అన్నాడు. కాగా, హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో పాక్‌తో హోరాహోరీగా సాగిన సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్ధిక్ బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు 17 బంతుల్లో అజేయమైన 33 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. హార్ధిక్‌తో పాటు భువీ, కోహ్లి, జడేజాలు కూడా రాణించడంతో టీమిండియా దాయాదిపై అపురూప విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ 'తోపు'.. టీమిండియా కెప్టెన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు -
Ben Stokes: టెస్టుల్లో స్టోక్స్ అరుదైన ఘనత.. క్రికెట్ దిగ్గజాలతో పాటుగా..
England Tour Of West Indies 2022- Ben Stokes Century: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 120 పరుగులు సాధించిన స్టోక్స్.. టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ బాది ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ తన పేరిట ఓ రికార్డు లిఖించుకున్నాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. క్రికెట్ దిగ్గజాలు సర్ గ్యారీ సోబర్స్, సర్ ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, జాక్వెస్ కలిస్ తర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు.. 150కి పైగా వికెట్లు సాధించిన టాప్-5 ఆల్‌రౌండర్లు ►గ్యారీ సోబర్స్ – 8032 పరుగులు, 235 వికెట్లు- 93 టెస్టుల్లో ►ఇయాన్ బోథమ్– 5200 పరుగులు, 383 వికెట్లు- 102 టెస్టుల్లో ►కపిల్ దేవ్– 5248 పరుగులు, 434 వికెట్లు- 131 టెస్టుల్లో ►జాక్వస్ కలిస్– 13289 పరుగులు, 292 వికెట్లు- 166 టెస్టుల్లో ►బెన్ స్టోక్స్- 5005* పరుగులు, 170 వికెట్లు, 78 టెస్టుల్లో Ben Stokes completing 5,000 Test runs landmark in style. pic.twitter.com/AuKZ72dCwU — Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2022 చదవండి: Sehwag-Akhtar: ఏదో ఒకరోజు సెహ్వాగ్ చెంప చెల్లుమనిపిస్తా: అక్తర్ -
మ్యాక్స్‌వెల్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలిసారి
Glenn Maxwell Completes 500 Runs For RCB.. ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ తరపున 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా కోహ్లి, గేల్, డివిలియర్స్ త్రయం కాకుండా ఆర్సీబీ తరపున ఐదు వందల మార్క్‌ను అందుకున్న రెండో ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. ఇంతకముందు జాక కలిస్ ఆర్సీబీ తరపున 2010 ఐపీఎల్ సీజన్లో 572 పరుగులు సాధించాడు. అంతేగాక ఆర్సీబీ తరపున తొలిసారి ఆడుతున్న మ్యాక్స్‌వెల్ 500 పరుగుల మార్క్‌ను అందుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. ఇక కేకేఆర్‌తో జరుగుతున్న ఆర్సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. 17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. చదవండి: Virat Kohli: ఆరు సార్లు ఔటయ్యాడు.. 145 పరుగులు చేశాడు -
ఎవరీ కుర్రాడు.. రేపటి టెస్టు మ్యాచ్‌లో ఆడిద్దామా!
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఆ దేశం నుంచి విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. మంచి పొడగరి అయిన మోర్కెల్ పదునైన బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఇబ్బందులకు గురి చేసేవాడు. 2006-2018 మధ్య దక్షిణాఫ్రికా తరపున ఆడిన మోర్కెల్ తన 12 ఏళ్ల కెరీర్లో 86 టెస్టుల్లో 309 వికెట్లు,117 వన్డేల్లో 188 వికెట్లు, 44 టీ20ల్లో 47 వికెట్లు తీశాడు. మొత్తంగా దక్షిణాఫ్రికా తరపున 500కు పైగా వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. మోర్నీ మోర్కెల్ సోదరుడు అల్బీ మోర్కెల్ కూడా దక్షిణాఫ్రికా తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మోర్కెల్ 2004లో ఈస్ట్రెన్స్ తరపున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఎలా అరంగేట్రం చేశాననేది చెప్పుకొచ్చాడు. '' 2004లో వెస్టిండీస్ దక్షిణాఫ్రికాలో పర్యటించేందుకు వచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ఈస్ట్రెన్స్తో వారు ఆడాల్సి ఉంది. దీనిలో భాగంగా నా సోదరుడు అల్బీ మోర్కెల్ నా వద్దకు వచ్చి ఈస్ట్రన్స్కు ఒక నెట్ బౌలర్ కావాలి.. నువ్వెందుకు ప్రయత్నించకూడదు అని చెప్పాడు. అలా ఈస్ట్రన్స్ బ్యాట్స్‌మెన్‌కు నెట్‌బౌలర్‌గా బంతులు విసిరాను. నా బౌలింగ్ చూసిన కోచ్ నా వద్దకు వచ్చి.. '' నీ బౌలింగ్ బాగుంది.. ఏం చేద్దామనుకుంటున్నావు'' అని అడిగాడు.. అతను అడిగింది నాకు అర్థం కాలేదు.. ''ఏమో తెలీదు'' అని సమాధానం ఇచ్చాను. వెంటనే కోచ్ నన్ను ఆఫీస్ రూమ్‌కు తీసుకెళ్లి జూనియర్ క్రికెటర్‌గా కాంట్రాక్ట్ ఇప్పించాడు. అలా ఈస్ట్రన్స్ తరపున ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాను. కొంతకాలం తర్వాత ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. కాగా ప్రాక్టీస్ సమయంలో నేను అప్పటి ఆల్‌రౌండర్ జాక్ కలిస్‌కు బంతులు విసిరాను. అతను నా బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. కోచ్ జెన్నింగ్స్ వద్దకు వెళ్లి.. ''ఎవరీ కుర్రాడు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు..'' అని అడిగాడు. దానికి కోచ్.. ''అతను అల్బీ మోర్కెల్ తమ్ముడు మోర్నీ మోర్కెల్.. ఈస్ట్రన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది విన్న కలిస్.. ఇతన్ని మనం రేపటి టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని'' చెప్పాడు. అని వివరించాడు. అలా 2006లో టీమిండియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మోర్కెల్ 12 ఏళ్ల పాటు ప్రొటీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: 'ఆ సమయంలో ద్రవిడ్‌ను చూసి భయపడేవాళ్లం' -
కలిస్, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్ శంకర్‌కు చివాట్లు
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల అతను చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ట్విటర్ వేదికగా తనను ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్లైన కలిస్, వాట్సన్లతో పోల్చుకోవడంపై క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తూ చివాట్లు పెట్టారు. వివరాల్లోకి వెళితే, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ శంకర్ మాట్లాడుతూ.. తాను టీమిండియాకు కలిస్, షేన్ వాట్సన్ లాంటి ఆల్‌రౌండర్‌నని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. Kallis and Watson reaction after Vijay Shankar’s comment pic.twitter.com/fk8fmlvqGh — Simran Kaur (@kaursimran_ind) May 17, 2021 దిగ్గజ ఆల్రౌండర్లలానే తాను కూడా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడినని, ఎటువంటి సందర్భంలోనైనా బౌల్ చేయగల సత్తా తనలో ఉందని పేర్కొన్నాడు. తాను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేశానని, అదే తన రెగ్యులర్ స్లాట్ అయితే అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికలుంటాయని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో తాను వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన విషయాన్ని ఆయన ప్రస్థావించాడు. Vijay Shankar in IPL 2022 pic.twitter.com/R4OYMraRg8 — The Beautiful game (@Leg_Gully) May 17, 2021 Indian fans after Vijay Shankar's statement: pic.twitter.com/cF4hh4skS9 — Tanishq Ganu (@smart__leaks) May 17, 2021 అయితే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగడం వల్ల తాను 30, 40 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయానని, ఇటువంటి ప్రదర్శనతో జాతీయ జట్టులో స్థానం ఆశించడం కూడా సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, శంకర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుగా అర్ధం చేసుకుని ట్రోల్ చేశారు. శంకర్ చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ మెగా టోర్నీలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుని కాదని శంకర్ ఆవకాశం దక్కించుకున్నాడు. చదవండి: కోహ్లి సేనకు వ్యాక్సిన్ రెండో డోసు అక్కడే.. -
ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో వేసినా..
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీలది ప్రత్యేక స్థానం. తమ శకంలో వీరిద్దరూ ఫాస్టెస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను హడలెత్తించిన సందర్భాలు అనేకం. అప్పట్లో సచిన్-బ్రెట్ లీ మధ్య పోరు, సచిన్-అక్తర్‌ల మధ్య పోటీ అనేది ఎక్కువగా ఉండేది. ఈ ఇద్దరిలో బ్రెట్ లీ కాస్త భిన్నం. బంతిని వేయడానికి రనప్‌ను తక్కువ తీసుకున్నా వేగంలో మాత్రం మార్పు ఉండేది కాదు. 1999లో భారత్‌పై అరంగేట్రం చేసిన బ్రెట్ లీ.. అనతికాలంలోనే ఆసీస్ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. కచ్చితమైన పరుగుతో అత్యంత వేగంగా బంతుల్ని సంధించడంలో దిట్ట బ్రెట్ లీ. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా, జాక్వస్ కల్లిస్, కుమార సంగక్కరా, ఇంజమాముల్ హక్, పీటర్సన్ వంటి దిగ్గజ క్రికెటర్లుకు బౌలింగ్ చేసినా, తన క్రికెట్ కెరీర్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లు ముగ్గురే ఉన్నారంటున్నాడు బ్రెట్ లీ. వారిలో తొలి స్థానం సచిన్‌కు ఇవ్వగా, రెండో స్థానాన్ని విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాది కాగా, ఇక మూడో స్థానం దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వస్ కల్లిస్‌ది. వీరినే తాను ఎందుకు ఎంపిక చేసుకున్నాననే దానిపై బ్రెట్ లీ వివరణ ఇచ్చాడు.(‘అందులో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ భేష్’) సచిన్‌లా ఎవరూ బ్యాటింగ్ చేయలేరు ‘సచిన్ తరహాలో ఎవరూ బ్యాటింగ్ చేయడం నేను చూడలేదు. ఎక్స్ట్రా టైమ్ తీసుకుని షాట్లు ఆడుతుంటాడు. క్రీజ్‌లో వచ్చాక నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ఈజీగా షాట్లు కొడతాడు. వరల్డ్‌లో సచినే అత్యుత్తమ బ్యాట్స్‌మన్’ అని లీ తెలిపాడు. ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో వేసినా.. ఇక లారా గురించి మాట్లాడుతూ.. ‘ లారా ఒక విభిన్నమైన లెఫ్ట్ హ్యాండర్. లారా హిట్టింగ్ బాగుంటుంది. ముఖ్యంగా సిక్స్‌లు కొట్టడంలో లారా దిట్ట. ఒక బౌలర్ ఆరు బంతుల్ని ఒకే ప్లేస్‌లో సంధించినా వేర్వేరు డైరెక్షన్లో సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం అతని సొంతం. అతను క్రికెట్ ఆడే కాలంలో చూపరులను ఇట్టే ఆకట్టుకునే వాడు’ అని తెలిపాడు. కల్లిస్ కంప్లీట్ క్రికెటర్ ‘జాక్వస్ కల్లిస్ కంప్లీట్ క్రికెటర్. బ్యాట్స్‌మన్‌గా ఎంతలా రాణిస్తాడో, బౌలర్‌గా అదే స్థాయిలో రాణించే ఆటగాడు కల్లిస్. అవసరమైతే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా దిగగలడు, ఓపెనింగ్ ఓవర్‌ను కూడా వేయగలడు. ఫీల్డర్‌గా కూడా కల్లిస్‌ది ప్రత్యేక స్థానం. స్లిప్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్న చరిత్ర కల్లిస్‌ది. నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్ కల్లిస్. సచిన్ తాను చూసిన బెస్ట్ బ్యాట్స్‌మన్ అయితే కల్లిస్ బెస్ట్ క్రికెటర్’ అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు. -
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కల్లిస్
కేప్‌టౌన్: సంధి దశను ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రధాన కోచ్‌గా మార్క్ బౌచర్‌ను నియమించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. తాజాగా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా మరో దిగ్గజ ఆటగాడు జాక్వస్ కల్లిస్‌ను ఎంపిక చేసింది. సమ్మర్లో సద్వేశంలో జరుగనున్న మొత్తం మ్యాచ్‌లకు కల్లిస్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈరోజే బ్యాటింగ్ కన్సల్టెంట్ బాధ్యతలను కల్లిస్ స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్వీటర్ అకౌంట్లో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. 519 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కల్లిస్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. ఆల్ రౌండర్‌గా సఫారీలకు వెన్నుముకగా నిలిచాడు. 166టెస్టులు, 328 వన్డేలు, 25 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం కల్లిస్‌ది. దక్షిణాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 25, 534 పరుగులు సాధించిన కల్లిస్.. 577 వికెట్లు తీశాడు. -
కోహ్లి.. మీ జట్టులోకి తీసుకుంటావా?: పీటర్సన్
న్యూఢిల్లీ: గత నెలలో ఒక బుడతడు క్రికెట్ ఆడుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా డైపర్స్‌లోనే ఆ బుడ్డోడు సహజ సిద్ధమైన క్రికెట్ షాట్లతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. క్లబ్ క్రికెటర్లను మించిపోయి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లనే మైమరిపిస్తున్నాడు. కచ్చితమైన షాట్లతో చక్కని టైమింగ్‌తో బంతిని అంచనా వేస్తూ షాట్లు కొట్టేస్తున్నాడు.దిగ్గజ క్రికెటర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ముగ్థుడైపోయాడు. మొత్తం బ్యాటింగ్‌ను ఒడిసి పట్టేసుకున్నాడా అంటూ కొనియాడాడు.ఈ బుడతడు బహుశా ఇంగ్లండ్ గడ్డపైనే పుట్టి ఉంటాడంటూ కితాబు కూడా ఇచ్చేశాడు.(ఇక్కడ చదవండి: డైపర్స్ బుడతడు.. క్రికెటర్లను మించి ఆడేస్తున్నాడు!) ఇది ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చేరింది. ఈ చిన్నోడి వీడియోను షేర్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. కోహ్లి ముందు ఒక ప్రశ్న ఉంచాడు. ‘ వాటే బ్యాటింగ్.. ఈ పిల్లోడ్ని మీ జట్టులోకి తీసుకుంటావా. మీ స్వ్కాడ్‌లో ఎంపిక చేయగలవా’ అంటూ కోహ్లిని అడిగాడు. ఆ బుడతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన కోహ్లి.. ‘ ఇది నమ్మ శక్యంగా లేదు. ఇంతకీ ఆ చిన్నోడు ఎక్కడి వాడు’ అంటూ కోహ్లి ఆసక్తిని ప్రదర్శించాడు.దీనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కల్లిస్ కూడా స్పందిస్తూ.. ‘ అతనిలో చాలా టాలెంట్ ఉంది. డైపర్స్ వేసుకునే వయసులోనే ఇలా ఆడేస్తున్నాడేమిటి’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. View this post on Instagram WHAT?!?!?!?!?! Get him in your squad, @virat.kohli! Can you pick him?!?! 😱 A post shared by Kevin Pietersen (@kp24) on Dec 13, 2019 at 1:07am PST -
సగం షేవ్‌తో కల్లిస్.. ఎందుకిలా!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వస్ కల్లిస్ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. దక్షిణాఫ్రికా తరఫున సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన కల్లిస్.. టెస్టుల్లో, వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లను సాధించిన ఏకైక క్రికెటర్. తన కెరీర్లో 166 టెస్టులు, 328 వన్డేలు ఆడాడు. ఇక పొట్టి ఫార్మాట్లో దేశం తరఫున 25 టీ20ల్లో పాల్గొన్నాడు. టెస్టుల్లో 13,289 పరుగులు చేసిన కల్లిస్.. వన్డేల్లో 11,579 పరుగులు చేశాడు. టెస్టుల్లో 292 వికెట్లు సాధించగా, వన్డేల్లో 273 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్‌కు దూరమైన తర్వాత పెద్దగా కనిపించని కల్లిస్.. తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది సగం షేవ్‌తో ఉన్న ఫొటో కావడంతో హాట్ టాపిక్ అయ్యింది. అయితే కల్లిస్ ఇలా ఎందుకు దర్శనమిచ్చాడంటే.. ఒక చాలెంజ్‌లో భాగంగా కచ్చితంగా సగం గడ్డం, సగం మీసంతో కనిపించాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన కల్లిస్ ఈ రకంగా అలరించాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కల్లిస్ ఫోటోను పోస్ట్ చేయగా, అందుకు పాజిటివ్‌గా కామెంట్లు వస్తున్నాయి. కల్లిస్ కొత్త లుక్‌లో అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. -
వారెవ్వా.. స్టీవ్ స్మిత్
బర్మింగ్‌హామ్: ఒకవైపు ఇంగ్లండ్ అభిమానుల నుంచి ‘చీటర్-చీటర్’ అంటూ ఎగతాళి మాటలు వినిపించినా ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొక్కవోని విశ్వాసంతో సెంచరీలతో చెలరేగిపోయాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్టుతో తన టెస్టు రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్న స్మిత్.. ఆసీస్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగులు చేశాడు. ఫలితంగా 25వ టెస్టు సెంచరీ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా వేగవంతంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. సర్ బ్రాడ్‌మన్ తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 25వ టెస్టు సెంచరీ సాధించిన ఘనతను అందుకున్నాడు. అదే సమయంలో కోహ్లిని వెనక్కినెట్టాడు స్మిత్. ఇదిలా ఉంచితే, ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వస్ కల్లిస్ సరసన చేరిపోయాడు. ఇప్పటివరకూ ఒక టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీలను కల్లిస్ తొమ్మిది సందర్భాల్లో చేశాడు. ఇప్పడు స్మిత్ సైతం కల్లిస్ రికార్డును చేరుకున్నాడు. ఇందుకు బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ వేదికైంది. ఈ జాబితాలో అలెస్టర్ కుక్(ఇంగ్లండ్) ఎనిమిది సందర్భాల్లో ఆ మార్కును చేరి రెండో స్థానంలో కొనసాగుతుండగా, అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లి(భారత్), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), కుమార సంగక్కరా(శ్రీలంక), సచిన్ టెండూల్కర్( భారత్)లు ఏడేసి సార్లు ఆ ఫీట్ సాధించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. మరొక టెస్టు మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ, హాఫ్ సెంచరీలను సాధిస్తే కల్లిస్ అధిగమిస్తాడు. -
దానికి సమాధానం కోహ్లి దగ్గరే!
కోల్‌కతా : టీమిండియా పరుగుల యంత్రం, సారథి విరాట్ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ ప్రశంసలు జల్లు కురిపించాడు. కోహ్లి వరల్డ్ క్లాస్ ఆటగాడంటూ అభివర్ణించాడు. ప్రస్తుతం కోహ్లి ఆకలితో ఉన్న పులిలా రెచ్చిపోతున్నాడని.. అందుకే పరుగుల సునామీ సృష్టిస్తున్నాడని పేర్కొన్నాడు. కష్టపడేతత్వం, ఆటపై మక్కువ గల అతడు మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించాడు. ఇక ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ వంద సెంచరీల రికార్డును కోహ్లి అధిగమిస్తాడా అనే విషయంపై కూడా కలిస్ స్పందించాడు. ఆ రికార్డును సాధిస్తాడా? లేదా? అనే విషయాన్ని కోహ్లినే చెప్పాలన్నాడు. ఎందుకంటే ఫిట్నెస్, ఆడగల సత్తా, సామర్థ్యం గురించి అతడికే ఒక క్లారిటీ ఉంటుందన్నాడు. కోహ్లిపై ఒత్తిడి ఉండదు స్వదేశంలో ఆస్ట్రేలియాపై ఎదురైన ఓటమి ప్రభావం టీమిండియాపై ఉండదని కలిస్ అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో కోహ్లిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో మరింత రెచ్చిపోతాడని వివరించాడు. ఎక్కడ.. ఎలా ఆడాలో కోహ్లికి తెలుసని, మిగతా ఆటగాళ్లు అతడిని అనుసరిస్తే సరిపోతుందన్నాడు. ఏ మెగాటోర్నీలోనేనా టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుందని కలిస్ పేర్కొన్నాడు. -
క్రికెటర్ల కళ్లు తెరుచుకున్నాయి: కలిస్
సాక్షి, కోల్‌కతా : క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదంపై దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాకస్ కలిస్ స్పందించాడు. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ఈ పని క్రికెట్ ప్రపంచానికి ఒక వేకప్ కాల్ వంటిది. ప్రతీ ఆటగాడు తాము అనుసరించాల్సిన విధానాలపై స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని’ కలిస్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ మాజీ ఆల్‌రౌండర్ కేకేఆర్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. విలేకరుల సమావేశంలో ట్యాంపరింగ్ వివాదంపై మాట్లాడుతూ.. ‘స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ చేసిన పని, ఎదుర్కొన్న పరిస్థితులు ప్రతీ ఆటగాడి కళ్లు తెరుచుకున్నాయి. క్రీడాస్పూర్తితో సరైన పద్ధతిలో మాత్రమే ఆడాలి. ఐపీఎల్లో కేకేఆర్ టీమ్ ఆట తీరుతో సంతోషంగా ఉన్నాను. గతంలో మెరుగైన ప్రదర్శన చేశాం. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని’ కలిస్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో కలిస్‌తో పాటు కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్ప, పియూష్ చావ్లా, ఆండ్రూ రస్సెల్, శివమ్ మావి, శుభమ్ గిల్, కమలేశ్ నాగర్కోటి పాల్గొన్నారు. ఏప్రిల్ 8న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కేకేఆర్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. -
జాగ్రత్త... అతను ఆకలితో ఉన్న ఓ సింహం!
సాక్షి, స్పోర్ట్స్ : సఫారీ గడ్డపై సమరానికి భారత్ సిద్ధమైన వేళ.. ప్రొటీస్ మాజీ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ తమ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. తమ పిచ్‌లపై టీమిండియా ట్రాక్ రికార్డు అంత ఘనంగా లేదని సౌతాఫ్రికా ఆటగాళ్లు మీడియా ముందు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌ను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదని కల్లిస్ వారికి సూచిస్తున్నాడు. ‘‘భారత్ వరస విజయాలతో ఊపు మీద ఉంది. వారి బౌలింగ్ లైనప్ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ప్రత్యర్థులపై వారు చేసే దాడి ఆసక్తికరంగా ఉంటుంది. అన్నింటికి మించి అవతల కెప్టెన్ కోహ్లి ఉన్నాడు. అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఐపీఎల్లో అతన్ని చాలా దగ్గరగా చూశాను. ఆకలితో ఉన్న సింహం లాంటోడు. ప్రత్యర్థుల బౌలింగ్‌కు అలవాటుపడితే మాత్రం అతన్ని ఆపటం చాలా కష్టం. ఈ విషయంలో సఫారీ బౌలర్లు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది’’ అని హెచ్చరించాడు. టీమిండియా బౌలర్లు షమీ, భువనేశ్వర్‌ల ప్రతిభ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వాళ్లిద్దరి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక పాండ్యా ఆటను అంతగా పరిశీలించలేకపోయానన్న ఆయన.. అతని ఆట కోసం ఎదురు చూస్తున్నట్లు కల్లిస్ తెలిపారు. గాయం నుంచి కోలుకుని డెయిల్ స్టెయిన్ జట్టులోకి రావటం.. మరో రికార్డుకు చేరువలో ఉండటంపై కూడా ఆయన ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాన్ పొల్లాక్ ఉండగా.. స్టెయిన్ ఆ రికార్డుకు చేరువయ్యాడు. -
గంభీర్ సేనకు కల్లిస్ హెచ్చరిక!
కోల్‌కతా:కోల్‌కతా నైట్ రైడర్ప్.. ఐపీఎల్ -9వ సీజన్లో ఇప్పటివరకూ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఆ జట్టు ప్రధాన కోచ్ జాక్వస్ కల్లిస్ మాత్రం ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుత పొజిషన్‌ను చూసి మురిసిపోవడం కంటే కొంత జాగురతతో ఉండాలని హిత బోధ చేశాడు. గత ఏడాది కూడా ఇదే స్థితిలోఉన్న జట్టు ఆకస్మికంగా వెనుకబడి పోయిన సంగతి ప్రతీ ఒక్క ఆటగాడు గుర్తించుకోవాలన్నాడు. 'జట్టు టాప్‌లో కొనసాగుతుండటం సంతోషించదగ్గ విషయమే. ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నాం. గతేడాది కూడా కోల్ కతా నైట్ రైడర్స్ ఆదిలో ఆకట్టుకుని ఆ తరువాత చతికిలబడింది. 2015లో ఈడెన్ గార్డెన్లో కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా ఒక పరుగు తేడాతో అద్భుత విజయాన్ని సాధించి పోల్ పొజిషన్ రేసులో నిలిచింది. అయితే ఆ తరువాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన వరుస మ్యాచ్‌ల్లో ఓటమి చెందాం. దాంతో ప్లే ఆఫ్ బెర్తును కోల్పోయి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడితే మంచిది'అని కల్లిస్ ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ పై కోల్ కతా ఏడు పరుగుల తేడాతో గెలిచిన అనంతరం ఆనాటి మ్యాచ్ ను కల్లిస్ జ్ఞప్తికి తెచ్చుకోవడం గమనార్హం.