Naveen-ul-Haq
-
భారత్‌కు ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్ ఖాన్ బృందం టీ20 వరల్డ్‌కప్-2024లో సెమీస్ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే. న్యూజిలాండ్‌పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దాకా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో అఅఫ్గన్ క్రికెట్ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్‌కు తాలిబన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ ఖాన్ ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక అఫ్గన్ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్ నేతలు, అఫ్గన్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..రషీద్ ఖాన్కెప్టెన్గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ఓపెనర్గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్ ఉల్ హక్ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.ట్రవిస్ హెడ్‌ను క్లీన్»ౌల్డ్ చేసిన అతని అవుట్‌స్వింగర్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్ జడేజా (వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్ బ్రేవో (బౌలింగ్ కన్సల్టెంట్): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్ ట్రాట్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన ట్రాట్ హెడ్ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్ కొనసాగించింది. ట్రాట్ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. మహ్మద్ నబీ15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్–డివిజన్–5లో జపాన్, బోట్స్వానావంటి జట్లతో తలపడిన టీమ్ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్ కప్ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్ టీమ్ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. కల నిజమైందిసెమీస్కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్ ఖాన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్ -సాక్షి. క్రీడా విభాగం -
వారెవ్వా.. అప్పుడు ఒక్కరు లేరు.. ఇప్పుడేమో: నవీన్ పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సమష్టి ఆటతీరుతో అఫ్గానిస్తాన్ తమ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ విజయం అందుకుంది. ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ తొలిసారి ఓడించింది.గతంలో ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగు వన్డేలలో, ఒక టి20 మ్యాచ్‌లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ ఆరో ప్రయత్నంలో మాత్రం క్రికెట్ అభిమానులందరూ అబ్బురపడే ఫలితాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అఫ్గాన్ క్రికెటర్లు ఆ అనుభవాన్నంతా రంగరించి పోరాడటంతో ఆస్ట్రేలియా తొలిసారి అఫ్గానిస్తాన్ ముందు తలవంచక తప్పలేదు. అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా తద్వారా.. ప్రపంచ క్రికెట్లో ఇక నుంచి తమను చిన్న జట్టుగా ఎవరూ పరిగణించకూడదని అఫ్గానిస్తాన్ చాటి చెప్పింది. అగ్రశ్రేణి జట్లపై గెలిచే సత్తా తమలోనూ ఉందని... క్రమం తప్పకుండా తమతో మేటి జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే మరింత రాటుదేలుతామని అఫ్గానిస్తాన్ క్రికెటర్లు నిరూపించారు.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సూపర్‌గా ఆడారంటూ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభినందిస్తున్నారు. అంతేకాదు అఫ్గన్లోనూ అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు.ఇప్పుడు ఆహా ఓహో అంటూఈ క్రమంలో అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. క్లిష్ట సమయాల్లో తమకు అండగా రాని వాళ్లు సైతం.. ఇప్పుడు ఆహా ఓహో అంటూ ప్రశంసిస్తున్నారంటూ ఫొటో ద్వారా ఘాటుగా సెటైర్ వేశాడు నవీన్. తమను విమర్శించే వాళ్లే ఇప్పుడు ఈ విజయం కారణంగా ఆకాశానికెత్తుతున్నారంటూ చురకలు అంటించాడు. స్టేడియంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్న ఫోటోకు సపోర్టు అని.. గుంపుగా స్టేడియమంతా నిండిన అభిమానులున్న ఫొటోకు కంగ్రాట్స్ అని రాసి ఉన్న దృశ్యాలు షేర్ చేశాడు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనేఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ స్పందించింది. నవీన్ పోస్టుకు బదులిస్తూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతోనే’’ అంటూ మద్దతు తెలిపింది. కాగా టీ20 ప్రపంచకప్ ‘సూపర్–8’ దశలో భాగంగా మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. నవీనుల్ హక్ (3/20), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ (4/20) తమ వైవిధ్యభరిత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టారు. గతంలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాపై నెగ్గని అఫ్గానిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (49 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 51; 6 ఫోర్లు) శుభారంభం అందించారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించారు. గుర్బాజ్, ఇబ్రహీం అవుటయ్యాక వచ్చిన ఇతర అఫ్గాన్ బ్యాటర్లు మెరిపించలేకపోయారు. కమిన్స్ హ్యాట్రిక్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆసీస్ పేసర్ కమిన్స్ చివరి బంతికి అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (2)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో తొలి రెండు బంతులకు కరీమ్ జన్నత్ (9 బంతుల్లో 13; 1 సిక్స్), గుల్బదిన్ నైబ్ (0)లను అవుట్ చేసి ఈ టోర్నీలో రెండో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు.నవీనుల్, గుల్బదిన్ సూపర్ బౌలింగ్ కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నవీనుల్ హక్ అద్భుత బంతికి ఓపెనర్ ట్రవిస్ హెడ్ (0) బౌల్డయ్యాడు. ఆ తర్వాత నవీనుల్ తన రెండో ఓవర్లో కెపె్టన్ మిచెల్ మార్ష్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వార్నర్ (3)ను నబీ పెవిలియన్‌కు పంపించడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.ఈ దశలో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ (17 బంతుల్లో 11; 1 ఫోర్) ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే గుల్బదిన్ వైవిధ్యభరిత బంతులతో ముందుగా స్టొయినిస్‌ను, ఆ తర్వాత టిమ్ డేవిడ్‌ను అవుట్ చేశాడు. అనంతరం ప్రమాదకరంగా మారిన మ్యాక్స్‌వెల్‌ను కూడా గుల్బదిన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత మాథ్యూ వేడ్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు.దీంతో ఆసీస్ 108 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు సాగింది. కమిన్స్ ఏమైనా అద్భుతం చేస్తాడా అని ఆశించినా అతడిని గుల్బదిన్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా పరాజయం ఖాయమైంది. చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
T20 World Cup 2024: మెల్బోర్న్ ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), శివమ్ దూబే (10) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (11) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.THE GOAT HAS ARRIVED IN T20I WORLD CUP 2024. 🇮🇳 pic.twitter.com/5vZTr1vTHK— Johns. (@CricCrazyJohns) June 20, 2024ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేసిన విరాట్ఈ మ్యాచ్‌లో విరాట్ 2022 టీ20 వరల్డ్‌కప్‌లో మెల్బోర్న్ మైదానంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బాదిన ఐకానిక్ సిక్స్‌ను రిపీట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన సిక్సర్ మెల్బోర్న్ ఐకానిక్ సిక్సర్‌ను గుర్తు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్.. 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. -
T20 WC: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్
వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో అఫ్గన్ జట్టు వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-సిలో ఉంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన రషీద్ ఖాన్ బృందం.. గ్రూప్ దశలో మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడో గెలుపు నమోదు చేసి ఆరు పాయింట్ల(నెట్ రన్‌రేటు +4.230)తో గ్రూప్-సి టాపర్‌గా నిలిచింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫజల్హక్ ఫరూకీ(3/16), నవీన్ ఉల్ హక్(2/4), నూర్ అహ్మద్(1/14) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి సత్తా చాటారు. తేలికగా తలవంచని ప్రత్యర్థిఈ క్రమంలో 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసిన పీఎన్జీ జట్టు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ ముందు అంత తేలికగా తలవంచలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గులాబిదిన్ నయీబ్(36 బంతుల్లో 49 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, మహ్మద్ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్) ఆచితూచి ఆడారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఫలితంగా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసిన అఫ్గన్ జయభేరి మోగించింది. తద్వారా సూపర్-8 దశకు అర్హత కూడా సాధించింది. ఇక ఇప్పటికే వెస్టిండీస్ గ్రూప్-సి నుంచి సూపర్-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్ అయింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్
షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది (2-1 తేడాతో). నిన్న (మార్చి 18) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 17.2 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. మెరుపు అర్దశతకంతో సత్తా చాటిన జద్రాన్.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మెరుపు అర్దశతకంతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. మొహమ్మద్ ఇషాక్ (27), సెదీఖుల్లా అటల్ (19), ఇజాజ్ అహ్మద్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, కర్టిస్ క్యాంపర్, డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. నిప్పులు చెరిగిన ఒమర్జాయ్, నవీన్ ఉల్ హక్.. 156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-9-4), నవీన్ ఉల్ హక్ (2.2-0-10-3) నిప్పులు చెరగడంతో 98 పరుగులకే కుప్పకూలింది. ఫజల్ హక్ ఫారూకీ, రషీద్ ఖాన్, ఖరోటే తలో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ (28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గెరాత్ డెలానీ (21), హ్యారీ టెక్టార్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఐర్లాండ్ గెలువగా.. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్‌పై నిషేధం
గుజరాత్ టైటాన్స్ బౌలర్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్‌పై ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) మేనేజ్మెంట్ నిషేధం విధించింది. షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ నూర్‌పై 12 నెలల నిషేధం విధిస్తున్నట్లు ILT20 యాజమాన్యం ప్రకటించింది. నూర్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నూర్‌పై నిషేధం విధించింది. నూర్ ఇంటర్నేషనల్ లీగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు మొగ్గు చూపాడు. ILT20 క్రమశిక్షణా ఉల్లంఘణ కమిటీ తొలుత నూర్‌పై 20 నెలల నిషేధం విధించింది. అయితే ఒప్పందంపై సంతకం చేసే సమయానికి నూర్ మైనర్ కావడంతో అతని నిషేధ కాలాన్ని ఎనిమిది నెలలు తగ్గించి 12 నెలలకు కుదించారు. ఇంటర్నేషనల్ లీగ్ యాజమాన్యం కొద్ది నెలల క్రితం నూర్ సహచరుడు, ఆఫ్ఘనిస్తాన్ వివదాస్పద బౌలర్ నవీన్ ఉల్ హాక్‌పై కూడా నిషేధం విధించింది. అతను కూడా నూర్ లాగే కాంట్రాక్ట్ పొడిగింపు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. 19 ఏళ్ల నూర్.. 2023 ILT20 సీజన్లో వారియర్స్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ నూర్‌తో 2023 సీజన్‌కు ముందు 30 లక్షల బేస్ ధరకు ఒప్పందం కుదుర్చుకుంది. నూర్ 2023 ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. -
టీ20లలో కోహ్లి ప్రపంచ రికార్డు.. ఏకైక బ్యాటర్‌గా ఘనత
అంతర్జాతీయ టీ20 పునరాగమనం సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లి ఏడాదికి పైగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో... టీ20 వరల్డ్ కప్-2024కు ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండో టీ20 సందర్భంగా బరిలోకి దిగాడు. 16 బంతుల్లో 29 కాగా.. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. పర్యాటక అఫ్గనిస్తాన్ జట్టును 172 పరుగులకు ఆలౌట్ చేసింది. లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్(68), శివం దూబే(63- నాటౌట్) దంచి కొట్టగా.. కోహ్లి సైతం దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 29 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏకైక క్రికెటర్‌గా.. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ టీ20 ఛేజింగ్ మ్యాచ్‌లలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి. తద్వారా ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లోనూ ఈ రికార్డుల రారాజే ఇక వన్డేల్లోనూ సెకండ్ బ్యాటింగ్‌లో ఈ రికార్డుల రారాజే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఛేజింగ్‌లో 152 ఇన్నింగ్స్ ఆడి 7794 రన్స్ పూర్తి చేసుకున్నాడు కోహ్లి. ఇందులో 27 సెంచరీలు, నలభై ఫిఫ్టీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అన్నట్లు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. పేసర్ నవీన్ ఉల్ హక్కు వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. -
ఐపీఎల్: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అఫ్గానిస్తాన్ త్రయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్లకు ఊరట లభించింది. ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గోనేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరుతులతో కూడిన నో-అబ్జెక్షన్స్ సర్టిఫికేట్లను (NOC) మంజూరు చేసింది. కాగా గత నెలలలో జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ ముగ్గరిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ కొన్ని ఆంక్షలు విధించింది. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు వీరి ముగ్గురు అంగీకరించడంతో అఫ్గాన్ క్రికెట్ తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంది. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అదే విధంగా ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. వీరిద్దరితో పాటు ఐపీఎల్-2024 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. చదవండి: T20 WC:రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ! -
టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్‌కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్‌గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్‌ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్‌కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ! -
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్‌పై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పై దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్‌లో భాగమైన షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్‌పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నవీన్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్‌పై నిషేధం విధించింది. నవీన్ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్‌కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్ మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. నవీన్.. 2023 సీజన్లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో నవీన్ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్ ఐదో స్థానంతో గత సీజన్‌ను ముగించింది. ఈ సీజన్లో వారు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. -
WC: అప్పుడు స్మిత్.. ఇప్పుడు నవీన్! కోహ్లి చర్య వైరల్.. గంభీర్ ప్రశంసలు
ICC WC 2023- Kohli- Naveen: ఒక ఆటగాడికి మద్దతుగా నిలవలేనపుడు.. అతడిని విమర్శించే హక్కు కూడా ఎవరికీ ఉండదని గౌతం గంభీర్ అన్నాడు. అభిమాన క్రికెటర్‌ను ఉత్సాహపరచడంలో తప్పులేదని.. అయితే, అది ఇతరులను హేళన చేసే విధంగా ఉండకూడదని హితవు పలికాడు. ఏదేమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ పట్ల వ్యవహరించిన తీరు గొప్పగా ఉందని గంభీర్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి, అఫ్గాన్ పేసర్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. గంభీర్ జోక్యంతో ఈ క్రమంలో లక్నో మెంటార్ గంభీర్ సైతం నవీన్‌కు మద్దతుగా మైదానంలోకి రావడంతో వివాదానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడించింది. ఈ ఘటన తర్వాత నవీన్ ఎక్కడ, ఏ మ్యాచ్‌లో కనిపించినా ప్రేక్షకులు కోహ్లి, కోహ్లి అంటూ ఆట పట్టిస్తూ వచ్చారు. కోహ్లి నామస్మరణతో నవీన్‌ను ట్రోల్ చేశారు. స్వయంగా రంగంలోకి దిగిన కోహ్లి.. నవీన్‌తో చేతులు కలిపి ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా కోహ్లి సొంతమైదానం అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం కూడా ఇదే పునరావృతమైంది. అయితే ‘ఢిల్లీ బాయ్’ కోహ్లి మళ్లీ స్వయంగా అభిమానులను నిలువరించాడు. ఇలా చేయవద్దంటూ సున్నితంగా వాళ్లకు నచ్చజెప్పాడు. అంతేకాదు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో నవీన్‌తో చేతులు కలపగా ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ ‘థమ్సప్’ సంకేతం చూపించడం హైలైట్‌గా నిలిచింది. తాజా ఘటనతో నాటి వివాదానికి తెర పడినట్లయింది. మరోసారి కోహ్లి గుర్తుచేశాడు ఈ విషయంపై స్పందించిన గౌతం గంభీర్.. ‘‘కోహ్లి చేసిన పని ఎంతో గొప్పగా అనిపించింది. ఇక ఇప్పటి నుంచి రానున్న మ్యాచ్‌లలో ఎవరూ ఇలా చేయరనే అనుకుంటున్నా. దేశం కోసం ఆడే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కేందుకు ఆటగాడు ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో.. ఎన్ని కఠిన సవాళ్లు అధిగమిస్తే ఈ స్థాయికి చేరుకుంటారో కోహ్లి మరోసారి అందరికీ గుర్తుచేశాడు. వాళ్లు మన అతిథులు.. హుందాగా వ్యవహరించాలి ఒకరికి అండగా నిలవలేనపుడు.. వాళ్లను విమర్శించే హక్కు కూడా మనకు ఉండదు. నిజానికి ఢిల్లీలో ప్రేక్షకులు కాస్త హుందాగా వ్యవహరించాల్సింది. ఇప్పుడు మనం వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాం. ఇలాంటి సమయంలో పర్యాటక జట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లేపుడు మధుర జ్ఞాపకాలు తీసుకువెళ్లేలా చూడాలేగానీ ఇలాంటివి చేయకూడదు’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఇక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో నవీన్ బౌలింగ్‌లో 10 బంతులు ఆడిన కోహ్లి 3 సింగిల్స్ తీశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన అఫ్గన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయం సాధించింది. కోహ్లి అంటే కోహ్లినే... కాగా గత వరల్డ్ కప్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా స్టీవ్ స్మిత్‌ను ప్రేక్షకులు ‘చీటర్’ అంటూ గేళి చేశారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని వారించడంతో పాటు స్మిత్ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా నవీన్ విషయంలోనూ హుందాగా వ్యవహరించి మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. చదవండి: CWC 2023: అఫ్ఘనిస్తాన్‌పై గెలుపు అనంతరం రోహిత్ శర్మ ఏమన్నాడంటే..? View this post on Instagram A post shared by ICC (@icc) -
కలిసిపోయిన విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హక్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(54 బంతుల్లో 131) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కలిసిపోయిన విరాట్ కోహ్లి-నవీన్ ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆఫ్గానిస్తాన్ పేసర్ నవీన్-ఉల్-హక్ కలిసిపోయారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకుని తమ మధ్య ఉన్న వైరానికి ఫుల్స్టాప్ పెట్టారు. కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్కు కోహ్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ అభిమానులు నవీన్ ఎక్కడ కన్పించిన కోహ్లి కోహ్లి అంటూ అరుస్తూ అతడిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో కూడా 'కోహ్లీ కోహ్లి' నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, నవీన్‌కు మధ్య మంచి పోటీ ఉంటుందని అంతా భావించారు. కోహ్లి కూడా నవీన్‌ను టార్గెట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అదేమి జరగలేదు. అందరి ఊహలను తలకిందలు చేస్తూ ఇద్దరూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించారు. ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లే మా కింగ్ కోహ్లితో అట్లుంటది కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WC 2023 IND Vs AFG: రోహిత్ శర్మ ఊచకోత.. ఆఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్ #INDvsAFG #ViratKohli𓃵 #CricketTwitter So it's finally over 🫂 naveen vs kohli pic.twitter.com/EUC96FjWbk — movie enthusiast (@OKAYCHILL07) October 11, 2023 Virat Kohli 🤝 Naveen Ul Haq. This is why cricket is more than a game. pic.twitter.com/5n3QQevYXy — Johns. (@CricCrazyJohns) October 11, 2023 -
CWC 2023: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. అందరి కళ్లు అతనిపైనే..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సొంత మైదానం అయిన న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ (అక్టోబర్ 11) భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. ఐపీఎల్ 2023లో విరాట్-నవీన్‌ల మధ్య గొడవ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఏమేరకు రియాక్ట్ అవుతారోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. విరాట్ సొంత మైదానం కావడంతో ప్రేక్షకులు నవీన్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించవచ్చేమో అని జనాలు అనుకుంటున్నారు. నవీన్ ఉల్ హక్ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో సైతం ట్రెండింగ్‌లో ఉంది. మరి ఢిల్లీ ప్రేక్షకులు నవీన్ పట్ల ఏరకంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హక్ మధ్య 2023 ఐపీఎల్ సందర్భంగా గొడవ జరిగిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా జరిగిన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానలా మారి, నవీన్ ఎక్కడికి వెళ్లినా నీడలా వెంటాడుతుంది. ఈ గొడవకు కారకులెవరు అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా నవీన్ ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా కోహ్లి అభిమానులు అతని టార్గెట్ చేస్తున్నారు. నవీన్ కనిపిస్తే చాలు కోహ్లి, కోహ్లి అంటూ కేకలు పెడుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కోహ్లి అభిమానుల టార్చర్ తట్టుకోలేక నవీన్ తన సోషల్‌మీడియా ఖాతాల కామెంట్ల సెక్షన్‌ను డిసేబుల్ చేశాడు. కోహ్లి ఫ్యాన్స్ నవీన్‌ను నిద్రలో కూడా వెంటాడుతున్నారు. కోహ్లి ఫ్యాన్స్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నవీన్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటివ్వదని అంతా అనుకున్నారు. అయినా ఆ దేశ బోర్డు సాహసం చేసి నవీన్‌ను ఇండియాకు పంపింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించగా.. ఆఫ్ఘన్లు తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడారు. -
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన నవీన్ 2021లో తన చివరి వన్డే ఆడాడు. కెరీర్లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) నవీన్ తన వన్డే కెరీర్లో 14 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. నవీన్ ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2023లో కోహ్లితో గొడవతో నవీన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్ ఫ్రాంచైజీ క్రికెట్ కోసం తన అంతర్జాతీయ కెరీర్‌ను వదులుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమ రెండో వరల్డ్‌కప్ ఆడేందుకు నిన్ననే భారత్‌కు వచ్చింది. వార్మప్ గేమ్ కోసం ఆఫ్ఘన్ క్రికెటర్లు త్రివేండ్రంలో ల్యాండయ్యారు. తమ తొలి వరల్డ్‌కప్‌లో (2019) లీగ్ స్టేజ్ దాటలేని ఆఫ్ఘన్ టీమ్ ఈసారి అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి సంచలనాలు క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఆఫ్ఘన్ జట్టులో నవీన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ. రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వీరితో ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచనాలు సృష్టించే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో వారు బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీని ముందు వారు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. సెప్టెంబర్ 29న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 3న శ్రీలంకతో ఆఫ్ఘన్లు తలపడతారు. -
నువ్వస్సలు మారొద్దు: గంభీర్ పోస్ట్ వైరల్.. సెటైర్లతో కోహ్లి ఫ్యాన్స్ కౌంటర్
There are very few like you, never change: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను విరాట్ కోహ్లి అభిమానులు మరోసారి టార్గెట్ చేశారు. మీ ఎక్స్ట్రాలన్నింటికి ఢిల్లీలో మా కింగ్ బ్యాట్‌తోనే సమాధానమిస్తాడంటూ చురకలు అంటిస్తున్నారు. మీ స్టాండ్ అస్సలు మారొద్దు.. అలాగే ఉండాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023లో లక్నోలో ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ లక్నో బౌలర్‌కు మద్దతుగా ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. గంభీర్ జోక్యంతో ముదిరిన గొడవ కోహ్లితో గొడవపడుతున్న నవీన్‌ను సమర్థించేలా మాట్లాడటంతో కోహ్లి కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. భారత మాజీలు సహా మిగతా క్రికెటర్లు సైతం ఈ విషయంలో గంభీర్‌ను తప్పుబట్టారు. మైదానంలో ఆటగాళ్లు మాటా మాటా అనుకోవడం సహజమేనని.. అంతమాత్రాన కోచ్ స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా మధ్యలో దూరిపోకూడదని విమర్శించారు. అయితే, నవీన్ కోహ్లితో గొడవను అక్కడితో ముగించలేదు. మ్యాంగోస్ పోస్టులతో కోహ్లి, కోహ్లి ఫ్యాన్స్ కవ్వించగా.. అదే స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. నువ్విలాగే ఉండాలి.. మారొద్దు ఇదిలా ఉంటే.. నవీన్ ఈరోజు(సెప్టెంబరు 23) ఇరవై నాలుగవ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా గంభీర్ సోషల్ మీడియా వేదికగా అతడికి విషెస్ తెలియజేశాడు. ‘‘హ్యాపీ బర్త్‌డే నవీన్.. అతి కొద్ది మంది మాత్రమే నీలా ఉండగలుగుతారు. నువ్విలాగే ఉండాలి. ఎప్పటికీ మారొద్దు’’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఢిల్లీలో టీమిండియాతో మ్యాచ్ ఈ పోస్ట్‌పై కోహ్లి ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పైవిధంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నవీన్ ఉల్ హక్‌ను అనూహ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023కి ఎంపిక చేశారు అఫ్గనిస్తాన్ సెలక్టర్లు. ఈ క్రమంలో అక్టోబరు 11న టీమిండియాతో ఢిల్లీలో అఫ్గనిస్తాన్ జట్టు తలపడనుంది. కోహ్లి హోం గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగనుండటంతో నవీన్ బౌలింగ్‌ను చెడుగుడు ఆడేస్తాడంటూ ఫ్యాన్స్ గంభీర్ పోస్టుకు బదులిస్తున్నారు. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! View this post on Instagram A post shared by Gautam Gambhir (@gautamgambhir55) -
వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. నవీన్ ఉల్ హాక్కు చోటు
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఇవాళ (సెప్టెంబర్ 13) ప్రకటించింది. ఈ జట్టుకు హస్మతుల్లా షాహీది నాయకత్వం వహించనుండగా.. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హాక్, నూర్ అహ్మద్ లాంటి స్టార్ ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్ కోసం ఆఫ్ఘన్ సెలెక్టర్లు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్లు వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉండనున్నారు. రెగ్యులర్ సభ్యుల్లో ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానంలో వీరు జట్టులో చేరతారు. రీఎంట్రీ ఇచ్చిన నవీన్ ఉల్ హాక్.. గత ఐపీఎల్లో విరాట్ కోహ్లితో గొడవ కారణంగా భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో విలన్లా మారిపోయిన నవీన్ ఉల్ హాక్‌ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023 కోసం ప్రకటించిన జట్టుకు నవీన్‌ను ఎంపిక చేయకపోవడంతో, భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో కూడా అతనికి ఛాన్స్ ఉండదని అంతా అనుకున్నారు. అయితే, ఆఫ్ఘన్ సెలెక్టర్లు నవీన్‌కు భారత్‌లో ఆడిన అనుభవం ఉండటాన్ని పరిగణలోకి అతనికి జట్టులో చోటు ఇచ్చారు. కాగా, కోహ్లితో ఉన్న విభేదాల కారణంగా నవీన్‌ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు పక్కకు పెడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హస్మతుల్లా షాహీది (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్ హాక్ ఫారూఖీ రిజర్వ్ ప్లేయర్లు.. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్ -
నవీన్‌కు గట్టి షాక్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! అయ్యో పాపం..
Naveen ul Haq’s Cryptic Post: ఆసియా కప్-2023 నేపథ్యంలో యువ పేసర్ నవీన్ ఉల్ హక్కు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు గట్టి షాకిచ్చింది. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో అతడిని పక్కనపెట్టి మెగా టోర్నీలో అవకాశం లేదని సంకేతాలు ఇచ్చిన మేనేజ్మెంట్.. ఇప్పుడు ఆ మాటను నిజం చేసింది. వన్డే ఈవెంట్లోకు ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో నవీన్‌కు స్థానం ఇవ్వలేదు. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభిమానులు నవీన్ ఉల్ హక్‌ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అయ్యో పాపం నవీన్..! మరేం పర్లేదు నీకు మంచే జరిగింది. ఒకవేళ ఆసియా కప్‌లో గనుక ఇండియా- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో నీకు చోటు దక్కి ఉంటే కచ్చితంగా కోహ్లి బ్యాటింగ్ విధ్వంసానికి బలైపోయేవాడివి. ఈసారి తప్పించుకున్నావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మేరకు కామెంట్లు, మీమ్స్‌తో ఈ అఫ్గన్ ఫాస్ట్ బౌలర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ జట్టు ప్రకటన నేపథ్యంలో నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టా పోస్ట్ సైతం నెట్టింట వైరల్‌గా మారింది. బాగా హర్ట్ అయ్యాడు ‘‘చీకటిని చూసేందుకు నీ కళ్లు ఎంతగా అలవాటు పడిపోయినా పర్లేదు. అయితే, వెలుగును చూసేందుకే ఇలా చేస్తున్నాయని మాత్రం నువ్వు అనుకుంటే అది పొరపాటే’’ అని నవీన్ ఉల్ హక్ పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ సెలక్టర్లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే తాను హర్ట్ అయినట్లు చెప్పాడు. దీంతో అతడి అభిమానులు.. ‘‘బాధపడకు భాయ్.. మనకంటూ తప్పక ఓ రోజు వస్తుంది’’ అని అండగా నిలుస్తున్నారు. కింగ్ కోహ్లి ఫ్యాన్స్ మాత్రం.. ‘‘అయ్యో పాపం’’ అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన నవీన్ ఉల్ హక్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రన్‌మెషీన్ కోహ్లితో వాగ్వాదానికి దిగాడు. గంభీర్ ఎంట్రీతో ముదిరిన వివాదం వీరిద్దమరి మధ్య జరిగిన గొడవలో అప్పటి లక్నో మెంటార్ గౌతం గంభీర్ కూడా జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఈ నేపథ్యంలో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలం కావడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి నవీన్.. ‘‘తియ్యటి మామిడి పండ్లు’’ అంటూ చేసిన పోస్ట్ కింగ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఇక నవీన్ దురుసు ప్రవర్తనకు కోహ్లి కూడా నర్భగర్భంగానే ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా వన్డే కప్ ఆరంభం కానుంది. భారత్, పాకిస్తాన్, నేపాల్.. శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ టోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఆ తర్వాత అఫ్గన్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా కాగా 2016లో బంగ్లాదేశ్‌తో వన్డే సందర్భంగా నవీన్ ఉల్ హక్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. రెండేళ్ల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. అఫ్గనిస్తాన్ తరఫున ఇప్పటి వరకు ఈ 23 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ 7 వన్డేలు, 27 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 14, 34 వికెట్లు పడగొట్టాడు. కోహ్లితో వివాదం తర్వాత అంటే ఐపీఎల్-2023 ముగిసిన తర్వాత అఫ్గన్ తరఫున నవీన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం. ఆసియా కప్-2023: అఫ్గనిస్తాన్ జట్టు హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
ఆసియాకప్‌కు ఆఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
ఆసియాకప్-2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. అదే విధంగా గాయం కారణంగా పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ఆటగాళ్లు షరాఫుద్దీన్ అష్రఫ్, నజీబుల్లా జద్రాన్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్‌పై ఆఫ్గాన్ సెలక్టర్లు మరోసారి వేటు వేశారు. అతడి ఆసియాకప్ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ,కరీం జనత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లుపాల్గొనబోతున్నాయి. పాకిస్తాన్, నేపాల్, భారత్ జట్లు గ్రూపు-ఏ లో ఉండగా.. ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గ్రూపు-బిలో ఉన్నాయి. కాగా నేపాల్ జట్టు తొలిసారి ఆసియాకప్ అర్హత సాధించింది. పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్.. ఇక ఆసియాకప్ సన్నాహాకాల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఫ్గాన్ ఓటమి పాలైంది. శ్రీలంక వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో 3-0 తేడాతో ఆఫ్గాన్‌ను పాక్ వైట్ వాష్ చేసింది. అయితే సిరీస్ ఆఫ్గాన్ కోల్పోయనప్పటికీ.. కొంత మంది ఆటగాళ్లు మాత్రం తమ వ్యక్తిగత ప్రదర్శనలతో అకట్టుకున్నారు. ఇక ఆసియాకప్‌లో ఆఫ్గాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 3న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆసియాకప్‌కు ఆఫ్గాన్ జట్టు హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, రియాజ్ హసన్, ఇక్రమ్ అలీ ఖిల్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, అబ్దుల్ రెహమాన్, రషీద్ ఖాన్, షరఫుద్దీన్ ఉర్ రహ్ అష్రఫ్, సులిమాన్ సఫీ, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ అహ్మద్ చదవండి: #Neeraj Chopra:13 ఏళ్ల వయస్సులోనే ఎన్నో అవమానాలు.. అయినా వరల్డ్ ఛాంపియన్! నీరజ్ 'బంగారు' కథ -
పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే!
గడ్డి నీలంగా ఉందని గాడిద.. పులితో చెప్పింది! లేదు లేదు.. గడ్డి పచ్చగా ఉంది.. పులి జవాబు.. రెండిటి మధ్య మాటా మాటా పెరిగింది.. దీంతో గాడిద, పులి కలిసి అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్లాయి. అపుడు.. గాడిద గట్టిగా అరవడం మొదలుపెట్టింది.. మహారాజా గడ్డి నీలం రంగులోనే ఉంది. అవును.. నిజమే గడ్డి నీలంగానే ఉంది.. సింహం బదులిచ్చింది. గాడిదకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. కానీ పులి మాత్రం వెనక్కి తగ్గలేదు. గడ్డి పచ్చగానే ఉందనే వాదనకు దిగింది. గాడిదను శిక్షించమని సింహాన్ని కోరింది. కానీ.. సింహం అనూహ్య ప్రకటన చేసింది. పులిని శిక్షించాల్సిందిగా ఆదేశించింది. వాదోపవాదాల అనంతరం ఐదేళ్ల పాటు మౌనంగా ఉండాలని పులిని సింహం ఆదేశించడంతో గాడిద ఆనందంగా గంతులేసుకుంటూ వెళ్లిపోయింది. పులి.. సింహం వేసిన శిక్షను ఆమోదించింది. అయితే, అంతకంటే ముందు.. ‘‘మహారాజా.. గడ్డి పచ్చగానే ఉంటుంది కదా!’’ అని సింహాన్ని అడిగింది. అవునని సింహం బదులిచ్చింది. మరి మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు అని అడిగింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు గడ్డితో నీకేం పని? అది పచ్చగా ఉందా? నీలంగా ఉందా? అన్న విషయం నీకెందుకు? నీలాంటి తెలివైన జంతువులు అసలు ఈ విషయాల గురించి పట్టించుకోవడమే తప్పు. అలాంటిది నా దగ్గరకు వచ్చి నా సమయం కూడా వృథా చేశావు. అందుకే నీకు శిక్ష విధించాను’’ అని పులి సందేహాన్ని తీర్చింది. ఇందులో నీతి ఏమిటంటే.. టైమ్‌ను ఎంత చెత్తగా వేస్ట్ చేస్తామో తెలుసుకోవడం! నిజాన్ని అంగీకరించని మూర్ఖులతో ఏళ్లకు ఏళ్లు వాదించినా ప్రయోజనం ఉండదు. ఇది తప్పు.. ఇది ఒప్పు అని వాళ్లకు ఎన్ని సాక్ష్యాలు చూపించినా వారి వారి ఊహాగానాలు, ఏకపక్ష అభిప్రాయాలు మారవు. అసలు మనం చెప్పే విషయాలను అర్థం చేసుకునే స్థాయి వాళ్లకు ఉండదు. అహంకారంతో వాళ్ల కళ్లు మూసుకుపోతాయి. తాము చెప్పింది, చేసిందే సరైందనే ఈగోతో ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడి సమయం వృథా చేయడం వేస్ట్!! అఫ్గనిస్తాన్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్-ఉల్-హక్ ఇన్‌స్టాలో పంచుకున్న వీడియోలో ఉన్న నీతికథ ఇది. కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా నవీన్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో గొడవకు దిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా చెలరేగిన భావోద్వేగాలను అదుపుచేసుకోలేని ఈ యువ ఆటగాడు.. ఆట అయిపోయిన తర్వాత ఇరు జట్లు పరస్పరం కరచాలనం చేసుకునే కోహ్లి ఏదో అనగానే అతడి చేతిని విసిరికొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారి తీయగా.. లక్నో మెంటార్ గౌతం గంభీర్ జోక్యంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో మైదానాన్ని వీడిన తర్వాత కోహ్లి, నవీన్ ఒకరినొకరు ఉద్దేశిస్తూ నర్మగర్భ పోస్టులతో సోషల్ మీడియా వార్‌కు తెరతీశారు. ఈ నేపథ్యంలో కోహ్లిని కించపరిచే విధంగా వ్యవహరించాడంటూ నవీన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు కింగ్ కోహ్లి ఫ్యాన్స్. ఎక్కడ మ్యాచ్ జరిగినా కోహ్లి నామస్మరణతో అతడిని టీజ్ చేశారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో నవీన్ మాట్లాడుతూ.. కోహ్లినే గొడవ మొదలుపెట్టాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత నవీన్‌పై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రిప్టిక్ పోస్ట్‌తో ముందుకు వచ్చాడు నవీన్ ఉల్ హక్. ఇది కోహ్లి ఫ్యాన్స్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, కింగ్ అభిమానులు ఈ వీడియోపై కూడా తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అవును నువ్వు గాడిదవే! నీతో వాదించడం మా కింగ్ తప్పే. అయినా ఇక్కడ మా స్టార్ పులిలాంటి వాడు కాదు.. సింహం లాంటోడు.. ఆ సింహం అడవికి రాజైతే.. మా కోహ్లి రికార్డుల రారాజు. అది గుర్తుపెట్టుకో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందుకు నవీన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!! చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు.. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) -
కోహ్లి మీద అసూయతోనే గంభీర్ అలా చేశాడు: పాక్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2023 సందర్భంగా ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి- లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. విరాట్‌పై అసూయతోనే గౌతీ వాగ్వాదానికి దిగినట్లు అనిపించిందన్నాడు. ఏదేమైనా ఓ క్రికెటర్‌గా ఇలా ఇద్దరు ఆటగాళ్లు మైదానంలోనే తగువు దిగడం తనను బాధించిందన్నాడు. కాగా లక్నో వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్- ఉల్- హక్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ నవీన్ కోహ్లితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో గొడవ పెద్దది కాగా గౌతం గంభీర్ జోక్యం చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి- నవీన్ గొడవ.. కోహ్లి- గంభీర్ మధ్య అగ్గిరాజేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విరాట్‌కు మద్దతునివ్వగా.. మరికొందరు గౌతీకి అండగా నిలిచారు. ఈ క్రమంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన అహ్మద్ షెహజాద్.. గౌతీ కావాలనే గొడవకు దిగినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ‘‘ఓ ప్రేక్షకుడిగా, ఆటగాడిగా.. ఆ దృశ్యాలు నన్ను కలచివేశాయి. నాకైతే.. కోహ్లి మీద అసూయతోనే గౌతం గంభీర్ గొడవ పెద్దది చేశాడనిపించింది. ఎన్నో రోజులుగా సమయం కోసం వేచి చూసి మరీ వివాదానికి తెరలేపినట్లు... విరాట్‌ను వివాదంలోకి లాగేందుకు వాగ్వాదానికి దిగాడేమో అన్నట్లు అనిపించింది. అయినా, ఆటగాళ్ల మధ్య గంభీర్ తలదూర్చాల్సిన అవసరం ఏమిటో నాకింకా అర్థం కాలేదు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని.. ఇందులో కోహ్లి తప్పేం లేదని టీమిండియా స్టార్‌ను సమర్థించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో తలపడిన తొలి సందర్భంలో సొంతగడ్డపై ఆర్సీబీని లక్నో ఓడించగా.. రెండోసారి పోరులో ఆర్సీబీ..లక్నోను చిత్తు చేసింది. ఇక బెంగళూరు ఫ్రాంఛైజీ ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. లక్నో టాప్-4లో నిలిచింది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో భారీ తేడాతో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని! -
కోహ్లినే గొడవ ప్రారంభించాడు.. నా తప్పేం లేదు: నవీన్ ఉల్ హక్
ఐపీఎల్-2023లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ జోక్యం చేసుకోవడంతో మరింత పెద్దదైంది. ఇక ఈ విషయాన్ని కోహ్లి అక్కడితోనే విడిచి పెట్టగా.. నవీన్ మాత్రం సోషల్ మీడియాలో విరాట్‌నే టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లి అభిమానులు ఓ ఆట ఆడేసుకున్నారు. అతడు ఎక్కడ కనిపించిన కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా అరుస్తూ చుక్కలు చూపించారు. ఇక ఈ వివాదంపై నవీన్ ఉల్ హక్ తాజాగా స్పందించాడు. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ సంచలన వాఖ్యలు చేశాడు. ' మ్యాచ్ సమయంలో విరాట్ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ గొడవను ప్రారంభించలేదు. మ్యాచ్ అనంతరం మేం షేక్‌హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కోహ్లి మళ్లీ గొడవను ప్రారంభించాడు. మాపై పడిన ఫైన్లు చూస్తే మీకు చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరినీ స్లెడ్జ్ చేయను. ఒక వేళ చేయాలనుకున్న నేను బౌలర్‌ను కాబట్టి బ్యాటర్లకు మాత్రమే చేస్తా. ఆ మ్యాచ్‌లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఎవరినీ స్లెడ్జ్ చేయలేదు. నేను పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ఆటగాళ్లకు తెలుసు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గానీ మ్యాచ్ తర్వాత గానీ సహనం కోల్పోలేదు. అక్కడ నా తప్పులేదని అందరికీ తెలుసు. నేనే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కోహ్లినే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నేను కూడా మనిషినే కదా రియాక్ట్ అవ్వక తప్పలేదు' అని చెప్పాడు. చదవండి: Ashes 2023: విచిత్రకర రీతిలో ఔటైన హ్యరీ బ్రూక్.. అస్సలు ఊహించుండడు! వీడియో వైరల్ -
T20 Blast: నవీన్ ఉల్ హక్‌ను చెడుగుడు ఆడుకున్న అనామక బ్యాటర్లు
ఐపీఎల్-2023లో ఓవరాక్షన్ చేసి (కోహ్లితో వివాదం) వార్తల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌ను ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అనామక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ను నిన్న (జూన్ 1) జరిగిన మ్యాచ్‌లో డెర్బిషైర్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన నవీన్.. ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. నవీన్‌ను ముఖ్యంగా సెంచరీ హీరో వేన్ మ్యాడ్సన్ (61 బంతుల్లో 109 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉతికి ఆరేశాడు. ఎడాపెడా బౌండరీలు బాది నవీన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మ్యాడ్సన్తో పాటు థామస్ వుడ్ (24 బంతుల్లో 37; 7 ఫోర్లు), బ్రూక్ గెస్ట్ (20 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లీసెస్టర్‌షైర్ బౌలరల్లో నవీన్‌తో పాటు ముల్దర్ (3-0-34-0), విల్ డేవిస్ (3-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. పార్కిన్సన్ (2/36), రెహాన్ అహ్మద్ (2/20), అకెర్మన్ (1/16) వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లీసెస్టర్‌షైర్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. నిక్ వెల్చ్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్), రిషి పటేల్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ అకెర్మన్ (38 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), రెహాన్ అహ్మద్ (14 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) లీసెస్టర్షైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. డెర్బీ బౌలర్లలో జాక్ చాపెల్ 2, మార్క్ వ్యాట్, జార్జ్ స్క్రిమ్షా, లూయిస్ రీత్ తలో వికెట్ పడగొట్టారు. -
విరాట్ సర్, ఐయామ్ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్ ఉల్ హక్ రియాక్షన్
ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లితో గొడవ పెట్టుకున్నప్పటి నుంచి లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్‌ను నెటిజన్లు, ముఖ్యంగా విరాట్ అభిమానులు, టీమిండియా అభిమానులు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. నవీన్.. కోహ్లిని ఉద్దేశిస్తూ ఏ పోస్ట్ చేసినా, వారు తగు రీతిలో ఘాటుగా జవాబిస్తున్నారు. ఈ క్రమంలో నవీన్ ట్విటర్ అకౌంట్ నుంచి రెండు రోజుల కిందట వచ్చిన ఓ పోస్ట్ నెట్టింట వైరలైంది. ఆ ట్వీట్లో ఏముందంటే.. విరాట్ సర్.. ఐయామ్ సారి, నేను మీకు పెద్ద అభిమానిని.. చిన్నప్పటి నుంచి మీరే నా ఆరాధ్య క్రికెటర్.. నా రూమ్ మొత్తం మీ పోస్టర్లతోనే నిండి ఉంటుంది.. లక్నోని వదిలి మీ కెప్టెన్సీలో ఆర్సీబీకి ఆడాలనుంది అంటూ నవీన్ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే నెట్టింట హల్చల్ చేసింది. నవీన్ పశ్చాత్తాపపడుతున్నట్లున్నాడని కోహ్లి అభిమానులు అనుకున్నారు. అది నా ట్విటర్ అకౌంట్ కాదు.. ఫేక్: నవీన్ ఉల్ హక్ అయితే, కొద్ది గంటల తర్వాత ఈ ట్వీట్ నవీన్ ఉల్ హక్ చేయలేదని తెలిసింది. ఈ విషయంపై అతనే స్వయంగా స్పందించాడు. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ రన్ చేస్తున్నారని, తాను కోహ్లికి క్షమాపణ చెబుతున్నట్లు ట్వీట్ చేయలేదని తన అఫిషియల్ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చాడు. కాగా, ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా కోహ్లి.. గంభీర్-నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన వన్ టు టూ ఫైట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాహాబాహీకి దిగినంత పని చేశారు. అనంతరం వీరు సోషల్‌మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకున్నారు. ఈ విషయంలో కోహ్లి కాస్త సైలెంట్ అయినా నవీన్ మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాడు. గంభీర్ అండదండలతో కోహ్లిని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. దీనికి ప్రతిగా కోహ్లి ఆర్మీ సైతం గంభీర్, నవీన్‌లపై ఎదురుదాడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఫేక్ అకౌంట్ నుంచి కోహ్లికి అనుకూలంగా ట్వీట్ రావడం.. దానిపై నవీన్ స్పందించడం జరిగింది. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించనున్న ఎంఎస్ ధోని -
గంభీర్ ఓ లెజెండ్.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇక మైదానంలో..
IPL 2023- Naveen-ul-Haq- Gautam Gambhir: ‘‘గంభీర్ ఓ దిగ్గజ క్రికెటర్. ఇండియా మొత్తం ఆయనను గౌరవిస్తుంది. భారత క్రికెట్‌కు ఆయన ఎనలేని సేవ చేశాడు. మెంటార్‌గా, కోచ్‌గా, క్రికెట్ లెజెండ్‌గా ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కెరీర్లో ఎలా ముందుకు సాగాలో ఎన్నో సూచనలు ఇచ్చారు. మైదానం లోపల, వెలుపలా ఎలా ఉండాలో నేర్పించారు’’ అని లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్, అఫ్గనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ అన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ దిగ్గజ ఆటగాడని, అతడి మార్గనిర్దేశనంలో అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. తొలి సీజన్లోనే ఐపీఎల్-2023తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన నవీన్.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో లక్నో తరఫున అరంగేట్రం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడిన నవీన్ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కోహ్లితో వాగ్వాదంతో ఒక్కసారిగా చెన్నై మ్యాచ్‌లో నవీన్ మెరుగ్గా రాణించినప్పటికీ లక్నో 81 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఆట కంటే కూడా టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లితో వాగ్వాదం, తదనంతరం కోహ్లిని ఉద్దేశించి చేసిన సోషల్ మీడియా పోస్టులతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లితో వాగ్వాదం సమయంలో నవీన్‌కు గంభీర్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరిని కోహ్లి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అంతేకాదు.. నవీన్ బౌలింగ్ చేయడానికి వచ్చిన ప్రతిసారి కోహ్లి నామస్మరణతో స్టేడియాన్ని హోరెత్తించారు. గంభీర్ లెజెండ్.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఈ నేపథ్యంలో కింగ్ అభిమానులు అలా చేయడాన్ని ఆస్వాదిస్తానన్న నవీన్.. గంభీర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. గంభీర్ తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు ముంబైతో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ మెంటార్, కోచ్ .. ప్లేయర్ ఎవరైనా గానీ.. ఎవరికైనా గానీ నా వంతు సాయం చేయాల్సి వచ్చినపుడు నేను వెనకడుగు వేయను. అలాగే ఇతరుల నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తా. గంభీర్ నాకు ఎన్నో విషయాలు నేర్పించారు’’ అని నవీన్ ఉల్ హక్ తెలిపాడు. కాగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన లక్నో తమ రెండో సీజన్‌ను కూడా నాలుగో స్థానంతో ముగించింది. మరోవైపు.. లక్నోపై గెలిచిన ముంబై క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. చదవండి: IPL 2023: ముంబై గెలిచిందా సరికొత్త చరిత్ర.. టైటిల్ నెగ్గే విషయంలో కాదు..! #MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే! Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });