New feature
-
తక్కువ ధరకు ఫుడ్.. జొమాటో కొత్త ఫీచర్
ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ ఫుడ్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది."జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్‌ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..ఒక కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్‌లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్‌ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్‌కు, రెస్టారెంట్ పార్టనర్‌కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. అయితే, ఐస్‌క్రీమ్‌లు, షేక్‌లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్ గోయల్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024 -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్‌లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టామార్ట్‌లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్‌లో టేబుల్స్‌ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
ఆ మూడు కంపెనీల్లో లేని కొత్త ఫీచర్.. బీఎస్ఎన్ఎల్లో..
స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.ఈ కొత్త భద్రతా ఫీచర్‌తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్ఎన్ఎల్ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. బీఎస్ఎన్ఎల్ యూసీసీ కంప్లయింట్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో మోసపూరిత ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్‌ను నివేదించవచ్చు. ఈ ఫీచర్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఏవీ ఇలాంటి ఫీచర్‌ను అందించడం లేదు.కంప్లయింట్ ఇలా ఫైల్ చేయండి» బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను తెరవండి.» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్' ఆప్షన్‌ను ఎంచుకోండి.» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్' ఎంచుకోండి.» 'న్యూ కంప్లయింట్'పై నొక్కండి.» మీ కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్‌ను సబ్మిట్ చేయండి. -
గూగుల్‌పేలో గోల్డ్ లోన్..
గూగుల్‌కు చెందిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్‌పే (google Pay) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ లోన్లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్‌తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.దీంతో చిరు వ్యాపారులు, ఇతర కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు గూగుల్‌పే ద్వారా సులభంగా బంగారు ఆభరణాలపై రుణాలను పొందవచ్చు. గోల్డ్ లోన్ల కోసం మరో ఎన్బీఎఫ్సీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌తో కూడా గూగుల్‌పే జట్టు కట్టింది. గూగుల్‌పే అందిస్తున్న ఈ ఫీచర్‌తో వినియోగదారులు క్రెడిట్ రిపోర్ట్ లేదా విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది టైర్-2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. ఇక్రా ప్రకారం.. వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమిస్తుందని, 2027 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. -
నచ్చినట్లు చాట్‌పేజ్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'వాట్సప్'.. వివిధ డిజైన్లతో కొత్త చాట్ థీమ్‌లను పొందనుంది. యూజర్ల కోసం సంస్థ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేయడంలో భాగంగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.వాటప్స్ పరిచయం చేస్తున్న 'థీమ్ చాట్' అనే ఫీచర్ సాయంతో యూజర్లు చాటింగ్‌కు నచ్చిన థీమ్‌లను ఎంచుకోవచ్చు. థీమ్ మాత్రమే కాకుండా చాట్ పేజీని కూడా నచ్చినట్లు మార్చుకోవచ్చని తెలుస్తోంది. చాట్ బబుల్స్, వాల్పేపర్ల రంగులు ఎంచుకున్న థీమ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
డిజిటల్ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగించే దాదాపు అందరూ గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఉపాయ్ప్గిస్తున్నారు. అయితే పేమెంట్స్ చేసేటప్పుడు ఇది కొంత ప్రాసెస్‌తో కూడుకున్న పని. పిన్ ఎంటర్ చేయాలి.. ఆ తరువాత ట్రాన్సక్షన్ జరుగుతుంది.దీనిని మరింత సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ ఫీచర్ తీసుకొచ్చింది. దీనిని చిన్న లావాదేవీలకు మాత్రమే ఉపయోగకోవాలి. ఎందుకంటే ఇందులో రూ. 2000 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తయిన తరువాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ విధానానికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది.యూపీఐ ఆటో టాప్-అప్లావేదేవీల కోసం యూపీఐ లైట్ ఉపయోగిస్తుంటే.. అక్టోబర్ 31 తరువాత ఆటో టాప్ అప్ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అంటే యూపీఐ లైట్లో ఆటో టాప్-అప్ ఆప్షన్ ఎంచుకుంటే.. అమౌట్ పూర్తయిన తరువాత మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా అమౌంట్ యాడ్ అవుతుంది. ఇది అక్టోబర్ 31 నుంచి అమలులోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.నిజానికి యూపీఐ ట్రాన్సక్షన్ చేయాలనంటే పిన్ ఎంటర్ చేయాలి. కానీ యూపీఐ లైట్ ద్వారా రూ. 500 కంటే తక్కువ లావాదేవీలు జరపడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూపీఐ లైట్ ద్వారా జరిగే లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించవు. -
వాట్సాప్ నుంచి వేరే యాప్‌లకు మెసేజ్‌లు, కాల్స్..
సోషల్ మీడియాలో మేసేజ్‌లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్‌లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్‌కి మెసేజ్‌లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన వాట్సాప్, మెసెంజర్లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్‌ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్‌ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్‌లకు నేరుగా మెసేజ్‌లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.మెటా ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్ల లాగే ఎన్క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్‌కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.కాల్స్ మాత్రం కాస్త ఆలస్యంథర్డ్ పార్టీ యాప్‌లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్‌ల మెసేజ్‌లు ఒకే ఇన్‌బాక్స్‌లో కనిపించే లేదా విడివిడి ఇన్‌బాక్స్‌లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్‌లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్‌లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. -
జొమాటో కొత్త ఫీచర్.. దీపిందర్ వీకెండ్ అప్డేట్
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఒకే ఫోన్‌ను మార్చుకునే ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.ఈ కొత్త ఫీచర్‌ని 'గ్రూప్ ఆర్డరింగ్' అని పిలుస్తారు. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు యూజర్లు తమ స్నేహితులకు లింక్‌లను షేర్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా వారు తమకు నచ్చిన వంటకాల జాబితాను సలువుగా జోడించవచ్చు. దీంతో ఫుడ్ ఆర్డర్ చేయడం మరింత వేగవంతమవుతుంది.దీపిందర్ గోయల్ వీకెండ్ అప్డేట్ పేరుతో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఈ కొత్త ఫీచర్ గురించి తెలియజేశారు. ఈ చేసిన ఈ పోస్ట్‌కు లక్షకు పైగా వ్యూస్, వేలాదిగా లైక్‌లు వచ్చాయి. యూజర్లు మిశ్రమ కామెంట్లు చేశారు.Exciting new weekend update: Group Ordering is now on Zomato!⁰You can now share a link with your friends, and everyone can add to the cart seamlessly, making ordering together faster and easier. No more passing the phone around awkwardly to collect everyone's order 😉We’re… pic.twitter.com/W3SrlwVJR0— Deepinder Goyal (@deepigoyal) August 17, 2024 -
స్కూల్ టైమ్ ఫీచర్.. తల్లిదండ్రులకు వరం!
మార్కెట్లో స్మార్ట్ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగమైపోయింది. పెద్దవారి విషయం పక్కన పెడితే.. పిల్లలు కూడా వీటికి అలవాటైపోతున్నారు, గంటలకొద్దీ వాటికే అతుక్కుపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి, వారికి ఫోన్ ఎంతవరకు అవసరమో.. అంతవరకు మాత్రమే ఉపయోగించేలా గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.గూగుల్ త్వరలోనే పిల్లలు ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడానికి 'స్కూల్ టైమ్' ఫీచర్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా టాబ్లెట్ ఓఎస్ వాచ్‌లలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.ఏమిటి ఈ స్కూల్ టైమ్ ఫీచర్స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి, పిల్లలు పరిమిత సమయం మాత్రమే ఉపయోగించడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. స్మార్ట్‌ఫోన్ నుంచి పిల్లలను ఎలా దూరం చేయాలని ఆలోచించే తల్లితండ్రులకు ఇప్పుడు ఈ ఫీచర్ ఓ చక్కని పరిష్కారం అనే చెప్పాలి.ఎలా ఉపయోగించాలి స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ వాచ్‌లలో స్కూల్ టైమ్ ఫీచర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్యామిలీ లింక్ ద్వారా తేదీ, టైమ్ వంటి వాటిని షెడ్యూల్ చేయాలి. దీని ద్వారా నిర్దిష్ట కాంటాక్ట్ నుంచి కాల్స్, మెసేజస్ అనుమతించడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడ్ ఎప్పుడైనా లాక్ చేయవచ్చు, అన్‌లాక్ కూడా చేయవచ్చు.గూగుల్ ఈ ఫీచర్‌ను వచ్చే ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత పిల్లలు స్మార్ట్‌ఫోన్ వినియోగించే సమయాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీనితో పాటు యూట్యూబ్ యాక్టివిటీ ఫీచర్ కూడా లాంచ్ చేయడానికి సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.స్కూల్ టైమ్ ఫీచర్ ఉపయోగాలుపిల్లలు తమ స్కూల్స్‌లో కూడా తరగతుల మీద దృష్టి సారించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. -
కస్టమర్ రిక్వెస్ట్.. జొమాటోలో కొత్త ఫీచర్
కస్టమర్ సమస్యలను పరిష్కరించే దిశగా జొమాటో ఓ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. ఆర్డర్ హిస్టరీ కనిపించకుండా చేయడానికి ఇప్పుడు 'డిలీట్ ఆర్డర్' అందుబాటులో తెచ్చింది. కంపెనీ ఈ ఫీచర్ తీసుకురావడానికి గల కారణాన్ని ఈ ఇక్కడ తెలుసుకుందాం..డిలీట్ ఆర్డర్ అనే ఫీచర్ గురించి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో వివరిస్తూ.. కరణ్ సింగ్ అనే వ్యక్తి అర్థరాత్రి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారని, హిస్టరీ మొత్తం అందులో నిక్షిప్తమై ఉండటం వల్ల తన భార్యకు దొరికిపోతున్నట్లు చెప్పాడు. ఇది చాలామంది సమస్య. ఇప్పుడు మీరు ఆర్డర్ హిస్టరీని తొలగించవచ్చు. దీన్ని బాధ్యతాయుతంగా వినియోగించని అని పేర్కొన్నారు. కరణ్ సింగ్ అభ్యర్థన మన్నించి డిలీట్ ఆర్డర్ ఫీచర్ యాడ్ చేయడంతో.. సింగ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.For Karan and many others - you can now delete orders from your order history on zomato. Use it responsibly 🙏Sorry, this took us a bit of time to prioritise and build. This touched multiple systems and microservices. We are rolling it out to all customers as we speak. https://t.co/Vwfr6Fs087 pic.twitter.com/0UMUnDuj0j— Deepinder Goyal (@deepigoyal) July 12, 2024 -
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్‌బాట్‌కు కాల్ చేసే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్‌నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్‌లో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్‌తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్‌లు, పిచ్‌లు, యాసలు ఎంచుకోవచ్చు. -
'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ పేమెంట్స్ మరింత సులభతరం చేసేందుకు మూడు సరికొత్త ఫీచర్స్ పరిచయం చేసింది. అవి "రివార్డ్స్, బై నౌ పే లేటర్, సెక్యూరిటీ ఫీచర్.రివార్డ్లుప్రస్తుతం క్రెడిట్ కార్డ్‌ల వినియోగం పెరిగిపోయింది. అయితే కార్డులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కొన్ని ప్రయోజనాలను పొందుతారు. దీని కోసం తనిఖీ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గూగుల్ పే పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ ముందుగానే రివార్డ్‌లు గురించి చూపిస్తుంది.ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండిఇప్పుడు కొనండి.. మళ్ళీ చెల్లించండి అనే స్కీమ్ ఒకప్పుడు కొన్ని కార్ల కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. సరిగ్గా ఇలాంటి ఫీచర్ గూగుల్ పే పరిచయం చేసింది. వస్తువులను కొనుగోలు వినియోగదారు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా.. మళ్ళీ చెల్లించవచ్చు. లేదా వాయిదాల రూపంలో కూడా చెల్లించవచ్చు. దీని కోసం అమౌంట్ చెల్లించే సమయంలోనే.. ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో అందుబాటులో ఉంది. మన దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.సెక్యూరిటీ ఫీచర్ఆన్లైన్ పేమెంట్ చేసే సమయంలో మరింత సురక్షితమైన లావాదేలీల కోసం గూగుల్ పే ఆటోఫిల్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇది వేలిముద్ర, స్క్రీన్ లాక్ PIN లేదా ఫేస్ స్కాన్ ద్వారా సేవ్ చేసిన కార్డ్ వివరాలను ఆటోమేటిక్‌గా ఇన్పుట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. -
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో యాపిల్ కంపెనీ తన ఉత్పత్తుల్లో ఆధునిక ఫీచర్స్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్ల శ్రేణిని ఆపిల్ ఎట్టకేలకు వెల్లడించింది.యాపిల్ కంపెనీ ప్రవేశపెట్టనున్న లేటెస్ట్ ఫీచర్లలో ఐ ట్రాకింగ్, మ్యూజిక్ హాప్టిక్స్, వోకల్ షార్ట్‌కట్స్, వెహికల్ మోషన్ క్యూస్ వంటివి ఉన్నాయి. visionOS కోసం మరిన్ని యాక్సెసిబిలిటీ అప్గ్రేడ్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.'ఐ ట్రాకింగ్ ఫీచర్'ఐ ట్రాకింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారు తమ కళ్ళతోనే ఐప్యాడ్లు, ఐఫోన్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా శారీరక వైకల్యాలు ఉన్న వినియోగదారుల కోసం రూపొందించినట్లు సమాచారం.ఎలా పని చేస్తుందంటే?ఐ ట్రాకింగ్‌ను సెటప్ చేయడానికి ముందువైపు కెమెరా ఉపయోగించబడుతుంది.ఐ ట్రాకింగ్ కోసం ఉపయోగించిన మొత్తం డేటా మీ డివైస్‌లో ఉంటుంది. ఇది Appleతో కూడా భాగస్వామ్యం చేయదు. కాబట్టి సమాచారం భద్రంగా ఉంటుంది.ఐప్యాడోస్, iOSలోని అన్ని యాప్‌లతో ఐ ట్రాకింగ్ పని చేస్తుంది. కాబట్టి అడిషినల్ హార్డ్‌వేర్ లేదా యాక్సెసరీలు అవసరం లేదు.ఎలా ఉపయోగపడుతుందంటే?ఐ ట్రాకింగ్ సాయంతో యాప్‌లోని వివిధ భాగాలను చూడటం ద్వారా వాటి ద్వారా నావిగేట్ చేయవచ్చు.ఈ ఎలిమెంట్లను యాక్టివేట్ చేయడానికి డ్వెల్ కంట్రోల్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.ఐ ట్రాకింగ్ వినియోగదారులు భౌతిక స్పర్శ అవసరం లేకుండా (టచ్ చేయకుండా) కేవలం వారి కళ్లను ఉపయోగించి బటన్లను నొక్కడం, స్వైపింగ్ చేయడం వంటివి చేయవచ్చు. -
WhatsApp Chat Filters: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి.తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఇదే ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్‌లో యాక్టివ్‌గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఇన్‌స్టా కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్‌లో అప్డేట్ చేయగలుగుతారు. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! డెమో వీడియో ప్రకారం, వినియోగదారులు నోట్‌ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్‌లో పోస్ట్ చేయవచ్చు. ఇది తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. -
థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు
ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ (Threads) అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓకే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా లేటెస్ట్ సోషల్ మీడియా యాప్ 'థ్రెడ్'లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌లో కనిపించింది. మెటా ప్రత్యర్థి ఎక్స్ (ట్విటర్)కి సరైన పోటీ ఇవ్వడానికి సంస్థ సిద్దమవుతున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రెడ్స్ ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను యాప్ డెవలపర్ విలియం మాక్స్ మొదటిసారిగా ఒక పేరు తెలియని మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్‌షాట్ ద్వారా గుర్తించారు. దీనిని అతడు అనుకోకుండా థ్రెడ్లలో పోస్ట్ చేశాడు. ఈ లేటెస్ట్ ఫీచర్ సర్చ్ బార్ కింద నెంబర్ వైస్ టాపిక్‌లను ర్యాంక్ చేస్తుంది, అంతే కాకుండా ప్రతి అంశంపై పోస్ట్‌ల సంఖ్యను కూడా చూపుతుంది. ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్! థ్రెడ్ గత నెలలో ఒక అప్డేటెడ్ కీవర్డ్ సర్చ్ ఫీచర్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఆ సమయంలో మెటా బాస్ 'మార్క్ జుకర్‌బర్గ్' ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. ప్రారంభంలో ఇది ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత మరిన్ని భాషల్లోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్‌క్యామ్‌లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్‌క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్‌క్యామ్‌లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్‌నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్‌లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్‌క్యామ్‌లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్‌కెమెరా ఫీచర్‌ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్‌ని పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్‌క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్‌క్యామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్‌లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్‌తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను
WhatsApp Channels: మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మోస్ట్ఎవైటెడ్ ఫీచర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. 'ఛానెల్స్' అనే కొత్త టూల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్-వే బ్రాడ్కాస్ట్ టూల్ ఛానెల్‌ల ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అవ్వొచ్చు. యూజర్లు ఫాలో అయ్యేందుకు ఎంచుకున్న ఛానల్ నుంచి కీలకమైన అప్డేట్లను పొందవచ్చు. 9 దేశాలలో ఛానెల్‌లను సృష్టించే ,అనుసరించే సామర్థ్యాన్ని విడుదల చేసిన తర్వాత, iOS, Android , డెస్క్‌టాప్ కోసం WhatsApp తాజా వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసిన వినియోగదారులు ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం ప్రకటించారు. వేలాది కొత్త ఛానెల్‌లను జోడిస్తున్నాం మీరు కొత్త 'అప్డేట్లు' ట్యాబ్‌లో ఛానెల్‌లను కనుగొనవచ్చు అంటూ ఫేస్బుక్లో పోస్ట్‌లో వెల్లడించారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు) మీ సొంత వాట్సాప్ ఛానల్ స్టార్ట్ అయిన తరువాత ఇప్పటికే వాట్సాప్‌లో ప్రముఖ ప్రముఖులు, క్రీడా కారులు కళాకారులు, ఇన్ఫ్యూయర్స్, సంస్థలను ఫాలో అవ్వవచ్చు. ఉదాహరణకు, భారత క్రికెట్ జట్టు, ప్రభాస్, క్రేజీ స్టార్లు, కత్రినా కైఫ్, దిల్జిత్ దోసాంజ్, అక్షయ్ కుమార్, నేహా కక్కర్ ఇలా మనకిష్టమైన వారిని ఫాలో అవ్వొచ్చు. అంతెందుకు వాట్సాప్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా అనుసరించ వచ్చు. దేశం ఆధారంగా స్వయంచాలకంగా ఫిల్టర్ అయిన ఛానెల్‌లను ఎంచుకోవచ్చు. సెర్చ్ చేయవచ్చు.మీ ఫాలోవర్స్‌ను బట్టి ఆధారంగా కొత్త, అత్యంత యాక్టివ్, జనాదరణ పొందిన ఛానెల్‌లను కూడా వీక్షించవచ్చు. ఇప్పటివరకు చిలీ కొలంబియా, ఈజిప్ట్, కెన్యా, మలేషియా, మొరాకో, పెరూ, సింగపూర్ , ఉక్రెయిన్లలో ఈ ఛానెల్‌లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. WhatsApp ఛానెల్‌లను ఎలా ఉపయోగించాలి ♦ మీ WhatsApp యాప్‌ని Google Play Store లేదా App Store నుండి తాజా వెర్షన్‌కి అప్డేట్ చేయండి. ♦ WhatsAppఓపెన్ చేసి, స్క్రీన్ దిగువన ఉన్న అప్డేట్స్ ట్యాబ్‌పై నొక్కండి. ఇక్కడ ఛానెల్స్ లిస్ట్కనిపిస్తుంది. ♦ ఫాలో అవ్వాలనుకున్న సంబంధిత ఛానెల్‌ని పక్కన ఉన్న ‘+’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్, ప్రొఫైల్ , ఛానెల్ పేరు కూడా చూడవచ్చు. ♦ ఛానెల్ అప్డేట్ రియాక్షన్ కోసం మెసేజ్ మీద ప్రెస్ చేసి, నొక్కి పట్టుకుంటే చాలు. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) WhatsApp ఛానెల్ కొత్త అప్డేట్ ♦ మెరుగైన డైరెక్టరీ: వినియోగదారులు ఇప్పుడు అధునాతన ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా కొత్త ఛానెల్‌లను అన్వేషించవచ్చు. ♦ రియాక్షన్స్ ఛానెల్‌లలో షేర్ అయిన కంటెంట్‌కు సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ♦ మెసేజ్ ఫార్వార్డింగ్ ఫీచర్: ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లు ఛానెల్‌కి లింక్ బ్యాంక్ అవుతాయి. యూజర్లకు జాయిన్ కావడం ఈజీ అవుతుంది. ♦ డిలీట్ అప్డేట్ ఫర్ ఎవ్రీ వన్: ఛానెల్ క్రియేటర్లకు 30 రోజులలోపు మెసేజ్‌ను తొలగించే సామర్థ్యాన్ని అందరికీ ఉంటుంది. Mark Zuckerberg announced a global launch for WhatsApp Channels!https://t.co/UcLJJubMo8 pic.twitter.com/LjhzAAvqZ3 — WABetaInfo (@WABetaInfo) September 13, 2023 -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్‌లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్‌పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్‌కి మారే పని లేకుండా ఈ నోట్స్‌లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్‌ను జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్‌ను, టూల్స్‌ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్‌కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్‌ఫారమ్‌లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్‌ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్‌లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్‌లను, లింక్‌లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
Google Flights: అతి తక్కువ ధరలో విమాన టికెట్లు కావాలా? గూగుల్ కొత్త ఫీచర్ చూడండి!
Google Flights సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునేవారిక గుడ్ న్యూస్ అందించింది.సామాన్యుడికి విమాన టికెట్ కొనుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. కానీ గూగుల్ ఫీచర్‌ను ఫాలో అయితే మాత్రం తక్కువ ధరలోనే గాల్లో ఎగిరి పోవచ్చు. ఎలా పనిచేస్తుంది చౌక ధరకే విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేలా Google Flights అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. . గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించిన Google Flights విమాన ఛార్జీలపై డబ్బు ఆదా చేసే లక్ష్యంతో ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం Google Flightsలో ధరల ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసుకోవాలి. కొత్త ఇన్సైట్స్ ద్వారా నమ్మకమైన ట్రెండ్ డేటాతో , మీరు ఎంచుకున్న తేదీలు ,గమ్యస్థానాన్నిటికెట్లు బుక్ చేసుకోవడానికి ధరలు సాధారణంగా ఎప్పుడు తక్కువగా ఉన్నాయో చూడొచ్చు అని తన Google బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ప్రయాణికులు తక్కువ ధరలో విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి ఉత్తమమైన సమయంపై సమాచారాన్నిమ సుమారు రెండు నెలల ముందే అందిస్తుంది. కొత్త ఫీచర్ ఏ సమయంలో లేదా ఏ తేదీలలో బుక్కింగ్ ధరలు తక్కువగా ఉంటాయనే వివరాలను అందిస్తుంది. ఇందుకోసం గూగుల్ విమానాల కోసం ధర హామీ ట్యాగ్‌తో పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేస్తోంది. బయలుదేరే ముందు టిక్కెట్ల ధర తగ్గకుండా చూసుకుంటుంది. అంతేకాదు ప్రైస్ గ్యారంటీని అందిస్తుంది.అంటే ధర తగ్గితే, Google Pay ద్వారా ఓవర్ పెయిడ్ వ్యత్యాసాన్ని గూగుల్ తిరిగి చెల్లిస్తుంది. క్రిస్మస్ ట్రిప్‌కోసం ప్లాన్ చేస్తే..? గూగుల్ లెక్కల ప్రకారం మిడ్ డిసెంబర్లో షురూ అయ్యే క్రిస్మస్ ట్రిప్‌ల కోసం తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకునే సరైన సమయం అక్టోబర్ ప్రారంభం. 71 రోజుల ముందు తక్కువగా ఉన్నాయి. 2022 నాటి లెక్కల ప్రకారం బయలుదేరడానికి కేవలం 22 రోజుల ముందు సగటు ధరలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. టేకాఫ్‌కి 54-78 రోజుల ముందు మరింత తక్కువ. అమెరికా నుండి యూరోప్ట్రిప్కు బెస్ట్ టైం సగటున 72 రోజుల ముందు బుక్ చేసుకుంటే అమెరికా నుంచి యూరప్ వెళ్లే విమాన టికెట్ల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి.యుఎస్ నుండి యూరప్‌కు సగటు విమాన ఛార్జీలు బయలుదేరి 10 వారాల ముందు అయితే బెటర్.. వీలైనంత త్వరగా మీ విమానాన్ని బుక్ చేసుకోవాలని గూగుల్ తె లిపింది.. -
లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది. లింక్డ్ఇన్, ఇండీడ్లాంటి సంస్థల తరహాలో ఎక్స్ కూడా కొత్త ఫీచర్నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది. జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు సంతోషం ప్రకటిస్తున్నారు. ఆర్ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్ జిప్క్రూటర్, గ్లాస్డో అంటూ కమెంట్ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్) ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్ ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్‌ను కూడా ట్వీట్లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్‌లో (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్‌లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్‌ను వివరించే స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్ ఫీచర్‌పై టెస్ట్ రన్ చేస్తోంది. Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations. Feature your most critical roles and organically reach millions of relevant candidates. Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀 "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h — Nima Owji (@nima_owji) July 20, 2023 — Hiring (@XHiring) August 25, 2023 -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్‌సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్‌ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్‌ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్‌ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్‌లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్‌ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్‌లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్‌లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్‌కు కూడా అందుతుంది. -
ఈ ఒక్క ఫీచర్ చాలు.. గ్రామర్‌లో తప్పులు ఇట్టే పట్టేస్తుంది!
Google Grammar Check Feature: ఈ రోజుకి కూడా ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ ఇప్పుడు తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారుల కోసం 'గ్రామర్ చెక్ ఫీచర్' తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్ మార్క్ చూపిస్తుంది. గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఈ లేటెస్ట్ ఫీచర్ కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. -
ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్ వచ్చింది, అదనపు బెనిఫిట్స్ కూడా
ఫోన్‌పే... ఈ పేరు తెలియని వారుండరు. చెల్లింపుల వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది ఈ సంస్థ. తాజాగా ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్ తమ యూజర్లకు మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆదాయ పన్ను చెల్లింపు' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ (ITR)ఫైలింగ్‌తో పాటు చెల్లించడానికి జూలై 31 గా నిర్ణయించింది. ఈ తేదీకి మించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు పొడిగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై చాలా ఈజీ ఇదిలా ఉండగా కొన్ని సార్లు పన్ను చెల్లింపు చేస్తుండగా సర్వర్లు యూజర్ల సంఖ్య పెరగడంతో మొరాయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఉపయోగించి నేరుగా యాప్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు చేసేందుకు ట్యాక్స్ పేయర్స్‌కు వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త సేవను తీసుకొచ్చేందుకు ఫోన్ పే సంస్థ ప్రముఖ బీ2బీ పేమెంట్స్, సర్వీసెస్ సంస్థ పేమేట్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లో యూజర్లు తమ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐని ఉపయోగించి సులభంగా పన్నులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం అదనపు ప్రయోజనాలతో వస్తుంది, ఫోన్ పే తెచ్చిన ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా 45 రోజుల ఇంటరెస్ట్ ఫ్రీ పీరియడ్ అవకాశం పొందవచ్చని, బ్యాంకును బట్టి వారి పన్ను చెల్లింపులపైనా రివార్డు పాయింట్లను కూడా అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్, రీఛార్జ్ బిజినెస్ హెడ్ నిహారిక సైగల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "ఫోన్‌పేలో, మా యూజర్లు అవసరాలను తీర్చడానికి మా యాప్‌ను నిరంతరం అప్డేట్ చేస్తూ వారికి అనుగుణంగా మార్పులు చేస్తూనే ఉంటాం. మా సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఫోన్‌పేలో ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం తరచుగా ఉంటుంది. పన్నులు కట్టడం అనేది క్లిష్టమైన ప్రక్రియ, చాలా సమయం పడుతుంది కూడా. ఇకపై మా యూజర్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితమైన పన్ను చెల్లింపు ప్రక్రియను అందిస్తోందని అన్నారు. చదవండి: EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం