obama modi visit 2015
-
విశాల్‌ను ఒబామా వద్దకు తీసుకొచ్చిందెవరు?
ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)లో గతంలో ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేసిన కేకే మహ్మద్‌కు జనవరి 19న అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఓ ఫోన్ వచ్చింది. ఏకంగా ఎంబసీ నుంచి ఫోన్ అనగానే ఆయన కాసేపు భయపడ్డారు. తర్వాత అవతల ఫోన్ చేసినవాళ్లు.. విశాల్ అనే కుర్రాడి చిరునామా ఇవ్వగలరా అని అడిగారు. భారతదేశ పర్యటనకు వస్తున్న ఒబామా దంపతులు ఆ పిల్లాడిని కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇంతకీ విశాల్ ఎవరో గుర్తుపట్టారా? ఇంతకుముందు 2010 నవంబర్ నెలలో ఒబామా దంపతులు భారతదేశానికి వచ్చినప్పుడు హుమాయూన్ సమాధి వద్ద విశాల్‌ను మరికొందరు పిల్లలతో కలిసి చూశారు. అప్పట్లో కేకే మహ్మద్ ఏఎస్ఐలో సూపరెంటిండింగ్ ఆర్కియాలజిస్టుగా ఉండేవారు. అక్కడ పనిచేసే కూలీల పిల్లల్లో ఒకరే.. విశాల్. యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే ఈ కార్మికులు.. తమ పిల్లలను కూడా వెంట తెచ్చుకునేవారు. అప్పట్లో విశాల్ సహా మొత్తం 500 మంది పిల్లలకు మహ్మద్, ఇతరులు పాఠాలు చెప్పేవారు. అయితే, అమెరికన్ ఎంబసీ నుంచి ఫోన్ రాగానే, అసలు విశాల్ ఎక్కడున్నాడో.. వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడున్నారో గుర్తించడం ఎలాగని మహ్మద్ కాసేపు ఆందోళన చెందారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడి ఆచూకీ కావాలని అవతలి వ్యక్తి ఫోన్లో చెప్పారు. 'విశాల్‌ను నేను మర్చిపోయా గానీ, ఒబామాలు మర్చిపోలేదు' అని మహ్మద్ అన్నారు. ఎట్టకేలకు యూపీలోని ఝాన్సీ సమీపంలో గల గ్రామంలో విశాల్ కుటుంబం ఆచూకీ దొరికింది. అతడి తల్లి, తండ్రి, సోదరి అంతా కూడా ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా దంపతులను కలిశారు. బరాక్ ఒబామా తన ప్రసంగంలో కూడా విశాల్ పేరును, అతడి గాధను ప్రస్తావించారు. -
మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!
సౌదీ అరేబియా పర్యటనలో మిషెల్ ఒబామా బురఖా ధరించకపోవడం అక్కడ పెద్ద వివాదానికి కారణమైంది. భారతదేశ పర్యటన ముగించుకుని సౌదీ అరేబియా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్.. తన దుస్తుల తీరును కొంతవరకు మార్చుకున్నారు. ఇక్కడ కాస్త పొట్టి గౌన్లలో కనిపించిన ఆమె, అక్కడ పొడవాటి ప్యాంట్లు కూడా ధరించారు. అయినా కూడా బురఖా లేదన్న కారణంతో ఆమె ముఖాన్ని సౌదీ అధికారిక చానల్లో బ్లర్ చేసి చూపించారని పెద్ద వివాదం రేగింది. అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని, వాస్తవాలు చూడాలి తప్ప ఫేస్బుక్ వివాదాల మీద ఆధారపడొద్దని సౌదీ ఎంబసీ ట్వీట్ చేసింది. వాస్తవానికి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన క్లిప్పింగులలో అయితే సౌదీ అరేబియా టీవీ మిషెల్ ముఖాన్ని బ్లర్ చేసి చూపించినట్లు ఉంది. అయితే, ప్రత్యక్ష ప్రసారం చూసినవాళ్లు మాత్రం అదేమీ లేదని చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఇదంతా పెద్ద వివాదంగా మారింది. గల్ఫ్ దేశాల్లో మహిళల దుస్తుల మీద సాధారణంగా కఠినమైన నిబంధనలుంటాయి. మహిళలు తప్పనిసరిగా బురఖా వేసుకోవాలి, ముఖం కూడా కప్పుకోవాలి. అయితే విదేశీయులకు మాత్రం ఈ నిబంధన ఉండదు. -
ఒబామా భారత పర్యటన పై చైనా విమర్శలు
-
ఒబామా భారత పర్యటన పై మోదీ హర్షం
-
తాజ్ సందర్శనకు మళ్లీ వస్తా: మిషెల్
న్యూఢిల్లీ: ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ మందిరం తాజ్‌మహల్‌ను ఈసారి పర్యటనలో వీక్షించలేకపోయినప్పటికీ తాజ్ సందర్శన కోసం మరోసారి భారత్ వస్తానని అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మంగళవారం తెలిపారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు మిషెల్ ఈ మేరకు బదులిచ్చారు. ఆగ్రా పర్యటన రద్దు కావడం తనకు నిరాశ కలిగించిందన్నారు. వాస్తవానికి ఒబామా దంపతుల భారత పర్యటన షెడ్యూల్లో మంగళవారం తాజ్ సందర్శన ఉన్నప్పటికీ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంతాపం తెలిపేందుకు సౌదీ వెళ్లాలని ఒబామా నిర్ణయించుకోవడంతో షెడ్యూల్‌ను కుదించారు. తాజ్‌మహల్‌ను ఇప్పటివరకూ పలువురు దేశాధినేతలు కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. 2010లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తన భార్య కార్లా బ్రూనీ 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సీతో కలసి తాజ్‌ను వీక్షించారు. -
వైట్ హౌస్ స్పందన
న్యూఢిల్లీ: ఒబామా పర్యటన భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరిన అనంతరం మోదీ ఈ మేరకు ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ''ఒబామాకు వీడ్కోలు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి'' అని మోదీ అన్నారు. వైట్‌హౌస్ కూడా దీనికి స్పందించింది. ''ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా మలిచినందుకు థాంక్యూ నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కతజ్ఞతలు''అంటూ అధ్యక్షుడి కార్యాలయం బదులిచ్చింది. దీన్ని మోదీ ట్వీటర్లో పొందుపరిచారు. Thank you @NarendraModi for a memorable visit, and to the Indian people for their warm welcome. #India -bo — The White House (@WhiteHouse) January 27, 2015 -
బీజేపీకి లాభం!
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యాటనకు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేకపోయినా బిజెపి నేతలు, కొందరు రాజకీయ పరిశీలకులు ఈ పర్యటన త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి లాభసాటిగా మారనుందని అంటున్నారు. ఒబామా పర్యటన కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ట పెరిగిపోయిందని , ఇది ఫిబ్రవరి 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి లాభించగలదని వారు అంటున్నారు. ఒబామా పర్యటనను బిజెపి విజయంగా బిజెపి నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ కృషి వల్లే ఒబామా భారత్‌కు వచ్చారని ఆమె తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పారు. బిజెపి అభ్యర్థి రాజీవ్ బబ్బర్ మరో అడుగు ముందకు వేసి ఒబామా ఫోటోను తన ఎన్నికల పోస్టర్లలో చేర్చారు. ఇదిలా ఉండగా, ఒబమా పర్యటనను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేయాలని కొందరు ఆమ్ అద్మీ పార్టీ నేతలు యోచిస్తున్నారు. -
బహుత్ ధన్యవాద్.. జైహింద్!
న్యూఢిల్లీ: ‘బహుత్ ధన్యవాద్’, ‘జైహింద్’ అని హిందీలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అందర్నీ ఆకట్టుకున్నారు. మంగళవారమిక్కడ సిరి ఆడిటోరియంలో తన ప్రసంగం ప్రారంభంలో ఆయన ఈ పదాలు ఉచ్చరించారు. ‘‘నేను అమెరికా ప్రజల స్నేహాన్ని, శుభాశీస్సులను మోసుకొచ్చా. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ మా ప్రజల తరఫున, నా తరపున, నా భార్య మిషెల్ తరపున బహుత్ ధన్యవాద్’’ అని అనడంతో సభికుల చప్పట్లతో ఆడిటోరియం మార్మోగింది. అలాగే బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన ‘దిల్వాలే దుల్హేనియా లే జాయేంగే’ చిత్రంలోని ఓ డైలాగ్‌ను చెప్పి ఒబామా అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘ఇంతకుముందు భారత్‌కు వచ్చినప్పుడు మేం ముంబైలో దీపావళి జరుపుకున్నాం. కొందరు పిల్లలతో కలసి డ్యాన్స్ చేశాం. కానీ ఈసారి ఆ అదృష్టం లేదు. ఆ డ్యాన్సులేవీ లేవు. ‘సినోరిటా.. బడే బడే దేశ్ మే ఐసీ చోటీ చోటీ బాతీ హోతీ రహెతీ హే’.. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటా..!’’ అని ఒబామా నవ్వుతూ అనడంతో సభికుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. అనంతరం ఆయన మతం, మహిళా సాధికారత, ఇరుదేశాల మధ్య సంబంధాలు.. తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. ధైర్యం, మానవతా విలువలు భారత్-అమెరికాలను కలుపుతాయని చెబుతూ.. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ క్రీడాకారుడు మిల్కాసింగ్, బాక్సర్ మేరీకోమ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పేర్లను ప్రస్తావించారు. ప్రసంగాన్ని ‘జైహింద్’ అంటూ ముగించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత వేదిక దిగి సభికుల వద్దకు వెళ్లి నవ్వుతూ అందరితో కరచాలనం చేశారు. కాగా, ఒబామా ప్రసంగంలో తనను గుర్తుచేయడంపై షారూఖ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి ఒబామా భాంగ్రా డ్యాన్స్ చేయలేకపోయారని, మళ్లీ వచ్చినప్పుడు ‘చయ్యా చయ్యా..’ పాటకు తప్పకుండా నృత్యం చేస్తారని పేర్కొన్నారు. ఒబామాను కలిసిన సత్యార్థి బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి సిరి ఆడిటోరియంలో ఒబామాను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా బాలలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించే ఉద్యమంలో తన వంతు సహకారం అందించాలని కోరారు. నోబెల్ బహుమతి.. తన బాధ్యత మరింత పెంచిందని పేర్కొన్నారు. ‘‘బాలలకు భద్రమైన ప్రపంచం నిర్మించడంలో, అహింసాయుత ప్రపంచలో వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో సహకారం అందించాలని ఒబామాను కోరాను’’ అని కైలాశ్ చెప్పారు. -
విశాల్.. ఒబామా.. ఓ ఉద్విగ్నత!
న్యూఢిల్లీ: నాలుగేళ్ల కిందట.. అది ఢిల్లీలోని హుమాయూన్ సమాధి.. ఓ విశిష్ట వ్యక్తి వచ్చారు.. సందర్శన అనంతరం అక్కడే కూలిపని చేసుకుంటున్న ఓ 12 ఏళ్ల బాలుడిని ఆప్యాయంగా పలకరించాడు.. ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యం, అతడి ఆశలు, ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నాడు..! మంగళవారం.. ఢిల్లీలోని సిరి ఆడిటోరియం.. అదే విశిష్ట వ్యక్తి.. నాలుగేళ్ల కిందట పలకరించిన బాలుడిని గుర్తుపెట్టుకున్నాడు.. నాడు అతడు చెప్పిన ఆశలనూ గుర్తుపెట్టుకున్నాడు.. బాలుడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఏమేం చేస్తారో చెప్పారు.. తన కూతుళ్లతో సమానంగా ఆ కూలి బాలుడికి కూడా అవకాశాలు దక్కాలని, అతడి కలలు నెరవేరాలని అభిలషించారు..!! ఆ విశిష్ట వ్యక్తి ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆ కూలి బాలుడు విశాల్! సిరి ఆడిటోరియంలో సభికుల మధ్య కూర్చున్న విశాల్ గురించి మాట్లాడి ఒబామా అందరినీ ఆకట్టుకున్నారు. ‘‘నాలుగేళ్ల కిందట నేను హుమాయూన్ సమాధిని సందర్శించినప్పుడు.. ఈ దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న కొందరు కూలీలు, వారి పిల్లలతో మాట్లాడా. భవిష్యత్తుపై ఎన్నో కలలు.. కళ్లలో ఎన్నో ఆశలు నింపుకున్న కొందరు అద్భుతమైన పిల్లల్ని చూశా. వారిలో విశాల్ ఒకరు. ఈరోజు ఆయనకు (విశాల్‌ను చూస్తూ..) 16 ఏళ్లు. ఆయన కుటుంబం దక్షిణ ఢిల్లీకి సమీపంలోని ఓ పల్లెలో నివాసం ఉంటోంది. ఆయన తల్లి హుమాయూన్ సమాధి వద్ద పని చేస్తుంటుంది. తండ్రి రాళ్ల పని చేస్తాడు. సోదరి యూనివర్సిటీలో చదువుతోంది. మరో సోదరుడు రోజువారీ కూలి. వీళ్లంతా పని చేయడం వల్ల విశాల్ స్కూలుకు వెళ్లగలిగాడు. ఆయనకు కబడ్డీ చూడడం ఇష్టం. సైన్యంలో చేరాలన్నది విశాల్ కల. ఆయనను చూసి మనమంతా గర్వపడాలి. ఇక్కడి పిల్లల్లో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయనడానికి విశాల్ ఒక ఉదాహరణ. నా కూతుళ్లు మాలియా, నషా కలలు నాకు ఎంత ముఖ్యమో విశాల్ కలలు కూడా అంతే ముఖ్యం. నా కూతుళ్లకు దక్కే అవకాశాలే విశాల్కూ దక్కాలి.’’ అని ఒబామా అన్నారు. దీంతో ఉద్విగ్నతకు గురైన సభికులు చప్పట్ల మోతతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
ప్రగతి మన అభి‘మతం’
► మతం పేరుతో చీలితే.. భారత్‌లో అభివృద్ధి అసాధ్యం ► సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం ► మతోన్మాదం అభివృద్ధికి చేటు... ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛ ఉంటుంది ► రాజ్యాంగాలే ఆ హక్కునిచ్చాయి.. కాపాడాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వాలది! ► మహిళాశక్తిని గుర్తించండి; దేశాభివృద్ధిలో వారు కీలకం ► ఐరాస భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు మూడు రోజుల పర్యటన ముగింపును అగ్రదేశాధినేత ఒబామా తనదైన శైలిలో ముగించారు. బీజేపీ నేతల హిందుత్వ వ్యాఖ్యలతో మోదీ సర్కారుపై పడిన ‘మత’ ముద్రపై స్పందనా అన్నట్లుగా.. మత సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని అధికరణలతో సహా గుర్తు చేశారు. మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్ విజయం సాధిస్తూనే ఉంటుందంటూ సున్నితంగా చురకలంటించారు. దాంతో, అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీల మధ్య కుదిరిన కెమిస్ట్రీ.. మోదీ సర్కారుకు చివరకు చేదునే మిగిల్చింది. ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మంగళవారం ఒబామా ఎంపిక చేసిన 1500 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అన్ని మతాలూ ఒకే తోటలో విరిసిన కుసుమాలు.. ఒకే అద్భుత వృక్షానికి చెందిన వేర్వేరు శాఖలు’ అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. మతోన్మాదం దేశాభివృద్ధికి చేటు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న విశ్వాసాన్ని ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని ఒబామా తేల్చిచెప్పారు. భారత్, అమెరికాల సారూప్యతలను, ఉజ్వలభరితం కానున్న ఇరుదేశాల సంబంధాలను, భారత్‌లోని నారీశక్తిని, యువత సామర్థ్యాన్ని, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా భారత్ పోషించాల్సిన పాత్రపై స్ఫూర్తిదాయక దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మతవిశ్వాసాలను అనుసరించే హక్కు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వం పైనా, ప్రతీ పౌరుడి పైనా ఉంది. తమ మత విశ్వాసమే గొప్పదనుకునేవారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మత హింస, మతపరమైన అసహనం, మత ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన విభజన రేఖలు గీచి, మనల్ని విడదీయాలనుకునే వారి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యాలైన మన రెండు దేశాలు కలిసికట్టుగా సాగితే.. ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మన రెండు దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న మహిళల పిల్లలకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. అందువల్ల ప్రగతి దిశగా ముందుకెళ్లాలనుకుంటున్న అన్ని దేశాలు.. జనాభాలో సగమైన మహిళల శక్తి సామర్థ్యాలను విస్మరించరాదు. వైవిధ్యత వల్లనే వంటవాడి మనవడినైన నేను అమెరికా అధ్యక్షుడినయ్యాను. టీ అమ్మిన మోదీ భారత ప్రధానయ్యారు. న్యూఢిల్లీ: సమాజంలో మత సామరస్యం, పరమత సహనం ప్రాధాన్యతలను నొక్కి చెబుతూ.. ‘మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్ విజయం సాధిస్తూనే ఉంటుంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సున్నితంగా హెచ్చరించారు. ‘అన్ని మతాలూ ఒకే తోటలో విరిసిన కుసుమాలు.. ఒకే అద్భుత వృక్షానికి చెందిన వేర్వేరు శాఖలు’ అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను గుర్తు చేస్తూ.. సమాజంలో మత సామరస్యం అవసరాన్ని ఒబామా నొక్కి చెప్పారు. మతోన్మాదం దేశాభివృద్ధికి చేటు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న విశ్వాసాన్ని ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని తేల్చి చెప్పారు. భారత్, అమెరికా రాజ్యాంగాల్లో మతారాధన హక్కును ప్రసాదించిన అధికరణలను ఉటంకిస్తూ.. ‘ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మతవిశ్వాసాలను అనుసరించే హక్కు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వం పైనా, ప్రతీ పౌరుడి పైనా ఉంది’ అని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు, హిందూత్వ సంస్థలు ఇటీవల చేపట్టిన మత మార్పిళ్ల కార్యక్రమం ‘ఘర్ వాపసీ’.. బీజేపీ ఎంపీలు, హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేస్తున్న మైనారిటీ వ్యతిరేక హిందూత్వ వ్యాఖ్యలు.. వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఒబామా సున్నితంగా చేసిన ఈ హెచ్చరికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మోదీ సర్కారును ఉద్దేశించే ఒబామా ఈ చురకలు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘తమ మత విశ్వాసమే గొప్పదనుకునేవారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మత హింస, మతపరమైన అసహనం, మత ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన విభజన రేఖలు గీచి, మనల్ని విడదీయాలనుకునే వారి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలి’ అని ఒబామా పిలుపునిచ్చారు. ‘నేను క్రిస్టియన్‌ను కాదని, ముస్లింన ని చాలా పుకార్లు వచ్చాయి. నేనెవరో తెలియని వారు నా మత విశ్వాసాలను ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి.’ అన్నారు. ఉత్తేజభరితం.. స్ఫూర్తిదాయకం: గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథిగా భారత్‌కు వచ్చిన ఒబామా 3 రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. చివరి రోజు మంగళవారం అమెరికాలోని టౌన్‌హాల్ మీటింగ్ తరహాలో.. ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఎంపిక చేసిన దాదాపు 1,500 మంది విద్యార్థులు, మేధావులు, ప్రముఖులనుద్దేశించి ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సతీమణి మిషెల్‌తో కలిసి ఆడిటోరియానికి వచ్చిన ఒబామా.. భారత్, అమెరికా సంబంధాలు, ఇరుదేశాల సారూప్యతలు, భారత్‌లో యువశక్తి, నారీ శక్తి సహా విస్తృతాంశాలను స్పృశిస్తూ దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ఒబామా ప్రసంగానికి సభికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పర్యటనలో భారతీయ నేతలెవరూ వెంట లేకుండా ఒబామా పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే. అనంతరం సౌదీ రాజు అబ్దుల్లా మృతిపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. సహజమే కాదు.. అత్యుత్తమం కూడా.! భారత్, అమెరికాలు సహజ భాగస్వాములు మాత్రమే కాదని, అమెరికా భారత్‌కు అత్యుత్తమ భాగస్వామిగా మారగలదని తన ప్రసంగంలో ఒబామా పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యాలైన మన రెండు దేశాలు కలిసికట్టుగా సాగితే.. ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మన రెండు దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయి.’ అన్నారు. పేదరిక నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషిని ప్రశంసించిన ఒబామా.. భారతీయుల జీవన ప్రమాణాలు మెరుగ వుతున్న కొద్దీ భారత్‌తో మరింత భాగస్వామ్యాన్ని అమెరికా కోరుకుంటుందన్నారు. ‘మీ దేశంలో రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బుల్లెట్ రైళ్ల వంటి మౌలిక వసతుల నిర్మాణంలో పాలుపంచుకుంటాం. మీ దేశంలో మరిన్ని నగరాల రూపకల్పనలో భాగస్వాములమవుతాం’ అని తెలిపారు. మహిళా శక్తి: భారత్‌లోని మహిళల శక్తి సామర్థ్యాలను ఒబామా గొప్పగా కొనియాడారు. ‘భారత పర్యటనలో నన్ను అత్యంత ఆకట్టుకున్న అంశం.. భారత సాయుధ దళాల్లోని మహిళల అద్భుతమైన శక్తి సామర్థ్యాలు. నేను రాష్ట్రపతిభవన్‌కు వెళ్లినప్పుడు అక్కడ నాకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన మహిళా అధికారి ఒక అద్భుతం’ అని వ్యాఖ్యానించారు. ఈ గణతంత్ర కవాతులో మహిళా అధికారులే సాయుధ దళాలకు నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలమని భారతీయ మహిళలు రుజువు చేశారు. ఈ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం.’ అన్నారు. ‘మన కుమారులకు అందించే అన్ని అవకాశాలను కూతుళ్లకు కూడా అందించాలి. ఇంటా, బయటా సురక్షితంగా, గౌరవంగా తన దినచర్యను ప్రతీ మహిళ పూర్తి చేసుకోగలగాలి. ఆ పరిస్థితి కల్పించేందుకు సోదరులుగా, తండ్రులుగా, భర్తలుగా మనమంతా కృషి చేయాలి’ అని ఒబామా పేర్కొన్నారు. ‘చదువుకున్న మహిళల పిల్లలకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. అందువల్ల ప్రగతి దిశగా ముందుకెళ్లాలనుకుంటున్న అన్ని దేశాలు.. జనాభాలో సగమైన మహిళల శక్తి సామర్థ్యాలను విస్మరించరాదు’ అన్నారు. తన జీవితంలో తన భార్య మిషెల్, ఇద్దరు కూతుళ్లు పోషిస్తున్న పాత్రను ఒబామా సభికులకు వివరించారు. ‘నా భార్య మిషెల్ చాలా తెలివైంది. నేనేమైనా తప్పు చేస్తే నిర్మొహమాటంగా చెప్తుంది. నాకు ఇద్దరు అందమైన కూతుళ్లున్నారు. వారికి సమాజ జీవనానికి అవసరమైన ప్రేమ, సానుభూతి, ఆత్మగౌరవం.. మొదలైన ముఖ్యమైన విలువలు నేర్పించడానికి ప్రయత్నిస్తుంటాం’ అన్నారు. ‘మేం గొప్ప కుటుంబాల నుంచేం రాలేదు. మా చదువే మమ్మల్నిక్కడికి చేర్చింది’ అన్నారు. వైవిధ్యత, భిన్నత్వం: భిన్నత్వం, వైవిధ్యతల్లో భారత్, అమెరికాలకు సారూప్యత ఉందని ఒబామా పేర్కొన్నారు. ‘ఆ వైవిధ్యత వల్లనే వంటవాడి మనవడినైన నేను అమెరికా అధ్యక్షుడినయ్యాను. టీ అమ్మిన మోదీ భారత ప్రధాని అయ్యారు. భారత్‌లో అనేక మతాలు, కులాలు, వర్ణాలు, భాషలు ఉన్నాయి. అవే భారత్ బలం. అమెరికాలోనూ శ్వేతజాతీయులు, నల్లవారు, లాటనో, ఇండో అమెరికన్, ఆసియన్, లాటినో అమెరికన్.. ఇలా విభిన్న జాతులున్నారు. దేశంలోని ప్రతి పౌరుడూ సమానమేనని మన రాజ్యాంగాల్లో స్పష్టంగా చెప్పుకున్నాం. అలాగే ముందుకు వెళ్తున్నాం’ అన్నారు. ‘మన రెండు దేశాల చరిత్ర వేరుకావచ్చు. వేర్వేరు భాషలు మాట్లాడుతాం కావచ్చు. కానీ సమాజంలో వేళ్లూనుకున్న విలువల పరంగా మనమొకటే. అందుకే మనం ఒకరికొకరం ప్రతిబింబాలుగా కన్పిస్తాం’ అన్నారు. వందేళ్లక్రితం స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన ప్రసంగాన్ని ఒబామా ప్రస్తావించారు. ‘స్వామి వివేకానంద నా సొంత నగరం చికాగో వచ్చారు. అక్కడి ప్రజలను భారతదేశ సోదర, సోదరీమణులారా అని సంబోధించారు. నేనూ మిమ్మల్ని అలాగే సంబోధించాలనుకుంటున్నాను’ అన్నారు. నేనూ వివక్ష ఎదుర్కొన్నా: ‘అమెరికాలో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నప్పటికీ.. నా చర్మం రంగు కారణంగా నేనూ అసమానతను, వివక్షను ఎదుర్కొన్నా’ అని గుర్తు చేసుకుంటూ.. ఇతరుల ఆశలను, ఆశయాలనూ గౌరవించాలని అభ్యర్థించారు. వాతావరణ మార్పును ఎదుర్కొందాం: భారత్ లాంటి దేశాలు స్వచ్ఛమైన ఇంధన వినియోగం వైపు మళ్లనట్లయితే.. వాతావరణ మార్పు అనే ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని ఒబామా హెచ్చరించారు. ‘గత వందేళ్లుగా శిలాజ ఇంధనాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందిన మేం.. ఇప్పుడు భారత్ లాంటి దేశాలను ఆ ఇంధనం వాడకూడదని చెప్పడాన్ని పలువురు తప్పుపడుతున్నారన్న విషయం నాకు తెలుసు. కానీ అంతర్జాతీయ భాగస్వామ్యమంటే.. వాతావరణ మార్పు అనే ప్రమాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడమే’ అని స్పష్టం చేశారు. భద్రతామండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో సంస్కరణల ఆవశ్యకత ఉందన్న ఒబామా.. భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు అమెరికా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలకశక్తిగా ఎదగాలని ఒబామా ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగాలని, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యం నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలోని ఇతర దేశాల అభివృద్ధికి భారత్ తోడ్పడాలని సూచించారు. ‘ఎన్నికల నిర్వహణలో మీకున్న అనుభవాన్ని, నైపుణ్యాన్ని మయన్మార్, శ్రీలంక తదితర దేశాల్లో ప్రజాస్వామ్య పరిపుష్టికి ఉపయోగించండి’ అన్నారు. వైద్య రంగంలోని నైపుణ్యాన్ని మరిన్ని టీకాల తయారీకి ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా శిశుమరణాలను అడ్డుకోవాలని కోరారు. రెండు దేశాలు.. ఒకే భావన భారత్, అమెరికాల మధ్య బలమైన సంబంధాలున్నాయని, రెండు దేశాల మధ్య ఒకే విధమైన ప్రజాస్వామ్య విలువలున్నాయని, రెండు దేశాల్లోనూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిఖ్ లు, యూదులు తదితర భిన్న మతస్థులు సహజీవనం చేస్తున్నారని ఒబామా గుర్తు చేశారు. ‘అమెరికా వ్యవస్థాపక పత్రాల్లో, భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలో మతస్వేచ్ఛ హక్కును, మత ప్రచార హక్కును స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ‘రెండు దేశాలూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయి. ఆ బాధను భరించాయి. అందుకే రక్షణ, పరస్పర భద్రత అంశాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాం. అణ్వాయుధాలు లేని ప్రపంచం మన లక్ష్యం. ఆ దిశగా కలిసి కృషి చేయాలి’ అన్నారు. మూడేళ్ల క్రితం యూఎస్‌లోని విస్కాన్సిస్ గురుద్వారాలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన విషయాన్ని ఒబామా గుర్తు చేశారు. -
మీ పర్యటనతో కొత్త అధ్యాయం
ట్వీటర్లో ఒబామాను ఉద్దేశించి మోదీ న్యూఢిల్లీ: ఒబామా పర్యటన భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరిన అనంతరం మోదీ ఈ మేరకు ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ‘‘ఒబామాకు వీడ్కోలు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి’’ అని మోదీ అన్నారు. వైట్‌హౌస్ కూడా దీనికి స్పందించింది. ‘‘ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా మలిచినందుకు థాంక్యూ నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కృతజ్ఞతలు’’ అంటూ అధ్యక్షుడి కార్యాలయం బదులిచ్చింది. దీన్ని మోదీ ట్వీటర్లో పొందుపరిచారు. గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో చిరుజల్లులు కాస్త ఇబ్బంది కలిగించిన విషయాన్ని కూడా మోదీ తనదైన శైలిలో ప్రస్తావించారు. -
స్నేహంలో నూతనాధ్యాయం
అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడురోజుల భారత పర్యటన ముగిసింది. విదేశాలకు వెళ్లినప్పుడు దేశం మొత్తం తన పర్యటనపైనే దృష్టి పెట్టేలా... తన గురించే చర్చించుకునేలా చేసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటినుంచీ కృతకృత్యుల వుతున్నారు. ఇప్పుడు ఒబామా వంటి అగ్రరాజ్య అధినేత గణతంత్ర దినోత్సవానికి వచ్చిన సందర్భాన్ని సైతం మోదీ అదే స్థాయిలో ఉపయోగించుకున్నారు. జాతీయ మీడియా మొత్తం ఒబామా పర్యటన గురించే చర్చించేలా చేయగలిగారు. అయిదేళ్ల క్రితం నాటి ఒబామా పర్యటననూ, ప్రస్తుత పర్యటననూ పోల్చిచూస్తే ఈ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నిజానికి ఆ సమయంలో ఒబామా అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీపడాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడాయన వచ్చే ఏడాది ఆ పదవి నుంచి వైదొలగబోతున్నారు. అయినా సరే ఈ పర్యటనకొచ్చిన ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ పాలన సమయంలో పదేళ్లనాడు కుదిరిన పౌర అణు ఒప్పందం అతీ గతీ తేల్చకుండా పదవినుంచి తప్పుకున్నారన్న అపప్రద తనకు అంటకుండా చూసుకోవడం ఒబామాకు అవసరం. అదే సమయంలో భారత్‌లో తమ వ్యాపారాభివృద్ధికి దోహదపడ్డారని అమెరికన్ కార్పొరేట్ ప్రపంచం అనుకోవడం ముఖ్యం. ఈ పర్యటనద్వారా ఒబామాకు ఆ రెండూ సమకూరాయనుకోవచ్చు. అదే సమయంలో చొరవతో వ్యవహరించి మూలనబడిన అణు ఒప్పందానికి కదలిక తీసుకురావడమేకాక, భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు రావడానికి దోహదపడిన నేతగా మోదీకి గుర్తింపు వచ్చింది. అయితే, అణు పరిహారచట్టానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయదల్చు కున్నారో ఇంకా తేలాల్సి ఉంది. సంయుక్త భాగస్వామ్యంలో రక్షణ పరికరాల ఉత్పత్తి చేయడానికి, ఇరుదేశాలమధ్యా ఇప్పటికే ఉన్న రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించడానికి అంగీకారం కుదిరింది. రెండో రోజు ద్వైపాక్షిక వాణిజ్య బంధం మరింత విస్తరించేందుకు వీలుకల్పించే పలు ఒప్పందాలపై సంతకాలయ్యాయి. మొత్తం 400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు, రుణాలు సమకూరేలా చూస్తామని ఒబామా ప్రకటించారు. అంతేకాక తమకూ, చైనాకూ మధ్య వాణిజ్యం 56,000 కోట్ల డాలర్లున్నదని ద్వైపాక్షిక వాణిజ్యం ఆ స్థాయికి పెరిగేలా ఇరు దేశాలూ కృషి చేయాలన్నారు. ఇరు దేశాధినేతల మధ్యా శిఖరాగ్ర సమావేశం జరిగి నాలుగు నెలలే అయినా... గణతంత్ర దినోత్సవానికి రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించి అందుకనుగుణంగా అమెరికా కాంగ్రెస్‌లో తన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగాన్ని ముందుకు జరుపుకొని ఒబామా భారత్‌కు వచ్చారు. రాజ్‌పథ్‌లో మన దేశం ప్రదర్శించిన సైనిక పాటవాన్ని, భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని, ముఖ్యంగా సాయుధ దళాల కవాతులో మహిళలు పాల్గొనడాన్ని ఒబామా ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే, ఇరుదేశాలమధ్యా అమ్మకందారు, కొనుగోలుదారు సంబంధాలు కాకుండా అంతకుమించిన అనుబంధం ఏర్పడాలని... అందుకోసం అమెరికా రక్షణ పరికరాల సంస్థలు ఇక్కడే కర్మాగారాలు నెలకొల్పి వాటిని తయారుచేయాలని మోదీ అభిప్రాయపడుతున్నారు. అందుకు తగినట్టుగా ఆయన ఇప్పటికే రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచబోతున్నట్టు ప్రకటించారు. అమెరికా నుంచి అందుకు సానుకూలమైన స్పందన లభిస్తుందా అన్నది చూడాలి. ఆసియాలో చైనా, జపాన్ల తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం మనదే. ఆసియా ఖండంలో చైనాకు దీటుగా ఎదిగేలా భారత్‌ను ప్రోత్సహించడం వ్యూహాత్మకంగా కూడా అమెరికాకు అవసరం. కనుక అమెరికా ఈ విషయంలో మనకు అనుకూలంగా వ్యవహరించవచ్చునన్న అంచనాలున్నాయి. ఆసియా పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత, వికాసానికి ఇరు దేశాల సన్నిహిత భాగస్వామ్యం అత్యంత అవసరమని భావిస్తున్నట్టు నేతలిద్దరూ చేసిన సంయుక్త ప్రకటనను గమనిస్తే ఈ విషయంలో అమెరికా స్పష్టతతోనే ఉన్నదని అర్ధమవుతుంది. అయితే, ఇది చైనాను అప్రమత్తం చేస్తుందనడంలో సందేహం లేదు. చైనా అధికారిక మీడియాలో వెలువడిన వ్యాఖ్యానంలో దీని ఛాయలు కనిపించాయి. చైనా, రష్యాలతో భారత్‌కున్న సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా చూస్తున్నదని చైనా మీడియా హెచ్చరించింది కూడా. సాధారణంగా నేరుగా దేన్నీ చెప్పడం అలవాటులేని చైనా నాయకత్వం తన మనోభావాలను వ్యక్తంచేయడానికి అక్కడి మీడియాను ఉపయోగించుకుంటుంది. అంతేకాదు...సరిగ్గా మన గణతంత్ర దినోత్సవం రోజునే బీజింగ్ పర్యటనకెళ్లిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. మొదటి రెండురోజులూ మోదీతోనే కనబడిన ఒబామా చివరిరోజు మాత్రం సిరిఫోర్ట్ ఆడిటోరియంలో జరిగిన సభలో తన సతీమణితోపాటు పాల్గొని ‘చాలా విషయాలే’ మాట్లాడారు. బహుశా మొదటి రెండురోజులూ చెప్పడం కుదరనివన్నీ అక్కడ మాట్లాడినట్టున్నారు. ‘మత విశ్వాసాలపరంగా చీలిపోనంతకాలమూ మీరు విజయం సాధిస్తార ’ని హితవు పలికారు. నచ్చిన మతాన్ని, కోరుకున్న విశ్వాసాన్ని అనుసరించే, ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని కూడా అన్నారు. ఘర్‌వాపసీ వంటి వివాదాస్పద కార్యక్రమాలు సాగిన నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యలను చురకలనుకోవాలో, సున్నితంగా చేసిన సూచనలనుకోవాలో...వీటితో సంబంధంలేని సాధారణ వ్యాఖ్యలనుకోవాలో వినేవారి రాజకీయ విశ్వాసాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికి తోచినట్టు వారు అనుకునే తరహాలోనే ఒబామా ఉదాహరణలున్నాయి. ఆయన విస్కాన్సిన్ గురుద్వారాలో కొన్నేళ్లక్రితం జరిగిన దాడిని ప్రస్తావించారు. తన చర్మం రంగు కారణంగా తాను అమెరికాలో వివక్షను ఎదుర్కొన్న సంగతిని గుర్తుచేసుకున్నారు. మొత్తానికి ఒబామా మూడురోజుల పర్యటన భారత్-అమెరికా సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. -
ఒబామాకు మోదీ ‘వీడ్కోలు’ట్వీట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత్ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఒబామా భారత్ పర్యటన ముగించుకొని సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లగానే మోదీ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఇదే మీకు వీడ్కోలు. మీ పర్యటన భారత్, అమెరికా సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లెంది. మీ ప్రయాణం క్షేమంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా వైట్‌హౌస్ కూడా ఇదే రీతిలో స్పందించింది. ఒబామా భారత్ పర్యటన ఓ మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందని, తమకందించిన స్వాగత, సత్కారాలకు భారతీయులకు, మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. దీనిపై మోదీ స్పందిస్తూ మళ్లీ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ పరేడ్ సందర్భంగా వర్షం పడుతుంటే ఒబామా స్వయంగా తానే గొడుకు పట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ ‘బడే బడే దేశంమే ఐసీ చోటే చోటే బాతే హోతీ రహతే హై’ అంటూ సందర్భోచితంగా ఒబామా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. Farewell @WhiteHouse! Your visit has taken India-USA ties to a new level & opened a new chapter. Wish you a safe journey. — Narendra Modi (@narendramodi) January 27, 2015 -
విజయవంతంగా ముగిసిన ఒబామా పర్యటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒబామా దంపతులు ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు పయనమయ్యారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, ఇతర ఉన్నతాధికారులు ఒబామాకు వీడ్కోలు పలికారు. ఈ రోజు ఉదయం ఒబామా సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగించారు. ఈ రోజు ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శించాల్సివుంది. అయితే సౌదీ రాజు అబ్దుల్లా మరణించడంతో ఒబామా ఆగ్రా పర్యటనకు రద్దు చేసుకుని సౌదీకి బయల్దేరారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా మూడు రోజుల భారత్ పర్యటనలో అణు ఒప్పందం, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. -
సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా ప్రసంగం
-
ముగిసిన ఒబామా భారత్ పర్యటన
-
'ఒబామాను ఆహ్వానించే ఛాన్స్ మిస్సయ్యాం'
లక్నో:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్సును కోల్పోయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పశ్చాతాపం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా మూడు రోజుల పర్యటనకు ఒబామా ఆదివారం భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఒబామా ముందస్తు షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించాల్సి ఉంది. అయితే గత గురువారం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా కన్నుమూయడంతో ఒబామా ఆగ్రా పర్యటన రద్దయ్యింది. ఒబామా రాష్ట్ర పర్యటన రద్దుకావడంతో అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒబామాను రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్స్ కోల్పోయాం. ఇది నిజంగా చాలా బాధాకరం'అంటూ తన అధికారిక ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఒబామా విందుకు పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ విందుకు అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి ఆహ్వానించదగ్గ పరిణామం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఢిల్లీలో ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం
-
అద్భుతమైన ముగింపు ఇచ్చిన ఒబామా
మూడు రోజుల భారతదేశ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అద్భుతమైన ముగింపు ఇచ్చారు. నమస్తే.. బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగం ప్రారంభించి, జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఒక్కో మాట చెబుతున్నప్పుడల్లా ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మిన్నంటింది. అడుగుడుగునా భారతీయతను తన ప్రసంగంలో ఆయన నింపేశారు. షారుక్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే విజయాన్ని, మిల్కాసింగ్ ఒలింపిక్ పతకాలను, కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతిని ప్రస్తావించారు. తాము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన 'విశాల్' అనే బాలకార్మికుడి విజయాన్ని కూడా గుర్తుచేశారు. స్వామి వివేకానంద అమెరికాకు హిందుత్వాన్ని, యోగాను పరిచయం చేశారన్నారు. 30 లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని, అది ఎంతో గర్వకారణమని ఒబామా చెప్పారు. భారతదేశంలోని మహిళా శక్తిని వేనోళ్ల పొగిడారు. మతస్వేచ్ఛను ప్రస్తావించారు. అమెరికాలో గురుద్వారాపై దాడి దురదృష్టకరమని అభివర్ణించారు. భారతదేశంలోని యువశక్తిని, వాళ్లకున్న అవకాశాలను, సాధించగలిగిన విజయాలను అన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తుచేశారు. భారతీయుల కష్టపడేతత్వాన్ని తాము నేర్చుకోవాలని నిజాయితీగా చెప్పారు. తాను వంటవాడి మనవడినని, మోదీ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకని తమ మధ్య పోలికలను గుర్తుచేశారు. -
ఈసారి డాన్సు చేయలేకపోయాం: ఒబామా
న్యూఢిల్లీలోని సిరిఫోర్ట్‌లో ఒబామా స్ఫూర్తిమంతంగా ప్రసంగించారు. నమస్తే , బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఏమన్నారంటే.. ఇంతకుముందు మేం ముంబైలో పిల్లలతో కలిసి డాన్సు చేశాం. దురదృష్టవశాత్తు ఈసారి డాన్సు చేయలేకపోయాం. మిషెల్ మంచి డాన్సర్ అని అందరూ అంటారు. ఇంతకుముందు వైట్ హైస్ లో దీపావళి చేసుకున్నాం. మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే పోరాటం చేసినట్లు మార్టిన్ లూథర్ కింగ్ చెప్పారు. అహింస అత్యంత శక్తిమంతమైన ఆయుధం. గాంధీ చెప్పిన ఈ విషయం మనందరికీ ఆచరణీయం. భారతీయులు, అమెరికన్లు అంతా సమానమే. వందేళ్ల క్రితం స్వామి వివేకానంద అమెరికాకు వచ్చి స్ఫూర్తిమంతమైన ప్రసంగం చేశారు. ఆయన మా సొంత నగరం చికాగో వచ్చారు. ఆయన ప్రసంగాన్ని అమెరికాలోని సోదర సోదరీమణులారా అని ప్రారంభించారు. ఇప్పుడు నేనూ భారత్ లోని సోదర సోదరీమణులారా అని అంటున్నాను. ఆయన హిందూత్వాన్ని, దాని శక్తిని ప్రపంచానికి చాటారు. వలసవాదాన్ని తరిమికొట్టడానికి మనమంతా పోరాడాం. భారత యూఎస్ సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. టెక్నాలజీ శక్తి మీ సొంతం. దాని పుణ్యమాని మనం ఫేస్బుక్, ట్విట్టర్.. వీటి సాయంతో ప్రంపచంలో అందరినీ కలవగలుగుతున్నాం. 30 లక్షల మంది భారతీయులు అమెరికాను బలోపేతం చేస్తున్నారు. వాళ్లంతా చాలా గర్వకారణం. భారత్, అమెరికా కేవలం భాగస్వాములే కారు.. అద్భుతమైన భాగస్వాములు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా భారతదేశం ఉంది. నన్ను రెండోసారి భారతదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అమెరికా- ఇండియా కలిస్తే ఏదైనా సాధించవచ్చు, ఎంత పెద్ద విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. పేదరికాన్ని తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం సౌర విద్యుత్తు లాంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అణ్వస్తాలు లేని ప్రపంచాన్ని మనం చూడగలగాలి. అందుకోసం మనమంతా కలిసి కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి భద్రతలు, తీరప్రాంత భద్రత ఇవన్నీ అత్యంత ముఖ్యం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్య దేశంగా చూడాలని నేను అనుకుంటున్నాను. అందుకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఎన్నికల రంగంలో మీకున్న అనుభవం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు ఇతర దేశాలకు కూడా ఉపయోగపడాలి. బర్మా, శ్రీలంక లాంటి దేశాలకు మీ సాయం అవసరం. మంచి వాక్సిన్లు కనిపెట్టారు, ఔషధ రంగంలో కూడా మీ అనుభవం అపారం.వైద్య మేథోశక్తితో ప్రపంచ దేశాలకు ఎంతో సాయం చేయచ్చు. మీ లాంటి యువతరమే స్వచ్ఛమైన ఇంధనం కోసం పోరాడాలి. ఈ భూమిని కాపాడుకోవాల్సింది మీరే. అమెరికాలాగే పేదరిక నిర్మూలనకు భారత్ కృషిచేస్తోంది. భారతదేశంలోను, అమెరికాలోను అనేక జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు, అన్నీ ఉన్నాయి. మీ రాజ్యాంగం, మా రాజ్యాంగం కూడా ఒక్కలాంటివే. మా తాతగారు బ్రిటిష్ సైన్యంలో వంటవాడిగా పనిచేసేవారు. మేం పుట్టినప్పుడు నల్లజాతి వాళ్లకు ఓటుహక్కు కూడా ఉండేది కాదు. నా చర్మం రంగు కారణంగా అసలు ఇంత ఎత్తు ఎదగగలనా అన్న అనుమానం చాలామందికి ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఒకళ్లు ఆటో నడుపుతుంటారు, మరొకరు ఇంట్లో పనిచేసుకుంటారు, వాళ్లకూ ఆశలు.. ఆకాంక్షలు ఉంటాయి. ప్రస్తుతానికి కడు పేదరికంలో మగ్గిపోతున్నా.. వాళ్ల పిల్లలకు అద్భుతమైన అవకాశాలు రావడం ఖాయం. ఓ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకు ప్రధానమంత్రి కావడమే ఇందుకు నిదర్శనం. ప్రతి ఒక్కరికీ అవకాశాలున్నాయి. తమ కలలను నిజం చేసుకోడానికి కష్టపడాలి. భారతదేశంలో మహిళా శక్తి అపారం. నా భార్య మిషెల్ చాలా గొప్పవ్యక్తి. మహిళల సమానత్వం కోంస అమెరికా కృషి చేస్తోంది. నాకు ఇద్దరు అందమైన కూతుళ్లున్నారు. వాళ్లకు స్వేచ్ఛ ఉంది. మహిళలు విజయాలు సాధిస్తే దేశం విజయాలు సాధిస్తుంది. మహిళలను ఎలా ట్రీట్ చేస్తారన్నదాన్ని బట్టే విజయాలు ఆధారపడి ఉంటాయి. మగాళ్ల కంటే కూడా ఆడవాళ్లు బాగా చదువుకుంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో ఏవైనా దేశాలు వెనకబడ్డాయంటే, మహిళాశక్తిని నిర్లక్ష్యం చేయడం వల్లే. మనమంతా కూడా మహిళలను పూర్తిస్థాయిలో గౌరవించాలి. వాళ్ల గౌరవాన్ని కాపాడే బాధ్యత సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా మనమీదే ఉంటుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో నారీశక్తి నన్ను ఎంతగానో ఆకర్షించింది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, యూదులు.. అంతా ఉంటారు. కానీ అంతా ఒకే చెట్టుకు ఉన్న వేర్వేరు కొమ్మల్లాంటివాళ్లే. మతస్వేచ్ఛ దేశానికి చాలా ముఖ్యం. మన రెండు దేశాల్లోనూ ఇది ఉంది. ఎలాంటి భయం లేకుండా తమ మతాన్ని అవలంబించడానికి, ప్రచారం చేసుకోడానికి వీలుండాలి. అమెరికాలో విస్కాన్సిస్ గురుద్వారా మీద దాడి జరగడం దురదృష్టకరం. షారుక్ ఖాన్, మిల్కాసింగ్.. ఇలా ఎవరైనా విజయాలు సాధించగలరు. కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. భారతదేశంలో చాలామంది 35 ఏళ్లలోపు వాళ్లే. మీలాంటి యువతే ఈ దేశ భవిష్యత్తు. ఏదేశంలోనైనా మీవల్లే బంగార భవిష్యత్తు సాధ్యం అవుతుంది. మీ కలలను సాకారం చేసుకునేందుకు అన్నిచోట్లా అవకాశం ఉంది. మీకు సరైన శిక్షణ ఇస్తేచాలు. ఇందుకోసం మన దేశాల్లోని యూనివర్సిటీలు, ఐఐటీలు, కాలేజీల మధ్య సహకారాన్ని మరింత పెంచుదాం. అమెరికా విద్యార్థులు భారత్ రావాలి, భారత విద్యార్థులు అమెరికా రావాలి. మనం ఒకరినుంచి మరొకరు నేర్చుకోవాలి. మవాళ్లు మిమ్మల్ని చూసి కష్టపడే తత్వం నేర్చుకోవాలి. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. మేం గతంలో వచ్చినప్పుడు కొంతమంది కార్మికులను కలిశాం. వాళ్ల పిల్లలను చూశాం. వాళ్ల ముఖాలమీద నవ్వు మెరిసిపోతోంది. అతడి పేరు విశాల్. ఇప్పుడు అతడి వయసు 16 ఏళ్లు. ఢిల్లీలో బాగా చదువుకుంటున్నాడు. అందుకు కారణం అతడు స్కూలుకు వెళ్లడమే. విశాల్ భారత సైన్యంలో చేరదామని అనుకున్నాడు. విశాల్ లాంటి లక్షలాది మంది వాళ్లకు మనం చదువుకునే అవకాశాలు కల్పించాలి. భారతదేశ భవిష్యత్తు మీద నేను చాలా ఆశాభావంతో ఉన్నాను. రెండు దేశాల్లోను ఎన్నికలు జరిగాయి. గత తరాలు కనీసం ఊహించలేని స్థాయిలో అభివృద్ధి సాధించాం. మానవహక్కులను గౌరవించాం. మనకు కలలున్నాయి, వాటిని సాకారం చేసుకుంటున్నాం. మనమంతా ఒకే చెట్టుకు పూసిన అందమైన పువ్వులం. మేం మీ స్నేహితులుగా ఉండాలని, భాగస్వాములుగా ఉండాలని అనుకుంటున్నాం. జైహింద్.. -
ఆ సూటు నిండా.. మోదీ పేర్లే!!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించిన తర్వాత రాష్ట్రపతి భవన్‌కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఓ నల్లటి బంద్ గలా సూట్ వేసుకున్నారు. అయితే దానిమీద బంగారు వర్ణంతో చారల్లాంటి డిజైన్ కనిపించింది. ఇదేంటో.. చారల సూటు అనే అంతా అనుకున్నారు. కానీ, ఆ ఫొటోలను క్లోజప్‌లో చూస్తే అసలు విషయం తెలిసింది. ఆ చారలన్నీ వాస్తవానికి నరేంద్ర మోదీ పేర్లే! అవును.. ఆయన పూర్తి పేరయిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అనే పేరును బంగారు వర్ణం అక్షరాలుగా దానిమీద కుట్టారు. తొలుత విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కుర్తా పైజమా ధరించి, దానిమీద నెహ్రూ జాకెట్, శాలువా వేసుకుని వెళ్లారు. తర్వాత రాష్ట్రపతి భవన్లో అధికారికంగా స్వాగతం చెప్పేటప్పుడు మాత్రం సూటు మార్చుకున్నారు. అదే సూటుతో హైదరాబాద్ హౌస్‌లో 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సూటును అహ్మదాబాద్‌కు చెందిన జేడ్ బ్లూ సంస్థ తయారుచేసింది. మోదీ దుస్తులన్నింటినీ వాళ్లే తయారుచేస్తారు. మోదీ కుర్తాలను డిజైన్ చేసింది కూడా వీళ్లేనని అంటారు. ఆ డిజైన్‌కు ఎంతగానో ముచ్చట పడిన ఒబామా.. ఆ తరహా కుర్తాలు వేసుకోవాలని తనకూ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కూడా ఇలా తన పేరును సూటు మీద కుట్టించుకుని వేసుకున్నారు. ఆయన మామూలు టూ పీస్ సూట్ వేసుకుని, దాని కాలర్ సహా మొత్తం సూటంతా తన పేరు కుట్టించుకున్నారు. ఆ తర్వాత ఇలా చేసింది మోదీ ఒక్కరేనని అంటున్నారు. -
నేను ఇక బైకు నడపను: ఒబామా
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ పెరేడ్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)కు చెందిన 'జాన్బాజ్' బృందం మోటార్‌సైకిళ్లపై చేసిన విన్యాసాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి. వారి విన్యాసాలు చూసిన తరువాత తాను ఇక మోటార్ బైకు నడపనని ఆయన చెప్పారు. బీఎస్ఎఫ్ బృందం బైక్స్‌పై వెళుతూ మానవ పిరమిడ్‌లా ఏర్పడిన విన్యాసం సహా ఒళ్లు గగుర్పొడిచే ఇతర విన్యాసాలను ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో, బొటనవేలితో థమ్స్అప్ చిహ్నాలు చూపుతూ ప్రోత్సహించారు. అనంతరం భారత్, అమెరికా వ్యాపార సంస్థల సీఈఓల భేటీలో బీఎస్ఎఫ్ జవాన్ల అద్భుత విన్యాసాలను ఒబామా ప్రస్తావించారు. వారి సాహసోపేత విన్యాసాలను చూసిన తరువాత 'నేనిక బైక్‌ను నడపబోను'అని ఒబామా వ్యాఖ్యానించారు. -
కదం తొక్కిన భారత నారి
వేడుకల్లో మహిళా పాటవం పతాకావిష్కరణ నుంచి.. కవాతు వరకూ.. నారీశక్తి కేంద్ర బిందువుగా సాగిన పరేడ్ న్యూఢిల్లీ: భారత 66వ గణతంత్రం సోమవారం ఓ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే విధం గా మహిళా పాటవాన్ని ప్రదర్శించింది. నారీశక్తి కేంద్ర ఇతివృత్తంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ భారత్‌లో మహిళా సాధికారత ప్రపంచ పెద్దన్నను విస్మయ పరిచే విధంగా సాగింది. రాజ్‌పథ్‌లో పతాకావిష్కరణ దగ్గర నుంచి ఆసాంతం మహిళా ప్రాధాన్యమే కనిపించింది. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో త్రివిధ దళాల నుంచి మహిళా జవానులు రాజ్‌పథ్ పరేడ్‌లో వివిధ బృందాలకు, శకటాలకు నేతృత్వం వహించారు. వీరి ప్రదర్శన పరేడ్‌కు హాజరైన అశేష ప్రజానీకంలో భావోద్వేగం పెల్లుబికేలా చేసింది. ముఖ్య అతిథి ఒబామా సైతం అబ్బుర పడేలా నారీశక్తి కదం తొక్కింది. పరేడ్ సాగుతుండగానే ఆయన నేతృత్వంలో సాగే అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తన ట్వీటర్ పేజిలో భారత మహిళా సైన్యానికి జోహారు అర్పించింది. ‘భారత రిపబ్లిక్ పరేడ్‌లో మహిళా సైనికపాటవం ఆకట్టుకునేలా సాగింది. భారత దేశంలోని అద్భుతమైన వైవిధ్యం ఒకేచోట ఏకరూపంగా ప్రదర్శితమైంద’ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్వీట్ చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పతాకావిష్కరణ పోడియం దగ్గరకు రాగానే, కెప్టెన్ హావోబమ్ బెల్లా దేవి.. ఆయన సమక్షంలో పతాకావిష్కరణ చేశారు. మణిపూర్‌కు చెందిన రెండోతరం సైనికాధికారి బెల్లాదేవి. పతాకావిష్కరణ జరగగానే జాతీయపతాకానికి వందన సమర్పణకు ఆమే కమాండ్ చేశారు. పరేడ్ ప్రారంభమైన తరువాత ముందుగా పదాతి దళం, కెప్టెన్ దివ్యా అజిత్ నాయకత్వంలో సైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం చేస్తూ ముందుకు సాగింది. దివ్యా అజిత్, 2010లో చెన్నైలోని అధికారుల శిక్షణ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌లో ‘స్వోర్డ్ ఆఫ్ హానర్’ అవార్డును పొందారు. దివ్యతోపాటు నౌకా, వాయు సైన్యానికి చెందిన మహిళా జవానులు కూడా రైసీనా హిల్స్ నుంచి ఇండియా గేట్ వరకూ దేశం గర్వపడేలా కవాతును నిర్వహించారు. నౌకాదళం ప్రదర్శించిన శకటం ‘భారతీయ నవసేన, నారీ శక్తి’కి లెఫ్టినెంట్ కమాండర్ శ్వేతాకపూర్, లెఫ్టినెంట్ వర్తికా జోషి నాయకత్వం వహించారు. మరో నలుగురు నౌకాదళ మహిళా అధికారులుశకటంపై అపూర్వమైన పాటవాన్ని ప్రదర్శించారు. ఈ అధికారులు గోవా నుంచి రియో జానెరియో వరకు ప్రతికూల వాతావరణంలో సముద్రంపై సాహస ప్రయాణం చేసిన ధీరవనితలు. ఎవరెస్టు పర్వత శకటంపై మహిళాధికారుల పర్వతారోహణ ఆహూతులను బాగా ఆకట్టుకుంది. ‘అమ్మాయిని రక్షించు.. అమ్మాయిని చదివించు’ (బేటీ బచావో, బేటీ పఢావో పథకానికి సంబంధించిన శకటం పరేడ్‌లో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఎన్సీసీ బ్యాండ్ బృందం కూడా బాలికల నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ బాలికలు వినిపించిన ‘సారే జహాసే అచ్చా’ గానానికి ఒబామా సతీమణి మిషెల్లీ చప్పట్లు కొట్టి అభినందించారు. .ఎన్ఎస్ఎస్ బృందం లో 148 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖకు చెందిన ‘మా గంగా’ శకటం మహిళా దైవశక్తిసామర్థ్యాలను చాటింది. పంచాయతీరాజ్ శాఖ శకటం ఈ-గవర్నెన్స్‌ను ఒక పల్లె పడుచు లాప్టాప్ ద్వారా వినియోగించుకుంటున్నట్లు ప్రదర్శించింది. న్యాయ శాఖ శకటం, రైల్వే శకటాలకు కూడా మహిళా సాధికారతే ఇతివృత్తమయింది. స్త్రీశిశు సంక్షేమ శాఖ బాలికలతో ‘భవిష్యత్తు మాదే’ అన్న ఇతివృత్తం తో శకటాన్ని ప్రదర్శించింది. రిపబ్లిక్‌డే పరేడ్ మొత్తం భారత మహిళా స్ఫూర్తిని సాధికారికంగా ప్రపంచానికి చాటి చెప్పింది. రాజస్థానీ తలపాగాతో మెరిసిన మోదీ గణతంత్ర వేడుకల్లో రాజస్థానీ ‘బాందనీ’ తలపాగాతో మోదీ మెరిసిపోయారు. నలుపు సూట్‌పై ఎరుపురంగు తలపాగా ధరించిన మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా ఆయన ఇదే వేషధారణలో కనిపించారు. ఇక ఒబామా నల్లరంగు సూట్ ధరించారు. జల్లులు కురవడం, చల్లని వాతావరణం ఉండడంతో ఒబామా తన వాహనం నుంచి దిగగానే.. సూట్‌పై నిలువెత్తు కోటు వేసుకున్నారు. మిషెల్ ఒబామా పొడవాటి నల్ల సూట్‌పై ఎర్రని స్కార్ఫ్‌తో తళుక్కుమన్నారు. 2015 ఛబ్బీస్ జనవరిలో ఇవి ఫస్ట్.. త్రివిధ దళాల్లోని మహిళా సిబ్బందితో పరేడ్ గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవడం ఇటీవలే కొనుగోలు చేసిన తీరప్రాంత నిఘా, జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం గల పీ-81 యుద్ధ విమానం, అత్యాధునిక మిగ్-29కే విమానం ప్రదర్శించడం ఇదే తొలిసారి. వేడుకలకు హాజరయ్యే విదేశీ ముఖ్య అతిథులు సాధారణంగా రాష్ట్రపతి వాహనంలో వస్తారు. కానీ ఈసారి ఒబామా తన సొంత వాహనం‘బీస్ట్’లో రాజ్‌పథ్‌కు వచ్చారు. సీఆర్పీఎఫ్కు చెందిన నక్సల్స్ నిరోధక దళం-కోబ్రా తొలిసారి పరేడ్‌లో పాల్గొంది. గణతంత్రంలో విశేషాలు.. సన్నని జల్లులు కురుస్తున్నా లెక్క చేయకుండా రాజ్‌పథ్ మార్గం రెండువైపులా జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓవైపు తడిసిపోతున్నా వేడుకలను ఆసక్తిగా వీక్షించారు. సతీమణి మిషెల్‌తో కలసి ఒబామా రాజ్‌పథ్‌కు రాగానే జనం హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రపతి రాకకోసం ఎదురుచూస్తున్న సమయంలో జల్లులు కురవడంతో ఒబామా తానే స్వయంగా గొడుగు పట్టుకొని నిల్చున్నారు. యువతీయువకులు ‘వి లవ్ ఒబామా’ అని చూపే ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఒబామా.. ఒబామా..’ అని నినాదాలు చేశారు. త్రివిధ దళాల విన్యాసాల సమయంలో చిన్నారుల కేరింతలతో రాజ్‌పథ్ మార్మోగింది. ‘నారీశక్తి’కి ప్రతీకగా త్రివిధ దళాల్లోని మహిళా అధికారులు కవాతు చేసిన సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లేచి నిలబడి అనందం వ్యక్తంచేశారు. ఆకాశంలో సుఖోయ్-30 ఎంకేఐ చేసిన విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. జాతీయ సాహస అవార్డులు గెల్చుకున్న బాలలకు గౌరవసూచకంగా సందర్శకులంతా లేచి నిలబడ్డారు. గణతంత్ర వేడుకల్లో ఒబామా కారు ‘బీస్ట్’ రాజ్‌పథ్‌పై రాచఠీవి ఉట్టిపడుతూ ముందుకు వస్తుంటే అంతా ఆసక్తిగా చూశారు. -
కళ్లకు కట్టిన శక్తి, సంస్కృతి
అగ్రరాజ్యాధినేత సమక్షంలో అబ్బురంగా గణతంత్ర దినోత్సవ కవాతు రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా సైనిక శక్తిని, భిన్న సంస్కృతులను ప్రదర్శించిన భారత్ రెండు గంటల పరేడ్‌ను వీక్షించిన ఒబామా దంపతులు న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధినేత ముఖ్య అతిథిగా పాల్గొని అబ్బురంగా వీక్షిస్తుండగా.. భారతదేశం 66వ గణతంత్ర దినోత్సవంలో తన సైనిక పాటవాన్ని, సుసంపన్నమైన భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని కళ్లు చెదిరే రీతిలో ఆవిష్కరించింది. కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్ల మధ్య దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం గణతంత్ర వేడుకల కవాతు కన్నులపండుగగా సాగింది. ఒకవైపు సన్నగా కురుస్తున్న వర్షం, మరోవైపు మంచు మేఘా లు ఆవరించివున్న ఆకాశం.. ఇవేవీ రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ పరేడ్‌ను వీక్షించేందుకు వచ్చే వేలాది జనాల ఉత్సాహాన్ని చల్లార్చలేకపోయాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడి గా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. సాధారణం గా ముఖ్యఅతిథిని రాష్ట్రపతి తన వాహనంలో వెంట తీసుకురావటం సంప్రదాయం. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. ఒబామా అత్యంత భద్రతాపూరితమైన తన సొంత వాహనం ‘ది బీస్ట్’లోనే రాజ్‌పథ్‌లోని వేదిక వద్దకు వచ్చారు. ఒబామా, మోదీ మాటామంతీ: ముదురు నల్ల రంగు సూటు ధరించిన ఒబామా.. ప్రధాన వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లాస్ ఎన్‌క్లోజర్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సరసన, ప్రధాని నరేంద్రమోదీ పక్కనే ఆశీనులయ్యారు. రాష్ట్రపతికి మరోవైపు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆ పక్కన ఒబామా సతీమణి మిషెల్, ఆమెపక్కన అన్సారీ సతీమణి, రక్షణమంత్రి పారికర్, ఇతర ముఖ్యులు ఆశీనులయ్యారు. మోదీ వర్ణశోభితమైన బంధేజ్ సాఫా (రాజస్థానీ తలపాగా) ధరించి ఆకర్షణీయంగా కనిపించా రు. స్వల్పంగా జల్లులు పడుతుండటంతో ఒబామా కొద్ది సేపు తన గొడుగు చేతపట్టుకుని కనిపించారు. వాన జల్లులతో తడిసిన పరేడ్ మార్గంలో రెండు గంటల పాటు కొనసాగిన అద్భుత ప్రదర్శనను ఒబామా ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షించారు. పరేడ్‌లోని ప్రదర్శనల విశేషాలను ముఖ్యఅతిథికి మోదీ వివరిస్తుండగా.. ఒబామా కూడా ఆయనతో ముచ్చటిస్తూ కనిపించారు. ప్రదర్శనలోని పలు అంశాల పట్ల ఒబామా అభినందనపూర్వకంగా తల ఊపారు.. బీఎస్ఎఫ్ జవాన్లుమోటార్ సైకిళ్లపై చేసిన విన్యాసాలకు బొటన వేలు పెకైత్తి చూపుతూ అభినందనలు తెలిపారు. మిషెల్ చిన్నారుల నృత్య ప్రదర్శనలను నవ్వుతూ తిలకించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రణబ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన, సంప్రదాయబద్ధమైన 21 గన్ సెల్యూట్ (గాలిలోకి తుపాకులు పేల్చి చేసే వందనం) జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న వేదికపై ఉన్న భారత సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతికి.. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (ఢిల్లీ) లెఫ్టినెంట్ సుబ్రతోమిత్రా నేతృత్వంలో సైనిక, పోలీసు బలగా లు.. లయబద్ధమైన సైనిక సంగీతంతో పదం కలుపుతూ కవాతు (మార్చ్ ఫాస్ట్) చేస్తూ సైనిక వందనం సమర్పించాయి. బీఎస్ఎఫ్, అస్సామ్ రైఫిల్స్, కోస్ట్ గార్డ్, సీఆర్పీఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్,సశస్త్ర సీమాబల్, ఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. అబ్బురపరచిన ఆయుధ సంపత్తి... గణతంత్ర దినోత్సవ కవాతులో తొలిసారిగా ఈ ఏడాది త్రివిధ దళాల నుంచి అన్నీ మహిళా యూనిట్లే పాల్గొనటం విశేషం. సైనిక ఆయుధ సంపత్తిలో.. ఇటీవలే సమకూర్చుకున్న దీర్ఘశ్రేణి సముద్ర నిఘాకు వినియోగించే, జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం గల పీ-81 యుద్ధ విమానం, దీర్ఘశ్రేణి అత్యాధునిక మిగ్-29కే యుద్ధవిమానాలను తొలిసారిగా ప్రదర్శించారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల ఆకాశ్ మధ్యశ్రేణి క్షిపణి, వెపన్ లొకేటింగ్ రాడార్ల ప్రదర్శన ఆకర్షించాయి. లేజర్ గెడైడ్ మిసైల్ సామర్థ్యమున్న టి-90 భీష్మ యుద్ధ ట్యాంకు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు చెందిన మొబైల్ అటానమస్ లాంచర్, శాటిలైట్ టెర్మినల్ (రాడ్శాట్) తదితర ఆయుధ సంపత్తి భారత సైనిక పాటవాన్ని చాటిచెప్పాయి. వైమానిక,నౌకాదళాలు కూడా తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. దుర్భేద్యమైన కోటగా దేశ రాజధాని... అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతా జాగ్రత్తల దృష్ట్యా ఆ దేశాధ్యక్షుడు ఒక బహిరంగ వేదిక నుంచి దాదాపు రెండు గంటల పాటు ఒక కార్యక్రమాన్ని వీక్షించటం అసాధారణమైన విషయం. అగ్రరాజ్యాధినేత కోసం చేపట్టిన భూతలం నుంచి గగనతలం వరకూ చేపట్టిన భద్రతా చర్యలు రాజధాని నగరాన్ని దుర్భేద్యమైన కోటగా మార్చివేశాయి. ఏడు వలయాలతో భద్రతను చేపట్టారు. పరేడ్ మార్గం పొడవునా అన్ని భవనాలు, ఎత్తయిన కట్టడాలపైనా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) స్నైపర్లను మోహరించారు. మోదీ మూడు కలలు ప్రధాని నరేంద్రమోదీ కలల పథకాలు మూడు సోమవారం రిపబ్లిక్ పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జనధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ పథకాలకు సంబంధించి ప్రత్యేక శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. వివిధ పాఠశాలల బాలబాలికలతో పరిశుభ్రతకు సంబంధించిన నృత్య ప్రదర్శనను స్వచ్ఛభారత్ శకటంపై ప్రదర్శించారు. అదే విధంగా కేంద్ర పారిశ్రామిక ఉత్పాదక శాఖ యంత్ర చక్రాలతో రూపొందించిన అతి పెద్ద సింహం నమూనా పరేడ్‌లో ప్రత్యేకంగా కనిపించింది. అదే విధంగా అత్యధిక ప్రజాదరణ పొందిన జనధన్ యోజన పథకానికి కూడా శకటం ప్రదర్శించారు. వీటితో పాటు బేటీ బచావో, బేటీ పఢావో, ఆయుష్ శకటాలు కూడా ఆహూతులను ఆకట్టుకున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాల నుంచి శకటాలను, వివిధ రంగాల్లో సాధించిన విజయాలు, ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబిస్తూ మరో 9 శకటాలను ప్రదర్శించారు. దేశంలో తయారీ పరిశ్రమను, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని ప్రతిబింబిస్తూ కూడా ఒక శకటాన్ని ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ గిరిజనుల నృత్యరీతులు, సంప్రదాయ సంగీతం, పాఠశాలల విద్యార్థినుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. చివర్లో భారత వాయుసేన ఫ్లైపాస్ట్‌లో హెలికాప్టర్లు, యుద్ధవిమానాలతో చేసిన విన్యాసాలు అతిథులు, వీక్షకులను అబ్బురపరచాయి. పరేడ్ ముగింపులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పొగలు విరజిమ్ముతూ వాయుసేన విమానాలు నింగిలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం ఆకట్టుకుంది. -
భారత్, అమెరికా సరైన దిశలో పయనిస్తున్నాయి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సరైన దిశగా పయనిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో ఒబామా ప్రసంగించారు. ఈ సదస్సులో ఒబామాతో పాటు భారత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత గణతంత్ర వేడుకులు తనను అబ్బురపరిచాయని ఒబామా ప్రశంసించారు. భారత్, అమెరికా సాధించాల్సింది చాలా ఉందని ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య దిగుమతులు పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అమెరికా దిగుమతుల్లో కేవలం 2 శాతమే భారత్ నుంచి వస్తుండగా, భారత్ దిగుమతుల్లో 1 శాతం మాత్రమే అమెరికా వాటా ఉందని చెప్పారు. అమెరికా తయారీ విమానాలు భారత్ విమానాశ్రాయాల్లో నిరంతరం కనబడాలని ఒబామా అన్నారు. అంతకుముందు మోదీ ప్రసంగించారు. -
అన్ని ప్రాజెక్టులపై పీఎంవో నిఘా: మోదీ
న్యూఢిల్లీ: భారత్‌లో అన్ని ప్రాజెక్టులపై పీఎంవో నిఘా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను అమెరికాలో పర్యటించిన తర్వాత భారత్‌లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో మోదీ ప్రసంగించారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. పెట్టుబడులు పెరగడం వల్ల భారత ఆర్థిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ హయాంలో ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి వచ్చిందని మోదీ అన్నారు. ఒబామా మాట్లాడుతూ అమెరికా, భారత్ వాణిజ్యంలో 60 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. వాణిజ్యంలో ఆధునికతకు తాను, మోదీ ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. -
సీఈవోల సదస్సులో పాల్గొన్న మోదీ, ఒబామా
న్యూయార్క్: భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సు సోమవారం సాయంత్రం ఆరంభమైంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత్, అమెరికాకు చెందిన 250 సీఈవోలు హాజరయ్యారు. మోదీ మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు సుపరిపాలనే పరిష్కారమని అన్నారు. వాణిజ్యంలో ఆధునికతపై తనకు, మోదీకి ఆసక్తి ఉందని ఒబామా అన్నారు. -
ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. -
ఒబామాతో సోనియా, మన్మోహన్ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఒబామా బస చేసిన మౌర్యా హోటల్‌కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. సోనియా, మన్మోహన్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. సోనియా బృందం మర్యాదపూర్వకంగా ఒబామాను కలిసినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సయమంలో 2010లో ఒబామా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. -
పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’
త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు. 2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
కెమిస్ట్రీ పండింది..!
ఒబామా, మోదీల మధ్య కుదిరిన సాన్నిహిత్యం, పెరిగిన అనుబంధం ఒబామా పర్యటనలో స్పష్టంగా కనిపించింది. ఇరువురు కలిసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో పేలిన చమత్కారాల్లో అది మరింత స్పష్టమైంది. భారతీయులకు ‘మేరా ప్యార్ భరా నమస్కార్’ అంటూ హిందీలో శుభాకాంక్షలు తెలిపిన ఒబామా.. మోదీతో తన సాన్నిహిత్యంపై జోక్స్ కూడా వేశారు. ‘హైదరాబాద్ హౌస్ లాన్లో ఈ రోజు.. రోజులో ఎంతసేపు నిద్రపోతాం అనే విషయం సహాచాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాకన్నా మోదీ చాలా తక్కువగా నిద్రపోతారు. అయినా ఆయనింకా అధికారానికి కొత్త కదా! అధికారంలో ఇంకో ఐదారేళ్లు ఉంటే ఇంకో గంట అదనంగా నిద్రపోతారు’ అంటూ ఒబామా చమత్కరించారు. ‘చాయ్ పే’కు థాంక్యూ! 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు మోదీని దగ్గర చేసిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని ఆదివారం మోదీతో కలిసి పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఒబామా ప్రస్తావించడం విశేషం. అంతకుముందే హైదరాబాద్ హౌస్ గార్డెన్లో ఒబామాకు మోదీ స్వయంగా టీ కలిపి ఇచ్చిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ‘ప్రైమ్ మినిస్టర్ మోదీ.. థాంక్యూ.. నాతో జరిపిన చాయ్ పే చర్చ సహా నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థాంక్యూ’ అన్నారు. ఇలాంటి చాయ్ పే చర్చ కార్యక్రమాలు చాలా వాషింగ్టన్లోనూ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. -
బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్
-
బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్
ఒకవైపు సైనిక దళాలు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురుస్తోంది. అయితే.. ముఖ్యఅతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. వేడుకలు చూస్తూ చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించారు. మధ్యమధ్యలో దాన్ని బయటకు తీసి, మళ్లీ నోట్లోకి పెట్టుకుంటూ ఫొటోలకు దొరికేశారు. రంగురంగుల తలపాగా ధరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పక్కనే నల్లటి సూటులో వచ్చిన ఒబామా కూర్చున్నారు. ఇంతకుముందు బీజింగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సమితి (అపెక్) సమావేశాల సమయంలో కూడా ఒబామా ఇదే తరహాలో చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రేగింది. ఆ సదస్సులో పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు చ్యూయింగ్ గమ్ నములుతూ, తీస్తూ కనిపించారని, సదస్సుకు వచ్చేటప్పుడు కూడా అలాగే చేశారని ఇంగ్లండ్ పత్రిక 'ద ఇండిపెండెంట్' అప్పట్లో విమర్శించింది. -
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు
-
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు
-
మంచు వర్షంలో రిపబ్లిక్ డే వేడుకలు
-
మంచువర్షంలో రిపబ్లిక్ డే వేడుకలు
విపరీతమైన మంచు వర్షం నడుమ దేశరాజధాని నగరం న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. కాసేపటి తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంచు దాదాపు వర్షంలా కురుస్తుండటంతో ముఖ్య అతిథులతో పాటు దాదాపు వేడుకలకు హాజరైనవాళ్లంతా గొడుగులు పట్టుకునో, తలపై పుస్తకాలు పెట్టుకునో ఉండక తప్పలేదు. పెరేడ్ మార్గం కూడా మొత్తం మంచుతో తడిసిపోయింది. అనంతరం అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను దివంగత సైనికాధికారుల భార్యలకు అందించారు. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందూ ముకుంద్‌కు అశోకచక్రను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. అనంతరం దివంగత నాయక్ నీరజ్‌కుమార్ సింగ్ భార్య పరమేశ్వరీ దేవికి కూడా అశోకచక్రను బహూకరించారు. -
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
నేడు 66వ గణతంత్ర దినోత్సవం
-
మోదీ కుర్తా వేసుకోవాలని ఉంది
భారత్, అమెరికాల మధ్య 'దోస్తీ' పెరగాలని, తనకు మోదీ కుర్తా వేసుకోవాలని ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నల్లటి సూటు, టై కట్టుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు హాజరైన ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. 2010 సంవత్సరంలో తాను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు తమ దంపతులతో డాన్సు చేయించారని అన్నారు. ముంబైలో కొందరు పిల్లలతో కలిసి మిషెల్ ఒబామా, బరాక్ ఒబామా డాన్సు చేశారు. తనకంటే మిషెల్ బాగా డాన్సు చేస్తారని ఆయన అన్నారు. కేవలం మూడు గంటల నిద్ర సరిపోతుందని, మిగిలిన 21 గంటలూ తాను పనిచేస్తానని ప్రధాని నరేంద్రమోదీ తనతో అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఒబామా తెలిపారు. తాను కనీసం ఐదు గంటలు పడుకోవాలని చెప్పారు. అలాగే, మొసలి దాడి నుంచి ఒకసారి తప్పించుకున్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆయన చాలా గట్టి మనిషని, మంచి స్టైలు కూడా ఉందని అన్నారు. ఒకప్పుడు మోదీ తండ్రి టీ అమ్ముకునేవారని, ఆయన తల్లి ఇళ్లలో పనిచేసుకునే వారని, కానీ వాళ్ల అబ్బాయి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మన ముందున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. -
విశాఖ ‘స్మార్ట్’ పట్నం
స్మార్ట్ సిటీపై అమెరికాతో ఏపీ ఎంవోయూ ఒప్పందంపై ఏపీ, అమెరికా అధికారుల సంతకాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చే కార్యాచరణలో సాధ్యాసాధ్యాల అధ్యయనం, సలహా సంప్రదింపులు, వనరుల సమీకరణ అంశాల్లో ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. విశాఖపట్నం(ఏపీ), అలహాబాద్(యూపీ), అజ్మీర్(రాజస్థాన్)లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై ఆయా రాష్ట్రాలు, అమెరికా మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో జరిపిన చర్చల్లో ఈ సిటీల అభివృద్ధిపై కుదిరిన అవగాహన మేరకు.. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఒబామా కార్యరూపం ఇచ్చారు. దీని ప్రకారం స్థానిక ప్రభుత్వాలు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ(యూఎస్టీడీఏ)కు అవసరమైన సమన్వయం, సాంకేతిక సమాచారం, పథక రచన సమాచారం, సిబ్బందిని, పరికరాలను సమకూర్చాల్సి ఉంటుంది. ఆదివారం ఢిల్లీలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అమెరికా, భారత అధికారుల సమక్షంలో యూఎస్టీడీఏ డెరైక్టర్ లియోకాడియా ఐజ్యాక్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరస్పరం విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు యూఎస్టీడీఏ.. స్మార్ట్‌సిటీ సాధ్యాసాధ్యాల అధ్యయనం, స్టడీ టూర్స్, వర్క్‌షాపులు, శిక్షణ నిర్వహించేందుకు ఆర్థిక వనరులను ఏపీకి అందజేస్తుంది. అమెరికా ప్రభుత్వ వాణిజ్య శాఖ, యూఎస్ ఎగ్జిమ్ బ్యాంక్, ట్రేడ్ అండ్ ఎకనమిక్ సంస్థలు సైతం ఈ ఒప్పందం బలోపేతం చేయడానికి సహకరిస్తాయి. యూఎస్ పారిశ్రామిక సంస్థ కూడా.. ఈ సందర్భంగా.. వైజాగ్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అమెరికా పారిశ్రామిక సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇది.. కొత్త మలుపు: వెంకయ్యనాయుడు భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కొత్త మలుపని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అభివృద్ధి సూచిక: మంత్రి నారాయణ విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థతో కుదిరిన ఒప్పందం ఏపీ అభివృద్ధికి సూచికని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
మెరిసిపోయిన మిషేల్ డ్రెస్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ డ్రెస్ జిగేల్మంది. నలుపు రంగు డ్రెస్‌పై తెల్ల గీతలు.. వాటిపై నీలి రంగు పూల డిజైన్‌తో మిషెల్ మెరిసిపోయారు! మోకాళ్ల వరకున్న ఈ డ్రెస్‌పై మ్యాచింగ్ కోటు ధరించారు. ఈ దుస్తులను న్యూయార్క్‌లోని భారతీయ డిజైనర్ బిహు మహాపాత్ర రూపొందించారు. ఒడిషాలోని రూర్కెలాకు చెందిన బిహు అమెరికాలో ప్రఖ్యాత డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన బెనారస్‌లో ఓ ప్రత్యేకమైన పట్టుచీర మిషెల్ కోసం రూపొందించారు. పూర్తిగా చేతితో నేసిన ఈ చీరలో సన్నని బంగారు, వెండి పోగులు వాడారు. 400 గ్రాములు ఉండే ఈ చీర ఖరీదు లక్షా 50 వేల రూపాయలు. బెనారస్‌కు చెందిన ముగ్గురు నిపుణులు దీన్ని మూడు నెలలు కష్టపడి తయారు చేశారు. శనివారమే దీన్ని దేశ రాజధానికి తీసుకువచ్చారు. -
రాష్ట్రపతి భవన్లో ఒబామా దంపతులకు విందు
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంప్రదాయం ప్రకారం ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు వచ్చిన అతిథులకు శాకాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు. కశ్మీర్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గల పసందైన వంటకాలను మెనూలో చేర్చారు. ఇందులో కశ్మీరీ గుస్తబా, మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా, చికెన్ టిక్కా, ఖాది పకోడ తదితరాలు ఉన్నాయి. ఈ విందుకు రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. కొందరు ప్రముఖులను ఒబామా, అతని భార్య మిషేల్ కలిశారు. ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన మంత్రి వర్గ సహచరులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, వ్యాపార దిగ్గజాలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ తదితరులు పాల్గొన్నారు. -
మీరెంతో ప్రత్యేకం
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌కు ఎంత ముఖ్యమైన, ప్రత్యేకమైన అతిథో ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ఆయనతో వ్యవహరించిన తీరు స్పష్టం చేసింది. విమానాశ్రయంలో ఆప్యాయంగా కౌగిలించుకుని ఆహ్వానం పలకడంలో కానీ.. హైదరాబాద్ హౌస్ లాన్లో ఒబామాకు స్వయంగా టీ తయారు చేసివ్వడం కానీ.. ఒబామాతో మోదీకున్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పాయి. మధ్యాహ్న భోజనం తరువాత హైదరాబాద్ హౌజ్ గార్డెన్లో అలా సరదాగా వ్యాహ్యాళికి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ ఒక దగ్గర కూర్చున్న సమయంలో ఒబామాకు మోదీనే స్వయంగా టీ కలిపిచ్చారు. అంతకుముందు ప్రొటోకాల్‌ను కాదని విమానాశ్రయంలో ఒబామాకు మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఒబామా గత పర్యటనలోనూ నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రొటోకాల్‌ను పట్టించుకోకుండా స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతించారు. అగ్రరాజ్యాధీశుడికి భారత్ ఇచ్చే గౌరవానికి అద్దంపట్టే చర్యలివి. మోదీ అమెరికా పర్యటనలోనూ.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు నివాళులర్పించేందుకు మోదీని ఒబామా స్వయంగా తోడ్కొని వెళ్లారు. -
‘అణు’మార్గం సుగమం
అమెరికా అధ్యక్షుడికి అపూర్వ స్వాగతం అణు ఒప్పందంపై ప్రతిష్టంభనకు తెరదించిన మోదీ, ఒబామా భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఆరేళ్ల ప్రతిష్టంభనకు తెర ఒబామా, మోదీ చర్చల్లో పరిష్కారం అణు వాణిజ్య సహకారం అమలుకు నిర్ణయం సరికొత్త శిఖరాలకు రక్షణ సహకారం.. రక్షణ రంగంలో 4 ప్రాజెక్టుల్లో సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తికి ఒప్పందాలు ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా సామర్థ్యాల బలోపేతానికి ద్వైపాక్షిక సహకారం హైదరాబాద్ హౌస్‌లో ఇరువురి సుదీర్ఘ చర్చల్లో నిర్మాణాత్మక ఫలితాలు, నిర్ణయాలు భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ‘అణు’ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం, ఉగ్రవాదంపై పోరు, వివిధ రంగాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇక భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఒబామా దంపతులకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలకగా.. రాష్ట్రపతి భవన్లో దేశంలోనే అత్యుత్తమమైన ‘21 గన్ శాల్యూట్’, సైనిక వందనం’తోనూ గౌరవించారు. హైదరాబాద్ హౌస్‌లోని లాన్లో కూర్చున్నప్పుడు ఒబామాకు మోదీ స్వయంగా ‘చాయ్’ కలిపి ఇచ్చారు. తనకు అపూర్వ ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. భారతీయ సంప్రదాయంలో రెండు చేతులనూ జోడించి ‘నమస్తే’ చెప్పారు. న్యూఢిల్లీ: భారత్-అమెరికాల మధ్య పౌర అణు సహకారంపై ఒప్పందం కుదిరిన ఆరేళ్ల తర్వాత.. ఆ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది. అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆదివారం ఢిల్లీలో జరిపిన చర్చలు తెరదించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య హైదరాబాద్ హౌస్‌లో మూడు గంటల పాటు కొనసాగిన చర్చల్లో.. అణు ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపైనా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. అణు ఒప్పందం అమలుపై గణనీయ ఫలితం సాధించామని ఒబామా అభివర్ణించినప్పటికీ, దీని విధివిధానాలు ఏంటనేది వెంటనే తెలియరాలేదు. హైదరాబాద్‌హౌస్‌లో ఒబామా, మోదీలు ముఖాముఖిగా, ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో కలసి, ఇరువురూ తోటలో విహరిస్తూ చర్చలు జరిపారు. తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. అణు వాణిజ్య సహకారం దిశగా ముందడుగు.. ‘‘భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న తొలి అమెరికా అధ్యక్షుడు, భారత్‌లో రెండోసారి పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే అన్న వాస్తవం. రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు సూచికలు. కొద్ది నెలలుగా ఈ సంబంధంలో కొత్త ఉద్విగ్నత, విశ్వాసాలు నాకు కనిపించాయి. మా సంబంధాల్లో నూతనోత్తేజం కనిపించింది. గత సెప్టెంబర్‌లో ఇందుకు నేపథ్యాన్ని నెలకొల్పినందుకు మీ నాయకత్వానికికృతజ్ఞతలు చెప్తున్నా. కొత్త రూపం తీసుకున్న మన సంబంధాల్లో పౌర అణు ఒప్పందం కేంద్ర బిందువు. ఇది కొత్త విశ్వాసాన్ని రుజువుచేసింది. ఇది కొత్త ఆర్థిక అవకాశాలనూ సృష్టించింది. స్వచ్ఛ ఇంధనశక్తి కోసం మన అవకాశాలను విస్తరించింది. 4 నెలలుగా దీనిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేం కృషి చేశాం. ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసిన ఆరేళ్ల తర్వాత మా చట్టానికి, మా అంతర్జాతీయ న్యాయ బాధ్యతలకు, సాంకేతికంగా, వాణిజ్యపరంగా ఆచరణ సాధ్యతలకు అనుగుణంగా వాణిజ్య సహకారం దిశగా ముందడుగు వేస్తుండటం నాకు సంతోషాన్నిస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. అవరోధాలకు నేడు పరిష్కారం సాధించాం.. ఒబామా మాట్లాడుతూ.. ‘మా పౌర అణు సహకారంపై ముందుకెళ్లకుండా నిరోధిస్తున్న రెండు అంశాలకు ఈ రోజు మేం పరిష్కారం సాధించాం. దానిని పూర్తిస్థాయిలో అమలు చేయటానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు. ‘ఇది చాలా ముఖ్యమైన ముందడుగు. మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేం ఉమ్మడిగా ఎలా కృషి చేయగలమనేది ఇది చాటుతోంది’ అని అన్నారు. నాలుగు అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు త్వరగా పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేలా మద్దతిచ్చేందుకు అమెరికా కృషి చేస్తుందని కూడా ఒబామా హామీ ఇచ్చినట్లు మోదీ తెలిపారు. ‘రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనీ నిర్ణయించాం.ఆధునిక రక్షణ ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని, ఉత్పత్తి చేయాలని అంగీకారానికి వచ్చాం. దేశీయ రక్షణ పరిశ్రమ స్థాయి పెరగటానికి, భారత్‌లో తయారీ రంగ విస్తరణకు ఇవి దోహదపడతాయి’ అని మోదీ అన్నారు. ఉగ్రవాద సంస్థల మధ్య తేడా చూపరాదు.. ప్రస్తుత సవాళ్లు అలాగే ఉన్నప్పటికీ ఉగ్రవాదమనేది ముఖ్యమైన ప్రపంచ ముప్పుగానే ఉందని, అది సరికొత్త రూపం తీసుకుంటోందని మోదీ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి సమగ్ర అంతర్జాతీయ వ్యూహం, విధానం అవసరమని అగీకారానికి వచ్చాం. ఉగ్రవాద సంస్థల మధ్య ఎలాంటి భేదమూ చూపరాదు. ఉగ్రవాదులకు భద్రమైన ఆవాసాలుగా ఉన్న ప్రాంతాలను నిర్మూలించేందుకు, వారిని చట్టం ముందు నిలిపేందుకు ప్రతి దేశమూ తన బాధ్యతను నిర్వర్తించాలి’ అని చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను, సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకోవడానికి రెండు దేశాలూ ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ముంబైపై 26/11 ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్తాన్‌కు అమెరికా, భారత్‌లు స్పష్టం చేశాయి. ప్రాంతీయ సహకారం గురించి ప్రస్తావిస్తూ.. రెండు దేశాల భవిష్యత్తుకు, ప్రపంచ భవిష్యత్తుకు కీలకమైన ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సుసంపన్నతలను పెంపొందించేందుకు సహకారాన్ని బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను ఇరు దేశాలూ పునరుత్తేజితం చేశాయన్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా బలగాలను పూర్తిగా ఉపసంహరించిన తర్వాత అఫ్ఘాన్ పరిణామక్రమంలో దోహదపడేందుకు కృషి చేయటంపై కూడా ఒబామా, తాను చర్చించామని మోదీ చెప్పారు. అఫ్ఘాన్ ప్రజలకు తమ రెండు దేశాలూ విశ్వసనీయమైన భాగస్వాములుగా ఉంటాయని ఒబామా పేర్కొన్నారు. ‘ఇరు దేశాల పురోభివృద్ధికి, ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరత, సుసంపన్నత ముందుకెళ్లడానికి భారత్ - అమెరికాల భాగస్వామ్యం విజయవంతం కావడం ముఖ్యం. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, నవీన ఆవిష్కరణ, వ్యవసాయం తదితరాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తాం’ అని మోదీ చెప్పారు. ఇరు దేశాల మధ్య హాట్ లైన్లు నెలకొల్పుతాం ‘మన విస్తృత ప్రాంతంలో అభివృద్ధి, అనుసంధానాన్ని పెంపొందించేందుకు కలిసి కృషిచేయాల్సిన బాధ్యతను చేపట్టినపుడే వ్యూహాత్మక భాగస్వామ్యం పరిపూర్ణమవుతుంది. దీనిని ప్రాధాన్యంగా గుర్తించి ఈ లక్ష్య సాధనకు కృషిచేయాలని ఒబామా నేనూ అంగీకరించాం. మా సంబంధం ఈ రోజు కొత్త స్థాయికి చేరింది. ఈ శతాబ్దపు అవకాశాలను, సవాళ్లను ప్రతిఫలించేలా మా స్నేహానికి, సహకారానికి విస్తృత ప్రణాళికను రచించాం. భారత్ - అమెరికాలు చాలా తరచుగా శిఖరాగ్ర సదస్సులు నిర్వహించాలని అంగీకారినికి వచ్చాం. అమెరికా, భారత్‌ల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య హాట్లైన్లను కడా నెలకొల్పుతాం. ఈ ఏడాది ఆరంభంలో మేం సరికొత్త ప్రయాణం మొదలు పెడతాం’ అని చెప్పారు. ‘అణు’మానాలు తొలగినట్లే.. అణు బాధ్యతకు ‘సమీకరణ నిధి’ పరిష్కారం భారతదేశపు ‘అణు బాధ్యత చట్టం’లోని.. అణు విద్యుత్ ప్లాంట్లలో అణు ప్రమాదాలేవైనా జరిగినట్లయితే సంబంధిత అణు సరఫరాదారులే నేరుగా బాధ్యత వహించాలన్న నిబంధనపై అమెరికాకు చెందిన అణు రియాక్టర్ల తయారీ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండడం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం.. ఏదైనా అణు ప్రమాదం సంభవిస్తే ప్రభావితులకు పరిహారం చెల్లించేందుకు రియాక్టర్ నిర్వహణ సంస్థ రూ. 1,500 కోట్లు పక్కన పెట్టాలి. అయితే.. సరఫరాదారుల నుంచి నిధుల హక్కును నిర్వహణదారు కోరవచ్చు. ఈ నిబంధన వల్ల భారత అణు రంగంలో పెట్టుబడులు పెట్టడం కష్టమవుతోందని విదేశీ అణు సరఫరాదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అణు రియాక్టర్లకు బీమా కల్పించే అంశమూ పీటముడిగా మారింది. అలాగే.. భారత్‌కు సరఫరా చేసే అణు ఇంధనాలను వాటికి సంబంధించిన అణు రియాక్టర్లకు చేరుతున్నాయో లేదో తాను స్వయంగా పర్యవేక్షించి, పరిశీలిస్తానని అమెరికా పట్టుపడుతోందని, ఇందుకు భారత్ వ్యతిరేకిస్తోందని, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) భద్రతా ప్రమాణాల మేరకే పనిచేస్తామని చెప్తోందని సమాచారం. పౌర అణు ఒప్పందం అరేళ్లుగా అమలుకాకపోవటానికి ఈ రెండు కీలక అంశాలే కారణం కాగా.. వీటిపై తాజాగా ఎలాంటి పరిష్కారాలు కనుగొన్నారన్నది తెలియరాలేదు. అయితే.. అణు ప్రమాదం జరిగిన పక్షంలో అందుకు సంబంధిత సరఫరాదారులే బాధ్యత వహించాలన్న నిబంధన విషయంలో అమెరికాకు భరోసా ఇచ్చేందుకు భారత్ ఒక ప్రతిపాదన చేస్తోంది. అణు ప్రమాదం జరిగినా అమెరికా అణు రియాక్టర్ల సంస్థలపై భారం పడకుండా భద్రత కల్పించేందుకు తాము ఒక సమీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్తోంది. రియాక్టర్లకు బీమా కల్పించేందుకు విదేశీ సంస్థలను అనుమతించటానికి సుముఖంగా లేని భారత్.. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కోరింది. అయితే.. ఆ సంస్థ వద్ద ఇందుకు అవసరమైనంత ఆర్థిక సామర్థ్యం లేదు. దీంతో.. పలు కంపెనీలు తమ నిధులను ఒక చోటకు సమీకరించి రియాక్టర్లకు బీమా కల్పించేలా.. అణు బీమా సమీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నాలుగు ప్రభుత్వ బీమా సంస్థలు రూ. 750 కోట్లను సమీకరించాయి. ఇది అవసరమైన మొత్తంలో కేవలం సగం మాత్రమే కావటంతో..ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుంది. కాగా, అణు ప్రమాదాలకు బాధ్యత, అణు పదార్థాల జాడ తెలుసుకోవడానికి సంబంధించి అమెరికాకు ఉన్న అభ్యంతరాలు.. ఒబామా - మోదీ సమావేశంలో కుదిరిన అవగాహనతో పరిష్కారమయ్యాయని ఆ దేశ ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ వాషింగ్టన్లో అన్నారు. మరోవైపు. ప్రతిష్టంభనను బద్దలుకొట్టామని, అణు బాధ్యత నిబంధన, అణు ఇంధనం జాడ తెలుసుకోవటంపై అమెరికాకు భరోసాలు ఇచ్చామని భారత ప్రభుత్వం తెలిపింది. ‘మీతో ఎక్కువ వ్యాపారం చేయాలనుకుంటున్నాం’ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బిట్)పై చర్చలను పునఃప్రారంభించాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. రెండు దేశాల్లోనూ పరస్పర పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై 2008 నుంచి చర్చలు జరుగుతున్నాయి. భారత్, అమెరికాల వాణిజ్యం గత కొన్నేళ్లలో 60 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒబామా చెప్పారు. ‘మరింత ఎక్కువగా వ్యాపారం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వ్యాపారం చేయడం మరింత సులభం చేస్తూ ప్రధాని అమలు చేస్తున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. మరింత ఎక్కువ మంది భారతీయులను బ్యాంకు ఖాతాలతో సాధికారం చేయాలని, భారతీయులకు పరిశుభ్రమైన నీరు, గాలి అందించాలని మోదీ చేస్తున్న కృషిని నాకు వివరించారు. ఈ కృషిలో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులకు ముఖ్యమైన సామాజిక భద్రత ఒప్పందంపై చర్చలను కూడా పునఃప్రారంభిస్తామని మోదీ చెప్పారు. రక్షణ ఒప్పందం పొడిగింపు భారత్-అమెరికాల మధ్య ఈ ఏడాదితో ముగియనున్న 2005 నాటి రక్షణ చట్ర ఒప్పందం (డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్)ను మరో పదేళ్లు కొనసాగించేలా తాజాగా ఒప్పందం ఖరారైంది. ఉన్నతస్థాయి రక్షణ సామగ్రిని సంయుక్తంగా ఉత్పత్తి చేయటానికి ఇది తోడ్పాటునిస్తుంది. ఇందులో భాగంగా ఖరారుచేసిన డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనీషియేటివ్ కింద.. కొత్త తరం రావెన్ మిని యూఏవీలు, సి-130 సైనిక రవాణా విమానానికి ప్రత్యేక కిట్లు, మొబైల్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ పవర్ సోర్స్, యూనిఫాం ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్ ఇంక్రిమెంట్ 2 అనే ప్రాజెక్టులను అభివృద్ధి చేయటం, ఉత్పత్తి చేయటం చేపట్టాలని నిర్ణయించినట్లు భారత్ తెలిపింది. ‘క్లీన్ ఎనర్జీ’కి మద్దతు స్వచ్ఛ ఇంధనశక్తి (క్లీన్ ఎనర్జీ) కోసం, వాతావరణ మార్పు అంశాలపై పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందిస్తామని భారత్, అమెరికాలు ప్రకటించాయి. వచ్చే వేసవి కాలంలో భారత్‌లో క్షేత్రస్థాయి పెట్టుబడి అధికారిని నియమించటం ద్వారా స్వచ్ఛ ఇంధనశక్తికి నిధులను వేగవంతం చేయడానికి అమెరికా అంగీకరించింది. ఈ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులను రప్పించేలా మద్దతివ్వడానికి ఒక బృందాన్నీ నియమిస్తామని పేర్కొంది. వాతావరణ మార్పు అంశంపై చర్చల్లో భారత్ వాణి చాలా ముఖ్యమైనదని ఒబామా పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో అమెరికా - చైనాల మధ్య కుదిరిన ఒప్పందం తరహా ఒప్పందం కుదుర్చుకునేలా భారత్‌పై ఒత్తిడి ఉందా? అని విలేకర్లు మోదీని ప్రశ్నించగా.. ‘ ఏ ఒత్తిడి అనేది భారత్‌పై ప్రభావం చూపదు. అయితే.. భవిష్యత్ తరానికి మనం ఎలాంటి వాతావరణం అందిస్తామనేదానిపై ఒత్తిడి ఉంది. వాతావరణ మార్పు అనేదే ఒత్తిడి. భూతాపోన్నతి అనేదే ఒత్తిడి’ అని అన్నారు. -
ఒబామా దంపతులకు విందు
-
చాయ్ పే చర్చా బాగా జరిగింది: ఒబామా
-
ఒబామాకు 'టెలిగ్రామ్' కానుక
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన బహుమతి అందజేశారు. అమెరికా- భారత్ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన టెలిగ్రామ్ ను కానుకగా ఇచ్చారు. 1946లోఅమెరికా నుంచి భారత రాజ్యాంగ సభకు వచ్చిన మొదటి టెలిగ్రామ్ కాపీని ఒబామాకు మోదీ బహుకరించారు. హైదరాబాద్ హౌస్ లో అత్యున్నతస్థాయి ప్రతినిధులతో సమావేశానికి ముందు ఒబామాకు దీన్ని అందించారు. రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న సచ్చిదానంద సిన్హాకు అమెరికా యాకింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా వ్యవహరించిన డీన్ అచేసన్ అప్పట్లో ఈ టెలిగ్రాఫ్ పంపారు. -
ఒబామా చూపిన చొరవ అపూర్వం: మోదీ
-
చాయ్ పే చర్చా బాగా జరిగింది: ఒబామా
మాడిసన్ స్క్వేర్ ప్రసంగం అద్భుతం బాలీవుడ్ స్టార్లకు వచ్చినట్లు జనం వచ్చారు మోదీపై అమెరికా అధ్యక్షుడి ప్రశంసల జల్లు అన్ని రంగాల్లో సహకారం ఉంటుందని భరోసా భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు న్యూఢిల్లీ: నమస్తే.. మేరా ప్యారా భాయీ నమస్కార్ అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, తనకు మధ్య 'చాయ్‌పే చర్చా' బాగా జరిగిందని, ఇలాంటివి వైట్‌హౌస్‌లో కూడా మరిన్ని జరగాలని ఒబామా అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ''భారతదేశంతో బంధం మరింత దృఢపరుచుకోవడం నా హయాంలో జరుగుతున్నందుకు సంతోషం. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన మొదటి అధ్యక్షుడిని నేనే. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అణు విస్తరణ విషయంలో కూడా రెండు దేశాల మధ్య బంధం బలోపేతమైంది. గత నెలలో వాషింగ్టన్ వచ్చినప్పుడు, అక్కడ న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్‌లో మీ ప్రసంగానికి బాలీవుడ్ స్టార్‌కు వచ్చినట్లుగా జనం రావడం చూసి ఆశ్చర్యపోయాం. 'చాయ్ పే చర్చా' బాగా జరిగింది. ఇలాంటివి వైట్ హౌస్‌లో కూడా జరగాలి. ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నాం. ఇండియాతో మరింత హైటెక్ సహకారం ఉంటుంది. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం ఉంటుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయి. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని హైడ్రో ఫ్లోరో కార్బన్లను తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాం. మరో పదేళ్ల పాటు కూడా ఇలాగే సహకారం కొనసాగాలని భావిస్తున్నాం. రక్షణ రంగంలోను, అణు రంగంలోను కూడా సహకారం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భారతీయులకు మరోసారి చెబుతున్నాను'' అన్నారు. అనుకున్న సమయం కంటే దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా సంయుక్త విలేకరుల సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చోపచర్చలు సాగాయి. సంయుక్త ప్రకటనను ఇరుదేశాల ఉన్నతాధికారులు సిద్ధం చేయగా, దానికి ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు బరాక్ ఒబామా ఇద్దరూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామా ఎప్పుడొస్తారా అని చాలాసేపు బయట ఇరు దేశాల మంత్రులు, జాతీయ.. అంతర్జాతీయ మీడియా ఆసక్తిగా ఎదురు చూడటం కనిపించింది. ఈలోపు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు అమెరికా బృందంతో మాటా మంతీ సాగించారు. -
ఒబామా భారత పర్యటన ప్రారంభం
-
ఒబామా చూపిన చొరవ అపూర్వం: మోదీ
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ''అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా ప్రథమ మహిళను భారతదేశానికి ఆహ్వానించడం గర్వకారణం. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అంగీకరించినందుకు కృతజ్ఞతలు. మీరు ఎంత బిజీగా ఉంటారో మాకు తెలుసు. కానీ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య సంబంధాలు ఎలా మారుతాయో దీనివల్ల తెలుస్తుంది. ఈ భాగస్వామ్యంపై మీ కమిట్మెంట్ను ఇది సూచిస్తుంది. రెండు దేశాల సంబంధాల విషయంలో ఎప్పుడూ ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుత డిజిటల్ తరంలో ఇది మరింత దృఢంగా మారింది. ఈ భాగస్వామ్యం విజయవంతం కావడం ప్రపంచ శాంతికి చాలా కీలకం. ప్రారంభం బాగానే ఉంది గానీ.. దీన్ని విజయవంతమైన లక్ష్యం దిశగా తీసుకెళ్లాలి. గడిచిన కొన్ని నెలల్లో ఈ బంధంలో కొత్త విశ్వాసం కనిపిస్తోంది. పౌర అణు ఒప్పందం మన రెండు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకం. దీనివల్ల సరికొత్త ఆర్థిక అవకాశాలు, స్వచ్ఛమైన ఇంధనం లాంటివి సాధ్యమవుతాయి. ఒప్పందం మీద సంతకాలు అయిన ఆరేళ్ల తర్వాత దీనిపై వాణిజ్యపరమైన సహకారం మొదలవుతోంది. అంతర్జాతీయ న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ఉండటానికి మీరు చూపిన చొరవ అపూర్వం. అణు ఎగుమతి దేశాలలో భారతదేశం కూడా చేరేందుకు తనవంతు సాయం తప్పక చేస్తానని ఒబామా చెప్పారు. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల కారణంగా మన స్వదేశీ రక్షణ పరిశ్రమ విస్తరిస్తుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలి. మన రెండు దేశాల్లో ఆర్థికవృద్ధి మరింత బలపడుతోంది. అనుకున్న సమయం కంటే దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా సంయుక్త విలేకరుల సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చోపచర్చలు సాగాయి. సంయుక్త ప్రకటనను ఇరుదేశాల ఉన్నతాధికారులు సిద్ధం చేయగా, దానికి ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు బరాక్ ఒబామా ఇద్దరూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామా ఎప్పుడొస్తారా అని చాలాసేపు బయట ఇరు దేశాల మంత్రులు, జాతీయ.. అంతర్జాతీయ మీడియా ఆసక్తిగా ఎదురు చూడటం కనిపించింది. ఈలోపు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు అమెరికా బృందంతో మాటా మంతీ సాగించారు. -
సినిమా తారలకు అందని ఆహ్వానం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గౌరవార్థం రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో సినిమా తారలు ఎవరూ పాల్గొనడడం లేదు. 250 మంది ప్రముఖులను ఈ విందుకు ఆహ్వానించారు. వీరిలో రాజకీయ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలు ఈ విందులో పాల్గొనున్నారు. నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి, సరోద్ విద్యాంసుడు అమ్జందాద్ అలీ ఖాన్, పర్యావరణవేత్త ఆర్కే పచౌరీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తదితరులను విందుకు ఆహ్వానించారు. కార్పొరేట్ దిగ్గజాలు రతన్ టాటా, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నారాయణమూర్తి, చందా కొచ్చర్, ప్రతాపరెడ్డి విందుకు హాజరుకానున్నారు. -
మోదీ విందులో ఒబామా ఏం తిన్నారు..?
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్‌లో ఒబామా, మోదీ కలసి భోజనం చేశారు. శాఖహారి అయిన మోదీ.. ఒబామా కోసం వెజ్, నాన్‌వెజ్ భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. విందులో వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో రెండు మెనూలు ఏర్పాటు చేశారు. కశ్మీర్ వంటకం నడ్రు కె గూలర్, బెంగాల్ వంట మహి సర్సాన్తో పాటు షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్డ్ వెజిటబుల్ కలోంజి, కెలా మేథీ ను షాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామూన్, పండ్లను సిద్ధంగా ఉంచారు. ఒబామా ఏయే పదార్థాలను రుచి చూశారో బయటకు తెలియరాలేదు. దక్షిణ భారత దేశంలో తాగే కాఫీ, హెర్బల్ టీని అందజేశారు. ఒబామాకు ఈ రోజు రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇవ్వనున్నారు. వెజ్‌తో పాటు నాన్‌వెజ్ వంటకాలను వడ్డించనున్నారు. మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా మెనూలో చేర్చారు. -
పౌర అణు ఒప్పందంలో మేలిమలుపు!
భారత్, అమెరికాల మధ్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పౌర అణు ఒప్పందం ఖరారైపోయింది. ఇందులో అత్యంత ముఖ్యమైన 'ట్రాకింగ్ క్లాజు'ను తొలగించేందుకు అమెరికా అంగీకరించడం ఇందులోని ప్రధానాంశం. భారత అణు ఉపయోగాన్ని తాము పరిశీలించబోమని అమెరికా చెప్పడం మన దేశంలోని చాలామందిని సంతృప్తి పరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఒబామా తన విశేషాధికారాలను ఉపయోగించుకుని ఈ క్లాజును తొలగించినట్లు తెలిసింది. వేరే దేశం నుంచి తెచ్చుకున్న అణు సామగ్రిని అమెరికా కంపెనీలు సరఫరా చేసిన రియాక్టర్లలో ఎలా ఉపయోగిస్తున్నారో కూడా అమెరికా ట్రాక్ చేయబోదు. ఆదివారం సాయంత్రం జరిగే సంయుక్త విలేకరుల సమావేశంలో దీన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అనేక అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు ఒబామాల మధ్య ఇంకా పలు అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకోవడం, రక్షణ రంగ సహకారం లాంటి విషయాలపైనా ఒప్పందాలు కుదరొచ్చని అంటున్నారు. -
ఒబామాకు స్వయంగా టీ కలిపిచ్చిన మోదీ
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రధాని నరేంద్ర మోదీ అవాజ్యమైన అభిమానం కురింపించారు. భారత గడ్డపై అడుగుపెట్టిన ఒబామాకు స్వయంగా స్వాగతం పలికిన మోదీ తర్వాత కూడా అదేరకమైన అభిమానం చూపించారు. హైదరాబాద్ హౌజ్ లో ఒబామాతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మోదీ ఆయనతో కలిసి 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒబామాకు స్వయంగా టీ కలిపి ఇవ్వడం విశేషం. టీ కప్పును స్వహస్తాలతో ఒబామాకు అందించారు. పూర్వాశ్రమంలో మోదీ.. ఛాయ్ వాలా అన్న సంగతి జగద్విదితం. టీ తాగుతూ ఇరువురు అగ్రనేతలు చర్చల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా మోదీ చాలా ఉల్లాసంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. తాను చెప్పాల్సిన విషయాలను ఒబామాకు సూటిగా చెప్పినట్టు తెలుస్తోంది. మోదీ ఆత్మీయ అతిథ్యానికి అగ్రరాజ్యాధినేత ముగ్దులయ్యారు. -
ఒబామాతో మోదీ కీలక చర్చలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో కీలక చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్న భోజనం సమయం సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సరిహద్దు తీవ్రవాదం అంశాన్ని ఈ సందర్భంగా మోదీ లేవలెత్తినట్టు సమాచారం. సరిహద్దులో పాకిస్థాన్, చైనా చొరబాబు గురించినట్టు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లంచ్ తర్వాత ఒబామాతో కలిసి మోదీ 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు. -
ఒబామా పర్యటన 'అతిపెద్ద పరిణామం'
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనపై పాకిస్థాన్ మీడియా కూడా అమితాసక్తి కనబరిచింది. ఒబామా భారత పర్యటనను 'అతిపెద్ద పరిణామం'గా పాకిస్థాన్ పత్రికలు వర్ణించాయి. భారత్-అమెరికా సంబంధాల్లో మొదలైన నూతన అధ్యాయంతో తమకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్ పై ఉందని పేర్కొన్నాయి. భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానుండడం అతిపెద్ద పరిణామమని 'డైలీ టైమ్స్' పేర్కొంది. అమెరికా వ్యూహాత్మకంగా భారత్, పాకిస్థాన్ లతో సంబంధాలు కొనసాగిస్తోందని వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అతపెద్ద ఆర్థిక మార్కెట్ అయిన భారత్ తమకు ఉపయోగపడుతుందని అమెరికా తలపోస్తోందని పేర్కొంది. -
ప్రత్యేక ఆకర్షణగా మిషెల్ ఒబామా!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఒబామా వెంట ఎక్కడికి వెళ్లినా తన ప్రత్యేకత నిలుపుకునే మిషెల్ భారత్ పర్యటనలోనూ దాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. న్యూయార్క్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులు ఆమె ధరించారు. జియోమెట్రిక్- ప్రింట్ బ్లాక్, తెలుపు , నీలం రంగు కలయికతో చూడగానే ఆకట్టుకునేవిధంగా ఈ డ్రెస్ రూపొందించారు. ఇక సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంతో బిభు మహాపాత్ర పేరు గాంచారు. -
హైదరాబాద్ హౌస్ లో మోదీ-ఒబామా చర్చలు
న్యూఢిల్లీ: భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్ లో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజ్ ఘాట్ కు చేరుకున్న ఒబామా.. అక్కడి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్ కు బయల్దేరి వెళ్లారు.ప్రస్తుతం మోదీతో కలిసి ఇక్కడ చర్చలు జరుపుతున్న ఒబామా.. గం.2.45 ని.లకు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించనున్నారు. -
రావిమొక్క నాటిన అధ్యక్షుడు
రాజ్‌ఘాట్‌లో బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అక్కడ ఓ రావిమొక్కను నాటారు. రాజ్‌ఘాట్ సందర్శనకు చిహ్నంగా ఈ మొక్కను నాటారు. సందర్శకుల పుస్తకంలో కూడా తన సందేశం రాశారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, భారతదేశంలో మహాత్మా గాంధీ ఇద్దరూ శాంతియుత పద్ధతుల్లోనే పోరాటాలు చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. బాపూజీ ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ భారత దేశంలో సజీవంగా ఉందని తెలిపారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశానికి ఒబామా హాజరయ్యారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులూ కొద్దిసేపు మాట్లాడుకున్న అనంతరం.. లోపలకు వెళ్లారు. విందుతో పాటే ఇరువురు నాయకుల మధ్య పలు అంశాలపై చర్చలు కూడా సాగుతాయని అధికార వర్గాల సమాచారం. -
మహాత్మా గాంధీకి ఒబామా నివాళి
-
బాపూజీకి నివాళులు అర్పించిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్‌ఘాట్‌కు చేరుకుని, అక్కడ మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి బయల్దేరారు. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్ వద్దకు వచ్చి, నివాళులు అర్పించడం గమనార్హం. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఒబామా బాపూజీకి నివాళులు అర్పించారు. ముందుగా పలువురు భద్రతా దళాధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని అణువణువూ గాలించారు. ఇరుదేశాలకు చెందిన భద్రతా దళాల అధికారులతో పాటు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తదితరులు కూడా ఒబామా వెంట ఉన్నారు. బాపూజీ శాంతియుత పోరాటానికి ఒబామా ఏనాడో ఆకర్షితులయ్యారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తాను చేసిన ప్రసంగంలో కూడా ఆయన గాంధీజీ సిద్ధాంతాలను ప్రస్తావించారు. అలా బాపూజీ అంటే ఎనలేని గౌరవం ఉన్న ఒబామా.. భారతదేశంలో తన రెండో కార్యక్రమంగానే రాజ్‌ఘాట్ సందర్శనను ఎంచుకున్నారు. తొలుత రాష్ట్రపతి భవన్లో స్వాగతం, సైనిక వందనం అనంతరం నేరుగా అక్కడి నుంచి రాజ్‌ఘాట్ వెళ్లారు. ఈ సందర్భంగా రాజ్‌ఘాట్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
రాష్ట్రపతి భవన్లో ఒబామాకు స్వాగతం
-
మహిళా అధికారికి అరుదైన అవకాశం
-
మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం
వింగ్ కమాండర్ పూజా ఠాకూర్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించే అరుదైన అవకాశం దక్కిన ఏకైక మహిళా సైనికాధికారిణి. రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి.. ఆయనను సైనిక వందనానికి తోడ్కొని తీసుకెళ్లిన ఏకైక అధికారిణి పూజా ఠాకూర్ మాత్రమే. ఇరు దేశాల జాతీయగీతాల ఆలాపన పూర్తయిన తర్వాత ముందుగా రాష్ట్రపతి, ప్రధాని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులతో ఒబామా కరచాలనం చేశారు. ఆ తర్వాత అమెరికా అధికారులు, మంత్రులు, ఇతరులతో కూడిన బృందాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఒబామా పరిచయం చేశారు. అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. రాజ్‌ఘాట్‌కు బయల్దేరారు. -
రాష్ట్రపతి భవన్లో ఒబామాకు స్వాగతం
భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా ప్రథమ పౌరుడు బరాక్ ఒబామాకు రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒబామాను స్వాగతించారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్కోర్ట్ ప్రాంతంలో రెడ్ కార్పెట్ పరిచి రాష్ట్రపతి భవన్లో ఒబామాను స్వాగతించారు. ఆయనకు పూర్తిస్థాయి సైనిక వందనం లభించింది. తుపాకులను 21 రౌండ్లు గాల్లోకి పేల్చి.. రిపబ్లిక్ డే అతిథికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ ప్రధాన గేటు వద్ద నుంచి అశ్వికదళం తోడు రాగా ఒబామా ప్రయాణిస్తున్న 'ద బీస్ట్' వాహనం నెమ్మదిగా లోపలకు వచ్చింది. తర్వాత తొలుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్వాగతించారు. అక్కడినుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారిక్కర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు ఉదయమే రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకున్నారు. తొలుత షెడ్యూలు కంటే పావుగంట ముందుగానే వచ్చిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఒబమాకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. విమానశ్రయం నుంచి తొలుత ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లి అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఒబామా.. అటు నుంచి నేరుగా తన 'ద బీస్ట్' కారులో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. -
మౌర్య హోటల్‌కు చేరుకున్న ఒబామా
పాలం విమానాశ్రయం నుంచి ద బీస్ట్ వాహనంలో బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విమానం వద్దకు వచ్చి మరీ ఒబామా దంపతులకు స్వాగతం పలికిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, ఇతర అధికారులు కూడా ఒబామాకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. కాగా, ఒబామా దంపతులు బస చేస్తున్న ఐటీసీ మౌర్య హోటల్ వద్ద కనీ వినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 మీటర్లకు ఒకటి చొప్పున హాలోజన్ దీపాలను ఏర్పాటుచేశారు. అక్కడకు సమీపంలో ఉన్న తాజ్ హోటల్‌ను కూడా భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!
అనుకున్న సమయం కంటే సుమారు అరగంట ముందుగానే వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు న్యూఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలం విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు విమానం వద్దే స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకురావడంతో.. దాని సమీపంలోనే స్వాగత కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముందుగా ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన నరేంద్రమోదీ.. ఆ తర్వాత ఆయనను బలంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోదీతో చేతులు కలిపారు. అనంతరం ఒబామా, మోదీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, ఒబామా బస చేస్తున్న ఐటీసీ మౌర్య హోటల్ బయట పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళానికి చెందిన ప్రత్యేక స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. సమీపంలో ఉన్న తాజ్ హోటల్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
ఒబామాకు.. మోడీ ఘన స్వాగతం
-
భారత్ చేరుకున్న ఒబామా దంపతులు
-
భారత్ వచ్చిన బరాక్ ఒబామా దంపతులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు అధికారులు సర్వ సన్నాహాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది. భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అలాగే, గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే. -
ఒబామా పర్యటన.. దేనికి సంకేతం !?
-
'అమెరికా అధ్యక్షుడిగా కాదు.. వ్యాపారవేత్తగా..'
-
ఒబామా పర్యటన : భద్రతా వలయంలో ఢిల్లీ
-
అమెరికా ‘రావెన్’లు ఇక మేడిన్ ఇండియా!
బెంగళూరులో ఇరు దేశాల సంయుక్త తయారీ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ భారీ ప్రాజెక్టు భారత్‌కు దక్కనుంది. ఇప్పటిదాకా అమెరికా కంపెనీ ఎరో విరోన్‌మెంట్ తయారుచేస్తున్న తేలికపాటి ‘రావెన్’ మానవ రహిత విమానాలు(యూఏవీ) ఇక బెంగళూరులో తయారు కానున్నాయి. దీంతో భారత్‌కు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కనున్నాయి. ఒబామా పర్యటనలో ఇరుదేశాలు దీనిపై ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. రావెన్‌లను ప్రధానంగా నిఘా కోసం వినియోగిస్తారు. వీటిని చేతుల్లో నుంచే గాల్లోకి ఎగరేసే వీలుంటుంది. 10 కి.మీ పరిధిలో నిఘా విధులు నిర్వర్తిస్తాయి. తేలికపాటి రావెన్‌లను భారత్-అమెరికా సంయుక్తంగా బెంగళూరులో తయారు చేస్తాయని, వీటిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఏడు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే సి-130జే రవాణా విమానాలకు సంబంధించిన ‘రోల్-ఆన్, రోల్-ఆఫ్’ టెక్నాలజీ కూడా భారత్‌కు అమెరికా అందించనుంది. భారత్ ఇప్పటికే 12 సీ-130జే హెర్క్యూల్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసింది. అమెరికా అందజేసే టెక్నాలజీతో వీటి సామర్థ్యం మరింత పెరగనుంది. ఈ విమానాలు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కిందకు దిగేందుకు ఈ టెక్నాలజీ దోహదం చేయనుంది. -
భద్రతా వలయంలో ఢిల్లీ
న్యూఢిల్లీ: వెయ్యికి పైగా ఎన్ఎస్జీ కమాండోలు.. 44 వేల మంది భద్రతా సిబ్బంది.. వీరికి తోడు అమెరికాకు చెందిన మరో 1,600 మంది మెరికల్లాంటి రక్షణ సిబ్బంది.. 15 వేల సీసీటీవీ కెమెరాలు..! ఒబామా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో చేసిన భద్రతా ఏర్పాట్లు ఇవీ!! గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని పూర్తిగా భద్రతా బలగాల గుప్పెట్లోకి వెళ్లనుంది. వేడుకలు జరగనున్న రాజ్‌పథ్‌కు రెండు కిలోమీటర్ల ప్రాంతమంతా వెయ్యి మంది ఎన్ఎస్జీ గార్డుల సంరక్షణలో ఉండనుంది. ఎత్తై భవనాలపై నుంచి వీరు డేగకన్నులతో క్షణక్షణం అప్రమత్తంగా ఉంటారు. రాజ్‌పథ్ వద్ద ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 44 వేల మంది పోలీసులు ఉదయం 5 గంటల నుంచే రాజధాని వీధుల్లో గస్తీ నిర్వహిస్తారు. ఈ 44 వేల మందిలో 10 వేల మంది పారామిలటరీ సిబ్బంది కాగా, 30 వేల మంది ఢిల్లీ పోలీసులు. సెంట్రల్, నార్త్, న్యూఢిల్లీ.. ఈ మూడు జిల్లాల్లోనే ఏకంగా 20 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. ఒబామా ఢిల్లీలో అడుగుపెట్టనున్న ఆదివారం రోజున 20 వేల మంది గస్తీ నిర్వహిస్తారు. ఢిల్లీ వ్యాప్తంగా 15 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్ మార్గంపై 18 మీటర్లకు ఒకటి చొప్పున 160 కెమెరాలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో తొలిసారిగా గగ నతల హెచ్చరిక వ్యవస్థ (అవాక్స్) కూడా వినియోగించే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. ఢిల్లీ గగనతలంపై 400 కిలోమీటర్ల పరిధిని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఇంతకుముందు దీన్ని 300 కి.మీగా నిర్ధారించారు. ఈ పెంపుతో వేడుకలు జరుగుతున్నంత సేపు ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, లక్నో, అమృత్సర్ తదితర ఎయిర్‌పోర్టుల్లో విమానాలు ఎగరడానికి వీలుండదు. ఢిల్లీలో ఒబామా విమానం దిగగానే ఆ ప్రాంతాన్ని ఎన్ఎస్జీ, అమెరికా నిఘా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోనున్నారు. ఆయన బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్ వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చే స్తున్నారు. భద్రతా కారణాల రీత్యా 26న కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా మెట్రోరైలు సేవలు నిలిపివేయనున్నారు. చొరబాటుకోసం పొంచి ఉన్న 160 మంది మిలిటెంట్లు శ్రీనగర్: పాకిస్తాన్‌నుంచి భారత్‌లోకి చొరబడేందుకోసం సుమారు 160 మంది మిలిటెంట్లు సరిహద్దుల్లో పొంచి ఉన్నారని భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సుబ్రత షా తెలిపారు. కశ్మీర్ లో సరిహద్దుల్లోని అధీనరేఖవెంట 17 చోట్లనుంచి చొరబాటుకోసం వీరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒబామా పర్యటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 27 రాత్రి 8కి మోదీ, ఒబామాల ‘మన్ కీ బాత్’ న్యూఢిల్లీ: ఒబామాతో కలిసి భారత ప్రధాని మోదీ చేయనున్న ప్రతిష్టాత్మక రే డియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ జనవరి 27న రాత్రి 8 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది. ప్రాంతీయ భాషల్లో జనవరి 28 ఉదయం 9 గంటలకు తిరిగి ప్రసారం అవుతుంది. ఈ ప్రసారాల ఫీడును ఆల్ ఇండియా రేడియో, డీడీలు ఉచితంగా ఇస్తుండటంతో అన్ని రేడియో, టీవీ చానళ్లు ప్రసారం చేసే అవకాశం ఉంది. కాగా, దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒబామా ముందు సాంస్కృతిక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. ఆదివారం రాష్ట్రపతి భవన్లో ఒబామా ముందు వీటిని నిర్వహించనున్నారు. ఒబామాకు వాయుకాలుష్యం సెగ! న్యూఢిల్లీ: బరాక్ ఒబామా సందర్శించనున్న ఢిల్లీలోని ఆరు ప్రాంతాల్లో వాయుకాలుష్యం ప్రమాదరక స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. అది భారత భద్రతా ప్రమాణాలకంటే మూడు రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉందని గ్రీన్‌పీస్ ఇండియా శుక్రవారం జరిపిన ‘పీఎం2.5’ పరీక్షల్లో తేలింది. ఒబామా సందర్శించనున్న జనపథ్‌లో 2.5 మైక్రోమీటర్లకంటే తక్కువ ఉన్న రేణువుల(పీఎం2.5) గరిష్ట స్థాయి క్యూబిక్ మీటరుకు 264 మైక్రోగ్రాములు, హైదరాబాద్ హౌస్ వద్ద 239, రాజ్‌ఘాట్ వద్ద 229 మైక్రోగ్రాములుగా నమోదైందని గ్రీన్‌పీస్ ఇండియా తెలిపింది. పీఎం2.5 రేణువుల కారణంగా కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బులు వస్తాయి. ‘భోపాల్ దుర్ఘటనపై మాట్లాడాలి’ వాషింగ్టన్: భారత పర్యటనలో ఒబామా భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై మాట్లాడాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో వేలాది మంది చనిపోయారని, ఇప్పటికీ వేల మంది దాని దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ అంశంపై ఒబామా మాట్లాడనట్లయితే అమెరికా కంపెనీలు మానవ హక్కులను పట్టించుకోనక్కర్లేదన్న సంకేతం ఇచ్చినట్లేనని తెలిపింది. భోపాల్ ఘటనపై భారత కోర్టుల సమన్లను అమెరికాకు చెందిన డౌ కెమికల్ కంపెనీ ఎందుకు పట్టించుకోలేదో ఒబామా వివరణ ఇవ్వాలంది. కాగా భారత్‌లో క్షీణిస్తున్న మైనారిటీల హక్కులను మోదీతో జరిపే చర్చల్లో లేవనెత్తాలని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఒబామాను కోరింది. పర్యటనను నిరసిస్తూ లెఫ్ట్ ధర్నా సాక్షి,న్యూఢిల్లీ: ఒబామా భారత పర్యటనకు వ్యతిరేకంగా వామపక్షాలు శనివారం ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఢిల్లీలో మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకు లెఫ్ట్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. అమెరికాతో సంబంధాలు దేశానికి ముప్పుతెస్తాయన్నారు. సీపీఎం నేత ప్రకాశ్ కారత్, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు ధర్నాలో మపాల్గొన్నారు. దేశ ఆర్థిక విధానాలు మార్చేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కాగా, కేంద్రం ఆదివాసీల సంక్షేమాన్ని పట్టించుకోనందుకు నిరసనగా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు అఖిల భారత ఆదివాసీ మహాసభ తెలిపింది. అప్పట్లో క్లింటన్‌కూ ఆహ్వానం! న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారైనా భారత్ ఈ ఆహ్వానం పంపడం మాత్రం మొదటిసారి కాదు. 1994లో పీవీ నరసింహారావు హయాంలో గణతంత్ర దినోత్సవానికి రావాల్సిందిగా నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే అమెరికా ఉభయ చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్నందున ఆయన రాలేకపోయారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసన్ వెల్లడించారు. ‘1994 మేలో అమెరికా వెళ్లిన పీవీ.. ఆ దేశాధ్యక్షుడి ఆతిథ్యానికి ముగ్ధుడయ్యారు. భారత్ వచ్చిన తర్వాత.. గణతంత్ర దినోత్సవానికి ఆయనకు ఆహ్వానం పంపాల్సిందిగా నాకు చెప్పారు’ అని తెలిపారు. -
భారత్‌కు బయల్దేరిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ వైమానికదళ స్థావరం నుంచి అధ్యక్షుడి విమానమైన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో భారత్‌కు బయల్దేరారు. ఆయన వెంట అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాతో ఉన్నతస్థాయి ప్రభుత్వ ప్రతినిధుల బృందం కూడా ప్రయాణిస్తోంది. ఒబామా విమానం మార్గంలో ఇంధనం నింపుకోవటం కోసం జర్మనీలోని రామ్‌స్టీన్‌లో కొద్దిసేపు ఆగుతుంది. అక్కడి నుంచి బయల్దేరాక ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని పాలం వైమానికదళ స్థావరంలో దిగుతుంది. ఒబామా మంత్రివర్గ సభ్యులు పలువురు, అమెరికా ప్రతినిధుల సభలో మైనారిటీ నేత (ప్రతిపక్ష నేత) నాన్సీ పెలోసీతో సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభావవంతమైన వాణిజ్యవేత్తలు ఢిల్లీలో ఒబామాతో జత కలుస్తారు. -
నేటి నుంచి భారత్‌లో ఒబామా పర్యటన
* దృఢసంకల్పంతో నవశకానికి * సభలు, సమావేశాలతో మూడు రోజుల పాటు బిజీబిజీ * పౌర అణు ఒప్పందం, సాంకేతికత బదిలీ, రక్షణ రంగంలో భాగస్వామ్యంపై నిర్దిష్ట ఫలితాల సాధనపై ఇరు దేశాల దృష్టి.. * ద్వైపాక్షిక వాణిజ్యంపైనా చర్చలు * వాషింగ్టన్లో బయల్దేరిన ఒబామా.. నేటి ఉదయం ఢిల్లీకి న్యూఢిల్లీ: పౌర అణు ఒప్పందం, సాంకేతికత బదిలీ, రక్షణ రంగంలో సంయుక్త భాగస్వామ్యం అనే అంశాలపై నిర్దిష్టమైన ఫలితాలు సాధించటం మీద.. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటనలో భారత్, అమెరికాలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఒబామా పర్యటనలో అద్భుత ఫలితాలు సాధించాలని ఇరు దేశాలూ గట్టిగా కృషి చేస్తున్నాయి. ఒబామా మూడు రోజుల పాటు తీరికలేకుండా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చలు జరపడం, గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనటం, వాణిజ్య దిగ్గజాలతో సమావేశమవడం, ‘భారత్ - అమెరికా: మనం ఉమ్మడిగా నిర్వించగల భవిష్యత్తు’ అనే అంశంపై ప్రసంగం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడి పర్యటన అనేది తమకు ఇటీలి కాలంలో అత్యంత ముఖ్యమైన దౌత్య కార్యక్రమాల్లో ఒకటని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అభివర్ణించారు. రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, భారతదేశపు విస్తృత పొరుగుప్రాంతంలో పరిస్థితి తదితర అంశాలపై ఒబామా, మోదీల మధ్య చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై ఇరు పక్షాల మధ్య ఉన్న విభేదాల గురించి ప్రశ్నించగా.. ఇంతకుముందటి సంప్రదింపుల్లో పురోగతి సాధించామని, అత్యంత ముఖ్యమైన అణు రంగంలో అమెరికాతో కలిసి సమర్థవంతంగా కృషి చేసేందుకు భారత్ ఎదురుచూస్తోందని అక్బరుద్దీన్ బదులిచ్చారు. ‘అణు బాధ్యత’ ఆటంకాలు తొలగినట్లే..! అణు విద్యుత్ ప్లాంట్లలో అణు ప్రమాదాలేవైనా జరిగినట్లయితే సంబంధిత అణు సరఫరాదారులే నేరుగా బాధ్యత వహించాలని భారత్ చేసిన ‘అణు బాధ్యత చట్టం’ నిర్దేశిస్తోంది. అయితే.. ఈ విషయంలో సదరు ప్లాంటు నిర్వాహకులే ప్రాథమిక బాధ్యత వహించాలన్న అంతర్జాతీయ విధానాలను భారత్ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు కోరుతున్నాయి. దేశంలో అణు విద్యుత్ ప్లాంట్లన్నిటినీ నిర్వహిస్తున్నది ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంతర్జాతీయ విధానాలను అనుసరించడం అంటే.. ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. భారత అణు బాధ్యత చట్టం ప్రకారం అణు సరఫరాదారుల బాధ్యత అనేది అపరిమితంగా ఉండటం కూడా అంతర్జాతీయ అణు సరఫరాదారులకు బీమా కల్పించేవారిని ఒప్పించడం కష్టంగా మారింది. ఈ అంశాలపై ఇటీవల లండన్‌లో జరిగిన భారత్ - అమెరికా కాంటాక్ట్ గ్రూప్ జరిపిన రెండు రోజుల సమావేశంలో పురోగతి సాధించటం జరిగిందని, మరికొన్ని అంశాలపై రాజకీయ స్థాయిలో పరిష్కారం అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాణిజ్యం, వాతావరణంపైనా చర్చలు... వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గల మార్గాలతో పాటు, కీలకమైన వాతావరణ మార్పు అంశంపైనా ఇరు దేశాలూ చర్చలు జరుపుతాయి. ద్వైపాక్షిక వాణిజ్యం గత దశాబ్ద కాలంలో ఐదు రెట్లు పెరిగి 100 బిలియన్ డాలర్లకు చేరిందని అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ కొద్ది రోజుల కిందట పేర్కొన్నారు. ఇది 2020 నాటికి మరో ఐదు రెట్టు పెరిగి 500 బిలియన్ డాలర్లకు చేరుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. 2020 సంవత్సరానికి భారతీయులందరికీ 24 గంటల పాటూ విద్యుత్‌ను సరఫరా చేయాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి మద్దతిచ్చేందుకు పౌర అణు సహకార ఒప్పందాన్ని అమలు చేయటం కోసం అమెరికా ఎదురుచూస్తోందని రిచర్డ్ చెప్పారు. మోదీ, ఒబామాల మధ్య చర్చల్లో వాతావరణ మార్పు అంశం కూడా వస్తుందని భావిస్తున్నారు. ఆదివారం ఇరు దేశాల అగ్రనేతల చర్చల నేపథ్యంలో.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వం హరిత అంశాలపై ఒత్తిళ్ల కింద పనిచేయదని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా గత సాధారణ ఎన్నికల్లో గొప్ప ఆకాంక్షలతో ఓట్లు వేసిన లక్షలాది మంది పేద ప్రజలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు అంశానికి సంబంధించినంత వరకూ భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోందన్న మాటలను ఆయన కొట్టివేశారు. తాజ్‌మహల్ సందర్శన రద్దు ఎల్లుండి ఢిల్లీ నుంచి రియాద్‌కు భారత పర్యటనకు సతీసమేతంగా వస్తున్న ఒబామా ఈ పర్యటనలో ఆగ్రాలోని ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను కూడా సందర్శించేలా తొలుత షెడ్యూల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే.. సౌదీ అరేబియా పాలకుడు కింగ్ సాల్మన్ బిన్ అబ్దులజీజ్ను, ఆయన కుటుంబాన్ని కలిసి దివంగత కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ మృతికి సంతాపం తెలియజేసేందుకు ఈ నెల 27వ తేదీ (మంగళవారం) నాడు రియాద్ వెళ్లేలా ఒబామా పర్యటనలో మార్పులు చేసుకోవడంతో.. తాజ్‌మహల్ సందర్శన కోసం ఉద్దేశించిన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నారు. తాజ్‌మహల్‌ను సందర్శించలేకపోవటం పట్ల ఒబామా విచారం వ్యక్తంచేస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి తరఫున దేశ ఉపాధ్యక్షుడు ఒక ప్రతినిధి బృందంతో ఈ నెల 27వ తేదీన రియాద్ వెళ్లేలా ప్రణాళిక రూపొందించటం జరిగిందని.. అయితే ఉపాధ్యక్షుడు రియాద్‌లో దిగే సమయానికి, ఒబామా భారత్ నుంచి బయలుదేరుతున్నట్లు షెడ్యూలు పూర్తిగా ఖరారయ్యాక తేలిందని.. కాబట్టి ఉపాధ్యక్షుడి రియాద్ పర్యటనను రద్దుచేసి, ఒబామా భారత్ నుంచి నేరుగా రియాద్ వెళ్లేలా పర్యటనలో మార్పులు చేసినట్లు శ్వేతసౌధం జారీచేసిన ప్రకటనలో వివరించింది. సంబంధాలు బలపడతాయి ప్రణబ్‌కు ఒబామా రిపబ్లిక్ డే సందేశం న్యూఢిల్లీ: భారత్, అమెరికాలు తమ రాజ్యాంగాల్లో నిర్దేశించుకున్న ప్రజాస్వామ్య విలువలు ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు 21వ శతాబ్దిలో బలోపేతమవటం కొనసాగుతుందని ఒబామా పేర్కొన్నారు. భారత 66వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షల సందేశం పంపించారు. ‘గణతంత్ర భారత్ 65 ఏళ్ల కిందట రాజ్యాంగాన్ని అమల్లోకితెచ్చినప్పటి నుంచీ సుసంపన్న, విభిన్న సాంస్కృతిక సంపదను గౌరవిస్తూ ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించింది. మన గొప్ప ప్రజాస్వామ్యాల (దేశాల) సంబంధాలను బలోపేతం చేసేందుకు, 21వ శతాబ్దిలో మన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. మన రాజ్యాంగాల్లోని ప్రజాస్వామిక విలువలు ప్రాతిపదికగా దీన్ని కొనసాగిస్తాం. రిపబ్లిక్ డే వేడుకల్లో భారత ముఖ్య అతిథిగా పాల్గొనటం గొప్ప గౌరవం. మిషెల్, నేను మళ్లీ భారత్‌కు రావాలని, 2010 నాటి మా పర్యటనలో లభించిన ఔదార్యం, ఆతిథ్యం, సౌందర్యం మళ్లీ ఆస్వాదించాలని చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ఒబామా మూడు రోజుల కార్యక్రమాలు ఇవే!
న్యూఢిల్లీ: సతీసమేతంగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీలు ఒబామాకు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఒబామా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అక్కడే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి మధ్యాహ్న భోజన సమావేశంలో ఒబామా పాల్గొంటారు. అక్కడే మోదీతో కలిసి 'వాక్ అండ్ టాక్'(నడుస్తూ చర్చించుకోవడం)లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇరు దేశాలకూ చెందిన విస్తత స్థాయి ప్రతినిధులతో కలిసి ఇరువురు నేతలూ దాదాపు గంట సేపు సమావేశమవుతారు. సాయంత్రం ఐటీసీ మౌర్య హోటల్లో అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబాలతో ఒబామా సమావేశమవుతారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చే ప్రభుత్వ విందుకు ఒబామా హాజరవుతారు. సోమవారం రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒబామా సతీసమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చే 'ఎట్ హోం' కార్యక్రమంలో ఒబామా దంపతులు పాల్గొంటారు. మధ్యాహ్నం అమెరికా - భారత్ వాణిజ్య శిఖరాగ్ర సదస్సులో సీఈఓ ఫోరం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఒబామా, మోదీలు పాల్గొంటారు. మంగళవారం సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తారు. అనంతరం సౌదీ అరేబియాకు బయల్దేరి వెళతారు.