Odisha Latest News
-
తాబేళ్ల ఆగమనం!
● సంతానోత్పత్తి సీజన్ కావడంతో అధికారుల ఆంక్షలు ● తీర ప్రాంతంలో చేపల వేట నిషేధం ● మే 31వ తేదీ వరకు కొనసాగింపు భువనేశ్వర్: రాష్ట్ర సముద్ర తీర ప్రాంతం తాబేళ్లకు పురిటిల్లుగా ప్రసిద్ధి. అపురూపమైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతి తీర ప్రాంతాల్లో విశేషంగా వృద్ధి చెందుతుంది. పర్యావరణ అనుకూలతతో సంరక్షణ వ్యవస్థ ఈ సంతతి వృద్ధికి దోహదపడుతుంది. సుదూర తీర ప్రాంతాల నుంచి అధికంగా ఆలివ్ రిడ్లే తాబేళ్లు రాష్ట్రంలోని తీర ప్రాంతానికి సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. ఏటా నవంబర్ నెల నుంచి ఇవి రావడం ఆరంభం అవుతుంది. ఆగమనం నుంచి గుడ్డు పెట్టి వాటిని పొడిగి పిల్లలు అయ్యేసరికి ఏడు నెలలు పడుతోంది. ఈ సమయంలో తాబేళ్లు గూళ్లు కట్టి గుడ్లు పెట్టడం, పొదగడం పూర్తి అవుతుంది. గుడ్లు పెట్టేందుకు చాలా దూరం నుంచి గుట్టలు గుట్టలుగా తరలి వచ్చిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు కొత్త సంతానంతో మారుమూల ప్రాంతాలకు తరలి వెళ్తాయి. రాష్ట్రంలో గహిర్మం్ అభయారణ్య సుమద్ర తీరం, రుషి కుల్య సాగర తీరం, ధామ్రా బీచ్, దేవీ నదీ సముద్ర సంగమ తీరం ఆలివ్ రిడ్లే సంతతి విస్తరణకు అనుకూలమైన తీర ప్రాంతాలు. ఏటా నవంబర్ నెల ఆరంభం నుంచి మే నెల ఆఖరు వరకు వందల కొద్దీ నాటికల్ మైళ్ల దూరం నుంచి ఈ తీర ప్రాంతాలకు చేరుతాయి. పెట్టిన గుడ్లు పొదిగేంత వరకు ఈ తీరంలో ఈదులాడుతు కొత్త సంతానానికి ఈ ప్రాంతం నుంచి ప్రపంచపు వెలుగులు పరిచయం చేసి వెనుదిరుగుతాయి. వీటి ఆగమనం నుంచి తిరోగమనం వరకు కంటికి రెప్పలా సంరక్షణ యంత్రాంగం నిర్వీరామంగా శ్రమిస్తుంది. చేపల వేట నిషేధం ఆలివ్ రిడ్లే సంతతి వృద్ధి పురస్కరించుకుని తీర ప్రాంతాల్లో చేపల వేట పూర్తిగా నిషేధిస్తారు. సుమారు ఏడు నెలలు ఈ ఆంక్షలు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో ప్రభావిత మత్స్యకారులకు ప్రభుత్వం సముచిత పరిహారం చెల్లిస్తుంది. ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడిన వారి వ్యతిరేకంగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం తదితర అనుబంధ చట్టాల కింద కఠిన చర్యలు చేపడుతుంది. చేపల వేట సందర్భంగా ట్రాలర్ల వినియోగం అమాయక తాబేళ్లకు ప్రాణ హానిగా పరిగణించి చేపల వేట పూర్తిగా నిషేధిస్తారు. ఆలివ్ రిడ్లే ఆవాస తీర ప్రాంతాల్లో 20 కిలో మీటర్ల సువిశాల పరిధిలో చేపల వేట నిషేధం ఆంక్షలు జారీ అయ్యాయి. ఈ ఆంక్షలు వచ్చే ఏడాది మే నెల 31వ తేదీ వరకు నిరవధికంగా కొనసాగుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైరెన్ ఠాణా పోలీసుల ప్రత్యక్ష పర్యవేక్షణలో తాబేళ్ల సంరక్షణ కార్యకలాపాల్ని అటవీ, పర్యావరణ శాఖ నిర్వహిస్తుంది. మార్చి నుంచి... నవంబర్ నుంచి తీర ప్రాంతానికి చేరే తాబేళ్లు సాధారణంగా ఏటా మార్చి నెల నుంచి గుడ్లు పెట్టడం ఆరంభిస్తాయి. అనంతరం మే నెలాఖరు సరికి పొడగం పూర్తి కావడంతో సురక్షితంగా వెనుదిరుగుతాయి. -
ఈ పాపం ఆకలిది
భువనేశ్వర్: స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో ఆకలి చావులు ఇంకా వెలుగు చూస్తున్నాయి. దీపావళి నాడు దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే కంధమాల్ జిల్లాలో ఓ చీకటి ఘటన బయటపడింది. కూటికి బియ్యపు గింజలు కొరవడి పొట్ట నింపుకునేందుకు మామిడి బద్దల జావ తాగడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆహార భద్రత రేషను కార్డుల పునఃపరిశీలన పురస్కరించుకుని గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషను కింద బియ్యం పంపిణీ నిరవధికంగా నిలిపి వేసింది. ఆకలిని తాళలేక ఎండలో ఆరబెట్టి పదిలపరచుకున్న మామిడి బద్దలు చేర్చి కొద్దిపాటి బియ్యంతో జావ వండుకుని దినం గడుపుకుంటున్న గడ్డు పరిస్థితులు ఇద్దరు మహిళల ప్రాణాల్ని పొట్టబెట్టుకున్నాయి. కంధమల్ జిల్లా దారింగిబాడి మండలం గొద్దాపూర్ పంచాయతీ మొండిపొంకా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మామిడి బద్దల జావ ఆరగించి ఇద్దరు మహిళలు కన్ను మూశారు. సుమారు 10 మంది అనారోగ్యం పాలవ్వగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బరంపురం ఎమ్కేసీజే ఆస్పత్రిలో చికిత్స పొందుతు మహిళ రుమితా పట్టొమాఝి మృతి చెందింది. చికిత్స కోసం తరలిస్తుండగా దివ్యాంగ యువతి రుణు మాఝి మృతి చెందడం విచారకరం. మరో 6 మంది విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. నేరం ఆకలిది.. రాష్ట్రంలో ఆహార భద్రత లోపానికి ఈ సంఘటన అద్దం పడుతుంది. గత 3 నెలలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఆహార భద్రత రేషను కింద బియ్యం పంపిణీ కావడం లేదు. బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబం మామిడి టెంకల జిగురుతో కడుపు నింపుకుని పబ్బం గడుపుకోవాల్సి వచ్చింది. ఈ దయనీయ పరిస్థితి నిండు ప్రాణాల్ని బలిగొందని ప్రత్యక్ష సాక్షుల కథనం. గత 3 నెలలుగా బియ్యం పంపిణీ లేకపోవడంతో మామిడి టెంకలతో పొట్ట నింపుకుంటున్నామని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించింది. ప్రత్యేక వైద్య బృందాన్ని ప్రభావిత గ్రామానికి తరలించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టరు విజయ్ మహాపాత్రో తెలిపారు. ఈ సంఘటనలో 8 మంది అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆహార కాలుష్యంతో ఈ సంఘటన చోటు చేసుకుందని భావిస్తున్నారు. వైద్య బృందం పరిశీలన ఆధారంగా ఈ సంఘటన పూర్వాపరాలు స్పష్టమవుతాయని నిరీక్షిస్తున్నారు. దర్యాప్తునకు ఆదేశాలు: మంత్రి ఈ సంఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ తెలిపారు. స్థానిక జిల్లా ప్రధాన వైద్య అధికారి, ఆరోగ్య శాఖ డైరెక్టరు దర్యాప్తు నిర్వహిస్తారు. మృతుల పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. మామిడి బద్దల జావ తాగి ఇద్దరు మృతి మరో ఆరుగురి పరిస్థితి విషమం -
ఉత్తమ అవినీతి నిరోధక అధికారికి సత్కారం
జయపురం: రాష్ట్రంలో ఉత్తమ అవినీతి నిరోధక విజిలెన్స్ ఎస్పీగా ముఖ్యమంత్రి నుంచి అవార్డు నందుకున్న కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం ఎస్పీ ప్రత్యూష్ కుమార్ ద్వివేదిని ఆయన కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించారు. కొరాపుట్ విజిలెన్స్ డివిజన్లో గల ఆరు జిల్లాలు కొరాపుట్, నవరంగపూర్, రాయగడ, మల్కన్‌గిరి, నువాపడ, కలహండిలలో 2023 లో ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం గల 13 కేసులు పట్టుకున్నారు. అలాగే లంచం తీసుకుంటుండగా 17 కేసులు, ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన ఉద్యోగులపై 11 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన కేసుల్లో బొయిపరిగుడ పోలీసు అధికారి సుశాంత కుమార్ శతపతి నుంచి రూ.37 లక్షలు స్వాధీనం చేసుకోగా.. మృత్తికా సంరక్షణ అధికారి కిశోర్ చంద్ర నాయిక్ నుంచి రూ.11.44 లక్షలు పట్టుకున్నట్లు గుర్తు చేశారు. గత ఏడాది కొరాపుట్ విజిలెన్స్ డివిజన్లో ఎక్కువ కేసులు పట్టుకున్నందుకు అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. -
ప్రాచీన చెరువు పునరుద్ధరణకు శంకుస్థాపన
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామంలో అతి పురాతన చెరువు పునరుద్ధరణకు జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి శుక్రవారం శంకుస్థాపన చేశారు. జయపురం సమితి అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాహిణీపతి మాట్లాడుతూ ఈ చెరువు నిర్లక్ష్యానికి గురవుతున్నందున స్థానికులు పునరుద్ధరించాలని కోరుతున్నారని, ఎట్టకేలకు వారి కోరిక నెరవేరుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో చెరువును పర్యాటక స్థలంగా మారుస్తామని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, సమితి ఉపాధ్యక్షుడు గణేష్ పాఢీ, ఉమ్మిరి సర్పంచ్ సబిత నాయిక్, జయపుర బీడీఓ శక్తి మహాపాత్రో, ప్రభుత్వ కార్యనిర్వాహక ఇంజనీర్ విశ్వనాథ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ దాడులు.. యువ వ్యాపారి మృతి
జయపురం: జీఎస్టీ అధికారులు దాడుల ఒత్తిళ్లు భరించలేక ఓ యువ వ్యాపారి చనిపోయిన ఘటన జయపురంలో కలకలం రేపింది. దీంతో స్థానిక వ్యాపారులు శనివారం వ్యాపార సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వేదికలో నిర్వహించిన అత్యవసర పత్రికా ప్రతినిధుల సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు వి.ప్రభాకర్ ఈ విషయం వెల్లడించారు. మైన్ రోడ్డులో గల న్యూ వాసవీ బంగారు షాపు యజమాని షాపుపైన ఇంటిపైన రెండు రోజుల కిందట జీఎస్టీ అధికారులు దాడి జరిపారని, అందుకు మనస్తాపానికి గురై ఆ షాపు యజమాని పి.హర ప్రసాద్ (42) అస్వస్థతకు గురై స్థానిక ప్రైవేటుఆస్పత్రిలో చేరి కన్నుమూశారని తెలిపారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్‌కు పిలుపునిచ్చిందని తెలిపారు. అధికారులకు కేవలం పండగల సమయంలోనే వ్యాపార వాణిజ్య సంస్థలపై దాడులు జరుపటం పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు. బంద్ నుంచి పాఠశాలలు, బస్సులు, ఇతర వాహనాలు, అత్యవసర సర్వీసులు మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కార్యదర్శి డి.మాధవ, డైరెక్టర్లు కె.రామకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, కె.ఈశ్వర రావు, లోకనాథ్ పాఢీ తదితరులు పాల్గొన్నారు. -
రహస్యమేమీ లేదు
రత్న భాండాగారంలో...● స్పష్టం చేసిన మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ● కార్తీకం తర్వాత నిర్వహణ కార్యకలాపాలుభువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథ మందిరం రత్న భాండాగారంలో ఊహించిన మేరకు ఎటువంటి రహస్యం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం స్పష్టం చేశారు. రత్న భాండాగారం లోపల సొరంగం, లెక్కకు చిక్కని నిధి వంటి పలు రహస్యాలు ఉంటాయని కొన్ని వర్గాలు విస్తారంగా ప్రసారం చేశాయి. ఇవి అవాస్తవమని తేలిందని మంత్రి తెలియజేశారు. పవిత్ర కార్తీక మాసం తర్వాత రత్న భాండాగారం నిర్వహణ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రత్న భాండాగారం వెలుపల, లోపలి భాగాల నిర్వహణ పనులు పూర్తి చేయనున్నారు. భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఈ పనులు చేపడుతుంది. త్వరలో రత్న భాండాగారం పరిశీలన సమగ్ర నివేదిక ప్రచురితం అవుతుందన్నారు. ● ఆభరణాల లెక్కింపు శ్రీజగన్నాథ రత్న భాండాగారంలోని అమూల్య సంపద లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు. కొత్త సంవత్సరంలో ఈ పనులు ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భాండాగారం గోడలు బీటలు వారినట్లు ప్రాథమిక సమాచారం. రత్న భాండాగారం వెలుపల, లోపల మరమ్మతులు, నిర్వహణ ఇతరేతర అనుబంధ కార్యకలాపాలు పూర్తి కావడంతో ఆభరణాల లెక్కింపు ప్రారంభించడం జరుగుతుంది. లెక్కింపు పూర్తయ్యాక లోగడ సిద్ధం చేసిన లెక్కింపు వివరాలతో సరి తూయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఆభరణాల లెక్కింపు ఆరంభమైన 7 రోజుల్లో సమగ్ర నివేదిక వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ● రద్దీ దృష్ట్యా... కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీమందిరం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం ముగిసిన తర్వాత రత్న భాండాగారం పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అది మొదలుకొని సుమారు నెలన్నర రోజులపాటు ఈ పనులు కొనసాగుతాయని భారత పురావస్తు శాఖ అంచనా. దీర్ఘకాలం తర్వాత ఈ ఏడాది జులై 14వ తేదీన తొలిసారిగా రత్న భాండాగారం తెరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11 మంది సభ్యుల బృందం రత్న భాండాగారం లోనికి అడుగిడింది. దీనిలో చెక్క పెట్టెలు, బీరువాలు ఉన్నట్లు ఈ బృందం గుర్తించింది. మరోమారు జులై 18వ తేదీన లోపలి రత్న భాండాగారం తెరిచి క్షుణ్ణంగా పరిశీలించడంతో 3 చెక్క పెట్టెలు మరియు 4 బీరువాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీటిలో ఒకటి స్టీలు బీరువా, మిగలిన 3 చెక్క బీరువాలు ఉన్నాయి. అలాగే 2 చెక్క పెట్టెలు, 1 ఇనుప పెట్టె ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ శయన సామగ్రి భద్రపరిచే ఖొట్టొసెజ్జొ గృహానికి తరలించి గట్టి భద్రత మధ్య తాత్కాలికంగా పదిలపరిచారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) రత్న భాండాగారం లోపల, వెలుపల లేజరు స్కానింగ్, రాడార్ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. -
వేదన
రాయగడ: గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఒక రోగిని మంచంపై 5 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లిన ఘటన జిల్లాలోని కాసీపూర్ సమితి కొడిపారి పంచాయతీ భెజాపొదొరొ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని జమ్ము మాఝి భార్య మోర్చి మాఝి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గ్రామస్తులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో 5 కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తప్పనిసరి పరిస్థితిలో మంచంపై రోగిని ఉంచి మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను కాసీపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. రహదారి సౌకర్యాలు లేకపోవడంతో ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటుండడం పరిపాటిగా మారింది. -
కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం
రాయగడ: స్థానిక జగన్నాథ మందిరం సమీపంలోని ఓ కిరాణా దుకాణలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం యజమాని సంతోష్‌కుమార్ బెహర ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్‌ను విక్రయించేందుకు వాటిని బయట పెట్టాడు. దీపావళి పండుగ సందర్భంగా అక్కడి వారు బాణసంచా కాలుస్తున్న సమయంలో నిప్పురవ్వ ఎగిరిపడి దుకాణంపై పడడంతో మంటలు వ్యాపించాయి. పెట్రోల్‌తో ఉన్న బాటిళ్లు కింద పడడంతో ప్రమాద తీవ్రతమరింత పెరిగింది. స్థానికులు సుమారు గంట శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే దుకాణంలోని సామాన్లు, ప్రిజ్ వంటివి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రమాదానికి కారణాలు తెలుసుకుని వెనుతిరిగారు. ఇదిలాఉండగా పట్టణంలోని పలు దుకాణాల్లో పెట్రోల్‌ను విడిగా బాటిళ్లలో పోసి విక్రయిస్తున్నారు. ఇటువంటి తరహా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో అగ్నికి ఆజ్యం పొసినట్లవుతుంది. కిరాణా దుకాణాల్లో పెట్రోల్ విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కొరుతున్నారు. -
యువకుడి చేతిలో చిన్నాన్న హతం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధిలో గల బంఝిగూఢ గ్రామం భీమ మాడి (53)అనే వ్యక్తిని తన అన్న కొడుకు లచ్చ మాడి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం భీమ మాడి ఆవు లచ్చ మాడి పొలంలోకి వెళ్లి మేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై గొడవ వరకు వెళ్లింది. ఆ గొడవలో లచ్చ మాడి గొడ్డలితో తన చిన్నాన్న భీమతలపై కొట్టగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శుక్రవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. లచ్చ మాడిపై హత్య చేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతిజయపురం: జయపురం పట్టణ 26వ జాతీయ మార్గంలో గల ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైక్‌లు ఢీకొని ప్రమాదం జరగ్గా అదే సమయంలో ఒక టిప్పర్ ఒక బైక్ పై ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను మరణించాడు. ఆ సంఘటన చూసిన స్థానికులు టిప్పర్ డ్రైవర్‌పై దాడి చేయడంతో అతను గాయపడ్డాడు. ప్రమాద సమాచారం తెలిసిన పోలీసులు చేరుకుని.. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సంఘటనలో మరణించిన వ్యక్తిని నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి పంచరపరా గ్రామం కోలనీ బలరాం హంతాల్(50)గా గుర్తించారు. బైకిస్టు కొరాపుట్ సదర్ పోలీసు స్టేషన్ పరిధి దేవ్గాం గ్రామం రమేష్ ఖొర(35)అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో గాయపడిన వారు పంచరపరా గ్రామ కోలనీ ఘాశీరాం హంతాల్(35) కాగా మిగతా వారు జయపురం సదర్ పోలీసు స్టేషన్ అంబాగుడ గ్రామానికి చెందిన మను హరిజన్(21), దిలీప్ హరిజన్(16), సంజీవ్ హరిజన్(19) అని పోలీసులు తెలిపారు. అంబాగుడ నుంచి ముగ్గురు ఒక బైక్ పై వస్తుండగా జయపురం నుంచి నవరంగపూర్ రాయిఘర్కు వెళ్తున్న బైక్ ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించారు. జేసీబీని దగ్ధం చేసిన దుండగులు రాయగడ: జిల్లాలోని సదరు సమితి జిమిడిపేట పంచాయతీ పరిధి పత్రాపుర్ గ్రామం నాగావళి నదీ తీరంలో ఇసుక రీచ్‌లో నిలిపి ఉన్న జేసీబీని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. గురువారం అర్ధరాత్రి కొంత మంది దీనికి నిప్పుపెట్ట తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న శశిఖాల్ ఐఐసీ మున్ని ఆచార్య సంఘటన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఎవరు.. ఎందుకు తగలబెట్టారో అనే కోణంలొ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జేసీబీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. భువనేశ్వర్‌లో భారీ అగ్ని ప్రమాదం ● అండర్‌గ్రౌండ్ దుకాణాలు దగ్ధం భువనేశ్వర్: భువనేశ్వర్‌లో భారీ అగ్ని ప్రమాదం గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక యూనిట్–1, 2 అంగడి సముదాయాల అనుసంధాన భూగర్భ దుకాణాల సముదాయం అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువైన వస్తుసామగ్రి బూడిదైంది. వీటిలో ఆరు బట్టల దుకాణాలు మంటలకు ఆహుతయ్యాయి. అగ్నిమాపక దళం సుమారు నాలుగు గంటలు నిర్వీరామంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. -
●శ్రీ క్షేత్రంలో కాగడా దీపావళి
కూలీల వాహనం బోల్తా సోంపేట: మండలంలోని కొర్లాం సబ్‌స్టేషన్ సమీపంలో బారువ– కొర్లాం రహదారిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. బారువ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం పూర్ణశాసనాం గ్రామానికి చెందిన దినసరి కూలీలు బారువ మేజర్ పంచాయతీ దాసరిగూడెం వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల కోసం బొలెరో వాహనంలో బయల్దేరారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కొర్లాం సబ్‌స్టేషన్ సమీపంలో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కూలీలంతా కిందపడి గాయాలు కావడంతో వెంటనే బారువ సామాజిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ బాలకృష్ణ, దుర్యోధన ప్రథమ చికిత్స నిర్వహించారు. ఎం.గాయత్రి, ఎం.సున్నమ్మ, శకుంతల బెహరా, ఎం.దమయంతి, ఎం.రుక్ష్మిణిలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం జెమ్స్‌కు తరలించారు. బబ్బి బెహరా, కై లాస్ బెహరా, ఎం.కేశమ్మ, తిలోత్తమ బెహరా, రాజేశ్వరి బెహరా, రాజు బెహరాలను టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కంచిలి ఎంపీపీ పైలదేవదాస్ రెడ్డి, శాసనాం సర్పంచ్ వేణు, సోంపేట మండల నాయకులు బుద్దాన శ్రీకృష్ణ సామాజిక ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బారువ ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 11 మందికి గాయాలు కొర్లాం–బారువలో రోడ్డులో ఘటన -
జిల్లా అండర్–14 క్రికెట్ జట్టు ప్రతిభ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బాలుర అండర్–14 క్రికెట్ జట్టు సమష్టిగా రాణిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా వేదికగా ఏసీఏ అంతర్‌జిల్లాల అండర్–14 బాలుర మల్టీడేస్(త్రీడేస్ మ్యాచ్‌లు) క్రికెట్ టోర్నమెంట్లె నవంబర్ 1న కృష్ణా జిల్లాతో జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీకాకుళం జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలుత టాస్ గెలిచిన కృష్ణా జిల్లా శ్రీకాకుళం బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. శ్రీకాకుళం జట్టులో శిమ్మ సాత్విక్ 3 వికెట్లతో విజృంభించగా, ఎల్.సాయిఆదిత్య, సీహెచ్ శ్రీయోజిత్ చెరో రెండు వికెట్లు , జె.హర్షవర్ధన్,ఎస్వీ ప్రేరణ్ తలా వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన శ్రీకాకుళం జిల్లా తొలిరోజు ఆటముగిసే సమయానికి 34 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. జట్టులో నల్లా జోగేంద్ర 33 పరుగుల తో, ఎస్వీఎస్ వివేక్నందా 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా రెండు రోజులాట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లోను విజయసాధించి పాయింట్ల పట్టికలో ముందు వరుసలో నిలుస్తామని జిల్లా జట్టు మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. -
పండగ రోజు విషాదం
భోగాపురం: దీపావళి పండగ రోజున మండలంలోని కొండ్రాజుపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల దానయ్య(15) అనే బాలుడు రామచంద్రపేట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం దీపావళి పండగ రోజు సెలవు కావడంతో తన స్నేహితులతో కలిసి గురువారం ఉదయం సముద్రంలో స్నానానికి వెళ్లాడు. సముద్రపు అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడడంతో అలల ధాటికి బాలుడు గల్లంతయ్యాడు. ఇది గమనించిన తోటి స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు హుటాహుటిన సముద్రం లోపలికి వెళ్లి బాలుడు కోసం వెతికారు. బాలుడు ఆచూకీ ఎంతకీ కానరాకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేసారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ కిషోర్‌కుమార్ గ్రామానికి చేరుకుని మైరెన్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం బాలుడు మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. బాలుడు తల్లిదండ్రులు దానమ్మ, తాతయ్యలు కుమారుడి మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించిన తీరు అందరినీ కలిచి వేసింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి, సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉండి అదుకుంటామని వారికి ధైర్యం చెప్పారు. -
కొలువుదీరిన కాళీమాత
భువనేశ్వర్: పూరీ జిల్లా అత్యంత పుణ్య ప్రదమైన క్షేత్రాలతో భాసిల్లుతోంది. ఈ జిల్లాలో శక్తి క్షేత్రాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. పూరీ పరిసర ప్రాంతాల్లో కాళీమాత అక్కాచెల్లెళ్లుగా పూజలందుకోవడం విశేషం. కామరూప, ఉగ్రతార, దక్షిణ కాళీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. వీరిలో కామరూప పెద్దక్క, ఉగ్రతార చిన్నక్క, దక్షిణ కాళీ చెల్లెలుగా వెలుగొందుతోంది. దీపావళి పురస్కరించుకుని ఆయా క్షేత్రాల్లో ప్రత్యేక శక్తి ఆరాధనలు విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పూరీ జిల్లా బీర ప్రతాప్పూర్ ప్రాంతంలో అక్క కామరూప, సమజాజ్ పూర్లో చిన్నక్క ఉగ్రతార, బీర గోవింద పూర్ గ్రామంలో చెల్లెలు దక్షిణ కాళీ కొలువుదీరి ఉన్నారు. కాళీమాత పూజలు ప్రారంభం పర్లాకిమిడి: స్థానిక కటికవీధి నెహ్రూ జంక్షన్ వద్ద దీపావళి రోజైన గురువారం నుంచి కాళీమాత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 50 ఏళ్లుగా నెహ్రూ జంక్షన్లో దీపావళి నుంచి జరుపుతున్నారు. కార్తీక మాసంలో కాళీదేవిని ఆరాదిస్తే అంతా శుభం జరుగుతుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. తెలుగు సోండి వీధి వద్ద అమవాస్య అర్ధరాత్రి నుంచి కాళీ మందిర్‌లో కూడా పూజలు ప్రారంభించారు. కాళీమాతా పూజలు పదిరోజుల పాటు నిర్వహిస్తామని, రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, పూజా కమిటీ అధ్యక్షులు భరత్ భూషణ్ మహాంతి తెలియజేశారు. కాళీమాత విగ్రహావిష్కరణ కొరాపుట్: రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గోండో 45 అడుగుల కాళీమాత విగ్రహం ఆవిష్కరించారు. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితిలో బెంగాలీ శరణార్థులు క్యాంప్ ఉండే దండ కారణ్య ప్రాంతంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వేలాది మంది శరణార్థులు స్థిరపడ్డారు. వారికి కాళీమాతపై అపారమైన నమ్మకం ఉంటుంది. ప్రతీ దీపావళి నుంచి వీరు కాళీ పూజలు ఘనంగా చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. పశ్చిమ బంగా నుంచి వచ్చిన కళాకారులు ఈ విగ్రహం తయారు చేశారు. -
సామాన్యుడిలా సీఎం దీపావళి వేడుక
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దీపావళి పండగ ముచ్చటగా జరుపుకున్నారు. సంప్రదాయ సామగ్రి కొనుగోలు కోసం స్థానిక యూనిట్ – 1 సంతకు వెళ్లారు. ఆయనతో సతీమణి కూడా సంతకు వెళ్లి సాధారణ పౌరుల తరహాలో పండ్లు, కాయలు, పూలు వగైరా కొనుగోలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి స్వగ్రామం రాయికిలా ప్రాంతంలో గ్రామస్తులతో కలిసి మెలిసి సంప్రదాయ గానాబజానా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. స్థానిక జానపద గీతాలకు లయబద్ధంగా డోలు బజాయించి ఉర్రూతలూగించారు. ఆకాశ జ్యోతిని నింగికి విడిచి దీపావళి వెలుగుల్ని విరజిమ్మించారు. -
లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
రాయగడ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక బాలాజీ నగర్‌లోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం లక్ష్మీఅమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల నేతృత్వంలో జరిగిన పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి వివిధ పుష్పాలతో పూజించారు. కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్తమ వైద్యాధికారిగా అనూష టెక్కలి: కర్ణాటకలో వైద్యాధికారిగా పనిచేస్తున్న టెక్కలికి చెందిన గజవిల్లి అనూష ఆ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ వైద్యాధికారి అవార్డును అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు అనూష కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఈమెకు అవార్డు లభించడం పట్ల సొండి కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయం కూల్చివేత అవాస్తవం రణస్థలం: మండలంలోని చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడులో పురాతన శివాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం కూల్చివేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ సర్పంచ్ సీహెచ్ శ్రీనివాస రెడ్డి, గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ శివాలయం చాలా పురాతనమైనదని, ఇటీవల కురిసిన వర్షాలకు సగం పడిపోయిందని, మిగతా కోవెల కూడా ప్రమాదకరంగా మారడంతో రానున్న కార్తీకమాసం దృష్ట్యా పురోహితుల సూచనల మేరకే తొలగించామని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఆలయం సరికొత్తగా నిర్మిస్తామని తెలిపారు. ఇద్దరు పురోహితుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గుప్త నిధుల కోసం కూల్చివేశారంటూ వదంతులు సృష్టించారని చెప్పారు. పాతపాడులో పూరిల్లు దగ్ధం సరుబుజ్జిలి: మండలంలోని తెలికిపెంట పంచాయతీ పాతపాడులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో నివగాన ముఖలింగంకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. దుస్తులు, సామగ్రి, ధాన్యం కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. గుర్రాలపాలెంలో.. ఎచ్చెర్ల: లావేరు మండలం గుర్రాలపాలెం ఎస్సీ కాలనీలో నేతల పెంటయ్యకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి ఎల్ఈడీ టీవీ రూ.25 వేలు నగదు, బంగారం, కుమారుడి ఒరిజనల్స్ సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. సచివాలయంలో చోరీకి యత్నం పాతపట్నం: మండలంలోని కొరసవాడ గ్రామ సచివాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలి యని వ్యక్తులు చొరబడి బీరువా లాకర్లు తెరిచారు. గ్రామ శివారున కార్యాలయం ఉండటం, దీపావళి కావడంతో తాళాన్ని యాక్సా బ్లేడ్‌తో కట్ చేసి లోపలికి వెళ్లి సర్వేయర్ అసిస్టెంట్‌కు చెందిన బీరువా లాకర్ తొలగించారు. శుక్రవారం ఉదయం పంచాయతీ సెక్రటరీ కృష్ణంరాజు, సచివాలయ ఉద్యోగులు రాగా.. కార్యా లయం తెరిచి ఉండడాన్ని గుర్తించి సర్పంచ్ ఉమాకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ జి.సింహచలం ఘటనా స్థలానికి చేరుకుని బీరువా లాకర్లను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ఒకటో తేదీ పెన్షన్ డబ్బులు బీరువా లాకర్లో ఉంటాయని భావించి చోరీకి ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి నరసన్నపేట: స్థానిక శివనగర్కాలనీలో బగ్గు సూర్యనారాయణ (45) అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. బుధవారం కూలి పనికి వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసేందుకు దిగగా ప్రమాదవశాత్తూ కూరుకుపోయి మృతి చెందాడు. సమాచారం అందుకు న్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు. భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ దాలినాయుడు తెలిపారు. -
పర్లాకిమిడిలో ఏక్తా దివస్
పర్లాకిమిడి: మాజీ ఉపప్రధానమంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ స్థానిక కలెక్టరేట్ లో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాలోని ఉన్నతాధికారులతో కలెక్టర్ బిజయకుమార్ దాస్ ప్రతిజ్ఞ చేయించారు. అఖండ భారతాన్ని కాపాడుతానని, అందరూ ఐక్యంగా ఉండాలని, దేశరక్షణ నిలుపుకునేందుకు నావంతు కృషిచేస్తానని కలెక్టర్ బిజయకుమార్ దాస్ ప్రభుత్వ అధికారులతో ప్రమాణం చేయించారు. కార్యక్ర మంలో ఏడీఎం రాజేంద్ర మింజ్, డిప్యూటీ కలెక్టర్ లిపిన్ దాస్, కశ్యపీ బెహారా, అత్యవసర అధికారి జగన్నాథపాఢి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మమతారాణి పోరిడా, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, గ్రామీణ తాగునీరు, శానిటేషన్ అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శివప్రసాద్ పోల్లాయి, జిల్లా అబ్కారీ శాఖ అధికారి బిభూతీ భూషన్ దోరాణి, డీపీఆర్వో ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రెండు ఆటోలు ఢీ
మెళియాపుట్టి/టెక్కలి రూరల్: రెండు ఆటోలు పరస్పరం ఢీకొట్టిన ఘటనలో మెళియాపుట్టి మండలం జలక లింగుపురం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థులు గాయపడడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. జలక లింగుపురం గ్రామానికి చెందిన ఏడుగురు టెన్త్ విద్యార్థులు మెళియాపుట్టి మండల కేంద్రంలోని ట్యూషన్ సెంటర్‌కు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆటోలో బయలుదేరారు. మెళియాపుట్టి గ్యాస్ కార్యాలయం వద్దకు రాగానే చికెన్ వ్యర్థాలు తరలించే వేరొక ఆటో డ్రైవర్ విద్యార్థులవైపు చూస్తూ వెకిలిచేష్టలతో సమీపంలోకి వచ్చాడు. విద్యార్థులున్న ఆటోడ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆటోలు పరస్పరం ఢీకొని బోల్తాకొట్టాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులు బాలకృష్ణ, హేమలత, పవన్‌సాయి, ధనుశ్రీ, విష్ణుప్రియ, నాగచైతన్యలను తొలుత మెళియాపుట్టికి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఈవో తిరుమల చైతన్య ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై నరసింహరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దీపం కింద డీబీటీ ద్వారా రూ.164 కోట్ల బదిలీ
పార్వతీపురం టౌన్: దీపం పథకం క్రింద జిల్లాలో డీబీటీ ద్వారా రూ.164 కోట్లు బదిలీ కానుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో దీపం–2 పథకం కింద 1,97,727 మందిని అర్హులుగా గుర్తించామని పేర్కొన్నారు. దీపం–2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. దీపం పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం పార్వతీపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం పొందేందుకు ఆధార్ కార్డు నెంబరు, రేషన్/బియ్యం కార్డు నెంబరు, ఆధార్ నెంబరుతో లింకు చేసిన బ్యాంకు ఖాతా (ఎకౌంటు) నెంబరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు ఉంటే సరిపోతుందని వివరించారు. లబ్ధిదారులు తమ వివరాలు లేకపోతే ఆయా సంస్థలు, శాఖల నుండి వివరాలు పొంది నమోదు చేసుకొని ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చని ఆయన వివరించారు. దీపం పథకంలో భాగంగా లబ్ధిదారులు తమ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్‌కు బుకింగ్ చేసి గ్యాస్ ధర, గ్యాస్ ఏజెన్సీ వారికి మొదట చెల్లించాలని, అనంతరం అర్హులైన లబ్ధిదారుకు మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుందన్నారు. మెసేజ్ వచ్చిన లబ్ధిదారుకు గ్యాస్ ఏజెన్సీకి చెల్లించిన మొత్తం నగదు తిరిగి వస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల వారికి 24 గంటలల్లో, గ్రామీణ ప్రాంతాల వారికి 48 గంటల్లోగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసేందుకు అక్టోబర్ 31 నుండి శ్రీకారం చుట్టిందని చెప్పారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. -
No Headline
విజయనగరం ఫోర్ట్: ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, సీహెచ్‌సీ వైద్యులు క్లిష్టతరమని రిఫర్ చేసిన గర్భిణులకు 108 అంబులెన్స్ సిబ్బంది ఎంతో సులువుగా ప్రసవాలు జరిపించేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ అవ్వాలని రిఫరల్ ఆస్పత్రికి రిఫర్ చేసిన కేసులను సైతం 108 సిబ్బంది చాకచక్యంగా ప్రసవాలు చేయడం ఇక్కడ గమనించదగ్గ విషయం. రిఫరల్స్కే ప్రాధాన్యమిస్తున్న ఆస్పత్రులు సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు ఎక్కువగా గర్భిణులు ప్రసవం కోసం వస్తారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రసవాలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రసవాలు అయ్యే గర్భిణులను సైతం ఘోషాస్పత్రికి, కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా రిఫర్ చేసే కేసులను రిఫరల్ ఆస్పత్రులకు తరలించే సమయంలో మార్గమధ్యలో 108 సిబ్బంది ప్రసవాలు నిర్వహిస్తున్నారు. జనవరి నెల నుంచి అక్టోబర్ నెలఖారు వరకు 108 అంబులెన్సులలో 42 ప్రసవాలు జరిగాయి. ప్రతి నెల 108 అంబులెన్సులో ప్రసవాలు జరుగుతున్నాయి. అనంతగిరి మండలం కొత్తరూకు చెందిన వంతల వనజకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్సుకు ఫోన్ చేసారు. సమాచారం అందుకున్న తర్వాత 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని గర్భిణి వనజను ఎస్.కోట ఏరియా ఆస్పత్రి తరలిస్తుండగా మార్గ మాధ్యలో పురిటి నొప్పులు రావడంతో 108అంబులెన్స్ ఈఎంటీ మౌనిక గర్భిణి వనజకు ప్రసవం జరిపించారు. ఆమెకు ఆడశిశువు జన్మించింది. -
కరాటే పోటీల్లో నగర విద్యార్థులకు పతకాలు
విజయనగరం: ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ – 2024లో విజయనగరం పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులకు పతకాలు లభించాయి. ఈ మేరకు పట్టణానికి చెందిన కరాటే కోచ్ కానూరు సంతోష్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. విశాఖ సిటీ వేపగుంటలో గల శ్రీకృష్ణ దేవరాయ కమ్యూనిటీ హాల్లో అక్టోబరు 27 నుంచి మూడు రోజుల పాటు జరిగిన శ్రీ గంటా కనకారావు మెమోరియల్ రాష్ట్ర ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ వివిధ విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిపారు. పి.హేమంత్ – కుమిటీ విభాగంలో బంగారు పతకం, కాటాలో వెండి పతకం సాధించాడు. బి.రేష్వంత్ – కాటా, కుమిటీ రెండింటిలో కాంస్యం గెలుచుకున్నాడు. కె.శివగణేష్ – కుమిటీలో బంగారు, కాటాలో వెండి, బి.షణ్ముఖ శ్రీకర్ – కుమిటీలో వెండి, బి.శివశ్రీ హర్షవర్థన్ – కాటాలో వెండి, ధనుష్ కృష్ణతేజ కాటాలో వెండి పతకాలు సాధించారని తెలిపారు. వీరిని శుక్రవారం గురుదత్త పాఠశాల కరస్పాండెంట్ పి.పద్మ, కోచ్ కె.సంతోష్‌కుమార్ అభినందించారు. -
ఇంత అలసత్వమా..!
● సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నా.. రిఫర్ చేస్తున్న వైద్య సిబ్బంది ● క్లిష్టమైన ప్రసవాలు 108 సిబ్బంది చేస్తున్న వైనం ● జనవరి నుంచి అక్టోబర్ వరకు 108లో 42 ప్రసవాలు● కొద్ది రోజుల క్రితం ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో జె.స్వప్న చేరింది. ఆమెను అక్కడ వైద్యులు విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేసారు. దీంతో వారి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్.కోట ఆస్పత్రిలో ఉన్న గర్భిణి స్వప్నను ఘోషాస్పత్రికి తరలిస్తుండగా కాపు సోంపురం వద్దకు వచ్చే సరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఎంటీ పి.వి.రమణ అంబులెన్సును పక్కన ఆపి ప్రసవం జరిపించారు. ఆమెకు పండంటి ఆడ శిశువు జన్మించింది. విచారణ చేపడతాం.. సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫరల్ ఆస్పత్రులకు ఎందుకు గర్భిణులను రిఫర్ చేస్తున్నారనే దానిపై విచారణ చేపడతాం. ప్రసవం చేయగలిగే అవకాశం ఉన్న కేసులను రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ బి.రాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ -
డీఆర్ఓ సేవలు మరువలేనివి
పార్వతీపురం: జిల్లా రెవెన్యూ అధికారిగా జి.కేశవనాయుడు అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. అనంతపురం బదిలీపై వెళ్తున్న కేశవనాయుడుకు కలెక్టర్ కార్యాలయంఓ ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్ఓ అంకిత భావంతో పనిచేసి ఈ ప్రాంతీయుల మన్ననలను పొందారన్నారు. సిబ్బందికి మార్గదర్శకం వహించడంలోను పై అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంలోను సమన్వయం చేశారన్నారు. ఎన్నికల వేళ చాకచక్యంగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చారన్నారు. బదిలీపై వెళ్తున్న కేశవనాయుడు మాట్లాడుతూ జిల్లాలో పని చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి ఎండీ గయాజుద్దీన్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి ఎల్.రమేష్, కలెక్టర్ పరిపాలన అధికారి సావిత్రి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సీతంపేట: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. మరొక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... సీతంపేట మండలం హడ్డుబంగి–లోవగూడ గ్రామాల మధ్య ఉన్న అప్పలమ్మ వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలకొండ మండలం ఎంకే రాజపురం గ్రామానికి చెందిన పైల రామ్మోహనరావు(27), ఆయన స్నేహితురాలు రేగిడి గ్రామానికి చెందిన కాజీపేట శ్రావణి కొత్తూరు నుంచి ద్విచక్ర వాహనంపై గురువారం వస్తుండగా వీరిని అప్పలమ్మ వంతెన వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రామ్మోహనరావు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రావణికి కుడి చేయి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తండ్రి శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అమ్మన్నరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు..రాజాం సిటీ: మండల పరిధి వీఆర్‌అగ్రహారం గ్రామానికి చెందిన బెజ్జి చిన్నమ్మ (93) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందిందని ఏఎస్ఐ రమణమ్మ శుక్రవారం తెలిపారు. రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న చిన్నమ్మికి చుట్ట తాగే అలవాటు ఉంది. చూపు కనిపించని ఆమె చుట్టను పక్కనే పడేయడంతో బట్టకు అంటుకుని శరీరం కొంతభాగం కాలిపోయిందని ఏఎస్ఐ తెలిపారు. స్థానికులు గమనించి ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో రూ.60లక్షల ఆస్తి నష్టం
చీపురుపల్లి: దీపావళి పండగ రోజున ఓ ఆటోమొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.60లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ సంఘటనకు సంబందించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మెయిన్రోడ్లోని ఆంజనేయపురంలో మాధురి ఆటోమొబైల్ దుకాణాన్ని గెంబలి శ్రీనివాసరావు అనే దివ్యాంగ యువకుడు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాసరావు దివ్యాంగుడైనప్పటికీ ఎంతో ధైర్యంతో 2016లోనే ఇక్కడ ఆటోమొబైల్ దుకాణాన్ని ఏర్పాటు చేసాడు. అప్పటి నుంచి వ్యాపారాన్ని విస్తరిస్తూ పట్టణంలో ప్రధాన ఆటో మొబైల్ దుకాణాల్లో ఒకటిగా నిలిపాడు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆటో మొబైల్ దుకాణాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి. దుకాణంలో అధిక సంఖ్యలో వాహన టైర్లు, ట్యూబ్‌లు ఉండడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ దుకాణంలో ఉన్న మొత్తం వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. రూ.60లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు యజమాని లబోదిబోమంటున్నాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు శుక్రవారం ఉదయాన్ని సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుడు శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పి, భీమా కంపెనీల ప్రతినిధులతో న్యాయం చేయాలని మాట్లాడారు. నా ఆధారం పోయింది దివ్యాంగుడైనప్పటికీ కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలని 2016లో ఆటో మొబైల్ దుకాణం ఏర్పాటు చేసానని బాధితుడు గెంబలి శ్రీనివాసరావు అన్నారు. అలా కష్టపడుతూ దుకాణ సామర్థ్యాన్ని పెంపొందించానని ఈ దుకాణం ఆధారంగానే కుటుంబాన్ని పోషించుకుంటున్నానని ఇప్పుడు అగ్నిప్రమాదం సంభవించడంతో సర్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసాడు. ఆటోమొబైల్ దుకాణాంలో ప్రమాదం -
మంచం పట్టిన ఎరుకొండ
పూసపాటిరేగ: మండలంలోని ఎరుకొండ గ్రామంలో డయేరియా ప్రబలింది. తీవ్ర అస్వస్థతకు గురై ఒకరు మృతి చెందగా, మరో 12 మంది పూసపాటిరేగ పీహెచ్సీ, సుందరపేట సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్నారు. ఆస్పత్రిలో మృతిచెందిన పచ్చిపులుసు వెంకట రమణ (75) గత కొంత కాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర వ్యాధులతో ఇబ్బందిపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డయేరియాకు కారణాలపై ఆరా తీస్తున్నారు. తాగునీటి బోర్లు, రక్షిత మంచినీటి పథకం నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు ల్యాబ్‌కు పంపించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రవీణ్‌శంకర్ తెలిపారు. గ్రామాన్ని జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి భాస్కరరావు, తహసీల్దార్ తాడ్డి గోవింద, ఎంపీడీఓ ఎం.రాధిక, వైద్యాధికారి రాజేష్వర్మలు శుక్రవారం సందర్శించారు. మురుగునీటి కాలువలు, తాగునీటి వనరులను శుభ్రం చేయాలని స్థానిక సిబ్బందికి సూచించారు. వైద్యాధికారులు కడగల త్రినాథ్, ఎస్.ప్రమీలాదేవి, సర్పంచ్ గొట్టాపు అప్పలస్వామి, వైద్య సిబ్బంది ఆర్.వి.రమణ, జి.బంగారుబాబు తదితరులు గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో సేవలందించారు. డయేరియాతో ఒకరు మృతి ఆస్పత్రిలో చేరిన 12 మంది గ్రామస్తులు