Personal Finance
-
ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. అయితే ఇదెలా పనిచేస్తుంది? ఎలాంటి ఫోన్లలకు సపోర్ట్ చేస్తుందనే మరిన్ని విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఇది వరకు యూపీఐ లావాదేవీలు చేయాలంటే.. తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులోకి రానున్న యూపీఐ 123 పే.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.యూపీఐ 123 పే చెల్లింపులు నాలుగు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఐవీఆర్ నెంబర్స్, మిస్డ్ కాల్స్, ఓఈఎమ్ ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ. అంటే యూజర్ తమ లావాదేవీలను ఈ నాలుగు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇవన్నీ 2025 జనవరి 1 కంటే ముందు అమల్లోకి వచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.యూపీఐ 123 పే కస్టమర్లు బహుళ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండకూడదు. కస్టమర్ మరొక ఖాతాను జోడించాలనుకుంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి.UPI 123PAYతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి?•మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్‌కి కాల్ చేయండి•కాల్ చేసిన తరువాత మీ భాషను ఎంచుకోండి•మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయడానికి ఎంచుకోండి•మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి•యూపీఐ పిన్ సెట్ చేసుకోండి.•పై దశలను పాటిస్తే మీ యూపీఐ 123 పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. -
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!
motilal oswal midcap fund: లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో అధిక స్థిరత్వం చాలా మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. కానీ, కొందరు రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు రాబడులు అధికంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఎంపిక చేసుకుంటారు. రిస్క్ మధ్యస్థంగా ఉండి, రాబడులు కూడా లార్జ్‌క్యాప్ కంటే ఎక్కువగా ఉండాలని కోరుకునే వారికి మిడ్‌క్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్ స్టాక్స్ కంటే స్మాల్‌క్యాప్ స్టాక్స్ అధికంగా రాబడులు ఇచ్చినట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన పదేళ్లలో రాబడుల పరంగా స్మాల్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్ సూచీ ముందుంది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐ సూచీ.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ టీఆర్ఐ సూచీ కంటే 2.13 శాతం అధికంగా 21.32 శాతం చొప్పున ఏటా రాబడులు అందించింది. ఇదే కాలంలో స్మాల్‌క్యాప్ సూచీ వార్షిక రాబడులు 19.18 శాతంగానే ఉన్నాయి. మిడ్‌క్యాప్ విభాగంలో అధిక స్థిరత్వం, మెరుగైన రాబడులు కోరుకునే వారికి మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది.రాబడులు.. ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఏడాది కాలంలో రాబడి 73 శాతంగా ఉంది. అదే రెగ్యుల్ ప్లాన్‌లో అయితే 71 శాతం రాబడి వచి్చంది. మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్ ఏటా 36 శాతానికి పైనే రాబడి తెచ్చి పెట్టింది. ఐదేళ్లలోనూ 35 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకం సొంతం. ఇక ఏడేళ్లలో ఏటా 24 శాతం, పదేళ్లలో ఏటా 23 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు రాబడి లభించింది. ఇందులో డైరెక్ట్ ప్లాన్ అన్నది మధ్యవర్తుల ప్రమేయం లేనిది. ఈ ప్లాన్‌లో ఫండ్స్ సంస్థ ఎవరికీ కమీషన్లు చెల్లించదు. రెగ్యులర్ ప్లాన్‌లో మధ్యవర్తులకు కమీషన్ వెళుతుంది. ఈ మేర ఇన్వెస్టర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తారు. కనుక రెగ్యులర్ ప్లాన్ కంటే డైరెక్ట్ ప్లాన్‌లో దీర్ఘకాలంలో రాబడులు ఎక్కువగా ఉంటాయి.పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో... మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నాణ్యత, వృద్ధి, దీర్ఘకాలం, ధర అనే అంశాల ఆధారంగా మిడ్‌క్యాప్ విభాగంలో భవిష్యత్‌లో మంచి రాబడులు ఇచ్చే స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. బలమైన వృద్ధి అవకాశాలున్న నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. సహేతుక ధరల వద్దే కొనుగోలు చేస్తుంటుంది. ఎంపిక చేసుకునే కంపెనీలకు గణనీయమైన వ్యాపార వృద్ధి అవకాశాలు ఉండేలా జాగ్రత్త పడుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20 శాతానికి పైన ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. బలమైన ఫ్రీ క్యాష్ ఫ్లోను కూడా చూస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,604 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 81 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 15 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టింది. 3.89 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 66 శాతం మేర లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి.చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!మిడ్‌క్యాప్‌లో 32.49 శాతం, స్మాల్‌క్యాప్‌లో 1.77 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్ విభాగంలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నప్పుడు మిడ్‌క్యాప్ పథకం ఎలా అయిందన్న సందేహం రావచ్చు. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు మధ్య కాలానికే లార్జ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించడం ఇందుకు కారణం. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, కన్జ్యూమర్ డి్రస్కీషనరీ, ఇండస్ట్రియల్స్ రంగాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ.. 61 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. -
‘సుకన్య సమృద్ధి’ వడ్డీ పెరిగిందా? పోస్టాఫీసు స్కీములపై అప్డేట్
చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఆయా పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుత వడ్డీ రేట్లు∇ సుకన్య సమృద్ధి యాజన (SSY): సంవత్సరానికి వడ్డీ రేటు 8.2 శాతం∇ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వడ్డీ రేటు 8.2 శాతం∇ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): వడ్డీ రేటు 7.1 శాతం∇ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): వడ్డీ రేటు 7.7 శాతం∇ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS): వడ్డీ రేటు 7.4 శాతం∇ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: వడ్డీ రేటు 7.5 శాతం∇ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్: వడ్డీ రేటు 6.7 శాతంఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. వడ్డీ రేట్లను చివరిగా 2023 డిసెంబర్ 31న సవరించింది. ఈ చిన్న పొదుపు పథకాలన్నీ పోస్టాఫీసు ద్వారా అందిస్తున్నారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సార్వభౌమాధికార హామీ ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి కొన్ని పథకాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-పొదుపు ప్రయోజనాలను అందిస్తాయి. -
EPFO: ఈపీఎస్‌పై కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్)కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలు మారవచ్చు.ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ వేతనంలో 12% మొత్తం నెలవారీ కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎఫ్‌కు వెళుతుంది. యజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమచేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్-95 కింద పెన్షన్ నిధికి వెళుతుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్‌కి జమవుతుంది. అయితే ఇప్పటివరకు యాజమాన్యాలు జమచేసే 8.33 శాతంపై ఎలాంటి వడ్డీ రావడంలేదు. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెలా జమవుతూ ఉంటుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కంట్రిబ్యూషన్ మారవచ్చు. ఈపీఎఫ్ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది. దీనిపై ఈపీఎఫ్‌వో నిర్ధిష్ట వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.25% ఉంది. ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, ఈపీఎస్-95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలు మారవచ్చు. మీడియా నివేదిక ప్రకారం.. బెంగుళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కి అనుగుణంగా ఈపీఎఫ్ సంపదను లెక్కించాలని, పెన్షన్ కార్పస్‌పై సంవత్సరానికి 8% వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది.ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్బీఐ స్పషల్ స్కీమ్'ది హిందూ' నివేదిక ప్రకారం.. ఎన్పీఎస్ మాదిరిగానే ఈపీఎస్ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని, జమయిన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా 'ఫిక్స్డ్ పెన్షన్ జీతం' ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (IRIROA) వాదిస్తోంది.ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లాగానే పని చేస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం, ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్‌పై ఏటా స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భారీగా పెరుగుతుంది. -
గడువు ముగియనున్న ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్ ‘ఎస్బీఐ అమృత్ కలశ్’కు గడువు త్వరలో ముగియనుంది. ఈ పథకం కింద ఎఫ్డీ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ 30 ముగుస్తుంది.ఏప్రిల్ 12న ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డీ ప్లాన్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ పథకానికి గడువును పలు సార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది.కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌తో అందిస్తున్న సాధారణ ఎఫ్డీ పథకాలతో పోలిస్తే అమృత్ కలాష్ ఎఫ్డీ ప్లాన్‌పై సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు సుమారు 30 బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తోంది.అమృత్ కలశ్ ఎఫ్డీ రేట్లుఎస్బీఐ అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు 7.1% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.6% రేటు లభిస్తోంది. ఇది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్. మరోవైపు 1-2 సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్డీ ప్లాన్‌కు సాధారణ కస్టమర్లకు 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3% వడ్డీని ఎస్బీఐ చెల్లిస్తోంది. -
NPS Vatsalya: పిల్లల కోసం ప్రత్యేక పథకం ప్రారంభం
పిల్లల కోసం ప్రత్యేక పొదుపు పథకం ‘ఎన్పీఎస్ వాత్సల్య’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ పెన్షన్ ఖాతాలను తెరవచ్చు. 2024-25 యూనియన్ బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లలకు పెన్షన్ పొదుపును ప్రారంభించచ్చు. ఇది భారతీయ పౌరులతోపాటు ఎన్ఆర్ఐలకు కూడా సౌకర్యవంతమైన దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా పిల్లలకి 18 ఏళ్లు నిండగానే ప్రామాణిక ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది. తద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం నిరంతర పెట్టుబడిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్లు లేదా ఈ-ఎన్పీఎస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబై సర్వీస్ సెంటర్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ఖాతాలను నమోదు చేసి సింబాలిక్ ప్రాన్ (PRAN-పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) కార్డ్‌లను జారీ చేసింది. ఐసీఐసీఐ, యాక్సిస్‌తో సహా ప్రధాన బ్యాంకులు ఈ పథకాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాయి.వీటిలో పెట్టిన మొత్తాన్ని ఈక్విటీలు, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా వచ్చే రిటర్న్స్‌ను ఖాతాల్లో జమ చేస్తారు. ఈ కార్పస్ ఫండ్‌ను ఖాతాదారు 60 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. అయితే మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత విద్య, అనారోగ్యం వంటి కారణాలకు పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. -
ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!
బంధన్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు (FD) 8.55 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.బంధన్ బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.55 శాతం, ఇతర కస్టమర్లకు 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఐదు సంవత్సరాలలోపు కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇతర కస్టమర్లకు ఈ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.ఇదీ చదవండి: కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..మరోవైపు రూ. 10 లక్షలకు మించిన పొదుపు ఖాతా నిల్వలపై 7 శాతం వడ్డీ రేటును బంధన్ బ్యాంక్ అందిస్తుంది. రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎంబంధన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కస్టమర్లు సౌకర్యవంతంగా తమ ఇళ్లు లేదా తాము ఉండే చోటు నుంచే ఫిక్స్డ్ డిపాజిట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సదుపాయం ద్వారా కస్టమర్లు ఎఫ్డీ బుకింగ్ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చు.కాలవ్యవధి వడ్డీ సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలకు7 నుంచి 14 రోజులు 3.00% 3.75%15 నుంచి 30 రోజులు 3.00% 3.75%31 రోజుల నుంచి 2 నెలలలోపు 3.50% 4.25%2 నెలల నుంచి 3 నెలలలోపు 4.50% 5.25%3 నెలల నుంచి 6 నెలలలోపు 4.50% 5.25%6 నెలల నుంచి ఏడాదిలోపు 4.50% 5.25%ఏడాది 8.05% 8.55%ఏడాది నుంచి ఏడాది 9 నెలలు 8.00% 8.50%21 నెలల 1రోజు నుంచి 2 ఏళ్లలోపు 7.25% 7.75%2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు 7.25% 7.75%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు 7.25% 7.75%5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.85% 6.60%ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ 7.00% 7.50% -
బిజినెస్ లోన్ కావాలా?.. ముందుగా ఇవి తెలుసుకోండి
ఉద్యోగం చేయడం ఇష్టంలేని వారు సొంతంగా బిజినెస్ చేసి ఎదగాలనుకుంటారు. అయితే బిజినెస్ చేయడానికి కావాల్సిన డబ్బు చేతిలో ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. బ్యాంక్ నుంచి బిజినెస్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..సిబిల్ స్కోర్ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలనుంటే ఏ బ్యాంక్ అయినా.. ఫైనాన్స్ సంస్థ అయినా ముందుగా క్రెడిట్ స్కోల్ లేదా సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంత లోన్ వస్తుంది, వడ్డీ రేటు వంటివి నిర్ణయిస్తారు. క్రెడిట్ స్కోర్ 685 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటేనే సులభంగా లోన్ పొందవచ్చు. ఈ స్కోర్ పెంచుకోవాలనుంటే గడువు తేదీ లోపల ఈఎంఐ చెల్లించాలి, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా క్లియర్ చేసుకోవాలి.వయసుబిజినెస్ చేయాలనుకునే వ్యక్తి వయసు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వ్యాపారం చేయాలనుకునే వ్యక్తి వయసు కనీసం 24 ఏళ్లకంటే ఎక్కువ ఉండాలి. ఈ వయసులో కష్టపడే తత్త్వం ఉంటుంది. సాధించాలనే తపన ఉంటుంది. అంతకన్నా తక్కువ వయసున్న వారు బిజినెస్ చేస్తే.. బహుశా ముందుకు వెళ్ళలేరేమో అని బ్యాంకులు భావిస్తాయి.బిజినెస్ ప్లాన్బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే ముందు.. మీరు ఎలాంటి బిజినెస్ చేస్తారనేది సంబంధిత అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది. మీ బిజినస్ ప్లాన్ బాగుంటే.. భవిష్యత్తులో ఆ వ్యాపారం ముందుకు సాగుతుందని బ్యాంక్ భావిస్తే త్వరగా లోన్ మంజూరవుతుంది. ఇది మీ ఆర్థిక అవసరాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.వార్షిక ఆదాయంలోన్ ఇచ్చే బ్యాంక్ ఖచ్చితంగా.. సదరు వ్యక్తి వార్షిక ఆదాయం ఎంత అనేది కూడా గమనిస్తుంది. దీన్నిబట్టి ఆ వ్యక్తి లోన్ చెల్లించగలడా? లేదా అనేది బేరీజు వేసుకుంటుంది.ఇదీ చదవండి: అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ బిజినెస్ లోన్ రకాలుపర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటికి.. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది. బిజినెస్ లోన్ ఇవ్వడానికి రూల్స్ వేరుగా ఉంటాయి. ఆస్తుల ఆధారంగా లోన్ తీసుకోవడం చాలా ఉత్తమం అని పలువురు నిపుణులు చెబుతారు. ఇలాంటి వాటికి వడ్డీ రేటు కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆస్తులు లేకుండా నేరుగా లోన్ తీసుకోవాలనుంటే.. ఇది అందరికీ సాధ్యమవుతుందనుకోవడం కొంత కష్టమే. వీటిని అన్సెక్యూర్డ్ లోన్లు అంటారు. ఒకవేలా ఇలాంటి లోన్స్ తీసుకుంటే వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. -
పీపీఎఫ్ కొత్త రూల్స్.. రెండో అకౌంట్‌పై వడ్డీ వస్తుందా?
పోస్టాఫీసుల ద్వారా తెరిచిన పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం గత నెలలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం పీపీఎఫ్ నిబంధనలలో మార్పులు అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి.పీపీఎఫ్ ఏంటంటే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తూ పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక ప్రముఖ ఆర్థిక సాధనం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండే పొదుపు పథకం.1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం దీంట్లో పెట్టిన అసలు, వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం అన్నిటికీ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.మారిన నిబంధనలు ఇవే..మైనర్లకు పీపీఎఫ్ ఖాతా: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా మైనర్ పేరు మీద తెరిచి ఉంటే మైనర్‌కు 18 ఏళ్లు వయస్సు వచ్చే వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) వచ్చే వడ్డీ మాత్రమే వస్తుంది. అటువంటి ఖాతాల మెచ్యూరిటీ వ్యవధిని మైనర్ పెద్దవాడైన తేదీ నుండి లెక్కిస్తారు.ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు: ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా ఏజెన్సీ బ్యాంక్‌లో ఖాతాదారు తెరిచిన ప్రాథమిక అకౌంట్‌పై స్కీమ్ రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. అదే ఒకటి ఎక్కువ ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్న సందర్భంలో వాటిని ప్రాథమిక ఖాతాతో ఏకీకృతం చేస్తారు. ఇలా చేశాక మొత్తం వార్షిక పరిమితి మొత్తం డిపాజిట్‌కు మాత్రం పథకం రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు. దీనికి మించి ఇతర ఖాతాల్లో మిగులు నిధులు ఉంటే ఎలాంటి వడ్డీ లభించదు. -
సుకన్య సమృద్ధి యోజన.. కొత్త రూల్స్
నిబంధనలకు అనుగుణంగా లేని పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. బాలికల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ప్రత్యేక పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన. బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులు బాలికల పేరున ఈ ఖాతాలను తెరుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు లేదా బంధువులు ఖాతాలు తెరిచారు. కానీ వీరు చట్టబద్ధంగా సంరక్షకులు కారు. కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులు తెరవని ఖాతాలను పథకం ప్రాథమిక మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బదిలీ చేయడమో లేదా మూసివేయడమో తప్పనిసరి. తల్లిదండ్రులు లేని బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు సంరక్షకులుగా ఉంటే ఇందుకోసం ప్రభుత్వం నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.ఖాతా మూసివేత, బదిలీకి అవసరమైన పత్రాలు» అన్ని వివరాలున్న ప్రాథమిక ఖాతా పాస్‌బుక్» బాలిక జనన ధ్రువీకరణ పత్రం» బాలికతో సంబంధాన్ని రుజువు చేసే బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర ధ్రువ పత్రాలు» తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు.» పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్పత్రాలన్నీ తీసుకుని ఖాతాకు సంబంధించిన ప్రాథమిక వ్యక్తి ఖాతా తెరిచిన పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం సంరక్షకుడికి ఖాతాను బదిలీ చేయాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేయాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీసు వారు అందించిన బదిలీ ఫారమ్‌ను పూరించాలి. ఇప్పటికే ఉన్న ఖాతాదారు (తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ), కొత్త సంరక్షకుడు (తల్లిదండ్రులు) ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఫారమ్‌పై సంతకం చేయాలి.ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, బ్యాంక్ లేదా పోస్టాఫీసు సిబ్బంది అభ్యర్థనను సమీక్షించి ధ్రువీకరణను ప్రాసెస్ చేస్తారు. అవసరమైతే వారు అదనపు సమాచారం కోసం కూడా అడగవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఖాతా రికార్డులు కొత్త సంరక్షకుని సమాచారంతో అప్డేట్ అవుతాయి. -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే!
ఆర్థిక పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. నెలకు లక్షల రూపాయలు సంపాదించేవారు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు, కావలసినప్పుడు లోన్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత లోన్స్ తీసుకోవచ్చు. కానీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేకుంటే తీసుకున్న అసలు కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్బ్యాంకు లోన్ ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ చూస్తుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎక్కువ బ్యాంక్స్ మీకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. లేకుంటే లోన్ లభించడం కొంత కష్టమనే చెప్పాలి. ఒకవేళా మీకు లోన్ లభించినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.వడ్డీ రేటులోన్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన మరో విషయం వడ్డీ రేటు. ఎందుకంటే ఒక్కో బ్యాంక్ ఒక్కో వడ్డీ రేటుతో లోన్ అందిస్తుంది. కాబట్టి తక్కువ వడ్డీతో లోన్ ఇచ్చే బ్యాంకుల వద్ద నుంచి లోన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు తిరిగీ చెల్లించాల్సిన ఈఎమ్ఐలను సులభతరం చేస్తుంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తుందనే విషయాలను అధికారిక వెబ్సైట్లలో లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు.లోన్ వ్యవధిలోన్ తీసుకునే వ్యక్తి.. తిరిగి ఎన్ని నెలల్లో చెల్లచగలుగుతాడో, సంపాదన ఎంత వంటి వాటిని బేరీజు వేసుకుని వ్యవధిని ఎంచుకోవచ్చు. పర్సనల్ లోన్ వ్యవధి 12 నెలల నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. అయితే 36 నెలలు లేదా మూడు సంవత్సరాలకు మించి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం మీకే మంచిది. అయితే ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం లేదు.లోన్ ఎక్కడ నుంచి తీసుకోవాలి (బ్యాంకు/ఎన్బీఎఫ్సీ)పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి.. బ్యాంకు నుంచి తీసుకోవాలా? లేదా ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకోవాలా? అని సొంతంగా నిర్దారించుకోవాలి. బ్యాంకు నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అని నిపుణులు చెబుతారు. లోన్ తీసుకోవడానికి కొంత ఆలస్యమైనా బ్యాంకు నుంచే తీసుకోవడం మంచిది. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావుండదు.ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు) నుంచి కూడా లోన్ తీసుకోవచ్చు. కానీ ఇందులో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఎక్కువ అవసరం లేదు. ఎన్బీఎఫ్సీలో లోన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. -
కోరికలు తీర్చే ‘ఫిష్’!
ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. కొనండి. కారు తీసుకోవాలనుకుంటున్నారా.. తీసుకోండి. విదేశాలు చుట్టేయాలనుకుంటున్నారా.. వెళ్లిరండి. పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాలంటే.. చేర్పించండి.. అంతా బాగానే ఉంది కానీ, అన్నింటికీ డబ్బుకావాలని ఆలోచిస్తున్నారా. మరేం ఫర్వాలేదు. ఉద్యోగం చేస్తూనే అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఎలా అంటారా? అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మదుపు ప్రారంభించాలి. ప్రధానంగా అందరికీ ‘ఫిష్’ గురించి తెలియాలి. అదేంటి చేప గురించి తెలిస్తే డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారేమో..కాదండి. ‘ఫిష్’ను పాటిస్తే దాదాపు మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అసలు ఈ ‘ఫిష్’ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.‘ఫిష్’ థియరీఎఫ్ఐ.ఎస్.హెచ్: ఫిష్..ఆర్థిక ప్రణాళిలో ఈ ఫిష్ థియరీని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫిష్ థియరీను మూడు భాగాలుగా విభజించారు.ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ఎస్: సేవింగ్స్హెచ్: హ్యాపీ టు స్పెండ్ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్బ్యాంకు అకౌంట్లో జీతం పడగానే నెలవారీ స్థిర ఖర్చుల కోసం(ఎఫ్ఐ) డబ్బు వెచ్చించాలి. అందులో ప్రధానంగా ఇంటి అద్దె, ఇంటర్నెట్ బిల్లు, సరుకులు, ఫోన్ బిల్లు..వంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా. ఒకవేళ నెల మధ్యలో అమాంతం వాటి విలువ పెరిగినా ఓ పదిశాతం అధికంగా ఖర్చు చేసే వీలుంటుంది. అందుకు అనువుగా బడ్జెట్ కేటాయించుకోవాలి. అయితే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి జీతంలో యాభైశాతానికి మించకుండా జాగ్రత్త వహించాలి.ఎస్: సేవింగ్స్భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు(ఎస్) చేయాలి. వేతనంలో 50 శాతం ‘ఎఫ్ఐ’కు కేటాయించాక మిగిన దాని నుంచి 30 శాతం ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్ ప్లాన్, హెల్త్‌పాలసీ, టర్మ్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయించాలి. ఎలాంటి మార్గాల్లో మదుపు చేయాలనే అంశంపై నిపుణులతో చర్చించాలి.ఇదీ చదవండి: మారుతున్న ప్రచార పంథాహెచ్: హ్యాపీ టు స్పెండ్ఇక మిగిలిన 20 శాతం జీతాన్ని ఆనందాలకు, అభిరుచులకు ఖర్చు పెట్టుకోవచ్చు. విందూ వినోదాలకు వెచ్చించవచ్చు. సినిమాలు, షికార్లు, షాపింగ్..వంటి వాటికి ఏంచక్కా ఖర్చు చేసుకోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా ఇతర వాటికి డబ్బు కేటాయించిన తర్వాతే మిగతా సొమ్మును ఖర్చు పెట్టాలి. ఒక్కసారి ఈ ‘ఫిష్’ థియరీను ఆకలింపు చేసుకుని ప్రయోగాత్మకంగా కొన్ని నెలలు పాటిస్తే ఆర్థిక జీవితంలో మార్పు గుర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు. -
యూత్ కోసం ఎల్ఐసీ కొత్త టర్మ్ ప్లాన్లు..
భారత జీవిత బీమా సంస్థ (LIC) యువతను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ప్రారంభించింది. ఇవి నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, రిస్క్ ప్లాన్లు. లోన్ రీపేమెంట్ రిస్క్‌ల నుంచి రక్షణ కల్పించేలా ఈ ప్లాన్లను రూపొందించారు. వీటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..ఎల్ఐసీ కొత్త ప్లాన్లు ఇవే..ఎల్ఐసీ తీసుకొచ్చిన కొత్త టర్మ్ ప్లాన్ల పేర్లు ఒకటి ఎల్ఐసీ యువ టర్మ్/డిజి టర్మ్, మరొకటి ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్. వీటిని ఎల్ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి ప్రారంభించారు.యువ టర్మ్/డిజి టర్మ్‌పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.గ్యారెంటీడ్ డెత్ బెనిఫిట్స్ అందిస్తుంది.ఎల్ఐసీ యువ టర్మ్ మధ్యవర్తుల ద్వారా అందుబాటులో ఉంటుంది.ఎల్ఐసీ డిజి టర్మ్ ఎల్ఐసీ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ప్రవేశ వయసు కనిష్టం 18 సంవత్సరాలు, గరిష్టం 45 సంవత్సరాలు.మెచ్యూరిటీ వయసు 33- 75 సంవత్సరాల మధ్య.హామీ మొత్తం రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల మధ్య.డెత్ బెనిఫిట్స్ రెగులర్, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు: వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% లేదా నిర్ణీత మొత్తం.సింగిల్ ప్రీమియం చెల్లింపు: సింగిల్ ప్రీమియంలో 125% లేదా హామీ మొత్తం.యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్ ప్లాన్లు రుణ బాధ్యతలకు కవరేజీని అందిస్తాయి. గృహ, విద్య లేదా వెహికల్ లోన్ వంటి వాటి రీ పేమెంట్ అవసరాలకు రక్షణ కల్పిస్తాయి. ఈ ప్లాన్లు ఆఫ్‌లైన్, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.హామీ మొత్తం: రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్లు.డెత్ బెనిఫిట్స్: పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, లోన్ బ్యాలెన్స్ ప్రకారం డెత్ బెనిఫిట్స్ తగ్గుతాయి. ఈ కొత్త ప్లాన్లు యువ వినియోగదారులకు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి, లోన్ రిస్క్‌ల నుంచి రక్షణ పొందడానికి మెరుగైన అవకాశాన్ని అందిస్తాయి. -
ఈ సూపర్‌హిట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
డబ్బు పొదుపు చేసుకోవాలనుకుంటున్నవారికి, ముఖ్యంగా దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసే వారికి పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. ఇవి సొమ్ముకు భద్రతతోపాటు మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో ప్రధానమైన పథకాలలో ఒకటి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఇది 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పొదుపు పథకం ప్రయోజనాలను ఎవరైనా పొందవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇందులో వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కూడా పొందుతారు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటారు. ఇక్కడ వడ్డీ ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటుంది.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలుఇందులో కనిష్ట పెట్టుబడి రూ.1000. దీనిపైనా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.ఒక సంవత్సరానికి 6.9%, రెండేళ్లకు 7.0%, 3 సంవత్సరాలకు 7.1%, ఐదేళ్లకు 7.5% వడ్డీ రేటు ఉంటుంది.ఈ పథకం కింద వ్యక్తిగతంగా ఒక్కరు లేదా ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ అయినా తెరవవచ్చు.5 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం.ఈ పథకం ఎందుకు ఆకర్షణీయం?పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది వారి పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని కోరుకునే వారికి సురక్షితమైన, లాభదాయకమైన ఎంపిక. అధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి. ఈ పథకం ద్వారా మీరు మీ సొమ్ముకు భద్రతతోపాటు ఐదేళ్లలో మంచి వడ్డీని కూడా పొందవచ్చు. -
పసిడి ఆనందం ఆవిరి.. భారీగా పెరిగిన ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (జూలై 31) ఒక్కసారిగా ఎగిశాయి. చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో రేట్లు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశకు గురయ్యారు.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) రూ.800 పెరిగి రూ.64,000 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే రూ.870 ఎగసి రూ. 69,820ని తాకింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.800 పుంజుకుని రూ.64,150 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 870 పెరిగి రూ.69,970 లకు ఎగిసింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా రూ.350 పెరిగి రూ.64,200 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.390 పుంజుకుని రూ.70,040 వద్దకు చేరింది.వెండి ధరలూ భారీగానే..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీగానే పెరిగాయి. హైదరాబాద్‌లో నేడు వెండి రేటు కేజీకి రూ.2000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.91,000 వద్దకు చేరింది. క్రితం రోజున ఇది రూ.89,000లుగా ఉండేది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి ప్రియులకు ఊరట! ధరలెలా ఉన్నాయంటే..
దేశంలో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు నేడు (జూలై 28) శాంతించాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు క్రితం రోజున ఉన్నంటుండి పెరిగాయి. ఆ పెరుగుదల కొనసాగకుండా ఈరోజు నిలకడగా ఉండటంతో పసిడి ప్రియులకు ఊరట కలిగింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.63,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 69,000 వద్ద కొనసాగుతున్నాయి. ముంబై, బెంగళూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.63,400 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.69,150 లుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.64,650 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.70,530 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.వెండి ధర ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది. ఇక్కడ వెండి ధరల్లో మార్పు లేకుండా కొనసాగడం వరుసగా ఇది మూడో రోజు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ఈరోజు (జూలై 27) ఉన్నంటుండి ఎగిశాయి. దీంతో వరుస తగ్గింపులతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.250 పెరిగి రూ.63,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ. 69,000 వద్దకు ఎగిసింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే ధరలు ఊపందుకున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.250 హెచ్చి రూ.63,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.69,150 వద్దకు ఎగిసింది. ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.64,650 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.550 పెరిగి రూ.70,530 వద్దకు హెచ్చింది.స్థిరంగా వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది. రెండు రోజులుగా ఇక్కడ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం నేడు ఎంత పలుకుతోందంటే..
బడ్జెట్ ప్రకటన తర్వాత మొదలైన బంగారం ధరల భారీ పతనానికి బ్రేకులు పడ్డాయి. వరుసగా మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (జూలై 26) నిలకడగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం మళ్లీ స్వల్పంగా తగ్గాయి.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.64,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ. 69,820 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.64,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.69,950 వద్ద కొనసాగుతున్నాయి. అయితే చెన్నైలో మాత్రం వరుసగా ఐదో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.64,150 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.69,980 వద్దకు వచ్చింది.నిలకడగా వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మూడు రోజులుగా క్షీణిస్తున్న వెండి రేటు నిలకడా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మరొక్కసారి భారీ తగ్గింపు.. నేలకు దిగిన బంగారం, వెండి!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరొక్కసారి భారీగా దిగివచ్చాయి. గురువారం (జూలై 25) పసిడి ధరలు 10 గ్రాములకు రూ.1000కిపైగా క్షీణించాయి. బడ్జెట్ ప్రకటన తరువాత రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధరలు మరుసటి రోజు నిలకడగా కొనసాగి నేడు మళ్లీ భారీగా తగ్గి రికార్డ్ మార్కుల దిగువకు వచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పుత్తడి తులం (10 గ్రాములు ) రూ.950 తగ్గి రూ.64,000 వద్దకు వచ్చేసింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1040 తరిగి రూ. 69,820 వద్దకు దిగివచ్చింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇదే విధంగా ధరలు క్షీణించాయి.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.950 తగ్గి రూ.64,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.1060 తగ్గి రూ.69,950 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.64,300 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.650 తగ్గి రూ.70,150 వద్దకు వచ్చింది.రూ.90 వేల దిగువకు వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు భారీ స్థాయిలో తగ్గాయి. క్రితం రోజున కేజీకి రూ.500 క్షీణించిన వెండి ధర నేడు రూ.3000 మేర తరిగింది. రూ.90 వేల దిగువకు వచ్చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అక్కడ మళ్లీ తగ్గిన బంగారం ధరలు
తాజా బడ్జెట్ 2024-25లో బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై దిగుబడి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటన తరువాత బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే బుధవారం (జూలై 24) పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఒక్క చెన్నైలో మాత్రం మళ్లీ తగ్గాయి.ఈ బడ్జెట్లో బంగారం, వెండి వస్తువులు, కడ్డీలపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఇరీడియం వంటి వాటిపై కూడా సుంకాన్ని 15.4 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు.నేటి ధరలు ఇలా..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.64,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ. 70,860 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.65,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,010 వద్ద కొనసాగుతుండగా చెన్నైలో మాత్రం వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.64,900 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.660 తగ్గి రూ.70,800 వద్దకు వచ్చింది.మళ్లీ తగ్గిన వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు కూడా తగ్గాయి. క్రితం రోజున కేజీకి రూ.3,500 క్షీణించిన వెండి ధర నేడు రూ.500 మేర దిగొచ్చింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్దకు తరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈ వారం బంగారానిదే!! వరుస శుభవార్తలు
బంగారం ధరల్లో వరుస తగ్గింపులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం (జూలై 23) పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వారం రోజులుగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. దాదాపు రూ.1,400 మేర దిగివచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.270 తగ్గి రూ. 73,580 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం సైతం రూ.170 తరిగి రూ.67,450 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 తగ్గి రూ.67,600 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,730 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా రూ.150 తగ్గి రూ.68,100 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.74,290 వద్దకు వచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరల్లో కూడా తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో నేడు వెండి రేటు కేజీకి రూ.400 తగ్గింది. దీంతో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.95,600 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వెండి నిలకడగా.. స్వర్ణం స్పల్పంగా..
దేశంలో బంగారం ధరలు ఒక రోజు విరామం తర్వాత ఈరోజు (జూలై 22) స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా ఐదు రోజులుగా పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తూ వస్తున్నాయి. ఈ ఐదు రోజుల్లో బంగారం రేటు సుమారు రూ.1,150 మేర తగ్గింది.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.120 తగ్గి రూ. 73,850 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తరిగి రూ.67,700 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.100 తగ్గి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.120 తగ్గి రూ.74,000 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.68,250 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.120 తగ్గి రూ.74,450 వద్దకు వచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు కూడా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. క్రితం రోజు లాగే వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.96,000 వద్ద నిలకడగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
దేశంలో మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (జూలై 21) స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో పసిడి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు కనిపించలేదు.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 73,970 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.67,800 వద్ద ఉన్నాయి. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.67,950 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.74,120 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.74,620 వద్ద నిలకడగా ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.97,650 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి హ్యాట్రిక్ జోష్.. నగల దుకాణాలకు రష్!
పసిడి ప్రియుల ఆనందం కొనసాగుతోంది. దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. శనివారం (జూలై 20) పసిడి రేట్లు మోస్తరుగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు కొనుగోలుదారులను నగల దుకాణాల వైపు నడిపిస్తున్నాయి.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.380 తగ్గి రూ. 73,970 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ.350 తరిగి రూ.67,800 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరల్లో ఇదే స్థాయిలో మూడో రోజూ తరుగుదలఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.350 తగ్గి రూ.67,950 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,120 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.350 తగ్గి రూ.68,400 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,620 వద్దకు వచ్చింది.వెండి ధరలు స్వల్పంగా..దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర కేజీకి రూ.100 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీకి రూ.97,650 లకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)