Priyanka Gandhi
-
నాగపూర్ రోడ్ షోలో బీజేపీ జెండాలు.. ప్రియాంక రియాక్షన్ ఇదే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగపూర్‌లో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను ఊపి నినాదాలు చేశారు. ఇది చూసి కాంగ్రెస్ మద్దతుదారులు కూడా తమ పార్టీ నినాదాలు చేశారు.దీనిని గమనించిన ప్రియాంక గాంధీ.. చిరునవ్వుతో స్పందించారు. బుధవారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మైక్ తీసుకొని వారినుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘బీజేపీ మిత్రులారా, మీకు ఎన్నికల శుభాకాంక్షలు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్) నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి గెలుస్తుంది’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.गढ़ में घुस कर ललकारना इसे कहते हैं नागपुर में गरजीं @priyankagandhi RSS और भाजपा वालों शुभकामनाएँ लेकिन जीतेगी तो महाविकास आघाड़ी ही! pic.twitter.com/YMj5ynuvpg— Supriya Shrinate (@SupriyaShrinate) November 17, 2024కాగా బీజేపీ సైద్దాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లోనే ఉంది. దీనిని బీజేపీ కంచుకోటగా పరగణిస్తారు. 2014 నుంచి నాగ్‌పూర్ లోక్‌సభ స్థానానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలోని ఆరు ఆసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఇక మహారాష్ట్ర నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ ఉపఎన్నికతో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20 రోడ్‌షోలో పాల్గొన్నారు. నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా సాగిన ఈ రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. నాగ్‌పూర్ వెస్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా.. నాగ్‌పూర్ సెంట్రల్ 2009 నుంచి బీజేపీ చేతిలో ఉంది. -
యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. -
ఢిల్లీకి వస్తే గ్యాస్ ఛాంబర్లో కాలు పెట్టినట్లే: ప్రియాంకా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని వయనాడ్‌లో లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చారు. తాను రాజధానికి తిరిగి రావడం ‘గ్యాస్ ఛాంబర్’లో ప్రవేశించినట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.ఢిల్లీలో కాలుష్యం ఏటా పెరిగిపోతోందని, స్వచ్ఛమైన గాలి కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో.. వయనాడ్ నుండి ఢిల్లీకి తిరిగి రావడం గ్యాస్ చాంబర్లోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమించాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు వాయు కాలుష్యం కారణంగా పలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Coming back to Delhi from Wayanad where the air is beautiful and the AQI is 35, was like entering a gas chamber. The blanket of smog is even more shocking when seen from the air.Delhi’s pollution gets worse every year. We really should put our heads together and find a solution… pic.twitter.com/dYMtjaVIGB— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 14, 2024కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వయనాడ్ నుంచి తన ఎన్నికల ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ప్రియాంక సోదరుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి వైదొలగడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాల నుంచి గెలుపొందిన రాహుల్ ఆ తర్వాత వయనాడ్ లోక్‌సభకు దూరమయ్యారు.ఇది కూడా చదవండి: ‘ఆమె రీల్స్ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’ -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
వయనాడ్ విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ.. లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా.. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెనిచిరాలో సోమవారంప్రచారం చేశారు.‘‘ప్రజలకు తీరని బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశం, ప్రజల ప్రయోజనాలు, దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన ప్రదేశంలో నిలబడి ఉన్నాం. కొండచరియలు విరిగిన జిల్లాలోని కుటుంబాలకు తగినంత సహాయం పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైంది. ఈ సమస్యపై పోరాడుతా. పార్లమెంటులో వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తే.. నేను మీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడి చూపిస్తా. ..నేను మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా. మీ అవసరాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని పోరాటయోధురాలుగా మీ పక్కనే ఉంటా. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా.. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసాలను బీజేపీ ఉపయోగిస్తుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాజకీయాలు ఇక్కడి సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏకైక లక్ష్యం.. ఎంత ఖర్చు అయినా సరే అధికారంలో ఉండటం’’ అని అన్నారు.జూలైలో వయనాడ్‌లో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వంద ఇళ్లు బురదలో కొట్టుకుపోయాయి. -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం: రాహుల్
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు. కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.సంపన్న మిత్రుల కోసమే ఆరాటంప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు. -
వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ: ప్రియాంక గాంధీ
వయనాడ్: వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ అని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే సమయంలో బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం కాకుండా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ కామెంట్స్ చేశారు.వయనాడ్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడుతూ..‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక.. తన వ్యాపార మిత్రుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో నిరుద్యోగుల గురించి మోదీ సర్కార్ ఏనాడు ఆలోచించదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే బీజేపీకి ఉండదు. ఏం చేసైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. ప్రజలను విడగొట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకోవడంతో ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. కానీ, వయానాడ్ ప్రజలకు రాహుల్‌కు ఎప్పుడూ అండగానే ఉన్నారని ప్రశంసించారు.ఇదిలా ఉండగా.. వయనాడ్‌లో నవంబర్ 13వ తేదీన పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉండగా.. బీజేపీ తరఫున నవ్య హరిదాస్ పోటీలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. #WATCH | Wayanad, Kerala: Congress leader and party's candidate for Wayanad Lok Sabha by-election, Priyanka Gandhi Vadra says, "Modi ji's government works only for his big businessman friends. His objective is not to give you a better life. It is not to find new jobs. It is not… pic.twitter.com/l5fkrO7pGX— ANI (@ANI) November 3, 2024 -
మదర్ థెరిసా మా ఇంటికి వచ్చారు: ప్రియాంకా గాంధీ
తిరువనంతపురం: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె వయనాడ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తనకు మానవతవాది, నొబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసాతో ఉన్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు.‘‘నాకు 19 ఏళ్ల వయసులో మా నాన్నగారు( మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చనిపోయారు. ఆ సమయంలో మదర్ థెరిసా మా అమ్మను (రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ)ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం వచ్చి నా గదిలో ఉన్నాను. ఆమె నన్ను కూడా కలవడానికి వచ్చి.. నా తలపై చేయి వేసి, నా చేతికి రోజరీ అందించారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నానని ఆమె గ్రహించి ఉండవచ్చు. .. ఆమె నాతో 'నువ్వు వచ్చి నాతో పని చేయి' అని చెప్పారు. నేను ఢిల్లీలోని మదర్ థెరిసా ఆశ్రమంలో పనిచేశాను. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇదే తొలిసారి. ఆశ్రమంలో నాకు పని నేర్పించారు. బాత్రూమ్లు కడగడం, పాత్రలు శుభ్రం చేయడం, పిల్లలను బయటికి తీసుకెళ్లడం. వారితో కలిసి పనిచేయడం ద్వారా నేను వారు ఎదుర్కొన్న బాధ, ఇబ్బందులు, సేవ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగాను. ఒక సంఘం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకున్నా. ప్రజల అవసరాలు ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ సమస్యలేమిటో వినాలనుకుంటున్నా’’ అని ర్యాలీలో పాల్గొన్న ఓటర్లతో అన్నారు.ఏప్రిల్-జూన్ సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సీటులో గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానంలో కూడా విజయం సాధించారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ స్థానంలో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఇక.. ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు.చదవండి: రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ -
వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా? తేల్చేసిన కాంగ్రెస్
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానపరిచిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆయన కొద్దిసేపు మాత్రమే బయట వేచి ఉన్నారని.. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆయన లోపలే ఉన్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.తలుపుకి తాళం వేసి ఉండటం వల్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా లోపలికి వచ్చే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు. ‘బీజేపీ ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రచారం చేస్తుంది?. సభ పూర్తయ్యాక కలెక్టరేట్‌కు చేరుకోగానే డోర్ మూసి ఉంది. తరువాత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అక్కడికి వచ్చారు.. వారు కూడా కొన్ని నిమిషాలు వేచి చూసి లోపలికి వచ్చారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే కూడా వచ్చి తలుపు తాళం వేసి ఉండటంతో నిమిషంపాటు బయట వేచి ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే ప్రియాకం నామినేషన వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై, పార్టీపై బీజేపీ ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైంది కాదు.’ అని పేర్కొన్నారు.కాగా వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తన తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, సోదరుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే నామినేషన్ సమర్పణ సమయంలో ఖర్గేను అగౌరవ పరిచారని, రిటర్నింగ్ అధికారి గదిలోకి రానివ్వకుండా బయటే ఉంచారని బీజేపీ ఆరోపించింది. అంతేకాదు దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వేషాన్ని పెంచుకుంటోందని విమర్శించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కాషాయ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’
తిరువనంతపురం: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా నిర్వహించిన రోడ్డు షోకు భారీగా ప్రజలు తరలిరావటంపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ విమర్శలు గుప్పించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రియాంకా గాంధీ రోడ్డు షోకు త్రిసూర్‌తో సహా ఇతర జిల్లాల ప్రజలను తరలించారని అన్నారు. అందుకే భారీగా జనాలు వచ్చారని తెలిపారు.‘‘షూటింగ్‌కు లేదా వయనాడ్‌లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలను ప్రియాంక గాంధీ రోడ్డు షోకు తీసుకొచ్చారు. రోడ్‌షోకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావటం వెనక కారణం ఇది. ప్రియాంక గాంధీ వయనాడ్‌కు రావటం, రోడ్‌షో నిర్వహించటం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే వచ్చే ‘సీజనల్ ఫెస్టివల్’ లాంటిది. ప్రజలు అన్నీ గమనిస్తారు. ...ప్రముఖ రాజకీయ కుటుంబ నేపథ్యం ఆధారంగా మాత్రమే ప్రియాంకా గాంధీ అభ్యర్థి అయ్యారు. కానీ, నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏళ్ల తరబడి పనిచేశా. అట్టడుగు స్థాయిలో పనిచేసి ప్రజాసేవలో అనుభవం సంపాదించా. ఒక అభ్యర్థి గొప్పతనానికి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే.. దానికి నిదర్శనం ప్రియాంకా గాంధీ మాత్రమే. అయితే.. బీజేపీకి అలాంటి ప్రమాణాలు ఉండవు’’ అని అన్నారు. ఇక.. నవ్య హరిదాస్ ఇవాళ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. -
తొలిసారి పోటీ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించండి: ప్రియాంక
తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024 -
వయనాడ్ ఉపఎన్నికల అభ్యర్థిగా ఇవాళ ప్రియాంక వాద్రా నామినేషన్
-
వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. వయనాడ్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పోటీగా యంగ్ డైనమిక్ లీడర్, కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ నవ్య హరిదాస్‌ను ఖరారు చేసింది. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.ఇక, బీజేపీ నవ్య హరిదాస్(39) పేరును ఖరారు చేయడంతో ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. నవ్య ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. బీటెక్ చదవి ఉద్యోగం చేసిన నవ్య.. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీలో తన ముద్ర వేసి తక్కువ కాలంలోనే అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా వయనాడ్ బరిలోకి టికెట్ పొంది బంపరాఫర్ దక్కించుకున్నారు.నవ్య హరిదాస్ రాజకీయ నేపథ్యం..👉నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు.👉బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు.👉నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.👉బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.👉2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి.👉అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.👉నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.ఇదిలా ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ పార్లమెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ ఉప ఎన్నిక జరగనుంది.Navya Haridas to take on PriyankaGandhi from the Wayanad Lok Sabha seat on a BJP ticket👍👍 pic.twitter.com/joo5dXrEhT— tsr. (@srikanth690935) October 19, 2024 -
వయనాడ్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది. నవ్య హరిదాస్ ఇక్కడి నుంచి తమ పార్టీ తరపున బరిలో ఉంటారని వెల్లడించింది. నవ్య కేరళ బీజేపీ మహిళామోర్చాకు ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. నవంబర్ 13న వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. ఇదీ చదవండి: జార్ఖండ్‌లో కాంగ్రెస్,జేఎంఎం మధ్య కుదిరిన పొత్తు -
వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
తిరువనంతపురం : వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ దిగుతున్నట్లు కొద్ది సేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ,కేరళ వయనాడ్.. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూన్‌లో ప్రకటించారు. తాజాగా, అధికారికంగా ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే, ప్రస్తుత పార్లమెంట్లో గాంధీ కుటుంబం నుంచి ఆమె మూడో ఎంపీ. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. -
ఖర్గే మోదీకంటే సీనియర్.. అవమానించడం తగదు: ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరిచారని, అవమానపరిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు పాటించకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు.అంతేగాక మోదీకి బదులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందింస్తూ ఖర్గేకు కౌంటర్ లేక రాయడంపై ఆమె మండిపడ్డారు. ‘ఖర్గే ప్రధానమంత్రి కంటే పెద్దవారు. ఆయన్ను మోదీ ఎందుకు అగౌరపరిచారు? ప్రధాని మోదీకి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలపై గౌరవం ఉంటే ఆయనే స్వయంగా ఖర్గే ఈ లేఖకు సమాధానమిచ్చేవారు. కానీ అలాకాకుండా నడ్డా ద్వారా ఆయన లేఖ రాయించారు. అందులోనూ ఖర్గేను అవమానపరిచారు. 82 ఏళ్ల సీనియర్ నాయకుడిని అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది?ప్రశ్నించడం, సమాధానాలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగం. గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదని మతం కూడా చెబుతోంది. నేటి రాజకీయాలు విషపూరితంగా మారాయి. అయితే ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకొని దీనికి భిన్నమైన ఉదాహరణను చూపాలి. ప్రధాని తమ పదవికి ఉన్న స్థాయిని దృష్టిలోపెట్టుకొని సీనియర్ నాయకుడికి సమాధానం ఇచ్చి ఉంటే ఆయనకు విలువ ఉండేది. ఆయనపై గౌరవం పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఈ గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరం’ అని ప్రియాంక మండిపడ్డారు.కాగా ఇటీవల బీజేపీ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మోదీకి ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాశారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ రాహుల్ గాంధీని విఫల నాయకుడిగా అభివర్ణించారు.గతంలో రాహుల్ ప్రధానిని ఇదేవిధంగా అవమానపరచలేదా? అని ప్రశ్నించారు. ‘మోదీపై సోనియాగాంధీ ‘మృత్యుబేహారీ’ అని అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ రాజకీయ నైతికతను మరిచిపోయిందా? గత ఐదేళ్లలో ప్రధానిని మీ నేతలు 110 సార్లు అవమానించారు. ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. कुछेक भाजपा नेताओं और मंत्रियों की अनर्गल और हिंसक बयानबाज़ी के मद्देनज़र लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जीवन की सुरक्षा के लिए चिंतित होकर कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खरगे जी ने प्रधानमंत्री जी को एक पत्र लिखा।प्रधानमंत्री जी की…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2024 -
మాటలు చెప్పడం కాదు.. ప్రధాని మోదీపై రాహుల్, ప్రియాంక ఆగ్రహం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పాటు అధికార బీజేపీని విమర్శించారు.ఈ భయంకరమైన సంఘటన మొత్తం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. నేరస్థులు వరుస దారుణాలతో ప్రభుత్వంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆ ఫలితమే ఈ దారుణాలు అని వ్యాఖ్యానించారు. मध्य प्रदेश में सेना के दो जवानों के साथ हिंसा और उनकी महिला साथी के साथ दुष्कर्म पूरे समाज को शर्मसार करने के लिए काफी है। भाजपा शासित राज्यों की कानून व्यवस्था लगभग अस्तित्वहीन है - और, महिलाओं के खिलाफ़ दिन प्रतिदिन बढ़ते अपराधों पर भाजपा सरकार का नकारात्मक रवैया अत्यंत…— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024 ట్రైనీ ఆర్మీ అధికారులపై జరిగిన దారుణం నా హృదయాన్ని ద్రవించి వేస్తుంది. మహిళల భద్రత గురించి ప్రధాని మోదీ ప్రసంగాలు చేస్తారు. మహిళలు మాత్రం రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ ఎప్పటికి ముగుస్తుంది? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో ప్రతిరోజూ 86 మంది మహిళలపై నిత్యం ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ట్వీట్లో పేర్కొన్నారు.मध्य प्रदेश में सेना के अधिकारियों को बंधक बनाकर महिला से गैंगरेप एवं उत्तर प्रदेश में हाईवे पर एक महिला का निर्वस्त्र शव मिलने की घटनाएं दिल दहलाने वाली हैं। देश में हर दिन 86 महिलाएं बलात्कार और बर्बरता का शिकार हो रही हैं। घर से लेकर बाहर तक, सड़क से लेकर दफ्तर तक, महिलाएं…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 12, 2024ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణంమధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై అర్థరాత్రి ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులతో దాడి చేశారు. అనంతరం వారిని బంధించి.. బాధితుల్లోని ఇద్దరిని రూ.10లక్షల తీసుకుని రావాలంటూ బెదిరించారు. దీంతో ఆ ఇద్దరు స్నేహితులు జరిగిన దారుణాన్ని ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.ఇదీ చదవండి : గణపతి పూజపై రాజకీయ దుమారంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఓ ట్రైనీ ఆర్మీ అధికారిపై దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు: సీఎం మమతకు ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇది హృదయవిదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ కేసు దర్యాఫ్తును వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలు పని చేసే ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సమస్యగా మారిందని వాపోయారు. మహిళల భద్రత కోసం తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.कोलकाता के आरजी कर मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर के साथ दुष्कर्म और हत्या की घटना दिल दहलाने वाली है। कार्यस्थल पर महिलाओं की सुरक्षा देश में बहुत बड़ा मुद्दा है और इसके लिए ठोस प्रयास की जरूरत है। मेरी राज्य सरकार से अपील है कि इस मामले में त्वरित और सख्त से सख्त कार्रवाई…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2024చదవండి: కోల్‌కతా వైద్యురాలి కేసు.. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నిందితుడు -
వయనాడ్ లో రాహుల్ ప్రియాంక పర్యటన
-
‘వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేస్తోంది‘: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది అని కేరళ వయనాడు విషాదంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. గురువారం కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లోని చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల క్షేమ సమాచారాన్ని, భద్రతా బలగాల సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మానాన్న రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడు అంతే బాధపడుతున్నా.. యావత్ దేశం వయనాడ్ బాధను చూస్తోంది. నేనొక్కడినే కాదు అనేకమంది ఈ బాధను అనుభవిస్తున్నారు. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలచివేసింది. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్న ఆయన.. బాధితులకు అన్నీ రకాలుగా సహాయం అందించడమే మా ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నాం. బాధితులకు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చాం. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. ఈ విషాదం చూస్తే నాకు మాటలు రావడం లేదు అని ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. #WATCH | On deaths due to Wayanad landslides, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "Today, I feel how I felt when my father died. Here people have not just lost a father but an entire family. We all owe these people respect and affection. The whole nation's attention… pic.twitter.com/9dSPI6kQdx— ANI (@ANI) August 1, 2024 -
కేరళలో ప్రకృతి విపత్తు : వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక
తిరువనంతపురం : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్ర గురువారం (ఆగస్ట్1) కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన స్థానికుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.భారీ వర్షాల కారణంగా మంగళవారం వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 256 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో కేరళ జిల్లాలోని ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.LoP Shri @RahulGandhi & AICC General Secretary Smt. @priyankagandhi ji visit the Chooralmala landslide site in Wayanad where devastating landslides have claimed many lives and left families devastated.📍 Kerala pic.twitter.com/EnPakO8tJC— Congress (@INCIndia) August 1, 2024కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ సుమారు 1,000 మందిని రక్షించింది . 220 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వయనాడ్ వరదల నుంచి ప్రజల నుంచి భద్రతా బలగాలు చేస్తున్న సహాయక చర్యలు గురువారానికి మూడోరోజుకి చేరుకున్నాయి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఎడిఆర్) ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం కనీసం 1,500 మంది ఆర్మీ సిబ్బందిని, ఫోరెన్సిక్ సర్జన్లను నియమించామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.రానున్న రెండు రోజుల్లో వయనాడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. -
ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ర ఏవంత్ భేటీయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి దీప దాస్ మున్షీ ఉన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు, నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకకు సీఎం వివరించారు. ఈ నెలాఖరున వరంగల్‌లో రైతు రుణమాఫీ విజయోత్సవ బహిరంగసభ నిర్వహిస్తామని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఏఐసీసీ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో, రేపు వీరంతా హైదరాబాద్ రానున్నారు. -
నిరుద్యోగంలో రికార్డ్ బ్రేక్: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా తూర్పార బట్టారు. మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సరకుల లోడింగ్ కేంద్రం వద్ద చిరు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత క్యూ వరసల్లో నిల్చుని తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు. ‘‘ కొద్దిరోజుల క్రితం ముంబైలో మోదీ మాట్లాడు తూ మేం కోట్లాది మందికి ఉపాధి కల్పించి రికార్డ్‌లు బ్రేక్ చేశామని ఢంకా బజాయించారు. కానీ అదే ముంబైలో చిన్నపాటి ఉద్యోగాల కోసం వేలాదిగా యువత ఆశతో ఎగబడటం మనందరం చూశాం. ఇదే ఏడాది గుజరాత్లో 25 ఉద్యోగాల కోసం ఏకంగా లక్షలాది మంది నిరుద్యోగులు తండోపతండాలుగా తరలిరావడమూ మనందరికీ తెల్సిందే. ఇవన్నీ చూస్తుంటే రికార్డ్‌లు బ్రేక్ అయినట్లు తెలుస్తూనే ఉంది. కానీ ఆ రికార్డ్‌లు నమోదైంది ఉద్యోగాల్లో కాదు నిరుద్యోగంలో. దేశాన్ని తీవ్ర నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా మోదీ ఉత్తమాటలు చెప్పడం మానేసి ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టాలి’’ అని ప్రియాంక నిలదీశారు. -
‘ప్రియాంకకు అంత సీన్ లేదు.. అదంతా రాహుల్ జిమ్మిక్కు’
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో.. వయనాడ్ వదులుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వయనాడ్ ప్రజలకు భావోద్వేగాలతో కూడిన ఓ లేఖ రాశారు. అయితే ఆయన రాసిన లేఖకూ కేరళ బీజేపీ అధ్యక్షుడు కే. సుందరేశన్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు రాసిన లేఖ కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్కులో భాగమని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ‘’ఇప్పటికే రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు ద్రోహం చేశారు. ప్రతిసారి వయనాడ్ తనకు రెండో నివాసం,కుటుంబమని చెబుతారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. ఆయన తన సోదరిని ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. ఇదంతా తన కుటుంబం కోసం చేస్తున్నారు. ఇది కేవలం ఒక జిమ్మిక్కు. వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీని నమ్మరు. ఎందుకంటే ఆయన చేప్పిన మాటలకు ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకొలేదు’’ అని సుందరేశన్ అన్నారు.ప్రియాంకా గాంధీ పార్టీలో, యూపీలో పెద్ద పేరు ఉన్నప్పుడు ఆమె ఎక్కడ ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, అమెథీ స్థానాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. ఇదీ వారికి అనుకూలమైన స్థానమని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు. కానీ, ఈసారి తాము ప్రియాంకా గాంధీకి గట్టిపోటీ ఇస్తామన్నారు. ఇక్కడ ఎన్డీయే, యూపీఏ మధ్యే అసలు పోటీ నెలకొనుందని అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ ప్రజలకు రాసిన లేఖలో.. ‘‘ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశా. నేను మీకు పరిచయం లేదు. కానీ మీరు నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చారు. నా ఇల్లు, నా కుటుంబం మీరే అయ్యారు. నాకు ప్రేమను, ఆప్యాయత పంచారు. జూన్ 17న వయనాడ్‌ను వదులుకుంటున్నట్టు మీడియా ముందు నిలబడి ప్రకటిస్తున్నప్పుడు కన్నీరు పెట్టుకోవడం మీరు చూసి ఉంటారు. బరువెక్కిన గుండెతో మీకు వీడ్కోలు పలుకుతున్నా. ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక సిద్ధంగా ఉన్నారు. నన్ను ఆదరించినట్టు నా సోదరిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
వయనాడ్ ప్రజలకు రాహుల్‌గాంధీ భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ: ఎంపీగా నియోజకవర్గాన్ని వదులుకున్న వేళ కేరళలోని వయనాడ్ ప్రజలకు ఆదివారం(జూన్23) రాహుల్ గాంధీ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘వయనాడ్‌ను వదులుకున్నందుకు బాధగా ఉంది. ఇన్ని రోజులు మీరిచ్చిన సహకారానికి నా కృతజ్ఞతలు. మీరు ప్రియాంకను ఎంపీగా ఎన్నుకుంటే బాగా పనిచేస్తుంది. ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయమని నేనే ఒప్పించా. గతంలో నేనెవరో తెలియనపుడే మీరు నన్ను నమ్మారు. మీ గొంతను పార్లమెంటులో వినిపించినందుకు ఆనందంగా ఉంది. రాయ్‌బరేలి, వయనాడ్ రెండింటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. దేశంలో విద్వేషాన్ని హింసను రెచ్చగొట్టేవారిపై కలిసి పోరాడదాం’అని రాహుల్‌గాంధీ లేఖలో తెలిపారు. కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చింది.