Rodrigo Duterte
-
సంచలన ప్రకటన చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె మరోసారి వార్తల్లోనిలిచారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. తాను 2022 ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శనివారం ప్రకటించారు. తద్వారా తన కుమార్తె సారా డ్యూటెర్టె దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గాన్ని క్లియర్ చేస్తున్నాడనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. తాను వైస్ ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడినన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పోటీనుంచి, రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది తన కుమార్తె పోటీకి మార్గం సుగమం చేశారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రోడ్రిగో విధేయుడు, సెనేటర్ క్రిస్టోఫర్ "బోంగ్" వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయనుండటం విశషం. కాగా 2022 ఎన్నికలకు గాను రోడ్రిగో డుటెర్టె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఆరేళ్లు కాలపరిమితిని పూర్తిచేసుకున్న ఆయన, టాప్ పొజిషన్ కోసం మళ్లీ పోటీ చేయడానికి అర్హుడు కాదు. అయితే సారా డ్యూటెర్టేకు లైన్ క్లియర్ చేసేందుకే ఆయన రేసునుంచి తప్పుకున్నారని న్యాయ, రాజకీయాల ప్రొఫెసర్ ఆంటోనియో లా వినా అన్నారు. ఈ ఫైర్ బ్రాండ్ మళ్లీ మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. -
స్ట్రాంగ్ వార్నింగ్.. టీకా వేసుకుంటారా లేక జైలుకు వెళ్తారా?
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే మరోసారి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని జైలులో పెడతామని వార్నింగ్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటారా? లేక జైలుకు వెళ్తారా? అని బెదిరించారు. కాగా, ఫిలిప్పీన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. దేశంలో ఇప్పటివరకు 13 లక్షల పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 వేల మందికి పైగా మరణించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ కొంతమంది వ్యాక్సిన్ పట్ల విముఖత చూపిస్తున్నారు. దాంతో టీకా వేసుకోవడానికి నిరాకరించిన ప్రజలపై రోడ్రిగో డ్యూటెర్టే విరుచుకుపడ్డారు. టీకా వద్దంటే ఖబర్దార్.. జైలులో ఊచలు లెక్కించాల్సిందే అని వ్యాఖ్యానించారు. ‘దేశంలో కరోనా సంక్షోభం ఉంది కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది, నన్ను తప్పుగా భావించవద్దు’ అని డ్యూటెర్టే వివరణ ఇచ్చుకున్నారు. జూన్ 20 నాటికి, ఫిలిప్పీన్స్ అధికారులు 2.1 మిలియన్ల మందికి పూర్తిగా టీకాలు వేశారని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. చదవండి: సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు -
అమెరికాకు నిజంగా అంత సీన్ ఉందా?
మనీలా(ఫిలిప్పిన్స్) : అమెరికాపై మరోసారి ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఘాటైన విమర్శలు చేశారు. అమెరికాకు చైనాతో యుద్ధం చేసేంత సీన్ లేదని తేల్చిచెప్పారు. నిజంగా చైనాను అమెరికా నిలువరించాలి అనుకుంటే తన మిత్రదేశాలను ‘ఎర’గా వాడుకొని చైనాను రెచ్చగొట్టడం ఆపాలని హితవు చెప్పారు. అంతేగాని మాలాంటి దేశాలను ముందు పెట్టి ఆటలాడటం సరికాదన్నారు. మనీలాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. అమెరికా ఎల్లప్పుడూ మనల్ని ముందుంచి చైనాకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. మనల్ని వానపాముల్లా ఎరగా వాడుకోవాలని చూస్తుందని పేర్కొన్నారు. అమెరికాను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు చెప్తున్నాం వినండి, మొదట మీరు వివాదాస్పద దక్షిణచైనా సముద్రంలోకి మీ మిలటరీతో వెళ్లండి, యుద్దం చేయండి, ఈ సారి మీ వెనక మేం ఉంటాం. చైనాపై పేల్చే మొదటి బుల్లెట్ మీదైతే..తర్వాత బుల్లెట్ మాదేనని’ తెలిపారు. ఎలాగైనా చైనాను కట్టడి చేయాలని ఒక పక్క అమెరికా, విస్తరణకాంక్షతో సముద్రంలో కృత్తిమ దీవులను సృష్టిస్తూ మరోపక్క చైనాలు ఘర్షణ పడుతుంటే వీటి మధ్య మేం శాండ్‌విచ్‌లా మారామని విమర్శించారు. ఏం అమెరికాకు జపాన్‌లో ఏడవ నౌకాదళం ఉందిగా, దమ్ముంటే యుద్ధానికి వెళ్లండని ప్రశ్నించారు. ఫిలిప్పిన్స్‌కు మిత్రదేశంగా చెప్పుకునే మీరు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా చైనా నిర్మాణాలు చేపడుతుంటే ఆపకుండా రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫిలిప్పిన్స్ ఏన్నటికీ చైనాపై యుద్దంలో గెలవలేదని, చైనాపై యుద్ధానికి తమ సైనికులను పంపి వారిని కోల్పోలేనని తెలిపారు. డ్యుటెర్టె తాజా వ్యాఖ్యలను చూస్తుంటే ఈ దేశం అమెరికాకు దూరం జరిగేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. దక్షిణచైనా సముద్రంలోని దీవులపై చైనా, ఫిలిప్పిన్స్లకు తగాదా ఉన్న విషయం తెలిసిందే. చైనా అక్కడ కృత్తిమ దీవులను సృష్టిస్తూ తీరప్రాంత దేశాలతో ఘర్షణ వాతారవరణం రేపింది. దీంతో వియత్నాం, ఫిలిప్పిన్స్ తదితర దేశాల తరపున అమెరికా నిలిచింది. గత నెలలో ఫిలిప్పిన్స్, చైనాల మధ్య సముద్ర ప్రయాణ విషయమై ఘర్షణ జరిగింది. దీన్ని చిన్న సముద్ర ప్రమాదంగా డ్యుటెర్టె అభివర్ణించారు. చైనాపై సున్నిత విమర్శలు చేస్తున్న డ్యుటెర్టె ఇదివరకూ కూడా అమెరికా తీరుపై విమర్శలు గప్పించాడు. అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని, తన మిత్రదేశాలపై గౌరవం లేదని అన్నారు. కాగా డ్యుటెర్టె అమెరికాపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేయడాని వేరే కారణం ఉందని పరిశీలకులు అంటున్నారు. డ్యుటెర్టె దేశంలో డ్రగ్స్ ముఠాపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వేలాదిమందిని డ్రగ్స్ పేరుతో డ్యుటెర్టె చంపుతున్నారని అమెరికా ఆధారిత మానవహక్కుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే డ్రగ్స్ ముఠాకు వ్యతిరేకంగా రైఫిల్స్‌ను ఫిలిప్పిన్స్‌కు అమ్మడానికి అమెరికా ఒప్పుకోలేదు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న ఆయన ఇలా వీలు దొరికినప్పుడల్లా అమెరికాను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నాడని అంటున్నారు. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు వేదికపై రోత చేష్టలు
-
‘ఈ స్త్రీలు నన్ను ‘గే’ కాకుండా కాపాడారు’
మనీలా : ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (73) ఓ దేశాధ్యక్షుడిగా కంటే కూడా అసభ్యకర వ్యాఖ్యలు, రోత చేష్టలు చేసే మనిషిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహిళలంటే ఈ దేశాధినేతకు చాలా చిన్న చూపు. వారిని కేవలం లైంగిక ఆనందం అందించే ఓ వస్తువుగా మాత్రమే చూస్తారు. ఆయన మాటలు, చేష్టల పట్ల ఎంతమంది దుమ్మెత్తిపోసినా.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లే గానీ.. ఇతను మాత్రం మారడు. తాజాగా ఈ ప్రబుద్ధుడు ఓ చండాలమైన పని చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్వదేశంలోనే కాక అతిథిగా వెళ్లిన దేశంలో కూడా తన నీచ బుద్ధిని బయటపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల పర్యటన ముగింపులో భాగంగా జపాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్ వాసులతో టోక్యోలో సమావేశమయ్యారు రోడ్రిగో. ఈ క్రమంలో కార్యక్రమం ముగిసిన తర్వాత తాను ముద్దుపెట్టుకొనేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదికకు దగ్గరగా కూర్చోవాలని కోరాడు రోడ్రిగో. వీరిలో మొదటి మహిళ రోడ్రిగోను ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. తన పెదవులపై, మెడపై ముద్దు పెట్టుకోవద్దని ఆమె కోరింది. దాంతో రోడ్రిగో ఆ మహిళ చెంపలపై ముద్దుపెట్టుకొని పంపించారు. అనంతరం రెండో మహిళది అదే పరిస్థితి. అయినా రోడ్రిగో తీరు మారలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు వేదికపై రోత చేష్టలు మూడో మహిళను ముద్దుపెట్టుకొని ఫోటోకి పోజు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు కూడా అలానే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగం ముగిసిన తర్వాత రోడ్రిగో ‘సాధారణంగా నేను పెదవులపైనే ముద్దు పెట్టుకొంటాను. ఈ రోజు నేను గే(నపుంసకుడు) కాకుండా ఈ మహిళలు సాయం చేశారు’ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. తన విమర్శకుడు సెనెటర్ ఆంటోనియోను ‘హోమో’గా వర్ణించారు. 74 ఏళ్ల ఈ ముసలి అధ్యక్షుడు తన భార్య కళ్ల ముందే ఇలా ఇతర మహిళల్ని ముద్దు పెట్టుకోవడం గమనార్హం. అయితే విదేశాల్లో నివసిస్తున్న తన దేశీయులను ముద్దు పెట్టుకోవడం రోడ్రిగోకు ఇదే మొదటి సారికాదు. 2018 జూన్‌లో కూడా సియోల్‌లో పని చేస్తున్న వివాహితను రోడ్రిగో ముద్ద పెట్టుకున్నారు. ఆమెకు వివాహం అయిందని తెలిసినా వదిలిపెట్టలేదు. (చదవండి : పెదాలపై ముద్దు.. తీవ్ర విమర్శలు) -
చర్చి లక్ష్యంగా పేలుళ్లు
మనీలా: బాంబు పేలుళ్లతో ఫిలిప్పీన్స్ దేశం దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని కేథలిక్ చర్చ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆప్రాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 15 మంది పౌరులు, ఐదుగురు భద్రతాసిబ్బంది ఉన్నారు. సైనిక బలగాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఆదివారం చర్చి ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. తొలిబాంబు పేలుడుతో చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. నిమిషం వ్యవధిలో మరో బాంబుపేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో బాంబును చర్చివద్ద నిలిపివున్న బైక్‌కు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ముందు జాగ్రత్తగా అధికారులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఆపివేశారు. ‘ఇది దేశ విద్రోహుల చర్య, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ముష్కరులకు తగిన బుద్ధి చెబుతాం’అని దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతెరో ప్రకటించారు. అబూ సయ్యఫ్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొద్దికాలంగా బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నారు. అమెరికాలో ఐదుగుర్ని చంపిన ఉన్మాది న్యూఆర్లిన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో డకోటా థిరియట్(21) అనే ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిని కూడా హ్యాండ్‌గన్‌తో కాల్చిచంపాడు. అనంతరం ఓ కారులో పరారయ్యాడు. లూసియానాలోని అస్కెన్షన్ ప్రాంతానికి చెందిన థిరియట్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం(స్థానిక కాలమానం) ప్రియురాలు సమ్మర్ ఎర్నస్ట్(20) ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమెతో పాటు యువతి తండ్రి బిల్లీ(43), తమ్ముడు టానర్(17)ను చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కారులో లివింగ్‌స్టన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు కీత్(50), ఎలిజబెత్(50) వద్దకు చేరుకుని వారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న డకోటా థిరియట్ కోసం గాలింపును ప్రారంభించారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. -
అతనో పిచ్చివాడు.. పట్టించుకోవద్దు
దావా : ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమ న్యాయం కల్పించాల్సిన నాయకులే ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. తప్పు చేసిన వారిని శిక్షించలేని సమాజం తన మాటలు, చేతలతో బాధితులనే మరింత ఇబ్బంది పెడుతోంది. అత్యాచారాలను నిరోధించలేని నాయకులు చిత్రంగా ఆడవారిదే తప్పంటూ మహిళల మీదే రాళ్లు వేస్తుంటారు. ఇలా నోటికి అడ్డు, అదుపు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో ముందుంటారు ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్. తాజాగా ఈయన గారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివాదాస్పద ‘జోక్’ చేసి విమర్శల పాలవుతున్నారు. దావోలో ఓ కార్యక్రమానికి హాజరైన డ్యూటర్ట్ ‘అందమైన మహిళలు ఉన్నంత కాలం అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయంటూ’ పనికిమాలిన జోక్ చేశారు. అంతటితో ఆగకుండా మరికొన్ని నీతి మాలిన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ మహిళా సంఘాలతో పాటు పాశ్చత్య మీడియా కూడా డ్యూటర్ట్ మీద దుమ్మేత్తిపోస్తున్నాయి. డ్యూటర్ట్ గురించి తెలిసిన ఫిలీప్పీన్స్ మహిళలు ‘దేవున్నే ఇడియట్ అన్న వాడు మహిళల గురించి ఇంత కన్నా బాగా ఎలా మాట్లాడగలడు. డ్యూటర్ట్ ఓ పిచ్చివాడు.. అతని మాటాలను పరిగణలోకి తీసుకుంటే మన స్థాయి పడిపోతుంది’ అంటున్నారు. -
దేవుడున్నాడని నిరూపిస్తే రాజీనామా
మనీలా : దేవుడున్నాడని ఎవరైనా నిరూపిస్తే దేశ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తానని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ సవాలు విసిరారు. స్టూపిడ్ గాడ్ అంటూ రొడ్రిగో ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేవుడిపై తన వ్యాఖ్యాలతో రోమన్ క్యాథలిక్ దేశమైన ఫిలిప్పీన్స్‌లో వివాదంగా మారుతున్నారు. దక్షిణ దవవొ నగరంలో సైన్స్, టెక్నాలజీ అంశంపై శనివారం రొడ్రిగో మాట్లాడుతూ... ‘అసలు ఈ సృష్టిలో దేవుడు అనేవాడు లేడు. ఎవరైనా దేవుడు వున్నాడని నిరూపిస్తే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. దేవుడు అనే పదానికి అర్థం ఏంటి. దేవుడి బొమ్మగాని, అతను మాట్లాడుతాడనిగాని ఎవరైనా నిరూపించగలరా? దేవుడు ఉన్నాడనే భావన చాలా మూర్ఖమైనది. ఇదేం మతమో’ అని వ్యాఖ్యానించారు. గతవారం రొడ్రిగో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు ఆ స్టూపిడ్ గాడ్ ఎవరని, క్యాథలిక్ బిషప్‌లను మానసిక రోగులని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డ్యూటర్ట్ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రతిపక్ష నేత ఆంటోనియా ట్రిలియన్స్ రొడ్రిగోను ఒక దుష్టుడిగా అభివర్ణించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా క్రూరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను రొడ్రిగో అధికార ప్రతినిధి హ్యారి రోక్ తీవ్రంగా ఖండించారు. దేవుడిపైనా, మతాలపైన తన అభిప్రాయాన్ని రోడ్రిగో వ్యక్తపరిచారని, ఆ హక్కు ఆయనకు ఉందని తెలిపారు. -
పెదాలపై ముద్దు.. తీవ్ర విమర్శలు
మనీలా/సియోల్: ఫిలిప్పీన్స్‌లో నిరంకుశ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళను 3 వేల మంది సమక్షంలో బహిరంగంగా పెదాలపై ఆయన ముద్దాడటమే ఇందుకు కారణం. స్ర్తీద్వేషిగా వార్తల్లో నిలిచే రొడ్రిగో చేసిన పనితో జనాలంతా దిగ్భ్రాంతికి గురికాగా, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఆయన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించారు. ఈ ఆదివారం అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న ప్రజల్లో ఓ ఫిలిపైనో మహిళను వేదిక మీదకు పిలిచారు. ఆమెకు ఓ పుస్తకాన్ని బహుకరించి అనంతరం తన పెదాలను ముద్దు పెట్టుకోవాల్సిందిగా ఆమెను కోరారు. ‘మీరు ఒంటరినా? లేక వివాహం అయ్యిందా? పుస్తకం బదులు నా పెదాలను ముద్దాడండి అని రొడ్రిగో అడగ్గా.. దానికి ఆమె అయ్యిందనే బదులిచ్చారు. ‘అయినప్పటికీ ముద్దు పెట్టాల్సిందేనంటూ’ ఆమెను ఆయన ప్రాధేయపడ్డాడు. మొహమాట పడుతూనే ఆమె రొడ్రిగో పెదాలను ఛుంబించటంతో అక్కడున్న జనమంతా నిశ్చేష్టులయ్యారు. అయితే ఆ వెంటనే ఆయన ‘ఇది సరదా కోసం చేసిందే. సీరియస్‌గా తీసుకోకండని’ అంటూ అక్కడున్న వారిని కోరారు. విమర్శలు-జోకులు... 73 ఏళ్ల డ్యుటెర్టె గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కార్యక్రమానికి హాజరైన ప్రజలను వినోదపరిచేందుకు తాను అలా చేశానని ఆయన స్పష్టం చేసినప్పటికీ, ఫిలిప్పీన్స్‌లోని మహిళా సంఘాలు, రాజకీయ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. సరదా కోసం ఓ మహిళను ఇబ్బంది పెట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. మరికొందరు ‘అది తప్పు అని, అంతలా అయితే చెంపపై పెట్టాల్సింది’ అని అంటున్నారు. విమర్శలు తారాస్థాయికి చేరటంతో మనీలాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఆ మహిళను ఇంటర్వ్యూ చేశాయి. ఇది చాలా చిన్న వ్యవహారమని, తనకు, తన భర్తకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు వస్తుందో తెలీటం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరికొందరు రొడ్రిగోకు మద్ధతుగా ట్వీట్లు చేస్తుండగా, ఇంకొందరు మాత్రం మహిళ స్థానంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ను అంటించి(మార్ఫింగ్) సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. -
ఔను ప్రజల్ని చంపుతున్నా.. జైల్లో పెట్టే దమ్ముందా!
ఫిలిప్పీన్స్ నిరంకుశ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తె ఐరాస మానవహక్కుల సంఘం చీఫ్‌పై తిట్లవర్షం కురిపించారు. ‘వేశ్య కొడుకా.. నన్నే సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటావా?’ అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తానంటూ అత్యంత క్రూరంగా ద్యుతర్తె సాగిస్తున్న అణచివేతపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్యుతర్తె సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి.. మానసిక పరిస్థితిని బాగుపర్చుకోవాలని ఐరాస మానవహక్కుల సంఘం హైకమిషనర్ జీద్ రాడ్ అన్ హుస్సేన్ సూచించారు. ఐరాస ప్రతినిధులపై దుర్భాషలు ఆడితే.. తగిన బదులిస్తామని ఘాటుగా పేర్కొన్నారు. జోర్డానియన్ రాజకుమారుడైన జీద్ వ్యాఖ్యలపై ద్యుతర్తె చిందులు తొక్కారు. ‘మీరు బాగున్నారు మేయర్.. మీకు తిట్టడం అంటే కొంచెం ఇష్టం’ అని సైక్రియాట్రిస్ట్ నాకు చెప్పాడు. జీద్ వ్యాఖ్యలపై స్పందించవద్దని కొంతమంది నాకు చెప్పారు. కానీ ప్రతీకారం తీర్చుకునేందుకు మాట్లాడుతున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు. జీద్ తలకాయలో మెదడు లేదని, అది ఉత్త బుర్ర అని తిట్టిపోశారు. ‘అవును, నేను పరుషంగా ఉంటాను. చాలా పరుషంగా ఉంటాను. ఇందులో నేనే చేసేదేమీ లేదు. నేను ప్రజల్ని చంపుతున్నానా? అవును నేను డ్రగ్స్ అమ్ముతున్న వారిని చంపేస్తున్నాను. దీనిని ఆపాలని నేను ఇంతకుముందే చెప్పాను’ అని ద్యుతర్తే మంగళవారం తెలిపారు. ‘నన్ను జైల్లో వేయగలమని మీరు అనుకుంటే.. మీరు కల కంటున్నట్టే’ అని మానవ హక్కుల సంఘాలను ఉద్దేశించి ద్యుతర్తే పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోయిన డ్రగ్స్ సంస్కృతిని ఆరునెలల్లో రూపుమాపుతానని 2016లో అధికారంలోకి వచ్చిన ద్యుతర్తే ప్రభుత్వం.. డ్రగ్స్ అణచివేతలో భాగంగా వందలమంది డీలర్లను, వేలమంది వినియోగదారులను హతమార్చింది. డ్రగ్స్ సేవిస్తున్నట్టు భావిస్తున్న 4,100 మందిని చంపేసినట్టు ఫిలిప్పీన్స్ పోలీసులు చెప్తుండగా.. అనధికారికంగా ఆ సంఖ్య మూడు రెట్లు అధికమని హక్కుల సంఘాలు చెప్తున్నాయి. ద్యుతర్తే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పౌరులను హతమారుస్తోందని, ఈ దుర్మార్గంపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని జీద్ గత నెలలో మండిపడ్డారు. ఐరాస ప్రతినిధిపై ద్యుతర్తె దుర్భాషలాడటాన్ని ఖండించారు. -
లగ్జరీ కార్లను నుజ్జునుజ్జు చేయించారు
మనీలా, ఫిలిప్పీన్స్ : కేవలం మూడే మూడు నిమిషాల్లో అక్షరాల లక్షా పదిహేను వేల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. దాదాపు రెండు డజన్ల లగ్జరీ కార్లను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె నుజ్జునుజ్జు చేయించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. పన్ను ఎగవేసి కొన్న లగ్జరీ కార్లను గతేడాది ఫిలిప్పీన్స్ అధికారులు పట్టుకున్నారు. సాధారణంగా ఇలా పన్ను ఎగవేసి దేశంలో నడుపుతున్న కార్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక వేలంలో అమ్ముతుంది. వచ్చిన మొత్తాన్ని ఎగవేసిన సొమ్ముకింద జమ చేసుకుంటుంది. అయితే, ఈ సారి అందుకు భిన్నంగా అధ్యక్షుడు డ్యుటెర్టె రైడింగ్‌లలో దొరికిన కార్లను బుల్డోజర్లతో తొక్కించారు. కార్లను తొక్కించగా మిగిలిన పార్ట్లతో బొమ్మలు చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. డ్యుటెర్టె నుజ్జునుజ్జు చేయించిన వాటిలో పొర్చె, మెర్సిడెజ్, జాగ్వర్, కొర్వెట్టెస్ కంపెనీల కార్లు ఉన్నాయి. -
ఫిలిప్పీన్స్‌లో అగ్నిప్రమాదం.. 37 మంది మృతి
దావో: ఫిలిప్పీన్స్‌లో తుపాను ఉధృతి మరవకముందే మరో పెనుప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని దావో నగరంలో ఉన్న ఎన్సీసీసీ షాపింగ్ మాల్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 37 మంది మరణించారు. మాల్లో మూడో అంతస్తులో ఉన్న ఫర్నిచర్ దుకాణంలో తొలుత మంటలు అంటుకున్నాయని పోలీసులు వెల్లడించారు. మాల్లో పై అంతస్తులో ఉన్న కాల్సెంటర్లో విధులు నిర్వహించే వారంతా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే ఘటనాస్థలికి చేరుకుని మృతుల బంధువులను పరామర్శించారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న తుపాను ధాటికి మరణించిన వారి సంఖ్య 200 దాటింది. -
'నా కొడుకైనా సరే కాల్చిపారేయండి'
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయన్నది ఆయన మాటలను బట్టి చెప్పవచ్చు. దేశంలో పేరుకుపోయిన డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న డ్యుటర్టె.. తన కుమారుడు పాలో డ్యుటర్టెపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ అక్రమరవాణాకు పాల్పడ్డాడని నిరూపితమైతే తన కుమారుడినైనా కాల్చిపారేయాల్సిందేనంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడంటూ అధ్యక్షుడి కుమారుడు పాలో డ్యుటర్టెపై విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేశారు. గతంలోనే డ్రగ్స్ రాకెట్లో పాలోపై ఆరోపణలు ఉండటంతో విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చైనా డీలర్లతో కలిసి పాలో డ్యుటర్టె దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణాచేస్తున్నారన్న ఆరోపణలపై అధ్యక్షుడు రొడ్రిగో ఈ విధంగా స్పందించారు. 'డ్రగ్స్ మాఫియాలో మా కుటుంబానికి సంబంధమే లేదు. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకుంటాను. నా కుమారుడు పాలో డ్రగ్స్ రాకెట్లో భాగస్వామి అని నిరూపించినట్లయితే అతడిని కాల్చిపారేయమని ఆదేశిస్తాను. పాలోను చంపిన వారికి రక్షణ కల్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ' అధ్యక్షుడు రొడ్రిగో వివరించారు. గతేడాది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డ్రగ్స్ రాకెట్‌పై సీరియస్‌గా ఉన్న రొడ్రిగో ఆదేశాలతో 3800 మందిని పోలీసులు కాల్చి చంపారు. డ్రగ్స్ సరఫరా చేసిన వారితో పాటు వీటిని అక్రమరవాణా చేస్తున్న వారిపై రొడ్రిగో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మీరు ఉగ్రవాదులను చంపితే ఎలాంటి భయం అక్కర్లేదు, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వాస్తవం చెప్పండంటూ మరోసారి దేశ ప్రజలకు భరోసా ఇవ్వడం గమనార్హం. -
'వాళ్ల లివర్ ఉప్పులో నంజుకుని తినేస్తా'
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి మరోసారి సంచలన ప్రకటన చేశారు. ముస్లిం ఉగ్రవాదుల కంటే తాను 50 రెట్లు ఎక్కువ క్రూరుడినని, వాళ్లు తలలు మాత్రమే నరికితే తాను ఉగ్రవాదులు సజీవంగా దొరికితే వాళ్లను తినేస్తానని చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్లకు ఫిలిప్పీన్స్‌లో చోటు లేదని, అలాంటివాళ్లను చంపేసినా ప్రజలకు శిక్ష ఉండదని గతంలో ప్రకటించిన డుటెర్టి.. ఇప్పుడు మరింత దారుణంగా చెప్పారు. జాతీయ క్రీడా టోర్నమెంటు ప్రారంభోత్సవంలో ఆయనీ మాటలు చెప్పారు. ఉగ్రవాదులు ప్రజలను భయకంపితులు చేయడానికి తలలు నరికేస్తున్నారని, వాళ్లు జంతువుల లాంటివాళ్లు కాబట్టి సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం లేదని, కాల్చిపారేయాలని తన సైనికులను ఆయన ఆదేశించారు. తాను కూడా జంతువులాగే మారాలనుకుంటే మారతానని, తనకు మూడ్ బాగోనప్పుడు ఎవరైనా ఉగ్రవాదులను సజీవంగా తనకు అప్పగిస్తే.. కాస్త ఉప్పు, వెనిగర్ ఇస్తే.. అందులో నంజుకుని వాళ్ల లివర్‌ను తినేస్తానని చెప్పారు. అధ్యక్షుడి మాటలు విని అక్కడున్నవాళ్లంతా పెద్దపెట్టున నవ్వారు. అయితే.. అది నిజమేనని, తనకు కోపం వస్తే అలాగే చేస్తానని డుటెర్టి అన్నారు. నేరాలు అరికట్టడంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న డుటెర్టి చాలాకాలం మనిలా నగర మేయర్‌గా ఉన్నారు. గత సంవత్సరం మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా గెలిచారు. అక్రమ డ్రగ్స్ వ్యాపారం, అవినీతి, ఉగ్రవాదాలపై తాను పోరాడతానని, వాటిని ఉక్కు పాదాలతో అణిచేస్తానని చెప్పడంతో ప్రజలు ఆయనను గెలిపించారు. ఉగ్రవాదం చేతులు దాటితే ముస్లిం వేర్పాటువాద ఉద్యమం తీవ్రంగా ఉన్న దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సైనిక పాపలన విధిస్తానని కూడా డుటెర్టి హెచ్చరించారు. బొహోల్ రాష్ట్రంపై దాడికి విఫలయత్నం చేసిన అబు సయ్యఫ్, ఇతర ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికి పెద్ద ఎత్తున బహుమతి ఇస్తానని ఇటీవలే ప్రకటించారు. -
'కాల్చిపారేయండి.. నేను చూసుకుంటా'
► ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు మనీలా: డ్రగ్స్ మాఫియాను ఏరిపారేస్తోన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటర్టె మరో సంచలన నిర్ణయం తీసుకునేదిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలోని బొహాల్ ప్రావిన్సులో తీవ్రవాద నిరోధానికి పౌరుల చేతికి మారణాయుధాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఓ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘తీవ్రవాద నిర్మూలనకు పౌరులను సాయుధులను చేయాలని అనుకుంటున్నా.. నేను కూడా పౌరులతోనే నడుస్తా’ అని డ్యుటర్టె అన్నారు. ఉగ్రవాద అనుమానితులను చంపినా వారిని క్షమిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మీరు ఉగ్రవాదులను చంపితే ఎలాంటి భయం అక్కర్లేదు, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వాస్తవం చెప్పండి. మీకెలాంటి ఇబ్బందులు రావు’ అంటూ భరోసా ఇవ్వడం గమనార్హం. పౌరులకు ఆయుధాలిచ్చే విషయమై డ్యుటర్టె స్థానిక ప్రభుత్వాలను సంప్రదించాలి అనుకుంటున్నారు. అయితే, అందుకు అవి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తొచ్చనే ప్రచారం జరుగుతోంది. పర్యాటక కేంద్రమైన బొహాల్లో గతవారం అబూ సయ్యాఫ్ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు, ఒక జవాను, ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అధ్యక్షుడు డ్యుటర్టె ఈ నిర్ణయం తీసుకున్నారు. -
లంచగొండి అధికారుల్ని హెలికాప్టర్ నుంచి తోసేస్తా!
మాదక ద్రవ్యాలపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపి.. వేలాదిమందిని చనిపోవడానికి కారణమైన ఫిలిపీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్తే మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే.. వారిని హెలికాప్టర్ నుంచి తోసేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తాను ఓ కిడ్నాపర్ ను ఇలాగే హెలికాప్టర్ నుంచి పారేశారనని, ఇప్పుడు అధికారుల్ని తోసేయడానికి ఏమాత్రం వెనుకాడబోనని బెదిరించారు. 'హెలికాప్టర్లో మనీలాకు మిమ్మల్ని తీసుకెళ్తూ.. దారిలో మిమ్మల్ని తోసిపారేస్తా' అని డ్యుటర్తే అన్నారు. క్యామరిన్స్ సర్ ప్రావిన్స్‌లో జనాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన 'నేను గతంలో కూడా చేశాను. ఇప్పుడెందుకు చేయకూడదు' అంటూ అధికారుల్ని బెదిరించారు. మాజీ మేయర్, ప్రాసిక్యూటర్ అయిన డ్యుటర్తే దేశం ఎదుర్కొంటున్న డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలిస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చారు. అన్నట్టుగానే ఆయన అత్యంత హింసాత్మకంగా, డ్రగ్స్ బాధితులు కనిపిస్తే కాల్చిపారేసే తరహాలో ఆదేశాలు ఇచ్చి.. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నారు. -
‘ట్రంప్ వచ్చాడు... ఇక అమెరికాతో గొడవ పడం’
మనీలా: అమెరికాతో కయ్యాలు మానుకుంటామని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొట్రిగో డుటెర్టె ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా డుటెర్టె తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా తన గౌరవాన్ని కోల్పోయిందని, బరాక్ ఒబామా నరకానికిపోతాడని గతంలో దుయ్యబట్టారు. కౌలాలంపూర్ లో ఫిలిప్పీన్స్ వాసులను ఉద్దేశించి డుటెర్టె బుధవారం ప్రసంగించారు. ‘అమెరికాతో ఇక గొడవ పడాలనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ట్రంప్ ఉన్నార’ని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు ఆయన అభినందనలు తెలిపారు. తమ ఇద్దరికీ చాలా విషయాల్లో సామీప్యం ఉందని, ట్రంప్ చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. విమర్శలు చేయడంలో తామిద్దరి తర్వాతే ఎవరైనా అని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి నుంచి ట్రంప్ ను డుటెర్టె సమర్థిస్తూ వచ్చారు. ట్రంప్ ను ముద్దుగా ‘ట్రంప్ ఆఫ్ ది ఈస్ట్’ సంబోధించారు. -
అమెరికా బలగాలు వెనక్కువెళ్లాల్సిందే
టోక్యో: రానున్న రెండేళ్లతో తమ దేశం నుంచి వెనక్కు వెళ్లిపోవాలని అమెరికా బలగాలను పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కోరారు. టోక్యోలో జరుగుతున్న ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బరాక్ ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కాగా తమ భూ భాగంపై నుంచి ఇతర దేశాల సైన్యం వెళ్లిపోవాలని అమెరికాను ఉద్దేశించి అన్నారు. అలాగే అగ్ర దేశంతో రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. దశాబ్దాల క్రితం స్పానిస్ నుంచి పిలిప్పీన్స్‌ను కొనుగోలు చేసిన అమెరికా ఉగ్రవాదం పేరుతో ఇప్పటికీ ఆ దేశంలో మిలిటరీ బేస్ క్యాంప్‌లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పతాక శీర్షికల్లో నిలవడం డుటెర్టెకు పరిపాటిగా మారింది. -
ఒబామా గో టు హెల్
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొట్రిగో డుటెర్టె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను హిట్లర్‌కు సోదరునిలాంటి వాన్నని చంపడానికి వెనుకాడని తేల్చి చెప్పిన ఆయన తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విరుచుకుపడ్డారు. ఒబామా నరకానికిపోతాడని శపించారు. ఇందుకు కారణం ఫిలిప్పీన్స్ కు ఆయుధాలు అమ్మమని అమెరికా తెగేసి చెప్పడమే. అమెరికా తన గౌరవాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. ఫిలిప్పీన్స్ లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటాన్ని తప్పుగా చూసేవారు మూర్ఖులని పేర్కొన్నారు. అమెరికా తమకు ఆయుధాలు ఇవ్వకుంటే రష్యా, చైనాలు ఆయుధాలు ఇస్తామని ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. ఒక్క సంతకంతో తాను ఆ దేశాల నుంచి తెచ్చుకోవడానికి సిద్దమని తెలిపారు. దేశ ప్రజలు డ్రగ్స్ కు బానిసలు కావడం తాను సహించనని చెప్పారు. అందుకు చంపడానికి సైతం సిద్దమని మరోసారి స్పష్టం చేశారు. అమెరికాతో తమ దేశానికి ఉన్న రక్షణ సహకార ఒప్పందాన్ని త్వరలోనే సమీక్షిస్తానని తెలిపారు. కాగా ఫిలిప్పీన్ కు ఆయుధాలను నిరాకరించడంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ యేడాది మేలో పదివీ బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో ప్రభుత్వం ఇప్పటి వరకు 3,400 మందిని హతమార్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
అవును నేను హిట్లర్నే... చంపడానికి సిద్ధం
మనీలా: ''డ్రగ్ బానిసలు, క్రిమినల్స్ లేని ఫిలిప్పీన్ నాలక్ష్యం. ప్రస్తుతం దేశంలో 30 లక్షల మంది డ్రగ్ బానిసలున్నారు. భవిష్యత్ తరాల సంక్షేమం కోసం వారినందరినీ చంపడానికైనా నేను సిద్ధమే'' అని ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్రె సంచలన వ్యాఖ్యలు చేశారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం దావోస్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను జర్మనీ నియంత రుడాల్ఫ్ హిట్లర్ తో పోల్చడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశ భక్తి విషయంలో తాను హిట్లర్ కు సోదరుని లాంటి వానినని చెప్పుకొచ్చారు. జర్మనీలో హిట్లర్.. ఫిలిప్పీన్‌కు తానని అన్నారు. ఇప్పటివరకూ తమ దేశంలో చనిపోయిన వారందరూ క్రిమినల్సేనని స్పష్టం చేశారు. ఈ యేడాది మేలో పదివీ బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో ప్రభుత్వం జూన్ 30 వరకు 3,100 మందిని హతమార్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
అధ్యక్షుడి వెనక నరహంతక కోణం
మనీలా: చట్టాలను చేతుల్లోకి తీసుకోమని, డ్రగ్ స్మగ్లర్లు కనిపిస్తే కాల్చేయండని దేశ ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చి ఫిలిప్పీన్స్ వీధుల్లో రక్తపుటేరులను పారిస్తున్న దేశాధ్యక్షుడు రోడ్రిగో డూటర్టీ వెనకనున్న మరో భయంకర చీకటి కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన దవావోకు మేయర్‌గా ఉన్నప్పటి నుంచే హత్యలకు పాల్పడుతున్నారని, మేయర్‌గానే ఆయన దాదాపు వెయ్యి మందిని హత్య చేశారని తెల్సింది. వారిలో ఎక్కువ మందిని కిరాయి హంతక ముఠాతో హత్య చేయించగా కొన్ని హత్యలను ఆయనే స్వయంగా చేశారని ఆయన హంతక ముఠా మాజీ సభ్యుడు ఎడ్గార్ మటోబాటో తెలిపారు. డూటర్టీ తన రాజకీయ శత్రువులను మొసళ్ల చేత తినిపించారని కూడా ఆయన చెప్పారు. తాను డూటర్టీ హంతక ముఠా సభ్యుడిగా 25 ఏళ్ల కాలంలో అనేక మందిని హత్య చేశానని, ఓ జస్టిస్ అధికారిని డూటర్టీనే స్వయంగా కసితీరా కాల్చి చంపాడని హిట్‌మేన్ ఎడ్గార్ వెల్లడించారు. ఆయన ఈ విషయాలను మీడియా ముందుకాకుండా సెనేట్ దర్యాప్తు కమిటీ ముందు వెల్లడించడం విశేషం. డ్రగ్ అమ్మకందారులను, రేపిస్టులను, దొంగలను కాల్చి చంపమని తమకు ఆదేశాలు ఇచ్చేవారని ఆయన వివరించారు. చట్ట విరుద్ధంగా హత్యలు చేయాల్సిందిగా తన ముందే కొంత మంది అధికారులకు ఆదేశించేవారని ఆయన చెప్పారు. దేశాధ్యక్ష పదవిని చేపట్టాక డూటర్టీ అదేశాల మేరకు పోలీసు అధికారులు, పౌరులు ఇంతవరకు రెండువేల మందికిపైగా అనుమానిత డ్రగ్ అమ్మకందారులను చట్టవిరుద్ధంగా కాల్చి చంపారు. చట్టం సంగతి తాను చూసుకుంటానని, డ్రగ్ అమ్మకందారులను చంపుమని పౌరులకు పిలుపునివ్వడం ద్వారా డూటర్టీ ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. మెజారిటీ మంచి ప్రజలను రక్షించేందుకు కొంతమంది దుష్టశక్తుల పట్ల టైస్టుగా మారడం నాయకుడి లక్ష్యమని ఆయన ఆయన దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే వ్యాఖ్యానించారు. తాను దేశాధ్యక్షుడినయ్యాక ఎన్ని శవాలు కావాలంటే అన్ని శవాలను సరఫరా చేస్తానని, బేషుగ్గా దేశ ప్రజలు శ్మశాన వ్యాపారాన్ని చేసుకోవచ్చని కూడా చెప్పారు. తనకు ఆడవాళ్లంటే పిచ్చని కొందరు మాట్లాడుతున్నారని, అవును నిజంగా తనకు పిచ్చేనని, అందుకే రేపిస్టులను సహించనని, వారిని కాల్చివేస్తానని కూడా డూటర్టీ వ్యాఖ్యానించడం ఆయన నియంత పోకడలను తెలియజేస్తోంది. మానవ హక్కులను భంగపర్చడమంటే ముందుగా మానవులెవరో తేల్చాలని, చెడ్డవాళ్లు ఎప్పుడు మనుషులు కారని, వారికి ఎలాంటి హక్కులు ఉండవనే విషయాన్ని గ్రహించాలని ఇటీవల సైనిక శిబిరాన్ని సందర్శించినప్పుడు ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికా అధ్యక్షుడిని అలా అనలేదు!
జకర్తా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తాను వెలయాలి కొడుకు అని అనలేదని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యురెటె పేర్కొన్నారు. లావోస్ లో సమ్మిట్ కు ముందు యూఎన్ చీఫ్ మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తడం ఆయన వెర్రితనానికి నిదర్శనమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియా పర్యటనకు వచ్చిన డ్యురెటెపై వ్యాఖ్యలు చేశారు. ఒబామాతో సమావేశం కోసం తాను వేచిచూసినట్లు చెప్పారు. ఒబామాను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కావాలంటే తన స్టేట్ మెంట్ ను మరోసారి పరిశీలించుకోవాలని అన్నారు. తాను అమెరికాతో పోరాటం చేయడం లేదని పేర్కొన్నారు. అది తన ఉద్దేశం కూడా కాదని అన్నారు. సోమవారం డ్యురెటె వ్యాఖ్యల అనంతరం సమావేశాన్ని అప్పటికప్పుడు రద్దు చేసుకున్న ఒబామా.. బుధవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
ఆ అధ్యక్షుడికి నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నోరు పారేసుకున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టెకి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. గుర్తింపు కోసమే కామెంట్లు చేస్తారనే వాదనలు ఉన్నాయి. డుటెర్టె-వివాదాలు గ్యాంగ్ రేప్ జోక్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డుటెర్టె.. గుర్తింపు కోసం వాషింగ్టన్ పోస్టులో వచ్చిన ఓ రేప్ కథనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1989లో ఆస్ట్రేలియా న్యాయశాఖ మంత్రి జాక్వెలిన్ హమిల్ ను దారుణంగా రేప్ చేసి, చంపారని ఆ కథనం. దవావో జైలులో జరిగిన ఈ ఘటనలో మొత్తం 15 మంది మరణించారు. దీనిపై స్పందించిన డుటెర్టె మృతుల శవాలను బయటకు తెచ్చిన తర్వాత తాను స్వయంగా చూశానని చెప్పారు. రేప్ కు గురైన ఆమె ముఖాన్ని కూడా చూశానని చెప్పారు. ఆమె చాలా అందంగా ఉందని, అచ్చం అమెరికన్ నటిలా ఉందని జోక్ చేశారు. ఆమె రేప్ కావడం తనకు కోపం తెప్పించిందని.. వృథాగా ఓ అందమైన యువతి చనిపోయిందని అయిందని వివాదాస్పదంగా మాట్లాడారు. డుటెర్టెపై నెటీజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోప్ ఫ్రాన్సిస్ నూ వదల్లేదు అధ్యక్ష పదవి అభ్యర్ధిగా అధికారిక ప్రకటన కార్యక్రమానికి ఆలస్యంగా రావడంపై డుటెర్టె పోప్ ఫ్రాన్సిన్స్ ను కారణంగా చూపుతూ దురుసుగా మాట్లాడారు. మనిలాలో పోప్ మీటింగ్ కారణంగా ట్రాఫిక్ జాం అయిందని సభలో చెప్పారు. పోప్ ను ఉద్దేశించి జోక్ చేశారు. పోప్ ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు. మీ ప్రాంతానికి వెళ్లిపోండి. ఇంకెప్పుడూ ఇటువైపు రావొద్దంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను పోప్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ట్రాఫిక్ జాం అయిందని అన్నారు. తన వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ కోరనని తేల్చిచెప్పారు. మానవహక్కుల ఉల్లంఘన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డుటెర్టె డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎంతలా అంటే దేశంలో ఉన్న ప్రతి ఇంటిని సోదా చేయించి.. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని చంపించారు. డ్రగ్స్ కారణంతో డుటెర్టె చంపించిన వారి సంఖ్య 2వేలకు పైమాటే. డ్రగ్స్ కేసుల్లో మానవహక్కుల ఉల్లంఘనపై మాట్లాడిన ఆ విషయంలో తాను ఎవరిని లెక్కచేయనని వ్యాఖ్యానించారు. దీంతో మానవహక్కుల కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. దక్షిణ చైనా సముద్రం దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ కోర్టు తీర్పు తర్వాత డుటెర్టె దురాక్రమణదారులను ఊరికే వదిలిపెట్టమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద భూభాగంలో తాను జెట్ లో విహరించాడానికి సిద్దంగా ఉన్నానని కూడా కామెంట్ చేశారు. అక్కడితో ఆగని డుటెర్టె ఫిలిప్పీన్స్ జెండాను కూడా ఆ ప్రాంతంలో ఎగురవేస్తానని ప్రకటించారు. యూఎన్ చీఫ్ కు షాక్ ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ తో సమావేశానికి డుటెర్టె నో చెప్పి మరోసారి వార్తలకెక్కారు. యూఎన్ ఫీలిప్పీన్స్ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటంతోనే మూన్ ని కలవడానికి డుటెర్టె ససేమీరా అన్నట్లు అక్కడి పత్రికలు రాశాయి. ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి బూతులు కూడా మాట్లాడినట్లు అక్కడ పత్రికలు ప్రచురించాయి. తక్షణమే స్పందించిన యూఎన్.. సభ్యత్వ దేశాల జాబితా నుంచి ఫిలిప్పీన్స్ తప్పిస్తామని హెచ్చరికలు చేసింది. దీంతో వెనక్కు తగ్గిన డుటెర్టె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
ఒబామాను బూతుమాటతో తిట్టి..
-
ఒబామాను బూతుమాటతో తిట్టి..
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నోరు పారేసుకున్నారు. ఒబామాను ఉద్దేశించి బూతుమాటలతో తిట్టారు. ఒబామా ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఒబామా రోడ్రిగోతో తలపెట్టిన తన తొలి సమావేశాన్ని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. లావోస్‌లో దక్షిణాసియా దేశాధినేతల వార్షిక సదస్సు సందర్భంగా తొలిసారి ఫిలిపినో అధ్యక్షుడు రోడ్రిగో- ఒబామా భేటీకి గతంలో షెడ్యూల్ ఖరారైంది. చైనాలోని హాంగ్ఝౌలో జీ20 సదస్సులో పాల్గొన్న అనంతరం ఒబామా తన గురించి రోడ్రిగో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యల గురించి తెలియగానే తన భేటీని రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఫిలిప్పీన్స్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతోపాటు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రోడ్రిగో ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆర్షించిన సంగతి తెలిసిందే. వైట్‌హౌస్ సిబ్బంది ద్వారా రోడ్రిగో వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఒబామా.. ఆయనతో సమావేశం దండుగ అనే నిర్ణయానికి వచ్చారు. తాము ఎవరితోనైనా చర్చలు జరిపితే.. అవి నిర్మాణాత్మకంగా, ప్రతిఫలం ఇచ్చేవిగా ఉండాలని కోరుకుంటున్నామని ఒబామా చెప్పారు. వియత్నాం రాజధాని హనోయ్ వచ్చిన ఒబామా.. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జియున్-హైతో భేటీ అయ్యే అవకాశముంది. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలపై వీరు ప్రధానంగా చర్చించవచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు వియత్నాం రావడం ఇదే తొలిసారి. కాగా, ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఫిలిపినో అధ్యక్షుడు రోడ్రిగో విచారం వ్యక్తం చేశారు.