Samaj wadi Party
-
చివరి విడతలో అఖిలేష్‌కు షాక్
లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బల్లియాకు చెందిన ప్రముఖ నేత నారద్ రాయ్ ఎస్పీతో తెగతెంపులు చేసుకుని, బీజేపీలో చేరారు. నారద్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. నారద్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు, అతని కుమారుడు అఖిలేష్‌కు అతి సన్నిహితునిగా పేరొందారు.నారద్ రాయ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుని అతని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాయ్ ఒక ట్వీట్లో తాను బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ‘బరువెక్కిన హృదయంతో నేను సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నాను. 40 ఏళ్ల రాజకీయ జీవితం అలానే ఉంది. ఇప్పుడు బీజేపీ కోసం నా బలాన్నంతా ఉపయోగిస్తాను. బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తాను. అఖిలేష్ యాదవ్ నన్ను అవమానించారు. గత ఏడేళ్లుగా ఇదే జరగుతోంది. 2017లో అఖిలేష్ యాదవ్ నా టికెట్ రద్దు చేశారు. అయితే 2022లో తిరిగి టికెట్ ఇచ్చారు. అయితే అదే సమయంలో నా ఓటమికి కుట్ర పన్నారు’ అని పేర్కొన్నారు.యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో నారద్ రాయ్ రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని వీడి, బీఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి మరోమారు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాజ్‌వాదీ పార్టీలోనే ఉంటున్నారు.ఇటీవల బల్లియా లోక్‌సభ ఎస్పీ అభ్యర్థి సనాతన్ పాండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో నారద్ రాయ్ పాల్గొన్నారు. అయితే నాడు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈయన పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆగ్రహించిన నారద్ రాయ్ ఎస్పీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. -
పోలింగ్ బూత్‌లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మద్దతు దారులు పోలింగ్ బూత్‌లను లూటి చేస్తున్నారంటూ ఉత్తర్ ప్రదేశ్ సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న 10 లోక్‌సభ స్థానాల్లో మూడో విడతలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో తన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మైన్‌పురి నియోజకవర్గంలో ఎటావాలో ఓటు వేశారు.రైతులు ప్రాణాలు కోల్పోయారనిఅనంతరం బీజేపీపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. బీజేపీలో అధికార పోరు నడుస్తోందని, అందుకే ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతికేరంగా వెయ్యి మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.లఖింపూర్ ఖేరీ హింసాకాండపైఈ సందర్భంగా 2021లో జరిగిన లఖింపూర్ ఖేరీ హింసాకాండను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో ఉన్న ఓ నలుగురు అగంతకులు రైతులను ఢీకొట్టారని ఆరోపించారు. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ద్వజమెత్తారు. ఐదు లక్షల ఓట్లతో డింపుల్ యాదవ్ కాగా, సైఫాయిలో ఓటు వేసిన ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని కాపాడే పోరాటమని, మైన్‌పురి స్థానంలో డింపుల్ యాదవ్ ఐదు లక్షల ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి నానారావ్ పార్కులో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఎన్నాళ్లయినా అందుబాటులోకి రాకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కాన్పూర్ పట్టణంలోని నానారావ్ పార్క్ ఎంతో పురాతనమైనది. యోగి ప్రభుత్వం పార్కు నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి పలు వాగ్దానాలు చేసింది. వీటిలో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తికాలేదు. దీనిపై ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్‌పాయ్ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఆయన ఒక చిన్న బాత్ టబ్‌తో ఈ పార్కుకు చేరుకుని, దానిని నీటితో నింపారు. ఆ తర్వాత ఆ టబ్‌లో ఆయన కూర్చున్నారు. దానిలోనే ఎంజాయ్ చేస్తూ, స్వీట్లు కూడా తిన్నారు. పైగా పక్కనే ఒక బ్యానర్ తగిలించి, దానిపై ‘రూ.11 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు’ అని రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విమ్మింగ్ పూల్‌పై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నగర ప్రజలు వేసవిలో ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ కొలను 2023లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీని నిర్మాణంలో ఆర్థిక సమస్య లుంటే తమకు తెలియజేయాలని, అప్పుడు ప్రజల నుండి విరాళాలు సేకరించి అందజేస్తామన్నారు. -
బీజేపీలో సస్పెన్స్.. బ్రిజ్ భూషణ్‌కు టికెట్ దక్కేనా?
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్, రాయ్‌బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ మే 3. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ.. మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు. బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు.. కైసర్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్‌గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు బ్రిజ్‌భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ఎస్పీలో సందిగ్ధం.. ‘కైసర్‌గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కైసర్‌గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్‌కు దక్కేనా..? బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్‌సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
తండ్రి ఒక పార్టీ.. కొడుకు మరో పార్టీ.. కలిసే ప్రచారం?
దేశంలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలతో ముడిపడిన కుటుంబాలు ఆసక్తికర పోరుకు ఆజ్యం పోస్తున్నాయి. యూపీలోని అలహాబాద్‌లో ఇలాంటి ఉదంతం చర్చల్లోకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేత, యూపీ మాజీ క్యాబినెట్ మంత్రి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని తండ్రి కున్వర్ రేవతి రమణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఉజ్వల్ రమణ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉండటం ఆసక్తికరంగా మారింది. కాగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమి కింద లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా యూపీలోని అలహాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ టిక్కెట్‌ను ఉజ్వల్ రమణ్ సింగ్‌కు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఇండియా కూటమి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
మీకేమైనా డౌటా..? ఇండియా కూటమికి ఇంకో షాక్
లక్నో: రాష్ట్రీయా లోక్ దళ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేరుతారని ప్రచారం జరుగుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాలు ఆర్ఎల్డీ పార్టీ బీజేపీలో చేరిందనడానికి బలం చేకూర్చాయి కూడా. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీనరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్కు భారత రత్న ప్రకటించింది. అయితే చరణ్ సింగ్.. మనవడే ప్రస్తుత ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీ. తన తాతకు భారత రత్న ప్రకటించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో చేరికకు సంబంధించిన ప్రచారాన్ని ధ్రువీకరించారు. గత ప్రభుత్వాలు చాలా ఏళ్ల నుంచి చేయని పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ఈ రోజు మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారత రత్న ప్రకటించారని ఆనందం వ్యక్తంచేశారు. వెలుగులోకి రాని వ్యక్తులకు ప్రధాన స్రవంతిలోకి తీసువచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరుతారన్న ప్రశ్నకు... ‘మీకేమైనా అనుమానం ఉందా? నేను ఈ రోజు ఎలా తిరస్కరించగలను’ అని అన్నారు. దీంతో జయంత్ చౌదరీ ఎన్డీయే కూటమి చేరిపోతారని సంకేతాలు అందించినట్లు అయింది. సామాజ్‌వాదీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఆర్ఎల్డీ.. బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని తెగప్రచారం జరగుతున్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. పార్టీలను ఎలా విడగొట్టాలో బీజేపీకి బాగా తెలుసని, ప్రత్యర్థులపై ఎలా దాడి చేయాలో కూడా బీజేపీ తెలుసని మండిపడ్డారు. పార్టీల్లో, నాయకల్లో చీలికలు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీను ఎలా వాడుకోవాలో బీజేపీ వాళ్లకు తెలుసని ఆరోపంచారు. ఎలా మోసం చేయాలో మొన్నటి చంఢీఘర్ మేయర్ ఎన్నికల పోలింగ్‌తో అర్థం అవుతుందని అన్నారు. ఎవరిని ఎలా కొనుగోలు చేయాలో కూడా బాగా తెలుసని.. విధానాల్లోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని ధ్వజమెత్తారు. గత 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ కూటమిలో భాగంగా ఆర్ఎల్డీ బరిలోకి దిగినప్పటికీ పోటీ చేసిన మూడు స్థానాల్లో (మథుర, బాగ్పట్, ముజఫర్ నగర్) ఓటమి పాలుకావటం గమనార్హం. జాట్ వర్గంలో ఆర్ఎల్డీకి మంచిపట్టు ఉండటం విశేషం. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
ఇండియా కూటమి ఉంటుందా? అఖిలేశ్ కీలక ట్వీట్
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టు ఇందుకు కారణమవుతోంది. ‘ఇండియా కూటమిలో భాగంగా ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తుకు మంచి ప్రారంభం లభించింది. యూపీలో 11 బలమైన సీట్లను కాంగ్రెస్‌కు ఇస్తున్నాం‘ అని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నిజానికి కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీని యూపీలో అడిగింది 13 సీట్లు. దీనికి అఖిలేశ్ ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్‌కు కేవలం 11 సీట్లే ఆయన ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ 13 సీట్ల కోసం కాంగ్రెస్ పట్టుపడితే పొత్తు వ్యవహారంలో మొదటికే మోసం వస్తుందన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అఖిలేశ్ పోస్టుపై యూపీ కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్ అవినాష్ పాండే స్పందించారు. ‘సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకంలో చర్చల్లో మంచి పురోగతి ఉంది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ పోస్టు తాను కూడా చూశానని అయితే ఆయన వ్యాఖ్యలపై మరింత సమాచారం ఏదీ లేదు’అని పాండే అన్నారు. కాగా, బిహార్ లాంటి కీలక రాషష్ట్రంలో జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ ఇప్పటికే ఇండియా కూటమిని వీడుతున్నట్లు స్పష్టమైపోయింది. ఆయన బీజేపీతో మళ్లీ జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై ఎటూ తేల్చలేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల వరకు ఇండియా కూటమిలో ఎన్ని పెద్ద పార్టీలు మిగులుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదీచదవండి.. తొమ్మిదోసారి నితీశ్ ప్రమాణస్వీకారం నేడే -
‘సమాజ్‌వాది’ వస్తే.. సీఎంగా డింపుల్ యాదవ్?
యూపీలోని లక్నోలో గల సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర వెలసిన ఒక పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్‌ను యూపీకికి కాబోయే ముఖ్యమంత్రిగా చూపించారు. ఇంతేకాదు ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్ ఫొటోను అఖిలేష్ యాదవ్ కంటే పెద్దదిగా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ వెనుక కథనం అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర తరచూ పోస్టర్లు కనిపించడం సాధారణమే. అయితే తాజాగా వెలసిన డింపుల్ యాదవ్‌కు సంబంధించిన పోస్టర్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ హోర్డింగ్‌ను ఎస్పీ నేత అబ్దుల్ అజీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, డింపుల్ యాదవ్‌ను యూపీకి కాబోయే కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. జనవరి 15న డింపుల్ యాదవ్ పుట్టినరోజు. దీనికి ముందుగానే పార్టీ కార్యాలయం ముందు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అనేక అర్థాలకు అవకాశమిస్తోంది. దీనిని చూసిన కొందరు ఇకపై అఖిలేష్ యాదవ్ దేశరాజకీయాలపై దృష్టిపెడతారని, అతని స్థానంలో డింపుల్ యాదవ్ యూపీ బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుండగా అఖిలేష్ యాదవ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కన్నౌజ్, అజంగఢ్ లోక్‌సభ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
Lucknow Building Collapsed: ఎస్పీ నేత భార్య, తల్లి దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సహాయాక బృందాలు రక్షించిన ఇద్దరు మహిళలు బుధవారం చికిత్స పొందుతూ చనిపోయారు. మృతి చెందిన ఇద్దరూ మహిళలు సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్ హైదర్ తల్లి బేగం హైదర్(72), అతని భార్య ఉజ్మా(30) హైదర్‌గా గుర్తించారు. ఆ రోజు ఈ ప్రమాదం జరిగిన వెంటనే శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిథిలాల కింద ఇంకా ఇద్దరూ లేదా ముగ్గురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన అలాయా అపార్ట్మెంట్ యజమానులు మహ్మద్ తారిఖ్, నవాజీష్ షాహిద్, బిల్డర్ ఫహద్ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే డివిజన్ కమిషనర్ రోషన్ జాకబ్ లక్నో డెవలప్మెంట్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆ బిల్డర్ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే వాటిని కూడా కూల్చేయమని చెప్పారు జాకబ్. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డివిజన్ రోషన్ జాకబ్ నేతృత్వం వహించగా, లక్నో పోలీసలు జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్డియా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ తదితరులు కమిటీలో సభ్యులుగా ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: లక్నో: కుప్పకూలిన నాలుగంతస్థుల బిల్డింగ్.. శిథిలాల కింద పదుల సంఖ్యలో..!) -
రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు!
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన దిగ్గజ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ట పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ములాయం సింగ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ....ములాయం సింగ్ మృతితో సోషలిస్ట్ స్వరం మూగబోయింది. ఆయన రక్షణ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. అంతేగాదు ఆయన అణగారిన వర్గాల కోసం చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరని చెప్పారు. దేశంలోని రాజ్యంగ విలువలను పరీరక్షించాల్సి అవసరం వచ్చినప్పుడల్లా తన మద్దతు కాంగ్రెసుకు ఉంటుందని ములాయం సింగ్ అనేవారని సోనియా గాంధీ భావోద్వేగంగా చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో గురుగ్రాంలో మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. (చదవండి: ఓటమెరుగని నేత.. అయినా ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు) -
వారి అవినీతికి ‘ట్విన్ టవర్స్’ సజీవ సాక్ష్యం: డిప్యూటీ సీఎం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు క్షణాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్‌ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తర్‌ప్రదేశ్ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాలతో రాజకీయ నాయకులు, బిల్డర్స్, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణానికి 2004లో అనుమతులు లభించాయి. దీంతో అప్పటి సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. ‘సమాజ్ వాదీ పార్టీ అవినీతి, అరాచకాలకు నోయిడా ట్విట్ టవర్స్ సజీవ సాక్ష్యం. నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్పీ అవినీతి భవనం కూలిపోతుంది. ఇదే న్యాయం, ఇదే సుపరిపాలన.’ అని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. नोएडा का सुपरटेक ट्विन टॉवर श्री अखिलेश यादव और सपा के शासनकाल के भ्रष्टाचार और अराजकता की नीति का जीवंत प्रमाण है। आज मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के नेतृत्व में भाजपा की सरकार में सपा के भ्रष्टाचार की इमारत ढहेगी। यह है न्याय, यही सुशासन।#TwinTowers — Keshav Prasad Maurya (@kpmaurya1) August 28, 2022 డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపణలను తిప్పికొట్టింది సమాజ్ వాదీ పార్టీ. ‘ఈ అవినీత కట్టడం నిర్మించటానికి బీజేపీ సైతం కారణం. బీజేపీకి సూపర్‌టెక్ భారీగా నిధులు ముట్టజెప్పింది. కాషాయ పార్టీకి చెందిన ఆఫీసులో కూర్చుని ఓ బ్రోకర్ అందుకు బ్రోకరేజ్ అందుకున్నాడు.’ అని ఆరోపించింది. ఇదీ చదవండి: Noida Twin Towers: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే.. -
బీజేపీ సొంతంగా సాధించిన సీట్లు ఎన్నో తెలుసా?
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సవ్యంగా ముగిశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించగా, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ 2017 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా మెరుగు పరుచుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 273 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి మైనస్.. ఎస్పీకి ప్లస్ తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా 57 సీట్లు తగ్గాయి. కమలం పార్టీ సొంతంగా 255 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ మిత్రపక్షాలు అప్నా దల్ (సోనీలాల్) 12, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే అదనంగా 64 సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన అఖిలేశ్ పార్టీ ఇప్పుడు 111 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ దళ్ 8, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలిచాయి. బీఎస్పీ, కాంగ్రెస్ ఫట్! బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్పీ ఏకంగా 18 సీట్లు కోల్పోయి సింగిల్ సీట్‌కే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ 5 సీట్లు కోల్పోయి రెండు స్థానాలను మాత్రమే గెలుకోగలిగింది. 10 శాతం పెరిగిన ఎస్పీ ఓట్లు తాజా ఎన్నికల్లో బీజేపీ 41.3 శాతం ఓట్లు సాధించింది. 2017 ఎన్నికలతో(39.67) పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే ఏకంగా 10.3 శాతం ఓటింగ్ షేర్ అదనంగా సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లు సాధించగా.. 2017లో 21.82 శాతం ఓట్లు దక్కించుకుంది. బీఎస్పీ 9.38, కాంగ్రెస్ 3.92 శాతం ఓట్ షేర్ కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి 12.88, కాంగ్రెస్‌కు 2.33 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.74 శాతం, రాష్ట్రీయ లోక్ దళ్ 2.85 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. (క్లిక్: తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు) బీజేపీకి 3, ఎస్పీకి 2, బీఎస్పీకి 1 అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి మొత్తంగా 3 కోట్ల 80 లక్షల 51 వేల 721 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ 2 కోట్ల 95 లక్షల 43 వేల 934 ఓట్లు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కోటి 18 లక్షల 73 వేల 137 ఓట్లు దక్కాయి. ఇతరులు 62 లక్షల 13 వేల 262 ఓట్లు తెచ్చుకున్నారు. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) ‘నోటా’నే బెటర్! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నోటాకు 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎఐఎం 0.49, ఆప్ 0.38, జేడీ(యూ) 0.11, సీపీఐ 0.07, ఎన్సీపీ 0.05, ఎస్హెచ్ఎస్ 0.02, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్జేపీఆర్వీ 0.01 శాతం చొప్పున ఓట్లు దక్కించుకున్నాయి. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) -
UP Election: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి..
లక్నో: బరేలీ కంటోన్మెంట్ సీటుకు సుప్రియా అరోన్ కాంగ్రెస్ నాలుగైదు రోజుల కిందటే ప్రకటించింది. నామినేషన్‌కు సిద్ధమవుతుందని భావిస్తుండగా.. ఆమె అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్‌కు షాకిచ్చారు. శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. అదే స్థానం నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీచేయనున్నారు. జర్నలిస్టు నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన సుప్రియా ఆరోన్ బరేలీ మేయర్‌గా పనిచేశారు. ఆమె ఎస్పీలో చేరడంతో బరేలీ నుంచి రాజేశ్ అగర్వాల్ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉపసంహరించారు. -
అఖిలేశ్‌కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తమతో కలిసొచ్చేందుకు చిన్నాచితకా పార్టీలు ముందుకు రావడం, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతుండటంతో సమాజ్‌వాదీ పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చినా.. వారందరికీ సీట్ల సర్దుబాటు అంశం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే. మిత్రపక్షాలతో పాటు కొత్తగా వచ్చి చేరుతున్న ఆశావహులకు టిక్కెట్ల కేటాయింపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు పెద్ద సవాల్ విసురుతోంది. ఇప్పటికే తమతో పొత్తు పెట్టుకునేందుకు సిధ్దమైన ఏడు మిత్రపక్ష పార్టీలతో చర్చలు చేసిన అఖిలే‹శ్, అతిత్వరలోనే కుల, వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే జాబితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం 10 మంది ఎస్పీ అభ్యర్థులు, 19 మంది ఆర్ఎల్డీ అభ్యర్థులతో ఎస్పీ సారథ్యంలోని కూటమి తొలి జాబితా వెలువడింది. లెక్కలు తేల్చడం కత్తిమీద సామే.. ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ఏడు పార్టీలు ముందుకొచ్చాయి. ఇందులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), మహాన్‌దళ్, జన్వాదీ పార్టీ (సోషలిస్టు), కృష్ణ పటేల్ నేతృత్వంలోని ఆప్నాదళ్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ, గంద్వానా గణతంత్ర పార్టీలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆర్ఎల్డీ 1.78 శాతం ఓట్లు సాధించుకోగా, ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆర్ఎల్డీకి పశ్చిమ యూపీలో గట్టి పట్టు ఉంది. ఇక్కడ ఉన్న 76 స్థానాలకు గానూ కనీసంగా 35–40 సీట్లలో జాట్ల ప్రాబల్యం బలంగా ఉంది. జాట్–ముస్లింలు కలిస్తే అధిక సీట్లు కొల్లగొట్టొచ్చన్న అంచనాతో ఇక్కడ ఆర్ఎల్డీతో ఎస్పీ పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీ 277 స్థానాల్లో పోటీ చేయగా, ఈ ఏడాది పొత్తుల కారణంగా కనీసంగా 40–50 స్థానాలకు పోటీ చేయాలని భావిస్తోంది. ఆ స్థాయిలో సీట్ల సర్దుబాటు అఖిలేశ్‌కు అంత సులభం కాదు. ఇక 30–35 స్థానాల్లో ప్రభావం చూపగల సుహెల్‌వేద్ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్బర్ అఖిలేశ్ నిర్వహించిన విజయ్ రథ్ యాత్రల్లో ఆయన వెన్నంటే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ పార్టీ 0.70 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయినా పోటీచేసిన 8 స్థానాల్లో 4 చోట్ల గెలిచింది. ఈ సారి కనీసంగా 20–25 స్థానాలకు పట్టుబడుతోంది. తూర్పు యూపీలో రాజ్బర్లు దాదాపు 18 శాతం మంది ఉన్నారు. ఇక్కడే అధిక సీట్లకు ఆ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. మహాన్‌దళ్ నేత కేశవ్దేవ్ మౌర్య తమకు 12 స్థానాలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ 57 స్థానాల్లో పోటీ చేయగా, 0.12శాతం ఓట్లు సాధించుకుంది. అయితే ఓబీసీకి చెందిన పెద్ద నేతలు పలువురు ఎస్పీలోకి వస్తున్న నేపథ్యంలో ఈ పార్టీకి 3–5 సీట్లకు మించి కేటాయించే అవకాశాలు లేవు. మిగతా మిత్రపక్ష పార్టీలకు పెద్దగా బలం లేనప్పటికీ వారందిరికీ కనీసంగా 2–3 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినా, అవి కొలిక్కిరాలేదు. కొత్తవారితో తలనొప్పులే మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు ఒక తలనొప్పిగా ఉండగా, మరోపక్క కొత్తగా చేర్చుకుంటున్న నేతలకు టికెట్లు ఇవ్వడం అఖిలేశ్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ముఖ్యంగా ఇటీవలే బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన మాజీ మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. అయితే ఈ టికెట్‌ను బీజేపీ నుంచి ఆర్ఎల్డీలో చేరిన ఆమ్‌శీష్ రాయ్‌కు ఇస్తామని ఇప్పటికే ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరీ వాగ్దానం చేశారు. దీంతో ఈ సీటు కేటాయింపు చిక్కుల్లో పడింది. ఇక మౌర్య కుమారుడు ఉత్క్రిష్ట్ మౌర్య 2017లో ఊంచహార్ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్ధి మనోజ్ పాండేపై ఓడిపోయారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మౌర్య పట్టుబడుతుండటంతో మనోజ్‌ను ఒప్పించడం అఖిలేశ్‌కు క్లిష్టంగా మారింది. ఇక మహానదళ్ నేత కేశవ్ మౌర్య కుమారుడు చంద్ర ప్రకాష్ మౌర్య ఇప్పటికే బిల్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే బిల్సీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే శర్మ కొద్ది రోజుల క్రితం ఎస్పీలో చేరడంతో అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది. వీరితో పాటే ఎస్పీలోకి వస్తున్న దారాసింగ్ చౌహాన్ (యోగి కేబినెట్ నుంచి బుధవారం రాజీనామా చేశారు) మధుబన్ నియోజకవర్గంతో పాటు మవూ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు తన మద్దతుదారులకు కోరుతున్నారు. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీలో చేరిన కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ సైతం తన మద్దతుదారులకు 6–8 సీట్లు కోరుతున్నారు. టికెట్లు దక్కవనే అంచనాతో బీజేపీ, బీఎస్పీ నుంచి కొత్తగా పార్టీలో చేరిన బ్రాహ్మణ నేతలు తమకు టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సామాజిక బలాలను దృష్టిలో పెట్టుకొని, పొత్తులకు గౌరవమిస్తూ, కొత్తవారికి టికెట్లు కేటాయించడం, సీట్లు సర్దుబాటు చేయడం అఖిలేశ్ ముందున్న అతిపెద్ద సవాల్. -
బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూ ఉండగానే.. మరోవైపు చేరికలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ బుధవారం కాషాయం గూటికి చేరారు. న్యూఢిల్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో సైనీ, హరి ఓంలతో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధర్మపాల్ సింగ్‌లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చదవండి: అయోధ్య నుంచి యోగి పోటీ! బీజేపీలోకి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. ఎన్నికల వేళ పార్టీలోని కీలక ఓబీసీ నేతలు బయటకి వెళ్లిపోతూ ఉండడంతో ఆ వర్గంలో తమకు ఇంకా పట్టు ఉందని నిరూపించుకోవడం కోసమే ఓబీసీ ఎమ్మెల్యేలను అక్కున చేర్చుకోవాలన్న వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోంది. -
మరుగుదొడ్లకు పార్టీ రంగులు
తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా, ఉద్రిక్తంగా ఉన్న 2009– 2014 మధ్యకాలంలో కాలేజీలలో, ఆఫీస్‌లలో ఎవరైనా పింక్ డ్రెస్‌లో కనిపిస్తే చాలు.. ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించేది. సమైక్య ఉద్వేగ అసంకల్పిత శుభాభివందన అది. చనువున్నా లేకున్నా, మనిషికి మనిషి తెలియకున్నా గులాబీ రంగు ఒకే జాతి, ఒకే మతం, ఒకే వర్ణం అన్నంత స్ట్రాంగ్‌గా ప్రత్యేక భావనతో ప్రజల్ని ఏకం చేసింది. అది ఒక పార్టీ జెండా రంగు అయినప్పటికీ ఒక ప్రత్యేక రాష్ట్ర జాతీయ రంగు అన్నంతగా మనుషుల్లో, మనసుల్లో కలిసిపోయింది. రాజకీయ, ఉద్యమ పార్టీలకు జెండా రంగు, లేదా జెండాలోని రంగులు ఇంతటి ఘనమైన ఐడెంటిటీని కల్పిస్తాయి. పవిత్రతను కూడా. ఆ రంగు ఉన్న మెట్లను ఎక్కవలసి వచ్చినా సంకోచిస్తాం. మెట్లంటే సరే. పార్టీ అధినాయకుడిని దర్శించుకోడానికి అవి గుడి మెట్ల వంటివి అనుకోవచ్చు. కానీ, గోరఖ్‌పుర్‌లోని లలిత్ నారాయణ్ మిశ్రా రైల్వే హాస్పిటల్ మరుగు దొడ్లకు కూడా ఎవరో రంగులు వేయించారు. ఎరుపు, ఆకుపచ్చ!! అవి సమాజ్ వాది పార్టీ జెండాలోని రంగులు. మూడుసార్లు (ములాయం రెండుసార్లు, అఖిలేష్ ఒకసారి) ఉత్తర ప్రదేశ్‌ని ఏలిన రంగులు అవి. మరుగుదొడ్లకు వేసిన ఆ రంగుల్ని వెంటనే మార్చాలని సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్ నగీనా సాహిని రైల్వే వాళ్లకు లెటర్ పెట్టారు. మరుగుదొడ్లకు ఆ రంగుల్ని ఎంపిక చేసిన వారి పై చర్య తీసుకోవాలని కూడా కోరారు. ఎరుపు, ఆకుపచ్చల్ని వేయించిన వారు అంత లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. వేయించాకైనా అలోచించేందుకు అవకాశం ఉంది. రంగులే కనుక మార్చవచ్చు. రైల్వే వాళ్లు పొరపాటు చేసినా, ప్రమాద రహితమైన పొరపాటునే చేశారు. ఆకుపచ్చ, ఎరుపు కాకుండా.. ఆకుపచ్చ, ఆరెంజ్ వేయించి ఉంటే విషయం సీఎం యోగి ఆదిత్య నాథ్ వరకు వెళ్లేది. కొన్ని కార్మిక ఉద్యోగాలు ఊడేవి. చివరికి వాళ్లే కదా పై అధికారులకు దొరికేది! ఏమైనా రంగులు, మనోభావాలు తేలికగా మండే స్వభావం కలిగినవి. వాటితో జాగ్రత్తగా ఉండాలి. -
కరోనా: రేపు అమిత్ షా అఖిల పక్షం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను సరిహద్దుగా కలిగి ఉన్న ఢిల్లీలో విస్తరిస్తున్న కరోనా కట్టడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్‌లో నిర్వహిస్తారు. ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీలను ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, సీఎస్, ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్, కరోనా నియంత్రణ నిబంధనలుపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవటం గమనార్హం. (పాజిటివ్ న్యూస్: 50 దాటిన రికవరీ శాతం) ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఢిల్లీతో ఉన్న సరిహద్దు మార్గాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ప్రజల రాకపోకల వల్ల తమ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి. ఇక నోయిడా, ఘజియాబాద్ నగరాలతో పోల్చితే ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు నమోదవటంతో ప్రయాణ పరిమితులను కొనసాగిస్తామని ఉత్తరప్రదేశ్ పేర్కొన్న విషయం తెలిసిందే. (మంత్రి నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో విమర్శలు) -
ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!
న్యూఢిల్లీ: రాజ్యసభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షం కంటే వెనుకబడిన అధికార బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను మచ్చిక చేసుకుంటోంది. దీని ఫలితంగానే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు నీరజ్ శేఖర్ అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇంకొందరు కూడా ‘కాషాయ’బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 78కి చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వచ్చే ఏడాది కల్లా రాజ్యసభలో అధికార ఎన్డీఏకి మెజారిటీ దక్కే అవకాశముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోగానే బీజేపీకి రాజ్యసభలో పైచేయి సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఎన్డీఏలోని జేడీయూ వంటి పార్టీలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే బలం పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కైవసం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. -
గాడ్సే లాంటి వాళ్లను తయారుచేయం
రాంపూర్: వివాదాలతో నిత్యం సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజామ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మదర్సాలు నాథురాం గాడ్సే, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వారిని తయారుచేయబోవని వ్యాఖ్యానించారు. మదర్సాలను ప్రధాన (మెయిన్‌స్ట్రీమ్) విద్యావ్యవస్థతో అనుసంధానం చేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆజామ్ ఖాన్ స్పందించారు. గాంధీని చంపిన నాథురాం గాడ్సే స్వభావం కలిగిన వారిని, మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వంటి వ్యక్తిత్వం కలిగిన వారిని మదర్సాలు తయారుచేయడం లేదన్నారు. ముస్లింలకు నాణ్యమైన విద్యను అందించే మదర్సాలకు కేంద్రం నిజంగా సహాయం చేయదలిస్తే వాటిని మెరుగుపరచాలని సూచించారు. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో పాటు ఆధ్యాత్మిక విలువలు, విజ్ఞాన అంశాలను మదర్సాలు బోధిస్తున్నాయని తెలిపారు. మదర్సాలకు భవనాలు, ఫర్నిచర్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను అందించే కేంద్రాలుగా మదర్సాలను గుర్తించాలన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న మదర్సాలను సాధారణ, ప్రధాన విద్యా కేంద్రాలతో కలుపుతామని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం ప్రకటించారు. మదర్సాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సబ్జెక్టులో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని ట్విటర్లో నఖ్వీ వెల్లడించారు. మదర్సాలను మెరుగపరిచేందుకు 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ ‘ఒక చేతిలో ఖురాన్ మరో చేతిలో కంప్యూటర్’ ఉండాలి అనే నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆజం ఖాన్‌పై జయప్రద సంచలన వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను తను అన్నా అని పిలిస్తే.. అతను మాత్రం తనని నాట్యగత్తె అని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు జయప్రద. ఆ తర్వాత ఎస్పీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ తీరుతో ఆమె పార్టీని వీడారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆజం ఖాన్.. నేను నిన్ను అన్నా అని పిలిచాను. కానీ నువ్వు నన్ను అవమానించావు. నన్ను నాట్యగత్తె అన్నావు. నిజమైన సోదరులు ఎవరూ అలా మాట్లాడరు. నీ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. అందుకే నేను రాంపూర్ విడిచి వెళ్లాను’ అన్నారు. పద్మావత్ సినిమా చూసిన తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఖిల్జీ పాత్రను చూస్తే నాకు ఆజం ఖానే గుర్తుకు వచ్చాడు. గత ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సమయంలో అతను నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు’ అని పేర్కొన్నారు. జయప్రద వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్ ఆమెను నాట్యగత్తె అని సంభోదించిన సంగతి తెలిసిందే. -
ములాయం స్టార్ క్యాంపెయినర్ కాదా?
లక్నో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ పేరు లేకుండానే శనివారం ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ స్థానం అయిన ఆజంగఢ్ నుంచి ఈసారి ములాయం కొడుకు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో నిలవనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శనివారం 40 మంది నేతలతో కూడిన ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. ఇందులో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్‌తోపాటు నేతలు ఆజంఖాన్, రామ్‌గోపాల్, జయా బచ్చన్ తదితరుల పేర్లున్నాయి. ములాయం పేరు లేదు. పొరపాటును గుర్తించిన పార్టీ నాయకత్వం వెంటనే ఆ జాబితాలో ఆయన పేరును చేర్చి మరో లిస్టును ఎన్నికల సంఘానికి పంపించింది.. -
సైన్యంతో రాజకీయాలా..?
లక్నో : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పాలక బీజేపీ సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగుతోందని ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తాను సైనిక స్కూల్లో చదివినప్పటికీ సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే స్ధాయికి తమ పార్టీ ఎన్నడూ దిగజారదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపొందేందుకు ఏం చేసేందుకైనా బీజేపీ వెనుకాడదని అఖిలేష్ ధ్వజమెత్తారు. భారత సైన్యాన్ని బీజేపీ రాజకీయాల్లోకి లాగిందని యావత్ దేశానికీ తెలుసునని ఆయన మండిపడ్డారు. ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని, ఈ క్రమంలో వారు గోవులు, గంగా నదిని సైతం విడిచిపెట్టలేదని అన్నారు. కాగా, సైనిక సిబ్బంది ఫోటోలను హోర్డింగ్‌లు, ఇతర ప్రచార సామాగ్రిలో వాడరాదని ఈసీ రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలపై ధ్వజమెత్తడం గమనార్హం. మరోవైపు పాక్ చెర నుంచి ఇటీవల విడుదలైన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫోటోతో కూడిన హోర్డింగ్‌లను బీజేపీ నేతలు ప్రదర్శించిన నేపథ్యంలో ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. -
అఖిలేష్‌కు బెహన్ బాసట
లక్నో : మైనింగ్ స్కామ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి సోమవారం అఖిలేష్‌కు బాసటగా నిలిచారు. దాడుల పేరుతో రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టే బీజేపీ వ్యూహాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారని మాయావతి పేర్కొన్నారు. కేంద్రం వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని, కుట్రలను నీరుగార్చాలని అఖిలేష్‌తో భేటీ సందర్భంగా మాయావతి స్పష్టం చేశారని బీఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2012-13లో మైనింగ్ గనుల కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించిన అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదైతే దానికి అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ బాధ్యులు ఎలా అవుతారని సోమవారం ఎస్పీ, బీఎస్పీ నేతల సంయుక్త సమావేశంలో బీఎస్పీ ఎంపీ సతీష్ మిశ్రా ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి నుంచి భాగస్వామ్య పక్షాలు వైదొలుగుతుంటే వారు కొత్తగా సీబీఐతో దోస్తీకి దిగారని ఎద్దేవా చేశారు. కాగా అఖిలేష్‌పై సీబీఐని ప్రయోగించడం పట్ల మోదీ సర్కార్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న నియంత సర్కార్‌ను సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. -
రామ మందిరం : ములాయం కోడలి సంచలన వ్యాఖ్యలు
లక్నో : సమాజ్ వాదీ పార్టీలోని రాజకీయ విబేధాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. వారం రోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్ సింగ్ యాదవ్ కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ కూడా ఇదే బాటలో నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రామ మందిరం నిర్మాణం గురించి అపర్ణ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణం తప్పక జరగాల్సిందే. జనవరిలో జరగబోయే కోర్టు విచారణ కోసం మేము ఎదురు చూస్తున్నాం’ అంటూ అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక శివ్‌పాల్ యాదవ్ స్థాపించిన ప్రగతిశీల్ సమాజవ్ వాదీ పార్టీ 2019 ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని అపర్ణ తెలిపారు. ‘2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే ఏ పార్టీ నుంచి రంగంలోకి దిగుతారు’ అని ప్రశ్నించగా.. ‘పెద్దలు ఎటువైపు ఉంటే నేను అటే. అయినా 2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంద’న్నారు. దాంతో అపర్ణ కూడా శివ్‌పాల్, నేతాజీ(ములాయం సింగ్ యాదవ్)ల దారిలోనే నడవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కుమారుడు.. సోదరుని మధ్య విభేదాలతో సతమతమవుతోన్న నేతాజీకి చిన్న కోడలు అపర్ణ వ్యాఖ్యలు మరిన్ని కొత్త సమస్యలు తెచ్చి పెట్టేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
సరికొత్త ‘కుల’ రాజకీయం
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ పొత్తుకు సిద్ధమవుతున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీకి కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 71 పార్లమెంటు స్థానాలు గెల్చుకున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడనున్న వినూత్న పొత్తు హిందుత్వ రాజకీయాలకు దృఢమైన సవాలును విసురుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బీజేపీ 2014 నాటి తన అద్భుతమైన పని తీరును పునరావృతం చేయాలంటే ఇలాంటి మహా కూటమి ఏర్పాటును అడ్డుకునే వ్యూహం తప్పనిసరిగా రచించాల్సి ఉంటుంది. పైగా ఉత్తరప్రదేశ్‌లో ఈ మూడు బలమైన పార్టీలను మినహాయిస్తే.. తాను ఎన్నికల పొత్తు కుదుర్చుకోగలిగే రాజకీయ పార్టీలు పెద్దగా లేవని కూడా బీజేపీకి తెలుసు. అందుచేత, ప్రతిపక్ష పార్టీల రాజకీయ పొత్తును సవాలు చేయాలంటే గత ఎన్నికలల్లో తనకు ఓటు వేసిన సామాజిక పునాదిని భారతీయ జనతాపార్టీ మరింత విస్తృత పర్చుకుని బలోపేతం కావాల్సి ఉంటుంది. ‘విభజించు–పాలించు’ వ్యూహంతో దాడి ఉత్తరప్రదేశ్‌లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ విభజించు పాలించు వ్యూహాన్ని ఎంపిక చేసుకుంది. దళితుల్లో, ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలు, సామాజికంగా ఎంతో వెనుకబడిన బృందాలను హిందుత్వ శక్తుల పక్షాన గణనీయంగా సమీకరించారు. సామాజికంగా వెనుకబడిన బృందాలకు చెందిన విస్తృత సెక్షన్లకు చెందిన ప్రజానీకానికి దళిత/బహుజన/పిచ్డా (వెనుకబడిన) వంటి సామూహిక పరిభాష అంత సులభంగా అందుబాటులో ఉండదు. అలవడదు కూడా. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు తరచుగా సంకుచితమైన కుల వర్గాలను ఉపయోగిస్తుంటారు. సమాజంలోని అన్ని కులాల తరపున ఒక ఏకైక కులం అధికారం చలాయించకూడదన్న సూచనతో కుల ప్రాతిపదికన సామాజిక విభజనను విస్తృతం చేయడమే బీజేపీ వ్యూహం. దాంట్లో భాగంగానే అత్యంత వెనుకబడిన కొన్ని నిర్దిష్ట కులాలను, బృందాలకు రాజకీయాలు అంటించిన బీజేపీ వాటిని యాదవులు, జాతవులు, ముస్లింలతో కూడిన సాంప్రదాయిక రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబెట్టింది. సామాజిక ఇంజనీరింగ్‌లో బీజేపీ పైచేయి ఉత్తరప్రదేశ్‌లో అంతవరకూ బలంగా కనిపించిన రాజకీయ శక్తులను అప్రధానమైన రాజకీయ ప్రత్యర్థులుగా వేరుపర్చడంలో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. అంతకుమించి ఆ పార్టీ తన సామాజిక ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మరింత గొప్పగా మెరుగుపర్చుకుంది. దిగువస్థాయిలోని ఓబీసీల్లోకి, రాజకీయంగా పూర్తిగా ఏకాకితనంలో ఉన్న దళిత బృందాల్లోకి విస్తరించడం ద్వారా అత్యంత సృజనాత్మక పార్టీగా బీజేపీ తనను తాను నిర్వచించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ పునాది ఒక్కసారిగా ద్విగుణీకృతం కావడానికి దారితీసిన మూలకారణం ఇదే. ఇన్నాళ్లుగా ఈ బృందాలను ఎస్పీ, బీఎస్పీ పార్టీల సాంప్రదాయిక రాజకీయ సమీకరణల్లో చాలా చిన్న చూపు చూసేవారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల సాంప్రదాయిక ఓట్లలోనూ కుల విభజనలు ప్రేరేపించిన బీజేపీ 2012లో యూపీలో సాధించిన 15 శాతం ఓట్లను 2017 అసెంబ్లీ ఎన్నికల నాటికి 42 శాతానికి పెంచుకుంది. ఈ ప్రాతిపదికన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ తన సామాజిక పునాదిని నిలబెట్టుకోగలనని ప్రగాఢంగా విశ్వసిస్తోంది. అందుకే ప్రతిపక్షాల రాజకీయ కూటమి బీజేపీ దృష్టిలో ఇప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది విభిన్న రాజకీయ వ్యూహాలు ఉత్తరప్రదేశ్‌లో మూడు విభిన్న రాజకీయ వ్యూహాలను అవలంబించడం ద్వారా బీజేపీ అంతటి ప్రభావశీలమైన సామాజిక పొత్తును సాధించింది. ఒకటి– రాష్ట్రంలో కుల వ్యవస్థ ఇప్పటికీ బలంగా పనిచేస్తోందని, విభిన్న కుల బృందాలు సామాజిక పొత్తులు లేక పరస్పర సంబంధాలకు ఇప్పటికీ దూరంగానే ఉన్నాయని బీజేపీ గ్రహించింది. పరస్పరం అవిశ్వాసం, శత్రుత్వం, అసూయ ప్రాతిపదికన కులాలు ఇప్పటికీ సమాజంలో పనిచేస్తున్నాయి. అలాంటి కుల విభజనలను సవాలు చేసే మౌలికమైన సంస్కరణాత్మక శక్తి సమాజంలో ఇంకా ఏర్పడలేదు. పైగా కుల బృందాలను సామాజిక సంస్కరణకు గురిచేయడంపై బీజేపీ ఎలాంటి ఆసక్తీ ప్రదర్శించలేదు. దానికి బదులుగా, అది కుల విభజనను ఎంతగా ప్రోత్సహించి, రాజకీయం చేసి పడేసిందంటే, ఉత్తరప్రదేశ్‌లో దళితులు లేక ఓబీసీల వంటి ఏకీకృత రాజకీయ సామూహిక శక్తి ఇకపై ఎన్నటికీ ఏర్పడటం కష్టం. అలాంటి పరిణామం సామాజికంగా ఉన్నత శ్రేణిలో ఉన్న ఆధిపత్య శక్తుల రాజకీయాలను తప్పకుండా సవాలు చేయగలదని బీజేపీ చక్కగా గ్రహించింది కూడా. కాబట్టి, దళితుల, ఓబీసీల సామూహిక ఉనికిని, అస్తిత్వాన్ని విచ్ఛిన్న పర్చడానికి సమాయత్తం అవుతున్న కుల బృందాలకు సహాయం చేయడం, ప్రోత్సహించడమే బీజేపీ ప్రధాన వ్యూహంలాగా మారింది. బీఎస్పీలోని జాతవ నాయకత్వానికి వ్యతిరేకంగా రాజ్‌భర్, పాసి, ధోబీ, ఖటిక్ వంటి కులాలను ప్రోత్సహించడంపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆధిపత్య కుల రాజకీయాలపై ప్రచారం ఓబీసీలలోని మౌర్యులు, కుర్మీలు, లోధీలను హిందుత్వ రాజకీయాలను బలపర్చే ప్రధాన శక్తులుగా బీజేపీ ఎగదోసింది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ కేవలం యాదవుల ఆధిపత్యం ఉన్న పార్టీ స్థాయికి పరిమితమైపోయింది. కుల బృందాల మధ్య రోజువారీగా తలెత్తుతున్న తీవ్రమైన సామాజిక వ్యత్యాసాలను విస్పష్టమైన సామాజిక, రాజ కీయ శత్రుత్వాల్లోకి మార్చడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేసింది. రెండు, యూపీలోని కుల విభేదాలను సజీవంగా ఉంచడానికి బీజేపీ పలు రాజకీయ ప్రకటనలు, విధానపరమైన వాగ్దానాలను తన ఎన్నికల ప్రచారంలో గుప్పించింది. ఉదాహరణకు, రిజర్వేషన్ విధానాన్ని వర్గీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆసక్తి ప్రదర్శించింది. దీంతో రాష్ట్రంలో యాదవులు, జాతవులు, మరికొన్ని కులాలు రిజర్వేషన్ విధానం ద్వారా లభ్యమవుతున్న ప్రయోజనాలను గుత్తకు తీసుకున్నాయని బీజేపీ ప్రచారం చేసింది. కాబట్టి రిజర్వేషన్ విధానాన్ని సంస్కరించవలసిన సమయం ఆసన్నమైందని, అప్పుడే రిజర్వేషన్ ఫలితాలు సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చేరుకుంటాయని బీజేపీ ప్రచారం చేసింది. ఆవిధంగా ఒకే కుల సామాజిక పునాదిలో అవిశ్వాసాన్ని, శత్రుత్వాన్ని పెంచి పోషించడమే కాకుండా, కీలకమైన ఆర్థిక, రాజకీయ వనరులపై అగ్రకుల కులీనుల ఆధిపత్యం కొనసాగడాన్ని కూడా బీజేపీ అనుమతించింది. మతపరమైన ఘర్షణలకు ఆజ్యం మూడు– నిమ్న కులాల్లో సామాజిక, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉండే సాంస్కృతిక, జానపద అంశాల్లో బీజేపీ మతత్వాన్ని రంగరించింది. దళిత్–ఓబీసీ కులాలకు చెందిన పలు వర్గాలు హిందూ మత సంప్ర దాయాలతో సన్నిహితంగా ఉండటంతోపాటు ఆ ఆచా రాల్లో, సంప్రదాయాల్లో పాలుపంచుకుంటాయి. ఆరెస్సెస్, బీజేపీలు ఒక పద్ధతి ప్రకారం వీటిల్లో జోక్యం చేసుకుని మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా వినియోగించుకుం టున్నాయి. గ్రామ దేవతలు, జానపద నాయకులు, గ్రామీణ సంప్రదాయాలు, ఇతర సాంస్కృతిక కళాఖం డాలు వగైరాలకు క్రమంగా హిందుత్వ రాజకీయాలతో బాంధవ్యం ఏర్పడేలా చూస్తున్నాయి. అంతేకాక గోరక్షణ, రామ మందిరం, హిందూ మహి ళల గౌరవ పరిరక్షణ వంటి సామాజిక పరమైన సున్నిత అంశాలను ముస్లిం వ్యతిరేకతకు బీజేపీ వాడుకుం టోంది. నిమ్నకులాలకు సంబంధించిన మతపరమైన, సాంస్కృతిక పరమైన అంశాల్లో తరచు ఆరెస్సెస్–బీజేపీలు జోక్యం చేసు కుంటున్న తీరు బీజేపీ మద్దతు పెరగడానికి దోహదకారి అవు తోంది. ఈ కపట వ్యూహాలు గత ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టి బీజేపీకి లబ్ధి చేకూర్చాయి. కనుక సహజంగానే రాబోయే ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఈ తరహా వ్యూహా లపైనే ఆధారపడదల్చుకుంది. కానీ ఈసారి సామాజిక, ఆర్ధిక న్యాయానికి సంబం ధించిన ప్రశ్నలకు బీజేపీ సరైన జవాబిచ్చే స్థితిలో లేదు. ఓబీసీల్లోని కింది కులాలు, దళితుల్లోని అట్టడుగు కులాలు మానవాభివృద్ధి సూచీల్లో మెరుగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ కులాలన్నీ ఇప్పటికీ సామాజికంగా వివ క్షను, వేధింపులను ఎదుర్కొంటున్నాయి. అత్యంత దారు ణమైన పేదరికంలో మగ్గుతు న్నాయి. బీజేపీ నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ఈ అట్టడుగు కులాలను దయ నీయమైన స్థితినుంచి బయట పడేయలేకపోయింది. ఇప్ప టికీ ఆ కులాలు అధికారానికి చాలాదూరంలో ఉన్నాయి. కేవలం మతతత్వ, కుల సమీకరణాల కారణంగా మాత్రమే అవి భారతీయ జనతా పార్టీ ఛత్రఛాయలో మనుగడ సాగిస్తున్నాయి. సమగ్ర వ్యూహంలేని విపక్షాలు ఎస్–బీఎస్పీ–కాంగ్రెస్ కూటమి కాగితాలపై చాలా ఆక ర్షణీయంగా కనిపిస్తుంది. యాదవ్–జాతవ్–ముస్లిం కల యిక సామాజికపరమైన అద్భుత వ్యూహమని, అది గెలుపును అందిస్తుందని విపక్షాలకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆరెస్సెస్–బీజేపీ శక్తులు దీనికన్నా అతి పెద్ద సామా జిక సముదాయాన్ని సమీకరించగలవు. క్షేత్ర స్థాయిలో బీజేపీ తన సొంత కుల–మత రాజకీయాల బ్రాండ్‌ను సమర్థవంతంగా అమలుచేస్తోంది. దానికి సమగ్రమైన ప్రతివ్యూహాన్ని విపక్షాలు ఇంకా రూపొందించుకోలేక పోయాయి. కేవలం రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడంతోనే తమ లక్ష్యం నెరవేరే అవకాశం లేదని ఆ కూటమిలోని పార్టీలు గుర్తించాలి. ఆ కూటమి తన సామాజిక పునాదిని విస్తరించుకుని ఇంతవరకూ ఎలాంటి ప్రాధాన్యతకూ నోచని గ్రూపులకు సమాన హోదానిచ్చి వాటికి సన్నిహితం కాగలిగితే అదొక తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. తనపై ఇంతకాలంనుంచీ ఉంటున్న వ్యతిరేక భావనలను, ప్రత్యే కించి ఇందులోని పార్టీలన్నీ ఏదో ఒక కులానికే ప్రాతినిధ్యం వహిస్తుంటాయన్న అభిప్రాయాన్ని పోగొట్టుకోవటం ఈ కూటమికుండే ప్రధాన సవాళ్లు. కొత్త ఆర్థిక సంక్షేమ ఎజెండా అవశ్యం సమాజంలో బాగా అణచివేతకు గురవుతున్న కులాలకు పార్టీ కార్యకలాపాల్లోనూ, సంస్థాగత అధికార నిర్మా ణాల్లోనూ మంచి ప్రాధాన్యత నిచ్చి ఈ పార్టీలు తమ సామాజిక పునాదిని విస్తృతపరచుకోవాల్సి ఉంది. అదే సమయంలో బీజేపీ అనుసరించే అలంకారప్రాయమైన అభివృద్ధి మంత్రానికి భిన్నంగా కూటమి ఒక కొత్త ఆర్థిక సంక్షేమ ఎజెండాను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక న్యాయం, సోషలిజం వంటి విలువల ఆధారంగా రూపొందే ప్రభావవంతమైన సైద్ధాంతిక ప్రక టన ఆ కూటమినుంచి వెలువడాలి. అది మాత్రమే భారతీయ జనతా పార్టీ వేర్పాటువాద సామాజిక నిర్మాణాన్ని తుత్తునియలు చేస్తుంది. హరీష్ ఎస్. వాంఖెడే వ్యాసకర్త జవహర్లాల్ యూనివర్సిటీ రాజకీయ అధ్యయన కేంద్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్