sara
-
మూగ జీవుల సేవలో.. 'సారా అయ్యర్'!
'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.' చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది. ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్ను వాకింగ్‌కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది. మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్లో ఈస్ట్కోస్ట్రోడ్లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె. ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి -
సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం నేటికి మిస్టరీలే!
ఊహో..? అపోహో..? అంతకు మించిన అభూతకల్పనో..? తేల్చుకోలేని స్థితే అశాంతికి ఆలవాలం. అంధవిశ్వాసానికి ఆధ్యం. వాటి మధ్య నలిగిన జీవితాలు.. వాళ్లు వదిలి వెళ్లిన ఆనవాళ్లు.. తర్వాత తరాలను ఇట్టే బెదరగొడతాయి. అలాంటి ఉదంతమే ఇది. 1881 తర్వాత మొదలైంది ఈ కథ. అది అమెరికా, న్యూ హెవెన్ సమీపంలోని ఒక పెద్ద విల్లా. అందులో నివసించే 44 ఏళ్ల సారా వించిస్టర్కు పడుకునే ముందు పియానో వాయించి నిద్రపోవడం అలవాటు. ఆ రాత్రి అదే చేసింది. అయితే పన్నెండు దాటాక.. అదే పియానో మ్యూజిక్ అస్పష్టంగా వినిపించడం మొదలైంది. తుళ్లిపడి నిద్ర లేచిన సారా.. వెంటనే హాల్లోకి వెళ్లిచూడగానే.. ఆ మ్యూజిక్ ఆగిపోయింది. కానీ ఆ ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. ‘ఎవరది?’ అనే అరుపు ఆమెలోని భయాన్ని మభ్యపెట్టింది. అప్పుడే.. చిమ్మచీకటిలో హాల్‌కి ఆనుకుని ఉన్న స్టోర్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అయ్యింది. ఆ అలికిడికి తిరిగి చూసిన సారా.. ధైర్యం తెచ్చుకుని.. దగ్గరకు వెళ్లి తలుపు క్లోజ్ చేయబోతుంటే.. అందులో ఉన్న ఊయల ఊగుతూ కనిపించింది. పసిపాప ఏడుపు, విచిత్రమైన ఓ నవ్వు ఆమెను వణికించాయి. అప్పటి నుంచి ప్రతిరాత్రి అదే ఉలికిపాటు. కొన్ని రోజులకు పియానో వాయించే మనిషి కూడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. కొన్నిసార్లు అది కలో.. నిజమో ఆమెకు అర్థమయ్యేది కాదు. అప్పటికే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ముసురుకున్నాయి. ∙∙ 1862లో ‘విలియమ్ విర్ట్ వించిస్టర్’ అనే ధనికుడ్ని వివాహం చేసుకున్న సారా.. తన మామగారు ఆలివర్ వించిస్టర్కి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేది. మొదట షర్ట్స్ కంపెనీ నడిపించే వించిస్టర్ కుటుంబం.. తర్వాత కాలంలో రైఫిల్స్ కంపెనీ (తుపాకుల వ్యాపారం) పెట్టి.. రెట్టింపు లాభాలు గడించసాగింది. గవర్నమెంట్ పర్మిషన్స్‌తో అఫీషియల్‌గానే కాదు.. రహస్యంగా కూడా చాలా గన్స్ అమ్మేది. సుఖశాంతులతో సాగిపోతున్న ఆ కుటుంబంలోకి సారా మరో శుభవార్తను మోసుకొచ్చింది.. తాను తల్లిని కాబోతున్నా అంటూ! పెళ్లి అయిన చాలా ఏళ్లకు కలగబోతున్న సంతానం కావడంతో.. ఆ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సారాకు ఆడపిల్ల పుట్టింది. పాపకి యానీ వించిస్టర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ నెల రోజులకే ఆ పాప చనిపోయింది. ఆ విషాదం వించిస్టర్ కుటుంబాన్ని కోలుకోనివ్వలేదు. కొన్ని రోజులకే ఆలివర్ మరణించాడు. ఇంటి పెద్ద మరణించడంతో సారా, విలియమ్ కుంగిపోయారు. కొన్నాళ్లకు రైఫిల్ కంపెనీ లాభాలు తగ్గాయి. వ్యాపారం పతనం దిశగా సాగింది. కంపెనీ బాధ్యతలందుకున్న విలియమ్.. ఏడాది గడవకముందే (1881లో) మరణించాడు. దాంతో సారా మరింత కుంగిపోయింది. నిజానికి అక్కడితోనే ఆ కుటుంబంలో విషాదాలు ఆగిపోలేదు. విలియమ్ తర్వాత.. సారా అత్త, సారా తల్లి, సారా సోదరి ఇలా పలు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు చాలామంది మరణించారు. దాంతో సారాలో భయం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే సారాకు ఆత్మలు కనిపించడం మొదలుపెట్టాయి. తనకు ఎదురవుతున్న వింత అనుభవాల గురించి.. కొందరు శ్రేయోభిలాషులతో పంచుకుని, వారి సాయంతో.. పరిష్కారం కోసం కొంతమంది మాంత్రికుల్ని కూడా ఆశ్రయించింది. వారు ఆ ఇంటిని పరిశీలించి.. ఇక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. ఇందులో నివసించడం మంచిది కాదని తేల్చేశారు. కొన్నినెలల పాటు శాంతిపూజలు చేయించినా ఫలితం లేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. స్టోర్ రూమ్‌లో ఊగే ఊయల సారా పాపదే. ప్రతిరాత్రి పియానో వాయించేది సారా భర్తే. తనకు ఎదురుపడే అస్పష్టమైన ఆకారం తన భర్తేదేనని గ్రహించిన రాత్రే.. సారాకి చాలా విషయాలు తెలిశాయి. ఆ రాత్రి విలియమ్.. సారాను తీవ్రంగా హెచ్చరించాడట. ‘మనం అమ్మిన రైఫిల్స్ (తుపాకీలు) కారణంగా చనిపోయిన వారి ఆత్మలు మన ఇంటిని చుట్టుముట్టాయి. ఆత్మలన్నీ కలసి.. వించిస్టర్ కుటుంబాన్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటి దాకా జరిగిన మరణాలన్నీ (నాతో సహా) ఆ ఆత్మల వల్లే జరిగాయి. ఈ ఇల్లు వదిలి పారిపో.. మరెక్కడైనా ఇల్లు కట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అయితే ఆ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాకుండా చూసుకో.. ఎప్పుడైతే ఇంటి నిర్మాణం పూర్తవుతుందో ఆ రోజే నీకు మరణం సంభవిస్తుంది’ అని చెప్పి విలియమ్ మాయమయ్యాడట. దాంతో సారా ‘న్యూ హెవెన్ను విడిచిపెట్టి.. కాలిఫోర్నియా వెళ్లిపోయింది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఓ మూడేళ్లకు.. తనకు వారసత్వంగా వచ్చిన డబ్బుతో కాలిఫోర్నియాలోని శానోస్ సమీపంలో ఓ విశాలమైన స్థలాన్ని కొనుక్కున్నది. అక్కడ ఏడంతస్తుల భవనానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సుమారు పదహారుసార్లు.. కట్టిన గదులను కూలుస్తూ మళ్లీ మళ్లీ కట్టించింది. ఆ ఇల్లు.. ఆత్మలను గందరగోళంలోకి నెట్టేలా ఉండాలనేది సారా ఉద్దేశమట. 1906 నాటికి ఇంటికి ఓ అందమైన రూపం వచ్చినా.. ఆమె శాంతించలేదు. ఆ ఇల్లు కొన్నిసార్లు భూకంప ప్రభావాలకు కూలితే.. ఎక్కువ సార్లు సారా అభీష్టానికి కూలిపోయింది. గదులు, కిటికీలు, తలుపులు ఇలా అన్నీ పగిలేవి, విరిగేవి. సుమారు ఆమె మరణం వరకూ అంటే 1922 సెప్టెంబర్ దాకా ఆ ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. స్వయంగా తనే ఎప్పటికప్పుడు నిర్మాణాల్లో పలు మార్పులు చేసేదట. సుమారు 36 ఏళ్ల పాటు ఆ ఇంట్లో రకరకాల మార్పుచేర్పులు జరిగాయి. కొన్ని మెట్లు పైకప్పుకి మార్గమైతే.. కొన్ని తలుపులు కేవలం అడ్డు గోడల్ని చూపెడుతుంటాయి. అంటే మెట్లు ఎక్కి మరో అంతస్తుకు వెళ్తాం అనుకుంటే అక్కడ ఇంటి పైకప్పు తప్ప ఏం ఉండదు. కొన్ని చోట్ల తలుపులు తెరిస్తే అడ్డంగా నిర్మించిన గోడలు తప్ప మార్గం కనిపించదు. కొన్ని కిటికీలు గోడలకు కాకుండా సీలింగ్‌కి ఉంటాయి. సారా స్వయంగా ఆత్మలతో మాట్లాడేదని.. వాటికి క్షమాపణలు చెప్పేదని.. వాటిని శాంతపరచడానికే ఇంటికి పదే పదే మార్పుచేర్పులు చేసేదని ఆ ఇల్లు కట్టిన కార్మికులు కొందరు ప్రచారం చేశారు. భర్త, బిడ్డ చనిపోవడంతో ఆమెకు పిచ్చి పట్టిందని.. ఆస్తులుండటంతో అలా ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేసిందని కొందరి అభిప్రాయం. అయితే వించిస్ట్టర్ బంధువులు మాత్రం.. ‘ఆమెకు ఆర్కిటెక్చర్ మీదున్న ఆసక్తికారణంగానే అన్నిసార్లు భవన నిర్మాణంలో మార్పులు చేసిందని.. ఆత్మలు వంటి పుకార్లను నమ్మొద్దు’ అని ప్రపంచానికి వెల్లడించారు. ఏది ఏమైనా సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం రెండూ నేటికీ మిస్టరీలే. అంతేగాదు మిస్టరీ హౌస్‌లో.. ప్రస్తుతం నాలుగు అంతస్తుల నిర్మాణం మిగిలింది. 500లకు పైగా గదులు, 2 వేలకు పైగా తలుపులు, 10 వేలకు పైగా కిటికీలు, 50కి పైగా బెడ్ రూమ్స్, 13 బాత్ రూమ్స్, ఆరు కిచెన్ రూమ్స్, చాలా బాల్కనీల సువిశాలమైన ఆ భవనం.. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. సంహిత నిమ్మన (చదవండి: ఆరుగంటలకు పైగా మంచులో కూరుకుపోయింది! బతికే ఛాన్స్ లేదు కానీ..) -
దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..
భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా సన్నీ తాజాగా సుప్రీం కోర్టులో సైన్ లాంగ్వేజ్‌లో వాదన వినిపించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఇంటర్ప్రెటర్ సహాయంతో ఆమె తన వాదనలు వినిపించి ప్రశంసలు పొందింది. ‘ఇలాంటిది చాలా మునుపే జరగాలి. ఆలస్యం చేశాం’ అని జస్టిస్ చంద్రచూడ్ సారా సన్నీని ఉద్దేశించి అన్నారు.సారా పరిచయం. సెప్టెంబర్ 22 సుప్రీం కోర్టు కేసు నంబర్ పిలువగానే నల్లగౌనులో అడ్వకేట్ సారా సన్ని తన ఇంట్రప్రేటర్ సౌరవ్ రాయ్ చౌదరితో కోర్టు హాల్లోకి ప్రవేశించింది. ధర్మాసనంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం జావేద్ ఆబిది ఫౌండేషన్ వారు వేసిన ఆ కేసులో ఫౌండేషన్ తరఫున సారా వాదనలు మొదలెట్టింది. వెంటనే కోర్టు హాలు సైలెంట్ అయ్యింది. ఎందుకంటే సారా సైన్ లాంగ్వేజ్ ద్వారా తన వాదనలు వినిపిస్తుంటే వాటిని అంతే వేగంగా ఇంట్రప్రేటర్ కోర్టుకు విన్నవిస్తున్నాడు. అలాగే కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను సైన్ లాంగ్వేజ్ ద్వారా సారాకు తెలియచేసి బదులుగా సారా సమాధానాన్ని కోర్టుకు చెబుతున్నాడు. సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఇలా ఒక ఒక బధిర అడ్వకేట్ మౌనవాదన వినిపించింది. దీనిని చూసిన జస్టిస్ చంద్రచూడ్ ‘ఇప్పటికైనా ఇది సాధ్యమైంది.. ఎప్పుడో జరగాల్సింది’ అన్నారు. కోర్టులో ఉన్న అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సారాను, ఇంట్రప్రెటర్ను మెచ్చుకున్నారు. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ఒక గొప్ప అనుభూతితో సారా సన్ని కోర్టు బయటకు నడిచింది. ఇలాంటి ఘనతను సాధించిన మొదటి మహిళా బధిర అడ్వకేట్ కదా మరి. కేరళ అమ్మాయి సారా సన్ని స్వస్థలం కొట్టాయం. ఆమె తండ్రి సన్ని కురువిల్లా చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి బెట్టి గృహిణి. ఈ దంపతులకు పుట్టిన అబ్బాయి ప్రతీక్ బధిరుడు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరూ మళ్లీ బధిరులే. వారిలో ఒకరు సారా మరొకరు మారియా. ముగ్గురు సంతానం బధిరులే అయినా తల్లిదండ్రులు ఆ లోటు వారికి తెలియనివ్వకుండా పెంచారు. కొడుకు అమెరికాలో బధిరుల స్కూల్లో ఉపాధ్యాయుడిగా, మారియా చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. సారా మన దేశంలో మొదటి బధిర అడ్వకేట్ అయ్యింది. వాదనలు చేస్తూ... సారా బాల్యం నుంచి అందరితో తెగ వాదించేది. ఆమెకు చెవుడు ఉండటం వల్ల మాటలు రాలేదు. కాని సైన్ లాంగ్వేజ్‌తో అందరితో తెగ వాదనలు చేసేది. ‘పెద్దయ్యి లాయర్ అవుతుందేమో’ అని సరదాగా తల్లిదండ్రులు అనుకునేవారు. అన్నట్టుగానే జరిగింది. సారా, మారియా ఇద్దరూ బెంగళూరులో చదువుకున్నారు. అక్కడే బి.కాం. చేసి ఒకరు లా వైపు మరొకరు చార్టెర్డ్ అకౌంటెన్సీ వైపు వెళ్లారు. రెండేళ్ల క్రితం సారా లా పట్టా తీసుకుంది. అయితే కర్నాటక కోర్టుల్లో కేసులు వాదించాలంటే ఇంట్రప్రెటర్లకు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం– కోర్టు పరిభాష ఇంట్రప్రెటర్లకు తెలియదని కోర్టు భావించడమే. అయితే సారా తన వాదనలను కాగితం మీద రాసి జడ్జికి ఇచ్చేది. ఈ విధానాన్ని జడ్జి ఆశ్చర్యంగా చూసేవారు. మెచ్చుకునేవారు కూడా. సుప్రీం కల ‘ఏ రోజైనా నేను సుప్రీం కోర్టులో వాదించాలని అనుకున్నాను’ అంటుంది సారా. ఆమె కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రతిభావంతంగా వాదనలు చేయగలిగింది. ‘దివ్యాంగులు దేనినీ వెలితిగా భావించకూడదు. సాధించాలి. నేను వారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. బధిరులు అడ్వకేట్లుగా రాణించగలరు. కాకపోతే వారి కోసం ఇంట్రప్రెటర్ల వ్యవస్థను ప్రభుత్వం తయారు చేయాలి. అంతేకాదు ఇంట్రప్రెటర్ల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తే బాగుంటుంది’ అని కోరుతోంది సారా. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను గొడుగు మొనలతో పొడిచి..
మా చిన్నతనంలో చెంచులో.. మరెవరో.. నల్లమల అడవుల నుంచి ఎలుగుబంట్ల ముక్కుకు తాడు కట్టి తీసుకుని వచ్చేవారు. ఆ జీవి చుట్టూ జనం మూగేవారు. దాని వీపుపై తమ పిల్లలను సవారీ చేయించేవారు. దానిని తడిమేవారు, తట్టేవారు. అల్లరి మనుషులు కొందరు కర్ర పుల్లతో పొడిచేవారు, మరి కొంతమంది ఆ ఎలుగ్గొడ్డు వెంట్రుకలను పీక్కునేవారు. ఆ వెంట్రుకలను దారంగా పేనుకుని కాలి బ్రోటన వేలుకు కట్టుకుంటే శుభమని భావించేవారు. లేదా దాని యజమానికి కాసిన్ని డబ్బులు ఇచ్చి అతనితోనే దాని వెంట్రుకలను పీకించే వారు. Duniyaa banaane wale, kyaa tere man me samaai ? Kaaheko duniyaa banaai? అని ఆడుగుతారు కవి శైలేంద్ర ఒక పాటలో. ఈ పాట తెలిసిన వాళ్ళే కాదు, తెలీని వాళ్ళు కూడా భగవంతుడిని ఈ మాట అడిగే ఉంటారు తమ తమ మూగభాషలో. ఒక విధివంచితురాలి యథార్థ గాధ 20 ఏళ్ల సారా బార్ట్‌మాన్ 1810లో బతుకు తెరువు కోసమన్న తలంపుతో కేప్‌టౌన్ నుంచి లండన్‌కు బయలుదేరడానికి పడవ ఎక్కినప్పుడు, ఆమె ఇక తన ఇంటిని మళ్లీ చూడదని ఆమెకు తెలియదు. అక్కడి గాలిని, అక్కడి గడ్డిని, అక్కడి సూర్యుడి వెలుతురును ఇక తన జీవితకాలంలో మరెప్పుడు తాకలేదని ఆవిడకు తెలీదు. మా ప్రాంతాల ఎలుగుబంటి కన్నా అన్యాయమైన జీవితం ఆవిడకు సంప్రాప్తించినపుడు ఆవిడ పదే పదే అదే ప్రశ్న భగవంతుడిని అడుగుతూ ఉండి ఉండవచ్చు. మా ఊరి ఎలుగు బంటిని నేను బోనులో చూడలేదు. కానీ మనిషి పుట్టుక పుట్టిన సారా బార్ట్మన్ని బోనులో నుండి బయటకు లాగేవారు. ధృఢమైన ఎలుగు శరీరాన్ని జనం పుల్లలతో తాకేవారు. సారా శరీరాన్ని, ఆవిడ వంటిని, ఆవిడ శరీర భాగాలను ఆడా మగ, పిల్లా జెల్లా, ముసలీ ముతక ప్రేక్షకులు అంతా తాకేవారు, గొడుగు మొనలతో పొడిచి పొడిచి పులకించి పోయేవారు. ఎలుగుబంటి వెంట్రుకలతో తమ ధైర్య సాహాసాలని పెంచుకోవడానికి చూశారు. సారా బార్ట్‌మన్ శరీరాంగాలను చూసుకుంటూ లండన్ సభ్య సమాజం, ఇంగ్లీష్ నాగరిక ప్రపంచం ప్రేరేపణలో మునిగి తేలారు. అచ్చు ఎలుగుబంటి మీద స్వారీ చేసినట్లు నల్ల పిల్ల, అఫ్రికా అమ్మాయి సారాబార్ట్మన్ మీద ఊరేగింది మానవజాతి. దునియా బనానే వాలే, క్యా తేరే మన్ మే సమాయి? కాహికో దునియా బనాయి తూనే, కాహికో దునియా బనాయి? మనుష్యులు కాదు.. రాక్షసులు ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో మానవ ఉన్మాద హింసతో మరణించింది సారా బార్ట్‌మన్. మరణించినా ఆమె శరీరాన్ని విడిచిపెట్టలేదు జాత్యహంకారం. 1815 నుండి ఆమె మెదడు, ఆమె తాలూకు శరీర తోలు తిత్తి బొమ్మ , ఆమె శరీర భాగాలను 1974 వరకు పారిస్ మ్యూజియంలో ప్రదర్శనలో పెట్టారు. సారా బార్ట్‌మన్ జీవితాన్ని 2010 బ్లాక్ వీనస్ అనే సినిమాగా తీశారు. సున్నిత మనస్కులు, మానవ జాతి మీద ప్రేమ, గౌరవం, ఔన్నత్యం కలవారు ఎవరూ ఈ సినిమా భరించలేరు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి. 'మానవ జూ'ల ఏర్పాటులో భాగంగా యూరోపియన్ సమాజం సారా బార్ట్‌మన్ పట్ల వ్యవహరించిన తీరు అమానుషం. 1789లో జన్మించిన ఆమెను యూరప్‌లో దేశాల్లోని జాతరల్లో ప్రేక్షకుల ముందు ప్రదర్శించేవాళ్లు. 1815లో ఆమె చనిపోయారు. అయినప్పటికీ సారా అస్తిపంజరం, మెదడు సహా లైంగిక అవయవాలను పారిస్‌లోని ఓ మ్యూజియంలో 1974 వరకూ ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక 2002లో సారా అవశేషాలను తిరిగి సౌతాఫ్రికాకు అప్పగించినట్లు కథనాలు ఉన్నాయి. చదవండి: Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి.. -
తీవ్ర విషాదం.. 30వ ఏట డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ సారా లీ హఠాన్మరణం
WWE- Sara Lee: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం చెందారు. తన ప్రదర్శనతో రెజ్లింగ్ అభిమానులను అలరించిన ఆమె తన 30వ ఏట చనిపోయారు. ఈ విషయాన్ని సారా తల్లి టెర్రీ లీ శుక్రవారం ధ్రువీకరించారు. సోషల్ మీడియా వేదికగా కూతురి మరణవార్తను తెలియజేశారు. సారా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయిందని.. ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ఇంకా పూర్తి కాలేదంటూ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే, ఆమె మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్ ‘టఫ్ ఎనఫ్’ సిరీస్ విజేతగా నిలిచిన సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఇక లేరనే విషాదకర వార్త తెలిసిందని.. ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది. WWE is saddened to learn of the passing of Sara Lee. As a former "Tough Enough" winner, Lee served as an inspiration to many in the sports-entertainment world. WWE offers its heartfelt condolences to her family, friends and fans. pic.twitter.com/jtjjnG52n7 — WWE (@WWE) October 7, 2022 అదే విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్లు పలువురు సారాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘హృదయం ముక్కలైంది. ఈ విషాదాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’’ అంటూ సరాయా, చెల్సీ గ్రీన్.. సారాతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. కాగా సహచర రెజ్లర్ వెస్టిన్ బ్లేక్‌ను పెళ్లాడిన సారాకు ముగ్గురు సంతానం ఉన్నట్లు సమాచారం. No tweet or amount of words can bring back this beautiful human, but all of my heart goes out to @TheWestinBlake & their family. Sara Lee will be missed greatly. ♥️ The photo on the left is how I will always remember her - laughing, smiling, carefree. pic.twitter.com/XLlLFXDOcF — CHELSEA GREEN (@ImChelseaGreen) October 6, 2022 చదవండి: Ind Vs SA- WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023కి మేము ‘అర్హత’ సాధించడం కష్టమని తెలుసు! అయినా.. BCCI Electoral Rolls: గంగూలీ, జై షా కాదు.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అతడేనా..? -
త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సచిన్ కూతురు సారా!
Sachin Tendulkar Daughter Sara Bollywood Debut Soon: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ముద్దుల తనయ సారా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీ కిడ్ అయిన సారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వెండితెర ఎంట్రీకి ముందే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సారా ఇప్పటికే పలు బ్రాండ్లను ఎండార్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో త్వరలోనే ఆమె ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బి-టౌన్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా బజ్ ప్రకారం బెసిగ్గా నటనపై ఆసక్తి ఉన్న సారా ఇప్పటికే మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు: ‘స్కామ్ 1992’ నటుడు ఆవేదన ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీపై కొంతకాలంగా చర్చ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే ఓ మూవీలో బాలీవుడ్ సిల్వర్ స్క్రిన్‌పై సందడి చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇందుకోసం ఆమె పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తూ నటనలో శిక్షణ కూడా తీసుకుంటుందని బి-టౌన్ మీడియాలు తమ కథనంలో రాసుకొస్తున్నాయి. కాగా లండన్ యూనివర్సిటీ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసిన సారా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఓ అంతర్జాతీయ క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు ఇటీవల మోడలింగ్‌లోకి అడుగుపెట్టి..సొంతంగా డిజైన్ చేయించిన అంతర్జాతీయ క్లాతింగ్ను ప్రమోట్ చేసుకుంటోంది. సారా క్లాతింగ్ బ్రాండ్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం అజియో లక్స్‌లో(Ajio Luxe) అందుబాటులో ఉన్నాయి. -
420 లీటర్ల సారా స్వాధీనం
కంచిలి: మండలంలో నువాగడ పంచాయతీ డొలాసాయి గ్రామంలో 420 లీటర్ల నాటుసారా డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సోంపేట ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ టి.వెంకటప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. చైతన్య భుయా అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరడులో సారా బ్యాగులను గుర్తించామని చెప్పారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచినట్లు తెలిసిందని, తనిఖీల కోసం సిబ్బంది రావడాన్ని పసిగట్టి భుయా పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐతో పాటు ఎస్ఐలు జి.వి.రమణ, యు.వి.వి.నాగరాజు, హెచ్‌సీ డి.మోహనరావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కాగా, డంప్‌ను గుర్తించినందుకు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ కంచె శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ కె.పి.గోపాల్ సిబ్బందిని అభినందించారు. -
‘నాన్న మరణం కంటే తాగుబోతు అనే మాటే ఎక్కువ బాధిస్తోంది’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన పైడేటి సత్యనారాయణ (73)ది సారా మరణం అంటూ తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడాన్ని అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. తమ తండ్రి మరణం కన్నా సారా తాగి చనిపోయారన్న ప్రచారం తమను ఎక్కువ బాధిస్తోందని, బయటకు రావాలన్నా ఇబ్బందిగా ఉందని, దయచేసి దుష్ప్రచారం ఆపి తమను వదిలేయాలని వారు వేడుకున్నారు. మృతుడు సత్యనారాయణ కుమారుడు మహేశ్వర శ్రీనివాస్, కుమార్తె నాగమణి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రికి కాఫీ అలవాటు కూడా లేదని, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్కరోజు కూడా ఆయన మద్యం సేవించలేదని చెప్పారు. అలాంటి తమ తండ్రిని తాగుబోతుగా చిత్రీకరించి, తమను మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తమ తండ్రికి బీపీతో పాటు ఆయాసం ఉందని చెప్పారు. ఈ నెల ఆరో తేదీ తెల్లవారుజామున ఆయాసం ఎక్కువగా రావడంతో బుట్టాయగూడెం క్లస్టర్ ఆస్పత్రికి తీసుకువెళ్లామని, అక్కడ సెలైన్లు పెట్టిన రెండు గంటల తర్వాత తిరిగి ఇంటికి తీసుకువచ్చామని వివరించారు. మధ్యాహ్న సమయంలో తీవ్రమైన దగ్గు, ఆయాసం వచ్చి మృతిచెందారని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో దహన సంస్కారాల అనంతరం ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచి తమ తండ్రి సారా తాగి మరణించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని దయచేసి ఇకనుంచైనా ఆపేయాలని, తమను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరారు. అసలేం జరిగిందంటే... పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పైడేటి సత్యనారాయణ 40 ఏళ్లుగా కిళ్లీ షాపు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరో తేదీన హైబీపీ రావడం, ఆస్తమా ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లోనే మృతి చెందారు. మధ్యాహ్నం దాటిన తరువాత మృతి చెందడంతో బుట్టాయగూడెంలో అంత్యక్రియలు నిర్వహించడానికి వసతులు లేక మానవత అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాహనంలో జంగారెడ్డిగూడెం శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. దీంతో ఇది సారా మరణమంటూ విష ప్రచారానికి తెర తీశారు. ఎక్కడెక్కడినుంచో ఎవరో ఫోన్లు చేసి మీ తండ్రి సారా తాగి చనిపోయారు కదా ఇబ్బంది పడవద్దు మేము చూసుకుంటామని మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో మానసికంగా వ్యధ చెందిన ఆ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ఇలాంటి శవరాజకీయాలు చేస్తోందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. -
మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి
చిత్తూరు, గుడిపాల: ‘‘దశాబ్దాల నుంచి రాసనపల్లె అంటేనే సారా తయారీకి పేరు గాంచింది. బిడ్డల అభివృద్ధి కోసమైనా మీ తీరును మార్చు కోవాల్సిన అవసరం ఉంది.’’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మండలంలోని రాసనపల్లె దళితవాడలో గురువారం సారా నిర్మూలన కోసం గ్రామస్తులకు ఎక్సైజ్, పోలీస్‌శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవ గాహన సదస్సు నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారి రిశాంత్‌రెడ్డి పర్యవేక్షించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణస్వామి మాట్లాడుతూ విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసికట్టుగా సారా తయారీ ఆపేస్తామని ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ రాసనపల్లె గత కొన్నేళ్లుగా సారా తయారీలో మునిగిపోయి అభివృద్ధికి దూరమైందన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని బెల్ట్‌షాపులన్నీ తొల గించారన్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
ఏరులైపారుతున్న సారా
సాక్షి, పశ్చిమగోదావరి : ఏజెన్సీ మెట్టప్రాంతంలో సారా తయారీ పడగ విప్పింది. దీంతో ఒక్కసారిగా మారుమూల అటవీ ప్రాంతాల నుంచి సారా మైదాన ప్రాంతాల్లోకి దిగుమతి అవుతుండగా, వాళ్లను చూసిన మైదాన ప్రాంతవాసులు కొందరు సారా తయారీ కేంద్రాలను కుటీర పరిశ్రమలుగా నెలకొల్పుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపడంతో ఇప్పటివరకు బెల్టు షాపులపై ఆధారపడ్డ కుటుంబాల వారు సారా తయారీ వైపు వెళుతున్నారు. దీంతో రోజుకు 40 లీటర్ల నుంచి 150 లీటర్ల వరకు సారాను దిగుమతి చేస్తూ ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల అటవీ ప్రాంతాల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయన్న విషయం సారా తయారీదారులకు అయాచిత వరంగా పరిణమించింది. దీంతో గత కొద్ది రోజుల వరకు రాత్రి వేళల్లోనే సారా తయారు చేసిన వ్యక్తులు ఏకంగా ఇప్పుడు పట్టపగలే తయారీ కేంద్రాలను నెలకొల్పి బాహాటంగా తయారుచేస్తున్నారు. అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులు లీటర్ సారా హోల్‌సేల్‌లో రూ.200కు, రిటైల్‌గా అయితే రూ. 300కు విక్రయిస్తున్నారు. ముగ్గురు నుంచి నలుగురు బృందంగా ఏర్పడిన సభ్యులు సారా తయారీకి గూడుపుఠానిలా వ్యవహరిస్తున్నారు. సారా తయారు చేస్తున్న సమీప వ్యవసాయ రైతులు అభ్యంతరాలు పెడుతుండటంతో వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని తయారీదారులు భయపెడుతున్నారు. దీంతో రైతులు వెనక్కి తగ్గాల్సి వస్తోంది. సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ గత కొద్ది నెలలుగా గ్రామగ్రామాన తిరుగుతూ జాగృతి కార్యక్రమం ద్వారా తయారీదారులైన వ్యక్తుల్లో మార్పు తీసుకురావడం జరిగింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి విజయవంతమైంది. అదేవిధంగా నక్సల్స్‌తో పాటు, నక్సల్స్ సానుభూతిపరులుగా ఉన్న నాయకులు సారా తయారీని ప్రోత్సహించకుండా అడ్డుకోవడంతో పాటు తయారీదారులపై ఆంక్షలు సారా తయారీ లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో చేయగలిగారు. అయితే బెల్టు ఊడిపోవడంతో ఆ రంగంపై ఆధారపడ్డవారు తక్కువ శ్రమ, ఎక్కువ రాబడి ఉంటుందన్న అత్యాశతో సారానే అంతిమంగా ఎంచుకున్నారు. సారా తయారీకి నల్లబెల్లం అందుబాటులో లేకపోవడంతో పంచదారలోని రెండోరకం పంచధారను, మొలాసిస్‌ను వినియోగిస్తున్నట్లు తెలిసింది. నల్లబెల్లం కేజీ రూ.100 నుంచి రూ.120 ధర పలుకుతున్నందున రూ.40 లోపు లభ్యమయ్యే రెండో రకం పంచదాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సంపాదన అంతా తాగుడికే వ్యవసాయ పనులు ముమ్మరమైన నేపథ్యంలో కూలీకి వెళుతున్న వారంతా సంపాదిస్తున్న సొమ్ములు మొత్తం తాగుడికే ఫణంగా పెడుతున్నారు. ఇచ్చే నాలుగు వందల రూపాయలను సారాను కొనుగోలు చేస్తూ ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. సారా తాగి ప్రాణాలు కోల్పోతున్న మందుబాబులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. – చింతా శ్రీదేవి, బట్రాజుల అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కలిసికట్టుగా రూపుమాపుతాం ఏజెన్సీలో సారా తయారీని గిరిజనులు, గిరిజనులకు అండగా నిలుస్తున్న సంఘాలు అడ్డుకోగా, అందుకు విరుద్ధంగా మైదాన ప్రాంతాల్లో సారా బట్టీలు కొనసాగుతుండటం విచారించదగ్గ అంశం. మహిళలు కలిసికట్టుగా సారా తయారీ కేంద్రాలను రూపుమాపాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రజాసంఘాలు మాకు మద్దతు ఇవ్వాలి. – తోట కృపామణి, వైఎస్సార్ సీపీ మహిళావిభాగం నాయకురాలు, యర్రంపేట -
సరిహద్దు పల్లెల్లో కనిపించని ‘నవోదయం’
గిరిజన, సరిహద్దు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పిస్తాం.. యువతకు ఉద్యోగాలు ఇస్తాం.. రుణాలు మంజూరు చేసి ఆర్థిక ఆసరా కల్పిస్తాం.. సారా తయా రీ పనుల్లోనుంచి విముక్తి కల్పిస్తాం.. వారి బతుకుల్లో ‘నవోదయం’ కల్పిస్తామన్న పాలకుల హామీలు, అధికారుల ప్రకటనలు ఆచరణ శూన్యమయ్యాయి. సారా తయారీ నుంచి దూరం చేయలేకపోయాయి. ఫలితం.. జిల్లాలో నాటుసారా తయారీ ఆరునెలలుగా ఊపందుకుంది. ఎక్సైజ్ అధికారుల దాడులు పెరగడం, కేసులు నమోదు సంఖ్యే దీనికి నిలువెత్తు సాక్ష్యం. తెలుగుదేశం ప్రభుత్వం ఏ పథకాన్నీ, ఏ పనినీ సక్రమంగా అమలు చేయదని, ఉత్తుత్తి ప్రకటనలతో కాలక్షేపం చేస్తోందని, సారాతో జీవితాలు ఛిద్రమవుతున్నాయంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు. విజయనగరం రూరల్: సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని 2016 ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. కార్యక్రమం ప్రారంభ సమయంలో జిల్లాను 2017 ఏప్రిల్ నెలాఖరు నాటికి సారా రహిత జిల్లాగా తీర్చుదిద్దుతామని ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శా ఖ అధికారులు ప్రకటించారు. ఏడాదిన్నర గడిచినా నాటుసారా తయారీ జిల్లాలో ఆగడం లేదు. దీనికి ఎక్సైజ్ అధికారుల దాడుల్లో సారా బట్టీలు వెలుగుచూడడం, కేసులు అధికంగా నమోదవుతుండడమే నిదర్శనం. జిల్లాలో నాటుసారా ఎక్కువుగా తయారు చేసే 80 గ్రామాలను గుర్తించారు. వీటిని ఏ,బీ,సీ విభా గాలుగా విడదీసి మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో నవోదయం కార్యక్రమంపై విస్త్రత ప్రచారం చేశారు. సారా తయారీ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో సారాబట్టీలపై దాడులు నిర్వహించి సారా తయారీ, సారా సరఫ రాను ఎక్సైజ్ అధికారులు అడ్డుకుంటున్నారు. 2017 వరకు జిల్లాలో సుమారు 300కు పైగా గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. నవోదయం ప్రారంభమైన మొదట్లో 210 మందిపై ముం దస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. నేర చరితగల 95 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ గ్రామ సభలు, ప్రతీ శనివారం నవోదయం కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పటివరకు వందశాతం సారారహిత గ్రామాలుగాతీర్చిదిద్దామని అధికారులు చెబుతున్నా వాస్తవంలో ఇప్పటికీ అనేక గ్రామాల్లో నాటుసారా తయారవుతున్నట్టు ఎక్సైజ్ అధికారుల దాడులతో తేటతెల్లం అవుతోంది. ఉపాధి ఏదీ? అధికారులు సారా తయారు చేస్తున్న 80 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వారిని తయారీకి దూరంగా ఉంటే ఉపాధికి ప్రభుత్వం నుంచి రుణాలు మంజూరు చేయిస్తామని చెప్పి హామీలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సారా తయారీకి దూరంగా ఉండాలని చెప్పారు. దీంతో ఏడాది పాటు వారు సారా తయారీకి దూరంగానే ఉన్నారు. అయితే, అధి కారులు వారికి ఉపాధి కల్పనకు ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తామని చెప్పిన హామీని నెరవేర్చకపోవడంతో వారు ఉపాధి లేక కుటుంబాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ రుణాలు అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే మంజూరు చేయడంతో ఎక్సైజ్ అధికారులు చేతులెత్తేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సారా తయారీవైపు ఆయా గ్రామాల ప్రజలు మొగ్గుచూపారు. ఫలితం.. గత ఆరు నెలలుగా జిల్లాలో నాటు సారా తయారీ ఊపందుకుంది. దీనికి నిదర్శనంగా 2018 జనవరి నుంచి ఇప్పటివరకు 328 కేసులు 382 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే, 10,700 లీటర్లకు పైగా నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 55 వేలకు పైగా బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతీ శనివారం గుర్తించిన గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడంలేదని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం. ప్రజల భాగస్వామ్యం అవసరం సంపూర్ణ సారా రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. నాటుసారా తయారీ, అమ్మకం, సరఫరా చేస్తే నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ నియంత్రణకు కృషి చేస్తున్నాం. అలాగే, ఒడిశా రాష్ట్ర సరిహద్దు మండలాలు పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, బొద్దిడి గ్రామాల్లో ఒడిశాకు చెందిన సారా తయారీ ముఠాలు జిల్లాలోకి అక్రమంగా సారా ప్యాకెట్లు సరఫరా చేసి గిరిజనలుతో అమ్మకాలు సాగిస్తున్నాయి. పార్వతీపురం, కురుపాం స్టేషన్ల పరిధిలో నాటుసారా కొంతవరకు తయారవుతున్నా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి అరికడుతున్నాం. సారా తయారీదారులపై అవగాహన కల్పిస్తున్నాం. నెల్లిమర్ల, కొత్తవలస, ఎస్.కోట సర్కిల్ పరిధిలో నాలుగైదు గ్రామాల్లో కొంతమంది సారా తయారుచేస్తున్నా వారిని నియంత్రించి కేసులు నమోదు చేస్తున్నాం. అయితే, రుణాల మంజూరుకు సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నాం. – ఎ.శంభూప్రసాద్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, విజయనగరం -
ఊరూరా సారా కిక్కు
చీరాల: ‘‘జిల్లాలో నాటు సారా తయారీ, అమ్మకాలు లేవు. ఎక్కడా సారా ఆచూకీ లేదు. ఎక్సైజ్ అధికారుల పనితీరు భేష్. సారా రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటిస్తున్నాం’’ అని అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. కానీ చీరాలతో పాటు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో జోరుగా సారా తయారు చేయడంతో పాటు విక్రయిస్తున్నారు. జిల్లాలో నాటు సారా లభించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు చీరాలకు మరో పేరు క్షీరపురి. అంటే ఒకప్పుడు పాడిపరిశ్రమతో పాలవెల్లువ కనిపించేపరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ స్థానంలో సారా వెల్లువగా మారింది. చీరాల ప్రాంతంలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాల వారే. కాయకష్టం చేసుకుని బతుకులు సాగిస్తుంటారు. పని ఒత్తిళ్లు, మరో ఇతర కారణాల వలన మద్యం మత్తుకు ఎక్కువ మంది బానిసలవుతున్నారు. కూలీ, నాలీ చేసుకుని బతికే ఈ వర్గాలు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థోమత లేక ప్రత్యామ్నాయ మార్గంగా సారా వైపు మళ్లారు. దీంతో కొన్నేళ్లుగా చీరాల ప్రాంతంలో సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరంలో అంటే ఐదు కిలోమీటర్లలోపే గుంటూరు జిల్లా స్టువర్టుపురం మందుబాబులతో కోలాహలంగా ఉంటుంది. కడుపునిండా తాగి తమతో కలిసి మద్యం తాగే వారికి పార్శిల్ రూపంలో కొనుగోలు చేసి రైళ్లలో రోజూ తెస్తుంటారు. వేటపాలెం, పందిళ్లపల్లి, జాండ్రపేట, రామకృష్ణాపురం, చీరాల, ఈపూరుపాలెంతో పాటు చినగంజాం, పలు ప్రాంతాల నుంచి రోజూ స్టువర్టుపురం వెళ్లి సారా తాగి వెంట కూడా తెచ్చుకోవటం నిత్యకృత్యం. సారా రహిత జిల్లా ఎక్కడ మంత్రివర్యా..? జిల్లాలో నాటుసారా ఊసేలేదని మంత్రి ప్రకటించిన సంత్సరన్నర కాలం నుంచి ఎక్కడా సారా నిలుపుదల కాలేదు. జిల్లాలోని చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటుగా మారుమూల తాండాల్లో కొందరు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారంటే సారా అమ్మకాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్ కాలనీకి చెందిన కొందరు స్టువర్టుపురంలో కాచే సారాను ఐదు లీటర్ల క్యాన్ రూ.400 కొనుగోలు చేసి, మందుబాబులకు గ్లాస్ రూ.10, క్వార్టర్ రూ.20–రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. అందులోనూ మొదటి క్వాలిటీ, రెండవ క్వాలిటీని బట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రధానంగా కూలీ పనులు చేసుకుని బతికే కాలనీవాసులకు అందుబాటులో సారా విక్రయాలకు అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఇదిలా ఉంటే చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణరోడ్డు, జాలమ్మగుడి, ఉజిలీపేట, శృంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్ సమీపంలో కూడా సారా విక్రయాలు రోజూ భారీ స్థాయిలో జరుగుతుంటాయి. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు... నాటుసారా వ్యవహారాన్ని స్థానిక పోలీసులు గానీ, ఎక్సైజ్ పోలీసులు గానీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. స్టువర్టుపురం నుంచి చీరాలకు ఆటోలు, టూవీలర్స్లలో నేరుగా చీరాలకు తరలిస్తుంటారు. అయితే ఈపూరుపాలెం రోడ్డు పక్కనే రూరల్ పోలీస్‌స్టేషన్ అనేది ఒకటుంటుంది. కానీ అక్కడ తనిఖీల తంతుకానీ, కనీసం నిఘా కానీ ఉండదు. పోలీస్‌స్టేషన్ దాటుకుని నేరుగా ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలకు నాటుసారా తరలిస్తున్నా స్థానిక పోలీసులు సారా పట్టుకుంటే మనకేమి వస్తుందిలే అనుకున్నారేమో గానీ వారి జోలికి అస్సలు వెళ్లరు. ఎక్సైజ్ పోలీసుల పరిస్థితైతే మరీ దారుణం. వారికి సారా సామ్రాట్లు అంటే మహా భయం. ఎక్సైజ్ పోలీసులపై సారా అమ్మే మాజీ నేరస్తులు పలుమార్లు దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు చీరాల్లో అనేకం ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సబ్‌డివిజన్ టాస్క్‌ఫోర్స్ ఉన్నప్పటికీ వారు సారా నియంత్రించటంలో నామమాత్రంగా కూడా దృష్టి పెట్టడం లేదు. స్థానికంగా కూడా తయారీ.. గతంలో కేవలం స్టువర్టుపురంలో సారా తయారై చీరాలకు అక్రమ రవాణా జరుగుతుండేది. కానీ సారాకు డిమాండ్ పెరగటంతో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ పక్కన, రామ్‌నగర్ గ్యాంగిలో, మత్య్సకార గ్రామమైన వాడరేవులో, విజిలీపేట, జాలమ్మగుడి, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద, జవహర్ నగర్ ప్రాంతాల్లో కాపుసారా అమ్మకాలకు నిలయంగా మారింది. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని సారా నియంత్రణకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేటు వ్యక్తులు సారా అమ్మకందారులతో చేతుల కలపడంతో సారా పరవళ్లు తొక్కుతోంది. కాపు సారా తయారీకి అధిక మోతాదులో మిరపకాయలు, యూరియా, బ్యాటరీ పౌడర్‌తో పాటు ఇతర హానికరమైన విష పదార్థాలను కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు చొరవచూపి సారా మహమ్మారిని చీరాల ప్రాంతం నుంచి తరిమికొట్టాలని ప్రజలు కోరుతున్నారు. సారా నియంత్రణకు దాడులు చేపడుతున్నాం జిల్లాలో నాటుసారా తయారీ, అమ్మకాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. వారంలో ఒకరోజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నాం. సారా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. చీరాల ప్రాంతంలో ఇటీవల మాజీ నేరస్తులు 28 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రత్యేక బృందాలు, ఆయా పోలీస్స్టేషన్లలోని సీఐలు, ఎస్సైలు రోజువారీ తనిఖీలు, దాడులు చేస్తున్నారు.–పి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఈఎస్, ఒంగోలు. -
కనిపిస్తే దాడులే..!
చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై చేయి వేయాలంటేనే ఎవరైనా ఆలోచిస్తారు. అలాంటిది ఓ సీఐపై సారా కాస్తున్న వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారంటే వారి వెనుక బలమైన రాజకీయ నేతలు ఉండాలి. అవును.. సారా కాస్తున్న వారికి, సారాను అమ్మే వారికి, సారా రవాణా చేసే వారికి అధికార పార్టీ నాయకులు అండగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కొందరు టీడీపీ నేతలు వాళ్ల ఉనికిని చాటుకోవడానికి నిరక్ష్యరాస్యుల్ని పావులుగా చేసుకుని సారా సామ్రాజ్యానికి అధిపతులుగా రాణిస్తున్నారు. హడలెత్తిస్తున్న రాసనపల్లె చిత్తూరు తమిళనాడుకు సరిహద్దు కావడంతో గుడిపాల, పాలసముద్రం, ఎస్ఆర్.పురం, గంగాధరనెల్లూరు, పిచ్చాటూరు, సత్యవేడు, నగరి ప్రాంతాల్లో నాటుసారాను తయారు చేయడమే వృత్తిగా కొందరు ఎంచుకున్నారు. అన్నింటికంటే గుడిపాల మండలంలోని రాసపల్లె పేరు చెబితే పోలీసులు సైతం భయపడి వెనకడుకు వేసే పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలకు వెళుతున్న వారితో పాటు నాటుసారా తయారీని ప్రవృత్తిగా ఎంచుకున్న వారు సైతం ఉన్నారు. పక్కనే ఉన్న అటవీశాఖ భూముల్లో ఇష్టానుసారం సారా తయారు చేసి తమిళనాడు, కర్ణాటకతో పాటు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాసనపల్లెలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులను ఏ మాత్రం లెక్కచేయకుండా సారాజులు దాడులకు దిగడం పరిపాటిగా మారింది. ఇలాంటివెన్నో.. సారా వ్యాపారుల దాడులతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఫలితంగా చిత్తూరు లాంటి ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడంలేదు. గతేడాది అక్టోబర్‌లో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులపై సారా వ్యాపారులు దాడి చేశారు. 2016 ఏప్రిల్ 30న చిత్తూరు ఎక్సైజ్ అర్బన్ సీఐ గోపీకృష్ణపై దాడి చేసి సుమో అద్దాలను ధ్వంసం చేసి తమ ప్రాంతంకు రావొద్దంటూ హెచ్చరించారు. 2015 డిసెంబరులో చిత్తూరు నగరంలోని మూడో గేటు వద్ద సైతం గోపీకృష్ణపై సారా వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు. తాజాగా దాడి చేసి చితకబాదారు. అధికారుల మౌనం.. సారా వ్యాపారులు ఎక్సైజ్ పోలీసులపై దాడి చేస్తున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. ఓ వ్యక్తి తరచూ నేరాలకు పాల్పడుతుంటే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు పెట్టొచ్చు. అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతున్న ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు పీడీ యాక్టుపై వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో 38 మంది సారా వ్యాపారులపై పీడీ యాక్టు పెట్టాలనే ప్రతిపాదన మూడేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. సంబంధిత ఫైలు కలెక్టర్ వద్దకు వెళ్లకుండా చిత్తూరుకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు. దీంతో దాడులు పునరావృతమయ్యాయి. ‘ఈయన పేరు గోపీకృష్ణ. చిత్తూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అర్బన్ సీఐ. సారా ఊటల్ని ధ్వంసం చేయడానికి వెళ్లిన ఈయనపై రాళ్లతో దాడి చేశారు. ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని రక్తగాయాలతో సిబ్బందితో కలిసి పారిపోయి ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడ్డ వారిలో ఓ మహిళా కానిస్టేబుల్‌కు పక్కటెముకలు విరిగిగాయి. ఇదెక్కడో మారుమూల ప్రాతంలో జరిగింది కాదు. చిత్తూరు నుంచి పది కి.మీ దూరంలో ఉన్న రాసనపల్లెలో బుధవారం జరిగిన ఘటన.’ -
ఎక్సైజ్ అధికారుల దాడులు
బొంరాస్‌పేట(కొడంగల్): ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీ కేంద్రంపై దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని వడిచర్ల అనుబంధ ఊరిముందలి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. తండాలో నాటుసారా తయారీ, అమ్మకంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సీఐ చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ ధన్వంత్‌రెడ్డి సిబ్బందితో కలిసి తండాలో దాడులు నిర్వహించారు. తండాకు చెందిన ముఢావత్ చందు, ముఢావత్ మోహణ్, శివ, దేవమ్మ, లక్షిబాయి, నాన్యనాయక్ నుంచి సారా తయారీ సామగ్రి లభించింది. 13 లీటర్ల ఐడీ, డిట్రాయిడ్, 100 లీటర్ల షుగర్వాష్ను ధ్వంసం చేశారు. ఈమేరకు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఫొటో: సచిన్ కూతురితో జాన్వీ బాయ్‌ఫ్రెండ్!
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఎంటరవ్వకముందే.. మీడియాలో డామినేట్ చేస్తోంది. ఆమె తొలిచిత్రం ఏమిటన్నదానిపై గానీ, ఆమె ప్రేమ కబుర్లు గురించి గానీ బాలీవుడ్ మీడియాలో రూమర్స్‌కు కొదువలేదు. ఇక ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముంబైలో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, జట్టు యజమాని అనిల్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీతోపాటు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీకి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా వచ్చింది. దీంతో సహజంగానే ఆమె ప్రియుడిగా భావిస్తున్న శిఖర్ పహరియా కూడా వచ్చాడు. అయితే, పార్టీలో శిఖర్ జాన్వీ కపూర్‌తో కాకుండా సచిన్ టెండూల్కర్ కూతురు సరాతో ఫొటోలకు పోజ్ ఇస్తూ సరదాగా కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సచిన్ గారాల పట్టి సరా ఇటీవల తన అభిమాన నటుడు రణ్‌బీర్ సింగ్‌తో ఫొటో దిగిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాదు.. ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుందన్న కథనాలకూ కారణమైంది. అయితే, సరా ఇప్పుడు బాగా చదువుకుంటున్నదని, ఆమె సినిమాల్లోకి రాదని సచిన్ క్లారిటీ ఇచ్చారు. ఇక శ్రీదేవి-బోనీ కపూర్ గారాలపట్టి జాన్వీ కపూర్‌ను త్వరలోనే దర్శకుడు కరణ్ జోహర్ బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. మరాఠీ బ్లాక్ బస్టర్ ’సైరత్’ రీమేక్‌తో జాన్వీ బాలీవుడ్లో అడుగుపెట్టనుందని వినిపిస్తోంది. -
గుప్పుమంటున్న నాటు సారా
తోటల్లో జోరుగా తయారీ వివిధ ప్రాంతాలకు ఎగుమతి పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు తొండంగి (తుని) : మండల పరిధిలోని వివిధ గ్రామాల సమీపంలోని జీడిమామిడి తోటల్లో నాటు సారా విచ్చలవిడిగా తయారు చేస్తూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా పీఈ చిన్నాయపాలెం, బెండపూడి, రావికంపాడు, కొమ్మనాపల్లి, సీతారాంపురం, పైడికొండ, ఆనూరు, ఎ.కొత్తపల్లి, గోపాపట్నం తదితర గ్రామాల పరిసరాల్లో కొండ ప్రాంతాలు, మామిడి, జీడితోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తోట మాటున భారీ ఎత్తున బెల్లపు ఊటలను పులియబెట్టి నాటు సారా కాస్తున్నారు. అక్కడి నుంచి ప్లాస్టిక్ క్యాన్ల ద్వారా మండలంలోని గ్రామాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాత్రి వేళల్లో రహస్యంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం రూ.10, రూ.20లకే మంచి కిక్కిచ్చే నాటు సారా లభిస్తుండడంతో వ్యవసాయ కూలీలు మద్యానికి బానిసలై ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. నాటు సారా వల్ల తమ కుటుంబాలు, జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని బాధిత మహిళలు వాపోతున్నారు. నాటు సారాతో ఆరోగ్యానికి ముప్పు నల్ల బెల్లం, అమ్మోనియా, నికిల్, లెడ్ మిశ్రమం, బ్యాటరీ పౌడర్‌ను నీటిలో కలిపి పులియబెడతారు. సుమారు మూడు రోజుల పాటు పులియబెట్టిన ఆ ఊటను పొయ్యిపై పెట్టి మరగబెట్టడం ద్వారా వచ్చే ఆవిరిని పడతారు. ఆ ఆవిరి ద్రావణంగా మారి నాటు సారా తయారవుతుంది. తక్కువ ధరకే ఇది లభిస్తుండడంతో వ్యవసాయ కూలీలు, పేదలు దీన్ని తాగుతున్నారు. ఉత్సవాలు, జాతరలు, ఇతర కార్యక్రమాల్లో నాటు సారా ఏరులై ప్రవహిస్తోంది. బ్రాందీ షాపుల్లో లభించే మద్యం కన్నా ఇది బాగా తక్కువ ధరకు లభించడంతో పాటు ఎక్కువ మత్తు ఇస్తుండడంతో మద్యానికి బానిసలైన పేదలు నాటుసారా తాగేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. దీని తయారీలో కలిపే ప్రాణాంతక పదార్థాల వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, మొదడులోని నాడీ వ్యవస్థ ఇతర అవయవాలపై ప్రభావం చూపడంతో కొంతకాలానికి అనారోగ్యానికి గురై మరణిస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా నాటు సారా తయారు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీ మామూళ్ల వల్లే వారు ఇటువైపు తొంగి చూడ్డం లేదన్న ఆరోపణలు వినిపిన్నాయి. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి నాటు సారా తయారీని నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు తమ గ్రామం నాటు సారా వాసనతో గుప్పుమంటోందని పీఈ చిన్నాయపాలెం గ్రామానికి చెందిన పి.విజయమ్మ తెలిపారు. రాత్రి వేళల్లో తోటల్లో నాటు సారా తయారు చేస్తున్నారని, దీన్ని తక్షణం నిరోధించాలని తుని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు. -
కానరాని నవోదయం
వెల్లువెత్తుతున్న నాటుసారా ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో తయారీ రాజమహేంద్రవరంలో విచ్చలవిడిగా అమ్మకాలు ఎక్సైజ్ శాఖ దాడులు చేస్తున్నా బెదరని తయరీదారులు సాక్షి, రాజమహేంద్రవరం : ఏజెన్సీ, మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా నాటుసారా వెల్లువెత్తుతోంది. సారా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ‘నవోదయం’ పేరుతో అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఎక్కడా ఫలితాలనివ్వడంలేదు. నాటుసారాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు పలు చర్యలు చేపడుతున్నా, కేసులు నమోదు చేస్తున్నా తయారీదారులు ఎక్కడా బెదరడంలేదు. అధికారుల కన్నుగప్పి ఎప్పటికప్పుడు తయారీ కేంద్రాలను మారుస్తున్నారు. విచ్చలవిడిగా నాటుసారా తయారు చేస్తున్నారు. అక్కడ తయారు చేసిన నాటుసారా పల్లెలు, పట్టణాలు, నగరాలను ముంచెత్తుతోంది. బడ్డీకొట్లు, నివాస గృహాలు నాటుసారా విక్రయ కేంద్రాలుగా మారాయి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి నిఘాలో ఈ వ్యవహారం తెటతెల్లమైంది. ‘సాక్షి’ నిఘా విభాగం రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో విక్రయకేంద్రాలను పరిశీలించింది. కొంత మంది విక్రయదారులు ఈ విషయం పసిగట్టి తమ వద్ద సరుకు అయిపోయిందని చెప్పగా, మరి కొంతమంది నగదు తీసుకున్న తర్వాత అనుమానం వచ్చి సరుకు అయిపోయిందని, వచ్చేందుకు అరగంట పడుతుందని నగదు తిరిగి ఇచ్చేశారు. పలు దుకాణాల్లో నాటుసారాను ప్యాకెట్లుగా కట్టి పార్శిల్ ఇచ్చారు. రూ.10, రూ.20 చొప్పున నా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఓ మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. తోటలు, లంకల్లో తయారీ ప్రయాణానికి అనువుగాలేని మారుమూలన ఉన్న తోటలు, గోదావరి లంకల్లో బట్టీలు ఏర్పాటు చేసి నాటుసారా తయారు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని వెంకటనగరం, పిడింగొయ్యి, కవలగొయ్యి, రాజానగరం మండలంలో శ్రీరాంపురం, రఘునాథపురం, రాధేయపాలం తోటలు, గోదావరిలో ఉన్న కేతవారిలంక, బ్రిడ్జిలంక తదితర ప్రాంతాల్లో నాటు సారా విచ్చలవిడిగా కాస్తున్నారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఆటోలల్లో రవాణా చేస్తున్నారు. నగరంలోకి... వెంకటనగరం, పిడింగొయ్యి, కవలగొయ్యి ప్రాంతాల్లో తయారు చేసిన నాటుసారా రాజమహేంద్రవరం నగరానికి చేరుస్తున్నారు. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సారా ఎక్కువగా విక్రయిస్తున్నారు. నగరంలోని క్వారీ మార్కెట్, ఆనంద్‌నగర్, గాదిరెడ్డి నగర్, అన్నపూర్ణమ్మపేట తదితర ప్రాంతాల్లో వీధి వీధిలో విక్రయ కేంద్రాలు ఉన్నాయి. వీరు నగరంలోని స్టాక్ పాయింట్ల నుంచి ప్లాస్టిక్ టిన్నుల్లో సారా తెచ్చి విక్రయిస్తున్నారు. అక్కడ తాగే వారికి గ్లాసు రూ.10ల చొప్పన విక్రయిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి అమ్ముతున్నారు. బలవుతున్న పేదలు నాటు సారాకు ఎక్కువగా పేదలు బలవుతున్నారు. కూలిపని చేసుకునే వారు తమ రోజు వారీ సంపాదన అధిక భాగం నాటు సారాకే ఖర్చు చేస్తున్నారు. నిత్యం ఈ సారా తాగి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరో వైపు మద్యం మత్తులో గొడవలు పడి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. చర్యలు చేపడుతున్నా ఫలితం శూన్యం సారా తయారు చేయడం, నిల్వ ఉంచడం, అమ్మకాలు చేసే ప్రాంతాలను అధికారులు ఏ, బీ, సీలుగా విభజించారు. సారా వల్ల కలిగే దుష్ఫలితాలపై ఆయా ప్రాంతాల్లో కళాజాతాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఏ,బీ,సీ ప్రాంతాలను దత్తత తీసుకున్నారు. ఆయా ప్రాంతాలపై నిరంతరం నిఘా పెట్టారు. రాజమహేంద్రవరం, పెద్దాపురం ప్రాంతాల్లో సారా కాస్తున్న ఇద్దరిపై అబ్కారీశాఖ అధికారులు పీడీ యాక్డులు ప్రయోగించి జైలుకు తరలించారు. ‘నవోదయం’ పేరుతో నాటుసారా కాసేవారికి, తాగేవారికి అవగాహన కల్పించాం. 110 సీఆర్పీసీతో పాటు పీడీ చట్టం ప్రయోగించాం. గ్రామాల్లో 80 శాతం వరకూ నాటుసారా అమ్మకాలు తగ్గాయి. రాజమహేంద్రవరం నగరం భౌగోళిక పరంగా నేరగాళ్లకు అనుకూలంగా ఉంది. లంకలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మేము దాడుల చేస్తున్నా నాటుసారా కాసేవాళ్లు ఎప్పటికప్పుడు స్థావరాలు మారుస్తున్నారు. సారా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటాం. – లక్షీ్మకాంత్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం -
మత్తు దించుతాం
► సారా తయారీఅడ్డుకట్టకు సన్నాహాలు ► గంజాయి సాగు నిరోధానికి కార్యాచరణ ► డిఫెన్స్, విదేశీ మద్యంఅక్రమ నిల్వలపై దాడులు ► ‘సాక్షి’తో ఎక్సైజ్ డీసీ గోపాలకృష్ణ సాక్షి: తెలంగాణ నుంచి ఆంధ్ర కేడర్‌కు రావడం ఎలా ఉంది? డీసీ: ఆంధ్ర నా సొంత ప్రాంతం. విశాఖలో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుంది. సాక్షి: జిల్లాలో సారా జోరు ఎక్కువగా ఉంది...? డీసీ: అవును. బాధ్యతలు చేపట్టగానే తొలుత సారాను అరికట్టే అంశాన్నే తీసుకున్నాను. రాష్ర్ట ప్రభుత్వం దీని నియంత్రణకు ‘నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో సారా తయారీని అడ్డుకుంటాం. ము ఖ్యంగా అనకాపల్లి డివిజన్లో 243 గ్రామాల్లో సారా తయారు చేస్తున్నట్టు గుర్తిం చాం. 22 గ్రామాల్లో ఉధృతంగా ఉంది. అంచెలంచెలుగా దాడులు చేపడతాం. సాక్షి: గంజాయి సాగు, అక్రమ రవాణాకు విశాఖ ఏజెన్సీ ప్రధాన కేంద్రంగా మారిందనే వాదన ఉంది? డీసీ: సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సాగయ్యే గంజాయికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఏజెన్సీలో గంజాయి సాగు విస్తరించింది. వరంగల్ వంటి తెలంగాణ జిల్లాల్లోనే ఉండే గంజాయి సాగు జిల్లాకు విస్తరించడానికి కూడా ఇదే కారణం. దీని రవాణాను ఎంతగా అడ్డుకున్నా అది తక్కువే అవుతుంది. పంట సాగును నిరోధిస్తేనే ఫలితం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ఇక్కడికి వచ్చి గిరిజనుల చేత పండిస్తున్నారు. వారిని పట్టుకోవాలి. ముఖ్యంగా పంట వేయకుండా ఉండాలంటే గిరిజనులకు గంజాయి విత్తనాలు దొరక్కుండా చేయాలి. ఇందుకు పోలీస్, ఫారెస్ట్, ఐటిడీఎ, ఎక్సైజ్ శాఖలో సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. మే నుంచి కొత్త పంట సాగు ప్రారంభమవుతుంది. ఈలోగా అన్ని విభాగా సమన్వయంతో అడ్డుకోవడానికి కార్యాచరణ మొదలుపెడతాం. సాక్షి: మద్యం దుకాణాలు నిబంధనలు పాటించేలా తీసుకుంటున్న చర్యలేమిటి? డీసీ: లెసైన్స్ కలిగిన మద్యం షాపులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నాం. అయితే అది తక్కువగా ఉంటోంది. జరిమానా మొత్తాన్ని పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఎక్కువ జరిమానా పడుతుందంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాం. అదే విధంగా విదేశీ, డిఫెన్స్ మద్యం అక్రమ నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి. డిఫెన్స్ మద్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని బ్రాండ్ల విదేశీ మద్యాన్ని మా ఏపీపీసీఎల్లో అందిస్తున్నాం. -
ఎక్సైజ్ సిబ్బందిని అడ్డుకున్న టీడీపీ నాయకులు
చాట్రాయి : కాపు సారా అమ్ముతున్నారన్న కారణంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బందిని స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్న సంఘటన. మండలంలోని పోలవరం గ్రామంలో బుధవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు కాపుసారా అమ్మకాలపై దాడులు నిర్వహించారు. గ్రామంలో ఇద్దరు మహిళలను వెంట బెట్టుకుని తమ్మిలేరు వాగువద్ద ఉన్న బెల్లం ఊట వద్దకు వెళ్లారు. ఈ ఊట మీదేనని మీ మీద కేసు నమోదు చేస్తామని చెప్పి విస్సన్నపేటకు జీపులో తీసుకొస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు వచ్చి సారా అమ్మకాలకు సంబంధంలేని వారిని ఎందుకు తీసుకెళుతున్నారని ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు, అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తహసీల్దార్ షాకీరున్నీసా బేగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఇద్దరితో చర్చలు జరిపారు. గతంలో వీరు కాపు సారా అమ్మడం వలన ఒకరిని బైండోవరు చేస్తున్నామని తహసీల్దారు చెప్పారు. చర్చల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు సీఐ ఖదీర్, ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనుబాబు, విస్సన్నపేట ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ, పోలవరం సర్పంచ్ ఈదర సత్యనారాయణరాజు, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, జిల్లా పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి మందపాటి బసవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సారా మానకుంటే రేషన్, ఆధార్ కార్డుల రద్దు
సప్పిపుట్టు గ్రామసభలో సబ్‌కలెక్టర్ శివశంకర్ పాడేరు రూరల్: సారా తయారీ, అమ్మకాలు, తాగడం ఆపేయాలి..లేకుంటే కఠినమైన చర్యలు ఉంటాయి.. రేషన్, ఆధార్ కార్డులు రద్దు చేస్తాం.. ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తాం అని సబ్ కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. పాడేరు రూరల్ మండలంలోని వంతాడపల్లి పంచాయతీలో సారా ప్రభావిత గ్రామమైన సప్పిపుట్టులో శుక్రవారం సారా నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. సారాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందన్నారు. సారాకు దూరంగా ఉంటే ప్రత్యామ్నయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న 50 ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. జలసిరి పథకం కింద ప్రత్యేకంగా బోర్లు ఏర్పాటు చేసి భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తామన్నారు. తర్వాత గ్రామస్తులు తమ సమస్యలను సబ్ కలెక్టర్‌కు విన్నవించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని శివశంకర్ చెప్పారు. గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయురాలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు సబ్ కలెక్టర్ చెప్పారు. అనంతరం గ్రామస్తులతో సారా తయారీకి దూరంగా ఉంటామని.. సారా తాగం అని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, తహశీల్దార్ ఆది మహేశ్వరరావు, సర్పంచ్ మర్రి వెంకటరావు, వీఆర్వో కనకరత్నం, సెక్రటరీ సురేష్, టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు బొర్రా నాగరాజు పాల్గొన్నారు. -
‘ఎక్సైజ్’ ఎక్సర్సైజ్ !
సారా అంతానికి కసరత్తు సారా త యారవుతున్న గ్రామాలు 241 ఏ క్లాస్ సెంటర్లు 37, బీ క్లాస్ సెంటర్లు 58, సీ క్లాస్ సెంటర్లు 145 తయారీ మానకపోతే పీడీ యాక్టుల నమోదు ఇప్పటికే 400 మందిపై బైండోవర్ కేసులు ఏప్రిల్ నాటికి సారా రహిత జిల్లా చేస్తామంటున్న ఎక్సైజ్ శాఖ చిత్తూరు: జిల్లాలో నాటుసారా కనిపించకుండా చేయాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. సారా తయారీదారులపై పీడీ యాక్టు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సారా తయారీ గ్రామాలు, తయారీదారుల జాబితాలను ఆ శాఖ సిద్ధం చేసింది. 400 మంది సారా తయారీదారులపై లక్ష రూపాయల పూచీకత్తుతో బైండోవర్ కేసులు కూడా నమో దు చేసింది. నవోదయం కార్యక్రమం పేరుతో చిత్తూరును సారా రహిత జిల్లా చేయాలని ఎక్సైజ్ శాఖ సంకల్పించింది. ఫిబ్రవరి 1 నుంచే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. తొలుత సారా తయారీ కేంద్రాలు, తయారీదారులను గుర్తించారు. వీటిని ఏ,బీ,సీలుగా విభజించారు. జిల్లా వ్యాప్తంగా ఏ- క్లాస్ సారా తయారీ కేంద్రాలు 37 ఉండగా, 59 బీ-క్లాస్, 145 సీ - క్లాస్ తయారీ కేంద్రాలున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో సారా తయారీ కేంద్రాలు అధికంగా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి జిల్లాలో నాటుసారా లేకుండా చేయాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. తొలుత నాటుసారా తయారీ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. పోలీసు, రెవెన్యూ, న్యాయ విభాగాలతోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి చైతన్యకార్యక్రమాలు నిర్వహించనున్నారు. సారా తయారీ వల్ల నష్టాలు, కష్టాలు వివరించడంతో పాటు తయారీ నేరమనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ తొలి విడత దాడులు నిర్వహించనుంది. రెండుమార్లు పట్టుబడిన సారా తయారీదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయనున్నారు. మరోవైపు సారా రహిత చిత్తూరు జిల్లా చేయాలని కలెక్టర్ పలువురు అధికారులతో స్టడీ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో న్యాయమూర్తి, తహశీల్దార్, షుగర్ కేన్ కమిషనర్, మార్కెఫెడ్ ఎండీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు. కుప్పంతో పాటు పలు నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ ముఖ్య నేతలే నాటుసారా తయారీలో కీలక భూమిక పోషిస్తున్న విషయం అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. నాటుసారా తయారీకి ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకట్ట వేయాలని, అవసరమైతే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి జిల్లా కలెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాటుసారా తయారీకి నల్లబెల్లం అధికంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో బెల్లాన్ని నాటుసారా వ్యాపారులు కాకుండా ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ షుగర్ కేన్, మార్కెఫెడ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి చిత్తూరును సారా రహిత జిల్లాగా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎక్సైజ్ శాఖ డీసీ సత్యప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. తయారీ ఆపకపోతే పీడీ యాక్టులు తప్పవన్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని జైపూర్ మండంలో సోదాలు జరిపిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టిన అధికారులు 40 కిలోల పటిక, 30 లీటర్ల నాటుసారా, 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. వీటితో పాటు 16 బైక్ లను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సారాజ్యం
పల్నాడులో గురువారం ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసిన సారా బట్టీ విక్రయ కేంద్రాలుగా పల్నాడు పల్లెలు పల్నాడు ప్రాంతాన్ని సారా రక్కసి పట్టి పీడిస్తోంది. ఇక్కడి పల్లెలు సారా విక్రయానికి కేంద్రాలుగా మారాయి. గతంలో గుడుంబా వ్యాపారం మూడు ప్యాకెట్లు ఆరు సీసాలుగా సాగేది. మద్యం దుకాణాలు పెరగడం, వాటిలో చీప్ లిక్కర్ అందుబాటులోకి రావడంతో సారాకు డిమాండ్ తగ్గింది. రెండేళ్లుగా మద్యం ధరలు పెరిగాయి. పంటలు సరిగా పండక ప్రజల చేతిలో డబ్బూ లేదు. దీంతో చౌకగా లభించే సారాకు గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గిరాకీ ఏర్పడింది. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. గుంటూరు: మద్యం దుకాణాల్లో అతి తక్కువ ధర ఉన్న చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్‌ను రూ. 70కు అమ్ముతున్నారు. బట్టీల వద్ద సారా ప్యాకెట్ రూ. 10 నుంచి రూ. 15 లకు దొరుకుతోంది. దీంతో కార్మికులు, కూలీలు అధికంగా సారావైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సారా అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నుంచి ఈ నియోజకవర్గాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. తెలంగాణాకు సరిహద్దు జిల్లాగా ఉండటంతోపాటు నల్గొండ, గుంటూరు జిల్లాలకు మధ్య కృష్ణా నది ప్రవహిస్తుండటంతో నాటు పడవల ద్వారా సారాను దర్జాగా జిల్లాకు చేరుస్తున్నారు. దాడులు చేసినా ఫలితం శూన్యం... పల్నాడు నల్లమల అటవీ ప్రాంతానికి, కృష్ణా నదికి పక్కనే ఉండటంతో అనాదిగా ఈ ప్రాంతంలో సారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉండేవి. ఎక్సైజ్ అధికారులు ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా నిష్ర్పయోజనమే. జనసంచారం లేని అటవీ ప్రాంతాలు, కొండలపై తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కొందరు వ్యాపారాన్ని నడిపేవారు. గతంలో సారా వ్యాపారం చేసిన వారంతా మళ్లీ అటు వైపే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారులను నిలదీస్తున్న మందుబాబులు... మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నా మామూళ్లు పుచ్చుకుంటూ చోద్యం చూస్తున్నారంటూ మందుబాబులు ఎక్సైజ్ అధికారులపై మండిపడుతున్నారు. వాటిని అరికట్టలేని మీకు సారా అమ్ముకునే వారిపై కేసులుపేట్టే హక్కు ఎక్కడిదంటూ పలు చోట్ల సిబ్బందిని నిలదీసిన సందర్భాలున్నాయి. అధికారులు చేసే తప్పులకు తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు ఎక్సైజ్ సిబ్బంది తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. జిల్లాలో సారా విక్రయాలు పెరగడానికి పరోక్షంగా ఎక్సైజ్ అధికారులే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సారా విక్రేతలపై కఠిన చర్యలు మాచర్లటౌన్ : ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా సారా వ్యాపారం చేసే వారిపై దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మాచర్ల ఎక్సైజ్ సీఐ టి.లక్ష్మణస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం మద్యం దుకాణాలలో విక్రయాలు చేయాలన్నారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎక్సైజ్‌శాఖకు సహకరించి సారా వివరాలను తెలియపర్చాలని కోరారు -
కొల్లిమలై యువకుడితో బెల్జియం యువతి ప్రేమ పెళ్లి
సేలం: బెల్జియం యువతిని ప్రేమించి కొల్లిమలై అటవీ ప్రాంతానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరి పెళ్లి రిజిస్ట్రేషన్‌కు అధికారులు అంగీకరించ లేదు. నామక్కల్ జిల్లా కొల్లిమలైకు చెందిన సురేష్ గిరిజనుడు. అటవీ ప్రాంతానికి చెందిన సురేష్ కుమార్ విద్యా వంతుడు. హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసి ఇటలీలో ఓ నౌకలో పనిచేస్తున్నాడు. అక్కడ తన సహోద్యోగిగా పనిచేస్తున్న బెల్జియం కు చెందిన సారా(30) ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ నెల పదిహేడున కొల్లి మలైలోని అరపలీశ్వరర్ ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కానీ, పెళ్లికి ఆలయ అధికారులు నిరాకరించారు. సారా విదేశీ యువతి కావడం, ఆమె వద్ద అన్ని రికార్డులు లేని దృష్ట్యా పెళ్లిని నిరాకరించారు. దీంతో వారు మార్గ మధ్యలోని వినాయకుడి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారులు ఒప్పుకోలేదు. గురువారం కొల్లిమలైకు చేరుకున్న కొత్త జంటకు అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. దంపలిద్దరం స్థానికంగా ఉండి వ్యవసాయం చేసుకుంటామని వారు మీడియాకు చెప్పారు. దౌత్య కార్యాలయ అధికారులు కల్పించుకుని తనకు సహాయమందివ్వాలని నవవధువువరులు కోరారు. -
బెల్లం నిల్వల స్వాధీనం
భువనగిరి: నాటుసారా తయారీకి అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్న బెల్లం నిల్వలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి రూరల్ సీఐ తిరుపతి నేతృత్వంలో ఎస్ఐలు సురేష్ బాబు, భిక్షపతి తదితర సిబ్బంది బెల్లం దుకాణాలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గంజ్ మార్కెట్లోని సాయిగణేష్ ట్రేడర్స్ దుకాణంలో అక్రమంగా నిల్వవుంచిన 54 బస్తాల బెల్లం పౌడర్, 76 బెల్లం ముద్దలు, రెండు బస్తాల పటికను స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతి తెలిపారు.