Shot Dead
-
బెయిల్‌పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. -
ఎనిమిదేళ్లలో తొలిసారి కనిపించిన ధ్రువ ఎలుగుబంటి.. పోలీసులు ఏం చేశారంటే!
ఐస్లాండ్లోని ఒక మారుమూల గ్రామంలోని కనిపించిన అరుదైన ధ్రువ ఎలుగుబంటిని స్థానిక ప్రజలకు ముప్పుగా భావించి పోలీసులు కాల్చి చంపారు. అయితే ముందుగా ఎలుగుబంటిని తరలించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విఫలం కావడంతో చంపాల్సి వచ్చందని వెస్ట్ఫ్జోర్డ్స్ పోలీస్ చీఫ్ హెల్గి జెన్సన్ తెలిపారు.ఆ ఎలుగుబంటి ఓ ఇంటికి సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఆ ఇంట్లో ఓ వృద్ధురాలు ఉందని, ఎలుగుబంటినిచూసి ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుందని పేర్కొన్నారు. సాయం కోసం తన కుమార్తెకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని దాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు.ధృవపు ఎలుగుబంట్లు ఐస్లాండ్కు చెందినవి కావు, అయితే కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్లాండ్ నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి. 2016లో ఐస్‌ల్యాండ్‌లో మొదటిసారి కనిపించింది ఇవి 150 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడి చేయడం చాలా అరుదు. 2017లో వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా సముద్రపు మంచు కోల్పోవడం వల్ల ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం ప్రారంభించాయని తెలిపింది. దీని వల్ల మానకులకు ప్రమాదం పెరిగిందని పేర్కొంది. వీటి వల్ల, మానవులకు లేదా పశువులకు ముప్పు కలిగిస్తే అధికారులు వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుది. -
బీహార్‌లో సీపీఐ నేత దారుణ హత్య
అర్వాల్: బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో సీపీఐ(ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీపై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన మార్కెట్ నుండి తన ఇంటికి వెళుతుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అతన్ని అడ్డుకుని, తుపాకీతో కాల్చిచంపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సునీల్ చంద్రవంశీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఈ ఘటన అర్వాల్ జిల్లాలోని కింజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కన్ బిఘా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాతకక్షలే కారణమై ఉంటాయని అన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య
వాషింగ్టన్: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు భారతీయులపై కాల్పులు జరపడంతో వారు మరణించిన ఘటనలు కూడా చూశాం. తాజాగా అకారణంగా భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన వ్యక్తి గావిన్ దసౌర్(29) కొన్నేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో గావిన్.. మెక్సికోకు చెందిన వివియానా జమౌరాతో ఇటీవలే వివాహం జరిగింది. ఈ సందర్భంగా భార్యతో సరదాగా బయటకు వెళుతుండగా.. కారు ప్రమాదం జరిగింది. వెంటనే దసౌర్ తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కారు నుంచి కిందకు దిగాడు. వెనక వాహనంలో ఉన్న డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్ తన దగ్గర ఉన్న తుపాకీతో దసౌర్‌పై కాల్పులు జరిపాడు. మెడకు బుల్లెట్ తగలడంతో దసౌర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. There are lessons here. The guy totally wasted imo. He should gather more data before getting out of the car with the gun. pic.twitter.com/KiNQzj9Z08— Xnews_with_Grok (@Xnews_with_grok) July 19, 2024అనంతరం దసౌర్ను అతడి భార్య ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, నిందితుడిని కోర్టులో హాజరుపరచడంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు నిందితుడు తెలిపాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఇక, దసౌర్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
అమెరికాలోని న్యూజెర్సీలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. న్యూజెర్సీలోని కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ (29) మరణించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ కాల్పుల్లో మరో మహిళ,జస్వీర్ బంధువు గగన్‌దీప్ కౌర్ (20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. నిందితుడు గిల్ నాకోదర్లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్‌లోని నూర్‌మహల్‌కు చెందినవారని తెలుస్తోంది. నిందితుడు గౌరవ్ గిల్‌ను హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.హత్యకు గురైన జస్బీర్ కౌర్ తన బంధువు గగన్‌దీప్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో అతడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్లో గగన్‌దీప్‌తో గిల్‌కు పరిచయమున్నట్టు తెలుస్తోంది. కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. -
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఒట్టావా: భారత సంతతికి చెందిని ఓ యువకుడు కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురుయ్యాడు. జూన్ 7 (శుక్రవారం) ఉదయం అతనిపై కాల్పులు జరగటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్‌గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్‌పై ఎటువంటి నేరపూర్తి రికార్డు లేదు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. యువరాజ్ గోయాల్ స్టూడెంట్ వీసాపై 2019లో పంజాల్‌లోని లూథీయానా నుంచి కెనడా వెళ్లారు. 28 ఏళ్ల యువరాజ్ కెనడాలో సెల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్‌వుడ్ వ్యాపారవేత్త. యువరాజ్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఎన్కౌంటర్లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం
ఉత్తరప్రదేశ్‌లో నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్, బీహర్, రతన్‌పురి పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో వాంటెడ్ బీహార్ గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు.వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి బీహార్‌లోని రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇంచోరా గ్రామం సమీపంలోని అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), బీహర్, రతన్‌పురి పోలీసులు ముగ్గురు దుండగులను ఎన్కౌంటర్ చేశారు వీరిలో బీహార్ గ్యాంగ్ స్టర్ నీలేష్ రాయ్ ఉన్నారు. రూ. రెండు లక్షల రివార్డు కలిగిన నీలేష్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతని సహచరులిద్దరూ పరారయ్యారు.నిందితులకు చెందిన బైక్, రెండు పిస్టల్స్, కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి నోయిడా, బీహార్‌కు చెందిన ఎస్టిఎఫ్ బృందాలు రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ పోలీస్ పోస్ట్‌లో నేరస్తుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇంతలో బుధానా నుంచి బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై కాల్పులు జరిపి, ఖతౌలీ-బుదానా రహదారి వైపు వేగంగా వెళ్లిపోయారు.పోలీసు బృందం వారిని వెంబడిస్తున్న సమయంలో ఇంచుడ గ్రామం అడవిలో వారి బైక్ స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇంతలో పోలీసులు కాల్పులు చేయగా ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. పోలీసుల తూటాలకు ఓ యువకుడు(నీలేష్ రాయ్) గాయపడ్డాడు. పోలీసులు బాధితుడిని బుధానా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు.మృతుడిని బీహార్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నీలేష్ రాయ్‌గా గుర్తించామని, బరో రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధరా బెగుసరాయ్ బీహార్ నివాసి అని ఎస్పీ దేహత్ ఆదిత్య బన్సాల్ తెలిపారు. అతనిపై బీహార్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. నీలేష్‌పై హత్య, దోపిడీ, తదితర 16 తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నీలేష్ సహచరులిద్దరి కోసం పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్‌లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. కారులో వెళ్తున్న ఆయనను దోపిడీ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.కాగా.. వాక్టర్ 'జనరల్ హాస్పిటల్' షోలో బ్రాండో కార్బిన్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్'లో అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'వెస్ట్‌వరల్డ్', 'స్టేషన్ 19', 'సైబీరియా', 'ఏజెంట్ ఎక్స్', 'ఫెంటాస్టిక్', 'యానిమల్ కింగ్డమ్', 'హాలీవుడ్ గర్ల్', 'ట్రైనింగ్ డే', క్రిమినల్ మైండ్స్', 'స్ట్రగ్లింగ్ సర్వర్లు', 'ది ప్యాసింజర్' 'బార్బీ రిహాబ్' లాంటి సిరీస్‌లలో అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా పనిచేశాడు. 2016లో వచ్చిన చిత్రం 'యూఎస్ఎస్ ఇండియానాపోలిస్: మెన్ ఆఫ్ కరేజ్' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు మారియో వాన్ పీబుల్స్ దర్శకత్వం వహించాడు. -
ఎన్నికల వేళ.. జేడీయూ యువనేత దారుణ హత్య
పాట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్‌లో అలజడి రేగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) యువ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాట్నాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఆయన్ను దుండగులు కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు జేడీయూ నేత సౌరభ్ కుమార్ తలపై రెండుసార్లు కాల్చారు. ఆయన వెంట ఉన్న సహచరుడు మున్మున్‌పైనా కాల్పులు జరిపి పరారయ్యారు. నెత్తుటి మడుగులో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, సౌరభ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మున్మున్ పరిస్థితి విషమంగా ఉంది.పాట్నా పోలీసుల ప్రత్యేక బృందం రాత్రి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. సమాచారం అందుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి కూడా పున్‌పున్‌కు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ నేత దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత హతమయ్యాడు. సాగర్ రోడ్డులోని మ్యారేజ్ గార్డెన్ సమీపంలో బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా తలపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ మీడియాకు తెలిపారు. మహేంద్ర గుప్తా ఘటనా స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఈ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇషానగర్ పట్టణానికి చెందిన మహేంద్ర గుప్తా 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజావర్ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. 10,400 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుప్తా ఛతర్పూర్కు వచ్చినట్లు తెలుస్తోంది. బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు అబ్దుల్ మన్సూరీ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి, కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలమయ్యిందన్నారు. తాను దాడి చేసిన వ్యక్తిని చూశానని, అతనిని గుర్తించగలనని అన్నారు. -
పంజాబ్‌లో ఆప్ కార్యకర్త కాల్చివేత
అమృత్సర్: పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌నకు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. తారన్‌తారన్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో ఒక్కడే వెళ్తున్నాడు. కారును వెంబడిస్తున్న దుండగులు ఫతేబాద్, గోయిండ్వాల్ సాహిబ్ మధ్యలోని రైల్వే క్రాసింగ్ వద్ద అతడిపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి పరారయ్యాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్ప్రీత్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
US: అమెరికాలో మరో భారతీయుడి హత్య
అలబామా: అమెరికాలో భారతీయుల వరుస మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్‌సింగ్ అలియాస్ గోల్డీ(23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజాసింగ్ మృతిచెందాడు. రాజాసింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని టండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజాసింగ్ తండ్రి మరణించాడు. కుటుంబానికి రాజాసింగ్ సంపాదనే ఆధారం. రాజాసింగ్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అతడి కుటుంబం కోరింది. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలతో భారత్, భారత సంతతికి చెందిన వారి మరణాలు ఎక్కువయ్యాయి. గడిచిన రెండు మూడు నెలల కాలంలో అమెరికాలో మరణించి వారిలో భారత విద్యార్థులతో పాటు ఒక వ్యాపారవేత్త కూడా ఉండటం గమనార్హం. ఈ వరుస మరణాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. మరణాల వెనుక ప్రత్యేక కుట్ర లేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం -
ఐఎన్ఎల్డీ హరియాణా చీఫ్ కాల్చివేత
చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హరియాణా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. ఢిల్లీకి సమీపంలోని బహదూర్గఢ్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒక పార్టీ కార్యకర్త చనిపోగా ఆయన ప్రైవేట్ గన్మెన్లు ముగ్గురు గాయాలపాలయ్యారు. ఝజ్జర్ జిల్లాలోని బహదూర్గఢ్ నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ఎస్‌యూవీలో వెళ్తున్న రాథీని కారులో వెంబడించిన దుండుగులు ఆయనపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన దాడిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. -
పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్‌స్టర్ మృతి
లాహోర్: పాకిస్థాన్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్‌వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలాజ్ టిపును ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్‌లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్‌తోపాటు మరో ఇద్దరు అతిథులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఆమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో షూటర్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని హుటాహుటిన జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అమీర్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా 2010లో అల్లమా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన తుపాకీ కాల్పుల్లో ఆమీర్ తండ్రి ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్వాలా మృతిచెందాడు. బలాజ్ తాత కూడా గతంలో గొడవలో పాత్ర ఉన్నవాడే. వీరి కుటుంబం మొత్తం హింసాత్మక చరిత్రను కలిగి ఉంది. -
Bihar: ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
పాట్నా: బిహార్‌లో ఎంఐఎం పార్టీకి చెందిన మరో నేతను దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్‌కు బంధువుతో కలిసి బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్ ఎంఐఎం తరపున గోపాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు. పార్టీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కుర్చీ కోసం పాకులాట తప్ప నితీశ్‌కుమార్‌కు బిహార్‌లో శాంతిభద్రతలు కాపాడటం చేతకావడం లేదని ఒవైసీ మండిపడ్డారు. తమ పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్లో సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్‌ను దుంగులు కాల్చి చంపారు. ఇదీ చదవండి.. మొదలైన ఢిల్లీ ఛలో.. పోలీసుల హై అలర్ట్ -
దారుణం: లైవ్‌లో మాట్లాడుతుండగా శివసేన నేత హత్య
ముంబై: శివసేన (ఠాక్రే) వర్గానికి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్యచేయబడ్డారు. ఆయన లైవ్ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. తాజాగా ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాను అనుమానితుడిగా భావిస్తున్నారు. గురువారం సాయంత్రం సబర్బన్ ముంబైలోని బిరివాలిలోని మోరిస్ నోరోన్హా కార్యాలయంలోనే ఈ కాల్పులు జరగటం గమనార్హం. ఫేస్బుక్లో లైవ్ వీడియో మాట్లాడతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే అభిషేక్ ఘోసల్కర్‌ను స్థానిక కరుణ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిషేక్ ఘోసల్కర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అభిషేక్ ఘోసల్కర్... శివసేన(యూబీటీ) మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు. వ్యాపారవేత్త అయిన మోరిస్ నోరోన్హాకు అభిషేక్ ఘోసల్కర్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ కాల్పులు జరిగినప్పుడు ఘటన స్థలంలో మెహుల్ పారిఖ్ అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు నోరోన్హా కూడా తనను తాను కాల్చుకొని మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి. గత వారంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు శివసేన (షిండే) వర్గం నేతపై పోలీస్ స్టేషన్లోనే కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
US: రెండేళ్ల తమ్ముడిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న
ఒహియో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల అన్న రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత విచారణలో పోలీసులడిగితే టీవీలో స్పైడర్ మ్యాన్ ప్రోగ్రామ్ చూసి తండ్రి టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి తమ్ముడిని కాల్చానని చెప్పాడు. ఈ సమాధానంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అసలు సంఘటన వివరాల్లోకి వెళితే కెంటాన్ కౌంటీలో తల్లిదండ్రులకు చెందిన ఫుల్ లోడెడ్ గన్‌తో మూడేళ్ల బాలుడు తన తమ్ముడిని కాల్చి చంపాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడి తమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లిదండ్రులు నిర్లకక్ష్యంగా ఫుల్ లోడెడ్ తుపాకీని పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇళ్లలో ఉన్న తుపాకులపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి గుర్తు చేసిందని పోలీసులు అంటున్నారు. ఇదీచదవండి.. తగ్గిన భారత టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా -
దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆదివారం మధ్యాహ్నం జరిపిన కాల్పుల్లో టీఎంసీ నేత స్థాయన్ చౌదరి మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు గుంపుగా బైకులపై వచ్చి స్థాయిన్ చౌదరిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను స్థానిక అస్పత్రికి తరలించగా.. అప్పటకే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన బెంగాల్‌లోని బహారామ్‌పూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఆయన టీఎంసీలో ముర్షిదాబాద్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్ -
మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం
పాట్నా: బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్‌కి పూజ కోసం వెళ్లిన మనోజ్ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్‌ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు. ఈ వార్త తెలవడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్‌ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
అమెరికాలో భారతీయ వైద్య విద్యార్థిపై కాల్పులు, మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దుండగుడి కాల్పులకు బలైపోయాడు. నార్త్ ఇండియాకు చెందిన వైద్య విద్యార్థి ఆదిత్య అద్లాఖా కారులో ఉండగానే కాల్పులు జరిపారు. ఈ సంఘటన నవంబర్ 9న జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత తుదిశ్వాస విడిచాడు. యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదిత్య మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆదిత్య అద్లాఖా యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్లో మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌లో నాల్గవ సంవత్సరం డాక్టరల్ విద్యార్థి. వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన కారు ఒక గొడను ఢీకొట్టింది. దీంతో అద్లాఖా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని యూసీ మెడికల్ సెంటర్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల తర్వాత మరణించినట్లు హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. ఆదిత్య నడిపిన కారు, అద్దాలకు బుల్లెట్ రంధ్రాలను గుర్తించామని విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. యూనివర్శీటీ సీనియర్లతోపాటు ఆరోగ్య వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డీన్ ఆండ్రూ ఫిలక్ అద్లాఖా ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. న్యూరోఇమ్యూన్ కమ్యూనికేషన్లో అద్లాఖా అద్భుతమైన పరిశోధన చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా ఆదిత్య 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తరువాత మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీలో పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లాడు. -
జైషే మహ్మద్ ఉగ్రవాది తాజ్ మహ్మద్ కాల్చివేత!
మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది, జైషే ఉగ్రవాది తాజ్ మహమ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అనేక హింసాత్మక ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న మోస్ట్ వాంటెడ్ జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్ రైట్ హ్యండ్, సమీపబంధువు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా జైషే ముఠాలో అత్యంత కీలక మైన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్. ముఖ్యంగా ఇండియాలో పఠాన్‌కోట్, నగ్రోటా, ఉరీ, పుల్వామా వంటి ఉగ్ర దాడుల్లో అతినిదే కీల ప్రాత. 1999లో అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో రౌవూఫ్ ప్రధాన సూత్రధారి. 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వాయుసేన స్థావరంపై దాడి, అలాగే 2014-2019 మధ్య భద్రతా బలగాల సిబ్బందిపై జరిగిన అనేక దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలున్నాయి. 2 019లో పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్లో రౌఫ్ అస్గర్, మసూద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయి. -
పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్స్పెక్టర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. "పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్‌గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు -
కేంద్ర మంత్రి నివాసంలో యువకుడి అనుమానాస్పద మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి నివాసంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితితో మృతిచెందడం కలకలం రేపుతోంది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కుమార్ నివాసంలో తలకు బుల్లెట్ తగిలిన గాయాలతో రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లక్నోలోని బెగారియా గ్రామంలో శుక్రవారం ఉదంయ 4 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి కుమారుడు వికాస్ పేరుతో రిజిస్ట్రర్ అయిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుడిని వినయ్ శ్రీవాస్తవగా పోలీసులు గుర్తించారు. అతడు మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ స్నేహితుడిగా తెలిసింది. అయితే ఆ ఇంటిని ప్రస్తుతం మంత్రి ఉపయోగించడం లేదు. అంతేగాక శ్రీ వాస్తవ మరణించిన సమయంలో మంత్రిగానీ, అతని కొడుకు గానీ ఆ ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేరుకున్నారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న ఆరుగురిని ప్రశ్నిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆధారాలను సేకరించాయి. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ ఇదిలా ఉండగా మృతుడి సోదరుడు మాత్రం తన అన్నయ్య మరణంలో కుట్ర దాగుందని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందా అని ప్రశ్నించగా.. ‘మంత్రి కొడుకు వికాస్ ఎక్కడికి వెళ్లినా తన గన్ను వెంట తీసుకెళ్లేవాడు. అతను కచ్చితంగా పిస్టల్ తీసుకెళ్లి ఉండాల్సింది.. ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికైనా వెళ్లినా దాన్ని వెంట తీసుకెళ్లేవాడని ఖచ్చితంగా చెప్పగలను. నిన్న ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు.. ఇది పక్కా ప్లాన్.. మా అన్నయ్యను ఎందుకు, ఎవరు చంపారో తెలియాలి’ అని ప్రశ్నించాడు. మృతుడి సోదరుడి ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందించారు. వికాస్ గురువారం మధ్యాహ్నమే ఢిల్లీకి వెళ్లాడని తెలిపారు. ఇందుకు బోర్డింగ్ పాస్‌లు కూడా సాక్ష్యంగా చూపించారు. పిస్తోల్‌కు నేషనల్ లైసెన్స్ లేదని, అందుకే తన కొడుకు పిస్టల్ని తనతో తీసుకెళ్లలేదని చెప్పారు. జరిగింది విచారకరమని.. విషయం తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరుగుతోందని నిందితులను వదిలిపెట్టమని, దోషులెవరైనా శిక్షిస్తామని తెలిపారు. బాధితుడి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగిని గుర్తు తెలియని దుండుగులు హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలోని భజన్‌పురలో చోటుచేసుకుంది. మృతుడిని హర్‌ప్రీత్ గిల్‌గా గుర్తించారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామతో కలిసి భజన్‌పురలోని సుభాష్ విహార్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది దుండగులు ఇద్దరిపై అడ్డగించి కాల్పులు జరిపారు. అనంతరం స్థానికులు గమనించి వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామకు చికిత్స అందిస్తున్నారు. మృతుడి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయిదుగురు వ్యక్తులు తనపై, తన అల్లుడిపై కాల్పులు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హర్‌ప్రీత్ ఇంటి నుంచి బయటకు వెళ్తూ 10 నిమిషాల్లో తిరిగి వస్తానని తమ తల్లిదండ్రులకు తెలిజయేశారు. దుండగుల కాల్పుల్లో గిల్ తలపై కుడి వైపు, బుల్లెట్ గాయాలు తగిలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్టున్నట్లు వెల్లడించారు. మృతుడి మేనమామ భజన్‌పురా నివాసి. అతడికి కూడా తలపై కాల్పులు జరగడంతో లోక్‌నాయక్ జై ప్రకాష్ ఆస్పత్రిలో చేర్పించినట్లు డీసీపీ తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో యాక్టివ్‌గా ఉందని, నగరంలో పెద్ద డాన్ కావాలనే కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుధాలతో తమ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారని తెలిపారు. చదవండి: Chandrayaan-3: తొలిసారి విక్రమ్‌ను ఫోటో తీసిన రోవర్.. ఇదిగో ఫోటో -
బీజేపీ నేత దారుణ హత్య.. కారణం అదేనా?
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అధికార పార్టీ నేతను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో, బీజేపీ నేత హత్య యూపీలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. శంభాల్ జిల్లాలోని మొరదాబాద్‌కు చెందిన బీజేపీ నేత అనూజ్ చౌదరీ(34) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం మొరాదాబాద్‌లోని ఆయన నివాసం బయటే ఆయనను కాల్చి చంపారు. అనూజ్ చౌధురి తన అపార్ట్మెంట్ నుంచి మరో వ్యక్తితో కలిసి గురువారం సాయంత్రం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. పొలిటికల్ ప్రత్యర్థుల పనేనా.. ఇక, కాల్పుల ఘటన ఆయన నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. ఎస్పీ హేమ్రాజ్ మీనాతో సహా పోలీసు అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అనూజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనూజ్‌పై కాల్పుల ఘటనలో అస్మోలీ బ్లాక్ చీఫ్ కుమారుడు అనికేత్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్ట తెలిపారు. ఇక, అనూజ్ హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు అమిత్, అనికేత్లుగా బాధిత కుటుంబం తెలిపింది. BJP Leader Anuj Chaudhary Shot dead on day light in Uttar Pradesh But still it's The Best Law & Order state in Bharatvarsh according to Bhakts 🙏#NarendraModi #NarendraModiji #NoConfidenceMotion #NoConfidence #NoConfidenceDebate #PMModi #earthquake #MohanLal #OMG2 #Gadar2 #UP pic.twitter.com/PnmhWMAyDA — Dr Jain (@DrJain21) August 11, 2023 ఇదిలా ఉండగా.. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోన్న అనూజ్.. రెండేళ్ల కిందట జరిగిన యూపీ బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో శంభాల్లోని అస్మోలీ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనూజ్‌కు బీజేపీ కీలక నాయకులు, మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: మోదీకి కాంగ్రెస్ ఫోబియా